Janhvi Kapoor
-
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
బెంగాలీ బ్యూటీలో ముస్తాబైన యాంకర్ అనసూయఒమన్ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న రష్మికహాట్ పోజులతో రెచ్చిగొట్టేస్తున్న జాన్వీ కపూర్చీరలో కిర్రెక్కిపోయే అందంతో కావ్య కల్యాణ్ రామ్పచ్చనిచెట్ల మధ్య తృప్తి దిమ్రి సోయగాల విందుఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుపమహాలీవుడ్ అందగత్తెలా కనిపిస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by ForeverNew India (@forevernew_india) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) -
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
లక్మే ఫ్యాషన్ వీక్ 2025లో అందమైన మోడల్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సందడి చేశారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్ట్రాప్‌లెస్, థై స్లిట్ బ్లాక్ గౌన్‌లో గ్లామర్ ట్రీట్ అందించిది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అదిరిపోయే డ్రెస్ ధరించి ర్యాంప్‌పై వయ్యారంగా వాక్ చేయడం అభిమానులు ఫిదా కావడం తెలిసిందే. అయితే తాజాగా జాన్వీ కపూర్ మించిన స్టైల్‌తో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోంది మరో మోడల్. ఎవరబ్బా? తెలుసుకుందాం ఈ కథనంలో..లక్మే ఫ్యాషన్ వీక్ 2025 (Lakme Fashion Week)లో జాన్వీ కపూర్ వెనుక నడిచిన మోడల్ తమన్నా కటోచ్ (Tamanna Katoch). ఆమె స్టైల్, ర్యాంప్ వ్యాక్ చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఇదే ఈవెంట్లో జాన్వీ కపూర్ గౌన్‌పై క్లాత్ తీసిన విధానంపై కొందరికి నచ్చలేదు. నడక, స్టైల్ స్టేట్మెంట్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. పైగా డబుల్ సైడెడ్ టేప్ బయటకు కనిపించిందంటూ కొందరు ట్రోల్ కూడా చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆమె వెనుకాలనే నడిచిన తమన్నా లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. తమన్నా కటోచ్ తన సూపర్ మోడల్ ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. షోస్టాపర్ జాన్వితో పోలిస్తే తమన్నానే షోస్టాపర్ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by TAMANNA KATOCH (@tamanna__katoch)బ్లాక్ హాల్టర్నెక్ గౌనులో మెరిసిసోతున్న వీడియోను తమన్నా కటోచ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన లుక్ కి మరింత అందంగా తెచ్చేలా టై-అప్ హీల్స్ ని ఎంచుకుంది. అలాగే స్మోకీ ఐషాడో మేకప్, టై-అప్ హెయిర్‌స్టైల్‌తో అదిరిపోయింది. ఈగ్లింప్స్ను విడుదల చేసిన వెంటనే, నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు. ‘‘జాన్వీని ఎవ్వరూ చూడలేదు.. నిన్నే చూశారు..’’, "లైన్ సెకండ్ సే షురు హోతీ హై" అని , "మీ నడకలో ఫైర్ ఉంది! అంటూ యూజర్ల కమెంట్లు వెల్లువెత్తాయి. -
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రామ్ చరణ్ RC16 'టైటిల్, ఫస్ట్ లుక్' విడుదల.. బుచ్చి బాబు మార్క్
రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో అదిరిపోయే మాస్ గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన మార్క్ చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్ రానుంది. అయితే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు . గేమ్‌ఛేంజర్ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ ఫుల్ జోష్ నింపుతుంది. ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నాం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025 -
రెడ్ చెర్రీలా జాన్వీ.. అవార్డ్ ఫంక్షన్ లో సమంత!
అవార్డ్ వచ్చిన వేళ.. పుల్ హ్యాపీగా సమంతరెడ్ కలర్ గౌనులో జిగేలుముంటున్న జాన్వీ కపూర్బ్లాక్ కలర్ తుమ్మెదలా కిక్కిస్తున్న తృప్తి దిమ్రిచీరలో ముద్దమందారంలో ముద్దుగా హనీరోజ్హాట్ నెస్ తో మెంటలెక్కిస్తున్న ప్రణీత సుభాష్సింపుల్ చీరలో చందమామలా హాట్ బ్యూటీ జ్యోతిరాయ్ఐస్ క్రీమ్ షాపువాడితో కీర్తి సురేశ్ ఫన్ గేమ్స్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) -
ప్రముఖ డిజైనర్ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ : రెడ్ డ్రెస్ లుక్ (ఫోటోలు)
-
అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ ఫాదర్‌తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్‌తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్‌ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
జాన్వీ కపూర్‌కు ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
దేవర సినిమాతో చుట్టమల్లే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ సినిమా విడుదలకుముందే రామ్‌చరణ్ (Ram Charan)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ #RC16 మూవీ నుంచి జాన్వీ బర్త్‌డే రోజు స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు. దక్షిణాది వంటకాలంటే ఇష్టంజాన్వీ ఉండేది ముంబైలో అయినా దక్షిణాది వంటకాలంటే తనకెంతో ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా తిరుపతికి వస్తుంది. అప్పుడు సౌత్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఉపాసన (Upasana Konidela) ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఆ బహుమతి మరేంటో కాదు.. అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను ఇచ్చింది. అసలే భోజనప్రియురాలైన జాన్వీ దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించింది జాన్వీ.ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే..దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనలో నుంచి పుట్టిందే అత్తమ్మాస్ కిచెన్. అప్పటికప్పుడు ఈజీగా ఇంటి భోజనం తయారయ్యేలా ఇన్స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) చదవండి: ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే -
రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?
'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. వెంటనే దాన్నుంచి బయటకొచ్చిన మెగా ఫ్యాన్స్.. చరణ్ (Ram Charan) కొత్త మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా RC16 కథ ఇదేనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 'ఉప్పెన' తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)స్పోర్ట్స్ డ్రామా స్టోరీ అని ఇదివరకే లీకైంది. ఇప్పుడు ఈ మూవీలో చరణ్.. అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ గేమ్ అయినా సరే ఎంతో కొంత డబ్బులిస్తే, వాళ్ల టీమ్ తరఫున ఆడతాడు. మరి నిజమా కాదా అనేది చూడాలి.కొన్నాళ్ల క్రితం మైసూరులో షూటింగ్ ప్రారంభం కాగా.. ఎక్కువగా రాత్రుళ్లు జరిగే సీన్స్ తీస్తున్నారు. రీసెంట్ గా క్రికెట్ సీన్స్ తెరకెక్కించారట. పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి లేవని, దీంత వీలైనంత త్వరగా పనిపూర్తి చేసుకుని ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి) -
రామ్ చరణ్ సినిమాలో ధోని.. నిజమెంత?
సినిమా వాళ్లతో క్రికెటర్లకి మంచి స్నేహబంధం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలతో క్రికెటర్లంతా టచ్‌లో ఉంటారు. యాడ్స్‌లో కలిసి నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ ప్లే చేస్తూ అలరిస్తున్నారు. అయితే మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించిన క్రికెటర్లు..ఇప్పుడు తెలుగు తెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతంది. ఆయన ఎవరో కాదు..తనదైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni).నిజమెంత?రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16 (RC 16) అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్‌కు ట్రైనర్‌గా ధోని కనిపించబోతున్నాడనే గాసిప్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ధోని ఈ చిత్రంలో నటించడం లేదు. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని రామ్ చరణ్ పీఆర్ టీమ్ పేర్కొంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
గ్లామరస్ జాన్వీ కపూర్.. చిన్నపిల్లలా మృణాల్ క్యూట్ నెస్!
హాయ్ నాన్న జ్ఞాపకాలు షేర్ చేసిన మృణాల్మెరుపుల డ్రస్సుతో కాక రేపుతున్న జాన్వీ కపూర్గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లిన నవదీప్-తేజస్వి మదివాడరంజాన్ సీజన్.. ఛార్మినార్ దగ్గర వితికా షేర్ సందడిచీరలో క్యూట్ నెస్ తో కట్టేపడేస్తున్న బిగ్ బాస్ దివిఎర్రచీరలో కలర్ ఫుల్ గా హీరోయిన్ చాందిని చౌదరిబ్లాక్ శారీలో బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ గ్లామర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
#RC16: జాన్వీ బర్త్‌డే స్పెషల్.. లుక్ అదిరిందిగా!
దివంగత నటి శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దేవర సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. తంగంగా తన మాటలు, యాక్టింగ్‌తో అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌చరణ్‌తో కలిసి #RC16 మూవీలో నటిస్తోంది. నేడు (మార్చి 6) జాన్వీ కపూర్ బర్త్‌డే. ఈ సందర్భంగా RC16 చిత్రబృందం జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో జాన్వీ గొర్రెలమంద ముందు నిల్చుంది. కుడిచేత్తో పొట్టేలు పిల్లను చేతిలో పెట్టుకుని మరో చేత్తో గడ్డిపోచలు పట్టుకుంది. ఈ పోస్టర్‌ను చరణ్ ట్విటర్లో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే జాన్వీ కపూర్. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ విజయాలను అందుకోవాలి అని ఆకాక్షించారు. జాన్వీ లుక్ చూసిన జనాలు బాగుందని కామెంట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు, చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్‌కుమార్ ముఖ్యపాత్రలో మెరవనున్నారు. Happy Birthday, #JanhviKapoor ! Excited for all that’s coming your way. Wishing you happiness and success always! pic.twitter.com/uGzmBnaBZI— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2025 చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్ రికార్డ్ -
Birthday special: జాన్వీ కపూర్ క్యూట్ ఫొటోస్
-
ఐదుగురు నాయికలతో..?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని భోగట్టా. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం జాన్వీ కపూర్ అని సమాచారం. మరి... వార్తల్లో ఉన్నట్లు అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ మూవీలో ఐదుగురు నాయికలు ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. -
జాన్వీతో రొమాన్స్ చేయడానికి స్టార్ హీరోలు సై..!
-
అల్లు అర్జున్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్గా చేస్తున్నారామె. ఈ యంగ్ బ్యూటీకి మరో సూపర్ చాన్స్ దక్కిందట. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్లో భాగంగా అల్లు అర్జున్ స్పెయిన్‌లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. -
ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే?
ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా మిసెస్ (Mrs). మలయాళంలో వచ్చిన 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా (The Great Indian Kitchen Movie)కి ఇది హిందీ రీమేక్. సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జీ5లో అందుబాటులో ఉంది. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌తో పాటు గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాగా మిసెస్ రికార్డు సృష్టించింది. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాగా మిసెస్పెళ్లి తర్వాత ఎంతోమంది అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో సన్యా.. రిచా పాత్రలో జీవించేసింది. ఇంతకుముందు కూడా ఆమె విభిన్నరకాల పాత్రలు పోషించింది. దంగల్, హిట్: ద పస్ట్ కేస్ (హిందీ), కాథల్, పాగ్లైట్ (Pagglait) వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఇంకా సెకండ్ హీరోయిన్ ఏంటి?'ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమవుతోంది. తొమ్మిదేళ్లకాలంలో ఆమె హీరోయిన్గా చేసిన రెండే రెండు సినిమాలు థియేటర్లో రిలీజయ్యాయి. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా చేస్తోంది. అందులో జాన్వీ (Janhvi Kapoor) ఫస్ట్ హీరోయిన్ అయితే సన్యా సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది' అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. జనాలకు ఏం కావాలో బాలీవుడ్ అస్సలు పట్టించుకోదు. జాన్వీ కంటే కూడా సన్యా చాలా గొప్ప నటి, పెద్ద సినిమాల్లో తనకు కథానాయికగా అవకాశాలివ్వొచ్చుగా అంటున్నారు. ఇలాంటివారు దొరకడమే అరుదు'దర్శకుల కంటికి ఈమె ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదు. తను నటించగలదు, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేయగలదు. ఈ జనరేషన్లో ఇలాంటి రెండు లక్షణాలున్నవారు దొరకడం చాలా అరుదు. పైగా తను ఎలాంటి జానర్లోనైనా ఇట్టే ఇమడగలదు', 'ఇప్పుడు ఇండస్ట్రీలో సన్యా ఉత్తమ నటి. కానీ తనకు మంచి అవకాశాలు రావడం లేదు' అని కామెంట్లు చేస్తున్నారు. మిసెస్ సినిమా విషయానికి వస్తే.. దీనికి అరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిశాంత్ దహియా, కన్వల్జిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Cinematic Syndicate (@cinematic.syndicate) చదవండి: తెలుగు సినిమా సెట్లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్ -
టాలీవుడ్ లో పాతుకపోతున్న జాన్వీ కపూర్
-
కోలీవుడ్ ఎంట్రీ?
కోలీవుడ్(Kollywood)లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎంట్రీ గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ జాన్వీ ఇప్పటివరకు తమిళంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని, ఓ తమిళ వెబ్ సిరీస్‌లో నటించేందుకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం.తమిళంలో ‘కబాలి, తంగలాన్’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు పా. రంజిత్ ఓ తమిళ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లోనే జాన్వీ లీడ్ రోల్ చేయనున్నారట. తమిళ దర్శకుడు ఏ. సర్గుణం ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది.సాధారణంగా పా. రంజిత్ డైరెక్షన్‌లోని సినిమాలైనా, నిర్మించే సినిమాల్లోనైనా, సమకాలీన అంశాల ప్రస్తావన ఉంటుంది. సో... జాన్వీతో రంజిత్ ఎలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయనున్నారన్న టాపిక్ చర్చనీయాంశమైంది. ఇక ఈ సిరీస్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారనే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పెళ్లి కూతురి చీరలో కీర్తి సురేశ్.. వజ్రంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
పెళ్లి కూతురి చీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్..క మూవీ హీరోయిన్ తన్వీరామ్ చిల్..ఇండియన్ ఆర్ట్ ఫెయిర్‌లో రానా సతీమణి మిహికా..బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హోయలు..వజ్రాల డ్రెస్‌లో ఒదిగిపోయిన్ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
వజ్రాల్లో ఒదిగిపోయిన దేవర భామ జాన్వీ కపూర్.. (ఫోటోలు)
-
ప్రకృతిని ఆస్వాదిస్తోన్న దేవర భామ.. నేపాల్‌లో శ్రియా శరణ్ చిల్!
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్..రాయ్‌పూర్‌లో డాకు మహారాజ్ భామ ఊర్వశి రౌతేలా..సమంత బ్లాక్ అండ్ వైట్ లుక్స్..బ్లాక్ డ్రెస్‌లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..ఫ్యామిలీతో నేపాల్‌లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
కందిపోయిన సుందరి
ఎండ తాకిడిని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గొంటున్నారు జాన్వీ కపూర్. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభమైంది. సిద్ధార్థ్, జాన్వీలతోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి లొకేషన్స్‌లో తీవ్రమైన ఎండ ప్రభావం కారణంగా తన చర్మం కందిపోయినట్లుగా సోషల్ మీడియాలో ‘బర్ట్ట్న్’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు జాన్వీ కపూర్. ఈ ఫోటోను బట్టి ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తీవ్రమైన ఎండ వేడిమిని కూడా తట్టుకుంటూ షూటింగ్లోపాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మా సుందరి కందిపోయిందన్నట్లుగా కొందరు నెటిజన్లు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, సౌత్ అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్‌లో నివసిస్తుంది. పాలి హిల్‌లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్‌తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్‌కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్‌లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం. ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్‌లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి. తన జుహు అపార్ట్‌మెంట్‌ని రాజ్‌కుమార్ రావ్‌కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.శ్రీదేవి పెయింటింగ్ అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి. పొడవైన చెక్క డైనింగ్ టేబుల్‌పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్‌వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది. -
చాలా సింపుల్‌గా ఆ గుడిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మూలాలు తమిళనాడులోనే అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో బాల తారగా నటించి అందరి మన్ననలను పొందిన శ్రీదేవి ఆ తర్వాత కథానాయకిగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించారు. అలాంటి శ్రీదేవి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మొదట హిందీలో కథానాయకిగా తెరంగేట్రం చేసిన ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపైన దృష్టి సారించారు. అలా ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మరిన్ని అవకాశాలు జాన్వీ కపూర్ వైపు చూస్తున్నాయి. అలా త్వరలోనే కోలీవుడ్‌లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తిరుపతి , తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి చాలా ఇష్టం. గతంలో తన అమ్మగారు శ్రీదేవి నిత్యం తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఈమె తిరుపతి నుంచి కాలినడకన 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇటీవల కొత్త ఏడాది ప్రారంభ సమయంలో కూడా జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే ఈమెకు ఎంతో ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా..? అని జాన్వీని ప్రశ్నించారు. తన వద్దకు పెళ్లి ప్రస్తావన రాగానే తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది. నిజంగా ఇదే జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె తెలిపింది. జాన్వీ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, జాన్వీ మాత్రం తిరుమలలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తనలోని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంది. -
కేరళలో చిల్ అవుతోన్న దేవర భామ (ఫోటోలు)
-
కేరళ కాలింగ్
కేరళ కాలింగ్ అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ ఇద్దరూ జంటగా హిందీలో ‘పరమ్ సుందరి’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తుషార్ జలోటా దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా నెల రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ కోసం సిద్ధార్థ్, జాన్వీ అండ్ టీమ్ కేరళ వెళ్లారని బాలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో మేజర్ టాకీ పార్ట్, యాక్షన్ సీక్వెన్స్, ఓ లవ్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.ఇక ఈ సినిమాలో నార్త్ అబ్బాయి పరమ్ పాత్రలో సిద్ధార్థ్, సౌత్ అమ్మాయి సుందరి పాత్రలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపిస్తారు. రెండు విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ అని బాలీవుడ్ టాక్. ‘పరమ్ సుందరి’ సినిమాను ఈ ఏడాది జూలై 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. -
జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్..? అసలు ట్విస్ట్ ఏంటంటే..
-
కిక్ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్‌ని విజృంభించి పంచే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్‌లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్‌ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్‌ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్‌కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్‌ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్‌కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్‌బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్‌ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్‌ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్‌గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్‌లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్‌లోని సెలబ్రిటీస్ లిస్ట్‌లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్‌తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్‌ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న బ్యూటీస్ విల్లే
-
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
ఆ హీరోయిన్‌తో సినిమా చేయను : ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ..సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతుంటాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకున్న అలవాటు. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. సినిమా విషయాల్లోనే కాదు పర్సనల్ విషయాల్లోనూ అలానే వ్యవహరిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదన్నాడు. దానికి గల కారణం ఏంటో కూడా వివరించాడు.శ్రీదేవి అంటేనే ఎక్కువ ఇష్టంరామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆమె మరణించినా.. తనపై ఆర్జీవీకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్న సందర్భం దొరికినా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితోనూ పోల్చలేం. ఆమె అందం, అభినయం ఎవరికి రాలేదన్నారు. ‘పదహారేళ్ళ వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్ననే విషయం మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి’ అని ఆర్జీవీ అన్నారు.జాన్వీతో సినిమా చేయనుశ్రీదేవి(sridevi) కూతురు జాన్వీ కపూర్‌తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకుల ఆర్జీవీ సమాధానం ఇస్తూ ఇప్పట్లో ఆ ఉద్దేశమే లేదన్నారు. శ్రీదేవిని జాన్వీతో పోల్చడం సరికాదన్నారు. శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఏ విషయంలోనైనా ఆమెతో పోల్చలేమని అన్నారు. ‘నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే జాన్వీతో కూడా కనెక్ట్ కాలేదు. ఈ జనరేషన్ వాళ్లకి జాన్వీనే గొప్పగా కనిపిస్తుందేమో. నాకు మాత్రం శ్రీదేవినే గొప్ప. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇప్పుడైతే జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు’ అని ఆర్జీవీ అన్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వీశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ధడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. గతేడాది విడుదలైన ‘దేవర’లో జాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటించబోతుంది. -
2024ని మంచి సినిమాతో ముగించాను: జాన్వీ కపూర్
‘‘అమరన్’ సినిమాని కాస్త ఆలస్యంగా చూశాను. అయితే 2024 సంవత్సరాన్ని ఇలాంటి ఒక అద్భుతమైన, ఒక మంచి సినిమా చూసి ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జోడీగా నటించిన ద్విభాషా చిత్రం (తమిళ్, తెలుగు) ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా 2024 అక్టోబరు 31న విడుదలైంది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ చిత్రంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా జాన్వీ కపూర్ కూడా ‘అమరన్’ మూవీపై తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ‘‘అమరన్’ సినిమాని నేను చూడడం ఆలస్యమైంది. కానీ, ఎంతో అద్భుతమైన సినిమా. ప్రతి సన్నివేశం చాలా భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్ మూవీ. ఈ చిత్రం నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయాన్ని బరువెక్కించాయి. ఓ ప్రేక్షకురాలిగా 2024ని ఇలాంటి ఒక మంచి సినిమాతో ముగించడం సంతోషంగా ఉంది’’ అని పోస్ట్ చేశారామె. కాగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా నటిస్తున్నారు. -
క్రిస్మస్ వేడుకల్లో ఓరీ - స్పెషల్ అట్రాక్షన్‌గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
బార్బీ డ్రెస్‌లో జాన్వీ కపూర్.. క్రిస్మస్ స్పెషల్ పిక్స్ వైరల్
-
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జిమ్‌లో సెల్ఫీతో నభా నటేశ్.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
వేకేషన్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ..జిమ్‌లో నభా నటేశ్ సెల్ఫీ కసరత్తులు..బంగారంలా మెరిసిపోతున్న అక్కినేనివారి కోడలు శోభిత..మరింత హాట్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా లుక్స్..దుబాయ్‌లో ప్రియమణి ఫోటోషూట్..మతిపొగొట్టే అవుట్‌ఫిట్‌లో దేవర భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా
ఓటీటీలో 'మీర్జాపుర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఉన్నవి బూతులే కానీ ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా మున్నా భయ్యా అనే క్యారెక్టర్‌కి బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాలో నటించేస్తున్నాడు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'గేమ్ ఛేంజర్' మూవీని రెడీ చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'RC16' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మైసూరులో మొదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పాత్ర అని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. మున్నా భయ్యా చరణ్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చరణ్-బుచ్చిబాబు మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. బహుశా వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Our favourite 'Munna Bhayya' will light up the big screens in a spectacular role tailor made for him ❤️🔥Team #RC16 welcomes the incredibly talented and the compelling performer @divyenndu on board ✨#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor… pic.twitter.com/Q4I8w9Vqhh— Vriddhi Cinemas (@vriddhicinemas) November 30, 2024 -
కట్టూబొట్టుతో అలనాటి అందాల తారలా దేవర బ్యూటీ (ఫోటోలు)
-
పెయింటింగ్‌తో దేవర భామ.. గోవాలో బిజీగా ఊర్వశి రౌతేలా!
జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రాపెయింటింగ్తో దేవర భామ జాన్వీ కపూర్...గోవాలో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ కావ్యథాపర్..తన ఫ్రెండ్స్‌తో లైగర్ భామ అనన్యపాండే చిల్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
దే..వుడా!
జాన్వీ కపూర్ స్నేహితురాలికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్ బీఎఫ్‌ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్లో వింటర్ జాకెట్‌తో బ్యాక్ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందట.. విత్ మై బాయ్‌ఫ్రెండ్ ఇన్ స్విట్జర్లండ్ అనే రైటప్‌తో! ఆ పోస్ట్ చూసి ‘అబ్బా.. తన ఎక్స్‌కి స్విట్జర్లండ్ తీసుకెళ్లే రిచ్ బాయ్‌ఫ్రెండ్ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్‌ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట. -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
దమ్మున్న హీరోకే 'దేవర' సాధ్యం.. ఆ ఒక్కటి చేసుంటేనా..: పరుచూరి
దేవరతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాపై రివ్యూ ఇచ్చారు.దమ్మున్న హీరోఆయన తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. 'సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే! సంగీతం మరీ అంత గొప్పగా లేదు. డిఫరెంట్ టాక్ వచ్చినా కూడా సినిమా విజయవంతంగా ఆడాలంటే అక్కడ దమ్మున్న హీరో ఉండాలి. అలాంటివారిలో మా చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) ఒకడు. సముద్రపు దొంగ మంచివాడిగా ఎలా మారాడన్నదే కథ. కథ చిన్నదే..ఇంత చిన్న పాయింట్‌పై ఆధారపడి మూడుగంటల నిడివితో సినిమా తీయడమనేది జోక్ కాదు. ఎక్కువ సన్నివేశాలు సముద్రానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయంలో కొరటాల శివ 'స్క్రీన్‌ప్లే మాస్టర్' అనిపించుకున్నాడు. ఈ కథ తారక్‌కు సెట్ కాదేమోననుకున్నా.. కానీ డైరెక్టర్.. ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా మూవీ తీసి వసూళ్లు రాబట్టాడు. అలా చేసుంటేనా..!ఇదే కథ హాలీవుడ్లో తీస్తే సూపర్ అంటారు. కథ గొప్పగా లేకపోయినా కథనం బాగుంటే సినిమాలు ఆడతాయనడానికి దేవర ప్రత్యక్ష ఉదాహరణ. ట్విస్టులు బాగున్నాయి. జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్‌కు రొమాంటిక్ సీన్లు, వినోదాత్మక సన్నివేశాలు పెట్టుంటే రూ.1000 కోట్లు ఈజీగా దాటేసేది. తారక్ నటన సహజంగా ఉంది' అని పేర్కొన్నారు.చదవండి: తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్.. మరి తేజ సంగతి? -
నెట్ చీరలో అందాల వల వేస్తున్న జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు
మొన్నీమధ్య 'దేవర' మూవీతో హిట్ కొట్టిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త మూవీ కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోషూట్.. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నడుస్తోంది. ఎలానూ సిటీలోకి వచ్చాను కదా అని గుళ్లకు వెళ్లి పూజలు చేసేస్తోంది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)తాజాగా గురువారం.. అమీర్‌పేట్ దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఈమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ వచ్చిందని తెలిసి, గుడి దగ్గరకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.జాన్వీ కపూర్ సినిమాలు చేస్తున్నప్పటికీ దైవ భక్తి మాత్రం ఎక్కువే. ఎప్పుడు వీలు దొరికినా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)అమీర్ పేట్ - వెంగళరావు నగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్. pic.twitter.com/r8AQQKUDqn— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024 -
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దావూదీ అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ పాటలో హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దావూదీ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. -
అనసూయ మాస్ డ్యాన్స్.. మీనాక్షి సోయగాల వల!
డ్యాన్స్ ఇరగదీసిన యాంకర్ అనసూయమోడ్రన్ డ్రస్సులో కేక పుట్టించేలా శ్రీలీలటైట్ ఔట్ఫిట్లో మీనాక్షి చౌదరి వయ్యారాలుహల్దీ వేడుకల్లో హిందీ నటి సురభి జ్యోతిట్రెడిషనల్ చీరలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్చిట్టి గౌనులో సెగలు రేపుతున్న 'పొలిమేర' నటిమామిడిపండు పులుపు దెబ్బకు అమలాపాల్ ఫన్నీ View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by VDeviyaniSharma (@vdeviyanisharma) View this post on Instagram A post shared by Sanchita Shetty (@isanchitaa) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Priya Banerjee (@priyabanerjee) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) -
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో బ్లాక్‌బస్టర్ అయిన సాంగ్స్‌లో చుట్టమల్లే పాట ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటకు థియేటర్లు సైతం ఊ కొడుతూ ఊగిపోయాయి. అంతలా యూత్‌ను పిచ్చెక్కించిన ఈ పాట ఫుల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.ఈ పాటలో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించాడు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. దేవర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
మెరుపుల చీర.. మెడలో నెక్లెస్.. జాన్వీ అందాల జాతర! (ఫొటోలు)
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
'చుట్టమల్లే' పాటకు విదేశీ మహిళ క్యూట్ స్టెప్పులు
'దేవర' సినిమా అనగానే బ్లాక్‌బస్టర్ అయిన పాటలే గుర్తొస్తాయి. ఫియర్, చుట్టమల్లే, ఆయుధ పూజ.. ఇలా ఒకటేమిటి దేనికదే సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగిస్తున్న ఈ కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో? ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలా 'దేవర' పాటలు దేశాలు దాటిపోయాయి.(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)'దేవర' మూవీలో చాలామందికి నచ్చిన సాంగ్ అంటే 'చుట్టమల్లే' అని అంటారు. ఈ పాటలో జాన్వీ గ్లామర్ చూస్తే.. ఎవరైనా సరే చూపు తిప్పుకోకుండా ఉండలేరేమో! అంత అందంగా కనిపిస్తుంది. వింటే ఎంతగా నచ్చిందో.. థియేటర్లో చూస్తే అంతకు మించి జనాలకు నచ్చేసింది. ఇప్పడీ పాటకు విదేశీ మహిళ.. సేమ్ స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైన 'దేవర' చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మెల్లమెల్లగా కుదురుకుంది. ప్రస్తుతం రూ.500 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. వీకెండ్ పూర్తయితే పోస్టర్ రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన)Indians have the dance rizz. Russian & Indians fit in quite well. pic.twitter.com/L7EybV6z8I— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) October 11, 2024 -
అనుకున్నంత ఈజీ కాదు.. దేవర బ్యూటీపై అనన్య ప్రశంసలు
దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ కమర్షియల్ సినిమాలో జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై హీరోయిన్ అనన్య పాండే స్పందించింది. తన లేటెస్ట్ మూవీ కంట్రోల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర మూవీ గురించి మాట్లాడింది.అంత ఈజీ కాదుకమర్షియల్ సినిమాల్లో నటించడం చాలా ఈజీ అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అది నిజం కాదు. అలాంటి చిత్రాల్లో నటించడమనేది ఒక కళ. దేవరలో జాన్వీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పాటల్లో తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆమె ఎనర్జీ గురించి మాటల్లో చెప్పలేం అని మెచ్చుకుంది.ఆ కోణంలో ఆలోచిస్తా..ఇంకా మాట్లాడుతూ.. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలనుంది. స్క్రిప్ట్ చదివేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో నుంచే ఆలోచిస్తాను. దీన్ని జనాలు ఆదరిస్తారు అనిపించిన కథల్ని వెంటనే ఓకే చేసేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనన్య నటించిన కంట్రోల్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్! -
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ జిగేలు.. బచ్చన్ బ్యూటీ చాన్నాళ్ల తర్వాత
మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ మౌనీ రాయ్జిగేలు మనిపిస్తున్న 'దేవర' హీరోయిన్ జాన్వీ కపూర్చాన్నాళ్ల తర్వాత మళ్లీ కనిపించిన 'మిస్టర్ బచ్చన్' భాగ్యశ్రీజిమ్నాస్టిక్స్ చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్ నేహాశర్మబ్లాక్ డ్రస్సులో క్యూట్ అండ్ స్వీట్‌గా మీనామెట్లు ఎక్కి తిరుపతి వెళ్తున్న బిగ్‌బాస్ నయని పావనిభర్తతో కలిసి ఆటోలో షికార్లు చేస్తున్న తమిళ నటి ప్రియ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shwetha Srivatsav (@shwethasrivatsav) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Mimi chakraborty (@mimichakraborty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
'దేవర'లో జాన్వీ ఫ్రెండ్‌గా తెలుగమ్మాయి బిందు భార్గవి (ఫొటోలు)
-
Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ అందాలు నెక్స్ట్ లెవల్ (ఫోటోలు)
-
అఫీషియల్.. 'దేవర' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది గానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట దేవరోడి బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తొలిరోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. సోలోగా వచ్చిన తారక్.. రూ.150 కోట్ల మార్క్ తొలిరోజే దాటేశాడు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఓవర్సీస్లో రిలీజ్‌కి ముందే దాదాపు రెండున్నర మిలియన్ల వసూళ్లని అందుకున్న దేవర.. తొలిరోజు ముగిసేసరికి 3.8 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక నైజాంలో 'దేవర'కు తొలిరోజు రూ.20 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ఘనంగా ప్రకటించకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.400 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG— Devara (@DevaraMovie) September 28, 2024 -
జాన్వీకి రెండుసార్లు ఫుడ్ పంపించా.. కానీ: ఎన్టీఆర్
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొన్నటివరకు ప్రమోషన్స్ చేసి తెగ అలసిపోయారు. దాదాపు ఇంటర్వ్యూలన్నీ ఇప్పటికే ప్రసారం అయిపోగా.. 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా శనివారం సాయంత్రం 8 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఈ షోలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ప్రోమోనే ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా సాగింది. ఎపిసోడ్ వేరే రేంజులో ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. ఇకపోతే ప్రోమోలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చూపించారు. 'దేవర' షూటింగ్ కోసం జాన్వీ హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ రెండుసార్లు ఫుడ్ పంపించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టాడు.కానీ జాన్వీ కపూర్ మాత్రం తనకు తానుగా ఫుడ్ వండుకునేదని, నాకు మాత్రం కొంచెమైనా పెట్టేది కాదని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో జాన్వీ నవ్వేసింది. అలానే 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీన్లో తాను నిజమైన జంతువులు ఉన్న ట్రక్‌లో చాలా సేపు ఉన్నానని జనాలు అనుకుంటున్నారని, అది గ్రాఫిక్స్ అని చెప్పినా సరే నమ్మట్లేదని తారక్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు. ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.'దేవర' చూసిన తర్వాత సందేహాలుసినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? 'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) -
'దేవర' థియేటర్లలో.. జాన్వీ మరో సినిమా ఓటీటీలో
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో ఇప్పటికే పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా బ్రేక్ రాలేదు. 'దేవర'తో తెలుగులోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇదే టైంలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)హిందీలో జాన్వీ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఉలాజ్'. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో జాన్వీ.. డిప్యూటీ హై కమీషనర్ పాత్ర చేసింది. ఈమెతో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ థ్రిల్ చేస్తాయి.'ఉలాజ్' విషయానికొస్తే ఖాట్మాండులో ఉండే సుహానా భాటియా (జాన్వీ కపూర్) ఓ కుర్రాడిని ప్రేమిస్తుంది. కానీ అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. కొన్నాళ్లకు లండన్‌లో భారత హై కమిషనర్‌గా ఉద్యోగం తెచ్చుకుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఈమె జీవితంలోకి నకుల్ అనే యువకుడు వస్తాడు. దీంతో చాలా మార్పులు జరుగుతాయి. వాటి వల్ల సుహానా సమస్యల్లో పడుతుంది. వీటి నుంచి ఎలా బయటపడిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?
'దేవర' థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే 'దేవర'కి బడ్జెట్ ఎంత? రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా 'దేవర'. గతంలో తారక్‌తో 'జనతా గ్యారేజ్' తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.పారితోషికాల విషయానికొస్తే 'దేవర'లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన జాన్వీ రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న దేవర బ్యూటీ..జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్‌పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్‌గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.టిఫిన్ దగ్గర గొడవదేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్‌లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్‌లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది. -
చిరంజీవి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు : కొరటాల
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?ఎన్టీఆర్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్‌గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్‌కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాం.దేవర కంటే ముందు అల్లు అర్జున్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.జాన్వీ కపూర్ గురించి?శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి గల కారణం?ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.సైప్ అలీఖాన్ గురించి?నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్కే దాదాపు గంట సమయం పట్టేది.సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా. -
Janhvi Kapoor : నాపై ప్రేమను చూపిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు..
-
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
'దేవర' కోసం జాన్వీ ఇలా ముస్తాబు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు (ఫొటోలు)
-
'దేవర' కోసం జాన్వీ.. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దేవర' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పాటల్లో ఈమె గ్రేస్ చూసి చాలామంది ఫిదా అయిపోతున్నారు. మూవీలో ఎలా కనిపించబోతుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈమె కూడా సిద్ధమైంది. నీలం రంగు చీరలో అందాలన్నీ కనిపించేలా ముస్తాబైంది. కానీ ఈవెంట్ కాస్త రద్దవడంతో అభిమానుల గురించి ఓ వీడియో పోస్ట్ చేసింది. స్టేజీపై మాట్లాడటం కోసం ప్రిపేర్ అయింది కాస్త ఇప్పుడు వీడియోలో చెప్పేసింది.(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)జాన్వీ ఏం చెప్పిందంటే?'అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా''నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నాకు చాలా సహాయపడిన చిత్రబృందానికి థ్యాంక్స్' అని వీడియోలో జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడింది.(ఇదీ చదవండి: మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్)ఇక ఈ వీడియోకి 'నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నా. ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్' అని జాన్వీ రాసుకొచ్చింది.సెప్టెంబరు 27న 'దేవర' మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రెండు ట్రైలర్స్ రిలీజ్ కాగా.. మిశ్రమ స్పందన వచ్చింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం 'దేవర'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. 'ఆచార్య'తో దెబ్బ తిన్న కొరటాల.. 'దేవర'తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అలానే అనిరుధ్ మ్యూజిక్‌పైనా అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదల) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
దేవకన్యలా దేవర బ్యూటీ, అమ్మను తలపించేలా! (ఫొటొలు)
-
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్‌కి మరో ఆరురోజులే ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇస్తున్నారు. మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. వీటన్నింటితో పాటు 'దేవర' టీమ్ మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)కొన్నిరోజుల క్రితం 'దేవర' ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి. ఇందుకు తగ్గట్లే ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ రెడీ చేశారని, దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు 'ఆయుధ పూజ' సాంగ్ కూడా ఈ పాటికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. బహుశా థియేటర్లలో చూసి థ్రిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారేమో. ఇకపోతే 'దేవర'లో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా కొరటాల దర్శకుడు. సెప్టెంబరు 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
#Devara : ఎన్టీఆర్ 'దేవర'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరినీ పలకరించినా దేవర పేరే వినిపిస్తోంది. మరో పది రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం దేవర. ఇందులో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీటీమ్ చిట్ చాట్ నిర్వహించింది.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించారు. జాన్వీ నటన, హావభావాలు అచ్చం శ్రీదేవిలాగే ఉన్నాయని ఎన్టీఆర్ కొనియాడారు. తనకు తాను నటన ప్రదర్శించుకున్న తీరు శ్రీదేవిని గుర్తు చేసిందని అన్నారు.(ఇది చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఒక ఫోటోషూట్ కోసం లుక్ టెస్ట్ చేశాం. అక్కడే జాన్వీ పడవలో కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. ఆ ఫోటో చూడగానే అచ్చం శ్రీదేవిలా కనిపించింది. తను కేవలం కెమెరాలో కొంత భాగాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన విధానం, స్మైల్ మళ్లీ క్యాప్చర్ చేయగలరని నేను అనుకోను. అవీ చూడగానే శ్రీదేవి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చాయి' అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. జాన్వీ స్పందిస్తూ.. తెలుగులో నటించడం తనకు సొంత ఇంటిలా అనిపించిందని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?
ప్రస్తుతం టాలీవుడ్లో 'దేవర' గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి అద్భుతమైన పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా. అందున తెలుగు కంటే హిందీలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతోంది. ఇది గనక నిజమైతే అభిమానులకు బ్యాడ్ న్యూసే.(ఇదీ చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతిపై సందేహాలు)వారం క్రితం ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ రిలీజైంది. మిశ్రమ స్పందన వచ్చింది. అంతకు ముందు రిలీజ్ చేసిన మూడు పాటల్ని కూడా తొలుత కాపీ ట్యూన్స్ అని ట్రోల్ చేశారు. కొన్నిరోజులకే అవే పాటల్ని రిపీట్స్‌లో వింటున్నారు. వీటిలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టిన 'దావుదీ' అనే సాంగ్ కూడా ఉంది.సినిమాలో సిట్చూయేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డ్యాన్స్ చూడటం కష్టమే. ఎందుకంటే 'చుట్టమల్లే' పాటలోనూ తారక్ డ్యాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డ్యాన్స్ ఉండదు. మరి సినిమాలో 'దావుదీ' ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?) -
జాన్వీ కపూర్‌ను చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర పార్ట్1 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీతో దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమవుతోంది. తెలుగులో ఇది తనకు తొలి సినిమానే అయినప్పటికీ జాన్వీ ఇక్కడి భాష బాగానే మాట్లాడుతోందంటున్నాడు తారక్.జాన్వీని చూసి షాకయ్యాతాజాగా దేవర టీమ్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా తారక్.. జాన్వీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయానంటున్నాడు. అతడు మాట్లాడుతూ.. జాన్వీ తెలుగు మాట్లాడటం చూసి షాకయ్యాను. బాంబేలో పెరిగిన ఆమెకు ఇక్కడి భాష ఎలా వస్తుంది? సౌత్‌లో తన మూలాలు ఉన్నప్పటికీ అంత స్పష్టంగా తెలుగు మాట్లాడటం కష్టమే కదా! సంతోషపడిపోయిన జాన్వీకానీ తను మాత్రం అదరగొట్టేసింది. ఒక సీన్లో తన నటన చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు కొరటాల కూడా నా రియాక్షన్ ఎలా ఉందా? అని నన్నే చూస్తున్నాడు' అని తెలిపాడు. ఈ మాటలు విని సంతోషపడిపోయిన జాన్వీ.. 'మీ మాటలతో నా కడుపు నిండిపోయింది. ఇక ఇంటర్వ్యూ అయిపోయాక నేను దేని గురించీ టెన్షన్ పడనవరసం లేదనుకుంటా'నని సరదాగా మాట్లాడింది. ఇకపోతే దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది.చదవండి: సైమా అవార్డ్స్‌లో నాని చిత్రాల హవా.. ఉత్తమ చిత్రం ఏదంటే..? -
దేవర రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ‘దేవర:పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రం గ్రాండ్ ప్రీమియర్ షోను ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు హాలీవుడ్లో ప్రదర్శించనున్నారు. ‘‘హాలీవుడ్లో బియాండ్ ఫెస్ట్ అనేది ఘనమైన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
Janhvi Kapoor: చీరలో అదిరిపోయిన దేవర బ్యూటీ (ఫోటోలు)
-
ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
దేవర మూడో సాంగ్: స్టెప్పులతో అదరగొట్టిన తారక్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే దేవర నుంచి రిలీజైన రెండు పాటలు ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తారక్- జాన్వీ కపూర్ల జోడీని చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. మూడో పాట..తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. దావూదీ.. అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు. ఏ భాషలో ఎవరు పాడారంటే?పాడిన వారి విషయానికి వస్తే నకష్ అజీజ్, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాడారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. ‘దేవర: పార్ట్ 1’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
తారక్, చరణ్ పైనే జాన్వీ ఆశలు..
-
హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని
శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా 'దేవర' నుంచి ఈమె సాంగ్ ఒకటి విడుదలై తెగ వైరల్ అయిపోయింది. దీంతో అప్పుడప్పుడు ఫ్యాన్స్ జాన్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.(ఇదీ చదవండి: కనీసం మర్యాద కూడా ఇవ్వరు.. ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతారు: సంగీత)సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రక్షా బంధన్ (రాఖీ) పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే జాన్వీ కపూర్ తాజాగా షూటింగ్ కోసం ఓ స్టూడియోకి వెళ్తుండగా.. ఓ అభిమాని వచ్చి రాఖీ కట్టమని రిక్వెస్ట్ చేశాడు. దీంతో జాన్వీ అతడు అడిగింది చేసింది.ఇదంతా బాగానే ఉంది కానీ రాఖీ కట్టిన తర్వాత సదరు అభిమాని.. జాన్వీ కపూర్‌కే డబ్బులివ్వబోయాడు. ఆమె నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అక్కడున్న వాళ్లందరూ నవ్వుకున్నారు. రాఖీ కట్టడం సంగతి అటుంచితే ఈ డబ్బులివ్వబోయిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)Janhvi Kapoor Gracefully Declines Shagun from a Paparazzo, Keeping it Sweet and Humble!#buzzzooka_events #janhvikapoor #bollywood #celebrity #trendingreels #reelsinstagram pic.twitter.com/SFhNIfDlPT— Buzzzooka Events (@BuzzzookaEvents) August 20, 2024 -
'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌లో ఐరన్ థ్రోన్ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.జాన్వీ కపూర్‌తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో సరికొత్త లుక్‌తో జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్
'దేవర' సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్న జాన్వీ కపూర్‌కి తిరుపతి వేంకటేశ్వర స్వామి చాలా సెంటిమెంట్. ఎప్పటికప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా మరోసారి స్వామి వారిని దర్శించుకుంది. కాకపోతే మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంది.(ఇదీ చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. రేర్ ఫొటోలు)ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో తల్లి శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. ఇందులో తల్లితో చిన్నప్పటి ఫొటోని, మెట్ల దారిలో తాను దిగిన ఓ ఫొటోని జాన్వీ షేర్ చేసింది.హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే!(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)Our Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today 💛🤩. #Chuttamalle pic.twitter.com/FMQ5tkHcGq— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 13, 2024 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఆయుధ పూజ ఆరంభం
హీరో ఎన్టీఆర్ ఆయుధ పూజ చేస్తున్నారు. అయితే ఈ పూజ ‘దేవర’ కోసం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరు«ధ్ సంగీతదర్శకుడు. కాగా ఈ సినిమాలో ఆయుధ పూజ నేపథ్యంలో సాగే ఓ పాట ఉందట. ప్రస్తుతం ఈ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ఎన్టీఆర్, ఇతర తారాగణంపై రాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారని టాక్. పతాక సన్నివేశాలకు ముందు ఈ పాట వస్తుందట. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. -
దేవర కు కలిసోస్తున్న కాపీ ట్యూన్స్.. త్వరలో మూడో సింగల్ రిలీజ్...
-
'దేవర' సాంగ్ కాపీపై కామెంట్ చేసిన ఒరిజినల్ కంపోజర్
'దేవర' సినిమా నుంచి రీసెంట్గా రెండో సాంగ్ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్ క్రియేట్ చేశారని చర్చ జరుగుతుంది.ఈ వివాదంపై చమత్ సంగీత్ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!
కొన్నిసార్లు అంతే! అందుబాటులో ఉన్నాసరే సరిగా వినియోగించుకోవడం తెలియాలి. ఎవరో వచ్చి తాము చేయలేనిది చేస్తే అప్పుడు అర్థమవుతోంది. హిందీ దర్శకనిర్మాతల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందేమో! ఎందుకంటే బాలీవుడ్ చేయలేని ఓ పని.. ఇప్పుడు 'దేవర' చేసి చూపించాడు. ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పామా ఈపాటికే మీకు అర్థమై ఉంటుందనుకుంటా! హీరోయిన్ జాన్వీ కపూర్ గురించే ఇదంతా!(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హోస్టింగ్ నుంచి తప్పుకొన్న కమల్.. కారణమదే)అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఆరేళ్లు అయిపోయింది గానీ ఇప్పటివరకు సరైన హిట్ ఒక్కటీ లేదు. పోనీ గ్లామర్ పరంగా అయినా బాలీవుడ్ ఉపయోగించుకుందా అంటే అదీ లేదు. జాన్వీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పెద్దగా గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఇప్పుడదే 'దేవర' చేసి చూపించాడు.జాన్వీ కపూర్ అందాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటివరకు బాలీవుడ్లో ఒక్కరు కూడా 'దేవర' పాటలో ఉన్నంత అందంగా ఈమెని చూపించలేకపోయారు. ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి గానీ జాన్వీని మాత్రం ఎవరేం అనట్లేదు. యూట్యూబ్‌లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే.. థియేటర్లలో ఈ పాట చూసిన తర్వాత జాన్వీకి ఇంకెంత మంది ఫ్యాన్స్ అయిపోతారో?(ఇదీ చదవండి: 'దేవర' విలన్‌కి అరుదైన వ్యాధి.. అదేంటంటే?) -
జిమ్‌లో జాన్వీ కపూర్.. కొడుకుతో అనసూయ ఫన్నీ వీడియో
జిమ్‌లో తెగ కష్టపడుతున్న 'దేవర' జాన్వీ కపూర్పల్చటి సింగిల్ పీస్ డ్రస్‌లో శివాని రాజశేఖర్చిట్టి పొట్టి బట్టల్లో సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్దేవకన్యలా మెరిసిపోతున్న నభా నటేశ్యూరప్లో చిల్ అవుతున్న టిల్లు బ్యూటీ నేహాశెట్టితిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్
రీసెంట్గా రిలీజైన 'దేవర' రెండో పాటపై మిక్స్డ్ టాక్ వచ్చింది. సూపర్ అదిరిపోయిందని కానీ బాగాలేదని కానీ అనట్లేదు. అదే టైంలో ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో పోలుస్తున్నారు. రెండింటి ట్యూన్స్ చాలా దగ్గరగా ఉన్నాయని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడిది కాస్త నిర్మాత నాగవంశీ వరకు చేరింది. పాటపై వస్తున్న ట్రోల్స్ గురించి పాటలో తారక్-జాన్వీ కెమిస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: ఓయో రూమ్‌లో తెలుగు డైరెక్టర్ ఆత్మహత్య)'గత 24 గంటల నుచి 'చుట్టమల్లే' సాంగ్ లూప్‌లో ఉంది. హౌ ఈజ్ ద జోష్ బాయ్స్? తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. జాన్వీని చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి కదా బాయ్స్' అని నాగవంశీ ట్వీట్ చేశారు.'దేవర' నైజాం హక్కుల్ని సితార నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగవంశీ.. 'దేవర' కంటెంట్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ట్వీట్స్ వేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. ఇకపోతే ఈ సినిమా.. సెప్టెంబరు 27న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రెండు పాటలు మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ వస్తుందోనని ఫ్యాన్స్ వెయిటింగ్.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))<br>Powered by <a href="https://youtubeembedcode.com">embed youtube video html</a> and <a href="https://starburstnotongamstop.org/">starburst not on gamstop</a> -
ఎన్టీఆర్ ‘దేవర’ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పారావు ఆలపించారు. కాగా.. ఇప్పటికే దేవర నుంచి ఫియర్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
పీకల్లోతు కష్టాల్లో జాన్వీ.. టాలీవుడ్ పైనే ఆశలు
-
OTT: ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ అండ్ మిసెస్ మహినటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులుదర్శకత్వం: శరణ్ శర్మ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామిఎడిటింగ్: నితిన్ బైదిఓటిటి వేదిక: నెట్ ఫ్లిక్స్స్ఫూర్తి అన్నది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ స్ఫూర్తికి సిద్దాంతం, వేదాంతం ఉండవు. తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకుని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి. అ కోవకు చెందినే ఈ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ. కథ మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ అని చెప్తున్నా ఈ సినిమాలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కాని సినిమా పేరు తో పాటు ధోనీ పుట్టిన రాష్ట్రంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఒక విధంగా ఇదొక మామూలు కథ. క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఓ సంఘటన వల్ల అదే క్రికెట్ కి దూరమవుతాడు. తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్ గా మారతాడు. ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో ఎన్నెన్నో. అది కూడా మగవాళ్ళైతే కొంత వరకు పరవాలేదు. కాని ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు. మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో ఈ పాయింట్ చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిబడేసేలా రాసుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ. ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావ్ మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ.- ఇంటూరు హరికృష్ణ -
ఫుడ్ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్
తెలుగు ఇండస్ట్రీలో ఫుడీ అనగానే ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లకు ఫుడ్ ట్రీట్ ఇస్తాడు. అంటే షూటింగ్ జరుగుతునన్ని రోజులు సౌత్ ఇండియాలో దొరికే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్‌ని పంపిస్తాడు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, దీపికా పదుకొణె లాంటి స్టార్స్.. ప్రభాస్ ఇచ్చే ఫుడ్ గురించి చెబుతూ తమ ఆనందాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో డార్లింగ్‌ని ఫాలో అయిపోతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉన్నాడు. తొలి భాగానికి సంబంధించి చివర దశ షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాల్ని తీస్తున్నారు. ఇకపోతే షూటింగ్లో పాల్గొంటున్న జాన్వీ.. ఆతిథ్యం విషయంలో ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తారక్ అలాంటి ఫుడ్ అరేంజ్ చేస్తున్నట్లు ఉన్నాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో 'దేవర' షూటింగ్ అంటే తనకు ఇందుకే ఇష్టమని చెబుతూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పిక్ పోస్ట్ చేసింది.ఇన్నిరోజులు ఫుడ్ విషయంలో ప్రభాస్ మాత్రమే అనుకున్నాం. కానీ ఇకపై ఎన్టీఆర్ కూడా కో యాక్టర్స్‌కి పసందైన ఫుడ్ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడేమో! ఇదిలా ఉండగా 'దేవర'.. ఈ ఏడాది సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం అనిరుధ్ కూడా మ్యూజిక్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం) -
డిఫరెంట్ స్టైలిష్ లుక్స్‌తో దేవర భామ.. ఫోటోలు
-
బాలీవుడ్ హీరోయిన్‌పై హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' మూవీలో మెరుపుతీగలా వచ్చి మాయమైపోయిన ఈ బ్యూటీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన 'ఉలజ్' ఈ వారమే (ఆగస్టు 2న) విడుదల కానుంది. తాను తెలుగులో ఎంట్రీ ఇస్తున్న 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.యాక్షన్ సీన్స్‌లో మాత్రంఇదిలా ఉంటే ఉలజ్ సినిమాకు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్ నిక్ పోవెల్.. జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించాడు. 'జాన్వీ సున్నిత మనస్కురాలు. ఎవరినైనా కొట్టేసి గాయపర్చే రకం కాదు. కానీ యాక్షన్ సీన్లో మాత్రం నలుగుర్ని కొట్టడానికి కూడా వెనుకాడనట్లుగా కనిపించేందుకు ప్రయత్నించింది. యాక్షన్ సీన్స్‌లో అవతలివారు ఎక్కడ గాయపడతారోనని భయపడిపోయింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నిక్ పోవెల్.. బర్న్ ఐడెంటిటీ, గ్లాడియేటర్, ద లాస్ట్ సమురై వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు పని చేశాడు.ఉలజ్..ఇకపోతే ఫ్యాన్స్ కోసం పలు నగరాల్లో ఉలజ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్స్ వేశారు. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ స్పెషల్ స్క్రీనింగ్ అని చెప్పగానే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. ఉలజ్ విషయానికి వస్తే ధాన్షు సారియా దర్శకత్వం వహించగా అతిక చౌహాన్ సంభాషణలు రాశాడు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, అదిల్ హుస్సేన్, జితేంద్ర జోషి, రాజేంద్ర గుప్త కీలక పాత్రల్లో నటించారు.చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత -
ఎన్టీఆర్ తో డాన్స్ అంటే.. జాన్వీ క్రేజీ కామెంట్
-
అమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.సీక్వెల్‌పై బోనీ కపూర్కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌పై హింట్ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై బోనీ కపూర్, సురీందర్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు. -
తనను పొగిడేందుకు డబ్బులిస్తున్న హీరోయిన్.. జాన్వీ ఏమందంటే?
జాన్వీ కపూర్.. ఈ మధ్య బాగా వైరలవుతున్న పేరు. హిందీలో డిఫరెంట్ సినిమాలు, తెలుగులో వరుస ఆఫర్లు, అంబానీ పెళ్లిలో డ్యాన్సులు.. ఇలా ఏదో ఒక విధంగా జాన్వీ కపూర్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. దివంగత నటి శ్రీదేవి పేరును నిలబెట్టేందుకు కూతురిగా బాగానే కష్టపడుతోంది. ఈ క్రమంలో తను ఎంచుకుంటున్న స్క్రిప్టులకు, నటనకు ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాను డబ్బులిచ్చి మరీ పొగిడించుకుంటోందని కొందరు నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.పొరపాటున పొగిడినా..ఉలజ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఈ ప్రచారంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను మీ అందరి ముందు కూర్చుని నా గురించి నేను ఏమని చెప్పుకోవాలి? నాపై నాకు చాలా నమ్మకముంది.. అద్భుతంగా నటిస్తున్నానని చెప్పాలా? అలా సొంత డప్పు కొట్టుకోవడం నా వల్ల కాదు. జనాలే నా పర్ఫామెన్స్‌ను జడ్జ్ చేయాలి. అయితే సోషల్ మీడియాలో కొందరు నన్ను పొరపాటున పొగిడితే చాలు.. వాళ్లకు నేను డబ్బులిస్తున్నానని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లేమీ నా పీఆర్ కాదు. డబ్బు ఇచ్చి మరీ పొగిడించుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు' అని చెప్పుకొచ్చింది.సినిమా..కాగా జాన్వీ కపూర్ చివరగా మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఉలజ్ మూవీ ఆగస్టు 2న విడుదల కానుంది. మరోవైపు తెలుగులో దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రామ్చరణ్తోనూ ఓ చిత్రంలో జోడీ కడుతోంది.చదవండి: నాకు పెళ్లయిందన్న విషయమే మర్చిపోయా: తాప్సీ -
ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్
తెలుగువారి పనితీరు అంటే తనకు చాలా ఇష్టం అంటోంది బాలీవుడ్ భామ జాన్వీకపూర్. ‘దేవర’ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది జాన్వీ. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఎన్టీఆర్, జాన్వీలతో ఓ పాటను చిత్రీకరించారు. అందులో ఎన్టీఆర్ డ్యాన్స్‌తో ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది జాన్వీ కపూర్. తన తాజా చిత్రం ‘ఉలజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన జాన్వీ ‘ఎన్టీఆర్’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘టాలీవుడ్లో తొలి సినిమానే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. సెట్లోకి వస్తే అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల మా ఇద్దరిపై ఓ పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఆయన వేసే స్టెప్పులు చూసి ఆశ్చర్యపోయాను. ఏదైనా నేర్చుకోవడానికి ఎన్టీఆర్‌కి ఒక సెకను చాలు. అదే విషయాన్ని నేను నేర్చుకోవాలంటే కనీసం 10 రోజుల సమయం పడుతుంది(నవ్వుతూ..). ప్రస్తుతం దేవరలోని రెండో పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. తెలుగువారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. వారు కళను, సినిమాను గౌరవిస్తారు. హుందాగా ప్రవర్తిస్తారు’ అని జాన్వీ చెప్పుకొచ్చింది.జాన్వీ తాజాగా నటించిన ‘ఉలజ్’ చిత్రం విడుదలకు రెడీ అయింది. సుధాంశు సరియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణిగా కనిపించనున్నారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
ఆస్పత్రిలో చేరడం మొదటిసారి.. భయంతో వణికిపోయా: జాన్వీ కపూర్
దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్త అధికారి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో అనారోగ్యానికి గురి కావడంపై నోరు విప్పింది. ఫుడ్ పాయిజన్‌తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను ఆస్పత్రిలో చేరడం ఇదే మొదటిసారి. మూవీ ప్రమోషన్లు, షూటింగ్‌లతో బాగా అలసిపోయా. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లా. అక్కడ విమానాశ్రయంలో ఫుడ్ తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయా. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. సాయం లేకుండా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయానని' తెలిపింది.'కానీ ఆస్పత్రిలో చేరాక వైద్య పరీక్షలు చేశారు. రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు. లివర్ బాగా ఇబ్బందికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో, లేదో అని భయపడ్డా. ప్రస్తుతం మళ్లీ వర్క్‌లో బిజీ అవుతున్నా' అని తెలిపింది. అయితే ఇప్పుడంతా బాగానే ఉందని వెల్లడించింది. కాగా.. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ఉలజ్ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ యాంగిల్లో తీయొద్దని చెప్పా: జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీకపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మాహీతో అలరించిన ముద్దుగుమ్మ మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్తగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తాను చెప్పిన విషయాన్ని గుర్తు ఉంచుకుని పాటిస్తున్నారని జాన్వీ వివరించింది.గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ క్యాప్షన్లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది.కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్‌తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది. -
జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: సహ నటుడు
సాధారణంగా సినిమా యాక్టర్స్ చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా సాధారణంగా మాట్లాడినా సరే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య.. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కాస్త వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సదరు నటుడు మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)జాన్వీ కపూర్‌తో కలిసి నటించాను గానీ తనకు వైబ్ రాలేదని గుల్షన్ దేవయ్య అన్నాడు. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును అతడు చెప్పింది నిజమేనని, షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక్కసారి కూడా కలిసి కూర్చోలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో గుల్షన్ ఏదో తప్పు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు.'జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదని చెప్పానంతే. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి యాక్టర్. చాలా ప్రొఫెషనల్. సినిమాలో మా సీన్స్ బాగా వచ్చాయ్. ప్రతి సినిమా సెట్లోనూ టీమ్ అంతా కలిసిపోవాలనేం లేదు కదా! నేను ఎవరినీ తక్కువ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదు. మూవీ కోసం 100 శాతం పనిచేశాం. గతంలో నేను చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను. వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి యాక్ట్ చేయడం మర్చిపోలేను. మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించే డిస్కషన్ జరిగింది. అదే రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పా' అని గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
అతని వల్ల నా హార్ట్ బ్రేక్ అయింది: జాన్వీ కపూర్ కామెంట్స్
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఆ తర్వాతా టాలీవుడ్లో దేవర భామ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఇటీవల అంబానీ పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి సందడి చేసింది. వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. దీంతో అతనితోనే ఏడడుగులు నడుస్తుందని బాలీవుడ్లో టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా అతనితో రిలేషన్‌పై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ అతని వల్లే తనకు ఒకసారి హార్ట్ బ్రేక్ అయిందని వెల్లడించింది.శిఖర్ పహారియాతో తన రిలేషన్ గురించి జాన్వీ కపూర్ చాలా ఓపెన్‌గా మాట్లాడింది. గతంలో తాను శిఖర్‌తో ఎందుకు విడిపోయిందో కారణాలను వివరించింది. నాకు పీరియడ్స్ వచ్చాక మొదటి రెండేళ్ల పాటు ప్రతి నెలా అతనితో బ్రేకప్ అయ్యానని వెల్లడించింది. దీంతో తాను మొదటి రెండు, మూడు నెలలు షాక్‌లో ఉన్నాడని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులకే నేను అతని వద్దకు వెళ్లి ఏడుస్తూ సారీ చెప్పేదాన్ని అని పేర్కొంది. కానీ ఆ సమయంలో నా మెదడు ఎందుకలా పనిచేస్తుందో అర్థం కాలేదని జాన్వీ చెప్పుకొచ్చింది.శిఖర్ వల్ల ఒకసారి తన గుండె పగిలిపోయిందని.. కానీ అదే మనిషి తిరిగి వచ్చి నా పగిలిన గుండెను మళ్లీ ఒక్కటి చేశాడని తెలిపింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని వివరించింది. కాగా.. బాలీవుడ్ ఎంట్రీకి ముందే జాన్వీ శిఖర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2018 వచ్చిన రొమాంటిక్ మూవీ ధడక్ సహనటుడు ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేసింది. ఇషాన్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ శిఖర్‌తో జతకట్టింది. ఇక సినిమాల విషయాకొనిస్తే..జాన్వీ చిత్రం ఉలాజ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో జాన్వీ కపూర్ డిప్యూటీ హైకమీషనర్‌గా కనిపించనున్నారు. ఆ తర్వాత దేవర పార్ట్ 1తో పాటు రామ్ చరణ్ సరసన నటించనుంది. -
ఫ్రెండ్లీ రిలేషన్ లేదన్న హీరో.. జాన్వీ కపూర్ కామెంట్స్ విన్నారా?
కలిసి సినిమాలు చేసినంత మాత్రాన అందరం ఒకే ఫ్యామిలీలా కలిసిపోతామన్న రూలేం లేదంటున్నాడు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. ఈ నటుడు జాన్వీ కపూర్‌తో కలిసి ఉలజ్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఇటీవల ఉలజ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన పై కామెంట్లు చేశాడు. తనతో వైబ్ రావడం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు. డైరెక్టర్ చెప్పినప్పుడు నా దగ్గరకు వస్తుంది, యాక్ట్ చేస్తుంది. తనొక ప్రొఫెషనల్ యాక్టర్ కాబట్టి అలాగే మెసులుకుంటుంది. కానీ షూటింగ్ గ్యాప్‌లో ఎక్కువగా మాట్లాడుకోలేదు, ఫ్రెండ్స్ కూడా కాలేకపోయాం అని తెలిపాడు. తాజాగా ఆ కామెంట్లపై బాలీవుడ్ బ్యూటీ స్పందించింది. 'నిజంగానే మేము కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. ఒకసారైతే మమ్మల్ని కాఫీకి అలా వెళ్లిరమ్మన్నారు. షూటింగ్ గ్యాప్‌లో ఎవరో తెలియనట్లు ఇలా కూర్చున్నారేంటి? కలిసి టీ తాగి రండి, సరదాగా జోక్స్ చెప్పుకోండి అని నాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగైతే అతడి వేసే జోకులకు మీరు నవ్వండి లేదంటే తను ఫీలవుతాడన్నాను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. గుల్షన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న ఉలజ్ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నారు.చదవండి: ఇన్నాళ్లకు బాబును చూపించించిన బ్యూటీ.. 12 ఏళ్ల క్రితం తెలుగులో.. -
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా జాన్వీ కపూర్ ఆసుపత్రి పాలైంది
-
ఆస్పత్రిలో జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తినడం వల్ల జాన్వీ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారని, రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అవుతారని జాన్వీ తండ్రి–నిర్మాత బోనీ కపూర్ వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ముందుగా జాన్వీ కపూర్ ఆస్పత్రిపాలయ్యారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. స్వల్ప అస్వస్థత మాత్రమే అని బోనీ కపూర్ పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్‌తో ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. అలాగే ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం ‘ఉలజ్’ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది. -
ఆస్పత్రిలో చేరిన దేవర హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే జూలై 12న అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన ముద్దుగుమ్మ ఆస్పత్రిలో చేరారు. జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజనింగ్‌కు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ సైతం కపూర్ ధృవీకరించారు.జాన్వీ అనారోగ్యానికి గురి కావడంతో ఈ వారంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుందని జాన్వీ సన్నిహితులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూలై 12న ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో అభిమానులను అలరించింది. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ఉలజ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుంది. -
నాని కొత్త సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్!
-
టాలీవుడ్ పై కన్నేసిన జాన్వీ..
-
తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
జాన్వీ కపూర్ కొత్త సినిమా ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా 'ఉలాజ్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ సుధాంశు సారియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జాన్వీ కపూర్‌తో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్ వంటి వారు నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుంది.దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా జాన్వీ దగ్గరైంది. అయితే, ఆమె నటించిన ఉలాజ్ చిత్రంలో సుహానా భాటియా పాత్రలో మెరిసింది. భారత విదేశాంగ విభాగంలో యంగెస్ట్ డిప్యూటీ హై కమిషనర్‌గా కనిపించనుండటం విశేషం. విదేశాల్లో చదువుకున్న సుహానాకు చిన్న వయసులోనే అత్యంత పెద్ద పదవి దక్కడంతో ఆమెపట్ల కొలీగ్స్ ట్రోల్ చేస్తారు.నెపోటిజం వల్లే ఇంతపెద్ద ఉద్యోగం వచ్చిందంటూ పలు ఆరోపణలు చేస్తారు. ఆమె పేరు చివరలో భాటియా అని ఉండటం వల్ల ఈ పదవి దక్కిందని కామెంట్ చేస్తారు. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఇలాంటి విభాగంలో ఆమె టాలెంట్ పనికిరాదని వారు చెబుతున్న క్రమంలో ఆమెకు ఓ అండర్ కవర్ ఏజెంట్ నుంచి సవాలు ఎదురౌతుంది. ఇలా ట్రైలర్లను ఆసక్తిగా కట్ చేశారు. తాజాగా విడుదలైన ఉలాజ్ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
ప్రతి ముఖం ఓ కథ చెబుతుందంటున్న జాన్వీ కపూర్!
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) విభాగంలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి ఓ కుట్రను గురించి కాన్ఫిడెన్షియల్ ఫైల్‌ను రెడీ చేశారు జాన్వీ కపూర్. మరి... ఈ ఫైల్లో ఉన్న వివరాలు ఏంటి? నిజమైన కుట్రదారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం ‘ఉలజ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలోనే జాన్వీ కపూర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సుధాంశు సరియ దర్శకత్వం వహించారు. ముందు ‘ఉలజ్’ను జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త ఫోటోలను విడుదల చేసింది యూనిట్. ‘‘ప్రతి ముఖం ఓ కథ చెబుతుంది. ప్రతి కథ ఓ ఉచ్చులాంటిదే’’ అని ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు జాన్వీ కపూర్. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు జాన్వీ కపూర్. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా?
అంబానీ ఇంట పెళ్లి అంటే ఆరు నెలల నుంచే హడావుడి మొదలైంది. ఇప్పుడా సెలబ్రేషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తారలు భాగమవుతూ సందడి చేస్తున్నారు. బాలీవుడ్ సుందరాంగి జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకలను ఎంజాయ్ ఇటీవలే సంగీత్‌లో శిఖర్‌తో కలిసి స్టేజీపై చిందేసింది.ఆరెంజ్ లెహంగాఇదిలా ఉంటే గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఇటీవల మామేరు అనే వేడుక నిర్వహించారు. ఇందుకోసం జాన్వీ ట్రెడిషనల్ లెహంగాను ఎంచుకుంది. ఆరెంజ్, రెడ్, పింక్, గోల్డ్ మిక్స్‌డ్‌గా ఉన్న లెహంగాను ధరించింది. దీనిపైకి చందేరి దుపట్టాను మ్యాచ్ చేసింది. ఈ డ్రెస్‌పైకి పెద్ద చోకర్ ధరించింది. ఆ చోకర్‌కు వచ్చిన కమ్మలనే చెవికి పెట్టుకుంది. పెద్ద స్టోన్స్ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.నెక్లెస్.. అర కోటిహజూరిలాల్ లీగసీ జ్యువెలర్స్‌కు చెందిన ఈ నగ ధర అక్షరాలా 52 లక్షల రూపాయలని తెలుస్తోంది. ప్రీవెడ్డింగ్‌కే ఇంత కాస్ట్లీ నగలు వేసుకుందంటే పెళ్లికి ఇంకే రేంజ్లో రెడీ అవుతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంబానీ ఇంట జరిగే వేడుకలకు ఆమాత్రం రెడీ అవడం సాధారణమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: 'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో' -
అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
దేవర ఆటా పాటా
‘దేవర’ రొమాంటిక్ మోడ్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవరగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇటీవల జాన్వీ, ఎన్టీఆర్ పాల్గొనగా ఈ సినిమాకు చెందిన ఓ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు మేకర్స్. తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్లో మరో రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ స్పెషల్ సెట్‌ను రెడీ చేస్తున్నారని, వచ్చే వారం ఈ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని టాక్. ఇప్పటికే యాక్షన్ పార్ట్, టాకీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో కొరటాల శివ పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని సెప్టెంబరు 27న విడుదల చేయనున్నారు. -
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
-
అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ ప్రేమ జంట (ఫోటోలు)
-
Janhvi Kapoor: పూలగౌనులో దేవర బ్యూటీ సోయగాలు (ఫోటోలు)
-
జాన్వీకపూర్ కోలీవుడ్ ఎంట్రీ చిత్రం డ్రాప్?
అనుకున్నవన్నీ జరగవు. జరిగేవాటిని ఊహించలేము. ఇదే జీవితం. నటి జాన్వీ కపూర్ విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీ కపూర్ అన్నది తెలిసిందే. ఈమె తండ్రి బోనీ కపూర్ హిందీలో పాటు కొన్ని తమిళ చిత్రాలు నిర్మించారు. ఈ మధ్య అజిత్ కథానాయకుడిగా తుణివు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. కాగా బాలీవుడ్లో నటిగా పరిచయమై రాణిస్తున్న జాన్వీకపూర్‌కు తన తల్లి మాదిరిగానే దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించి పేరు తెచ్చుకోవాలన్నది ఆశ. ఈ విషయాన్ని ఆమె పలుసార్లు ఆమె స్వయంగా వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎనీ్టఆర్ సరసన దేవర అనే భారీ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. త్వరలో రామ్‌చరణ్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో కూడా నటించాలని జానీ్వకపూర్ చాలా ఆశగా ఉన్నారు. అలా ఒక పాన్ ఇండియా సినిమాలో నటించడానికి కమిట్ అయ్యారు. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందనుందనని పేర్కొన్నారు. కాగా మహాభారతం ఇతివృత్తంతో సాగే ఈ చిత్రానికి కర్ణ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కర్ణుడిగా నటుడు సూర్య నటించనున్నారని, ఆయనకు జంటగా నటి జానీ్వకపూర్ ఎంపికైనట్టు ప్రచారం జోరుగా సాగింది. త్వరలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఏమైందో గానీ ఇప్పుడీ చిత్రం డ్రాప్ అయినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే జానీ్వకపూర్ కోలీవుడ్ ఎంట్రీ చిత్రం ఆగిపోవడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. అయితే తాజాగా విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జానీ్వకపూర్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అయినా నిజం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మత్స్య కన్యలా జాన్వీ స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లుక్ ఓ రేంజ్లో ఉంది. ఆమె స్టైలిష్ లుక్ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్ హాట్ కోచర్ వీక్ 2024లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్ హోలోగ్రాఫిక్ టోన్ డిజైనర్ వేర్‌తో పారిస్ ఫ్యాషన్ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్ ముదురు బ్లాక్క లర్‌లో అల్లికలతో డిజైన్ చేసిన మెర్మైడ్ స్కర్ట్‌లా ఉంది. అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్ లుక్ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్ మిశ్రాకు సపోర్ట్ చేస్తూ..బాలీవుడ్ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ రాహుల్ మిశ్రా.. రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్ కలెక్షన్లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షో జూన్ 24 నుంచి జూన్ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) (చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!) -
థాయ్‌లాండ్‌లో పాట
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్‌ని థాయ్‌లాండ్‌లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్‌ను కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు బాస్కో మార్టిస్. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్. -
సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. హీరోయిన్ టీం క్లారిటీ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సరసన నటించింది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే .తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఊహించని విధంగా జాన్వీ కపూర్ తన ఎక్స్ ఖాతాలో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. అయితే ఇది గమనించిన జాన్వీకపూర్ టీమ్ ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది.అసలు జాన్వీకపూర్‌కు ఎక్స్‌లో అకౌంట్ లేదని తెలిపారు. జాన్వీ కపూర్ పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్‌గా గుర్తించారు. ఆమె పేరుతో ఖాతా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా ఖాతాను సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. కాగా.. జాన్వీ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవరలో కనిపించనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కించనున్న రామ్ చరణ్ చిత్రంలో నటించనుంది. -
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)
-
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ వస్తుంది. అక్కడ ఒక్క హిట్ పడితే చాలు..ఇక స్టార్ హీరోయిన్ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.మాళవికా మోహన్.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్‌కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ‘మాస్టర్’తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్గా మారడం ఖాయం.జాన్వీ కపూర్.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్. అంతేకాదు రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేసన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్‌లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.అషికా రంగనాథ్.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్‌కి ప్రమోషన్స్ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్‌కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది. -
మహేష్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ జక్కన్న ప్లాన్ మామూలుగా లేదులే..
-
ఆ హీరోతో పని చేయనన్న హీరోయిన్.. ఇప్పుడు అతడితోనే హిట్..
హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో రూహి ఒకటి. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ సమయంలో 'రాజ్‌కుమార్‌తో పని చేయాలంటే చిరాకుగా ఉంది. ప్రతిసారి ఆయనతో కలిసి ఎలా నటించగలను? కాకపోతే ఆయన చాలా టాలెంట్.. నటిగా తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. తనతో కలిసి పని చేయడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న ఫీలింగ్ వస్తుంది' అని చెప్పింది.మరోసారి జోడీఅతడితో పని చేయడమే చిరాకు అన్న జాన్వీ కపూర్.. మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో మరోసారి రాజ్‌కుమార్ రావుతో జోడీ కట్టింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆమె ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ.. జాన్వీని ఊహించని ప్రశ్న అడిగాడు. రాజ్‌కుమార్‌తో మళ్లీ పని చేయనన్నావ్? అని ఇరకాటంలో పడేశాడు.అందుకే అలా చెప్పాఅందుకు జాన్వీ తెలివిగా సమాధానమిచ్చింది. మీడియా ఎప్పుడూ సెన్సేషనల్ హెడ్‌లైన్స్ కోసమే ఎదురుచూస్తుంది. నేను అలాంటి స్టేట్మెంట్ ఇస్తే సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందనుకున్నాను. అలాగే తనతో పని చేయడం ఎందుకు కష్టమో కూడా చెప్పాను. తనకు చాలా అనుభవం ఉంది, టాలెంటెడ్.. అలాంటి వ్యక్తి పక్కన నటించడం కష్టమే కదా..! అని బదులిచ్చింది.చదవండి: ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు -
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు. టెన్నిస్‌బాల్‌తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్‌తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్‌కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ప్రియుడితో పెళ్లి వార్తలు.. తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్!
-
ప్రియుడితో పెళ్లి వార్తలు.. తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్!
దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా నగరాల్లో పర్యటిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. తన ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగారు. దీనికి జాన్వీ కపూర్ సైతం నవ్వుతూనే సమాధానమిచ్చింది. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.జాన్వీ మాట్లాడుతూ..'ఇటీవల నేను కొన్ని వార్తలు చదివాను,. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. దీంతో నేను పెళ్లి చేసుకుంటున్నట్లు రెండు, మూడు కథనాలు మిక్స్ చేశారు. నాకు తెలియకుండానే.. వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు (నవ్వుతూ). కానీ ప్రస్తుతం నేను ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి పెడుతున్నా. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు.' అని తెలిపింది. జాన్వీ కపూర్ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' మే 31న థియేటర్లలోకి రానుంది. -
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ వివిధ రకాల డిజైనర్ దుస్తులతో అబిమానులను అలరిస్తుంది. అంతకుమునుపు ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ధరించిన చీర కూడా హైలెట్‌గా నిలిచింది. ఆ చీరపై ఏకంగా మొత్తం క్రికెట్ స్టేడియంనే చక్కగాత్రీకరించారు. అదికూడా 1983 ప్రపంచకప్‌లో జరిగిన ఘట్టాన్ని చక్కగా చేతితో ఆవిష్కరించారు. అది మరువక మునుపే క్రికెట్ నెక్లెస్‌తో మనముందుకు వచ్చింది జాన్వీ.డిజైనర్ అర్పితా మెహతా పూలా లెహంగా ధరించి మరీ చెన్నైలో మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌కు వచ్చింది. క్రికెట్‌తో తీసిన మూవీకి ఆమె ధరించిన పూల లెహంగాకి సంబంధం ఎలా అని ఆశ్యర్యంగా ఉన్నా.. ఆమె ధరించిన నెక్లెస్ అందుకు చక్కటి సమాధానం ఇచ్చేలా నిలిచింది. ఆమె ధరించిన నెక్లెస్‌లో బ్యాట్, బాల్, వికెట్‌తో కూడిన లాకెట్‌ని చాల చక్కగా తీర్చిదిద్దారు. ఇది ఆమెకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని ఇచ్చింది. ఏదీఏమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచేలా జాన్వీ ఆహార్యం డ్రెస్సింగ్ స్టయిల్ హైలెట్‌గా ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Arpita Mehta Official (@arpitamehtaofficial) అంతేగాదు జాన్వీ ధరించే ప్రతి డిజైనర్ డ్రెస్, చీరలు ఫేమస్ అయ్యి మూవీ ప్రమోషన్స్ రేంజ్‌ని పెంచాయి. పైగా ఈ ప్రమోషన్స్ ముగిసేలోగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుందేమో అన్నట్లు ఉంది ఆమె లుక్. చీర దగ్గర నుంచి లెహంగా వరకు ప్రతీది ఆమె మూవీకి తగ్గట్టు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మూవీ సారాంశాన్ని పరోక్షంగా తెలియజేసేలా నెక్లెస్ నుంచి చెవిపోగుల వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశారు. ఆ క్రికెట్ నెక్లెస్, ఆ అద్భుతమైన లెహంగాలో కొత్త జాన్వీని చూస్తున్నామనేలా మిస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!) -
అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్
దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్‌లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.జాన్వీ కపూర్ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది.