Debt waiver
-
Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్’కు రైతుల పిలుపు
న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border. Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm — Press Trust of India (@PTI_News) March 6, 2024 ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి. ఇదీ చదవండి.. రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం -
రుణమాఫీ బిల్లులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ సొమ్ము విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది మాఫీ చేయాల్సిన సొమ్ములో కొంత మేరకు ఆర్థిక శాఖ నిలిపేయడమే ఇందుకు కారణం. మార్చి 31 నాటికే రూ. 50 వేలలోపు రైతుల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు ఉన్న పంట రుణాలనే ప్రభుత్వం మాఫీ చేసింది. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం మరో రూ. 857 కోట్లు అవసరం ఉంది. ఈ సొమ్ము విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖకు బిల్లులు సమర్పించగా నిధుల కొరత వల్ల ఫైల్ నిలిచిపోయిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం రెండోదశ రుణమాఫీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. మరోవైపు తమకు మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో రాలేదంటూ అనేక మంది రైతులు వ్యవసాయశాఖ చుట్టూ తిరుగుతున్నారు. మాఫీ అయింది రూ.1,144.38 కోట్లే... 2018 ఎన్నికల సమయంలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ. 1,144.38 కోట్లనే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 2020లో రూ. 25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 25 వేల నుంచి రూ. 37 వేల లోపు రైతులకు చెందిన రూ. 763 కోట్ల రుణాలనే మాఫీ చేసింది. ఇంకా రూ. 1,027 కోట్ల నిధులు అందించి రైతులకు మాఫీ చేయాల్సి ఉంది. అందులో రూ. 857 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా మిగిలిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. -
మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం.. మాఫీ.. రాష్ట్ర వ్యాప్తంగా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిరుపేదలైన ఎస్సీల మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించింది. భూమి కొనుగోలు పథకం ద్వారా లబ్ధిపొందిన ఎస్సీలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రుణ విముక్తులను చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 17,189 మంది ఎస్సీ లబ్ధిదారులకు సంబంధించిన 18,235.37 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న తనఖా నుంచి విముక్తి కానున్నాయి. ప్రకాశం జిల్లాలో అమలైన ఈ రుణమాఫీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా తీసుకున్న చొరవే ఈ పథకం వేగంగా అమలు కావటానికి దోహదపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకం అమలులో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ప్రకాశం జిల్లాలో లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ వైఎస్సార్ ఇచ్చిన జీవోను అమలు చేస్తే భూమి కొనుగోలు పథకంలో లబ్ధిపొందిన ఎస్సీలకు ప్రయోజనం కలుగుతుందని సీఎంకు వివరించారు. ఈ అంశంపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్దన్‌ను సీఎం ఆదేశించారు. దీంతో జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటగా ప్రకాశం జిల్లాలో లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ గుర్తించారు. భూములకు తనఖా నుంచి విముక్తి కలిగించేందుకు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. 1988–89 నుంచి లబ్ధిదారులకు ఊరట రాష్ట్రంలోని ఎన్ఎస్ఎఫ్డీసీ పథకంలో 1988–89 నుంచి భూములు కొనుగోలు చేసిన లబ్ధిదారులకు రుణమాఫీ ద్వారా ఊరట కలుగనుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు భూమి కొనుగోలు పథకంలో రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీచేస్తూ 2009 జూలై 7వ తేదీన జీవోఆర్టీ నంబరు–492 విడుదల చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తరువాత ఆ జీవోను కాంగ్రెస్, టీడీపీ పాలకులు అటకెక్కించారు. ఆ మహానేత ఇచ్చిన జీవోకు మోక్షం కల్పిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎస్సీ లబ్ధిదారులకు జిల్లాల్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తాకట్టులో ఉన్న భూములకు విముక్తి కలిగించనున్నారు. ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ ఎస్సీ కార్పొరేషన్ కింద భూమి కొనుగోలు పథకంలో లబ్ధి పొంది.. 2008లోపు రూ.లక్ష లోపు రుణం ఉన్నవారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా ఆ భూములపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్రస్థాయి తొలి సమీక్ష సమావేశం ఆదివారం ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు.. కొమ్మూరి కనకారావు మాదిగ, పెదపాటి అమ్మాజీ, వడ్డాది మధుసూదనరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా–సంక్షేమం) జి.కృష్ణవేణి, జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఎన్.లక్ష్మానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 వేలకుపైగా ఎస్సీ లబ్ధిదారులున్నారని, వారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. అయితే 2009లో నాటి సీఎం వైఎస్సార్ ఇచ్చిన జీవో ప్రకారం రుణమాఫీ 2008లోపు ఉన్న లబ్ధిదారులకు మాత్రమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2008 తర్వాత రుణాలు తీసుకొని.. తిరిగి చెల్లించని వారి వివరాలను కూడా బయటకు తీస్తున్నామన్నారు. వారికి కూడా రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ.. 2009 జూలైలో ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని వైఎస్సార్ జీవో ఇచ్చారని.. ఆ తర్వాత రెండు నెలలకే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆ జీవోను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్ ఆ జీవోను అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. -
లోటులో రాష్ట్రం.. కావాలి ఊతం
సాక్షి, అమరావతి: ఓ వైపు రాష్ట్ర విభజన సమస్యలతో పాటు మరో వైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని వివరించనుంది. ఈ కారణాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాల అమలు తీరును వివరించి సాయం కోరడంతో పాటు కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటును కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్‌ను జనరల్ కేటగిరీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును వివరించి ప్రత్యేక నిధులు కోరనుంది. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనున్న అంశాలు ► గ్రామ, పట్టణాల మధ్య పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిలో ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలను తొలగించేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.28,382 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.27,820 కోట్ల గ్రాంటును సిఫార్సు చేయాలి. ►73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడి గ్రామ, పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు. ఈ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూ.5,950 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లను తగ్గించినందున రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతోంది. సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తున్నందున ఆ మేరకు ఆదుకునేలా సిఫార్సులు చేయాలి. ఈ విషయంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు ఇందుకు తగిన బహుమతి కూడా ఇవ్వాలి. ►రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం నెలకొందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ►అస్తవ్యస్థంగా ఉన్న భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే చేసేందుకు చట్టం తీసుకొచ్చామని, ఈ కార్యక్రమానికి రూ.1,667 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►గతంలో పంజాబ్ రాష్ట్రానికి చేసిన తరహాలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నందున రూ.11,039 కోట్ల (వచ్చే ఏడాది మార్చి 31 నాటికి) కేంద్ర రుణాలు మాఫీ చేస్తూ సిఫారసు చేయాలి. (తద్వారా కొత్త అప్పులకు అవకాశం ఉంటుంది) ►విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందున పని తీరు ప్రోత్సాహకాలుగా ఆర్థిక సాయాన్ని సిఫార్సు చేయాలి. ►కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. -
త్వరలో రుణమాఫీ అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని త్వరలో అమలు చేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలిలో శుక్రవారం మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను సభలో ఆయన ప్రవేశపెట్టారు. సభ్యులు వివిధ అంశాలను లేవనెత్తారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ విముక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి సమాధానం ఇచ్చారు. చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్డితో పాటు నలుగురు సభ్యులు ఉంటారని చెప్పారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు వార్డుల పునర్విభజనకు సంబంధించిందని పేర్కొన్నారు. వడ్డీ రాయితీ సొమ్ము ఇవ్వకపోవడంతో రుణాలు 10 శాతం కూడా బ్యాంకులు రైతులకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు ఇప్పించాలన్నారు. ప్రైవేటు ఈడబ్ల్యూఎస్ లేదు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదల (ఈడ బ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి ఇవ్వలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మండలిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపక సిబ్బంది విరమణ వయసు పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. కాగా, మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులను మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సభకు పరిచయం చేశారు. -
చంద్రబాబే మాకు బాకీ
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం – 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బాబు హామీ ‘‘డ్వాక్రా మహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీ చేస్తాను. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరిక నిశ్చింతగా ఉండొచ్చు’’. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఊరూరా తిరిగి ఇలా నమ్మబలికారు. ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబు సహజ నైజం. అందుకే నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు గుర్తుకురాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. మరోవైపు వడ్డీతో సహా కట్టాల్సిందేనంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతోపాటు అవమానిస్తుండటంతో..అప్పోసప్పోచేసి, తినోతినకో రుణాలు చెల్లిస్తున్నారు మహిళలు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. అకస్మాత్తుగా చంద్రబాబుకు డ్వాక్రా మహిళలు గుర్తుకొచ్చారు. ఏదో ఒక మాయ చేయాలి. అంతే.. పసుపు–కుంకుమ పల్లవి అందుకున్నారు. రుణమాఫీ చేస్తానని నాలుగున్నరేళ్లు మాయ చేసి.. ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ పేరిట మళ్లీ అప్పులు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. పసుపు కుంకుమ కింద ఇస్తానంటున్న పదివేలు పోగా.. ఇంకా చంద్రబాబే తమకు బాకీ ఉన్నాడని అక్కచెల్లెమ్మలు కుండబద్దలు కొడుతున్నారు. లంకిరెడ్డి విద్యాధర్‌రెడ్డి సాక్షి, అమరావతి: ‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు అంటూ.. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు చెబితే నమ్మామని.. నాలుగున్నరేళ్లు రుణాల మాఫీ ఊసే ఎత్తలేదని డ్వాక్రా మహిళలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ‘పసుపు కుంకుమ’ అంటూ కొత్త పథకం ప్రకటించి.. అప్పు ఇస్తూ పసుపు కుంకుమ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వెలుగు అధికారులు జారీ చేసిన అంతర్గత సర్క్యులర్‌లో.. ‘కేవలం సంఘాల పొదుపు ఖాతాలో మాత్రమే సభ్యులు అప్పులు తీసుకొను నిమిత్తం జమ చేస్తారు’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా సంఘాలకు మళ్లీ అప్పులు మిగిల్చే పరిస్థితి ఎదురుకానుందని మహిళా సంఘాల నేతలు వాపోతున్నారు. మహిళలకు ఉచితంగా పదివేలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. చంద్రబాబు మళ్లీ వారిని మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగిపోయి..రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు మళీ ఎన్నికలు రాగానే పసుపు కుంకుమ పేరుతో ముష్టేస్తున్నారని మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా రుణమాఫీ చేయలేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా రాత పూర్వకంగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొదుపు సంఘాలకు పసుపు–కుంకుమ నగదును అప్పుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ చెల్లని చెక్కులిచ్చి మరోవైపు చెక్కులు బ్యాంకుల్లో మార్చుకునేందుకు మహిళలు నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ.. చెక్కులు మార్చేకునేందుకు వెళితే కొన్నిచోట్ల చెల్లడం లేదని డ్వాక్రా సంఘాల ఫిర్యాదులు గత వారం రోజులు నుంచి అధికమయ్యాయి. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9వేల కోట్లను తానే ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సభల్లో ప్రకటించడాన్ని మహిళా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. టీడీపీ నాయకుల పెత్తనం పసుపు–కుంకుమ చెక్కులను ఆయా గ్రామాల్లో స్ధానిక టీడీపీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చేటప్పుడు టీడీపీ నాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని డ్వాక్రా మహిళలు పేర్కొంటున్నారు. ఆర్ధిక సాయం అందించామని తమపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ప్రచారానికి పిలిచినా రావాలంటూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారని డ్వాక్రా సంఘాలు వాపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఓ వైపు కొనసాగుతుండగా.. మరోవైపు వెలుగు అధికారులు సీఎం సభలకు వెళ్లాలని.. పోలవరం యాత్రలకు పోవాలంటూ బలవంతంగా పంపుతున్నారని డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైసా కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని అసెంబ్లీలో మంత్రి పరిటాల సునీత ప్రకటనకు సంబంధించిన వార్త క్లిప్పింగ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు- 9,53,571 డ్వాక్రా సభ్యుల సంఖ్య- 95,69,080 బాబు హామీ ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు- రూ. 14,204 కోట్లు రుణాలు మాఫీ కాక వడ్డీలు పెరిగిపోయి ప్రస్తుతం- రూ. 25,424 కోట్లు చంద్రబాబే నాకు రూ.15వేలు బాకీ నా పేరు టి.కృపామణి. ప్రకాశం జిల్లా పర్చూరు. ఎన్నో ఏళ్లుగా స్వయం సహాయక సంఘంలో పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా. మా గ్రూపు చేస్తున్న పొదుపు కారణంగా గతంలో బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణంగా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.20వేల వంతున రుణం దక్కింది. చంద్రబాబు 2014లో ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. దాంతో నేను తీసుకున్న రుణానికి వడ్డీ రూ.15వేలు అయింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.35వేల వరకు చెల్లించా. ఇప్పుడు పసుపు–కుంకుమ కింద ఇస్తానన్న రూ.10వేలు, గతంలో ఇచ్చిన రూ.10వేలు కలుపుకున్నా..చంద్రబాబే నాకు ఇంకా రూ.15వేల వరకు బాకీ ఉన్నాడు. చంద్రబాబు ఇస్తున్న రూ.పదివేలతోనే మాకు ఏదో అద్భుతం జరుగుతుందని, కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెబుతున్నారు. ఆయన డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ గురించి మాట్లాడటం లేదు. ఇచ్చిన ఈ డబ్బు కూడా అప్పుగా ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. మాఫీ అని మాయ చేసి.. ఎన్నికల ముందు ముష్టి నా పేరు.. కట్టా సుజ్ఞానమ్మ. మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు. గతంలో పావలా వడ్డీ పథకం కింద మేలు జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న రుణానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మాయ చేసి..ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ముష్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని పసుపు–కుంకుమ పథకం బాబుగారికి ఎన్నికల ముందు జ్ఞాపకం వచ్చింది. ఆయన జేబులో నుంచి మాకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు కదా. చంద్రబాబు ఏ సభ పెట్టినా.. మమ్మల్ని ఒత్తిడి చేసి సభలకు తరలించారు. ఎన్ని పనులున్నా..చేసేదేమీ లేక సభలకు వెళ్లాం. పసుపు–కుంకుమ కింద రూ.పదివేలిచ్చి అదేదో తమ సొంత డబ్బు ఇచ్చినట్లు టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా నిలబెడుతుంది నా పేరు దండిప్రోలు లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం 21వ వార్డు. నా భర్త అనారోగ్యంతో ఏపనీ చేయలేడు. కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వారి పిల్లలతో కుటుంబాలను పోషించుకుంటూ తంటాలు పడుతున్నారు. నేను ఇంటి వద్ద లేసు అల్లికలు చేస్తూ, చీపుర్లూ అల్లుతూ ఎంతోకొంత సంపాదించుకుంటున్నా. 2007 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నా. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననే చంద్రబాబు హామీతో వాయిదాలు కట్టలేదు. నిక్షేపంగా నెలనెలా అప్పులు కడుతూ.. మళ్లీ రుణాలు తీసుకునే వాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే.. అప్పులు కట్టడం మానేశాం. తరువాత బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వడ్డీతో సహా కట్టాం. ఇప్పుడు ఇస్తున్న పసుపు కుంకుమ మాకు అప్పులకు కూడా సరిపోదు. అది అప్పేనని సాక్షాత్తు ప్రభుత్వ సర్క్యులర్‌లోనే పేర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి 40–60 సంవత్సరాలోపు మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి కొంత చొప్పున రూ.75వేలు ఇస్తామంటున్నారు. వైఎస్సాఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణాల మొత్తం మహిళ చేతికే ఇస్తామని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తామని జగన్ చెబుతున్నారు. అలా చేస్తే మా బతుకులు మారతాయని నమ్ముతున్నాం. రుణ మాఫీ కాక.. అప్పుచేసి బాకీ తీర్చాం నా పేరు పెదశింగు రామలక్ష్మి. మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం, పీచుపాలెం ప్రాంతం. నేను మత్స్యకార మహిళను. భర్త కోటేశ్వరరావు, పెయింటింగ్ పనిచేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు. 1999 నుంచి సంగీత పేరుతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నమ్మిస్తే.. రుణాలు కట్టలేదు. దాంతో ఆ రుణాలకు వడ్డీలు రూ.12వేలుపైనే కట్టాం. 2014 ఎన్నికల నాటికి మా గ్రూపునకు రూ.4.80లక్షలు అప్పు ఉంది. అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తామంటే.. అప్పుకట్టలేదు. 2016 నాటికి వడ్డీ రూ 1.20లక్షలు దాటింది. బ్యాంకువారు నోటీసులు పంపితే అప్పులు చేసి బాకీలు తీర్చాం. మా గ్రూపులో ఒక్కొక్కరూ రూ.12వేలు పైనే వడ్డీకట్టారు. మేం కట్టిన వడ్డీలు అన్నీ కలుపుకుంటే రూ.20వేలు వరకూ లెక్క వస్తుంది. మాకు పసుపు కుంకుమ అని మొన్న రూ.10వేలు చెక్కులు ఇచ్చారు. ఇందులో ఒక చెక్కు మారింది. ఇక మాకు పసుపు కుంకుమ ఎక్కడ ఇచ్చినట్టు? ఇప్పుడిస్తున్న రూ.10వేలు పసుపు కుంకుమ డబ్బు మేం కట్టిందే. మా డబ్బులు మాకిచ్చి.. హంగామా చేయడం ఏమిటి? మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు చంద్రబాబు. పసుపు కుంకుమ పేరుతో అప్పా? మా డ్వాక్రా గ్రూపు బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణం తీసుకొని పొదుపు చేసుకుంటూ... ఆర్ధిక పరిపుష్టి సాధించాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెబితే.. రుణం చెల్లించలేదు. కాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ పెరిగిపోయింది. చేసేదేమీ లేక వన్‌టైం సెటిల్మెంట్ కింద బ్యాంకుకు రుణం చెల్లించాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రుణ మాఫీ చేయకుండా... పసుపు కుంకుమ పేరుతో మా దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ డబ్బులే మాకు ఇవ్వడం ఏమిటి? చంద్రబాబు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో అప్పో,సప్పో చేసి బ్యాంకులకు రుణాలు కట్టాం. పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు మోసం చేస్తున్నారు. – బాబు తీరుపై మండిపడుతున్న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు శాంతారా, ఎస్కే జాన్‌బీ, రమీజా, మోతి, అషిరిన్ -
ఏడాది గడచినా ఏ సాయమూ లేదు
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కురువ నారాయణ పంటలు పండక అప్పులపాలయ్యాడు. చంద్రబాబు హామీ ప్రకారం పూర్తిగా రుణ మాఫీ జరగలేదు. పేరుకుపోయిన అప్పుల భయంతో సొంత పొలంలోనే 2018 జనవరి 2న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండల పరిధిలోని తాడూరు. నారాయణ ఆత్మహత్య చేసుకొని ఏడాది గడచినా ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందలేదు.నారాయణకు భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు మల్లికార్జున, కుమార్తె సుజాతమ్మ ఉన్నారు. అయితే, నారాయణ భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యం వల్ల చనిపోగా, కూతురు కుటుంబ కలహాల వల్ల అల్లుడి చేతిలో హతమైంది. కుమారుడు మల్లికార్జునకు పెళ్లయింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. నారాయణకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు గుత్తకు తీసుకొని కంది, వేరుశనగ పంటలను వేసేవారు. పంటనే నమ్ముకున్న ఆయన తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సీజన్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆంధ్రా బ్యాంకులో రూ. లక్ష పంట రుణంతో పాటు బయటి వ్యక్తుల దగ్గర మరో రూ.4.80 లక్షలు అప్పులు మిగిలాయి. తొలి విడతలో రూ. 36 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. పంటలు సరిగ్గా పండక, ప్రభుత్వం పట్టించుకోక, అప్పులు తీర్చే మార్గం లేక నారాయణ తీవ్ర మనస్తాపం చెందారు. పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విచారణ చేసిన ఆర్డీఓ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. అయినా, నేటి వరకు నయాపైసా సహాయం అందలేదని, దిక్కుతోచడం లేదని నారాయణ కుమారుడు మల్లికార్జున ఆవేదన చెందుతున్నారు. రామాంజినేయులు, సాక్షి, డోన్ రూరల్, కర్నూలు జిల్లా. -
రైతులు, యువత ఫ్రంట్‌ఫుట్ ఆడాలి
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రికెట్ పరిభాషను రాజకీయాలకు అనువర్తింపజేశారు. ‘రైతులు, యువత ఏ మాత్రం భయం లేకుండా ఫ్రంట్‌ఫుట్ బ్యాటింగ్ చేయాలి’ అని అన్నారు. ‘మనం ఆడితే ఫ్రంట్‌ఫుట్ ఆడతాం, సిక్స్’ కొడతాం అని పేర్కొన్నారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ప్రసంగిస్తూ ‘దేశంలోని రైతులు, యువత ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పిచ్‌పై ఫ్రంట్‌ఫుట్ వచ్చి ఆడాలి. ఐదేళ్లుగా ప్రధాని మోదీ బ్యాక్‌ఫుట్ వేసి ఆడుతున్నారు’ అని పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయలేక పోయిందన్నారు. ‘రైతులకు సాయం చేస్తాననీ, యువతకు ఉద్యోగాలిస్తాననీ మోదీ మాట ఇస్తారు. కానీ ఆయనెప్పడు బ్యాక్ఫుటే ఆడతారు (వెనకడుగు వేస్తారు)’ అని రాహుల్ అన్నారు. -
రాజస్తాన్‌లో రూ.18వేలకోట్ల రుణమాఫీ
జైపూర్: సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్లు రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ బుధవారం ప్రకటించారు. సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారిగా కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గెహ్లోత్ మీడియాతో మాట్లాడారు. ఇతర బ్యాంకుల్లో తీసుకున్న రూ.2లక్షల లోపు రుణాలనూ మాఫీ చేయనున్నారు. దీంతో రాజస్తాన్‌లో మొత్తంగా రూ.18,000 కోట్ల మేర రైతు రుణాలు మాఫీకానున్నాయి. నవంబర్ 30లోపు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తారు. -
మూడేళ్లయినా ఎక్స్‌గ్రేషియాకు దిక్కులేదు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు. రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. రుణ మాఫీ కాలేదు.. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు? – కిరణ్, మృతుని సోదరుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. – మృతుడి తండ్రి నర్శింగరావు -
రాజకీయాల్లో నైతిక విలువల్లేవు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని, రాజకీయాల్లో జవాబుదారీతనం, నైతిక విలువలు నశిస్తున్నాయని జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అన్నారు. మంగళవారం ఇక్కడి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ‘ఈ రోజు గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి. వీరిద్దరూ దేశంలో తమదైన ముద్ర వేశారు. రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి శాస్త్రి. నేటి రాజకీయాల్లో అలాంటి నైతికతను మనం ఆశించలేకపోతున్నాం’ అని అన్నారు. రైతు రుణాల వసూలులో కఠినంగా ఉన్నవారు, డిఫాల్టర్లపై ఎందుకు కనికరం చూపుతున్నారని ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవాలను వెలికి తీయాల్సిన మీడియా ఇప్పుడు కార్పొరేట్ చేతిలో బందీగా మారిందని, పాలకులు మీడియా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే అడ్వర్టయిజ్మెంట్లు నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను నీరుగారుస్తోందని, బీఎస్ఎన్ఎల్ను కాదని జియోకు ప్రచారం కల్పించడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సమానత్వంతోనే అవినీతి అంతం సమాజంలో సమానత్వం వచ్చినప్పుడే అవినీతి నశి స్తుందని కన్నయ్య చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర విధానాల్ని ఎదురించడానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఒక్కటవ్వడాన్ని ఆయన సమర్థించారు. నీల్, లాల్ కలసి పోరాడాలి నీల్– లాల్ కలిసి పోరాడటాన్ని కన్నయ్య సమర్థిం చారు. మహారాష్ట్రలో పారిశుద్ధ్య కార్మికుల కోసం తాను– జిగ్నేశ్ మేవానీ కలసి పోరాడటాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశంలోని 90 శాతం సహజ వనరులను కేవలం 2 కంపెనీలు దోచుకుం టున్నాయని ఆరోపించారు. అన్యాయాన్ని ఎదురించి న వారిపై దేశద్రోహులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ అనుకూలురు అంటూ ముద్రవేస్తున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన దేశభక్తి కేసు కూడా అలాంటిదేనన్నారు. ఆ కేసులో ఇప్పటివరకూ ఎలాం టి చార్జిషీటు దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై దేశద్రోహం పెట్టిన తొలి కేసుగా ఇది చరిత్రలో నిలిచిపోతుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు లు దేవులపల్లి అమర్, శ్రీనివాసరెడ్డి, విరాహత్ అలీ తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులకు న్యాయం చేకూరేలా సాగుతు న్న పోరాటంలో మద్దతివాలని కన్నయ్యను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
‘బద్ధవ్యతిరేకులతో స్నేహమా?’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ద్రోహి అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతి నిధి వేణుగోపాల చారి తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే యావత్తు తెలంగాణ జాతి క్షమించదన్నారు. నాలుగేళ్లుగా ఎన్నికలకు పోదామంటూ సవాళ్లు విసిరిన కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీలు ఇప్పుడు ఓటర్ల జాబితా తప్పులతడక అంటూ ఎందుకు వెనకాడుతున్నాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, సీపీఎస్ రద్దు అంటూ హామీలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ముందు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. అధికార దాహంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. -
అధ్యయనం చేశాకే హామీలు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం రెడీ.. ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కంటే భారీ సభ... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ టూర్ సక్సెస్ రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్‌తో కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. -
నేతన్నకు రుణమాఫీ
సాక్షి, వరంగల్ రూరల్ : చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుంది. ఆ హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయిలో లబ్ధిదారుల గుర్తిం పుతోపాటు రుణమాఫీ అమలు చేస్తే వర్తించే బ్యాంకులు, లబ్ధిదారుల స్టేటస్ తదితర సమగ్ర వివరాలతో జిల్లా కమిటీ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికను కలెక్టర్ ఆమోదంతో చేనేత జౌళిశాఖ రాష్ట్ర శాఖకు నివేదికను అందించారు. రుణమాఫీ చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,167 మంది చేనేత కార్మికులకు రూ.7.27 కోట్ల లబ్ధి చేకూరనుంది. రెండు విధాలుగా రుణ మాఫీ.. 1 ఏప్రిల్, 2010 నుంచి 31 మార్చి 2017 వరకు చేనేత కార్మికులు పొందిన రుణాల్లో లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూల రుణ మొత్తాన్ని చేనేత జౌళి శాఖ భరిస్తే, వడ్డీ మొత్తాన్ని బ్యాంకులు భరిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాల పరిమితిలో రుణం పొంది అప్పులు తిరిగి చెల్లించిన వారికి రూ.లక్ష రీయింబర్స్మెంట్ చేయనున్నారు. ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణాలు పొందిన చేనేత కార్మికులకు రూ.లక్ష ప్రయోజనం కలుగుతుండడం గమనార్హం. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులతో రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఖరారు.. ఈ పథకం అమలు కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్, చేనేత జౌళి శాఖ అధికారి, నాబార్డ్ ఏజీఎం, డీసీసీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార శాఖ ఆడిట్ అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ జిల్లాలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి చేనేత రుణాలు పొందిన వారి వివరాలు సేకరించి ఇటీవల నేతన్నకు రుణమాఫీఆయా జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల గుర్తించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వానికి నివేదికలు పంపాం చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ రుణమాఫీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారందరివి ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. –రమేష్, చేనేత జౌళి శాఖ ఏడీ, వరంగల్ రూరల్ -
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ
శంకరపట్నం(మానకొండూర్) : తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం వ్యవసాయ సబ్ మార్కెట్లో ఆదివారం బీజేపీ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మార్కెట్ ఆవరణలో నిర్వహించే సభాప్రాంగణాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఒ క్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1,55,000 రాష్ట్రానికి అందిస్తే.. ఒక్క డబుల్ బెడ్రూం నిర్మించలేదని ఆరోపించారు. వేల కోట్ల నిధులను తెలం గాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. ఫసల్‌బీమా రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో ఎక్కువ సంఖ్యలో చేయలేదని మండిపడ్డారు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఈనెల 4న శంకరపట్నం మండలకేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ఎండగడతామన్నా రు. సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాననసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అలివేలి సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇనకొండ నాగేశ్వర్‌రెడ్డి, గణపతి, ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ చదువు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయకులు సూదగోని శ్రీనివాస్, కోరెం శ్రీనివాస్‌రెడ్డి, దండు కొంరయ్య, పుట్టపాక సమ్మయ్య, చల్ల ఐలయ్య, నరేందర్, జైపాల్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అక్కడి రైతులు, విద్యార్థులు, పేద మహిళలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. జాతీయ, సహకార బ్యాంకుల్లో లక్ష వరకు పంట రుణమాఫీ, సాగు నీటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల వ్యయం, విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ. 5 వేల కోట్లతో ‘రైతు బంధు మార్కెట్ మధ్యంతర నిధి’ని ఏర్పాటు చేసి పంట ధరల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రైతులపై పడకుండా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పారు. వ్యవసాయంలో అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రైతులను ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ బోర్లకు 10 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి సమయంలో ప్రభుత్వ కానుకగా ‘వివాహ మంగళ’ పథకం కింద రూ.25 వేల నగదు, 3 గ్రాముల బంగారం. ► బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల కోసం ‘స్త్రీ సువిధ’ పథకం కింద ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్ ► పేదలకు అందుబాటు ధరల్లో ఆహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘ముఖ్య మంత్రి అన్నపూర్ణ క్యాంటీన్ల’ ఏర్పాటు ► లోకాయుక్తను కాంగ్రెస్ అవినీతి నిరోధక విభాగంలో ఉపవిభాగం చేయగా, దానికి మళ్లీ పూర్వస్థితి కల్పిస్తామని హామీ. ► అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు సీఎం కార్యాలయంలోనే హెల్ప్‌లైన్. ► అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యక ర్తలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టం. ► కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థికీ ‘ముఖ్యమంత్రి ల్యాప్‌టాప్ యోజనే’ కింద ఉచిత ల్యాప్‌టాప్. ► ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్ యోజనే’ కింద పేద మహిళలకు ఉచిత స్మార్ట్‌ఫోన్. ► ఉద్యాన నగరి బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని హామీ. ► ఆవుల సంరక్షణ కోసం గతంలో బీజేపీ తీసుకురాగా కాంగ్రెస్ రద్దు చేసిన ‘గౌ సేవా ఆయోగ్’ పునరుద్ధరణ. -
ఆ రైతులకు రుణమాఫీ ఏమైంది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. తీవ్రమైన కరువు ప్రకటించిన కారణంగా రైతులు రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్నారని, అయితే వారికి రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. రుణమాఫీ నోటీసులు వచ్చిన వారికి కూడా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీకి చక్రవడ్డీ కలిపి లక్షా యాబై వేలు కూడా దాటిందని చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
త్వరలో చేనేత రుణ మాఫీ
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల రుణ మాఫీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.5 కోట్ల నిధులు విడుదల చేసిందని, 2,500 మంది కార్మికులు రుణ మాఫీ ద్వారా లబ్ధిపొందనున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీమేరకు ప్రతి కార్మికుడు రూ.లక్ష వరకు రుణ మాఫీకి అర్హుడని వెల్లడించారు. చేనేత, జౌళి శాఖ పథకాలు, కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల జాబితా రూపకల్పన సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. చేనేతతోపాటు పవర్‌లూం కార్మికులకు ఉమ్మడిగా రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని తొలిసారిగా రాష్ట్రంలో అమలు చేయబోతున్నామన్నారు. యార్న్, రసాయనాలు, డైల కొనుగోళ్లకోసం చేనేత కార్మికులకు రాయితీల చెల్లింపులో పురోగతిని సైతం మంత్రి సమీక్షించారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశామని అధికారులు మంత్రికి తెలియజేశారు. నవంబర్ తొలివారం నుంచి ఈ రాయితీల పంపకాలను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి రంగానికి ప్రకటించిన రాయితీలు నేరుగా కార్మికులకు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు 40 శాతం, పవర్‌లూం కార్మికులకు 10 శాతం వరకు రాయితీలను పెంచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రంలో చేనేత కార్పొరేషన్, పవర్ లూం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత విభాగం డైరెక్టర్ శైలజా రామయ్యర్‌లను ఆదేశించారు. ఈ కార్పొరేషన్లకు ప్రభుత్వం కార్పస్ ఫండ్ కేటాయిస్తుందన్నారు. గద్వాల్లో నిర్మించతలపెట్టిన చేనేత పారిశ్రామికవాడపై సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఆధునిక లూమ్ ఉత్పత్తిదారులు, పవర్‌లూం కార్మికులతో సిరిసిల్లలో నవంబర్ 18న మెగా పవర్‌లూం అప్‌గ్రెడేషన్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 2018లోగా లూమ్ అప్‌గ్రెడేషన్ పూర్తి కానుందని తెలిపారు. -
రుణమాఫీతో రైతులకు ఒరిగింది శూన్యం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాలుగు విడతలుగా చేసిన రుణమాఫీతో రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్‌తో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరికి రూ.2 వేలకు తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని, మొక్క జొన్నకు కేంద్రం ఇచ్చే ధరకు అదనంగా రూ.2 వేలకు తగ్గకుండా, పత్తికి రూ.5 వేలకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తాను చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేకుండా పోయిం దని, టీఆర్ఎస్ కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇవ్వ డమే ‘వ్యవసాయ యాంత్రీకరణ’అని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు ఒక్క పైసా నష్ట పరిహారం ఇవ్వని ఘనత కేసీఆర్ ప్రభుత్వాని దేనని ధ్వజమెత్తారు. ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వముందని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు రూ.25 వేలు, వరి రైతులకు రూ.15 వేల నష్ట పరి హారం చెల్లించాలని కోరారు. రైతు ఆత్మహత్య లకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో 3 వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు. రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 27న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చలో అసెంబ్లీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు సీఎం హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలన్నారు. -
రుణమాఫీకి రూ.19.22 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: చివరి విడత రుణమాఫీకి విడుదల చేసిన నిధులు సరిపోకపోవడంతో మరో రూ. 19.22 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రూ. 4,025 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ. 4 వేల కోట్లే విడుదల చేసింది. ఈ సొమ్ము సరిపోదని జిల్లా వ్యవసాయాధికారులు విన్నవించడంతో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతినిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. -
రుణమాఫీ చేయాలని ఆందోళన
► అర్ధనగ్నంగా రైతుల నిరసన టీనగర్: తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ చెన్నైలో రైతులు శుక్రవారం ఆందోళన జరిపారు. రాష్ట్రంలో కరువు నెలకొన్నందున రైతుల రుణాలను మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో జాతీయ దక్షిణాది నదుల అనుసంధానం రైతుల సంఘం సమన్వయకర్త అయ్యాకన్ను ఇదివరకే ఢిల్లీలో ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో రెండో విడతగా నిరవధిక ఆందోళన శుక్రవారం ప్రారంభించారు. చేపాక్కం అతిథిగృహం సమీపంలో జరిపిన ఆందోళనలో రైతులు కట్ డ్రాయర్లు, కౌపీనాలు ధరించి అర్ధనగ్నంగా పాల్గొన్నారు. అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ అనేక దఫాలుగా ధర్నాలు జరుపుతున్నామని, కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశా రు. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛన్ అందజేయాలని పదే పదే కోరుతున్నామని, దీనికి ఇంతవరకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణా ల కోసం నగలను వేలం వేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ వేలాన్ని ప్రభుత్వం అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు. చెరుకు రైతులకు అందజేయాల్సిన బకాయిలను ఇంకా చెల్లించలేదని, వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారం కానందున మళ్లీ ఆందోళనకు దిగామని, 32 జిల్లాల రైతులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలిపారు. జూలై నెల 10 తేదీ వరకు 32 రోజులపాటు నిరవధికంగా ఆందోళన జరిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో అనేక రాజకీయ పార్టీల నిర్వాహకులు పాల్గొని రైతులకు మద్దతుగా ప్రసంగించి వెళ్లారు. -
‘మాఫీ’పై మళ్లీ ఆశలు
♦ అర్హులైన రైతులకు అందే అవకాశం ♦ ప్రభుత్వానికి ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ ♦ రైతులు 20,848.. మాఫీ కావాల్సింది రూ.107.98కోట్లు అర్హత ఉన్నా రుణమాఫీ కాని పరిస్థితి.. అధికారుల నిర్లక్ష్యమో.. ప్రభుత్వ తప్పిదమో.. అటువంటి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.. అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించింది.. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20,848 మంది రుణమాఫీకి నోచుకోని రైతులు ఉండగా.. వీరికి రూ.107.98కోట్లు రుణమాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల రుణమాఫీ ప్రక్రియ ఈ ఏడాదితో పూర్తికాగా.. అర్హులై ఉండి.. రుణమాఫీ పొందని రైతుల విషయం మళ్లీ తెరపైకి రావడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. – ఖమ్మంవ్యవసాయం ఖమ్మంవ్యవసాయ: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ జాబితా తయారీ బాధ్యతను వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లకు అప్పగించింది. ఆయా శాఖలు రూపొందించిన జాబితా ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో ప్రభుత్వ శాఖలు తగిన జాబితా రూపొందించకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. రెండు జిల్లాలకు రుణమాఫీ నిధులు రూ.1711కోట్లు అవసరం ఉంటాయని ప్రాథమికంగా గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగా రెండు జిల్లాల్లోని 3.80 లక్షల మంది రైతులకు తొలి విడతలో రూ.427.80కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో జాబితాలను వడబోసి.. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో 3.59 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి మొత్తం రూ.1637కోట్లు అవసరం ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా తొలి విడతలో రెండు జిల్లాలకు రూ.409కోట్లు సరిపోతాయి. అయితే ప్రభుత్వం తొలి విడత కోసం రూ.427.80కోట్లు పంపింది. అయితే ఆ నిధులు అదనంగా ఉండటంతో వాటిని వెనకకు పంపించాలని ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి రూ.18కోట్లను వెనకకు పంపారు. ఈ క్రమంలో రూపొందించిన జాబితాలో అర్హత ఉన్న రైతులు రుణమాఫీకి నోచుకోకపోవటంతో రెవెన్యూ, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవటంతో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ, కలెక్టర్, నోడల్, లీడ్ బ్యాంక్ చుట్టూ కూడా రైతులు తిరిగారు. అయితే సమస్యను గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం అర్హత ఉండి.. రుణమాఫీకి నోచుకోని రైతుల జాబితా తయారు చేసింది. ఇందులో ఉన్న రైతులు తమకు రుణమాఫీ వర్తిస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అర్హులని అప్పుడే గుర్తింపు.. రెండు జిల్లాల్లో మరో 20,848 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వ శాఖలు అప్పుడే గుర్తించాయి. వీరికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం వివిధ బ్యాంకుల నుంచి భూముల పహాణీలను తాకట్టు పెట్టి.. పంట రుణాలు తీసుకున్న రైతులు(మిస్సైన వారు) 17,642 మంది వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. వీరికి సంబంధించి రూ.84.43కోట్ల రుణాలు మాఫీలో చేర్చాల్సి ఉందని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంతేకాక అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న గోల్డ్ లోన్ల వ్యవహారం కూడా ఉంది. రెండు జిల్లాల్లో 3,206 మంది రైతులు తమ పంట భూముల ఆధారంగా బంగారాన్ని అర్బన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వీటిని కూడా తొలుత రుణమాఫీలో చేర్చలేదు. ఆయా రైతులకు చెందిన రూ.23.55కోట్లు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో చేర్చాలి. మొత్తంగా 20,848 మంది రైతులను అర్హులుగా గుర్తించి, వారికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించి, వీరికి సంబంధించి రూ.140కోట్ల మంజూరుకు ప్రతిపాదించిందనే సమాచారం ఉంది. దీంతో రెండు జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ దక్కుతుందా? వీరిలో కూడా కొందరికే దక్కుతుందా? అనేది బాధిత రైతుల్లో చర్చనీయాంశంగా ఉంది. -
రుణమాఫీతో అంత ప్రమాదమా?
విశ్లేషణ దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా భారతీయ ఆర్థిక విధాన పండితులు శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే భారీ ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా ఉంటారు. అమెరికన్ అంతర్యుద్ధం 1865లో ముగిసిపోయినప్పుడు, అమెరికా పత్తి ఉత్పత్తి పునరుద్ధరణ జరిగి భారతీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. బాంబే ప్రెసిడెన్సీలో రైతులు పత్తి పండించడం తగ్గిపోయింది. రైతులకు రుణం ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు తిరస్కరించేవారు లేదా అధిక వడ్డీరేట్లను విధించేవారు. దీంతో సెటిల్మెంట్ డిమాండ్లు పెరిగిపోయాయి. దీని ఫలితంగా పుణే సమీపంలోని సుపా గ్రామంలో 1875లో దక్కన్ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణగా దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆగ్రహోదగ్రులైన రైతులు, వడ్డీవ్యాపారులపై దాడులు చేసి వారి ఇళ్లు తగులబెట్టారు. ఈ తిరుగుబాటు 30 గ్రామాలను ప్రభావితం చేసింది. గ్రామాల్లోని పోలీసు గస్తీ కేంద్రాలు త్వరలోనే రైతులను లొంగదీసుకున్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో నెలల తరబడి తిరుగుబాటు కొనసాగింది. దీంతో బాంబే ప్రెసిడెన్సీ 1878లో దక్కన్ రయట్స్ కమిషన్ని నెలకొల్పింది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆహారం కోసం, విత్తనాలు, ఎద్దులు వంటి ఇతర అవసరాలకోసం రైతులు కొద్ది మొత్తంలో తీసుకునే రుణాలు ఎప్పుడో ఒకసారి చేసే వెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా వారిని అధిక రుణగ్రస్తులను చేస్తున్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రైతుల రుణ భారాన్ని తగ్గించాలంటే, రుణాలు చెల్లించనివారిపై నిర్బం ధాన్ని నిషేధించాలని, రుణ బకాయి వసూలు కోసం రైతుల నివాస గృహాలను అమ్మకానికి పెట్టడం నుంచి మినహాయించాలని, రుణగ్రస్తుల నుంచి భారీ మొత్తాలను లాగేందుకు న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియలను నిలిపివేయాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో రైతు దురవస్థ ఇప్పటికీ మారలేదనిపిస్తోంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, రైతు అనుకూల విధానాలు కొత్తవేమీ కావు. 1989లో జనతాదళ్ ప్రభుత్వం ఒక్కో రైతుకు పదివేల రూపాయల వరకు రుణాల రద్దుకు అవకాశమిస్తూ వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రవేశపెట్టింది. 1992లో ఇది 4.4 కోట్లమంది రైతులకు 6 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేసింది. 2008లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం ప్రవేశపెట్టగా 5 కోట్ల 97 లక్షల మంది పెద్ద రైతులతోపాటు 3 కోట్ల 69 లక్షలమంది సన్నకారు రైతులు 71,600 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు. రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈమధ్యే దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న 50 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. తరువాత అవసరమైన రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేయాలని యూపీ నూతన ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాలి. అయితే ఇది సరిపోదు. ఇలాంటి రుణమాఫీలను దేశవ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులందరికీ వర్తింపచేయాల్సి ఉంది. భారత్‌లోని 12.1 కోట్ల వ్యవసాయ భూముల్లో 9.9 కోట్ల భూములు సన్నకారు రైతులవే అయి ఉంటున్నాయి. బహుళ పంటల విధానం ద్వారా ఇలాంటి రైతులు దేశంలో పండే కూరగాయల్లో 70 శాతం, తృణధాన్యాల్లో 52 శాతం పండిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల అవసరం పెరగడంతో రైతులు విత్తన ధరల పెరుగుదల భారాన్ని మోయవలసివస్తోంది. అన్ని విత్తనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. పాతకాలంలో మాదిరిగా రైతులు విత్తనాలను కులధనం లాగా తమ కుమారులకు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి పోయింది. దీనికి తోడు ఎరువుల ధరలూ పెరిగాయి. వ్యవసాయ మెషినరీకి ప్రత్యామ్నాయంగా ఉండే కూలీలకయ్యే ఖర్చు కూడా తదనుగుణంగా పెరిగింది. పశువుల వాడకం ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇక పురుగుమందుల ద్వారా పంట రక్షణ ఖర్చు చుక్కలనంటింది. మన రైతులు తమ పంటలకు మార్కెట్ విలువను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 1972లో కలకత్తాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక కమలాపండును మార్కెట్లో వినియోగదారు కొనుగోలు చేసే ధరలో కేవలం 2 శాతం మాత్రమే దాన్ని పండించిన రైతుకు అందుతోందని తెలిసింది. పంటవిలువలో అధిక భాగాన్ని మండీలు, మార్కెట్లే మింగేస్తున్నాయి. మోదీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా, ఇంతవరకు దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ సామగ్రి, పరికరాలను దేశంలోనే తయారు చేయడంపై దృష్టి పెట్టింది కాబట్టి భారత వ్యవసాయ సామగ్రి విధానాన్ని కూడా పూర్తిగా మార్చవలసి ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మన వ్యవసాయ సామగ్రి, పరికరాలను ప్రామాణీకరించాల్సి ఉంది. మన వ్యవసాయ పాలసీ తెగుళ్లను, పురుగులను ఎదుర్కోవడానికి జీవ, రసాయన, యాంత్రిక, భౌతిక విధానాలను మిళితం చేయడంపై దృష్టి సారించాలి. పురుగుమందుల వాడకాన్ని తొలగిం చడం లేక గణనీయంగా తగ్గించడంపై దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలి. భారతీయ ఆర్థిక విధాన పండితులు దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్నయినా శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా మౌనంగా ఉంటారు. వాస్తవాలను పరిశీలి ద్దాం. ఆర్బీఐ ప్రకారం 2000– 2013 కాలంలో దేశంలో లక్షకోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేశారు. వీటిలో 95 శాతం రుణాలు బడా సంస్థల రుణాలే మరి. దీంతో పోలిస్తే ఎస్బీఐ ఇటీవల ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిపై రుణాలమీద 40 శాతం తగ్గింపుతో ఒక సెటిల్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 25 లక్షలవరకు రుణం తీసుకున్నవారికి 6 వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తూ రుణాలను తగ్గించారు. రైతులలో రుణ చెల్లింపు సంస్కృతి లేక పోవడం వల్ల భారత్‌లో మొండిబకాయిలు పేరుకోవడం లేదు. మొండి బకాయిల్లో 50 శాతం వరకు మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చినవే. పిండదశలోని రుణ చెల్లింపు సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించే ముందు విమర్శకులు వ్యవసాయ రుణాల చరిత్రను గుర్తిస్తే బాగుంటుంది. దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఉబ్బిన కడుపులు, అనాధ పిల్లల రూపంలో దోపిడీ పరిణామాలు నాలో చాలా కాలం క్రితమే బలమైన ముద్రవేశాయి. దిద్దుబాటు చర్యలు లేకుంటే మన రైతుల విధి అనిశ్చితంగానే ఉంటుంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త, బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
రుణ మాఫీ కాలేదంటూ జన్మభూమిలో నిరసన
వడ్డేశ్వరం గ్రామ సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ను నిలదీసిన స్థానికులు వడ్డేశ్వరం (తాడేపల్లి) : అర్హులకు రుణమాఫీ కాలేదంటూ గ్రామస్తులు అధికారులను, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను నిలదీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ‘జన్మభూమి - మా ఊరు’ గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి తిరుమలదేవి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అమలు చేయటమే తమ ప్రభుత్వ ధేయమని చెప్పారు. ఈ గ్రామం రాజధాని ప్రాంతంలో ఉన్న దృష్ట్యా అనేక పరిశ్రమలు వస్తాయని, వాటిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు అనే రైతు కల్పించుకుని తమ గ్రామంలో అర్హులైన వారికి నేటికీ రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశాడు. తాను టీడీపీ కార్యకర్తనేనంటూ సమస్యను ఎంపీకి విన్నవిస్తుండగానే అతనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివర్లో అతను ఎంపీ కారు వద్దకు కూడా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించరా అంటూ కేకలేశాడు. అతనిని బయటకు పంపండంటూ టీడీపీ నేతలకు ఎంపీ హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దండమూడి శైలజారాణి, గ్రామ సర్పంచ్ కత్తిక మల్లేశ్వరి, ఎంపీడీవో పి.రోశయ్య, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈవో సుబ్బారావు, గ్రామ కార్యదర్శి గల్లా అమరేష్, జన్మభూమి కమిటీ సభ్యుడు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘన.. కాగా, సభలో అడుగడుగునా ప్రొటోకాల్ ఉల్లంఘన చోటు చేసుకుంది. కార్యక్రమం టీడీపీ సభలా మారిపోయింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గల్లా జయదేవ్ తనతో పాటు వచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, పలువురు టీడీపీ నేతలను వేదికపై కూర్చోబెట్టుకున్నారు. దీంతో స్థలం లేక అధికారులు వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, టీడీపీ సభా అని వచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇవేమీ పట్టని టీడీపీ నేతలు మాత్రం వేదికపై ఆశీసులై తమ దర్పాన్ని ప్రదర్శించారు. సీపీఐ వినూత్న నిరసన వడ్డేశ్వరం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం భూములను లీజు పేరుతో విదేశీయులకు కట్టబెట్టడంపై మౌనంగా తన నిరసన వ్యక్తం చేశారు. -
పోరు భూమి
నేటి నుంచి మూడో విడత జన్మభూమి సమస్యలు, హామీలపై నిలదీతకు ప్రజలు, విపక్షాల సన్నద్ధం పింఛన్లు, ఇళ్లు, కమిటీల పెత్తనం, రుణ మాఫీ తదితర సమస్యలపై ప్రశ్నించే అవకాశం విశాఖపట్నం : ‘జన్మభూమి మావూరు’ శుక్రవారం నుంచి మళ్లీ మొదలవుతోంది. తొలి రెండు విడతలు మొక్కుబడి తంతు గానే సాగగా.. ఈసారి మాత్రం తమపై వత్తిడి ఉం టుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో తొలివిడత, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో మలివిడత మొక్కుబడిగా సాగగా.. మూడో విడత మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు.. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. అర్జీల చిట్టా కాకిలెక్కలే! టీడీపీ సర్కారు గద్దనెక్కిన తర్వాత 2014 అక్టోబర్‌లో తొలి జన్మభూమి తలపెట్టారు. హుద్‌హుద్ దెబ్బకు ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేకులుపడ్డాయి. ఆ తర్వాత నవంబర్‌లో కొనసాగించగా, తుపాను ప్రభావంతో అర్జీలు వెల్లువెత్తాయి. ఏకంగా 3.54 లక్షల అర్జీలు రాగా, వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను మాత్రమే అప్లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో 2015 జూన్‌లో మొక్కుబడిగా జరిగిన రెండోవిడత జన్మభూమిలో 20 వేల అర్జీలు మాత్రమే వచ్చాయి. రెండు విడతల్లో 3.74లక్షల అర్జీలు రాగా, 2.02,390 అర్జీలను అప్లోడ్ చేశారు. వీటిలో 1.81లక్షల అర్జీలను పరిష్కరించగా, ఇంకా 20,883 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని లెక్కతేల్చారు. ఈ లెక్కలన్నీ కాకిలెక్కలుగానే కన్పిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొత్త కార్డులు జారీ చేసినా.. టీడీపీ పగ్గాలు చేపట్టక ముందు జిల్లాలో 12.25 లక్షలకుపైగా బీపీఎల్ కార్డులుండేవి. ప్రస్తుతంవాటి సంఖ్య 10,28,800కు చేరింది. అంటే రెండు లక్షలకు పైగా కార్డులు వివిధ రూపాల్లో తొలగించేశారు. కొత్తకార్డుల కోసం 1.75 లక్షల మంది దరఖాస్తు చేస్తే 1.15 లక్షల కార్డులు మాత్రమే మంజూరు చేశారు. కాగా ఇప్పటివరకు ముద్రించిన కార్డులు కేవలం 70 వేల లోపే. కొత్తకార్డులను జన్మభూమి పంపిణీ చేయనుండగా మంజూరైన కార్డులందని వారు, కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డులు కోల్పోయిన వారు సైతం సభల్లో నిలదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పింఛన్‌దారుల పాట్లు.. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో 3.26 లక్షల పింఛన్లుండగా.. వడపోతల పేరిట పాతిక వేలకు పైగా పింఛన్లను తొలగించారు. ఆ తర్వాత కాల్‌బ్యాక్, కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు కలుపుకొని జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,24,585కు చేరితే గత మూడునెలల్లో ఆధార్ మిస్‌మ్యాచ్ పేరిట 28,287 పింఛన్లను నిలిపేశారు.మరో పక్క వరుసగా మూడునెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో జిల్లాలో సుమారు 5వేలకు పైగా పింఛన్లు రద్దుచేశారు. వీరంతా సభల్లో తమ గోడు వినిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ మీటింగ్‌లో పింఛన్ల విషయమై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హౌసింగ్ పైనే దృష్టంతా.. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ జీవీఎంసీ పరిధిలో 20.030 ఇళ్లు మంజూరు చేస్తే ఏకంగా 1.84 లక్షల మంది దరఖాస్తుచేసుకున్నారు. గ్రామీణజిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికే 46,053 మంది అర్హులుగా లెక్కతేల్చి అప్లోడ్ చేశారు. కానీ ఈ జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాల్లో టీడీపీ కార్యకర్తలెవరో లెక్కతేల్చి వారికి మాత్రమే ఆమోదముద్ర వేయనుండడంతో అర్హులైన మిగిలిన బాధితులు సభలను వేదికగా చేసుకుని నిలదీసే అవకాశం ఉంది. ‘కొను’గోల్మాల్ ఇక జిల్లాలో ఖరీఫ్ కోతలు నూరుశాతం పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నేటివరకు ఎక్కడా కొనుగోలు ప్రారంభం కాలేదు. దళారీల చేతిలో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయి. రూ.3 వేల పెట్టుబడి నిధి చాలామంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదు.మరో పక్క 2015-16లో జమకావాల్సిన రెండో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ఇంకా విడుదల చేయలేదు. హుద్‌హుద్ బాధిత రైతుల్లో చాలా మందికి ఇంకా పరిహారం జమకాని పరిస్థితి నెలకొంది. ఇంకా జిల్లా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రతీ పథకం లోనూ జన్మభూమి కమిటీల పెత్తనం.. వసూళ్ల దందా, ఎన్నికల హామీల అమలులో సర్కార్ వైఫల్యాలపై జన్మభూమి సభలను వేదికగా చేసుకుని యుద్ధభేరి మోగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతుండడం అధికారులకు చమటలు పట్టిస్తోంది. -
అవినీతికి అడ్డాలుగా పీఏసీఎస్‌లు!
ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అవినీతి కూపంలో కూరుకుపోతున్నాయి. పాలకవర్గాలు, అధికారులు కుమ్మక్కై డబ్బు కొల్లగొడుతున్నారు. చేయని తప్పులకు రైతులను బాధ్యులను చేస్తున్నాయి. రుణాలు చెల్లించినా చెల్లించలేదని రికార్డుల్లో ఉండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మండల పరిధిలోని రాచకొండ దండుమైలారం కో- ఆపరేటివ్ బ్యాంకులో రూ. 26 లక్షల అక్రమాలు జరిగినట్లు శనివారం వెలుగుచూసింది. ఈ బ్యాంకులో మొత్తం 1247 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అక్రమార్కులు తొలి విడత రుణ మాఫీ నిధుల్లో 50 శాతం సొమ్ము, బ్యాంకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల నిధులు కాజేశారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై బంగారం, దీర్ఘ, స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్నట్లుగా రికార్డుల్లో ఉంది. ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లు, నకిలీ పాసుపుస్తకాలతో ఈ తతంగం సాగింది. బ్యాంకులో ఇప్పటి వరకు సుమారు రూ. 26 లక్షల అక్రమాలు వెలుగు చూశాయని విచారణ అధికారి నర్సింహారెడ్డి చెప్పారు. బ్యాంకు సీఈఓ సయ్యద్ మక్బుల్ మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
తాకట్టు.. కనికట్టు
రుణమాఫీ మాయ రద్దుకాని బంగారం రుణాలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు వేలం ప్రకటనతో రుణాలు రెన్యువల్ చేయించుకున్న రైతులు బందరు మండలం మేకవాని పాలేనికి చెందిన నండూరి మురళీధర్‌కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. రెండేళ్ల క్రితం బందరు ఇండియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.82 వేల రుణం తీసుకున్నారు. అదే సంవత్సరం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదటి విడతగా బంగారం కుదవ పెట్టి రూ.33వేలు, రెండో విడతగా రూ.43 వేలు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ మొదటి, రెండు, మూడోవిడత జాబితాల్లో మురళీధర్ పేరు లేదు. రుణమాఫీ జరగలేదని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బందరు మండలం సీతారామపురానికి చెందిన బెజవాడ రవికుమార్ తన భార్య నగలను కుదువపెట్టి మచిలీపట్నం ఇండియన్ బ్యాంకు లో రూ.లక్ష రుణం తీసుకున్నారు. టీడీపీ నాయకుల హామీతో రుణమాఫీ జరుగుతుందనే ఆశతో బకాయి చెల్లించలేదు. రుణమాఫీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ పొలానికి సంబంధించిన సర్వే నంబరు తప్పుగా నమోదు చేశారు. ఈ కారణంతో రవికుమార్ బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణం మాఫీ కాలేదు. సర్వే నంబరు సరి చేయాలని బ్యాంకు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేదు. మచిలీపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుచేస్తున్న రుణమాఫీలో న్యాయం జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాల మాఫీకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేకుండా పోయింది. జిల్లాలో 2,60,737 మంది రైతులుబంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ జాబితాలను ప్రకటించింది. మొదటి విడతలో 2.84 లక్షల మంది రైతులకు రూ.997 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ.324.95 కోట్లను విడుదల చేశారు. రెండో విడతలో 1.84 లక్షల మంది రైతులకు రూ.531.96 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ. 227.13 కోట్లు విడుదల చేశారు. మూడో విడతలో రూ.78.25 కోట్లు జరిగినట్లు చూపి రూ.36.33 కోట్లను విడుదల చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి రూ.50వేలు లోపు పంట రుణం తీసుకుంటే ఆ తరహా రైతులకు రుణమాఫీ జరిగిందని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లోని భార్య, పిల్లల గాజులు, పుస్తెల తాళ్లు తదితరాలను తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోవటంతో వడ్డీ పెరిగిపోయింది. గడువు మీరిన రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకు అధికారులు బంగారు నగలు వేలం వేస్తామని ప్రకటనలు ఇచ్చారు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇంత వ్యవసాయం చేసి భార్య, పిల్లల నగలు విడిపించుకోలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలానికి వెళ్లకుండా బయట అప్పులు చేసి వడ్డీ, బకాయిలు చెల్లించారు. బందరు మండలం చిన్నాపురం కెడీసీసీ బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వారి జాబితాలను సకాలంలో పంపకపోవటంతో ఆ బ్యాంకు పరిధిలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలను రద్దు చేసేది లేదని వాటిని పక్కన పెట్టించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల కోసం రైతులు తీసుకున్న రుణాల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాలను ఎప్పటికి తయారు చేస్తారు. ఎప్పటికి అమలు చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. -
మైక్రో ఉచ్చులో విలవిల
డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు ఇవ్వాల్సిన రుణం రూ.1139కోట్లు ఐదు నెలల్లో ఇచ్చింది రూ.175కోట్లు పాత బకాయిల పేరుతో ముఖం చాటేస్తున్న వైనం రుణమాఫీ పాపం డ్వాక్రా సంఘాలకు శాపమై వెంటాడుతోంది. రుణాలు దొరక్క నిరుపేద మహిళలు మైక్రో ఉచ్చులో పడివిలవిల్లాడుతున్నారు. మాఫీకి మంగళం పాడేసి..ఆర్థిక వెసులుబాటు పేరిట సంఘానికి రూ.30వేల చొప్పున జమ చేసినా బ్యాంకర్లు మాత్రం ముఖం చాటేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలంటూ సంఘాల పాలిట సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..దాటాక బోడి మల్లన్న చందంగా గద్దెనెక్కే వరకు మాఫీ జపం పాటించిన టీడీపీ పాలకులు పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీని మాఫీ చేశారు. ఏడాది పాటు ఊరించి ఊరించి చివరకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సంఘానికి రూ.30వేలుగా జమ చేశారు. ఈ మొత్తంతో పదిరెట్లు రుణం ఇప్పిస్తాం..దాంతో సంఘాలన్నీ బలోపేతమైపోతాయని ఊహలపల్లకిలో ఊరేగించారు. తీరా ఆచరణలో మాత్రం బ్యాంకర్లు వీరికి చుక్కలు చూపిస్తున్నారు. మార్చిలో ప్రకటించిన రుణప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు రూ.1139 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలను 24,392 మందికి ఇవ్వను న్నట్టుగా ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అప్పుడే ఐదు నెలలు గడిచిపోయింది. కేవలం రూ.175కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. అది కూడా పాతబకాయిలు చెల్లించినవారికే. ఈ విధంగా రుణాలు పొందిన వారు జిల్లాలో నాలుగువేలకు మించి లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆర్థికసంవత్సరం ముగియడానికి మిగిలింది ఏడు నెలలే. ఇవ్వాల్సిన రుణ లక్ష్యం సుమారు వెయ్యికోట్ల వరకు ఉంది. ఆర్థిక వెసులుబాటుతో సర్కార్ సమకూర్చిన పెట్టుబడి నిధిపై చిత్తశుద్ధి ఉంటే రుణాలు ఇవ్వొచ్చు. కానీ బ్యాంకర్లు మాత్రం రుణమాఫీ వర్తించని రైతుల మాదిరిగానే వడ్డీతో కొండలా బకాయిలున్న సంఘాల వైపు కన్నెత్తయినా చూడడంలేదు. దీంతో ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్టుగా డ్వాక్రా సంఘాల మహిళలు రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పేది ఒకటైతే..క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటిగా ఉంది. దీంతో రుణాలు వీరికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. గతేడాది రుణమాఫీ పుణ్యమాని రూ.755 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా అతికష్టంమీద రూ.200కోట్లకు మించి ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అదే సీను రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీబాదుడుకు జడిసి ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం వ్యాపార, కుటుంబ అవసరాలు నిమిత్తం మళ్లీ మైక్రో సంఘాల దారి పట్టాల్సి వస్తోంది. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించకతప్పని దుస్థితి. -
దారుణం
లక్ష్యం మేరకు అప్పులు అనుమానమే పాస్‌బుక్‌పై అన్నదాతకు ఒకే పంటరుణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే వర్తింపు వరికి ఎకరాకు రూ.24 వేలు చెరకుకు రూ.35వేలలోపే.. రుణమాఫీ పరోక్షంగా రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక పాస్‌బుక్‌పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆపై కావాలంటే ఇప్పుడున్న ఏడు శాతానికి బదులు 12 శాతం వడ్డీ భరించాల్సిందే. విశాఖపట్నం : జిల్లాలో ఖరీఫీలో 2,08,988 హెక్టార్లలో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,93,447 మంది రైతులకు షార్ట్‌టర్మ్(పంట) రుణాలుగా రూ.1200 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది కేవలం 60 శాతమే రుణాలిచ్చారు. ఈఏడాది ఏదిఏమైనా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా యంత్రాంగం పట్టుదలతో ఉంది. గతేడాది 32 మంది కౌలురైతులకు రూ.8లక్షలు మాత్రమే రుణంగా ఇచ్చారు. ఈ ఏడాది 40వేల మందికి కౌలుఅర్హత కార్డుల జారీకి ఏర్పాట్లుతో ఆ మేరకు కార్డులు జారీ అయిన ప్రతీఒక్కరికి రుణాలివ్వాలని యోచిస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాలకు ఆర్బీఐ నిబంధనలు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. విరివిగా రుణాలిచ్చేవారు... : గతంలో భూమి దస్తావేజులు, పాస్‌బుక్, టైటిల్ డీడ్లను తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు..ఈ పాస్‌పుస్తకం జెరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధరంగాలకు అవసరాలకు తగ్గట్టుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలిలక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద... ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునే వారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడు శాతం వడ్డీతోనే రైతు చెల్లించే వాడు. ఇప్పుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టీ ఆ భూమిపై వేసే పంటకు సంబంధించి స్కేల్ఫైనాన్స్కు తగ్గట్టుగా రుణమివ్వాలని ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది. ఇలా అయితే లక్ష్యం కష్టమే.. వరికైతే ఎకరాకు రూ.24వేలు, చెరకుకు రూ.35వేల వరకు మాత్రమే రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదార్ పాస్పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కుదువపెట్టి భూమి డాక్యు మెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు..కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డింపు భరించాల్సిందే. దీంతో గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అధికారం బ్యాంకర్లకు లేదు. అధికారులు సిఫారసు చేసినంత మాత్రాన కౌలురైతులకు రుణాలిచ్చే అవకాశం లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి. దీంతో రుణ అర్హత కార్డులు అలంకారప్రాయం కానున్నాయి. -
ఇదేం ఖర్మ బాబూ..
- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము - మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు - ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి సాక్షి, కడప : రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు. జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు. -
రుణ మాఫీ ఫిర్యాదులపై మెలికలు
బ్యాంకు ధ్రువపత్రాలుంటేనే ఫిర్యాదుల స్వీకరణ హైదరాబాద్: ఇప్పటికే రుణ మాఫీ విముక్తి పేరుతో రాష్ట్రస్థాయిలో పలు రకాల ఆంక్షలతో సగానికి పైగా రైతుల ఖాతాలను విముక్తి నుంచి ఏరివేసి రుణ ఊబిలోకి నెట్టివేసిన ప్రభుత్వం.. తాజాగా జిల్లా కేంద్రాల్లో రుణ విముక్తి ఫిర్యాదుల స్వీకరణలోను పలు మెలికలు, ఆంక్షలు విధించింది. బ్యాంకులు, సర్కారు చేసిన తప్పిదాలకు రైతులను బలి చేస్తోంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో గత నెల 27 నుంచి ఫిర్యాదుల స్వీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. వీటిపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇలా ఉంటే ఫిర్యాదులు స్వీకరించరు ఏ పంట, ఎంత విస్తీర్ణం అనే విషయంలో తప్పులు దొర్లితే.రుణ విముక్తి పత్రంలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైనట్టు చేసే ఫిర్యాదులు.కౌలు దారు, భూమి యజమాని ఒకే విస్తీర్ణంపై ఒకే సీజన్లో రుణం తీసుకుంటే. రుణం తీసుకున్న రైతు పేరు పలు రేషన్ కార్డుల్లో ఉంటే.. ఆ రైతును రుణ విముక్తి నుంచి తొలగించారు. దీంతో ఈ రైతు చేసే ఫిర్యాదులు. సరైన రేషన్ కార్డు, ఓటరు కార్డు ఉంటేనే ఇలాంటి వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. లేని వారి నుంచి స్వీకరించరు. సర్వే నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నంబరు తప్పుగా నమోదైన రైతుల నుంచి స్వీకరించరు.ఒకవేళ.. ఇలాంటి వారు.. ఎమార్వో నుంచి అండగల్ ప్రతులు సమర్పిస్తే.. స్వీకరిస్తారు. భూ విస్తీర్ణం 50 ఎకరాలకు మించి ఉన్నా లేదా విస్తీర్ణం తప్పుగా నమోదైనా బ్యాంకు ధ్రువపత్రాలు ఇస్తేనే ఫిర్యాదు స్వీకరణ. రుణ బకాయి రూ.10 లక్షలకు పైనున్నా, రుణం మొత్తం విముక్తి పత్రంలో తప్పుగా నమోదైనా ఫిర్యాదు స్వీకరణకు షరతులు. ప్రక్రియ ముందుకు సాగేనా?! రుణమాఫీపై రైతుల నుంచి జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకోడానికి ముందు రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించలేదు. ఏదో ఒక నెపం జూపి రైతుల నుంచి ఫిర్యాదులను తిరస్కరిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రోలుగుంట: ప్రజల సంక్షేమం పట్టించుకోని రాష్ర్ట ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని కుసుర్లపూడి గ్రామంలో శ్రీదేవి పెద్దింటమ్మ ఉత్సవం సందర్భంగా గురువారం రాత్రి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అయన చర్చించారు. ప్రతి కార్యకర్త కష్టాల్లోను తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ర్టంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తూతూ మంత్రంగా రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకున్నారని, దీని వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తుపాను బాధితులకు పూర్తి స్థాయిలో నేటికీ సాయం అందలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోలు, డీజీల్ ధరలు పెంచడం దారుణమన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరచడమే థ్యేయంగా టీడీపీ, బీజే పీ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆక్షేపిం చారు. మడ్డు అప్పలనాయుడు గృహంలో జరి గిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు టి.వి.రమణ, గొర్లె చెల్లమ్మనాయుడు, బంటు సూర్యసన్యాసి దేముళ్లు, మలసాల భాస్కర్‌రావు, తమటపు సత్యంనాయుడు, అడ్వకేట్ చలపతి, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిలువునా ముంచేశారు
రుణమాఫీ పేరుతో మోసం చేశారు రైతు సాధికార సదస్సుల్లో అధికారులను అడ్డుకున్న రైతులు సమాధానం దాటవేసిన అధికారులు కుప్పం: ‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు రుణం మాఫీ చేయకుండా కనీసం దాని వడ్డీకి సరిపడా డబ్బు కూడా ఇవ్వకుండా పత్రాలు తెచ్చి చేతిలో పెడుతున్నారు. అవి మాకు అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ కుప్పం వుండల పరిధిలోని రైతులు అధికారులపై మండిపడ్డారు. చెక్కునత్తం, వుంకలదొడ్డి, ిపీబీనత్తం, అనిమిగానిపల్లి, వెండుగంపల్లి, గోనుగూరు గ్రామ పంచాయతీల్లో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుల్లో ఈ మేరకు అధికారులను నిలదీశారు. అనిమిగానిపల్లి గ్రామ సభలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించొద్దని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. ప్రభుత్వం భిక్షమేసినట్టు రూ.500, రూ.1000 బ్యాంకులో వేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇదేనా రుణమాఫీ అంటే అని అధికారులను నిలదీశారు. రెండో విడతలో న్యాయం చేస్తామని ఎంపీడీవో వివరణ ఇస్తున్నా వారు పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయని, సమాధానం చెప్పని ఇలాంటి సదస్సులు వద్దని రైతులు వెళ్లిపోయారు. -
రుణమాఫీ సగం మందికే
గొర్రె ఏడుపు తోడేలుకు ఎందుకు అన్న చందంగా బాబు రుణమాఫీ వ్యవహారం తయారైంది. ఇటు రుణమాఫీ కాక..అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక ఇబ్బందులు పడుతున్నా రోజుకో మాట మారుస్తున్న బాబు వైఖరిపై జిల్లా రైతులు మండిపడుతున్నారు. కొండను తవ్వి ఎలుక ను పట్టినట్లు రుణమాఫీ తయారైందని గురువారం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఖరిపై విపక్షాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టూటౌన్ : కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా తయారైంది సీఎం చంద్రబాబు రుణమాఫీ ప్రకటన. గద్దెనెక్కడానికి ఓట్ల కోసం అడ్డంగా రుణమాఫీ చేస్తానంటూ అబద్ధాలు పలికిన బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం రోజున రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టు ఫైలుపై సంతకం చేసిన ఆరు నెలల తర్వాత బాబు చేసిన ప్రకటనపై రైతన్నలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా రైతు ఖాతాలుంటే కేవలం 40 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనతో జిల్లాలో ఎంతమందికి ఈ రుణమాఫీ వర్తిస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. జిల్లాలో ఏడు లక్షల రైతు ఖాతాలున్నాయి. అందులో ఆధార్, పట్టాదార్ పాసుపుస్తకం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు ఖాతాలు సరిపోల్చడం అంటూ చేసిన గందరగోళంతో సగానికి పైగా రైతులకు ఈ రుణమాఫీ వర్తించే అవకాశాలు కనపడటం లేదు. జిల్లాలోనే రుణమాఫీకి అర్హమైన మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్లే బడ్జెట్లో కేటాయించిన సంగతి తెలిసిందే. 50 వేలలోపు రుణం ఉన్నవారికి ఒకేసారి, మిగిలిన వారికి 20 శాతం రుణమాఫీ చేయాలన్నాఒక్క జిల్లాకే వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో అసలు ఎంతమందికి మాఫీ అవుతుందో చెప్పలేమని బ్యాంకర్లు చెబుతున్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండా తొలి విడత, మలివిడత అంటూ నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తానంటూ మాయమాటలతో కాలయాపన చేయడంపై అటు రైతులు, ఇటు రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 20 శాతానికి పరిమితం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రుణమాఫీ ప్రకటనపై జిల్లాలోని రైతు సంఘాల నాయకులు,రాజకీయపార్టీల నాయకుల అభిప్రాయాలు.. జగన్ ప్రకటించిన ధర్నాలకు భయపడే రుణమాఫీ ముత్తుమల అశోక్ రెడ్డి , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు, అన్ని రుణాలు రద్ధు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమయ్యే సరికి 20 శాతం రుణమాఫీ అంటూ కొత్త ఎత్తుగడకు దిగారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయకుండా కేవలం విడతల వారీగా రుణమాఫీ చేస్తాననడం రైతులను మరోమారు మోసం చేయడమే. రుణమాఫీపై తొలిసంతకం చేస్తానని .. కమిటీ వేసిన రోజే బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి గెలిచిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైల్‌పై పెట్టి నిజమైన రైతు నాయకుడు అనిపించుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి. జాప్యం చేయడానికి మరో ఎత్తుగడ ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వం జాప్య చేయడానికి మరో ఎత్తుగడ ఇది. ఆధార్ సంఖ్య సరిగాలేదని, రేషన్ కార్డు నెంబర్ కనపడటంలేదనో బ్యాంకుల వద్దకు వెళ్లి చాలామంది రైతులు వెనక్కు వస్తున్నారు. స్పష్టత లేకుండా ప్రతిపక్షాలకు భయపడి అరకొర రుణమాఫీ చేయడం సరికాదు. మా కనిగిరి నియోజకవర్గంలోనే దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు రుణమాఫీ బాకీలున్నాయి. ఎన్నికలలో వ్యవసాయ రుణాలు కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే రద్ధు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఆలోచించి హామీలివ్వాలి కె అరుణ, సీపీఐ జిల్లా కార్యదర్శి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించి హామీలివ్వాలి. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే ఇలానే ఉంటుంది. 50 వేలలోపు ఉంటే ఒకేసారి చేస్తామనడం, వాయిదాల ప్రకారం రుణమాఫీ చేస్తామనడం, మిగతవాటికి బాండ్లు ఇస్తామనడం బాగాలేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ముఖ్యంగా కౌలు రైతుల రుణాలు, మహిళలు తీసుకున్న రుణాలను రద్ధు చేయాల్సిందే. రుణ విముక్తులను కాదు రుణ ఊబిలోకి... - సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగబోయిన రంగారావు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను రుణ విముక్తులను చేయకుండా మరింత రుణ ఊబిలోకి నెట్టేశారు. రుణమాఫీ చేస్తానని ప్రకటించడంతో రైతులు వాటిని కట్టకపోవడంతో ఆరునెలలకు కలిపిన వడ్డీని బ్యాంకర్లు అసలు కింద జమ చేస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చిన ప్రతిసారీ రూ. 400 రైతు ఖాతాకు అదనపు అప్పు కింద జమ చేస్తున్నారు. రుణమాఫీ ప్రస్తావన లేకుంటే సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంది. లక్ష రూపాయల్లోపున్న వాటికి వడ్డీ మినహాయింపు, మూడు లక్షల్లోపున్నవారికి పావలా వడ్డీ ఉండేది. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకర్లు రైతుల నుంచి 13శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి 3- 5 రూపాయలకు వడ్డీలకు తీసుకువచ్చి పంటలు సాగు చేశారు. చంద్రబాబు ఇదే మాదిరిగా మోసగిస్తూ పోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైతులకు ఉపయోగకరం.. బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు కోటయ్య కమిటీ లక్ష వరకే రుణమాఫీ అని సూచించినా చంద్రబాబు రూ1.50లక్షలన్నారు. దానికి కట్టుబడే నేడు తొలివిడతగా రూ50వేలలోపు రైతుల రుణాలను తీరుస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏదైనప్పటికి ప్రకటించిన హామీకి కట్టుబడి రుణం మాఫీచేసేందుకు చంద్రబాబు ముందుకు రావడం శుభపరిణామమే. ఇది రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. జగన్ తీసుకున్న నిర్ణయానికి భయపడి.. మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీై రెతు విభాగం జిల్లా అధ్యక్షుడు రుణమాఫీ చేస్తానని ఎన్నికలలో ఇచ్చిన హామీపై ధర్నాలకు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో భయపడి 20 శాతం రుణమాఫీతో మళ్ళీ రైతులను మభ్య పెడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి తొలిసంతకం ఉచిత విద్యుత్తుపై చేస్తే.. బాబు మాత్రం రుణమాఫీపై పెట్టకుండా కమిటీ ఏర్పాటుకు సంతకం చేసిన రోజునే మోసపోయమని రైతులు భావించారు. ఏడు నెలలుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ పార్టీ ధర్నాలు అనగానే భయపడి ముందురోజే అరకొరగా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిగ్గుమాలిన పని. ఇదేం రుణమాఫీ దుగ్గినేని గోపినాధ్ , ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రుణమాఫీ పూర్తిగాచేయకుండా తొలివిడత, మలివిడత అంటూ విడతల వారీగా రుణమాఫీ చేస్తే రైతులకు ఏం లాభం. పూర్తిగా రుణమాఫీ జరిగితేనే బ్యాంకులు మళ్ళీ రైతులకు రుణాలు ఇచ్చేది. ఇప్పటికే ఖరీఫ్, రబీ సీజన్లలో బ్యాంకు రుణాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. బయట అప్పులు తెచ్చుకోని సేద్యం చేస్తున్నారు. 20 శాతంరుణమాఫీ చేసి మిగిలిన దానికి బాండ్లు జారీ చేస్తామనడం విడ్డురంగా ఉంది. రైతులకు జారీ బాండ్లను బ్యాంకులకే జారీ చేసి పూర్తి రుణమాఫీ చేయాలి. ఇట్లాంటి రుణమాఫీలు రైతులకు అవసరం లేదు. -
రుణమాఫీకి డబ్బెక్కడుంది
కోడుమూరు: రుణమాఫీ అంటూ రైతులను మోసం చేయడమే తప్ప అందుకు డబ్బెక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చెప్పే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘‘ప్రజలకు నువ్వు కట్టే సింగపూర్ అవసరంలేదు. సక్రమంగా రోడ్లు వేసి మరుగుదొడ్లు కట్టించి, తాగునీళ్ల సమస్య లేకుండా చేసి, సాగునీటి వనరులు పెంచేదిశగా పనులను చేస్తే చాలు’’. అని కోరారు. వైఎస్సార్సీపీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూల్ చేసి బదిలీలు చేస్తుందని ఆరోపించారు. కర్నూలు నుంచి రోజుకు 150లారీల ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలిపోతున్న అడ్డుకునే అధికారేలేరని ఆరోపించారు. బీసీ సెల్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు లాయర్ప్రభాకర్, వైఎస్సార్సీపీ నేతలు కృష్ణారెడ్డి, రామకృష్ణ, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమపథం దిశగా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రుణ మాఫీ హామీ ఉత్తుత్తి మాఫీగానే మిగిలిపోతోంది... డ్వాక్రా రుణాల మాఫీ అటకెక్కింది... హుద్‌హుద్ తుపాను బాధితుల వేదన అరణ్య రోదనే అయ్యింది. వెరసి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖం పూరిస్తోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఈ భారీ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో డిసెంబర్ 5న ధర్నాను విజయవంతం చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని బలంగా వినిపించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సమన్వయంతో సన్నద్ధత డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ధర్నా నిర్వహణ గురించి కూడా ప్రధానంగా చర్చించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు జిల్లాలో నేతలు, కార్యకర్తలతో సమావేశమై ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు, తుపాను బాధితులు తదితరులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న అంశాన్ని నేతలు ప్రస్తావించారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ధర్నాను విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. నియోజకవర్గాలవారీగా సన్నద్ధత డిసెంబర్ 5న ధర్నాపై రాష్ట్ర పార్టీ కూడా ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి( కార్యక్రమాల కో ఆర్డినేటర్) తలశిల రఘురాం బుధ, గురువారాలు జిల్లాలో పర్యటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించారు. జీవీఎంసీ, రూరల్ జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ధర్నాలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. అందుకోసం నియోజకవర్గాల్లో గ్రామాలు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా మహాధర్నాకు ప్రజలను సంసిద్ధులను చేయడానికి పార్టీశ్రేణులు రంగంలోకి దిగాయి. రూరల్ జిల్లాలో నియోజకవర్గాలవారీగా సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో డివిజన్లవారీగా కార్యకర్తల సమావేశాలు గురువారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతుండటంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. -
రుణమాఫీ కాదు...వాగ్దానాల మాఫీ
చిత్తూరు (టౌన్) : రాష్ట్రప్రభుత్వం తీరు చూస్తుంటే రుణమాఫీ కథ దేవుడెరుగు కానీ.. వాగ్దానాల మాఫీ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గురువారం ఆయన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో కొన్నిం టిని కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల వ్యవసాయరుణాల మాఫీతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. పింఛన్లను ఏవేవో కుంటిసాకులతో అర్హులకు అందకుండా చేయడం దారుణమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. జన్మభూమి కార్యక్రమం జరిగే తేదీల్లో కార్యాలయూలన్నీ అధికారులు లేకుండా బోసిపోయాయన్నారు. దీనిపై తాము తమ నాయకునితో కలిసి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చించనున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులొద్దంటూ కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. డీలర్లపై కక్షసాధింపెందుకు ? రేషన్ షాపు డీలర్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందని, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నామని నారాయణ స్వామి చెప్పా రు. డీలర్లు ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి కమిషన్‌తో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీచేసే వారు మాత్రమేనన్నారు. అయితే ప్రభుత్వం డీలర్లపై కక్షగట్టి వారి డీలర్‌షాపులను రద్దుచేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కొంతమందిపై పనిగట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే నెపంతో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించారని విమర్శించారు. ఆమెతోపాటు వీరు కూడా పార్టీ మారివుంటే మంచివాళ్లు, మారకపోతే అవినీతిపరులా అని ఎద్దేవా చేశారు. కార్వేటినగరం మండలంలోని రెండు డీలరు షాపుల రద్దు చెల్లదని హైకోర్టు ఆదేశించినా ఆ ఆదేశాలను అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రగతి కరుణాకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీ దేవి పాల్గొన్నారు. -
రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. రోజుకో కొత్త నిర్ణయాన్ని ప్రకటించి లబ్ధిదారుల జాబితాను వడబోయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో లక్షన్నర మంది రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఈ జాబితాలను వడపోసేందుకు జన్మభూమి కమిటీల ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్ణయం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పొందే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు వారికి సకాలంలో అందకుండా చేయడం కోసం రోజుకో ప్రక్రియతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. కొత్తగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రెండూ ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరువాత ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది. దీంతో ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇందులో ఎక్కువగా రేషన్ కార్డు ఉండి, ఆధార్ లేనివారు. ఆధార్ ఉండీ రేషన్ కార్డు లేనివారు ఉన్నారు. పేరులో, ఆధార్ కార్డులో ఒక్క అక్షరం తప్పుంటేచాలు తిరస్కరించిన వాటిలోకి చేర్చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో లక్షన్నర వరకూ ఖాతాలు రుణమాఫీకి అర్హత లేదని తేల్చారు. జిల్లాలో ఆధార్ కార్డును జతచేయకపోవడంతో 15631 ఖాతాలను తొలగించారు. ఇవి మినహాయిస్తే రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది. ఆ తర్వాత ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డు లింకుతో ఈ సంఖ్య ఐదున్నర లక్షలకు పడిపోయింది.. రేషన్ కార్డు రైతుల వద్ద ఉన్నా పౌరసరఫరాలశాఖ తమ రికార్డుల నుంచి తొలగించడంతో చాలా మందికి రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. రుణమాఫీ కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని చెప్పడంతో తాజాగా ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా సేకరిస్తోంది. బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతుల సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి మెలిక పెడుతుందోనన్న భయం రైతుల్లో వ్యక్తమవువుతోంది. తిరస్కరణకు గురైన జాబితాలు కూడా బ్యాంకులకు అందలేదు. ముందు రెవెన్యూ విభాగం పరిశీలిస్తుంది. తాజాగా జాబితాలను వీఆర్ఓలకు ఇచ్చి పరిశీలింపజేయిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీలోగా లబ్ధిదారుల వడపోత కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. -
అస్తవ్యస్తం..గందరగోళం
గుడివాడ : ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబితా విడుదలే అస్తవ్యస్తంగా ఉందని, ఫలితంగా తమపేరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేవని తెలిసిన రైతులు భయాందోళనకు గురువుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీపై ఆశలు పెట్టుకుంటే తీరా పేరులేదని తెలిసిన రైతాంగం ఏంచేయాలో తెలియని స్థితిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 6.2 లక్షల మంది రైతులు రుణమాఫీ పరిధిలో ఉన్నారు. వీరిలో అనేకమంది పేర్లు జాబితాలో లేవని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ చేసి వడ్డీలు కూడా కడతామని చెబుతున్న ప్రభుత్వం తొలిదశలోనే పేర్లు లేకుండా చేయటంపై రైతులు మండిపడుతున్నారు. జాబితాలో తికమకలు.. ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నందున వారి వివరాలను ఈ నెల ఎనిమిదిన విడుదల చేసింది. ఈ జాబితా సోమవారం సాయంత్రానికి తహశీల్దార్ కార్యాలయాల నుంచి వీఆర్వోలకు చేరింది. జాబితాలోని రైతుల పేర్లు చూసి ఆయా రైతులు ఇంకా ఇవ్వాల్సిన వివరాలు పూర్తిచేసి పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇది రెండు రోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. రుణమాఫీ జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండు రోజుల్లో వివరాలు పూర్తిచేసి పంపటం కష్టమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ జాబితాలో కొన్ని బ్యాంకుల వారీగా ఇవ్వగా మరికొన్ని ఎక్కడ భూమి ఉందో ఆప్రాంతంలో ఉన్న జాబితాలోకి వెళ్లాయి. గుడివాడకు చెందిన సుబ్బారావుకు ఉయ్యూరులో భూమి ఉంది. దీనిపై గుడివాడ ఎస్బీఐలో ఆయన రుణం పొందాడు. జాబితాలో మాత్రం భూమి ఉన్న ఉయ్యూరులోనే ఉంటుందని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల బ్యాంకు ఆధారంగా జాబితా ఇవ్వటం గమనార్హం. ఏమేమి సేకరిస్తున్నారంటే... ప్రతి రైతూ తన ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి లేకపోతే వాటిని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇవిగాక ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల ఆధార్ నంబర్లు, ఓటు గుర్తింపు కార్డు నంబర్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే రుణమాఫీ జాబితాకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి మంది వీఆర్వోలు ఈ జాబితా సరిచేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటా వివరాల సేకరణకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు. కౌలు రైతులకు చోటులేదు... గుడివాడ పట్టణంలో విడుదలైన జాబితాలో కౌలు రైతుల పేర్లు లేవని చెబుతున్నారు. రుణాలు తీసుకున్నా బ్యాంకర్లు కౌలు రైతుల పేర్లు ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి దాపురించినట్లు సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో కౌలు రైతు ఆప్షన్ లేకపోవటమే ఇందుకు కారణమని కొన్ని బ్యాంకుల వారు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతూ పైసా కట్టాల్సిన పనిలేదని చెప్పిన చంద్రబాబు రుణాలు రద్దుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
రుణం చెల్లించాల్సిందే
సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. పాత బకాయి చెల్లిస్తేనే... పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. బాబువి మాయమాటలేనా? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. -
రుణ మాఫీ.. కుచ్చుటోపీ
నాడు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పాలనా పగ్గాలు చేపట్టగానే ఎటువంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు తీసుకున్న రుణాలన్నీ, మెట్ట రైతులకు విద్యుత్ బకాయిలతో సహా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రాష్ట్రంలోని అందరి రైతుల్లానే సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అప్పుల ఊబి నుంచి బయటపడి అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు... ఎన్నికల వేళ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీలు గుప్పించి అందలమెక్కిన చంద్రబాబు..రుణ మాఫీ చేస్తామంటూనే రోజుకో నిబంధనతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆధార్‌కార్టు, రేషన్‌కార్డు, సర్వేనంబర్ల ఆన్లైన్, పట్టాదారు పుస్తకాల ఆన్లైన్ అంటూ ఆంక్షల వలయంలో రైతన్నను బంధించి రుణమాఫీకి దూరం చేశారు. ఫలితంగా కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలో 2,900 మంది రైతులు రూ.23 కోట్ల రుణమాఫీ కోల్పోయారు. సంతమాగులూరు: రోజుకో కొత్త నిబంధనతో సాధ్యమైనంత ఎక్కువ మందిని రుణమాఫీకి దూరం చేయాలన్న సర్కారు పన్నాగానికి వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని అగ్రహారం భూములు సాగు చేసుకుంటున్న రైతులే దీనికి నిదర్శనం. రైతుల సాగుభూములు వారిపేర్లతో ఆన్లైన్ చేయని కారణంతో ఆ రెవెన్యూ పరిధిలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామాలకు చెందిన 2,900 మంది రైతులు రూ.23 కోట్ల మేర రుణమాఫీ సదుపాయాన్ని కోల్పోతున్నారు. రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేసి బ్యాంకులు పంట రుణాలు అందజేసిన అందరికీ మాఫీ వర్తింపజేయాలని రైతు సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కొమ్మాలపాడు కథ ఇదీ... స్వాతంత్య్రానికి పూర్వం కొమ్మాలపాడు గుంటూరు జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతం జాగర్లమూడి కుప్పుస్వామి జమీందారిలో సర్వే నంబరు 1 నుంచి 230 వరకు 4,874 ఎకరాలు ఉండేది. స్వాతంత్య్రానంతరం జమీన్దారులకు ఏటా కప్పం కడుతూ సాగు చేసుకుంటున్న భూములు రైతుల ఆధీనమయ్యాయి. అయితే భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. 1972లో ప్రకాశం జిల్లా ఆవిర్భావంతో సంతమాగులూరు సమితి ప్రాంతం గుంటూరు జిల్లా నుంచి విడిపోయి ప్రకాశంలోకి వచ్చింది. మండలాల ఏర్పాటుకు పూర్వమే కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో సాగులో ఉన్న రైతులు తమ భూములు రీ సర్వే జరిపి యాజమాన్య హక్కులు కల్పించాలని అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం శూన్యం. అయితే రైతువారీగా పంటల వివరాలను, అడంగల్‌లో అనుభవదారులైన రైతుల పేర్లు ఏటా నమోదు చేస్తున్నారు. బ్యాంకులు కూడా రెవెన్యూ అధికారులు జారీ చేసే అడంగల్ ఆధారంగా ఆయా రైతులకు పంటరుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన రుణమాఫీలో కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణాలు పూర్తిగా మాఫీ అయి రుణవిముక్తులయ్యారు. తాజాగా రుణమాఫీకి అర్థ రహితమైన నిబంధనలు పెట్టడంతో వీరంతా రుణమాఫీ జాబితాలోకి రావడం లేదు. ఈ భూములన్నీ అగ్రహారం భూములని రెవెన్యూ రికార్డుల్లో ఉండటం, రైతు ఖాతాలు ప్రారంభించకపోవడం, ఖాతాలు లేనిదే కంప్యూటర్ అడంగల్ నమోదు కాకపోవడం, అడంగల్‌కు ఆధార్‌కు రుణమాఫీకి లింకు పెట్టడంతో వీరంతా రుణమాఫీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సంతమాగులూరు మండల పరిషత్ సమావేశంలో సభ్యులు తమ ఆవేదనను వ్యక్తపరచారు. తక్షణమే నిబంధనలు సడలించి కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రుణమాఫీ పేరిట రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని శనివారం ఆయన కలిశారు. అనంతరం గుత్తా మీడియాతో మాట్లాడుతూ రోజూ కేసీఆర్, చంద్రబాబు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.. ఇద్దరూ సమస్యల పరిష్కారానికి కృషిచేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పారు. వీరిద్దరి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన బుద్ధిచెబుతారన్నారు. -
ముందు హామీలు అమలు చేయండి!
రైతులను మళ్లీమళ్లీ మోసపుచ్చకండి: సీఎంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి హైదరాబాద్: రైతుల ప్రయోజనాల కోసమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన ఏ హామీ అమలు చేసి చూపించారని కొత్తగా ‘హరిత’ పథకం ప్రకటిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు దయచేసి ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకొని పథకాల ప్రకటన చేయాలని పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే ఎన్నికల ముందిచ్చిన రైతు రుణాల మాఫీ హామీ అమలు పక్కకు పోయింది.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.. ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఊసే లేదు.. ఎప్పటికప్పుడు ప్రజలను, రైతులను మోసం చేసే కార్యక్రమాలతో సీఎం ముందుకు సాగుతున్నారు’’ అని దుయ్యబట్టారు. రైతుల్ని అప్పులపాలుచేశారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు రద్దు కాకపోగా, వారు అప్పు కోసం ప్రైవేట్ వ్యాపారుల బారిన పడేలా చేశారని, మొన్నటి వరకు జీరో శాతంతో వడ్డీ రుణాలు పొందిన రైతు నెత్తిన ఇప్పుడు 14 శాతం వడ్డీ భారం పెట్టారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కావాల్సినంత అటవీ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన 30 వేల ఎకరాలు రాజధాని కోసమని బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. తనను చూస్తేనే కరువు పారిపోతుందని బాబు చెప్పుకుంటుంటే ఆయన అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పంట తుపానుకు కొట్టుకుపోయిందని, మిగిలిన జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని దుయ్యబట్టారు. -
ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
గండేపల్లి : రుణమాఫీని తప్పక చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం ప్రకటించారు. శుక్రవారం మండలంలోని మురారి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందని అయినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేయగా, రాష్ట్రంలో 13 జిల్లాలకు కలిపి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్ల రుణమాఫీకి ముందుగా 20 శాతం ఇచ్చి, మిగిలిన 80 శాతానికి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ చైతన్యరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పి.చిట్టిబాబు, ఎంపీపీ డి.సుశీల, వైస్ ఎంపీపీ పోతుల మోహనరావు, జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ బులి వీరమ్మ, కందుల కొండయ్యదొర, గోదావరి డైయిరీ చైర్మన్ కొడాలి చంటిబాబు, జ్యోతుల చంటిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ కె. రమేష్, తహశీల్దార్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 36 కొత్త పింఛన్లు అందజేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగపర్చుకోవాలి బ్యాంకు సేవలను సద్వినియోగపరచుకోవాలని గండేపల్లి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ కొక్కిరి మహాలక్ష్మి జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులకు తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. పింఛను లబ్ధిదారుల ఇబ్బందులు ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఇదేమి మెలిక?
మోర్తాడ్: ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణం పై 30 శాతం రుణం హెచ్చింపు చేసి కొత్త రుణం ఇవ్వాలని ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను ఆదేశించింది. దీంతో రైతు కు ఉన్న రుణంపై 30 శాతం ఎక్కువ రుణం ఇవ్వాల్సి ఉంది. అంటే మాఫీ అయిన 25 శాతం సొమ్ముతోపాటు అదనం గా మంజూరు అయ్యే రుణం రైతుకు అందాలి. అయితే సింగిల్ విండోల అధికారులు గతంలో లేని నిబంధనలను ఇప్పుడు ఉన్నట్లు చూపుతూ రైతులకు మొండి చెయ్యి చూపుతున్నారు. రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలకు టైటిల్ డీడ్‌ను కాని, పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా ఉంచుకోకూడదు. అయిన్పటికీ టైటిల్ డీడ్లను తనఖా ఉంచాలని స ంఘాల ఉద్యోగులు పట్టుబడుతున్నారు. గతంలో ఏం జరిగింది? గతంలో సహకార సంఘాలలో రైతులు రుణాలు తీసుకున్నప్పుడు టైటిల్ డీడ్లను తనఖా ఉంచుకోలేదు. తక్కువ మొత్తంలోనే రుణం లభిస్తుండటంతో పహాణి అందించి, మరొక రైతు జామీనుతో రుణం పొందారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సహకార సంఘాలు రూ. 60 వేలకు మించి రుణం ఇవ్వలేదు. వాణిజ్య బ్యాంకులలో ఎకరానికి రూ. 50 వేల చొప్పున పంట రుణం ఇచ్చారు. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో పహాణిలను ఇచ్చి పంట రుణం తీసుకున్నారు. వాణిజ్య బ్యాంకులలో టైటిల్ డీడ్ తనఖా ఉంచి ఎక్కువ పంట రుణం తీసుకున్నారు. సహకార సంఘాలలో ఎంత రుణం ఉన్నా తమ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సింపుల్ మార్టిగేజ్ చేసి ఇచ్చారు. పంట రుణాలకు సంబంధించి సహకార సంఘాలు, బ్యాంకులు సిం పుల్ మార్టిగేజ్ చేసుకోవాలని టైటిల్ డీడ్ తనఖా పెట్టుకోరాదని రిజర్వు బ్యాంకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాం కర్లు మాత్రం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను కాదని టైటిల్ డీడ్ తనఖాకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.320 కోట్ల రుణం మాఫీ లభించింది. సర్కారు తొలి విడతగా 25 శాతం నిధు లను విడుదల చేయడంతో సహకార సంఘాలకు రూ. 80 కోట్ల మాఫీ సొమ్ము జమ అయ్యింది. అక్కడ రైతులు ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చే సుకున్నారు. దీంతో రైతులకు మాఫీ సొమ్ము చేరాల్సి ఉంది. ఎక్కువ మంది రైతులు టైటిల్ డీడ్లను తనఖా ఉంచడం లేదనే కారణంతో మాఫీ సొమ్ము రైతుల చేతికి అందకుండా రుణంలోనే మినహాయిస్తున్నారు. గతంలో లేని నిబంధనలను ఇప్పుడు సాకుగా చూపుతూ కొత్త రుణాలను ఇవ్వక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా సహకార సంఘాలలో తక్కువ పంట రుణం లభించడంతోనే తాము మళ్లీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులలో ఎంత రుణం ఉన్నా ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ చేస్తుంది. సహకార సంఘాలు రుణాలను రెన్యూవల్ చేయకపోవడంతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయం ఉన్న రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న, సన్నకా రు రైతులకు మాత్రం కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాలలో సభ్యు లైన రైతులకు కొత్త రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్
ప్రారంభానికే పరిమితమైన రైతు సాధికార సంస్థ ఖరారు కాని విధివిధానాలు అధికారులనూ నియమించలేదు రుణమాఫీ గురించి తెలియదంటున్న డిప్యుటేషన్ అధికారులు విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికార సంస్థకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. గత నెల 21న గన్నవరంలో ఈ సంస్థను ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాలేదు. ఈ సంస్థను రుణమాఫీ కోసమే కాదు.. రైతు ఎంపవర్మెంట్ కోసం కూడా వినియోగిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక్కడ పర్మినెంట్ అధికారులు, ఉద్యోగులను కూడా నియమించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు సరికదా విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. దీంతో రుణమాఫీపై సందేహాలు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుంచి నిత్యం వస్తున్న రైతులకు సమాచారం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. రైతుసాధికార సంస్థకు సంబంధం లేకుండానే రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను బ్యాంకర్లు సిద్ధం చేశారు. దీంతో ఈ సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారని పలువురు రైతు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్ష్యాలు ఇవీ... రైతులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రైతుసాధికార సంస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. తొలిగా రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే అమలుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలి విడత రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రుణమాఫీ సొమ్మును ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రైతుసాధికార సంస్థకు ఒక్క రూపాయి కూడా అందకుండా తమ ఖాతాల్లో డబ్బు ఎలా జమచేస్తారని రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చెప్పిందొకటి.. జరుగుతున్నది మరొకటి.. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ప్రతి అంశం రైతుసాధికార సంస్థ ద్వారానే నెరవేరుస్తామని పాలకులు ప్రకటించారు. రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. ఆచరణలో మాత్రం ఈ సంస్థను అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీకి అర్హులైన వారి జాబితాలను రూపొందించాలని ప్రభుత్వం కొన్ని నిబంధనలను బ్యాంకులకు పంపాయి. ఈ మేరకు బ్యాంకర్లు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ కొన్ని మార్పులు చేశారు. ఎట్టకేలకు తుది జాబితాను సిద్ధమైంది. దీంతో రైతుసాధికార సంస్థకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని, బ్యాంకర్లకు నచ్చినట్టే జాబితాలు రూపొందించారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. క్లారిటీ లేదు... ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఓ రైతు గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వచ్చారు. తాను రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో తెలంగాణ జిల్లాలో బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం పొందానని తెలిపారు. ఇప్పుడు రుణం చెల్లించాలని ఆ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారని, రుణమాఫీతో తమకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నారని, తన రుణం మాఫీ అవుతుందో లేదో చెప్పాలని ఆయన రైతు సాధికార సంస్థ అధికారులను కోరారు. వాస్తవానికి రైతు సాధికార సంస్థ విధివిధానాలు ఖరారు కాలేదని, రుణమాఫీ విషయంలో తమకు కూడా క్లారిటీ లేదని అధికారులు బదులిచ్చారు. అంతటితో ఆగక.. ‘గతం వేరు. ఇప్పుడు వేరు. ఇప్పటి లెక్కప్రకారం మీరు వేరే రాష్ట్రంలో అప్పు తీసుకున్నట్టే. కాబట్టి రుణమాఫీ అయ్యే అవకాశం లేదు’ అని చెప్పడంతో సదరు రైతు కంగుతిన్నాడు. ఇలా నిత్యం ఇక్కడికి వచ్చే రైతులకు సరైన సమాధానం లభించక అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. అంతా డిప్యుటేషన్ పైనే.. ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి జేడీ, ఏడీ స్థాయి అధికారులు తొమ్మిది మంది డిప్యుటేషన్‌పై రైతుసాధికార సంస్థకు వచ్చారు. వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ హోదా కలిగిన అధికారిని ఇన్చార్జిగా నియమించారు. వీరంతా రాష్ట్రంలోని 13 జిల్లాల వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్థక శాఖ జేడీ, ఆత్మ ప్రాజెక్ట్ పీడీ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ జిల్లా కార్యాలయాల అధికారుల ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమచారాన్ని తమకు పపాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను జిల్లా కార్యాలయాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి రైతుసాధికార సంస్థను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసినందు వల్ల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జాబితాలు బ్యాంకుల్లో.. ఫిర్యాదులు తహశీల్దార్ కార్యాలయాల్లో..! ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హుల జాబితాలను బ్యాంకుల్లో పెడతారు. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే రుణం ఎందుకు మాఫీ కాలేదనే విషయం బ్యాంకర్లకు తెలుస్తుందని, కాని తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఎలా తెలుస్తుందని, గందరగోళానికి గురిచేసేందుకే ప్రభుత్వం ఇటువటి నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. -
రుణమాఫీ జాబితాలు విడుదల
తహశీల్దార్ల వెబ్సైట్లకు పంపిన ప్రభుత్వం 7,600 పేజీలతో జాబితా నేడు పంచాయతీ కార్యాలయాలకు మచిలీపట్నం : పంట రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. వాటిని అన్ని మండల తహశీల్దార్ల వెబ్సైట్లకూ పంపింది. రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను తయారుచేసిన ప్రభుత్వం దాని వివరాలను తహశీల్దార్ కార్యాలయ వెబ్‌సైట్‌కు పంపి, అక్కడి పాస్వర్డ్తోనే ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ జాబితా 7,600 పేజీల్లో ఉందని పలువురు తహశీల్దార్లు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన మండలం.. అందులోని రెవె న్యూ గ్రామాల వారీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. రుణం తీసుకున్న రైతు పేరు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని తహశీల్దార్లు వివరించారు. ఈ జాబితాను శనివారం ఆయా గ్రామాలకు పంపుతామని.. పంచాయతీ కార్యాలయాల్లో వీటిని ప్రదర్శించనున్నామని వారు వివరించారు. 20 శాతమే నగదు జమ... ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రకటించటంతో అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత రుణమాఫీ జరిగింది అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ కింద మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన రూ.5 వేల కోట్ల నగదును ఒక్కొక్క రైతు పేరున ఉన్న బకాయిలో 20 శాతం మేర జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతా మాయేనా... ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ స్వీకారం రోజున వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రుణమాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని ఈ ప్రకటనల్లో వివరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తున్నట్లు సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు రైతులెవ్వరూ కట్టవద్దని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చెల్లించి మీ బంగారం మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేణా అరటి, పసుపు, మిర్చి, కూరగాయలు, పూలతోటలు తదితర ఉద్యానవన పంటలకు రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ జాబితాను తొలగించారు. మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలే రద్దవుతాయంటూ మెలిక పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆధార్ కార్డు, అడంగల్ కాపీలు ఈ వివరాలు ఉండాలని ఆంక్షలు విధించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నా ఇంతవరకు రైతులకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వరుణుడు కరుణించకపోవటంతో రైతులు పంటలు ఎండిపోయి దిగుబడులు ఆశించిన మేర రావని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో వడ్డీ లేని పంట రుణాలు తీసుకున్న రైతులు నేడు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో మూడు శాతం ఇన్సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉండేది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోకపోవటంతో పంట బీమా సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం, రైతులు తీసుకున్న రుణాలు మార్చి 31లోపు చెల్లించకపోవటంతో రుణాలు తీసుకున్న రైతులంతా డిఫాల్టర్లుగా మారారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాల్లోని వివరాలు బయటపడితే ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. బ్యాంక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట, సూర్యారావుపేట, నున్న, పటమట పోలీసు స్టేషన్ల పరిధిలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్, మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9, 15, 23, 29, 30 తేదీల్లో ఈ ఉత్తర్వులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పరీక్షలు జరిగే రోజుల్లో.. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు సహా మారణాయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని వివరించారు. -
వంచక పాలనపై కన్నెర్ర
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కదంతొక్కారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు ఎలాంటి షరతులూ లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. అన్నదాతలకు బాసటగా నిలిచి రైతులకు రుణమాఫీ చేసేవరకు పోరుబాట సాగించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉద్యమబాట పట్టారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ధర్నాలకు నేతృత్వం వహించారు. * రుణమాఫీలో మోసాలపై మండిపాటు * అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ * అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు బాసట * వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు * పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు * ధర్నాలకు వెల్లువెత్తిన ప్రజాస్పందన సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో బుధవారం ర్వహించిన ధర్నాలకు ప్రజాస్పందన వెల్లువెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నాలను విజయవంతం చేశారు. రైతులు, రైతు కూలీలు, డ్వాక్రా మహిళలు ధర్నాకు తరలివచ్చి ప్రస్తుత ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తామని ఒకటికి పదిసార్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలయ్యాక రుణమాఫీ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీ అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే రుణమాఫీ అమలు చేసేలా ఉద్యమం కొనసాగిస్తామని నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో అనుసరిస్తున్న తీరుపై నేతలు నిప్పులు చెరిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి, శాంతియుతంగా నిరసన తెలిపి మండల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. విజయవాడ నగరంలో... స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ నయవంచనకు, నమ్మకద్రోహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాయపదం అని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డదారులు తొక్కి.. ఏ గడ్డిఅయినా కరుస్తారని రుణమాఫీ ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. రైతులకు లక్ష కోట్ల రుణమాపీ చేస్తామని చెప్పి కేవలం ఐదు వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారని విమర్శించారు. అదేమంటే రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెపుతున్నారన్నారు. చంద్రబాబు తన కిడ్నీలు అమ్మి అయినా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మాట్లాడారు. జిల్లా అంతటా సమరశంఖం... * పామర్రులో నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను విస్మరిస్తే ప్రజలు క్షమించరని కల్పన హెచ్చరించారు. నియోజకవర్గంలోని మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెదపారుపూడి మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. * నూజివీడులో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. * తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం తదితర మండలాల్లో జరిగిన ధర్నాల్లో ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు. ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. * జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వత్సవాయి మండలంలో జరిగిన ధర్నాలోనూ ఉదయభాను పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు ధర్నాలో వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, భాను పాల్గొన్నారు. * మచిలీపట్నంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు తీరును పేర్ని నాని ఖండించారు. * మైలవరంలో నియోజకవర్గ సమనయ్వకర్త జోగి రమేష్ నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. జోగి రమేష్ మైలవరం, జి.కొండూరు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. * అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ధర్నాలు జరిగాయి. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లో పార్టీ నేతలు ధర్నాలు నిర్వహించారు. * కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ముదినేపల్లిలో ఉప్పాల రాంప్రసాద్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కలిదిండిలో నేతలు ధర్నా నిర్వహించారు. * నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. కంచికచర్ల మండలంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. * పెడనలో నిర్వహించిన ధర్నాలో పార్టీ సమన్వయకర్తలు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రాంప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి, గూడూరు, కృతివెన్ను మండలాల్లో ధర్నాలు జరిగాయి. * గుడివాడ నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నేతలు ధర్నాలు చేపట్టారు. * గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో బాపులపాడులో ధర్నా నిర్వహించారు. ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో నేతలు ధర్నాలు జరిపారు. రుణమాఫీ పేరుతో దగా చేశారు : సారథి పెనమలూరు : నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి నేతృత్వంలో మూడు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆయా ధర్నాల్లో సారథి, పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సారథి మాట్లాడుతూ ఎన్నికల చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ నేటివరకు అమలు చేయక వారిని దగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు జగన్మోహన్రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరిక ఉన్నా.. చంద్రబాబునాయుడు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించటంతో టీడీపీకి ఓట్లు వేశారన్నారు. తాను గెలిచిన తరువాత మొదటి సంతకం రుణాలమాఫీపై అని చంద్రబాబు చేసిన ప్రకటనలు ప్రజలు నమ్మారని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. 87 వేల కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా.. రోజుకో మాట చెబుతూ రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆ నిధులు కూడా రైతులకు అందజేయడానికి రోజుకో నిబంధన పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులతో రైతుల వడ్డీలు కూడా తీరవన్నారు. డ్వాక్రా మహిళలు కూడా చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించలేదని చెప్పారు. నేటివరకు వారి రుణాలపై ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణ విముక్తి అయ్యేవరకు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. -
చంద్రబాబు వంచక పాలనపై నేడే ఉద్యమ శంఖం
మూడు దశల్లో నిర్వహిస్తాం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్లలో కోత, హుద్‌హుద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలి పారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు స్వయంగా తానే గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలందరూ ఆందోళనలను జయప్రదం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని రైతులకు ఇప్పుడు అపరాధ వడ్డీ రూపేణా 28 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిం దని, డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొ మ్ము నుంచి వడ్డీ చెల్లించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలప్పుడు పింఛనుదారులందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. బాబు వల్లే రైతులకు పంటల బీమా రాలేదు ‘‘హుద్‌హుద్ తుపానులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 3.03 లక్షల హెక్టార్లలో పంటకు పూర్తిగా నష్టం జరిగింది. మరో 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగింది. చంద్రబాబు రుణ మాఫీ హామీని నిల బెట్టుకోని కారణంగా ఈ రైతులందరికీ పంటల బీమా కూడా రాని దారుణమైన పరిస్థితి ఏర్పడింది’’ అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలకు ముందు తనకు అన్నీ పూర్తిగా తెలుసం టూ చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పో యారు. ►రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనే 87,612 కోట్ల వ్యవసాయ రుణా లు, 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు. రెండు రకాల రుణాలు కలిపితే 1.01 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు చెల్లించవద్దన్నందుకు రుణాలు కట్టని కారణంగా ఆయన పుణ్యామా అని వారందరిపై పోయిన ఏడాదికే 14 వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీగా భారం పడింది. రుణ మాఫీకి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించని కారణంగా ఈ సంవత్సరానికి మరో 14 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ►రెండేళ్లకు కలిపి రుణాలపై వడ్డీనే 28 వేల కోట్లు రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం రుణమాఫీకి ఐదు వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సంగతి దేవుడికి ఎరుక. వడ్డీనే 28 వేల కోట్లు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో 20 శాతం రుణ మాఫీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న మాటలనుబట్టే చంద్రబాబు ఎంతగా రైతులను మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది. ►చంద్రబాబు రుణాలు మాఫీ చేయని కారణంగా ఈ ఏడాది రైతుల రుణాలు తిరిగి రెన్యువల్ కాలేదు. పంటలకు బీమా రావడంలేదు. డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బు నుంచి బ్యాంకు వడ్డీని జమ చేసుకుంటున్నాయి’’ అని వివరించారు. ఈ సందర్భంగా బాబు అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశానికి సంబంధించిన పుస్తకాన్ని జగన్ విలేకరులకు చూపించారు. ఇంకెన్ని పింఛన్లకు కోత పెడతారో? ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం లో 43,11,686 వరకు పింఛన్లు ఉన్నాయి. వాటి లో దాదాపు 10 లక్షల పింఛన్లకు ఇప్పటికే కోత పెట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ వెయ్యి రూపాయల పింఛను చెల్లిస్తే ఏడాదికి దాదాపు 3,650 కోట్ల రూపాయ లు అవసరమవుతాయి. అయితే, బడ్జెట్లో మా త్రం 1,338 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పింఛన్లకు కోతపెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బడ్జెట్లో అవసరమైనదాని కంటే తక్కువ నిధులు కేటాయించారు. పింఛన్ల ఖర్చు రూ. 1,338 కోట్లకు పరిమితం చేసేలా మరికొన్ని పింఛన్లకు ప్రభుత్వం కోతపెట్టే అవకాశం ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం కూడా అందజేశారని జగన్ వివరించారు. మున్సిపల్ సమావేశాల్లో హత్యలా? ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోంది. మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఒకరిపై ఒకరు గొడవ పడినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై పడిన గొడవకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రౌడీషీటు తెరవడమే రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం’’ అని జగన్ విరచుకుపడ్డారు. ‘‘మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొడవ పడతారే గానీ.. ఎవరైనా, ఎక్కడైనా ఆ సమావేశాల్లో హత్యలు చేస్తారా? హత్య చేయడానికి పూనుకుంటారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఎవరిపైనయినా రౌడీషీట్ తెరవాలంటే అతనిపై కనీసం మూడు కేసులు ఉండాలని చట్టం చెబుతోంది. భూమా నాగిరెడ్డిపై ఇంతకుముందు ఒక్క కేసు కూడా లేదు. మున్సిపల్ సమావేశంలో సంఘటన ఆధారంగానే ఆయనపై టపటపా మూడు కేసులు కట్టేసి రౌడీషీటు తెరిచే పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబూ ఒక మనిషేనా అన్నది ఆయన గుండెల మీదే చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. చివరకు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని కౌన్సిలర్లపైనా ఒక్క సంఘటన ఆధారంగానే మూడు కేసులు కట్టి వారిపై రౌడీషీట్లు తెరిచారు’’ అని ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై భూమా నాగిరెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే అఖిల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించమంటే బాబు వినలేదు ‘‘ప్రభుత్వ, అటవీ భూములున్న చోటే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద సమస్యలు వస్తున్నాయి. రాజధాని విషయంలోబాబుకు అసెంబ్లీలోనే మా వైఖరి స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా 30 వేల ఎకరాల ప్రభు త్వ భూమి ఉన్న చోట రాజధాని నిర్మించాలని సూచించాం. పునర్విభజన చట్టంలో అటవీ భూములు ఢీనోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చినందున, అవి ఉన్న చోటైనా నిర్మించమని చెప్పాం. ప్రభుత్వ భూములున్న చోట రాజధాని నిర్మిస్తే సామాన్యులు, ఉద్యోగులు కూడా అక్కడ సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు కొనుక్కొనే అవకాశముంటుందని కూడా చెప్పాం. ఇవేమీ చంద్రబాబు చెవికి ఎక్కించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని మొదలుపెట్టింది. చివరకు ల్యాండ్ పూలింగ్ కాస్తా ల్యాండ్ ఫూలింగ్ (రైతులను ఫూల్స్ చేసేలా) చేసే కార్యక్రమంగా తయారైంది. అందుకే రైతులు గట్టిగా నిరసన తెలుపుతున్నారు. రైతులకు అన్యాయం జరిగే ఏ పరిస్థితినైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ అని చెప్పారు. బాబుకు చిత్తశుద్ధే ఉంటే శ్రీశైలం సమస్య వచ్చేదే కాదు రాయలసీమ నీటి అవసరాలపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటి సమస్య ఇంత దూరం వచ్చేదే కాదని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాజెక్టుకు ఎడమ వైపు కేసీఆర్ ప్రభుత్వం, కుడి వైపు నుంచి బాబు ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఎడాపెడా తోడేసి విద్యుత్ కోసం వాడటంతో 15 రోజుల్లోనే ప్రాజెక్టులో నీరు 858 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో రాయలసీమకు నీరందుతుంది. నీటి మట్టం 858 అడుగులకు చేరాక బాబుకు సీమ అవసరాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఏపీ ప్రభుత్వం తమ వైపు విద్యుత్ ఉత్పతిని నిలిపివేసి కేసీఆర్‌ను తిట్టడం మొదలుపెట్టారు’’ అని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్నది తాను ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గించారని, దానిని తిరిగి 854 అడుగులకు సవరిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి 107 జీవో తీసుకొచ్చారని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలంగాణ విద్యుత్ సమస్య తీర్చవచ్చిలా.. ‘‘తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్న మాట నిజమే. అయితే కేసీఆర్ కొంత మానవత్వంతో, వినూత్నంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరఫరా లైన్లు లేవు. లైన్ల నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ అందదు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధర్యంలోని 2,600 మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అందులో ఎన్టీపీసీకి వాటాగా దక్కే 75 శాతం విద్యుత్‌ను ఆ సంస్థ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో కొనే వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అక్కడ ఎన్టీపీసీకి అప్పగించి, రామగుండం ప్లాంట్‌లో ఎన్టీపీసీ వాటా నుంచి తెలంగాణకు విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేస్తే విద్యుత్ లైన్లు వేసేవరకు ఆగాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 1,000 మెగావాట్ల సామర్థ్యం గల విశాఖపట్నం సింహాద్రి ప్లాంట్ ఫేజ్-2లో 60 శాతం విద్యుత్ ఎన్టీపీసీ వాటాగా ఉంది. తెలంగాణ ఇక్కడి నుంచి ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. దీనికి బదులుగా ఛత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేసే విద్యుత్‌ను ఆ సంస్థకు ఇవ్వవచ్చు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కొంత చొరవ చూపితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని’’జగన్ తెలిపారు. -
మాఫీపై వారానికో జీవో.. ఒరిగింది జీరో
-
ఐదువేల కోట్లు ఎలా సరిపోతాయి?
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విజయవాడ: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి రూ.1.2 లక్షల కోట్లు అవసరంకాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు సాధికార సంస్థ పేరుతో ఐదువేల కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రూ. 1.2 లక్షల కోట్ల అప్పుపై రూ. 25 వేల కోట్లు వడ్డీ ఉందని.. కనీసం చంద్రబాబు ఇచ్చిన రూ. 5 వేల కోట్లు వడ్డీకి కూడా సరిపోదని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే రుణమాఫీ హామీ నుంచి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఆరు నెలలు కాలక్షేపం చేశారని విమర్శించారు. విజయవాడలో శనివారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు రాగా సమీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరయ్యారు. సమీక్ష అనంతరం పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుపై మండిపడ్డారు. గమనిక ‘నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ నేతల పర్యటన’ శీర్షికతో శనివారం నాడు ప్రచురితమైన వార్తలో పొరపాటున సాగి ప్రసాదరాజు ఫొటో బదులుగా వేరే ఫొటో ప్రచురితమైంది. గమనించగలరు. -
బలిపీఠంపై రైతన్నలు
14 మంది రైతుల ఆత్మహత్య నెట్వర్క్: కాడి పట్టుకోవాల్సిన రైతు కాటికి వెళ్తున్నాడు. బ్యాంకు రుణం మాఫీ చేయాలని కలెక్టర్‌కు, బ్యాంకు అధికారులకు లేఖ రాసుకొని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒకరు చొప్పున, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం శాభాష్‌పల్లికి చెందిన చంద్రగిరి ఉరఫ్ దార్కార్ రాజయ్య(49) ట్రాక్టర్ లోన్‌కు సంబంధించి రూ.5.40 లక్షల అప్పు ఉంది. పత్తి సాగుకు పెట్టుబడిగా రూ.లక్ష అప్పు తీసుకువచ్చాడు. అప్పులు తీరే మార్గం కానరాక రాజయ్య మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కోనరావుపేట మం డలం పల్లిమక్తకు చెందిన రైతు ఎగంటి దేవయ్య(40) రూ.4 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన రైతు కొమ్ము లింగయ్య(48) తనకున్న 8 ఎకరాలకు తోడు మరో ఏడు ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగు చేశా డు. రూ. మూడు లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చే అవకాశం లేక శుక్ర వారం ఆత్మహత్య చేసుకున్నాడు. చందంపేట మండలం నేరడుగొమ్ము పరిధి చర్ల తండాకు చెందిన రైతు నేనావత్ చందు(40) పత్తి వేసి నష్ట పోవ డంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన రైతు బొజ్జ భీమలింగం (43) ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాడు. సాగుకు రూ.లక్ష వరకు, బంగారంపై బ్యాంకులో అప్పు, పంట రుణాలు, మరో రూ.2 లక్షలు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. బుధవారంరాత్రి క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన రైతు పెద్ద ఆంజనేయులు(60) మొక్కజొన్న, పత్తి పంట చేతికందకపోవడంతో గురువారం క్రిమిసంహారక మందు తాగాడు. వడ్దేపల్లి మండలం రాజోలికి చెందిన గళ్ల మద్దిలేటి(35) పంటలు దెబ్బ తినడంతో గురువారం పురుగుల మందు తాగాడు. తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన పెద్ద ఆంజనేయులు(60) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరి గూడకు చెందిన కుమ్మరి సత్తయ్య(38) పత్తి సాగు చేస్తున్నాడు. రూ. 50 వేలు అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన మల్లిగారి రామ స్వామి(40) ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 4 లక్షలు, ప్రైవేటుగా రూ. లక్ష అప్పు చేశాడు. గురువారం పురుగుల మందుతా గాడు. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య(40) రెండు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్లుగా రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు పోవడంతో శుక్రవారం ఉరి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన ఎండీ బురాన్(45) తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న, మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, క్యారెట్, టమోటా, క్యాబేజీ సాగు చేస్తున్నాడు. పంటలు ఎండుముఖం పట్టడంతో మనోవేదనకు గురైన బురాన్ మంచంపట్టాడు. వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన రైతు మన్నె నరసింహులు(45), ఖమ్మం జిల్లా పెదబండిరేవు గ్రామ రైతు పాయం సూరయ్య(87) తనకున్న కొద్దిపాటి భూమిలో పత్తి, వరి సాగు చేశా డు. పంట గురువారం ఇంట్లోనే గుళికలు మింగాడు. -
మోసపోయాం!
సాధికార సంస్థ ఏర్పాటైనా పైసా మాఫీ కాని తీరు ఇన్నాళ్లూ ఎదురుచూసి మోసపోయామని వాపోతున్న రైతులు హైదరాబాద్: రైతు సాధికార సంస్థ ఏర్పాటుతో రైతులంతా రుణ విముక్తులవుతారని, రైతాంగం సమస్యలన్నిటికీ అదే పరిష్కారమని ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు దాన్ని ఏర్పాటు చేస్తూ రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించటంతో రాష్ట్ర రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ కేటాయింపులతో ప్రస్తుతం ఒక్క పైసా రుణం కూడా మాఫీ అయ్యే అవకాశం లేకపోవటంతో పాటు ఇప్పటికే చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోవటంతో అది మరో ఏడెనిమిది నెలల్లో రెట్టింపు కాబోతోంది. ఇవన్నీ తలచుకుంటే రైతు గుండె గుభేలుమంటోంది. మంగళవారంనాడు విజయవాడలో రైతు సాధికార సంస్థ ఏర్పాటైనట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. రుణాల మాఫీ సంగతి ప్రస్తావించనే లేదు. రైతాంగం... ఆందోళనల దిశగా కదులుతోంది. తొలినుంచీ ఆంక్షలు, కుంటిసాకులే.. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలినుంచీ కుంటి సాకులే చెబుతోంది. కమిటీల పేరుతో రకరకాల ఆంక్షలు, పరిమితులు విధిస్తూ కసరత్తు కొనసాగించింది. చివరకు రైతు సాధికార సంస్థను తెరపైకి తెచ్చింది. రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా దాదాపు ఈ ఏడాది జూన్ నాటికే రూ.14 వేల కోట్ల వడ్డీ భారం పడినప్పటికీ.. మొత్తంగా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో రైతులు ఐదు నెలలుగా ఎదురుచూశారు. అక్టోబర్ 21న రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని, ఆలోగా రైతుల ఖాతాల వివరాలన్నీ సేకరించి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వం నమ్మబలుకుతూ వచ్చింది. తీరా సాధికార సంస్థ ఏర్పాటైనా ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడం, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోరుుంది. లక్షల్లో చేసిన అప్పులు తీరకపోవడం, ప్రైవేటుగా అప్పులు చేసి వేసిన పంటలను కరువు, తుపాను కబళించడంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. రుణం, వడ్డీ కలిసి తడిసిమోపెడైన భారాన్ని తలుచుకుని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. రూ.5 వేల కోట్లు వడ్డీకే చాలవు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నివేదించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలున్నాయి. రుణాలను సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించని కారణంగా రైతులపై ఒక్క ఏడాదికే రూ.14 వేల కోట్లకు పైగా అపరాధ వడ్డీ భారం పడింది. ఎన్నికల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణాలన్నిటినీ ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయూలి. కానీ సుదీర్ఘ కాలయూపన తర్వాత రుణమాఫీ కోసం అంటూ ఏర్పాటు చేసిన సాధికార సంస్థకు కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ రూ.5 వేల కోట్లను బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకుంటాయని, మెుత్తం వడ్డీయే తీరనప్పుడు, తమ రుణాలన్నీ ఎలా మాఫీ అవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. బాబుదే బాధ్యత: చంద్రబాబు హామీని నమ్మ డం వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోయూరు. ఈ ఖరీఫ్‌లో 11 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెల కొన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 664 మండలాలకు గాను 568 మండలాల్లో వర్షాభావ పరిస్థితు లు ఉన్నట్లు రాష్ట్ర అర్ధగణాంక శాఖ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. రైతులు గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించి ఈ ఏడాది రెన్యువల్ చేసుకుని ఉంటే ఈ ఖరీఫ్‌లో వేసిన పంటలకు బీమా వర్తించేది. కరువు వల్ల పంటలు ఎండిపోయిన రైతులకు బీమా రూపంలో పరిహారం వచ్చేది. రుణాలు రెన్యువల్ చేయించుకుని ఉం టే హుదూద్ తుపానువల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులకు కూడా ఇప్పుడు పంటల బీమా వచ్చేది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం లక్షలోపు రుణాలకు వడ్డీ కూడా వర్తించేది. కానీ రుణమాఫీపై ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయకుండా కసరత్తు పేరిట కాలయూపన చేయడంవల్ల రైతులు అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్న వారికి అధిక వడ్డీ పెను భారంగా మారింది. పంటల బీమా ఆశ లేకుండా పోయింది. ఇందుకు పూర్తిగా చంద్రబాబే బాధ్యులంటూ రైతులు మండిపడుతున్నారు. 5 నుంచి ఉద్యమమే: వైఎస్ జగన్ మాఫీ విషయంలో బాబు సర్కారు నాన్చు డు ధోరణిని ఎండగడుతూ నవంబర్ 5 నుంచి రైతుల తరఫున ఉద్య మం చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకి నాడ పర్యటనలో ప్రకటించారు. ‘‘రుణమాఫీపై జరుగుతున్న అన్యాయాన్ని రైతులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బాబు మాట లకు, చేతలకు పొంతన లేదు. ఎన్నికలప్పు డు ఒకమాట, తీరా గెలిచాకా ఒక మాట మాట్లాడుతున్నాడు’’అంటూ ధ్వజమెత్తారు. నగలు వేలం వేస్తామని నోటీసు మాకు కౌండిన్య నది పక్కన మూడెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం బంగా రం తాకట్టు పెట్టి పలమనేరులోని బ్యాంకులో రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నాం. బోరు ఎండిపోవడంతో పంట చేతికందలేదు. ప్రభుత్వమే అప్పు తీర్చేస్తుందని అదే పదివేలని ఆశించాం. ఇప్పుడు బ్యాంకు వాళ్లు అప్పు తీర్చాలని లేని పక్షంలో నగలు వేలం వేస్తామని నోటీసులు పంపారు. చంద్రబాబును నమ్మి ఆశపడినందుకు నగలమీద ఆశ వదలాల్సి వచ్చేలా ఉంది. ఇద్దరు ఆడబిడ్డలున్న మేం నగలు కూడా లేకపోతే ఏమి చేయాలో తెలియక కుమిలిపోతున్నాం. - మునిరత్నమ్మ, కొంగోళ్లపల్లె, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా రైతు సాధికార సంస్థ ఓ నాటకం ఎవరూ రుణాలు చెల్లించవద్దని, అధికారంలోకి రాగానే మొత్తం రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు బ్యాంకులకు డబ్బు చెల్లించకుండా మాకు నోటీసులు వచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు రైతు సాధికార సంస్థ అని మరో నాటకం మొదలుపెట్టారు. ఖరీఫ్ పూర్తయి రబీ వచ్చినా రుణాలు రెన్యువల్ చేసుకోనందున మాకు కొత్త రుణాలు రాలేదు.బ్యాంకులకు డబ్బు చెల్లించి రుణ విముక్తులను చేయకుండా ఇప్పుడు రైతులకు బాండ్లు జారీ చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. - టి. లక్ష్మీ కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా -
15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము
అప్పటివరకూ ఏ రైతూ రుణాల మీద వడ్డీ కట్టొద్దు రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో ఏపీ సీఎం వెల్లడి విజయవాడ నుంచే వ్యవసాయ మిషన్ పనిచేస్తుంది ‘ఈ-కామర్స్’ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఇంటివద్దకే ఎఫ్ఐఆర్, రాష్ట్ర కంట్రోల్ రూం ప్రారంభం విజయవాడ బ్యూరో: నవంబర్15వ తేదీ లోగా రాష్ట్రంలోని రైతుల ఖాతాలకు రుణ మాఫీ సొమ్ము అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అప్పటి వరకూ ఏ రైతు కూడా వడ్డీలు చెల్లించాల్సిన పనిలేదని.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. గన్నవరం పశు వైద్య కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను దశల వారీగా తీర్చే దిశగా టీడీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. తనపై నమ్మకంతో పట్టం కట్టిన రైతు సోదరుల కోసం రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి, తొలి విడతగా రూ. 5,000 కోట్లను నిధులను విడుదల చేసి, 20 శాతం మందికి రుణ విముక్తి కలిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. వచ్చే నెల 15 లోగా తొలి దశలోని రైతులకు ఆయా నగదు ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, సమస్యలను పరిష్కరించడం, రుణ పరపతి పెరిగేలా చూడటం, ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం వంటివన్నీ చేస్తామని చెప్పారు. ఇసుక వేలం పాటలను డ్వాక్రా మహిళలకే కట్టబెట్టి వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రామహిళలకు, 75 శాతాన్ని రైతు సాధికార సంస్థకు అందేలా చూస్తామని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దనీ, రైతు రుణం తీర్చుకుంటానని ఉద్ఘాటించారు. త్వరలో ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించబోతోందని.. దీంతో ై ఆన్లైన్లోనే ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుందని చంద్రబాబు అన్నారు. తుపాను బాధితుల కోసం విరాళాలు... ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తమ విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు రూ. 5.07 కోట్లు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు రూ. 1 కోటి, కేసీపీ షుగర్స్ రూ. 25 లక్షలు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు రూ. 20 లక్షలు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ. 10 లక్షలు, విజయవాడ ఆటోనగర్ ఐలా వారు రూ. 5 లక్షలు, గుంటూరు కాటన్ జిన్నర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు, సుచిత్రా రూపకుమార్ రూ. 1 లక్ష, గౌతం స్కూల్ (కైకలూరు) రూ. 50 వేలు విరాళాలను స్వయంగా సీఎంకు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్, ఉమా, పుల్లారావు, రవీంద్ర, మాణిక్యాలరావు, ఎంపీలు పాల్గొన్నారు. -
పంట ఎండింది.. గుండె పగిలింది
కరెంట్ కోతలతో కళ్ల ముందటే పంట ఎండిపోవట్టే.. వేసిన బోర్ల అప్పులు ఎక్కువయ్యే. బ్యాంకుల రుణమేమో మాఫీ కాలే. భవిష్యత్తు అంతా అంధకారమే కనిపించే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువరైతు బతుకు మీద ఆశ వదులుకున్నాడు. చేనులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని అనాధను చేశాడు. భార్య, పిల్లలను వదిలి కానరాని లోకాలకు పయనమయ్యాడు. * పాల్వంచలో యువరైతు ఆత్మహత్య * అప్పులు ఎక్కువ కావడం * రుణం మాఫీ కాకపోవడంతో మనస్తాపం * పంట చేనులోనే ఉరికి వేలాడిన అన్నదాత మాచారెడ్డి: ఆరుగాలం శ్రమించిన పంట ఎండిపోయింది. బోర్లు తవ్వించిన అప్పు వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సం ఘటన సోమవారం మాచారెడ్డి మండలం పా ల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నర్సింహులు (35) అనే రైతు తన సొంత చెరుకు తోట లో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మండల కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్‌లో నర్సింహులకు రూ.45 వేల పంట రుణం ఉంది. సోమవారం బ్యాంకుకు వెళ్లిన ఆయన తన రుణం మాఫీ అయ్యిందా అని బ్యాంకు అధికారులను అడిగాడు. కాలేదని వారు సమాధానం చెప్పారు.దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.‘అప్పులైన యి.బ్యాంక్‌ల రుణంమాఫీకాలేదు.. కొత్త రుణం రాలేదు.. పంట ఎండిపోవట్టే.. పిల్లలు చిన్నగున్నరు ఏం చేద్దాం’ అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని భార్య లక్ష్మి రోధిస్తూ చె ప్పింది. నర్సింహులు ఆయన సోదరుడు బాల్‌రాజు కలిసి నాలుగు ఎకరాల భూమిలో ఓ బోరు తవ్వించారు. ఆ బోరు నీరు తక్కువగా పోయడంతో నర్సింహులు మరో మూడుబోర్లు అదనంగా వేయించాడు. అవి వట్టిపోయాయి. రూ.లక్ష వరకు అప్పు అయ్యింది. ఎకరం చెరుకు, మరో ఎకరం వరి సాగుచేశాడు. కరెంట్ కోతలతో చెరుకుతోట సగం వరకు ఎండిపోయింది. సాగుచేసిన వరిపంట సైతం ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నర్సిం హులుకు ఉరి తాడే దిక్కయ్యింది. చనిపోతున్నానని చెప్పి... నర్సింహులు చనిపోవడానికి ముందు సమగ్ర సర్వేలో భాగంగా వచ్చిన తప్పు ఒప్పులను సరి దిద్దుకోవడానికి గ్రామపంచాయతీ వద్ద ఉన్న గ్రామస్తుడు పరశురాములుకు చూయించాడు. ఇదేమి సర్వేనో ఏమోనని మదనపడి, ఓ దిక్కు అప్పులు పెరిగిపోతున్నయి. రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు పరశురాము లు తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి నేరు గా గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. వెళ్లిన మరుక్షణమే గ్రామానికి చెందిన గ్రామసేవకుడు మశ్చందర్కు ఫోన్ చేశాడు. ‘‘కాకా నాకు బతకాల నిపిస్తలేదు చనిపోతు న్నా. రుణమాఫీ కాలేదు.. పంట ఎండిపోతుం ది. కరెంట్ ఎద్దెం మద్దెంగా ఉంది, నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా. నా భార్య, పిల్లలు పయిలం’’ అంటూ నర్సింహు లు చెప్పడంతో మశ్చందర్ వద్దని వారించాడు. ‘ఎందుకు సచ్చిపోతావ్ బిడ్డా, అందరం బతక లేమా నువ్వుకూడా గట్లనే బతుకు, చిన్న చిన్న పిల్లలున్నరు అద్దు బిడ్డా’ అని బదులివ్వడంతో నర్సింహులు ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెం దిన ఆయన గ్రామస్తులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునేలోగానే నర్సింహులు టేకు చెట్టుకు విగత జీవై కనిపిం చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య లక్ష్మి ‘‘చేనుకాడికి పోయివస్తానని శవమయ్యా వా’’ అంటూ బోరున విలపించింది. లోకం పోకడ తెలియని చిన్నారులు.. ‘‘నాయిన చెట్టు ఎక్కాడా అమ్మా’’ అంటూ అమాయకంగా అడగడంతో అక్కడ ఉన్న హృదయా లు కలచివేశాయి. నర్సింహులుకు భార్య లక్ష్మి, కూతురు అశ్విని(09), కుమారుడు నితిన్(06) ఉన్నారు. మాచారెడ్డి ఎస్ఐ ప్రసాద్‌రావు, ఏఎస్ఐ ముజీ బ్, హెడ్‌కానిస్టేబుల్ మురళి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహంతో రైతుల ఆందోళన నర్సింహులు మృతదేహంతో శనివారం సాయంత్రం పాల్వంచ గ్రామం వద్ద కా మారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రా స్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడం, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, విద్యుత్ సమస్య లు తీర్చాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. పాల్వంచ ఎంపీటీసీ సభ్యుడు గ్యార చంద్రయ్య, ఉపసర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాగౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రుణమాఫీ చేస్తామంటే మీకేం ఇబ్బంది?
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్: రైతులకు రుణమాఫీని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ మందలించింది. ‘రైతులకు రుణం మంజూరు చేసేది బ్యాంకులు. ఆ రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తానంటే అందుకు అంగీకరించాలో వద్దో అన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. మధ్యలో మీకొచ్చిన ఇబ్బందేమిటి?’ అంటూ రుణమాఫీని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన లోక్‌సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. సమాజ అవసరాలను తీర్చే రైతులు రుణభారంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలిచేందుకు సమాజం ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రుణ మాఫీలో భాగంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలకు సంబంధించి మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన జీవో ఎమ్మెస్ 174ను సవాలు చేస్తూ శ్రీనివాస్‌రెడ్డి గతవారం పిల్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అనుమతినిస్తూ, పూర్తిస్థాయి వివరాలతో తిరిగి దాఖలు చేసుకోవచ్చునంటూ ఉత్తర్వులిచ్చింది. -
వడ్డీకే చాలని నిధులతో 20 శాతం మాఫీయా?
ఇంతకన్నా నమ్మకద్రోహం ఉండదంటున్న ఏపీ రైతాంగం విజయవాడ బ్యూరో: తొలి సంతకం రుణ మాఫీపైనే అంటూ ఆర్భాటాలు పలికిన తెలుగుదేశం సర్కారు దీనిపై ఆది నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. మాఫీకి నోచుకోక, కొత్త రుణాలు రాక ఖరీఫ్ సీజన్‌ను నష్టపోయిన రైతాంగం రబీ సీజన్‌నూ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల 14వేల కోట్లు మినహాయించగా రైతాంగం తీసుకున్న పంట రుణాల విలువే 87వేల కోట్లు. ఇది రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) అధికారికంగా తేల్చిన లెక్క. దీనిలో ఇప్పటిదాకా పైసా కూడా బ్యాంకులకు చెల్లించకుండా వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, దానికి నిధులు కేటాయించి దానిద్వారా మాఫీ చేస్తామని ప్రకటించింది. మంగళవారం నుంచి విజయవాడ కేంద్రంగా పని ప్రారంభించనున్న ఈ సంస్థకు తొలివిడతగా రూ.5వేల కోట్లు కేటాయించారు. వీటిద్వారా 20 శాతం రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 87 వేల కోట్లలో 20 శాతమంటే 17,400 కోట్లు కాదా! మరి 5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని మాఫీ చేస్తున్నామంటే ఏమనుకోవాలి? పెపైచ్చు ఏడాదిలో రుణాలు తిరిగి చెల్లించలేదు కాబట్టి ఆ 87 వేల కోట్లపై 14 శాతం వడ్డీ చెల్లించాలి. అంటే వడ్డీ రూపేణాయే రూ.12,180 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. అలాంటిది వడ్డీలో సగం కూడా లేకుండా రూ.5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని తొలి ఏడాది మాఫీ చేసేస్తున్నామని, మిగిలిన రుణాల్ని తరవాత మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు రైతులెలా నమ్ముతారు? ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? రానురాను ఈ వడ్డీ పెరిగి రైతులకు పెనుభారం కాదా? నేడు సాధికార సంస్థ ప్రారంభం విజయవాడలోని గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని లైవ్‌స్టాక్ భవనంలో ఏర్పాటు చేస్తున్న రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11.50కి ప్రారంభిస్తారు. తర్వాత కళాశాల ఆవరణలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు. -
22 లక్షల మందికి మొండిచెయ్యి!
14 లక్షల మంది రైతులకే కొత్త రుణాలిచ్చిన బ్యాంకులు రుణ మాఫీ కింద రూ. 4,250 కోట్లతో 36 లక్షల రైతులకు లబ్ధి బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు సుమారు రూ. ఆరువేల కోట్లే.. హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ పొందిన రైతుల్లో సగానికిపైగా మందికి బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా.. 25 శాతం రుణమొత్తాన్ని విడుదల చేసినా.. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినా.. రైతులు కాళ్లరిగేలా తిరిగినా.. క్షేత్రస్థాయిలో బ్యాంకులు ఏమాత్రం సహకరించలేదు.. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు.. అసలు ‘రుణ మాఫీ’పై ప్రభుత్వం చేసిన తీవ్ర జాప్యం కారణంగానే బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు అందించేలేకపోయాయనే అభిప్రాయం కూడా వస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ముగిసినందున రైతులే రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్న కొత్త వాదనను ప్రభుత్వ అధికారవర్గాలు ముందుకు తీసుకుని వస్తుండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద 36 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించి, తొలి విడతగా రూ. 4,250 కోట్లను విడుదల చేయగా.. బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చింది కేవలం 14 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు ఈసారి ఖరీఫ్ సీజన్లో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదన్నది స్పష్టమవుతోంది. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించలేదు. దీంతోపాటు రుణ మాఫీపై ప్రభుత్వం త్వరగా తేల్చకుండా జాప్యం చేయడంతో పాటు... మొత్తం నిధులు జమచేయని కారణంగా బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయలేదు. సగం కన్నా తక్కువ... రుణమాఫీ కింద తొలివిడతగా ప్రభుత్వం చెల్లించిన రూ. 4,250 కోట్లకు తోడుగా మరో రూ. 1,800 కోట్ల కొత్త రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. విడుదల చేసిన మొత్తానికి కనీసం రెట్టింపు రుణాలైనా రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ శనివారం నాటికి అధికారులకు అందిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులకు కేవలం రూ. ఆరు వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అయితే రుణాలు ఇవ్వడాన్ని నిరంతర ప్రక్రియగా అధికారులు అభివర్ణిస్తున్నారు. మొన్నటివరకు రైతులకు పంటల బీమా అమలు చేయడానికి గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కోరిన యంత్రాంగం.. బీమా సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ రైతులు పంటల బీమాకు మొగ్గు చూపడం లేదని పేర్కొంటుండడం గమనార్హం. రబీకైనా అందేనా? ఖరీఫ్ సీజన్ ముగిసిపోయినందున.. కనీసం రబీ సీజన్‌కు అయినా రైతులకు సక్రమంగా రుణాలు అందుతాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రబీలో రైతులకు రుణాల మంజూరు అంశంపై వచ్చే నెలలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగే అవకాశం ఉంది. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు సహకరించడం లేదంటూ సీఎం కేసీఆర్ ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో అయినా వచ్చే సీజన్లో రైతులకు రుణాలు సరిగా అందుతాయేమోన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
‘పరిశీలన’ నిబంధనలకు విరుద్ధం
* బంగారం కుదువ పెట్టి అప్పుతీసుకున్న ఖాతాదారులు లేకుండానే.. * అభ్యంతరం చెబుతున్న బ్యాంకు మేనేజర్లు * రుణ మాఫీలో భాగం అంటున్న కోఆర్డినేషన్ కమిటీ మోర్తాడ్: పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి వాణిజ్య, సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్ల వద్ద శిక్షణ పొందుతున్న అకౌంటెంట్(కాలిబర్)లను ఆడిటర్లుగా కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. బ్యాంకులకు ఆడిటర్లు వెళ్లి పంట రుణం మాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన పహాణి, టైటిల్ డీడ్లను పరిశీలించాలి. అలాగే పంట రుణం పొందడానికి బంగారం కుదువ పెట్టినట్లు అయితే తనఖా ఉన్న బంగారాన్ని పరిశీలించాలి. టైటిల్ డీడ్, పహాణిల పరిశీలన సమయంలో ఖాతాదారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. కుదువ ఉన్న బంగారాన్ని పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ఖాతాదారు తప్పనిసరిగా ఉండాలి. బంగారాన్ని కుదువపెట్టే సమయంలో నగలు తయారు చేసే వృత్తిదారుడు పరిశీలించి బ్యాంకు అధికారులకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. రుణం తీసుకునే ముందు ఖాతాదారు సమక్షంలోనే బంగారాన్ని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి సీల్ చేస్తారు. రుణం చెల్లించి బంగారాన్ని ఖాతాదారు తీసుకునే సమయంలో ఖాతాదారు సమక్షంలోనే మళ్లి సీల్ విప్పి బంగారాన్ని ఖాతాదారుకు అందచేస్తారు. ఇప్పుడు ఆడిటింగ్ పేర ఆడిటర్లు బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుడు లేక పోయినా సీల్ వేసిన కవర్లను విప్పి పరిశీలిస్తున్నారు. ఖాతాదారులకు సమాచారం ఇవ్వండి జిల్లాలోని ధర్పల్లి మండలం రామడుగు ఎస్బీఐ శాఖతో పాటు పలు గ్రామాలలో ఉన్న బ్యాంకుల శాఖలలోను బంగారు రుణాలకు సంబంధించి బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని ఆడిటర్లు పరిశీలించారు. పరిశీలన సమయంలో బంగారం కుదువపెట్టిన ఖాతాదారులు అందుబాటులో లేక పోయినా ఆడిటర్లు కవర్ల సీల్ విప్పి పరిశీలించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు నోర్లు మూయించినట్లు తెలిసింది. కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి మోర్తాడ్, జక్రాన్పల్లిలోని జిల్లా సహకార బ్యాంకు శాఖలకు ఆడిటర్లు రాగా ఖాతాదారులకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఆడిటింగ్ చేయాలని మేనేజర్లు స్పష్టం చేశారు. దీంతో ఆడిటర్లు వెనుదిరిగి వెళ్లారు. ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడైనా పరిశీలించవచ్చని, కుదువ పెట్టిన బంగారాన్ని మాత్రం ఖాతాదారు సమక్షంలో పరిశీలించాలని కొందరు మేనేజర్లు ఆడిటర్లకు సూచిస్తున్నారు. అయితే రుణ మాఫీ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఆడిటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టిన సంబంధిత వ్యక్తులు లేకుండా బంగారాన్ని పరిశీలిస్తే అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతే బ్యాంకుల వ్యవస్థపైనే విశ్వాసం ఉండదని పలువురు మేనేజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఉన్నతాధికారులు స్పందించి కుదువ పెట్టిన బంగారం పరిశీలన విషయంలో ఆడిటర్లు నిబంధనలు పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
డీసీసీబీ తీరిది
* జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు మంగళం * నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి ఖాతాకు రూ.200 చొప్పున వసూలు * రూ.3.46 కోట్లు సేకరణ * డిపాజిట్లు లేకపోవడం వల్లే అలా చేశారట ఏలూరు (టూ టౌన్) : రైతులకు అండగా నిలవాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నిబంధనలను తోసిరాజని వారిపైనే భారం మోపుతోంది. రుణమాఫీ కోసం డీసీసీబీ శాఖల్లో ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలని ఆదేశాలు అందాయి. ఇదే సందర్భంలో 34 కాలమ్స్‌లో పేర్కొన్న వివరాలు సేకరించాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీలు రైతులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇచ్చారుు. మన జిల్లాలో మాత్రం డీసీసీబీ అధికారులు ప్రతి అకౌంట్‌కు రూ.200 చొప్పున కట్టి తీరాలనే నిబంధన పెట్టారు. జిల్లాలోని 258 సహకార సంఘాల్లో 1.99 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, ఇప్పటివరకూ 1.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించి, ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ సందర్భంలో ఖాతాలు తెరిచిన ఒక్కొక్క రైతు నుంచి రూ.200 చొప్పున రూ.3.46 కోట్లను డీసీసీబీ సేకరించింది. సహకార సంఘాల ఖర్చులూ రైతుల నెత్తినే రుణ మాఫీ అమలు కావాలంటే ఖాతాలన్నిటికీ ఆధార్ అనుసంధానించి, ఆన్లైన్ చేయూలనే నిబంధన విధించడంతో సహకార సంఘాలపైనా మోయలేని భారం పడుతోంది. రైతులకు సంబంధించిన డేటా ఎంట్రీ చేయించడంతోపాటు స్టేషనరీ, టీఏ, డీఏ తదితర ఖర్చులు తడిసి మోపుడవుతున్నారుు. ప్రతి సంఘంపై రూ.25 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చువుతోంది. సహకార సంఘాలు ఈ ఖర్చులను కూడా రైతుల నెత్తినే వేసేందుకు సిద్ధమవుతున్నారుు. రుణమాఫీకి సంబంధించి తొలుత 31 కాలమ్స్‌తో వివరాలు నమోదు చేయూలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత రైతు ఇంటి పేరును పూర్తిగా రాయూలని మరో కాలం, తదనంతరం రైతుకు పొలం ఎంత ఉంది. ఆ పొలంలో ఏ పంట వేశారనే వివరాలు అడగడంతో డేటా ఎంట్రీని మూడుసార్లు మార్చాల్సి వచ్చింది. దీనివల్ల సహకార సంఘాలపై అదనపు భారం పడింది. రుణమాఫీ అవుతుందో లేదో తెలియదు గాని, రైతులకు మాత్రం అదనపు ఖర్చు అవుతోంది. -
రైతుల ఇంటికే అధికారులు
రుణమాఫీ విషయంలో ఇబ్బందులుండవు మాట వినని బ్యాంకుల విషయం ప్రభుత్వం దృష్టికి.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : కలెక్టర్ కిషన్ హన్మకొండ అర్బన్ : రైతులకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటివద్దనే రుణమాఫీ, రెన్యూవల్‌కు సంబంధించి దరఖాస్తులపై వ్యవసాయ అధికారులు సంతకాలు తీసుకుం టారని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రుణమాఫీ, ప్రభుత్వ పథకాల మంజూరు తదితర విషయాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రుణమాఫీలో ప్రభుత్వం తొలివిడతగా 25శాతం జిల్లాకు రూ.472కోట్లు విడుదల చేసిందని, ఆ మొత్తా న్ని రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు చెప్పారు. అయితే కొన్ని బ్యాంకులు రుణాల రెన్యూవల్ విషయంలో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభంలో ఉన్నందున బ్యాంకులకు తిరగడం ఇబ్బందిగా ఉంటుందని భావించి వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల ఇంటికి వెళ్లి రుణా ల రెన్యూవల్ దరఖాస్తులపై సంతకాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారని తెలిపారు. జిల్లా లో ఇప్పటివరకు 97వేల బ్యాంకు అకౌంట్లు మాత్రమే రైతులవి అందుబాటులో ఉన్నం దున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నార ని, ఇంకా 22వేల ఖాతాల వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. మితగావారు కూడా జన్‌ధన్ ఖాతాలు తెరిచి అధికారులకు వివరా లు ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకోసం 9.65లక్షలు, పింఛన్లకోసం 5.81లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటి పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజ లు ఆందోళన చెందవద్దని సూచించారు. 20వ తేదీ గడువు అయినప్పటికీ తరువాత కూడా మండల కార్యాలయాల్లో దర ఖాస్తులు స్వీకరి స్తారని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అధికారులు ఎప్పుడు వచ్చేది వార్డుల వారీగా తేదీలు ముందే ప్రకటిస్తారని, ఇంటివద్ద అం దుబాటులో ఉండి తగిన సమాచారం ఇవ్వాల ని కోరారు. సమగ్ర సర్వే సమయంలో పూర్తి వివరాలు ఇవ్వని వారు.. అసంపూర్తి సమాచా రం ఇచ్చిన వారు ప్రస్తుతం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రశీదు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫాస్ట్ పథకానికి సంబంధించి కులం, నివాసం విషయంలో విధివిధానాలు వచ్చినప్పటికీ ఆదాయం విషయంలో ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. అయితే ముందుగా దరఖాస్తులు తెల్ల కాగితాలపై ఇస్తే సరిపోతుందని తరువాత అధికారులే విచారణ జరిపి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని చెప్పారు. ఈవిషయంలో అధికారులకు మరోసారి స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఓటర్ల నమోదు.. జిల్లాలో నవంబర్ ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుందని, దానిని పరిశీలించి అభ్యంతరాలుంటే నవంబర్ 25వ తేదీలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు లు చేసుకోవాలని చెప్పారు. నవంబర్ 9, 16 తేదీల్లో బూత్‌లవారీగా జాబితాల ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 25నాటికి డాటాఎంట్రీ పూర్తి చేసి జనవరి 5న తుదిజాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్వో సురేంద్రకరణ్, జేడీఏ రామారావు, డీఆర్డీఏ పీడీ శంకరయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బలిపీఠంపై బక్కరైతు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పచ్చని పంట పొలాలతో అలలాడుతూ సిరులొలికించాల్సిన జిల్లాను కరువు మేఘం కాటేసింది. వరుణుడు పగపట్టడం.. కాలం కాలిసిరాకపోవడం.. రుణాలు ఇచ్చే వారు లేకపోవడం.. సమయానికి భరోసా కల్పించే వారు కానరాకపోవడం కుభేరుడిగా ఉండాల్సిన రైతు కుచేలుడిగా మారుతున్నాడు. గత ఖరీఫ్‌ను అతివృష్టి ముంచితే.. ఈ ఖరీఫ్‌లో అనావృష్టి కన్నీరు పెట్టించింది. రెండు.. మూడు సార్లు విత్తనాలు విత్తినా భూమిలోనే కుళ్లిపోవడం.. కాత వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడం.. వెరసి రైతన్న ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అనుకున్న దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. మట్టిలోనే కలిసిపోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తగ్గిన సాగు.. తప్పని కరెంటు కష్టాలు.. జిల్లాలో ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అ ధికారులు అంచనా వేశారు. కానీ.. సకాలంలో వర్షా లు లేక అంచనాలు తగ్గాయి. 5.43 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. జూన్, జూలైలో కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా ఆగస్టు చివరలో కురియడంతో ఆ మాత్రం పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న పంటలకు నీటితడి అవసరం ఉంది. నెలన్నరగా వరుణుడు మొఖం చాటేయడంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీనికితోడు నీటి సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా నీరందించాలనుకుంటున్నా కరెంటు సహకరించడంలేదు. అధికారికంగానే మూడు గంటల త్రీఫేజ్ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ఇక అనధికారికంగా ఎంత కరెం టిస్తారో అర్థం చేసుకోవచ్చు. అనధికారికంగా కోతలు తీవ్రం కావడంతో గంట కూడా కరెంటు ఉండని పరిస్థితి నెలకొంది. అందని రుణాలు.. రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం కాలయాపన చే స్తుండడంతో అన్నదాతలకు భరోసా లేకుండా పో యింది. ఆ తర్వాత విడతల వారీగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందారు. కేవలం 25 శాతం రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడంతో అన్నదాత అయోమయంలో పడ్డాడు. పూర్తిస్థాయిలో రుణ మాఫీ అవుతుందని ఆశ పెట్టుకున్న వారికి ప్రభుత్వం నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,228 కోట్లు, 3.50 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ కాలం ముగుస్తున్నా బ్యాంకర్లు మాత్రం సగం కూడా పూర్తి కాలేదు. కేవలం ఇప్పటి వరకు 1,32,311 మంది రైతులకు రూ.602 కోట్లు రుణాలు అందజేశారు. ఇప్పటివరకు రుణ మాఫీ కాని రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతిసారీ బ్యాంకర్లు ఖరీఫ్ ప్రారంభంలో పంట రుణాలు అందిస్తారు. కానీ.. ఈసారి ఖరీఫ్ ముగుస్తున్నా రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వని పరిస్థితి. ఈసారి వర్షాలు లేక రెండు మూడుసార్లు విత్తనాలు విత్తి రైతులు సుమారు లక్ష 80 వేల ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తక నష్టపోయారు. ఎకరానికి సుమారు 4 వేల నుంచి రూ.6 వేల వరకు నష్టం వాటిల్లింది. అన్నిరకాల పంటలు కలిపి విత్తన దశలోనే జిల్లాలో సుమారుగా రూ.2 కోట్ల పంట నష్టం జరిగిం ది. దీంతో నష్ట పరిహారం అందక.. పంటలు మొలకెత్తక, మొలకెత్తిన పంటలు కరెంట్ కోతలతో ఎండిపోవడంతో రైతులు అత్మహత్యకు పాల్పడుతున్నారు. తగ్గిన వర్ష పాతం.. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షపాతం కంటే తక్కువగా కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 1037.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. కానీ.. 717.0 మిల్లీమీటర్లు పడింది. 31 లోటుగా ఉంది. గతేడాది ఈ సమయానికి 1326.9 మిల్లీమీటర్లు అధికంగా వర్షపాతం కురిసింది. జిల్లాలో అధికంగా 80 శాతం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. 52 మండలాలకు గాను సిర్పూర్(టి)లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వరి సాగు సగానికి తగ్గింది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు అత్మహత్యలు.. జిల్లాలో వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూలైలో పది మంది, ఆగస్టులో 15 మంది, సెప్టెంబర్‌లో 11 మంది, ఈనెలలో ఇప్పటి వరకు నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల భారం పెరిగిపోయి.. వాటిని తీర్చలేక ప్రాణాలు కోల్పోయారు. -
నమ్మి మోసపోయారు: జానారెడ్డి
‘‘కేసీఆర్ వల్లే రుణమాఫీ అవుతుందని నమ్మి ఓటేసిన రైతులంతా మోసపోయినట్లే. రుణ మాఫీ అవుతుందని రెండేళ్లుగా బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఒక్కో రైతుపై రూ. 25 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతాయి. అసలు అప్పు యథాతథంగా రైతు పేరుమీదనే ఉంది. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇటు రైతులకు, అటు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది. మూడేళ్ల దాకా కరెంటు రాకపోతే రైతులు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఆత్మహత్యలు చేసుకోవాలా?’’ -
కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల
‘‘పండుగ చేసుకోవాల్సిన కొత్త రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయి. నాలుగు నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కనికరం లేని ప్రభుత్వమిది. రైతు, పేదల వ్యతిరేకి కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తుండు. రుణ మాఫీ సహా ఏది అడిగినా వాయిదాలతోనే సరిపెడుతుండు. చివరకు అసెంబ్లీ సమావేశాలను, సొంత పార్టీ ప్లీనరీలను కూడా వాయిదాలపై వాయిదా వేస్తున్నాడంటే కేసీఆర్‌ది ‘వాయిదాల పాలన’ కాక మరేంది? కరెంట్ అడిగిన పాపానికి రైతులను గొడ్డును బాదినట్లు బాదిన చరిత్ర ఆనాడు చంద్రబాబుదైతే.. ఈనాడు కేసీఆర్‌దే. విద్యుత్ ఇవ్వడం చేతగాని కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడమెందుకు? బిడ్డా కేసీఆర్.. ఇక నీ ఆటలు సాగనీయం. ఏడు గంటల విద్యుత్, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’’ -
రోజుకో మాట పూటకో నిబంధన
అందరిలో అయోమయం జాబితా రూపకల్పనలో బ్యాంకర్లకు తలనొప్పులు కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం పాస్‌పుస్తకం ఉంటేనే రుణమాఫీ రుణమాఫీ విషయంలో పూటకోమాట మారుస్తున్న ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మాటమాటకు మారుతున్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా పరిణమిస్తుండగా.. కౌలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరువూరు : రుణమాఫీ అమలులో జరుగుతున్న జాప్యం రైతులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత తక్కువమంది రైతులకు, డ్వాక్రా మహిళలకు మాత్రమే మాఫీ ద్వారా ప్రయోజనం కలిగేలా నిబంధనలను రోజురోజుకు కఠినతరం చేస్తున్న ప్రభుత్వవైఖరిని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రుణమాఫీ వర్తింపజేసే ప్రక్రియ బ్యాంకర్లకు సైతం తలనొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గంలోని జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో గత 2 నెలలుగా రుణమాఫీ కోసం జాబితాలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతున్నారు. రాత్రింబవళ్ల కష్టపడి రూపొందిస్తున్న జాబితాలను హఠాత్తుగా విడుదలవుతున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పదేపదే మార్పు చేయాల్సి రావడంతో పని మళ్లీ మొదటికొస్తోంది. కఠినతరమవుతున్న నిబంధనలతో కనీసం 20శాతం మంది కూడా లబ్ధిపొందే సూచనలు కనిపించడం లేదని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. పాస్ పుస్తకం ఉంటేనే మాఫీ... రైతులకు సైతం పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉంటేనే మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో భూమి దస్తావేజులపై సైతం రుణాలు పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ శాఖ జాప్యం చేస్తుండడంతో సగానికి పైగా రుణమాఫీ భారం ప్రభుత్వానికి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను నట్టేట ముంచేలా ఉందని వివిధ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మాఫీ వర్తించని కౌలురైతు గ్రూపులు... గతంలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన కౌలు రైతులకు మాఫీ వర్తింపజేసే అవకాశం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కౌలురైతు రుణ అర్హతా కార్డులు కలిగి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన కౌలుదార్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉండటంతో కౌలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. గత 3 సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో 6వేల మంది కౌలుదార్లను గుర్తించిన ప్రభుత్వం కేవలం 2వేల మందికి మాత్రమే రుణ అర్హతా కార్డులు అందజేసింది. వీరిలో 800 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది. కాలయాపనకే కమిషన్ రుణమాఫీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతుల్ని మోసగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేని రుణమాఫీ వర్తింపజేయాలి. - శీలం నాగనర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ తిరువూరు మండల కన్వీనర్ కంటితుడుపు చర్య రకరకాల ప్రకటనలతో రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం నీరుగారుస్తోంది. బ్యా ంకర్లకు సైతం అర్థంకాని రీతిలో నిబంధనలను రూపొందిస్తూ రైతులకు కంటితుడుపు చర్యగా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రయత్నిస్తోంది. - సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు, తిరువూరు -
బీమా ధీమా కూడా లేదాయె!
తుపానుతో 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం రైతుకు బీమా వర్తించకుండా పోయిన వైనం రుణమాఫీ హామీతో కొత్తగా రుణాలు ఇవ్వని బ్యాంకులు అప్పులిచ్చినట్టైతే బ్యాంకులు అప్పుడే బీమా ప్రీమియం తీసుకునేవి రుణాలు రాకపోవడంతో పునరుద్ధరణ కాని పంటల బీమా దిక్కుతోచని స్థితిలో రైతాంగం హైదరాబాద్: రుణ మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ తుపానులో పంటలు కోల్పోయి న రైతుల పాలిట శాపంగా మారింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకపోవడమే కాకుండా పంటల బీమాను కూడా పునరుద్ధరించుకోలేదు. దీంతో హుదూద్ తుపాను కారణంగా భారీఎత్తున పంటలు నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. హు దూద్ బీభత్సంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. ప్రకృతి బీభత్సాలతో నష్టపోయే రైతుల్ని ఆదుకునేందుకు గ్రామం యూనిట్‌గా వర్షాధారిత పం టల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంట వేసింది మొదలు కోసిన తర్వాత పంట కల్లాల్లో ఉన్నప్పుడూ 14 రోజుల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. మామూలుగా రైతు లు ఖరీఫ్ సీజన్లో (ఏప్రిల్ నుంచి జూలై మధ్య) బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అప్పు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రైతులు వేసే పంటలకు అనుగుణంగా బీమా ప్రీమియా న్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తుంటాయి. అయితే రుణ మాఫీ హామీ నేపథ్యంలో ఏ రైతుకూ బ్యాంకులు ఇప్పటివరకు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని స్పష్టం చేయడంతో పం టల బీమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ పథకం గడువు గత నెలాఖరుతో ముగిసింది. గడువు ముగిసిన రెండు వారాల్లోపే తుపాను వచ్చి రైతులకు అపార నష్టం మిగిల్చి వెళ్లింది. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదారతపై ఆధారపడాల్సిందే తప్ప.. ఓ హక్కుగా బీమాను పొందే వీలును కోల్పోయారు. ఈనెల 22 తర్వా త తొలి విడతగా బ్యాంకులకు చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలయ్యే లోపే నష్టం జరిగింది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, మిరప, వేరుశన గ, జీడిమామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లిం ది.రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారే గానీ వ్యవసాయ బీమా గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసా య బీమా అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సం స్థలే చూస్తుంటాయి. ప్రభుత్వం నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప నిబంధనలు మార్చడానికి బీ మా సంస్థలు అంగీకరించవు. నీలం, పైలిన్ తుపాన్ల నష్టపరిహారమే ఇప్పటివరకు అందలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీమా వస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీకే నిధులకు కటకటలాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు పెట్టుబడి రాయితీని ప్రకటించారు. అరుుతే ఇది నిర్దిష్ట గడువులోపు అందితే తప్ప రైతులు కోలుకునే స్థితి లేదు. పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని, పరిహారం ఇవ్వదల్చుకుంటే ఎప్పటిలోగా ఇస్తారో ప్రకటించాలని అంటున్నారు. బీమా ఉంటే ఎకరాకు రూ. 23 వేల వరకు వచ్చేవి.. ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పడం వల్ల 90 శాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో రైతులందరూ ఖరీఫ్‌లో బీమా అర్హత కోల్పోయారు. ప్రభుత్వం లేదా రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ జరిగి ఉంటే తుపాను ప్రభావం వల్ల పంట పోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.23 వేల వరకు బీమా అందేది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఆర్బీఐ నిబంధనల మే రకు తీసుకున్న రుణ మొత్తం ఒకేసారి చెల్లిస్తే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏడాదికి 20శాతం మే ర చెల్లిస్తామంటే రైతులకు తిరిగి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వాటిని రాని బకాయిలు గా చూపి రైతులకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. పంట రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. - రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే.. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. తుపాను కారణంగా చెరకు, అరటి ఇతర పంటలన్నీ నేల కొరిగాయి. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం సంభవించింది. తిరిగి పంట వేయాలన్నా ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంక ర్లు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రభుత్వం, బ్యాంకర్లు స్పం దించకుంటే మున్ముందు పంటలు వేసుకోలేం. - సత్యనారాయణ, రైతు,సిరివాడ, తూ.గో.జిల్లా ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలి. దెబ్బతిన్న పంట పొలాలను సందర్శిస్తున్నా సహాయంపై ఇప్పటివరకు ఎవరూ మా ట్లాడటంలేదు. సర్వే చేయిస్తామని చెబుతున్నా ఎక్కడా చేయించలేదు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి. - కె.రామచంద్రరావు,సిరివాడ,తూ.గో.జిల్లా రైతులకు రెండు విధాలా నష్టం రైతులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించని పరిస్థితి ఏర్పడింది. తుపానుతో పంట కోల్పోయిన రైతులు రుణమాఫీ అందక, బీమా రాక అప్పుల ఊబిలో మరింత మునిగిపోయూరు. - దడాల సుబ్బారావు, కౌలు రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా -
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. ‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది. ‘సిట్’కేవలం జీవ న్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌ను తల దన్నేలా సింగపూర్‌లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి. నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది. చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు. - నన్నూరి వేణుగోపాల్ -
24 గంటలే గడువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇప్పటి వరకు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయని బ్యాంకులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు 24 గంటల గడువు ఇచ్చారు. 24 గంటల్లో రైతు రుణమాఫీలో ప్రగతి చూపించకపోతే ఆయా బ్యాంకుల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఖాతాలను ఉపసంహరించుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్, కరూర్ వైశ్యా, ఐఎన్జీ వైశ్యా, లక్ష్మి, పంజాబ్, విజయాబ్యాంకులు ఇప్పటివరకు ఒక్క రైతురుణం మాఫీ చేయకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ఈనెల 12 ‘సాక్షి’లో ‘అప్పు తీర్తదో.. లేదో? అందోళనలో అన్నదాతలు ’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి హరీష్‌రావు స్పందించి, మంగళవారం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతు రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షత వహించిన ఈ సమీక్షకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి. బాబూమోహన్, చింతా ప్రభాకర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ అధికారులు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, రుణాల కోసం ఆ బ్యాంకులకు వెళ్తున్న రైతులకు అన్ని జాతీయ బ్యాంకుల నుంచి ఎన్ఓసీ తీసుకురావాలంటూ నిబంధన విధిస్తున్నాయని రెవిన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రైతు రుణాల రీషెడ్యూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.499 కోట్లు బ్యాంకర్లు జమ చేసుకొని, రైతులకు తిరిగి కొత్త రుణాలు అందించినపుడే రైతు రుణాలు మాఫీ అయినట్లుగా భావిస్తామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 25 శాతం రీ షెడ్యూల్ డబ్బును తమ ఖాతాల్లో జమ చేసుకున్న బ్యాంకులు, రైతులకు తిరిగి రుణాలు ఇవ్వడంతో తాత్సారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు రూ.50 వేలకు తగ్గకుండా, రూ.70 వేలకు మించకుండా రుణాలు మాఫీ చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులతో ఒప్పదం కుదిరిందని, అప్పుడే విధి విధానాలు కూడా రూపొందించామన్నారు. వాటిని అమలు చేయకుండా బ్యాంకు బీఎంలు ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలను అమలు చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మరో 10-15 రోజుల్లో బ్యాంకు అధికారులతో మరోసారి సమీక్షిస్తామని, అప్పటి కూడా బ్యాంకర్ల ప్రవర్తనలో మార్పులు రాకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతిరోజు రైతు రుణాల ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే తాను కూడా బ్యాంకులను సందర్శించి రుణాలమాఫీ ప్రగతిని సమీక్షిస్తానన్నారు. రుణాల మాఫీ విషయంలో బ్యాంకర్లకు రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తారని, ఈ రెండు శాఖల అధికారులు 15 రోజుల పాటు స్థానికంగా ఉంటూ రైతులకు రుణాలందేలా కృషి చేయాలన్నారు. అమర వీరుల పట్ల మానవతా దృక్పథం చూపండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. రుణమాఫీ సమావేశంలోనే రెవెన్యూ అధికారులతో మాట్లాడిన హరీష్‌రావు అమరవీరుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా 2000 సంవత్సరం నుంచి 2009 వరకు ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదని, 2009 నుంచి 2014 వరకు 52 మంది తెలంగాణ సాధనలో అమరులైనట్లు డీఆర్ఓ ప్రకటించారు. దీనిపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది అమరవీరుల పేర్లు గల్లంతయ్యాయని, పునఃపరిశీలన చేసి మరో ఫైల్ సిద్ధం చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన 105 మంది యువకులపై కేసులు ఉన్నట్లు ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నివేదించగా, మరోసారి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హత్నూర: రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.4వేల కోట్లను మంజూరు చేశారన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు 25శాతం రుణాన్ని తిరిగి ఇస్తారన్నారు. రాష్ట్రం మొత్తంలో రూ.18వేల కోట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు రుణమాఫీతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. మంజీరా నదిపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి పంటలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు రైతు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రావణ్‌కుమార్, సొసైటీ చైర్మన్లు దుర్గారెడ్డి, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ రమేష్, నాయకులు మురళిధర్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, శివశంకర్‌రావు, దేవేందర్‌రావు, దుర్గంగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు నెత్తిన మరో పిడుగు
రుణాలపై వడ్డీ రేటు పెంపు ఆప్కాబ్ నిర్వాకం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో రైతాంగం నూజివీడు : ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా కాలం గడుపుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతుల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గడువు మీరిన రుణాలపై 2శాతం వడ్డీరేటును పెంచుతూ డీసీసీబీతో పాటు జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు ఆప్కాబ్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను ఎంతో గోప్యంగా పంపడం గమనార్హం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా వడ్డీ రేటును పెంచి ప్రభుత్వం తన సవతి ప్రేమను చూపించింది. పీఏసీఎస్‌లో తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించకపోతే, గడువు తీరిన తరువాత నుంచి 11శాతం వడ్డీరేటును విధిస్తుండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది కాస్తా 13శాతానికి పెంచారు. దీంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది. నాబార్డు పెంచిందని సాకు... రిజర్వుబ్యాంకు నుంచి నాబార్డుకు, నాబార్డు నుంచి ఆప్కాబ్‌కు, ఆప్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధులు సమకూరుతాయి. అయితే నాబార్డు వడ్డీరేటు పెంచిందని చెప్పి ఆప్కాబ్ కూడా డీసీసీబీలకు ఇచ్చే నిధులపై వడ్డీరేటును పెంచింది. దీంతో డీసీసీబీలు కూడా సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతుల నెత్తిన పెరిగిన వడ్డీరేటును మోపింది. వడ్డీరేటు తగ్గించిన వైఎస్... 2004లో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పీఏసీఎస్‌లలో తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై 12శాతం ఉండే వడ్డీరేటును తొలుత 11శాతానికి, క్రమేణా 7శాతానికి తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు ఉన్న 18శాతం వడ్డీరేటును తగ్గించారు. అంతేగాకుండా కేంద్రప్రభత్వం ఇచ్చే రాయితీని కూడా రైతులకు వర్తింపచేసి కేవలం పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. 2004లో కేంద్రప్రభుత్వం నియమించిన వైధ్యనాథన్ కమిటీ సహకార సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పిస్తే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులను అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుంది. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లన్నింటికి ఆర్థికపరిపుష్టి కల్పించారని రైతులే చెబుతున్నారు. రుణాలు మాఫీ చేసినా భారమే... ప్రభుత్వం రుణమాఫీని వర్తింపచేసినప్పటికీ రైతులకు రుణభారం నుంచి విముక్తి లభించే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ 31వరకు ఉన్న రుణాలు, బకాయిలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో జనవరి నుంచి రుణమాఫీ చేసేవరకు అయ్యే వడ్డీని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. దీనికి తోడు గడువు దీరిపోయిన రుణాలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి 2శాతం వడ్డీరేటు అదనంగా తోడవ్వనుంది. దీంతో రుణాలను మాఫీ చేసినా రైతులకు రుణమాఫీ భారం తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వడ్డీరేటు 2శాతం పెరిగింది : కేడీసీసీబీ సీఈవో తోట వీరబాబు గడువు దీరిన రుణాలపై వడ్డీరేటును 11శాతం నుంచి 13 శాతానికి పెంచిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంపు సెప్టెంబరు ఒకటోతేదీ నుంచే అమలులోకి వచ్చింది. గడువు తీరకముందు వరకు 7శాతం, గడువుతీరిన తరువాత 13శాతం చొప్పున వడ్డీని లెక్కగట్టడం జరుగుతుంది. -
ధీమా కరువు!
రుణ‘మాయ’ ఎఫెక్ట్ పంటల బీమా అర్హత కోల్పోయిన సగానికి పైగా రైతులు వణికిస్తున్న ప్రకృతి విపత్తులు ‘హుదూద్’ గండం తప్పినా అన్నదాతలను వీడని ఆందోళన సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మిన జిల్లాలోని రైతుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన చెప్పినట్లు రుణమాఫీ జరగలేదు. కనీసం బ్యాంకుల నుంచి రైతులు ఖరీఫ్ సాగు కోసం రుణాలను సైతం పొందలేకపోయారు. ఇప్పుడు అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న పంటలకు కూడా బీమా భరోసా కరువైంది. హుదూద్ తుపాను నేపథ్యంలో పంటల బీమాకు అర్హత కోల్పోయినవారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం సాగు కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు. ఈ మొత్తంలో కొంత నగదును పంటల బీమా కింద జమ చేసేవారు. కానీ, చంద్రబాబు మాటలు నమ్మిన ఎక్కువ మంది రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించి బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. దీంతో వారందరూ ఈ ఏడాది పంటల బీమాకు అర్హత కోల్పోయినట్టే. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకున్న కొందరికి మాత్రం బ్యాంకులు బీమాపై భరోసా ఇస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణాలు ఇచ్చారనే విషయాన్ని చెప్పేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నిరాకరించారు. కానీ, కొన్ని బ్యాంకుల మేనేజర్లు మాత్రం పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని, దీంతో బీమా సదుపాయం కూడా ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించడంతో రైతులు మండిపడుతున్నారు. 2,20,120 మందికే అవకాశం.. జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల మంది రైతులకు రూ.3049.39 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3106.20 కోట్లను అందజేసి లక్ష్యాన్ని అధిగమించారు. పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం 5 శాతం చొప్పున మొత్తం రూ.155.31 కోట్లను బ్యాంకు అధికారులే మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాయి. కానీ, 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు రూ.3659.27 కోట్లను రుణాలుగా అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,20,120 మంది రైతులకు కేవలం రూ.1,206 కోట్లను మాత్రమే పంట రుణాలుగా ఇచ్చారు. వారికి ఇచ్చిన రుణాల్లో పంటల బీమా కోసం రూ.60.3 కోట్లు మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించారు. దీంతో సగానికిపైగా రైతులు పంటల బీమాను కోల్పోయారు. ప్రస్తుతానికి హుదూత్ తుపాను ముప్పు తప్పినా, నవంబరు వరకు విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి మంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏమిటని బీమాకు అర్హత కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి సాగు.. ఈ ఏడాది బ్యాంకుల ద్వారా సక్రమంగా రుణాలు అందకపోవడంతో రైతులు గ్రామాల్లోని ధాన్యం వ్యాపారుల వద్ద నూటికి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని 6.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆయిల్ ఇంజిన్లను అద్దెకు తెచ్చుకుని గంటకు రూ.250లు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. దీనికి డీజిల్ ఖర్చు అదనం. ఒకవైపు ఖర్చులు రెట్టింపు కావడం, మరోవైపు బీమా భరోసా కూడా లేకపోవడం రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది. -
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?
ఏది న్యాయం? ► రుణమాఫీ, పింఛన్లపై నిరసనలు పట్టని టీడీపీ ►భూములు అమ్మేసిన రైతుల్ని రెచ్చగొట్టి ఆందోళనలు ►హెరిటేజ్, ‘రామోజీ’ భూముల్ని వెనక్కిచ్చేస్తారా? ►విపక్ష నేతనే టార్గెట్ చేసుకుని కదులుతున్న తీరు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు మొదలెట్టింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబీకులకు చెందిన ‘సరస్వతీ సిమెంట్స్’ను వేధిస్తోంది. ఆరేడేళ్ల కిందట ఈ సిమెంట్స్‌కు భూములు విక్రయించిన రైతుల్ని రెచ్చగొట్టి, సంస్థ ఇప్పటిదాకా ప్లాంటు పెట్టలేదు కాబట్టి ఆ భూముల్ని తిరిగి రైతులకిచ్చేయాలంటూ ఆందోళనలు చేయిస్తోంది. సంస్థకు 2009లో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజును కూడా రద్దు చేసింది. అసలు ప్లాంటు పెట్టాలంటే అనుమతులుండాలి కదా? వాటి కోసం ఐదేళ్ల కిందట చేసిన దరఖాస్తుల్ని ఇప్పటికీ పరిష్కరించకుండా, నీటి వసతి కోసం పెట్టిన దరఖాస్తును నేరుగా సీఎం కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని... మరోవైపు ప్లాంటు పెట్టలేదు కాబట్టి లీజు రద్దు చేశామనటాన్ని ఏమనుకోవాలి? ప్లాంటు రాలేదు కనుక కొనుగోలు చేసిన భూముల్ని రైతులకిచ్చేయాలని చేస్తున్న డిమాండ్లను ఏమనుకోవాలి? ఫిలిం సిటీ కోసం రామోజీరావు ఎకరాకు లక్షకు మించి ఎక్కడా వెచ్చించలేదు. మరిపుడు ఆయన భవనాలు నిర్మించిన ఐదారు ఎకరాల్ని వదిలేసి మిగిలిన 1900 పైచిలుకు ఎకరాలనూ తిరిగి రైతులకిచ్చేయాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయటం లేదు? తన హెరిటేజ్ సంస్థ కోసం కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు ఎందుకు అప్పగించటం లేదు? సిమెంట్ కంపెనీ కోసమని కొనుగోలు చేసి నిరుపయోగంగా వదిలిపెట్టిన టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి భూములపై ఎందుకు రాద్ధాంతం చేయటం లేదు?సరస్వతీ సిమెంట్స్ సమీపంలోనే సంఘీ సంస్థ సేకరించిన 2000 పైచిలుకు ఎకరాల్లో గానీ, గుజరాత్ అంబుజా, ఆంధ్రా సిమెంట్స్ సంస్థలు సేకరించిన భూముల్లో ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టలేదే! వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఎందుకు ధర్నాలు చేయించటం లేదు? లీజుల్ని ఎందుకు రద్దు చేయలేదు? మరీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒకవైపు రుణమాఫీ చేయనందుకు రైతులకు మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న బాబు... రైతులకు న్యాయం చేస్తామంటూ తమ వర్గానికి చెందిన కొందరిని జగన్‌మోహన్‌రెడ్డిపైకి రెచ్చగొడుతుండటాన్ని ఏమనుకోవాలి? కొనుగోలు చేసిందీ అధిక ధరకే... నిజానికి 2008. 2009లో సరస్వతీ సిమెంట్స్ రైతుల నుంచి భూములు కొన్నపుడు గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ధర ఎకరాకు రకాన్ని బట్టి రూ.1-3 లక్షల మధ్య ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సరస్వతీ సంస్థ ఎకరాకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.8.5 ల క్షలు చెల్లించింది. అందుకేఒక్క రైతు కూడా తనకు అన్యాయం జరిగిందనలేదు. ఇపుడు టీడీపీకి చెందిన వారిని రెచ్చగొట్టి ఆ భూముల్లో ఘర్షణలకు దిగుతూ... అడ్డుకున్న సరస్వతీ సంస్థ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ప్రభుత్వ పెద్దలే పెట్టిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు? -
సహకార బ్యాంకుల్లో రూ.184కోట్ల రుణాలు మాఫీ
గజ్వేల్: జిల్లాలోని సహకార బ్యాంకు ల ద్వారా రైతులకు రూ.184 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఇప్పటివరకు పావువంతు రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి తెలి పారు. శనివారం గజ్వేల్‌లోని సహకార బ్యాంకులో ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్లో 56951 మంది రైతులు రుణాలు పొం దారని వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈనెల 15లోగా రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకొని ‘జీరో’ వడ్డీని పొందాలని సూచిం చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5149మంది రైతు లు రుణాల పొందారని చెప్పారు. వీరికి రూ.13.7కోట్ల రుణమాఫీ వర్తిస్తుందన్నారు. జాతీయ బ్యాంకులకు దీటు గా తమ బ్యాంకు సేవలందిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ శివకోటేశ్వర్‌రావు, గజ్వేల్ మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపాక: కొండపాక పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న 826 మంది రైతులకు 2కోట్ల 56లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని దేవేందర్‌రెడ్డి చెప్పారు. దీంట్లో 25 శాతం కింద రూ.61 లక్షలు పీఏసీఎస్‌కు చేరాయన్నారు. రైతులు ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రెండో విడత విడుదలయ్యే మాఫీ డబ్బులకు ఇబ్బందులెదురవుతాయన్నారు. రెన్యువల్ చేసుకుంటే జీరో శాతం వడ్డీ లేదంటే రైతులకు 13 శాతం వడ్డీ పడుతుందన్నారు. -
పంట రుణాలివ్వడంలో వెనుకంజ
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని వివిధ బ్యాంకులు రైతులకు పంట రు ణాలు మంజూరు చేయడంలో ఇతర జిల్లాల కంటే వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు పంట రుణాలు అందించాలని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, రుణ మాఫీ కూడా చేసిందని పేర్కొన్నారు. అయినా కొత్త పంట రుణాల మంజూరులో మన జిల్లా వెనుకబడి ఉందని తెలిపారు. జిల్లాలో భూములు లేని వారు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే తమకు రిపోర్టు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోగా పంట రుణాలు ఇవ్వాలని సూ చించారు. ప్రతీ రోజు ఐదు గంటలకు ఏయే బ్యాంకులు ఎం త మంది రైతులకు రుణాలు ఇచ్చారో తనకు నివేదికల రూపంలో పంపాలని అన్నారు. సంబంధిత మండల తహశీల్దార్లు, ఆర్డీవోలు ఆయా పరిధిలోని బ్యాంకుల్లో కొద్ది సమ యం కేటాయించాలని, బ్యాంకు అధికారుల సమన్వయం తో పంట రుణాల మంజూరులో సహకరించాలని కోరారు. మండలాల ఏవోలు, ఎడీలు, కూడా బ్యాంకులకు వెళ్లి రుణా ల విషయంలో సరి చూడాలని ఆదేశించారు. పరిహారంను రైతు పాత బకాయి కింద జమ చేస్తే ఆ బ్యాంకుల వివరాలను తనకు పంపాలని ఎల్డీఎంకు సూచించారు. ఓ జిల్లా కలెక్టర్ బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తే బాగుంటుందా.. అని ప్రశ్నించారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన సర్వీసుల శాఖలు వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న రుణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలని, ఇందుకు జీరో ఖాతా తెరవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఎల్డీఎం శర్మ, జేడీఏ రోజ్‌లీల, ఆర్డీవోలు, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
అప్పు తీర్తదో..లేదో?
ఆందోళనలో రైతన్నలు ‘పోతిని... బేంకిల దస్కతి పెడితిని.. ఇయ్యాలగాకున్నా రేపైనా బేంకోడు నా ఇంటికే ఒచ్చి తట్టాసెంబులు గుంజుకపోడా?.. గింతకు గంతయి మొయ్యలేని బరువైనంక నా భూమిని బేంకోడు ఏలం బెట్టడా?’ నరసన్నపేట గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి, ఇటిక్యాల రైతు మల్లయ్య, రాంనగర్‌కు చెందిన చెందిన ఎర్రబోయిన నారాయణ అనే రైతులు అనుమానం ఇది. ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తున్నా, రైతులు వాస్తవానికి బ్యాంకుకు వెళ్లి రుణాలు రీషెడ్యూల్ లేదా రెన్యూవల్ చేయించుకోవాలి. అందుకు బ్యాంకులో సంతకాలు చేయాలి. కానీ సంతకాలు చేస్తే బ్యాంకర్లు తమ వద్దే అప్పు వసూలు చేస్తారని భయపడుతున్నారు రైతులు. వాస్తవ పరిస్థితిని రైతులకు వివరించాల్సిన యంత్రాగం ఆ పని చేయకపోవడంతో జిల్లాలో చాలామంది రైతులు బ్యాంకు వైపు కన్నెత్తి చూడడం లేదు. సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. అయినా రైతుల్లో ఇంకా ఏదో ఆందోళన. స్పష్టమైన విధివిధానాలు రూపొందించి కచ్చితమైన హామీ ఇచ్చినా, రుణమాఫీ అవుతోందో? కాదో అన్న భయం వెంటాడుతోంది. ఖరీఫ్ ఎలాగు ముగిసిపోయింది, కనీసం రబీకైనా కొత్త రుణాలు దక్కుతాయే లేదో అని అన్నదాతలు దిగులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఇంకా ఐదురోజులు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతులు మాత్రమే రీషెడ్యూల్ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు ‘సాక్షి’ పల్లెల్లో తిరిగింది. రైతులు ఏముకుంటున్నారో..వారి ఆందోళన ఏమిటో తెలుసుకునేప్రయత్నం చేసింది. రుణమాఫీ, రీషెడ్యూల్‌పై అన్నదాతలకు అవగాహన కల్పించడంపై అధికారులు పూర్తిగా విఫలమాయ్యారని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీనికి తోడు ప్రతిపక్ష నేతలు ఎవరికి తోచిన విధంగా వారు రుణమాఫీపై స్టేట్మెంట్లు ఇస్తూ రైతులను భయపెట్టారు. దీంతో రైతన్నలు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు గడపతొక్కని రైతు జిల్లాలో 4,04,095 మంది రైతులు లక్షలోపు రుణాల మాఫీకి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 1,12,104 మంది రైతు లు రుణాల రీషెడ్యూల్కు, 2,91,991 మంది రైతులు రుణాల రెన్యూవల్‌కు అర్హులుగా నిర్ధారించింది. ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతుల రుణాలే రీషెడ్యూల్ కాగా 44,807 మంది రైతుల రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యూవల్ చేయగలిగారు. ఇంకా 2.47 లక్షల మంది రైతుల రుణాలు రెన్యూవల్ చేయాల్సి ఉంది. లక్ష మందికిపైగా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. రీషెడ్యూల్ అంటే... బ్యాంకులో రుణం అలాగే ఉంటుంది. నిర్ధారించిన రూ. లక్ష వరకు అసలు, దానికైన వడ్డీని కలిపి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ చెల్లింపులు వచ్చే ఏడాది చెల్లించవచ్చు... లేదంటే మరో రెండు మూడేళ్ల తర్వాతైనా చెల్లించవచ్చు. ఎప్పుడు చెల్లిం చినా అసలు వడ్డీని కలిపి రైతుతో సంబంధం లేకుం డా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల రుణాలను తీర్చేస్తుంది. భారతీయ రిజర్వుబ్యాంక్తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా ఒప్పందం చేసుకుని వచ్చారు. దీన్నే రీషెడ్యూల్ అంటారు. అయితే ఇక్కడ రైతు పే రు మీద కొత్త ఖాతా తెరిచి ఈ ఖాతాలోనే పాత అప్పును జమ చేస్తారు. ఈ పద్ధతిలో రైతులు బ్యాం కులకు వెళ్లి బ్యాంకు రికార్డుల మీద సంతకం చే యాల్సి ఉంటుంది. ఇక్కడే రైతులు జంకుతున్నారు. సంతకం పెడితే అసలుకు వడ్డీలు కలిపి తమ వద్దే వసూలు చేస్తారోమోనని భయపడుతున్నారు. రెన్యూవల్ అంటే... ఇక రుణాలు రెన్యూవల్ అంటే ప్రభుత్వం రైతు రుణాలను దశల వారీగా బ్యాంకుకు చెల్లిస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్ కంటే ముందు తీసుకున్న పంట రుణాలు, బంగారం రుణాలను కూడా ప్రభుత్వమే విడతల వారీగా చెల్లిస్తుంది. సర్కార్ మొదటి విడత కింద 25 శాతం డబ్బును చెల్లిస్తుంది. మిగిలిన డబ్బును కూడా వాయిదాల్లో జమ చేస్తుంది. దీనికి కూడా రైతు బ్యాంకు రికార్డుల్లో సంతకం చేయాల్సి ఉంటుంది. తొలి విడత నిధులు బ్యాంకులో జమ కాగానే రైతులు కొత్త రుణాలకు అర్హులు అవుతారు. పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, చెల్లించిన 25 శాతం సొమ్మును కలుపుకుని రూ.55 వేల వరకు రైతులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. పై రెండు పద్ధతుల్లో కూడా రైతులు రుణాలు కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. కానీ రెవిన్యూ, వ్యవసాయ, సమాచార, ప్రజా సంబంధాల శాఖల అధికారులు రైతులకు బ్యాంకు లావాదేవీల గురించి విడమరిచి చెప్పడంలో విఫలమయ్యారు. దీంతో అన్నదాతలు పాత రుణాలు మాఫీ చేయించుకోలేక, కొత్త రుణాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ రుణాల మంజూరు, రుణాల మాఫీ మీద లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
‘బాబు’ మాయ
⇒ అన్నదాతకు కోలుకోలేని దెబ్బ ⇒ బ్యాంకుల నుంచి అందని రుణాలు ⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ⇒ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.3,797 కోట్లు ⇒ బ్యాంకులు ఇచ్చింది కేవలం రూ. 227 కోట్లు సాక్షి, గుంటూరు : అన్నదాతలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో కనీసం పెట్టుబడులు కూడా రాక కుదేలవుతున్న అన్నదాతకు రుణమాఫీ రూపంలో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాక, కొత్త అప్పు పుట్టక అవస్థలు పడుతున్నారు. ► బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ► ఈ ఏడాది ఖరీఫ్ రుణం లక్ష్యం రూ. 3797.14 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ. 227.80 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. దీంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ► ప్రభుత్వ నిర్వాకంతో రెండు రకాల భారం అన్నదాత నెత్తిన పడింది. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాకపోవడంతో 14 శాతం వడ్డీ రైతుకు భారంగా మారింది. మరో వైపు పెట్టుబడులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడంతో వందకు మూడు రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ► ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రాక పోవడంతో అన్నదాతలకు దిక్కు తోచడం లేదు. ► ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీ సాగు కోసం రైతులు సన్నాహాలు చేసుకొంటు న్నారు. చేతిలో రూపాయికూడా లేకపోవడంతో సాగు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ► జిల్లాలో 12,21,965 మంది రైతులకు రుణ మాఫీ ద్వారా రూ.9,749 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరాల్సివుంది. రుణమాఫీ కాకపోగా, రుణాలను రెన్యూవల్ చేయలేదు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి రైతులకు రూ.6,328 కోట్ల రూపాయల రు ణాలను ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రణాళికలు వేసినా ఆచరణలో కార్యరూపం దాల్చ లేదు. రబీ సాగుకు సన్నాహాలు... ► జిల్లాలో అన్నదాతలు రబీ సాగుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. పెట్టుబడులు కోసం మళ్లీ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ► రబీలో ముఖ్యంగా జొన్నతో పాటు, రెండో పంట కింద వరి సాగు చేస్తారు. ► ప్రభుత్వం రూ. 2,531.43 కోట్ల రూపాయలను రబీ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు. ► జిల్లాలో 3,684 మంది రైతు మిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 136 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. ► కౌలు రైతులకు సంబంధించి 27,562 మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ► జిల్లాలో 7,945 రైతు సంఘాలు ఉండగా 38 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. మొత్తం మీద రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగా మారాయి. -
16న ధర్నాలు
రుణమాఫీ అమలులో ప్రభుత్వ తీరుకు నిరసనగా.. పార్టీలకు అతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొనాలి వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు పార్థసారథి పిలుపు కంకిపాడు : రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంకిపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై ఆశతో టీడీపీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ 16న అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా రైతులు, మహిళలు ధర్నాల్లో పాల్గొని పాలకుల కళ్లు తెరిపించాలని కోరారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబుకు ప్రజల ఇబ్బందులు పట్టడంలేదని విమర్శించారు. -
డ్వాక్రా మహిళల మెడపై కేసుల కత్తి
యలమంచిలి కోర్టులో 19 మందిపై వ్యాజ్యాలు మరో 37 మందిపై దాఖలుకు చర్యలు నిర్ధారించిన ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ యలమంచిలి : రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం తాత్సారంతో బ్యాంకర్లు తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కూడా బ్యాంకులకు చెల్లించొద్దంటూ పదే పదే సభల్లో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వమే అప్పులు తీరుస్తుందంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలయినా రుణమాఫీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలూ రుణమాఫీ ఆశతో బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. ఈ క్రమంలో కాలపరిమితి తీరిన మొండి బకాయిల విషయంలో యలమంచిలి స్టేట్ బ్యాంక్ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. యల మంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లికి చెందిన 19 మంది డ్వాక్రా మహిళలపై యల మంచిలి సబ్‌కోర్టులో దావాలు వేశారు. కొక్కిరాపల్లిలోని 40 స్వయం సహాయక సంఘాలకు రూ.2కోట్లకుపైగా ఆరేళ్లక్రితం యలమంచిలి ఎస్బీఐ అప్పులిచ్చింది. దాదాపు 400 మంది మహిళలు రుణాలు పొందారు. వీరు తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ.3.50కోట్లకు చేరుకుందని ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ పి.ఎస్.శ్రీనివాసమూర్తి గురువారం విలేకరులకు చెప్పారు. తొలి దశలో 19 మంది మహిళలపై కేసులు వేశామన్నారు. మరో 37 మందిపై న్యాయస్థానంలో కేసులు వేసేందుకు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం రుణమాఫీని వెంటనే అమలు చేసి తమను ఆదుకోవాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఎస్బీఐ నుంచే కాకుండా మిగతా బ్యాంకర్లు కూడా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామం యలమంచిలిలో సంచలమైంది. డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. -
అర్హులను గుర్తించేందుకే సమగ్ర గణన
కలెక్టర్ రాహుల్ బొజ్జా సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారమే కుటుంబంలోని వ్యక్తులు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, కులం, విద్యార్హతలు తదితర వివరాలను 2011 నుంచి సేకరించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ వివరాలను వివిధ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా పథకాల అమలులో వినియోగిస్తామన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10 న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామైక్య సంఘాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో, పురపాలక సంఘాల్లో వెబ్సైట్ల ద్వారా ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు. గతంలో నిర్వహించిన సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, విద్యార్హతలు ఇతర సమాచారాన్ని సరిచేయించుకోవాలనుకునే వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19న గ్రామ సభలు నిర్వహిస్తామని, నవంబర్ 8 వ తేదీన ఆక్షేపణలను స్వీకరిస్తామన్నారు. నవంబర్ 30లోపు ఆక్షేపణలను పరిష్కరించి ముసాయిదా జాబితాను డిసెంబర్ 30 లోపు ప్రచురిస్తామన్నారు. ప్రజలంద రూ ముసాయిదా జాబితాలో కుటుంబ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబంలోని వ్యక్తుల పేర్లు లేనట్లయితే, జాబితాలోని సమాచారాన్ని సవరణ చేయడానికి , ఇతరుల సమాచారంపై ఆక్షేపణలు చేయడానికి, తొలగించడానికి వినతులను సంబంధిత అధికారులకు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడటం ఈ జాబితా ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాత్రమే దరఖాస్తును నేరుగా అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలి నెల రోజులుగా రుణమాఫీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, రూ.లక్షలోపున్న రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు రీషెడ్యూల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2013 ఖరీఫ్ లోన్ మూడు సంవత్సరాలకు రీషెడ్యూల్డ్ అవుతుంద న్నారు. మొదటి సంవత్సరం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే రెండు, మూడు సంవత్సరాలలో రూ.లక్ష చెల్లిస్తుందన్నారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి రీషెడ్యూల్ మాత్ర మే చేయించుకోవాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆహార భధ్రత కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులను వీఆర్వో కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. తెల్లకాగితంపై సాధారణ వివరాలు పొందుపరుస్తూ, ఆధార్‌కార్డు వివరాలు అందించినట్లయితే సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపర్చిన వివరాల ఆధారంగా కార్డులు అందజేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు ఫాస్ట్ పథకం, పెన్షన్ల ప్రక్రియ అక్టోబర్ లోపు ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తిచేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అన్లైన్ ద్వారా మీ-సేవా కేంద్రంలో http://epass.cgg.gov.in సంప్రదించగలరన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్, డీఆర్డీఏ పీడి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15లోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేయాలి
హైదరాబాద్: రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని, రైతులందరికీ కొత్త రుణాలు అందేట్లు చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయం నుంచి వారు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో వూట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లతోపాటు జిల్లా వ్యవసాయధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్లు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు రోజూ కలెక్టర్లతో సమీక్ష చేస్తామని జనార్దన్‌రెడ్డి చెప్పారు. రైతులకు కొత్త రుణాలు తక్షణంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున యుద్ధప్రాతిపదికన రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.