galla jayadev
-
పెమ్మసాని మంత్రి పదవి? గల్లా అభినందనలు
సాక్షి, ఢిల్లీ: పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారు కావడంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. రాజకీయ మొదటి అడుగులోనే కేంద్ర మంత్రి పదవి పొందడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర మంత్రి పదవితో సానుకూల మార్పులు తీసుకురావాలన్నారు.కాగా, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడికి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc— Jay Galla (@JayGalla) June 9, 2024 Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB— Jay Galla (@JayGalla) June 9, 2024 -
గల్లా జయదేవ్ రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ!
సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ! ► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు. ► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. అదనపు పెట్టుబడులు కనిపించవా? ► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది? రిలయన్స్‌కు వివాదాస్పద భూములు ► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్‌టాప్ బ్యాక్స్‌ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్‌కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకువస్తున్న జీయో నెట్ వర్క్ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్ సెట్‌టాప్స్ బాక్స్‌ల తయారీని థర్డ్ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఫ్రాంక్లిన్ పరిస్థితి తెలియదా? ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ డెట్ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. ► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ? ► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? ► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? ► లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)రిపోర్ట్ 2022లో ఆంధ్రప్రదేశ్ అచీవర్‌గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్10 రీజియన్స్‌లో చిత్తూరు–నెల్లూరు రీజియన్ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. ► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది. ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి. ‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం. గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’ – కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి -
తెలంగాణలో పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం?
ఆంధ్రప్రదేశ్‌లో క్షుద్ర రాజకీయం రోజురోజుకు శృతి మించుతోంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా కనిపిస్తోంది. గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తన కంపెనీ అయిన అమరరాజా బాటర్ యూనిట్ ఒక దానిని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే పదేళ్లలో తొమ్మిదివేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఆయన అంటున్నారు. తొలి దశలో రెండువేల కోట్లు వ్యయం చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. అంతవరకు సంతోషమే. ఎక్కడ ఎవరు కొత్త కంపెనీ పెట్టినా స్వాగతించాల్సిందే. కాకపోతే ఆయన తెలంగాణలో యూనిట్ పెట్టడానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం?ఆయన పెట్టుబడి , ఆయన ఇష్టం. ఏ పెట్టుబడిదారుడు అయినా అనేక అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాని గల్లా జయదేవ్ ను ఏపీ ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆయన అక్కడ పెట్టుబడి పెట్టారని ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి. జయదేవ్ ఆ మాట చెప్పలేదు. కాని ఈ మీడియా మాత్రం ప్రపంచం తలకిందులైనంతగా గగ్గోలుపెట్టాయి. జయదేవ్ ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయి తాను ఈ పెట్టుబడి పెట్టదలిచానని అడిగి, అప్పుడు ప్రభుత్వం నుంచి సహాకరం అందకపోతే తాను వేరే రాష్ట్రానికి వెళుతున్నారని చెప్పవచ్చు. అలాంటిదేమీ జరగలేదు. అయినా ఆయన ఏపీలో పెట్టుబడి పెట్టలేదు కనుక, వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి టీడీపీ మీడియా దీనిని ఒక అవకాశంగా వాడుకునే యత్నం చేసింది. ఇదంతా చూస్తే ఒక అనుమానం వస్తోంది. గల్లా జయదేవ్ తో టీడీపీ వారు, లేదా వారికి మద్దతు ఇచ్చే మీడియా వారు ఈ విధంగా ప్లాన్ చేసి, తెలంగాణలో పెట్టుబడులు అని అనౌన్స్ చేయించి ,ఏపీ ప్రభుత్వంపై విషం కక్కాలని అనుకున్నారా అన్న సందేహం కలుగుతుంది.ఈ దిక్కుమాలిన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక పత్రిక కావాలని 1.73 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని పచ్చి అబద్దపు వార్త ప్రచురించడం, తదుపరి గల్లా వార్తను ఇవ్వడం ఇవన్ని చూస్తుంటే వచ్చే ఏడాదిన్నరలో ఇంకెన్నో డ్రామాలు చూడాల్సిరావచ్చనిపిస్తుంది. నిజానికి గల్లా జయదేవ్ ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదో ఆయనను అడగాలి. గుంటూరు నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ పక్షాన గెలిచారు. ఆయన తల్లి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తాత రాజగోపాలనాయుడు ఎంపీగా, ఎమ్మెల్యేగా పదవులు చేశారు. ఏపీ ప్రజలు ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు వారికి ఇన్ని అవకాశాలు ఇస్తే , ఆ కృతజ్ఞతతో ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా అక్కడికి ఎలా వెళతావు అని అడగవలసిన మీడియా, ఆయన అక్కడకు వెళ్లగానే రెచ్చిపోయి ప్రభుత్వంపై చెడరాసేశాయి. అదేమంటే ఆయన పరిశ్రమలలో కాలుష్యం పేరుతో వేధించారని ఈ పత్రికలుచెబుతున్నాయి. అంటే ఏదైనా పరిశ్రమలో కాలుష్యం వస్తుంటే దానిని అరికట్టడం ప్రభుత్వ బాద్యత కాదా? నిజంగానే కాలుష్యం లేకపోతే ,సంస్థ యాజమాన్యం ఆ విషయం ప్రభుత్వానికి వివరించవచ్చు. అయినా ప్రభుత్వం వినకపోతే అప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వవచ్చు. విశాఖలో ఎల్.జి పాలిమర్స్ సంస్థలో విష వాయువులువెలువడి 13 మంది మరణించినప్పుడు ఇదే మీడియా ఏమని రాసింది. ఆ సంస్థ యాజమాన్యాన్ని జగన్ కాపాడుతున్నారని, అరెస్టు చేయడం లేదని ఆరోపించింది.కాని జగన్ ప్రభుత్వం వారిని కూడా అరెస్టు చేయించింది. అంటే మనవాడు అయితే ఒకలా, వేరే వాడు అయితే ఇంకోలా చూడాలని టీడీపీ మీడియా చెబుతోందన్నమాట.అసలు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా, సార్ట్ అవుట్ చేసుకుని ఇక్కడ పెట్టాలి కాని, వేరే రాష్ట్రానికి ఇలాంటి రాజకీయ నేతలు వెళితే ఏమిటి దాని అర్ధం. సరే.. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ పెట్టలేదు. మరి తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో గల్లా ఇదే పరిశ్రమను ,లేదా మరో పరిశ్రమను ఎందుకు పెట్టలేదు ?ఆయనే కాదు.. టీడీపీ పారిశ్రామిక వేత్త ఎవరూ కూడా ఆ పని చేయలేదు. చంద్రబాబును చూసి ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు పెట్టి ఉండాలి కదా? అమరావతి రియల్ ఎస్టేట్ పై చూపిన శ్రద్ద ఈ విషయంలో ఎందుకు చూపలేదు. ఇక మరో సంగతి చూద్దాం. నిజంగానే జగన్ ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉందా? అలా అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పలు పరిశ్రమల సంగతేమిటి? బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ కంపెనీని పెట్టిన యజమాని ఏమన్నారు..తమిళనాడులో పెట్టాలనుకున్న 2900 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ఏపీలోనే వ్యయపరుస్తానని అన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ చూపిన చొరవే అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరిలో ఒక కర్మాగారం స్థాపిస్తున్న టెక్ మహింద్ర ఎమ్.డి గుర్నానీ దావోస్ లో జగన్ ను కలిసిన అరక్షణంలో తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు కదా! ఆదిత్య బిర్లా తొలిసారిగా ఏపీలో పరిశ్రమ స్థాపించింది జగన్ ప్రభుత్వ హయాంలోనే. విశాఖలో ఇన్ పోసిస్ కాంపస్ ఎలా వచ్చింది. మరో ఐటి పరిశ్రమ 3 వేల మందికి ఉపాధి కల్పించేలా ఎలా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీసిటీ, అనకాపల్లి తదితర చోట్ల వచ్చిన పరిశ్రమల సంగతేమిటి? గ్రీన్ ఎనర్జీ మాటేమిటి? జగన్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలుఏమీ రాలేదని, వెళ్ళిపోతున్నాయని వెకిలి రాతలు రాస్తున్నవారి అంధత్వాన్ని చూసి జాలిపడడం తప్ప ఏమి చేయగలం!నిజమే ! ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని రాసి నిర్మాణాత్మకంగా సూచనలు చేయవచ్చు. కాని ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టకపోతే, అది కూడా టీడీపీ ఎమ్.పి చేస్తే, ఆనందంతో తాండవం చేస్తూ,ఏపీకి భలే అయింది అని చంకలు గుద్దుకునే మీడియా,ప్రతిపక్షం ఉంటే ఏపీకి ఏమి మేలు జరుగుతుంది?అందుకే ఇదంతా టీడీపీ వారే కావాలని గల్లా జయదేవ్ ను అడ్డుపెట్టుకుని ఈ డ్రామా ఏమైనా ఆడిస్తున్నారా అన్న సందేహం వస్తుంది. అయితే గల్లా జయదేవ్ ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాని ఆయనను అడ్డుపెట్టుకుని టీడీపీ మీడియా నానా రభస చేశాయి.వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ విన్యాసం తప్పదు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తప్ప, వీరి నోర్లు మూతపడవు. విషపు రాతలు ఆగవు..అంతవరకు వెయిట్ చేయాల్సిందే. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎంపీ గల్లా కనపడటం లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే. మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. అమలుకానీ హామీలు.. వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. -
Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?
ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ్యాపార పనుల్లో ఎంపీ అన్న సంగతి మరిచిపోయారేమో..? రెండోసారి గెలిచాక.. ఈ మూడేళ్ళలో ఐదారు సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదట. ప్రజలు తమ ఎంపీని చూడాలనుకుంటే టీవీల్లో మాత్రమే దర్శనమిస్తారు. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ గల్లా అంటే ఎంపీగా కంటే.. పారిశ్రామికవేత్తగానే అందరికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి రావడం చాలా అరుదు. అసలు గుంటూరు ప్రజలను మీ ఎంపీ ఎవరని అడిగితే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా గుంటూరుకు వచ్చి పోతుండేవారు. అది కూడా ఆయన సొంత పనులకోసం మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందారు. గల్లా పోటీ చేసే సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లా గెలిస్తే టీవీలో చూసుకోవాల్సిందేనంటూ ప్రచారం చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. గల్లా జయదేవ్ గుంటూరును పూర్తిగా మర్చిపోయారు. గతంలోలా అప్పుడప్పుడు కూడా రావడంలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వచ్చినా కూడా ఎంపీ మాత్రం కనిపించడు. టీడీపీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా గల్లా మాత్రం గైర్హాజరవుతారు. ఎంపీగా గెలిచి మూడేళ్లు అయినా ఐదారుసార్లు మాత్రమే గుంటూరు వచ్చారంటే ఆయనకు ప్రజలపట్ల ఎంత బాధ్యత ఉందో అర్దమవుతుంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలైతే అసలు మనకు ఎంపీ ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. గల్లాను చూడాలంటే పార్లమెంట్ సమావేశాల్లో టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా కనిపించరు. గల్లా తీరుపై తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి అసంతృప్తి కనిపిస్తోంది. ఎంపీతో ఏదైనా పని పడితే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. గల్లా జయదేవ్‌ను కలవాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియదు. గుంటూరులోని ఆయన ఆఫీసులో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఉంటారు. వారిని అడిగితే ఎంపీ ఎప్పుడొస్తారో, ఇప్పుడెక్కడున్నారో తెలియదంటారు. ఎంతో కష్టపడి గల్లాను ఎంపీగా గెలిపించుకుంటే ఇప్పుడు తమ సమస్యలు వినడానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలైతే చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడంతోనే తానేం చేసినా చెల్లుబాటు అవుతుందని గల్లా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వ్యాపారదృక్పధంతో మునిగి తేలే నాయకులను ఎంపీలుగా ఎన్నుకుంటే ఇలాగే ఉంటుందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు చంద్రబాబు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందేమో కానీ గల్లా అపాయింట్మెంట్ దొరకడం కష్టమని సెటైర్లు వేస్తున్నారు. -
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
సాక్షి ప్రతినిధి,తిరుపతి: ‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్/డబ్ల్యూ 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చైర్పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. -
‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ మూవీలో హైదరాబాద్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ రోజు మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో మూవీ షూటింగ్ జరిగింది. అయితే షూటింగ్ సెట్లోకి ఆకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ ప్రత్యక్షం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చదవండి: ఆర్సీ 15 కాన్సెప్ట్ పోస్టర్‌కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా! As it happens, at our hotel in Hyderabad, the @TridentHyd, I ran into Superstar MaheshBabu @urstrulyMahesh along with my colleague (& his brother-in-law) @JayGalla, a member of the Committee. What a delightful personality! pic.twitter.com/rhrTDOQBQy — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 ఆయన ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు మాదాపూర్‌లోని ట్రిడెంట్ హోటల్లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది.అది తెలిసి నేను నా సహా ఉద్యోగులతో కలిసి వెళ్లి మహేశ్‌ను కలిశాను. మా వెంట ఆయన బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. ఆయనను కలిసి కాసేపు మాట్లాడాను. నిజంగా ‘సూపర్ స్టార్’ ఎంత గొప్ప వ్యక్తి. ఆయనను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్లో మహేశ్‌తో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! అంతేగాక అదే సమయంలో ఆయన విలన్లతో పోరాడే సన్నివేశాలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా థరూర్ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Talking to MaheshBabu @urstrulyMahesh shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… @JayGalla pic.twitter.com/2ZaKSVBOIi — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 -
గల్లా ఫుడ్స్‌కి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోండి..
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం(ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011లో 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒప్పందం మేరకు ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పూతలపట్టు మండలం నల్లగట్లపల్లికి చెందిన గాలి పురుషోత్తంనాయుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ చైర్మన్ అండ్ ఎండీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గల్లా ఫుడ్స్ లిమిటెడ్‌లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పి.హేమచంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్.. ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆ భూమిని ఉపయోగించనప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్‌పై ఉందన్నారు. అయితే ఇప్పటి వరకూ భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్ గానీ, ఇటు ఏపీఐఐసీ అధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హేమచంద్ర వివరించారు. చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
అఫ్గాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను రూపొందించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడంతోపాటు అక్కడ భారత్ పెట్టుబడులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో చాలామంది తెలుగు వారు పనిచేస్తున్నారని మిథున్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాలిబన్లతో చర్చలు జరిపి అందరినీ క్షేమంగా తీసుకురావాలన్నారు. తాను సూచించిన అంశాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నోట్ చేసుకున్నారని తెలిపారు. అఫ్గాన్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారన్నారు. కాగా, అఫ్గాన్‌లో ఇప్పటిదాకా భారత్ పెట్టిన 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వివరించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. -
పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తనిఖీలకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. అలాగే తనిఖీలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని పీసీబీని కోరింది. తనిఖీలకు వెళ్లే ముందు అమరరాజా బ్యాటరీస్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆ సంస్థ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. తనిఖీలను అడ్డుకుంటోంది.. పీసీబీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐఐటీ నిపుణులతో కూడిన బృందం తనిఖీలకు వెళ్తే వారిని అమరరాజా బ్యాటరీస్ తన ప్రాంగణంలోకి అనుమతించడం లేదని తెలిపారు. తనిఖీలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తోందని వివరించారు. ఈ కంపెనీ టీడీపీ ఎంపీదని.. అందువల్ల ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఐఐటీ నిపుణులతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కంపెనీ ఉద్యోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు ఉన్నాయని, పూర్తి వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీబీపై ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. తనిఖీలు చేపట్టకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అమరరాజా యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఆ సంస్థ తరఫు న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. పీసీబీకి సంబంధం లేని థర్డ్ పార్టీ వారిని మాత్రమే అనుమతించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 8 మంది ఉద్యోగులను సీసం రహిత ప్రాంతానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. పీసీబీ వెంట ఉన్నది ఐఐటీ నిపుణులే తప్ప థర్డ్‌పార్టీ కాదని మోహన్‌రెడ్డి చెప్పారు. నిపుణుల సాయం తీసుకునే అధికారం పీసీబీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘అమర్‌రాజా’లో ప్రమాదకర స్థాయిలో లెడ్
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర స్థాయిలో లెడ్ కాలుష్యం వెలువడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల రక్తంలోనూ లెడ్ శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గాలి, నీరు, భూమిలో కూడా లెడ్ శాతం ప్రమాదకరస్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసివేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. అమర్‌రాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కాలుష్య నివేదికలు సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. నివేదికలోని అంశాలను తాము సమగ్రంగా పరిశీలించామని స్పష్టం చేసింది. -
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్‌గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్‌బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా రాజీనామా
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె గురువారం చంద్రబాబుకు లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నా అరుణ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు. ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కూడా టీడీపీలో గతంలో మాదిరిగా చురుగ్గా ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. -
వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే అధికార పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌దే బాధ్యత అని గతంలోనే చెప్పానని, తనను అంతం చేయాలని చూస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఎంపీ నందిగం సురేష్ సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) బాబుది రక్తం రుచి చూసిన చరిత్ర ఆయన మాట్లాడుతూ.. ‘జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు? లేళ్ల అప్పిరెడ్డి కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఉంది. గన్మెన్లు, సిబ్బంది కళ్లల్లో మహిళలు కారం చల్లారు. అమరావతికి సంబంధం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే ఈ ఘటనకు పాల్పడ్డారు. కారం చల్లి నా గన్మెన్లు, సిబ్బందిపై దాడి చేశారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అమరావతి ప్రజలు బలి అవుతున్నారు. చంద్రబాబుది రక్తం రుచి చూసిన చరిత్ర. దళితలు ఎప్పుడూ ఊరు బైట ఉండాలనుకొనే చరిత్ర ఆయనది. ఇప్పటికైనా చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా వాస్తవాలు రాయాలి. (ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్ గుట్టు!) రాజధాని నీ అబ్బ సొత్తు కాదు అరే ఎంపీ అంటూ ఏమి పీకుతారు అంటూ నోటి కొచ్చినట్లు తిట్టారు.. కళ్లలో కారం చల్లారు. గతంలో కూడా నాపై దాడి చేశారు. నా పీఎపై చెప్పుతో దాడి చేశారు. నా పక్కన ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకొని కొట్టారు. మాపై దాడి చేసినవారు రాజధానికి సంబంధించిన వాళ్లు కాదు. నాపై దాడి చేసిన వారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. చంద్రబాబు చేతకాని రాజకీయాలు చేయొద్దు. రాజధాని మీ అబ్బ సొత్తు కాదు. అమరావతి చంద్రబాబు బినామిల రాజధాని. ఇప్పటికైనా ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాయాలి. అలా తప్పుడు వార్తలు రాసి చంద్రబాబుకు 23 సీట్లు తెచ్చారు. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదు. తాను, తన సామాజిక వర్గం మాత్రమే రాజ్యాధికారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తహసీల్దార్ వనజాక్షిపై మరోసారి టీడీపీ దాడి నీచ రాజకీయాలు చేయొద్దు.. టీడీపీ మహిళలు ప్రయాణించిన బస్సులో ఎంపీ గల్లా జయదేవ్, ఆలపాటి రాజా ఉన్నారు. బస్సు పోలీస్ స్టేషన్‌కు వెళ్లేలోగా అక్కడికి వాళ్లు ఎలా వచ్చారు? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని వెధవ రాజకీయాలు చేయొద్దు. మహిళలైతే ఏ ఇబ్బంది రాదని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రాజధాని పేరుతో అక్రమాలకు అడ్డగా మార్చుకున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారు. కారం మాపై వేసి, పైపెచ్చు వాళ్లే వేశారని చెప్పమంటున్నారు. బాబు తొత్తుగా మారిన ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని తెలిసి మాపై దాడులు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను అంతం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత. (ఆంధ్రా అనకొండ) నీ అంతు చూస్తామంటూ బెదిరింపులు దళితులకు ఎలాగు గౌరవం ఇవ్వరు. కనీసం ఎంపీ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా? దళితులు అమరావతిలో తిరగడానికి అర్హులు కాదా? అమరావతిలో ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి కూడా అర్థరాత్రి నాకు ఫోన్లు వస్తున్నాయి. నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఉప్పు, కారం తింటున్న మాకు రోషం ఉండదా?. సామాన్యులపైనా టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. దాంతో మేము నిబద్ధతతో పని చేస్తున్నాం. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి పర్యటన సందర్భంగా పసుపు నీళ్లు చల్లించారు. ఇప్పుడు దళిత ఎంపీ అయిన నాపై దాడులు చేయించారు.’ అని మండిపడ్డారు. (దృష్టి మళ్లించడానికే ఆ దిక్కుమాలిన రాతలు..!) -
అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ చేసిన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరని, అసెంబ్లీ అధికారంలో జోక్యం చేసుకోజాలరని బుధవారం లోక్‌సభలో ప్యానెల్ స్పీకర్ ఎ.రాజా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజా పలుమార్లు జోక్యం చేసుకుని వారించారు. అయినా వినిపించుకోకుండా గల్లా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజా స్పందిస్తూ.. ‘అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ(పార్లమెంటులో) ప్రశ్నించలేరు.. ప్రస్తావించనూ లేరు. అది అసెంబ్లీ అధికారం. దానిలో జోక్యం చేసుకోజాలం’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారుపై విమర్శలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా జయదేవ్ తన ప్రసంగమంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతోనే సరిపుచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుంటోందని, రెండంకెల వృద్ధి సాధించిన తమ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను పరిశ్రమలు ఉపసంహరించుకున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని అభ్యంతరం వ్యక్తంచేశారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని వికేంద్రీకరణను రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిందని, అయితే శాసన మండలిలో చైర్మన్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ప్రభుత్వం కౌన్సిల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తన సమాధానంలో రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని చెప్పారని, కానీ రాజధానులని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అమరావతిని నోటిఫై చేస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కేంద్రం గుర్తించిందన్నారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టి పెట్టండి.. ఈ నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని ‘మీరు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్నారు. దానికే పరిమితం కావాలి..’ అంటూ గల్లా జయదేవ్‌కు సూచించారు. అయితే గల్లా వినిపించుకోలేదు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ చెప్పిందని, ఇప్పుడు మూడు రాజధానులు తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో విషయంలోకి రావాలంటూ ప్యానెల్ స్పీకర్ ఆయనకు సూచించారు. ‘‘మీ ప్రకటన వివాదానికి దారితీస్తోంది. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరు.. దానిని గుర్తుంచుకోవాలి..’’ అని ఒకింత ఘాటుగా చెప్పారు. దీంతో తాను ప్రశ్నించట్లేదని, కేవలం నేపథ్యమే చెబుతున్నానంటూ గల్లా తిరిగి అవే విషయాలు మాట్లాడారు. ప్యానెల్ స్పీకర్ మరోసారి జోక్యం చేసుకుంటూ.. ‘‘మీ సమయాన్ని వృథా చేసుకోరాదు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టిపెట్టండి..’’ అని హితవు పలికారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే గల్లా తిరిగి మాట్లాడుతూ నిపుణుల కమిటీకి చట్టబద్ధత లేదని, ముఖ్యమంత్రి వాటిని ప్రభావితం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల వల్ల ఆర్థిక భారం మూడు రెట్లు పడుతుందన్నారు. తిరిగి ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని.. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ ప్రశ్నించలేరు.. కనీసం ప్రస్తావించనూ లేరని, అసెంబ్లీ అధికారంలో మనం జోక్యం చేసుకోజాలమని అంటూ మీరు వినకపోతే నేను ఇంకో సభ్యుడిని పిలుస్తానని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా జయదేవ్ ముఖ్యమంత్రిపై విమర్శలు కొనసాగించారు. దీంతో ‘ఆ వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవు’ అని ప్యానెల్ స్పీకర్ స్పష్టంచేశారు. కానీ జయదేవ్ అమరావతిపైనే మాట్లాడుతుండడంతో వేరొక సభ్యుడి పేరును రాజా పిలిచారు. దీనిపై జయదేవ్ అభ్యర్థించడంతో నిమిషం సమయమిస్తూ ప్రసంగాన్ని ముగించాలని కోరారు. కానీ గల్లా మళ్లీ పాత విషయాలే ప్రస్తావించడంతో ప్యానెల్ స్పీకర్ మాట్లాడాలంటూ మరొక సభ్యుడి పేరును పిలిచారు. -
రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లోక్‌సభకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో టీడీపీ వాదనలన్నీ ప్రజలను పక్కదారి పట్టించేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. లోక్‌సభ వేదికగా టీడీపీ వేసిన పాచిక వారికే ఎదురుతిరిగింది. రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమివ్వడంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని స్పష్టమైంది. నిత్యానంద్రాయ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రం స్పందన ఏమిటి?: గల్లా రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ రాజకీయ ఎత్తుగడ వేసింది. ఈమేరకు ఎంపీ గల్లా జయదేవ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రశ్నలు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే దీనిపై కేంద్రం స్పందన ఏమిటి? ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సహాయపడుతుంది? పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడమే కాకుండా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతున్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుందా? ఇస్తే అందుకు సంబంధించి వివరాలేమిటి?’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మరో సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అమరావతిలో నిరసన అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తూ ప్రశ్న అడిగారు. ‘అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సామూహిక నిరసనలు జరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందా? నిరసనకారులపై పోలీసుల దాడులు కేంద్రం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఈ విషయంలో జోక్యం చేసుకునే యోచన ఉందా?’ అని అడిగారు. రాజధాపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే మూడు రాజధానుల అంశంపై టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది’ అని విస్పష్టంగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్ 23న జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది..’ అని పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ప్రజల భద్రత, పోలీసింగ్ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, చట్టప్రకారం అపరాధులపై చర్యలు తీసుకునే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో శాంతి భద్రతల స్థితిని పర్యవేక్షిస్తుంది. భారీగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లైతే రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) పంపడం ద్వారా సాయం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనేదీ కేంద్ర హోం శాఖకు ఇంతవరకూ రాలేదు’ అని వివరించారు. రాజకీయ లబ్ధికి టీడీపీ పాట్లు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని మొదటి నుంచీ చెబుతోంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. కానీ దీనికి వక్రభాష్యం చెబుతూ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. బీజేపీలో చంద్రబాబు కోవర్టు సుజనా చౌదరి తదితరులు కూడా టీడీపీ వాదనను వినిపిస్తూ వికేంద్రీకరణను అడ్డుకుంటామని చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. కేంద్రం ప్రకటనపై హర్షాతిరేకాలు.. మూడు రాజధానుల విధానానికి అనుకూలంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా ‘రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. అందులో కేంద్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకోదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తుంది’ అని చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగానే కీలక ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ విధానానికి ఇటు ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తుండటం అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని పేర్కొంటున్నాయి. -
'చంద్రబాబు ఉచ్చులో రైతులెవరు పడొద్దు'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ రాజధానికి సంబంధించి పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమంటూ కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారంటూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కేంద్రానికి అర్థమైన విషయం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, రాజధాని చుట్టూ ఉన్న రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న బాబు మాటలు ఎవరు నమ్మొద్దని, అతని ఉచ్చులో రైతులెవరు పడొద్దని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్న విషయం నగ్నసత్యమని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని అప్పట్లో ప్రజలు బాబుకు అధికారమిస్తే రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మరింత నీచ స్థితికి దిగజార్చారని అమర్నాథ్ మండిపడ్డారు. (సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్‌లో చర్చించాలా?) -
టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కొత్త ముఖాలు
సాక్షి,అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్‌బ్యూర్‌లోకి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నాయకులు గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. కాగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు కచ్చులూరు పడవ ప్రమాద మృతులకు పొలిట్‌బ్యూరో సంతాపం తెలుపనుంది. -
ఆర్టికల్ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వాదం గురించి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదని ఎంపీ శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు కశ్మీర్ పౌరులకు మద్దతుగా నిలబడుతుందని ప్రకటించారు. కశ్మీరీలు మన తోటి పౌరులని గర్వంగా చెబుతామన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను నిందించడం సరికాదన్నారు. ఆర్టికల్ 370 రూపకల్పనలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ పాత్ర ఉందని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని చీకటి దినంగా కాంగ్రెస్ పార్టీ వర్ణించడంపై వివరణయిస్తూ.. ‘జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్ట్ చేశారు. లోక్‌సభలో మన సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా ఏమయ్యారో తెలియడం లేదు. అఖిలపక్ష నాయకులను కశ్మీర్ తీసుకెళ్తే అక్కడ పరిస్థితులను స్వయంగా అంచనా వేసేవార’ని శశిథరూర్ అన్నారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా సొంత ఇంట్లోనే ఉన్నారని, ఆయనను నిర్బంధించలేదని హోంమంత్రి అమిత్ షా వివరణయిచ్చారు. కశ్మీర్లో కొత్త శకం: గల్లా జయదేవ్ ఒకే దేశం, ఒకే రాజ్యాంగానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. 370 అధికరణను రద్దు చేయడం ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సరిచేశారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం కశ్మీర్‌కు ఎంతో మేలు జరుగుతుందని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. -
ఎంపీ గల్లా అనుచరులపై కేసు
పెదకాకాని (పొన్నూరు) : పాత వాహనం కొనుగోలు విషయంలో కత్తితో దాడికి పాల్పడిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లో శనివారం పాత బస్సు కొనుగోలు చేసిన వ్యవహారంలో జరిగిన ఘర్షణలో ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు షబ్బీర్ ఆయన కుమారులు ఇంతియాజ్, రియాజ్, ఫిరోజ్, ఆయన సోదరుని కుమారుడు సయ్యద్ గఫార్‌లు కలిసి వైఎస్సార్సీపీ కార్యకర్త మురాద్ అలీపై దాడి చేయగా, అడ్డుకున్న మురాద్ అలీ సోదరుని కుమారుడు అక్రమ్‌పై కత్తితో దాడి చేసి గాయపరచిన సంగతి విదితమే. ఈ ఘటనలో మురాద్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపీ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, ఇదే వ్యవహారంలో ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు మురాద్ అలీ, అక్రమ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.అనురాధ తెలిపారు. చదవండి : గల్లా అనుచరుల దాష్టీకం -
కత్తులు, రాడ్లతో స్వైర విహారం
సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు, ఆ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఆటోనగర్‌లో మామూళ్లు వసూలుచేస్తూ రెచ్చిపోతున్నారు. తమ అక్రమాలను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. తమ అక్రమాలను నిలదీశారనే కారణంతో పాత లారీ కొనుగోలు విషయంలో తగాదా పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్రమ్‌పై ఎంపీ గల్లా అనుచరులు ఇంతియాజ్, రియాజ్, ఫెరోజ్, గఫూర్ శనివారం హత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీకి చెందిన ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షబ్బీర్ ఎన్నికల ముందు అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఇతర మంత్రుల సమక్షంలో గల్లా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడిగా చలామణీ అవుతున్న షబ్బీర్.. గత కొన్ని రోజులుగా తన అనుచరులతో ఆటోనగర్‌లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఆటోనగర్‌లో మరమ్మతుల కోసం వచ్చే లారీకి రూ.500, కారుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నాడు. కాగా, ఇక్కడే స్పేర్‌పార్ట్స్ వ్యాపారం చేస్తున్న వైఎస్సార్సీపీకి చెందిన మురాద్ అలీ.. షబ్బీర్, అతని అనుచరుల ఆగడాలను తొలి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. దీంతో మురాద్ అలీపై షబ్బీర్, అతని అనుచరులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటోనగర్‌లో జానీ అనే వ్యాపారి రాజమండ్రిలో పాత లారీ కొనుగోలు చేసిన విషయంలో సంబంధం లేకపోయినప్పటికీ షబ్బీర్ కుమారులు, అనుచరులు మురాద్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మురాద్పై షబ్బీర్ తనయుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో మురాద్ సోదరుని కుమారుడు అక్రమ్ ప్రతిఘటించడంతో అతని కుడి భుజానికి తీవ్ర గాయమైంది. గొడవ అనంతరం షబ్బీర్ అనుచరులు చాలాసేపు ఆటోనగర్‌లో కత్తులు, రాడ్లతో హడావుడి చేశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు అక్రమ్‌ను జీజీహెచ్‌కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో స్వల్పంగా గాయపడ్డ షబ్బీర్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. ఎంపీ అండదండలతోనే.. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం అల్తాఫ్ అనే వ్యాపారిపై కూడా షబ్బీర్, అతని కుమారులు, అనుచరులు హత్యాయత్నం చేశారు. ఈ కేసు విషయంలో అప్పటి సీఐ, హెడ్‌కానిస్టేబుళ్లు షబ్బీర్‌కు సహకరించడంతో బాధితుడు అల్తాఫ్ అర్బన్ ఎస్పీకి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆటోనగర్‌లో షబ్బీర్, అతని అనుచరుల అరాచకాలు తగ్గడంలేదు. టీడీపీ ఎంపీ గల్లా అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, నారా లోకేశ్‌తో షబ్బీర్ (ఫైల్). గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రమ్ -
గల్లా జయదేవ్ అనుచరుల వీరంగం..
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. వివరాలు.. వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రమ్‌పై.. టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ అనుచరులు హబ్బీర్, ఫిరోజ్, గఫూర్, ఇంతియాజ్, రియాజ్‌లు వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రంను అంతమెందించడానికి ప్రయత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నాడు. కత్తులతో మెడపై దాడి చేయడానికి ప్రయత్నించగా అక్రం తప్పించుకునే క్రమంలో భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.