Ram Charan
-
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్‌పై దిల్ రాజు కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారు.‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో మేకర్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు. అందుకు దిల్ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు. 'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.pic.twitter.com/NVwAIJW0HG— Out of Commentary (@OutofContestTel) February 1, 2025 -
‘గాంధీ తాత చెట్టు'పై రామ్ చరణ్, ఉపాసన ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్‌చరణ్(Ram Charan), ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్, భాను ప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు.గాంధీ తాత చెట్టు కథేంటి?ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు.అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ. -
RC16 కి రెహమాన్ బ్రేక్.. ఎలాంటి ఇబ్బంది లేదు
-
#RC16 కి టైటిల్ ఫిక్స్
-
పెద్ది షూటింగ్ షురూ
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొననుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట.అంతేకాదు... ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరంను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో రామ్‌చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది. -
టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్.. మళ్ళీ దిల్ రాజు తో రామ్ చరణ్ సినిమా..
-
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం. -
రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి..
హీరో రామ్ చరణ్ (Ram Charan) గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చాడు. చరణ్ అభిమానిగా ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్- ఉపాసన దంపతులు అతడికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అతడి భార్యను చేర్పించారు. 17 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించేవారు.అభిమాని భార్యకు వైద్యసాయంఇది చూసిన అభిమాని హాస్పిటల్ బిల్లు ఎంతవుతుందోనని కంగారుపడ్డాడు. కానీ చరణ్ దంపతులు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ విషయాన్ని సదరు అభిమాని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి మరీ తన భార్యను ఇంటికి క్షేమంగా పంపించాడని చెప్పుకొచ్చాడు. అలాగే షోలో చరణ్.. అభిమానికి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించాడు. ఇది చూసిన నెటిజన్లు చరణ్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు -
'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్
గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రాన్ని తమ లోకల్ ఛానెల్లో (local channel) ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానల్స్‌లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం చెందడమే కాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే, కేబుల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం ప్రసారం అవతుందని కొందరు స్క్రీన్ షాట్స్ తీసి చిత్ర నిర్మాణ సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: మహానగరంలో బాలీవుడ్ ప్రముఖలపై జరిగిన దాడులు ఇవే)ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. వారిపై కూడా చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ కలెక్షన్లపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కలెక్షన్ల వివరాలు తప్పుగా చెప్పారని పలువురు నెటిజన్లు విమర్శించారు. -
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్‌కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం!
ఇంటిల్లిపాదీ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి ఎవరెక్కడ, ఏ మూలన ఉన్నా సరే ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఇంటికి చేరుకుంటారు. అమ్మ చేసే అరిసెలు, చెల్లి వేసే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, స్నేహితులతో గాలిపటాలు ఎగరేయడాలు.. కోడిపందేలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కుటుంబ బంధాల్ని రెట్టింపు చేస్తూ ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసిస్తుంది సంక్రాంతి.గతేడాది కన్నులపండగ్గా..ఈ పండగను మెగా ఫ్యామిలీ (Mega Family) కూడా ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ ఒక్కచోట చేరుతుంటారు. గతేడాదైతే మెగా కుటుంబమంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హోస్లో మెగా అల్లు ఫ్యామిలీ జాలీగా పండగను ఎంజాయ్ చేశారు. చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా అక్కడే ఉంది. అల్లు అర్జున్.. భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌తో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు.గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబంచదవండి: గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్ఈసారి ఎవరింట్లో వారే..కానీ ఈసారి మాత్రం ఎవరింట్లో వారే పండగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అటు చిరంజీవి తన ఇంట్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) తన కుటుంబంతో పండగ జరుపుకున్నాడు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ముస్తాబైన దిగిన ఫ్యామిలీ ఫోటోను అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉండేదోనని నిట్టూర్పు విడుస్తున్నారు.క్రిస్మస్ పార్టీకి చరణ్..గతంలో అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ ఇస్తే దానికి రామ్‌చరణ్- ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, శ్రీజ, నిహారిక, వైష్ణవ్‌తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు. అలా ఎవరింట్లో ఏ పార్టీ ఉన్నా రెండు కుటుంబాలు కలుసుకునేవి. ఇప్పుడేమో వీరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ దూరం ఇలాగే కొనసాగుతుందా? అని పలువురూ చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ -
గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie)కు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయినా సరే బంపర్ హిట్ అంటూ తొలి రోజే రూ.186 కోట్లు వచ్చాయని ప్రచారం చేశారు. ఓపక్క సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంటే మరోపక్క కలెక్షన్లు భారీగా వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ సినిమాపై స్పందించాడు.సినిమా సక్సెస్‌లో వారంతా భాగమయ్యారుతనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అభిమానులకు, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాలో పని చేసిన నటీనటులతో పాటు తెరవెనక పనిచేసిన అందరూ ఈ సినిమా విజయంలో భాగమయ్యారు.మంచి రివ్యూలు ఇస్తున్నందుకు థ్యాంక్స్మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. గేమ్ ఛేంజర్ సినిమాకు మంచి రివ్యూలు ఇస్తున్న మీడియాకు స్పెషల్ థ్యాంక్స్. మా సినిమా మైల్ స్టోన్ అందుకోవడంలో మీ రివ్యూలు కీలక పాత్ర పోషించాయి. పాజిటివిటీతో ముందుకువెళ్దాం. మున్ముందు కూడా మీరు గర్వపడే పాత్రలు చేస్తానని మాటిస్తున్నాను. గేమ్ ఛేంజర్ సినిమాకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఓ లేఖ షేర్ చేశాడు.గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలుఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటించారు. తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో రిలీజైందో లేదో వెంటనే పైరసీరాయుళ్లు దాన్ని లీక్ చేసి ఆన్లైన్లో వదిలారు. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉందని చిత్రయూనిట్ ఆరోపిస్తోంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠా చివరకు అన్నంత పనీ చేసిందట. దీంతో గేమ్ ఛేంజర్ యూనిట్ ఆ 45 మందిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.పాటల కోసమే అన్ని కోట్లు!గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దాదాపు రూ.400-450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు వస్తున్న మిక్స్డ్ టాక్ చూస్తుంటే మూవీ బ్రేక్ ఈవెన్ అవడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇకపోతే శంకర్ రేంజ్‌కు తగ్గట్లుగా పాటల కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు. కేవలం ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు పెట్టినట్లు తెలిపాడు. రిహార్సల్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువే అవుతుందన్నాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! -
'గేమ్ చేంజర్'టీమ్‌కి భారీ షాక్.. ఆన్లైన్లో పైరసీ ప్రింట్ !
సినిమా అనేది కోట్ల బిజినెస్. పెద్ద పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు అవుతుంటాయి. అలాంటి సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ పైరసీని అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ కేటుగాళ్లను అడ్డుకోలేకపోతుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాకు కూడా పైరసీ బారిన పడింది. సినిమా రిలీజైన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీనిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది.మూడేళ్ల కష్టం.. నిమిషాల్లో లీక్కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని చిత్రబృందం ఆరోపిస్తుంది.డబ్బు కోసం బెదిరింపులు..'గేమ్ చేంజర్' విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయట. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని . 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.45 మందిపై ఫిర్యాదు'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు. -
గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్.. రెండో రోజు కాస్తా తగ్గనట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ మూవీ.. రెండవ రోజు రూ. 21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో కలిపి రూ. 72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ దూసుకెళ్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు తెలుద రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తోంది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 12.7 కోట్లు, హిందీలో రూ. 7 కోట్లు, తమిళం రూ. 1.7 కోట్లు, కన్నడలో రూ. 10 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు తెలుగులో థియేటర్లలో మొత్తం 31.19 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. ఉదయం షోలకు 20.66 శాతం ఆక్యుపెన్సీతో నడవగా.. సాయంత్రం షోలలో 36.48 శాతానికి పెరిగింది. సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.కాగా.. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రలో అదరగొట్టారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఆ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. కాగా... చిత్రంలో కోలీవుడ్ హీరోలు ఎస్జే సూర్య, జయరామ్ కీలకపాత్రలో కనిపించారు. వీరితో పాటు శ్రీకాంత్, సముద్రఖని, అంజలి, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ కూడా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.పాటలకే రూ.75 కోట్లు..దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు వెచ్చించినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో గేమ్ ఛేంజర్ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. -
Game Changer: అభిమానులతో రామ్‌చరణ్ సెలబ్రేషన్స్
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer Movie) బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో రెండో రోజున కూడా వసూళ్ల పరంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజర్ కొనసాగించే అవకాశం ఉంది.డ్యాన్సుల గురించి స్పెషల్‌గా చెప్పాలా!ప్రజా నాయకుడు అప్పన్నగా.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్ రామ్ నందన్గా రెండు పాత్రల్లో చరణ్ చూపించిన పెర్ఫామెన్స్ వేరియేషన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే డ్యాన్సుల విషయంలో మెగా పవర్ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్ తదితరుల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండియర్‌గా శంకర్ తెరకెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ మేకింగ్ బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.అభిమానులకు రామ్ చరణ్ కృతజ్ఞతలురామ్ చరణ్‌ను శంకర్ ఎలా ప్రెజంట్ చేస్తారోనని అందరూ ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అందరి అంచనాలను అందుకుంటూ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ సక్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం విశేషం. గేమ్ చేంజర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ను కలిసిన రామ్ చరణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ -
గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్.. ఇకపై అది లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) స్పెషల్ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ షోలను రద్దు చేసింది.బెనిఫిట్ షోకు నిరాకరణరామ్చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కాకపోతే అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు మాత్రం అనుమతి నిరాకరించింది. జనవరి 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవచ్చని పేర్కొంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్తోపాటు సతీశ్కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.స్పెషల్ షో కూడా బెనిఫిట్ షోలాంటిదే!దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్ స్పెషల్ షోలను రద్దు చేసింది.చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ -
గేమ్ ఛేంజర్ చూసిన వారికి బిగ్ షాక్..
-
ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్
ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు..? ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్ చరణ్ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్ వేదికగా చరణ్(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ రివీల్ చేశారని టాక్ ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పాటు చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల అవుతుంది. అయితే, ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడుతారు. అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్కీ కూడా పాల్గొన్నారు.2025 దసరా లోపు పెళ్లికృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రీసెంట్గా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ మాటలు చూస్తుంటే డార్లింగ్ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు) సలార్,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి. -
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'గేమ్ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రిలీజ్ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్ ఛేంజర్ లెక్కల వివరాలను ప్రకటించింది.రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్ ఛేంజర్ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల లెక్కలు ఇలా'గేమ్ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)గేమ్ ఛేంజర్ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్ డే రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్ బద్దలు అయిపోయిందని పోస్టర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥Book your tickets now on @bookmyshow🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025Sare, ippudu original collections cheppandi...— నాని (@nani_SSMBfan) January 11, 2025Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025 -
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే కాస్త నెగటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో నిరాశ ఎదురైంది. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం అనుకున్నంతగా రాబట్టలేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)'గేమ్ ఛేంజర్' (Game Changer)చిత్రం సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రకు ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన తొలి చిత్రం గేమ్ ఛేంజర్. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఇందులో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. అయితే, అప్పట్లో మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల నెట్ సాధించింది. గ్రాస్ పరంగా రూ. 68 కోట్ల వరకు ఓపెనింగ్‌ను క్రియేట్ చేసింది. అయితే, 2022లో ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రం రూ. 133 కోట్ల నెట్ రాబట్టింది. కానీ, గ్రాస్ పరంగా రూ. 232 కోట్లతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer Movie). శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. రిలీజైన తొలి రోజే ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ మూవీపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు తెలిపింది. నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్.. లవ్ యూ అంటూ తన భర్తను కొనియాడింది. ఈ మేరకు తన ట్విటర్లో పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో జాతీయ మీడియాలో వచ్చి గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ టైటిల్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంపై మొదటి నుంచి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. Congratulations my dearest husband @AlwaysRamCharan You truly are a game changer in every way. Love u 🥰 ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025 -
గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల రివ్యూ.. సినిమా మధ్యలో వెళ్లిపోయామంటూ..!
ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ సినీ ప్రేమికులను మెప్పించాడు రామ్‌చరణ్ (Ram Charan). ఈ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌లోని ఏంటమ్మా పాటలో అతిథిగా మెరిశాడు. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చిత్రంలోనూ కనిపించాడు. కానీ హీరోగా చరణ్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ (Game Changer Movie)తో ప్రేక్షకుల్ని పలకరించాడు చరణ్. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే సినిమా చూసేసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఎలా ఉందన్న సాక్షి.కామ్ పోల్‌కు పలువురూ ఈ కింది విధంగా స్పందించారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తీరును గూర్చి అద్బుతమైన కథనం- సైదుల యాదవ్ఔట్డేటెడ్ డైరెక్షన్- రవికుమార్శంకర్ చెత్త డైరెక్షన్. హీరో, శ్రీకాంత్ తప్ప ఎవరికి స్కోప్ లేదు. చెత్త స్ర్క్రీన్ ప్లే- సురేశ్ రాజ్అవుట్ డేటెడ్ డైరెక్టర్, అవుట్ డేటెడ్ స్టోరీ, శంకర్ ని డైరెక్టర్ గా తీసుకుని దిల్ రాజు చాలా తప్పు చేశాడు 🙏🏻🙏🏻. చరణ్ పెర్ఫార్మన్స్ కి ఒక్కసారి చూడొచ్చు 🙏🏻🙏🏻మిగతా సినిమా అంత అస్సాం ఏ, పోయారు మోసం.- అమలశేఖర్ గౌడ్ఈ పండక్కి ఓటీటీలో వేసేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తాం.. వేసేయండి దిల్ రాజు గారు పండగ పూట మీ పేరు చెప్పుకుంటాం- భాస్కర్ కుమార్ప్రొడ్యూసర్ బతుకు చేంజ్ అయిపోయింది అంటా -మహమ్మద్ నూర్మనకు సోషల్ మెసేజ్‌లు నచ్చవు, పుష్ప లాంటి సినిమాలు కావాలి- మల్యాద్రి రెడ్డి బాలసానిఎక్సలెంట్ మూవీ-ముబీన్సినిమా మధ్యలో వచ్చేశా- గిరిగతేడాది గుంటూరు కారం బ్లాక్‌బస్టర్ అయితే ఈసారి గేమ్ ఛేంజర్ కూడా బ్లాక్‌బస్టర్ అయినట్లే!- పవన్ఇలా సినిమా బాగుందని కొందరు కామెంట్లు చేయగా అస్సలు బాగోలేదని ఎక్కువమంది రియాక్ట్ అవుతున్నారు. అసలైన సంక్రాంతి పోటీ మొదలు కాకముందే గేమ్ ఛేంజర్ గేమ్ ఓవర్ అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అటు సాక్షి వాట్సప్ ఛానల్లో పెట్టిన పోలింగ్‌లోనూ మెజారిటీ జనాలు సినిమా బాలేదని అభిప్రాయపడుతున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి