distribution of pensions
-
ఏం చేయాలన్నా డబ్బుల్లేవు
సాక్షి, అమరావతి : పనులు చేయడానికి డబ్బుల్లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. తప్పులు చేయడం, వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటని అన్నారు.వివేకా హత్యను వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడటాన్ని అగ్నిప్రమాదంగా చెబుతున్నా, అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడిందన్నారు.శాంతిభద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని, ఏ పార్టీ వాళ్లనైనా సహించేది లేదని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామని, రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పారు. ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలని సూచించారు. పవన్‌కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం : పవన్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన పార్టీ నూరు శాతం సహకరిస్తామని తెలిపారు. ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదన్నారు. కూటమిలోని మూడు పారీ్టల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. -
పింఛన్లకు కొర్రీ
సాక్షి, భీమవరం : పింఛన్ల పంపిణీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో కొర్రీ పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదు రోజుల లాగిన్ గడువును ప్రస్తుత ప్రభుత్వం రెండ్రోజులకు కుదించేసింది. దీంతో తర్వాత వచ్చిన వారికి సాయం అందకుండా చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందలేదని అంచనా. జూలై నెలకుగాను రాష్ట్రంలోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర 65,18,496 సామాజిక పింఛన్లకుగాను ఏప్రిల్ నుంచి పెంచిన సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఏడు వేలు చొప్పున రూ.4,400.67 కోట్లు విడుదల చేసింది. రెండ్రోజుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా 64,58,367 మంది లబ్ధిదారులకు రూ.4,360 కోట్ల సాయాన్ని పంపిణీ చేయించారు. తర్వాత లాగిన్ నిలిపివేయడంతో ఆ తర్వాత వచ్చిన వారికి పింఛన్ అందలేదు. సాయం అందాల్సిన 60,129 మందిలో 30–40 శాతం వరకు మృతులు ఉండగా మిగిలిన వారిలో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారే అధిక శాతం మంది ఉన్నారు. ఇతర ప్రాంతాల్లోని వారికి నిరాశ..గత ప్రభుత్వంలో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్ల పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగులకు లాగిన్ గడువు ఉండటంతో మూడు, నాలుగు తేదీల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు వచ్చి పింఛన్ సాయం తీసుకుని వెళ్లేవారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పింఛన్ తీసుకునేందుకు రాలేని వారి వద్దకు వలంటీర్లు వెళ్లి అందించి వచ్చేవారు. ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్ వరకు కూడా వెళ్లి ఆస్పత్రుల్లోని లబ్ధిదారులకు పింఛన్ సాయం అందించిన వలంటీర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా సాయం అందించినప్పటికీ రెండ్రోజులు మాత్రమే గడువివ్వడంతో చాలావరకు స్థానికంగా అందుబాటులో ఉన్నవారికి మాత్రమే వారు పింఛన్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిర్ణీత ఐదో తేదీ దాటిన తర్వాత మిగిలిన మొత్తాన్ని జమచేసేవారు. కానీ, ఈసారి మూడో తేదీనే రూ.40.67 కోట్ల మేర మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమచేసేశారు. గతంలో మాదిరి ఐదో తేదీ వరకు గడువు ఉంటుందని రూ.7,000 పింఛన్ తీసుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వచ్చిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. వచ్చే నెలలో ఈ సాయాన్ని కలిపి అందిస్తారా లేదా? అన్నదానిపై తమకు స్పష్టతలేదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడువేల మందికి పైగా లబ్ధిదారులకు ఇలా పింఛన్ సాయం అందలేదు. పింఛన్ల నిలిపివేతపై కోర్టుకు..బత్తలపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్న కారణంతో పింఛన్లు ఇవ్వకపోవడంపై బాధితులు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టును ఆశ్రయించారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలోని 40 మందికి పైగా అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు పింఛన్లు ఇవ్వడంలేదంటూ ఈనెల మూడున బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఇదే విషయంపై ఎంపీడీఓ శివనాగప్రసాద్, పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్‌ను ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుపడటమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కావున తామేమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని అధికారులు అనడంతో విధిలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులతో కలిసి సుమారు 20 మంది లబ్ధిదారులు శనివారం ధర్మవరం కోర్టులో పిటిషన్ వేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తాము పోరాటం ఆపేదిలేదని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టంచేశారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
పింఛన్ల పంపిణీ.. పవన్ కళ్యాణ్‌కు పరాభవం
పిఠాపురం: వలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యమన్నారని, కానీ వారి అవసరం లేకుండా పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచి్చన హామీ ప్రకారం ఒకటో తేదీన వలంటీర్లు లేకుండానే సచివాలయాలు, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.గతంలో పింఛన్ల పంపిణీలో కొందరు వలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100కు తక్కువ కాకుండా తీసుకునేవారని తనకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. వలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా చేసి చూపించామన్నారు.వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీరు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడం, ప్రతి ఇంటికీ లోటు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించి, ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని చెప్పారు. రక్షిత మంచి నీరు, ఉపాధి, సాగునీటి కాలువల పూడికతీత వంటివి చేసి, ప్రజలకు దగ్గర కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలనేది తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతోందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్‌కు పరాభవం భీమవరం: పింఛన్ల పంపిణీ కరపత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్రించకపోవడం ఆయన్ని పరాభవించడమేనని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి వచి్చన చంద్రబాబు పింఛన్ల కరపత్రంపై కేవలం తన చిత్రాన్ని మాత్రమే ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరపత్రంపై పవన్ ఫొటో ముద్రించకుండా దారుణంగా అవమానించారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తాను మాత్రమే ప్రచారం పొందాలన్న యావ చంద్రబాబుకు ఇంకా పోలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్ల కరపత్రంపై ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా వేయకపోవడం గమనార్హం. దీనిపై ఎనీ్టఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. -
మళ్లీ పాత బాబును చూస్తారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో అధికారులంతా పాతరోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి రావాలని.. చెప్పినట్లు నడుచుకోకపోతే మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇది సీబీఎన్ 4.0 అని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. నాయక్ కుమార్తె ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్, పాములు నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, భార్య సీతాబాయికి రాజధాని పరిధిలో భూమిలేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్‌ను అందించారు. అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. తనకు ఇల్లులేదని సీఎంతో నాయక్ చెప్పగా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపి.. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏమన్నారంటే.. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఐదేళ్లు వారు అణచివేతకు గురయ్యారు. ఇప్పుడు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజలకు మాపై చాలా ఆశలున్నాయి. కానీ, అవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో అర్థంకావడంలేదు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు.గత ఐదేళ్లలో ఇలా సంతోషంగా కూర్చూని మాట్లాడుకుంది ఒక్కరోజు కూడా లేదు. పోలీసులు ఎప్పుడు గోడ దూకి వస్తారో తెలీని పరిస్థితి. భయంకర వాతావరణంలో ప్రజలు, నాయకులు బతికారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ పెన్షన్ ఇవ్వాలని మేం పోరాడినా వినలేదు. అందుకే ఇప్పుడు 1.20 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందిస్తున్నాం. నెలనెలా పెన్షన్లకు అదనంగా రూ.819 కోట్లు రాష్ట్రంలో 28 వర్గాలకు చెందిన 65.31 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకు గతంలో నెలకు రూ.1,938 కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు దానికి అదనంగా రూ.819 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ఇకపై ఏడాదికి రూ.33,100 కోట్లు పెన్షన్లకు ఖర్చుచేయబోతున్నాం. రాబోయే ఐదేళ్లలో రూ.1,65,500 కోట్లు వెచి్చస్తాం. ఈ నెలలో రూ.4,408 కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల సమయంలో ఇచి్చన హామీ మేరకు ఒకేరోజు ఐదు హామీలపై సంతకాలు చేశాను. ఇక రాజధాని తరలిపోతుందని గతంలో ఇక్కడివారు బాధపడితే.. రాజధాని వస్తుందేమోనని విశాఖ వాసులు భయపడ్డారు.పోలవరంలో వాటికి మళ్లీ రూ.990 కోట్లు ఖర్చు ఇక పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్‌ను నాడు జర్మన్ కంపెనీ టెక్నాలజీతో రెండు సీజన్లలోనే నిరి్మంచాం. కానీ, గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోకపోవడంతో వరదలవల్ల డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఇప్పుడు నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గోదావరిలో పోలవరాన్ని ముంచి మళ్లీ ఇప్పుడు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు. ఇక రాజధాని నిమిత్తం అమరావతి రైతులు భూములిచ్చారు. దానికి ప్రతిఫలంగా కేవలం కౌలు మాత్రమే ఇచ్చాం. అయినా అక్రమాలు జరిగాయని కేసులు పెట్టారు. రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులుంటే మాతో చెప్పండి. కోర్టులకెళ్తే పనులు ఆలస్యమవుతాయి. అలాగే, నేను వెళ్లేదారుల్లో పరదాలు కట్టినట్లు కనబడితే సస్పెండ్ చేస్తా. -
పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో 94 మంది లబ్ధిదారులకు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదుతో ఈ నెల ఫించన్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లూ ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటివద్దే నిశ్చింతగా కోవిడ్ కష్టకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన ఫించన్లు ఈసారి కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటుతున్నా చేతికి అందకపోవడంతో పలుచోట్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్ల మంజూరు మొదలు పంపిణీ దాకా రాజకీయాలకు అతీతంగా, ఎవరి సిఫారసులు అవసరం లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లను అందచేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నంగా తాజాగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. గ్రామాల్లోనూ, వార్డులోనూ సచివాలయాల ఉద్యోగుల వెంట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు మోహరించారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తూ పోటాపోటీగా నేతలు ఫోటోలు దిగారు. విజయనగరం తదితర చోట్ల తమ అధిపత్యం నిరూపించుకునేందుకు జనసేన – టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూటమి నేతలు కొన్ని చోట్ల తమ ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో పలువురు పింఛన్లను తొలగించినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో పెదంచలలో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందుకు తమ పింఛన్లు నిలిపివేశారంటూ కొందరు లబ్ధిదారులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 29వ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి (32) సోమవారం రాత్రి తన ఇంట్లో బాత్రూమ్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వారం క్రితం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాతో పాటు సచివాలయ ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సుధారాణి సోమవారం టీడీపీ నేతలతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించారు.తొలిరోజు 95 శాతం.. మొత్తం 64.75 లక్షల మంది లబ్ధిదారులకుగానూ తొలి రోజు సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 61 లక్షల మంది (దాదాపు 95 శాతం)కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలంటీర్లతో సంబంధం లేకుండా పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వలంటీర్లు వారి వెంట వెళ్లి పంపిణీలో పాల్గొన్నారు. ఉదయం కొద్దిసేపు సాంకేతికపరమైన అవాంతరాలు తల్తెత్తడంతో వాటిని సరిదిద్ది ప్రక్రియ కొనసాగించారు.జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నేతల దాడిపింఛన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పింఛన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. చాలాసేపు సద్దుమణగకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశతో వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పింఛను అందించారని గుర్తు చేసుకున్నారు.వృద్ధులు ఉసూరు..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నిర్దేశిత ప్రాంతానికి రావాలని ఆదేశించడంతో వృద్ధులు, దివ్యాంగులు నానా పాట్లు పడి అక్కడకు చేరుకున్నారు. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్‌తో ప్రయత్నించారు. చివరకు సరిపోలడం లేదని, ఫించన్ ఇవ్వలేమని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పలువురు వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరికొన్ని వార్డుల్లో సచివాలయాలకు తాళం వేసి సిబ్బంది పింఛన్ల పంపిణీకి వెళ్లి పోవడంతో సమాచారం తెలియక పలువురు అక్కడకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.మొదటి నెలలోనే చుక్కలు...– సత్యనారాయణ, 5వ వార్డు, తాడేపల్లిగూడెంఅధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మా వార్డులో పంపిణీకి ఇంటికి రాలేదు. ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. సచివాలయానికి వెళితే తాళం వేసి ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.సచివాలయాలకు పరుగు ఉదయం 8 గంటలు దాటుతున్నా సచివాలయ సిబ్బంది జాడ లేకపోవడం, పింఛన్ తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళనతో విజయనగరంలో లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరంలోని తోటపాలెం సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. ఫించన్లపై ఫిర్యాదులు..శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ప్రకాశంలో పడిగాపులు..ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన పింఛన్లను ప్రకాశం జిల్లాలో ఆలయాలు, స్కూళ్లు, ప్రైవేటు స్థలాల వద్దకు రప్పించడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరకు సర్వర్ పనిచేయడంలేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎక్కువ చోట్ల గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని పింఛన్లు పంపిణీ చేశారు.కష్టాలు మొదలయ్యాయిఇన్నాళ్లూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 1వ తేదీ ఉదయం పింఛన్ అందుకున్నాం. ఈసారి మాకు పింఛన్ అందలేదు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల తరువాత గాని మాకు అందే పరిస్థితి లేదు. మాకు కష్టాలు మొదలయ్యాయి.పుట్టా ఫిర్యాదుతో 94 మందికి ఆగిన ఫించన్లువైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో గత నెల వరకు పింఛన్లు పొందిన 94 మంది లబ్ధిదారులకు ఈదఫా డబ్బులు అందలేదు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులే దీనికి కారణం. మడూరులో 40, అన్నవరంలో 28, టీఓపల్లెలో 26 మందికి పించన్లపై పునర్విచారణ చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 94 మందికి పింఛన్లను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తమ పింఛన్లను ఆపారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఇలా చేశారని, విచారణ జరిపి అర్హత ఉంటేనే తమకు పింఛన్ ఇవ్వాలని బాధితులు పేర్కొన్నారు.ఒంటరి మహిళ ఇక్కట్లు..భర్తకు పొగొట్టుకుని వితంతు పింఛన్ పొందుతున్నా. గత ఐదేళ్లుగా టంఛన్‌గా ఇచ్చారు. ఈసారి రాలేదు. డబ్బుల కోసం పంచాయతీ అధికారి వద్దకు వెళితే నీ పింఛన్ ఆపమన్నారని చెప్పారు. అర్హత పత్రాలు పరిశీలించిన తర్వాత అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పింఛన్ డబ్బులే నాకు జీవనాధారం.కారు వద్దే పింఛన్ల పంపిణీఓ సచివాలయ ఉద్యోగి తన కారు వద్దకే లబ్ధిదారులను రప్పించుకుని పింఛన్ పంపిణీ చేపట్టిన ఘటన రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. 16వ డివిజన్ పరిధిలోని 41వ వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీ వీవీడీ ప్రసాద్‌కు వాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించారు. బ్లాక్–1 వద్ద దివ్యాంగులు, వృద్ధులు, వితంతవులు తన కారు వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక లబ్ధిదారులు అక్కడ బారులు తీరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు, వైఎస్సార్ సీపీ నేత సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి దీన్ని వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటల తరువాత ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.సాయంత్రం వరకు ఇవ్వలేదు..గతంలో వలంటీర్లు వేకువజామునే మా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ నగదు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే మీకు ఇప్పుడే ఇవ్వమన్నారని చెప్పారు. ఎందుకయ్యా? అని అడిగితే.. ఏమో టీడీపీ వాళ్లు చెప్పారని అంటున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవేమీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. – రాజేంద్రరెడ్డి, మల్లారెడ్డికండ్రిగ గ్రామం, విజయపురం మండలం, నగరి నియోజకవర్గం. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇవ్వొద్దుఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లె, పుప్పాల గ్రామాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్ల పంపిణీ చేపట్టిన పంచాయతీ కార్యదర్శి వసుంధరను అడ్డగించారు. పుప్పాల గ్రామంలో 35, వెంగన్నపల్లెలో 50 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకూడదంటూ టీడీపీ సర్పంచులు దేవన్న, నాగమునిరెడ్డి తమ వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ జరగలేదు. టీడీపీలో ఆధిపత్య పోరుపింఛన్ల పంపిణీ టీడీపీలో వర్గ పోరుకు వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో సుగవాసి సుబ్రమణ్యం వర్గం పంపిణీ చేపట్టగా అదే ప్రాంతంలో పార్లమెంటరీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు వర్గీయలు కూడా దీన్ని ప్రారంభించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా దుద్యాల గ్రామంలో టీడీపీ నాయకుడు కోటేశ్వర్ రెడ్డి మీ అంతు చూస్తానంటూ సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. పంచేందుకు కుమ్ములాట..కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పచ్చ కండువాతో మెప్మా ఆర్పీ..రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్(ఆర్పీ) పచ్చ కండువా మెడలో ధరించి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రామారావు కాలనీకి చెందిన మెప్మా ఆర్పీ జాఫరున్నీసా టీడీపీ నాయకురాలిలా మెడలో పచ్చ కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని టీఎంసీ రవి తెలిపారు. -
నేనంటే లెక్కలేదా..?
ఎస్.రాయవరం: గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి తాను వస్తుంటే మండలస్థాయి అధికారులు ఎందుకు హాజరుకాలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె సోమవారం అనకాపల్లి జిల్లా పెదగుమ్ములూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబి్ధదారులకు పింఛను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేదికపై ఉన్న అధికారులను చూసి మండలస్థాయి అధికారులు ఎవరు హాజరయ్యారని అడిగారు.ముందుకొచి్చన ఎంపీడీవో సత్యనారాయణతో.. మండలంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? హోం మంత్రి వస్తే తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు రావాల్సిన అవసరం లేదా.. అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీకి అధికారులు రావలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.అధికారుల తీరు మారలేదని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గ్రామంలోకి వస్తే అనేక సమస్యల్ని ప్రజలు తనకు చెప్పారని, ఆ ఫిర్యాదులను తాను ఆఫీస్‌కు పంపించుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి హుటాహుటిన మండల కార్యాలయం నుంచి వేదిక వద్దకు వచ్చారు. -
సచివాలయాల సిబ్బంది చేతివాటం
ప్రొద్దుటూరు క్రైం/మాచర్ల/రాప్తాడు/కుక్కునూరు/చీపురుపల్లి/పాలకొల్లు అర్బన్: పింఛన్ల పంపిణీలో తొలి రోజే సచివాలయాల సిబ్బంది చేతివాటం చూపారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో మురళీమోహన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సోమవారం పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు అతడికి రూ.4 లక్షలు ఇచ్చారు. ఈ క్రమంలో అతడికి రోడ్డు ప్రమాదం జరిగి కింద పడిపోగా 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు తమదైన స్టైల్లో మురళీమోహన్ను విచారించగా ఆ డబ్బును అతడే వాడుకున్నట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు సచివాలయ కార్యదర్శి–2 బి.రాము పింఛన్ల డబ్బు రూ.2,50,500 తీసుకుని పరారయ్యాడు. అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో పంచాయతీ కార్యదర్శి రాజేష్ సోమవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం కర్లాం సచివాలయంలో వ్యవసాయ సహాయకునిగా పని చేస్తున్న రాఘవకు పింఛన్ల పంపిణీ చేయమని అధికారులు రూ.3.96 లక్షలు అందజేశారు.అయితే రాఘవ ఆ డబ్బుతో మాయమయ్యాడు. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలో పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతలను ఉప్పేరు పంచాయతీలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సంకు ప్రసాద్‌కు అధికారులు అప్పగించారు. అతడు పింఛన్లు పంపిణీకి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగి స్వగ్రామమైన చింతలపూడి మండలం సీతానగరానికి వెళ్లిన అధికారులకు అతడు గాయాలతో ఇంటి వద్దే కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల తొమ్మిదో వార్డుకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ ముడావత్ వాల్యూనాయక్ ఒక్కో లబ్ధిదారుకు రూ.7 వేలు చొప్పున అందించాల్సి ఉండగా.. ఒక్కొక్క లబి్ధదారు నుంచి రూ.500 చొప్పున వసూలు చేశాడు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకటదాసుకు ఫిర్యాదులు రావడంతో ఆయన వాల్యూ నాయక్‌ను సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తిలో పింఛన్ల లబి్ధదారులకు రూ.7 వేలు చొప్పున పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసులు దాదాపు 20 మందికి రూ.6 వేలే ఇచ్చాడు. -
పింఛన్ల పంపిణీకి ఆఫీసులోనే రాత్రి బస
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్ల పంపిణీని చేపడుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో పలు జిల్లాల్లో సచివాలయాల సిబ్బంది ఆదివారం రాత్రి తాము పనిచేసే సచివాలయంలోనే బస చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ పింఛన్ల పంపిణీ కోసం సిబ్బంది అంతా సచివాలయానికి హాజరై ఏర్పాట్లుచేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సోమవారం ఉ.6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టాల్సిన నేపథ్యంలో సిబ్బంది అంతా ఆదివారం రాత్రి సచివాలయం పరిధిలోనే బసచేయాలని పలుచోట్ల జిల్లాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారని.. దీంతో అత్యధిక శాతం మంది సచివాలయాల్లోనే బసచేశారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు. ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని కూడా హెచ్చరించారని వారన్నారు. కాగా, ఒకటో తేదీనే దాదాపు వీలైనంత ఎక్కువమందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఉన్నతాధికారులు సచివాలయాల వారీగా గంట గంటకు పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ డీఎల్డీఓలు, డీపీఓలను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. పంపిణీకి 30వేల మంది సిబ్బంది..ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అన్నారు. తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జూలై 1న ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పింఛన్ల పంపిణీకి దాదాపు 30 వేల మంది ప్రభుత్వోద్యోగులను నియమించామన్నారు. -
వలంటీర్లకు విధులేవి?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు æస్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. లక్షన్నర మంది విధుల్లోనే..రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున గతంలో 2.65 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత మినహా ఐదేళ్ల పాటు వలంటీర్ల సేవలు కొనసాగాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు రాజీనామాలు చేయగా ప్రస్తుతం లక్షన్నర మందికి పైగా విధుల్లో కొనసాగుతున్నారు. అయితే పింఛన్ల పంపిణీతో పాటు ఇతర సాధారణ విధులు కూడా అప్పగించకుండా వారిని దూరంగా ఉంచడం ప్రశ్నార్థకంగా మారింది.ఆగస్టు 14 ఆఖరి గడువు..సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. వలంటీర్లకు బాబు వెన్నుపోటు! వలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. వారికి నెలకు రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వలంటీర్లతో కాకుండా, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. -
98.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 98.89 శాతం మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెల పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. డీబీటీ రూపంలో పింఛను డబ్బు బ్యాంకులో జమ చేసిన వారిలో 6,960 మంది బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులు రావడంతో వారికి బదిలీ చేసిన పింఛను డబ్బులు వెనక్కి వచ్చాయని, వీరందరికీ సోమవారం నుంచి ఇంటి వద్దే పింఛను డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.ఈ నెల (జూన్) 1వ తేదీ నుంచి మొత్తం 65,30,838 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,939.35 కోట్లు విడుదల చేసింది. వీరిలో 47,67,773 మందికి పింఛను సొమ్మును డీబీటీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెప్పారు. 17,63,065 మందికి ఇంటి వద్ద పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీరిలో 16,90,945 మందికి పంపిణీ పూర్తయినట్టు వివరించారు. బ్యాంకులో డబ్బు జమ చేసిన లబ్ధిదారులతో కలిపి సోమవారం సాయంత్రం వరకు మొత్తం 64.58 లక్షల మందికి రూ. 1,919.07 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
అవ్వాతాతలకు వందనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు. -
అయ్యో.. అవ్వాతాతలు
సాక్షి, అమరావతి: ఇలా చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ప్రతి నెలా ఒకటినే తమ ఇళ్ల వద్దే వారు పింఛన్ అందుకునేవారు. అయితే చంద్రబాబు ముఠా కుతంత్రాలతో వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరగనీయకుండా అడ్డుకున్నారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్ సొమ్మును బ్యాంకుల్లో జమచేశారు. దీంతో అవ్వాతాతలు బ్యాంకుల్లో పడ్డ పింఛన్ సొమ్మును తెచ్చుకునేందుకు చాలా చోట్ల వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. వారినే బతిమలాడుకుని బ్యాంకులకు తీసుకువెళ్తున్నారు. అవ్వాతాతల కష్టాలతో చలించిపోతున్న వలంటీర్లతోపాటు ఇప్పటికే రాజీనామా చేసిన వలంటీర్లు కూడా వారికి మానవతాదృక్పథంతో సాయమందిస్తున్నారు. చంద్రబాబు ముఠా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోకపోయి ఉంటే ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందించేవారు. ఈపాటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తయి ఉండేది. కానీ, చంద్రబాబు కుతంత్రాలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల పింఛన్ నగదును బ్యాంకుల్లో జమ చేశారు. అయితే ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల చేతికి సొమ్ము అందలేదని తెలుస్తోంది. నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో లబ్ధిదారులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేవు. దీంతో కనీసం 5 కి.మీ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు అవ్వాతాతలు వెళ్లాల్సి వస్తోంది.సమాచారం కోసం వలంటీర్ల దగ్గరకే..ప్రతి నెలా పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు తమను చిరునవ్వుతో పలకరించే అవ్వాతాతలు ఇప్పుడు అదే పింఛన్ కోసం అవస్థలు పడుతుంటే చూడలేకపోతున్నామని గ్రామ, వార్డు వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలి కాళిదాస్ ‘సాక్షి’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలు సమాచారం కోసం తమ వద్దకే వచ్చి బ్యాంకు దాకా తోడు రమ్మని అడుగుతుంటే చాలాచోట్ల వలంటీర్లు కాదనలేక వెంట వెళ్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలో తన క్లస్టర్ పరిధిలో 35 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. అందరికీ పింఛన్ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా అందులో 13 మంది మాత్రమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు తన ఇంటికొచ్చి.. పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో పడిందో చెప్పాలని అడిగితే చెప్పానని వెల్లడించారు. బోరివంకకు బ్యాంక్ 5 కి.మీ దూరంలో ఉందని.. దీంతో ఎండల్లో అంతదూరం వెళ్లలేనివారు ఇంకా పింఛన్ తీసుకోలేదన్నారు. గతంలో తాము ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినప్పుడు 35 మందికి ఒకట్రెండు తేదీల్లోనే పింఛన్ సొమ్ము అందేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.57 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా, అందులో 93 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు అవ్వాతాతల కోరిక మేరకు వారికి సాయం చేస్తున్నా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.నిండిపోయిన బ్యాంకులుశనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు అవ్వాతాతలతో నిండిపోయాయి. కొన్నిచోట్ల పింఛను డబ్బులు తీసుకోవడానికి తమ ఊరి నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చారు. కొన్ని చోట్ల బ్యాంకులకు అనుసంధానంగా గ్రామాల్లో ఉండే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అవ్వాతాతలకు రూ.3,000 తీసి ఇచ్చేందుకు రూ.200 దాకా తీసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రంలోని వృద్ధుడి పేరు ఉల్చాల మద్దయ్య. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మజారా లక్షుంపల్లె నివాసి. మండల కేంద్రం వెల్దుర్తిలోని యూనియన్ బ్యాంకుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈయన ఊరు ఉంది. పింఛన్ కోసం బ్యాంకుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఇంకా అకౌంట్లో పడలేదని తెలుసుకుని శనివారం పడతాయేమోనని బ్యాంకు బయటే రాత్రి పడుకున్నాడు. తెల్లారి బ్యాంకు ఉద్యోగులు వచ్చి బయటపడుకున్న మద్దయ్యకు టిఫిన్ పెట్టించారు. అనంతరం అకౌంట్ చెక్ చేస్తే పింఛన్ సొమ్ము పడలేదు. అదే సమయంలో ఒక సచివాలయ ఉద్యోగి నరేశ్ బ్యాంకుకు వచ్చి విషయం తెలుసుకుని వృద్ధుడి వివరాలు తీసుకున్నారు. ఆయన పింఛన్‌ను ఇంటి వద్ద ఇచ్చేందుకు ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెళ్లగా వృద్ధుడు లేడని, ఎక్కడికెళ్లాడో తెలియక ఇవ్వలేకపోయినట్లు తెలుసుకున్నాడు. చివరకు వృద్ధుడికి ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెల్దుర్తి బ్యాంకు వద్దకే వచ్చి పింఛన్ అందించాడు. నాకీ కష్టం తెచ్చింది ఆ చంద్రబాబేనని, మట్టి కొట్టుకుపోతాడని తిడుతూ మద్దయ్య వెళ్లిపోయాడు.చంద్రబాబు కుట్రకు బదులు తీర్చుకుంటాంచంద్రబాబు దుర్మార్గం వల్ల రెండు నెలలుగా పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బాబుకు పేదల కష్టాలు ఎప్పటికీ తెలియవు. ఎంతో ఆశగా ఈనెల పింఛను తీసుకుందామని రెండు రోజుల నుంచి వాకాడు యూనియన్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాను. అయినా.. పింఛన్ అందుకోలేకపోయాను. వలంటీర్లు ఇంటికి పింఛన్ తెచ్చి ఇచ్చేటప్పుడు మాకు ఈ కష్టాలు తెలియలేదు. బాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం. – చేను వెంకటయ్య, వాకాడు, తిరుపతి జిల్లా చంద్రబాబు దుర్మార్గమే ఇదిమా ఊరి నుంచి మూడు రోజులుగా నరసాపురం బ్యాంకుకు వచ్చి పోతున్నాను. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజూ ఇలా తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు చేసిన రాజకీయ దుర్మార్గం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్, లక్ష్మణేశ్వరం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి మమ్మల్ని ఏడిపిస్తే ఏమొస్తుంది బాబూమాలాంటి ముసలోళ్లను ఏడిపిస్తే చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. నాలుగో తారీఖు వచ్చింది. అయినా పింఛన్ అందలేదు. అంతకుముందు ప్రతి నెలా మొదటి రోజున వలంటీర్ మా ఇంటికే వచ్చి తలుపు తట్టి చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. చంద్రబాబు పుణ్యమా అని మాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. – షేక్ మస్తాన్‌బీ సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందివలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి ఇచ్చే పింఛన్లను చంద్రబాబు రానివ్వకుండా చేశాడు. 75 ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేక మనవడితో పాటు మరో మహిళ సాయంతో సచివాలయానికి వెళ్లా. బ్యాంకు దగ్గరకు వెళ్లండని చెప్పారు. అక్కడ చూస్తే ఒకటే జనం. పింఛన్ డబ్బు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ప్రతినెలా హాయిగా ఇంటి వద్దే పింఛన్ తీసుకునేవాళ్లం. చంద్రబాబు చేసిన పని వల్ల రెండు నెలల నుంచి నరకం చూస్తున్నాం. చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది.– సిద్ధరామక్క, పళారం, గుడిబండ మండలం, శ్రీసత్యసాయి జిల్లాపేదోళ్లంటే బాబుకు కడుపుమంట80 ఏళ్ల వయసులో పింఛన్ కోసం బ్యాంక్‌కు తిరగలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన పనికి మా కడుపు మండుతోంది. గతంలోనూ ఆయన హయాంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాం. పింఛన్ తీసుకొనేందుకు రోజుల తరబడి పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మా కష్టాలు తీరాయి. పేదోళ్లంటే బాబుకు కడుపుమంట. మాపై కక్ష కట్టి మరీ సాధిస్తున్నాడు. ఇప్పటికీ నా పింఛన్ సొమ్ము చేతికి అందలేదు. – దేవళ్ల రమణమ్మ, కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
పింఛన్లపై లోకేశ్ మాట్లాడొద్దన్నాడు
సాక్షి, అమరావతి : ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు పార్టీ కేడర్‌కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడుతున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.ఇదీ సంభాషణ..పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్?టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులోఅనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్ ఇష్యూ బాగా వైరల్ అయిపోతోందంట. బ్యాడ్ నేమ్ వస్తోంది. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్‌కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్ హార్‡్ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్చేశా..ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్ వచ్చాయి. అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్‌గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?ఉద్యోగి : కౌంటర్ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్‌గా మిస్టేక్ మనదే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్‌తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్ వేయించి ఎన్నికల కమిషన్‌తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్ అయిపోయింది. అనుచరుడు : దానిపై కౌంటర్ ఇవ్వలేమా?ఉద్యోగి : దీని గురించి లోకేశ్ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్ వచ్చాయి. అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్‌గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు. ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్ మొత్తం ఇది ఉంది. లోకేశ్ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్ అయితే మళ్లీ మన మీదకే మిస్‌ఫైర్ అవుతుంది, ఏ యాక్షన్ వద్దు అని చెప్పారు. అనుచరుడు : డ్యామేజి కంట్రోల్ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్ ఏమీ చెప్పలేదా?ఉద్యోగి : లోకేశ్ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు..అనుచరుడు : కొంచెం యాక్టివ్‌గా ఉండండి..ఉద్యోగి : కేడర్ డీమోరలైజ్ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి.ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? ఉద్యోగి : లోకేశ్ అన్న ప్రెస్మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు. -
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. 4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్యరాష్ట్రంలో లోక్‌సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు. 15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్‌సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు. పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించంరాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసేశారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్‌కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్‌ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్‌కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్‌కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్‌ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్‌ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. -
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్‌కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. (ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది) విలన్ నంబర్–1 పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్ నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు? – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్‌గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్‌దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్‌గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్‌దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్‌లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్‌లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది. – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్ రన్నింగ్‌లో లేదంటున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్‌ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్‌లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – షేక్ గాలిబ్‌సాహెబ్, పింఛన్‌దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్‌కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్‌ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం. – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్‌ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
చంద్రబాబు = వంద దుర్యోధనులు
సాక్షి, అమరావతి: సాఫీగా సాగుతున్న పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు నాయుడు, అయన అనుకూల వర్గాలు అడ్డు తగిలి వృద్ధుల ఉసురు తీస్తున్నాయని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీ ఇంటిలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘సమాజ సేవలో వలంటీర్ల పాత్ర’ పై రాష్ట్ర స్ధాయి సదస్సు గురువారం జరిగింది. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో వక్తలు తొలుత వలంటీర్లకు తమ సంఘీభావం తెలిపారు. పచ్చ బ్యాచ్ కుట్రల వల్ల మృతిచెందిన వృద్దులకు ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. ఈ వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లాంటివారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు.. లోకేశ్ అడుగుపెడితే అరిష్టం ముఖ్య వక్తగా పాల్గొన్న ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన తేవాలని ప్రయత్నించగా దానిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధ ద్వారా ఇంటి వద్దకే తెచ్చారన్నారు. 1660 లోనే కేంబ్రిడ్జి వలంటీర్ పదాన్ని విల్ అనే పేరుతో డిక్షనరీలో చేర్చారని, అమెరికా ప్రెసిడెంట్ కూడా వలంటీర్‌గా సేవ చేస్తారని, మన దేశంలో ఇన్నేళ్లలో ఎవరికీ రాని ఆలోచన జగన్మోహన్రెడ్డికి వచ్చిందన్నారు. సొంత బిడ్డలు కూడా చేయని సేవను వృద్ధులు, దివ్యాంగులకు జగన్ చేస్తుంటే పచ్చముఠాకు కళ్ళు కుట్టి రాక్షసంగా వ్యవహరించి వృద్ధులు, వికలాంగుల ఉసురు పోసుకున్నారన్నారు. వంద దుర్యోధనులను కలిపితే ఒక చంద్రబాబు అని, ఎన్నికల తర్వాత అతన్ని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చ ముఠాకు చెందిన అష్ట్రగహ కూటమి అరాచకాలను ఎండగట్టడానికి రాష్ట్ర మంతటా వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ‘నిమ్మగడ్డ’ ఓ శకుని ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శకుని లాగా వ్యవహరిస్తూ, పెన్షన్‌దారుల ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు తాము అండగా ఉంటామని, వారి ప్రాధమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. వలంటీర్లు ముందు ఈ దేశ పౌరులని, వారు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించవచ్చని, తమ మద్దతును బహిరంగంగా తెలుపవచ్చని స్పష్టం చేశారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు సుమారు 3.66 కోట్ల పౌర సేవలందాయని తెలిపారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరహరిశెట్టి జ్యోతి మాట్లాడుతూ వలంటీర్లను ప్రజా సేవకు దూరం చేయాలనుకోవడం అవివేకమని, రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సేవలు యధాతథంగా కొనసాగుతాయన్నారు. వలంటరీ వ్యవస్ధకు అంతర్జాతీయ ప్రశంసలు ప్రవాస భారతీయుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ వలంటరీ వ్యవస్ధ పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి ప్రశంసలు పొందిందని, ఇటువంటి వ్యవస్థ మరే రాష్ట్రంలో లేదన్నారు. వలంటీర్లు, పెన్షనర్లపై చంద్రబాబు దురాగతాలు రాష్ట్రానికి హెచ్చరిక లాంటిదన్నారు. ఈ పెత్తందార్లు తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకుడు ఎల్. శివరామప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లు సమర్ధవంతంగా పని చేస్తూ రూ. 85 వేల కోట్లు పంపిణీ చేశారన్నారు. వేల కోట్ల రూపాయలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసినప్పటికీ ఎక్కడా పైసా దుర్వినియోగం కాలేదన్నారు. మారుతీ మహిళా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు మాట్లాడుతూ వలంటీర్లను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్.ధనలక్ష్మి, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్ళూరు సూరిబాబు, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధి గోమతోటి వినోద్ పాల్, ఎమ్మార్పీఎస్ నేత మేడర సురేష్ తదితరులు ప్రసంగించారు. -
ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం ఏపీలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశంలో మరెక్కడా లేదని, ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందచేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తమ జోక్యం అవసరం లేదంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో క్యూలో నిల్చుకుని పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, కుంచెనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. పక్షవాతం, కిడ్నీ తదితర రోగాలతో బాధపడే వారు పింఛను పొందలేని పరిస్థితి ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రత్యామ్నాయల సంగతి ఏమిటని, దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని, ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది. ► కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఈ నెల 2న మెమో జారీ చేసిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంతృప్తి చెందామని ధర్మాసనం తెలిపింది. అలా అయితే తాను లేవనెత్తిన అంశాలన్నింటినీ రికార్డ్ చేయాలని, తరువాత తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని శివప్రసాద్‌ను ధర్మాసనం కోరింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారని తెలిపారు. శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం.. పిల్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మిగిలిన అన్ని చోట్లా ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పగా, ఆ వ్యాజ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
పింఛన్ల పంపిణీ ఆపింది మేమే : ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ: అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని.. దీనివలన శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ తమ పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి రిటర్నింగ్ అధికారికి చెప్పారని, డీఎస్పీ కూడా అది వాస్తవమని అన్నారని వాసు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి లేనందున ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. అందువల్లే ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. వాసు వ్యాఖ్యలతో దుమారం.. ఇక ఆదిరెడ్డి వాసు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించింది తామేనని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూనే.. పింఛన్లు ఆగిపోవడంతో తమకేమీ సంబంధంలేదని, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమని మరోవైపు కవర్ చేసుకోవడం వారి రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటున్నారు. ఇక ఎండ తీవ్రత పెరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు ఈ కుట్రలకు తెగబడడంపై వృద్ధులు, దివ్యాంగులు తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వారివల్లే ప్రతినెలా ఒకటో తేదీ వేకువనే వలంటీర్ల ద్వారా అందే పింఛను ఈ నెలలో తమకు అందకుండాపోయిందని పింఛనుదారులు వారిని శాపనార్థాలు పెడుతున్నారు. -
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్‌షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్‌కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్‌పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచన్‌గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు దొడ్డిదారిన అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యాదులు చేశారు. దీంతో కోడ్ ముగిసేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ, ప్రజాగ్రహంతో ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. -
తిరుగుబాటుతో తత్తరపాటు..
సాక్షి, అమరావతి: అవ్వాతాతలను అవస్థలకు గురి చేస్తూ ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి అడ్డుపడ్డ పచ్చ ముఠా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తత్తరపాటుకు గురై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు బరి తెగించింది. వలంటీర్లపై ఆది నుంచి విద్వేషాన్ని పెంచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందం ఇన్నాళ్లూ సజావుగా సాగిన సామాజిక పింఛన్ల పంపిణీకి ఎన్నికల వేళ ఆటంకాలు కల్పించేందుకు సాహసించింది. గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంచన్‌గా లబ్ధిదారుల ఇంటివద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా కోవిడ్ వేళ కూడా పెన్షన్లు అందచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తలేదన్నది నిజం. స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ వరుస ఫిర్యాదులతో ఇంటివద్ద ఫించన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సైతం స్వాదీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ ఈనాడు రామోజీ తన విద్వేషాన్ని కుమ్మరించారు. ఆపాలని అడిగి ఆపై నాటకాలు.. వలంటీర్ల ద్వారా ఇంటివద్ద పింఛన్ల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు టీడీపీ నాయకులు ‘ఛలో సచివాలయం’ పేరుతో మీడియా ముందు హడావుడి చేస్తూ రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. నిమ్మగడ్డ నిర్వాకాలు.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ విరుద్ధంగా, వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తమ సామాజికవర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి. ► వలంటీర్లకు వ్యతిరేకంగా 2023 డిసెంబరు నాలుగో తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసి మధ్యలోనే ఉపసంహరించుకుంది. ► మళ్లీ 2024 జనవరి 12న అదే సంస్థ వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై తమకు నమ్మకం లేదన్నట్టు పిటిషన్లో నిమ్మగడ్డ తదితరులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ► తర్వాత నిమ్మగడ్డకు చెందిన సంస్థ 2024 మార్చి 13న వలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లను స్వా«దీనం చేసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలనే అచ్చెన్నాయుడు వలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. ► సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులే అయినప్పటికీ వారికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేదని, వారికి ఎన్నికల విధులు అప్పగించవద్దని నిమ్మగడ్డ సంస్థ ఈసీని కోరింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ టీడీపీ, ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నాయి. అన్నీ ఆలోచించాకే.. సచివాలయాల ఉద్యోగులు ఇన్నాళ్లూ విధి నిర్వహణలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వలంటీర్లపై ఆధారపడే పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ బాధ్యతను వారికి అప్పగించినా లబ్ధిదారుల పేర్లు తెలుస్తాయి కానీ ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. మళ్లీ వారు తిరిగి గ్రామంలో ఎవరో ఒకరిపై ఆధారపడే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభిమానులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు తర్జనభర్జన పడిన అనంతరమే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఫించన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాన్ ఐఏఎస్ అధికారిని తొలుత ఓఎస్డీగా నియమించుకొని తరువాత సెర్ప్ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓట్లర్లను ప్రభావితం చేసేలా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ తాయిలాలు విడుదల చేయడం గమనార్హం. పది రోజుల క్రితమే నిర్ణయం.. ఈ నెలలో పింఛన్ల పంపిణీని మూడో తేదీ నుంచి చేపట్టనుండటంపైనా టీడీపీ, ఈనాడు దుష్ప్రచారానికి దిగాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని పది రోజుల కిత్రం ఎన్నికల కోడ్ వచ్చాకే అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో అప్పుడే వివరించారు. పింఛను డబ్బులను సచివాలయాల సిబ్బంది ఏప్రిల్ రెండో తేదీన డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడే జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల కారణంగా ఏటా ఏప్రిల్ నెలలో మూడో తేదీ తర్వాత పంపిణీ కొనసాగడం అనవాయితీగా జరుగుతోంది. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. -
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీలో సమూల మార్పులు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు. అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్‌రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీకి వలంటీర్లు దూరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెన్షన్లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాల నగదు పంపిణీ విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీచేసింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పదేపదే చేసిన ఫిర్యాదులకు తోడు.. అదే సంస్థ హైకోర్టులో వేసిన కేసు, వలంటీర్లకు వ్యతిరేకంగా పదేపదే వివిధ దినపత్రికల్లో వస్తున్న కథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సంక్షేమ పథకం కిందైనా నేరుగా నగదును ఇచ్చే విధుల నుంచి వలంటీర్లను తొలగించాలని స్పష్టంచేసింది. అదే విధంగా వలంటీర్లకు ఇచ్చిన సెల్ఫోన్లు, ట్యాబ్‌లు వంటి ఇతర పరికరాలని్నంటినీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తయ్యే వరకు డీఈఓకి అప్పజెప్పాల్సిందిగా ఆదేశించింది. ఇక పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల నగదు పంపిణీ కోసం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరింది. -
3 నుంచి పింఛన్ల పంపిణీ.. బ్యాంకులకు వరుస సెలవులే కారణం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటినే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతోపాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారమిచ్చింది. గతేడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యధావిధిగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌తో ప్రత్యేక మార్గదర్శకాలు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి సెర్ప్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌తో నిర్దేశిత పరిమితికి మించి వ్యక్తులు నగదు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ప్ అధికారులు సూచించారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. పింఛన్లు పంపిణీ సమయంలో ప్రచారం చేయడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
శభాష్ వలంటీర్
వజ్రపుకొత్తూరు: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించడమే కాకుండా ఆమెకు రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు ఓ వలంటీర్. వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిన బడే గుణవతి ఆనారోగ్యంతో గత కొంత కాలంగా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పింఛన్ పంపిణీకి చివరి రోజు కావడంతో వలంటీర్ మడ్డు మధు రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ డబ్బులు అందించారు. అలాగే ఆమె రక్తహీనతతో బాధ పడుతుండడంతో రక్తదానం చేశాడు. దీంతో పంచాయతీ పెద్దలు వలంటీర్‌ను అభినందించారు. -
అవ్వాతాతలకు 3న పింఛన్లు..
సాక్షి, అమరావతి: ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభ్యుదయానికి దోహదం చేసే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి జగన్ కృషిని మంత్రివర్గం కొనియాడింది. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని ప్రశంసించారు. సీఎం జగన్‌ను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మంత్రివర్గం అభినందించింది. నూతన పారిశ్రామిక విధానం 2023–27ను కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ► సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లు) విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పన, సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణకు అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం. సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్) క్లస్టర్ల వారీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్. మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి ఏడాది కాలపరిమితితో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్ వాచ్మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 5,388 హైస్కూళ్లలో పేరెంట్స్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున టీఎంఎఫ్ నుంచి గౌరవ వేతనం చెల్లింపు. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 (యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2020) సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణల డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 (యాక్టు 9 ఆఫ్ 2021) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 (యాక్టు 19 ఆఫ్ 2019) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్ 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ మహిళా కమిషన్ పదవీ కాలానికి సంబం«ధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్ట్ –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ► గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 2022 ఆర్డినెన్స్‌కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల 2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. ► ది మిల్క్ ప్రొక్యూర్మెంట్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు 2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. బిల్లు ద్వారా పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. ► ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ 2019కు మార్పులు చేస్తూ సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 సవరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ 2022 స్థానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ బిల్లు 2023కు కేబినెట్ ఆమోదం. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు నీటి సరఫరా పైప్‌లైన్ కోసం 29.67 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. దీంతోపాటు నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 78.46 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ బిల్లు 2023 ప్రతిపాదనలకు ఆమోదం. ► మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం. ► అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో కూడిన 11 మండలాలతో కలిపి మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానున్న అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ► ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం. లోక్‌సభ, రాజ్యసభలో పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్న సెక్రటరీ జనరల్ ఈ పోస్టుకు అర్హులు. ► అనపర్తి, పిడుగురాళ్ల, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు మండలాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీకి కేబినెట్ ఆమోదం. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 సవరణలకు ఆమోదం. ► రిజిస్ట్రేషన్ సేవలకు ఇ–స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించేలా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఎక్సైజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని దేవస్ధానాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దేవాలయాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు కచ్చితం కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం వంద పనిదినాలు నమోదైన వారికి ఇది వర్తింపు. ► పట్టాదార్ పాస్‌బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్) ఆర్డినెన్స్ 2022 లో సవరణలకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదర్సాకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు అంతర్జాతీయంగా ఉర్రూతలూగించిన నాటు...నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు సాధించిన “ఆర్ఆర్ఆర్’’ చిత్ర యూనిట్‌ను మంత్రివర్గం అభినందించింది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బృందానికి కేబినెట్ అభినందనలు తెలియచేసింది. -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ.. ఊరూ వాడా సంబరం
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా సామాజిక పింఛన్ రూ.2,750కి పెంపుపై లబ్ధిదారులు ఆనందభరితులయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వారి ఇళ్ల వద్ద సందడి నెలకొంది. పెరిగిన పింఛన్‌పై వివిధ రూపాల్లో తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ దీవెనలను వ్యక్తపరిచారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి నెలా వలంటీర్లు తమ ఇంటి వద్దకే వచ్చి.. పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్మోహన్రెడ్డిని లబ్ధిదారులు కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పింఛన్ మంజూరుకు పడే పాట్లు, ప్రతినెలా పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు, చాంతాడంత క్యూలో నిలుచోలేక పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తున్నారని కొనియాడారు. పింఛన్ పెంపును పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రాసిన లేఖను లబ్ధిదారులకు పింఛన్ సొమ్ముతో పాటు అందజేశారు. అవ్వాతాతల్లో ఆనందం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో పలుచోట్ల లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలో ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ► వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్ పరిధిలోని శంకరాపురంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పింఛన్ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, డబ్బులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పింఛన్ల పెంపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ► నెల్లూరు జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు కార్డు, పెరిగిన పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖను చదివి వినిపించారు. ► పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురంలో ఆదివారం తెల్లవారు జామున రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెంచిన పింఛను సొమ్మును, స్వీటు ప్యాకెట్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ► శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులతో ముచ్చటించారు. పింఛన్ల పెంపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖలను అందజేసి, పెరిగిన పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ► పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీనగర్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. సత్తెనపల్లి ఆరవ వార్డులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరు మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పింఛన్లు పంపిణీ చేశారు. ► గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆగతవరపుపాడులో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, బాపట్లలో కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అధికారులు, వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులతో మాట్లాడారు. సీఎం వారికి రాసిన లేఖలను అందజేయడంతో పాటు పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 71.26% పంపిణీ 1వ తేదీ (ఆదివారం) రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,65,076 మందికి పెరిగిన పింఛను డబ్బుల పంపిణీ పూర్తయింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,257.25 కోట్లు అందజేశారు. తొలిరోజునే 71.26 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. 1వ తేదీ సెలవు రోజు అయినప్పటికీ 13 జిల్లాల్లో 75 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని తెలిపారు. -
మూడేళ్లలో 21.83 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా..గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా 21,83,027 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ నెలలోనూ 2,99,085 మంది కొత్తగా పింఛన్ అందుకున్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారుల ఇంటింటికీ మంగళవారం వలంటీర్లే వెళ్లి పింఛను కార్డులను అందజేశారు. ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 62.68 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసే పరిస్థితి ఉండగా.. అందులో మూడో వంతు మందికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం గమనార్హం. మరోవైపు.. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. అర్హత ఉన్నవారికి వలంటీర్ల దరఖాస్తులు పూర్తి చేసి, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే విధానం తీసుకొచ్చింది. అవ్వాతాతల అవస్థలకు చెక్.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొత్త పింఛను మంజూరు కావాలంటే అవ్వా తాతలు సహా వితంతు, దివ్యాంగులకు చుక్కలు కనిపించేవి. అప్పట్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారన్నా.. ఏ రాజకీయ అండ లేదనుకునే వారికి అప్పట్లో కొత్తగా పింఛను మంజూరు కావాలంటే గగనమే. దీనికి తోడు మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేనిస్థితిలో ఉండే అవ్వాతాతలు గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేకుండా వలంటీర్లే ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ పద్ధతిలో పింఛన్లు అందించడం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో కొనసాగుతున్నది. సంస్కరణలకు శ్రీకారం.. ► ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పింఛనుదారులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే.. ఇంటికి వద్దకే వెళ్లి ఫించన్ అందజేత, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు ► తలసేమియా, సికిల్‌సెల్, తీవ్ర హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు, ద్వైపాక్షిక బోధ వ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్న వారు, కుష్టు వ్యాధి వంటి 11 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా రూ.5000ల నుంచి రూ.10,000 వరకు పింఛన్లు మంజూరు. అప్పుడు వైఎస్.. ఇప్పుడు మళ్లీ జగన్.. ఆసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి చూపించే ఉదారత ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ విషయాన్ని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన కాగ్ రిపోర్టులోనే పేర్కొంది. -
52.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు బుధవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 52,68,975 మందికి రూ.1,339.71 కోట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో 86.04 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మరో మూడురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. కేజీహెచ్‌లో అందజేత విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు విజయానంద్ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. గ్రామ వలంటీరు గొంప ఉమా కేజీహెచ్‌కు వెళ్లి విజయానంద్‌కు పింఛన్ సొమ్ము అందజేశారు. – విజయనగరం ఆస్పత్రికి వెళ్లి.. పింఛను అందించి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటకు చెందిన గోవిందయ్య అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న వార్డు వలంటీర్ సాయిచరణ్ తన సొంత ఖర్చులతో బుధవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గోవిందయ్యకు పింఛన్ నగదు అందజేశారు. – వెంకటగిరి చికిత్స పొందుతున్న వ్యక్తికి.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం రామచంద్రాపురం పంచాయతీ పొన్నాంపేట గ్రామానికి చెందిన చల్లా రామారావు అనారోగ్యంతో శ్రీకాకుళం జెమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ కోటేశ్వరమ్మ బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. – ఆమదాలవలస రూరల్ -
57.04 లక్షల మందికి రూ.1450.75 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కొనసాగింది. మంగళ, బుధవారాల్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 57,04,996 మంది లబ్ధిదారులకు రూ.1450.75 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 61,51,660 మందికి ప్రభుత్వం రూ.1563.73 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 92.78 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదిరక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 94.85 శాతం పంపిణీ పూర్తయింది. -
నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా...
పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: 82 శాతం లబ్ధిదారులకు పింఛన్ AP: టీనేజ్‌కు టీకా -
82 శాతం లబ్ధిదారులకు పింఛన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ శరవేగంతో జరుగుతోంది. అవ్వాతాతలు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు 82.04 శాతం లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ అందజేశారు. మొత్తం 50,65,597 మందికి రూ.1,288.86 కోట్ల మొత్తాన్ని అందజేశారు. జనవరి ఒకటో తేదీన 25 లక్షల మందికి పంపిణీ జరగ్గా, రెండో రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, పలుచోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. పాలాభిషేకంతో సీఎం జగన్‌కు అవ్వాతాతల దీవెన పింఛను రూ. 2,500కు పెంచడంపై అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు ఆదివారం వివిధ రూపాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల అవ్వాతాతలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ దీవెనలందించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు, పెరిగిన పింఛన్ డబ్బులు అందుకున్న పలువురు ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రొంపిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో రూ.2,500 పెన్షన్‌ను వృద్ధురాలైన వేపూరి దుర్గాంబకు అందజేస్తున్న వలంటీర్ ► శ్రీకాకుళం జిల్లా పొలకి మండలంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించి, సీఎం జగన్ రాసిన లేఖ ప్రతులను అందజేశారు. సంతకవిటి మండలంలో పింఛన్ల పెంపు కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు పాల్గొన్నారు. ► విజయవాడ నగరం 52వ వార్డులో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. కృష్ణా జిల్లా నూజివీడు రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో మండల పరిషత్ పాఠశాలలో సమావేశమయ్యారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ► నెల్లూరు జిల్లా వాకాడులో సర్పంచ్ వెంకట రత్నం, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సచివాలయ కార్యదర్శి ఉమామహేశ్వర రావు, ఇతర సిబ్బంది కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే పింఛను మంజూరు పత్రాలను అందజేశారు. నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా... పింఛన్ పెంపుపై ఓ వృద్ధురాలి మనోగతం.. సోషల్ మీడియాలో వైరల్ పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నడుపల్లిలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పింఛనుదారులు ఇచ్చిన మాట నెరవేర్చే నాయకుడు జగన్ పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల హర్షం.. వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులుపెరవలి: ఇచ్చిన మాటను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ పింఛన్ సొమ్మును పెంచడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామంలోని వృద్ధులు ఆదివారం వైఎస్సార్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కిందటి వరకు ఓట్ల కోసం మోసపు హామీలిచ్చిన నాయకులను చూశామన్నారు. గతంలో పింఛన్ మంజూరు చేసేందుకు లంచాలు తీసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా మొదటి తేదీనాడే పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటికే పింఛన్ పంపిస్తున్న మహానుభావుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సర్పంచ్ బీరా సత్యవతి రాజు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా కడప రవీంద్రనగర్‌లో రహిమూన్కు వితంతు పెన్షన్ అందిస్తున్న వలంటీర్ -
జనవరి 1న వారి మోముల్లో వెల్లివిరిసిన ఆనందం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: నూతన సంవత్సరాదిన పింఛన్ లబ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పింఛన్ డబ్బుల పంపిణీ 25.11 లక్షల మంది లబ్దిదారులకు తొలిరోజే పూర్తయింది. ఇంతకు ముందు రూ.2,250 చొప్పున చెల్లించే పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచే కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. జనవరి నెలలో 61,74,593 మంది లబ్ధిదారులకు రూ.1,570.06 కోట్ల మొత్తం పంపిణీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. శనివారం రాత్రి పది గంటల వరకు 25,11,909 మంది లబ్ధిదారులకు రూ.639.04 కోట్ల మొత్తాన్ని అందజేశారు. కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా 50 శాతానికి పైగా పంపిణీ పూర్తయింది. లబ్ధిదారులతో ఎమ్మెల్యేలు ముఖాముఖీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేలా అన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక టీవీలను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో జిల్లా ఇన్చార్జి, స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కార్యక్రమాలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లతో పాటు పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు. పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచిన సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖ ప్రతులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. పండుగలా పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగింది. పింఛను రూ.2,500 అందుకోవడంతో అవ్వాతాతల ముఖాల్లో సంతోషం కన్పించింది. ఐదు రోజుల పాటు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచి, ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు ప్రశంసించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే సమర్థవంతమైన పాలన అందిస్తున్న దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్మోహన్రెడ్డి నిలిచిపోతారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్: 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
సాక్షి, అమరావతి : జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తోంది. శనివారం నుంచి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచి చెల్లించబోతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అవ్వాతాతలకు చెల్లిస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని వైఎస్ జగన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పెన్షన్ల పెంపుదల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల వరకు పెంచుతామన్న మాటకు కట్టుబడి పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పాల్గొని పెన్షన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు. రూ.45 వేల కోట్లు ఖర్చు ► రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.1,570.60 కోట్లు విడుదల చేసింది. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసింది. వీరందరికీ శనివారం నుంచి పెంచిన మొత్తాలతో పెన్షన్ చెల్లింపులు చేయనున్నారు. ► వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పెన్షన్లకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేశారు. 24 కేటగిరిల కింద పెన్షన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► 2.66 లక్షల మంది వలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రతినెలా ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, వారి చేతికే పెన్షన్ సొమ్మును అందిస్తున్న ప్రక్రియ లేదు. ► దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి కూడా ప్రభుత్వం మెడికల్ పెన్షన్లు అందిస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 18.36 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు. పెన్షన్లలో మనమే ఎక్కువ దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నది మన రాష్ట్రమే. ప్రతినెలా సుమారు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకు ప్రతి నెలా సుమారు రూ.1,450 కోట్లకు పైగా కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు రూ.18 వేల కోట్ల మేరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జనవరి నుంచి పెరిగిన పెన్షన్లతో ప్రతి ఏటా పెన్షన్ల కోసం చేసే ఖర్చు రూ.20 వేల కోట్లకు చేరుతోంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి -
పండుగలా.. పెంచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలతో పాటు వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితరులకు రూ. 2,250 చొప్పున ఇస్తున్న పింఛనును రూ. 2,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలోనే పెరిగిన డబ్బులను లబ్ధిదారులకు చెల్లించనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పింఛన్ పెంపు నేపథ్యంలో జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గోపాలకృష్ణ ద్వివేది మరో ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► జనవరి 1న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను విడుదల చేయనున్నారు. స్థానికంగా కొందరు లబ్ధిదారులకు పెరిగిన పింఛను డబ్బులను రూ. 2,500ల చొప్పున పంపిణీ చేస్తారు. ► తొలి రోజు అన్ని జిల్లాల్లోనూ జిల్లా ఇన్చార్జి మంత్రులు, స్థానిక జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లాలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ► ఒకటో తేదీ నుంచి 5వ తేదీ మధ్య జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులందరూ స్వయంగా పాల్గొంటారు. కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతూనే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొంతమంది లబ్ధిదారులతో ముఖాముఖీగా సమావేశమై, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా రాసిన లేఖలను వారికి పంచిపెడతారు. ► పింఛన్ల పెంపునకు సంబంధించి పోస్టర్లను అన్ని మండల, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బుల పంపిణీ చేస్తారు. 1,41,562 మందికి కొత్తగా పింఛన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,41,562 మందికి ప్రభుత్వం జనవరి నెల నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు గోపాలకృష్ణ ద్వివేది తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు కూడా ఒకటో తేదీ నుంచి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
పింఛన్.. ఏపీలోనే మించెన్
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.2,250 అందిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51.44 లక్షల మంది లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అందుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సెర్ప్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మన రాష్ట్రంలో 24 రకాల కేటగిరీ పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఆయా లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ కనిష్టంగా రూ.2,250 నుంచి గరిష్టంగా రూ.10 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 13,412 మందికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పింఛన్‌ను అందజేస్తోంది. అవ్వాతాతలు, వితంతువులకు ఇప్పటిదాకా రూ.2,250 చొప్పున ఇస్తుండగా వచ్చే జనవరి నుంచి ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచాలని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. -
Andhra Pradesh: రూ. 1,394 కోట్ల పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: డిసెంబర్ నెలకుగాను రాష్ట్రంలో 59,80,510 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసింది. మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు రూ. 1,411.42 కోట్ల మేర ప్రభుత్వం నిధుల విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి 98.78 శాతం మందికి రూ.1,394.83 కోట్లు పంపిణీ చేశారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 99 శాతానికి పైగా, మిగిలిన 10 జిల్లాల్లో 98 శాతానికి పైగా పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
వేకువనే వచ్చారు.. పింఛను డబ్బిచ్చారు
సాక్షి, అమరావతి: వార్డు, గ్రామ వలంటీర్లు బుధవారం తెల్లారకముందే సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. పింఛను సొమ్ములు పంపిణీ చేశారు. డిసెంబర్ 1వ తేదీనే రాష్ట్రంలో 56,22,435 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే నిమిత్తం రూ.1,411.42 కోట్లను పంపిణీకి గాను ప్రభుత్వం నవంబర్ 3వ తేదీనే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాత్రి వరకు 92.92 శాతం లబ్ధిదారులకు రూ.1,312.21 కోట్లను అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 95.05 శాతం మందికి పంపిణీ పూర్తవగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 88.82 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మొత్తంగా తొలి రోజున 92.92 శాతం మంది లబ్ధిదారులకు పింఛను నగదు అందింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలో గొల్లపూడిలో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. తొలి రోజు పింఛను డబ్బులు అందుకోలేకపోయిన వారికి మరో నాలుగు రోజులపాటు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారని సెర్ప్ అధికారులు చెప్పారు. -
58.97 లక్షల మందికి రూ.1,377 కోట్ల పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/కంభం/తోటపల్లిగూడూరు/ఖాజీపేట/పాలకొల్లు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా 58,97,231 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.1,377.48 కోట్లు పంపిణీ పూర్తయింది. మంగళవారం కూడా వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ నెలకు గాను 60.65 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,417.74 కోట్ల మొత్తాన్ని విడుదల చేయగా, రెండో రోజు నాటికి 97.23% మందికి పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 3 రోజుల పాటు వలంటీర్ల ఆధ్వర్యంలో పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. శభాష్ వలంటీర్స్... పించన్ల పంపిణీలో వలంటీర్లు తమ సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్ కొత్తపల్లి గిరి అలియాస్ షర్మిల 2 నెలల నుంచి పింఛన్ తీసుకోలేదు. ఈ నెలలో తీసుకోకపోతే పింఛన్ కట్ అయిపోయే అవకాశం ఉండటంతో షర్మిల హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి వలంటీర్ రాజు పింఛన్ అందించాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చింతోపు గ్రామానికి చెందిన దారాల శేషయ్య తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి గాయపడి విజయవాడలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతడికి వలంటీర్ యెండ్లూరి సుధాకర్ మంగళవారం చింతోపు నుంచి విజయవాడకు వెళ్లి పింఛన్ అందించాడు. అలాగే, అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన కటారు రాజమ్మకు ఇటీవల కడపలో శస్త్రచికిత్స జరిగి కాలు కదపలేని పరిస్థితిలో ఉంది. ఆమె తన భర్త వెంకటస్వామితో కలిసి వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని బంధువుల నివాసంలో ఉంటోంది. అనంతపురం టౌన్ మారుతీనగర్ 51వ సచివాలయానికి చెందిన వలంటీర్ కె.అమృతలక్ష్మి తన సొంత ఖర్చుతో అనంతపురం నుంచి ఖాజీపేటకు వెళ్లి వెంకటస్వామికి పింఛన్ అందజేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో కాలు విరిగి వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పింఛనుదారుకు వలంటీర్లు నేరుగా ఆస్పత్రికి వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు పెదపేటకు చెందిన ఉన్నమట్ట లక్ష్మీకాంతం కాలు విరగడంతో వారం రోజులుగా భీమవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వలంటీర్ దీపిక ఆస్పత్రికి వెళ్లి పింఛను అందజేసింది. అలాగే పాలకొల్లు మండలం వరిధనం గ్రామానికి చెందిన గునిశెట్టి తేజ వితంతు పింఛన్‌ను లబ్ధిదారు. కాలి వాపులతో భీమవరంలో చికిత్స పొందుతున్న ఆమెకు వలంటీర్ అనిత ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందజేసింది. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీలో అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా గత ఆరు నెలలుగా మన రాష్ట్రంలోనే మరో చోట నివాసం ఉంటుంటే.. తాము ఉన్న చోటనే పింఛన్ పొందేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు) -
జోరు వానలోనూ పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నా బుధవారం పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు వానలోనూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 59,18,673 మందికి ప్రభుత్వం పింఛను డబ్బు విడుదల చేసింది. 1వ తేదీనే 54,10,830 మంది లబ్ధిదారులకు (91.42 శాతం మందికి) రూ.1,263.23 కోట్లు అందాయి. తొలిరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93.57 శాతం మందికి, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 89.04 శాతం మందికి పింఛన్లు పంపిణీ అయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురు, శుక్రవారాల్లో కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్నా, పింఛన్ల పంపిణీలో మొక్కవోని లక్ష్యంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది శ్రద్ధ చూపారని మంత్రి అభినందించారు. పారాణి పాదాలతోనే పింఛన్ల పంపిణీ.. గంపలగూడెం: పెళ్లి పీటలు ఎక్కబోతూ.. పారాణి పాదాలతోనే ముందుగా పింఛన్లు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా గంపలగూడెంలో వలంటీరు కోట శివకృష్ణ. అతడికి మైలవరం మండలం మొర్సుమల్లికి చెందిన యువతితో బుధవారం ఉదయం 7.55 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. 35 కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటివద్ద కల్యాణ మంటపానికి వెళ్లాల్సి ఉన్నందున వేకువజామున 4 గంటలకే శివకృష్ణను కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి కుమారుడిని చేశారు. పెళ్లి బట్టలు ధరించి బాసికాలు, కాళ్లకు పారాణితోఉన్న శివకృష్ణ ఉదయం 6 గంటల వరకు తన పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఆ తర్వాత ముహూర్తానికి సమయం అవుతుండటంతో మొర్సుమల్లికి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివకృష్ణను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. కిడ్నీ బాధితురాలికి తక్షణమే పింఛన్ మంజూరు చేయించిన సెర్ప్ సీఈవో గుంటూరు జిల్లా అమరావతి రూరల్ మండలానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు గీతకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెంటనే పింఛను మంజూరు చేయించారు. ఆధార్, ఈ–కేవైసీ సమస్య కారణంగా పింఛను మంజూరుగాక ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. సిబ్బందితో కలిసి స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. పెళ్లి మంటపం నుంచి పింఛన్ల పంపిణీకి.. పరిగి/కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి తంతు ముగియగానే నేరుగా పింఛన్ల పంపిణీకి వెళ్లి పలువురి ప్రశంసలు అందుకున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు. పరిగి మండలం ముల్లమోతుకపల్లిలో వలంటీర్‌గా చేస్తున్న హరీష్‌రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు గ్రామంలోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మిని వివాహమాడారు. పెళ్లి వేడుక ముగియగానే నేరుగా వెళ్లి తన పరిధిలోని మొత్తం 27 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన వలంటీర్ వరలక్ష్మికి యనకల్లుకు చెందిన ఈశ్వర్‌తో వివాహమైంది. వేడుక పూర్తికాగానే ఆమె వెళ్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. -
48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్లు సెలవు రోజు అయినా.. ఆదివారం తెల్లవారుజాము నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. ఠంచన్‌గా ఒకటో తేదీ తెల్లవారకముందే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేశారు. రాత్రి 8 గంటల సమయానికి 48,63,732 మందికి రూ.1,157.74 కోట్లు పంపిణీ చేశారు. రాత్రి వేళ కూడా ఇంకా పంపిణీ కొనసాగుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 60.50 లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,455 కోట్లు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పాక్షిక మొత్తంలో డబ్బులు చేరినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.90 కోట్లు సకాలంలో క్షేత్రస్థాయికి చేరలేదని గుర్తించినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. ఆయా వార్డుల్లో కూడా ఆదివారం పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు చెప్పారు. సెలవు రోజు అయినా, కొన్నిచోట్లకు సకాలంలో పూర్తి డబ్బు చేరకపోయినా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 80.4 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు తెలిపారు. పింఛన్ల పంపిణీ తీరును సెర్ప్ సీఈవో ఇంతియాజ్ స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ, మంగళవారాల్లో ఈ పంపిణీ కొనసాగనుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ పేషెంట్‌కు.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషెంట్ వద్దకు వలంటీర్లు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఖాజీగూడేనికి చెందిన డయాలసిస్ పేషెంట్ కుమ్మరి శ్యాంసన్‌రాజు డయాలసిస్ పేషెంట్ కావడంతో ప్రభుత్వం రూ.10 వేల పింఛను మంజూరు చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొందిన అతడికి తరువాత బ్లాక్‌ఫంగస్ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. గత రెండునెలలు పింఛను తీసుకోకపోవడంతో ఈసారి తీసుకోకపోతే పింఛను రద్దయ్యే ప్రమాదముందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు అక్కినేని రాజశేఖర్ వలంటీర్లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ వెళ్లి అతడికి పింఛను ఇచ్చి రావాలని సూచించి, ప్రయాణ ఖర్చులకు తన సొంత సొమ్ము ఇచ్చారు. దీంతో వలంటీర్లు హైదరాబాద్ వెళ్లి 3 నెలల పింఛన్ సొమ్ము రూ.30 వేలు శ్యాంసన్‌రాజుకు అందజేశారు. – పెదపాడు (దెందులూరు), పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరంలో చికిత్స పొందుతున్న రాబంద గ్రామానికి చెందిన వృద్ధుడికి పింఛన్ ఇస్తున్న వలంటీర్ నిర్మల జిల్లా సరిహద్దులు దాటి.. అనారోగ్యంతో బాధపడుతున్న పింఛను లబ్ధిదారుకు జిల్లా దాటివెళ్లి మరీ పింఛను అందజేశారు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వలంటీరు. కడప నగరం నకాష్ వీధికి చెందిన పీరాన్ బీ (85) అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని ఆమె ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురంలో కుమార్తె ఇంటివద్ద ఉంటోంది. రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయిన ఆమె పరిస్థితిని తెలుసుకున్న వలంటీరు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆదివారం సీతారాంపురం వెళ్లి పింఛను మొత్తాన్ని అందజేశారు. – కడప కార్పొరేషన్ -
కొనసాగుతున్న 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా 60,50,377 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1455.87 కోట్లు కేటాయించింది. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ చేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.03 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
60.95 లక్షలమందికి నేడు పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 60.95 లక్షలమంది వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రభుత్వం గురువారం పింఛన్లు పంపిణీ చేయనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రూ.1,484.96 కోట్లను అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లోని డీఆర్డీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాల్ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. -
58 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61.46 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం రూ.1,497.62 కోట్ల నిధులను విడుదల చేయగా.. బుధవారం రాత్రి వరకు 58,01,978 మందికి రూ.1,398.77 కోట్ల మొత్తాన్ని వలంటీర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 94.38 శాతం మందికి పంపిణీ పూర్తి అయింది. గురువారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. నగరం నుంచి మన్యం వెళ్లి పింఛను.. సాక్షి, విశాఖపట్నం: నగరంలో అందుబాటులో లేక మూడు నెలలుగా పింఛన్ తీసుకోలేకపోయిన వృద్ధురాలికి సచివాలయ ఉద్యోగి వెళ్లి పింఛను అందించాడు. జీవీఎంసీ పరిధిలోని జోన్–8లోని పాపయ్యరాజపాలెం–3 సచివాలయంలో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా బొడ్డు కనక మహేశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నాడు. తన సచివాలయ పరిధిలోని చినముషిడివాడలో తంగుల బుల్లమ్మ (84) మూడు నెలలుగా పింఛను తీసుకోవడం లేదు. ప్రతి నెలా ఆమెకు ఫోన్ చేసి పింఛన్ తీసుకోవాలని చెప్పేవాడు. అయితే, లాక్డౌన్ కారణంగా సొంతూరైన విశాఖ జిల్లా మన్యంలోని డుంబ్రిగుడ మండలం లైగొండ గ్రామానికి వెళ్లిపోయామని, పింఛన్ తీసుకోవడానికి రాలేకపోతున్నానని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెలల పాటు వేచి చూసిన వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ.. బుధవారం ఉదయం 5 గంటలకు విశాఖ నుంచి బైక్‌పై 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైగొండ గ్రామానికి వెళ్లి బుల్లమ్మకు మూడు నెలల పింఛన్ డబ్బులు రూ.6,750 అందించాడు. దీంతో ఆమె భావోద్వేగానికి గురైంది. కూలిపనులు లేక.. ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి పింఛన్ డబ్బులు అందించినందుకు మహేశ్వరరావును ఆశీర్వదించి అభినందించింది. -
తొలిరోజే 56.12 లక్షల మందికి రూ.1,350 కోట్ల పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: జూన్ 1వ తేదీ.. మంగళవారం.. తెల్లవారకముందే లక్షల ఇళ్ల తలుపుతట్టిన వలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కరోనా భయంలోనూ అంకితభావంతో విధులు నిర్వర్తించారు. కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి కూడా ఆస్పత్రులకు వెళ్లి మరీ పింఛను డబ్బు అందజేశారు. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 56,12,751 (91.31 శాతం) మందికి పింఛన్లు అందజేశారు. రూ.1,350.76 కోట్లను పంపిణీ చేశారు. వేర్వేరు కారణాలతో మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి బకాయిలతో కలిపి ఈ నెల డబ్బులు ఇచ్చారు. ఒకనెల బకాయితో కలిపి 2.06 లక్షల మందికి రెండు నెలల పింఛను డబ్బుల విడుదల చేయగా.. అందులో 1.41 లక్షలమందికి మంగళవారం పంపిణీ చేశారు. రెండు నెలల బకాయిలతో కలిపి 10,115 మందికి మూడు నెలల డబ్బులు అందజేశారు. మూడు నెలల బకాయిలు కలిపి ఏడుగురికి నాలుగు నెలల పింఛను పంపిణీ చేశారు. పోర్టబులిటీ విధానంలో రాష్ట్రంలో ఎక్కడైనా పింఛను తీసుకోవడానికి 7,441 మంది దరఖాస్తు చేసుకోగా, వారందరికీ వారు ఉన్నచోటే సొమ్ము అందజేశారు. ఈనెలలో 61.46 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,497.63 కోట్లను విడుదల చేశారు. మంగళవారం 91.31 శాతం పంపిణీ పూర్తయింది. బుధ, గురువారాల్లో కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాచకుడికి పింఛను యాచన చేస్తూ జీవనం సాగించే ఆ వృద్ధుడికి రూ.2,250 పింఛను అందడంతో అతడి కళ్లల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. కాకినాడ నూకాలమ్మగుడి సమీపంలో పిట్టా గోపి (76) యాచనతో జీవనం సాగిస్తున్నాడు. బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటున్నాడు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో అతడికి రేషన్‌కార్డు, పింఛను మంజూరయ్యాయి. ఎంఎస్‌వో ఎంవీ మురళీకృష్ణ, 40వ డివిజన్ సచివాలయ అడ్మిన్ ఎన్.శ్రీలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ షర్మిలాలక్ష్మి మంగళవారం అతడికి వృద్ధాప్య పింఛను రూ.2,250 అందజేశారు. ఆనందంగా ఈ పింఛను అందుకున్న అతడి కళ్లల్లో బతుకు భరోసా కనిపించింది. – కాకినాడ కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్ నగరానికి చెందిన వృద్ధురాలు పి.కమలమ్మ కరోనా పాజిటివ్‌తో కొద్దిరోజులుగా చీరాల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సచివాలయం–2 వలంటీర్ సాయి ఆదివారం ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛను నగదు అందజేశారు. – వేటపాలెం వలంటీర్ల సేవలు భేష్ చిత్తూరులో కరోనాతో చికిత్స పొందుతున్న వారికి, హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారికి కూడా మంగళవారం వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రమణ్యానికి వలంటీర్ పి.ఎస్.నాగార్జున, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆనందవేల్కు వలంటీర్ మోహన్‌శ్రీనివాస్ పింఛన్ల సొమ్ము అందజేశారు. – చిత్తూరు అర్బన్ హైదరాబాద్ వెళ్లి పింఛను పంపిణీ కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటివద్ద చికిత్స పొందుతున్న వల్లభనేని శివపార్వతికి పాయకాపురం 262 సచివాలయం వలంటీరు నున్న అశోక్ మంగళవారం హైదరాబాద్ వెళ్లి పింఛను అందజేశారు. ఈ నెల కూడా పెన్షన్ తీసుకోకపోతే రద్దయ్య ప్రమాదం ఉన్నందున వలంటీర్ అశోక్ వెళ్లి మూడు నెలల పెన్షన్ రూ.6,750 ఆమెకు అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. – పాయకాపురం, విజయవాడ రూరల్ 24 కిలోమీటర్లు వెళ్లి.. ఇతడి పేరు సుబ్బరాయుడు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ఇప్పేరు గ్రామం. కరోనా లక్షణాలు ఉండటంతో మంగళవారం ఉదయం 24 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకునేందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్ రజని అనంతపురం చేరుకుని ఆస్పత్రి వద్దే కోవిడ్ నిబంధనల మధ్య పింఛను పంపిణీ చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం బ్లాక్‌ఫంగస్ బాధితుడికి పింఛను బ్లాక్‌ఫంగస్ సోకి విశాఖలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి.. వలంటీర్ కరుకోల రాజేశ్వరి దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి పింఛను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చిన్నకోడూరుకు చెందిన మెట్ట అప్పారావు బ్లాక్‌ఫంగస్ సోకి విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నకోడూరు వలంటీరు రాజేశ్వరి స్వయంగా విశాఖలో ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. ఎంతో శ్రమపడి తనకు పింఛను ఇచ్చిన వలంటీర్‌కు వెంటిలేటర్‌పై ఉన్న అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. – పోలాకి బాలింత అయినా విధి నిర్వహణలో అంకితభావం కరోనా వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోను విధి నిర్వహణే పరమావధిగా భావించిన వలంటీరు చింతపల్లి హేమలత.. బాలింత అయినా కూడా పింఛన్లు పంపిణీ చేశారు. ఆమె జీవీఎంసీ 30వ వార్డులోని కొత్త జాలారిపేటలో వలంటీర్‌గా పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. మంగళవారం యథావిధిగా పింఛన్లు పంపిణీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం, కొత్త జాలారిపేట వెల్ఫేర్ సెక్రటరీ ఫణిరాజ్ శరకం, అడ్మిన్ సెక్రటరీ వరలక్ష్మి, పలువురు వలంటీర్లు హేమలతను అభినందించారు. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన దాస్యం పెరుమళ్లు కరోనాతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ గెడ్డం సురేష్ మంగళవారం రాజమండ్రి వెళ్లి పీపీఈ కిట్ ధరించి ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న పెరుమళ్లుకు వితంతు పింఛన్ అందజేశారు. – చాగల్లు కరోనా బాధితుడికి పింఛను వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం తిరువెంగళాపురం పంచాయతీ పాతతిరువెంగళాపురం గ్రామ వలంటీర్ రాగే రమణయ్య కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్‌కు పింఛను అందజేశారు. గ్రామానికి చెందిన నారిబోయిన పుల్లయ్య కరోనాతో బాధపడుతూ కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం పుల్లయ్యకు పింఛన్ ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన వలంటీర్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే కడప వెళ్లి ఆస్పత్రిలో పుల్లయ్యకు పింఛన్ అందజేశారు. – బద్వేలు అర్బన్ -
రెండో రోజూ పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సెలవు రోజైన ఆదివారం కూడా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,36,746 మంది లబ్ధిదారులకు రూ.1,350 కోట్ల నగదును వలంటీర్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 91.72 శాతం మందికి పంపిణీ పూర్తయిందని, సోమవారం కూడా పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. వలంటీర్ కాదు.. వారియర్ మంగళగిరి: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ గ్రామ/వార్డు వలంటీర్లు వారియర్లుగా మారి ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేరుస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని చినకాకానికి చెందిన చాగర్లమూడి శివరామకృష్ణయ్య అనే వృద్ధుడు కరోనా బారినపడి మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలలుగా అతడు వృద్ధాప్య పింఛన్ తీసుకోవడం లేదు. ఈ నెల కూడా తీసుకోకపోతే నిబంధనల ప్రకారం ఆయనకు పింఛన్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆ ప్రాంత వలంటీర్ ఆర్.హేమలత ప్రాణాలకు తెగించి మరీ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులోకి నేరుగా వెళ్లి శివరామకృష్ణయ్య పింఛన్ అందజేసింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం తనకు చికిత్స చేయించడంతోపాటు ప్రస్తుత విపత్కర పరిస్థితిలో నేరుగా తన వద్దకు వలంటీర్‌ను పంపించి పింఛను నగదు అందజేసిందని శివరామకృష్ణయ్య చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఈ స్థాయిలో సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. కోవిడ్ బాధితుడికి పింఛన్ అందజేత కడియం: కోవిడ్ బారినపడి ఇంటివద్ద చికిత్స పొందుతున్న వృద్ధుడికి ఆదివారం పెన్షన్ అందజేశారు తూర్పు గోదావరి జిల్లా కడియం–1 సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సూర్యశ్రీనివాస్. కోవిడ్ రోగులంటే దూరం జరుగుతున్న నేపథ్యంలో వృద్ధుడి అవసరాన్ని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాస్ ఐరిస్ విధానం ద్వారా పెన్షన్ అందజేశారు. గత నెలలో కూడా ఐసొలేషన్‌లో ఉన్న ఒక వృద్ధురాలికి పెన్షన్ అందజేసినట్టు శ్రీనివాస్ చెప్పారు. -
విపత్తు వేళా ఠంచనుగా పింఛన్
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళలోనూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 54,13,004 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసింది. ఎక్కడా నలుగురైదుగురు గుమిగూడే పరిస్థితి రానివ్వకుండా కచ్చితమైన జాగ్రత్తలు చేపట్టింది. శనివారం మే డే సెలవు రోజు అయినప్పటికీ వలంటీర్లు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 88.07 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,296.10 కోట్లను నగదు రూపంలో అందజేశారు. మొత్తం 61.45 లక్షల మందికి మే 1న పింఛన్ అందించేందుకు రూ.1,483.68 కోట్లను ప్రభుత్వం శుక్రవారం సాయంత్రానికి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాల్లో జమ చేసింది. కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మే డే సెలవు రోజు అయినా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శనివారం ఆయా బ్యాంకుల్ని తెరిచి పింఛనుదారుల డబ్బులు సచివాలయ కార్యదర్శుల ద్వారా వలంటీర్లకు చేరేందుకు సహకరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో నామమాత్రంగా కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీ కార్యక్రమం కాస్త మందగించినట్టు తెలిపారు. ఆది, సోమవారాల్లో కూడా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వలంటీర్లు పింఛన్ పంపిణీ చేస్తారని సెర్ప్ అధికారులు వెల్లడించారు. ప్రసవించే వేళా.. మది నిండా ఆశయమే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఈ వలంటీర్ పేరు ఎం.హరిణి. 9 నెలల నిండు గర్భిణి. రేపో మాపో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బయటకొస్తే కరోనా భయం వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఏ గర్భిణి అయినా విశ్రాంతి తీసుకోవాలి. కానీ.. హరిణికి మాత్రం మది నిండా జగనన్న ఆశయమే నిండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగనన్న ఆశయానికి విఘాతం కలుగకూడదన్న సంకల్పంతో అవ్వా తాతలకు ఒకటో తేదీనే పింఛన్ అందించేందుకు వేకువజామునే విధుల్లోకి వచ్చింది. పెద్దల పైడమ్మ అనే వృద్ధురాలికి పింఛన్ పంపిణీ చేస్తుండగా తీసిన చిత్రమిది. నువ్వు బంగారమయ్యా పింఛన్ సొమ్ము తీసుకుంటూ మురిసిపోతున్న ఈ అవ్వ పేరు జి.వెంకట సుబ్బమ్మ. కడప వైఎస్ నగర్లో నివసిస్తోంది. ఉదయాన్నే ఆ ప్రాంత వలంటీర్ భారతి వెళ్లి వృద్ధాప్య పింఛన్ నగదు అందజేయగా.. వెంకట సుబ్బమ్మ మురిసిపోయింది. ‘ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ వస్తోంది. జగనయ్యా.. నువ్వు బంగారమయ్యా’ అంటూ చిరునవ్వులు చిందించింది. రాదనుకుని వదిలేసినా.. పింఛనొచ్చింది అచ్చంపేట (పెదకూరపాడు): ఎన్నోసార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాక విసిగిపోయిన 80 ఏళ్ల నిరుపేద వృద్ధురాలికి ఎట్టకేలకు గ్రామ వలంటీర్ చొరవతో పింఛన్ మంజూరైంది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన గణపవరపు లక్ష్మమ్మకు వెనకాముందూ ఎవరూ లేరు. వృద్ధాప్య పింఛన్ కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆమె మొర ఎవరూ ఆలకించలేదు. ఆమె స్థితిగతుల్ని గుర్తించిన గ్రామ వలంటీర్ శివకుమార్ పింఛన్ మంజూరు చేయించాడు. శనివారం ఆమె ఇంటికి వెళ్లి ఈ నెల పింఛన్ రూ.2,250 అందించగా.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. గ్రామ వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, తనలాంటి వారిని గుర్తించి న్యాయం చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్మమ్మ కృతజ్ఞతలు తెలిపారు. -
61.45 లక్షల మందికి నేడు పింఛన్లు పంపిణీ
-
61.45 లక్షల మందికి నేడు పింఛన్లు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 61.45 లక్షల వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నేడు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు అయిన 59,062 మందికి కలిపి పంపిణీ కొనసాగనుంది. వీరందరికీ పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,483.68 కోట్లను శుక్రవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛను డబ్బులు పంపిణీ చేస్తారు. పింఛనుదారుడి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తింపు.. లేదంటే రియల్‌టైం బెనిఫీషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానాలలో పంపిణీ చేస్తారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఏ లబ్ధిదారుడికైనా పంపిణీలో ఇబ్బంది కలిగితే ఆ లబ్ధిదారుని కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ ద్వారా వలంటీర్లు పంపిణీ చేస్తారు. వలంటీర్ల ద్వారా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ స్వయంగా పర్యవేక్షిస్తారని.. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఆయా జిల్లాల డీఆర్డీఏ ఆఫీసులో పర్యవేక్షణ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. (చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజుల నిర్ధారణ) -
రెండు రోజుల్లో 58.67 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి/సంగం/బిట్రగుంట: అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందించారు. మార్చికి సంబంధించి రెండో రోజు మంగళవారం నాటికి 58,67,623 మందికి రూ.1,404.24 కోట్లు అందజేశారు. ఇప్పటివరకు 95.56 శాతం మేర పంపిణీ చేశామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. బుధవారం కూడా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందిస్తారని చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లి మరీ పింఛన్ అందజేత ఓ వలంటీర్ తన పరిధిలోని లబ్ధిదారుకు పింఛన్ అందించడానికి ఏకంగా మరో రాష్ట్రానికి ప్రయాణించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధీపురం క్లస్టర్లో పరుచూరు కృష్ణవేణమ్మ అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్ద ఉంటోంది. ఇప్పటికే రెండు నెలలుగా పింఛన్ తీసుకోలేకపోయింది. మార్చి 1 వచ్చినా రాకపోవడంతో ఆమె పింఛన్ ఆటోమేటిక్‌గా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో వలంటీర్ రమేష్ సోమవారం రాత్రి హైదరాబాద్ వెళ్లి మరీ మూడు నెలల పింఛన్ రూ.6,750 ఆమెకు అందించి వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ.. ఓ వలంటీర్ సొంత ఖర్చులతో తన ద్విచక్ర వాహనంపై పోను.. రాను 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్ సొమ్ము అందించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు పంచాయతీ చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన లంక అయ్యమ్మది నిరుపేద కుటుంబం. భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. గుండె సంబంధిత సమస్యతో పది రోజుల నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల ఒకటిన పింఛన్ పంపిణీ సమయంలో అయ్యమ్మ అందుబాటులో లేని విషయం తెలుసుకున్న వలంటీర్ వై.శ్రీకాంత్ చెన్నైకి వెళ్లి పింఛన్ అందజేయాలని నిర్ణయించుకున్నాడు. రైళ్లు కూడా సమయానికి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తన ద్విచక్రవాహనంపై చెన్నై వెళ్లి ఆమెకు పింఛన్ అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. -
తొలిరోజే అవ్వాతాతల చేతికి రూ.1,351.94 కోట్లు
సాక్షి, నెట్వర్క్: మళ్లీ ఒకటో తేదీ రావడం ఆలస్యం.. వలంటీర్లు తెల్లవారుజామునే అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్ అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 56,57,160 మందికి రూ.1,351.94 కోట్లు పంపిణీ చేశారు. తొలి రోజు 92.13 శాతం మందికి పింఛన్ సొమ్ము ఇచ్చామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. మంగళ, బుధవారాల్లో కూడా అందిస్తామని చెప్పారు. ► మార్చికి సంబంధించి మొత్తం 61,40,090 మందికి పింఛన్ల పంపిణీకి రూ.1,473.88 కోట్లను ఫిబ్రవరి 26నే అన్ని సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ► బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడంలో లబ్ధిదారులకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మరో మూడు పద్ధతుల ద్వారా పింఛన్లు అందించేందుకు వీలు కల్పించారు. లబ్ధిదారుడి కుటుంబంలోని వేరొకరి బయోమెట్రిక్ ద్వారా డబ్బుల పంపిణీకి అవకాశమిచ్చారు. 120 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ.. 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఆస్పత్రిలో ఉన్న వ్యాధిగ్రస్తురాలికి పింఛన్ అందించాడు.. చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన వలంటీర్. మండలంలోని ఎనుగొండపాళ్యెం పంచాయతీకి చెందిన వలంటీర్ హరినాథ్ పరిధిలోని పి.రమణమ్మ అనే వృద్ధురాలు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆర్థికావసరాలు తెలుసుకున్న హరినాథ్ సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్లి మరీ ఆమెకు పింఛన్ అందజేశాడు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరు వలంటీర్ చవల చినబాబు.. అంబటి అప్పారావు అనే లబ్ధిదారుడి ఇంటికి పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా ఆయన అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో ఉన్నట్లు బంధువులు చెప్పారు. దీంతో చినబాబు అప్పటికప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ వెళ్లి ఆయనకు పింఛన్ అందజేశాడు. అలాగే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివమ్మ అనే వృద్ధురాలికి గుంటూరు జిల్లా కాజ గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ 16 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్ సొమ్ము అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడుకు చెందిన డయాలసిస్ పేషెంట్ ఏలేటి మంగమ్మకు వలంటీర్ గొన్నూరి అంజనిమిత్ర స్వయంగా అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసింది. మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా.. ఆ వలంటీర్‌కు మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా తన పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో వలంటీర్ జావీద్ పెళ్లి దుస్తుల్లోనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పొలాలకెళ్లి మరీ పింఛన్ పంపిణీ ఇంటికే కాదు.. అవసరమైతే లబ్ధిదారుల పని ప్రదేశానికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.. వలంటీర్లు. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి (పీసీపల్లి) మండల పరిధిలోని తురకపల్లి గ్రామ వలంటీర్ శ్రీహరి తన పరిధిలోని లబ్ధిదారు కాకర్ల వరమ్మ నువ్వుల కళ్లంలో పనిచేస్తుంటే అక్కడికి వెళ్లి మరీ పింఛన్ సొమ్ము అందించాడు. బాలింతయినా బాధ్యత మరవని వలంటీర్ పది రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన ఆ వలంటీర్.. అటువంటి పరిస్థితుల్లోనూ తన బాధ్యతను మరవలేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జనార్దనస్వామి కాలనీకి చెందిన గ్రామ వలంటీర్ దేశాభక్తుల వరలక్ష్మి పచ్చి బాలింతరాలు. అయినప్పటికీ సోమవారం ఉదయాన్నే తన పరిధిలోని లబ్ధిదారులకు మరో వలంటీర్ సాయంతో పింఛన్లు అందజేసి అందరితో శభాష్ అనిపించుకుంది. -
ఎల్లలు దాటిన సంక్షేమం
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి అనుగుణంగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ రెండో రోజైన మంగళవారం నాటికి 96.36 శాతం మందికి పూర్తయింది. 59,32,610 మంది లబ్ధిదారులకు రూ.1,420.95 కోట్లను అందజేశారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛను సొమ్ము అందజేయగా.. లబ్ధిదారుల్లో కొందరు అనారోగ్యం వంటి కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటంతో వలంటీర్లు దూరాభారాన్ని సైతం లెక్కచేయకుండా వెళ్లి వారికి నగదు పంపిణీ చేశారు. ► శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన లబ్ధిదారు పైడి అప్పలనర్సమ్మ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పలనర్సమ్మ అతడితోపాటు ఆస్పత్రిలోనే ఉండటంతో వలంటీర్ రమణ మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి పింఛను సొమ్ము అందించాడు. ► ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన లబ్ధిదారు బొల్లినేని వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె శస్త్ర చికిత్స చేయించుకోగా.. వలంటీర్ సిద్దారపు ఇసాక్ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి పింఛను సొమ్ము అందించాడు. ► పెందుర్తి సమీపంలోని కృష్ణరాయపురం ఎన్ఏడీ కాలనీకి చెందిన వడ్డాది జగ్గయ్యమ్మ (86) మూడు నెలల క్రితం పెద్దాపురంలోని సోదరి కుమార్తె ఇంటికి వెళ్లింది. అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే ఉండిపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఇచ్చేందుకు వెళుతున్న సచివాలయ సిబ్బంది, వలంటీర్‌కు ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో స్థానికులను ఆరా తీయగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో వార్డు వెల్ఫేర్ కార్యదర్శి డొక్కరి వెంకటరావు మంగళవారం పెద్దాపురం వెళ్లి జగ్గయ్యమ్మకు మూడు నెలల పింఛను అందించారు. ► అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకేడు వలంటీర్ చిరంజీవి తిరుపతికి వెళ్లి మరీ స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న కిడ్నీ వ్యాధి బాధితుడు శ్రీనివాసులుకు పింఛను అందజేశాడు. ఇదే జిల్లాలోని అమరాపురం మండలం హలుకూరు వలంటీర్ హనుమంతరాయ బెంగళూరులో చికిత్స పొందుతున్న కరియమ్మకు పింఛను అందించాడు. ► చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే లబ్ధిదారు పక్షవాతంతో బెంగళూరులో చికిత్స పొందుతుండగా వలంటీర్ భానుప్రకాష్ అక్కడికి వెళ్లి పింఛను అందించాడు. -
వలంటీర్‌పై దాడి చేసి పింఛన్ సొమ్ము దోపిడీ
పిడుగురాళ్ల(గురజాల): గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న వలంటీర్, వెల్ఫేర్ అసిస్టెంట్‌పై ఇద్దరు అగంతకులు దాడిచేసి నగదు దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో శనివారం జరిగింది. జూలకల్లు వెల్ఫేర్ అసిస్టెంట్ గడిపూడి శివపార్వతి తెలిపిన వివరాల ప్రకారం.. జూలకల్లు గ్రామ వలంటీర్ బీరవల్లి వెంకటరెడ్డి, శివపార్వతి ఇద్దరూ కలిసి ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్)లో శనివారం ప్రభుత్వ ఖాతా నుంచి రూ.19, 21, 282 డ్రా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా, పందిటివారిపాలెం గ్రామ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద వెనుక నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు క్రికెట్ బ్యాట్‌తో బైక్ నడుపుతున్న వలంటీర్ తలపై బలంగా కొట్టారు. దీంతో బైక్‌తో పాటు ఇద్దరూ రోడ్డు పక్కన పొలాల్లో పడిపోయారు. వలంటీర్ స్పృహ కోల్పోవడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ శివపార్వతిని కూడా క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టేందుకు ప్రయత్నించగా, చేయి అడ్డు పెట్టడంతో చేతికి గాయమైంది. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు వీరి దగ్గర ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కుని తిరిగి పిడుగురాళ్ల వైపు పారిపోయారు. పల్సర్ బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండగా, క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన వ్యక్తి తలపై క్యాప్ ధరించి ఉన్నాడు. జూలకల్లు గ్రామానికి చెందిన వ్యక్తులు గాయాలపాలైన వీరిని చూసి ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి విషయమై శివపార్వతి పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వలంటీర్ వెంకటరెడ్డి తలకు బలమైన దెబ్బ తగలడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మూడు బృందాలతో విచారణ పింఛను సొమ్ము చోరీ కేసులో దుండగులను పట్టుకునేందుకు పోలీసు శాఖ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. నగదు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
96.25 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి/రొద్దం: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో 59,41,480 మందికి రూ. 1,425.06 కోట్ల మేర పంపిణీ పూర్తి చేశారు. మొత్తం 96.25 శాతం పంపిణీ పూర్తయింది. ఆదివారం కూడా ఈ పంపణీ కొనసాగనుంది. ఒంగోలు నగరంలో దివ్యాంగుడు దుర్గావలికి పింఛన్ ఇస్తున్న వలంటీర్ కోటి పెళ్లి కూతురుగానే.. పింఛన్ల పంపిణీ ఆ వలంటీర్‌కు పెళ్లి కుదిరింది. శనివారం తొలి పసుపు (పెళ్లికూతురుని చేయడం). అయినా కూడా పింఛన్ల పంపిణీ చేసి అందరిమన్ననలు పొందింది అనంతపురం జిల్లా రొద్దం గ్రామ వలంటీర్ గాయత్రి. పింఛను లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో బాధ్యతను నెరవేర్చింది. సీఎం జగనన్న సంకల్పంలో తాను భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. -
95.89% మందికి పింఛన్లు..
సాక్షి, అమరావతి: తొలిరోజు పంపిణీకి వీలు కాని పింఛనుదారులకు బుధవారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. బుధవారం నాటికి మొత్తం 59,16,290 మందికి పంపిణీ పూర్తి కాగా, రూ.1436.78 కోట్లు అందజేశారు. రెండో రోజుకు మొత్తం పింఛనుదారుల్లో 95.89 శాతం మందికి డబ్బులు చేరాయి. గురువారం కూడా వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తారని సెర్ప్ అధికారులు వెల్లడించారు. పరిమళించిన మానవత్వం గాలివీడు/ఒంగోలు టౌన్: మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామాలకు రాలేని ఇద్దరు వృద్ధుల పింఛను రద్దయ్యే నేపథ్యంలో.. స్థానికులు, స్థానిక వలంటీర్లు మానవత్వంతో బాసటగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తలముడిపికి చెందిన రామసుబ్బమ్మ అనారోగ్యంతో మూడు నెలల క్రితం కర్ణాటకలోని ఉడిపి మండలం కొలంబిలో ఉంటున్న తన కూతురింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఇక్కడికి రాలేకపోయింది. మూడు నెలలు కావస్తుండడంతో వృద్ధాప్య పింఛన్ రద్దయ్యే అవకాశం ఉందని గ్రామ వలంటీరు ఆలీ అహమ్మద్ బాషా స్థానికులకు తెలిపాడు. దీంతో కొంతమంది స్పందించి టికెట్‌కయ్యే ఖర్చులో కొంతమొత్తాన్ని వలంటీర్‌కు అందజేశారు. ఆ మొత్తంతోపాటు వలంటీర్ మరికొంత మొత్తం భరించి మంగళవారం కర్ణాటకలోని వృద్ధురాలు ఉంటున్న ఇంటికి వెళ్లి మూడు నెలల పింఛన్‌ను అందజేశాడు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గాంధీనగర్ వార్డుకు చెందిన దేవరపల్లి రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నది. మూడు నెలలుగా పింఛను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక వలంటీర్ పాలపర్తి డేవిడ్ విషయాన్ని సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సుబ్బయ్యశర్మకు వివరించాడు. దీంతో ఆయన తన సహచర సెక్రటరీలతో మాట్లాడి డేవిడ్ ప్రయాణానికి అవసరమైన నగదు సమకూర్చారు. వలంటీర్ డేవిడ్ బుధవారం హైదరాబాద్ వెళ్లి ఆ వృద్ధురాలికి అందాల్సిన నాలుగు నెలల పింఛన్‌ను అందజేశాడు. దీంతో ఆ వృద్ధుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వలంటీర్లను పలువురు ప్రశంసించారు. -
తొలిరోజే రూ.1,412 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు పింఛను డబ్బులు ఒకటో తేదీన ఠంఛన్‌గా అందాయి. మంగళవారం తెలవారుతుండగానే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభించిన వలంటీర్లు తొలిరోజు 58,22,120 మందికి రూ.1,412 కోట్లు పంపిణీ చేశారు. మొదటిరోజే 94.36 శాతం మందికి పింఛను డబ్బులు అందాయి. లబ్ధిదారులందరికీ పింఛను తప్పకుండా అందాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ నెల నుంచి మూడురోజులు పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల నుంచి 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ► తొలిరోజు ఉదయం 8.30 గంటలకే 58 శాతం పంపిణీ పూర్తవగా, మధ్యాహ్నం 3 గంటల కల్లా 90 శాతం పంపిణీ పూర్తయింది. ► ఒకటి, రెండు, మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోలేకపోయిన 2,14,464 మందికి మంగళవారం పాత బకాయిలతో కలిపి ఈ నెల పింఛను అందజేశారు. ► 2,42,293 మందిలో 2,01,456 మంది పాత బకాయితో కలిపి రెండునెలల పింఛను డబ్బు తీసుకున్నారు. 18,590 మందికిగాను 10,974 మంది రెండు నెలల బకాయిలతో కలిపి మొత్తం మూడునెలల డబ్బులు, 7,462 మందికిగాను 2,034 మంది మూడునెలల బకాయిలతో కలిపి మొత్తం నాలుగు నెలల డబ్బులు అందుకున్నారు. బుధ, గురువారాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. 90 కిలోమీటర్లు వెళ్లి పింఛను పంపిణీ నెల్లిమర్ల రూరల్/విజయపురం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వలంటీరు రాంబాబు విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు బెల్లాన రాజమ్మకు పింఛను అందజేశారు. రాజమ్మ పక్షవాతంతో బాధపడుతూ విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు మంగళవారం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన తరువాత దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నంలోని ఆదిత్యా ఆస్పత్రిలో రాజమ్మకు పింఛను సొమ్ము అందజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆస్పత్రిలోనే పింఛను ఇవ్వడంతో రాజమ్మ, ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ వెళ్లి పింఛన్ అందజేసిన వలంటీర్‌ను ఎంపీడీవో రాజ్‌కుమార్, ఈవోపీఆర్డీ భానోజీరావు, గ్రామస్తులు అభినందించారు. చెన్నై వెళ్లి పింఛను ఇచ్చిన వలంటీర్ చిత్తూరు జల్లా విజయపురం మండలంలోని ఆలపాకం గ్రామానికి చెందిన సుబ్బమ్మ మూడునెలల కిందట చెన్నైలో బంధువుల ఇంటికి వెళ్లారు. లాక్డౌన్ కారణంగా తిరిగి రాలేకపోయారు. పింఛను కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ చిన్నరాజ్ తన సొంత ఖర్చుతో ద్విచక్ర వాహనం మీద చెన్నైలోని రెడ్‌హిల్స్‌కి వెళ్లి సుబ్బమ్మకు రెండునెలల బకాయిలతో సహా మూడునెలల పింఛను సొమ్ము అందజేశారు. ఒంగోలు లబ్ధిదారుకు తిరుపతి ఆస్పత్రిలో.. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన పి.జాషువా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నాడు. తిరుపతి 38వ వార్డు సంక్షేమ కార్యదర్శి నీలమణి మంగళవారం ఉదయం స్విమ్స్ డయాలసిస్ వార్డులోకి వెళ్లి జాషువాకు పింఛను సొమ్ము అందజేశారు. -
రెండో రోజు కొనసాగిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/బలిజిపేట (పార్వతీపురం): రెండో రోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. తొలిరోజు పంపిణీకి వీలు కాని వారికి వలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం నాటికి మొత్తం 58,99,388 మందికి పంపిణీ పూర్తి కాగా, రూ.1,420.92 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం పింఛనుదారుల్లో 95.24 శాతం మందికి పింఛన్లు అందాయి. అర్ధరాత్రి వేళ ఆస్పత్రి వద్దకే పింఛన్ లబ్ధిదారుడి అవసరం తీర్చడానికి అర్ధరాత్రి వేళ ఆస్పత్రి వద్దకే పింఛన్ తరలివెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకికి చెందిన పింఛన్ లబ్ధిదారుడు జి.తిరుపతి డయాలసిస్ నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి బయోమెట్రిక్, ఐరిస్ పడకపోవడంతో అప్పటికి ఇంకా పింఛన్ అందలేదు. ఇటువంటి వారికి సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ అథంటికేషన్‌తో వెంటనే పింఛన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారంతో వెల్ఫేర్ అసిస్టెంట్ అశోక్ ఆదివారం అర్ధరాత్రి వేళ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తిరుపతికి రూ.10 వేలు పింఛన్ అందించారు. అంత రాత్రివేళ సుదూరం నుంచి వచ్చిన వెల్ఫేర్ అసిస్టెంట్‌కు ఆ లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపాడు. -
ఒకటో తేదీనే 94.94% మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ తొలిరోజే 94 శాతానికి పైగా పూర్తయ్యింది. అవ్వాతాతలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే తమ పింఛన్ డబ్బులు అందుకున్నారు. వలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వాటిని అందజేశారు. ఆదివారం సాయంత్రానికి మొత్తం 58,80,605(94.94శాతం) మందికి రూ.1,416.34 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. గత మూడు, నాలుగు నెలలుగా వివిధ కారణాలతో పింఛన్లు తీసుకోలేకపోయిన వారికి పాత బకాయిలు కూడా కలిపి అందించారు. 1,80,862 మందికి రెండు నెలల డబ్బులు, 26,385 మందికి 3 నెలల డబ్బులు, 179 మందికి నాలుగు అంతకంటే ఎక్కువ నెలలకు సంబంధించిన పాత బకాయిలను ఈనెల పింఛన్‌తో కలిపి ఇచ్చారు. 12,892 మంది పోర్టబులిటీ విధానాన్ని ఉపయోగించుకున్నారు. అందులో 6,907 మంది సొంత జిల్లాలోనే వేరొక చోట ఉండి పింఛన్ డబ్బులు పొందగా, 5,985 మంది వేరే జిల్లాల్లో తీసుకున్నారు. -
93.24 శాతం మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను మంగళవారం 57,51,413 మందికి పంపిణీ చేశారు. కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో గత ఐదారు నెలలుగా పింఛన్లు తీసుకోలేకపోయిన అవ్వాతాతలకు బకాయిలను కూడా ఈ నెల పింఛన్లతో కలిపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇలా మొత్తం రూ.1,379.81 కోట్లను వలంటీర్లు లబ్ధిదారుల వద్దకే వెళ్లి అందజేశారు. తొలిరోజు సెప్టెంబర్ ఒకటవ తేదీనే 93.24 శాతం పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈనెల పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు.. ఐదారు నెలల పాటు పింఛన్లు తీసుకోని వారికి బకాయిలన్నింటినీ కలిపి ఇవ్వాల్సి రావడంతో పారదర్శకత కోసం మళ్లీ బయో మెట్రిక్ విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వలంటీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చిత్తూరు, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో 94 శాతానికి పైగా పంపిణీ పూర్తవగా, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు 85 శాతం పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల్లో పలుచోట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవి.. ► విశాఖ జిల్లా తామరబ్బ పంచాయతీ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో సెల్‌సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో వలంటీర్ సింహాచలం, పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ రాజా ఒకటో తారీఖునే పింఛన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో బండరాళ్లపై సిగ్నళ్ల కోసం నిరీక్షించి మరీ పెన్షన్లను అందజేశారు. ► చిత్తూరు జిల్లా పిచ్చాటూరు గాంధీనగర్‌కు చెందిన వలంటీర్ వాణిశ్రీ సోమవారమే పెళ్లి చేసుకున్నప్పటికీ మంగళవారం తనే పెన్షన్లు పంపిణీ చేస్తానంటూ ముందుకు వచ్చి వేకువజాము నుంచే పింఛన్లు అందజేసి అందరి మన్ననలు అందుకున్నారు. ► కర్నూలు జిల్లా మడుతూరు మండల కేంద్రంలో వలంటీర్‌గా పనిచేస్తున్న సులోచనమ్మ.. తన తల్లి మాణిక్యమ్మ (55) సోమవారం సాయంత్రం మరణించినప్పటికీ తన పరిధిలోని లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ పంపిణీ చేసి ఆ తర్వాత అంత్యక్రియలకు వెళ్లారు. ఇంతకన్నా పేదోళ్లకి ఇంకేం కావాలి 60ఏళ్లు నిండిన నాకు అర్హత పొందిన 15 రోజుల్లోనే వృద్ధాప్య పెన్షన్ పొందగలగడం జగనన్న దయగా భావిస్తున్నాను. జగన్ సీఎం అయ్యాక పేదలకు ఎటువంటి కష్టం లేకుండానే నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ అందజేశారు. ఇంతకంటే పేదవాడికి ఏం కావాలి. పెన్షన్ మంజూరు చేసిన జగనన్నకు కృతజ్ఞతలు. – రేకాడి వీరభద్రరావు, జగన్నాథపురం, కాకినాడ నాకిక పింఛను రాదేమో అనుకున్నా 90ఏళ్ల వయస్సున్న నేను గత ఆరేళ్లుగా వృద్ధాప్య పించను కోసం అర్జీలిస్తూనే ఉన్నా. కానీ, మంజూరు కాలే. ఇప్పుడు వలంటీరు రాసుకొనిపోయిన నెలకే పింఛను అందింది. చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ చల్లగా ఉండాలయ్యా. – జులేఖాబీ, పలమనేరు, చిత్తూరు జిల్లా -
11.42 లక్షల కొత్త పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 90,167 మంది అవ్వా తాతలకు ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో 89,324 మంది రెగ్యులర్ పింఛన్లు, 843 మంది హెల్త్ పింఛన్లు అందుకోనున్నారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. వీటితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మంగళవారం 61.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందించనున్నారు. ఇందుకోసం రూ.1,496.07 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాలకు నిధులను విడుదల చేసింది. ఐదు నెలల తరువాత పాత విధానంలో పంపిణీ.. ► ఈసారి జియో ట్యాగింగ్ విధానంలో కాకుండా పాత పద్ధతి ప్రకారమే బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కొత్త పింఛన్లు భారీగా మంజూరు కావడం, పాత బకాయిలు పెద్ద ఎత్తున చెల్లిస్తున్న నేపథ్యంలో పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ► కరోనా, లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,87,442 మందికి కూడా ఈ నెల పింఛన్లను బకాయిలతో కలిపి అందచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. 2,375 మంది ఆరు నెలల పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. 5,497 మందికి ఐదు నెలల డబ్బులు, 1,286 మందికి నాలుగు నెలల పింఛన్ చెల్లిస్తారు. 2,399 మందికి మూడు నెలలు, 15,748 మందికి రెండు నెలలు, 1,60,137 మందికి ఒక నెల పింఛను బకాయిలు కలిపి అందించనున్నారు. ► తాము ప్రస్తుతం ఉంటున్న చోట పింఛన్ అందచేయాలని కోరుతూ 13,969 మంది డీఆర్డీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. సీఎం విప్లవాత్మక నిర్ణయాలతో సంతృప్త స్థాయిలో పింఛన్లు పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించగలుగుతున్నాం. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే అర్హులకు పింఛను మంజూరు కార్డు అందజేస్తున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే యజ్ఞంలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి -
ఒకటో తేదీనే 97 శాతం మందికి పింఛన్ల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట గ్రామంలో ఓ పాకలో వుంటున్న శతాధిక వృద్ధురాలికి బుధవారం ఉదయాన్నే పింఛను సొమ్ము అందజేస్తున్న వలంటీరు సుగుణ సాక్షి, అమరావతి: జూలై నెల పింఛన్ల పంపిణీ తొలి రోజునే 97 శాతానికి పైగా పూర్తయింది. అవ్వాతాతలు చిన్న కష్టం కూడా పడకుండానే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే నెల తొలి రోజునే పింఛను సొమ్ములు చేతికి అందాయి. ఒకటవ తేదీ మధ్యాహ్నానికే ఈ నెల జరగాల్సిన పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షనర్ల చేతికి పింఛను సొమ్మును అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వలంటీర్లు బుధవారం తెల్లవారు జాము నుంచే పంపిణీ మొదలు పెట్టి మధ్యాహ్నం కల్లా దాదాపు పూర్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈసారి కూడా బయో మెట్రిక్ విధానంలో కాకుండా పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పంపిణీ సమయంలో జియో ట్యాగింగ్‌తో కూడిన లబ్ధిదారుడి ఫొటో తీసుకొని వలంటీర్లు డబ్బులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట గ్రామంలో ఓ పాకలో వుంటున్న శతాధిక వృద్ధురాలికి బుధవారం ఉదయాన్నే పింఛను సొమ్ము అందజేస్తున్న వలంటీరు సుగుణ 59,03,723 మంది పింఛనుదారులకు గాను 57,32,603 మందికి బుధవారం పింఛన్ల పంపిణీ జరిగింది. మొత్తం రూ.1,389 కోట్లు లబ్ధిదారుల చేతికి చేరాయి. ఈ మేరకు 97.1 శాతం మందికి అందాయి. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలల కాలంలో వేరే ప్రాంతంలో చిక్కుకుపోయి అప్పట్లో పింఛను తీసుకోలేకపోయిన 1.70 లక్షల మంది లబ్ధిదారులకు బకాయిలతో కలిపి బుధవారం అందజేశారు. జూలై నెల పెన్షన్ సొమ్మును అనివార్య కారణాల వల్ల ఈ నెలలో అందుకోలేక పోతే, వారికి ఆగస్టు నెలలో అందచేసే పెన్షన్‌తో కలిపి అందించాలని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచన చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ( సెర్ప్) అధికారులు వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి ఆసుపత్రిలో చికిత్స కోసం ఒకరు, కూతురిని చూసేందుకు మరొకరు లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. అప్పటి నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు రావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో వీరు మూడు నెలలుగా పింఛన్ తీసుకోలేకపోయారు. ఈ నెల కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుందని తెలుసుకున్న వలంటీర్లు వార్డు సచివాలయ అధికారుల అనుమతితో తెలంగాణకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి.. పలువురి ప్రశంసలు అందుకున్నారు. యాదగిరి గుట్టకు వెళ్లి.. నంద్యాల ఐదో వార్డు నడిగడ్డ వీధికి చెందిన నసీమా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు అస్లాం బాషా (10) కొన్ని నెలలుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఇతను పుట్టుకతోనే దివ్యాంగుడు. లాక్డౌన్ ముందు నుంచి హైదరాబాద్‌లో బాలుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి నంద్యాలకు రాలేకపోయారు. యాదగిరిగుట్టలోని బంధువుల ఇంట్లో ఉంటూ బాలుడికి ఫిట్స్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా అస్లాం బాషా పింఛన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుందన్న ఉద్దేశంతో 5వ వార్డు వలంటీర్ షేక్‌రెహమాన్ వార్డు సచివాలయ అధికారుల అనుమతితో, వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ సోమశేఖర్‌రెడ్డి సహకారంతో యాదగిరిగుట్టకు ద్విచక్ర వాహనంపై వెళ్లి అస్లాం బాషాకు నాలుగు నెలల పింఛన్ రూ.12వేలు అందజేశారు. హైదరాబాద్‌కు వెళ్లి పింఛన్ నంద్యాల 15వ వార్డులోని సరస్వతినగర్‌కు చెందిన షేక్ అమర్‌బీ తన కుమార్తెను చూడటానికి లాక్డౌన్ ముందు హైదరాబాద్ వెళ్లారు.అక్కడి నుంచి తిరిగి రావడానికి వీలు కాలేదు. అమర్‌బీ భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ వస్తోంది. ఈ నేపథ్యంలో వలంటీర్లు సాయిరాం, తిరుమలేష్ హైదరాబాద్‌కు మోటారు సైకిల్‌పై వెళ్లి ఆమెకు నాలుగు నెలల పింఛన్ ఒకేసారి అందజేశారు. హైదరాబాద్‌లో షేక్‌అమర్‌బీకి పింఛన్ అందజేస్తున్న వలంటీర్లు సంతోషంగా ఉంది నసీమా, అస్లాం బాషా తల్లి నంద్యాల నుంచి యాదగిరి గుట్టకు వచ్చి వలంటీరు పింఛన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం వచ్చి పింఛన్ డబ్బులు ఇస్తారని అసలు అనుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నారు. వలంటీర్లను పెట్టడం చాలా మంచిదైంది. ఇంత దూరం వస్తారనుకోలేదు షేక్ అమర్‌బీ నంద్యాల పిల్లోళ్లు హైదరాబాద్‌కు వచ్చి నా పింఛన్ డబ్బులు ఇచ్చారు. మా వీధి పిల్లోళ్లను ఈ మధ్యనే వలంటీర్లుగా తీసుకున్నారు. వాళ్లు నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంత దూరం వస్తారని అనుకోలేదు. వలంటీర్లను నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. -
కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. మొత్తమ్మీద 59.03 లక్షల మందికి ప్రభుత్వం బుధవారం పింఛన్ డబ్బులను పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయమే ఎక్కడికక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ డబ్బుల పంపిణీ మొదలు పెట్టనున్నారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు. ► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. ► లాక్డౌన్ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. ► కాగా, జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. -
తొలిరోజు పింఛన్లు 96.5% మందికి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి గత రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయినవారికి ఊరట కల్పిస్తూ బకాయిలతో కలిపి మూడు నెలల డబ్బులను సోమవారం ఒకేసారి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. వలంటీర్లు ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి 8 గంటల కల్లా 70 శాతం మందికి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఉదయం పది గంటల కల్లా 83 శాతం పంపిణీ పూర్తయింది. రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 55,86,571 మందికి పింఛన్ డబ్బులు రూ.1,337.85 కోట్లు అందజేశారు. తొలిరోజు మొత్తంగా 96.5 శాతం మంది పింఛను డబ్బులు అందుకున్నారు. నెల్లూరులో లివర్ వ్యాధిగ్రస్తుడు హరికి పెన్షన్ ఇస్తున్న వలంటీర్లు జియో ట్యాగింగ్‌తో పారదర్శకంగా... కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్ విధానంలో కాకుండా మొబైల్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్‌తో లబ్ధిదారుల ఫోటో తీసుకుని వలంటీర్లు పారదర్శకంగా పెన్షన్ డబ్బులు అందజేశారు. –రాష్ట్రవ్యాప్తంగా 2,37,615 మంది గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. – లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 30 వేల మంది పింఛనుదారులు పెన్షన్ తీసుకోలేకపోతున్నట్లు వలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో వారికి బకాయిలతో కలిపి వచ్చే నెలలో చెల్లించేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనివార్య కారణాలతో జూన్ నెల పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోయిన వారికి జూలైలో బకాయితో కలిపి ఇస్తామని సెర్ఫ్ సీఈవో పి.రాజాబాబు తెలిపారు. వలంటీర్లకు మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 55 లక్షల మందికిపైగా పింఛన్ లబ్ధిదారులకు గంటల వ్యవధిలో నేరుగా డబ్బులు అందచేసిన వలంటీర్లను గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారని చెప్పారు. పాలనను గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమన్నారు. వలంటీర్ల విశేష కృషి – పిడుగులు పడ్డా పింఛన్ల పంపిణీ ఆగలేదు.. – పోర్టబులిటీ ద్వారా ఉన్నచోటే నిశ్చింతంగా పెన్షన్ – ఐసీయూల్లో ఉన్నా అందుకున్నా లబ్ధిదారులు విశాఖ ఏజెన్సీలో సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీర్లు అడవిలో సాహస యాత్ర చేశారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలోని మారుమూల ప్రాంతమైన చింతగున్నలు, మాతికబంద గ్రామాలకు చెందిన వలంటీర్లు పాంగి రాంబాబు, లోంబేరి వెంకటరమణ ఈదురు గాలులు, భారీ వర్షంతో ఆదివారం సాయంత్రం అడవిలో పెన్షన్ డబ్బులతో చిక్కుపోయారు. చీకటి పడే సమయానికి వర్షం తగ్గడంతో గ్రామానికి సురక్షితంగా చేరుకుని ఉదయాన్నే యధావిధిగా పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా చాబోలు గ్రామానికి చెందిన వితంతు మహిళ ఎస్తేరు అనారోగ్యంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. గ్రామ వలంటీర్ ముస్తాక్ (దివ్యాంగుడు) సోమవారం ఐసీయూ వద్దే ఆమెకు పింఛన్ అందజేశాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం డి.చెక్కవారిపల్లి గ్రామ వలంటీర్ కోమలకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆమె పరిధిలో 38 పింఛన్లు ఉండగా నడవలేని స్థితిలోనూ ఆటో అద్దెకు తీసుకొని మొదటి రోజు 35 మందికి పంపిణీ చేయడం విశేషం జగ్గయ్యపేటకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు ఉప్పుటూరి నాగేశ్వరరావు లాక్‌డౌన్‌తో తెలంగాణాలోని భద్రాచలంలో తన కుమార్తె ఇంట్లో చిక్కుకుపోయాడు. 10వ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ కొండా దుర్గారావు ఆధ్వర్యంలో వలంటీర్లు ఎం.ముత్యంబాబు, ఆర్.వరప్రసాద్ సోమవారం భద్రాచలం వెళ్లి నాగేశ్వరరావుకు నాలుగు నెలల పింఛన్ రూ.9 వేలు అందించారు. ఒకటో తేదీ వచ్చిందంటే వలంటీర్లు కచ్చితంగా తమ ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందచేస్తారని లబ్ధిదారులు భరోసాగా ఉంటారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు 10వ వార్డు శ్రీనివాసనగర్‌లో దివ్యాంగుడైన వలంటీర్ అఫ్జల్ వృద్ధురాలు ఖాసిం బీకి వితంతు పించను అందచేశాడు. చిత్తూరులోని కట్టమంచికి చెందిన పుష్పవాణి మూత్రపిండాల వ్యాధితో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్డు వలంటీర్లు దినేష్‌బాబు, జగదీష్ సోమవారం ద్విచక్రవాహనంలో 140 కి.మీ ప్రయాణించి స్విమ్స్ ఆస్పత్రిలో పుష్పవాణికి రూ.10 వేల పెన్షన్ అందించారు. వాకాడుకు చెందిన ముగూరు పోలమ్మ రెండు నెలల నుంచి సూళ్లూరుపేట మండలం కడపట్రలో బంధువుల ఇంట్లో ఉండిపోయింది. సూళ్లూరుపేట నుంచి వాకాడు 53 కిలో మీటర్ల దూరం ఉంది. పోర్టబిలిటీ ద్వారా ఆమెకు సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రెండు నెలల పింఛన్ అందజేశారు. పట్టణంలో ఉంటున్న మరో 10 మందికి కూడా ఇలాగే అందించారు. -
వలంటీర్ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం పరిధిలోని కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వలంటీర్ గబ్బాడ అనురాధ (26) కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వలంటీర్ మరణించిన విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ సీఎంవో అధికారులతో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని వెంటనే అందేలా చూడాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, శుక్రవారం సాయంత్రం పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. సీఎం జగన్ చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం తన భార్య అనురాధ గుండెపోటుతో మృతి చెందడంతో రెండు నెలల శిశువుతో తాను ఒంటరిగా మిగిలిపోయానని భర్త గబ్బాడ కర్రన్న వాపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించి తన బిడ్డ సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారన్నాడు. సీఎం చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటానన్నాడు. తమకు సహకరించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. -
రూ. 1,299.14 కోట్ల పింఛను ఒక్కపూటలో పంపిణీ
సాక్షి, అమరావతి, నెట్వర్క్: లాక్డౌన్, కరోనా విపత్కర పరిస్థితిల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర పింఛనుదారుల చేతికి ఒక్కపూటలోనే ప్రభుత్వం రూ. 1299.14 కోట్లు అందజేసింది. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రతినెలా ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సామాజిక పింఛనుదారులకు పెన్షన్ డబ్బులు అందజేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి వారి కళ్లలో ఆనందాన్ని నింపింది. వలంటీర్లు శుక్రవారం లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ డబ్బులను అందచేశారు. ► రాష్ట్రవ్యాప్తంగా 58,22,399 మంది పింఛనుదారులకుగాను 54,53,408 మందికి ఒకటవ తేదీనే పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. తొలిరోజు 93.66 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. ► లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 19,960 మంది పెన్షన్‌దారులు పోర్టబులిటీ విధానంలో ప్రస్తుతం వారున్నచోటే పెన్షన్ డబ్బులు అందుకున్నారు. ► 2,37,615 మంది వలంటీర్లు శుక్రవారం తెల్లవారు జామునే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉదయం 10 గంటల సమయానికే 44 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు అందచేశారు. ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) సీఈవో పి.రాజాబాబు స్వయంగా పశ్చిమగోదావరి జిల్లా కలపర్రు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ► పంపిణీ సమయంలో వలంటీర్లు ముఖానికి మాస్క్‌లు ధరించి, శానిటైజర్లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పంపిణీలో జాగ్రత్తలు తీసుకున్నారు. ► కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్లకు బయోమెట్రిక్ లేకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్ రూపొందించింది. యాప్ ద్వారా జియోట్యాగింగ్‌తో కూడిన ఫొటోలను వలంటీర్లు ఫోన్లో అప్లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. ► ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవీ, డయాలసిస్ పేషెంట్లకు డీబీటీ విధానంలో పెన్షన్ సొమ్ము జమ చేశారు. సరిహద్దుకెళ్లి పింఛను ► చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేటకు చెందిన చెందిన కస్తూరి తమిళనాడులోని కాట్పాడిలో ప్రై వేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తన కుమారుడి వద్దకు వెళ్లి లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. వలంటీర్ వెంకటేశ్ అక్కడకే వెళ్లి ఆమెకు పింఛను అందచేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ముఖ్యమంత్రి జగన్ తమలాంటి వారికి ఎక్కడున్నా ఆర్థిక భరోసా అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎర్రావారిపాళెం ప్రథమ స్థానం ► పింఛన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ప్రథమ స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం 12 గంటలకే 99.52 శాతం పంపిణీ పూర్తయింది. గ్రామంలో 4,587 మంది లబ్ధిదారులు ఉండగా 4,563 మందికి పంపిణీ చేశారు. 17 మంది మృతి చెందడంతో పింఛన్లు ఇవ్వలేదు. మరో ఏడుగురు అందుబాటులో లేరు. సమన్వయంతో పంపిణీ చేపట్టిన ఎంపీడీఓ మురళీమోహన్‌రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. ఐసీయూలో ఉన్నా అక్కడకే.. తిరుపతి 26వ డివిజన్ బండ్ల వీధికి చెందిన చింతకుం ట లక్ష్మమ్మ (82) అనారోగ్యంతో రుయా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వలంటీర్లు ఆస్పత్రికి వెళ్లి పింఛను అందచేశారు. ఆ కష్టం.. ఇక లేదు ‘కల్లుగీత మా వృత్తి. పదేళ్ల క్రితం చెట్టుపైకి ఎక్కినప్పుడు తాటిమట్ట గుచ్చుకొని కన్ను పోయింది. తర్వాత రెండో కన్నూ కనిపించడం మానేసింది. వృద్ధాప్యంలో నా భార్యతో కలసి పింఛను కోసం గతంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజంతా పడిగాపులు కాశాం. ఇప్పుడా కష్టం లేదు. వలంటీరే ఇంటికొచ్చి పింఛను చేతికి అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా కనిపిస్తున్నారు’ – వనం పోలీసు, చీమలాపల్లి, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా గుండెపోటుతో వలంటీర్ మృతి ► విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం పరిధిలోని కుజ్జెలి పంచాయతీకి చెందిన గ్రామ వలంటీర్ గబ్బాడ అనురాధ(26) పింఛన్లు పంపిణీ చేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురైంది. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించింది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించారు. -
రికార్డు స్థాయిలో పింఛన్లు
సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ అదే స్ఫూర్తి.. అదే వేగం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వ్యాధులతో సతమతమయ్యేవారికి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ దృఢ సంకల్పం ముందు ఆటంకాలన్నీ తలవంచాయి. బుధవారం కూడా పింఛన్ల పంపిణీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ముగిసింది. కరోనా భయాలు, లాక్డౌన్ ఇబ్బందులు మధ్య కూడా వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని సునాయాసంగా పూర్తి చేసింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఒక్క రోజులోనే 92.35 శాతం మందికి పింఛన్లు నేరుగా అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53,97,303 మంది లబ్ధిదారుల చేతికి ప్రభుత్వం బుధవారం రూ.1278.90 కోట్లు అందచేసింది. ఈసారి పింఛన్ల పంపిణీలో అనుసరించిన పోర్టబులిటీ విధానం ద్వారా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉన్న 28,230 మందికి కూడా ప్రభుత్వం డబ్బులు అందచేసింది. – విపత్తులోనూ సడలని వేగం, అంకిత భావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,25,463 మంది వలంటీర్లు ఉదయమే పెన్షన్ల డోర్ డెలివరీ చేపట్టారు. – వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వ్యాధులతో సతమతమయ్యేవారికి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ దఢ సంకల్పం ముందు అటంకాలన్నీ తలవంచాయి. –కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా వలంటీర్లు ఒకపక్క జాగ్రత్తలు తీసుకుంటూనే పెన్షన్లు పంపిణీ సజావుగా పూర్తి చేశారు. బయో మెట్రిక్ లేకుండా ఫొటో గుర్తింపు ఆధారంగా పంపిణీ నిర్వహించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున లబ్ధి్దదారుల నుంచి సంతకాలు, వేలిముద్రలు సేకరించలేదు. – లబ్ధిదారుల చేతికే పెన్షన్లకు అందిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వలంటీర్లు ముందుకు సాగారు. –ఉదయం 9 గంటలకే 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి కాగా పది గంటల కల్లా 77 శాతం మందికి అందచేశారు. మధ్యాహ్నం12 గంటలకు 84.19 శాతం మంది లబ్ధిదారులు ఇంటి వద్దే పింఛన్ అందుకోగా 2 గంటల కల్లా æ88.27 శాతం మందికి పంపిణీ పూర్తయింది. – కరోనా వల్ల పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్ ను వలంటీర్లు నిర్ధారించడం, జియో ట్యాగింగ్ ద్వారా ఫోటోను యాప్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా పంపిణీని సులభతరం చేశారు. -
ఎక్కడున్నా పింఛన్
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన అప్పల నరసింహ నిరుపేద కూలీ. విజయవాడలోని తన కుమారుడి ఇంటికి వచ్చిన ఆయన లాక్డౌన్ వల్ల పింఛను డబ్బులపై ఆందోళన చెందుతున్నారు. సొంత ఊరు వెళ్లే మార్గం చూడాలని కుమారుడిని కోరాడు. గుంటూరు జిల్లాకు చెందిన వెంకటమ్మది కూడా అదే పరిస్థితి. లాక్‌డౌన్‌తో ఎటూ కదలలేక కుమార్తె ఇంట్లో చిక్కుకుపోయింది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1వ తేదీన చేపడుతున్న పింఛన్ల పంపిణీలో అప్పలనరసింహ, వెంకటమ్మ లాంటివారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్న చోటే డబ్బులు అందుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈసారి పింఛన్ల పంపిణీలో పోర్టబులిటీ అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టబులిటీ అంటే పింఛనుదారుడు పెన్షన్ డబ్బులను సొంత ఊరిలో మాత్రమే కాకుండా తనకు వీలున్న ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించడం. పింఛనుదారుడు తాను ఉన్న ప్రాంతానికి చెందిన వలంటీరుకు వివరాలు తెలియజేస్తే చాలు ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు అందచేస్తారు. కేవలం ఒక్క ఫొటోతో.. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో భాగంగా ఏప్రిల్ నెల పింఛన్లను బయో మెట్రిక్ లేకుండానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల నుంచి సంతకాలు లేదా వేలి ముద్రలు సైతం సేకరించరాదని నిర్ణయించినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. అయితే పారదర్శకత కోసం లబ్ధిదారుడికి వలంటీర్లు పెన్షన్ డబ్బులు అందచేసే సమయంలో ఫోటో తీసుకుంటారు. ఇందుకోసం మొబైల్ యాప్ కూడా సిద్ధం చేశారు. సెర్ప్ సీఈవో జారీ చేసిన ఇతర మార్గదర్శకాలు.. ► పెన్షన్ కోసం ఏ పింఛనుదారుడు ఇంటి నుంచి బయటకు రాకూడదు. వలంటీరే వారి ఇంటికి వెళ్తారు. పంపిణీ సమయంలో భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ► లబ్ధిదారుడి ఫోటో ఎక్కడ తీశారనే వివరాలు జియోట్యాగింగ్ ద్వారా యాప్‌లో నమోదవుతాయి. ► వలంటీర్లు సూర్యోదయం తరువాత పింఛన్ల పంపిణీని ప్రారంభించాలి. ► పెన్షన్ల పంపిణీకి అవసరమైన నగదును ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మార్చి 30, 31వ తేదీలలో బ్యాంకుల నుంచి డ్రా చేసేందుకు వీలుగా జిల్లా కలెకర్లు పోలీసు శాఖకు సూచనలు చేయాలి. ► 31వ తేదీ కల్లా రాష్ట్రంలో అందరు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ నగదు డ్రా చేసి అన్ని గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలి. ► గ్రామ, వార్డు వలంటీర్లు ఏప్రిల్ 1న పింఛన్ల పంపిణీ ప్రారంభించి వీలైనంత త్వరగా çపూర్తి చేయాలి. -
తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ
-
ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఉదయం 7 గంటల కంతా 11శాతంపైగా మందికి పింఛన్ పంపిణీ పూర్తిచేసినట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నంకంతా వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కాగా, వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచనలు జారీఅయ్యాయి. శరవేగంగా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఉదయం 6 గంటలనుంచే గడపగడపకు పింఛన్ పంపిణీ మొదలైంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు 26,20,673 మందికి.. 9 గంటలకు 31లక్షల మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఈ మధ్యాహ్నంకంతా దాదాపు 60 లక్షల మందికి రూ. 1,384 కోట్ల పింఛన్ పంపిణీ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పింఛన్ పంపిణీ పూర్తయింది. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ జరిగింది. గత నెల కంటే ఈ నెల అదనంగా 4.30 లక్షల పింఛన్లు మంజూరు అయ్యాయి. గత నెలలో పింఛన్లు అందని లబ్ధిదారులకు 2 నెలల పింఛన్ కలిపి అందజేశారు. దాదాపు 3.30 లక్షల మందికి 2 నెలల పింఛన్ అందజేశారు. తొలి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం నుంచే శరవేగంగా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ మొదలైంది. మ.12 గంటల వరకు 43.9 లక్షలకుపైగా పింఛన్లు పంపిణీ అయ్యాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ చొప్పున డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఐరిస్, వేలిముద్రలతో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. -
రాష్ట్రంలో భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
-
58,99,065 మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్య 58,99,065కు చేరుకుంది. ఫిబ్రవరిలో 54,68,322 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ లెక్కన గత నెలతో పోల్చితే 4,30,743 పింఛన్లు పెరిగాయి. నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం 7.41 లక్షల మందికి (ఫిబ్రవరిలో 6.14 లక్షలు, మార్చిలో 1,27,207 లక్షలు) కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. మార్చి 1వ తేదీ అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నాని కల్లా వంద శాతం పంపిణీ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేయాలని సూచించామని చెప్పారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచించామన్నారు. -
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
-
ఇంటివద్దకే పింఛన్లు
సాక్షి, అమరావతి : దేశ చరిత్రలో తొలిసారిగా సామాజిక పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయనుంది. అదికూడా ఫిబ్రవరి 1వ తేదీనే ఈ ప్రక్రియ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది. అర్హులైన కొత్త వారికి కూడా జనవరి నెల నుంచి పింఛన్లను మంజూరు చేసింది. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితరులకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దే వీటిని ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1,320.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సామాజిక పింఛనన్లు పొందుతున్న వారందరూ కూడా పేదలే అయినందున.. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు అందుకున్నట్లుగానే వీరికి కూడా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్‌ను అందజేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అత్యధిక ప్రాధాన్యతనూ ఇస్తోంది. మరోవైపు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిని శ్రీకాకుళం జిల్లాలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పింఛన్ల పంపిణీ కాగా, శనివారం ఉ.8 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది మ.1 గంటకల్లా పూర్తిచేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి పింఛన్ల మొత్తాలను వారి ఖాతాల్లో జమచేశారు. వలంటీర్లకు ఆ డబ్బులను శుక్రవారం మధ్యాహ్నానికల్లా అందజేయనునున్నారు. -
ఇంటి వద్దకే పింఛన్..
-
ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వలంటీర్ల ద్వారా నేరుగా చేరవేయాలన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంతో పాటు నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్ గ్రిడ్ అంశాలపై చర్చించారు. వివిధ సర్వేలంటూ ముడిపెట్టి అసలైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను నిరాకరించే పరిస్థితి ఉండకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఆ మేరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హులు ఎంత మంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణం రైతులు తమ పంటలకు గిట్టుబాబు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ భవనాలు, వాటికి అనుబంధంగా నిర్మించే రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు అవసరమైన వాటన్నింటినీ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక బద్దంగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున గ్రామాల్లో ఎక్కడికక్కడ వ్యవసాయ రంగంలో కూలీలకు పనులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడంలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ పథకం ద్వారా చేపట్టే ప్రతి పని పకడ్బందీగా, ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు కొత్తగా మరో 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలతో పాటే వీటిని భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చెప్పిన మాట ప్రకారమే పెన్షన్
సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పెన్షన్‌ను సోమవారం నుంచి రూ.2,250కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం పింఛన్‌దారులకు లేఖ రాశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ లేఖ ప్రతులను పింఛన్‌దారులకు అందజేయనున్నారు. పెంచిన పింఛన్‌ను అర్హులందరికీ అందజేస్తామని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. లేఖలోని వివరాలు... ప్రియమైన అవ్వాతాతలకు, అక్కాచెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులకు.. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పిన మాట ప్రకారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(సోమవారం) నుంచి మీ పెన్షన్‌ను రూ.2,250కు పెంచుతున్నాం. పెంచిన పెన్షన్లను వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ఈ పెంపు వర్తిస్తుంది. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే అందిన పెన్షన్‌ను రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం. దివ్యాంగులకు నెలకు రూ.3,000 చొప్పున పంపిణీ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.10,000కు పెంచాం. ఈ సందర్భంగా అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ హామీ ఇస్తున్నా. ఇకపై మీకు జన్మభూమి కమిటీల వేధింపులు ఉండవు. పెన్షన్ మంజూరుకు గానీ, పెన్షన్ ప్రతినెలా ఇచ్చేటప్పుడు గానీ గతంలో మాదిరిగా లంచాల బాధ ఉండదు. మీ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చి మీ చేతికే అందుతుంది. అంతేకాదు పెన్షన్ పొందే వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. పెన్షన్ల మంజూరు విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారని కూడా చూడం. పెంచిన పెన్షన్‌ను అర్హులందరికీ ఇస్తాం. ఈ పెన్షన్‌ను రూ.3,000 వరకూ తీసుకుపోతాం.’’ -
బాబు భజన సభల్లో.. పింఛన్‌దారులకు చుక్కలు
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/సాక్షి ప్రతినిధి, ఏలూరు /సదుం : ఊళ్లో సభ జరుగుతున్న రోజే పింఛన్లిస్తాం.. అప్పుడు తీసుకోకుంటే పింఛనే రద్దవుతుంది.. అంటూ జన్మభూమి కమిటీ సభ్యులు ప్రచారం చేస్తుండటంతో కృష్ణా జిల్లా నిడమోలుకు చెందిన 70 ఏళ్ల వెంకటేశ్వర్లు రాజమండ్రిలో ఉంటున్న తన కుమారుడి ఇంటి నుంచి హడావుడిగా సొంతూరికి బయలుదేరాడు. కొడుకు ఇంట్లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా.. పింఛన్ రద్దువుతుందని అన్ని పనులూ మానుకుని మరీ వచ్చాడు. అయితే ఊళ్లో సభ ఈ రోజు కాదు.. నాలుగో తేదీ.. ఆ రోజే పింఛన్ల డబ్బులిస్తారని చెప్పడంతో పనులన్నీ వదిలి మరో రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి నెలా మాదిరి ఒకటి నుంచి ఐదో తేదీల మధ్య ఐదు రోజుల పాటు పింఛన్ల పంపిణీని ఆపేసి, ఈ సారి కేవలం ఒకే రోజు.. అదీ రెండు మూడు గంటలే పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో తీసుకోకుంటే రద్దవుతాయని జన్మభూమి కమిటీ సభ్యులు బెదిరించడంతో వృద్ధులు పింఛన్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సీఎం చంద్రబాబు పొగడ్తల సభల కోసం.. పింఛన్లు పంపిణీ చేసేందుకు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భజన సభలు వృద్ధులకు చుక్కలు చూపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డబ్బులతో ఊరూరా ఈ సభలను నిర్వహిస్తున్న కొందరు ఉన్నతాధికారులు.. ఇందుకోసం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో వారికి చుక్కలు చూపుతున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీల మధ్య రోజూ ప్రతి గ్రామంలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ నిబంధనలను.. బాబు పొగడ్తల సభల కోసం తాత్కాలికంగా మార్చేశారు. ప్రతి గ్రామం, పట్టణ వార్డుల్లోనూ శని, ఆది, సోమవారాల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించి.. ఆ రోజు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఆ రోజు పింఛన్ తీసుకోకుంటే ఇక భవిష్యత్తులో పింఛన్ రాదని గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బెదిరిస్తున్నాయి. అధికారులు మాత్రం.. ఆ రోజు తీసుకోకుంటే ఇంక ఆ నెలకు పింఛన్ పంపిణీ ఉండదని చెబుతున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామంలో సభ జరిగే రోజే ఆ ఊరిలో పింఛనుదారులందరూ సభకు హాజరయ్యేలా చూసుకోవాలని సెర్ప్ సీఈవో జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఒక్కో మండలంలో దాదాపు పది గ్రామాల్లోని సభలకు అధికారులు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒకట్రెండు గంటలే సభ నిర్వహించి, ఆ సమయంలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో వృద్ధులు సభల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 11 వేల చోట్ల మొదలు కాని పంపిణీ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలు, 3,600కు పైగా పట్టణ వార్డుల్లో ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ మొదలు కావాల్సి ఉంది. రెండో తేదీ రాత్రి వరకు దాదాపు 11 వేల చోట్ల అసలు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదని అధికార వర్గాల సమాచారం. ఐదో తేదీకల్లా పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు 54.15 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా.. శనివారం రాత్రి వరకు కేవలం 11 లక్షల మందికే పింఛన్లు అందాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పింఛన్‌దారుల నుంచి అధికారులు ఫోన్ నంబర్లతో పాటు ఓటు ఉందా లేదా తదితర వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ పంపిణీ చేసే అధికారి రిజిస్టర్లో లబ్ధిదారుడి ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోవాలని ఆదేశాలున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో చేపట్టిన పసుపు–కుంకుమ చెక్కులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. పేరు పేరునా పిలిచి పింఛన్, పసుపు–కుంకుమ చెక్కులు ఇవ్వడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. టెంట్లు లేక మండుటెండలోనే భోజనాలు చేశారు. పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో కొంతమంది సభ్యుల పేర్లు లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది. ముగ్గురి ఉసురు తీసిన బాబు ప్రచారార్భాటం పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి పింఛన్ల పెంపు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రచారార్భాటం ముగ్గురు వృద్ధుల ఉసురు తీసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీని వేడుకగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులంతా పంచాయతీ కార్యాలయాల వద్దకు హాజరుకావాలంటూ అధికారులు టాంటాం వేశారు. టెంట్లోనే కుప్పకూలి.. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(75) పింఛన్ కోసం ఉదయం ఏడు గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. పంచాయతీ సిబ్బంది వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలను తీసుకున్నారు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే చేతులు మీదుగా పింఛన్ సొమ్ము అందజేస్తాం.. అని చెప్పడంతో కొంతమంది వెళ్లిపోగా, మరికొందరు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లో కుర్చీలో కూర్చుండిపోయాడు. పదిగంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పంచాయతీ అధికారులు వెంకటరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి సమాచారం తెలపడంతో ఆయన వచ్చి వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రోడ్డుమీదే కూలబడ్డాడు.. తాడేపల్లిగూడెం మూడో వార్డుకు చెందిన గొర్ల కొండయ్య (80) పింఛన్ తీసుకునేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే నిరీక్షించి, నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడి వారు లేపి మంచినీళ్లిచ్చారు. పింఛన్‌తో ఇంటికెళ్తూ రోడ్డుపై మరోసారి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతతో.. పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డలో జరిగింది. షరీపాబీ (75) నడిగడ్డలోని కుమార్తె మస్తానీ వద్ద కొద్ది రోజులు, సదుంలోని కుమారుల ఇంట కొద్ది రోజులు ఉంటోంది. శనివారం ఉదయం నడిగడ్డకు వచ్చిన షరీపాబీ రేషన్ సరుకులు తీసుకుంది. అనంతరం పింఛన్ కోసం బయలుదేరింది. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికులు ఆమెను సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రభుత్వం ప్రచారం కోసం పింఛన్లు పంపిణీ చేయకుండా వారిని గంటల తరబడి కూర్చోబెట్టడం వల్లే వృద్ధుల ప్రాణాలు పోయాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఇంతమంది మహిళలు ఒంటరివాళ్లా?
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కంటతడి మహబూబ్‌నగర్ రూరల్: గంభీ రంగా కనిపించే ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కంట తడి పెట్టారు. దుఃఖం ఉబికివస్తున్నా ఆపుకున్నారు.ఆదివారం మహబూబ్‌నగర్ లో ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉద్విగ్నక్షణాలు చోటుచే సుకున్నాయి. స్థానిక అంబేడ్కర్ కళా భవన్ లో సీట్ల పరిమితికి మించి ఒంటరి మహిళలు హాజరయ్యారు. వారందరినీ చూసి ఆవేద నకు లోనైన ఎమ్మెల్యే... ఇంతమంది మహి ళలు ఒంటరిగా ఉన్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు సైతం కుమారులు అన్నం పెట్టలేని దుస్థితిలో సమాజం ఉందని, ఒంటరిగా జీవించే మహిళలు అనేక ఛీత్కారాలకు గురవుతుం డడం విచారకరమని అన్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాడి
కేవీపల్లె : పింఛన్లు పంపిణీ చేయడానికి వెళ్లిన పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడు దాడి చేసిన సంఘటన మండలంలోని తువ్వపల్లె పంచాయతీలో ఆది వారం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు కేవీపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తువ్వపల్లె పంచాయతీ కార్యదర్శి మణి ఆదివారం పింఛన్లు పంపిణీ చేయడానికి గ్రామానికి వెళ్లాడు. పెండేరివాండ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు అంకమనాయుడి అవ్వకు పింఛను ఇవ్వడానికి వారి ఇంటి వద్దకు వెళ్లాడు. ఆమె పొలం వద్దకు వెళ్లిందని, సాయంత్రం వరకు ఉండి పింఛను ఇచ్చి వెళ్లాలని అంకమనాయుడు దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా మద్యం మత్తులో నానా దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడు మణి కేవీపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ఎప్పుడిస్తారో తెలియని ‘ఆసరా’
* పింఛన్ల పంపిణీపై అంచనాల కమిటీ అసంతృప్తి * పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ఎమ్మెల్యేల ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఎప్పుడు అందుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, 36 లక్షలమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే విషయంలో స్పష్టమైన తేదీలను ప్రకటించ లేకపోవడం శోచనీయమని అంచనాల కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో అంచనాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసరా పింఛన్లు, పంచాయతీరాజ్ రహదారులు, ఉపాధిహామీ పనులు.. తదితర అంశాలపై సభ్యులు సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని సెర్ప్ సీఈవో పౌసమి బసును నిలదీశారు. ఆధార్ కార్డులో పేర్కొన్న వయసు ఆధారంగా వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారని, దీంతో లక్షలాదిమంది తమ వయసును మార్చుకొని అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని ఆమె ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎంతోమంది అర్హులకు ఇప్పటికీ పింఛన్లు అందడం లేదన్నారు. సెర్ప్ సీఈవో స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలలో జాప్యం జరగడం వల్లే పింఛన్లను సకాలంలో అందజేయలేకపోతున్నామని వివరించారు. ఆధార్‌కార్డు వయసును పరిగణనలోకి తీసుకోవడం లేదని, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రతినెలా కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. 30% ‘లెస్’ వేస్తుంటే ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం బాగోలేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు 30 శాతం లెస్‌కు టెండర్లు వేస్తున్నారంటే ఎస్టిమేషన్స్ వేయడంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనుకోవాల్సి వస్తుందన్నారు. కేవలం కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసమే లెస్‌కు టెండర్ వేసి, ఆపై కాంట్రాక్టర్లు పనులను సరిగా చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖలో టెండర్లకు బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్ధారించిన విధంగా పంచాయతీరాజ్‌లోనూ 5 శాతం కన్నా తక్కువగా టెండర్‌వేస్తే సదరు సొమ్మును డిపాజిట్ చేయించుకోవాలని సూచించారు. ఉపాధిహామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వ్యవసాయానికి కూడా ఉపాధిహామీని అనుసంధానం చేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని సూచిం చారు. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ కింద చేపట్టిన స్కీమ్‌లకు సకాలంలో సొమ్ము చెల్లించక రైతులు అవస్థలు పడుతున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులున్నారు. -
పింఛన్ల పంపిణీ బాధ్యత డ్వాక్రా మహిళలకు
జులై నుంచిఅమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం కర్నూలు(హాస్పిటల్): రాష్ర్టంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం మారబోతోంది. పంచాయతీ కార్యదర్శుల నుంచి డ్వాక్రా మహిళల చేతుల్లోకి పంపిణీ వెళ్లబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రబ్యాంకుచే ఒప్పందం కుదుర్చుకొని జులై ఒకటి నుంచి ఈ విధానాన్ని అమలుల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లాలో వృద్దులు, వికలాంగులు, వితంతవులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వికలాంగుల్లో కొందరికి మినహా మిగిలిన వారందరికీ నెలకు రూ.1000ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 3,11,977 మందిని గుర్తించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియే మొదట్లో వివాదాస్పదంగా మారింది. అనర్హుల పేరుతో అర్హులైన వారిని వేలల్లో తొలగించారు. జాబితాలో ఉన్న వారికి మొదట్లో పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేసేవారు. ఈ విధానం విఫలం కావడంతో బ్యాంకుల ద్వారా అందజేశారు. ఇది కూడా ఆశించినంత విజయవంతం కాలేదని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటిల్లో బిల్ కలెక్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే నెలలో 10 రోజులు వీరు పింఛన్ల పంపిణీకే సమయం కేటాయిస్తుండటంతో ఉద్యోగ రీత్యా వారు నిర్వర్తించాల్సిన పనులు ఆగిపోతున్నాయి. దీంతో మొదటి మూడు రోజుల్లోనే పింఛన్ల ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. బిజినెస్ కరస్పాండెంట్లుగా డ్వాక్రా మహిళలు పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లచే పంపిణీకి బదులు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బిజినెస్ కరస్పాండెంట్లను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు ఆయా బ్యాంకులకు ఆ బాధ్యతలను అప్పగించనుంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా ఎవరినో నియమించే బదులు డ్వాక్రా మహిళలనే నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంకుచే ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లాలో డ్వాక్రా మహిళలను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించి, వారిచే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. -
ఇకపై ఏడాదికి ఒకేసారి ‘ఆసరా’!
బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేయనున్న ఆర్థికశాఖ సాక్షి, హైదరాబాద్: పింఛన్ల పంపిణీలో ఏర్పడుతున్న తీవ్ర జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాది కాలానికి సంబంధించిన పింఛన్ల మొత్తానికి ఒకేసారి బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వు(బీఆర్వో)లను జారీ చేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రేపో మాపో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మేరకు మే నుంచి ప్రతినెలా పింఛన్లను 10వ తేదీలోగానే పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి మార్చి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఏప్రిల్ నెల సగమైపోయినా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీని ప్రారంభించాలంటే, అంతకు ముందు నెలలో కనీసం 20 లోగానే బీఆర్వోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ, పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో పింఛన్‌దారులకు అవస్థలు తప్పడం లేదు. -
ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..
వందశాతం వసూళ్ల కోసం అడ్డదారులు వెదిరలో పింఛన్ డబ్బులనుంచి ఇంటిపన్ను వసూలు అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం ఈవోపీఆర్డీపై ఫిర్యాదు రామడుగు : పేరుకే పింఛన్ల పంపిణీ.. ఒక చేతితో ఇచ్చి.. మరో చేతితో లాక్కున్నట్లుంది అధికారుల నిర్వాకం. గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నుల వసూలు కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్లకు ఎసరు పెడుతున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమానికి సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నారు గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా స్థారుు అధికారులు ఆదేశాలు జారీ చేశారని గ్రామాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ప్రతినెల పింఛన్ ఇస్తుంటే అధికారులు మాత్రం వాటిని పంచాయతీ బిల్లుల కింద జమచేసుకోవడంపై మండలంలోని వెదిర గ్రామస్తులు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తీసుకోవడంపై నిరసన వ్యక్తమైంది. 60మంది వద్ద వసూలు.. వెదిర గ్రామ పంచాయతీలో వృద్ధులకు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు 111 మందికి పింఛన్లు బుధవారం పంపిణీచేశారు. ఇందులో 60 మంది నుంచి సుమారు రూ.50వేలను ఇంటి పన్ను కింద వసూలు చేశారు. బకారుు మొత్తం చెల్లించకుంటే వచ్చేనెల నుంచి పింఛన్ ఇవ్వబోమని ఈవోపీఆర్డీ శశికళ హెచ్చరించడంతో పింఛనుదారులు భయపడి పన్నుచెల్లించారు. విషయం తెలుసుకున్న యువకులు వెళ్లి అధికారులను నిలదీశారు. జిల్లా అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని ఈవోపీఆర్డీ చెప్పారు. గ్రామస్తులు, యువకులు నిలదీయడంతో మిగతా మొత్తాన్ని పంపిణీచేయకుండా ఆమె వెనుదిరిగారు. పింఛన్ డబ్బుల నుంచి ఇంటిపన్నులు వసూలు చేసిన ఈవోపీఆర్డీపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్నులు వసూలు చేయకూడదని ఎంపీడీవో రాధారాణి తెలిపారు. అధికారులు ఇంటింటా తిరిగి పన్నులు వసూలు చేయాలని మాత్రమే ఆదేశించామని చెప్పారు. పన్ను చెల్లిస్తేనే రేషన్‌సరుకులు..! శంకరపట్నం: వందశాతం ఇంటి పన్ను వసూళ్లకు రేషన్‌సరుకులను ముడిపెడు బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా పింఛన్దారులనుంచి ఇంటి పన్ను, నల్లా పన్నుల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతినెల గ్రామాల్లో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారుల నుంచి ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తేనే సరుకులు అందించాలని డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమచారం. గతంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపేట్టేందుకు స్థానికంగా రేషన్ సరుకులను ముడిపెట్టడంతో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం పన్నుల వసూళ్లకు అదే విధానాన్ని అవలంబించనున్నారు. అన్ని బకారుులు రావాలంటే రేషన్‌సరుకులను ముడిపెట్టాలని కొందరు ఎంపీడీవోలు కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఇంటి పన్నుల కోసం రేషన్‌సరుకుల నిలిపివేయాలన్న ఆదేశాలురాలేదని తహశీల్దార్ సంపత్ చెప్పారు. ఇదెక్కడి న్యాయం..? వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చి ఇంటిపన్ను కింద రూ.800లు తీసుకుండ్రు..మందులకు డబ్బులు లేకుండా చేసిండ్రు. గవర్నమెంట్ డబ్బులు మాకు ఇబ్బంది ఉందని ఇస్తుంటే.. ఇలా ఇంటిపన్ను పేర తీసుకోవడం న్యాయమా..? - బుచ్చమ్మ, పింఛన్‌దారు, వెదిర మొత్తం తీసుకున్నరు.. నాకు వె య్యి రూపాయలు పింఛన్ వస్తే ఇంటి పన్ను కిందనే మొత్తం తీసుకున్నరు. నాకు నెల ఖర్చుల కిందకు అవుతాయనుకుంటే ఇలా ఇంటిపన్ను కింద తీసుకుంటే కష్టంగా ఉంటుంది.. - దుద్యాల కిష్టయ్య, వెదిర -
మెట్టు ఎక్కితేనే పింఛను!
♦ సిగ్నల్స్ అందక మొరాయిస్తున్న మిషన్లు ♦ లబ్ధిదారులకు అవస్థలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు జూకల్ నివాసి సాయమ్మ. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఈమె గురువారం గ్రామంలో పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్న డబ్బులను తీసుకోవడానికి వచ్చింది. అయితే ఎన్రోల్మెంట్ కోసం మళ్లీ కొత ్తగా లబ్ధిదారుల వివరాలు, వేలి ముద్రలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా.. ఎన్రోల్మెంట్ చేసే మిషన్‌కు గ్రామంలో సిగ్నల్స్ సరిగా అందలేదు. దీంతో స్థానిక బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఈ మిషన్ తీసుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవ నం మొదటి అంతస్తులో ఎన్రోల్మెంట్ చేశారు. అయితే వృ ద్ధాప్యం, అంగవైకల్యం కారణంగా ఆపసోపాలు పడుకుంటూ ఇంత దూరం వచ్చిన సాయ మ్మ మెట్లు వరకు వచ్చి ఆగిపోయింది. కిందకు వస్తే మిషన్‌కు సిగ్నల్స్ అందవు. సాయమ్మ మెట్లు ఎక్కలేదు. ఇదీ గ్రామాలలోని వృద్ధుల పరిస్థితి. శంషాబాద్ రూరల్ : బయోమెట్రిక్ విధానంతో పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ల్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల నుంచి లబ్ధిదారుల ఆధార్‌కార్డు, ఫొటోలు, వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఇందు కోసం వినియోగిస్తున్న మిషన్లకు స్థా నికంగా సిగ్నల్స్ అందకపోవడంతో పాటు సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుల వివరాలు సేకరించడానికి 15-30 నిమిషాల సమ యం పడుతుందని పోస్టుమాస్టర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 21 నుంచి ఈ విధానం ప్రారంభించగా ఇప్పటి వర కు కేవలం 20 శాతం మాత్రమే పంపిణీ చేశారు. అందరూ ఇక్కడికే రావాలి.. మండల పరిధిలోని పాల్మాకులలో పోస్ట్ సబ్ ఆఫీసు ఉండగా.. దీని పరిధిలో సుమారు 10 గ్రామాల లబ్ధిదారులకు పింఛన్ల్ అందజేయాల్సి ఉంది. మిగతా చోట్ల బ్రాంచ్ పోస్టు ఆఫీసులు ఉన్నాయి. బ్రాంచ్ పోస్టు ఆఫీసుల పరిధిలోని గ్రామాలకు పోస్టుమాస్టర్లు వెళ్లి పింఛన్ల్ అందజేస్తున్నారు. కాని పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీసు పరిస్థితి భిన్నం. చుట్టు పక్కల గ్రామాల వారంతా ఇక్కడికి వచ్చి పింఛన్ల్ తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. రోజూ వారి ఆర్థిక లావాదేవీలు, ఉత్తరాల బట్వాడా, ఇతర పనుల కోసం కార్యాలయాన్ని మూసి వెళ్లడం సాధ్యకాదని, ఇక్కడి నుంచి పింఛన్ల్ అందజేస్తామని చెబుతున్నారు. నానా అవస్థలు.. పాల్మాకుల పోస్ట్ సబ్ ఆఫీస్ పరిధిలోని ముచ్చింతల్, మదన్‌పల్లి, పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, పిల్లోనిగూడ, ఇనాంషేరి, అచ్చంపేట, మేకలబండతం డాల నుంచి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం ఇక్కడికి వస్తున్నారు. మూడు రోజులుగా ఇక్కడ గంటల కొద్ది పడిగాపులు కాస్తూ నానా పాట్లు పడుతున్నారు. గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం.. పింఛన్లను గ్రామాల్లోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పాల్మాకుల పోస్టాఫీసు సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వేరే గ్రామాలకు ఎవరూ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. - శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ రోజూ రూ.30 కిరాయి అవుతుంది.. మా ఊరి నుంచి పాల్మాకుల రావడానికి రోజూ బస్సు కిరాయి రూ.30 అవుతుంది. రెండు రోజుల నుంచి వస్తున్నాము. ఇంత దూరం వచ్చి పింఛన్ తీసుకెళ్లాలంటే చాలా కష్టం. - అడివమ్మ, ముచ్చింతల్ -
ఆసరా అనుసంధానం అరకొర!
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా.. పింఛను సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల అనుసంధాన ప్రక్రియ నాలుగు నెలలుగా నత్తనడకన సాగడంతో అది నెరవేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,20,156 మంది పెన్షనర్లలో కేవలం 16,18,517 (సగం మంది) ఖాతాలకే పింఛన్ల సొమ్ము జమవుతోంది. అలాగే భృతిని పొందుతున్న 3.20 లక్షల బీడీ కార్మికుల్లో ఖాతాల ద్వారా పింఛను పొందుతోంది 1.75 లక్షల మందికే. మిగిలిన బీడీ కార్మికులకు, పెన్షనర్లకు పింఛను సొమ్మును సిబ్బంది ద్వారా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా, లబ్ధిదారులకు సంపూర్ణంగా అందడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కొందరు దళారులు వృద్ధులు, వికలాంగుల పింఛను సొమ్ము స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ససేమిరా అంటున్న బ్యాంకర్లు పింఛను సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులకు ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు విముఖత వ్యక్తం చేస్తున్నాయని సెర్ప్ అధికారులు వాపోతున్నారు. వృద్ధాప్య పింఛను పొందుతున ్న వారంతా 65 ఏళ్లు పైబడిన వారు కావడం, వికలాంగుల్లో కొందరి వేలిముద్రలు సరిగా ఉండకపోతుండడాన్ని బ్యాంకులు కారణాలుగా చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకుకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడం, కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు బ్యాంకులు అందుబాటులో లేకపోవడం కూడా ఖాతాల అనుసంధానానికి ఆటంకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛను పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ప్రయత్నించినా, పోస్టాఫీసుల నుంచి సహకారం లభించడం లేదు. కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు పోస్టాఫీసు అధికారులు మొగ్గు చూపడం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండలలో పెన్షనర్ల బ్యాంకు ఖాతాలను నేటికీ అనుసంధానం చేయలేదు. పింఛనర్లు బ్యాంకు ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లను ఒప్పించాలని జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. -
పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయండి
కడప రూరల్ : జిల్లాలో మే 1 నుంచి పిం ఛన్ల పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడి యో కాన్ఫరెన్స్ హాలులో పింఛన్ల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలో హ్యాబిటేషన్ ప్రకారం పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలన్నారు. మే 2 నుంచి 11వ తేది వరకు నీరు-చెట్టు కార్యక్రమం జరుగుతున్నందున రోజువారి కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇరిగేషన్ అదికారులు, ఎం పీడీఓలు నిర్వహించాలని ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమం జరిగే ముందు గ్రామంలో ప్రజలకు తెలిసేలా బహిరంగ పర్చాలన్నారు. ఉపాధి హామి పథ కం కింద కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలన్నారు. గ్రామంలో ఎన్ని చెరువులున్నాయి? వాటినన్నింటికీ మరమ్మతులు చేయించాలన్నారు. ఓటరుకార్డుకు ఆధార్ ఎంట్రీ మే 10లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వాల్టా చట్టాన్ని అతిక్రమించి బోరువేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో మే నెలలో 496 ఈ-పాస్ యంత్రాల ద్వారా డీలర్లు వంద శాతం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాల సుబ్రమణ్యం, వెంకట సుబ్బయ్య, ఇరిగేషన్ ఎస్ఈ శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వరయ్య, డీఆర్వో సులోచన, కమిషనర్ఓబులేశు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, సీపీఓ తిప్పేస్వామి, డీపీఓ అపూర్వసుందరి తదితరులు పాల్గొన్నారు. -
‘జీవన భృతి’.. దేశానికే ఆదర్శం
సిద్దిపేట జోన్:బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన భృతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పరిధిలోని 3,230 మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున జీవన భృతి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే ఆసరా పథకం కింద 8,441 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం జీవన భృతితో సిద్దిపేటలోని ప్రతి రెండు ఇళ్లకు ఒక పింఛన్ అందుతుందని తెలిపారు. పేదల కడుపునిండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్... దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పథకాన్ని అమలు చేశారన్నారు. బీడీ కార్మికులు అధికంగా ఉండే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలోనే రూ.వెయ్యి చొప్పున జీవన భృతిని చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇది దేశ చరిత్రలోనే ఒక లిఖిత పూర్వకమైన ఘట్టమని.. పొరుగు రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. అర్హులందరికీ జీవన భృతి అందేలా చర్యలు తీసుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి నెలా రూ.1.20 కోట్లు పింఛన్లకే.. పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 1.20 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రూ.3,600 కోట్లను పేద వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రూ.16 వేల కోట్లను రుణమాఫీ కింద కేటాయించడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణంలో 3,700 మందికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొం దించిందన్నారు. ఆ దిశగా లబ్ధిదారులకు రూ.12 వేల చొప్పున చెల్లించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారన్నారు. సిద్దిపేటను క్లీన్, గ్రీన్, సేఫ్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీడీ కార్మికులకు మరో అవకాశం.. బీడీ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వినూత్నంగా జీవన భృతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వివిధ కారణాల వల్ల బీడీ కార్మికులుగా పేరు నమోదు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వాటర్ గ్రిడ్ పథకానికి భవిష్యత్తులో సిద్దిపేట దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌గౌడ్, తహశీల్దార్ ఎన్వై గిరి, ఓఎస్డీ బాల్‌రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సుతోపాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలువురు మహిళలకు జీవన భృతిని పంపిణీ చేశారు. -
పింఛన్ పైసలెట్ల తీసుకుంటరు..
పరకాల : ‘మాకు ఇండ్లు లెవ్వు.. కొడుకులు బువ్వ పెడ్తలేరు.. మీరేమో పింఛన్ పైసల నుంచి ఇంటి పన్ను కట్ చేత్తాండ్లు.. గిదేం పని సారూ.. ఎట్ల బతుకాలె’ అంటూ వృద్ధులు పరకాల నగర పంచాయతీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పింఛన్ డబ్బు ల్లో కోత పెడితే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని రాజిపేట లో పింఛన్ల పంపిణీ కోసం జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, మార్క విజయభాస్కర్, రాజిరెడ్డి వచ్చారు. పింఛన్ ఇస్తూ ఇంటి పన్ను చెల్లించాలని కోరడంతో వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు అధికారులపై మండిపడ్డా రు. మా కొడుకులు బువ్వ పెట్టకపోతే ఇళ్ల పక్కన పరదాలు కట్టుకొని బతుకుతున్నం.. ఇండ్లళ్ల ఉండెటోళ్లను పన్నులు అడుక్కోవా లె.. మా పైసలను ఎందుకు తీసుకుంటరని అధికారులతో ఘర్షణకు దిగారు. పింఛన్ మొత్తం ఇస్తేనే తీసుకుంటామని తేల్చి చెప్పా రు. పింఛన్ దారులకు మద్దతుగా వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివా స్, సీపీఎం నాయకులు బొట్ల నరేష్, ఏకు రఘుపతి కమిషనర్ ఇంద్రసేనారెడ్డికి ఫోన్ లో సమాచారం అందించడంతో అక్కడకి చేరుకున్నారు. పింఛన్ డబ్బులను ఇంటి పన్నుకు లింకు పెట్టడం ఏందయ్యా అంటూ వృద్ధులు నిలదీయగా పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇప్పటికైతే పింఛన్ డబ్బు పూర్తిగా ఇస్తున్నాం.. తర్వాతనైనా పన్నులు చెల్లించాలని కమిషనర్ కోరడంతో వారు శాంతించారు. -
దద్దరిల్లిన కౌన్సిల్
సర్వేపై పేలిన మాటల తూటాలు దర్గా భూములపై వెనక్కి తగ్గిన టీడీపీ 238 అంశాలపై చర్చ ఒక్కరోజులోనే పూర్తయిన సమావేశం మున్సిపల్ కమిషనర్ లేకుండానే కొనసాగిన కౌన్సిల్ విజయవాడ సెంట్రల్ : రెవెన్యూ సర్వే, దర్గా భూముల వ్యవహారంపై కౌన్సిల్లో పాలక, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. పురాతన భవనాలు, పింఛన్ల పంపిణీపై వాడీవేడిగా చర్చ సాగింది. యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందంటూ అన్ని పార్టీల సభ్యులు మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. సర్వే పేరుతో ప్రజల నెత్తిన భారాలు వేస్తే సహించమంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు ధ్వజమెత్తారు. ‘తాము పన్నులు పెంచడం లేదని, మీరు కలలు కంటే నేనేం చేయలేను..’ అంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్హాల్లో జరిగింది. ఉదయం 10.35కు సభ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 4 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ 6.20 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 8.15కు ముగిసింది. మొత్తం 238 అంశాలపై చర్చించారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈసారి మాత్రమే ఒక్కరోజులో సభ ముగిసింది. కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.వీరపాండ్యన్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లడంతో కౌన్సిల్‌కు హాజరుకాలేకపోయారు. సర్వేపై రసవత్తర చర్చ ఆస్తిపన్నులో తేడాలు, నీటి, డ్రెయినేజీ, ట్రేడ్ లెసైన్స్‌ల ఫీజుల వసూళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కాంప్రహెన్సివ్ రెవెన్యూ సర్వే నిర్వహించాలని అంజెండాలో కమిషనర్ జి.వీరపాండ్యన్ చేసిన ప్రతిపాద నపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య రసవత్తర చర్చ సాగింది. ప్రజలపై పన్ను భారాలు మోపేందుకే సర్వే అస్త్రం ప్రయోగిస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చందన సరేష్, గాదె ఆదిలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వారు సవరణ తీర్మానం ఇచ్చారు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ‘పన్నులు పెంచుతున్నారని మీకు ఎవరు చెప్పారు. పన్నులు ఎగ్గొట్టేవాళ్లకు మీరు(ప్రతిపక్షాలు) కొమ్ము కాస్తున్నారు..’ అంటూ మేయర్ ఆరోపించారు. కమ్యూనిస్టుల పాలనలో 1995లో సర్వే చేసి పన్నులు పెంచలేదా.. అని ప్రశ్నించారు. ఆదాయం వస్తే నగరం ఎక్కడ బాగుపడుతోందోనని ప్రతిపక్షాలు బాధ పడుతున్నాయని విమర్శించారు. మూడు డివిజన్లలో సర్వే నిర్వహిస్తే రూ.74 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.600 కోట్లు టార్గెట్ పెట్టి సర్వే చేస్తామంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చందన సురేష్ అన్నారు. ఓటింగ్ నిర్వహించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన సవరణ తీర్మానం సక్రమంగా లేదని, అందువల్ల ఓటింగ్ అవసరం లేదన్నారు. నగరంలో సమగ్ర సర్వే నిర్వహించే అధికారాన్ని కమిషనర్‌కు అప్పగిస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది. దర్గా భూములపై వెనక్కి తగ్గిన పాలకపక్షం దర్గా భూముల్లో గృహనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన విషయంలో పాలకపక్షం వెనక్కి తగ్గింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ఈ విషయమై అధికార పార్టీని గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్ద విచారణ పెండింగ్‌లో ఉండగా, గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దర్గా భూముల్లో అనుమతులు నిలుపుదల చేసే అధికారం కౌన్సిల్‌కు లేదంటూ వింతవాదన వినిపించారు. అదే పార్టీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దంటూ కౌంటర్ వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు అనుమతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని మేయర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. దర్గా భూముల వ్యవహరంలో ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే పాలకపక్షం వెనకడుగు వేసిందని సమాచారం. -
అందని అభయహస్తం
* మూడు నెలలుగా నిలిచిన పింఛన్ల పంపిణీ * పెన్షన్ పెంపుపై సందిగ్ధం * ఆందోళనలో లబ్ధిదారులు * ఆధార్ అనుసంధానం పూర్తయితేనే చేతికందేది..! నెలలకు సంబంధించి అందకుండా పోయింది. ఇప్పటికే జనవరి నెల పింఛన్ వారు అందుకోవాల్సి ఉండగా, నేటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. 60 ఏళ్ల వయస్సులో తమకు ఆసరాగ నిలుస్తుందని రోజుకు రూపాయి చొప్పున చెల్లిస్తే ఇప్పుడు ఆ పథకం ద్వారా డబ్బులు నిలిచిపోగా, పెంచి ఇస్తామన్న పింఛను రెండు నెలలుగా నిలిచింది. దీంతో వారికి పాత పొంఛన్ ఇస్తారా? పెంచిన పింఛన్ ఇస్తారా? అనే విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అభయహస్తం పింఛన్లు పొందే లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభయహస్తం పింఛన్ పొందేవారు ఆందోళనబాట పట్టారు. 2009లో పథకం ప్రారంభం స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వృద్ధాప్యం పొందిన తరువాత ఆసరా కోసం ప్రతి నెలా పింఛన్ అందించేందుకు వీలుగా 2009లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ప్రతినెలా అభయహస్తం పింఛన్లు అందిస్తుండగా, మూడు నెలలుగా పంపిణీని అధికారులు నిలిపివేశారు. 65 ఏళ్లు దాటిన వారికి ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.1000 పింఛన్ అందిస్తుండగా, 60 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు.ఈ క్రమంలో అభయహస్తం పింఛన్లపై అధికారులు ఒక్కోతీరుగా చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని పింఛన్ లబ్ధిదారులు పెరిగిన పింఛన్లను సంతోషంగా అందుకుంటుంటే.. తమకు మాత్రం పెంచినవి లేవు, పాతవి లేవని.. మూడు నెలలుగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 21 వేల మంది లబ్ధిదారులు జిల్లాలో మొత్తం 21,187 మంది అభయహస్తం ద్వారా నెలకు రూ. 500 పింఛన్ పొందుతున్నారు. ఈ పథకం కింద ఒక్కో సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండే వరకు సభ్యులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు చెల్లించిన మొత్తాన్ని లెక్కేసి నెలకు రూ.500 నుంచి రూ. 2,200 వరకు పింఛన్ మంజూరు చేస్తారు.సభ్యురాలికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతోపాటు కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన 21,187 మంది మహిళలకు నెలనెలా రూ.500 పింఛన్ అందిస్తే, ప్రతినెలా రూ.1.05 కోట్లు, మూడు నెలల బకాయిలు 3.17 కోట్లుగా ఉన్నాయి. స్పష్టత కరువు అభయహస్తం లబ్ధిదారులకు సైతం అర్హతలుంటే సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని, సామాజిక పింఛన్లకు అర్హులుగా గుర్తిస్తే అభయహస్తం పింఛన్ రద్దు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారికి ఆసరా ద్వారా పింఛన్లను గ్రామపంచాయతీల్లో అందిస్తుండగా, 60 నుంచి 65 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి అందడం లేదనే వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో వివరాలను సేకరించడంలోనూ అధికారులు ఆలస్యం చేస్తున్నారు. జిల్లాలోని 21,187 మంది అభయహస్తం పింఛన్‌దారులకు సంబంధించిన ఆధార్‌ను డీఆర్డీఏ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 65 ఏళ్లకు పైబడ్డ వారు ఎంతమంది ఉన్నారు.. వారిలో ఆసరా ద్వారా పింఛన్ ఎంత మంది పొందుతున్నారనే విషయమై స్పష్టత వస్తుంది. ఇప్పటికే మూడు నెలలుగా అభయహస్తం పింఛన్ పొందని వారు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ఆసరా పథకానికి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులను గుర్తించి పూర్తిస్థాయిలో మండల అధికారులతో సర్వే చేసి వారికి ‘ఆసరా’ పింఛన్లు మంజూరు చేయాలని, అభయహస్తం పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో మిగిలిన అభయహస్తం పింఛన్‌దారులకు మాత్రం రూ.500 నుంచి రూ.1000 వరకు పెంచే విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే మూడు నెలల పింఛన్ అందకపోగా, ఫిభ్రవరి నెలతో నాలుగు నెలలకు చేరుతుంది. అధికారులు మాత్రం ఆధార్ అనుసంధానం పూర్తయి, ఆసరాకు అర్హులైన వారిని గుర్తించిన తరువాతే అభయహస్తం పింఛన్లు అందించాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రక్రియ ఎన్నిరోజులు పడుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు అభయహస్తం పింఛన్లు అక్టోబర్ నెల నుంచి నిలిచిపోయాయి. ఇప్పటికే 65 ఏళ్లు నిండిన వారు ఆసరా ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు. జిల్లాలో ఉన్న 21,187 మంది పింఛన్‌దారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. ఇందులో 65 ఏళ్లు నిండి, ఆసరా ద్వారా పింఛన్ పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నాం. ఆసరా పథకానికి అర్హులైన వారిని గుర్తించడంతోపాటు, ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే మిగిలిన లబ్ధిదారులకు నాలుగు నెలల పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - శోభారాణి, డీఆర్డీఏ డీపీఎం -
నేడు పింఛన్ పంపిణీ డౌటే !
ప్రగతినగర్ : ‘ఆసరా’ పింఛన్లు ఈ నెల 5 నుంచిఅందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి పింఛన్ల పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సాంకేతిక కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.‘ఆసరా’కు సంబంధించిన నిధులు ఇప్పటికీ సెర్ప్ నుంచి డీఆర్డీఏ అకౌంట్లో జమ కాలేదు. నిధులు డీఆర్డీఏ అకౌంట్లో జమైన అనంతరం ఎంపీడీఓ అకౌంట్లోకి పింఛన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎంపీడీఓ ఆయా గ్రామ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందిస్తారు. అయితే ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు సమయం పటేలా ఉందని సంబంధిత అధికారికి వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో రెండు నెలల పింఛన్ కలిపి 2,01,982 మందికి రూ. 42 కోట్ల 54 లక్షలు పంపిణీ చేశారు. రూపాయల వరకు అందించారు. గత నెలతో పోలిస్తే జనవరి నెల పింఛన్ పెరిగింది. ఈ నెలలో నిజామాబాద్ అర్బన్‌లో 11,244 మందికి పింఛన్ అందించనున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య మరో వెయ్యి వరకు పెరిగే ఆస్కారం ఉంది.అంతే కాకుండా నిజామాబాద్ మూడు మున్సిపాలిటీలు,అన్ని మండలాలు కలిపి జనవరి నెలకు 2,07,984 మందికి పింఛన్ అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు. వీటికి గాను 23 కోట్ల రుపాయలు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అయితే నిజామాబాద్ అర్బన్‌లో గత నెలలో అప్లోడ్ సీడింగ్ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులకు పింఛన్ అందని విషయం తెలిసిందే.అర్బన్ పింఛన్‌పై గత నెలలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యే సరికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ రంగంలోకి దిగి మున్సిపాల్ అధికారులతో తిరిగి అర్బన్ డాటాను సేకరించారు. వాటిని వెంటనే అప్లోడ్ చేయించి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది అర్హులకు పింఛన్ అందేలా ప్రయత్నించారు. కలెక్టర్ ప్రయత్నం మూలంగా అర్బన్‌లో డిసెంబర్ నెలతో పోల్చుకుంటే దాదాపు మరో 5 వేల మంది లబ్ధిదారులు పెరగనున్నారు. డిసెంబర్లో నిజామాబాద్ అర్బన్ 9,634 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు కాగా 8,576 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. -
పింఛన్ కోసం.. లంచం ఇవ్వొద్దు
సిద్దిపేట జోన్: పేదలు కడుపు నిండా తినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. వివిధ కారణాల వల్ల తొలి జాబితాలో పేర్లు రాని 531 మంది లబ్ధిదారులకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ ఇచ్చేందుకు ఎవరు లంచం అడిగినా వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలతో పాటు పింఛన్ డబ్బులను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఆహార భద్రత జాబితాలో పేరు లేని అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరిలో మూడు కొత్త పథకాలు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ, మధ్యాహ్న భోజనం పథకం, వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన సోనామసూరి బియ్యం సరఫరా, గర్భిణులకు ప్రతిరోజూ గుడ్డుతోపాటు పౌష్టికాహారం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న రమణాచారి పని తీరును మెచ్చుకున్నారు. రాజనర్సు పాల్గొన్నారు. నంగునూరులో పాసు పుస్తకాల పంపిణీ... సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. నంగునూరుంలో బుధవారం 576 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. చదువుల ఖిల్లాగా.. గజ్వేల్ గజ్వేల్: వచ్చే విద్యా సంవత్సరంలోపు గజ్వేల్‌లో పీజీ, మరో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు బుధవారం ప్రకటించారు. దీనికోసం త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.కోటితో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం దేశంలోనే రోల్ మోడల్‌గా అవతరించనుందని చెప్పారు. డీగ్రీ కళాశాల విద్యార్థుల కోరిక మేరకు ఆడిటోరియం, రీడింగ్ రూమ్స్ నిర్మాణానికి మరో రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్త కోర్సులను ప్రవేశ పెడతామన్నారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం... గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోని హైరిస్క్ ప్రెగ్నెన్సీ మానిట రింగ్ సెంటర్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. హైరిస్క్ కేంద్రం తో పాటు ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి ఆర్థోపెడిక్ వైద్యున్ని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీణాకుమారికి సూచించారు. ఆస్పత్రిలోని చిన్నచిన్న పనులకోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జననీ ఎక్స్‌ప్రెస్ పథకంలో భాగంగా తల్లీబిడ్డలను తీసుకెళ్లే వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్పర్సన్ అరుణ, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ జేజాల వెంకటేశ్‌గౌడ్, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి , డాక్టర్ వి.యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి
పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా పంపిణీ కోసం ప్రభుత్వ ఆదేశం మూడు నెలల్లోగా ఆధార్ సమర్పించకుంటే పింఛన్ నిలిపివేత వీటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన ఇప్పటివరకు 23.11 లక్షల మందికి రూ. 456.67 కోట్లు పంపిణీ సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ‘ఆసరా’ పింఛన్లను పంపిణీ చేయాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లబ్ధిదారులందరికీ పొదుపు ఖాతాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందు కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి శుక్రవారం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, మరికొంత గడువు కావాలని పలు జిల్లాల అధికారులు కోరారు. దీనిపై స్పందించిన సీఈవో మురళి.. ఈ నెల 25వ తేదీలోగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ లేకుంటే అంతే! పింఛన్ల లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని సెర్ప్ సీఈవో మురళి స్పష్టం చేశారు. ఆధార్ సమర్పించేందుకు ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చినందున, ఆధార్ లేనివారు ఈలోగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గడువులోగా ఆధార్ సమర్పించని వారికి ఆ తర్వాతి నెల పింఛన్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై లబ్ధిదారులను అప్రమత్తం చేయాలని సూచించారు. కొత్త పింఛన్లు జనవరిలోనే.. ఈ నెల 20వ తేదీ తర్వాత మంజూరు చేసే పింఛన్లను వచ్చే జనవరి నెల నుంచే వర్తింపజేయాలని మురళి అధికారులకు సూచించారు. లబ్ధిదారుల జాబితాల్లో మరణించిన వారి పేర్లు, ఒకరి పేర్లు రెండు మార్లు రావడం, వలస వెళ్లిన వారి పేర్లు ఉండడం వంటివాటిని క్షేత్రస్థాయిలోనే తొలగించేందుకు సాంకేతిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా పెన్షనర్ల కేటగిరీని మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. పంపిణీ చేసిన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి తీసుకున్న రశీదు (అక్విటెన్స్)ల డేటా ఎంట్రీని 29వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి విభాగం నుంచి ఆయా మండలాల అధికారులకు కేటాయించిన నిధులు, అందిన నిధుల వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23.11 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 456.67 కోట్లను పంపిణీ చేసినట్లు మురళి తెలిపారు. -
ఆగని నిరసన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆసరా’ పథకం తమకు అందడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం కూడా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగించారు. నిజామాబాద్, ఆర్మూ రు, బోధన్, కామారెడ్డి డివిజన్లలో అర్హత కోల్పోయిన పలువురు రోడ్లెక్కారు. అధికారులు ఈ నెల పది నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించిన విషయం విదితమే. చివరి రోజైన సోమవారం నాటికి మొత్తం 2,03,868 మందికి నవంబర్, డిసెంబర్ నెలలకు చెందిన పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజే బాలారిష్టాలు తప్పలేదు. ఆ రోజు, మొత్తం 2,03,886 మంది లబ్ధిదారులకుగాను 21,157 మందికే రూ.4.42 కోట్లు అందజేశారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పంపిణీలో వేగం పెంచారు. అయినా, సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వేలాది మంది దరఖాస్తులతో తరలిరావడంతో నగరం జాతరను తలపించింది. తేలని అర్హుల జాబితా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆద్యంతం ఆందోళనలకు కారణమవుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో చాలా మంది ఈసారి అవకాశం కోల్పోయా రు. ఈ నేపథ్యంలో జనం రోడ్లెక్కారు. నిజామాబా ద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల ఎదుట ధర్నాకు దిగారు. పలుచోట్ల వృద్ధులు, మహిళలు, వికలాంగులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘ఆసరా’ కింద మొత్తం 3,62,166 దరఖాస్తులు రాగా, అందులో 2,03,868 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఫించన్ల జాబితాలో పేర్లు లేని వారందరూ ఆందోళనబాట పట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్‌ను ముట్టడించిన వృద్ధులు, వికలాంగులు అనంతరం ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బోధన్ మున్సిపల్ కమిషనర్ డీవీవీ ప్రసాదరావును నిలదీశారు. బోధన్ పట్టణంలో పలు వార్డులకు సంబంధించిన తమ పేర్లు పింఛన్ జాబితాలో లేవని అధికారులను ప్రశ్నించారు. ఆర్మూరు మున్సిపాలిటీ ఎదుట ఫించన్ల కోసం చేపట్టిన దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. ఎంపీడీఓ, తహసీల్దారు కార్యాలయాల ఎదుట మున్సిపాలిటీలతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపీడీఓ, తహసీల్దారు కార్యాల యాల ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఇందులో అత్యధికంగా వృ ద్దులు, వికాలాంగులు పాల్గొన్నారు. బోధన్‌లో హుస్సా, మందారా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. బాల్కొండ మండలం ముప్కాల్, రెంజర్లలో పంపిణీ కా వల్సిన పింఛన్లకు సంబంధించి నగదు కొరత ఏర్పడింది. గ్రామ పంచాయతీల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. కమ్మర్పల్లి మండలం ఉప్పులూర్కు చెం దిన అనేక మంది పింఛన్లు రావడం లేదంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఫించన్ల కోసం తరచుగా అర్హులైన లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రం లో వృద్ధులు ధర్నా చేశారు. కోటగిరిలోనూ ఆందోళన చేశారు. పింఛన్లు రాలేదం టూ ధర్పల్లి మండల మండల కార్యాలయాన్ని ముట్టడించారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సదాశివనగర్ మండలాల తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలను సమర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీల వద్దా నిరసనలు కొనసాగాయి. -
‘ఆసరా’ అందేదెప్పుడు..?
ధర్మపురి : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో పింఛన్ల పంపిణీ రచ్చగా మారింది. కార్యక్రమానికి రాజకీయ రంగు పులుమడంతో అది కాస్తా రాస్తారోకో చేసే వరకు వెళ్లింది. ధర్మపురిలో సోమవారం పింఛన్లు పంపిణీచేశారు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం చేపడతామని ఎంపీడీవో భాస్కరాచారి నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయంలోనే పంపిణీచేయూలని సర్పంచ్ సంగి సత్తెమ్మ కోరారు. అయితే పండుటాకులు, వికలాంగులు గంటల తరబడి నిరీక్షించి ఆకలి, దప్పికకు దూరమయ్యారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని మండల కార్యాలయంలోనే పంపిణీచేయూలని పట్టుబట్టడంతో అధికారులు డైలమాలో పడిపోయూరు. మండలపరిషత్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని సర్పంచ్‌తోపాటు మరికొందరు అడ్డుకున్నారు. సభావేదికపై ఉన్న కుర్చీలు, టేబుళ్లు తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కార్యదర్శి మేఘమాల తహశీల్దార్ కార్యాలయూనికి వెళ్లింది. బయటకు రావాలంటూ నినాదాలు చేస్తు కార్యాలయాలను ముట్టడించారు. జాతీయ రహదారిపై సర్పంచ్ సంగి సత్తమ్మ, కాంగ్రెస్ నాయకులు, పింఛన్‌దారులు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. చివరకు కార్యదర్శి మేఘమాల గ్రామపంచాయతీలోనే పంపిణీచేసేందుకు ఒప్పుకోగా వివాదం సద్దుమణిగింది. అర్హులకు పింఛన్లు అందించాలని డిమాండ్‌చేస్తూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడే రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ అక్కడకు చేరుకుని మాట్లాడారు.. అర్హత ఉన్న వారందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. రామగుండం నగరపాలక సంస్థలో పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన సర్వేపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. పింఛన్లు పంపిణీ చేయడానికి డీఆర్డీఏ పీడీ ఎస్.విజయగోపాల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డీవో, తహశీల్దార్‌తో సమీక్ష జరిపారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయనకు వివరించారు. ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన పీడీ వారంలోగా అన్ని డివిజన్లలో రీ సర్వే పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు. కోరుట్ల మండలంలోని జోగిన్‌పల్లికి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీ వోకార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.పింఛన్లు అందించాలని మెట్పల్లి మండలం వేంపేట గ్రామస్తులు మండల పరిషత్ ఎదుట ఆందోళ చేశారు. రామగుండం మండలం జయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 400 మంది ఆందోళన చేపట్టారు. పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ కార్యద ర్శిని అడ్డుకున్నారు. పింఛన్లు అడిగితే ఈవోపీఆర్డీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వితంతులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తోందని, రేషన్ కార్డుల్లో పిల్లలు ఉన్నప్పటికీ పెండ్లిళ్లు అయ్యాయా..! అని ప్రశ్నించడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీడీవో కలుగజేసుకుని శాంతిపజేశారు. ఆసరా పథకం కింద అర్హులైన వారికి పింఛన్లు అందలేదని బోరుునపల్లి మండలం తడగొండ, బూర్గుపల్లి గ్రామాల్లో ఆందోళన చేశారు. తడగొండలో సర్పంచ్ కట్ట కనుకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కట్ట భాగ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్‌ను గంటసేపు పంచాయితీ కార్యాలయంలో నిర్భందించారు. ఎస్సై రాజేశ్వరరావు, ఏఎస్సై చల్ల వెంకట్రాజం వెళ్లి సముదాయించారు. అర్హులకు పింఛన్లు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
అరెస్టు చేయకుంటే పింఛన్లు పంచం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : నవాబ్‌పేట్ మండలం కారూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయకపోతే ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించబోమని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా సంఘం ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన ధర్నా సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులు పెద్దసంఖ్యలో పోలీసు రక్షణ కల్పిస్తేనే పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయూలన్నారు. శ్రీనివాస్‌పై బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును ఉపసంహరించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. లేని పక్షంలో ఉద్యమన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాడులను అరికట్టాలి... ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే విధులు నిర్వహించడం కష్టమని ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, రెవెన్యు సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు ప్రభాకర్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. సోమవారం వారు ధర్నాకు సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ విశ్వ్రపసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళన విరమణ కారూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా చేపట్టిన ఆందోళనను విరమిస్తూ మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సిటి కేబుల్ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాడి కేసులో నిందితులను అరెస్ చేయడంతో తాము ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు. -
10 నుంచి పంచుడే
⇒ ఒకేసారి రెండు నెలల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీ ⇒ వేగిరం చేసిన అధికార యంత్రాంగం ⇒ రేపు గ్రామస్థాయిలో సర్పంచ్‌లకు అవగాహన ⇒ ఇప్పటివరకు 3 లక్షల మంది అర్హులు హన్మకొండ అర్బన్ : రెండు నెలలుగా ఆగిపోయిన పింఛన్ల పంపిణీపై సందిగ్ధత తొలగింది. ఆగిన పింఛన్ వస్తుందా.. రాదా అని ఆందోళనకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఊరట కలిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఆసరా పింఛన్లను గ్రామస్థాయిలో పంపిణీకి తేదీలు ఖరారు చేసింది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏది ఏమైనా పదో తేదీ లోపు పరిశీలన పూర్తి చేసి జాబితా సిద్ధం చేయూలని హుకుం జారీ చేశారు. అంతేకాదు.. నిలిచిపోరుున రెండు నెలల పింఛన్ డబ్బులు ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పెండింగ్ పింఛన్ డబ్బులు కూడా... ప్రభుత్వం ఆసరా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభం నుంచి పాత పింఛన్ల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో నెలల వారీగా నిలిచిపోరుున పింఛన్ డబ్బులను ఇస్తారా... ఇవ్వరా... అన్న విషయంలో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొం ది. ప్రస్తు తం రెండు నెలల (అక్టోబర్, నవంబర్) పింఛన్ డబ్బులను ఈ నెలలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం గ్రామ స్థారుులో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రేపు సర్పంచ్‌లకు అవగాహన ముఖ్యంగా గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీ, ఎంపిక విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సర్పంచ్‌లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో సద స్సు నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ... దాన్నిరద్దు చేశారు. 6న ఉదయం జిల్లాలోని సర్పంచ్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్పంచ్‌లు ఉదయం 11 గంట లకు ఆయా తహసీల్దార్ కార్యాల యాల్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు 3 లక్షల మంది అర్హుల గుర్తింపు జిల్లాలో వివిధ పింఛన్ల కోసం అందిన మొత్తం 5,40,000 దరఖాస్తుల్లో వివిద స్థాయిలో వడపోత అనంతరం 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. పదో తేదీ నాటికి మరో 5వేల మంది పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ పంపిణీ సమయంలో ఫొటోలతో ఉన్న ప్రొసీడింగ్స్ అందజేసి, పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆసరా కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తెలుగు అక్షర దోషాలు ఎక్కువ ఉన్నందున... కార్డులు ప్రింట్ చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత కార్డులు ముద్రించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తంగా జిల్లాలో పింఛన్ల పంపిణీకి తేదీలు ఖరారు కావడం ఆసరా లబ్ధిదారులకు ఊరటనిచ్చే విషయం. -
పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జగన్మోహన్ సూచించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలనిపేర్కొన్నారు. పింఛన్ దరఖాస్తులను పరిశీలించిన విచారణాధికారులు సూచించిన విధంగా వీఆర్వోలు, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేయాలన్నారు. పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీలోపు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో మారిన రూల్స్ ప్రకారం తహశీల్దార్లు ఈ నెల 30వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. చెరువుల పూడికతీతను చేపట్టేందుకు ఉద్దేశించిన కాకతీయ మిషన్ కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా చేపట్టాలన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నిర్దేశించిన మొక్కలను నాటించాలని సూచించారు. డీఎస్వో వసంత్‌రావ్, ఆర్డీవో శివలింగయ్య, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఆసరా పోయిందని కుప్పకూలారు
* ఏడుగురు మృతి * మృతుల్లో హైదరాబాద్‌వాసి సాక్షి నెట్వర్క్: ఇంతకాలం తమ జీవితాలను ఆసరాగా ఉన్న పింఛన్లు ఇక రావనే బెంగతో వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మరణించారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కొంరయ్య(80)కి గతంలో వృద్ధ్యాప్య పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో కొంరయ్య పేరు లేదు. దీంతో మనస్తాపానికి చెంది బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. ఇదే మండలం కిష్టంపల్లెకు చెం దిన బొనాల రాజయ్య(85) పేరూ జాబితాలో లేకపోవడంతో మనస్తాపం చెంది మరణించా డు. ఇదే జిల్లా హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లిగ్రామానికి చెందిన అట్ల ఎల్లయ్య(80)కు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల గ్రామంలో కొందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లయ్యకు సదరు జాబితాలో పింఛన్ రాలేదు. దీంతో తనకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళనకు గురైన ఎల్లయ్య గుండెపోటుకు గురై మృతి చెందాడు. అయితే, ఎల్లయ్య పింఛన్ మంజూ రైందని తహశీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామానికి చెందిన మేతరి సాయిలు(45) వికలాంగుడు. ఎకరం భూమి ఉంది. సాగునీటి వసతి లేకపోవడంతో అప్పు చేసి రెండేళ్ల క్రితం బోరు వేయగా, నీరు పడలేదు. దీంతో ఆరుతడి పంటలే వేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేయగా, వర్షాభావ పరిస్థితుల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇదే క్రమంలో సాయిలుకు వస్తున్న పింఛన్ సైతం ఆగిపోయింది. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగిన సాయిలు మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సదరం క్యాంపునకు హాజరయ్యాడు. ఇంటికి వచ్చిన సాయిలు అప్పులు ఎలా తీర్చాలోనని, పింఛన్ వస్తుందో రాదోనని మదనపడ్డాడు. బుధవారం వేకువ జామున మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరుకు చెందిన సంగిశెట్టి చెన్నమ్మ(75) పదేళ్లుగా పింఛన్ పొందుతోంది. తాజా జాబితాలో చెన్నమ్మ పేరు లేదు. దీంతో వారం రోజులుగా బెంగపట్టుకుంది. మూడు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగింది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చంఎదిన బచ్చలి వెంకటయ్య పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో మనస్తాపంతో మృతి చెందాడు. ఇదిలా ఉండ గా, హైదరాబాద్‌లోని కార్వాన్ తాళ్లగడ్డకు చెం దిన గోనెల నారాయణ(68)కు గతంలో పింఛ న్ వచ్చేది. ఈసారి రాకపోవడంతో పింఛన్ ఇచ్చే కేంద్రానికి, తహసీల్దార్ కార్యాల యానికి వారం రోజులపాటు తిరిగాడు. మంగళవారం కూడా ఈ రెండు చోట్లకు వెళ్లాడు. పింఛన్ రాలేదనే బెం గతో ఇంటికి చేరాడు. ఒంట్లో నలతగా ఉండ డంతో బుధవారం కుటుంబసభ్యులు ఉస్మాని యా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. -
ఆందోళన వద్దు
‘‘పింఛన్ల కోసం గందరగోళం వద్దు. అర్హులందరికీ పింఛన్ల పంపిణీ జరుగుతుంది.అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం జరుగదు’’ జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం వృద్ధులను, వితంతువులను, వికలాంగులను అయోమయానికి గురి చేస్తోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అధికారులు ఒక జాబితా విడు దల చేశారు. అందులో పేరు లేని వారు ధర్నాలు, ఆదోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ రాజారాం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులను పలకరించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆరా తీశారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఈఓ : ఏమమ్మా బాగున్నావా...ఎక్కడి నుంచి వచ్చినవు? జకినీబాయి : బాగున్నాను సారూ...నేను మానిక్‌భండార్ నుంచి వచ్చిన. సీఈఓ : ఇక్కడికి ఎందుకు వచ్చినవు, నీ సమస్య ఏమిటి? జకినీబాయి : పింఛన్ రావడం లేదు సారూ. ఇంతకు ముందు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చిన. పింఛన్ వస్తదా మరి. సీఈఓ : ఏ పింఛన్ కోసం వచ్చినవు? జకినీబాయి : నాకు భర్త లేడు. వితంతు పింఛన్ కావాలె. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఈమె దరఖాస్తు తీసుకున్నారా? ఎంపీడీఓ : తీసుకున్నం సార్. సోను : సారూ... పింఛన్ల జాబితాలో నా పేరు లేదు. పింఛన్ ఆగిపోయింది. ఎట్ల సారూ! సీఈఓ : జాబితాలో పేరు లేదా. ఎంపీడీఓగారు పరిశీలిస్తారు. పింఛన్ వచ్చేలా చూస్తరు. సారుని కలువు. బాల్యనాయక్ : సారూ...ఎన్నిసార్లు తిరిగినా నాకు పింఛన్ రావడం లేదు. సార్లు ఏమోమో చెపుతాండ్రు. నేనెట్ల బతుకాలే? సీఈఓ : చూడు పెద్దాయనా, నీ వయసు ఎంత, నీకు ఏ పింఛన్ వస్తాంది. కాగితాలు చూపించు? బాల్యనాయక్ : ఇదిగో సారూ...ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉంది. అన్ని ఉన్నాయి. కాని పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : గుర్తింపు కార్డులో ఈయన వయస్సు తక్కువగా పడింది సార్. దీంతో పరిశీలనలో దరఖాస్తును తిరస్కరించారు. సీఈఓ : గుర్తింపు కార్డులో నీ వయస్సును సరిచేసుకో. అప్పుడు నీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది. గంగారాం (వికలాంగుడు) : సారూ...నాకు నడవడం చేతకాదు. పని చేయలేను. పింఛన్ ఇస్తే ఆసరాగా ఉంటుంది. సీఈఓ : (గంగారాంను పరిశీలిస్తూ) నీకు కాలు పుట్టుకతో ఇలాగే ఉందా? లేకపోతే ఏమైన ప్రమాదం జరిగిందా? గంగారాం : ప్రమాదం జరిగింది సారూ. సీఈఓ : ప్రమాదం జరిగితే పింఛన్ రాదు కదా....సరే పరిశీలిస్తాం. దేవిలీ : మా ఇంటికి సార్లు వచ్చిండ్రు..పేర్లు రాసుకొని పోయిండ్రు. జాబితాలో మాత్రం మా పేర్లు లేవు. సీఈఓ : ఇంతకూ నీకు రావాల్సిన పింఛన్ ఏంది? దేవిలీ : ముసలోల్లకు వచ్చే పింఛన్ కావాలె సారూ! ఎంపీడీఓ : (దేవిలీ దరఖాస్తును, గుర్తింపు కార్డు ను పరిశీలిస్తూ) వయస్సు తక్కువగా ఉంది సార్. అందుకే ఈమెకు పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీకు భర్త లేడన్నవు కదా... వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో పింఛన్ వస్తుంది. భూదేవి : నాకు వితంతు పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : ఈమె గుర్తింపు కార్డులో మహిళ బదులు. పురుషుడని నమోదైంది అందుకే వితంతు పింఛన్ నిలిపివేశారు. సీఈఓ : నీ గుర్తింపు కార్డులో మార్పులు చేసుకొని తీసుకవస్తే పింఛన్ వస్తది. ముత్తన్న : నాకు వచ్చే పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీ వద్ద ఉన్న కాగితాలు చూపించు. ముత్తన్న : (కాగితాలు చూపెడుతూ) ఇదిగో సారూ...రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నయి సీఈఓ : నీకు వయస్సు తక్కువగా ఉంది కదా. నీకు ఎంత మంది పిల్లలు, వారేం చేస్తరు? ముత్తన్న : 12వ తరగతి చదివిండ్రు. పనులు చేసుకుంటాండ్రు. సీఈఓ : నీకు ఏ సంవత్సరంలో పెళ్లి అయిందో గుర్తుందా? ముత్తన్న : నాకు ఇద్దరు పెళ్లాలు సారూ. మొదటామెను ఎప్పుడో వదిలేసిన. ఇప్పుడు రెండో ఆమెతో ఉంటున్న. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నరు. సీఈఓ : సరే నీ గుర్తింపు కార్డు పరిశీలించి చూస్తాం. సురేష్ (వికలాంగుడు) : నాకు సదరం సర్టిఫికెట్ ఉంది. ఆరు నెలలు పింఛన్ వచ్చింది. అప్పటినుంచి మల్ల రాలే. 80 శాతం వికలాంగత్వం ఉంది. సీఈఓ : సదరం సర్టిఫికెట్ చూపించు. సురేష్ : ఇప్పుడు తీసుకరాలేదు సార్. ఇంటి వద్దనే ఉంది. సీఈఓ : సర్టిఫికెట్లు అన్ని తీసుకవచ్చి ఎంపీడీఓ సార్‌ను కలువు. విజయ : నా భర్త చనిపోయి పదకొండు సంవత్సరాలైతాంది. వితంతు పింఛన్ ఇవ్వడం లేదు ఎంపీడీఓ : ఈమె దరఖాస్తు లైఫ్‌స్టైల్ పరిశీలనలో తిరస్కరణకు గురైంది. సీఈఓ : మీకు భూములు ఉన్నాయి కదా! మరీ పింఛన్ అడిగితే ఎట్లా? విజయ : మాకు ఎవరూ లేరు సార్. మేము ఎట్ల బతకాలే! నాగమణి : రేషన్ షాపులో బియ్యం తక్కువగా ఇస్తున్నారు సర్. ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదు. సీఈఓ : నీవు ఎక్కడి నుంచి వచ్చినవు? నీకు రేషన్‌కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డు ఇచ్చినవా? నాగమణి : మాది మాదాపూర్ సార్. ఆధార్ కార్డులు అధికారులకు ఇచ్చిన. సీఈఓ : సరేనమ్మా...ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడు. రమేశ్ : సర్ మా ఊరిలో మురికికాలువలు శుభ్రం చేయడం లేదు సర్. సీఈఓ : మీ ఊరి పేరు ఏమిటి? రమేశ్ : మానిక్‌భండార్ సార్. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఒకసారి సంబంధిత అధికారితో మాట్లాడండి. -
ప్రోగ్రెస్ నిల్
మచిలీపట్నం :జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం గత నెల అక్టోబరు రెండో తేదీన ప్రారంభమై ఈ నెల 11తో ముగిసింది. తుపాను కారణంగా అక్టోబరు 12 నుంచి ఆ నెలాఖరు వరకు వాయిదా వేశారు. నవంబరు ఒకటి నుంచి 11 వరకు రెండో విడత నిర్వహించి పూర్తిచేశారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జన్మభూమి-మా ఊరు పేరుతో నిర్వహించగా, ఆ పార్టీ నేతలు దీనిని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చివేశారు. జన్మభూమిలోనే పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో అవి నిలిచిపోయాయి. 970 పంచాయతీలు.. 277 వార్డుల్లో... జిల్లాలో జన్మభూమి - మా ఊరు సభలు 970 పంచాయతీల్లో, 277 వార్డుల్లో నిర్వహించారు. 2.77 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా నవంబరు 11 నాటికి 2,26,998 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారికి తరువాత రోజుల్లో ఇచ్చారు. తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారికి గృహాలకు వెళ్లి పింఛన్లు అందజేస్తామని అధికారులు ప్రకటించారు. నవంబరు 11 నాటికి రూ.23.61 కోట్లను పింఛను రూపంలో అందజేశారు. మండలాలు, ఆయా పురపాలక సంఘాల్లో 1,247 గ్రామసభలు నిర్వహించగా వాటిలో 1,241 వైద్యశిబిరాలను నిర్వహించారు. 1,18,898 మందికి వైద్యపరీక్షలు చేశారు. 1,085 పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 90,245 పశువులకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. భూసార పరీక్షలకు సంబంధించి రైతులకు 12,758 సాయిల్ హెల్త్‌కార్డులను అందజేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,058 అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గృహనిర్మాణం, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 5,12,166 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని ఆన్లైన్లో ఉంచుతున్నారు. బడి ఈడు ఉండి అసలు బడికి వెళ్లని ఏడుగురు బాలలను గుర్తించారు. గృహాలు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 1,70,290 దరఖాస్తులు వచ్చాయి. నిధుల విడుదలపై స్పష్టత లేదు... జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏ విభాగం నుంచి నిధులు కేటాయించాలనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. నూతన పింఛన్ల మంజూరు పైనా ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తదుపరి నిర్ణయం తీసుకోగలమని అధికారులు చెబుతున్నారు. ప్రచారానికే ప్రాధాన్యం జన్మభూమిని ఆద్యంతం పార్టీ ప్రచార కార్యక్రమంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తలకే నాయకులు, కార్యకర్తలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పింఛను మంజూరు పత్రాలను అందజేసే సమయంలో పసుపు రంగులో ప్రత్యేకంగా తయారు చేయించిన కవర్లపై ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించి ఇచ్చారు. గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు అందజేశారు. సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు. జన్మభూమి నిర్వహణ కోసం పంచాయతీకి, వార్డుకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వాటిని జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యే సమయంలో అధికారులు విడుదల చేయటం గమనార్హం. అధికారులే టీడీపీ కార్యకర్తలుగా... చాలా గ్రామాల్లో అధికారులే టీడీపీ కార్యకర్తలుగా మాదిరిగా వ్యవహరించి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. బందరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఎలాంటి పదవులూ లేని టీడీపీ నాయకులు వేదికపై నుంచి ప్రసంగించేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించాలనే నిబంధన ఉన్నా బందరు మండలం గుండుపాలెంలో టీడీపీ కార్యకర్తల సూచనల మేరకు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. పలువురు నేతల అత్యుత్సాహం... జన్మభూమి సభల్లో పలువురు టీడీపీ నేతల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. పామర్రు మండలం కొమరవోలు, రిమ్మనపూడి పంచాయతీలో టీడీపీ నేత వర్ల రామయ్య వ్యవహరించిన తీరు ఆ గ్రామాల ప్రజల మధ్య చిచ్చుపెట్టింది. కొమరవోలు పంచాయతీలో పింఛను సర్వేలో భాగంగా గ్రామకమిటీ సభ్యులు 50 మందికి అకారణంగా పింఛన్లను తొలగించారు. దీనిపై ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పోలీసు బలగాలను దింపి ఇక్కడ జన్మభూమి నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య తదితరులు మళ్లీ ఇక్కడ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించటం వివాదాస్పదమైంది. రిమ్మనపూడిలో టీడీపీ నాయకులను వేదిక ఎందుకు ఎక్కనిచ్చారంటూ గ్రామస్తులు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉన్న సర్పంచులు, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఉన్న మండలాల్లో వారిని పక్కనపెట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలే తమ పెత్తనం చెలాయించేందుకు జన్మభూమిని వేదికగా వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మహిళలు ఉన్నచోట్ల వారి భర్తలే అన్నీ తామై వ్యవహరించారు. టీడీపీకి చెందిన గ్రామ, మండల, పట్టణస్థాయి నాయకులంతా జన్మభూమి వేదికలపై నుంచి గంటల తరబడి ప్రసంగించారు. ప్రభుత్వం తమదేనని, తాము చెప్పిందే జరుగుతుందనే ధోరణిలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించటం గమనార్హం. -
పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ల పంపిణీ
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో వికలాంగుల పింఛన్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర లురాని వారిని గుర్తించి వారికి పంచాయతీ సెక్రటరీల ద్వారా ప్రతినెలా పింఛన్ డ్రా చేసి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పలువురు వికలాంగుల వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్ ఇవ్వలేదని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వేలిముద్రలు సరిపోని వికలాంగులకు పింఛన్లు సంబంధిత సెక్రటరీలు సొంత బాధ్యత తీసుకుని అందించాలన్నారు. ప్రజావాణిలో సరిగా ఎదుగుదల లేని రమేష్ కుమార్తె గంగామాతకు గతంలో రిలీ జైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.25వేలను వెంటనే చెల్లిం చాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మీ- సేవ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లాలో మీ-సేవ ద్వారా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన దరఖాస్తులు 33వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని, వీటి పరిష్కారానికి అనుభవం కలిగిన రెవెన్యూ అధికారులతో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేసీ భరత్‌గుప్తా, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’
మంత్రి మహేందర్‌రెడ్డి ఆదిబట్ల : ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని , అర్హులందరకీ పింఛన్లు అందించటంమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడలో జిల్లా సంయుక్త పాలనాధికారి చంపాలాల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో గతంలో రూ.7 కోట్ల రూపాయలు మేరకు పింఛన్లు అందించేవారని, ఇప్పుడు ఆసరా పథకంలో భాగంగా రూ.27 కోట్ల పింఛన్లు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. బడ్జెట్లో ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 5 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు మూడు ల క్షల మూపై వేల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, దళిత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అమ్మాయిలకు 51 వేల రూపాయలు ఇచ్చి వివాహలు జరిపిస్తామని తెలిపారు. జంట నగరాలలో కోటీ 20 ల క్షల జనాభాకు మంచి నీరుకు 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో రూ,240 కోట్లతో మంచి నీటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రూ.150 కోట్లతో 540 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. జిల్లాపై అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వాటితో చర్చలు జరిపి నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వెంకట్రారాంరెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, సర్పంచ్ పొట్టి రాములు, ఎంపీటీ సీ సభ్యులు గౌని అండాలు బాలరాజ్గౌ డ్, ఆర్డీవో యాదగిరి రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్‌కుమార్, నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
8 నుంచి పింఛన్ల పంపిణీ
తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే పెంచిన పింఛన్ నగదు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ తర్వాత నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను సొమ్మును తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే ఇవ్వనున్నట్లు చెప్పారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు. తొలి నెల్లో నేరుగా చేతికే: వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛన్ల సొమ్మును నేరుగా వారి చేతికే అందించడం ద్వారా.. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ‘తర్వాతి నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపులు ఉంటాయి. గ్రామం యూనిట్‌గా పింఛన్లను పంపిణీ చేయాలి. ప్రారంభించిన మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలి’ అని చెప్పారు. పంపిణీలో సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్ అందినట్లు కంప్యూటరైజ్డ్ రసీదు తీసుకోవాలని సూచించారు. వారంలోగా వెరిఫికేషన్..: పింఛన్ల పంపిణీకి గడువు దగ్గర పడుతున్నందున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, వారంలోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం 39,90,197 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 19,27,049 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆహార భద్రతా కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా, 19,28,528 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. పింఛన్ల విషయమై ఇప్పటికే ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పెరిగిన పింఛను విషయమై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. వితంతువుల పింఛను దరఖాస్తుల పరిశీలన సందర్భంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వారిని ఒత్తిడి చేయవద్దని ఆదేశించారు. -
కుటుంబానికి ఒక్కటే...
- జన్మభూమి సభలో పెన్షన్లపై స్పష్టత ఇచ్చిన కలెక్టర్ లొట్లపల్లి (జామి): ఒక కుటుంబానికి ఒకటే పెన్షన్ అని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశా రు. జామి మండలంలోని లొట్టపల్లిలో శుక్రవారం జరిగిన జన్మభూమి-మాఊ రు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసుత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒకటే పెన్షన్ వస్తుందన్నా రు. ప్రభుత్వ నిబంధనల్లో తరువాత మార్పులు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. పెన్షన్ల పంపిణీలో జాప్యం ఎందుకవుతోందని ఎంపీడీఓ ఎన్ఆర్కె.సూర్యాన్ని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ నంబరు అనుసంధానం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పా రు. దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో డీఆర్డీఏ, స్మార్ట్ కార్డుల అధికారులతో మాట్లాడి బాధ్యులైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. అర్హత కలిగి ఉన్నప్పటికీ నిరుపేదల పెన్షన్లు తొలగించారని గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కలెక్టర్ ఎదుట వాపోయారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు తమ పెన్షన్లు కూడా తొలగించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తొలగింపులపై మళ్లీ విచారణ జరిపి అర్హత ఉంటే తప్పనిసరి గా పరిష్కారం చేస్తామని ఫిర్యాదు దారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. దీనిపై గ్రామస్తుల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడగంతో అధికారులు దరఖాస్తులు తీసుకుంటామని సమాధానమివ్వగా కలెక్టర్ మండిపడ్డారు. తాను మళ్లీ ఈ గ్రామానికి వస్తానని, ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుని కనిపించాలని అధికారులను హెచ్చరించారు. ఎంపీడీఓ, ఉపాధి తదితర శాఖల సిబ్బంది సం యుక్తంగా మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం లో జన్మభూమి ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి ఆదిత్యలక్ష్మి, ఎంపీడీఓ ఎన్ఆర్కె.సూర్యం, జెడ్పీటీసీ బండారు పెదబాబు, సర్పంచ్ జన్నేల సింహాచలం, ఎంపీటీసీ కడియా ల గోపి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
అవును మేమే తిన్నాం.. ఇప్పుడేంటి!
కర్నూలు(అగ్రికల్చర్): దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు ఎవరి స్థాయిలో వారు అక్రమాలకు తెగబడుతున్నారు. స్వాహాపర్వం వెలుగుచూసిన రోజు ఉన్నతాధికారులు హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనం దాలుస్తుండటంతో వీరి బాగోతం యథేచ్ఛగా సాగిపోతోంది. పింఛన్ల పంపిణీ విషయంలో ఇదే జరిగింది. మూడు నెలల క్రితం వరకు దుర్వినియోగమైన మొత్తం రూ.1.15 కోట్లు కాగా.. ఇప్పుడది రూ.1.44 కోట్లకు చేరుకుంది. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి రూ.50వేలకు పైగా నిధులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రికవరీకి ఆదేశించారు. బాధ్యులైన పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలన్నారు. ఆ తర్వాత ఆయనా పట్టించుకోకపోవడం.. కింది స్థాయి అధికారులు మౌనం దాల్చడంతో ఈ మూడు నెలల్లోనే రూ.29 లక్షలు కాజేసేందుకు ఆస్కారం ఏర్పడింది. సామాజిక భద్రత పింఛన్లను కొన్ని మండలాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు.. మిగిలిన మండలాల్లో యాక్సిస్ బ్యాంకు, పినో కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్పీలు పంపిణీ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యారు. చనిపోయిన వారి పింఛన్లను కొందరు సీఎస్పీలు ఫోర్జరీ సంతకాలతో కాజేస్తున్నారు. గ్రామం వదిలి వెళ్లిన వారి పింఛన్లనూ బొక్కేస్తున్నారు. ఈవిధంగా పంచాయతీ సెక్రటరీలు రూ.49.78 లక్షలు.. సీఎస్పీ(కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)లు రూ.94.37 లక్షలు స్వాహా చేసినట్లు మూడు విడతల సామాజిక తనిఖీలో వెల్లడైంది. ఇందులో రూ.18.69 లక్షలు మాత్రమే రికవరీ చేయడం గమనార్హం. సీఎస్పీ పోస్టుల కోసం ప్రతి రోజూ డీఆర్డీఏ అధికారులకు పది సిఫారసులు వస్తున్నాయంటే వీటికున్న డిమాండ్ ఇట్టే అర్థమవుతుంది. బాగా ఆదాయం ఉండటం.. రాష్ట్రంలో పాలన మారిన నేపథ్యంలో ఉన్న వారిని తొలగించి ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు తమ్ముళ్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్.విజయమోహన్ పింఛన్ల వ్యవహారంలో చొరవ చూపితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఇప్పటి వరకు వారిపై ఈగ వాలని పరిస్థితి నెలకొంది. మరి కలెక్టర్ వీరి విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
‘తుగ్లక్’ విధానం
అద్దంకి: సమాజంలో ఆదరణ కోల్పోయిన వారికి ఆసరా కల్పించాల్సిన కనీస ధర్మం ప్రభుత్వాలకుంది. కానీ పేదలంటే పాలకులకు లెక్కలేదు. వారి జీవితాలంటే గౌరవం లేదు. కాస్తో కూస్తో కాళ్లమీద నిలబడేందుకు ఉపయోగపడే సామాజిక పింఛన్ల వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నో వాగ్దానాలు చేసింది. అవి ఎలాగున్నా.. కనీసం ముందునుంచి వస్తున్న పద్ధతులను కూడా గాడిలో పెట్టలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరే పింఛన్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారితే.. మళ్లీ దానిలో వేలు పెట్టి కలగాపులగం చేస్తోంది. గజిబిజీ.. పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధానాలు మార్చడంతో లబ్ధిదారులు ముప్పతిప్పలు పడ్డారు. మొదట్లో పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో పంపిణీ జరిగేది. జనం దానికి అలవాటు పడేసమయానికి మళ్లీ మార్చి ఐకేపీ ఆధ్వర్యంలోని మండల సమాఖ్యలకు అప్పగించారు. వెంటనే ఫినో కంపెనీ ఏజెంట్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి నగదు అందించేవారు. దీనిని మళ్లీ మార్చి పోస్టాఫీసులకు బదలాయించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ విధానంలో మార్పు వచ్చింది. గ్రామాల్లోని పింఛనుదారుల ఖాతాలను పోస్టాఫీసుల్లోనే ఉంచుతూ.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులు మాత్రం ఐసీఐసీఐ బ్యాంకుల్లో తీసుకోవాలంటూ నిబంధనలు మార్చారు. దీంతో ఏం చేయాలో తెలియని పింఛనుదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలు ఎలా అందించాలో తెలియక కనపడినవారందరినీ అడుగుతున్నారు. ఓ ప్రహసనం పింఛను పొందాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ప్రభుత్వం తరఫున పింఛను కార్డులుంటేనే సరిపోదు. వివిధ సంస్థలకు పింఛను వ్యవహారాన్ని బదలాయించినప్పుడల్లా లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. ప్రతి సారీ వేలిముద్రలు ఇవ్వాలి. అలాగే రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ఫొటోస్టాట్ కాపీలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఆయా సంస్థలకు అందజేయాలి. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా బోలెడంత శ్రమ పడాలి. ఇచ్చే *200 కోసం పడరాని పాట్లు పడితే కానీ సకాలంలో అందవు. లబ్ధిదారునిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నా.. ప్రతి సారీ వివరాలు కావాలంటూ వేధించడంతో వికలాంగు లు, వృద్ధులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సీన్లోకి ఐసీఐసీఐ ప్రతినిధులు నూతన విధానం అమల్లోకి రావడంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియను నగర పంచాయతీ నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు అప్పగించారంటూ.. బ్యాంకు రిసోర్స్ పర్సన్లు అద్దంకి పట్టణంలో బుధవారం దండోరా వేయించారు. పింఛనుదారులను నగరపంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. యంత్రం సాయంతో వేలిముద్రలు తీసుకోవడం.. ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలను సేకరించడం మొదలు పెట్టారు. తప్పని పడిగాపులు అద్దంకి పట్టణంలోని 20 వార్డులుండగా.. 2,463 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ దారులున్నారు. వీరికి నెలకు * 7,74,900 నగదు చెల్లిస్తున్నారు. అయితే రీ ఎంట్రీ అని చెప్పగానే వీరంతా ఒక్కసారిగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ సిబ్బంది ఇద్దరే వివరాలు తీసుకోవడానికి రావడంతో వేలిముద్రలు సేకరించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో పింఛనుదారులంతా ఎండలో గంటల తరబడి వేచి చూశారు. వీరికి కనీస వసతులు కల్పించలేదు. నీడలేదు.. మంచినీరు అందించలేదు.. కనీసం క్యూలైన్లు కూడా పాటించలేదు. ఈ దెబ్బకు తొక్కిసలాట జరిగింది. కొంతమంది కింద పడిపోయారు. భరించలేని వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు ఉషారాణి, శిరీష మాట్లాడుతూ తమ సంస్థ పింఛనుదారుల వివరాలు రీ ఎంట్రీ చేయమని కోరినట్లు తెలిపారు. అందుకే అందరినీ పిలిపించామన్నారు. -
ఏడి‘పింఛన్’
సాక్షి, ఒంగోలు: ఏ దిక్కూ లేనివారికి కాస్తోకూస్తో ఆసరాగా ఉంటుందనుకున్న ప్రభుత్వ పింఛన్లపైనా ఆంక్షల పర్వం మొదలైంది. ప్రతీనెలా అందే పింఛన్ల కోసం ఎదురుచూసే పండుటాకులకు నిరాశే ఎదురవుతోంది. పంపిణీలో జరుగుతోన్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సంస్కరణలు మొదలుపెట్టామని చెబుతున్న అధికారులు..లబ్ధిదారుల ఇక్కట్లపై దయ చూపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్కరణలతో ఇక్కట్లు: పింఛన్ల పంపిణీని గతంలో ‘ఫినో’ సంస్థ చేపట్టేది. నెలవారీగా వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం కింద లబ్ధిదారులకు కూడా నెలకు రూ.200 పంపిణీ చేస్తున్నారు. అయితే, ఫినోసంస్థ చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చాలావరకు అవకతవకలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. దీంతో తాజాగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి.. బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల సమాచార సేకరణ పేరిట పింఛన్ల పంపిణీపై ఆంక్షలు విధించారు. చెల్లింపులను పూర్తిగా బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల ద్వారానే చేయాలని నిర్ణయించారు. ఈ విధానం నేపథ్యంలో జిల్లాలో వేలాదిమంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. మండే ఎండల్లో వృద్ధులు బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అలసిపోతున్నారు. ఇచ్చే అరాకొరా పింఛన్‌కు వందరకాల ఆంక్షలు పెడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 వేల మందికి పింఛన్ల నిలుపుదల జిల్లాలో సామాజిక పింఛన్లు అందుకునే వారు గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆంక్షలతో తిప్పలు పడుతున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల పింఛన్ల విడుదలలో జాప్యం జరిగింది. గత రెండు నెలలు ఎన్నికల నియమావళి అమలు కావడం, అధికారులంతా ఆ ఎన్నికల విధుల్లో బిజీగా మారడం..గవర్నర్ పాలన కొనసాగుతోన్న నేపథ్యంలో నిధుల విడుదలలో సమస్యలు తలెత్తాయి. నిధుల సర్దుబాటుకు సమయం పట్టడంతో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పింఛన్లు పంపిణీ చేయలేకపోయారు. జిల్లాలో మార్చినెలలో 3,09,514 మంది సామాజిక పింఛన్లు పొందారు. వీరిలో 2,92,514 మందికి పంపిణీ చేశారు. మరో 17 వేల మంది బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోలేదనే కార ణంతో పింఛన్లు అందివ్వలేదు. ఏప్రిల్, మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీలో భారీ కోత పడింది. సమస్యగా మారిన వేలిముద్రల సేకరణ గతంలో పింఛన్ల పంపిణీని ప్రత్యక్షంగా ‘ఫినో’ సంస్థ సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. అటువంటిది, తాజాగా బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టి లబ్ధిదారులు చేతివేలి ముద్రలను సేకరించి.. వ్యక్తిగత పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. అయితే, గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులకు బయోమెట్రిక్ పద్ధతిన సమాచార సేకరణపై అవగాహన లేకపోవడం.. పోస్టల్ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుల ద్వారా పింఛన్లిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పోస్టల్ కార్యాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పోస్టల్ కార్యాలయాలు అందుబాటులో లేని 198 ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్(సీఎస్పీ)లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రకరకాల కారణాల నేపథ్యంలో ప్రతీనెలా 15 వేల మంది నుంచి 17 వేల మంది వరకు పింఛన్లు అందుకోలేకపోతున్నారు. కొందరు చేతివేలి గుర్తులు స్పష్టంగా లేకపోవడం, వణుకుతున్న చేతులతో వృద్ధుల నుంచి సమాచారం సేకరణ సక్రమంగా కుదరక పింఛన్ల పంపిణీ కష్టమైందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మే నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పలు జాగ్రత్తలు చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేయగలమని డీఆర్డీఏ పీడీ ఎ.పద్మజ పేర్కొన్నారు. -
‘ఆసరా’తో ఆటలు
1,756 పింఛన్ల తొలగింపు.. 514 మంజూరు ఎన్నికల వేళ మార్పులుచేర్పులు 3,30,660 పింఛన్లకు బడ్జెట్ విడుదల కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులకు ‘ఆసరా’ దూరమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనూ మార్పులు చేర్పులు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మార్చి నెలకు సంబంధించి సామాజిక భద్రత పింఛన్లలో మరికొంత కోత పెట్టారు. ఫిబ్రవరి నెలలో 3,32,017 పింఛన్లు ఉండగా.. మార్చిలో 813 డెత్ కేసులు, 943 శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తొలగించారు. అయితే కొత్తగా 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పింఛన్ల మంజూరు విదాస్పదమవుతోంది. తొలగింపులు పోను.. కొత్త పింఛన్లతో కలిపి మార్చి నెలలో 3,30,660 పింఛన్లకు రూ.7,50,29,100 మొత్తాన్ని బుధవారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేశారు. తొలగించిన పింఛన్లు తక్కువే అయినా బడ్జెట్లో భారీగా కోతపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల 13,100.. మార్చి నెలలో 1,756 పింఛన్లను తొలగించారు. ఇదిలాఉండగా మార్చి 29, 30 తేదీల్లో విడుదల కావాల్సిన బడ్జెట్ నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పింఛన్ల పంపిణీ కూడా జాప్యం కానుంది.