Harmanpreet Kaur
-
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్‌కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటుఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ప్రకటించంఅయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్‌కు వెల్లడించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు. ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)గ్రేడ్-ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మగ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మగ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా! -
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్- 2025 ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. శనివారం బ్రౌబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.కాప్ ఒంటరి పోరాటం..అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. ఓ దశలో ఢిల్లీని కాప్ ఒంటి చేత్తో గెలిపించేలా కన్పించింది.కానీ ఆఖరిలో కాప్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారు అయింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. ఇక ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఎంత ప్రైజ్‌మనీ దక్కింది ఆరెంజ్? ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం.ముంబైకి ప్రైజ్ మనీ ఎంతంటే?ఈ టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 3 కోట్లు నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా 523 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. అందుకు గాను 5 లక్షలు నగదు బహుమతి ఆమెకు దక్కింది. పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన అమీలియా కేర్‌కు కూడా రూ.5 లక్షలు నగదు లభించింది.ప్రైజ్ మనీ వివరాలు..విజేత- ముంబై ఇండియన్స్- రూ. 6 కోట్లురన్నరప్-ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లుఆరెంజ్ క్యాప్ విజేత- స్కివర్ బ్రంట్-రూ. 5 లక్షలుపర్పుల్ క్యాప్ విజేత- కేర్- రూ. 5లక్షలుమోస్ట్ వాల్యబుల్ ప్లేయర్- స్కివర్ బ్రంట్(523 పరుగులు, 12 వికెట్లు)-రూ. 5 లక్షలుఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-అమన్‌జోత్ కౌర్-రూ. 5 లక్షలుసీజన్లో అత్యధిక సిక్సర్లు- ఆష్లీ గార్డనర్ (18 సిక్సర్లు)- రూ.5 లక్షలుచదవండి: హ్యాట్సాఫ్ హర్మన్ -
మహిళల ప్రీమియర్ లీగ్‌లో విజేతగా ముంబై ఇండియన్స్..టైటిల్ సొంతం (ఫొటోలు)
-
జై ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్‌రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్‌లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది. ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్‌లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1. -
హ్యాట్సాఫ్ హర్మన్
డబ్ల్యూపీఎల్‌లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్‌ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్‌కు ముందు జట్టు కోచ్ దేవిక పల్షికర్తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్‌గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్‌లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది. 10 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్‌లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి. అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్‌ను అందించడం విశేషం. -
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్ స్కోరర్‌గా నిలిచారు.ఆమెతో పాటు నాట్ స్కివర్(30) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జానెసన్, చరణి, కాప్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణిచదవండి: IPL 2025: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్ -
WPL 2025: దంచికొట్టిన హర్మన్.. ధనాధన్ హాఫ్ సెంచరీ
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్(5) విఫలం కాగా.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్ బ్యాటర్ నాట్ సీవర్-బ్రంట్ 38 పరుగులతో రాణించగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్ కౌర్(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారుగుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కుఅయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అయితే, లీగ్ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్ రూపంలో ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా మిగిలే ఉంది.ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్ భవితవ్యం తేలిపోనుంది.డబ్ల్యూపీఎల్-2025: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్తుదిజట్లుముంబై ఇండియన్స్:హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్- బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కర్, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్, పరుణిక సిసోడియాగుజరాత్ జెయింట్స్బెత్ మూనీ(వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, ఆష్లే గార్డ్నర్(కెప్టెన్), డియాండ్రా డాటిన్, కశ్వీ గౌతం, సిమ్రన్ షేక్, ఫోబే లిచ్‌ఫీల్డ్, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
అంపైర్‌తో వాగ్వాదం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు భారీ షాక్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై జరిమానా పడింది. గురువారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో వాదనకు దిగినందుకు హర్మన్‌ప్రీత్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ముగిసిన సమయంలో అంపైర్ అజితేశ్ అర్గాల్... సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంచాలని హర్మన్‌ప్రీత్‌కు సూచించాడు.స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు గానూ చివరి ఓవర్లో బౌండరీ సమీపంలో నలుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం లేదని హర్మన్‌కు వివరించాడు. దీంతో అంపైర్‌తో ముంబై సారథి వాగ్వాదానికి దిగింది. ఆల్‌రౌండర్ అమెలియా కెర్ కూడా హర్మన్‌కు వంతపాడింది. దీంతో ఈ ఘటనపై రిఫరీ క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నాడు.‘హర్మన్‌ప్రీత్ లెవల్–1 తప్పిదానికి పాల్పడింది. నియమావళిలోని 2.8 ఆర్టికల్ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడతో మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని డబ్ల్యూపీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ప్లేయర్ సోఫీ ఎకిల్స్టోన్తోనూ హర్మన్‌ప్రీత్ వాదనకు దిగింది. కాగా... ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరువైంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
ముంబై ఇండియన్స్ వుమెన్(Mumbai Indians Women)తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) బ్యాటర్లు విఫలమయ్యారు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2025(WPL) ఎడిషన్‌లో భాగంగా ముంబై- గుజరాత్ మధ్య మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తోంది.కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్.. ముంబై జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ(1), లారా వొల్వర్ట్(4) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దయాళన్ హేమలత(9), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్(10) కూడా నిరాశపరిచారు.ఆదుకున్న హర్లీన్ డియోల్ ఈ క్రమంలో హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసిన హర్లీన్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మిగతావాళ్లలో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన డియాండ్రా డాటిన్ ఏడు పరుగులకే నిష్క్రమించగా.. కశ్వీ గౌతమ్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది. హేలీ మాథ్యూస్‌కు మూడు వికెట్లుఇక లోయర్ ఆర్డర్లో సిమ్రన్ షేక్ 3, తనూజా కన్వర్ 13, సయాలీ సత్ఘరే 13(నాటౌట్), ప్రియా మిశ్రా(2) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో 120 పరుగులు చేసిన గుజరాత్ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రైటార్మ్ మీడియం పేసర్ నట్ సీవర్- బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నం ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి గెలుపు కోసంకాగా ఫిబ్రవరి 14న డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వుమెన్ జట్టు ఎదుర్కొన్న గుజరాత్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అనంతరం యూపీ వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గెలుపుబాట పట్టిన గుజరాత్ జెయింట్స్.. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి నామమాత్రపు స్కోరు చేసింది. ఇక సీజన్లో తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై.. విజయమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్ బరిలో దిగింది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. అరంగేట్ర చాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన(ముంబై) నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతేడాది స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ గెలిచింది.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ జెయింట్స్ వుమెన్ వర్సెస్ ముంబై వుమెన్ తుదిజట్లుగుజరాత్ జట్టులారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.ముంబై జట్టుయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
అండర్-19 టీమిండియా స్టార్ క్రికెటర్ జి.కమలిని(G Kamalini) సరికొత్త రికార్డు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్(WPL) చరిత్రలో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ వుమెన్ తరఫున ఈ తమిళనాడు క్రికెటర్ మంగళవారం(ఫిబ్రవరి 18) డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టింది. ఓటమితో మొదలుపెట్టిన ముంబైకాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 14) డబ్ల్యూపీఎల్-2025 ఎడిషన్ మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్లో తొలుత గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజేతగా నిలవగా.. శనివారం నాటి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ కాప్యిటల్స్ చేతిలో ఓడిపోయింది.అనంతరం ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఆ తర్వాత సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఎదుర్కొన్న బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్- ముంబై తలపడుతున్నాయి.ఇద్దరు ప్లేయర్ల అరంగేట్రంవడోదరలోని కొటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వుమెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. సైకా ఇసాక్ స్థానంలో పరుణిక సిసోడియా(Parunika Sisodia) జట్టులోకి వచ్చినట్లు తెలిపిన హర్మన్.. కమలినికి కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు పేర్కొంది.ఈ క్రమంలో కమలిని అత్యంత చిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. పదహారేళ్ల 213 రోజులు వయసులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మహిళల టీ20 లీగ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల మలేషియా వేదికగా ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో కమలిని సభ్యురాలు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన కమిలిని ఈ మెగా టోర్నమెంట్లో రెండు అర్ధశతకాలతో మెరిసింది. మరోవైపు.. పరుణిక సిసోడియా కూడా వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్. టోర్నీ మొత్తంలో కలిపి పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఒకేసారి అరంగేట్రం చేయడం విశేషం.డబ్ల్యూపీఎల్‌లో చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు👉జి.కమలిని(ముంబై ఇండియన్స్)- 16 ఏళ్ల 213 రోజుల వయసులో- గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం- 2025👉షబ్నం షకీల్(గుజరాత్ జెయింట్స్)- 16 ఏళ్ల 263 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2024👉పార్శవి చోప్రా(యూపీ వారియర్స్)- 16 ఏళ్ల 312 రోజుల వయసులో ముంబై ఇండియన్స్ మీద- 2023👉వీజే జోషిత(ఆర్సీబీ)- 18 ఏళ్ల 205 రోజుల వయసులో గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం-2025👉అలిస్ కాప్సే(ఢిల్లీ క్యాపిటల్స్)- 18 ఏళ్ల 206 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2023.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ముంబై తుదిజట్లుముంబైయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.గుజరాత్లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్‌కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ టీ20 లీగ్‌ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్‌బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్‌ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
చెలరేగిన నాట్ స్కివర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ఆల్‌రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ అదరగొట్టింది.ఇన్నింగ్స్ ఆరంభంలోనే హీలీ మాథ్యూస్ వికెట్‌ను ముంబై కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకుంది. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపించింది.స్కివర్-బ్రంట్ 59 బంతుల్లో 13 ఫోర్లతో 80 పరుగులు చేయగా.. హర్మాన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేసింది. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో సదర్లాండ్ మూడు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే రెండు, క్యాప్సీ, మిన్నీ మణి తలా వికెట్ సాధించారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ NAT SCIVER-BRUNT SHOW IN WPL80* off just 59 balls without much support from the other end, crazy innings under immense pressure from one of the best players of this generation! pic.twitter.com/byJWFKVXcm— Daddyscore (@daddyscore) February 15, 2025 -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్‌కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్‌ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్‌ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్‌పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్‌ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్‌పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్‌పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు మరో స్వదేశీ పోరుకు సిద్దమైంది.ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడేందుకు భారత్ సిద్దమైంది. జనవరి 10న రాజ్‌కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఐరీష్‌తో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఎంపికైంది. అదే విధంగా మరో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ వన్డే సిరీస్‌కు దూరమైంది.కాగా మరోసారి స్టార్ ప్లేయర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతున్నప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా విండీస్‌తో సిరీస్‌లో ఆడిన ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్‌లు.. ఐరీష్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.ఐర్లాండ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే -
వాళ్లంతా గ్రేట్.. కోచ్ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్(India Women vs West Indies Women)తో మూడో వన్డేలోనూ గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని పేర్కొంది.రెండు సిరీస్‌లు భారత్వేకాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ మహిళా జట్టు భారత్ వచ్చింది. తొలుత నవీ ముంబై వేదికగా జరిగిన పొట్టి సిరీస్‌లో హర్మన్ సేన.. హేలీ మాథ్యూస్ బృందంపై 2-1తో నెగ్గింది. అనంతరం వడోదర వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన రేణుక.. దీప్తి విశ్వరూపంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. పేసర్ రేణుకా ఠాకూర్ సింగ్(Renuka Thakur Singh) నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఆరు వికెట్లతో దుమ్ములేపింది.వెస్టిండీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ షెమానే కాంప్‌బెల్(46), చినెల్లె హెన్రీ(61), అలియా అలెనె(21) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ 38.5 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది.ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 4 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ప్రతికా రావల్(18) నిరాశపరిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా విఫలమైంది.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ దంచికొట్టింది. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. అదే విధంగా.. జెమీమా రోడ్రిగ్స్(29), దీప్తి శర్మ(39 నాటౌట్) రాణించారు. ఇక ఆఖర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చింది.𝐑𝐢𝐜𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐬 𝐢𝐭 𝐨𝐟𝐟 𝐢𝐧 𝐬𝐭𝐲𝐥𝐞 🔥#TeamIndia win the 3rd ODI by 5 wickets & cleansweep the series 3-0 🙌🙌Scorecard ▶️ https://t.co/3gyGzj5fNU#INDvWI | @IDFCFIRSTBank | @13richaghosh pic.twitter.com/XIAUChwJJ2— BCCI Women (@BCCIWomen) December 27, 2024 ఆ ముగ్గురూ గ్రేట్ఈ క్రమంలో 28.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిన భారత్.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకా సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘రేణుక అద్బుతంగా బౌలింగ్ చేసింది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది.ఇక దీప్తి శర్మ, జెమీమా బాగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో రిచా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతా కలిసి కట్టుగా ఉంటే.. ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయంలో భాగం ఉంది.అయితే, ఒక్క తప్పు లేకుండా వంద శాతం ఫలితాలు కావాలని మా ఫీల్డింగ్ కోచ్ పదే పదే చెప్తారు. కానీ.. ఈరోజు ఒకటీ రెండుసార్లు మేము విఫలమయ్యాం. వచ్చే ఏడాది ఈ తప్పులను పునరావృతం కానివ్వము’’ అని పేర్కొంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం 𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩 Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the ODI series 3-0 💪 pic.twitter.com/glblLcPBc7— BCCI Women (@BCCIWomen) December 27, 2024 -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వడోదర వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 115 పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగులు వరద పారించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జోరుమీదున్న ఓపెనర్ స్మృతి మంధాన (53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరో ఓపెనర్ ప్రతీక రావల్ (76; 10 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా వన్డేల్లో భారత్ తమ అత్యధిక స్కోరును సమం చేసింది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు 358 పరుగులే సాధించింది. అంతేకాకుండా మరో అరుదైన రికార్డు కూడా భారత్ తమ ఖాతాలో వేసుకుంది.తొలి జట్టుగా..మహిళల వన్డే క్రికెట్లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2011లో లీసెస్టర్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ రికార్డును మన అమ్మాయిలు బ్రేక్ చేశారు.మాథ్యూస్ సెంచరీ వృథా..359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (109 బంతుల్లో 106; 13 ఫోర్లు) శతకం సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి శర్మ, టిటాస్, ప్రతీక తలా 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 27న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్? -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్‌లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్‌లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్‌పై వేటు
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్‌తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ మిస్ -
ఆసీస్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్‌కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్‌కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
Ind Vs Aus ODI: ఈసారైనా...!.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ్రస్టేలియాలో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మరో అవకాశం లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య ఈరోజు తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహాలు ఈ సిరీస్ నుంచే భారత్ మొదలుపెట్టనుంది. బ్రిస్బేన్: ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుండగా... మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో జట్టు బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య 16 వన్డేలు జరగగా... అందులో భారత జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2021లో చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన మన జట్టు 1–2తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత జట్టు శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. 2025లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నామరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తహిలా మెక్‌గ్రాత్ జట్టుకు సారథ్యం వహించనుంది. ‘భారత జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. స్వదేశంలో ఆడుతుండటంతో మాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా. ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తా’ అని తహిలా పేర్కొంది.రాధ యాదవ్‌పై భారీ అంచనాలుఇటీవల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హర్మన్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు ఎక్కువైనా... మేనేజ్మెంట్ ఆమె సారథ్యంపై నమ్మకముంచింది. మరి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హర్మన్ తన సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న రాధ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఆసీస్ జట్టులో స్టార్లకు కొదవలేకపోగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆటకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.షఫాలీ వర్మ చాలా ముఖ్యమైన ప్లేయర్. జాతీయ జట్టు తరఫున షఫాలీ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తుందని నమ్మకముంది. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించాలనే తపనతోనే మైదానంలో అడుగు పెడతాం. వన్డేల్లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. దాన్నే ఇక్కడ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పుపై కసరత్తు చేస్తాం. స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించాం. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటి కోసం సిద్ధంగా ఉన్నాం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ 10 భారత్, ఆ్రస్టేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 53 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.9 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. తొమ్మిది సిరీస్‌లలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు నాలుగు వన్డే సిరీస్‌లు ఆడి నాలుగింటిలోనూ ఓటమి పాలైంది. -
ఆసీస్ పర్యటన.. టీమిండియా వికెట్‌కీపర్‌కు గాయం
భారత్, ఆస్ట్రేలియా (మహిళల క్రికెట్) జట్ల మధ్య డిసెంబర్ 5 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు.ఈ జట్టుకు ఎంపికైన యువ వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా బిగ్‌బాష్ లీగ్ ఆడుతూ (మెల్బోర్న్ స్టార్స్) గాయపడింది. యస్తికా మణికట్టు గాయానికి గురైంది. దీంతో యస్తికాను ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.యస్తికా స్థానాన్ని 22 ఏళ్ల ఉమా ఛెత్రీ భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఛెత్రీ ఈ ఏడాది జులైలోనే టీమిండియా అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఈ చిన్నది నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఛెత్రీ వన్డేల్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో స్టార్ ప్లేయర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా సెలెక్టర్లు షఫాలీ వర్మపై వేటు వేశారు. ఈ సిరీస్‌లో శ్రేయాంక పాటిల్, దయాలన్ హేమలత, సయాలీ సథ్గరే కూడా ఆడటం లేదు.ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు..హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, సైమా ఠాకోర్, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్)సిరీస్ షెడ్యూల్..డిసెంబర్ 5- తొలి వన్డే (బ్రిస్బేన్)డిసెంబర్ 8- రెండో వన్డే (బ్రిస్బేన్)డిసెంబర్ 11- మూడో వన్డే (పెర్త్) -
టాప్-10లోకి హర్మన్.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీగా లబ్ది పొందింది. గత వారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హర్మన్.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. న్యూజిలాండ్ సిరీస్ చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో హర్మన్ 83 పరుగులు చేసింది. ఇందులో సిరీస్ డిసైడర్‌లో చేసిన ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధనకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. న్యూజిలాండ్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినా మంధన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆమె తన ర్యాంకింగ్ పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ వారం ర్యాంకింగ్ పాయింట్స్‌లో మంధన 703 నుంచి 728 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న మంధనకు మూడో ప్లేస్‌లో ఉన్న చమారీ ఆటపట్టుకు కేవలం ఐదు పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది.ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన నాట్ సీవర్ బ్రంట్ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ రెండో స్థానంలో ఉంది. భారత ప్లేయర్లలో దీప్తి శర్మ 20వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 30వ స్థానంలో ఉంది.బౌలింగ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్లు తీసిన దీప్తి శర్మ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్‌లో తన హావా కొనసాగిస్తుంది. దీప్తికి సోఫీకి మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ రేణుక సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకగా.. మరో ఇద్దరు భారత బౌలర్లు ప్రియా మిశ్రా, సోయ్మా ఠాకోర్ టాప్-100లోకి ఎంటర్ అయ్యారు. -
స్మృతి శతకం... సిరీస్ సొంతం
అహ్మదాబాద్: వారెవా... స్మృతి మంధాన ఇలా ఆడి ఎన్నాళ్లైంది. ఆఖరి వన్డే చూసినవారందరి నోటా వినిపించిన మాట ఇదే! కీలకమైన పోరులో ఆమె సాధించిన శతకంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను 2–1తో వశం చేసుకుంది. ఈ విజయంలో బౌలర్లు దీప్తిశర్మ, ప్రియా మిశ్రాలతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తోడయ్యారు. దీంతో మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్రూక్ హాలిడే (96 బంతుల్లో 86; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆదుకుంది. ఓపెనర్ జార్జియా ప్లిమెర్ (67 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3 వికెట్లు పడగొట్టగా, యువ లెగ్‌స్పిన్నర్ ప్రియా మిశ్రా (2/41) కీలకమైన వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 44.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి గెలిచింది. చాన్నాళ్ల తర్వాత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10 ఫోర్లు)బ్యాట్‌కు పనిచెప్పింది. హర్మన్‌ప్రీత్ (63 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) రాణించింది. హన్నా రోవ్ 2 వికెట్లు పడగొట్టింది. కివీస్, భారత్ తమ తుది జట్లలో ఒక్కోమార్పు చేశాయి. జెస్ కెర్ స్థానంలో హన్నా రోవ్ బరిలోకి దిగింది. భారత జట్టులో హైదరాబాద్ సీమర్ అరుంధతి రెడ్డి స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకున్నారు. హాలిడే ఒంటరి పోరాటం భారత బౌలర్లు, ఫీల్డర్లు కట్టుదిట్టం చేయడంతో కివీస్‌కు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. జెమీమా మెరుపు ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్ (4)తో పాటు మ్యాడీ గ్రీన్ (15)ను రనౌట్ చేసింది. సైమా, ప్రియా బౌలింగ్‌లలో లౌరెన్ (1), సోఫీ డివైన్ (9)లు అవుటయ్యారు. దీంతో ఒక దశలో 88/5 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్‌ను మిడిలార్డర్ బ్యాటర్ బ్రూక్ హాలిడే ఆదుకుంది. చూడచక్కని బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఇసాబెల్లా గేజ్ (49 బంతుల్లో 25; 1 ఫోర్)తో ఆరో వికెట్‌కు 64 పరుగులు, తహుహు (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక హాలిడే నిష్క్రమించింది. గెలిపించిన స్మృతి, హర్మన్ చూసేందుకు లక్ష్యం సులువుగానే కనిపిస్తుంది. అయితే గత మ్యాచ్ గుర్తుకొస్తే ఎక్కడ, ఎప్పుడు కూలిపోతోందోనన్న బెంగ! నాలుగో ఓవర్లోనే షఫాలీ (12) అవుట్. స్మృతి ఫామ్‌పై దిగులు! కానీ స్టార్ ఓపెనర్ కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వన్‌డౌన్ బ్యాటర్ యస్తిక భాటియా (49 బంతుల్లో 35; 4 ఫోర్లు)తో కలిసి జట్టును పరుగుల బాట పట్టించింది. జట్టు స్కోరు వందకు చేరువయ్యే సమయంలో 92 పరుగుల వద్ద యస్తికను సోఫీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రాగా... 73 బంతుల్లో స్మృతి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.ఇద్దరు కలిసి న్యూజిలాండ్ బౌలర్లపై కదం తొక్కడంతో జట్టు గెలుపుబాట పట్టింది. హర్మన్ 54 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది. కాసేపటికే మంధాన 121 బంతుల్లో సెంచరీ మైలురాయిని చేరుకుంది. అదే స్కోరు వద్ద ఆమె క్లీన్బౌల్డయ్యింది. అప్పటికే జట్టు గెలుపుతీరానికి చేరుకుంది. జెమీమా (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)తో హర్మన్ లాంఛనాన్ని దాదాపు పూర్తి చేస్తుండగా, విజయానికి పరుగుదూరంలో జెమీమా ఎల్బీగా వెనుదిరిగింది. తేజల్ (0 నాటౌట్) ఖాతా తెరువకముందే హర్మన్‌ప్రీత్ బౌండరీతో జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ మహిళల ఇన్నింగ్స్: సుజీ బేట్స్ రనౌట్ 4; జార్జియా (సి) దీప్తి (బి) ప్రియా 39; లౌరెన్ (సి) యస్తిక (బి) సైమా 1; సోఫీ డివైన్ (బి) ప్రియా 9; హాలిడే (సి) రాధ (బి) దీప్తి 86; మ్యాడీ గ్రీన్ రనౌట్ 15; ఇసాబెల్లా (సి) అండ్ (బి) దీప్తి 25; హన్నా రోవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 11; తహుహు నాటౌట్ 24; కార్సన్ (సి) రాధ (బి) రేణుక 2; జొనాస్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–24, 2–25, 3–36, 4–66, 5–88, 6–152, 7–199, 8–210, 9–219, 10–232. బౌలింగ్: రేణుకా సింగ్ 10–1–49–1, సైమా ఠాకూర్ 9.5–1–44–1, ప్రియా మిశ్రా 10–1–41–2, దీప్తిశర్మ 10–2–39–3, రాధా యాదవ్ 4–0–21–0, హర్మన్‌ప్రీత్ 6–0–34–0. భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (బి) రోవ్ 100; షఫాలీ (సి) ఇసాబెల్లా (బి) రోవ్ 12; యస్తిక (సి) అండ్ (బి) సోఫీ 35; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 70; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) జొనాస్ 11; తేజల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–16, 2–92, 3–209, 4–232. బౌలింగ్: లియా తహుహు 6–0–30–0, హన్నా రోవ్ 8–0–47–2, ఎడెన్ కార్సన్ 10–0–45–0, సోఫీ డివైన్ 7.2–0–44–1, సుజీ బేట్స్ 4–0–18–0, ఫ్రాన్ జొనాస్ 9–1–50–1. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్‌లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్‌ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా కెప్టెన్ రీఎంట్రీ
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది.అదేవిధంగా యవ పేసర్ ప్రియా మిశ్రా ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు రేణుకా సింగ్, హేమలతకు భారత జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైంది.ఆమెతో పాటు మోలీ పెన్ఫోల్డ్ కూడా రెండో వన్డేకు దూరమైంది. ఈ క్రమంలో వీరిద్దిరి స్ధానాల్లో జట్టులోకి తహుహు, జోన్స్ వచ్చారు. కాగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రాన్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, లారెన్ డౌన్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్ -
హర్మన్‌ప్రీత్‌కు పరీక్ష!
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్‌లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్‌పై నమ్మకముంచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హర్మన్‌కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్‌ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్‌పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో హర్మన్‌తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 20 భారత్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.54 ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కరు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్‌కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వోల్వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్‌తో 150 పరుగులు సాధించింది.జట్టు వివరాలు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్కులులెకొ ఎమ్‌లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్). -
W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
ఆఖరి ఓవర్లో అలా చేస్తారా? టీమిండియా కెప్టెన్‌దే తప్పు?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో తమ సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు సెమీస్ ఆశలన్నీ పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌పై పాక్ విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ పరంగా టీమిండియా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ పాక్ ఓటమి చెందితే వరల్డ్‌కప్‌లో భారత్ కథ ముగిసినట్టే. ఇక ఆసీస్‌తో మ్యాచ్ విషయానికి వస్తే.. 152 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైంది. లక్ష్య చేధనలో మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమయ్యారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆఖరి వరకు పోరాడినప్పటకి జట్టును విజయతీరాలను చేర్చలేకపోయింది. అయితే 54 పరుగులతో హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటకి అభిమానుల నుంచి విమర్శల ఎదుర్కొంటుంది. ఆఖరి ఓవర్లో కౌర్ బ్యాటింగ్ విధానాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.ఆఖరి ఓవర్లో భారత విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో హర్మన్ ప్రీత్ ఉండడంతో మ్యాచ్‌పై భారత అభిమానులు ఇంకా ఆశలు వదులుకోలేదు. ఆసీస్ కెప్టెన్ మెక్‌గ్రత్ చివరి ఓవర్ వేసే బాధ్యతను పేసర్ అన్నాబెల్ సదర్లాండ్కు అప్పగించింది.ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కౌర్ సింగిల్ తీసి పూజాకు స్ట్రైక్ ఇచ్చింది. రెండో బంతికి పూజా క్లీన్ బౌల్డ్ అయింది. మూడో బంతికి అరుంధతి రెడ్డి రనౌట్‌గా వెనుదిరిగింది. నాల్గవ డెలివరీలో హర్మన్‌ప్రీత్ స్ట్రైక్‌కి తిరిగి వచ్చింది. కానీ ఆమె మళ్లీ సింగిల్ కోసం వెళ్లి శ్రేయాంక పాటిల్‌ను స్ట్రైక్‌లోకి తీసుకొచ్చింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన సమయంలో ఐదో బంతిని అన్నాబెల్ వైడ్ డెలివరీగా సంధించింది. వైడ్ బంతికి పరుగుకు ప్రయత్నించి శ్రేయాంక పాటిల్ రనౌట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్ ఎల్బీగా పెవిలియన్‌కు చేరింది. చివరి బంతికి రేణుకా సింగ్ సింగిల్ తీసింది. దీంతో ఆఖరి ఓవర్లో కేవలం భారత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ క్రమంలో హర్మన్ స్ట్రైక్‌ను తన వద్ద ఉంచుకోకపోవడం సర్వాత విమర్శల వర్షం కురుస్తోంది. జట్టుకు విజయానికి 14 పరుగులు అవసరమైనప్పడు టెయిలాండర్లకు స్ట్రైక్ ఎలా ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Why didn’t Harmanpreet Kaur keep the strike to herself? #INDvAUS— Surbhi Vaid (@vaid_surbhi) October 13, 2024 -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్‌లో (పాక్‌పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్‌కు ఈ మ్యాచ్‌కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్‌లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
IND W vs PAK W Match live Updatesపాక్‌పై భారత్ ఘన విజయందుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్( 29 రిటైర్డ్ హార్ట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సానా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇక్బాల్, సోహైల్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఒకే ఓవర్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్ వేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సానా బౌలింగ్‌లో తొలుత రోడ్రిగ్స్(23) ఔట్ కాగా, తర్వాత బంతికి రిచా ఘోష్(0) పెవిలియన్‌కు చేరింది. భారత విజయానికి ఇంకా 12 పరుగులు కావాలి. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 94/4టీమిండియా రెండో వికెట్ డౌన్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన షెఫాలీ వర్మ.. సోహైల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులోకి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చింది. భారత విజయానికి ఇంకా 48 బంతుల్లో 44 పరుగులు కావాలి.నిలకడగా ఆడుతున్న భారత్.. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(24), రోడ్రిగ్స్(13) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి 60 బంతుల్లో 56 పరుగులు కావాలి.తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరింది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(7), రోడ్రిగ్స్(5) పరుగులతో ఉన్నారు.చేతులేత్తిసిన పాక్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే?టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నామమాత్రమే స్కోర్‌కే పరిమితమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో నిధా ధార్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.16 ఓవర్లకు పాక్ స్కోర్: 76/716 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో నిధా ధార్(19), సైదా ఆరోబ్(3) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రియాజ్.. అరుందతి రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. 12.1 ఓవర్లకు పాక్ స్కోర్: 52/5కష్టాల్లో పాకిస్తాన్.. 44 పరుగులకే 4 వికెట్లుపాక్తో మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. భారత బౌలర్ల దాటికి పాక్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 11 ఓవర్లకు పాక్ స్కోర్: 47/4. క్రీజులో రియాజ్(1), నిదా(11) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన సొహైల్.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులో నిదా ధార్ వచ్చింది. 8 ఓవర్లకు పాక్ స్కోర్: 35/3. క్రీజులో మునీబా అలీ(16), దార్(2) పరుగులతో ఉన్నారు.పాక్ రెండో వికెట్ డౌన్..25 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సిద్రా అమీన్.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. క్రీజులోకి సొహైల్ వచ్చింది.తొలి వికెట్ కోల్పోయిన పాక్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గుల్ ఫిరోజాను రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. క్రీజులోకి అమీన్ వచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్..మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాదితో పోరులో భారత జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ దూరమైంది. ఆమె స్ధానంలో సజన తుది జట్టులోకి వచ్చింది. మరోవైపు పాక్ కూడా ఓ మార్పుతో ఆడనుంది. డానియా బ్యాగ్ స్దానంలో ఆరోబాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.తుది జట్లుభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: మునీబా అలీ(వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్ -
Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. దూకుడుగా ఆడతాం: పాక్ కెప్టెన్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు జోష్‌లో ఉంది. గ్రూప్-ఏలో భాగమైన శ్రీలంకను 31 పరుగులతో ఓడించి తొలి విజయం అందుకుంది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆదివారం పోటీకి సిద్ధమైంది.దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాయాది జట్ల మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు హర్మన్‌ప్రీత్ సేనతో పాక్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. అన్ని మ్యాచ్‌లలాగే టీమిండియాతోనూ ఆడతామని పేర్కొంది.దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం‘‘మేము ఒత్తిడికి లోనవ్వము. అయితే, ప్రేక్షకుల ఉత్సాహం కారణంగా మా వాళ్లు కాస్త అలజడి చెందే అవకాశం ఉంది. అయితే, వీలైనంత ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఒత్తిడికి లోనైతే మాత్రం ఫలితం మాకు అనుకూలంగా రాదని తెలుసు.మేము గత కొంతకాలంగా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా నిర్భయంగా అటాకింగ్‌కి దిగుతున్నాం. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితకబాదడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.అందుకు తగ్గట్లుగానే ఇక్కడా ఫలితం రాబడతామని విశ్వాసంతో ఉన్నాము’’ అని ఫాతిమా సనా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫాతిమా ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో అదరగొట్టింది. 30 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీసింది.భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా బోణీ కొట్టగా.. భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడింది.ఈ క్రమంలో ఇక ముందు ఆడనున్న ప్రతీ మ్యాచ్ హర్మన్‌సేనకు అగ్నిపరీక్షగా మారింది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించడం సహా ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తేనే సెమీస్‌కు మార్గం సుగమం అవుతుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే.ఇక పాకిస్తాన్ మహిళా జట్టుపై కూడా భారత్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరుజట్లు టీ20లలో 15 సందర్భాల్లో తలపడగా.. భారత్ 12 సార్లు, పాక్ మూడు సార్లు గెలిచింది. చివరగా ఆసియా వుమెన్స్ కప్-2024లోనూ హర్మన్ సేన పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.చదవండి: అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి: పాక్ బ్యాటర్లపై కోచ్ ఫైర్! -
అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్ అసహనం.. తప్పెవరిది?
మహిళా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. దుబాయ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్‌ప్రీత్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ పద్నాలుగో ఓవర్ ఆఖరి బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. అప్పుడు క్రీజులో ఉన్న అమేలియా కెర్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంది. అప్పటికి అమేలియా సోఫీ డివైన్‌తో కలిసి సింగిల్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో ఓవర్ ముగిసింది కాబట్టి హర్మన్ బంతిని త్రో చేయకుండా అలాగే చేతుల్లో పట్టుకుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కివీస్ బ్యాటర్లు మరో పరుగు కోసం యత్నించారు. అంతలో హర్మన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు బంతిని అందించగా.. అమేలియా రనౌట్ అయింది.కానీ.. అంపైర్ మాత్రం అప్పటికే బంతి డెడ్ అయినట్లు ప్రకటించారు. నిజానికి కివీస్ బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించకముందే ఫీల్డ్ అంపైర్.. బౌలర్ దీప్తి క్యాప్‌ను ఆమెకు తిరిగి ఇచ్చేశారు. అప్పటికే హర్మన్ చేతిలో బంతి ఉండి ఐదు సెకన్లకు పైగా కాలం గడవడంతో బంతిని డెడ్‌గా ప్రకటించారు. అయినప్పటికీ న్యూజిలాండ్ డబుల్‌కు యత్నించగా.. అమేలియా రనౌట్ అయింది. దీంతో ఆమె తాను అవుటైనట్లు భావిస్తూ పెవిలియన్‌కు వెళ్తుండగా.. అంపైర్లు మాత్రం ఆమెను వెనక్కి పిలిపించారు.దీంతో అమేలియా మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంతి డెడ్ అయిందనుకుని తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినా వారికి అనుకూలంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాసేపు వివాదం నెలకొనగా.. మళ్లీ ఆట మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో రెండో బంతికే అమేలియా కెర్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రేణుకా సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. అంపైర్లు ఇలా వ్యవహరించడం సరికాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. సమిష్టిగా విఫలమై 58 పరుగుల తేడాతో పరాజయం పాలై.. తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొంది.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్OUT or NOT OUT 🧐Animated Harmanpreet Kaur Spotted🔥🔥🇮🇳#INDvsNZ #WomenInBlue #T20WorldCup pic.twitter.com/QJVYKG6ZIE— Sports In Veins (@sportsinveins) October 4, 2024 -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్‌కప్‌లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్‌లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్‌ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్‌కప్‌లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్‌లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్‌డౌన్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్‌ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్‌కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్ -
T20 WC: ‘కెప్టెన్సీకి కఠిన సవాలు.. ఈసారైనా ట్రోఫీ గెలవాలి’
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలుకాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.మనదైన రోజు ఏదైనా సాధ్యమేఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్‌ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.భావోద్వేగాలను అదుపు చేసుకోవాలిప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. చదవండి: DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో) -
టీమిండియా కెప్టెన్‌కు అవమానం
మహిళల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అవమానం జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన డ్రాఫ్ట్‌లో హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. బిగ్‌బాష్ లీగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన హర్మన్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హర్మన్ బీబీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడి 117.16 స్ట్రయిక్‌రేట్‌తో 1440 పరుగులు చేసింది. 35 ఏళ్ల హర్మన్ మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్ తరఫున ఐదు సీజన్ల పాటు బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంది. హర్మన్ 2023 మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టింది. గత సీజన్లోనూ ముంబై ఇండియన్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు (153 మ్యాచ్‌ల్లో 3426 పరుగులు) కలిగిన హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకోకపోవడం విచారకరం.కాగా, మహిళల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో మొత్తం 19 మంది భారత ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకోగా.. కేవలం ఆరుగురు మాత్రమే వివిధ ఫ్రాంచైజీల చేత ఎంపిక చేసుకోబడ్డారు. స్మృతి మంధనను అడిలైడ్ స్ట్రయికర్స్ ముందస్తుగా (ప్రీ సైన్డ్) సొంతం చేసుకోగా.. దయాలన్ హేమలతను పెర్త్ స్కార్టర్స్, శిఖా పాండేను బ్రిస్బేన్ హీట్, యస్తికా భాటియాను మెల్బోర్న్ స్టార్స్, దీప్తి శర్మను మెల్బోర్న్ స్టార్స్, జెమీమా రోడ్రిగెజ్‌ను బ్రిస్బేన్ హీట్ డ్రాఫ్ట్‌లో ఎంపిక చేసుకున్నాయి. మహిళల బిగ్‌బాష్ లీగ్ అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు సాగనుంది.డ్రాఫ్ట్ రిజల్ట్స్..సోఫీ ఎక్లెస్టోన్ (సిడ్నీ సిక్సర్లు,రిటెన్షన్ పిక్)హీథర్ నైట్ (సిడ్నీ థండర్, రిటెన్షన్ పిక్)లారా వోల్వార్డ్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్, రిటెన్షన్ పిక్)డాని వ్యాట్ (హోబర్ట్ హరికేన్స్)డియాండ్రా డాటిన్ (మెల్బోర్న్ రెనెగేడ్స్)దీప్తి శర్మ (మెల్బోర్న్ స్టార్స్)జెమిమా రోడ్రిగ్స్ (బ్రిస్బేన్ హీట్)సోఫీ డివైన్ (పెర్త్ స్కార్చర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)క్లో ట్రయాన్ (హోబర్ట్ హరికేన్స్)అమేలియా కెర్ (సిడ్నీ సిక్సర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)హేలీ మాథ్యూస్ (మెల్బోర్న్ రెనెగేడ్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)మారిజానే కాప్ (మెల్బోర్న్ స్టార్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)షబ్నిమ్ ఇస్మాయిల్ (సిడ్నీ థండర్)శిఖా పాండే (బ్రిస్బేన్ హీట్)అమీ జోన్స్ (పెర్త్ స్కార్చర్స్)హేమలత దయాళన్ (పెర్త్ స్కార్చర్స్)ఆలిస్ క్యాప్సే (మెల్బోర్న్ రెనెగేడ్స్)చమారి అతపత్తు (సిడ్నీ థండర్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)యాస్తిక భాటియా (మెల్బోర్న్ స్టార్స్)స్మృతి మంధాన (అడిలైడ్ స్ట్రైకర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)లిజెల్ లీ (హోబర్ట్ హరికేన్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)హోలీ ఆర్మిటేజ్ (సిడ్నీ సిక్సర్లు)ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్)జార్జియా ఆడమ్స్ (సిడ్నీ థండర్)నదీన్ డి క్లెర్క్ (బ్రిస్బేన్ హీట్, ప్రీ-సైన్డ్ ప్లేయర్) -
బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్లు..!
సిడ్నీ: ఈ ఏడాది మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) టి20 టోర్నీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఆడటం దాదాపు ఖరారైంది. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్టింగ్ జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండటమే దీనికి కారణం. మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్‌ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనుంది. ఈ మేరకు ఫ్రాంచైజీలు సోమవారం అట్టిపెట్టుకోవాలనుకుంటున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి.అడిలైడ్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. సూజీ బేట్స్ (సిడ్నీ సిక్సర్స్), అలీస్ కాప్సీ (మెల్బోర్న్ స్టార్స్), సోఫియా ఎకెల్‌స్టోన్ (సిడ్నీ సిక్సర్స్), షబ్నిమ్ ఇస్మాయిల్ (హోబర్ట్ హరికేన్స్), హీతర్ నైట్ (సిడ్నీ థండర్), డానీ వ్యాట్ (పెర్త్ స్కార్చెర్స్) రిటెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు డబ్ల్యూబీబీఎల్ సీజన్ జరగనుంది. -
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది. -
ఫైనల్లో టీమిండియా
మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది.వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.చెలరేగిన భారత బౌలర్లుపేసర్ రేణుకా సింగ్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్‌ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఓపెనర్లే పూర్తి చేశారుస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాక్‌తోనే తొలి మ్యాచ్
మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌తో పాటు ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో జూలై 23న నేపాల్‌తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు (ఫోటోలు)
-
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్‌కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్‌సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్‌సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్‌కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్. -
చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 19) జరిగిన భారత్-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బ్యాటర్లు స్మృతి మంధన (136), హర్మన్‌ప్రీత్ కౌర్ (103 నాటౌట్) శతక్కొట్టగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు లారా వాల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) సెంచరీలతో విరుచుకుపడ్డారు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకు పరిమితమైంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
అటు హర్మన్...ఇటు స్మృతి
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సమరంలో రికార్డులు హోరెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారి హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు భారత్‌దే పైచేయి అయింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా, స్మృతి మంధాన (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో వన్డేలోనూ శతకంతో చెలరేగింది.అనంతరం సఫారీ టీమ్ చివరి వరకు పోరాడి ఓడింది. 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 321 పరుగులు సాధించింది. కెపె్టన్ లారా వోల్వార్ట్ (135 బంతుల్లో 135 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరిజాన్ కాప్ (94 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. పూజ వస్త్రకర్ వేసిన ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి 2 బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి 2 బంతులకు 2 వికెట్లు పడ్డాయి. ఆఖరి 2 బంతుల్లో 1 బై మాత్రమే వచ్చింది. సిరీస్‌ను 2–0తో భారత్ సొంతం చేసుకోగా, మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. 4 మహిళల వన్డేలో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. 646 ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. ఇది రెండో అత్యధికం. గతంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లో 678 పరుగులు నమోదయ్యాయి 7 వన్డేల్లో ఏడో సెంచరీ సాధించిన స్మృతి...భారత్ తరఫున మిథాలీ రాజ్ (7)ని సమం చేసింది. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఆమె ఇప్పటికే 26 టి20లు ఆడింది. -
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK— Johns. (@CricCrazyJohns) June 19, 2024చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది. -
సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు.మంధాన అరుదైన రికార్డుఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హర్మన్ ప్రీత్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) ఉంది. -
సౌతాఫ్రికాతో సిరీస్‌ల కోసం భారత జట్టు ప్రకటన
వచ్చే నెల (జూన్) 13 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ల సిరీస్‌ల కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (మే 30) ప్రకటించారు. భారత పర్యటనలో సౌతాఫ్రికా ఓ వన్డే వార్మప్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్, మూడు టీ20లు ఆడనుంది.మూడు ఫార్మాట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా సారధిగా ఎంపిక కాగా.. అన్ని ఫార్మాట్లలో స్మృతి మంధన హర్మన్‌కు డిప్యూటీగా వ్యవహరించనుంది. జెమీమా రోడ్రిగెజ్, పూజా వస్త్రాకర్లను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్నెస్ పరీక్ష నెగ్గితేనే వారికి తుది జట్టులో అవకాశం ఉంటుంది.భారత పర్యటనలో సౌతాఫ్రికన్లు తొలుత బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ జూన్ 13న బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం సౌతాఫ్రికా-భారత్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 16న తొలి వన్డే, 19న రెండవది, 23న మూడో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ అనంతరం భారత్-సౌతాఫ్రికాలు ఏకైక టెస్ట్‌లో తలపడతాయి. చెన్నై వేదికగా జూన్ 28 నుంచి జులై 1 ఈ మ్యాచ్ జరుగనుంది. దీని తర్వాత ఇరు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతాయి. జులై 5, 7, 9 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. టీ0 సిరీస్ మొత్తానికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియాఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియాటీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రి (వికెట్‌కీపర్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డిస్టాండ్బై: సైకా ఇషాక్ -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. 44 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది. -
హర్మన్ ధనాధన్.. ఫ్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం ముంబై ఇండియన్స్‌ను గెలిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్‌కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్‌రేట్... తర్వాత ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (18; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరితో పాటు నట్ సీవర్ బ్రంట్ (2) వికెట్‌నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
ప్రపంచంలో ఏకైక పురుష క్రికెటర్‌గా రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గనిస్తాన్‌తో ఇండోర్ వేదికగా రెండో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్లో షార్టెర్ట్ ఫార్మాట్లో తొలుత 150 మ్యాచ్‌ల మైలురాయి అందుకుంది రోహిత్ శర్మ కాగా... టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో తొలుత 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న క్రికెటర్లు 150 టెస్టులు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (డిసెంబర్ 1993) 150 వన్డేలు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (ఫిబ్రవరి 1987) 150 టీ20లు: రోహిత్ శర్మ(ఇండియా) (జనవరి 2024)*. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా రోహిత్ శర్మ దాదాపు 14 నెలల తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఆదిలోనే రనౌట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇండోర్ వేదికగా ఆదివారం(జనవరి 14) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు 161 - హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్, 2009-2024) 152 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్, 2007-2023) 151 - డానీ వ్యాట్ (ఇంగ్లాండ్, 2010-2023) 150 - అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా, 2010-2024) 150 - రోహిత్ శర్మ (భారత్, 2007-2024)* -
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
ఆసీస్‌తో రెండో టీ20.. సిరీస్ విజయమే లక్ష్యంగా!
ముంబై: వన్డే సిరీస్ వైఫల్యాన్ని అధిగమించి తొలి టి20లో ఆ్రస్టేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్‌ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు సాధారణ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా కోలుకొని సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. యువ పేసర్ టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ ప్రదర్శన తొలి మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 19 ఏళ్ల ఈ బెంగాలీ పేసర్ మరోసారి తన జోరును ప్రదర్శిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. శ్రేయాంక, దీప్తిల ఆటతో డీవై పాటిల్ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం కూడా బాగా కనిపించింది. పేసర్లు రేణుక, పూజ కూడా ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో షఫాలీ, స్మృతి మరో బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఫామ్ కోల్పోయి చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం లభించని షఫాలీ తాను ఎంత కీలకమో తొలి టి20 పోరులో చూపించింది. స్మృతి కూడా చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించింది. జెమీమా, హర్మన్ కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. జట్టుపరంగా చూస్తే ముఖ్యంగా వన్డేలతో పోలిస్తే ఫీల్డింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరో వైపు ఆ్రస్టేలియా జట్టు అనూహ్య రీతిలో తడబడింది. టి20ల్లో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ఆలౌట్ కావడం భారత బౌలర్ల పైచేయిని చూపించింది. సీనియర్ బ్యాటర్లు ఉన్న టాప్–5లో పెరీ మినహా అంతా విఫలమయ్యారు. అయితే హీలీ, మూనీ, తహీలా, గార్డ్నర్ రాణిస్తే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ఆటను చూపించిన లిచ్‌ఫీల్డ్ టి20 మ్యాచ్‌లో కూడా సత్తా చాటడం ఆసీస్‌కు సానుకూలాంశం. ఆమె ఆడిన కొన్ని చక్కటి షాట్లు లిచ్‌ఫీల్డ్ సామర్థ్యాన్ని చూపించాయి. గత మ్యాచ్‌లో పూర్తిగా కట్టు తప్పిన ఆసీస్ బౌలింగ్ ఈ సారి ఎంత ప్రభావం చూపిస్తుంననేది ఆసక్తికరం. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఒత్తిడిలో భారత్
ముంబై: వన్డే సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సమరానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. వాంఖేడె మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. తొలి మ్యాచ్‌ను గెలిచిన ఆసీస్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. నిజానికి ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ భారీస్కోరే చేసింది. కానీ బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు లోపాలపై దృష్టి పెట్టిన టీమ్ మేనేజ్మెంట్ వీటిని అధిగమించి ఆ్రస్టేలియాను నిలువరించాలనే లక్ష్యంతో ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి జరిగే మ్యాచ్ ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. చదవండి: Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కౌంటర్ ఇచ్చిన కమిన్స్! -
ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్‌కు ఛాన్స్
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌కు కూడా ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది. డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళల వన్డే జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్ భారత మహిళల టీ20 జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో...
ముంబై: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే రెండు కీలక సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ప్రకటించింది. ఈ రెండు టీమ్‌లకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఇంగ్లండ్‌తో 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఆ తర్వాత ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆసీస్‌తో టి20 సిరీస్‌కు టీమ్‌ను తర్వాత ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగానే జరుగుతాయి. ఈ నెల 6న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరుగుతుంది. ఇంగ్లండ్‌తో టి20లకు జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్, శ్రేయాంక, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, కనిక ఆహుజా, మిన్ను మని. ఇంగ్లండ్, ఆసీస్‌లతో టెస్టులకు జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, స్నేహ్ రాణా, శుభ సతీశ్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రకర్ -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
BCCI: ఏపీ పేసర్ అంజలి శర్వాణి చేజారిన గోల్డెన్ ఛాన్స్.. జట్టులోకి ఆమె
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది. మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న పూజా వస్త్రాకర్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక. ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్. -
టైమ్ 100 నవ్య సారథుల జాబితాలో హర్మన్‌ప్రీత్
న్యూయార్క్: భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ స్థానం దక్కించుకున్నారు. 2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింగ్ ది వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధంచేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్మన్‌ప్రీత్.. మహిళా క్రికెట్‌ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు’ అని టైమ్ పొగిడింది. క్షయ వ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి, వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయినా మెరుగైన డ్రగ్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరూ ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్‌లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణహిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న వినూ డేనియల్ పేరూ ఈ జాబితాలో ఉంది. -
భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ మాత్రమే...
ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీకి సంబంధించి ఆదివారం విదేశీ క్రికెటర్ల డ్రాఫ్ట్ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 116 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఎనిమిది ఫ్రాంచైజీలు 17 మందిని ఎంపిక చేసుకున్నాయి. భారత్ నుంచి 18 మంది క్రికెటర్లు తుది జాబితాలో ఉండగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మాత్రమే అవకాశం దక్కింది. మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్టు హర్మన్‌ప్రీత్‌ను ఎంపిక చేసుకుంది. 2021–2022 సీజన్లో హర్మన్‌ప్రీత్ మెల్బోర్న్ తరఫున ఆడి 406 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా తీసింది. -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్‌బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్‌ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్‌లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
హర్మన్ ఆడేది... ఫైనల్ చేరితేనే!
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్ చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్లో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఎంట్రీ లభించింది. కెప్టెన్ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్ గెలిచి భారత్ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్ ఈవెంట్లో 14 జట్లు, పురుషుల ఈవెంట్లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ ఎంట్రీ లభించింది. -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్‌కు చేరే క్రమంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్‌తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది'
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై విమర్శల వేడి తగ్గడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. కాగా హర్మన్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ విషయంలో హర్మన్ చేసింది ఓవర్‌గా అనిపించిందని.. అంత వైల్డ్‌గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. "భారత్ విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్‌కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్‌ప్రీత్ విషయంలో ఓవర్ అనిపించింది. ఔట్ విషయంలో అంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు." అని అఫ్రిది స్పష్టం చేశాడు. కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. గత శనివారం మిర్పూర్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్ దురుసుగా వ్యవహరించింది. ముందుగా తనను అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి పడేయడంతో పాటు వెళుతూ వెళుతూ అంపైర్‌ను చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేసింది. దీనిపై మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాతా అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెప్టెన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. దీనిపై సుల్తానా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాస్త మర్యాద నేర్చుకోమంటూ సహచరులతో కలిసి వేదిక నుంచి దిగేసింది. 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 చదవండి: టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు? #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు?
భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్‌తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది. అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..! -
టీమిండియా కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం: ఐసీసీ ప్రకటన.. ఆమె ఏం తప్పు చేసిందని?
India women's team skipper Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అందుకే ఈ చర్యలు ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా ఢాకాలో శనివారం బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ సందర్భంగా హర్మన్ వ్యవహరించిన తీరుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హర్మన్... తాను అవుటైన తర్వాత వికెట్లను బ్యాట్‌తో కొట్టినందుకు గానూ ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు.. డిసిప్లినరి రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది. రెండు మ్యాచ్‌లు ఆడకుండా అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఐసీసీ నియమావళిలోని 2.8 నిబంధనను అతిక్రమించిందన్న ఐసీసీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా అంపైర్‌ను విమర్శించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోత(డిమెరిట్ పాయింట్ కూడా) విధించినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ.. హర్మన్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిషేధం విధించిన నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆమె ఒక టెస్టు మ్యాచ్ లేదంటే.. రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. తప్పుడు నిర్ణయమని అంపైర్‌పై కోపంతో అలా.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ బౌలింగ్‌లో భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. ఎల్బీడబ్ల్యూ అయినట్లు పేర్కొన్నాడు. అయితే, బంతి లెగ్స్టంప్నకు ఆవల పిచ్ అయిందనుకున్న హర్మన్ తను అవుట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలిచేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అండగా నిలుస్తున్న అభిమానులు అంతేకాదు మ్యాచ్ తర్వాత అంపైరింగ్ ప్రమాణాలను తప్పుబట్టిన ఆమె.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీస మర్యాద చేయలేదంటూ బంగ్లాదేశ్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో టీమిండియా అభిమానులు.. ‘‘సూపర్ హర్మన్.. ఆటలో మనకు అన్యాయం జరిగిందని భావించినపుడు కోపం రావడం సహజం. అది మానవ నైజం. ఇక మన హైకమీషన్ పట్ల వాళ్లు వ్యవహరించిన తీరుకు నువ్విచ్చిన కౌంటర్ అదుర్స్. మన పురుష క్రికెటర్లు కూడా ఇంత డేరింగ్‌గా మాట్లాడేవాళ్లు కాదేమో! నీపై ఐసీసీ చర్యలు తీసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. చదవండి: రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ దూరం
భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగలనుంది. చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగనున్న ఏసియన్ గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు (టీ20లు) టీమిండియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడో వన్డేలో దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ హర్మన్‌కు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ 2 డీ మెరిట్ పాయింట్లకు ఓ టీ20 మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకున్న హార్మన్.. టీమిండియా తదుపరి ఆడే ఆసియా క్రీడల్లో తొలి రెండు టీ20లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాలో టాప్ జట్టుగా ఉన్న భారత్ ఏసియన్ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనలు అమలైతే.. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు హర్మన్ లేకుండా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరుకుంటే హర్మన్ ఆ మ్యాచ్ ఆడేందుకు అర్హత కలిగి ఉంటుంది. హర్మన్ గైర్హాజరీలో స్మృతి మంధన టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో గోల్డ్ మెడల్‌పై కన్నేసిన భారత్‌కు కెప్టెన్ హర్మన్ లేకపోవడం పెద్ద లోటుగా పరిగణించాలి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఏసియన్ గేమ్స్-2023లో భారత్ పురుషుల క్రికెట్ జట్టు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. -
Harmanpreet Kaur Fined: హర్మాన్ ప్రవర్తనపై ఐసీసీ ఆగ్రహం...నిషేధం తప్పదా ?
-
టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్‌తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్‌తో వికెట్లను కొట్టనందుకు గాను, అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా అంపైర్లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసినందుకు గాను హార్మన్‌కు ఐసీసీ జరిమనా విధించింది . Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 హర్మన్ వ్యవహరించిన తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్ ఫీజ్‌లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్ ప్రవర్తనను లెవెల్ 2 అఫెన్స్ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 జరిమానాలో 50 శాతం ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే 3 డీమెరిట్ పాయింట్లు ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్ పాయింట్ ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 కాగా, బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని భావించిన హర్మన్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది. బ్యాట్‌తో వికెట్లను కొట్టడమే కాకుండా.. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఇంతటితో ఆగని హర్మన్.. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్ అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు కనీసం స్వాగతం కూడా పలకలేదని అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగ్ లోపాలే అనుకున్నాం.. వారికి కనీస మర్యాదలు కూడా తెలియవని తీవ్రస్థాయి పదజాలాన్ని వాడింది. అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ మొత్తం పూర్తయ్యాక బంగ్లా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు కూడా నిరాకరించింది. -
కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! హర్మన్‌పై సీరియస్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో దురుసగా ప్రవర్తించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అంపైర్ ఔట్ ఇచ్చాడానే కోపంతో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టి హర్మన్ పెవిలియన్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం కూడా అంపైర్లపై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసింది. "ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో" అంటూ హర్మన్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా.. చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ వ్యవహిరించిన తీరును బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుబట్టింది. కాగా ఈఎస్పీఈన్ రిపోర్టు ప్రకారం.. బంగ్లాదేశ్‌తో పోస్ట్ సిరీస్ ఫోటోలు దిగడానికి కూడా హర్మన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఈఎస్పీఈన్తో సుల్తానా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో ఏమి జరిగిందో మనందరికి తెలుసు. అది తన వ్యక్తిగత సమస్య. కానీ సహచర (బంగ్లాదేశ్) ఆటగాళ్లతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. కనీసం జాయింట్ ఫోటోగ్రాఫ్ దిగేందుకు కూడా ఆమె నిరాకరించింది. అది మంచి పద్దతి కాదు. నేను కూడా నా జట్టు ఆటగాళ్లను తీసుకుని ఫోటో సెక్షన్ నుంచి వెళ్లిపోయాను. క్రికెట్ అనేది గౌరవం క్రమశిక్షణతో కూడిన ఆట. ఈ మ్యాచ్‌లో ఉన్న వారు చాలా అనుభవజ్ఞులైన అంపైర్లు. చాలా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్లుగా పనిచేశారు. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారు తీసుకున్న నిర్ణయాలు అంతిమంగా పరిగణించబడతాయి" అని వాఖ్యనించింది. చదవండి: IND vs WI: వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! వీడియో వైరల్ Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్‌గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్‌కు వచ్చినందుకు మా ఇండియన్ టీమ్ తరపున హైకమీషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్‌ప్రీత్ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్ చేశారు. తప్పుడు నిర్ణయం.. అంపైర్‌పై కోపంతో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్‌ప్రీత్ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్
ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని మేఘనా సింగిల్ తీసి రోడ్రిగ్స్‌కు స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత రోడ్రిగ్స్ మరో పరుగు తీసి స్కోర్లను సమం చేసింది. ఈ సమయంలో స్ట్రైక్‌లోకి వెళ్లిన మేఘనా సింగ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో సాధించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కోపంతో ఊగిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేశారు. అంపైర్ వెంటనే ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్‌తో సంప్ట్ప్ను పడగొట్టి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టి20 క్రికెట్ జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుండగా.. పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ టీమిండియాకు ఎంపిక కాగా.. ఐపీఎల్లో రాణించిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రబ్‌సిమ్రన్ సింగ్‌లకు తొలిసారి జాతీయ జట్టుకు ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలు చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. ఇక మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి, బారెడ్డి అనూషలకు టీమిండియాలో చోటు దక్కింది. టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam… — BCCI (@BCCI) July 14, 2023 టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూషా బారెడ్డి TEAM - Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Jemimah Rodrigues, Deepti Sharma, Richa Ghosh (wk), Amanjot Kaur, Devika Vaidya, Anjali Sarvani, Titas Sadhu, Rajeshwari Gayakwad, Minnu Mani, Kanika Ahuja, Uma Chetry (wk), Anusha Bareddy https://t.co/kJs9TQKZfw — BCCI Women (@BCCIWomen) July 14, 2023 చదవండి: #RAshwin: అశ్విన్ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే -
భారత జట్టుకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌లో..
India Women tour of Bangladesh, 2023- మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ ఆశలకు ఆతిథ్య జట్టు గండికొట్టింది. ఆఖరి టి20లో బంగ్లా ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో బోల్తా పడింది. దీంతో సిరీస్‌ను 3–0 గెలవాలనుకున్న భారత్ 2–1తో సరిపెట్టుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (11) సహా అందరు మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (40; 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (28; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3, సుల్తానా 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లా 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 103 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షమీమా సుల్తానా (46 బంతుల్లో 42; 3 ఫోర్లు) గెలిపించే బాధ్యత తీసుకుంది. భారత బౌలర్లలో దేవిక వైద్య, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా మహిళల జట్టుకు బంగ్లా చేతిలో ఇది మూడో ఓటమి. ఈ మూడు మ్యాచ్‌లకూ హర్మన్‌ప్రీత్ కౌరే కెపె్టన్‌గా వ్యవహరించింది. ఈ పర్యటనలో తదుపరి మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ కూడా ఇదే వేదికపై 16న జరిగే తొలి వన్డేతో మొదలవుతుంది. చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో.. -
రాణించిన మంధన.. మెరిసిన హర్మన్.. టీమిండియా ఘన విజయం
3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇవాళ (జులై 9) జరిగిన తొలి టీ20లో భారీ విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు తలో చేయి వేయడంతో టీమిండియా అలవోకంగా బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్ధిని 114 పరుగుల స్వల్ప స్కోర్‌కే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పూజా వస్త్రాకర్ (4-1-16-1), షఫాలీ వర్మ (3-0-18-1), మిన్నూ మణి (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ తీయగా.. ఆంధ్రప్రదేశ్ (అనంతపురం) అమ్మాయి బారెడ్డి అనూష (4-0-24-0) పర్వాలేదనిపించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాతి రాణి (22), శోభన మోస్టరీ (23), షోర్ణా అక్తెర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలింతగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రాణించిన మంధన.. మెరిసిన హర్మన్ 115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడింది. 38 పరుగులతో స్మృతి మంధన రాణించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో మెరిసింది. జెమీమా రోడ్రిగెస్ (11) నిరాశపర్చగా, యస్తికా భాటియా (9 నాటౌట్) సహకారంతో హర్మన్ టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 2 వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్ ఓ వికెట్ దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జులై 11న జరుగుతుంది. -
బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ!
నాలుగు నెలల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌ల పర్యటనలో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాపై భారత జట్టు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. భారత్ కోణంలో చూస్తే పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువ క్రీడాకారిణులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నిలిచింది. సీనియర్ స్పిన్నర్లు రాధ యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్ లేకపోవడంతో తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనూషకు ఇది మంచి చాన్స్. ఆమె తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఎంపికైన పేసర్ మోనికా పటేల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. భారత మహిళల జట్టు కోచ్‌గా అమోల్ మజుందార్ ఎంపిక దాదాపు ఖాయమైనా...అధికారిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అతను కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్–19 జట్టు, ఇటీవల ఆసియా కప్ గెలిచిన అండర్–23 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, బారెడ్డి అనూష -
సూర్య, హర్మన్‌ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా టి20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్లో సూపర్ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్ విజ్డన్ అల్మానిక్ లీడింగ్ టి20 క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు గెలుచుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తద్వారా విజ్డన్ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టి20 క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్‌రేట్‌తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో 28 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక నాటింగ్హమ్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం. ఇక హర్మన్‌ప్రీత్ గతేడాది కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో 143 పరుగులు నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక కెప్టెన్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఔట్‌స్టాండింగ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా మూడోసారి లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ వరల్డ్ టాప్ వుమెన్స్ క్రికెటర్ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది. -
చీరకట్టులో తళుక్కుమన్న టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త లుక్‌తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే ఈ ఛాంపియన్ కెప్టెన్ కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ఫ్యూజులు ఎగురగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. View this post on Instagram A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని, తెలుగమ్మాయిలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడంతో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్లో హర్మన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరెట్‌గా మారిన హర్మన్ సేన, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హేలీ మాథ్యూస్ (4-2-25-3), మేలీ కెర్ (4-0-18-2) అద్భుత ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఛేదనలో నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్), హర్మన్ (37) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. లీగ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన హర్మన్.. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 40.41 సగటున, 135.10 స్ట్రయిక్ రేట్‌తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
హర్మన్ ప్రీత్ డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధిస్తుందని ముందే ఊహించాడు..!
ప్రిడిక్షన్స్ అనేవి క్రికెట్లో సర్వసాధారణం. ఆటగాళ్లు, జట్ల ఫామ్‌ను బట్టి ఏ ఆటగాడు రాణిస్తాడో, ఏ జట్టు గెలుస్తుందో ముందే ఊహించడం పరిపాటిగా మారింది. కొందరేమో వారి అనుభవం వల్ల ఏ ఆటగాడు సెంచరీ కొడతాడో, ఏ ఆటగాడు ఎక్కువ వికెట్లు పడగొడతాడో పక్కాగా చెప్పేస్తుంటారు. ఇటీవలకాలంలో కొందరు ఆటగాళ్లు గతంలో సోషల్‌మీడియా వేదికగా చేసిన కొన్ని పోస్ట్‌లు వైరలయ్యాయి. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గతంలో ఎప్పుడో చేసిన ట్వీట్లు, ప్రస్తుతం ఆటగాళ్ల గణాంకాలతో మ్యాచ్ అవుతుండటం ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. తాజాగా ఇలాంటి ప్రిడిక్షనే ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌కు అందిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు గ్రీన్ స్టోన్ చాలారోజుల ముందే పసిగట్టాడు. హౌజ్జాట్ అనే పుస్తకంలో గ్రీన్‌స్టోన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొద్దిరోజుల కిందట హర్మన్.. ముంబై ఇండియన్స్‌కు డబ్ల్యూపీఎల్ టైటిల్ అందించడంతో ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. Harmanpreet winning it for MI. Predicted thrice!1. https://t.co/6Mp16lNXsp2. In an Instagram reel3. in the book, 'Howzzat' pic.twitter.com/2Zu5zsEUDY— GREENSTONE LOBO (@GreenstoneLobo) March 26, 2023 గ్రీన్‌స్టోన్ వెర్షన్‌పై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఐ ముందే వ్యవస్థలను మేనేజ్ చేసిందని కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే, మరికొందరేమో హర్మన్‌కు ఆ టాలెంట్ ఉండింది కాబట్టి ముంబైను ఛాంపియన్‌గా నిలబెట్టగలిగిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొట్టతొలి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్‌గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్..
ముంబై: తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులోనూ సమష్టి ప్రదర్శనతో అదే జోరును కొనసాగించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా...ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది. ముంబై బౌలింగ్ ధాటికి ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది. కెపె్టన్ మెగ్ లానింగ్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా అంతా విఫలం కావడంతో టపటపా వికెట్లు కోల్పోయింది. దాంతో స్కోరు 79/9కు చేరింది. అయితే ఆఖరి వికెట్‌కు రాధ యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖా పాండే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి 24 బంతుల్లోనే అభేద్యంగా 52 పరుగులు జోడించడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు దక్కింది. అనంతరం ముంబై కూడా 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 74 బంతుల్లో 72 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. 345 డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) నిలిచింది. ఆమె 9 మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 345 పరుగులు సాధించింది. 16 డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా హేలీ మాథ్యూస్ (ముంబై), సోఫీ ఎకెల్‌స్టోన్ (యూపీ వారియర్స్) నిలిచారు. వీరిద్దరు 16 వికెట్ల చొప్పున తీశారు. స్కోరు వివరాలు : ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (రనౌట్) 35; షఫాలీ (సి) కెర్ (బి) వాంగ్ 11; క్యాప్సీ (సి) అమన్‌జోత్ (బి) వాంగ్ 0; జెమీమా (సి) మాథ్యూస్ (బి) వాంగ్ 9; మరిజాన్ కాప్ (సి) యస్తిక (బి) కెర్ 18; జొనాసెన్ (సి అండ్ బి) మాథ్యూస్ 2; అరుంధతి రెడ్డి (సి) ఇషాక్ (బి) కెర్ 0; శిఖా పాండే (నాటౌట్) 27; మిన్ను (సి) యస్తిక (బి) మాథ్యూస్ 1; తానియా (బి) మాథ్యూస్ 0; రాధ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–35, 4–73, 5–74, 6–75, 7–75, 8–79, 9–79. బౌలింగ్: నాట్ సివర్ 4–0–37–0, ఇసీ వాంగ్ 4–0–42–3, సైకా ఇషాక్ 4–0–28–0, అమేలియా కెర్ 4–0–18–2, హేలీ మాథ్యూస్ 4–2–5–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అరుంధతి (బి) జొనాసెన్ 13; యస్తిక (సి) క్యాప్సీ (బి) రాధ 4; నాట్ సివర్ (నాటౌట్) 60; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 37; అమేలియా కెర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–95. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–22–0, రాధ యాదవ్ 4–0–24–1, జొనాసెన్ 4–0–28–1, శిఖా పాండే 4–0–23–0, అలైస్ క్యాప్సీ 3.3–0–34–0. -
ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఈరోజు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో అలీసా హీలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. హర్మన్‌తో పాటు హీలీ మాథ్యూస్, యస్తిక భాటియా, స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్ , పూజా వస్త్రాకర్ రూపంలో టాప్ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సైకా ఇషాఖ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ తహిలా మెక్‌గ్రాత్, సోఫియా ఎకెల్‌స్టోన్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చదవండి: ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా! పాపం ముంబై!
WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచింది. పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్’గా నిలిచి ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్సీ క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లానింగ్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్ (31 నాటౌట్; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు The first-ever team to make it to the 𝗙𝗜𝗡𝗔𝗟 of #TATAWPL 🙌 The @DelhiCapitals are ready to roar 🔥🔥 pic.twitter.com/LZclWYNH8J — Women's Premier League (WPL) (@wplt20) March 22, 2023 -
ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ లీగ్ దశను విజయంతో ముగిస్తే.. ఆర్సీబీ మాత్రం ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కావడంతో మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినప్పటికి గెలుపుతో టోర్నీని ముగిద్దామని భావించిన ఆర్సీబీ వుమెన్‌కు నిరాశే ఎదురైంది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. తొలి వికెట్‌కు హేలీ మాథ్యూస్(24 పరుగులు), యస్తికా బాటియా(30 పరుగులు) 50 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ అవ్వడం.. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ట్రాక్ ఎక్కినట్లే కనిపించింది. కానీ అమేలియా కెర్(31 నాటౌట్).. పూజా వస్త్రాకర్(19 పరుగులు) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి జట్టును గెలిపించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో కనికా అహుజా రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక్ పాటిల్, ఎల్లిస్ పెర్రీ, మేఘన్ స్కా్ట్, ఆశా శోభనా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ సేన 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్ రెండు, ఇసీ వాంగ్, సయికా ఇషాకీ చెరొక వికెట్ తీశారు. చదవండి: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే! మెస్సీకి చేదు అనుభవం.. -
ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ ఆటతీరు ఏమాత్రం మారడం లేదు. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆర్సీబీ వుమెన్ తమ బ్యాటింగ్ మెరుపులు ఒక్కదానికే పరిమితం అన్నట్లుగా తయారయ్యింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. మిగతావారు బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్, ఇసీ వాంగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సయికా ఇషాకీ ఒక వికెట్ తీసింది. -
ఉపయోగం లేని మ్యాచ్.. టాప్ ప్లేస్ కోసం మాత్రమే
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ లీగ్ మ్యాచ్‌లకు ఆఖరిరోజు. నేటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్న వేళ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉపయోగం లేని మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఏంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్, యూపీ వారియర్జ్లు ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ, గుజరాత్‌లు ఎలిమినేట్ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ముంబైతో మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సోఫీ డివైన్‌పై మరోసారి దృష్టి నెలకొంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టాప్ప్లేస్తో లీగ్ దశను ముగియాలని చూస్తుంది. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ వుమెన్: యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్. ఆర్సీబీ వుమెన్: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, మేగన్ షుట్, ప్రీతి బోస్ 🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @RCBTweets. Follow the match ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/AfbXXSf7la — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ అందుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూపీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హేలీ మాథ్యూస్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. దేవికా డ్రైవ్ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. ఇక్కడే హర్మన్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేదే. అందుకే క్యాచ్ అందుకోగానే హర్మన్ కూడా చాలాసేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్లో తిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. Cheer on Hayley and Harry as they take on the UP Warriors in the #WPL2023 season! 🏏🔥 Use the hashtags #OneFamily, #MumbaiIndians, #AaliRe, and #MIvUPW to show your support for the Mumbai Indians 💙#CricketGaliyara #CricketTwitter #cricketnews pic.twitter.com/Ua4SjQBV2p — Cricket Galiyara (@cricketgaliyara) March 18, 2023 చదవండి: Deepthi Sharma: చరిత్రలో నిలిచిపోయే రనౌట్.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి -
ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమెలియా కెర్ రెండు వికెట్లు తీయగా.. నట్ సివర్, హేలీ మాథ్యూస్, ఇసీ వాంగ్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్ విజయంతో ఆర్సీబీ వుమెన్ ప్లేఆఫ్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్ రన్‌రేట్ కలిగి ఉండడమే దీనికి కారణం. Take a bow @Sophecc19 🙌🏻🙌🏻She finishes in style with a SIX & powers @UPWarriorz to a thrilling win! 👏👏Scorecard ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/pwR2D2AoLZ— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
యూపీ వారియర్జ్‌కు సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఏంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అయితే పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మైనస్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం ఒకరిద్దరిపైనే ఆధారపడింది. కెప్టెన్ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్ నవగిరే, తాహిలా మెక్‌గ్రాత్‌లు రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan. Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX — Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
హర్మన్ ధనాధన్ హాఫ్ సెంచరీ.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీ బాదింది. ఓపెనర్ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నెర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు. నట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (రనౌట్) 44; హేలీ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; నట్ సీవర్ (ఎల్బీ) (బి) గార్త్ 36; హర్మన్‌ప్రీత్ (సి) హర్లీన్ (బి) గార్డ్నెర్ 51; అమెలియా (సి) గార్త్ (బి) కన్వార్ 19; ఇసి వాంగ్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 0; హుమైరా (రనౌట్) 2; ధార (నాటౌట్) 1; అమన్‌జోత్ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; కలిత (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్: గార్డ్నెర్ 4–0–34–3, కిమ్ గార్త్ 4–0–31–1, స్నేహ్ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్ 4–0–42–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (ఎల్బీ) (బి) నట్ సీవర్ 0; మేఘన (సి) నట్ సీవర్ (బి) హేలీ 16; హర్లీన్ (ఎల్బీ) (బి) వాంగ్ 22; అనాబెల్ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్నెర్ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్ (ఎల్బీ) (బి) నట్ సీవర్ 20; హేమలత (సి) వాంగ్ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్) 18; గార్త్ (సి) హర్మన్ (బి) నట్ సీవర్ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్: నట్ సీవర్ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్ 3–0–19–1, హేలీ మాథ్యూస్ 4–0–23–3, అమెలియా కెర్ 4–0–18–2, అమన్‌జోత్ 1–0–6–0. -
ఎదురులేని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో విజయం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ దూసుకుపోతుంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ముంబై బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్నేహ్రాణా 20 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో నట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ 2 వికెట్లు పడగొట్టింది.అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్రాణా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
హర్మన్‌ప్రీత్ ఫిఫ్టీ.. గుజరాత్ జెయింట్స్ టార్గెట్ 163
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ పోరాడే స్కోరు సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔటయ్యాక వెంటనే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో 136 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవర్లో అష్లీ గార్డ్నర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వరుస బంతుల్లో హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్ కౌర్‌లను ఔట్ చేసింది. కానీ, ఆఖరి బంతికి జింతిమని కతియా రెండు రన్స్ తీసింది. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ నిలువరిస్తుందా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే… ఓపెనర్లు మేఘన, సోఫీ భారీ స్కోర్ చేయడం లేదు. హర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజయం మాత్రమే సాధించిన గుజరాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరం. గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అన్నబెల్ సథర్లాండ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్ -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్‌గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. యస్తికా బాటియా 41, హేలీ మాథ్యూస్ 32 పరుగులతో రాణించారు. ఇక నట్‌సివర్ బ్రంట్ 23 నాటౌట్, హర్మన్ 11 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. తొలి వికెట్ డౌన్.. విజయం దిశగా ముంబై ఇండియన్స్ 106 పరుగుల స్వల్ప చేధనలో భాగంగా ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులతో దాటిగా ఆడుతున్న యస్తికా బాటియా తారా నోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 22 పరుగులతో ఆడుతుంది. దూకుడు ప్రదర్శిస్తున్న ముంబై.. 4 ఓవర్లలో 33/0 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడు ప్రదర్శిస్తుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. యస్తికా బాటియా 14, హేలీ మాథ్యూస్ 17 పరుగులతో ఆడుతున్నారు. 105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. కుప్పకూలిన ఢిల్లీ ఇన్నింగ్స్.. 85 పరుగులకే ఏడు వికెట్లు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. 4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/1 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 10 పరుగులు, కాప్సీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. షఫాలీ వర్మ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 2 పరుగులు చేసిన షఫాలీ వర్మ సయికా ఇషాకీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. 2 ఓవర్లలో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 8 పరుగులుగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వుమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇరుజట్ల మధ్య టఫ్‌ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI): హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్‌ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్‌ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్‌బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్‌లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్‌లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్‌లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్‌లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడారు. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్‌లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్‌ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్‌నిచ్చిన ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్‌మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్‌లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్‌లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్‌లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్‌ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
MI Vs RCB: ఓటమికి ప్రధాన కారణం అదే.. అయినా: స్మృతి మంధాన
Same Results Memes Trolls On RCB: ‘‘మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. మెరుగైన స్కోరు నమోదు చేయాల్సింది. ఓటమిని అంగీకరించకతప్పదు. అయితే, కచ్చితంగా లోపాలు సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటాం. నిజానికి నాతో సహా ఇద్దరు- ముగ్గురు బ్యాటర్లు కనీసం 20 పరుగులు చేయగలిగారు. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. నిజం చెప్పాలంటే.. మా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. 6-7 మంచి ఆప్షన్లు ఉన్నాయి. కానీ బ్యాటర్లు మెరుగైన స్కోరు నమోదు చేయనపుడు వారు మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇందుకు వాళ్లను బాధ్యులను చేయడం సరికాదు. ఫ్రాంఛైజ్ క్రికెట్లో మనకు శుభారంభాలు లభించినా.. మ్యాచ్ గెలుస్తున్నామనిపించినా.. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. అయితే, ఈ రోజు మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ కనిక, శ్రియాంక బ్యాటింగ్ చేసిన తీరు మాకు అత్యంత సానుకూల అంశం. వాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో పోరులో ఓటమికి బాధ్యత వహించిన స్మృతి.. బ్యాటర్ల వైఫల్యమే పరాజయానికి ప్రధాన కారణమని తెలిపింది. PC: RCB కాగా మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన 23, వికెట్ కీపర్ రిచా ఘోష్ 28, లోయర్ ఆర్డర్లో కనికా అహుజా 22, శ్రియాంక పాటిల్ 23, మేగన్ షట్ 20 పరుగులు చేయగలిగారు. మిగిలిన వాళ్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి టార్గెట్ ఛేదించింది. ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్ 77 పరుగులతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నటాలీ సీవర్- బ్రంట్ 55 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హేలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడటంతో ఆర్సీబీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఆర్సీబీ రాత మారదని, కోహ్లి వారసత్వాన్ని స్మృతి కొనసాగిస్తుందంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ ఇందుకు ధీటుగానే బదులిస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్‌లతో అంచనా వేయొద్దని హితవు పలుకుతున్నారు. ఇక స్మృతి సేన మార్చి 8న గుజరాత్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: WPL 2023 GG Vs RCB: మహిళా దినోత్సవ కానుక.. బీసీసీఐ బంపరాఫర్.. అందరికీ ఉచిత ప్రవేశం! Shubman Gill: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ.. Every Year Same Story For RCB Fans And Meme Material For MI And CsK Fans pic.twitter.com/sgKFfQOqPt — Captain Jack Sparrow (@ImVivaan45) March 6, 2023 Virat Kohli Legacy is Followed By #SmritiMandhana🤣🤣 Haarcb ☕☕#RCBWvsMIW . #MIvsRCB . #WPL2023 pic.twitter.com/dBB11lv8GY — क्रिकेट प्रेमी (Cricket Premi) VK18 💓 (@cricaddicted18) March 6, 2023 -
MI Vs RCB: పరుగుల వరద.. ముంబైపై ఆర్సీబీ గెలుపు ఖాయం!
Womens Premier League 2023 RCB VS MI: మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలుస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముంబై ఇండియన్స్ మహిళా జట్టుపై స్మృతి సేన పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని.. ఆర్సీబీని విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలని సూచించాడు. ఇక ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉన్నపటికీ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బెంగళూరు మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరిగింది బ్రబౌర్న్ స్టేడియంలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబైతోనూ అదే మైదానంలో పోటీపడనుంది. ఇప్పటికే బ్రబౌర్న్‌లో ఆడినందు వల్ల అక్కడి పరిస్థితులపై ఆర్సీబీ ప్లేయర్లకు అవగాహన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ గత ప్రదర్శనలు గమనిస్తే అందరూ ముంబై వైపే మొగ్గు చూపుతారు. కానీ నేను మాత్రం ఈసారి ఆర్సీబీకే ఓటు వేస్తున్నా. స్మృతి రాణిస్తేనే అయితే, స్మృతి భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై స్పిన్ ఆల్‌రౌండర్ హైలీ మాథ్యూస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. ఈ ఆఫ్ స్పిన్నర్ కచ్చితంగా స్మృతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్మృతి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక సోఫీ డివైన్ కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. ఇక ఆర్సీబీ పేస్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ సేవలను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై టాపార్డర్ అత్యద్భుతంగా ఉంది. హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్.. ఆ తర్వాత పూజా వస్త్రాకర్‌లతో పటిష్టంగా కనపడుతోంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న ఆకాశ్ చోప్రా.. ‘‘బ్రబౌర్న్ పిచ్ ఫ్లాట్‌గా ఉంది. మరో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవాలి. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది.. కాబట్టి ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటే కనీసం 200 పరుగులు స్కోరు చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూపీఎల్-2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడ్డ ముంబై.. 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ సేన ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించింది. మరోవైపు.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ టీమ్‌తో తలపడ్డ ఆర్సీబీ.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఆర్సీబీ సారథి స్మృతి 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం (మార్చి 6) మ్యాచ్ జరుగనుంది. చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన సచిన్ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు -
చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను పరిచయం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు), ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) చెలరేగడంతో చేతులెత్తేసిన గుజరాత్ టీమ్ 15.1 ఓవర్లలో 64 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. pic.twitter.com/EpIaVdOCoX — WPL MAHARASTRA (@WMaharastra) March 4, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. గుజరాత్ ఇన్నింగ్స్ సందర్భంగా సైకా ఇషాఖీ బౌల్ చేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించింది. అయితే అంపైర్ కాల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ముంబై కెప్టెన్ హర్మన్ రివ్యూ కోరింది. రీప్లేలో బంతి బ్యాటర్ మోనిక గ్లోవ్స్‌ను తాకినట్లు స్పష్టంగా తెలియడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. క్రికెట్ చరిత్రలో ఇలా వైడ్ బాల్ విషయంలో రివ్యూకి వెళ్లడం ఇదే తొలిసారి. WPLలో వైడ్ బాల్స్‌తో పాటు నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు ఉంది. ఈ ఛాన్స్‌ను హర్మన్ విజయవంతంగా వాడుకుని సక్సెస్ అయ్యింది. గతంలో ఔట్ విషయంలో మాత్రమే అంపైర్ కాల్‌ను ఛాలెంజ్ చేసే అవకాశం ఉండేది. WPL 2023 నుంచి బీసీసీఐ వైడ్, నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు కల్పించింది. హోరాహోరీ మ్యాచ్‌ల్లో రాంగ్ కాల్ (వైడ్, నో బాల్) వల్ల నష్టం జరగకూడదనే బీసీసీఐ ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. వైడ్‌బాల్ రివ్యూ వల్ల ముంబై ఇండియన్స్‌ను ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. ఇలాంటి రూల్ ఒకటి ఉందని సగటు క్రికెట్ అభిమానికి ఈ మ్యాచ్ ద్వారానే తెలిసింది. -
గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబైను గెలిపించిన ఈ అమ్మాయి ఎవరు..?
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) మెరుపు అర్ధశతకంతో, ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), నాట్ సీవర్-బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2.. వేర్హమ్, గార్డ్నర్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) ధాటికి 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి పేకమేడలా కూలింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (23 బంతుల్లో 29 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), 11వ నంబర్ ప్లేయర్ మోనికా పటేల్ (9 బంతుల్లో 10; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. గుజరాత్ స్కోర్ కార్డు సున్నాలు, సింగిల్ డిజిట్ స్కోర్లతో నిండుకుని ఫుట్‌బాల్ స్కోర్ కార్డును తలపించింది. సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0 రిటైర్డ్ హర్ట్), హర్లీన్ డియోల్ (0), ఆష్లే గార్డ్నర్ (0), అన్నాబెల్ సుదర్లాండ్ (6), జార్జియా వేర్హమ్ (8), స్నేహ్ రాణా (1), తనుజా కన్వర్ (0), మాన్సీ జోషీ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సైకా ఇషాఖీ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇషాఖీ ఎవరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు. సైకా ఇషాఖీ గురించి నెట్లో సెర్చ్ చేయగా.. ఆమె ఓ దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన 27 ఏళ్ల ఇషాఖీ.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయనప్పటికీ ఇండియా డి వుమెన్, ట్రయల్‌బ్లేజర్స్, బెంగాల్, ఇండియా ఏ వుమెన్ జట్లకు ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యమున్న ఇషాఖీ.. 2021లో ఇండియా-సితో జరిగిన ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అమేలియా కెర్ర్, హేలీ మాథ్యూస్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లు ఉన్నా, ఇషాఖీ వారిని ఫేడ్ అవుట్ చేసి మరీ సత్తా చాటింది. ఈ ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శనతో ఇషాఖీ రాత్రికిరాత్రి స్టార్‌గా మారిపోయింది. -
ముంబై మెరుపులు
అప్పుడెలాగో... ఇప్పుడు అలాగే.... పురుషుల ఆటలోని మెరుపులు అమ్మాయిల లీగ్‌లోనూ కనిపించాయి. 2008లో పురుషుల లీగ్ ధనాధన్‌గా ప్రారంభమైన రీతిలో మహిళల లీగ్ డబ్ల్యూపీఎల్‌కు కూడా తెర లేచింది. కోల్‌కతాలాగే ముంబై చెలరేగగా... భారీ లక్ష్య ఛేదనలో నాడు బెంగళూరు కుదేలైనట్లే... తాజాగా గుజరాత్ కూడా విలవిల్లాడింది. మొత్తానికి ఈ రెండు లీగ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు (కోల్‌కతా, ముంబై) 200 పైచిలుకు స్కోరుతో తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాయి. అంతకు ముందు తారాలోకంతో కూడిన ‘గానాబజానా’ వేడుకలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్ర ముంబై ఇండియన్స్ బోణీతో మొదలైంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 143 పరుగుల తేడాతో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అమెలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరిపించారు. అనంతరం గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. హేమలత (29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇశ్వక్ 4 వికెట్లు తీసింది. చెలరేగిన హేలీ, హర్మన్ హేలీ మాథ్యూస్‌తో ముంబై ఇన్నింగ్స్ ఆరంభించిన యస్తిక భాటియా (1) నిరాశ పరిచింది. అయితే నట్ సీవర్ బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), హేలీ ధాటిగా ఆడటంతో వేగం పెరిగింది. హేలీ అయితే భారీ సిక్సర్లతో అలరించింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరగా... కాసేపటికి వరుస ఓవర్లలో బ్రంట్, హేలీ నిష్క్రమించారు. 10 ఓవర్లలో ముంబై స్కోరు 77/3. తర్వాత సగం ఓవర్ల ఆట రూటు మారింది. అమెలియా కెర్ అండతో కెపె్టన్ హర్మన్ ఒక్కసారిగా బౌండరీలతో విరుచుకుపడింది. కాసేపు ఇద్దరి ఆట పురుషుల లీగ్‌ను గుర్తుకుతెచ్చింది. మోనిక పటేల్ 15వ ఓవర్లో తొలి రెండు బంతులాడిన అమెలియా ఒక ఫోర్ కొడితే... తర్వాతి నాలుగు బంతుల్ని హర్మన్ బౌండరీలకు తరలించింది. ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లోనూ ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టిన హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో (11 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్–కెర్ జోడీ నాలుగో వికెట్‌కు కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు. హర్మన్ నిష్క్రమించాక... అమెలియా, పూజ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ధాటిని కొనసాగించడంతో జట్టు స్కోరు 200 దాటింది. గుజరాత్ ఆట పేలవంగా మొదలై... చివరకు చిత్తుగా ఓడింది. టాపార్డర్‌లో మూనీ (0 రిటైర్డ్‌హర్ట్) గాయంతో వెనుదిరగ్గా... హర్లీన్ (0), సహా గార్డ్నర్ (0), తనూజ (0) ఖాతానే తెరువలేదు. ఏకంగా 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హేమలతతో పాటు మోనిక (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జార్జియా (బి) తనూజ 1; హేలీ (బి) గార్డ్నెర్ 47; సీవర్ (సి) స్నేహ్ రాణా (బి) జార్జియా 23; హర్మన్‌ప్రీత్ (సి) హేమలత (బి) స్నేహ్ రాణా 65; అమెలియా నాటౌట్ 45; పూజ (సి) మోనిక (బి) స్నేహ్ రాణా 15; ఇసి వాంగ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–15, 2–69, 3–77, 4–166, 5–201. బౌలింగ్: ఆష్లే గార్డ్నెర్ 4–0–38–1, మాన్సి 2–0–17–0, తనూజ 2–0–12–1, మోనిక 2–0–34–0, జార్జియా 3–0–30–1, అనాబెల్ 3–0–32–0, స్నేహ్ రాణా 4–0–43–2, గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (బి) సీవర్ 2; బెత్ మూనీ రిటైర్డ్ హర్ట్ 0; హర్లిన్ (సి) వాంగ్ (బి) నట్ సీవర్ 0; ఆష్లే గార్డ్నెర్ (సి) హేలీ (బి) వాంగ్ 0; అనాబెల్ (బి) ఇష్వాక్ 6; హేమలత నాటౌట్ 29; జార్జియా (బి) ఇషా్వక్ 8; స్నేహ్ రాణా (ఎల్బీ) (బి) అమెలియా 1; తనూజ (సి) నట్ సీవర్ (బి) అమెలియా 0; మాన్సి జోషి (ఎల్బీ) (బి) ఇష్వాక్ 6; మోనిక (బి) ఇష్వాక్ 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 64. వికెట్ల పతనం: 1–1, 2–3, 3–5, 4–12, 5–22, 6–23, 7–23, 8–49, 9–64. బౌలింగ్: నట్ సీవర్ 2–0–5–2, ఇసి వాంగ్ 3–0–7–1, సయిక ఇషా్వక్ 3.1–1–11–4, అమెలియా కెర్ 2–1–12–2, పూజ 2–0–9–0, కలిత 2–0–12–0, హేలీ 1–0–8–0. డాటిన్ వివాదం డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందే ఒక అనూహ్య పరిణామం వివాదాన్ని రేపింది. గుజరాత్ జెయింట్స్ జట్టు తమ ప్రధాన ప్లేయర్ డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) గాయపడిందని ప్రకటించింది. ఆమె స్థానంలో ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌ను తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే డాటిన్నుంచి భిన్నమైన స్పందన వచి్చంది. తాను అసలు గాయంతోనే లేదని ఆమె ప్రకటించడం విశేషం. ‘నేను కోలుకుంటున్నానని చెబుతున్నాను. అసలు ఏదైనా అయితే కదా నేను కోలుకునేది. దేనినుంచి కోలుకుంటున్నానో నాకే తెలీదు. నిజాలు చెబితే బాగుంటుంది’ అని ట్వీట్ చేసింది. దీనిపై గుజరాత్ యాజమాన్యం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వేలంలో డాటిన్‌ను గుజరాత్ రూ. 60 లక్షలకు తీసుకుంది. మహిళల టి20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు ఉన్న డాటిన్ విండీస్ తరఫున 127 టి20లు ఆడింది. మహిళల టి20ల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు బెంగళూరు VS ఢిల్లీ మ.గం. 3.30 నుంచి యూపీ VS గుజరాత్ రా.గం. 7.30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఫోర్లతో హర్మన్ హల్చల్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫిఫ్టీ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో తొలి అర్థశతకం నమోదైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీగ్‌లో తొలి ఫిఫ్టీ సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వేగంగా ఆడిన హర్మన్ వరుస బౌండరీలతో విరుచుకుపడింది. బౌండరీల రూపంలోనే 44 పరుగులు వచ్చాయంటే ఆమె ఎంత దూకుడుగా ఆడిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక హర్మన్ ఇన్నింగ్స్ ఒక్క సిక్సర్ లేకుండా కేవలం బౌండరీలు మాత్రమే ఉండడం విశేషం. మ్మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. -
64 పరుగులకే కుప్పకూలిన గుజరాత్.. ముంబై ఘన విజయం
గుజరాత్ జెయింట్స్‌కు దారుణ పరాభవం ►డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దయాలన్ హేమలత 29 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైకా ఇషికీ నాలుగు వికెట్లతో చెలరేగింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ► గుజరాత్ జెయింట్స్ ఫేలవ ఆటతీరు కనబరుస్తుంది. మాన్సి జోషి(6) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ ► గుజరాత్ జెయింట్స్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. వర్హెమ్ 4, దయాలన్ హేమలత ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ ► 208 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత కెప్టెన్ బెత్ మూనీ కాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్ వాంగ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. మరుసటి బంతికే స్టార్ బ్యాటర్ అష్లీ గార్డనర్ గోల్డెన్ డకౌట్ అయింది. సబ్బినేని మేఘన రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరింది. హర్మన్, అమెలీ కైర్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు ► డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ముగిసిన హర్మన్ జోరు.. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ► కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హర్మన్(30 బంతుల్లో 65) స్నేహ్రాణా బౌలింగ్‌లో హేమలతాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ మెరుపులు.. భారీ స్కోరు దిశగా ముంబై ► ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీల వర్షం కురిపిస్తోంది. తద్వారా ముంబై భారీ స్కోరు దిశగా కదులుతుంది. 15 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులతో హర్మన్ దూకుడు ఆటతీరును కనబరుస్తోంది. ప్రస్తుతం ముంబై 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ► దూకుడుగా ఆడిన హేలీ మాథ్యూస్ 47 పరుగుల వద్ద గార్డనర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న విండీస్ క్రికెటర్ ► విండీస్ క్రికెటర్ హెలీ మాథ్యూస్ సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ముంబై 8.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మాథ్యూస్ 41 పరుగులతో క్రీజులో ఉంది. సివర్ బ్రంట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ► ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్ నష్టానికి 44 పరుగులుగా ఉంది. సివర్ బ్రంట్ 189, మాథ్యూ హెలిస్సా 23 పరుగులతో ఆడుతున్నారు. ► 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు ఎంతంటే? 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వుమెన్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 15, నట్ సివర్ బ్రంట్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు యస్తికా బాటియా(1) తనూజ కన్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. ► టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న గుజరాత్ జెయింట్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం మ్యాచ్‌కు వేదిక కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఏంచుకుంది.గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్ గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి ► అంతకముందు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సింగర్ డిల్లాన్లు తమ ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. -
మహిళల ఐపీఎల్ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..?
తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ (మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా 2023 WPL ఇనాగురల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై టీమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా సంచలన ప్రదర్శనలు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇటీవలికాలంలో వీరి ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ ఐదుగురిని ఆపడం కష్టమని సుస్పష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే.. గుజరాత్‌పై పైచేయి సాధించడం హర్మన్ సేనకు పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తప్పుకోవడం గుజరాత్‌కు మైనస్‌గా చెప్పవచ్చు. గుజరాత్ విజయావకాశలు కెప్టెన్ బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలపైనే అధారపడి ఉన్నాయి. కాగా, WPL టీవీ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను స్పోర్ట్స్ 19 నెట్వర్క్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను జియో సినిమా యాప్, వెబ్సైట్ సొంతం చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్.. హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. గుజరాత్ జెయింట్స్.. బెత్ మూనీ (కెప్టెన్), యాష్లే గార్డ్నర్,జార్జియా వేర్హమ్,స్నేహ్ రాణా, అనాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సోఫియా డన్క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్ షకీల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్‌ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
WPL 2023: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా టీమిండియా సారథి
Women Premier League 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ పేరును ప్రకటించింది. టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా హర్మన్‌ప్రీత్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఉండి.. మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా టీ20 టోర్నీలో జట్టును సెమీస్ వరకు చేర్చింది. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో 150 టీ20లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. సరికొత్త ఇన్నింగ్స్ ఇరవై ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్.. దాదాపు దశాబ్దకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు వెన్నుముకగా ఉంది. ఆమె అందించిన సేవలకు గానూ అర్జున అవార్డు లభించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కుటుంబంలో అడుగుపెట్టిన హర్మన్.. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించనుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న చార్లెట్ ఎడ్వర్డ్‌తో పలు మ్యాచ్‌లలో తలపడ్డ హర్మన్.. మెంటార్ ఝులన్ గోస్వామి ఉన్న జట్టుకు సారథ్యం వహించడం విశేషం. ఇక.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత ముంబైది. గుజరాత్‌తో మ్యాచ్‌తో ఆరంభం ఇప్పుడు ఇద్దరు టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకే ఫ్రాంఛైజీ జట్లకు సారథులుగా ఉండటం మరో విశేషం. దీంతో ముంబై ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపయ్యాయి. తొలి సీజన్లో ముంబై టైటిల్ సాధించాలని అభిమానులు హర్మన్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌తో మార్చి 4న మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేవనుంది. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు కోచింగ్ స్టాఫ్ హెడ్‌కోచ్- చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) బౌలింగ్ కోచ్, మెంటార్- ఝులన్ గోస్వామి(ఇండియా) బ్యాటింగ్ కోచ్- దేవికా పల్షికార్(ఇండియా) ఫీల్డింగ్ కోచ్- లిడియా గ్రీన్వే(ఇంగ్లండ్) ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: Yashasvi Jaiswal: అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..! -
అంత సిల్లీగా అవుటవుతారా? అవునా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్
ICC Womens T20 World Cup 2023- Harmanpreet Kaur: ‘‘అవునా...? ఆయన అలా అన్నాడా? పర్లేదు. నాకైతే ఆ విషయం తెలియదు. అయితే, అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. అయినా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పరుగులు తీసే క్రమంలో సింగిల్ పూర్తి చేసిన తర్వాత మరో పరుగుకు యత్నించినపుడు బ్యాట్ అలా అక్కడ స్టక్ అయిపోయింది. నిజంగా అదో దురదృష్టకర పరిణామం. మేము ఈ మ్యాచ్‌లో మరీ అంత చెత్తగా ఫీల్డింగ్ చేయలేదు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేయకపోవచ్చు.. మరికొన్ని సార్లు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవచ్చు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే మ్యాచ్ గెలవగలం. ఈరోజు మా ప్రదర్శన బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయింది. ఇక రనౌట్ విషయానికొస్తే.. ఆయనన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. నేను గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఆయన అలా ఆలోచిస్తే నేనేమీ చేయలేను. అయితే, కచ్చితంగా అది స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదని మాత్రం చెప్పగలను’’ అంటూ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ నాసిర్ హుస్సేన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. సెమీస్ భారత్ ఓటమి కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే తడబడ్డా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ గెలుపు ఆశలు చిగురింపజేశారు. అనూహ్య రీతిలో రనౌట్ జెమీమా 24 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. హర్మన్ 34 బంతుల్లో 52 పరుగులతో మెరిసింది. అయితే, 14.4 వోర్ వద్ద ఆసీస్ బౌలర్ వారెహాం బౌలింగ్‌లో హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్ అయింది. సింగిల్ పూర్తి చేసిన మరో పరుగు తీసే క్రమంలో.. డైవ్ చేసి బంతిని ఆపిన గార్డ్నర్వికెట్ కీపర్ వైపు బాల్ విసిరింది. ఆ సమయంలో హర్మన్ సులువుగానే క్రీజులోకి చేరుకుంటుందన్నట్లు కనిపించినా బ్యాట్ స్టక్ అయిపోవడంతో.. అప్పటికే బంతిని అందుకున్న హేలీ బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పింది. ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. అతడికి కౌంటర్ ఇదిలా ఉంటే.. హర్మన్ రనౌట్‌పై కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ స్పందిస్తూ.. కాస్తైనా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది అన్న అర్థంలో స్కూల్ గర్ల్ ఎర్రర్ అంటూ లైవ్‌లో వ్యాఖ్యానించాడు. ఇంత సిల్లీగా అవుటవుతారా అని కామెంట్ చేశాడు. ఈ విషయం గురించి మ్యాచ్ తర్వాత హర్మన్‌కు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె పైవిధంగా స్పందిస్తూ అతడికి కౌంటర్ ఇచ్చింది. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! Tim Southee: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
కన్నీటి పర్యంతమైన హర్మన్... అక్కున చేర్చుకున్న అంజుమ్.. వీడియో
ICC Womens T20 World Cup 2023: ఇటీవలే సౌతాఫ్రికాలో అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2023లో మన అమ్మాయిలు అదరగొట్టి ఐసీసీ టైటిల్ గెలిచారు. అదే జోష్‌ను కొనసాగిస్తూ అదే గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ సేన భావించింది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ప్రదర్శనతో టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యం బారిన పడిందన్న వార్త అభిమానులను కలవరపెట్టింది. అయినప్పటికీ, పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కొనే క్రమంలో బరిలోకి దిగిన హర్మన్ అద్భుత ఇన్నింగ్స్(34 బంతుల్లో 52 పరుగులు) ఆడింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 43 పరుగులతో చెలరేగగా.. హర్మన్ అర్ధ శతకంతో మెరిసింది. అయితే, ఆమె రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. ఆఖరి వరకు పోరాడినా గెలుపు గీత దాటలేక ఓటమి ముందు తలవంచింది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది. అద్భుత పోరాట పటిమ కనబరిచినా.. పరాజయం తప్పకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న భారత మాజీ సారథి అంజుమ్ చోప్రా హర్మన్‌ను అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని హర్మన్‌కు ఓదార్పు మాటలు చెప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్ ధరించిన హర్మన్ తన కన్నీటిని మాతృదేశం చూడకూడదనే ఉద్దేశంతోనే వాటిని ధరించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! PSL 2023: బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
'మ్యాచ్‌కు అదే టర్నింగ్ పాయింట్.. లేదంటే విజయం మాదే'
ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరైపోయాయి. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటిముఖం పట్టింది. అయితే కీలక సమయంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ స్పందించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హర్మన్ మాట్లాడుతూ.. "నా బ్యాట్ అలా ఇరుక్కుపోయి ఉండకపోయింటే.. ఆ పరుగు ఈజీగా వచ్చేంది. ఆఖరి వరకు క్రీజులో నేను ఉండి ఉంటే, మా జోరు మ్యాచ్‌ను ఒక ఓవర్ ముందే ఫినిష్ చేసేవాళ్లం. అయినప్పటకి నా తర్వాత దీప్తి శర్మ, రిచా ఘోష్ ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉండేది. రిచా గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ నేను ఔటైన తర్వాత ఏడెనిమిది డాట్ బాల్స్ వచ్చాయి. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఇక నేను జెమిమా క్రీజులో ఉన్నప్పుడు సులువైన బంతులను బౌండరీలుగా మలచాలని అనుకున్నాం. మాకు మొదటి నుంచి ఓవర్‌కు 8 పరుగులు అవసరం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము బ్యాటింగ్ చేశాం.జెమిమా అద్భుతంగా ఆడింది. నాన్-స్ట్రైకర్‌గా ఉన్న భాగస్వామి నుంచి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇక రనౌట్ కూడా ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఆస్ట్రేలియాను 170కి పరిమితం చేస్తే చాలు అని మేము ముందే అనుకున్నాం. ఆ స్కోర్‌ను మేము చేధిస్తామని మాకు నమ్మకం ఉండేది. కానీ నా రనౌట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది" అని ఆమె పేర్కొంది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' -
ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పరాజాయం పాలైన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఏడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. ఊహించని రీతిలో.. కాగా ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను దురుదృష్టం వెంటాడింది. కీలక సమయంలో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. 15వ ఓవర్ వేసిన జార్జియా వేర్హామ్ బౌలింగ్‌లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఆపింది. అయితే సింగిల్‌ను ఇదే సమయంలో హర్మన్, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీప్ హీలీ బెయిల్స్ పడగొట్టడంతో హర్మన్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. దీంతో మ్యాచ్ ఒక్క సారిగా ఆసీస్ వైపు మలుపు తిరిగింది. ఇక అనూహ్యరీతిలో ఔటైన హర్మన్ అసహనానికి గురైంది. ఈ క్రమంలో డగౌట్ వైపు వెళ్తూ కోపంతో తన బ్యాట్‌ను నేలకేసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' pic.twitter.com/D1bYu3qogq — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 23, 2023 -
'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'
మహిళల టీ20 ప్రపంచకప్-2023 టీమిండియా కథ ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం భారత్ పక్షానే నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించింది. అయితే కీలక సమయంలో హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. ఇక ఈ మ్యచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యంది. మైదానంలోనే హర్మన్ కన్నీరు పెట్టుకుంది. భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఇక మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్ పెట్టుకుని హర్మన్ కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రెజెంటేటర్ అద్దాలు ఎందుకు ధరించారని హర్మన్‌ను ప్రశ్నించాడు. అందుకు బదులుగా.. "నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఈ అద్దాలు ధరించాను. మేము కచ్చితంగా మెరుగవుతాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని నేను మాటిస్తున్నాను" అని హర్మన్‌ప్రీత్ సమాధానమిచ్చింది. చదవండి: ENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా! -
అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్! దురదృష్టం అంటే టీమిండియాదే?
మహిళల టీ20 ప్రపంచకప్-2023 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు భారత్ అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (2) శుభారంభం అందించలేకపోయారు. అనంతరం యస్తిక భాటియా (4) రనౌట్ అయ్యింది. దీంతో కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్‌ను చేరింది. అనంతరం హర్మన్ తన దూకుడును ఏ మాత్రం తగ్గంచకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓ దశలో భారత్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అటువంటి సమయంలో దురదృష్టం టీమిండియాను వెంటాడింది. 15వ ఓవర్లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఆపింది. అనంతరం కీపర్ హీలీకి త్రో చేసింది. ఇదే సమయంలో హర్మన్, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. దీంతో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇక జ్వరంతోనే బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ హర్మన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా హర్మన్ రనౌట్‌ను 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్‌తో పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్ ఈ విధంగానే సెమీస్‌లో ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోని కూడా హర్మన్లాగే దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీను పెవిలియన్‌కు పంపాడు. దీంతో మ్యాచ్ కివీస్‌వైపు మలుపు తిరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ధోని,హర్మన్ జర్సీ నెం ఏడు కావడం గమానార్హం. చదవండి: T20 WC 2022: టీమిండియా కొంపముంచిన రనౌట్.. పాపం హర్మన్! వీడియో వైరల్ Ms Dhoni and harmanpreet Kaur!🥺#indiavsaustralia #indvsaus #indvaus #t20worldcup #worldcup #T20WomensWorldCup #T20WorldCup2023 pic.twitter.com/EErB3dZbwo — RVCJ Sports (@RVCJ_Sports) February 23, 2023 Heartbreak💔💔💔 pic.twitter.com/W5uBYHci3q — Abhishek Sandikar (@Elonmast23) February 23, 2023 -
టీమిండియా కొంపముంచిన రనౌట్.. పాపం హర్మన్! వీడియో వైరల్
తొలి ఐసీసీ టైటిల్ సాధించాలని పట్టుదలతో ప్రోటీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ పరాజాయం పాలైంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మన అమ్మాయిలు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్య చేధనలో భారత్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగస్ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్‌ను చేరింది. ఈ క్రమంలో జట్టును గెలిపించే పూర్తి బాధ్యతను కెప్టెన్ హర్మన్ తన భుజాలపై వేసుకుంది. కొంపముంచిన రనౌట్.. అయితే వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ హర్మన్ ఆసీస్ బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ సమయంలో భారత విజయం ఖాయమని అంతా భావించారు. ఇక్కడే భారత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆనూహ్య రీతిలో హర్మన్ (34 బంతుల్లో 52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత ఇన్నింగ్స్ 15 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ భారీ షాట్ ఆడింది. అయితే బంతిని ఆసీస్ ఫీల్డర్ గార్డనర్ అద్భుతంగా బౌండరీ లైన్ దగ్గర అడ్డుకుంది. ఈ క్రమంలో కౌర్, రిచా తొలి పరుగు పూర్తి చేసుకుని రెండో రన్‌కు ప్రయత్నించారు. అయితే రెండో రన్‌కు వెళ్లేటప్పుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న హర్మన్ వేగంగా పరిగెత్తలేకపోయింది. క్రీజ్‌కు కొద్ది దూరంలో బ్యాట్ మైదానంలో దిగబడినట్లు అయిపోవడంతో.. వెంటనే వికెట్ కీపర్ హీలీ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగిపోయింది. ఇక జ్వరంతో బాధపడుతూనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్! Tough luck Team India. #HarmanpreetKaur & #JemimahRodrigues looked like taking the game away but the Aussies fought back brilliantly & in the end India have fallen short. Harmanpreet’s runout was the turning point & India will be disappointed to miss out on the finals. #INDWvAUSW pic.twitter.com/RY06QHDrE0 — VVS Laxman (@VVSLaxman281) February 23, 2023 Heartbreak💔💔💔 pic.twitter.com/W5uBYHci3q — Abhishek Sandikar (@Elonmast23) February 23, 2023 చదవండి: T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్! -
పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ కీలక సమయంలో రనౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా 7వసారి కావడం గమనార్హం. చదవండి: T20WC: ఆసీస్ బ్యాటర్‌పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్ -
World Cup 2023 Semi Final: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్
India Women Vs Australia Women Live Updates: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్ మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఔట్ 133 పరుగులు వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(52) రనౌట్‌గా వెనుదిరిగింది. భారత విజయానికి 28 బంతుల్లో 39 పరుగులు కావాలి. 14 ఓవర్లకు భారత స్కోర్: 124/4 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్(43), రిచా ఘోష్(14) పరుగులతో ఉన్నారు. 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(39), హర్మన్‌ప్రీత్ కౌర్(33) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 15 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మృతి మంధాన.. గార్డనర్ బౌలింగ్‌లో ఔటయ్యంది. తొలి వికెట్ కోల్పోయి భారత్ 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. స్కాట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 142/3 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో మెగ్ లానింగ్(28), హ్యారీస్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన బెత్ మూనీ.. శిఖాపాండే బౌలింగ్‌లో షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/2 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ►54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అలిస్సా హీలీ రాధాయాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 78/1 ►4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(19),మూనీ(7) పరుగులతో ఉన్నారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(8),మూనీ(6) పరుగులతో ఉన్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అస్వస్థతకు గురైన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెస్ జోనాస్సెన్, వికెట్ కీపర్ అలిస్సా హీలీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. యస్తిక భాటియా,స్నేహ రానా, రాధాయాదవ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా, స్నేహ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ -
T20 WC 2023: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్‌కు సెమీస్‌లోనే చెక్ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు. అస్వస్థతకు గురై ఈ క్రమంలో హర్మన్, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్ అయినప్పటికీ మ్యాచ్ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. కాగా కెప్టెన్ హర్మన్ వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్ ఉంది. హర్మన్ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. టీ20 వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..! BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత -
T20 WC: ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా; టీమిండియా పటిష్ట జట్టు..
ICC Womens T20 World Cup 2023 - AusW vs IndW: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటూ ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. భారత్‌లో టీమిండియా- ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీని వరల్డ్‌కప్ మ్యాచ్‌తో ముడిపెట్టి ప్రశ్నలు సంధించారు. ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా.. భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోబోతున్నారా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ‘‘ఓహ్.. ఆ సిరీస్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మా జట్టు అక్కడ అత్యుత్తమ రాణించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. పూర్తిస్థాయిలో సన్నద్ధమై వందకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రెండు టెస్టులు ముగిశాయి. అయితే, వాళ్లు మెరుగ్గానే ఆడారు. మిగిలిన వాటిలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది’’ అని మెగ్ లానింగ్ పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు! కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతంలో రెండుసార్లు(ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్)లో ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈసారి సమిష్టిగా రాణించి కంగారూల ఫైనల్ అవకాశాలు గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఈ మేర ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె పైవిధంగా స్పందించింది. టీమిండియా పటిష్ట జట్టు ఇక సెమీ ఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. రెండు జట్లు పరస్పరం ఎన్నోసార్లు పోటీపడ్డాయి. వాళ్ల జట్టులో వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్ మలుపు తిప్పగల ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఉత్తమ జట్టుతో పోటీ పడేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అత్యుత్తమంగా రాణించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని మెగ్ లానింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ Ind Vs Aus: పాపం గిల్ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి? -
'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ అనగానే మొదటగా వచ్చే పేరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. పురుషులు క్రికెట్ ఆధిపత్యంలో మహిళల క్రికెట్ కెప్టెన్ సంగతి మరిచిపోతున్నాం. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మహిళల టి20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23న జరగనున్న తొలి సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది భారత మహిళల జట్టు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. 150 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన వేళ మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ హర్మన్‌ప్రీత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''గూగుల్‌కు వెళ్లి ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎవరు అని వెతికితే హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం.#IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit ఈ పదాలను అన్నింటిలో షేర్ చేసి చక్కదిద్దుకుందాం.'' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది. నిజమే టీమిండియా మహిళల క్రికెట్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈసారి మహిళల జట్టు టి20 వరల్డ్‌కప్ కొట్టాలని కోరుకుందాం. యువీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా యువరాజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సేమ్ వీడియోను షేర్ చేశాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో మినహా మిగతా అన్నింటిలోనూ విజయాలు సాధించింది. సోమవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు ఎంటరైంది. If we’ve created this problem, we also have the power to fix it. Let’s do it for women’s cricket! 🏏💪🏻 Use this hashtag: #IndianCricketTeamCaptainHarmanpreetKaur on #Twitter #Quora #LinkedIn and #Reddit to spread the word and make a difference! 🇮🇳 pic.twitter.com/JMn5Cw7Cel — Yuvraj Singh (@YUVSTRONG12) February 21, 2023 -
WC 2023: ఇక్కడ రోహిత్ సేన సూపర్.. అక్కడ మీరు కూడా ఆసీస్‌ను ఓడించి..
ICC Womens T20 World Cup 2023 - India vs Australia: ‘‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. వాళ్లతో మ్యాచ్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇరు జట్లకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా బ్యాటింగ్ చేస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతాం’’ అని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. సెమీస్‌లో ఆసీస్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్‌ను ఓడించింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాలోని సెయింట్ జార్జ్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది హర్మన్‌ప్రీత్ సేన. స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కీలక మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. గొప్ప విషయం ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఓపెనర్ స్మృతి మంధానపై ప్రశంసలు కురిపించింది. ‘‘కీలక మ్యాచ్‌లో స్మృతి ఆడిన అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడింది. తను శుభారంభం అందించిన ప్రతిసారి మేము భారీ స్కోరు చేయగలుగుతాం. ఈసారి కూడా అదే జరిగింది. సెమీస్ చేరడం ఎంతో గొప్ప విషయం. రోహిత్ సేన మాదిరే మీరు కూడా! ఇక్కడిదాకా చేరుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది. వాళ్లతో పోటీలో మజా ఉంటుంది. ఫైనల్ చేరేందుకు మేము వందకు వంద శాతం ప్రయత్నిస్తాం’’ అని హర్మన్‌ప్రీత్‌కౌర్ చెప్పుకొచ్చింది. ఇక స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ.. రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న వేళ.. మహిళా జట్టు సైతం ఆసీస్‌ను వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్మన్‌ప్రీత్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత క్రికెటర్ల రికార్డులు ►ఐర్లాండ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. 2009 తొలి టి20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ ఆడిన హర్మన్ 2023లో టి20 ప్రపంచకప్‌లోనే తన 150వ మ్యాచ్ ఆడటం విశేషం. ►అంతర్జాతీయ మహిళల టి20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో క్రికెటర్‌గా, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ గుర్తింపు పొందింది. టాప్–3లో సుజీ బేట్స్ (3,820–న్యూజిలాండ్), మెగ్ లానింగ్ (3,346–ఆస్ట్రేలియా), స్టెఫానీ టేలర్ (3,166–వెస్టిండీస్) ఉన్నారు. ►టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరుకోవడం ఇది ఐదోసారి. 2009, 2010, 2018లలో సెమీఫైనల్లో ఓడిన భారత్ 2020లో రన్నరప్‌గా నిలిచింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ స్కోర్లు ఇండియా- 155/6 (20) ఐర్లాండ్ 54/2 (8.2) చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు? Women T20 WC: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..! -
'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్'
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా స్టార్ స్మృతి మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అయితే తన కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ ఇదేనని మంధాన మ్యాచ్ అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో వేలికి గాయమైనప్పటికి మంధాన తన జోరును ఎక్కడా ఆపలేదు. మధ్యలో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ విజయం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ.. ''వర్షం కారణంగా మ్యాచ్ జరిగిన సెంట్జార్జీ పార్క్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. గాలికి బంతి దిశ మారుతూ వికెట్ల మీదకు దూసుకువస్తుండడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది. బహుశా నా కెరీర్లోనే ఇది అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ అనుకుంటున్నా. వేలికి గాయం అయినప్పటికి పెద్దగా ఏం కాలేదు.. అంతా ఓకే. షఫాలీ వర్మతో సమన్వయం చేసుకున్నా. ఇద్దరం కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే నిశ్చయించుకున్నాం. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోతుందని భావించాం. అందుకే జాగ్రత్తగా ఆడాం. మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీస్ చేర్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మేం ఆడాల్సిన పద్దతిలో ఆడలేదు. అందుకే ఓడిపోయాం'' అంటూ చెప్పుకొచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. A crucial knock with a big six! This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs! Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4 — ICC (@ICC) February 20, 2023 చదవండి: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే.. -
ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..
మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెరుగైన రన్‌రేట్, పాయింట్ల ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు అసలైన పరీక్ష సెమీఫైనల్లో ఎదురుకానుంది. సెమీస్‌లో మహిళల క్రికెట్లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. లీగ్ పోటీల్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ గెలిచేందుకు అవకాశముంటుంది. కానీ నాకౌట్ స్టేజీ అలా కాదు. మ్యాచ్ గెలిస్తే ముందుకు.. ఓడిపోతే ఇంటికి. అందునా ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే టీమిండియా వుమెన్స్ శక్తికి మించి రాణించాల్సిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అందరికి తెలిసిందే. వారిని మించి డామినేట్ చేస్తుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్లో ఒక మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు లేకుండా ముగియదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత బలంగా ఉందనేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు అందుకొని టాపర్‌గా నిలిచింది. ఆ జట్టులో ఒకటో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తాహిలా మెక్‌గ్రాత్ ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్నారు. మరి అలాంటి పటిష్టమైన ఆసీస్‌ను సెమీస్‌లో భారత్ నిలువరించగలిగితే ఈసారి కప్ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. అనుకుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం అంత కష్టమేమి కాదు. కానీ ముందు వారిని ఓడించగలమా అనే డౌట్ పక్కనబెట్టి సమిష్టి ప్రదర్శన చేస్తే కచ్చితంగా మ్యాచ్ మనదే అవుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడుసార్లు ఔట్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పటికి తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెను ఎందుకు టీమిండియా సూపర్‌స్టార్ అంటారో.. ఎందుకంత క్రేజ్ అనేది ఈ పాటికే అర్థమై ఉండాలి. అండర్-19 టి20 వరల్డ్‌కప్‌లో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గానూ రాణించి జట్టును విజేతగా నిలిపిన షఫాలీ వర్మ గాడిన పడాల్సి ఉంది. జేమిమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్ మినహా మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. రిచా ఘోష్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తమ ప్రతిభను చూపెట్టాల్సిన అవసరం ఉంది. వీరంతా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం ఈజీయే. ఎలాగూ బౌలింగ్‌లో రేణుకా సింగ్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన ఇస్తుండగా.. స్పిన్నర్‌గా దీప్తి శర్మ ఆకట్టుకుంటుంది. మరి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని టీమిండియా వుమెన్స్ నిలబడతారా.. లేక ఒత్తిడికి లోనై పాత పాటే పాడుతారా అనేది ఫిబ్రవరి 23న తెలియనుంది. India are through to the semi-finals 🥳 They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/6SOSiUMO9L — T20 World Cup (@T20WorldCup) February 20, 2023 చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' -
భారత కెప్టెన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పురుషుల, మహిళల క్రికెట్లో మరెవరెకీ ఈ రికార్డు సాధ్యం కాలేదు. అంతకుముందు అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ(148) రికార్డును కూడా హర్మన్ బ్రేక్ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 18(శనివారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఇక మహిళల క్రికెట్ లో హర్మన్ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 143 మ్యాచ్‌లతో రెండోస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 115 మ్యాచ్‌లతో ఉంది. అదేవ విధంగా టీ20లలో రోహిత్, విరాట్ కోహ్లిల తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం ఆమె 13 పరుగులు చేసింది. సెమీస్‌లో భారత్ ఇక ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత్..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా! 🚨 Milestone Alert 🚨 First woman cricketer to play 1⃣5⃣0⃣ T20Is 🙌 🔝 Congratulations to #TeamIndia captain @ImHarmanpreet on a special landmark 👏 👏#INDvIRE | #T20WorldCup pic.twitter.com/X1DyIqhlZI — BCCI Women (@BCCIWomen) February 20, 2023 -
ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్
ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్ టీ20 ప్రపంచకప్-2023 సెమీఫైనల్లో భారత మహిళల జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరడం వరుసగా ఇది మూడో సారి. ►భారత్ -ఐర్లాండ్ మధ్య జరుగుతున్నకీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ స్కోర్: 54/2 వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ►6 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో గాబీ లూయిస్(27), డెలానీ(13) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అమీ హంటర్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరగా.. ప్రెండర్గాస్ట్ను రేణుక సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. అదరగొట్టిన స్మృతి మంధాన.. ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ ఐర్లాండ్‌తో జరగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్ సాధించింది. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 143 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 87 పరుగులు చేసిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన..ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఔటయ్యంది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన లారా డెలానీ బౌలింగ్‌లో నాలుగో బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్(13) పెవిలియన్‌కు చేరగా.. ఆరో బంతికి రిచా ఘోష్ డకౌట్‌గా ఔటయ్యంది. క్రీజులో క్రీజులో మంధాన(69)తో పాటు జెమీమా రోడ్రిగ్స్(11) పరుగులతో ఉంది. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను స్మృతి అందుకుంది. 14 ఓవర్లు ముగిసే భారత్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మంధాన(53)తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 62 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. లారా డెలానీ బౌలింగ్‌లో పెవిలియన్‌కే చేరింది. క్రీజులో స్మృతి మంధాన,హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 63/1 ► పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(27), షఫాలీ వర్మ(13) పరుగులతో ఉన్నారు. ►3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(5) పరుగులతో ఉన్నారు. ►మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక భారత్ కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. రాధాయాదవ్ స్థానంలో దేవిక వైద్య తుది జట్టులోకి వచ్చింది. కాగా ఈ మెగా టోర్నీల్లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఐర్లాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. తుది జట్లు: ఐర్లాండ్: అమీ హంటర్, గాబీ లూయిస్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐమర్ రిచర్డ్సన్, లూయిస్ లిటిల్, లారా డెలానీ(కెప్టెన్), అర్లీన్ కెల్లీ, మేరీ వాల్డ్రాన్(వికెట్ కీపర్), లేహ్ పాల్, కారా ముర్రే, జార్జినా డెంప్సే భారత్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ చదవండి: IND vs AUS: కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్ కెప్టెన్ చేసి ఉంటేనా.. వెంటనే! -
ఐర్లాండ్‌తో కీలకపోరు.. కచ్చితంగా గెలవాల్సిందే
మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో టీమ్ఇండియా తలపడుతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్(4) రెండో స్థానంలో కొనసాగుతుంటే..ఐర్లాండ్(0) ఆఖర్లో ఉంది. అయితే సెమీఫైనల్స్‌కు ఎలాంటి అవరోధాలు లేకుండా అర్హత సాధించాలంటే టీమిండియా..ఐర్లాండ్‌పై తప్పక గెలువాలి. ఇప్పటికే గ్రూపు-2 నుంచి ఇంగ్లండ్(6) ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.. అయితే మరో స్థానం కోసం పోటీ ఏర్పడింది. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ గెలిస్తే మన ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. అప్పుడు టీమిండియా నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో తలపడుతుంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన పోరులో పాక్ ఓడిపోవడం ఒక రకంగా మనకు కలిసొచ్చింది. ఒకవేళ ఆఖరి పోరులో ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే నాలుగు పాయింట్లకే పరిమితమవుతుంది. అప్పుడు భారత్‌కు బెర్తు ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మ్యాచ్‌ను కీలకంగా తీసుకున్న భారత్ అందుకు తగ్గట్లు సిద్ధమైంది. -
రిచా ఘోష్ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్ సేన ఓటమి
రిచా ఘోష్ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్ సేన ఓటమి మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా వుమెన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మస్ సేన ఒత్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్‌కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్‌కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. 15 ఓవర్లలో టీమిండియా 93/3 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వుమెన్స్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మంధాన 45, రిచా ఘోష్ 17 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి 58 పరుగులు కావాలి. జెమీమా రోడ్రిగ్స్(13) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన భారత్ జెమీమా రోడ్రిగ్స్(13 పరుగులు) రూపంలో భారత మహిళల జట్టు రెండో వికెట్ కోల్పోయింది. సారా గ్లెన్ బౌలింగ్‌లో బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి రోడ్రిగ్స్ వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా వుమెన్స్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. టార్గెట్ 152.. 5 ఓవర్లలో భారత్ స్కోరు 36/1 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. స్మృతి మంధాన 23, జేమీమా రోడ్రిగ్స్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ వర్మ 8 పరుగులు చేసి బెల్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. ఐదు వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత టార్గెట్ 152 మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇంగ్లండ్.. టీమిండియా వుమెన్స్ ముందు 152 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగింది. ఆరంభంలో తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ కెప్టెన్ హెథర్‌నైట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో 28 పరుగులు చేసిన నైట్ షపాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 72/3 ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ కోలుకుంది. 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. బ్రంట్ 35, హెథర్‌నైట్ 23 పరుగులతో ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ భారత మహిళా బౌలర్ రేణుకా సింగ్ చెలరేగుతుంది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ వుమెన్స్‌ను చావుదెబ్బ కొట్టింది తాజాగా డంక్లీ(10 పరుగులు)ని రేణుకా సింగ్ క్లీన్‌బౌల్డ్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వుమెన్స్ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. అదిరిన ఆరంభం.. రెండు వికెట్లు డౌన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న భారత్‌కు పేసర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే రేణుకా సింగ్.. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత తన రెండో ఓవర్లో క్యాప్సీని క్లీన్‌బౌల్డ్ చేసిన రేణుకా సింగ్ రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా.. మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా ఇవాళ మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఏంచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇక భారత్ జట్టు ఒక మార్పు చేసింది. దేవికా స్థానంలో శిఖా పాండే తుది జట్టులోకి వచ్చింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఇంగ్లండ్ మహిళలు తుదిజట్టు: సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్ ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. -
వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా ► సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30 పరుగులు), రిచా ఘోష్(22 పరుగులు) ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సి ఉంది. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 44/3 ► 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక్క పరుగుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే షఫాలీ వర్మ(28 పరుగులు) మూడో వికెట్‌గా వెనుదిరిగింది. టీమిండియా వుమెన్స్ టార్గెట్ 119 పరుగులు ► టీమిండియా వుమెన్స్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్ ► చినెలి హెన్రీ(2) రనౌట్ కావడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ► ఒక్క ఓవర్లోనే వెస్టిండీస్ రెండు వికెట్లను కోల్పోయింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలుత 30 పరుగులు చేసిన క్యాంప్బెల్లె స్మృతి మంధాన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి 42 పరుగులు చేసిన టేలర్ ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో వెస్టిండీస్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లలో వెస్టిండీస్ 53/1 ► తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయినప్పటికి వెస్టిండీస్ తన ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. స్టెఫాని టేలర్ 28, క్యాంప్బెల్లె 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో విండీస్ స్కోరు 15/1 ► 4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసిది. టేలర్ 3, క్యాంప్‌బెల్లే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ► వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్ టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ హేలీ మాథ్యూస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. విండీస్ జట్టు ప్రస్తుతం వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న వెస్టిండీస్ వుమెన్స్ ► మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ ఇండియా వుమెన్స్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ వెస్టిండీస్ మహిళల తుదిజట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), స్టాఫానీ టేలర్, షెమైన్ కాంప్బెల్లె, షబికా గజ్నాబి, చినెల్లే హెన్రీ, చెడియన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షామిలియా కన్నెల్, రషదా విలియమ్స్ (వికెట్ కీపర్), కరిష్మా రామ్‌హారక్, షకేరా సెల్మాన్ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్.. వెస్టీండీస్తో మ్యాచ్‌లో అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ వుమెన్స్‌తో మ్యాచ్‌లో విండీస్ ఓటమిపాలైంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు వేలిగాయంతో దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు తిరిగిరావడం బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. -
Viral: భారత క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం
WPL Auction 2023: మహిళల తొట్టతొలి ఐపీఎల్ వేలం తర్వాత భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఆయా ఫ్రాంచైజీల ప్రణాళికల ప్రకారం జరిగిందో తెలీదు కానీ.. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో హర్మన్‌ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకోగా.. రోహిత్ 2011 నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ ముంబైతో జతకట్టే సమయానికి టీమిండియా కెప్టెన్‌గా లేడు. ఇటీవలే అతను కోహ్లి నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. ఏదిఏమైనప్పటికీ భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్ల కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌లో చేరడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయం నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. హర్మన్ కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని జెర్సీ నంబర్ 18 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో ఆర్సీబీ వుమెన్ జెర్సీ నంబర్ 18 స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. WPLలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక పురుషుల క్రికెట్లో జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లి ఐపీఎల్ పుట్టుక నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నారు. ఐపీఎల్ మరే ఇతర క్రికెటర్ కోహ్లిలా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది లేదు. అయితే కోహ్లికి ఒక్క లోటు మాత్రం ఉంది. అతను ఒక్కసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్లు, జెర్సీ నంబర్ 18 ఐపీఎల్లో వేర్వేరు జట్లుగా విడిపోవడం ఆసక్తికర పరిణామం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీల పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో WPLలో కూడా ఈ రెండు జట్ల మధ్య అంతే రసవత్తర పోరులు సాగే అవకాశం ఉంది. WPLలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు.. స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు) రిచా ఘోష్ (రూ.1.90 కోట్లు) ఎలీస్ పెర్రీ (రూ.1.70 కోట్లు) రేణుక సింగ్ (రూ.1.50 కోట్లు) సోఫీ డివైన్ (రూ.50 లక్షలు) హీతెర్ నైట్ (రూ.40 లక్షలు) మేగన్ షుట్ (రూ.40 లక్షలు) కనిక అహుజ (రూ.35 లక్షలు) డేన్‌వాన్ నికెర్క్ (రూ.30 లక్షలు) ఎరిన్ బర్న్స్ (రూ.30 లక్షలు) ప్రీతి బోస్ (రూ.30 లక్షలు) కోమల్ జంజద్ (రూ.25 లక్షలు) ఆశ శోభన (రూ.10 లక్షలు) దిశ కాసత్ (రూ.10 లక్షలు) ఇంద్రాణి రాయ్ (రూ.10 లక్షలు) పూనమ్ ఖేమ్నర్ (రూ.10 లక్షలు) సహన పవార్ రూ.10 లక్షలు శ్రేయాంక పాటిల్ రూ.10 లక్షలు WPLలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్.. నటాలీ సివర్ (రూ.3.20 కోట్లు) పూజ వస్త్రకర్ (రూ.1.90 కోట్లు) హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.1.80 కోట్లు) యస్తిక భాటియా (రూ.1.50 కోట్లు) అమేలియా కెర్ (రూ.1 కోటి) అమన్‌జోత్ కౌర్ (రూ.50 లక్షలు) హేలీ మాథ్యూస్ (రూ.40 లక్షలు) క్లొయ్ ట్రియాన్ (రూ.30 లక్షలు) హిదెర్ గ్రాహమ్ (రూ.30 లక్షలు) ఇసాబెలె వోంగ్ (రూ.30 లక్షలు) ప్రియాంక బాల (రూ.20 లక్షలు) ధార గుజ్జార్ (రూ.10 లక్షలు) హుమైరా కాజి (రూ.10 లక్షలు) జింతిమని కలిత (రూ.10 లక్షలు) నీలమ్ బిష్త్ (రూ.10 లక్షలు) సయిక ఇషాక్ (రూ.10 లక్షలు) సోనమ్ యాదవ్ (రూ.10 లక్షలు) -
WPL 2023: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది. వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్టార్లు యాష్లే గార్డ్నర్, నటాలీ సివర్ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్‌లు హర్మన్ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్‌కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ 18 మంది చొప్పున తీసుకున్నాయి. టాప్–10 జాబితాలో వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్–10 జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. త్రిషకు మొండిచేయి సీనియర్ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్‌లో అవకాశం దక్కింది. అయితే అండర్–19 ప్రపంచకప్‌లో రాణించిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్ డబ్ల్యూపీఎల్ వేలంను నిర్వహించింది. వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్‌బాష్ లీగ్, ‘హండ్రెడ్’ లీగ్‌లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్‌పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన యాష్లే గార్డ్నర్పై కూడా టీమ్‌లు ఆసక్తి చూపించాయి. వారికి కూడా తక్కువేం కాదు ఆసీస్ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్ లానింగ్‌లకు కూడా మంచి విలువ దక్కింది. గుర్తింపు ఉన్నా ఇక.. మహిళల టి20 క్రికెట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. హర్మన్ విషయంలో మాత్రం ►భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోసం గుజరాత్ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు. ►అసోసియేట్ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్ తారా నోరిస్ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. ►యూఏఈకి చెందిన మనిక గౌర్ కోసం గుజరాత్ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. స్మృతి తర్వాత వేలంలో టాప్–10 ►యాష్లే గార్డ్నర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►నటాలీ సివర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు ►జెమీమా రోడ్రిగ్స్ - రూ. 2 కోట్ల 20 లక్షలు ►బెత్ మూనీ -రూ. 2 కోట్లు ►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు ►పూజ వస్త్రకర్ -రూ. 1 కోటి 90 లక్షలు ►రిచా ఘోష్ -రూ. 1 కోటి 90 లక్షలు ►సోఫీ ఎకిల్‌స్టోన్- రూ. 1 కోటి 80 లక్షలు ►హర్మన్‌ప్రీత్ - రూ. 1 కోటి 80 లక్షలు – సాక్షి క్రీడా విభాగం చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం -
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ విక్టరీ నమోదు చేసింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్.. తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ మారూఫ్ (68 నాటౌట్), అయేషా నసీం (43 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. షెఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగెస్ (53 నాటౌట్), రిచా ఘోష్ (31 నాటౌట్) చెలరేగడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 93 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో మారూఫ్‌కు క్యాచ్ ఇచ్చి హర్మన్ కౌర్ (16) ఔటైంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/3. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 65 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో అమీన్‌కు క్యాచ్ ఇచ్చి షెఫాలీ వర్మ (33) ఔటైంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 67/2. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్.. 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో ఫాతిమా సనాకు క్యాచ్ ఇచ్చి యస్తికా భాటియా (17) ఔటైంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/1. విజృంభించిన అయేషా నసీం.. సత్తా చాటిన బిస్మా మారూఫ్ కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అయేషా నసీం (23 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. తిప్పేసిన రాధా యాదవ్.. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ రాధా యాదవ్ మాయాజాలం ధాటికి పాకిస్తాన్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12.1వ ఓవర్లో రాధా బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి అమీన్ (11) ఔటైంది. 15 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/4గా ఉంది. ఫైర్ మీదున్న టీమిండియా బౌలర్లు, 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ టీమిండియా బౌలర్లు ఫైర్ మీదున్నారు. దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీయడంతో పాక్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వస్త్రాకర్ బౌలింగ్‌లో రిచాకు క్యాచ్ ఇచ్చి నిదా దార్ (0) డకౌటైంది. 8 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 46/3. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్‌లో రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ చేయడంతో మునీబా అలీ (12) పెవిలియన్ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/2గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో హర్మన్‌కు క్యాచ్ ఇచ్చి జవేరియా ఖాన్ (8) ఔటైంది. 4.4 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 31/1గా ఉంది. బిస్మా మారూఫ్ (18), మునీబా అలీ (5) క్రీజ్‌లో ఉన్నారు. ICC Womens T20 WC 2023 IND VS PAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. స్మృతి స్థానంలో హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చిందని, ఈ మ్యాచ్‌కు శిఖా పాండే దూరంగా ఉందని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ అనంతరం వెల్లడించారు. పాక్ జట్టులో సైతం ఓ కీలక ప్లేయర్ మ్యాచ్‌కు దూరమైంది. డయానా బేగ్ ఇవాల్టి మ్యాచ్ ఆడటం లేదని పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ తెలిపింది. తుది జట్లు: భారత్: షెఫాలీ వర్మ, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగెస్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ పాకిస్తాన్: జవేరియా ఖాన్, మునీబా అలీ (వికెట్‌కీపర్), బిస్మా మారూఫ్ (కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఎయిమన్ అన్వర్, సష్రా సంధూ, సాదియా ఇక్బాల్ -
T20 World Cup: పాక్‌తో పోరు.. టీమిండియా ఎలా ఉండబోతుదంటే
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పురుషుల క్రికెట్ లాగే మహిళల క్రికెట్లోనూ దాయాదుల సమరం కేవలం మెగాటోర్నీల వరకే పరిమితమైంది. అందుకే భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా క్రేజ్ అలాగే ఉంటుంది. ఇక టీమిండియా వుమెన్స్‌కు రెండు వార్మప్ మ్యాచ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించినట్లయింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓడిన భారత్.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం 52 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తాను ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి మరొకటి ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. పాక్‌తో పోరుకు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వేలిగాయంతో దూరమవడం టీమిండియాను కలవరపెడుతోంది. అయితే స్మృతి మంధాన దూరమైనప్పటికి బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుండడం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యస్తికా బాటియా, షఫాలీ వర్మలు ఖాయం. వన్‌డౌన్‌లో జెమిమా రోడ్రిగ్స్, నాలుగో స్థానంలో హర్లిన్ డియోల్‌లు రానున్నారు. ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆరో స్థానంలో రిచా ఘోష్ రానుంది. ఇక ఆల్రౌండర్లుగా పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు ఉన్నారు. రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండేలు పేస్ బౌలింగ్ మారాన్ని మోయనున్నారు. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండే -
డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది
ముంబై: వచ్చే నెలలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు బరిలో ఉన్నాయి. గరిష్టంగా 90 బెర్త్‌ల కోసం మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈనెల 13న ముంబైలో మధ్యాహ్నం 2:30 నుంచి వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1525 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా... చివరకు 409 మందిని ఎంపిక చేశారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు... 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 24 మంది క్రికెటర్లు గరిష్ట కనీస ధర రూ. 50 లక్షల విభాగంలో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు రూ. 12 కోట్లు చొప్పున వేలంలో వెచ్చించడానికి వీలు ఉంది. ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు. వేలం బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, షబ్నమ్, శరణ్య, నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ దీప్తి, కట్టా మహంతి శ్రీ, వై.హేమ, బారెడ్డి అనూష, చల్లా ఝాన్సీలక్ష్మీ, విన్నీ సుజన్... హైదరాబాద్ నుంచి అరుంధతి రెడ్డి, గొంగడి త్రిష, యషశ్రీ, మమత, ప్రణవి, కోడూరి ఇషిత ఉన్నారు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ . -
Womens T20 World Cup: వేలంపై కాదు... పాక్‌తో సమరంపైనే దృష్టి
కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగే సమరంపైనే తాము దృష్టి పెట్టామని, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం నిర్వహించే వేలంపై ఆలోచించడం లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. దక్షిణాఫ్రికా గడ్డపై అండర్–19 అమ్మాయిల జట్టు సాధించిన వరల్డ్‌కప్ స్ఫూర్తితో తమ ప్రపంచకప్ వేట సాగుతుందని చెప్పింది. మెగా ఈవెంట్లో హర్మన్ సేన 12న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్‌లో తలపడుతుంది. మరుసటి రోజే ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం జట్టు కెప్టెన్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్పే అన్నింటికంటే ముఖ్యమైంది. దాని తర్వాతే ఏదైనా..! ఐసీసీ మెగా ఈవెంట్‌పైనే మేం దృష్టి సారించాం. మిగతావి ఎప్పుడూ ఉండేవే. ఓ క్రికెటర్‌గా ఏది ప్రధానమో ఏది అప్రధానమో నాకు బాగా తెలుసు. దేనిపై దృష్టి సారించాలో కూడా తెలుసు. గత నెల షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్–19 మహిళల జట్టు సాధించిన వరల్డ్‌కప్‌ను మేమంతా చూశాం. జూనియర్ టీమ్ స్ఫూర్తితో మేం కూడా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అని వివరించింది. అలాగే దేశంలో జరిగే మహిళల లీగ్‌లతో జాతీయ జట్లకు చాలా మేలు జరుగుతుందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరుగుతున్న లీగ్‌లతో ఆ జట్లు ఏ స్థాయిలో ఉన్నాయో... అలాగే డబ్ల్యూపీఎల్‌తో మన జాతీయ జట్టు, అమ్మాయిలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని, నాణ్యమైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని భారత కెప్టెన్ తెలిపింది. వేలం ఇబ్బందికరమే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సారథులు ప్రపంచకప్ సమయంలోనే క్రికెటర్ల వేలం జరగనుండటం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. ‘కొందరు క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోతారు. మరికొందరేమో మిగిలిపోతారు. ఇంకొందరికి ఎక్కువ ధర, కొందరికి తక్కువ ధర లభిస్తుంది. ఇది క్రికెటర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అని న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ పేర్కొంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ ‘నిజంగా ఇది (వేలం) ఇబ్బందికర పరిణామమే. ప్రపంచకప్‌లో ఆడేందుకు వచ్చిన అమ్మాయిలను తప్పకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు జీర్ణించుకుంటారు. ఇంకొందరు జీర్జించుకోలేరు. ఇది కాస్త ఆటపై ప్రభావం చూపుతుంది’ తెలిపింది. -
T20 Tri Series: టీమిండియా ఘన విజయం.. విండీస్‌కు చేదు అనుభవం
T20I Tri-Series - India Women vs West Indies Women: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ మైదానంలో వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ట్రై సిరీస్ మూడో మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టును 56 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. దంచికొట్టిన మంధాన విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా(18 పరుగులు) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. 51 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్మన్ డియోల్(12) విఫలం కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ అర్ద శతకం(35 బంతుల్లో 56 పరుగులు)తో మెరిసింది. మంధాన మెరుపులకు తోడు హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దెబ్బకొట్టిన దీప్తి శర్మ టీమిండియా బౌలర్ దీప్తి శర్మ.. విండీస్ ఓపెనర్లు రషద విలియమ్స్(8), బ్రిట్నీ కూపర్(0)లను ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన షిమేనే కాంప్బెల్లె 47 పరుగులతో రాణించగా.. రాధా యాదవ్ ఆమెకు చెక్ పెట్టింది. ఇతర బ్యాటర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్(34- నాటౌట్) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 111 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ముందంజలో టీమిండియా అంతకు ముందు.. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు.. విండీస్‌ను సైతం ఓడించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఇక సౌతాఫ్రికా.. గత మ్యాచ్‌లో విండీస్‌పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమే ఎదురైంది. చదవండి: Ravindra Jadeja: జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా.. ఆసీస్‌తో మ్యాచ్ కోసం.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
T20 WC 2023: భారత ప్రపంచకప్ జట్టు.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!
ICC Women Cricket World Cup 2023- ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కేశవరాజుగారి అంజలి శర్వాణికి తొలి వరల్డ్ కప్ అవకాశం లభించింది. ఫిబ్రవరి 10నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో ఆడిన 5 టి20ల్లో 8.73 ఎకానమీతో 3 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. మరో వైపు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పేసర్ శిఖాపాండేకు మళ్లీ పిలుపు లభించింది. షఫాలీ, రిచా.. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం. ప్రపంచ కప్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్ ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రకర్ (ఫిట్నెస్ సాధిస్తేనే). చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! -
ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్.. దుమ్మురేపిన ఇండియా అమ్మాయిలు ( ఫొటోలు)
-
'ఇప్పుడే సరైనోడి చేతుల్లోకి వెళ్లాం'.. టీమిండియా కెప్టెన్ కౌంటర్
భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ రమేశ్ పవార్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 6న బీసీసీఐ రమేశ్ పొవార్‌ను భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరగడం పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణమయింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ రమేశ్ పొవార్‌ను ఎన్సీఏకు బదిలీ చేసింది. ఇకపై ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పొవార్ కలిసి పనిచేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం రమేశ్ పొవార్‌పై పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇండియా, ఆస్ట్రేలియా వుమెన్స్ ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మేం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాం అంటూ తెలిపింది. అయితే పొవార్‌ను ఉద్దేశించే హర్మన్ ప్రీత్ ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడం వెనుక హర్మన్‌ప్రీత్ హస్తం ఉందని హిందుస్థాన్ టైమ్స్ ఆరోపణలు చేసింది. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్వయంగా లేఖ రాసినట్లు తెలిసింది. అయితే టీమిండియా మహిళా జట్టుకు పొవార్‌పై ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు. ఇంతకముందు 2018 టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ను పొవార్ పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిథాలీ రిటైర్మెంట్ తర్వాత తన పుస్తకంలోనూ రమేశ్ పొవార్‌తో ఉన్న విబేధాలను బయటపెట్టింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలాసార్లు వివాదాల్లో నిలిచాడు. అందుకే హర్మన్‌ప్రీత్ స్వయంగ రంగంలోకి దిగి బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. ఇక కొత్త హెడ్‌కోచ్ ఎవరనే దానిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. అయితే 2021లో హృషికేష్ కనిత్కర్ హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసినప్పటికి అతనికి అవకాశం రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మాత్రం హృషికేష్ కనిత్కర్‌కు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మహిళల జట్టుకు పనిచేసే అవకాశం లభించింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ -
న్యూజిలాండ్ తర్వాత మనమే.. కానీ ఆ విషయంలో మాత్రం..
BCCI Equal Pay Decision: మ్యాచ్ ఫీజుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చే చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న రోజును అతి ప్రత్యేకమైన ‘రెడ్ లెటర్ డే’గా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభివర్ణించగా... ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా మహిళల క్రికెట్లో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నామని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘లింగ వివక్షను తొలగించి.. సమానత్వాన్ని పెంపొందించే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. భారత క్రికెట్లో మరో ముందడుగు పడింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బోర్డును అభినందించాడు. ఇకపై ఇలా మ్యాచ్ ఫీజుల విషయంలో టీమిండియా పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అంతరాన్ని తొలగించింది. ఇకపై భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇక నుంచి మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇంతకు ముందు ఇలా ఉండేది ఇప్పటి వరకు మహిళా క్రికెటర్లకు వన్డే, టి20లకు రూ.1 లక్ష లభిస్తుండగా, టెస్టు మ్యాచ్‌కు రూ. 2 లక్షల 50 వేలు ఇస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, వివక్షను దూరం చేసే దిశగా తొలి అడుగు అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొనగా... తాజా నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుందని అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు. కివీస్ తర్వాత మనమే ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రమే ఇలా పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. భారత్ రెండో జట్టు కాగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన నాటి నుంచి భారత మహిళల జట్టు ప్రదర్శన మరింతగా మెరుగవుతూ వస్తోంది. దీనిని మరింత ప్రోత్సాహించే దిశగా తాజా ప్రకటన వెలువడింది. అయితే బోర్డు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు చొప్పున బోర్డు ఇస్తోంది. అదే పురుష క్రికెటర్లకు మాత్రం ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు లభిస్తాయి. చదవండి: T20 WC 2022: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన హర్మన్‌ప్రీత్
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ్రస్టేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీ నుంచి వైదొలిగింది. వెన్ను నొప్పితో ఈ సీజన్లో తాను పాల్గొనడంలేదని హర్మన్ తెలిపింది. గత ఏడాది మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడిన హర్మన్ 406 పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీలో హర్మన్ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’... హర్మన్‌ప్రీత్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది. ఇంగ్లండ్ పర్యటనలో మూడు వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది. ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల (1999) తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ అమ్మాయిలు సిరీస్ గెలిచారు.