rk nagar by election
-
దినకరన్‌కు చుక్కెదురు
-
దినకరన్‌కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్‌కు ఊరట లభించింది. -
ఆ ఫీలింగ్ నాకూ ఉంది- కమల్
సాక్షి, టీ.నగర్: ఆర్కేనగర్ నియోజకవర్గంలో రూ.20 టోకెన్‌ను అడ్డుకోలేకపోయాననే అపరాధ భావన తనకూ ఉందని నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ఆనంద వికటన్ వారపత్రికలో రాస్తున్న సీరియల్ కథనంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఎన్నిక గురించి మళ్లీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి విమర్శించే మీరు అందులో ఎందుకు పాలుపంచుకోలేదని ప్రశ్నిస్తున్నారని, అందులో పాలుపంచుకోనందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపారు. ఆ అపరాధ భావనతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొందరు దిష్టిబొమ్మలను దహనం చేయడం, కోర్టులో కేసు వేయడాన్ని అభిమాన సంఘాలు ఖండించినప్పటికీ వారిని వారించామని, ఇద్దరు మనుషులు సరిచేసుకోవాల్సిన వ్యవహారంలో తాము ప్రజల్ని భాగస్వాములుగా చేయడం సరికాదని అన్నారు. మయ్యం విజిల్ యాప్ జనవరిలో ప్రారంభించడం జరుగుతుందన్నారే ఎప్పుడు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పొంగల్‌కు ఇచ్చే చెరకు లాంటిది కాదని, చేదు మందుగా ఉంటుందన్నారు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని తెలిపారు. సరైన రీతిలో తీసుకువస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. -
తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గేది లేదు!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే దినకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేసులు ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆయనను మీడియా సంప్రదించింది. ‘‘నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా’’ అని మీడియాకు కమల్ బదులిచ్చారు. కాగా, ఆనంద వికటన్ కోసం రాసిన వ్యాసంలో కమల్ వ్యాసం ద్వారా దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి దినకరన్ గెలిచారని.. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని కమల్ పేర్కొన్నారు. కాగా, ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్ ఆ వ్యాసంలో రాశారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్‌తోపాటు ఆర్కే నగర్ ఓటర్లను కమల్ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్‌పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది. ఇది కూడా చదవండి... తీవ్ర ఆరోపణలు.. కమల్ ఇంటి వద్ద బందోబస్తు -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
రాజకీయ తెరపై రజని
'వస్తానొస్తానంటూ' రెండు దశాబ్దాలుగా తన అభిమాన జనసందోహాన్ని ఊరి స్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఆది వారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని కూడా చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశాక అక్కడి రాజకీయ యవనికపై వరసబెట్టి కొన సాగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారికి సమర్ధులైన నాయకులొస్తే జనంలో ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ అన్నాడీ ఎంకే పార్టీయే పాలకపక్షంగా ఉన్నా... సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెనకే మెజారిటీ ఎమ్మెల్యేలున్నా ఆ ప్రభుత్వం దినదినగండంగానే బతుకీడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రమే రాష్ట్రంలో బలమైన, పటిష్ట మైన పార్టీ. అన్నా డీఎంకే దుస్థితి చూస్తూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమదే అధికా రమని ధీమాతో ఉన్న ఆ పార్టీ మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పో యింది. దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అది అయోమయంలో పడింది. సినిమా అనేది ఒక బలమైన, ప్రభావవంతమైన మాధ్యమం కనుక ఆ రంగంలో మన్ననలందుకునేవారికి సహజంగానే జనాకర్షణ ఉంటుంది. ఎక్కడి కెళ్లినా వారిని చూసేందుకు జనం విరగబడతారు. కానీ ఇలాంటివన్నీ రాజకీయ రంగంలో ఆ నటుల అఖండ విజయానికి గ్యారెంటీనివ్వలేవు. వారేం చెబు తున్నారో, ఏం చేస్తున్నారో... వారి పార్టీ ఆశయాలేమిటో, సిద్ధాంతాలేమిటో జనం గమనిస్తారు. తమ రాక వెనకున్న అవసరమేమిటో, అందులోని ఔచిత్యమేమిటో... వర్తమాన రాజకీయాలపైనా, పాలనపైనా తమ అభిప్రాయాలేమిటో ఆ నటులు విస్పష్టంగా వివరించగలగాలి. తమవల్ల మెరుగైన మార్పు సాధ్యమేనన్న అభి ప్రాయం కలిగించగలగాలి. అన్నిటికీమించి అప్పటికి పాలకులుగా ఉంటున్నవారిపై జనంలో అసంతృప్తి ఉండాలి. ఒక నిరాశామయ వాతావరణం అప్పటికే అలు ముకుని ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించేనాటికి కాంగ్రెస్ అన్నివిధాలా భ్రష్టుపట్టి ఉంది. ఆ పార్టీ పాలనపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీని స్థాపించబట్టే ఎన్టీ రామారావు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి రాగలిగారు. కానీ అనేకానేక సంక్షేమ పథకాలతో, సమర్ధవంతమైన పాలనతో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుగులేని జనాదరణను పొందుతున్న సమయంలో 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి చివరి కెలా వైఫల్యం మూటగట్టుకున్నారో అందరూ చూశారు. తమిళనాడులో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్తగాదు. డీఎంకే స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన అన్నాదురై, ఆయన తర్వాత అధికారం లోకొచ్చిన కరుణానిధి సినీ రంగానికి చెందినవారే. అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన సినీ హీరో ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయా లపై చెరగని ముద్ర వేశారు. ఆయన ఆశీస్సులతో రాజకీయాల్లోకొచ్చిన జయలలిత సైతం రాణించారు. కానీ శివాజీ గణేశన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్‌లాంటివారు విఫలమయ్యారు. పొరుగునున్న కర్ణాటకలో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందిన రాజ్ కుమార్‌పై రాజకీయ రంగప్రవేశం చేయమని ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆయన దూరంగానే ఉండిపోయారు. కన్నడ భాషా, సంస్కృతి పరిరక్షణ ఉద్యమాలకే పరి మితమయ్యారు. ఉత్తరాదిలో అమితాబ్‌బచ్చన్ మొదలుకొని అనేకులు రాజ కీయ రంగ ప్రవేశం చేసినా వారు ఏదో ఒక జాతీయ పార్టీనో, ప్రాంతీయ పార్టీనో ఆశ్రయించి ఎన్నికల్లో గెలుపొందారు తప్ప సొంతంగా పార్టీ పెట్టే సాహసం చేయలేదు. వర్తమాన తమిళనాడులో రాజకీయ శూన్యత అలుముకున్నదని, మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం దీనినే ప్రతిబింబిస్తున్నదని భావిస్తున్నవారు రజనీకాంత్ ఆగమనానికి ఇదే సరైన సమయమని విశ్వసిస్తున్నారు. బహుశా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్‌కు కూడా అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అయితే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉండటం నిజమైనా... దానికదే రజనీకాంత్నైనా, మరెవరినైనా అందలం ఎక్కించలేదు. అందులోనూ తమిళనాడు మిగిలిన రాష్ట్రాల్లాంటిది కాదు. స్వాతంత్య్రానికి ముందే అక్కడ వేళ్లూనుకున్న ద్రవిడ ఉద్యమం సామాజిక, సాంస్కృతిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రంగాల్లో ఆ ఉద్యమం సాధించిన ఘన విజయాలను సుస్థిరం చేసుకునేందుకు తొలుత డీకే, తర్వాత డీఎంకే ఆవిర్భవించాయి. అన్నాదురై, కరుణానిధి చలనచిత్ర రంగ దిగ్గజాలు కావొచ్చుగానీ రాజకీయరంగంలో వారి విజయానికి మూలాలు ద్రవిడ ఉద్యమంలో ఉన్నాయి. అలాంటి గడ్డపై తన రాజకీయ రంగ ప్రవేశం గురించిన ప్రకటనలో రజనీకాంత్ భగవద్గీత శ్లోకాన్ని పఠించారు. నీతి, నిజాయితీలున్న, మతసామరస్యంతో కూడిన ‘ఆధ్యాత్మిక రాజకీయాలను’ ప్రజల వద్దకు తీసుకెళ్తానన్నారు. ఇవి బీజేపీ అనుకూలతను ధ్వని స్తున్నాయని కొందరు భాష్యం చెబుతున్నా... మొత్తం అన్ని సీట్లకూ పోటీ చేస్తా ననడం ద్వారా ఎవరితోనూ పొత్తు ఉండబోదన్న అభిప్రాయం కలిగించేందుకు రజని ప్రయత్నించారు. వాటి సంగతలా ఉంచి మాటల్లోనూ, ఆచరణలోనూ స్పష్టత, నిజాయితీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. మరో మూడేళ్ల వ్యవధి ఉంది కదా అని మౌనంగా ఉండక అన్ని అంశాల్లోనూ తానేమిటో, తన వైఖరేమిటో తేటతెల్లం చేసినప్పుడే... వాటికి అనుగుణమైన ఆచరణ ఉన్నప్పుడే రజనీకాంత్ ప్రజలకు చేరువ కాగలరు. రాజకీయాల్లో అస్పష్టతకూ, ఊగిసలాటకూ, లాలూచీలకూ, ప్యాకేజీలకూ తావుండదు. అలా చూస్తే రాగల మూడేళ్లకాలం రజనీకాంత్‌కు పరీక్షా కాలమే. అందులో నెగ్గి రాజకీయరంగంలో సైతం సూపర్‌స్టార్‌నని ఆయన నిరూ పించుకోగలరో లేదో వేచిచూడాలి. -
మా స్లీపర్ సెల్ బయటకు వస్తుంది: దినకరన్
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీటీవీ దినకరన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సచివాలయంలో దినకరన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం దినకరన్ మాట్లాడుతూ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. తమ స్లీపర్ సెల్ బయటకు వస్తుందని, మార్చిలో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా వెన్నపోటుదారులు, ద్రోహులు ...ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు. లేకుంటే తమ విశ్వరూపం చూపిస్తామని దినకరన్ హెచ్చరించారు. త్వరలోనే ఆయన ఆర్కేనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. -
దినకరన్‌కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్‌కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్‌గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్‌కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్‌కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
దినకరన్.. ఇలా గెలిచెన్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత ఆకస్మిక మరణానికి శశికళే కారణమంటూ ప్రచారం ఓవైపు.. ఎన్నికల కమిషన్‌కి లంచం ఇవ్వజూపిన కేసులో జైలుకెళ్లిన అప్రతిష్ట మరోవైపు.. పళనిస్వామి ప్రభుత్వానికి పుష్కలంగా కేంద్రం అండదండలు, డీఎంకేకు సమర్థమైన నాయకత్వం.. ఇవేవీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ (శశికళ సోదరి కుమారుడు) విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికితోడు ‘అమ్మ’ కంటే దినకరన్‌కే అధిక మెజారిటీని ఆర్కేనగర్ ఓటర్లు కట్టబెట్టడం, నోటాకన్నా బీజేపీకి తక్కువ ఓట్లు రావటం విస్తుపోయేలా చేసింది. ‘ఆర్కేనగర్’కు ఆర్థిక సాయం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాతే దినకరన్ పేరు తెరపైకి వచ్చింది. శశికళకు పాదాభివందనం చేసి పార్టీ పగ్గాలు ఇచ్చిన నేతలు ఆమె జైలుపాలు కాగానే తగిన కారణం చూపకుండానే దినకరన్‌పై బహిష్కరణ వేటు వేయడం ప్రజల్లో సానుభూతి కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం కావడం విమర్శలకు దారితీసింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపి జైలుకు వెళ్లిన దినకరన్.. తిరిగొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నేతలను, కార్యకర్తలను చేరదీశారు. ఆర్కే నగర్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. దీంతో దినకరన్ తన సొంత డబ్బుతో స్థానిక ప్రజల రుణాలు తీర్చినట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత ఓసారి ఉపఎన్నిక రద్దవటం, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నా.. దినకరన్ వెనుకంజ వేయలేదు. తన అనుచరుల ద్వారా అక్కడి పేదలకు సాయం చేస్తూ సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్నికకు ముందు రోజు వ్యూహాత్మకంగా ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో ఆస్పత్రిలోని బెడ్‌పై జయలలిత జ్యూస్ తాగుతున్నట్లు కనిపించారు. ఇది కూడా శశికళపై ఆగ్రహం తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు, ఎన్నికకు ముందురోజు దినకరన్ భారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పరోక్ష సాయం ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ ఓటర్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేకపోయారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనన్ ఓటమికి అసమర్థ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటున్నారు. అటు, ఆర్కేనగర్లో డీఎంకేకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవడం గమనార్హం. దినకరన్ గెలిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం బలహీనపడుతుందనే వ్యూహంతోనే స్టాలిన్ మిన్నకుండిపోయారనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూడా బీజేపీ గూటికి చేరుతుందనే అనుమానాలతో ప్రజలు ఆ పార్టీకి మొండిచేయి చూపారని భావిస్తున్నారు. కరుణానిధిని మోదీ పరామర్శించడం, కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలను డీఎంకే విరమించుకోవడం, పోలింగ్ సమయంలోనే కనిమొళి, రాజా 2జీ కేసులో నిర్దోషులుగా తేలడం వంటివి ఆర్కే నగర్ ఓటర్లు డీఎంకేనూ పక్కన పెట్టేందుకు కారణమయ్యాయంటున్నారు. -
ఓటుకు 10 వేలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దినకరన్ అనుచరులు రూ.10 వేలకు బదులు రూ.20 నోటిచ్చి దానిపై ఉన్న కోడ్ రాసుకున్నారని, ఫలితాలనంతరం ఆ నోటు చూపితే డబ్బిస్తామని హామీ ఇచ్చారని ఓటర్లు వెల్లడించారు. రూ.20 నోట్లు పంచిన వారంతా ఆర్కేనగర్కు చెందిన వ్యక్తులే కావడంతో వ్యవహారం సజావుగా సాగింది. ఇప్పుడు ఫలితం తేలడంతో టోకెన్ ఇచ్చిన వాళ్లను ఓటర్లు నిలదీస్తున్నారు. కొందరు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టోకెన్ అందని కొందరికి సోమవారం వాటిని ఇస్తుండగా.. ఘర్షణ చోటు చేసుకుంది. దినకరన్ అనుచరులు కార్తికేయన్ అనే వ్యక్తిపై దాడిచేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు దినకరన్ అనుచరులను అరెస్టు చేశారు. -
తారల వెలుగులకు తావుందా?
ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావించడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ఈ రాజకీయ శూన్యంలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు. ఈ సంవత్సరం నిష్క్రమిస్తున్న వేళ రెండు దశాబ్దాల నుంచి తమిళనాడును అలజడికి గురిచేస్తున్న ఒక ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించబోతోంది. తాను రాజకీయాలలోకి ప్రవేశించ దలిస్తే ఆ సంగతిని ఈ నెల 31న ప్రకటిస్తానని మొత్తానికి తలైవా రజనీకాంత్ ప్రకటించారు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా మెరీనా బీచ్ ఆందోళన, శశికళ కారాగారానికి తరలడం, ఒ. పన్నీర్‌సెల్వం ప్రజాస్వామిక తిరుగుబాటు, తాను సైతం రాజకీయాలలోకి వస్తున్నట్టు మరో తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ప్రకటించడం కూడా 2017లో జరిగిన పరిణామాలే. రజనీకాంత్ ఇచ్చిన ప్రకటన ఈ ఏటి ఘటనలకు పరాకాష్ట. సినీ పరిభాషలో చెప్పాలంటే బ్లాక్బస్టరన్నమాట. అయితే రజనీ ప్రకటన ఆరోగ్యం గురించి చేసే చట్టబద్ధమైన హెచ్చరిక పద్ధతిలోనే వెలువడింది. ‘నేను రాజకీయాలలోకి వస్తున్నట్టు చెప్పడం లేదు. దీని గురించి నా నిర్ణయం ఏమిటో 31న ప్రకటిస్తానని మాత్రమే నేను చెప్పాను’ అని వివరణ ఇచ్చారు. బస్సు కండక్టర్ స్థాయి నుంచి సినీ నటుడి స్థాయికి ఎదిగిన రజనీ కనుక రాజకీయాలలోకి రావాలని నిర్ణయిస్తే, ఈ ఏడాదే ఇలాంటి నిర్ణయం తీసుకున్న పెద్ద తారలలో ఆయన రెండోవారు అవుతారు. రజనీ ఆప్తమిత్రుడు కమల్ హాసన్ కొన్ని మాసాల క్రితమే తాను రాజకీయ నేతగా మారుతున్నట్టు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రం గురించి కొంత హడావుడితోనే ప్రకటించారు. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారిని కలుసుకోవడం, ఇంకా పలు చానళ్లలో అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రవేశం గురించి కొద్దిపాటి సంచలనం రేపారు. కానీ పూర్తి చేయవలసి ఉన్న రెండు సినిమాల కోసం కమల్ దాదాపు రెండు మాసాల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. విశ్వరూపం–2 నిర్మాణం కోసం ఆయన అమెరికాలో ఉన్నారు. అదలా ఉంచితే, నటులు ఇలా ప్రజాజీవి తంలో రాజకీయాలని కాల్షీట్ల మాదిరిగా చూస్తేనే తమిళనాడు ప్రజలకు సుఖంగా ఉంటుందన్న సంగతి నిజమో కాదో తేలవలసి ఉంది. నటులు ఇంకానా...! అసలు తమిళనాడు రాజకీయాలలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులకు ఇప్పుడు ప్రవేశించే అవకాశం ఉందా? అయితే తమిళనాడు ఓటర్లు రాజ కీయ నాయకులుగా సినీ నటులనే ఆదరిస్తూ ఉంటారన్న ఒక వాస్తవం. తమిళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎం.జి. రామచంద్రన్, కరుణానిధి, జయలలిత కోలీవుడ్ నేపథ్యం కలిగినవారే. వీరు మంచి ముఖ్యమంత్రులుగానే కాకుండా, మంచి రాజకీయవేత్తలుగా కూడా రాణించారు. కానీ 21వ శతాబ్దం తమిళనాడుకూ, ఆ ముగ్గురు రాజకీయ రంగం మీద ప్రత్యక్షమైన కాలానికీ ఎంతో తేడా ఉంది. సోషల్ మీడియా ప్రభావం చాలా తీక్షణంగా ఉన్న ప్రస్తుత తరుణంలో తారలు ఏం చేస్తున్నారో నిరంతర నిఘా ఉంటున్నది. తెర మీద అద్భుతాలు సృష్టించిన రీతిలో నిజ జీవితంలో వ్యవహరించడం ఇకపై సాధ్యం కాదు. పైగా ప్రస్తుత తమిళ రాజకీయాల దీనస్థితి వేరు. కొత్త ముఖాలను తిరస్కరించడానికి వారు ఏమాత్రం సంకోచించరు. తమిళనాడు రాజకీయ చిత్రం ఎలా ఉందో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితమే చెబుతోంది. ఎన్నికల కమిషన్‌తో పోరాడి రెండాకుల ఎన్నికల గుర్తును తన సొంతం చేసుకోవడంలో అక్కడ అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పెద్ద విజయం సాధించింది. కానీ ఆర్కేనగర్ ఉప ఎన్నికలో మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నది. విపక్ష డీఎంకే పరిస్థితి మరీ దారుణం. అన్నా డీఎంకే వ్యతిరేక ఓట్లన్నీ తమ అభ్యర్థికే జమ అయిపోతాయని ఆ పార్టీ ఆశపడింది. కానీ ఘోరంగా వారి అభ్యర్థి ధరావతు కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే డీఎంకే అభ్యర్థి ఓటమి విషాదాల్లో కెల్లా విషాదం. ఎందుకంటే, ఆ పార్టీకి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకేలు మద్దతు ఇచ్చాయి. అయినా ధరావతు కూడా దక్కలేదు. ఇక బీజేపీ కనీసంగా కూడా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ఫలితంతో పెద్ద మలుపు ఆర్కేనగర్ నియోజక వర్గం నుంచి దినకరన్ విజయం సాధించి ఉండవచ్చు. కానీ ఆయన అవినీతి మార్గాలలోనే విజయం సాధించారనే నిందకు గురయ్యారు. ఆయన విజయం అంటే శశికళ, మన్నార్గుడి కుటుంబం పరోక్షంగా పదవిలోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొడుతుందని చాలామంది విచారిస్తున్నారు. ఇదంతా ఏం చెబుతుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉంది. అలా అని ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం మాత్రం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావిం చడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ప్రస్తుత రాజకీయ శూన్యంలో రాజకీయాలలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు. ఇలాంటి వాతావరణంలో కమల్ çహాసన్ తాను రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. రజనీ ప్రవేశించే అవకాశం ఉంది. రజనీకాంత్ గతంలో ఇచ్చిన ప్రకటనలకీ, తాజాగా ఇచ్చిన ప్రకటనకీ మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి. అప్పుడు ఆయన రాజకీయాల గురించి చాలా విస్తృతంగానే మాట్లాడారు. ఇప్పుడు అలా కాదు. ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. తాను రాజకీయాలలో ప్రవేశిస్తే ఆ సంగతి ఈనెల 31న ప్రకటిస్తాను అని ఆయన విస్పష్టంగానే వెల్లడించారు. రజనీ స్థాపించబోయే పార్టీ గురించిన విధివిధానాలు సిద్ధమవుతున్నాయనీ, అయితే పార్టీ ప్రారంభం ఎప్పుడనే విషయంలో తమ నాయకుడే అంతిమంగా నిర్ణయం ప్రకటిస్తారనీ రజనీ శిబిరానికి చెందిన వారు గత కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. రజనీతో సన్నిహితంగా ఉన్నవారు ఆయన పార్టీ స్థాపనకు అనుమతిస్తారనే గట్టిగా చెప్పినా, ఇప్పుడు మాత్రం అంత ఉత్సాహంగా ఆ మాట చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే సూపర్‌స్టార్ వ్యవహారం రెండడుగులు ముందుకీ, ఒక అడుగు వెనక్కీ అన్న చందంగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో తనకంటూ ఓ పాత్ర ఉంటుందని రజనీకాంత్ కనుక ప్రకటిస్తే, తమిళనాడులో అది కమల్ వర్సెస్ రజనీ పోరాటంగా రూపుదాలుస్తుంది. మీడియా వరకు ఇలాంటి సన్నివేశం చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది. సమస్యలు, సిద్ధాంతాల కన్నా, వ్యక్తుల మధ్య పోరాటంగా అది తయారవుతుంది. కాబట్టి చాలామంది ఇలాంటి ఆలోచనను కోరుకోవడం లేదు. కానీ కొద్దిరోజుల క్రితం రజనీతో ఫొటోలు దిగిన ఆయన అభిమానుల వాదన వేరుగా ఉంది. బాక్సాఫీసు దగ్గర ఆ ఇద్దరు తారలకు చిరకాలంగా అలాంటి స్పర్థే ఉన్నదనీ, కానీ ఏనాడూ అది ఘర్షణ స్థాయికి పోలేదనీ వారు చెబుతున్నారు. బయట వినిపించే మాట మరోరకంగా ఉంది. అది – ఆ ఇద్దరు రాజకీయాలలో కలసి నడవాలి. అది సాధ్యం కాని పక్షంలో, ఒకరు వైదొలగి రెండో వారికి మార్గం సుగమం చేయాలి. ఇవేమీ వీలుపడకపోతే జరిగేది, పట్టణ ప్రాంత మేధావి వర్గంతోనే ఎక్కువ మమేకమయ్యే కమల్ కంటే, రజనీయే ముందంజ వేసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు కమల్ హాసన్ అటు వామపక్షాల వైపు, ఇటు వామపక్షేతర పార్టీల వైపు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. లెఫ్ట్ నాయకులతో కనిపిస్తూనే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కూడా కనిపిస్తున్నారు. హిందూ అతివాదం, రాజకీయ అవినీతి, పర్యావరణం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాల గురించి కమల్ మాట్లాడారు. అలాగే ఆయన అన్నా డీఎంకే నాయకులతో తరచూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. కాబట్టి ఆయన అటు అన్నా డీఎంకేతో గానీ, ఇటు బీజేపీతో గానీ చెలిమిని నెరపరని తెలుస్తున్నది. పైగా ఆయన నాస్తికుడు. ఇది కూడా ఆ రెండు పార్టీలకూ, కమల్‌కూ మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. రజనీకాంత్ ఇందుకు పూర్తి విరుద్ధమైన వ్యక్తి. ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. ఆయన అభిప్రాయాలు బీజేపీకే సన్నిహితంగా కనిపిస్తాయి. బీజేపీ ఆశ నెరవేరుతుందా? బీజేపీ కూడా గత కొంతకాలంగా రజనీకాంత్‌ను నాయకుడిగా అవతరింపచేయడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే కూడా. ఇందులో బీజేపీకి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికలలో హరి యాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో తగ్గే లోక్‌సభ స్థానాలను భర్తీ చేసుకునే క్రమంలో తమిళనాడులోకి ప్రవేశించాలని బీజేపీ ఆశ. 2014లో ఆ రాష్ట్రాలలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పన్నీర్‌సెల్వంను కాకుండా ఎడప్పుడి పళనిస్వామి మద్దతు ఇవ్వడం వంటి తమిళనాడు ప్రయోగం నేపథ్యంలోనే కాకుండా, ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలను చూశాక ఇప్పుడు బీజేపీకి మిగిలిన ఏకైక ఆశ రజనీకాంత్ మాత్రమే. ఆ పార్టీ ఆశ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం బీజేపీకి అక్కడ ఎలాంటి పట్టు లేదు. పైగా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నదని పట్టణ ప్రాంత మేధావులలో ఒక అభిప్రాయాన్ని కూడా సృష్టించింది. గ్రామీణ ప్రాంతాలలో అయితే, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయించేందుకు కర్ణాటక మీద ఒత్తిడి తేవడంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ విఫలమైం దన్న ఆగ్రహం కూడా ఉంది. కర్ణాటకలో బీజేపీకి బలం ఉంది. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించి, బీజేపీతో కొంత మేర అవగాహనకు వస్తారని అనిపిస్తుంది. రజనీ, మోదీ ద్వయం తమిళనాడు పట్టణ ప్రాంత ప్రజల మీద తమ ప్రభావం చూపగలరనీ, బీజేపీ వల్ల అన్నా డీఎంకేలోని ఒక వర్గం చివరి క్షణంలో అయినా రజనీ వెంట వెళతారనీ కమలం పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయం. అయితే అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. అయితే ఇద్దరు నటులలో ఎవరు విజయం సాధించినా, వారి సమక్షంలో రాష్ట్రంలో అవినీతి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. తమిళనాడు ఎన్నికలలో పెరిగిపోయిన ఓట్ల కొనుగోలు సంస్కృతితో ప్రజలు ఎంత తీవ్రంగా కలత చెందుతున్నారో ఇలాంటి భావన వెల్లడిస్తోంది. నిజానికి జయలలిత మరణంతోనే తమిళ రాజకీయాలు దిశా దశ లేకుండా పోయాయి. 2018లో కూడా అలాగే ఉంటుంది. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
దినకరన్ గెలుపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతో గెలుపొందడం అధికార అన్నాడీఎంకేకు మాత్రమే కాదు... ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు కూడా ఊహించని పరిణామమే. అలాగే తెరవెనక ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసి స్తున్నదని పేరుబడ్డ బీజేపీ అధిష్టానానికి సైతం ఇది షాక్. జయలలిత మరణా నంతరం ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కావాలని ఆశించి అప్పటి సీఎం పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించడం... సీఎం పదవి చేతికందేలోపే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు శిక్షపడటం, అనంతరం ఆ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగాయి. కానీ శశికళ మేన ల్లుడు దినకరన్ రంగ ప్రవేశం తర్వాత పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమై ఆయన్ను ఏకాకిని చేశాయి. ఆ తర్వాత దినకరన్‌ను కేసులు చుట్టు ముట్టాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్కే నగర్ ఓటర్లు ఆయనకు రాజకీ యంగా ఊపిరిపోశారు. తమిళనాడు రాజకీయం విలక్షణమైనది. నాలుగు దశాబ్దాలుగా అక్కడ రెండు పార్టీల వ్యవస్థే రాజ్యమేలుతోంది. జయలలిత మరణం, శశికళ జైలు కెళ్లడం పర్యవసానంగా అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు గనుక అది కనుమరుగవుతుందని డీఎంకే ఆశించింది. దినకరన్ జయలలిత అను గ్రహాన్ని కోల్పోయి పార్టీకి దూరంగా ఉండిపోయిన వ్యక్తి. కనుక జయ వారసు డిగా ఆయన్ను ఓటర్లు పరిగణనలోకి తీసుకోరని డీఎంకే భావించింది. ఇక దినకరన్‌పై వచ్చిపడిన కేసులు సరేసరి. పైగా ఎవరికీ పరిచయం లేని ప్రెషర్ కుక్కర్ గుర్తుతో ఆయన బరిలో నిలిచారు. వీటన్నిటినీ ఆర్కే నగర్ ఓటర్లు తోసి రాజన్నారు. ఎప్పుడూ జయలలిత కూడా సాధించనంత మెజారిటీ దినకరన్‌కు ఇచ్చారు. ఆయనకు 40,707 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు ఆయనవే కావడం, డీఎంకే సైతం డిపాజిట్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే ఆయన గెలిచారని ప్రత్యర్థులు ఆరోపించవచ్చుగానీ... ఆ పని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు చేసి ఉండవని ఎవరూ అనుకోరు. మొత్తానికి తాము జయలలిత వారసులమని చెప్పుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలకు ఈ ఉప ఎన్నికలో ఆదరణ దొరకలేదు. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని దినకరన్ చెబుతున్నారు. అది జరిగినా, జరగకపో యినా పళని ప్రభుత్వం ఇబ్బందులు పడటమైతే తప్పకపోవచ్చు. ఎందుకంటే మొన్న సెప్టెంబర్‌లో ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనవలసిన తరుణంలో దినకరన్ వర్గంలోని 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధన్పాల్ అన ర్హులుగా ప్రకటించారు. వారి పిటిషన్ స్వీకరించిన మద్రాస్ హైకోర్టు బలపరీక్షను నిలుపుచేసింది. ఇప్పుడా బలపరీక్ష జరిగినా, వారి అనర్హత సబబేనని తీర్పు వెలు వడి ఉప ఎన్నికలొచ్చినా పళని సర్కారుకు సమస్యలు తప్పవు. ఇవిగాక స్థానిక ఎన్నికల బెడద ఒకటి ఉంది. ఈ ఉప ఎన్నిక అనేకమంది ఆశల్ని అడియాసలు చేసింది. పళనిస్వామి– పన్నీర్‌సెల్వం వర్గాలను ఏకం చేయడంలో విజయం సాధించిన బీజేపీ అధినా యకులు... వీరిద్దరి సాయంతో భవిష్యత్తులో రాష్ట్రంలో కాలు మోపవచ్చునని ఆశపడ్డారు. ఈ నేతలిద్దరి చేతగానితనమూ అడుగడుగునా కనబడుతూనే ఉన్నా జయలలిత వారసులుగా జనం వారినే గుర్తిస్తారని, కేసుల్లో ఇరుక్కున్న దినకర న్కు ఆదరణ ఉండదని వారు భావించారు. ఇదంతా ఇప్పుడు తలకిందులైంది. పైగా బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థికి కేవలం 1,417 ఓట్లు రావడం బీజేపీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యం దక్కటం లేదన్న అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం విఘాతమే. విలీనమై నాలుగు నెలలు కావస్తున్నా పన్నీర్‌కు డిప్యూటీ సీఎంతోపాటు రాజకీయ సమన్వయకర్త పదవి రావడం మినహా ఆయన వర్గీయులకు దక్కిందేమీ లేదు. తమ వర్గానికి చెందిన మధుసూదన్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే ప్రాబల్యం పెరుగుతుందని, అప్పుడు పదవుల కోసం గట్టిగా ఒత్తిడి తీసుకురావొచ్చునని పన్నీర్ వర్గం ఆశపడింది. ఇందులో కులం కోణం కూడా ఉంది. పన్నీర్ తీవర్ కులస్థుడు. పళనిస్వామి గౌండర్. జయ లలిత వద్ద శశికళ ప్రాబల్యం పెరిగిననాటినుంచీ పార్టీలో తీవర్లదే ఆధిపత్యం. తమ కులస్తుడు గనుక చెప్పుచేతల్లో ఉంటాడన్న భావనతోనే జయ మరణా నంతరం శశికళ పన్నీర్‌కు మద్దతిచ్చారు. తీరా ఆయన ఎదురు తిరగడంతో గౌండర్ కులస్తుడైన పళనిస్వామిని అందలం ఎక్కించారు. ఇప్పుడు పళని, పన్నీ ర్లు ఏకమైనా పార్టీలో తమ ఆధిపత్యం పోయిందన్న దిగులు తీవర్లను బాధి స్తోంది. మధుసూదన్ గెలుపు ఈ సమస్యను తీరుస్తుందని పన్నీర్ వర్గం ఎంత గానో ఆశపెట్టుకుంది. అటు పళనిస్వామికి సైతం ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. జయలలిత సొంత స్థానంలో, రెండాకుల గుర్తు తమకే వచ్చినా నెగ్గక పోతే అది రాజకీయంగా సమాధి అవుతుందని గ్రహించి ఆయన తన శక్తిమేరకు కష్టపడ్డారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఇక ఎదురు లేదని... ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తనదే అని భావిస్తున్న డీఎంకేకు ఇప్పుడు డిపాజిట్ గల్లంతు కావడం మింగుడు పడని విషయం. పైగా దినకరన్ శశికళ పేరు చెప్పుకుని, ఆమె ఫొటో పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు. ఇది ఆర్కే నగర్లో కనబడిన ధోరణా లేక రాష్ట్రంలో గాలి మళ్లిందా అన్న అయోమయం డీఎంకేను చుట్టుముట్టింది. రాగలకాలంలో దినకరన్ గెలుపు తమిళ రాజకీయా లను మరెన్ని మలుపులు తిప్పుతుందో చూడాల్సి ఉంది. -
స్వామి మరో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు. ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్‌పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు. -
అది బీజేపీ వ్యతిరేక ఓటు కానేకాదు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్ష అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి, వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దాదాపు 40 వేల మెజారిటీతో విజయం సాధించడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. దినకరన్‌కు నేడు 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు జయలలిత 39 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. దానర్థం జయలలితకన్నా దినకరన్ ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తని అర్థం కాదు. పాలకపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఈ. మధుసూదన్‌కు ఈ ఎన్నికల్లో 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధుగణేశ్ 24,651 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై దినకరన్ విజయం సాధిస్తున్న సూచనలు కనిపించగానే వివిధ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు తమ విశ్లేషణలు వినిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పంటూ పలు పార్టీల నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలే కాకుండా బలవంతంగా హిందీ భాషను రుద్దడం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ లాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు దినకరన్‌కు ఓటేశారని తేల్చారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకుంటే డీఎంకే అభ్యర్థిని గెలిపించేవారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ డీఎంకే. కాగా, డీఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. బీజేపీ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించే ప్రజలు దినకరన్‌వైపు మొగ్గుచూపారని కూడా అంటున్నారు. మతతత్వంపై పోరాడాలన్న తపన ప్రజల్లో ఏ కోశాన, ఎక్కడా కనిపించలేదు. డబ్బు ప్రవాహం ప్రభావం వల్లనే దినకరన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఎన్నికల కోసం దాదాపు వంద కోట్ల రూపాయలను కుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బే ప్రధాన ప్రభావం చూపిస్తుందని తేలడం ఇదే మొదటిసారి కాదు. 2003లో శాంతకులం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించడంలో డబ్బు ప్రభావం మొదటిసారి కనిపించింది. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉన్నప్పటికీ పాలక పక్ష అభ్యర్థినే గెలిపించడం, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం స్పష్టంగా కనిపించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా మన ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలం అవుతోంది. -
అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించింది. ఎస్. వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కళైరాజన్, షోలింగుర్ పార్తీబన్ లను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఆర్కే నగర్లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అధికార అన్నాడీఎంకే ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అమ్మ’ కంచుకోటలో పార్టీ పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి బాధ్యులైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం దినకరన్ భేటీకానున్నారు. రేపు బెంగళూరు వెళ్లి శశికళను కలిసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దినకరన్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ధనాధన్ దినకరన్
-
అమ్మ కోటలో చిన్నమ్మ తడాఖా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు గట్టి షాక్ తగిలింది. శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్.. ఆ రెండు పార్టీల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. తమిళనాడుకు భిన్నంగా.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రౌండులోనూ కనీసం 2 వేల ఆధిక్యంతో ముందంజలో నిలిచారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,28,234 ఓట్లు ఉండగా 1,76,885 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 89,013 (50.32 శాతం) ఓట్లను దినకరన్ గెలుచుకున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 48,306 (27.31శాతం), డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కు 24,651 (13.94శాతం) ఓట్లు పోలయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి 3,860 ఓట్లు, బీజేపీకి 1,417 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 2,373 ఓట్లు దక్కడం విశేషం. ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండాకుల గుర్తును సీఎం కె.పళని స్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా.. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే సమయంలో దినకరన్‌కు శశికళ అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్టు చేశారు. అనంతర పరిణామాల్లో దినకరన్, శశికళను పక్కనపెట్టి పళని, పన్నీరు వర్గాలు ఈ ఏడాది ఆగస్టులో ఏకమయ్యారు. దీంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దినకరన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత ఉన్న సమయంలో పార్టీ నియామకాలు, ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చల్లో దినకరన్ కీలక పాత్ర పోషించారు. 1999లో పెరియాకులం నుంచి లోక్‌సభకు, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలదే గెలుపు పశ్చిమ బెంగాల్‌లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 64 వేల ఓట్ల మెజార్టీతో తృణమూల్ అభ్యర్థి గీతా రాణి భునియా గెలుపొందారు. ఆమెకు మొత్తం 1,06,179 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి రీతా మండల్‌కు 41,987 ఓట్లు దక్కాయి. యూపీలో సికందర అసెంబ్లీ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకుంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పాల్ 11 వేల ఓట్లతో సమాజ్‌వాదీ అభ్యర్థి సీమా సచన్‌పై విజయం సాధించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోని పాక్‌కే–కసాంగ్, లికాబలీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను బీజేపీ గెలుపొందింది. ఈ రెండు స్థానాల్ని కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ సొంతం చేసుకుంది. అన్నాడీఎంకేపై పట్టు సాధిస్తారా? తమిళనాడు రాజకీయాలు ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితాలతో మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే ఆగ్రహానికి గురై ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. «రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సరికొత్త కేంద్రబిందువుగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత హయాంలో దినకరన్ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఆమె మరణించాక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తన అక్క కొడుకైన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు తమ వర్గానికి రెండాకుల చిహ్నం రావడం కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం (ఈసీ)లోని ముఖ్యులకే రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపారు. తీహార్ జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత శశికళ వర్గం నుంచి సీఎం అయిన పళనిస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంతో చేతులు కలిపి శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీచేసి భారీ విజయం సాధించారు. దినకరన్ విజయంతో తమిళ రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతారా? ఆ పార్టీని శశికళ, దినకరన్‌లు మళ్లీ తమ చేతుల్లోకి తెచ్చుకుంటారా? దినకరన్ గెలుపుతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? అన్న విషయం చర్చనీయాంశమైంది. దినకరన్ డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికలో గెలిచారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తునప్పటికీ ఒకవేళ అదే నిజమైతే దినకరన్ డీఎంకేలో చేరుతారా? లేదా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. చెన్నైలో దినకరన్ మద్దతుదారుల సంబరాలు -
ఆర్కే నగర్ తీర్పు: మారుతున్న తమిళ రాజకీయం..!
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తమిళనాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అనూహ్యంగా 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసులం తామేనంటున్న అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జయ మృతి తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరుకునపడిన శశికళ వర్గం కూడా ఈ ఎన్నికను చావో-రేవో అన్నట్టుగా తీసుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. రాజకీయ పరిశీలకులు సైతం ఊహించనిరీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి. ఈ విజయం శశికళ వర్గంలో కొత్త ఉత్తేజం నింపిందని చెప్పవచ్చు. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్లో పాగా వేయడంతో శశి వర్గం ఆనంద డొలికల్లో తేలియాడుతోంది. అమ్మ వారసురాలం తామేనని చెప్పుకోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ వర్గం భావిస్తోంది. ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశి వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేశారు. అటు దినకరన్ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. నిజానికి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎప్పుడో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇంతవరకు అసెంబ్లీలో చేపట్టలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకివచ్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే వట్రివేలు, ఎంపీ సెంగుట్టువన్ దినకరన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరింతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్‌కు అండగా నిలబడితే.. పళనిస్వామి సర్కారు ఇబ్బందులు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
బ్రేకింగ్: దినకరన్ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్ కోల్పోయాయి. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ, అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు తనను గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తనకు ఉన్నాయని, అందుకే ఆర్కే నగర్ తీర్పే నిదర్శమని అన్నారు. మూడు నెలల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ వారసురాలే చిన్నమ్మేనంటూ శశికళ వర్గం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు
-
భారీ ఆధిక్యం దిశగా దినకరన్
-
గవర్నర్‌పై పిటిషన్ వేస్తా..!
సాక్షి, చెన్నై: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ఉండగా, ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటూ సమీక్షలు, సమాలోచనలు సాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి వ్యాఖ్యానించారు. అందుకే గవర్నర్‌పై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఓ ప్రైవేటు కళాశాలలో అవినీతి వ్యతిరేక కమిటి సర్వోదయా మరు ముళక్కం నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సదస్సుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా విఫలమైందని, కేవలం ఎలాగైనా ఎన్నికలు పూర్తి చేయాలనే ముందుకు సాగారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అధికార పక్షం రూపంలో ఖూనీ చేసినా, ప్రజలు న్యాయమైన తీర్పునే ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. డీఎంకే, లేదా దినకరన్‌కు విజయావకాశాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం మిస్టరీ తేల్చేందుకు విచారణ సాగుతున్న సమయంలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడాన్ని తప్పు బట్ట లేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియో ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎప్పుడో విడుదల చేసి ఉండాలని పేర్కొన్నారు. రోడ్డు పక్కన బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధించాలని కోర్టులో తానే కేసు వేశానని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం వాటిలో జీవించి ఉన్న వారి ఫొటోలు పెట్టుకునే విధంగా అనుమతి వచ్చిందని, దీనిపై తగిన వివరాల్ని కోర్టుకు సమర్పిస్తానని, కొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ అధికారం గవర్నర్‌కు లేదు.. రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో అధికారులతో సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల మీద గవర్నర్ దృష్టి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం పాలనలో ఉందన్న విషయాన్ని మరచి, గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తన ధోరణి మార్చుకోని పక్షంలో త్వరలో ఆయన మీద కోర్టులో పిటిషన్ వేస్తానని ట్రాఫిక్ రామస్వామి హెచ్చరించడం గమనార్హం. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్ కూలిపోతుంది
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు. -
విజయం దిశగా దూసుకెళ్తున్న దినకరన్
-
ఆర్కేనగర్ ఓట్ల లెక్కింపులో గందరగోళం
-
దినకరన్‌కు కలిసొచ్చింది ఎలాగంటే...
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఓవైపు కొనసాగుతున్న వేళ.. సర్వేలన్నీ శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు అనుకూలంగా రావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకుగానూ పలు కారణాలను ఆయా సర్వేలు చూపుతున్నాయి. 54 ఏళ్ల దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. దశాబ్దం క్రితం దాకా జయకు ఆప్తుడిగానే ఉన్నాడు. ఆమె తీసుకున్న కీలక నిర్ణయాల్లో దినకరన్ పాత్ర ఉండేది కూడా. 1999లో పెరియాకులం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు.. తర్వాత 2004-10 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే 2011లో మన్నార్ గుడి మాఫియా(శశికళ మరియు ఆమె బంధువులు)ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించటంతో ఆయన తెర వెనక్కవెళ్లిపోయారు. చివరకు జయ మరణానంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వారంతా వెనక్కి వచ్చారు. అయితే వచ్చి రాగానే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే జయ అసలైన వారసత్వం అన్న ట్యాగ్ లైన్‌తో పళని స్వామి గ్రూప్ తరపున ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నిల్చోగా.. ఓటర్లకు యథేచ్ఛగా డబ్బు పంచిన ఆరోపణలతో ఆ ఎన్నిక కాస్త రద్దు అయ్యింది. కానీ, పరిస్థితులు తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఆమె వారసుడిగా రంగంలోకి దిగిన దినకరన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఓవైపు ఎన్నికల్లో అవినీతి కేసు.. మరోవైపు ఫెరా కేసు ఊపిరి సలపకుండా చేశాయి. పళని-పన్నీర్ వర్గాలు కలిసిపోయి.. శశికళ వర్గాన్ని బహిష్కరించాయి. ఒకదాని వెంట ఒకటి దెబ్బలు తగులుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇక రెండాకుల గుర్తు కోల్పోవటంతో టోపీ కోసం యత్నించగా.. అది దక్కలేదు. దానికి తోడు జయ మరణం వెనుక ఆమె హస్తం ఉందన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున్న వినిపించారు. ఒక రకంగా ప్రభుత్వం కావాలనే దినకరన్ పై కుట్ర చేస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇన్ని పరిణామాల మధ్య ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు సంచలనానికి తెరలేపారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేశారు. తనకు తెలీకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ.. ఈ వీడియో ప్రభావంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని వారంటున్నారు. ఆర్కే నగర్ ప్రజల్లో దినకరన్ పై సింపథీ బాగా వర్కవుట్ అయ్యిందని.. అందుకే ఓటింగ్ శాతం కూడా ఓ మోస్తరుగా పెరిగిందని వారంటున్నారు. మరి ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడా? విశ్లేషకులు భావించింది జరగుతుందా? జయకు అసలైన వారసుడని ఆర్కే నగర్ వాసులు భావించారా? మరికాసేపట్లోనే తేలనుంది. -
తొలిరౌండ్లో దినకరన్ ముందంజ
-
లైవ్ అప్ డేట్స్.. అనూహ్యంగా స్వరం మార్చిన అన్నాడీఎంకే నేతలు
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో అన్నాడీఎంకే స్వతంత్ర్య అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపినా ఆయన కంటే చాలా తక్కువ నమోదు కావటం విశేషం. దినకరన్ గెలుపు ఖాయమైపోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఒక్కోక్కరుగా స్వరం మారుస్తున్నారు. ఆ పార్టీ నేత సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ దినకరన్ గెలుపును స్వాగతించటం విశేషం. దినకరన్ తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అపార్థాల వల్లే రెండుగా విడిపోయింది. త్వరలో రెండూ ఒకటవుతాయని ఆశిస్తున్నా.. ఆ మేర నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆయన తెలిపారు. అదే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దినకరన్ ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్‌కు అప్పగించే సమయం వచ్చిందంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ రోడ్లపైకి చేరారు. ఫలితాలపై స్పందించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. అయితే బీజేపీ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఓటుకు నోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని.. డబ్బు విచ్చలవిడిగా పంచటంతోనే దినకరన్ గెలుస్తున్నాడంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. సుబ్రమణియన్ స్వామి ట్వీట్... ఇక బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ లో ఆసక్తికర సందేశం ఉంచారు. ఉప ఎన్నికలో దినకరన్ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. Dinakaran seems to have won the R K Nagar election caused by JJ death. I expect to see the two ADMK factions now to unite for 2019 LS poll — Subramanian Swamy (@Swamy39) 24 December 2017 -
నేడు ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు
సాక్షి, చెన్నై: ఆర్కేనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ నెల 21న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే(శశికళ వర్గం) అభ్యర్థి దినకరన్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. చెన్నై థౌజండ్ లైట్స్‌లోని క్వీన్ మేరిస్ కళాశాలలో ఐదంచెల భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ వెబ్ టెలికాస్టింగ్, వీడియో చిత్రీకరణకు ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు తీసుకొంటోంది. ఈ ఎన్నికలో దినకరన్‌దే గెలుపని, మధుసూదనన్, గణేషన్‌లు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తారని కావేరి టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. దినకరన్‌కు సుమారు 37 శాతం ఓట్లు దక్కొచ్చని పేర్కొంది. -
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్‌లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్‌లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్‌లోని కంట్రోల్ రూమ్‌ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్ బూత్‌ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్‌లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది. -
ఆర్కేనగర్ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ నిమిత్తం ఉప ఎన్నిక నిర్వహించగా గురువారంతో పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయత్రం 5 గంటలకు ముగియగా 77.68 శాతం పోలింగ్ నమోదైంది. 2,28,234 మంది ఓటర్లు ఉండగా 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో 258 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మధుసూదనన్ (అన్నాడీఎంకే), మరుదు గణేష్ (డీఎంకే), స్వతంత్ర అభ్యర్థి, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన చేపడతారు. అదే రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. -
ఆర్కే నగర్లో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే?
సాక్షి , చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్ కేనగర్ ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 73.45 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 24న కౌటింగ్ జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ జోరుగా సాగింది. ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సాగింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం చెన్నై ఆర్కే నగర్. ఆమె మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పట్లో ఈసీ ఉప ఎన్నికను రద్దుచేసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. -
2జీ తీర్పు: ఆర్కే నగర్ ఓటరు ఎటు?
చెన్నై: తమిళనాడులో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో కోర్టు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్కామ్‌లో నిందితులందరినీ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్‌పై కోర్టు తీర్పు ఎటువంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 'మోదీ ఇప్పుడు తమిళనాడు వెళ్లి డీఎంకేతో పొత్తు పెట్టుకోండి' అంటూ వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌పై పోలింగ్ కేంద్రాల వద్ద చర్చ ఓటర్లు చర్చించుకోవడం కనిపించింది. దీన్నిబట్టి తమిళనాడు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మాకు ప్లస్ అవుతుంది 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికి ఆర్కే నగర్లో పోలింగ్ ఇంకా 90 శాతం మిగిలేవుంది. కోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా రావడంతో ఉప ఎన్నికలో తమ పార్టీకి లాభించే అవకాశముందని డీఎంకే నాయకులు అభిప్రాయపడుతున్నారు. 'ఆర్కే నగర్లో మేము గెలుస్తామని అనుకున్నాం. ఈరోజు కోర్టు వెలువరించిన తీర్పుతో మా విజయావకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయ'ని డీఎంకే అధికార ప్రతినిధి మాను సుందరం పేర్కొన్నారు. ఈ కేసు ఎన్నికల అంశం కానప్పటికీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ పార్టీపై ప్రజల్లో నమ్మకం బలపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ లాభాల కోసమే తమ పార్టీ నాయకులను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. స్వాగతిస్తున్నాం: దినకరన్ 2జీ కుంభకోణం కేసులో డీఎంకే నాయకులను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తెలిపారు. డీఎంకే ప్రతిపక్షం అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు జైలు వెళ్లాలని తాము కోరుకోబోమన్నారు. ఆర్కే నగర్ వశమయ్యేనా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ చాలా ఏళ్లుగా అన్నాడీఎంకే పార్టీకి కంచుకోటగా ఉంది. ఆమె మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇక్కడ పాగా వేసేందుకు డీఎంకే సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్నాడీఎంకేలో వర్గపోరుతో తమకే విజయావకాశాలుంటాయని డీఎంకే భావిస్తోంది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పుతో డీఎంకేలో కొత్త ఉత్సాహం నింపింది. ఆర్కే నగర్ తమ వశం కావడం ఖాయమని కరుణానిధి పార్టీ దీమాతో ఉంది. దీర్ఘకాలం ప్రభావం ఉంటుందా? తమిళనాడు రాజకీయాల్లో న్యాయస్థానం తీర్పు ప్రభావం ఎంతకాలం ఉంటుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం(2021) ఉంది. 2జీ స్కామ్ కారణంగా డీఎంకేతో పొత్తుకు జాతీయ పార్టీలు వెనుకాడుతూ వచ్చాయి. అపవాదు తొలగిపోవడంతో డీఎంకేతో చేతులు కలిపేందుకు నిస్సంకోచంగా ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
20 సెకన్ల వీడియో.. ప్రభావం ఎంత?
సాక్షి, చెన్నై : పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండువారాలు ప్రచారం నిర్వహిస్తే.. సరిగ్గా 24 గంటలకు ముందు జయలలిత వీడియో విడుదల చేసి దినకరన్ వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటిదాకా వార్తల్లో నిలిచిన అంశాలను ముఖ్యంగా డబ్బు పంపిణీ వంటి వాటిని ఈ వార్త ఒక్కసారిగా తెరవెనక్కు నెట్టేసింది. అనర్హత వేటు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే వెట్రివెల్ వీడియోను విడుదల చేస్తూ ఉప ఎన్నికకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అమ్మ మరణం వెనుక శశికళ పాత్ర లేదని నిరూపించేందుకు.. చికిత్స మెరుగ్గా అందించామని చెప్పేందుకే విడుదల చేశామని చెప్పటంతోనే అసలు చర్చ మొదలైంది. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం తనకేం పట్టన్నట్లు ఉండటం.. పైగా నేతలను మౌనంగా ఉండాలంటూ ఆదేశించటం... ఈ ఎపిసోడ్ వెనుక వేరే ఏదో మతలబు ఉందన్న సంకేతాలను ముందుగా అందించింది. ప్రతిపక్షాలు కూడా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో పెద్దగా స్పందించలేదు. కానీ, ఏడాది తర్వాత ఈ సమయంలోనే ఎందుకు రిలీజ్ చేశారన్న ప్రశ్న.. వీడియో అసలుదేన్నా అన్న అనుమానంతో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల దినకరన్ వర్గానికి ఒరిగేదేం లేదని వారంటున్నారు. వీడియో చూసి ఎమోషనల్‌గా అమ్మ సెంటిమెంట్‌కు జనాలు కనెక్ట్ అయ్యి ఓట్లు వేయటం కూడా అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ టిపికల్ పొలిటికల్ స్టంట్’ గా దీనిని అభివర్ణిస్తున్న విశ్లేషకులు.. దాని ప్రభావం తెలియాలంటే మరో మూడు రోజులు(ఫలితాలు వచ్చేదాకా) ఓపిక పట్టాల్సిందేనంటున్నారు. -
ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
2జీ స్పెక్ట్రం కేసులో నేడే తీర్పు
-
ఆర్కే నగర్లో పోలింగ్ ప్రారంభం
సాక్షి , చెన్నై: చెన్నై ఆర్ కేనగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే ప్రాతినిథ్యం వహించారు. ఆమె మరణంతో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు బట్వాడా జరగడంతో ఆ ఎన్నిక రద్దయింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. -
జైలుకా.. ఇంటికా..!
‘2జీ’. ఈ రెండు అక్షరాలు వింటే డీఎంకే శ్రేణుల గుండెల్లో గత ఆరేళ్లుగా రైళ్లు పరుగెడుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి రూ.1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణం, ఆరేళ్లుగా సాగుతున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణే వారి భయానికి కారణం. ఈ కేసులో గురువారం తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓవైపు 2జీ స్పెక్ట్రం కేసులో తీర్పు.. ఇదే రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. 2జీ కేసులో శిక్ష పడితే ఆర్కే నగర్ పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని డీఎంకే నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. కరుణ సహధర్మచారిణిని ప్రశ్నించాలనుకున్న సీబీఐ స్వాన్ టెలికం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా డీఎంకేకి సొంతమైన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు రూ.200 కోట్లు లంచం ఇచ్చిన కేసును సైతం అసలు కేసులోనే చేర్చారు. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం, స్వాన్ టెలికం, యూనీటెక్ వైర్లెస్ సంస్థలు సైతం కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ వ్యవహరిస్తున్న కరుణ సహధర్మచారిణి దయాళుఅమ్మాళ్ను కూడా సీబీఐ ప్రశ్నించాలని భావించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంబీకులు నిరాకరించారు. సీబీఐ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి వైద్యులు బృందం సైతం చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్ను పరీక్షించింది. 2జీ కేసులో మిత్రపక్షం డీఎంకే అని కూడా చూడకుండా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహించిన కరుణానిధి యూపీఏ నుంచి వైదొలిగారు. ఆ తరువాత దయాళూఅమ్మాళ్ను విచారించే అంశం మరుగున పడింది. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం సంభవించినట్లు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆరేళ్లు సాగినకేసు గత ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగియగా, 21వ తేదీన తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ఓపీ సైనీ ఇటీవల ప్రకటించారు. గురువారం చెప్పబోయే తీర్పుతో పదేళ్ల కిత్రం జరిగిన కుంభకోణానికి ముగింపు కార్డు పడనుంది. తీర్పు చెప్పుతున్నందున కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాజా, కనిమొళిలకు ఆదేశాలు అందాయి. పదేళ్ల క్రితం నాటి 2 జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల క్రితం నాటి కుంభకోణం, ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. రాజా, కనిమొళిలను కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు బాటపట్టిస్తుందా, నిర్దోషులుగా పేర్కొని ఇంటికి పంపుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకే రోజు రెండు టెన్షన్లు దురదృష్టమో, కాకతాళీయమో తెలియదు కానీ కరుణానిధి, స్టాలిన్ సహా డీఎంకే శ్రేణులు గురువారం రెండు టెన్షన్లను ఎదుర్కొంటున్నారు. 2 జీ కేసులో శిక్ష పడితే పార్టీకి చెరగని మచ్చగా మారి ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని భయం. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. అన్నాడీఎంకేకి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది. -
జయ వీడియో.. ఇంత దిగజారుడు రాజకీయమా?
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో తాజాగా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఈ వీడియోలు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. పలు అనుమానాల నడుమ జయలలిత మృతి మిస్టరీగా మారగా.. ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోలు విడుదల కావడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ' ఇప్పటికే జయలలిత మృతి మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ వీడియోలు విడుదల చేసి ఆమె మృతిపై రాజకీయం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారడం ఉండదు. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఈ ఈ వీడియో ప్రభావం ఉండదు' అని ఆయన అన్నారు. అయితే, ఈ వీడియో విడుదలను శశికళ, దినకరన్ వర్గం సమర్థించుకుంటోంది. అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందించిన చికిత్సపై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి ఆరోపణలను కొట్టిపారేసేందుకే ఈ వీడియోను విడుదల చేశామని దినకరన్ వర్గం నేత టీ సెల్వన్ పేర్కొన్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఎలాంటి కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధమని చెప్పారు. కాగా, సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురువారం జరగనుంది. -
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
-
ఆర్కేనగర్లో అరటి పళ్లలో డబ్బు పంపిణీ
-
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొరుక్కుపేట్‌లోని ఓ సైకోథెరపీ సెంటర్లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డిసెంబర్ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. -
'ఈసారి మా అమ్మ, అయ్య లేకుండానే ఎన్నికలు'
సాక్షి, చెన్నై : తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నిక అంటే మిగితా ప్రాంతాలకంటే ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే అది దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడూ బరిలోకి దిగే స్థానం. అంతే కాకుండా అదే స్థానంలో డీఎంకే అధినేత కరుణానిధి కూడా తమ అభ్యర్థి తరుపున పోటాపోటీగా ప్రచారం నిర్వహించే చోటు. అయితే, జయలలిత చనిపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ప్రచారం జరుగుతుంది. భారీ లౌడ్ స్పీకర్లలో ఎంజీఆర్ పాటలు, ప్రచార నినాదాలతో ఆర్కే నగర్ వీధులన్ని మారుమోగుతున్నాయి. అయితే, ఎక్కడ కూడా ప్రస్తుతం జయలలిత ఫొటోగానీ, కరుణానిధి ఫొటోగానీ కనిపించడం లేదు. ఓ పక్క పెద్ద పెద్ద హోర్డింగ్‌లకు మద్రాస్ కోర్టు అనుమతించకపోవడంతో అసలు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు బరిలోకి దిగిన అభ్యర్థిని కొనియాడుతున్నారే తప్ప ఆ క్రమంలో ఎవరూ జయనుగానీ, కరుణానిధిని గానీ తలుచుకోవడం లేదు. ఇప్పటికే కరుణానిధి అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో 'ఈసారి ఆర్కే నగర్ ఎన్నికలు, మా అమ్మ(జయలలిత) మా అయ్య(కరుణానిధి) లేకుండానే జరుగుతున్నాయి' అంటూ పలువురు సగటు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
విశాల్ నాకు షాక్ ఇచ్చారు..
సాక్షి, చెన్నై: నటుడు విశాల్ నాకు షాక్ ఇచ్చాడని నటుడు పొన్వన్నన్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం, అది అనేక నాటకీయ పరిణామాల తరువాత తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. విశాల్ అనూహ్య నామినేషన్ చర్య పరిశ్రమలో ఒక వర్గం దిగ్భ్రాంతికి, మరో వర్గం తీవ్ర వ్యతిరేకతకు గురి చేసింది. ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. అందులో దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి నటుడు పొన్వన్నన్ రాజీనామా నిర్ణయం ఒకటి. ఈ విషయంపై ఆ సంఘంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి పొన్వన్నన్ రాజీనామాను అంగీకరించేది లేదని సంఘం అధ్యక్షుడు నాజర్ వెల్లడించారు. దీంతో బుధవారం పొన్వన్నన్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతనటీనటుల సంఘ నిర్వాహం రాజకీయాలకతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో ఉందన్నారు. అలాంటిది సంఘం కార్యదర్శి విశాల్ అనూహ్యాంగా ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసి తనకు పెద్ద షాక్ ఇచ్చారన్నారు. సంఘం అధ్యక్షుడు నాజర్‌కు ఫోన్ చేసి సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని చెప్పారన్నారు. సంఘం కోశాధికారి కార్తీని సంప్రదించగా తనకూ ఏమీ తెలియదని,అది విశాల్ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు పలువురు తనను ప్రశ్నించడంతో బదులు చెప్పలేక తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తన రాజీనామాను సంఘ నిర్వాకం ఆమోదించక పోవడం, విశాల్ ఈ విషయంలో విచారం వ్యక్తం చేసి, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తన రాజీనామాతో సంఘం బలహీన పడుతుందని, సంఘ భవన నిర్మాణం నిధిని సమకూర్చడం కోసం వచ్చే నెల 6వ తేదీన మలేషియాలో నిర్వహించ తలపెట్టిన స్టార్ క్రికెట్ కార్యక్రమం పనులు చేయాల్సిఉండడం లాంటివి దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానన్నారు. రజనీ,కమల్ పాల్గొననున్నారు.. జనవరి 6వ తేదీన మలేషియాలో జరగనున్న స్టార్ క్రికెట్ పోటీల్లో కమలహాసన్, రజనీకాంత్‌తో సహా 200 మంది కళాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. నటుడు అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్‌తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని మలేషియా ప్రభుత్వంతో కలిసి నటీనటుల సంఘం నిర్వహించనుందని పొన్వన్నన్ వివరించారు. -
తమిళ నిర్మాతల వార్
తమిళ సినిమా (చెన్నై): తమిళ నిర్మాతల మండ లి సర్వసభ్య సమావేశంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండలి అధ్యక్షు డు విశాల్‌కు వ్యతిరేకంగా పెద్ద పోరే జరగడం తో సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ వర్గం గెలుపొంది నిర్వహణ బాధ్యతల ను చేపట్టింది. ఆదివారం తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. మొదలైన కొద్ది సేపటికే విశాల్‌కు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు చేరన్ వర్గం నినాదాలు చేసింది. అందులో కొందరు విశాల్ మాట్లాడు తున్న మైక్‌ను లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. వాగ్వాదాలు, తోపులాటలతో సమావేశం పోరు వాతావరణాన్ని తలపించింది. అనంతరం చేరన్ వర్గం మీడియాతో మాట్లాడుతూ విశాల్ ఏడు కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని, అప్పుడు తాను తగిన బదులిస్తాని విశాల్ సవాల్ విసిరారు. -
నేనంటే ఎందుకు అంత భయం..?
సాక్షి, చెన్నై: పార్టీ పెట్టాలన్న ఆలోచన తనకు లేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. పార్టీ పెట్టే ప్రసక్తే లేదని, ప్రజాహితం కాంక్షిస్తూ, మంచి పనులు చేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ విశాల్ రాజకీయ పయనానికి ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంగా ఓ మీడియాకు ఆదివారం విశాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆర్కేనగర్లో పోటీకి సిద్ధపడానే గానీ, మరే కారణాలు లేవని స్పష్టంచేశారు. ఆర్కేనగర్ ప్రజలకు మంచి జరిగి ఉంటే, తాను వచ్చి ఉండే వాడిని కాదని వ్యాఖ్యానించారు. తానంటే కొందరికి ఎందుకు అంత భయమో అంతు చిక్కడం లేదన్నారు. తనను గురిపెట్టి దిగజారుడు, ఇంకా చెప్పాలంటే, నీచ రాజకీయాల్ని ప్రదర్శించారని మండిపడ్డారు. సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు, బెదిరింపులు, కిడ్నాప్‌ల పర్వాల్ని ప్రత్యక్షంగా ఆర్కేనగర్లో తాను చూశానని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందరో స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉండగా, ఒక్క తనను మాత్రమే టార్గెట్ చేయడం బట్టి చూస్తే, తనకు ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఆ వ్యక్తులు గుర్తించినట్టున్నారని పేర్కొన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక్క ప్రజలతో తప్పా అని వ్యాఖ్యానించారు. తన వెనుకు దినకరన్, స్టాలిన్, కమల్ ఉన్నట్టు ప్రచారం చేశారని, అయితే, వీళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన వెనుక వారి హస్తం లేదని స్పష్టం చేశారు. తనను నడింపించేందుకు ఎవరో అవసరం లేదని, ప్రజలు చాలు అని, ప్రజలతో కలిసి మంచి కార్యక్రమాలు, పనులు కొనసాగుతాయని తెలిపారు. రాజకీయ పార్టీల ఆలోచన లేదని, అస్సలు ఆ ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. ఇక, నామినేషన్ వ్యవహారంలో జరిగిన తంతంగాన్ని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. జయలలిత మరణం తదుపరి అనేక మందికి ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. -
రిటర్నింగ్ అధికారిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ప్రముఖ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. విశాల్ నామినేషన్ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన అధికారి వేలుస్వామిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. ఈయన స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పీ నాయర్‌ని నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది. హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్‌ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం విదితమే. అయితే కొంత సమయం అనంతరం నామినేషన్ అంగీకరిస్తున్నట్టు, మళ్లీ తిరస్కరించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. విశాల్ అభిమానుల మితిమీరిన ఒత్తిడి మూలంగానే నామినేషన్‌ను ఆమోదించినట్లు అధికారి చెప్పడం మరింత వివాదానికి తెర తీసింది. -
హీరో విశాల్‌కు ఊహించని సపోర్టు..!
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
చివరకు దినకరన్‌కు దక్కింది ఇదే!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించినట్లు ప్రకటించింది. రెండాకుల గుర్తు పళని-పన్నీర్ గ్రూప్‌కు చెందుతుందని ఇటీవలె ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తమకు కేటాయించిన టోపీ గుర్తునే కేటాయించాలంటూ దినకరన్ ఈసీని అభ్యర్థించారు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. టోపీ గుర్తును శశికళ-దినకరన్ వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ఈసీపై కోర్టు ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రభావమో లేక మరేయితర కారణమో తెలీదుగానీ ఎన్నికల సంఘం మాత్రం ఆ గుర్తును కొంగునాడు మున్నేట్ర కగజమ్ అభ్యర్థికి రమేష్‌కు కేటాయించి, దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ ను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై స్పందించిన దినకరన్ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకే ఈ గుర్తు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొనటం విశేషం. కాగా, డిసెంబర్ 21 న జరగబోయే ఎన్నిక కోసం మొత్తం 145 నామినేషన్లు నమోదుకాగా ఈసీ 72 అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే అంగీకరించింది. గత నలభై ఏళ్లలో 11 సార్లు డాక్టర్ రాధాకృష్ణన్(ఆర్కే నగర్) నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా.. అన్నాడీఎంకే పార్టీ 7 సార్లు ఘన విజయం సాధించింది. -
తెర వెనుక హైడ్రామా
సాక్షి, చెన్నై: సినీ నటుడు విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీచేయకుండా అడ్డుకునేందుకు సినిమా స్టైల్లోనే కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు ప్రజల ఓటు చీలడం ఖాయమన్న సంకేతాలతో అధికార పక్ష అన్నాడీఎంకే వర్గం తెర వెనక రాజకీయం సాగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశాల్ పేరును ప్రతిపాదిస్తూ ఆర్కే నగర్‌కు చెందిన పదిమంది సంతకాలు చేశారు. పరిశీలన సమయంలో వారిలో సుమతి, దీపన్‌ల సంతకాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తొలుత విశాల్ నామినేషన్ పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈలోగా సుమతి, దీపన్లకు వచ్చిన బెదిరింపుల ఆడియో టేపుల్ని విశాల్.. రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) దృష్టికి తీసుకెళ్లారు. విచారణ ముగియడంతో నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. చివరకు 11 గంటల సమయంలో సుమతి, దీపన్‌ల సంతకాలు బోగస్ అని తేల్చి విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆర్వో వేలుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పెద్దగా పట్టించుకోని ఆర్వో ఒక్క విశాల్ నామినేషన్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని చూస్తే, తెర వెనుక ఏమేరకు రాజకీయం సాగిందో స్పష్టమవుతోంది. అడ్డుకోవడం అక్రమం: విశాల్ తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో విశాల్ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్లారు. సినీ వర్గాలు విశాల్‌కు బాసటగా నిలిచాయి. -
ఇంత దారుణమా.. నేను షాక్ తిన్నాను!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై ప్రముఖ నటుడు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు? నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్ తిన్నాను’ అని విశాల్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు వదిలిపెట్టబోనని విశాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి విశాల్ లేఖ..! ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను తిరస్కరించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నటుడు విశాల్ లేఖ రాశారు. తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. -
విశాల్ నామినేషన్‌పై హైడ్రామా
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఒక్క రోజులో ఎన్ని మలుపులో... చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. -
అనూహ్యం.. విశాల్ నామినేషన్ అంగీకారం
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విశాల్ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తొలుత నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించగానే విశాల్ తన అభిమానులతో ధర్నాకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నాటకీయ పరిణామాల తర్వాత రిటర్నింగ్ అధికారిని కలిసిన విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. దానిపై సంతృప్తి చెందిన అధికారి విశాల్ నామినేషన్‌ను అంగీకరించారు. అనంతరం బయటకు వచ్చిన విశాల్ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు. ‘‘నా నామినేషన్‌ను ఈసీ అంగీకరించింది. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని విశాల్ ప్రకటించాడు. తన మద్దతుదారులను బెదిరించారని.. అయినా నా పోరాటం గెలిచిందన్నాడు. -
విశాల్,దీప ఇద్దరికీ ఈసీ బిగ్ షాక్!
-
ఆర్కే నగర్ బైపోల్.. విశాల్ నామినేషన్ తిరస్కరణ
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. విశాల్ అరెస్ట్... నామినేషన్ తిరస్కరణపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
దీప జయకుమార్‌కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది. ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది. -
విశాల్.. రాజీనామా చెయ్ !
సాక్షి, పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని డిమండ్ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్‌పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది. పోరాటం చేస్తాం: హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు. అప్పుడు కరుణానిధి.. ఇప్పుడు..! దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు. రాజకీయ లబ్ధి: ఆ పదవిని అడ్డు పెట్టుకుని తను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కే.నగర్లో నామినేషన్ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించి మీడియాతో మాట్లాడారు. -
ఆర్కే నగర్లో విశాల్ నామినేషన్
సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం తమిళ హీరో విశాల్, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దాదాపు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుచేయడానికి ముందు హీరో విశాల్ సోమవారం దివంగత ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీఆర్ స్మారక మందిరాల్లో నివాళులర్పించారు. మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్ద అంజలి ఘటించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నియోజవకర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ఓటర్లు ఉండటంతో, విశాల్ వారి ఓట్లే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాల్‌కు మద్దతుగా నటుడు ఆర్య, ప్రకాష్‌రాజ్ కదిలారు. తనకు మద్దతుగా సినీ పరిశ్రమ కదిలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
అమ్మ సమాధి సాక్షిగా విశాల్ నామినేషన్
సాక్షి, చెన్నై : నటుడు విశాల్ సోమవారం తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ సెంటర్‌కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శమని ప్రకటించిన విశాల్.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్ ప్రజలను కోరుతున్నాడు. ఇక విశాల్ రాక నేపథ్యంలో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అక్కడికి చేరుకోగా.. భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కూడా తమలాగే మాములు వ్యక్తి అని.. అతని కోసం ఎదురు చూడాల్సిన అవసరం తమకు లేదంటూ వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ఫ తోపులాట చోటు చేసుకోగా.. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున), బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న మాస్ హీరో విశాల్ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. -
విశాల్‌కు పోటీగా దర్శకుడు అమీర్
సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు సినీ నటులు పోటీకి దిగనున్నారు. సినీ నటుడు విశాల్‌కు పోటీగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్ సిద్ధమయ్యారు. ఇక 13 ఏళ్ల అనంతరం డీఎంకేకు మద్దతివ్వాలని ఎండీఎంకే నేత వైగో ఆదివారం నిర్ణయించారు. దీనిని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్వాగతించారు. అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీ ఎంకే అమ్మ (రెబల్) గా టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేయాలని అమీర్ నిర్ణయించారు. ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్, విశాల్, అమీర్ సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. -
ఆర్కే నగర్ బరిలో తమిళ హీరో విశాల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 4వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి. -
షాక్.. ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో విశాల్!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. యువ హీరో విశాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయటమే కాదు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు తమిళ మీడియా నుంచి వార్తలు అందుతున్నాయి. అంతేకాదు కొత్త పార్టీ నెలకొల్పి 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నాడంట. సోమవారం విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ వేయబోతున్నట్లు దాని సారాంశం. స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. కమల్, రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విశాల్ నిర్ణయం పెను చర్చకు దారితీసింది. కాగా, ఇప్పటిదాకా 27 నామినేషన్లు దాఖలు కాగా, విశాల్ ఎంట్రీతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. -
ఆసక్తికరంగా ఆర్కే నగర్ ఉప ఎన్నిక!
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్ బరిలోకి దిగుతుండగా డీఎంకే నుంచి మరుదు గణేశ్, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. జయలలిత నియోజకవర్గంలో గెలిచి.. ఆమె వారసులం తామేనని నిరూపించుకోవాలని ఇటు అధికా అన్నాడీఎంకే, అటు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకే కూడా ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి.. ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో దినకరన్
చెన్నై: తమిళనాడులోని రాధాకృష్ణ(ఆర్కే)నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ పోటీచేయనున్నారు. డిసెంబర్ 21న జరగనున్న ఎన్నికల్లో దినకరన్ బరిలో నిలుస్తారని ఆయన వర్గంనేత ఎస్ అంబళగన్ చెప్పారు. వీకే శశికళ అంగీకారంతోనే దినకరన్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్కేనగర్ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ఉప ఎన్నికల్లోనూ దినకరన్ పోటీచేశారు. ప్రచారసమయంలో కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ను రద్దుచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఆర్కే నగర్ బైపోల్.. అభ్యర్థిని ప్రకటించిన డీఎంకే
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం డీఎంకే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత స్టాలిన్ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. తమ పార్టీ తరపున మరుదు గణేశ్ పోటీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కే నగర్) బై ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఎన్నిక, 24న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
ఆర్కేనగర్ నుంచి పోటీచేస్తా
సాక్షి, చెన్నై, కొయంబత్తూర్: ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు. జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో డిసెంబర్ 21న ఉపఎన్నికలు నిర్వహిస్తామని శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అనంతరం తిరుపూర్‌లో దినకరన్ మాట్లాడుతూ.. రెండాకుల గుర్తు కోసం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు బీజేపీతో కుమ్మక్కై కుట్ర చేశారని ఆరోపించారు. కాగా డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాల్ని విడుదల చేస్తామని, డిసెంబర్ 26 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి లఖోనీ తెలిపారు. వేలిముద్రల్ని సరిపోల్చాలని నిర్ణయం గతేడాది ఉప ఎన్నికలవేళ బీ–ఫారాలపై జయలలిత వేలిముద్రల్ని.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో అందుబాటులో ఉన్న జయ వేలిముద్రలతో సరిచూడాలని మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. జయ వేలిముద్రల వివరాల్ని సమర్పించాలని ఆధార్ నియంత్రణ సంస్థ యూఐడీఏఐని కూడా హైకోర్టు కోరింది. మరోవైపు రెండాకుల గుర్తుపై తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ పన్నీర్ సెల్వం సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేశారు. -
దినకరన్ శపథం
చెన్నై: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటామని అన్నాడిఎంకే బహిష్కృత నాయకుడు టీటీవీ దినకరన్ ప్రతిజ్ఞ చేశారు. తిరుర్పూర్‌లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శపథం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ అధికార చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని దినకరన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ డిసెంబర్ 21న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. -
ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారు
-
ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైంది. డిసెంబర్ 21న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 21న ఎన్నిక నిర్వహించి.. 24న కౌటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటితోపాటు సికంద్రా(యూపీ), సంబంగ్(పశ్చిమ బెంగాల్), అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కసంగ్, లికబలి నియోజకవర్గాలకు అదే తేదీలో ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజకవర్గ స్థానం ఖాళీ అయ్యింది. గతంలోనే ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమవగా.. ప్రచార సమయంలో భారీ అవినీతి బయటపడటంతో ఎన్నికను రద్దు చేశారు. చివరకు న్యాయస్థానాల జోక్యంతో డిసెంబర్ 31లోగా ఎన్నిక నిర్వహించాలని ఈసీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. -
దినకరన్ ఎంట్రీ.. సూపర్ ట్విస్ట్
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు. బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా దినకరనే పోటీలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ద్వారా అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకునే అవకాశం వచ్చిందని దినకరన్ చెబుతున్నారు. జయలలిత మరణంతో దాదాపుగా ఏడాది నుంచి (రాధాకృష్ణన్ నగర్) ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఓటర్లను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ప్రలోభ పెట్టడం టాక్స్ అధికారుల దృష్టిలో పడటం.. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ఎన్నికల సంఘం వాయిదా వేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించాకే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించగా.. డీఎంకే తరపున దాదాపు అభ్యర్థి ఖరారైనట్లేనని.. మరో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. -
అక్కడి నుంచి పోటీ చేస్తారా?
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా నటుడు కమల్‌హాసన్‌పై అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుంది. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని కమల్‌హాసన్ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే రాజకీయాల్లోకి రావడానికి కమల్ వంద రోజుల గడువు విధించుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, గత ఏడాది ఏప్రిల్‌లో రద్దయిన ఈ ఉప ఎన్నికలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన మరుదు గణేష్ శనివారం ఈసీకి లేఖ రాశారు. ఓటర్లకు భారీ ఎత్తున డబ్బు పంపిణీ రుజువు కావడం వల్ల ఉప ఎన్నికను రద్దు చేశారని, అయితే రద్దుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. ఆనాటి ఎన్నికల్లో రూ.5 లక్షలు ఖర్చు చేసిన తనకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరారు. లేకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. -
డిసెంబర్ 31లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటించింది. జయ మరణం తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నిక జరిగేలా గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆనాటి ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటర్లకు విచ్చలవిడిగా నగదు, బహుమతులు పంచడం వివాదాస్పదమైంది. ఇవే ఆరోపణలతో మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో ఇందుకు తగిన ఆధారాలు దొరకడంతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 9వ తేదీన ఈసీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం, దీప వర్గాలు పోటీపడడంతో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించింది. మరలా జరిగే ఉప ఎన్నికల నాటికైనా రెండాకుల చిహ్నాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఈసీకి రూ.50 కోట్ల లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేడు మరలా ఉప ఎన్నిక సమీపిస్తుండగా అన్నాడీఎంకే వర్గాలు రెండాకుల చిహ్నం దక్కించుకోవడం కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. రద్దయిన ఎన్నిక సమయంలో పన్నీర్ సెల్వం వర్గ అభ్యర్థి మధుసూదనన్, శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ ఈసారి కూడా పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై క్లారిటీ
సాక్షి, చెన్నై : జయలలిత మరణానంతరం ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్(ఆర్కే నగర్) ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం ఓ స్పష్టత ఇచ్చేసింది. డిసెంబర్ 31 లోపు ఎన్నిక నిర్వహించి తీరతామని ఈసీ ప్రకటించింది. గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏకే జ్యోతి ఈ మేరకు వెల్లడించారు. గత నెల మద్రాస్ హైకోర్టు ఆర్కే నగర్ ఉప ఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్నికల సంఘం స్పందించింది. ఈ యేడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఎన్నికను వాయిదా వేసింది. అంతేకాదు ఆ సమయంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ రెండాకుల గుర్తు పొందడం కోసం ఎన్నికల సంఘం ఉన్నతాధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్ట్ చేసి.. ఆపై బెయిల్ పై విడుదల చేశారు. గుజరాత్ షెడ్యూల్ ఏది? రెండు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్‌ను విడుదల చేస్తారని భావించినప్పటికీ.. ఈసీ కేవలం హిమాచల్ ప్రదేశ్ కు మాత్రమే ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గుజరాత్ ఎన్నికలను డిసెంబరు 18లోపు పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు దిగింది. ఎన్నికల సంఘంపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయించిందని ఆరోపించింది. తన రాజకీయ స్వప్రయోజనాలు నెరవేరే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసేలా ప్రధాని మోదీ ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. కానీ, దీని వెనుక ఓ సాంకేతిక కారణం ఉన్నట్లు ప్రెస్ మీట్ లో ఈసీ చీఫ్ ఏకే జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాల పరిమితి నిబంధన ఉన్నందున గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆయన వెల్లడించారు. -
విజయ్ భాస్కర్ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు
చెన్నై: ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై నివాసంపై ఐటీశాఖ మరోసారి పంజా విసిరింది. ఇలుప్పుర, పుదుకొట్టైలోని ఆయన నివాసాలతో పాటు పలుచోట్ల ఐటీ శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మళ్లీ విజయ్ భాస్కర్ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. -
ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు!
-
ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు!
న్యూఢిల్లీ: తమిళ నాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో సరి కొత్త ఆలోచనలు చూసిన తర్వాత అలా ప్రలోభ పెట్టే అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే అభ్యర్థులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టినట్లు కోర్టులో చార్జిషీట్ దాఖలైతే సదరు అభ్యర్థులపై ఐదేళ్ల వరకు అనర్హత వేటు వేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనుంది. దీనిపై న్యాయ శాఖకు లేఖ రాస్తున్నామని ఈసీ అధికారవర్గాలు తెలిపాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పాల టోకన్లు, ఫోన్ రీచార్జ్ కూపన్లు, పేపర్ల చందాలు, ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ఫర్, మొబైల్ వాలెట్ పేమెంట్ల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అయితే ఆ ఎన్నికలను రద్దు చేసేలా అధికారాలు ఇవ్వాలని గతంలోనే ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఎన్నికల్లో అంగ బలం ప్రదర్శించిన సమయంలో ఈసీకి నేరుగా ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. అర్థ బలం విషయంలో రాజ్యాంగ అధికారాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వాటితో అవసరం లేకుండానే చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది. -
ఓటుకు నోటుపై పిల్
► ఆర్కేనగర్ ఓటర్లపై నోటు పోటు ► నోట్లు పంచిన దినకరన్‌పై పోలీసులకు ఫిర్యాదు ► ఆర్కేనగర్ ఉప ఎన్నికల అవకతవకలపై మద్రాసు హైకోర్టులో వ్యాజం ► వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ నియోజకవర్గ ఓటర్లు దినకరన్ నుంచి రూ.89 కోట్ల మేర లబ్ధిపొందినట్లుగా లభించిన ఆధారాలు ఆ ప్రాంత ప్రజలను చిక్కుల్లో పడవేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు ఇచ్చిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పుచ్చుకున్న ప్రజలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్)పై వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు లేవని తెలుసుకున్న దినకరన్ ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.4వేలు లెక్కన పంచినట్లు సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు చిక్కకుండా ‘స్వామి దర్శనం అయిందా(డబ్బు అందిందా)’ అంటూ కోడ్ భాషను ప్రయోగించారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇవిగాక టోకన్ల పంపిణీ చేసి నేరుగా షోరూంల దగ్గరే విలువైన బహుమతులు పంచే పథకాన్ని పన్నారు. ఎంతగోప్యంగా సాగినా ఎన్నికల కమిషన్ కన్ను పడడంతో అధికార పార్టీ నేతలు ఆదాయపు పన్ను దాడులకు గురైనారు. వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 35 చోట్ల చేసిన దాడుల్లో ఓటర్లకు పంచినట్లుగా రూ.89 కోట్ల విలువైన ఆధారాలు లభించాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యాయి. ఇచ్చిపుచ్చుకున్న వారి మాటేమిటి: న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ నగదు బట్వాడా జరిగినట్లు రుజువుకావడంతో ఎన్నికలను రద్దు చేసి సరిపెట్టిన ఎన్నికల కమిషన్ ఓటుకు నోటు ఇచ్చిన , పుచ్చుకున్నవారిని వదిలేసిందని పిల్ వేసిన అరుణ్ నటరాజన్ తరపు న్యాయవాది నళినీ చిదరంబం శుక్రవారం నాటి విచారణలో న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఓటుకు నోటు పంచడం మాత్రమే కాదు, స్వీకరించడం కూడా చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. అయితే ఎన్నికల రద్దుకు అన్నాడీఎంకే అమ్మ అభ్యర్ది దినకరన్, నగదు పంపిణీకి సారధ్యం వహించిన ఐదు మంది మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ చెన్నై పోలీసులను అదేశించలేదని ఆమె తప్పుపట్టారు. ఓటుకు నోటు పంచిన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ న్యాయమూర్తులకు తెలిపారు. ఫిర్యాదు చేసిన పత్రాల నకలును సైతం కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంలో పిల్ తరపు న్యాయవాది నళినీ చిదంబరం మధ్యలో కలుగజేసుకుని...నోటు చెల్లించినవారిపై మాత్రమే ఫిర్యాదు చేశారు, పుచ్చుకున్న ఓటరుపై చేయలేదని, ఓటర్లపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని వాదించారు. పైగా ఓటర్లు నగదు పొందినట్లుగా ఆధారాలు ఫ్లయింగ్ స్వా్కడ్ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లలో నగదు పుచ్చుకున్న వారిని గుర్తించడం ఆచరణలో సాద్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్‌లు స్పందించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ తదితరులు సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. -
తమిళనాట టెన్షన్.. గవర్నర్ రాక!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేను పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు పట్టుబడడం ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ గూటికి మంత్రులు అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే రాజీనామా చేయాలని శశికళ, దినకరన్‌లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుంచి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
అరెస్ట్ చేస్తారా?
♦ మంత్రుల్లో ఆందోళన ♦ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ♦ విజయభాస్కర్ వైపు సీబీఐ చూపు ♦ 122 మంది ఎమ్మెల్యేలపై గురి సాక్షి,చెన్నై: అధికారులకు బెదిరింపులు, ఐటీ ఉచ్చు వెరసి మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంత్రులు అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న సమాచారం ఉత్కంఠను రేపుతోంది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలకు ముగ్గురు మంత్రులు సిద్ధమయ్యారు. ఇక, ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన ఐటీ దాడులు మంత్రులకు సంకట పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పలుమార్లు ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఆయన్ను పదే పదే ఆదాయ పన్ను శాఖ వర్గాలు విచారిస్తూ రాగా, ఇక ఆయనపై సీబీఐ కూడా దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీబీఐ విచారణకు ప్రతి పక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ పరిశీలనలు సాగుతున్నట్టుంది. విజయ భాస్కర్‌ను సీబీఐ కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఎక్కడ ఆయన అరెస్టు అవుతారోనన్న చర్చ బయలు దేరింది. అలాగే, ఐటీ అధికారుల్ని బెదిరించి ఇరుకున పడ్డ మరో ముగ్గురు మంత్రుల్ని పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న ఉత్కంఠ సాగుతోంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ మంత్రులు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఐటీ అధికారుల్ని బెదిరించిన వ్యవహారంలో మంత్రులు ఉడుమలై కే రాధాకృష్ణన్, కామరాజ్, కడంబూరు రాజాలపై అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసుల్ని నమోదు చేశారు. వీరిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణానంతరం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆ ముగ్గురు మంత్రులు ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో దాఖలు చేయడానికి తగ్గ సూచనల్ని తమ న్యాయవాదులకు జారీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులో దాఖలు చేయడానికి న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు. 122 మంది ఎమ్మెల్యేల్ని విచారించేనా: కువత్తూరు వేదికగా 122 మంది ఎమ్మెల్యేలను బల పరీక్ష సమయంలో బంధించి ఉన్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ వద్ద సాగిన ఐటీ విచారణలో కువత్తూరులోని ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా ఐటీ వర్గాలుకు చిక్కినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేల్ని విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. అంత మంది ఎమ్మెల్యేల్ని విచారణకు పిలిపించడం కన్నా, సమగ్ర సమాచారంతో అడుగులు వేయడానికి తగ్గ కార్యచరణతో ఐటీ వర్గాలు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
డిష్యూం..డిష్యూం
► రోడ్డెక్కిన దీప, మాధవన్‌ల పోరు ► దీప డౌన్ డౌన్ అంటూ నినాదాలు ► ఇరువర్గాల ఘర్షణలతో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ అమ్మ దీప పేరవైలోని విభేదాలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జయలలిత వారసురాలిగా రాజకీయ తెరపైకి వచ్చిన దీప ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే తాను సొంతగా పేరవైని స్థాపించి అధ్యక్షురాలిగా తన డ్రైవర్ భార్యను, ప్రధాన కార్యదర్శిగా డ్రైవర్ ఏవీ రాజాను నియమించారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని కోపగించుకున్న దీప భర్త మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు సమాధానపరచడంతో మళ్లీ కలిశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మళ్లీ ఆగ్రహానికి గురిచేయడంతో మళ్లీ వెళ్లిపోయారు. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం దీప ఇంటి ముందు అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచెను కట్టుకుని వేడుకల్లో పాల్గొనేందుకు అనుచరులతో హాజరయ్యారు. దీప రాకకోసం మాధవన్ ఇంటి బైటే వేచి చూసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప అనుచరులతో వాగ్విదానికి దిగి గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. వీరిని డ్రైవర్ ఏవీ రాజా, అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. ఘర్షణ పడవద్దని దీప కేకలు వేసినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పేరవైలో గొడవలన్నింటికీ నీవే కారణమని కొందరు ఏవీ రాజాను దూషించగా, దీప డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించేశారు. -
మళ్లీ సమన్లు
► బెదిరించిన ముగ్గురు మంత్రులపై కేసు నమోదు ►అన్నాడీఎంకే (అమ్మ)లో విబేధాలు ► సీఎం ఎడపాడి వర్సెస్ దినకరన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని రాష్ట్ర రాజకీయాలు మరోసారి అల్లకల్లోలంగా మారిపోయాయి. రాష్ట్ర మంత్రులను ఐటీ వెంటాడుతూనే ఉంది. వైద్య మంత్రి విజయభాస్కర్‌కు శుక్రవారం మరోసారి ఐటీ సమన్లు జారీకాగా, ఐటీ అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరణైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్ తరఫున విచ్చలవిడిగా ధన ప్రవాహానికి పాల్పడ్డారనే సమాచారంతో వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.5.5 కోట్ల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.అలాగే విజయభాస్కర్ నగదు పంపిణీలో భాగస్వాములుగా భావిస్తూ మాజీ ఎంపీ రాజేంద్రన్, సమక పార్టీ అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లు,తదితర 35 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించి ఆర్కేనగర్ ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు తేల్చారు. దాడులు పూర్తికాగానే మంత్రిని ఐటీ కార్యాలయానికి పిలిపించుకుని 5గంటలపాటు విచారించగా, ఈనెల 17వ తేదీన మరోసారి హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ శుక్రవారం సమన్లు పంపింది. మంత్రిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రికి సన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్షి సైతం 17వ తేదీన ఐటీ ముందు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులు కామరాజ్, రా«ధాకృష్ణన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రచ్చకెక్కిన ఇంటిపోరు: ఇన్నాళ్లూ చాపకింది నీరులా ఉన్న అన్నాడీఎంకే (అమ్మ)లోని ఇంటిపోరు రచ్చకెక్కింది. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)చే విచారణను ఎదుర్కొంటున్న వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుండి తప్పించాలనే అంశంలో సీఎం ఎడపాడి, దినకరన్‌ల మధ్య విభేధాలు భగ్గుమాన్నాయి. జయలలిత మరణానికి శశికళ, అమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తున్న తరుణంలో వారిని దూరం పెట్టాలని ఎడపాడి భావించారు. అయితే ఎడపాడి మాటను కాదని ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ పోటీ సిద్దం కావడంతో విభేధాలు పొడచూపాయి. మంత్రులు సైతం రెండు బృందాలుగా మారి ఎడపాడి, దినకరన్ పక్షాన నిలిచాయి. ఐటీ దాడులకు గురై విచారణను ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 17వ తేదీన ఐటీ కార్యాలయానికి హజరుకావాలని సమన్లలో ఆదేశించి ఉన్నారు. మంత్రిని పదే పదే విచారిస్తుండగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందరూ అంచనావేస్తున్నారు. అయితే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వానికి మచ్చగా మారిన ఉదంతం నుండి బైటపడేందుకు విజయభాస్కర్‌కు ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయించుకోగా సీనియర్ మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, వేలుమణి, తంగమణి సైతం ఎడపాడికి మద్దతు పలికారు. అయితే దినకరన్ గట్టిగా అడ్డుకున్నారు. సీనియర్ మంత్రులే దినకరన్‌పై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం పార్టీ, ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని కోరుతూ సదరు సీనియర్ మంత్రులు గురువారం రాత్రి దినకరన్‌ను కలుసుకున్నారు. కాగా, లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి తదితరులు శుక్రవారం దినకరన్‌తో సమావేశమైనారు. అయితే మంత్రి విజయభాస్కర్‌ను క్యాబినెట్ నుండి తప్పించే ప్రసక్తే లేదని దినకరన్ స్పష్టం చేయగా, విజయభాస్కర్‌పై తగిన చర్య తీసుకుంటామని గవర్నర్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. అంతేగాక ప్రభుత్వంలో మార్పులకు దినకరన్ ఇంటిలో మంతనాలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. -
తమిళ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేలో చీలిక సంక్షోభం నుంచి బయటపడ్డ పళనిస్వామి ప్రభుత్వానికి ఆర్కే నగర్ ఉప ఎన్నికలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్‌భాస్కర్‌పై ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలో వేటు వేయనున్నట్టు సమాచారం. విజయ్‌భాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పళనిస్వామి ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయ్‌భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు వేసే యోచనలో పళనిస్వామి ఉన్నట్టు సమాచారం. కాగా కొందరు మంత్రులు అన్నా డీఎంకే అమ్మ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఎవరికీ అసంతృప్తి లేదని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దినకరన్ చెప్పారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించాయి. ఈనెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది. -
ఐటీ శాఖ విచారణకు హాజరైన శరత్ కుమార్
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, నటుడు శరత్ కుమార్ మరోసారి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గురువారం ఆయన చెన్నైలోని ఐటీ శాఖ ఆఫీసుకు వెళ్లి వివరణ ఇచ్చారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్న అన్నా డీఎంకే శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం రావడంతో తమిళనాడు వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. రాధిక, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఐటీ శాఖ అధికారులు శరత్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. -
మంత్రులపై ఐటీ పంజా
-
మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ► ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్,రాధిక దంపతులు ► మంత్రి విజయభాస్కర్‌కు పదవీగండం? ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్, రాధిక: సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్‌ను ఈ నెల 6వ తేదీన శరత్‌కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్‌కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు. ఈనెల 11వ తేదీన శరత్‌కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్‌కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు. స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు. ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్‌ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్‌పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది. -
ఇకనైనా మేలుకుందామా?
భారత ఎన్నికల కమిషన్‌కు అత్యంత సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ వ్యవస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవలి జమ్మూకశ్మీర్, తమిళనాడు ఉప ఎన్నికలు ఆ ప్రతిష్టకు భంగం కలిగించేలా పరిణమించడం దురదృష్టకరం. ఈ నెల 9న శ్రీనగర్ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 7.24 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత 30 ఏళ్లలో ఇది అత్యంత తక్కువ పోలింగ్. దీంతో ఎన్నికల సంఘం 12న జరగాల్సిన అనంతనాగ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్ని కను నిలిపివేసి, శ్రీనగర్‌లోని 38 పోలింగ్ బూత్‌లలో తిరిగి ఎన్నికలకు ఆదేశిం చింది. గురువారం ఆ పోలింగ్ పూర్తయ్యాక, పద్ధతి ప్రకారం ఆ ఓట్లను లెక్కించి అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి వస్తుంది. గత రెండు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలు మిలిటెంట్ల బెదిరింపులను, ఎన్నికల బహిష్క రణ పిలుపులను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ఓటు చేస్తుండటాన్ని భారత ప్రధాన స్రవంతి రాజకీయాలను వారు ఆమోదిస్తున్నారనడానికి నిదర్శనంగా చూపుతున్నాం. ఈ ఎన్నిక దాన్ని అపహాస్యం చేసేది కాదా? రాష్ట్రlశాసనసభ ఎన్నికల్లో 1996లో 53.9 శాతం, 2002లో 43 శాతం, 2008లో 60.5 శాతం, 2014లో 65.23 శాతం పోలింగ్ నమోదైంది. అలాంటిది రెండేళ్లు గడిచేసరికే పోలింగ్ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడానికి కారణం మిలిటెంట్ల బెదిరింపులు, ప్రతీకార దాడుల భయమే అనడం సమంజసం కాదు. 1996, 2002 ఎన్నికల్లో సైతం ఇలాంటి భయాల మధ్యే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చారు. భయం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నా ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు, ప్రత్యేకించి యువత పోలింగ్ పట్ల విముఖతను ప్రదర్శించారనేది స్పష్టమే. 2016 జూలైలో హిజబుల్ ముజాహిదిన్ కమాండర్ బుర్హన్‌వనీ ఎదురు కాల్పులలో మరణించినప్పటి నుంచి కశ్మీర్ లోయలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం, నిరసన, హింసా కాండ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పరిస్థితిని ఉపశమింపజేయడానికి బదులు పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఈ అల్లర్లను, అసంతృప్తిని పాక్ ప్రేరేపిత చర్యలుగా కొట్టిపారేస్తూ, బలప్రయోగమే శరణ్యంగా భావించాయి. దీనికి తోడు జమ్మూ ప్రాంతంలో బీజేపీ నేతలు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామంటూ సాగించిన ప్రచారం, దేశవ్యాప్తంగా ఆ పార్టీ సాగిస్తున్న గోరక్షణ ప్రచారం కశ్మీర్ ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా పెంచాయి. వీటన్నిటి జమిలి ఫలితంగానే పరి స్థితి పూర్తిగా అదుపుతప్పింది. గత ఆరు నెలల్లోనే అల్లర్లు, నిరసనలలో 96 మంది పౌరులు మరణించారు. 12,000 మందికి పైగా గాయపడ్డారు. పెల్లెట్స్ గన్స్ ప్రయోగంవల్ల వెయ్యి మంది ఒక కన్ను కోల్పోగా ఐదుగురు పూర్తి అంధుల య్యారు. ఇవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేదనుకోవడం అసమంజసం. కశ్మీర్ లోయలో ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చెప్పినా లెక్క చేయక ఈసీ ఈ ఉప ఎన్నికలకు సిద్ధమైంది. అది తన స్వతంత్ర, స్వయం ప్రతిపత్తిని నిస్సంశయంగా కాపాడుకోవాల్సిందే. కానీ దేశం లోనే అతి సున్నితమైన ప్రాంతంలో అవాస్తవిక అంచనాలతో ఎన్నికలకు దిగడం తొందరపాటేనని చెప్పక తప్పదు. శ్రీనగర్ ఓటింగ్ సరళి గుణపాఠంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వైఖరిని మార్చుకుని కశ్మీర్లో శాంతిని నెలకొల్పడానికి ప్రాధా న్యమిచ్చి సామరస్యంతో, సహనంతో, చాకచక్యంగా ప్రజల సంతృప్తిని, ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి కృషి చేయడం అవసరం. ఇక తమిళనాడులోని ఆర్కే నగర్ శాసనసభ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్ని కకు సంబంధించి ఈసీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టి పీడిస్తున్న అతి పెద్ద రుగ్మతలలో ఒకటైన ధన బలానికి ఎదురు నిలవాల్సి వచ్చింది. దివంగత ముఖ్య మంత్రి జయలలిత మరణంతో అవసరమైన ఈ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయక తప్పలేదు. అనూహ్యమైన రీతిలో ఆర్కేనగర్‌ను ముంచెత్తిన నోట్ల వరదలో ఎన్నికలు స్వేచ్ఛగా, ఏ ప్రలోభాలూ లేకుండా జరిగే అవకాశం లేదని ఈసీ సహేతుకంగానే భావించింది. తమిళనాట ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలు రెండూ వాగ్దానాలు కురిపించడంలో, ఓట్లను విడివిడిగా, టోకుగా కొను గోలు చేయడంలో ఆరితేరినవే. అక్రమాస్తుల కేసులో దోషిగా బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిçస్తున్న శశికళ నటరాజన్ నేతృత్వంలోని అన్నా డీఎంకే (అమ్మ) పార్టీ, ఆమె ప్రతినిధిగా ముఖ్యమంత్రి అయిన కే పళనిస్వామి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్ని కలో గెలుపు ప్రజామోద ముద్ర అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. ఇది దృష్టిలో ఉంచుకునే ఈసీ అసాధారణమైన రీతిలో పెద్ద సంఖ్యలో కేంద్ర పరిశీలకులు, ప్లయింగ్ స్క్వాడ్లతో భారీ ఏర్పాట్లు చేసింది. ఏఐఏడీఎంకే (అమ్మ) పార్టీ, ప్రభుత్వాలలో చక్రం తిప్పుతున్న దినకరన్ నిస్సిగ్గుగా, విచ్చల విడిగా డబ్బును పంపిణీ చేయడం సాగించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్ వద్ద ముఖ్యమంత్రి సహా పలువులు మంత్రుల ద్వారా ఓటర్లకు పంచడానికి రూ. 89 కోట్లు సిద్ధం చేసినట్టు తెలిపే పత్రాలు ఏప్రిల్ 7న ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో దొరికాయి. ఆ పార్టీ పంపిణీ చేస్తున్న రూ. 18.8 లక్షలు రెడ్ హ్యాండెడ్గ పట్టుబడ్డాయి. అమ్మ పార్టీకి, దినకరన్‌కు ఈ డబ్బు పంపిణీతో సంబంధాలున్నాయని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత ఈసీది. ఓటుకు నోట్లు కొని ఎన్నికల్లో పోటీ చేసేవారు తాము ఖర్చు పెట్టే డబ్బును పెట్టు బడిగా చూస్తారని, ఐదేళ్లపాటూ నల్లధనాన్ని పోగేసుకోడానికి పదవులను వాడుకుని ఎన్నికల్లో తిరిగి డబ్బు వెదజల్లుతారని అందరికీ తెలిసిందే. ఈ విష వలయాన్ని బద్ధలు కొట్టాల్సిన బాధ్యత ఈసీది కానే కాదు, ఎన్నికైన ప్రభుత్వాలది. ఆర్కేనగర్ నోట్ల పంపిణీ, అక్రమాలు అసాధారణమైనవి. ఇలాంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డ పార్టీపై, అభ్యర్థిపై కనీసం ఆ ఎన్నిక వరకైనా అనర్హత వేటు వేయగలిగేలా ఈసీ అధికారాలను విస్తరింపజేయడంపై సమగ్ర బహిరంగ చర్చ జరగడం అవ సరం, ఏదిఏమైనా రోజురోజుకూ బలపడుతున్న ఓటుకు నోట్లు సంస్కతి మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరతకు ముప్పు తెచ్చేది. ఆ విషయాన్ని మన రాజకీయ పార్టీలు, నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. -
రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం?
►మంత్రి విజయభాస్కర్ క్వారీలపై మళ్లీ దాడులు ►శరత్‌కుమార్, రాధిక ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు ►సర్కార్ రద్దు దిశగా పరిణామాలు చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు అనంతర పరిణామాలు ఎడపాడి ప్రభుత్వ కొంపను ముంచనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ మెడకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగుస్తోందా? పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఎడపాడి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందా? అనే ప్రశ్నలకు అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డింది. ఓటును నోటుతో కొనేయవచ్చనే సులభమార్గాన్ని ఎంచుకుని ఐటీ వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోంది. అధికార పార్టీనే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. మంత్రి క్వారీల్లో మళ్లీ తనిఖీలు మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలపై ఈనెల 7న జరిగిన ఐటీ దాడుల వేడి చల్లారక ముందే పుదుక్కోట్టలోని ఆయన క్వారీల్లో మంగళవారం మరోసారి తనిఖీలు సాగాయి. తిరువేంగవాసల్లో మంత్రికి చెందిన క్వారీలపై కేంద్ర ప్రజాపనులశాఖ అధికారుల సహాయంతో ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సుమారు 150 ఎకరాల్లోని క్వారీల్లోకి ఉదయం 7 గంటల సమయంలో పది మంది అధికారులు ప్రవేశించి నిర్వహణ తీరుపై విచారణ చేపట్టారు. క్వారీల హద్దులను అధిగమించి నిక్షేపాలను కొల్లగొట్టినట్లు కనుగొన్నారు. 7వ తేదీన జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంతోనే ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అలాగే, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, ఆయన సతీమణి, నటి రాధికకు చెందిన చెన్నై టీ నగర్‌లోని రాడాన్ టీవీసీరియల్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆరుగురు మంత్రులకు ఐటీ సమన్లు మంత్రి విజయభాస్కర్ పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన పరిస్థితిలో మరో ఆరుగురు మంత్రులకు ఐటీ అధికారులు మంగళవారం సమన్లు జారీచేశారు. సెంగోట్టయ్యన్ రూ.13 కోట్లు, దిండుగల్లు శ్రీనివాసన్ రూ.13 కోట్లు, తంగమణి రూ.12 కోట్లు, ఎస్పీ వేలుమణి రూ.15 కోట్లు, జయకుమార్ రూ.11 కోట్లు, సెల్లూరు రాజా రూ.48 లక్షలు పంపిణీ చేసినట్లు ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడంతో నోటీసులు పంపారు. మంత్రి విజయభాస్కర్తోపాటూ ఈ ఆరుమంది మంత్రులన త్వరలో విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ విచారణకు హాజరుకాని ఎంజీఆర్ వైద్యవర్సిటీ వీసీ గీతాలక్ష్మికి రెండోసారి నోటీసులు పంపారు. అయితే ఆమె తనపై ఐటీశాఖ జారీచేసిన సమన్లను కొట్టి వేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ తప్పదా? ఆదాయపుపన్నుశాఖ అధికారులు ఈనెల 7వ తేదీన జరిపిన దాడుల్లో వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి నుండి రూ.5.5 కోట్ల స్వాధీనం నేపధ్యంలో డైరక్టర్ ఆఫ్ విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి విజయభాస్కర్‌ను సోమవారం తీవ్రస్థాయిలో విచారించారు. సోమవారం రాత్రి మంత్రికి సంబంధించి ఇద్దరు బంధువుల ఇళ్లపై, అనుచరులున్న ప్యారీస్‌లోని ఒక లాడ్జీపై ఆకస్మిక దాడులు జరిపి మరికొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి కేసును ఆర్కేనగర్లో నగదు పంపిణీ, ఇంటిలో రూ.5.5 కోట్లు కలిగి ఉండటాన్ని రెండుగా విభజించి విచారించనున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2లక్షలకు పైగా నగదు దగ్గర ఉంచుకున్నట్లయితే తగిన కారణాలతో ఐటీ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో సీబీఐ లేదా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారు. ఈ ప్రకారమే కేసు ఈడీకి చేరగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం? ఆర్కేనగర్ ఉప ఎన్నికలను అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గుప్పుమంటోంది. ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేర నగదు, బహుమతుల బట్వాడా సాగినట్లు ఐటీ దాడుల్లో సాక్ష్యాలు లభించడం, ఈ పంపిణీలో ముఖ్యమంత్రి ఎడపాడి, ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ ప్రధానపాత్ర పోషించడం తేటతెల్లమైంది. ఎన్నికల్లో అక్రమాలపై సీఎం సహా అందరినీ విచారించాలని ఐటీ అ«ధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేతగా ఎడపాడి ఎన్నిక, విశ్వాస పరీక్ష వరకు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ఉంచడం, మంత్రుల ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్లు ఆరోపణలతో ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్టపాలై ఉంది. ఐటీ దాడుల వల్ల ప్రభుత్వంపై మరింత మచ్చపడటం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్నట్లుగా కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం సమర్పించేందుకు డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురైమురుగన్, ఎంపీ ఆర్ ఎస్ భారతి తదితరులు మంగళవారం ముంబయికి వెళ్లారు. ఆర్కేనగర్లో అధికార పార్టీ అవినీతిపై నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి ఎడపాడి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్రాజా నాగర్‌కోవిల్‌లో మీడియాతో అన్నారు. ఆయా కారణాల దృష్ట్యా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయవచ్చాని కేంద్ర పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.5లక్షలు తీసుకోలేదు: డాక్టర్ బాలాజీ అమ్మ వేలిముద్రల స్వీకరణ సమయంలో వైద్యమంత్రి విజయభాస్కర్ నుంచి తాను రూ.5లక్షలు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యులు బాలాజీ మంగళవారం ఖండించారు. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉండగా మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల వచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత అభ్యర్థులకు జారీచేయాల్సిన బీఫారంలో ఆమె సంతకానికి బదులు వేలిముద్రలు వేశారు. ఆ సమయంలో డాక్టర్ బాలాజీ సాక్షి సంతకం చేశారు. మంత్రి తనకు కూడా రూ.5లక్షలు ఇచ్చారని, ఆ సొమ్మును లండన్ డాక్టర్ రిచర్డ్ హోటల్ ఖర్చులకు వినియోగించినట్లుగా వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. తాను ఏ మీడియాతో మాట్లాడలేదు, తనకు మంత్రి రూ.5లక్షలు ఇవ్వలేదని డాక్టర్ బాలాజీ ఖండించారు. -
ఔను వాళ్లిద్దరూ ఒకటయ్యారు
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా ప్రకటన వెలువడినప్పటి నుంచి పలు రకాల సంచలనాలు జరిగాయి. అందులో దీప– మాధవన్ ఒకటైన సంఘటన ఒకటి. జయలలిత అన్న కుమార్తె ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై కార్యదర్శి దీప, తన భర్త మాధవన్‌తో టీనగర్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. జయ మృతి అనంతరం రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల కుటుంబంలో గందరగోళం నెలకొంది. దంపతుల మధ్య నెలకొన్న కలహాల కారణంగా దీపను వదిలి మాధవన్ ఒంటరిగా హోటల్లో బస చేశారు. ఆర్కేనగర్ ఎన్నికల నామినేషన్ దాఖలులో దీప భర్త పేరును సూచించలేదు. తనకు మాధవన్‌తో ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన దీప మాటలను పట్టించుకోకుండా దీప పిలిస్తే ప్రచారానికి సిద్ధం అని మాధవన్ ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్కేనగర్ ఎన్నిక వాయిదాతో దీప, మాధవన్ ఒకటయ్యారు. దీనిపై ప్రశ్నించిన వారితో ఇది తమ సొంత విషయం అని దీప చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీపకు హత్యా బెదిరింపుల కేసు వాయిదా ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి జె.దీపకు గత 31, 4వ తేదీల్లో టీనగర్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్ ఫోన్లో హత్య బెదిరింపులు చేశాడు. దీనిపై పార్టీ ప్రచార కార్యకర్త పొన్ పాండ్యన్ మాంబలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ నంబర్, ఫేస్బుక్లో అతడి ఫొటోను పోలీస్ స్టేషన్లో చూపించారు. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు న మోదు కాలేదు. పసుమ్‌పొన్ పాండియన్ న్యాయవాది సుబ్రమణి ద్వారా సైదాపేట 17వ న్యాయస్థానంలో మహమ్మద్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ అంకాళేశ్వరి ఈ కేసుపై విచారణను14వ తేదీకి వాయిదా వేశారు. -
పాల టోకెన్లు, గిఫ్ట్ కూపన్లు
న్యూఢిల్లీ: పాల టోకన్లు, గిఫ్ట్ కూపన్లు, ఫోన్ రీచార్జి కూపన్లు..! జయలలిత మరణంతో ఖాళీ అయిన తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పార్టీలు ఎరవేసిన తాయిలాల్లో ఇవి కొన్ని మాత్రమే. కాదేదీ లంచానికి అనర్హం అన్న రీతిలో పార్టీలు సరికొత్త లంచాలకు తెరతీసినట్లు ఎన్నికల సంఘం దర్యాప్తులో తేలింది. అన్నాడీంకే(అమ్మ) వర్గం ఓటర్లకు రూ.90 కోట్లు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఎన్నికల నిబంధనల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో కొత్తకొత్త మార్గాల్లో లంచాలకు తెరతీస్తున్నారని ఈసీ 33 పేజీల రద్దు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్కే నగర్లో పార్టీలు దినపప్రతికల చందాలు, బ్యాంకు ఖాతాల్లో, మొబైల్ వ్యాలెట్లలలో డబ్బులు తదితర మార్గాల్లో లంచాలు ఎరవేశారంది. రూ.18.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తమ పార్టీని దెబ్బతీయడానికి కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిందని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కే నగర్లో ఆ పార్టీ అభ్యర్థి దినకరన్ ఆరోపించారు. -
‘ఎప్పటికైనా ఆర్కే నగర్లో నాదే విజయం’
చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక విజయంపై అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఆయన సోమవామిక్కడ అన్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలుపు తమనే వరిస్తుందని దినకరన్ జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఎవరికీ డబ్బులు పంచలేదని దినకరన్ తెలిపారు. కాగా జయలలిత మరణంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో గెలిచి.. ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే శశికళ వర్గం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కూడా ఆర్కే నగర్లో అన్నాడీఎంకే నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంతలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఉప ఎన్నికను రద్దు చేయడంతో ఆ పార్టీ ఇరకాటంలో పడింది. అంతేకాకుండా ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ దినకరన్ మండిపడ్డారు. మరోవైపు ఆర్కేనగర్లో డబ్బుల పంపిణీపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల పాత్రపై కూడా దర్యాపు చేయాలని ఆయన కోరారు. అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఎన్నికల సంఘం ఉప ఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. -
చిన్నమ్మకు మరిన్ని కష్టాలు??
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) అధినేత్రి వీకే శశికళకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) నేతలు భారీగా ఓటర్లకు డబ్బులు పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఆమె నియామకం ఎంతవరకు చెల్లుతుందనే అంశాన్ని ఈసీ పరిశీలించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా శశికళ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె నియామకం ఎంతవరకు ప్రామాణికం అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీలను ప్రకటించాలని ఈసీ భావిస్తున్నదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. -
అక్కడ పంచిందంతా తెల్ల ధనమేనా?
న్యూఢిల్లీ: పాత నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ప్రశ్నలు సంధించారు. డబ్బులు విచ్చలవిడిగా పంచారన్న ఆరోపణలతో ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసిన నేపథ్యంలో చిదంబరం ట్విటర్ లో స్పందించారు. ‘డీమోనిటైజేషన్ తో నల్లధనం నిర్మూలిస్తామని మనకు చెప్పారు. ఆర్కే నగర్ లో పంచిందంతా తెల్ల డబ్బా’ అని పిదంబరం ప్రశ్నించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పాత పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడులోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ఆదివారం రద్దు చేసింది. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
శశికళ వర్గానికి షాక్..
చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయడంతో అధికార అన్నాడీఎంకే వర్గం షాక్‌కు గురైంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో గెలిచి.. ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే శశికళ వర్గం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కూడా ఆర్కే నగర్లో అన్నాడీఎంకే నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంతలో ఈసీ ప్రకటించిన ఉప ఎన్నిక నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ అన్నాడీఎంకే అభ్యర్థి, శశికళ కొడుకు దినకరన్ మండిపడ్డారు. కాగా, అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ’ఈ ఎన్నిక పారదర్శకంగా జరగడం లేదని గుర్తించి ఈసీ జోక్యం చేసుకుంది. దేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం బతికే ఉందనడానికి, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనడానికి ఇది నిదర్శనం’ అని ఆమె కొనియాడారు. రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఈసీ.. ఉప ఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది. విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఈసీ కొరడా: ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు
-
నేటితో తెర
► తారాస్థాయిలో ప్రచారం ► సీఈసీతో అధికారుల సమాలోచన ► నజీంజైదీ నిర్ణయం ఏంటో? ► మరి కొన్ని గంటల్లో ప్రకటన ఆర్కేనగర్ ఉప ఎన్నికలప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటల తో ముగియనుంది. ప్రచారం తారాస్థాయికి చేరింది. ఆదివారం ఆగమేఘాలపై నేతల పర్యటనలు సాగాయి. ఇక,ఎన్నికల నిర్వహణపై సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ నిర్ణయాన్ని ప్రకటించ నున్నారు. దీంతో ఎన్నికలు జరిగేనా, రద్దయ్యేనా? అన్న ఉత్కంఠ రెట్టింపైంది. సాక్షి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. సంఖ్య మరీ ఎక్కువ కావడంతో ఒక్కో పోలింగ్ బూత్‌లో నాలుగు ఈవీఎంల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఎన్నికల తేదీ (బుధవారం) సమీపించడంతో ఇందు కు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక, ఎన్నికల సామగ్రిని పోలింగ్ బూత్‌లకు తరలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో నియోజకవర్గంలో ఉన్న బయటి వ్యక్తులు ఖాళీ చేసి వెళ్లి పోవాలని హుకుంను ఎన్ని కల యంత్రాంగం జారీ చేసింది. ఇక, ఆదివారం సెలవు దినం కావడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతల సుడిగాలి పర్యటనలు సాగాయి. ఆదివారం ప్రధాన పార్టీలన్నీ తెలుగు వారు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలోని న్యూశాస్త్రి నగర్, కామరాజనగర్, చిగురింత పాళ యం. కార్నేషన్ నగర్, అంబే ద్కర్ నగర్, అనంత నాయకీ నగర్, హరినారాయణపురం, స్టాన్లీ నగర్ ప్రాంతాల్లో నేతల పర్యటనలు ఆగమేఘాలపై సాగాయి. డీఎంకే అభ్యర్థి మరుదుకు మద్దతుగా స్టాలిన్ ఓపెన్ టాప్ జీపులో పర్యటించారు. బీజేపీ అభ్యర్థి గంగైఅమరన్కు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి, తమిళిసై సౌందరరాజన్ ఓపెన్ టాప్ జీపులో పర్యటించారు. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ తెలుగువారి ప్రాంతాల్లో సభ రూపంలో ప్రచారం చేస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాలను స్వీకరిస్తూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. తమిళనాడు తెలుంగు మక్కల్ కట్చి అభ్యర్థి లలిత తెలుగు వారిని ఆకర్షిస్తూ, తెలుగులో ప్రసంగాలు సాగిస్తూ ముందుకు సాగారు. అన్నాడీఎంకే అమ్మ పురట్చి తలైవీ అభ్యర్థి మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరుసెల్వం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఒంటరిగా దీప పర్యటన నియోజకవర్గంలో సాగింది. తమ అభ్యర్థికి మధివానన్కు మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్ సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. ఇక, డీఎంకే అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సైతం ప్రచారంలో దిగడం విశేషం. ప్రచారం తారాస్థాయికి చేరడంతో నియోజకవర్గంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరమైంది. నగదు బట్వాడా కట్టడి లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రాత్రి పగలు నియోజకవర్గంలోని అన్ని వీధుల్లో దూసుకెళ్తున్నాయి. ఎంపిక చేసిన 350 చోట్ల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుండడం గమనార్హం. జైదీ నిర్ణయం ఏమిటో: ఆర్కేనగర్లో ఓటుకు నోటు తాండవం చేసి ఉండడం ఆధారాలు సహా బయట పడడంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ సోమవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక అధికారి విక్రమ్ బాద్రా ఢిల్లీలో ఆదివారం జైదీని కలిసి అన్ని వివరాలను సమర్పించారు. తమకు ఆదాయ పన్ను శాఖ సమర్పించిన నివేదికను, తమ విచారణలో వెలుగు చూసిన అంశాలను వివరించారు. జైదీ సోమవారం కేంద్ర , రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించి ఉండడంతో ఆర్కేనగర్ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడనుందో అన్న ఉత్కంఠ రెట్టింపు అవుతోంది. మరికొన్ని గంటల్లో సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఆర్కేనగర్లో నోట్ల కట్టలు తాండవం చేస్తుండడం, దీని పరిగణలోకి తీసుకుని ఎన్నికల రద్దుకు అధికారులు నిర్ణయం తీసుకుంటుండడం బట్టి చూస్తే తమిళనాట ప్రజాస్వామ్యం అన్నది లేదని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఈ దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. -
ఈసీ కొరడా: ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నికల కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఈసీ.. రాత్రి 10:30 తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది. విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఆర్కేనగర్లో పురందేశ్వరి ప్రచారం
చెన్నై(కేకేనగర్): ఆర్కేనగర్ నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్కు మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి ఆదివారం ప్రచారం చేశారు. కొరుక్కుపేటలో ఉన్న కామరాజనగర్, భారతీనగర్ తదితర తెలుగు ప్రాంతాల్లో ఆమె పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలనకు ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. అందుకే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి అమరన్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, పార్టీ నాయకులు, చక్రవర్తి నాయుడు, శక్తివేల్ చెన్నై జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నికల కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 12న జరగనున్న ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలా? లేక యథాతథంగా కొనసాగించాలా? అన్న దానిపై ఈసీ సమాలోచనలు జరుపుతోంది. ఈ విషయంలో సోమవారం నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో గెలుపు శశికళకు చెందిన అన్నాడీఎంకే వర్గానికి కీలకం కావడంతో అధికారంలో ఉన్న ఆ వర్గం భారీ మొత్తంలో ప్రజలకు డబ్బు పంచుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలో పలు విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఆర్కే నగర్లో ఓటరుకు రూ. 4000 చొప్పున శశికళ వర్గం పంచుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఆర్కే నగర్‌లోని 2,24,145 మంది ఓటర్లకు పంచేందుకు శశికళ వర్గం అధినాయకత్వం నలుగురు మంత్రులకు రూ. 89.5 కోట్లు ఇచ్చినట్టు మీడియాకు లీకైన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మంత్రి ఇంటివద్ద హైడ్రామా: పత్రాలతో అనుచరుడి పరార్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరుగనిరీతిలో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అధికారులు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌భాస్కర్ నివాసంలో శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా ఐటీ అధికారులనే కాదు.. అక్కడ కాపలాగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లను కూడా బిత్తరపోయేలా చేసింది. ఒకవైపు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ల నుంచి తప్పించుకొని మరీ ఇంటి నుంచి మంత్రి విజయ్ భాస్కర్ అనుచరుడు పత్రాలను బయటకు చేరవేయడం కెమెరాకు చిక్కింది. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలకు ఈ హైడ్రామా అద్దం పడుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో వందకోట్లకుపైగా డబ్బును వివిధ పార్టీల నేతలు ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ అధికారులు నేరుగా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు. ఏకంగా 35చోట్ల దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారుల దాడుల సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. తన నివాసంలో, తన కుటుంబసభ్యుల నివాసాల్లో కేవలం పదివేలు మాత్రమే దొరికాయని మంత్రి చెప్తుండగా.. అయితే, కీలక పత్రాల కోసమే ఆయన ఇంట్లో ఈ దాడులు నిర్వహించినట్టు ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఆర్కే నగర్ నియోజకవర్గంలోని మార్కింగ్ చేసిన పలు ఇళ్లు వేదికగా డబ్బు పంపిణీ కొనసాగుతున్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా ఇళ్లకు వేసిన మార్కింగ్ కోడ్, వీటి ఆధారంగా చేస్తున్న నోట్లకట్టల పంపిణీ గుట్టును రట్టు చేసేందుకు ఐటీ రంగంలోకి దిగింది. డబ్బు పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్న మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే.. మరో మంత్రి కామరాజు తన అనుచరులతో అక్కడికి చేరుకొని రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. కొంతసేపు ప్రతిఘటించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ తర్వాత వారిని లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా ఇంటిలో నుంచి కొన్ని పత్రాలను తీసుకొచ్చిన అన్నాడీఎంకే నేత థాలవాయ్ సుందరం వాటిని ఐటీ అధికారులకు కనబడకుండా మరో అనుచరుడికి అందించారు. కాస్తా దూరంగా నిలబడిన ఇద్దరు మంత్రులు దీనిని గమనిస్తుండగానే.. ఆ అనుచరుడు తన వెంటపడుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను తప్పించుకొని మరీ ఆ పత్రాలను బయటకు విసిరేశాడు. బయట ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు ఆ పత్రాలను మాయం చేశాయి. డబ్బు పంపిణీకి సంబంధించిన కీలకమైన పత్రాలను ఇలా బయటకు తరలించి ఉంటారని భావిస్తున్నారు. #WATCH Chennai: Security personnel chase TN Minister Vijaya Bhaskar's supporter who tried to flee with documents during IT raid (07.04.2017) pic.twitter.com/iELfRTBby8 — ANI (@ANI_news) 9 April 2017 -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యే ఛాన్స్!
-
ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యే ఛాన్స్!
చెన్నై: తమిళనాడులో ఆర్కేనగర్కు జరగనున్న ఉపఎన్నికలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేశారని ఆధారాలతో సహా బయటపడటంతో మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈసీ రేపు నిర్ణయాన్ని వెలువరించనుందని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, నియోజకవర్గంలో తమకు పట్టుబడ్డ నగదు, తాయిలాల వివరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్బాద్రాతో పాటు పలువురు అధికారులు ఆగమేఘాలపై ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో భేటీ అయి ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఒక్కో ఓటుకు దాదాపు రూ.4వేలు చెల్లించారని తెలుస్తోంది. నగదు బట్వాడాకు తగ్గ ఆధారాలు లభించడం, అమ్మ, పురట్చితలైవి శిబిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఉండడం వెరసి ఎన్నికల నిర్వహణ మీద కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దృష్ట్యా, రద్దు విషయంలో వెనక్కు తగ్గుతారా, వాయిదా వేస్తారా అని విస్తతంగా చర్చ జరుగుతుంది. మరోపక్క, సీఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉన్నపలంగా డబ్బు పంపిణీ విషయంపై దర్యాప్తు ఆదేశించింది. -
ఉత్కంఠగా..
♦ ఉప ఎన్నిక రద్దయ్యేనా..? ♦ ఢిల్లీకి ఎన్నికల అధికారులు ♦ రూ.89 కోట్ల నగదు బట్వాడా ♦ ఆధారాల చిట్టా లభ్యంతో చర్చ ♦ టీటీవీకి వ్యతిరేకంగా చిట్టాలో వివరాలు ♦ అమ్మ, పురట్చితలైవి శిబిరాలపై ఈసీ అసంతృప్తి ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దయ్యేనా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు శనివారం చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గంలో రూ.89 కోట్ల మేరకు నగదు బట్వాడా సాగినట్టుగా ఆదాయపన్ను శాఖ ఓ జాబితాను ఎన్నికల యంత్రాంగానికి సమర్పించింది. అదే సమయంలో ఎన్నికల అధికారులు ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే అమ్మ, పురట్చితలైవి శిబిరాలపై ఈసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఈనెల 12న ఉప ఎన్నిక జరగనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రచారంలో నేతలు దూసుకెళుతున్నారు. అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్, పురట్చితలైవి అభ్యర్థి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీప అన్నాడీఎంకే ఓట్లను చీల్చుకునే దిశగా పరుగులు తీస్తున్నారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్‌కు మద్దతుగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్ర ప్రచారంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గంగైఅమరన్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, తన అభ్యర్థి మధివానన్కు మద్దతుగా ఆదివారం నాలుగున్నర గంటల పాటు సుడిగాలి పర్యటనకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ అధికార, ధన బలం ప్రయోగంతో తీవ్ర వ్యూహ రచనలు సాగిస్తున్నట్టు ఆరోపణలు వసు ్తన్నాయి. నియోజకవర్గంలో ఓటుకు కొన్ని చోట్ల రూ.నాలుగు వేలు, మరికొన్ని చోట్ల రూ.ఏడు వేలు ఇస్తున్నట్టుగా ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ఉత్కంఠగా: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు, ప్రచారాలు ఓ వైపు సాగుతుంటే మరోవైపు ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదోనన్న సర్వేలు సైతం సాగాయి. డీఎంకే అభ్యర్థి గెలుపు ఖాయం అన్నట్టు లయోల కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది అన్నాడీఎంకే ఓట్ల చీలిక డీఎంకేకు కలిసి వచ్చే అంశంగా ఆ సర్వే తేటతెల్లం చేసింది. డీఎంకే గెలుపు ఖాయం అని 49 శాతం మద్దతు పలికినట్టు ఆ విద్యార్థులు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక సాగేనా అన్న ఉత్కంఠ బయలు దేరింది. ఇందుకు నగదు బట్వాడా కారణం, శనివారం కూడా అధికారులు రూ. 29 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో రూ.89 కోట్ల మేరకు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నగదు పంపిణీ చేయాలి, ఎవరెవ్వరి ద్వారా పంపిణీ జరగాలని, నేతృత్వం వహించే వారెవ్వరో అన్న వివరాలతో జాబితా బయటపడడం గమనార్హం. ఆదాయ పన్ను శాఖ శుక్రవారం జరిపిన దాడుల్లో ఈ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇందులో సీఎం ఎడపాడి పళనిస్వామితో పాటు పలువురు మంత్రుల పేర్లు ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలోని ఏడు వార్డుల్లో ఏ వార్డుకు ఎంత మొత్తం కేటాయించారో, వాటిని స్వీకరించిన వారి పేర్లతో సహా వివరించి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. ఈ నగదు ఎలక్ట్రిక్ రైలు మార్గాన్ని ఆధారంగా చేసుకుని తరలించినట్టు సమాచారం. ఇక, రెండాకుల చిహ్నంను సీజ్ చేసినా ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి తమకు అనుకూలంగా దానిని వాడుకుంటున్నట్టు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఇచ్చిన వివరణ అసంతృప్తికరంగా ఉండడాన్ని ఎన్నికల యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలు ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలు రద్దయ్యేనా: ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, నియోజకవర్గంలో తమకు పట్టుబడ్డ నగదు, తాయిలాల వివరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్బాద్రాతో పాటు పలువురు అధికారులు ఆగమేఘాలపై ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో ఎన్నికలు రద్దు అయ్యేనా, వాయిదా పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. నగదు బట్వాడాకు తగ్గ ఆధారాలు లభించడం, అమ్మ, పురట్చితలైవి శిబిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఉండడం వెరసి ఎన్నికల నిర్వహణ మీద ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు కేవలం నాలుగు రోజులే సమయం ఉండడం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దృష్ట్యా, రద్దు విషయంలో వెనక్కు తగ్గుతారా అన్న ఎదురుచూపులు ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవకుర్చి, తంజావూరుల్లో నగదు బట్వాడా ఆధారాలు బయట పడడంతో, ఆ రెండు చోట్ల ఎన్నికల్ని ఈసీ నిలుపుదల చేయడం గమనించాల్సిన విషయం. తన గెలుపును అడ్డుకునేందుకు సాగుతున్న కుట్రలో భాగమే నగదు బట్వాడా ఆరోపణలు అని అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్ని నిలుపుదల చేయడం లక్ష్యంగా బూటకపు జాబితా పేరుతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, డీఎంకే ర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తన ప్రచారంలో నగదు బట్వాడాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, నగదు బట్వాడా చేసిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు. -
భాస్కరుడికి ఐటీ ఉచ్చు
♦ సమన్లు జారీ అయ్యే అవకాశం ♦ మంత్రి తండ్రి, సోదరుడి విచారణ ♦ శేఖర్‌రెడ్డితో మిత్ర బంధం వెలుగులోకి సాక్షి, చెన్నై: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడకు ఐటీ ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నిమిత్తం ఆయనకు సమన్ల జారీకి ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక, మంత్రి తండ్రి, సోదరుడ్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగా విచారించడం గమనార్హం. నల్లధనం, అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్న శేఖర్‌రెడ్డితో మిత్ర బంధం ఉన్నట్టు ఐటీ విచారణలో వెలుగు చూసింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న మంత్రి విజయభాస్కర్‌కు షాక్ ఇచ్చే రీతిలో ఆదాయపన్ను శాఖ శుక్రవారం మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. మంత్రితో పాటు అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో సన్నిహితంగా ఉన్న వారందరి ఇళ్ల మీద ఈ దాడులు జరిగాయి. మొత్తం 55 చోట్ల దాడులు సాగినట్టు ఐటీ వర్గాలు ప్రకటించాయి. అయితే, మంత్రి విజయభాస్కర్, ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి ఇళ్లల్లో మాత్రం తనిఖీలు రాత్రంతా సాగాయి. పుదుకోట్టై జిల్లాలో ఉన్న మంత్రి కుటుంబీకులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో 22 గంటలపాటు సాగిన దాడుల్లో కీలక రికార్డులు, దస్తావేజులు బయట పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, మంత్రి తండ్రి చిన్నతంబి ఇంట్లో ఏకంగా ఓ గదిని అధికారులు సీజ్ చేసి ఉండడం చర్చకు దారి తీసింది. అందులో ఏముందో అని పెదవి విప్పే వారే అధికం. ఇక మంత్రి క్వారీల్లోనూ కీలక రికార్డులు బయట పడ్డాయి. రూ. 5.5 కోట్ల నగదు పట్టుబడ్డట్టు, ఇది మంత్రికి సంబంధించిన నగదుగా తేలినట్టు సమాచారం. తండ్రి చిన్నతంబి, సోదరుడు ఉదయభాస్కర్లతో ఐటీ వర్గాలు రెండు గంటల పాటు జరిపిన విచారణలో పలు ప్రశ్నల్ని సంధించారు. అందులో కొన్నింటికి సమాధానాలు మంత్రి ఆడిటర్ జయరామన్ ద్వారా ఇచ్చారు. తమ వద్ద అన్నింటికీ లెక్కలు ఉన్నట్టు మంత్రి తండ్రి, సోదరుడు స్పష్టం చేసినా, ఐటీ వర్గాలు మాత్రం తీవ్ర పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. అవసరం అయితే, మంత్రిని విచారణకు పిలిపించేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను సమన్ల జారీకి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మంత్రి మెడకు ఐటీ దాడుల ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, నల్లధనం కేసులో పట్టుబడ్డ శేఖర్‌రెడ్డితో మంత్రికి సంబంధాలు ఉన్నట్టు ఐటీ విచారణలో తేలినట్టు సమాచారం. మంత్రికి సంబంధించిన క్వారీల ద్వారా శేఖర్‌రెడ్డికి చెందిన, సన్నిహిత క్వారీల మధ్య లావాదేవిలు సాగినట్టు , ఇందుకు తగ్గ కీలక రికార్డులు, ఆధారాలు ఐటీ వర్గాల చేతిలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ దృష్ట్యా, మంత్రి తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించే వాళ్లు పెరుగుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ సైతం తెర మీదకు రావడం గమనార్హం. -
ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు..?
చెన్నై: తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు.. వెతికినకొద్దీ పట్టుబడుతున్న డబ్బు సంచులు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో హద్దులేని విధంగా సాగుతోన్న అధికార పార్టీ ఆగడాలకు ఎన్నికల సంఘం ముకుతాడు వేయనుందా? ఏకంగా ఉప ఎన్నికనే రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనరగ్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. అధికార పార్టీలోని శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలతోపాటు ప్రతిపక్ష డీఎంకే సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ఈ మూడు పక్షాలేకాక ఆర్కే నగర్ నుంచి ఈసారి ఏకంగా 62 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలు భారీ ప్రణాళికలు రచించాయి. అధికార పార్టీ ఏఐడీఎంకే ఏకంగా మంత్రులను, సినీ నటులను రంగంలోకిదింపి కోట్లాది రూపాయలను సరఫరాచేస్తోంది. గురు, శుక్రవారాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. (ఐటీ హడల్: మంత్రి, నటుడి నివాసాల్లో సోదాలు) ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై పలు పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం, ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మరి కొద్ది గంటల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. (ఆర్కేనగర్ రేసులో 62 మంది) -
ఓటర్లకు 80 కోట్ల పంపిణీ?
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటేనే నిధుల వరద పొంగుతుంటుంది. అదే ఉప ఎన్నికలైతే మరికాస్త ఎక్కువ ఉండచ్చు. కానీ తమిళనాడులో ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం డబ్బులు వరద కాదు ఉప్పెనలా పొంగుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ. 10 నుంచి 15 వేల వరకు ఇస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు అక్కడ ఏకంగా 80 కోట్ల రూపాయలను కేవలం నగదు రూపంలోనే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. శశికళ వర్గం తరఫున టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం క్యాంపు నుంచి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. ఇలా పలువురు హై ప్రొఫైల్ నాయకులు బరిలో ఉండటం, ఈ స్థానాన్ని అందరూ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోడానికి అందరూ చాలా ‘గట్టి’గానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద, పలు ప్రాంతాల్లోను జరిగిన ఆదాయపన్ను శాఖ దాడులలో ఇందుకు సంబంధించిన ఆధారాలు బాగానే దొరికాయని అంటున్నారు. కేవలం ఒక్క దినకరన్ వర్గీయులే ఆర్కే నగర్ ఓటర్లకు రూ. 80 కోట్లు పంచారనడానికి తమకు పక్కా ఆధారాలు దొరికరాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇతర పార్టీలన్నీ కూడా కలుపుకొంటే ఎంత లేదన్నా కేవలం డబ్బు రూపంలోనే ఓటర్లకు దాదాపు రూ. 200–300 కోట్ల వరకు ముట్టాయని అనుకోవాల్సి ఉంటుంది. వీడియో బయటపడిన తర్వాతేనా.. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొట్టింది. అందులో ఒక వ్యక్తి కొంతమందికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తూ.. తప్పనిసరిగా టీటీవీ దినకరన్‌కే ఓటేయాలని వాళ్లను కోరుతుంటాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి ఇంటి మీద, నటుడు శరత్‌కుమార్ ఇంటి మీద దాడులు చేశారని అంటున్నారు. -
ఐటీ హడల్
► ఆర్కేనగర్ ఎన్నికలే నేపథ్యం ► వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే లక్ష్యం ► అధికార పార్టీలో కలవరం ► సుమారు రూ.50 కోట్లు స్వాధీనం? అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలంతా ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచా రంలో బిజీ బిజీ. ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తు వేయడం ఎలా, చిత్తు చేయడం ఎలా అనే ఏకైక అజెండాతో రేయింబ వళ్లు తలమునకలు. ఈనెల 12వ తేదీన పోలింగ్, ప్రచారానానికి ఇక నాలుగు రోజులే (10వ తేదీ) గడువు. తెల్లారగానే ప్రచారానికి మళ్లీ పరుగులు పెట్టేందుకు అందరూ సన్నద్ధం. అయితే అధికార పార్టీ నేతలకు శుక్రవారం ప్రశాంతంగా తెల్లారలేదు. నిద్ర నుంచి కళ్లు తెరిచేలోగా ఆదాయ పన్నుశాఖ అధికారులు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి తలుపు తెరిచారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి అధికార పార్టీ నేతలను హడలెత్తించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సహజం. అయితే చెన్నై ఆర్కేనగర్లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు సైతం సహజంగా ప్రారంభమై సంచలనానికి దారితీశాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలే ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో నిలవడంతో అన్నాడీఎంకే అమ్మ పార్టీ (స్వతంత్ర) అభ్యర్థి దినకరన్ (అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి) ధన ప్రవాహానికి పాల్పడుతున్నట్లు కొన్నిరోజులుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు పంచుతున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో తరచూ నగదు పట్టుబడుతూనే ఉంది. దినకరన్ మనుషులు నగదు పంచుతున్నట్లు ఒక వాట్సాప్ వీడియో కూడా సెల్‌ఫోన్ లలో హల్చల్ చేసింది. ఓటుకు నోటు చలామణి జరుగుతున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఐటీ అధికారులను ఆర్కేనగర్కు నియమించారు. ఈ సమయంలోనే ఆర్కేనగర్లో నగదు పంపిణీ బాధ్యతను దినకరన్ వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌కు అప్పగించినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అంతే ఇక ఎంతమాత్రం ఆలస్యం తగదని శుక్రవారం ఉదయం సుమారు వంద మంది అధికారులు ఒక్కసారిగా విరుచుకుబడ్డారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఉదయం 6 గంటల సమయంలో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలే ప్రధాన లక్ష్యంగా దాడులు ప్రారంభించారు. మంత్రికి చెందిన చెన్నై, తిరుచ్చిరాపల్లి, పుదుక్కోట్టై తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, విద్యాసంస్థలు, క్వారీ కార్యాలయాల్లో దాడులు చేశారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులో నివసించే ప్రభుత్వ బంగ్లాపై ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. సాయుధ పారామిలటరీ దళాలను బందోబస్తుగా పెట్టుకుని సుమారు పది మంది అధికారులు మంత్రి నివాసంలోకి ప్రవేశించినపుడుఆయన నిద్రపోతున్నారు. ఐటీ అధికారులు ఆయనను నిద్రలేపి తనిఖీలకు వచ్చాం, సహకరించండి అంటూ ఇంటి ద్వారాలు, కిటికీలు మూసివేసి టెలిఫోన్ కనెక్షన్ తొలగించారు. సెల్ఫోన్లను స్విచ్ఆఫ్ చేయాల్సిందిగా ఆదేశించారు. చెన్నై చేపాక్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మంత్రి విజయభాస్కర్ నివాసం నుంచి రూ.1.80 కోట్లు, ఎగ్మూరులోని ఒక లాడీ్జలో మంత్రి విజయభాస్కర్ అనుచరులు అద్దెకు దిగిన మూడు గదుల నుంచి అర్కేనగర్‌లో ఓటర్లకు రూ.120 కోట్లు పంచినట్లుగా ఉన్న ఆధారాలు అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. నైనార్ అనే మంత్రి సహచరుడు ఇంటి నుంచి రూ.1.20 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. కీల్పాక్కంలోని మంత్రి సోదరి ఇంటిపై కూడా దాడుల జరిపారు. కేవలం మంత్రికి సంబంధించే 21 చోట్ల దాడులు నిర్వహించారు. తమిళనాడు చరిత్రలో ఒక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు జరగడం ఇదే ప్రప్రథమమని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై కొట్టవాక్కంలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయంపై కూడా దాడులు చేశారు. ఆర్కేనగర్ అభ్యర్థి దినకరన్ కు గురువారమే శరత్‌కుమార్ మద్దతు ప్రకటించగా శుక్రవారం దాడులు జరగడం గమనార్హం. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గీతాలక్ష్మి నివసించే చెన్నై విరుగంబాక్కంలోని ఆమె నివాసం, గిండీలోని వర్సిటీలో వీసీ చాంబర్లోనూ తనిఖీలు చేశారు, మాజీ ఎంపీ రాజేంద్రన్ కి చెందిన చెన్నైలోని ఇళ్లు, కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించారు. రాష్ట్రం మొత్తం మీద వంద మంది అధికారులు బృందాలుగా ఏర్పడిత 35 చోట్ల ఐటీ దాడుల సందర్భంగా చెన్నైలో 21, పుదుక్కోట్టైలో 11, తిరుచ్చిలో 2, నామక్కల్‌లో ఒక చోట తనిఖీలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో నగదు బట్వాడా జరిగినట్లు ఐటీ దాడుల్లో తేలడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దు కాగలవని కొందరు అంచనా వేస్తున్నారు. హద్దుమీరిన ఐటీ అధికారులు: మంత్రి విజయభాస్కర్ ఐటీ దాడులు సమయంలో అధికారులు హద్దుమీరి ప్రవర్తించారు. కనీసం నా కుమార్తెను స్కూలుకు కూడా పంపకుండా చేశారు. ఐటీ దాడుల్లో మా ఇంటి నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేదు. ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉంది. పథకం ప్రకారం దాడులు: దినకరన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకం ప్రకారం దాడులు జరిపారు. ఈ దాడుల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై హస్తం ఉంది. ఐటీ దాడుల వల్ల ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: డీఎంకే స్టాలిన్ మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు రాష్ట్ర రాజకీయాలకే అవమానం. సీఎం వెంటనే అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలి. ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం ఉందని తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించగా, ఐటీ దాడులు హర్షణీయమని, అయితే దాడులకు కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై అన్నారు -
తమిళ రాజకీయల్లో తెలుగు పార్టీ
-
తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
-
తమిళ పార్టీల విపరీత పోకడలు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తమిళ పార్టీలు విపరీత పోకడలకు పోతున్నాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ(పన్నీర్ సెల్వం వర్గం) విపరీత ప్రచారానికి దిగింది. జయలలిత శవపేటిక నమూనాతో ఓట్లు అభ్యర్థించడం మొదలు పెట్టింది. 'అమ్మ' ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు విపరీత ప్రచారానికి దిగింది. జయలలిత చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం వీధి పోరాటాలకు దిగడంతో అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలింది. శశికళ జైలుకు వెళ్లగా, పన్నీర్ సెల్వం పదవి కోల్పోయి మాజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శశికళ వర్గం నాయకులు డబ్బులు పంచుతూ ఇప్పటికే పట్టుబడ్డారు. మరోవైపు ఆర్కే నగర్ లో పాగా వేయడం ద్వారా సత్తా చాటాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుదలతో ఉంది. -
తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శరత్ కుమార్.. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు ఆయన అండగా నిలిచారు. గురువారం దినకరన్ ను కలిసి సంఘీభావం తెలిపారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ(పన్నీర్ సెల్వం వర్గం) అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీపా జయకుమార్, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు ఆర్కేనగర్ లో పోటీ చేస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే మద్దతుదారుగా ఉన్న శరత్ కుమార్ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. డీఎంకే-తమిళ మాలిన కాంగ్రెస్ కూటమికి తర్వాత మద్దతు ప్రకటించారు. 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించారు. పెద్దగా రాణించకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు క్రమంగా దూరమయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు త్వరలో తన శిబిరంలోకి వచ్చి తీరుతారన్న ఆశల పల్లకిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఉన్నారు. శశికళ కుటుంబ జోక్యం కారణంగానే అన్నాడీఎంకేలో చీలిక అనివార్యం అయిందని సమర్థించుకున్నారు. అమ్మ మరణంలో మిస్టరీపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడే ఉన్నట్టు చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీరుసెల్వం. అధి కారం దూరమైనా, పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో పార్టీవర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుని బలాన్ని చాటుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారబిజీలో ఉన్న మాజీ సీఎం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ శిబిరం నేత ఓ.పన్నీరుసెల్వం మీడియాకు ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ మేరకు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఆశాభావాల్ని, ధీమా వ్యక్తం చేస్తూ, తాను గతంలో చేసిన వాఖ్యలకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. 122 మంది వస్తారు అసెంబ్లీ వేదికగా బలపరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, బలవంతంగా బంధించి మద్దతు కూడగట్టుకున్నారని ఆరోపించారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మేరకు వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాల నాటికి తేలుతుందన్నారు. ఎన్నికల అనంతరం ఆ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదికగా అన్నాడీఎంకే మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాత్కాలికమేనని జోస్యం చెప్పారు. ఆ కుటుంబ జోక్యంతో చీలిక దివంగత సీఎం ఎంజీఆర్ ఎన్నడూ పార్టీలో తన కుటుంబీకుల జోక్యానికి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అమ్మ జయలలిత కూడా అదే తరహాలో ముందుకు సాగారని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు అమ్మ వ్యతిరేకం అని, అమ్మ మరణంతో శశికళ కుటుంబం జోక్యం పెరగడంతోనే చీలిక అనివార్యం అయిందని చెప్పారు. ఆ కుటుంబ జోక్యాన్ని ఎన్నడూ అమ్మ అనుమతించలేదని, అమ్మ లేని దృష్ట్యా, ఇష్టారాజ్యంగా ఆ కుటుంబం వ్యవహరిస్తూ పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఆ కుటుంబ జోక్యం లేకుండా ఉండి ఉంటే, అందరం ఒకే వేదికగా కలిసి ఉండే వాళ్లమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని సాగనంపి, మళ్లీ అందరూ ఒకే వేదికగా ముందుకు సాగే సమయం తప్పకుండా వస్తుందన్న నమ్మకం తనలో ఉందన్నారు. ఇందుకు ప్రజలు అండగా నిలబడాలని, ప్రజా మద్దతుతో అన్నాడీఎంకే వైభవాన్ని చాటుతామని, కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని మళ్లీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కట్టుబడే ఉన్నా అమ్మ మరణంలో అనుమానాలు తేలాలంటే విచారణ కమిషన్‌ను నియమించాల్సిందేనని పన్నీరుసెల్వం డిమాండ్ చేశారు. తాను ఇందుకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. అమ్మను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అధికారులు కొందరు ఆమెతో భేటీ అయ్యారని వివరించారు. కావేరి జలాల సమస్యపై సాగిన ఈ భేటికి తాను వెళ్లలేదని చెప్పారు. ఆ సమావేశానికి వెళ్లిన అధికారులతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. అమ్మ స్వయంగా కావేరి నివేదిక విషయంగా పలు మార్పులు చేర్పులు, సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే, ఆ మరుసటి రోజే అమ్మ అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రకటించడంతోనే అనుమానాలు కలిగాయని చెప్పారు. అందుకే అనుమానాల నివృత్తి లక్ష్యంగా విచారణ కమిషన్‌కు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్
-
అధికారంలోకి వస్తే మిస్టరీ ఛేదిస్తాం
♦ శశికళ, పన్నీరుపై విచారణ కమిషన్ ♦జయలలిత మరణంపై స్టాలిన్ వ్యాఖ్య ♦జాలర్లతో సమావేశం సాక్షి, చెన్నై : తాము అధికారంలోకి రాగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటామని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శశికళ, పన్నీరుసెల్వంపై విచారణ కమిషన్ వేస్తామని ప్రకటించారు. ఆర్కేనగర్లో జాలర్ల సమస్యలపై జరిగిన సమావేశానికి స్టాలిన్ హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనకు.. మనమే నినాదంతో స్టాలిన్ రాష్ట్ర పర్యటన సాగించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆ పర్యటనలో ముందుకు సాగారు. ఈ పర్యటనకు అమిత స్పందన రావడంతో ప్రస్తుతం మళ్లీ అన్ని వర్గాల సమస్యల అధ్యయనం మీద స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్కేనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో జాలర్లతో ఆయన సమావేశం అయ్యారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు, జాలర్ల కుటుంబాలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. తమ సమస్యలను స్టాలిన్‌కు వివరించారు. సాగరంలో సాగుతున్న దాడులను, తమకు కరువు అవుతోన్న భద్రతను ఏకరువు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు. ఈసందర్భంగా స్టాలిన్ తన ప్రసంగంలో జాలర్ల సంక్షేమం లక్ష్యంగా గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. నిఘా పెంచాలి : ఆర్కేనగర్లో ఎన్నికల యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఫిర్యాదుల్ని తక్షణం పరిశీలించి చర్యలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెండాకుల గుర్తు తన రూపంలో అన్నాడీఎంకేకు దురమైనట్టు టీటీవీ దినకరన్ చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించ దలచుకోలేదన్నారు. ఇలాంటి వారిపై విమర్శలు గుప్పించి తన స్థాయిని దిగజార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు. జల్లికట్టు మద్దతు ఉద్యమకారుల్ని అణచి వేయడానికి పోలీసులు సాగించిన తీరు సర్వత్రా ఖండించ దగ్గ విషయమేనని స్పందించారు. ఆ సమయంలో విద్యార్థుల్ని పోలీసుల నుంచి రక్షించేందుకు అండగా నిలిచింది జాలర్ల కుటుంబాలకు చెందిన తల్లులేనని అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని ఓ పన్నీరుసెల్వం, ఇప్పుడు స్పందిస్తున్న తీరు హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, డీఎంకే అధికార పగ్గాలు చేపట్టగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు తగ్గ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శశికళ, పన్నీరు సెల్వంSపై విచారణ కమిషన్ వేస్తామని, న్యాయ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్
జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలు బాగా వేడెక్కాయి. శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం వైపు నుంచి కురువృద్ధుడు మధుసూదనన్, ఇంకా దీపా జయకుమార్, బీజేపీ, డీఎండీకే.. ఇలా బహుముఖ పోటీతో అక్కడ రాజకీయాలు మంచి రంజుగా ఉన్నాయి. రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విపరీతంగా పోరాడాయి. దాంతో దాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఒకరికి టోపీ, మరొకరికి కరెంటు స్తంభం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, శశికళ వర్గం మాత్రం సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేస్తోందట. ఈ విషయం తెలిసి ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. పార్టీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి వెంటనే రెండాకుల గుర్తును తీసేయాలని ఆదేశించింది. అలాగే, అన్నాడీఎంకే పేరు, గుర్తును ఉపయోగించకూడదని తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ అందుకు గురువారం ఉదయం వరకు సమయం ఇచ్చింది. ఇలా అన్నా డీఎంకే గుర్తును ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం ఐపీసీ 171జి సెక్షన్ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలలోను, పార్టీ వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి చోట్ల వాడటాన్ని వెంటనే ఆపేయాలని తెలిపింది. ఈనెల 9వ తేదీన ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో శశికళ వర్గానికి టోపీ, పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తులు వచ్చాయి. -
రైతులను పట్టించుకోకుండా ఉప ఎన్నికల గోలేంటి?
-
ఆర్కేనగర్లో చిన్నమ్మ వర్గానికి చేదు అనుభవం
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆర్కే నగర్లో శశికళ వర్గానికి చెందిన సీఆర్ సరస్వతి ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. దినకరన్‌కు మద్దతుగా సరస్వతి ప్రచారం చేశారు. ఈ నెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది బరిలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. -
రైతులను పట్టించుకోకుండా.. ఉప ఎన్నికల గోలేంటి?
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వైపు తమిళనాడు రైతులు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి నిరసనలు తెలియజేస్తుంటే.. వాళ్ల విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి ఆర్కే నగర్ ఉప ఎన్నికలలో బిజీ బిజీగా గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న తమిళ రైతులను సీపీఐ నాయకుడు రాజాతో కలిసి ఆయన పరామర్శించారు. ఆ రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా దాదాపు మూడోవంతు పొలాల్లో వరి నాట్లు వేయలేదు. రాష్ట్రానికి కనీసం 40 వేల కోట్ల రూపాయల కరువు సహాయ నిధి మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయని స్టాలిన్ విమర్శించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే ఢిల్లీ వచ్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించాల్సింది పోయి ఉప ఎన్నికల పేరు చెప్పి హడావుడి చేస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి రైతులను కలిసిన ఒక్కరోజు తర్వాత స్టాలిన్ రావడం గమనార్హం. -
అమ్మ నియోజకవర్గంలో ఈసీ రికార్డు
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లకు భారీగా డబ్బు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈసీ ఏకంగా ఐదుగురు పరిశీలకులను నియమించింది. దేశ ఎన్నికల చరిత్రలో ఓ స్థానానికి ఇంతమంది పరిశీలకులను నియమించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఇదివరకే ముగ్గురు పరిశీలకులను నియమించింది. కాగా ఓటర్లకు పెద్ద ఎత్తును డబ్బు పంచుతున్నారని డీఎంకే, సీపీఎం తదితర పార్టీలు ఫిర్యాదు చేయడంతో.. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఈసీ మరో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డబ్బు పంపణీకి సంబంధిన ఫిర్యాదులను పరిశీలించేందుకు 12 మందికిపైగా ఆదాయ పన్ను శాఖ అధికారులను ఈసీ నియమించింది. ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఎన్నికలు జరిగే మొత్తం 256 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక 25 ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించనున్నారు. -
ఎమీకి రాజకీయ రంగు!
నటి ఎమీజాక్సన్‌కు రాజకీయరంగుపులమనున్నారా? అలాంటి పరిస్థితి కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.రాజకీయ వర్గాలు సినీ గ్లామర్‌ను వాడుకోవడం ఇవాళ కొత్తేమీ కాదు. అలాగే సినిమా వాళ్లకు రాజకీయ రంగు అనాధిగా పడుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ రాజకీయాలు ఇటీవల కన్ను మూసిన జయలలిత వరకూ సినిమా వారి చుట్టూనే తిరిగాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నియోజక స్థానాన్ని భర్తీ చేయడానికి సినీ గ్లామర్ అవసరంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. అన్నాడీఎంకే రెండు పార్టీలుగా చీలిపోయి ఆర్కే.నగర్లో పోటీ చేస్తూ గెలుపు కోసం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అమ్మ అన్నాడీఎంకే తరఫున టీటీవీ.దినకరన్ బరిలో ఉన్నారు.ఈ స్థానాన్ని ఎలాగైనా సాధించాలన్నదే ధ్యేయంగా పోటీలో ఉన్న అన్ని పార్టీలు పరితపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అన్నాడీఎంకే పార్టీ తరఫున ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్‌ను ప్రచారానికి వాడుకోవాలని ఆ పార్టీ వర్గాలు భావించినట్లు, అందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు టాక్. ఎందరో సినీ ప్రముఖులుండగా నటి ఎమీపైనే వీరి కన్ను పడడానికి కారణం లేకపోలేదు. ఈ అమ్మడు మదరాసు పట్టణం చిత్రం ద్వారా నటిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విషయం తెలిసిందే. అందులో ఆమె చాలా వరకూ టోపీ పెట్టుకునే అందంగా కనిపించింది. ఇక అమ్మ అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు టోపీ అన్నది తెలిసిందే. దీంతో అలాంటి గోపీని పెట్టుకుని నటి ఎమీజాక్సన్‌ను తమ పార్టీ తరుఫున ప్రచారం చేయవలసిందిగా ఎమీజాక్సన్‌ను కోరినట్లు, అందుకు ఈ బ్యూటీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అన్నది ఎమీ ప్రచారానికి బయలుదేరే వరకూ వేచి ఉండాల్సిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో మెరవనున్న ఈ జాణ ప్రస్తుతం కాళీగానే ఉందన్నది గమనార్హం. -
పన్నీర్‌సెల్వం వర్గంపై ఈసీకి ఫిర్యాదు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే నిప్పు ఉప్పుగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పన్నీర్ సెల్వం వర్గంపై శశికళ గ్రూప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ పోల్ గుర్తును పన్నీర్ వర్గం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. రెండు ఆకుల గుర్తుగా ప్రచారం చేస్తున్నారని గురువారం ఈసీకి ఫిర్యాదు చేసింది. సెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి వీడియో పుటేజ్‌ను కూడా సమర్పించింది. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చేనెల 12న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. బహుముఖ సమరంగా సాగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్ర కుస్తీలే పడుతున్నారు. బరిలో 62మంది ఉన్నా, ప్రధాన సమరం మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే అమ్మ, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ మధ్య సాగుతున్నదని చెప్పవచ్చు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పురట్చితలైవి అమ్మ అభ్యర్థి మధుసూదనన్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులతో కలిసి ప్రజాకర్షణ ప్రచారంలో ఉన్నారు. -
ఆర్కేనగర్ రేసులో 62 మంది
►ఈవీఎంలతో ఓటింగ్ ►పది కంపెనీల పారా మిలటరీ ►ఆర్కేనగర్లో ప్రచార హోరు ►పన్నీరు, దీప శ్రీకారం ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు నిలిచారు. బహుముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. భద్రత నిమిత్తం పది కంపెనీల పారా మిలటరీ రంగంలోకి దిగనుంది. ఓట్ల వేటలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, జయలలిత మేన కోడలు దీప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. అన్నాదీఎంకేలో ఏర్పడ్డ చీలికల పుణ్యమా ఈ సారి ఆ పార్టీ గుర్తు రెండాకుల్ని ఎన్నికల యంత్రాంగం సీజ్ చేయక తప్పలేదు. అన్నాడీఎంకే గుర్తు లేని ఎన్నికలుగా సాగుతున్న సమరంలో గెలుపు కోసం తీవ్ర కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఎన్నికల బరిలో నిలబడేందుకు 127 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఓటింగ్ బ్యాలెట్ ద్వారా జరపక తప్పదన్న ప్రశ్న బయల్దేరింది. అయితే, పరిశీలన, ఉప సంహరణ పర్వాలతో సోమవారం నాటికి చివరకు రేసులో 62 మంది నిలిచారు. రేసులో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రకటించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంది.రేసులో 62 మంది:డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. డీఎంకే అభ్యర్థి ఓట్లు చీల్చే దిశగా గణేష్ పేరు వచ్చే రీతిలో పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం. తుది జాబితా ప్రకటనతో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టింది. 63 మందికి పైగా అభ్యర్థులు రేసులో ఉంటే బ్యాలెట్ నిర్వహించాల్సి ఉంటుందని తొలుత నిర్ణయించారు. అయితే, సంఖ్య ప్రస్తుతం 62కు పరిమితం కావడం, నోటా చిహ్నం ఒకటిని కలుపుకుంటూ, ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగు ఈవీఎంలను ఉపయోగించేందుకు తగ్గ చర్యల్లో అధికార వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నగదు బట్వాడా అడ్డుకట్ట, మద్యం తదితర తాయిలాల పంపిణీని అడ్డుకునే విధంగా తనిఖీల ముమ్మరం అయ్యాయి. పది కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలు ఒకటి రెండు రోజుల్లో చెన్నైకు రానున్నాయి. తనకు వయసు లేదన్న కారణంతో నామినేషన్ తిరస్కరించినట్టు ఎన్నికల యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వయసు 23 సంవత్సరాలు అని, అయితే, తనకు 25 సంవత్సరాలు రాలేదన్న ఒక్క కారణంతో నామినేషన్ తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైన ఆర్కేనగర్కు చెందిన సౌమ్య పిటిషన్లో వివరించారు. ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు, అదే ఎన్నికల్లో నిలబడేందుకు వయస్సు 25గా నిర్ణయించడం ఏమిటోనని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన తమకు అన్ని హక్కులు ఉన్నప్పుడు, ఎన్నికల్లో మాత్రం నిలబడే హక్కు ఎందు లేదని సౌమ్య ప్రశ్నించడం గమనార్హం. ప్రచారంలో నేతలు: మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. టీటీవీ దినకరన్ సైతం ప్రచారంలో ఉరకలు తీశారు. సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులతో కలిసి ఏకంగా ఆర్కేనగర్కు ఓ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ జయలలిత మేనకోడలు దీప ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ అభ్యర్థికి మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రచారం రద్దు కాగా, ఆయన స్థానంలో ప్రేమలత విజయకాంత్ ఓటర్ల వద్దకు బయల్దేరారు. బీజేపీ అభ్యర్థి గంగై అమరన్కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ప్రచారం నిర్వహించారు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆయనకు మద్దతుగా మంగళవారం ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రచారం చేపట్టనున్నారు. దీపకు పడవ: ఎంజీయార్, అమ్మ, దీప పేరవై అభ్యర్థి, జయలలిత మేన కోడలు దీపకు ఎన్నికల యంత్రాంగం పడవ చిహ్నంగా కేటాయించింది. ఆర్కేనగర్ రేసులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీప ప్రచార పయనానికి శ్రీకారం చుట్టారు. ఆమెకు పడవ చిహ్నం రావడంతో అందుకు తగ్గ ప్లకార్డులను చేత బట్టి మద్దతుదారులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
చిన్నమ్మ చిర్రుబుర్రు
► ‘రెండాకులు’ చేజారినందుకు ఆగ్రహం ►టోపీ చిహ్నం సిగ్గుసిగ్గు ► దినకరన్‌కు చీవాట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ చేతుల్లో ఉంది...పరువు పోయింది, రెండాకులు రాలిపోగా చివరకు ‘టోపీ’ మిగిలింది’ అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లోలోన మదనపడుతున్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇదా నీ నిర్వాకం అంటూ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. జయలలిత రాజకీయ జీవితంలో 32 ఏళ్లపాటు వెన్నంటి నడిచి, నమ్మకంగా నిలిచిన ఫలితంగా అన్నాడీఎంకే చిన్నమ్మ చేతుల్లోకి వచ్చింది. అయితే నిండా నెలరోజులు కాకమునుపే సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆమె మోజు తీరకుండానే అక్రమ ఆస్తుల కేసులో జైలుపాలయ్యారు. నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని బైటకు వచ్చిన తరువాత పార్టీని జాగ్రత్తగా తన చేతుల్లో పెట్టే నమ్మకమైన వ్యక్తి కోసం చిన్నమ్మ సాగించిన అన్వేషణలో ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ మెలిగారు. పార్టీతోపాటు పదవి సైతం ఇచ్చినపుడే పెత్తనం సాధ్యమనే వ్యూహంతో దినకరన్‌కు దాదాపు తనతో సమానమైన హోదాగా ఉప ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక తన స్థానంలో నమ్మకస్థుడైన వ్యక్తిని సిద్ధం చేసుకున్నామన్న ధీమాతో చిన్నమ్మ జైలు జీవితాన్ని ప్రారంభించారు. దినకరన్‌కు సవాళ్లు: అయితే చిన్నమ్మ జైలు కెళ్లిన తరువాతనే దినకరన్‌కు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. ఎడపాడిని సీఎం చేయడం, విశ్వాస పరీక్షలో నెగ్గేలా ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించడం, ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోని విశ్వాసపరీక్షలో ఎడపాడిని నెగ్గించడం వరకు చకచకా సాగిపోయాయి. అయితే అర్కేనగర్‌లో ఉప ఎన్నికలు దినకరన్‌కు పెనుసవాళ్లు విసిరాయి. రెండాకుల చిహ్నంకై శశికళ, పన్నీర్ వర్గాలు పోటీపడ్డాయి. ఎన్నికల కమిషన్ వద్ద వాదోపవాదాలు వినిపించాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నందున రెండాకుల చిహ్నం తమకే దక్కాలని శశికళ వర్గం ఈసీ వద్ద మొరపెట్టుకుంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లనపుడు రెండాకుల గుర్తుకు వారు ఎలా అర్హులని పన్నీర్ వర్గం వాదించింది. రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ ఎవ్వరికీ చెందకుండా చేయడంతోపాటు అన్నాడీఎంకే తరఫున పోటీచేయరాదని ఆంక్షలు విధించింది. దీంతో దినకరన్ ‘అన్నాడీఎంకే అమ్మ’ అనే పార్టీని స్థాపించి ఒక స్వతంత్య్ర అభ్యర్థిగా టోపీ గుర్తుపై పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. శశికళ శిబిరం వెల వెల: ఎంజీఆర్ స్థాపించి, జయలలిత నడిపించిన పార్టీ అనే అనందం అదృశ్యమైపోగా శశికళ శిబిరం వెలవెల పోయింది. రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పరిణామంతో ఇరువర్గాలు హతాశులైనా శశికళ వర్గాన్ని ఎక్కువగా బాధించింది. ఎంతో కష్టపడి స్వాధీనం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కూడా లేకుండా ఆర్కేనగర్ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి దాపురించడాన్ని శశికళ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో పోటీచేయవద్దని చెప్పినా వినలేదు, ఇపుడు రెండాకుల చిహ్నం లేకుండా పోటీకి దిగి ఓటమి పాలైతే పన్నీర్‌వర్గం దీన్ని పరాభవంగా పరిగణించగలదని ఆమె వాపోతున్నారు. ఇళవరసి కుమారుడు వివేక్ శుక్రవారం బెంగళూరు జైలుకెళ్లి శశికళను కలుసకున్నపుడు.. రెండాకుల చిహ్నం స్థానంలో టోపీ గుర్తును ఎన్నుకోవడం నలుగురిలో ఎద్దేవాగా మారిందని దినకరన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపడం ప్రారంభించగానే అప్రమత్తమై సరైన గుర్తును సిద్ధం చేసుకోవడంలో దినకరన్ విఫలమయ్యాడని ఆమె కోప్పడుతున్నారు. రెండాకుల చిహ్నం చూపిన చేతితో టోపీని సర్దుకోగలమని ఆమె రుసరుసలాడుతున్నారు. రెండాకుల చిహ్నం లేకున్నా రెండు లైట్లను ఎన్నుకోవడం ద్వారా పన్నీర్‌సెల్వం రాజకీయ పరిణితిని ప్రదర్శించారని వివేక్‌తో శశికళ వ్యాఖ్యానించారు. అంతేగాక జైల్లో నుంచే ఫోన్ ద్వారా దినకరన్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. పైగా చిహ్నం ఎంపికలో చిన్నమ్మ సలహాను తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంపై కూడా నిలదీసిçనట్లు తెలుస్తోంది. ప్రజలకు ‘టోపీ’ పెట్టేందుకు వస్తున్నారని ప్రచారాల్లో గేలి చేస్తే గెలుపు ఎలా సాధ్యమని ఆమె తిట్టి పోశారు. -
చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్‌పై బదిలీ వేటు
చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్‌పై మరోసారి బదిలీ వేటు పడింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ కమిషనర్ జార్జ్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే పార్టీ అరాచకాలు చేసే అవకాశం ఉందని, వారి ఆటలు సాగకుండా ఉండాలంటే వెంటనే చెన్నై నగర పోలీసు కమిషన్ జార్జ్ ను వేరే ప్రాంతానికి బదిలీ చెయ్యాలని డీఎంకే డిమాండ్ చేసింది.దీంతో ఎన్నికల కమిషన్ ...పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీబీసీఐడీ అడిషనల్ డీజీపీ కరణ్ సిన్హాను నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించలింది. వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుంది. కాగా గతంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా జార్జ్‌ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించారు. జార్జ్‌ను జైళ్ల శాఖకు పంపించారు. నెల రోజులకు పైగా త్రిపాఠి చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. అనంతరం జార్జ్ తిరిగి చెన్నై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరోసారి ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈసీ మళ్లీ జార్జ్‌పై బదిలీ వేటు వేసింది. -
జయలలిత మేనకోడలు దీప ఆస్తులివే
చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తనకు మొత్తం 3.05 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్టు ప్రకటించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, రూ. 1.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. గురువారం ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన దీప.. అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. 2016-17 వార్షిక ఏడాదికి గాను తనకు రూ. 5.37 లక్షలు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. గతేడాది రూ. 17.50 లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని దీప అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకులకు రూ. 6.15 లక్షలు లోన్ చెల్లించాల్సివుందని, మరో ముగ్గురి నుంచి రూ. 70.65 లక్షలు అప్పు తీసుకున్నానని తెలిపారు. 2016లో 50,390 రూపాయలు వెచ్చించి ఓ స్కూటర్ కొన్నానని వెల్లడించింది. తనకు 23.80 లక్షల రూపాయల విలువైన 821 గ్రాముల బంగారం, రూ. 1.72 లక్షల విలువైన వెండి, రూ. 4 లక్షల విలువైన 20 కేరట్ వజ్రాలు ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ. 3.50 లక్షల నగదు ఉందని, బ్యాంకులో రూ. 1.77 లక్షలు సేవింగ్ డిపాజిట్లు ఉన్నట్టు దీప వెల్లడించారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత నెలలో ఎంజీఆర్ అమ్మ దీప పెరవయి రాజకీయ వేదికను ప్రారంభించిన ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. -
రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు
-
రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే అసెంబ్లీ నియోజక వర్గానికి ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే నుంచి శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు, డీఎంకే, దీప పేరవై, బీజేపీ, డీఎండీకే, సీపీఎం, నామ్ తమిళర్ కచ్చి తదితర పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పటివరకు 24 నామినేషన్లు దాఖలైయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్ మంగళవారం రజనీకాంత్ ను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అమరన్ కు రజనీకాంత్ మద్దతు ఇస్తారన్న ప్రచారం మొదలైంది. దీంతో రజనీకాంత్ స్వయంగా వివరణయిచ్చారు. ఆర్కే నగర్ లో ఉప ఎన్నికలో నామినేషన్ల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. -
మనసు మార్చుకున్న దీప భర్త మాధవన్
చెన్నై: రాజకీయాల్లో గందరగోళం ఎవరికైనా సహజమే. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పార్టీ ప్రారంభించినప్పటీ నుంచి అయోమయ పరిస్థితిలో ఉన్నారు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, మాధవన్ దంపతులు. అన్నాడీఎంకే నిర్వాహకుల బలవంతంపై జయలలిత అన్న కుమార్తె దీపా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్వాహకుల ఏర్పాటులో దీపా, మాధవన్‌ల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాధవన్ దీపాతో విడిపోయి ప్రత్యేక పార్టీని ప్రకటించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. దీపాకు, తనకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపారు. తామంటే గిట్టని వాళ్లు ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దీపాను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో పార్టీ ప్రారంభించినట్టు తెలిపారు. పార్టీ పేరు, ఆర్కేనగర్లో పోటీ చేయడం వంటి విషయాలపై కార్యకర్తలతో చర్చలు జరిపిన అనంతరం ప్రకటిస్తామని మాధవన్ తెలిపారు. నిన్న మాధవన్ జయలలిత సమాధి దర్శించుకుని అంజలి ఘటించారు. -
కంటైనర్లలో కోట్లు
సాక్షి,చెన్నై: రూ.రెండు వేల నోట్లతో కోట్లాది రూపాయలు కంటైనర్ల ద్వారా చెన్నై హార్బర్‌కు చేరిన సమాచారం ఉత్కంఠను రేపుతోంది. ఈ సమాచారంతో వందలాదిగా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడి లారీలు అక్కడే ఆగడంతో హార్బర్ తీరం వెంబడి కంటైనర్ లారీలు బారులు తీరాయి. ఈ తనిఖీలు పుణ్యమా ఎగుమతి దిగుమతులకు ఆటంకాలు నెలకొనడంతో వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి సముద్ర మార్గంలో రూ. రెండు వేల దొంగనోట్లను భారత్‌లోకి పంపించేందు కు ముష్కరులు ప్రయత్నాలు చేసి ఉండడం నిఘా వర్గాల దృష్టికి చేరింది. తమకు అందిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు దేశంలోని అన్ని హార్బర్లలో అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా చెన్నై హార్బర్లో రెండు రోజులుగా చడీ చప్పుడు కాకుండా కంటైనర్లలో తనిఖీల మీద కస్టమ్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. కోట్లాది రూపాయలు కంటైనర్లలో వచ్చి చేరినట్టుగా సమాచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ తప్పలేదు. తొలుత పదుల సంఖ్యలో అధికారులు తనిఖీల్లో నిమగ్నం కాగా, ఆదివారం వందలాదిగా ఉరకులు, పరుగులతో ఆ కంటైనర్లు చెన్నైకు వచ్చాయా అని తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలతో అనేక నౌకలు హార్బర్ తీరానికి కూత వేటు దూరంలో ఎగుమతి, దిగుమతుల నిమిత్తం వేచి ఉండాల్సిన పరిస్థితి. అలాగే, హార్బర్‌కు వివిధ ప్రాంతాల నుంచి సరకు లోడుతో వచ్చిన కంటైనర్ లారీలు, ఇక్కడ దిగుమతి అయ్యే వస్తువుల్ని బయలకు తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. హార్బర్ తీరం వెంబడి ఈ వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చెన్నై హార్బర్లో రెండు స్కానర్లు మాత్రమే ఉండడంతో, అన్ని కంటైనర్లను త్వరితగతిన తనిఖీలు చేసి బయటకు పంపడం అన్నది శ్రమతో కూడుకున్న పనిగా మారి ఉన్నది. హార్బర్లో పది వేల కంటైనర్ల ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, ఎగుమతి, దిగుమతుల్లో జాప్యం నెలకొనే కొద్ది వర్తకుల్లో ఆందోళన బయలు దేరింది. కొన్ని రకాల వస్తువులు త్వరితగతిన పాడై పోయేవి ఉండడంతో, వాటిని త్వరితగతిన బయటకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని హార్బర్ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తనిఖీల కారణంగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో, ఆగమేఘాలపై కస్టమ్స్ వర్గాలు చర్యల్ని వేగవంతం చేశాయి. హార్బర్, కస్టమ్స్ , ప్రత్యేక బృందాలు సమన్వయంగా వ్యవహరిస్తూ, తనిఖీలను వేగవంతం చేస్తున్నారు. తనిఖీలు పూర్తి చేసిన కంటైనర్లను జీరో గేట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. రూ.400 కోట్ల మేరకు దొంగ నోట్లు ఇక్కడ చెలామణి చేయడానికి ముష్కరులు వ్యూహ రచన చేసినట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో రూ. 2వేల నోటు తమకు వద్దు బాబోయ్ అని భయంతో పరుగులు పెట్టే వారి సంఖ్య ఇక పెరిగినట్టే. అలాగే ఈ నోట్లు ఆర్కేనగర్ ఉప ఎన్నికల పంపిణీకి వచ్చి ఉండొచ్చేమో అన్న ప్రచారం తెరమీదకు రావడం గమనార్హం. -
మరింత వేడెక్కిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా పోటీ చేసిన ఇ. మధుసూదనన్‌ను తమ వర్గం తరఫున అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అన్నాడీఎంకే అభ్యర్థిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. డీఎంకే నుంచి మరుతు గణేశ్ పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి గౌతమి బరిలోకి దిగుతున్నారని వినిపించింది. ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఆమెకు ఎంతమంది మద్దతుగా ఉంటారో తెలియరాలేదు. అయితే.. అవతలి నుంచి ఎంతమంది పోటీలో ఉన్నా తాను మాత్రం కనీసం 50వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతానని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తు మీద ఈనెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. అయితే, ఆ గుర్తు తమకే చెందాలంటూ పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయంలో ఈసీ ఇంకా తన నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
రేసులో దినకరన్
► 50 వేల మెజారిటీతో గెలుపు తథ్యం ► ఉప ప్రధాన కార్యదర్శి ధీమా ► సీఎం పదవి మీద ఆశ లేదని స్పష్టీకరణ ► కేపీఎస్ సీఎంగా కొనసాగుతారని ప్రకటన సాక్షి, చెన్నై: అందరూ ఊహించినట్టే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల రేసులో దిగారు. దినకరన్ పేరును అన్నాడీఎంకే పరిపాలనా కమిటీ «ఖరారు చేయడంతో ఆ పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేశాయి. ఇక, 50 వేల మెజారిటీతో గెలిచి తీరుతానన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేశారు. తనకు సీఎం పదవి మీద ఆశ లేదని, ఎడపాడి పళని స్వామి సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆర్కేనగర్ నుం చి వరుసగా రెండుసార్లు అమ్మ జయలలిత అసెంబ్లీ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో తానే పోటీ చేయడానికి ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సిద్ధం అయ్యారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, పార్టీ పరిపాలనా కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థి ప్రకటన ఉంటుందని టీటీవీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయం ఆవరణలో పది నిమిషాల పాటు జరిగిన ఆ కమిటీ సమావేశంలో దినకరన్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఇందుకు తగ్గ ప్రకటనను ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ , మంత్రి సెంగోట్టయన్ చేశారు. దీంతో అక్కడున్న అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తూ, దినకరన్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. పుష్పగుచ్ఛాలు, పూల మాలలు, శాలువలతో ముంచెత్తారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆ కమిటీకి, చిన్నమ్మ శశికళకు దినకరన్ కృతజ్ఞత తెలుపుకున్నారు. సీఎం కావాలన్న ఆశ లేదు: మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, అమ్మ జయలలిత నియోజకవర్గంలో పోటీకి తనకు అవకాశం కల్పించడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. ఆర్కేనగర్లో అమ్మ వదలి వెళ్లిన పనులు, ఆశయాల సాధనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఎన్నికల ద్వారా తనకు కల్పించడం మహద్భాగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాదరణతో 50వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఒక్కరేనని, ఇతర అభ్యర్థులను తాను లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. 21వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు, రెండాకుల చిహ్నం మీదే అన్నాడీఎంకే పోటీ ఉందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల అనంతరం మాజీ సీఎం పన్నీరుసెల్వం అడ్రస్సు గల్లంతు కావడం తథ్యమన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచినా, సీఎం పదవిని మాత్రం చేపట్టనని స్పష్టం చేశారు. ఆ ఆశ తనకు లేదని, అన్న ఎడపాడి పళనిస్వామి బ్రహ్మాండ పాలనను అందిస్తున్నారని, ఆయనే సీఎంగా కొనసాగుతారన్నారు. అన్నాడీఎంకే అధికారం, ప్రభుత్వ అధికారం ఒకరి చేతిలోనే ఉండాలన్నదే గతంలో సీనియర్ల అభిప్రాయం అని, అయితే, ఇక, ఆ పద్ధతి కొనసాగదని స్పష్టం చేశారు. సీఎంను మార్చే ప్రసక్తే లేదని ముగించారు. ఇప్పటికీ సీఎం ఆశ తనకు లేదని దినకరన్ పైకి చెప్పుకున్నా, అన్నాడీఎంకే వర్గాల, అందరి అభిప్రాయం మేరకు ఆ బాధ్యతలు చేపడుతానని ఎన్నికల అనంతరం కొత్త పల్లవిని ఆయన అందుకున్న అందుకోవచ్చేమో. ఇందుకు ఉదాహరణ చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా పలికిన పలుకులే. ఇక, తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలకు దినకరన్ వేడుకోలు పంపించగా, ఆ రెండు పార్టీలు తిరస్కరించాయి. దినకరన్ రాజకీయ పయనం: జయలలిత నెచ్చెలి శశికళ సోదరి వణితామణి కుమారుడు దినకరన్. ఇతడి సోదరుడే జయలలిత దత్తపుత్రుడిగా మెలిగిన సుధాకరన్. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెరియకుళం నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో ఆ పదవి కాలం ముగియడంతో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరించారు. 2011లో అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై పార్టీ నుంచి బహిష్కరణకు గుయ్యారు. అమ్మ మరణంతో గత నెల ఫిబ్రవరి 15న దినకరన్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రాగానే, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం గమనార్హం. ఈ పదవి చేపట్టి నెల రోజుల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ప్రకటించ బడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఆయన సీఎం కావడం తథ్యం అన్న ప్రచారం అన్నాడీఎంకేలో ఊపందుకోవడం ఆలోచించ దగ్గ విషయం. ఇక, దినకరన్ మీద విదేశీ మారక ద్రవ్యంతో పాటు, సింగపూర్ సిటిజన్ వ్యవహారం వంటి పలు కేసులు కూడా ఉన్నాయి. -
‘దినకరన్‌కు, అన్నాడీఎంకేకు సంబంధం లేదు’
చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి శశికళపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. దినకరన్‌ను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. దినకరన్‌కు, అన్నాడీఎంకే ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఇవాళ ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తును తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బరిలో దిగనున్నారు. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కూడా ఆర్కేనగర్ నుంచే రాజకీయ అరంగ్రేటం చేయనుంది. కాగా జయ మరణానంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నిక చెల్లదంటూ పన్నీరు సెల్వం వర్గీయులు ఈసీని ఆశ్రయించారు. ఈసీ నోటీసులు జారీచేయడంతో శశికళ వివరణ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
-
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక టైట్ ఫైట్ గా మారబోతుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత రెండు సార్లు ఇక్కడి నుంచే పోటికి దిగి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు జయలలిత అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు తెలిపిన దీపా జయకుమార్, గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. అయితే జయలలిత పార్టీ నుంచి గెంటివేయబడ్డ దినకరన్ నే అన్నాడీఎంకే పోటీకి దింపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్కే నగర్ లో బహుముఖ పోటీ!
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవడంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపై నిలిచింది. ‘అమ్మ’ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అన్నాడీఎంకే భావిస్తుండగా, ఇక్కడ పాగా వేసి సత్తా చాటాలని డీఎంకే వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. వామపక్షాలను కోరారు. అన్నాడీఎంకే తరపున దినకరన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ‘కెప్టెన్’ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును ఖారారైంది. విజయకాంత్ సతీమణి ప్రేమలతను పోటీ దింపాలని పలువురు నేతలు కోరుతున్నారు. పన్నీర్ సెల్వం శిబిరం నుంచి పోటీకి దిగనున్నట్టు మాజీ డీజీపీ తిలకవతి సూచనప్రాయంగా వెల్లడించారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సొంత పార్టీ తరపున బరిలోకి దిగుతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమ వేదిక(పీడబ్ల్యూఎఫ్) కూడా పోటికి సిద్ధమవడంతో బహుముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. కాగా, ఆర్కే నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి శశికళ వర్గం నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపించారు. -
నన్ను వేధిస్తున్నారు: జయ మేనకోడలు
చెన్నై : జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కు వేధింపులు ప్రారంభమయ్యాయట. ఏప్రిల్ 12 న జరుగబోయే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధిస్తున్నారని దీపా జయకుమార్ సోమవారం ఆరోపించారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని చెప్పారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఈ ఉప ఎన్నికల నుంచి తనని విరమింపజేయడానికి పలు కుట్రలు జరుగుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 24నే ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్టు దీపా జయకుమార్ ప్రకటించారు. ఈ ఫోరం ప్రారంభించడానికి ముందు కూడా చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దీపా జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ నుంచి దీపా జయకుమార్ పోటీ చేసి అమ్మ అసలు వారసురాలిగా నిరూపించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణించడంతో ఆమె స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి దీపా పోటీచేస్తున్నారు. ఆర్కే నగర్ వాసులు కూడా చిన్నమ్మను పక్కన పెట్టి, దీపా జయకుమార్ కే తమ మద్దతు తెలుపుతున్నారు. -
'అమ్మ'కోటలో పాగా వేసేదెవరో?
► ఆందరి చూపు ఆర్కేనగర్ వైపు.. జయ మృతితో అనివార్యమైన ఎన్నిక ► రసవత్తరంగా రాజకీయాలు ► బహుముఖ పోటీ ఖాయం ► పన్నీర్, స్టాలిన్, దినకరన్ కు తొలి పరీక్ష సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో మూడు నెలలుగా ఖాళీగా ఉన్న చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గంలో వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. జయలలిత రెండుసార్లు పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో ఈ అసెంబ్లీ స్థానంపై వీవీఐపీ ముద్రపడింది. జయ మరణం తరువాత ఖాళీ అయిన స్థానం కావడంతో ప్రధానాకర్షణగా మారింది. దీంతో ఆర్కేనగర్లో గెలుపొందడం ఒక ప్రతిష్టగా అన్నిపార్టీలూ భావిస్తున్నాయి. ప్రధానపోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుందనేది నిర్వివాదాంశం. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చీలు ప్రకటించాయి. ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ డీఎంకేలో శుక్రవారం నుంచే ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జయపై పోటీచేసి ఓడిన సిమ్లా ముత్తుచోళన్ తన దరఖాస్తును సమర్పించారు. ఇక బీజేపీ, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నాయి. తమ నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామని ప్రజా సంక్షేమకూటమి శుక్రవారం తెలిపింది. అన్నాడీఎంకే అనుచరులను శశికళ, పన్నీర్‌సెల్వం, దీప పంచుకుని ఉన్నారు. అభ్యర్థుల పేర్లపై ఊహాగానాలు అనేక పార్టీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నందున ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బహుముఖ పోటీ ఖాయమని తేలిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకేలతోపాటు ఇతర ద్రవిడ పార్టీలు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులపై రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గం నుంచి ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై నుంచి దీప, డీఎంకే తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన సిమ్లా ముత్తుచోళన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. తాము పోటీకి దిగుతున్నట్లు నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ శుక్రవారం ప్రకటించారు. తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే పోటీచేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగో ఓటమి ఖాయం ఎందుకు అనవసరమైన ఖర్చని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో ఆలోచనలో పడినట్లు సమాచారం. త్వరలో పార్టీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పోటీకి వెనుకాడను: దినకరన్ ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు అవకాశం వస్తే ఎంతమాత్రం వెనుకాడబోనని అన్నాడీంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థిఎవరైనా అన్నాడీఎంకే ఘనవిజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికీ తొలి సవాల్: ఆర్కేనగర్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ప్రధాన నేతలు ముగ్గురూ తొలిసారిగా సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడుగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నిక. ఎంతో బలమైన క్యాడర్ గలిగిన అన్నాడీఎంకే కలహాల కాపురంగా మారిన దశలో డీఎంకే అభ్యర్థిగెలుపు నల్లేరుపై నడకలా సాగాల్సి ఉంది. ఇంతటి సానుకూలమైన పరిస్థితులను స్టాలిన్ సద్వినియోగం చేసుకుంటారో లేదో వేచి చూడాలి. అలాగే కొంతకాలంగా చిన్నమ్మ చాటున ఉండి తెరవెనుక రాజకీయాలు నడిపిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దినకరన్ కు సైతం ఇది తొలి సవాలే. ఎంజీఆర్ స్థాపించి, జయలలితచే బలమైన పార్టీగా నిలవడం అనే అంశం మినహా దినకరన్ చుట్టూ ఇతరత్రా అన్నీ ప్రతికూల అంశాలే. పైగా అన్నాడీఎంకే అభ్యర్థిగా తానే నిలిచేందుకు దినకరన్ సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకేతో విభేదించి తిరుగుబాటు నేతగా మారిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సైతం ప్రజాకోర్టులో తొలిసారిగా తన సత్తా చాటుకోవాల్సి ఉంది. ఆన్నాడీఎంకేకు ఆర్కేనగర్ పెట్టని కోట: ఆర్కేనగర్ నియోజకవర్గంలో 1977లో తొలిసారిగా అన్నాడీఎంకే తన అభ్యర్దిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి విజయం సాధించింది. ఆ తరువాత 1991, 2001, 2006, 2011, 2015, 2016 ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే గెలుపొందింది. 1957, 1962, 1980చ 1984లో కాంగ్రెస్ గెలిచింది. 1967, 1971,1989,1996 ఎన్నికల్లో డీఎంకేను విజయం వరించింది. డీఎంకే 7 సార్లు, అన్నాడీఎంకే 3 సార్లు మాత్రమే ఓటమిపాలైంది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం: గత ఏడాది జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఆర్కేనగర్లో అన్నాడీఎంకే అభ్యర్ది జయలలిత 97,218 (55.87 శాతం) ఓట్లతో గెలుపొందారు డీఎంకే అభ్యర్ది సిమ్లా ముత్తుచోళన్ కు 57,673 (33.14 శాతం) ఓట్లు, వీసీకే అభ్యర్ది వసంతీదేవికి 4,195 , (2.41 శాతం), పీఎంకే అభ్యర్ది ఆగ్నస్కు 3,011 (1.73 శాతం), బీజేపీ అభ్యర్ది ఎమ్ఎన్ రాజాకు 2,873 (1.68 శాతం) ఓట్లు లభించాయి. అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు డీఎంకేకు లాభించేనా లేక శశికళ, పన్నీర్, దీప వర్గాల్లో ఏవరో ఒకరిని విజయ కిరీటం వరించేనా అని చర్చించుకుంటున్నారు. -
పన్నీర్ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ?
చెన్నై : తమ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీయేనని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పన్నీర్ సెల్వం తమకు పోటీ కాదని, ఆయన సున్నఅని దినకరన్ అభివర్ణించారు. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు ఆర్కేనగర్ స్థానం నుంచే పోటీకి దిగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే అధికార అన్నాడీఎంకేతో పాటు పన్నీర్ సెల్వం, డీఎంకేలు ఈ స్థానంపై కన్నేయడంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : తమిళనాడులో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలిలత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 17న ఉప ఎన్నిక ఫలితం రానుంది. జయలలిత మృతి, శశికళ జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలుగా చీలడం, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం చేయడంతో పాటు ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కాగా ఖాళీ అయిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఆర్కేనగర్ (తమిళనాడు)తో పాటు థీమజీ (అస్సాం), భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్), కంతీదక్షిన్ (వెస్ట్ బెంగాల్), ధోల్పూర్ (రాజస్థాన్), నన్జన్గౌడ్, గుండ్లుపేట్ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్), ఉప్పేర్ బుర్తూక్ (సిక్కిం), రాజౌరీ గార్డెన్ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, కేరళలోని మలప్పురం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఆర్కే నగర్ బరిలో ఎవరెవరు?
తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి జయలలిత మరణం తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె నెచ్చెలి శశికళ భావించారు. ఎటూ అమ్మ మీద అభిమానంతో చిన్నమ్మను గెలిపిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అనుకున్నారు. కానీ ఇంతలో సుప్రీంకోర్టు తీర్పు ఆమెకు అశనిపాతంలా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు తన అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ను ఆర్కే నగర్ బరిలోకి దించాలని శశికళ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గురువారం ప్రకటించిన మంత్రివర్గంలో కూడా దినకరన్‌కు స్థానం ఉంటుందని చాలామంది భావించారు. అయితే, ఎమ్మెల్యే పదవి లేకుండా నేరుగా మంత్రిని చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో.. ముందుగా అతడిని ఆర్కే నగర్ బరిలో దించి, ఆ తర్వాత కీలకమైన మంత్రిత్వ శాఖ అప్పగించాలన్నది శశికళ ఆలోచన అని అంటున్నారు. అయితే, ఇప్పటికే శశికళ మీద కొంత వ్యతిరేకత ఉన్న ఆర్కే నగర్ వాసులు.. ఆమె అక్క కొడుకు, పలు ఆర్థికపరమైన ఆరోపణలు ఉన్న దినకరన్‌ను ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా అనుమానంగానే ఉంది. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా ఆర్కేనగర్ స్థానం మీద గట్టిగా దృష్టిపెట్టింది. తాము ఎంతగా అనుకున్నా ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం ఒక ఎత్తయితే శశికళ వర్గీయులకు ఆ పదవి దక్కడాన్ని పన్నీర్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ ఆశయాల సాధనే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన.. ముమ్మూర్తులా జయలలితలాగే కనిపించే దీపా జయకుమార్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీపకు ఎటూ శశికళ పోలికలు ఉండటం, ఆర్కే నగర్ వాసులు తాము అమ్మ కోసమే ఉన్నామని ఇంతకుముందు సైతం చెప్పడంతో ఆమెను పోటీకి దింపితే గెలవడం ఖాయమన్న అంచనాలు పన్నీర్ వర్గానికి ఉన్నాయి. దీపను ముందుకు పెట్టడం ద్వారా మళ్లీ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా పొందగలిగితే, పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం కూడా పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే విషయం వరకు వస్తే డీఎంకే సైతం మద్దతిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. ముందుగా ఆర్కే నగర్ స్థానం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. మరో నాలుగు నెలలే ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆరు నెలల్లోగా మళ్లీ ఎన్నిక నిర్వహించాలి. జయలలిత డిసెంబర్ 5వ తేదీన మరణించారు. దాంతో జూన్ లోగా ఎన్నిక నిర్వహించి, కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాలి. ఇప్పటికే రెండు నెలల సమయం ముగియడంతో మరో నాలుగు నెలల్లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎవరికి వాళ్లు పావులు కదుపుతున్నారు. -
జయలలిత గెలుపును సవాల్ చేసిన ఓటరు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికను సవాల్ చేస్తూ ఆర్కే నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ అనే ఓటరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత అక్రమంగా గెలిచారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. పోలింగ్ బూతులను ఆక్రమించి, ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం దురైసామి.. ఎన్నికల కమిషన్ అధికారులకు, జయలలితకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 16లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించించారు. మే 16న జరిగిన ఎన్నికల్లో ఆర్ కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ జయలలిత.. డీఎంకే అభ్యర్థి సిమ్లా ముత్తుపై 39,545 ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
ఆర్కేనగర్లో అందరూ అమ్మలే
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఆకర్షిస్తున్న ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అమ్మపై మరికొందరు అమ్మలు పోటీపడుతున్నారు. వారందరి మధ్య హిజ్రా అభ్యర్థి ప్రత్యేకంగా మారారు.రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు ఒక ఎత్తు, చెన్నైలోని ఆర్కేనగర్ ఒక ఎత్తు. ఎందుకంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ చేస్తోంది కనుక. తమిళనాడు ప్రజల చేత అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ప్రస్తుత ఎన్నికల్లో ఆర్కేనగర్ నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. జయలలిత నిర్ణయంతో ఆర్కేనగర్ మహిళా అభ్యర్థుల నిలయంగా మారిపోయింది. జయపై పోటీకి పెట్టే అభ్యర్థుల్లో ఏదోఒక ప్రత్యేకత, ఆకర్షణ ఉండాలని ప్రతిపక్ష పార్టీలన్నీ భావించాయి. అనేక పేర్లతో తర్జనభర్జన పడ్డాయి. అయితే ఎట్టకేలకూ మహిళా అభ్యర్థినే నిలబెట్టాలని నిర్ణయించిన తరువాత తగిన అభ్యర్థిని కోసం వెతుకులాట ప్రారంభమైంది. జయలలిత ప్రస్థానం: రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత జయలలిత తొలిసారిగా 1989 లో పోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1991లో బర్గూర్, కాంగేయం ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలుపొందారు. 1996లో బర్గూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2002, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆండిపట్టి నుంచి విజేతగా నిలిచారు. 2011 ఎన్నికల్లో తిరుచ్చి శ్రీరంగం నుంచి పోటీచేసి గెలుపొందిన జయలలిత ఆస్తుల కేసుల వల్ల మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత 2015లో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపొంది సీఎం పీఠం ఎక్కారు. ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థిగా ఆర్కేనగర్ నుంచే తలపడుతున్నారు. డీఎంకే నుంచి మహిళా న్యాయవాది: ఇక అన్నాడీఎంకే దీటైన పోటీ ఇవ్వగల డీఎంకే మహిళా న్యాయవాదిని రంగంలోకి దించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బును పోటీపెట్టడం ద్వారా ప్రజాకర్షణ చూరగొనవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే డీఎంకే మాత్రం ఆర్కేనగర్‌ను తమ అభ్యర్థికే కేటాయించింది. మహిళా న్యాయవాది సిమ్లాను అభ్యర్థిగా రంగంలోకి దించింది. విద్యాధికురాలిగా పదునైన ప్రసంగాలతో ప్రచారం చేసే శక్తి ఆమెకు ఉందని డీఎంకే విశ్వసిస్తోంది. వీసీకే నుంచి మాజీ మాజీ వీసీ పోటీ: ఇదిలా ఉండగా, ప్రజా సంక్షేమ కూటమి సైతం మహిళా అభ్యర్థిని పెట్టింది. సంక్షేమ కూటమిలో భాగస్వామి వీసీకే అధినేత తిరుమావళవన్ తమ అభ్యర్థిగా మాజీ వైస్ చాన్సలర్ వసంతీదేవిని పోటీకి పెట్టారు. జయపై వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీచేయాలని ముందు భావించారు. అయితే అందరూ మహిళా అభ్యర్థులు కావడంతో అభిప్రాయం మార్చుకున్నారు. వసంతీదేవి సైతం ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఓటర్ల మెప్పుపొందగలరని సంక్షేమ కూటమి ఆశిస్తోంది.కాగా ఒంటరిగా బరిలో ఉన్న పీఎంకే ఆగ్నిస్ అనే మహిళకు అవకాశం ఇచ్చింది. ఆర్కేనగర్ నుంచి జయలలితకు పోటీగా పురుషులు నిలబడతారని సహజంగా అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యరీతిలో అందరూ మహిళలను నిలబెట్టడం అమ్మకు ఒకింత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులను నిలబెడితే భారతీయ జనతా పార్టీ మాత్రమే పురుషుడిని నిలబెట్టింది. హిజ్రా ప్రత్యేక ఆకర్షణ: అన్ని పార్టీల మాట అటుంచితే నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. సి.దేవి అనే హిజ్రాను అమ్మపై పోటీపెట్టడంతో ఇదొక ప్రత్యేక ఆకర్షణగా, చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో హిజ్రాలు ఉండగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా వారంతా ఆర్కేనగర్లో సందడి చేయడం ఖాయం. -
సీఎం సిట్టింగ్ స్థానంలో హిజ్రా పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరంగా అనేక సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడులో మరో విశేషం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఓ హిజ్రా పోటీకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సేలం దేవీ అనే హిజ్రాను ఆర్కే నగర్ నుంచి పోటీకి దింపుతున్నట్లు తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు మంగళవారం ప్రకటించాయి. నామ్‌తమిళర్ కట్చి(ఎన్టీకే) తరఫున పోటీకి దిగుతోన్న సేలం.. గడిచిన కొన్నేళ్లుగా హిజ్రాల హక్కుల కోసం పోరాడుతున్నారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని ఎన్ టీకే డిమాండ్ చేస్తోంది. -
వదంతులకు చెక్
సచివాలయంలో సీఎం సందడి పథకాలు ప్రారంభించిన జయలలిత పీఎంకు సీఎం లేఖ చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత ఈనెల 4వ తేదీన అమ్మ సచివాలయానికి వచ్చారు. ఆ తరువాత అనేక కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండగా, రద్దు చేసుకున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేయసాగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందునే జయ బైటకు రావడం లేదని ప్రచారం జరిగింది. ఈ దశలో బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు జయలలిత సచివాలయానికి వచ్చారు. మంత్రులు ఆమెకు ఘనస్వాగతం పలికి లోనికి ఆహ్వానించారు. నేరుగా సీఎం చాంబర్‌కు వెళ్లిపోయారు. తమిళనాడు ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా సైన్స్, ఆర్ట్స్ విభాగ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అసిస్టెంటు ప్రొఫెసర్లుగా నియామక ఉత్తర్వులను జయ స్వయంగా అందజేశారు. పేదలు, విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. తిరువన్నామలై జిల్లా సెంగంలో 39.52 ఎకరాల విస్తీర్ణంలో రూ.72.60 కోట్లతో నిర్మించిన పాల పౌడర్ ఫ్యాక్టరీని, రూ.4.12 కోట్లతో రాష్ట్రం నలుమూలలా ఏర్పాటు చేసిన 151 ఈ-సేవాకేంద్రాలను విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నిర్బంధ వ్యవసాయ భూముల సేకరణ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీకి జయ లేఖ రాశారు. రైతుల సంక్షేమాన్ని దెబ్బతీసే ఈ బిల్లును ఎంతమాత్రం అంగీకరించబోమని లేఖలో ఆమె స్పష్టం చేశారు. -
అదీ ఒక గెలుపేనా?
- జయపై కరుణ ధ్వజం టీనగర్:ఆర్కే నగర్ గెలుపు అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు విజయానికి చిహ్నంగా జయలలిత పేర్కొంటూ ప్రజల నుంచి ఓదార్పును, భద్రతను కోరుకుంటున్నారని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విమర్శించారు. చెన్నై, ఆర్కే నగర్ నియోజవర్గంలో అత్యంత నిజాయితీ(?)తోను, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల(?)తోను, ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత(?)తోను, ఎటువంటి మంత్రుల హంగు, ఆర్భాటాలు లేకుండా (?) ప్రతిపక్షాల ప్రశ్నలకు జయలలిత సవ్యంగా బదులిస్తూ(?) ఎన్నికల కమిషన్-పోలీసు శాఖ-అనడీఎంకే అనే ముక్కోణపు కూటమి ఏర్పాటు చేసి జయలలిత గెలుపు సాధించారట అని విమర్శలు గుప్పించారు. అన్ని అధికారాలను చేతిలో ఉంచుకుని, మంత్రులందరిని రాత్రింబవళ్లూ వీధుల వెంట తిప్పారని, ప్రతిపక్షాలు దుష్టుడికి దూరంగా వుండాలనే రీతిలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సహకారంతో గెలుపొందడం నిజంగా గెలుపేనా? అని ప్రశ్నించారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పోలయ్యాయనేందుకు 181వ పోలింగ్ బూత్ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. -
ఆర్కేనగర్లో జయలలిత ఘన విజయం
ఉప ఎన్నికల్లో లక్షన్నర మెజారిటీ సాధించిన జయ ఎంపీలో బీజేపీ, కేరళ-మేఘాలయల్లో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు నల్లేరుపై బండి నడకలా మారింది. మంగళవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే మహేంద్రన్ జయ దరిదాపుల్లోకీ రాకుండా పోయారు. 17వ రౌండ్ ముగిసేసరికి పోలైన మొత్తం 1,81, 420 ఓట్లలో 1,60,432 ఓట్లు జయకే వచ్చాయి. మహేంద్రన్‌కు పోలైన ఓట్లు కేవలం 9,710 కాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి 4,590 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు, డీఎండీకే, బీజేపీ, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ 25 మంది స్వతంత్రులు ఈ ఎన్నికలో పోటీ పడ్డారు. మహేంద్రన్‌తో సహా జయపై పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థికీ డిపాజిట్ కూడా దక్కలేదు. గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో శ్రీరంగం నియోజకవర్గం ఎమ్మెల్యే అర్హతను, ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. అదే కేసులో కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడడంతో గత నెల 23వ తేదీన ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సీఎం పదవిని చేపట్టిన ఆరునెలల్లో తిరిగి ఎన్నిక కావటం తప్పనిసరి కావటంతో ఆర్కేనగర్ ఎమ్మెల్యే పి. వెట్రివేల్చే రాజీనామా చేయించి జయ ఉప ఎన్నికకు వెళ్లిన సంగతి తెలిసిందే. జయలలిత గెలుపుతో రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల పూజలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌లు జయలలితకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జయ విజయంపై విచారణ జరిపించాలని ఆమె ప్రత్యర్థి సీపీఐ నేత మహేంద్రన్ డిమాండ్ చేశారు. అధికార పార్టీలదే విజయం ఆర్కేనగర్‌తో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లోని 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే గెలిచారు. కేరళలోని అరువిక్కరలో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్ శబరినందన్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో గరోత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి చందర్‌సింగ్ సిసోడియా గెలుపొందారు. త్రిపురలో ప్రతాప్‌గఢ్, సుర్మా స్థానాలను అధికార సీపీఎం చేజిక్కించుకుంది. మేఘాలయలోని చోక్పాట్లో కాంగ్రెస్ అభ్యర్థి బ్లుబెల్ ఆర్ సంగ్మా 2550 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. -
లక్షన్నర ఓట్ల మెజారిటీతో అమ్మ విజయం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఏఐడీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం జె. జయలలిత విజయ దుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి అయిన మహేంద్రన్ పై లక్షా యాభైవేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. సోమవారం ఉదయం చెన్నైలోని క్వీన్స్ మేరీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ అమ్మ ఆధిక్యతను ప్రదర్శించారు. కేవలం 9. 690 ఓట్లు మాత్రమే సాధించిన మహేంద్రన్ డిపాజిట్ కోల్పోయారు. ఈ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె అనుచరులు సంబరాలు జరుపుకొన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచ పేల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు జయలలిత కృతజ్ఙతలు తెలిపారు. -
ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నగరంలోని రాణీమేరీ కాలేజీలో ప్రారంభమైంది. ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు ఖాయమని ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అమ్మకు ఎంత మెజార్టీ లభిస్తుంది అనే అంశంపై వారిలో ఉత్కంఠత నెలకొంది. జూన్ 27న ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీపీఐ మాత్రమే తమ అభ్యర్థిగా మహేంద్రన్ ను బరిలో దింపగా... మిగిలిన 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో 74.4 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పాత వన్నార్పేటలో ఓటర్ల సంఖ్య కంటే అధిక శాతం పోల్ కావడంతో సదరు ప్రాంతంలో ఎన్నికల సంఘం సోమవారం రీపోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్షతోపాటు పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీపై అనర్హత విధించింది. అందులోభాగంగా శ్రీరంగం నుంచి ప్రాతినిధ్యం వహించిన జయలలిత ఎమ్మెల్యే పదవితోపాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే దీనిపై ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొట్టివేసి.. జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆరునెలల్లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జయలలిత ఆర్కే నగర్ నుంచి ఉప ఎన్నికల బరిలో దిగిన విషయం విదితమే. -
అమ్మ సేనల్లో గుబులు
సాక్షి, చెన్నై :ఆర్కేనగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది. అయితే ఆశించిన మేరకు ఓటింగ్ శాతం పెరగకపోవడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన బయలుదేరింది. తమ అమ్మకు భారీ ఆధిక్యత దక్కని పక్షంలో ఎలాంటి పరిణామాల్ని చవిచూడాల్సి ఉంటుందోనన్న బెంగ పట్టిపీడిస్తోంది. ఇక పదవీ గండం తప్పదేమోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్ని మలచుకునేందుకు అన్నాడీఎంకే కసరత్తులు చేపట్టింది. ఈ స్థానం బరిలో సీఎం, ఆ పార్టీ అధినేత్రి జయలలిత దిగడంతో, గెలుపు ఏక పక్షం అన్నది స్పష్టమయింది. ప్రధాన ప్రతి పక్షాలు బహిష్కరించినా, రేసులో సీపీఐ నిలవటం, స్వతంత్ర అభ్యర్థులు 26 మంది దిగడం వెరసి భారీ ఆధిక్యత మీద అన్నాడీఎంకే దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి అన్నాడీఎంకే జంబో జట్టు రంగంలోకి దిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లలతో కూడిన యాభై మంది ఇన్‌చార్జ్‌ల బృందం, అనుబంధ బృందాలు ఇంటింటా తిరిగి ఓట్ల వేటలో పడ్డాయి. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో నాయకుడు ఎంపిక చేసుకోవడం, ఆయా ప్రాంతాల్లోని వీధుల్ని తమ పరిధిలోని కింది స్థాయి నాయకులకు అప్పగించడం, ఏ ఇంట్లో అయితే, అత్యధిక ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను రాబట్టేందుకు ఏకంగా ఓ నాయకుడ్ని రంగంలోకి దించడం వంటి వ్యూహాలు రచించారు. దానిని అమలు పరిచేందుకు ధన బలం నియోజకవర్గంలో తాంవడం చేసిందన్నది జగమెరిగిన సత్యం. తమ వ్యూహాల్ని విజయవంతంగా అమలు చేసిన అన్నాడీఎంకే సేనలు, ఆచరణలో విజయం సాధించారా..? అన్నది డౌటే. సేనల్లో గుబులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి విముక్తి లభించిన తరువాయి ఎదుర్కొంటున్న ఈ ఎ న్నికల్లో తమ అధినేత్రి జయలలిత మీద ప్రజల్లో ఏమేరకు విశ్వాసం, నమ్మకం, అభిమానం ఉన్నదో చాటుకునే విధంగా ఓట్ల శాతం పెంపుతో నిరూపించేందుకు చర్యలు చేపట్టారు. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కే విధంగా ఓటింగ్ శాతం, మెజారిటీ వచ్చి తీరుతుందన్న ధీమాను నేతలందరూ వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల రోజు పరిస్థితి తారుమారైంది. తొలుత వంద శాతం ఓటింగ్ అన్న ఆ పార్టీ వర్గాలు తదుపరి 90 శాతానికి తగ్గారు. ఈ శాతం తప్పని సరిగా వస్తుందన్న ధీమాతో ఉన్న, ఆ పార్టీ వర్గాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వెట్రి వేల్ పోటీ చేసిన సమయంలో వచ్చిన శాతం కంటే, కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు పెరిగాయి. ఇది కాస్త అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేస్తోంది. ఓటింగ్ శాతం తగ్గినా, మెజారిటీ సంపూర్ణంగా ఉంటుందన్న భావనలో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో సీపీఐకు అనుకూల వాతారణం నెలకొన్నట్టు సంకేతాలు ఉండడం గుబులురేకెత్తిస్తోంది. పదవుల గండం ఇది వరకు పలు ఉప ఎన్నికలు అన్నాడీఎంకే హయాంలో జరిగాయి. వీటిల్లో జయలలిత సూచించిన వ్యక్తి బరిలోకి దిగినప్పుడే ఓటింగ్ శాతం తారాస్థాయికి చేరి ఉన్నాయి. అయితే, స్వయంగా జయలలిత పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గడం అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లుగా ఉన్నమంత్రుల్లో పదవీ గండం బయలుదేరి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పదవులు ఊడిన పక్షంలో, మళ్లీ సీట్లు దక్కేది అనుమానమేనన్న ఆందోళనలో ఉన్నారు. పార్టీ తరపున ఇతర ఉపఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు నిలబడ్డ చోటే ఏదేని తప్పులు దొర్లిన పక్షంలో కఠినంగా వ్యవహరించే జయలలిత, ఇక తాను పోటీ చేసిన స్థానంలో ఎదురయ్యే పరిణామాల మీద ఏ మేరకు స్పందిస్తారోనన్న భయం ఆ పార్టీ వర్గాల్లో వెంటాడుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన తిరుమంగళం ఉప ఎన్నికలో 88 శాతం, ఏర్కాడులో 89.22 శాతం, శ్రీరంగంలో 81.79 శాతం, శంకరన్ కోవిల్లో 77.52 శాతం మేరకు ఓటింగ్ నమోదు కాగా, ఆర్కే నగర్లో 74.4 శాతం మాత్రమే నమోదు కావడంతో ఇక, ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరి పదవి ఉంటుందో ఊడుతుందోనన్న చర్చ అన్నాడీఎంకేలో బయలుదేరింది. అలాగే, నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల వివరాల ఆధారంగా స్థానికంగా ఉండే నేతలతో పాటుగా, ఆయా ప్రాంతాల ఇన్‌చార్జ్‌లకు పదవీ గండం తప్పదేమో...! స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు గెలుపు ఏకపక్షమైనా తమ పదవుల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలలోని ఓట్ల ఆధారంగా మెజారిటీ పెరగాలంటూ దేవళ్లను మొక్కే పనిలో అన్నాడీఎంకే సేనలు నిమగ్నం అయ్యాయి. ఇక, ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను ఆయా పోలింగ్‌బూత్‌ల నుంచి తీసుకొచ్చి నగరంలోని రాణిమేరి కళాశాలలో భద్రపరిచారు. ఆ పరిసరాల్లో ఆరంచెల భద్రత కల్పించారు. ఈనెల 30 బుధవారం ఓట్ల లెక్కింపు పర్వం సాగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఇక, తమ పదవులకు గండం రాని రీతిలో ఫలితాలు రావాలన్న ఎదురు చూపుల్లో అన్నాడీఎంకే సేనలు నిమగ్నమయ్యాయి. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో జయ ప్రచారం
చెన్నై: తమిళనాడులోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం జయలలిత సోమవారం అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నోర్ రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు శుభ సూచికగా ఆర్కే నగర్ గెలుపును అందివ్వండి. నా సర్వస్వం మీరే. ఆర్కే నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తానని వాగ్దానం చేస్తున్నా. ఎన్నికల్లో అన్నాడీఎంకేను భారీ మెజారిటీతో గెలిపించండి’ అని వందలాది మంది కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాజకీయ కుట్రతో తనపై పెట్టిన కేసు కారణంగా గత ఏడాది సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి రావడంతో ఆర్కే నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ నేత పి.వెట్రివేల్ మేలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.