Amazon
-
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్‌లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్‌ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్‌ను విమర్శించారు. గతంలో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెజాన్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్‌లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్‌మస్క్ ఇప్పటికే ట్రంప్‌నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
అమెజాన్ కొత్త అడుగు..
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీయంగా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ’15 నిమిషాల లోపే’ నిత్యావసరాలను డెలివరీ చేసేలా బెంగళూరులో పైలట్ ప్రాజెక్టును ఈ నెలలో మొదలుపెట్టబోతున్నట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ తెలిపారు. దేశీయంగా ఇప్పటికే క్విక్ కామర్స్ మార్కెట్లో బ్లింకింట్, జెప్టో మొదలైనవి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఈ–కామర్స్ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ వివరించారు. ఇక్కడ విక్రేతలు.. ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటం, నాణ్యమైన తయారీ, సానుకూల పాలసీలు, టెక్నాలజీ మొదలైనవన్నీ ఇందుకు దోహదపడే అంశాలని పేర్కొన్నారు.భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై వచ్చే ఆరోపణల మీద స్పందిస్తూ.. తమ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా, నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహిస్తోందని కుమార్ చెప్పారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు కూడా మనుగడ సాగించేలా తోడ్పాటు అందించడమనేది ఒక పెద్ద కంపెనీగా తన బాధ్యతగా అమెజాన్ భావిస్తుందని పేర్కొన్నారు. 80 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెజాన్ 2030 నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 80 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్టు ప్రకటించింది. 2015 నుంచి కంపెనీ ఎగుమతులు చేపడుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం, లక్షలాది భారతీయ చిన్న వ్యాపారులు, డైరెక్ట్ టు కంజ్యూమర్ బ్రాండ్లతోపాటు ఇతర కీలక వాటాదారులతో కలిసి పనిచేస్తున్నట్టు అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు.సంస్థ ఏటా నిర్వహించే సంభవ్ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి మొత్తం 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను అందుకునేందుకు నిబద్ధతతో ఉన్నట్టు వివరించారు. 2015లో ప్రారంభించినప్పటి నుండి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ భారత్‌లోని 200లకుపైగా నగరాల నుండి 1,50,000 పైచిలుకు నమోదిత విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. 2025 చివరి నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 20 బిలియన్ డాలర్లను అధిగమించబోతున్నాయని కంపెనీ బ్లాగ్ తెలిపింది. గడువు కంటే ముందుగానే.. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా స్థాపించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్‌తో (డీపీఐఐటీ) అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తయారీ స్టార్టప్స్‌లో 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్ ఒక కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలీకరణ చేస్తామని, 2025 నాటికి భారత్ నుండి మొత్తం 20 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించి.. దేశంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని గతంలో హామీ ఇచ్చింది. గడువు కంటే ఏడాది ముందుగానే డిజిటలీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు అమెజాన్ తెలిపింది. 1.2 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటలైజ్ చేశామని, మొత్తం ఎగుమతులు 13 బిలియన్ డాలర్లు నమోదయ్యాయని, 14 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించామని వివరించింది. లాజిస్టిక్స్ సేవలు.. దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) బ్రాండ్స్ కోసం అమెజాన్ షిప్పింగ్, అమెజాన్ ఫ్రైట్ పేరుతో సరుకు రవాణా సేవలను ప్రారంభించినట్లు అమిత్ అగర్వాల్ ప్రకటించారు. అమెజాన్ ఫ్రైట్ కింద నగరాల మధ్య, నగరాల్లో రవాణా కోసం పూర్తి ట్రక్లోడ్ సరుకు రవాణా సేవలను అందిస్తారు. అలాగే అమెజాన్ షిప్పింగ్ కింద బిజినెస్ టు కంజ్యూమర్ (బీ2సీ) పార్సిల్ డెలివరీలను చేపడతారు. -
విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తాజాగా 100 మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో ఈ క్రెడిట్స్‌ను అందజేయనున్నట్లు వెల్లడించింది.ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్‌ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ క్రెడిట్స్‌తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్బాట్స్తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ (ఫోటోలు)
-
ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్లో అన్లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.నాన్ మెట్రో అమ్మకాలే అధికం ఈసారి ఆన్లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్‌బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్‌వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది. -
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
అలెక్సా చెబితే టపాసు వింటోంది!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..హైటెక్ లాంచ్మనీస్ప్రాజెక్ట్ల్యాబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్‌కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్‌ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్‌మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Mani's Projects Lab (@manisprojectslab) -
హెచ్పీసీఎల్తో అమెజాన్ జట్టు
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్‌ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది. -
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పన్ను?
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్‌టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్‌కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్‌గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపురూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్
ఉచిత స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. దాన్ని తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీటీవీలో విలీనం చేసి ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’ కింద ఒకే సర్వీసుగా మార్చినట్లు పేర్కొంది. అమెజాన్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, కనెక్టెడ్ టీవీల ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ రెండు సర్వీసుల అనుసంధానం ఆటోమేటిక్‌గా జరుగుతుందని, దీనికోసం ఆయా యాప్‌లను రీఇన్‌స్టాల్ లేదా అప్‌గ్రేడ్ చేయనక్కర్లేదని వివరించింది. సెప్టెంబర్‌లో రెండు సర్వీసులను 25 కోట్ల మంది యూజర్లు వినియోగించుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సర్వీసును ఉచితంగా కొనసాగేస్తూనే మరింత నాణ్యమైన కంటెంట్‌ను, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతుండడంతో కంపెనీలు ఇప్పటికే మార్కెట్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు -
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్‌మార్ట్ బుక్‌స్టోర్‌లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్‌లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఇండియా పోస్ట్, అమెజాన్ జత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్‌వర్క్‌లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్‌ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్‌తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం -
అమెజాన్‌లో కార్చిచ్చులు..బ్రెజిల్‌ను కమ్మేసిన పొగ
బ్రసిలియా: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుల దెబ్బకు 80శాతం బ్రెజిల్‌ను పొగకమ్మేసింది. రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కొవిడ్ మాస్కులకు బ్రెజిల్ ప్రజలు మళ్లీ పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. గత 14 ఏళ్లలో ఇంతటి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది. ఓవైపు బ్రెజిల్ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు ఉన్న పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి. అమెజాన్ పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయి.భూమిపై అమెజాన్ బేసిన్‌కు అత్యంత తేమ ప్రాంతంగా పేరుంది. కార్చిచ్చులతో కమ్మేసిన పొగ పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల రాజధాని బ్రసిలియాలో ఆస్పత్రులకు చాలామంది రోగులు శ్వాస సంబంధ ఇబ్బందులతో చికిత్స కోసం వస్తున్నారు. బ్రసిలియాలో దాదాపు 160 రోజులుగా చుక్క వర్షం పడలేదు. దీంతో ప్రజలు తడి గుడ్డలపై ఫ్యాన్ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాగుకు వినియోగించేందుకుగాను అటవీభూమికి ప్రజలు నిప్పుపెడుతున్నట్లు గుర్తించారు. సోమవారం(సెప్టెంబర్30) బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాలో కార్చిచ్చులను నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం -
పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 20-25 శాతం పెరిగాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే సంస్థలు వివిధ పేర్లతో ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో విభిన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాయి. దాంతో 27న(26న ప్రైమ్ వినియోగదారులకు వర్తించాయి.) మొదలైన అమ్మకాలు గతేడాది ఇదే సీజీన్లోని మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సారి 20-25 శాతం వృద్ధి చెందినట్లు డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 26(ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు వర్తించాయి)-28 రోజుల్లో ఆన్లైన్ రిటైలర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 26% పెరిగాయి. సుమారు రూ.26,500 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ పండగ సీజన్ పూర్తయ్యే సమయానికి రూ.లక్ష కోట్లు (12 బిలియన్ డాలర్లు) స్థూల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 23% వృద్ధిని సూచిస్తుంది. ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ప్రధానంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంటీరియర్ వస్తువులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!కంపెనీలు ఇలాంటి ఫెస్టివ్ సీజన్లో ఆఫర్లు తీసుకురావడం సహజం. కానీ కొనాలనుకునే వస్తువుపై ఏదోఒక ఆఫర్ ఉందని కొంటున్నామా? లేదా నిజంగా ఆ వస్తువు అవసరమై కొంటున్నామా..అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆఫర్ల ట్రాప్‌లో పడి విచ్చలవిడిగా షాపింగ్ చేసి అప్పులపాలు కాకూడదని సూచిస్తున్నారు. ప్రధానంగా చాలామంది క్రెడిట్‌కార్డులు వాడుతూ, ఈఎంఐ ఎంచుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే మీకు ఇతర ఈఎంఐలు ఉంటే మాత్రం జాగ్రత్తపడాలని చెబుతున్నారు. నెలవారీ సంపాదనలో కేవలం 20-25 శాతం మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలంటున్నారు. లేదంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఆఫీసుకు రాకుండా ఉండేదుకు ఉద్యోగులు వాడే ట్రిక్స్ ఇవే..
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాయి. ఈ జాబితాలో అమెజాన్ కూడా ఉంది. 2025 నుంచి వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించింది. అందరూ ఆఫీస్ నుంచి పనిచేస్తే కలిగే ప్రయోజనాలను గురించి కూడా అమెజాన్ సీఈఓ 'ఆండీ జాస్సీ' వెల్లడించారు.ఇన్నిరోజులు ఇళ్లకు పరిమితమైన చాలా మంది ఉద్యోగులు.. ఆఫీసుకు రావాలనే వార్తతో కొంత నిరాశకు గురయ్యారు. ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అభ్యర్థించారు. మరికొందరు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పించుకోవడానికి మూడు ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు 'ఆండీ జాస్సీ' చెప్పుకొచ్చారు.కాఫీ బ్యాడ్జింగ్అమెజాన్ ఉద్యోగులు మాత్రమే కాకుండా.. చాలామంది ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్నారని తెలిసింది. అంటే సమయానికి ఆఫీసులకు వచ్చి పంచ్ వేయడం, అల్పాహారాని కొంత సమయం, కాఫీ తాగటానికి కొంత సమయం ఇలా కేటాయించుకుంటూ.. మళ్ళీ టైమ్ అవ్వగానే పంచ్ వేసి వెళ్ళిపోతారు. ఇదెలా ఉండేదంటే.. ఆఫీసులో కనిపించి, కాఫీ తాగి వెళ్లిపోవడం అన్నమాట. ఈ విధానం కొంత తగ్గుముఖం పట్టింది.హోమ్ వై-ఫై పేరు మార్చేయడంఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే పనిచేస్తూ.. హోమ్ వై-ఫైకి ఆఫీస్ వై-ఫై పేరు ఇచ్చేవారు. ఇలా చేసి ఉద్యోగి లాగిన్ అయినప్పుడు రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వారు ఆఫీసులో ఉన్నట్లు తెలిసేది. ఇలా కూడా చేసేవారు ఎక్కువయ్యారు. ఆఖరికి రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను మరింత పటిష్టంగా చేయడంతో ఇది కొంత కనుమరుగైంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఆఫీసులో బ్యాడ్జ్ వదిలి వెళ్లడంమూడో ట్రిక్ ఏమిటంటే.. కొంతమంది ఉద్యోగులు తమ బ్యాడ్జ్‌ని ఆఫీసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ బ్యాడ్జ్‌తో సహోద్యోగి చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి చేస్తారు. ఇలా చేస్తే సదరు ఉద్యోగి ఆఫీసుకి వచ్చి వెళ్తున్నట్లు రిపోర్టులో చూపిస్తుంది. కానీ నిజానికి వారు ఆఫీసుకే రారని తెలుస్తుంది. -
వీటి కొనుగోలుపై 86 శాతం డిస్కౌంట్!.. పండగ చేసుకోండి..
దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ 27 నుంచి (సెప్టెంబర్ 27) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తుల మీద ఏకంగా 86 శాతం డిస్కౌంట్స్ అందించనున్నట్లు సమాచారం.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ఫోన్లు, సౌండ్బార్లు మొదలైన వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందించనుంది. అయితే ఈ డిస్కౌంట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. టాబ్లెట్ల మీద 55 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్, లెనోవా, యాపిల్ వంటి టాప్ బ్రాండ్ల మీద కూడా 55 శాతం డిస్కౌంట్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..అమెజాన్ హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్‌ల మీద 86 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నట్లు సమాచారం. సోనీ, గోప్రో వంటి కెమెరాల మీద 53 శాతం డిస్కౌంట్స్.. స్పీకర్ల కొనుగోలుపైన 73 శాతం, యాపిల్, శాంసంగ్, నాయిస్, బోట్ వంటి స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ 83 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కీబోర్డ్ మరియు మౌస్ కాంబోలపై కూడా 82 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.అమెజాన్ మాత్రమే కాదుఅమెజాన్ మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. -
లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..
1994లో జెఫ్ బెజోస్ సీటెల్ గ్యారేజీలో స్థాపించిన ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్ నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ సంస్థ పేరే 'అమెజాన్'. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన అమెజాన్.. సమావేశాల్లో ఎప్పుడూ ఓ కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఇంతకీ మీటింగులో ఖాళీ కుర్చీ ఎందుకు ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బిలినీయర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ కనిపించే ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుకు తెస్తుంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ తన మొదటి ప్రాధాన్యతను కస్టమర్లకు ఇస్తున్నట్లు చెప్పడానికే అమెజాన్ కంపెనీ ఆ ఖాళీ కుర్చీని ఉంచుతుంది.ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ కంపెనీ నిర్వహించే సమావేశాల్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉంటారు. సమావేశంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్దిగ్గజ కంపెనీలలో ఒకటిగా ఎదిగిన అమెజాన్ సంస్థలో నిర్వహించే సమావేశాలలో ఇప్పటికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిషేధమే. సమావేశంలో పాల్గొనేవారు ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్లను పాయింట్ల రూపంలో లేదా మెమోల రూపంలో సమర్పించాల్సిందే. బహుశా ఇలాంటి విధానాన్ని పాటిస్తున్న పెద్ద కంపెనీ అమెజాన్ అనే చెప్పాలి. -
'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్'
దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి 'రిటర్న్-టు-ఆఫీస్' విధానం చేపడుతున్నాయి. అమెజాన్ కూడా ఈ ఫార్ములానే అనుసరిస్తోంది. ఈ విధానం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికే.. అంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో పనిచేసిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'జాన్ మెక్‌బ్రైడ్' పేర్కొన్నారు.2023 జూన్ వరకు అమెజాన్ కంపెనీలో ఒక ఏడాది పనిచేసిన మెక్‌బ్రైడ్.. సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటనపై స్పందించారు. అమెజాన్ వర్క్‌ఫోర్స్ తగ్గింపు ప్రణాళిక ఐదు దశలుగా ఉందని వివరించారు. మొదటి దశలో 30000 మంది ఉద్యోగులను తొలగించారు. రెండవ దశలో రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేయడం జరిగింది.రిటర్న్-టు-ఆఫీస్ విధానం అమలు చేసిన తరువాత కొందరు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నేను (జాన్ మెక్‌బ్రైడ్) ఆఫీసుకు వెళ్ళడానికి 20 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణమయింది. నాలాగే కొందరు ఉద్యోగులను వదులుకున్నారని వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?నాల్గవ, ఐదవ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు అప్పటికే పెండింగులో ఉన్న చాలా పనులను అప్పగించారు. దీంతో పనిభారం ఎక్కువైంది. ఇది మరికొందరు ఉద్యోగాలను వదిలిపోయేలా చేసింది. మొత్తం మీద కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి.. మళ్ళీ లాభాలబాట పట్టాలని సంస్థ చేస్తున్న చర్య అని అన్నారు.I’m a former AWS employee: most of the hot takes on Amazon's new strict return-to-office policy are wrong.Anyone who’s been paying attention saw this coming years ago. And ultimately, it comes down to taxes and economics.Here's their plan:Phase 1: layoff over 30k people.…— John McBride (@johncodezzz) September 18, 2024 -
వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని అమెజాన్ డాట్ కామ్ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్లో తెలిపారు.సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
ఈ–కామర్స్ పండుగ సేల్ 26 నుంచి షురూ..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా సెప్టెంబర్ 26 నుంచి వార్షిక పండుగ సేల్ ప్రారంభించనున్నాయి. 27 నుంచి అందరికీ సేల్ అందుబాటులోకి వస్తుందని, అంతకన్నా 24 గంటల ముందు తమ పెయిడ్ సబ్స్క్రయిబర్స్కు యాక్సెస్ లభిస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ది బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 పేరిట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) పేరుతో అమెజాన్ ఇండియా వీటిని నిర్వహించనున్నాయి. 20 నగరాలవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ప్రోడక్టు కేటగిరీల్లో ఉత్పత్తులను అదే రోజున అందించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈసారి విక్రేతలకు 20 శాతం అధికంగా రివార్డులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, ఏజీఐఎఫ్లో భాగంగా 14 లక్షల మంది పైగా విక్రేతలు, ప్రోడక్టులను విక్రయించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
చట్టాలను ఉల్లంఘించిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు
శామ్సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్మీ, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్‌తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్సైట్లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు రాయిటర్స్ నివేదికపై స్మార్ట్‌ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేకమైన లాంచ్‌ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు.