Amazon Prime Video
-
మరో ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ సినిమా స్ట్రీమింగ్
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయతే, అమెజాన్ ప్రైమ్‌లో కూడా తెలుగు వెర్షన్లోనే హిడింబ మూవీ తాజాగా విడుదలైంది.ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడిగా అశ్విన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజుగారి గది సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ చిత్రాలన్నింటికి ఓంకార్ దర్శకత్వం వహించడం గమనార్హం. అయితే, హిడింబ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై భారీ అశలు పెట్టకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్‌గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.కథేంటి..?హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. -
ఇదెక్కడి ట్విస్ట్.. మళ్లీ ఓటీటీకి వచ్చేసిన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్
2018లో వచ్చి సూపర్ హిట్‌గా హారర్ థ్రిల్లర్ తుంబాడ్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ మూవీని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.31 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. అయితే రీ రిలీజ్‌కు ముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండేది. కానీ ఊహించని విధంగా ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తొలగించారు.అయితే తాజాగా ఆడియన్స్‌కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ మరోసారి సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని మహరాష్ట్ర జానపద కథల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హనీ ట్రెహాన్, అషర్ హక్, హ్యారీ పర్మార్, ప్రశాంత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.తుంబాడ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తుంబాడ్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నటుడు, నిర్మాత, సోహమ్ షా ఇప్పటికే ప్రకటించారు. -
ఓటీటీలో డిటెక్టివ్ థ్రిల్లింగ్ సినిమా స్ట్రీమింగ్
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’(Bhoothaddam Bhaskar Narayana). స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్‌ని పంచింది. ఆపై ఆహా ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను కొనసాగించింది. ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.డిటెక్టివ్ థ్రిల్లర్స్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. ఇప్పటికే ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ ఎంట్రీ ఇచ్చింది.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
సుడల్ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన నాగచైతన్య
తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్ సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ సీక్వెల్‌గా పార్ట్2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి పుష్కర్ల ద్వయం నిర్మించింది. ఇందులో కదీర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు. -
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు.బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది. -
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్‌తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్‌ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ఈ మధ్య సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు హిట్టయ్యాయంటే చాలు దానికి కొనసాగింపుగా రెండో భాగం, మూడో భాగం తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.తమిళంలో వచ్చిన బెస్ట్ సిరీస్‌లో సుడల్ ఒకటి అని.. ఇన్నాళ్లకు రెండో పార్ట్ రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సుడల్ మొదటి భాగం 2022లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. పార్తీబన్, కదీర్, ఐశ్వర్య రాజేశ్, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి జంట కథ అందించగా బ్రహ్మ అనుచరణ్ దర్శకత్వం వహించారు. రెండో భాగానికి కూడా వీళ్లే పని చేస్తున్నారు.సుడల్ కథేంటి?తమిళనాడులోని సాంబలూరు అనే చిన్న గ్రామంలో ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఫ్యాక్టరీ తగలబడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్తిబన్) కూతురు నీల కనిపించకుండా పోతుంది. మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? నీల సోదరి నందిని (ఐశ్వర్య రాజేశ్) సొంతూరిని వదిలేసి కోయంబత్తూరులో ఎందుకుంటోంది? ఈ మిస్సింగ్‌ల వెనక నీల హస్తం ఉందా? అనే ఆసక్తికర అంశాలతో సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉంటుంది. Some storms never settle.🌪️#SuzhalS2OnPrime, New Season, Feb 28 pic.twitter.com/sHDaA8sjW8— prime video IN (@PrimeVideoIN) February 11, 2025 చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్ -
విలేజ్‌లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించారు.మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్‌తో కథ ఉంటుంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్‌ను షార్ట్ కట్లో రానా పేరుతో ప్రమోట్ చేశారు. ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి. -
ఓటీటీలో గ్లామర్ బ్యూటీ సినిమా.. సర్ప్రైజ్ స్ట్రీమింగ్
అప్సర రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. నటి అప్సర రాణికి సోషల్‌మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె నటించిన మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇవడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అప్సర రాణీ చేయని వెరైటీ సబ్జెక్ట్ కావడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది.తలకోన సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కోసం ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడమే కాకుండా భారీ యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్మురేపింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం. హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది..? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. -
ఓటీటీలో సెడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. బేబీ జాన్‌తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్‌లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ సినిమా.. 'డార్క్' పేరుతో తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్‌గా 'డార్క్' టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
ఓటీటీలో 'హెబ్బా పటేల్' రొమాంటిక్ సినిమా
టాలీవుడ్లో భారీ తారాగణంతో గతేడాది నవంబర్‌లో విడుదలైన ‘‘ధూం ధాం’(Dhoom Dhaam Movie) సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (hebah patel) జోడీగా నటించిన చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ( Sai Kishore Macha) తెరకెక్కించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ భారీ అంచనాలతో నిర్మించారు. థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ సినిమా కథలకు కాస్త కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో 'ధూం ధాం'గా చూపించారు. గతంలో శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన డైరెక్టర్ సాయి కిషోర్ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో కాస్త బెటర్‌గానే ఓపెనింగ్స్ వచ్చాయి.ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ధూం ధాం చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హెబ్బా పటేల్ కాస్త గ్లామర్ రోల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మారుతి సినిమా 'రోజులు మారాయి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చేతన్ కృష్ణ ధూం ధాం అనేలా మెప్పించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో రూ. 7 వేల కోట్ల ప్రాఫిట్ సినిమా
మోనా ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైనా సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మోనా-2 టైటిల్‌తో గతేడాదిలో నవంబర్ 27న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని డేవిడ్ డెరిక్ జూనియర్, జాసన్ హ్యాండ్, డానా లెడౌక్స్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మోనా 2 చిత్రాన్ని చూడాలంటే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ కోసం రూ. 389 చెల్లించాలని మేకర్స్ ప్రకటించారు. మోనా 2 (Moana 2) చిత్రాన్ని సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించింది. అయితే, ఈ చిత్రం కేవలం 50 రోజుల్లోనే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 8500 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ చిత్రాల లిస్ట్‌లో మోనా2 చేరిపోయింది. ఈ చిత్రం సుమారుగా రూ. 7000 కోట్లకు పైగానే లాభాలను గడించింది.మోనా2 మూవీలో డ్వేన్ జాన్సన్‌తో పాటు ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్ వంటి వారు తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. 2016లో వచ్చిన మోనా మూవీకి సీక్వెల్‌గా మోనా 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు కాస్త మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. రెంటల్ కాకుండా ఉచితంగా ఈ చిత్రాన్ని అమెజాన్‌లో చూడాలంటే మార్చి 25 వరకు వేచి ఉండాల్సిందే. హాట్‌స్టార్‌లో తెలుగు వర్షన్ కూడా అదే సమయంలో రిలీజ్ కావచ్చు. -
ఓటీటీలో థ్రిల్లర్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు
అమెరికన్ థ్రిల్లర్ సినిమా 'స్ట్రేంజ్ డార్లింగ్'(Strange Darling ) తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారంలో ఉంది. కానీ, ఆ విషయాన్ని దర్శకుడు జె.టి. మోల్నర్ ధృవీకరించలేదు ఆపై తిరస్కరించలేదు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో (Amazon Prime Video) పాటు బుక్‌మైషోలో కూడా తెలుగు వర్షన్ రన్ అవుతుంది. అయితే తాజాగా జియో సినిమా(JioCinema) ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ తాజాగా తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతేడాది ఆగస్టు 23న విడుదలైన స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రానికి హాలీవుడ్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎమ్బిడి రేంటిగ్ కూడా 7కు పైగా ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తి చూపారు. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్స్‌ను అయితే రాబట్టలేకపోయింది. అయితే, థ్రిల్లింగ్‌తో పాటు బోల్డ్ సినిమాలను ఇష్టపడే వారిని మాత్రం నిరుత్సాహపరచలేదని చెప్పవచ్చు. జె.టి. మోల్నర్ తెరకెక్కించిన ఈ మూవీలో విల్లా ఫిజ్గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలలో మెప్పించారు.సినిమా నిడివి కేవలం 1:35 గంటలు మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్‌తో ప్రారంభమైన ఈ కథ ఫైనల్‌గా అనేక మలుపులు తిరుగుతుంది. ఫ్యామిలీతో పాటుగా కూర్చొని చూసే సినిమా ఎంతమాత్రం కాదు. అలాంటి పొరపాటైతే చేయకండని రివ్యూవర్లు కూడా చెప్పారు. స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్గెరాల్డ్ నటించగా.. డెమోన్ క్యారెక్టర్‌ను గాల్నెర్ పోషించారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో చిత్రం ఉంటుంది. థియేటర్స్‌లో చూసేంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. కానీ, ఓటీటీలో మాత్రం పక్క చూసేయవచ్చు. చివరి 40 నిమిషాలు మరీ వైలెంట్‌గా మూవీ మారిపోతుంది. ఓటీటీలో ఔట్‌స్టాండింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో అమెజాన్, జియో సినిమాలో మీరూ చూసేయండి. -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్‌హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్‌మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
'ది ఫ్యామిలీ మ్యాన్-3' గురించి గుడ్ న్యూస్
ఓటీటీలో భారీ విజయం అందుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఓటీటీలో భారీగా ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్’ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ షూటింగ్ పనులను గతేడాదిలో ప్రారంభించారు. అయితే, తాజాగా ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్3’ గురించి ఒక శుభవార్తను మేకర్స్ పంచుకున్నారు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. అందుకు సంబంధించి వారు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజ్ అండ్ డీకేతో పాటు మనోజ్ బాజ్‌పాయ్,గుల్‌పనాగ్, ప్రియమణి, సమంత పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో వారు పంచుకున్నారు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కూడా మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, విడుదల తేదీని ప్రకటించలేదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. It's a wrap on Season 3 of The Family Man! Thank you to the wonderful crew and cast for going through with the toughest shoot yet! ❤️#TFM #TheFamilyMan3 pic.twitter.com/WXogsICE6v— Raj & DK (@rajndk) January 23, 2025 -
ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు 'సస్పెన్స్ థ్రిల్లర్' సినిమా
వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఫియర్’ (Fear) ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మెప్పించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే, ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది డిసెంబర్ 14న రిలీజైంది. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)ఫియర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (జనవరి 22) ఓటీటీలో విడుదలైంది. 'అమెజాన్ ప్రైమ్'లో(Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలతో పాటు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతమేరకు ఉండాలి అనే కాన్సెప్ట్‌తో ఫియర్ చిత్రాన్ని తీశారు. సినిమా కాస్త పర్వాలేదనిపించేలా ఉంటుంది. కానీ, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేకపోయింది.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే. -
ఈ వారం ఓటీటీకి ఏకంగా 11 చిత్రాలు.. ఆ రెండే స్పెషల్..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది థియేటర్లలో మూడు తెలుగు సినిమాలను సినీ ప్రియులను అలరించాయి. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో వెంకీమామ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఏయే సినిమాలు వస్తున్నాయని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వాటిలో ముఖ్యంగా రజాకార్, బరోజ్ 3డీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలోనే సినీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఓ ఓటీటీలో రానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ వారం ఓటీటీ సినిమాలు..నెట్‌ఫ్లిక్స్..ది నైట్ ఏజెంట్- సీజన్ 2(వెబ్ సిరీస్) -జనవరి 23షాఫ్డెట్( కామెడీ సిరీస్)- జనవరి 24ది శాండ్ క్యాస్టిల్(హాలీవుడ్ మూవీ)- జనవరి 24ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్(కొరియన్ సినిమా)- జనవరి 24అమెజాన్ ప్రైమ్ వీడియో..హర్లీమ్- సీజన్ 3 (వెబ్ సిరీస్)- జనవరి 23జీ5..హిసాబ్ బరాబర్-(హిందీ మూవీ)- జనవరి 24ఆహా..రజాకార్(టాలీవుడ్ సినిమా)- జనవరి 24డిస్నీ ప్లస్ హాట్‌స్టార్...బరోజ్ 3డీ(మలయాళ మూవీ)- జనవరి 22స్వీట్ డ్రీమ్స్- జనవరి 24జియో సినిమా..దిది-(హాలీవుడ్ సినిమా)- జనవరి 26యాపిల్ టీవీ ప్లస్..ప్రైమ్ టార్గెట్..(హాలీవుడ్ మూవీ) జనవరి 22 -
'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..?
పాతాళ్ లోక్-2 (Paatal Lok-2) వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌కు ఫిదా అవుతున్నారు. 2020లో వచ్చిన మొదటి సీజన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జనవరి 17న రెండో సీజన్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్‌లో ఈ సిరీస్ కొనసాగుతోంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మన తెలుగు దర్శకుడు, నటుడు నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) కూడా ఇందులో ఓ బిజినెస్ మ్యాన్‌గా కనిపించాడు. ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. దీంతో ఆయన గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన నగేశ్ కుకునూర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటా వెళ్లి తన చదువు పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తనకు ఉద్యోగం కంటే సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఉంటూ ఉద్యోగం ద్వారా సంపాధించిన డబ్బుతో 1998లోనే 'హైదరాబాద్ బ్లూస్' అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల గురించి అట్లాంటాలో వ్రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడింది.హైదరాబాద్ బ్లూస్ (1998), రాక్‌ఫోర్డ్ (1999), ఇక్బాల్ (2005), దోర్ (2006), ఆశేయిన్ (2010), లక్ష్మి (2014), ధనక్ (2016) చిత్రాలకు గాను ఏడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. నగేశ్ ఇప్పటికే అక్షయ్ కుమార్, అయేషా టాకియా,జాన్ అబ్రహం, సోనాల్ సెహగల్ వంటి బాలీవుడ్ స్టార్స్‌ను డైరెక్ట్ చేశారు.‘పాతాళ్ లోక్-2’లో నగేశ్ వ్యాపారవేత్త పాత్రలో మెప్పించారు. అనుష్క శర్మ మొదటిసారి నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్‌కు కూడా వచ్చింది. ఇందులో జైదీప్ అహ్లావత్, నగేశ్ కుకునూర్, గుల్ పనాగ్, ఇశ్వక్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్ అరుణ్ దర్శకత్వం వహించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు -
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్‌సింగిల్స్ ఇన్ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17 -
ఓటీటీలో 'రియల్ స్టోరీ' సినిమా స్ట్రీమింగ్
'ప్రేమించొద్దు' (Preminchoddu ) అనే చిన్న సినిమా ఓటీటీలోకి (OTT) వచ్చేసింది. ‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రంలో దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ (Shirin Sriram) స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది జూన్ 7న విడుదలైంది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ మూవీ నిర్మించారు. యువతలో చాలామంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తుంటారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణంలో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షికతో ఈ సినిమాను తెరకెక్కించనట్లు శిరిన్ శ్రీరామ్ తెలిపారు.ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్‌తో ప్రేమించొద్దు చిత్రం ఉంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 10 నుంచి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు బీసినీట్ (Bcineet OTT) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ)వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ గతంలో తెలిపాడు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తిగానే ఉండటంతో థియేటర్స్‌లో కాస్త పర్వాలేదనిపించింది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు 'ప్రేమించొద్దు' చిత్రంలో చూపించారు.బేబి సినిమా వివాదంతో శిరిన్ శ్రీరామ్ వైరల్తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి కూడా ఆయన తీసుకోచ్చారు. ఆ సమయంలో ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీశారని ఆయన చాలా సార్లు చెప్పారు. తనకు దర్శకత్వం అవకాశం ఇస్తానని తన వద్ద ఉన్న కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడని శిరిన్ ఆరోపించారు. అయితే, తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమించొద్దు సినిమా స్టోరీ కూడా బేబీ సినిమాకు దగ్గరగానే ఉంటుంది. అందువల్ల సోషల్‌మీడియాలో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి. -
ఓటీటీకి వచ్చేసిన బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన సినిమా 'బచ్చల మల్లి'(Bachalamalli Movie). గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా మెప్పించింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో(OTT) సందడి చేస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో(Amazon Prime Video) అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని థియేటర్లలో చూడడం మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. బచ్చలమల్లి అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు.నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie)కి అంతటా మిక్స్డ్ టాక్ లభిస్తోంది. రామ్‌చరణ్ (Ram Charan) నటన బాగున్నప్పటికీ పాత కథే అవడంతో జనాలు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. పైగా ట్రైలర్లో చెప్పినట్లుగా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఏదైనా ఉందా? అని చూస్తే ఒకటీ రెండు ట్విస్టులు మినహా కథ మొత్తం ఊహించినట్లే సాగుతోంది. దీంతో జనాలు గేమ్ ఛేంజర్‌పై పెదవి విరుస్తున్నారు.బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?అభిమానులు మాత్రం రామ్ చరణ్ నటన బాగుందని సంబరపడుతున్నారు. ఇండియన్ 2 డిజాస్టర్‌తో చతికిలపడ్డ శంకర్ ఈ చిత్రంతోనైనా కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దాదాపు రూ.400 -450 కోట్లు గుమ్మరించి తెరకెక్కించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓటీటీ వివరాలుఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ షిప్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. అయితే నెగెటివ్ టాక్ ఇలాగే కొనసాగితే మాత్రం ఓటీటీలో నెల రోజుల్లోనే రిలీజ్ కావడం ఖాయం!గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండిగేమ్ ఛేంజర్ సినిమా..రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహించగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 2.45 గంటల నిడివితో జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజైంది. దిల్‌రాజు బ్యానర్లో నిర్మితమైన 50వ సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.పాటల కోసమే కోట్లు ఖర్చుకేవలం పాటలకే కోట్లు ఖర్చుపెట్టారు. ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఐదు పాటలకు రూ.75 కోట్లు ఖర్చయ్యాయి. కొన్ని విదేశాల్లో షూట్ చేశాం. ఒక్కో పాట పది రోజులకుపైగా చిత్రీకరించారు అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 29న విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో రామ్‌చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దదిగా చరిత్రకెక్కింది.పొరపాటు చేసిన చిత్రయూనిట్ప్రీరిలీజ్, ప్రమోషన్స్ అన్నీ పెద్ద ఎత్తున చేశారు కానీ రిలీజ్ రోజే చిన్న పొరపాటు చేశారు. సినిమాకు హైప్ ఇచ్చిన నానా హైరానా సాంగ్‌ను థియేటర్లలో ప్రదర్శించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా పాటను యాడ్ చేయలేని మరో నాలుగు రోజుల్లో నానా హైరానా థియేటర్లో వేస్తామని చిత్రయూనిట్ వివరణ ఇచ్చింది. కానీ నాలుగురోజుల్లో సినిమా ఫలితం తేలిపోతుందని, ఆ తర్వాత పాటను యాడ్ చేస్తే ఉపయోగమేముంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ
హీరో సిద్దార్థ్ (Siddharth).. ఒకప్పుడు టాప్ హీరో! ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు! తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఇతడు ఈ మధ్యకాలంలో మాత్రం హిట్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్‌కు దూరంగా ఉన్న సిద్దార్థ్ రెండేళ్లక్రితం చిత్తా (చిన్నా) మూవీతో విజయం అందుకున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాకు తమిళంలో వచ్చినంత ఆదరణ తెలుగులో రాకపోవడం గమనార్హం.ఓటీటీలో సిద్దూ మూవీసిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్‌లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.(గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సిద్దార్థ్ కెరీర్ అలా మొదలైందిబాయ్స్ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు సిద్దార్థ్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సెన్సేషన్ అయ్యాడు. బొమ్మరిల్లుతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. అతడు హిందీలో నటించిన తొలి చిత్రం రంగ్ దే బసంతి. బాలీవుడ్ స్ట్రైకర్, చష్మే బద్దూర్ సినిమాలు చేశాడు. హిందీలోనూ లక్ పరీక్షించుకున్న సిద్దార్థ్కానీ అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సౌత్‌లోనే తన స్టార్‌డమ్‌ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాడు. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహా సముద్రం సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లుగా తమిళంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టెస్ట్, ఇండియన్ 3 సహా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.సింగర్ కూడాసిద్దార్థ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, సింగర్ కూడా! లవ్ ఫెయిల్యూర్, జిల్ జంగ్ జుక్, చిత్తా (చిన్నా) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఇతడు ఎన్నో పాటలు పాడాడు. అపుడో ఇపుడో ఎపుడో.. (బొమ్మరిల్లు మూవీ), నిను చూస్తుంటే.. (ఆట), ఓయ్ ఓయ్ (ఓయ్ మూవీ), మా డాడీ పాకెట్స్.. (ఓ మై ఫ్రెండ్), ఎక్స్క్యూజ్ మీ రాక్షసి.. (నిను వీడని నీడను నేనే) ఇలా ఎన్నో పాటలు ఆలపించాడు.గతేడాది పెళ్లిసిద్ధార్థ్ 2024 సెప్టెంబర్‌లో తన ప్రేయసి, హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో మొదటగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే!చదవండి: భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్ -
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
ఓటీటీలో అభిషేక్ బచ్చన్ సినిమా.. కానీ, షరతులు వర్తిస్తాయ్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త సినిమా 'ఐ వాంట్ టు టాక్' ఓటీటీలోకి వచ్చేసింది. అభిషేక్ ప్రధాన పాత్రలో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాగా గతేడాది నవంబర్ 22న విడుదలైంది. అయితే, థియేటర్స్‌లో పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. కానీ, సినిమా చూసిన కొందరు పాజిటివ్ రివ్యూలు ఇవ్వండంతో నెట్టింట కాస్త క్రేజ్ పెరిగింది. అయితే, చాలామంది ఈ చిత్రాన్ని ఓటీటీలో వచ్చాక చూడొచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడి అయింది.'ఐ వాంట్ టు టాక్' సినిమా ఆమెజాన్ ప్రైమ్‌లో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాలని అమెజాన్ పేర్కొంది. అయితే, ఉచిత స్ట్రీమింగ్ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, ఇలా అద్దెకు ఉన్న సినిమాలు 30 రోజుల టైమ్‌లైన్ తర్వాత ఉచితంగా ప్రసారం చేయబడతాయి.అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ఎన్ఆర్ఐ అర్జున్ సేన్‌గా మెప్పించారు. తన డ్రీమ్ నిజమైన తర్వాత అకస్మాత్తుగా క్యాన్సర్ బారీన పడిన అర్జున్ ఆపై భార్యతో విడాకులు తీసుకోవడం. ఈ క్రమంలో తన కుమార్తెకు ఎదురైన కష్టం వంటి సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అర్జున్ కేవలం 100 రోజులు మాత్రమే జీవిస్తాడని వైద్యులు చెప్పడంతో ఆయన తన కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎలాగైన క్యాన్సర్ నుంచి మరణాన్ని జయించాలని సుమారు 20 ఆపరేషన్స్ చేయించుకుంటాడు. అయితే, ఈ కథలో అర్జున్ సేన్ చివరికి ప్రాణాలతో బయటపడుతాడా..? ఆయన కుమార్తె పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోనే టాప్ వెబ్ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన
ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం తర్వలో విడుదల కానుంది. 2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు దర్శకులు చూపించారు.'ఫ్యామిలీ మ్యాన్ 3'లో మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయినట్లు మనోజ్ తాజాగా ప్రకటించారు. ఈమేరకు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. విజయవంతంగా మూడో సీజన్ షూటింగ్ ముగిసిందని తెలిపిన ఆయన త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. అయితే, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించలేదు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ముర' ఒక వర్గం ప్రేక్షకులను భారీగా మెప్పించింది. యాక్షన్ ఎపిసోడ్స్ మరోస్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డరు. నవంబర్ 8న విడుదలైన ఈ మూవీ రీసెంట్గా 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళం వర్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగు,తమిళ్,కన్నడ వంటి భాషలలో డిసెంబర్ 28న అమెజాన్ స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు. -
ఓటీటీలో రూ.350 కోట్ల యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
ఈ ఏడాది వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీస్‌లో సింగం అగైన్ ముందు వరుసలో ఉంటుంది. ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగం. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్ -
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్
ఎలాంటి అంచనాల్లేకుండా ఓటీటీల్లో రిలీజయ్యే కొన్ని సిరీస్‌లు.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అవుతుంటాయి. అలా 2020లో 'పాతాళ్ లోక్' పేరుతో వచ్చిన ఓ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సిరీస్‌కి ఇన్నాళ్లకు రెండో సీజన్ తీసుకొస్తున్నారు. అధికారికంగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?స్టార్ జోడీ కోహ్లీ-అనుష్క శర్మ నిర్మించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పాతాళ్ లోక్'. 2020లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నిమిషాల వరకు ఉన్నప్పటికీ.. ప్రతి నిమిషం థ్రిల్లింగ్ ఉండటంతో ఈ సిరీస్‌ని ఎగబడి చూశారు. మర్డర్స్, ధనిక-పేద మధ్య అంతరం లాంటివి చాలా రియలస్టిక్‌గా చూపించడంపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అదరగొట్టేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)'పాతాళ్ లోక్' రెండో సీజన్.. జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. పోస్టర్లో ప్రధాన పాత్రధారి జైదీప్ అహ్లావత్ ముఖం ఓవైపు నార్మల్‌గా ఉండగా.. ఎద్దు పుర్రెతో కప్పినట్లు ఉంది. చూస్తుంటేనే రెండో సీజన్ కూడా రచ్చలేపడం గ్యారంటీ అనిపిస్తుంది.'పాతాళ్ లోక్' విషయానికొస్తే.. 20 ఏళ్లుగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) దగ్గర పాపులర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యాయత్నం కేసు వస్తుంది. నలుగురు క్రిమినల్స్‌ని అరెస్ట్ కూడా చేస్తారు. దర్యాప్తు చేసే క్రమంలో హంతకుల బృంద నాయకుడైన హతోడా త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అయితే ఈ కేసుని కొందరు ప్రభుత్వ పెద్దలు.. సీబీఐకి అప్పగిస్తారు. సస్పెండ్ అయినా కానీ హాతీరామ్ తన ఇన్వెస్టిగేషన్ ఆపడు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ హంతకుల గురించిన చేదు నిజాలతో పాటు పెద్ద రాజకీయ కుంభకోణమే బయట పడుతుంది. అసలు సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎందుకు వేసినట్టు? కంటికి కనిపిస్తున్నవన్నీ నిజాలేనా లేక అసలు నిజాన్ని కప్పి పెట్టడానికి పెట్టిన డైవర్షన్లా? అనేదే అసలు కథ.(ఇదీ చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ) -
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?
భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఒకటి. ఇప్పటి వరకు ఒక అకౌంట్ తీసుకుని చాలామంది దీనికి సంబంధించిన సేవలను వినియోగించుకునే వారు. కానీ 2025 జనవరి నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.జనవరి నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లు & ధరలుఅమెజాన్ ఇండియా వివిధ అవసరాలు, బడ్జెట్లకు అనుగుణంగా ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో నెలవారీ ప్లాన్ ధర రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, ఏడాది ప్లాన్ రూ. 1499 వద్ద ఉన్నాయి. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి యూజర్లు ప్రయోజనాలను పొందవచ్చు. -
అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు.అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది.(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ)పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. -
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తుండటంతో అవన్నీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 8న విడుదలైన 'ముర' భారీ విజయాన్ని అందుకుంది. 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'అమెజాన్ ప్రైమ్'లో విడుదల కానుంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ డేట్‌కు ఈ చిత్రం ఓటీటీలో రాకుంటే డిసెంబర్ 25న తప్పకుండా విడుదల అవుతుంది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు. -
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్‌కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్
ఓటీటీలో కంగువా విడుదల ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆపై నిర్మాతలకు కూడా ఎక్కువ నష్టాలనే మిగిల్చిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే, తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.కంగువ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఇప్పటకే చాలా తేదీలు వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ తప్పు అంటూ ఆ తేదీలకంటే ముందే కంగువ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. డిసెంబర్ 8న ఓటీటీలో కంగువ విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు.ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్‌లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన అమరన్ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05 చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04 దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04 ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్)- డిసెంబరు 04 బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05 విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06 ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06 మేరీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06అమెజాన్ ప్రైమ్ మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05 జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03 పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) -డిసెంబరు 04 అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06 ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06 జియో సినిమా క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06 లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03 లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04జీ5 మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06సోనీలివ్ తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06 బుక్ మై షో స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04 -
OTT: హాలీవుడ్ మూవీ ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ రివ్యూ
ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కాని కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలివుడ్ దర్శకులకు విపరీతధోరణితో ఆలోచనలొస్తాయి. మనమెప్పుడూ ఊహించని కనీ వినీ ఎరుగని విపత్తులు ఈ హాలివుడ్ దర్శకులకు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. అవి వాళ్ళు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపధ్యంలో వచ్చిన సినిమానే ఎ క్వైట్ ప్లేస్ డే వన్. ఈ సినిమా సీరిస్ లో మూడవది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఇప్పుడు వచ్చిన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా పెయిడ్ ఫార్మెట్ లో విడుదలవగా ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు ముప్ఫై ఏడేళ్ళ క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు పుష్పకవిమానం అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. సినిమాలో ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. కాని దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లీష్ చిత్రమైన ఎ క్వైట్ ప్లేస్ డే వన్ మాత్రం చూసేవాళ్ళకు చమటలు పట్టించడం ఖాయం. సినిమాలో కథ ప్రకారం మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడపుట్టిస్తుందీ సినిమా. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మాత్రం మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ ప్రకారం న్యూయార్క్ లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్ కా వున్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్ తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్ కి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటూనే వుంటుంది.అప్పుడే మాన్ హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులను దారుణంగా దాడి చేస్తూవుంటాయి. ఈ దశలో నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమైపోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్న వాళ్ళు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ వుంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ తనను తాను కూడా ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కుంటుందనే మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా వుంటుందో మీకు సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వీకెండ్ చూసెయ్యండి. - ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్ అప్డేట్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్‌ను అత్యధిక ధరకు అమెజాన్ దక్కించుకుంది. దీంతో ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.కంగువా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ప్రైమ్ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్‌గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు. -
OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్ దిలీప్‌కుమార్ రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ? -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
రానాతో టాక్ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా ఒక టాక్ షో రానుంది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టాక్ షో కార్యక్రమంలో సౌత్ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ట్రైలర్లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్ అవుతాయి. ప్రియాంక మోహన్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జా, రిషభ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్ ఎపిసోడ్ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
సూర్య భారీ యాక్షన్ మూవీ.. కంగువా ఏ ఓటీటీకి రానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో నటించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కంగువా. ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచే కంగువాకు పాజిటివ్ టాక్ వస్తోంది.అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. కంగువా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది. తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం. అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కంగువా రెమ్యునరేషన్..కంగువా కోసం సూర్య ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా బడ్జెట్లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. -
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలోకి వచ్చేసిన చిన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 'దేవర', 'వేట్టయన్' సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటికోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవి కాదన్నట్లు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి అలా ఉండగానే సైలెంట్‌గా ఓ తమిళ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)ప్రముఖ కమెడియన్ యోగిబాబు, యువ నటి బ్రిగిడ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'కొళిపన్నై చెల్లదురై'. సెప్టెంబరు 20న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పర్లేదనిపించే టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
ఓటీటీలో వేట్టయాన్.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
ఓటీటీలో తమిళ్ థ్రిల్లర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో నటుడు సతీష్ కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే 'నాయ్ శేఖర్' సినిమాతో హీరోగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అయితే, తాజాగా 'సట్టం ఎన్ కైయిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని చాచి దర్శకత్వం వహించారు. ఇందులో సతీష్‌తో పాటు మైమ్‌గోపి, అజయ్ రాజ్ పలు పాత్రలలో నటించారు. 'సట్టం ఎన్ కైయిల్' సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. IMDb రేటింగ్‌లో కూడా ఈ మూవీ 9.3 సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఈ చిత్రం నవంబర్ 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. చాలా సింపుల్ బడ్జెట్‌తో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అలా ఈ ఏడాది రిలీజైన ఓ సినిమానే 'గోళం'. కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా సరే స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు మెస్మరైజ్ కావడం గ్యారంటీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్సవకండి.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానం. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
దసరా సెలవులు ముగిశాయి. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. విజయదశమికి వేట్టయాన్, విశ్వం, జనక అయితే గనక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సంగతి అటుంచితే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అయితే ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ వారం కేవలం చిన్న చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.దీంతో సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీల్లో కాస్తా ఇంట్రెస్టింగ్ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి మీకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18 ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18 కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18 లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18 స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్‌స్టార్ 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమా క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18 హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19 హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆహారైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19బుక్ మై షో బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18 -
ఓటీటీకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. అది కూడా నెల రోజుల్లోపే!
ఓటీటీల్లో హారర్, యాక్షన్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే ఇటీవల అలాంటి కంటెంట్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. అదే తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ కడైసీ ఉలగ పోర్. హిప్ హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో అన్నీ అతడే కావడం విశేషం.ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతనెల సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నాజర్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తుందేమో వేచి చూడాల్సిందే. Directing a movie changes your perspective on various things. #KadaisiUlagaPor was one such experience. pic.twitter.com/NNsn7H9dEv— Hiphop Tamizha (@hiphoptamizha) September 29, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గతేడాది డిసెంబరు చివర్లో రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డబ్బు చుట్టూ తిరిగే ఆంథాలజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ దీని సంగతేంటంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)డబ్బులున్న ఓ ఇనుప పెట్టె.. ఓ దొంగతో ఎనిమిది కథలు చెబుతుంది. మనిషి డబ్బు కోసం ఏమేం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'కరెన్సీ నగర్'. గతేడాది డిసెంబరు 29న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయినా నేరుగా స్ట్రీమింగ్ చేయకుండా ఈ చిన్న మూవీని కూడా అద్దె విధానంలో పెట్టడమేంటో అర్థం కాలేదు. ఏదైతేనేం ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ వచ్చేసింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!) -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం'
దసరా సందర్భంగా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం.’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
పిల్లలను మెప్పించే 'హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్' సినిమా
చిన్న పిల్లలకు గీతలు గీయడమన్నా, బొమ్మలు వేయడమన్నా ఎంతో ఇష్టం. పూర్వం బలపాలు, పెన్సిళ్లు వాడేవాళ్ళు. ఇప్పటి జెనరేషన్ క్రేయాన్స్ వాడుతున్నారు. పిల్లలు ఒక్కోసారి పిచ్చి గీతలు గీస్తారు. ఒక్కోసారి పేరు లేని ఆకారాలను వేస్తారు. ఏది గీసినా, రాసినా వాటికి జీవమొస్తే..? అన్న చిలిపి ఆలోచన హాలీవుడ్ దర్శకుడు కార్లోస్‌కు వచ్చింది. ఇంకేముంది ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘ అనే సినిమాను రూపొందించాడు. కథాపరంగా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్’లో హెరాల్డ్ అనే బాలుడు ఓ పుస్తకంలోని పాత్ర. అతనితో పాటు మూస్, పోర్క్పైన్ అనే మరో రెండు పాత్రలు ఉంటాయి. హెరాల్డ్ తన మానాన తాను ఉండగా బయటి ప్రపంచంలో అతనికి తెలిసిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోతాడు. దాంతో హెరాల్డ్ ఆ వృద్ధుణ్ణి వెతకడానికి పర్పుల్ క్రేయాన్‌తో ఓ తలుపు బొమ్మ గీసి పుస్తకంలో నుంచి మానవ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతనితో పాటు తోడుగా మూస్, పోర్క్పైన్ కూడా బయటకు వస్తాయి. ఇక అక్కడ నుండి మానవ ప్రపంచంలో అతడు ఏది గీస్తే అది నిజమైపోయి కథను నడిపిస్తుంది. హెరాల్డ్ ఆ ముసలివాడిని కనుగొంటాడా, మానవ ప్రపంచంలో తన మాయాజాలంతో ఎదుర్కోన్న ఇబ్బందులేంటి అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కారు బొమ్మ, హెలికాప్టర్ బొమ్మ ఇలా ఏది క్రేయాన్‌తో గీసినా అది నిజంగా అయిపోవడం పిల్లలకు బాగా నచ్చుతుంది. విజువల్‌గా గ్రాఫిక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళను ఆకట్టుకుంటాయి. పండుగ సెలవలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూడగలిగిన సినిమా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘. వర్త్ టు వాచ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన తెలుగు సినిమా
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. నాటకాలు, వాటికి పునర్వైభవం తీసుకురావడం అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏ ఓటీటీలోకి వచ్చింది?(ఇదీ చదవండి: నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు!)ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్.. ఇలా సీనియర్ నటుల్ని కీలక పాత్రల్లో నటించిన సినిమా 'ఉత్సవం'. దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించగా, రెజీనా హీరోయిన్. స్టార్ నటీనటులు, భారీ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. సెప్టెంబరు 13న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చిందా అన్నంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాండి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'ఉత్సవం' కథ విషయానికొస్తే.. అభిమన్యు (ప్రకాశ్ రాజ్) సురభి నాటక మండలిలో కళాకారుడు. ఇతడి కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్). అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలు గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఓ ఈవెంట్ సందర్భంగా రమతో(రెజీనా) ప్రేమలో పడతారు. పెద్దలు వీళ్లకి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ విషయం తెలియకు వీళ్లిద్దరూ పెళ్లి జరగడానికి ముందే పారిపోతారు. చివరకు వీళ్లకు పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న వెట్టయాన్.. భారీ ధరకు రైట్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేట్టయాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు. అంటే నవంబర్ చివర్లో ఓటీటీకి వచ్చే అవకాశముంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా
బాలీవుడ్లో స్టాండప్ కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ నటించిన జ్విగాటో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నందిత దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. షహానా గోస్వామి హీరోయిన్గా నటించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది.భువనేశ్వర్ నేపథ్యంలో సాగే ఫుడ్ డెలివరీ బాయ్ కథ ఇది. జ్విగాటో మూవీలో సాధారణ ప్రజల జీవితాన్ని ఎంతో అద్బుతంగా డైరెక్టర్ నందిత దాస్ చూపించారు. అయితే, ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం, బుసాన్ అంతర్జాతీయ చిత్రోత్సవం వంటి వేదికలపై ప్రదర్శితమైంది. తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.సాధారణ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయాక ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాల్సి వస్తుంది. అయితే, ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడనేది అసలు కధ. ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. ఐఎండీబీలో రేటింగ్ కూడా మెరుగ్గానే ఉంది. -
ఓటీటీలో రూ.700 కోట్ల సినిమా.. ఉచితంగా చూసేయండి
ఇటీవల థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజై ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా యానిమల్, పఠాన్, బాహుబలి లాంటి పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ స్త్రీ- 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. నేటి నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ. -
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన టాలీవుడ్ హారర్ మూవీ కళింగ. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 2 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. టాలీవుడ్లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా ధృవ వాయు పనిచేశారు. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించింది. ఇంజులో మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5 కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది.కళింగ కథేంటంటే..కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్
ఉచిత స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. దాన్ని తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీటీవీలో విలీనం చేసి ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’ కింద ఒకే సర్వీసుగా మార్చినట్లు పేర్కొంది. అమెజాన్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, కనెక్టెడ్ టీవీల ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ రెండు సర్వీసుల అనుసంధానం ఆటోమేటిక్‌గా జరుగుతుందని, దీనికోసం ఆయా యాప్‌లను రీఇన్‌స్టాల్ లేదా అప్‌గ్రేడ్ చేయనక్కర్లేదని వివరించింది. సెప్టెంబర్‌లో రెండు సర్వీసులను 25 కోట్ల మంది యూజర్లు వినియోగించుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సర్వీసును ఉచితంగా కొనసాగేస్తూనే మరింత నాణ్యమైన కంటెంట్‌ను, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతుండడంతో కంపెనీలు ఇప్పటికే మార్కెట్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్‌కు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్‌లతో పాప్‌కార్న్ నుంచి ఐస్‌క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్‌్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్‌తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
ఓటీటీకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్‌ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు. Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7— prime video IN (@PrimeVideoIN) October 7, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్‌కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్‌ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)