Google Play Store
-
ఏకకాలంలో మూడు యాప్‌లు: గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త ఫీచర్
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఒకసారికి ఒక యాప్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్‌లు లేదా గేమ్‌లను ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా? గూగుల్ ఏప్రిల్‌లో మొదటిసారి రెండు యాప్‌లను ఏకకాలంలో ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్డేట్లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం. -
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్‌లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
ఈ యాప్స్ వినియోగిస్తున్నారా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే..
మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్న 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆ యాప్స్ మీ ఫోన్లలోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మాల్వేర్ ఫాక్స్ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో సైబర్ కేటుగాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్లను ఆసరగా చేసుకొని పలు వైరస్ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నేరస్తులు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్లను ఉపయోగిస్తున్నారు. మాల్వేర్ను ఎలా పంపిస్తారు పైన పేర్కొన్న మాల్వేర్లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్‌లలోకి వైరస్‌ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్ చేసుకొని డార్క్‌వెబ్‌లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్ ఫాక్స్ నిర్ధారించిన 19 యాప్స్‌లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్ మీ ఫోన్లలో ఉంటే డిలీట్ చేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో నివేదించింది. హార్లీ ట్రోజన్ - ఫేర్ గేమ్ హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్చర్ రికార్డ్, సేమ్ లాంచర్, లైవ్ వాల్ పేపర్, అమేజింగ్ వాల్ పేపర్, కూల్ ఎమోజీ ఎడిటర్ అండ్ స్టైకర్ జోకర్ స్పైవేర్ - సింపుల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసేంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రజర్ చకర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కలర్ మెసేజ్ ఆటోలీ కాస్ మాల్వేర్- వ్వాల్గ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటీవ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైమ్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి👉 అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో.. -
గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..
చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని 2021లో అప్డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందినట్లు యాప్ డెవలపర్లు ధ్రువీకరించాలి. అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! ఈ రుణ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ 2022లో మరిన్ని నిబంధనలు చేర్చింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), బ్యాంకులకు ఫెసిలిటేటర్లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్లు మరికొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెవలపర్లు వారి భాగస్వామి NBFC, బ్యాంకుల పేర్లను, వాటికి తాము అధీకృత ఏజెంట్లనే విషయం తెలియజేసే వెబ్సైట్ల లైవ్ లింక్‌ను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. -
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్
-
వారం రోజుల వ్యవధిలో.. గూగుల్‌కు సీసీఐ రూ. 936.44 కోట్ల ఫైన్
వారం రోజుల వ్యవధిలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ (సీసీఐ) రూ. 936.44 కోట్ల ఫైన్ విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని గూగుల్‌కు సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని హితువు పలికింది. ఆ జరిమానాపై గూగుల్ స్పందించింది. సీసీఐ తమపై విధించిన జరిమానా భారతీయ వినియోగదారులు, వ్యాపారానికి ఎదురు దెబ్బ అని గూగుల్ పేర్కొంది. సీసీఐ తీర్పును సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు సృష్టించిందని గూగుల్ తెలిపింది. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయానికి మద్దతుగా నిలిచిందని పేర్కొంది. సీసీఐ నిర్ణయం భారత్‌లో మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారి తీస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. Case Nos. 07 of 2020, 14 of 2021 and 35 of 2021 CCI imposes a monetary penalty of ₹ 936.44 Crore on Google for anti-competitive practices in relation to its Play Store policies. Read the full order here: https://t.co/GDR820ffYg Press release: https://t.co/7HEPJeHVK3#Antitrust pic.twitter.com/TbTa6vbCXl — CCI (@CCI_India) October 25, 2022 ఈ తరుణంలో మరోమారు సీసీఐ..గూగుల్‌కు భారీ ఎత్తున ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో గూగుల్‌కు పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్? -
ఆ యాప్స్ ను అన్ ఇన్స్టాల్ చెయ్యకపోతే ..!
-
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్‌ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్‌ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
వార్నింగ్: షార్క్‌బాట్ వచ్చేసింది.. మీ స్మార్ట్ఫోన్లలో ఆ యాప్స్‌ని డెలీట్ చేయండి!
గత దశబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఇక అంతే.. అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్లో ఈ డేంజరెస్ సాఫ్ట్వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ప్రధానంగా ఇది మిస్టర్ ఫోన్ క్లీనర్( Mister Phone Cleaner), కైల్హావీ మొబైల్ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్ తప్పకుండా తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్వేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్లోడ్ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్ 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
గూగుల్ కొత్త రూల్స్.. ఇక యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అది తప్పనిసరి!
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ సేవలు అరచేతిలోకి వచ్చాయనే చెప్పాలి. మనం ఆ సేవల కోసం ప్రత్యేకంగా సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు ఇటీవల గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది. యాప్ డెవలపర్లకు ఇది చేయాల్సిందే.. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అలా డెవలపర్ అందించిన సమాచారాన్ని గూగుల్ చెక్ చేసి నిబంధనలు పాటించిన యాప్‌లను తీసుకుని వాటిని యూజర్‌కు తెలిసేలా ప్లేస్టోర్‌లో ఉంచుతుంది. ఒకవేళ యాప్ డెవలపర్ యూజర్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అందుకు జూలై 20 నాటికి ప్రతి యాప్ డెవలపర్ డేటా సేఫ్టీ డ్యాకుమెంట్ని సమర్పించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఒకవేళ డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. చదవండి: Reliance Jio: ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్! -
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్!
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్. ఐఫోన్లపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన ఐఫోన్ యాప్స్‌ను యాపిల్ బ్లాక్ చేసింది. అంతేకాదు ఐఫోన్లపై దాడులు చేసేందుకు ఎలాంటి మాల్వేర్ను తయారు చేశారు. ఎవరు తయారు చేశారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌కు చెందిన 'థ్రెట్ అనాలిసిస్ గ్రూప్' (టీఏజీ ) హ్యాకింగ్, దాడుల్ని గుర్తిస్తుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం..ఇటాలియన్ సాఫ్ట్ వేర్ సంస్థ ఆర్సీఎస్ తయారు చేసిన 'హెర్మిట్' అనే స్పైవేర్ ఐఫోన్లపై దాడి చేసి..ఆఫోన్ పనితీరు ఆగిపోయేలా చేస్తుంది.ఈ స్పైవేర్ మీ ఫోన్లో ఎంటర్ అయ్యిందంటే చాలు హ్యాక్ చేయడం,ఆడియోను రికార్డ్ చేయడం, అనధికారిక కాల్స్ లిఫ్ట్ చేయడం, ఈమెయిల్‌లు చెక్ చేయడం, మెసేజెస్ చదవడం, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేశారో తెలుసుకోవడం, కెమెరాను హ్యాక్ చేస్తున్నట్లు ట్యాగ్ గ్రూప్ గుర్తించింది. అంతేకాదు విచిత్రంగా ఐఫోన్లలోకి ఎంటర్ అయ్యే ఈ వైరస్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాపిల్ స్టోర్ నుంచి సాధ్యపడదని సదరు రిపోర్ట్‌లో పేర్కొంది. సైడ్ లోడింగ్ ద్వారా ఐఫోన్లలోకి ఎంటర్ అవుతున్నట్లు నివేదిక నిర్ధారించింది. సైడ్‌లోడింగ్ అంటే యూఎస్బీ, బ్లూటూత్, వైఫై లాంటి ఇతర పద్ధతుల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసే సామర్ధ్యం ఉన్న మీడియా ఫైల్స్ ద్వారా ఫోన్లపై అటాక్ చేస్తున్నట్లు తేలింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల్ని హెచ్చరించింది. డేటా షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
డబ్బులెవరికి ఊరికే రావు సార్, సుందర్ పిచాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, సీఈవో సుందర్ పిచాయ్ వ్యవహారం పోలీస్టేషన్ వరకు చేరింది. యాప్ బిల్లింగ్ సిస్టమ్‌లో డొమొస్టిక్ యాప్ డెవలపర్ల నుంచి భారీ ఎత్తున కమిషన్లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారుల సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరియా టైమ్స్ కథనం ప్రకారం..సిటిజన్ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ (సీయూసీఎస్) సభ్యులు సుందర్ పిచాయ్, గూగుల్ కొరియా సీఈవో నాన్సీ మాబెల్ వాకర్, గూగుల్ ఏసియా పసిపిక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్లపై సౌత్ కొరియా సియో నగరంలోని గంగ్నమ్ జిల్లా పోలిసుల్ని ఆశ్రయించారు. గూగుల్ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు దేశ టెలికమ్యూనికేషన్ బిజినెస్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులకు సీయూసీఎస్ సభ్యులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూగుల్ యాప్ పేమెంట్ పాలసీ పెంచుతున్న కమిషన్ల కారణంగా వినియోగదారులకు భారంగా, క్రియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉందంటూ కన్జ్యూమర్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. "యాప్ డెవలపర్లకు ప్రత్యామ్నాయం లేదు. తప్పని సరిగా గూగుల్ సంస్థ చెప్పినట్లే వినాలి. ఎందుకంటే యాప్‌స్టోర్ మార్కెట్ షేర్ గూగుల్‌కు 74.6 శాతంగా ఉందని" అన్నారు. వివాదం ఏంటంటే సంస్థకు సంబంధించిన డిజిటల్ ప్రొడక్ట్‌లు సేల్ చేయాలన్నా,సంబంధిత యాప్స్ సర్వీస్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అందించాలన్నా గూగుల్‌కు 15శాతం నుంచి 30 వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కమిషన్ ఎక్కువగా ఉండడంతో యాప్ డెవలపర్లు 15 శాతం నుంచి 20శాతం మాత్రమే కమిషన్ చెల్లించి థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల ద్వారా గూగుల్‌కు పేమెంట్ చేసేవారు. దీంతో యజమానులకు గూగుల్‌కు పెద్దమొత్తంలో చెల్లించే కమిషన్ల భారం తగ్గిపోయింది. యాప్స్‌ను బ్లాక్ చేస్తాం అదే సమయంలో యాప్ డెవలపర్ల నుంచి వచ్చే కమిషన్ పడిపోవడంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్ డెవలపర్లు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల నుంచి చెల్లింపులు జరపకూడదని హెచ్చరించింది. అలా చేస్తే సదరు యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేస్తామని తెలిపింది. పనిలో పనిగా గూగుల్‌కు లింకైన థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో వినియోగదారుల సంఘం సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీరు మారలేదు! ఈ ఏడాది మార్చి నెలలో గూగుల్ తీరుతో సౌత్ కొరియా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్లు వారి ఇష్ట ప్రకారమే చెల్లింపులు చేసుకోవచ్చని, ఆ విషయంలో గూగుల్ ఒత్తిడి చేయకూడదని సవరించిన బిల్లుపై కేబినెట్ ఆమోదం తెలిపింది.అయినా సౌత్ కొరియా కేబినెట్ తెచ్చిన ప్రతిపాదనల్ని తిరస్కరించింది. ఏప్రిల్ 1 నుంచి డెవలపర్లను తమ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని సూచించింది. లేని పక్షంలో యాప్స్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! -
గూగుల్ హెచ్చరిక..! యాప్స్‌ను అప్డేట్ చేయండి..లేకపోతే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. యాప్స్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ను అప్డేట్ చేయాలని, లేదంటే వాటిని తొలగిస్తామని తెలిపింది. అయితే గూగుల్ హెచ్చరించిన యాప్స్ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో సుమారు ప్లే స్టోర్‌లో ఉన్న సుమారు 9లక్షల యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ ను తొలగించేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నుంచి అప్డేట్ కానీ యాప్స్‌ను అప్డేట్ చేయాలని వాటి డెవలపర్లకు గూగుల్, యాపిల్ వార్నింగ్ ఇచ్చాయి. విధించిన గడువులోపే యాప్స్‌ను అప్డేట్ చేయాలని గూగుల్‌తో పాటు యాపిల్ సైతం హెచ్చరించాయి. అయినా డెవలపర్లు పట్టించుకోకపోవడంతో వాటిని డిలీట్ చేయనున్నాయి. -
Google Play Store: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. యాప్స్ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మీ ఫోన్లో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది. ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్‌కు గగుల్ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. -
హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..!
సైబర్ నేరస్తులు కొత్త పుంతలను తొక్కుతూ..ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే అనేక భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా హ్యకర్లు చేస్తున్నారు. కాగా తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్ యూజర్లకు హాని కల్గించే 10 యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఇప్పటికే పలు యూజర్లు ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. యూజర్ల డేటాను..! గూగుల్ బ్యాన్ చేసిన 10 పాపులర్ యాప్స్ యూజర్ డేటాను దొంగిలిస్తున్నాయని తెలిసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం... నిషేధిత యాప్‌లు ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకోవచ్చునని కూడా నివేదిక పేర్కొంది. దాంతో పాటుగా ఈ యాప్‌లను ఉపయోగించి ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూజర్ల బ్యాంకు వివరాల గురించి తెలుసుకోవడం సులువు కానుంది. 'కట్ అండ్ పేస్ట్' పద్ధతి ద్వారా డేటా చౌర్యం జరుగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా సదరు యూజరు ఏదైనా OTP లేదా ఇతర వివరాలను కాపీ-పేస్ట్ చేసినప్పుడు, హ్యాకర్లు ఈ యాప్‌ల నుంచి యూజర్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దొంగిలించవచ్చునని తెలిసింది. అదనంగా హ్యకర్లు ఈ యాప్స్ సహాయంతో యూజర్ల వాట్సాప్‌ను కూడా యాక్సెస్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ నిషేధించిన 10 యాప్స్ ఇవే..! 1. స్పీడ్ రాడార్ కెమెరా 2. AI-Moazin లైట్ (ప్రార్థన సమయాలు) 3. Wi-Fi మౌస్ (రిమోట్ కంట్రోల్ PC) 4. QR & బార్కోడ్ స్కానర్ (AppSource Hub ద్వారా అభివృద్ధి చేయబడింది) 5. Qibla కంపాస్ - రంజాన్ 2022 6. సింపుల్ వెదర్ & క్లాక్ విడ్జెట్ (డిఫర్ సంస్థ డెవలప్ చేసింది) 7. హ్యాండ్సెంట్ నెక్స్ట్ SMS- టెక్స్ట్ విత్ ఎంఎంఎస్ 8. స్మార్ట్ కిట్ 360 9. ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్స్ & ట్రాన్స్లేషన్ ఆడియో 10. Audiosdroid ఆడియో స్టూడియో DAW చదవండి: తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! -
భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్‌తో కలిసి గూగుల్ .. యాప్‌స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్‌స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
అమ్మో.. చైనా యాప్‌లు.. పేర్లు మార్చుకుని ఏకంగా 57 శాతం!
సాక్షి, అమరావతి: ‘చైనా దుకాణంలో దూరిన ఎద్దు..’ అనేది ఓ సామెత. అంటే పింగాణి సామగ్రి దుకాణంలో ఎద్దు దూరితే అది లోపలున్నా.. బయటకొచ్చినా.. దుకాణానికి నష్టమే. ఇక తాజాగా మన మొబైల్ ఫోన్లో చైనా యాప్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే కొన్ని చైనా యాప్‌లు చాపకింద నీరులా మన వ్యక్తిగత సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం అటువంటి చైనా యాప్‌లను నిషేధిస్తున్నప్పటికీ పేర్లు మార్చుకుని మరీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. చైనా యాప్‌లు 57 శాతానికిపైగా అదనపు సమాచారాన్ని సేకరించి ఇతరులకు చేరవేస్తున్నాయని పుణెకు చెందిన ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఆర్కా కన్సల్టెన్సీ జనవరిలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సరిహద్దులు దాటుతున్న సమాచారం మొబైల్ యాప్ సంస్థలు అవసరానికి మించి వినియోగదారుల సమాచారాన్ని కోరుతున్నాయి. వినియోగదారులకు తగిన అవగాహన లేకపోవడంతో యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే తొందర్లో ఆ సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నారు. ప్రధానంగా కాంటాక్ట్ నంబర్లు, కెమెరా, మైక్రోఫోన్, సెన్సార్లు, లొకేషన్, టెక్టŠస్ మెస్సేజ్‌లు మొదలైన అంశాలతో అనుసంధానించమని అడుగుతున్నాయి. ఆ విధంగా యాప్ కంపెనీలు 57 శాతానికిపైగా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి. 90 శాతానికిపైగా యాప్‌లు అవసరం లేనప్పటికీ కెమెరా యాక్సెస్ కోరుతున్నాయి. వాటిలో వినోద, విద్య, ఇ–కామర్స్, న్యూస్, గేమింగ్ తదితర యాప్‌లున్నాయి. ఆ సమాచారాన్ని యాప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, సింగపూర్‌లతోపాటు గుర్తుతెలియని దేశాల్లోని సంస్థలకు విక్రయిస్తున్నాయి. ఆయా దేశాల్లోని సంస్థలు ఆ సమాచారాన్ని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మార్కెట్ రీసెర్చ్ కోసం అంటూ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెబుతున్నాయి. ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తున్నారా అన్నదానిపై సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలీబాబా వంటి ప్రముఖ సంస్థ యాప్‌లను భారత్‌లో ఏకంగా 43 కోట్లమంది వరకు డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. అంటే ఏ స్థాయిలో భారతీయుల సమాచారాన్ని ఆ సంస్థ సేకరించిందో తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుండటం సైబర్ నేరాలకు కూడా కారణమవుతోందని ఆర్కా కన్సల్టెన్సీ గుర్తించింది. డిజిటల్ పేమెంట్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్లు పెరగడం దీనికి తార్కాణమని కూడా గుర్తుచేస్తున్నారు. పేరు మార్పుతో మళ్లీ.. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా యాప్‌లను నిషేధిస్తోంది. 2020 నుంచి 278 చైనా యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, వుయ్‌చాట్, లైకీ, బిగ్ లివ్, అలీ ఎక్స్‌ప్రెస్, అలీపే క్యాషియర్ మొదలైనవి ఉన్నాయి. భారత్‌లో ఆ యాప్‌లను బ్యాన్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్‌ను కేంద్రం ఆదేశించింది కూడా. కానీ ఆ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ దేశంలో అందుబాటులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. వాటిలో ప్రముఖ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, నెట్ఈజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దీనిపై వివరాల కోసం ఈ–మెయిల్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సంస్థలు స్పందించలేదని ఆర్కా కన్సల్టెన్సీ పేర్కొంది. అప్రమత్తతే పరిష్కారం యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మనకు అవసరమైనమేరకే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకు ముందు ఆ కంపెనీలు అడిగే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. సమాచారం పెద్దగా ఉంది కదా అని చదవకుండా యాక్సెస్ ఇవ్వొద్దు. అవసరమైనంత వరకే సమాచారం ఇవ్వండి. యాప్‌లు ప్రతి వారం, పదిరోజులకు ఒకసారి అప్డేట్ అడుగుతుంటాయి. అప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఓకే చేయండి. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారం లీకైందని భావించినా, తాము సైబర్ నేరాల బారిన పడ్డామని తెలిసినా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – రాధిక, ఎస్పీ, సైబర్ క్రైం -
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది. ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు. -
Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే..
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా. తోచింది తోచినట్టు అప్లికేషన్లు డౌన్లోడ్ చేస్తున్నారా. వాటిల్లో మీకు నచ్చినవి ఏవి. ఒకటో రెండోఉంటాయి. మరి దేశం మొత్తమ్మీద ఎక్కువమంది మెచ్చుకున్న అప్లికేషన్ ఏంటి. వాటిల్లో మన హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నవి ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు గూగుల్ బదులిచ్చేసింది. బెస్ట్ ఆఫ్ 2021 పేరుతో గూగుల్ ప్లేస్టోర్ ఇటీవలే దేశంలో అత్యధికులు ఇష్టపడ్డ అప్లికేషన్ల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని వర్గాల గురించి కాకున్నా వాటిల్లో ఎన్నదగ్గ అప్లికేషన్లు కొన్ని ఇలా ఉన్నాయి. బిట్ క్లాస్.. నేర్చుకునేందుకు కరెక్ట్ ప్లేస్ కొంతమంది హాబీగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంకొందరు అవసరం కొద్దీ నేర్చుకుంటుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఉపయోగపడేదే బిట్‌క్లాస్ అప్లికేషన్. ఈ ఏటి మేటిగా యాప్‌గా నిలిచిందీ ఇదే. కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకోవాలన్నా, చిత్రకళకు మెరుగులు దిద్దుకోవాలన్నా, కంప్యూటర్ సాయంతో ఫొటోల కాలేజ్ సృష్టించడమెలాగో తెలుసుకోవాలన్నా బిట్క్లాస్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. బోలెడన్ని కొత్త అంశాలను ఉచితంగానే నేర్చుకోవచ్చు. భాగ్యనగరం నుంచి.. ఈ ఏడాది మేటి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లుగా ఎంపికైన వాటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 3 కంపెనీలున్నాయి. వాటి గురించి క్లుప్తంగా.. సార్టీజీ.. ఇంటి తిండికి సాటి ఏది జీ ఈ తరం పిల్లలు ఇంట్లో కంటే బయట రెస్టారెంట్లలో తినడం మునుపటి కంటే ఎక్కువైందన్నది వాస్తవం. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు..జేబుకు చిల్లులు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఇంటి వంటకు మళ్లీ ప్రాభవం తీసుకొచ్చేందుకు నితిన్ గుప్తా సిద్ధం చేసిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషనే ఈ సార్టీజీ. ఇంటి వంటిల్లును మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మలుచుకోవడం ఎలాగో ఈ అప్లికేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని నితిన్ గుప్తా అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ ఏటి మేటిల్లో ఒకటిగా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. సార్టీజీని మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరి ఈ అప్లికేషన్లో ఏముంటాయని అనుకుంటున్నారా? లొట్టలేస్తూ తినేందుకు, తయారు చేసకునేందుకు రకరకాల రెసిపీలు ఉంటాయి. అంతేకాదు.. ఒక్కో రెసిపీతో మీ శరీరానికి అందే కేలరీలెన్ని? ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పీచుపదార్థం ఎంతో స్పష్టంగా పేర్కొని ఉంటాయి. ఫ్రంట్ రో.. సెలబ్రిటీలే టీచర్లురో భారత క్రికెట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్‌తో ఫాస్ట్ బౌలింగ్, యజువేంద్ర చహల్‌తో స్పిన్ బౌలింగ్ శిక్షణ పొందాలనుకుంటున్నారా? ఒక్కసారి ఫ్రంట్ రో అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి. బౌలింగేం ఖర్మ.. మీకు నచ్చిన అంశాన్ని సెలబ్రిటీల పాఠాల సాయంతో ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ‘జంపింగ్ మైండ్స్’ తో ప్రశాంతంగా ఉందాం ‘మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్య’మన్నాడో సినీ కవి. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి తోడు దొరకడం కష్టం. మనసు లోతుల్లోని భావాలను ఇతరులతో చెప్పుకునేందుకు, తద్వారా ఆత్మన్యూనత, వ్యాకులత వంటి మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ఈ జంపింగ్ మైండ్స్! వృత్తి, సంబంధాలు, కుటుంబ సమస్యల వంటి ఏ అంశంపైన అయినా మీ భావాలను వ్యక్తీకరించేందుకు ఓ వేదిక కల్పిస్తుంది ఈ అప్లికేషన్. అది కూడా ఇతరులెవరికీ మీ గురించి తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది. కృత్రిమ మేధ సాయంతో మీరు కుదుటపడేలా మంచి మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్ అయ్యేందుకు కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. 5 నెలల్లో 50 వేల కంటే ఎక్కువ మంది ఈ అప్లికేషన్‌ను వాడటం మొదలుపెట్టారని కంపెనీ సీఈవో అరిబా ఖాన్ తెలిపారు. పోటీ పరీక్షలకు ‘ఎంబైబ్’ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. పాఠశాల స్థాయి పాఠాలు అర్థం చేసుకునేందుకు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకూ ఉపయోగపడుతుంది. కృత్రిమ మేధ ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయడం, విద్యార్థుల ఫలితాలను విశ్లేషించడం దీని ప్రత్యేకతలు. ఇవే కాకుండా.. యోగా సాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ‘సర్వా’ వినియోగదారుల మన్ననలు పొందింది. గేమింగ్‌లో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ గేమ్‌గా ‘‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’’ఎంపికైంది. మనోధైర్యానికి ‘ఎవాల్వ్’ ఈ కరోనా కష్టకాలంలో మానసిక స్థైర్యం సడలిన వారు చాలామందే ఉంటారు. అలాంటి వారికి టెక్నాలజీ సాయంతో కొంత ఉపశమనం కలిగిచేందుకు, ఒత్తిడిని జయించేందుకు, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఆహారం, బద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఎవాల్వ్ ఉపయోగపడుతుందని అంటున్నారు ఎవాల్వ్ వ్యవస్థాపకుడు అన్షుల్ కామత్. ఒంటరితనం, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలైన సమచారాన్ని సేకరించి అందిస్తున్నామని తెలిపారు. అప్లికేషన్‌ను మరింత అభివృద్ధి చేసి మానసిక సమస్యల తీవ్రతను సులువుగా గుర్తించేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు యాప్‌లో వేదిక కూడా కల్పిస్తామని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్ -
శాంసంగ్ యూజర్లకు అలర్ట్...! వీటితో జాగ్రత్త..!
శాంసంగ్ యూజర్లకు అలర్ట్..! శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో మాల్వేర్ ఆధారిత యాప్స్ ఉన్నాయని ప్రముఖ ఆన్లైన్ టెక్ పబ్లికేషన్స్ ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. శాంసంగ్ మొబైల్ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రతి గెలాక్సీ స్టోర్‌లో ఈ మాల్వేర్స్ ఉన్నట్లు ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రచురణలో పేర్కొంది. నివేదిక ప్రకారం....స్ట్రీమింగ్ యాప్స్‌ల్లో మాల్వేర్ను కలిగి ఉండవచ్చునని అభిప్రాయపడింది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో షోబాక్స్ యాప్ అనేక క్లోన్(నకిలీ)యాప్స్‌ను కలిగి ఉందని పేర్కొంది. షోబాక్స్ యాప్ ఒక మూవీ, టీవీ సిరీస్‌లను ఉచితంగా అందించే ప్రసిద్ధ యాప్. షోబాక్స్ యాప్ తరహ సుమారు ఐదు నకిలీ యాప్స్ స్టోర్‌లో ఉన్నాయని ఆండ్రాయిడ్ పోలీస్ తన నివేదికలో పేర్కొంది. ఈ నకిలీ యాప్స్ అత్యంత ప్రమాదకమైనవని వెల్లడించింది. కొన్ని యాప్స్ కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, టెలిఫోన్‌కు యాక్సెస్‌తో సహా అనవసరమైన అనుమతులను కూడా యూజర్ ప్రమేయం లేకుండా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి సమస్య గతంలో హువావే స్మార్ట్ఫోన్లలో తలెత్తింది. అప్పట్లో డజనుపైగా హెచ్చరికలను జారీ చేశారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోవడానికి ఇలా చేయండి...? ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్తో నిండిన యాప్స్‌ను ఏదైనా ఇన్స్టాల్ చేశారో లేదో ముందుగా చెక్ చేసి, వెంటనే వాటిని తీసివేయాలి. ఇది ఎలా సాధ్యమౌతుందంటే గూగుల్ ప్లే ప్రోటెక్ట్ను ఆన్ చేయగానే..ఆయా యాప్స్ ప్రమాదకరమైనవని గూగుల్ సూచిస్తుంది. యూజర్లు కాస్పర్‌స్కై, నోర్టన్ 360 వంటి యాంటీ వైరస్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మంచింది. కొన్ని యాప్స్ పరిమిత కాలపు వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. మీకు కావాల్సిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచే కాకుండా ఆయా యాప్స్ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయడం ఉత్తమం. థర్డ్ పార్టీ యాప్స్ జోలికి వెళ్లకపోవడం మంచింది. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..! చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ది డేంజరస్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఐదు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ప్రడియో ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో కన్పించింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించింది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగల్ ప్లే స్టోర్‌పై మరోసారి జోకర్ మాల్వేర్ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ప్రడియో ఒక అలర్ట్ జారీ చేసింది. జోకర్ మాల్వేర్ సుమారు పది యాప్స్‌లో ఉన్నట్లు ప్రడియో గుర్తించింది. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని ప్రడియో పేర్కొంది. ఈ యాప్స్ మీ స్మార్ట్ఫోన్లలో ఉంటే హ్యకర్లు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను క్షణాల్లో ఊడ్చేస్తారని ప్రడియో వెల్లడించింది. జోకర్ మాల్వేర్ డిటెక్ట్ఐనా యాప్స్ ఇవే..! కలర్ మెసేజ్ యాప్ సేఫ్టీ యాప్‌లాక్ కన్వీనియెంట్ స్కానర్ 2, ఎమోజి వాల్‌పేపర్స్ సెపరేట్ డాక్ స్కానర్ ఫింగర్‌టిప్ గేమ్బాక్స్ ఈజీ పీడీఎఫ్ స్కానర్ సూపర్-క్లిక్ వీపీఎన్ యాప్ వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్ ఫ్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ యాప్ చదవండి: టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..! ప్రత్యర్థి ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కలే..! -
2021 భారత్‌లో నిలిచిన బెస్ట్ యాప్స్ ఇవే..!
Google Best Android Apps, Games of 2021 in India: స్మార్ట్‌ఫోన్..! ఏ ముహుర్తాన వచ్చిందో కానీ...అది లేకుండా బతకలేకపోయే రోజులు వచ్చాయి. లేవడంతోనే వాట్సాప్, ఫేస్బుక్, జీ మెయిల్ ఇలా రకరకాల యాప్స్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను చూసుకోవడం మన దినచర్యగా మారిపోయింది. మనకు ఉపయోగపడే యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటూ వాటి సేవలను పొందుతాం. మనం వాడుతున్న యాప్స్‌లో బెస్ట్ యాప్ ఏదంటే చెప్పడం కాస్త కష్టం. కాగా ప్రతి ఏడాది అత్యంత ఆదరణను పొందిన యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఆయా కేటగిరీలో బెస్ట్ యాప్స్‌గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. 2021గాను ఇండియాలో బెస్ట్ యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేసింది. 2021గాను భారత్‌లో బెస్ట్ యాప్‌గా ‘బిట్‌క్లాస్’ నిలిచిందని గూగుల్ ప్రకటించింది. బెస్ట్ గేమ్ కేటగిరీలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అంతేకాకుండా గేమ్స్, ఫన్, వ్యక్తిగత వృద్ధి, రోజువారి అవసరాలను తీర్చే కేటగిరీలో బెస్ట్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ ప్రకటించింది. వినోదాన్ని పంచే బెస్ట్ యాప్స్ ఫ్రంట్‌రో క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్ హాట్స్టెప్ రోజువారి అవసరాలకోసం వాడే బెస్ట్ యాప్స్ సోర్టిజీ - వంటకాలు, మీల్ ప్లానర్ & కిరాణా జాబితాలు అందిస్తోంది. సర్వ - యోగా & ధ్యానం ట్రూకాలర్ పర్సనల్గ్రోత్ ఉత్తమ యాప్‌లు బిట్‌క్లాస్ (Bitclass) ఎంబైబ్: లెర్నింగ్ అవుట్‌కమ్స్ యాప్ ఏవాల్వ్: ధ్యానాలు, స్వీయ సంరక్షణ & బ్రీతింగ్ థెరపీ యాప్ బెస్ట్ కాంపిటిటీవ్ గేమింగ్ యాప్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సమ్మనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా మార్వెల్ ఫ్యూచర్ రివల్యూషన్ పోకీమాన్ యునైట్ సస్పెక్ట్: మిస్టరీ మాన్షన్ చదవండి: సగం మైక్రోసాఫ్ట్ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే.. -
Joker: ఈ యాప్స్ యమడేంజర్! సీక్రెట్‌గా డేటాను..
Joker Malware Strikes Again on Android Apps: ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితమేనా? చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ (యాప్స్)లోనూ కోడ్ రూపంలో డివైజ్‌ల మీద వైరస్ దాడి చేసే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్లోడ్ చేసేప్పుడు కొన్ని కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే జోకర్ లాంటి మాల్వేర్.. డివైజ్‌లోని డాటా మొత్తాన్ని గుంజేస్తుంటుంది మరి! 2017 నుంచి తన జోరు చూపిస్తున్న ‘జోకర్’ మాల్వేర్ విషయంలో గూగుల్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కోడింగ్ బలంగా లేని యాప్స్ ద్వారా అది ప్రభావం చూపెడుతూనే వస్తోంది. తాజాగా 14 ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్‌ను గుర్తించినట్లు కాస్పర్‌స్కై అనలిస్ట్ తాన్య షిష్కోవా చెబుతున్నారు. డాటాను తస్కరించే ఈ మాల్వేర్ .. యాప్స్‌లో కోడింగ్ మార్చేయడం ద్వారా తన పని చేసుకుంటూ పోతుందని, తద్వారా కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఓటీపీల తస్కరణ, ఎస్సెమ్మెస్‌లను రీడ్ చేయడం చేస్తోందని షిష్కోవా చెబుతున్నారు. కోడ్‌లో దాగి ఉండే ఈ మాల్వేర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రిస్క్ కూడా ఎక్కువేనని ఆండ్రాయిడ్ యూజర్లను షిష్కోవా హెచ్చరిస్తోంది. సూపర్ క్లిక్ వీపీఎన్, వాల్యూమ్ బూస్టింగ్ హియరింగ్ ఎయిడ్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ ఎఫెక్ట్స్, ప్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ ఆన్ కాల్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, స్మార్ట్‌ఫోన్ రిమోట్, హలోవీన్ కలరింగ్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డు, వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వెలైజర్, సూపర్ హీరో ఎఫెక్ట్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ వాల్ పేపర్, డాజిలింగ్ కీబోర్డ్, ఎమోజీవన్ కీబోర్డు, నౌ క్యూఆర్ స్కాన్.. ఈ యాప్స్‌ను తక్షణమే అన్ఇన్స్టాల్ చేయడం మంచిదని షిష్కోవా చెబుతోంది. VIDEO: జోకర్ ఏం చేస్తాడో చూడండి -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ వాడుతున్నారా? వెంటనే డిలీట్ చేయండి..లేదంటే
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ వాడుతున్నారా? అయితే వెంటనే ఆ కీబోర్డ్ యాప్‌ను తొలగించండి. లేదంటే జేబుకు చిల్లు పడినట్లేనని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ కీబోర్డ్ యాప్‌తో పాటు 'ట్రోజన్' జోకర్ అనే మాల్వేర్తో సైబర్ దాడులు చేస్తున్న మరికొన్ని యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎవరైనా ఆ యాప్స్‌ను వినియోగిస్తుంటే వెంటనే డిలీట్ చేయాలని కోరింది. ప్రముఖ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై కథనం ప్రకారం.. ఇటీవల గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న ఏడు యాప్‌లలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించింది. వెంటనే వాటిని తొలగించింది. ఈ సందర్భంగా క్యాస్పర్ స్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా మాట్లాడుతూ..ఆ ఏడు యాప్స్‌లలో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ఇటీవల, సైబర్ నేరస్తులు స్క్విడ్ గేమ్ యూజర్లను యాప్‌ల సాయంతో దాడులకు పాల్పడుతున్నారు. దీంతో గూగుల్..ప్లే స్టోర్‌లో ఉన్న ఆ యాప్‌లను తొలగించింది. అయినా మిలియన్ల మంది ఆ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో .. గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌పై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కింది పేర్కొన్న యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేసింది. 1. Now QRcode Scan (Over 10,000 installs) 2. EmojiOne Keyboard (Over 50,000 installs) 3. Battery Charging Animations Battery Wallpaper (Over 1,000 installs) 4. Dazzling Keyboard (Over 10 installs) 5. Volume Booster Louder Sound Equalizer (Over 100 installs) 6. Super Hero-Effect (Over 5,000 installs) 7. Classic Emoji Keyboard (Over 5,000 installs) దాడులు పెరిగిపోతున్నాయ్ కరోనా కారణంగా సైబర్ నేరస్తులు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో ఫేక్ యాప్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి సాయంతో మాల్వేర్ను ఫోన్లలోకి పంపి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అదీ చాలదన్నట్లు ఇటీవల స్క్వీడ్ గేమ్ హవా కొనసాగుతుండడంతో సైబర్ నేరస్తులు కొత్త పంథాని అనుసరిస్తున్నారు. స్క్వీడ్ గేమ్ వెబ్ సిరీస్ యాప్స్‌తో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. అయితే ఇలాంటి యాప్స్ పట్లు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డిలీట్ చేయాలని క్యాస్పర్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా సూచించారు. -
గూగుల్ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..!
Google Banned 150 Malicious Apps:గూగుల్ ప్లే స్టోర్‌లో పలు ప్రమాదకరమైన యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు 150 ప్రమాదకరమైన యాప్‌లను నిషేధించింది. ఈ యాప్స్ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ అనే ప్రచారంలో 150 హానికరమైన మెసేజేస్ యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించి వాటిపై చర్యలను తీసుకుంది. ఈ హానికరమైన యాప్స్‌ను వాడుతున్న వారిలో ఎక్కువగా నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అప్లికేషన్లు ప్లే స్టోర్ నుంచి సుమారు 10.5 మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేశారని గూగుల్ పేర్కొంది. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..! అసలు ఏంటీ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్..! సైబర్‌నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ పలు హానికరమైన యాప్స్‌ను తయారుచేసి వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో వచ్చేలా చేశారు. ఈ యాప్స్ ద్వారా తక్కువ ధరలోనే పలు ప్రీమియం ఎస్ఎమ్ఎస్ సేవలను అందిస్తామని యాప్స్ ప్రచారం చేసుకుంటాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఒమన్, ఖతార్, కువైట్, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ప్రీమియం సేవలను అందించడంతో పాటుగా యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశం వస్తోందంటూ యూజర్లకు ఆఫర్లను అందిస్తాయి. గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ యాప్స్‌తో యూజర్ల డేటాను హ్యకర్లు చోరీ చేస్తారు. ప్రముఖ యాంటీ వైరస్ బ్లాగ్ అవాస్థ్ ప్రకారం...ప్లే స్టోర్ నుంచి యూజర్లు యాప్స్‌ను డౌన్లోడ్ చేసినప్పుడు..వారి లోకేషన్‌ను, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్, ఫోన్ నంబర్‌ను సేకరిస్తుంది.వారి మెయిల్ అడ్రస్‌ను కూడా హ్యకర్లు తమ చేతికి చేజిక్కించుకుంటున్నట్లు అవాస్థ్ పేర్కొంది. చదవండి:ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్! -
Google: దిగొచ్చిన గూగుల్.. సగానికి సగం తగ్గింపు
Google Play Business Lower Fees: యాప్ డెవలపర్స్‌కు గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్లే స్టోర్ సబ్ స్క్రిప్షన్ కమిషన్‌ను భారీగా తగ్గించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది 30 శాతం ఉండగా.. సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్ పార్టీగా ఉంటూ యాప్ డెవలపర్స్‌ను సైతం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు గూగుల్ ఎదుర్కొంటోంది. సబ్ స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ ద్వారా అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తూ వేధిస్తోందని భారత్ సహా చాలా దేశాల్లో గూగుల్ విచారణ, దర్యాప్తులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కమిషన్‌ను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. సబ్ స్క్రిప్షన్ కమిషన్ ఫీజును ఏకంగా 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. అయితే మొదటి 1 మిలియన్ డాలర్ల మీద మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని డెవలపర్స్‌కు సూచించింది. తద్వారా యాప్ మేకర్స్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది. గూగుల్ గణాంకాల ప్రకారం.. ఈ బంపరాఫర్ సుమారు 99 శాతం డెవలపర్స్‌కు వర్తించనుందట. తగ్గించిన కమిషన్ ఫీజును.. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో పాటు మీడియా యాప్స్ మీద సర్వీస్ ఫీజును 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్లే మీడియా ఎక్స్‌పీరియెన్స్ ప్రోగ్రామ్ కింద.. ఈ-బుక్స్, ఆన్ డిమాండ్ మ్యూజిక్, వీడియో సర్వీసులకు ఈ ఆఫర్ వర్తించనుంది. మీడియా బేస్డ్ యాప్స్ గూగుల్‌తో చేసే బిజినెస్ ఇది. ఉదాహరణకు.. యూట్యూబ్ మ్యూజిక్, స్పోటిఫైతో కలిసి చేస్తున్న ఒప్పందం లాగా అన్నమాట. క్లౌడ్ మార్కెట్‌ప్లేస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొన్నప్పుడు కూడా గూగుల్ కొంత పర్సంటేజ్ తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ కూడా విమర్శలు వెల్లువెత్తగా.. ఆ కమిషన్‌ను 20 నుంచి 3 శాతానికి తగ్గించుకున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది కూడా. చదవండి: గూగుల్ కమిషన్ కక్కుర్తికి దెబ్బేసిన సౌత్ కొరియా ఇదీ చదవండి: భారత్ యాక్షన్.. గూగుల్ కౌంటర్ రియాక్షన్ -
ఈ 26 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో. అంత కంటే వేగంగా సైబర్ క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వినియోగదారుల నుంచి డబ్బును దొంగిలించే 26 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ నిషేధించినట్లు తెలిపింది. హ్యాకర్లు కంప్యూటర్లలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్ భద్రత సంస్థ ఈ హానికరమైన యాప్స్ కనుగొనే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ జింపెరియం గూగుల్ సంస్థకు ఈ హానికర యాప్స్ గురుంచి పిర్యాదు చేసిన తర్వాత వాటిని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్ లేటర్, బస్ - మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. కానీ, దుర దృష్టవశాత్తు ఈ హానికర ఆండ్రాయిడ్ యాప్స్ గురుంచి వాటిని వాడుతున్న చాలా మందికి తెలియదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది.(చదవండి: సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం మిలియన్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడమే. టాప్ ఇన్ క్రామ్టెడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ 5,00,000 నుంచి 10,00,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న యాప్స్ ను కనీసం 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్(Zimperium zLabs) సెక్యూరిటీ రీసెర్చర్లు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లను గ్రిఫ్ట్ హార్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. హానికరమైన 26 యాప్స్: Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 -
136 యాప్స్‌పై నిషేధం.. అర్జెంట్‌గా డిలీట్ చేయండి
Google Ban 136 Malicious Apps: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు హెచ్చరిక. ప్లేస్టోర్ నుంచి 136 యాప్స్‌ను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్స్ ద్వారా ప్రమాదకరమైన మాల్వేర్ను ప్రయోగించి.. హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా యూజర్లు కొద్దికొద్దిగా డబ్బును పొగొట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూజర్లు అర్జెంట్‌గా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని గూగుల్ సూచించింది. యాప్స్ ద్వారా మాల్వేర్ దాడులతో హ్యాకర్లు తెలివిగా ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా డబ్బును మాయం చేస్తున్నారట. డల్లాస్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘జింపేరియమ్’ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 136 యాప్స్ మీద నిషేధం విధించింది గూగుల్. ఇంకా గూగుల్‌ప్లే స్టోర్ నుంచి తొలగించని ఈ యాప్స్‌ను.. ఫోన్ వాడకందారులే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఒకవేళ యాప్స్ తొలగించినప్పటికీ.. థర్డ్‌పార్టీ యాప్ మార్కెట్ ప్లేస్‌తోనూ నడిచే అవకాశం ఉందని, కాబట్టి యాప్స్‌ను తీసేయాలని గూగుల్ సూచిస్తోంది. బ్యాన్ చేసిన యాప్స్‌లో పాపులర్ యాప్స్ సైతం కొన్ని ఉండడం విశేషం. ఐకేర్-ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్‌లేటర్, జియోస్పాట్: జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, హార్ట్ రేట్ అండ్ పల్స్ ట్రాకర్, హ్యాండీ ట్రాన్స్‌లేటర్ ప్రో లాంటి యాప్స్ సైతం ఉన్నాయి. గ్రిఫ్ట్‌హోర్స్ ఆండ్రాయిడ్ ట్రోజన్ మొబైల్ ప్రీమియం సర్వీస్ ద్వారా దాదాపు కోటి మంది ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారని జింపేరియమ్ జీల్యాబ్ గుర్తించింది. ఫిషింగ్ టెక్నిక్‌లు, గిఫ్ట్‌ల పేరుతో టోకరా, తెలియకుండానే డాటాను తస్కరించడం లాంటి యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే భారీగా చోరీ చేయగా.. ఆండ్రాయిడ్ యూజర్లు కింద పేర్కొన్న యాప్స్ గనుక ఫోన్లలో ఉంటే.. వాటిని తొలగించాలని చెబుతోంది. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 Idle Gun Tycoo\u202an\u202c Scanner App Scan Docs & Notes Chat Translator All Messengers Hunt Contact Icony Horoscope : Fortune Fitness Point Qibla AR Pro Heart Rate and Meal Tracker Mine Easy Translator PhoneControl Block Spam Calls Parallax paper 3D SnapLens – Photo Translator Qibla Pass Direction Caller-x Clap Photo Effect Pro iConnected Tracker Smart Call Recorder Daily Horoscope & Life Palmestry Qibla Compass (Kaaba Locator) Prookie-Cartoon Photo Editor Qibla Ultimate Truck – RoudDrive Offroad GPS Phone Tracker – Family Locator Call Recorder iCall PikCho Editor app Street Cars: pro Racing Cinema Hall: Free HD Movies Live Wallpaper & Background Intelligent Translator Pro Face Analyzer iTranslator_ Text & Voice & Photo Pulse App – Heart Rate Monitor Video & Photo Recovery Manager 2 Быстрые кредиты 24\7 Fitness Trainer ClipBuddy Vector arts Ludo Speak v2.0 Battery Live Wallpaper 4K Heart Rate Pro Health Monitor Locatoria – Find Location GetContacter Photo Lab AR Phone Booster – Battery Saver English Arabic Translator direct VPN Zone – Fast & Easy Proxy 100% Projector for Mobile Phone Forza H Mobile 4 Ultimate Edition Amazing Sticky Slime Simulator ASMR\u200f Clap To Find My Phone Screen Mirroring TV Cast Free Calls WorldWide My Locator Plus iSalam Qibla Compass Language Translator-Easy&Fast WiFi Unlock Password Pro X Pony Video Chat-Live Stream Zodiac : Hand Ludo Game Classic Loca – Find Location Easy TV Show Qibla correct Quran Coran Koran Dating App – Sweet Meet R Circle – Location Finder TagsContact Ela-Salaty: Muslim Prayer Times & Qibla Direction Qibla Compass Soul Scanner – Check Your CIAO – Live Video Chat Plant Camera Identifier Color Call Changer Squishy and Pop it Keyboard: Virtual Projector App Scanner Pro App: PDF Document QR Reader Pro FX Keyboard You Frame Call Record Pro Free Islamic Stickers 2021 QR Code Reader – Barcode Scanner Bag X-Ray 100% Scanner Phone Caller Screen 2021 Translate It – Online App Mobile Things Finder Proof-Caller Phone Search by Clap Second Translate PRO CallerID 3D Camera To Plan Qibla Finder – Qibla Direction Stickers Maker for WhatsApp Qibla direction watch (compass) Piano Bot Easy Lessons CallHelp: Second Phone Number FastPulse – Heart Rate Monitor Caller ID & Spam Blocker Free Coupons 2021 KFC Saudi – Get free delivery and 50% off coupons Skycoach HOO Live – Meet and Chat Easy Bass Booster Coupons & Gifts: InstaShop FindContact Launcher iOS for Android Call Blocker-Spam Call Blocker Call Blocker-Spam Call Blocker Live Mobile Number Tracker చదవండి: వాట్సాప్‌లో రూపాయి సింబల్ ఫీచర్.. ఇందుకోసమేనంట! -
Google: గూగుల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా..
గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్డేట్ అందించింది. ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!. ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే! ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి -
8 లక్షల యాప్‌లపై గూగుల్, ఆపిల్ నిషేధం
గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 2021 మొదటి అర్ధభాగంలో 8,13,000కు పైగా యాప్‌లపై నిషేధం విధించినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీటిలో 86 శాతం యాప్‌లు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పిక్సలేట్ తెలిపింది. ఈ యాప్స్ తొలగింపునకు ప్రధాన కారణం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నియమాలు ఉల్లఘించడమే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయి. పిక్సాలేట్ విడుదల చేసిన "హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్" కొన్ని కీలక డేటా పాయింట్లను పంచుకుంది. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో 5 మిలియన్లకు పైగా మొబైల్ యాప్‌లను ఈ కంపెనీ విశ్లేషించింది. అంతేగాక, ఈ యాప్స్ డీలిస్టింగ్ కు ఈ యాప్‌లకు సుమారు 21 మిలియన్ యూజర్ రివ్యూలు ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల, ఇంకా లక్షలాది యాప్ వినియోగదారులు వీటిని వినియోగించే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. మీరు ఏమి చేయాలి? గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ వాటిని స్టోర్ల నుంచి నిషేధించి ఉండవచ్చు, కానీ ఈ యాప్స్ బహుశా మీ ఫోన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఇప్పుడు వాటిని కనుగొని వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్ స్టోర్ పాలసీ ఉల్లంఘన కారణంగా తొలగిస్తే వినియోగదారుల గోప్యత, భద్రతకు, అదేవిధంగా ప్రకటనదారులకు బ్రాండ్ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మీ మొబైల్స్ లో ఉన్న అన్నీ యాప్స్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేల ఆ యాప్స్ ప్లే స్టోర్/యాప్ స్టోర్ లేకపోతే వెంటనే మీ మొబైల్ నుంచి వెంటనే తొలగించాలి నిపుణులు పేర్కొన్నారు. -
వామ్మో.. పేరు నుంచి పాస్వర్డ్ దాకా అన్నీ ఫసక్
సురక్షితంకానీ యాప్‌ల జోలికి వెళ్లొద్దని, ఫోన్లో గనుక అలాంటివి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని స్టోర్లు(గూగుల్, యాపిల్) ఎప్పటికప్పుడు యూజర్లను హెచ్చరిస్తూనే ఉంటాయి కదా. కానీ, ఈసారి ఆ అలర్ట్ భారీ లెవల్లోనే రిలీజ్ అయ్యింది. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లోనే 19 వేల అరక్షితమైన యాప్‌లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్.. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లో సేఫ్కాని 19,300 యాప్‌ల్ని గుర్తించింది. డేటాబేస్(ఫైర్‌బేస్ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్ హెచ్చరించింది. యాప్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌ను సురక్షితమైన సోర్స్‌గా భావిస్తుంటారు. కానీ, ఇందులో ఉన్న యాప్స్ కూడా యూజర్ డాటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగు చూసింది. ప్రస్తుతం గుర్తించిన యాప్‌ల వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్ డెవలపర్స్ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవాస్ట్ తెలిపింది. పొరపాటు ఇదే.. సాధారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్(మొబైల్-వెబ్ యాప్స్) డెవలపింగ్ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు డెవలపర్స్. ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్‌కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో ఈ డేటాబేస్ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది. వీటిలోని యాప్స్ మిస్కన్ఫిగరేషన్ ప్రభావం వల్ల.. లైఫ్‌స్టైల్, వర్కవుట్, గేమింగ్, మెయిల్స్, ఫుడ్ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్ కావొచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, ఒక్కోసారి పాస్వర్డ్లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి. మొత్తంగా లక్షా ఎనభై వేల మూడు వందల యాప్స్‌ను ఎవాస్ట్ థ్రెట్ ల్యాబ్ రీసెర్చర్స్ పరిశీలించారు. అందులో 10 శాతం అంటే.. 19,300 యాప్స్ ఓపెన్‌గా, గుర్తింపులేని డెవలపర్స్ నుంచి డాటాను లీక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. జాగ్రత్తలు.. ►వెరిఫై మార్క్ లేని యాప్స్ లేని డౌన్లోడ్ చేయకపోవడం బెటర్. ►యాప్ పర్మిషన్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేకుండే డాటా మొత్తం లీక్ అవుతుంది ►ప్లేస్టోర్లలో కింద రివ్యూలు, సమాచారం పూర్తిగా చదవాలి. ఒక్కోసారి ఫేక్ రివ్యూలు బోల్తా కొట్టిస్తుంటాయి. కాబట్టి, జెన్యూన్ రీజన్ ఉంటేనే డౌన్లోడ్ చేయాలి. ►రివార్డులు ఆఫర్ చేసే యాప్స్ విషయంలో మరింతజాగ్రత్త అవసరం. ►యాంటీ వైరస్ ఎంపికలోనూ ఆచీతూచీ వ్యవహరించాలి. ►ఒక్కోసారి ‘మొబైల్స్’కు హాని చేస్తాయనే సందేశాన్ని పట్టించుకోకుండా ‘టెంప్టింగ్’ యాప్స్‌ను డౌన్ లోడ్ చేస్తుంటారు. ఈ చర్య తెలిసిమరీ గోతి తవ్వుకున్నట్లే.. ►గేమ్స్ ఆడేటప్పుడు లేదంటే అశ్లీల వీడియోలు చూసేటప్పుడు వచ్చే యాప్స్ నోటిఫికేషన్ సురక్షితమైనది ఎంతమాత్రం కాదు ►అవతలివాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అన్‌లాక్ చేసి చూడాలనే ఉత్సుహకతతో ఇలాంటి అరక్షితమైన యాప్స్‌ను ప్రొత్సహిస్తుంటారు కొంతమంది. కానీ, మిగతా యాప్స్ కన్నా ఇలా డౌన్ లోడ్ చేసే యాప్స్ ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంటాయి. చదవండి: యాప్ మార్కెట్.. గూగుల్, యాపిల్‌కు భారీ షాక్ -
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్ మని నీటి బుడగలా పేలిపోయే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. అయితే ఆ ఇంట్రస్ట్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అనుసరిస్తున్నారు. బిట్ కాయిన్‌పై యాప్స్ తయారు చేసి వైరస్ల సాయంతో యూజర్ల అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. దీంతో గూగుల్ ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ♦ బిట్‌ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్ ♦ బిట్‌కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్ ♦ వికీపీడియా (BTC)- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్ ♦ క్రిప్టో హోలిక్- బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్ ♦ డైలీ బిట్ కాయిన్ రివార్డ్స్ - క్లౌడ్ ఆధారిత మైనింగ్ వ్యవస్థ ♦ బిట్‌కాయిన్ 2021 ♦ మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బిటిసి మైనర్ ♦ ఎథీరియం (ETH) - పూల్ మైనింగ్ క్లౌడ్ యాడ్స్‌ను ఎరగా వేసి సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్ ద్వారా యూజర్ల అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ట్రెండ్ మైక్రో రిపోర్ట్ ప్రకారం.. తొలత సైబర్ నేరస్తులు బిట్ కాయిన్ పై ట్రేడింగ్ నిర్వహించేందుకు ఇష్టపడుతున్న వారిని టార్గెట్ చేస్తారు. వారికి రూ.1000తో (ఉదాహరణకు) బిట్ కాయిన్‌పై ట్రేడింగ్ చేస్తే వారికి అదనంగా రూ.2వేలు చెల్లిస్తామంటూ యాడ్స్‌ను క్రియేట్ చేస్తుంటారు. పొరపాటున ఆ యాడ్స్‌ను క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా అంతా సైబర్ నేరస్తుల డేటాలో స్టోరై ఉంటుందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఆ తర్వాత యాప్స్ ద్వారా మాల్వేర్ సాయంతో అకౌంట్లలో ఉన్న డబ్బులు కాజేస్తుంటారని, ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చదవండి : Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్ -
వివాదాస్పదంగా గూగుల్ భారీ డీల్
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్‌లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది. 2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్‌ను మరోసారి తెర మీదకు తెచ్చింది. చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు, ఏపీకే ఇన్స్టాల్స్ యాప్స్‌ను సైతం ఇన్స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్‌ప్లేస్‌లో గూగుల్‌ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్‌తో గూగుల్‌కు వివాదం మొదలైంది. సీక్రెట్‌గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్. ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్‌ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి. -
డేటింగ్ ముసుగులో వ్యభిచారమే.. గూగుల్ డెడ్లీ వార్నింగ్
వయసు మళ్లిన వాళ్లు.. వయసులో అమ్మాయిలతో డేటింగ్ చేయడమే షుగర్ డాడీ యాప్స్ కాన్సెప్ట్. అయితే ఇది తోడు వరకో లేదంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆగిపోదు. శారీరక సుఖం.. దానికి బదులుగా యువతులకు కాస్ట్లీ గిఫ్ట్‌లు, డబ్బు ఎరవేస్తుంటారు. విదేశాల్లో బాగా నడిచే ఈ వ్యవహారానికి మనదేశంలోనూ క్రేజ్ ఉంది. కానీ, త్వరలో ఇలాంటి యాప్స్‌పై బ్యాన్ విధించేందుకు గూగుల్ సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద కొరడా జులిపించాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ కూడా టార్గెట్‌గా ఉంది. ఈ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ కిందకే వస్తాయని గూగుల్ ప్లేస్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యభిచారమే! ‘షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్. అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే’ అని గూగుల్ ప్లేస్టోర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని హెచ్చరించింది గూగుల్ ప్లే స్టోర్. మన దగ్గరా ఇక మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి క్రేజ్ పెరుగుతోంది. ఆసియా దేశాల లిస్ట్‌లో.. మన దేశంలో మూడున్నర లక్షల మంది షుగర్ డాడీలు ఉండగా, ఇండొనేషియాలో అరవై వేలమంది ఉన్నారు. ఈ యాప్‌ల్లో ‘ఎస్డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ, షుగెర్ డాడీ’.. ఇవి ప్లేస్టోర్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. సెక్సువల్ రిలేషన్స్ ప్రొత్సహించే ఏ యాప్స్‌ను ఉపేకక్షించబోమని స్పష్టం చేసింది గూగుల్. అయితే అనధికారిక యాప్ స్టోర్లలో, డౌన్లోడ్లతో షుగర్ డేటింగ్ యాప్స్ కొనసాగే అవకాశాల్లేకపోలేదు. -
ఫ్రెండ్లీ యాప్ ‘యూట్యూబ్’ సంచలనం
మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా ఘనత దక్కించుకుంది. ఈ మేరకు 9టు5 గూగుల్ అనే వెబ్సైట్ కథనం ప్రచురించింది. ప్లే స్టోర్‌లో ఇదో అరుదైన రికార్డ్ అని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇదంతా ప్రీ ఇన్‌స్టాలేషన్‌తో కలిపే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్ సంబంధిత లిస్ట్‌లో యూట్యూబ్ తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ టెక్స్ టు స్పీచ్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో 5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌కి పైగా ఉన్నాయి. ఫ్రెండ్లీ యాప్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధిక డౌన్లోడ్ల కౌంట్‌లో మాత్రం ముందుండేది ఏదో తెలుసా?.. ‘గూగుల్ ప్లే స్టోర్’. ఇక 2005లో లాంఛ్ అయిన యూట్యూబ్‌ని.. 2006లో 1.6 బిలియన్ డాలర్లు చెల్లించి గూగుల్ సొంతం చేసుకుంది. ఆపై యూట్యూబ్ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్రెండ్లీ యాప్‌గా యూట్యూబ్‌కి పేరుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్, 4జీ డివైజ్‌లు ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తర్వాత యూట్యూబ్ వినియోగం విపరీతంగా పెరిగింది. తద్వారా అతిపెద్ద స్ట్రీమింగ్ యాప్‌గా అవతరించింది యూట్యూబ్. ఇంత కాలం వీడియో చేసే వాళ్లకు మాత్రమే ఇన్కమ్సోర్స్గా ఉన్న యూట్యూబ్.. తాజాగా ‘సూపర్థ్యాంక్స్’ ద్వారా చూసేటోళ్ల నుంచి సైతం డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. -
స్మార్ట్ఫోన్లపై విరుచుకుపడుతున్న జోకర్ మాల్వేర్
-
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
అమెరికాలో గూగుల్‌పై కేసు
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ ‘గూగుల్ ప్లే స్టోర్’లో ఆరోగ్యకరమైన పోటీని తన విధానాల ద్వారా తోసిపుచ్చుతోందని, దేశ కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ‘గూగుల్’పై కోర్టులో కేసు వేశాయి. వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు, విధానాలను అవలంబిస్తూ యాండ్రాయిడ్ వినియోగదారులకు సరైన, చవౖMðన ఉత్పత్తులు లభించకుండా చూస్తోం దని ఆరోపించాయి. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీ తదితర రాష్ట్రాలు గూగుల్‌పై ఈ దావా వేశాయి. యాప్ డెవలపర్లు వారి డిజిటల్ కంటెంట్‌ను గూగుల్ ప్లే సోర్ట్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల ద్వారా, గూగుల్ మధ్యవర్తిగా మాత్రమే అమ్మాలని నిర్దేశిస్తోందని, తద్వారా వారి నుంచి గూగుల్ కమిషన్ సహా పెద్ద ఎత్తున ఆదాయం సముపార్జిస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపిం చాయి. ‘చాన్నాళ్లుగా ఇంటర్నెట్కు గేట్‌కీపర్‌గా గూగుల్ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు మన డిజిటల్ డివైజెస్‌కు గేట్ కీపర్‌గా మారింది. తద్వారా మనం రోజూ వాడే సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. తన ఆధిక్యతను ఆసరాగా తీసుకుని పోటీని అక్రమంగా అణచివేస్తోంది. పోటీకి నిలిచిన థర్డ్ పార్టీ యాప్ డెవలపర్ల చిన్న,చిన్న వ్యాపారాలను తొక్కేస్తోంది’ అని న్యూయార్క్ అటార్నీ వ్యాఖ్యానించారు. -
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు
వాట్సాప్ లో కొన్నిసార్లు డిలీట్ మెసేజ్ లను చదవాల్సి వస్తుంది. వాట్సాప్ మాత్రం డిలీట్ అయిన మెసేజ్ లను మళ్లీ ఓపెన్ చేసి చదివేలా ఆప్షన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ చిన్నట్రిక్ తో డిలీట్ మెసేజ్ లను చదవచ్చు.ఆండ్రాయిడ్ ఫోన్ లలో మాత్రమే సదుపాయం ఉంది. 1. ముందుగా గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లాలి. గూగుల్ ప్లేస్టోర్ లో నోటిసేవ్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. ఇన్ స్టాల్ చేసుకున్న అనంతరం నోటిసేవ్ యాప్ సాయంతో నోటిఫికేషన్లు, ఫోటోలు, మీడియా మరియు ఫైల్స్ చదివేలా మీరు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 3. అది పూర్తయితే డిలీటెడ్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంది. . 4. మీరు అనుమతులు ఇచ్చిన వెంటనే వాట్సాప్ తో పాటూ ప్రతి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకుంటుంది. వాటిని మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కాకపోతే డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్ లను తిరిగిపొందాలంటే నెలకు రూ.65 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా జిఫ్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొందవచ్చు. చదవండి : వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్
వాట్సాప్ వినియోగదారులు కొత్త మాల్వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు, కొత్తరకం వార్మబుల్ మాల్వేర్ను ఫోన్లు, డివైజ్‌లలోకి పంపిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని వార్మ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ముందు వాట్సాప్ యూజర్లకు ఇతరుల నుంచి మీకు ఒక మెస్సేజ్ లేదా లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫోన్లలో ఇతర నఖిలీ యాప్‌లు డౌన్లోడ్ అవుతాయి. వీటి ద్వారా మీ వ్యక్తిగత డేటాను సులభంగా దొంగిలిస్తారు. ఇది వివిధ రకాల ఫంక్షన్లు, పర్మిషన్లను ఎనేబుల్ చేయాలని యూజర్లకు నోటిఫికేషన్లు ఇస్తుంది. అనంతరం ఫోన్‌కు ఏదైనా వాట్సాప్ మెస్సేజ్ రాగానే, మాల్వేర్ ద్వారా తక్షణమే ఫేక్ లింక్స్ ఉండే మెస్సేజ్‌లు రిప్లైగా వెళ్తాయి. ప్రస్తుతం వీటి ద్వారా వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో యాడ్స్ రావచ్చు. ఇవి ప్రజలను ప్రకటనలతో విసిగిస్తాయి. వాట్సాప్ కు వచ్చిన సందేశం స్పామ్ లాగా కనిపించకుండా ఉండటానికి గంటకు ఒకసారి పింగ్ చేయబడుతుంది. అలాగే ఇలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి 'ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్‌ను గెలుచుకోండి' అనే ఫేక్ లింకులను డిస్ప్లే చేస్తాయి. వాట్సాప్ యూజర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండటానికి ఒక నకిలీ గూగుల్ లింక్ లాగా ఉంటుంది. ఎవరైనా ఈ లింక్‌ను క్లిక్ చేస్తే క్లోన్ గూగుల్ ప్లే స్టోర్, క్లోన్ 'హువావే మొబైల్' అనే యాప్ ను డౌన్లోడ్ చేయమని ఆ వ్యక్తిని అడుగుతుంది. ఇవి నిజమైన యాప్ లు కావు నకిలీ యాప్ లు. ఈ క్లోనింగ్ యాప్‌ల ద్వారా ఫిషింగ్ మెస్సేజ్‌లు కస్టమర్ల ఫోన్లలో డౌన్లోడ్ అవుతాయి. ఈ యాప్ లను కనుక డౌన్లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫంక్షన్లు, పర్మిషన్లను మీరు ఎనేబుల్ చేస్తే ఇక మీ పని అంతే. మీ వ్యక్తిగత డేటాతో పాటు, ఇతర ముఖ్యమైన డేటా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ నకిలీ డొమైన్లపై సరైన చర్యలు తీసుకోవాలని డొమైన్ ప్రొవైడర్‌కు తెలియజేస్తున్నాము అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎవరు అనుమానిత మెస్సేజ్‌లను ఓపెన్ చేయవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న భారత పబ్జీ ‘ఫౌజీ’
చైనా యాప్ అని 'పబ్జీ’ని నిషేధించడంతో దానికి పోటీగా ‘ఫౌజీ’ (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) తీసుకొచ్చారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ గేమ్ రికార్డ్ సృష్టించింది. మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్‌గా భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ‘ఫౌజీ’ రూపొందించారు. భారత పబ్జీగా పిలువబడే ఫౌజీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26వ తేదీన అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు 24 గంటల్లో 3 లక్షల డౌన్లోడ్లు సాధించగా.. మూడు రోజుల్లోనే ఫౌజీ గేమ్ 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్‌గా ఫౌజీ నిలవనుంది. అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయ్యింది. ఈ గేమ్‌ను సుమారు 500ఎంబీ సైజ్‌లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్‌ని ఓపెన్ చేశాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ (క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్) కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. (చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా? ) ప్రస్తుతం పబ్జీ గేమ్‌లో మాదిరి మల్టీ ప్లేయర్‌కి సపోర్ట్ చేయకపోయినా తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ థీమ్‌తో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్‌కు వెళ్తుంది. -
లోన్ యాప్స్‌పై గూగుల్ ప్లేస్టోర్ ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్ : ఇన్స్టాంట్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల రిక్వెస్ట్‌తో యాప్స్ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన గూగుల్ ప్లేస్టోర్ ఇప్పటివరకు 200కు పైగా లోన్‌యాప్స్‌ను తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి 288.. సైబరాబాద్‌లో 110.. రాచకొండ నుంచి 90 లోన్ యాప్స్ తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. ( యూట్యూబ్ వీడియోల స్పూర్తితో.. ) ఈ కేసుకు సంబంధించి పోలీసులు వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు ఫ్రీజ్ అయింది. ఆన్లైన్ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బులతో చైనీయులు ఈ లోన్ యాప్‌లను నడిపారు. ఇప్పటివరకు నలుగురు చైనా దేశస్తులు అరెస్టయ్యారు. -
వేధించే లోన్ యాప్స్ ఔట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. కస్టమర్లు, ప్రభుత్వ సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వందలాది యాప్స్‌ను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఆన్‌డ్రాయిడ్ సెక్యూరిటీ, పైవసీ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సుజాన్నే ఫ్రే ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడమేగాక, వసూలు చేసేందుకు యాప్స్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని యాప్స్‌ను తొలగించారో గూగుల్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. గత 10 రోజుల్లో సుమారు 120 యాప్స్‌ను తీసివేసినట్టు సమాచారం. ఇలా ప్లే స్టోర్ నుంచి గుడ్‌బై చెప్పిన యాప్స్ సంఖ్య డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసు లేకుండానే..: స్థానిక చట్టాలు, ఆర్బీఐ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని నిరూపించాలని ఇతర గుర్తించిన యాప్ డెవలపర్లను గూగుల్ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పొందిన లైసెన్సు పత్రాలను తమ ముందు అయిదు రోజుల్లో ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్‌కు లోబడే డెవలపర్లు పనిచేయాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. విఫలమైన యాప్స్‌ను ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని హెచ్చరించింది. ఆన్లైన్ రుణ వేధింపుల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, నియంత్రణ చర్యలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించినట్టు ఆర్బీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫిన్‌టెక్ యాప్స్‌పై కన్నేసి ఉంచాలన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో గూగుల్ తాజా చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక వివరాలు ఉండాల్సిందే..: వ్యక్తిగత రుణాలను అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్.. రుణాలను తిరిగి చెల్లించాల్సిన కనీస, గరిష్ట కాల పరిమితి, గరిష్ట వార్షిక వడ్డీ శాతం, మొత్తం లోన్‌కు అయ్యే ఖర్చు వంటి కీలక వివరాలను ముందస్తుగా వెల్లడించాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుందని, మోసానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. రుణం జారీ చేసిన తేదీ నుండి 60 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన వ్యక్తిగత రుణ యాప్స్‌ను మాత్రమే గూగుల్ అనుమతిస్తుంది. డెవలపర్లు ప్రస్తుత సేవలను అమలు చేయడానికి అవసరమైన అనుమతులను మాత్రమే యూజర్ల నుంచి అభ్యర్థించాలి. వారు బహిర్గతం చేయని, అమలు చేయని, అనుమతించని ప్రయోజనాల కోసం వినియోగదారు లేదా వారి మొబైల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించరాదని హెచ్చరించింది. అనుమతి తీసుకోవాలి.. డెవలపర్లు వినియోగదారు అంగీకరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించాలి. తరువాత వారు ఇతర ప్రయోజనాల కోసం డేటాను ఉపయోగించాలనుకుంటే, వారు అదనపు ఉపయోగాలకు వినియోగదారు అనుమతి పొందాలని గూగుల్ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహకరిస్తామని సంస్థ తెలిపింది. ‘గూగుల్ ఉత్పత్తుల ద్వారా సురక్షిత, భద్రమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించడం మా ప్రాధాన్యం. మా గ్లోబల్ ప్రొడక్ట్ పాలసీలు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి, అమలు చేయబడ్డాయి. వినియోగదార్ల భద్రతను పెంచడానికి మా పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము’ అని వివరించింది. -
ఈ యాప్స్ ని వెంటనే డిలీట్ చేయండి
బంబుల్, ఓక్‌కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ వంటి ప్రముఖ డేటింగ్, ట్రావెల్, వీడియో కాలింగ్ యాప్స్ లలో ఇటీవల ఒక పెద్ద బగ్ గుర్తించినట్లు చెక్‌పాయింట్ పరిశోధకులు తెలిపారు. ఈ సమస్య అనేది గూగుల్ కోర్ లైబ్రరీ(జీపీసీ)కి చెందిన రెండు యాప్స్ మాత్రమే కాకుండా ఇతర యాప్స్ లలో గుర్తించినట్లు తెలిపారు. డెవలపర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ బగ్ బయటపడింది. దీనిని 2020 ఏప్రిల్‌లో గూగుల్ గుర్తించి పరిష్కరించింది. ఈ బగ్ కి CVE-2020-8913 అని పేరు పెట్టబడింది. (చదవండి: గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు) ఈ బగ్ ద్వారా సైబర్ క్రీమినల్స్ కి మీ మొబైల్ యొక్క డెవలపింగ్ కోడ్ అనేది పొందటానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు హ్యాకర్స్ మీ మొబైల్ లో ఉన్న సెక్యూరిటీ కోడ్ ని మార్చడంతో పాటు వారు మరో హానికరమైన కోడ్‌ను మొబైల్ లో ఇంజెక్ట్ చేయవచ్చు. ఇటువంటి హానికర యాప్స్ ద్వారా వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగత సమాచారంతోపాటు సున్నితమైన బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా వివరాలు తెలుసుకుంటారు. ఈ సమస్య 2020 ఏప్రిల్‌లో గుర్తించబడింది. ఇది గూగుల్ ప్లే కోర్ లైబ్రరీకి సంబంధించినది కనుక గూగుల్ పరిష్కరించింది. అయితే చాలా మంది యాప్ డెవలపర్లు ఇప్పటికీ పాతబడిపోయిన గూగుల్ ప్లే కోర్ లైబ్రరీ (జీపీసీ)నే వాడుతున్నారు. ఇందులోనే ఈ బగ్‌ను కనుగొన్నారు. ఈ జీపీసీ ద్వారానే డెవలపర్లు తమ అప్డేట్స్ను యూజర్లకు చేరవేస్తారు. 2020 సెప్టెంబర్ నెలలో గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని ప్రముఖ యాప్స్‌ను చెక్ పాయింట్ పరీక్షించింది. ఇప్పటికి 13 శాతం డెవలపర్లు పాత గూగుల్ ప్లే కోర్ లైబ్రరీని వాడుతున్నట్లు గుర్తించింది. 8 శాతం మంది బగ్ ముప్పు ఎక్కువగా ఉన్న వెర్షన్‌నే వాడుతున్నారని ఇందులో తేలింది. ఇంకా ఈ సమస్యను గూగుల్ పూర్తిగా పరిష్కారించలేదు. గ్రైండర్, వైబర్, ఓక్‌కుపిడ్, బంబుల్, సిస్కో జట్లు, ఎడ్జ్, యాంగో ప్రో, ఎక్స్రేకార్డర్ మరియు పవర్ డైరెక్టర్ లాంటి ప్రముఖ యాప్స్ లో లోపం ఉన్నట్లు చెక్‌పాయింట్ నిపుణులు తెలిపారు. అందుకని మీ మొబైల్ ఇలాంటి యాప్స్ ఉంటె వెంటనే డిలీట్ చేయండి. -
గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నా గేమ్ అభిమానులకు ఎన్కోర్ గేమ్స్ శుభవార్త తెలిపింది. తాజాగా ఎన్కోర్ గేమ్స్ రూపొందిస్తున్న 'ఫౌజీ' మొబైల్ గేమ్ చివరకు గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. గేమ్ ఇంకా లాంచ్ కాలేదు కానీ, మొత్తానికి దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్లు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. 'ఫౌజీ' మొబైల్ గేమ్ గతంలో తీసుకొచ్చిన టీజర్లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది. (చదవండి: 5జీ మొబైల్స్ సందడి షురూ) సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా సెప్టెంబరులో 117 ఇతర చైనా యాప్ లతో పాటు పబ్జి గేమ్ నిషేదించింది. పబ్జి గేమ్ పై నిషేధం విధించిన రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' గేమ్ ని రూపొందిస్తున్నట్లు ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. గతంలో ఎన్కోర్ గేమ్స్ ఈ గేమ్ నవంబర్ తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తామని తెలిపింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెలలో పబ్జి గేమ్ కూడా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి రానున్నట్లు సమాచారం. చూడాలి మరీ ఈ రెండు గేమ్ లలో ఏది ముందు విడుదల అవుతుందో. -
ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ఆండ్రాయిడ్ యాప్ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది. ప్లే స్టోర్‌లో ఉన్న హానికరమైన యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తుంది. తాజగా ఇలాంటి హానికరమైన యాప్ లలో ఒకటైన ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ చైనా యాప్ ని తొలగించింది. ఈ యాప్ ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లను పూర్తీ చేసుకుంది. ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్ వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటా, ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్లతో సహా బహిర్గతమవుతున్నాయి. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల డేటాకు ప్రమాదం పొంచి ఉందని సింగపూర్‌కు చెందిన ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. (చదవండి: గూగుల్ పే యూజర్లకు షాకింగ్ న్యూస్) "ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఆగస్టులో ఈ లోపాన్ని కనుగొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 90 రోజుల గడువును కూడా ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, గో ఎస్ఎంఎస్ ప్రో ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోలేదు. అందువల్లనే యూజర్లకు ఇప్పుడు ఈ సమాచారాన్ని చెప్పక తప్పడం లేదని సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రస్ట్ వేవ్ వెల్లడించింది" అని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. గో ఎస్ఎంఎస్ ప్రో యాప్ ద్వారా యూజర్లు ఇప్పటివరకు పంపిన సమస్త సమాచారం పబ్లిక్‌గా లభిస్తుందని, ఈ సమాచారాన్ని ఒక ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపిన యూఆర్ఎల్ లింక్‌తో సులభంగా యాక్సెస్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక డీకోడ్ లింక్ ద్వారా వినియోగదారులు ఇప్పటివరకు పంపుకున్న ఫోన్ నంబర్స్, బ్యాంక్ లావాదేవీ స్క్రీన్ షాట్స్, అరెస్ట్ రికార్డ్, ఇతర సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చని వారు పేర్కొన్నారు. దింతో మీ యొక్క ఫోన్, బ్యాంకు అకౌంట్ హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఎక్కువ అని ఆందుకోసమే వెంటనే మీ ఫోన్ నుండి ఈ యాప్ ని డిలీట్ చేయాలనీ నిపుణులు తెలుపుతున్నారు. -
ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్ తొలగింపు
న్యూ ఢిల్లీ: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగించింది. వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్పకాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతలను వేధించాయి. తమ గూగుల్ ప్లేస్టోర్ డెవలపర్ విధానాలు వినియోగదారులను కాపాడటానికి, వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడినవని గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించింది. (చదవండి: చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు) "ప్రజలకు త్వరగా నగదు అవసరమైనప్పుడు అందించడానికి లాక్డౌన్ సమయంలో ఇటువంటి గుర్తింపు లేని యాప్స్ పెరిగాయి. ఈ యాప్స్ పేర్లు కూడా గుర్తింపు గల కంపెనీల పేర్లతో పోలి ఉండటం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ప్రజలకు తెలియదు. వీటిని కనీసం 4,00,000 నుండి 1 మిలియన్ల మంది డౌన్లోడ్ చేశారు" అని ఫిన్‌టెక్ పరిశోధకుడు ఎల్. శ్రీకాంత్ చెప్పారు, కనీసం ఇలాంటి 10 యాప్‌లను తను అధ్యయనం చేసినట్లు తెలిపారు. టెక్నాలజీ గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుండి తొలిగించిన వాటిలో ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్, స్నాప్ ఇట్ లోన్ యాప్స్ ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తిగత రుణాల నిబంధనల నుంచి ప్రజలను కాపాడటం కోసం తమ ఆర్థిక సర్వీసుల విధానాలను విస్తరించినట్లు పేర్కొంది. ఈ యాప్స్ ఫీచర్లు కూడా మనదేశ చట్టాల పరిధిలోకి రావు. కాబట్టి ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. -
డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్
కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి స్మార్ట్ ఫోన్, పీసీ, పియస్4, ఏక్షబాక్స్ వన్, నింటెండో స్విచ్, గూగుల్ స్టేడియా వంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్లోడ్లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్లోడ్లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్లోడ్లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్త గేమ్ డౌన్లోడ్ లలో 10శాతం ఇన్స్టాల్ లతో యుఎస్ రెండవ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బ్రెజిల్ (8 శాతం) ఉంది. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) 2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్ గేమ్ లు నిలిచాయి. ఇండియాలో అక్టోబరులో పబ్జి నిషేధం తర్వాత తిరిగి "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్లోడ్లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్‌స్టాల్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి. -
ఈ అలారంతో ఉదయం నిద్ర లేవాల్సిందే
మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది. దాని పేరే ‘ఛాలెంజెస్ అలారం క్లాక్– వేకప్ పజిల్స్’ అనే అలారం యాప్. ఇది అన్ని అలారంల లాగా టైం రిమైండ్ చేయదు ఈ యాప్. ఒక వేళా అన్ని యాప్ లలాగే లేసి ఆఫ్ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్‌లో అలారం పెడితే మళ్ళి ఆఫ్ చేయాలంటే గణిత, జ్ఞాపకశక్తి, సీక్వెన్స్, రీటైప్, పిక్చర్, స్మైల్ కు సంబందించిన ఒక పజిల్ ని సాల్వ్ చేయాలి. దాంతో ఆటోమేటిక్‌గా నిద్రమత్తు వదలడంతో పాటు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్‌లో అలారం సెట్ చేయడానికి ముందే ఛాలెంజెస్, గేమ్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఈ యాప్ విద్యార్థులకు, ఉద్యోగులకు బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీకు గూగుల్ ప్లేస్టోర్ లో ఉచితంగా లభిస్తుంది. (చదవండి: వివో నుండి మరో బడ్జెట్ ఫోన్) -
ఈ యాప్‌లను వెంటనే తొలగించండి!
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ప్రతి చిన్న అవసరానికి మనం ఎక్కువ శాతం మొబైల్ మీద ఆధారపడుతున్నాం. ఏ చిన్న సమస్యకైనా మనకు ఏదో ఒక యాప్ రూపంలో పరిష్కారం లభిస్తుంది. ఈ యాప్స్ ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్స్ వల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తున్నాయి. తాజాగా, డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది. (చదవండి: పీవీసీ ఆధార్: రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో పనిలేదు) వినియోగదారుల నుంచి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్ జాబితా ఇదే... Skins, Mods, Maps for Minecraft PE Skins for Roblox Live Wallpapers HD & 3D Background MasterCraft for Minecraft Master for Minecraft Boys and Girls Skins Maps Skins and Mods for Minecraft -
యాప్స్ వార్
-
గూగుల్‌తో పేటీఎం ఢీ..!
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్‌తో తలపడేందుకు దేశీ ఈ–కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ఆవిష్కరించింది. తమ యాప్‌లో అంతర్గతంగా మినీ–యాప్స్‌ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. అలాగే, యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్–బ్యాంకింగ్, కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లింపులు జరిపేలా డెవలపర్లు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వొచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై మాత్రం 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. డెకాథ్లాన్, ఓలా, పార్క్‌ప్లస్, ర్యాపిడో, నెట్‌మెడ్స్, 1ఎంజీ, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెనూ, నోబ్రోకర్ వంటి 300 పైచిలుకు యాప్ ఆధారిత సర్వీసుల సంస్థలు ఇప్పటికే ఇందులో చేరినట్లు పేటీఎం తెలిపింది. ‘ప్రతీ భారతీయ యాప్ డెవలపర్‌కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం యూజర్లు ప్రత్యేకంగా ఆయా యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. గూగుల్‌తో వివాదం.. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్‌తో పేటీఎం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడల బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సెప్టెంబర్ 18న పేటీఎం యాప్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించింది. సదరు ఫీచర్‌ను తొలగించిన తర్వాతే మళ్లీ ప్లేస్టోర్‌లో చేర్చింది. గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకే ఇలాంటి పక్షపాత విధానాలు అమలు చేస్తోందని పేటీఎం ఆరోపించింది. ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్‌పై గూగుల్‌కు గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్ తమ విధానాలపై వివరణనిచ్చింది. ప్లే స్టోర్ ద్వారా డిజిటల్ కంటెంట్ విక్రయించే యాప్స్ కచ్చితంగా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్‌నే ఉపయోగించాలని, ఇన్–యాప్ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట శాతం ఫీజుగా చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భారత్‌లోని డెవలపర్లు.. ప్లే బిల్లింగ్ సిస్టమ్‌తో తమ యాప్‌లను అనుసంధానించేందుకు గడువును 2020 మార్చి 31 దాకా పొడిగించింది. ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు.. పండుగ సీజన్ నేపథ్యంలో పేటీఎంతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసే యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేగాకుండా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమ పేటీఎం వ్యాలెట్లలో తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చని వివరించింది. అక్టోబర్ 16 నుంచి 21 దాకా ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహిస్తుండగా, ఆ సంస్థలో భాగమైన ఫ్యాషన్ విభాగం మింత్రా కూడా అక్టోబర్ 16 నుంచి 22 దాకా ’బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ నిర్వహిస్తోంది. అటు, మ్యాక్స్ ఫ్యాషన్‌తో కూడా జట్టు కట్టినట్లు మింత్రా మరో ప్రకటనలో వెల్లడించింది. -
ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్' మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే.. 'జోకర్' మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్' బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్) ఇప్పటికే లక్షా 20 వేల డౌన్లోడ్స్ ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్ పరీక్షించింది. 17 యాప్స్ భారీగా ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల గూగుల్ గుర్తించిన 17 ఇన్ఫెక్టెడ్ యాప్స్ ఇవే.. One Sentence Translator - Multifunctional Translator Style Photo Collage Meticulous Scanner Desire Translate Talent Photo Editor - Blur focus Care Message Part Message Paper Doc Scanner Blue Scanner Hummingbird PDF Converter - Photo to PDF All Good PDF Scanner Mint Leaf Message-Your Private Message Unique Keyboard - Fancy Fonts & Free Emoticons Tangram App Lock Direct Messenger Private SMS -
గూగుల్‌కు పోటీగా పేటీఎం యాప్ స్టోర్
ముంబై: గూగుల్‌కు పోటీగా పేటీఎం రంగంలోకి దిగింది. ఇండియన్ యాప్ డెవలపర్స్ కోసం ప్రత్యేక యాండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ మినీ యాప్ స్టోర్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోకుండానే ఉపయోగించుకోవచ్చు. నేరుగా మొబైల్ వెబ్సైట్ ద్వారా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని, ఇందువల్ల కోట్లాది మంది యూజర్ల డేటా ప్రైవసీకి ముప్పు ఉండదని పేటీఎం పేర్కొంది. అందుకే ఈ కోత్త స్టోర్.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇటీవలే కొద్దిగంటలపాటు పేటీఎం యాప్‌ను తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పేటీఎం సొంతగా యాప్ స్టోర్‌ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కి కూడా తమ ప్లేస్టోర్‌లో చోటు దక్కుతుందని పేటీఎం స్పష్టం చేసింది. ఇప్పటికే 300కు పైగా యాప్స్.. 1ఎంజీ, నెట్‌మెడ్స్, డిజిట్, డెకథ్లాన్ తదితర 300 సంస్థలు తమ ప్లేస్టోర్ కోసం యాప్స్ డెవలప్ చేశాయని పేటీఎం తమ వెబ్సైట్లో పేర్కొంది. మన దేశానికి చెందిన ప్రతి యాప్ డెవలపర్‌కి అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించామని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌శేఖర్‌శర్మ తెలిపారు. ఇండియన్ స్టార్టప్స్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలిస్తామని వెల్లడించారు. (చదవండి: పేటీఎంకు గూగుల్ షాక్) కమిషన్ చెల్లించక్కర్లేదు.. గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ తమ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు పేటీఎం తెలిపింది. పేటీఎం మినీ యాప్ స్టోర్‌లో యాప్స్ లిస్ట్ చేసిన డెవలపర్లు పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చని వెల్లడించింది. (చదవండి: డిజిటల్ మార్కెట్‌పై గూగుల్ పెత్తనం) -
గూగుల్‌పై పేటీఎం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన నేపథ్యంలో గూగుల్‌పై డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఆరోపణలు గుప్పించింది. భారత చట్టాలకు అతీతంగా గూగుల్ తన పాలసీలను రూపొందిస్తోందని పేటీఎం మండిపడింది. సెప్టెంబర్ 11న తాము తమ యూజర్ల కోసం యూపీఐ క్యాష్‌బ్యాక్‌ను ప్రారంభించామని, ఇది తమ పాలసీకి విరుద్ధమంటూ ఈనెల 18న ప్లేస్టోర్ నుంచి తమ యాప్‌ను గూగుల్ తొలగించిందని పేటీఎం వాపోయింది. తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని పేటీఎం ఆరోపించింది. యూపీఐ క్యాష్‌బ్యాక్, స్క్రాచ్‌కార్డ్ ప్రచారానికి సంబంధించి గూగుల్ తమకు నోటిఫికేషన్ పంపడం ఇదే తొలిసారని వివరించింది. ఆనవాయితీకి విరుద్ధంగా వారి ఆందోళనలపై తాము స్పందించే అవకాశం కానీ, మా అభిప్రాయాలను వెల్లడించే ఆప్షన్‌ను కానీ సెర్చింజిన్ దిగ్గంజం తమకు ఇవ్వలేదని పేర్కొంది. గూగుల్ పే యాప్ కోసం భారత్‌లో గూగుల్ సైతం తరచూ ఇలాంటి స్క్రాచ్‌కార్డ్ క్యాంపెయిన్లు నిర్వహించిందని పేర్కొంది. భారత డిజిటల్ మార్కెట్లో గూగుల్ ప్రాబల్యం దేశీ ఇంటర్నెట్ కంపెనీలకు అనుభవమేనని పేటీఎం వ్యాఖ్యానించింది. -
పేటీఎంకు గూగుల్ షాక్!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్ దిగ్గజం గూగుల్ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్‌పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్‌బ్యాక్’ ఫీచర్‌ను పేటీఎం తొలగించడంతో యాప్‌ను సాయంత్రానికి గూగుల్ మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ నిబంధనలకు అనుగుణంగా క్యాష్‌బ్యాక్ కింద ఆఫర్ చేస్తున్న స్క్రాచ్ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్ వంటి) కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే... ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం .. ప్లే స్టోర్‌లో కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, యాప్‌ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. క్రికెట్ లీగ్ తెచ్చిన తంటా.. క్రికెట్ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్ యాప్‌లో ఇటీవల ’పేటీఎం క్రికెట్ లీగ్’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ భారత్‌లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తొలగించింది‘ అని వివరించారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ తొలగింపు.. క్రీడలపై బెట్టింగ్ చేసే యాప్స్ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్‌ప్లే డెవలపర్ అకౌంట్‌ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ పేర్కొన్నారు. -
గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
-
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 29 యాప్స్ తొలగింపు
యాడ్వేర్(యూజర్ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్)తో నిండిన 29 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ యాప్స్ అండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో 3.5 మిలియన్లకు పైగా డౌన్లోడ్ అయి ఉన్నాయి. సతోరి ఇంటెలిజెన్స్ బృందం చార్ట్రూస్బ్లూర్ పేరుతో జరిపిన పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్‌లను కనుగొన్నారు. వీటిలో అధికంగా ఫోటో ఎడిటింగ్ యాప్‌లు ఉన్నట్లు తేలింది. దర్యాప్తులో యాప్స్‌లో బ్లర్ అనే పదం చాలా హానికరమైనదగా తేలింది. (10 లక్షలకు పైగా డౌన్లోడ్లతో టాప్‌లో) ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌లో వినియోగంలోని లేని యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఏ యాప్ అయినా యూజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మొబైల్లో లాంచ్ ఐకాన్స్ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్ ఈ యాప్‌లను డిలీట్ చేయడానికి కష్టంగా మారుతుంది. యాడ్వేర్ ఉన్న ఓ యాప్ స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్. సాటోరి బృందం ఈ యాప్‌ను పరీక్షించింది. ఈ యాప్ సరిగా వర్క్ చేయడం లేదు. ఫోన్లలో ఓసీసీ యాడ్లను అమలు చేస్తోంది. ఈ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసేన తర్వాత లాంచ్ ఐకాన్ అదృశ్యమైంది. అంతేగాక ప్లే స్టోర్‌లో “ఓపెన్” ఫంక్షన్ కూడా లేదు. (టిక్‌టాక్ బ్యాన్.. దూసుకుపోతున్న చింగారీ) ఈ యాప్‌ల ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. వీటిలో కొన్ని ఫోన్‌ను అన్‌లాక్ చేయడం, యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం, ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా మొబైల్ డేటా నుంచి వై-ఫైకి మారడం వంటివి ఉన్నాయి. ఇవి ఫోన్ మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయి. ఇలాంటి హానిరమైన యాడ్‌వేర్‌తో ఇప్పటికి 29 యాప్‌లు గుర్తించడం జరిగింది. కానీ భవిష్యత్తులో వీటి సంఖ్య అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే వీటన్నింటిని తెలుసుకొని అన్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఇందుకు సతోరి బృందం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోంది. (పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా...) గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా 11 యాప్ లను ఇటీవల ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ తెలిపింది. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయని తెలిపింది. వినియోగదారులు వారి మొబైల్స్ చెక్ చేసుకుని.. ఒక వేళ ఈ యాప్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సూచించింది. (చైనాలో కాదు చెన్నైలో) -
10 లక్షలకు పైగా డౌన్లోడ్లతో టాప్‌లో
సాక్షి, ముంబై: రిలయన్స్‌కు చెందిన రీటైల్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ డౌన్లోడ్లలో దూసుకుపోతోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ యాప్ 10 లక్షలకు పైగా డౌన్లోడ్లను సాధించింది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ) దేశవ్యాప్తంగా 200 నగరాల్లో బీటా మోడ్‌లో ప్లాట్‌ఫామ్ లభ్యతను ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే జియోమార్ట్ ప్లాట్‌ఫాం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. యాప్ బ్రెయిన్ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ యాప్‌స్టోర్‌లో రెండు, మూడు స్థానాలను ఆక్రమించి అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ఘనతను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ షాపింగ్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ దేశవ్యాప్తంగా రోజువారీ రెండున్నర లక్షలకు పైగా ఆర్డర్లను పొందుతున్నట్టు సమాచారం. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్డర్ పరిధితో నిమిత్తం లేకుండా ఉచిత డెలివరీ అందిస్తోంది. అలాగే చెల్లింపుల్లో సోడెక్సో మీల్ కూపన్లను కూడా అంగీకరిస్తోంది. దీంతో జియోమార్ట్‌కు భారీ ఆదరణ లభిస్తోందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (జియో మార్ట్ ఈ-కామర్స్ సేవలు షురూ) -
టిక్‌టాక్ బ్యాన్.. దూసుకుపోతున్న చింగారీ
బెంగళూరు: భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు చైనీస్ యాప్స్ వాడినవారంతా ప్రత్యామ్నాయ యాప్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ స్థానంలో భారతదేశానికి చెందిన 'చింగారీ' యాప్ డౌన్‌లోడ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్‌లోనే కోటి డౌన్లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. గత పదిరోజుల్లో ఈ యాప్‌ను 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోగా.. గడిచిన 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది డౌన్లోడ్ చేశారు. (దేశీ యాప్స్ హుషారు..) బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది 'చింగారీ' యాప్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్ ఇన్ ఇండియా యాప్ అయిన్ ‘చింగారీ’ని డౌన్లోడ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చైనాకు చెందిన యాప్స్‌ని నిషేధించాలన్న వాదన మొదలైన దగ్గర్నుంచీ 'చింగారీ' యాప్‌కు యూజర్లు పెరిగారు. గత కొన్ని రోజులుగా సబ్స్క్రైబర్స్ 400 శాతం పెరిగారు. ఈ యాప్‌లో వీడియోలు అప్లోడ్, డౌన్లోడ్ చేయొచ్చు. స్నేహితులకు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చాట్ చేయడంతో పాటు కొత్త వారితో ఇంటరాక్ట్ కూడా కావొచ్చు’ అని తెలిపారు. ‘చింగారీ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బంగ్లా, మళయాళం లాంటి భాషల్లో ఉపయోగించొచ్చు.(టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియన్ యాప్) -
టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియన్ యాప్
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిలబడలేదు. డౌన్లోడ్లతో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గతంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా దిగింది. ప్రస్తుతం "చింగారి" యాప్ మార్కెట్లో సెన్సేషన్‌గా మారింది. పైగా "బైకాట్ చైనా ప్రొడక్ట్స్" నినాదం తర్వాత ఈ యాప్‌కు మరింత ప్రాచుర్యం లభించింది. గడిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది. చింగారి సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ మాట్లాడుతూ... "భారతీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేము అందరి అంచనాలకు మించి దీన్ని రూపొందించాం. (చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్) ఈ యాప్‌ను వాడుతున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేయడం సంతృప్తినిస్తోంద"ని తెలిపారు. కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవలప్ చేశారు. ఇందులో కొత్త వ్యక్తులతో చాట్ చేయవచ్చు, వీడియోలు అప్లోడ్ చేయవచ్చు. వినియోగదారులే స్వంతంగా వాట్సాప్ స్టేటస్లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించవచ్చు. మరో ముఖ్య విషయమేంటంటే ఇందులో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు లభిస్తాయి. దీన్ని డబ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠి, బంగ్లా, పంజాబీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఓ సారి చింగారి యాప్ ట్రై చేయండి. (ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్) -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్‌ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్‌తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌కు ప్లే స్టోర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త యాప్ మిట్రాన్ గుగూల్ ప్లేస్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్‌ను అధిగమించింది. ఇప్పటి వరకు గుగూల్ ప్లే స్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లు మాత్రమే పోటీ పడేవి. తాజా నివేదిక ప్రకారం గుగూల్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లను మిట్రాన్ యాప్ అధిగమించి 4.7 రేటింగ్‌తో ట్రేండింగ్లో ఉంది. అంతేగాక ప్లే స్టోర్‌లో యూజర్లు టిక్‌టాక్‌కు తక్కువ రేటింగ్, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో టిక్‌టాక్ ప్లే స్టోర్ రేటింగ్ 1కి పడిపోయింది. ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్లేస్టొర్‌లో 1.4 రేటింగ్‌తో ఉంది. మిట్రాన్ యాప్ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి 4.7 రేటింగ్‌తో ప్లే స్టోర్‌లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా యూజర్లను పొంది 4.7 రేటింగ్‌తో మిట్రాన్ ట్రేండింగ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. (ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్) మిట్రాన్ ఎలా పని చేస్తుందంటే.. మిట్రాన్ కూడా టిక్‌టాక్ మాదిరిగానే దాని శ్రేణి సాధనాలతో (రేంజ్ ఆఫ్ టూల్స్) పనిచేస్తుంది. దీనిలో ఫిల్టర్ ఆప్షన్ ద్వారా షాట్ వీడియోలను ఎడిట్ చేసి వాటిని ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయోచ్చు. అంతేగాక టిక్‌టాక్ మాదిరిగానే, మిట్రాన్ వినియోగదారులకు వారివద్ద ఉన్న మల్టీమీడియా కంటెంట్‌కు వైడ్ లైబ్రరీని పొందే యాక్సెస్ కూడా ఉంది. ఇక మీరు ఈ యాప్‌లో కొత్తగా వీడియోలు క్రియోట్ చేయడంతో పాటు పాపులర్ మ్యూజిక్ క్లిప్స్ లేదా మూవీ డైలాగ్‌లను సింక్రనైజ్ చేయోచ్చు. (యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్) మిట్రాన్ అన్ని ఫోన్లలో పనిచేస్తుందా? ఇది ప్రస్తుతానికి ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది గుగూల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేగాక ఈయాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీస స్పేస్ ఉన్న సరిపోతుంది. ఎందుకంటే ఇది 8 ఎంబీ పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంది. అదే విధంగా ఆన్‌డ్రాయిడ్ 5.0 కలిగిన ఏ డివైస్‌లోనైనా ఈయాప్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ఐఓఎస్(ios) యాక్సెస్‌కు అనమతి లేదు. ఐఓఎస్ యాక్సెస్‌ను స్టోర్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు. -
పాతాళానికి టిక్ టాక్ రేటింగ్స్
బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ రేటింగ్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో భారీగా పడిపోయాయి. టిక్‌టాక్ రేటింగ్ 4.6 నుంచి రెండుకు దిగిరాగా, టిక్ టాక్ లైట్ రేటింగ్ 1.1కి పడింది. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉన్న కారీ మినాటి యూట్యూబ్ వర్సస్ టిక్ టాక్ ది ఎండ్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనితోపాటు టిక్ టాక్ స్టార్ ఫైజల్ సిద్ధిఖి మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలంటూ భారత యూజర్లు ట్విట్టర్లో ట్వీట్లుచేయడం టిక్‌టాక్‌కు నష్టం చేకూర్చాయి. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ప్రధానికి లేఖలు రాస్తామని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించడమూ రేటింగ్స్ పడటానికి మరో కారణం. -
సాహో.. ఆరోగ్య సేతు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా ఆరోగ్య సేతుకు అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్ ప్లే డౌన్‌లోడ్‌లో 5వ స్థానం లభించగా, ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ డౌన్‌లోడ్స్‌లో 7వ స్థానం లభించడం విశేషం. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందిం చిన ఈ కరోనాట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓ ఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. భారతీ యులను కరోనా నుంచి ఆరోగ్యం దిశగా పయ నింపజేసేందుకు ఉద్దేశించిన వారధి ఈ యాప్.. అందుకే, దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టారు. ఏం చేస్తుంది? దేశ, విదేశాల్లోని కరోనా కేసుల సమాచారం, మిమ్మల్ని మీరు కరోనా బారి నుంచి ఎలా కాపాడుకోవాలి? మీ నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్లు 500 మీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎంతమంది ఉన్నారో గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. కేవలం 3.7 ఎంబీ కలిగిన ఈ యాప్‌ను జూమ్, టిక్–టాక్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసుకున్నారని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్ లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్ టవర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అనుకూలాంశాలు.. ఈ యాప్‌ని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. అంటే 9 కోట్ల మంది ప్రజలు ఈ యాప్ సేవలు పొందుతున్నారు. 12 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలకు ఈ యాప్ దగ్గరైంది. ప్రధాని మోదీ కూడా ఈ యాప్‌ని వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏ యాప్ కూడా ఇంతవేగంగా ఇన్ని మిలియన్ల డౌన్లోడ్లను సాధించలేదు. అందులోనూ ఇది ఒక దేశీయ యాప్ కావడం గమనార్హం. దీని కంటే ముందున్న యాప్‌లన్నీ కేవలం వినోదం, సమాచార యాప్‌లు కాగా.. ఇదొక్కటే ఆరోగ్యానికి సంబంధించినది. -
అక్కడ వాట్సాప్ మాయం!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు వినియోగదారులు చెప్పారని ఎమ్ఎస్పవర్ యూజర్ వెబ్సైట్ తెలిపింది. ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇప్పటికే వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు అన్ఇన్స్టాల్ చేసి ఉంటే, మై యాప్స్ సెక్షన్ ద్వారా తిరిగి డౌన్లోడ్ చేసుకోగలిగారని ఆ వెబ్సైట్ తెలిపింది. పాత యూజర్లు డౌన్లోడ్ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్ ప్లేస్టోర్ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని విశ్లేషించింది. అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో ‘వాట్సాప్ ఫర్ బిజినెస్’ యాప్ ఇప్పటికి ఉన్నట్టు గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్సైట్ వెల్లడించింది. -
ఇక సులభంగా పాస్‌పోర్టు
సాక్షి, అమరావతి : గతంలో పాస్‌పోర్ట్ కోసం వ్యయప్రయాసల కోర్చి సుదూర పట్టణంలోని పాస్‌పోర్ట్ కార్యాలయం ముందు బారులుతీరేవారు. అయితే ప్రస్తుతం గతంలో మాదిరి పాస్‌పోర్ట్ కార్యాలయాల ముందు పడిగాపులు తప్పాయి. పాస్‌పోర్ట్ దరఖాస్తు కష్టాలకిక కాలం చెల్లింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కష్టాలను దూరం చేసింది. ఇన్స్టాల్.. ఎంటర్.. సబ్మిట్.. అనే మూడు ప్రక్రియలతో పాస్‌పోర్ట్ ఇంటికొచ్చి చేరుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ‘ఎం–పాస్‌పోర్ట్ సేవ’యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులైతే గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఓఎస్ వినియోగదారులైతే యాప్ స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. నకళ్లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మూడు సింహాల లోగోతో పాస్‌పోర్ట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే అక్షరాలను గమనించాలి. ఇన్స్టాల్ చేసిన వెంటనే ‘ఎం–పాస్‌పోర్ట్ సేవ’ ఆంగ్ల నామంతో భారతదేశ చిత్రపటంతో కూడిన నీలిరంగు చిత్రం దర్శనమిస్తుంది. తర్వాత మనకు కనిపించేదే హోమ్ పేజీ. అందులో పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన 10 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు అందులో ఉన్న న్యూ యూజర్ రిజిస్టర్ అనే అంశాన్ని ఎంచుకోవాలి. తొలి ఎంపిక దరఖాస్తుదారుడు ఏ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో నివాసం ఉంటున్నాడు, తర్వాత సాధారణమైన వివరాలు, పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, అందులోనే ఓ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేది రోబో కాదని నిర్ధారించేందుకు చూపిన సంఖ్యలు లేదా ఆంగ్ల అక్షరాలను అక్కడి ఖాళీ పెట్టెలో నింపాలి. అలా నింపి కిందే ఉన్న సబ్మిట్ బటన్‌ను ఎంచుకోవాలి. దీంతో దరఖాస్తుదారుడి సెల్‌కు మెయిల్ వస్తుంది. అందులో ఉన్న అధికారిక లింక్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఉనికిని నిర్ధారించాలి. తిరిగి మొబైల్ యాప్‌లో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వివరాలు నింపి సబ్మిట్ను ఎంచుకోవాలి. అప్పుడు అప్లికెంట్ హోమ్ పేజీ తెరుచుకుంటుంది. అందులో ‘అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్’ను ఎంచుకోవాలి. దరఖాస్తుదారుడు నివసించే రాష్ట్రం, జిల్లా పేర్లను నింపాలి. పేజీ తెరుచుకున్న తర్వాత ఫ్రెష్ పాస్‌వర్డ్‌ని ఎంపిక చేసి, దరఖాస్తు చేసుకునేది సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్ కోసమా అనే విషయాన్ని నిర్ధారించాలి. బుక్‌లెట్‌లో ఉండాల్సిన పేజీల సంఖ్యలనూ నిర్ధారించుకోవాలి. కచ్చితమైన వివరాలు ఇవ్వాలి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తుదారుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ప్రక్రియ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ దశలో 9 పేజీలతో వివిధ వివరాలను నింపాల్సి ఉంటుంది. వేగంతో కూడిన కచ్చితమైన వివరాలను పొందుపర్చాలి. వివరాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే సెషన్ గడువు ముగుస్తుంది. తిరిగి దరఖాస్తు ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. తొలి పేజీ నుంచి వివరాలు నింపి, సేవ్, నెక్ట్స్ బటన్‌ను మాత్రమే ఎంచుకోవాలి. వివరాలన్నింటినీ నింపిన తర్వాత 9వ పేజీలో సబ్మిట్ బటన్‌ను ఎంచుకుంటే పాస్‌పోర్ట్ ప్రివ్యూ కనిపిస్తుంది. దరఖాస్తుదారుడికి మంజూరయ్యే పాస్‌పోర్ట్ సమగ్ర రూపమది. లోపాలుంటే పేజీల్లో నింపిన వివరాలను వెనక్కు వెళ్లి సరిచేసుకోవాలి. తర్వాత అభ్యర్థి పూచీకత్తుతో పాటు పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు తనిఖీ చేసే సమయంలో చూపబోయే ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేసి సమర్పించాలి. ఒరిజినల్ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి అప్లోడ్ తర్వాత తిరిగి హోమ్‌పేజీకి చేరతాం. అక్కడ యూజర్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థి దరఖాస్తుపై ఉండే 3 చుక్కలను క్లిక్ చేస్తే ‘పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్’ కనిపిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుంను సదరు ఎంపికలో చెల్లించాలి. వాటిని ఆన్లైన్ నుంచే చేయాలి. అక్కడితో పాస్‌పోర్ట్ దరఖాస్తు పూర్తిస్థాయిలో ముగిసినట్లే. అభ్యర్థి ఏఆర్ఎన్ ముందస్తు దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకుని తనిఖీ అధికారులకు చూపాల్సిన ఒరిజినల్ పత్రాలతో సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడి కార్యాలయ ప్రక్రియ ముగుస్తుంది. నిర్ణీత తేదీకి పోలీసుల పరిశీలన పూర్తవుతుంది. కొద్ది రోజుల్లోనే పాస్‌పోర్ట్ పోస్ట్ ద్వారా దరఖాస్తుదారుడి ఇంటికి చేరుతుంది. సలహాలు.. సూచనలకు కాల్ సెంటర్ యాప్ ద్వారా సేవలు పొందే వారికి కాల్ సెంటర్ భరోసా ఉంది. సలహాలు, సూచనల కోసం దరఖాస్తుదారులు 1800–258–1800 నంబరులో ప్రతినిధులను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ సేవలు పూర్తిగా ఉచితం. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రజల సేవ కోసం ఆటోమేటెడ్ ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్ఎస్) సౌలభ్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఎం–పాస్‌పోర్ట్ సేవ యాప్ బహుళ ప్రయోజనాలతో కూడుకుని ఉంది. కొత్తగా నమోదు చేసుకునే వారికే కాకుండా పాస్‌పోర్ట్ వినియోగదారులందరికీ ఈ యాప్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసిన తర్వాత మంజూరయ్యాక దరఖాస్తుదారుడి చిరునామాకు చేరే లోపు ప్రభుత్వం, అభ్యర్థి చిరునామాకు పంపిన తేదీ, ఏ రోజు ఎక్కడి వరకు చేరింది అనే అంశాలను ‘స్టేటస్ ట్రాకర్’ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తులు పరిశీలనకు హాజరుకావాల్సిన తేదీని ‘అపాయింట్మెంట్ అవైలబుల్’ అనే ఎంపికలో గుర్తించవచ్చు. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలేవి అనే విషయాన్ని ‘డాక్యుమెంట్ అడ్వయిజరీ’ తెలియజేస్తుంది. పేజీలు ఇతర అంశాలను బట్టి నిర్ణయించే పాస్‌పోర్ట్ రుసుంను ‘ఫీ కాలుక్యులేటర్’ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తులో తలెత్తే అనుమానాల నివృత్తి కోసం ‘ఎఫ్ఏక్యూ’ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. -
పిడుగుపడే సమాచారం ఇక మనచేతుల్లోనే
సాక్షి, వల్లూరు: ప్రస్తుతం వర్షా కాలం. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు కనిపిస్తున్నాయంటే.. దగ్గర్లో ఎక్కడో ఓ చోట పిడుగు పడే అవకాశం ఉందని భావిస్తాం. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, చెట్ల కింద వున్న ఉన్న వారే ఎక్కువగా గురవుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ పిడుగు పాటుకు గురైతే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం మొదలైన అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. వీటిని పాటించి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిద్దాం. పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులో ఎంతో తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. అది తాకిన మరుక్షణం జీవి ఏదైనా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. పిడుగు దాదాపుగా ఎత్తైన చెట్లు, భవనాలు, ప్రదేశాలు, వస్తువులపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు తక్కువ ఉన్న చోట కాస్త సురక్షితం. పచ్చని చెట్లను తాకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదు. ఆరుబయట ఉంటే.. ఆరుబయట ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు సురక్షిత భవనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి. పొలంలో పూర్తి ఆరుబయట ఉంటే మొక్కల కన్నా మనిషి ఎక్కువ ఎత్తు ఉంటాడు.. కాబట్టి పిడుగు అతనిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు పడేటపుడు అర చేతులతో చెవులను మూసుకుని తల వంచుకుని నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. ఇంట్లో ఉంటే.. మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా ఉండటం మంచిది. పిడుగుపాటుకు గురైతే .. పిడుగుపాటుకు గురైతే అంబులెన్స్, వైద్యులకు సమాచారం అందించాలి. బాధితుడికి ప్రథమ చికిత్స అందించాలి. పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే.. దుప్పటి లాంటి వస్త్రంపై పడుకోబెట్టాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. యాప్ డౌన్ లోడ్ .. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘వీఏజేఆర్‌ఏపీఏఏటీ ’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ కోసం మొబైల్‌ఫోన్ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్ చేసి భాష ఎంచుకోవాలి. యాప్ ముఖ చిత్రం కనిపిస్తుంది. లొకేషన్ సెట్ చేసుకుంటే.. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారం, సూచనలు అందిస్తుంది. యాప్ రెండు రకాల సమాచారాన్ని ఇస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో వున్న చోట క్లిక్ చేస్తే మీరున్న ప్రాంతం మ్యాప్ వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. పిడుగు ఎంత దూరంలో పడుతుందో.. పిన్ గుర్తు ద్వారా స్పష్టత ఇస్తుంది. యాప్ కుడి భాగంలో పిడుగు పాటు హెచ్చరికలు తెలిపే బటన్ ఉంటుంది. యాప్ ఆన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. వజ్రపాత్తో ముందస్తు సమాచారం పిడుగుపాటు వల్ల ఎదురయ్యే విపత్తును నివారించడానికి విపత్తుల నివారణ సంస్థ ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తుంది. 30 నిమిషాల ముందుగా అధికారుల ద్వారా ఆ ప్రాంత సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లను అందిస్తుంది. దీనికి తోడు ఇటీవల ఇస్రో సహకారంతో పిడుగు పాటు గురించి ముందస్తు సమాచారం తెలుసుకోడానికి.. వజ్రపాత్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో పిడుగు ఎక్కడ పడుతుందో ముందే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఉంటే చాలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ఇట్లే తెలుసుకోవచ్చు. రంగులను బట్టి.. తీవ్రత ► మెరుపు చిహ్నం, శీర్షిక నీలం రంగులో వుంటే మీరు పిడుగు పడే స్థలానికి దూరంగా వున్నట్లు అర్థం. ► మెరుపు చిహ్నం, శీర్షిక పసుపు రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 15 నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు లెక్క. ► మెరుపు చిహ్నం, శీర్షిక నారింజ రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 8 నుంచి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ► మెరుపు చిహ్నం, శీర్షిక ఎరుపు రంగులో ఉంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 0 నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో వున్నట్లు.. అంటే అత్యంత ప్రమాదరకరమైన స్థలమని అర్థం. -
కడప ఆకాశవాణికి మొబైల్ యాప్‌లో చోటు
సాక్షి, కడప : ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను ఇక మొబైల్ యాప్‌లో వినవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆకాశవాణి ప్రసారాలు వినేందుకు ప్రసార భారతి మొబైల్ యాప్‌ను రూపొందించింది. తొలి విడతగా ఈనెల 17న మన ఆకాశవాణి కడప కేంద్రం కంటే ఎంతో వెనుక ప్రారంభమైన రేడియో కేంద్రాలకు ఈ యాప్ సౌకర్యం కల్పించింది. ఆకాశవాణి కడప కేంద్రానికి ఈ సౌకర్యం కల్పించపోవడం గమనించిన జిల్లా సాహితీవేత్తలు, కళాకారులు ఆశ్చర్యపోయారు. ‘సాక్షి’ దినతిపత్రిక జిల్లా సంచికలో ఈనెల 18న ‘అయ్యో ఆకాశవాణి’ శీర్షికన ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రచురించింది. స్థానిక అధికారుల దృష్టి కి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు స్థానికుల నిరసనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మొబైల్ యాప్‌లో ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలకు కూడా చోటు కల్పించారు. ఈనెల 22వ తేది సాయంత్రం నుంచి ఈ ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు వింటున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినందుకు కడప శ్రోతలు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని కడప కేంద్రం ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా వినవచ్చు. యాప్ సౌకర్యం ఇలా గుగూల్ ప్లే స్టోర్‌లో న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారభారతి లైవ్ యాప్ అని టైప్ చేసి సెర్చి చేస్తే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్చేశాక స్క్రీన్ పైభాగాన కనిపించే రేడియోబొమ్మను క్లిక్ చేయాలి. అన్ని స్టేషన్ల ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిలో ఇష్టమైన కేంద్రాలను ఫేవరేట్ కేంద్రాలుగా ఒక క్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌తో తెలుగు వారు ఎక్కడున్నా మన కేంద్రం రేడియో ప్రసారాలను వినవచ్చు. అరచేతిలోని మొబైల్లో ఆకాశవాణి ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో వార్తలు, దూర దర్శన్ ఛానళ్ల కార్యక్రమాలను కూడా వినవచ్చు. -
ఆహారానికి మతం లేదన్నారు.. మరి ఇదేంటి..!
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్‌పై ఓవైపు ప్రసంశల వర్షం కురుస్తుండగా.. మరోవైపు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మతమే లేదన్నప్పుడు యాప్‌లో హలాల్ ట్యాగ్ ఎందుకు కొనసాగిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘హలాల్ మాంసం మాత్రమే తినేవారికి.. ప్రత్యేకంగా ఫుడ్‌ని అందిస్తున్నారు కదా’ అని నిలదీస్తున్నారు. జొమాటో యాప్ బాగోలేదంటూ గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో 1-స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. తమదైన శైలిలో యాప్‌ను ఏకిపారేస్తున్నారు. ఇక జొమాటోకు మద్దతు తెలిపిన ఊబర్ ఈట్స్‌ను కూడా నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #boycottUberEats అని ట్రోల్ చేస్తున్నారు. (చదవండి : ఆహారానికి మతం లేదు) కాగా, నెటిజన్ల కామెంట్లపై జోమాటో వివరణ ఇచ్చింది. ‘తమ వద్ద ఎన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయో కస్టమర్లకు తెలిసేందుకే హలాల్ ట్యాగ్‌ని అందుబాటులో ఉంచాం. మతపరమైన వ్యత్యాసాల్ని చూపెట్టేందుకు కాదు. హలాల్ ట్యాగ్‌లో ప్రత్యేక వంటకాలను అందించే రెస్టారెంట్లు ఉంటాయి. కొందరు హలాల్ మాంసం తీసుకోరు. మరికొందరు తీసుకుంటారు. కస్టమర్ల సేవల కోసమే ఆ ట్యాగ్’ అని వెల్లడించింది. ఇక బుధవారం వెలుగు చూసిన హిందూయేతర వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసిన వ్యవహారం నేపథ్యంలో.. ‘హిందూ ఓన్లి రైడర్’ అని జొమాటో ట్వీట్ చేయడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. జోమాటోకు 1 స్టార్ ఇస్తున్నామని కొందరు.. యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తున్నామని మరికొందరు టీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఇతర యాప్‌లకు జైకొడుతున్నారు. -
కేలరీ యాప్‌లా.. కాస్త కేర్‌ఫుల్!
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బోలెడన్ని పనులు చేసేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఈ జాబితాలో ఒకటి. తినే ఆహారంలో ఎన్ని కేలరీలున్నాయో? లెక్కకట్టి చెప్పేందుకు గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్నో అప్లికేషన్లు ఉన్నాయి. మరి ఇలాంటి అప్లికేషన్ల ద్వారా మనకందే సమాచారం సరైందేనా? మరీ ముఖ్యంగా ఎక్కడో పాశ్చాత్యదేశాల జనాభాకు అనుగుణమైన కేలరీల లెక్క మనకూ సరిపోతుందా? దైనందిన కార్యకలాపాల ద్వారా ఎన్ని కేలరీలు కోల్పోతున్నామో ఇవి కచ్చితంగా లెక్కకట్టగలవా? ఆసక్తికరమైన ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పౌష్టికాహార సంస్థ! ఒక్కోటి ఒక్కో సమాచారం ఈ అధ్యయనంలో భాగంగా వారు గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న 20 అప్లికేషన్లను ఎంపిక చేసుకున్నారు. అంతర్జాతీయంగా శాస్త్రీయంగా అమల్లో ఉన్న ప్రమాణాలను మన జనాభాకు తగ్గట్టుగా మార్పులు చేసి 55 పాయింట్ల స్కేల్‌తో అప్లికేషన్లను బేరీజు వేశారు. 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అప్లికేషన్లను నాణ్యమైనవిగా గుర్తించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో భాగంగా పరిశీలించిన 20 అప్లికేషన్లలో 13 ఈ నాణ్యతకు దిగువన ఉన్నాయి. చాలా అప్లికేషన్లు వాడిన సమాచారం శాస్త్రీయ ప్రమాణాలకు నిలబడేవి కానేకావని తేలింది. వ్యక్తుల శారీరక శ్రమను పరిగణలోకి తీసుకోకుండా కేలరీ అవసరాలను లెక్కకట్టిన అప్లికేషన్లు ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమైంది. ‘ఒకవేళ మీరు ఈ 20 అప్లికేషన్లను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని వాడితే.. ఒక్కోటి ఒక్కో రకమైన అంకెలను చూపిస్తుంది’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎం.గవరవరపు సుబ్బారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తూ.. ‘పెద్దగా శారీరక శ్రమ చేయని 22 ఏళ్ల మహిళను ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు 66 కిలోల బరువున్న ఈ మహిళ వారానికి అర కిలో బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఈ 20 అప్లికేషన్లు సూచించే కేలరీల సంఖ్య 1191 నుంచి 1955 కిలోకేలరీ వరకూ ఉంటుంది’అని వివరించారు. కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినడం, సంతృప్త కొవ్వుల మోతాదును పరిమితంగా ఉంచుకోవడం, తినే పండ్లలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కేవలం 40 శాతం అప్లికేషన్లు మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా.. మంచి ఆరోగ్యానికి రోజూ వ్యాయామం చేయాలన్న సూచన చేసే అప్లికేషన్లు కూడా సగమేనని, ఈ అప్లికేషన్లు అన్నీ బరువు తగ్గడాన్ని నమోదు చేస్తున్నా.. నడుము చుట్టుకొలత గురించి పట్టించుకునేవి అతితక్కువగా ఉన్నాయని చెప్పారు. లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా.. మంచి స్టార్ రేటింగ్ ఉన్న అప్లికేషన్లు కూడా నాణ్యత విషయానికొచ్చేసరికి అంతంత మాత్రంగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని సుబ్బారావు తెలిపారు. చాలా అప్లికేషన్లు భారతీయ భోజనానికి సంబంధించిన కేలరీల లెక్కలు తప్పుగా చూపుతున్నాయని చెప్పారు. ‘కేలరీలు లెక్కవేసే అప్లికేషన్లలో ఉన్న లోపాలను సరిచేసే ఉద్దేశంతోనే తాము ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ను అభివృద్ధి చేశామని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. -
ట్విటర్ ఖాతాదారులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : ట్విటర్ ఖాతాదారులకు శుభవార్త. ట్విటర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఎక్కువ స్పేస్ కేటాయించాల్సిన అవసరం లేదు. తక్కువ స్పెస్, ఎంబీతో తర్వగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలయ్యే ట్విటర్ లైట్ యాప్ ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ట్విటర్ లైట్ వెర్షన్ తీసుకొచ్చినప్పటికీ ఇండియాలో అది అందుబాటులో లేదు. అప్పుడు కేవలం 24 దేశాలల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా మంగళవారం ఇండియాతో సహా మరో 20 దేశాలల్లో ట్వీటర్ లైట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రస్తుతం 45 దేశాల్లో ట్విటర్ లైట్ వెర్షన్ అందుబాటులో ఉంది. అతి తక్కువ మొమోరీతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్వీటర్ లైట్‌ని 3ఎంబీ సైజుతో ఇన్‌స్ట్రాల్ చేసుకోవచ్చు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల్లో కూడా దీనిని త్వరగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైట్ వెర్షన్‌తో స్టోరేజ్ స్పెస్ తగ్గించడమే కాకుండా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పటికీ ఫాస్ట్‌గా ట్వీట్‌ను చేయవచ్చు. అంతే కాకుండా వీడియోలను, చిత్రాలను లోడ్ చేసుకోవాలో లేదో యూజర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. లోడ్ వీడియో ఆప్షన్‌తో డాటాని, టైమ్‌ని ఆదా చేసుకోచ్చు. నేటి నుంచి ట్విటర్ లైట్ యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ట్విటర్ పేర్కొంది. -
రాందేవ్ ‘కింబో’ యాప్ మహా డేంజర్..!
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్‌కు కిల్లర్‌గా, బాబా రాందేవ్ స్వదేశీ యాప్ అంటూ తీసుకొచ్చిన ‘కింబో’ యాప్‌తో ప్రమాదమేనట. అందుకే ఈ యాప్‌ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేశారు. ఐఫోన్ కంపెనీ కూడా తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలగించింది. కేవలం గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్‌లో మాత్రమే కాక, కింబో పేజీ యాప్‌లో కూడా ఇది ఓపెన్ కావడం లేదు. దానిలోకి లింక్స్‌ను క్లిక్ చేస్తే, ఎర్రర్ చూపిస్తోంది. అయితే ఎందుకు కింబో యాప్‌ను గూగుల్, ఆపిల్లు తమ సంబంధిత స్టోర్లలో డిలీట్ చేశాయో స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ డెవలపర్లు మాత్రం ఈ యాప్ ప్రమాదకరమని, బగ్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఒక ట్విటర్ యూజర్, కింబో యాప్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. దానిలో స్వదేశీ యాప్, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్ కూడా వాడుతుందని పేర్కొన్నాడు. భారతీయుల కోసం భారతీయులు రూపొందించిన ఈ స్వదేశీ యాప్‌లో పాకిస్తానీ నటి ఫోటో కనిపించడం ఏమిటి? అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఆధార్ సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలున్నాయనిద ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ ఇలియట్ ఆండర్సన్ అన్నారు. ఈ యాప్ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు. పతంజలి కమ్యూనికేషన్స్ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోనే కింబో యాప్‌ను డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ యాప్ మొత్తం ఒక జోక్‌గా అభివర్ణించారు. ‘ఓకే, నేను ఇక్కడితో ఆపుతున్నా. కింబో ఆండ్రాయిడ్ యాప్ అనేది భద్రతా విపత్తు. యూజర్ల మెసేజ్‌లన్నీ నేను యాక్సస్ చేయగలను. ఈ కింబోయాప్ పెద్ద జోక్. ఈ సమయంలో దీన్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటేనే మేలు’ అని ఇలియట్ ట్వీట్ చేశారు. ఇది బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే ఆరోపణలతో కూడా కింబోను ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. కింబోయాప్ మరో అప్లికేషన్ కాపీ పేస్టని, వీటి స్క్రీన్షాట్లు, వివరాలు అన్నీ సమానంగా ఉన్నాయి అని ఇలియట్‌తో పాటు మరో ట్విటర్ యూజర్ కూడా ట్వీట్ చేశాడు. -
వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేయకండి!
న్యూఢిల్లీ : వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మెసేజింగ్ మాధ్యమం. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునే, కొందరు దీని డూప్లికేట్‌ను రూపొందించి. థర్డ్ పార్టీ కంపెనీలకు మీ వ్యక్తిగత వివరాలను చేరవేస్తున్నారు. నకిలీ వాట్సాప్ యాప్ ఆన్లైన్లో స్పాట్ అయింది. వాట్సాప్ ప్లస్ పేరుతో ఆన్లైన్ ఉన్న ఈ యాప్, మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందుతుందని మాల్వేర్బైట్స్ ల్యాబ్ రిపోర్టు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన యాప్ అని రిపోర్టు హెచ్చరించింది. Android/PUP.Riskware.Wtaspin.GB కి ఇది వేరియంట్ అని తెలిపింది. లింక్‌ల ద్వారా షేర్ అయే ఈ నకిలీ వాట్సాప్ ప్లస్ యాప్, ఏపీకే ఫైల్లో డౌన్లోడ్ అవుతుందని పేర్కొంది. ఒక్కసారి ఇది డౌన్లోడ్ అయి, ఇన్స్టాల్ అయితే, మధ్యలో యూఆర్ఎల్తో గోల్డ్ రంగులో వాట్సాప్ లోగో యూజర్లకు కనిపిస్తుందని రిపోర్టు తెలిపింది. ‘అగ్రి అండ్ కంటిన్యూ’ బటన్‌పై క్లిక్ చేస్తే, ప్రస్తుతం ఈ యాప్ అవుట్ డేట్ అయిందని, గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆ యాప్‌పై కనిస్తోంది. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో వారికి ‘వాట్స్ ప్లస్ ప్లస్ వాట్సాప్’ అనే యాప్ డౌన్లోడ్ అయి, ఎప్పడికప్పుడూ అది అప్డేట్ అవుతూ యూజర్ల డేటాను దొంగలిస్తుందని మాల్వేర్బైట్స్ నివేదించింది. ఈ యాప్‌లో హైడింగ్ రిసీవ్ టెక్ట్స్, టైపింగ్ మెసేజ్, రీడింగ్ టెక్ట్స్, వాయిస్ క్లిప్‌ను హైడ్ చేయడం వంటి ఫీచర్లున్నాయని రిపోర్టు పేర్కొంది. అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుందో మాత్రం మాల్వేర్బైట్స్ రివీల్ చేయలేదు. ఈ నకిలీ వాట్సాప్ వ్యవస్థాపకుడు ఎవరో కూడా ఇంకా తెలియలేదు. గూగుల్ ప్లేలో ఉన్న నిజమైన వాట్సాప్ వైపే యూజర్లు మొగ్గుచూపాలని వెబ్సైట్ సూచిస్తోంది. ప్రస్తుతమైతే గూగుల్ తన ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న హానికరమైన యాప్స్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. -
ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
-
అలర్ట్ : ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
మెసేజింగ్ మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ యూజర్లు ప్రమాదంలో పడబోతున్నారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసిన ఒక కొత్త యాప్, యూజర్లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది. ఈ యాప్ పేరు ఛాట్వాచ్గా తెలుస్తోంది. ఛాట్డబ్ల్యూగా ఇది అందుబాటులో ఉందట. ఈ యాప్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్‌లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు? ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఛాటింగ్ చేసుకుంటున్నారు? వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. ‘లాస్ట్ సీన్’ తీసేసినప్పటికీ, వాట్సాప్ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందట. అయితే ఈ యాప్ ఉచితంగా కాకుండా.. వారానికి రూ.140 చెల్లించి దీన్ని వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల వరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ ఐఓఎస్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్డబ్ల్యూ యాప్, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత, డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పలు వెబ్సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాట్సాప్‌లో ఛాట్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా అన్ని వివరాలు తెలిసినట్టు చెబితే, అనుమానించాల్సి ఉందని రిపోర్టులు వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు ఛాట్వాచ్లో బారిని పడినట్టు గుర్తించాలని పేర్కొంటున్నాయి. ఏ సమయంలో మీ వాట్సాప్ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది. ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సాప్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సాప్ యాప్ ఫుల్ ఎండ్‌టూఎండ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సాప్ యూజర్ల గోప్యతను దొంగలించడానికి కుదరదని ఓ వైపు ఆ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఇలాంటి యాప్‌ల ద్వారా వాట్సాప్ యూజర్ల వివరాలు బయటికి వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని టెక్ వర్గాలంటున్నాయి. -
ప్లే స్టోర్ నుంచి సీఎం యాప్ అదృశ్యం
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమైంది. ఈ యాప్ యూజర్లు వ్యక్తిగత డేటాను ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయిస్తుందనే ట్విటర్ యూజర్ల ఆరోపణల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్లే స్టోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ కూడా కనిపించడం లేదు. వీటి లింక్‌లను క్లిక్ చేస్తే.. ‘ ప్రస్తుతం ఆ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదని, వీలైనంత త్వరగా మీరు ఇష్టపడే కంటెంట్ మరిన్ని దేశాలకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెక్ చేయ్యండి’ అని చూపిస్తోంది. ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ బాప్టిస్ట్ రాబర్ట్ కూడా సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ యూజర్ల డేటాను ప్రైవేట్ కంపెనీకి అమ్ముతున్నట్టు ధృవీకరించారు. యూజర్ పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిని ప్రైవేట్ కంపెనీకి పంపుతున్నట్టు తెలిపారు. ఆ యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోయేదని, సరియైన పరిశీలన చేసుకోలేకపోయేవాడనని తెలిపారు. ఇలా యూజర్ల డేటా ప్రైవేట్ కంపెనీకి చేరుతున్నట్టు ఆయన గుర్తించారు. ఇటీవలే ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేసిందనే ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున సంగతి తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యాప్ అదృశ్య కావడం చర్చనీయాంశమైంది. -
రకుల్ ఇన్ యాప్
తన పేరిట రూపొందించిన యాప్‌ను మంగళవారం నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఫొటోలకు ఇలా ఫోజులిచ్చారు. జూబ్లీహిల్స్: కూల్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు, సినీ విశేషాలు పంచుకునేందుకు తన పేరుతో రూపొందించిన యాప్‌ను ఆమె మంగళవారం ఆవిష్కరించారు. న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్ టెక్నాలజీస్ దీనిని రూపొందించింది. ఈ సందర్భంగా రకుల్ యాప్‌లో తన ఫొటోలను చూపుతూ కెమెరాకు పోజులిచ్చింది. కార్యక్రమంలో ఎస్కేపెక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షామిక్ తాలూక్దార్ పాల్గొన్నారు. -
అరచేతిలో జీఎస్టీ!
సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వచ్చిన తర్వాత ఏ వస్తువుకు ఎంత పన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపారి ఎంత అంటే అంత జీఎస్టీని చెల్లించేవారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా జీఎస్టీ వేయడంతో వినియోగదారులు మోసపోతుండటంతో కేంద్రం జీఎస్టీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు ఇష్టారా జ్యంగా చెప్పే జీఎస్టీలకు వినియోగదారులు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల డివిజన్లు ఉండగా.. అందులో జీఎస్టీ డీలర్లు 1,63,059 ఉన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతి వస్తువు పన్నుపైనా స్పష్టత వచ్చేలా ఈ యాప్‌ను రూపొందించారు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువు ధర, పన్నుల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీలలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోని వస్తువుల ఐచ్ఛికాన్ని ఎంచుకున్న వెంటనే తెరపై 0,3,5,12, 18,25,28 శాతం తదితర పన్నుల జాబితా కనిపిస్తుంది. దీని ద్వారా ఏయే వస్తువులకు ఎంత శాతం పన్ను విధించారో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వస్తుసేవలు 5% అంశంపై నొక్కగానే ఆ పన్ను చెల్లించాల్సిన సరుకుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. సేవల వివరాలు.. ప్రభుత్వం కల్పించే సేవలకు విధించిన పన్ను వివరాలను ఐచ్ఛికం ద్వారా తెలుసుకునే అవకాశముంటుంది. మొబైల్లో అంశాన్ని ఎంచుకుంటే తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి. యాప్‌లో సమాచారం అనే అంశం ప్రెస్ చేయగానే జీఎస్టీకి సంబంధించిన వివరాలు లభిస్తాయి. జీఎస్టీ ఎందుకు అమలులోకి తెచ్చారు, దీనివల్ల కలిగే ప్రభావం, ప్రయోజనాలు, పర్యవసనాలు తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయి. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి మొదట జీఎస్టీ రేట్ ఫైండర్ అని టైప్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. వెంటనే మొబైల్ తెరపై పలు యాప్‌లు కనిపిస్తాయి. వీటిలో జీఎస్టీ రేట్ ఫైండర్ ఇంగ్లిష్, హిందీ ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అవగానే స్క్రీన్‌పై వస్తువులు, పన్నులు, సేవలు, సమాచారం తదితర వివరాలతో నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుంటే తగిన సమాచారాన్ని పొందవచ్చు. -
ఆ యాప్స్‌కు గూగుల్ షాక్
పలు ప్రముఖ యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తన పాలసీలను ఉల్లంఘించే బ్యాడ్ యాప్స్‌కు వ్యతిరేకంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో సరహా మెస్సేజింగ్ యాప్ కూడా ఉంది. సరహాతో పాటు ఇతర పాపులర్ యాప్స్ అమెజాన్ అండర్‌గ్రౌండ్,గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో స్థానం కోల్పోయాయి. సరహా అనేది తామెవరో తెలిసే అవకాశం లేకుండానే ఎదుటి వారికి సందేశాలు పంపుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో వేధింపులకు ఇదో మాధ్యమంగా మారిపోయింది. దీనిపై యూజర్ల నుంచి కూడా భారీగానే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేయాలని నిర్ణయించింది. ట్యూబ్ మేట్ అనే యాప్‌పై కూడా గూగుల్ వేటు వేసింది. ఈ యాప్ యూట్యూబ్ నుంచి వీడియోలను నేరుగా యూజర్ల ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇదే గూగుల్‌కు నచ్చలేదు. యూట్యూబ్ వీడియోలను నచ్చినప్పుడు చూసుకోవడానికే మాత్రమే అవకాశం ఉంది. డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు లేదు. సీఎం ఇన్ స్టాలర్ కూడా గూగుల్ ప్లే స్టేర్‌లో స్థానం కోల్పోయింది. నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే టీవీ పోర్టల్ యాప్‌ను కాపీరైట్ ఉల్లంఘనల అంశం కింద గూగుల్ నిషేధించింది. యాడ్ బ్లాకర్ అనే మరో యాప్‌ను కూడా గూగుల్ తన వ్యాపార కోణాల రీత్యా నిషేధించింది. ఈ యాప్ ప్రకటనలను బ్లాక్ చేసేస్తుంది. గ్రూవ్స్ షార్క్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్, అమేజాన్ అండర్ గ్రౌండ్ తదితర యాప్ లు కూడా ప్లే స్టోర్ నుంచి స్థానం కోల్పోయాయి. -
గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్‌పై మాల్వేర్ అటాక్
శాన్ఫ్రాన్సిస్కో : గూగుల్ ప్లే స్టోర్‌లోని గేమ్స్‌పై పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ అటాక్ చేసింది. ఈ అటాక్ బారితో దాదాపు 60 గేమ్స్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్‌లో ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌పై అటాక్ చేసినట్టు ఇజ్రాయిల్‌కు చెందిన సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఫేక్ సెక్యురిటీ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు డిజైన్ చేసినట్టు రీసెర్చర్లు రిపోర్టు చేశారు. గేమ్స్ యాప్‌లో పోర్నో యాడ్స్ ద్వారా ఈ మాల్వేర్ అటాక్ చేస్తుందని, ఒకవేళ వీటిని క్లిక్ చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఈ మాల్వేర్పై అలర్ట్ అయిన గూగుల్, వెంటనే తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్‌ను తొలగించింది. ప్లే స్టోర్ నుంచి తాము ఈ యాప్స్‌ను తొలగించామని, డెవలపర్ల అకౌంట్‌ను డిసేబుల్ చేశామని గూగుల్ తెలిపింది. వీటిని ఇన్స్టాల్ చేసుకునే వారికి తాము గట్టి హెచ్చరిక జారీచేస్తున్నామని పేర్కొంది. యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు చెక్ పాయింట్స్ చేసిన ఈ పనిని తాము అభినందిస్తున్నామని తెలిపింది. అయితే ఈ మాల్వేర్ ప్రభావానికి యూజర్ల డివైజ్‌లు ప్రభావితం కాలేదని చెప్పింది. మాల్వేర్ ప్రభావానికి గురైన యాప్స్‌ను మూడు నుంచి ఏడు మిలియన్ సార్లు డౌన్లోడ్ అయ్యాయి. వాటిలో ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్ కారు రేసింగ్ గేమ్ ఉన్నాయి. -
యూసీ బ్రౌజర్ కనిపించడం లేదు
ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల మందికి పైగా ఉపయోగిస్తున్న మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ యూసీ బ్రౌజర్, గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. ఇన్స్టాల్ చేసుకోవడానికి `యూసీ బ్రౌజర్` అని సెర్చ్ చేస్తే కేవలం యూసీ మినీ యాప్ మాత్రమే కనిపిస్తోంది. ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక వివరణను ప్రకటించనప్పటికీ, యూసీ బ్రౌజర్‌పై గతంలో చాలా వివాదాలు వచ్చాయి. యూసీ బ్రౌజర్ యూజర్ల డేటాను దొంగతనం చేస్తుందని, దీన్ని చైనాలో సర్వర్లకు పంపిస్తుందని గత ఆగస్టులో ఆరోపణలు వచ్చాయి. ఈ బ్రౌజర్‌ను యూజర్ అన్ఇన్స్టాల్ చేసినప్పటికీ డేటాను సేకరిస్తుందని రిపోర్టులు తెలిపాయి. ఈ బ్రౌజర్‌పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. యూసీ బ్రౌజర్ తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఇన్స్టాల్స్ సంఖ్యను పెంచడం కోసం తప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వచ్చినట్లు అడ్వర్టైజ్మెంట్లను యూసీ బ్రౌజర్ ఇస్తుందని, ఇది ఆండ్రాయిడ్ పాలసీలకు విరుద్ధం కావడంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొలగించిందని ఓ మేగజైన్ పేర్కొంది. యూసీ బ్రౌజర్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాజా ఘటనపై స్పందించారు. 'నాకు ఈరోజు ఉదయం ఓ మెయిల్ వచ్చింది. యూసీ బ్రౌజర్‌ను 30 రోజులపాటు తాత్కాలికంగా ప్లేస్టోర్ నుంచి తీసివేస్తున్నట్లు అందులో సమాచారం ఉంది. డౌన్లోడ్లు పెంచుకునేందుకు యూజర్లను తప్పుదారి పట్టించినందుకు, అనారోగ్యకర విధానాలను అవలంబించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది'' అని అతను పేర్కొన్నాడు. కాగ యూసీ బ్రౌజర్ మినీ, యూసీ న్యూస్ ఇంకా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. -
ఫేక్ వాట్సాప్.. అంతమంది వాడుతున్నారా!
న్యూఢిల్లీ : ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లోఇటీవల ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో నెటిజన్లు తమ పాత వాట్సాప్ యాప్‌ను డిలీట్ చేసి కొత్త యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. కొత్త యూజర్లు కూడా లేటెస్ట్ వర్షన్ యాప్‌ను డౌన్లోడ్ చేసి వాడుతున్నారు. అయితే ఫేక్, వైరస్ ప్రొగ్రామింగ్ ఉన్న వాట్సాప్‌ను పది లక్షలకు (10,00,000) పైగా తమ యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారట. ఇది గుర్తించిన వాట్సాప్ యాజమాన్యం సంబంధిత ప్లే స్టోర్, ఇతర యాప్ డౌన్ లోడింగ్స్ నుంచి ఫేక్ వాట్సాప్ యాప్‌ను డిలీట్ చేసింది. అసలైన వాట్సాప్ యాప్ ను వంద కోట్లకు పైగా నెటిజన్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘అప్డేట్ వాట్సాప్ మెసెంజర్’ అనే పేరుతో ఉన్న యాప్‌ను అసలైన యాప్‌గా భావించి నెటిజన్లు డౌన్లోడ్ చేసుకున్నారని.. వారంతా ఆ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసి అసలైన యాప్‌ను ఇన్స్టాల్ చేసి వినియోగించాలని ఆ సంస్థ యాజమాన్యం సూచించింది. ఫేమస్ గేమింగ్ యాప్ ‘టెంపుల్ రన్ 2’ నకిలీ యాప్‌ను ప్లే స్టోర్‌లో గత అక్టోబర్‌లో అప్లోడ్ చేసినట్లు సమాచారం. ఇలాంటి నకిలీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని యూజర్లు వాడితే.. వారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మెసేజ్‌ను పంపిన తర్వాత 7 నిమిషాల్లోపు ఆ సందేశాన్ని పంపిన వ్యక్తి (సెండర్) డిలీట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది. -
డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోయిన మైజియో
రిలయన్స్ జియోకి ముఖ్యమైన మొబైల్ అప్లికేషన్ 'మైజియో' కి పెరుగుతున్న క్రేజీ అంతా ఇంతా కాదు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ 100 మిలియన్(10 కోట్ల) మార్కును దాటేసింది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసు హాట్‌స్టార్ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇంతలా డౌన్లోడ్ అయిన రెండో దేశీయ అప్లికేషన్ ఇదే కావడం విశేషం. ఈ అప్లికేషన్‌కు యావరేజ్‌గా 4.4 స్టార్ రేటింగ్ ఉంది. జియో సబ్స్క్రైబర్లందరికీ ఇది కామన్ ప్లాట్‌ఫామ్. జియో కనెక్షన్ చెక్ చేసుకోవడానికి, డేటా వాడకం తెలుసుకోవడం కోసం ఇది ఎంతో సహకరిస్తోంది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు- ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ల సెల్ఫ్-కేర్ అప్లికేషన్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్(కోటి) పైగా డౌన్లోడ్లను నమోదుచేసింది. రిలయన్స్ జియో టీవీ యాప్, జియో టీవీ కూడా 50 మిలియన్(5 కోట్ల) డౌన్లోడ్లను రికార్డు చేసినట్టు వెల్లడైంది. కాగ, ఎయిర్టెల్ టీవీ యాప్ 5 మిలియన్ పైగా డౌన్లోడ్లు, వొడాఫోన్, ఐడియాలకు ఒక్కో దానికి 1 మిలియన్‌కు పైగా డౌన్లోడ్లను కలిగి ఉన్నట్టు తెలిసింది. జీరోకే జియో ఫోన్ లాంచింగ్‌తో టెలికాం వ్యాపారాల్లో రిలయన్స్ జియో మరింత మార్కెట్ షేరును విస్తరించేందుకు చూస్తోంది. ప్రస్తుతం మార్చి నెలలో 9.9 మార్కెట్ షేరును జియో కలిగి ఉంది. అంతేకాక టీవీ మార్కెట్లోనూ దేశవ్యాప్తంగా 15 స్థానిక భాషల్లో 432 లైవ్ ఛానల్స్‌ను జియో టీవీ యాప్ ఆఫర్ చేస్తోంది. తమ యూజర్లకు జియో టీవీ సర్వీసులను అందించేందుకు హాట్‌స్టార్‌తో ఇది భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. -
ఈ యాప్‌తో సంపాదించవచ్చు!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తాజాగా సరికొత్త యాప్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 'ఒపీనియన్ రివార్డ్స్' పేరిట రూపొందిన ఈ యాప్‌లో సర్వేలకు యూజర్లు సమాధానం ఇస్తే చాలు.. వారికి రివార్డుల రూపంలో గూగుల్ చెల్లింపులు జరపనుంది. తమ వ్యక్తిత్వాన్ని సరిపోయే సర్వేలలో యూజర్లు పాల్గొనవచ్చు. ఇందుకుగాను గూగుల్ ఇచ్చే రివార్డ్స్ పలువిధాలుగా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో జరిపే కొనుగోళ్లకు క్రెడిట్ రూపంలోనూ వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే సింగపూర్, టర్కీ మార్కెట్లలో ఈ యాప్‌ను గూగుల్ విడుదల చేసింది. యూజర్లు ఈ యాప్‌లో ఒక్కసారి సైన్ అప్ అయి.. సర్వేలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఒక్కసారి సర్వేను విజయవంతంగా పూర్తిచేస్తే గూగుల్ ప్లేస్టోర్ క్రెడిట్స్ రూపంలో చెల్లింపులు ఉంటాయి. ఈ క్రెడిట్స్‌ను వాడుకొని పెయిడ్ సేవలను స్టోర్‌లో పొందవచ్చు. అయితే, ఒక సర్వేను 24 గంటలలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో యూజర్లు పేరు, చిరునామా వంటి ప్రాథమిక సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎవరితో పంచుకోబోమని యాప్ యూజర్లకు హామీగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రెంటోమోజో
యాప్‌కీ కహానీ... ఉద్యోగులకు బదిలీ అయితే లగేజ్‌తో సమస్యే. మనమైతే వెంటనే బస్సో, రైలో ఎక్కి వెళ్ళిపోతాం. లగేజ్ సంగతి వేరు. దాన్ని తీసుకెళ్లాలంటే ఎన్నో తిప్పలు. ఇంట్లోకి కావలసిన ఫర్నిచర్, ప్రొడక్టులను అద్దెకిచ్చే వారు దొరికితే.. లగేజ్ ట్రాన్స్ఫర్ సమస్యలుండవు. ప్రస్తుతం ‘రెంటోమోజో ఫర్నిచర్ రెంటల్’ అనే యాప్ ఈ సేవలనే అందిస్తోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు నచ్చిన ప్రొడక్టులను నెలవారీ అద్దెకు తీసుకోవచ్చు. ఉచిత డెలివరీ, ఇన్స్టలేషన్, సెటప్. ఫ్రీ–పికప్ సౌకర్యం. నాణ్యతకు 100 శాతం గ్యారెంటీ. బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్, స్టడీ రూమ్ సంబంధిత ఫర్నిచర్.. టీవీలు, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, మైక్రోఒవెన్ వంటి ప్రొడక్ట్స్.. ఆఫీస్ ఫర్నిచర్, వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐలను యాప్ ద్వారానే చెల్లించొచ్చు. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. -
ఫోర్త్ లయన్ యాప్ కొత్త వెర్షన్ విడుదల
భవానీపురం : ఫోర్త్ లయన్ యాప్‌ను ప్రజలకు మరిన్ని సేవలను అందించేందుకుగాను దానిని ఆధునీకరించి రూపొందించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరారు. కొద్ది రోజులలో ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. యాప్ కొత్త వెర్షన్లో పొందుపరిచిన సౌకర్యాలు ► హోమ్ పేజి డిజైన్ మార్చి మరింత ఆకర్షణీయంగా నగర పోలీస్ వెబ్సైట్ వివరాలు ఇచ్చారు ► పబ్లిక్ ఇన్ఫర్మేషన్లోని పోలీస్ స్టేషన్ ఆప్షన్లో ఆ స్టేషన్‌ను కాంటాక్ట్ చేసేందుకు ఫోన్ నెంబర్, స్టేషన్ ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించారు. ► నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు పొందుపరిచారు. తద్వారా వారిని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు. ► రహదారులలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల (లైవ్ ట్రాఫిక్‌లో బ్లాక్ స్పాట్స్) వివరాలను ఇచ్చారు. ఈ సమాచారంతో బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్, హాస్పటల్ ఎంత దూరంలో ఉంది అనే వివరాలను పొందుపరిచారు. రాబోయే వెర్షన్లో దీనిని మరింత మెరుగుపరచనున్నారు. యాప్‌లో ప్రత్యేక సర్వీసులు ► మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ‘ట్రాక్ మై ట్రావెల్’, ఎస్ఓఎస్ను పొందుపరిచారు. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే యాప్‌లో ఈ బటన్‌ను నొక్కడం వలన పోలీసులు అప్రమత్తమై మీరు ఉన్న ప్రాంతానికి అతి తక్కువ సమయంలో చేరుకుని రక్షిస్తారు. ► నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల ప్రాంతాలలో స్థిరపడేందుకు ఉద్యోగరీత్యాగానీ, జోవనోపాధి కోసంగానీ ఎంతోమంది వస్తున్నారు. అటువంటివారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, కొత్తగా పనులలో కుదుర్చుకునేటప్పుడు, డ్రైవర్లను నియమించుకునే సమయంలో వారి వివరాలను ఈ యాప్‌లోని ‘వెరిఫికేషన్’ ఆప్షన్ ద్వారా పంపితే, పోలీసులు వారి గురించి విచారించి వారి వివరాలను దరఖాస్తుదారునికి తెలియచేస్తారు. మంచివారిని పనిలోకి తీసుకోవడం, సరైనవారికి ఇల్లు అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ► ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు ఇంటి వివరాలను వెకేషన్ ఇన్ఫర్మేషన్లో పొందుపరిస్తే, ఆ ప్రాంతంలో పోలీసు బీటును ఏర్పాటు చేస్తారు. ప్రజలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకుని పోలీసుల సేవలను అందుకోవాలని కోరారు. -
ఈజీ లైఫ్ పర్సనల్ ఫైనాన్స్ యాప్
పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈజీ లైఫ్ యాప్‌కి గూగుల్ ప్లేస్టోర్‌లో నాలుగున్నర రేటింగ్ ఉంది. పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా అన్నింటిని సజావుగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని అంశాలు చూస్తే.. ఇందులో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు/డిబెంచర్లు, బీమా పాలసీలు మొదలైన వాటి వివరాలు పొందుపర్చుకోవచ్చు. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటే ఎఫ్డీ ఎప్పుడు ప్రారంభమైంది... మెచ్యూరిటీ తేదీ ఎప్పుడు, ఎంత వస్తుంది తదితర అంశాలు.. అలాగే ఏ షేర్లు ఎంతకి, ఎప్పుడెప్పుడు కొన్నారు.. సగటు రేటెంత మొదలైన వివరాలన్నీ చిటికెలో లభించేలా ఇందులో భద్రపర్చుకోవచ్చు. ♦ వీటితో పాటు ఈఎంఐ కాల్క్యులేటర్, డౌన్లోడ్ చేసుకోతగ్గ లైవ్ కోట్స్ లాంటివి ఇందులోని ప్రత్యేక ఫీచర్స్. ♦ ప్రారంభంలో ముప్పై రోజుల పాటు ఉచితంగా దీన్ని ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగించవచ్చు. ♦ ప్రమోషనల్ ఆఫర్ కింద అయిదుగురినుంచి ఇరవైమంది దాకా ఉపయోగించుకునే లైసెన్సుకు వార్షికంగా రూ.3 వేల నుంచి రూ.6 వేల దాకా సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంది. -
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
-
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది. ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్‌లను పక్కకు నెట్టేసింది. భీమ్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డౌన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, (డిసెంబర్ 30) ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ కొనియాడిన సంగతి తెలిసిందే. #BHIM from @NPCI_NPCI races to the top of the charts! Dream debut! https://t.co/I9t2C3G5cV — Nandan Nilekani (@NandanNilekani) January 1, 2017 -
నోటీబాక్స్..
సాక్షి, వీకెండ్: బిజీగా ఉన్న వేళల్లో మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్ ను పట్టించుకునే తీరిక ఉండదు. ఏదో పని కోసం మొబైల్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై కుప్పలుతెప్పలుగా ఉండే నోటిఫికేషన్స్ చూడగానే అన్నీ క్లియర్ చేసేస్తాం. మనకు కావాల్సిన విషయాలను వెతుక్కునే క్రమంలో చాలా ముఖ్యమైన సమాచారాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనల్ని తప్పించేందుకే ‘నోటీబాక్స్’ అనే యాప్ వచ్చేసింది. మన మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్ ను తేదీల వారీగా పొందుపరచడమే ఈ యాప్ ప్రత్యేకత. తీరిక చిక్కినపుడు హాయిగా చదివేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో notibox అని టైప్ చేసి దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలి. -
స్మార్ట్ ఫోన్‌కు 2వేల నోటు చూపితే మోదీ ప్రసంగం
పులివెందుల రూరల్: స్మార్ట్ ఫోన్లో ఓ యాప్ ఓపెన్ చేసి, రూ.2 వేల నోటు వైపు చూపితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘మోడి కీ నోటు’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే కెమెరా ఆన్ అవుతుంది. రూ.2 వేల నోటు వెనుక భాగం (మంగళ్యాన్ ఉన్న వైపు) కెమెరాలో కనిపించే విధంగా స్మార్ట్ ఫోన్‌ను పట్టుకుంటే ప్రధాని మోదీ ప్రసంగం వస్తుంది. రూ.2 వేలు, రూ.500 కొత్త నోట్ల గురించి నరేంద్ర మోదీ ఇంగ్లిషులో మాట్లాడుతుండటం కనిపిస్తుంది. ప్రస్తుతం విడుదలైన రూ.2000 నోటులో ఈ ప్రత్యేకత ఉండటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
గూగుల్ ప్లేస్టోర్‌లో ‘మై టీఎస్పీఎస్సీ’ యాప్
పరీక్ష కేంద్రాల వివరాలు అప్డేట్ కానందున ఆవిష్కరణ వారుుదా సాక్షి, హైదరాబాద్: పరీక్ష కేంద్రాలకు గ్రూపు-2 అభ్యర్థులు సులభంగా చేరుకునేలా రూట్ మ్యాప్ చూపించే ‘మై టీఎస్పీఎస్సీ’ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. అన్ని పరీక్ష కేంద్రాల సమాచారం, లాంగిట్యూట్, లాట్యిట్యూడ్ సమాచారంతో మ్యాప్‌లు అప్డేట్ కాకపోవడంతో మంగళవారం యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించలేదు. అరుుతే గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 1,600 కేంద్రాలరూట్ మ్యాప్‌లను యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. మరో 300కు పైగా కేంద్రాల సమాచారాన్ని బుధవారం ఉదయం వరకు పొందుపరిచేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. కాగా, ఇతర పోటీ పరీక్షలకూ యాప్‌ను వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. యాప్‌లో ఏమున్నాయంటే.. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో టీఎస్పీఎస్సీ ఐడీని అభ్యర్థి తెలుసుకోవచ్చు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన వివరాలు ఫొటోతో పాటు చూసుకోవచ్చు. హాల్‌టికెట్ వివరాలు పొందొచ్చు. హాల్‌టికెట్ నెంబరు సహాయంతో పరీక్ష రాయబోయే కేంద్రానికి రూట్ మ్యాప్ పొందేలా యాప్ అభివృద్ధి చేశారు. సమస్యలుంటే సంప్రదించేందుకు హెల్ప్ డెస్క్, టెక్నికల్ టీం నంబర్లు కూడా యాప్‌లో అందుబాటులో ఉంచారు. -
పైసాబజార్
Appకీ కహానీ... రుణం తీసుకోవాలనుకుంటున్నారా? మన రుణ అర్హతకు అనువుగా ఏ ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లకు లోన్స్‌ను ఇస్తున్నాయో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఇంకేం పర్సనల్, హోమ్, ఎడ్యుకేషన్, గోల్డ్ వంటి రుణాలకు వివరాలను ఒకే చోట పొందాలనుకుంటే.. ‘పైసాబజార్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు * వివిధ రుణాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. మన అర్హతకు లోబడి ఏ ఏ బ్యాంకులు లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయో చూడొచ్చు. * యాప్ నుంచే డెరైక్ట్‌గా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. * స్మార్ట్ ఈఎంఐ కాలిక్యులేటర్ సాయంతో ఈఎంఐ ఎంత కట్టాలో చూడొచ్చు. * రుణం విషయంపైనిపుణులతో మాట్లాడొచ్చు. * బ్యాంక్ బ్రాంచ్ లొకేటర్ ను ఉపయోగించి దగ్గరిలోని బ్యాంకు శాఖ వివరాలను పొందొచ్చు. * మన అర్హతకు అనువైనా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌కు, క్రెడిట్ కార్డులకు అప్లై చేయొచ్చు. * దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను తెలుసుకోవచ్చు. -
‘ఎం-ఓటింగ్’ యాప్‌ను
ఆవిష్కరించిన సీడీఎస్ఎల్ హైదరాబాద్: దేశీ దిగ్గజ ఈ-ఓటింగ్ సర్వీస్ ప్రొవైడర్ ‘సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్’ (సీడీఎస్ఎల్) తాజాగా ‘ఎం-ఓటింగ్’ అనే మొబైల్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. షేర్హోల్డర్లు ఈ యాప్ సాయంతో కంపెనీ తీర్మానాలకు సంబంధించిన ఓటింగ్‌లో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్ ద్వారా పాల్గొనవచ్చని సీడీఎస్ఎల్ తెలిపింది. ఏజీఎం/ఈజీఎం వేదికల్లో కూడా ఈ-ఓటింగ్ విధానాన్ని అవలంభించవచ్చని పేర్కొంది. ఈ కొత్త యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే విండోస్ ఫోన్, ఐఫోన్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది. వినియోగదారులు ‘ఎం-ఓటింగ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా సీడీఎస్ఎల్ దేశంలోనే తొలిసారిగా 2009లో ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 4,250 కంపెనీలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. వీటిల్లో 3,800 కంపెనీలు 8,215 ఈ-ఓటింగ్ కార్యక్రమాల్లో సీడీఎస్ఎల్ విధానాన్ని అనుసరించాయి. -
ఎస్బీఐ నో క్యూ
APPకీ కహానీ... ఆధునిక టెక్నాలజీని ఒడిసిపట్టుకొని, దాన్ని వినియోగదారులకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఎస్బీఐ తాజాగా ‘నో క్యూ’ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు * బ్యాంక్ కస్టమర్లు/నాన్ కస్టమర్లు ఈ యాప్ సాయంతో వర్య్చువల్ క్యూ టికెట్ (ఎం-టోకెన్)ను బుక్ చేసుకోవచ్చు. * ఎస్బీఐకి సంబంధించిన ఎంపిక చేసుకున్న ఏ బ్రాంచ్‌లోనైనా, కావాల్సిన సర్వీసులకు గానూ ఎం-టోకెన్లను పొందొచ్చు. * బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లక ముందే టోకెన్లను తీసుకోవడం వల్ల అక్కడ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన బాధ తప్పుతుంది. మన విలువైన సమయం మిగులుతుంది. * క్యూ లైన్లో మనకు ముందు ఎంతమంది ఉన్నారో, ఎంత సమయం పడుతుందో కూడా తెలుసుకోవచ్చు. * బ్యాంక్ బ్రాంచ్ ఎంత దూరంలో ఉన్నదీ.. దాని వద్దకు ఏ విధంగా వెళ్లాల్సిందీ.. యాప్‌లో చూడొచ్చు. * యాప్‌ను పెన్ చేయగానే బ్యాంకుకు సంబంధించిన సర్వీసులు (డిపాజిట్స్, నెఫ్ట్, విత్‌డ్రాయల్స్, డీడీ వంటి తదితర) మనకు కనిపిస్తాయి. * కావాల్సిన సర్వీస్‌పై క్లిక్ చేయగానే యాప్ మనకు దగ్గరిలోని బ్రాంచ్‌ను చూపిస్తుంది. బ్రాంచ్ ఎంపిక చేసుకొని అటు తర్వాత ఎం-టోకెన్‌ను బుక్ చేసుకోవచ్చు. -
ఆ యాప్ ను తీసేసింది
న్యూయార్క్: తాలిబాన్ యాప్ ను తొలిగించినట్టు ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ధ్రువీకరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తాలిబాన్ యాప్ ను తీసేసినట్టు స్పష్టం చేసింది. గతవారం ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచింది. విద్వేష ప్రసంగాలు, హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే యాప్స్ ను గూగుల్ అనుమతించదు. టెర్రరిస్టుల ఆన్ లైన్ కార్యకలాపాలను కనిపెట్టేందుకు అంతకుముందు 'సైట్' అనే సంస్థ పనిచేసేది. అయితే ఆన్ లైన్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఆండ్రాయిడ్ డెవలర్ల కోసం గూగుల్ సమీక్ష విధానాన్ని అమలుచేస్తోంది. తాము ఆమోదించిన వాటినే గూగుల్ ప్లే స్టోర్ లో పెడుతోంది. గతేడాది పలు యాప్స్ ను గూగుల్ తొలగించింది. తాజాగా తాలిబాన్ యాప్ ను తీసేసింది. అయితే దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. -
స్టేట్ బ్యాంక్ ఎనీవేర్
Appకీ కహానీ... దేశీ పీఎస్‌యూ బ్యాంకు దిగ్గజం ఎస్బీఐ తన సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన యాప్ ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’. ఈ యాప్ సాయంతో మనం దైనందిన బ్యాంకింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ యాప్‌ను ఇతర వెబ్‌సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదు. ప్రత్యేకతలు * యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. యాప్‌ను ఓపెన్ చేయగానే మై అకౌంట్, బ్యాంకింగ్, బిల్ పేమెం ట్స్, టాప్అప్-రీచార్జ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. * మై అకౌంట్లోకి వెళ్లితే ట్రాన్సాక్షన్ అకౌంట్, డిపాజిట్ ఖాతా, లోన్ అకౌంట్, పీపీఎఫ్ ఖాతాలు కనిపిస్తాయి. ఆయా అకౌంట్లైపై క్లిక్ చేసి సంబంధిత వివరాలను పొందొచ్చు. ఎం-పాస్‌బుక్ ద్వారా లావాదేవీల సమాచారం పొందొచ్చు. * బ్యాంకింగ్ ఆప్షన్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది మన ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్లోకి కావచ్చు లేదా ఇతరుల ఖాతాల్లోకి కావచ్చు. అలాగే బ్యాంకింగ్ ఆప్షన్లో టీడీఎస్ ఎంక్వైరీ, ఫిక్స్డ్ డిపాజిట్, ఆధార్ సబ్సిడీ, ఏటీఎం/డెబిట్ కార్డ్ బ్లాక్, చెక్ బుక్ రిక్వెస్ట్, రికరింగ్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్స్ఫర్, క్విక్ ట్రాన్స్ఫర్, స్టేట్ బ్యాంక్ ఎం-క్యాష్, ఐఎంపీఎస్ వంటి తదితర సేవలను పొందొచ్చు. * బిల్‌పే ద్వారా బిల్లులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించవచ్చు. * టాప్అప్-రీచార్జ్లోకి వెళితే అక్కడ మొబైల్, డీటీహెచ్ సేవలను పొందొచ్చు. అంటే వాటిని రీచార్జ్ చేసుకోవచ్చు. -
ఎస్బీఐ సమాధాన్..
appకీ కహానీ... మీరు ఎస్బీఐ కస్టమరా? మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, రుణ వడ్డీరేట్లు సంబంధిత సేవలన్నింటినీ ఒకే చోటు తెలుసుకోవాలని భావిస్తే ‘ఎస్బీఐ సమాధాన్’ యాప్‌ను ఉపయోగించండి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తన వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలన్నింటినీ ఒకే చోటు అందించాలనే లక్ష్యంతో ఎస్బీఐ ఈ యాప్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రత్యేకతలు * చాలా సింపుల్‌గా ఉండే యూజర్ ఇంటర్ఫేజ్. * యాప్‌ను ఓపెన్ చేయగానే డిపాజిట్స్, అడ్వాన్సెస్, అకౌంట్ సంబంధిత సేవలు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, ట్యాక్స్ సంబంధిత సేవలు, ఈఎంఐ కాలిక్యులేటర్, హెల్ప్‌లైన్, ఫిర్యాదులు, ఇతర సేవలు అనే ఆప్షన్లు కనిపిస్తాయి. * వినియోగదారులు అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవాలంటే ‘అకౌంట్ సంబంధిత సేవలు’ అనే ఆప్షన్‌లోకి వెళ్లి బ్యాంక్ ఖాతా నంబర్‌ను, దానికింద పాస్వర్డ్ కోసం ఏదైనా నాలుగు అక్షరాలను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు పీడీఎఫ్ ఫైల్ రూపంలో మీకు ఈ-మెయిల్ వస్తాయి. * పీడీఎఫ్ ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే మీరు ముందు పాస్వర్డ్ కోసం నాలుగు పదాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ముందుగా మీరు బ్యాంకులో మీ ఈ-మెయిల్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఖాతాకు ఈ మెయిల్‌ను లింక్ చేసి ఉండకపోతే... ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేరు. -
స్మార్ట్ ఫోన్ చిక్కులకు చిట్కాలివిగో...
ఆండ్రాయిడ్ ఫోన్ అప్పుడప్పుడైనా సతాయిస్తోందా? స్క్రీన్ జామై... లేదంటే కొన్ని అప్లికేషన్లు సరిగా పనిచేయకుండా మొరాయిస్తోందా? స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు అందరికీ కామనే. అయితే చాలా వరకూ సమస్యలను మనమే సరిచేసుకోవచ్చు. సాధారణంగా స్మార్ట్ఫోన్లతో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అన్నది చూద్దామా... పదే పదే గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే... స్మార్ట్ఫోన్లతోపాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం మనందరికి అనుభవమైన సమస్య. దీనికి వైరస్, మాల్, యాడ్వేర్లతో సంబంధం లేదు. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూంటుంది. క్యాష్ మెమరీని తుడిచేస్తే ప్రాబ్లెమ్ పోయినట్లే. ఈ పనిచేసేందుకు ఏం చేయాలంటే... ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి డేటా, క్యాష్‌లను తుడిచేయండి. ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. అప్పటికీ సమస్య తీరకపోతే గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్‌లలోని డేటా, క్యాష్‌లను కూడా తుడిచేసి చూడండి. సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ జామ్ అయిపోతే... స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం... రీస్టార్ట్ చేయడంతో మళ్లీ పనిచేయడం మనం చూసే ఉంటాం. ఒకవేళ రీస్టార్ట్ చేసిన తరువాత కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయలేదనుకోండి. దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించుకోవడం ద్వారా కొంత ఫలితముంటుంది. క్యాష్ వైప్ చేసుకునేందుకు మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి యూజర్ ఇంటర్ఫేస్ను సెలెక్ట్ చేసుకోవాలి. వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాకపోతే.... ఇలాంటి సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతూంటుంది. రూటర్తోపాటు ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావవచ్చు. ప్లే స్టోర్‌తో అప్లికేషన్లు డౌన్లోడ్ కాకపోతే... కొన్ని సార్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లు డౌన్లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. దీనికి రెండు రకాల పరిష్కారాలున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేయడం ఒకటైతే... గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం రెండో పద్ధతి. క్యాష్‌ను వైప్ చేయడమెలాగో ఇప్పటికే చూశాం. హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి. అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి. వీడియో ప్లే కాకపోతే... వీఎల్సీ, లేదా ఎంఎక్స్ ప్లేయన్లను ఉపయోగించి చూడండి. వీటితోనూ వీడియో ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్థం. మామూలుగా వీఎల్సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి. ప్రొప్రైటరీ ఫార్మాట్లకు మాత్రం ఆయా వీడియోలు సూచించే ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌ను రీ ఇన్స్టాల్ చేయాలంటే... మీ స్మార్ట్‌ఫోన్ ఆప్స్ ఫోల్డర్లో గూగుల్ ప్లే స్టోర్ కనిపించడం లేదా? అయితే మీరు పొరబాటున దాన్ని అన్ ఇన్స్టాల్ చేశారన్నమాట. రూట్ యాక్సెస్ లేకుండా ప్లే స్టోర్‌ను తొలగించలేము కాబట్టి అన్ఇన్స్టాల్ మాత్రమే చేయగలం. దీని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోని ఆప్స్‌లోకి వెళ్లండి. కుడివైపునకు స్వాప్ చేసుకుంటూ వెళితే... డిసేబుల్డ్ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. అందులో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి క్లిక్ చేస్తే తిరిగి ఎనేబుల్ చేయవచ్చు. కొన్ని ట్యాబ్లెట్లలో గూగుల్ ప్లే స్టోర్ అస్సలు ఉండదు. అటువంటి సందర్భాల్లో ధర్డ్‌పార్టీ నుంచి ఏపీకేను డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ట్యాబ్‌లోకి వెళ్లి అక్కడున్న అన్నోన్ సోర్సెస్‌ను టిక్ చేయండి. అప్పుడు థర్డ్‌పార్టీ నుంచి ప్లే స్టోర్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెమరీ తక్కువగా ఉన్నప్పుడు... రకరకాల పనుల కోసం అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని... కొంత కాలం తరువాత స్పేస్ లేదని చిరాకు పడుతూంటాం. స్మార్ట్‌ఫోన్‌లో మెమరీని సద్వినియోగం చేసుకునేందుకు మార్కెట్లో అనేక అప్లికేషన్లు ఉన్నాయి. వీటితో కొంత మెమరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మెమరీని ఆదా చేయవచ్చు. అయితే స్పాటిఫై వంటి మ్యూజిక్ ఆప్స్ అన్ ఇన్స్టాల్ చేసేందుకు అవి ఎక్కడున్నాయో తెలియాలి. అటువంటి సందర్భాల్లో సీసీ క్లీనర్ వంటి అప్లికేషన్లు వాడటం మంచిది. డిస్క్ యూసేజ్ వంటి వాటితో ఏ అప్లికేషన్ ఎంత మెమరీ తీసుకుంటోందో చూసుకోవచ్చు. తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు ఆన్ అవుతూనే ఫోన్ క్రాష్ అవుతూంటే.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బూట్ కాకుండా సతాయిస్తూంటే... పదే పదే క్రాష్ అవుతూంటే.. దాన్ని సేఫ్ మోడ్‌లో ఆన్ చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అయితే సేఫ్‌మోడ్‌లో ఎలా ఆన్ చేయడం అన్నది ఒక ప్రశ్న. దీనికి కూడా ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఫోన్ పవర్‌బటన్‌ను కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే... పవర్ ఆఫ్ అన్న ఆప్షన్ వస్తుంది. పవర్ ఆఫ్ ఆప్షన్‌ను కూడా కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచితే... ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీబూట్ చేయాలా? అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరి. ఒకసారి మీరు సేఫ్‌మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్ చేసిన తరువాత అనవసరమైన, తేడాగా ఉన్న అప్లికేషన్లను తొలగించి రీస్టార్ట్ చేస్తే బూటింగ్ సమస్య పోతుంది. స్కానింగ్ కోసం ఆఫీస్ లెన్స్.. అకస్మాత్తుగా మీ పాస్‌పోర్ట్ కాపీ లేదంటే ఇంకో రసీదు స్కాన్ చేయాలి? ఏం చేస్తారు? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్లడం చాలామంది చేసే పని. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసేయవచ్చు. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్ కోసం కూడా ఆఫీస్ లెన్స్ పేరుతో ఇలాంటి ఓ అప్లికేషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది. వన్నోట్తో కలిసి ఈ అప్లికేషన్ బిజినెస్కార్డులు, రసీదులు తదితర డాక్యుమెంట్లను స్కాన్ చేయగలదు. స్కాన్వన్, వన్నోట్లు బిజినెస్ కార్డులను స్కాన్ చేయడంతోపాటు వాటిల్లోని ఫోన్ నెంబర్లను నేరుగా ఫోన్లోకి ఫీడ్ చేసుకునేందుకు వీలుకల్పిస్తాయన్నది తెలిసిందే. మొబీ ఎన్షూర్... స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మరచిపోయినా, ఎవరైనా ఎత్తుకెళ్లినా చాలా ఇబ్బంది. మన నెంబర్‌కు పదేపదే కాల్ చేయడం అవతలివారు లిఫ్ట్ చేయకపోవడం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవడం మనలో చాలామందికి అనుభవం. ఈ సమస్యలన్నింటినీ ఒక్క ఎస్ఎంఎస్తో సరిచేయవచ్చునంటోంది మొబీ ఎన్షూర్ టెక్నాలజీస్. ఈ సంస్థ అభివృద్ధి చేసిన మొబీ ట్రాకర్ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే దాని పోగొట్టుకున్నా తిరిగి వెతుక్కోవడం చాలా సులువు. ఎందుకంటే... పోగొట్టుకుపోయిన తరువాత ఈ అప్లికేషన్ ఎప్పటికప్పుడు తాను ఉండే ప్రాంతం వివరాలు మీరు సూచించే మరో నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతూ ఉంటుంది. అంతేకాదు.... అవతలివాళ్లు సిమ్ మార్చినా సరే... కొత్త సిమ్ నెంబర్‌ను కనిపెట్టి మీ ఇతర నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తుంది. దాంతోపాటు అవతలి వ్యక్తి కొత్త నెంబర్‌తో ఏఏ నెంబర్లకు ఫోన్ చేశారన్న వివరాలు కూడా మెయిల్ ఐడీకి పంపుతుంది. చిన్న మెసేజీతో మీ ఫోన్‌ను లాక్ చేయడంతోపాటు ఆఫ్ బటన్ తాత్కాలికంగా పనిచేయకుండా చేసేయవచ్చు. దీనివల్ల ఫోన్ ఎత్తుకెళ్లిన వారు ఫోన్ అస్సలు ఆఫ్ చేయలేరు. ఇన్ని వివరాలు దొరికిన తరువాత మీ ఫోన్ మళ్లీ మీకు దొరకడం చాలా సులువే కదా! మెదడుకు ఇంగ్లీష్ మేత... స్మార్ట్‌ఫోన్‌లోని గేమ్స్‌తో మీరు టైమ్‌పాస్ చేస్తూనే ఉంటారు కదూ... కాలం గడిపేందుకు మాత్రమే కాకుండా మీ మెదడుకు మేతగానూ ఈ గేమ్స్ ఉపయోగపడితే? అదికూడా ఇంగ్లీషు భాషలో మీ పరిజ్ఞానాన్ని పెంచేదైతే? భలే ఉంటుంది. లెటర్క్రాఫ్ట్ అచ్చంగా ఇదే పనిచేస్తుంది. క్రాస్‌వర్డ్ పజిల్ మాదిరిగా గళ్లుగళ్లుగా ఉండే ఈ గేమ్‌లో పదాలను వెతికి సరిచేయాల్సి ఉంటుంది. లెవల్స్ పెరిగేకొద్దీ పదాల సంక్లిష్టత పెరుగుతుందన్నమాట. నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ పదాలను గుర్తించాల్సి ఉంటుంది. పదం పొడవునుబట్టి మీకు పాయింట్లు వస్తాయి. లెటర్క్రాఫ్ట్ ప్రస్తుతానికి ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. గేమ్ ఉచితంగానే లభిస్తున్నప్పటికీ కొంచెం డబ్బు చెల్లించడం ద్వారా మీరు గుర్తించిన పదాల జాబితా, మీ ప్రోగ్రెస్ వంటి అదనపు వివరాలు -
ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్/డీటీహెచ్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్,ఫిక్స్డ్ /రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు. వినియోగదారులతో 24 గంటలూ అనుసంధానమై ఉండటానికి ఈ అప్లికేషన్ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐడీబీఐ బ్యాంక్ సీఎండీ ఎం.ఎస్.రాఘవన్ అన్నారు. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను ఎక్కడి నుంచైనా పొంద వచ్చని చెప్పారు. -
టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్
న్యూఢిల్లీ: ఫోన్‌బుక్‌లో లేకపోయినప్పటికీ మనం కాల్ చేస్తున్న నంబరుకు సంబంధించిన వారి వివరాలను చెప్పేసే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూ డయలర్ పేరిట ఫోన్ డెరైక్టరీ యాప్ సంస్థ ట్రూకాలర్ దీన్ని ఆవిష్కకరించింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్‌బుక్‌లో లేని కొత్త నంబరుకు కాల్ చేయాల్సి వచ్చినప్పుడు సదరు నంబరును ఉపయోగిస్తున్న వారి పేరు, ప్రొఫైల్ ఫొటో వంటి వివరాలను ఈ యాప్ ఆటోమేటిక్‌గా సెర్చి చేసి, అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత యాప్. ప్రస్తుతం ట్రూకాలర్‌కి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది యూజర్లు ఉండగా.. ఇందులో దాదాపు సగభాగం భారత్ నుంచే ఉన్నారు. -
మ్యూజిక్ 'వింక్' మ్యాజిక్ చేసింది!
న్యూఢిల్లీ: ఇటీవల భారతీ ఎయిర్ టెల్ విడుదల చేసిన వింక్ మ్యూజిక్ అప్లికేషన్ కు భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో వింక్ (Wynk) అప్లికేషన్ ను లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నాట్టు ఎయిర్ టెల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంగీతాభిమానుల కోసం ఉచితంగా అందించే యాప్స్ లలో వింక్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఎయిర్ టెల్ తెలిపింది. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 5 యాప్ లలో ఒకటిగా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 2 తేదిన ఎయిర్ టెల్ వింక్ యాప్ ను విడుదల చేసింది. వింక్ యాప్ కు విశేష ఆదరణ లభించడంతో మరో ఆరు కేటగిరిలపై దృష్టిని పెట్టింది. సోషల్ నెట్ వర్క్స్, వీడియో, మ్యూజిక్, గేమింగ్, ఈ కామర్స్, ట్రావెల్, ఇతర కేటగిరిలలో ప్రోడక్ట్స్ ను రూపొందించడానికి ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. -
నిత్య విద్యార్థి నేస్తం కోర్సెరా...
ప్రపంచస్థాయి యూనివర్శిటీలు లేదా సంస్థల నుంచి డిగ్రీ పొందాలని అనుకుంటున్నారా? అది కూడా ఇంట్లోంచి కాలు కదపకుండానే పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే కోర్సెరా మొబైల్ అప్లికేషన్ మీ కోసమే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమయ్యే ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. దాదాపు వంద యూనివర్శిటీలు, సంస్థలందించే 600 కోర్సు లను ఇంట్లో కూర్చునే పూర్తి చేయవచ్చు. దాదాపు 20 సబ్జెక్టులకు సంబంధించిన ఈ కోర్సులకు సంబంధించిన లెక్చర్లు అన్నీ వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి మరి. కోర్సులను ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ రాగానే సైన్అప్ చేసుకుంటే సరి. నిపుణులైన ఇన్‌స్ట్రక్టర్ల నుంచి పాఠాలు, అవసర మైన సాయం కూడా అందుతూం టుంది. మీకు నచ్చిన కోర్సును ఎంచుకుని రిజిస్టర్ చేసుకో వడం... ఆ కోర్సు నోటిఫికేషన్ రాగానే సైన్అప్ చేసుకుంటే చాలు. ఇంగ్లీషుతోపాటు దాదాపు 12 భాషల్లో లభ్యమవుతాయి మైక్రోసాఫ్ట్ ఆఫీస్... స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆఫీసు పనులు చక్కబెట్టాలనుకుంటున్నారా? వర్డ్ఫైళ్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూసేందుకు ఇతర సాఫ్ట్వేర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదిప్పుడు. ఎంచక్కా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌నే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ దాదాపు నెల రోజుల క్రితం అప్డేట్ చేసిన ఈ అప్లికేషన్ పదిలక్షలకుపైగా డౌన్లోడ్లతో ఇప్పటికే సూపర్‌హిట్ అయింది కూడా. వర్డ్, ఎక్సెల్ ఫైల్స్ ఎడిటింగ్, పవర్‌పాయింట్ ఫైళ్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉండటం, పవర్ పాయింట్ స్లైడ్స్‌ను చూడగలగడం, ఈమెయిల్ అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు, ఎడిట్ చేసుకోగలగడం ఈ అప్లికేషన్ కున్న కొన్ని ప్రత్యేకతలు. మీరు సాయంత్రం వరకూ ఆఫీసులో చూసిన ఫైళ్లను క్లౌడ్ ద్వారా యాక్సెస్ చేసుకుని పనిచేసుకో వచ్చు కూడా. ఆండ్రాయిడ్ 4.0 కంటే ఆధునిక వర్షన్లతో పనిచేస్తుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో పీసీకి అనుసంధానమయ్యేందుకు అవకాశం కల్పించే అప్లికేషన్ ఇది. రెండింటిలోనూ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం ద్వారా పీసీ డెస్క్టాప్ను స్మార్ట్‌ఫోన్‌పై నుంచే నియంత్రించుకోవచ్చు. ముందుగా పీసీపై అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసు కుని రిమోట్ యాక్సెస్‌ను సెట్ చేసుకోవాలి. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌పై అప్లికేషన్‌ను నొక్కడంతో రిమోట్ యాక్సెస్ ప్రారంభమవుతుంది.