demolition
-
భక్తుల మనోభావాలతో రాజకీయాలొద్దు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ ? పవన్ కళ్యాణ్‌పై శ్యామల సెటైర్లు
-
దేవాలయాలు, ఆశ్రమాలపై కూటమి కన్ను
-
Hydra: జగద్గిరిగుట్టలో హైడ్రా కూల్చివేతలు
-
Secunderabad: ఆ భవనం.. ఓ జ్ఞాపకమే
సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది ఒకటి రైల్వేస్టేషన్.. మరొకటి క్లాక్‌టవర్. ఈ రెండూ నగరానికి ‘ఐ’ కాన్లుగా నిలుస్తున్నాయి. ఇందులో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిజాం ఆర్కిటెక్చర్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న కట్టడం. కొద్ది రోజుల్లో ఈ కట్టడం మొత్తం కనుమరుగు కానుంది. సైనిక స్థావరాల నుంచి రూపాంతరం చెంది దేశ విదేశాల ప్రయాణికులు గుర్తెరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనం ఇక చరిత్ర పుటల్లో ఓ జ్ఞాపకం కానుంది. ఎందరో ప్రయాణికులకు చక్కని ల్యాండ్ మార్క్‌గా చిరపరిచితమైన నీలిరంగు మేడ కాలగర్భంలో కలిసిపోనుంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొత్త భవనాల నిర్మాణాలకు ప్రధాని గతంలోనే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన రైల్వేస్టేషన్ నిర్మిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ మూడు ఆర్చ్ల్లో ఇప్పటికే రెండింటిని నేలమట్టం చేశారు. మరొకటి ఒకటి రెండు రోజుల్లో కనుమరుగు కానుంది. నిజాం ప్రభుత్వ హయాంలో 1874లో సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో మూడు ప్లాట్‌ఫాంలతో కూడిన రైల్వేస్టేషన్‌కు సాధారణ భవనం ఉండేది. ఇండియన్ రైల్వేస్టేషన్లో భాగంగా మారిన రైల్వేస్టేషన్‌కు 1952లో మరో భవనాన్ని నిర్మించారు. మూడు ఆర్చీలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ శైలిలో ఇక్కడ రైల్వేస్టేషన్ భవనాన్ని నిర్మించారు. క్రమేణా 10 ప్లాట్‌ఫాంలకు చేరింది. నిత్యం వందకుపైగా రైళ్లు, 1.60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు ఈ రైల్వేస్టేషన్ కేంద్రంగా మారింది. మూడు ఆర్చ్ లు.. ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి మూడు ఆర్చ్ లు. ఈ మూడింటి ప్రవేశ ద్వారాల శిఖరాన మూడు భాషల్లో (తెలుగు, హిందీ, ఆంగ్లం) ఒక్కో దానిపై నిలిపిన సికింద్రాబాద్ అనే అక్షరాలు కిలో మీటర్ దూరం వరకు ప్రయాణికులకు కనిపించేవి. సెల్ఫోన్ల రాకకు ముందు కొత్తగా రైలు ప్రయాణాల ద్వారా నగరానికి చేరుకునే ప్రయాణికులకు రైల్వేస్టేషన్ ఆరీ్చలే కేరాఫ్ అడ్రస్‌లుగా ఉండేవి. ⇒ ఏ భాషలోని ఆర్చీ కింద నిల్చోవాలో ఇక్కడికి కొత్తగా వచ్చే ప్రయాణికులకు వారి బంధువులు చెబుతుండే వారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల అక్షరాలు కలిగిన ఆర్చీలు నేలమట్టమయ్యాయి. తెలుగు అక్షరాలు కలిగిన ఆర్చీని రెండు రోజుల్లో కనుమరుగు కానుంది. వేగంగా నిర్మాణం పనులు.. ⇒ ఏడాది కాలంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.720 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కూల్చివేత పనులు చేపడుతున్న అధికారులు, మరోవైపు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. ⇒ రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీ లెవల్ పార్కింగ్, ఎంటర్టైన్మెంట్ స్టాళ్లు, ఎస్కలేటర్ల తరహాలో వాకింగ్ ట్రాక్‌లు, లిఫ్ట్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శకులకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపింపజేస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
కడపలో కూటమి నేతల ‘కూల్చివేత’ రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.నిన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
కోహెడలో హైడ్రా పంజా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు. 1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు లే ఔట్లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్ మున్సిపల్ అధికారుల స్పష్టం చేశారు. ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి. -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేత ప్రారంభం
-
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: మణికొండలో హైడ్రా(hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
200 ఎకరాలను పరిరక్షించాం!
‘ఈ ఏడాది జూలై 19న హైడ్రా ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలను పరిరక్షించాం. వీటిలో 12 చెరువులు, ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుద్ధభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్లమని, హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాల పైనే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 2025 సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది. సంజాయిషీ నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని, కూల్చేస్తామని సైతం నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన 5 నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2025కు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్ఆర్కు ఆనుకుంటూ అవతలి వైపునకూ విస్తరించి ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పునరు ద్ధరించిన 12 చెరువులకు 2025లో పునరుజ్జీవం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్టీఎల్... ప్రస్తుతం నగరం పరిధిలో ఉన్న 1095 చెరువుల్ని హైడ్రా గుర్తించింది. వీటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నిర్ధారణ, పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డులు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డేటా, శాటిలైట్ ఇమేజ్‌తో పాటు అత్యంత రెజల్యూషన్ ఉన్న గూగుల్ డేటా తీసుకుంటున్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్, డ్రోన్స్ ఫొటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా ఆయా చెరువుల ఎఫ్టీఎల్ మారడానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోనున్నారు. పెద్ద నాలాల ఆక్రమణలపైనా నజర్... చెరువులతో పాటు నాలాల పైనా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికోసం కిర్లోస్కర్ కమిటీ, ఓమెంట్స్ నివేదికలను పరిశీలిస్తోంది. చిన్న చిన్న నాలాలు కాకుండా మూడు, నాలుగు ఆర్డర్స్‌లో ఉండే పెద్ద వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నాలాలపై ఆక్రమణలను గుర్తిస్తున్నారు. చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో వీటి డంపింగ్ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జలవనరులకు జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ప్రజలు, కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాప్, వెబ్సైట్ ద్వారా సమాచారం ⇒ హైడ్రా 2025లో తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారం జీపీఎల్ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు. ⇒ ఓ వ్యక్తి ఎక్కడైనా నిల్చుని హైడ్రా యాప్ ఓపెన్ చేస్తే..అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగిన ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ⇒ త్వరలో ఏర్పాటుకానున్న హైడ్రా పోలీసుస్టేషన్ ప్రభుత్వ, చెరువుల భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు, అధికారులను గుర్తిస్తుంది. ⇒ హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ డీ–మార్కేషన్ను 2025లో హైడ్రా పూర్తి చేయనుంది. మూసీలో ఉన్న ఆక్రమణల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీరు పరిరక్షణ పైనా హైడ్రా అధ్యయనం చేయనుంది. -
నోటీసులు ఇవ్వం.. కూల్చివేతలు ఆపం.. హైడ్రా రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్ చెప్పారు.‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్టిఎల్ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్ స్పష్టం చేశారు.‘‘హైడ్రా అనగానే కూల్చడం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. త్వరలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్ఎం ఛానెల్ రాబోతుంది. కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. హైడ్రా ఆధ్వర్యంలో ఎఫ్టిఎల్ లిస్ట్ త్వరలో వెబ్సైట్లో పెడతాం. చెరువుల వద్ద ఉన్న షెడ్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి...హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా?. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్టీఎల్ గుర్తించిన తరువాత అనధికారిక నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 550 చెరువుల ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తోంది. పేదలను ముందు చూపి వెనకాల మాఫియా వేరే ఉంటుంది. మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు, హైడ్రాకు సంబంధం లేదు. మూసీలో కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కబ్జా నిర్మాణాలను హైడ్రా కచ్చితంగా కూల్చుతుంది. ఇప్పటికే పలువురు బిల్డర్స్‌కి వార్నింగ్ ఇచ్చాము. మూసీ కబ్జాలపై చర్యలు ఉంటాయి కానీ మూసి రివర్ ప్రాజెక్ట్‌కు హైడ్రాకు సంబంధం లేదు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది...హైడ్రా ఛైర్మన్‌గా సీఎం ఉంటారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించాం. హైడ్రాపై సోషల్ మీడియాలో మాత్రమే తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఇళ్లు బఫర్ ఎఫ్టిఎల్లో లేదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే చెరువుపైనే వస్తుంది. నా ఇల్లు చెరువుకి కింద కిలో మీటర్ దూరంలో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు చర్యలు ఎదుర్కొంటారు’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు.. -
శ్రీకాళహస్తిలో రిసార్ట్ కూల్చివేతకు కుట్ర
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామునే వచ్చి... మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని.. ఉదయం నుంచి రివర్వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు. -
5 అంతస్థుల భవనం కూల్చేందుకు హైడ్రా రెడీ..
-
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..
-
సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ యాక్టీవ్
-
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
దేవాలయాల జోలికొస్తే ఊరుకోం.. చంద్రబాబుపై మల్లాది ఫైర్
సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మధురా నగర్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు. -
సీఎం యోగి ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డ్‌లు మూసీ సుందరీకరణ,కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలపై చేశారు.30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్ కార్డ్‌లను రూపొందించాం. అన్ని చోట్ల అద్యయనం చేసి డిజిటల్ కార్డ్‌లను తయారు చేశాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డ్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీల్లో కుటుంబాలు పెరిగాయి. కొత్తగా కార్డ్‌లు లేకపోవడంతో పదకాలు అందలేదు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లు అందిస్తాం. ప్రజల సంక్షేమం కోసమే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లు. రేషన్ కార్డ్‌లు ఇవ్వడం లేదనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. రేషన్ కార్డ్‌లు ఇవ్వాలని అన్నీ జిల్లాల నుంచి రిక్వెస్ట్‌లు పంపారు. డిజిటల్ కార్డ్‌లో ఫ్యామిలీ వివరాలు ఉంటాయి. అన్నీ పథకాలు ఒకటే కార్డ్ అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వచ్చిన పేదలు ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ముందుగా నియోజకవర్గానికి రెండు చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. దీనిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుబీజేపీ,బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నాం. తాగునీరు అందించే చెరువుల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఫాంహౌస్ కూలగొట్టా.. వద్దా? ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచావు కదా? మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా? కేటీఆర్,హరీష్ రావు సెక్రటేరియేట్‌కు రావాలి. ప్రధాని మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా. చిన్నపాటి వర్షంతో మునిగిపోతున్న నగరాన్ని సంరక్షించేందుకు నడుం బిగించాం. మూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా ఉన్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధం హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాలు ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుదాం. మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. బావబామర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు.కూల్చి వేతలపై వెనక్కి తగ్గబోమని, ఇలాగే కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గతంలో ఒకాయన చేసింది రెండే పనులు.. అవి అప్పులు, తప్పులుఅధికారం పోయాక విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు.ప్రతిపక్షాలు వాగుడు ఆపడం మంచిదిమూసీలో మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్మును పంచి పెట్టండిమీ ఖాతాలోని రూ.500 కోట్లు పంచి పెట్టండిమూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బతుకుతున్నారుమూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం తప్పామీరు మాత్రం ఫాం హౌజ్‌లో ఉండాలా?మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధంమీ ముగ్గురి ఫాంహౌస్‌లు కూల్చాలా? వద్దా?అధికారం రాక ముందు చెప్పులు లేకుండా తిరిగిన మీరు కోట్లకు ఎలా పడగలెత్తారు.మూసీ పేదలకు ఇళ్లు ఇవ్వాలా? వద్దా?బావబామ్మర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారుబీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందిఒకరోజు కేటీఆర్ మాట్లాడితే.. మరో రోజు అదే అంశాన్ని ఈటెల మాట్లాడుతున్నారుప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దామోదీ దగ్గరు వెళ్దాం రా ఈటలఎవరు ఆక్రమించారో తేలుద్దాంహైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాల ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేలుద్దాంకేటీఆర్,హరీష్‌రావు సచివాలయానికి రండి.. 4రోజులు లేవకుండా చర్చిద్దాం -
సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ
ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? -
KSR Live Show: కూల్చివేతల 'హైడ్రా'మా వెనక్కి తగ్గారా..?
-
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
ద్వారంపూడి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత..
-
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు
-
ప్రభుత్వ స్థలంలో 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
-
కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్
-
బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాలను ఆదేశించింది.దేశంలోని ప్రేవేటు స్థలాల్లో అనధికారిక బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిలిపివేయాలని తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల ఇప్పటికే కూల్చివేసేందుకు ప్రక్రియ పూర్తయిన పనులు ప్రభావితం కావచ్చని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయగా.. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఆపడం వల్ల.. స్వర్గమేమి ఊడిపడదంటూ (పెద్ద నష్టం ఏం జరగదని) జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, చెరువులు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. వీటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.‘తదుపరి తేదీ వరకు ఈ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూదు. అయితే బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలకు ఈ ఉత్తర్వులు వర్తించవు’ అని కోర్టు స్పష్టం చేసింది.కాగా వివిధ నేరాలకు పాల్పడిన నిందితుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కూల్చివేత డ్రైవ్‌లను సవాలు చేస్తూ దాఖలైన వరుస పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజా ఉత్తర్వులు వెలువరించింది.అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. వరుసగా జమ్మూ కశ్మీర్, హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్‌కు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. -
హైడ్రా కూల్చివేతలు.. RERA చట్టం ఏం చెబుతోంది..?
-
మహబూబ్ నగర్ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు?
-
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి VS బండి సంజయ్
-
హైడ్రా బుల్డోజర్ల దూకుడు.. నష్టం ఎవరికి ?
-
చెరువులు మింగేశారు.. హైడ్రా చేస్తున్నది సరైనదేనా?
-
శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలపై హైడ్రా పంజా..
-
హైడ్రా’ కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో మరో కట్టడాన్ని హైడ్రా ఆదివారం(సెప్టెంబర్8) కూల్చివేసింది. ఈ భవనంలో హోటల్ నిర్వహించే వాళ్లు కూల్చివేతలను అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉదద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ పోసుకున్న వ్యక్తి నిప్పంటించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. హోటల్ భవనాన్ని కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరళీమోహన్ ‘జయభేరి’కి నోటీసులుసినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా తాజాగా నోటీసులిచ్చింది. గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువులో జయభేరికి చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు..హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తుండగా భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగాారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. హెచ్ఎంటీ నగర్, వాణి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇదీ చదవండి.. కూల్చివేతే చెరువుల పరిరక్షణా..? -
‘హాథీరాం బావాజీ’ ప్రాంగణంలో బీభత్సం
తిరుపతి రూరల్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పాచికలు ఆడిన హాథీరాం బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో నిర్మిస్తున్న ఆలయం ప్రాంగణంలో గురువారం తెల్లవారుజామున మఠం అధికారులు బీభత్సం సృష్టించారు. చీకట్లో జేసీబీలతో వచ్చి ఆలయానికి చెందిన కట్టడాలను ధ్వంసం చేశారు. కూల్చివేతలను అడ్డుకొనకుండా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకుడు శివనాయక్‌ను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కూల్చివేతలు ప్రారంభించారు. మఠం ఏఏఓ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది పోలీసులతో వచ్చి బావాజీ ఆలయం ప్రాంగణంలోని వసతి సముదాయం, విజ్ఞాన మందిరం, పోటు, పూజా సామగ్రి గదులను కూల్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, బంజారా జాతి ప్రజలు ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ ఉన్నా ఆస్తులను ఎలా ధ్వంసం చేస్తారని నిలదీశారు. అయినా మఠం సిబ్బంది దౌర్జన్యంగా నిర్మాణాలను కూల్చేశారు. బంజారాలు పూజించే హా«థీరాం బావాజీకి ఇప్పటివరకు ఆలయం లేదు. దీంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శివనాయక్ ఆలయ ధర్మకర్తగా బంజారా జాతి ప్రజలు ఆలయం నిర్మాణానికి పూనుకొన్నారు. తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో హాథీరాంజీ మఠం భూముల్లో ప్రపంచంలోనే ప్రప్రథమంగా బావాజీ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజారా జాతి ప్రముఖులు సొంత నిధులతో ఈ ఆలయాన్ని, వసతి గృహాలను నిర్మిస్తున్నారు. బంజారాల విజ్ఞప్తి మేరకు గతంలో హాథీరాంజీ మఠం మహంతుగా పనిచేసిన అర్జునదాస్ కేటాయించిన భూమిలోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామని, అవినీతికి సహకరించలేదనే కక్షతో కొందరు మఠం అధికారులు ఆలయాన్ని, వసతి గృహాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్లు గతంలో పలుమార్లు తెలిపారు. అధికారుల బెదిరింపులతో కోర్టుకు వెళ్లి ఇంజెంక్షన్ ఆర్డర్ పొందినట్లు తెలిపారు.అయితే, అవన్నీ అక్రమ నిర్మాణాలని మఠం ఏఏఓ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. మఠం భూములకు, శివనాయక్‌కు సంబంధం లేదన్నారు. ఆలయం పేరుతో మఠం భూములను కబ్జా చేస్తున్నందునే అక్రమ నిర్మాణాలన్నింటినీ దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి తొలగించామని చెప్పారు. ఆలయాన్ని నిర్మించడమే తప్పా వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా హాథీరాంజీ మఠం అధికారులు హాథీరాం బావాజీకి ఇంత వరకు ఆలయాన్ని నిర్మించలేదు. బంజారాలు ఆరాధించే బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో ఆలయాన్ని నిర్మించేందుకు బంజారా సేవా సంఘం పలుమార్లు మహంతు అర్జునదాస్కు విన్నవించాం. ఆయన స్థలం కేటాయించడంతో బంజారాలం అందరం చందాలు వేసుకుని మరీ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పుడు కూల్చివేయడం అన్యాయం. అక్రమం. – శివనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు -
ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పక్కాగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రమూల గ్రామంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన ‘గాయత్రి’నిర్మాణాలపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత అక్కడి నాదెం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్జోన్లను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి.. చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంతమేర జరిగాయన్నది తేల్చి.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. వారి వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.. చట్ట విరుద్ధంగా తమ విద్యా సంస్థల భవనాల కూలి్చవేతకు హైడ్రా, అధికారులు ప్రయతి్నస్తున్నారంటూ.. గాయత్రి విద్యా, సాంస్కృతిక ట్రస్టు, అనురాగ్ వర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గూడ మధుకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 796, 813 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్లపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘1954, 1955 కాస్రా పహాణీ ప్రకారం నాదెం చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు. పిటిషనర్ విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఉన్నాయి.కూల్చివేత సహా ఎలాంటి చర్యలు చేపట్టినా పిటిషనర్‌కు నోటీసులు జారీ చేస్తాం. ఆ భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పిటిషనర్‌ను ఆదేశించాలి’’అని న్యాయమూర్తిని స్పెషల్ జీపీ కోరారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ.. అధికారుల నుంచి అనుమతి పొందినా కూడా తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను ఆదేశించారు. నాగోల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా, సనత్‌నగర్, షాద్‌నగర్‌లలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి నాదెం చెరువుకు సంబంధించి స్పష్టమైన మ్యాప్‌లను తీసుకుని.. వాటి ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్థారించాలని స్పెషల్ జీపీకి సూచించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. -
HYD: రాంనగర్ కూల్చివేతలు..‘హైడ్రా’ కమిషనర్ స్పందన ఇదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్‌ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. -
హైడ్రా దూకుడుతో ఆందోళనలో ప్రజలు
-
రాంనగర్లో హైడ్రా కూల్చివేతలు.. ఘర్షణ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు హైడ్రా చేపట్టిన చర్యలు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. రాంనగర్ చౌరస్తాలోని మనమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచే కూల్చివేతలు మొదలయ్యాయి. ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు, పార్కుల గురించి హైడ్రాకు ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 ఫిర్యాదులు అందుతున్నాయి. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొనగా, ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఈ రోజు కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి. -
తెలంగాణలో చెరువుల ఆక్రమణ ఉదంతంలో అధికారులపై హైడ్రా ఫోకస్. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
N కన్వెన్షన్ కూల్చేసినప్పుడు.. నాగార్జున ఫోన్ చేశాడా?
-
కూల్చివేతలపై అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక భేటీ
-
N కన్వెన్షన్ కూల్చివేత వెనుక తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర
-
50 ఏళ్ల వ్యాపార దుకాణం కూల్చివేత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నేతల కక్ష సాధింపు హద్దులు దాటుతోంది. ఇప్పటివరకు గ్రావెల్, మట్టి దందాలతో మునిగితేలిన తెలుగు తమ్ముళ్లు...ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కనుసన్నల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తోన్న దురాగతాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా..వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన నారాయణ గుప్తాకు చెందిన ఓ దుకాణాన్ని మంగళవారం వేకువజామున నేలమట్టం చేయించారు. స్థానిక మునిసిపల్ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వేకువజామున వచ్చి దుకాణాన్ని కూలగొట్టించారు. దుకాణం ఉన్న స్థలం ప్రభుత్వానిది అని అధికారులు చెబుతున్నారు. కావలిలో పారీ్టలకతీతంగా పలువురు నేతలు అధికారుల చర్యను ఖండించారు. పట్టణంలోని రైల్వేరోడ్డులో 1.5 అంకణాల స్థలంలో చిన్న దుకాణం గది 50 ఏళ్లుగా నారాయణ గుప్తా కుటుంబం ఆధీనంలో ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా కలిగి, మునిసిపాలిటీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ గుప్తా కుటుంబానికి చెందిన షాపు గదిని కూలి్చవేస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో నారాయణ గుప్తా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ మునిసిపల్ అధికారులు మంగళవారం ఉదయాన్నే జేసీబీతో వచ్చి షాపుని నేలమట్టం చేశారు. షాపును ధ్వంసం చేసి మెటీరియల్ కూడా అప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించేశారు.కుటుంబం వీధిన పడేలా చేశారు ఎన్నో ఏళ్లుగా మునిసిపాలిటీకి పన్నులు కడుతున్నాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉంది. ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా పనిచేశానన్న కారణంతో నన్ను టార్గెట్ చేశారు. కౌంటింగ్ తర్వాత మా దుకాణం పడగొడతామని ప్రచారం రావడంతో కోర్టుకు వెళ్లాం. కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ మునిసిపల్ అధికారులు మా దుకాణాన్ని పడగొట్టి ఆర్యవైశ్యులకు ద్రోహం చేశారు. – నారాయణ గుప్తా, వైశ్య నేత -
ఆపరేషన్ హైడ్రాతో అధికార, విపక్షాలా మధ్య కురుక్షేత్ర యుద్ధం
-
హైడ్రా లిస్ట్ లో ఒవైసీ కాలేజీ.. ఇంకా ఎవరెవరు ఉన్నారు ?
-
మాదాపూర్ లో N కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు
-
అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్టిఎల్, బంఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాం. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు’’ అని హైడ్రా స్పష్టం చేసింది.తుమ్మిడికుంట, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌పై 2014లోనే హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో హెచ్ఎండీఏ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిని నిర్థారించమని హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే చేసి నివేదిక అందించాం. మేమిచ్చిన నివేదికపై ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.’’ అని హైడ్రా పేర్కొంది.‘‘ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఇవ్వలేదు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. ఎన్ కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆక్రమణలను రెగ్యులర్ చేయించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది.. కానీ అధికారులు తిరస్కరించారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల హైటెక్స్ పరిధిలోని నాలాలు మూసుకుపోయి వరద వస్తుంది. ఆక్రమణల వల్ల తమ్మిడికుంట చెరువు 50 నుంచి 60 శాతం వరకు కూచించుకుపోయింది.’’ అని హైడ్రా వెల్లడించింది. -
తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.కాగా, తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు.కోర్టు కేసులు, స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ హాల్ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
-
జన్వాడ ఫామ్‌హౌజ్ కేసు.. ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది. ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైడ్రా అధికారాలు ఏంటని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది. హైడ్రా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అవుటర్ రింగురోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో చెరువులు, కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులపై హైకోర్టు ప్రశ్నలు..గ్రామపంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్‌హౌజ్ తరపున పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్‌కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామపంచాయతీ సెక్రటరీకి మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్‌కు లేదని పేర్కొంది. -
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం
-
పాల్వంచ KTPS కూలింగ్ టవర్ల కూల్చివేత
-
నేటితో నేలమట్టం
పాల్వంచ: పాల్వంచలోని కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్(ఒఅండ్‌ఎం)లోని కూలింగ్ టవర్లు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక్కోటి చొప్పున మొత్తం 8 టవర్లు కూల్చివేయనున్నారు. పాత ప్లాంట్ తొలగింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ.. టవర్ల కూల్చివేతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎక్సిక్యూడ్ కంపెనీకి అప్పగించింది. కంపెనీ డైరెక్టర్ ఆనంద్ శర్మ సారథ్యంలో ఇంప్లోషన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలేలా పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామున ట్రాన్స్‌కో శాఖ నుంచి విద్యుత్ లైన్ల క్లియరెన్స్ రాగానే కూల్చివేతకు సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో ఎక్స్‌ప్లోజివ్స్ పేలి టవర్లు నేలమట్టం కానుండగా, ముందుగా ‘ఎ’స్టేషన్‌లోని నాలుగు టవర్లు, తర్వాత ‘బీ’స్టేషన్‌లోని రెండు, ‘సీ’స్టేషన్లలోని మరో రెండు టవర్లు కూల్చివేయనున్నారు. టవర్ల శకలాలు దూరంగా పడకుండా అక్కడే కుప్పకూలేలా పిల్లర్ల చుట్టూ ఐరన్ మెస్‌లను ఏర్పాటు చేసి, క్లాత్‌తో సీల్ చేశారు. దీంతో కూలే సమయంలో ఎక్కడా ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కర్మాగారంలోని మిగతా విభాగాలను తుక్కుగా మార్చి తరలించడంతో చివరికి ఈ టవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదా?జూలై 31వ తేదినే కూలింగ్ టవర్లను నేలమట్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు చేసేందుకు అధికారులు సాహసించలేదని తెలుస్తోంది. అనుకోని ప్రమాదాలు జరిగితే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని కూల్చివేతను నిలిపివేసినట్లు సమాచారం. కాగా ట్రాన్స్‌కో లైన్ల క్లియరెన్స్‌లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక నేడు ముహుర్తం ఖరారు చేశారు.1965–78 ప్రాంతంలో నిర్మాణం..పాల్వంచ అంటే కేటీపీఎస్, దానిలో టవర్లు ఆనవాళ్లుగా చెప్పవచ్చు. 115 మీటర్ల ఎత్తులో ఉన్న ఇవి కొన్ని మైళ్లదూరం వరకు కనిపిస్తాయి. 1965–78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీతో కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని నిర్మించారు. ఏ,బీ,సీ, స్టేషన్లలోని 60 మెగావాట్ల సామర్థ కలిగిన 1,2,3,4 యూనిట్లు, 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5,6,7,8 యూనిట్లు చేపట్టి... 720 మెగావాట్లతో రాష్ట్రానికి వెలుగులు పంచారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో కూలింగ్ టవర్ చొప్పున మొత్తం 8 నిర్మించారు. విద్యుదుత్పత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించిన క్రమంలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపయోగపడతాయి. నాణ్యతా ప్రమాణాలతో నిర్మిచడంతో ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం. కాగా పలువురు టవర్ల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో బైబై ఓల్డ్ ప్లాంట్.. కూలింగ్ టవర్లు అంటు పోస్ట్‌లు చేశారు. ఆది నుంచి వివాదాస్పదంగానే ఈ పనులు సాగుతుండగా, చిట్టచివరి అంకం కూడా పూర్తి కావొచ్చింది. కాగా టవర్ల కూల్చివేతపై సీఈ పి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.పటిష్ట భద్రత నడుమ..కూలింగ్ టవర్ల కూల్చివేతపై కర్మాగారం చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్‌కుమార్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎ. అప్పాజీ, ఇన్స్పెక్టర్ కిరణ్, జెన్కో విజిలెన్స్ డీఎస్పీ రమేష్, ఎస్ఈ కిరణ్‌కుమార్‌లు టవర్ల కూల్చివేత ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం ఉదయం కరకవాగు, అల్లూరిసెంటర్, పాండురంగాపురం రోడ్లలో ఎవరూ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కర్మాగారంలోకి ఇతరులెవరూ రాకుండా అనుమతులు నిలిపివేశారు. కనీసం 200 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్లొద్దని నిబంధనలు విధించారు. ఉదయం షిఫ్ట్ విధులకు వెళ్లే సిబ్బందిని కూడా నిలిపివేయనున్నారు. -
బడుగులపైకి బుల్డోజర్
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్ తన ప్రతాపాన్ని చూపించారు. అధికారమే అండగా వారి దుకాణాలపైకి బుల్డోజర్ను పంపి కూల్చివేయించారు. వారి పొట్టకొట్టి రోడ్డున పడేలా చేశారు. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 22వ వార్డు పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్నచిన్న దుకాణాల్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు. పీతల మూర్తి యాదవ్ 2021లో కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవలకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులన్నీ తొలగించేస్తానంటూ సవాల్ విసిరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిరు దుకాణాలపై ఫిర్యాదు చేసినా అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. దుకాణాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా పిటిషన్‌ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక.. చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులివ్వకుండానే దుకాణాలు తొలగింపు ప్రక్రియని మొదలు పెట్టేశారు. ఏయూ గేట్‌ని ఆనుకొని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించిపారేశారు.దుకాణాలను కోల్పోయినవారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించగా జీవీఎంసీ అధికారులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియని నిలిపివేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్.. జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినదించారు.పన్ను చెల్లించినప్పుడు అక్రమమని గుర్తులేదా?నేను ఇక్కడ 30 ఏళ్లుగా సెలూన్ నడుపుతున్నా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహిస్తున్నా. ట్రాఫిక్‌కు కూడా ఏ ఇబ్బందీ లేదు. జీవీఎంసీకి పదేళ్ల నుంచి పన్నులు కూడా కడుతున్నా. ఇప్పుడు జనసేన కార్పొరేటర్ చెప్పారని దుకాణాలు తొలగిస్తున్నారు. నా దుకాణం ఏర్పాటు అక్రమమైతే పన్నులు ఎందుకు కట్టించుకున్నారో అధికారులు, కార్పొరేటర్ చెప్పాలి. – కె.వెంకటరమణ, సెలూన్ షాప్ నిర్వాహకుడునోటీసులివ్వకుండా కూల్చారు నెల్లూరు నుంచి వలస వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడ టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాం. ఇంతకు ముందు.. కొంచెం లోపలకు పెట్టుకొండి.. లేదంటే పగలగొట్టేస్తామని జనసేన కార్పొరేటర్ మూర్తి చెప్పారు. మూడు రోజుల నుంచి చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం. ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. ఈ దుకాణంలో మా కుటుంబంతో పాటు మరో ఏడుగురు పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తారా? – కస్తూరయ్య, టిఫిన్ దుకాణం నిర్వాహకుడు -
వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కూల్చివేతలకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్సార్సీపీ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్టప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లను ఆదేశిస్తూ గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. దీంతో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్‌కుమార్‌లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది నన్నపనేని శ్రీహరి అధికారుల వ్యవహారశైలిని.. కోర్టు ధిక్కారాన్ని న్యాయమూర్తికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులుగా ఉన్న అధికారులిద్దరికీ నోటీసులు జారీ చేశారు. -
వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు
అమరావతి, సాక్షి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. కోర్టు ధిక్కరణ కేసులో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌తో పాటు తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.కూల్చివేతకు సంబంధించి.. కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గురువారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ కట్టడం అని సీఆర్డీయే పేర్కొంది. అయితే దానిని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. దీంతో.. చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. అయినా కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సాయంతో సీఆర్డీయే జూన్ 22వ తేదీ వేకువజామున కూల్చివేతలు జరిపింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. దీంతో సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ వైఎస్సార్సీపీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. -
హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు మందు తాగిన బార్ కూల్చివేత
ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్లోని బార్పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్‌పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై తొందరపడొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. స్టేటస్ కో(యధాతధ) స్థితిని కొనసాగించాలని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. అదే సమయంలో అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్సీపీ వివరణ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది.వైఎస్సార్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని కోర్టు పేర్కొంది. అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలన్న హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. కోర్టులో వాదనల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు కుట్రకు హైకోర్టు బ్రేక్..
-
మరో కూల్చివేతకు టీడీపీ కుట్ర.. సాక్షి చేతిలో సంచలన ఆడియో ప్రూఫ్
-
గుడి కూల్చేసిన టీడీపీ నేత
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు. -
Gunshot: చంద్రబాబు ఎజెండా ఇదేనా ?
-
Big Question: పచ్చి అబద్దాలు.. కోర్టు ఆర్డర్ బయటపెట్టిన మాజీ ఏఏజీ పొన్నవోలు
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం.. చేసేదంతా చేస్తూ నీతులా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టారని.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం?. కోర్టు ప్రొసీడింగ్‌లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారాయన. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చిన అవసరం ఉందని, ఆరు నెలలు గడిచాక పరిస్థితుల్ని చూసి ప్రభుత్వం తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని, కానీ, అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయల విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని ఆయన మీడియాకు వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్.. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రజలంతా ఈ కక్షపూరిత రాజకీయ చర్యలను గమనించాలని కోరారాయన. -
ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయి
-
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేతపై అంబటి రాంబాబు రియాక్షన్
-
ఏపీలో చంద్రబాబు రాజకీయ కక్షసాధింపు చర్యలు: వైఎస్ జగన్
-
చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు
గుంటూరు, సాక్షి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘‘చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు.. ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు... అయినా ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్సీపీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024 -
Updates: టీడీపీ విధ్వంస పాలన.. వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: తెల్లవారక ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ.. ప్రతీకార రాజకీయాలు దిగిందనే చర్చ మొదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబు దమనకాండ మరో స్థాయికి చేరిందంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్సార్సీపీ నేతల స్పందనఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు సుధాకర్రెడ్డిచట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తోంది.హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారుగుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారుపాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదున్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారుతెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుందిఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుందిపర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారుమేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం.కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాండ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారుకన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుందిచట్టం 115 సీఆర్డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాముకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారుకోర్టు ఆదేశాల విషయం సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాంరాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?కక్షసాధింపు తప్ప చంద్రబాబు పాలనలో ఇంకేమైనా ఉందా?ఏపీలో వైఎస్సార్సీపీ ఆఫీసులే ఉండకూడదన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందిచంద్రబాబు పాలన తొలిరోజు నుండే దారుణాలు జరుగుతున్నాయినియంతృత్వ వైఖరితో చంద్రబాబు పని చేస్తున్నారుక్రమశిక్షణతో పని చేయాలని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారుతెల్లవారేపాటికి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారుచంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట నివాసం అక్రమందాన్ని కూల్చుతామని గతంలోనే దేవినేని ఉమా చెప్పారుఅధికంగా బూతులు మాట్లాడేదెవరని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోందిఅలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియమించారంటేనే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థం అవుతోందిఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్.. వైఎస్సార్సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా?జగన్‌ను అవమానించటానికీ, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా?:::టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యేనాడు లేని సమస్య.. నేడు ఎందుకు?చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు లేదంటూనే కక్ష సాధింపు చేపడుతోందిగతంలో 12 చోట్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థలాలు లీజుకు తీసుకుందిఅప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది?చట్టబద్ధంగా లీజుకి తీసుకున్న స్థలంలో కార్యాలయం నిర్మిస్తే తప్పేంటి..జరిగిన సంఘటన అందరూ ఖండించాలి:::మాజీ ఎంపీ మార్గాని భరత్, తూర్పుగోదావరి చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరించాలికూల్చివేతలకు మేము వ్యతిరేకంకక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దుప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(ఢిల్లీ)పార్టీ ఆఫీస్‌లు మాకు దేవాలయాలు.. రక్షించుకుంటాంఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయిప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ద్వసం చేస్తున్నారుతాడేపల్లిలో కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేశారుకోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్న పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారుచంద్రబాబు లోకేష్ వెళ్ళేటపుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కనిపిస్తుందని కూల్చేశారుఅంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారుమేము మీలాగే దాడులు చేసి ఉంటే టీడీపీ కార్యాలయాలు ఉండేవా?మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక వాగులో ఉందిచాలా జిల్లాల్లో 2015 నుంచి 2019 నుంచి టీడీపీ కార్యాలయాలు కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారు.కేబినెట్ నిర్ణయం మేరకు వైఎస్ఆర్సీపీ వైజాగ్ ఎండాడలో 2 ఎకరాల స్థలం తీసుందిపార్టీ కార్యాలయం కోసం ప్లాన్ అప్రూవల్ తీసుకొని నిర్మాణం చేపట్టాముఫిబ్రవరి నెల 2023 తేదీన ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం15 లక్షలు రూపాయలు ప్లాన్ అప్రూవల్ కోసం చెల్లించాంనిబంధనలు ప్రకారం బిల్డింగ్ నిర్మించాంగజాల్లో ఉంటే gvmc పరిధిలో కి వస్తుంది.. ఎకరాల్లో ఉంటే vmrda అనుమతి తీసుకోవాలిఏడాది క్రితమే అనుమతి తీసుకున్నాంఆ మాటకొస్తే.. వైజాగ్ లో టీడీపీ కార్యాలయానికి 15 ఏళ్ల వరకు ప్లాన్ అప్రూవల్ లేనేలేదుఅధికారంలో ఉన్నాము కాబట్టి ఏదైనా చేస్తామంటే చెల్లదుమీ రెడ్‌బుక్ పాలన చేస్తామంటే కుదరదు.పద్ధతి ప్రకారం చేస్తే పార్టీ కార్యాలయం ఉండడానికి వీళ్లేదా?టీడీపీ నిర్మించిన అన్ని కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయా?వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు మాకు దేవాలయాలులాంటివిచట్టప్రకారం మా దేవాలయాలను కాపాడుకుంటాం::: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(విశాఖపట్నం)ఇది అప్రజాసామ్విక చర్యతాడేపల్లి వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయాన్ని అన్యాయం కూల్చేయడం చట్ట వ్యతిరేక చర్యప్రజలకు అభివృద్ధి పాలన అందిస్తాన్న చంద్రబాబు ఇలాంటి చర్యలు చేపట్టడం వలన ప్రజలు భయాందోళనలు చెందుతున్నారుఅనుమతులు అన్నీ తీసుకుని చట్టపరిధిలో నిర్మాణం చేస్తుంటే వాటిని కూల్చేయడం దారుణంఇది అప్రజాసామ్వికం , ఇది హైకోర్టు ధిక్కార చర్య:::మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమఅనకాపల్లి కార్యాలయానికీ నోటీసులుఅనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులుఅనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న కార్యాలయంఅక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు ఏడాది క్రితం ప్లాన్ అప్రూవల్ కోసం చేసిన దరఖాస్తు.. ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న అధికారులువారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టీకరణనెల్లూరు వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతనెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ ఆఫీస్ అనుమతులు చూపాలంటూ మున్సిపల్ అధికారుల జులుం.. ఉద్రిక్తతహుటాహుటిన కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిబిల్డింగ్కు అన్ని అనుమతులు తీసుకున్నామని వివరణ అయినా తగ్గని అధికారులు రెండు రోజులు గడువు కోరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?ఇది ప్రభుత్వ స్థలమే ప్రభుత్వ స్థలం అయినా.. లీజ్‌కు తీసుకున్నాంకేబినెట్ ఆమోదం పొందాకే స్థలం తీసుకున్నాంఒక పద్ధతి ప్రకారమే నిర్మాణాలు చేపట్టాంటీడీపీకి మమ్మల్ని అనే హక్కు లేదుఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ స్థలాల్లో పార్టీ నిర్మాణాల్ని చేపట్టిందినోటీసులు ఇచ్చాక పదిహేను రోజుల టైం ఉంటుందికోర్టు చెప్పినా పట్టించుకోకుండా ఆగమేఘాల మీద రెండున్నర గంటల్లోనే, అదీ వేకువజామున భవనం కూల్చేశారునిర్మాణంలో ఉన్న భవనాన్ని నిర్దాక్షిణ్యంగా.. కక్ష పూర్వకంగా చేసిన ఈ పనిని ఖండించాలని ప్రజాస్వామ్య వాదుల్ని కోరుతున్నాఅధికారం శాశ్వతం కాదు.. ఇలా కూల్చేయడం ధర్మం కాదుమాది రాజకీయ పార్టీ కాదా?.. కార్యకలాపాలు నిర్వహించుకోకూడదా?చంద్రబాబుగారూ.. ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?ప్రజలు ఇవన్నీ ఆలోచించరని అనుకుంటున్నారా? అసలు ప్రజలు టీడీపీ ప్రభుత్వ చర్యను క్షమిస్తారా?::: అంబటి రాంబాబుసీతానగరంలో కూల్చిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో అంబటి రాంబాబు వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చేయాలన్నదే టీడీపీ ప్రయత్నంవైఎస్సార్సీపీ కార్యాలయానికి ధ్వంసం చెయ్యడం.. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టటీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ప్రారంభం అయ్యాయి..వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుతోటపల్లి గూడూరు మండలం కోడూరులో అక్వా రైతు రంగారెడ్డికి సంబందించిన 50 లక్షలు విలువ చేసే రొయ్యల సామాగ్రిన్ని తగలబెట్టారు..పోలీసులకు పిర్యాదు చేసినా.. బాధితులనే ఇబ్బంది పెడుతున్నారు..వైఎస్సార్సీపీ నేతలకు ఆర్థికంగా నష్టం కల్గిస్తున్నారు..కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వకుండా.. ప్రభుత్వ జోక్యం లేకుండానే.. ప్రవేట్ వ్యక్తులు వైఎస్సార్సీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు..టీడీపీ నేతలు చేస్తున్న పాపాలే.. భవిష్యత్తులో వారికి శాపాలుగా మారుతాయి..వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చెయ్యాలని టీడీపీ చూస్తోంది ప్రజలు అన్నింటిని గమనిస్తూ ఉన్నారు:::మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరుతెలుగుదేశం పతనానికి ఇదే నాందివైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని దురుద్దేశం పూర్వకంగా కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందిగతంలో కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మించినప్పటికీ కూడా మా ప్రభుత్వం కూల్చి వేయలేదురాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థని లెక్కచేయకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఇదే నాందిటీడీపీ అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి YSRCP నేతలపై దాడులు చేస్తున్నారు.. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు:::మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళంప్రజలే గుణపాఠం చెబుతారువైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేయడం దుర్మార్గమైన చర్యకోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ కూల్చివేయడం హేయమైన చర్యకూటమినేతలుప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకుల పై దాడులు ప్రజలు గమనిస్తున్నారుచంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇలాగే కూల్చి వేస్తారనీ హెచ్చరిస్తున్నాంవారి పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉండటాన్ని ఓర్చుకోలేక ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారుప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటిచర్యలు గొడ్డలి పెట్టు లాంటివిప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా? అనిబాధపడే పరిస్థితులు వచ్చాయిసంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనున్న ప్రజలకు.. రాష్ట్రాన్ని బీహార్ల మార్చేసి చూపిస్తున్నారుచంద్రబాబుకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెబుతారు:::కంభం విజయరాజు, చింతలపూడి వైఎస్సార్సీపీ కన్వీనర్ (ఏలూరు)సంబంధిత వార్త: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతటీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటంరాజకీయ కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదుతాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాంసూపర్ సిక్స్ అమలకన్నా కక్ష సాధింపు చర్యలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారుటిడిపి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాల కోసం అనేక స్థలాలను తీసుకుందిమేము ఏ రోజు వాటి జోలికి వెళ్లలేదు వాటిని ధ్వంసం చేయలేదుటీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటం చేస్తాం::కొండా రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి(విశాఖపట్నం)విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులుఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు జీవీఎంసీ అధికారులుపార్టీ కార్యాలయానికి పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసులుఅనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ నోటీసులో పేర్కొన్న అధికారులువారం గడువు.. వివరణ ఇవ్వాలని ఆదేశాలునోటీసుల సంగతి తెలిసి ఆఫీస్‌కు చేరుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ఆగ్రహంతో నోటీసుల్ని చించిపడేసిన అమర్నాథ్దొంగల్లాగా కూల్చేశారుచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండ అరాచక తీరు బాధాకరం. తెలుగుదేశం సభ్యులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేసే 24 గంటలు గడవకముందే విధ్వంసకాండ కు తరలేపారుకోర్టు ఆదేశాలు ఉన్నా సరే వాటిని బేఖాతరు చేశారుపార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం వారి అరాచక పాలనకు నిదర్శనందొంగల్లాగా తెల్లవారుజామున పోలీసుల పహారాలో కూల్చివేయడం బాధాకరంజరుగుతున్న విధ్వంసకాండను టీవీ ఛానల్ లో కూడా రానివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారుఒకపక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కక్ష సాధింపు రాజకీయాలు ఉండవంటారు.. మరోవైపు చంద్రబాబేమో ఇలా కూల్చివేతలకు ఆదేశాలిస్తారు!:::ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, నంద్యాలమరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకి చురకలు అంటించారు. సూపర్ సిక్స్ అమలు కన్నా.. వైఎస్సార్సీపీ ఆఫీసులను కూల్చడమే ఆయన ముఖ్యమని భావిస్తున్నారా?. ఇంతకీ చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అని ఎక్స్‌లో అంబటి సందేశం ఉంచారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదుమరోవైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఈ అంశంపై ట్వీట్ చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేతఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత.శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న… pic.twitter.com/zCeLpHiZPE— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 22, 2024ఏం జరిగిందంటే.. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఇది అక్రమ కట్టడం అంటూ గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సీఆర్డీఏ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(MTMC)లకు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ చర్యలకు సిద్ధం అవ్వగా.. ఆ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ న్యాయవాది సీఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్డీఏ వైఎస్సార్సీపీ న్యాయవాది చెప్పిన అంశాన్ని పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ.. ఎంటీఎంసీకి కూల్చివేత ఆదేశాలిచ్చింది. దీంతో ఆ ఆదేశాలతో ఆరు బుల్డోజర్లను పట్టుకుని మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. కేవలం రెండున్నర గంటల్లో నిర్మాణంలో ఉన్న పోర్షన్‌ను కూల్చేశారు. YSRCP రియాక్షన్టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినా.. కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దని అత్యున్నత న్యాయస్థానం సూచించినా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని మండిపడుతోంది. ఏపీలో కూటమి విధ్వంస పాలనపై న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది.ఏపీలో మొదలైన @JaiTDP కూటమి విధ్వంస పాలన! తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉదయం 5:30గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులుకూల్చివేతకు… pic.twitter.com/x8cEiPlGYo— YSR Congress Party (@YSRCParty) June 22, 2024 -
తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత
గుంటూరు, సాక్షి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంసపాలన మొదలైందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే(CRDA) అధికారులు కూల్చేశారు. శనివారం వేకువ జాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగింది.తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తై.. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. రెండే రెండు గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరినీ వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే.. నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. ఇదే విషయాన్ని సీఆర్ఏ కమిషనర్ దృష్టికి వైఎస్సార్సీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినా కూడా మున్సిపల్ అధికారుల సాయంతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరిపింది. మరోవైపు సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది. -
106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!
న్యూయార్క్: ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్)లో తయారు చేసిన ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో న్యూయార్క్‌లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్‌తో కలిసి మెగా ఈవెంట్‌కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్‌లోని నాసా స్టేడియం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్... బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్‌ల్ని ఆడింది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్‌లపై బ్యాట్ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్ లేక టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్‌పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. -
రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు)
-
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం
నిడమనూరు: నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం దుండగులు ధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022సంవత్సరంలో విడుదల చేసిన రూ.20లక్షల నిధులతో గ్రామంలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం బుధవారంతో ముగియనుండడంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని సర్పంచ్ వంకా బ్రహ్మన్న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పూర్తి కాని పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భవనం ప్రారంభోత్సవం చేసేందుకు సర్పంచ్ వచ్చే సరికి శిలాఫలకం ధ్వంసమై ఉంది. దీంతో సర్పంచ్ వంకా బ్రహ్మన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు నిధులు విడుదల చేశామని, కాంగ్రెస్ వారు ఓర్చుకోలేకనే ఇలా శిలాఫలకాన్ని ధ్వంసం చేసారని ఆరోపించారు. శిలాఫలకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వేములపల్లి వెంకట్రావు, మద్దిపూడి రాంబాబు, కుంబం విజయ్, కంచి శ్రీను ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సర్పంచ్ బ్రహ్మన్న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని డిగితే దూషించారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు వేములపల్లి వెంకట్రావు సర్పంచ్‌తో పాటు వంకా బ్రహ్మన్న, సత్యనారాయణ, నక్క సైదులు, కృష్ణమూర్తిపై మరో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. – వంకా బ్రహ్మన్న, సర్పంచ్, పార్వతీపురం సమాచారం లేదు పార్వతీపురం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురించి అధికారికంగా సమాచారం లేదు. భవనం పూర్తి అయిన తర్వాత ప్రాంరంభిస్తాం. భవనం పూర్తయినట్లు కూడా సమాచారం అందలేదు. – ప్రమోద్‌కుమార్, ఎంపీడీఓ, నిడమనూరు -
HYD: క్షణాల్లో నేలమట్టమైన భవనాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇవాళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాదాపూర్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని రెండు పక్కపక్క భవనాలను క్షణాల్లో నేలమట్టం చేసేశారు. పేలుడు పదార్థాల అమర్చి.. అధునాతన టెక్నాలజీతో ఈ కూల్చివేత చేపట్టారు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని రెండు భవనాలను క్షణాల్లో నేలమట్టం చేశారు. డిజైనింగ్‌లో లోపంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసి నుండి అనుమతి లభించింది. భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు బిల్డింగ్ ఓనర్స్ తెలిపారు. కూల్చివేసిన స్థానంలో భారీ భవనాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. *Video from earlier today showing the controlled demolition of Mindspace Madhapur Buildings 7 & 8 carried out by Edifice Engineering & Jet Demolition!..* #Hyderabad pic.twitter.com/sdwmZMSFpu — DONTHU RAMESH (@DonthuRamesh) September 23, 2023 -
కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం -
వైరల్ వీడియో: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి..
-
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్‌మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత పనులు కొనసాగుతుండగానే.. ఒక్కసారిగా ఆరు అంతస్తులు కుప్పకూలిపోయాయి. బిల్డింగ్ ముందు భాగం కూల్చివేత పూర్తి కాగా.. వెనక భాగం కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే చుట్టుపక్కల ఇళ్ల వారిని ముందుగానే ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గత ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు మంటల్లో భవనం ఉండటంతో.. అధిక వేడికి పగుళ్లు వచ్చాయి. ప్రమాద ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి అస్థిపంజరం లభించగా.. మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారం రోజులుగా వెతికినా ఇద్దరి అవశేషాలను అధికారులు గుర్తించలేకపోయారు.అయితే భవనాన్ని వెంటనే కూల్చేయాలని నిపుణుల బృందం హెచ్చరించింది. కూల్చేయకపోతే ప్రమాదమని, ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని తెలిపింది. దీంతో వారిద్దరి ఆచూకీ లభించకపోయినా అధికారులు కేల్చివేత పనులు చేపట్టారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. మొత్తం 5 అంతస్తులతో పాటు సెల్లార్ కూడా కూల్చివేయాలని తెలిపారు. భవనం కూల్చివేసి శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత -
గోఖలే వంతెన త్వరలో కూల్చివేత
సాక్షి, ముంబై: అంధేరీలోని గోఖలే వంతెన సాధ్యమైనంత త్వరగా కూల్చివేసి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని బీఎంసీ భావిస్తోంది. స్ధానికులు పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులకు 21 రోజుల్లో టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ పూర్తి చేయాలని బీఎంసీ భావిస్తోంది. 2023 మార్చి లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాకుండా కూల్చివేత పనుల్లో చివరి ఘట్టం పూర్తి చేయడానికి 30 గంటలపాటు రైల్వే నుంచి బ్లాక్ తీసుకోనున్నట్లు బీఎంసీ పేర్కొంది. ఆ తరువాత నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టనుంది. 1975లో నిర్మించిన అంధేరీలో తూర్పు–పశ్చిమ ప్రాంతాలను కలిపే గోఖలే వంతెన శిథిలావస్ధకు చేరుకోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినప్పటికీ అవికూడా సరిపోవడం లేదు. దీంతో కూల్చివేత పనులు వేగవంతం చేసి కొత్త వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని బీఎంసీ నిర్ణయించింది. ఎంత వ్యయం? ఎవరి బాధ్యత? గోఖలే వంతెన ఎవరు నేల మట్టం చేస్తారు..? ఎవరు నిర్మిస్తారనే ప్రశ్న స్ధానిక ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు కూల్చివేయాలి...? ఎవరు నిర్మించాలి...? అందుకయ్యే వ్యయంలో ఎవరు, ఎంత శాతం నిధులు వెచ్చించాలి..? ఇలాంటి కారణాలు తెరమీదకు వచ్చాయి. ఇదివరకు నేలమట్టం చేసిన అనేక వంతెనల పనులు జాప్యం జరగడానికి ఇవే ప్రధాన కారణాలయ్యాయి. దీంతో ఈ వంతెన రైల్వే హద్దులో ఉన్న పనులు పశ్చిమ రైల్వే చేపట్టనుంది. బీఎంసీ హద్దులో ఉన్న పనులు బీఎంసీ చేపట్టనుంది. కాని రైల్వే ట్రాక్స్ మీదున్న వంతెన భాగాన్ని కూల్చివేయాలంటే కూలీలకు ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం. ఓవర్ హెడ్ వైర్లోంచి 25 వేల ఓల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుంది. వంతెన కిందున్న ఆరు రైల్వే మార్గాల మీదుగా సగటున రెండు నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ వంతెన నేలమట్టం చేయాలంటే ఇటు ఇంజినీర్లకు, అటూ కూలీలకు కత్తిమీద సాములంటిదేనని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమీత్ ఠాకూర్ పేర్కొన్నారు. కూల్చివేత పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కంట్రాక్టర్లకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాధారణంగా గోఖలే వంతెన వినియోగంలో ఉన్నప్పుడే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ వంతెన మూసి వేయడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా స్ధానికులు విసిగెత్తిపోయారు. రోడ్డు మార్గం కంటే లోకల్ రైలు లేదా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. -
ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ప్రాపర్టీ కూల్చివేత
-
నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు. VIDEO : #Bengaluru में घर तोड़ने पर खुद को आग लगाने लगे पति-पत्नि pic.twitter.com/Tp3L2QJDIh — NDTV India (@ndtvindia) October 12, 2022 ఏం జరిగిందంటే? బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్డోజర్కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
కామాంధుడి దాష్టీకం.. ఇల్లు నేలమట్టం
భోపాల్/రేవా: స్కూలు బస్సులోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాడు ఓ మృగం. మూడున్నరేళ్ల చిన్నారిపై కామాంధుడి దాష్టీకం ఆలస్యంగా వెలుగుచూసింది. భోపాల్‌లో ఈ నెల 8న ఈ దారుణం జరిగింది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదివే చిన్నారి ఇంటికెళ్లాక.. ఆమె బ్యాగ్‌లో ఉండాల్సిన స్పేర్ దస్తులు మార్చేసి ఉన్నాయి. పైగా ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. తల్లి ఆరాతీయడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వాళ్లు నిర్లక్ష్యంగా స్పందించారు. పైగా ఘటన జరిగిన రోజు బస్సులోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేశార. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు.. బస్సు డ్రైవర్‌ను, ఘటన జరిగినపుడు సహకరించిన మహిళా హెల్పర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డ్రైవర్ అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ మేరకు అక్రమ కట్టడంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసిన అధికారులు.. పోలీసుల సమక్షంలో షాపురా ఏరియాలోని నిందితుడి ఇంటిని నేలమట్టం చేశారు. ఘటన గురించి తెలిసి ఆగ్రవేశాలతో ఉన్న స్థానికులతోనే ఆ ఇంటిని అధికారులు నేలమట్టం చేయించడం విశేషం. ఇదిలా ఉంటే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. స్కూల్ యాజమాన్యం ధోరణిపైనా మండిపడ్డారు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా. video courtesy: IBC24 ఇదీ చదవండి: నాకు మా అమ్మ కావాలి.. గుండెల్ని పిండేస్తున్న చిన్నారి రోదన -
ట్విన్ టవర్ల కూల్చివేత.. ఫ్లాట్‌లో నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
లక్నో: నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి.. బటన్ నొక్కి జంట భవనాలను నేలమట్టం చేశారు. కేవలం 9 సెకన్లలోనే ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే కూల్చివేత ప్రక్రియకు ముందుగానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ఇ అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు. చదవండి: Noida Twin Towers Demolition: వ్యర్థాల తొలగింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా! కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుండిపోయాడు. ట్విన్ టవర్స్‌కు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోని టాప్ ఫ్లోర్లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్లోని పై అంతస్తు ఫ్లాట్‌లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు.వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్‌కు పంపారు.కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తెలిపారు. చదవండి: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి? -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు ప్రధాన కారణాలు ఇవే..
-
కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ (ఫొటోలు)
-
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. వ్యర్థాల తరలింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!
లక్నో: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి..100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్‌ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది. చదవండి: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోపే.. అయితే ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చదవండి: మీకు తెలియని ఆసక్తికర విషయాలు : ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం! కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1, 200 కోట్లు. #WATCH | Noida, UP: Rubble of demolished #SupertechTwinTowers laid bare along with a cloud of dust in the vicinity after the demolition pic.twitter.com/0jxd4VVh0l — ANI (@ANI) August 28, 2022 ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు. #WATCH | 'Controlled implosion' turns Noida's #SupertechTwinTowers to dust pic.twitter.com/zDksI6lfIF — ANI (@ANI) August 28, 2022 దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్పటివరకు పరిసరాల్లోని 35 వీధి కుక్కలనుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. -
పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4 — ANI (@ANI) August 28, 2022 -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం
-
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏర్పాట్లు పూర్తి
-
ట్విన్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్!
న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్ జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన నిపుణుల సమక్షంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు. దశలవారీగా ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు
నోయిడా ట్విన్ టవర్ కేసు చిత్రవిచిత్ర మలుపులు తీసుకుంటోంది. అక్రమంగా నలభై అంతస్థుల భవనం నిర్మించారంటూ కోర్టుకు వెళ్లిన వాళ్లకు న్యాయం దక్కేట్టు కనిపిస్తున్నా అంతకు మించి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. అసలెందుకు ఈ కేసు వేశాంరా బాబు అన్నట్టుగా మారింది వాళ్ల పరిస్థితి. నోయిడా అధికారుల నిర్లక్ష్యం, రియల్టర్ల అత్యాశ చివరికి అందరికీ కష్టాలను కొని తెచ్చింది. అక్రమ నిర్మాణం నోయిడాలో ఎమరాల్డ్ ఫేజ్‌లో అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఇదే సముదాయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్‌టెక్ అనే సంస్థ నలభై అంతస్థుల జంట భవనాల నిర్మాణం చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టులను ఆశ్రయించారు. చివరకు నాలుగైదేళ్ల తర్వాత భవన నిర్మాణం అక్రమం అంటూ సుప్రీం కోర్టు 2022 ఫిబ్రవరిలో తేల్చింది. అప్పటికే దాదాపు 39వ అంతస్థు వరకు నిర్మాణం పూర్తయ్యింది. సాగుతున్న కూల్చివేత కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ జంట భవనాలు కూల్చేయాల్సి 2022 మే 21న కూల్చేయాల్సి ఉంది. ఆ పనుల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎమారాల్డ్ ఫేజ్‌లోకి వెళ్లే నాలుగు దారుల్లో మూడు దారులు మూసి వేశారు. కేవలం ఒక్కటి మాత్రమే తెరిచి ఉంచారు. ముందుగా నిర్దేశించిన గడువు మే 21లోగా కూల్చివేత సాధ్యం కాదని తేలడంతో ఈ గడువును ఆగష్టు వరకు పొడిగించారు. కష్టాల్లో స్థానికులు దారులు మూసివేయడం వల్ల ఎమరాల్డ్ ఫేజ్‌లో ఉన్న నివాసాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు టెస్ట్ బ్లాస్టింగ్స్, ఇతర పనుల కారణంగా నిత్యం ట్విన్ టవర్స్ నుంచి దుమ్ము రేగుతూ అక్కడున్న వారికి చికాకులు తెచ్చి పెడుతున్నాయి. పైగా కూల్చివేత పనులు దక్కించుకున్న సంస్థ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించాల్సి ఉంటుందని చెప్పడం మరింత సందేహాలను లేవనెత్తింది. ట్విన్ టవర్స్ పేల్చి వేత వల్ల తమ ఇళ్లకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయో ఏమో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మాగోడు వినండి ట్విన్ టవర్స్ కూల్చివేత వ్యవహారంలో తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటూ అక్కడి వారు నోయిడా అధికారులను కోరారు. దీంతో 2022 జూన్ 7న ట్విన్ టవర్స్ నిర్మించిన సూపర్‌టెక్ సంస్థ, కూల్చివేత పనులు చేపడుతున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ, స్థానికులతో కలిసి నోయిడా అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఆందోళనలకు పరిగణలోకి తీసుకుని కూల్చివేత పనులు చేపట్టాలని ఇందులో కోరనున్నట్టు సమాచారం. మరి ఈ సమావేశం తర్వాత ఈ భవనాల కూల్చివేత అంశం మరే మలుపు తీసుకుంటుందో చూడాలి. చదవండి: ఇంకా పేలుడు పదార్థాలు కావాలి.. అప్పుడే ఆ పని చేయగలం! -
టెస్ట్ బ్లాస్ట్ సక్సెస్.. 40 అంతస్థుల బిల్డింగ్ కూల్చివేతకు అంతా రెడీ
దేశవ్యాప్తంగా రియల్టీ రంగాన్ని కుదిపేస్తోన్న నోయిడా ట్విన్ టవర్ కేసులో టెస్ట్ బ్లాస్టింగ్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్‌ను నిర్వహించారు. ఈ జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, 14వ అంతస్థుల్లో ఐదు కేజీల పేలుడు పదార్థాలతో టెస్ట్ బ్లాస్ట్ చేపట్టారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూ్ట్ (సీబీఆర్ఐ) రూర్కీ నుంచి వచ్చిన నిపుణులు బ్లాస్టింగ్ పనులను పర్యవేక్షించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి 2022 మే 22న ఈ జంట భవనాలను కూల్చివేయబోతున్నారు. టెస్ట్ బ్లాస్ట్ అనంతరం ఈ రెండు భవనానలు కూల్చి వేసేందుకు 3,000ల నుంచి 4,000 కేజీల పేలుడు పదార్థాలు అవసరం అవుతాయని అంచనా. దాదాపు 9 సెకన్లలో ఈ భవంతి నేలమట్టం అవుతుందని పేలుడు పనులు దక్కించుకున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ సంస్థ తెలిపింది. నోయిడా సెక్టార్ 93ఏలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్‌టెక రియాల్టీ సంస్థ ఎమరాల్డ్ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు చేపట్టింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో కూడా అనేక విడతలుగా విచారణ జరిగింది. చివరకు జంట భవనాలను కూల్చివేయాల్సిందే అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. Low intensity blast (mock drill) sound heard at Supertech Twin Tower in Noida. The building has to be demolised on 22nd May. Blast Test was done to see as to how many kgs of explosives to be used on actual day. #SuperTech #twintower #demolition #Noida #Blast pic.twitter.com/Zevad7ja98 — Gurmeet Singh, IIS (@Gurmeet_Singh33) April 10, 2022 చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
ఐరాస హెలికాప్టర్ కూల్చివేత
దకర్: కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్‌ను వేర్పాటువాదులు కూల్చేశారు. సోమవారం కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్ గ్రూప్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం మంగళవారంప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది: బైడెన్) -
బిగ్‌బీ ‘ప్రతీక్ష’ గోడ కూల్చివేతపై బీఎంసీ ఆలస్యం.. లోకాయుక్త ఫైర్
Maharashtra Lokayukta On BMC Delaying Amitabh Bungalow Wall Razing: ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదటిసారిగా నిర్మించుకున్న బంగ్లా ప్రతీక్ష. ఇంద్రభవనంలా ఉండే ఈ బంగ్లా చుట్టూ వివాదం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ప్రతీక్ష బంగ్లా కాంపౌండ్ వాల్ కూల్చివేసేందుకు, భవనంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు బీఎంసీ కుంటి సాకులు చెబుతోందని మహారాష్ట్ర లోకాయుక్త ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేతకు కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మహారాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ వీఎం కనడే తన ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఈ ఉత్తర్వుల్లో పనుల జాప్యంపై పశ్చిమ శివారు ప్రాంతాల డిప్యూటీ ఇంజినీర్ (రోడ్లు)కు పౌర సంఘం నోటీసు జారీ చేయాలన్నారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్ లేనందున బంగ్లా నుంచి కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోలేదని ఇంతకుముందు బీఎంసీ తెలిపింది. శివసేన నియంత్రణలో ఉన్న పౌర సంఘం కూడా గోడను కూల్చివేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు కాంట్రాక్టర్‌ను నియమించినప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంటుదని చెప్పింది. 'కూల్చివేతలను చేపట్టకపోవడానికి బీఎంసీ చెప్పిన ఈ కారణం సరైనదిగా కనిపించడం లేదు. రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడల్లా అవి అమలు చేయడానికి తగిన బడ్జెట్‌ను బీఎంసీ అమలు చేస్తుంది. దీన్ని బట్టి బీఎంసీ ఆలస్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కుంటి సాకులు చెబుతూ సరిహద్దు గోడ కూల్చివేత చేయట్లేదు' అని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
జంట టవర్లను కూల్చివేయాల్సిందే
న్యూఢిల్లీ: నోయిడాలో 40 అంతస్తుల జంట టవర్ల కూల్చివేతపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు సూపర్‌టెక్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా లేని ఒక టవర్లోని 224 ఫ్లాట్లతోపాటు గ్రౌండ్ ఫ్లోర్‌లోని కమ్యూనిటీ ఏరియాను పాక్షికంగా మాత్రమే నేలమట్టం చేసేందుకు వీలు కల్పించాలన్న వినతిని తోసిపుచ్చింది. ఇలాంటి వెలుసుబాట్లు కల్పిస్తే ఆగస్ట్ 31వ తేదీ నాటి తమ తీర్పును తిరిగి పూర్తి స్థాయిలో సమీక్షించుకున్నట్లవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం తెలిపింది. రెండు టవర్లను పూర్తిగా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. చదవండి: ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు -
చిత్తూరు : ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు కూల్చివేత
-
కొత్తగూడెం రైల్వే శాఖ పరిధిలో ఆక్రమణలు కూల్చివేత
-
వజ్రాలు ఉన్నాయనే నంది విగ్రహం ధ్వంసం..
విజయవాడ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కాపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గతేడాది సెప్టెంబరు 17న విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ఘటనలో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నిందితులు నంది విగ్రహ చెవులను విరగొట్టారని ఆయన వెల్లడించారు. నంది విగ్రహం నడుము భాగంలో హంస ఉంటే వజ్రాలు ఉంటాయని నిందితులు భావించారని, ఈ విషయంపై పూజారి యుగంధర్ శర్మను వివరాలు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారని ఎస్పీ తెలిపారు. విగ్రహ ధ్వంసానికి ముందు నిందితులు పలు మార్లు రెక్కీ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. గుప్త నిధుల వేటలోనే విగ్రహాన్ని పగలగొట్టినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. నిందితులపై 447, 427, 295, 295A,153, IPC & 20 of Indian treasure trove act 1878 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి Ap 24 AP 8999 ఇన్నోవా కార్, Ap 16 DQ 4243 స్విఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. విగ్రహాన్ని పగలగొట్టడానికి వినియోగించిన సుత్తి ,గ్యాస్ కట్టర్లను సీస్ చేశామని పేర్కొన్నారు. గుప్తనిధుల వేటలో నిందితులు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన ఫోటోలను నిందితుల సెల్ ఫోన్లలో గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. -
కూలిన గ్లైడర్.. ఇద్దరు నేవీ సిబ్బంది మృతి
తిరువనంతపురం: నేవీ పవర్ గ్లైడర్ కూలిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించిన ఘటన ఆదివారం ఉదయం కేరళలోని తొప్పంపడీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లెఫ్టినెంట్ రాజీవ్ ఝా, పెట్టీ ఆఫీసర్ సునీల్ కుమార్‌లను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే వారు మరణించారని వైద్యులు తెలిపారు. రాజీవ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, సునీల్‌కు పెళ్లి కాలేదని అధికారులు చెప్పారు ఈ ఘటనపై దక్షిణ నేవీ కమాండ్ విచారణకు ఆదేశించింది. -
దేవుడికి ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబందించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
అక్కడికెళ్లి ఏం చూస్తారు?
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి ప్రజాప్రతినిధులు వెళ్లి ఏం చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గుడి, మసీదు కూల్చామని ప్రభుత్వమే ప్రకటించిందని, ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చిందని, అలాంటప్పుడు అక్కడ కొత్తగా చూసి శోధించాల్సింది ఏముందని ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతివ్వాలని కోరినా ప్రభుత్వం అనుమతించట్లేదని, ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలం టూ కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాది అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలేవీ లేవం టూ అభ్యర్థనను తిరస్కరించింది. 138 ఏళ్ల పురాతనమైన గుడిని కూల్చారని, అప్రకటిత నిషేధం విధించి ఎవరినీ కూల్చివేత ప్రదేశాలకు అనుమతివ్వడం లేదని వారి తరఫు న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి నివేదించారు. జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉంది కాబట్టే ఎవరినీ అనుమతించట్లేదన్న అనుమానాలున్నాయని, ప్రజాప్రతినిధులు అక్కడికెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలపాలనుకుంటున్నారని వివరించారు. ‘నిధులు వెలికితీస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లో ఒక బాబా సమాధిలోకి వెళ్లాడు. నిధి వెలికి తీయడమేమోగానీ సమాధి నుంచి మళ్లీ ఆయన బయటకు తిరిగి రాలేదు. అలాగే సచివాలయంలోని జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్తామనడం సరికాదు. అక్కడ నిధి ఉందని ఏ విభాగం ధ్రువీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వాదనలు వినిపించడం సరికాదు’ అని ధర్మాసనం సూచించింది. సందర్శనకు అనుమతించండి సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీమంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖ లు చేశారు. సచివాలయం భవనాల కూల్చి వేత ప్రదేశానికి అనుమతించాలంటూ గత నెల 27న, 30న డీజీపీకి వినతిపత్రం సమర్పించినా స్పందన లేదన్నారు. 25.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న సచివాలయం 10 బ్లాకులుగా ఉందని, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేత పనులను రహస్యంగా చేపడుతున్నారని తెలిపారు. నల్లపోచమ్మ దేవాలయం, మసీదు కావాలని కూల్చలేదని, తిరిగి వాటిని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అనేక అనుమానాలకు ఆస్కారమిస్తోందన్నారు. నిజాం 132 ఏళ్ల క్రితం నిర్మించిన జీ బ్లాక్ కింద నిధి ఉందనే వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నారు. ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే సచివాలయం చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలోకి ప్రజలనెవరినీ అనుమతించలేదని తెలిపారు. సచివాలయం సందర్శనకు అనుమతించేలా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
సచివాలయంలో ఏముంది? సీక్రసీ ఎందుకు!
సెక్రెటరీయేట్ కూల్చివేత పనుల్లో అంత సీక్రసి ఏముంది? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగానే పాత సెక్రెటరీయేట్ భవనాల కింద గుప్తనిధులున్నాయా? లేదా ఎవరు ఏమనుకుంటే మాకేంటి మేం అనుకున్నది చేసి తీరుతామనేదే ప్రభుత్వ పాలసీనా? పాత భవనాల కూల్చివేతను ప్రభుత్వం అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం ఎందుకు? సాక్షి, హైదరాబాద్ : పరిపాలనకు అనుకూలంగా లేదని, ఒక్కో శాఖ ఒక్కో దగ్గర ఉండడం సరైన పద్ధతి కాదని పాత సెక్రెటరీయేట్ కూల్చివేసి నూతన సెక్రెటరీయేట్ కడదామనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం క్రితం నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన కేసీఆర్ వివిధ కారణాలవల్ల దాని జోలికే వెళ్ళలేదు. కేవలం వాస్తు బాగాలేదని మంచి భవనాలను కూల్చేయడం సరైంది కాదని పలువురు కోర్టులో పిల్స్ వేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం పాత భవనాల కూల్చివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రభుత్వం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించకపోవడంతో పాటు మీడియా పట్ల కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని ప్రజాసంఘాలు, పలు పార్టీల నేతలు వివిధ కారణాలు చూపెడుతూ, కూల్చివేతను అడ్డుకొని ఆ భవనాలను కోవిడ్ సెంటర్ గా మార్చి ప్రజలకు ఉపయోగపదేవిధంగా చూడాలని కోర్టులో మళ్ళీ పిల్స్ వేశారు. కోర్టు స్టే ల తర్వాత కూల్చివేతలకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మీడియాకైనా అనుమతి ఇవ్వాల్సిందిగా పలువురు పిటిషన్ వేయడంతో పాత భవనాల కూల్చివేత ప్రక్రియను మీడియా కవేరేజ్ కోసం అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మీడియాని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. 15 నిమిషాల్లోనే బయటకు ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం మీడియాని అనుమతిస్తోందని తెలియడంతో వాస్తవాలు బయటకొస్తాయని అందరూ భావించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా పోలీసుల కఠినమైన ఆంక్షల మధ్య మీడియాను లోపలికి తీసుకెళ్లి బయటకి తీసుకొచ్చారు. మీడియా కోసం ఐదు వెహికల్స్ ఏర్పాటు చేసి అందులోనే మీడియా ప్రతినిధులతో పాటు వందలమంది పోలీసులను కుక్కి సెక్రెటరీయేట్ కి తీసుకెళ్లారు. సెక్రెటరీయేట్ వెళ్లిన తర్వాత మీడియా ప్రతినిధులను కనీసం వాహనాల నుండి కిందకి దిగకుండా అడ్డుకొని కవరేజ్ చేయకుండా పొలీసులు నిలువరించారు. మీడియాను పాత భవనాల కూల్చివేత దగ్గరికి మీడియాను తీసుకెళ్లిన అధికారులు కేవలం 15 నిమిషాల్లోనే బయటకి తీసుకొచ్చారు. పాత భవనాల కవరేజీకి ఎందుకు అనుమతించడం లేదని కోర్టు అడగడంతో మాత్రమే ప్రభుత్వం మీడియాని అనుమతించిందని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. భవనాల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం మీడియాని ఆంక్షలు లేకుండా కవరేజీ చేసుకొనివ్వకుండా ఎందుకు వ్యవహరించిందో సమాధానం లేని ప్రశ్న. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలైతే కనిపించలేదు.కానీ కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. దుమ్ము లేవకుండా భవనాలను నీళ్లు కొట్టడం, పాత ఇనుప చువ్వల్లో బాగున్నవాటిని తిరిగి ఉపయోగించడం లాంటి సాధారణ ప్రక్రియ తప్పా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవీ లేవనే చెప్పుకోవాలి. ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయని చెప్తోన్న ప్రభుత్వం అక్కడి శిధిలాలను వేరే దగ్గర డంప్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే 2500 లారీ ట్రిప్పుల శిధిలాలు డంప్ చేశామని, మరో 2000 లారీ ట్రిప్పుల శిధిలాలను డంప్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల పరంగా చూస్తే జీ బ్లాక్‌ను వంద శాతం కూల్చివేయగా, ఎన్, జే బ్లాక్‌లు యాభై శాతం కూల్చివేశారు.ఏ,బీ,సీ బ్లాక్‌లు 80 శాతం, కే బ్లాక్ 20 శాతం కూల్చివేశారు. ఇక సౌత్ హెచ్, నార్త్ హెచ్ బ్లాకులు 95 శాతం కూల్చివేత ముగిసింది. వృక్షాలకు ఇబ్బంది కలగకుండా కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత పనులను కవరేజీకి అనుమతించమని చెప్పుకోవడానికి మాత్రమే మీడియాను అనుమతించిన ప్రభుత్వం ఈ ప్రక్రియలో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అనుమతించిన ప్రతి వాహనంలో మీడియా ప్రతినిధులతో పాటు, పదుల సంఖ్యలో పోలీసులను కుక్కింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యతో ఈ కమ్యూనిటీల్లో కరోనా కేసులు పెరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రభుత్వమే చెప్పాలి. -
మీడియా కవరేజ్ అనుమతికి హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం భవనాల కూల్చివేతను కవర్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలైంది. పటిషన్లో కూల్చివేతను కవర్ చేయకుండా ఆంక్షలు పెట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసుల బారికేడ్లు వేసి ఎవరిని అనుమతించడం లేదని తెలిపారు. (చదవండి: కూల్చివేతకు లైన్‌క్లియర్) ప్రజల డబ్బుతో నిర్మించిన అధికార భవనాలను కూల్చి వేసిన, కొత్తవి నిర్మాణం చేసిన ప్రజలకు తెలియాల్సిన అవసంరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కూల్చివేతకు కవరేజ్‌కు మీడియాకు అనుమతించకపోవడమనేది రాజ్యాంగం కల్పించిన మీడియా స్వేచ్చను హరించడం అవుతుందన్నారు. సెక్రెటరేట్ కూల్చివేత సమయంలో మీడియా కవరేజ్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోర్టు కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హకోర్టు విచారణ చెపట్టనుంది. (చదవండి: కొత్త సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి ప్రకటన) -
సచివాలయం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
-
కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఈ నెల 15 వరకూ హైకోర్టు పొడిగించింది. కూల్చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. భవనాల్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని, దీని విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఇదే విధంగా తీర్మానం చేసిన దానిపై తాము ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. మంత్రివర్గం గత నెల 30న తీర్మానం చేసిన విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అనిపిస్తోందని,, పత్రికల్లో వార్తలు రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజలకు చెప్పకపోయినా కోర్టులకైనా తెలియజేయాలని ఆదేశించింది. ప్రజలకు తెలియజేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్లో మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయాలని కోరింది. పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ... నిర్మాణాలు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, పలు చట్టాలను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడిందని, అనుమతి తీసుకుని కూల్చారో లేదో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ వాదనను ఏజీ వ్యతిరేకిస్తూ, భవనాల కూల్చివేత పనులు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిగా కూల్చేందుకు వీలుగా స్టేను ఎత్తేయాలని కోరారు. మంత్రివర్గ తీర్మాన ప్రతిని ఈరోజే మధ్యాహ్నానికి ఇస్తామని, విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై.. పిటిషనర్ వాదనల దాఖలుకు సమయం ఇవ్వాలని, విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం మంత్రివర్గ తీర్మాన ప్రతిని, పిటిషనర్ కౌంటర్ రిప్లై్ల దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మంత్రివర్గం ఆమోదించింది ప్రభుత్వం చట్ట ప్రకారమే సచివాలయ భవనాల్ని కూల్చివేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. మంత్రివర్గం జూన్ 30న ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఆర్అం డ్బీ ఈఎన్సీ అదే నెల 4న 25.50 ఎకరాల్లోని సచివాల య భవనాల కూల్చివేతకు నివేదిక ఇచ్చారని, దీనికి అనుగుణంగా కూల్చివేతలకు జీహెచ్ఎంసీ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. కాలుష్య సమస్యతో ఎవ్వరూ బాధపడటం లేదని, హుస్సేన్‌సాగర్ సమీపంలో కూల్చివేయరాదన్న వాదన చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిర్మాణాలు– కూల్చివేతలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లోని 4(3)ను ఉల్లంఘించలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, వీటిని కొట్టేయాలని కోరారు. -
‘సీఎం కేసీఆర్ కరోనా తెచ్చుకోరు.. తెప్పిస్తారు’
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరానికి చరిత్రే లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయంలాంటి పురాతన కట్టడాలను కూల్చడం సరైన పద్ధతికాదని హితవు పలికారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయం కూల్చివేసే సందర్భంగా నిజాం నవాబులను పొగిడే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీఎం కేసీఆర్ కూడా నిజాం నవాబును అనేకసార్లు పొగిడారు. నిజాం నవాబు వారసులు నాకు ఫోన్ చేసి మీరు.. నిజాం నవాబును విమర్శిస్తున్నారు మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పుడు నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే మేనమామ సర్ వికార్ ఉల్ ఉమ్రా ఆలోచన ప్రకారం నిజాం 6వ నవాబు మహబూబ్ అలీఖాన్.. లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ నమూనాతో తెలంగాణ సచివాలయంలో ఒక భవనాన్ని నిర్మించారు. వికారాబాద్‌కు కూడా ఆయన పేరే పెట్టారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగిస్తే బాగుండేది. పురాతన భవనాలను పడగొడితే హైదరాబాద్ ప్రాముఖ్యత కనిపిస్తుంది. పురాతన భవనాలు కూలగొట్టడం సరైన పద్ధతి కాదు. వాటిని పురావస్తు శాఖకు అప్పగించి సంస్కృతిని కాపాడాలి. (చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) కేసీఆర్ శకం నుంచే హైదరాబాద్ నిర్మాణమైనట్టు చూపిస్తున్నారు. గతంలో నిజాం నవాబు పరిపాలన గాని, పది మంది ముఖ్యమంత్రులు పాలించినట్లు గాని చెప్పకుండా తానే హైదరాబాద్ నిర్మించినట్లు చూపించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయానికి అన్ని హంగులతో భవనాన్ని కట్టడానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. కరోనా కేసులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారింది. కోవిడ్‌తో బాధపడుతున్నవారిని కాపాడాల్సింది పోయి కొత్త సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యే. దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు సరైన సమయం కాదు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. ఆయనకు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ, ఆయనకు వచ్చిందని నేనేమీ అనుకోను. ఆయన చాలా తెలివైనవారు. ప్రజలందరికీ కోవిడ్ తెప్పిస్తారు గాని ఆయన తెచ్చుకోరు. కోవిడ్ పేషెంట్లకు సచివాలయంలో చికిత్స అందించాలి. కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పురాతన భవనాలు కూల్చి కొత్తవి కట్టడం.. చావప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదు’అని నారాయణ విమర్శించారు. (ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన) -
సచివాలయం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సచి వాలయ భవనాలను కూల్చివేసి అదే ప్రాంతంలో ఆధునిక హంగులతో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేస్తూ జూన్ 29న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన వారం రోజులకే అకస్మాత్తుగా సచివాలయ భవనాల కూల్చివేతకు సర్కారు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన బ్లాకుల కూల్చివేత పనులూ సమాంతరంగా జరుగుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నడుస్తున్న బీఆర్కే భవన్లో ఉద్యోగులకు మంగళవారం సెలవు ఇచ్చారు. బిల్డింగ్ ఇంప్లోజియం పరిజ్ఞానంతో పేలుడు పదార్థాలు ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో పేలుళ్లు జరపడం ద్వారా సచివాలయం భవనాలను సులువుగా, సత్వరంగా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. పేలుళ్ల ప్రకంపనల ధాటికి పక్కనే నిండు కుండలాగా ఉండే హుస్సేన్‌సాగర్ కట్టకు ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశముందని భావించి దాన్ని ప్రభుత్వం విరమించుకుంది. పెద్ద మొత్తంలో దట్టమైన దుమ్ము ఎగిసిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం ఇబ్బందిపడతారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారీ ప్రొక్లైనర్లు, క్రేన్లు, ఇతర యంత్రాలను వినియోగించి సాంప్రదాయ పద్ధతిలో కూల్చివేత పనులు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో భవనాలన్నీ పూర్తిగా నేలమట్టం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కూల్చివేత అనంతరం బయటపడనున్న టన్నుల కొద్దీ శిథిలాలను తరలించడనికి మాత్రం కొన్ని వారాల సమయం పట్టనుందని అంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఆకస్మాత్తుగా కూల్చివేతను ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. కూల్చివేత, శిథిలాల తరలింపు ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. 2019 జూన్ 29న కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ సైతం నిర్వహించారు. వచ్చే శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో ఆలోగా పనులు ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలగర్భంలో చరిత్ర ! 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయ భవనాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పరిపాలన అవసరాల కోసం 6వ నిజాం నవాబు 1888లో సైఫాబాద్ ప్యాలెస్‌ను నిర్మించగా, కాలక్రమంలో అది రాష్ట్ర సచివాలయం జీ–బ్లాక్‌గా అవతరించింది. యూరోపియన్ ఆర్కిటెక్ట్ శైలితో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్‌తో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు ముడిపడిఉన్నాయి. 6వ నిజాం 1888లో ఈ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు బల్లి అడ్డురావడంతో అపశకునంగా భావించి దీనికి తాళం వేసి ఉంచారు. అనంతరం 1940లో దీనిని తెరిచారు. ఏ–బ్లాక్‌ను 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించారు. సీ–బ్లాక్ ను 1978 లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. ప్రగతిభవన్ నిర్మాణానికి ముందు సీఎం కేసీఆర్ సైతం కొంతకాలం పాటు సీ–బ్లాక్ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఏ–బ్లాక్ రెండో విడతను 1998 ఆగస్టు 10న చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించారు. డీ–బ్లాకును 2003 లో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ప్రారంభించారు. మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న జే, ఎల్ బ్లాకులను 1990 నవంబర్ 12న అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. సచివాలయంలో అతిపెద్దది జే –బ్లాక్. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయంలో మొత్తం 10 బ్లాకులు ఉండగా, 132 ఏళ్లలో దశల వారీగా వీటి నిర్మాణం జరిగింది. కొత్తగా నిర్మించిన డీ–బ్లాక్‌ను 2003లో, నార్త్, సౌత్ హెచ్ బ్లాకులను 2013లో ప్రారంభించారు. దశాబ్దాల అనుబంధం ... ఉమ్మడి ఏపీ, విభజన అనంతర ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏలిన 16 మంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన కేంద్రంగా 6 దశాబ్దాలుగా పైనే సేవలందించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సచివాలయంగా ఉపయోగపడింది. ఎందరో సీఎంలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం కేడర్ అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రిటైర్డు అధికారులకు దశాబ్దాల అనుబంధం ఈ భవనాలతో ఉంది. భవనాలను కూల్చివేస్తున్నారని తెలుసుకుని అందరూ సచివాలయ భవనాలతో తమ అనుబంధాన్ని సన్నిహితుల వద్ద నెమరవేసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాల దారి మళ్లింపు సచివాలయ భవనాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా నివారించేందుకు ప్రభుత్వం భారీగా పోలీసుల మోహరించింది. సచివాలయానికి వెళ్లే అన్నిదారులను మంగళవారం తెల్లవారుజామున నుంచే మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. సచివాలయం వైపు వెళ్లేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఇటువైపు నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించింది. చివరకు మీడియా ప్రతినిధులు, వాహనాలకు సైతం అనుమతి నిరాకరించింది. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్ కాంపౌండ్, రవీంద్రభారతి, హిమాయత్‌నగర్ నుంచి సచివాలయం వైపు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. కూల్చివేతతో పాటు శిథిలాల తరలింపు పూర్తయ్యే వరకు ఈ దారులను మూసి ఉంచనున్నారని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తు దోషమే ప్రధాన సమస్య ప్రస్తుత సచివాలయానికి చాలా వాస్తుదోషాలున్నాయని వాస్తుపండితులు సీఎం కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. ఆర్బీఐ నుంచి వచ్చే రహదారితో సచివాలయానికి వీధి పోటు ఉందని, అదే విధంగా 25 ఎకాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయం స్థల ఆకారం సైతం గజిబిజీగా ఉందని వాస్తు పండితులు పేర్కొనేవారు. చతురస్త్ర/దీర్ఘచతురస్త్ర ఆకారంలో స్థలం ఉంటేనే వాస్తు ఉంటుందని, ఆ దిశగా కొత్త సచివాలయం కోసం పక్కనే ఉన్న ఇతర కార్యాలయాల భవనాల స్థలాలను సైతం సేకరించాలని వాస్తు పండితులు సీఎంకు సూచించారు. వాస్తు సలహాల కోసం సుద్దాల సుధాకర్ తేజను కన్సల్టెంట్‌గా సీఎం నియమించుకున్నారు. ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో ఈయనకు ప్రత్యేకంగా ఒక చాంబర్‌ను సైతం కేటాయించారు. కొత్త భవనాల నిర్మాణం, డిజైన్ల తయారీ, ముహూర్తాల ఖరారు, శంకుస్థాపన స్థల నిర్ణయం వంటి అంశాల్లో సుధాకర్ తేజ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. -
సచివాలయం ఇక కూల్చివేతే!
-
సచివాలయం ఇక కూల్చివేతే!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయ భవనాలను కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గత సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం వేగం పెంచింది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌లోని ఐటీ శాఖ సర్వర్‌ను ప్రభుత్వం బీఆర్కేఆర్ భవన్‌కు తరలించడంతో పాటు మీడియా పాయింట్‌ను సైతం ఖాళీ చేయించి సచివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్లకు తాళాలు వేయించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడిగా సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాల తరలింపును బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న వాహనాలను క్రేన్ల సహాయంతో సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిజాం కళాశాల మైదానానికి తరలించారు. వందకు పైగా కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి. చాలా వాహనాలు శిథిలమైపోగా, కొన్ని వాహనాలు పనికొచ్చే స్థితిలో ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రవాణాశాఖ పరిశీలించి ధరలను ఖరారు చేశాక... బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో చాలా మంది అధికారులు తమ పాత వాహనాలను సచివాలయంలో నిరుపయోగంగా ఉంచారు. వీటిలో పనికి వచ్చే వాహనాలను గుర్తించి వేలం వేయనున్నారు. నెలాఖరులోగా... వివిధ శాఖల కార్యాలయాలను బీఆర్కేఆర్ భవన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించడంతో దాదాపు ఏడాదికాలంగా సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో సచివాలయ భవనాల కూల్చివేతకు ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి. -
వాస్తు కోసం పోలీస్ స్టేషన్ గది కూల్చివేత
బి.కొత్తకోట : వాస్తు దెబ్బకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ భవనంపై గది కూలిపోయింది. మండల పరిధిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఏదో వాస్తులోపం ఉందని భావించారు. వాస్తు రీత్యా స్టేషన్ భవనంపై ఉన్న గది ఉండకూదని గ్రహించారు. మంగళవారం ఆ గదిని కూల్చేశారు. వాస్తవంగా ఈ గది పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణంలో భాగం కాదు. 1980లో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించగా, 1992లో గది నిర్మించారు. 1980 దశాబ్దంలో పీపుల్స్‌వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) చరిత్రలో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు ఏ ప్రాంతానికీ లేదు. పీపుల్స్‌వార్ వెలుగు వెలిగిన కాలంలో తంబళ్లపల్లె కార్యకలాపాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు ఉద్రిక్తతలు, సంచలన సంఘటనలు జరిగాయి. వార్ కదలికలు అధికంగా ఉండటం, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లకూ భద్రత కలి్పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బి.కొత్తకోట, ముదివేడు, తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం పోలీస్స్టేషన్లపై పీపుల్స్‌వార్ దళాలు దాడులు చేస్తే తిప్పికొట్టడం కోసం రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ భవనంపై ఓ గదిని నిర్మించి అందులో ఇసుక బస్తాలు వేసి, సాయిధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. 24 గంటలు గది నుంచి పహారా ఉండేది. స్టేషన్ల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరుగా స్టేషన్లోకి వచ్చే వీలులేకుండా కంచెతో పలు వలయాలను నిర్మించారు. ఇలా చేయడం ద్వారా నక్సల్స్‌ను స్టేషన్లలోకి దూసుకురాకుండా నివారించడం, పై గదిలో పహారా కాస్తున్న సాయుధ బలగాలు నిలువరించడం సాధ్యమవుతుందని ఇలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంటే 1992–93లో బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌పై ఈ గది నిర్మించారు. అప్పుడు నిర్మించిన గది 2000 వరకు ఉపయోగంలో ఉండగా, అనంతర పరిణామాలతో పీపుల్స్‌వార్ కనుమరుగు కావడంతో నిఘా, కంచెను తొలగించారు. అప్పటి నుంచి వృథాగా ఉన్న ఈ గది ఇప్పుడిలా వాస్తు దెబ్బకు కూలిపోయింది. -
లగ్జరీ ఫ్లాట్ల వివాదం : సుప్రీం సంచలన ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ కొచ్చిన్ శివార్లలోని మరాదు ఫ్లాట్ల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేయనున్న ఎర్నాకుళం మరాదు ప్రాంతంలోని నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల ఫ్లాట్ యజమానులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ మధ్యంతర పరిహారాన్ని నాలుగు వారాల్లోగా పంపిణీ చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది, ఈ మొత్తాన్ని నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల బిల్డర్లు, ప్రమోటర్లు చెల్లిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. నష్టపరిహార ప్రక్రియను అంచనా వేయడానికి , కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భవనాలను ఎప్పుడు పడగొట్టవచ్చో తెలుపుతూ కేరళ ప్రభుత్వం శుక్రవారం తాజా అఫిడవిట్ సమర్పించిన తరువాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కూల్చివేత ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై 90 రోజుల్లో పూర్తి చేస్తామని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ప్రదేశం నుండి శిధిలాలను తొలగించడానికి అదనంగా 48 రోజులు అవసరమని తెలిపింది. మరాదు మునిసిపాలిటీ కోరినట్లు గురువారం కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కెఎస్ఇబి), కేరళ వాటర్ అథారిటీ (కేడబ్ల్యుఎ) నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశాయని సీనియర్ కౌన్సెల్ హరీష్ సాల్వే తెలిపారు. నిర్దేశిత సమయంలో కూల్చివేత పూర్తి చేయాలని సుప్రీం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 25కి వాయిదా వేసింది. కాగా జైన్స్ కోరల్ కోవ్, గోల్డెన్ కయలోరం, హెచ్ 20 హోలీ ఫెయిత్, ఆల్ఫా సెరీన్ సంస్థలే అనే నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్సులు 2005కి ముందు ఇక్కడ భవన సముదాయ నిర్మాణ అనుమతి పొందాయి. మరాదు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ అనుమతి లభించింది. అయితే నవంబర్ 2010 లో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది. దీంతో వివాదం నెలకొంది. ప్రతి అపార్ట్మెంట్ ధర రూ .50 లక్షల నుంచి రూ .1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో నలుగురు బిల్డర్ల మీద కేసులు నమోదయ్యాయి. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేతతో బిల్డర్లు ఏర్పాటు చేసిన జనరేటర్ జైన్స్ కోరల్ కోవ్ కాంప్లక్స్‌లో 122 అపార్ట్మెంట్లు ఉండగా, జైన్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ప్రతి ఫ్లాట్‌ను రూ .86 లక్షలకు విక్రయిస్తోంది. కెపి వర్కీ అండ్‌వీఎస్ బిల్డర్స్ నిర్మించిన గోల్డెన్ కయలోరం ఫ్లాట్ ధర 50-60 లక్షల మధ్య ఉంటుంది. హోలీ ఫెయిత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ 2 ఓ హోలీ ఫెయిత్ ఫ్లాట్ 1.25 - 1.5 కోట్ల రూపాయలకు విక్రయిస్తోంది. ఆల్ఫా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ఫా సెరెన్ ఫ్లాట్ ధర 1.07 కోట్ల నుండి 1.33 కోట్ల మధ్య ఉంటుంది. ఆత్మహత్యే శరణ్యం మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల తప్పునకు తమకు శిక్ష విధించడం సరికాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇళ్లను ఖాళీ చేసేది లేదని ప్రాన్సిస్ అనే ఫ్లాట్ ఓనర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సుహాస్, హరీష్ సాల్వే పర్యటన సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల ఆందోళన -
అక్రమ నిర్మాణాల్ని కూల్చకూడదట
-
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్‌కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
బ్రిడ్జి డిజైన్‌లో లోపం.. కూల్చేసిన అధికారులు
బొగొటా : 10 మంది కార్మికుల మరణానికి కారణమైన నిర్మాణంలో ఉన్న నాసిరకం బ్రిడ్జిని కొలంబియా అధికారులు కూల్చివేశారు. కొలంబియా రాజధాని బొగొటా, విల్లావిసేన్సియో నగరాలను కలిపే హైవేపై చిరజరలోని లోయ పైనుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. డిజైన్‌లో లోపం కారణంగానే బ్రిడ్జి ప్రమాదానికి కారణమైందని తేలడంతో, భద్రతా చర్యల్లో భాగంగా బ్రిడ్జిని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. 100కిలోల పేలుడు పదార్థాలు, 30 డిటోనేషన్ పరికరాలను ఉపయోగించి క్షణాల్లో బ్రిడ్జిని భూస్థాపితం చేశారు. నాసిరకం పనుల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
హైదరాబాద్‌లో కూల్చివేతలు
-
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
-
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఇతర నిందితులు బీఎల్ శర్మ, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, ధర్మదాస్లతో పాటు రామ్ విలాస్.. లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. రూ 20 వేల పూచికత్తుపై ఈ ఐదుగురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారని, రాముడి కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
వరంగల్‌లో ‘డబుల్’ రగడ
► 38 ఇళ్లు కూల్చివేసిన అధికారులు ► ఆందోళనకు దిగిన బాధితులు ► పలువురి ఆత్మహత్యాయత్నం ► మాజీ ఎమ్మెల్యే ధర్నా వరంగల్: డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు వరంగల్ నగరంలోని 12వ డివిజన్ ఎస్ఆర్నగర్లో బుధవారం వేకువజామున రెవెన్యూ, పోలీసు శాఖలు చేపట్టిన కూల్చివేత కార్యక్రమం రసాభాసగా మారింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్నగర్లో 792 మంది లబ్ధిదారులకు జీప్లస్–1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను 2015లో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఇళ్లను 104 బ్లాకుల్లో నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించి పనులు చేపట్టారు. ఎస్ఆర్నగర్లో సుమారు 250 మంది తమ ఇళ్లను కూల్చివేసేందుకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మిగిలిన వారు జీప్లస్–1 వద్దని, వ్యక్తిగత ఇళ్లను నిర్మిస్తే ఒప్పుకుంటామని, లేకుంటే అసలు డబుల్ బెడ్రూం ఇళ్లు వద్దని అధికారులకు తెలిపారు. పలుమార్లు జిల్లా యంత్రాంగం అవగాహన సభలు పెట్టినా ఒప్పుకోకపోవడంతో వారి ఇళ్లను కూల్చే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. బ్లాకుల్లో ఇళ్లు నిర్మించేందుకు మిగిలిన వారు సైతం ఒప్పుకుంటేనే పనులు సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న ఇళ్లను కూల్చి వేసేందుకు బుధవారం అధికారులు వచ్చారు. ఒకేసారి 38 ఇళ్లను కూల్చివేయడంతో అందులో నివాసం ఉంటున్నవారు ఆందోళనకు దిగారు. బాధితుల్లో ఒకరు ఉరివేసుకునేందుకు, మరొకరు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడడంతో పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పోతున్నారు.. ఎక్కడ ఉండాలో చెప్పాలని మహిళలు పోలీసులకు అడ్డం తిరిగారు. దీంతో అడ్డుగా ఉన్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్ఆర్నగర్లో ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయా అని ఆర్డీవో వెంకారెడ్డిని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు కొండేటి శ్రీధర్ ప్రశ్నించారు. అలాంటి ఆదేశాలు లేవని బ్లాక్‌లకు అడ్డంగా ఉన్నందున కూల్చివేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. కూల్చివేతలను నిరసిస్తూ ప్రధాన రహదారిపై బాధితులతో కలసి శ్రీధర్ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కూల్చివేతల్లో పోలీసు డీసీపీ వేణుగోపాల్‌రావు, ఆర్డీవో వెంకారెడ్డి, ఏసీపీలు, తహసీల్దార్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలు కూల్చివేత, ఉద్రిక్తత
శంషాబాద్ : శంషాబాద్ మండలం ఘాన్సిమియాగుడలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను హెచ్ఎండీఎ అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించారని స్థానికులే ఫిర్యాదు చేయడంతో 200 మంది పోలీసు బందోబస్తుతో కట్టడాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అరణ్య రోదన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అరణ్యం రోదిస్తోంది. పెదవేగి మండల పరిధిలో ఓ మాఫియా చెలరేగిపోతుంటే.. అటవీ శాఖ యంత్రాంగం తనకేమీ తెలియనట్టు నిద్రనటిస్తోంది. మూడు రోజులుగా అటవీ ప్రాంతంలోని వెదురు, యూకలిప్టస్ చెట్లను అక్రమార్కులు తెగనరుకుతున్నారు. హైవేను తలపించే రోడ్డుతోపాటు వెదురు పొదల మధ్యనుంచి అంతర్గత రహదారులూ నిర్మించారు. అటవీ సంపదను లూటీ చేస్తూ వాహనాలపై యథేచ్ఛగా తరలిస్తున్నారు. మూడు రోజులుగా ఈ తంతు సాగుతున్నా అటవీ శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను వారి దృష్టికి తీసుకెళితే.. ‘ఔనా.. అలాగా.. మాకెలాంటి సమాచారం లేదు’ అంటూ దాటవేస్తున్నారు. పగలు నరికివేత.. రాత్రి తరలింపు పెదవేగి మండలం న్యాయంపల్లి, కూచింపూడి గ్రామాల పరిధిలోని 6,500 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. అందులో 300 ఎకరాల్లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెదురు ప్లాంటేషన్ వేశారు. ప్రస్తుతం ఈ ప్లాంటేషన్‌తోపాటు అడవిలో ఉన్న యూకలిప్టస్ చెట్లను సైతం యథేచ్ఛగా నరికేస్తున్నారు. పగటి వేళ చెట్లను నరికి వాహనాలపై రహదారిపైకి చేరుస్తున్నారు. రాత్రివేళ వీటిని లారీల్లో తరలించుకుపోతున్నారు. ఈ సమాచారం తెలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ‘సాక్షి’ బృందానికి హైవేను తలపిస్తూ అటవీ ప్రాంతంలో నిర్మించిన రహదారి కనిపించింది. చట్ట ప్రకారం అటవీ భూముల్లో రోడ్డు వేయకూడదు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొద్దిపాటి రెవెన్యూ భూమిని అడ్డం పెట్టుకుని అటవీ భూమిని కలిపేసి పెద్ద రోడ్డు నిర్మించారు. నరికిన వెదురు బొంగులు, యూకలిప్టస్ కలపను ట్రాక్టర్లపై ఈ రహదారిపైకి చేరుస్తున్నారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. అడవిలోకి వెళ్లకుండా నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా స్థానిక నాయకుల సాయంతో రిజర్వు ఫారెస్ట్ సంపదను తరలించుకుపోతున్నారు. వెదురు, యూకలిప్టస్తోపాటు అటవీ భూముల్లోని మట్టి, కొండ రాళ్లను సైతం ఎత్తుకుపోతున్నారు. యంత్రాంగం ఎక్కడ అటవీ భూములతోపాటు అక్కడి సంపదనూ కాపాడాల్సిన అటవీ శాఖ గార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్, సూపర్వైజర్, డీఆర్వో తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారంపై స్థానికులు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు. ఒకవేళ వెదురు గడలు నరికేందుకు అనుమతులు ఇచ్చి ఉంటే.. ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎవరికి హక్కులు కల్పించారన్న వివరాలు ఇవ్వాలని కోరినా వారు స్పందించలేదు. అవినీతికి రోడ్డేశారు అటవీ భూముల్లో నిర్మించిన రహదారి కూచింపూడి, కొండరావిపాలెం, రామచంద్రాపురం లింక్‌రోడ్డు అని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అయితే, దానికి అనుసంధానంగా మరో రోడ్డు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అటవీ భూమి కావడం, స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కిలోమీటర్ అనంతరం రోడ్డు నిర్మాణం ఆగిపోయినట్టు సమాచారం. అడవిని కాపాడండి అడవిని, అటవీ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది. దీనిపై అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ స్పందించలేదు. కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – ఎల్.నాగబాబు, కన్వీనర్, లోక్ జనశక్తి పార్టీ జిల్లా శాఖ మా దృష్టికి రాలేదు కూచింపూడిలో అడవిని నరికివేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. అక్కడి భూముల్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు లీజుకు ఇచ్చి ఉండొచ్చు. పూర్తి వివరాలు తెలియదు. విచారణ జరిపిస్తాం. – ఎం.నాగేశ్వరరావు, డీఎఫ్‌వో -
నోటీసులివ్వకుండానే.. 150 ఇళ్లు కూల్చివేత
హైదరాబాద్ : చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న నిరుపేదలకు చెందిన 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని పేదలు వాపోయారు. ఇళ్లు కూల్చినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. -
కూల్చివేతలు కొనసాగిస్తాం
మణికొండ: హెచ్ఎండీఏ పరిధిలో అక్రమనిర్మాణాలు, లేఅవుట్ల కూల్చివేతలు కొనసాగిస్తామని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్కాలనీ, పంచవటి కాలనీల్లో రెండు భవనాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, నిబంధనలను పాటించని భవనాలను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తీసుకున్న అనుమతుల మేరకే భవనాలను నిర్మించుకోవాలని భవన నిర్మాణదారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటశివయ్య, బిల్కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అడ్డుకునేందుకు విఫలయత్నం... సెక్రటేరియట్ కాలనీలో జీప్లస్‌టు అంతస్తులకు అనుమతులు తీసుకుని మూడు అంతస్తుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్న భవన నిర్మాణదారులు కూల్చివేతలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. అధికారులు డబ్బులు ఆశించే కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీకి చెందిన ఓ వార్డుసభ్యునికి ఇప్పటికే రూ.3 లక్షలు ఇచ్చామని, ఇపుడు అతను ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని చుట్టముట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం అధికారులు పార్క్‌లేన్‌లో పురాతన భవనాన్ని కూల్చివేశారు. జేఎన్టీయూ బృందం పరిశీలన రాయదుర్గం: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవన నిర్మాణ స్థలాన్ని జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు పిల్లర్లను తవ్వి వాటికి ఉపయోగించిన సిమెంట్, ఇసుకల మిశ్రమాన్ని, భూమిని, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యతపై విచారణకు ప్రభుత్వం జేఎన్టీయూ ప్రొఫెసర్ రమణారావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సారి ఈ స్థలాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి ఆధారాలను సేకరించారు. -
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
న్యూఢిల్లీ: ‘పాల ప్యాకెట్ల దగ్గర్నుంచి ప్రయాణాల దాకా అత్యవసరమైన ఏ చోటా రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవట్లేదు. నవంబర్ 8 ప్రకటనలో.. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రధాని చెప్పారు. ఇవ్వాళేమో 50 రోజులు టైమ్ కావాలని అడుగుతున్నారు. చేతిలో చెల్లుబాటయ్యే డబ్బులు లేకుండా 50 రోజుల పాటు జనం ఏం తిని బతకాలి? అసలీ మాట చెప్పడానికి మోదీకి నోరెలా వచ్చింది?’ అని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దును సమర్థించుకుంటూ ప్రధాని మోదీ ఆదివారం గోవాలో చేసిన ప్రసంగం ప్రజలను కించపర్చేలా ఉందని, కుంభకోణాలు చేసినవాళ్లూ బ్యాంకుల ముందు క్యూలైన్లో నిలబడ్డారు అనడం దారుణమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సీఎం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? స్విస్ బ్యాంకు నుంచి తెస్తానన్న బ్లాక్ మనీ ఏమైంది? అని ప్రధానిని ప్రశ్నించారు. అవినీతిపరులు బ్యాంకుల ముందు నిల్చున్నారన్న ప్రధాని ఒక్కసారైనా లైన్ లో నిలబడితే బాధేంటో తెలుస్తుందని అన్నారు. గతంలో రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానన్న మోదీ ఇప్పుడాయనతో దోస్తానా చేస్తున్నారని, నల్లకుబేరులపై చర్యలకు కేంద్రం జంకుతోందని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కేజ్రీవాల్.. రూ.500, 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.2000 నోటుతో నల్లకుబేరులకు మేలు జరుగుతుందని, సామాన్య జనం సమస్యలు ఎప్పటిలాగే ఉంటాయని అన్నారు. 2011లో వెల్లడైన నల్లబాబుల జాబితోని 6000 మందిలో కనీసం కొందరిపైనైనా చర్యలు తీసుకోవాలని, తద్వారా మోదీ తన నిజాయితీని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. (బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు) -
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
-
నోట్ల రద్దుపై మోదీ ఎమోషనల్ స్పీచ్..
-
నోట్ల రద్దుపై మోదీ ఎమోషనల్ స్పీచ్..
పణజి: నల్లధనం, నకిలీ కరెన్సీలను రూపుమాపేక్రమంలో రూ.500, రూ1000 నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతటా కలకలం చెలరేగింది. డిసెంబర్ 31లోగా పాత కరెన్సీని డిపాజిట్ చేయాలని, విత్ డ్రాయల్స్ మాత్రం విడతలవారీగా తీసుకోవాలని సర్కారు పేర్కొంది. ఈ నిర్ణయం నల్లబాబుల మీద ఏ మేరకు ప్రభావం చూపిందోగానీ, కోట్లాది మంది సమాన్యులు మాత్రం నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. అయితే నోట్ల రద్దు విషయం ముందే లీకైందని, బీజేపీ, దాని మిత్రపక్షపార్టీల నాయకులతోపాటు కొందరు బడా బాబులు ఇప్పటికే నల్ల డబ్బును తగిన రూపాల్లోకి మార్చేసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తున్నా జనం వెతలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పణజి(గోవా)లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగం నోట్ల రద్దుపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడమేకాక, మరో 40 రోజుల పాటు నోట్ల ఇబ్బందులు తప్పవనే సంకేతాలిచ్చింది. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన మోదీ నేరుగా గోవా వెళ్లి మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం పూర్తి వీడియో మీకోసం... -
కూల్చివేతను వాయిదా వేసుకోండి: చాడ
సాక్షి,హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత, తరలింపు అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. దీనిపై పునరాలోచించుకోవాలని శుక్రవారం సీఎంకు రాసిన లేఖలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిచిపోయి, డబుల్ బెడ్రూం ఇళ్లు మొదలు కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం రూ.50 కోట్లతో ఇప్పటికే నిర్మించుకోవడం, కొత్త సచివాలయానికి రూ.380 కోట్లతో శంకుస్థాపనకు సిద్ధం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సీఎంకు విపక్షాలన్నా, విమర్శలన్నా గిట్టట్లేదన్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుదలపై దృష్టిపెడితే సమంజసంగా ఉంటుం దని సూచించారు. -
జూబ్లీహిల్స్ లో ఉద్రిక్తత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్-45 లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సర్కారు స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారంటూ పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం దాదాపు 50 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే నిరసన తెలుపుతున్నారు. దీంతో అధికారులు వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. -
పంజగుట్టలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3 ఖైరతాబాద్ మండల పరిధిలోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశాన వాటికలో అమ్మవారి గుడిని అడ్డుగా పెట్టుకొని నిర్మించిన పది గదులను నేలమట్టం చేశారు. కొంతకాలంగా అమ్మవారి గుడి పక్కన అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తుండగా పంజగుట్ట హిందూ శ్మశానవాటిక కమిటీతోపాటు స్థానికులు కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదు. ఇటీవల నాలాలు, చెరువుల ఆక్రమణలను కూల్చివేయాలని స్వయంగా మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఇదే అదనుగా జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శ్మశాన అక్రమ నిర్మాణాల తొలగింపుకు రంగంలోకి దిగారు. బంజారాహిల్స్ పోలీసులు వంద మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా అధికారులు బుల్డోజర్లు, జేసీబీల సహాయంతో గదులన్నింటిని నేలమట్టం చేశారు. అమ్మవారి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ఒకరిద్దరు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించారు. మూడు రోజుల నుంచి శ్మశానంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాయిదా పడుతూ వచ్చినా ఎట్టకేలకు కూల్చివేతల కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఫెన్సింగ్ వేసి రక్షిస్తారా, మళ్లీ గాలికొదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
రైల్వేల్యాండ్‌లో ఆక్రమణలు కూల్చివేత
హైదరాబాద్: రైల్వేల్యాండ్‌లో అక్రమంగా వేసిన గుడిసెలను రైల్వే అధికారులు తొలగిస్తున్న క్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ గూడు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ నిరసన చేపడుతున్నారు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్, ఎస్.పీ నగర్‌లోని రైల్వే ల్యాండ్‌లో గత కొంత కాలంగా కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు రైల్వే అధికారులు వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుండగా.. స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పడానికి యత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. -
అక్రమ కట్టడాలపై ‘ఆస్తి పన్ను’ పిడుగు
* జరిమానాల వసూళ్లకి కొత్త నిబంధనలపై సర్కార్ కసరత్తు * ఆస్తి పన్నులో 25 నుంచి 100 శాతం జరిమానాలు సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు ఆ భవనాలపై ఆస్తి పన్నుల రూపంలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేవిధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని అక్రమ కట్టడాలపై ఈ నిబంధనలను అమల్లోకి తెస్తూ త్వరలో రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా అక్రమ కట్టడాలపై ఆస్తిపన్నులో 25 నుంచి 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేయాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీలో కొన్ని భవనాలపై ఈ జరిమానాలను వసూలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి ఆస్తిపన్నులు, జరిమానాలు చెల్లిస్తున్నందున తమ భవనాల క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆదేశించాలని కొందరు భవనాల యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్‌లో ఉండిపోతుండడంతో ఈ భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్ను, జరిమానాలను వసూలు చేయలేకపోతున్నారు. ఈక్రమంలో జరిమానా చెల్లించినంత మాత్రాన అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదనే విధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. త్వరలో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 22న అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కూల్చివేతలు
హైదరాబాద్: ప్రమాదకరంగా మారిన పురాతన భవనాలు కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పురాతన భవనాన్ని పరిశీలించిన అధికారులు భవనం శిథిలావస్థకు చేరుకుందని నిర్ధరించుకున్నారు. భవనం పూర్తిగా దెబ్బతినడంతో.. వర్షాలు కురుస్తున్న సమయంలో ఎప్పుడైన అది కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. -
మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. స్థానిక నాయకులు, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ వారికి గాంధీ విగ్రహం తొలగించటంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులదే ప్రధాన పాత్ర అని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతలకు ఈ ప్రభుత్వం పట్టించిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముణ్ని అర్ధరాత్రి హత్యచేసి మురికినీటిలో పడేయటం దారుణమన్నారు. మూడురోజుల్లో విగ్రహాన్ని నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పటతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో గాంధీ విగ్రహం కూల్చివేత
-
ప్రాణాలు తీస్తున్న ‘పేక మేడలు’
-
ప్రాణాలు తీస్తున్న ‘పేక మేడలు’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మాణాలకు పాల్పడుతున్న నిర్మాణదారులు...అక్రమ నిర్మాణాల్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరు వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మరోవైపు శిథిల భవనాల విషయంలోనూ ఇదే అశ్రద్ధ వల్ల ఒక్కటొక్కటిగా కూలుతున్న భవనాలతోనూ ప్రాణాలు పోతున్నాయి. ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన అవినీతితో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అందిన కాడికి దండుకుంటున్నారే తప్ప..అనుమతులున్నా లేకున్నా పట్టించుకోవడం లేదు. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు తనిఖీలన్నవే మర్చిపోయారు. వాస్తవానికి నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ వివిధ దశల్లో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా.. లేదా అనేది తనిఖీలు చేయాలి. కానీ..అవేవీ చేయకుండా నిర్మాణం ప్రారంభం కాగానే తమ వాటా తమకు ముట్టిందా లేదా అన్నదానిపైనే శ్రద్ధ చూపుతున్న టౌన్‌ప్లానింగ్ విభాగం తీరుతో అక్రమ నిర్మాణాలు చేసేవారు ఎంత వీలైతే అంత మేర ఆక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు. అనుమతి తీసుకున్నా చేతులు తడపాల్సిందే అనే అభిప్రాయం బలపడటంతో అనుమతులున్నా, లేకున్నా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతులకు మించి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మొన్న పాతబస్తీ కబూతర్‌ఖానాలో, నిన్న ఫిల్‌్మనగర్ ఎఫ్ఎన్సీసీలో, తాజాగా కూకట్‌పల్లిలో కమాన్ నిర్మాణంలో జరిగిన ప్రమాదాలు ఇందుకు మచ్చుతునకలు. నిర్మాణాలు జరిపేవారు అనుమతులు తీసుకుంటున్నా..అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం లేదు. దాంతో స్ట్రక్చరల్ స్టెబిలిటీని పట్టించుకోకుండా నిర్మాణాలు జరుగుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎఫ్ఎన్సీసీలో నిర్మాణ లోపాలున్నట్లు జేఎన్టీయూ నివేదికలో పేర్కొనడం ఇందుకు తాజా ఉదాహరణ. కూకట్‌పల్లిలో ప్రస్తుతం కూలిన కమాన్ నిర్మాణానికి సైతం టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుతులు తీసుకోలేదు. అనుతుల్లేకున్నా నిర్మాణాలు చేపట్టవచ్చునని, అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటే చాలుననే భావనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిర్మాణాలు కూలి ప్రమాదాలు జరిగినప్పుడు ఆరా తీస్తే, అసలు అనుమతులే లేకపోవడం.. కొన్ని చోట్ల ఉన్న అనుమతులకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మాణాలు జరుపుతుండటం వెల్లడవుతున్నాయి. వీరి ఈ చర్యల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శిథిల భవనాలదీ అదే తీరు.. శిథిలభవనాలు ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉన్నాయని గత కొన్ని నెలలుగా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తీరా వర్షాలు ప్రారంభమయ్యాక జోరున వర్షాలు కురుస్తున్న తరుణంలో శిథిలభవనాలపై చర్యలంటూ కొరడా ఝళిపిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్‌లోనే రెండు భవనాలు కూలి ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. కారణాలు.. ? ప్రమాదాలన్నింటికీ కారణం నిపుణులైన సైట్ ఇంజినీర్లు లేకపోవడం, సెంట్రింగ్ పనుల్లో లోపాలే కారణమని తెలుస్తోంది. వీటికితోడు అనుమతుల్లేని నిర్మాణాలు ప్రమాదాలను పెంచుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో ప్రవేశద్వారం వద్ద ఈ బ్లాక్ పక్కన కూలిన ఆర్చికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. -
విగ్రహాలు తొలగించడం పద్ధతికాదు
తిరుపతి ఎంపీ వెలగపల్లి సూళ్లూరుపేట : మహానాయకులు విగ్రహాలు తొలగించడం మంచి పద్ధతి కాదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. పుష్కరాల పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తీసేయడం క్షమించరాని నేరమని చెప్పారు. సూళ్లూరుపేటలోని పరమేశ్వరీనగర్‌లో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ మెతకSవైఖరివల్లే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ విషయంలో మొండిచేయి చూపించారన్నారు. 2వ తేదీన జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 2న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతంగా చేయడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. షార్ సహకారంతో.. తీరప్రాంత గ్రామాలైన రాగెన్నపట్టెడ, పేర్నాడుల్లో రూ.40 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) కేంద్రం వారు. సుమఖంగా ఉన్నతారని ఎంపీ తెలిపారు. పట్టణంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ముందుకొచ్చారన్నారు. సూళ్లూరులో శ్మశానవాటికను అభివృద్ధి చేయడానికి ఎంపీ ల్యాడ్స్‌నుంచి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వేగేట్‌కు సబ్వే నిర్మాణంపై రైల్వేమంత్రి సురేష్‌ప్రభుతో మాట్టాడగా ఆయన ఒప్పుకున్నారని, అయితే నిధులు తమ వద్ద లేవని మీరే సమీకరించుకుని చేసుకోమని చెప్పారని వెల్లడించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు వంకా రామాంజనేయులు, పోకల దుష్యంతయ్య, గోపాలకష్ణయ్య, దామనెల్లూరు ఎంపీటీసీ సభ్యుడు దాసరి జయరామయ్య, సుల్తాన్‌బాషా, వంకా దినేష్ పాల్గొన్నారు. -
పురాతన భవనాల కూల్చివేత
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ ప్రాంతంలోని కూలిపోయే దశలో ప్రమాదకరంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజులుగా కూల్చివేస్తున్నారు. గురువారం సర్కిల్-18 పరిధిలోని చిలకలగూడలో జేసీబీలతో పురాతన కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. వారికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాయపడుతోంది. -
ఆ కూల్చివేతలు ఆపండి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కలెక్టర్ యువరాజ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
బెజవాడలో ఆలయం, దర్గా కూల్చివేత
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రార్థనాలయాలను కూల్చివేస్తోంది. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపక్కగా ఉన్నవాటిని అర్ధరాత్రి సమయంలో పడగొట్టేస్తోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి దుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొ న్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు. లాగే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధి మొదట్లో ఉండే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా ప్రాంగణాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దర్గా మరమ్మతులు పూర్తయి కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోకుండానే ఇలా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా కూల్చివేతల కొనసాగింపు.. గతంలో 30 దేవాలయాలను కూల్చివేసినందుకు నిరసనగా పీఠాధిపతులు, మఠాధిపతులు విజయవాడలో పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక నుంచి ఏ దేవాలయం, ప్రార్థనాలయం తొలగించాలన్నా ఆయా ప్రార్థనామందిరాల పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. తొలగించిన దేవాలయాలను నిర్మించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. అయితే వీటిన్నంటినీ పక్కన పెట్టి యథావిధిగా దేవాలయాలు, దర్గాల కూల్చివేతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆలయాల కూల్చివేతలు ఇక లేవంటూ ప్రకటిస్తూనే మరో వైపు ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దర్జాగా కబ్జా
♦ కార్పొరేషన్లో రూ.15 కోట్ల విలువైన స్థలం కబ్జాకు రంగం సిద్ధం ♦ అన్న క్యాంటీన్ పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమైన టీడీపీ నేత ♦ స్థలం అప్పగింతకు సిద్ధమైన నగరపాలక సంస్థ అధికారులు ♦ అధికార పార్టీ నేతలకే భవనం కూల్చివేత కాంట్రాక్టు ♦ కూల్చివేత పనుల్లోనూ నిబంధనలకు పాతర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలున్నా... ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి పేదలను రోడ్డుకీడ్చి మరీ నాడు నగర పాలక సంస్థ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నేడు మాత్రం కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి, స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ సమీపంలో రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కొట్టేసేందుకు స్థానిక టీడీపీ ముఖ్యనేత ఒత్తిడి తేగా ఆ స్థలం అప్పగింతకు మున్సిపల్ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు బండ్లమిట్ట ప్రాంతంలో ఇటీవల వందలాది పేదల ఇళ్లు కూల్చివేసి ఆ స్థలంతో పాటు ఊరచెరువును అధికార పార్టీ నేతలకు ఆదాయవనరుగా మార్చేందుకు సిద్ధమైన ఒంగోలు మున్సిపల్ అధికారులు తాజాగా నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే కార్పొరేషన్ స్థలాన్ని అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేశారు. 100 గదులకు పైగా ఉన్న ఈ స్థలాన్ని కొట్టేసేందుకు పచ్చ నేత మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాజు తలుచుకుంటే కొదువేముందన్న సామెతగా మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లు విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేశారు. ఆ కాంట్రాక్టును సైతం అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలోని శిథిలాలను సైతం కార్పొరేషన్ అధికారులే తొలగించి స్థలాన్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం కావడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పార్టీ నేత అధికారులకు సైతం ముడుపులు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అన్న క్యాంటీన్ పేరుతో ఈ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు అధికార పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగడం గమనార్హం. తన ముగ్గురు అనుచరులను ముందు పెట్టి ముఖ్యనేత కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు నేతల మధ్య పోటీ.. ఆ స్థలంపై అధికార పార్టీల్లోనే పోటీ నెలకొంది. నగరానికి చెందిన ముగ్గురు స్థలం నాకంటే నాకంటూ ముఖ్యనేతపై ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. ముగ్గురు ముఖ్యనేత సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఒకరు మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తి, మరొకరు నగర శాసనసభ్యుడికి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. పైకి అన్న క్యాంటీన్ అని చెబుతున్నా... స్థలాన్ని అప్పనంగా కొట్టేసి కాంప్లెక్స్‌ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య పోటీ నేపథ్యంలో తానే ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు పాతర.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సాక్షాత్తు మున్సిపల్ అధికారులే సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన భవనాన్ని కూలగొట్టే సమయంలోనే భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఏం చేయాలన్న దానికి అధికారులు ఒక నిర్ణయానికి రావాలి. దీనిపై ప్రతిపాదనలు పంపాలి. కాంప్లెక్స్ నిర్మించదలచుకుంటే దానికి సంబంధించిన డిజైన్లు రూపొందించాలి. నిధులు మంజూరు ఉత్తర్వులు తీసుకోవాలి. ఒక వేళ భవనాన్ని కూల్చాలన్నా అందుకు అనుమతులు తీసుకోవాలి. కానీ అద్దంకి బస్టాండ్‌లోని మున్సిపాలిటీ భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు ఈ నిబంధనలేమి పాటించలేదు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పెద్ద జేసీబీ, ఇటాచీ లాంటి మిషన్లు తెచ్చి పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు అద్దంకి బస్టాండ్‌లోని భవనం కూల్చివేత పనులను మాత్రం పచ్చ నేతకు అప్పగించడం గమనార్హం. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు చేతులు మారినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ స్థలాన్ని సైతం సదరు నేతకే అప్పగించేందుకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాన్ని అన్న క్యాంటీన్‌కు అధికార పార్టీ నేతలు కావాలని కోరిన మాట నిజమేనని మున్సిపల్ కమిషనర్ ‘సాక్షి’తో చెప్పారు. తొలుత క్యాంటీన్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో పై నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా... అలాంటివేమి అమలు చేసిన దాఖలాల్లేవు. మొత్తంగా స్థలాన్ని అప్పగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
పేదల బతుకులపై పిడుగు
♦ బండ్లమిట్టలో మరో విధ్వంసం ♦ పేదల ఇళ్లు కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు ♦ రోడ్డున పడిన 30 కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే నివాసం ♦ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం ♦ శనివారం సాయంత్రం ఉన్నపళంగా ఇళ్లు కూల్చివేత ♦ అధికార పార్టీ మద్దతుదారుల నివాసాల జోలికి వెళ్లని వైనం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పచ్చ పార్టీ నేతలు బరితెగించారు. ఒంగోలు కార్పొరేషన్ అధికారులను అడ్డుపెట్టి పేదల ఇళ్లను కూలగొడుతూ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి ఆర్థిక లబ్ధే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మంగళవారం నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ముస్లిం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టి కార్పొరేషన్ అధికారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఊరచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే బండ్లమిట్టలో ఇళ్లు, దుకాణాల కూల్చివేతకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధ్వంసం మరువక ముందే శనివారం మరోమారు బండ్లమిట్ట ఉత్తరప్రాంతంలోని 30కిపైగా పేదల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూలగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులు పోలీస్ బందోబస్తుల మధ్య జేసీబీని తీసుకెళ్లి ఇళ్లను ధ్వంసం చేశారు. బాధితులు లబోదిబోమంటూ అడ్డుపడ్డా అధికారులు ఖాతరు చేయలేదు. కేసులు పెట్టి స్టేషన్లో పెడతామంటూ వారిని బెదిరించారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చి రోడ్డున పడవేస్తారా... అంటూ నెత్తీనోరు బాదుకున్నా.. అధికారులు కనికరించలేదు. 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. గూడు కోల్పోయి కట్టుబట్టలతో బయటపడిన వారి ఆవేదన వర్ణనాతీతం. వారి మొర ఆలకించే వారు కరువయ్యారు. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన 30కిపైగా కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారుు. ప్లాస్టిక్, చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని అమ్మి పొట్టపోసుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కూలి డబ్బులను పోగేసుకొని ఊరచెరువుకు ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకున్నారు. ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు జేసీబీ తెచ్చి ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలైన తమకు ఎక్కడో చోట ప్రత్యామ్నాయం చూపించి ఉంటే వెళ్లిపోయేవారమని, అలా చేయకుండా దౌర్జన్యంగా ఇళ్లు కూల్చడం ఏమిటని వారు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందరినీ రోడ్డుపాలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు పెద్దలు, అధికార పార్టీ నేతల స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని వారి జోలికి వెళ్లడం లేదని బాధితులు ఆరోపించారు. కూలగొట్టిన ఇళ్ల సమీపంలోనే అధికార పార్టీకి చెందిన వారి రేకుల షెడ్లను మాత్రం కూలగొట్టకపోవడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు.