Sourav Ganguly
-
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో కనిపించే స్టార్ ఎవరంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై ప్రకటన వచ్చేసింది. ఇదే విషయాన్ని తాజాగా గంగూలీ ప్రకటించారు. తన పాత్రలో కనిపించనున్న నటుడు ఎవరో కూడా ఆయన రివీల్ చేశారు. అయితే, ఈ బయోపిక్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా గురించి గంగూలీనే స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు తప్పక చరిత్రలో ఉంటుంది. ఇండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలలో రాణించిన ఆయన అన్ని విభాగాల్లో కలిపి 18575 రన్స్ చేశారు. ఆయన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెండితెరపై ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాతో మాట్లాడిన గంగూలీ పలు విషయాలు పంచుకున్నారు. ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. తనకు తెలిసిన సమాచారం ఆయనే తన పాత్రలో నటిస్తున్నారని సౌరవ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన షెడ్యూల్స్ బిజీగా ఉండటం వల్ల సరైన తేదీలు ఇంకా సెట్ కాలేదన్నారు. దీంతో ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని గంగూలీ అన్నారు.రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్లో ప్రస్తుతం ఓ బిజీ స్టార్‌గా ఉన్నారు. రీసెంట్గా స్త్రీ2 సినిమాతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం భూల్ చూక్ మాఫ్, టోస్టర్,మాలిక్ వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. గంగూలీ బయోపిక్‌లో ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా చిత్ర యూనిట్ సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు. -
వీడియో: మాజీ కెప్టెన్ గంగూలీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
కోల్కత్తా: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంగూలీ పది నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి చూశారు.వివరాల ప్రకారం.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్లారు. ఈవెంట్‌కు వెళ్తున్న సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో ఆయన కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది.దీంతో, ఆయన కారు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ సౌరవ్ గంగూలీ, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, గంగూలీ అక్కడే కాసేపు వేచి చూశారు. అనంతరం, ఆయన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. Sourav Ganguly News:सौरव गांगुली की कार का एक्सीडेंट, बाल-बाल बचे दादा#SauravGanguly #Accident #LatestNews @khanduri_pooja pic.twitter.com/7ZnuBdhDYi— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) February 21, 2025 -
గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. 🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨- Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada's biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.కాగా, గంగూలీ బయోపిక్‌లో లీడ్ రోల్ కోసం తొలుత ఓ ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.గంగూలీ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా గొప్ప కెప్టెన్లలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడు నేర్పాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. గంగూలీ నేతృత్వంలో భారత్ 146 వన్డేల్లో 76 విజయాలు.. 49 టెస్ట్‌ల్లో 21 విజయాలు సాధించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం గంగూలీ బీసీసీఐ అథ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. -
గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన పదో తరగతి కుర్రాడు
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్నటి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా (ఐదు వికెట్లు) మినహా టీమిండియా ఆటగాళ్లంతా తేలిపోయారు. పలువురు దేశీయ ఆటగాళ్లు (గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ తొమ్మిది వికెట్ల ప్రదర్శన) సత్తా చాటారు. నిన్న మొదలైన మ్యాచ్‌ల్లో పదో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.15 ఏళ్ల అంకిత్ ఛటర్జీ హర్యానాతో నిన్న మొదలైన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేపి, బెంగాల్ తరఫున రంజీ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ 17 ఏళ్ల వయసులో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంకిత్ ప్రస్తుతం పదో క్లాస్ చదువుతున్నాడు. క్లబ్ లెవెల్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన అంకిత్‌కు రంజీ జట్టులో చోటు దక్కేలా చేసింది.నిన్న హర్యానాతో మొదలైన మ్యాచ్‌లో అంకిత్ 20 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అంకిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగాల్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ యువ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్ ఆరు వికెట్లు తీసి హర్యానాను దెబ్బేశాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ముకేశ్ కుమార్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ తలో రెండు వికెట్లు తీశారు. హర్యానా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అంకిత్ కుమార్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీఅంకిత్ ఛటర్జీ బెంగాల్ తరఫున రంజీ అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైతే.. ఓవరాల్‌గా రంజీల్లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడి రికార్డు వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది. వైభవ్ 12 ఏళ్ల వయసులో బీహార్ తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. వైభవ్ ముంబైతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వైభవ్ భారత్ తరఫున అండర్ 19 లెవెల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు. వైభవ్.. యూత్ టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. -
‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు. తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్ దీప్(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్- మనోజ్ తివారి కలిసి ఆడారు. గతంలో దేశవాళీ క్రికెట్లోనూ ఢిల్లీ తరఫున గంభీర్- బెంగాల్ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.గంభీర్ హయాంలో చేదు అనుభవాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్‌కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో మనోజ్ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్ తివారిని తప్పుబడుతూ.. గంభీర్‌కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.హర్షిత్ రాణాను ఎందుకు ఆడించారు?ఈ విషయాలపై మనోజ్ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని నితీశ్, హర్షిత్‌లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్‌కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.ఎందుకంటే పెర్త్ టెస్టులో ఆకాశ్ దీప్‌ను కాదని హర్షిత్ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌గా తనకు సహకరించే పిచ్‌లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్ కోసం ఆకాశ్‌పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్ దీప్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్‌కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్ జరిగినపుడు గౌతం గంభీర్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.అతడిని తొక్కేయాలని చూశారుహర్షిత్ కంటే ఆకాశ్ దీప్ బెటర్ అని మేనేజ్మెంట్ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది. పాపం ఆకాశ్ దీప్ తన సెలక్షన్ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్ -
సౌరవ్ గంగూలీ కుమార్తె సనా కారుకు యాక్సిడెంట్
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కుమార్తె సనా గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోల్‌కతాలోని తమ ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం కారులో బయల్దేరిన సనా గంగూలీ బెహాలా చౌరాస్తాకు చేరుకున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు ఆమె కారును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో సనా(Sana Ganguly)తో పాటు కారులో ఉన్న మిగతా వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, కారును ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు వేగంగా అక్కడి నుంచి కదిలింది. ఈ క్రమంలో స్థానికులతో పాటు.. పోలీసులు బస్సును వెంబడించారు. దాదాపు కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత.. ఎట్టకేలకు సఖేర్‌బజార్ క్రాసింగ్ వద్ద బస్సును ఆపగలిగారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు.అప్పటి నుంచి పోలీసు నిఘాలో కాగా బెహాలా చౌరాస్తా వద్ద గత ఏడాదిన్నర కాలంగా పోలీసు బందోబస్తు ఉంది. 2023లో బెహాలా చౌరాస్తా వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎనిమిదేళ్ల విద్యార్థిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రెండో తరగతి చదువుతున్న ఆ పిల్లాడు పరీక్ష రాసేందుకు వెళ్తూ దుర్మరణం పాలు కావడంతో స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబికాయి.పరిస్థితి చేయిదాటంతో పోలీసులు వచ్చి వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చౌరాస్తా ప్రాంతం పోలీసు నిఘాలో ఉంది. ఈ క్రమంలోనే సనా గంగూలీ కారును ఢీకొట్టిన ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించగలిగారు. ఇక రాయ్చక్ నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్తున్న బస్సు.. సనా కారును ఢీకొట్టిందని.. అయితే, ఈ ఘటనలో కారు పెద్దగా డ్యామేజ్ కాలేదని.. అలాగే అందులోని ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏకైక సంతానంకాగా భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ- డోనా దంపతులకు ఏకైక సంతానం సనా. 1997లో పెళ్లి చేసుకున్న సౌరవ్- డోనాలకు 2001లో కుమార్తె సనా జన్మించింది. తల్లిలాగే సనా కూడా ఒడిస్సీ డాన్సర్. లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆమె పట్టా పుచ్చుకుంది. చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా -
నేనే గనుక రోహిత్ స్థానంలో ఉండి ఉంటే..: గంగూలీ
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని.. ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు.ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. కనీసం నాలుగు మ్యాచ్లైనాఇక కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో కనీసం నాలుగు మ్యాచ్‌లైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్- టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలుకానుంది. పండంటి మగబిడ్డఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో.. భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్లుగానే రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా. ఎందుకంటే.. జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది.నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. అతడి భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి.. రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయల్దేరవచ్చు. నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. ఇప్పటికే ఆసీస్‌కు పయనమయ్యేవాడిని.తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..! -
దాదా స్థానంలోకి అతడు.. గంగూలీకి ‘కొత్త’ బాధ్యతలు!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగనున్నాడు.ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్‌డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపిక చేసింది.గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మూడు సీజన్లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్‌గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్టి20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు శిక్షకుడిగా పనిచేశాడు.‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు. ‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
అతడొక అద్భుతం.. టెస్టు క్రికెట్ లెజెండ్ అవుతాడు: గంగూలీ
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమానికి సిద్దమయ్యాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పంత్‌కు చోటు దక్కింది. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో పంత్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా పంత్ నిలుస్తాడని దాదా కొనియాడాడు. ఒత్తడిలో కూడా పంత్ అద్బుతంగా ఆడుతాడని తాజాగా ఓ కార్యక్రమంలో గంగూలీ చెప్పుకొచ్చాడు."రిషబ్ పంత్‌ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా భావిస్తున్నాను. అతడు ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పంత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఆల్ టైమ్ గ్రేట్ అవుతాడు. అయితే వైట్ బాల్ క్రికెట్లో అతడు కాస్త మెరుగవ్వాలి" సౌరవ్ పేర్కొన్నాడు. కాగా వైట్ బాల్ ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా 2020-21లో ఆస్ట్రేలియా పర్యటలో పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్పటకి చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.గబ్బాలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడు మళ్లీ టెస్టుల్లో పంత్ రీఎంట్రీ ఇవ్వడం భారత జట్టు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా బంగ్లాతో సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. -
వీలైనంత త్వరగా సుప్రీం కోర్టు తీర్పునివ్వాలి: గంగూలీ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సర్వోన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విజ్ఞప్తిచేశాడు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలన్నాడు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరుపుతోంది.ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలిఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన దర్యాప్తు తాజా నివేదికను సెప్టెంబరు 17లోగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం నాటి విచారణలో భాగంగా ఈ మేరకు గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీం కోర్టు ఈరోజు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో నాకు పూర్తి సమాచారం లేదు.అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో నిరసన చేశారు. వారందరికీ న్యాయం జరగాలి. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందని తెలుసు. అయితే, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థిస్తున్నా. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి.ఇదీ చదవండి: అభయ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం!చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో గుబులుపుట్టేలా ఉండాలి. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. రాజకీయ రగడకాగా ఈ హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయా పార్టీల అభిమానులు సైతం రెండుగా చీలిపోయి.. పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం -
#Sourav Ganguly: లార్డ్స్‌లో 'దాదా' గిరి
సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టీమిండియా అత్యంత విజయంవతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఈ బెంగాల్ టైగర్.. ఇండియన్ క్రికెట్ దిశదశను మార్చేశాడు. అప్పటివరకు విజయాలపై సచిన్‌పై ఆధారపడ్డ భారత్‌కు.. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లను పరిచయం చేశాడు. యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు అతడి సారథ్యంలోనే వెలుగులోకి వచ్చినవారే. అయితే అద్భుతమైన ఆటగాడిగా, నాయకుడిగా నిలిచిన గంగూలీకి.. వరల్డ్‌కప్ టైటిల్ ఒక్కటే అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచిన బెంగాల్ దాదా... 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చవిచూశాడు. అయితే కెప్టెన్‌గా గంగూలీ సాధించిన విజయాలు ప్రపంచకప్‌లతో సమానం. అతడు భారత్‌కు అందించిన చారిత్రత్మక విజయాల్లో 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ ఒకటి. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయనంతరం గంగూలీ ప్రతిష్టాత్మక లార్డ్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి చేసుకున్న సంబరాలను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అంతలా దాదా సెలబ్రేషన్స్ జరపుకోవడం వెనక ఓ కథ దాగి ఉంది.ఇంగ్లండ్-భారత్ ఫైనల్ పోరు..2002 ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు నాట్‌వెస్ట్ ట్రై సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు శ్రీలంక, భారత జట్లు భాగమయ్యాయి. శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఇంటిముఖం పట్టగా.. టీమిండియా, ఇంగ్లండ్ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాయి. అయితే ఈ సిరీస్ మొత్తం ఒక లెక్క.. ఫైనల్ మ్యాచ్ ఒక లెక్క. 2002 జూలై 13.. క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరులో ఇంగ్లండ్-భారత జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ ట్రెస్కోథిక్(109), నాజర్ హుస్సేన్(119) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్ల జహీర్ ఖాన్(మూడు వికెట్లు) మినహా మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు.యువీ, కైఫ్ అద్భుత పోరాటం..326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (45; 49 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే వీరిద్దరి ఔటయ్యాక అస్సలు కథ మొదలైంది. వెంటవెంటనే దినేశ్ మోంగియా (9), సచిన్ (14), ద్రవిడ్ (5) వికెట్లను భారత్ కోల్పోయింది. 146/5 తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అదే సమయంలో క్రీజులో ఉన్న యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతం చేశారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను తమ విరోచిత పోరాటంతో వారిద్దరూ గెలుపు బాట పట్టించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. యువరాజ్ సింగ్ (69, 63 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్; 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరి అద్బుత పోరాటం ఫలితంగా భారత్ మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టగానే లార్డ్స్ మైదానం భారత అభిమానుల చప్పట్ల హోరుతో దద్దరిల్లిపోయింది.గంగూలీ స్వీట్ రివెంజ్..అభిమానులతో పాటు భారత జట్టు మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఈ క్రమంలో లార్డ్స్ బాల్కనీలో ఉన్న టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి గిరా గిరా తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణంలో దాదా ఆనందానికి అవధులు లేవు. అయితే గంగూలీ అంతగా రియాక్ట్ అవ్వడం వెనక ఓ కారణం దాగి ఉంది. అదే ఏడాది ముంబై వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన ఆరో వన్డే మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. ఆండ్రూ ఫ్లింటాప్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన వెంటనే ఫ్లింటాప్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మన బెంగాల్ టైగర్‌ను నచ్చలేదు. ఆ రోజే సౌరవ్ ఫిక్స్ అయ్యాడు.. ఈ ఇంగ్లీష్ జట్టుకు వాళ్ల సొంతగడ్డపైనే అదిరిపోయే సమాధానం చెప్పాలని. తను అనుకున్న విధంగానే ఇంగ్లండ్‌ను ప్రతిష్టాత్మక లార్డ్ మైదానంలో ఓడించి.. తన స్వీట్ రివెంజ్ను తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని గంగూలీనే చాలా సార్లు స్వయంగా వెల్లడించాడు.వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే..అయితే ఆ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని గంగూలీని ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశ్నించాడు. . 'లార్డ్స్ అంటే ప్రపంచ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్‌కాట్ అడగ్గా.. వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని గంగూలీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. -
వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలంటే..: గంగూలీ
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇలాంటి దారుణానికి పాల్పడిన దుండగులకు కఠినమైన శిక్ష విధించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా భయంతో వణికిపోయేలా తీర్పునివ్వాలని కోరాడు.కాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. అత్యంత పాశవికంగా బాధితురాలిపై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో 30 మందిని అనుమానితులుగా చేర్చి.. విచారిస్తున్నామని తెలిపింది.రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి?అయితే, ఈ ఘటనపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ‘రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి’ అని అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు సైతం దాదాపై విరుచుకుపడ్డారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాదంటూ ట్రోల్ చేశారు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఈ లెజెండరీ క్రికెటర్.. కాస్త ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు నెటిజన్లు.ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు . ‘‘గత ఆదివారం నేను మాట్లాడిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇదొక భయానక ఘటన అని నేను ఆరోజే చెప్పాను. ప్రస్తుతం సీబీఐ, పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్నారు. దోషులు ఎవరన్నది తేలిన తక్షణమే వారికి కఠినాతికఠినమైన శిక్ష విధించాలి.వాళ్లకు పడే శిక్ష ఎలా ఉండాలంటే?భవిష్యత్తులో మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే వణికిపోయే పరిస్థితి ఉండాలి. ఎంత కఠినమైన శిక్ష విధిస్తే అంత మంచిది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గంగూలీకి సత్సంబంధాలు ఉన్నాయంటారు అతడి సన్నిహిత వర్గాలు. ఇక దేశాన్ని కుదిపేస్తున్న డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో దీదీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రాగా.. పైవిధంగా స్పందించాడు దాదా.కాగా 1992 నుంచి 2008 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంగూలీ.. మేటి కెప్టెన్, బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 113 టెస్టులాడి 7212, 311వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. బెంగాల్ క్రికెట్ ముఖచిత్రంగా నీరజనాలు అందుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగానూ గతంలో పనిచేశాడు. చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ -
అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవితవ్యంపై అనేక ఊహగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో పంత్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.వచ్చే ఏడాది సీజన్లో సీఎస్కే పంత్ ఆడనున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పంత్‌పై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని దాదా కొట్టి పారేశాడు. వచ్చే ఏడాది సీజన్లో పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన దాదా స్పష్టం చేశాడు. కాగా దాదాపు 16 నెలల పాటు రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూరమైన పంత్.. ఐపీఎల్ 2024తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 446 పరుగులతో ఢిల్లీ తరపున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న గంగూలీనే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్‌కు వస్తున్నారు.వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్‌మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్‌లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్‌లా రైట్‌హ్యాండ్ బ్యాటర్. -
సౌరవ్ గంగూలీకి ఆశాభంగం..!
ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆశాభంగం ఎదురైంది. దాదాను హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. డీసీ.. గౌతమ్ గంభీర్ లాంటి ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తిని హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఇద్దరు ముగ్గురు వరల్డ్‌కప్ విన్నర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్నాడు. అలాగే అతను ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీలైన దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20) మంచి చెడ్డలు కూడా చూస్తున్నాడు. ఇన్ని బాధ్యతలు మోస్తుండటంతో డీసీ యాజమాన్యం గంగూలీని హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన పాంటింగ్ డీసీని ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. ఇదే కారణంగా డీసీ మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసింది. పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాక గంగూలీ ఈ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. ఓ బెంగాలీ పేపర్‌ను ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.ఇదిలా ఉంటే, పాంటింగ్ ఆథ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్‌కు చేరింది. 2018 ఎడిషన్‌లో తొలిసారి పాంటింగ్ ఆథ్వర్యంలో బరిలోకి దిగిన డీసీ.. ఆ సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆతర్వాతి సీజన్లో (2019) మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2021 సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. గడిచిన మూడు సీజన్లలో ఢిల్లీ 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. -
రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు: గంగూలీ
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ 11 ఏళ్ల సుదీర్ఘణ అనంతరం ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. భారత జట్టు చివరిగా 2013లో ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా రోహిత్ నేతృత్వంలో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది.టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. భారత్ ట్రోఫీ గెలిచి రెండు వారాలు గడిచినా విజయోత్సవ సంబురాలు ఇంకా జరుగతూనే ఉన్నాయి. తాజాగా భారత విజయానికి సంబంధించి కోల్‌కతాలో వేడుక జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజయర్యాడు.ఈ సందర్భంగా గంగూలీ.. టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. దాదా రోహిత్ గురించి మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంతో నన్నెవరూ నిందించడం లేదు. అయితే రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని మాత్రం అందరూ మరిచిపోయారని సరదాగా అన్నాడు. -
రిక్కీ పాంటింగ్‌పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటన! కొత్త కోచ్‌గా దాదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్‌తో తమ అనుబంధాన్ని తెంచుకుంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఏడేళ్లపాటు కొనసాగిన బంధానికి ఇక తెరపడిందంటూ.. రిక్కీ పాంటింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. వేటు వేయడానికి కారణం అదే?కాగా 2018లో రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాంపులో చేరాడు. ప్యాటీ ఉప్టన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఢిల్లీ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఏడేళ్లపాటు ప్రధాన కోచ్‌గా కొనసాగాడు. అయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా అతడి మార్గదర్శనంలో ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయినప్పటికీ యాజమాన్యం పాంటింగ్‌పై నమ్మకం ఉంచింది.అయితే, వేలంలో పాల్గొనడం మినహా జట్టు కూర్పు తదితర అంశాలపై మరింతగా దృష్టి సారించాలని మేనేజ్మెంట్ కోరగా.. పాంటింగ్ నుంచి స్పందన కరువైందని సమాధానం. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కేవలం రెండు వారాలు ముందే జట్టుతో చేరడం పట్ల యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక రిక్కీ పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.కొత్త కోచ్‌గా దాదా?ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్‌గా ఉన్న దాదాను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసీ సహ యజమానులైన జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపు పెద్దలు ఈ విషయమై వచ్చే నెలలో భేటీ అయి.. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అదే విధంగా.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను కొనసాగించేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting. It's been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024 -
ఇప్పటికీ ఆ రికార్డు గంగూలీ పేరిటే ఉంది..!
భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇవాళ (జులై 8) 52వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డు గురించి తెలుసుకుందాం.క్రికెట్ చరిత్రలో వివిధ ఫార్మాట్లలో ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఐసీసీ టోర్నీలు జరగగా.. ఓ రికార్డు నేటికీ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిటే ఉంది. అదేంటంటే.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు.1992లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ భారత కెప్టెన్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో కెప్టెన్‌గా (ఐసీసీ టోర్నీల్లో) ఎవరూ ఇన్ని సెంచరీలు చేయలేదు. గంగూలీ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 5 సెంచరీ చేశాడు.పాంటింగ్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో కేన్ విలియమ్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2), సనత్ జయసూర్య (2) ఉన్నారు.కాగా, 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 424 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ.. 38 సెంచరీలు, 107 అర్ద సెంచరీల సాయంతో 18000 పైచిలుకు పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని ముద్దుగా అందరూ దాదా (బెంగాలీలో అన్న అని అర్దం) అని పిలుస్తుంటారు. -
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ పుట్టిన రోజు ప్రత్యేకం (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ రికార్డ్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బుధవారం అమెరికాపై టీమిండియా విజయనంతరం రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.7 వికెట్ల తేడాతో అమెరికాను భారత్ చిత్తు చేసింది. ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హిట్‌మ్యాన్ అధిగమించాడు. దాదా కెప్టెన్‌గా 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు టీమిండియాకు అందించాడు. తాజా మ్యాచ్‌తో గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని కెప్టెన్‌గా 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలు భారత్‌కు అందించాడు. ధోని సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను భారత్ సొంతం చేసుకుంది.అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మొట్టుపై భారత్ బోల్తా పడింది. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 అర్హత సాధించిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్! -
రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అమెరికాలోని డలాస్ వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఐసీసీ టోర్నీ కోసం సన్నద్ధమైంది.న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి కూడా భారీ అంచనాల నడుమ రోహిత్ సేన ప్రపంచకప్ బరిలో దిగనుంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు, టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్ అన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇరువురిపై ఒత్తిడి ఉండటం సహజం.అదే విధంగా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆటగాళ్లు అంత ఎక్కువగా ఒత్తిడికి లోనై.. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరని పేర్కొన్నాడు.‘‘రాహుల్ ద్రవిడ్ చాంపియన్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నడంలో దిట్ట. అయితే, రిలాక్స్ కావడానికి తనకూ కొంత సమయం కావాలి.రోహిత్ భార్య(రితికా సజ్దే)ను స్టాండ్స్‌లో చూసినపుడు మనకే అర్థమవుతుంది. ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నారో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అదే విధంగా.. విరాట్ భార్య(అనుష్క శర్మ)ను చూసినపుడు కూడా ఇదే అనిపిస్తుంది.ఆమె ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారో తెలిసిపోతుంది. ఆటగాళ్లపై ఆశలు పెట్టుకున్నామంటూ వాళ్లను ఎంత ఒత్తిడికి లోను చేస్తోంది మనమే. తప్పు మనవైపే ఉంది. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇదే జరిగింది.మేజర్ టోర్నీల్లో ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆడుతున్నపుడు ఒత్తిడి పెట్టకుండా స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి’’ అని గంగూలీ రెవ్స్ట్పోర్స్తో వ్యాఖ్యానించాడు. అంచనాల పేరిట ఆటగాళ్లపై మానసికంగా భారం మోపడం సరికాదని దాదా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ఇక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లోనూ టీమిండియా ఓడిపోవడానికి ఇదే కారణమని.. ఆటగాళ్లు కూడా కాస్త రిలాక్స్‌గా ఉండి ఒత్తిడి పడకుండా చూసుకోవాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. -
ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
టీమిండియా కొత్త కోచ్ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లే!కానీ ఇంతవరకు కొత్త కోచ్ ఎవరన్నా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్‌ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో.. ఐపీఎల్-2024 చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.తెలివిగా వ్యవహరించాలి‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. కాబట్టి కోచ్‌ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్‌లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్‌కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా? ఆయన హెడ్‌కోచ్ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్ చాపెల్ మాదిరి ఇంకో కోచ్ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుThe coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024 -
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్‌కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్‌కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
రోహిత్‌తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్‌కప్‌లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్‌కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2024: వరల్డ్‌కప్ జట్టులో రిషభ్ పంత్?
ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన టీమిండియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అద్బుత ఆట తీరు కనబరుస్తున్నాడు. గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సేవలు అందిస్తున్నాడు ఈ కెప్టెన్ సాబ్. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందు వరుసలో ఉండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ వరల్డ్‌కప్ సెలక్షన్ గురించి బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ జట్టులో పంత్? వరల్డ్‌కప్ జట్టులో పంత్ చోటు దక్కించుకోగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకొన్ని మ్యాచ్‌లు పూర్తి కానివ్వండి. ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn — JioCinema (@JioCinema) April 3, 2024 సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవారం గడిస్తే గానీ నేను ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేను. సెలక్టర్లు పంత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేను. ప్రస్తుతానికి పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా రాణిస్తున్నా.. కెప్టెన్ విఫలం! కాగా డిసెంబరు, 2022లో పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషభ్ పంత్ రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింటిలో ఓడిపోయింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హార్దిక్‌ది తప్పు కాదు.. దయ చేసి హేళన చేయవద్దు: గంగూలీ
ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్‌కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. "దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్‌ను తప్పుబట్టడం సరికాదు. క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్‌మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్‌గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీ పేర్కొన్నాడు. -
‘రోహిత్ శర్మ ఆటగాళ్లను అందుకే తిడతాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడొక అద్భుతమైన నాయకుడని.. జట్టును ముందుకు నడిపించడంలో తనకు తానే సాటి అని కొనియాడాడు. సౌరవ్ గంగూలీ లాంటి క్రమక్రమంగా వాళ్లు పటిష్ట జట్టు నిర్మిస్తే.. రోహిత్ శర్మ తనకు తానుగా జట్టును క్రియేట్ చేసుకున్న ఘటికుడని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు అమోఘమని ప్రశంసించాడు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి నుంచి భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్ములేపాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా మార్చాడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్-2022 టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సేనకు పరాభవం తప్పలేదు. ఇక వన్డేల్లోనూ అదే తరహా దురదృష్టం వెంటాడింది. ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తా చాటడం సహా సొంతగడ్డపై అపజయమన్నది ఎరుగక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ దాకా వెళ్లినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. జట్టును నడిపించిన తీరు బాగుందని ప్రవీణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ‘‘సౌరవ్ గంగూలీ జట్టును నిర్మించాడు. కానీ రోహిత్ తనకంటూ కొత్త జట్టును క్రియేట్ చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో తనొక స్నేహితుడిలా మెలుగుతాడు. వాళ్లు తప్పుచేసినప్పుడు మాత్రమే తిడతాడు. మళ్లీ వెంటనే వెళ్లి ఆత్మీయంగా హత్తుకుంటాడు కూడా! కెప్టెన్‌గా వాళ్లకు ఆదేశాలు ఇస్తూనే మైదానంలో స్వేచ్ఛగా కదిలే వెసలుబాటు కూడా కల్పిస్తాడు’’ అని ప్రవీణ్ కుమార్ రోహిత్ కెప్టెన్సీ తీరును ప్రశంసించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో గెలిచాడు. చదవండి: IPL 2024: లక్నో అభిమానులకు గుడ్‌న్యూస్.. కెప్టెన్ వచ్చేశాడు! -
అతడిని ధోనితో పోల్చడమేంటి? : గంగూలీ
టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే అతడిని మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజ ఆటగాడితో పోల్చకూడదని సరికాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. అయితే, రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని విభిన్నమైన ఆటగాడు. ధ్రువ్ జురెల్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే, ఇప్పుడే అతడిని ధోనితో పోల్చడం సరికాదు. అతడిని స్వేచ్ఛగా ఆడనిస్తే మంచిది. ధోని ఎంఎస్ ధోని అనే బ్రాండ్ సంపాదించుకోవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం సానుకూల అంశం. అంతేకాదు.. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం అతడి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం’’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావన రాగా.. అతడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల క్రికెటర్ అని గంగూలీ కితాబులిచ్చాడు. -
అచ్చం దాదా మాదిరే.. మరో గంగూలీ అవుతాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. యశస్వి బ్యాటింగ్ తీరు చూస్తే తనకు సౌరవ్ గంగూలీ గుర్తుకువస్తాడని తెలిపాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ ఆడటంలో ఈ ముంబై బ్యాటర్ దిట్ట అంటూ కొనియాడాడు. కాగా వెస్టిండీస్ గడ్డపై శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఇటీవలే తొలి డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తదుపరి రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు యశస్వి జైస్వాల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో యశస్వి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సిరీస్‌లో నేను ఎవరి ఆట కోసమైనా ఎదురుచూస్తున్నానంటే అది యశస్వి జైస్వాల్ మాత్రమే! ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడో మనమంతా చూశాం. అత్యద్భుతమైన ఆటగాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ గేమ్ చితక్కొడతాడు. నిజానికి తనను ఆఫ్ సైడ్ రారాజు అని పిలవొచ్చు. ఒకవేళ వచ్చే పదేళ్ల పాటు అతడు జట్టులో కొనసాగితే.. తప్పకుండా దాదా మాదిరే ప్రభావం చూపగలడు. మనం ఇప్పుడు దాదా గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే యశస్వి గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో యశస్వి మరోసారి నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులాడి 637 పరుగులు, 17 టీ20లలో 502 పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియా మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా.. కెప్టెన్ రోహిత్ శర్మ జోడీగా కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! -
అలాంటి పిచ్‌లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్!
Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్‌లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగిసిపోవడం వల్ల పిచ్‌ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్ తాజా సిరీస్‌పై క్రికెట్ దిగ్గజాల దృష్టి పడింది. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్‌లో పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటు సాగాయి. బుమ్రా అద్భుత ప్రదర్శన హైదరాబాద్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్‌లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్‌లో స్పిన్‌తో పాటు పేస్‌కూ అనుకూలించే పిచ్‌లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్ అయ్యే పిచ్‌లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 విశాఖ మ్యాచ్‌లో భారత్ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్‌ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు. టర్న్ అయ్యే పిచ్లే కావాలని మేము కోరలేదు ‘‘పిచ్‌లను క్యూరేటర్ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్ పిచ్‌లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. అయితే, అవి ఎంత వరకు టర్న్ అవుతాయి? ఎంత తక్కువ టర్న్ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు. నేనేమీ పిచ్ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్‌లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్‌లు టర్న్ అవుతాయి. అంతేగానీ.. టర్న్ అవుతూనే ఉండవు. ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్ అవుతాయి. పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్‌పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. తదుపరి మేము రాజ్‌కోట్‌కు వెళ్తున్నాం. అక్కడి పిచ్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్‌పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్ ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. గంగూలీకి కౌంటర్‌గానేనా? ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక ఫైర్ -
కేవలం ఇలాంటి పిచ్‌లు మనకు అవసరమా: గంగూలీ
India vs England, 2nd Test: భారత్‌లో పిచ్‌లు కేవలం స్పిన్‌కు మాత్రమే కాకుండా.. పేస్‌కు కూడా అనుకూలించేలా తయారు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తదితరుల బౌలింగ్ చూసినపుడల్లా తనకు ఇలాంటి ఆలోచన వస్తుందని పేర్కొన్నాడు. పిచ్‌లు బాగుంటే ఆట మరింత రసకందాయకంగా ఉంటుందని.. ఐదు రోజులపాటు సాగే టెస్టును కూడా గెలిచే సత్తా టీమిండియా సొంతమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పిచ్‌లు ఉంటాయక్కడ. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్‌లు రెండు.. మూడు రోజుల్లోనే.. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోతున్న తరుణంలో.. పిచ్‌ల రూపకల్పనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టర్నింగ్ ట్రాకులు మాత్రమే ఎందుకు? ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బుమ్రా, షమీ, సిరాజ్, ముకేశ్ బౌలింగ్ చేయడం చూసినపుడు.. ఇండియాలో ఇంకా టర్నింగ్ ట్రాక్‌ల తయారీకే మనం ఎందుకు పరిమితం కావాలి అనిపిస్తుంది. మంచి వికెట్ తయారు చేస్తే ప్రతి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది కదా! అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్(స్పిన్నర్లు)లతో కలిసి మన పేసర్లు కూడా ఇక్కడి పిచ్‌లపై 20 వికెట్లు తీయగలరు. నిజానికి సొంతగడ్డపై.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల మీద గత ఆరేడేళ్లుగా మన బ్యాటింగ్‌లో నాణ్యత లోపించడం చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన వికెట్లు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఐదు రోజుల మ్యాచ్‌ను గెలవగల సత్తా ఇంకా టీమిండియాకు ఉంది’’ అని గంగూలీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్‌పై ఆరేసిన బుమ్రా కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకోవడం గమనార్హం. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 -
T20 WC 2024: టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా ఐసీసీ టోర్నీలో ఆడితే భారత్ అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని బీసీసీఐ మాజీ బాస్ అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022 తర్వాత కేవలం వన్డేలు, టెస్టులకే పరిమితమైన రోహిత్ శర్మ, కోహ్లి.. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో టీ20 సందర్భంగా పునరాగమనం చేయనున్నారు. ఏడాది తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగనున్నారు. రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో విరాహిత్ ద్వయం రీఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రోహిత్- కోహ్లితో చర్చించి అంతర్జాతీయ టీ20లలో మళ్లీ బరిలోకి దిగేలా ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరు ప్రపంచకప్ ఈవెంట్లోనూ ఆడటం దాదాపుగా ఖాయమైనట్లే!! ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న వీరి ఫామ్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో టచ్‌లోనే ఉన్నా.. టీమిండియా తరఫున స్థాయికి తగ్గట్లు రాణిస్తారా? వీరి రాక వల్ల యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండాలి. విరాట్ కోహ్లి కూడా జట్టుతో పాటే ఉండాలి. విరాట్ అత్యద్భుతమైన ఆటగాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక చాలా కాలం తర్వాత నేరుగా జట్టులోకి వస్తున్నారంటూ కోహ్లి- రోహిత్‌ల గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న గంగూలీ.. జట్టుకు ఇలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందని నొక్కివక్కాణించాడు. కాగా అఫ్గన్‌తో సిరీస్ ద్వారా విరాహిత్ ద్వయం టీ20 జట్టుతో చేరనుండగా.. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు జట్టులో చోటిచ్చారు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
రూ. 10 కోట్లదాకా వెళ్తామని గంగూలీ మాటిచ్చారు.. ఇలా అనుకోలేదు!
IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వల్ల వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. దేశవాళీ క్రికెట్, సెలక్షన్ క్యాంపులలో అసాధారణ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధపడతాయన్న విషయం తెలిసిందే. తమ జట్టుకు సదరు ఆటగాడు ఉపయోగపడతాడని భావిస్తే కనీస ధరతో సంబంధం లేకుండా కోట్ల వర్షం కురిపించిన దాఖలాలు కోకొల్లలు. ఐపీఎల్-2024 వేలం సందర్భంగా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్. రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చి ఏకంగా రూ. 7.20 కోట్లు కొల్లగొట్టాడు. అతడి పేరు కుమార్ కుషాగ్ర. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడి మరీ ఈ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, దీనంతటికి క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీనే కారణం అంటున్నాడు కుషాగ్ర తండ్రి శశికాంత్. ధోనిలా వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా గంగూలీ కుషాగ్రతో మాట్లాడారు. నీకోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 కోట్ల వరకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడుతుందని కుషాగ్రకు చెప్పారు. నిజానికి ట్రయల్స్‌లో భాగంగా కుషాగ్ర సిక్సర్లు బాదడం చూసి గంగూలీ ముచ్చటపడ్డారు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అంతేకాదు.. కుషాగ్ర మహేంద్ర సింగ్ ధోని మాదిరే బెయిల్స్‌ను హిట్ చేస్తున్నాడంటూ కొనియాడారు. ఉత్సాహపరిచేందుకు చెప్తున్నారనుకున్నా గానీ.. ఇలా అనుకోలేదు వేలంలో కుషాగ్రను ఢిల్లీ కనీస ధరకే కొనుగోలు చేస్తుందని భావించాం. అయితే, ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి. గంగూలీ మాట ఇచ్చినట్లుగానే ఇతర జట్లతో పోటీ పడీ మరీ మా వాడిని కొనుగోలు చేసేలా చేశారు. జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుషాగ్రకు ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది. తను ఇక్కడిదాకా చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని శశికాంత్ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్ర. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. రంజీ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 250కి పైగా రన్స్ చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, దేళవాళీ టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి కాసుల వర్షంలో తడిశాడు. చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు -
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు.. సల్మాన్ నా ఫేవరెట్: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు స్వాగతం పలికాడు. సల్మాన్ తన అభిమాన నటుడన్న దాదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనను కలవలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఏదేమైనా కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా సల్లూ భయ్యాను కలుసుకోవడం సంతోషంగా ఉందని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా కోల్‌కతా వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మంగళవారం తెరలేచింది. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా కోల్‌కతాకు విచ్చేసిన బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేశ్ భట్, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా తదితరులకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో వేదికపైకి వచ్చిన సౌరవ్ గంగూలీ సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా అభిమాన నటుడు మిస్టర్ సల్మాన్ ఖాన్‌కు కోల్‌కతా తరఫున స్వాగతం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. LATEST: #SouravGanguly on #Salmankhan Salman is Huge Name in Indian Cinema And famous in other countries also Legendary Megastar@BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/LROpHCWN1Q — FIGHTя (@SalmanzFighter_) December 5, 2023 ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రతక్ష్యంగా కలుసుకోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే నిజంగా ఇది దురదృష్టకరమే. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్లతో పాటు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బెంగాల్ తరఫున టీమిండియాకు ఆడిన సౌరవ్ గంగూలీ దూకుడైన కెప్టెన్‌గా పేరొందిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్కు చూపించాడీ బెంగాలీ బ్యాటర్. #WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee, Film Director Mahesh Bhatt, former Indian cricketer Sourav Ganguly, actors Salman Khan, Anil Kapoor and Sonakshi Sinha shake a leg at the Kolkata International Film Festival (KIFF). (Source: KIFF Social Media) pic.twitter.com/EHOKtK9g3B — ANI (@ANI) December 5, 2023 చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! Latest - Former president of BCCI #Souravganguly about Megastar #Salmankhan. ' Our very favourite my favourite, Salman Khan welcome to Kolkata, we have never met before. But I'm his huge fan ' 🙌❤️pic.twitter.com/12FENf5TTa — YOGESH (@i_yogesh22bakup) December 5, 2023 -
కోహ్లి కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ
విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్ ఈ వివరణ ఇచ్చాడు. కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్ మెషీన్ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. -
అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ
Sourav Ganguly Comments: మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉండాలని మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసేంత వరకు హిట్‌మ్యాన్‌ను కొనసాగిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈనెలలో మొదలుకానున్న సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్.. పొట్టి సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. వన్డేలకు కూడా దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాల్సి ఉండగా.. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌నే సఫారీలతోనూ కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. ఇక వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం రోహిత్ శర్మ జట్టుతో కలువనున్నాడు. ఈ పరిణామాలపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ‘‘చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా పరిణమించింది. సూర్య టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, వన్డేల్లో అతడి స్థానం విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి 50 ఓవర్ల క్రికెట్‌కు మరో కెప్టెన్ అంటే ఈసారి కేఎల్ రాహుల్ వస్తున్నాడు. ఇక రోహిత్ టెస్టులు ఆడాలనుకుంటున్నాడు కాబట్టి తనే సారథిగా ఉంటాడు. నిజానికి.. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఆడాలి. వన్డే వరల్డ్‌కప్‌లో అతడి సారథ్యంలో టీమిండియా అద్భుతంగా ఆడింది. అతడు గొప్ప నాయకుడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసేంత వరకు అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండాలి’’ అని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా దూరంగా ఉండనున్నాడు. చదవండి: రాహుల్‌కు వన్డే పగ్గాలు.. రుతురాజ్‌కు లక్కీఛాన్స్ -
అదంతా చూస్తూ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు: గంగూలీ
ICC WC 2023: వన్డే ప్రపంచకప-2023లో అఫ్గనిస్తాన్ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాని రీతిలో సెమీస్ రేసులో నిలిచి మేటి జట్లకు సవాల్ విసిరింది. స్పిన్ మాత్రమే అఫ్గన్ బలం అనుకున్న వాళ్లకు బ్యాటింగ్‌లోనూ తాము తక్కువేం కాదంటూ యువ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిరూపించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్ అఫ్గన్ తరఫున వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. లీగ్ దశలో ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగింట జట్టును గెలిపించి హష్మతుల్లా సైతం సారథిగా తన ముద్ర వేయగలిగాడు. అయితే, అఫ్గన్ విజయాల వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. మెంటార్‌గా జట్టుకు మార్గదర్శనం చేసి ఈస్థాయిలో నిలిపిన ఘనత అతడి దక్కుతుంది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించిన అఫ్గనిస్తాన్.. ఐదుసార్లు జగజ్జేత అయిన ఆస్ట్రేలియాను కూడా ఓడించేలా కనిపించింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా 291 పరుగులు సాధించిన హష్మతుల్లా బృందం.. ఆరంభంలోనే వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో అజయ్ జడేజాతో పాటు అఫ్గనిస్తాన్ శిబిరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల వల్ల సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కంప్లైంట్ చేశాడు. దీంతో అతడిని కవ్వించేలా జడేజా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాక్సీ వచ్చాక సీన్ రివర్స్ కానీ గ్లెన్ మాక్స్వెల్ రాకతో సీన్ మారిపోయింది. అప్పటిదాకా అఫ్గనిస్తాన్ చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చేజారిపోయింది. మిస్‌ఫీల్డ్, క్యాచ్డ్రాప్ల మూలంగా మాక్సీకి లైఫ్ దొరకగా.. అతడు ఏకండా అజేయ ద్విశతకం బాదాడు. అఫ్గన్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అనూహ్య రీతిలో విజయం అందించి సెమీస్ చేర్చాడు. జడేజా ఏడ్చే ఉంటాడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాక్స్వెల్ క్రీజులో పాతుకుపోయినపుడు అఫ్గనిస్తాన్ బౌలర్లు ఎక్కువగా స్ట్రెయిట్ బౌలింగే చేశారు. అప్పటికే అతడు గాయపడ్డాడు అయినా కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఇదంతా చూస్తూ అజయ్ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు. మాక్సీ నిలబడి ఉన్నచోటే బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అసలు మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినట్లుగా అనిపించలేదు. ఏదేమైనా వన్డేల్లో ఇది అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది’’ అని కోల్‌కతా టీవీతో ముచ్చటిస్తూ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత రోహిత్‌తో నేను చెప్పిందిదే: గంగూలీ
Rohit Sharma- ViratKohli- Team India Captaincy: వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో అజేయంగా ఉండి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. టైటిల్ దిశగా ఒక్కో అడుగు వేస్తూ సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఈ ఐసీసీ టోర్నీ కంటే ముందు రోహిత్ సేన ఆసియా వన్డే కప్-2023 నెగ్గిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఓపెనర్ రోహిత్ శర్మ గెలిచిన తొలి టైటిల్ ఇది. దీంతో.. ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రమే గెలుస్తాడంటూ అప్పటి వరకు రోహిత్‌ను విమర్శించిన వాళ్లకు గట్టిగా బదులిచ్చినట్లయింది. ఈ క్రమంలో స్వదేశంలో ప్రపంచప్‌లో టీమిండియా జైత్రయాత్ర సాగిస్తున్న తీరు, రోహిత్ కెప్టెన్సీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం విశేషం. కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత నేనే.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. రోహిత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘విరాట్ తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా లేడు. ఈ విషయం గురించి ఎన్నోసార్లు తనతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేను మరింత చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ‘‘నువ్వు సరే అంటావా? లేదంటే నాకు నేనుగా దీని గురించి ప్రకటన చేయాలా? అప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా బాధ్యతలు చేపట్టక తప్పదు’’ అని తనతో కాస్త గట్టిగానే మాట్లాడాను. ఇదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు ఎందుకంటే తను జట్టును విజయవంతంగా ముందుకు నడపగల సమర్థుడని నాకు తెలుసు. నిజానికి విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత టీమిండియాను నడిపించే అత్యుత్తమ వ్యక్తి అతడే అని అందరూ నమ్మారు. అందుకే ఇప్పుడు జరుగుతున్నదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’’ అంటూ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. కోల్‌కతా టీవీతో సంభాషిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన(2022, జనవరి)లో ఉండగానే తాను టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించి కోహ్లి షాకిచ్చాడు. దీంతో రోహిత్ శర్మ కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గానే కాకుండా టెస్టు జట్టుకు కూడా సారథి అయ్యాడు. అయితే, కోహ్లి మాదిరే రోహిత్ కూడా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీ గెలవడంలో విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తదుపరి నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనుంది. దీంతో లీగ్ దశను ముగిస్తుంది. చదవండి: బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్‌ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్‌ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌లా సెమీస్‌కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేసిన జో రూట్
వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. కాగా కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రూట్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. 18555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్ తన వన్డే కెరీర్లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్(758 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చదవండి: గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్ -
గంగూలీ కీలక వ్యాఖ్యలు.. కోహ్లినే కరెక్ట్ అన్న ఏబీడీ! ఇష్టం ఉన్నా లేకపోయినా..
Asia Cup 2023: మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో టీమిండియాలో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే అంగీకరించాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రిటరైన తర్వాత ఎవరూ కూడా అక్కడ నిలదొక్కుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. దీంతో చాలా కాలంగా నంబర్ 4 సమస్య భారత జట్టును వెంటాడుతోందని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు దూరంగా ఉన్న కారణంగా కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రాణిస్తున్నప్పటికీ ఆరేడు నెలలుగా గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్‌దీ ఇలాంటి పరిస్థితే. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్లు ఇద్దరూ ఇలా ఆటకు దూరంగా ఉండటం మేనేజ్మెంట్కు కలవరపాటుకు గురిచేస్తోంది. గంగూలీ, రవిశాస్త్రి వ్యాఖ్యలకు మద్దతుగా ఏబీడీ! ప్రాక్టీస్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ అసలు సమయంలో ఎలా రాణిస్తారనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచన చేశాడు. కోహ్లి కరెక్ట్.. ఇష్టం ఉన్నా లేకపోయినా ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి విరాట్ కోహ్లి.. సరిగ్గా సరిపోతాడు. మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగల బాధ్యత తను తీసుకోగలడు. కోహ్లిని నంబర్ 4లో బ్యాటింగ్‌కు పంపాలన్న ఆలోచనను నేను నూటికి నూరు శాతం సమర్థిస్తా. కోహ్లికి ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు గానీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు తప్పక బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా జట్టు సమతూకంగా.. పటిష్టంగా ఉండటమే ముఖ్యం కదా’’ అని ఏబీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆసియా కప్-2023, ప్రపంచకప్-2023 టోర్నీల్లో వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో పంపాలన్న రవిశాస్త్రి, గంగూలీ వ్యాఖ్యలకు ఈ మేరకు వత్తాసు పలికాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న భారత్ పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నంబర్ 4లో కోహ్లి రికార్డు ఇలా.. వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 42 మ్యాచ్‌లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సగటున 55.21 పరుగులతో 1767 రన్స్ సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో నంబర్ 4లో స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 20 మ్యాచ్‌లలో 805 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి. చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? -
WC 2023: మొన్న అలా.. ఇప్పుడిలా! మాట మార్చిన దాదా.. పాపం
World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా తన టీమ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం. అందుకే చహల్‌పై వేటు! టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. దీంతో అనుభవజ్ఞుడైన చహల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్‌తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. తిలక్ వర్మకు నో ఛాన్స్ కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణను కూడా దాదా తప్పించాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితే తిలక్ వర్మ, పేసర్ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్, స్పిన్నర్ గాయపడితే చహల్‌లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్‌లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్-2023కి సౌరవ్ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
అంతా వాళ్ల మీదే ఆధారపడి ఉంది.. అలా అయితేనే ట్రోఫీ గెలుస్తాం: గంగూలీ
ICC ODI World Cup 2023: పుష్కర కాలం తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడనుంది. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఇక స్వదేశంలో మెగా టోర్నీ జరుగనున్న తరుణంలో రోహిత్ సేన హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. ఈసారి కూడా భారత్ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రధాన బలం అదే భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్ అని.. బ్యాటర్లు రాణిస్తేనే భారత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆసియా కప్ ఫలితంతో ప్రపంచకప్ ఈవెంట్‌కు సంబంధం ఉండదని దాదా పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్... వరల్డ్‌కప్.. దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు. ప్రతి టోర్నమెంట్లోనూ ఆడే విధానం భిన్నంగా ఉంటుంది. భారత్ పటిష్ట జట్టు. ఒకవేళ మన బ్యాటర్లు రాణిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాం. కాబట్టి మొత్తమంతా మన బ్యాటర్లు ఎలా ఆడుతారన్న అంశం మీదే ఆధారపడి ఉంది’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. పాక్ బౌలింగ్ దళం పటిష్టం ఇక పాకిస్తాన్ జట్టు సైతం మెరుగ్గా ఉందన్న దాదా.. ‘‘పాక్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. నసీం షా, షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్ రాణిస్తున్నారు. మొత్తానికి పాక్ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే, టీమిండియాతో పోటీ ఎలా ఉంటుందనేది చెప్పలేం. మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడతారో విజయం వాళ్లనే వరిస్తుంది. అందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు’’ అని దాయాదుల పోరులో ఫేవరెట్ జట్టు ఏదీ లేదని చెప్పకనే చెప్పాడు. కాగా అక్టోబరు 14న పాక్‌తో అహ్మదాబాద్ వేదికగా రోహిత్ సేన మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ కంటే ముందు ఆసియా కప్‌లో సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే?
Sourav Ganguly disagreed with Shoaib Akhtar’s suggestion: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కెరీర్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. కోహ్లి తనకు నచ్చినన్ని రోజులు నచ్చిన తీరుగా ఆడతాడని వ్యాఖ్యానించాడు. కాగా ఆగష్టు 18, 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో శుక్రవారం నాటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్ తర్వాత గుడ్‌బై చెబితే! ఈ సందర్భంగా రన్‌మెషీన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన షోయబ్ అక్తర్.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కోహ్లి వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సెంచరీ సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే విరాట్ ఇకపై పూర్తిగా టెస్టు క్రికెట్‌పైనే దృష్టి సారించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి 50- ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడకపోతేనే మంచిది. టీ20ల విషయంలోనూ ఆలోచించాలి. కనీసం ఇంకా ఆరేళ్లపాటు కోహ్లి క్రికెట్ ఆడాలి. అప్పుడే సచిన్ టెండుల్కర్ రికార్డు బ్రేక్ చేయగలడు. అక్తర్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన దాదా వరల్డ్‌కప్ తర్వాత అతడు పూర్తిగా టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలి’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. అయితే, అక్తర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా గంగూలీని కోరగా.. ‘‘ఎందుకు? విరాట్ కోహ్లి తనకు ఎన్నాళ్లు ఆడాలనిపిస్తే అన్నాళ్లు ఆడతాడు. నాడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అది కూడా తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే ఇప్పటికీ తను మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు’’ అని బదులిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పగా.. నాడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ప్రోద్బలంతోనే వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. కోహ్లిని అడిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పగా.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ కోహ్లి దాదా వ్యాఖ్యలను ఖండించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. గంగూలీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
సౌరవ్ చండీదాస్ గంగూలీ.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. ఇతన్ని అందరూ ముద్దుగా దాదా (బెంగాలీలో అన్న అని అర్ధం) అని పిలుచుకుంటారు. 90వ దశకంలో (1992) అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగపెట్టి, దాదాపు 16 ఏళ్ల పాటు (2008) దిగ్విజయంగా కెరీర్‌ను కొనసాగించిన ఈ కోల్‌కతా ప్రిన్స్.. అత్యుత్తమ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా, అత్యుత్తమ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్నాడు. 1992లో విండీస్‌తో వన్డేతో ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన దాదా.. ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో దాదాపు నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. అనంతరం 1996 ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన గంగూలీ.. తానాడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, సెన్సేషన్‌గా మారాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని గంగూలీ భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగాడు. టీమిండియాలో ఓ పక్క సచిన్ హవా నడుస్తున్నా, బ్యాటర్‌గా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. దూకుడే మంత్రంగా గంగూలీ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటివరకు గంగూలీలా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన భారత బ్యాటర్లు లేరు. 1997లో శ్రీలంకపై తొలి వన్డే శతకాన్ని బాదిన దాదా.. ఆ తర్వాతి కాలంలో వన్డే క్రికెట్లో దాదాగిరి కొనసాగించాడు. 1998లో పాక్‌తో జరిగిన సహారా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న గంగూలీ, ఆ సిరీస్‌తో తనలోని బౌలర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1999 వరల్డ్‌కప్‌లో గంగూలీ బ్యాటింగ్ శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఆ మెగా టోర్నీలో అతను ఎన్నో రికార్డులను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌పై మొదలైన దాదాగిరి.. అనూహ్య పరిణామాల మధ్య 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. కెప్టెన్‌గా తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆట పరంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావి అయిన గంగూలీ అదే మంత్రాను కెప్టెన్‌గానూ కొనసాగించాడు. అదే దూకుడును భారత జట్టుకు కూడా నేర్పించాడు. అప్పట్లో ఆటతో పాటు మాటకు కూడా పని చెప్పే ఆస్ట్రేలియన్లతో సై అంటే సై అన్నాడు. అప్పటిదాకా నిదానంగా ఉండిన టీమిండియా ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు డిఫెన్సివ్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్‌కు గేర్ మార్చింది. దీని ఫలితంగా టీమిండియా ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు తిరుగులేని జట్టుగా చలామణి అయ్యింది. ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ టీమిండియా దెబ్బకు గడగడలాడాయి. భారత క్రికెట్‌కు అది స్వర్ణయుగంగా చెప్పవచ్చు. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు దాదా హయాంలో వెలుగులోకి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే వారు దాదా అండర్లోనే రాటుదేలారు. ఆతర్వాత ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా పేరొందారు. ఈ క్రమంలోనే దాదా సారధ్యంలో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అప్పటివరకు విదేశాల్లో అడపాదడపా విజయాలు సాధించిన టీమిండియా గంగూలీ నేతృత్వంలో ఆసీస్ లాంటి జట్టును వారి స్వదేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. అదే దాదాగిరితో 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. Making us believe in our abilities with pride & passion, he turned us into "Overseas Tigers". We've had many great leaders & will keep having them. But the foundation you built at the time of crisis will never ever be forgotten. HBD @SGanguly99 "Dada" ❤pic.twitter.com/WzN9yQGIob — North Stand Gang - Wankhede (@NorthStandGang) July 8, 2023 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యన్నత శిఖరాలు అధిరోహించిన గంగూలీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యుత్తమ కెప్టెన్లలో ప్రథముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌పై దాదాగిరి చేసిన గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలను మార్చాడని వేనోళ్ల కీర్తించబడ్డాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు అత్యుతన్న శిఖరాలను అధిరోహించిందని, కెప్టెన్‌గా గంగూలీ జమానా భారత క్రికెట్‌కు స్వర్ణయుగం లాంటిదని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తారు. -
ఆరోజు గంగూలీతో నేను చెప్పాను.. కానీ ధోని విషయంలో అలా: మాజీ సెలక్టర్
Ex-Selector Comments On MS Dhoni: ‘‘ఎంఎస్ ధోని.. రంజీ ట్రోఫీ సెకండ్ సీజన్లో ఆడుతున్నపుడు తనను తొలిసారి కలిశాను. అప్పుడు అతడు బిహార్ జట్టుకు ఆడుతూ ఉండేవాడు. బ్యాటింగ్ చేయడంతో పాటు కీపర్‌గానూ వ్యవహరించేవాడు. స్పిన్నర్ అయినా పేసర్ అయినా దూకుడుగానే బ్యాటింగ్ చేసేవాడు. కానీ.. వికెట్ కీపర్‌గా తన ఫుట్‌వర్క్ విషయంలో మెరుగుపడాల్సి ఉందనుకున్నాను. అదే విషయాన్ని అతడితో చర్చించాను. నాడు నేర్చుకున్న పాఠాలను నేటికీ ధోని పాటిస్తున్నాడు. ధోని కెరీర్లో అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. కెరీర్ తొలినాళ్లలో వికెట్ కీపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోని.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి కీపర్లలో ఒకడిగా ఎదిగాడని పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను మాజీ వికెట్ కీపర్ సబా కరీం పంచుకున్నాడు. ‘‘కెన్యాలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, కెన్యా- ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ ధోని కెరీర్లో రెండో టర్నింగ్ పాయింట్. దినేశ్ కార్తిక్ జాతీయ జట్టుకు ఆడుతున్న క్రమంలో ధోనికి ఈ సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. అక్కడ తను వికెట్ కీపర్‌గా సేవలు అందించాడు. ఇక బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మా నమ్మకాన్ని నిలబెట్టాడు’’ అని సబా కరీం.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. నేను గంగూలీకి చెప్పాను.. కానీ.. ఇక 2004లో ధోని పాకిస్తాన్ టూర్ మిస్సవడానికి గల కారణాన్ని కూడా సబా కరీం ఈ సందర్భంగా బయటపెట్టాడు. ‘‘కెన్యాలో అద్భుత ప్రదర్శన తర్వాత అతడి పేరు మారుమ్రోగిపోయింది. అప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను. నాడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక వికెట్ కీపర్ ఉన్నాడు.. అతడు అద్భుత నైపుణ్యాలు కలిగి ఉన్నాడని గంగూలీతో చెప్పాను. జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కూడా అన్నాను. కానీ దురదృష్టవశాత్తూ.. ఎందుకో సౌరవ్ అప్పుడు అప్‌కమింగ్ ఆటగాడిపై నమ్మకం ఉంచలేకపోయాడు. ధోనిని మేము అప్పుడు జాతీయ జట్టుకు సెలక్ట్ చేయలేదు. అయితే, ఆ తర్వాత వెంటనే టీమిండియాలోకి వచ్చాడు’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపికైన ధోని.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. ఇక మిగిలిందంతా చరిత్రే!! చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్‌పురీలో మాట్లాడగలదు.. ఇంకా! -
ఈసారి యశస్వి మిస్సయ్యాడు! అయితేనేం అరుదైన రికార్డుతో..
West Indies vs India, 2nd Test- Yashasvi Jaiswal Record: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ జోరు మీదున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పిన్న వయసులోనే మొదటి టెస్టులోనే 150 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. శిఖర్ ధావన్ రికార్డు బద్దలు దీనితో పాటు మరెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక రెండో టెస్టులోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. తన కెరీర్లో మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించిన యశస్వి జైశ్వాల్.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అధిగమించాడు. రోహిత్, గంగూలీ తర్వాత భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శిఖర్ ధావన్‌ను వెనక్కినెట్టి రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఈసారి సెంచరీ మిస్ అయినా ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ట్రినిడాడ్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఈసారి సెంచరీ మిస్ అయినా అర్ధ శతకంతో మెరిసి మరో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొదటి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు వీరే! 1.రోహిత్ శర్మ- 288 పరుగులు 2.సౌరవ్ గంగూలీ- 267 పరుగులు 3.యశస్వి జైశ్వాల్- 228 పరుగులు 4.శిఖర్ ధావన్- 210 పరుగులు 5.పృథ్వీ షా- 204 పరుగులు. చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
యశస్విని కచ్చితంగా వరల్డ్‌కప్ టోర్నీలో ఆడించాలి! అదెలా కుదురుతుంది దాదా?
ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి ఇంకా రెండున్నర నెలలకుపైగా సమయం ఉంది. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఆతిథ్య టీమిండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా టాప్-10లో అడుగుపెట్టాయి. లంకతో పాటు డచ్ జట్టు జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు నమోదు చేసి ఐసీసీ మెగా టోర్నీ ఆడేందుకు అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ సాధించి పదేళ్లు గడిచిపోయింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2013లో చివరిసారి చాంపియన్స్ ట్రోఫీ రూపంలో భారత్ ఐసీసీ టైటిల్ సాధించింది. భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ తర్వాత వరుస ఈవెంట్లలో వైఫల్యం చెంది విమర్శలు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనన్న తరుణంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ జట్టు కూర్పుపై అభిమానులు సహా మాజీ ఆటగాళ్లు ఇప్పటికే చర్చ మొదలుపెట్టేశారు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ ఎంతో ప్రత్యేకం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వెస్టిండీస్‌తో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైశ్వాల్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవాలని దాదా మేనేజ్మెంట్కు సూచించాడు. టెలిగ్రాఫ్‌తో ముచ్చటిస్తూ.. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన యశస్విని కొనియాడాడు. ‘‘తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే శతకం సాధించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నా మొదటి మ్యాచ్‌లో నేను కూడా సెంచరీ కొట్టాను. యశస్వి టెక్నిక్ బాగుంది. అతడు ఉంటే ప్రయోజనకరం జట్టులో ఎడమచేతి వాటం గల బ్యాటర్ ఉండటం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతడకి కచ్చితంగా చోటివ్వాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కాగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన యశస్వికి వన్డేల్లో మాత్రం అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు.. ఆసియా క్రీడలు-2023కి పంపే ద్వితీయశ్రేణి జట్టుకు ఎంపిక చేశారు. అదెలా కుదురుతుంది దాదా? సెప్టెంబరు 28 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీలో ఆడే భారత జట్టులోని ఆటగాళ్లు అక్టోబరు 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్ ఈవెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రధాన జట్టును పంపడం వీలుకాకపోవడంతోనే బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపనుంది. ఈ నేపథ్యంలో యశస్వి వన్డే వరల్డ్‌కప్ జట్టులో భాగమయ్యే అవకాశం లేదని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. రోహిత్ తిరిగి వచ్చేశాడు! యశస్వి జైశ్వాల్ తొలిసారి.. కోహ్లి మాత్రం -
లీగ్ దశలో దుమ్మురేపి నాకౌట్లో చతికిలపడడం.. అలవాటైపోయింది
2011 తర్వాత టీమిండియా ఆడిన ఐసీసీ మేజర్ టోర్నీలో నాకౌట్ దశలోనే వెనుదిరుగుతూ వచ్చింది. 2012 చాంపియన్స్ ట్రోపీ మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన 2016 టి20 వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2017 చాంపియన్స్ ట్రోపీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టి20 వరల్డ్‌కప్(లీగ్ దశలోనే), 2022 టి20 ప్రపంచకప్‌లు.. ఇలా ఏది చూసుకున్నా నాకౌట్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుంది. ఈసారి కచ్చితంగా రోహిత్ సేన కప్ కొడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం తన 51వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకౌట్లో భారత జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో ధోనీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచుకున్న తర్వాత భారత్ మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. అప్పటి నుంచి టీమిండియా నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోగా.. ఇంకొన్ని సార్లు సెమీఫైనల్ వరకు వెళ్లింది. భారత్ వైఫల్యాలకు కారణం మానసిక ఒత్తిడి కంటే ఎగ్జిక్యూషన్ లేకపోవడమేనన్నారు. తాము కీలకమైన దశలలో కొన్నిసార్లు బాగా రాణించలేదని.. దీనిని మానసిక ఒత్తిడిగా తాను పరిగణించడం లేదన్నారు. మానసికంగా టీమిండియా ఆటగాళ్లు చాలా దృఢమైన వ్యక్తులని.. వారు త్వరలోనే ఈ అడ్డు రేఖను దాటుతారని దాదా ఆకాంక్షించారు. త్వరలో భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి నాకౌట్ దశలో అద్భుతంగా రాణిస్తుందన్నారు. భారత్ కనీసం డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించిందని.. ఇది కూడా ఒక ఘనతేనని గంగూలీ పేర్కొన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లున్నారని.. ఈసారి రాణిస్తారని ఆయన జోస్యం చెప్పారు. -
వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే.. కోల్‌కతాలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
వన్డే ప్రపంచకప్-2023కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న చెన్నై వేదికగా తలపడనుంది. కాగా ప్రపంచకప్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. సెమీఫైనల్‌కు చేరే జట్లను, ఫైనలిస్టులను మాజీలు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే తన ఫేవరెట్ జట్లను గంగూలీ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు భారత్ జట్లు కచ్చితంగా సెమీఫైనల్లో అడుగుపెడతాయని గంగూలీ జోస్యం చెప్పాడు. ఇటువంటి మెగా టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరే జట్లను అంచనా వేయడం చాలా కష్టం. నా వరకు అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ జట్లు కచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుతాయాని భావిస్తున్నాను. అదే విధంగా రన్నరప్ న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. కాబట్టి న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్లో అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈడెన్ గార్డెన్స్ జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్- భారత జట్లు తలపడాలని ఆశిస్తున్నాని రెవ్‌స్పోర్ట్జ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
పుట్టినరోజు నాడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను గెలిచిన సందర్భంలో లార్డ్స్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు. ‘సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్లైన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు. ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా. 'సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్' అనే యాప్ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్‌ప్లస్ (ఎడ్టెక్ స్టార్టప్)కు ధన్యవాదాలు. నేను, క్లాస్‌ప్లస్ కలిసి ఆన్లైన్ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 16+ years of international cricket and countless matches later… on this 51st bday, I sum up my learnings for you. They are now yours! Announcing “Sourav Ganguly Masterclass”, an app that has my first-ever online course on leadership - https://t.co/fX0dM4NVTb Thanks to… pic.twitter.com/Dek5fBzBM5 — Sourav Ganguly (@SGanguly99) July 8, 2023 -
రోహిత్, కోహ్లి టీ20 కెరీర్ ముగిసినట్లేనా?! వాళ్లు ఎవరైతే ఏంటి?: గంగూలీ
India Tour OF West Indies 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి జట్టులో చోటు దక్కలేదు. వీరికి విశ్రాంతినిచ్చారా లేదంటే వచ్చే ప్రపంచకప్-2024 నాటికి యువ జట్టును తయారు చేసుకునే క్రమంలో పక్కకు పెట్టారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి రోహిత్, కోహ్లి దాదాపు టీ20 సిరీస్లన్నింటికి దూరంగానే ఉన్నారు. అదే సమయంలో ప్రతి సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. తాజాగా విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. రోహిత్, కోహ్లి శకం ముగియనుందా? అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా నియమితుడైన తర్వాత ఎంపిక చేసిన తొలి జట్టులో యువకులకే పెద్దపీట వేశారు. దీంతో పొట్టి ఫార్మాట్లో రోహిత్, కోహ్లి శకం ముగియనుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు ఎవరైతే ఏంటి? ‘‘అత్తుత్తమంగా ఆడే వాళ్లు ఎవరైనా సరే వారిని జట్టులోకి తీసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు టీ20 ఫార్మాట్లో మరి కొన్నేళ్లు కొనసాగగలరు. మరి సెలక్టర్లు వాళ్లను ఎందుకు పక్కకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఐపీఎల్లో కోహ్లి అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. రోహిత్ కూడా మెరుగ్గా రాణించగలడు. వాళ్లిద్దరు టీ20 క్రికెట్లో మరిన్ని అద్భుతాలు చేయగలరు. ఆ సత్తా వారికుంది’’ అని రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పుకొచ్చాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ, 34 ఏళ్ల కోహ్లిని భారత టీ20 జట్టులో కొనసాగించాలని విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్-2023లో కోహ్లి అద్బుత ప్రదర్శన కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 14 ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీల సాయంతో 639 పరుగులు సాధించాడు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 16 ఇన్నింగ్స్‌లో 332 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. టెస్టు, వన్డేలు ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి పయనం కానున్నారు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి.. సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి -
Sourav Ganguly Rare Pics : సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Sourav Ganguly Dona Roy Love Story: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. వివాదాలను లెక్క చేయకుండా భారత క్రికెట్లో సంచలన మార్పులకు కారణమైన దాదా వ్యక్తిగత జీవితం గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డోనా రాయ్‌తో అతడి ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.. చిన్ననాటి నుంచే పరిచయం గంగూలీ చిన్నపుడు ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేవాడు. స్నేహితులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లే దారిలోనే డోనా ఇల్లు ఉండేది. అలా ఓసారి ఆమెను చూసిన దాదా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ కూడా ఆడే గంగూలీ కావాలనే రెండు మూడుసార్లు షటిల్‌కాక్‌ను డోనా ఇంట్లో పడేశాడు. అలా తమకు సంబంధించిన వస్తువును తిరిగి తెచ్చుకునే సాకుతో డోనాతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. అప్పటి నుంచి గంగూలీ- డోనా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో తొలిసారి అలా ప్రేమ పక్షులు తొలిసారి కోల్‌కతాలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో కలుసుకున్నారు. నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ఫుల్లుగా లాగించేశారు. ఆ తర్వాత నుంచి అక్కడే తరచుగా కలుసుకునేవారు డోనా- గంగూలీ. స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కుటుంబాల మధ్య గొడవ సౌరవ్ గంగూలీ- డోనా రాయ్ కుటుంబాల మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి. దీంతో ఇరు కుటుంబాలు ఉప్పు-నిప్పుగా ఉండేవి. అయితే, ఇవేమీ ఈ లవ్బర్డ్స్పై ప్రభావం చూపలేదు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాంతం కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అప్పటికి జీవితంలో సెటిల్ కాలేదు కాబట్టి తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గానే ఉంచారు. అప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన గంగూలీ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డోనాను వివాహమాడాలని ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుడి నివాసంలో రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అంతా సజావుగానే సాగింది. ఒకరి చేయి ఒకరు వీడలేదు అయితే, తమ పెళ్లి విషయాన్ని చాలా కాలం వరకు సీక్రెట్‌గానే ఉంచిన గంగూలీ- డోనా.. ఒకానొక రోజు నిజం బయటపడటంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ.. ఒకరి చేయి ఒకరు వీడలేదు. తమ నిజమైన ప్రేమతో పెద్దల మనసు గెలిచి కథను సుఖాంతం చేసుకున్నారు. ఇక 1997లో పెళ్లి చేసుకున్న డోనా- సౌరవ్ గంగూలీ జంటకు 2001లో కూతురు జన్మించింది. ఆమెకు సనాగా నామకరణం చేశారు. ఇక టీమిండియా స్టార్‌గా గంగూలీ, ఒడిస్సీ డ్యాన్సర్‌గా డోనా తమ కెరీర్లో విజయవంతమైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఒక్కటిగా కొనసాగుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తన 51వ జన్మదినమైన జులై 8న ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని దాదా తన ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో లీడింగ్ విత్ అంటూ డైరీలో రాస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ.. జూలై 8న నా పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను, వేచి ఉండండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. పుట్టిన రోజు గంగూలీ ఏం ప్రకటించబోతున్నాడో అని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదా.. శుభవార్త చెబుతాడా లేక ఏదైనా బాంబు పేలుస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గంగూలీ గురించి తెలిసినవారైతే.. దాదా తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నాడని అంటున్నారు. మరి గంగూలీ రేపు ఏ ప్రత్యేకమై ప్రకటన చేస్తాడో వేచి చూడాలి. కాగా, ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌గా విధుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదా ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో డీసీ చివరి స్థానంలో నిలిచింది. తన జమనాలో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించిన దాదా.. ఐపీఎల్లో తన జట్టుకు న్యాయం చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కాస్త విరామం తీసుకున్న టీమిండియా.. జులై 12 నుంచి విండీస్‌తో వరస సిరీస్‌లతో బిజీ కానుంది. విండీస్ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్ సిరీస్ (2 టెస్ట్‌లు), ఆతర్వాత వన్డే (3 వన్డేలు), టీ20 సిరీస్ (5 టీ20లు)లు ఆడుతుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. గంగూలీ హెచ్చరిక
టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ టెస్టుల్లో పెద్దగా మెరవనప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్లు తీయగల సమర్థుడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి స్వదేశంలో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఈ మధ్యన అతన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు స్వర్గధామం. అశ్విన్ లాంటి టాప్‌క్లాస్ స్పిన్నర్ టెస్టుల్లో మాత్రమే ప్రభావం చూపించగలడు. వన్డేలు ఆడినప్పటికి పెద్దగా మెరిసింది లేదు. మరో నాలుగు నెలల్లో భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. 2011 తర్వాత పుష్కర కాలానికి టీమిండియా మెగా సమరానికి ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి రోహిత్ సేన కచ్చితంగా కప్ కొట్టి ధోని సేన మ్యాజిక్‌ను పునరావృతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ బాధ్యతలు ఎవరు నడిపస్తారనేది ఆసక్తిగా మారింది. చహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు అక్షర్ పటేల్‌లు ఉన్నప్పటికి రెగ్యులర్ స్పిన్నర్లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వన్డే వరల్డ్‌కప్‌కు యజ్వేంద్ర చహల్‌ను ఆడించడం ఉత్తమమని.. అతను ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గంగూలీ మాట్లాడుతూ.. ''వన్డే వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిభష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే... పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు.. యజ్వేంద్ర చహాల్ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! -
సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా!
కేవలం ఆటకే పరిమితం కాదు.. బిజినెస్మేన్లుగానూ తాము రాణించగలం అని ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు నిరూపించుకున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండుల్కర్.. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ఇటీవలే సురేశ్ రైనా సైతం వ్యాపారవేత్తగా అవతారమెత్తాడు. మరోవైపు.. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ బ్యాటర్లకు వ్యాపారం పెద్దగా కలిసిరాలేదు. ఇంతకీ ఈ క్రికెట్ వీరులు చేస్తున్న వ్యాపారాలేంటో తెలుసా?! ఆ వివరాలు సంక్షిప్తంగా.. ఎంఎస్ ధోని: మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షి సింగ్ ధోనీతో కలసి ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ:. ఇటీవలే జిమ్ కమ్ ఫిట్నెస్ సెంటర్ల నిర్వహణ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. యువరాజ్ సింగ్: ఈ సిక్సర్ల వీరుడికి బ్యూటీ అండ్ వెల్నెస్ స్టార్టప్ ‘వ్యోమో’లో వాటాలున్నాయి. రాబిన్ ఊతప్ప: ‘ఐ టిఫిన్’ అనే ఫుట్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాడు. జహీర్‌ఖాన్, హర్భజన్ సింగ్‌లకు రెస్టారెంట్ వ్యాపారాలున్నాయి. సురేశ్ రైనాకు ఆమ్‌స్టర్‌డామ్‌లో ‘రైనా’ అనే రెస్టారెంట్ ఉంది. ఫెయిల్యూర్స్ కూడా.. మైదానంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వ్యాపారంలో మాత్రం గాడ్ ఆఫ్ బిజినెస్ కాలేకపోయాడు. ముంబైలో ‘టెండూల్కర్స్’ రెస్టారెంట్, ‘సచిన్స్’ కేఫ్‌లను ప్రారంభించి లాభాలు పండించలేక మూసివేశాడు. అదే విధంగా బెంగాలీ దాదా గంగూలీ తెరచిన ‘సౌరభ్స్’ రెస్టారెంట్, వీరేంద్ర సెహ్వాగ్ ‘వీరూ’ రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ కొన్ని ఫెయిల్యూర్స్‌ని పక్కన పెడితే.. చాలా మంది సెలబ్రిటీలు తమది కాని రంగాల్లోనూ అడుగుపెట్టి తమదైన సక్సెస్‌ను అందుకుంటున్న వారే. మిగిలిన వాళ్లకు ధైర్యాన్ని, ప్రేరణను ఇస్తున్నవారే! -దీపావళి చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
అప్పుడు పీయూశ్ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది. ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ ముగ్గురు ఉంటారు.. అయితే ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు. అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు వ్యవహరించిన తీరుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వకపోవడం దారుణమన్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని, అవకాశం ఇస్తేనే కదా ఎవరేంటో తెలిసేదంటూ ఫైర్ అయ్యాడు. తాజా సైకిల్లో తొలి సిరీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ సేన వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. జూలై 12న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించింది. వాళ్లిద్దరికీ మొండిచేయి రోహిత్ శర్మ కెప్టెన్‌గా, అతడి డిప్యూటీగా అజింక్య రహానే వ్యవహరించనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఇక మూడేళ్ల తర్వాత పేసర్ నవదీప్ సైనీ కూడా పునరాగమనం చేసే అవకాశం వచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్‌లో క్రమశిక్షణ లోపించిందని, అతడు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడంటూ బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. యశస్వి ఓకే.. కానీ వాళ్లేం పాపం చేశారు? ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు. అతడికి కనీసం ఒక్క అవకాశమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. అతడిని జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, నేను సర్ఫరాజ్ విషయంలో బాధపడుతున్నా. గత మూడేళ్లుగా అతడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కానీ ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కనీసం ఒక్క ఛాన్స్ అదే విధంగా అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కూడా ఇలాగే జరగుతోంది. ఐదారేళ్లుగా అతడు రాణిస్తున్నాడు.అయినా నో ఛాన్స్. వీళ్లిద్దరి విషయంలో సెలక్టర్ల తీరు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేడన్న కారణంతో సర్ఫరాజ్‌ను ఎలా పక్కనపెడతారు? అతడు పేసర్లను ఎదుర్కోలేడని మీకెవరు చెప్పారు? నాకు తెలిసినంత వరకు సర్ఫరాజ్‌కు పేసర్ల బౌలింగ్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క అవకాశం ఇవ్వండి. తనను తాను నిరూపించుకుంటాడు’’అని గంగూలీ సెలక్టర్ల తీరును తూర్పారబట్టాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! -
18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ
India Vs West Indies Test Series: ‘‘18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి.. తిరిగొచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్.. వైస్ కెప్టెన్‌గా నియమితుడు కావడం. ఇలాంటి ఎంపిక నేనెప్పుడూ చూడలేదు. జట్టులో చాలా కాలం నుంచి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజా ఉన్నాడు. నిజానికి అతడు కదా అసలైన క్యాండిడేట్. కానీ ఓ వ్యక్తి ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేసి ఒక్క మ్యాచ్ ఆడగానే వైస్ కెప్టెన్ అవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో సెలక్టర్ల తీరు నాకైతే అర్థం కాలేదు. ఏదో తూతూ మంత్రంగా జట్టును ఎంపిక చేసినట్లు ఉండకూడదు. సెలక్షన్ విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. రోహిత్ డిప్యూటీగా అతడే ఎందుకు? వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఎంపిక చేసిన టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా అజింక్య రహానేకు స్థానం ఇవ్వడంపై ఘాటు విమర్శలు చేశాడు. అదే విధంగా.. సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా విషయంలో సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా దాదాపు ఏడాదిన్నరగా జట్టుకు దూరమైన రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా జట్టులోకి తిరిగి వచ్చి.. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పుజారా విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? మరోవైపు.. పుజారా జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘పుజారాను జట్టులో కొనసాగిస్తారా లేదంటే.. అతడి వారసుడిగా యువ క్రికెటర్లలో ఎవరినైనా తయారు చేస్తారా అన్న విషయంపై ముందుగా స్పష్టతకు రావాలి. పుజారా లాంటి మేటి ఆటగాడిని జట్టు నుంచి తప్పించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతేగానీ ఓ సిరీస్‌కు ఎంపిక చేసి.. ఆ వెంటనే తదుపరి సిరీస్‌కు తప్పించడం సరికాదు. అజింక్య రహానే విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని గంగూలీ.. సెలక్టర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. వెస్టిండీస్ రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి తెలుగు కుర్రాడు! -
నాన్న సంతోషించి ఉంటారు.. మెదడులో రక్తస్రావంతో! గంగూలీ సర్, రణదేవ్ సర్ వల్లే..
‘‘నా కల నెరవేరింది. టీమిండియా తరఫున టెస్టులు ఆడాలన్న ఆశయం దిశగా అడుగులు పడ్డాయి. నా ఈ ఎదుగుదల చూసి నాన్న తప్పకుండా సంతోషించి ఉంటారు. నేను ఈ స్థాయికి చేరుకున్నాననంటే అందుకు అమ్మానాన్న, నా స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. వాళ్ల మద్దతునే నేను అనుకున్నది సాధించగలిగాను’’ అని బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. పోషకాహార లోపంతో కాగా బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ పేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రితో పాటు 2012లో బెంగాల్‌కు చేరుకున్న ముకేశ్.. క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. కానీ పోషకాహార లోపం బోన్ ఎడిమ, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడటం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో బెంగాల్ మాజీ స్పీడ్‌స్టర్ రణదేవ బోస్ పరిచయం ముకేశ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అతడి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడటం మొదలుపెట్టాడు. ఏకంగా 5.5 కోట్ల రూపాయలు ఫస్ట్‌క్లాస్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. దీంతో.. అంతకు ముందు 20 లక్షల కనీస ధరతో సీఎస్కే తరఫున ఆడిన అతడి పంట పండినట్లయింది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ముకేశ్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా ఎంపికైన అతడు.. వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్ నేపథ్యంలో తాజాగా మరోసారి సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన ముకేశ్ హర్షం వ్యక్తం చేశాడు. స్వర్గస్తుడైన తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. అదే విధంగా తన గురువు రణదేవ్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంగూలీ సర్, రణదేవ్ సర్ వల్లే ‘‘సౌరవ్ గంగూలీ సర్, జాయ్దీప్ ముఖర్జీ సర్.. నా గురువు రణదేవ్ బోస్ సర్.. అందించిన సహాయసహకారాలు మరువలేనివి. వాళ్ల మద్దతే లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చే వాడినే కాదు. ముఖ్యంగా రణదేవ్ బోస్ సర్ రెడ్ బాల్ క్రికెట్లో నాకు మార్గదర్శనం చేసి నన్ను సరైన దారిలో నడిపించారు’’ అని ముకేశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ‘‘ఎక్కడ మొదలుపెట్టాను.. ఎక్కడిదాకా వచ్చాను. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది’’ అని ఎగ్జైట్ అయ్యాడు. కాగా ముకేశ్ కుమార్ తండ్రి 2019లో మరణించాడు. మెదడులో రక్తస్రావం కావడంతో శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయాడు. విండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! -
కోహ్లీ నిర్ణయంతో షాక్ అయ్యాం
-
కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ టెస్టులకు కెప్టెన్‌గా పనికిరాడని, వెంటనే అతడిని ఆ భాధ్యతల నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది కెప్టెన్‌గా రోహిత్ కంటే విరాట్ కోహ్లి ఎంతో బెటర్ అని, అతడి సారధ్యంలో భారత జట్టు అద్బుతంగా రాణించందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లిని టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని ఎప్పుడూ తాము కోరుకోలేదని, అది అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ తెలిపాడు. కాగా గతేడాది ఆరంభంలో ధక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. ఆ సిరీస్ అనంతరం టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. అయితే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక కోహ్లి తప్పుకున్న అనంతరం రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మేము అస్సలు ఊహించలేదు. అప్పటికే మేము దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోయి బాధలో ఉన్నాము. అంతలోనే కోహ్లి ఇటువంటి నిర్ణయం తీసుకుని మమ్మల్ని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో కోహ్లికే తెలియాలి. అది అతడి వ్యక్తిగత నిర్ణయం. కోహ్లి తప్పుకున్న తర్వాత భారత జట్టుకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అందుకే సెలక్షన్ కమిటీ రోహిత్ పగ్గాలు అప్పజెప్పింది అని ఆజ్ తక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ఈవెంట్లో రాణించలేకపోతుంది అని పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా దాదా మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలవడం కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా కష్టం. 14 మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్‌లో నాలుగైదు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్లో 17 మ్యాచ్ ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? -
ఇటువంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, రోహిత్, పుజరా వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. రహానే తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. 129 బంతుల్లో 89 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక రీ ఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానేపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. రహానే మాత్రం పోరాట పటిమ కనబరిచాడని దాదా కొనియాడాడు. "రహానే 18 నెలల పాటు అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే రహానే ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంది అతడి కెరీర్ ముగిపోయిందని భావించారు. నిజానికి రహానే కూడా అదే అనుకుని ఉంటాడు. భారత్ క్రికెట్లో ఒక బ్యాటర్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు. రహానే రీ ఎంట్రీ మాత్రం అద్భుతం. గతంలో చాలా మంది ఆటగాళ్లు కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రహానే వంటి రీ ఎంట్రీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతడు మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు అని స్టార్‌స్పోర్ట్స్ షోలో గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WTC Final: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
IPL 2024: పాంటింగ్‌కు గుడ్‌బై.. ఢిల్లీ హెడ్ కోచ్‌గా గంగూలీ!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు స్ధానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2018 నుంచి ఢిల్లీ ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్.. జట్టుకు ట్రోఫీని అందించడంలో విఫలమయ్యాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో అయితే ఢిల్లీ మరి చెత్త ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే పాంటింగ్‌ను సాగనంపాలని ఢిల్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గంగూలీ విషయానికి వస్తే.. దాదా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్నాడు. గంగూలీ 2019 ఐపీఎల్ ఎడిషన్‌లో మెంటార్‌గా ఢిల్లీ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2019, 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆప్స్ చేరడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే ఈ వార్తలపై ఢిల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చదవండి: WTC Final: కొంచెం ఆలోచించండి.. కోచ్‌గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ -
సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా!
IPL 2023- Tilak Varma: ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు తెలుగు తేజం తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు తొలి సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌లు ఆడి 397 పరుగులతో ముంబై తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఈ హైదరాబాదీ బ్యాటర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఫిట్నెస్ సమస్యల కారణంగా అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్-2023 ఆరంభంలో ఆకట్టుకున్న తిలక్ వర్మ.. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా తిలక్ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపింది. కీలక మ్యాచ్‌లో దుమ్ములేపాడు అయితే, కీలక మ్యాచ్ క్వాలిఫయర్-2 నేపథ్యంలో జట్టులోకి తిరిగి వచ్చిన తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక మ్యాచ్‌లో 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తడబడిన వేళ తిలక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు సాధించాడు. కానీ అప్పటికే కానీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వెనుదిరగడంతో ముంబై కథ ముగిసిపోయింది. 171 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 343 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాల్సి ఉందంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. సూర్యను చూసి నేర్చుకోవాలి తన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టాలి. అదే విధంగా మైండ్‌సెట్‌లోనూ మార్పు రావాలి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తను కాస్త విరామం దొరికినా వైవిధ్యమైన షాట్లు ప్రాక్టీసు చేస్తూ నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ ఉంటాడు. నాకు దాదా ఇచ్చిన సలహా తిలక్ వర్మ తన బలహీనతలపై కూడా దృష్టి సారించి వాటిని అధిగమించేలా నిరంతరం శ్రమించాలి. నేను 1999లో తొలిసారి టీమిండియాకు ఆడినపుడు షోయబ్ అక్తర్ నన్ను అవుట్ చేశాడు. నేను నా బ్యాట్‌తో బంతిని టచ్ చేసే లోపే.. బాల్ నా ప్యాడ్లను తాకింది. అప్పుడు దాదా (సౌరవ్ గంగూలీ) నాకో సలహా ఇచ్చాడు. తిలక్ కూడా నాలాగే ఫాస్ట్‌బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చెయ్. అప్పుడే నువ్వు మైదానంలో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలవు. అప్పట్లో నేను మిడిలార్డర్లో ఆడేవాడిని. ఎక్కువగా స్పిన్ బౌలర్లను ఎదుర్కొనే వాడిని. తర్వాత ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ఎలా ఆడాలో పూర్తిగా అవగాహన వచ్చింది. నాలాగే తిలక వర్మ కూడా తన బలహీనతలు ఏమిటో తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. తిలక్ వర్మకు మంచి భవిష్యత్తు ఉందని.. అయితే, చిన్న చిన్న లోపాలు సరిచేసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉందని వీరూ భాయ్.. తిలక్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. చదవండి: WTC Final: రుతురాజ్ అవుట్.. యశస్వి జైశ్వాల్‌కు బంపరాఫర్! ద్రవిడ్ విజ్తప్తి మేరకు.. వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. జై షా కీలక ప్రకటన var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడు రీ ఎంట్రీ ఇస్తే సంతోషిస్తా! టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ: దాదా
WTC Final 2021-23- Ganguly Prediction: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా పునరాగమనం చేస్తే బాగుంటుందని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సేవలు ఉపయోగించుకోవాలని పరోక్షంగా సూచించాడు. ఆ దిశగా టీమిండియా సెలక్టర్లు యోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్- 2021-23 జరుగనున్న విషయం తెలిసిందే. జూన్ 7న మ్యాచ్ మొదలుకానున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇక స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. పంత్, రాహుల్ దూరం ఈ క్రమంలో.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్.. రిషభ్ పంత్ స్థానంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే, మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో.. ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఇషాన్ కిషన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. తద్వారా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా టెస్టుల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఇషాన్‌ను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. వృద్ధిమాన్ సాహా అతడు వస్తే సంతోషిస్తా ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సాహాకు అవకాశమిస్తే మాత్రం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. టీమిండియా స్వదేశంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలిచినపుడు కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అంతకంటే ముందు వృద్ధిమాన్ టెస్టుల్లో ఆడాడు. అంతకు మునుపు రిషభ్ పంత్ ఉండేవాడు. అందుకే అప్పుడు సాహా అవకాశాలు కోల్పోయాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో సాహాకు పిలుపు వస్తే బాగుంటుంది. అతడు పునరాగమనం చేస్తే నేను సంతోషిస్తాను. సెలక్టర్లు ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని దాదా సూచించాడు. టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నానన్న గంగూలీ.. ఆసీస్‌తో పోటీ అంటే కాస్త కష్టమేనన్నాడు. ‘‘మ్యాచ్ అద్భుతంగా సాగుతుందని అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో తెలియదు. నేనైతే భారత్ గెలవాలని కోరుకుంటున్నా. కానీ అవకాశాలు మాత్రం 50-50గా ఉన్నాయి’’ అని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా తొట్టతొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఉన్న సాహా.. 15 ఇన్నింగ్స్‌లలో కలిపి 299 పరుగులు చేశాడు. ఇక 38 ఏళ్ల సాహా ఆఖరి సారిగా న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున 2021లో టెస్టు ఆడాడు. మొత్తంగా 40 టెస్టులాడి 1353 పరుగులు సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: గంభీర్ ఓ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇక మైదానంలో.. IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్ నెగ్గే విషయంలో కాదు..! -
Virat Kohli: మీకు ఇంగ్లిష్ అర్థం కాకపోతే.. వెళ్లి!.. దాదా ట్వీట్ వైరల్
Virat Kohli- Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎదుటి వాళ్లకు ఇంగ్లిష్ అర్థంకాకపోతే అది తన సమస్య కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ అలా అవుట్ అయింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోహ్లి అజేయ సెంచరీ కారణంగా 197 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో గిల్ విజృంభించడంతో ఆర్సీబీకి కష్టాలు తప్పలేదు. అద్భుత సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు గిల్. దీంతో ఆర్సీబీ నిరాశగా ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు కావడంతో అభిమానులకు కావాల్సినంత వినోదం దొరికింది. కోహ్లి, శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ క్రమంలో గంగూలీ చేసిన ట్వీట్ కోహ్లి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. గిల్‌ను మెచ్చుకుంటూ దాదా ట్వీట్ ఆర్సీబీ- గుజరాత్ మ్యాచ్ అనంతరం దాదా స్పందిస్తూ.. ‘‘దేశం ఆణిముత్యం లాంటి ఆటగాడిని అందించింది.. ప్రతిభ గల ఆ క్రికెటర్.. శుబ్‌మన్ గిల్.. రెండు అద్భుత ఇన్నింగ్స్.. ఐపీఎల్.. క్యాష్ రిచ్ లీగ్ ప్రమాణాలు ఏ స్థాయికి చేరుకున్నాయో!?’’ అని ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఫ్యాన్స్ ఆగ్రహం కాగా ఐపీఎల్-2023లో గిల్ రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా కోహ్లి కూడా వరుస శతకాలు సాధించాడు. కానీ తన ట్వీట్లో గంగూలీ.. కోహ్లి పేరు ప్రస్తావించకపోవడంతో అభిమానులు దాదాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో గంగూలీ సైతం ఘాటుగా స్పందించాడు. మీకు ఇంగ్లిష్ రాకపోతే.. వెళ్లి ‘‘మీకోసం ఓ రిమైండర్.. నా ట్వీట్‌పై రాద్ధాంతం చేస్తున్నవాళ్లు ముందు ఇంగ్లిష్ అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దానికి నేను బాధ్యుడిని కాదు.. ఎవరో ఒకరిని వివరించమని అడగండి’’ అంటూ దాదా మరో ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో కోహ్లి టీమిండియా సారథిగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఇప్పటికీ కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. చదవండి: ఛీ.. అపార్థం చేసుకున్నావు! ధోనిని అవమానించావు.. నీకేం తక్కువ చేశాం? లక్నోతో కీలక పోరు.. ముంబై జట్టులోకి యువ స్పిన్నర్! విధ్వంసకర ఓపెనర్ కూడా What talent this country produces .. shubman gill .. wow .. two stunning knocks in two halves .. IPL.. .. what standards in the tournament @bcci — Sourav Ganguly (@SGanguly99) May 21, 2023 Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చెప్పాల్సిందే! అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే! బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు. క్లియర్‌గా కనిపించినా ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్‌గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది. నాటి మ్యాచ్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో సామ్ కరన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు. అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి రూల్‌ను రద్దు చేయాల్సిందే! దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. చదవండి: కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
కలిసిపోయిన దాదా, కోహ్లీ.. ఢిల్లీ టీమ్‌కి విరాట్..?
-
నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..!
ఆర్సీబీ కీ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చాలాకాలంగా తమ మధ్య నెలకొన్న విభేదాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. నిన్న (మే 6) ఆర్సీబీ-డీసీ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం వీరిరువురు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, ఒకరి భజం మరొకరు తట్టుకుంటూ కనిపించారు. ఈ సీన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 🚨 Massive Respect 🚨 Hand Shake And Almost Hug Moment Between Sourav Ganguly & Virat Kohli Two Of The Best To Lead Indian Cricket ❤️#IPL23 #rcbvsdc #DCvsRCB pic.twitter.com/bIoLrNNvVD — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) May 6, 2023 కోహ్లి, దాదా కలిసిపోయారని భారత క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. డీసీ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి.. గంగూలీతో వివాదం సమసిపోయింది కదా కోహ్లి.. ఆర్సీబీని వదిలేసి తమ జట్టుకు వచ్చేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్ గంగూలీతో హుందాగా వ్యవహరించడం పట్ల హర్షిస్తున్నారు. The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI — itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023 కాగా, గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్సీ విషయంలో కోహ్లితో మొదలైన వివాదం నిన్న మొన్నటి వరకు సాగింది. ఈ మధ్యలో అనేక సందర్భాల్లో వీరు బహిరంగానే ఒకరితో ఒకరు విభేదించారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే డీసీతో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు. Virat Kohli stares towards Sourav Ganguly and Ricky Ponting after takes the catch. 🔥 pic.twitter.com/EmuAzzzzMb — S. (@Sobuujj) April 15, 2023 తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు. దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. గంగూలీ చర్యకు బదులుగా కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు. No handshake between Virat Kohli and Sourav Ganguly❓😳 📸: Jio Cinema#RCBvDC #IPL23 #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/7iRoSq4kw7 — CrickDesi (@Crick_Desi) April 15, 2023 అయితే దాదా.. తాను కూడా తగ్గేదేలేదంటూ ఇన్‌స్టాలో కోహ్లిని అన్ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందని అభిమానులు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లి-గంగూలీ ఆప్యాయంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్ లోమ్రార్ (54 నాటౌట్), డుప్లెసిస్ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్ సాల్ట్ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్ (22), మిచెల్ మార్ష్ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్), అక్షర్ పటేల్ (8 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చారు. చదవండి: కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్ ఉల్ హక్.. గంభీర్ మద్దతు -
గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ
తానాడిన ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు కొల్లగొడుతూ, అనునిత్యం వార్తల్లో నిలిచే విరాట్ కోహ్లి.. గత కొద్ది రోజులుగా క్రికెటేతర కారణాల చేత హైలైట్ అవుతున్నాడు. ఐపీఎల్-2023లో ఓ పక్క పరుగుల వరద పారిస్తూనే.. వివాదాల కారణంగా వార్తల్లో హెడ్‌లైన్‌గా నిలుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ వివాదం మొదలుకొని లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదం వరకు కోహ్లి ప్రతి చర్య వివాదాస్పదంగా మారింది. ఈ రెండు విషయాల్లో కోహ్లి దూకుడును చాలామంది తప్పుబడుతున్నారు. గంభీర్‌తో వాగ్వాదం విషయంలో బీసీసీఐ కూడా బయటి వారితో ఏకీభవించి కోహ్లికి అక్షింతలు (100 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత) వేసింది. వరుస వివాదాల నేపథ్యంలో కోహ్లి.. బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు సమాచారం. లేఖలో కోహ్లి తాను నిర్ధోషినని, తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుచేయలేదని రాసాడని తెలుస్తోంది. అలాగే తనకు వంద శాతం జరిమానా (ఓ మ్యాచ్‌కు) విధించడంపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవే కాక మరిన్ని విషయాలను కోహ్లి తన లేఖలో ప్రస్తావించినట్లు ప్రముఖ దైనిక్ జాగ్రన్ పేర్కొంది. కోహ్లి రాసినట్లు చెబుతున్న ఈ లేఖపై బీసీసీఐ ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్ లోమ్రార్ (54 నాటౌట్), డుప్లెసిస్ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్ సాల్ట్ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్ (22), మిచెల్ మార్ష్ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్), అక్షర్ పటేల్ (8 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చారు. చదవండి: IPL 2023: ఢిల్లీ ధనాధన్ -
DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
IPL 2023 DC Vs RCB: ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. అరున్ జైట్లీ స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తాజా ఎడిషన్‌లో తొలి ముఖాముఖి పోరులో ఆర్సీబీ.. ఢిల్లీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. అప్పుడు హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అర్ధ శతకం(50)తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ను ఓడించి మరోవైపు.. ఆర్సీబీ సైతం లక్నో సూపర్ జెయింట్స్‌పై ప్రతీకార మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇలా లో స్కోరింగ్ మ్యాచ్‌లలో అటు ఆర్సీబీ.. ఇటు ఢిల్లీ విజయం సాధించాయి. ఇదే జోష్‌లో ముఖాముఖి పోరుకు సై అంటున్నాయి. దాదాతో జగడం ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి- ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన ఘటన క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. దాదా బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం.. ఈ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న సమయంలో కోహ్లి.. గంగూలీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో ఎలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రసవత్తర పోరు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో గోల్డెన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో మనం విరాట్ కోహ్లి వర్సెస్ వార్నర్ వార్ చూడొచ్చు. అదే విధంగా అన్రిచ్ నోర్జేను ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. విరాట్ సెంచరీ కొట్టు ఇక అన్నింటికంటే ఆసక్తికరమైంది ఏమిటంటే.. విరాట్ ఈ మ్యాచ్‌లో సెంచరీ కొడితే చూడాలని ఉంది. శతకం సాధించడమే దాదాకు అతడు ఇచ్చే నిజమైన కానుక. విరాట్.. నువ్వు నీ లాగే ఉండు.. ఆర్సీబీ కోసం ఈ మ్యాచ్‌ను గెలిపించు’’ అంటూ శ్రీశాంత్ కింగ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 364 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82(నాటౌట్). చదవండి: బ్లడీ.. అసలు..! మాట జారిన కోహ్లి.. అదే గొడవకు కారణం! బీసీసీఐకి మెసేజ్ కూడా! ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..? '@ImVKohli getting a 100 will be a great tribute to Dada', @sreesanth_36 anticipates a great #RivalryWeek clash between @DelhiCapitals & @RCBTweets! Tune-in to #DCvRCB at #IPLonStar Today | Pre-show at 7 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/CxzBgDh6vr — Star Sports (@StarSportsIndia) May 6, 2023 -
ఎట్టకేలకు దాదా ముఖంలో ఆ నవ్వు! 25 ఏళ్ల క్రితం అప్పుడలా.. మళ్లీ ఇప్పుడు..
IPL 2023 DC Vs KKR: ‘‘ఎట్టకేలకు అనుకున్న ఫలితం రాబట్టినందుకు సంతోషంగా ఉన్నాం. డగౌట్లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నపుడు.. 25 ఏళ్ల క్రితం ఆడిన టెస్టు మ్యాచ్‌లో మొదటిసారి పరుగు పూర్తి చేసినపుడు కలిగిన అనుభూతిని పొందాను. ఈనాటి మ్యాచ్ ఎలా సాగిందో మీరంతా చూశారు... ఈరోజు అదృష్టం మావైపు ఉందనే చెప్పాలి’’ అని టీమిండియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఉద్వేగంగా మాట్లాడాడు. ఎట్టకేలకు ఢిల్లీ బోణీ ఐపీఎల్-2023లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ ఎట్టకేలకు గురువారం తొలి విజయం నమోదు చేసింది. సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ.. బౌలర్ల అద్భుత ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశాడు. కేకేఆర్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం కలిసి వచ్చిందని.. అయితే.. తమ బ్యాటింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ సీజన్లో ఆరంభం నుంచే మా బౌలింగ్ బాగుంది. బెంగళూరు మ్యాచ్‌లో ఆర్సీబీని 170 పరుగులకే కట్టడి చేశాం. ముంబైతో మ్యాచ్‌లోనూ మా ప్రదర్శన బాగుంది. మా బౌలర్లు అద్భుతం.. కానీ బ్యాటర్లే ఆది నుంచే మా బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా బ్యాటింగ్‌లోనే లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు రాబట్టగలం’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అన్రిచ్ నోర్జే అత్యద్భుతంగా ఆడాడని, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ కూడా తమ వంతు పాత్ర పోషించారని దాదా కొనియాడాడు. వార్నర్ ఒక్కడే కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ 2, ముకేశ్ కమార్ ఒకటి, నోర్జే 2, అక్షర్ పటేల్ 2, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్థ శతకంతో శుభారంభం అందించాడు. 57 పరుగులతో వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లలో మనీశ్ పాండే(21) కాస్త పర్వాలేదనిపించగా.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 128 పరుగులు సాధించిన ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొంది తొలి విజయం అందుకుంది. చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. #Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు Off the mark in #TATAIPL 2023 ✅@DelhiCapitals with a much-needed victory as they complete a 4-wicket win over #KKR at home 👏👏 Scorecard ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/Ol7Mu3s9IT — IndianPremierLeague (@IPL) April 20, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గంగూలీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విరాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది?
-
Kohli Vs Ganguly: తగ్గేదేలే.. దాదా కూడా అచ్చం అలాగే!
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడినప్పటికీ కనీసం పలకరించుకోకుండా తప్పించుకున్నారు. అంతటితో ఆగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వీరిద్దరూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే ఢిల్లీతో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే తాజాగా ఇప్పుడు దాదా వంతు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీ కూడా కోహ్లిని ఆన్ ఫాలో చేశాడు. నెటిజన్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎందుకీ ఈ విభేదాలు? గంగూలీ - కోహ్లీల మధ్య కోల్డ్ వార్ 2021 నుంచే కొనసాగుతుంది. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ టీ20 కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై చెప్పినప్పటికీ.. వన్డేల్లో, టెస్టుల్లో మాత్రం కొనసాగాలని భావించాడు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లిని తప్పించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను భారత కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తప్పించారని కోహ్లి ఆరోపణలు చేశాడు. అందుకు బదులుగా.. ఇది భారత క్రికెట్ బోర్డు, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయమని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ సమాధానమిచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. -
Kohli-Ganguly: షేక్ హ్యాండ్ ఇవ్వని ప్రభావం.. గంగూలీకి భారీ ఝలక్ ఇచ్చిన కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ కీ ప్లేయర్ విరాట్ కోహ్లి, బీసీసీఐ మాజీ బాస్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో మొదలైన వీరిద్దరి మధ్య అగాధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరి, ఒకరినొకరు అవమానించుకునే స్థితికి చేరింది. తాజాగా జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ (ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ) సందర్భంగా వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు. తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు. The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI — itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023 Virat Kohli stares towards Sourav Ganguly and Ricky Ponting after takes the catch. 🔥 pic.twitter.com/EmuAzzzzMb — S. (@Sobuujj) April 15, 2023 దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. ఈ మొత్తం తంతుకి సంబంధించిన వీడియోలు కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కోహ్లి.. గంగూలీ తన పట్ల ప్రవర్తించిన తీరుకు కౌంటర్‌గా ఓ భారీ ఝలక్ ఇచ్చాడు. కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు. మరోవైపు గంగూలీ మాత్రం సోషల్‌మీడియాలో కోహ్లిని ఇప్పటికీ ఫాలో అవుతూ ఉండటం విశేషం. కోహ్లి చర్యకు ప్రతిచర్యగా గంగూలీ ఏం చేస్తాడోనని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Saurav Ganguly ignored Virat Kohli and Walk off where you can see Kohli turned back to see Dada Once again Dada showed Virat Kohli his place 👏 pic.twitter.com/AphU0U3IMO — R e t i r e d (@Sense_detected_) April 15, 2023 ఇదిలా ఉంటే, ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఐదో పరాజయం కాగా.. ఆర్సీబీ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 అపజయాలను ఎదుర్కొంది. లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఇవాళ (ఏప్రిల్ 17) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుండగా.. ఏప్రిల్ 20న ఢిల్లీ, కేకేఆర్‌ను ఢీకొడుతుంది.