Shiv Sena
-
సైలెంట్‌గా మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్.. విమానం గాల్లో ఉండగా ట్విస్టులు
ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది. ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు. ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.పుణే ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. -
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్‌షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.మరోవైపు నేడు విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.ఈ ఉదయం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. -
కీలక సమావేశానికి షిండే డుమ్మా.. మహాయుతిపై ఆదిత్య ఠాక్రే సెటైర్లు
ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. To not be able to decide on a chief minister, and form government, for more than a week after result day, is not just an insult to Maharashtra (for taking our state so lightly) but also to the assistance provided by their dearest Election Commission. It seems that rules only…— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2024 ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్‌కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్నాథ్ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యు.బి.టి.) రాయని డైరీ
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి. ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను. ‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్‌లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్‌జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ. ‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను. ‘‘అదే అంటున్నాను ఉద్ధవ్జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ. ‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను. ‘‘కాదు’’ అన్నారు. ‘‘మరి?’’ అన్నాను. ‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు. ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా!అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి. లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్‌జీ. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
షిండేకు భారీ షాక్? శివసేన నేత కీలక వ్యాఖ్యలు
-
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
కాంగ్రెస్ అతి విశ్వాసమే కొంపముంచింది: మిత్రపక్షం శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి.. కూటమి విజయావకాశాలను దెబ్బతిశాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు శివసేన(యూబీటీ) సీనియర్ నేత, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మహా వికాస్ అఘాడి ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు."లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని బాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్‌ను ప్రకటించాల్సి ఉండేది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. అలా చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.’ దాన్వే పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించిన 48 స్థానాల్లో మహా వికాస్ అఘాడి అత్యధికంగా 30 చోట్ల గెలుపొందింది. మిత్ర పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువగా 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య చర్చల సమయంలో గట్టిగా బేరసారాలు చేసింది. ఇది కూటమిలో ఘర్షణకు దారితీసింది. చివరకు 103 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 మాత్రమే గెలుపొందింది. 89 స్థానాల్లో పోటీ చేసిన సేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించింది. మూడో మిత్రపక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో విజయం సాధించింది.మరోవైపు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. -
మంత్రి పదవులపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘన విజయంతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచి్చనట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కీలక పోర్ట్‌ఫోలియోలపై మూడు పార్టీలూ కన్నేయడంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్‌షాను కలిశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోనిæషా నివాసంలో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలతోనే పోస్ట్‌లు సామాజిక సమీకరణాలను బట్టే మంత్రి పదవులను కట్టబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీలోని ఓబీసీ లేదా మరాఠా నేతకే సీఎం పదవి కట్టబెట్టాలని చూస్తోందని తొలుత వార్తలొచ్చాయి. అన్ని పార్టీల్లో మరాఠా వర్గానికి చెందిన వాళ్లే అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆర్ఎస్ఎస్ లాబీయింగ్ బలం పనిచేస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్‌కే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అజిత్, షిండే డిప్యూటీ సీఎంలుగా ఉంటారని వార్తలొచ్చాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎవరేం కోరుతున్నారు? పోర్ట్‌ఫోలియోలపై ఎవరికివారు కరీ్చఫ్ వేసేస్తున్నారు. తమ పార్టీకి ఈ శాఖలే కావాలని పట్టుబడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు తమకు కేటాయించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం డిమాండ్చేస్తోంది. అయితే మెజారిటీ సీట్లు గెలిచిన తమ వద్దే కీలకమైన శాఖలను అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ( అజిత్ పవార్) 41 చోట్ల గెలిచాయి. ఒక్కో పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎంగా చేసిన షిండే ఇకపై డిప్యూటీ సీఎం పదవి చేబడితే పట్టణాభివృద్ధి శాఖతోపాటు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖనూ తన వద్ద అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు. రెవిన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, సామాజిక న్యాయ శాఖలను తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అజిత్ డిమాండ్లు ఏంటి ? డిప్యూటీ సీఎం పోస్ట్‌తోపాటు ఆర్థికశాఖ తనకే ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరుతున్నట్లు వినికిడి. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు ప్రణాళిక శాఖను తన వద్దే ఉంచేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాటేంటి? కూటమిలో అత్యధిక సీట్లు గెలిచినందున కీలకమైన ఏ శాఖనూ కూటమి పార్టీలకు ఇచ్చేది లేదని బీజేపీ పట్టుదలగా ఉందని తెలుస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థికం, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని బీజేపీ ఆశిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలన్న సూత్రాన్ని అమలుచేస్తే బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 లేదా 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయి. -
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
విజయాన్ని మించిన పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్‌సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్‌కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది. అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది. కాంగ్రెస్‌ది మహావైఫల్యంఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్‌సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు. హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్‌సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు. సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!పాత చింతకాయ పచ్చడిచంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి. వాస్తవిక బలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.దిద్దుబాటు చర్యలతో...లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
Maharashtra: ప్రతిపక్ష నేత ఎవరు..?
ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మహాయుతి కూటమి 235 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి. ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా!ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజార్టీతో మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షంలోని ఏ పార్టీ కూడా పది శాతం స్థానాలు రాబట్టుకోలేక పోయాయి. దీంతో ప్రతిపక్ష పదవిలో ఎవరు ఉండక పోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) లేకపోవడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్ర శాసన మండలి నియమాల ప్రకారం మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు దక్కించుకున్న పార్టీకే ప్రతిపక్ష పదవి లభిస్తుంది. కానీ శనివారం వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) మిత్రపక్షాల్లోని ఏ ఒక్క పార్టీకి పది శాతం స్థానాలు రాలేకపోయాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 49 చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద 16, యూబీటీ–శివసేన వద్ద 20, ఎన్సీపీ (ఎస్పీ) వద్ద 10 స్థానాలున్నాయి. దీంతో ఏ పార్టీ వద్ద తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పీఠంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠంపై వీడని ఉత్కంఠమరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తం ఆ పోస్టు కోసం పోటీలో ఉన్నారు.బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. -
ఏదో మోసం జరిగింది: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. -
మాజీ సీఎంకు షాకిచ్చిన ‘ఆటోవాలా’
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, 39 చోట్ల ఎన్సీపీ హవా కొనసాగుతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉద్దవ్ వర్గం శివసేన 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకోగా.. అటు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే 23 చోట్ల తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే.. నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేననే అసలు పార్టీలుగా ప్రజలు తేల్చినట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని మహా ఓటర్లు తేల్చి చెప్పారు.ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకాఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్‌నాథ్‌షిండే.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేశారు,.. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, బీర్లు తయారు చేసే సంస్థలోపనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశిస్సులతో 1997లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసి నెగ్గడంతో శిండే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్నాథ్.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. శిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియశిష్యుడు కూడా.మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. .ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది.ఇక శనివారం వెలువడుతున్న మహారాష్ట్రలో ఫలితాల్లో ఎన్డీయే కూటమి కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 288 స్థానాలకు గానూ 221 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, ఎన్సీపీ 39 చోట్ల ఆధిక్యాన్ని హవా కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీయే శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు నేటి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ కానున్నారు. ఇక నవంబర్ 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. -
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "They have done some 'gadbad', they have stolen some of our seats...This cannot be the public's decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW— ANI (@ANI) November 23, 2024 బిలియనీర్ గౌతమ్ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3— ANI (@ANI) November 23, 2024 -
‘మహా’ పోరు: ఇంతకీ రెండు కూటముల ‘సీఎం’ ఎవరంటే..
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి...మరోవైపు ఎన్నికల్లో విజయంపై అటు ప్రతిపక్ష కూటమి మహ వికాస్ అఘాడీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా.. ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమే అధికారం చేపడుతుందని భావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన నేపథ్యంలో మహారాష్ట్రలోనూ సర్వేల ఫలితాలు తారుమారు అవుతాయని గట్టిగా నమ్ముతోంది. ఇక మరో 24 గంటల్లో మహారాష్ట్ర భవితవ్యం తేలనుంది. నవంబర్ 23న అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.అయితే ఫలితాల ముందే అటు మహాయూతి, ఇటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు నుంచి ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తమ పార్టీ నాయకత్వంలోనే మహారాష్టట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఓటింగ్ ట్రెండ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలను మిత్రపక్షమైన శివసేన(ఉద్దవ్) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా చర్చించ నిర్ణయం తీసుకుంటామని స్పఫ్టం చేశారు. పటోలే ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.అటు మహాయుతి కూటమిలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లు పేర్కొననారు. పోలింగ్ నాడు ఓటర్లు షిండేకు తమ ప్రాధాన్యతను చూపించారని ఆయనే మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. షిండేనే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే.. అది దేవేంద్ర ఫడ్నవీసే అని తెలిపారు.ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారీ తన పార్టీ చీ ఫ్ఉ, ప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు. ఫలితాలు ఏమైనప్పటికీ, ఎన్‌సిపి కింగ్‌మేకర్ అవుతుందని అన్నారు. మహాయుతి కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటాయని మిస్టర్ ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందది, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనేదానిపై రేపటి(శనివారం) ఫలితాల తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
యుద్ధంలా ‘మహా’ రాజకీయం
నేడు జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇవి పాత కొత్త పార్టీలకు అస్తిత్వ పోరాటంగా మారాయి. ఎందుకంటే, శివసేన, ఎన్సీపీ రెండింటిలోనూ అతి పెద్ద చీలికలు జరిగాయి. పైగా ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నాలను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికితోడు, డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశవాదం ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తున్నాయి. 2024లో దేశంలో జరిగిన పంటనష్టంలో 60 శాతం మహారాష్ట్రలోనే సంభవించింది. అయినా స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై పార్టీలు ఆధారపడటం పెరిగింది. ఇది సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతోంది.అనేక రాజకీయ ఒడుదొడుకులు, నిట్టనిలువు చీలికలు, ప్రముఖ నాయకుల అడ్డగోలు దారులు, అధికారం కోసం నిరంతర పోరు వంటి వాటిని చూసిన తర్వాత, మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ప్రముఖ పార్టీలు నేడు (నవంబర్ 20) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేక విధాలుగా విశేషమైనవి. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల, రాజకీయ చర్చను రూపొందించే అవ కాశం ఉన్న కొన్ని కీలకమైన తప్పులను బహిర్గతం చేశాయి. ఈ కథనం అటువంటి ఐదు తప్పులను, అవి విసిరే సంక్లిష్ట సవాళ్లను అందిస్తుంది.1. ఉచితాలపై ఆధారపడటం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలన్నీ ‘మాఝీ లడ్కీ బహిన్ యోజన’, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్ లకు ఉచిత తీర్థయాత్రలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉచితాలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి ప్రకట నలపై ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ పథకాలు చాలావరకు రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై ఆధారపడటం అనేది విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో సంక్షేమ ఎజెండాకు సమర్థంగా ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే, గతంలో మహిళల భద్రత, శ్రేయస్సుపై ఆదుర్దా, ఆందోళనలు కనబడేవి.గత రెండు దశాబ్దాలుగా, కీలక అభివృద్ధి సూచికలలో మహారాష్ట్ర కిందికి జారిపోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, మహారాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి వృద్ధి గత 14 సంవత్సరాలలో రెండు శాతం పాయింట్లు పడిపోయింది. ‘వార్షిక విద్యా నివేదిక– 2022’ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంకగణితం, పఠన నైపు ణ్యాలలో మునుపటి కంటే చాలా పేలవంగా ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వెలు వడిన ‘భారతదేశ నిరుద్యోగ నివేదిక–2023’ మహా రాష్ట్రలో విద్యావంతులైన నిరుద్యోగిత నిష్పత్తి 2022లో 15 శాతంగా ఉందని పేర్కొంది. దశాబ్దం క్రితం కంటే ఇది 11 శాతం పెరుగుదల. ఈ ప్రాథ మిక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, పార్టీలు ఎన్నికల లాభాల కోసం ఉచితాల మీద దృష్టి పెడుతున్నాయి.2. కరిగిపోయే పొత్తులు, మారుతున్న విధేయతలు: 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ కూటమి (భారతీయ జనతా పార్టీ, శివసేన) విచ్ఛిన్నం కావడం ‘మహా వికాస్ ఆఘాడీ’ ఏర్పాటుకు దారితీసింది. ఇది చాలా భిన్నమైన సిద్ధాంతాలు గల పార్టీల (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్–ఎన్సీపీ, శివసేన) మధ్య అసహజ కూటమి. వారి ప్రభుత్వం స్వల్పకాలికంగా పనిచేసింది. పైగా మనం శివసేన, ఎన్సీపీ రెండు పార్టీలలో అతిపెద్ద చీలికలను చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలిపేందుకు రెండు పెద్ద భాగస్వామ్యాలు సిద్ధమైనాయి. భారత రాజకీయాల్లో ఇలాంటి ఫిరాయింపులు అసాధారణం ఏమీకాదు. కానీ ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నా లను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించింది. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే దీర్ఘకాలిక పొత్తులు, సైద్ధాంతిక ప్రాధాన్యతలు, కేడర్ విధేయతలు వంటి సాంప్రదాయ సమీకరణాలను పూర్తిగా బలహీనపరిచింది. ఇది మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బ తీసింది. డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశ వాదం గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తు న్నాయి.3. వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ– ప్రేరిత సవాళ్లను పట్టించుకోకపోవడం: 2024లో దేశంలో జరిగిన పంట నష్టంలో 60 శాతం మహా రాష్ట్రలోనే సంభవించిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ ప్రేరిత సవాళ్లను పరిష్క రించడానికి సమష్టి కృషి జరగలేదు. రుణమాఫీ వంటి తక్షణ చర్యలకు మించి దీన్ని పరిష్కరించ డానికి రాజకీయ పార్టీలకు కచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మూలాలు ప్రధానంగా వ్యవసాయా ధారిత మరాఠా సమాజం ఎదుర్కొంటున్న సామా జిక–ఆర్థిక సవాళ్లలో ఉన్నాయి. భారీగా ఉన్నసంఖ్యను బట్టి, ఎన్నికల వేడిలో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మూల కార ణాన్ని పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.4. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం: మహా రాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు గత రెండు నుంచి ఐదేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 29 మున్సిపల్ కార్పొరేషన్లు (రెండు కొత్తవి), 200 కంటే ఎక్కువ మున్సిపల్ కౌన్సిళ్లు, 27 జిల్లా సమి తులు ఉన్నాయి. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం వల్ల స్థానిక పరి పాలనా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక నియంత్రణను సాధించేలా చేసింది. ఇది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం క్షీణించడం గురించిన ఆందోళనలకు దారితీసింది. స్థానిక సంస్థల పరిధిలోని కొన్ని విధాన నిర్ణయాలు రాజకీయ పరిశీలనల ద్వారా ఎక్కువగా ప్రభావితమవు తాయి. ‘గట్టర్, మీటర్, నీరు’ (మురుగునీటి పారు దల, విద్యుత్, నీరు)కు సంబంధించిన సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎందుకంటే వాటిని పరిష్కరించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.5. అభివృద్ధి విధానం: ఇటీవలి సంవత్స రాలలో, మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ రైలు వంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహారాష్ట్ర గణనీయమైన ప్రాధాన్య మిస్తోంది. ఈ విధానం పెద్ద స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తుంది. స్థానిక రైల్వేలు, ప్రభుత్వ ఆధీ నంలో నడిచే రోడ్డు రవాణా, అందుబాటులో ఉండే పబ్లిక్ రోడ్లు వంటి విస్తృత జనాభాకు మరింత నేరుగా ప్రయోజనం చేకూర్చే అవసరమైన సేవ లను బలోపేతం చేయాల్సిన ఖర్చుతో ప్రైవేట్, ఉన్నత వర్గాల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతోంది.2024 మహారాష్ట్ర ఎన్నికలు పాత, కొత్త పార్టీలు, నాయకులు, పొత్తులకు అస్తిత్వయుద్ధంగా పరిణమించాయి. కానీ అంతకుమించి, ఇది ఓటర్లకు నిజమైన పరీక్ష అవుతుంది. ఎందుకంటే వారి ఎంపికలే రాబోయే దశాబ్దాల రాష్ట్ర రాజకీ యాల గమనాన్ని నిర్ణయిస్తాయి.– సంజయ్ పాటిల్ ‘ రాజకీయ పరిశోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన ఎంపీ
శివసేన (ఏక్నాథ్ షిండే) నేత షాయినా ఎన్సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన ఎంపీపై కేసు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో టికెట్ దక్కని మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ ఎంపీ సంచలన కామెంట్స్ చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు అని కామెంట్స్ చేయడం వివాదం తెచ్చిపెట్టింది.మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి షాయినా ఎన్సీ టికెట్ ఆశించారు. అయితే, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా బీజేపీని వీడి షిండే వర్గం శివసేనలో చేరారు. ఆమె చేరికపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ అరవింద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ.. షాయినా ఎన్సీ ఇంతకాలం బీజేపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్ రాలేదని ఇప్పుడు మా పార్టీలో చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు(దిగుమతి చేసుకున్న మెటీరియల్). మా వస్తువులు ఒరిజినల్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, మహిళా నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఇక, ఎంపీ సావంత్ వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అరవింద్ సావంత్ వ్యాఖ్యలు బాధాకరం. ఆయన గతంలో నన్ను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారు. నేను మెటీరియల్‌ను కాదు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. సావంత్ వ్యాఖ్యలను బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది. Surprising to see @ShainaNC quitting BJP and filing her nomination from Mumbadevi as a Shiva Sena(Shinde) Candidate for #MaharashtraElection2024 Hope all is well between the current alliance partners of BJP in Maharashtra. pic.twitter.com/JeToDqqOFs— Rajesh Shenoy (@rshenoy87) October 29, 2024 -
అన్ని నామినేషన్లు పూర్తి.. ఇక యుద్ధానికి సిద్ధం: కాంగ్రెస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియడంతో ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో బరిలో నిలిచన అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపుకు సర్వశక్తుల కృషిచేస్తున్నాయి.అయితే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ..15 స్థానాల్లో అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ సందిగ్దత తొలగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు నామినేషన్లు పూర్తి చేసినట్లు మహా వికాస్ అఘాడీ కూటమి వెల్లడించింది. ఇక ఎన్నికల యుద్ధానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకుడు వర్షా గైక్వాడ్, నసీమ్ ఖాన్‌లతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి రమేష్ చెన్నితాల బుధవారం మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడిలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవం ఉందని తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశామని చెప్పారు. మహాయుతి కూటమితో పోల్చితే తమ గ్రూపులో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. . తమ సభ్యుల మధ్య కొంత అపార్థాలు ఉన్నప్పటికీ మిత్రపక్షాల మధ్య ఎలాంటి చీలికలు లేవన్నారు. ఎంవీయేలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవాన్ని అందించామని తెలిపారు‘మహాయుతి సమయం ముగిసింది. , ఆ కూటమిలో బీజేపీ తమ మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(షిండే) స్థానాలను దోచుకుంది. బీజేపీ తమ కూటమి భాగస్వాములను అణగదొక్కాలని చూస్తోంది. కానే మేము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను ఇచ్చాం. ఎన్నికల్లో పోటీకి మేము సిద్దం. స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. ’ అని చెన్నితాల కోరారు. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...
థాణేలోని కోప్రి –పాచ్‌పాఖడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేకు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) కేదార్ దిఘేను బరిలోకి దింపింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఏక్నాథ్ శిందేకు, కేదార్ దిఘేల మధ్య రసవత్తర పోటీ జరగనుంది. వాస్తవానికి కేదార్ దిఘే శిందే గురువు దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే సోదరుని కుమారుడు. దీంతో ఇక్కడ వీరిద్దరి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికపై థాణేతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే అనేకమంది అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటించగా మిగిలిన అభ్యర్థులను కూడా ఒక్కోరిని ప్రకటిస్తూ వస్తున్నారు. నామినేషన్లు దాఖలు గడువు ఈనెల 29తో ముగియనుండగా నవంబర్ 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నికల అసలు చిత్రం నవంబర్ 4న స్పష్టం కానుంది.శివసేన కంచుకోటగా థాణేముఖ్యంగా థాణేలో గత 30 ఏళ్లుగా శివసేనకు కంచుకోటగా మారింది. అయితే రెండున్నరేళ్ల కిందట ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అయితే థాణేలో మంచి పట్టున్న ఏక్నాథ్ శిందేకు అక్కడి కార్పొరేటర్లలో అత్యధికమంది మద్దతు పలికారు. అయితే ఉద్దవ్ ఠాక్రేకు మాత్రం వేళ్లమీదలెక్కించేంతమంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతు పలికారు. దీంతో వీరిద్దరిలో ఎవరి ప్రభావం ఉండనుంది..? ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.ఏక్నాథ్ శిందేకు థాణేపై పట్టు!ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేకు కోప్రీ – పాచ్‌పాఖడీ అసెంబ్లీయే కాకుండా థాణేలో మంచి పట్టు ఉంది. దీంతో 2004లో ఏక్నాథ్ శిందే మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కోప్రీ – పాచ్‌పాఖడీ అసెంబ్లీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ శిందేపై 32,677 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరిగింది. ముఖ్యంగా 1,00,316 ఓట్లు పోలయ్యాయి. అదే ప్రత్యర్థి సందీప్ లేలేకు 48,447 ఓట్లు పోలయ్యాయి. ఇలా ఏక్నాథ్ శిందే 51,869 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.చదవండి: తెలుగువారిపై మహరాష్ట్ర రాజకీయ పార్టీల చిన్నచూపు ఎందుకు? ఇక గత ఎన్నికల్లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ ఘాడిగావ్కర్పై 90 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇలా ప్రతీసారి ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తోంది. అయితే శివసేనలో తిరుగుబాటు చేసిన అనంతరం శివసేన పార్టీతోపాటు పార్టీ చిహ్నం ఏక్నాథ్ శిందేకే దక్కింది. దీంతో ఈసారి మొట్టమొదటిసారిగా శివసేన (శిందే) వర్సెస్ శివసేన (యూబీటీ)ల మధ్య పోటీ జరుగుతోంది.దిఘే ప్రభావం చూపేనా...?రెండున్నరేళ్ల కిందట శివసేనలో తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపారు. అయితే థాణే ఓటర్లు పెద్ద సంఖ్యలో దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు మద్దతు పలికేవారు. దీంతో ఈ ఓటర్లు బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)వైపు మొగ్గు చూపుతారా? శిందేకు పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో మాత్రం శివసేన (శిందే) అభ్యర్థి నరేష్ మస్కేకు 1.11 లక్షల ఓట్లు, శివసేన (యూబీటీ) అభ్యర్థి రాజన్విచారేకు 66,260 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏక్నాథ్ శిందే ప్రభావమే అధికంగా ఉందని ఈ ఫలితాల ద్వారా కన్పిస్తోంది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘేను ఏక్నాథ్ శిందే గురువుగా కొలుస్తారు. దీంతో ఆనంద్ దిఘే సోదరుని కుమారుడైన కేదార్ దిఘేకు థాణే ఓటర్లు అనుకూలంగా మారే అవకాశమూ ఇక్కడ లేకపోలేదు. -
సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్‌ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.ఆ సీట్లనే కోరుతున్న శివసేనవిదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు. ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక కోసిన వారికి రూ, 11 లక్షలు బహుమతిగా ఇస్తానని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించారు. అయితే రిజర్వేషన్లపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు.“ఇటీవల అమెరికా పర్యటనలో భారత్‌లో రిజర్వేషన్లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటించడం.. ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఓవైపు మహారాష్ట్రలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ అక్కడ దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటన చేశారు. దేశం నుంచి రిజర్వేషన్లను దూరం చేస్తామంటూ రాహుల్ మాటాలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది. రాహుల్ నాలుకను ఎవరు నరికినా, వారికి 11 లక్షల రూపాయల బహుమతి ఇస్తాను’ అని గౌక్వాడ్ ప్రకటించారు.అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, శివసేన భాగస్వామ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గైక్వాడ్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కానీ, అటుశివసనే కానీ స్పందించలేదు. కాగా గైక్వాడ్ విధర్బలోని బుల్దానా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేకు వివాదాలు కొత్తేమీ కాదు. గత నెలలో ఓ పోలీసు అధికారి గౌక్వాడ్ కారును శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో వివాదంగా మారింది. అయితే దీనిని ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. కారులో అనుకోకుండా కారులో వాంతులు చేసుకోవడంతో ఆ పోలీసు స్వచ్ఛందంగా దాన్ని శుభ్రం చేశాడని చెప్పుకొచ్చారు. అంతేగాక 1987లో ఓ పులిని వేటాడి దాని దంతాన్ని నెక్లెస్‌గా ధరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర అటవీశాఖ ఫోరెన్సిక్ ఆ దంతాన్ని పరీక్షించి.. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసింది. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్‌సభ ఎన్నికల జోష్‌నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్.. సీట్ల పంపకాలపై చర్చలు షురూ
ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ ఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్‌గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది. -
మహారాష్ట్రలో రసవత్తర రాజకీయం.. ఆ ఒక్క ఎమ్మెల్సీ ఎవరు?
ముంబై: మహారాష్ట్రలో పలు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారు. దీంతో, ‘మహా’ రాజకీయం రీసార్ట్‌లకు చేరింది.కాగా, మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 11 స్థానాలకు గాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే.. మిలింద్ నార్వేకర్‌తో నామినేషన్ వేయించారు. దీంతో మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. క్రాస్ ఓటింగ్ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్నాథ్ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. మరోవైపు.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్షా తండ్రి, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నేత రాజేష్ షాపై పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యారు.ఆయన కుమారుడు మిహిర్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో బైక్‌ను ఢీకొట్టడంతో కావేరీ నఖ్వా అనే మహిళ చనిపోగా ఆమె భర్త గాయపడటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మిహిర్‌ను ముంబైలోని విరార్ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లి, ఇద్దరు చెల్లెళ్లను మరో 10 మందితో కలిసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే పోలీసుల విచారణలో.. ప్రమాద సమయంలో తాను బీఎండబ్లయూ కారు నడుపుతున్నట్లు మిహిర్ అంగీకరించాడు. కానీ తాను తాగినట్లు వచ్చిన ఆరోపణలనుఅతడు కొట్టేసినట్లు తెలుస్తోంది.పోలీసుల విచారణలో ప్రమాదం ముందు మిహిర్ తన స్నేహితులతో కలిసి వైస్ గ్లోబల్ తపాస్ బార్లో మద్యం తాగి బిల్ ఏకంగా 18 వేలు చేసినట్లు తేలింది.మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు.కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. ఇక మిహిర్‌కు మద్యం సరఫరా చేసన బార్ యజమానిని అరెస్ట్ చేయడంతోపాటు బార్‌ను మూసేశారు. మిహిర్ తండ్రిని, స్నేహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
ముంబై: ముంబైలోని వర్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. 72 గంటల తర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్మెంట్లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే గత మూడు రోజులుగా కొడుకును దాచి పెట్టడంతో తండ్రి, శివసేన(ఏక్నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అతడి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను పోలీసులు సీజ్ చేశారు. కాగా ఈ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్ షా కారు తన బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన్నట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.కారు బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడగా.. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.కారునిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్‌ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు.. అతడికి బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మిషిర్ షా తండ్రి, శివసేన నేత రాజేష్ షాకు బెయిల్ లభించింది. సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది.ఇక, ఈరోజు ఉదయం హిట్ రన్ కేసులో భాగంగా పోలీసులు రాజేష్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాజేష్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక, తాజాగా కోర్టు రాజేష్ షాకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన మిషిర్ షాకు లుక్ అవుట్ నోటీస్‌ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.VIP hit & run coward Mihir Shah's father Rajesh Shah (Shinde Faction Sena leader) gets bail a day after he was arrested. Son still absconding.#EknathShinde pic.twitter.com/iuzOMUlwqb— Kedar (@shintre_kedar) July 8, 2024మరోవైపు.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అంతా సమానమేనని షిండే తెలిపారు. ఈ ఘటనలో ఉన్నది ఎంత పెద్ద ధనవంతుడైనా, రాజకీయ నాయకుడైన ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, షిండే ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాజేష్ షాకు బెయిల్ రావడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ముంబై హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం షిండే సంచలన కామెంట్స్.. -
Shiv Sena Leader: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో ట్విస్టు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత(ఏక్నాథ్ షిండే) రాజేష్ షా కుమారుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు. లింది. ప్రమాద సమయంలో 24 ఈ యువకుడే ఈ కారును నడుపుతున్నట్లు తేలింది.దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మిహిర్ షా నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది . ఘటన జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అతని డ్రైవర్ రాజ్ రిషి బిజావత్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. మిహిర్ షా తన నలుగురు స్నేహితులతో కలిసి మెర్సిడెస్ కారులో పబ్ నుంచి బయలు దేరినట్లు ఈ వీడియోలో కినిపిస్తుంది. అయితే తరువాత అతడు కారు మారాడు. మిహిర్ బీఎండబ్ల్యూ కారు నడపడగా.. అతడి డ్రైవర్ ప్యాసింజర్ సీటులో కూర్చొని ఉన్నాడు.అయితే మిహిర్ తప్పించేందుకు అతడి గర్ల్‌ఫ్రెండ్ సాయం చేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆమెను కూడా వారు విచారిస్తున్నారు. మిహిర్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.మిహిర్ సంఘటనా స్థలం నుంచి కాలా నగర్ మీదుగా వెళ్లి బాంద్రా ఈస్ట్ వద్ద కారును విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తరువాత ఓ ఓటోలో అక్కడ ఇనుంచి పరారైనట్లు పేర్కొన్నారు. మిహిర్ కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నట్లు తెలిపారు. కారు ఎక్కడ మారిందనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు.అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.నిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్‌ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే. ఉద్ధవ్ శనివారం ఎన్సీపీ (ఎస్పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. -
మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివసేన అసంతృప్తి
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.అయితే మోదీ కేబినెట్ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్ పాశ్వాన్, ఒక ఎంపీ కలిగిన జితన్ రాం మాంఝీ, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించారని.. తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్‌కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది. ఒక రౌండ్లో అయితే అమోల్ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు. -
మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా తగ్గింది. అయోధ్య రామనాయం పనిచేయనట్లు కనిపిస్తుంది. 2019 ఫలితాలో పోలిస్తే తాజాగా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్రలో గతం కంటే సగం సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ.చాలా చోట్ల ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎన్డీయే వెనుకంజలో ఉంది. మొత్తం 48 స్థానాల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ 12 చోట్ల, శివసేన(షిండే వర్గం) ఆరు చోట్ల, ఎన్సీపీ(అజిత్ పవార్) ఒకచోట ఆధిక్యతలో ఉంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ముందంజలో ఉన్నారు. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన శివసేన(ఉద్దవ్ వర్గం) 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 సీట్లలో, ఎన్సీపీ(శరద్ పవార్) ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి సాంగ్లీ నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి విశాల్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.మొత్తానికి ఎన్డీయే కూటమి 19 చోట్ల, ఇండియా కూటమి 28 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా 48 లోక్‌సభ స్థానాలతో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అయిదు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే 30 స్థానాలు గెలుచుకుంటుందని, ఇండియా 18 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వాస్తవ ఫలితాలు తారుమారు చేశాయి. -
20 రోజుల్లో ఉద్దవ్ బీజేపీలో చేరుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భార్య నవనీత్ కౌర్‌తో ఎమ్మెల్యే రవి రానా‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్‌కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్‌తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్‌లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు. -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్‌గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్‌సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్‌ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్‌పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.బీహార్‌కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్‌లో చేరారు.మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్‌ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.#WATCH | Former Congress leader Sanjay Nirupam along with his wife and daughter join Shiv Sena, in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai pic.twitter.com/lLtKFcelti— ANI (@ANI) May 3, 2024 -
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
ముంబయి: లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శివసేన (యూటీబీ) నాయకులు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సోమవారం ముంబైలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి, అనిల్ దేశాయ్ ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.సావంత్ తన నామినేషన్ ఫారమ్‌తో పాటు అఫిడవిట్ ద్వారా తన సంపద సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అరవింద్ సావంత్ భార్య అనుయా అరవింద్ సావంత్ పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు.అఫిడవిట్ ప్రకారం.. అరవింద్ సావంత్ వద్ద ప్రస్తుతం రూ.135000 నగదు ఉందని, అతని భార్య వద్ద రూ.60000 ఉందని వెల్లడించారు. సావంత్ వద్ద 251.070 గ్రాముల బంగారం, 3000 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. సావంత్ భార్య వద్ద 509.10 గ్రాముల బంగారం, 8000 గ్రాముల వెండి ఉందని వెల్లడించారు. అరవింద్ సావంత్ ఆస్తి మొత్తం రూ.2 కోట్ల 13 లక్షల 91 వేల 322. భార్య పేరు మీద 2 కోట్ల 26 లక్షల 65 వేల 869 రూపాయల ఆస్తులున్నట్లు వివరించారు.ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న శివసేన నేత రాహుల్ షెవాలే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ముంబై సౌత్ నుంచి డాక్టర్ మయూరి సంతోష్ షిండే, సబీహా బానో సహా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముంబైలోని ఆరు స్థానాలకు మే 20న ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 3.मुंबई दक्षिण मध्य लोकसभा मतदारसंघातील महाविकास आघाडीचे अधिकृत उमेदवार अनिल देसाई ह्यांनी त्यांचा उमेदवारी अर्ज दाखल केला. ह्यावेळी युवासेनाप्रमुख शिवसेना नेते आमदार आदित्य ठाकरे, शिवसेना उपनेत्या खासदार प्रियंका चतुर्वेदी, खासदार चंद्रकांत हंडोरे, आमदार प्रकाश फातर्पेकर, शिवसेना… pic.twitter.com/wXwI2MDs8k— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 29, 2024 -
Lok sabha elections 2024: మరాఠా గడ్డపై మహా పోరు!
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి... స్టేట్ స్కాన్ 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రెండేళ్లలో అంతా తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు. మాటల యుద్ధం ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు. బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు. అధికార కుమ్ములాటలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! ‘మహా’యుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్‌సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు! ‘ఇండియా’ పైచేయి సాధించేనా? ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేల సంగతేంటి? సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్‌ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్‌సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్‌కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్‌పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్‌లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీజేపీకి షాక్.. శివసేనలోకి(ఉద్దవ్) సిట్టింగ్ ఎంపీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మహారాష్ట్రలోని జల్గావ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్ ప్రతిపక్ష శివసేనలో(ఉద్ధవ్ వర్గం) చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ వద్ద తన సహచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జల్గావ్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన ఉన్మేష్కు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. స్మితా వాఘ్‌ను సీటు కేటాయించడంతో బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా శివసేన(ఉద్దవ్ వర్గం) ఇప్పటికే జల్గావ్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా కరణ్ పవార్‌ను జల్గావ్ నుంచి బరిలోకి దింపింది. అతని పేరుతో పాటు మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను(కళ్యాణ్ నుంచి వైశాలి దారేకర్, హత్యనంగలే నుంచి సత్యజీత్ పాటిల్, పాలఘర్ నుంచి భారతి కమ్డి) ప్రకటించింది. దీంతో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో భాగమైన ఈ పార్టీ ఇప్పటి వరకు 21 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసమే తాను శివసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రతీకారం కోసం కాదని అన్నారు. బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసింది శివసైనికులేనని అన్నారు. అయితే జల్గావ్ లోక్‌సభకు శివసేన పటీ చేయడం ఇదే తొలిసారి అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2019 వరకు అవిభక్త శివసేన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగంగా ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసిందని తెలిపారు. కాగా 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు అయిదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్ వర్గం శివసేన నుంచి అమోల్ కిర్తికర్ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు. #WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO — ANI (@ANI) March 28, 2024 మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు #WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV — ANI (@ANI) March 28, 2024 ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా విదర్భ!
మహారాష్ట్రలోని విదర్భ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో విదర్భ ఓటర్లు బీజేపీ, శివసేన జంటకు తమ మద్దతు పలికారు. తూర్పు విదర్భలో బీజేపీ, పశ్చిమాన శివసేన గట్టి పట్టు సాధించాయి. అయితే 1960 నుంచి 2009 వరకు విదర్భ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పుడు విదర్భ ప్రజలు ఇందిరా గాంధీకి మద్దతుగా నిలిచారు. విదర్భ అనేది తూర్పు మహారాష్ట్రలోని 11 జిల్లాలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగ్‌పూర్, రామ్‌టెక్, చంద్రాపూర్, గోండియా భండారా గడ్చిరోలి స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్ వాషిం, బుల్దానా స్థానాలకు పోలింగ్ జరగనుంది. శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి, అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ వర్గం) మహాకూటమి మధ్య అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంది. హైవే మ్యాన్‌గా బిరుదు పొందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్‌పూర్ సౌత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వికాస్ ఠాక్రేను పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీనిస్తుండగా, గడ్కరీ హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం విదర్భ పరిధిలోని నాగ్‌పూర్‌లో ఉంది. పొరుగున ఉన్న వార్ధా నియోజకవర్గం మహాత్మా గాంధీ జన్మస్థలం. రైతు ఆత్మహత్యలకు నెలవైన విదర్భలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. 64 సంవత్సరాల క్రితం విదర్భ ప్రాంతం నాగ్‌పూర్ ఒప్పందం కింద మహారాష్ట్రలో విలీనమైంది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే విదర్భలోని మొత్తం 62 సీట్లలో, బీజెపీ 29, అవిభక్త శివసేన 4, ఎన్సీపీ 6, కాంగ్రెస్ 15 ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 2014లో విదర్భలో బీజేపీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. -
బరిలో ‘హీరో నెం 1’.. అక్కడి నుంచే పోటీ?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. సీఎం షిండేపై సంచలన ఆరోపణలు
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనను క్రిమినల్‌గా మార్చాడని గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల ప్రకారం.. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహేష్ గైక్వాడ్‌పై ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థతో టెలీఫోన్లో మాట్లాడారు. Land dispute turns into an action flick in #Maharashtra BJP MLA Ganpat Gaikwad opens fire on Shiv Sena's Mahesh Gaikwad in Ulhasnagar over land dispute claiming self-defense post son's alleged assault in a police station. Gaikwad arrested, faces attempt to murder charges pic.twitter.com/V4Gbq7GHal — Nabila Jamal (@nabilajamal_) February 3, 2024 ఈ సందర్భంగా గైక్వాడ్.. పోలీసు స్టేషన్లో తన కొడుకును కొట్టారని, తన భూమిని బలవంతంగా గుంజుకున్నారని చెప్పారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినట్లయితే ఇలాగే నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుందన్నారు. అతడు తనలాంటి మంచి వ్యక్తిని నేడు క్రిమినల్‌గా చేశాడని ఆరోపించారు. దీంతో, ఫ్రస్టేషన్లోనే కాల్పులు జరిపానని, అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదన్నారు. పోలీస్ స్టేషన్లో కొందరు నా ఎదుటే నా కుమారుడిని కొట్టారు, ఇంతకంటే నేనేం చేయాలి అని ప్రశ్నించారు. వారిని చంపాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. కాగా, మహేశ్ గైక్వాడ్‌పై ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ పది రౌడ్ల బుల్లెట్లు అక్కడ లభించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
BJP MLA: ‘కాల్చినందుకు పశ్చాత్తాపం లేదు’
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన చెందిన నేతపై బీజేపీ చెందిన ఎమ్మెల్యేపై జరిపిన కాల్పులు శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. భూవివాదం నేపథ్యంలో షిండే వర్గం శివసేన ముంబై చీఫ్ మహేష్ గైక్వాడ్, మరోనేత రాహుల్ పాటిల్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పలు జరిపారు. ఈ ఘటన హిల్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వార్లీ గ్రామంలోని భూవివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్ కొడుకు వైభవ్ గైక్వాడ్ పోలీసు స్టేషణ్‌కు తన అనుచరులను తీసుకొని వచ్చారు. అదే సమయంలో మహేష్ గైక్వాడ్ సైతం తన కార్యకర్తలను తీసుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. కొంత సమయానికి గణపతి కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్.. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్ వెలుపల ఇరు వర్గాల అనుచరులు ఆందోళకు దిగారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో గణపతి గైక్వాడ్ .. మహేష్ గైక్వాడ్, మరో నేత రాహుల్ పాటిల్‌పై తుపాకితో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మహేష్ గైక్వాడ్, రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపే క్రమంలో గణపతి గైక్వాడ్ చేతికి గాయం అయింది. గాయపడిన మహేష్ గైక్వాడ్, రాహుల్‌ను థానేలోని ఆస్పత్రికి తరలించారు. మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైవ్వాడ్తో పాటు మరో ఇద్దని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేష్ గైక్వాడ్.. కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ, ఏక్ నాథ్ షిండే కుమారు డా. శ్రీకాంత్ షిండే సన్నిహితుడు కాగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన గణపతి గైక్వాడ్ చాలా సన్నిహితుడు గమనార్హం. సంకీర్ణ ప్రభుత్వంలోని ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన కాల్పుల ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు పశ్చాత్తాపం లేదు: గణపతి గైక్వాడ్ ఆత్మరక్షణ కోసమే షిండే వర్గం శివసేన నేతపై కాల్పులు జరిపానని తెలిపారు. తన కొడుకుపై పోలీసు స్టేషన్లో మహేష్ గైక్వాడ్, అతని అనుచరులు దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అందుకే వారి నుంచి తన కొడుకును కాపాడే క్రమంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. నిన్న (శుక్రవారం) రోజు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గణపతి గైక్వాడ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయనను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే -
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్‌లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గణ్‌పత్ గైక్వాడ్.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. #WATCH | Thane, Maharashtra: Sudhakar Pathare, DCP says, "Mahesh Gaikwad and Ganpat Gaikwad had differences about something and they came to the Police station to give complaint. At that time, they had a talk and Ganpat Gaikwad fired at Mahesh Gaikwad and his people. 2 people… pic.twitter.com/Qw2Q9iUHHz — ANI (@ANI) February 2, 2024 ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని జూపిటర్ హాస్పిటల్‌కు తరలించారు. గణ్‌పత్ గైక్వాడ్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
ఛాయ్‌వాలా పీఎం.. ఆటోవాలా సీఎం: మిలింద్ దేవరా
ముంబయి: కాంగ్రెస్‌ను వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు. "మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు. "సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ -
‘మహా’ జనానిదే తుది తీర్పు
సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు. అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్ నార్వేకర్‌కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది. 2022 జూన్ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్ చౌధరిని నియమించటంతోపాటు, విప్‌గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్ 29న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్‌కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్ వర్గం మౌనంగా ఏమీవుండదు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్ పవార్ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్‌లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం. మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, స్పీకర్‌పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది. ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు. అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్ తాజా నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్‌లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్‌కు లేదని పేర్కొన్నారు. 2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు. -
మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్.. అందుకు నో!
ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్‌వర్గం) కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్నాథ్ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు. శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే స్థిరమైన ఓట్‌షేర్‌తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
శివసేన, ఎన్సీపీ విబేధాలపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు
ఢిల్లీ: శివసేన, ఎన్సీపీ విభేదాలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు నేడు తుది గడువును విధించింది. శివసేన విబేధాలపై డిసెంబర్ 31, 2023 నాటికి, ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శివసేన సభ్యుడు సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ (శరద్ పవార్) దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాగా.. శివసేన పార్టీలో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 29, 2024 వరకు సమయం కావాలని కోరిన మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విబేధాలపై ఇంతకాలం కాలయాపన చేసి మళ్లీ గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ తరఫున వాదనలు వినిపించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జనవరి 31లోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. డిసెంబర్ 31లోగా తేల్చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 2022 జులైలో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని ఈ ఏడాది మేలోనే రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే.. రాబోయే దీపావళి సెలవులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఉటంకిస్తూ జనవరి 31లోపు పూర్తి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ విన్నవించారు. వాదనల అనంతరం డిసెంబర్ 31లోపు విచారణ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్సీపీ విభేదాలకు సంబంధించి మాత్రం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. కానీ ఎన్సీపీ విబేధంపై గడువు ఇవ్వడాన్ని అజిత్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నిరసించారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లలో మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అయితే.. ఈ ఏడాది జులైలో తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను మాత్రమే ఈ దశలో పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. శివసనే, ఎన్సీపీ అనర్హత పిటిషన్లను త్వరితగతిన విచారించడానికి తగిన షెడ్యూల్‌ను రూపొందించడానికి మహారాష్ట్ర స్పీకర్‌కు కోర్టు చివరి అవకాశాన్ని ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యమంత్రి శిందేతో సహా పలువురు శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం పెట్టుకున్న అర్జీలపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారని స్పీకర్‌పై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా.. శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఎన్సీపీలోనూ తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గంపై అనర్హత ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ మద్దతుదారులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం నేడు తుది గడువును విధించింది. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్‌ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్‌లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్‌ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్‌ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్‌లోని రాజ్‌ఘడ్‌కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్‌తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్‌కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్‌లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్‌తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్‌ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
Sharad Pawar: ఆది నుంచి ఫిరాయింపులే!
1958 నాటి సంగతి; పూనా(ఇప్పుడు పుణె) సిటీ, ‘బృహన్ మహారాష్ట్ర కాలేజి ఆఫ్ కామర్స్’లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇరు ప్యానల్ అభ్యర్థులు చివరి రోజు రాత్రి తమ తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. ఓటమిని శంకించిన ఓ గ్రూప్ లీడర్ ఒక పథకం వేశాడు. ఆ రోజు మధ్య రాత్రి, ఆయన ఓ నలుగురు మిత్రులతో హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న కొందరు రైవల్ గ్రూప్ విద్యార్థులను నిద్ర లేపి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా బతిమాలాడు. బదులుగా, తన టీం గెలిచిన వెంటనే కాలేజి యాజమాన్యంతో సంప్రదించి వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. తెల్లవారే వరకు ఈ ప్రచారం నడిచింది. మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఆయన టీం గెలిచింది. ఆ టీమ్ లీడర్ మరెవరో కాదు– శరద్ చంద్ర గోవిందరావ్ పవార్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరద్ రావ్ నేరుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్త అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎదిగి, తన 27వ ఏట (1967లో) ఎమ్మెల్యేగా ఎన్నికై వైబీ చవాన్ ఆశీస్సులతో మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి (1972) కూడా అయ్యారు. 1977 లోక్ సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రభంజనంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవటమే కాక, నిలువునా చీలి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ (1978)గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించక పోవటంతో, రెండు కాంగ్రెస్ పార్టీలూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వసంత్ దాదా పాటిల్ (రెడ్డి కాంగ్రెస్) ముఖ్య మంత్రి అయ్యారు. శరద్ పవార్ రెవెన్యూ మంత్రిగా ఆయన క్యాబినెట్లో చేరారు. కొన్ని రోజులకే, జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర శేఖర్ (మాజీ కాంగ్రెస్ యంగ్ టర్క్ లీడర్) స్నేహాన్ని ఆసరా చేసుకుని, యంగ్ పవార్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి, ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతుతో తన 38వ ఏట (జూలై, 1978) ముఖ్య మంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తెల్లబోవటం కాకలు తీరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల వంతైంది. ఇందిరా గాంధీ 1980లో కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్ పవార్ సీఎం పదవి కోల్పోయారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్ (సెక్యులర్)’ పేరుతో కొంత కాలం ప్రాంతీయ పార్టీ నడిపించారు పవార్ సాబ్. ఇందిరాజీ హత్య తరువాత రాజీవ్ గాంధీ పవార్‌ను, తన పార్టీ బలగంతో తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 1988 జూన్‌లో శరద్ పవార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో నాగపూర్ అసెంబ్లీ సమావేశాల్లో, శివసేన పార్టీ అంతర్గత కుమ్ములాటను గమనించి, ఆ పార్టీ ఓబీసీ నేత చగన్ భుజ్‌బల్, మరో 16 మంది శివ సేన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు సీఎం పవార్. ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మొదటిసారిగా ‘వలసలు’ ప్రారంభమయ్యాయి. ఇక పదేళ్ల అనంతరం (2001) కొంతమంది పార్టీ నాయకులను తీసుకొని కాంగ్రెస్‌కు మరోసారి తిలోదకాలు ఇచ్చి, ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (ఎన్సీపీ)ని స్థాపించారు. 1989 నుండి మూడు దశాబ్దాల వరకు హిందూత్వ భావజాలం పులుముకున్న శివసేన – భారతీయ జనతాపార్టీలు ప్రతీ ఎన్నికలోనూ కలిసే పోటీ చేశాయి. 1995–2000 ఈ కూటమి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసింది. ఇక 2019 ఎన్నికల్లో ఈ కూటమి 161 సీట్లు గెలవటంతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కాని అది కుదర్లేదు. కారణం, ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలని 56 సీట్లు గెలుచుకున్న శివసేన మారాం చేయడమే. ఇంతలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, తన బాబాయి సీనియర్ పవార్‌ను కాదని భాజపాతో చేతులు కలిపారు. ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది. తనను విడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను పవార్ సాహెబ్ చాకచక్యంగా తిరిగి తన గూటిలోకి చేర్చుకోవటంతో అజిత్ పవార్ పాచిక పారలేదు. ఇక సంఖ్యా బలం కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం, 60 గంటల్లోనే (26.11.2019న) పడిపోవటం విశేషం. ఆ తర్వాత శరద్ పవార్ రంగంలోకి దిగి, తనదైన శైలిలో చకచకా పావులు కదిలించారు. ‘మహా వికాస్ అఘాడి’ పేరుతో శివసేన (56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ (44) కూటమిని ఏర్పాటు చేసి, శివసేన కోరిక మేరకే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (28.11.2019) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో 105 స్థానాలు గెలిచిన భాజపా ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. దిగ్భ్రాంతికి గురైన భాజాపా తనతో శివసేనకు ఉన్న మూడు పదుల దోస్తీని తుంచిన శరద్ పవార్‌తో పాటు, శివసేన అధినాయకుడు ఉద్ధవ్కూ గుణపాఠం నేర్పాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది. 45 ఏళ్ల క్రితం పవార్ రచించిన రాజకీయ స్క్రిప్ట్‌నే ఆదర్శంగా తీసుకొని 2022 జూన్‌లో ఏక్నాథ్ శిందేని ఉపయోగించి శివసేననూ, 2023 జూలైలో అజిత్ పవార్‌ను ఉపయోగించి ఎన్సీపీని... చీల్చి కొత్త ప్రభుత్వాల ఏర్పాటును దిగ్విజయంగా పూర్తి చేసి ‘టిట్ ఫర్ టాట్’ అంది భారతీయ జనతా పార్టీ. ఔను మరి, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు (శివసేన, ఎన్సీపీ) సంస్థాపరంగా చెదిరి, కోలుకోలేని స్థితిలో, తెరచాప తెగిన నావలా మారాయి. చివరిగా, క్యాన్సర్ జబ్బుకు ‘షికార్’ అయినప్పటికీ, 83 ఏళ్ల సీనియర్ నేత శరద్ చంద్ర పవార్, ‘నా టైర్డ్ హు, నా రిటైర్డ్ హు’ అంటూ, ధీమాగా సానుభూతి కోసం (ఓటు బ్యాంకు), రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పుడు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టారు. తన ఫార్ములా తనకే బెడిసి కొట్టడంతో ఏర్పడ్డ (రాజకీయ) గాయం, మరో వైపు పార్టీ అనుయాయులు తననే పార్టీ అధ్యక్ష పదవి నుండి వెలివేయటంతో ఒంటరి పక్షి అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి మరి! (శరద్ పవార్ స్వీయచరిత్ర ‘ఆన్ మై టర్మ్స్’, వైభవ్ పురంధరే రాసిన ‘ది రైజ్ ఆఫ్ ది శివసేన’ ఆధారంగా) జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పి.ఎఫ్. కమిషనర్ ‘ 9819096949 -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్‌ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
అజిత్ పవార్ చేరికపై అసంతృప్తి, సీఎం రాజీనామా!.. స్పందించిన శివసేన
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కూటమిలోనూ ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై పట్టుకోసం బాబాయ్-అబ్బాయ్ మధ్య తీవ్ర వార్ నడుస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని చీల్చుతూ ఆయన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఎనిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఏక్నాథ్ శిండే(శివసేన) వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివసేనలో చిచ్చు మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని, అసంతృప్తితో ఉన్న 8–10 మంది మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. పార్టీలో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హడావిడీకి ముంబైకి వచ్చారని వదంతులు వ్యాపించాయి. ఏ గందరగోళం లేదు తాజాగా శివసేనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ నేత ఉదయ్ సావంత్ ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై శివసేనలో ఎలాంటి విభేదాల్లేవని, ఎవరో గిట్టనివారు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఏక్నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచనలు కూడా లేనట్లు స్పష్టం చేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. చదవండి: NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు సీఎం అత్యవసర భేటీ బుధవారం ముర్ముకు స్వాగతం పలికేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లిన శిండే తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన నివాసంలో అత్యవసరంగా భేటీ అయిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఉదయ్ సావంత్ మాట్లాడుతూ.. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు. షిండే సారథ్యంలో తమ ప్రభుత్వం ప్రశాంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సీఎం ప్రతి ఒక్కర్నీ కలుపుకొంటూ వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమని ఆయన అన్నారు. బుధవారం నాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఎన్సీపీతో వెళ్లవద్దని వాదన? శిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎవరూ ఎటు వెళ్లాల్సిన పని లేదని, ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. గతంలో తాము ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్దవ్) నుంచి బయటకి వస్తే.. మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించారని, ప్రస్తుతం ఎన్సీపీ కూడా అదే బాట పట్టిందని సామంత్ అన్నారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో కలవడం అంటే ఇప్పుడు శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. -
ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్ పవార్.. జూన్ 30నే తీర్మానం!
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తలెత్తిన సంక్షోభం ముదిరింది. పార్టీలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఎన్సీపీపై ఆధిపత్యం కోసం పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, చీలిక వర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి తొలగిస్తూ ఆయన స్థానంలో అజిత్ పవార్‌ను నియమిస్తూ జూన్ 30నే తీర్మానం చేసినట్లు ఎన్సీపీ తిరుగుబాటు నేతలు వెల్లడించారు. రెండు రోజుల ముందే తీర్మాణం ఎన్సీపీ నుంచి వేరుపడే కొన్ని రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ వర్గం పేర్కొంది. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్‌కు బుధవారం ఒక పిటిషన్ సైతం సమర్పించింది. ఇందులో జూన్ 30న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ తీర్మాణాన్ని ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మద్దతు ఇస్తూ ఆఫిడవిట్లపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. హోటల్‌కు అజిత్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఎన్సీపీ నుంచి వేరు కుంపటి ఏర్పాటు చేసిన అజిత్ గ్రూప్ పార్టీ పేరు, గుర్తు కోసం ఈసీని ఆశ్రయించారు. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే నిజమైన ఎన్సీపీ అని పార్టీ పేరు, గుర్తు తమకు కేటాయించాలని ఆరోపిస్తున్నారు. అంతేగాక అజిత్ పవార్ తన గ్రూప్ ఎమ్మెల్యేలందరిని ముంబై హోటల్లో ఉంచారు. అయితే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శరద్ పవార్ విధేయుడు జయంత్ పాటిల్ నుంచి కూడా తమకు లేఖ అందిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. చదవండి: 'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్.. షిండే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కాగా ఆదివారం అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసందే. అయితే ఈ పరిణామంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి తన అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకొని తన అధికారిక నివాసంలో అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే, ఎన్సీపీతో ఎప్పుడు బంధం కలిగి లేరనే విషయాన్ని ఎత్తి చూపుతూ.. ఎన్సీపీతో పొత్తుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అజిత్ వెంట 32 మంది ఎన్సీపీ పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు బుధవారం బల ప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలు, అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. పరస్పరం వాగ్బాణాలు విసురుకున్నారు. అయితే నంబర్‌గేమ్‌లో బాబాయిపై అబ్బాయి అజిత్‌దే పై చేయి అయింది. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ సభకు 32 మంది హాజరయ్యారని ఆయన వర్గం నేతలు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు వారే కీలకం 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు ఇప్పటికే అజిత్‌కు మద్దతు ప్రకటించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే అజిత్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఆయనకు 40 మంది అండ ఉందని చీలిక వర్గం ఎమ్మెల్యే అనిల్ పాటిల్ చెప్పారు. ఇక శరద్ భేటీకి 18 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ఇరు భేటీల్లోనూ పాల్గొనడం విశేషం!. మరికొందరు రెండు సమావేశాలకు హాజరుకాలేదు. అయితే ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలుండగా ఏ భేటీకీ వెళ్లని ఎమ్మెల్యేల మద్దతు రెండు వర్గాలకూ కీలకంగా మారేలా కన్పిస్తోంది. -
మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి తాజాగా అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు పదవి గండం మొదలైందని, అజిత్ పవార్ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "Today I am saying this in front of the camera, the Chief Minister of Maharashtra is going to change. Eknath Shinde is being removed. Eknath Shinde and the 16 MLAs are going to be disqualified" pic.twitter.com/R0YI0MwQwR — ANI (@ANI) July 3, 2023 సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్నాథ్ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్‌కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్భవన్లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI — ANI (@ANI) July 3, 2023 -
హైదరాబాద్ లో మొదటి సారి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది
-
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన షిండేకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా అధికార ప్రభుతానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేసిన ఏక్నాథ్ షిండే వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్ధవ్ వర్గం శివసేన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు 79 పేజీల లేఖను అందజేసింది. స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల డిప్యూటీ స్పీకర్‌కు లేఖ అందించినట్లు శివసేన నేత ప్రభు తెలిపారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ..ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. షిండే, ఫడ్నవీస్‌ల ప్రభుత్వం పడిపోదని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం ముంబైలో విలేకరు సమావేశంలో పేర్కొన్నారు. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ప్రభుత్వం తన మెజారిటినీ కోల్పోదని తెలిపారు. కాగా ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం అధికార కూటమికి 162 మంది శాసన సభ్యుల బలం ఉంది. అంతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే 17 మంది ఎక్కువే ఉన్నారు. ఇదిలా ఉండగా శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదని తెలిపింది. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తన విచక్షాణాధికారాలను ఉపయోగించిన తీరు చట్టబద్దంగా లేదని తెలిపింది. అయితే ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. శాసనసభలో బల పరీక్షలను ఎదుర్కోకుండా ఆయన స్వచ్చందంగా రాజీనామా చేశారని తెలపింది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
సరిదిద్దలేని మహా తప్పిదాలు
ఉత్కంఠగా ఎదురుచూసిన కోర్టు తీర్పు వచ్చింది. కానీ, న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. శివసేన రెండు ముక్కలై వీధికెక్కిన వివాదంలో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితి అదే. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గాల మధ్య శివసేనలో అంతర్గత కలహాలు చివరకు ప్రభుత్వ మార్పిడిగా పర్యవసించినప్పుడు మహారాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్లు అత్యుత్సాహం చూపిన తీరును కోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. వారు చట్టప్రకారం నడుచుకోలేదని కుండబద్దలు కొట్టింది. కానీ, శివ సేనను వీడి, పార్టీని శిందే రెండు ముక్కలు చేసిన సందర్భంలో సభలో బలపరీక్షకు నిలవకుండానే రాజీనామా సమర్పించిన ఉద్ధవ్ సర్కార్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వలేమనీ పేర్కొంది. జరిగింది తప్పేనని తీర్పు చెబుతూనే, పాత తప్పును ఇప్పుడు సరిదిద్దలేమని అశక్తత వ్యక్తం చేసింది. అంటే శిందే సర్కార్ కొనసాగేలా ఇప్పటికి ఊరట నిచ్చింది. అదే సమయంలో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా, సభలో బలపరీ క్షకు దిగుంటే... ఆ బలపరీక్షే చట్టవిరుద్ధం గనక ఆయన సర్కారును పునరుద్ధరించే వీలుండేదని కోర్ట్ అభిప్రాయపడింది. అలా అప్పట్లో విప్‌ను ధిక్కరించిన శిందే అనర్హతకు తలుపు తెరిచే ఉంచింది. పార్టీ అంతర్గత విభేదాల లెక్క తేల్చేందుకు నాటి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ శాసనసభలో బలపరీక్ష పెట్టాలని నిర్ణయించడం శుద్ధ తప్పు అనే మాట లోతైనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో పనేమిటి? ప్రభుత్వం మద్దతు కోల్పోయినట్టు తగిన సాక్ష్యాధారాలేమీ లేకుండానే, స్వయానా గవర్నరే బలపరీక్ష జరపా లని కోరడమంటే... చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అనివార్యంగా మెజారిటీ కోల్పోయేలా చేసి, కూలి పోయేలా చూడడమే! అంటే, కారణాలేమైనా తన చర్యల ద్వారా ఒక నిర్ణీత ఫలితం వచ్చేలా చేయ డమే! ఉద్ధవ్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కార్ రాజీనామాకు ఇదే కారణమైంది. ఇది గవర్నర్లు చేయాల్సిన పనేనా? ఈ కేసులో వాదనల సందర్భంగా సుప్రీమ్ ప్రస్తావించిన ఈ అంశాలు ఆలోచించాల్సినవి. కావాల్సిన పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్న విషాదానికి ఇవన్నీ మహా చిహ్నాలు. మరోపక్క శిందే వర్గమే ‘అసలైన’ శివసేన అని గుర్తిస్తూ, దానికే పార్టీ చిహ్నమైన విల్లంబులను ఎన్నికల సంఘం కేటాయించడమూ తొందరపాటే. అలాగే, అసెంబ్లీ స్పీకర్ సైతం శిందే వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించే వరకు ఆ వర్గపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులను నానబెట్టడం మరో తప్పు. ఇలా గవర్నర్, స్పీకర్, ఎన్నికల సంఘం సహా అన్ని రాజ్యాంగ సంస్థలూ తప్పుదోవ పట్టిన తీరును సుప్రీమ్ తన తీర్పులో బలంగా ప్రస్తావించడం గమనార్హం. శివసేన కథలో తదుపరి ఘట్టం మరింత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న వేళ ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి రాక మానవు. అలాగే, విప్ జారీ అయినా సరే చీలిక ముసుగులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తిప్పలు తప్పవనీ తేలిపోనుంది. వెరసి, తాజా తీర్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖయం అనిపిస్తోంది. గతంలోకెళితే ఈ కథలో ఎన్నో మలుపులు. 2019 అక్టోబర్‌లో బీజేపీ–శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మరిన్ని మంత్రి పదవులు, రెండున్నరేళ్ళ పాటు సీఎం పీఠం కట్టబెట్టాలని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందమేదీ లేదని బీజేపీ అడ్డం తిరిగింది. దాంతో గెలిచిన పక్షం రోజులకే కూటమి విచ్ఛిన్నమైంది. కమలనాథుల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో కొత్త పొత్తులు, ప్రభుత్వాలు– సీఎంల మార్పులు, కాంగ్రెస్– ఎన్సీపీ– శివసేనల ‘ఎంవీఏ’ కూటమి ఆవిర్భావం... ఇలా అనేకం జరిగాయి. వాటిలో భాగమే 2022 జూన్‌లో ఏకంగా శివసేన వ్యవస్థాపకుడైన బాల్‌ఠాక్రే కుమారుడూ, అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు. గవర్నర్ బలపరీక్ష నిర్ణయంతో ఉద్ధవ్ జూన్ 29న రాజీనామా చేశారు. ఆ మర్నాడే బీజేపీ అండతో శిందే సీఎం కుర్చీ ఎక్కారు. శిందే, ఆయనతో బయటకొచ్చి పార్టీ తమదేనన్న మరో 15 మంది అనర్హత కథ కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతోంది. తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి శిందే సర్కార్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ కోరుతుంటే, కోర్టు వ్యాఖ్యలెలా ఉన్నా తమను కొనసాగనివ్వడమే ప్రజాస్వామ్య విజయమని శిందే, ఫడ్నవీస్‌లు జబ్బలు చరుస్తున్నారు. విస్తృత ధర్మాసనంలో కథ ఏ కొత్త మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమను కాదని ప్రత్యర్థులతో కూటమి కట్టిన మునుపటి మిత్రపక్షం శివసేనను నిలువునా చీల్చడంలో బీజేపీ ఇప్పటికే సఫలమైంది. సొంతంగా చక్రం తిప్పేందుకు అదను కోసం చూస్తోంది. అది రుచించకున్నా, బీజేపీ దోస్తీ లేకుండా శిందే సేన మనుగడ కష్టం. మరోపక్క తన వెంట మిగిలిన కొద్దిమందీ చేజారిపోకుండా కాపాడుకోవడం ఉద్ధవ్ ముందున్న సవాలు. ఈ పరిస్థితుల్లో తాజా తీర్పు ఉద్ధవ్‌కు నైతికంగా బలమిచ్చింది. కోర్టు తీర్పుతో కుర్చీ దక్కకున్నా, గవర్నర్ అవాంఛనీయ పాత్రతో ప్రత్యర్థులు అధికారం చేజిక్కించుకున్న తీరును తప్పుబట్టడమే ఊరట. అనర్హతలపై స్పీకర్ సత్వరమే నిర్ణయించాలనీ కోర్ట్ చెప్పడం గమనార్హం. అందుకే, ముందే అన్నట్టు తీర్పు వచ్చినా, న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. కోర్టు లోపల ఒక దశ పోరాటం ముగిసి ఉండవచ్చు. మరోదశ మిగిలివుంది. కోర్టు బయట కూడా ఉద్ధవ్ తదితరుల నైతిక పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది. సుప్రీమ్ వ్యాఖ్యలతోనైనా మన రాజ్యాంగ వ్యవస్థలు దిద్దలేని తప్పిదాలకు దూరంగా ఉంటాయా?