Hardik Pandya
-
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథి?
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్‌కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికికాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.రోహిత్‌పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథిఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.రేసులో ముందుంది అతడేశ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.వరుస వైఫల్యాలతో సతమతంకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్‌లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు. చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ -
ఇద్దరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్ -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.🚨 HARDIK PANDYA SMASHED 74* (35) IN SMAT...!!! 🚨- The No.1 T20 All Rounder...!!! 🙇♂️pic.twitter.com/z1Wo4P1p0s— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్ పటేల్ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు), రిపల్ పటేల్ (7 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్ సేథ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కృనాల్, మహేశ్ పితియా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్, శివాలిక్ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. చింతన్ గజా, అర్జన్ నగస్వల్లా, తేజస్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్‌ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో పాల్గొననున్న టీమిండియా స్టార్లు వీరే..! (ఫొటోలు)
-
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
అందర్నీ సంతోషంగా ఉంచాలంటే... నేను వెళ్లి ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి!
నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జూలై 18న విడిపోయారు. అప్పట్నుంచి నటాషాకు ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఏమ్మాయ్, ముచ్చటైన జంట కదా మీది? ఎందుకు విడిపోయారు?’’‘‘భర్త ఏమైనా అంటే సర్దుకు΄ోవాలి కానీ, పెట్టే బేడా సర్దుకుని బయటికి వచ్చేయటమేనా?’’‘‘ఇప్పుడేమిటి? మీ దేశం వెళ్లిపోతావా? ఇక్కడే ఉండిపోతావా?’’. ‘‘కొడుకు పెద్దవాడౌతున్నాడు. వాడి భవిష్యత్తు ఆలోచించకుండా విడాకులకు నువ్వు కూడా ఎందుకు తొందరపడ్డావ్?’’. ‘‘అతనే విడాకులు కావాలని అడిగినా కూడా, కాళ్లా వేళ్లా పడి అతడితోనే ఉండిపోవాలి కానీ, పంతానికి పోతే ఇలా?’’ఇవీ ఆ ప్రశ్నలు! హార్దిక్‌కి మాత్రం సహజంగానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎప్పటిలాగే అతడు మిడిల్–ఆర్డర్లో రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్, ఫాస్ట్–మీడియంలో రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేసుకుంటూ, తన ఆట తను ఆడుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 2020 మే 31న నటాషా, హార్ధిక్‌ల పెళ్లి జరిగింది. అదే ఏడాది జూలై 30న వాళ్లకు కొడుకు (అగస్త్య) పుట్టాడు. అప్పటికి ఎంతకాలంగా వాళ్లు డేటింగ్లో ఉన్నారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ల లవ్ స్టోరీనే పెద్ద రహస్యం. పెళ్లి కాగానే నటాషా కెరీర్‌కు బ్రేక్ పడింది. నటాషా చక్కటి డాన్సర్, మంచి నటి, పాపులర్ మోడల్. నటనలో తన కెరీర్‌ను మలుచుకోవటం కోసం 2012లో ఇరవై ఏళ్ల వయసులో సెర్బియా నుండి ఇండియా వచ్చారావిడ. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఫిలిప్స్, క్యాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు మోడలింగ్ కూడా చేశారు. అయితే పెళ్లి తర్వాత ఆమె డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ అన్నీ మూలన పడ్డాయి. తిరిగి నాలుగేళ్ల తర్వాత మాత్రమే గత నెలలో ‘తేరే కర్కే’ అనే మ్యూజిక్ వీడియో విడుదలతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించగలిగారు.ఈ పునరాగమనం సందర్భంగా ‘బాంబే టైమ్స్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో (ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా ఆమె విడాకుల మీదే సాగింది) ఆమె ఎంతో దృఢంగా మాట్లాడారు. తను తిరిగి సెర్బియా వెళ్లేది లేదని, ముంబైలోనే ఉండిపోతానని, విడాకులు తీసుకున్నప్పటికీ ఆగస్త్య కోసం హార్దిక్, తను తరచు కలుసుకుంటూనే ఉంటామని చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న దగ్గర ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించారు. ‘‘మీరు విడాకులు తీసుకున్నందుకు మీ వైపు గానీ, హార్దిక్ వైపు గానీ ఎవరూ సంతోషంగా లేరనే మాట వినిపిస్తోంది?’’ అని అడిగినప్పుడు.. ఆ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె నవ్వుతూ ... ‘‘అందర్నీ సంతోషంగా ఉంచాలంటే నేను వెళ్లి ఐస్‌క్రీమ్ బండిని నడుపుకోవాలి..’’ అన్నారు. ఆమె నవ్వుతూనే ఆ మాట అన్నా, ‘విడిపోవటం ఎవరికి మాత్రం సంతోషకరమైన విషయం..’ అని తన మనసులో అనుకునే ఉంటారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో.. ) -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. హార్దిక్ పాండ్యాపై వేటు..?
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాత రెండో టీ20 బ్యాట్‌తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్‌ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్‌కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.మరోవైపు ఈ సిరీస్‌లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్‌కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.విరాట్ కోహ్లి అరుదైన రికార్డు బద్దలుఈ క్రమంలో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ సేన తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ధనాధన్ దంచికొట్టారుఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 29) ధనాధన్ దంచికొట్టాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి 16(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్ కీపర్ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. సిక్సర్‌తో ముగింపుఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్ ఐదో బంతికి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్ ఫినిష్ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను అధిగమించిఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్ పాండ్యా.. భారత్ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్‌దీప్ సింగ్(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
ఇదేం బౌలింగ్?.. హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సందర్భంగా ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో యువ పేస్ దళంతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ శైలి పట్ల మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్‌నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్‌ను రిలీజ్ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్‌రౌండర్‌తో మోర్కెల్ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన శైలికి భిన్నంగా మోర్కెల్ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్ యాక్షన్ గురించి హితభోద చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లపై మోర్కెల్ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం.సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీటఇదిలా ఉంటే.. పేస్ బ్యాటరీ స్పీడ్ గన్స్‌ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా హార్దిక్ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్ సందర్భంగా భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీట వేసింది. మూడు టీ20లు.. వేదికలు ఇవేఅరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్‌కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇక తాజా సిరీస్ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్‌లకు గ్వాలియర్(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా యువ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024 -
నాన్న దగ్గరగా లేడు.. పెదనాన్న, తమ్ముడితో అగస్త్య (ఫొటోలు)