Movie Tickets
-
సినిమా ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు బెనిఫిట్ షో, ప్రిమియర్ షో, స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన పరిణామాలతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది. -
జూన్ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్ బంద్
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
రేవంత్.. టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయి.అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతాను. మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూటర్న్?. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు.టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి… pic.twitter.com/hO1Q7ELAWE— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025 -
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. -
ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..
ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎలా పని చేస్తుందంటే..టికెట్ స్కానింగ్: మీరు సినిమా థియేటర్లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్ సమయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్ అవుతుంది.రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్ ఐనాక్స్ పేర్కొంది.అదనపు ఛార్జీలుఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.ఎక్కడ అమలు చేస్తున్నారు..ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?కంపెనీపై ప్రభావంప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్ ఐనాక్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. -
సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.సౌకర్యాలకు పెద్దపీటగతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా మార్కుఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!లిస్టెడ్ కంపెనీల జోరుపీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది. -
తెలంగాణలో ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొంది. పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది. (చదవండి: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?)ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ -బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా. మూడేళ్ల క్రింద విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫాహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
Pushpa The Rule: వేలం ద్వారా 'పుష్ప 2' టికెట్.?
-
Kalki 2898 AD: గుడ్ న్యూస్.. చవక రేటుకే కల్కి టికెట్స్
కొన్ని సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే కల్కి 2898 ఏడీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్‌తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్లోనూ కలెక్షన్లతో విజృంభించింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.టికెట్ రేట్ల తగ్గింపుఇంత మంచి ఆదరణ లభించడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వారం కల్కి సినిమాను తక్కువ ధరకే థియేటర్లలో అందుబాటులో ఉంచాలని డిసైడ్ అయింది. కల్కిని కేవలం రూ.100కే ఆస్వాదించండి. ఆగస్టు 2 నుంచి 9 వరకు ఇండియా అంతటా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటివరకు కల్కి చూడనివారికి, మరోసారి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అవుతుంది.కల్కి మూవీ..కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించాడు. చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
మూవీ లవర్స్‌కి క్రేజీ ఆఫర్.. రూ.50కే కొత్త సినిమా ప్రీమియర్
ఇప్పట్లో కొత్త సినిమా చూడాలంటే రెండు మూడొందలైనా పెట్టాల్సిందే. అలాంటిది కొత్త సినిమా, అది కూడా రూ.50కే అంటే మంచి ఆఫర్ కదా! మీరు విన్నది నిజమే. 'నా పేరు శివ' సినిమాలో విలన్ తరహా పాత్ర చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ కిషన్. ఇతడు హీరోగా నటించిన తెలుగు సినిమా 'పేక మేడలు'. జూలై 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే టికెట్‌పై భారీ ఆఫర్ ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)రాకేష్ వర్రే నిర్మించిన రెండో సినిమా 'పేక మేడలు'. మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కథతో ఈ మూవీ తీశారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల రిలీజ్‌కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. వీటిలోనే ఒక్కో టికెట్ రూ.50గా నిర్ణయించారు. ఈ విషయాన్ని హీరోతోనే చెప్పిస్తూ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.ఈ కాలంలో అసలు థియేటర్లకే జనాలు రావడం లేదు. అలాంటిది రూ.50 టికెట్ అంటే సినిమా ఎలా ఉందని కాకపోయినా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయడానికైనా సరే ప్రేక్షకులు వచ్చే అవకాశముంది. 'పేకమేడలు'పై పెద్దగా అంచనాల్లేవు. దీనితో పాటు వస్తున్న ప్రియదర్శి 'డార్లింగ్'పై కాస్త అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
కాజల్ కొత్త సినిమా రిలీజ్.. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్స్!
కొత్త సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కాజల్ అగర్వాల్.. 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ శుక్రవారం అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేశారు. తాజాగా మహిళల కోసం బంపరాఫర్ ప్రకటించారు. ఉచితంగా టికెట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?)కాజల్ అగర్వాల్ 'సత్యభామ' మూవీ.. జూన్ 7న థియేటర్లలోకి రానుంది. కానీ అంతకంటే ముందే హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న అంటే బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షో టికెట్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని 'గూఢచారి', 'క్షణం' సినిమాల ఫేమ్ శశి కిరణ్ తిక్క నిర్మించారు. సుమన్ చిక్కల దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?) -
బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.99 మాత్రమే
సినిమాలు తెగ చూసేవాళ్లకు ఇది బంపరాఫర్. ఎందుకంటే మే 31న అంటే ఈ శుక్రవారం సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏ మల్టీఫ్లెక్స్‌లో అయినా సరే రూ.99 మాత్రమే మూవీ చూడొచ్చని ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని చెప్పి చిన్నపాటి షాకిచ్చింది.ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 'హనుమాన్', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. వీటి వల్ల బాక్సాఫీస్ కళకళాలాడింది. దీని తర్వాత టాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి చూడటం గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్ రూ.99 అని ఆఫర్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!)ఆఫర్ చూసి మీరు తెగ ఎగ్జైట్ అయిపోయింటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వర్తించదని చెప్పి షాకిచ్చింది. మన దగ్గర సినిమా లవర్స్ డే ఉన్నప్పటికీ.. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధర రూ.112గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. వీళ్లకు ఆఫర్ ఇవ్వకపోయినా సరే ఎలానూ చూస్తారులే అనే ధీమానా? లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఇలా తెలుగు ప్రేక్షకులపై మల్టీప్లెక్స్‌లా చిన్నచూపు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే సినిమా లవర్స్ డే అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫర్ ప్రకటించింది. నాలుగు నెలల తిరక్కుండానే మళ్లీ బంపరాఫర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వ్యాపారం తగ్గినా ప్రతిసారీ కావాలనే ఇలా ఆఫర్స్ అని అంటున్నారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)Cinema Lovers Day returns on 31st May with movies for just Rs 99/-!🍿Join us at cinemas across India to celebrate a day at the movies. Over 4000+ screens are participating, making it an unforgettable cinematic experience!#CinemaLoversDay pic.twitter.com/b2XAOC3yxy— Multiplex Association Of India (@MAofIndia) May 28, 2024 -
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్‌ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
తెలంగాణలో 'గుంటూరు కారం' టికెట్ రేట్స్ పెంపు.. బెన్ఫిట్ షోలు అలా
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు.. చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇలాంటి టైంలో మూవీ టీమ్‌కి సంతోషపరిచే విషయం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చింది. టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్ఫిట్ షోలకు అనుమతి లభించింది. కొన్నిరోజుల ముందు 'గుంటూరు కారం' టీమ్.. తెలంగాణ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా పర్మిషన్ లభించింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది. అంటే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రూ.410 అనమాట. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అలానే 12న అర్థరాత్రి ఒంటి గంట నుంచి రాష్ట్రంలో దాదాపు 23 చోట్ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు రివీల్ అయింది. అలానే తొలిరోజు ఆరో షో ప్రదర్శనకు కూడా పర్మిషన్ దొరికింది. అలానే ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి లభించింది. అయితే సాధారణ ప్రేక్షకుడికి ఈ టికెట్స్ రేట్లు అవి ఎక్కువగా అనిపించొచ్చు. కానీ డై హార్డ్ అభిమానులకు మాత్రం అర్థరాత్రి నుంచి షోలు అంటే పండగ చేసుకుంటారు. టికెట్స్ రేట్లు అనేవి పెద్దగా పట్టించుకోరు. ఇకపోతే మహేశ్ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) -
ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్
స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు. ఇక ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ నుంచి 'సలార్' మూవీ వస్తుందంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందేనని వీరాభిమానులు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు యంగ్ హీరో బంపరాఫర్ ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. మరో వారంలో అంటే ఈ డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. మరోవైపు యంగ్ హీరో నిఖిల్.. ప్రభాస్ వీరాభిమానుల కోసం 100 టికెట్స్ ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. డిసెంబరు 22న అర్థరాత్రి ఒంటి గంటకు శ్రీరాములు థియేటర్లో 'సలార్' మిడ్ నైట్ షో పడనుంది. ఇప్పుడు ఇక్కడే 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని యువ హీరో నిఖిల్ చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని మాటిచ్చాడు. మరి ఆ అదృష్టవంతులు మీరు కూడా కావొచ్చేమో. కాస్త ట్రై చేయండి. (ఇదీ చదవండి: ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్) -
ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు..‘నరకాసుర’బంపరాఫర్
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన లభించడంతో.. మరింత మందికి చేరవయ్యేందుకు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ఒక టికెట్‌పై ఒకరు మాత్రమే సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మేకర్స్ ఈ విషయాన్ని వెళ్లడించారు. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. , ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అన్నారు. ‘ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు’అని దర్శకుడు సెబాస్టియన్ అన్నారు. -
Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్ర్ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్ మూవీస్‌కు రూ.99 టిక్కెట్ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్‌ను ప్రచారం చేస్తున్నారు. #NationalCinemaDay par aap sab ke liye ek bahut khaas tohfaa, only for the love of cinema! Iss 13th October, jaiye aur dekhiye Jawan at just Rs. 99! Book your tickets now!https://t.co/fLEcPK9UQT Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uS3LfpcTNb — Shah Rukh Khan (@iamsrk) October 12, 2023 సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్‌లు అందించే వెబ్సైట్ల్లోకి వెళ్లి ఫుడ్, బేవరేజెస్ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్ ఉండనుంది. పీవీఆర్ ఐనాక్స్, సినోపోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్, ఎం2కే, డెలైట్ వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. This cheer right here is why we do what we do... Thank you fans for the full houses & full hearts filled with love. Nothing matters beyond YOU. HAPPY NATIONAL CINEMA DAY. pic.twitter.com/R7h5v6xKZa — Ajay Devgn (@ajaydevgn) October 13, 2023 -
సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!
సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.99 కే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఎంఏఐ(MAI) ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న శుక్రవారం కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు శుక్రవారం రిలీజయ్యే చిత్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తక్కువ ధరకే సినిమా చూసే ఒక్కరోజు మాత్రమే. ఈ ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్‌లో రూ.99 కే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా.. 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతకుముందు సెప్టెంబర్ 16వ తేదీని వేడుకల రోజుగా ప్రతిపాదించగా.. ఆ తర్వాత అది సెప్టెంబర్ 23కి మారింది. గతేడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున 6.5 మిలియన్ల మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూశారని వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆ ఏడాదిలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన రోజుగా నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్చందానీ తెలిపారు. National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg — Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023 -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
'భోళా శంకర్' టికెట్ ధరల పెంపునకు బ్రేక్.. కారణమిదే
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. టికెట్ల ధరలను పెంచాలంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును ఆ చిత్ర నిర్మాతలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల 'భోళా శంకర్' టికెట్ల ధరలు పెంచేందకు అనుమతి లేనట్లు పేర్కొంది. 101 కోట్లతో సినిమాను నిర్మించినట్టు నిర్మాతలు పేర్కొన్నారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది. (ఇదీ చదవండి: Bhola Shankar: భోళాశంకర్ ఆపాలంటూ కేసు.. చంపుతామంటూ డిస్ట్రిబ్యూటర్‌కు బెదిరింపులు) గతంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని గుర్తుచేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది. ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతలు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదని ప్రభుత్వం పేర్కొంది. -
ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!
సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్‌ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్టైన్మెంట్కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది. టాప్ 10 చిత్రాలు కేవలం భారత్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక? -
Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్‌లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి) ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్‌కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది. ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్‌కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చిన నెట్ ఫ్లెక్స్
-
మహేష్ బాబు థియేటర్ లో టికెట్లు అమ్ముతున్న రావణాసుర టీం
-
స్టార్ హీరో మూవీ టికెట్స్‌పై బంపరాఫర్.. ఆ మూడు రోజులే..!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించారు. తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియుల కోసం యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది. పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది చిత్రబృందం. పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు క్రేజీ ఆఫర్‌తో ఎంచక్కా థియేటర్లలో చూసేయొచ్చు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) -
ఏపీలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల టికెట్ ధర పెంపునకు అనుమతి
-
ఆన్లైన్ టికెట్లపై 1న ఉత్తర్వులిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ దాఖలైన ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. బుక్ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని అన్నారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్ ధర ఎక్కువ ఉంటుందన్నారు. ప్రభుత్వం సర్వీసు చార్జి మాత్రమే వసూలు చేస్తున్నందున, వినియోగదారులు ఏపీఎఫ్డీసీ పోర్టల్ ద్వారానే టికెట్ కొంటారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మాకు అలా అనిపించడం లేదు. మీరు కన్వీనియన్స్ చార్జి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అది వసూలు చేయదు. దీంతో ప్రభుత్వం వద్ద తక్కువ రేటుకు టికెట్ దొరుకుతుంది. అది మీకు ఇబ్బంది. మీ సమస్యంతా కన్వీనియన్స్ ఫీజే’ అని వ్యాఖ్యానించింది. వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించండి మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు. పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామని తెలిపారు. ఒప్పందాల ద్వారా తమ వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దీంతో అనుబంధ వ్యాజ్యాల్లో జూలై 1న ఉత్తర్వులిస్తామని ధర్మాసనం తెలిపింది. పలు కీలక అంశాలు ఉన్నందున కొత్త విధానాన్ని 15–20 రోజుల పాటు ఎందుకు ఆపకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ, కొత్త విధానానికి అత్యధికులు ఆమోదం తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా అందరితో చర్చించి, వారి సలహాలతో కొత్త విధానాన్ని తెచ్చామన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పారు. -
ఆన్లైన్ టికెట్లపై రోజంతా వాదనలు
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో వాదనలు మంగళవారం వాడీవేడిగా సాగాయి. బుక్ మైషో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దాదాపుగా రోజంతా వాదనలు సాగాయి. మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం వాదనల నిమిత్తం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వుల జారీకి బుక్ మైషో తరఫున సీనియర్ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అందరి వాదనలు విన్న తరువాతే నిర్ణయాన్ని వెలువరిస్తామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతకాలం ప్రభుత్వం తెస్తున్న వ్యవస్థను కొనసాగనిద్దామని, అప్పుడు బుక్ మైషో వ్యక్తం చేస్తున్న భయాందోళనలు నిజమో కాదో తేలిపోతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్ట నిబంధనలతో పాటు ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బుక్ మైషో) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. బాహుబలికి 50 శాతం ఆక్యుపెన్సీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. బుక్ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థను ఏపీఎఫ్డీసీ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆన్లైన్ టికెట్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీకి పరిమితం చేసి మిగిలిన టికెట్లను థియేటర్లో నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వంద శాతం టికెట్లను ఆన్లైన్లో బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాయన్నారు. రూ.100 బేస్ రేటు కలిగిన టికెట్‌ను బుక్ మై షో రూ.145కు విక్రయిస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దేశంలోనే అత్యధిక గ్రాస్ సాధించిన బాహుబలి–2 సినిమాకు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీనే బుక్ మైషో లాంటి సంస్థలు చూపాయని నివేదించారు. ఆన్లైన్ టికెట్ విక్రయాలపై తామేమీ నిషేధం విధించలేదని, నియంత్రణ మాత్రమే చేస్తున్నామన్నారు. కొత్త పోర్టల్ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 2 శాతం లోపు సర్వీస్ చార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం పోటీదారుగా వ్యవహరించదని ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాన్ని ముందుకు సాగనివ్వాలని, కొంతకాలం పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అంతా ప్రభుత్వ పోర్టల్‌లోనే కొంటారు.. బుక్ మైషో తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థ వల్ల వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి 2 శాతం సర్వీసు చార్జీ చెల్లించాలంటే వినియోగదారుడి నుంచి అధిక మొత్తాలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 2 నుంచి కొత్త విధానం అమలు చేయకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఎక్కడ ఉందని, ఏ చట్టం నిషేధిస్తుందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వండి జూలై 2 నుంచి కొత్త విధానం అమలుకు ఏపీఎఫ్‌డీసీతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదించారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతోందన్నారు. ఒప్పందాల కోసం ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ఏజీ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ 80 శాతం థియేటర్లకు బీ లైసెన్సులు లేవని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. -
సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్లు విక్రయించేందుకే ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీఎఫ్డీసీ పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ ద్వారా ఆన్లైన్ టికెట్ల విధానం అందుబాటులోకి రానుందని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ విధానంతో థియేటర్ల యాజమాన్యాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయన్న అపోహలు అక్కర్లేదని, పాత ఒప్పందాలు యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోర్టల్‌తో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యువర్ స్క్రీన్స్’ పోర్టల్ ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని థియేటర్లు కల్పించాలని, దీంతో ప్రేక్షకులకు తమకు నచ్చిన పోర్టల్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదనపు చార్జి చెల్లించకూడదనుకునేవారు ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యువర్ స్క్రీన్స్’ పోర్టల్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకుంటారని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు చేసిన విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సినిమా టికెట్ల ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. టికెట్ల డబ్బులు థియేటర్ల బ్యాంకు ఖాతాల్లో రోజువారీ ప్రాతిపదికన జమ చేస్తారని విజయ్‌కుమార్‌రెడ్డి వివరించారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
బుక్ మై షో ‘ఎక్స్ట్రా’ దోపిడీ
సాక్షి, అమరావతి: సినిమా.. సగటు పౌరునికి అందుబాటులో ఉన్న మాద్యమం. కానీ, ఈ వినోదాల వెండితెరను తమ దోపిడీకి రాచబాటగా చేసుకుంటోంది సినిమా మాఫియా. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాల పేరుతో ‘బుక్ మై షో’ అనే ప్రైవేటు సంస్థ ఏళ్ల తరబడి యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతోంది. అడ్డగోలు ఆర్జనకు కక్కుర్తిపడుతున్న థియేటర్ల యాజమాన్యాలు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి. థియేటర్లను గుప్పెటపట్టి.. టికెట్ల ధరలపై అత్యధికంగా కమీషన్లు వసూలుచేస్తూ ‘బుక్ మై షో’ దోచుకుంటోంది. దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ మాఫియాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ఇప్పుడీ మాఫియా బెంబేలెత్తుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో పారదర్శకంగా విక్రయిస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది. థియేటర్లను గుప్పెటపట్టి గుత్తాధిపత్యం ‘బుక్ బై షో’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సినిమా థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుంది. థియేటర్ల యజమానులకు డిపాజిట్ల రూపంలో అప్పులిచ్చి తమ సంస్థ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలనే షరతుతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య నిరోధక చట్టానికి విరుద్ధమైనప్పటికీ బేఖాతరు చేస్తోంది. ఏపీలో 1,140 థియేటర్లు ఉండగా.. తెలంగాణాలో 1,250 థియేటర్లు (వాటిలో 40 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనేనివే) ఉన్నాయి. వీటిల్లోని అత్యధిక థియేటర్లు ‘బుక్ మై షో’ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అంతేకాక.. దేశంలో ఏకంగా 78 శాతం ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయాలను బుక్ మై షో కంపెనీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఒక్కో టికెట్‌పై రూ.25వరకు అదనపు భారం.. ఇక సినిమా థియేటర్లు తమ గుప్పెట్లోకి వచ్చిన తరువాత టికెట్ల దందాకు ఈ సంస్థ తెరతీసింది. థియేటర్లను బట్టి ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనంగా వసూలుచేస్తోంది. వాటిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అయితే టికెట్‌కు రూ.8 చొప్పున, మల్టీపెక్స్ థియేటర్లకు రూ.14 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. అంటే.. టికెట్‌పై ఆ సంస్థ రూ.11 వరకు లాభం తీసుకుంటోంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా 50శాతానికి పైగా టికెట్లను ఈ సంస్థకే కేటాయిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుడిపై ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనపు భారం పడుతోంది. ఇలా బుక్ మై షో ఎంతగా దోపిడీకి పాల్పడుతో స్పష్టమవుతోంది. మరోవైపు.. ఎన్ని టికెట్లు ఎంత ధరకు విక్రయిస్తోందన్న రికార్డులు కూడా ప్రభుత్వానికి చెప్పకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. తద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో.. మార్కెట్లో ఉన్న కొన్ని పోటీ సంస్థలు సినిమా టికెట్‌పై రూ.11 అదనపు చార్జీతో ఆన్లైన్లో విక్రయిస్తామని ముందుకొచ్చాయి. కానీ, ముందస్తు ఒప్పందాల పేరిట ‘బుక్ మై షో’ సంస్థ అందుకు అడ్డంకులు సృష్టిస్తోంది. రూ.1.95 సర్వీస్ చార్జితోనే విక్రయాలకు ఏపీ నిర్ణయం దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను దోచుకుంటున్న ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. సినిమా టికెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్లో విక్రయించాలన్న విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. టికెట్‌పై కేవలం రూ.1.95 మాత్రమే సర్వీస్ చార్జ్‌తో ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. దాంతో తమ దందాకు అడ్డుకట్ట పడుతుందని ‘బుక్ మై షో’ సంస్థ ఆందోళన చెందింది. ఏపీ ప్రభుత్వ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమ అక్రమాల పుట్టి పూర్తిగా మునిగిపోతుందని ఆ సంస్థ, థియేటర్లు బెంబేలెత్తుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘బుక్ మై షో’ కోర్టులో కేసు వేసింది. కానీ, వీరి దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గుత్తాధిపత్యం చట్టవిరుద్ధమే.. మరోవైపు.. బుక్ మై షో గుత్తాధిపత్య పోకడలతో సగటు ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్న అంశంపై కొందరు ఢిల్లీలోని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను ఆశ్రయించారు. దేశంలో ఏ రంగంలో కూడా గుత్తాధిపత్యంతో వినియోగదారులు నష్టపోకుండా చూసే చట్టబద్ధమైన సంస్థ ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’. గత కొన్నేళ్లుగా ఆన్లైన్లో సినిమా విక్రయాల వాటా, వాటి విలువ మొదలైన అంశాలతో నివేదిక సమర్పించాలని కమిషన్ ‘బుక్ మై షో’ సంస్థను ఆదేశించింది. అయినా ఆ సంస్థ ఖాతరు చేయలేదు. ఈ కేసుపై ఇరుపక్షాల వాదనాలు విన్న తరువాత ‘బుక్ మై షో’ గుత్తాధిపత్యంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా కమిషన్ అభిప్రాయపడింది. థియేటర్లతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం చట్ట విరుద్ధమని చెప్పింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి డైరెక్టర్ జనరల్(డీజీ)ని ఆదేశిస్తూ ఈనెల 16న ఆదేశాలు జారీచేసింది. -
AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి
సాక్షి, అమరావతి: ‘సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయి. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారు’.. ఇదీ ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో స్పష్టంగా పేర్కొన్న అంశం. ఈ విధానంతోనే థియేటర్ల యజమానులతో కార్పొరేషన్ ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో టికెట్లు విక్రయిస్తే ఇక దశాబ్దాలుగా తాము సాగిస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనతో కొందరు తాజాగా ఓ దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం మొదలైతే.. టికెట్ల కలెక్షన్ల మొత్తం ప్రభుత్వం థియేటర్ల యజమానులకు ఎప్పుడిస్తుందో’.. అంటూ థియేటర్ల యజమానులను గందరగోళపరిచేందుకు యత్నిస్తున్నారు. కానీ, దీంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో విక్రయించే విధానాన్ని త్వరలో ప్రారంభించడానికి ఉద్యుక్తమవుతోంది. రోజువారీ ప్రాతిపదికన థియేటర్ల ఖాతాకు బదిలీ ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం జీఓ జారీచేసి మార్గదర్శకాలను వెల్లడించింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. మరోవైపు.. ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానంపై ఎలాంటి సందేహాలకు ఆస్కారంలేకుండా అన్ని అంశాలను సమగ్రంగా ఒప్పంద పత్రంలో పేర్కొంది. ప్రధానంగా ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తాన్ని థియేటర్ల యాజమాన్యానికి తిరిగి ఎప్పుడు బదిలీ చేస్తారు అనే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎంఓయూలోని ఆరో నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టికెట్ల కలెక్షన్‌ను రోజువారి ప్రాతిపదికన సంబంధిత థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని వెల్లడించింది. సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్ చార్జి (1.95శాతం) మినహాయించుకుని మిగిలిన మొత్తం అంటే జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు కలెక్షన్ ఆ మర్నాడే థియేటర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కాబట్టి సినిమా టికెట్ల విక్రయ మొత్తం తమకు ఎప్పుడు చేరుతుంది అనేదానిపై థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ఎఫ్డీసీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు.. ఆన్లైన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మరికొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అవి.. ♦ఆన్లైన్ వెబ్సైట్ లాగిన్ సౌకర్యం థియేటర్ కౌంటర్ వద్ద, మేనేజర్ చాంబర్లోనూ కల్పిస్తారు. ♦థియేటర్లకు బీఫాం లైసెన్సులు రెన్యువల్ కూడా ఆన్లైన్ విధానంలోనే సులభంగా చేస్తారు. ♦సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందుగా రిజర్వ్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ మొత్తం కూడా సంబంధిత షో ముగిసిన తరువాతే థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తారు. అక్రమాలకు కళ్లెంపడుతుందనే ఆందోళన దశాబ్దాలుగా సినిమా టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న కొందరికి ఆన్లైన్ విధానం సంకటప్రాయంగా మారింది. ఆన్లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను ప్రకటించడమే అందుకు కారణం. సినిమా సీట్లను మ్యాపింగ్ చేయనుండటంతో కలెక్షన్లను తక్కువగా చూపించి పన్ను ఎగవేయడం ఇకపై సాధ్యంకాదు. థియేటర్లు కచ్చితంగా బీఫామ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అందుకే.. ఆన్లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు కొందరు దుష్ప్రచారానికి తెరతీశారు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు ఏపీ థియేటర్ల యజమానులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఎంఓయూ కుదుర్చుకోకుంటే.. ఆన్లైన్ విధానానికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్ణీత గడువులోనే థియేటర్ల యజమానులు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. జూలై మొదటివారంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఎంవోయూల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంచేసింది. -
ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలి
కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి థియేటర్ల యజమానులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓలతో కలసి థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారానే విక్రయించాలన్నారు. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదన్నారు. బుక్ చేసుకున్న టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్డీఓలు మోహన్‌దాస్, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్: టెన్త్ విద్యార్థులకు తీపి కబురు) -
థియేటర్లతో ఎంవోయూ, సీట్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం దిశగా రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సన్నద్ధమవుతోంది. సినీపరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు హోం శాఖ తాజాగా జీవో జారీచేసింది. దీంతో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లకు నిర్దేశించారు. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. కలెక్టర్ల ద్వారా ఎంవోయూ రాష్ట్రంలో ఉన్న 1,140 సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎఫ్డీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలి. అందుకోసం ఎంవోయూ కాపీలను ఎఫ్డీసీ జిల్లా కలెక్టర్లకు పంపింది. కలెక్టర్లు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశమై ఎంవోయూపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వారం, పదిరోజుల్లో ఎంవోయూ కుదుర్చుకుని ఆ పత్రాలను కలెక్టర్లు ఎఫ్డీసీకి పంపుతారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం థియేటర్ల వారీగా ఉన్న సీట్లను నిర్ధారిస్తారు. అవకతవకలకు అవకాశం లేకుండా సీట్లను మ్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్లలో ఎన్ని సీట్లు ఉన్నాయన్నది అధికారికంగా గణాంకాలు లేవు. కొన్ని థియేటర్ల యజమానులు సీట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీట్ల సంఖ్యపై స్పష్టత లేకపోతే.. కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయించి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే థియేటర్ల వారీగా సీట్లను ఎఫ్డీసీ మ్యాపింగ్ చేయనుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కల్పించనున్న సర్వీసు ప్రొవైడర్ ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం పిలిచిన టెండర్లను ఎస్ఆర్ఐటీ–జస్ట్ టికెట్స్ సంస్థ దక్కించుకుంది. టెండర్లు, రివర్స్ టెండర్ల ప్రక్రియ అనంతరం ఆ సంస్థకు టెండరును ఎఫ్డీసీ ఖరారు చేసింది. టికెట్లను నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్లో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ టికెట్ కౌంటర్లలో కూడా ఎఫ్డీసీ పోర్టల్ నుంచే టికెట్లు విక్రయిస్తారు. అందుకోసం సినిమా థియేటర్లకు అవసరమైన హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలను సర్వీసు ప్రొవైడర్‌గా ఎంపికైన సంస్థ కల్పిస్తుంది. ఆన్లైన్లో టికెట్ల విక్రయంపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఇతర సంస్థల కంటే చాలా తక్కువ సర్వీసు చార్జి ఆన్లైన్లో విక్రయించే సినిమా టికెట్లపై 1.95 శాతం చొప్పున సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 0.95 శాతాన్ని సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మిగిలిన ఒక శాతం ఎఫ్డీసీ ఖాతాలోకి చేరుతుంది. ఆ విధంగా సమకూరే నిధులతో రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎఫ్డీసీ చేపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న వివిధ సంస్థలకంటే చాలా తక్కువ సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. పలు సంస్థలు రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టికెట్ రేటును బట్టి రూ.12 నుంచి రూ.50 వరకు సర్వీసు చార్జి వసూలు చేస్తుండటం గమనార్హం. ఆ సంస్థలు కూడా టికెట్లను ఎఫ్డీసీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయాలి. ఆ సంస్థలు తాము ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలో 1.95 శాతాన్ని ఎఫ్డీసీకి చెల్లించాలి. ఆ విధంగా కాకుండా నేరుగా ఎఫ్డీసీ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రేక్షకులకు సర్వీసు చార్జి తక్కువగా పడుతుందని ఎఫ్డీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్డీసీ పోర్టల్‌పై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తామని కూడా తెలిపాయి. -
‘పక్కా కమర్షియల్’ టికెట్ రేట్స్‌పై బన్నీవాసు క్లారిటీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు. (చదవండి: స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్‌లైన్స్ జారీ.. ఇకపై..
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. (చదవండి: సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు) అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్ స్క్రీన్ ఐమ్యాక్స్ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. -
‘సర్కారువారి పాట’ కు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
‘సర్కారువారి పాట’సినిమా యూనిట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) -
ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లు విక్రయించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునే ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కొంతకాలం తరువాత ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూసి తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇదే సమయంలో తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లను విక్రయించుకునేందుకు అనుమతించాలన్న మల్టీప్లెక్స్ థియేటర్ల అభ్యర్థనకు హైకోర్టు నో చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయం నిమిత్తం ప్రభుత్వం గత డిసెంబర్ 17న జారీచేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుమిత్ నీమా వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా మాత్రమే టికెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాము తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని, సమాంతరంగా రెండు వ్యవస్థలు ఉండటం వల్ల ఇబ్బందేమీ ఉండదని చెప్పారు. దీనిపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరణ కోరింది. ఏపీఎఫ్డీసీ ద్వారా వాళ్లూ టికెట్లు అమ్ముకోవచ్చు ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లను విక్రయించేందుకు బుక్‌మై షో, పేటీఎం వంటి సంస్థలు అంగీకరించాయని, అయితే మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం ముందుకు రావడంలేదని చెప్పారు. టికెట్ విక్రయ కార్యకలాపాలను ఏపీఎఫ్‌డీసీలో విలీనంచేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఆన్లైన్ టికెట్ విక్రయాల జీవో ఇచ్చామన్నారు. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయాన్ని కొనసాగించనివ్వాలని, దీనివల్ల పిటిషనర్ హక్కులకు భంగం వాటిల్లుతుంటే అప్పుడు జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. టికెట్ల విక్రయాల నుంచి తామెవరినీ తప్పించడం లేదని, ఏపీఎఫ్డీసీ ద్వారా విక్రయించాలని చెబుతున్నామని తెలిపారు. ఒక్కో టికెట్ విక్రయించినందుకు ప్రభుత్వానికి రూ.1.97 సర్వీసు చార్జీ కింద వస్తుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏముందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ న్యాయవాదిని ప్రశ్నించింది. తమకు తమ సొంత వ్యవస్థలు, విధానం ఉన్నాయని సుమిత్ నీమా చెప్పారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విధానాన్ని ఆషామాషీగా తీసుకురాలేదని, చట్టం ద్వారా ఆ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అందువల్ల ఏపీఎఫ్డీసీ ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని కొనసాగనివ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. తమ సొంత విధానంలో కూడా టికెట్ల విక్రయానికి అనుమతినివ్వాలన్న మల్టీప్లెక్స్ అసోసియేషన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది. -
ఏలూరులో నకిలీ సినిమా టిక్కెట్లు! కళ్లు కాయలు కాచేలా వేచి చూసి మూవీకెళ్తే..
ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. అభిమానుల ఉత్సాహం, సినిమా చూడాలనే ఆతృత అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా చేసుకొని వారికి నకిలీ టిక్కెట్లు విక్రయించి మోసం చేస్తూ డబ్బు దోచేస్తున్నారు ఓ థియేటర్ సిబ్బంది. తీరా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళితే.. నకిలీదంటూ బయటికి గెంటేస్తున్నారు. దీంతో డబ్బూ పోయి, సినిమా చూడలేకపోయామనే ఆవేదనతో పాటు అవమానానికి గురవుతున్నారు అభిమానులు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇటీవల రిలీజ్ అయిన ఓ పెద్ద హీరో సినిమాకు వెంకటకుమార్ అనే ఒక ప్రేక్షకుడు వెళ్లాడు. ముందురోజే థియేటర్ వద్ద రూ.300 పెట్టి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. కళ్లు కాయలు కాచేలా వేచి చూసి ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్ షోకు వెళ్లాడు. టిక్కెట్‌పై ఉన్న తన సీట్ నంబర్ చూసుకుని కూర్చున్నాడు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి తన సీట్ నంబర్ కూడా అదేనంటూ టిక్కెట్ చూపించాడు. ఈలోగా థియేటర్ సిబ్బంది వచ్చి అతన్ని కూర్చోబెట్టి.. రాత్రంతా వేచిచూసి అధిక ధరకు టిక్కెట్ కొన్న వెంకట కుమార్‌ను బయటకు నెట్టేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నీది నకిలీ టిక్కెట్.. మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా అభిమాని తనకు ఈ టిక్కెట్ ఎలా వచ్చిందో చెప్పాలంటూ పట్టుబట్టడంతో థియేటర్ యాజమాన్యం, సిబ్బంది కంగుతిన్నారు. అతను వెళ్లి ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి👉 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ భారీగా దోపిడీ సినిమా థియేటర్లోని సిబ్బంది చాకచక్యంగా టిక్కెట్లను నకిలీవి తయారు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వెళితే నకిలీ టిక్కెట్ కొన్నారు మాకు సంబంధం లేదంటూ బయటకు పంపేస్తున్నారు. వారంతా అవమానంగా ఫీలవుతూ ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనకు గురవుతున్నారు. రోజూ ఒక్కో షోకు ఈ విధంగా పది టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో టిక్కెట్ ధర రూ.300 అనుకుంటే షోకు రూ.3 వేలు సంపాదిస్తున్నారు. నాలుగు షోలకు రూ.12 వేల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. వీరిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు. చదవండి👉🏻 నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి -
అలా విక్రయించడం గుత్తాధిపత్యమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్ రూపంలో ప్రభుత్వం మాత్రమే విక్రయించడం గుత్తాధిపత్యమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. థియేటర్ యాజమాన్యాలు కూడా వారి సొంత ఆన్లైన్ వ్యవస్థల ద్వారా టికెట్ల విక్రయానికి అనుమతించడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకో వాలని, లేనిపక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సినిమా టికెట్ ధరల నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీదే
సాక్షి, అమరావతి: టికెట్ ధరలు, సర్వీసు చార్జీలను లైసెన్సింగ్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) మాత్రమే నిర్ణయించగలదని, ప్రభుత్వం కాదని హైకోర్టు పేర్కొంది. టికెట్ ధరలు, సర్వీసు చార్జీల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలియచేయగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్ అథారిటీనేనని స్పష్టం చేసింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం సందర్భంగా సినిమా థియేటర్లు ప్రేక్షకులకు విధించే సర్వీసు చార్జీని టిక్కెట్ ధరలో కలపడానికి వీల్లేదని పేర్కొంది. సర్వీసు చార్జీ విధింపు నిధుల మళ్లింపునకు దారితీయదని తెలిపింది. ఆన్లైన్ టికెట్ల విక్రయ ప్రక్రియ రికార్డవుతుందని, అందువల్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు రిస్క్ ఉండదని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా విక్రయించే టికెట్ మొత్తం ధరలో సర్వీసు చార్జీని కలపడాన్ని తప్పుబట్టింది. పాత విధానంలోనే ఆన్లైన్ టికెట్లను విక్రయించుకోవచ్చునని, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రేక్షకుడిపై సర్వీసు చార్జీ భారం మోపవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ ధరలను ఖరారు చేస్తూ జారీచేసిన జీవోను, సర్వీసు చార్జీని కూడా కలిపి ఆన్లైన్ టికెట్ ధరను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ‘ప్రత్యేక సౌకర్యం’ ప్రేక్షకులకు కల్పిస్తున్నామని, ఇందుకు తాము వసూలుచేసే సర్వీసు చార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని అసోసియేషన్ వాదించింది. ఈ వ్యాజ్యంపై గత వారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరిన విధంగా బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు ‘సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్లు భాగం కాదు. ఆ కమిటీ కూడా టికెట్ ధరలు నిర్ణయించే సమయంలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు. వారిని సంప్రదించినట్లుగానీ, వారి అభ్యంతరాలు స్వీకరించినట్లుగానీ చూపేందుకు ఎలాంటి డాక్యుమెంట్‌ను ఈ కోర్టు ముందుంచలేదు. ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించినందుకు సినిమా థియేటర్లు ప్రేక్షకుడిపై విధించే సర్వీసు చార్జీని టికెట్ మొత్తం ధరలో కలపడానికి వీల్లేదు. సినిమా హాలులో ప్రవేశానికి చెల్లించే ధరే.. అసలు టికెట్ ధర. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉపయోగించుకున్నందుకు విధించే చార్జీలను అసలు టికెట్ ధరగా పరిగణించడానికి వీల్లేదు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని కూడా పిటిషనర్ ప్రశ్నించారు. జీవో 69 ప్రకారం టికెట్ ధరలను నిర్ణయించాల్సింది లైసెన్సింగ్ అథారిటీయే తప్ప ప్రభుత్వం కాదు. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది. ఈ విషయంపై లోతుగా విచారణ జరపాలి..’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సినిమా టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో, ఐనాక్స్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్లైన్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్లైన్లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే -
టిక్కెట్ రేట్ల పెంపే కాదు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి మరో శుభవార్త!
బాహుబలి తర్వాత తెలుగు తెర నుంచి వస్తోన్న మరో భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. అంతకు ముందే తెలంగాణలో కూడా జీవో జారీ అయ్యింది. వీటికి తోడు ఆర్ఆర్ఆర్ టీమ్‌ని ఖుషి చేసే మరో వార్త వెలుగు చూసింది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఇదే సమయంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగారు. లాక్డౌన్ ఎత్తేసినా సీ సెంటర్లో సింగిల్ స్క్రీన్ నుంచి మెట్రోలో మల్టీప్లెక్సుల వరకు ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. థియేటర్ల దగ్గర సందడేది? సౌత్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ వరకు బాగానే ఉన్నా.. తర్వాత థియేటర్‌కి వస్తున్న వారి సంఖ్య బాగా పడిపోయింది. ఇక బాలీవుడ్ నార్త్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండియా వైడ్‌గా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న అక్షయ్ కుమార్ నటించిన బెల్‌బాటమ్, సూర్యవంశీ సినిమాలు ఆశించిన మేర బాక్సాఫీసు వద్ద సందడి చేయలేకపోయాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వే సినిమా ఇండస్ట్రీకి ఉత్సాహం అందించే ఫలితాలను వెలువరించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 331 జిల్లాల నుంచి 19 వేల మందికి పైగా సినిమా గోయర్స్ నుంచి పలు దఫాలుగా సమాచారం సేకరించి విశ్లేషించింది. ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. థియేటర్లలో చూస్తాం 2021 డిసెంబరులో సేకరించిన సమాచారం ప్రకారం గత 60 రోజుల్లో సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశామని చెప్పిన వాళ్ల సంఖ్య 14 శాతం ఉండగా 2022 ఫిబ్రవరి నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఇక సినిమాలకు కీలకమైన మార్చ్, ఏప్రిల్‌లలో థియేటర్‌కి వెళ్లి కచ్చితంగా సినిమా చూస్తామని చెప్పిన వారి సంఖ్య ఏకంగా 41 శాతంగా ఉంది. కంటెంట్ ఉంటే కనక వర్షమే లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం సినిమా గోయర్స్‌లో 75 శాతం మంది ఏడాది కాలంగా థియేటర్లో ఒక్క సినిమా కూడా చూడలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పేందుకు మార్చిలో రిలీజైన కశ్మీర్‌ఫైల్స్ ఓ ఉదాహారణ. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ లేకపోయినా ప్రేక్షకులను కదిలించే కంటెంట్ ఉండటంతో సినిమా గోయర్స్ థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృస్టిస్తోంది. రికార్డులు ఖాయం కశ్మీర్ ఫైల్స్ సినిమాకే బాక్సాఫీసు దగ్గర సందండి నెలకొంటే బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి అండ్ కో నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ కంటెంట్ బాగుంటే థియేటర్లలో కనకవర్షమే అనే అంచనాలు నెలకొన్నాయి. పైగా లోకల్ సర్కిల్స్ సర్వేలో 44 శాతం శాంపిల్స్ మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల నుంచి తీసుకున్నారు. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రోజులు హౌజ్‌ఫుల్ బోర్డులు పడితే బాహుబలి 2, దంగల్ రికార్డులు చెరిగిపోవడం ఖాయం! -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు జక్కన్న కృతజ్ఞతలు..
Rajamouli Thanks To YS Jagan And KCR: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దర్శక ధీరుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం (మార్చి 8) తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. తాజాగా జక్కన్న కూడా ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వ్యక్తపరిచారు. Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas. — rajamouli ss (@ssrajamouli) March 9, 2022 ఈ పోస్ట్‌లో 'కొత్త జీవోతో టికెట్ల ధరలు సవరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీం జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.' అంటూ రాసుకొచ్చారు జక్కన్న. అలాగే తెలంగాణ ముఖమంత్రి చంద్రశేఖర్ రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. 'పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.' అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. A big thanks to the CM KCR garu and the Telangana govt for permitting 5 shows a day for big films. Also, thanks to @YadavTalasani garu for your continuous support to us. This is a big help to the film fraternity. @TelanganaCMO — rajamouli ss (@ssrajamouli) March 9, 2022 -
సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు. పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్‌ను త్వరలోనే కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్, జెమిని కిరణ్ సహా పలువురు ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని, అందుకు తగినట్లుగా పనిచేసేందుకు కృషి చేయనున్నట్లు సి. కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఒక మెగా ఈవెంట్ నిర్వహించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా భావించే చిరంజీవిని కలిసి వివరిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మరింత చొరవ తీసుకోవాలని కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. థియేటర్లు కళకళలాడితేనే సినీ పరిశ్రమ బాగుంటుందన్నారు. -
ఏపీలో కొత్త సినిమా టికెట్ రేట్టు..ఎంత పెరిగాయి అంటే
-
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల సవరణ.. స్పందించిన చిరంజీవి
Megastar Chiranjeevi Tweet On Ap Movie Ticket Prices: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లను సవరించడంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలుగు సినీ పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 'తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. చదవండి: సినిమా టిక్కెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చిన్న సినిమాకు ఐదో షో కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశమని చిరంజీవి పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, మూడు కేటగిరీల్లో 4 రకాలుగా సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా రూ. 20, గరిష్టంగా రూ. 250 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఇదివరకు కలిసిన విషయం తెలిసిందే. Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt — Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022 -
సినిమా టికెట్ల ధరలపై జీవో విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం సవరించింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, అదే సమయంలో సామాన్యులకు టికెట్ల ధర అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ఇతర వర్గాలతో ప్రభుత్వం పలు దఫాలుగా సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. టికెట్ల అంశాన్ని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ల ధరలను ఖరారు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు/పంచాయతీల వారీగా సినిమా థియేటర్లను 4 కేటగిరీలుగా విభజించి టికెట్ల ధరలను నిర్ణయించింది. సినిమా టికెట్ల కనిష్ట ధర రూ. 20గా, గరిష్ట ధర రూ. 150గా నిర్ణయిస్తూ రిక్లయినర్ సీట్లకు టికెట్‌ను రూ. 250గా ఖరారు చేసింది. నిర్వహణ చార్జీలతో కలుపుకొని ఆ టికెట్ ధరలను ప్రకటించింది. కాగా దీనికి జీఎస్టీ అదనమని పేర్కొంది. పేదలకు అందుబాటులో సినిమా... పేదలకు సినిమా అందుబాటులో ఉండేందుకు నాన్ ప్రీమియం కేటగిరీని ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఏసీ, నాన్ ఏసీ థియేటర్లు తప్పనిసరిగా 25 శాతం సీట్లను నాన్ ప్రీమియం కేటగిరీ కింద కేటాయించాలని స్పష్టం చేసింది. తక్కువ బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహంపై విధాన నిర్ణయం ప్రకటించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. కాగా పండుగ రోజులతో సహా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఒక షోను తప్పనిసరిగా చిన్న బడ్జెట్ సినిమాల ప్రదర్శనకు కేటాయించాలని షరతు విధించింది. నటీనటుల పారితోషికం సహా బడ్జెట్ రూ. 20 కోట్లు లోపు ఉన్నవాటిని చిన్న సినిమాగా గుర్తిస్తామని పేర్కొంది. రూ. 100 కోట్లు నిర్మాణ వ్యయం దాటితే.. హీరో, హీరోయిన్, దర్శకుల పారితోషికాలు మినహా రూ. 100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలు విడుదల తేదీ నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదీ ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం షూటింగ్ చేసిన సినిమాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ► తక్కువ బడ్జెట్, సూపర్హై బడ్జెట్ సినిమాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేస్తామని పేర్కొంది. ► ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది. ► జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. చదవండి: కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
ప్రముఖ నటుడి సినిమా.. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కోసం తండ్రి డబ్బివ్వలేదని..
జగిత్యాలక్రైం: సినిమా టికెట్ కొనడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల పురాణిపేటలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు నవదీప్ (11) ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. త్వరలో విడుదల కానున్న ఒక ప్రముఖ నటుని సినిమా కోసం తన స్నేహితులు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. టికెట్ కొనడానికి రూ.300 కావాలని తండ్రిని నవదీప్ సోమవారం రాత్రి అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని తండ్రి బదులివ్వడంతో మనస్తాపానికి గురైన నవదీప్.. ఇంటి ఎదుట గల బాల్కనీలో లుంగీతో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుని తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ కిశోర్ తెలిపారు. (చదవండి: GHMC: హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై) -
అభివృద్ధికి ఒప్పిస్తే ఏడుపెందుకు?!
సినీ ప్రముఖులంతా జగన్‌ను అభినందించి, సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తుంటే... తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం అదెలా కుదురుతుందని రోదిస్తోంది! జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో సరైన చొరవ తీసుకుని ఉంటే ఈపాటికే ఎంతో కొంత చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చి ఉండేది. చంద్రబాబుకు సినీ ప్రముఖులతో బాగా సంబంధాలు ఉన్నాయి. వాటిని ఆయన ఏపీ కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేశారు. అందుకు భిన్నంగా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సినీ పెద్దల్ని ఒప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే రోజులు వస్తున్నట్లే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సందర్భంగా జరిగిన చర్చలను గమనిస్తే అలాంటి ఆశా భావం కలుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చూపిన చొరవ, ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రాధాన్యం అభినందనీయం అని చెప్పాలి. ఇతర సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, ప్రభాస్, రాజ మౌళి, పోసాని కృష్ణమురళి, ఆర్.నారాయణమూర్తి, అలీ తదితరులు కలిసి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. ‘ఇది సంతోషకరమైన రోజు’ అని కూడా వారు వ్యాఖ్యానించారు. కొద్దినెలలుగా సినీ పరిశ్రమలోని కొంతమందికీ, ఏపీ ప్రభుత్వానికీ మధ్య వివాదం జరుగుతోంది. సినిమా టికెట్ల ధరలను సామాన్య ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ రేట్లు తమకు గిట్టుబాటు కావని సినీ ప్రముఖులు వాదిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోపై నటులు నాని, పవన్ కల్యాణ్ వంటివారు విమర్శనాత్మకంగా స్పందించారు. వారు ప్రభుత్వానికి విషయం తెలియజేసేవిధంగా కాకుండా, ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందించే విధంగా మాట్లాడారు. దాంతో ఈ సమస్య మరింత జటిలమైంది. కిరాణా షాపుతో థియేటర్లను పోల్చారు నాని! పవన్ కల్యాణ్ అయితే తనను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ధరలు నిర్ణయించిందన్నట్లు భావించి, అవసరమైతే తాను ఉచితంగా సినిమాలను ప్రదర్శిస్తానని అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే– పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటుడు అయిన చిరంజీవి... ముఖ్య మంత్రి జగన్‌తో సత్సంబంధాలను నెరపుతూ, సినీ పరిశ్రమ సమస్య లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే, పవన్ మాత్రం రాజకీయం గానే వ్యవహరిస్తుండటం! దానివల్ల పరిశ్రమకు ఏ మాత్రం ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో సినిమా హీరోల రెమ్యునరేషన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది. కొందరు హీరోలు నలభై నుంచి వంద కోట్ల వరకు తీసుకుంటున్నారని, వారు తమ ప్రతిఫలాన్ని తగ్గించుకోకుండా టిక్కెట్ల ధర పేరుతో ప్రజలపై భారం మోపడం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తింది. అందువల్లే ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో సానుకూలత ఏర్పడింది. దీనిని గమ నించే సినీ పెద్దలు కూడా ప్రభుత్వంతో తగాదా రూపంలో కాకుండా రాజీ ధోరణిలో వ్యవహరించారని చెప్పవచ్చు. ఈ సందర్భంలోనే ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై జగన్ దృష్టి కేంద్రీకరించారు. విశాఖపట్నం సినీ పరిశ్రమకు అనువైన ప్రదేశమనీ, అక్కడకు అంతా రావాలనీ ఆయన ఆహ్వానించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామనీ, స్టూడియోల నిర్మాణానికి భూమి ఇస్తామనీ కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు. అలాగే ఇరవై శాతం షూటింగులు ఏపీలో తీయాలని కూడా సీఎం కోరారు. కచ్చితంగా ఇది అవసరం కూడా! ఎక్కువ జనాభా, ఎక్కువ థియేటర్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాన్ని సినీ పరిశ్రమ విస్మరించడం సరికాదు. నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో సరైన చొరవ తీసుకుని ఉంటే ఈపాటికే ఎంతో కొంత చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చి ఉండేది. చంద్రబాబుకు సినీ ప్రముఖులతో బాగా సంబంధాలు ఉన్నాయి. వాటిని ఆయన ఏపీ కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాలకే పరిమితం చేశారు. అందుకు భిన్నంగా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సినీ పెద్దల్ని ఒప్పించారు. ఏపీలో అనేక ప్రాంతాలలో టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అయినా సాంకేతిక నిపుణులు, ఇతర సహాయ సిబ్బంది అంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వారు ఆశించిన మేర షూటింగ్‌లను ఏపీలో చేయడం లేదు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడంతో ఏపీలోని కళాకారులకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అదే ఏపీలోనే పరిశ్ర మకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకుంటే అలాంటి సమస్యలకు ఆస్కారం ఉండదు. పైగా ఆంధ్రా సంస్కృతిని, సాహి త్యాన్ని, ప్రాంత ఉనికిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. టికెట్ల ధరలు, ఆన్లైన్ విధానం వంటి విషయాలలో ప్రభుత్వా నికీ, సినీ పెద్దలకూ ఒక అవగాహన కుదరడం కూడా మంచి పరి ణామమే. ఆన్లైన్ విధానానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతు ఇచ్చారు. అలాగే పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలకు కూడా నష్టం జరగకుండా చూడాలని ఆర్. నారాయణ మూర్తి కోరారు. చిన్న సినిమాలకు «థియేటర్లు దొరకడం లేదని పోసాని చెప్పారు. థియేటర్లు అన్నీ నలుగురైదుగురి చేతిలోనే ఉండటంతో ఈ సమస్య వస్తోంది. దీనికి ప్రభుత్వపరంగా ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. సినీ పరిశ్రమ ప్రముఖులే థియేటర్లను కంట్రోల్ చేస్తున్న వారితో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావడం మంచిదనిపిస్తుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే వంద కోట్లు మించి బడ్జెట్ ఉన్న సినిమాలను ప్రత్యేకంగా పరిగణించి, వాటికి టిక్కెట్ల ధరలను విడిగా నిర్ణయించ డానికి ప్రభుత్వం ఓకే చేయడం. సానుకూల స్పందన ఇది. కాగా సినీ ప్రముఖులంతా జగన్‌ను అభినందించి, సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తే, తెలుగుదేశం అను కూల మీడియా మాత్రం అదెలా కుదురుతుందని రోదిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? నిర్ణయాలలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కానీ పనిగట్టుకుని వ్యతిరేకించడం ద్వారా వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు. ఇక స్టార్ నటుడు చిరం జీవికి ముఖ్యమంత్రి జగన్‌తో సత్సంబంధాలు ఉండటం, ఆయన తరచుగా జగన్‌ను కలవడం కూడా టీడీపీ వర్గాలకూ, టీడీపీ మీడియాకూ జీర్ణం కావడం లేదు. దాంతో చిరంజీవి సహా జగన్‌ను కలిసిన వారందరిపై బురద జల్లే ప్రయత్నంలో పడ్డారు. అందులో చంద్రబాబు కూడా చేరారు. ‘చిరంజీవి ముఖ్యమంత్రి వద్ద ప్రాథేయ పడతారా!’ అని ప్రశ్నించారు. సినీ నటులను జగన్ అవమానించారని దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇదంతా చిల్లర రాజకీయంగా కనిపిస్తోంది. చిరంజీవి వల్ల జగన్‌కు రాజకీయ ప్రయోజనం కలుగుతుందేమోనన్నది వారి బాధ కావచ్చు. చిరంజీవి ఏదో పదవి ఆశించి జగన్‌ను కలుస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ఆయన కొట్టిపారేసి, తాను ఎలాంటి పదవీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఒక పెద్ద మనిషి తరహాలో వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. మరి ఆయన సోద రుడు పవన్ కల్యాణ్ మాత్రం అనేక అంశాలలో చపలచిత్తంగా ఉంటు న్నారు. ఆయన ఎంతసేపూ రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప, ఏది సరైన మార్గం అనేది ఎంపిక చేసుకోలేకపోతున్నారు. సినిమాకూ, రాజకీయాలకూ ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారే గానీ, సినీ పరిశ్రమ మంచికి యత్నించినట్లు కనిపించదు. ఏది ఏమైనా సినీ పరిశ్రమతో ప్రభుత్వానికి వివాదం ఏర్పడటం కూడా మంచిది కాదు. అందుకే ప్రభుత్వం కూడా సామరస్య ధోరణిలో సినీ పరిశ్రమ సమస్యలను పరిశీలించి పరిష్కరించడం, అదే సమయంలో ఈ పరిశ్రమ ఏపీలో కూడా వచ్చేలా చర్యలు చేపట్టడం, తద్వారా ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేలా చూసేందుకు ప్రయత్నించడం శుభ పరిణామం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకున్నట్లు చిత్ర పరి శ్రమలో కొంత భాగం ఏపీకి తరలివస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే అవుతుంది. అది తేలికైన విషయం కాకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న యత్నాలకు అంతా మద్దతు ఇవ్వాలి. మహేశ్‌బాబు ‘ఇది మంచి రోజు’ అన్నట్లుగానే ఏపీ ప్రజలకు సైతం మంచి జరిగేలా పరిశ్రమ కూడా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నటుడు మోహన్ బాబు నన్ను వ్యక్తిగతంగా కాఫీకి ఆహ్వానించారు: మంత్రి పేర్ని నాని
-
మంచు విష్ణు మోహన్ బాబుతో పేర్ని నాని కీలక భేటీ
-
నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు మోహన్‌బాబును మంత్రి పేర్ని నాని మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. మోహన్‌బాబు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. చదవండి: సినిమాకు మంచి రోజులు -
ఇప్పుడు చాలా సంతోషం
సాక్షి, అమరావతి : సినిమా టికెట్ ధరలు, ఇతర సమస్యలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రతిపాదనలు ఉభయ తారకంగా.. ఇటు ప్రేక్షకులు, అటు సినీ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎంతో, అనంతరం మీడియాతో వారు మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. సంతృప్తిగా ఉంది : చిరంజీవి పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. మీ ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తిగా ఉంది. కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరం ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టికెట్ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్సైజ్ చేశారు. పెట్టే అమ్మను అన్నీ అడుగుతారు. ఇచ్చే వారినే కోరుతారు. అందుకే మేం కొన్ని కోరికలు కోరుతున్నాం. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్ ఇంపాక్ట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అవి ఉంటేనే కానీ జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే పైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాను కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణ మూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు. సీఎంకు ధన్యవాదాలు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమ కళకళలాడాలంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ బాగుండాలి. అప్పుడే పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది నటులు, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుంది. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరితే.. సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కల్పించే అంశంపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అందాల నగరమైన విశాఖపట్నంను సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చుతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి బాటలు వేస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ సమంగా అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌కు చెప్పాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంలో ముందు నుంచి ఎంతో చొరవ తీసుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై ఈనెల మూడో వారంలోగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేస్తుందని భావిస్తున్నాం. ఇకపై ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చలతో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం. సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ సహకారం అందజేస్తారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరిశ్రమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రత్యేకంగా కమిటీ వేశారు. సినీ ప్రముఖులు ప్రతి సమస్యపైనా సీఎంతో విపులంగా చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన వారు, సంబంధం లేని వారు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నా.. చిరంజీవి వాటిని భరిస్తూ సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. పరిశ్రమకు ఉపశమనం కల్పించారు. చిన్న సినిమాలకు సంబంధించి నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదనను సీఎం వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారు. పండగ, సెలవు రోజుల్లో చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలని, అవి బతికేలా చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ పెద్దలను సీఎం కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా అందజేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమాలు చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందించారు. తమకు హైదరాబాద్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని, ఇక్కడా భారీ ఎత్తున సినిమాలు చిత్రీకరిస్తామని వారు సీఎంకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి దారి చూపిన సీఎం కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గత రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉంది. మా కెరీర్లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బందికరం. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్.. ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతాయి. ఈ రెండేళ్లలో ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉండింది. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయిన తరుణంలో చిరంజీవి ముందడుగు వేసి.. సీఎం జగన్‌తో చర్చించి, సమస్యల పరిష్కారానికి దారి చూపించారు. ఈ రోజు సినీ పరిశ్రమకు సీఎం జగన్ గొప్ప ఉపశమనం కల్పించినందుకు కృతజ్ఞతలు. వారం పది రోజుల్లోనే శుభ వార్త వింటాం. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – మహేష్‌బాబు, సినీనటుడు ఇండస్ట్రీకి మంచి చేస్తే అందరికీ లాభం గతంలో సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ సినిమా అయినా హిట్ లేదా ప్లాప్. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు. అందరికీ మేలు జరుగుతుంది. – అలీ, సినీనటుడు సంతోషంగా ఉంది ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. ఈ రోజుతో అది తొలగిపోయింది. మాతో మీరు (సీఎం) నేరుగా మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి సినిమా థియేటర్ యజమాని నుంచి ఎగ్జిబిటర్, నిర్మాత వరకు ఉన్న సమస్యలపై సీఎం జగన్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. సమస్యల పరిష్కారానికి మా ప్రతిపాదనలన్నీ విని.. సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే చిరంజీవికి నచ్చదు. కానీ ఆయన చేసే పనుల వల్ల ఆయనకు పెద్దరికం వచ్చింది. సీఎం వైఎస్ జగన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. – రాజమౌళి, దర్శకుడు మీరు చేయాలనుకుంటే చేస్తారు చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు.. ఇలాంటి వాటికి రాశాను. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎం చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి. కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30 వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. – పోసాని కృష్ణమురళి, సినీ నటుడు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్ మాకు సమయం ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. అందుకు కృతజ్ఞతలు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ప్రభాస్, సినీనటుడు చిన్న సినిమా బతకాలి సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా.. పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమా కూడా బతకాలి. హిట్ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి. పండగలు, సెలవుల సమయాల్లో పెద్ద సినిమాలదే హవా. ఆ సమయంలో చిన్న, సగటు సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు దొరకడం లేదు. థియేటర్లను అడుక్కోవాల్సిన పరిస్థితి. సగటు సినిమా మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో.. సినిమాను నిలబెట్టేలా మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమ విరాజిల్లుతుంది. సినీ పరిశ్రమలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాకారులకు ఏటా నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. పరిశ్రమ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు. పరిశ్రమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ఆర్.నారాయణ మూర్తి, సినీనటుడు, దర్శకుడు, నిర్మాత -
వాళ్ళిద్దరికీ తేడా అదే! ఇక మీరే నిర్ణయించుకోండి: పోసాని కృష్ణ మురళి
-
సీఎం జగన్ తో చిరంజీవ, మహేష్ ఏం మాట్లాడారో చూడండి
-
సీఎం జగన్‌తో భేటీ తర్వాత టాలీవుడ్ పెద్దల స్పందన
-
టాలీవుడ్ సెలబ్రిటీల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్
-
సీఎం జగన్ స్పందన చూసి ప్రభాస్, మహేష్: మంత్రి పేర్ని నాని
-
సినిమా టికెట్ రేట్స్ పై నా నిర్ణయం: సీఎం వైఎస్ జగన్
-
నేను చిరంజీవి అన్న కలిసి ఇండస్ట్రీ కోసం చాలా చర్చించాం: సీఎం వైఎస్ జగన్
-
సినీ ఇండస్ట్రీకి సీఎం బంపర్ ఆఫర్
-
దేనికైనా ఐదో షోకు అనుమతిస్తాం: సీఎం జగన్
-
సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం జగన్ ఏమన్నారంటే..?
సాక్షి, అమరావతి: తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐఎండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎఫ్డిసీ ఎండీ టి విజయ్‌కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... : ‘‘మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ... దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు... కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ఈ పాయింట్‌ను కూడా చర్చించాను. నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. మంచి ధరలు తీసుకురావడం జరిగింది. ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే... అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించాం. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం... ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయి. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారు. రేట్లకు సంబంధించినంత వరకు... అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్ ఇస్తుంది. నెలకు సగటున రూ.80లు పడుతుంది. దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మార్పు చేశాం. మరొక్క అంశం...మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుంది. ఆ పాయింట్ అర్ధం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉంది. నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం. విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి... అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమనుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నాం. ఆ పండగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా... కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని’’ సీఎం జగన్ అన్నారు. -
సీఎం జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు: ప్రభాస్
-
సినీ పరిశ్రమలకు కీలక సూచనలు.. అక్కడా కూడా షూటింగులు
-
సీఎం గారికి ఆవిషయంలో చాలా థాంక్స్: ఎస్ ఎస్ రాజమౌళి
-
ఒకే ఫ్రేమ్ లో చిరు, ప్రభాస్, మహేష్
-
ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే..
-
సీఎం జగన్‌తో ముగిసిన టాలీవుడ్ ప్రముఖుల భేటీ
Chiranjeevi, Mahesh Babu And Others To Meet Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. 17 అంశాలపై చర్చ? సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్ ధరలు, ఏసీ, నాన్ఏసీ థియేటర్లలో టికెట్ ధరల పెంపు సహా ఇండస్ట్రీకి చెందిన 17 అంశాలపై సినీ పెద్దలు సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ బృందం గన్నవరం విమనాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సినీ ప్రముఖులు బయల్దేరి వెళ్లారు. -
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై బురద చెల్లడం తప్పు
-
సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న సినీ పెద్దలు వీరే: మంత్రి పేర్ని నాని
-
సినిమా టిక్కెట్ల అంశానికి తెరపడేనా ??
-
ఆన్లైన్ టికెట్ల విధానంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్లో విక్రయానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయిస్తే పన్నుల ఎగవేతను అడ్డుకోవచ్చునని, ఇందుకోసమే ఆ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపింది. దీనివల్ల ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లదని కూడా తేల్చి చెప్పింది. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయానికి జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీఎఫ్‌డీసీలకు నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆన్లైన్ టికెట్ల విధానాన్ని సవాలు చేస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్లైన్లో టికెట్లు అమ్మితే తప్పేముందని ప్రశ్నించింది. అది గుత్తాధిపత్యం అవుతుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పన్నుల ఎగవేతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ప్రకాశ్‌రెడ్డి అనగా, ఈ వ్యవహారంలో ప్రాథమిక హక్కులు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆన్లైన్లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. దీనిపై ధర్మాసనం విబేధిస్తూ, ‘ఆన్లైన్ గురించి తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు ప్రపంచమంతా ఆన్లైన్ ద్వారానే పనిచేస్తోంది. ఆన్లైన్లో సినిమాలు ఎలా చూడాలో జనాలకు బాగా తెలుసు. మీరు కూడా ఆన్లైన్ ద్వారానే వాదనలు వినిపిస్తున్నారు. ఆన్లైన్ గురించి ప్రజలకు తెలియదనుకోవడం పొరపాటు’ అని వ్యాఖ్యానించింది. ముందు నోటీసులు జారీ చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు. జీవో 35పై విచారణ వాయిదా సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్ నర్సింహారావు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. తుది విచారణను వాయిదా వేసింది. -
అందుబాటులో వినోదం
సాక్షి, అమరావతి/గన్నవరం: సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన, ఆకాంక్షను అభినందిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను ముఖ్యంగా ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు, సినీ కార్మికుల కష్టాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించానన్నారు. తాను చెప్పిన అన్ని విషయాలను సానుకూలంగా ఆలకించారని తెలిపారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతూ గన్నవరం విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. టికెట్ల వివాదం జఠిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా తనను ఆహ్వానించారని.. భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చెప్పారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా తనను ఆహ్వానించి, విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆ ఆలోచన నాకు బాగా నచ్చింది ► సినిమా అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ఆలోచన నాకు బాగా నచ్చింది. సినిమా టికెట్ల ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు.. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ► ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలో వినడం కాదు, రెండో కోణంలోనూ వినాలని సీఎం అన్నారు. రెండు వైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అది ఎంతో బాధ్యతగా అనిపించింది. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల ఇబ్బందులు ఒక్కొక్కటి సీఎం జగన్‌కు కూలంకషంగా తెలియజేశాను. ఎన్నో ఇబ్బందులున్నాయి.. ► సినీ ఫీల్డ్ పైకి కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఎంతో మంది ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. సినిమా హాళ్లు మూసేస్తే బెటర్ అనే భావనలో కొందరు యజమానులు ఉన్నారు. ► కోవిడ్ సమయంలో సినీ కార్మికులు దయనీయ పరిస్థితిలో గడిపారు. ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటితో పాటు ఇండస్ట్రీలో అన్ని కేటగిరీలకు చెందిన వారి సమస్యలను వివరించాను. నిర్మాణాత్మక సూచనలు చేశాను. అన్నీ పరిశీలిస్తామన్నారు ► అన్ని రకాలుగా ఆలోచించి, ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను పునః పరిశీలిస్తామని తెలిపారు. ► ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. వీటిని ప్రభుత్వ కమిటీకి నివేదిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశం వివరాలను హైదరాబాద్‌కు వెళ్లాక సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు తెలియజేస్తాను. ► ఆ తర్వాత మరోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతాను. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం. ఒక వేళ నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. సినీ ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి లేనిపోని కామెంట్స్ చేయొద్దని కోరుతున్నా. ► పెద్ద బడ్జెట్ సినిమానా.. లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే జీవో ఇస్తామని సీఎం తెలిపారు. సీఎం జగన్‌ను సన్మానించిన చిరంజీవి చిరంజీవి గురువారం తాడేపల్లిలోని సీఎం ఇంటి వద్దకు రాగానే వైఎస్ జగన్ సాదరంగా ఆయన్ను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చిరంజీవి తొలుత వైఎస్ జగన్‌ను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇద్దరూ 1.20 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీపై చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. పండుగ పూట సీఎం నాతో సోదరుడిగా వ్యవహరించారని, వైఎస్ భారతి ఆప్యాయంగా వడ్డించారని ఆనందం వ్యక్తం చేశారు. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నప్పుడు, 3.10 గంటలకు తిరిగి వెళ్లేటప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది: చిరంజీవి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయినా చిరంజీవి.. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. పండగ పూట సీఎం జగన్‌తో ఆనందకర భేటీ జరిగిందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంసం ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరో వైపు. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎంగారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు ఒక కోణంలో వినడం కాదు.. రెండో కోణంలోనూ వినాలని ఆయన అన్నారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను వివరించా. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను సీఎం పునః పరిశీలిస్తామన్నారు. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత మరోసారి సీఎం జగన్ తో భేటీ అవుతా. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం.. నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు. -
ఇండస్ట్రీ బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా : చిరంజీవి
-
ఆ కారణంగానే సీఎం జగన్‌ని కలిసేందుకు వెళ్లలేదు: నాగార్జున
Nagarjuna respond on CM Jagan-Chiranjeevi meet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చిరంజీవి భేటీపై సీనియర్ హీరో నాగార్జున స్పందించారు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం జగన్‌తో చిరంజీవీ సమావేశం అయ్యారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను, చిరంజీవి చర్చించుకున్నామని, సీఎంతో భేటీకి నన్ను కూడా ఆహ్వానించారని, కానీ బంగార్రాజు ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో నాకు కుదరలేదని నాగార్జున పేర్కొన్నారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు. కాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గురువారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లిన చిరంజీవి.. అక్కడి నుంచి కారులో నేరుగా సీఎం క్యాంప్ క్యార్యాలయానికి వెళ్లారు. సీఎంతో భేటీ అనంతరం.. చిరంజీవి మీడియాతో మాట్లాడనున్నారు. -
ఇండస్ట్రీ బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా : చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గురువారం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి... తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘సినిమా అంశాలపై సీఎంతో చర్చించేందుకు విజయవాడ వచ్చా. సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా. సీఎంతో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతాను’అని సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. -
టికెట్ రేట్లపై నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల విషయంలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మంచి నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. చర్చలు వంద శాతం సంతృప్తినిచ్చాయి. టికెట్ ధరలు తగ్గించొద్దని చెప్పాను. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని కోరాను. సినీ పరిశ్రమకు ప్రతినిధిగా రాలేదు. ఒక దర్శక, నిర్మాతగా మాత్రమే వ్యక్తిగత వాదన వినిపించాను’ అని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. పవన్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే ఆరోపణలు సరైనవి కావన్నారు. ‘సినీ రంగమంటే ఒకరిద్దరు కాదు. ఈ ఒక్క చర్చతోనే టికెట్ల అంశానికి ముగింపు రాదు. పరిశ్రమలోని వందల మంది అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో మంత్రికి వివరించాను.’ అని చెప్పారు. ఏపీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే థియేటర్లు మూసివేశారన్నారు. కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వాన్ని మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు: మంత్రి పేర్ని నాని టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీలానే సినీ పరిశ్రమలో ఎవరైనా వచ్చి అభిప్రాయాలు తెలపవచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు. వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని అంశాలనే అమలు చేస్తున్నామన్నారు. 2013లో ఇచ్చిన జీవోతో పోలిస్తే రేట్లు పెంచామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చన్నారు. త్వరలోనే ఈ కమిటీ మరోసారి భేటీ అవుతుందన్నారు. కరోనా నేపథ్యంలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించామని చెప్పారు. సంక్రాంతికి సినిమా విడుదలకు ఇబ్బందిపడే వారు వాయిదా వేసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’, రాథే శ్యామ్ విడుదల వాయిదా వేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ పరిస్థితులను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..
-
ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..
సాక్షి, అమరావతి: సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సోమవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, ఆర్జీవీ తాను చెప్పాల్సింది చెప్పారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదని.. నిబంధనలు అందరికీ ఒక్కటేనని పేర్ని నాని స్పష్టం చేశారు. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటైందన్నారు. కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామని.. అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. -
మంత్రి పేర్ని నానితో వర్మ భేటీకి డేట్ ఫిక్స్
రాష్ట్ర సమచారా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని జనవరి 10వ తేదిన అమరావతిలోని సచివాలయంలో కలుస్తున్నట్లు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఏపీ టికెట్ ధరలపై సామరస్యంగా చర్చించేందుకు జనవరి 10వ తేది మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయానికి మంత్రిగారు ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పేర్ని నాని గారు ధన్యవాదాలు’ అని వర్మ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల ధరలపై ట్విటర్ వేదికగా ఇరువురి మధ్య మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. Happy to inform that I have been invited by the honourable cinematography minister to the Amaravati Secretariat on January 10 th afternoon ….Thank u @perni_nani Garu for your kind initiative to exchange views on the AP ticket pricing for an amicable solution💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 7, 2022 -
ఏపీ ప్రభుత్వ చర్యలకు మనసారా కృతజ్ఞతలు: సీవీఎల్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహారావు అన్నారు. పది మంది ప్రొడ్యూసర్ల కోసం సినిమా రేట్లపై రచ్చ చేస్తున్నారని సీవీఎల్ అన్నారు. పెద్ద సినిమాలు తీస్తున్నామంటున్న నిర్మాతలు ఆ స్థాయి సినిమా కోసం.. కింది స్థాయిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. మామూలు సినిమా అభిమాని టికెట్ రేటు రూ.1,000 ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూడగలరని ప్రశ్నించారు. టికెట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని సీవీఎల్ నరసింహారావు అన్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే: టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు
సాక్షి, ఒంగోలు: పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మలీ్టప్లెక్స్ కలరింగ్ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్లైన్లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షిస్తోందన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. చిత్ర నిర్మాత సి.ప్రవీణ్‌కుమార్, సినీ ప్రదర్శకులు అయినాబత్తిన ఘనశ్యాం, షాజహాన్, ఎండీ సాహుల్, సూపర్‌బజార్ చైర్మన్ తాతా బద్రి, షౌకత్ ఆలీ, వరదా నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్
సాక్షి, అమరావతి: ఆర్జీవీ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. ఏ హీరోకు ఇంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదని’’ మంత్రి పేరి నాని ట్వీట్ చేశారు. సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. ధియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని’’ ట్వీట్ చేశారు. ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారూ? అమ్మే వారికా?.నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికొదిలేశారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ.. అంటూ ట్వీట్ చేశారు. ‘‘రూ.100 టికెట్‌ను రూ.వెయ్యి, రూ.2వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు. డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెట్ అంటారా?’’ అంటూ ట్వీటర్ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? https://t.co/pwsOQsY9uW — Perni Nani (@perni_nani) January 5, 2022 ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు https://t.co/eGEbF3LaLN — Perni Nani (@perni_nani) January 5, 2022 హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ. https://t.co/hV7eeEZLji — Perni Nani (@perni_nani) January 5, 2022 థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి. — Perni Nani (@perni_nani) January 5, 2022 -
డిస్ట్రిబ్యూటర్ల నకిలీ లేఖలు కలకలం
సాక్షి, విశాఖపట్నం: సినిమా టికెట్ ధరల వ్యవహారం విశాఖలో కాకరేపుతోంది. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందన్న వార్తలు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. చోడవరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్ తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారంటూ మిగిలిన ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా తమతో సంతకాలు చేయించుకున్నారంటూ.. గత నెల 25న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద... చిన్న సినిమాలనే తారతమ్యం లేకుండా అన్ని సినిమా థియేటర్లలో ఆడాలి.. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ ఉండే విధంగా ప్రభుత్వం జీవో–35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖల్లో నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు చెబుతుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లలో ఒక వర్గం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. జేసీ ఆదేశాల మేరకే టిక్కెట్ల రేట్లు జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ ధరలు పాత విధానంలో అమలు చేయాలా.. లేదా అనేది జేసీ ఆదేశాల మేరకు నిర్ణయించాలని పేర్కొంది. కోర్టుని ఆశ్రయించిన వారెవరూ ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జేసీ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు థియేటర్లలో అన్ని సౌకర్యాలు, టికెట్ల ధరలు సవ్యంగా ఉన్నాయో లేదో జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మురంగా చేస్తున్నారు. థియేటర్లో తప్పక ఉండాల్సినవి ఇవే.. ►ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, ఎలక్ట్రికల్ సర్టిఫికెట్ ►బిల్డింగ్ స్ట్రెంగ్త్‌ను తెలియజేసే ఆర్అండ్బీ అనుమతి ►ఫిలిమ్ డివిజన్ నుంచి అనుమతి పత్రం ►క్యాంటీన్ నిర్వహణ కోసం ఫుడ్‌లైసెన్స్ ►ఇవన్నీ రెవెన్యూ విభాగం వారికి సమర్పించి ‘ఫామ్–బి’సర్టిఫికెట్ పొందాలి. విచారణ చేస్తున్నాం హైకోర్టుని ఆశ్రయించామని చెప్పిన జిల్లాకి చెందిన 9 థియేటర్ల ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం తనకు ఫిర్యాదు చేశారు. తమకు అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌కి చెందిన చోడవరం థియేటర్ యాజమాని ఒకరు తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిందని, విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమేనని కోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపారు. – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చదవండి: Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే! -
సినిమా టికెట్ల ఖరారుకు కమిటీ వేశాం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, విచారణను అప్పటికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాతే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. సోమవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరపగా.. ఏజీ శ్రీరామ్ టికెట్ రేట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాత టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వీవీ సతీష్ చెప్పగా.. దరఖాస్తులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచిస్తామని ఏజీ బదులిచ్చారు. -
ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు కాదు
-
సినిమా టికెట్ ధరలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి
సాక్షి, అమరావతి: పేదవారికి వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను ఇన్ని రోజులుగా కొందరు దోపిడీ విధానాన్ని అవలంభించారని విమర్శించారు. అటువంటి దోపిడీని అరికట్టడం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచిన కారణంగా అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఖాయమని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో తినుబండారల ధరలు, పార్కింగ్ చార్జీలను నియంత్రించాలని, నాసిరకమైన తినుబండారాలు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. టికెట్ రేట్లు నిర్ణయించే క్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, సినీగోయర్స్ అసోసియేషన్ సభ్యులతో కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ఈ క్రమంలో సభ్యుల సూచనలు, సలహాలను సైతం కమిటీ స్వీకరించింది. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 11వ తేదీన మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రేక్షకులపై భారం పడకుండా తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకు హైకోర్టు సూచనల మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
నకిలీ లేఖలతో కోర్టును ఆశ్రయించారు
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం తెచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ నకిలీ లేఖలు పెట్టినవారిపై వెంటనే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశా రు. గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో 35 రద్దు కోరు తూ విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన పూసర్ల బాబ్జీ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్టు చె ప్పారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్లు జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ నకిలీ లేఖల ను సృష్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. అంగీకారం తీసుకోకుండా తన థియేటర్ పేరిట నకిలీ లేఖలు సృష్టించాడని తెలి పారు. ఈ లేఖల విషయాన్ని విశాఖపట్నం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అక్కడి జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం ప్రాంతాల ఎగ్జిబిటర్స్ సైతం బాబ్జీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. లెసెన్స్‌లు, ఫైర్ ఇతర అనుమతులు రెన్యువల్‌కు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు నెల రోజుల సమయం ఇచ్చిందని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలంతా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు. వీరు టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారే తప్ప చిన్న నిర్మాతల గురించి పట్టించుకోవడంలేదని అన్నారు. చిన్న సినిమాల కోసం 5వ షోకు అనుమతించాలని కోరారు. తెలంగాణలో టికెట్ రేట్లను తగ్గించకపోతే తన చిన్న సినిమాలను అక్కడ రిలీజ్ చేయలేనని అన్నారు. లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన కొన్ని థియేటర్ల పునఃప్రారంభం, లైసెన్స్‌ల పునరుద్ధరణకు అనుమతిస్తూ ప్రభుత్వం నెల రోజుల గడువు ఇవ్వడంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియచేసింది. -
సినిమా థియేటర్లకు గడ్డుకాలం
-
ఏపీలో హాట్ హాట్ గా సినిమా పాలిటిక్స్
-
కావాలనే ఒకరిద్దరు రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే రోజా
-
టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి. నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్‌తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్ కల్యాణ్‌కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్‌లో తీసు కుంటారా? బ్లాక్‌లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు పెట్టుకోవాలని భావిస్తారా? నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది. ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు ఇవ్వవచ్చు. కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్ యాదవ్ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి. సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! ఆన్లైన్ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్‌లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒక్క జగన్ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట. ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ వినోదం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను పరిశీలించేందుకు హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలో సమావేశమై అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని టికెట్ రేట్లను నిర్ణయిస్తుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో సినిమా పంపిణీదారుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. రెండు నెలల క్రితం సినీ పరిశ్రమ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలతో జరిగిన సమావేశంలో థియేటర్ల లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ పొందాలని సూచించినప్పటికీ అలసత్వం వహించారన్నారు. ఇప్పడు థియేటర్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది జిల్లాల్లో 83 థియేటర్లను సీజ్ చేయగా, 25 సినిమా హాళ్లకు జరిమానా విధించినట్టు చెప్పారు. మరో 22 థియేటర్లకు లైసెన్సులు లేకపోవడంతో యజమానులే వాటిని మూసివేశారన్నారు. చదవండి: (ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?) సినిమాల మధ్య వ్యత్యాసం చూడం ‘ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకుంటుంది. వ్యక్తులను బట్టి వ్యత్యాసం చూపించదు. గతంలో అయితే చారిత్రాత్మక సినిమా అంటూ బామ్మర్ది తీసిన సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. చిరంజీవి అడిగితే ఇవ్వలేదు’ అంటూ పెద్ద సినిమాలకు మినహాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాని సమాధానమిచ్చారు. హైకోర్టు సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ల ద్వారా అవసరం అయితే టికెట్ రేట్లను పెంచుకుంటారన్నారు. ‘సినీ నటుడు నాని ఏ థియేటర్ పక్కన కిరాణా షాపు కౌంటర్‌ను లెక్కించారో నాకు తెలీదు. హీరో సిద్ధార్థ తమిళనాడులో ఉంటూ అక్కడే ట్యాక్సు కడుతున్నారు. బహుశ ఆయన స్టాలిన్ ప్రభుత్వంలోని మంత్రుల విలాసాల గురించి మాట్లాడి ఉంటారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని సినిమా పంపిణీదారుల సంఘాల ప్రతినిధులు కార్పొరేషన్ పరిధిలోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.150, లోయర్ రూ.50, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, ఇతర ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.80, లోయర్ రూ.30గా టికెట్ రేట్లు పెట్టాలని కోరారు. దీంతోపాటు థియేటర్ల లైసెన్సుల రెన్యువల్‌కు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.విజయమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (వివక్ష లేదు.. లంచాలకు తావులేదు: సీఎం జగన్) -
సినిమా టికెట్ల అంశంపై స్పందించిన దిల్‌రాజు
Producer Dil Raju Comments On Ap Ticket Issue: ‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా ఇబ్బందులు ఏంటి? అనేది ప్రభుత్వానికి ఇప్పటికీ కచ్చితంగా తెలియడం లేదు. టిక్కెట్ల ధర పెంపు, 5వ ఆటకు అనుమతి వంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ నుంచి ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కొన్ని పేర్లు కూడా పంపించారు. త్వరలోనే కమిటీని నియమిస్తారు. కమిటీ వల్ల ఇరువైపులా చర్చించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ కమిటీలోని వాళ్లు ఇండస్ట్రీ సాధక బాధకాలు ప్రభుత్వానికి వినిపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సోషల్ మీడియా పోస్టులు చేయకపోవడం, మాట్లాడకపోవడం మంచిది. ప్రభుత్వం నుంచే స్పందన వచ్చి సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కాబట్టి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని, మంత్రి పేర్ని నానిగారిని కలవాలనుకుంటున్నాం. ఇటు ఇండస్ట్రీకి అటు సొసైటీకి, ప్రభుత్వాలకు మధ్య మీడియాది చాలా కీలక పాత్ర. మాలో భాగమైన మీడియా కూడా ఇండస్ట్రీ వార్తలను సున్నితమైనవిగా చూడాలి కానీ సెన్సేషన్ చేయొద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితులను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే టిక్కెట్ల విషయంలో కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నాం. నిర్మాతల, ఎగ్జిబిటర్ల సమస్యలు వేర్వేరు. అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది. కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా ప్రస్తుత అంశాలు పరిష్కారం కాకుంటే అన్ని క్రాఫ్ట్స్ వారు కూర్చుని ఎలా చేస్తే బాగుంటుందని అప్పుడు ఆలోచించుకుని మాట్లాడదాం.. దయచేసి అప్పటి వరకూ ఎవరూ స్పందించ వద్దు. కష్టమో, నష్టమో సినిమాల విడుదలను ఆపుకోలేం.. పెద్ద సినిమాలను అస్సలు ఆపుకోలేం. రిలీజ్‌కి రెడీగా ఉన్న వాటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కొత్త టిక్కెట్ ధరలను నిర్ణయించి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసానిగారికి నిర్మాతల తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, వంశీ పాల్గొన్నారు. -
అదనంగా రేట్లు పెంచి అమ్మే విధానాన్ని అడ్డుకున్నాం: మంత్రి కొడాలినాని
-
టికెట్ రేట్ల పెంపుతో చిన్న సినిమాలకు అన్యాయం: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ల రేట్లు అధికంగా పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చిన్న నిర్మాతలను నిరాశ పరిచింది. చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షోకి అనుమతివ్వాలని కోరుతున్నా ఆ ఊసే లేదు. మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 ప్రకారం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం కేటాయించి, టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా రూ.50గా నిర్ణయించాలి. కానీ అలాంటి నిబంధనలు జీవోలో లేనే లేవు. తెలంగాణలోని థియేటర్లు ఏషియన్ సునీల్, ‘దిల్’రాజు చేతుల్లోనే ఉన్నాయి. టికెట్ ధరల పెంపుతో వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది. చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’అని నట్టి కుమార్ తెలిపారు. చదవండి: ఈసారి లవర్స్ డేను ముందుగా సెలబ్రేట్ చేసుకుంటారు: తమన్ చదవండి: Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి -
తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు
థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021 -
కెఎస్ఆర్ లైవ్ షో 25 December 2021
-
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం టికెట్ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్ 120 జారీచేశారు. దీని ప్రకారం ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో సినిమా టికెట్ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. జీఎస్టీ అదనం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 కాగా, గరిష్టంగా రూ.70గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ కనీస ధర రూ.100+జీఎస్టీ.. గరిష్టంగా రూ.250+జీఎస్టీగా ఖరారు చేశారు. రిక్లైనర్స్ కోసం రూ.300+జీఎస్టీగా మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేట్ల ను నిర్ణయించారు. ఇవికాకుండా నిర్వహణ ఖర్చుల కింద టికెట్‌పై ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీలలో రూ.3 వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్ ధరల సవరణకు జీవో ఇచ్చాం సాక్షి, హైదరాబాద్: ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో టికెట్ల ధరలను సవరించి పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈమేరకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను శుక్రవారం ముగించింది. ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రభుత్వ జీవో ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో స్పష్టమైన ఆధారాలు సమర్పించాలని పేర్కొంది. సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలంటూ గతేడాది జూలైలో తానిచ్చిన వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను గతంలో ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. -
దుమారం రేపుతున్న సినిమా టికెట్ రేట్ల అమ్మకాలు
-
సినీ హీరో నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌కుమార్ ఆగ్రహం
-
ఆ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మెచ్చుకుంటుంటే సినిమా హీరోలకు వాళ్ల రెమ్యునరేషన్ తగ్గుతుందన్న బాధ తప్ప మరేమీ కాదు..’ అని జలవనరులశాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరులో శుక్రవారం మాట్లాడిన మంత్రి.. సినీ హీరో నాని వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఉదాహరణకు సినిమా తీసేందుకు రూ.100 ఖర్చవుతుంటే తీసేందుకు రూ.80, మిగిలిన ఖర్చు రెమ్యునరేషన్‌కు అయితే సబబుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రూ.80 ఆ నలుగురి జేబుల్లోకి పోతుంటే రూ.20 సినిమాకి ఖర్చవుతోందని, ఆ 80 రూపాయలను ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. చారిత్రాత్మక, సందేశాత్మక చిత్రం తీసి బడ్జెట్టు పెరిగిందంటే టికెట్ల ధరలను పెంచమని ప్రభుత్వాన్ని కోరితే కొన్ని సందర్భాల్లో సౌత్ ఇండియాలో టికెట్ల ధర పెంచిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అయితే హీరోకు, డైరెక్టర్‌కు, మ్యూజిక్ డైరెక్టర్‌కు, హీరోయిన్లకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి ఆ మొత్తాన్ని ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల రూ.70 కోట్లతో ఓ సినిమా తీశారని, హీరోకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ పోతే మిగిలిన నలుగురికి రూ.10 కోట్లు పోగా.. మిగిలిన రూ.10 కోట్లు మాత్రమే సినిమాకు అయిన ఖర్చని చెప్పారు. ఈ విధంగా జరుగుతుంటే సినిమా వాళ్ల దోపిడీ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమౌతోందన్నారు. ఇటీవల వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు తీసేందుకు అయిన ఖర్చు ఎంత? ఆయన రెమ్యునరేషన్ ఎంత? అని నిలదీశారు. ప్రజలను ఉద్ధరిస్తామనే హీరో ఆ రూ.50 కోట్లు తీసేస్తే ప్రజలకు టికెట్ల ధరలు తగ్గుతాయి కదా అన్నారు. తనకు క్రేజ్ ఉందని, ఆ క్రేజ్‌ను ఎక్కువ రేటుకు అమ్ముకోవడమే కదా? అని ప్రశ్నించారు. సినిమా స్కోప్ పెద్దదని, సినిమా విస్తరణ పెరిగిందని చెప్పుకొంటున్నారని, వాస్తవానికి ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్లలో హీరోల రెమ్యునరేషన్ కోట్లాది రూపాయల్లో కనిపిస్తోంది తప్ప సినిమా స్కోప్ ఏమేరకు పెరిగిందో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడుతోందో తెలుస్తోందని చెప్పారు. పవన్ అభిమానులు తెలుసుకోండి పవన్‌కల్యాణ్ అభిమానులూ.. ‘మేం సినిమాల్లో నుంచే వచ్చాం. ఆయనకు కటౌట్లు పెట్టి మాలలు వేసి మీకంటే ముందు నష్టపోయాం. అప్పడు తెలియలేదు. ఇప్పడు తెలుస్తోంది. మా ముందు తరం వాళ్లు అలాగే తెలుసుకున్నారు. రేపు మీ తరం వాళ్లు తెలుసుకుంటారు. అభిమానం వెర్రిలో తల్లిదండ్రుల డబ్బులను వృధా చేయవద్దు. వాస్తవాలు తెలుసుకోండి..’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్) -
ప్రజల వినోదాన్ని బలహీనతగా మారుస్తారా?
విజయనగరం అర్బన్: ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకొని ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచడం సమంజసం కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. టికెట్ ధర రూ.500కు పెంచితే జనంపై ఒత్తిడి పెంచినట్టు కాదా అని ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలపై విలేకరులు ప్రశ్నించగా.. సినిమా టిక్కెట్ల ధరలను అడ్డగోలుగా పెంచడం సరికాదని అన్నారు. అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్లపై ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని థియేటర్ల నిర్వాహకులకు సూచించారు. బిస్కెట్లు, సబ్బులకు ఎమ్మార్పీ రేట్లు ఉన్నప్పుడు సినిమా టికెట్లకు ఉంటే తప్పు ఏమిటని నిలదీశారు. సమస్యకు పరిష్కారం ఉండే మార్గంలో వెళ్లడం మంచిదని అన్నారు. అశోక్ చెప్పినవి అసత్యాలు రామతీర్థం బోడికొండపై కోదండరామస్వామి ఆలయం నిర్మాణానికి పవిత్రమైన శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అసత్యాలు చెబుతున్నారని బొత్స చెప్పారు. నిబంధనల మేరకే ఆలయ శంకుస్థాపనను దేవదాయశాఖ చేపట్టిందన్నారు. కార్యక్రమం వివరాలను ముందుగా తెలియజేసేందుకు వెళ్లిన ఆ శాఖ సిబ్బందిని అశోక్ దుర్భాషలాడారని, ప్రొటోకాల్ ప్రకారం ధర్మకర్తగా ఆయన పేరు పెట్టిన శిలాఫలకాన్ని కూడా చిందరవందర చేశారని వివరించారు. గర్భగుడుల్లో శిలాఫలకాలు వేయకూడదని ఉన్నప్పుడు, చంద్రబాబు పాలనలో జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బాధ్యత గల ధర్మకర్త అయితే ఆలయం అభివృద్ధికి కృషి చేస్తారని, ఆయన ఆ దిశగా ఏనాడూ పనిచేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో ఒక్కపైసా వెచ్చించే ఆలోచన చేయని ధర్మకర్త ఆయనేనంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేస్తుంటే, అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇస్తున్న సమయంలో ప్రత్యేకించి విగ్రహాల కోసం మాత్రమే అని ఇచ్చిన రూ.లక్ష చెక్కును తిరిగి పంపాల్సి వచ్చిందన్నారు. దుర్బుద్ధితో మీడియా ముందే ఆయన ఇలా ప్రవర్తించారని మండిపడ్డారు. -
సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్టా ??
-
హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విజయనగరం: సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా.. ఇష్టానుసారం రేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. చదవండి: అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు సామాన్యునికి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అని.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. -
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
మా ఉత్తర్వులు థియేటర్లన్నింటికీ వర్తిస్తాయి
సాక్షి, అమరావతి: లైసెన్స్ జారీ అధికారులైన జాయింట్ కలెక్టర్లను సంప్రదించాకే సినిమా టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలన్నింటికీ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకొచ్చిన థియేటర్ల యజమానులకే తమ ఉత్తర్వులు వర్తిస్తాయంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పత్రికా ప్రకటనను హైకోర్టు తప్పుపట్టింది. పత్రికాముఖంగా అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆయనకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో అదనపు మెటీరియల్ పేపర్లను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వ న్యాయవాది(హోం) మహేశ్వరరెడ్డి కొంత గడువు కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో టికెట్ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35తో సంబంధం లేకుండా, ఈ జీవో జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా థియేటర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న ధర్మాసనం ఉత్తర్వులు కేవలం హైకోర్టును ఆశ్రయించినవారికి మాత్రమే వర్తిస్తాయంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి పత్రికా ప్రకటన జారీ చేశారని తెలిపారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతవారం తామిచ్చిన ఉత్తర్వుల్లో థియేటర్లు అని స్పష్టంగా పేర్కొన్నామని.. దీని అర్థం రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లనీ స్పష్టతనిచ్చింది. -
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తరహాలో ప్రత్యేకంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది. ఆన్లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆన్లైన్ టికెట్ విక్రయాలు జరపాలని ఏపీ ఫిల్మ్ చాంబర్ కోరడంతో దానిపై ప్రభుత్వం పలుమార్లు చర్చించింది. సినీ నిర్మాతలు, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇతర సినీ రంగానికి సంబంధించిన వారి అభిప్రాయాలు తీసుకుంది. ఆన్లైన్ టికెట్ విక్రయాలను జరపాలన్న వారి కోరిక మేరకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. అధ్యయనం కోసం తొలుత ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు ఆన్లైన్ టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు ఇకపై కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది. చదవండి: (భిక్షగాడికి అమరావతి రైతు గెటప్) -
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్‌లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్‌గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
జేసీలను సంప్రదించాకే టికెట్ ధరల ఖరారు..
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. లైసెన్స్ జారీచేసే అధికారులైన జాయింట్ కలెక్టర్లకు ముందుగా తెలియజేసి, వారిని సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని ఆదేశించింది. ఈ ధరల ఖరారు విషయంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు ప్రభుత్వాధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో సినిమా టికెట్ ధరలను ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–35తో సంబంధంలేకుండా, ఈ జీఓ జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. చట్టప్రకారమే ధరలను నిర్ణయించాం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనల ప్రకారమే టికెట్ ధరలను భౌగోళిక ప్రాంతాల వారీగా నిర్ణయించామన్నారు. థియేటర్ల యాజమాన్యాలు సౌకర్యాలతో నిమిత్తం లేకుండా నిర్ణయిస్తున్న ధరలకు కళ్లెంవేసి ప్రేక్షకులకు లబ్ధిచేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య కోర్టును లాగుతున్నారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించింది. టికెట్ ధరలను పెంచి థియేటర్లు, పన్నులు వసూలుచేసుకుంటూ ప్రభుత్వం రెండూ సంతోషంగా ఉంటాయని.. కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రేక్షకులేనని తెలిపింది. టికెట్ ధరలను పెంచడంవల్ల నష్టపోతామన్న విషయాన్ని యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. తాము చేస్తున్నది కూడా ప్రేక్షకుల కోసమేనని.. వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చామని ఏజీ వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. టికెట్ ధరలను అందరితో మాట్లాడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వారిని కూడా భాగస్వాములను చేయాలని చెప్పింది. తాము ఏకపక్షంగా చేయబోమని.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే టికెట్ ధరల విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే చట్ట ప్రకారం ధరలను నియంత్రిస్తున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ధరలు థియేటర్ల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరలను తాము నిర్ణయించుకునే వెసులుబాటు ఉందన్నారు. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వాటిని నిర్ణయిస్తున్నామన్నారు. పంచాయతీల్లో టికెట్ ధరను రూ.5గా నిర్ణయించారని, ఈ రేటుకి కప్పు కాఫీ కూడా రావడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. టిక్కెట్ ధరల విషయంలో కొత్త కమిటీని ఏర్పాటుచేయాలని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన వారు, ప్రభుత్వాధికారులు ఉండాలని సూచించింది. కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటో చెప్పాలని ఏజీని కోరింది. విచారణను శుక్రవారానికే వాయిదా వేస్తామంది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల జోలికి వెళ్లబోమంది. భారీ రేట్లకు టికెట్ల విక్రయం ఏజీ స్పందిస్తూ.. కొత్త కమిటీ ఏర్పాటునకు అభ్యంతరంలేదని.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరల ఖరారు విషయంలో థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్లను సంప్రదించాలని, కానీ ఇప్పటివరకు ఏ థియేటర్ కూడా జాయింట్ కలెక్టర్లకు ధరలను తెలియజేయలేదన్నారు. ఈ వారంలో విడుదలవుతున్న ఓ పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.80 టికెట్‌ను రూ.140 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు. అలాగే, నాలుగు షోలకు బదులు 6 షోలు వేస్తున్నారని తెలిపారు. దీనిని ఖండిస్తూ.. నాలుగు షోలు మాత్రమే వేస్తున్నామని ఆదినారాయణరావు చెప్పారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ఏజీ పట్టుబట్టారు. కమిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని ఏజీ అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, జాయింట్ కలెక్టర్లకు తెలియజేసి, వారిని సంప్రదించాకే ధరలను ఖరారుచేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది. -
సినిమా టికెట్ రేట్లపై కోర్టు ఉత్తర్వులను నిలిపేయండి
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ జారీ అయిన జీవోకు ముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట బుధవారం అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయా లని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, ఆ కాపీ దాఖలుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
జేసీని సంప్రదించే ధరలు ఖరారు చేసుకోవాలి
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ధరలను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు ఇచ్చిన హైకోర్టు ఇక్కడ కీలక మెలిక పెట్టింది. లైసెన్స్ జారీచేసే అధికారి అయిన జాయింట్ కలెక్టర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, ఆయన్ని సంప్రదించిన తరువాతే టికెట్ రేట్లను ఖరారు చేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది. అంతేగాక మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీచేసిన జీవో 35ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీవో 35 జారీకి ముందున్న విధంగానే టికెట్ల ధరలను నిర్ణయించుకోవచ్చని మాత్ర మే యాజమాన్యాలకు చెప్పింది. మంగళవారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ బుధవారం సాయంత్రం అందుబాటులోకి రావడంతో కోర్టు ఏం చెప్పిందన్న దానిపై స్పష్టత వచ్చింది. -
పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్లు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరాతి: సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. -
టికెట్ రేట్ల పెంపుపై త్వరలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వల్ల రెండేళ్లుగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో ‘పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతుండటంతో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు శుక్రవారం హైదరాబాద్‌లో తలసానిని కలసి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎంతో చర్చించాక...:‘‘సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ల నిర్వహణ ఖర్చు పెరిగిందని, కరోనా వల్ల ఇండస్ట్రీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని సినీ ప్రముఖులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న టికెట్ల ధరలపై అధ్యయనం చేసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టికెట్ల ధరల పెంపుపై తగు నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి తలసాని మీడియాకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు: ‘దిల్’ రాజు ‘‘కోవిడ్ థర్డ్ వేవ్ వస్తోంది. మళ్లీ థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత? పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై మంత్రి తలసానితో మాట్లాడాం. రెండేళ్ల కిందట పరిశ్రమ తరఫున ప్రభుత్వానికి చేసిన వినతులపైనా చర్చించాం. టికెట్ ధరలు, కరెంట్ బిల్లులు, కోవిడ్... ఇలా ఐదారు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తలసాని హామీ ఇచ్చారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. తలసానితో భేటీలో నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, రాధాకృష్ణ, నవీన్ ఎర్నేని, వంశీ, బాల గోవిందరాజు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్‌రెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్‌బాబు పాల్గొన్నారు. -
ఏపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ఆన్లైన్ టికెటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆన్లైన్ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే . ఈ బిల్లును మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.