Trump India Visit
-
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్‌లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్‌కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్‌లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
‘నమస్తే ట్రంప్; నేను ఎగ్జయిట్ కాలేదు’
దక్షిణ కరోలినా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన ప్రధాని అతడు. అతనో గొప్ప వ్యక్తి అని ట్రంప్ అభివర్ణించాడు. దక్షిణ కరోలినాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి తన భారత పర్యటనను గుర్తు చేశారు. లక్షకు పైగా జనంతో మొతెరాలో లభించిన అపూర్వ స్వాగతం మరువలేనిదని అన్నారు. తనకు భారీ జనబాహుళ్యంతో నిండిన సభల్లో పాల్గొనడం అంటే ఇష్టమని, అయితే, అమెరికాలో భారీ జన సమీకరణ జరగదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!) ‘ప్రధాని మోదీతో భారత పర్యటన అద్భుతంగా సాగింది. దేశ ప్రజలు ప్రేమించే అతనో గొప్ప వ్యక్తి. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ అద్భుతం. భారీ సభల్లో మాట్లాడటం నాకు ఇష్టం. నా సభలకు జనం భారీగా వస్తారు. మొతెరా సభకు లక్షా యాభై వేల మంది జనం వచ్చారు. ప్రస్తుత కరోలినా సభకు జనం భారీగానే వచ్చారు. రెండు సభలూ నాకు ఇష్టమే. అయితే నేను ఈ సమూహాన్ని చూసి ఎగ్జయట్ కాలేదు. ఎందుకంటే నమస్తే ట్రంప్‌లో ఆ జన బాహుళ్యం, వారి ఆదరణ చూశాను కదా..! భారత్‌లో 150 కోట్ల జనాభా ఉంది. మనకేమో 35 కోట్ల జనాభానే. అమెరికాతో సంబంధాలు భారతీయులకు ఎంతో ఇష్టం. వారికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అదొక విలువైన పర్యటన’ అని అన్నారు. (చదవండి : నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!) కాగా, గత సోమవారం సతీసమేతంగా భారత్‌లో పర్యటించిన ట్రంప్‌నకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌లోని మొతెరాలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్షకు పైగా జనం పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమం, ఆగ్రాలోని ప్రపంచ సుందర కట్టడం తాజ్ మహల్‌ను ట్రంప్ దంపతులు, అతని బృందం సందర్శించింది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక చర్చల్లో మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. -
ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!
ట్రంప్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. పదే పదే ఇండియన్ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు. ‘‘ఇదేంటి సార్?’’ అని ఆయన పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా కామ్‌గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ వైట్‌హౌస్‌కు ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఇలా జరిగింది: సెక్రెటరీ: హలో ట్రంపుగారు... ట్రంప్: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్ ట్రంప్‌ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ.... సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను... ( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది) ట్రంప్: విషయం ఏమిటో చెప్పిచావు... సెక్రెటరీ: ఆ ఇరాన్ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్’ అంటున్నాడు... ట్రంప్: బాసూ, ఇరాన్ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో... సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్ చేస్తే ఇరాన్ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్ హోదాలో ప్రశ్నిస్తున్నాను... ట్రంప్: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది... ట్రంప్: అరే... బొంగులో చికెన్ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్’ ఈజ్ ట్రడిషనల్ ఫామ్ ఆఫ్ కుకింగ్. ఆల్మోస్ట్ నో ఆయిల్ అండ్ కారం... డిష్ అదిరిపోయింది అనుకో! సెక్రెటరీ: కాస్త నీ చికెన్ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ... ట్రంప్: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్ అనుకో... హై ప్రోటీన్ చారు... ప్రిపరేష్ 16 నిమిషాలు, కుక్ 30 నిమిషాలు, టోటల్...46 నిమిషాలు... సింపుల్‌గా చేసుకోవచ్చు... సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే... ట్రంప్: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్ ట్రంప్‌తో, అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే... సెక్రెటరీ: కూల్ ట్రంప్ కూల్... ట్రంప్: బాసూ... ‘కూల్’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కేసర్ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో... సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి... ట్రంప్: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్ కర్రీ, బలుసాకు చికెన్ కర్రీ, బలుసాకు ఫిష్ ఫ్రై, బలుసాకు ఫిష్ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా... గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్ కట్ అయిపోయింది. అశుభం – యాకుబ్ పాషా -
దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ
‘దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ, బాబ్జీ గార్లెండ్స్ దత్తుడు’– అంటూ నానుడిలాంటి వాడుక ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలో ఉండేది. పెద్ద బస్తీల్లో, చిన్న నగరాల్లో చిన్న చిన్న కూటములుం టాయ్. వారు తమ వృత్తి వ్యాపారాల్లో కొండచిలువల్లా పెరిగిన వారై ఉంటారు. వాళ్లకి కీర్తిని కొనుక్కోవడానికి లెక్కలు చూపని చిల్లర ఉంటుంది. వారి వారి శక్త్వానుసారం అప్పుడప్పుడు సవాపావో, సవాశేరో కీర్తిని కొను క్కుని దండతో ఇంటికి వెళ్తుంటారు. దండోరా వేయించుకుంటారు. ఈ కూటమి వాళ్లకి వినసొంపైన పదవులుంటాయ్. అవి అజాగళస్తనాల్లాంటివి– ఇదేమరి అక్కర్లేని సొల్లు కబుర్లంటే– మొన్న ట్రంప్ టూర్ ప్రసంగాల్లాగా. ట్రంప్ మోదీని, మోదీని ట్రంప్ అడుగడుగునా దండించుకున్నారు. నగర సంకీర్తన వలె పలుచోట్ల పరస్పరం భజించుకున్నారు. ఆ పొగడ్తలకి ఇద్దరి పళ్లు పులిసిపోయి ఉంటాయ్. ట్రంప్ గాంధీ పేరు ఎత్తలేదు, మోదీ తాజ్‌మహల్ గుమ్మం ఎక్కలేదు. చెల్లుకు చెల్లు ఏ అమెరికా ప్రెసిడెంటు వచ్చినా ఏవుండదు కడుపు నిండేది– మా మేనత్త పెళ్లిళ్లకి వెళ్లినట్టే! ఆ వైనం చెబుతా. ఆవిడ ఆస్తిపరురాలు. బాధ్యతలు లేవు. పెద్దతనంలో కూడా జుత్తూడక, మాట చెడక నిండుగా ఉండేది. ఒంటినిండా నగలుండేవి. వొంకుల వడ్డాణం, కాసులపేరు, ఓ చేతికి కట్టె వంకీ, ఇంకో చేతికి నాగవత్తు ఇంకా చాలినన్ని బంగారు గాజులు ఉండేవి. ముక్కుకి ఎర్రరాయి నత్తు, తలతిప్పితే అరచెయ్యంత చేమంతిబిళ్ల, అసలు సిసలు కంజీవరం పట్టు చీరెలో ఆవిడ పందిట్లో తిరుగుతుంటే దేవుడి రథం కదుల్తున్నట్టుండేది. పెళ్లికి వస్తే హీనపక్షం మూడు రోజులుండేది. పట్టు చీరెలన్నీ ప్రదర్శించేదాకా ఉండేది. ఆ రోజుల్లో అరడజనుంటే మహాగొప్ప. ఆవిడ దీవెనలు మాత్రం ఉదారంగా ఇచ్చేసి, పెళ్లివాళ్లు పెద్దరికంగా పెట్టేవి స్వీకరించి వెళ్లేది. అమెరికా ప్రెసిడెంటు తెల్లఏనుగు లాంటి విమానం గురించి, మందీమార్బలం గురించి, జరగాల్సిన మర్యాదల గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒబామా పెంపుడు కుక్కతో సహా వచ్చాడు. అత్తగారు కూడా వచ్చింది. అసలావిడ కోసమే వచ్చారని అనుకున్నారు. తాజ్‌మహల్ చూడాలని మదర్ ఇన్ లా అడిగిందట. అది మన దేశ పౌరులు చేసుకున్న అదృష్టం. అయినా ఎప్పుడూ అదేం దరిద్రమో తెలియదు. ఏ అమెరికా ప్రెసిడెంటు వస్తున్నాడన్నా కోట్లకు కోట్లు ధారపోసి అతి మర్యాదలు చేయడం మనకు అలవాటే. కరువులో అధిక మాసం అంటే ఇదే. అప్పుడెప్పుడో ఇవాంకా వస్తేనే భాగ్యనగరానికి రంగులు వేశాం. దానికి రిటన్ గిఫ్ట్‌గా కేసీఆర్‌ని పిలిచి ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. నవ్వుతూ ఆరుసార్లు చెయ్యి ఊపాడు. జగన్‌కి పిలుపు లేదు. ఇహ దానిమీద ఆయనంటే గిట్టని మీడియా కావల్సినన్ని కథనాలు అల్లింది. నా చిన్నప్పుడు ఐసన్‌హోవర్ రష్యానించి వస్తుంటే నెహ్రూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్ స్వాగతానికి మోదీ కనీసం కొన్ని వందల కోట్లు ఖర్చుచేసి ఉంటారు. శివరాత్రి నుంచి శివతాండవంలా నడిచింది. మోదీకి కూడా పూనకం వస్తుందని అర్థమైంది. ఆ దేశం గొప్ప దేశమే కావచ్చు. మనదీ గొప్ప దేశమే. అంతమాత్రంచేత దాని పాలకులంతా గొప్పవారు కానక్కర్లేదు. మన దేశాన్ని ఎందరు నికృష్టులు పాలించలేదు. పద్ధతులు పాటించవచ్చుగానీ మరీ అతి అవసరం లేదు. సబర్మతి ఆశ్రమంలో ఎన్నో రకాలు ఎంతో వ్యయంతో, శ్రమతో చేయించిన ఉపాహారాలను ట్రంప్ ముట్టనే లేదు. దారిలో ప్రాకృతిక వాతావరణంలో పచ్చని చెట్టుకింద కావాల్సినన్ని మాంసాహారాలు వండి వడ్డించాల్సింది. ట్రంప్ రాబోతున్న ఎన్నికల దృష్ట్యా వచ్చాడని అందరికీ తెలుసు. మోదీ గాంధీల రాష్ట్రం తనకి బాసటగా ఉంటుందని ట్రంప్ ఆశ. సువీ అంటే రోకలిపోటని తెలియందెవరికి. ఆయన మళ్లీ త్వరలోనే వస్తారు. మళ్లీ పొగడ్తలుంటాయ్ కాకపోతే కొత్తవి. కానీ మహాశయా! ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించండి. తెలుగువారు కూడా మీ జాతకం తేల్చగలవారే. ఎందుకైనా మంచిది చంద్రబాబుని కూడా పిలవండి. ఆయనగానీ ఒక్క వీల వేస్తే...... వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
‘నమస్తే ట్రంప్’ను అంత మంది చూశారా!
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వీక్షించిన వారికంటే ఇది రెండింతలు కావడం విశేషం. ఆస్కార్ అవార్డుల వేడుకను దాదాపు రెండున్నర కోట్ల మందిపైగా వీక్షించినట్టు తెలుస్తోంది. నమస్తే ట్రంప్ కార్యక్రమానికి విచ్చేసిన ట్రంప్, మెలనియాలకు లక్ష మందిపైగా ప్రజలు స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన జనంతో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. (చదవండి: హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా) -
ట్రంప్ పర్యటన: విందుకు అది కూడా వచ్చింది!
రెండు రోజులు పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన అగ్రారాజ్యాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు భారత ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, సీఎం కేసీఆర్ సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక ట్రంప్ మాంసాహార ప్రియుడైనప్పటికీ ప్రభుత్వం వెజిటేరియన్ మెనూకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. (రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు విందు) ఇదిలా ఉండగా విందులో అంతమంది ఉంటే రెహమాన్ మాత్రం ఒకరిపైనే దృష్టి సారించాడు. పైగా అది భోజనం చేస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీశాడు. ‘మా చిట్టిపొట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చేశాడు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇంతకీ వచ్చిందెవరనుకుంటున్నారు.. ఓ కోతి. అది అక్కడి పూలకుండీలోని ఆకులను తింటుండగా వీడియో క్లిక్‌మనిపించాడు. దీంతో రెహమాన్ హాస్యచతురతకు మెచ్చిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మీ దోస్తు భలేగుంది’, ‘ట్రంప్, మోదీతోపాటు మరో ముఖ్య అతిథితో విందారగించారు, నిజంగా మీరు గ్రేట్’ ‘శాఖాహార వంటకాలున్నాయని తెలిసి వచ్చింది కాబోలు’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) View this post on Instagram Meanwhile our little friend was having dinner too! A post shared by @ arrahman on Feb 25, 2020 at 12:12pm PST -
హ్యాపీనెస్ క్లాస్‌పై మెలానియా ట్వీట్..
వాషింగ్టన్ : ఇటీవలి భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ అభివర్ణించారు. తనకు స్కూల్లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట భారత్ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. చదవండి : బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మొదటిసారి పర్యటించిన నేపథ్యంలో ఇంటా బయటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్ పర్యటనలో సానుకూల చర్చలు జరిగి, హెచ్1బి వీసాల జారీ నిబంధనలు, పాల, పౌల్ట్రీ ఉత్పత్తులకు అనుమతులు, డబ్లు్య.టి.ఓ. అత్యంత అనుకూల దేశాల లిస్టు నుంచి భారత్ తొలగింపు, అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి చెందిన 20 దేశాల లిస్టులో చేర్చటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై స్పష్టమైన వైఖరి తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ఆశించాము.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం మరొక ముఖ్యమైన అంశం. కానీ, పర్యటనలో ఈ కీలక అంశాలపై ఏమాత్రం దృష్టిసారించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రయోజనాలు మరిచి, ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ మరియు వారి కుటుంబ సభ్యుల సేవలో తరించారు. ఈ విషయాలను ఉటంకిస్తూ, అంతర్జాతీయ మీడియా ట్రంప్ భారత పర్యటనను తూర్పారబట్టింది. ఇక ట్రంప్ పర్యటన లోతుల్లోకి వెలితే, మోదీ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ మోడల్ అభివృద్ధి అనే బూటకపు ప్రచారం చాటున ఉన్న మకిలిని ట్రంప్ గారికి కనబడకుండా గోడ కట్టి, తద్వారా దేశ ప్రజల కళ్ళు తెరిపించారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల డబ్బు ఖర్చు చేసి జనాన్ని తరలించి స్టేడియం నింపారు. మొదటి రోజు పూర్తిగా పొగడ్తలకు కేటాయించారు. మోదీ పొగడ్తలతో ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తగా, ట్రంప్ ఇంకో అడుగు ముందుకేసి మోదీ దేశభక్తికి, ఆయన చాయ్ అమ్మినట్టు జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తూ పోయారు. ఇక గాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, విజిటర్ రిజిస్టర్లో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ప్రస్తావించకుండా, మోదీని పొగడడం చూస్తే సబర్మతి ఆశ్రమం యొక్క ఔన్నత్యం ట్రంప్ గారికి తెలియదు, కేవలం ఫొటోలకు పోజులు ఇవ్వటానికి సందర్శించారని అర్థమవుతుంది. నాడు–నేడు ఎప్పుడైనా అమెరికా దృష్టిలో భారత్ కేవలం వాళ్ళ ఉత్పత్తులు, రక్షణ పరికరాలు అమ్ముకునే పోటెన్షియల్ మార్కెట్ మాత్రమే. అమెరికా జాతీయ సంపదకు ప్రవాస భారతీ యులు కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఈ ఏడాది 2020 చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. అక్కడ సుమారు 40 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. కిందటి ఎన్నికల్లో కేవలం 16% మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసినట్టు కొన్ని సర్వేలు తేల్చడంతో, రాబోయే ఎన్నికలును దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ పర్యటనకు వచ్చారు. ఒక రోజంతా ట్రంప్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికి, అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కలిసే అవకాశం ఇవ్వకపోవటం, రాష్ట్రపతి విందుకు కూడా పిలువకపోవటం మోదీ ప్రభుత్వం యొక్క వివక్ష. ఒకవేళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండివుంటే ఆ ముఖ్యమంత్రిని పిలిచేవారే కదా! ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల్లో అక్కడి ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చిన మోదీ కేజ్రీవాల్‌కు ఇవ్వకపోవడం గమనిం చాలి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కరచాలనంతో సరిపెట్టుకోగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పంపకపోవటం భారతీయ జనతా పార్టీ వివక్షకు తార్కాణం. మోదీ వ్యక్తిపూజ కోసం వెచ్చించిన సమయాన్ని కుదించి, కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించాల్సింది. నిత్యం భారతీయత గురించి ప్రవచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ట్రంప్ పర్యటనలో భారత దేశ విదేశాంగ విధానం, దౌత్య నియమాల పరిధిని దాటి దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఒక స్టేట్ గెస్ట్‌కు ఇవ్వవలసిన ప్రాధాన్యం కంటే అతిగా చేయడం ప్రధాని కుర్చీ ప్రభను పెంచదు. మోదీ, మన దేశ ఎజెండా పక్కకు పెట్టి, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి పరిమితమైనారు. మోదీ తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల కోసం వెంపర్లాడి, భారతదేశ ప్రజల ఆత్మగౌరవం ట్రంప్ వద్ద తాకట్టుపెట్టిన తీరు బాధాకరం. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ, మొబైల్ : 98667 76999 -
తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించాను
-
'తాజ్ అందాలు నన్ను మైమరిపించాయి'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి రెండు రోజులవుతుంది. అయినా ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వారి పర్యటనపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తాజ్ అందాలను ఆస్వాదించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్‌మహల్‌ను దగ్గర నుంచి చూడడం ఆనందం కలిగించింది. తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించానంటూ' క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొత్తం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త ట్రంప్ ట్రంప్‌తో కలిపి చేతిలో చేయి వేసుకొని తాజ్‌మహల్‌లో కలియ తిరగడం కనిపించింది. నితిన్ కుమార్ గైడ్‌గా వ్యవహరిస్తూ తాజ్‌మహల్ విశిష్టతను, దానియొక్క చరిత్రను వారికి వివరించారు. కాగా డేవిడ్ ఐసనోవర్, బిల్ క్లింటన్, తర్వాత తాజ్ మహల్‌ను వీక్షించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు పొందారు. (‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు) -
ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. పూర్తిగా విఫలమయ్యారు
వాషింగ్టన్ : భారత రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆ దేశ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ పేర్కొన్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన హింసాకాండపై ట్రంప్ స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ ఇది ఇండియా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీ సాండర్స్ బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు.' భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం లోపించింది. అంతేగాక ఒక వ్యక్తిగానూ మానవ హక్కుల విషయంలోనే పూర్తిగా విఫలమయ్యారు' అంటూ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీసాండర్స్ మాత్రమే గాక ఇతర డెమొక్రాటిక్ సెనేటర్లు కూడా తప్పుబట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ తమ పౌరుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లింలపై దాడి నివేదికల మధ్య భారత ప్రభుత్వం ప్రజలకు విశ్వాసంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాలని అమెరికా సంస్థ తెలిపింది. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) (భారత్ గొప్ప దేశం: ట్రంప్) -
ట్రంప్‌పై వర్మ మరో ట్వీట్: నెటిజన్లు ఫిదా!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై కొన్ని రోజులుగా ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో.. వర్మ మరోసారి తనదైన శైలిలో ట్రంప్ పర్యటనపై ట్వీట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ నెల 24న ట్రంప్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అదేరోజు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ బుధవారం వర్మ సరదాగా ట్వీట్ చేశారు. ట్రంప్ పర్యటన: వర్మ సంచలన వ్యాఖ్యలు! Trump : MR.Modi you told me 70 lakh people will come to see me and there’s only 1 lakh. Modi: Mr.Trumpie Like1 dollar is 70 rs 1 Gujarati is equal to 70 Americans — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2020 ‘ఈ కార్యక్రమంలో నాకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పావు కదా.. లక్ష మందే వచ్చారేంటి?’ అని అడిగిన ప్రశ్నకు మోదీ ‘ఇండియన్ 70 రూపాయలకు.. అమెరికా 1 డాలర్ ఎలా సమానమో.. 70 మంది అమెరికన్లకు ఒక గుజరాతీ సమానం’ అని మోదీ సమాధానం ఇచ్చినట్లు వర్మ ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వర్మ ట్వీట్‌కు ఫిదా అయిన నెటిజన్లు.. ఫన్నీ మీమ్స్‌తో తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా గతంలో కూడా వర్మ వివిధ అంశాలపై తనదైన శైలిలో ట్వీట్ చేసి నవ్వించిన సంగతి తెలిసిందే. ట్రంప్ భారత్ పర్యటనపై వర్మ పంచ్‌లు -
బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా
న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్‌లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్ఐ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్ విద్యా విధానాన్ని' అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా) #WATCH Delhi: First Lady of the United States, Melania Trump watches a dance performance by students at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura. pic.twitter.com/dBCuTzvymF — ANI (@ANI) February 25, 2020 -
అమెరికా బయల్దేరిన ట్రంప్
-
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి: ట్రంప్
న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల గురించి ట్రంప్‌నకు వారు వివరించారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. అపూర్వ విజయాలు సాధించిన మీకు అభినందనలు. మీరు అమెరికా రావాలని, బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మేం పెట్టుబడులను నిధులపరంగా కాకుండా ఉద్యోగాల కల్పన దృష్టితో చూస్తాం‘ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చట్టాలపరంగానూ, ప్రభుత్వపరంగానూ ఉన్న నియంత్రణలపరమైన సమస్యల అంశాన్ని ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తావించారు. ‘చాలా నియంత్రణలను ఎత్తివేయబోతున్నాం. పెను మార్పులను మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఇకనుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది‘ అని ట్రంప్ సమాధానమిచ్చారు.(సీఎన్ఎన్ X ట్రంప్) ఇక్కడ మేము.. అక్కడ మీరు.. అమెరికా, భారతీయ కంపెనీలు ఇరు దేశాల్లోనూ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తోడ్పాటు మాత్రమే అందించగలవని, ప్రైవేట్ రంగమే వాస్తవానికి ఉద్యోగాలు కల్పించగలుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాను కలిసి పనిచేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ‘మీ ద్వారా మేము ఈ దేశంలో, ఆయన మా దేశంలో ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ట్రంప్.. మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు. సీఈవోల సమావేశంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎవరో చెప్పారు. ఆయన నిజంగా మంచి వ్యక్తే. అంతే కాదు చాలా స్థిరంగానూ వ్యవహరిస్తారు. ఆయన గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు‘ అని ట్రంప్ కితాబిచ్చారు.(నమస్తే ట్రంప్ అదిరింది... ) మళ్లీ నేనే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తానే గెలుపొందుతానం టూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మార్కె ట్లు భారీగా లాభపడతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, వైద్యం తదితర రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని ట్రంప్ చెప్పా రు. తన సారథ్యంలో అమెరికా ఎకానమీ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వృద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి చేరువలో: గోయెల్ భారత్ అమెరికాలు కీలక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు మంగళవారం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలిపారు. ‘యూఎస్–ఇండియా ఫోరమ్: పార్ట్నర్స్ ఫర్ గ్రోత్’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో గోయెల్ మాట్లాడారు. పరస్పర భారీ వాణిజ్య ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల ఒనగూరుతాయని అన్నారు. 2020 నాటికి కేంద్రం లక్ష్యాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, 24 గంటలూ విద్యుత్, వంట గ్యాస్, ఇంటర్నెట్ విస్తృతి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతులు పదింతలు నిత్యం 2,50,000 బ్యారెళ్ల చమురు దిగుమతి భారత్‌కు అమెరికా నుంచి చమురు సరఫరాలు రెండేళ్లలో పది రెట్లు పెరిగి.. రోజుకు 2,50,000 బ్యారెళ్ల స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇంధన బంధం బలోపేతాన్ని ఇది తెలియజేస్తోంది. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన వ్యాపార భేటీలో అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్ బ్రోలెట్ మాట్లాడుతూ.. భారత్ 2017లో అమెరికా నుంచి నిత్యం 25,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. గత రెండేళ్లలో ఇది 25,000 బ్యారెళ్ల నుంచి నిత్యం 2,50,000 బ్యారెళ్ల దిగుమతి స్థాయికి చేరుకుంది. ఇది ఇంకా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని బ్రోలెట్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇంధన వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాన్బ్రోలెట్ను అభినందించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో అమెరికా 5.4 మిలియన్ టన్నుల చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు వనరుగా అవతరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో జరిగిన భారత్–అమెరికా వ్యాపార కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే, అమెరికాకు భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద చమురు ఎగుమతి మార్కెట్‌గా మారినట్టు ఆయన వివరించారు.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
విందుకు వేళాయె...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్ దంపతులను కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్ ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాలులోకి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకులు చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని, ఇందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ట్రంప్‌కి ఘనస్వాగతం పలకడమే నిదర్శనమని అన్నారు. అమెరికా తమకు అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ రెండు రోజులు అద్భుతంగా గడిచాయని, ఎంతో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని చెప్పారు. భారత్‌కు రావడం వల్ల ఎంతో నేర్చుకున్నామని,, ఎన్నో అందమైన అనుభూతులతో తిరిగి వెళుతున్నామని ట్రంప్ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ చేసిన అతిథి మర్యాదలకు ఆయనకు, ఆయన అనుచర వర్గానికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ), బీఎస్ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా),శర్బానంద సోనోవాల్(అస్సాం)..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విందు అనంతరం ట్రంప్ తిరుగు పయనమయ్యారు. ఇవాంకా, కుష్నర్ దంపతులను రాష్ట్రపతికి పరిచయం చేస్తున్న ట్రంప్..చిత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య విందు ప్రత్యేకత ఏమంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భలే పసందుగా ఉంది. ట్రంప్ మాంసాహార ప్రియుడు. ఎక్కడికెళ్లినా ఆయనకు బీఫ్ స్టీక్స్, మీట్ లోఫ్, బర్గర్స్ లాంటి వాటినే ఇష్టంగా లాగిస్తారు. అందుకే భారతీయ రుచులు, ట్రంప్ అభిరుచులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి భవన్ వర్గాలు రెండు రకాల మెనూలు తయారు చేశాయి. వెజిటేరియన్ వంటకాలు: కోరియాండర్ షోర్బా, ఆలూ టిక్కీ, పాలక్ పాప్డి, జార్ఖెజ్ జమీన్, దాల్ రైజినా వగైరాలు, నాన్ వెజ్ మెనూ: రాన్ అలీషాన్, కాజూ స్పైస్డ్ సాల్మన్, డెజర్ట్స్: హాజల్‌నెట్ యాపిల్ పై, కారమెల్ సాస్, మల్పువా రబ్రీరోల్.. ఎపిటైటర్‌గా అమ్యూజ్ బౌచె లంచ్ @ హైదరాబాద్ హౌస్ ట్రంప్, మోదీ మధ్య చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశారు. మోదీ పక్కా శాకాహారి కావడంతో రెండు రకాల మెనూలు సిద్ధం చేశారు. ఈ లంచ్‌కి ఫస్ట్ లేడీ మెలానియా, ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్లు హాజరయ్యారు. సారంగి, సంతూ ర్ జుగల్బందీ చేస్తూ హాయి గొలిపే సంగీతం, గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ భజనలు వస్తూ ఉంటే ఈ లంచ్ కార్యక్రమం జరిగింది. భజనలు, ఘజల్స్, పాశ్చాత్య సంగీత, హిందీ సినిమా పాటల్ని ప్లే చేశారు. అణువణువున దేశభక్తి ఉప్పొంగే మిలేసుర్ మేరా తుమ్హారా పాట కూడా వినిపించారు. హిందీ ఆపాత మధురాలైన మేరే గీత్ అమర్ కర్ దో, పీయా తోసే నైనా లగే రే, సత్యం శివం, సుందరం వంటివి గీతాలు ప్లే అవుతూ ఉంటే, అత్యంత ఆహ్లాదకర వాతారవణంలో భోజనాలు చేశారు. పైనాపిల్, మస్టర్డ్ సీడ్స్‌తో తయారు చేసిన అనాస్ సన్సావ్, పనసపండుతో తయారు చేసిన పాంచ్ ఫోరాన్ కాథల్, జీరా బన్, హాక్ చెనా కబాబ్, స్ప్రౌట్స్తో తయారు చేసిన సూప్, రకరకాల రోటీలు, నాన్లు, ఖర్జూరం హల్వా, అంజీర్ ఐస్‌క్రీమ్, చోటీ స్వీట్స్ వంటివి వెజ్ మెనూలో ఉన్నాయి. ఇక నాన్‌వెజ్ వంటకాల్లో కశ్మీర్ కుంకుం పువ్వు వేసిన రిచ్ గ్రేవీతో తయారు చేసిన కోడికూర, చికెన్ పఫ్‌లు, మసాలా తక్కువగా వేసిన మటన్ కర్రీ, పింక్ సాల్మన్ స్వీట్ బాసిల్ చట్నీ వడ్డించారు. -
సీఎన్ఎన్ X ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్ఎన్ వార్తాసంస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘మీ పనితీరు చూసి మీరే సిగ్గుపడాలి’అంటూ సీఎన్ఎన్ విలేకరి అకోస్టాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం ఇందుకు వేదికయింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ మీరు ప్రతిజ్ఞ చేస్తారా?, ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు? అంటూ ఈ సమావేశంలో సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్.. ‘ఎన్నికల్లో సాయం చేయాలని ఏ దేశాన్ని కోరలేదు. ఏ దేశం నుంచి నాకు సాయం అందలేదు కూడా’అని బదులిస్తూ.. ఇటీవల ఓ వార్తాంశంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీఎన్ఎన్ క్షమాపణ చెప్పాలన్నారు.(కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) నిజాన్ని వెల్లడించడంలో మీతో పోలిస్తే మాకు మంచి రికార్డే ఉంది’అని అకోస్టా అనడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ రికార్డు ఏమిటో నేను చెబుతా. ఆ రికార్డు చూసి మీరే సిగ్గుపడతారు’అని పేర్కొన్నారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2018లో మీడియా సమావేశంలో ట్రంప్‌తో వాదులాటకు దిగిన అకోస్టా మీడియా పాస్‌ను అధ్యక్ష భవనం రద్దు చేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో దానిని పునరుద్ధరించారు. (రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
నమస్తే ట్రంప్ అదిరింది...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనపై అంతర్జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. సీఎన్ఎస్ ఇంటర్నేషనల్, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, బీబీసీ సహా పాకిస్తానీ మీడియా సంస్థలు ట్రంప్ పర్యటనను ప్రముఖంగా ప్రస్తావించాయి. అశేష జనసందోహం నడుమ అమెరికా అధ్యక్షుడికి భారత్‌లో ప్రేమపూర్వక స్వాగతం లభించిందని సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. భారత ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ట్రంప్‌కు స్వాగతం పలికారని వెల్లడించింది. ట్రంప్ తన ప్రసంగంలో పలు భారతీయ పదాలను పలకడంలో తడబడ్డారని పేర్కొంది. ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా పేర్కొన్న ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది’అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రధాన శీర్షికగా చేసుకుంది. అయితే, మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తే విమర్శలను ట్రంప్ ప్రస్తావించలేదని తెలిపింది. పౌరసత్వ చట్టం సహా పలు అంశాల విషయంలో గత మూడు నెలలుగా భారత్‌లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన కాస్త ఊరడింపుగా మారిందని ద గార్డియన్ పేర్కొంది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం లభించిందని బీబీసీ పేర్కొంది. భారతీయ పదాలను పలకడంలో ట్రంప్ తడబడ్డారని తెలిపింది. ట్రంప్ పర్యటన విషయంలో పాకిస్తాన్ మీడియా మరోసారి తన తీరును వెళ్లగక్కింది. ట్రంప్ పర్యటన మొత్తంలో పాక్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేసింది. పాక్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ మాటలను ప్రస్తావించింది. -
కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!
న్యూఢిల్లీ: ఈ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) భారత్ అంతర్గత వ్యవహారమని, ఆ విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని తేల్చిచెప్పారు. భారత పర్యటన సందర్భంగా మంగళవారం ట్రంప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో ప్రజలకు మతస్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారనే తాను భావిస్తున్నానన్నారు. ‘వివాదాస్పద అంశాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఒక చిన్న సమాధానం నా మొత్తం పర్యటన సానుకూలతను ముంచేస్తుంది.(అమెరికాకు బయల్దేరిన ట్రంప్ బృందం) ఆ జవాబును మాత్రమే మీరు పట్టించుకుంటారు. నా పర్యటన అంతా పక్కనబెడ్తారు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే.. అంతా కోరుకుంటే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కశ్మీర్‌ను భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న అతి పెద్ద సమస్యగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఉద్రిక్తతలు తొలగేలా మధ్యవర్తితం చేయమంటే.. అందుకు నేను సిద్దం’అన్నారు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్.. ఇద్దరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ సమస్యపై కృషి చేస్తున్నారు’అని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. పాక్ నుంచి తలెత్తుతున్న ఉగ్రవాదంపై కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సరళంగా వ్యవహరించే, చాలా శక్తిమంతమైన నేత అని వ్యాఖ్యానించారు. ‘మోదీ గట్టి మనిషి. తానేమనుకుంటాడో అది చేస్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారు’అన్నారు. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వాణిజ్యంపై.. దిగుమతుల సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌పై విధిస్తున్న భారీ సంకాల విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ టారిఫ్‌ల విషయంలో అమెరికాతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ భారీగా మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందాన్ని భారత్ సమర్ధిస్తుందనే తాను భావిస్తున్నానన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నకు.. అలాంటి సమాచారమేదీ తనకు నిఘా వర్గాల నుంచి రాలేదన్నారు. ((సీఎన్ఎన్ X ట్రంప్) ఢిల్లీ అల్లర్లు అంతర్గతం ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లపై మోదీతో చర్చించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వ్యక్తిగత దాడుల గురించి చర్చించబోనన్నారు. అది భారత్ సొంత విషయమని స్పష్టం చేశారు. సీఏఏపై తాను ఏమీ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తన దేశ ప్రజల కోసం సరైన నిర్ణయాలే తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. భారత్‌లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిపై ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించాలన్న ప్రశ్నకు.. ‘మోదీతో చర్చల్లో ముస్లింల ప్రస్తావన కూడా వచ్చింది. క్రిస్టియన్ల గురించి కూడా చర్చించాం’అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ నుంచి తనకు శక్తిమంతమైన సమాధానం లభించిందన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చల్లో సీఏఏ అంశం చర్చకు రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. మత సామరస్యంపై ఇరువురు నేతలు సానుకూల భావాలను వ్యక్తం చేశారన్నారు. మత స్వేచ్ఛపై మాట్లాడా... ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా.. భారత్‌లో మత స్వేచ్ఛ విషయమై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ తెలిపారు. ‘భారత్‌లో మత స్వేచ్ఛపై చర్చించాం. భారత్‌లో ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలనే మోదీ కోరుకుంటున్నారు. ముస్లింలతో కలిసి పనిచేస్తున్నామని మోదీ నాకు చెప్పారు. గతంలోనూ పౌరులకు మతస్వేచ్ఛను అందించేందుకు భారత్ కృషి చేసింది’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ అద్బుతమైన నేత అని, భారత్ గొప్ప దేశమని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. పౌరులకు మతస్వేచ్ఛ అందించేందుకు భారత్ గొప్పగా కృషి చేసిందన్నారు. -
మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. మహాత్ముడి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలను ఉంచి, పూలతో అర్చించి నివాళులర్పించారు. అనంతరం ట్రంప్ సందర్శకుల పుస్తకంలో గాంధీజీని కొనియాడుతూ సందేశాన్ని రాశారు. ‘‘మహాత్ముడి ఆలోచనల నుంచి రూపు దిద్దుకున్న అత్యంత అద్భుతమైన సార్వభౌమ భారత్‌కు అమెరికా ప్రజలు బలమైన మద్దతు ఇస్తారు. ఇది నాకు దక్కిన అపూర్వమైన గౌరవం’’అని ఆ పుస్తకంలో రాశారు. ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు మహాత్ముడి ప్రస్తావన లేకుండా సందేశం రాయడంతో ట్విట్టర్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ అసలు గాంధీ పేరు విన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌ఘాట్‌లో ట్రంప్ రాసే సందేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సందేశం దగ్గర ట్రంప్‌తో పాటు మెలానియా కూడా సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్‌ను రాజ్‌ఘాట్‌కు తోడ్కొని వెళ్లారు. రాజ్‌ఘాట్ వద్ద మొక్కను నాటుతున్న ట్రంప్, మెలానియా -
త్వరలో భారీ ట్రేడ్ డీల్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందడం ఇరుదేశాల వ్యూహాత్మక మైత్రిలో కీలకమైన అంశమన్నారు. ఇరుదేశాల మధ్య త్వరలో ఒక భారీ, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని సంకేతాలిచ్చారు. భారత్, అమెరికాల మధ్య మంగళవారం జరిగిన సమగ్ర ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ట్రంప్‌తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం.. తదితర కీలక అంశాలు మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో జరిగిన ఆ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశమైన ద్వైపాక్షిక వాణిజ్యంపై మోదీ విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇరు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య ఈ విషయంపై సానుకూల ధోరణిలో చర్చలు జరిగాయని ప్రధాని వెల్లడించారు. ‘మా వాణిజ్య మంత్రులు అంగీకారానికి వచ్చిన విషయాలకు ఒక చట్టబద్ధ రూపం తీసుకువచ్చేందుకు ఇరుదేశాల అధికారుల బృందం కృషి చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్, నేను నిర్ణయించాం.ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయించాం. ఆ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకర ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నాం ’ అని మోదీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి అందించే నిధుల విషయంలో పారదర్శకత అవసరమని తాను, ట్రంప్ భావిస్తున్నామన్నారు. పరస్పర ప్రయోజనాలే కాకుండా, ప్రపంచ ప్రయోజనాలు లక్ష్యంగా తమ ఆలోచనలు కొనసాగాయని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలను అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, నార్కో టెర్రరిజాన్ని, ఇతర వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. ట్రంప్‌కు కేంద్ర మంత్రులను పరిచయం చేస్తున్న ప్రధాని ఆతిథ్యం అద్భుతం ట్రంప్‌కు భారత్‌లో లభించిన స్వాగతం చిరకాలం గుర్తుండిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే ముందు ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ.. భారత్, అమెరికాల సంబంధాలు ఈ స్థాయికి పెరగడానికి ట్రంప్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. భారత్‌లో ఈ రెండు రోజులు అద్భుతంగా సాగాయన్నారు. ముఖ్యంగా, మొతెరా స్టేడియంలో కార్యక్రమం గొప్పగా జరిగిందన్నారు. ‘అది నాకు లభించిన గొప్ప గౌరవం. నిజానికి ఆ స్టేడియానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నా కోసం కాదు.. మీ(మోదీ) కోసమే వచ్చారనిపించింది. స్టేడియం లోపల దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. మీ పేరును నేను పలికిన ప్రతీసారి చప్పట్ల వర్షం కురిసింది. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు’ అని ట్రంప్ మీడియా ముందే మోదీపై ప్రశంసలు గుప్పించారు. -
రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు.(సీఎన్ఎన్ X ట్రంప్) డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ వెంట రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు. ట్రంప్‌కు సంబంధించి పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
24 రోమియోలు 6 అపాచీలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మంగళవారం ఇరు దేశాల మధ్య ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. (తెలుపు.. స్వచ్ఛత) ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ –60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందాలు భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఒక ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అలాగే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్ఎన్జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి. (మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..) ‘హెచ్1 బీ’పై ఆందోళన చర్చల అనంతరం, వాటి వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి భారత్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య దాదాపు 5 గంటల పాటు చర్చలు కొనసాగాయన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నారు. అలాగే, చర్చల సందర్భంగా హెచ్1 బీ వీసాల విషయంలో తమ ఆందోళనలను అమెరికా దృష్టికి భారత్ తీసుకువచ్చిందన్నారు. అమెరికా హైటెక్ రంగంలో భారతీయుల పాత్రను ప్రధానంగా ప్రస్తావించామన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు కూడా ప్రస్తుతం గణనీయ స్థాయికి తగ్గిందని ష్రింగ్లా వెల్లడించారు. అమెరికా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత్ మొత్తం ఎగుమతుల్లో 12% యూఎస్‌కే ఉంటాయని తెలిపారు. ట్రంప్, మోదీల మధ్య సీఏఏ అంశం చర్చకు రాలేదని ష్రింగ్లా తెలిపారు. చర్చలో మత సామరస్యం అంశం ప్రస్తావనకు వచ్చిందని, భిన్నత్వం, బహుళత్వం భారత్, అమెరికాల ఉమ్మడి విలువలని ఆ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోనూ ట్రంప్ భారత్‌లోని మత విభిన్నతను, మత సామరస్యాన్ని ప్రస్తావించిన విషయాన్ని ష్రింగ్లా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి గెలుస్తారనే భావనతోనే.. ఈ స్థాయి స్వాగతం భారత్ నుంచి లభిస్తోందా? అని ప్రశ్నించగా.. వేరు వేరు పార్టీలకు చెందిన యూఎస్ అధ్యక్షులు భారత్‌కు వచ్చారని, ద్వైపాక్షిక సహకారం ప్రాతిపదికగానే వారితో భారత్ వ్యవహరిస్తుందని వివరించారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోండి పాక్ భూభాగంపై ఉగ్ర స్థావరాలకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఉగ్రదాడులకు పాక్ గడ్డను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. 26/11 ముంబై దాడుల సూత్రధారులు సహా ఆ తరహా దాడులకు పాల్పడిన వారికి అతి త్వరగా శిక్ష పడేలా చూడాలని పాక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జైషే మొహమ్మద్, లష్కరే, హిజ్బుల్ ముజాహిదీన్, డీ –కంపెనీ(దావూద్ ఇబ్రహీంకు చెందిన మాఫియా సంస్థ), అల్ కాయిదా, ఐసిస్, హక్కానీ నెట్వర్క్, తెహరీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ తదితర ఉగ్రవాద సంస్థలను, వాటి సోదర సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. -
మాట ముచ్చట C/O హైదరాబాద్ హౌస్
హైదరాబాద్ హౌస్..దేశానికి విదేశీ దేశాధినేతలు వచ్చినప్పుడల్లా ప్రపంచానికి ఈ పేరు వినిపిస్తుంది. ప్రముఖులు రావడం కంటే వారితో మన దేశం చర్చలు జరిపి చేసుకొనే ఒప్పందాలపైనే ప్రపంచ దృష్టి నిలుస్తుంది. ఆ ఒప్పందాలతోపాటే మార్మోగే పేరు హైదరాబాద్ హౌస్. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌తో కీలక ఒప్పందాలకు, ద్వైపాక్షిక చర్చలకు కూడా ఈ భవనమే వేదికై అంతర్జాతీయంగా మరోసారి వెలుగు వెలిగింది.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు)ఇంతకూ ఆ భవనమే ఎందుకు? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీతో కలసి ఓ ఊయలలో కూర్చొని కాసేపు మాట్లాడారు. రెండోసారి ఆయన.. మ హాబలిపురంలో సముద్ర తీరాన కొబ్బరి బొండాలను ఆస్వాదిస్తూ చర్చించుకున్నారు. అవ న్నీ సరదా చర్చలకే పరిమితం. అసలు సిసలు చర్చలంటే చలో హైదరాబాద్ హౌస్ అనాల్సిందే. రెండు దేశాల మధ్య ఒప్పందాలు అనగానే వాటిని ఫలప్రదం చేసే స్థాయిలో చర్చలు జరగాలి. ఆ చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రాంగణం ఉండాలి. అది అబ్బురపరిచే రీతిలో ఠీవిగా ఉండాలి. వాటన్నింటికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ హౌసే. ఎందుకంటే ఆ నిర్మాణ కౌశలం గంభీరంగా ఉంటుంది, అందులోని ఇంటీరియర్ రాజసా న్ని ఒలకబోస్తుంది. పచ్చికబయళ్లు గంభీరవా తావరణాన్ని తేలికపరుస్తాయి. ప్రవేశమార్గంలో వాడిన రాతి నగిషీలు మొదలు, భవనంపై న ఉన్న గుమ్మటం శిఖరం వరకు అన్నీ ప్రత్యేకమే, అందుకే ఆ భవనం ఢిల్లీలో ఓ ప్రత్యేకం. (నమస్తే ట్రంప్ అదిరింది... )నిజాం ప్యాలెస్ సే హైదరాబాద్ హౌస్ తక్ప్రపంచ ధనవంతుడిగా వెలుగొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏది చేసినా తన స్థాయికి తగ్గట్టే ఉండాలని కోరుకున్నాడు. దానికి అప్పట్లోనే హైదరాబాద్‌కు ఒనగూరిన హంగులే సాక్ష్యం. రాచరికంలో కనిపించిన ఆ ర్భాటాన్ని అమితంగా ఇష్టపడే ఆయన కలకు సజీవ సాక్ష్యమే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. విదేశాల నుంచి వస్తువులు..దేశ రాజధానిలో తమకు ఓ విడిది ఉండాలనే ది అప్పటి సంస్థానాధీశుల కోరిక. అందుకు నాటి ఆంగ్ల పాలకులు అంగీకరించారు. అంతే స్థలాలు సమకూర్చుకొని భారీ ప్యాలెస్‌లు ని ర్మించుకున్నారు. ఢిల్లీ అనగానే మన మదిలో మెదిలేది ఇండియా గేట్. ఔరా అనిపించేలా వెలుగొందుతున్న రాష్ట్రపతి భవన్. ఈ రెండు నిర్మాణాలను రూపొందించింది ఒక్కరే. ఆయనే ఎడ్విన్ లూటెన్స్. ఆంగ్లేయుల కాలంలో విఖ్యాత ఆర్కిటెక్ట్. నాటి వైస్రాయ్ అధికారిక నివాసం కోసం అద్భుతంగా రూపొందించిన భవనం అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప ప్యాలె స్‌గా అలరారింది. దాన్ని చూడగానే ఢిల్లీలోని తన అధికారిక నివాసం అలాగే ఉండాలన్న ఉ ద్దేశంతో ఎడ్విన్‌కు దాని ప్రణాళిక బాధ్యతలు అప్పగించాడు ఏడో నిజాం. ఇంకేముంది.. ఫర్నిచర్ కోసం కలప, ఫ్లోరింగ్ కోసం రాళ్లు విదేశాల నుంచి చకచకా వచ్చేశాయి. 1926లో నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లలో పూర్తి చేశా రు. 8.77 ఎకరాల విస్తీర్ణంలో 36 గదులతో కూడిన ఈ భవన నిర్మాణానికి రూ. 1.86 కో ట్లు ఖర్చయ్యాయి. తొలుత నిజాం ప్యాలెస్‌గా పేరొందిన ఈ భవనం స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ హౌస్‌గా మారింది. కొడుకులకు నచ్చలేదు.... నిజాం జీవన విధానం పూర్తి ఇస్లాం పద్ధతిలో ఉండేది. మతానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వారసులనూ అలానే పెంచా రు. ఆయన కుమారులు అంతకంటే ఎక్కువ గా మతానికి ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ హౌస్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలకు కూడా అదే కారణమైంది. రాజప్రాసాదంలా ఉండాలన్న ఉద్దేశం తో హైదరాబాద్ హౌస్‌కు ఆయన ఆర్కిటెక్ట్‌గా నియమించుకున్న ఎడ్విన్‌కు నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పటికే సిద్ధమైన వైస్రాయ్ భవనంపై ఉండే గుమ్మటం (డోమ్) సాంచీలో ఉండే బౌద్ధస్థూపం నమూనాలో నిర్మించారు. దానికి కాస్త పోలికలుంటూనే యూరోపియన్ నిర్మాణ శైలితో నియో క్లాసికల్‌గా హైదరాబాద్ హౌస్‌పై డోమ్‌ను నిర్మించారు. దీంతోపాటు మొత్తం భవనం నాటి ఆధు నిక యురోపియన్ ఆర్కిటెక్ట్ శైలితో రూపొందింది. దీన్ని చూసి దేశవిదేశీ ప్రముఖులు అద్భుతంగా ఉందని మెచ్చకున్నారు. ఈ మెచ్చుకోలుకు నిజాం పొంగిపోయాడు. కానీ ఆయ న ఇద్దరు కుమారులు అజంజాహి, మొజం జాహీ మాత్రం నొచ్చుకున్నారు. అందుకే వారు ఆ భవనంలో ఉండలేమని తేల్చి చెప్పారు. కాసేపు భవనంలో కాలక్షేపం చేసినా.. తర్వాత వాళ్లు అందులోకి రావడానికి నిరాకరించారు. నాలుగు పర్యాయాలే వచ్చిన నిజాంఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఆ అద్భుత ప్యాలెస్‌ను నిజాం సందర్శించింది మాత్రం నాలుగు పర్యాయాలేనట. 1928లో భవనం ప్రారంభానికి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ర్యాలీ మధ్య ఆయన భవనానికి చేరుకుని అందులో విడిది చేశారు. ఆ తర్వాత 1932లో కుమారులతో కలిసి వచ్చారు. స్వాతంత్య్రానంతరం ఒక పర్యాయం వచ్చారు. హైదరాబాద్ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం అయ్యాక రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించిన నిజాం 1954లో చివరిసారి హైదరాబాద్ హౌస్‌కు వచ్చారు. నెహ్రూకు హైదరాబాద్ చాయ్ తాగించిందిక్కడే నిజాం తన చివరి పర్యటనలో భాగంగా ఆ ప్యాలెస్‌కు వచ్చినప్పుడు అక్కడ భారీ ఎత్తున గార్డెన్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నాటి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారికి ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ చాయ్ తాగించారు. ప్యాలెస్ ముందు పచ్చికబయళ్లలో అటూఇటూ కలియతిరుగుతూ నెహ్రూ చాయ్‌ను ఆస్వాదించారని చెబుతారు. ఇప్పుడు అదే ప్రధాన ఆతిథ్య విడిదివిదేశీ ప్రముఖులు వస్తే చాలు ద్వైపాక్షిక చర్చలు, ఉమ్మడి విలేకరుల సమావేశాలు, సదస్సులు, స మావేశాలు..ఇలా అన్నింటికీ ఇప్పు డు హైదరాబాద్ హౌసే వేదిక. మోదీ ప్రధాని అయ్యాక భారత్‌కు విదేశీ దేశాధినేతల రాక బాగా పెరిగింది. దాంతోపాటు హైదరాబాద్ హౌస్‌లో సందడి కూడా అధికమైంది. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తుండగానే... అక్కడకు కాస్తంత దూరంలో హింస పెచ్చరిల్లింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... రెండు వర్గాలూ పెట్రేగిపోయాయి. దీంతో 2 రోజుల్లో ఏకంగా 13 మంది బలైపోయారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోమవారం మొదలైన ఘర్షణలు... మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు అవతలివర్గం తాలూకు దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని తగలబెట్టేయడంతో మంగళవారం స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. అల్లరి మూకలు మారణాయుధాలతో వీధుల్లో స్వేచ్ఛగా స్వైరవిహారం చేశాయి. ఈ ఘర్షణల్లో సోమవారం 5 మంది, మంగళవారం మరో 8 మంది బలైపోయారు. మరో 200 మంది వరకూ గాయపడగా... వారిలో 48 మంది పోలీసులే!. కనిపిస్తే కాల్చివేయాలంటూ పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా చెప్పారని మౌజ్‌పూర్ స్థానికులు చెప్పగా, అలాంటి ప్రకటన చేయలేదని డీసీపీ వేద్‌ప్రకాశ్ చెప్పారు.(సీఎన్ఎన్ X ట్రంప్) మరిన్ని ప్రాంతాలకు చిచ్చు... ఈ అల్లర్లు మంగళవారం కొత్త ప్రాంతాలకు పాకాయి. ఆందోళనకారులు స్వేచ్ఛగా లూటీలు, దహనాలకు తెగబడటంతో చాంద్ భాగ్, భజన్‌పురా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గోకుల్పురిలోఅల్లరిమూకలు రెండు అగ్నిమాపక వాహనాల్ని ధ్వంసం చేశారు. దుండగులు కనిపించిన దేన్నీ వదిలిపెట్టకుండా.. పెట్రోల్ పోసి నిప్పుపెడుతూ రెచ్చిపోయారు. ఫలితం ధ్వంసమైన వాహనాల భాగాలు, కాలిపోయిన టైర్లు, రాళ్లు ఇటుకలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. రాళ్లు, రాడ్లు, ఆఖరికి కత్తులు కూడా పట్టుకుని ఆందోళనకారులు రెచ్చిపోవటంతో.. వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించారు. కొన్నిచోట్ల అల్లరిమూకలు సైతం హెల్మెట్లు ధరించడం గమనార్హం. మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, జఫరాబాద్‌లలో కర్ఫ్వూ విధించారు. (నమస్తే ట్రంప్ అదిరింది... ) అల్లర్లు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసుల కాల్పుల్లో గాయపడిన వ్యక్తి సగం మందికి బుల్లెట్ గాయాలే... మంగళవారం ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 8 మంది మరణించారని, మరో 35 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. గాయపడ్డ వారిలో సగం మంది బుల్లెట్ గాయాలు తగిలిన వారే. ఒకవైపు హింస కొనసాగుతుండగానే... మరో వైపు పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) గవర్నరు, సీఎంలతో అమిత్‌షా భేటీ ఢిల్లీలో అల్లర్లపై హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు అనిల్ బైజాల్‌తో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్ చీఫ్ అమూల్య పట్నాయక్‌లు దీనికి హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలూ ఈ విషయంలో కలిసికట్టుగా వ్యవహరించాలని, అన్ని కాలనీల్లో తక్షణం శాంతి కమిటీలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గడిచిన దశాబ్దకాలంలో ఢిల్లీలో ఎన్నడూ ఇంతటి హింస చెలరేగలేదు. జేకే 24/7 న్యూస్ విలేకరికి, ఎన్డీటీవీ విలేకరులకు కూడా కొందరికి గాయాలయ్యాయి. చాలాచోట్ల 144వ సెక్షన్ విధించినా దాన్ని పాటించేవారే కరువయ్యారు. కాగా అల్లర్లను అదుపు చేయడానికి తమ వద్ద తగినన్ని బలగాలు లేవని, ఉంటే వెంటనే అదుపు చేసి ఉండేవారమని కమిషనర్ అమూల్య పట్నాయక్ హోంశాఖకు చెప్పినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఢిల్లీ పోలీస్ పీఆర్ఓ అధికారికంగా స్పందిస్తూ... అదంతా వాస్తవం కాదని, తమవద్ద తగినన్ని బలగాలున్నాయంటూ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు, సుప్రీం విచారణ నేడు ఈశాన్య ఢిల్లీలో 3 రోజులుగా చెలరేగుతున్న అల్లర్లలో హింసకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మంగళవారం వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారిస్తామని ఆయా కోర్టులు కక్షిదారులకు తెలిపాయి. పిటిషన్‌ను మంగళవారమే విచారించాలని డిమాండ్ చేశారు. అయితే జస్టిస్ జి.ఎస్.సిస్థానీ, జస్టిస్ ఏ.జే.భంభానీలతో కూడిన బెంచ్ బుధవారం ఉదయం విచారిస్తామని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా వీరు డిమాండ్ చేశారు. పోలీసులు మాయం ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదని, ఆందోళనకారులు సాధారణ ప్రజలను బెదిరిస్తూ.. దుకాణాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లిపోయారని ఓ పౌరుడు తెలిపారు. 1984 సిక్కు అల్లర్ల తరువాత అంతటి పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి అని మరో వ్యక్తి చెప్పారు. ఆందోళన కారులు రువ్విన రాళ్లు తగిలి గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ మరణించారని, అయితే మరణించిన ఇతరులు ఏ కారణంగా మరణించారో? చంపింది ఎవరో తెలియరాలేదని అధికారులు మంగళవారం తెలిపారు. నగరంలో పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నగర సరిహద్దులను మూసివేయడం ద్వారా హింసకు పాల్పడే వారిని అడ్డుకోవచ్చునని సీఎం సూచించారు. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కొంత ఆశ... కొంత నిరాశ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అసాధారణమైన స్వాగత సత్కారాలు అందుకుని స్వదేశంలోని ఓటర్లకూ, ప్రత్యర్థి పక్షానికీ తన ఘనతను చాటిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజైన మంగళవారం పూర్తిగా ద్వైపాక్షిక అంశాలపై దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చల్లో మూడు వందల కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు ఖరారు చేసుకోవడంతోపాటు ఇంధనరంగంతోసహా మూడు రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరు దేశాల అధికారుల మధ్యా సాగిన చర్చోపచర్చలు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ముందనుకున్నట్టే వాణిజ్య రంగంలో కుదరవలసిన ఒప్పందంపై ఈ పర్యటనలో సంతకాలు కాలేదు. రెండు దేశాల ప్రస్తుత సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉన్నాయని ట్రంప్ అభివర్ణించడాన్నిబట్టి చూస్తే మన దేశంపై ఆయనకున్న అసంతృప్తి క్రమేపీ తగ్గుతున్నదని భావించాలి. అయితే అమెరికా సరు కులపై భారత్ విధిస్తున్న ‘అధిక టారిఫ్’ల గురించి, దానివల్ల తమకు జరిగే నష్టం గురించి ఆయ నింకా చెప్పడం మానుకోలేదు. తమను భారత్ ‘న్యాయసమ్మతం’గా చూడాలని, అధిక టారిఫ్‌లు తగ్గించుకోవాలని ఆయన మరోసారి చెప్పారు. అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్నవారు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించ వలసిన బాధ్యత తమకున్నదని, వాటిని సరిచేయడం కూడా తమ కర్తవ్యమేనని భావిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో వివాదాస్పద అంశంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం గురించి ట్రంప్ ఆ కోణంలోనే మోదీ వద్ద ప్రస్తావిస్తారని పలువురు ఆశించారు. కానీ పాలకుడిగా గత మూడున్న రేళ్లనుంచి ట్రంప్ వ్యవహారశైలిని గమనిస్తున్నవారు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈ పర్యటన నుంచి ట్రంప్ ఆశిస్తున్న ప్రయోజనాలు వేరు. అమెరికాలో ఈ ఏడాది ఆఖరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గరిష్టంగా ప్రయోజనం పొందడానికి ఆయన ఈ పర్యటనకొచ్చారు. అక్కడున్న ఎన్నారైల అభిమానాన్ని చూరగొనడంతోపాటు భారత్‌తో కుదుర్చుకునే ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నానన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగించాలన్న తాపత్రయం ట్రంప్‌కు ఉంది. అందుకు పూర్తి సహాయసహకారాలు అందించిన మోదీ ప్రభుత్వాన్ని ఆయన ఇరకాటంలో పెట్టేలా మాట్లాడతారని ఎవరూ అనుకోరు. అందుకే సీఏఏ అంశం పూర్తిగా భారత్ ఆంతరంగిక సమస్యని తేల్చిచెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై అడిగిన ప్రశ్నకూ ఆ మాదిరే జవాబిచ్చారు. అయితే, మత స్వాతంత్య్రానికి విఘాతం కలుగుతున్నదని వచ్చిన ఆరోపణలను మోదీ దృష్టికి తీసుకెళ్లానని... ఆ విషయంలో ముస్లింలు కోరుకుంటున్నదేమిటో తెలుసుకుంటున్నామని ఆయన జవాబిచ్చారని ట్రంప్ అన్నారు. మోదీ శక్తిమంతుడని, ఇలాంటి సమస్యలను అధిగమిస్తారని కూడా చెప్పారు. కశ్మీర్ విషయంలో మొదటినుంచీ ఉన్న అభిప్రాయాన్నే మరోసారి ట్రంప్ ప్రకటించారను కోవాలి. కశ్మీర్ సమస్య విషయంలో భారత్, పాకిస్తాన్లకు వేర్వేరు కోణాలున్నాయని, ఆ రెండు దేశాలూ కలిసి చర్చించుకుని ఈ విషయంలో ఒక అంగీకారానికి రావాలని కోరుకుంటున్నట్టు తెలి పారు. బహుశా ఒకటికి రెండుసార్లు దీనిపై మీడియా ప్రశ్నించడంవల్ల కావొచ్చు... రెండు దేశాలూ కోరితే మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమేనని చెప్పారు. అమెరికాకున్న ఈ మధ్యవర్తిత్వం ఉబలాటం ఎంత పాతదో, దీనిపై మన దేశానికున్న అభ్యంతరం కూడా అంతే పాతది. ట్రంప్ ఈ విషయంలో చేసిన ప్రకటన మన దేశానికి సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. మన దేశం పదే పదే కశ్మీర్ సమస్య గురించి పాక్‌తో చర్చించడానికి సిద్ధంగా వున్నామని చెబుతోంది. ఈ విషయంలో ఎవరి మధ్యవర్తి త్వాన్ని అంగీకరించబోమని గతంలో అనేకసార్లు చెప్పింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యంగా గత ఆగస్టులో కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక ఈ వైఖరి మరింత మారింది. కశ్మీర్ గురించి పాక్‌తో చర్చించాల్సిందేమీ లేదని, అయితే దాని ప్రాపకంతో సాగుతున్న హింస గురించి ఆ దేశంతో మాట్లాడటానికి సిద్ధమని మన దేశం చెబుతోంది. ఈ నేప థ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్య ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందనడంలో సందేహం లేదు. దీనిపై ప్రభుత్వ స్పంద నేమిటో చూడాల్సివుంది. స్వర్గీయ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1998లో అణు పరీక్ష జరిపినందుకు అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన దేశంపై ఆంక్షలు విధించారు. మరో రెండేళ్ల తర్వాత వాటిని పాక్షికంగా తొలగించడంతోపాటు మన దేశంలో అయిదు రోజుల పర్యటనకు కూడా వచ్చారు. మొత్తంగా రెండు దేశాల మధ్యా ఈ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహసంబంధాలను పునశ్చరణ చేసుకుంటే అవి నానాటికీ బలపడుతూనే వచ్చాయని అర్థమవుతుంది. జార్జి బుష్ ఏలుబడిలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నాక ఈ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. తాజా చర్చల్లో ఇరు దేశాల సంబంధాలనూ అంతర్జాతీయ సమగ్ర భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించడం కూడా అటువంటిదే. అయితే తాలిబన్లతో అమెరికా కుదుర్చుకోబోయే ఒప్పందం గురించి మోదీకి వివరిస్తే, ఆయన బ్రహ్మాండంగా ఉన్నదని మెచ్చుకున్నారనడం వాస్తవదూరంగా ఉంది. అఫ్గాన్‌లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం తాలిబన్ల చేతిలో పెడితే అది భారత్‌కు తలనొప్పిగా మారుతుందని అమెరికాకు తెలియందేమీ కాదు. కానీ ఏదోవిధంగా సమస్య పరిష్కారం అయినట్టు చూపించి నిష్క్రమించాలని అమెరికా తొందరపడుతోంది. ఒకపక్క మనతో సాన్నిహిత్యాన్ని నెరపు తూనే, మన దేశం నుంచి గరిష్టంగా లబ్ధి పొందాలని చూస్తూనే పాక్ ప్రాపకంతో తాలిబన్లతో ఒప్పందానికి సిద్ధపడుతోంది. ఈ క్రమంలో మన వైఖరిని పరిగణనలోకి తీసుకోకపోవడం, ఈ ప్రాంత భద్రతకు తగిన హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో అమెరికాతో మన దేశం వివరంగా మాట్లాడవలసివుంది. -
భారత్ పర్యటనలో భారీ ప్రయోజనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. మొతెరా స్టేడియం నుంచి లక్షా పాతిక వేలమంది సమక్షంలో ప్రసంగించిన ట్రంప్ ఆద్యంతం అమెరికా–భారత్ స్నేహ సంబంధాల విశిష్టతను ప్రస్తావించారు. రాడికల్ ఇస్లాం ఉగ్రవాదాన్ని సహించబోమని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన ప్రత్యక్షంగా పాకిస్తాన్‌కు, పరోక్షంగా చైనాకు తీవ్ర హెచ్చరిక. అయితే ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే భారత్ తన ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఈ విషయంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భారత్ బలానికి ఆర్థిక పటిష్టతే అసలైన పునాది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక భారత్ పర్యటన ముగిసింది. ఆయన రెండు రోజుల పర్యటన భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. ఏ అమెరికన్ అధ్యక్షుడూ చేయని విధంగా ట్రంప్ వ్యవహారాలను నడుపుతారు. ఇంతవరకు ట్రంప్ తన జీవితకాలంలో ఒక్క ఎన్నికలో మాత్రమే పోటీ చేశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ట్రంప్ అమెరికన్ రాజకీయ దిగ్గజం హిల్లరీ క్లింటన్‌పై అందరి అంచనాలకు మించి విజయం సాధించారు. 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ చేయలేని విధంగా పాలన సాగించారు. అన్ని చట్టాలనూ ఆయన తోసిపడేశారు. నేడు ఆయన అతిశక్తిమంతుడు, సమయస్ఫూర్తి కలిగిన వారు కూడా. తన కేబినెట్ మంత్రులను కానీ, సాధారణ మీడియాను కానీ ట్రంప్ అస్సలు ఉపయోగించుకోరు. అనేక టీవీ చానళ్లు చూసి సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవును.. ఈరోజు అమెరికా ఆర్థికవ్యవస్థ గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వికాసంతో పరవళ్లు తొక్కుతోందనటం నిజం. అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ట్రంప్ చాలా అరుదుగా మాత్రమే విదేశాల్లో ప్రయాణించారు. భారత్ గురించి, దాని గతం గురించి ట్రంప్‌కి పెద్దగా తెలీదు. కానీ ప్రపంచంలో సాంకేతికరంగంలో పలువురు భారతీ యులు ఆధిపత్యం చలాయిస్తున్నారని తెలుసుకున్న ట్రంప్ భారతీ యుల ప్రతిభా సామర్థ్యాలపట్ల గొప్ప గౌరవం ప్రదర్శిస్తారు. అయితే భారత్ గురించి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఏమీ తెలీదు. పైగా భారతీయ ప్రముఖులను తాను ఎన్నడూ కలవలేదు. అందుకే తనతో కలిసి మోదీ నడుస్తారా అనే ఆందోళన ట్రంప్‌ను పీడిస్తోంది. భారత్‌కు అమెరికా తోడు ఎందుకు? మనదేశానికి ఇరుగు పొరుగు సమస్య చాలా పెద్దది. పాకిస్తాన్, చైనా దేశాలతో మనకు 10 వేల కిలోమీటర్ల సరిహద్దులున్నాయి. ఈ రెండు దేశాలతో భారత్‌కు తీవ్ర శతృత్వం ఉంది. పైగా భారత్‌కు వీటితో యుద్ధం చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే భారత్ నిరంతరం అంతర్జాతీయ ముఖచిత్రంలో కనబడుతూ, ఈ రెండు దేశాలూ ఇతర దేశాలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. అటు కశ్మీర్ విషయంలో పాక్‌తో ఘర్షణ పడుతూ, ఇటు చైనాతో సరిహద్దు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు తప్పకుండా అమెరికా మనసు గెల్చుకోవలసిన అవసరం ఉంది. మన శత్రుదేశాలు మనల్ని వేధించకుండా ఉండాలంటే అమెరికా మద్దతు పొందాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్నేహం అత్యవసరం. ఒక విదేశీ అధ్యక్షుడు భారత్‌లో అతి పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం చాలా అరుదు. కానీ రెండురోజుల ట్రంప్ పర్యటన భారీ విజయం పొందినట్లే మరి. ట్రంప్ పర్యటనలో మొదటి రోజు మరీ ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ట్రంప్, ఆయన కుటుంబం బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్న దృశ్యాలను చూడడానికి భారతీయులు మొత్తంగా టీవీ సెట్లకు అతుక్కుపోయారు. తొలిరోజు సాధించిన విజయం ట్రంప్ పర్యటన పొడవునా ఆధిపత్యం చలాయించిందనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో లక్షా పాతికవేలమంది జనం ముందు ట్రంప్ ప్రసంగాన్ని యావత్ ప్రపంచం దిగ్భ్రమతో చూసింది. ట్రంప్ భారత పర్యటన యావత్తులో ఇది ఒక సానుకూల మూడ్‌ని తీసుకొచ్చింది. మొతెరా స్టేడియంలో సభ, రోడ్ షోను ప్రధాని మోదీ అత్యద్భుతరీతిలో నిర్వహించారు. అంతకుమించి ట్రంప్ స్టేడియంలో గొప్పగా ప్రసంగించారు. ఈ ఘటన చూస్తే దేశాలకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని 230 సంవత్సరాల క్రితం ప్రముఖ బ్రిటిష్ ప్రధాని లార్డ్ పాల్మర్‌స్టోన్ చెప్పింది గుర్తుకొస్తుంది. ఆ ప్రకటన అన్ని రకాల దౌత్యానికి పునాది. అధ్యక్షులు వస్తారు వెళతారు కానీ భారతీయ ప్రయోజనాలు కొనసాగుతాయి. ట్రంప్ భారత్ పర్యటన ఫలితాలు మొతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం ఆయన పర్యటన మొత్తంలో కీలకమైంది. ఆ స్టేడియంలో అమెరికా విదేశీ విధానాన్ని, భారత్ పట్ల తన వైఖరిని ట్రంప్ ప్రసంగం విస్పష్టం చేసింది. పదాలను వెతుక్కోకపోవడం, అభిప్రాయ ప్రకటనలో తడబాటు లేకపోవడం ట్రంప్ ప్రసంగంలో ఆద్యంతం వ్యక్తమయ్యాయి. ట్రంప్ భారత పర్యటనలో మనకు ఒరిగే ప్రయోజనాలు చూద్దాం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో భారత్, అమెరికాకు ఉమ్మడి లక్ష్యం ఉందని రెండు దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాడతాయని ట్రంప్ చెప్పారు. ఏ అమెరికన్ అధ్యక్షుడు, లేక యూరోపియన్ లీడర్ ఇంత స్పష్టంగా ఉగ్రవాద నిర్మూలనా పోరాటం గురించి చెప్పి ఉండలేదు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని దేశాలను ట్రంప్ నేరుగా మొతెరా స్టేడియం నుంచి హెచ్చరించారు. తన శక్తియుక్తులన్నింటినీ మేళవించి ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాడతానని ట్రంప్ చేసిన హెచ్చరిక పాకిస్తాన్‌కు, అలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశానికైనా సరే తీవ్రమైన సందేశాన్నే ఇచ్చింది. అమెరికా సైన్య ఆధునీకరణకు 2.5 ట్రిలియన్ డాలర్లను వెచ్చించానని, ఈ శక్తివంతమైన సైన్యంతోనే ప్రపంచమంతటా ఉగ్రవాదుల పని పడుతున్నామని, ఐసిస్ అధినేత బాగ్దాదిని కూడా మట్టుపెట్టామని ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో భారత్ వెనుక తాముం టామనే బలమైన సందేశాన్ని ట్రంప్ పంపించారు. ప్రతి దేశం కూడా తన సరిహద్దులను కాపాడుకుని తీరాల్సిందేనని, ఎవరు తమ భూభాగంలోనికి ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుందని ట్రంప్ చెప్పారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ అంశాలను ట్రంప్ నేరుగా ప్రస్తావించినట్లయింది. అలాగే భారతీయ ఎన్నారైలను, కష్టించి పనిచేసే భారతీయులను ట్రంప్ ప్రశంసించారు. ఎన్నారైలకు, భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భవిష్యత్తులో ట్రంప్ మరింత ప్రోత్సాహం అందిస్తారని భావించవచ్చు. పైగా ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు ట్రంప్ ఇంత ప్రశంసల వర్షం ఎన్నడూ కురిపించలేదు. గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ భారతీయ సంస్కృతి, సామాజిక చరిత్రకు తానెంతో విలువ ఇస్తున్నట్లు సందేశం పంపారు. ఇతర దేశాలు ప్రత్యేకించి చైనా బలాన్ని ప్రదర్శిస్తూ, బెదిరి స్తున్న నేపథ్యంలో భారత్ ప్రజాస్వామిక మార్గంలో పయనిస్తోందని ట్రంప్ కితాబిచ్చారు. శాంతియుత, ప్రజాస్వామిక మార్గాల్లో భారత్ ఎదుగుతున్నందుకు అభినందించారు. ట్రంప్ పర్యటన నుంచి భారత్ పొందే ప్రయోజనాలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ట్రంప్ మరోసారి ఇస్లాం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. ట్రంప్ సందేశం నేరుగా పాకిస్తాన్‌కు చేసిన తీవ్ర హెచ్చరిక. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా తాను సహించబోమని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. పైగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, పాకిస్తాన్ దేశాలు చైనాకు సన్నిహితం కావడానికి ప్రయత్నించడం తనకు ఏమాత్రం సంతోషం కాదని ట్రంప్ సందేశమిచ్చారు. పాకిస్తాన్, చైనాలు ట్రంప్ భారత పర్యటన ప్రభావాన్ని ఇకపై జాగ్రత్తగా మదింపు చేసుకోవలసి ఉంది. భారత అభిప్రాయాలను గౌరవించి తీరాలన్న సందేశం చైనాకు అందింది. పైగా భారత, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్న విషయాన్ని చైనా గ్రహించి మెలగాల్సి ఉంది. నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న అనేకమంది భారతీయులు ఈ ఏడాది ఆఖరిలో జరగబోయే ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్‌ని మోదీ ఇంత బాహాటంగా బలవర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా శక్తిమంతుడిగా ఉన్నారు. ట్రంప్ గెలిస్తే తాను భారత్‌కు మరింత మంచి స్నేహితుడు అవుతారు. ట్రంప్ ఓడిపోతే మనకు అదేం పెద్ద విషయం కాదు. భారత్ అతి పెద్ద దేశం కాబట్టి కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే భారత్‌తో సర్దుబాటు కావలసి ఉంటుంది. కానీ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆర్థికాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవలసి ఉంది. ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే ఇదొకటే మార్గం. కాబట్టి మోదీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై మరింతగా దృష్టి పెట్టాలి. భారత్ బలానికి ఇదే అసలైన పునాది. వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
అమెరికాకు బయల్దేరిన ట్రంప్ బృందం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. రాష్ట్రపతి భవన్లో విందు అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికాకు ట్రంప్ బృందం బయలుదేరింది. భార్య మెలానియాతో కలిసి అమెరికాకు ట్రంప్ తిరుగు పయనమయ్యారు. చదవండి: ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు -
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
-
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ట్రంప్ దంపతులతో పాటు ఈ విందులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ కేంద్ర మంత్రులు, తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రపతి భవన్ విశేషాలను స్వయంగా వివరించారు. విందుకు విచ్చేసిన అతిథులను వారికి పరిచయం చేశారు. ఆపై విందులో ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించారు. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్ సర్వ్ చేసిన తర్వాత.. సాలమన్ ఫిష్ టిక్కాతో ఈ గ్రాండ్ డిన్నర్ ప్రారంభమైంది. వెజిటేరియన్ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను వడ్డించారు. రాష్ట్రపతి భవన్ సిగ్నేచర్ డిష్ దాల్ రైసీనాతో పాటు.. మటన్ బిర్యానీ, మటన్ ర్యాన్, గుచ్చీ మటార్(మష్రూమ్ డిష్) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో భాగమైంది. డిన్నర్ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్ రాబ్డీలను అతిధులు ఆరగించారు. చదవండి : ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్ -
టార్గెట్ టెర్రరిజం
-
డెమొక్రాట్లు హార్వేను ప్రేమిస్తారు: ట్రంప్
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ బడా నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పును మహిళలు సాధించిన గొప్ప విజయంగా ట్రంప్ అభివర్ణించారు. భారత పర్యటనలో భాగంగా.. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. ‘‘ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నందున ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోలేకపోయాను. బాధితుల పరంగా చూస్తే ఇది ఎంతో గొప్ప విజయం. ఈ తీర్పు శక్తిమంతమైన సందేశాన్ని అందిస్తుంది’’అని పేర్కొన్నారు. (విందు: ట్రంప్ మెనూలోని వంటకాలివే!) ఇక గతంలో హార్వే వెయిన్‌స్టీన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ట్రంప్... హార్వే తనకు అస్సలు నచ్చడని మంగళవారం పేర్కొన్నారు. ప్రతిపక్ష డెమొక్రాట్లకు మాత్రం అతడు అత్యంత ప్రీతిపాత్రుడని విమర్శలు గుప్పించారు. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళగా ఖ్యాతికెక్కిన హిల్లరీ క్లింటన్ హార్వేను ప్రేమిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ అందరికీ తెలుసు కదా.. నేను హార్వే వెయిన్‌స్టీన్‌కు చాలా దూరంగా ఉంటాను. అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటమి కోసం కృషి చేస్తానని అతడు అందరికీ చెప్పాడు. కాబట్టి తనతో నాకు సత్సంబంధాలు లేవు. తను నాకు నచ్చడు. అయితే డెమొక్రాట్లకు హార్వే చాలా డబ్బు ఇచ్చాడు. అందుకే వాళ్లకు అతడంటే ఇష్టం. ముఖ్యంగా మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్లు అతడిని ప్రేమిస్తారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్) కాగా హాలీవుడ్ మూవీ మొఘల్‌గా ప్రసిద్ధి గాంచిన హార్వే వెయిన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది నటీమణులు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెయిన్‌స్టీన్ మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ కేసులో వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని తేలడంతో.. ఆయనను వెంటనే జైలుకు తరలించాలని జడ్జి సోమవారం ఆదేశించారు. ఇక హార్వే ఉదంతం ప్రపంచవ్యాప్తంగా...‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మీటూ కారణంగా పెద్దమనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న ఎంతో మంది నిజస్వరూపం బట్టబయలైంది.(80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే) ట్రంప్ భారత పర్యటన: సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
విందు: ట్రంప్ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అదే విధంగా ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తదితరులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలు తయారుచేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాల సమాచారం. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్ సర్వ్ చేసిన తర్వాత.. సాలమన్ ఫిష్ టిక్కాతో ఈ గ్రాండ్ డిన్నర్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వెజిటేరియన్ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను ట్రంప్ కుటుంబానికి వడ్డించనున్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్) అదే విధంగా రాష్ట్రపతి భవన్ ప్రఖ్యాత వంటకం దాల్ రైసీనాతో పాటు.. మటన్ బిర్యానీ, మటన్ ర్యాన్, గుచ్చీ మటార్(మష్రూమ్ డిష్) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో చేర్చారు. డిన్నర్ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్ రాబ్డీలను ట్రంప్ ఆరగించనున్నారు. దర్బార్ హాల్లో ట్రంప్‌నకు స్వాగతం పలికిన తర్వాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను లోపలికి తీసుకువెళ్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లోని నార్త్ డ్రాయింగ్ రూం వద్ద ఇరువురు కాసేపు భేటీ అవుతారు. (భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్) ఈ క్రమంలో తాజ్‌మహల్ ప్రతిమతో పాటు కశ్మీర్ కార్పెట్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ట్రంప్‌నకు బహూకరించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగే విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మహారాష్ట్ర, హరియాణా, బిహార్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇక డిన్నర్ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. (భారత పర్యటన విజయవంతం: ట్రంప్) ట్రంప్ భారత పర్యటన: సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
భారత్, పాక్‌లకు కశ్మీర్ మల్లు వంటిది: ట్రంప్
-
ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్
న్యూఢిల్లీ: భారత్ బ్రహ్మాండమైన దేశమని... ఈ రెండు రోజుల పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత ప్రజలు గతంలో కంటే ఇప్పుడు తమను మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారనుకుంటున్నానని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ప్రధానులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని... వారు కోరితే కశ్మీర్ అంశంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని... భారత్‌కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. (భారత పర్యటన విజయవంతం: ట్రంప్) ఉగ్రవాదంపై తాను పోరాడినంతగా ఎవరూ పోరాడలేదని.. ఐసిస్ చీఫ్ బాగ్దాదీని తాము అంతమొందించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని.. అమాయక ప్రజలను చంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే అమెరికా ప్రపంచానికి పోలీసు కాదని.. ఉగ్రవాదంపై అందరూ మరింత పోరాటం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం భారత్‌కు ప్రయోజనకరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని తెలిపారు. కశ్మీర్ అంశం భారత్- పాక్‌లకు ముల్లు వంటిదని.. ఈ విషయంలో తాను ఇరు దేశాధినేతలతో చర్చించడానికి సిద్ధమని తెలిపారు. (భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్) అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నారు.. ఇక భారత్‌తో వాణిజ్యం గురించి మాట్లాడుతూ.. ‘‘భారతీయ మార్కెట్ ఎంతో పెద్దది. చాలా విస్తృతమైనది. భారతీయ సీఈఓలతో భేటీ ఆసక్తికరంగా సాగింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు ఆసక్తిగా ఉన్నారు. అయితే టారిఫ్‌ల విషయంలో మాత్రం భారత్ వైఖరి అలాగే ఉంది. అమెరికాకు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నారు. భారత్‌తో ఒప్పందం అంటే అధిక టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాకు మోటారు సైకిళ్లు పంపినపుడు హార్లేడేవిడ్సన్ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో భారత ఎగుమతులకు మాత్రం ఎటువంటి టారిఫ్‌లు విధించడం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే హెచ్-1బీ వీసాల గురించి సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. -
సీఏఏ అల్లర్లపై స్పందించిన ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మంగళవారం సాయంత్రం ట్రంప్ మీడియా భేటీ సందర్భంగా దేశ రాజధానిలో తలెత్తిన హింసాత్మక నిరసనలను ప్రస్తావించగా ఈ ఘటనలను తాను విన్నానని, కానీ వీటిపై తాను చర్చించలేదని, ఇది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో తాము చర్చించామని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. మతస్వేచ్ఛపై ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఏఏ గురించి మోదీతో తాను చర్చించలేదని మోదీ స్పష్టం చేశారు. ఇక సీఏఏ హింసాత్మక నిరసనలు, వ్యక్తిగత దాడులు, ఘటనల గురించి తాను విన్నానని వాటిపై తాను చర్చించలేదని..వాటిని భారత్ ఎదుర్కొంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా రెండో రోజూ పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు అల్లర్లు జరిగే ప్రాంతాలకు పెద్ద ఎత్తున పోలీసులను తరలించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. చదవండి : నేను ఓడిపోతే మార్కెట్లు ఢమాల్.. -
కరోనా వైరెస్పై చైనా గట్టిగా పోరాడుతుంది
-
నేను ఓడిపోతే మార్కెట్లు ఢమాల్..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంపై అగ్ర దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత కార్పొరేట్ దిగ్గజాలతో మంగళవారం సాయంత్రం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడతూ ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించని పక్షంలో అమెరికా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే తమ మార్కెట్లు వేలకు వేల పాయింట్ల మేర పెరుగుతాయని, తాను ఓడితే అవి మీరెన్నడూ చూడని రీతిలో పేకమేడల్లా కూలిపోతాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భారత కార్పొరేట్లను కోరారు. కార్పొరేట్లు, నూతన పెట్టుబడులకు నియంత్రణలు, పన్నులను తగ్గించామని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క హైవే ప్రాజెక్టు క్లియరెన్స్‌కు 20 ఏళ్ల సమయం పడితే తాము క్లియరెన్స్ ప్రక్రియను రెండేళ్లకు కుదించామని పేర్కొన్నారు. పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ట్రంప్‌తో భేటీ అయ్యారు. చదవండి : ఆయుధాల అమ్మకానికే ఆ డీల్.. -
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని... ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌజ్‌లో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్.. ఢిల్లీలో ఉన్న అమెరికా ఎంబసీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత పర్యటనకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ కొనుగోళ్లు జరపడం మంచి విషయమని.. భారత పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి ట్రంప్ మాట్లాడుతూ... వైరస్‌ను రూపుమాపేందుకు చైనా ఎంతో కఠినంగా శ్రమిస్తోందని తెలిపారు.(భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్) ఈ విషయం గురించి తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక గత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ వచ్చినందు వల్ల అమెరికాలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం సాధ్యమైందని ట్రంప్ తెలిపారు. డెమొక్రాట్లు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రస్తుతం తాము అధికారంలోకి వస్తేనే స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయని పేర్కొన్నారు. హెల్త్‌కేర్, మిలిటరీ, ఉద్యోగాల విషయంలో తాము మెరుగైన ఫలితాలు రాబట్టామని తెలిపారు. తాము కఠినంగా వ్యవహరించడం వల్లే అమెరికాలో ప్రతీ పౌరుడు సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. (ట్రంప్ నోట పాకిస్తాన్.. జస్ట్ నాలుగుసార్లే!) -
అందరి చూపులు ఆమె వైపే..!
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ రెండవ రోజు తెలుపు రంగు సూట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెనుక తన భర్త జరెద్ కుష్నర్తో కలిసి ఇవాంక రాష్ట్రపతి భవన్ వద్దకు వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెలుపు రంగు సూట్ ధరించారు. ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే ఈ షేర్వానీని డిజైన్ చేశారు. పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టుతో షేర్వానీని అందంగా డిజైన్ చేశారు. దీనికి మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. స్లీవ్‌లెస్ కాకుండా తెలుగు రంగు సూట్‌తో పాటు స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. అందులో నిండుగా భారతీయత ఉట్టిపడేట్టు ఇవాంక కనిపించారు. చదవండి: ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్! ‘తాజ్’ అందాలకు ఇవాంక ఫిదా! -
ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
-
ఆయుధాల అమ్మకానికే ఆ డీల్..
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో నిలిచిన యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ విమర్శలు గుప్పించారు. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు బదులు వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్‌ను భాగస్వామ్యం చేయాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. బోయింగ్, లాక్‌హీడ్, రేతియన్ వంటి దిగ్గజ కంపెనీలకు లాభాల పంట పండిచేందుకు 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించే బదులు పర్యావరణ పరిరక్షణలో భారత్‌ను భాగస్వామిగా చేయడంపై దృష్టి సారిస్తే బావుండేదని శాండర్స్ హితవు పలికారు. వాతావరణ కాలుష్య నియంత్రణ, సంప్రదాయేతర ఇంధన వనరుల సృష్టి, ఉపాధి కల్పనలపై సమిష్టిగా మనం పని చేస్తూ మన ప్లానెట్ను కాపాడుకునేందుకు కృషి సాగించే వారమని శాండర్స్ ట్వీట్ చేశారు. 78 ఏళ్ల శాండర్స్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనను ఢీకొనే గట్టి పోటీదారుగా ముందుకొస్తున్నారు. కాగా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం రక్షణ ఒప్పందంపై వారు కీలక ప్రకటన చేశారు. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ కసరత్తు సాగిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా మిగులుతుందని వ్యాఖ్యానించారు. చదవండి : ట్రంప్ నోట పాకిస్తాన్.. జస్ట్ నాలుగుసార్లే! -
పాకిస్తాన్ మీడియా వక్రబుద్ధి!
పాకిస్తాన్ మళ్లీ తన వక్రబుద్ధిని చూపించింది. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌లోని కొన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలు ట్రంప్ పాకిస్తాన్‌ను ప్రశంసించినట్లు శీర్షికలు పెట్టాయి. భారత్‌లో పాకిస్తాన్‌ను పొగిడిన ట్రంప్ అని కథనాలు వెలువరించాయి. పాకిస్తాన్‌తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్‌తో దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నట్లు.. ట్రంప్ పేర్కొన్నారని స్థానిక పత్రికలు వార్తను ప్రచురించాయి. దీనికి సంబంధించి ప్రముఖ పాకిస్తాన్ పత్రిక కింది విధంగా కథనాన్ని ప్రచురించింది. ‘ఇండియాలో పాకిస్తాన్‌ను ప్రశంసించిన ట్రంప్’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించిన ఆ పత్రిక దాంతో పాటు సోమవారం భారత్ చేరుకున్న ట్రంప్ భారత లౌకితత్వాన్ని అభినందించారని పేర్కొంది. ‘మాకు పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి, అవి మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నాం’ అని ట్రంప్ ప్రసంగించినట్లు ప్రచురించింది. కాగా సోమవారం అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ మొతెరా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్, అమెరికా రెండు సరిహద్దుల్లో ఉగ్రవాదుల బెడదను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా ముందుకు సాగుతున్నామన్నారు. అమెరికా దృష్టిలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందన్న ట్రంప్.. దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అయితే పాక్ మీడియా మాత్రం... ట్రంప్ ప్రసంగంలో పాక్ పేరును ప్రస్తావించడాన్ని హైలెట్ చేసి కథనాలు వెలువరించడం గమనార్హం. అయితే పాకిస్తాన్, పాకిస్తాని పదాలకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ట్రంప్ ప్రసంగంలో చోటు దక్కింది. కాగా అహ్మదాబాద్‌లో ప్రసంగం అనంతరం ట్రంప్... ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఇక మొతెరా స్టేడియంలో లక్షమందితో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహంచిన సంగతి తెలిసిందే. (చదవండి: ట్రంప్ నోట పాకిస్తాన్.. జస్ట్ నాలుగుసార్లే!) -
ట్రంప్ నోట పాకిస్తాన్.. జస్ట్ నాలుగుసార్లే!
అహ్మదాబాద్: మొతెరా మైదానంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంతో భారతీయుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. 27 నిమిషాల పాటు ప్రసంగించిన అగ్రరాజ్యధినేత ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. టఫ్ నెగోషియేటర్ (గట్టి ప్రతినిధి) అంటూ మోదీకి ట్రంప్ కితాబిచ్చారు. దాదాపు 2800 పదాల్లో ఆయన ప్రసంగాన్ని రాసుకున్నారు. పలు పదాలను ఆయన పదే పదే ఉటంకించారు. ఇండియా, ఇండియాస్, ఇండియన్, ఇండియన్స్ పదాలను 60 సార్లు ఉచ్చరించారు. మిలటరీ, టెర్రరిజం, డిఫెన్స్, ఆర్మడ్, ఐఎస్ఐఎస్ పదాలు 20 సార్లు వచ్చాయి. మోదీ, ప్రైమ్ మినిస్టర్ పదాలను 17 సార్లు పలికారు. అలాగే ప్రధాని మోదీ తన ప్రసంగంలో ట్రంప్ పేరును 22 పర్యాయాలు ఉచ్చరించారు. లవ్, లవ్స్, హర్మోనీ, ఫ్రెండ్షిప్, పీస్, యూనిటీ పదాలు 14 సార్లు ట్రంప్ నోటి నుంచి వచ్చాయి. పాకిస్తాన్, పాకిస్తాని పదాలకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ట్రంప్ ప్రసంగంలో చోటు దక్కింది. (చదవండి: హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా) -
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
-
21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం
-
21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోదీ
న్యూఢిల్లీ : భారత అమెరికా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర, డొనాల్డ్ ట్రంప్ మధ్య చారిత్రక హైదరాబాద్ హౌజ్ వేదికగా మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరు దేశాధినేతలు ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రంప్ కుటుంబానికి, అమెరికా ప్రతినిధుల బృందానికి మరోసారి మోదీ హార్ధిక స్వాగతం పలికారు. తన మిత్రుడు ట్రంప్‌నకు నిన్న మొతెరాలో ఇచ్చిన అపూర్వ, సదా స్మరణీయ స్వాగతం ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.(ఇక్కడ చదవండి: చిన్నారుల స్వాగతానికి మెలానియా ఫిదా) గడిచిన ఎనిమిది నెలల్లో ట్రంప్‌తో తనకిది ఐదో భేటీ అని ప్రధాని తెలిపారు. భారత్-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ట్రంప్ తాజా పర్యటన ఇరు దేశాల సబందౠలను మరింత బలోపేతం చేసిందన్నారు. తమ సమావేశాల్లో రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని మోదీ తెలిపారు. అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీపై చర్చించామని పేర్కొన్నారు. అత్యాధునిక రక్షణ ఉత్పత్తి సంస్థలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో ఈ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని అన్నారు. సైనిక శిక్షణలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని గుర్తు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల మధ్య ఒక అవగాన కుదిరిందని చెప్పారు. అమెరికాతో ఓ భారీ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వెల్లడించారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నారి ఆనందం వ్యక్తం చేశారు.(ఇక్కడ చదవండి: పాక్‌ను హెచ్చరించిన ట్రంప్) మోదీ పేర్కొన్న మరికొన్ని అంశాలు.. అంతర్గత భద్రతపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాం మాదక ద్రవ్యాలు, నార్కో టెర్రరిజంపై ఉమ్మడిగా ఉక్కుపాదం మానవ అక్రమ రవాణాపై రెండు దేశాలు ఉమ్మడిగా పోరాటం రెండుదేశాల మధ్య ఇటీవల 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి వ్యతిరేకంగా రెండు దేశాల పోరాటం ఆర్థిక సంబంధాల్లో పారదర్శక వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్షుడు ట్రంప్ పర్యటన రెండు దేశాలకు కీలకం -
పాక్‌ను హెచ్చరించిన ట్రంప్!
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం తన జీవితంలో గొప్ప విషయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అదే విధంగా ప్రపంచంలోనే అత్యద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ట్రంప్ దంపతులు తొలుత రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించి.. ఆ తర్వాత హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తనకు అద్భుత స్వాగతం పలికిన ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు.. 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.(21 వ శతాబ్దంలోనే ఇదొక కీలక ఘట్టం : మోదీ) ఈ సందర్భంగా... ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను భారత గడ్డపై నుంచి ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నామని... అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అదే విధంగా భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్- అమెరికా సంబంధాలు బలపడ్డాయన్న అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఢిల్లీలో ఐరాస డెవలప్మెంట్ ఫండ్ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు మరోమారు ప్రెస్‌తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. (హైదరాబాద్ హౌజ్‌లో మోదీ-ట్రంప్ చర్చలు) ట్రంప్ భారత పర్యటన: వరుస కథనాల కోసం క్లిక్ చేయండి -
భారత్‌తో ఒప్పందం కుదిరింది
-
మోదీ-ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
-
చిన్నారుల స్వాగతానికి మెలానియా ఫిదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో ‘హ్యాపినెస్ క్లాసు’లను ఆమె పరిశీలించారు. హైదరాబాద్ హౌజ్‌లో భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మెలానియాకు సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో మెలానియాను స్వాగతం పలికారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లిన మెలానియా విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ‘హ్యాపీనెస్ క్లాస్’ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లు మెలానియా వెంట ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు. పాటలు, సంగీతం, ఆటలపై తమకు ఉన్న మక్కువను వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్యాలను మెలానియా తిలకించారు. అనంతరం మెలానియా మాట్లాడుతూ.. పాఠశాల విద్యావిధానం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత మరవలేనిదన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మంచి నడవడికను నేర్పించడం బాగుందని మెలానియా పేర్కొన్నారు. (చదవండి : సైనిక వందనం స్వీకరించిన ట్రంప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులు
-
హైదరాబాద్ హౌజ్‌లో మోదీ-ట్రంప్ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటలో ఉన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ హౌజ్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ట్రంప్.. అక్కడ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ క్రమంలోనే ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌లో మొక్కను నాటారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ కలిసి హైదరాబాద్ హౌజ్‌కు వెళ్లారు. హైదరాబాద్ హౌజ్‌లో భారత్, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఇరు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాముంది. మోదీ, ట్రంప్ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాత్ముడికి ట్రంప్ నివాళి..
-
రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులు
-
సైనిక వందనం స్వీకరించిన ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. (చదవండి : ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?) ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల బుక్‌లో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ట్రంప్‌తో కలిసి మెలానియా.. రాజ్‌ఘాట్‌లో మొక్క నాటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు తాజ్ మహల్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో గైడ్‌గా నితిన్ కుమార్ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్‌కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్‌కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను ట్రంప్‌కు వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, మెలానియాలు అతను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నారు. దీనిపై నితిన్ మాట్లాడుతూ.. ట్రంప్ దంపతులు తాజా మహల్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్ దంపతులు పేర్కొన్నట్లు నితిన్ కుమార్ సింగ్ తెలిపారు. మరొకసారి తాజ్ మహల్‌ను వీక్షించడానికి వారు వస్తామని తెలిపారన్నారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్‌లకు తాజ్ మహల్ గురించి వివరించిన ఘనత నితిన్ కుమార్ సింగ్‌ది. ప్రధాన నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన నితిన్ సింగ్.. ఎక్కువ శాతం ప్రముఖులకే గైడ్‌గా వ్యవహరిస్తారు. ఆగ్రాకు చెందిన నితిన్ సింగ్ తాజ్ మహల్ విశిష్టత గురించి తెలపడంలో అతనికే అతనే సాటని స్థానికుల మాట. (ఇక్కడ చదవండి: చేతిలో చెయ్యేసి) -
ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో భారతీయ పేర్లు, పండగలు, సినిమాల గురించి ప్రస్తావించారు. అయితే ఆ పేర్లను పలకడంలో తడబడ్డారు. ఈ క్రమంలో చాయ్ వాలాను చీవాలా అని, వేదాలను వేస్టాస్ అని, స్వామి వివేకానంద పేరును వివేకముందగా అని పేర్కొన్నారు. అదేవిధంగా భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావించారు. అయితే వారి పేర్లను ఉచ్చరించడంలో ట్రంప్ విఫలమయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ట్రంప్ నోటి నుంచి టీమిండియా దిగ్గజాల పేర్లు రావడం పట్ల పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరి పేర్లను సుచిన్ టెండూల్కర్, విరాట్ కోలీ అని ఉచ్చరించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. లెజెండ్స్ పేర్లను పలికేముందు ట్రంప్ తగిన రీసెర్స్ చేయాలని ట్రంప్‌కు పీటర్సన్ సూచించాడు. ఐసీసీ కూడా ట్రంప్‌ను ట్రోల్ చేసింది. ‘sach, such, satch, sutch, sooch లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా?’అని అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. FFS, @piersmorgan, pls ask your mate to do some research in pronouncing legends names?! https://t.co/eUGuCNReaM — Kevin Pietersen🦏 (@KP24) February 24, 2020 Sach- Such- Satch- Sutch- Sooch- Anyone know? pic.twitter.com/nkD1ynQXmF — ICC (@ICC) February 24, 2020 చదవండి: తెల్లని దుస్తుల్లో రాజహంసలా.. ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి... హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా -
పడమటి ట్రంప్ రాగం!
-
అద్భుతమైన వాణిజ్య ఒప్పందం
అహ్మదాబాద్: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని ప్రకటించారు. ‘‘నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ, నేను ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతికి చర్చించనున్నాం. ప్రధాని మోదీతో కలసి ఇరు దేశాలకూ మంచి చేసే గొప్ప అద్భుతమైన ఒప్పందానికి వస్తామన్న విశ్వాసం నాకుంది’’ అని ట్రంప్ వివరించారు. అమెరికా బూమింగ్ ప్రపంచానికి ప్రయోజనం అమెరికా అభివృద్ధి చెందితే అది భారత్‌కు, ప్రపంచానికి మంచిదన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగాలను ఆకర్షించడం, వ్యాపారాల్లో సమస్యలను తగ్గించడం, నూతన పెట్టుబడులకు అవరోధాల్లేకుండా చేయడం, అనవసర బ్యూరోక్రసీ, నియంత్రణలను తొలగించినట్టు ట్రంప్ వివరించారు. వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలి.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే గణనీయమైన సంస్కరణలను చేపట్టారన్న ట్రంప్.. భారత్‌లో వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలని ప్రపంచం కోరుకుంటోందన్నారు. ఆయన (మోదీ) దీన్ని రికార్డు వేగంతో చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన వ్యవసాయం, పాడి, డేటా పరిరక్షణ, డేటా స్థానికంగా నిల్వ చేయడం, ఈ కామర్స్ తదితర రంగాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందని, భారత ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని ఓ అధికారి తెలిపారు. వాణిజ్య చర్చలు పురోగతి చెందితే అమెరికా మరిన్ని డిమాండ్లను ముందుకు తీసుకురావచ్చని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు భారత్‌తో 17 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పించాలన్నది అమెరికా డిమాండ్. భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశం హోదా తిరిగి కల్పించాలని మన దేశం కోరుతోంది. -
చుట్టాలు వస్తేకనీ..తాజ్‌ను పట్టించుకోని ప్రభుత్వం
-
తాజ్‌మహల్ వీక్షించిన ట్రంప్ దంపతులు
-
అమెరికా, భారత్‌ల స్నేహగీతం..
-
ఎయిర్పోర్ట్ టు స్టేడియం వయా సబర్మతి
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి భారత పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ట్రంప్, ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్ వచ్చిన ‘ఎయిర్‌ఫోర్స్ 1’ విమానం ఉదయం 11.37 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. బ్లాక్ సూట్లో ట్రంప్, వైట్ జంప్‌సూట్‌లో మెలానియా భారత గడ్డపై అడుగుపెట్టారు. ట్రంప్ రాకకు దాదాపు గంట ముందే మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్‌కు సాదర స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మెలానియాకు ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి వారు నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు గడిపిన అనంతరం, మొటేరా స్టేడియానికి బయల్దేరారు. రోడ్ షో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచే ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ రహదారులకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. దారి పొడవునా దాదాపు 22 కిమీ మేర వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రత్యేకతలను వివరించేలా దాదాపు 50 వేదికలను ఏర్పాటు చేశారు. ఆ వేదికలపై ఆయా రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. బ్లాక్ లిమోజిన్ ‘ది బీస్ట్’లో ప్రయాణిస్తూ ఈ రోడ్ షోలో ట్రంప్ పాల్గొన్నారు. భద్రత 10 వేలకు పైగా పోలీసులు, ఎన్ఎస్జీ, ఎస్పీజీ దళాలు, అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు రోడ్ షో, ఆ తరువాత మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు భద్రత కల్పించారు. ‘మౌర్య’లో సంప్రదాయ స్వాగతం ట్రంప్ దంపతులకు హోటల్ మౌర్య షెరాటన్‌లో సంప్రదాయ సిద్ధంగా స్వాగతం పలికారు. హోటల్లో అడుగుపెట్టగానే వారికి తిలకం దిద్ది, పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. భద్రతాకారణాల రీత్యా వారు వెనకద్వారం గుండా లోనికి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు భోజనం చేశారని హోటల్ వర్గాలు తెలిపాయి. మౌర్యషెరాటన్‌లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్లో ట్రంప్ బస చేశారు. నేడు చర్చలు ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తరువాత, ప్రధాని మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో హైదరాబాద్ హౌజ్‌లో భారత్, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మోదీ, ట్రంప్ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. రక్షణ ఒప్పందంలో.. నౌకాదళం కోసం 24 ఎంహెచ్ 60ఆర్ రోమియో హెలీకాప్టర్లను, 6 ఏహెచ్64ఈ అపాచీ హెలీకాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుంది. అనంతరం ట్రంప్ దంపతులు రాష్ట్రపతి కోవింద్‌ను కలుస్తారు. కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆ తరువాత అమెరికాకు బయల్దేరి వెళ్తారు. -
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్‌తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్‌గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్‌ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్‌ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్‌పై ట్విటర్లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు. -
చేతిలో చెయ్యేసి
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో చల్లని సాయంత్రం సమయంలో చిరుగాలులు మోముని తాకుతూ ఉంటే తన నెచ్చెలి మెలానియా చేతిలో చెయ్యేసి వెండికొండలా మెరిసిపోయే ప్రపంచ అద్భుతాన్ని తనివితీరా చూసి తన్మయత్వం చెందారు అగ్రరాజ్యాధీశుడు ఆగ్రా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్‌మహల్‌ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్ వావ్ అనిపించింది. సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్ గొప్పతనాన్ని ఒక గైడ్ వారికి వివరించి చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్‌మహల్ అందాలను వీక్షించారు. తాజ్ అందాలను ఇవాంకా తన మొబైల్ ఫోన్లో బంధిస్తూ కనిపించారు. ఆగ్రా వీధుల్లో ఘన స్వాగతం అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా ట్రంప్ కారు బీస్ట్ క్షణ కాలమైనా కనిపిస్తుందని ఆత్రుతగా ఎదురుచూశారు. అహ్మదాబాద్ నుంచి ఆగ్రాలో ఖేరియా ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఆయనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తాజ్‌మహల్‌కి సమీపంలోని ఓబరాయ్ అమర్‌విలాస్ హోటల్‌కి తన కాన్వాయ్‌లోనే చేరుకున్నారు. మొత్తం 13కి.మీ. దూరం ఉన్న ఈ ప్రయాణంలో 15 వేలకు మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్డుకిరువైపులా అమెరికా, భారత్ జెండాలు పట్టుకొని ఉత్సాహంతో చేతులు ఊపారు. ఆ హోటల్ నుంచి తాజ్‌మహల్‌కి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో వెళ్లారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాజ్‌మహల్ గేటు నుంచి 500 మీ పరిధి వరకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ తన బీస్ట్ కారుని హోటల్ ఆవరణలో ఉంచి ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లోనే వెళ్లారు. తాజ్ కట్టడం దగ్గర మెలానియాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు వస్తూ ఉండడంతో తాజ్‌ని అద్దంలా ఉంచడానికి మరింత మెరుగులు దిద్దారు. వందలాది మంది పనివాళ్లు ముల్తానీ మిట్టీతో తాజ్‌ని శుభ్రం చేశారు. తాజ్‌మహల్‌ని సందర్శించిన అధ్యక్షుల్లో చివరి వాడు బిల్ క్లింటన్. 2000 సంవత్సరంలో తన కుమార్తె చెల్సీతో కలిసి ఆయన తాజ్‌ని సందర్శించారు. 2015లో బరాక్ ఒబామా తాజ్‌ని చూద్దామని భావించారు కానీ, భద్రతా కారణాల రీత్యా సందర్శించలేదు. ఇవాంకా మళ్లీ అదే డ్రెస్ సాధారణంగా సెలిబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్‌తో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించరు. పూటకో ఫ్యాషన్‌తో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. కానీ ఇవాంకా గత ఏడాది ఫ్యాషన్‌నే మళ్లీ కొనసాగించారు. 2019 సెప్టెంబర్ అర్జెంటీనా పర్యటనలో ఏ మిడీ అయితే వేసుకున్నారో అదే మళ్లీ భారత పర్యటనలోనూ ధరించారు. బేబి బ్లూ రంగు పైన ఎరుపు రంగు పెద్ద పెద్ద పువ్వులున్న వీ నెక్ డ్రెస్ వేసుకున్నారు. ఇలా మళ్లీ అదే డ్రెస్ వేసుకోవడానికీ ఒక కారణం ఉంది. ఒక చిన్న వస్త్రం తయారు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో సహజవనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజవనరుల్ని కాపాడాలంటే సెలిబ్రిటీలు కూడా వేసుకున్న డ్రెస్‌లే మళ్లీ ధరించాలన్న సందేశాన్ని పంపడానికే ఇవాంకా అదే డ్రెస్ ధరించారు. ఈ విధంగా ప్రకృతి పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజ్ వద్ద ఇవాంకా, కుష్నర్ దంపతులు సాధారణ టూరిస్టులకు నో ట్రంప్ రాక సందర్భంగా సోమవారం ఆగ్రాలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహల్‌లో సాధారణ టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్ తాజ్‌మహల్ రాగా.. ఉదయం 11.30 గంటలకే తాజ్‌ను సాధారణ సందర్శకులకు దూరం చేశారు. ట్రంప్ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ రాకను పురస్కరించుకుని తాజ్‌మహల్‌ను అందం గా అలంకరించామని, ఉద్యానవనంలో మరిన్ని పూలమొక్కలు నాటడంతోపాటు ఫౌంటేన్లు మరమ్మతు చేయించామన్నారు. ట్రంప్ దంపతులకు సీఎం యోగి బహుమతి -
సుచిన్..షోజే..చీవాలా!!
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగం విషయంలో బాగానే ప్రిపేరయినట్లున్నారు. ఎందుకంటే దీన్లో ఆయన బోలెడన్ని భారతీయ పేర్లు, పండుగలు, హిందీ సినిమాలను కూడా జొప్పించారు. కాకపోతే వాటిని పలకటంలో మాత్రం తడబడ్డారు. నరేంద్రమోదీని ఛాయ్ వాలాగా సంభోదించబోయి ‘చీవాలా’ అన్నారు. ఇక వేదాలను వేస్టాస్గా... స్వామి వివేకానంద పేరును వివేకాముందగా... సచిన్ టెండూల్కర్‌ను సుచిన్ టెండూల్కర్‌గా పేర్కొన్నారు. దీంతో పాటు షోలే సినిమాను షోజే అని అన్నారు. దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా పేరును షార్ట్‌కట్‌లో చక్కగా డీడీఎల్జే అని పలికేశారు. ఈ తప్పులపై ట్విటర్లో ట్రోలింగ్ బాగానే జరిగింది. కాకపోతే ఇన్ని పేర్లను పలకటానికి ట్రంప్ బాగానే హోమ్ వర్క్ చేసి ఉంటారంటూ చాలామంది వీటిని తేలిగ్గానే తీసుకున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ పేరును సుచిన్ టెండూల్కర్‌గా పలికినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్ వేదికగా విమర్శించింది. అయినా అమెరికాలో సగం మంది క్రికెట్ అంటేనే... ‘అదేం ఆట?’ అని అడిగే పరిస్థితి ఉంది. అలాంటిది ట్రంప్ ఏకంగా సచిన్ పేరునే బట్టీపట్టినందుకు ప్రశంసించాలంటూ కొందరు పేర్కొనటం కొసమెరుపు!!. ట్రంప్ తొలిరోజు పర్యటన సాగిందిలా ► ఉదయం 11.40కి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. ► 12.10: సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు ► 12.50: మొటెరా స్టేడియంకు వెళ్లారు ► 1.15: ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు. ► 2.50: అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ► 4.15: ఆగ్రా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ► 4.50: తాజ్‌మహల్ సందర్శనకు వచ్చారు ► 6.45: తిరిగి ఆగ్రా ఎయిర్ బేస్‌కు వెళ్లారు ► 7.40: ఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ► 8.00: మౌర్య హోటల్లో రాత్రి బస -
ప్రపంచ గతిని మారుస్తాం
అహ్మదాబాద్: ట్రంప్ భారత్‌కు ప్రత్యేక స్నేహితుడని ప్రధాని మోదీ అభివర్ణించారు. ట్రంప్ భారత పర్యటన భారత్, అమెరికా సంబంధాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్ర దేశాలన్నారు. మొతెరా స్టేడియంలో సోమవారం జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. తొలుత, ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ ప్రసంగించిన మోదీ.. ట్రంప్ ప్రసంగం అనంతరం మళ్లీ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాగతం’ అంటూ ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికారు. ‘21వ శతాబ్దంలో ప్రపంచ గతిని మార్చడంలో భారత్, అమెరికా సంబంధాలు, వాటి మధ్య నెలకొన్న సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు సహజసిద్ధ భాగస్వాములు’ అని తన ప్రసంగంలో మోదీ వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య నెలకొన్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని గుర్తు చేశారు. ‘భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. భారత్‌కు రక్షణ ఉత్పత్తులను అత్యధికంగా అందిస్తున్న దేశం అమెరికా’ అన్నారు. ఈ రెండు దేశాలు సంయుక్తంగా అనేక సైనిక విన్యాసాలు నిర్వహించాయన్నారు. ‘ఈ రెండు దేశాల మధ్య సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, పురోగతి నెలకొనడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ సంబంధాలుగా తీసిపారేయలేమని, ప్రస్తుతం అవి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన కుటుంబంతో భారత్‌కు రావడం దీన్నే స్పష్టీకరిస్తోందన్నారు. ‘ట్రంప్ భారత పర్యటన ఈ దశాబ్దం ప్రారంభంలో చోటు చేసుకున్న అతిపెద్ద కార్యక్రమం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ట్రంప్ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో ముందు వరసలో ఇవాంకా, ఆమె భర్త కుష్నర్, హోం మంత్రి అమిత్ షా తదితరులు -
రాట్నం తిప్పి.. నూలు వడికి
అహ్మదాబాద్ : భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ సోమవారం అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకు కొద్ది నిముషాల ముందే ఆశ్రమానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు ఆశ్రమం అంతా తిప్పి చూపించి దాని విశిష్టతను తెలియజేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈ ఆశ్రమంలో గాంధీజీ, ఆయన భార్య కస్తూర్బా 1917–1930 మధ్య కాలంలో నివసించారు. వారిద్దరూ నివసించిన గది హృదయ్ కుంజ్ లోపలికి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి చూపించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి, గాంధీజీ పోరాట స్ఫూర్తి గురించి వివరించారు. ఆశ్రమంలో ఉన్న చరఖాను ట్రంప్, మెలానియా కూడా తిప్పుతూ, నూలు వడకడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆశ్రమ నిర్వాహకులు రాట్నాన్ని ఎలా తిప్పుతూ నూలు వడకాలో వారికి వివరించి చెప్పారు. ట్రంప్ చరఖా తిప్పుతున్నప్పుడు మెలానియా ఆయనకు సహకరించారు. మహాత్ముడిని ప్రస్తావించని ట్రంప్ దాదాపు 15 నిముషాల సేపు ఆశ్రమంలో గడిపి తిరిగి వెనక్కి వెళుతున్నప్పుడు సందర్శకుల పుస్తకంలో ట్రంప్ ‘‘నా గొప్ప స్నేహితుడైన ప్రధానమంత్రి మోదీ – అద్భుతమైన ఈ పర్యటనకు ధన్యవాదాలు’’అని తన సందేశాన్ని రాశారు. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ సంతకాలు చేశారు. గాంధీజీ బోధనల గురించి కానీ, ఆయన ప్రపంచానికి అందించిన స్ఫూర్తి గురించి నామ మాత్రంగా కూడా ట్రంప్ ప్రస్తావించలేదు. దీనిపై ట్విటర్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కూడా గాంధీ గురించి రెండు ముక్కలు రాయకపోవడమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. 2015లో బరాక్ ఒబామా ఢిల్లీ రాజ్‌ఘాట్‌ను సందర్శించినప్పుడు ‘‘డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు ఇప్పటికీ వాస్తవం. గాంధీ స్ఫూర్తి భారత్‌లో అణువణువు జీర్ణించుకొని ఉంది. అది ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బ హుమతి’’అని రాయడంతో పోలుస్తూ కామెంట్లు ఉంచారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ అసలు రూపం తెలిసిందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పోస్టు పెడితే, త్రిపుర మాజీ ఎమ్మెల్యే తపస్ దే మోదీపై తన ప్రేమను ట్రంప్ ఒలకపోశారని విమర్శించారు. అల్పాహారం తీసుకోని ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన పూర్తిగా శాకాహారంతో హై టీ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాటిని తీసుకోలేదని ఆశ్రమ ట్రస్టీ వెల్లడించారు. ట్రంప్ కోసం ప్రత్యేకంగా హోటల్ ఫార్చూన్ ల్యాండ్‌మార్క్‌కు చెందిన చెఫ్ సురేష్ ఖన్నా ఆధ్వర్యంలో తయారు చేసిన గుజరాతీ స్పెషల్ ఖమాన్, బ్రాకొలిన్–కార్న్ బటన్ సమోసా, మల్టీ గ్రెయిన్ కుకీస్, కాజూ కత్లీ యాపిల్ పేస్ట్రీ, తాజా పండ్లు, గుజరాతీ అల్లం టీ ఉంచారు. అయినా వాటినేమీ వాళ్లు రుచి చూడలేదు. ట్రంప్ మాంసాహార ప్రియుడు. కానీ సబర్మతి ఆశ్రమంలో మాంసం నిషిద్ధం కావడంతో శాకాహారంతో తయారు చేసిన స్నాక్స్ ఉంచారు. గాంధీజీ మూడు కోతుల బహుమానం చెడు వినకు , చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనని చాటి చెప్పే మూడు కోతుల బొమ్మల్ని ట్రంప్, మెలానియాలకు మోదీ కానుకగా ఇచ్చారు. ఇక ఆశ్రమం తరఫున ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్ దంపతులకు మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం, గాంధీజీ, చరఖా పెన్సిల్ డ్రాయింగ్లను బహూకరించారు. అంతకు ముందు ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్, మెలానియాలకు ఖద్దరు శాలువా కప్పి స్వాగతం పలికారు. ట్రంప్ సందర్శన పూర్తయిన తర్వాత కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఎనలేని మనశ్శాంతి తనకు కలిగిందని, ఆ ఆశ్రమం ప్రాధాన్యత అర్థమైందని ట్రంప్ తనతో చెప్పారని కార్తికేయ వెల్లడించారు. మూడు కోతుల ప్రతిమతో బహూకరిస్తున్న మోదీ -
హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా
డెబ్బయ్ లక్షల మంది స్వాగతిస్తారన్నారు. అది తక్కువనిపించిందేమో!! అంతలోనే ! ఆ సంఖ్య కోటికి చేరింది. ఆ క్షణం రానే వచ్చింది. ట్రంప్ ఊహించిన కోటి మంది కాకున్నా... అహ్మదాబాద్ వీధుల్లో లక్షల మంది స్వాగతం పలికారు. మొతెరా మైదానంలో మరో లక్షన్నర మంది ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించారు. భారత్‌కు రాకముందు ట్రంప్ యంత్రాంగం కశ్మీర్‌ను తెరపైకి తెచ్చింది. సీఏఏ నిరసనలనూ ప్రస్తావించింది. కానీ ఆశ్చర్యంగా.. ట్రంప్ ప్రసంగంలో మోదీ కీర్తి ప్రతిష్టలకు ట్రంపెట్ల మోతలే తప్ప భారత్‌ను ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలేమీ లేవు. భారత్‌లో మత సామరస్యానికి జై కొడుతూ... తమ దేశంలోని భారతీయ అమెరికన్ల ప్రతిభకు జేజేలన్నారు. మందగమనంలోని భారతానికి ఊరటనిచ్చేలా వాణిజ్యపరమైన ప్రకటనలు చేస్తారని భావించారంతా!!. అంతకుమించి... అనేలా భారతీయుల్ని సంతోషపెట్టారు ట్రంప్. మన దీపావళి, హోలీ పండుగల్ని మనకే వివరిస్తూ... దిల్వాలే దుల్హనియా, షోలే అంటూ బాలీవుడ్ సినిమా చూపించారు. క్రికెట్ వీరులు సచిన్, కోహ్లీలనూ కొనియాడారు. భారతీయుల నుంచి కోట్లాది చప్పట్లను రాబట్టడానికి ఇంతకన్నా ఏమైనా కావాలా చెప్పండి..? ఇక దారిపొడవునా ఘన స్వాగతం పలికిన గుజరాతీలను తక్కువ చేయలేదు ట్రంప్. అల్లంత ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని మాటల్లో మరింత ఎత్తున ఆవిష్కరించారు. మోదీ ఛాయ్‌వాలా నుంచి ప్రభుత్వ సారథిగా మారిన చరిత్రను మరోసారి వినిపించారు. సాక్షాత్తూ అగ్రరాజ్యాధీశుడే తమను అలా పొగిడేస్తుంటే స్థానికులకు ఇంకేం కావాలి చెప్పండి? మొత్తానికి మొదటిరోజు ప్రసంగమంతా జనరంజకమే!. వీనులవిందైన పరస్పర పొగడ్తలే! ఈ ప్రసంగంలో దేశానికి కాస్తంత ప్రయోజనం కలిగించే అంశమేదైనా ఉందంటే అది 3 బిలియన్ డాలర్ల రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందమే!. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లు, క్షిపణులు, యుద్ధనౌకలు తయారు చేస్తున్నామని చెప్పిన ట్రంప్.. హెలికాప్టర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు భారత్‌తో 3 బిలియన్ డాలర్ల (రూ. 21వేల కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. మరి మంగళవారం ఇరువురు ప్రభుత్వాధినేతల చర్చల్లో ఇదొక్కటే సాకారమవుతుందా? మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం – ట్రంప్ ట్రంప్ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఇరు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం అత్యున్నత, చరిత్రాత్మక శిఖరాలకు చేరాయి. – మోదీ అహ్మదాబాద్: ‘అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం’.. భారతీయుల మనసు గెలుచుకునే ఈ సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి సోమవారం ట్రంప్ ప్రసంగించారు. ‘నమస్తే.. నమస్తే.. హలో ఇండియా’ అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడని, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆ మహోన్నత నేతకు.. తనకీ అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత సాంస్కృతిక వైభవాన్ని, గత 70 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలను, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాటిస్తున్న గొప్ప విలువలను, వివిధ రంగాల్లో ఇండియా సాధించిన ఘనతలను ట్రంప్ తన ప్రసంగంలో సందర్భానుసారం ప్రస్తావించి, భారతీయులను ఆకట్టుకున్నారు. స్వామి వివేకానంద ప్రవచిత వ్యాఖ్యను గుర్తు చేసి, భారత దార్శనికతను ప్రశంసించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ సామర్థ్యాన్ని తన ప్రసంగంలో గుర్తు చేశారు. భారత్‌కు సహకరించే విషయంలో అమెరికా ముందుంటుందని, భారత సాయుధ దళాలకు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయని వెల్లడించారు. వేదికపైకి మోదీ, ట్రంప్‌తో పాటు మెలానియా వచ్చారు. హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ట్రంప్ కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్.. ఇతర ప్రముఖులు మొదటి వరుసలో కూర్చుని ట్రంప్, మోదీల ప్రసంగాలను విన్నారు. ఈ స్వాగతాన్ని మర్చిపోలేం ‘ఐదు నెలల క్రితం భారత ప్రధానికి అమెరికాలో భారీ ఫుట్‌బాల్ స్టేడియంలో స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నన్ను స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతం గొప్పగా ఉంది. థ్యాంక్యూ. ఈ ఆతిథ్యాన్ని మేమెన్నడూ మర్చిపోం’ అని ట్రంప్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవిస్తున్న దేశంగా.. వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలన, పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనం కల్పిస్తున్న దేశంగా భారత్‌ను ప్రపంచదేశాలు అభిమానిస్తాయన్నారు. గట్టి ప్రతినిధి ఒక సామాన్య భారతీయుడు ఏం సాధించగలడనేదానికి భారత ప్రధాని మోదీనే సజీవ తార్కాణమని ప్రశంసించారు. భారత, అమెరికా వాణిజ్య చర్చలను ప్రస్తావిస్తూ ‘మోదీ తమ దేశం తరఫున గట్టిగా వాదిస్తారు(టఫ్ నెగోషియేటర్)’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘‘మోదీని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాకపోతే ఆయనతో వ్యవహారాలు నడపడం అంత సులువు కూడా కాదు’’అని అన్నారు. ‘‘ప్రధానమంత్రి మోదీగారు.. మీరు గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధించగలరు అనేందుకు సజీవ తార్కాణం మీరు’’అని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు. ‘భారత్ సామర్థ్యం ఆశ్చర్యకరం. అద్భుతం. స్వతంత్ర దేశంగా భారత్ సాధించిన అభివృద్ధి మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకం. భారత్ సాధించిన పురోగతి ఈ శతాబ్దంలోనే అసాధారణ విజయం’ అని ఇండియాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చప్పట్లు.. నవ్వులు.. గుజరాత్ సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు లక్షమందితో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. మోదీ, సర్దార్‌పటేల్‌ను ప్రశంసిస్తున్న సమయంలో, షోలే, డీడీఎల్‌జీ వంటి బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్లు సచిన్, కోహ్లీలను ప్రస్తావించిన సమయంలోనూ భారీగా చప్పట్లు వినిపించాయి. ట్రంప్ మాటతీరు, ఉచ్ఛారణతో పలుమార్లు స్టేడియంలో నవ్వులు పూచాయి. ప్రపంచం మారుమూలల్లోనూ భారతీయ నృత్యం భాంగ్రాకు, హోళీ, దీపావళి పండగలకు మంచి ఆదరణ ఉందన్నారు. ‘ఏడాదికి రెండు వేల సినిమాలు తీసే అత్యద్భుతమైన సృజనాత్మకత ఉన్న బాలీవుడ్ ఉన్న దేశమిది’అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రజలకు ట్రంప్, మోదీ అభివాదం సాంస్కృతిక కార్యక్రమాలు మోదీ, ట్రంప్‌లు స్టేడియంలోకి వచ్చేవరకు బాలీవుడ్ గాయకుడు కైలాశ్ ఖేర్ బృందం, గుజరాతీ స్థానిక గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్టేడియంలో వాలంటీర్లుగా వ్యవహరించారు. వి ద పీపుల్ నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘‘అమెరికా, భారత్.. ఈ రెండు దేశాల రాజ్యాంగాలు ఒకే అద్భుతమైన పదంతో ప్రారంభమవుతాయి. అది ‘వి ద పీపుల్(ప్రజలమైన)’. అంటే, మన రెండు దేశాల్లోనూ దేశ పౌరులకు సమాన గౌరవం, సాధికారత, విశ్వాసం లభిస్తాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎండల్లో.. ఓపికగా ప్రజలు... స్టేడియంకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకే విచ్చేసిన ప్రజల సహనానికి ఎర్రటి ఎండ పరీక్ష పెట్టింది. స్టేడియం సామర్త్యం 1.10 లక్షలు కాగా సోమవారం అంతకు మించి 1.25 లక్షల మంది చేరారు. ఇరువురు నేతలు ప్రజలకు అభివాదం చేయడాన్ని పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య స్వాగతించారు కూడా. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ప్రజల ఓపిక తగ్గుతూ వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు ఆ తరువాత ట్రంప్ మాట్లాడే సమయానికి ఒక్కరొక్కరుగా స్టేడియంను వీడిపోవడం కనిపించింది. మోదీని ట్రంప్ ప్రశంసించే సమయంలో చాలామంది బయటకు వెళ్లారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్, అమెరికాలు ఉన్నాయన్నారు. ‘ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను సంపూర్ణంగా నాశనం చేశాం. ఐఎస్ స్థాపకుడైన అల్ బగ్దాదీ వంటి రాక్షసున్ని అంతమొందించాం’ అని గుర్తు చేశారు. తమ సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని, ఉగ్రవాదులను, వారి భావజాలాన్ని నిర్మూలించే దిశగా భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘నేను అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి ఉగ్రసంస్థలను, వారి భూభాగంలోని ఉగ్రవాదులను నాశనం చేసే దిశగా పాకిస్తాన్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. ‘పాక్‌తో మా సంబంధాలు బావున్నాయి. అవి మెరుగుపడే దిశగా వెళ్తున్నాం. దక్షిణాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తొలగుతాయని, సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. చైనా పేరును ప్రస్తావించకుండానే.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్రదేశాలను ట్రంప్ అభివర్ణించారు. అమెరికా విలువలను కాపాడేవారికి తమ దేశంలోకి స్వాగతం పలుకుతామని, అదే సమయంలో ఉగ్రవాదాన్ని కానీ ఏ విధమైన తీవ్రవాదాన్ని కానీ సమర్ధించబోమన్నారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం -
ట్రంప్ దంపతులకు సీఎం కానుకలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రత్యేక ఆహ్వాని తుడిగా కేసీఆర్ హాజరుకాను న్నారు. ఇందుకోసం ఆయన మంగళ వారం ఢిల్లీ వెళ్లనున్నారు. కార్య క్రమంలో ఆయన ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు. -
గోల్డెన్ షేక్ హ్యాండ్
-
ట్రంప్ కారు ప్రత్యేకతలు
-
రాజధానిలో మళ్లీ సీఏఏ రగడ
-
‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు
-
తాజ్‌మహల్‌లో ఇవాంక సందడి
-
‘తాజ్’ అందాలకు ఇవాంక ఫిదా!
ఆగ్రా: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజ్‌మహల్‌లో సందడి చేశారు. భర్త జారేద్ కుష్నర్తో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన కట్టడాన్ని వీక్షించారు. 2017లో ఇవాంక తొలిసారిగా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. తాజాగా తన తండ్రి ట్రంప్ భారత పర్యటనలో ఆమె కూడా భాగస్వామ్యమయ్యారు.(చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ.. ) ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతులతో పాటు ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన డ్రెస్‌తో పాటు అదే రంగు హైహీల్స్ ధరించి తనదైన స్టైల్లో వావ్ అనిపించారు. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ కుటుంబం ఆగ్రాకు చేరుకున్నారు. ట్రంప్ దంపతులతో పాటు, ఇవాంక దంపతులు కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇవాంక భర్త జారేద్ కుష్నర్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. చారిత్రక కట్టడానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి తాజ్ అందాలకు ఫిదా అయిన ట్రంప్ కుటుంబం.. దాదాపు గంటసేపు అక్కడే ఆహ్లాదంగా గడిపారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంక) -
ట్రంప్ కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న ట్రంప్ మెలనియా దంపతులకు మోదీ ఘనస్వాగతం పలికారు. అయితే అమెరికా అధ్యక్షడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆయన ప్రయాణించే కారు 'ద బీస్ట్' గురించి తెలుసుకుంటేనే అర్థమైపోతుంది. భారత్‌లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం మొత్తం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన కార్లలోనే కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు 'ది బీస్ట్'. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. చదవండి: చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ.. 1963లో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. దీని వినియోగానికి భారీగానే ఖర్చుపెడుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ వాడుతున్న కాడిలాక్ మోడల్ 2018 సెప్టెంబర్ 24న ఆయన కాన్వాయ్‌లోకి చేర్చారు. అధునాతన సౌకర్యాలతో, మెరుగైన భద్రతా ప్రమాణాలతో దీనిని తయారు చేశారు. ఆయన ఏ దేశంలో పర్యటించినా ఇది కూడా అక్కడకి చేరుకోవాల్సిందే. చదవండి: నేను, ప్రథమ మహిళ.. ట్రంప్ మరో హిందీ ట్వీట్! కారు ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే.. దీని ఖరీదు దాదాపు వందకోట్ల రూపాయలు. బీస్ట్ టెక్నాలజీ అత్యంత దుర్భేద్యంగా ఉంటుంది. శత్రుదుర్బేధ్యమైన బీస్ట్ కారును బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ గ్లాస్‌తో ఈ కారును డిజైన్ చేశారు. బీస్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ సీఐఏ ఎంపిక చేసిన సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తారు. మిగిలిన వారికి ఈ కారును కనీసం ముట్టుకునేందుకు కూడా అవకాశం ఉండదు. శక్తివంతమైన బాంబులు బీస్ట్‌కు సమీపంలోనే పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ కుదుపులకు కూడా లోనుకారు. ఇందులో రాత్రి సమయాల్లో ప్రయాణించేటపుడు నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. కారు డోర్స్ మందం 8 అంగుళాలుగా ఉంటుంది. శక్తివంతమైన బాంబు దాడులను సైతం ఇది తట్టుకుంటుంది. చదవండి: ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..! ఈ బీస్ట్ మరో ప్రత్యేకత ఏంటంటే రసాయన ఆయుధ దాడిని కూడా తట్టుకోగల సామర్ధ్యం దీని సొంతం. ఎవరైనా ఈ కారుకి అడ్డుపడితే టియర్ గ్యాస్ వదిలే ఏర్పాటు కూడా ఉంది. ఏదైనా దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. బీస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఎంతటి బ్లాస్ట్‌ని అయినా తట్టుకుంటుంది. టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపల ఉండే స్టీల్ రిమ్ లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ కారులో నుంచే అవసరమైతే షాట్ గన్ ద్వారా గుళ్ల వర్షాన్ని కూడా కురిపించవచ్చు. అనూహ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే అధ్యక్షుడిని కాపాడటానికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం వంటి సదుపాయాలు ఈ కార్లలో ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ పరిస్థితిలో అధ్యక్షుడు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నా కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో, పెంటగాన్‌తో మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది. డ్రైవర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది. ఈ కారును జనరల్ మోటార్స్ సంస్థ తయారు చేసింది. ఇలాంటివి మొత్తం 12 కార్లు ట్రంప్ కాన్వాయ్‌లో ఉంటాయి. -
తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు
-
చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ..
ఆగ్రా: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి తాజ్‌మహల్ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్.. తొలుత సందర్శకుల పుస్తకంలో(విజిటర్ బుక్)లో సంతకం చేశారు. ‘‘తాజ్‌మహల్ అద్భుతం. అందమైన భారత సంస్కృతికి నిదర్శనం! థ్యాంక్యూ ఇండియా’’అని ఆయన రాశారు.ప్రపంచ వింతగా ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్ విశేషాలను గైడ్ వివరిస్తుండగా.. ట్రంప్ దంపతులు ఆసక్తిగా ఆలకించారు. సంధ్యాసమయంలో చేతిలో చెయ్యి వేసుకుని పచ్చటి లాన్లో నడుచుకుంటూ మహత్తర కట్టడాన్ని చేరుకున్నారు. ఫొటోలకు పోజులిస్తూ.. ‘ప్రేమచిహ్నం’ అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తాజ్‌మహల్ లోపలికి ప్రవేశించి.. షాజహాన్, ముంతాజ్ సమాధులను సందర్శించారు. ఇక ట్రంప్, మెలానియాది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. (చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) ఇక ట్రంప్ కుటుంబం తాజ్ మహల్ సందర్శన నేపథ్యంలో ఆగ్రా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన అనంతరం ట్రంప్ ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్‌పటేల్ ట్రంప్ కుటుంబానికి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
‘తాజ్’అందాలు వీక్షిస్తున్న ట్రంప్ దంపతులు
-
తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులు
లక్నో: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్‌నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్... ‘ప్రేమచిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ట్రంప్ తాజ్‌మహల్ వద్ద సమయం గడపనున్నట్లు సమాచారం. కాగా అంతకు ముందు అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత పర్యటన తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయంటూ కీలక ప్రకటన చేశారు. -
డీడీఎల్జే, షోలే క్లాసిక్ సినిమాలు: ట్రంప్
-
నేను, ప్రథమ మహిళ.. ట్రంప్ మరో హిందీ ట్వీట్!
అహ్మదాబాద్: ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరైన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత ప్రజలతో మాట్లాడేందుకు తాను, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నామన్నారు. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌ను ప్రేమిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మరోసారి హిందీలో ట్వీట్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు.‘‘భారతదేశంలోని ప్రతీ పౌరుడికి సందేశం ఇచ్చేందుకు నేను, ప్రథమ మహిళ 8000 వేల మైళ్ల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం! అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది- అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది- అమెరికా ప్రజలు ఎల్లప్పుడు... భారత ప్రజలకు నిజమైన, నిబద్ధతతో కూడిన స్నేహితులుగా ఉంటారు’’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.(ఆ రెండు క్లాసిక్ సినిమాలు: ట్రంప్ ) కాగా.. భారత పర్యటనకు బయల్దేరిన క్రమంలో తమ రాక గురించి తెలియజేస్తూ ట్రంప్ హిందీలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘మేము భారత్ రావాలని ఎదురుచూస్తున్నాం. దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!’ అని ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక తొలిసారి భారతదేశానికి వచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మొతేరా స్టేడియంలో భారత ప్రజలకు ట్రంప్ దంపతులను పరిచయం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఆ తర్వాత ట్రంప్ అక్కడి నుంచి ఆగ్రాకు పయనమయ్యారు. प्रथम महिला और मैं इस देश के हर नागरिक को एक सन्देश देने के लिए दुनिया का 8000 मील का चक्कर लगा कर यहां आये हैं l अमेरिका भारत को प्रेम करता है - अमेरिका भारत का सम्मान करता है - और अमरीका के लोग हमेशा भारत के लोगों के सच्चे और निष्ठावान दोस्त रहेंगे l https://t.co/1yOmQOEnXE — Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020 -
కళాకారుడి వినూత్న స్వాగతం.. మోదీ, ట్రంప్ ఇడ్లీలు..
-
రాజధానిలో మళ్లీ సీఏఏ రగడ
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు వర్గాలు నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దుండగులు కొన్ని ఇళ్లపైన కూడా రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం కూడా మౌజ్‌పూర్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్ల దాడులకు దిగాయి. మౌజ్‌పూర్ చౌక్‌కు బీజేపీ నేత కపిల్ మిశ్రా చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. జఫరాబాద్ ప్రాంతంలోనూ సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహీకి దిగాయి, బహజన్‌పురాలో కొందరు రాళ్లదాడికి పాల్పడుతూ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారు. ఇక్కడ చదవండి: ‘సీఏఏ’ వర్గాల మధ్య ఘర్షణ చదవండి : సీఏఏ సెగ: మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత -
ఆ రెండు క్లాసిక్ సినిమాలు: ట్రంప్
అహ్మదాబాద్: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అహ్మదాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. సోమవారం మొతేరా స్టేడియంలో కిక్కిరిసిన జనాల మధ్య ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తడంతో పాటుగా.. భారతీయుల శక్తిసామర్థ్యాలను ట్రంప్ కొనియాడారు. ఇక భారతీయ సినిమాలు, క్రీడాకారుల గురించి కూడా.. ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘భారత్ క్రియేటివ్ హబ్. బాలీవుడ్లో ఏడాదికి దాదాపు 2000 వేల సినిమాలు నిర్మిస్తారు. భూగ్రహం మీద ఉన్న ప్రజలంతా బాలీవుడ్ సినిమాలను ఆస్వాదిస్తారు. భాంగ్రాను ఇష్టపడతారు. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి క్లాసిక్ సినిమాలను చూస్తారు. అంతేకాదు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజాలు ఇక్కడి నుంచే వచ్చారు’’ అని ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. (రక్షణ ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన) అదే విధంగా... ‘‘గడిచిన డెబ్బై ఏళ్లలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన భారత్.. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలిచింది. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. కఠిన శ్రమ, నిబద్ధతకు నిదర్శనం. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ప్రపంచలోనే పెద్దదైన, లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న మొతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇరు దేశాధినేతలు ప్రసంగించారు. (మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ) -
ఆ అతిథుల జాబితాలో మన్మోహన్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవనున్నారు. పలు విపక్ష నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోయినా రాష్ట్రపతి ఇచ్చే విందులో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారని భావిస్తున్నారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి నిర్ణయించిన క్రమంలో విందుకు హాజరయ్యేందుకు సర్దార్జీ సంసిద్ధమవడం గమనార్హం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానించకపోవడంపై విపక్ష నేత మండిపడుతున్నారు. విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనపెట్టడమేనని చౌధరి పేర్కొన్నారు. మనసు మార్చుకున్న మన్మోహన్ కాంగగ్రెస్ అధినేత్రి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించనందుకు నిరసనగా ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కారాదని ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధరి, గులాం నబీ ఆజాద్‌లు విందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చదవండి : 'సిక్కుల ఊచకోత జరిగేది కాదు' -
భవిష్యత్‌లో ప్రబల శక్తిగా భారత్ : ట్రంప్
-
ట్రంప్ టూర్: కళాకారుడి వినూత్న స్వాగతం
చెన్నై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేశారు. దీంతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ట్రంప్ రెండు రోజుల పర్యటనపై దేశమంతా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ క్రమంలో ఓ కళాకారుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి వినూత్న స్వాగతం పలికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఇనైవాన్ అనే వ్యక్తి ట్రంప్ పర్యటనతోపాటు రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని తన కళాకృతిలో చాటి చెప్పాడు. అందుకోసం మూడు పే..ద్ద ఇడ్లీలను తయారు చేసి వాటిపై మోదీ, ట్రంప్ ముఖాలను చిత్రీకరించాడు. (మేడమ్ ఫస్ట్ లేడీ) మరో ఇడ్లీపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఆవిష్కరించాడు. ఈ కళాకృతులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటిని ఇనైవాన్ ఆరుగురు వ్యక్తుల సహాయంతో సుమారు 36 గంటల పాటు శ్రమించి సిద్ధం చేశాడు. ఈ మూడు ఇడ్లీల బరువు సుమారు 107 కిలోలు. కాగా నేడు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వీరు అక్కడి నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ట్రంప్ దంపతులు ఇద్దరూ నేలపై కూర్చుని చరఖాపై నూలు వడకడం విశేషం. (మోదీ, నేను మంచి ఫ్రెండ్స్!) -
ట్రంప్ మెనూ గురించి సిబ్బంది దిగులు!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం భారత్ చాలానే ఏర్పాట్లు చేసింది. ఆయనకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే అందరూ ‘ట్రంప్.. భారత్ గురించి ఏం మాట్లాడుతారు... ఈ పర్యటనతో భారత్- అమెరికా సంబంధాలు ఎలా మెరుగుపడతాయి’ అని ఆలోచిస్తుంటే ట్రంప్ సిబ్బంది మాత్రం వేరే విషయం గురించి ఆలోచిస్తున్నారట. ట్రంప్ తన డైట్లో నాన్ వెజ్ బర్గర్లు, స్టీక్, మటన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భారత్‌లో ట్రంప్ పర్యటించే 36 గంటల్లో ఆయన మెనూ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్ కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయిస్తున్నారు. అయితే వాటిలో వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వెజ్ బర్గర్లు, మల్టీగ్రెయిన్ రోటీ, సమోసా మొదలైనవి ట్రంప్ కోసం ప్రత్యేకంగా చేయిస్తున్నారు. ఈ విషయంపై సంబంధించిన ట్రంప్ సిబ్బంది... అధ్యక్షుడి డైట్లో ఎప్పుడు వెజిటేరియన్‌ను చూడలేదని తెలిపారు. ఇండియా మెనూ విషయంలో ఆయన ఏం చేస్తారో చూడాలి అని పేర్కొన్నారు. ట్రంప్ ఎప్పుడూ తినే మెక్‌డొనాల్డ్‌లో కూడా బీఫ్ బర్గర్లు అందుబాటులో లేవని తెలిపారు. ట్రంప్ ఇప్పటి వరకు ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయన కోసం స్టీక్ అందుబాటులో ఉంచుతారని, అది వీలుకాకపోతే మటన్‌ను మెనూలో జత చేరుస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ మెనూ, ఆతిథ్యం ట్రంప్‌నకు నచ్చుతుందో లేదోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కాగా మంగళవారం సాయంత్రం ట్రంప్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్లో విందు ఆరగించనున్నారు. (ఇక్కడ చదవండి: మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : ప్రధాని మోదీ) ఇక తన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్తో కలసి ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ఆయనతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతేరా స్టేడియంలో ఇరువురు ప్రసంగించారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత ట్రంప్ ఆగ్రాకు చేరుకోనున్నారు. -
రక్షణ ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన
అహ్మదాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ ప్రసంగం కొనసాగించారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రస్తుతించారు. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని అన్నారు. ట్రంప్ ఇంకా ఏమన్నారంటే...‘ భారత్, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం ముదావహం. భారత్ ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఓ ఛాయ్ వాలా స్ధాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతం..ఇంతటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు. భారతీయులు ఏదైనా సాదించగలరనేందుకు మోదీ నిదర్శనం. ఆర్థిక ప్రబల శక్తిగా భారత్ భారత్ ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగింది. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 12 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ స్ధాయిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు సచిన్, కోహ్లీలు ఇక్కడే.. ప్రపంచ క్రికెట్లో అద్భుతాలు సృష్టించి సత్తా చాటిన క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పుట్టినిల్లు భారతేనని కొనియాడారు. భవిష్యత్‌లో భారత్ అద్భుత శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ దశాబ్ధంలో భారత్ అత్యధిక విజయాలు సాధించింది. ఈ భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. భారత్ మాతా కీ జై ’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. చదవండి : మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ -
ఆ పుస్తకంలో ట్రంప్ ఏం రాశారంటే..!
అహ్మదాబాద్: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి చిత్రపటానికి నూలుమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రత్యేకత, గాంధీ అనుసరించిన జీవన విధానాలను ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం రాసి సంతకం చేశారు. చదవండి: మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ అద్భుతమైన ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలంటూ ట్రంప్ సందర్శకుల పుస్తకంలో పేర్కొన్నారు. గొప్ప స్స్నేహితుడైన ప్రధానికి మోదీకి ధన్యవాదాలు. ఇదో అద్భుతమైన సందర్శన అంటూ అక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసుకొచ్చారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం నుంచి మొతెరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లారు. చదవండి: ‘నమస్తే ట్రంప్’ ప్రారంభం -
దేశవ్యాప్తంగా ఉత్సాహం నింపారు
-
ట్రంప్ టూర్ : వావ్ తాజ్ అంటారా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించనున్న అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ అపూర్వ కట్టడంతో అనుభవాలు చాలానే ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ తిరుగులేని ఆదాయ వనరుగా మార్చుకోవడంలో అందెవేసిన చేయిగా పేరొందిన ట్రంప్‌నకు ఆ తాజ్‌మహల్ మాత్రం బిన్న అనుభవాలనే మిగిల్చింది. 1990లో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో ప్రారంభమైన ట్రంప్ తాజ్ మహల్ క్యాసినో ప్రారంభించిన నెలల్లోనే దివాలాకు దరఖాస్తు చేసింది. అనంతరం దీన్ని ట్రంప్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చారు, అప్పటికీ అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చినా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రెండు చేతులా ఆర్జించారు. ట్రంప్ తాజ్ మహల్ ను 2017 లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్ యజమానులకు విక్రయించే సమయానికి, డొనాల్డ్ ట్రంప్‌కు మాతృ సంస్థలో వాటా లేదు. (నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్) తాజ్ వద్ద తాజా సాయంత్రం.. ఇక ఇప్పటి విషయానికి వస్తే తాను నిర్మించిన తాజ్ మహల్ అనుభవం అలా ఉంటే ఇక ప్రపంచంలోనే అత్యంత సందర్శనీయ స్ధలాల్లో ఒకటై ఆగ్రాలో కొలువుతీరిన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో సందర్శించనున్నారు. ట్రంప్ తాజ్ పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. తోటలు, ఫౌంటెన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆర్భాటపు ఏర్పాట్లు, తాజ్ అందాలు ట్రంప్‌ను ఎలాంటి అనుభూతులకు లోనుచేస్తాయి..? తన తాజ్‌మహల్ జ్ఞాపకాలను గుర్తుకుతెస్తాయా..? వాటిని మనతో ఆయన ఎలా పంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుపొందిన మొతెరా క్రికెట్ స్టేడియం ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం జనంతో కిక్కిరిపోయింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభికులతో సమస్తే ట్రంప్ అంటూ పలికించారు. అమెరికా, భారత్ జాతీయా గీతాలాపన అనంతరం ‘భారత్ మాతాకీ జై’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు. నమస్తే ట్రంప్ అంటూ సభికులను పలకరించారు. భారత్-అమెరికా స్నేహం పరిఢవిల్లాలని నినదించారు. ఆయన మాట్లాడుతూ... (చదవండి : ట్రంప్ టూర్ : వావ్ తాజ్ అంటారా..?) ‘మొతెరా క్రికెట్ స్టేడియంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ట్రంప్, ఆయన కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఇది గుజరాతీ గడ్డ అయినా యావత్తు దేశమంతా దీన్ని స్వాగతిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే నిదర్శనం. ట్రంప్ ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అమెరికా యావత్తు భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది. (చదవండి :ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు..) అహ్మదాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్టపాత్ర ఉంది. మనం అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ అమెరికాలను కలుపుతుంది. స్టాచ్యు ఆఫ్ లిబర్టీ - స్టాచ్యూ ఆఫ్ పటేల్ మధ్య సంబంధముంది. ఇరు దేశాల స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాలి. ట్రంప్ రాక దీనికి కచ్చితంగా దోహదపడుతుది. అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది. అమెరికాలో సమాజాభివృద్ధికి మెలానియా కృషిని ప్రశంసిస్తున్నాం. బాలల సంక్షేమానికి మెలానియా చేసిన కృషి అభినందనీయం. ఇవాంక రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చారు. మరోసారి ఇవాంకకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నా’అని మోదీ పేర్కొన్నారు. -
‘నమస్తే ట్రంప్’ ప్రారంభం
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం జనంతో కిక్కిరిపోయింది. స్టేడియం వేదికపై భారతీయ విశిష్టతను తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇరు దేశాధినేతలు సభికులకు అభివాదం చేశారు. అనంతరం భారత్, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నమస్తే ట్రంప్ అంటూ సభికులతో పలికించారు. భారత్-అమెరికా సంబంధాలు వర్ధిల్లాలి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మొతేరా స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా పేరుగాంచింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్!) -
నమస్తే ట్రంప్
-
ట్రంప్ పర్యటన : ఇవాంకా డ్రెస్ అదుర్స్!
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం 11:45 గంటలకు అహ్మదాబాద్ సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్నర్లు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్ నెక్లైన్తో, పఫ్పుడ్ స్లీవ్స్‌తో డ్రెస్ చాలా అందంగా ఉంది. మామూలుగానే ఎత్తుగా ఉండే ఆమె డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా పొడవైన ఎర్రటి హైహీల్స్ ధరించి మరింత ఎత్తుగా కనిపించారు. (ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు.. ) ఇవాంకా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్ టీన్ యూఎస్ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అందాల రాశిగా గుర్తింపు వచ్చినా... తర్వాతికాలంలో ఇవాంకా మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. చదవండి : ట్రంప్ దంపతులకు మోదీ ఘన స్వాగతం విజయాలు.. వివాదాలతో సహజీవనం! -
నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్
అహ్మదాబాద్ : భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. ట్రంప్ చరఖాపై కాసేపు నూలు వడికారు. అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్ బుక్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు. -
ట్రంప్ దంపతులకు మోదీ ఘన స్వాగతం
అమెరికా అధిపతి తొలి రాకడ సందర్భంగా యావత్ భారతం ‘నమస్తే ట్రంప్’ అంటూ ఆహ్వానం పలుకుతోంది. అగ్రరాజ్యాన్ని పాలిస్తున్న ట్రంప్ దూకుడైన, కఠిన నిర్ణయాలు భారత్‌కు నష్టదాయకంగా పరిణమించడంతో ఆయన తాజా పర్యటన మనకు ఏమేరకు లాభిస్తుందని కొందరు లెక్కలు కడుతున్నారు! ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మేలిమలుపు తిప్పనుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. సతీసమేతంగా ఇక్కడికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు..36 గంటల తన పర్యటనలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూద్దాం! అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది. (చదవండి : ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు..) 22 కి.మీ. రోడ్ షో.. ఎయిర్‌పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. (చదవండి : మేడమ్ ఫస్ట్ లేడీ) -
ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు..
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్ భారత్ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్ దంపతులు బస చేయబోయే హోట్‌ల్ గదికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ దంపతులు అహ్మదాబాద్, ఆగ్రా పర్యటనల అనంతరం ఢిల్లీకి చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. వీరికోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యా హోటల్లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్‌చేసింది. ఒక రాత్రికి ఆ సూట్లో ఉండటానికి అయ్యే ఖర్చు అక్షరాల 8 లక్షల రూపాయలు. అమ్మో అంత ఖర్చా! అంటూ నెటిజన్లు కూడా నోరెళ్లబెతున్నారు. ‘పెద్దన్నంటే మాటలు కాదుగా మరి.. ఆ మాత్రం ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ పనేంటంటే..) ఇంతకీ ఆ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ ప్రత్యేకతలేంటంటే.. సిల్క్ ప్యానెల్డ్ గోడలు, వుడెన్ ఫ్లోరింగ్, అదిరిపోయే కళాకృతులు, సౌకర్యవంతమైన లివింగ్ రూం, ప్రత్యేకమైన డైనింగ్ గది, విలాసవంతమైన రెస్ట్‌రూం, మినీ స్పా, పర్శనల్ జిమ్ ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 55 అంగుళాల హై డెఫినిషన్ టీవీ, ఐపాడ్ డాకింగ్ స్టేషన్, ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయోలాజికల్ లాబొరేటరీ, బయట వైపు గాలి విషతుల్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్‌లు బస చేశారు. కాగా, మరి కొద్ది గంటల్లో ట్రంప్ భారత గడ్డమీద అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ చేరుకుంటారు. అహ్మదాబాద్ పర్యటన ముగిసిన వెంటనే కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రా సందర్శనకు వెళతారు. ( ‘మేడమ్ ఎక్కడా!!’? ) చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ -
దారిలో ఉన్నాం.. హిందీలో ట్రంప్ ట్వీట్!
న్యూఢిల్లీ : భారత్‌కు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు టంప్.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు హిందీలో రిప్లై ఇచ్చారు. వారి రాకను తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘మేము భారతదేశానికి రావాలని ఎదురుచూస్తున్నాం. మేము దారిలో ఉన్నాం. కొద్ది గంటల్లో అందరినీ కలుస్తాం!’ అని ట్రంప్ పేర్కొన్నారు. భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆయన నిన్న వాషింగ్టన్ డీసీ నుంచి ఎయిర్‌ఫోర్స్ 1 విమానంలో బయల్దేరిన సంగతి తెలిసిందే. వారి వెంట కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఇండియా వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వారంతా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అంతకు ముందు ప్రధాని మోదీ ట్విటర్లో.. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు యావత్ భారతం ఎదురుచూస్తోంది. మీ సందర్శన కచ్చితంగా ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అహ్మదాబాద్‌లో కలుద్దాం’ అని పేర్కొన్నారు. గుజరాత్ వ్యాప్తంగా ‘నమస్తే ట్రంప్’అనే మాటే వినబడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ట్వీట్ చేశారు. (చదవండి : ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది?) రెడ్ కార్పెట్ స్వాగతం.. అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీతోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత పర్యటనకు వస్తోంది. అమెరికా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రెసిడెంట్ ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరు దేశాధినేతలు అశేష జనవాహిని మధ్య 22 కిమీమీటర్ల మేర సాగే భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం మోతేరాలో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరవుతారు. సుమారు 1.10 లక్షలమంది సభికులను ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగిస్తారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి మోదీతోపాటు ట్రంప్ హాజరైన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. (చదవండి : ట్రంప్ పర్యటనపై వర్మ సెటైర్లు) (చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) -
ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ పనేంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేటి(సోమవారం) మధ్యాహ్నం అడుగిడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికాకు చెందినసీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయంలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏంటో తెలుసుకుందాం.. ►అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ► ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. ► అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ►ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. ► అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. ►అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. ►అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. ►చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. ►1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. ►సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుంటారు. ► ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. ► సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. ►వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్‌మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ మోదీ, నేను మంచి ఫ్రెండ్స్! ‘అగ్ర’జుడి ఆగమనం నేడే -
ట్రంప్ భారత్ పర్యటనపై వర్మ పంచ్‌లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 24, 25 తేదీల్లో ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదిలా ఉండగా ట్రంప్ భారత పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ మధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్న కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తాజాగా డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై ట్వీటర్ వేదికపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సెటైర్లు వేస్తున్న వర్మ.. మరోసారి ట్రంప్ పర్యటనను ఉద్దేశించి పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.(‘అగ్ర’జుడి ఆగమనం నేడే) ‘ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం.. కానీ ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా..? అది అమెరికా.. భారత్ కాదు’’.అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదే విధంగా ‘ట్రంప్ ఇండియాకు రావడానికి ఒకే ఒక కారణం.. తను ఇండియా వస్తున్నాడంటే ఎంత మంది అతన్ని చూడటానికి వస్తారో అని ఆసక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చు.తన కోసం 10 మిలియన్ల మంది రావచ్చు.. కానీ ట్రంప్ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు.’ అంటూ మరో ట్వీట్ చేశాడు. (ట్రంప్ పర్యటన: వర్మ సంచలన వ్యాఖ్యలు!) ‘ఏ భారతీయుడైన తమ సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైనది కాదు. దీని కంటే ఓ బాలీవుడ్ నైట్ ఈవెంట్ ఏర్పాటు చేయడం ఉత్తమం’ అని ట్రంప్ పర్యటను టార్గెట్ చేసిన వర్శ ఆయనపై మరికొన్ని పంచ్‌లు విసిరారు.. ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ మోదీ, నేను మంచి ఫ్రెండ్స్! ‘అగ్ర’జుడి ఆగమనం నేడే We Indians spent thousands of crores in welcoming @realDonaldTrump , but will Americans spend even thousands of rupees in welcoming @narendramodi to the US ? That says about America and not India ...Just saying ! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 The only reason @realdonaldtrump is coming to india is because he’s obsessed with crowd sizes which he can brag about till he dies ..I hope for his sake the 10 million will turn up..But knowing him he will just lie and say 15 million turned up..Just saying! — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020 -
‘మేడమ్ ఎక్కడా!!’?
స్త్రీ పక్కన ఉంటే పురుషుడికి లభించే గౌరవమే వేరు! సీఎం అయినా, పీఎం అయినా, చక్రవర్తే అయినా. అంతవరకు ఎందుకు.. మనం వెళ్లే ఫంక్షన్లలోనే చూడండి.. అతను కనిపించి ఆమె జాడ లేకుంటే... ఠపీమని ‘అమ్మాయేదీ!’ అంటారు. ‘మేడమ్ ఎక్కడా!!’ అని చుట్టుపక్కలకు చూస్తారు. అమెరికా అధ్యక్షుడు కొద్ది గంటల్లో ఇండియాలో దిగుతున్నారు. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. సతీమణితో పాటు వస్తున్నారు కనుక సంపూర్ణ గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఇలా జంటగా కలిసి ఇండియా వచ్చి, భర్తకు అపారమైన గౌరవ మర్యాదలను ప్రసాదింపజేసిన అమెరికా ప్రథమ మహిళల సందర్శన సమయాలు, సందర్భ చిత్రాలు... క్లుప్తంగా, మీ కోసం. 1962 జాక్వెలీన్కెన్నడీ సతీమణి జాక్వెలీన్ 1962లో ఇండియా వచ్చారు. ఇండియాను సందర్శించడం తన కల అని కూడా అన్నారు! ఇండియాలో హోలీ కూడా ఆడారు. 1969 పాట్ రిచర్డ్ నిక్సన్ సతీమణి పాట్ నిక్సన్ 1969లో ఇండియా వచ్చారు. ఒకే రోజు ఉన్నారు. పెద్దగా పర్యటనలేం చెయ్యలేదు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. 1978 రోసలీన్జిమ్మీ కార్టర్ సతీమణి రోసలీన్ కార్టర్ 1978లో ఇండియా వచ్చారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారని అంటారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలను కలిశారు. 1995-1997 హిల్లరీబిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ 1995లో, 1997లో ఒక్కరే ఇండియా వచ్చారు. మొదటిసారి కూతురు చెల్సీతో కలిసి వచ్చారు. రెండోసారిమదర్ థెరిసాఅంత్యక్రియలకువచ్చారు. 2006 లారా జార్జి బుష్ సతీమణి లారా బుష్ 2006లో ఇండియా వచ్చారు. నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీలో కొంత సమయం గడిపారు. హైదరాబాద్ కూడా వచ్చారు. 2010- 2015 మిషెల్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా 2010లో, 2015లో ఇండియా వచ్చారు. మహిళా సంక్షేమం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. బాలలతో కలిసి డాన్స్ చేశారు. -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
మోదీ, నేను మంచి ఫ్రెండ్స్!
భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. భారత్ పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారత్‌కు వస్తానని చాలా రోజుల క్రితమే మాట ఇచ్చానని ఈ సందర్భంగా తెలిపారు. ‘భారత ప్రజలతో మమేకమయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా పర్యటన సందర్భంగా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం జరగబోతోందని విన్నా. భారత్‌లో ఇంతవరకు జరగనంత భారీ కార్యక్రమం అది అని భారత ప్రధాని నాకు చెప్పారు. భారత ప్రధాని మోదీ నా స్నేహితుడు. మేమిద్దరం బాగా కలసిపోతాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ఎదురు చూస్తోంది: మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు భారత్ ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. -
విజయాలు.. వివాదాలతో సహజీవనం!
‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’– అమెరికా 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ జాన్ ట్రంప్‌నకు ఇష్టమైన సొంత కొటేషన్ ఇది. ట్రంప్ జీవితాన్ని కొంతవరకు ఈ కొటేషన్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్ జీవితంలో విజయాలు, వైఫల్యాలు, వివాదాలు.. ప్రశంసలు, విమర్శలు.. అవహేళనలు, ఆత్మీయతలు.. అన్నీ కనిపిస్తాయి. అదీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటినీ ఆయన ఒక్కలాగే తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ‘డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. పని చేయడం కోసమే పని చేస్తున్నాను. వ్యాపారం నా కళాత్మక విధానం’ అంటారు ట్రంప్. తండ్రి ఫేమస్ రియల్టర్ డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్లియడ్ దంపతులకు 1946 జూన్ 14 వ తేదీన జన్మించారు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్‌లో పేరెన్నిక గన్న బిల్డర్, రియల్టర్. క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్, బ్రూక్లిన్ల్లో మధ్యతరగతి వాసులకు చవకగా అపార్ట్మెంట్స్ నిర్మించి ఇచ్చేవాడు. మేరీ కుటుంబం స్కాట్లాండ్ నుంచి వలస వచ్చింది. ఫ్రెడ్, మేరీల వివాహం 1936లో జరిగింది. వారి ఐదుగురు పిల్లల్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగవ వాడు. ఫోర్డమ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, న్యూయార్క్ మిలటరీ అకాడమీల్లో ట్రంప్ విద్యనభ్యసించారు. మిలటరీ అకాడెమీలో స్టార్ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా ట్రంప్ నిలిచారు. ఆ తరువాత తన తండ్రి వారసత్వంగా రియల్టీ బిజినెస్‌లోకి దిగారు. కొద్ది కాలంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మన్‌హటన్‌లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్ హయత్ న్యూయార్క్’ ప్రాజెక్టు ఆయనకు డెవలపర్‌గా గొప్ప పేరు తీసుకువచ్చింది. రియాలిటీ టీవీ స్టార్ గానూ ట్రంప్ ప్రఖ్యాతి గాంచారు. ‘ది అప్రెంటిస్’ పేరుతో ఆయన ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు. సోదరుడి ప్రభావం మద్యం వ్యసనానికి లోనై చనిపోయిన తన సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ట్రంప్ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. సోదరుడి మరణం తరువాత తాను ఆల్కహాల్ ముట్టనని, డ్రగ్స్ తీసుకోనని ట్రం ప్ శపథం చేశారు. మతపరంగా, ట్రంప్‌ను ఆయన తల్లి ప్రెస్బిటేరియన్‌గా పెంచినప్పటికీ.. తనను తాను మెయిన్‌లైన్ ప్రొటెస్టెంట్నని ఆయన చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారాల్లో ముఖ్యమైనవి ట్రంప్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్‌లో కేసినోలు, టీవీ షోలు. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ 1987లో టోనీ ష్వాజ్తో కలిసి ట్రంప్ ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం రాశారు. అందులో తన వ్యాపార విజయరహస్యాలను వివరించారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ఆ పుస్తకం నిలిచింది. కానీ, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. ‘క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే పుస్తకం కూడా ట్రంప్ రాశారు. 2005లో ఆయన ‘ట్రంప్ యూనివర్సిటీ’ని స్థాపించారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపార మెళకువలను కోర్సులుగా నేర్పించేవారు. ఇవానా.. మేపుల్స్.. మెలానియా ట్రంప్ మొదట 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ఇవానా అప్పటికే ప్రముఖ ఫ్యాషన్ మోడల్. వారికి ముగ్గురు పిల్లలు. వారు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ట్రంప్, ఇవానా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, 1993లో ట్రంప్ మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె నటి. వారికి టిఫానా అనే కూతురు ఉంది. 1999లో మేపుల్స్‌కు 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి ట్రంప్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో మెలానియాను ట్రంప్ వివాహమాడారు. ఆమె స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్. ట్రంప్ కన్నా వయసులో 23 ఏళ్లు చిన్న. ట్రంప్, మెలానియాల సంతానం బారన్ విలియమ్. డొనాల్డ్ ట్రంప్ పిల్లల్లో డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు వారి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు. -
అస్థిరతలు కొనసాగొచ్చు..
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్పీ పారిబాస్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ గౌరవ్‌దువా తెలిపారు. మెటల్స్, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇన్స్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో కోవిడ్–19 వైరస్ సంబంధిత పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్–జూన్) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ తెలిపారు. ఎఫ్‌పీఐలు బుల్లిష్... భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. అయితే సమీప భవిష్యత్తు పెట్టుబడు లపై కోవిడ్–19 ప్రభావం ఉండవచ్చని అంచనా. -
అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. కుటుంబంతో సహా ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లో నేటి మధ్యాహ్నం అడుగిడనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషమైతే.. ప్రొటొకాల్‌కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం.భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా భారత్ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్‌తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. (ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) 36 గంటలు.. ముఖ్యమైన కార్యక్రమాలు భారత్‌లో తొలుత ట్రంప్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు నేరుగా ఈ రోడ్ షోలో పాలుపంచుకుంటారు. దాదాపు 22 కి.మీ.లు ఈ రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది ఈ రోడ్ షోలో ట్రంప్‌నకు స్వాగతం పలుకుతారు. రోడ్ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అనంతరం, కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమం ఉంటుంది. ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ కైలాశ్ ఖేర్ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్‌లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ’కార్యక్రమం తరహాలో ఈ ‘నమస్తే ట్రంప్’ఉంటుంది. ఆ కార్యక్రమం తరువాత ట్రంప్ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్ మౌర్య షెరాటన్‌లో సేద తీరుతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. అనంతరం, హైదరాబాద్ హౌజ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం, యూఎస్ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్‌నాథ్ కోవింద్‌ను ట్రంప్ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్ భారత్‌లో గడపనున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో స్వాగతం పలికేందుకు చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ చర్చల్లో కీలకం ట్రంప్ పర్యటన భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలను మేలిమలుపు తిప్పనుంది. ముఖ్యంగా, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. అయితే, వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ ప్రాంతంలో ఆర్థికంగా, సైనికంగా చైనా విస్తృతిని అడ్డుకునే దిశగా ఇరు దేశాల సంబంధాల మధ్య కీలక సానుకూల ఫలితాలు ఈ పర్యటన ద్వారా వెలువడే అవకాశముంది. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై కామెంట్స్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ పర్యటన జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో మత స్వేచ్ఛపై ట్రంప్ తన అభిప్రాయాలను వెల్లడిస్తారని వైట్‌హౌజ్‌లోని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇరుదేశాల విలువలైన ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు సంబంధించి బహిరంగంగాను, వ్యక్తిగత చర్చల్లోనూ ప్రస్తావన తీసుకువస్తారు. అన్ని అంశాలు, ముఖ్యంగా మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ప్రెసిడెంట్ తప్పక లేవనెత్తుతారు’అని ఆ అధికారి తేల్చిచెప్పారు. ఐదు ఒప్పందాలు! ఇరు దేశాల మధ్య ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాణిజ్యం, అంతర్గత భద్రతలకు సంబంధించి ఐదు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా, అమెరికా నుంచి 260 కోట్ల డాలర్లను వెచ్చించి 24 ఎంహెచ్–60 రోమియో హెలీకాప్టర్లను, 80 కోట్ల డాలర్లతో 6 ఏహెచ్ 64ఈ అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భారత్‌కున్న పలు అభ్యంతరాల రీత్యా.. భారత పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలో ప్రవేశించాలన్న అమెరికా ఆశలు ఈ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్‌మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు -
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం
పాత మంచిర్యాల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు రెండో రోజు ఆదివారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆ భారాన్ని ఇతర దేశాలపై మోపడానికి ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారన్నారు. ట్రంప్ పర్యటన ఎలా ఉందంటే మీ ఇంటికొస్తే ఏమిస్తావు.. మా ఇంటికి ఏమి తెస్తావ్ అనేలా ఉందన్నారు. -
ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ
మెలనియా గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. బిజినెస్‌మ్యాన్. టెలివిజన్ పర్సనాలిటీ. అప్పటికే రెండో భార్యతో వేరుగా ఉంటున్నాడు. ‘వావ్.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు చెప్పింది మెలనియా. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. ట్రంప్ వదిలిపెట్టలేదు. మెలనియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. చివరికి ‘ఎస్’ అంది. తర్వాత కొన్నాళ్లకు ‘నో’ అంది. అలా కొంతకాలం ‘ఎస్’లు, ‘నో’ లతో వాళ్ల రిలేషన్ నడిచింది. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు. తమ రిలేషన్ గురించి ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. ఆ ముందు ఏడాదే వీళ్ల ఎంగేజ్మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు. మెలనియాకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆమె తండ్రి స్లొవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. స్లొవేనియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. తల్లికి బట్టల కంపెనీ ఉంది. మెలనియాకు ఒక చెల్లి ఉంది. అన్న ఉన్నాడు. సొంత అన్న కాదు. తండ్రి మొదటి భార్య కొడుకు. మెలనియా ఆ అన్నను ఎప్పుడూ చూడలేదు. మెలనియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్‌లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలనియా. ఇన్ని భాషలు వచ్చినా... ట్రంప్‌పై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి ఆమెకు ఏ భాషలోనూ బలం సరిపోయేది కాదు. నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌పై దాడి మొదలైంది. ముఖ్యంగా అమెరికన్ మహిళల వైపు నుంచి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో మహిళా వచ్చి ట్రంప్ తమతో ఎంత అసభ్యంగా ప్రవర్తించిందీ మీడియా ముందు వెళ్లగక్కారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని మెలనియా ఆయన వైపు స్థిరంగా నిలబడ్డారు. ‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు’’ అని వెనకేసుకొచ్చారు. ఎంత వెనకేసుకొచ్చినా.. మొదటి భార్య కూతురు ఇవాంక విషయంలో తన భర్త చేసిన కామెంట్లను మాత్రం ఆమె నిజాయితీగా ఖండించారు. కూతురు గురించి ఒక తండ్రి అనవలసిన మాటలు కాదని కూడా అన్నారు. (‘ఇవాంకా నా కూతురు కాకపోయుంటే నేను తనతో డేటింగ్‌కి వెళ్లేవాడిని. అంత అందంగా ఉంటుంది తను’ అని ట్రంప్ అన్నాడని వచ్చిన వార్తలపై). ట్రంప్ ధోరణి గురించి అడిగితే ఆమె ఎప్పుడూ ఒకే మాట చెబుతారు: ‘సెన్సేషన్ కోసం ఆయన్ని మాట్లాడిస్తారు తప్ప, సెన్సేషన్ కోసం ఆయనకై ఆయన మాట్లాడరు’ అని. ఆ మధ్య ఇంకో ఒక అందమైన మాట కూడా అన్నారు మెలనియా. ఇంట్లో తనకు ఇద్దరు కొడుకు లట. తన కొడుకు. తన భర్త. -
భారత్‌కు బయల్దేరిన ట్రంప్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బయల్దేరారు. సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్ 1 విమానంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి పయనమయ్యారు. వారి వెంట కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఇండియా వస్తున్నారు. జర్మనీ మీదుగా వారు భారత్‌కు చేరుకుంటారు. రేపు (సోమవారం) ఉదయం 11.55 నిముషాలకు ట్రంప్ ఫ్యామిలీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతేరా క్రికెట్ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్ షోలో పాల్గొంటారు. లక్షలాది నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. చదవండి :- ట్రంప్ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు! ట్రంప్‌ను విలన్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత హౌడీ X నమస్తే -
ట్రంప్ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించింది. ట్రంప్ పర్యటన భారత్‌కు ఏమేరకు లాభిస్తుందో చెప్పగలరా అని ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్‌సింగ్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఐదు ప్రశ్నలు వేశారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలు, హెచ్ 1బీ వీసాలు, జాతీయ భద్రత, ఆయిల్ ధరలు, స్టీల్ ఎగుమతి అంశాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి : భారత్‌కు పయనమైన అమెరికా అధ్యక్షుడు) 1.హెచ్ 1 బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం (85 వేలు) మందికి వీసాలు వచ్చేవి. 30 శాతం తిరస్కరణకు గురయ్యేవి. ట్రంప్ నిర్ణయాల వల్ల నేడు తిరస్కరణ మరో 24 శాతం పెరిగింది. ఈ పర్యటన తర్వాత హెచ్ 1 బీ వీసాల జారీని ట్రంప్ సరళతరం చేస్తారా? 2.1974 నుంచి భారత్‌కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) 2019లో తొలగించారు. దీనివల్ల 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడింది. నమస్తే ట్రంప్ కార్యక్రమం జీఎస్పీ పునరుద్ధరణకు దోహదం చేస్తుందా? 3.ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిల్లో ఇరాన్ నుంచి భారత్ చములు కొనుగోలు చేయొద్దని నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ దిగుమతి నిలిపేస్తే.. ఆ స్థానంలో అమెరికా మనకు చమురు సరఫరా చేస్తుందా? ఇరాన్ నుంచి కాకుండా భారత్‌కు తక్కువ ధరకు చుమురును మోదీ తీసుకురాగలరా? 4.అమెరికా ప్రమోజనాలే తమకు తొలి ప్రాధాన్యం అని ట్రంప్ వాదిస్తుంటే.. భారత్‌కు తొలి ప్రాధాన్యం అన్న విధానంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? 5. భారత్ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం వల్ల 761 మిలియన్ డాలర్లుగా స్టీల్ ఎగుమతులు 50 శాతం మేర తగ్గిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందానికి భారత్ సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిఫలంగా భారత స్టీల్ ఎగుమతులపై అగ్రరాజ్యం ఏమైనా ప్రోత్సహకాలు కల్పిస్తుందా? అని సుర్జేవాలా ప్రశ్నించారు. (చదవండి : ట్రంప్‌ను విలన్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత) ఇక 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసిన సుర్జేవాలా.. తాలిబన్లతో అమెరికా చేసుకునే ఒప్పందం భారతదేశ రక్షణను వెక్కిరిస్తుంది కదా అని పేర్కొన్నారు. తాలిబన్లతో అమెరికా ఒప్పందం శాంతిని పెంపొందిస్తుందని రష్యా కూడా చెప్తున్న నేపథ్యంలో భారత్‌పై తాలిబన్ల చర్యలన్నీ మర్చిపోవాలా అని ప్రశ్నించారు. (చదవండి : హౌడీ X నమస్తే) -
ట్రంప్ పర్యటన : రంగంలోకి కొండముచ్చులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. (చదవండి : ట్రంప్ పర్యటన పుణ్యమా అని..) ఇక ట్రంప్ ఆగ్రాలో కూడా పర్యటిస్తుండడంతో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత ఏర్పాటు విషయంలో అధికారులు ఏమాత్రం రాజీ పడడంలేదు. ముఖ్యంగా కోతుల వల్ల అమెరికా అధ్యుక్షుడి పర్యటనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చని భావించిన అధికారులు.. కోతుల పని పట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు వాపోతున్నారు. దీంతో ట్రంప్ పర్యటనకు కోతుల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు ఐదు కొండముచ్చులను తాజ్‌మహాల్ సమీపంలో ఉంచారు. కొండముచ్చులను చూసి కోతులు భయపడతాయి. అవి ఉన్న సమీపానికి కోతులు రాలేవు. అందుకే అధికారులు కొండముచ్చులను రంగంలోకి దించారు. మొత్తానికి కొండముచ్చులు కూడా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా నిలిచాయన్నమాట. కాగా, రెండు రోజుల భారత్ పర్యటలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) ఇండియాకు రానున్నారు. హ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం మొటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహాల్‌కు వెళ్తారు. రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు.అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ట్రంప్ పర్యటన పుణ్యమా అని..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నీ రూ. కోట్లు పెట్టి మరమ్మతులు చేయించారు. అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి రూ.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది .రోడ్లను ఆదునీకరించడానికే రూ.30 కోట్లను ఖర్చు చేశారట. సోమవారం సాయంత్రం ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహాల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యం అక్కడి రోడ్లన్ని క్లీన్ చేయించారు. ట్రంప్ ప్రయాణించే రహదారి ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరించారు. ట్యాంకర్లలో నీళ్లను తెచ్చి రోడ్లన్నిశుభ్రం చేశారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న ప్రధాన మార్గాల్లో రోడ్లన్ని అద్దంలా మెరిసిపోతున్నాయి. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) ఇక ట్రంప్‌కు ఘన స్వాగతం గుజరాత్ ప్రభుత్వం కూడా భారీ ఏర్పాటు చేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడను నిర్మించారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మొటెరా స్టేడియాన్ని అలంకరించారు. ఇక ట్రంప్ ప్రయాణించే రహదారి వెంబడి విద్యార్థులలో సంప్రదాయ క్రీడ మల్లకంబను ప్రదర్శించనున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం దాదాపు రూ.85 కోట్లు చేస్తోంది. (చదవండి : ట్రంప్ విందు.. పసందు..!) ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 ► అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. ► గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. ► తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ► అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్‌లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. ► సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ► ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 25 ► రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ► ట్రంప్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ► అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ► మోదీ, ట్రంప్‌ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. ► అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. ► రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’
ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్‌ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్) ట్రంప్‌ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 'ట్రంప్ భారత్‌కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్‌ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్‌ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్) -
ట్రంప్ వెంట ఇద్దరు ఇండో అమెరికన్లు..
న్యూయార్క్ : ఈనెల 24, 25న రెండు రోజుల భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి బృందంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్ అజిత్ పాయ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారి కష్ పటేల్‌లు ఈ బృందంలో సభ్యులుగా అధ్యక్షుడి వెంట సోమవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పాయ్ తల్లితండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వైద్యులు కాగా 1971లో వారు అమెరికాకు వలస వెళ్లారు. కాన్సాస్‌లో జన్మించిన పాయ్ హార్వార్డ్, చికాగో యూనివర్సిటీల్లో విద్యాభ్యాసంతో న్యాయవాదిగా ఎదిగారు. 2012లో ఆయన ఎఫ్‌సీసీలో చేరి అనంతరం అయిదుగురు కమిషనర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. 2017లో ట్రంప్ పాయ్‌ను ఎఫ్‌సీసీ చీఫ్‌గా నియమించారు. ఇక గుజరాత్ మూలాలున్న కష్ పటేల్ తల్లితండ్రులు తూర్పు ఆఫ్రికా, కెనడాల నుంచి న్యూయార్క్‌లో స్ధిరపడ్డారు. రష్యా జోక్యంపై దర్యాప్తును తోసిపుచ్చడం ద్వారా పటేల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 2018లో పటేల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెదిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్స్‌లో చేరారు. ఉగ్రవాద నిరోధక విభాదగం బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. పటేల్ గతంలో రిపబ్లికన్ నాయకత్వానికి చెందిన హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి కూడా పనిచేశారు. చదవండి : వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్ -
వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. (ట్రంప్ విందు.. పసందు..!) ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు ఒక్కరోజు ముందు బాహుబలి టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్ ముఖానికి ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో 'జియోరే బాహుబలి' సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్ స్పందిస్తూ.. 'భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. (హౌడీ X నమస్తే) కాగా రెండు రోజుల పాటు ఇండియాలో గడపనున్న ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. Look so forward to being with my great friends in INDIA! https://t.co/1jdk3AW6fG — Donald J. Trump (@realDonaldTrump) February 22, 2020 -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్‌ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్‌కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్‌హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్‌హోవర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్‌కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్‌తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్‌తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్‌కు ప్రకటించారు. -
భారత్– అమెరికా.. 5 చిక్కుముళ్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాల్లోని ఐదు చిక్కుముడులు ఏమిటన్నది చూస్తే.. వాణిజ్య పన్నుల వివాదాలు: భారత్‌ను టారిఫ్ కింగ్ అని ఇటీవలే ట్రంప్ చేసిన వ్యాఖ్య పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. 2018 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 142.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నా గత ఏడాది అమెరికా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై పన్నులు పెంచింది. భారత్‌కిచ్చే కొన్ని ప్రత్యేక రాయితీలను కూడా ఉపసంహరించుకుంది. భారత్ ఎగుమతు లపై ఈ నిర్ణయం ప్రభావం సుమారు 5600 కోట్ల డాలర్ల వరకూ పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ బాదంపప్పు, వాల్నట్, ఆపిల్‌పండ్ల వంటి 28 వస్తువుల దిగుమతులు కొన్నింటిపై పన్నులు పెంచడం అమెరికా గుర్రుగా ఉంది. హెచ్–1బీ వీసాలు:అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేందుకు కారణమైన హెచ్–1బీ వీసాలపై నియంత్రణలు విధిస్తామన్న హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. ఇందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ వీసాల సంఖ్యను తగ్గించడంతో పాటు తాజాగా వీసా చార్జీలను రెండు వేల డాలర్ల నుంచి రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. త్వరలోనే హెచ్–1బీ వీసా పొందిన వ్యక్తుల భార్య/భర్తలు అక్కడ ఉద్యోగం చేసే అంశంపైనా త్వరలో సమీక్ష చేపట్టనున్నట్లు చెబుతోంది. భారతీయ ఐటీ కంపెనీలు దాఖలు చేసే హెచ్–1బీ వీసాల్లో 24% తిరస్క రణకు గురవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భారతీయులకు ఇబ్బంది కలిగించేవే. డేటా లోకలైజేషన్: పౌరుల సమాచారంపై హక్కు తమదేనన్న భారత ప్రభుత్వ వాదన అమెరికాతో సంబంధాలను కొంతవరకూ ప్రభావితం చేస్తోంది. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని స్థానికంగానే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలు వీసా, మాస్టర్‌కార్డ్‌లపై తీవ్రంగా ఉంది. ఆర్బీఐతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా డేటా విషయంలో నియంత్రణలు విధించడం మొదలు పెట్టడంతో అమెరికన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటి వల్ల ఆ కంపెనీలకు 780 కోట్ల డాలర్ల అదనపు ఖర్చులు వచ్చినట్లు అంచనా. ఇరాన్, రష్యాలు: ముడిచమురు విషయంలో భారత్ ఎక్కువగా ఆధారపడ్డ ఇరాన్‌పై గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడంతో సమస్య మొదలైంది. అమెరికా ఒత్తిడితో భారత్ కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది. రష్యా నుంచి దూరశ్రేణి క్షిపణులు (ఎస్–400) కొనుగోలు చేయాలన్న భారత్ లక్ష్యం కూడా అమెరికా ఆంక్షల కారణంగా సందిగ్ధంలో పడుతోంది. 5జీ పరీక్షలపై కూడా నీడలు: భారత్‌లో 5జీ సర్వీసుల పరీక్షలను చేపట్టనున్న హువాయి విషయమూ ఓ చిక్కుముడిగా మారింది. చైనా మద్దతుతో హువాయి ప్రపంచ టెలికామ్ నెట్‌వర్క్‌లో రహస్య సాఫ్ట్వేర్లను పెట్టి ఇతర దేశాలపై నిఘా పెడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆ కంపెనీపై నిషేధం విధించింది. అటువంటి సంస్థ భారత్‌లో 5జీ సర్వీసులను చేపట్టడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు. -
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
హౌడీ X నమస్తే
సారొస్తున్నారు... మాటల తూటాలతో జాతీయ భావాన్ని రెచ్చగొట్టినా .. ప్రపంచ దేశాలపై నోరు పారేసుకొని వివాదాల కుంపట్లు రాజేసినా..దూకుడు నిర్ణయాలతో సొంత పార్టీలోనూ, మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొన్నా.. అదరలేదు. బెదరలేదు. ఎప్పుడూ తలవంచలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ .. చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో.. ఎన్నారైలు హెచ్1బీ వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో.. కశ్మీర్ అంశంలో మూడోవ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెడుతున్నారు. విపక్షాల అభిశంసన తీర్మానాన్ని దీటుగా ఎదుర్కొన్న విజయ దరహాసంతో సారొస్తున్నారొస్తున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తారు? మన ప్రధానికి షేక్ హ్యాండిస్తారా? హ్యాండ్నే షేక్ చేస్తారా? ఏమో? ఎవరు చెప్పగలరు? వస్తున్నది ట్రంప్ కదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఆరు నెలలు తిరిగిందో లేదో మళ్లీ భారీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ తరహాలో ఇప్పుడు నమస్తే ట్రంప్ కార్యక్రమానికి అహ్మదాబాద్ ముస్తాబైంది. హౌడీ మోదీకి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రయోజనం? హౌడీ మోదీ వేదిక: టెక్సాస్ హూస్టన్‌లో ఎన్ఎస్జీ స్టేడియం తేదీ: 2019 సెప్టెంబర్ 23 హాజరైనవారు: 50 వేల మంది ప్రవాస భారతీయులు ఎందుకీ కార్యక్రమం? ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికా గడ్డపై అడుగు పెట్టినందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేలా, ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా తన పర్యటన సాగాలని మోదీ అనుకున్నారు. ఇంధనం, వాణిజ్య రంగాల్లో సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం బాటలు వేస్తుందని ఇరుపక్షాలు భావించాయి. ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం రద్దు తర్వాత అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి మోదీతో పాటు ట్రంప్ హాజరుకావడం నాడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగతంగానూ బంధం బలపడి వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో అడుగులు ముందుకుపడ్డాయి. ఆ కార్యక్రమమే ఇప్పుడు ట్రంప్ భారత పర్యటనకు దోహదపడింది. నమస్తే ట్రంప్ తేదీ: 2020 ఫిబ్రవరి 24 వేదిక : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియం హాజరయ్యే వారు: లక్ష మందికి పైగానే.. ఎందుకీ కార్యక్రమం? అమెరికాకు అధ్యక్షుడయ్యాక ట్రంప్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అందుకే హౌడీ మోదీ కార్యక్రమాన్ని మించి భారత్‌లో ఘన స్వాగతం తెలపడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డు సృష్టించనున్న మొటెరా స్టేడియంలో లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్, మోదీలు ప్రసంగించనున్నారు. తనపై అభిశంసన తీర్మానంలో నెగ్గి నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో ప్రవాస భారతీయులందరూ డెమొక్రాట్లకే అండగా నిలిచారు. ఆసియా అమెరికన్ సర్వే ప్రకారం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 84 శాతం మంది ఓటు వేస్తే, ట్రంప్‌కు భారతీయుల ఓట్లు 14 శాతమే పడ్డాయి. ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థుల ఎన్నిక కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రాథమికంగా ఓటింగ్ కొనసాగుతోంది. 2018 నాటికి అమెరికాలో 26.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికాలోని విదేశీయుల్లో 5.9 శాతం మంది భారతీయులే. గత సారి ఓటు వెయ్యని వారిని ఈ సారి తన వైపు తిప్పుకోవడానికి, చైనాతో వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తూ ఉండడంతో, భారత్‌కు తాము ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పడానికి ఈ పర్యటన సాయపడుతుందనే ట్రంప్ భావిస్తున్నట్లు రాజకీయ పండితుల విశ్లేషణ. విదేశంలో లక్ష మంది హాజరయ్యే ఒక భారీ కార్యక్రమంలో మాట్లాడే తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధ్యక్ష ఎన్నికలవేళ ఇవన్నీ తనను ‘ప్రపంచంలో అగ్రనేత’గా నిలబెడతాయని ట్రంప్ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు సమదూరం పాటిస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో ఆర్థికమందగమన పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో భారత్‌కు అమెరికా సాయం చాలా అవసరం. అలా ‘విన్ అండ్ విన్’ పాలసీతో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వంలో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆత్మన్ ఎం త్రివేది అభిప్రాయపడ్డారు. మోదీ కలల ప్రాంగణం నరేంద్ర మోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) చీఫ్‌గా ఉండగా భారీ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న తలంపు ఆయనకు వచ్చింది. 2014లో మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జీసీఏ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న స్టేడియాన్ని కూల్చేసి ఈ నూతన స్టేడియాన్ని నిర్మించారు. మోదీ కలగన్న ఆనాటి క్రికెట్ క్రీడా మైదానంలో ఈ రోజు పెద్దన్నకు ఘనస్వాగతం లభిస్తోంది. ఈ అందమైన, అధునాతనమైన, అతిపెద్ద క్రికెట్ స్టేడియంపై ఓ లుక్కేద్దాం. స్టేడియం పేరు: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియం గతంలో పేరు: సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం ఎగ్జిక్యూటివ్ సూట్స్: 76 సీటింగ్ కెపాసిటీ: 1,10,000 విస్తీర్ణం: 63 ఎకరాలు తొలిసారి నిర్మాణం: 1982 పాత స్టేడియం కూల్చివేత: 2015 పునర్నిర్మాణం ప్రారంభం: 2017– 20 ఆర్కిటెక్ట్: పాపులస్ (కొత్త నిర్మాణం), శశి ప్రభు (పాత నిర్మాణం) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ మైదానంకన్నా పెద్దది. నిర్మాణం ఖర్చు: రూ. 800 కోట్లు పార్కింగ్ ఏరియా: ఏకకాలంలో 3000 కార్లను, 10 లక్షల ద్విచక్ర వాహనాలను పార్క్ చేయొచ్చు. శనివారం పూరిలోని సముద్రతీరంలో రూపొందించిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాల సైకత శిల్పం. -
3 గంటలు.. రూ.85 కోట్లు
న్యూఢిల్లీ: అగ్రరాజ్య అధిపతి వస్తున్నారంటే ఆయనకిచ్చే విందు భోజనంలో ఏమేం వంటకాలు ఉంటాయా అన్న ఊహే నోరూరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఆ హోటల్లో బుఖారా రెస్టారెంట్ తమ ఆత్మీయ అతిథికి హోటల్లో సంప్రదాయక వంటకాలతో పాటు ఆయనకి నచ్చే రుచులతో ట్రంప్ ప్లేటర్ (ట్రంప్ పళ్లెం) పేరుతో రకరకాల వంటకాలు వడ్డించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఆ మెనూని హోటల్ యాజమాన్యం వెల్లడించలేదు. 2010, 2015లో బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు హోటల్ మౌర్య ఆయన కోసం ప్రత్యేకంగా ఒబామా ప్లేటర్‌ను వడ్డించింది. అప్పటి నుంచి ఆ మెనూ ప్రాచుర్యం పొందింది. ఒబామాకి వడ్డించిన వంటకాల్లో తందూరీ జింగా, మచ్లీ టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్‌లు ఉన్నాయి. బుఖారా రెస్టారెంట్ ప్రధానంగా తందూరీ వంటకాలకే ప్రసిద్ధి. కబాబ్, ఖాస్తా రోటి, భర్వాన్ కుల్చా వంటి వంటకాలు రుచి చూస్తే ప్రాణం లేచొస్తుంది. ట్రంప్‌కి కానుకగా ఈ రెస్టారెంట్ ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ వేసిన అప్రాన్‌ను అందించనుంది. ట్రంప్ రేటింగ్ పెరిగింది ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. ఎవరి మీద ఎలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు. భారతీయులు అంటే చులకన భావం. అమెరికాలో ప్రవాస భారతీయులు వీసా, గ్రీన్‌కార్డు సమస్యలతో తిప్పలు పడుతున్నాయి. అయినా భారత్‌లో ట్రంప్‌కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానం పట్ల 2016లో 16శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉంటే 2019నాటికి ఆ సంఖ్య 56శాతానికి పెరిగింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గత అక్టోబర్‌లో ఈ సర్వే చేసింది. ట్రంప్‌కి మద్దతిచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్‌ను అమెరికా తన నమ్మకమైన నేస్తంగా చూస్తోంది. 3 గంటలు.. రూ.85 కోట్లు అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి గుజరాత్ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం రోడ్ షోతోపాటు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. భద్రతా ఏర్పాట్లు, ట్రంప్ ప్రయాణించే రహదారుల మరమ్మతు, ట్రంప్ ఆతిథ్యానికి దాదాపు రూ.85 కోట్లు ఖర్చు అవుతున్నట్టుగా నగర కార్పొరేషన్ అధికారులు చెప్పారు. నగరంలో ట్రంప్ ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంటారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు 22 కి.మీ. మేర రోడ్లను ఆధునీకరించడానికే రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. రూ.6 కోట్లను సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం అత్యధికంగా ఖర్చు అవుతోంది. అహ్మదాబాద్‌లో కాన్వాయ్ ట్రయల్స్ ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 ► అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. ► గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. ► తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ► అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్‌లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. ► సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ► ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 25 ► రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ► ట్రంప్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ► అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ► మోదీ, ట్రంప్‌ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. ► అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. ► రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
మెలానియా కార్యక్రమానికి కేజ్రీకి పిలుపేది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బీజేపీ పనే: ఆప్ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. -
లెగ్ పీస్ డిప్లొమసీ !
అమెరికా అధ్యక్షుడు రేపు భారత పర్యటనకు వస్తు న్నారు. అయితే ఏమిటి? ఇంతకుముందు ఐదుగురు అగ్ర రాజ్యాధినేతలు భారత్‌లో పర్యటించారు. వారిలో బరాక్ ఒబామా రెండుసార్లు వచ్చారు. కానీ, ఇప్పుడు వస్తున్నది డొనాల్డ్ ట్రంప్. మిగతా అధ్యక్షుల కంటే చాలా తేడా. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుని పర్యటనపై ఆసక్తిని సృష్టించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం, భారత మీడియా చేపట్టేవి. ట్రంప్ మాత్రం ఆ పని కూడా తానే చేపట్టారు. ‘ఇండియాలో నన్ను చూసేందుకు పది మిలి యన్ల (కోటి) మంది వస్తున్నారు తెలుసా?’... అంటూ అడిగిన వారికీ అడగని వారికీ పిలిచి మరీ చెబుతున్నా రట. మంచి తరుణం మించిన దొరకదు టీవీలో తప్పక చూసి తరించండి అంటూ ఉచిత సలహాలను కూడా పారే స్తున్నారట. దీంతో భారత ప్రభుత్వానికి బీపీ పెరిగింది. అసలీ కోటి గొడవ ఏమిటని ప్రభుత్వాధికారులు ఆరా తీశారట. ఏదో సందర్భంలో ప్రధాని మోదీ అహ్మదాబా ద్లో మీకు దాదాపు పది లక్షలమంది స్వాగతం పలుకు తారని ట్రంప్‌తో చెప్పారట. అమెరికాలో వేలు, మిలి యన్లు, బిలియన్లలోనే గణిస్తారు. వాళ్ల లెక్కల్లో లక్షల వ్యవహారం ఉండదు. మోదీ చెప్పిన లక్షల సంఖ్యను మిలి యన్లుగా ఊహించుకొని ట్రంప్ ‘మూన్‌వాక్’ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ‘అపూర్వ’ సంఘ టన ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే లెక్కల్లో కూడా ట్రంప్ బృందం బిజీగా ఉందట. ట్రంప్–మోదీ ఇద్దరూ కూడా ‘థింక్ బిగ్’ కేటగిరీకి చెందినవాళ్లు. చిన్న చిన్న అంకెలు వాళ్లకు నచ్చవు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్నదనీ, వృద్ధిరేటు ఐదు శాతం కంటే తక్కువ నమోదు కానున్నదనీ ఎవరెన్ని చెప్పినా మోదీ మాత్రం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం మానలేదు. ట్రంప్ కూడా అంతే. చిన్నచిన్న అంకెలూ నచ్చవు, చిన్నచిన్న మనుషులూ నచ్చరు. అందుకే ట్రంప్ రోడ్‌షో దారిలో చిన్న మనుషులూ, చిన్నచిన్న ఇళ్లూ ఆయనకు కనిపించకుండా ఆగమేఘాల మీద ఏడడుగుల గోడను నిర్మించారని ప్రతిపక్షాలు, మోదీ అంటే గిట్టనివాళ్లు విమర్శిస్తున్నారు. మోదీ మద్దతు దారులు మాత్రం వేరే కథను వినిపిస్తున్నారు. స్వభా వాల్లో వున్న సారూప్యత కారణంగా మోదీ–ట్రంప్‌ల మధ్య మంచి స్నేహం కుదిరింది. మోదీ రెండోసారి ప్రధా నమంత్రి అయిన తర్వాత అమెరికా వెళ్లినప్పుడు డాలస్ నగరంలో జరిగిన పౌర సన్మానంతో పోల్చదగిన స్వాగతం ఏ ఇతర దేశాధ్యక్షునికీ ఇంతవరకూ లభించ లేదట. పైగా స్వయంగా అమెరికా అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అరుదైన స్నేహ సంకేతమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అటువంటి తన అరు దైన మిత్రునికి ఘనమైన స్వాగతాన్ని అందివ్వాలని మోదీ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. స్వాగతంతోపాటు ఒక మరపురాని బహుమతిని కూడా ఇవ్వాలని మోదీ అను కొని ఉండవచ్చు. స్వతహాగా శ్రీమంతుడైన ట్రంప్‌కు ఏ బహుమతి ఇస్తే గొప్పగా ఫీలవుతాడు?. ఆలోచించగా... చించగా ట్రంప్‌కు పెద్దపెద్ద గోడలంటే ఇష్టమనే సంగతి తట్టింది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతూనే అమెరికన్ల మనసుల్లోనూ, అమెరికా మనుషుల మధ్య గోడలు నిర్మిస్తూ నెగ్గుకొచ్చారు. ఎన్ని కైన తర్వాత మెక్సికో సరిహద్దు వెంట ఒక మూడువేల కిలోమీటర్ల భారీ గోడను నిర్మించాలని పగటి కలలు కంటూనే ఉన్నారు. అందుకని ట్రంప్ స్వాగత మార్గం వెంట కిలోమీటర్ల పొడవునా ఒక సరికొత్త గోడను నిర్మించి, ఆ గోడ నిండా ట్రంప్‌కు స్వాగతం పలికే పెయింటింగ్‌లు వేస్తే..? తక్షణమే ఈ ఐడియా అమల్లోకి వచ్చింది. హాలీవుడ్ ‘వాల్’ స్వాప్నికునికి బాలీవుడ్ ‘దీవార్’ తోఫా! మోదీ అంటే ప్రేమ ఉన్నవాళ్లు ఇంత ప్రిస్టేజీ గోడను ఎలా కాదనగలరు?. ట్రంప్ కనుక ఆ సమయంలో అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే బెర్లిన్ గోడను కూలకుండా ఆపేవారా? అనే డౌటు కొందరికి రావచ్చు. కానీ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇటువంటి విపరీతపు ఆలోచనలకు తావుండదు. అమెరికా అధ్యక్షుని రెండు రోజుల పర్యటనలో ఒక రోజు పూర్తిగా అహ్మదాబాద్‌లో స్వాగత సత్కార కార్య క్రమం, రెండో రోజు ఆగ్రాలో అధినేతల మధ్య వాణిజ్య చర్చలు ఉంటాయని తెలుస్తున్నది. గతంలో పోలిస్తే ఇప్పుడు రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నట్టే లెక్క. అయినప్పటికీ ఐదారు అంశాలు మాత్రం పరిష్కరించలేని కొరకరాని కొయ్యలుగా రెండు దేశాలకు సవాల్ విసురుతున్నాయి. వీటిలో ప్రధానమై నవి: 1. వాణిజ్య సుంకాల వివాదం, 2. హెచ్–1 బి వీసాల సమస్య, 3. డేటా లోకలైజేషన్, 4. మేధో హక్కుల సమస్య, 5. విదేశీ పెట్టుబడుల విషయంలో భారత పరి మితులు, 6. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరితో భార త్‌కు ఎదురౌతున్న ఇబ్బందులు. రేపటి భేటీలో కచ్చి తంగా చర్చకు వస్తాయంటున్న అంశాలు మాత్రం మొదటి రెండే. కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్‌తో జరిగే చర్చల్లో ట్రంప్‌కు ఒక అడ్వాంటేజ్ పాయింట్ కావాలి. ఆ పాయింట్‌ను వాణిజ్య సుంకాల వివాదంలో ట్రంప్ సాధించాలి. దాని ఫలితంగా అమెరికా రైతాంగంలో ట్రంప్ పలుకుబడి పెరుగుతుంది. బదులుగా భారతీయ వృత్తి నిపుణులకు వీసాలు ఇచ్చే విషయంలో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి నుంచి కొంత సడలింపును భారత్ కోరుకోవడం సహజం. ప్రస్తుతం రెండుదేశాల మధ్య జరుగుతున్న వార్షిక వర్తక లావాదేవీల విలువ 14,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదికాకుండా భారత ప్రభుత్వం అమెరికా విపణిలో రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు గత పదిహే నేళ్లలో వెచ్చించిన మొత్తాన్ని లెక్కిస్తే అది సగటున ఏటా రూ. పదివేల కోట్లుగా తేలింది. భారత్–అమెరికా సుంకాల వివాదంలో ముందుగా కాలు దువ్వింది అమెరి కాయే. ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై పన్నులు పెంచేసింది. ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాల జాబితా లోంచి భారత్‌ను తొలగించి అప్పటివరకు ఉన్న కొన్ని రాయితీలను ఎత్తివేసింది. ఫలితంగా భారత్‌కు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై కూడా సుంకాలు పెంచింది. దీని ప్రభావం అమెరికాలోని వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ రంగాలపై పడింది. ఆ రంగాల నుంచి ట్రంప్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. అమెరికన్లకు చికెన్ లెగ్స్ తినే అలవాటు లేదు. దాంతో అవి గుట్టలుగా పేరుకు పోతున్నాయి. లెగ్ పీసెస్‌ను ఇష్టపడే భారత మార్కెట్‌ను వాటితో నింపేయా లని అక్కడి పౌల్ట్రీ రంగం ఆశ పడుతున్నది. అయితే భారత్ ఆ లెగ్ పీస్‌లపై నూరుశాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నది. దీన్ని ఇరవై నుంచి ముప్ఫై శాతానికి తగ్గించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నది. అమెరికా ఒత్తిడికి తలొగ్గితే దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతుందని ఆ రంగం ఆందోళన చెందుతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సంకేతాలను బట్టి ట్రంప్‌తో జరిగే సమావేశంలో లెగ్‌పీస్‌లపై అమెరికాకు అనుకూ లంగా ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని తెలు స్తోంది. ఇదే జరిగితే భారతీయ మార్కెట్‌ను అమెరికా చికెన్ లెగ్‌పీస్‌లు ఆక్రమించడం ఖాయం. సంవత్సరీకం పూర్తి చేసుకున్న కోడి కాళ్లు, ఐదో వర్ధంతి, పదో వర్ధంతి జరుపుకున్న కోడి కాళ్లను మనం ఆరగించేయవచ్చు. స్కాచ్ విస్కీలా చికెన్ లెగ్స్ కూడా ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్ అని అమెరికా వాడు ప్రచారంతో ఊదరగొట్ట వచ్చు. మనవాళ్లు విలాసంగా రెస్టారెంట్లో కూర్చొని ‘ఏక్ తంగ్డీ కబాబ్ లా... బారా సాల్ కా’ అంటూ ఆర్డర్ చేసే రోజులు తొందర్లోనే వస్తాయేమో. చికెన్ లెగ్స్‌తో పాటు బాదంపప్పు, వాల్నట్స్, ఆపిల్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రంప్ కోరే అవకాశం ఉంది. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగులు, వారితో పాటు భారతీయ ఐటీ కంపెనీలు, వీసాలకు సంబంధించి కొన్ని కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వృత్తి నిపుణులను నియమించుకోవడానికి ఇచ్చే వీసాల సంఖ్యను భారీగా కత్తిరించడం వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీల విస్తరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. హెచ్1బి వీసాలతో పాటు భారతీయ కంపెనీలకు ఇచ్చే ఎల్–1 వీసాలను కూడా 90 శాతం తగ్గించారు. హెచ్–4 ఈఏడి పై పనిచేస్తున్న లక్ష మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మెడపై ట్రంప్ కత్తి వేలాడుతున్నది. భారతీయ ఇంజనీర్లు గ్రీన్ కార్డుల కోసం దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ అంశా లను పరిష్కరించాలన్న ఒత్తిడి కూడా మోదీపై ఉన్నది. కనుక ఎజెండాలో వాటికి స్థానం లభించవచ్చు. ఇందులో ఏ ఒక్క విషయంలో ట్రంప్‌ను ఒప్పించినా అది మోదీకి ప్లస్ పాయింటే. లేకపోతే ట్రంప్ పర్యటన కేవలం లెగ్‌పీస్ డిప్లొమసీగానే మిగిలిపోతుంది. ఈ చర్చల ఫలితాలు ఏ రకంగా వున్నా మునుపె న్నడూ లేనంత బలంగా ఇప్పుడు ఇండో–అమెరికన్ సంబంధాలు అల్లుకున్నాయి. ఇది క్రమంగా జరిగిన పరిణామం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నంతకాలం ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉండేది. భారత్ అలీనోద్యమంలో కీలకపాత్ర పోషించేది. అందువల్ల అమెరికా వైపో, రష్యా వైపో పూర్తిగా మొగ్గకుండా తటస్థంగా నిలబడగలిగింది. ఈ సమయంలోనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భార త్లో పర్యటించి గాంధీ పథాన్ని అధ్యయనం చేశారు. అనంతరం అహింసా పద్ధతుల్లో పౌరహక్కుల ఉద్య మాన్ని సాగించి అమెరికన్ సమాజాన్ని ఉర్రూతలూగిం చారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న మొదటి పదకొం డేళ్లు పూర్తిస్థాయి రష్యా మిత్రదేశంగా భారత్ వ్యవహ రించింది. రాజీవ్ గాంధీ పదవీకాలం ముగిసే సమయా నికి రష్యా శిబిరం పతనమైంది. అంతర్జాతీయ సంబం ధాల్లో మళ్లీ ఏకధ్రువ శకం మొదలైంది. భారత్‌లో మొద లైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా లక్షలాది మంది విద్యా ర్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి పొందారు. దేశంలోని ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాల వారికి పిల్లల్ని అమె రికా చదువుకు పంపించడం ధ్యేయంగా మారింది. ఈ క్రమం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పుడు రిటైరైన ఏ ఉద్యోగిని పలకరించినా అమ్మాయి టెక్సాస్‌లో, అబ్బాయి కాలిఫోర్నియాలో ఉంటున్నారని అమెరికాలోని రాష్ట్రాల పేరు చెబుతున్నారు దేశం పేరు వదిలేసి. భారత మధ్య తరగతికి ఇప్పుడు అమెరికా అంత దగ్గరైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అమెరికాతో అణు ఒప్పందం పై సంతకం చేసి భారత్ రాజకీయంగా చేరువైంది. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే నాటికి అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా చైనా ఎదగడం మొదలైంది. ఆర్థికంగా, సైనికంగా రెండో అతి పెద్ద శక్తిగా అవతరించింది. పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆఫ్రికా ఖండపు తూర్పు తీరం నుంచి అమెరికా ఖండపు పశ్చిమ తీరం వరకు విస్తరించిన ఈ రెండు మహాసముద్రాల గుండానే మూడింట రెండొంతుల ప్రపంచ వర్తక వాణిజ్యాలు జరుగుతున్నాయి. పసిఫిక్‌లో భాగమైన దక్షిణ చైనా సముద్రంలో జపాన్, కొరియా తదితర దేశాలను ఇప్పటికే బీటు కానిస్టేబుల్లాగ బెది రించడం మొదలు పెట్టింది. అక్కడ్నుంచి ‘ఏసియాన్’ సభ్యదేశాలను చుట్టుకుంటూ హిందూ మహాసముద్రంలో భాగమైన బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో మైన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్లలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి భారత్‌ను దిగ్బంధనం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు అమెరికా సహజ మిత్రునిగా ఆవిర్భవించింది. బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)తో విస్తరిస్తున్న చైనాకు ఇండో–పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చెక్ పెట్టడా నికి అమెరికా ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి బ్లూ డాట్ నెట్వర్క్ (బీడీఎన్)ను ప్రారంభించింది. భార త్ను కూడా భాగం కావాలని ఆహ్వానిస్తున్నది. ఇందులో చేరడం వల్ల భారత కంపెనీలకు బహుశా పెద్దపెద్ద ఇన్ఫ్రా కాంట్రాక్టులు దక్కవచ్చు. మన వృత్తి నిపుణులకు మంచి ఉద్యోగాలు కూడా దొరకవచ్చు. కానీ, అంతి మంగా పసిఫిక్‌ను పక్కన పెట్టినా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఎటువంటి కూటమి ఏర్పడినా భారత్ అందులో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలన్నదే ఈ దేశప్రజల ఆకాంక్ష. ప్రభుత్వ ఆకాంక్ష కూడా అదే. ఈ దేశ గత చరిత్ర, సంస్కృతి, వనరులు, జనాభా, నైపుణ్యాలకు అనులోమానుపాతంలో ఈ దేశ అంతర్జాతీయ ప్రతిష్ట ఉండాలని ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ కోరుకుంటు న్నాడు. రోడ్‌షోలో వెళ్తున్నప్పుడు తనకు స్వాగతం చెప్పే గోడను చూసి ట్రంప్‌కు బహుశా ఒక డౌట్ రావచ్చు. ‘దీవార్ కే పీచే క్యాహై... దీవార్ కే పీచే’. అందుకు బదు లుగా గోడ ఆవలి నుంచి వినిపించే హృదయ స్పందనను ట్రంప్ వినగలిగితే విషయం అర్థమవుతుంది. ‘దీవార్ కే పీచే దిల్ హై భారత్ కా’. muralivardelli@yahoo.co.in వర్ధెల్లి మురళి -
ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ విందులో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఈమేరకు కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, ట్రంప్ సోమ వారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. -
ట్రంప్ పర్యటన : కేజ్రీవాల్‌కు అవమానం..!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆహ్వానం అందలేదు. భారత్ పర్యటనలో భాగంగా ఈ నెల 25న మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే ‘ హ్యాపీనెస్ క్లాస్’ గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే మెలానియా ట్రంప్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. కాగా, కేజ్రీవాల్‌కు కానీ, మనీష్ సిసోడియాలకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ మండిపడింది. మెలానియా ట్రంప్ కార్యక్రమానికి తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్ గురించి బెబుతాయని ప్రీతిశర్మ మీనన్ ట్వీట్ చేశారు. (చదవండి : ట్రంప్‌కి విందు: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!) ఇక ఆప్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆప్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సంబిత్ పత్రా విమర్శించారు.‘కొన్ని విషయాలపై రాజకీయాలు చేడయం సరికాదు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం ప్రారంభింస్తే భారతదేశం అపఖ్యాతి పాలవుతుంది. భారత్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు. ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆ దేశం చేతుల్లో ఉంది. దీనిపై రాజకీయాలు చేయడం మంచిది కాదు’ అని సంబిత్ అన్నారు. (చదవండి : ట్రంప్ వెంటే ఇవాంకా..) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) భారత్‌కు చేరుకుంటారు. వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ వస్తారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. -
అప్పుడు ట్రంప్ డ్యాన్స్ చేయాలి: సింగర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తన పాటకు డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తెలిపారు. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్తో కలిసి భారత్‌లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’..! ఈ సందర్భంగా కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలతో పాటు ప్రముఖ బాలీవుడ్ గాయకులు పాటలు పాడనున్నారు. వారిలో కైలాష్ ఖేర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పాట పాడుతుండగా.. ట్రంప్ నా పాటకు చిందులేయాలని కోరుకుంటున్నానని’ ఏఎన్ఐతో పేర్కొన్నారు. తన పాట ‘జై జై కారా.. జై జై కారా స్వామీ దేనా సాథ్ హమారా’తో ప్రారంభమై, ‘అగాడ్ బం-బమ్ లాహిరి’తో ముగుస్తుందని తెలిపారు. ఇక మొతేరా స్టేడియంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని.. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడి మోదీ’కి ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ట్రంప్ ఆగ్రా పర్యటన.. మోదీ వెళ్లరు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రా సందర్శిస్తారని మీడియాలో వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆగ్రా సందర్శనకు వెళ్లబోవడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మొదటి మహిళ మెలానియా ఆగ్రా సందర్శనలో భారత్ తరపున ఓ ఒక్క అధికారిక ప్రతినిధి కూడా భాగం కావటం లేదని అధికారిక వర్గాల సమాచారం. ప్రధాని మోదీ, ట్రంప్‌తో కలిసి ఈ నెల 24న అహ్మదాబాద్‌లో పర్యటిస్తారని, అనంతరం 25 ఢిల్లీలో జరగనున్న అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. (ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు) ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు ఆయన భార్య, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్, కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెద్ కుష్నర్తో పాటు పెద్ద సంఖ్యలో అమెరికా అధికారులు భారత్‌కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ స్కూల్లో జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా పాల్గొనాల్సి ఉండింది. అయితే కేజ్రివాల్, మనిష్ సిసోడియాలు తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. చదవండి : ఆ అంశాల గురించి ట్రంప్ చర్చిస్తారు: అమెరికా -
ట్రంప్‌కి విందు: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మహారాష్ట్ర, హరియాణా, బిహార్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈనెల 25న ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.(ఆ అంశాల గురించి ట్రంప్ చర్చిస్తారు: అమెరికా) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం భారత్‌కు చేరుకుంటారు. తొలుత మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆగ్రాకు వెళ్తారు. అనంతం అక్కడి నుంచి ఢిల్లీకి పయమవుతారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ట్రంప్ సహా ఆయన కుటుంబం, అధికారులు బస చేసే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ బృందం తిరిగి వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. (ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా..) -
ఆ అంశాల గురించి ట్రంప్ చర్చిస్తారు: అమెరికా
వాషింగ్టన్: భారత పర్యటనలో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మతపరమైన స్వేచ్ఛ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. భారత రాజ్యాంగం అక్కడి ప్రజలకు మతస్వేచ్ఛను ప్రసాదించిందని.. అక్కడ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు ప్రధాన మతాలకు భారత్ పుట్టినిల్లు అని, మత, భాషా, సాంస్కృతికంగా పరంగా ఉన్నతస్థాయిలో ఉన్న దేశమని కొనియాడారు. ట్రంప్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 24న ట్రంప్ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ గురించి ట్రంప్.. మోదీతో చర్చిస్తారా అన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. (ట్రంప్ వెంటే ఇవాంకా కూడా..) ఈ విషయాలపై స్పందించిన శ్వేతసౌధ అధికారులు... ‘‘భారత్ ప్రజాస్వామ్యం, మతపరమైన స్వేచ్ఛ గురించి సభలోనూ.. ఆ తర్వాత అంతరంగిక చర్చల్లోనూ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడతారు. భారత ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు, వ్యవస్థలపై అమెరికాకు అపారగౌరవం ఉంది. అయితే మతస్వేచ్ఛ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలు, విలువలకు మేం కట్టుబడి ఉంటాం. సీఏఏ, ఎన్నార్సీ తదితర అంశాలపై మాకు అవగాహన ఉంది. ప్రజాస్వామ్య విలువలు, మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా భారత్ తన సంప్రదాయాలను కొనసాగించాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మతపరమైన మైనార్టీలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో మోదీ తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు’అని పేర్కొన్నారు.(గుజరాత్ మోడల్‌పై గోడలెందుకు?) కాగా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ పలుమార్లు ప్రకటించగా.. ఆయన ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్ తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన భారత్... సీఏఏ, ఎన్నార్సీల గురించి ఒకవేళ ట్రంప్ చర్చలో ప్రస్తావిస్తే ఎలా స్పందిస్తుందోనన్న విషయం చర్చనీయాంశమైంది. సీఏఏను పోలి ఉండే బడ్జెట్ బిల్లు(కొన్ని వర్గాలను మినహాయించి.. ఇరాన్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయిం ఇవ్వడం)పై ఇటీవల సంతకం చేసిన ట్రంప్.. మోదీతో మతపరమైన స్వేచ్ఛ గురించి మాట్లాడతారనడం హాస్యాస్పదమే అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా బ్రహ్మాండమైన డీల్ కుదిరే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. (ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు) -
ట్రంప్ వెంటే ఇవాంకా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్ లేడీ మెలానియా తన భర్త ట్రంప్‌తో పాటు భారత్ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్‌తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి డాన్ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రీన్ తదితరులున్నారు. 24న తాజ్ మహల్ ఫిబ్రవరి 24న వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. 25న రాజ్‌ఘాట్ ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్1బీ వీసా విషయంలో భారత్ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది. సర్వం వచ్చేసింది ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్ అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్, రోడ్ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్‌సీఏ రోడ్‌రన్నర్. దీన్నే మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్‌మాస్టర్ కార్గో విమానాలు అహ్మదాబాద్ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు. ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ అందులోని చాణక్య సూట్లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జిబుష్‌లు సేదతీరారు. ట్రంప్ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. కాగా, ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి. సాదర స్వాగతం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది. సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం అయితే ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు అధికారులు సహా అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత్‌కు వస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. వీరితో పాటు ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్ కూడా వస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్, మెలానియా, ఇవాంకా తొలుత అహ్మదాబాద్ వెళ్లి.. ఆ తర్వాత ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి.. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా మెలానియాతో కలిసి ఇవాంకా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక 2017లో ఇవాంకా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. చదవండి: భారత పర్యటన: ట్రంప్ నిష్ఠూరం మరోవైపు.. ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావిస్తున్న తరుణంలో.. వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. -
22 కి.మీ... లక్ష మంది
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గాంధీనగర్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్‌షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా చెప్పారు. రోడ్ షోకి ఒక లక్ష మంది రోడ్‌షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్‌షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్‌షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు. సర్వాంగ సుందరంగా ఆగ్రా తాజ్‌మహల్‌ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్‌మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్‌మహల్ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్‌లీలా, రాస్లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్‌ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులమ్’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి. రోడ్ షోకు డీఆర్డీఓ డ్రోన్ నిరోధక వ్యవస్థ ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షోలో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన డ్రోన్ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్, చేతక్ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ గురువారం తెలిపారు. డ్రోన్‌ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్ తెలిపారు. అలాగే, ఓపెన్ వెహికిల్‌ను వారు వాడకపోవచ్చన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం. -
ట్రంప్ టూర్ : ఆగ్రా మేకోవర్..
ఆగ్రా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారత్ పర్యటన సందర్భంగా ఆయన సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌నకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతుంటే ఆయన పర్యటించే ఆగ్రాలోనూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. అగ్రనేత రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దడంతో పాటు యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. అమెరికా నుంచి వచ్చిన సెక్యూరిటీ బృందం తాజ్‌మహల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చారిత్రక కట్టడాన్ని సందర్శించి ట్రంప్ రాకకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా 500 క్యూసెక్కుల నీటిని యుమనా నదిలోకి యూపీ ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. నదీ జలాల వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసనను నియంత్రించేందుకు తాజా నీటిని అధికారులు విడుదల చేశారు. చదవండి : ఆగ్రా పేరు ఇక 'అగ్రవాన్'..! -
భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం కష్టమే..!
వాషింగ్టన్: వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. భారత్ మాతో సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌ను మొదటి నుంచి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ‘‘భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఇది మాకు అవసరం. అయితే, ఎన్నికల ముందు ఇది జరుగుతుందా అన్నది నాకు తెలియదు. కానీ, భారత్‌తో మాకు భారీ వాణిజ్య ఒప్పందం అయితే ఉంటుంది’’ అంటూ కర్ర విరగకుండా, పాము చావకుండా రీతిలో ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ట్రంప్ పర్యటనలో భాగంగా డీల్ కుదురొచ్చన్న అంచనాలు ఇప్పటికే వ్యక్తమవుతుండడం గమనార్హం. భారత్‌తో వాణిజ్య చర్యలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జర్ ట్రంప్‌తో కలసి భారత పర్యటనకు రాకపోవచ్చని తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, లైట్జర్ మధ్య ఇప్పటికే పలు విడతలుగా వాణిజ్య చర్చలు జరిగాయి. తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. మోదీ అంటే ఎంతో ఇష్టం..: ప్రధానమంత్రి మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు ట్రంప్. భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియంలో ఇరు దేశాధి నేతలతో భారీ సభ జరగనుంది. దీని గురించి ట్రంప్ మాట్లాడుతూ..‘‘విమానాశ్రయం, కార్యక్రమం జరిగే ప్రాంతానికి మధ్య ఏడు మిలియన్ల ప్రజలు ఉంటారని ఆయన (మోదీ) నాకు చెప్పారు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించనుంది. ఇది ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మీరు కూడా దీన్ని ఆనందిస్తారు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. -
ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు
వాషింగ్టన్, న్యూఢిల్లీ : ప్రపంచానికే పెద్దన్న దేశం విడిచి వస్తున్నాడంటే ఆయన రాజభోగాలకు కొరతేం ఉండదు. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రయాణించే విమానం, కారు, హెలికాప్టర్ వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి. ఎలాంటి దాడులనైనా తట్టుకుంటాయి. ఆత్మరక్షణ కోసం ఆయుధాలుగా కూడా మారుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25న భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రయాణ సాధనాలు, వాటి ప్రత్యేకతలు... (వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు) ఎయిర్‌ఫోర్స్ వన్ ► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ► ప్రస్తుతం ట్రంప్ భారత్‌కు వస్తున్న విమానం బోయింగ్ 747–200. ఈ విమానంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న అక్షరాలు, అమెరికా జాతీయ జెండా ఉంటాయి. ► ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారుతుంది. ► నాలుగు జెట్ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది ► గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ► 70 మంది వరకు ప్రయాణించవచ్చు. ► గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు. ► విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. ► అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ► ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది ► ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు. అద్దాలే ఆయుధాలు ది బీస్ట్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో ఆయన తన వెంట తెచ్చుకున్న కారులోనే వెళతారు. బీస్ట్ అని పిలిచే ఈ కారుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ► ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కారు తొలిసారి వాడకంలోకి వచ్చింది. ► ఈ కారుని కాడలిక్ 1 అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఏర్పాట్లున్న కారు ఇదే ► ఇలాంటి బీస్ట్ కార్లు 12 అధ్యక్షుడు వెళ్లే కాన్వాయ్‌లో ఉంటాయి ► 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేశారు. ► దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారు అద్దాలు అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపించగలవు ► అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన వారు మాత్రమే ఈ కారుని నడుపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో, 180 డిగ్రీల్లో కారుని తిప్పడం, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడం వంటి వాటిలో డ్రైవర్‌కి శిక్షణ ఇస్తారు ► ఈ కారు పక్కనే బాంబు పేలినా లోపల ప్రయాణించే అధ్యక్షుడికి ఏమీ కాదు. ► జీవరసాయన దాడుల నుంచి కూడా తట్టుకొనే సౌకర్యం ఈ కారుకి ఉంది. ► రాత్రిపూట ప్రయాణాల్లో కనిపించే నైట్ విజన్ కెమెరాలు, గ్రనేడ్ లాంచర్స్, ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం .వంటి సదుపాయాలుంటాయి. ► అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ సీటు కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది. హెలికాప్టర్.. మెరైన్ వన్ అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్ వన్ హెలికాఫ్టర్ కూడా వెంట వస్తుంది. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, తాను బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఈ హెలికాప్టర్ని వినియోగిస్తారు. ► వీహెచ్–3డీ సీ కింగ్ లేదంటే వీహెచ్–60ఎన్ వైట్ హాక్ హెలికాప్టర్లే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ► క్షిపణి దాడుల్ని సైతం ఈ హెలికాప్టర్లు తట్టుకుంటాయి. ఆ హెలికాప్టర్లో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంటుంది. ► అధ్యక్షుడి భద్రత కోసం ఒకేసారి అయిదువరకు ఒకే రకంగా ఉండే హెలికాప్టర్లు ప్రయాణిస్తాయి. ఒక దాంట్లో అధ్యక్షుడు ఉంటే, మిగిలినవి ఆయనకు రక్షణగా వెళతాయి. ► అధ్యక్షుడు ప్రయాణిస్తున్న మెరైన్ వన్ ఎటు వెళుతోందో ఈ అయిదు హెలికాప్టర్లు ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకుంటాయి. -
వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. బీసీసీఐ ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమానికి ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో మైదానాన్ని నిర్వహకులు అత్యంత సుందరంగా తీర్చదిద్దారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం రికార్డును బ్రేక్ చేస్తూ.. అత్యంత విశాలమైన స్టేడియంగా మొతేరా స్టేడియం నిర్మితమైంది. #MoteraStadium gearing up for #NamasteTrump !! Witness the world's biggest cricket stadium host the oldest and biggest democracies of the world! Watch all the action only on @DDNewslive @DDNewsHindi @DDIndialive @PBNS_India @shashidigital @Chatty111Prasad pic.twitter.com/q2Wevmd72Z — Meghna Dev (@DevMeghna) February 18, 2020 -
అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న భారత పర్యటకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత పెద్దదిగా భావిస్తున్న గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధాని మోదీతో కలిసి ఆవిష్కరించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈమేరకు వైట్ హౌజ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘చైనాకు ధీటుగా ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం భారత్’ అని వైట్ హౌజ్ పేర్కొంది. మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ లక్ష.ట్రంప్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతా వాహనాలు అహ్మదాబాద్ చేరుకుంటున్నాయి. (ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!) ‘భారత్-అమెరికా ప్రజల సంబంధాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం దానిని పతిబింబించేలా ఉటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరోస్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. ట్రంప్‌నతో కలిసి ఆయన భార్య, అమెరికా మొదటి మహిళా మెలానియా ట్రంప్ కూడా భారత్‌లో పర్యటిస్తారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం వారు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. (ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన) -
ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు భారత్ పర్యటనకు రానున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం అత్యంత శక్తివంతమైనది. అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: ట్రంప్ మూడు గంటల పర్యటన ఖర్చెంతో తెలుసా..! ఇందులోని సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్ ఫోర్స్ వన్ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్ వన్‌పై దాడులు జరిగితే మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి' -
ట్రంప్ టూర్ : మురికివాడలు ఖాళీ
గాంధీనగర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన నేపథ్యంలో పేదల ఇళ్లు కనిపించకుండా గోడ నిర్మాణం చేపట్టడం విమర్శల పాలవగా తాజాగా మొతెరా ప్రాంతంలో మురికివాడల నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు అక్కడి పేదలకు 7 రోజుల ముందు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించేందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొతెరా స్టేడియాన్ని సందర్శించారు. ట్రంప్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను ఈ సందర్భంగా సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం ఈ ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న వాషింగ్టన్ నుంచి నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయంలో ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సహా ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. చదవండి : ట్రంప్ సాక్షిగా గోడకు అటూ ఇటూ! -
ట్రంప్ సాక్షిగా గోడకు అటూ ఇటూ!
ట్రంప్ రాక సందర్భంగా పేదరికం ఆయన కళ్లబడకుండా అహ్మదాబాద్ కార్పొరేషన్ ‘గోడకట్టుడు’ ముసుగు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్థికంగా మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత దశలో మనల్ని వర్ధమాన దేశంగా కాక, అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించి ఆ మేరకు మన ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తోంది. తన సరుకులపై సుంకాలు తగ్గించాలని పట్టుబడుతోంది. ఈ ఒత్తిళ్లు సహించరానివి. ప్రపంచంలో నాలుగింట మూడువంతుల జనాభా వర్ధమాన దేశాల్లోనే ఉన్నదని, కనుక వాటికి ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంటుందని సౌత్ కమిషన్ ఏనాడో నొక్కిచెప్పింది. మన పాలకులందరూ దాన్ని విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న అహ్మదాబాద్ నగరానికి వస్తున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ట్రంప్ మెప్పుకోసం నగరంలోని రోడ్ల గతుకులు సరిచేసి అందంగా కనపడేలా మెరుగులు దిద్దుతోంది. ఆయన వచ్చే వీధుల వెంట కొబ్బరి చెట్లు నాటడంతోపాటు ఆ పొడవునా పెద్ద గోడ కడుతున్నారు. ఈ పనంతా ట్రంప్‌కు మన మురికివాడలు కనబడకుండా చేయడానికి. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్దార్ పటేల్(మోతేరా) స్టేడియం దాకా ఊరకుక్కలుగానీ, పశువులుగానీ కంటికి కనబడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. –‘ది హిందూ’ రిపోర్టు 14.02.2020 మన ఇంటిని, మన దేశాన్ని పేదరికం లేకుండా చూడాలని, సర్వులకూ సుఖమయ జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, నలుగురికీ ఆదర్శంగా దాన్ని మలచాలని బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరైనా ఆశిస్తారు. అందుకోసం శ్రమిస్తారు! కానీ మన పాలకుల (అన్ని రంగులవారూ) ప్రవర్తన, మనస్తత్వం ఈ ఆదర్శానికి పరమ విరుద్ధంగా ఉంటోంది! పై వార్త విన్న తర్వాత ప్రజల మనస్సులు ఎక్కడ గాయపడతాయోనన్న భీతి, లజ్జ కూడా లేకుండా మురికివాడలు ట్రంప్ కళ్లకు కనబడకుండా ఉండేందుకు ‘‘గోడ కట్టుడు’’ ముసుగు వేయడానికి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నించింది. ఈ సందర్భంగా కమిషనర్ విడుదల చేసిన ప్రకటన మరీ వింతగా, ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది–‘‘రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణాలు జరగకుండా చూసేందుకు గోడ నిర్మించాలని రెండు నెలలనాడే కార్పొరేషన్ నిర్ణయించింద’’ని ఆయన ప్రకటించారు. అయితే ట్రంప్ రాకతోనే మన పేదరికం తొలగిపోతుందా అన్నది వేరే ప్రశ్న! ట్రంప్‌కు కనబడకుండా ఉండేందుకు పేదవాళ్ల వాడల్ని, పొగచూరిన వారి గోడల్ని కనబడకుండా చేద్దామన్న ‘ఔదార్యం’తో పాలకులు తలపెట్టిన ‘‘గోడకట్టుడు’’ పూర్తి కాకుండానే దాదాపు అదే రోజున ఇండియాను అభివృద్ధి చెందిన లేదా వర్ధమాన దేశాల ప్రతిపత్తి జాబితానుంచి అమెరికా ప్రభుత్వం తొలగించి, భారత్ దిగుమతి చేసుకుంటున్న అమెరికన్ వస్తువులు, తదితర సరంజామాపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న షరతు విధించుతూ ప్రకటించింది(13.02.20) అంటే మన దేశం పేద దేశం కాదు, ‘‘అభివృద్ధి చెందిన సంపన్న దేశమే’’నని అమెరికా వర్తక వాణిజ్య కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. అమెరికా దిగుమతి చేసుకునే మన వస్తువులపై దాని ప్రకారం సుంకాలు గణనీయంగా తగ్గించివేయాల్సిందేనని పట్టుబడుతోంది! అమెరికా తన సమ ఉజ్జీగా దూసుకువెడుతున్న చైనాతో ఇలాంటి వాణిజ్య యుద్ధాన్నే చేస్తోంది. దాన్ని సమ ఉజ్జీల మధ్య పోటీగా భావించవచ్చు. కానీ అన్ని అంతర్జాతీయ మదింపు సంస్థలూ మన అభివృద్ధి రేటు గత పదేళ్ల వ్యవధిలోనే ఎలా దిగజారిపోతూ వస్తున్నదో చూపుతున్న వర్తమాన దశలో భారత్‌పై కూడా ఈ పిడుగును వదిలింది. ఇంకా వర్థమాన దశలోనే ఉంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న మన దేశంపై అమెరికా చేస్తున్న ఒత్తిడి సహించరానిది. పైగా ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ‘‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే వ్యవహారం కాద’’ని అధికారికంగా ప్రకటించ సాహసించడం మన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని మరవరాదు. మన ప్రణాళికలుగానీ, వార్షిక బడ్జెట్లుగానీ, ఆర్థిక సర్వేక్షణలుగానీ ప్రజలకు దేశ వాస్తవిక పరిస్థితుల గురించి చెప్పకుండా దాచడం, మభ్యపరచడం కొత్తగాదు. వింత కూడా కాదు! మన ఆర్థిక వ్యవస్థా చట్రానికి సోకిన వైరస్ ఇప్పటిది కాదు. పైగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ పాలన నాటికన్నా బీజేపీ ఏలుబడిలోని ఎన్డీఏ సంకీర్ణ పాలన దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చే వైపుగా అడుగులువేస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వస్తుతహ ఎంత తెలివిగల మహిళో, బీజేపీ వరలోకి వెళ్లిన తరవాత తానే చెప్పుకున్నట్లు అంత ‘మితవాద శక్తి’గా మారి ‘‘నేను మితవాదినే కావచ్చుగానీ వాస్తవవాదిని’’ అనవలసివచ్చింది. ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలకు 1990లలో ప్రధాని హోదాలో నరసింహారావు తలవూపారు. అంతకు చాలాముందుగానే చరిత్రాత్మకమైన ‘‘సౌత్ కమిషన్’’ వర్థమాన దేశాల స్వతంత్ర ప్రగతి బాటకు రూపకల్పన చేసింది. ఆ కమిషన్‌కు అప్పటి టాంజానియా అధ్యక్షుడు, ఆఫ్రికా దేశాల ఆరాధ్య నేత జూలియస్ నైరేరి అధ్యక్షుడు కాగా, మన్మోహన్సింగ్ ప్రధాన కార్యదర్శి. భారతదేశంలాంటి వర్ధమాన దేశాలు స్వావలంబన ద్వారా సొంతకాళ్లపై నిలబడి ఎంతటి అభివృద్ధి సాధించవచ్చునో , అదెంత ఆచరణ సాధ్యమో సౌత్ కమిషన్ నివేదిక తెలిపింది. అందులోని కీలకమైన ప్రతిపాదన– ‘‘వలస విధానాన్ని వలస దేశాల ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆ విధానాన్ని వారు పాతిపెట్టగలిగారు. ఆ అనుభవంతోనే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాలలో అనుభవిస్తున్న దేశాలు కూడా అలాంటి దృఢచిత్తం తోనే, స్వావలంబన పైన ఆధారపడిన కార్యాచరణ ద్వారా మాత్రమే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చునని ఆ నివేదిక హెచ్చరించింది. కానీ అదే మన్మోహన్ ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ప్రపంచబ్యాంకు వరలో ఇమిడిపోవలసి వచ్చింది. బీజేపీ పాలకులు అంతకన్నా పది అడుగులు ముందుకి దూకి స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులెత్తిన ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా వినాశనం వైపునకు నెడుతున్నారు. ఫలితంగా ఆర్థిక పరాధీన స్థితి మరింత పెరగడానికి మార్గం ఏర్పడింది. దేశ నిరంతర ఆర్థిక అభివృద్ధి ‘‘దిగుమతి చేసుకునే వస్తువు’’ కాదని, ఉత్పత్తి అయిన సంపద అనేది సామాజికుల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ కావడం ద్వారానే ఆర్థికాభ్యుదయం సాధ్యమని సౌత్ కమిషన్ నొక్కి చెప్పింది! ఈ అభ్యుదయకర పాఠం మన పాలకుల చేతిలో ఆవిరైపోయింది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లు నేటి ప్రధాని మోదీ పబ్లిక్ రంగ వ్యవస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, బ్యాంకుల విలీనీకరణ పేరిట బడా ప్రయివేటు బ్యాంకుల ద్వారా దేశంలో రూ. 360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని ఆశగొల్పుతున్నారు! ‘స్విస్ బ్యాంకు’ ఖాతాలు తెరిచి వాటిలో దాగిన భారత బడా సంపన్నుల 25 లక్షల కోట్లకుపైగా సంపద బయటకు లాగి మరీ ప్రతి కుటుంబానికీ రూ. 15 లక్షలు పంచుతానన్న మోదీ బాస కాస్తా గాలి కబురుగానే మిగిలిపోయింది! చివరకు భారీ యంత్రాలనుంచి పిన్నులకు, పెన్నులకు, ‘పిడుగుకూ, బియ్యానికీ’ విదేశీ కంపెనీల మీద, వాటి సరుకుల మీద బతకాల్సిన పరాధీన స్థితికి దేశ పాలకులు దేశాన్ని నెడుతున్నారు. ప్రజల దృష్టిని గుళ్లూ గోపురాలవైపు, మతం పేరిట కుహనా సంస్కృతుల వైపు మళ్లించి మూఢత్వాన్ని చేటలతో చెరిగే ప్రక్రియను పెంచి పోషిస్తూ తమ పనిని చడీచప్పుడూ లేకుండా చకచకా చేసుకుపోతున్నారు. అదేమని ప్రశ్నించిన వారి నోళ్లకు తాళాలు వేస్తున్నారు. నిర్బంధించి భిన్నాభిప్రాయాలను అణిచేస్తున్నారు. అందుకే ‘‘వర్ధమాన దేశాలు చేతులు ముడుచుకు కూర్చోరాదని, ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలే ఈ దేశాల ప్రాపంచిక దృష్టికి వెలుగు దివ్వెలు కావాలనీ, నాల్గింట మూడు వంతుల జనాభా(350 కోట్లుపైగా) వర్ధమాన దేశాల్లోనే ఉన్నందున ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల హక్కు, సత్తా ఈ దేశాలకు ఉంది’’ అని కూడా సౌత్ కమిషన్ మూడు దశాబ్దాల నాడే చెప్పింది. కానీ మోదీ నినాదం ‘ఇండియాలోనే తయారీ’(మేక్ ఇన్ ఇండియా) కాస్తా క్రమంగా ‘‘ఇండియాలోనే తయారీ, కానీ దాని నిర్మాత అమెరికా’’ అన్న చందంగా మారిపోయింది! మరో మాటలో చెప్పాలంటే–అమెరికా, దాని జేబు సంస్థ ప్రపంచబ్యాంకు చేసిన, చేస్తున్న నిర్వాకమల్లా– ‘‘అరువులివ్వడం, కరువులు తేవడం, రుణం పెట్టడం, రణం పెంచడం’’ అందుకే యువకవి అలిశెట్టి ఏనాడో చాటాడు: ‘‘ అన్నం మెతుకునీ/ఆగర్భ శ్రీమంతుణ్ణీ/ వేరుచేస్తే/ శ్రమ విలువేదో తేలిపోతుంద’’ని! అది తేలకుండా ఉంచడానికే ఘరానా దేశాధిపతుల రాక పోకలప్పుడు పేదల గుడిసెలు కనబడకుండా ఎల్తైన గోడలు కట్టించడం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ట్రంప్ టూర్ : మోదీ నినాదమిదే..
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మోదీ సర్కార్ తీరును శివసేన దుయ్యబట్టింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ ప్రయాణించే మార్గంలో గుడిసెలు కనిపించకుండా గోడను నిర్మించడాన్ని సేన తప్పుపట్టింది. ట్రంప్ పర్యటనకు భారత్ చేస్తున్న ఏర్పాట్లు దాని బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మండిపడింది. మోదీ నినాదం గరీబీ చుపావ్ (పేదరికాన్ని దాచడం)లా ఉందని చురకలు వేసింది. ట్రంప్ భారత పర్యటన బాద్షా (చక్రవర్తి)ను మరిపిస్తోందని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఎద్దేవా చేసింది. ట్రంప్ పర్యటన పడిపోతున్న రూపాయిని కాపాడలేదని, గోడ వెనుక పేదలను ఉద్ధరించదని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ రాజు, రాణి తమ బానిస రాజ్యాల్లో ఒకటైన భారత్‌ను సందర్శించినప్పుడు చేపట్టే ఏర్పాట్లనే ఇప్పుడు ట్రంప్ పర్యటనకు ట్యాక్స్ పేయర్ల సొమ్ము వెచ్చించడం భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌లో పేదల గుడిసెలు కనిపించకుండా చేపట్టిన గోడ నిర్మాణానికి ఏమైనా నిధులు కేటాయించారా.? దేశవ్యాప్తంగా ఇలాంటి గోడలు నిర్మించేందుకు అమెరికా భారత్‌కు నిధులు ఏమైనా మంజూరు చేసిందా..? అంటూ శివసేన ప్రశ్నలు గుప్పించింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ కేవలం మూడు గంటలు గడుపుతారని, గోడ నిర్మాణానికి ఖజానాకు మాత్రం రూ 100 కోట్ల భారం పడిందని పేర్కొంది. అమెరికాలో అత్యధికంగా ఉన్న గుజరాతీ ఓటర్లను అధ్యక్ష ఎన్నికల్లో ఆకర్షించేందుకే ట్రంప్-మోదీ ఎత్తుగడలో భాగంగా అహ్మదాబాద్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని దుయ్యబట్టింది. చదవండి : సీఏఏకు మద్దతు.. ఎన్నార్సీకి వ్యతిరేకం! -
ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్.. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు. వివాదాల పరిష్కారంపై దృష్టి.. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
కెమ్ ఛో ట్రంప్ కాదు.. నమస్తే ట్రంప్
న్యూఢిల్లీ: హౌడీ మోడీ తరహాలో అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనే భారీ కార్యక్రమం ‘‘కెమ్ ఛో ట్రంప్’ ’పేరును ‘నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లిష్‌లో హౌ డూ యూడూ అనే అర్థం వచ్చేలా గుజరాతీ భాషలో కెమ్ ఛో (ఎలా ఉన్నారు? ట్రంప్) అని పేరు పెట్టారు. కానీ అది స్థానిక భాషలో ఉండడంతో ఒక ప్రాంతానికి పరిమితమైనట్టుగా ఉంది. అగ్రరాజ్యాధిపతి పాల్గొనే ఆ కార్యక్రమానికి జాతీయ భావాన్ని తలపించడం కోసం కేంద్రం ఆదేశాల మేరకు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ అని మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూడా ట్రంప్ సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటాం: జైషే మొహమ్మద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘‘ముస్లింలను వేధిస్తే ఇక చూస్తూ కూర్చోం. క్షమించడమన్నదే లేదు’’ అని ఒక వ్యక్తి వీడియో ద్వారా హెచ్చరించాడు. ట్రంప్ పర్యటనకి కాస్త ముందు పాకిస్తానే ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. -
ట్రంప్ మూడు గంటల పర్యటన ఖర్చెంతో తెలుసా..!
సాక్షి, అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు గడపనున్నారు. అందుకోసం విజయ్ రూపాణి సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను అందించనుంది. చదవండి: కెమ్ ఛో ట్రంప్! ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. వీటి కోసం రూ. 80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రత కోసమే రూ. 15 కోట్ల దాకా ఖర్చుచేయనున్నారు. మోదీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా రూ. 4 కోట్లు వెచ్చిస్తున్నారు. ట్రంప్-మోదీ హాజరయ్యే రోడ్ షో కోసం 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి'