Narendra Modi
-
ఇస్రోకి తీపి కబురు.. మూడో లాంచ్ ప్యాడ్ కు మోదీ గ్రీన్ సిగ్నల్
-
ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు
న్యూఢిల్లీ: ప్రజా శక్తిని సాంకేతికత దన్నుతో (Central Election Commission)కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలోపేతం చేసిందని ప్రధాని , (Narendra Modi)మోదీ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో ఎన్నికలను సజావుగా నిర్వహించిందంటూ అభినందించారు. ఆదివారం ఆయన , (Mann Ki Baat)‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో కార్యక్రమాన్ని చివరి ఆదివారానికి బదులు ఒక వారం ముందుకు జరిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే ఈసీ వ్యవస్థాపక దినోత్సవం జనవరి 25వ తేదీ సమీపిస్తున్న వేళ ఈసీని మోదీ పొగడటం విశేషం. ‘‘ 1951–52లో తొలిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యం దేశంలో మనగలదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వాళ్లందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా అవతరించింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ విధానాన్ని ఆదునీకరిస్తూ, పటిష్టపరుస్తున్న ఈసీకి నా అభినందనలు’’ అని మోదీ అన్నా రు. ‘‘ ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. భారత గణతంత్రానికి ఇది 75వ వార్షికోత్స వం. ఇంతటి పవిత్ర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగపరిషత్లోని మహనీయులకు నా సెల్యూ ట్. ఆనాటి వారి విస్తృతస్థాయి చర్చలు, రాజ్యాంగ సభలో సభ్యుల ఆలోచనలు, వారి ఉపదేశాలు మనకు గొప్ప వారసత్వ సంపద’’అంటూ నాటి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీల ప్రసంగాల ఆడియో క్లిప్‌లను మోదీ వినిపించారు. ‘‘ భారత్ తరఫున తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహాల కూటమి ఫైర్ఫ్లైను నింగిలోకి పంపి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ చరిత్ర సృష్టించిన విషయాన్ని చెప్పేందుకు గర్వపడుతున్నా’’ అని మోదీ అన్నారు. -
మోదీ జీ.. వారికి భూమిలిచ్చి ఆదుకోండి: కేజ్రీవాల్ మరో లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) మరింత సమీపిస్తున్న వేళ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి(Narendra Modi)కి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఇటీవల జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను ప్రధాని మోదీ దృష్టి తీసుకొచ్చారు కేజ్రీవాల్. జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంచితే, గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్! -
భారత్‌లో ట్రంప్ పర్యటన.. ఎప్పుడంటే?
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి ముందే డొనాల్డ్ ట్రంప్ (donald trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్‌లో(india) పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు చైనాలో పర్యటించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని తన సలహాదారులతో ట్రంప్ మంతనాలు జరిపినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.మరికొద్ది నెలల్లో వైట్‌హౌస్‌లో జరిగే దేశాదినేతల సమావేశానికి ట్రంప్.. భారత ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారని ట్రంప్ విశ్వసనీయ మీడియా వర్గాలు తెలిపాయి. వైట్ హౌస్ సమావేశంలో దేశాదినేతలు చర్చలు సఫలమైతే.. ట్రంప్ ఏప్రిల్ లేదంటే ఈ ఏడాది ఆగస్ట్ నెల తర్వాత భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ చివరి సారిగాడొనాల్డ్ ట్రంప్ చివరి సారిగా అమెరికా అధ్యక్షుని హోదాలో 2020లో భారత్‌లో పర్యటించారు. ఆ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత పర్యటనలో భాగంగా ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్‌లు తరలివచ్చారు. ట్రంప్ తన పర్యటనలో అహ్మదాబాద్, న్యూఢిల్లీని సందర్శించారు.భారత్‌లో క్వాడ్ మీటింగ్ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వాడ్ దేశాలు ఈ ఏడాది భారత్‌లో సమావేశం కానున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్న క్వాడ్ సమావేశానికి భారత్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ సమావేశానికి సభ్యదేశాధినేతలు నరేంద్ర మోదీ (భారత్), ఆంటోనీ ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), ఫుమియో కిషిదా (జపాన్)లు హాజరు కానున్నారు. అధ్యక్షుని హోదాలో క్వాడ్ సమావేశానికి హాజరైతే.. బరాక్ ఒబామా తర్వాత ట్రంప్ రెండుసార్లు భారత్‌ను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఒబామా 2010, 2015లో భారత్‌లో పర్యటించారు. 2015లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు వాషింగ్టన్ సిటీ క్యాపిటల్ భవనంలోని రొటుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
కూలదోయబోయి కూలబడ్డారు
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు. -
చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి
న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్‌లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్‌గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. మృత మూలధనం కాదు ‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం. స్వామిత్ర (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం. -
ఈవీ రంగం @ 8 రెట్లు..!
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో ఉందని మోదీ అన్నారు.టాటా.. 32 కొత్త వాహనాలు టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్‌తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్‌తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తోపాటు జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.ఇక జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్‌లో కార్స్, ట్రక్స్, బస్‌ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీమారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్‌కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు. కొత్తగా 1.5 లక్షల మందికి.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్‌కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్పో వేదిక కానుంది. -
బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశం
వేల ఏళ్ల క్రితమే భారతదేశం శాంతి సౌభాగ్యాలను ప్రవచించిన బుద్ధభూమిగా విదేశాల వారికి తెలుసు. ప్రపంచమంతా కత్తులతో సామ్రాజ్య విస్తర ణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నాడు. అదీ భారత వారసత్వ బలం. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. బౌద్ధ సూత్రాలు అనేకం మన రాజ్యాంగంలోనూ పొందుపరచారు అంబేడ్కర్. అయితే ఈనాడు తద్ద్విరుద్ధమైన పరిస్థితులుదేశంలో నెలకొని ఉన్నాయి. దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో ఉంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమం అవసరం.ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్‌లో 18వ ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) సదస్సులో ప్రసంగిస్తూ ‘మానవుని భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధునిలో ఉందని’ ఉద్ఘాటించారు. ఇది చాలా చరిత్రాత్మకమైన ప్రకటన. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ప్రకటన అని చెప్పక తప్పదు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి గురించి, అలాగే ఇజ్రాయెల్– గాజా మధ్య జరుగుతున్న మానవ హననం గురించిన ఆందోళన ఇందులో లీనమై ఉంది. ఇంకా ఆయన ఈ సందర్భంగా మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వార సత్వం కారణంగా మన తత్త్వాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామనీ, ప్రస్తుతం ప్రపంచం మనం చెప్పే మాటను వింటోందని తెలిపారు. ఆయన మరొక ముఖ్యమైన ప్రస్తావన కూడా చేశారు. ‘ప్రపంచ మంతా కత్తులతో సామ్రాజ్య విస్తరణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నారు. అదీ భారత వారసత్వబలం. భారత్ అంటే ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. భిన్నత్వం గురించి మనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలు దానిపైనే నడుస్తున్నాయి. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా ఆ సమాజంలోఅంతర్భాగం అవుతారు. ఆ యా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ చిత్తశుద్ధితో పనిచేసి అక్కడి పురోభివద్ధికి దోహదపడు తుంటారు. అదే సమయంలో వారి హృదయాలు భారత్ కోసం తపిస్తుంటాయి. ప్రవాసులను మన దేశ రాయబారులుగా నేను చూస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరుగుతున్నానంటే దానికి వారే కారణం. అన్ని చోట్లా వారు నాకు ఘనస్వాగతం చెబు తుంటారు. భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని అన్నారు. వాస్తవానికి భారతదేశం అశోకుడు కత్తి దించాక ప్రపంచంఅంతా విస్తరించింది. కేవలం సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, తాత్విక సాంస్కృతిక విప్లవం కూడా భారత్ నుండి ప్రపంచానికి విస్తరించింది. భారతదేశం ఉత్పత్తి క్రమం పెరగాలంటే తప్పక బౌద్ధం విస్తృతి ప్రపంచ దేశాలకే కాదు భారతదేశానికీ మరింత అవసరం అని అంబేడ్కర్ అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ప్రసిద్ధ భారతదేశ చరిత్ర పరిశోధకులు రొమిల్లా థాపర్ బౌద్ధం... మరీ ముఖ్యంగా అశోకుని బౌద్ధం స్వీయ జీవిత అనుభవం నుంచి వ్యక్తీక రించబడిందని, అనుసరించబడిందని చెప్తూ అది భారతదేశంలో నూత్న నిర్మాణానికి దారి తీయడానికి ఎన్నో సామాజిక అసమాన తలకు సంబంధించిన అమానవ ధర్మాలను త్రోసి పుచ్చిందని అన్నారు. ‘దమ్మం అనేది అశోకుని దృష్టిలో ఒక జీవిత విధానం. అది అతనికి పరిచయమున్న తత్త్వవేత్తల నైతిక బోధనల సారం. బహుశా స్వీయ జీవితానుభవ సారం కూడా అయివుండవచ్చు. ఆ జీవిత విధానం ఉన్నత స్థాయి సామాజిక నీతి మీద, పౌరబాధ్యతల మీద ఆధారపడింది. అంతేగాక అశోకుడు... వర్ణవ్యవస్థను గురించి ఆదర్శప్రాయంగా చిత్రించిన సిద్ధాంతంగా కాక, నిత్యజీవితం దృష్ట్యా తన దమ్మాన్ని రూపొందించార’ని రొమిల్లా థాపర్ విశ్లేషించారు. ‘సాధారణంగా పెక్కు సమాజాలలో కన్పించే సాంఘిక డాంబికత్వాన్ని పరిహరించి, మానవత్వ సిద్ధమైన సాంఘిక ప్రవర్తనను అశోకుడు కాంక్షించాడు. స్వర్గ సౌఖ్యం వంటి ఆధ్యాత్మిక భావనలో ప్రజలకు పరిచయముంది. అటువంటి ప్రతిఫలాల ఆశ చూపటం ద్వారా సాంఘిక బాధ్యతను కేవలం సదాచార వర్తనగా గాక, సాత్విక ప్రాధాన్యం ఉండి నిర్వా్యజంగా అనుసరించే బాధ్యతగా ఉదాత్త స్థానానికి కొనిపోవడానికి అశోకుడు ప్రయత్నించాడ’ని రొమిల్లా థాపర్ అశోకుని పరిపాలనా విధానం గురించి చెప్పారు.ఈనాడు భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక, ఆర్థిక విప్లవం అవసరం అని నరేంద్ర మోదీ సంఘ్‌పరివార్ శక్తులకు కూడా బోధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో వుంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా ఆయనఅంతర్గత లౌకిక వాదానికి కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి దిగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతులు తగ్గుతున్నాయి. భారతదేశంలో సామాజిక ఆర్థిక ఉత్పత్తులు పెరగా లంటే ఈనాడు తప్పకుండా సామాజిక జీవన సామరస్యాన్ని,శాంతిని, కరుణను, కుల వివక్షేతరమైన ప్రజ్ఞను గుర్తించే కుల నిర్మూలనా భావం పాలకులకు అవసరం. బౌద్ధ సంస్కృతీ వికాసం అవసరం. అశోకుడి పాలనను పునర్వివేచించుకొని సమన్వయించు కోవడం అవసరం.బౌద్ధాన్ని ఒక మతంగా కాక ఒక ధర్మంగా, ఒక నీతిగా పరి వ్యాప్తి చేయవలసిన అవసరం వుంది. సారనాథ్‌లో అశోకుడు నిలిపిన శిలాస్తంభ అగ్రభాగంలోని నాలుగు సింహాల శిల్పాన్ని భారత ప్రభుత్వం అధికార ముద్రగా స్వీకరించింది. కానీ ఈ దేశాన్ని బౌద్ధ భూమిగా ప్రకటించలేకపోయింది. అయితే ఇప్పుడు హిందూదేశంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుండడం గమ నార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు యుద్ధానికి బదులు శాంతి అవ సరం అని చెబుతున్న పాలకులందరూ ఆయుధ సంపత్తికే ఎక్కువ ధనం ఖర్చు బెట్టడం విడ్డూరం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అంత ర్జాతీయ వేదికలపై చెబుతున్న మాటలను భారతదేశంలో కూడా నిరంతరంగా చెప్పడమే కాక, ఆచరణలోకి తీసుకురావడం వల్లఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో భారత రాజ్యాంగకర్త అంబేడ్కర్‌ను అవమానిస్తూ మాట్లాడటాన్ని మోదీ ఖండించలేదు. అది బాధాకరమైన విషయం. బుద్ధ–అశోకులంతటి వారు అంబేడ్కర్. భారతదేశంలో ఈనాడు రక్తపాతంలేని సమాజం ఏర్పడిందంటే ఆయనే కారణం.నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఆర్థిక పరిస్థితులు దిగ జారడానికి కారణం బౌద్ధ జీవన విధానం ప్రపంచంలో లేకపోవ డమే! ప్రపంచమంతా ఆశాంతిగా ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి కారణం ప్రకృతినీ, మనిషి వ్యక్తిత్వాన్నీ కాపాడుకోలేక పోవడమే. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావనలు పెరిగి పర్యావరణవిధ్వంసం, యుద్ధకాంక్ష, దోపిడీలు పెరగడం వల్ల ప్రపంచంలోశాంతి అంతరిస్తూ ఉంది. అంబేడ్కర్ రాజ్యాంగంలో బౌద్ధ ధమ్మంలోని అష్టాంగ సూత్రాలు, పంచశీల వంటి వాటి నుండే భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. నరేంద్ర మోదీ బౌద్ధంతో పాటు ప్రపంచానికి భారత రాజ్యాంగ ప్రశస్తిని చాటవలసిన అవసరం ఉంది. బుద్ధుణ్ణి, అశోకుణ్ణి, అంబేడ్కర్‌ని భారతదేశ పునర్మిర్మాణ కర్తలుగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క మోదీనే కాదు, ప్రతిపక్ష నాయకులు, ఆ యా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బౌద్ధ సంస్కృతి వికాసానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్ర బాబుకి అమరావతిని బౌద్ధ సాంస్కృతిక, తాత్విక, ఆర్థికకేంద్రంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్ప వలసిన అవసరం ఉంది. చంద్రబాబు నోట బుద్ధుని పేరు గాని, అశో కుని పేరుగాని, అంబేడ్కర్ పేరుగాని రాకపోవడం శోచనీయం. ఈనాడు భారత రాజ్యాంగ సూత్రాల పునాదుల మీద బౌద్ధ జీవన పునరుజ్జీవనానికి ఆచరణాత్మకంగా పూనుకోవాల్సిన చారిత్రక సంద ర్భంలో మనమున్నాం. ఆ దిశగా నడుద్దాం. - వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్‌తో ఒరిగేదేమీ లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఉక్కు పోరాట కమిటీ.. ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్రాలకు లేదని మండిపడుతోంది. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన సాయం పై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం అరకొరగా స్పందించిందని.. అరకొర చర్యలతో విశాఖ ఉక్కుకు ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 11,500 కోట్లు ప్యాకేజీ ప్రకటించి.. అందులోనే 10,300 కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తామనడం సరికాదు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలంటే సెయిల్‌లో విలీనం చేయాల్సిందే. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి ప్రోత్సహించడం సరికాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించడం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకమే’’ అని రామకృష్ణ స్పష్టం చేశారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ గుడ్ న్యూస్
-
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్‌కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది. కొత్త లాంచ్ ప్యాండ్ ప్రస్తుతమున్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరా లను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.రెండు ప్యాడ్లపైనే ఆధారంభారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ పాడ్లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్ఎల్వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్ఎల్వీ మిషన్ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదేవిధంగా, 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.రెండో లాంఛ్ ప్యాడ్‌కు బ్యాకప్‌గా..ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్‌కు బ్యాకప్‌ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దన్నుగా నిలువనుంది. నాలుగేళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మూడో లాంఛ్ ప్యాడ్ కేవలం నెక్ట్స్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్‌తో లాంఛ్ వెహికల్ మార్క్–3(ఎల్వీఎం3)వాహనాలకు, అలాగే ఎన్జీఎల్వీ యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంఛ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే. మరిన్ని విశేషాలువిస్తరణ: రెండో లాంచ్ ప్యాడ్‌లో సమ స్యలు తలెత్తిన సందర్భాల్లో జీఎస్ఎల్వీ ప్రయోగా లు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా పనిచేస్తుంది. ఎన్జీఎల్వీ సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు: నూతన తరం లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) కుతుబ్ మినార్‌కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువగా అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా, ఎన్జీఎల్వీ అత్యధిక పేలోడ్‌ను అంటే 70 టన్నుల పేలోడ్‌ను సైతం భూమికి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు. -
ప్రాజెక్ట్ చిరుత.. పరాజిత
భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతులను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’ (ప్రాజెక్ట్ చీతా) ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో వదిలిన చిరుతల్లో జీవించి ఉన్న ఒకే ఒక చిరుత పవన్ కొద్దినెలల క్రితం మృతి చెందడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్యప్రాణి ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య 2022 సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్. ఆఫ్రికన్ చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాలపాటు అడవిలో జీవిస్తాయి. కానీ.. పవన్ ఆరేళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది. దీంతో చీతా ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతిసరైన సంరక్షణా చర్యలు లేవా! పవన్ మృతి చెందిన తర్వాత మిగిలి ఉన్న చీతాలన్నింటినీ ఎన్క్లోజర్లు, అడవిలా తీర్చిదిద్దిన ప్రాంతాల్లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చీతా ప్రాజెక్టు అతి పెద్దది. దేశంలోని చాలా వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించి సుమారు 58 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. అయితే, శాస్త్రీయ అధ్యయనం, సరైన సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు విఫల దశలో ఉన్నట్టు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా చీతాలను ఆఫ్రికా నుంచి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు వన్యప్రాణుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేసి ఉంటే.. ఆఫ్రికన్ చీతాలకు అనువుగా ఉండే అడవులను మొదట సిద్ధం చేసి ఆ తర్వాత వాటిని తీసుకురావాల్సి ఉంది. కానీ.. ముందే వాటిని తీసుకువచ్చి ఆ తర్వాత కునో జాతీయ పార్కు అందుకు అనువైనదని భావించి అందులో వదిలారు.కానీ.. కునో పార్కు వాటికి సరైన ఆవాసం కాదని తేలింది. అందుకే చీతాలు అందులో జీవించలేకపోయాయి. దీంతో కొన్ని గడ్డి మైదానాల్లోని ఫెన్సింగ్‌లు, క్యాప్టివ్ బ్రీడింగ్‌పై ఆధారపడ్డారు. కేవలం ప్రచారం కోసం పాకులాడడం తప్ప నిబద్ధత లోపించడంతో వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. అత్యంత వేగం చిరుతల ప్రత్యేకతచిరుతలు అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. మూడు సెకన్లలోనే గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. 1967 వరకూ ఇవి మన దేశంలోనూ ఉన్నాయి. వాటి ఆవాసాలు కుచించుకుపోవడం, అడవులు తగ్గిపోవడం, వేటాడటం, సింహాలు, పులులు, చిరుతలు వాటి ఆహారం కోసం పోటీ పడుతుండడంతో క్రమేపీ అవి దేశంలో అంతరించిపోయాయి. ఇన్ఫెక్షన్లు, గాయాలతో.. దేశంలో వీటిని మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం 2021లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన అడవుల్లో చీతాల పునరుత్పత్తిని ప్రారంభించి అడవిలో వాటి జనాభాను పెంచాలని భావించింది. అయితే.. తీసుకువచ్చిన చీతాలను అడవిలో వదిలిన తర్వాత అవి ప్రాణాంతకమైన సెప్టిసిమిమా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాయి. మరికొన్ని ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యాయి. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలోనే ఉంచి పర్యవేక్షించారు. ప్రభుత్వం చీతా ప్రాజెక్టు చేపట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ వ్యవస్థలో భాగమైన గడ్డి భూముల అడవుల్లో మనుగడ సాగిస్తేనే ఉపయోగం ఉంటుంది. అలాంటి వాతావరణం లేకపోవడంతో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మిగిలిన ఏకైక చీతా పవన్ మృతి చెందింది. అంతకుముందు 12 చీతాలు కూడా ఇలాగే మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 12 చీతాలు, మరో 12 పిల్ల చీతాలు ఎన్క్లోజర్లలో ఉన్నాయి. వాటిని అడవిలోకి వదిలితే అవి బతుకుతాయో లేదోననే అనుమానాలు, భయాలతో వాటిని అక్కడే ఉంచి సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షణలో ఉన్న చీతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
-
ద్విగుణీకృతమైన సాగర పాటవం
ముంబై: భారత్ తిరుగులేని సాగరశక్తిగా ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ను బుధవారం ముంబై నావల్ డాక్ యార్డులో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి జాఢ్యాల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. ‘‘మూడు యుద్ధనౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేస్తుండటమే ఇందుకు కారణం. గత పదేళ్లలో మా హయాంలో 40 నౌకలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఏకంగా 39 భారత్‌లోనే తయారవడం విశేషం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహా్నలను రూపొందించుకున్నాం. రూ.1.5 లక్షల కోట్లతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. సాగరగర్భంలో దాగున్న అపారమైన అవకాశాలను ఒడిసిపట్టే ప్రయత్నమూ జోరుగా సాగుతోంది. మన పరిశోధకులు 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్రయాన్ ప్రాజెక్టు ఊపందుకుంది’’ అని వివరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భాగస్వామ్య దేశాలన్నింటికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం నిలబెట్టుకున్నాక మోదీ మహారాష్ట్రలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మహాయుతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.ఐఎన్ఎస్ నీలగిరి → ప్రాజెక్ట్ 17ఏ స్టెల్త్ ఫ్రి గేట్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.→ శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టె క్నాలజీ దీని సొంతం.→ గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్ టెక్నాలజీ ఉంది. → ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. → ఐఎన్ఎస్ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.→ ఎంహెచ్–60ఆర్ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.ఐఎన్ఎస్ సూరత్ → ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక. → ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. → అత్యాధునిక ఆయుధ, సెన్సర్ వ్యవస్థలు, అధునాతన నెట్వర్క్ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం. → దీన్ని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. → 80% దేశీయంగా∙తయారవడం విశేషం.ఐఎన్ఎస్ వాఘ్షీర్ → ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో ఆరో జలాంతర్గామి. → దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలుపంచుకుంది. → యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. → నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది. → అత్యాధునిక ఎయిర్–ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం. → డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. → దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైళ్లు, వైర్ గైడెడ్ టార్పెడోలను మోహరించారు. → భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు.#WATCH | Mumbai: On the commissioning of three frontline naval combatants, PM Narendra Modi says, "...It is a matter of pride that all three frontline naval combatants are Made in India. Today's India is emerging as a major maritime power in the world." pic.twitter.com/DisB0t8oDY— ANI (@ANI) January 15, 2025 #WATCH | Mumbai, Maharashtra: Prime Minister Narendra Modi dedicates three frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation(Source: ANI/DD) pic.twitter.com/0PI3kxlVT4— ANI (@ANI) January 15, 2025 -
మోదీ పగలబడి నవ్వింది అందుకే!
దేశ ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం. ఎవరూ తప్పుపట్టలేము. కానీ ప్రధానే ఇబ్బందిపడేలా పొగిడితే? ఎంత ఎబ్బెట్టు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇది ఆయన సొంతపార్టీ తెలుగుదేశం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కూడా!. .. అంత పొగిడినా మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా బాబును నిరాశకు గురి చేసి ఉంటుంది. అలాగని ఆ విషయం గట్టిగా చెప్పలేని స్థితి. కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ఉన్న సమయంలో.. చంద్రబాబు మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావిచ్చారనిపిస్తోంది. బహుశా కేంద్రం స్థాయిలో తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)కు పట్టం కట్టాల్సి వస్తే సమస్యల్లేకుండా చూసుకోవడం వంటివి బాబుకు ఈ పరిస్థితి కల్పించి ఉంటాయని అనుకుంటున్నారు!. చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని మోదీ ప్రశంసలకే కేటాయించడం సొంతపార్టీలోనే చాలామందికి నచ్చలేదట!. ఇది పార్టీ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా ఫర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే 2019 ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు. పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానమంత్రిని ‘టెర్రరిస్టు’గా అభివర్ణించారు. ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు. చివరికి భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించే వారు. పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ‘యూ టర్న్ బాబు’ అని నామకరణం చేసింది కూడా మోదీనే. కొడుకు కోసమే బాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేశారు. దీనికి ప్రతిగా బాబు తనకు కుటుంబం ఉందని, మీకేం ఉందని మోదీని ఘాటుగా ప్రశ్నించారు అప్పట్లో. అయితే 2024నాటికి తిరిగి వారిద్దరూ కలిసిన తీరు రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఒక నిదర్శనం!. పరువు ప్రతిష్టలు, ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవే కానీ, ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి.. మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత. ఆయన 1978 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నారు. 1995లోనే తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. తాను సీనియర్‌ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు పదే పదే గుర్తు చేశారు కూడా. అలాంటి బాబుగారు ఇప్పుడు ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అంటున్నారు. తమ ఇద్దరిది ఒకటే స్కూల్ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించడంతో మోదీ నవ్వుతూ కూర్చున్నారు. బహుశా ఇదే చంద్రబాబు గతంలో తనను ఉద్దేశించి ఏమన్నది మోదీకి గుర్తు వచ్చి ఉండవచ్చు!. గత మూడు దశాబ్దాలలో మోదీకి, చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. జరిగిన మత ఘర్షణలలో ఆయన రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. వస్తే అరెస్టు చేయిస్తానిని కూడా హెచ్చరించారు. అప్పటికి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు. 2009లో బీజేపీని వదలి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), వామపక్షాలతో కూటమి కట్టి ఓటమి పాలవడంతో తిరిగి బీజేపీ వైపు మళ్లారు. 2014లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాట్లు పడ్డారు. మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మాట కలిపే యత్నం చేశారు. ఎలాగైతేనేం..2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత.. ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్యనేతలు దూషించేవారు. ఆ క్రమంలో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శించారు. ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే భావన ఏర్పడేది. దానికి తోడు చంద్రబాబు 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు.. 2019లో ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో.. తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు. ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. అలాగే.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇదే టైమ్‌లో బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ సిద్దం కాకపోవడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది!... ఎలాగైతేనేం 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగుడుతున్నారు. అది విశాఖ సభలో శ్రుతి మించిందని చెప్పకతప్పదు. మోదీ భజన చేస్తే చేశారులే.. ఏపీకి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడతారేమో అని ఆశగా ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా.. విశాఖపట్నంలో ఐదు దశాబ్దాలుగా విరాజిల్లుతున్న విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని మాత్రం కోరలేకపోయారు. పైగా పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయదలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి గుర్తు చేసి, ప్రధాని పాజిటివ్‌గా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ స్టీల్ సంగతేమిటి?’’ అని ఎవరికైనా సందేహం వస్తే అది వారి ఖర్మ. కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు. పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలమని ఏమైనా చెప్పారా? అంటే అదీలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సెంటిమెంట్ అని, దానిని కాపాడుకోవాల్సిందేనని, ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే విశాఖ స్టీల్ ను సేవ్ చేయగులుగుతామని, తాము ప్రధానిని ఒప్పించగలుగుతామని చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. వాటిని కూడా నమ్మి అక్కడి వారు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్దులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారిపోయింది. పైకి మాత్రం మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూ, అక్కడ ఉద్యోగాలు పోతున్నా, ఇనుప ఖనిజం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా వామపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్‌లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా వ్యవహరించారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాని మోదీని విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయవద్దని, దానికి అసరమైన గనులు కేటాయించాలని కోరారు కదా. మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అంటూనే, ఏపీకి కావల్సిన డిమాండ్లను తీర్చాలని విస్పష్టంగా కోరారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగారు. కానీ.. ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దాని గురించి మర్చిపోయారు. ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు, పవన్ లు ప్రస్తావించకపోవడంతో ప్రధాని మోడీకి సమాధానం చెప్పే అవసరమే లేకుండా పోయింది.విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే కూటమి నేతలంతా పరిమితం అయ్యారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులకు ఆరోజుల్లో తెలుగుదేశం నేతలు అడ్డుపడే యత్నం కూడా చేశారు. పలు రాష్ట్రాలు పోటీపడినా ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దానిని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతేనని నిస్సిగ్గుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్.టి.పి.సి ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే. అలాగే రైల్వేజోన్ కు అవసరమైన భూమిని కేటాయించింది సైతంం జగన్ సర్కారే. కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు. చివరికి అదే భూమిలో శంకుస్థాపన చేశారు. అయినా మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలగాలి. శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ,ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు మించినవారు ఉండరేమో!. ప్రధాని మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్దతి అనుకోవచ్చు. అలాకాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం?. ఇంతకీ మోదీని ఆనాడు చంద్రబాబు దూషించడాన్ని సమర్ధించాలా? లేక ప్రస్తుతం పొగడడాన్ని ఒప్పుకోవాలా?.. అంటే ఏమి చెబుదాం. అలాగే ఒకప్పుడు అవినీతిపరుడు అన్న చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి? మొత్తం మీద వీరిద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేశారా?!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి👉🏾: ‘చంద్రబాబు ఎన్డీయేకి ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం!’ -
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. విశ్వంభరలో చిరంజీవి..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi. Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025 -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
ఆనందం.. ఆరోగ్యం ఇవ్వాలి..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మోదీకి కిషన్‌రెడ్డి కుటుంబస భ్యులతోపాటు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. నేరుగా తులసికోట వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయి ద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలు వెలిగించారు.గంగిరె ద్దులకు వృషభ పూజ చేశారు. అక్కడి నుంచి సంప్రదాయ, జానపద కళాకారుల నృత్యా లు, డప్పు చప్పుళ్ల మధ్య సభాస్థలి వరకు మోదీకి స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై ప్రధాని మోదీ జ్యోతి వెలిగించారు. ప్రముఖ గాయని సునీత శ్లోకం అలపించగా, ఢిల్లీ నా ట్య అకాడమీ బృందం నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది సంస్కృతి, సమృద్ధి, పునరుద్ధరణ వేడుక: మోదీ సంక్రాంతి పండుగ సంస్కృతి, పునరుద్ధర ణల వేడుక అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలల్లో అంతర్భాగ మైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ ముగించారు. సంకాంత్రి అంటే రైతుల పండుగ: కిషన్రెడ్డిసంక్రాంతి అంటేనే రైతులు..గ్రామాల పండుగ అని కిషన్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించానని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాధిత్య సింథియా, మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, సతీష్‌చంద్ర దూబే, శ్రీనివాస్‌వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కె.లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే.అరుణతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ నేతలు, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, క్రీడాకారిణి పీవీ.సింధు, మంగ్లీ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్‌లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్‌లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్‌బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్‌ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
కిషన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. -
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారుమీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
శ్రీనగర్:కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్‌మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్అబ్దుల్లా మాట్లాడారు.‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. -
Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!
సోనామార్గ్: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్–మోర్హ్ టన్నెల్‌గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం ‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్‌క్రీమ్ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్‌చౌక్‌కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్‌ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్‌లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్‌లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఆరోజు మారథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. నూతన శకమిది ‘‘ఇది జమ్మూకశ్మీర్‌కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్ భారత్‌కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్‌ను ప్రారంభించాక మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్‌గిర్, గుండ్, కంగన్ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం. దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్ పొగడ్తలు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్‌కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్ ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్ టన్నెల్ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్ అన్నారు. రూ.2,716 కోట్ల వ్యయంతో.. రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బల్ జిల్లాలో శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై గగన్‌గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను నిర్మించారు. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం పాల్గొన్నారు. #WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today. CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1— ANI (@ANI) January 13, 2025 #WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel. CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm— ANI (@ANI) January 13, 2025 -
ఆర్టికల్ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్ అబ్దుల్లా ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్టికల్-370 రద్దుతో సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి, ఆర్టికల్ రద్దుకు లింక్ పెట్టొద్దు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్ము కశ్మీర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ఇవి ప్రణాళిక చేయబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో 2008, 2010, 2016లో ప్రముఖంగా కనిపించిన రాళ్ల దాడులు, నిరసనలు వంటి కార్యకలాపాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఇది కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇది జరిగింది. సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మార్పును ప్రజలు అంగీకరించాలి. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి ఒమర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "Let's not link the infrastructure projects in J&K to the politics surrounding Article 370. Most of these projects are not located in any areas that saw activities like stone-pelting and protests": CM Omar Abdullah@OmarAbdullah pic.twitter.com/gbODYR3KdH— Rahul Kanwal (@rahulkanwal) January 13, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి.