rajasthan
-
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా.. క్వార్టర్ ఫైనల్లో రాజస్థాన్, హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఇవాళ (జనవరి 9) జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందగా.. బెంగాల్‌పై హర్యానా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధాప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-2లో రాజస్థాన్, హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు (9-0-52-5) తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు.రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు తలో చేయి వేసి తమిళనాడు ఇంటికి పంపించారు. అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ తలో రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బెంగాల్ భరతం పట్టిన హర్యానాబెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో (ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-1) హర్యానా ఆటగాళ్లు కలిసికట్టుగా పోరాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమశిక్షణతో వ్యవహరించారు. ఫలితంగా సునాయాస విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్‌కు (28) ఓ మోస్తరు ఆరంభాలు లభించినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పార్థ్ వట్స్ 3, నిషాంత్ సంధు, అన్షుల్ కంబోజ్ చెరో 2, అమన్ కుమార్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ పడగొట్టి బెంగాల్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
బోరుబావిలో బాలిక.. విషాదంగా ముగిసిన ఘటన
-
కారుకు డ్రైవర్లుగా మారిన ఎద్దులు
-
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
జైపూర్: రాజస్థాన్‌లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి ఉంటోంది. రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్ అబూలో చూసేందుకు ఏమున్నాయి?రాజస్థాన్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు. అచల్‌ఘర్ కోటమౌంట్ అబూలోని అచల్‌ఘర్ కోట ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హిల్ స్టేషన్‌కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.సన్‌సెట్ పాయింట్హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.టోడ్ రాక్మౌంట్ అబూలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్ రాక్‌ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు. నక్కీ సరస్సుఈ సరస్సును దేవతలు స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.ఎలా వెళ్లాలి?మౌంట్ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి 185 కి.మీ దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్ అబూకు బస్సులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
వాళ్లు చెయ్యరు.. ఇతరుల్ని చెయ్యనివ్వరు..!
జైపూర్: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు. చంబల్ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్‌లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు. -
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
బోరు బావిలో పడ్డ బాలుడు
-
ఇది టెక్, డేటా శతాబ్ది సంస్కరణలు..
జైపూర్: సంస్కరణలు, పనితీరు, పారదర్శ కతలను పాటిస్తూ భారత్ సాధించిన అభివృద్ధి ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం జైపూర్‌లోని ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో మొదలైన ‘రైజింగ్ రాజస్తాన్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు, నిపుణుడు భారత్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. గత పదేళ్లలో భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. సంక్షోభాల సమయంలోనూ నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి భారీ ఉత్పత్తి క్షేత్రంగా భారత్ ఎదగాలి. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లడం కలిసొచ్చే అంశం. ప్రజాస్వామ్యయుతంగా మానవాళి సంక్షేమం కోసం పాటుపడటం భారత విధానం. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే ఎన్నకుంటున్నారు. ఈ సంస్కృతిని యువశక్తి మరింత ముందుకు తీసుకెళ్తోంది. యువభా రతంగా మనం ఇంకా చాన్నాళ్లు మనం కొనసా గబోతున్నాం. భారత్‌లో అత్యంత ఎక్కువ మంది యువత, అందులోనూ నైపుణ్యవంతులైన యువత అందుబాటులో ఉన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామీకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కుతాయని భారత్ నిరూపించింది. ఈ శతాబ్దిని టెక్నాలజీ, డేటాలే ముందుకు నడిపిస్తాయి’’ అన్నారు. -
కోటా జోరుకు కళ్లెం
కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.నిర్వాహకుల ధీమాఅత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ జోనల్ చైర్ పర్సన్ గోవింద్రామ్ మిట్టల్ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.వాయిదాలకు సైతం కష్టంగా ఉంది‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్ ఒకరు చెప్పారు.ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులుకోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్ ప్రాంతంలోని హాస్టల్ యజమాని ఒకరన్నారు. -
వీడు మాములోడు కాదు.... ఖతర్నాక్!’ ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ
ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్‌గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.ఊరు: యూపీ ఘజియాబాద్ స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్.. తేదీ నవంబర్ 21, టైం.. సరిగ్గా తెలియదు.మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్‌కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది.అది 1993 సంవత్సరం.. తేదీ సెప్టెంబర్ 08సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంస్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది. అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.రాజస్థాన్‌కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలో.. ఘజియాబాద్‌లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024 Video Credits: JAN TV -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
రాజస్థాన్‌లో పెళ్లి పార్టీ.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అన్‌సీన్ ఫోటోలు
-
పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.ఆసక్తికర విషయాలుఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఢిల్లీ క్యాపిటల్స్తోనూఅనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్హౌజ్గా కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.లింక్డిన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.కృతజ్ఞతలు సింధుఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ వేదికగాకాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం
పట్నా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో బిహార్ ఎడంచేతి వాటం స్పిన్నర్ సుమన్ కుమార్ అద్భుతం చేశాడు. రాజస్తాన్‌తో ఇక్కడి మొయిన్ ఉల్ హఖ్ స్టేడియంలో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 18 ఏళ్ల సుమన్ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసుకున్నాడు. సుమన్ 33.5 ఓవర్లలో 20 మెయిడెన్లు వేసి 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. సుమన్ ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. 285 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బిహార్ జట్టు రాజస్తాన్‌ను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మొత్తం 137.5 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.కూచ్ బెహార్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా సుమన్ కుమార్ గుర్తింపు పొందాడు. గతంలో ఆంధ్ర బౌలర్ మెహబూబ్ బాషా (2010లో త్రిపురపై 44 పరుగులకు 10 వికెట్లు), మణిపూర్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ (2018లో అరుణాచల్ ప్రదేశ్‌పై 11 పరుగులకు 10 వికెట్లు) ఈ ఘనత సాధించారు. -
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్ తప్పుపపట్టారు. -
ఉదయ్పూర్ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయిదుగురు వ్యక్తులు కారులో అంబేరి నుంచి దేవరీ వైపు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను అదుపులోకి తీసుకొని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఉదయపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హిమాన్షు సింగ్ రాజావత్ తెలిపారు. -
Rajasthan By-Election: ‘ఫలితాల’తో నాలుగు నిర్ణయాలకు ముడిపెట్టి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షరాష్ట్రంలో జరిగిన ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి జోగారామ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. దీనిని సీఎం భజన్‌లాల్ శర్మకు అందించింది. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.కొత్త జిల్లాలపై నిర్ణయంగత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 కొత్త జిల్లాల భవిష్యత్తుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది. ఐదు చిన్న జిల్లాలను మళ్లీ పాత జిల్లాల్లో కలపవచ్చని సమాచారం. డిసెంబరు 31లోగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూకేటాయింపులతోపాటు పలు నిర్ణయాలను కమిటీ పరిశీలించింది.ఒకే రాష్ట్రం- ఒకే ఎన్నికలురాష్ట్ర ప్రభుత్వం కూడా వన్ స్టేట్- వన్ ఎలక్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి కొంత సమయం అవసరం ఉంటుంది. దీనిపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించి. ఆ తర్వాత ఒక రాష్ట్రం- ఒక ఎన్నికల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
పలు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతటా చలి వాతావరణం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలి గాలులు జనాలను గజగజ వణికిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.రాజధాని ఢిల్లీలో ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో పాటు విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. వాయుకాలుష్యంతో ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో పొగమంచు, చలి పెరుగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతుందనేది వాతావరణశాఖ తెలియజేసింది. Daily Weather Briefing English (17.11.2024)YouTube : https://t.co/E2s6UfbRiBFacebook : https://t.co/ql3wumSRyL#weatherupdate #rainfall #rainalerts #rain #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/0ZRZYLNQZl— India Meteorological Department (@Indiametdept) November 17, 2024వాతావరణ శాఖ అందించిన తాజా అప్డేట్ ప్రకారం హర్యానా, చండీగఢ్, ఉత్తర రాజస్థాన్, బీహార్, ఉత్తర, పంజాబ్, చండీగఢ్, ఉత్తర ఉత్తరప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో ఉదయం తీవ్రమైన చలి ఉంటుంది.Dense to very dense fog conditions very likely to prevail in isolated pockets of Haryana & Chandigarh in late night of 17th November and early morning of 18th November and dense fog for subsequent 24 hours#imdweatherupdate #visibilityalert #fogalert #densefog #verydensefog… pic.twitter.com/1E9GkQwqCZ— India Meteorological Department (@Indiametdept) November 17, 2024మాల్దీవుల మీదుగా దిగువ ట్రోపోస్పియర్లో, భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో తుఫాను సూచనలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు భారత ప్రాంతంలో ద్రోణి ఏర్పడింది. ఫలితంగా దక్షిణ భారతదేశంలో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మెరుపులు వచ్చే అవకాశం ఉంది.Dense to very dense fog conditions very likely to prevail in isolated pockets of North Uttar Pradesh in late night of 17th November and early morning of 18th November and dense fog for subsequent 24 hours#imdweatherupdate #visibilityalert #fogalert #densefog #verydensefog #up… pic.twitter.com/bY61NZfrJM— India Meteorological Department (@Indiametdept) November 17, 2024తూర్పు అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ మీదుగా బలమైన గాలులతో టైఫూన్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు(సోమవారం)రేపు(మంగళవారం) తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి