Ross Taylor
-
ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్.. కేన్ మామ ముందున్న భారీ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి నోయిడా గ్రౌండ్‌ను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. ఈ వేదికపైనే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాల్టి ఉదయమే ప్రారంభం కావాల్సి ఉన్నా.. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆలస్యమైంది. టాస్ కూడా ఇంకా పడలేదు. తుది జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కేన్ మామ మరో 72 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (అన్ని ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు రాస్ టేలర్ పేరిట ఉంది. రాస్ టేలర్ మూడు ఫార్మాట్లలో 450 మ్యాచ్‌లు ఆడి 18199 పరుగులు చేయగా.. కేన్ మామ 358 మ్యాచ్‌ల్లో 18128 పరుగులు చేశాడు. ప్రస్తుత తరం న్యూజిలాండ్ క్రికెటర్లలో కేన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఫాబ్ ఫోర్లో ప్రధముడిగా చెప్పుకునే కేన్ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే 100వ టెస్ట్ ఆడిన కేన్.. తన చివరి 20 టెస్ట్‌ల్లో ఏకంగా 2267 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాబ్ ఫోర్లో (జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి) ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. కేన్‌కు మించి ఫామ్‌లో ఉన్న రూట్ సైతం గత 20 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీ సాయంతో 1761 పరుగులే చేశాడు. ప్రస్తుతం కేన్ టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా (8743) ఉన్నాడు. -
AUS VS WI 1st T20: వార్నర్ 'ట్రిపుల్ ‘సెంచరీ’
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే..!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఖాతాలో అతి భారీ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో సూపర్ సెంచరీ (132) సాధించి, ఫాలో ఆన్ ఆడుతున్న తన జట్టును గట్టెక్కించిన కేన్ మామ.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 25 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బరిలోకి దిగిన విలియమ్సన్.. ఆండర్సన్ బౌలింగ్‌లో బౌండరీ బాది న్యూజిలాండ్ టాప్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. కెరీర్లో ఇప్పటివరకు 92 టెస్ట్‌లు ఆడిన విలియమ్సన్ 53.33 సగటున 26 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 7787 పరుగులు చేసి, కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (112 టెస్ట్‌ల్లో 44.66 సగటున 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీల సాయంతో 7683 పరుగులు)ను వెనక్కు నెట్టి కివీస్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్, రాస్ టేలర్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172), బ్రెండన్ మెక్కల్లమ్ (6453), మార్టిన్ క్రో (5444), జాన్ రైట్ (5334), టామ్ లాథమ్ (5038) వరుసగా 3 నుంచి 7 స్థానాల్లో నిలిచారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 202/3తో (ఫాలో ఆన్) నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్ చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (132) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండల్ (90) తమ పాత్రలను న్యాయం చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసి, ప్రత్యర్ధికి 258 పరుగుల డిఫెండింగ్ టార్గెట్‌ను నిర్ధేశించింది. కష్టసాధ్యంకాని టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తమదైన స్టయిల్లో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వరుస బౌండరీలతో విరుచుకుపడిన జాక్ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఓటవ్వగా.. బెన్ డక్కెట్ (23), ఓలీ రాబిన్సన్ (1) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి, లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేయగా.. న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
రాణించిన రాస్ టేలర్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెజెండ్స్ సూపర్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా దిగ్గజాలు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. వికెట్‌కీపర్ దిమాన్ ఘోష్ (32 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), అలోక్ కపాలీ (21 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఓపెనర్లు నజీముద్దీన్ (0), మెహ్రబ్ హొసేన్ (1) దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్‌కు ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనతంరం 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ దిగ్గజ టీమ్.. 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జేమీ హౌ (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. డీన్ బ్రౌన్లీ (19 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రాస్ టేలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్, అలోక్ కపాలీకి తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) ఎగబాకగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఇండియా లెజెండ్స్, విండీస్ లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్, న్యూజిలాండ్ లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇవాళ ఇదే వేదికగా మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో విండీస్ లెజెండ్స్‌ను ఇంగ్లండ్ దిగ్గజ టీమ్ ఢీకొట్టాల్సి ఉంది. -
ఎదురుగా పులులు కనిపిస్తున్నా.. అందరి కళ్లు ద్రవిడ్‌పైనే!
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ''బ్లాక్ అండ్ వైట్'' ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్.. శనివారం.. ఐపీఎల్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు తన చెంప పగులగొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్.. ప్రస్తుత భారత హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న టేలర్.. అప్పట్లో బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నాడు. ''2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రవిడ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కును సందర్శించా. ఈ సందర్భంగా ద్రవిడ్‌ను.. మీరెన్ని సార్లు పులులను సందర్శించారు. అని అడిగాను. దానికి ద్రవిడ్.. లేదు ఇంతవరకు ఒక్క పులిని కూడా దగ్గరి నుంచి చూడలేదు. ఇది 21వ సపారీ అనుకుంటా.. కానీ ఒక్క పులిని కూడా చూడలేకపోయా అని చెప్పాడు. దీంతో ఏంటి 21 సార్లు సఫారీకి వచ్చినా ఒక్కసారి కూడా పులిని చూడకపోవడం ఏంటి. అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత అందరం కలిసి ఎస్యూవీ మోడల్ ఓపెన్ టాప్ కారులో సఫారీకి వెళ్లాం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక aపులిని చూశాం. ద్రవిడ్.. నావల్ల ఈరోజు నువ్వు పులిని దగ్గర్నుంచి చూశావు.. దానికి థ్యాంక్స్ చెప్పాలి అని పేర్కొన్నాను. ఇక మా మధ్య ఏవో మాటలు సందర్బంలో వచ్చాయి. ఈ సమయంలోనే నేనొక అద్భుత విషయాన్ని గమనించా. అది చూశాకా భారత్‌లో క్రికెటర్లను ఇంతలా ఎందుకు అభిమానిస్తారా అని ఆశ్చర్యమేసింది. అదేంటంటే.. మేము వెళ్తున్న వాహనం వెనకాల వస్తున్న మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటిదాకా కనిపిస్తున్న పులులను తమ కెమెరాల్లో బందిస్తున్న వాళ్లు.. అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలన్నింటిని ద్రవిడ్‌వైపు తిప్పారు. అంటే ఒక జాతీయ పార్క్‌కు వచ్చి.. ఎదురుగా అరుదైన పులి జాతి సంపద కనిపిస్తున్నా సరే.. అందరు ద్రవిడ్‌నే చూడడం నాకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఒక విషయం కోట్ చేయలానుకున్నా.. 'ప్రపంచంలో సుమారు 4వేల పులులు ఉండుంటాయి.. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్ ద్రవిడ్' అన్న విషయం కచ్చితంగా చెప్పగలను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Asia Cup 2022: ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం -
అది అస్సలు ఊహించలేదు.. డకౌట్ అయ్యానని చెంపపై కొట్టాడు: టేలర్
ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. కాగా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్లపాటు సేవలందించిన తర్వాత.. టేలర్‌ను 2011 వేలంలో రాయల్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తను డకౌట్ అయ్యాక రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని టేలర్ అన్నాడు. "మెహాలీ వేదికగా రాజస్తాన్ రాయల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. 195 పరుగుల లక్ష్య చేధనలో నేను డకౌట్‌గా వెనుదిరిగాను. మేము ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవి చూసం. కనీసంలక్ష్యం దగ్గరకు కూడా చేరలేక పోయాం. మ్యాచ్ అనంతరం మా జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనంతరం హోటల్‌కు చేరుకున్నాము. ఆ తర్వాత మేము అందరం కలిసి హోటల్ పై అంతస్తులోని బార్‌కు వెళ్లాం. అక్కడ షేన్ వార్న్‌తో పాటు లిజ్ హర్లీ కూడా ఉంది. ఈ సమయంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్ నువ్వు డకౌట్ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని అన్నాడు. ఈ క్రమంలో అతడు నవ్వుతూ నా చెంపపై మూడు నాలుగు సార్లు కొట్టాడు. అయితే అతడు నన్ను గట్టిగా మాత్రం కొట్టలేదు. అతడు సరదాగా కొట్టాడో లేక ఉద్దేశ పూర్వకంగా చేశాడో నాకు తెలియదు. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్ద సమస్య చేయదలుచుకోలేదు. కానీ జెంటిల్మెన్ గేమ్ పిలిచే క్రికెట్లో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ సీజన్లో రాజస్తాన్ నన్ను భారీ ధరకు కొనుగోలుచేసినందు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఈ సంఘటన జరిగాక ఆర్సీబీ నన్ను సొంతం చేసుకుని ఉంటే బాగున్ను అనిపించింది" అని తన ఆత్మ కథ 'బ్లాక్ అండ్ వైట్'లో టేలర్ పేర్కొన్నాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! -
రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా!
న్యూజిలాండ్‌కు క్రికెట్లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్‌కు "కూల్ జట్టు" అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇటీవలే కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్ క్రికెట్లో సంచలనం కలిగిస్తోంది. టేలర్ వ్యాఖ్యలతో కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా అనిపిస్తుంది. "నా 16 ఏళ్ల కెరీర్ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్‌కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. రాస్.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్‌రూమ్ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్‌రూమ్‌ను నేను ఒక బారోమీటర్‌గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది. జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్‌గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్ గోల.. ఇది వారి పనేనా? SA vs ENG: టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు! -
Ross Taylor: రాస్‌టేలర్ వీడ్కోలు
హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లో 1 సిక్స్‌తో 14 పరుగులు సాధించాడు. అనంతరం నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. స్టెఫాన్ మైబర్గ్ (43 బంతుల్లో 64; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు దక్కాయి. రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్. -
సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్.. భావోద్వేగానికి లోనవుతూ..!
Ross Taylor Bids Emotional Goodbye To Cricket: న్యూజిలాండ్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టుకు సేవలందించిన స్టార్ ఆటగాడు రాస్ టేలర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 16 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రోస్కో (రాస్ టేలర్ ముద్దు పేరు).. కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన టేలర్‌కు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో స్వాగతం పలికారు. మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన టేలర్.. ఉబికి వస్తున్న దుఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Ross Taylor is about to play his final international game of cricket for New Zealand. We will miss you Rosco #SparkSport #NZvNED pic.twitter.com/Y6kmXVHvSH — Spark Sport (@sparknzsport) April 4, 2022 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 38 ఏళ్ల రాస్ టేలర్.. న్యూజిలాండ్ తరుపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌ల్లో 44.16 సగటున 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీల సాయంతో 7684 పరుగులు చేసిన టేలర్.. వన్డేల్లో 47.52 సగటుతో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీల సాయంతో 8602 పరుగులు చేశాడు. టేలర్.. టీ20ల్లో 7 హాఫ్ సెంచరీల సాయంతో 1909 పరుగులు సాధించాడు. టేలర్ జాతీయ జట్టు తరఫునే కాకుండా ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 55 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సహకారంతో 1017 పరుగులు స్కోర్ చేశాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఛేదనలో నెదర్లాండ్స్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కాగా, తొలి రెండు వన్డేల్లోనూ గెలుపొందిన కివీస్.. 2-0తేడాతో సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడేందుకు భారత్‌కు వెళ్లడంతో న్యూజిలాండ్ ఈ సిరీస్‌కు బీ టీమ్‌తో బరిలోకి దిగింది. చదవండి: IPL 2022: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..! -
కివీస్-ఆసీస్ సిరీస్ వాయిదా.. కారణం అదే!
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన న్యూజిలాండ్ జట్టు తమ పర్యటను నిరవధికంగా వాయిదా వేసుకుంది. ట్రాన్స్-టాస్మాన్ ప్రత్యర్థులు మధ్య ఫిబ్రవరిలో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరాగాల్సి ఉంది. న్యూజిలాండ్ క్వారంటైన్ నిభందనలు, సరిహద్దు నియంత్రణలు దృష్ట్యా ఈ పర్యటనను కివీస్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 తీవ్రత దష్ట్యా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య వైట్-బాల్ సిరీస్ వాయిదా పడడం వరుసగా ఇది మూడో సారి. కాగా రానున్న వేసవిలో ఆస్ట్రేలియా జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలి అని భావించిన రాస్ టేలర్‌కు నిరాశే మిగలనుంది. కోవిడ్, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా న్యూజిలాండ్ ప్రభుత్వం కఠినమైన 10 రోజుల క్వారంటైన్ నిభందనలు విధించింది. కాగా త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించిన రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది. చదవండి: SL Vs Zim: శ్రీలంకకు జింబాబ్వే షాక్... 94 బంతుల్లో 102 పరుగులు.. కానీ పాపం కెప్టెన్.. -
వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
NZ vs BAN: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టేలర్ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 290. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ అతడి కేరిర్‌లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు 38 ఏళ్ల టేలర్ తన కెరీర్లో రెండే వికెట్లు (2010లో) తీశాడు. అయితే చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించకపోవడంతో కివీస్ కెప్టెన్ లాథమ్ అతనితో సరదాగా బౌలింగ్ చేయించాడు. తన మూడో బంతికే అతను బంగ్లా చివరి వికెట్ (ఇబాదత్)ను అవుట్ చేసి ఘనంగా ఆటను ముగించడం విశేషం. న్యూజిలాండ్ ఘన విజయం తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 395 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (102; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. జేమీసన్‌కు 4, వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి. చదవండి: Virat Kohli: శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..! Gotta love Ross Taylor getting his 3rd Test wicket in his final Test to win the match. pic.twitter.com/8KsjuWMExR — Andrew Donnison (@Donno79) January 11, 2022 -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. రెండో టెస్టులో ఘన విజయం!
కింగస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్ సమం చేసింది. ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి టెస్టులో ఓటమికి బదులుగా న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిటన్ దాస్ (102), మోమినుల్ హక్(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జామీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, నీల్ వాగ్నర్ మూడు వికెట్లు సాధించాడు. కాగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగగా, కాన్వే(109), యంగ్(54) పరుగులతో రాణించారు. ఇక కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కూప్పకూలింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా టామ్ లాథమ్ ఎంపిక కాగా, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కాన్వేకి దక్కింది. కాగా కేరిర్‌లో అఖరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్‌కి ఘన విజయంతో న్యూజిలాండ్ విడ్కోలు పలికింది. చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే.. -
రాస్ టేలర్ ఉద్వేగ క్షణాలు.. వీడియో వైరల్
రెండో టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్.. తన కేరిర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7600కి పైగా పరుగులు చేశాడు. రెండో రోజు టేలర్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లో 28 పరుగులు చేసి అతడు పెవిలియన్ చేరాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ టేలర్ అరంగట్రేం చేశాడు. దాదాపు 16 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు అతడి సేవలను అందించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! A great gesture for a great of the game 🙌 Ross Taylor is given a guard of honour as he makes his way out to bat for possibly the final time in Test cricket for New Zealand 🥺#NZvBAN pic.twitter.com/ejJjTo5w4v — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన బంగ్లా... కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్‌లు డ్రాప్ చేయడం, రనౌట్లు మిస్ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా 37వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్ చేసుకుంది. టస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్ మొమినల్ అప్పీలు చేయగా నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్ టేలర్ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ WORST REVIEW EVER??! Bangladesh lost their last remaining review when THIS was given 'not out' for LBW! FOLLOW #NZvBAN LIVE: 👉 https://t.co/vIAFgN1IK7 👈 pic.twitter.com/f8CmxEKkpk — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 4, 2022 -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్..
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గురువారం టేలర్ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత తప్పుకుంటాను. 17 సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను" అని టేలర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2006లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్లో టేలర్ అరంగటేట్రం చేశాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు సాధించాడు. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాకు షాక్.. నిర్ణయం మార్చుకున్న కీలక ఆటగాడు.. సిరీస్‌కు దూరం! Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp — Ross Taylor (@RossLTaylor) December 29, 2021 -
అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్
It was a dream delivery for any fast bowler on Ross taylor wicket:ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్బతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్‌ను అద్బుతమైన బంతితో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. కాగా టేలర్‌ను ఔట్ చేసిన బంతి.. తన డ్రీమ్ డెలివరీ అంటూ మ్యాచ్ అనంతరం సిరాజ్ తెలిపాడు. రెండో రోజు ఆటముగిశాక విలేకరుల సమావేశంలో సిరాజ్ మాట్లాడాడు. “మేము ఇన్‌స్వింగ్ డెలివరీకి తగ్గట్టుగా ఫీల్డ్‌ని పెట్టాము. కానీ నేను తర్వాత నా మనసుని మార్చుకుని అవుట్‌స్వింగ్ బౌలింగ్ ఎందుకు చేయకూడదని అనుకున్నాను. అందుకే అవుట్‌స్వింగ్ డెలివరీ వేశాను. దీంతో టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగలిగాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన సిరాజ్ తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ఇషాంత్ శర్మ స్ధానంలో తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. కాగా గాయంనుంచి కోలుకున్నాక.. తను ఫిట్నెస్ సాధించాడానికి ఎలా సాధన చేశాడో తెలిపాడు. "నేను గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు వీలైనంత ఎక్కువ స్వింగ్ పొందాలనే లక్ష్యంతో సింగిల్ వికెట్ బౌలింగ్ చేసాను. నాకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తే ఆ విధంగా బౌలింగ్ చేయాలి అనుకున్నాను. సింగిల్ వికెట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ మ్యాచ్‌లో నాకు చాలా ఊపయోగపడింది అని సిరాజ్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో.. Absolute peach of a delivery 📦 #Siraj #MiyaanMagic pic.twitter.com/aqU82Ersrr — King (@DNKWrites) December 4, 2021 -
Mohammed Siraj: సిరాజ్ దెబ్బ.. కివీస్ అబ్బా.. జోరు మామూలుగా లేదుగా..
IND vs NZ 2nd Test: Mohammed Siraj Peach of a Delivery to Get Ross Taylor Bowled in Mumbai Test: ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆదిలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి టెస్టులో రాణించిన కివీస్ ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆ తర్వాత అద్భుతమైన బంతితో రాస్ టేలర్‌ను బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. చక్కని లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రాస్ టేలర్‌కు ఊహించని షాకిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘వరుసగా 3 వికెట్లు... సూపర్ సిరాజ్.. నీ దెబ్బకు రాస్ టేలర్‌కు దిమ్మతిరిగింది.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు... నిన్ను నీవు నిరూపించుకున్నావు’’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో టెస్టు రెండో ఆటలో భాగంగా భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. సిరాజ్(3), అశ్విన్(4) చెలరేగడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో 62 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్‌కు రెండు, జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే That's Ripper from Mohammad Siraj 💥💥#INDvzNZ pic.twitter.com/ja5vkgMbka — Diwakar¹⁸ (@diwakarkumar47) December 4, 2021 -
టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన కివీస్.. ఇద్దరు సీనియర్లు ఔట్
New Zealand ICC T20 World Cup 2021 Team: యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా, సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, వెటరన్ ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లను తప్పించింది. ఇంజ్యూరీ కవర్‌గా అడమ్ మిల్నేను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, గడిచిన రెండు మూడేళ్లుగా కేన్ సారధ్యంలో న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది. భారత్‌తో స్వదేశంలో సిరీస్(5-0) దగ్గరి నుండి ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకుండా పొట్టి ఫార్మాట్లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్ జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్, మిచెల్ సాట్నర్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఐష్ సోధి, టిమ్ సౌథీ, అడమ్ మిల్నే(ఇంజ్యూరీ కవర్) -
రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే.. ఇప్పట్లో రిటైర్ కాను
వెల్లింగ్టన్: వయస్సనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనని, దాన్ని అటతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన ఈ కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. జాతీయ జట్టుకు మరికొన్నేళ్లు అడగలిగే సత్తా తనలో ఉందని తేల్చి చెప్పాడు. 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ దానిపై పునారాలోచించుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని వెల్లడించాడు. ఆటను ఆస్వాదించగలిగినన్ని రోజులు క్రికెట్ ఆడతానని, ప్రస్తుతానికి తన ఫామ్‌కు ఏమాత్రం ఢోకా లేదని, స్థాయికి తగ్గ ప్రతిభను కనబర్చలేని రోజు స్వచ్చందంగా తప్పుకుంటానని పేర్కొన్నాడు. నేటి తరం ఆటగాళ్లు రిటైర్మెంట్పై లెక్కలేసుకోవడం మానుకోవాలని, వారిలో సత్తా ఉన్నన్ని రోజులు జట్టుకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించాడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం కేన్ విలియమ్సన్ సారధ్యంలో అద్భుతంగా రాణిస్తుందని.. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమాతూకంగా ఉందని అభిప్రాయడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ ఓ పీడకలగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తరఫున టెస్ట్, వన్డే ఫార్మట్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన ఈ వెల్లింగ్టన్ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో కివీస్.. రెండు టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం భారత్‌తో డబ్యూటీసీ ఫైనల్ పోరులో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్ పర్యటనలో అతను పాంటింగ్‌ను అధిగమిస్తాడు.. -
‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి
న్యూఢిల్లీ: ఏడాది క్రితం వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదుర్కొన్న ఓటమి బాధను న్యూజిలాండ్ క్రికెటర్లు అంత సులువుగా మరచిపోయేలా లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, ఆపై సూపర్ ఓవర్ కూడా ‘టై’ కావడంతో బౌండరీ కౌంట్‌తో కివీస్ ఓడింది. దీనిపై ఆ జట్టు టాప్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మాట్లాడుతూ... వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమే లేదని...ఆ నిబంధనను తొలగించి, మ్యాచ్ ‘టై’గా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలన్నాడు. ‘టి20ల్లో సూపర్ ఓవర్ అంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్ తరహాలో ఏదో ఒక ఫలితం కోసం అలా ఆడవచ్చు. కానీ వన్డేలో సూపర్ ఓవర్ ఆడించడమే అసమంజసం. ఇరు జట్లు అప్పటికి 100 ఓవర్లు ఆడి ఉంటాయి. ఇంతసేపు పోటీ పడిన తర్వాత రెండు జట్లు సమఉజ్జీగా నిలిచాయంటేనే ఎవరూ గెలవలేదనే కదా అర్థం. మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించడంలో తప్పేముంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. -
టై అంటే టై.. సూపర్ ఓవర్ ఏమిటి?
వెల్లింగ్టన్: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను విజయం వరించినట్లే వరించి చేజారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ రెండు సార్లు సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో చివరకు బౌండరీ కౌంట్ విధానం అనుసరించాల్సి వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌ను విజయం వరించగా, న్యూజిలాండ్‌ను పరాజయం వెక్కిరించింది. దాంతో వన్డే వరల్డ్‌కప్ సాధించాలనుకున్న కివీస్ ఆశలు నెరవేరలేదు. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినా కివీస్‌కు కప్‌కు దక్కకపోవడం ఇక్కడ గమనార్హం. కాగా, తమ జట్టును ‘సూపర్ ఓవర్’ దెబ్బ తీసిన బాధ ఆ జట్టు వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ మనసులో అలానే ఉండిపోయింది. ఇదొక అనవసరపు విధానమని తాజాగా టేలర్ పేర్కొన్నాడు. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా') ‘వన్డే ఫార్మాట్లో సూపర్ ఓవర్ అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో కూడా ఈ విధానంతో ఉపయోగం లేదు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ టై అయితే కప్‌ను ఇరు జట్లకు పంచాలి. సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. అంతేగానీ సూపర్ ఓవర్‌తో ఒక్క జట్టును ఫేవరెట్ చేయడం భావ్యం కాదు. దీనిపై నేను ఇంకా గందరగోళంలో ఉన్నాను. నేను చాలాకాలం నుంచి క్రికెట్ ఆడుతున్నా. వన్డే టైగా ముగిస్తే ఎలాంటా సమస్యా లేదు. ఫుట్‌బాల్, లేదా ఇతర క్రీడలు కానీ, టీ20లు కానీ టై అయితే మ్యాచ్‌ను కొనసాగించడం సరైనది. దాంతో విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ వన్డే మ్యాచ్‌లో సూపర్ ఓవర్ అవసరం అని నేను అనుకోను. తుది పోరు టై అయితే సంయుక్త విజేతగా ప్రకటించాలి. సూపర్ ఓవర్ అనేది అప్పటికప్పుడు తీసుకొచ్చిన నిబంధనలా అనిపించింది. అది వరల్డ్‌కప్‌లో ఉందనే విషయం నాకు తెలియదు. మ్యాచ్ టై అంటే టై.. అంతే కానీ సూపర్ ఓవర్ ఏమిటి?. కప్ విషయంలో సూపర్ ఓవర్ అనేది మంచి ఆలోచన కాదు’ అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన టేలర్ పేర్కొన్నాడు. -
‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా రాస్ టేలర్
వెల్లింగ్టన్: ప్రతిష్టాత్మక ‘న్యూజిలాండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ఎంపికయ్యాడు. జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ విశేషంగా రాణించిన టేలర్ శుక్రవారం ‘సర్ రిచర్డ్ హాడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఈ అవార్డును అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. గత సీజన్లో అద్భుతంగా ఆడిన టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1389 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (7238) చేసిన ఆటగాడిగా నిలిచిన టేలర్... మూడు ఫార్మాట్లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నానని అన్నాడు. -
రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం లభించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌ను వరించింది. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ అవార్డును టేలర్ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. తాజా అవార్డుపై టేలర్ స్పందిస్తూ.. ‘ గడిచిన ఏడాది నా కెరీర్లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తు-పల్లాలతో నా కెరీర్ ఇంకా సాగుతుండటం ఆనందంగా ఉంది. (ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా) 2023లో భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటమే నా ముందున్న లక్ష్యం. వరుసగా రెండు వరల్డ్‌కప్‌ల్లో మా జట్టు ఫైనల్ చేరడంలో భాగస్వామ్యం అయ్యా. ఇక వరుసగా మూడోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా. పరుగులు చేయాలనే దాహం. మానసికంగా ధృడంగా ఉండటమే నా సానుకూలాంశం. వయసు అనేది ప్రామాణికం కాదు. అది కేవలం నంబర్ మాత్రమే. నాకు కివీస్ తరుఫున ఇంకా ఆడాలని ఉంది’ అని 36 ఏళ్ల టేలర్ పేర్కొన్నాడు. 2006లో కివీస్ తరఫున అరంగేట్రం చేసిన టేలర్.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు.ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్ వెటోరి(112), స్టీఫెన్ ఫ్లెమింగ్(111), బ్రెండన్ మెకల్లమ్(101)లు టేలర్ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్ ఆటగాళ్లు.(మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే కదా అలా అనేది!) -
రాస్ టేలర్ ‘ట్రిపుల్’ సెంచరీ
వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే తొలి టెస్టుతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. ఇది అతని కెరీర్లో 100వ టెస్టు కావడం విశేషం. తద్వారా ఏ జట్టు తరఫు నుంచైనా మూడు ఫార్మాట్లలోనూ కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకెక్కుతున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్ తరఫున డానియల్ వెటోరి (112), స్టీఫెన్ ఫ్లెమింగ్ (111), బ్రెండన్ మెకల్లమ్ (101) తర్వాత వంద టెస్టులు ఆడనున్న నాలుగో ఆటగాడిగా టేలర్ నిలిచాడు. -
అసలు ఊహించలేదు: టేలర్
హామిల్టన్: ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్లో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా గుర్తింపు సాధించిన రాస్ టేలర్.. ఇక వంద టెస్టు ఆడటానికి సిద్ధమవుతున్నాడు. టీమిండియాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో టేలర్ ఈ ఫీట్‌ను అందుకుంటాడు. దాంతో మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్న తొలి క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించనున్నాడు. దీనిపై టేలర్ మాట్లాడుతూ.. ‘ ఈ సుదీర్ఘ జర్నీ చాలా సంతోషాన్నిచ్చింది. న్యూజిలాండ్ తరుఫున ఇంతటి క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. నా కోసం ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసింది. నేను వరుసగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ ఉండటంపై ఫ్యామిలీని చాలా మిస్సయ్యాను. నా భార్యే పిల్లలకు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇక్కడ వరకూ వచ్చా. ఫ్యామిలీ సహకారం లేకపోతే ఈ లాంగ్ జర్నీ ఉండేది కాదు. మా పిల్లలు కూడా నా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో నా తొలి టెస్టు సిరీస్ తర్వాత ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదు. వరుసగా ప్రతీ మ్యాచ్ ఆడుతూ ఉండట నిజంగా అదృష్టం. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ను తానే కావొచ్చు.. కానీ చాలా మంది ఆటగాళ్లు దాన్ని చేరుకుంటారనే ఆశిస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తర్వాత నా టెస్టు కెరీర్‌పై నమ్మకం ఏర్పడింది. మాంచెస్టర్‌లో నేను సాధించిన 158 పరుగులు నా అత్యుత్తమ ఇన్నింగ్స. అలాగే శ్రీలంకపై కొలంబోలో 140, 170 పరుగులు కూడా ఎప్పటికీ మరచిపోలేను. ఆస్ట్రేలియాపై చేసిన 290 స్కోరు కూడా నా కెరీర్ ఇన్నింగ్స్ అత్యుత్తమల్లో ఒకటి. నేను ఎప్పుడూ ఏదొకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు నా పిల్లలు పర్యటనలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నా కూతురు భారత్ పర్యటనకు వెళదామని అంటోంది’ అని టేలర్ పేర్కొన్నాడు. -
అతని ఆట చూస్తే మతిపోతుంది: శార్దూల్
మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కోల్పోయిన టీమిండియా.. చివరిదైన మూడో వన్డేలో సానుకూల ధోరణితో బరిలోకి దిగుతుందని పేసర్ శార్దూల్ ఠాకూర్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ మ్యాచ్ చాలా ముఖ్యమైనదేనని పేర్కొన్న శార్దూల్.. సిరీస్‌ను కోల్పోయామన్న ఆందోళనను వదిలిపెట్టి స్వేచ్ఛగా పోరుకు సిద్ధం అవుతామన్నాడు. ‘ ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో చివరి మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉండకపోవడం అంటూ ఏమీ ఉండదు. చివరి మ్యాచ్‌లో గెలిచి మమ్ముల్ని మరోసారి నిరూపించుకుంటాం. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాం. న్యూజిలాండ్ వన్డే సిరీస్ విజయంలో ఆ జట్టు వెటరన్ ఆటగాడు రాస్ టేలర్‌దే కీలక పాత్ర. టేలర్ బ్యాటింగ్ అమోఘం. అతను బ్యాట్‌తో విధ్వంసం చేస్తున్న తీరు మతిపోగొడుతుంది. ప్రధానంగా టేలర్ లెగ్ సైడ్ ఆడే విధానం చాలా బాగుంది. క్రికెట్ దేవుడు ఆడుతున్నట్లు ఉంది. రెండు వన్డేల్లో అతనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. కాకపోతే టేలర్‌ను రెండు మ్యాచ్‌ల్లోనే ఆదిలోనే ఔట్ చేసే అవకాశాలన్ని చేజార్చుకున్నాం. అతన్ని ఎంత తొందరగా పెవిలియన్ పంపితే అంత పైచేయి సాధించే వీలుంటుంది’ అని శార్దూల్ తెలిపాడు. మంగళవారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జరుగనుంది. -
టేలర్ సరికొత్త రికార్డు
ఆక్లాండ్: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్.. ఆ దేశం తరఫున భారత్‌పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును సైతం లిఖించిన సంగతి తెలిసిందే. కాగా, ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో సైతం టేలర్ మరో రికార్డును నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్లో భారత్‌పై 50కిపైగా స్కోర్లను అత్యధికంగా సాధించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే నాథన్ ఆస్ట్లే రికార్డును టేలర్ బ్రేక్ చేశాడు. భారత్‌పై 50కిపైగా స్కోర్లను టేలర్ 11వ సారి సాధించాడు. టీమిండియాపై రెండో వన్డేలో టేలర్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో భారత్‌పై 10సార్లు యాభైకిపైగా స్కోర్లు సాధించిన ఆస్ట్లే రికార్డును టేలర్ సవరించాడు. ఈ జాబితాలో టేలర్, ఆస్ట్లే తర్వాత స్థానంలో స్టీఫెన్ ఫ్లెమింగ్(9), కేన్ విలియమ్సన్(9)లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం భారత్‌పై రెండో వన్డేలో కివీస్ 273 పరుగులు సాధించగా, 9వ వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. టేలర్‌తో కలిసి జెమీసన్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా కివీస్ తరఫున 9 వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా వీరు నిలిచారు. ఇక ఆక్లాండ్‌లో 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం మాత్రం టేలర్-జెమీసన్లదే కావడం విశేషం. (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!) -
మెరిసిన టేలర్.. టీమిండియా ఛేదించేనా?
ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో మార్టిన్ గప్టిల్(79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్(41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్(73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా, బ్లండెల్(22), జెమీసన్(25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు ఫర్వాలేదనిపించారు. ఇక ఐదుగురు బ్యాట్మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అటు బౌలింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోను ఆకట్టుకున్న టీమిండియా.. కివీస్‌ను మూడొందల మార్కును చేరకుండా నియంత్రించింది. (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను గప్టిల్-నికోలస్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత నికోలస్(41) ఔటయ్యాడు. చహల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, గప్టిల్ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్(22) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన 27 ఓవర్ మూడో బంతికి బ్లండెల్ ఔటయ్యాడు. దాంతో 142 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి గప్టిల్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగుల వద్ద ఉండగా రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 30 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే దానికి సింగిల్‌కు రమ్మంటూ గప్టిల్‌ను పిలిచాడు. దాంతో ఇద్దరూ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకుని కీపర్ రాహుల్ విసిరాడు. దాంతో వెంటనే వికెట్లను గిరటేయడం, గప్టిల్ ఎటువంటి అనుమానం లేకుండా పెవిలియన్‌కు చేరుకోవడం జరిగిపోయాయి. (ఇక్కడ చదవండి: అయ్యో గప్టిల్.. ఎంత పొరపాటాయే!) గప్టిల్ రనౌటైన కాసేపటికి కివీస్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను నష్టపోయింది. 34 ఓవర్లో తొలి బంతికి టామ్ లాథమ్(7) ను రవీంద్ర జడేజా ఎల్బీగా ఔట్ చేసి పెవిలియన్‌కు పంపి మంచి బ్రేక్ ఇవ్వగా. ఆపై మరుసటి ఓవర్ రెండో బంతికి జేమ్స్ నీషమ్(3)ను జడేజా రనౌట్ చేసి శభాష్ అనిపించాడు. గప్టిల్ రనౌట్‌లో భాగమైన రాస్ టేలర్.. మరో రనౌట్‌లో కూడా పాలుపంచుకున్నాడు. నవదీప్ సైనీ వేసిన 35 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ బ్యాక్వర్డ్ పాయింట్లోకి షార్ట్ ఆడాడు. దాంతో సింగిల్‌కు యత్నించగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా డైరెక్ట్ త్రో విసిరి స్ట్రైకర్స్ ఎండ్‌లోని బెయిల్స్ పడగొట్టాడు. నీషమ్ క్రీజ్‌లోకి రావడానికి చాలా దూరంలో ఉండగానే జడేజా వేసిన అద్భుతమైన త్రోకు కివీస్ మరో మూల్యాన్ని చెల్లించుకుంది. దాంతో టీమిండియా సంబరాలు చేసుకోగా, రెండో రనౌట్‌తో కివీస్ శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. ఆపై గ్రాండ్ హోమ్(5)ను శార్దూల్ ఔట్ చేయగా, మార్క్‌చాప్‌మన్(1)ను చహల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక సౌతీ(3)ని చహల్ ఔట్ చేయగా,టేలర్ కడవరకూ క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ సాధించాడు. 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం నమోదు చేయడంతో కివీస్ స్కోరు బోర్డు కాస్త గాడిలో పడింది. అతనికి జెమీసన్ నుంచి సహకారం లభించడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. తొమ్మిదో వికెట్‌కు టేలర్-జెమీసన్‌లు అజేయంగా 76 పరుగులు జత చేయడంతో కివీస్ పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. టీమిండియా బౌలర్లలో చహల్ మూడు వికెట్లు సాధించగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. (ఇక్కడ చదవండి: గప్టిల్ నయా రికార్డు) -
‘టేలర్.. నాలుక ఎందుకు బయటకు తీస్తావ్’
న్యూఢిల్లీ: తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో వందకు పైగా వన్డేలు, వంద టీ20లు ఆడిన ఘనత న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్‌ది. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తన వందో మ్యాచ్‌ను పూర్తి చేసుకున్న టేలర్.. ఆ ఘనత సాధించిన తొలి కివీస్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా, ప్రస్తుతం 99 టెస్టులతో ఉన్నాడు రాస్ టేలర్. ఇంకో మ్యాచ్ ఆడితే టెస్టు ఫార్మాట్లో కూడా ‘సెంచరీ’ కొట్టేస్తాడు ఈ వెటరన్. అది టీమిండియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లోనే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిసాడు టేలర్. ఇప్పుడు ఆ అరుదైన రికార్డే టేలర్‌ను ఊరిస్తోంది. ఇదిలా ఉంచితే, నిన్న టీమిండియాతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ ఫార్మాట్లో 21వ శతకం నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: మూడేళ్ల తర్వాత అయ్యర్-టేలర్!) అయితే టేలర్ తాను ఎక్కువ జోష్‌కు లోనయ్యే సందర్భంలో నాలుకను బయటకు తీస్తూ ఉంటాడు. సెంచరీ సాధించే క్రమంలో అయితే కచ్చితంగా నాలుకతో తన సెలబ్రేషన్స్ చేసుకుంటాడు టేలర్. ఇలా నాలుక ఎందుకు బయటకు తీస్తాడు అనేది చాలామంది క్రికెట్ అభిమానుల్లో మెదిలే ప్రశ్నే. అయితే ఇప్పుడు అదే అనుమానం మన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు వచ్చింది. దీన్ని తన మనసులోకి ఉంచుకోలేక ట్వీటర్ వేదికగానే టేలర్‌ను అడిగేశాడు. ‘ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావ్ టేలర్. వెల్డన్. కానీ నాకో విషయం చెప్పాల్సి ఉంది. నువ్వు సెంచరీ చేసిన ప్రతీసారి నాలుకను ఎందుకు బయటకు తీస్తావ్’ చెప్పు అంటూ హాస్యపూరిత ఎమోజీని పోస్ట్ చేసి మరీ అడిగాడు. What a knock @RossLTaylor well done.. tell me why do u put the tongue out every time score 100??? 😜good game of cricket #indvsnz pic.twitter.com/XjNuXVxrTW — Harbhajan Turbanator (@harbhajan_singh) February 5, 2020 -
మూడేళ్ల తర్వాత అయ్యర్-టేలర్!
హామిల్టన్: క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే అభిమానులకు సైతం కొన్ని విషయాలను చూస్తే ఇది నిజమా.. అనిపిస్తూ ఉంటుంది. టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఇలాంటి విషయమే ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్లు, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన ఆటగాళ్ల సెంచరీలే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ డౌన్లో అంటే నాల్గో స్థానంలో హాఫ్ సెంచరీలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాలుగో స్థానం నుంచి పదో స్థానం వరకూ తరుచు హాఫ్ సెంచరీలు నమోదు అవుతూ ఉంటాయి. ఓపెనర్లు విఫలమైన క్రమంలో మూడు, నాలుగు స్థానాల్లో దిగే బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నిన్న టీమిండియా-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లలోని నాల్గో స్థానంలో వచ్చిన ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. (ఇక్కడ చదవండి: గెలుపు ‘రాస్’ పెట్టాడు) ఒకరు చేసిన సెంచరీ భారీ టార్గెట్‌ను నిర్దేశిస్తే, మరొకరు చేసిన శతకం మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చింది. అందులో ఒకరు శ్రేయస్ అయ్యర్ అయితే, మరొకరు రాస్ టేలర్. భారత్ తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన అయ్యర్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 పరుగులు చేస్తే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన టేలర్ 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అయితే ఒకే వన్డే మ్యాచ్‌లో నాల్గో స్థానంలో వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేసి చాలాకాలమే అయ్యింది. 2017లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఒక వన్డేలో నాల్గో స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్-ఇయాన్ మోర్గాన్‌లు సెంచరీలు బాదితే, ఆ తర్వాత ఇంతకాలానికి ఆ స్థానంలో ఇరు జట్ల ఆటగాళ్లు శతకాలతో మెరవడం విశేషం. వీరిలో రాస్ టేలర్ వెటరన్ క్రికెటర్ కాగా, శ్రేయస్ అయ్యర్ యువ క్రికెటర్. అంతకుముందు 2007లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డేలో నాల్గో స్థానంలో ఆడిన ఏబీ డివిలియర్స్-టెతెండా తైబులు సెంచరీలు సాధించారు. (ఇక్కడ చదవండి: అదే టర్నింగ్ పాయింట్: కోహ్లి) -
గెలుపు రాస్ పెట్టాడు
ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. సొంతగడ్డపై వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓటమి తర్వాత ఆ జట్టుకు ఊరట లభించింది. అది కూడా అసాధారణ విజయంతో దక్కింది. తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించి కివీస్ సగర్వంగా నిలిచింది. టి20ల్లో 0–5తో క్లీన్‌స్వీప్‌కు గురైన వేదనను మరచిపోయేలా భారత్‌పై తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు ఆకట్టుకుంది. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ సెంచరీతో ముందుండి నడిపించగా... కెప్టెన్ లాథమ్, నికోల్స్ కీలక పాత్ర పోషించారు. టీమిండియా తరఫున శ్రేయస్ అయ్యర్ తొలి వన్డే సెంచరీ, రాహుల్ మెరుపు బ్యాటింగ్ చివరకు వృథా కాగా, పేలవ బౌలింగ్‌తో జట్టు భంగపడాల్సి వచ్చింది. మొత్తంగా భారీ స్కోర్లతో పరుగుల వరద పారిన సెడన్ పార్క్‌లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. హామిల్టన్: భారత్‌తో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 88 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. లాథమ్ అనంతరం న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాస్ టేలర్ (84 బంతుల్లో 109 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి కెప్టెన్ టామ్ లాథమ్ (48 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (82 బంతుల్లో 78; 11 ఫోర్లు) అండగా నిలిచారు. టేలర్, లాథమ్ నాలుగో వికెట్‌కు 13.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1–0తో ముందంజ వేయగా... ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఇద్దరు కొత్త ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (31 బంతుల్లో 32; 6 ఫోర్లు), పృథ్వీ షా (20)లతో భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ఆడిన షా తొమ్మిదో బంతికి వన్డేల్లో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత వీరిద్దరు చకచకా పరుగులు రాబట్టారు. ఒక దశలో 17 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు వచ్చాయి. అయితే ఈ భాగస్వామ్యం 50 పరుగులకు చేరాక గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో షా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే మయాంక్ కూడా అవుటయ్యాడు. ఇలాంటి స్థితిలో కోహ్లి, అయ్యర్ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లి వేగంగా ఆడగా అయ్యర్ మాత్రం నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. 9 పరుగుల వద్ద కష్టసాధ్యమైన క్యాచ్‌ను టేలర్ వదిలేయడంతో అయ్యర్ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడారు. కోహ్లి తనదైన శైలిలో కొన్ని చూడచక్కటి షాట్లతో అలరించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 20.1 ఓవర్లలో 102 పరుగులు జోడించారు. అయితే ఓవర్‌కు 5.07 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు రాబట్టగలిగారు. ఈ దశలో లెగ్ స్పిన్నర్ సోధిని బౌలింగ్‌కు దించి కివీస్ మంచి ఫలితం సాధించింది. అప్పుడే హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటిన కోహ్లిని సోధి తన తొలి ఓవర్లోనే ‘గుగ్లీ’తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక భారత్‌ను నిలువరించవచ్చని ప్రత్యర్థి భావిస్తున్న తరుణంలో రాహుల్ సవాల్ విసిరాడు. మరోవైపు 66 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరు దూకుడుగా ఆడి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. సోధి ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రాహుల్ ఆ తర్వాత సౌతీ ఓవర్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. సౌతీ తర్వాతి ఓవర్లో అయ్యర్ 3 ఫోర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. 83 పరుగుల వద్ద గ్రాండ్‌హోమ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్... సాన్‌ట్నర్ ఓవర్లో సింగిల్ తీసి కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఆ మూడు ఓవర్లు... భారత్ తమ చివరి 6 ఓవర్లలో 62 పరుగులు చేయగలిగింది. ఇందులో సౌతీ వేసిన 48వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. కేదార్ జాదవ్ (15 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వరుస బంతుల్లో 4, 6, 4 బాదగా రాహుల్ మరో ఫోర్ కొట్టాడు. అయితే మిగిలిన ఐదు ఓవర్లలో 3 ఓవర్లు వేసిన బెన్నెట్ 6, 8, 7 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడంతో టీమిండియా మరింత భారీ స్కోరుకు దూరమైంది. వీరబాదుడు... తొలి పది ఓవర్ల పవర్‌ప్లేలో 54 పరుగులు... ఇలాంటి సాధారణ ఆరంభం తర్వాత కూడా కివీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఓపెనర్లు గప్టిల్ (41 బంతుల్లో 32; 1 ఫోర్), నికోల్స్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే తాను ఎదుర్కొన్న 35వ బంతికి బౌండరీ కొట్టగలిగిన గప్టిల్ ఆ వెంటనే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన బ్లన్‌డెల్ (9) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సగం ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 147 పరుగులకు చేరింది. అర్ధ సెంచరీ అనంతరం కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు నికోల్స్ రనౌటయ్యాడు. ఈ దశలో భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లు అనిపించింది. అయితే టేలర్, లాథమ్ భాగస్వామ్యం ఆ ఆనందాన్ని దూరం చేసింది. 21.3 ఓవర్లలో 177 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తూ వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కుల్దీప్, శార్దుల్‌పై బ్యాట్స్‌మెన్ విరుచుకు పడ్డారు. ఫలితంగా 4 ఓవర్లలో 44 పరుగులు వచ్చాయి. 45 బంతుల్లో టేలర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ సహా మొత్తం 15 పరుగులు వచ్చాయి. 38 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు కుల్దీప్ బౌలింగ్‌లో లాథమ్ అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే నీషమ్ (9), గ్రాండ్‌హోమ్ (1) ఒకే ఓవర్లో వెనుదిరగడంతో న్యూజిలాండ్ శిబిరంలో కొంత ఆందోళన పెరిగింది. అయితే శార్దుల్ ఓవర్లో సాన్‌ట్నర్ (12 నాటౌట్) ఫోర్, సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు. చివరకు మరో 11 బంతులు మిగిలి ఉండగానే టేలర్ తమ జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 20; మయాంక్ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 32; కోహ్లి (బి) సోధి 51; అయ్యర్ (సి) సాన్‌ట్నర్ (బి) సౌతీ 103; రాహుల్ (నాటౌట్) 88; కేదార్ జాదవ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 347. వికెట్ల పతనం: 1–50; 2–54; 3–156; 4–292. బౌలింగ్: సౌతీ 10–1–85–2; బెన్నెట్ 10–0–77–0; గ్రాండ్‌హోమ్ 8–0–41–1; నీషమ్ 8–0–52–0; సాన్‌ట్నర్ 10–0–58–0; సోధి 4–0–27–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) జాదవ్ (బి) శార్దుల్ 32; నికోల్స్ (రనౌట్) 78; బ్లన్‌డెల్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 9; టేలర్ (నాటౌట్) 109; లాథమ్ (సి) షమీ (బి) కుల్దీప్ 69; నీషమ్ (సి) జాదవ్ (బి) షమీ 9; గ్రాండ్‌హోమ్ (రనౌట్) 1; సాన్‌ట్నర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 348. వికెట్ల పతనం: 1–85; 2–109; 3–171; 4–309; 5–328; 6–331. బౌలింగ్: బుమ్రా 10–1–53–0; షమీ 9.1–0–63–1; శార్దుల్ 9–0–80–1; జడేజా 10–0–64–0; కుల్దీప్ 10–0–84–2. 22 పరుగుల ఓవర్... శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో కివీస్ పండగ చేసుకుంది. లాథమ్ ఒక సిక్స్ బాదగా...టేలర్ చివరి మూడు బంతుల్లో 6, 4, 4 కొట్టాడు. దాంతో మొత్తం 22 పరుగులు లభించాయి. 42 బంతుల్లోనే... టేలర్, లాథమ్ చెలరేగిన వేళ కివీస్ దూకుడుకు ఎదురు లేకుండా పోయింది. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్న సమయంలో స్కోరు 200 నుంచి 300 పరుగులకు చేరేందుకు ఆ జట్టుకు కేవలం 42 బంతులే సరిపోవడం విశేషం. 56 ఎక్స్‌ట్రాలు! మ్యాచ్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 56 పరుగులు నమోదయ్యాయి. న్యూజిలాండ్ 27 అదనపు పరుగులు ఇవ్వగా, భారత్ 29 పరుగులు సమర్పించుకుంది. కివీస్ 19 వైడ్లు వేయగా...టీమిండియా బౌలర్లు ఏకంగా 24 వైడ్లు వేశారు. అత్యధికంగా బుమ్రానే 9 వైడ్లు ఇచ్చాడు! రాహుల్, అయ్యర్ -
టీమిండియాకు షాకిచ్చిన కివీస్
హామిల్టన్ : న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20 ల సిరీస్‌ను 5-0 తేడాతో గెలిచి అదరగొట్టిన టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్‌కు తలవంచింది. హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ తన అద్వితీయ బ్యాటింగ్‌తో చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. టీమిండియా విధించిన 348 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కివీస్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కివీస్ బ్యాట్స్మెన్లలో రాస్ టేలర్ శతకంతో చెలరేగగా, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్లు అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశాడు. టీమిండియా బౌలర్లలో ఒక్క బుమ్రా తప్ప మిగతవారంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం విశేషం. (కోహ్లి ‘వీక్’ పాయింట్ అదేనా?) అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్లో తొలి సెంచరీతో మెరవగా, కేఎల్ రాహుల్ మెరుపు అర్థశతకాన్ని సాధించగా, టీమిండియా కెప్టెన్ కోహ్లి అర్థశతకంతో రాణించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌధీ 2 వెకెట్లు, కొలిన్ డి ఇంగ్రామ్, ఇష్ సోదీ చెరో వికెట్ తీశారు. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయిన కివీస్ పరిమిత ఓవర్ల ఆటలో భారీ లక్ష్యాన్ని తడబడకుండా చేధించడం విశేషం. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం(ఫిబ్రవరి 7) ఆక్లాండ్ వేదికగా జరగనుంది. (శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టుడు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాస్ టేలర్‌కు ‘వంద’నం
మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ టేలర్ కెరీర్లో వందో అంతర్జాతీయ టీ20. ఫలితంగా ఈ ఫీట్ సాధించిన తొలి కివీస్ ఆటగాడిగా రాస్ టేలర్ ఘనత సాధించాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న రాస్ టేలర్ ఒకప్పుడు హిట్టింగ్‌కు పెట్టింది పేరు. కాగా, ఇటీవల కాలంలో రాస్ టేలర్ ప్రాభవం తగ్గింది. ఒక సీనియర్ క్రికెటర్ కావడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 15వేలకు పైగా పరుగుల్ని టేలర్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో టేలర్ ఇప్పటివరకూ 1,856 పరుగులు చేశాడు. టీ20ల్లో టేలర్ స్టైక్‌రేట్ 123.00 ఉండగా, యావరేజ్ మాత్రం 25.42గానే ఉంది. వన్డే ఫార్మాట్లో టేలర్ 8,371 పరుగులు సాధించగా, టెస్టుల్లో 7,175 పరుగులు చేశాడు. (ఇక్కడ చదవండి: శాంసన్ మళ్లీ మిస్ చేసుకున్నాడు..!) భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో టేలర్ తన వందో టెస్టు ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా టేలర్ కొత్త రికార్డు నెలకొల్పుతాడు. 228 వన్డేలు ఆడిన టేలర్.. 99 టెస్టులు మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా టేలర్ ఉన్నాడు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్(113), రోహిత్ శర్మ(107)ల తర్వాత స్థానంలో టేలర్ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, ఇక న్యూజిలాండ్ తరఫున వందో టెస్టు ఆడిన తొలి ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ కాగా, ఆ జట్టు తరఫున వందో వన్డే ఆడిన మొదటి ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీ. కాగా, ఇప్పుడు కివీస తరఫున వందో టీ20 ఆడుతున్న తొలి ఆటగాడిగా టేలర్ నిలవడం విశేషం. -
రెండో టీ20: ఇవి మీకు తెలుసా?
ఆక్లాండ్: హాలిడే అయిన ఆదివారం రోజు ఫుల్ వినోదాన్ని అందించేందుకు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్దమయ్యాయి. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపు కోసం పోటాపోటీగా పోటీపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడిపోయినా తాము అనుకున్నదే దక్కిందని సారథి కోహ్లి పేర్కొనడం విశేషం. కాగా, విన్నింగ్ టీమ్‌నే కొనసాగించాలనే ఉద్దేశంతో రెండో టీ20 కోసం ఇరుజట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే భారత్-కివీస్ రెండో టీ20 సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. ఇప్పటివరకు టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌పై గెలవలేదు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ మైదానం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం. ఎందుకుంటే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం కివీస్ జట్టుకు కలిసిరాదు. ఎందుకంటే ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో అక్కడ ఓడిపోయింది. న్యూజిలాండ్ స్టార్ అండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 2014 తర్వాత టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియాతో జరిగిన తొలి టీ20 సందర్భంగా టేలర్ అర్థసెంచరీ సాధించిన విషయం తెలిసిందే. గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఏడు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడం గమనార్హం. అంతేకాకుండా రోహిత్ తన కెరీర్లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు. కివీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కోలిన్ మున్రో 2017 నుంచి ప్లవర్ ప్లేలో 165కు పైగా స్ట్రయిక్ రేట్ నమోదు చేస్తుండటం విశేషం. టీ20ల్లో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి టీమిండియాపై ఇప్పటివరకు 13 వికెట్లు దక్కించుకున్నాడు. చదవండి: ఓడినా.. కోరుకున్నదే దక్కింది -
టేలర్ సరికొత్త రికార్డు.. ఆసీస్ క్లీన్‌స్వీప్
సిడ్నీ: న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న టేలర్.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు సాధించిన జాబితాలో టాప్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టేలర్ ఈ ఫీట్‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టేలర్(22) నిరాశపరిచినప్పటికీ అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉండేది. టెస్టుల్లో ఫ్లెమింగ్ 7,172 పరుగులు సాధించి ఇప్పటివరకూ ఆ దేశం తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. దాన్ని తాజాగా టేలర్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం టేలర్ 7,175 పరుగులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో టేలర్, ఫ్లెమింగ్‌ల తర్వాత బ్రెండన్ మెకల్లమ్(6,453), కేన్ విలియమ్సన్(6,379), మార్టిన్ క్రో(5,444)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఆసీస్ క్లీన్‌స్వీప్.. కివీస్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆసీస్ 279 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా ఆసీస్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. 416 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌కు వరుసగా వికెట్లు కోల్పోయింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్(52) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ మూడు వికెట్లు సాధించగా, కమ్మిన్స్‌కు వికెట్ దక్కింది. తొలి రెండు టెస్టుల్లో కూడా ఆసీస్ భారీ విజయాల్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 454 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 217/2 డిక్లేర్డ్ న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 256 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 136 ఆలౌట్ -
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్!
పెర్త్: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్ కీపర్ టిమ్ పైన్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ చెత్త కీపంగ్‌తో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ స్టార్ వేసిన 35వ ఓవర్ ఐదో బంతిని రాస్ టేలర్ కవర్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ తీశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్, టేలర్ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియోన్ బంతిని వేగంగా అందుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌కు పైన్ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్ పైన్ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ రనౌట్ మిస్సయినప్పటికీ ఆసీస్‌కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్ తడబడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్‌లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్ పైన్‌ను జట్టు నుంచి సాగనంపడం బెటర్’అంటూ ఓ నెటజన్ కామెంట్ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్ టిమ్ పైన్’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్‌వుడ్ బ్యాటింగ్‌కు దిగలేదు). దీంతో కివీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి: ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు.. ‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’ An early chance goes by! Paine fumbles with Watling out of the frame! #AUSvNZ live: https://t.co/0Uay6Vh9fg pic.twitter.com/mjZUiWrrqH — cricket.com.au (@cricketcomau) December 14, 2019 -
అతని తర్వాత రాస్ టేలర్ ఒక్కడే..
హామిల్టన్: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన క్లబ్లో చేరిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టేలర్(105 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్లో ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం రాస్ టేలర్ 7,023 టెస్టు పరుగులతో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో ఏడువేల పరుగులు సాధించిన 51వ క్రికెటర్ టేలర్ కాగా, న్యూజిలాండ్ తరఫున ఆ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్. అంతకుముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే కివీస్ తరఫున ఆ మార్కును చేరాడు. ఫ్లెమింగ్ తన కెరీర్లో 111 మ్యాచ్‌లకు గాను 189 ఇన్నింగ్స్‌లు ఆడి 7,172 పరుగులతో ఉన్నాడు. అతని తర్వాత కివీస్ తరఫున ఏడువేల టెస్టు పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్‌గా టేలర్ గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకూ 96 టెస్టులు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక వన్డే ఫార్మాట్లో 228 వన్డేలు ఆడగా 8, 376 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 95 మ్యాచ్‌లు ఆడి 1,743 పరుగులతో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: ఇంతటి వరస్ట్ క్యాచ్ డ్రాపింగ్ చూశారా?) ఇటీవల ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వేగవంతంగా ఏడువేల టెస్టు పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. స్మిత్ తన 126వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే ఏడువేల పరుగులు పూర్తి చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హామండ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. హామండ్ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడువేల పరుగుల్ని సాధించాడు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల టెస్టు పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతన్నాడు. సచిన్ టెండూల్కర్ 136వ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరగా, గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరా, విరాట్ కోహ్లిలు తమ 138 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు సాధించారు. -
నా శరీరం అనుకూలిస్తే..
లండన్: ఫిట్నెస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే వరల్డ్‌కప్ తర్వాత కూడా క్రికెట్లో కొనసాగుతానని న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ స్పష్టం చేశాడు. తాను సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడటానికి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా ఒక స్ఫూర్తి అని టేలర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను 35 ఒడిలో ఉన్నందున ఇంకా క్రికెట్లో కొనసాగాలనే అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తర్వాత జరిగే పరిణామాల్ని బట్టి క్రికెట్ ఆడేది.. లేనిది తెలుస్తుందన్నాడు. శరీరం అనుకూలిస్తే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌ను యథావిధిగా కొనసాగిస్తానన్నాడు. ‘ గేల్‌కు 39 ఏళ్లు. 2023 నాటికి వరల్డ్‌కప్‌కు నాకు 39 ఏళ్లు వస్తాయి. దాంతో ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రస్తుత వరల్డ్‌కప్ చివరిది అని చెప్పలేను. నా శరీరం అనుకూలిస్తే క్రికెట్లో కొనసాగుతా. కివీస్ వరల్డ్‌కప్ సాధించాలనేది నా కోరిక. అదే లక్ష్యంతో నా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కాకపోతే దీన్ని మనసులో పెట్టుకుని మాత్రం ఆటకు సిద్ధం కాను. మెగా టోర్నీల్లో ఒత్తిడి అనేది సహజం. దాన్ని అధిగమిస్తేనే విజయాల్ని సాధించగలం’ అని టేలర్ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్ జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టేలర్ 71 పరుగులు చేసి కివీస్ విజయానికి సహకరించాడు. -
ప్రపంచకప్‌కు కివీస్ జట్టు ఇదే
వెల్లింగ్టన్: ఇంగ్లండ్-వేల్స్ వేదికగా మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో పాల్గనబోయే జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జాబితాను కివీస్ బోర్డు ఐసీసీకి పంపించింది. ఈ సారి ప్రపంచకప్‌లో పాల్గనబోయే జట్టులో అనుభవానికే పెద్దపీట వేసినట్టు బ్లాక్ క్యాప్స్ ప్రధాన కోచ్ గ్యారీ స్టడ్ తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు రాస్ టేలర్, గుప్టిల్, బౌల్ట్, సౌథీలకు మరో అవకాశం కల్పించారు. రెగ్యులర్ కీపర్ లాథమ్ గతనెలలో గాయపడటంతో బ్యాకప్‌గా బ్లన్‌డెల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. బౌల్ట్, సౌథీలతో పేస్ విభాగం బలంగా ఉంది. స్టార్ స్పిన్నర్ సాంటర్న్కు తోడుగా ఇష్ సోధీని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. విలియమ్సన్, టేలర్, లాథమ్, మున్రోలతో బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న కివీస్.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా టైటిల్ నెగ్గాలని విలియమ్సన్ సేన ఆరాటపడుతోంది. కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లన్‌డెల్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్ హోమ్, ఫెర్గుసన్, మార్టిన్ గుప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కోలిన్ మున్రో, నీషమ్, నిఖోలస్, సాంటర్న్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్ -
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: వర్షంతో రెండు రోజుల ఆట రద్దయింది. ఇక మూడే రోజులు మిగిలి ఉన్న టెస్టు మ్యాచ్‌లో ‘డ్రా’ తప్పదనుకుంటున్న తరుణంలో రాస్ టేలర్ (212 బంతుల్లో 200; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అటు కివీస్ బౌలర్లు కూడా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఫలితం దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 38/2తో సోమవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను కేన్ విలియమ్సన్ (74; 11 ఫోర్లు, 1 సిక్స్), టేలర్ నడిపించారు. వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన టేలర్ ముందుగా కెప్టెన్ విలియమ్సన్తో కలిసి మూడో వికెట్‌కు 172 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో లంచ్ విరామానికి ముందే టెస్టుల్లో అతను 18వ సెంచరీని సాధించాడు. రెండో సెషన్లో టేలర్‌కు నికోల్స్ (129 బంతుల్లో 107; 9 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 216 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత టేలర్ టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే ముస్తఫిజుర్ మరుసటిబంతికే ఔటయ్యాడు. అతను నిష్క్రమించే సమయానికి కివీస్ 5 వికెట్లకు 421 పరుగులు చేసింది. కాసేపటికి వాట్లింగ్ (8) ఔట్ కాగానే కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 432/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 221 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (4)తో పాటు మోమినుల్ హక్ (10)లను బౌల్ట్... మరో ఓపెనర్ ఇస్లామ్ (29)ను హెన్రీ ఔట్ చేశారు. క్షమించు క్రో...: న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగ్గజం మార్టిన్ క్రో. రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో కన్నుమూసిన ఈ లెజెండ్ టెస్టులో 17 సెంచరీలు చేశారు. సోమవారం ఆయన సెంచరీలను అధిగమించిన అనంతరం టేలర్ ఆకాశం వైపు చూస్తు మనసులో ప్రార్థన చేశాడు. ఆట ముగిశాక దీనిపై అతను మాట్లాడుతూ ‘నేను తన ఘనతను అధిగమించాలని క్రో కోరుకున్నారు. ఇప్పుడీ ఘనత చేరేందుకు చాలా ఆలస్యం చేసినందుకు ఆయన్ని క్షమించమని కోరాను’ అని అన్నాడు. విలియమ్సన్కు గాయం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఎడమ చేతి భుజానికి గాయమైంది. ఆదివారం ఫీల్డింగ్ సమయంలోనే గాయమైనప్పటికీ సోమవారం అతను బ్యాటింగ్ చేశాడు. అనంతరం హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్ తీయించినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. -
టేలర్ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ డబుల్ సెంచరీ సాధించాడు. 211 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్న టేలర్‌కు ఇది టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ. అయితే డబుల్ సెంచరీ మార్కును చేరిన తర్వాత బంతికే టేలర్ పెవిలియన్ చేరాడు. అతనికి జతగా హెన్రీ నికోలస్(107), కేన్ విలియమ్సన్(74) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌కు విలియమ్సన్-టేలర్ జోడి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై నికోలస్-టేలర్‌ల జోడి నాల్గో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ 141 పరుగుల వెనుకబడి ఉంది. ఇక్కడ చదవండి: కివీస్ ఇన్నింగ్స్ విజయం -
‘ఇంత దారుణంగా ఓడిపోవడం బాధించింది’
హామిల్టన్: టీమిండియా చేతిలో 3–0తో ఓటమి బాధాకరమని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్‌టేలర్ అన్నాడు. పటిష్ఠంగా ఉన్న కోహ్లీసేన స్థాయికి తగినట్లు తాము ఆడలేదని అంగీకరించాడు. ‘3–0 ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం బాధించింది. భారత్ మూడు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడింది. వారు మాకన్నా ఎంతో పైస్థాయిలో ఉన్నారు. మాపై ఒత్తిడి పెంచి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. మేం ఆధిపత్యం వహించే స్థితిలో పట్టు కోల్పోయాం. మేమెంతో పోరాడాం, కానీ ఫలితం లేదు. మరో రెండు మ్యాచులున్నందున సిరీస్ ఇప్పటికే చేజారినా పరువు నిలుపుకొనేందుకు అవకాశం ఉంది. హామిల్టన్ మాకు అచ్చొచ్చింది. మేం తిరిగి లయ అందుకుంటామని నమ్మకముంది. అన్ని విభాగాల్లోనూ మేం రాణించాల్సి ఉంది. విరాట్ అద్భుతమైన నాయకుడు. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు సమతూకం తెస్తున్నాడు. కుల్దీప్, చాహల్‌ను ఎదుర్కోవాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే’ అని టేలర్ వెల్లడించాడు. -
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ టీమిండియా కైవసం
-
టీమిండియాదే సిరీస్
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. తద్వారా ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తేడాతో చేజిక్కించుకుంది. రోహిత్ శర్మ(62; 77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి(60; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్)లు భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ధావన్ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టించాడు. కాగా, జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఉండగా ధావన్(28; 27 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రోహిత్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరొకవైపు కోహ్లి కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 59 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్‌తో అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ 113 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రోహిత్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి కోహ్లి కూడా ఔట్ కావడంతో భారత్ జట్టు 168 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత అంబటి రాయుడు-దినేశ్ కార్తీక్‌ల జంట సమయోచితంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించింది. రాయుడు(40 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), దినేశ్ కార్తీక్(38 నాటౌట్; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు ఆకట్టుకోవడంతో భారత్ 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించగా, సాంత్నార్ వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులకు ఆలౌటైంది. రాస్ టేలర్(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్ లాథమ్(51; 64 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. అటు తర్వాత టేలర్-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా అర్థ శతకంతో మెరిశాడు. హాఫ్ సెంచరీ సాధించిన లాథమ్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్, సాంత్నార్‌లు ఔటయ్యారు. దాంతో కివీస్ 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత టేలర్‌పై పడింది. కాగా, టేలర్ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చిన టేలర్ సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అనంతరం కివీస్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టడంతో ఆ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే గురువారం జరుగనుంది. -
టీమిండియా లక్ష్యం 244
మౌంట్ మాంగనీ: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాస్ టేలర్(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్ లాథమ్(51; 64 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. అటు తర్వాత టేలర్-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా అర్థ శతకంతో మెరిశాడు. హాఫ్ సెంచరీ సాధించిన లాథమ్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్, సాంత్నార్‌లు ఔటయ్యారు. దాంతో కివీస్ 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత టేలర్‌పై పడింది. కాగా, టేలర్ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చిన టేలర్ సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అనంతరం కివీస్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టడంతో ఆ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. (వారెవ్వా పాండ్యా.. వాటే క్యాచ్!) -
న్యూజిలాండ్ జట్టులో భారత స్పిన్నర్!
వెల్లింగ్టన్ : భారత సంతతికి చెందిన స్పిన్నర్ అజాజ్ పటేల్ న్యూజిలాండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మూడుటెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు 15 మంది సభ్యులు గల జట్టును ప్రకటించారు. ఈ జట్టులో అజాజ్‌కు చోటు దక్కింది. ముంబైలో పుట్టిన అజాజ్.. చిన్నతనంలోనే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. అక్కడి డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించడంతో అజాజ్‌కు ఈ అవకాశం దక్కింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో అజాజ్‌ను తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ గావిన్ లార్సెన్ తెలిపారు. సాంట్నర్ స్థానంలో అజాజ్ సరైనవాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కివీస్ డొమెస్టిక్ క్రికెట్లో అజాజ్ 48 వికెట్లు పడగొట్టి డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ 2017గా నిలిచాడు. జట్టులోకి అజాజ్‌తో పాటు టామ్ బ్లండేల్, బ్యాకప్ వికెట్ కీపర్‌గా బీజే వాట్లింగ్‌లను కూడా తీసుకున్నారు. -
రాస్ రఫ్పాడించాడు
డ్యూనెడిన్: హోరాహోరీ, పోటాపోటీ వంటి పదాలకు సరైన నిర్వచనంగా సాగిన వన్డేలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాస్ టేలర్ (147 బంతుల్లో 181 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) విరుచుకుపడిన వేళ న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 9 వికెట్లకు 335 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసి నెగ్గింది. మెరుపులా మొదలై... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు జేసన్ రాయ్ (42), బెయిర్‌స్టో (138; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) 77 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం బెయిర్‌స్టో, రూట్ (102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికె ట్‌కు 190 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 38వ ఓవర్లో 267/1తో నిలిచిన ఇంగ్లండ్ 400 పరుగులు చేసేలా కనిపించినా.. 21 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనలో కివీస్ విధ్వంసక ఓపెనర్లు గప్టిల్ (0), మున్రో (0) డకౌటయ్యారు. ఆ తర్వాత టేలర్... లాథమ్ (71; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో నాలుగో వికెట్‌కు 187 పరుగులు జోడించాడు. చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా... మూడో బంతిని నికోల్స్ సిక్స్‌గా మలచడంతో కివీస్ భారీ ఛేదన పూర్తయింది. ఐదో వన్డే శనివారం జరుగుతుంది. -
ఛేజింగ్‌లో రాస్ టేలర్ రికార్డుల మోత!
సాక్షి, స్పోర్ట్స్ : ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ (147 బంతుల్లో 181 నాటౌట్: 17 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కీలక ఛేజింగ్ ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ కీలక ఆటగాడు కొన్ని అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఓ వన్డే ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడయ్యాడు టేలర్. దాంతోపాటుగా ఓ వన్డే ఛేజింగ్‌లో భాగంగా అత్యధిక ఇన్నింగ్స్ పరుగులు చేసిన కివీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో మార్టిన్ గప్టిల్ (180 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును ఈ ఇన్నింగ్స్‌తో అధిగమించాడు. ఓవరాల్‌గా వన్డే ఛేజింగ్ ఇన్నింగ్స్ టాప్-3 ఆటగాళ్లుగా వరుసగా షేన్ వాట్సన్(185 నాటౌట్), ఎంఎస్ ధోని(183 నాటౌట్), విరాట్ కోహ్లి (183) ఉన్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ రెండో క్రికెటర్‌గా టేలర్ (7267 పరుగులు) నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్ ఈ ఫీట్ సాధించాడు. కివీస్ మాజీ క్రికెటర్ నాథన్ ఆస్టల్ (7090 పరుగులు) ను టేలర్ అధిగమించాడు. దీంతో కివీస్ నుంచి అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో టేలర్ రెండో స్థానంలో నిలవగా, ఆస్టల్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు 7086 వన్డే పరుగులతో ఉన్న టేలర్.. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌కు అద్బుత విజయాన్ని అందించి అజేయంగా నిలిచాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై కివీస్ ఆటగాడు గప్టిల్ (180 నాటౌట్) సైతం అజేయంగా నిలవడం గమనార్హం. వన్డేల్లో కివీస్ నుంచి 8007 పరుగులతో స్టీఫెన్ ఫ్లెమింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2-2 తో సమంగా ఉన్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ ల సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే శక్రవారం జరగనుంది. -
రాస్ టేలర్ 181.. ఇంగ్లండ్ ఓటమి
డూడెన్ : ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్(181) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లండ్‌పై కివీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్ స్టో (132), రూట్(102)లు సెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్‌గా పెవిలియన్ చేరారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, లాథమ్‌లు చెలరేగి ఆడటంతో హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ చివరకు కివిస్ వశమైంది. ఈ విజయంతో సిరీస్ 2-2 తో సమమైంది. చివరి వన్డే శక్రవారం జరగనుంది. -
కివీస్‌ను గెలిపించిన రాస్ టేలర్
హామిల్టన్: రాస్ టేలర్ (113; 12 ఫోర్లు) అద్భుత శతకానికి సాన్‌ట్నర్ (27 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో... ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 3 వికెట్లతో విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బట్లర్ (79; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), జో రూట్ (71; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం లభించలేదు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో టేలర్, లాథమ్ (79; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. చివర్లో సాన్‌ట్నర్ మెరవడంతో విజయం సొంతమైంది. నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వివాదాస్పద ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (2/43) బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్లు మధ్య రెండో వన్డే బుధవారం మౌంట్‌మాంగనీలో జరుగనుంది. -
క్యాచ్ పట్టి..జాక్‌పాట్ కొట్టాడు
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన హోరాహోరి టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురవగా.. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన ఓ అభిమానికి కాసుల వర్షం కురిసింది. ఇరు జట్లు 500పైగా పరుగులు నమోదు చేసి అభిమానులను హోరెత్తించగా.. రాస్ టేలర్ సిక్సర్ ఓ అభిమానికి ఏకంగా జాక్‌పాట్ తగిలేలా చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్లో టేలర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ బంతిని స్టాండ్స్‌లో నిల్చోన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్ అనే 20 ఏళ్ల యువకుడు ఒంటిచేత్తో పట్టేశాడు. ఈ క్యాచ్‌కు ముగ్ధులైన స్థానిక శీతల పానియాల కంపెనీ ఈ అభిమానికి రూ.24 లక్షలు( 50 వేల న్యూజిలాండ్ డాలర్లను) బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా స్టాండ్స్‌లోకి ఆటగాళ్లు కొట్టిన బంతుల్ని క్యాచులు అందుకోవటం అభిమానులకు ఎంతో సరదా. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ రకమైన వినోదం చూస్తూనే ఉంటాం. ఇలా తన సరదా కోసం ప్రయత్నిస్తే వెతుకొంటూ బహుమానం రావడంతో మిచెల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ‘నేను లెఫ్ట్ హ్యాండ్ కానప్పటికి ప్రయత్నించా. అనుకోకుండా బంతి నాకు చిక్కింది. అనంతరం అందరు నాపై పడ్డారు.’ అని విద్యార్థి అయిన మిచెల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిచినప్పటికి మిచెల్‌కు బహుమానం రావడంతో కివీస్ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ క్యాచ్‌పై రాస్ టేలర్ సైతం అతన్ని ప్రశంసిస్తూ గ్లోవ్స్, మ్యాచ్ బంతిని బహుమానంగా ప్రకటించాడు. Congratulations Mitch on a great catch and 50k 💰 Enjoy my gloves and the match ball… https://t.co/2F4G9sJaXz — Ross Taylor (@RossLTaylor) 16 February 2018 -
క్యాచ్ పట్టాడు.. జాక్‌పాట్ కొట్టాడు
-
చెలరేగిన పేసర్లు.. కివీస్ క్లీన్‌స్వీప్
హామిల్టన్: పర్యాటక జట్టు వెస్టిండీస్‌కు ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో మరో పరాభవం ఎదురైంది. వరుసగా రెండో టెస్టులోనూ విండీస్ ఓటమి పాలు కావడంతో రెండు టెస్టుల సిరీస్‌ను కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ సేన 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 203 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య కివీస్ 240 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 30/2తో నాలుగో రోజు బ్యాటింగ్ చేసిన విండీస్.. రోస్టన్ ఛేజ్ (98 బంతుల్లో 64) హాఫ్ సెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు రీఫర్(29), రోచ్ (32) తమ వంతుగా స్కోరు బోర్డుకు పరుగులు జోడించకుంటే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 200 మార్కు కూడా చేరకపోయేది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 6 వికెట్లు పడగొట్టగా, వాగ్నర్ 5, సౌథీ 4 వికెట్లు తీశారు. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో నిలిచిన కివీస్ టపార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (107 నాటౌట్; 11 ఫోర్లు)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కెరీర్లో 17వ టెస్టు శతకం సాధించిన రాస్ టేలర్... తన ఆరాధ్య ఆటగాడు, కివీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ మార్టిన్ క్రో రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. -
ఓటమి దిశగా విండీస్
హామిల్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (107 నాటౌట్; 11 ఫోర్లు) శతకం బాదడంతో న్యూజిలాండ్... వెస్టిండీస్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. ఆట ముగిసే సమయానికి విండీస్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో విండీస్ ఓటమి ని తప్పించుకోవడం కష్టమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 215/8తో సోమవారం మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ మరో ఆరు పరుగులు జోడించి ఆలౌటైంది. బౌల్ట్ (4/73) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టేలర్‌తో పాటు కెప్టెన్ విలియమ్సన్ (54; 8 ఫోర్లు) రాణించాడు. టీ విరామం అనంతరం న్యూజిలాండ్ 291/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్లో 17వ టెస్టు శతకం సాధించిన రాస్ టేలర్... తన ఆరాధ్య ఆటగాడు, కివీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ మార్టిన్ క్రో రికార్డును సమం చేశాడు. -
సెంచరీల రికార్డు సమం చేశాడు!
హామిల్టన్:న్యూజిలాండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీల రికార్డును వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ సమం చేశాడు. వెస్టిండీస్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రాస్ టేలర్ (107: 198 బంతుల్లో11 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో కెరీర్లో 17 శతకాన్ని పూర్తి చేసుకుని ఆ దేశం తరపున అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు శతకాల రికార్డు దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ క్రో, కేన్ విలియమ్సన్ పేరిట ఉంది. 1995లో రిటైర్మెంట్ ప్రకటించిన క్రో.. కెరీర్లో 77 టెస్టులాడి 17 శతకాలు సాధించగా, విలియమ్సన్ కేవలం 66 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. తాజాగా దాన్ని రాస్ టేలర్ సమం చేసి అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ శతకం నమోదు చేశాడు. 2007లో టెస్టు కెరీర్ ప్రారంభించిన టేలర్.. మూడో టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్నాడు. సెడాన్ పార్క్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టేలర్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. తన 10 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో కివీస్ సాధించిన ఎన్నో విజయాల్లో టేలర్ పాలుపంచుకున్నాడు. -
‘నాకు హిందీ నేర్పింది వీరే’.. అంటూ వీరూకి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో మాటలయుద్దానికి సై అన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ తన చివరి సందేశంతో ఈ ఫన్నీ వార్‌ను ముగించాడు. కివీస్‌తో సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి వీరి మధ్య సరదా మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏప్పటిలాగే సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్లతో టేలర్‌ను టైలర్‌గా సంబోధిస్తూ ఆటపట్టించాడు. అయితే అనూహ్యంగా టేలర్ సెహ్వాగ్‌కు హిందీలో ట్వీట్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ఎంతలా అంటే టేలర్ హిందీకీ ఆధార్ ఇచ్చేయండి అని సెహ్వాగే స్వయంగా యూఐడీఏఐను కోరేంత. మాజీ కెప్టెన్ గంగూలీ నీకు హిందీ ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసేంతా.. భారత అభిమానులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యేంతా.. ప్రతి మ్యాచ్ అనంతరం వీరి మధ్య జరిగిన సరదా ట్వీట్లతో భారత అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. భారత్ టీ20 సిరీస్ గెలుచుకున్న అనంతరం సెహ్వాగ్ ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్‌కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ఈ ట్వీట్‌కు లేట్‌గా అయినా లేటేస్ట్‌గా స్పందించాడు టేలర్. తనకు హిందీ నేర్పిన వారితో దిగిన ఫోటోతో ఇన్‌స్ట్రాగ్రమ్ పోస్ట్ చేశాడు. ఆ ఇద్దరు తన టీమ్ మెట్ అయిన ఇష్ సోదీ, భారత స్టాఫర్ దేవ్‌లు అని పేర్కొన్నాడు. ‘భారత్‌లో ఆడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, సెహ్వాగ్‌తో మాటలయుద్దానికి నాకు ఈ ఇద్దరే సాయం చేశారు. ధన్యవాదాలు దేవ్, సోదీ, ఉతకడం, కుట్టడానికి చాలా సమయం ఉంది సెహ్వాగ్జీ.. ఈ చివరి మెసేజ్‌తో ముగిస్తున్నాను. అని పోస్ట్ చేశాడు. As always India it was a pleasure. FYI - the two responsible for helping me with banter with @virendersehwag are here in this photo, thanks Dev and @ic3_odi , signing off with one last message: Dhullai aur Silaai Anne waale samay mein jaari rahegi ☺️#India #indvnz #Mumbai #darji A post shared by Ross Taylor (@rossltaylor3) on Nov 8, 2017 at 7:30am PST Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7 — Virender Sehwag (@virendersehwag) 7 November 2017 -
కివీస్ ఓటమిపై వీరూ మరో ఫన్నీ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌పై కోహ్లి సేన టీ20 సిరీస్ నెగ్గడంతో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. తొలి వన్డే అనంతరం నుంచే కివీస్ బ్యాట్స్‌మెన్ టేలర్‌కు సెహ్వాకు ఫన్నీ ట్విట్టర్ వార్ నడుస్తుంది. టేలర్, టైలర్‌గా సంబోదిస్తూ సెహ్వాగ్ సరదా ట్వీట్లు చేశాడు. దీనికి టైలర్ ఏమాత్రం తక్కువ కాకుండా హిందీలో సెహ్వాగ్‌కు కౌంటర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక రెండో టీ20 అనంతరం టేలర్ ఓ దర్జీ షాపు ముందు కూర్చోని.. రాజ్‌కోట్‌లో దుకాణం బంద్ అయింది. కొత్త దుకాణం తిరువనంతపురంలో.. బట్టలు కుట్టించుకోవాలంటే అక్కడికి రా సెహ్వాగ్ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు. టైలర్ హిందీకి సెహ్వాగ్‌తో పాటు భారత అభిమానులు కూడా నివ్వేరపోయారు. సెహ్వాగ్ అయితే టేలర్ హిందీకి ఏకంగా ఆధారే ఇవ్వమన్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న డాషింగ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ విజయానంతరం.. ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్‌కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ప్రతి ట్విట్‌కు స్పందించిన టేలర్ ఈ ట్వీట్‌కు మాత్రం ఇంకా సమాదానం ఇవ్వలేదు. బాక్సింగ్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించిన మేరీకోమ్‌కు సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపాడు. Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7 — Virender Sehwag (@virendersehwag) November 7, 2017 -
టేలర్‌కు ఆధార్!.. సెహ్వాగ్‌కు కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌ల ట్వీట్ల యుద్దం మరింత ఫన్నీగా కొనసాగతుంది. వ్యంగ్య చలోక్తులతో ట్వీట్ చేసే సేహ్వాగ్కు హాస్యం జోడించడంలో ఏ మాత్రం తక్కువ కాదంటూ బదులిస్తున్నాడు రాస్ టేలర్. భారత్ తో తొలి వన్డేలో కివీస్ విజయం అనంతరం మొదలైన వీరి సరదా ట్విట్ల సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు తిరవనంతపురం బయలు దేరే ముందు రాజ్‌కోట్‌లోని ఓ దర్జీ షాపు ముందు కూర్చోని దిగిన ఫోటోను రాస్ టేలర్ హిందీలో ‘ రాజ్‌కోట్ మ్యాచ్ అనంతరం దర్జీ షాపు బంద్ అయింది. తరువాతి మ్యాచ్ తిరువనంతపురంలో ఆర్డర్ ఉంటే అక్కడికి రా సెహ్వాగ్’ అనే క్యాఫ్షన్‌తో ట్విట్ చేశాడు. దీనికి సెహ్వాగ్ ఏహే మనోడికి హిందీ తెగ వచ్చేసింది ఆధార్ కార్డు ఇచ్చేయండి అనే ట్వీట్‌తో బదులిచ్చాడు. అయితే ఈ ట్వీట్‌కు అనూహ్యంగా యూఐడీఏఐ స్పందించింది. భాష ఒక్కటే ముఖ్యం కాదు.. నివాస గృహం సంగతేంటని ప్రశ్నిస్తూ.. ఆధార్ కావల్సిన నియమాలను వివరిస్తూ ట్వీట్ చేసింది. తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించిన టేలర్‌ను అభినందిస్తూ... వీరూ తన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ జీ (టేలర్ ను టైలర్ అన్నడన్న మాట). దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి తగ్గట్లే హిందీలోనే ఆ దర్జీ(టేలర్) రిప్లై ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల పర్వం ఇక్కడితోనే ఆగలేదు. ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా లూజ్ గా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ దానికి తగ్గట్లే ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది కుట్టడంలో అయినా.. మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే టేలర్ హిందీ నైపుణ్యానికి భారత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. @virendersehwag #Rajkot mein match k baad, #darji (Tailor) Ki dukaan band. Agli silai #Trivandrum mein hogi... Zaroor Aana. #India #IndvNZ A post shared by Ross Taylor (@rossltaylor3) on Nov 5, 2017 at 2:30am PST Highly impressed by you @RossLTaylor . @UIDAI , can he be eligible for an Aadhaar Card for such wonderful Hindi skills. https://t.co/zm3YXJdhk2 — Virender Sehwag (@virendersehwag) November 6, 2017 Language no bar. Resident status is what matters. — Aadhaar (@UIDAI) November 6, 2017 -
ఏడాదిన్నర తరువాత టీ 20ల్లోకి
న్యూఢిల్లీ:టీమిండియాతో జరుగనున్న మూడు టీ 20ల సిరీస్ న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో రాణించిన టేలర్ ను టీ 20 సిరీస్ కు సైతం జట్టులోకి తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్ట్లే స్థానంలో టేలర్ ను జట్టులో తీసుకున్నారు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్లే గాయపడ్డాడు. దాంతో అతను టీ 20 సిరీస్ కు దూరం కావాల్సి వచ్చింది. అయితే టీ 20ల్లో టేలర్ కు చోటు దక్కడం దాదాపు ఏడాదిన్నర తరువాత ఇదే తొలిసారి. గతేడాది మార్చి తరువాత టేలర్ టీ 20 మ్యాచ్ ఆడలేదు. కాగా, వన్డే సిరీస్ టేలర్ ఫామ్ ను పరిగణలోకి తీసుకున్న కివీస్ సెలక్టర్లు.. అతన్ని టీ 20 సిరీస్ కు ఎంపిక చేసేందుకు ఎంపికకు మొగ్గు చూపారు. కివీస్ టీ 20 జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మిచెల్ సాంత్నార్, ఇష్ సోథీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రీ, గ్లెన్ ఫిలిప్స్ -
అలా చేయడంలో సక్సెస్ అయ్యాం: టేలర్
ముంబై:టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడం పట్ల న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ప్రధానంగా భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో ఎదురుదాడికి దిగి సక్సెస్ కావడాన్ని బాగా ఆస్వాదించినట్లు టేలర్ పేర్కొన్నాడు. 'భారత్ స్పిన్నర్లను స్వీప్ షాట్లతో బెదరగొట్టాలనుకున్నాం. ఆ క్రమంలోనే లాథమ్ రివర్స్ స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్ల లైన్ ను దెబ్బ తీశాడు. లాథమ్ కు స్వీప్ షాట్లతో దాడి చేయమని నేనే చెప్పా. ముఖ్యంగా రివర్స్ స్వీప్ ను లాథమ్ చాలా బాగా ఆడాడు. ఒకసారి స్పిన్నర్లపై ఎటాక్ చేస్తే ఆటోమేటిక్ వారి లైన్ దిబ్బతింటుంది. అది మా వ్యూహంలో భాగమే. దాన్ని ఫీల్డ్ లో లాథమ్ బాగా అమలు చేశాడు'అని టేలర్ పేర్కొన్నాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ విసిరిన 281 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లాథమ్-టేలర్ లు అసాధారంగా ఆడి రెండొందల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు చక్కటి విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే లాథమ్ సెంచరీ చేయగా, టేలర్ 95 పరుగులు చేశాడు. -
కివీస్ ఘన విజయం..
-
కివీస్ ఘన విజయం.. కోహ్లీ స్పెషల్ సెంచరీ వృథా
ముంబయి : టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే ఛేదించింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ లతో నాలుగో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో వారికి విజయం నల్లేరుపై నడక అయింది. చివర్లో ఒక్క పరుగు అవసరమైన సమయంలో టేలర్ ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన నికోల్స్ ఫోర్ కొట్టడంతో కివీస్ సంబరాలు మొదలయ్యాయి. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, కుల్దీప్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న కోహ్లీ సేన కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మాత్రం ఓటమితో ఆరంభించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. 200వ వన్డే ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం (125 బంతుల్లో 121: 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. దినేష్ కార్తిక్ (37), ధోని(25)తో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ జట్టుకు పరుగులు జోడించాడు కోహ్లీ. అయితే చివరి ఓవర్లలో భారత్ 8 రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లు వేసి 35 పరుగులే ఇచ్చి ఓపెనర్లు సహా నాలుగు వికెట్లు తీశాడు. సౌథీ 3 వికెట్లు తీయగా, శాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే 25న జరగనుంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
న్యూజిలాండ్ వచ్చేసింది..
ముంబై: ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ లో పాల్గొనడానికి న్యూజిలాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టింది. మరో తొమ్మిది రోజుల్లో వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో పలువురు న్యూజిలాండ్ క్రికెటర్లు గురువారం రాత్రి ముంబైలో దిగిపోయారు. తొమ్మిది మందితో కూడిన న్యూజిలాండ్ జట్టు భారత్ కు వచ్చిన విషయాన్ని ఆ దేశ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'మళ్లీ భారత్ కు వచ్చాం. ట్రిడెంట్ హోటల్ లో దిగాం'అని టేలర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం 9 మందితో భారత్ కు న్యూజిలాండ్ రాగా, మిగతా ఆరుగురి సభ్యుల్ని భారత్ 'ఎ' జట్టుతో ఇక్కడే పర్యటనలో ఉన్న న్యూజిలాండ్'ఎ' జట్టు నుంచి ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 'ఎ' జట్టు విశాఖపట్టణంలో భారత్ 'ఎ' జట్టుతో మ్యాచ్ లు ఆడుతోంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబైలో జరుగుతుండగా, పుణెలో రెండో వన్డే (అక్టోబర్ 25న), కాన్పూర్ లో మూడో వన్డే(అక్టోబర్ 29న) జరుగనుంది. ఆపై మూడు టీ 20ల సిరీస్ జరుగనుంది. అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో రెండు వార్మప్ మ్యాచ్ లను న్యూజిలాండ్ ఆడనుంది. -
రెండో టెస్టుకు టేలర్ దూరం
వెల్లింగ్టన్: దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కు న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న రాస్ టేలర్ కు రెండో టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్(ఎన్‌జడ్‌సీ) తెలిపింది. అతని స్థానంలో నీల్ బ్రూమ్ ను జట్టులో స్థానం కల్పించారు. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్ లో అరంగేట్రం చేసిన బ్రూమ్.. ఈ ఏడాది టెస్టుల్లో ఆడటానికి రంగం సిద్ధమైంది. అప్పుడు కూడా టేలర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బ్రూమ్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అదే ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం ఇక్కడ గమనార్హం. -
దక్షిణాఫ్రికా జోరుకు బ్రేక్
రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపు ∙ రాస్ టేలర్ సెంచరీ క్రైస్ట్‌చర్చ్: వరుసగా 12 విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టుకు న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 290 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (110 బంతుల్లో 102; 8 ఫోర్లు) సెంచరీ చేయగా... విలియమ్సన్ (75 బంతుల్లో 69; 6 ఫోర్లు), నీషమ్ (57 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. టేలర్, విలియమ్సన్ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ రెండు వికెట్లు తీశాడు. 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 283 పరుగులు చేసి ఓడిపోయింది. డి కాక్ (65 బంతుల్లో 57; 6 ఫోర్లు), ప్రెటోరియస్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసినా కీలక సమయాల్లో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 214 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో ప్రెటోరియస్, ఫెలుక్వాయో (29 నాటౌట్; 4 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టు తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, సాంట్నెర్ రెండు వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డే శనివారం జరుగుతుంది. -
టేలర్ సెంచరీ.. కివీస్ ప్రతీకార విజయం
క్రిస్ట్ చర్చ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ప్రతీకారం విజయం సాధించింది. తొలి వన్డేలో ఓటమికి రెండో వన్డేలో గెలుపుతో బదులిచ్చింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో వన్డేలో సఫారీ జట్టుపై న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విలియమ్సన్ సేన రాస్ టేలర్ అజేయ శతకం చేయడంతో(102 నాటౌట్, 110 బంతుల్లో 8 పోర్లు) నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (69, 71 బంతుల్లో 6 ఫోర్లు), నీషమ్(71 నాటౌట్, 57 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో తమ వంతు పాత్ర పోషించారు. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు, పార్నెల్, ఇమ్రాన్ తాహిర్ చెరో వికెట్ తీశారు. 290 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి ఆమ్లా(10), డుప్లెసిస్(11) వికెట్లను కోల్పోయింది. డుమిని(34) తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన కీపర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ (57, 65 బంతుల్లో 6 ఫోర్లు) చేసి ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిల్లర్(28), కెప్టెన్ డివిలియర్స్(45, 49 బంతుల్లో 2 ఫోర్లు) స్వల్ప విరామాల్లో వెనుదిరగడంతో సఫారీలలో టెన్షన్ మొదలైంది. హాఫ్ సెంచరీతో చివరివరకూ పోరాడిన ప్రిటోరియస్ (50, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్ కు ఫిహ్లుక్వాయో(29 నాటౌట్) తో కలిసి 61 పరుగులు జోడించాడు. అయితే 49వ ఓవర్ చివరి బంతికి యార్కర్ బంతితో ప్రిటోరియస్ ను కివీస్ బౌలర్ బోల్తా కొట్టిస్తూ బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్లో సఫారీల విజయానికి 15 పరుగులు అవసరం కాగా, ఆఖరి ఓవర్ చివరి రెండు బంతులను ఫిహ్లుక్వాయో బౌండరీలకు తరలించడంతో డివిలియర్స్ సేన 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. సాంట్నర్ రెండు వికెట్లు, సోధీ, గ్రాండ్ హోమ్మీ, సౌతీ తలో వికెట్ తీశారు. -
కివీస్‌దే సిరీస్
మూడో వన్డేలో ఆసీస్‌పై గెలుపు మెరిసిన రాస్ టేలర్, బౌల్ట్ హామిల్టన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2–0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ 24 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్‌లో రాస్ టేలర్ (107; 13 ఫోర్లు) శతక్కొట్టగా, బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ (6/33) ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ బ్రౌన్లీ 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ఫించ్ (56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెడ్ (53; 5 ఫోర్లు), స్టోయినిస్ (42) రాణించారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కివీస్ నెగ్గగా... రెండో వన్డే వర్షార్పణమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. మరోవైపు ఈ సిరీస్ ఓటమితో ఆస్ట్రేలియా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే ప్రమాదంలో పడింది. -
13 ఇన్నింగ్స్‌ల తరువాత..
హామిల్టన్:ఇటీవల కాలంలో ఫామ్ కోసం తంటాలు పడుతున్న న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ ఎట్టకేలకు తిరిగి గాడిలో పడ్డాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. టేలర్ 82 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు వరుస 11 ఇన్నింగ్స్‌ల్లో టేలర్‌కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, స్వదేశంలో 13 ఇన్నింగ్స్‌ల తరువాత టేలర్ కు ఇది తొలి హాఫ్ సెంచరీ. ఒకవైపు కంటి దృష్టి లోపంతో బాధపడుతున్న టేలర్‌కు ఇది కచ్చితంగా ఉపశమనం కల్గించే ఇన్నింగ్సే. కాగా, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసే క్రమంలో టేలర్ చేతికి బంతికి బలంగా తగలడంతో గాయమైంది. -
ఈ మ్యాజిక్.. మ్యాచ్‌కే హైలెట్!
రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను ధోని రనౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్.. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ.. బంతి స్టంప్స్‌కు తగలడం, టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ ధోని కొన్నిసార్లు ఇలా బంతిని పూర్తిగా అందుకోకుండా వికెట్ల పైకి మళ్లించిన ఘటనలు ఉన్నాయి.. ఈ సారి అతను వికెట్లకు బాగా దూరంలో ఉండి అత్యంత కచ్చితంగా ఇలా త్రో చేయగలగడం మ్యాచ్‌లోనే మ్యాజిక్ హైలెట్‌గా నిలిచింది. ధోనీ చేసిన మ్యాజిక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. Watch the Mahi magic on loop #INDvNZ https://t.co/btMoJF0xC3 — BCCI (@BCCI) 26 October 2016 -
అంతా ధోని మయం
కెప్టెన్ నామస్మరణతో రాంచీలో హోరు నేడు న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే గెలిస్తే సిరీస్ భారత్ వశం పక్క ఫొటోను చూశారా..? న్యూజిలాండ్ జట్టు బస్సులో హోటల్‌కు వెళుతోంది. ఇంతలో ఓ హమ్మర్ కారు వేగంగా దూసుకువచ్చి బస్‌ను ఓవర్టేక్ చేసింది. కివీస్ క్రికెటర్లంతా కారులోకి చూశారు. మహేంద్ర సింగ్ ధోని... తన సొంత నగరంలో తనకు ఇష్టమైన కారుతో దూసుకువెళుతున్నాడు. అంతే రాస్ టేలర్ సహా న్యూజిలాండ్ క్రికెటర్లంతా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు. రాంచీలో భారత జట్టు క్రికెట్ ఆడటం కొత్త కాదు... ధోని ఆటను ప్రత్యక్షంగా చూడటం అక్కడి అభిమానులకు కొత్త కాదు... కానీ ఎందుకో గతంతో పోలిస్తే ఈసారి నగరం అంతా ధోని నామస్మరణతో హోరెత్తుతోంది. ఇటీవల విడుదలైన ధోని సినిమా దీనికి ఓ కారణం కావచ్చు. అరుుతే అసలు కారణం మాత్రం... భవిష్యత్‌లో ధోని మళ్లీ రాంచీలో భారత్ తరఫున మరో మ్యాచ్ ఆడొచ్చు, ఆడకపోవచ్చనే సందేహం. అందుకే తన ప్రాక్టీస్‌ను చూడటానికి కూడా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. ఇదీ న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు ముందు రాంచీలో పరిస్థితి. రాంచీ: టెస్టుల నుంచి ధోని ఇప్పటికే రిటైర్ అయ్యాడు. వన్డేల్లో ఎంతకాలం కొనసాగుతాడో తెలియదు. దాదాపు రెండేళ్లపాటు రాంచీలో భారత్‌కు మరో వన్డే ఉండకపోవచ్చు... గతంలో ఈ వేదికలో ధోని అత్యధిక స్కోరు కేవలం 10 పరుగులు. కానీ తాజాగా మొహాలీ వన్డేలో తన ఆటతీరు చూస్తే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు... కాబట్టి రాంచీలో కూడా అదే తరహా ఇన్నింగ్స ఆడతాడేమో. తమ నగర ముద్దుబిడ్డ ఆటను ఈసారి ఎలాగైనా ప్రత్యక్షంగా చూడాల్సిందే.... ఇదీ ఇప్పుడు రాంచీలోని సగటు క్రికెట్ అభిమాని ఆలోచన. ఏమైనా సిరీస్‌లో ఏ వన్డేకూ లేనంతగా ఆసక్తి పెరిగిపోరుుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బుధవారం జరిగే వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. నేడు జరిగే నాలుగో వన్డేలో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలవచ్చు. ఇక్కడే సిరీస్ గెలిస్తే వైజాగ్‌లో జరిగే ఆఖరి వన్డేలో మరికొంత మంది బెంచ్ మీద ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు. ఇదీ భారత్ ఆలోచన. మరోవైపు న్యూజిలాండ్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇందులో కచ్చితంగా గెలవాలి. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మార్పులు ఉండకపోవచ్చు ధోని కొత్త క్రికెటర్లకు అవకాశం ఇవ్వడంలో ముందు ఉంటాడు. అరుుతే మ్యాచ్ ఫలితాన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటాడు. కాబట్టి సిరీస్ గెలవడానికి ప్రాధాన్యత ఇచ్చి గత మూడు మ్యాచ్‌లు ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్, రహానే ఇప్పటివరకూ తమ స్థారుుకి తగ్గట్లుగా ఆడకపోవడం మినహా భారత్‌కు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు లేవు. ఇక బౌలింగ్‌లోనూ అంతా కుదురుకున్నట్లే కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తుందనే అంచనా నేపథ్యంలో మిశ్రా, అక్షర్ పటేల్ మరోసారి కీలకం కానున్నాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేస్తే భారత్‌కు అసలు సమస్యలే ఉండవు. నిలకడలేమి సమస్య ఇక న్యూజిలాండ్ జట్టులో సీనియర్ గప్టిల్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ సరిగా ఆడలేదు. మరో సీనియర్ రాస్ టేలర్ కూడా గత వన్డే మినహా సిరీస్ అంతా విఫలమయ్యాడు. విలియమ్సన్, లాథమ్‌ల ఫామ్ వల్ల కివీస్ సిరీస్‌లో ఎంతో కొంత ఫర్వాలేదనిపించింది. మిడిలార్డర్ వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా కనిపిస్తోంది. కోరీ అండర్సన్ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పిచ్ పేస్‌కు అనుకూలిస్తే సౌతీ, బౌల్ట్ మ్యాజిక్ చేస్తారు. అరుుతే పిచ్ స్వభావం దృష్ట్యా సాన్ట్నర్తో పాటు మరో స్పిన్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫామ్ సంగతి ఎలా ఉన్నా ఈ జట్టును తక్కువ అంచనా వేయకూడదని ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో తేలింది. అరుుతే సిరీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా జట్టులో ఆటగాళ్లంతా నిలకడగా ఆడాలి. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్, జాదవ్, పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, రోంచీ, అండర్సన్, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, హెన్రీ/సోధి. పిచ్, వాతావరణం వర్ష సూచన లేదు. సాయంత్రం మంచు కురుస్తుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. ► మ. గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్‌ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం ► 2 రాంచీలో భారత్ మూడు వన్డేలు ఆడితే రెండు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దరుుంది. -
అతను ఎప్పుడూ మౌనముద్రలోనే..: మెకల్లమ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గతంలో న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలు మోసిన టేలర్ ఎప్పుడూ పెదవి విప్పేవాడే కాదంటూ మెకల్లమ్ రాసిన 'డిక్లేర్' అనే బుక్‌లో ప్రస్తావించాడు. కనీసం జట్టు సమావేశాల్లో కూడా రాస్ టేలర్ మౌన ముద్రలోనే ఉండేవాడంటూ ఆ పుస్తకంలో ప్రస్తావించాడు. ' మా ప్రధాన కోచ్ మైక్ హెస్సెన్ ఎప్పుడూ ఆటగాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకునేవాడు. అయితే ఇందుకు కారణంగా కెప్టెన్ గా రాస్ టేలర్ ఎప్పుడూ జట్టు ప్రణాళికలు చెప్పకపోవడమే. భవిష్యత్తు ప్రణాళికలేమిటో మేమే చెప్పేవాళ్లం. రాస్ ను ఎప్పుడు అడిగినా ఏమీ లేదు అనేవాడు. ఒక్క పదం కూడా మాట్లాడేవాడు కాదు. దాంతో మా కోచ్ అయోమయంలో పడేవాడు. ఇలా రాస్ ఎందుకు చేసేవాడు నాకైతే తెలీదు. జట్టును ఎప్పుడూ సరైన రీతిలో పెట్టలేకపోయేవాడు. అతని ఆలోచల్ని కూడా జట్టు సభ్యులతో పంచుకునేవాడు కాదు' అని మెకల్లమ్ తాజా పుస్తకంలో వెల్లడించాడు. అయితే రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని తెలిపాడు. రాస్ టేలర్ తరువాత డేనియల్ వెటోరికీ న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పడాన్ని మాత్రం మెకల్లమ్ పరోక్షంగా విమర్శించాడు. -
'భారత్ పై మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అదే'
కోల్ కతా: భారత్ తో జరిగిన రెండో టెస్టులో ఘోర ఓటమి పాలైన న్యూజిలాండ్ ఇప్పుడు అందుకు కారణాలు వెతికే పనిలో పడింది. ప్రత్యేకంగా కోల్ కతాలో ఈడెన్ లో భారత్ విసిరిన లక్ష్యం ఒక సవాల్ అయితే, తొలి ఇన్నింగ్స్ లో 100 పరుగులకు పైగా వెనుకబడిపోవడం మరొక కారణమని న్యూజిలాండ్ యాక్టింగ్ కెప్టెన్ రాస్ టేలర్ స్పష్టం చేశాడు. 'ఎక్కడైనా చూసుకోండి. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్ధి జట్టు కంటే వంద పరుగులు వెనుకబడితే తేరుకోవడం కష్టం. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను ఆరంభంలో కట్టడి చేశాం. అప్పటికే భారత్ 150 పరుగుల పైగా ఆధిక్యం సాధించింది. దాంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది. ఈ పిచ్ పై భారీ పరుగుల్ని ఛేదించడం అంత సులువు కాదు. కనీసం 40 పరుగులకు మూడు భారత వికెట్లను తీసి ఉంటే వారి ఆధిక్యం ఇంత ఉండేది కాదు. ఒకసారి వెనుకబడి, ఆ తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఒక సవాల్. మేము అన్ని సెషన్లు బాగా ఆడాం. మ్యాచ్ ముగిసిన రోజు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసిన వారి చేతిలో ఓడాం' అని టేలర్ తెలిపాడు. ప్రత్యేకంగా వృద్ధిమాన్ సాహా రెండు ఇన్నింగ్స్ ల్లో నమోదు చేసిన అజేయ హాఫ్ సెంచరీలే తమను వెనుక్కు నెట్టాయన్నాడు. దాంతో భారత్ తమపై పైచేయి సాధించిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ సాధించిన ఆధిక్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని టేలర్ పేర్కొన్నాడు. -
ఇక్కడ టీమిండియాను ఓడించడం కష్టం
న్యూఢిల్లీ: టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఎప్పుడూ కష్టమేనని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అన్నాడు. భారత్ జట్టు పటిష్టంగా ఉందని, సొంతగడ్డపై పరిస్థితులు వారికి అనుకూలిస్తాయని చెప్పాడు. భారత్‌లో మూడు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు వచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియాను టెస్టు సిరీస్‌లో ఓడించాలంటే తాము అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుందని టేలర్ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో తాము ఎక్కువ సిరీస్‌లు గెలవకపోయినా, టెస్టు మ్యాచ్‌లు గెలిచామని చెప్పాడు. భారత్‌తో సిరీస్ తమకు కష్టమైనదే అయినా, స్థాయికి తగ్గట్టు ఆడుతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం తమ ముందున్న అతిపెద్ద సవాలని టేలర్ అన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోనేందుకు దృష్టిసారిస్తున్నామని, స్వీప్ షాట్లు ఆడటంపై ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపాడు. ఇటీవల అన్ని జట్లు దూకుడైన క్రికెట్ ఆడుతున్నాయని, భారత్‌లో ఎప్పుడు ఆడినా సవాలేనని చెప్పాడు. -
రాస్ టేలర్ అరుదైన ఘనత!
పెర్త్: మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం నాల్గో రోజు ఆటలో భాగంగా తృటిలో ట్రిపుల్ సెంచరీని కోల్పోయిన టేలర్ (290;374 బంతుల్లో 43 ఫోర్లు) న్యూజిలాండ్ తరపున అత్యధిక స్కోరు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఆదివారం ఆటలో ఆసీస్ పై ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ చేసిన ఆరో విదేశీ బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించిన టేలర్.. ఓవరాల్ గా ఆసీస్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టేలర్ సుదీర్ఘంగా 567 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ కు చెందిన హట్టన్(364 పరుగులు) సాధించి ముందు వరుసలో ఉండగా, మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫోస్టర్(287 పరుగులు) తృతీయ స్థానంలో, భారత్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్(281 పరుగులు) నాల్గో స్థానంలో, విండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా(277 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆసీస్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 559/9 వద్ద డిక్లేర్ చేయగా.. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 624 పరుగులు చేసింది. రాస్ టేలర్ డబుల్ సెంచరీతో పాటు, విలియమ్సన్(166;250 బంతుల్లో 24 ఫోర్లు) మరో శతకం చేయడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. 510/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట కొనసాగించిన కివీస్ మరో 114 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 63.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131 బ్యాటింగ్), వోజస్(101 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇప్పటివరకూ ఆరు సెంచరీలు నమోదయ్యాయి. తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 1-0 తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. -
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
విలియమ్సన్ శతకం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 510/6 ఆసీస్‌తో రెండో టెస్టు పెర్త్: ‘వాకా’ పిచ్‌పై పరుగుల వరద పారుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు దీటుగా న్యూజిలాండ్ బదులిస్తోంది. రాస్ టేలర్ (308 బంతుల్లో 235 బ్యాటింగ్; 34 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టగా... కేన్ విలియమ్సన్ (250 బంతుల్లో 166; 24 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో శతకం సాధించాడు. దీంతో రెండో టెస్టులో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో ఆరు వికెట్లకు 510 పరుగులు సాధించింది. ఆసీస్‌కన్నా ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. కెరీర్లో టేలర్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. అలాగే ఆసీస్‌పై ఓ కివీస్ ఆటగాడు ద్విశతకం సాధించడం ఇదే తొలిసారి. కాగా విలిమయ్సన్ 25 ఏళ్ల వయసులోనే కనీసం 12 సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గతంలో సచిన్ (16), బ్రాడ్‌మన్ (13), కుక్ (12) సెంచరీలు చేశారు. అలాగే గత ఏడు టెస్టుల్లో విలియమ్సన్కిది ఐదో సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 140/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌కు టేలర్, విలిమయ్సన్ జోడి మూడో వికెట్‌కు 265 పరుగుల భారీ భాగస్వామ్యం అందించింది. క్రికెట్ చరిత్రలో గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతి విసిరిన ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా మిషెల్ స్టార్క్ నిలిచాడు. స్టార్క్ తన 21వ ఓవర్లో టేలర్‌కు వేసిన నాలుగో బంతి 160.4 కి.మీ రికార్డు వేగంతో దూసుకెళ్లింది. గతంలో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ (161.3 కి.మీ.), ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ.. షాన్ టెయిట్ (161.1), థామ్సన్ (160.6 కి.మీ.) ఈ ఫీట్‌ను సాధించారు. -
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
పెర్త్: మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్నరెండో టెస్టులో మరో డబుల్ సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో అదరగొడితే... న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో రాస్ టేలర్ ద్విశతకంతో దుమ్మురేపాడు. రాస్ టేలర్(235 బ్యాటింగ్; 308 బంతుల్లో 34 ఫోర్లు) ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. రాస్ టేలర్ కు జతగా విలియమ్సన్(166; 250 బంతుల్లో 24 ఫోర్లు) మరోసారి ఆకట్టుకోవడంతో కివీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తూ ఆసీస్ కు దీటుగా సమాధానమిస్తోంది. 140/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆటను కొనసాగించిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఒక పక్క టేలర్ తనదైన ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, విలియమ్సన్ కచ్చితమైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్ 150 పరుగుల మార్కును చేరగా, టేలర్ డబుల్ సెంచరీ నమెదు చేశాడు. కాగా, హజిల్ వుడ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన విలియమ్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం బ్రెండన్ మెకల్లమ్(27), బ్రాస్ వెల్(12), వాట్లింగ్(1) అవుటయ్యారు. దీంతో న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 510 పరుగులతో ఉంది. టేలర్(235) , మార్క్ క్రెయిగ్ (7) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ 559/9 వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును గెలిచిన ఆసీస్ 1-0 ముందంజలో ఉంది. విశేషాలు.. ఆసీస్ లో డబుల్ సెంచరీ చేసిన ఆరో విదేశీ బ్యాట్స్ మెన్ గా టేలర్ రికార్డు సాధించాడు ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ తరపున (235) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టేలర్ గుర్తింపు ఆస్ట్రేలియాపై టేలర్-విలియమ్సన్(265) అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి(ఏ వికెట్ కైనా) టెస్టుల్లో రాస్ టేలర్-విలియమ్సన్ లు జోడి (42 ఇన్నింగ్స్ లలో 2,188 పరుగులు ) అత్యధిక పరుగులను సాధించింది. -
మూడో వన్డేలో కివీస్ గెలుపు
విలియమ్సన్, రాస్ టేలర్ సెంచరీలు సౌతాంప్టన్ : రాస్ టేలర్ (123 బంతుల్లో 110; 12 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీకి తోడు.. విలియమ్సన్ (113 బంతుల్లో 118; 12 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం బాదడంతో న్యూజిలాండ్‌కు మరో విజయం దక్కింది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఆదివారం ది రోజ్ బౌల్ మైదానంలో జరిగినమూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో చూపిన కివీస్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోర్గాన్ (82 బంతుల్లో 71; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), స్టోక్స్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), వేగంగా ఆడారు. సౌతీ, వీలర్లకు మూడేసి వికెట్లు, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 49 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరినా విలియమ్సన్, టేలర్ జోడి ఇంగ్లండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. విలియమ్సన్ 88 బంతుల్లో.. టేలర్ 105 బంతుల్లో సెంచరీలు చేశారు. వీరి జోరుతో మూడో వికెట్‌కు 206 పరుగుల భారీ భాగస్వామ్యం చేరింది. విల్లేకు మూడు, స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే ఈనెల 17న జరుగుతుంది. -
న్యూజిలాండ్ 398/5
ఇంగ్లండ్‌తో రెండో వన్డే లండన్ : తొలి వన్డేలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ తొందరగానే తేరుకుంది. బ్యాటింగ్‌లో విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు చేసింది. రాస్ టేలర్ (96 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి తోడు విలియమ్సన్ (88 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 398 పరుగులు చేసింది. కెన్నింగ్స్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో మెకల్లమ్ (39) విఫలమైనా.. గుప్టిల్ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. తర్వాత విలియమ్సన్ దూకుడుగా ఆడగా, టేలర్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ ఇద్ద రు మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇలియట్ (32), రోంచి (33) ఓ మోస్తరుగా ఆడారు. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు.