Akash Puri
-
దీన స్థితిలో పావలా శ్యామల.. సాయం చేసిన పూరీ తనయుడు
సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. కనీసం మాట్లాడేందుకు కూడా శరీరం సహకరించడం లేదు. ఎవరైనా దయతలచి ఆదుకోమని చేతులెత్తి వేడుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చలించిపోయాడు.ఆర్థిక సాయంహైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తోంది: ఆకాశ్ జగన్నాథ్
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సీతారం సిత్రాలు’. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తోంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ‘సీతారం సిత్రాలు’ని ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘గుడికి వెళితే ఎంత ప్రశాంతత లభిస్తుందో, ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అంతే ప్రశాంతత లభిస్తుంది’’ అని తెలిపా లక్ష్మణ మూర్తి. ‘‘జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగిగార్ల సినిమాల్లా మా ‘సీతారం సిత్రాలు’ ప్రేక్షకులకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది’’ అన్నారు నాగ శశిధర్ రెడ్డి. ‘‘మా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేయాలి’’ అని పేర్కొన్నారు నిర్మాతలు. -
రెండేళ్ల నుంచి ఖాళీగా ఏం లేను: ఆకాశ్
తండ్రీకొడుకులకు టైం బాగోలేనట్లుంది.. అటు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్‌తో వరుస పరాజయలు అందుకోగా మరోవైపు ఆకాశ్ పూరీ రెండేళ్లక్రితం చోర్ బజార్‌తో ఫ్లాప్ అందుకున్నాడు. అప్పటినుంచి మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. తాజాగా సోషల్ మీడియాలో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు.ఒకటే ప్రశ్న..నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం... ఏం సినిమా చేస్తున్నావ్? అంటూ చాలారోజుల నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు. సినిమా ప్రకటించి రెండేళ్లయిపోయింది.. చాలాకాలంగా ఖాళీగా ఎందుకుంటున్నావ్? అని అడుగుతున్నారు. ఖాళీగా ఏం లేను.. జాగ్రత్తగా ఉంటున్నానంతే!ఈసారి గట్టిగా..ఎన్నో కథలు విన్నాను. నాకు మంచి ప్రొడక్షన్ హౌస్ దొరికింది. మంచి దర్శకుడు, నిర్మాతలు దొరికారు. చాలా కథలు వింటూ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేవాడిని. దేవుడి దయ వల్ల, నేను నమ్మిన అమ్మవారి దయ వల్ల నాకంటూ మంచి టీమ్ దొరికింది. ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయి ఓ సినిమా ఫైనల్ చేశాను. సోమవారం (ఆగస్టు 19న) నా కొత్త సినిమా అప్డేట్ రాబోతోంది. మీ అందరూ నాకు తోడుగా ఉండాలి అని వీడియోలో చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Akash Jagannadh (@actorakashpuri) -
పేరు మార్చుకున్న ఆకాశ్.. 'పూరి' అనే పదాన్ని తొలగించి ఆపై..
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి తాజాగా తన పేరు మార్చుకున్నాడు. నేడు (జులై 25) తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు.చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు ఆకాశ్. కానీ ఫ్లాప్ అయింది. సుమారు రెండేళ్లు సమయం పూర్తి అయినా కూడా ఆకాశ్ నుంచి సినిమా ప్రకటన రాలేదు. కనీసం ఆయన ఎక్కడా కూడా కనిపిమచలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా కనిపించాడు. తాజాగా తన పేరును 'ఆకాశ్ జగన్నాథ్'గా మార్చుకున్నాడు. ఆకాశ్ పేరు పక్కన తన తండ్రి పేరు నుంచి 'జగన్నాథ్' అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు. గతంలో కూడా తన తండ్రి పేరు నుంచే పూరి అనే పదాన్ని తీసుకున్నాడు.ఇక నుంచి 'ఆకాశ్ జగన్నాథ్' అనే తనను పిలవాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పులు వెనుక అసలు కారణాలు ఆయన వెళ్లడించలేదు. సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆకాశ్ అనుకుంటే తన తండ్రి డైరెక్షన్లో మరో సినిమా తీయగలడు. కానీ, దానిని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇండస్ట్రీలో తానేంటు నిరూపంచకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్లో సినిమా చేస్తానిని గతంలో ఆకాశ్ జగన్నాథ్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2007లో చిరుతు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. ఆపై బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్,బిజినెస్‌మేన్,గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా,రొమాంటిక్ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకాశ్ జగన్నాథ్ కథలు -
Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
కోటవురట్ల: వర్థమాన హీరో, సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ శనివారం పాత తంగేడులో సందడి చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులతో సెల్ఫీలు దిగారు. పరిచయస్తులు, బంధువులు ఆకాష్ పూరీతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న, ఒప్పుకున్న సినిమా కబుర్లు వారితో పంచుకున్నారు. ఆకాష్ పూరీ మాట్లాడుతూ తన బాబాయ్ పెట్ల ఉమాశంకర గణేష్ నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆయన గెలుపులో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలిపారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి బాబాయ్ ఉమాశంకర గణేష్‌ను గెలిపించాలని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన బాబాయ్‌ను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. చాలా సింపుల్‌గా, సౌమ్యంగా అందరితో కలిసిపోయే మంచి వ్యక్తిత్వం కలిగిన బాబాయ్ గెలుపు తథ్యం అన్నారు. సీఎం జగన్ సహకారంతో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో తక్కువ కాలంలోనే బాబాయ్ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి బాబాయ్ గణే‹Ùను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
‘మెర్సి కిల్లింగ్’ కాన్సెప్ట్ బాగుంది: ఆకాష్ పూరి
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడు..‘మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. -
‘వెయ్ దరువెయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
హీరోగా సెట్ అయిన తర్వాత అది చేస్తా: హీరో ఆకాశ్ పూరీ
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చాలామందికి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు. కానీ ఫ్లాప్ అయింది. ఇలా చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించాడు. ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) 'నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా 'చోర్ బజార్' అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, యాక్షన్ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ దశలో ఉన్నాయి. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. ఇప్పటికీ నేను చిన్న పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ తరహా క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పట్లో నటించకూడదని అనుకున్నా' 'నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ లాంటివి చూసినప్పుడు ఇలాంటి వాటిలో నటించాలనే కోరిక కలుగుతుంటుంది. ఇప్పుడు నేను సింగిల్‌గానే ఉన్నా. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!) -
నాన్న డైరెక్షన్లో సినిమా చేయను: ఆకాశ్ పూరి
టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఆకాశ్ పూరి కూడా ఒకరు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆకాశ్. చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్‌తో పాటు పలు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి పాత్రను పోషించాడు. ‘ఆంధ్రా పోరి’తో హీరోగా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో స్వయంగా పూరినే రంగంలోకి దిగాడు. కొడుకుతో డిఫరెంట్ లవ్‌స్టోరీ ‘మెహబూబా’ తీశాడు. అయితే అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘రొమాంటిక్’ ఫిల్మ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదీ కూడా ఫ్లాప్ అయింది. చివరగా చోర్ బజార్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రానికి కూడా తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కథల వేటలో పడ్డాయి. అయితే ఎంతో మందిని స్టార్ హీరోలుగా మలిచిన పూరి జగన్నాథ్.. కొడుకును మాత్రం హీరోగా పెట్టి మరో సినిమా తీయలేకపోయాడు. పూరి అనుకుంటే.. ఆకాశ్‌ను ఓ మాస్ హీరోగా నిలబెట్టగలడు. కానీ అది ఆకాశ్‌కి ఇష్టం లేదు. తండ్రి డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదట. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని చెప్పాడు ఆకాశ్. ‘నాన్న డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదు. నటుడిగా నన్ను నేను ఫ్రూవ్ చేసుకున్న తర్వాత నాన్నతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నేను నాన్నతో సినిమా చేయను. ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే.. ‘పూరి జగన్నాథ్-ఆకాశ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది’ అనుకునే స్థాయికి వచ్చినప్పుడే చేస్తాను’ అన్నాడు. నేనింతే సినిమాకు సీక్వెల్ వస్తే.. అందులో హీరోగా నటించాలని ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?
టాలీవుడ్లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడా? ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వారసుడే అని తెలుస్తోంది. అలానే అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలేం జరుగుతోంది? (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) దర్శకుడు పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు. తనదైన స్టైల్ ఆఫ్ మూవీస్‌తో అప్పట్లో ఊపు ఊపాడు. ఇతడి కొడుకు ఆకాశ్.. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేడు. కొన్నాళ్ల నుంచి అసలెక్కడ వినిపించని ఆకాశ్ పూరీ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. చిన్నప్పటి క్లాస్మేట్ ఒకమ్మాయితో ఆకాశ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని అంటున్నారు. అలానే అమ్మాయి తాత పెద్ద పొలిటికల్ లీడర్ అని అంటున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాలి. లేదంటే స్వయంగా ఆకాశ్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు! (ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?) -
బిచ్చగాడు-2 కోసం ప్రాణం పెట్టారు : అడివి శేష్
‘‘సినిమా కోసం ప్రాణం పెట్టి చేశామని అందరూ చెబుతుంటారు. కానీ, ‘బిచ్చగాడు 2’ కోసం విజయ్, ఫాతిమాగార్లు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. వారికోసమైనా ‘బిచ్చగాడు 2’ హిట్టవ్వాలి’’ అన్నారు హీరో అడివి శేష్. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతమందింన త్రం ‘బిచ్చగాడు 2’. కావ్యా థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మింన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఉషా పిక్చర్స్‌పై విజయ్ కుమార్, వీరనాయుడు రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, ఆకాశ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోనిగారిని ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాను.. కానీ ఆయన్ను కలిశాక గౌరవం మొదలైంది. ‘బిచ్చగాడు 2’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ తొలి భాగం నచ్చినవారికి రెండో భాగం కూడా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన (విజయ్ ఆంటోని) చూసుకున్నారు. ఆయన ప్రమాదానికి గురైనా.. అభిమానుల ప్రేమ వల్లే కోలుకున్నారు’’ అన్నారు ఫాతిమా విజయ్ ఆంటోని. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
వైవిధ్యం.. వినోదం...
జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎర్రర్ 500’. సాందీప్ మైత్రేయ.ఎన్ దర్శకత్వంలో యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాష్ పూరి పాల్గొన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘ట్రైలర్ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ‘ఎర్రర్ 500’ అనేది జెస్సీకి యాప్ట్ టైటిల్. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు. వెంటనే సినిమా సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫణి కల్యాణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు జెస్సీ. ‘‘ట్రైలర్లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. జెస్సీ చాలా అంకితభావంతో ఈ సినిమా చేశాడు’’ అన్నారు సాందీప్. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చైతన్య, రితిక జంటగా కొత్త సినిమా షురూ
మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సత్యసాయి కల్యాణమండపంలో ఘనంగా జరిగాయి. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుంచి చీరాలలో మొదటి షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం' అన్నారు. చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేం పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా.. మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. 'ఇది నా మూడవ సినిమా. నా మెదటి సినిమా నుంచి వెంకటేష్ గారు నాకు తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అన్నారు. హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ.. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్గా నటించాను. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ "ఖుషి", అనంత సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నేనెవరు' ఆడియో రిలీజ్
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. -
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి
'ఆకాష్‌కి ఏంటి? పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ, మా నాన్న స్టార్ డైరెక్టర్ కాకముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నా పక్కన లేకుంటే నేను జీరో.. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పీ జంటగా నటించిన చిత్రం చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'చోర్ బజార్ బాగా తీస్తావనే నమ్మకం ఉంది. మా అబ్బాయి (ఆకాష్)తో మంచి సినిమా చెయ్ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'కలర్‌ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత వీఎస్ రాజు పేర్కొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాష్ పూరీ -
కొడుకు ఫంక్షన్‌కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు(ఆకాశ్ పూరీ) సినిమా ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్ నువ్ డేట్లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. -
అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ
‘‘బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉంది. ఓ బిగ్ హిట్ కోసం మరింత ఏకాగ్రతతో కష్టపడి పని చేస్తున్నాను. ‘చోర్ బజార్’ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆకాష్ పూరి. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాష్ పూరి చెప్పిన విశేషాలు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ⇔ ఈ సినిమాలో నేను బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. టైర్లను దొంగతనం చేయడం నా పని. దొంగతనాలు చేసి పేదవారికి సాయం చేస్తుంటాడు. సో... వారి దృష్టిలో బచ్చన్ సాబ్ హీరో. ‘చోర్ బజార్’ అనగానే అందరూ దొంగలు, క్రిమినల్స్ గురించే ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ కూడా కుటుంబాలు, ఎమోషన్స్ ఉంటాయి. వీటినే మా ‘చోర్ బజార్’ సినిమాలో చూపించాం. నా కెరీర్లో డిఫరెంట్ అండ్ మంచి స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇది. జీవన్రెడ్డిగారు కథ వినిపించినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా యాక్టర్‌గా నా ఇమేజ్ను పెంచుతుందనుకుంటున్నాను. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! ⇔ నాన్నగారు (పూరి జగన్నాథ్) ఇంకా ‘చోర్ బజార్’ చూడలేదు. కానీ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. నా ప్రతి సినిమా కథను నాన్నకి వినిపించి ఆయన్ను డిస్ట్రబ్ చేయాలనుకోను. ‘సొంత నిర్ణయాలు తీసుకో.. నీ గట్ ఫీలింగ్‌పై వెళ్లు’ అని నాన్న చెబుతుంటారు. నా గత చిత్రం ‘రొమాంటిక్’ ప్రమోషన్లో నేను హీరోగా సక్సెస్ అయి నాన్న పేరు నిలబెడతానని కాలర్ ఎగరేశాను. కానీ అది ఒక సినిమాతో జరిగే పని కాదు. కొంత జర్నీ సాగాలి. ఇక నేను కొత్తగా మూడు సినిమాలు కమిటయ్యాను. -
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు? స్పందించిన డైరెక్టర్ కుమారుడు
స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఈ రూమర్లపై పూరీ తనయుడు, హీరో ఆకాశ్ పూరీ స్పందించాడు. 'నాన్న సినీకెరీర్‌లో చాలా నష్టపోయాడు. అమ్మకు పరిస్థితి అర్థమై మాకు ఆ విషయాలేవీ తెలియకూడదని చెల్లిని, నన్ను హాస్టల్ పంపించారు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నా. మేమేమో.. మా నాన్న పెద్ద డైరెక్టర్, అంతా హ్యాపీ అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ వరకు, ఉంటున్న ప్లేస్ అంతా మారిపోయింది. ఉన్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం. ఐదారేళ్లు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం అమ్మే. అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. కొందరు టైంపాస్ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. చదవండి: తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి -
హైదరాబాద్‌లో అది 400 ఏళ్లుగా ఉంది: నిర్మాత
Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie: ‘‘హైదరాబాద్‌లో దాదాపు 400 సంవత్సరాలుగా ‘చోర్ బజార్’ ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ చోరీ చేసిన వస్తువులను అక్కడ విక్రయిస్తారని అంటుంటారు. ‘చోర్ బజార్’ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత వీఎస్ రాజు అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘నాది భీమవరం. సినిమాలపై ఆసక్తితో రామ్‌గోపాల్ వర్మ ‘రక్ష’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాను. ‘గుండెల్లో గోదారి, జోరు...’ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘రక్ష’ సమయంలోనే జీవన్ రెడ్డితో నాకు పరిచయం ఏర్పడింది. నేను దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ మాత్రమే చూసుకున్నాను. రాత్రి జరిగే కథ ఇది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు చూపించాం? అనేది ఆసక్తిగా ఉంటుంది. పృథ్వీ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అదనపు ఆకర్షణ. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ సంస్థ కలవడం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
ఆకాశ్ పూరీ ‘చోర్ బజార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటు మంచి హిట్ అయ్యాయి. ఇక బాలకృష్ణ ఇటీవల విడుదల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చోర్ బజార్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చదవండి: పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్ ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ నెల్ 24వ తేదీన సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్ -
చోర్ బజార్: మూగ అమ్మాయితో లవ్‌లో పడ్డ హీరో
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'నా పేరు బచ్చన్.. బచ్చన్ సాబ్.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల' అంటూ ఆకాష్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక డైమండ్ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ నాన్న సినిమా చేద్దామంటే కుదరదని చెప్పేశా: ఆకాశ్ పూరి -
జిమ్‌లో క్లీనింగ్ చేశాను: పూరీ తనయుడు ఆకాష్
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చోర్ బజార్'. సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను సైతం పంచుకున్నాడు. తనకు తొలి రెమ్యునరేషన్ ప్రకాశ్‌రాజ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. 'ఓసారి ఏమైందంటే నేను నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక్కసారి చూద్దామని నాన్న గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ లాగిపెట్టి కొట్టి వెళ్లిపోమన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్ టైం జాబ్ చూశాను, చేయమన్నారు. అలా జిమ్‌కు వెళ్లి క్లీనింగ్ చేశా. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్ చేస్తున్నానన్నాను. కానీ వారికి నేను పూరీ కొడుకు అని తెలిసిపోయింది. ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. ఇక రామ్‌చరణ్ అన్నయ్య ఓసారేం చేశారంటే నాకు జెల్ ఇష్టమని రకరకాల హెయిర్ స్టైయిల్స్ వేశారు. ఓసారి మార్కెట్లో లయన్ కింగ్ సీడీని దొంగిలించి ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకుని వచ్చేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే పూరీ కొడుకు.. పూరీ కొడుకు, స్టార్డమ్ ఉన్న వాళ్ల నాన్న ఉన్నాడు, వాడికేంటిలే అనే టాక్ బయట బాగా ఎక్కువైపోయింది. అందుకే నాన్న నాతో సినిమా చేద్దాం అన్నా కూడా నో చెప్పాను. పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పాను' అని పేర్కొన్నాడు పూరీ. చదవండి: విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్... సూర్యకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌ను తలపిస్తున్న శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్ -
'మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె'.. చోర్ బజార్ సాంగ్ విన్నారా?
Hero RAM Launched Akash Puri Movie Title Song: ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హీరో రామ్ పోతినేని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్ చాలా ట్రెండీగా ఉంది, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఈ సినిమాతో ఆకాశ్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. ‘మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్ బజార్... ఆజా చోర్ బజార్..’ అంటూ సాగే ఈ పాటకు నవాబ్ గండ్, అసురన్ టీమ్ సంగీతం, ర్యాప్ అందించి, పాడారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మా సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. -
స్నేహం నేపథ్యంలో 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ' చిత్రం
త్రిగున్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందుతున్న చిత్రం 'కార్టూన్స్ 90టీస్ కిడ్స్ బె ఈడ'. సాయితేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై తీసిన తొలి సీన్‌కి హీరో ఆకాశ్ పూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. 'ఢీ’లో డ్యాన్సర్‌గా, కంటెస్టెంట్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేశాను. స్నేహం నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. 1990 దశకంలో పుట్టినవారి అనుభవాలు కూడా ఉంటాయి' అన్నారు సాయితేజ సప్పన్న. 'ఇది కామెడీ డ్రామా మూవీ' అన్నారు శ్రీకాంత్ దీపాల. -
ఆర్జీవీ చేతుల మీదుగా దీపాల ఆర్ట్స్ సినిమా ప్రారంభం, టైటిల్ ఇదే..
హీరో త్రిగున్(అరుణ్ అదిత్), పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగాసాయి తేజ సప్పన్న దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘కార్టూన్స్ 90s కిడ్స్ బే ఈడా’. శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ.. హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఇక నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా రామ్ గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించాడు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. -
రొమాంటిక్: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Romantic Movie On AHA: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యే రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్‌కు ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. పూరి ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించగా ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డార్లింగ్ ప్రభాస్ వల్ల ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. చదవండి: రొమాంటిక్ సినిమా ఎలా ఉందంటే.. తాజాగా రొమాంటిక్ మూవీ ఓటీటీ ట్రాక్ ఎక్కింది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే థియేటర్లో ఈ సినిమా చూసిన పూరీ ఫ్యాన్స్ మరోసారి ఓటీటీలో చూడొచ్చని సంతోషిస్తున్నారు. అటు థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఆహాలో చూసేయొచ్చన్నమాట! 'Vasco' and 'Monica' are here to charm you 🥰 Get ready to see the world in a Romantic way from November 26❣️#RomanticOnAHA @ActorAkashPuri @AnilPaduri @meramyakrishnan @purijagan #KethikaSharma pic.twitter.com/8dLFzTfEcP — ahavideoIN (@ahavideoIN) November 16, 2021 -
నా పోస్టర్ దగ్గర నేనే సెల్ఫీ తీసుకున్నా: ఆకాష్ పూరి
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `పోస్టర్`. టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. బుధవారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పోస్టర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 19న పోస్టర్ విడుదలవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ...``ప్రతి సినిమాకు, ప్రతి నటుడికి పోస్టర్ ఎంతో ఇంపార్టెంట్. `మెహబూబా` సినిమా టైమ్‌లో నాకిష్టమైన ఐమాక్స్ థియేటర్ వద్ద నా సినిమా పోస్టర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. నా పోస్టర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకున్నాను. అటువంటి ఒక మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి`` అని కాంక్షించారు. యంగ్ హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ ...`హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్‌లో నాకు ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. నటుడు, దర్శకుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ...`` ప్రతి సినీ కళాకారుడికి పోస్టర్‌తో ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే టైటిల్. నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను``అన్నారు. దర్శకుడు టి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ....``సినిమా పోస్టర్ నన్ను సినిమా రంగం వైపు రప్పించింది. సంధ్య థియేటర్లో కొంత కాలం ఆపరేటర్‌గా పని చేశాను. ఆ తర్వాత డైరక్షన్ డిపార్ట్మెంట్లో కొంత కాలం పని చేశాక.. ఫస్ట్ టైమ్ `పోస్టర్` సినిమా డైరెక్షన్ చేశాను. ఇది అందమైన ప్రేమకథ, ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ`` అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అరుణ్, డాన్స్ మాస్టర్ అరుణ్, నటి మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
కేతిక ఏడుపు చూసి భయపడ్డా
-
గరం గరం వార్తలు 30 October 2021
-
Romantic Review: రొమాంటిక్ మూవీ రివ్యూ
టైటిల్ : రొమాంటిక్ నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ దర్శకత్వం : అనిల్ పాదూరి సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : నరేష్ రానా విడుదల తేది : అక్టోబర్ 29,2021 పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మరి ఏసీపీ రమ్య వలలో వాస్కోడిగామా చిక్కాడా లేదా? మోనికతో మోహం ఏమైంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ. ఎవరెలా చేశారంటే... గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది. ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే...? పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది. అయితే లాజిక్లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రొమాంటిక్ మూవీ ట్విటర్ రివ్యూ
పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Can watch #Romantic 3 times for @ActorAkashPuri, 3 times for #Ketikasharma & 1 time for the entire team 🥳 Loved it ❤@purijagan @Charmmeofficial #AnilPaduri #SunilKashyap @PuriConnects #RomanticOnOCT29th pic.twitter.com/gKjjOdUBTe — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 Just watched #romantic Thoroughly enjoyed it!🙂@ActorAkashPuri killed it!👏👏#Ketikasharma did a great job, welcome to TFI! Wishing the entire team all the very best!#RomanticOnOCT29th pic.twitter.com/Hhd2YrUYo4 — Teja Sajja (@tejasajja123) October 27, 2021 @purijagan Big blockbuster of Movie #romantic @ActorAkashPuri #blockbuster @purijagan Garu big fan of ur love you sir❤️❤️💪 pic.twitter.com/7qQBYh2MuU — Arun (@Arun81197894) October 29, 2021 " I love india Rupayi karchundadu I Love you dhoola teeripothundi" @purijagan things 🔥🔥 #Romantic — E Avinash (@EAvinash1106) October 29, 2021 Breaking update Hero #Ram Cameo in #Romantic movie 😍🤩🥰 — E Avinash (@EAvinash1106) October 29, 2021 #Romantic : “Turns out to be OVERMATIC” 👉Rating : 1.25/5 ⭐️ Positives: 👉Few dialogues Negatives: 👉Entire Film 👉Bad Narration 👉Overaction This puri Akash film will make you feel…Ela cheparura premieres lo🥲#akashpuri #KetikaSharma pic.twitter.com/X1Vu09ooPZ — Theinfiniteview (@theinfiniteview) October 29, 2021 Block Buster Director @AnilRavipudi Sir Speech at #Romantic Special Premiere 💥 Releasing Tomorrow in Theaters 💥 All The Best To The Entire Team From Anil Sir Fan's 🙌💥@ActorAkashPuri #Ketikasharma@purijagan #AnilRavipudi#RomanticOnOCT29th pic.twitter.com/maR74yihPx — Anil Ravipudi FC™ (@AnilRavipudiFC) October 28, 2021 The fighting back of urge to watch #Romantic is real. I'm torn from the gut. — Alice in Cinema Hall 🎥 (@cinemapilla) October 29, 2021 -
రొమాంటిక్ మూవీ టీం తో గరం సత్తి ముచ్చట్లు
-
‘రొమాంటిక్’ మూవీపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ మూవీ అక్టోబర్ 29(శుక్రవారం) విడుదలకు సిద్దమైన సంగితి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ షోకు దర్శకుడు ధీరుడు రాజమౌళి కుటంబ సమేతంగా వచ్చి వీక్షించారు. అలాగే స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు బాస్కర్, గొపిచంద్ మిలినేని, బాబీ, మెహర్ రమేశ్‌లతో పలువురు నటీనటులు ఈ పీమియర్ షోకు హజరయ్యారు. ఈ షో చూసిన అనంతరం డైరెక్టర్లంతా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీ బాగుందని, ఇది ఆకాశ్ కెరీర్‌కు మైల్స్టోన్ అవుతుందని కితాబిచ్చారు. చదవండి: ChaySam Divorce: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ అలాగే రాజమౌళి కూడా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ఇది కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. అనిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు ఎక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు #ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021 -
ఆకాశ్ మంచి నటుడే.. కానీ అందులో చాలా వీక్: పూరి జగన్నాథ్
‘ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. రొమాంటిక్ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది’అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటే చేసింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. . ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాశ్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాశ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాశ్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక మనం చేద్దామని ఆకాశ్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు. ‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు నటి, నిర్మాత చార్మి. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’అన్నాడు యంగ్ హీరో ఆకాశ్. -
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్గా నటించింది. చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయా: కేతికా శర్మ
‘నేను డిల్లీ నుండి వచ్చాను. మాది డాక్టర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు సినిమా రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్ ద్వారా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’అన్నారు హీరోయిన్ కేతిక శర్మ. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది. ►ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ►నా మొదటి చిత్రమే పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ►నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషంగా నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది. ► ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాశ్‌తో కలిసి నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. దర్శకుడు అనిల్ ని ప్రతీ సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని. టోటల్ ఔట్పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది. ► ఆకాశ్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. ► బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే. ► ప్రభాస్ మా టీంను పిలిచారు.. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ బాహుబలి మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ► సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీ గారు మా వెంటే ఉన్నారు. ఆమే నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి. ► రొమాంటిక్ చిత్రంలో కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఆనందంగా ఉంది. ► రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి.. ప్రతీ సీన్ ట్రీట్‌లా ఉంటుంది. ► డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే డబ్బింగ్ చెప్పాలని, అది జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను. -
అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్
Prabhas Chitchat With Romantic Team: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి చేస్తున్న రొమాంటిక్ సినిమాను దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ తాజాగా రొమాంటిక్ హీరో, హీరోయిన్లతో సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్, కేతికా శర్మలకు తనదైన స్టైయిల్లో ప్రశ్నలు సంధించాడు. ఈ క్రమంలో ఇంటర్వ్యూ మొదట్లో కేతికా..తనని తాను పరిచయం చేసుకుంటూ..హాయ్ సార్, నేను ఢిల్లీ నుంచి కేతికను” అని చెప్పగా, “హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్” అంటూ డార్లింగ్ బదులిచ్చాడు. హీరోయిన్ కేతిక బాగా పాడుతుందని ఆకాశ్ చెప్పగా.. ‘లేదు సార్. నేను కేవలం బాత్రూం సింగర్‌ని’ అని ఆమె పేర్కొంది. అయితే ఆకాశ్ మాత్రం ‘ఇది బాత్రూం అనుకో. నేను, ప్రభాస్ అన్న ఇక్కడ లేము అనుకో.. ఏమంటావ్ డార్లింగ్’ అని ప్రశ్నించగా... ‘ఆమె బాత్రూంలో నేను ఎందుకు ఉంటానురా?’ అంటూ ప్రభాస్ అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇంటర్వ్యూ మొత్తం ప్రభాస్ చాలా ఓపెన్ అప్ అయి మాట్లాడాడు. సెటైర్స్ వేస్తూ ఆద్యంతం కట్టిపడేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంత బిజీగా ఉన్నా ఒక యంగ్ హీరో కోసం ప్రభాస్ ప్రమోషన్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ప్రభాస్ డార్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీడియో చివర్లో పూరి జగన్నాథ్ భార్య లావణ్య అంటే తనకు ఎంతో ఇష్టం, గౌరవం అని ప్రభాస్ పేర్కొన్నారు. చదవండి: Romantic: భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్ పూరి ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్ నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున -
ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ మూవీ స్టిల్స్
-
ఆకాశ్‌లో ఆ కసి కనిపించింది: సంగీత దర్శకుడు సునీల్
‘‘రొమాంటిక్’ చిత్రంలోని ‘పీనే కే బాద్..’ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసినవాళ్లతో పాటు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి, ‘పీనే కే బాద్..’ అని మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అన్నారు. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘రొమాంటిక్’లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. పూరీగారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ‘రొమాంటిక్’ చూశాక ఆయన కంట్లోంచి నీళ్లు రావడంతో నా పని మీద నాకు నమ్మకం వచ్చింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎమోషన్ అవుతారు. మా ఇస్మార్ట్ గ్యాంగ్ సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్..’. ఈ సినిమాలో కేతికా శర్మ పాడిన ‘నావల్ల కాదే..’ పాట కూడా పెద్ద హిట్ అయింది. ‘వాస్కోడిగామ..’ పాటలో ఆకాష్ వాయిస్ బాగుంది. ప్రీ రిలీజ్లో ఆకాష్ మాట్లాడిన తీరులో తన కసి కనబడింది. హీరోలు ఎంత బాగా నటిస్తే నేను అంత బాగా రీ–రికార్డింగ్ (ఆర్ఆర్) ఇవ్వగలను. ‘రొమాంటిక్’ని అనిల్ బాగా తెరకెక్కించాడు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్లగారే ఉంటారు. పూరీగారు తన సినిమాలన్నీ నాకు ఇవ్వాలని ఏమీ లేదు.. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే ఇష్టం. ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళుతుంటా. హిందీలోనూ రెండు సినిమాలు చేశాను. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావచ్చు. ప్రతి సినిమాలో అలాంటివి చేయలేం.. కానీ, ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘గాడ్సే’ కి సంగీతం అందిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి. చదవండి: ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి -
ఈ వారం ఓటీటీ, థీయేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక దసరా తర్వాత వెండితెరపై చిన్న సినిమాల హవా కొసాగుతోంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన చిత్రాలు ఇప్పుడు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకోస్తోన్న ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. వరుడు కావలేను నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆకాశ్ పూరీ ‘రొమాంటిక్’ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ముంబై బ్యూటీ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న రొమాంటిక్ థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో అలరించనున్నారు. అనిల్ ఇనమడుగు ‘తీరం’ అనిల్ ఇనమడుగు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్ వైజీటీ మరో హీరో. క్రిస్టెన్ రవళి, అపర్ణ కథానాయికలు. యం శ్రీనివాసులు నిర్మంచిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు జంటల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, రొమాంటిక్‌గా తెరక్కించాడు అనిల్. రావణ లంక క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది, దీంతో అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ చిత్రంలో మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జై భజరంగి 2 కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’ చిత్రానికి సీక్వెల్‌గా ఏ. హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిరంజన్ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ విడుదలైంది. ఓటీటీలో జీ5 ►ఆఫత్ ఈ ఇష్క్(హిందీ) అక్టోబరు 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► హమ్ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29 అమెజాన్ ప్రైమ్ ► డైబుక్(హిందీ) అక్టోబరు 29 నెట్‌ఫ్లిక్స్ ►లాభం(తమిళం) అక్టోబరు 24 ► ఆర్మీ ఆఫ్ దీవ్స్ , అక్టోబరు 29 -
పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్
‘‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ‘రొమాంటిక్’. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యూత్ సినిమానే కాదు.. కుటుంబ ప్రేక్షకులూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అనిల్ పాదూరి అన్నారు. ఆకాశ్ పూరి, కేతిక శర్మ జంటగా రమ్యకృష్ట ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ పాదూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాలో రేకెత్తించింది పూరి జగన్నాథ్‌గారే. ‘రొమాంటిక్’ కథని డైరెక్ట్ చేయమని చెప్పారు పూరిగారు. ‘రొమాంటిక్’ కథ, మాటలు ఆయన రాసినా సినిమాలో నా మార్క్ కనిపిస్తుంది. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ పాత్రకు ఆకాశ్ వంద శాతం న్యాయం చేశాడు. ‘రొమాంటిక్’ ఫస్ట్ కాపీ చూసిన పూరిగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ‘నా సినిమాలో ఇంత ఎమోషన్ ఉందా?. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ఎమోషన్ ఉంది.. ‘రొమాంటిక్’ లో అంత కంటే ఎక్కువగా ఉంది.. సినిమా బాగా తీశావ్.. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకున్నారు. నా తర్వాతి చిత్రం యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లోనే చేస్తాను’’ అన్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేయాలి: విజయ్ దేవరకొండ
‘‘పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చేసే సినిమాలన్నీ వరంగల్‌లోనే స్టార్ట్ చేయాలి.. ఎందుకంటే వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ‘రొమాంటిక్’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఆకాశ్ మాటలు విన్నాక తనలో మంచి ఫైర్ ఉందనిపించింది. మీ నాన్న (పూరి జగన్నాద్) కాలర్ ఎగరేయాలి. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి పూరి, చార్మీగార్లు నాకు చెప్పేవారు. ప్రతి సినిమా చూస్తాడట.. సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. సక్సెస్ అవుతావు. ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారు. ఈ సినిమా 100శాతం హిట్ అవుతుంది. విధి అనేది నన్ను, పూరి జగన్నాథ్, చార్మీలను కలిపింది. ‘లైగర్’ సినిమా కోసం వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాం’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నాకు పదేళ్లప్పుడు స్కూల్ తరపున వరంగల్‌కి వచ్చాను. అప్పటి నుంచి నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ‘రొమాంటిక్’ చిత్రంలో ఆకాశ్, రమ్యకృష్ణ, కేతిక ఇరగ్గొట్టేశారు. మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమా చూడండి. ఆకాశ్ చాలా మాట్లాడేశాడు.. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ లేవగానే ఓ డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు నన్ను. తను మంచి నటుడు’’ అన్నారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ వరంగల్‌లో చేశాం.. పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తోనే ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలి’’ అన్నారు చార్మి. అనిల్ పాదూరి మాట్లాడుతూ– ‘‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌గారు పూరి జగన్నాథ్‌గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను నమ్మి ‘రొమాంటిక్’ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, చార్మీగార్లకు థ్యాంక్స్. మంచి ప్రేమకథా చిత్రాల్లో ‘రొమాంటిక్’ కూడా ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పూరి ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో నర్సీపట్నంలో పుట్టిన మా నాన్న సినిమా నేపథ్యం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి పైకి వచ్చారు. ‘పూరి టైమ్ అయిపోయిందిలే.. ఇక సినిమాలు ఏం చేస్తాడు?’ వంటి రకరకాల కామెంట్స్ చూసినప్పుడు బాధ వేసేది. అలాంటి వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో సమాధానం చెప్పారు. అలాగే ‘వీడేం హీరోలే’ అని నన్ను కొందరన్నారు. నన్ను చూసి మీరు గర్వపడేలా ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతా నాన్నా.. ఏదో ఒకరోజు గర్వంగా మీరు కాలర్ ఎగరవేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి
‘‘రొమాంటిక్’ మూవీ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్లుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్లుగా లాస్ట్ షాట్లో అద్బుతంగా అనిపించాడు. యాక్టర్‌గా ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. అనిల్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు ప్రభాస్. ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో వాస్కో పాత్రలో ఆకాష్, మౌనిక పాత్రలో కేతిక నటించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ప్రభాస్ ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేసిన వీడియోను ప్లే చేశారు. అనంతరం ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్’ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? ఈవెంట్‌కు రావాలా? అని అడిగారు. ప్రభాస్ చాలా మంచివారు. ‘రొమాంటిక్’ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ‘డార్లింగ్..’ అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ సర్ప్రైజింగ్గా ఉండబోతోంది. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అనిల్ ‘రొమాంటిక్’ను బాగా తెరకెక్కించాడు’’ అన్నారు చార్మి. చదవండి: ‘రొమాంటిక్’గా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న ఆకాశ్ పూరీ -
‘రొమాంటిక్’గా ట్రైలర్.. లాంచ్ చేసిన ప్రభాస్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అనంతరం హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకుడు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్ పూరినే అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. ‘ఐ లైక్ దిస్ ఎనిమల్’ అంటూ ఆకాశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయిన ఈ ట్రైలర్ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న ఈ కుర్ర హీరో ఎలాగైనా సక్సెస్ రుచి చూడాలని కసిగా ఈ సినిమాతో చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీత అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 29న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. చదవండి: ప్రభాస్ ‘సలార్’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి? -
ఆకట్టుకుంటున్న ఆకాశ్ కొత్త సాంగ్ ‘పీనే కే బాద్’
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఇందులో కేతికా శర్మ హీరోయిన్గా నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పీనే కే బాద్’ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘హ్యాపీ హ్యాపీ మామ.. దిల్ ఖుష్ అవుతుందే పీనేకే బాద్...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు ‘పీనే కే బాద్’ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట థీమ్‌కు తగ్గట్లు పబ్‌లో షూట్ చేశాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యపే పాడారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. చదవండి: సల్మాన్ ఖాన్ని డైరెక్ట్ చేయనున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ..? -
ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ విడుదల ఎప్పుడంటే..
డైనమిక్ డైరెక్టర్ పూరిగజన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేతికా శర్మ అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. (చదవండి: డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున) ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. -
పచ్చబొట్టు పొడిపించుకున్న ఆకాశ్ పూరి..
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్ బజార్’’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి బర్త్ డే (జూలై 25) సందర్భంగా ‘చోర్ బజార్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆకాశ్.. చేతి మీద బచ్చన్ సాబ్ అనే ట్యాటూ కనిపిస్తోంది. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. హ్యాపీ బర్త్‌డే బచ్చన్ సాబ్ తనయుడు ఆకాశ్ పూరి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ వీడియో విడుదల చేశారు. ‘హ్యాపీ బర్త్ డే బచ్చన్ సాబ్.. బచ్చన్ సాబ్ ఎవరనుకుంటున్నారా? ‘చోర్ బజార్’లో మా ఆకాశ్ పేరు. ఈ సినిమా బాగా వస్తోందని విన్నాను.. ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఆకాష్.. వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే.. లవ్ యు’’ అని పూరి అన్నారు. -
రన్నింగ్ బస్‌లో లిప్‌లాక్.. ‘రొమాంటిక్’గా పూరీ కొడుకు
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటింగ్. ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. అనిల్ పడూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18న థియేటర్లలో సినిమా రిలీజ్ కానున్నట్లు సోమవారం హీరో ఆకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లో.. నడుస్తున్న బస్ డోర్ దగ్గర హీరోయిన్ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి సినిమా ఎంత రొమాంటిక్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ గతేడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా నిలిచిపోయింది. రమ్య కృష్ణ, మందిరా బేడి, మకరంద్ దేశ్‌పాండే, దివ్యదర్శిని తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రొమాంటిక్ సినిమా టీజర్‌ను పూరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆంధ్రాపోరి చిత్రంతో టాలీవుడ్లోకి ఆకాష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018లో మెహబూబా చిత్రంతో పలకరించాడు. ఇండియా- పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఆకాష్ ఎదురు చూస్తున్నాడు. View this post on Instagram A post shared by Akash Puri (@actorakashpuri) ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కూడా జూన్ నెలలోనే విడుదల కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే రొమాంటిక్ జూన్ 18న రిలీజ్ అవుతుండగా.. జూన్ 18న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సీఫీస్ వద్ద పోటీ పడనున్నాయని చెప్పవచ్చు. చదవండి: ‘ఆకాష్’ దొంగల బజార్ ఖరార్ కామ్రేడ్‌గా చరణ్.. ఆచార్య సెట్లో నాన్నతో ఇలా.. -
దొంగల బజార్ ఖరార్
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి చోర్ బజార్లోకి ఎంటరయ్యారు. దొంగిలించిన వస్తువులను చేర్చే చోటునే చోర్ బజార్ అంటారు. దొంగ ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ జీవ¯Œ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘చోర్ బజార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వీ ప్రొడక్ష¯Œ ్సపై వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సీన్‌కి ఆకాష్ తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేయగా, సోదరి పవిత్రా పూరి క్లాప్ ఇచ్చారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ను అందించారు. ఐ.వి ఎస్.ఎన్ రాజు దర్శకత్వం వహించారు. ‘‘ఈ కథ అందరి ఊహలకు భిన్నంగా ఉంటుంది. మంచి లవ్, యాక్షన్ ఎంటర్టైనర్. ఈ నెల 26న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సుబ్బరాజు, పోసాని, అర్చన నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్: సత్య గిడుటూరి, సహ నిర్మాత: అల్లూరి సురేష్‌వర్మ. -
నా కేరాఫ్ అడ్రస్ నాన్నే: ఆకాష్ పూరీ
సాక్షి, అరసవల్లి: ‘నా కేరాఫ్ అడ్రస్ నాన్నే... నన్ను బాల నటుడిగా స్క్రీన్ మీద చూసుకున్న నాన్న .. ఇప్పుడు హీరోను చేశారు. అందుకు తగిన శిక్షణ కూడా ఆయనే ఇచ్చారు...ఆయన స్ఫూర్తితోనే అతని అడుగుజాడల్లోనే ఉత్తమ హీరో అనిపించుకోవాలనేది నా ఆశ..’ అంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ తెలిపారు. ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి ఆదిత్యుని ఆలయానికి వచ్చిన యువ హీరో.. మీడియాతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ తనయులతో కలిసి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్యుని చిత్రపటాన్ని హీరో ఆకాష్‌కు అందజేస్తున్న ఈఓ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమా అంటే తనకు పిచ్చి అని, అందుకు నాన్న కూడా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రాపోరి, మెహబూబా తదితర చిత్రాల్లో హీరోగా నటించానని, తాజాగా రొమాంటిక్ అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉందని తెలిపారు. లవ్ అండ్ యాక్షన్ మూవీస్‌పైనే తన దృష్టి ఉందని, మాస్ సినిమాలకు కూడా ప్రిపేరవుతున్నానని చెప్పారు. ఆదిత్యుని దర్శనం తొలిసారిగా చేసుకున్నానని ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆదిత్యుని చిత్రపటాన్ని ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఆయనకు అందజేశారు. -
రొమాంటిక్ మూవీ హీరోయిన్ కేతికా శర్మ ఫోటోలు
-
‘రొమాంటిక్’ సినిమా స్టిల్స్
-
వేసవిలో రొమాంటిక్
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అనిల్ పాడూరి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. వేసవి సెలవుల్లో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లు మా సినిమాను చూడొచ్చు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య -
‘రిలీజ్ ఎప్పుడో రేపు చెబుతాం’
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘రొమాంటిక్’చిత్ర విడుదల తేదీపై పూరి జగన్నాథ్ స్పష్టతనిచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీని రేపు(సోమవారం) మధ్యాహ్నం గం.1:56 నిమిషాలకు ప్రకటిస్తామంటూ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశాడు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. Keep an eye out for the exciting announcement, the release date of #Romantic will be announced tomorrow @ 1.56Pm. Starring @ActorAkashPuri #Ketikasharma 💰 @purijagan @Charmmeofficial 🎬 @anilpaduri 🎼#SunilKashyap @PuriConnects #PCfilm pic.twitter.com/GGNUalxyqy — PURIJAGAN (@purijagan) February 9, 2020 చదవండి: ‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’ ‘సరాసరి గుండెల్లో దించావె..’ -
‘నా వల్ల కాదే’ అంటూ ఫుల్ బాటిల్ ఎత్తేశాడు
ఎన్నో మాస్ చిత్రాలకు దర్శకత్వం వహించి కమర్షియల్ హిట్లు కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’ . ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ వీడియో సాంగ్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్‌ను రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ‘నా వల్ల కాదే’ లిరికల్ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. అందులో ఆకాష్ పూరి సముద్ర ఒడ్డున ఫుల్ బాటిల్‌ను ఎత్తి తాగుతూ కనింపించగా.. హీరోయిన్ కేతికా శర్మ ఆకాష్ వెనకాల విచారంగా కుర్చుని ఉన్నారు. దీంతో ఇది ఓ విషాద ప్రేమ గీతం కావచ్చని కొందరు, బ్రేక్ ప్ సాంగ్ ఏమోనని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చేడాల్సిందే. View this post on Instagram "Where there is love , there is pain “❣ #NaaVallaKadhe lyrical song from #Romantic will be releasing tomorrow @ 5PM. Stay tuned! 📝 @poetbb 🎤#SunilKashyap 💰 @purijagannadh @charmmekaur 🎬 @anil.paduri @actorakashpuri @ketikasharma @puriconnects #PCfilm 💖 A post shared by Puri Jagannadh (@purijagannadh) on Jan 22, 2020 at 8:33pm PST ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్.. ఆ తర్వాత తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు సినిమాలు ఆకాశ్‌కు మంచి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. అయితే ఈసారి తన కొడుకుకు ఎలాగైనా హిట్టు ఇవ్వాలనే కసితో ఉన్నాడు పూరి జగన్నాథ్. ఇందుకోసం చార్మితో పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. -
‘ఐలవ్ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు’
‘దేశాన్ని ప్రేమించటం వేరు.. ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐలవ్ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు.. ఐ లవ్ యూ.. సరదా తీరిపోద్ది’ప్రస్తుతం ఈ లిరిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు డైలాగ్‌లు రాయడం వరకే పరిమితమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా మరో ముందడుగేసి ఓ పాట రాశాడు తన కొడుకు ఆకాశ్ కోసం. ఆకాశ్ పూరి హీరోగా ముంబై భామ కేతిక శర్మ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘రొమాంటిక్’ చిత్రంలోని ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే ఫస్ట్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు పూరి స్వయంగా లిరిక్స్ అందించగా.. చిన్మయి శ్రీపాద ఆలపించారు. సునీల్ కశ్యప్ సంగీతమందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూరి రైటింగ్ స్కిల్స్‌కు నెటిన్లు ఫిదా అవుతున్నారు. పూరి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా ఫలితం బెడిసి కొట్టడంతో ఎలాగైనా తన కొడుకుతో హిట్ కొట్టించాలనే కసితో ఉన్నాడు ఈ ఇస్మార్ట్ డైరెక్టర్. దీనిలో భాగంగా కొడుకు ఆకాష్ కోసం పక్కా లవ్ స్టోరీని ప్రిపేర్ చేశాడు. అయితే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరికి అప్పగించాడు. కాగా, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ‘నువ్వు నేను ఈ క్షణం’ వీడియో సాంగ్ #Romantic An intense love story 💖#NuvvuNenuEkshanam video song out now 👇🏻https://t.co/Hv3gXM2YJN Starring @actorakashpuri & #KetikaSharma Music #SunilKasyap Directed by @anilpaduri A @purijagan @Charmmeofficial Production@PuriConnects #PCfilm — PURIJAGAN (@purijagan) December 21, 2019 -
‘రొమాంటిక్’ సినిమా నుంచి మరో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ . ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆకాశ్ సరసన ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ను మేకర్ అనౌన్స్ చేశారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ‘రొమాంటిక్’ సినిమాలోని ఫస్ట్ వీడియో సాంగ్ ‘నువ్వు నేను ఈ క్షణం’ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆకాశ్-కేతికల మధ్య ఈ పాట తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని కేతిక ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆకాశ్ పూరి.. తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాలో నటించాడు. కానీ ఈ రెండు సినిమాలు ఆకాశ్‌కు మంచి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఆకాశ్ ఉన్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. -
రొమాంటిక్‌కి గెస్ట్
రామ్ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్‌గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్ప్రైజ్గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారట రామ్. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. -
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్‌గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్‌గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
గోవాలో...
గోవా మంచి హాలిడే స్పాట్. అది మాత్రమే కాదు.. షూటింగ్స్‌కి కూడా మంచి స్పాట్. అందుకే ‘రొమాంటిక్’ టీమ్ గోవా వెళ్లింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పణలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గోవాలో 30 రోజులపాటు జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. -
రొమాంటిక్‌లో గెస్ట్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన కొత్త సినిమా కోసం రొమాంటిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ భామ మందిరా బేడీ కీలక పాత్ర చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్ సినిమాను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్ చేయబోతున్నారు. అయితే అప్పుడు గెస్ట్ రోల్. ఇప్పుడు కథానాయిక. -
‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అభిమానులు ముఖ్యంగా యువత ఎంతగానే ఆసక్తి కనబరుస్తుండటంతో ‘రొమాంటిక్’.పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బటయటకువచ్చింది. `బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనుందని తెలుస్తోంది. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇక ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు. -
వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్‌లుక్ విడుదలైయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న తొలిచిత్రంలోనే ఫస్ట్‌లుక్‌లో అందాల ఆరబోతతో ఆదరగొట్టింది. స్టన్నింగ్ ఫోటోతో కుర్రకారుల మతిపోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్‌లుక్ విడుదలైన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో ఈ ఫోటో చెక్కర్లుకొడుతోంది. చాలామంది నెటిజన్లు, చిత్ర ప్రముఖులు ఈ ఫోటోపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్ను చేసేశారు పూరి. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. -
రేపే ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో మంది హీరోలకు ఎనలేని క్రేజ్‌ను సంపాదించిపెట్టాడు. అయితే సొంతకొడుకు అయిన ఆకాష్‌కు మాత్రం ఒక్క హిట్టు ఇవ్వలేకపోతున్నాడు. తన నిర్మాణంలో సినిమా చేపట్టినా, తన దర్శకత్వంలో సినిమా తెరకెక్కించినా హీరోగా మాత్రం నిలబెట్టలేకపోతున్నాడు. చివరగా మెహబూబా అంటూ ఆకాశ్ పూరి పలకరించినా.. అంతగా మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ‘రొమాంటిక్’ ఫెల్లోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. మరి పూరి శిష్యుడైన అనిల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పైన నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చేసింది. రేపు (సెప్టెంబర్ 30) ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాతోనైనా ఆకాశ్ హిట్టు కొడతాడా? లేదా అన్నది చూడాలి. వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్ -
‘రొమాంటిక్’ హీరోయిన్
ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాకపోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ ‘రొమాంటిక్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. కేతిక శర్మ అనే మోడల్ ఆకాష్ సరసన హీరోయిన్గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు. Our hot hot KETIKA SHARMA will b romancing with @ActorAkashPuri in #romantic .. joins shoot in #goa from today 🔥 #PCfilm @purijagan @Charmmeofficial @anilpaduri @puriconnects pic.twitter.com/9RC4gENUoj — Charmme Kaur (@Charmmeofficial) 11 March 2019 -
రొమాంటిక్ ఆకాష్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఆకాష్ తాజాగా ‘రొమాంటిక్’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. నూతన దర్శకుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నా«థ్, చార్మి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. సీనియర్ నటి రమాప్రభ, హీరో కల్యాణ్ రామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా తొలి సన్నివేశానికి కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. రొమాంటిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాష్ సరికొత్త లుక్, స్టైలిష్‌గా కనిపించనున్నాడని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ పతాకాలపై రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త. -
‘రొమాంటిక్’గా ఆకాష్ పూరి!
ఆంధ్రాపోరీ, మెహబూబా అంటూ తన తనయుడిని హీరోగా లాంచ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే ఈ సారి పూరి జగన్నాథ్ కథను అందించి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మరోసారి తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీకి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు పూరి జగన్నాథ్ అందించగా.. తన శిష్యుడు అనిల్ పాడురిని దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా అయినా ఆకాష్‌కు కలిసి వస్తుందో లేదో చూడాలి. పూరి కనెక్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం పూరి రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’తో బిజీగా ఉన్నాడు. #romantic @ActorAkashPuri @Charmmeofficial #AnilPaduri #shootbegins pic.twitter.com/hubvghGZc0 — PURIJAGAN (@purijagan) February 11, 2019 -
‘వాస్కోడగామా’గా ఆకాష్..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ సరసన గాయత్రి భరద్వాజ్ అనే మోడల్‌ను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
పూరి నెక్ట్స్ ‘వాస్కోడగామా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మై డియర్ బ్రదర్
-
అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు..
రక్ష బంధన్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాద్ కూతురు పవిత్ర, కొడుకు ఆకాశ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
ప్రేమదేశం ప్రారంభం
‘నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా’ పాట వినగానే టక్కున ‘ప్రేమదేశం’ సినిమా గుర్తుకు రాకమానదు. అబ్బాస్, వినీత్, టబూ ప్రధాన పాత్రల్లో 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. అజయ్, మాయ జంటగా శ్రీకాంత్ శిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేషన్స్ వర్క్స్ పతాకంపై శిరీష, నీలిమ తిరుమల్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఆకాష్ పూరి క్లాప్ ఇచ్చారు. ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకునిగా, శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, అజయ్ కతుర్వ, మాయ, శివకుమార్ రామచంద్రవరపు, వైశాకి నటిస్తున్నారు. -
‘మెహబూబా’ మూవీ రివ్యూ
టైటిల్ : మెహబూబా జానర్ : లవ్ ఎంటర్టైనర్ తారాగణం : ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే సంగీతం : సందీప్ చౌతా దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : పూరి కనెక్ట్స్ చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ముందు నుంచి ఇది పూరికి కూడా రీలాంచ్ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్రయూనిట్. పూరి తన రెగ్యులర్ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ టేకింగ్‌తో చేసిన మెహబూబా పూరికి సక్సెస్ అందించిందా..? ఆకాష్ హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నాడా..? కథ ; రోషన్ (ఆకాష్ పూరి)ను చిన్న తనం నుంచి ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని అనిపిస్తుంటుంది. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని.. ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్ లో ఉన్న అఫ్రీన్ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది అఫ్రీన్. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది.(సాక్షి రివ్యూస్) ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాకు వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన అఫ్రీన్‌ను.. రోషన్ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్ ముఖం చూడని అఫ్రీన్.. ఎలాగైన తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి తనను తిరిగి పాకిస్తాన్‌కు పిలిపిస్తాడు. పాకిస్తాన్ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్కు.. అదే ట్రైన్లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.(సాక్షి రివ్యూస్) గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పట్టుందని తెలుసుకుంటాడు రోషన్. అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? పాకిస్తాన్ వెళ్లిపోయిన అఫ్రీన్‌ను రోషన్ ఎలా కలవగలిగాడు..? చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్.. చాలా రోజులు తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్ హీరోగా రీలాంచ్ అయ్యాడు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా మెప్పించిన ఆకాష్, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. హీరోయిన్గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్ పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ ; ఆకాష్‌కే కాదు మెహబూబా పూరి జగన్నాథ్‌కు కూడా రీలాంచ్ లాంటిందే. అందుకే తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జోడించాడు. తన స్టైల్ మార్చి కొత్త టేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి తన మార్క్ టేకింగ్‌ను ఇష్టపడేవారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. (సాక్షి రివ్యూస్) అభిమానులు పూరి సినిమాలో ఆశించిచే పూరి మార్క్ హీరోయిజం, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటమే ఇందుకు కారణం. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్ చౌతా డిఫరెంట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్ సీన్స్ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి ఫస్ట్ హాప్లో కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే లాజిక్ లేని సీన్స్ పూరి మార్క్ కనిపించకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది
‘‘పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం ఇది వరకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది. జెన్యూన్ లవ్‌స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్ బ్యానర్‌పై వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్ ఆడియన్స్‌కు చూపిస్తే జనరల్ టాక్ తెలుస్తుందని పబ్లిక్ షో ఏర్పాటు చేశాం. నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్‌గా సినిమా తీశాను. పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్ థ్రిల్ కలిగింది. అమేజింగ్ రెస్పాన్స్’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు యూఎస్‌లో ఫస్ట్ ప్రీమియర్‌ను టీమ్ అంతా కలసి చూస్తాం. యూఎస్‌లో 2 వీక్స్ టూర్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకాష్‌తో మరో సినిమా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో పూరికి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. అయితే పూరి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ మెహబూబా షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. చిత్రయూనిట్ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మెహబూబా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు పూరి. అంతేకాదు తన తదుపరి చిత్రాన్ని ఆకాష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. రిలీజ్‌కు రెడీ అవుతున్న మెహబూబా ఇంటెన్స్ లవ్ స్టోరి కాగా.. నెక్ట్స్ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాను కూడా పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ లోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పూరి టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.