Citizenship Amendment Act
-
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్‌కు ఉందా?
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్ఆర్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు. -
ఓటు ప్రజాస్వామ్య జీవధాతువు
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది. భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు. ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్‌సభ), 16వ లోక్‌సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు. క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్‌ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది. మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్‌ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్‌ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది. ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్‌లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక.. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9న వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు -
‘సీఏఏ’పై వందల పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరింది. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు సీఏఏపై సుప్రీంకు వెళ్లారు. ఇదీ చదవండి.. బాండ్ల నంబర్లేవి -
అసంపూర్ణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019కి జవసత్వాలు అందించే 39 పేజీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పాలనా యంత్రాంగం ఓటర్లను విభజించాలని చూస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా చోటు చేసుకున్న ఈ పరిణామం వివాదాన్ని రేకెత్తించింది. కాగా, మరో ఎన్నికల హామీని తాను నెరవేర్చినట్లు బీజేపీ చెప్పుకొంది. పౌరసత్వాన్ని హరించడానికే సీఏఏని ఉపయోగిస్తారనే భయాలు కేవలం నిరాధారమైనవని తిప్పికొట్టింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసాత్మక చర్యల కారణంగా పారిపోయి భారతదేశంలో అక్రమంగా లేదా అనధికారికంగా స్థిరపడిన ఆరు మతా లకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం అందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ ఆరు మత బృందాలు ఆ దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు. ఆ దేశాలకు చెందిన ముస్లింలను సీఏఏ నుంచి మినహాయించారు. ఈ దేశాలకు చెందిన ముస్లింలను పై చట్టం నుంచి మినహాయించడానికి హేతువు ఏమిటంటే... ఆ మూడు దేశాలూ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఇస్లామిక్ దేశాలు. కాబట్టి వారు తమతమ దేశాలలో తగు న్యాయం పొందగలరని ఇది సూచిస్తుంది. దరఖాస్తులను పర్యవేక్షించడానికి కేంద్ర అధికా రులతో కూడిన కమిటీలను రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై నియంత్రణను కలిగి ఉంది. పాత విధానంలో జిల్లా అధికారులే అభ్యర్థ నలను స్వీకరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కోవడంలో నిరీక్షణ వ్యవధిని, సీఏఏ 11 నుండి ఐదు సంవత్సరాలకు తగ్గిస్తుంది. అయితే దరఖాస్తుదా రులు వారి మాతృభూమి నుండి అధికారిక పత్రాలను సమర్పించాలి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, 2019– 20లో భారతదేశం అంతటా ఈ సవరణ చట్టంపై వీచిన తుపానుతో పోలిస్తే ఇవి పెద్దగా సద్దులేనివి గానే కనిపిస్తాయి. అయితే, రాబోయే కొద్ది వారాల్లో అభ్యంతరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంలో మరొక పెద్ద సమస్య దాగి ఉంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను వ్యతిరేకిస్తున్న సీఏఏకి సంబంధించిన అనేక చట్టపరమైన సవాళ్లను సుప్రీంకోర్టు ఇంకా వినలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇక్కడ కీలకమైన వాదన ఏమిటంటే, మతాన్ని పౌరసత్వానికి గుర్తుగా ప్రతిష్టించడం ద్వారా, రాజ్యాంగానికి చెందిన ప్రాథమిక స్వరూపాన్నే పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందన్నదే. అదే సమయంలో భారత రాజ్యాంగం మతపరమైన వివక్షను నిషేధిస్తుంది. చట్టం ముందు ప్రజలందరికీ సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణకు హామీ ఇస్తుంది. ఈ చట్టంపై తొలి సవాలు 2020లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను ఇంకా వినలేదు. అయితే, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గత ఏడాది డిసెంబర్లో పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏ చెల్లుబాటుకు సంబంధించిన మరో కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిర్దిష్ట సవరణ 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం నాటిది. ఇది బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు సంబంధించిన శాశ్వత సవాలుపై రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని భారతీయ పౌరులుగా గుర్తించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందించింది. అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి 1971 మార్చి 25ని కటాఫ్ తేదీగా నిర్ణయించడమైంది. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం అంతటా ఒకే విధంగా వర్తించదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ప్రత్యేక రాజ్యాంగ రక్షణ ఉన్న అస్సాం (తక్కువ జనాభాతో), త్రిపురలోని మూడు గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఈ చట్టం అమలు కాదు. 2019లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)ని తీసుకురావడం ద్వారా అస్సాంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. 19 లక్షల దరఖాస్తుదారులు దీనికి వెలుపలే ఉండిపోయారు. వీరిలో ఎక్కువమంది హిందువులు, స్థానిక సంఘాల సభ్యులే ఉన్నారు తప్పితే, ముస్లింలు కాదు. ఇది బీజేపీనీ, దాని మిత్ర పక్షాలనూ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి వారు ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాంలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు కూడా సీఏఏని వ్యతిరేకించారు. మతం పౌరసత్వాన్ని నిర్ణయించకూడదని వాదించారు. సహాయాన్ని పొందవలసిన సామాజిక బృందాల జాబితా కూడా అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఇందులో శ్రీలంకలోని తమిళ హిందువులు, క్రైస్తవులు వంటి సమూహాలు లేవు. వీరిలో 90,000 మందికి పైగా భారత్‌లో శరణార్థులుగా ఉన్నారు. మయన్మార్ నుండి వచ్చిన చిన్ క్రైస్తవులు కూడా జాబితాలో లేరు. వీరిలో 45,000 మందికి పైగా ఒక్క మిజోరంలోనే ఉన్నారు. ఒక మతానికి చెందినవారైనప్పటికీ, ఆ మతంలోని మైనారిటీ శాఖలపై వేధింపుల ప్రమాదం తగ్గదు. అయినా పాకిస్తాన్ లోని అహ్మదీయులు, అఫ్గానిస్తాన్‌లోని హజారాలు వంటి బలహీనమైన ముస్లిం సమూహాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం సీఏఏకి కనిపించలేదు. సంజయ్ హజారికా వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
UNGA: పాకిస్తాన్‌కు రుచిరా కంబోజ్ కౌంటర్
ఐక్యరాజ్య సమతిలో పాకిస్తాన్ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు అని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్లామోఫోబియాను ఎదుర్కొవటానికి చర్యలు’పై తీర్మాన్నాని ప్రవేశపెట్టే సందర్భంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ భారత దేశానికి సంబంధించిన రామ మందిర్ నిర్మాణం, సీఏఏ అమలు అంశాలను ప్రస్తావించారు. మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా దేశం (భారత్)కు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్ చాలా పరిమితమైన, తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు కలిగి ఉండటం దురదృష్టకరం. ప్రపంచం మొత్తం ఒకవైపు అభివృద్ది మార్గంలో దూసుకువెళ్తుంటే పాక్ తీవ్ర విషాదంతో కూడిన స్తబ్దతను కనబరుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు’ అని రుచిరా మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయాగా.. ఎవరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. కానీ, 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియాతోపాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. -
‘సీఏఏ’పై స్టే ఇవ్వండి: సుప్రీంలో ఒవైసీ పిటిషన్
న్యూఢిల్లీ: ఇటీవలే అమలులోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా సీఏఏ కింద కొత్తగా ఎవరికీ పౌరసత్వం ఇవ్వవద్దని పిటిషన్లో ఒవైసీ కోరారు. కాగా, 2019లో కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్రం రూల్స్ నోటిఫై చేసి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి డిసెంబర్ 31,2014కు ముందు దేశంలోకి వలస వచ్చిన నాన్ ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తారు. సీఏఏ పోర్టల్‌లో దరఖాస్తు చేసిన కొందరు మైగ్రెంట్స్‌కు ఇప్పటికే భారత పౌరసత్వం కల్పించారు. AIMIM president Asaduddin Owaisi approaches the Supreme Court seeking to stay the implementation of the Citizenship Amendment Act (CAA), 2019 and the Rules, 2024. Owaisi says no applications seeking grant of citizenship status be entertained or processed by the government under… pic.twitter.com/w8uQii4lyn — ANI (@ANI) March 16, 2024 ఇదీ చదవండి.. చైనా, పాక్ స్నేహం భారత్‌కు సవాలే -
సీఏఏ అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు. ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. -
మరోసారి 'మోదీ'ని ప్రశంసించిన అమెరికన్ సింగర్.. ఎందుకంటే?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేసింది. దీనిపై దేశంలో పలు ప్రాంతాల్లో వ్యతిరేఖత కనిపిస్తోంది. కానీ ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని 'మేరీ మిల్బెన్' మాత్రం ఇది గొప్ప చర్య అంటూ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని గుర్తించాలని, భారతదేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని, ముఖ్యంగా మూడోసారి మోదీని ఎన్నుకోవాలని సూచించింది. సీఏఏ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని, దుర్బల వర్గాలకు రక్షణ మరియు ఆశ్రయాన్ని అందజేస్తుందని మేరీ మిల్బెన్ పేర్కొంది. మత స్వేచ్ఛను కోరుకునే క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇదొక శాంతి మార్గం. భారతదేశం వీరందరికి నివాసం కల్పిస్తోంది. పౌరసవరణ చట్టం నిజమైన ప్రజాస్వామ్య చర్య అని మేరీ మిల్బెన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొంది. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నోటిఫికేషన్ గురించి అగ్ర రాజ్యం అమెరికా ఆందోళన చెందుతోంది. సీఏఏ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. @StateDept, PM @narendramodi is demonstrating compassionate leadership towards those being persecuted for their faith and providing a home to them in #India. A pathway to peace for Christians/Hindus/Sikhs/Jain/Buddhists seeking #religiousfreedom. When the PM is reelected for a… https://t.co/Y5tyuWCVAs — Mary Millben (@MaryMillben) March 15, 2024 -
CAAపై అమెరికా ప్రకటన.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అగ్రరాజ్యం అమెరికా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. 2019కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషషమని, ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం.. పౌరసత్వం తీసివేయడం గురించి కాదని అన్నారు. ఇది అందరికీ అర్థం కావాలన్నారు. ‘ఇది ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. సీఏఏ అమలులు తీరును తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని గమనిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు. చదవండి: ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు -
USA: ‘సీఏఏ’ అమలుపై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: భారత్ తాజాగా అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సీఏఏ అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘మార్చ్ 11 సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళనతో ఉన్నాం. ఈ చట్టం అమలు తీరును గమనిస్తున్నాం. మత పరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనేవి ప్రజాస్వామ్య మూల సూత్రాలు’ అని మిల్లర్ పేర్కొన్నారు. అయితే హిందూ అమెరికన్లు మాత్రం సీఏఏను స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. US State Department spokesperson, Matthew Miller, provides the State Department's response to CAA, The Citizenship Amendment Act, being implemented in India.#CAAImplemented #CAA #CAAImplementation #CitizenshipAmendmentAct #CitizenshipAct pic.twitter.com/a9kAzL64ft — Diya TV (@DiyaTV) March 14, 2024 పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014కు ముందు వలస వచ్చిన నాన్ ముస్లింలకు సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నారు. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వలసవచ్చిన వారికి పౌరసత్వం జారీ చేస్తున్నారు. ఈ చట్టం కింద దేశంలోని ఒక్క ముస్లిం కూడా తమ పౌరసత్వాన్ని కోల్పోడని భారత ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దేశంలో అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ భారతీయులు ఇదీ చదవండి -
వాళ్లకేం పని లేదు.. CAAను వెనక్కి తీసుకోం: అమిత్ షా
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారాయన. ‘ప్రతిపక్షాలకు ఏ పనీ లేదు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా?. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. వాళ్ల చరిత్ర అంతా చెప్పింది చేయకపోవడమే.. కానీ మోదీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని సాకారం చేశారు’ అని అమిత్ షా తెలిపారు. ‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు. ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదు. పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని వాళ్లు చేస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదు. అలాగే.. NRC(జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారాయన.. చట్టం అమలు కేంద్రం అంశం.. సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. ‘‘ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రాలది కాదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు’’ అని షా గట్టిగా చెప్పారు. సీఏఏపై ఆందోళనలు ఉద్ధృతమైతే చట్టం అమలుపై పునరాలోచనలు చేస్తారా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఈ చట్టాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దీనిపై మేం దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ చట్టంతో బీజేపీ కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం పనిలేదు. వాళ్లు చెప్పింది ఎన్నడూ చేయరు. ఒవైసీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏను ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్లో ఆమోదించాం. కానీ కొవిడ్, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను ఎందుకు వద్దంటున్నారో రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పాలి. మీ వ్యాఖ్యలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరూ వివరణ ఇవ్వండి’’ అని అమిత్ షా సవాల్ చేశారు. సీఏఏపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలనూ షా దుయ్యబట్టారు. ‘‘అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే.. బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు?విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం(సీఏఏ)–2019 కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆన్లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోం శాఖ బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే ఓ పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వలసదారులైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ దరఖాస్తు సంబంధ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
CAA: ‘బెంగాల్లో నిర్బంధ శిబిరాలను అనుమతించం’
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు. అస్సాంలో ఉన్న విధంగా పశ్చిమ బెంగాల్‌కు నిర్బంధ శిబిరాలు అవసరం లేదని అన్నారు. ‘సీఏఏ అనేది ఎన్ఆర్సీ వంటిదే. అందుకే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్సాం ఉన్నట్లు మాకు నిర్బంధ కేంద్రాలు అవసరం లేదు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాము భూస్వాములం కాదని.. అప్రమత్తంగా ఉండే సంరక్షకులమని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టమని అన్నారు. శరణార్థులంతా ఇక్కడే శాశ్వతంగా స్థిరపడవచ్చని సీఎం మమత అన్నారు. బీజేపీ హిందూ మతాన్ని వక్రీకరిస్తోందని.. స్వామి వివేకనంద బోధనలు నుంచి హిందుత్వాన్ని వేరు చేస్తోందని మండిపడ్డారు. సీఏఏతో భారత ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సీఎం మమత దుయ్యబట్టారు. ఇక.. 2019లో విదేశీయులతో కూడిన నిర్బంధ కేంద్రాలను అస్సాం ప్రభుత్వ నోటీఫై చేసిన విషయం తెలిసిందే. వారికి శాశ్వత కేంద్రాల ఏర్పాటు చేసే వరకు జైళ్లను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని దిస్పూర్కు సుమారు 130 కిలోమిటర్ల దూరం మాటియా అనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్బంధ కేంద్రంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
సీఏఏపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
-
సీఏఏపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించబోమన్నారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు. కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైఎస్సార్సీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే. .. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. -
మళ్లీ సీఏఏ రంగప్రవేశం!
రేపో మాపో లోక్‌సభ ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆరునూరైనా ఈనెల 15కల్లా బహిరంగపరచాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన కొన్ని గంటల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలపై సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలుగా వేధింపులకు లోనవుతూ మన దేశానికి వలసవచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్తులకు త్వరితగతిన భారత పౌర సత్వం ఇవ్వటం సీఏఏ ప్రధాన ఉద్దేశమని పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఆమాటే చెప్పింది. ఈ మతస్తులు వరసగా అయిదేళ్లపాటు ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. చట్టంలో ముస్లింలను మినహాయించినట్టు బాహాటంగానే కనబడుతోంది. కానీ శ్రీలంకలో మైనారిటీలైన హిందూ తమిళులనూ, మయన్మార్‌లోని మైనారిటీలు రోహింగ్యాలనూ, ఇంకా... హజరా, అహ్మదీయ వంటి ముస్లిం మైనారిటీ తెగలనూ సీఏఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ తెగలు కూడా భారత పౌరసత్వం కోసం ఎప్పటిలా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం వారు పదకొండేళ్లపాటు ఈ దేశంలో నివసించాలి. ఆచరణలో పౌరసత్వం రావటానికి దశాబ్దాలు పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ముస్లిం దేశాల్లోని హిందువుల స్థితిగతులపై వున్న ఆరాటం లంక తమిళుల విషయంలో ఎందుకు లేకుండా పోయింది? అక్కడ వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస తక్కువేమీ కాదు. చట్టం ముందు అందరూ సమానులేనని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యం ఎవరికీ సమానత్వాన్ని నిరాకరించకూడదనీ, పౌరులందరికీ చట్టాలు సమంగా రక్షణ కల్పించాలనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో ఆ స్ఫూర్తే కొనసాగాలి. కానీ సీఏఏ అందుకు విరుద్ధంగా కొన్ని మతాలవారిని ఉదారంగా చూడటం, మరికొందరిని దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 2020లో పిటిషన్ దాఖలు చేసింది. కాలక్రమంలో మరో 200 పిటిషన్లు దానికి జత కలిశాయి. ఇందులో అస్సాంకు చెందిన అసోం గణపరిషత్, డీఎంకే, అస్సాం పీసీసీ మొదలుకొని అసదుద్దీన్ ఒవైసీ, మహువా మొయిత్రా, జైరాం రమేష్ వంటి నాయ కులు కూడా వున్నారు. బిల్లు చట్టంగా మారాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వ విద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూని వర్సిటీ వంటిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో వందమంది వరకూ మరణించగా, అనేకులు గాయపడ్డారు. వందలాదిమందిపై ఇప్పటికీ కేసులు కొనసాగు తున్నాయి. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వెనకున్న ఉద్దేశం వేరు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనారిటీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన పడుతున్నాయి. మరోపక్క సీఏఏ నోటిఫికేషన్ రాకపై గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనీ, లేకుంటే దెబ్బతింటామనీ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. బెంగాల్‌లోని నాదియా, 24 పరగణాలు, తూర్పు బర్ద్వాన్, ఉత్తర బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు 1971లో బంగ్లా విముక్తి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా తెగ ప్రజలు హిందువులు. పౌరసత్వ చట్టానికి 2003లో చేసిన సవరణ కింద వారంతా శరణార్థులుగా కొనసాగుతున్నారు. ఓటుహక్కు వగైరాలున్నాయి. మొదట్లో సీపీఎంకూ, తర్వాత తృణమూల్కూ, ఇప్పుడు బీజేపీకీ వోటు బ్యాంకుగా వీరు ఉపయోగపడుతున్నారు. అస్సాంలోనూ బీజేపీకి అటువంటి ప్రయోజనాలే వున్నాయి. రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టంవంటివి మాత్రమే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నిజంగా బీజేపీ భావిస్తే అది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుందే తప్ప బలాన్ని కాదు. పొరుగు దేశాల బాధిత మైనారిటీల విషయంలో అనుసరించాల్సిన విధానాలను మాత్రమే సీఏఏ నిర్ధారించిందని, మైనారిటీల పౌరసత్వానికి దానివల్ల వచ్చే నష్టంలేదని, వారు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీఏఏ దానికదే సమస్యాత్మకం కాక పోవచ్చు. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దాంతో అనుసంధానిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని నిపుణులంటున్న మాట. అస్సాంలో ఎన్ఆర్సీ అమలయ్యాక ఏమైందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలమంది పౌరసత్వానికి అనర్హు లయ్యారు. ఇందులో ముస్లింలతోపాటు హిందువులు కూడా వున్నారు. ఎన్ఆర్సీని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సీఏఏపై వ్యతిరేకత వుండటాన్ని, లంక తమిళులకు చట్టంలో చోటీయక పోవటంపై వున్న అసంతృప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. చట్టం తీసుకురావటానికి ముందు అన్ని వర్గాలతోనూ చర్చించలేదు. ఉద్యమాల సమయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అవేమీ జరగలేదు. కనీసం నోటిఫికేషన్ విడుదలకు ముందైనా సందేహాలు పోగొట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా? అసలు ఎన్నికలు ముంగిట పెట్టుకుని సమస్యాత్మకమైన ఈ తేనెతుట్టెను ఎందుకు కదిపినట్టు? -
‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధివిధాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఏఏ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడితున్నాయి. మరోవైపు.. ఈ చట్టం అమలుతో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడతారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీఏఏ చట్టంపై ముస్లింల ఆందోళనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ముస్లింలు సీఏఏతో ఆందోళ చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది ‘భారతీయ ముస్లింలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సీఏఏ చట్టంలో 18 కోట్లమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నిబంధన లేదు. ముస్లింలు తమ పౌరసత్వ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని హిందూవులతో సమానమైన హక్కులు ఉంటాయి. సీఏఏ కింద ముస్లింలు పౌరసత్వాన్ని రుజువు చేయటానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలిన అవసరం లేదు. ఇస్లాం మతం శాంతియుతమైంది. మతప్రాతిపదికగా ద్వేషం, హింసను బోధించదు. ఈ చట్టం కరుణ చూపే.. ఇస్లాం మతాన్ని హింస పేరుతో మసకబారనివ్వకుండా కాపాడుతుంది’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొన్ని ఇస్లాం దేశాలలో మైనారిటీల వేధింపుల కారణంగా.. ఇస్లాం పేరు మసకబారిందని తెలిపింది. ఇక.. సీఏఏ చట్టం ముస్లింకు వ్యతిరేకమని కొంతమంది ఆందోళన చెందటం అన్యాయమని పేర్కొంది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన సీఏఏ చట్టంలో లేదని హామీ ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖార్గే, ఎంపీ రాహుల్ గాంధీ.. సీఏఏ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మండిపడ్డారు. చదవండి: ‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్‌ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
సీఏఏ అమలుపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' తీవ్రంగా విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన 'లూడో మూవ్' అని ఆరోపించారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య అని మండిపడ్డారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు. సీఏఏ మీకు హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మీరు పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న మరుక్షణం అక్రమ వలసదారులుగా మారి మీ హక్కులను కోల్పోతారు. దయచేసి దరఖాస్తు చేసే ముందు ఆలోచించండి అని మమతా బెనర్జీ అన్నారు. సీఏఏ బెంగాల్లో జరగడానికి నేను అనుమతించను. మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బెంగాల్‌ను విభజించడానికి ఇది బీజేపీ మరో గేమ్ అని మమతా వెల్లడించారు. మనమంతా భారత పౌరులమేనని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. -
‘సీఏఏ’పై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఏఏ చట్టం రాజ్యాంగం పరంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద తప్పు. పౌరసత్వం చట్టంలో మతాల ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. చట్టం పరిధిలో నుంచి ఒక మతాన్ని తప్పించకుండా ఉండి ఉంటే మేం సీఏఏను ఆహ్వానించి ఉండే వాళ్లం’ అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా, సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోమవారం (మార్చ్11) కేంద్ర ప్రభుత్వం రూల్స్ నోటిఫై చేసింది. ఇదీ చదవండి.. సీఏఏపై దళపతి విజయ్ ఏమన్నారంటే.. -
‘సీఏఏ’పై నిరసనలు.. అస్సాం పోలీసుల సీరియస్ వార్నింగ్
గువహతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం(మార్చ్11) నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏ చట్టంపై బంద్‌కు పిలుపిచ్చిన అస్సాం ప్రతిపక్ష పార్టీలకు ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఏఏ చట్టం రూల్స్ నోటిఫై చేసిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచే అస్సాంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళనలకు దిగాయి. రాజధాని గువహతితో పాటు చాలా ప్రాంతాల్లో సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు కాల్చివేశారు. చట్టం అమలు చేయడానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో పోలీసులు ఈ ఆందోళలపై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగే సర్బత్మక్ బంద్‌లో భాగంగా ఎవరైనా ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పౌరులను గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టాన్ని వారి నుంచే పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో పోలీసులు ఒక పోస్ట్ చేశారు. ఆదివారమే ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర హెచ్చరిక చేశారు. Guwahati police gave a legal notice to the Political parties who have called for a 'Sarbatmak Hartal' in Assam to protest against the CAA. "Any damage to public/ private property including Railway and National Highway properties or injury to any citizen caused due to 'Sarbatmak… pic.twitter.com/vnO6uin76t — ANI (@ANI) March 12, 2024 సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయ్యే చాన్స్ ఉందని సీఎం బిశ్వశర్మ హెచ్చరించారు. ఎవరికైనా చట్టం పట్ల అభ్యంతరాలుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కాగా, 2019 డిసెంబర్లో సీఏఏపై అస్సాంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఈ చట్టం అమలు చేస్తే బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా వలసలు ఉంటాయని పలు పార్టీలు, గ్రూపులు భావిస్తున్నాయి. ఇదే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. ఆ స్టేట్స్లో సీఏఏ చట్టం ఉండదు -
అమల్లోకి సీఏఏ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కలి్పస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కలి్పంచడం దీని ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ (సవరణ) నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘సీఏఏ చట్టం–2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచాం’’అని ఆయన వెల్లడించారు. బీజేపీ హర్షం, విపక్షాల ధ్వజం సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చి చూపారంటూ అభినందించారు. పాక్, బంగ్లా, అఫ్గాన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనారిటీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై మండిపడ్డాయి. ఇది దేశ సమగ్రతకు సీఏఏ విఘాతమంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, మజ్లిస్ తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. దీన్ని కేవలం బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడగా అభివరి్ణంచాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అసోంలలో మతపరమైన విభజన తెచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి. ఆమ్నెస్టీ ఇండియా కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఇది సమాజంలో మతపరంగా విభజనకు దారి తీస్తుందదన్నారు. ప్రజల హక్కులను హరించే ఎలాంటి మత, కుల, సామాజికపరమైన వివక్షనైనా తుదికంటా వ్యతిరేకించి తీరతామని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పాక్ తదితర దేశాల నుంచి వచి్చన ముస్లిమేతర శరణార్థులు మాత్రం దీన్ని స్వాగతించారు. ముస్లింల పట్ల సీఏఏ పూర్తిగా వివక్షపూరితమంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఏఏ అమలు నిర్ణయం వెలువడ్డ నిమిషాల్లోనే సంబంధిత ఇ–గెజిట్ వెబ్సైట్ క్రాషైంది. దాన్ని కాసేపటికి పునరుద్ధరించారు. సీఏఏలో ఏముంది...! ► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. ► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కలి్పస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు. ► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది. ► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పిందని సీఎం పినరయి గుర్తుచేశారు. ఆదే మాటపై తమ ప్రభుత్వం కట్డుబడి ఉంటుందని తెలిపారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. చదవండి: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
‘అధికారంలోకి వస్తే ఆ పౌరసత్వ చట్టం రద్దు’
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ, "1971 కటాఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది. కానీ సీఏఏ దాన్ని తొలగిస్తుంది. 2014 కొత్త కట్-ఆఫ్ తేదీ అవుతుంది. ఇది అస్సాం ఆందోళనలో అమరవీరుల త్యాగాలను అగౌరవపరుస్తుంది " అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్చి 25, 1971 నాటి కటాఫ్ తేదీని ఆయన ప్రస్తావించారు. పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ కనీసం ఐదేళ్లు నివాసం ఉన్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వాన్ని అందిస్తుంది. ఇటీవల అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ పొరుగున ఉన్న మణిపూర్‌ను సందర్శించలేదని పవన్ ఖేరా విమర్శించారు. "మణిపూర్‌ను సందర్శించడానికి ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు? దయచేసి మణిపూర్‌ను సందర్శించండి, అది కూడా మన దేశంలో భాగమే. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం అరగంటైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరుతున్నాం" అన్నారాయన. ఇక లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ఖేరా పేర్కొన్నారు. "కాంగ్రెస్ సర్వే ప్రకారం మేము ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తున్నాం. అస్సాం రికార్డులను బద్దలు కొడుతుంది. మా విజయం ఖాయం. అందుకే హిమంత బిస్వా శర్మ ప్రధానమంత్రిని క్రమం తప్పకుండా రాష్ట్రాన్ని సందర్శించాలని పిలుస్తున్నారు" అని ఖేరా పేర్కొన్నారు. -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు’
కోల్‌కతా: వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. 'రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారతదేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను హామీ ఇవ్వగలను' అని బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలోని కక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు. సీఏఏపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను శంతను ఠాకూర్ గుర్తుచేశారు. సీఏఏను అమలు చేయకుండా దేశంలో ఎవరూ ఆపలేరని అమిత్ షా గత డిసెంబర్లో అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు అంశాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెంగాల్ నుండి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. 2026లో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. పార్లమెంటు ఉభయ సభల్లో సీఏఏ బిల్లు 2019లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టంపై భారతదేశం అంతటా భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శులు చేశాయి. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
‘సీఏఏ అమలు ఖాయం’
కోల్‌కతా: దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టం–సీఏఏ అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. బుధవారం ఆయన కోల్‌కతాలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ ర్యాలీలో మాట్లాడారు. సీఏఏను పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. బెంగాల్లోకి విదేశీయుల చొరబాట్లకు మమత దన్నుగా ఉండటమే అందుకు కారణమని షా ఆరోపించారు. రాష్ట్రాన్ని తృణమూల్ సర్కారు సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం నిండా అవినీతిలో మునిగిపోయింది. మమత హయాంలో రాష్ట్రంలో రాజకీయ హింస, ముస్లిం సంతుïÙ్టకరణ చర్యలు పరాకాష్టకు చేరాయి’’ అని ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమత సర్కారును సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టి మమత సర్కారు పతనానికి రంగం సిద్ధం చేయండి. మోదీ కూడా బెంగాల్ ప్రజల వల్లే నేను మూడోసారి ప్రధాని అయ్యాను అని చెప్పుకునే స్థాయిలో రాష్ట్రంలో బీజేపీని ఘనంగా గెలిపించండి’’ అని కోరారు. -
మమతా దీదీకి బీజేపీ సవాల్!...దమ్ముంటే ఈ చట్టాన్ని ఆపండి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలవుతోందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన బంగ్లాదేశ్ మూలాలు ఉన్న మతువా ఆధిపత్య ప్రాంతమైన నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఠాకూర్ నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ....విస్వసనీయ పత్రాలతో కూడిన నివాసి అయితే వారికి పౌరసత్వం తీసివేయబడుతుందని సీఏఏ సూచించలేదు. తాము అనేకసార్లు సీఏఏ గురించి చర్చించాం. కచ్చితంగా రాష్ట్రంలో అములు చేయబడుతుంది. దీంతో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం మంజూరు అయ్యేలా సీఏఏ సులభతరం చేస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ....దీదీజీ మీకు దమ్ముంటే దీన్ని ఆపండి అంటూ సవాలు విసిరారు. ఐతే ఆ చట్టం కింద ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించనందున ఇప్పటివరకు ఎవరికీ ఆ చట్టం ద్వారా పౌరసత్వం మంజూరు కాలేదు. కానీ నందిగ్రామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మతువా కమ్యూనిటీ సభ్యులకు కూడా పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్పారు. రాజకీయంగా ప్రాముఖ్యమున్న ఈ కమ్యూనిటీ బీజేపీ, తృణమాల్ శిభిరాలుగా చీలిపోయారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది మతువాలతో నాడియా, నార్త్, సౌత్24 పరగణాస్ జిల్లాలో కనీసం ఐదు లోక్‌సభ స్థానాల తోపాటు దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఘం ప్రభావం ఉంది. అలాగే కేంద్ర మంత్రి బొంగావ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంతను ఠాకూర్ కూడా కచ్చితంగా సీఏఏ అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం సాధించేందకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇదిలా ఉండగా, తృణమాల్ నాయకుడు పశ్చిమబెంగాల్ సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ...2023 పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సీఏఏ కార్డుతో ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఇలా నాటకమాడుతోందని విమర్శించారు. ఐనా అలా ఎప్పటికీ జరగనివ్వం అని హకీమ్ దృఢంగా అన్నారు. (చదవండి: గుజరాత్ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?) -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ -
CAA అమలు చేయం. అంతే!: కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంచలన నిర్ణయాన్ని మరోమారు ప్రస్తావించారు. ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం కేరళలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోదని ప్రకటించారు. కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే విషయంపై ఒక స్పష్టతతోనే ఉంది. ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయం. ఈ నిర్ణయం కొనసాగుతుంది అంతే. అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద సిద్ధాంతాన్ని అంతా పాటించాల్సిందే. కానీ, దేశమంతటా లౌకికవాదాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. ఒక వర్గం దీనిని బాగా ప్రచారం చేస్తోంది. మతపరమైన పౌరసత్వం కోసం ఉవ్విళ్లూరుతున్నారు వాళ్లు. కానీ, అలాంటి వాటికి కేరళ వ్యతిరేకమని గుర్తించాలి. దేశంలో జరిగిన కొన్ని సర్వేలు మతపరమైన విద్వేషాలకు దారి తీశాయని, కానీ, ఇక్కడ మాత్రం మొత్తం సమాజాన్ని ఒక కుటుంబంగా చూస్తుంది మా ప్రభుత్వం. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా.. గురువారం ఓ ఫంక్షన్‌కు హాజరై సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం(సవరణ)2019.. 2019 డిసెంబర్ 11వ తేదీన పార్లమెంట్లో పాస్ అయ్యింది. డిసెంబర్ 12న నోటిఫై చేసి.. జనవరి 10 2020 నుంచి అమలు చేయాలని అనుకుంది కేంద్రం. కానీ, ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఇదిలా ఉంటే.. పౌరసత్వ సవరణ చట్టాన్ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే అమలు చేస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కిందటి నెలలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ సభలో ప్రకటించారు. -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్ చేయండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్ రివకరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్ అరీఫ్ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. -
వారిని విడుదల చేయండి!
న్యూయార్క్: సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన 18మంది విద్యార్ధులను బేషరతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయ ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్‌డే సందర్భంగా బుధవారం వీరంతా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ 18 విద్యార్ధులను అక్రమంగా నిర్భంధించారని, వీరిపై అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రకటనలో కోరారు. ఈ 18మందిలో షర్జీల్ ఇమామ్ సహా 13మంది ముస్లింలున్నారు. ప్రకటనకర్తల్లో ఆస్ట్రేలియాలో ఎంపీగా ఎన్నికైన డేవిడ్ షోబ్రిడ్జి, ఆమ్నెస్టీకి చెందిన గోవింద్ ఆచార్య సహా పలు దేశాలకు చెందిన హక్కుల గ్రూపులు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, భారతీయ ముస్లింల అంతర్జాతీయ సమాఖ్య, దలిత్ సొలిడిటరీ ఫోరమ్ తదితరాలున్నాయి. -
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రసంగం: కఫీల్ ఖాన్‌కు ఊరట
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో పౌరసత్వ సవరణ చట్టం అంశంపై 2019 లో డాక్టర్ కఫీల్ ఖాన్ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగానికి సంబంధించిన కేసులో అలహబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక కారణాలతో అతడిపై నమోదైన క్రిమినల్ కేసులను పక్కన పెట్టింది. అలీగఢ్ మేజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తప్పనిసరి ముందస్తు అనుమతిని పోలీసులు తీసుకోలేదని డాక్టర్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ గౌతమ్ చౌదరి అంగీకరించారు. ఈ కేసులో ఇప్పుడు సరైన విధానాన్ని అనుసరించమని కోరుతూ న్యాయమూర్తి కేసును తిరిగి స్థానిక కోర్టుకు పంపారు. ఈ సందర్భంగా3 డాక్టర్ కఫీల్ ఖాన్ మాట్లడుతూ.. ‘‘ఇది భారతదేశ ప్రజలు సాధించిన భారీ విజయం. ఈ తీర్పు న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ ప్రజలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉన్నతాధికారం పూర్తిగా బహిర్గతమైంది. ఈ ధైర్యమైన తీర్పు భారతదేశం అంతటా జైళ్లలో మగ్గుతున్న ప్రజాస్వామ్య అనుకూల పౌరులు, కార్యకర్తలందరికీ నమ్మకాన్ని, ఆశను ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. భారత ప్రజాస్వామ్యం దీర్ఘకాలం వర్థిల్లాలి’’ అంటూ నినాదాల చేశారు. (చదవండి: పౌర స్వేచ్ఛకు పట్టం) డాక్టర్ కఫీల్ ఖాన్ తన డిసెంబర్ 13, 2019 పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తన ప్రసంగం ద్వారా ఏఎంయూ యొక్క శాంతియుత వాతావరణాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాక అతను మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించాడని కఫీల్ ఖాన్‌పై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో కఫీల్‌ని జనవరి 29, 2020 న అరెస్టు చేశారు. తర్వాత, ఈ కేసులో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చింది. (చదవండి: వివాహేతర సంబంధం: డీఎన్ఏ పరీక్ష ఉత్తమం) పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడం.. భారతదేశ భద్రతకు.. విదేశీ దేశాలతో దాని సంబంధాలకు భంగం కలిగించారని అనుమానించినట్లయితే, ఒక సంవత్సరం వరకు కోర్టులో ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రజలను నిర్బంధించడానికి ఈ కఠినమైన చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. గత సెప్టెంబర్‌లో, అలహాబాద్ హైకోర్టు డాక్టర్ ఖాన్‌ను సుదీర్ఘంగా నిర్బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అతడిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, భారతీయ శిక్షాస్మృతి కింద క్రిమినల్ చర్యలు కొనసాగుతున్నాయి. -
అఫ్గాన్ నుంచి భారత్‌లోకి ఎంట్రీ.. తెరపైకి పౌరసత్వ సవరణ చట్టం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ సంక్షోభంతో వివాదాస్పద సీఏఏ బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఎంత అవసరమో అఫ్గాన్‌లో తలెత్తిన పరిస్థితులు తెలియస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యానించారు. అల్లకల్లోల అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. చదవండి: Elon Musk Tweet On Taliban: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్, వైరల్ కాగా, అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరింది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గాన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విమానం లోపల 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. కాగా 2019 డిసెంబర్లో భారత్‌లో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే భారత పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టమని సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ దేశంలో తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. Recent developments in our volatile neighbourhood & the way Sikhs & Hindus are going through a harrowing time are precisely why it was necessary to enact the Citizenship Amendment Act.#CAA#Sikhs https://t.co/5Lyrst3nqc via @IndianExpress — Hardeep Singh Puri (@HardeepSPuri) August 22, 2021 Jubilant evacuees on their journey home ! pic.twitter.com/3sfvSaEVK7 — Arindam Bagchi (@MEAIndia) August 21, 2021 చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం -
ఆరుగురు పాక్ వలసదారులకు భారత పౌరసత్వం
భోపాల్: పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కి వచ్చిన ఆరుగురు పాక్ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని అందించింది. వీరు మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల కాలంగా జీవిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద భారత్ పౌరసత్వం కల్పించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్ర మాట్లాడుతూ.. ఈ ఆరుగురు వలస బాధితులు మతపరమైన హింసకు గురై భారత్‌లో బతకడానికి వచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం వారి భారత పౌరసత్వ పత్రాలను అధికారికంగా అందించినట్లు మంత్రి నరోత్తం మిశ్ర తెలిపారు. పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్ భోపాల్ నివాసితులు కాగా, అర్జున్‌దాస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్య బాయి మాండ్‌సౌర్‌కు చెందినవారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడనని గర్వంగా ఉన్నట్లు అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్షీ, క్రైస్తవ వలసదారులకు భారత్ పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014 సంవత్సరం కంటే ముందే భారత్‌కు వచ్చివారికి మాత్రమే దేశ పౌరసత్వం కల్పించనుంది. -
జైల్లో నుంచి ఎమ్మెల్యేగా.. ప్రమాణం చేసిన అఖిల్ గొగోయ్
గువాహటి: సీఏఏ చట్టం వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా నేడు 125 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు అఖిల్ గొగోయ్ కూడా నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ఫలితంగా అసోం అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే జైలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మెదటి వ్యక్తిగా అఖిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జైల్లో నుంచి శివ్‌సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసిన సంగతి తెలిసిందే. తన సమీప బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇతర అభియోగాల కింద 2019 డిసెంబర్ లో గొగోయ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అస్సాం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మే 11 న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు అఖిల్ గొగోయ్‌కి అనుమతి ఇచ్చింది. (చదవండి:Mamata Banerjee: సీఎం కోసం పదవి త్యాగం చేసిన ఎమ్మెల్యే) -
Akhil Gogoi: జైలు నుంచి అసెంబ్లీకి..
శివసాగర్(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్ గొగోయ్(46) జైల్లో ఉంటూ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తొలినేతగా గుర్తింపు పొందారు. ఆయన శివసాగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి సురభీ రాజ్‌కొన్వారీపై 11,875 ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. దేశద్రోహం ఆరోపణలతో 2019 డిసెంబర్లో అఖిల్ గొగోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నారు. రాయ్జోర్ దళ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 57,219 ఓట్లు సాధించారు. పోలైన మొత్తంలో ఓట్లలో 46.06 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తొలుత అఖిల్‌కి మద్దతు ప్రకటించింది. పార్టీ టికెట్‌ను మాత్రం శుభ్రమిత్ర గొగోయ్‌కు కేటాయించింది. శుభ్రమిత్ర మూడో స్థానంలో నిలిచారు. జైలు నుంచి బహిరంగ లేఖలు అఖిల్ జైల్లో ఉంటూనే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. తరచుగా అస్సాం ప్రజలకు బహిరంగ లేఖలు రాశారు. ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. ఆయన తల్లి ప్రియద 85 ఏళ్ల వృద్ధురాలు. కుమారుడి గెలుపు కోసం శివసాగర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేధా పాట్కర్, సందీప్ పాండే అఖిల్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. వందలాది మంది రాయ్జోర్ దళ్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. అఖిల్ గొగోయ్‌ను గెలిపించాలని కోరారు. ఆయన చేతిలో డబ్బులేవీ లేవు. రూ.60,497 బ్యాంకు డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. అఖిల్ గొగోయ్ గౌహతిలోని కాటన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1995–96లో కాటన్ కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. -
తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి
డిస్పూర్: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్‌కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొగోయ్ గువహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్సిటల్లో చికిత్స పొందుతున్నారు. అఖిల్ గొగోయ్ గత ఏడాది అక్టోబర్‌లో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్‌ను స్థాపించారు. అస్సాంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు రైజోర్ దళ్ కొత్తగా ఏర్పడిన మరో పార్టీ అస్సాం జాతియా పరిషత్ (ఏజేపీ) తో కలిసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్‌కు టిక్కెట్ ఇచ్చింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. కుమారుడి తరఫున రంగంలోకి దిగిన తల్లి... ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియదా గొగోయ్.. శిబ్‌సాగర్‌లోని గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. కుమారుడి కోసం ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్‌సాగర్‌కు తరలివచ్చి ప్రియదా గొగోయ్‌తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కొన్వర్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ సందర్భంగా అఖిల్ గొగోయ్ భార్య మాట్లాడుతూ.. ‘‘అసోం శిబ్‌సాగర్ జనాలు అఖిల్ మీద పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలే తనని గెలిపించాయి. ఈ విజయం మా అందరి బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా శిబ్‌సాగర్ జనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయత వల్లనే అఖిల్ గొగోయ్ విజయం సాధించారు. అసోం చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఇంతవరకు జైలుకెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించిన ఘటనలు ఎక్కడా లేవు’’ అన్నారు. ఏవరీ అఖిల్ గొగోయ్... గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు తనను అరెస్ట్ చేశారు. చదవండి: అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష -
సోనార్ బంగ్లా నిర్మిస్తాం: అమిత్‌షా
కోల్‌కతా: తాము అధికారంలోకి వస్తే సోనార్ బంగ్లా(బంగారుబెంగాల్) నిర్మిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని, పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మేనిఫెస్టో ‘సోనాల్ బంగ్లా సంకల్ప పత్ర’ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కతాలో విడుదల చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సామాజిక భద్రత పథకాలను బలోపేతం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సీఏఏ అమలుపై కొత్త ప్రభుత్వంలో తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి వాటిని బెంగాల్లో అమల్లోకి తీసుకొస్తామని అమిత్ షా ఉద్ఘాటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింది రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులకు రూ.18 వేల చొప్పున ఏరియర్స్ ఇస్తామన్నారు. రైతుల ఆర్థిక భద్రత కోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సన్నకారు రైతులకు, మత్స్యకారులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. నోబెల్ బహుమతి తరహాలో కళలు, సాహిత్యంలో లబ్ధప్రతిష్టులకు టాగూర్ బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లతో సోనార్ బంగ్లా నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు కేజీ నుంచి పీజీ దాకా విద్యనందిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అలాగే విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లతో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. సోనార్ బంగ్లా నిర్మించడానికి తమకు ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. -
‘ఐదు హామీలు పక్కా .. ఇది ప్రజా మేనిఫెస్టో’
గుహవాటి: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లకు ప్రధాన పార్టీలు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా అసోంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఐదు హామీలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో లేని మహిళలకు రూ.2 వేల ఆర్థిక సహాయం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తేయాకు కార్మికులకు కనీస కూలీ రూ.365 కల్పిస్తామని మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రధాన హామీలు ప్రకటించింది. అసోంవాసుల కలలు.. ఆశలు మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ తెలిపారు. అసోం భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని స్పష్టం చేశారు. ‘ఇది మా నిబద్ధత.. మీరు బీజేపీ, ఆరెస్సెస్ దాడుల నుంచి అప్రమత్తంగా ఉండండి’ అసోం ప్రజలకు పిలుపునిచ్చారు. చదవండి: ఏపీ పథకంపై కేంద్రానికి ఢిల్లీ సీఎం విజ్ఞప్తి -
అస్సాం ఎటువైపు?
ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం వుందని అత్యధికులు పరిగణించే రాష్ట్రం అస్సాం. 126 స్థానాలుండే రాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 27, ఏప్రిల్ 1, 6 తేదీల్లో మూడు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు అన్ని సర్వేలూ అస్సాం మళ్లీ బీజేపీదేనని జోస్యం చెప్పాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో కొచ్చినప్పటినుంచీ ఆదివాసీలతోసహా అన్ని వర్గాల్లోనూ చొచ్చుకుపోతూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీజేపీ తన పునాదిని పటిష్ట పరుచుకుంది. అయితే ఆ పార్టీకి నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలతోపాటు మరో రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఇంతవరకూ బీజేపీ కూటమిలో భాగస్వామిగా వున్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్), ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి వలసపోయింది. అలాగే జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లపై 2019లో సాగిన ఉద్యమాలు కూడా బీజేపీ గెలుపు అవకాశాలను ప్రభావితం చేయొచ్చన్నది విశ్లేషకుల అంచనా. రెండు సంవత్సరాలక్రితం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల య్యాక రాష్ట్రంలో అలజడి రేగింది. దాదాపు 20 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిర్ధారించటం అందుకు కారణం. వీరంతా ఈ దేశస్తులమేనని నిరూపించుకోవటానికి అవసరమైన పత్రాలు లేని నిరక్షరాస్యులు, నిరుపేద వర్గాలవారు. చివరకు దీన్ని రద్దు చేసి, దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోయే ఎన్ఆర్సీలో అస్సాంను కూడా చేర్చమని ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరాల్సివచ్చింది. అటుపై సీఏఏ పార్లమెంటులో ఆమోదం పొందాక దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు అస్సాం కూడా భగ్గుమంది. అయితే వేరే రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకించటానికీ, అస్సాంలో వ్యతిరేకించటానికీ వ్యత్యాసం వుంది. వేరేచోట్ల ఈ చట్టాన్ని ప్రధానంగా ముస్లింలు వ్యతిరేకించారు. ఆ పేరుతో తమపై ఈ దేశ పౌరులు కారన్న ముద్రేస్తారన్నది వారి ఆందోళనకు మూలం. కానీ అస్సాంలో ముస్లింలతో సహా అందరూ సీఏఏను వ్యతిరేకించారు. ఇరుగు పొరుగు దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనారిటీ మతస్తులకు ఆశ్రయమిచ్చేందుకు ఆ చట్టం అవకాశమివ్వటమే అందుకు కారణం. ఈ చట్టం మాటున బంగ్లాదేశ్‌లో వుండే హిందువులు తమ రాష్ట్రానికి వెల్లువలా వస్తారని స్థానికుల భయం. అస్సామేతరులెవరూ ఉండటానికి వీల్లేదని వారి వాదన. ఈ విషయంలో గత నాలుగు దశా బ్దాలుగా ఉద్యమాలు సాగుతూనేవున్నాయి. ఆ ఉద్యమాలే అసోం గణ పరిషత్(ఏజీపీ) ఆవిర్భావా నికి దారితీశాయి. బీపీఎఫ్ బీజేపీ కూటమికి దూరం కావటానికి కూడా ఆ పార్టీకి సీఏఏపై వున్న వ్యతిరేకతే కారణం. కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అసోం గణ పరిషత్(ఏజీపీ)లోనూ సీఏఏపై విభేదాలున్నాయి. సీఏఏకు పార్టీ అధికారికంగా మద్దతిస్తున్నా పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ఆర్సీ, సీఏఏలను బీజేపీ కూటమి ప్రస్తావించకపోవటం గమనించదగ్గ అంశం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో సీఏఏ అమలు గురించి మాట్లాడే సీనియర్ నేతలు అస్సాంకొచ్చేసరికి మౌనం పాటిస్తున్నారు. సీఏఏ వ్యతిరేకత తమ గెలుపును ప్రభావితం చేయ బోదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోవున్న హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో సీఏఏ వ్యతిరేక ఆందోళన రాష్ట్రంలో చల్లబ డింది. ఆ తర్వాత అది మళ్లీ రాజుకున్న దాఖలా లేదు. బహుశా ఇది బీజేపీకి భరోసానిస్తుండవచ్చు. తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆ పార్టీ దృష్టి నిలిపింది. ముస్లింలతో సహా అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలందాయి గనుక తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ విశ్వాసంతో వుంది. కానీ బీజేపీ అధికారంలోకొస్తుందని చెబుతున్న సర్వేలే అధిక ధరలు ఆ పార్టీకి కొంత అవరో ధమేనని అంగీకరించాయి. అలాగే సీఏఏ కూడా. వాస్తవానికి సీఏఏను పార్లమెంటు ఆమోదించి చాన్నాళ్లు కావొస్తున్నా ఇంతవరకూ దాన్ని కేంద్రం నోటిఫై చేయకపోవటానికి కారణం అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలేనని చెబుతారు. బీజేపీ వ్యూహాత్మక మౌనానికి కూడా అదే కారణం. కానీ ఆ పార్టీ చేత సీఏఏ గురించి పలికించాలని, అదే జరిగితే బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ పక్ష కూటమి అనేకవిధాల ప్రయత్నిస్తోంది. రంగంలోకి కొత్త పార్టీలు రావటం కూడా బీజేపీకి తలనొప్పే. ఈసారి అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ), రాజియోర్ దళ్, అంచాలిక్ గణ మోర్చా రంగంలోవున్నాయి. సీఏఏ విషయంలో ఏజీపీలో అంతర్గత విభేదాలుండటం బీజేపీ కూట మికి కొంత ఇబ్బంది. ఇటు ముస్లింలలో పలుకుబడివున్న ఏఐయూడీఎఫ్‌తో చెలిమి కాంగ్రెస్‌కు ఎంతవరకూ లాభించగలదో చూడాలి. ఎన్నికల సమయంలో ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు రావటం ఈమధ్యకాలంలో తగ్గింది. నాయకులు ఒకరిపై ఒకరు విసురుకునే సవాళ్లు, సంచలనాత్మక ప్రకటనలు, ఇరుగు పొరుగు దేశా లతో వుండే సంబంధాలు వగైరా ప్రాధాన్యతలోకొస్తున్నాయి. కానీ అస్సాం అందుకు భిన్నం. ఎవ రెంత కాదన్నా అక్కడ స్థానిక సమస్యలే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. తన ప్రయోజనాలకు ఏ రూపంలోనైనా విఘాతం కలుగుతుందంటే అస్సాం భగ్గుమంటుంది. అది ఒక రకంగా మేలు కలి గించే అంశమే అయినా, భిన్న జాతులు నివసించే అస్సాంలో అది ఒక్కోసారి శాంతిభద్రతల సమ స్యను సృష్టిస్తోంది. ఏదేమైనా అస్సాం ఈసారి ఎవరి పక్షంవహిస్తుందన్నది ఉత్కంఠ రేపే అంశం. -
ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం
చెన్నె: రహాస్య బంధాన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ బహిరంగపరిచారు. అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లగా ఆదిలోనే అన్నాడీఎంకే బీజేపీకి షాకిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏఏ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పళనిస్వామి సీసీఏ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే మైనార్టీలకు భద్రత కల్పిస్తుందని ప్రకటించారు. మైనార్టీలు తమను విజ్ఞప్తి చేశారని.. ఆ విజ్ఞప్తి మేరకు తాము సీఏఏ ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని కోరుతామని పళనిస్వామి తెలిపారు. ఈ విషయమై తాము హామీ ఇస్తున్నట్లు చెప్పారు. సీఏఏ విషయమై తమ పార్టీ మానిఫెస్టోలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రకటన బీజేపీకి షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చట్టం తప్పనిసరిగా అమలుచేయాలని భావిస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 22, 2019లో తీసుకువచ్చిన సీఏఏ చట్టం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చట్టానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే ఈ చట్టం ప్రస్తావన తీసుకురావడం బీజేపీకి మింగుడు పడని విషయంగా భావించవచ్చు. అయితే ఈ ప్రకటన రావడానికి కారణం మొన్న స్టాలిన్ సీఏఏ చట్టాన్ని చెత్తకాగితంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని హామీ ప్రకటించడంతో అన్నాడీఎంకే సీఏఏపై ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతన ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? చదవండి: కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన? -
కాంగ్రెస్‌కు కఠిన పరీక్ష
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వ్యతిరేకత, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు తెస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేరళను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. పశ్చిమబెంగాల్లో కొత్తగా ఏర్పడిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కాంగ్రెస్– వామపక్షాల కూటమి సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. అస్సాంలోనూ బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఏఐడీయూఎఫ్‌తో కాంగ్రెస్‌కు ఇంకా ఒప్పందం కుదరలేదు. తమిళనాడులో ప్రధాన పక్షం డీఎంకేపైనే కాంగ్రెస్ ఆధారపడి ఉంది. 50 స్థానాలు కావాలని కాంగ్రెస్ డీఎంకేను డిమాండ్ చేస్తోంది. అయితే, అందుకు డీఎంకే సిద్ధంగా లేదు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను, 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరును డీఎంకే గుర్తు చేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2016లో 41 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 8 చోట్లే గెలుపొందింది. పుదుచ్చేరిలో తాజా సంక్షోభం కారణంగా కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ గెలుపొందడం అవసరమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జమ్మూలో శనివారం సమావేశమైన అసమ్మతి నేతలు పార్టీ బలహీన పడుతోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ, తమిళనాడుల్లో మిత్రపక్షాలతో కలిసి గెలిచే అవకాశముందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అస్సాంలోనూ గెలుపునకు అవకాశాలున్నాయని, అయితే, తరుణ్ గొగోయి వంటి సీనియర్ నేత లేకపోవడం లోటుగా మారిందని భావిస్తున్నారు. బెంగాల్లో ప్రధానంగా టీఎంసీ, బీజేపీ మధ్యనే పోరు ఉంటుందని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్– లెఫ్ట్ కూటమికి ఆశలు లేవని విశ్లేషిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి కేవలం 15% ఓట్లు సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రారంభించగా, నేటి నుంచి ఆయన సోదరి ప్రియాంక ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. -
సీఏఏను రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ
గౌహతి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎప్పటికీ అమలు కానీయమని(రద్దు చేస్తామని) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసోంలోని శివసాగర్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అసోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి 'సొంత ముఖ్యమంత్రి' అవసరమని, అతను ప్రజల వాణి వినగలిగే వాడై ఉండాలే కానీ, నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునే వాడు కాకూడదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నాగపూర్, ఢిల్లీ మాటల ప్రకారమే నడుచుకుంటారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు రాష్ట్రంలోని సహజవనరులు, పీఎస్‌యూలను వ్యాపారవేత్తలకు కట్టబెట్టే పనిలో నిమగ్నమైవున్నారని, వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు మరో అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో(మార్చి, ఏప్రిల్) జరుగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. -
నిరసనలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కుపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజారవాణకు ఇబ్బందులు కలగజేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది. నెలల తరబడి రోడ్లపై ధర్నాలు, దీక్షలు చేయడం ప్రజలు హక్కులకు హరించడమేనని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షహిన్‌బాగ్ ఆందోళకారులు టెంట్లు వేసుకుని నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని వ్యతిరేక ఆందోళనకారులకు ఆదేశించింది. నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ దానిపేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేసింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది పౌరహక్కుల ఉద్యమకారులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎస్కే కౌల్, అనురుద్ బోస్, కృష్ణ మురళీలతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పును వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. నిరసన తెలిపే హక్కు అనేది ఎల్లప్పూడు, ఎక్కడైనా ఉంటుందని అనుకోవడం సరైనది కాదని స్పష్టం చేసింది. -
‘వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు’
కోల్‌కత: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఏఏ అమలుతో దేశంలోని మైనారిటీల పౌరసత్వ హోదాకు భంగం కలుగుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. 2018లో వాగ్దానం చేసిన విధంగానే మోదీ ప్రభుత్వం వలస ప్రజలకు భారత పౌరసత్వం అందజేసే సీఏఏను అమలు చేసి తీరుతుందన్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగానే సీఏఏ అమలు తాత్కాలికంగా వాయిదాపడిందని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని మటువా వర్గం వలస ప్రజలు ఎక్కువగా ఉండే ఠాకూర్నగర్లో గురువారం జరిగిన ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘సీఎం మమతా దీదీ సీఏఏను వ్యతిరేకించారు. దాన్ని అమలు చేయనీయమని అంటున్నారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుంది. సీఏఏను అమలు చేస్తుంది. మటువాలు సహా వలస వచ్చిన వారందరికీ పౌరసత్వం అందజేస్తాం’ అని చెప్పారు. దేశంలోని మైనారిటీలెవరికీ కూడా సీఏఏతో నష్టం కలగదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి వలసలను టీఎంసీ ప్రభుత్వం ఆపలేకపోతోందనీ, తాము మాత్రమే వారిని నిలువరించగలమనీ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకునే దాకా తమ పోరు ఆగదని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రాన్ని స్వర్ణ బెంగాల్(సోనార్ బంగ్లా)గా మారుస్తామన్నారు. బెంగాల్లో గెలుపుతో ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ తమ గెలుపునకు బాటలు పడతాయన్నారు. బెంగాల్లో 2కోట్ల మందికి పార్టీ లక్ష్యాలు, సందేశాలు చేర్చాలని సోషల్ మీడియా బృందానికి షా చెప్పారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి సుమారు 30 లక్షల మంది మటువా వర్గానికి చెందిన ప్రజలు వలస వచ్చారు. రాజకీయంగా ఎంతో కీలకమైన వీరి ఓట్ల కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఏడాది క్రితం డిసెంబర్ 11, 2019లో పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఢిల్లీలో ఆందోళనలు అల్లర్లకు కూడా దారితీయడంతో పలువురు అమాయకులు మరణించారు. ముస్లింలను వేరుచేసి దేశ బహిష్కారం చేయడం కోసం ఈ బిల్లును తెచ్చారంటూ ఎక్కువ రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుందన్న కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈలోగా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పౌరసత్వ గొడవలు సద్దు మణిగాయి.(భారత్ బంద్‌లో వీరేరి?) ఇప్పుడు మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. భారత్ వలస దేశంగా ఉన్నప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలు అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో స్వాతంత్రం వచ్చేనాటికి అక్కడి జనాభాలో 30 శాతం మంది వలస వచ్చిన వారు కాగా, ఇప్పుడు వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంది. అస్సాం పలు ప్రాంతాల్లోకి బెంగాలీ మాట్లాడే వారి వలసలు ఎక్కువగా వచ్చాయి. 19, 20 శతాబ్దాల్లో వారి వలసలు ఎక్కువగా కొనసాగాయి. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు అస్సాంలోకి వలసలు ఎక్కువగా కొనసాగాయి. ఈ వలసలకు వ్యతిరేకంగా 1979 నుంచి ఆరేళ్లపాటు ఆందోళనలు తీవ్రంగా కొనసాగాయి. 1985లో అస్సాం జాతీయవాదులు కేంద్రంతో ఒప్పందం చేసుకోవడంతో ఆందోళనలు ఆగిపోయాయి.ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుతో బెంగాలీలు, అస్సామీలు, ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ మధ్య మళ్లీ చిచ్చు రగిల్చాయి. ప్రధానంగా అస్సాంలో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్’ వల్ల ఆందోళనలు ఎక్కువగా జరగుతున్నాయి. దీనివల్ల దాదాపు 20 లక్షల మంది భారతీయ పౌరులు కాకుండా పోయారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి అక్రమ వలసలు పెరగుతాయని కూడా అస్సామీలు భయాందోళనలకు గురవుతున్నారు. అస్సాం, మిజోరమ్ మధ్య ఈ ఆందోళనతోపాటు ఇటీవల సరిహద్దు వివాదంతో ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే. త్రిపుర, మేఘాలయలలో కూడా ఆందోళనలు చెలరేగాయి. -
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్‌ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. -
త్వరలో సీఏఏ అమలు
కోల్‌కతా : కోవిడ్-19తో జాప్యం నెలకొన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) త్వరలో అమలవుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సామాజిక్ సమూహ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సీఏఏతో దేశ ప్రజలందరికీ మేలు చేకూరుతుందని, దీనికోసం బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై నడ్డా విమర్శలతో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ దేశ ప్రజలందరి వికాసానికి పాటుపడుతుందని చెప్పారు. వచ్చేఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా సోమవారం ఉత్తర బెంగాల్లో పలు ప్రాంతీయ, సామాజిక బృందాలతో సమావేశమయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద రైతు సంఘాలు, వ్యవసాయ మౌలిక వసతుల ఏర్పాటు కోసం రూ లక్ష కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. స్ధానిక ఉత్పత్తులను గుర్తించి వాటి మార్కెటింగ్ కోసం రోడ్మాప్ను రూపొందించాలని బీజేపీ ఎంపీలను నడ్డా కోరారు. స్ధానిక మార్కెట్లను ప్రోత్సహించి స్ధానిక వ్యాపారులకు మేలు చేసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన చెప్పారు. చదవండి : దీదీకి షాక్ : శాంతిభద్రతలపై గవర్నర్ లేఖ -
తాహీర్ హుస్సేన్‌పై ఛార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్‌శర్మతో పాటు 50మంది చావుకు కారణమైన ఢిల్లీ అల్లర్లతో హుస్సేన్‌కు సంబంధం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాలను విచారిస్తున్న సెంట్రల్ ఏజెన్సీ దీనిపై ఢిల్లీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. అమిత్‌గుప్తాతో కలిసి హుస్సేన్ అనేక ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు వివరించింది. నకిలీ కంపెనీలను సృష్టించి రూ. 1.10కోట్లకు పైగా రాయితీలు పొందటంతో పాటు చీటింగ్, డాక్యుమెంట్ల ఫోర్జరీ వంటి అనేక మోసాలకు పాల్పడినట్టు పేర్కొంది. చదవండి: (అంకిత్ శర్మ హత్య కేసు : ఆప్ నేతపై అనుమానాలు..!) -
ఢిల్లీ అల్లర్లపై 17 వేల పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 వేల పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ చార్జీ షీటును దాఖలు చేశారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్ల గురించి ఢిల్లీ పోలీసు విభాగంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మార్చి ఆరవ తేదీన తొలి ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. 59–2020 నెంబర్‌తో నమోదయిన ఈ ఎఫ్ఐఆర్లో జవహర్ లాల్ నెహ్రూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24–25 తేదీల్లో ఢిల్లీకి వచ్చినప్పుడు రోడ్లను దిగ్బంధం చేయాల్సిందిగా ప్రజలను రెచ్చ గొడుతూ ఉమర్ ఖలీద్ ప్రసంగించారు. మైనారిటీలను వేధిస్తున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరవు తీయడమే ఖలీద్ లక్ష్యం. ఆయన తన సహచరులతో కలసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళలను, పిల్లలను సమీకరించారు. వారు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా సేకరించి ఇళ్లలో దాచి పెట్టారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..! టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలు ఫిబ్రవరి 23వ తేదీన జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వెలుపల నిందితులు రోడ్డును బ్లాక్ చేశారు. ఆ ప్రాంతం ప్రజలకు ఇక్కట్లు కలిగించడం ద్వారా అల్లర్లకు వారిని సిద్ధం చేయడమే కుట్రలో భాగం. ఖలీద్ సహచరుడిగా ఎఫ్ఐఆర్లో ఈశాన్య ఢిల్లీకి చెందిన డానిష్‌ను పేర్కొన్నారు. వారిద్దరిపై అల్లర్లు, చట్ట విరుద్ధంగా సమావేశమవడం, నేరపూరిత కుట్ర అభియోగాలను ముందుగా మోపిన పోలీసులు, ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలను జోడించారు. ఈ రెండు అభియోగాల కింద నిందితులకు బెయిల్ దొరకడం అసాధ్యం. మార్చి 9వ తేదీన అరెస్టయిన నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటికీ ఆయనపై అదనపు అభియోగాలు నమోదు కానందున బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 13వ తేదీన అరెస్టయిన ఉమర్ ఖలీదుకు అదనపు అభియోగాల కారణంగా ఇప్పటికీ బెయిల్ లభించలేదు. చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు వీరితోపాటు ఇదే కేసులో అరెస్ట్ చేసిన మిగతా 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మతిలోని హత్యా, దేశద్రేహం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి 26 సెక్షన్లతోపాటు ఆయుధాల చట్టంలోని రెండు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన స్థానిక నాయకుడు, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన రిసర్చ్ స్కాలర్ సఫూర్ జార్గర్ నిందితుల్లో ఉన్నారు. నిందితుల్లో 80 శాతం మంది మైనారిటీ వర్గానికి చెందిన వారే. -
కేటాయించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు చేసుకోవాలి
-
ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చేపట్టే ఆందోళనలు, ధర్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా రాస్తారోకోలు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అదే విధంగా ఆందోళనకారులను బహిరంగ ప్రదేశాల నుంచి ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, సాధారణ పౌరుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు చేపట్టేందుకు తమ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిర్ధారించిన, తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ధర్నాలు చేసుకోవాలని నిరసనకారులకు స్పష్టం చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.(చదవండి: అరెస్ట్ చేయకపోవడం సీరియస్ విషయం!) ఈ నేపథ్యంలో షాహిన్‌బాగ్- కాళింది కుంజ్ మార్గంలో రాస్తారోకో వల్ల జనజీవనానికి ఆటంకం కలిగిందని పేర్కొంటూ న్యాయవాది అమిత్ సాహ్ని ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే వారి కారణంగా ఇతరులకు ఇబ్బంది కలగుకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ నిరసన వ్యక్తం చేసేందుకు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టవచ్చు. ఇందుకు సంబంధించిన విధానాలపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీటిని అమలు చేసేందుకు కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’’అని పేర్కొంది. -
అక్టోబరు 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌కు వచ్చే నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న ఉమర్.. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యాడు. ఈ క్రమంలో అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ పేరును చార్జిషీట్లో చేర్చిన పోలీసులు, సెప్టెంబరు 13న అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కుట్రపూరితంగా వ్యవహరించి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హింసాత్మక ఘర్షణలకు కారణమయ్యాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: చార్జిషీట్లో సల్మాన్ ఖుర్షీద్ పేరు!) ఈ క్రమంలో ఉగ్రవాద నిరోధక చట్టం, ఉపాతో పాటు రాజద్రోహం, హత్యానేరం, హత్యాయత్నం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తదితర తీవ్రమైన నేరాల కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మైనార్టీల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేసి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలను రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో విద్వేష ప్రసంగాలు పౌరులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టేలా ప్రేరేపించాడని పేర్కొన్నారు. నిరసనలు హింసాత్మక రూపం దాల్చేలా పెట్రోల్ బాంబులు, ఆసిడ్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసేందుకు కుట్ర పన్నాడని, ఇలాంటి ఎన్నో వస్తువులను సమీప ఇళ్లల్లో నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. (టైమ్ మ్యాగజీన్: ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..) ఇక ఈ కేసులో ఉమర్ ఖలీద్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న దానిష్‌కు ప్రజలను పోగు చేయడం, వాళ్లు కొట్టుకునేలా ప్రేరేపించడం వంటి బాధ్యతలు అప్పగించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులతో రోడ్లను దిగ్భంధనం చేయించి, ఫిబ్రవరి 23న జఫ్రాబాద్ మెట్రో స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రకంనపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో పలువురు ప్రముఖ కార్యకర్తలు, రాజకీయ నాయకులతో పాటు సోషల్ ఆక్టివిస్టుల పేర్లను చేరుస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం విదితమే. -
ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అల్లర్లకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఇప్పటికే పలువురి పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం నాయకురాలు బృందా కారత్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సమా ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేరును చార్జిషీట్లో చేర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ) ఇందులో భాగంగా, సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబరు 13న నమోదు చేసిన చార్జిషీట్లో.. ‘‘ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీం ఖాన్.. వంటి నాయకులు యాంటీ సీఏఏ- ఎన్సార్సీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారు’’ అని ఓ సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. హింస చెలరేగేలా కుట్రలు పన్నిన కోర్‌టీంలో సదరు సాక్షి కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సీఆర్పీసీలోని సెక్షన్ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట ఈ మేరకు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. సదరు సాక్షితో పాటు మరో నిందితుడు కూడా సల్మాన్ పేరును ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసంగంలో వ్యాఖ్యానించిన విషయాల గురించి మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈ విషయంపై స్పందించిన సల్మాన్ ఖుర్షీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు చెత్తను సేకరించాలనుకుంటే చాలా మలినాలు దొరుకుతాయి. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేటమెంట్‌ను నిరూపించేందుకు ఈ చెత్తను జతచేస్తారు. నిజానికి ఆ రెచ్చగొట్టే ప్రసంగం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెత్త సేకరించే వాళ్లు తమ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తోంది’’అంటూ విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ 2020 ఏడాదిగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసిన ‘‘అత్యంత ప్రభావశీల వ్యక్తుల’’ జాబితాను విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు షాహిన్‌బాగ్ దాదీగా ప్రాచుర్యం పొందిన బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. లీడర్స్ కేటగిరీలో ప్రధాని మోదీ, ఐకాన్స్ కేటగిరిలో బిల్కిస్ స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాణా ఆయుబ్.. ‘‘ఓ చేతిలో జపమాల, మరో చేతిలో జాతీయ జెండాతో బిల్కిస్ భారత్‌లోని అణచివేయబడిన వర్గాల తరఫున గళమెత్తింది. 82 ఏళ్ల వయస్సులో పొద్దున 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరసనల్లో పాల్గొంది’’అంటూ ఈ బామ్మ గురించి టైమ్ మ్యాగజీన్లో పేర్కొన్నారు. (చదవండి: రైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ ) కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు నిరసనలు తెలియజేస్తూ దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగమైన 82 ఏళ్ల బిల్కిస్ దాదీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ‘‘ఇక్కడ చూడండి. కేవలం ముస్లింలు మాత్రమే నిరసన చేపట్టలేదు. అన్ని మతాల వారు వచ్చి ఇందులో పాలుపంచుకుంటున్నారు. భోజనం పంచుతున్నారు. మాకోసం కొందరు అరటిపళ్లు తీసుకువచ్చారు. మరికొందరు జ్యూస్, బిస్కట్లు తెస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా కలిసే ఉన్నారు’’ అంటూ మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి అమూల్యమైన మాటలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్లో చోటు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ట్రంప్, కమలా హారిస్ కూడా ఇక పలు సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఆర్టిస్టుల కేటగిరీలో స్థానం సంపాదించుకున్నారు. కాగా టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్య పదవికి పోటీపడుతున్న కమలా హారిస్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు ఈ లిస్టులో ఉన్నారు.(చదవండి: 244 ఏళ్ల స్వాత్రంత్ర్య చరిత్ర: మహిళకు దక్కని అవకాశం!) -
ఢిల్లీ అల్లర్లు : 15,000 పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింసపై ఢిల్లీ పోలీసులు బుధవారం 15,000 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్లో 15 మంది పేర్లను పొందుపరిచారు. ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీలో 53 మంది మరణించారు. ఈ హింసాకాండపై కర్కదూమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో 15 మంది నిందితుల పేర్లను చేర్చారు. వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మరోవైపు ఢిల్లీ ఘర్షణల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్, సర్జీల్ ఇమాంల పేర్లను ప్రస్తావించలేదు. కాగా, కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన ఉమర్, సర్జీల్ల పేర్లను అనుబంధ చార్జిషీట్లో చేర్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన సీఏఏ ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : ‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’ -
‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత, ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పోలీసులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఉమర్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్థులను ఉరితీయడం ఖాయమని తాను పూర్తిగా నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ) ఫిబ్రవరి 2020 లో ఢిల్లీలో జరిగిన హింస ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర అని, హింసాత్మకు అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్, తదితరులు ప్రయత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు చూశారని ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు. ఢిల్లీ పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనోద్యమం సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతనిపై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. (ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) #JUSTIN: BJP leader Kapil Mishra’s reaction on the arrest of former JNU student leader #UmarKhalid. @IndianExpress, @ieDelhi pic.twitter.com/EYomJaER6t — Mahender Singh Manral (@mahendermanral) September 14, 2020 -
ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈశాన్య ఢిల్లీ అలర్ల కేసు విచారణను ఢిల్లీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. సీఏఏ-ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలతో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిలో భాగంగానే ప్రధాన ఆరోపనలు ఎదుర్కొంటున్న జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థిసంఘం మాజీ నాయకుడు. యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను ఆదివారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. తన కుమారుడిని అక్రమ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారని ఖలీద్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఆయన అరెస్ట్‌ను నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసకు బాధ్యులుగా భావిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. (చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) మరోవైపు ఈ అల్లర్లలో పలువురు భాగస్వామ్యూలను చేస్తూ ఢిల్లీ పోలీసులు ఇటీవల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ కూడా ఉన్నారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అయితే దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరిని కూడా ఆజాబితాలో చేర్చడంపై దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరులేదని తెలిపినట్లు సమాచారం. అయితే మిగతా వారిని కూడా విచారణ నిమిత్తం ముందుగానే నోటీసులు జారీచేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అరెస్ట్‌ల ప్రక్రియను ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కఫీల్ ఖాన్ విడుదల.. సంచలన వ్యాఖ్యలు
లక్నో: పౌరసత్వం (సవరణ) చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రసంగించినందుకు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద జైలు శిక్ష అనుభవిస్తోన్న ఉత్తరప్రదేశ్ వైద్యుడు కఫీల్ ఖాన్ మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్ హైకోర్టు ఆయన నిర్బంధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నది. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎవ్వరిని రెచ్చగొట్టే విధంగా లేదని, అతడిని వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కఫీల్ ఖాన్‌ను మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టుకు కఫీల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా విడుదల కోసం గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను రిలీజ్ చేయడానికి అధికారులు ఏమాత్రం సుముఖంగా లేరు. ప్రజల ప్రార్థనల ఫలితంగా విడుదలయ్యాను. రాజధర్మాన్ని పాటించాలని వాల్మీకి మహర్షి రామాయణంలో బోధించారు. రాజు ‘రాజధర్మం’ ప్రకారమే వ్యవహరించాలి. కానీ యూపీలో అలా లేదు. రాజ ధర్మాన్ని అనుసరించాల్సింది పోయి, చిన్న పిల్లల్లా మొండిగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ కఫీల్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అంతేకాక ‘కోర్టు తన తీర్పును వెలువరించి ఎంతో మేలు చేసింది. అలా కాకుండా నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికే వదిలేస్తే నన్ను చంపేసేవారు. సిట్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ముంబై నుంచి మథురకు తీసుకెళ్లేటప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు’ అంటూ కఫీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ నిర్బంధంపై జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన కుమారుడికి ఫిబ్రవరిలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్‌పై ఆయనను విడుదల చేయాల్సి ఉన్నా ఎన్ఎస్ఏ కింద నిర్బంధంలో ఉంచారని కఫీల్ ఖాన్ తల్లి పర్వీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ విడుదల పట్ల ఆయన కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడని, చాలా మంచి వ్యక్తి అని కఫీల్ ఖాన్ తల్లి పేర్కొన్నారు. (చదవండి: ఆ తీర్మానం.. దేశ ద్రోహమే) అసలు కేసేంటి.. 2017లో గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో డాక్టర్ కఫీల్ ఖాన్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. చిన్నారులు చనిపోయిన బీఆర్డీ మెడికల్ కాలేజీలోనే పని చేసిన కఫీల్.. యోగి సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చిన్న పిల్లల మరణాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయనపై ఈ ఏడాది తీవ్రమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయ్యింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు రావడంతో కఫీల్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 2020, ఫిబ్రవరి 13న అలీగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అరెస్టు చేశారు. అయితే, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఎన్ఎస్ఏ ఆరోపణల్ని తోసిపుచ్చింది. అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. -
సీఏఏ రూపకల్పనకు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లోని నిబంధనల రూపకల్పనకు కేంద్ర హోం శాఖ అదనంగా మరో మూడు నెలల సమయం కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సబార్డినేట్ లెజిస్లేషన్‌కు సంబంధించిన హోం శాఖ పార్లమెంటరీ కమిటీకి నివేదన పంపినట్లు వెల్లడించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురయ్యే ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకువచ్చిన విషయం విదితమే. ఉభయసభల ఆమోదం పొందిన అనంతరం గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనికి ఆమోదముద్ర వేశారు. (పౌరసత్వ సవరణ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా నిబంధనల ప్రకారం.. ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన 6 నెలల్లోగా నిబంధనల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే గరిష్టంగా 3 నెలల పొడిగింపునకు అనుమతి పొందవచ్చు. సీఏఏ నిబంధనల రూపకల్పన పూర్తికాక పోవడంతో మరో మూడు నెలల గడువు కోరుతూ పార్లమెంటరీ కమిటీకి విజ్ఞాపన పంపారు. ఈ వినతిని సంబంధిత కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఇక ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సీఏఏ రూపొందించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్
న్యూఢిల్లీ : జామియా విశ్వవిద్యాలయ విద్యార్థి, కార్యకర్త సఫూరా జర్గర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్యాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో గర్భిణి అయిన సఫూరాను ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్టిస్ రాజీవ్ షాక్ధర్ ఈ పిటిషన్ విచారణను చేపట్టారు. సఫూరా జర్గర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలపకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) అయితే ఢిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించే ఏ చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు సఫూరా జర్గర్‌ను ఆదేశించింది. ఢిల్లీ విడిచి వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాలి అనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిని కనీసం 15 రోజులకొకసారి ఒక్కసారి ఫోన్లో సంప్రదించాలని కోర్టు ఆదేశించింది. జేఎమ్ఐలో ఎంఫిల్ విద్యార్థి అయిన సంఫూరా జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు. అంతేగాక ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఏప్రిల్‌లో సఫూరాను పోలీసులు అరెస్టు చేశారు. (ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్!) -
ఆందోళన వద్దు.. మాటకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, తాడేపల్లి: సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని పేర్కొన్నారు. వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వివాదస్పద ఎన్ఆర్సీ,ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. (ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం) ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ద్వారకానాథ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకానాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య ప్రముఖులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ) -
నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గడిచిన తొలి ఏడాది పాలనలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చింది. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్యలను తుడిచిపెట్టి దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు, అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) కేంద్రంలో రెండోసారి పాలక పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా.అంటూ మోదీ పేర్కొన్నారు. (ప్రధానితో అమిత్ షా భేటీ) 2014 లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటూ ఓటు వేశారు. అంతకు ముందు అయిదేళ్ళలో పరిపాలనా యంత్రాంగం ఎలా విఫలమైందో దేశం చూసింది. ఆ తరువాత అవినీతికి దూరంగా జరిగి, పరిపాలనను గాడిలో పెట్టటం చూశారు. ’అంత్యోదయ’ స్ఫూర్తి కి పూర్తిగా కట్టుబడి లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రాగలిగాం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. పేదల గౌరవం పెరిగింది. దేశం ఆర్థికంగా అందరినీ కలుపుకోవటం జరిగింది. ఉచిత గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించటంతోబాటు ”అందరికీ ఇళ్ళు" సార్థకమయ్యేలా పురోగతి సాధించాం.సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని చాటుకుంది. అదే సమయంలో శతాబ్దాలుగా సాగుతున్న వన్ రాంక్-వన్ పెన్షన్, వన్ నేషన్ - వన్ టాక్స్ , మెరుగైన గరిష్ఠ మద్దతు ధర లాంటివి సాకారం చేసుకున్నాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ 2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే ఓటు వేయలేదు. భారత్‌ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు, సమీకృతమయ్యారు. జన శక్తి, రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ వెలిగించాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది. (ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు) నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను, రైతులను, మహిళలను, యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9 కోట్ల 50 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం. మన 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాం. మన దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణ దారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ళు పైబడ్డాక రూ. 3000 వంతున నెలసరి పెన్షన్ క్రమం తప్పకుండా అందే ఏర్పాటు చేశాం. బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా, వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవలే స్వయం సహాయక బృందాలకిచ్చే హామీ లేని రుణాలను అంతకు ముందున్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం. (మోదీ 2.0) గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు, మహిళలకు, దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్టమొదటి సారిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణప్రాంతం వారికంటే 10% ఎక్కువగా నమోదైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న అలాంటి చరిత్రాత్మక చర్యలు, నిర్ణయాల జాబితా ఈ లేఖలో ప్రస్తావించటం సాధ్యం కానంత పొడవైనది. కానీ ఈ ఏడాదిలో ప్రతి రోజూ నా ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలుకోసం రేయింబవళ్ళూ చురుగ్గా పనిచేస్తూ వచ్చింది. అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ నా సహ భారతీయులారా, మన దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన కరోనావైరస్ మనదేశాన్నీ చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు, అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా, మరోవైపు భారీ జనాభా, పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో ఉన్న మన దేశం ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ, సామర్థ్యానికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగలేవని మీరు నిరూపించారు. కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా, భారత సాయుధ దళాలను గౌరవించినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్‌ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా ఎవరూ, ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ, బాధపడలేదనీ చెప్పటం లేదు. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్న తరహా పరిశ్రమలలోని హస్త కళాకారులు, బండ్ల వ్యాపారులు ఇంకా అలాంటి సోదరులెందరో అనేకానేక కష్టాలనెదుర్కున్నారు. వాళ్ళ సమస్యల తీవ్రత తగ్గించటానికి మనం కలసికట్టుగా పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. అయితే, మనం ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనకు ప్రమాదకర దుర్ఘటనలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన నిబంధనలు, మార్గదర్శకాలు పాటించటం ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన బాధ్యత. ఇప్పటిదాకా మనం ఎంతో ఓపికపట్టాం. దాన్ని అలాగే కొనసాగించాలి. భారతదేశం మిగిలిన అనేకదేశాలకంటే భద్రంగా, మెరుగైన స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఇదొక సుదీర్ఘ పోరాటం. కానీ మనం ఇప్పటికే విజయపథంలో సాగుతున్నాం. విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి, నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాటం ప్రియ మిత్రులారా, ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం. ఆర్థిక పరంగా 130 కోట్లమంది భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటంతోబాటు దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్. ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన, కఠోరశ్రమ, మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది. ప్రియ మిత్రులారా, గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు, ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ, సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మనదేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ. నా పట్టుదలకు మూలకారణమైన బలం మీరూ, మీ మద్దతు, మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించిన ఈ కరోనా మహమ్మారితో వచ్చింది కచ్చితంగా ఒక సంక్షోభ సమయమే. కానీ మన భారతీయులకు మాత్రం మరింత పట్టుదలతో వ్యవహరించాల్సిన సమయం కూడా. 130 కోట్ల ప్రజల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఎలాంటి కష్టాలూ శాసించలేవని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. పురోగతి పథంలో ముందుగు సాగితే విజయం మన వశమవుతుంది. కృతమ్ మే దక్షిణే హస్తే, జయో మే సవ్య ఆహితః అంటారు. అంటే, ఒకచేత కార్యాచరణ, విధి నిర్వహణ ఉంటే, రెండో చేతికి విజయం ఖాయం అని. మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ’’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు. -
మోదీ 2.0
సబ్కా సాథ్ , సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న స్ఫూర్తితో తొలుత అడుగులు బలంగానే పడ్డాయి. ఆత్మ విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలతో అనుకున్నవి సాధించారు ఆరు నెలల్లోనే పట్టు సడలింది. అడుగులు తడబడ్డాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు కేంద్రానికి గట్టిగానే తాకాయి. దాని నుంచి బయటపడకుండానే కరోనా కసిగా కాటేసింది. కొన్ని విజయాలు, మరిన్ని వైఫల్యాలతో మోదీ ఏడాది పాలన సాగిందిలా.. ఆరంభం అదిరిపోయింది. కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన విజయోత్సాహంతో మొదటి ఆరు నెలలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడుకి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. 2019, మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన కుడిభుజమైన అమిత్‌షాకి హోంమంత్రి పదవి కట్టబెట్టి పక్కా ప్రణాళికతో అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మోదీ అడుగులు వేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కల తీరేలా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరే అవకాశం రావడం, 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన సంస్కరణలు, రైతు ఆదాయం, మహిళా సాధికారత చర్యలు, కార్మిక సంస్కరణలు, ముస్లిం మహిళలకి భారీ ఊరటనిచ్చే ట్రిపుల్ తలాక్ చట్టం వంటివి మోదీ క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా వివాదాస్పద బిల్లులు గట్టెక్కేలా చేసిన వ్యూహరచన మోదీకి రాజకీయంగా ఎదురులేకుండా చేసింది. ఇక గత సెప్టెంబర్‌లో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన హౌదీ మోదీ కార్యక్రమం ఆయన ఇమేజ్ను పెంచింది. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవ అతిథిగా హాజరవడమే కాకుండా మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ట్రంప్ భారత్ పర్యటనకు రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. రెండో సగంలో తడబడిన అడుగులు పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజుకున్న ఉద్యమం మోదీ మొదటి వైఫల్యంగా చెప్పుకోవాలి. ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఎన్నార్సీని తీసుకురావడానికి ముందు జరిగే ప్రక్రియగా సీఏఏని తీసుకువచ్చారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆ చట్ట ఉద్దేశాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ, ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్ విఫలమైంది. రోజు రోజుకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటివి ఈ ఏడాది కాలంలో మోదీ వైఫల్యాలే. ఇక రాజకీయంగా రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో పిల్లి మొగ్గలు వంటివి మోదీ క్రేజ్‌ని తగ్గించాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజంలో నోటి మాటతో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చింది. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్ అయ్యేలా వ్యూహరచన చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముస్లిం మహిళల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లిం సోదరుల్లో ఒక అభద్రతా భావాన్ని నింపింది. కోవిడ్ వీరుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌కీ పలు సవాళ్లు విసిరింది. భౌతిక దూరం మినహా దీనిని అడ్డుకునే దారి లేకపోవడంతో 130 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించాలన్న అత్యంత సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఆరోగ్య రంగంపై పెనుభారం పడకుండా కాపాడగలిగారు. పల్లెలకి వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో విజయవంతమయ్యారు. మోదీ మాటకి కట్టుబడి దేశం అంతా ఏకతాటిపై నిలుస్తూ తొమ్మిది వారాల లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించడం ఆయనకున్న బలాన్ని తెలియజేస్తుంది. వలస కార్మికుల తరలింపులో గందరగోళం నెలకొని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వైరస్ విస్తరణను సమర్థవంతంగానే అడ్డుకోగలిగారు. ఇప్పుడు ప్రధాన మెట్రో పాలిటిన్ నగరాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులైతే నమోదు కావడం లేదు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం మోదీ తీసుకున్న కరోనా కట్టడి చర్యల్ని దేశంలో 82 శాతం మంది ప్రశంసించారు. ఈ స్థాయిలో ప్రజాదరణ ప్రపంచ దేశాల్లో మరే నాయకుడికి దక్కలేదు. కోవిడ్‌తో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించినప్పటికీ దానికి ఆశించినంత సానుకూలత లభించలేదు. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. 2019, నవంబర్ 9న యూపీలో అయోధ్య నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన మూడు నెలల్లోనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్ మందిర నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది. ఆర్టికల్ 370 రద్దు రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కశ్మీర్లో అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి తాను అనుకున్నది విజయవంతంగా అమలు చేశారు. -
జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’
సాక్షి, హైదరాబాద్: కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటూ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ విస్తరణకు యత్నిస్తున్న వైనం బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్.. తీహార్ జైల్లో ఉంటూ సీఏఏకు వ్యతి రేకంగా స్మార్ట్‌ఫోన్ సాయంతో మద్దతు కూడ గడుతూ ఓ గ్రూపును తయారుచేస్తున్నట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జహన్ జెబ్ సామి, హీనా బషీర్‌బేగ్ దంపతులు ఇటీవల ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఐసిస్‌కు చెందిన ఖొరాసన్ మాడ్యూల్లో ఉగ్రవాదులుగా మారిన వీరిద్దరూ, బాసిత్ ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు విచారణలో తేలింది. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. దీంతో వీరిద్దరినీ ఢిల్లీకి రప్పించిన బాసిత్ అక్కడి ఓక్లాలోని జామియానగర్‌లో ఉంచాడు. సామి ప్రైవేట్ ఉద్యోగిగా, హీనా గృహిణిగా చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించా రు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జం ట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విశ్లేషణ, విచారణలో వెలుగుచూసిన వివరాల ఆధారంగా బాసిత్‌ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ సమాచారం ఇచ్చారు. జైలు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో.. విచారణలో జమ్మూకశ్మీర్ జంట తెలిపిన వివరాల ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్.. తీహార్ జైలులో ఉన్న అబ్దుల్లా బాసిత్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెం దిన యువతకు బాసిత్ సోషల్‌మీడియా ద్వారా వలవేస్తూ ఉగ్ర బాట పట్టేలా చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. దీంతో బాసిత్‌కు జైల్లో సెల్‌ఫోన్ ఎలా అందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ (26) ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్ సా నుభూతిపరుడిగా మారాడు. 2014, ఆగస్టు లో మరికొందరితో కలిసి పశ్చిమబెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసు కోవాలని భావించాడు. నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. అనంతరం హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆర్నెల్ల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. 2015, డిసెంబర్లో ఐసిస్‌లో చేరుతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని అరెస్టుచేశారు. బెయిల్‌పై బయటికొచ్చిన బాసిత్.. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టుచేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ బాసిత్ వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలువురిని ఆకర్షిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యభర్తలు ఈ విధంగానే అతని వలలో పడ్డారు. -
అది కేవలం ఎముక కాదు.. నా తండ్రి..
న్యూఢిల్లీ: ‘‘ఏడ్చీ ఏడ్చీ నా కన్నీళ్లు ఇంకిపోయాయి. నా తండ్రి గౌరవప్రదమైన అంత్యక్రియలకు కూడా నోచుకోలేదన్న విషయం నమ్మలేకపోతున్నా. నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పటికైనా మా నాన్న కాలును ఇస్తే ఖననం చేస్తాను. అది మీకు ఎముక మాత్రమే కావొచ్చు. కానీ నాకు అది ఎంతో ముఖ్యమైనది’’అంటూ గుల్షన్ అనే మహిళ కన్నీటిపర్యంతమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో సజీవ దహనం గావించబడినట్లుగా భావిస్తున్న అన్వర్ కసార్ కుమార్తె ఆమె. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 53 మంది మరణించిన విషయం విదితమే. ఆనాటి అల్లర్లలో గుర్తు తెలియని దుండగులు శివ్ విహార్‌లో నివసించే అన్వర్‌పై రెండుసార్లు కాల్పులు జరిపి.. అనంతరం అతడి ఇంటికి నిప్పంటించి.. అతడిని మంటల్లో పడేశారని గుల్షన్ తెలిపారు. (లాక్డౌన్ : షాహీన్ బాగ్ ఆందోళనకు తెర) ఈ విషయం గురించి తెలుసుకున్న తాము ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చామని.. అప్పటికి తన తండ్రి ఒక కాలు తప్ప మరే ఇతర ఆనవాళ్లు మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటికే పోలీసులు మృతదేహ విడిభాగాలు తీసుకువెళ్లగా.. ఆ కాలు తన తండ్రిదేనని.. దానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశమివ్వాలని గుల్షన్ కోరారు. అనేక పరిణామాల అనంతరం డీఎన్ఏ టెస్టు నిర్వహించిన తర్వాత ఆ కాలు అన్వర్దేనని నిర్ధారణ అయ్యింది. ఈ విషయం గురించి గుల్షన్ మాట్లాడుతూ..‘‘ అది నా తండ్రి ఆనవాళేనని నాకు తెలుసు. వైద్య పరీక్షలో కూడా అదే తేలింది. అది కేవలం ఎముక కాదు. నా తండ్రి వదిలిన ఆఖరి జ్ఞాపకం. అయితే ఎన్నిసార్లు పోలీస్ స్టేషను చుట్టూ తిరిగినా దానిని నాకు అప్పగించడం లేదు. నా తండ్రి గౌరవప్రదమైన చావుకు కూడా నోచుకోలేదు’’అని భావోద్వేగానికి లోనయ్యారు. ( పౌరసత్వ సవరణ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో శవాలను మార్చురీ నుంచి తరలించేందుకు పోలీసులు అనుమతించడం లేదని గుల్షన్ లాయర్ తెలిపారు. గుల్షన్ ఇచ్చిన డీఎన్ఏ నమూనాల ఆధారంగా అది ఆమె తండ్రి మృతదేహమే అని తేలినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తనకు ఢిల్లీ వెళ్లేందుకు లేదా అన్వర్ శరీర భాగాలను ఉత్తర ప్రదేశ్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వాలని గుల్షన్ కోరుతున్నారని పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం
-
లాక్డౌన్ : షాహీన్ బాగ్ ఆందోళనకు తెర
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా 101 రోజులుకు పైగా సాగుతున్న ఆందోళనకు తెరపడింది. కోవిడ్ -19(కరోనా వైరస్) వ్యాప్తి, ఆందోళన, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో షాహీన్ బాగ్ ఏరియాలో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు తొలగించారు. పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగిస్తున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఆగ్నేయ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్పి మీనా చెప్పారు. మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని ఆదేశించారు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని కూడా హెచ్చరించారు.మరోవైపు ఐదుగురు మహిళా నిరసనకారులు మాత్రమే నిరసనలో పాల్గొంటూ తమ ఆందోళన కొనసాగిస్తారని, షిప్టుల వారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీఏఏ ఆందోళన నిర్వాహకులు వెల్లడించారు. వృద్ధ మహిళలను లేదా జర్వంతో బాధపడుతున్నవారిని ఆందోళనలో పాల్గొనడానికి అనుమతించమని నిర్వాహకులలో ఒకరైన అబిద్ షేక్ ప్రకటించారు. అలాగే నిరసనకారులను వెంటనే తొలగించాలని కోరుతూ చేసిన పిటిషన్ విచారణను కరోనా వైరస కారణంగా సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో, మంగళవారం (మార్చి 24) షాహీన్ బాగ్ ప్రాంతం నుంచి సీఏఏ నిరసనకారులను పోలీసులు తొలగించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సెక్షన్ 144 ను విధించడంతో ఒకే స్థలంలో ఐదుగురికి పైగా గుమిగూడడం నిషేధం. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఏఏ వ్యతిరేక నిరసన 2019 డిసెంబర్ 15 న ప్రారంభమై గత 101 రోజులుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కొనసాగుతున్నఈ ఆందోళనలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిదిమంది మృత్యువాతపడ్డారు. -
తీర్మానం ఉపసంహరించుకునేలా ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్పీఆర్కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా సీఎం కేసీఆర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్ర బీజేపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామ్‌చందర్‌రావు, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీమంత్రి డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఎన్పీఆర్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గవర్నర్‌ను కలసిన అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పేలా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎన్ఆర్సీపై కేంద్రం ఇంకా నిర్ణయమే తీసుకోలేదన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా చేసిన అసెంబ్లీ తీర్మానం చెల్లదని తెలిసినా, ఎంఐఎం కోసమే దాన్ని చేశారన్నారు. పాకిస్తాన్ ముస్లిం లకు పౌరసత్వం ఇక్కడ ఇవ్వాలని కేసీఆర్ అడుగుతున్నారని పేర్కొన్నారు. -
కరోనాను లెక్కచేయకుండా నిరసనలు
చెన్నై : నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మద్రాస్ హైకోర్టు వద్దకు చేరుకున్న తౌహీద్ జమత్ సభ్యులు, మరికొంతమంది సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా బుధవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిసినా సీఏఏ వ్యతిరేక ఆందోళనలో జనం కదం తొక్కారు. కాగా, దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారీ సభలు, నిరసనలను ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి నిరసన కోసం పెద్దసంఖ్యలో జనం ఒక్కచోట చేరటం చర్చనీయాంశంగా మారింది. చదవండి : పౌరసత్వ నిరూపణకు మతం ఆధారమా? -
పౌరసత్వ నిరూపణకు మతం ఆధారమా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న మతాలన్నీ శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందక ముందు, ఈ భూగోళం ఎలా ఏర్పడిందో తెలియకముందు, సృష్టి రహస్యం తెలియకముందు పుట్టినవే. మతాన్ని కారల్‌మార్క్స్ మత్తుమందు అన్నాడు. మతాలు ఎందుకు పుట్టినా ప్రపంచవ్యాప్తంగా హింసాయుత సంఘటనలకు దారితీశాయి. మతాల కోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వచ్చి సృష్టి రహస్యాన్ని ఛేదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క మతమూ పుట్టుకు రాలేదు. మతాల స్థానంలో బాబాలు పుట్టుకొచ్చారు. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఖగోళ శాస్త్ర పరిశోధనలు, ఇతర గ్రహాలకు పోయేంత టెక్నాలజీ, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్, ఇంట ర్నెట్, ఐటీ, సెల్‌ఫోన్ లాంటి ఆవిష్కరణలు జరిగిన తర్వాత కూడా మతాలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. మానవ జాతిని ‘మనుషులు, మనీ షులు’గా ఐక్యం చేయకుండా మతాలుగా విభజిస్తున్నాయి. మానవ జాతినంతా కలిపి ఉంచే మానవత్వం అనే భావనకు దూరంగా ఉండటం వల్లనే మనుషుల్లో మత, కుల, జాతి, దేశ పరంగా విభజ నలు, విభేదాలొస్తున్నాయి. ప్రపంచంలో ఎంత వైవిధ్యం, బహుళత్వముందో మతాలననుసరించడంలోనూ అంతే బహుళత్వముంది. ఉండాలి. గ్రహాంతర సీమల్లోకి వెళ్ళి బతకగలిగే విషయాల గురించి పరిశోధనలు జరుగుతున్న సమయంలోనూ ఇంకా మతాలంటూ మానవజాతి విడిపోవడం, కుమ్ములాడుకోవడం, ఏ సంస్కృతికి నిదర్శనం? ఫలానా మతం వాళ్లే తమ దేశంలో ఉండాలని దేశాలన్నీ ప్రకటిస్తే ఆయా దేశాల్లోని మిగతా మతస్తుల పరిస్థితేంటి? ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు ప్రపంచ యుద్ధ భయం, ఇంకో వైపు తీవ్రవాదంతో ప్రపంచం ప్రమాదపుటంచులో ఉంటే మతం పేరు మీద వివక్షతో మరీ ప్రమాదంలోకి నెట్టడం సరైందేనా? ప్రపంచవ్యాప్తంగా చూసినా ఏ ఒక్కదేశంలోనైనా వలసపోయిన వారు లేకుండా ఆదేశానికి సంబంధించినవారు మాత్రమే ఉన్నారా? భారతదేశానికి వలసవచ్చిన వారిలో మొదటివారు ఆర్యులు. ఆ తర్వాత ముస్లింలు, ఆంగ్లేయులు పాలనాధికారులుగా వచ్చారు. అమెరికాలో ఉన్నవాళ్ళంతా యూరోపియన్ దేశాలు, ఇతర ఖండాల నుంచి వచ్చిన వారే కదా! భారతీయులు పాశ్చాత్య దేశాల్లోనూ, అన్ని ఖండాల్లోనూ ఉన్నారు కదా! వీళ్ళందరికీ పౌరసత్వం విషయంలో మతం, జాతి, కఠిన నిబంధనలు పెడితే అది ఎలా లభి స్తుంది? పౌరసత్వం పేరు మీద ఓ మతం వారిని, చిరునామాలు కూడా నిరూపించుకోలేని దీనులను ఏరివేయడం న్యాయమేనా? ధర్మసమ్మతమా? సవరణ చట్టంలో ఏ మతలబు లేకుంటే దేశ వ్యాప్తం గానూ, విదేశాల్లోనూ ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మతమేదైనా మానవత్వ పరి మళం విరజిమ్మినప్పుడే మానవజాతి మనుగడ భూగోళంపై సార్థకం అవుతుంది. సర్వమత సమానత్వాన్ని కోరుకునే భారతదేశంలో అనేక మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంగా మనిషితనాన్ని కోరుకునే దేశంలో ఏ వివక్షా తగదని సీఏఏ గురించి అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసింది తెలం గాణ ప్రభుత్వం. కులాతీత, మతాతీత రాజ్యాంగం అమలులో ఉన్న భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను మినహాయించి అని పేర్కొనడం చట్ట విరుద్ధమని ధైర్యంగా చెప్పిన నాయకుడు కేసీఆర్. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో అనేక కష్టాలకు గురయ్యే ఈ దేశ మూలవాసులకు, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ మత మైనారిటీలకు, చిరునామాలే లేని సంచార జాతులకు, తెలంగాణ పౌరులందరికీ అండదండగా నిలిచినందుకు తెలంగాణ సీఎం అభినందనీయులు. అలాగే జాతీయ పౌరపట్టికను రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తి లేదని ముస్లిం మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతైనా సంతోషించదగిన విషయం. ఈ అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు బహిరంగంగానే విస్పష్టంగా హామీ ఇవ్వడంద్వారా ముస్లిం మైనారిటీలకు కొండంత అండగా నిలిచారు. మతం కంటే మానవత్వం ముఖ్యమని భావిం చాయి కాబట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికల గురించి సముచిత నిర్ణయం తీసుకున్నాయి. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, రచయిత, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 91829 18567 -
‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వల్గర్ భాషలో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 5 ఏళ్లలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసారని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాకుండా.. అప్పుల తెలంగాణగా మారిందన్నారు. బైంసాలో జరిగిన హింస గుర్తులేని కేసీఆర్‌కు.. ఢిల్లీ ఘటనలు ఎలా గుర్తున్నాయని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. 10 పేజీల సీఏఏ బిల్లు చదవలేదా అని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది లేదని అన్నారు. ఎన్నార్సీపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని.. దానిని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్ అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదని అన్నారు. -
‘అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంతో(సీఏఏ) దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహం ముందు బండి సంజయ్ నేతృత్వంలో బీజీపీ మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, బీజేపీ అఖిల భారత పదాధికారి కామర్సు బాల సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఏఏ ఎవరికి వ్యతిరేకం కాదని, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోవాలని అన్నారు. (ఆ తీర్మానం.. దేశ ద్రోహమే) వేరే దేశం నుంచి ముస్లింలు వస్తే దేశంలో ఉన్న ముస్లింలు పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే వ్యతిరేక తీర్మాణం చేశారని విమర్శించారు. కేసీఆర్ అయినా, ఓవైసీ అయినా జాతీయ పౌర పట్టికలో(ఎన్పీఆర్) నమోదు చేయించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. దేశం గురించే ఆలోచించే సమయం కేసీఆర్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణలోరైతులు, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కేసీఆర్ పట్టించుకోలేదని, సీఏఏ, ఎన్పీఆర్ అమలు జరిగి తీరుతుందని అన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితం అవుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు సిరిసిల్లలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.