Kajal Aggarwal
-
నిర్మాత నైట్ పార్టీలో తమన్నా-కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
భర్తకు ప్రేమగా తినిపించిన కాజల్, అలాగే కలిసి తాగుతూ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్ చెల్లి.. తెలుగులో హిట్ సినిమాలు.. చివరకు పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
ప్రభాస్‌తో ఛాన్స్ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితం నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడి సంచలనం రేపారు. అయితే, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో వచ్చిన ఒక సినిమా ఛాన్స్ ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని రకుల్ పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకున్నారని తెలిపారు.రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే మొదట కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే ప్రభాస్ సరసన సినిమా ఛాన్స్ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో తను కొంత భాగం షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత తాను కాలేజీకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, రెండో షెడ్యూల్ పిలుపు కోసం ఎదురు చూసిన తనకు నిరాశే మిగిలిందన్నారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ నుంచి తనకు ఎలాంటి కబురు రాలేదని ఆమె అన్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని మరోకరి ద్వారా తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తనను తొలగించడంతో కాస్త బాధ అనిపించినట్లు తెలిపారు. వారిద్దరి కాంబినేషన్లో అప్పటికే వచ్చిన సినిమా హిట్ కావడంతో అదే జోడీని రిపీట్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లకు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. కాజల్ అగర్వాల్, ప్రభాస్ కాంబినేషన్లో రెండు సినిమాలు డార్లింగ్ (2010), Mr పర్ఫెక్ట్ (2011) వచ్చాయి. రకుల్ చెబుతున్న ప్రకారం 'Mr పర్ఫెక్ట్' చిత్రంలో తనకు వచ్చిన అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. -
పాటతో పండగ
ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్‌గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.మురికివాడలకు సంబంధించిన సెట్‌ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
సికందర్‌కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
బంగారంలా మెరిసిపోతున్న రాశీ.. ధోని ఫ్యామిలీతో నయనతార
అనంత్ పెళ్లికి అందంగా ముస్తాబైన కాజల్మహారాణిలా వెలిగిపోతున్న కృతి సనన్క్యూట్గా ఉన్నా కదూ అంటోన్న నయని పావనిక్రికెటర్ ధోని ఫ్యామిలీతో నయనతారబంగారంలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
వైట్ డ్రస్‌లో మెరిసిపోతూ.. స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
గ్లామర్‌తో పోటీ పడుతున్న బ్యూటీస్
నేను పెయింటర్‌ను కాదంటున్న శ్రీలీలఏంజిల్లా మెరిసిపోతున్న కాజల్బీచ్లో కసరత్తు చేస్తున్న హనీరోజ్బుట్టబొమ్మలా జాన్వీ కపూర్సరికొత్త లుక్‌లో షాకిస్తున్న డింపుల్ హయాతి View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్‌లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
-
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్‌లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్‌హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
సంతూర్ మమ్మీలా 'కాజల్ అగర్వాల్'.. ఫోటోలు వైరల్
-
ఫ్యాన్స్ చేసిన పనికి కాజల్ అగర్వాల్ ఎమోషనల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ 39వ పుట్టినరోజుని తాజాగా జరుపుకొంది. ఈ క్రమంలోనే అభిమానులు, తోటీ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెప్పారు. అందరూ శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు కానీ కాజల్ ఫ్యాన్స్ మాత్రం చాలాకాలం గుర్తుండిపోయే పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్.. 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో హీరోయిన్ అయింది. 'మగధీర' మూవీతో స్టార్ హోదా సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది. కరోనా లాక్డౌన్ టైంలో ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు పుట్టాడు.సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఈ మధ్య 'సత్యభామ' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే కాజల్ ఫ్యాన్స్.. ఈమె పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఫుడ్ పంచారు. అలానే ఈ నెలాఖరులోపు 50 మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీని గురించి తెలిసి కాజల్ భావోద్వేగానికి గురైంది. అద్భుతమైన పని చేశారని చెప్పి మెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)You guys never fail to amaze me with your thoughtfulness and kind compassion towards society. Thank you so much my amazing friends at @wekafawa for all the birthday love ❤️🙏🏻❤️ https://t.co/5F4xTZiZ10— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 20, 2024 -
భర్త, కొడుకుతో బర్త్‌డే బాష్ : దిల్ ఖుష్ అంటున్న ‘భామ’ ఫోటోలు
-
'సత్యభామ' కాజల్ అగర్వాల్ బర్త్‌డే.. ఈ ఫోటోలు చూశారా..?
-
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
-
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్ చేయలేదు: శశికిరణ్ తిక్క
‘‘ఇప్పటివరకూ ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా భావోద్వేగాలతో రూపొందిన ‘సత్యభామ’ ప్రత్యేకంగా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో కాజల్ అగర్వాల్గారి ఎనర్జీ మా యూనిట్‌కి ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. ‘సత్యభామ’లో ప్రేక్షకులు కొత్త కాజల్‌ను చూస్తారు’’ అన్నారు శశికిరణ్ తిక్క. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించిన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన పాయింట్ నచ్చడంతో నేను, దర్శకుడు సుమన్ ‘సత్యభామ’ కథ సిద్ధం చేశాం. దర్శకుడిగా నేను బిజీగా ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్‌పై మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో ‘సత్యభామ’తో తెలిశాయి.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. ‘సత్యభామ’ సినిమా ప్రీమియర్స్ వేశాం... చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గూఢచారి’ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ‘గూఢచారి 2’కి వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, అడివి శేష్ ముందే అనుకున్నాం. మహేశ్‌బాబుగారు ‘మేజర్’ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఆయనకు ‘సత్యభామ’ చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క
కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్ చేసిన యాక్షన్స్ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్‌ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను. -
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను. -
ట్రెండ్ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్ బిజీ అయ్యారు: కాజల్
‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్‌కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.⇢ నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.⇢ శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.⇢ గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.⇢ సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.⇢ యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.⇢ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.⇢ నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.⇢ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.⇢ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి. -
మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్
కాజల్ అగర్వాల్..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కాజల్ కొత్త సినిమా రిలీజ్.. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్స్!
కొత్త సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కాజల్ అగర్వాల్.. 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ శుక్రవారం అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేశారు. తాజాగా మహిళల కోసం బంపరాఫర్ ప్రకటించారు. ఉచితంగా టికెట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?)కాజల్ అగర్వాల్ 'సత్యభామ' మూవీ.. జూన్ 7న థియేటర్లలోకి రానుంది. కానీ అంతకంటే ముందే హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న అంటే బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షో టికెట్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని 'గూఢచారి', 'క్షణం' సినిమాల ఫేమ్ శశి కిరణ్ తిక్క నిర్మించారు. సుమన్ చిక్కల దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?) -
తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే
దక్షిణాదిలో హీరోయిన్లగా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత ఛాన్సులు రాకపోతే నిందలు వేయడం పరిపాటే. గతంలో ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే ఇలానే చేయగా, ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేరింది. 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. 'మగధీర' ఈమె ఫేట్ మార్చింది. స్టార్ హీరోయిన్ని చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)2020లో ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్‌కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే. జూన్ 7న 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.'బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. దీనికి నయనతార అతీతం. ఆమె మంచి సినిమాలు చేస్తోంది. కాగా దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు) -
‘సత్యభామ’ గుర్తుండిపోతుంది
‘సత్యభామ’ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అని అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.⇢ ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.⇢ "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.⇢ కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం.