Covishield
-
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది. -
కొవిషీల్డ్ వివాదం.. బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఫైర్
లక్నో: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్ మే ఔర్ బీజేపీ గయ్’’ అని ఎద్దేవా చేశారు.మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కొవిషీల్డ్ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్‌తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్‌కు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్నే తీసుకోడం గమనార్హం. — ANI (@ANI) May 1, 2024 -
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్‌ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024 -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
కోవిడ్ టీకాలకు కటకట..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కోవిడ్ టీకాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ల స్టాక్ పూర్తిగా ఖాళీ అయింది. టీకా కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్తున్నవారికి ప్రస్తుతం అందుబాటులో లేవన్న సమాధానమే వస్తోంది. మరోవైపు చైనాతోపాటు పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయని వస్తున్నవార్తలతో జనంలో ఆందోళన కనిపిస్తోంది. డిమాండ్ మేరకు టీకాలను సరఫరా చేయకపోవడం, ప్రభుత్వ కోల్డ్ చెయిన్ పాయింట్ (సీసీపీ), డిస్ట్రిక్స్ వ్యాక్సి నేషన్ పాయింట్ (డీవీ ఎస్) కేంద్రాలకు ఇప్పటికే సర ఫరా చేసిన కోవిషీల్డ్ టీకాల గడువు ముగిసిపోవడం వంటివి ఇబ్బందికరంగా మారింది. ఇదే టీకా తొలి రెండు డోసులు వేసుకున్న వారితోపాటు విదేశాలకు వెళ్లాల్సినవారు వ్యాక్సిన్లు అందుబాటులో లేక ప్రైవేటులో తీసు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సొమ్ముచేసు కుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు టీకాలతోపాటు అదనపు చార్జీలు అంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవిషీల్డ్ గడువు ముగియడంతో.. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ప్రజలకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది. మెజార్టీ ప్రజలు మొదటి, రెండో డోసు కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నారు. బూస్టర్ డోసులు పంపిణీ మొదలైనా ఇటీవలి వరకు పెద్దగా డిమాండ్ కనిపించలేదు. కానీ కొన్నిరోజులుగా కోవిడ్ కొత్త వేరియంట్లను గుర్తించడం, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తుండటంతో.. బూస్టర్ (ప్రికాషన్) డోసు వేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,24,42,135 ఫస్ట్‌డోసు, 3,15,40,633 సెకండ్ డోసు టీకాలను పంపిణీ చేశారు. వీరిలో 1,32,93,044 మంది ప్రికాషన్ డోసు తీసుకోగా.. మరో 1,61,38,443 మందికి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందు సరఫరా చేసిన కోవిïషీల్డ్ టీకాల గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసి పోయింది. దీనితో మిగిలిన టీకాలను పక్కన పడేశారు. సంబంధిత వెబ్సైట్ కూడా మూడు రోజుల కిందే మూతపడింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా 2.77 లక్షల డోసులే స్టాకు ఉంది. ఈ వ్యాక్సిన్ గడువు కూడా ఈ నెలా ఖరుతో ముగియ నున్నట్టు సమాచారం. టీకా నిల్వలు దగ్గరపడుతుండటంతో వైద్య సిబ్బంది కూడా ఏమీ చేయ లేక చేతులెత్తేస్తున్నారు. వ్యాక్సినే షన్ కోసం ఆస్పత్రు లకు వెళ్తున్నవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ లేదన్నారు ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. వాక్సినేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే మొదటి, రెండు డోసులు కోవిషీల్డ్ తీసుకున్నా. బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంది. టీకా కోసం గురువారం బాలాపూర్ పీహెచ్‌సీకి వెళ్లాను. కానీ ఆ టీకా లేదన్నారు. ఎనిమిది రోజుల్లో ప్రయాణం ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – అశోక్‌కుమార్, మీర్పేట్, హైదరాబాద్ టీకాల కోసం లేఖ రాసినా స్పందించని కేంద్రం కేంద్ర ప్రభుత్వం కంపెనీల నుంచి కరోనా టీకాలను తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఆయా రాష్ట్రాల అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ టీకాల స్టాకు ఖాళీ అవుతుండటంతో వెంటనే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కొన్నిరోజుల కిందే కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. కానీ దీనిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా కేంద్రం నుంచి టీకాలు అందడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..! -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ఉచిత బూస్టర్ డోస్ 24/7
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం కొనసాగనుంది. ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్ బూస్టర్డోస్లకు ఆర్డర్ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు. గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్ ఇన్చార్జి సుధా ఓంకార్ చెప్పారు. 20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్ గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్ డోస్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 24/7 కొనసాగుతుందన్నారు. (చదవండి: డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్! ) -
మరో మైలురాయికి సిద్ధమా?
కరోనా ఇప్పటికీ ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని వార్తలు వస్తున్న వేళ... ఆదివారం ఒకింత సంతోషకర సమాచారం వచ్చింది. మనదేశంలో వేసిన కోవిడ్–19 టీకా డోసుల సంఖ్య తాజాగా 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశ వయోజనుల్లో 96 శాతానికి కనీసం ఒక డోసు, 87 శాతానికి రెండు డోసులూ అందినట్లయింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమంలో ఇది ఓ అరుదైన విన్యాసం. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది.’ టీకాలపై అపోహలు, మందకొడి టీకాకరణ, టీకాల కొరత – ఇలా సవాలక్ష సమస్యలు ఎదురైనా, 2021 జనవరి 16న మొదలుపెట్టి, 18 నెలల్లో ఇన్ని కోట్ల కరోనా టీకా డోసులు వేయడం కచ్చితంగా చరిత్రే. కాకపోతే, ‘ముందు జాగ్రత్త మూడో డోసు’ను వయోజనులకు ఉచితంగా వేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించే వేళకు దేశంలో గత నాలుగు నెలల్లోకెల్లా గరిష్ఠస్థాయికి మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. అలక్ష్యం వదలాలని అందరికీ గుర్తుచేస్తున్నాయి. మన దేశంలో తొలి శతకోటి డోసులకు 9 నెలలు పడితే, ఇప్పుడీ రెండో శతకోటి సంబరానికీ మళ్ళీ 9 నెలలే పట్టింది. టీకాలు వేయడంలో వేగం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యమని ప్రభుత్వ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లెక్కల్లో చూస్తే అది నిజమే కానీ, క్షేత్రస్థాయిలో నిజంగా వేగం తగ్గలేదంటారా అన్నది విమర్శకుల ప్రశ్న. వ్యవస్థాగతంగా ప్రభుత్వ సత్వర జోక్యం వల్లే దేశీయంగా ఒకటికి మించి కరోనా టీకాలు బయటికొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జవాబు. దేశాన్ని ఇవే కాపాడాయనీ, ముఖ్యంగా ఈ ఏడాది థర్డ్ వేవ్‌లో భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నాయంటే అదే కారణమనీ మంత్రివర్యుల మాట. దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారీ ‘కోవిషీల్డ్’ 160 కోట్లు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ 33.5 కోట్లు, బయొలాజికల్ ‘ఇ’ వారి ‘కోర్బెవ్యాక్స్’ 6.5 కోట్లు – ఇలా పిన్నపెద్దలకు ఒకటికి మూడు డోసుల వంతున మొత్తం 200 కోట్ల డోసుల మార్కు చేరగలిగాం. ఇప్పటి దాకా వేసిన డోసుల్లో దాదాపు 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించినవే. అలాగే, మొత్తం డోసుల్లో 48.9 శాతం ఆడవారికి అందాయని లెక్క. రెండేళ్ళ పైచిలుకు క్రితం అంతుచిక్కని మాయదారి రోగంతో యావత్ ప్రపంచంతో పాటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధిక జనాభా దేశం ఇప్పుడు కాస్తంత ఊపిరి పీల్చుకోవడం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల, వైద్యుల, పలు వర్గాల ఫ్రంట్ లైన్ యోధుల అవిశ్రాంత కృషి ఉంది. దేశీయంగా టీకాల అభివృద్ధి, డోసులు వృధా కాకుండా నిరంతర సమీక్షలతో ప్రాధాన్యతా క్రమంలో సమర్థంగా టీకాలేస్తూ వచ్చిన విధానం, ప్రజలకూ – పాలకులకూ తక్షణ సమాచారం అందించే ‘కోవిన్’ పోర్టల్ – ఇలా అనేకం ఈ విజయానికి తోడ్పడ్డాయి. ఎవరేమన్నా కరోనాపై టీకాల యుద్ధంలో అనేక దేశాల కన్నా భారత్ ముందంజలో ఉంది. ఐరోపా అంతటా కలిపి 130 కోట్ల డోసులైతే... మన దగ్గర 200 కోట్ల డోసులు వేయడం, మరో 23 కోట్లకు పైగా డోసుల్ని 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇవి కాక దాదాపు మరో 10 కోట్ల డోసులు నిల్వలో సిద్ధంగా ఉన్నాయి. అంటే, గత 18 నెలల్లో భారత్ దాదాపు 233 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసిందన్న మాట. ఇది రొమ్ము విరుచుకొనే విషయమే. ప్రపంచ జనాభాలో 17.5 శాతం, అందులోనూ 95 కోట్ల మంది వయోజనులూ ఉన్న దేశం మనది. ప్రతి ఇద్దరి మధ్య కనీసం నాలుగు భిన్నాభిప్రాయాలుంటాయనే ఇలాంటి దేశంలో ఇప్పటికి ఏడు విడతల్లో ఇంతమంది స్వచ్ఛందంగా టీకాకరణకు ముందుకొచ్చేలా చేయడం అంత సులభ మేమీ కాదు. అందులో ప్రభుత్వం విజయం సాధించింది. 75 రోజుల పాటు ఉచిత ‘ముందు జాగ్రత్త మూడో టీకా’ ప్రకటనతో మరోసారి ఊపు తేవాలని ప్రభుత్వ ప్రయత్నం. ఇదీ విజయవంతమైతే, అయిదారు నెలల్లో 250 కోట్ల డోసుల మైలురాయినీ దాటేస్తాం. నిజానికి, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఈ జనవరి 10 నుంచీ, 18 –59 ఏళ్ళ మధ్యవయసు వారికి ఏప్రిల్ 10 నుంచే ప్రభుత్వం మూడో డోస్‌కు వీలు కల్పించింది. అయినా, ఆరు నెలల్లో నూటికి అయిదుగురే వేయించుకున్నారు. రెండు, మూడు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు ఈ జూలై మొదట్లో సర్కార్ తగ్గించింది. అయినా అదే పరిస్థితి. ఉద్ధృతి తగ్గిందంటూ ఉదాసీనత ప్రజల్లో పేరుకుపోయిందనడానికి ఇది ఉదాహరణ. కానీ, కరోనా పూర్తిగా పోలేదని పెరుగుతున్న కేసులు తట్టి చెబుతున్నాయి. కొత్తగా మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకరం. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, ముందు జాగ్రత్త డోసు లాంటివి అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. కేంద్రం సైతం 18–59 ఏళ్ళ వారికి మూడో డోసుకు ఓకే చెప్పడానికి తాత్సారం చేసింది. ప్రజారోగ్య రీత్యా ఏ మహమ్మారికైనా ఉచితంగా టీకా వేయాల్సిన పాలకులు 75 రోజులే ఉచితం అనడం సరికాదు. డబ్బులకే టీకా అంటే ఆరోగ్యంలోనూ ఆర్థిక, భౌగోళిక అంతరాలు పెరుగుతాయి. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానంలోని సమానత్వ భావనకే ఇది విరుద్ధం. అలాగే, కరోనా విజయగాధను ఇతర టీకాలకూ విస్తరించాలి. సాధారణ పిల్లల టీకాలను నేటికీ నూటికి 80 మందికే టీకాలిస్తూ, నేపాల్, శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ద్విశత కోటి విజయగానంతో ఊరుకోకుండా బాలల టీకాల్లోనూ భారత్ ఉపక్రమించడానికి ఇదే సరైన సమయం. -
ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి
కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్లో డిమాండ్ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది. గత డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్‌కి ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. చదవండి👉🏾 జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం ! -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర
వ్యాక్సిన్ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్ఈ వేరింట్ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్‌కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్సిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. సీరమ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ. 225కి మార్చారు. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్‌ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్‌ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, కరోనా కట్టడి కోసం దేశంలో ప్రజలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్లను తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకునేందుకు కేంద్రం.. కొన్ని వారాల గ్యాప్‌ను విధించింది. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఆదివారం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ(NTAGI) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇకపై 8-16 వారాల గ్యాప్‌తో రెండో డోసును తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, ఎన్టీఏజీఐ సూచనల మేరకు మే 13, 2021 నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును 12-16 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంతో వ్యాక్సిన్ తీసుకునే వారికి వెసులుబాటు కలిగింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ షెడ్యూల్లో మాత్రం మార్పులేదని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లను కేంద్రం విధించిన నిబంధనల మేరకే తీసుకోవాలని హెచ్చరించింది. ఇది చదవండి: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు -
అవన్నీ తప్పుడు వార్తలు.. టీకా వృథాగా పోయే అవకాశమే లేదు..
న్యూఢిల్లీ: ఈ నెలాఖరుకు 50 లక్షల కోవిషీల్డ్ డోసులు వృథాగా పోయే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. టీకాల లభ్యతపై వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభం నుంచి రాష్ట్రాలతో సమీక్ష జరుపుతూనే ఉన్నామని, ఎక్కడా టీకా వృథాగా పోయే అవకాశమే లేదని తెలిపింది. టీకాలు నిరుపయోగంగా ఉన్న చోట నుంచి మరోచోటికి బదిలీ చేసే అవకాశం కూడా కల్పించామని పేర్కొంది. ఆయా సంస్థల వద్ద ఉన్న టీకాలను ఎక్స్పైరీ తేదీకి ముందే వినియోగించాలని ఆదేశించామని తెలిపింది. -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. టీకా డేటా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సి ఉంటుందని భారత ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగనుంది. అయితే వీటిని కేవలం ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారు. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. గత ఏడాది అక్టోబర్ 25న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200 రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రోజురోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు... వరుసగా మూడో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గాయి. ఒక రోజులో 2,86,384 మంది కరోనావైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 20,546 కేసులు తగ్గాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22,02,472 క్రియాశీల కేసులున్నాయి. నేటితో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. 573 మరణాలతో మరణాల సంఖ్య 4,91,700కి చేరుకుంది. అయితే మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 573 కొత్త మరణాలలో కేరళ నుండి 140 మరియు మహారాష్ట్ర నుండి 79 మంది ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజు 22 లక్షల మంది టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ 163 కోట్లను దాటింది. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
Covid Vaccine: 3 నెలలకే కోవి‘షీల్డ్’ మాయం!
లండన్: ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రెజిల్, స్కాట్లాండ్లో సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించామని, దీన్ని ఇచ్చిన వారికి బూస్టర్ డోసులివ్వడం ద్వారా రక్షణ పెంచాలని సూచించింది. ఈ టీకా కోవిషీల్డ్ పేరిట ఇండియాలో గుర్తింపు పొందింది. వేరియంట్‌ను బట్టి టీకా రక్షణ తగ్గడం ఆధారపడి ఉందని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధన బూస్టర్ డోసుల ప్రాముఖ్యాన్ని వివరిస్తోందని ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ విఠల్ కటికిరెడ్డి చెప్పారు. రక్షణ తగ్గుతోందని తెలియగానే భారత ప్రభుత్వం బూస్టర్ డోసులివ్వడం ఆరంభించాలన్నారు. (చదవండి: ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!) -
కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నెలకు 25–27.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ బయోటెక్ నెలకు 5నుంచి 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90% మేర సాధించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. చదవండి: 2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు! -
కోవిషీల్డ్ గడువును తిరిగి 4–6 వారాలకు కుదించండి: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: కోవిషీల్డ్ మొదటి, రెండో డోస్‌ల మధ్య కాలవ్యవధిని మొదట్లో ఉన్న మాదిరి 4 నుంచి 6 వారాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వా న్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. టీకా డోసుల కొరత కారణంగా కాలవ్యవధిని గతంలో 12 వారాలకు పెంచడంతో లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్నాక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, వారిని గుర్తించి రెండో డోస్ వేయడం కష్టంగా మారిందన్నారు. మొదటి డోస్ వేసుకున్న వారి వివరాలు కొవిన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నామన్నారు. టీకాల మధ్య గడువును కుదిస్తే రెండో డోస్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అలాగే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి టీకా రెండో డోస్ వేసి 8–10 నెలలు దాటడం, కరోనా కొత్త వేరియెంట్లు వస్తుండటంతో వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ విషయాన్ని శుక్రవారం తనను కలిసిన విలేకరులకు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలోనే 75 లక్షల టీకా డోసులు ఉన్నాయని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు కాల వ్యవధిని తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్ 90 శాతం, రెండో డోస్ 46 శాతం వేశామన్నారు. వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వేలు... టీకాల పంపిణీ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నమూనా దేశంలోనే ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్త, జీహెచ్ఎంసీ అధికారి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ చేశారని, అయితే గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు సరైన సహకారం అందడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో కలిసి ఇంటింటి సర్వే చేపడు తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు పెడుతున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 3.82 కోట్ల కరోనా డోసులను వేశామన్నారు. విమానాశ్రయంలో టెస్ట్‌లు... శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారిని ‘టిమ్స్’కు పంపి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నామని చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్ వస్తే పూర్తిగా నయమయ్యాకే టిమ్స్ నుంచి బయటకు పంపుతామన్నారు. ప్రభుత్వంలో 27 వేలకుపైగా పడకలుంటే, వాటిల్లో 25 పడకలకు ఆక్సిజన్‌ను సమకూర్చామన్నారు. అలాగే అందులో 6 వేలు ఆక్సిజన్, ఐసీ యూ పడకలను పిల్లల కోసం సిద్ధం చేశామన్నారు. -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది. -
డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ
లండన్: కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల కోవిషీల్డ్, ఫైజర్ టీకాలు 90% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఈవ్–2 అనే సంస్థ స్కాట్లాండ్ వ్యాప్తంగా అందిన డేటా ఆధారంగా చేపట్టిన అధ్యయనం ఫలితాలు గురువారం న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిన్‌బరో, స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీలు, పబ్లిక్ హెల్త్ స్కాంట్లాండ్ కలిసి ఏప్రిల్ 1– సెప్టెంబర్ 27వ తేదీల మధ్య స్కాట్లాండ్లోని 54 లక్షల మంది డేటాను విశ్లేషించాయి. వ్యాక్సినేషన్ జరుగుతున్న ఈ సమయంలోనే 1,15,000 మంది కరోనా బారినపడగా, వీరిలో 201 మంది చనిపోయారు. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడటంలో ఫైజర్ టీకా 90 శాతం, కోవిషీల్డ్ 91% సమర్థవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. -
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
కోవిషీల్డ్‌కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
కోవిషీల్డ్ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య
లండన్: కరోనా వ్యాక్సిన్ అంశంలో భారత్, బ్రిటన్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మెలిక పెట్టింది. అక్టోబర్ 4 నుంచి విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిరోజుల కిందట బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆ దేశం దిగొచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్ జారీ చేసే వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ జాబితాలో ఆ్రస్టాజెనికా కోవిషీల్డ్‌ను చేరుస్తూ బుధవారం నిబంధనల్ని సవరించారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అంశంలో భారత్, యూకే పరస్పరం చర్చించుకుంటున్నాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని వెల్లడించారు. విదేశీ ప్రయాణికుల మార్గదర్శకాల్లో బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై భారత్ పదునైన విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్నే పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో చేస్తోందని, అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్‌పై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ నిలదీసింది. భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు... అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్ వ్యాక్సిన్‌కి అంగీకరించినప్పటికీ, భారత్ జారీ చేసే వ్యాక్సిన్ ధ్రువపత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాలని చెప్పింది. మరోవైపు భారత్ అధికారులు మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకి అనుగుణంగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు. -
బ్రిటన్‌కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను రూపొందించింది. దీన్ని భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్‌లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్‌తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్‌కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్‌ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్‌తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్‌తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా సరికొత్త రికార్డ్
-
4 వారాల తర్వాత కోవిషీల్డ్ రెండో డోస్‌కు చాన్సివ్వండి
కొచ్చి: కోవిడ్ నుంచి ముందస్తు రక్షణలో భాగంగా తొలి కరోనా టీకా తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ టీకా కోరే పౌరులకు ఆ అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పౌరులు మొదటి డోస్ కరోనా టీకా తీసుకున్న కనీసం 12 వారాల (84 రోజుల) తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి. ఆలోపు రెండో డోస్ ఇవ్వరు. అయితే, తొలి డోస్ తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవాలనుకునే వారు కోవిన్ పోర్టల్ ద్వారా వ్యాక్సినేషన్‌ను షెడ్యూల్ చేసుకునేందుకు అనుమతించాలని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది. తమ సంస్థలో పనిచేసే 5,000 మందికిపైగా ఉద్యోగులకు తొలి డోస్ కోవిషీల్డ్ టీకా ఇప్పించామని, ప్రభుత్వ నిబంధనల కారణంగా 84 రోజుల్లోపే రెండో డోస్ ఇవ్వడం కుదరడం లేదని, 4 వారాల టీకా గ్యాప్ తర్వాత రెండో డోస్‌కు అనుమతించాలని కైటెక్స్ గార్మెంట్స్ అనే సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ విచారించారు. ‘విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి ముందస్తు టీకా అనుమతులు ఇస్తున్నారు. భారత్‌లోనే ఉంటూ ఇక్కడే ఉద్యోగం, విద్య కోసం ఇల్లు దాటే పౌరులు తమకూ ముందస్తు టీకా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. స్వదేశంలో ఉండే వారికీ ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రావట్లేదు’ అని జడ్జి అన్నారు. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?
ప్రస్తుతం కరోనా మహమ్మరిని ఎదుర్కొనే ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఒక వ్యాక్సిన్ మాత్రమే. అయితే, కొందరు నెరగాళ్లు ఈ వ్యాక్సిన్లను కూడా విడిచి పెట్టడం లేదు. వ్యాక్సిన్లకు నకిలీ వ్యాక్సిన్లను సృష్టించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ నకిలీ వల్ల ప్రజలు భారీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే, వీటి కట్టడి దిశగా కేంద్ర రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) కూడా ఆందోళన చెందుతుంది. (చదవండి: Google: వెతుకులాట.. అలా మొదలైంది) ఇటీవల, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలలో ఆస్ట్రాజెనెకా/ఆక్స్ ఫర్డ్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల డూప్లికేట్ వెర్షన్లను కనుగొన్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. అందుకే, ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతానికి, భారతీయ మార్కెట్లో కరోనా వైరస్ అరికట్టడం కోసం దేశంలో మూడు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్లు ఒరిజినల్ లేదా నకిలీదా అని చెక్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిషీల్డ్ కోవిషీల్డ్ బాటిల్ ఈ క్రింది వివరాలు ఉండాలి ఎస్ఐఐ ప్రొడక్ట్ లేబుల్ ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు(కోవిషీల్డ్) ఉండాలి జనరిక్ పేరు ఫాంట్ అన్ బోల్డ్ గా ఉంటుంది "(రీకాంబినెంట్)" అదే ఫాంట్ తో జనరిక్ పేరు దిగువ ఉంటుంది. సీజీఎస్ సేల్ స్టాంప్ కొరకు కాదు. ఎస్ఐఐ లోగో కచ్చితంగా ఉండాలి. లేబుల్ కలర్ షేడ్ ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ అనేది ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. కొవాక్సిన్ బుడ్డి లేబుల్ మీద డీఎన్ఎ వంటి నిర్మాణం ఉంటుంది. కోవాక్సిన్ స్పెల్లింగ్ "ఎక్స్"లో గ్రీన్ కలర్ ఉంటుంది. కొవాక్సిన్ స్పెల్లింగ్ పై హోలో గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 68 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇందులో 18-44 ఏళ్ల వయసున్న వ్యక్తులకు 26.99 కోట్ల ఫస్ట్ డోస్, మే 1న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫేజ్-3 ప్రారంభమైనప్పటి నుంచి వారికి 3.35 కోట్ల రెండో డోసులుఇచ్చారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 60 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది. -
ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం 2500కి పైగా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 లక్షల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇప్పటివరకు 2.93 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. విజయవాడ: పడమట 45 వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, జిల్లా వైద్య శాఖాధికారిణి డాక్టర్ సుహాసిని తదితరులు పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ తొలి డోసు అందిస్తున్నామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌కి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌పై వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ముందుగానే ప్రజలకి సమాచారమిచ్చి టైం స్లాట్ కేటాయించాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందికి ఈ స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేయనున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పుని దృష్డిలో ఉంచుకుని ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, మెడికల్, ఐదేళ్ల చిన్నారుల తల్లులు, గర్భిణులకు ఇప్పటికే నూరుశాతం వ్యాక్సిన్ వేశామని, వ్యాక్సినేషన్‌తోనే థర్డ్ వేవ్ నుంచి రక్షణ ఉంటుందని జేసీ శివశంకర్ పేర్కొన్నారు. ఇవీ చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి -
రెండో డోస్ టీకా వేయించుకోని 3.86 కోట్ల మంది
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో వేయించుకోని వారు 3.86 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు దేశంలో 44,22,85,854 మంది కోవిడ్ టీకా మొదటి డోస్ తీసుకోగా, 12,59,07,443 మంది రెండో డోస్ వేయించుకున్నట్లు వివరించింది. కోవిడ్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిషీల్డ్ టీకా అయితే 84–112 రోజుల్లో, కోవాగ్జిన్ 28–42 రోజుల మధ్య రెండో డోస్ తీసుకోవాలి. ఆగస్టు 17వ తేదీ నాటికి దేశంలో కోవిషీల్డ్ టీకా మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్‌ను ప్రభుత్వం సూచించిన సమయంలో తీసుకోని వారు కోవిడ్ పోర్టల్ వివరాలను బట్టి 3,40,72,993 మంది ఉన్నట్లు తెలిపింది. కోవాగ్జిన్ మొదటి డోస్ వేయించుకుని, సకాలంలో రెండో డోస్ వేయించుకోని వారు 46,78,406 మంది ఉన్నారు. రెండో డోస్‌ను ఎప్పుడు వేయించుకోవాలో సూచించామనీ, అయితే, సకాలంలో రెండో డోస్ తీసుకోని వారు మళ్లీ రెండు డోస్‌లు తీసుకోవాలా అనే విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదని పేర్కొంది. -
కాక్టైల్ వ్యాక్సిన్ కహానీ!
-
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం
ముంబై: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు సైతం తీసుకున్న 63 ఏళ్ల మహిళ జూలై 27న మరణించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు ఆమె మరణించాక వచ్చిందని పేర్కొన్నారు. జూలై 21న పొడి దగ్గు, వాసనలేమి, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ఆమె ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఆమెకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, ఆమెతో స్ననిహితంగా మెలిగిన ఆరుగురికి కరోనా నిర్ధారణ పరీక్ష చేసినట్లు వెల్లడించారు. అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, ఇద్దరిలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ ఉందన్నారు. జూన్ 13న కూడా 80 ఏళ్ల మహిళ రత్నగిరి జిల్లాలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరణించారు. బుధవారం నాటికి మహారాష్ట్రలో 20 డెల్టా ప్లస్ కేసులు ఉండగా, అందులో ముంబైలోనే 7 కేసులు నమోదయ్యాయి. -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్‌కు గ్రీన్ సిగ్నల్
-
మిక్సింగ్ కరోనా టీకా భేషుగ్గా పనిచేస్తుందంట, పరిశోధనకు అనుమతి
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను మిక్సింగ్ పద్ధతిలో ఇచ్చి ఫలితాలను విశ్లేసించేందుకు ఉద్దేశించిన ఓ పరిశోధనకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ), వెళ్లూర్ ఈ పరిశోధనలకు వేదిక కానుంది. దాదాపు 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఈ పరిశోధన జరగనుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నిపుణులు బృందం జూలై 29న ఈ అనుమతులు జారీచేసింది. పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోసు కోవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ ఇవ్వనున్నారు. ఇటీవలే ఐసీఎంఆర్ కూడా ఇలాంటి ఓ పరిశోధన చేసింది. మొత్తం 98 మందిపై జరిపిన ఆ మిక్సింగ్ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తేలింది. ఒకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం కంటే రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ డోసులను ఒక్కొక్కటిగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు తెలిసింది. అంతేగాక కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ల మిక్సింగ్ సురక్షితమేనని రుజువైంది. -
ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీకి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. గన్నవరం నుంచి ఏపీలోని 13 జిల్లాలకు టీకాలను వైద్యాధికారులు సరఫరా చేయనున్నారు. -
‘కోవిషీల్డ్ ఉత్పత్తిని 120 మిలియన్ డోసులకు పెంచుతాం’
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాల ఉత్పత్తి పెంచుతామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పార్లమెండ్ సమావేశాల్లో భాగంగా మంగళవారం కోవిడ్ టీకాలపై రాజ్యసభలో మంత్రి మన్సుఖ్ వివరణ ఇచ్చారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోవిషీల్డ్ ఉత్పత్తిని నెలకు 120 మిలియన్ డోసులకు పెంచుతామని తెలిపారు. కొవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు 58 మిలియన్ డోసులకు పెంచుతామని చెప్పారు. ఈనెల నుంచే టీకాల ఉత్పత్తి పెంపు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధికి 'మిషన్ కోవిడ్ సురక్ష' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనట్లు మంత్రి తెలిపారు. -
కోవిషీల్డ్ రూ.205.. కోవాగ్జిన్ రూ.215..
న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్‌లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి. కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్‌కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!. ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్లు, మెడిసిన్స్కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది. For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser — EU Medicines Agency (@EMA_News) July 15, 2021 ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఏపీకి చేరుకున్న మరో 7.20 లక్షల కోవిడ్ టీకా డోసులు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో 7.20 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. కాగా కోవిషీల్డ్ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అక్కడి నుంచి టీకా డోసులను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. అనంతరం జాబితాల ప్రకారం టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు అధికారులు తరలిస్తారు. -
రెండో డోసు తీసుకోకపోతే...!
గడువు దాటినా కోవిడ్–19 వ్యాక్సిన్ రెండో డోసు ఇంకా మీరు తీసుకోలేదా ? వ్యాక్సిన్ తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారా ? లేదంటే టీకా డోసులే దొరకడం లేదా ? కారణం ఏదైనా సెకండ్ డోసు మిస్సయితే ఏం జరుగుతుంది? అమెరికా నుంచి అండమాన్ వరకు సెకండ్ డోసు వేసుకోవడానికి ఎందుకు సంకోచం? ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి వ్యాక్సినే బ్రహ్మాస్త్రం. ఈ విషయాన్ని ఎందరో నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యాక్సిన్‌పై అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాల్లో రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలు అందుబాటులో ఉంటే మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. అయితే మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేదు. మిస్సయితే ఏం జరుగుతుంది ? కోవిడ్–19 రెండో డోసు ప్రాధాన్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. ఎందరో నిపుణులు తమ అభిప్రాయాలను వివిధ వేదికలపై పంచుకున్నారు. భారత్‌లో లభించే కరోనా టీకాల్లో ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్ డోసుగానే ఉపయోగపడిందని ఐసీఎంఆర్ మాజీ చీఫ్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు. ఒక్కటే డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్ సోకే అవకాశాలుంటాయని ఆయన హెచ్చరించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత మన శరీరం కరోనాపై పోరాటానికి ప్రాథమికంగా సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకున్నాక నిరోధకత మరింత బలోపేతమై మెమొరీ–బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్ మన శరీరంపై దాడి చేస్తే, వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యుద్ధం ప్రకటిస్తాయి. రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఆ అధ్యయనం చెప్పిందేమిటంటే కోవిడ్–19 రెండు డోసులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికాలోని యేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. మొత్తంగా 91,134 మంది కరోనా రోగుల్ని డిసెంబర్–ఏప్రిల్ వరకు వారిని పరీక్షించారు. ఆ రోగుల్లో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆ కరోనా రోగుల్లో 4.5% మందిలో స్వల్పంగా యాంటీబాడీలు ఉత్పత్తయితే, 25.4 శాతం మంది పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు చేరాయి. ఈ రోగుల్లో 225 మంది మరణిస్తే వారిలో వ్యాక్సిన్ తీసుకోని వారు 219 (97%) మంది కావడం గమనార్హం. మరో అయిదుగురు పాక్షికంగా నిరోధకత కలిగిన వారు కాగా, మృతుల్లో కేవలం ఒకే ఒక్కరు పూర్తి స్థాయి యాంటీబాడీలు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. అదే అధ్యయనంలో తేలిన అంశాలేమిటంటే... ► రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 96% మందికి ఆస్పత్రి అవసరం రాదు ► రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే 98.7% మంది మృత్యు ఒడికి చేరుకోరు ► ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకుంటే 77% మందికి మాత్రమే ఆస్పత్రిలో చేరే అవసరం రాదు ► ఒక్క డోసు తీసుకుంటే 64% మంది ప్రాణాలకే భద్రత ఉంటుంది. ఎందుకీ సంకోచం ? కోవిడ్–19 సెకండ్ డోసు తీసుకోకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముందు వెనుక ఆలోచించడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో ప్రభుత్వ వైఫల్యాలు కొన్నయితే, ప్రజల్లో అవగాహనా లేమి మరి కొంత కారణమవుతోంది. టీకా కొరత, మొదటి డోసు తీసుకున్న సమయంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు, రెండో డోసు తీసుకుంటే మరింత ఎక్కువ అవుతాయనే అపోహ, భారత్ వంటి దేశాల్లో నిరక్షరాస్యుల్లో టీకా అంటే ఒక్కటే డోసు అన్న భావన తరతరాలుగా నెలకొని ఉండడం వంటివెన్నో సెకండ్ డోసు తీసుకోకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయని ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ తన తాజా సంచికలో వెల్లడించింది. ఇక అమెరికాలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మొదటి డోసుతోనే 80% రక్షణ కల్పిస్తే, రెండో డోసు తర్వాత 90శాతానికి పైగా రక్షణ ఉంటుంది. ఈ వ్యత్యాసం తక్కువగా ఉండడంతో రెండో డోసు అవసరం లేదన్న అభిప్రాయం అత్యధికుల్లో నెలకొంది. కోవిడ్–19 టీకా మొదటి డోసు తీసుకున్న 70%మందిలో కరోనా పోరాటానికి శరీరం సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకుంటేనే వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవుతాయి. అదే ఏడాది పాటు రెండో డోసు తీసుకోకుండా ఉంటే, దానిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా మళ్లీ రెండు డోసులు తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ కలుగుతుంది’’ – డాక్టర్ జాకబ్ జాన్, వైరాలజిస్టు – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
Corona Vaccine: ఒప్పుకోండి లేకుంటే ఇబ్బందులే!
వాక్సినేషన్ పాస్‌పోర్ట్ విషయంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్‌ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. న్యూఢిల్లీ: ఈయూ దేశాల్లో.. అలాగే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్‌పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల లిస్ట్‌లో భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండడం తెలిసిందే. ఎక్కువ మంది భారతీయలు తీసుకుంటున్న కొవిషీల్డ్‌కూ సైతం చోటు దక్కకపోవడంతో.. భారతీయ ప్రయాణికులకు ఇబ్బందికర అంశమనే ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని సీరం సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో.. కేంద్రం త్వరగతిన స్పందించింది. తక్షణమే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని, లేకుండా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పదని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను అనుమతించమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)ని హెచ్చరించింది కేంద్రం. ఒకవేళ అనుమతిస్తే మాత్రం.. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్ట్‌లో మనదగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లకు మొదటి ఫేజ్‌లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం.. కనీసం కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లకైనా అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటు ఇవ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రతిపాదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు. ఈయూ వివరణ ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో ఈయూ సభ్యదేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసం గ్రీన్‌పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్‌టెక్, మెడెర్నా, వాక్స్‌జెర్విరియా, జన్‌స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే ఈఎంఏ ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. అయితే కొవిషీల్డ్‌ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలంటూ అభ్యర్థనలేవీ రాలేదని ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవీషీల్డ్ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని, అందుకు నెల టైం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: కొవిషీల్డ్ డోస్ గడువు మళ్లీ పెంపు.. ఈసారి ఎంతంటే.. -
ఆరు లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక
విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ డోసుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఆరు లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ వ్యాక్సిన్ డోసులను 50 బాక్స్‌ల్లో స్పైస్‌జెట్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. చదవండి: కోవిడ్: రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ -
కోవిషీల్డ్ రెండో డోసు గడువు మళ్లీ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు గడువును వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి పెంచింది. ప్రస్తుతం మొదటి డోసు పొందిన తర్వాత 12–16 వారాల మధ్యలో రెండో డోసు ఇస్తుండగా, ఈ గడువును 14–16 వారాలకు పెంచుతూ ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధ వారం ఉత్తర్వులు జారీచేశారు. అంటే కోవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న 14 నుంచి 16 వారాల మధ్యలోనే రెండో డోసు టీకాను తీసు కోవాల్సి ఉంటుంది. కాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందజేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. -
Covishield: ఈయూ పాస్‌పోర్ట్‌లో కోవిషీల్డ్‌ను చేర్చేలా చూడండి!
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ ‘కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్’లో కోవిషీల్డ్ టీకాను కూడా చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. కోవిషీల్డ్‌ను అందులో చేర్చనట్లయితే ఆయా దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు 4 టీకాలకు మాత్రమే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం లభించింది. అవి ఫైజర్/బయోఎన్‌టెక్, మోడెర్నా, వాక్స్‌జెర్విరియా(ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్), జాన్సన్. ఈ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే ఈయూ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. భారత్‌లో ఎక్కువమంది తీసుకున్న కోవిషీల్డ్‌ను ఈయూ వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్‌లో చేర్చనట్లయితే, అనేక విపరిణామాలుంటాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు రాసిన లేఖలో ఎస్ఐఐ సీఈఓ ఆధర్ పూనావాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్‌లో 30 కోట్లమంది కోవిషీల్డ్ తీసుకున్నారని, మొత్తంగా 50% భారత జనాభా ఈ టీకానే తీసుకునే అవకాశముందని తెలిపారు. ఇక్కడ చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ Prashant Bhushan: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్ -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
కోవిడ్ టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు!
న్యూఢిల్లీ: కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్ టీకాల ప్రభావాన్ని తగ్గిస్తుందనిగానీ, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనిగానీ చెప్పేందుకు శాస్త్రీయ గణాంకాలేవీ లేవని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ చెప్పారు. కరోనా వైరస్ ధోరణిని అంచనా వేయడం కష్టం కాబట్టి ఫలానా ఫస్ట్ వేవ్ ఇప్పుడని, సెకండ్ వేవ్ అప్పుడని చెప్పలేమన్నారు. కరోనా నుంచి దేశం బయటపడాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రభావవంతమైన ప్రవర్తన అవసరమన్నారు. కరోనా వేవ్స్ రావడం, రాకపోవడం మన చేతలపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్‌లో రోజుకు 4 లక్షల వరకు నమోదైన కేసులు కొన్ని రోజులుగా రోజుకు 50వేల దిగువకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. డెల్టా వేరియంట్లో జరిగిన ఉత్పరివర్తనాలతో డెల్టాప్లస్ ఉద్భవించిందని, దీని గురించిన సైంటిఫిక్ డేటా తక్కువగా ఉందని చెప్పారు. డెల్టాపై టీకాలు ఓకే ఐసీఎంఆర్ విశ్లేషణ ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు డెల్టా వేరియంట్‌పై మంచి ప్రభావాన్ని చూపాయని పాల్ తెలిపారు. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రభుత్వ అనుమతి అనేక అంశాలపై ఆధారపడి ఉందని, అందువల్ల ఎప్పటికల్లా ఇవి అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ వ్యాక్సిన్ల అనుమతి ప్రక్రియకు కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య నష్టపరిహార అంశంపై చర్చలు కొలిక్కిరాలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి కోవాగ్జిన్‌కు త్వరలో అనుమతి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో టీకా ఉత్పత్తిదారులకు సామర్ధ్య విస్తరణ కోసం వివిధ గ్రాంట్ల రూపంలో కేంద్రం రూ. 670 కోట్ల సాయం అందించిందన్నారు. దీనికి మించి ప్రభుత్వ సైన్సు సంస్థలు ఎంతో విలువైన సాంకేతిక సాయాన్ని సైతం టీకా ఉత్పత్తిదారులకు అందించాయన్నారు. -
కోవీషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ధృవీకరణ పత్రాలను చాలా దేశాలు తప్పనిసరి చేసాయి. అయితే మన దేశంలో తయారైన కోవీషీల్డ్ టీకా తీసుకుని విదేశాలకు పయనం కాబోతున్నవారికి ఎదురవుతున్న గ్రీన్ పాస్ ఇబ్బందులపై శుభవార్త. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని ఈయూ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణీకులకు ఇబ్బందులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా స్పందించారు. కోవీషీల్డ్ కారణంగా ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని పూనావాలా ట్వీట్ చేశారు. ఈ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. (DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ ) కోవీషీల్డ్ టీకా తీసుకున్న చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న విదేశీ ప్రయాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానంటూ భరోసా ఇచ్చారు. దీనిని ఆయా దేశాల అత్యున్నత అధికారులు, రెగ్యులేటర్లు, దౌత్య అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ పాస్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను యూరోపియన్ యూనియన్ మినహాయించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పూణేకు చెందిన సీరం దేశీయంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ (ఈయు) ‘గ్రీన్ పాస్’కు కోవిడ్-19 వ్యాక్సిన్ల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం, ఫైజర్, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ , వాక్స్ జెర్విరా ఈ నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. I realise that a lot of Indians who have taken COVISHIELD are facing issues with travel to the E.U., I assure everyone, I have taken this up at the highest levels and hope to resolve this matter soon, both with regulators and at a diplomatic level with countries. — Adar Poonawalla (@adarpoonawalla) June 28, 2021 -
జూన్‌లో 10.8 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్
న్యూఢిల్లీ: ముందుగా హామీ ఇచ్చిన మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) జూన్ నెలలో ఇప్పటిదాకా 10.8 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి అందజేసింది. జూన్ 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత టీకాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. 21న రికార్డు స్థాయిలో 86 లక్షల పైచిలుకు డోసులను వేసినప్పటి నుంచీ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆరు రోజులుగా సగటున 69 లక్షల టీకాలు ఇస్తున్నారు. సీరమ్ జూన్‌లో ఇప్పటిదాకా 45 బ్యాచుల్లో 10.8 కోట్ల టీకా డోసులను కసౌలీ (హిమాచల్‌ప్రదేశ్)లోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీకి పంపింది. అక్కడ ప్రతిబ్యాచ్‌ను పరీక్షించిన తర్వాత... టీకాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. చదవండి: 5 నిమిషాల వ్యవధిలో మహిళకు కోవాగ్జిన్, కోవిషీల్డ్.. వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్! -
అన్ని వేరియంట్లపై ఆ రెండు టీకాలు పనిచేస్తాయి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆల్ఫా, డెల్టా, గామా, బీటా లాంటి వేరియంట్లన్నింటిపై కోవిషీల్డ్, కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. డెల్టా ప్లస్ వేరియంట్‌పై టీకాల పనితీరుపై పరిశోధనలు జరుగుతున్నాయంది. ఆల్ఫా తదితర వేరియంట్లపై ఫైజర్, మోదెర్నా టీకాలతో పోలిస్తే కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల ద్వారా వచ్చిన యాంటీబాడీ స్పందన తరుగుదల తక్కువగా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. డెల్టాప్లస్ వేరియంట్ ప్రస్తుతం 12 దేశాల్లో ఉందని, భారత్‌లో 10 రాష్ట్రాల్లో 48 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై టీకాల ప్రభావాన్ని పరిశోధిస్తున్నామని, వారం పది రోజుల్లో వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో సంభవించిన మరణాల్లో 80 శాతం దీనివల్లనే అన్నారు -
జార్ఖండ్‌లో ఆరుగురికి మిక్స్డ్ వ్యాక్సిన్
పాలాము: జార్ఖండ్‌లోని పాలాము జిల్లాలో ఆరుగురికి అధికారులు పొరపాటున రెండు వేర్వేరు కంపెనీల కరోనా టీకాలు ఇచ్చారు. ఈ ఆరుగురు మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకోగా, బుధవారం రెండో డోసు మాత్రం అధికారులు కోవిషీల్డ్ వేశారు. మిక్స్డ్ వ్యాక్సిన్ వల్ల ప్రస్తుతం వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని, ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్ సింగ్ చెప్పారు. రెండో డోసు కోసం హరిహరగంజ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయం తెలియగానే హెల్త్ సెంటర్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొందన్నారు. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారని వెల్లడించారు. ఆరుగురిని మరో 24 గంటలపాటు పరిశీలనలో ఉంచుతామన్నారు. -
30 నిమిషాల్లో ఒకే వ్యక్తికి రెండు డోస్‌లు
బారిపదా: కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మరో డోస్ టీకాను ఇచ్చిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. తనకు ఇప్పుడే టీకా ఇచ్చారని ఆ వ్యక్తి చెబుతున్నా వినకుండా సెకన్ల వ్యవధిలో రెండో డోస్ ఇచ్చేశారని అతను ఆందోళన వ్యక్తంచేశాడు. తప్పు తెల్సుకున్న వైద్య సిబ్బంది అతడిని అదనంగా మరో రెండు గంటలపాటు పర్యవేక్షణలో ఉంచారు. ఆయనకు ఒకే తయారీ సంస్థకు చెందిన టీకాలు ఇచ్చారా లేదా వేర్వేరువా అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు చెప్పారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని రఘుపూర్ గ్రామానికి చెందిన 51 ఏళ్ల ప్రసన్నకుమార్ సాహూ.. ఖుంతాపూర్‌లోని సత్య సాయి ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం వెళ్లారు. మొదట ఆయనకు ఒక డోస్ ఇచ్చారు. దాదాపు 30 నిమిషాలు గడిచాక ఒక నర్సు వచ్చి ఆయనకు మరో డోస్ టీకా ఇచ్చింది. ‘నాకు టీకా ఇప్పుడే ఇచ్చారు అని ఆ నర్సుకు చెబు తూనే ఉన్నా. అంతలోనే ఆమె మళ్లీ టీకా వేసింది’ అని సాహూ చెప్పుకొచ్చారు. డబుల్ డోస్ ఘటన పై టీకా కేంద్రం అధికారిక అబ్జర్వర్ రాజేంద్ర బెహెరా వివరణ ఇచ్చారు. ‘ టీకా ఇచ్చాక కూడా సాహూ అబ్జర్వేషన్ రూమ్‌కి వెళ్లకుండా ‘టీకా తీసుకోబోయేవారి ప్రాంతం’లోనే ఉన్నారు. దీంతో ఈ పొరపాటు జరిగింది’ అని రాజేంద్ర బెహెరా స్పష్టంచేశారు. మొత్తం ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాకే రెండో డోస్ ఇచ్చిన నర్సుపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ఇన్చార్జ్ డాక్టర్ సిపున్ పాండే చెప్పారు. 5 నిమిషాల తేడాతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఒకే మహిళకు ఐదు నిమిషాల తేడాతో రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన కరోనా టీకాలు ఇచ్చిన ఘటన బిహార్‌లో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యస్థితి బాగానే ఉంది. పట్నా నగరంలోని బెల్దారిచాక్ ప్రాంతంలో ఉండే సునీలా దేవి అనే మహిళ ఈనెల 16న కరోనా టీకా కోసం ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాలలోని టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడి నర్సు ముందుగా కోవిషీల్డ్ టీకా ఇచ్చింది. సిబ్బంది సూచనమేరకు ఆమె తర్వాత ఆబ్జర్వేషన్ రూమ్‌కి వెళ్లింది. కేవలం ఐదు నిమిషాలు గడిచాక అక్కడికి మరో నర్సు వచ్చి కోవాగ్జిన్ టీకా ఇచ్చింది. ఈ ఘటనపై బిహార్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
ఏపీ: నేడు ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది. కోవిడ్ కట్టడికి ఈ టీటీటీ ప్లస్ వ్యాక్సినేషనే శరణ్యమంటూ శనివారం కూడా రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసిన నేపథ్యంలో... కొన్నాళ్లుగా సీఎం జగన్ సారథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలోనూ ఒకేరోజున 6.28 లక్షల టీకాలు... ప్రభుత్వమే వ్యాక్సిన్ బాధ్యతను నిర్వర్తించాలన్న ఫార్ములాతో ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వం... ఏ రాష్ట్రమూ వేయని విధంగా ఏప్రిల్‌లో ఒకేరోజున 6.28 లక్షల మందికి టీకా వేసి తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఇపుడు ఆదివారం నాడు ఒకే రోజున 8 లక్షల మందికి టీకా వేసి... టీకాల లభ్యత పెరిగితే ఎంత వేగంగా దాన్ని పూర్తిచేయగలమనేది మరోసారి చెప్పడానికి సిద్ధమయింది. ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లూ ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్న వారితో పాటు ఆధార్ కార్డు తీసుకెళ్లిన వారికి సైతం వ్యాక్సిన్ వేస్తారు. తల్లుల తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులందరికీ ఇప్పటికే సచివాలయాల వారీగా సమాచారమిచ్చారు. సమాచారం అందకపోయినా.. ఆధార్ కార్డు తీసుకెళ్లిన అర్హులక్కూడా టీకా వేస్తారు. వ్యాక్సిన్ డ్రైవ్‌లో 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు పాల్గొంటారు. ఆదివారం జరిగే టీకా కార్యక్రమంలో మొదటి డోసు, రెండో డోసు వేస్తారు. ప్రతి జిల్లానూ సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తుండగా ప్రకాశం జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెళుతున్నట్టు తెలియవచ్చింది. మొదటి నుంచీ టి3 వ్యూహం... కోవిడ్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్లు వేస్తూనే... మరోవంక వైరస్ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి (ట్రేసింగ్) ఫీవర్ సర్వేను ప్రభుత్వం నిరంతరం నిర్వహిస్తోంది. అందుబాటులో ఉన్న వలంటీర్ వ్యవస్థను అద్భుతంగా ఉపయోగిస్తూ మొదటివేవ్లో ఇంటింటి సర్వేకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్... దాన్ని సెకండ్‌వేవ్‌లోనూ కొనసాగిస్తున్నారు. సర్వేలో లక్షణాలు బయటపడ్డవారికి, కావాలని వచ్చినవారికి దాదాపుగా రోజుకు లక్షకు పైగా ప్రభుత్వం టెస్టులు నిర్వహిస్తోంది. ఈ టీ3 వ్యూహంతో పాజిటివ్ బాధితులకు కోవిడ్ కేర్ సెంటర్ లేదా, గ్రామ స్థాయిలోనే ఐసొలేషన్ ఏర్పాట్లు చేసి వ్యాప్తికి గ్రామస్థాయిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. పాజిటీవ్ బాధితులకు ప్రభుత్వాసుపత్రులతో పాటు అర్హులయితే ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స (ట్రీట్మెంట్) అందిస్తోంది. కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారిలో 90 శాతం మందికి పైగా ఆరోగ్యశ్రీలోనే చికిత్స తీసుకోవటం గమనార్హం. మొదటి వేవ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తే, రెండో వేవ్ సమయంలో 8 సార్లు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. సచివాలయ స్థాయిలో ఫీవర్ క్లీనిక్స్ సచివాలయ స్థాయిలో ఏర్పాటైన ఫీవర్ క్లీనిక్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది ఆశా వర్కర్లు, 19వేల మంది ఎఎన్ఎంలు, దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ముందుగా ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. సర్వేలో జ్వరంతో పాటు ఇతర కోవిడ్ అనుమానిత లక్షణాలుంటే తక్షణం సచివాలయ పరిధిలోని ఎఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వగా, వెంటనే ఎఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సదరు ఇంటిని సందర్శించి, అక్కడికక్కడే వారికి కోవిడ్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,63,62,671 నివాసాలు ఉండగా వాటిల్లో కరోనా రెండో వేవ్‌లో 1,50,13,669 ఇళ్ళలో ఫీవర్ సర్వే జరిగింది. మొత్తం 92,364 మంది వైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించారు. వారిలో 88,657 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,729 మంది పాజిటీవ్ పేషంట్లను గుర్తించారు. 8 లక్షల నుంచి 10 లక్షల డోసులు నేడు మెగా డ్రైవ్ చేపడుతున్నాం. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకూ వ్యాక్సిన్ వేయాలనేది లక్ష్యం. వ్యాక్సిన్ జిల్లాలకు చేరింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పీహెచ్సీ స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. –కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
5 నిమిషాల వ్యవధిలో మహిళకు కోవాగ్జిన్, కోవిషీల్డ్..
పట్నా: బిహార్‌లో ఓ మహిళకు నిమిషాల వ్వవధిలో రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు వైద్యులు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం పట్నా పున్పున్ బ్లాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బెల్దారిచెక్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో జూన్ 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సునీలా దేవి టీకా వేయించుకోవడానికి వెళ్లింది. ఆరోగ్య సిబ్బంది ఆమెకు కోవిషీల్డ్ డోస్ ఇచ్చారు. ఆ తర్వాత అబ్జర్వేషన్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల పాటు కూర్చోవ్సాలిందిగా సూచించారు. ఈ మేరకు సునీలా దేవి వెళ్లి అక్కడ కూర్చుంది. ఇంతలో మరో నర్స్ వచ్చి సునీలా దేవికి కోవాగ్జిన్ టీకా ఇచ్చింది. ఈ సందర్భంగా సునీలా దేవి మాట్లాడుతూ.. ‘‘నేను వ్యాక్సిన్ తీసుకున్నానని నర్స్‌కు చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. పైగా అంతకుముందు వ్యాక్సిన్ ఇచ్చిన చేతికే మరో టీకా ఇచ్చింది’’ అని వాపోయింది. విషయం కాస్త సునీలా దేవి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. నిమిషాల వ్యవధిలో ఆమెకు రెండు వేర్వేరు టీకాలు ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమేకాక సునీలా దేవి ఆరోగ్య బాధ్యత వారిదేనని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైద్యులు సునీలా దేవిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు నర్స్‌లను సస్పెండ్ చేయడమే కాక వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. చదవండి: Corona Vaccine: మిక్స్ చేస్తే పర్లేదా! -
ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు 9 లక్షల డోసులు గురువారం చేరాయి. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లు తరలించారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని రిలాక్స్ అవ్వొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలన్నారు. కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్‌పై సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించిన సంగతి విదితమే. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోంది. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోంది. జూన్ 20 తర్వాత సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే.. ప్రస్తుతం 5.97 శాతం ఉంది. చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు రైతుల పట్ల ప్రతిపక్షానిది కపట ప్రేమ: సజ్జల -
వ్యాక్సిన్‌లో ఎందుకింత గ్యాప్..!
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది? ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది. ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నదేంటి! కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు? మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది. వివాదం ఎందుకు మొదలైంది? కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్ -
Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!
ముంబై: కరోనా మహమ్మారి రాకతో ప్రపంచం మొత్తం పూర్తిగా అతలాకుతలామయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్‌తో మన దేశం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే శ్రీ రామ రక్ష..! అని పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే తెలిపారు. కాగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వస్తాయనే విషయం తెలిసిందే. కాగా, నాసిక్ చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతడి శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అరవింద్ మమూలుగానే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో కోవిషిల్డ్ రెండో డోసును వేయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని శరీరం అయస్కాంతంలాగా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిని రియల్ లైఫ్ మ్యాగ్నటో(ఎక్స్ మెన్ లోని ఒక సూపర్ హీరో పాత్ర) అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెడికల్ అధికారులు స్సందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్సైట్లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కోవిడ్-19 టీకాలు తీసుకున్న ప్రదేశంలో ఎలాంటి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయగల పదార్థాలను కలిగి ఉండవని తెలిపారు. కోవిడ్-19 టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలకు తావులేదని తెలిపింది. అంతేకాకుండా కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సీడీసీ పేర్కొంది. View this post on Instagram A post shared by Bol Bhidu (@bolbhidu) చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
లోకం చూపు టీకావైపు!
సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి కోవిడ్ రెండో అల వెనక్కి జారుతున్న క్రమంలోనే... టీకా ప్రక్రియ (వ్యాక్సినేషన్) పైకి అందరి దృష్టీ మళ్లుతోంది. ఇప్పుడిదొక ముఖ్యాంశమైంది. కోవిడ మూడో అల రాకుండా, వచ్చినా తీవ్రత లేకుండా చూసుకోవాలంటే వేగంగా టీకా ప్రక్రియ జరిపించాలనేది దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర– రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తగు దిద్దుబాటు చర్యలతో, విధానమార్పు ప్రకటించిన ప్రధాని మోదీ, ఇకపై టీకామందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని చెప్పారు. ప్రక్రియను పరు గులు తీయిస్తామన్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా... పలు అంశాలు టీకా చుట్టే అల్లుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహ వైక ల్యాలు, నిర్వహణా లోపాలు, విధానపరమైన వైఫల్యాలైతే మరికొన్ని అనుకోకుండా పుట్టుకు వచ్చిన సవాళ్లు! ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఈ చిక్కుముడులన్నిటినీ విప్పి ముందుకు సాగితేనే మనమీ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాము. కోవిడ్ విషకోరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకామందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్ ముందుండాల్సింది! మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని, దావోస్ ఆర్థిక సదస్సు వేదిక నుంచి ప్రపంచానికి తెలియ జెప్పారు. కానీ, ఆ పరిస్థితిపుడు లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు రెండు డోసుల టీకా ప్రక్రియ ముగించుకొని తలసరి రెండు, మూడు డోసుల టీకా భవిష్యత్తు కోసం రిజర్వు చేసుకున్నాయి. కెనడా ఒక్కో పౌరుడికి (తలసరి) 9 డోసుల చొప్పున రిజర్వు చేసు కుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, పలు దేశాల్లో కట్టడి ఉపసంహ రిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవ స్థల్ని పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం, ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక డోసు, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా (రెండు డోసులు) ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే ముందున్నాయి. శరవేగంతో వెళితేనే..... ఆర్థిక వ్యవస్థను పూర్వపుబాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి దైనందిన ప్రక్రియలు పూర్తిస్థాయిలో పనిచేయాలి. అందుకు, ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్ ఇమ్యూనిటీ) రావాలి. జనాభాలో 70 శాతం మందికి టీకామందు, కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ(మే) నివేదిక చెబుతోంది. సెప్టెంబరు మాసాంతానికి ఈ లక్ష్యం సాధించా లంటే సగటున రోజూ 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. గడ చిన 5 మాసాల్లో అత్యధికమంటే, ఒక రోజు 42.65 లక్షల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగడం, విదేశీ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు, కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయడం, రాష్ట్రాలూ ఈపాటికే కోవిడ్ సెంటర్లను ఏర్పరచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమే అంటున్నారు. నమోదు సైట్లు, టీకామందు సెంటర్లు, వైద్య–అనుబంధ సిబ్బంది, టీకామందు సరఫ రాలను సమన్వయ పరచి, రాత్రీపగలు (27/7) శ్రమిస్తే లక్ష్యం సాధ్య మేనని నివేదిక పేర్కొంది. టీకామందు ఉత్పత్తిపై సందేహాలు, అపో హలతో టీకాకు పౌరుల వెనుకంజ, ఇతర నిర్వహణా లోపాల్ని అధిగ మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ కంపెనీల టీకామం దుల్లో ధర వ్యత్యాసాల సమస్య అలాగే ఉంది. సుప్రీంకోర్టూ దీన్ని తప్పుబట్టింది. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం టీకామందు కేటా యింపు, వారి దోపిడీకి లైసెన్సు ఇవ్వడమేననే విమర్శలున్నాయి. కోవిడ్ సమాచార వెల్లడిలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు న్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహె చ్వో) అనుమతించిన జాబితాలోకి, స్వదేశీ టీకామందు కోవాక్సిన్ (భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి) ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమ స్యగా మారుతోంది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నా, దాన్ని ‘వాక్సినేషన్’గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరిం చడంతో, భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకిది అవరోధంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సత్వరం డబ్లుహెచ్‌వో ఆమోదం తీసుకురావాలి. ఉత్పత్తి ఊపందుకోవాలి దేశీయ, విదేశీ కంపెనీలయినా టీకామందు ఉత్పత్తి ఎన్నో రెట్లు పెంచాలి. సెప్టెంబరు–డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని కేంద్రం లోగడ ప్రకటించింది. కానీ, ఇదే కాలంలో సరఫ రాకై 44 కోట్ల డోసుల ఉత్పత్తికి ఆర్డర్లు, అడ్వాన్సులు ఇస్తున్నట్టు ఇటీ వలే వెల్లడించింది. ఎందుకీ వ్యత్యాసమో తెలియదు. దాదాపు 90 శాతం ఉత్పత్తికి బాధ్యత వహిస్తున్న భారత్ సీరమ్ సంస్థ (కోవీషీల్డ్) ఇకపై ఉత్పత్తిని పెంచనున్నట్టు పేర్కొంది. ముడి పదార్థాల దిగుమతి ఓ సమస్యగా ఉండింది. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత అమెరికా (యుఎస్), ఆయా పదార్థాల ఎగుమతు లపై ఉన్న నిషే«ధం తొలగించింది ‘అమెరికా రక్షణ ఉత్పత్తుల చట్ట’ నిబంధనల్ని సడలిం చామని యుఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. ముడిసరుకు దేశానికి వచ్చి, ఉత్పత్తి పెరిగేది ఆగస్టు నెలాఖరులోనే! భారత్ బయోటెక్ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్ని జూన్ నుంచి పెంచుతున్నట్టు చెప్పింది. జూలైలో 7.4 కోట్ల డోసులు ఈ సంస్థ ఉత్పత్తి చేయనుందని కేంద్రం వెల్లడించింది. ఇదంతా గజిబిజిగా ఉంది. ఫైజర్ (యూఎస్) టీకా మందు ఉత్పత్తి చేసే కంపెనీ, తాము భారత్‌లో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవాలంటే న్యాయపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర సర్కా రును అడుగుతోంది. పాక్షికంగా కల్పించే అవకావాలున్నాయి. స్వదే శీతో సహా ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఇటువంటి రక్షణ కల్పించలేదు. ధరల్లో అసాధారణ తేడా! లాభాపేక్షలేని పద్ధతిన భారత్‌లో పది డాలర్ల (రూ.730)కే ఒక్కో డోసు టీకామందు ఇస్తామని ఫైజర్ ఉత్పత్తిదారు చెబుతోంది. ఇదే కంపెనీ అమెరికాలో, ఐరోపాలో ఇస్తున్న ధర కంటే ఇది తక్కువ. అంటే, భారత్‌లో ఇది దేశీయ ఉత్పత్తి కోవిషీల్డ్ ధర (రూ.780) కన్నా తక్కువ! మరి, రష్యాకు చెందిన స్పుత్నిక్–వి (రూ.1145), మరో దేశీయ ఉత్పత్తి కోవాక్సిన్ (రూ.1410) ధరలు ఎందుకంత ఎక్కువ అనేది ప్రశ్న. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం కోటా కేటా యించిన నేపథ్యంలో, ఈ ధర వ్యత్యాసం పలు సమస్యలకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడింది. టీకామందు ఉత్పత్తి ఫార్ములాలను బట్టి ఈ వ్యత్యాసమని, అధికధర నిర్ణయించిన కంపెనీలు చెబుతున్నాయి. అడెనోవైరస్ ఫార్ములాతో రూపొందించే మిగతా టీకామందు తయారీ చౌకలో అవుతుందని, తమలా ఇనాక్టివేటెడ్ వైరస్ వినియోగ ఫార్ములా వల్ల, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసినా వ్యయం తగ్గదని కోవాక్సిన్ ఉత్పత్తి దారు చెబుతున్నారు. ధర ఎక్కువున్నప్పటికీ, ఆయా టీకా మందుల సామర్థ్యం తక్కువని వస్తున్న అధ్యయనాలు పౌరుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సదరు నివేదికలు సత్య దూరం, అసమగ్రమని ఉత్ప త్తిదారు అంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వం ఇంకా సమర్థంగా ఆయా కంపెనీలతో చర్చించి, సహేతుక ధరల్ని ఖరారు చేసుండాల్సింది. సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విష యాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శ లున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పాడైపోయిన ఫ్రిజ్‌లో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
జైపూర్: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. పాడైన రిఫ్రిజిరేటర్లో వ్యాక్సిన్లను నిల్వ చేయడంతో అవి గడ్డకట్టి పాడైపోయాయి. ఈ ఘటన రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అయితే మే 22 నుంచి ఆ ఫ్రిజ్ పాడైనా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. ఈ విషయం చీఫ్ మెడికల్ హెల్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. మహేంద్ర పర్మర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. ఫ్రిజ్ పాడైపోవడంతో అవి గడ్డకట్టి వ్యర్థంగా మారాయని.. దీనికి కారణమైన పీహెచ్సీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని సీఎమ్హెచ్వో పర్మర్ తెలిపారు. పీహెచ్సీ డాక్టర్ రామచంద్ర శర్మ మాట్లాడుతూ.. '' 480కి పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఫ్రిజ్ పాడైన మాట నిజమే కానీ వెంటనే మెకానిక్‌ను పిలిపించి ఫ్రిజ్‌ను బాగుచేయించాం. మా దగ్గర ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్లు లేవు.. గడ్డకట్టినవి అన్ని ఇతర వ్యాక్సిన్లు.. దీనిపై ఇప్పటికే ఎంక్వైరీకి వచ్చిన మెడికల్ టీమ్‌కు వివరణ ఇచ్చాం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: నాన్న వస్తాడని ఎదురుచూస్తుంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
వ్యాక్సిన్ల కోసం కంపెనీలకు భారీ ఆర్డర్ ఇచ్చిన కేంద్రం..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాటుగా భారత్ బయోటెక్ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్ డోసులను 30 కోట్ల మేర ఆర్డర్ చేసింది. బయోలాజికల్-ఈ టీకాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. చదవండి: వ్యాక్సిన్‌పై సందిగ్ధత తొలగించారని ప్రశంసలు -
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంట.. వధువు ప్రకటన వైరల్
కరోనా వేళ.. ఓ వింత ప్రకటన సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ఓ వధువు.. తనకు కాబోయే వరుడు కోసం పెళ్లి ప్రకటన చేసింది. ఇందులో అశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా..? పెళ్లి ప్రకటనకు ఎవరైనా వధువు లేదా వరుడు వివరాలు ఇస్తారు. కానీ ఆ వధువు తన క్రియేటివికి పదును పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తనకు.. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంటూ వివాహ ప్రకటన ఇచ్చింది. ఇదే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పెళ్లాడిబోయే వరుడి కోసం ఆమె చేసిన క్రియేటివ్ ఆలోచన ఫన్నీగా నవ్వులు కురిపిస్తోంది. అంతే కాదండోయ్ వరుడులో ఏయే క్వాలిటీస్ ఉండాలో స్పష్టంగా చెప్పి.. పైన పేర్కొన్న అర్హత ఉన్నవారు సంప్రదించవచ్చునని పేర్కొంటూ.. వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం కొసమెరుపు. చదవండి: ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు.. తర్వాత ఏం జరిగిందంటే బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్ తెలియదు అనుకుంటా ..! -
కొవిషీల్డ్ సింగిల్ డోస్‌పై ఫోకస్
-
Vaccination: రానున్నది వ్యాక్సిన్ల కాలం
కోవాగ్జిన్, కోవిషీల్డ్, ఈమధ్యే స్పుత్నిక్.. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ల పేర్లే ఎక్కువగా వింటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్నా.. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీల రాకతో ఆ సమస్య తీరబోతోంది. రకరకాల వ్యాక్సిన్లు మన మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వెబ్‌డెస్క్: అవును.. వ్యాక్సినేషన్ కోసం కంగారుపడాల్సిన అవసరం లేదని కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త వ్యాక్సిన్ రకాలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికారిక ఆమోదంతో కొన్ని మార్కెట్లోకి అడుగుపెట్టగా, ఇంకొన్ని ట్రయల్ ఫేజ్‌లో.. ఉత్పత్తి దిశగా, మరికొన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ధరల విషయంలో స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై భారం తగ్గించడంతో పాటు ఎక్కువ మందికి వ్యాక్సిన్ డోసుల్ని త్వరగా అందించేందుకు వీలు పడనుంది. బయోలాజికల్ ఈ టెక్సాస్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ దీనిని అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్ ప్రొటీన్ వ్యాక్సిన్ ఇది. 28 రోజుల గ్యాప్‌తో రెండో డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది హ్యూమన్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉంది. జులై ఆగష్టు మధ్యలో ఇది మార్కెట్లోకి రావొచ్చని అంచనా. నెలకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా భావిస్తున్నారు. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ దీనిని డెవలప్ చేస్తోంది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్(వైరస్..రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపేది). ఒకే డోసుతో రానున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం జంతువులపై అధ్యయనంలోనే ఉంది. దీంతో కమర్షియల్ మార్కెట్లోకి ఇది రావడానికి ఏడాదిపైనే టైం పట్టొచ్చు. బీఎన్టీ162 ఫైజర్ జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ ఎస్ఈ రూపొందించిన వ్యాక్సిన్. రెండో డోసుల ఎంఆర్ఎన్ఎ బేస్డ్ వ్యాక్సిన్ ఇది. ఇది ఇప్పటికే 85 దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. అమెరికాలోనూ 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఈమధ్యే అనుమతి దొరికింది. ప్రస్తుతం మనదేశంతో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. జులై నాటికి ఇది మన మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. జైకోవ్ డీ అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిల్లా రూపొందిస్తున్న వ్యాక్సిన్. ఇది మూడు డోసుల(మొదటిరోజు, 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్ఎ వ్యాక్సిన్. ఫేస్ 3 హ్యూమన్ ట్రయల్స్‌లో ఉంది. జూన్ జులై మధ్య వినియోగానికి అప్రూవల్ దొరికే అవకాశం ఉంది. నెలకు కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది జైడస్ కాడిల్లా. అంతేకాదు ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లల మీద టెస్ట్ కోసం ప్రణాళిక వేసుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌నూ డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎడీ26.కోవ్2.ఎస్ యూఎస్ జాన్సన్ అండ్ జాన్సన్ వారి వ్యాక్సిన్. జులైలో మనదగ్గరికి వచ్చే అవకాశం. ఒకేడోస్. సింగిల్ షాట్ ఇంజెక్షన్ వ్యాక్సిన్. ఏడాదికి యాభై నుంచి 60 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని బయో ఈ వారి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యూ4 ప్రకటించుకుంది. స్పుత్నిక్ వీ రష్యన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో పంపిణీ అవుతున్న వ్యాక్సిన్. ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 వెక్టర్స్ ఉపయోగించే తయారు చేసిన అడినోవైరస్ వ్యాక్సిన్. కిందటి నెలలోనే ఈయూఎ కింద అనుమతి. మే 14న తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ద్వారా ప్రారంభించిన రెడ్డీస్ ల్యాబ్స్. లక్షన్నర డోసుల ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 యాభై వేల డోసులు ఇదివరకే దిగుమతి. జూన్ రెండో వారం నుంచి వేగంగా ఉత్పత్తి. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌గా ఆర్ఎడీ26ను స్పుత్నిక్ లైట్ పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొవిషీల్డ్ ఇండియాలో కొవిడ్ కట్టడికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరో వ్యాక్సిన్. ఆక్స్‌ఫర్ట్, ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇండియా ఈ వ్యాక్సిన్‌ను తయారీ చేస్తోంది. పన్నెండు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాగా తీసుకోవాలి. చింపాజీ అడినోవైరస్ కారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీనికి కూడా జనవరిలోనే అనుమతి దొరికింది. ఇది కూడా పదికోట్ల డోసుల టార్గెట్‌నే పెట్టుకుంది. కోవాగ్జిన్ కొవిడ్-19 జబ్బు కట్టడికి తయారు చేసిన మొట్టమొదటి దేశీయ వాగ్జిన్. ఇన్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ రెండు డోసుల వ్యాక్సిన్.. ఈ జనవరిలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ) కింద వాడకంలోకి వచ్చింది. ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ నుంచి దీనిని డెవలప్ చేశారు. ఈ ఏడాది చివరివరకు నెలకు పదికోట్ల డోసుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్ బయోటెక్. ఇక అనుమతులతో రెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న పిల్లలపై జూన్ మొదటి వారం నుంచి ఫేజ్ 2,3 ట్రయల్స్ నిర్వహించనుంది. -
కరోనా వ్యాక్సిన్ అనుకొని ఎత్తుకెళ్లారు.. ట్విస్ట్ ఏంటంటే
ముంబై: మహారాష్ట్రలోని థానేలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 300 వివిధ రకాల వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. వారు ఎత్తుకెళ్లిన వాటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలిసింది. కాగా అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తులు హెల్త్ సెంటర్లో యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ ఏమైనా ఉందేమోనని... ముఖ్యంగా కోవిషీల్డ్ దొంగలించడానికి చొరబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్స్‌పై ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ స్టిక్కర్లను తీసేసి అక్కడే వదిలేసి వెళ్లారు. కాగా వచ్చిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు ఉండకూదని సీసీ కెమెరాలతో పాటు మానిటర్‌ను తమ వెంట తీసుకెళ్లారు . కాగా సెక్షన్ 380, సెక్షన్ 427,సెక్షన్ 454 కింద ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈరోజు ఉదయం విధుల్లో చేరేందుకు వచ్చిన పీహెచ్సీ ఉద్యోగులు హెల్త్ సెంటర్లో ఫ్రిజ్ డోర్ పగులగొట్టి ఉండడం... వ్యాక్సిన్ ట్రేలు చెల్లాచెదరుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. '' ఈరోజు ఉదయం రాగానే ఫ్రిజ్ డోర్ తాళం విరిగి ఉండడంతో వ్యాక్సిన్ స్టాక్‌ను తనిఖీ చేశాము. సాధారణంగా మాకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వస్తుంటాయి. కానీ గత శుక్రవారం నుంచి మా హెల్త్ సెంటర్‌కు ఎలాంటి కరోనా వ్యాక్సిన్లు రాలేదు. ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అని భావించి వాటిని ఎత్తుకెళ్లి ఉంటారు.పిల్లల వ్యాక్సిన్లలో అందుబాటులో ఉన్న 40 శాతం నిల్వలను ఎత్తుకెళ్లారు'' అని పీహెచ్సి వైద్య అధికారి డాక్టర్ దీపక్ చావా తెలిపారు. చదవండి: Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్ -
Corona Vaccine: మిక్స్ చేస్తే పర్లేదా!
మొదటి డోస్ కోవాగ్జిన్ తీసుకున్నాం. నాలుగు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. కానీ కోవాగ్జిన్ స్టాక్ లేదు. నిర్ణీత సమయంలో రెండో డోస్ తీసుకోకపోతే ఎలా? పోనీ రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. టీకాలు వేయించుకుంటున్న ఎంతోమందిలో ఇలాంటి సందేహాలే. ప్రస్తుతం మనదేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే ప్రభుత్వాల తరఫున ప్రజలకు ఇస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్– వీకి అనుమతి ఇచ్చినా.. అది పరిమిత సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంది. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవచ్చా?... అంటే ప్రస్తుతానికైతే భారత్‌లో దీనికి అనుమతి లేదు. మొదటి డోసుగా ఏ టీకాను తీసుకున్నామో... రెండో డోసు కూడా అదే టీకా తీసుకోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా టీకాలను మిక్స్ చేసే విషయంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం... నిపుణుల అభిప్రాయం తొలి డోస్ కోవాగ్జిన్ లేదా సినోఫార్మ్ వేసుకున్నాక... రెండో డోసుగా ఫైజర్/ ఆస్ట్రాజెనెకా (మన కోవిషీల్డ్)/ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకోవచ్చా? ‘ఇప్పటిౖMðతే వద్దనే అంటా ను. అధ్యయనాలు జరుగుతున్నాయి. అరుదుగా మినహాయింపులుండొచ్చు గాని... రెండు వేర్వేరు కంపెనీల టీకాలను మిక్స్ చేయొద్దు. అయితే ఇది తప్పకుండా మారుతుంది. గుడ్డిగా రిస్క్ తీసుకొనే బదులు 2–3 నెలలు ఆగండి’’ – అమెరికాలోని మేరీలాండ్ యూనివర్శిటీకి చెందిన అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ ఫహీమ్ యూనుస్ ఇతర దేశాల్లో పరిస్థితేమిటి... ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)ను తొలి డోసుగా తీసుకుంటే... రెండో డోసు కింద ఇతర టీకాలను తీసుకోవడానికి పలు దేశాలు అనుమతించాయి. తొలిడోసు కోవిషీల్డ్ తీసుకుంటే... రెండో డోసుగా ఇతర కంపెనీల టీకా ఇవ్వొచ్చని కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్పెయిన్, దక్షిణకొరియాలు అనుమతించాయి. రెండు విభిన్నమైన సాంకేతికతలతో తయారైన టీకాలకు మిక్స్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చైనా ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలను మిక్స్ చేయడంపై స్పెయిన్‌లో అధ్యయనం జరిగింది. ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారికి రెండో డోసుగా ఫైజర్ టీకా ఇస్తే... యాంటీబాడీలు గణనీయంగా వృద్ధి చెందినట్లు 600 మందిపై జరిపిన అధ్యయంలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థ స్పందన మెరుగ్గా ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్వల్పంగా ఉన్నాయి. ఫైజర్, మోడెర్నా టీకాలను మిక్స్ చేయడానికి అమెరికా ఇప్పటికే అనుమతించింది. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా, నోవావాక్స్ల నుంచి ఏవేని రెండు టీకాలను రెండు డోసులుగా ఇవ్వడానికి బ్రిటన్‌లో 50 మంది వలంటీర్లపై అధ్యయనం మొదలైంది. ఫలితాలు వెల్లడి కావడానికి సమయం పడుతుంది. ప్రమాదం లేదు.. కానీ అప్పుడే వద్దు మొదటి డోసు ఒక కంపెనీ, రెండో డోసు మరో కంపెనీ టీకా తీసుకున్నా పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలియజేసింది. అయితే, దీనిపై మరింత పరిశీలన జరిగిన తర్వాతే తుది నిర్ణయానికి రావాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రోటోకాల్ ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఒకే కంపెనీవి తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో జరిగిన పొరపాటుపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. రెండు వేర్వేరు సంస్థల టీకా డోసులు తీసుకున్నప్పటికీ శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు. రెండు వేర్వేరు కంపెనీ టీకాలు తీసుకుంటే... రోగనిరోధక శక్తి మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయం నెలకొందని, లోతైన విశ్లేషణల ద్వారా నిశ్చితాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. పొరపాటే... ప్రయోగం! భారత్‌లో పొరపాటున 21 మందికి రెండు వేర్వేరు కంపెనీల టీకాలను ఇవ్వడం జరిగింది. యూపీలోని మహరాజ్‌గంజ్ జిల్లాలో మొదటి డోస్ కోవాగ్జిన్ ఇచ్చిన ఒకతనికి ఏప్రిల్‌లో రెండోడోసు కింద కోవిషీల్డ్ ఇచ్చారు. సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ నెలలో 20 మందికి కోవిషీల్డ్ ఇచ్చి... ఈనెలలో రెండో డోసు కింద కోవాగ్జిన్ ఇచ్చారు. ఈ 21 మందిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనపడకపోవడం గమనార్హం. టీకాలను మిక్స్ చేసే విషయంలో మనదేశంలో అధికారికంగా అధ్యయనం మొదలుకాకపోయినా... పొర పాటు జరిగిన ఘటనలను అధ్యయనానికి స్వీకరించే అవకాశం ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
తల్లిదండ్రులిద్దరికి వ్యాక్సిన్.. షాకైన కుమారుడు
జైపూర్: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక విధి నిర్వహణలో అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అందరికి తెలుసు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్‌లో వెలుగు చూసింది. దాదాపు ఏడేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి తల్లిదండ్రులకు కోవిడ్ టీకా ఇచ్చినట్లు అతడి మొబైల్‌కి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వివరాలు.. పర్వీన్ గాంధీ రాజస్తాన్ దుంగర్పూర్ జిల్లాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2014లో అతడి తండ్రి మరణించగా.. మరుసటి ఏడాది అనగా 2015లో అతడి తల్లి మరణించింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం పర్వీన్ గాంధీ మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పర్వీన్ గాంధీ తల్లిదండ్రులిద్దరికి శ్రీ గంగానగర్ జిల్లాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మొదటి డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. దాన్ని చూసి పర్వీన్ గాంధీ షాక్ అయ్యాడు. ఎప్పుడో చనిపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం ఏంటనుకున్నాడు. దీని గురించి పర్వీన్ గాంధీ ఆరా తీయగా.. శ్రీ గంగానగర్‌లోని 1కేడీ గ్రామంలో ఎవరో తన తల్లిదండ్రుల పత్రాలపై టీకాలు తీసుకున్నట్లు తెలిసింది. మరణించిన తన తల్లిదండ్రుల పత్రాలను టీకాల కోసం మోసపూరితంగా ఉపయోగించినట్లు జిల్లాలోని ఇద్దరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని పర్వీన్ గాంధీ తెలిపాడు. ‘‘మాస్క్ ధరించడం వల్ల డాక్యుమెంట్లలో ఉన్న వారు.. టీకా తీసుకోవడానికి వచ్చిన వారు వేరు వేరు అని గుర్తించడం వీలు కావడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో పర్వీన్ గాంధీ తల్లీదండ్రుల పత్రాల మీద టీకా తీసుకుని ఉంటారని’’ అధికారులు తెలిపారు. చదవండి: కోవిడ్ వ్యక్తి అంతిమయాత్రకు హాజరు, 21 మంది మృతి..! -
వ్యాక్సిన్-వ్యాక్సినేషన్.. లెక్కల్లో తేడా!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా? సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు కలిపి నెలకు ఎనిమిది కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ, మే చివరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అందే డోసుల లెక్క 5 కోట్లకే తేలుతోంది. మరి మిగతా మూడు కోట్ల డోసుల సంగతేంటి? ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు రోజూ సగటున 27 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అదీ రష్యన్ స్పుత్నిక్ను పరిగణనలోకి తీసుకోకుండానే. అయితే మే మొదటి మూడు వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రోజు సగటున 16.2 లక్షల డోసులు మాత్రమే డెలివరీ చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సుమారు 3.4 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించారు. లెక్కల్లో.. నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేయగలమని సీరమ్ ఇండియా పదే పదే ప్రకటించుకుంటోంది. ఇక భారత్ బయోటెక్ ఏప్రిల్‌లో 2 కోట్ల కోవాగ్జిన్ డోసుల్ని ఉత్పత్తి చేశామని, మే చివరికల్లా మూడు కోట్ల డోసుల్ని అందిస్తామని చెప్పింది. అంటే ఎలా చూసుకున్నా ఎనిమిదిన్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి కావాలి. కోవిన్ పోర్టల్ ప్రకారం చూసుకుంటే మే 22 రోజులకుగానూ రోజుకి 16.2 లక్షల చొప్పున వ్యాక్సిన్లను డెలివరీ చేశాయి. మే 16 నుంచి 22 మధ్య ఆ డెలివరీ ఏకంగా 13 లక్షల డోసులకు పడిపోయింది. అంటే రోజుకి 9.7 లక్షల డోసులు లెక్క తేడా వస్తోంది. అలాగే కంపెనీలు చెప్తున్న నెల వ్యాక్సిన్ డోసుల అవుట్‌పుట్‌కు, వ్యాక్సినేషన్‌కు తేడా వస్తోంది. ఇప్పుడున్న డెలివరీ ఇలాగే కొనసాగినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదు కోట్ల డోసులతో ముగియొచ్చు. మరి మిగతా మూడుకోట్ల డోసుల మాటేంటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గప్పాలేనా? ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టుకు కేంద్రం వ్యాక్సినేషన్ మీద ఒక అఫిడవిట్ సమర్పించింది. నెలకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆరున్నర కోట్ల కోవిషీల్డ్ డోసులను, భారత్ బయోటెక్ రెండు కోట్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయగలవని అందులో పేర్కొంది. జులై నాటికి కోవాగ్జిన్ సామర్థ్యం ఐదున్నర కోట్లకు పెరుగుతుందని, అలాగే స్ఫుత్నిక్ కోటిన్నర డోసులకు(ఇప్పుడు నెలకు ముప్ఫై లక్షలు ఉంది) పెరుగుతుందని రిపోర్ట్ సమర్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అది జరగకపోవచ్చనే మేధావులు అంచనా వేస్తున్నారు. ఎనిమిదిన్నర కోట్లు ఉత్పత్తి చేసేప్పుడు.. కేవలం ఐదు కోట్లను డెలివరీ చేయడం, ప్రైవేట్ కోటా లాంటి విషయాల్లో క్లారిటీ వస్తేనే డోసుల లెక్క తేలేది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి టైంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో... రెండు వేర్వేరు సంస్థలకు చెందిన టీకాలు అదించొచ్చా అనే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్–19 బృందం (వర్కింగ్ గ్రూపు) అధ్యయనం చేయనుంది. త్వరలోనే దేశంలోకి కొత్త వ్యాక్సిన్లు వస్తున్న నేపథ్యంలో వేర్వేరు టీకాలపై దేశంలో అధ్యయనం చేయనున్నట్లు వర్కింగ్ గ్రూపు హెడ్ ఎన్కే అరోరా తెలిపారు. ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందిస్తుండగా త్వరలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో రెండు డోసుల్లో రెండు వేర్వేరు టీకాలు అందిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిర్ధారణ కోసమే అధ్యయనం చేస్తున్నట్లు అరోరా పేర్కొన్నారు. జులై నాటికి స్పుత్నిక్ లభ్యత దేశంలో పెరగనుందని, అప్పటి నుంచి జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చుతామని తెలిపారు. (చదవండి: NGO: శ్మశానాల్లో అధిక వసూళ్లా?) -
45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. నేటి నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 3 రోజుల పాటు వేయనున్నామన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉంటే ఇష్టారాజ్యంగా ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొన్ని గ్రూపులు అంటే రైల్వే, ఆర్టీసీ, పోర్ట్‌లు, బ్యాంకులు, సివిల్ సప్లై, పాత్రికేయులు వంటి విభాగాల్లో ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలని చెప్పామన్నారు. సింఘాల్ ఇంకా ఏమన్నారంటే.. ► తుపాన్ ప్రభావం కారణంగా ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఎదురవ్వకుండా అప్రమత్తంగా ఉన్నాం. రూర్కెలా, జామ్‌నగర్ వంటి చోట్ల నుంచి 70 మెట్రిక్ టన్నుల చొప్పున సేకరించాం. ► మూడు రోజులుగా టెస్టులు తగ్గించకున్నా కేసులు రోజుకు వెయ్యి లెక్కన తగ్గుతూ వస్తున్నాయి. పడకల లభ్యత పెరిగింది. 104కు వచ్చే కాల్స్ తగ్గాయి. ఇవన్నీ చూస్తే కరోనా కాస్త నెమ్మదిస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం వెయ్యి ఇంజక్షన్లు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ► కృష్ణపట్నం మందుపై ఆయుష్ విభాగం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ మందులో హానికారక దినుసులేవీ లేవని చెప్పారు. ప్రతి ఊళ్లో సంప్రదాయ మందులు వాడుతుంటారు. వాటికి అనుమతులు అవసరం లేదు. అయితే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే పరిశీలించాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్ వేశాం. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించాం. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. జూన్ 15 వరకు మన దగ్గర ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు అవుతుంది. -
31.71 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం కేవలం 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు గల వారి నుంచి అందరికీ ఉచితంగా కోవిడ్ టీకా వేస్తామని, ఇందుకోసం రూ.1,600 కోట్లు వ్యయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అవసరమైన కోవిడ్ టీకాలను వెంటనే కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం మే, జూన్లకు కలిపి 31.71 లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించగా ఆ మొత్తం డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మే నెలకు కేంద్రం కేటాయించిన 16.85 లక్షల డోసులను కొనుగోలు చేసినప్పటికీ ఇంకా 5.21 లక్షల డోసులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. జూన్‌కు కేటాయించిన 14.86 లక్షల డోసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ డోసులు కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 4.44 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక గన్నవరం: రాష్ట్రానికి 4.44 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రాత్రి 8.15 గంటలకు చేరుకున్నాయి. అనంతరం వ్యాక్సిన్ డోసులను కంటైనర్‌లో రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించి భద్రపరిచారు. -
రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా ప్రక్రియ వేగవంతం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కోవిషిల్డ్, కోవాక్సిన్ డోసుల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఆయా ఇన్స్టిట్యూట్లకు రూ. 50 కోట్లకు పైగా నిధులు చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో త్వరలో 11 లక్షలకు పైగా కోవిషిల్డ్ డోసులు, 3 లక్షలకు పైగా కోవాక్సిన్ డోసులు రాష్ట్రానికి సరఫరా కానున్నాయి. 45 సంవత్సరాల పైబడిన వారికి జూన్ నెల వరకు రెండు డోసులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. -
అందుకే ఆ గ్యాప్ ఇచ్చాం: ఐసీఎంఆర్ చీఫ్
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరిగినట్టు గుర్తించామని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ప్రకటించారు. తొలి డోసు ప్రభావ శీలత ఎక్కువగా ఉన్నందునే రెండు డోసుల మధ్య వ్యవధిని ఆరు వారాల నుంచి మూడు నెలలకు పెంచినట్టు వివరించారు. అదే సమయంలో కోవాగ్జిన్ తొలి డోసు ప్రభావం ఎక్కువగా లేదని, అందుకే రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచలేదన్నారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుందన్నారు బలరాం భార్గవ. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం వల్ల సానుకూల ఫలితాలే వస్తాయన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని తొలుత ప్రకటించింది కేంద్రం. వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇదే వ్యవధిలో టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచారు. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నెలలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనిపై విమర్శలు రావడంతో ఈ గ్యాప్‌ని 3 నెలలకు కుదించింది కేంద్రం. తరచుగా కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని మార్చుతుండటంతో కేంద్రంపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్ల కొరత సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచిందంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో ఈ విమర్శలకు సమాధానం ఇచ్చే పనిలో భాగంగానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్ బలరాం భార్గవ వివరణ ఇచ్చారు. -
టీకా రక్ష.. అందని ద్రాక్ష?
శివాజీనగర: కోవిడ్ రెండో దాడితో నలిగిపోయిన కన్నడనాట కరోనా టీకాలు అందనిమావిగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రమంతటా 18 ఏళ్లు పైబడిన 5.11 కోట్ల మంది కరోనా టీకాలకు అర్హులు కాగా వారిలో 82 శాతం మందికి ఇప్పటికీ సూదిమందు ఇవ్వలేదు. టీకా అభియాన్ ప్రారంభమైన జనవరి నుంచి బుధవారం వరకు 1.14 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు సర్కారు తెలిపింది. మరో 4.22 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉండగా అభియాన్ ముందుకు సాగడం లేదు. రెండో డోసే అందలేదు.. 66.4 లక్షల మంది రెండో డోస్‌కు నిరీక్షిస్తున్నారు. అభియాన్‌ను వేగవంతం చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కోవిడ్ వారియర్స్ 8.6 లక్షలు కాగా, వారిలో ఇప్పటి వరకు 4,60,437 మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకాలు లభించాయి. 1.6 లక్షల మందికి తొలి డోసే దొరకలేదు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 1.5 లక్షల డోస్‌ల కోవాగ్జిన్, 6.5 లక్షల డోస్‌లు కోవిషీల్డ్ టీకాలు మాత్రమే స్టాక్ ఉంది. టీకాల్లో సర్కారు లెక్కలు దారితప్పాయని నిపుణులు తెలిపారు. నవంబర్‌కల్లా 100 శాతం టీకాలు రాష్ట్రంలో నవంబర్ నాటికి రెండు డోస్‌ల కోవిడ్ టీకాలను 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు వైద్య ఆరోగ్య సుధాకర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు 1,22,20,510 డోస్‌లు వచ్చినట్లు చెప్పారు. 1,13,61,234 మందికి టీకాలు ఇచ్చినట్లు బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9,50,000 కోవిషీల్డ్, 1,44,174 కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసిందన్నారు. స్పుత్నిక్ టీకాను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అవకాశముందని తెలిపారు. కోవిడ్ డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమన్నారు. -
దేశ ప్రజలే మాకు ముఖ్యం: సీరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. కరోనా కట్టడి కోసం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటికి టీకాల కొరత వల్ల అది అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్ టీకా ఇవ్వడం పూర్తవ్వలేదు. ఇక పలు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తాము విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించింది. భారత్ వంటి దేశంలో 2,3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమన్నది. భారత్‌లో వ్యాక్సినేషన్లో అనేక సవాళ్లు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు 2 నుంచి 3 ఏళ్లు పడుతుందని సీఎం తెలిపింది. అమెరికా కంపెనీల కంటే తమకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయన్నది. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే తమది మూడో స్థానమని.. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామని సీరం తెలిపింది. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది. చదవండి: యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’ -
వ్యాక్సిన్ల వ్యయం రూ.75 వేల కోట్లు!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ల కోసం మన దేశం అక్షరాలా రూ.75 వేల కోట్లను వ్యయం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి 2021లో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం వ్యాక్సిన్లకు ఎంత వ్యయం అవుతుందనే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, జూలై నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని తన నివేదికలో పేర్కొంది. ఇండియాలో ప్రతిరోజు 70 లక్షల నుంచి 80 లక్షల డోసులు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల సరఫరా లేదు. సామర్థ్యంలో 30 శాతం మాత్రమే సరఫరా అవుతున్నట్టు పేర్కొంది. అక్టోబర్ నాటికి పూర్తి స్థాయికి.. దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకా వేయించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభంకాదని ఇన్వెస్టెక్ తేల్చిచెప్పింది. జూలై నుంచి దేశంలోకి కొత్తగా క్యాడిలా హెల్త్‌కేర్ అభివృద్ధి చేస్తున్న జెడ్‌వైకోవీడీ, నోవాక్స్, స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. జూలై నుంచి దేశంలో వ్యాక్సిన్ల సరఫరా పెరిగి అక్టోబర్ నాటికి పూర్తి స్థాయికి చేరుకుంటుందని ఇన్వెస్టెక్ అంచనా వేసింది. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సరఫరా పెరిగినా కేవలం 124 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ ప్రకారం చూస్తే 18 ఏళ్లు నిండిన జనాభాలో 74 శాతం మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఇది కూడా వ్యాక్సిన్ సరఫరా, కేంద్ర అనుమతులపై ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ సంస్థలకు లాభాలే లాభాలు 2021లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు లాభాల పంట పండనుందని ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది, మొత్తం వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఈ ఏడాది లాభాల రూపంలో రూ.15 వేల కోట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా తొలుత ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లకు తీసుకోనుండగా.. ఆ తర్వాత స్థానాల్లో డాక్టర్ రెడ్డీస్ (స్పుత్నిక్–వీ), క్యాడిలా సంస్థలు లబ్ధి పొందుతాయని పేర్కొంది. ఫైజర్, జే అండ్ జే, బయలాజికల్–ఈ వంటి సంస్థలు ఈ రేసులో ఆలస్యంగా చేరుతుండటంతో ప్రారంభ లాభాలను పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాయి. -
Vaccine: రక్త స్రావం, గడ్డకట్టడం భారత్‌లో చాలా తక్కువ
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియాలో సీరం సంస్థ కోవిషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వల్ల .. కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. యూరోప్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తిన కేసులు 20 వరకు నమోదు అయినట్లు రికార్డులు తెలిపాయి. కరోనా టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్‌లో అత్యంత తక్కువ అని నేషనల్ ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇండియాలో 75,435,381 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారని, దాంట్లో కోవీషీల్డ్ 650,819 మందికి, కోవాగ్జిన్ టీకాలను 6,784,819 మందికి ఇచ్చినట్లు నేషనల్ ఏఈఎఫ్ఐ తెలిపింది. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తర్వాత 23 వేల సమస్యాత్మక కేసులను గుర్తించినట్లు.. కోవిడ్ పోర్టల్ ద్వారా దీని గురించి తెలిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక వీటిలో కేవలం 700 కేసులు మాత్రమే సీరియస్‌గా ఉన్నట్లు పేర్కొన్నది. అంటే పది లక్షల్లో 9.3 కేసులు మాత్రమే సమస్యాత్మకం అని గుర్తించినట్లు కమిటీ చెప్పింది. సుమారు 498 సీరియస్ కేసులను కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. దాంట్లో 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కోవిషీల్డ్ తీసుకున్నవారిలో త్రాంబోఎంబోలిక్ కేసులు 0.61గా ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇక కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవీ నమోదు కాలేదన్నది. రక్తం గడ్డకట్టే కేసులు ఇండియాలో అతి స్వల్పంగా నమోదు అయినట్లు ఏఈఎఫ్ఐ వెల్లడించింది. అది కేవలం 0.61గా ఉన్నట్లు చెప్పింది. దిలావుంటే, బ్రిటన్‌లో ఇది ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులు, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు కేవలం 10 కేసులు నమోదయినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది. ‘‘నేపథ్యం, శాస్త్రీయ కారణాలను పరిగణనలోకి తీసుకుంటే యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ, ఆగ్నేయాసియా సంతతికి ఈ ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని సూచిస్తుంది’’ అని నివేదిక తెలిపింది. రక్తం గడ్డకట్టడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాక్సిన్ భయాలను తొలగించాలని అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, గుండెల్లో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. గత నెలలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఇదిలావుంటే, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఎదురుకావడంతో డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కోవిషీల్డ్‌ను నిషేధించాయి. దీనిపై ఐరోపా సమాఖ్య మెడికల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి కోవిషీల్డ్ సురక్షితమైందేనని, ప్రభావంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. చదవండి: Corona Vaccine: కోవాగ్జిన్ స్టాక్ లేదు.. కోవిషీల్డ్‌కు అర్హులు లేరు! -
Corona Vaccine: కోవాగ్జిన్ స్టాక్ లేదు.. కోవిషీల్డ్‌కు అర్హులు లేరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంలో పడింది. శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం నుంచి (ఈ నెల 17 నుంచి) ప్రారంభిస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం తెలిపింది. కానీ రాష్ట్రంలో కోవాగ్జిన్ మొత్తంగా ఖాళీ అయిపోవడం, కేంద్రం నుంచి కొత్త స్టాకు రాకపోవడంతో.. కోవాగ్జిన్ రెండో డోసు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కోవాగ్జిన్ టీకాల పంపిణీపై త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొంది. ఈ లెక్కన సోమవారం నుంచి కోవాగ్జిన్ పంపిణీ లేనట్టే. | కోవిషీల్డ్‌పై అయోమయం.. కోవిషీల్డ్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కోవిషీల్డ్ రెండో డోసును 84 రోజుల (12 వారాల) తర్వాతే ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రం.. పాత గడువు లెక్కన (8 నుంచి 12 వారాల మధ్య) ఇవ్వొచ్చని రాష్ట్రాలకు సూచించింది. స్లాట్ బుక్ చేసుకోని వారికి మాత్రం 84 రోజుల గడువు ముగిశాకే ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారు కొత్త గడువు ప్రకారం రెండో డోసు తీసుకోవాలని భావిస్తే.. ఆ మేరకు పోర్టల్‌లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 45 ఏళ్లు దాటినవారికి రెండో డోసు టీకాల పంపిణీ మాత్రమే సాగుతోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ముందస్తు రిజిస్ట్రేషన్/బుకింగ్ అవసరం లేదని, టీకా కేంద్రాల్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పెద్దగా ఎవరూ స్లాట్ బుకింగ్ చేసుకోలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో పాత గడువుతో రెండో డోసు తీసుకోవాల్సిన వారు దాదాపుగా లేరని అధికారులు చెప్తున్నారు. కొత్త గడువు (84 రోజులు) ప్రకారం మరికొన్ని రోజులపాటు రెండో డోసు వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుందా, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, కొత్తగా తొలి డోసు పంపిణీ ప్రారంభిస్తారా? అన్న అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. -
వ్యాక్సిన్లు విక్రయిస్తున్న వైద్యాధికారి అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): కోవిడ్ వ్యాక్సిన్లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జీ కొండూరు మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఎన్ఎస్ రాజు నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ హెల్ప్‌లైన్ 104లో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో సత్యనారాయణపురం, మత్యాలంపాడు ప్రాంతాల్లో కారులోనే వ్యాక్సిన్లు వేస్తూ రూ.600 నుంచి రూ.1000 వరకూ వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణపురంలోని ఓ భవనంలో వ్యాక్సిన్ వేస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శీరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ బాలమురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వైద్యాధికారితో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు. భవనంలోని స్టోర్ రూంలో భద్రపర్చిన సిరెంజిలు, 5 కోవాగి్జన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. -
కోవిషీల్డ్ రెండో డోస్ 12–16 వారాల మధ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవడానికి ప్రస్తుతం 6–8 వారాలున్న వ్యవధిని ఇకపై 12–16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫారసుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు టీకాల మధ్య కాల పరిమితిని పెంచితే మరింతగా ప్రయోజనాలు ఉన్నట్లు బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో ఎన్టీఏజీఐ కొత్తగా ఈ సిఫార్సు చేసింది. మొదటి టీకా తీసుకున్నాక ఆరు వారాలలోపు రెండో టీకా తీసుకుంటే వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 55.1 శాతం ఉండగా, రెండో డోస్‌కు 12 వారాలకంటే ఆలస్యంగా తీసుకుంటే టీకా సామర్థ్యం ఏకంగా 81.3 శాతానికి పెరిగినట్లు బ్రిటన్ అధ్యయనంలో తేలింది. మరోవైపు, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ రెండు టీకాల మధ్య వ్యవధిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తమ వద్ద కోవిడ్ టీకాల కొరత చాలా ఎక్కువగా ఉందని చాలా రాష్ట్రాలు కేంద్రప్రభుత్వానికి విన్నవించుకున్నవేళ కోవిషీల్డ్ టీకా డోస్‌ల మధ్య అంతరాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో టీకా డోస్‌ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం తెల్సిందే. కోవిషీల్డ్ టీకాల డోస్‌ల మధ్య వ్యవధిని పెంచడం ఇది రెండోసారి. 28 రోజుల వ్యవధిని 6–8 వారాలుగా మారుస్తూ మార్చి నెలలో నిర్ణయించారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులను నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్–19(ఎన్ఈజీవీఏసీ) అంగీకరించిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిషీల్డ్ డోసుల మధ్య కాలవ్యవధిని 12 వారా లు మించి పెంచితే మంచిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొందని, ఇదే విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని వీకే పాల్ చెప్పారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవీ.. ► కోవిషీల్డ్ కోవిడ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని 12–16 వారాలకు పెంచుకోవచ్చు ► కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాల్లో గర్భిణులు తమకు నచ్చిన టీకాలను ఎంచుకోవచ్చు ► కోవాగ్జిన్ రెండు టీకాల మధ్య కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు ► నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు పూర్తిగా కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే టీకాను తీసుకోవాలి ► కోవిడ్ టీకా తీసుకునేముందు లబ్దిదారులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలన్న ప్రతిపాదనను ఎన్టీఏజీఐ తిరస్కరించింది ► గర్భిణులకు తరచుగా జరిగే డాక్టర్ చెకప్‌ల సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలతోపాటు సైడ్ ఎఫెక్ట్లపైనా వారికి అవగాహన కలిగించాలి ► టీకా తీసుకుంటే అత్యంత అరుదుగా రక్తం గడ్డ కట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చనే వివరాలతో కూడిన అవగాహనను గర్భిణులకు కల్పించాలి ► ప్రసవించాక పాలిచ్చే తల్లులు ఎప్పుడైనా సరే టీకా తీసుకోవచ్చు ► టీకా మొదటి డోస్ తీసుకున్నాక పరీక్షలో పాజిటివ్‌గా తేలితే పూర్తిగా కోలుకున్నాక 4–8 వారాల తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి ► బయటి వ్యక్తుల నుంచి యాంటీ బాడీలు, ప్లాస్మాను పొందాక కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి మూడు నెలల వరకు కోవిడ్ టీకాను తీసుకోకూడదు. ► మొదటి డోస్ తీసుకున్నాక అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారు, ఐసీయూ చికిత్స అవసరమైన వారు కనీసం 4–8 వారాలు ఆగిన తర్వాతే రెండో డోస్ టీకా తీసుకోవాలి. -
కోవీషీల్డ్ డోసుల గ్యాప్: పూనావాలా స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కోవీషీల్డ్ వ్యాక్సిన్ మోతాదుల మధ్య అంతరాన్ని పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ సంస్థ సీరం ఉత్పత్తి చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమని ఆదార్ పూనావాలా అన్నారు. టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ దృక్కోణంలో చూస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.(మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఎపుడు తీసుకోవాలి!) టీకా సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందని పూనావల్లా చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అంచనా. మొదట్లో రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు. ఆ తరువాత అది 6 నుంచి 8 వారాలకు పెరిగింది. అయితే ఇటీవలి అధ్యయనం ప్రకారం రెండు డోసుల మధ్య అంతరం 12 నుంచి అంతకంటే ఎక్కువ విరామంలో ఇచ్చిన రెండు ప్రామాణిక మోతాదుల తరువాత టీకా సామర్థ్యం 81.3 శాతంగా ఉంది. 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని వెల్లడైంది. అదే బ్రిటన్ నుంచి అందిన ఆధారాల ప్రకారం ఈ విరామ కాలాన్ని పెంచేందుకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ పెంచడం ద్వారా టీకా సామర్థ్యం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ గత ఫిబ్రవరిలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా -
Corona Vaccine: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెరిగింది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్టీఏజీఐ) పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. కోవాగ్జిన్ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది. నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సిఫారసులు కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ మోతాదు ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు. చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్‌కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ మొదటి షాట్ ఇస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదు. దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు. టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్ ఇస్తుండగా.. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3% పెంచుతుందని తెలుస్తోంది. ఈ ప్రోటోకాల్ బ్రిటన్‌లో అనుసరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు యాంటినెటల్ సెంటర్లలో టీకాలకు సంబంధించిన లాభాలు, నష్టాలు గురించి తెలియజేయాలి. సైడ్ ఎఫెక్ట్స్‌పై ఒక బుక్లెట్ వారికి అందించాలి. వారికి టీకా వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాలిచ్చే తల్లులు డెలివరీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపింది. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్ -
కరోనా వ్యాక్సిన్: పరిమిత జాప్యం పర్వాలేదు!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు దాటాక రెండో డోసు తీసుకుంటే సరైన ఫలితం ఉంటుందా? రెండో డోసు తీసుకున్నాకే శరీరానికి వైరస్ నుంచి రక్షణ అందుతుందా?’.. దేశంలో వ్యాక్సిన్ల కొరత, టీకాల కార్యక్రమం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలివి. టీకాల కొరత కారణంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారికి.. ముందుగా చెప్పిన సమయం కంటే ఎక్కువ ఆలస్యమవుతోంది. అయితే పరిమిత ఆలస్యం వల్ల నష్టమేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్తోంది. వివిధ దేశాల్లో పంపిణీ చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదికలో.. మన దేశంలో వినియోగిస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. కోవిషీల్డ్‌కు మూడు నెలల దాకా.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ల లభ్యత ఆధారంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి పంపిణీ ప్రక్రియ మొదలైంది. రెండు టీకాలు కూడా నిర్ణీత విరామంతో రెండు డోసులుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాక.. 6–8 వారాల విరామంతో రెండో డోసు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో మాత్రం 6 నుంచి 12వారాల విరామం ఉన్నా నష్టం లేదని వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నాక మూడు నెలల విరామం వరకు రెండో డోసు వేసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అదే విధంగా కోవాగ్జిన్ టీకా తొలిడోసు తీసుకున్నాక 4 నుంచి 6 వారాల విరామంతో తీసుకోవచ్చని సూచించింది. తొలి డోసు నుంచే రక్షణ మొదలు కోవిడ్ వ్యాక్సిన్లు తొలి డోసు తీసుకున్న రెండువారాల తర్వాత శరీరానికి రక్షణ మొదలవుతుంది. శరీరంలో యాంటీబాడీల వృద్ధి రెండు వారాల తర్వాత ప్రారంభమవడమే దీనికి కారణం. ఇక తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల నుంచి యాంటీబాడీలు వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే స్థాయికి ఎదగడం మొదలవుతుంది. రెండో డోసు తీసుకున్నాక యాంటీబాడీలకు డబుల్ బూస్టింగ్ వస్తుంది. వైరస్ నుంచి రెట్టింపు రక్షణ ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్‌వో తమ నివేదికలో పేర్కొంది. కొన్ని సందర్భాల్లో శరీర స్థితి ఆధారంగా యాంటీ బాడీల పెరుగుదల ఉంటుందని వివరించింది. ఇక ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే ఫలితం ఉండదనేది అవాస్తవమని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెండో డోసుకు నిర్దేశించిన గడువు నాలుగైదురోజులు అటూ ఇటూ అయినా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. 2–4 వారాల మధ్యే యాంటీబాడీల వృద్ధి ‘వ్యాక్సిన్ వేసుకున్నాక రెండు నుంచి నాలుగు వారాల మధ్య యాంటీబాడీల వృద్ధి ప్రారంభమవుతుంది. వాటి సంఖ్య, సామర్థ్యం మరింతగా పెంచేందుకు రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరతతో రెండో డోసు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతోంది. దేశంలో ప్రస్తుతం ఇస్తున్న రెండు రకాల వ్యాక్సిన్ల రెండో డోసుకు ఐసీఎంఆర్ వేర్వేరు గడువును విధించింది. నిర్దేశించిన గడువుకు కాస్త అటుఇటైనా వ్యాక్సిన్ పనితీరు బాగానే ఉంటుంది. అయితే ఈ అంశంపై ఇంకా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి’. – డాక్టర్ పి.విజయ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, జీజీహెచ్, కడప రెండో డోసు తప్పనిసరి ‘కోవిడ్–19 వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు ఇస్తున్నారు. మన దగ్గర కూడా రెండో డోసు వేసుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అయితే నిర్ధిష్ట కాల పరిమితి విధించి ఆలోపు రెండో డోసు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆలస్యం కాక తప్పేలా లేదు. అయినప్పటికీ రెండో డోసు వేసుకుంటే యాంటీబాడీలకు బూస్టింగ్ వస్తుంది. అందువల్ల రెండో డోసు పట్ల నిర్లక్ష్యం చూపకుండా వేసుకోవాలి’. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
త్వరలోనే 4 పీఎస్‌యూల ద్వారా టీకా ఉత్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి’’ అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర. మే 1నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి.. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో అనుకున్న మేర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల గురించి పట్టించుకోకుండా.. విదేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసిందని.. ఫలితంగా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సంబీత్ పాత్ర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోవిషీల్డ్ ఫార్ములా, లైసెన్స్ విదేశాల చేతిలో ఉంది. లైసెన్స్ ఫ్రీ చేయడానికి భారత్, ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రయత్నం చేస్తోంది. కోవాగ్జిన్ ఫార్ములా మన దేశానిదే. ఈ వాక్సిన్‌లో సజీవ వైరస్ ఉండడంవల్ల కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ భారత్ బయోటెక్ కాకుండా మరో కంపెనీ వద్ద మాత్రమే ఉంది. ఆ కంపెనీతో పాటు మరో నాలుగు పీఎస్‌యూల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అన్నారు సంబీత్ పాత్ర. ‘‘భారత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి. అలాగే విదేశాల్లోని భారతీయులకు వాక్సిన్ అందజేశారు. వ్యాక్సిన్‌పై కేజ్రీవాల్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. వ్యాక్సిన్లు కొనుగోలుకు ఆర్డరు, అడ్వాన్స్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు మానుకుని ఏకతాటిపై నడవాలి’’ అని సంబీత్ పాత్ర ప్రతిపక్షాలకు సూచించారు. చదవండి: టీకాలపై తుది మాట మాదే -
కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి కోవాక్జిన్ టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని సరఫరాను నిలిపివేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, మరలా 6.6 కోట్ల వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో 17 పాఠశాలల్లోని 100 కోవాక్జిన్ సెంటర్లను మూసివేయాల్సి వస్తుందని ట్విట్టలో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోవాక్జిన్-భారత్ బయోటెక్, కొవిషీల్డ్- సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13.5 లక్షల కేసులు నమోదు కాగా..12.4 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 20,010 మంది మరణించారు. (చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!) -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’
న్యూఢిల్లీ: ఒకవైపు దేశం తీవ్ర వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటుండగా... మరోవైపు 50 లక్షల కోవిషీల్డ్ డోసులను బ్రిటన్‌కు ఎగుమతి చేయడానికి తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ (సీఐఐ) అనుమతి కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లను మొదట భారత అవసరాలను తీర్చడానికి సరఫరా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ 50 లక్షల కోవిషీల్డ్ డోసులను 18–44 ఏళ్ల వయసుల వారికి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ‘ఈ 50 లక్షల డోసులు రాష్ట్రాలకే ఇస్తాం. వీటిని కొనాల్సిందిగా రాష్ట్రాలను కోరాం. ప్రైవేటు ఆసుపత్రులు కూడా వీటిని తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా దాదాపు 95 దేశాలకు భారత్ లక్షలాది వ్యాక్సిన్ డోసులను అందించింది. దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే... విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ఎలా అనుమతిస్తారంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడికి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరమ్ తాజా అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది') -
ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కరోనా వ్యాప్తి చెందడానికి కూడా అదొక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు దేశంలో వేస్తున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అవసరానికి తగ్గట్టు సరఫరా లేదు. దీంతో వ్యాక్సిన్ ప్రక్రియపై ఢిల్లీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రస్తుతం ఒక్కరోజుకే వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని.. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయలేమని ఢిల్లీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 125 కేంద్రాల్లో కోవాగ్జిన్ టీకాలు 18-44 వయసు వారికి వేయడం నిలిపివేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి మంగళవారం తెలిపారు. ‘ఒక్క రోజుకు మాత్రమే కోవాగ్జిన్ ఉంది’ అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సోమవారం ప్రకటన చేయగా మంగళవారం ఆ పార్టీ నాయకుడు వ్యాక్సిన్ కొరతతో ఆ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇక కోవిషీల్డ్ మూడు, నాలుగు రోజులకు సరిపడా ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ పంపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాం. పంపకపోతే ఇక ఏం చేస్తాం. వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపివేస్తున్నాం’ అని అతిషి తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ సరఫరా పెంచితే మూడు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న యూట్యూబర్ ఆఖరి మాటలు చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
తొలి డోసు తీసుకున్నారా.. రెండో డోసుకు గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి టీకాలు ఇచ్చినా.. వీరిలో రెండో డోసు చాలా తక్కువ మంది తీసుకున్నారు. పలు కారణాల వల్ల రెండో డోస్ తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రెండు టీకాల మధ్య అంతరం ఎంత ఉండాలన్న దానిపై చర్చా సారాంశమే ఈ కథనం.. దేశంలో ప్రస్తుతం రెండు టీకాలు ఉపయోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్. కోవాగ్జిన్ టీకాల మధ్య అంతరంపై పెద్దగా అభ్యంతరాలు, సమస్యలు లేకపోయినా కోవిషీల్డ్ విషయంలో మాత్రం తరచూ మార్పులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా కార్యక్రమం మొదలు కాగా.. అప్పట్లో 2 కోవిషీల్డ్ టీకాల మధ్య అంతరం గరిష్టంగా 4 వారాలు మాత్రమే ఉండేది. అయితే గత నెల రెండో వారంలో ఈ అంతరాన్ని మరింత పెంచారు. తొలి డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల అంతరంతో రెండో డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి కొరత ఇందుకు కారణమని అప్పట్లో కొంతమంది ఆరోపించినా.. నిపుణులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెబుతున్నారు. సాధారణంగా ఏ టీకా వేసుకున్నా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు 3 వారాల సమయం పడుతుంది. అవి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు 8 వారాల సమయం అవసరమని వైరాలజిస్టులు చెబుతారు. రెండు దోసుల మధ్య అంతరం గరిష్టంగా ఎంత ఉండాలన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని, రెండో డోసు ఎప్పుడైనా ఇవ్వొచ్చని చెబుతుంటే.. 3 వారాల కంటే ముందే ఇవ్వడం సరికాదని దేశంలోనే ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అంటున్నారు. ఇలా అయితేనే మంచిది కరోనా మహమ్మారితో ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2 టీకాల డోసుల మధ్య అంతరం పెంచడం మేలన్నది నిపుణుల అంచనా. ఒక డోసు తీసుకున్న వారికి వ్యాధి నుంచి గణనీయమైన స్థాయిలో రక్షణ లభిస్తుంటుందని, రెండో డోసు కారణంగా ఇది మరికొంత పెరుగుతుందని వివరిస్తున్నారు. ఈ కారణంగా వీలైనంత ఎక్కువ మందికి తొలి డోసు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం గాడినపడేంత వరకు ఈ పద్ధతి పాటిస్తే కేసులు, మరణాల సంఖ్య తగ్గించవచ్చని అంచనా. పలు దేశాల్లో పెరిగిన అంతరం టీకాల మధ్య అంతరాన్ని పలు దేశాలు ఇప్పటికే పొడిగించాయి. కెనెడాలో ఇప్పుడు అక్కడ తొలి డోసు తీసుకున్న 4 నెలలకు గానీ రెండో డోసు ఇవ్వట్లేదు. కోవిషీల్డ్ డోసుల మధ్య అంతరం పెరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్ అంటున్నారు. బ్రిటన్ లో ఒక డోసు తీసుకున్న తర్వాత కేసులు, మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని, కనీసం 12 వారాల గడువు ఉన్నా కూడా సమస్యలేవీ ఎదురు కాలేదని వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ డోసుల మధ్య అంతరాన్ని 12 వారాలకు పెంచారని తెలిపారు. భారత్‌లోనూ 8 నుంచి 12 వారాల అంతరంతో రెండు డోసుల కోవిషీల్డ్ ఇవ్వడం మేలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ నిడివికి ఓకే చెప్పిందని గుర్తు చేశారు. కోవాగ్జిన్ నిర్వీర్యం చేసిన వైరస్‌తో తయారైంది కాబట్టి 2 డోసుల మధ్య అంతరం తక్కువ ఉండటం మేలని, రెండు కంటే ఎక్కువ డోసులు తీసుకోవాల్సి రావొచ్చని గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. ( చదవండి: కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ) -
వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత పాజిటివ్ శాతం ఎలా ఉందంటే..
ఢిల్లీ: ప్రపంచాన్ని బెంబెలేత్తించిన కరోనా వైరస్ కట్టడి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మన దగ్గర ఇప్పటికే భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరం కంపెనీ కోవిషీల్డ్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టీకా తీసుకున్న తర్వాత కొందరు కోవిడ్ బారిన పడ్డారు. దాంతో వ్యాక్సిన్ పని తీరుపై జనాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడుతున్నప్పుడు.. వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాక్సిన్ అనేది కోవిడ్ రాకుండా అడ్డుకోదు. వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు దానితో పోరాడటంతో పాటు.. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపర్చడం.. వైరస్ ఇతర కణాలకు వ్యాపిచకుండా నిరోధిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాణాంతక పరిస్థితి నుంచి కాపాడుతుంది. ఇక వ్యాక్సిన్ రెండు డోసులు సమర్థవంతంగా పని చేయడానికి 45 రోజుల సమయం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఈ లోపు వైరస్ బారిన పడితే.. త్వరగానే కోలుకుంటారు తప్ప ప్రాణాలు పోయే పరిస్థితులు రావంటున్నారు నిపుణులు. ఇక మన దగ్గర వాడుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న తర్వాత పాజిటివ్ రేటు ఎలా ఉంది అంటే.. కోవిషీల్డ్.. ఇప్పటి వరకు మన దగ్గర 10,03,02,745 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోగా.. వీరిలో కేవలం 17,145(0.02శాతం) మంది మత్రామే టీకా ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడ్డారు. ఇక కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకున్న వారు 1,57,32,754 కాగా.. వీరిలో 5,014(0.03 శాతం) మంది మాత్రమే రెండో డోసు తర్వాత వైరస్ బారిన పడ్డారు. కోవాగ్జిన్.. ఇప్పటి వరకు మన దగ్గర 93,56,436 మంది కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకోగా.. వీరిలో కేవలం 4,208(0.04శాతం) మంది మత్రామే టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డారు. ఇక కోవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్న వారు 17,37,178 కాగా.. వీరిలో 695(0.04శాతం)మంది మాత్రమే రెండో డోసు తర్వాత వైరస్ బారిన పడ్డారు. చదవండి: కోవాగ్జిన్‌తో డబుల్ మ్యూటెంట్‌కి అడ్డుకట్ట -
ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం వాటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి 5 లక్షల డోసులను 13 జిల్లాలకూ రోడ్డు మార్గం ద్వారా తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం చెప్పారు. జిల్లాల వారీగా వ్యాక్సిన్ పంపిణీ ఇలా.. అనంతపురం–45 వేలు, చిత్తూరు–40 వేలు, తూర్పు గోదావరి–40 వేలు, గుంటూరు–40 వేలు, కృష్ణా–45 వేలు, కర్నూలు–40 వేలు, ప్రకాశం–35 వేలు, నెల్లూరు–38 వేలు, శ్రీకాకుళం–30 వేలు, విశాఖ–40 వేలు, విజయనగరం–30 వేలు, పశ్చిమ గోదావరి–37 వేలు, వైఎస్సార్ కడప–40 వేల టీకా డోసులు. -
వ్యాక్సిన్ కోసం నాపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి: పూనావాలా
లండన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపుతున్న సమయంలో వ్యాక్సిన్ కోసం నెలకొన్న విపరీతమైన డిమాండ్‌పై కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్ సరఫరా కోసం డిమాండ్ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్‌కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు. ‘అనుకున్న దానికంటే ఎక్కువ సమయం లండన్‌లో ఉండటానికి కారణం అదే. మళ్లీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. భారమంతా నా ఒక్కడి భుజస్కందాలపైనే పడుతోంది. కానీ నేనొక్కడినే చేయలేను. మీ బాధ్యత మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నపుడు కూడా... ఎవరో ఎక్స్, వై, జడ్ అడిగినంత సరఫరా చేయలేకపోయినందుకు వారేం చేస్తారోననే ఆలోచనలతో గడపలేం కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతటి దూకుడు వ్యవహారశైలి (దురుసుతనం)ని, మానుంచి ఇంతగా ఆశించడాన్ని నేనెప్పుడూ చూడలేదు. మాకు వ్యాక్సిన్ అందాల్సిందేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తమకంటే ముందు ఇతరులకు వ్యాక్సిన్లు అందడాన్ని వారు అర్థం చేసుకోలేరు’ అని పూనావాలా అన్నారు. సీరమ్ సంస్థ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఇటీవలే పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే. చదవండి: (భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం) భారత్‌కు బయట కూడా కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని, లండన్‌లో మకాం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమని పూనావాలా సంకేతాలిచ్చారు. బ్రిటన్‌తో సహా ఇతరదేశాల్లో కోవిషీల్డ్ ఉత్పత్తికి సంబంధించిన రాబోయే కొద్దిరోజుల్లో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత్‌లో పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. కోవిషీల్డ్ డోసు ధరను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లుగా నిర్ణయించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై పూనావాలా స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న వ్యాక్సిన్ తమదేనని అన్నారు. తామేమీ తప్పు చేయడం లేదని, దీనిపై కాలం చెప్పే తీర్పు కోసం వేచిచూస్తానని అన్నారు. -
Covid-19 Vaccine: చేతులెత్తేసిన రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18-45 లోపు వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడానికి మరో 24 గంటల వ్యవధి కూడా లేదు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉందని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభిచలేమని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. వ్యాక్సిన్ కోసం శుక్రవారం ఉదయం నాటికే 2.45 కోట్ల మంది కోవిన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారు. బుధవారం నాడు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మూడు రోజుల వ్యవధిలోనే ఇంత మంది రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ఇక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ నెలకు 6-7 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే సామార్థ్యం కలిగి ఉండగా.. భారత్ బయోటెక్ నెలకు సుమారు రెండు కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఇక రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టలేమని తెలిపిన రాష్ట్రాలు.. తెలంగాణ.. ‘‘రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదే. మేం భారత్ బయోటెక్, సీరం కంపెనీలతో టచ్‌లో ఉన్నాం. కానీ వారి నుంచి సరైన స్పందన లేదు. మేం రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలం. మాకు 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లు కావాలి. కంపెనీలతో మాట్లాడుతున్నాం. రేపటి నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం’’ అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్ర.. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఇక్కడే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ మాట్లాడుతూ.. ‘‘మాకు అత్యవసరంగా 20-30 లక్షల వ్యాక్సిన్ వయల్స్ కావాలి. 18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 12 కోట్ల డోసుల టీకాలు కావాలి. అంత మొత్తంలో మా దగ్గర వ్యాక్సిన్లు లేవు. ప్రస్తుతం మేం కోవిడ్ థర్డ్ వేవ్‌కు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వల్ల ఇప్పటికే ముంబైలో టీకాలు వేయడం ఆపేశాం. ఇక రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించలేం’’ అని తెలిపారు. కర్ణాటక.. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘రేపటి నుంచి మా దగ్గర మూడో దశ వ్యాక్సినేషన్ని ప్రారంభించలేం. ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేశాం. కానీ వారు రేపటి వరకు డోసులను డెలివరీ చేయలేమన్నారు. ఈ నేపథ్యంలో 18-44 ఏళ్ల వారు వ్యాక్సిన్ కోసం రేపు ఆస్పత్రులకు వచ్చి ఇబ్బంది పడవద్దని కోరుతున్నాం’’ అన్నారు. ఢిల్లీ.. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు తమ దగ్గర సరిపడా వ్యాక్సిన్లు లేవని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 18-44 ఏళ్ల వారు మే 1న వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల వద్దకు రావద్దని.. వ్యాక్సినేషన్ గురించి రెండు మూడు రోజుల్లో తామే చెప్తామని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 67 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఆర్డర్ చేసింది. మే 3 నాటికి మూడు లక్షల డోసుల డెలివరీ చేస్తామని కంపెనీ అధికారులు తమకు తెలిపారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గోవా.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే.. అప్పుడే 18-44 ఏళ్ల వారికి టీకా వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు లక్షల డోసులు డెలివరీ చేయాల్సిందిగా సీరం కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మధ్యప్రదేశ్.. కంపెనీలు తాము ఆర్డర్ చేసిన వ్యాక్సిన్ డోసులను ఇంకా డెలివరీ చేయలేదని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి మూడో దశ వ్యాక్సిన్ ప్రారంభించలేమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పశ్చిమబెంగాల్.. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయాలంటే కేంద్రం తమకు 3 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని.. అప్పుడు మాత్రమే తాము వ్యాక్సినేషన్ ప్రారంభిచగలమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇవే కాక జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తాము మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని తెలిపాయి. చదవండి: ఉత్పత్తి పెరిగితే... ధరలు దిగిరావా? -
లాక్డౌన్ పొడిగింపుపై 30న తుది నిర్ణయం
ముంబై: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ప్రకటించారు. అయితే అందరికీ టీకాలు వచ్చే నెల 1 నుంచి వేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా లేనందున మే 1 నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న వారందరికీ టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని బుధవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 5.71 కోట్ల మంది పౌరులకు టీకాలు వేయాలంటే రూ.6,500 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. చివరకు ఈ ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిందని రాజేశ్ టోపే వెల్లడించారు. లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయని అయితే నిర్ణయం ఈనెల 30న వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఎన్సీపీ ప్రకటనతో గందరగోళం.. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా కరోనా టీకా వేస్తున్నారు. కానీ, మే ఒకటో తేదీ నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు యువకులందరికీ కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పేచి మొదలైంది. దీంతో ఈ వయసు వారందరికి టీకా ఉచితంగా వేస్తారా లేక నిర్ణీత రుసుం తీసుకుంటారా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన ఎన్సీపీ నాయకుడు నవాబ్ మలిక్ ఉచితంగా టీకా వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు పార్టీల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ప్రభుత్వంలో ఒక పార్టీ ఎలా ప్రకటిస్తుందని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. ఈ విషయాన్ని ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికే ఉందని స్పష్టం చేశారు. చివరకు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి తెరపడింది. కమిటీ ఏర్పాటు.. వచ్చే ఆరు నెలల్లో ప్రణాళికాబద్దంగా టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్లు అందుతాయని రాజేశ్ టోపే పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో ఆమోదముద్ర పడినట్లు మంత్రి తెలిపారు. టీకాల కోసం కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని రాజేశ్ టోపే సూచించారు. టీకా కార్యక్రమాన్ని అమలు చేయడం గురించి సూక్ష్మ ప్రణాళిక వేయడానికి ఆరోగ్య శాఖ ప్రతినిధులు, కొంతమంది సీనియర్ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 18–25, 25–35, 35–44 వయస్సు గల వారిని వర్గీకరించవచ్చా అని కమిటీ ఆలోచిస్తోందని రాజేశ్ తెలిపారు. త్వరితగతిన టీకాలు వేసి ఇమ్యునిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాక్సిన్ తయారీదారుల నుంచి మాత్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కోవాక్సిన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ మోతాదుకు రూ. 600 చొప్పున వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపారు. మే, జూన్ నెలల్లో నెలకు 10 లక్షలను సరఫరా చేస్తామని ఆ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం నెలకు 20 లక్షల మోతాదులను సరఫరా చేస్తామని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. చదవండి: (లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు') సీరం నుంచి కోవీషీల్డ్ వ్యాక్సిన్లు నెలకు కోటి వరకు సరఫరా చేయవచ్చని ఆరోగ్య శాఖమంత్రి స్పష్టంచేశారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అందుబాటు ధరలో స్పుత్నిక్ అందించనట్లయితే ఆ వ్యాక్సిన్ కూడా ఎంపిక చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో జైడస్ కాడిలా, జాన్సన్ జాన్సన్ వంటి తయారీదారుల నుంచి వ్యాక్సిన్ల సరఫరాను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ట్రానికి రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్లు వంటి కీలకమైన ఔషధాల సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను సంప్రదించాలని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు (కేంద్ర మంత్రి) నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవిస్, ప్రవీణ్ దారేకర్‌లకు రాజేశ్ టోపే సూచించారు. లాక్డౌన్ పొడిగింపు? మంత్రివర్గ సమావేశంలో మే ఒకటో తేదీ తరువాత లాక్డౌన్ కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, దీంతో గడువు పెంచితే బాగుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ పొడగించే విషయంపై ఏప్రిల్ 30వ తేదీన తుది నిర్ణయం తీసుంటారని టోపే తెలిపారు. అయితే 15 రోజులు పొడగించాలా..? లేక ఎక్కువ రోజులు పొడగించాలనే దానిపై అదే రోజు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ నెల 14వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి మే ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల వరకు లాక్డౌన్ అమలుచేసిన సంగతి తెలిసిందే. సమయం దగ్గరపడటంతో ప్రజల్లో లాక్‌డౌన్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది. -
ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్
-
గుడ్ న్యూస్: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికి కలిసి దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ 14.77 కోట్లు దాటింది. ప్రస్తుతానికి కేంద్రమే వ్యాక్సినేషన్‌ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుంది. అయితే మే 1 నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను కేంద్రానికి ఇచ్చి మిగతా 50 శాతాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్లో అమ్ముకునేందుకు కేంద్రం వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలుగా సీరమ్ సంస్థ ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. కేంద్రానికి మాత్రం కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది. తాజాగా ధర విషయంలో కోవిషీల్డ్ తగ్గింపు ప్రకటించింది. రాష్ట్రాలకు విక్రయించే డోసులను 400 రూపాయల నుంచి రూ.300కు తగ్గించినట్లు వెల్లడించింది. గతంలో ప్రకటించిన ధర కంటే ఇది 25% తక్కువ. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ అదర్ వూనావాల పేర్కొన్నారు. ‘‘సీరమ్ సంస్థ నుంచి ఓ ముందడుగు. రాష్ట్రాలకు విక్రయించే కోవిషిల్డ్ టీకా ధరను 300కి తగ్గించాం. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దీని ద్వారా వేల కోట్ల రాష్ట్ర నిధులు ఆదా కానున్నాయి. టీకాలతో మరిన్ని ప్రాణాలు కాపాడండి’. అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే గత వారం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషిల్డ్ అధిక ధరలను ప్రకటించడంతో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కోవిషీల్డ్: ప్రైవేటు మార్కెట్లో టీకా ధరలను ప్రకటించిన సీరమ్ As a philanthropic gesture on behalf of @SerumInstIndia, I hereby reduce the price to the states from Rs.400 to Rs.300 per dose, effective immediately; this will save thousands of crores of state funds going forward. This will enable more vaccinations and save countless lives. — Adar Poonawalla (@adarpoonawalla) April 28, 2021 -
కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనాపై పోరులో భారత్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు అవసరమైన అన్నిరకాల సహాయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ప్రధాని మోదీకి తెలిపారు. మందులు, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు సాధ్యమైనంత తొందరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం రాత్రి బైడెన్ ఫోన్లో మాట్లాడారు. భారత్‌లో కోవిడ్ సంక్షోభ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్లు, మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా ‘వ్యాపార సంబంధిత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ట్రిప్స్)లో మినహాయింపులు ఉండాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు్యటీవో)లో భారత్ చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ... బైడెన్ దృష్టికి తెచ్చారని కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఈ రోజు ఫలవంతమైన సంభాషణ జరిపాను. ఇరుదేశాల్లో కోవిడ్ పరిస్థితులపై విపులంగా చర్చించాం. భారత్‌కు అమెరికా అందిస్తున్న సహాయానికి ప్రెసిడెంట్ బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. వ్యాక్సిన్ ముడిసరుకుల సరఫరా.. సాఫీగా, సమర్థవంతగా జరగాల్సిన అవసరాన్ని బైడెన్‌తో చర్చల్లో ప్రస్తావించడం జరిగింది. ఆరోగ్యరంగంలో భారత్– అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కోవిడ్–19 విసురుతున్న సవాళ్లకు పరిష్కారం చూపగలదు’ అని మోదీ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారత్‌కు సాయం చేయడానికి ముం దుకు రావడంపై బైడెన్‌కు మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి, కోవాక్స్‌లో పాల్గొనడం, క్వాడ్ వ్యాక్సిన్ సాయంలో పాలుపంచుకోవడం (విదేశాలకు కరోనా టీకాలకు అందించడం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ తమ వంతు ప్రయత్నం చేసిందని మోదీ గుర్తుచేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేయాలని తమ తమ దేశాల అధికారులను బైడెన్, మోదీలు ఆదేశించారు. ఇకపై తరచూ సంప్రదింపులు జరపాలని ఇరువురూ నిర్ణయించారు. కోవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అండగా ఉంటామని భరోసానిస్తూ అందుకు సూచికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. అక్కడి భవనాలపై మువ్వన్నెల రంగుల్లో విద్యుత్ దీపాలను వెలిగించిన దృశ్యం -
రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి మరో 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ డోసులను ఇక్కడికి తరలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కంటైనర్లలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి భద్రపరిచారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేసేందుకు 2 రోజుల వ్యవధిలో 5 లక్షల కోవిషీల్డ్ డోసులను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు. -
ఉత్పత్తి పెరిగితే... ధరలు దిగిరావా?
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరుగా టీకా ధరలు ఉంటాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చేసిన ప్రకటన అనేక ప్రశ్నలకు తావిచ్చింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పడం కొంతలో కొంత శుభ వార్తే అయినా ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక్కో డోసుకు రూ.150 తీసుకుంటున్న ఎస్ఐఐ.. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున తీసుకుంటామని ప్రకటించింది. తన టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని, మొత్తం డోసుల్లో సగం కేంద్రానికి ఇచ్చి, మిగిలినవి రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయడంతో పాటు కొంత మొత్తం టీకాలను రాష్ట్రాలకూ ఇస్తుంది. కానీ రాష్ట్రాలకు ఇంకా అదనపు కోటా కావాలంటే అవి సొంతంగా ఎస్ఐఐ నుంచి కొనుక్కోవాలి. అయితే.. తాము ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కేంద్రం నుంచి వస్తున్న టీకాలు అరకొరగానే ఉంటున్న పరిస్థితుల్లో రాష్ట్రాలు సొంతంగా కూడా కొనుక్కునే వెసులుబాటు ఉన్నా.. దాని ధర విషయమే కాస్త పంటికింద రాయిలా తగులుతోంది. నిజానికి సరఫరాకు, ధరలకు మధ్య ఉండే సంబంధంలో సాధారణ ఆర్థిక సూత్రాల ప్రకారం సరఫరా పెరిగితే ధర తగ్గాలి. చిన్న మొత్తంలో ఉత్పత్తి చేయడం కంటే పెద్దమొత్తంలో చేస్తే ఉత్పత్తి వ్యయం కూడా కలిసొస్తుంది. అలాంటప్పుడు ధర ఎందుకు పెంచుతున్నట్లు? అసలు ఈ ధరలకు ప్రాతిపదిక ఏంటి? అమెరికా, యూకే, ఈయూలలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకాను ఒక్కో డోసు 2-4 డాలర్ల మధ్య అమ్ముతున్నారు. ఎస్ఐఐ తయారుచేసే టీకా కూడా అదే. మొదటి 40, 50 కోట్ల డోసుల్లో లాభం చూసుకోబోమని ఆస్ట్రాజెనెకా చెప్పింది కూడా. ప్రాంతాన్ని బట్టి, ఉత్పత్తిని బట్టి ధర మారుతుందనే 2-4 డాలర్లు అన్నారనుకోవాలి. ఎస్ఐఐ మొత్తం 91 పేద దేశాలకు టీకా ఇవ్వాలని ఆస్ట్రాజెనెకా లైసెన్సులో పేర్కొంది. భారత్ లాంటి దేశాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ అవుతుందని, ఎస్ఐఐ ప్రపం చంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారని లైసెన్సు ఇచ్చింది. అలాం టప్పుడు ఆస్ట్రాజెనెకాకు అయ్యే వ్యయం కంటే ఎస్ఐఐకి ఎక్కువ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేం. కేంద్ర ప్రభుత్వానికి ఇన్నాళ్లూ ఇచ్చిన టీకాల వల్ల తనకు నష్టమేమీ రాలేదని.. అయితే లాభాలు పెద్దగా లేకపోవడంతో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం వీలు కావట్లేదని ఓ ఇంటర్వ్యూలో ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. తనకు రూ.3 వేల కోట్ల గ్రాంటు కావాలని ఆయన అడిగారు. కానీ, ప్రభుత్వం భవిష్యత్తులో ఇవ్వబోయే టీకాలకు అడ్వాన్సుగా మాత్రమే ఇస్తామని చెప్పింది. అందుకే ఒక్కసారిగా టీకా ధర రూ.150 నుంచి రూ.400కు పెరిగింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వానికే అమ్మాలని చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మాలంటే అందుకు వేరే అనుమతులు తీసుకోవాలి. వ్యాపారం ఎవరైనా లాభాలకోసమే చేస్తారు. అదర్ పూనావాలా కష్టపడుతున్నారన్న విషయంలో అనుమానం లేదు. కానీ, ఉత్పాదక సామర్థ్యం పెంచితే ధర రెట్టింపు కంటే ఎక్కువ ఎందుకు అయ్యిందన్నదే అసలు ప్రశ్న. మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ టీకా ధర విష యంలో ఇంతవరకు ఎందుకు స్పందించలేదో అర్థం కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వాలే టీకా నేరుగా కొని, ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి. 136 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ధనికదేశమేమీ కాదు. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశ జనాభాలో 18 ఏళ్లు దాటినవారి సంఖ్య సుమారు 91 కోట్లు. వాళ్లలో ప్రతి ఒక్కరికీ రెండు డోసులు ఇచ్చినా 182 కోట్ల డోసుల్లో ఒక్కోదానికి రూ.200 వెచ్చించారనుకున్నా దానికి రూ.36,400 కోట్లు అవుతుంది. టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నామని, అవసరమైతే ఇంకా ఇస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎస్ఐఐ ఒక్కో డోసుకు రూ.200 చొప్పున ఇస్తే ఆ బడ్జెట్ దాదాపుగా సరిపోతుంది. అప్పుడు అదర్ పూనావాలాకూ కొంత లాభం పెరుగుతుంది. కానీ రూ. 150కి కొన్నటీకాపై అదనంగా వెచ్చించి కోవిషీల్డ్ టీకాలను కేంద్రం ఎందుకు కొనాలనుకుం టోందో ఆ బ్రహ్మదేవుడికే ఎరుక! ప్రసేన్ జిత్ దత్తా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (ది ప్రొజాయిక్ వ్యూ సౌజన్యంతో) -
కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం
పుణే: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ పై కేంద్రం ప్రకటించిన కొత్త వ్యాక్సిన్ ధరలు తీవ్ర దుమారం రేపగా దానిని సమర్ధిస్తూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ ధర పెంపు కొన్ని రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్‌ను ముందు లభించే ధర కంటే 1.5 రెట్లు అధికంగా విక్రయించాలనే అంశాన్ని సీరం ఇన్స్టిట్యూట్ తోసిపుచ్చింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ ధరను రూ. 150 గా కేంద్రానికి నిర్ణయించింది. దీని కారణం వివిధ దేశాలు వ్యాక్సిన్ తయారీకి ముందుగానే పెట్టుబడి సహాయం అందించడమే. ప్రస్తుతం మరిన్నీ కోవిషిల్డ్ వ్యాక్సిన్ షాట్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమని కంపెనీ పేర్కొంది. ప్రపంచ దేశాల్లో లభించే కరోనా వ్యాక్సిన్ల ధరతో పోల్చుకుంటే భారత్‌లో తక్కువగా ఉందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తయారైన కోవిషిల్డ్ వ్యాక్సిన్‌లో కొంత భాగం మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తామన్నారు. ఒక్కో డోసును రూ. 600కు విక్రయిస్తామని సీరం తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19కు ఇతర వైద్య చికిత్సల కంటే కోవిషిల్డ్ ధర తక్కువగా ఉందని కంపెనీ వివరించింది. ఆస్ట్రాజెనీకా కనుగొన్న టీకా కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే సెంటర్లో తయారయ్యే వ్యాక్సిన్ ఒక్కో డోసును ప్రైవేటు సంస్ధలకు రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 టీకా కొత్త ధరలను ప్రకటించిన విషయం తెలిసిందే. We at @SerumInstIndia have for the past five decades been at the forefront of supplying vaccines and saving lives globally. We care about and respect every human life and strongly believe in transparency, and thus we hope our statement below can clear any confusions. pic.twitter.com/YQ3x38BuFL — SerumInstituteIndia (@SerumInstIndia) April 24, 2021 చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం కీలక ప్రకటన -
ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిమిత్తం బుధవారం మరో రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్స్‌లను ఉదయం విమానంలో ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు. గత 2 రోజుల్లో ఇక్కడికి మొత్తం 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్లలో 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు. -
రాష్ట్రాలకు రూ.400లకు డోసు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్ ’కోవిషీల్డ్’బహిరంగ మార్కెట్ ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 డోసు చొప్పున అందజేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక డోసుకు రూ.600 వసూలు చేస్తామని వెల్లడించింది. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు, 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగే తక్కువ ధరకు అందిస్తూ... మిగతా 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అయితే ఫార్మా కంపెనీలు మే1 లోపే పారదర్శకంగా తమ బహిరంగ మార్కెట్ ధరలను ప్రకటించాలని కేంద్రం షరతు విధించింది. కేంద్ర అదేశాలకు అనుగుణంగా సీరమ్ కోవిషీల్డ్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 డోసు చొప్పున అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధరలను దృష్టిలో పెట్టుకొని... వాటితో పోల్చితే తక్కువ ధర ఉండేలా, అందరికీ అందుబాటులో ఉండేలా కోవిషీల్డ్ ధరలను నిర్ణయించాం. అమెరికా వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో ఒక్క డోసుకు రూ.1,500 కంటే ఎక్కువగా, రష్యా, చైనా వ్యాక్సిన్లు ప్రతి డోసుకు రూ.750కి పైగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరాను పెంచుతాం. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్ రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది’అని సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. 18–45 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు వేసే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకోదలచుకున్న వారు నేరుగా వెళ్లి ఆసుపత్రి నిర్ధారించిన ఫీజు చెల్లించి వేసుకోవచ్చు. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం తరఫున టీకాలు సరఫరా అయ్యాయి కాబట్టి... ప్రైవేటులో వేసుకుంటే టీకాకు రూ. 150, సర్వీసు ఛార్జీ కింద రూ.100 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు సీరమ్ డోసును రూ.600లకు అమ్మనుంది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అదనంగా వసూలు చేస్తాయనేది చూడాలి. కాంట్రాక్టు ముగిశాక కేంద్రానికీ అదే ధర కేంద్ర ప్రభుత్వానికి రూ.150 డోసు చొప్పున అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400 ధర నిర్ణయించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇంత అధికధర వసూలు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి. వైరస్ సమర్థత ఎంత ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, చాలాకాలం ముందే కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా తమకు 10 కోట్ల డోసులకు అర్డర్ ఇచ్చిందని, రిస్క్‌ను తాము కూడా పంచుకొనే దాంట్లో భాగంగానే రూ.150 డోసును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించామని సీరం సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ పది కోట్ల డోసుల సరఫరా పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ.400 డోసు చొప్పునే ఇస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 6–7 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, జులై కల్లా దీన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామన్నారు. -
మొదటి డోసు తీసుకున్న 21 వేల మందికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: మొదటి డోసుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా తీసుకున్న సుమారు 21 వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, రెండో డోసు తీసుకున్నాక కూడా 5,500 మంది ఈ మహమ్మారి బారినపడ్డారని కేంద్రం తెలిపింది. రెండో డోసుగా కోవాగ్జిన్ తీసుకున్న 17,37,178 మందిలో 0.04% మంది, కోవిషీల్డ్ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 0.03% మంది ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. టీకాలు వైరస్ వ్యాప్తిని, మరణాలను తగ్గించాయన్నారు. అయితే, టీకా తీసుకున్న తర్వాత కూడా వ్యాధి బారినపడటాన్ని బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్గా పిలుస్తారని ఆయన తెలిపారు. ఇలాంటి కేసులు, ప్రతి 10వేల మందిలో 2 నుంచి 4 వరకు ఉన్నాయని ఆయన అన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘కోవాగ్జిన్ టీకా 1.1 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4,208 మంది, అంటే 0.04% మంది కోవిడ్ బారినపడ్డారు. ఈ టీకాను రెండో డోసుగా తీసుకున్న 17,37,178 మందిలో 695 మంది, అంటే 0.04% మందికి పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా కోవిషీల్డ్.. మొత్తం 11.6 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి వైరస్ సోకింది. కోవిషీల్డ్ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 5,014 మంది, అంటే 0.03% మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారు’అని వివరించారు. -
వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు
సాక్షి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సెకండ్‌వేవ్‌లో ఉధృతి ఆందోళన కరంగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఆసుపత్రులలో మందులు, బెడ్లు దొరకక, వెంటిలేటర్ల కొరతతో కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా ప్రభావిత రాష్ట్రాలు, డిల్లీ, మహారాష్ట పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత చోటు చేసుకుంటున్నఘటనలు, కొన్ని విషాదకర వార్తలతో అనేక భయాందోళలను నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంచలన డేటాను విడుదల చేసింది. టీకాలు వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్ డేటా తేల్చంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న తరువాత వైరస్ సోకుతున్న వారి నిష్పత్తి సామాన్య ప్రజలలో చాలా తక్కువగా ఉందని ఈ డేటా తెలిపింది. టీకా మొదటి లేదా రెండవ మోతాదు తీసుకున్న చాలా రోజుల తరువాత కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తుల డేటాను ఐసిఎంఆర్ నిపుణుల బృందం వెల్లడించింది. (కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అందించారు. కోవాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సుమారు 93 లక్షల మంది తమ మొదటి మోతాదును, సుమారు 17 లక్షల మంది రెండవ మోతాదును పొందారు. మొదటి మోతాదు పొందిన 93 లక్షలమందిలో 4,208 మందికి, రెండవ షాట్ తీసుకున్న 17 లక్షలలో, 695 మంది మాత్రమే కరోనా సోకిందన్నారు. అలాగే సీరం ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ రెండవ మోతాదు తీసుకున్న తరువాత పాజిటివ్ పరీక్షించిన వారి శాతం 0.03 శాతంగా ఉంది. దాదాపు 10 కోట్ల మంది కోవిషిల్డ్ మొదటి మోతాదును స్వీకరించగా వీరిలో 17,145 మంది తొలి డోసు తర్వాత 1.5 కోట్లకు పైగా ప్రజలకు రెండవ మోతాదు ను తీసుకోగా, వీరిలో, 5,014 మంది పాజిటివ్ పరీక్షించారు. కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల నిష్పత్తి మొదటి మోతాదు తర్వాత 0.02 శాతం, రెండవ మోతాదు తర్వాత 0.03 శాతంగా ఉంది. అలాగే కరోనా టీకా తీసుకున్న తరువాత ప్రతి 10,000 జనాభాకు 2-4 మందికి మాత్రమే కోవిడ్-19 సోకుతోందనీ, ఆ తర్వాత వ్యాధి బారినపడే వారి శాతం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ అన్నారు. (కరోనా బారిన మరో కేంద్ర మంత్రి) కోవిషీల్డ్ 70 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కోవాక్సిన్ తన 3 వ దశ ట్రయల్స్‌లో 81 శాతం మధ్యంతర సామర్థ్యాన్ని చూపించిందని వెల్లడించారు. రెండవ మోతాదు తీసుకున్న 10-15 రోజుల తరువాత మాత్రమే తగినంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 87 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 79 శాతం మంది ఫ్రంట్ లైన్ కార్మికులు తమ మొదటి మోతాదు కోవిడ్ -19 వ్యాక్సిన్లను స్వీకరించారని చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 130 మిలియన్ల టీకాలను అందించారు. (ఉన్నట్టుండి పేలిన ఫోన్, జనం హడల్: వైరల్ వీడియో) #IndiaFightsCorona: 📍Post Vaccination break through infection (As on 20th April, 2021). - DG, @ICMRDELHI #We4Vaccine #LargestVaccinationDrive #Unite2FightCorona pic.twitter.com/xMNpyfxyBb — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 21, 2021 -
కోవిషీల్డ్: ప్రైవేటు మార్కెట్లో టీకా ధరలను ప్రకటించిన సీరమ్
సాక్షి, ముంబై: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్ టీకా ధరలను సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది. కేంద్రానికి కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది. కాగా వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధఙగమిస్తామని సీరమ్ సంస్థ పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తచ్చెందుకు ప్రయత్నిస్టున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కి భారత్ బయోటెక్ ఇస్తోంది. కోవిషీల్డ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక్కో డోసుకు రూ.250 భారం పడుతుంది. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1431, మోడర్నా వ్యాక్సిన్ రూ.2348-2715, సినోవాక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1027, జాన్సన్ అండ్ జాన్సన్ రూ.734గా ఉంది. చదవండి: రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి IMPORTANT ANNOUNCEMENT pic.twitter.com/bTsMs8AKth — SerumInstituteIndia (@SerumInstIndia) April 21, 2021 -
కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఆ వయసు వారు 2.62 కోట్ల మంది ఉంటారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 18-44 ఏళ్ల వయస్కులు 1.82 కోట్ల మంది ఉంటారని, వారు కొత్తగా వ్యాక్సిన్‌కు అర్హులవుతారని అంచనా వేసింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారు 80 లక్షల మంది ఉండగా వారందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అందులో ఇప్పటికే 28 లక్షల మందికి టీకా వేశారు. ఇక 18-45 ఏళ్ల మధ్య వయసులోని 1.82 కోట్ల మందికి మే 1 నుంచి వ్యాక్సిన్ వేస్తారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. కానీ 18-45 లోపు వయసు వారి నుంచి నిర్దిష్ట రుసుము తీసుకొని టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి... కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఒక కుటుంబంలో ఎవరికైనా వస్తే అందరికీ వ్యాపించే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్‌లో ఎక్కువగా యువత వైరస్ బారిన పడుతోంది. ఉపాధి, ఉద్యోగాల్లో ఆ వయసువారే ఎక్కువగా ఉండటం, పైగా చాలా మంది నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉండటంతో వాటి కొరత వల్ల డోస్‌లు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి రావడం లేదు. దీంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో నిల్వలు లేక ప్రజలను వెనక్కు పంపుతున్నారు. అన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వడం వల్ల టీకాలు విరివిగా అందుబాటులోకి వస్తాయి. పైగా తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకాలు ఇవ్వొచ్చు. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ప్రభుత్వ యంత్రాగానికి ఉంది. ఆ ప్రకారం జరిగితే తెలంగాణలో ఇప్పటివరకు వేసిన వారిని మినహాయిస్తే కేవలం 23 రోజుల్లోనే 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయవచ్చు. ఎలాంటి కొరత లేకుండా టీకాలు సరఫరా అయితే మేలోనే టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉచితమా.. కాదా? ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవగా తొలుత వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వేశారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల వయసులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేశారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అందులో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాలు ఇచ్చారు. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ప్రభుత్వంలో ఉచితంగా వేస్తుండగా ప్రైవేటులో ఒక డోస్‌కు రూ.250 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసులోని వారికి ఉచితంగా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించగా ఆ వయసు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అలాగే మే ఒకటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని కేంద్రాల్లో టీకా వేయాలన్న దానిపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మే ఒకటో తేదీ నుంచి వేసే టీకాపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉండాలో కూడా కసరత్తు చేస్తున్నారు. ఆస్పత్రులకు రాని వారికి ఇళ్లకు వెళ్లి టీకాలు వేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా అనే దానిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. -
కరోనా టెర్రర్.. 5 రాష్ట్రాల సీఎంలకు పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్య ప్రజలనుంచి పాలకుల వరకు ఎవర్నీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే మనదేశంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. తమిళనాడు సీఎం పళని స్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ జాబితాలో చేరారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా, కరోనా తీవ్రతను దృష్ఠిలో ఉంచుకున్నకేంద్రం వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీసుకుంది. -
ఏపీకి చేరుకున్న 4.40 లక్షల వ్యాక్సిన్ డోసులు..
విమానాశ్రయం (గన్నవరం): కోవిడ్ వ్యాక్సినేషన్ నిమిత్తం సోమవారం 4.40 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ 467 విమానంలో 37 బాక్స్‌లలో ప్రత్యేకంగా భద్రపరిచిన వ్యాక్సిన్‌ను ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్‌లో గన్నవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించారు. అక్కడి నుంచి రాత్రికి 13 జిల్లాల్లోని టీకా స్టోరేజ్ సెంటర్లకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. -
సీఎం జగన్ లేఖకు 24గంటల్లో కేంద్రం స్పందన
గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గన్నవరం విమానాశ్రయానికి తరలించింది. సోమవారం రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి 4 లక్షల 40 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ చేరుకున్నాయి. లేఖ రాసిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పంపడంతో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికే రెండు లక్షల కోవాగ్జిన్ వ్యాక్సినేషన్లు రానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నాలుగు లక్షల నలభై వేల కోవిషిల్డ్ వ్యాక్సిన్లు అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వ్యాక్సిన్లను ప్రతి జిల్లాకు పంపించి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్స్, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: వామ్మో రెండు లక్షల కేసులు -
కరోనా: వ్యాక్సిన్ భారతం లెక్కలివే..
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌కి తగ్గట్టుగా కోవిడ్ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి వెనుతిరుగుతున్నారు. వ్యాక్సిన్ కొరతనెదుర్కొంటున్న రాష్ట్రాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రాల్లో తరిగిపోతున్న టీకా డోసులు కరోనా సెకండ్‌వేవ్ ఉధృతంగా కొనసాగుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి మించి వినియోగిస్తూ ఉండడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి నెలకి 7 కోట్ల డోసులుగా ఉంది. ఈ ప్రాతిపదికన రోజుకి 25 లక్షల వరకు ఇవ్వొచ్చు. అయితే వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏప్రిల్ 1 తర్వాత అనుకున్నదానికంటే ఎక్కువగా 34 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో టీకాలకి కొరత ఏర్పడింది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలో 60% వరకు వెలుగు చూస్తూ ఉండడంతో ఆ రాష్ట్రంలో రోజుకి 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్థాయిలో టీకా డోసులు ఆ రాష్ట్రానికి అందలేదు. రాష్ట్రాల జనాభా, కరోనా కేసుల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం దగ్గర 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక పంజాబ్ దగ్గర 5.7 లక్షల కోవిడ్ టీకాలు ఉన్నాయి. రోజుకి సగటున 85,000–90,000 మందికి టీకా వేస్తున్నారు. ప్రతీ రోజూ 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్‌లో అమరీందర్ సింగ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే మరో మూడు రోజుల్లోనే వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయి. ఇక రాజస్తాన్ రోజుకి 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆదివారం నాటికే అక్కడ కూడా టీకా డోసులు అయిపోతాయి. అందుకే 30 లక్షల టీకాలు పంపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రానికి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లో 3 రోజుల్లో టీకా డోసులు అయిపోతాయి. టీకా డోసుల్లో 60 శాతం కంటే ఎక్కువ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది. వాటిలో మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా వస్తూ ఉండడంతో వ్యాక్సిన్‌కి డిమాండ్ పెరిగింది. కేంద్రం వద్ద 43 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రానికి చేతకావడం లేదు: సోనియా దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా నిర్వహణ సరిగ్గా చేయకుండా టీకా డోసుల్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండడం వల్ల దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని అన్నారు. కరోనా కేసులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉండడం వల్ల ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. శనివారం సోనియా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల్ని సమీక్షించారు. కరోనా టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేట్.. ఈ మూడింటికే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. కరోనా టీకా కొరత గురించే ఎక్కువగా ప్రస్తావించారు. వ్యాక్సిన్ కొరత ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ నెలకి ఉత్పత్తయ్యే డోసుల సంఖ్య 7కోట్లు ప్రస్తుతం రోజూ ఇస్తున్న డోసులు 34 లక్షలుపైగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసులు 9.80కోట్లు -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
యాంటీబాడీస్‌తో పుట్టిన మొదటి చిన్నారి!
మనందరికీ తెలుసు ఇప్పటివరకూ రకరకాల వయసుల వారికీ, ఎన్నోరకాల జబ్బులున్నవారికీ, మరెన్నో రకాల ఆరోగ్య సమస్యలున్నవారికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహించారు. కానీ ఎందుకైనా మంచిదంటూ మొదట్లో గర్భవతుల మీద, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మీద ట్రయల్స్ జరగలేదు. అయితే ఇప్పుడు ఆ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే దాదాపు ప్రసవానికి రెడీగా అంటే... తొమ్మిదినెలలప్పుడు నెలలుపూర్తిగా నిండిన గర్భవతికి (ఖచ్చితంగా చెప్పాలంటే 36 వారాల మూడురోజుల గర్భవతి గా ఉన్నప్పుడు) కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి చూశారు. ఆ గర్భవతికి మాడర్నాఎమ్ఆర్ఎన్ఏ తరహా వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు. మరో మూడు వారాల తర్వాత ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. చిన్నారి పాప పుట్టిన వెంటనే ఆమె నుంచి రక్తం సేకరించి పరిశీలించి చూశారు. విచిత్రం ఏమిటంటే... అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కూడా దేహంలో పుష్కలమైన యాంటీబాడీస్‌తో పుట్టడం చూసి ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతయ్యింది. దీన్ని బట్టి తేలుతున్నదేమిటంటే... గర్భవతిగా ఉన్న కాబోయే తల్లికి వ్యాక్సిన్ ఇచ్చినా లేదా గర్భవతిగా ఉన్న మహిళకు కోవిడ్ వచ్చినా... బొడ్డుతాడు (ప్లాసెంటా) ద్వారా ఆ యాంటీబాడీస్ చిన్నారుల్లోకి కూడా ప్రవేశించి, వారికీ రక్షణ కల్పిస్తాయని తేలింది. అంటే కాబోయే తల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కొంతమేర బిడ్డకు సైతం కరోనా వైరస్ నుంచి రక్షణ కలుగుతుందని చాలావరకు తేలిందంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పాల్ గిల్బర్ట్, చాడ్ రడ్నిక్లు. అయితే ఇలా ఇచ్చిన ఈ వ్యాక్సిన్ల ప్రభావం (ఎఫెకసీ) బిడ్డలో ఖచ్చితంగా ఎంత ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు... ఇలా గర్భవతులకు వ్యాక్సిన్ ఇచ్చాక... బిడ్డ పుట్టిన అనంతరం... ఆ చిన్నారులకు రొమ్ముపాలు పడుతూ... తద్వారా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉందో కూడా చూడాలంటున్నారు పరిశోధకులు. అయితే ఇవి కేవలం తొలి దశ పరిశోధనలు మాత్రమే కావడంతోనూ, ఇంకా పరిశోధనలూ, ట్రయల్స్ జరుగుతుండటం వల్లనూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం గర్భవతులూ... వారి గర్భస్థ శిశువులపై ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ ఆశారేఖగా కనిపించే విషయం ఒక్కటే... ఇప్పటికి వస్తున్న ఫలితాల మేరకు గర్భవతుల్లోనూ వ్యాక్సిన్ చాలావరకు సురక్షితమేననీ, బిడ్డకు సైతం గర్భస్థపిండానికీ, కడుపులో ఎదుగుతున్న శిశువుకూ అది హాని చేయకపోగా... ఎంతోకొంత సంరక్షణ ఇస్తుందనే సానుకూల ఫలితాలు వస్తుండటంతో పరిశోధకులు చాలా ఆశావహంగా, ఆనందంగానే ఉన్నట్లు తొలి పరిశీలనల ద్వారా తెలుస్తోంది. l -
టొరంటో రోడ్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సి
టొరంటో: మనదేశంలో తయారైన కరోనా టీకాలను ఇతర దేశాలకు అందిస్తూ భారత్ విశ్వగురు పేరును సార్థకం చేసుకుంటుంది. అందులో భాగంగా కరోనా టీకాలను కెనడాకు అందించింది. గత వారం, కెనడాకు 500,000 మోతాదుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేసింది. భారత్ చూపించిన ఔదర్యానికిగాను కెనడాలోని టోరంటో రోడ్లపై ‘థ్యాంక్యు ఇండియా, పిఏం నరేంద్ర మోదీ’ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి. కెనడా, భారత్ మధ్య మైత్రి వర్ధిలాలని ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు.కెనడావాసులు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో భారత్ ముందంజలో ఉంది. మిత్రదేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి ప్రపంచ సంస్థల నుంచి మాత్రమే కాకుండా, బిల్‌గేట్స్ వంటి వ్యక్తుల నుంచి కూడా భారత్ ప్రశంసలను పొందింది. కొన్ని రోజుల క్రితం, ఇండియా-స్వీడన్ మధ్య జరిగిన వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 'మేడ్-ఇన్-ఇండియా' టీకాలు ఇప్పటివరకు 50 కి పైగా దేశాలకు సరఫరా చేశామన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రణాళిక వేస్తున్నామన్నారు. భారత్150 కి పైగా దేశాలకు మందులు, ఇతర అవసరమైన వస్తువులను అందించిందన్నారు.దీనితో పాటుగా, భారత్ తన అనుభవాలను, ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలను, ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆ దేశ చట్టసభ సభ్యులతో పంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. Billboards come up in Greater Toronto area thanking PM Narendra Modi for providing COVID-19 vaccines to Canada pic.twitter.com/0AaQysm6O1 — ANI (@ANI) March 11, 2021 -
ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..
హ్యూస్టన్: అంతర్జాతీయ సంస్థలతో కలిసి భారత్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లు (కోవిషీల్డ్, కొవాగ్జిన్) ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం నుంచి కాపాడాయని అమెరికా శాస్త్రవేత్త, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ అన్నారు. కరోనా కష్టకాలంలో భారత్ ప్రపంచానికి ఫార్మసీలా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. డీజీసీఏ అనుమతి కలిగిన ఆ రెండు వ్యాక్సిన్ల పనితీరు చాలా మెరుగ్గా ఉందని, వాటి పనితీరు అన్ని వయసుల వారిపై సమానంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకే ప్రపంచ దేశాలన్నీ భారత వ్యాక్సిన్ల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. వ్యాక్సిన్ల తయారీ విషయంలో భారత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని హెచ్చరించారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల తయారీలో భారత పాత్రను ప్రశంసించారు. వైరస్‌పై పోరాటంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి భారత్ ప్రపంచానికి పెద్ద బహుమతే ఇచ్చిందని కొనియాడారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రంగానే ఉండగా.. భారత వ్యాక్సిన్లు ప్రపంచాన్ని రక్షించాయని పేర్కొన్నారు. కాగా, బీసీఎం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి భారత్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -
వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో తొలగించండి
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇచ్చే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించవద్దంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని శనివారం కోరింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ అనంతరం ఈసీ కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది. త్వరలో పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్రానికి ఈసీ రాసిన లేఖలో ఎవరి పేరును పెట్టలేదని, కేవలం ప్రధాని ఫొటోలు కనిపించకుండా ఫిల్టర్లు మాత్రమే వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖకు సూచించిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రావాల్సిన క్రెడిట్‌ను ప్రధాని తన వైపు మళ్లించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించింది.