NDRF
-
నేడు SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు. ప్రమాద స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో మరోచోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా చేశారు. ఇక, ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.నలుగురి ఆనవాళ్లు దొరికినా..టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు చోట్ల ఏడు మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్, నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్‌గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్‌తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.సమస్యగా మారిన బురద, ఊట నీరు..టన్నెల్ లోపల 13.50 కి.మీ దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజ్మెంట్, బార్డర్రోడ్ ఆర్గనైజషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు. టన్నెల్లోపల13 కి.మీ వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్‌లో వేసి తరలించారు. -
ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎల్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరో ప్రయత్నంలో భాగంగా మంగళవారం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అయితే కార్మికుల క్షేమంపై మంగళవారం రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి వరకు వెళ్లిన తొలి బృందం ఇదే..: మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరో రెస్క్యూ బృందం సొరంగంలో ప్రవేశించింది. ర్యాట్ హోల్ మైనింగ్ టీం ప్రత్యేకంగా తమకు కావాల్సిన వస్తువులను సేకరించి, వెల్డింగ్ చేయించుకుని టన్నెల్లోకి తీసుకెళ్లింది. టన్నెల్లో బురద దాటేందుకు వీలుగా, టన్నెల్ సైడ్ గోడలకు రాడ్లు కొడుతూ ప్రత్యేక దారి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని వెంటబెట్టుకుని వెళ్లింది. గంటన్నర ప్రయాణించి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సొరంగం చివరి అంచువరకు వెళ్లిన ఆరో బృందం గాలింపులు నిర్వహించింది. సొరంగం చివరన ప్రమాద స్థలానికి చేరుకున్న తొలి రెస్క్యూ బృందం ఇదే కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు, స్నైఫర్ డాగ్స్, డ్రోన్ ఆపరేటర్లు, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణులతో సహా మొత్తం 35 మంది బృందంలో ఉండగా, సొరంగం చివరికి 11 మంది ర్యాట్ హోల్ మైనర్లతో పాటు నలుగురు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో 15–18 మీటర్ల ఎత్తులో 140 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. ‘కూలిపోయే ప్రమాదం ఉంది..’ : అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. నేడు ఏడో ప్రయత్నం.. : ఏడో ప్రయత్నంలో భాగంగా బుధవారం ఉదయం మళ్లీ ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన బృందం సొరంగంలోకి వెళ్లనుంది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన తుక్కును గ్యాస్ కట్టర్లతో కట్ చేయడంతో పాటు కంకర, బండ రాళ్లు, మట్టిని తొలగించే ఆపరేషన్‌ను ప్రారంభించనుంది. సహాయక బృందాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి జేసీబీ యంత్రాలు వినియోగించకుండా ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ల బృందాలతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఎన్నిరోజుల సమయం పడుతుందో చెప్పలేమని ర్యాట్ హోల్ మైనర్ ఫిరోజ్ ఖురేషీ ‘సాక్షి’తో అన్నారు. కన్పించిన టీబీఎం ఉపరితల భాగం: మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ఉపరితల భాగం కనిపించింది. బండ రాళ్లు, కాంక్రీట్ పడడంతో ఈ భాగం ఊర్తిగా ధ్వంసమై కనిపించగా, మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి, మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కిందనుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్‌పై పడిన మట్టి, బురదను తొలగించేందుకు మెష్ ప్రేమ్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరుచేసి డీ వాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు.ప్రస్తుతం నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల వరక నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు ఐదు మోటార్లతో డీ వాటరింగ్ చేపడుతున్నారు. బుధవారం సాయంత్రానికి మొత్తం నీటిని డీవాటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో, ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వారిని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం» రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి»డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో టన్నెల్ ఇన్లెట్ పరిశీలన» మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డితో కలిసి సహాయక చర్యల పర్యవేక్షణ సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: శ్రీశైల ఎడమ కా ల్వ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని, ఇందు కోసం అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకుంటామని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్‌లెట్‌ను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.అనంతరం ఎస్ఎల్బీసీ సొరంగం, జేపీ కార్యాలయంలో రెండుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సహా ఆయా శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, సహాయ చర్యల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. బురదను తొలగించడమే సమస్య‘ఎస్ఎల్బీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఊటతో 40 నుంచి 50 మీటర్ల మేర బురద పేరుకుంది. టన్నెల్లో 11 కి.మీ తర్వాత ప్రాంతం నీటితో నిండి ఉంది. 13.50 కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ఉంది. ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం టన్నెల్లో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశాం. దీనిని తొలగించడమే ప్రధాన సమస్య’ అని మంత్రి ఉత్తమ్ చెప్పా రు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఇ.శ్రీధర్, కలెక్టర్ బదావత్ సంతోష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.గ్రౌటింగ్ విఫలం కావడంతోనేనా..? సొరంగం కూలిన ప్రాంతంలో కొన్నిరోజుల కింద నిర్మాణ సంస్థ పీయూ గ్రౌటింగ్ చేసింది. జీఎస్ఐ నుంచి జియాలజిస్టు వచ్చి పరిశీలించి, పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్ పనులు పునః ప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పీయూ గ్రౌటింగ్ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌటింగ్ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫాల్ట్ లైన్ గుర్తించేందుకు జీఎస్ఐ అధ్యయనం సొరంగం కూలడానికి కారణమైన ఫాల్ట్ లైన్‌ను గుర్తించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సొరంగం ఉపరితలం నుంచి వారు సర్వే చేసి ఏ ప్రాంతంలో మట్టి వదులుగా, బలహీనంగా ఉందో గుర్తించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. బుధవారం మరో జీఎస్ఐ బృందం రాబోతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నిపుణుల బృందం సైతం బుధవారం సొరంగం వద్దకు రానున్నారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే నివేదిక ఇవ్వండి : ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తక్షణమే నివేదిక సమరి్పంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) దక్షిణాది విభాగం.. రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. శ్రీశైలం జలాశయంతో సొరంగం అనుసంధానం కానుండడంతో ఈ ప్రమాదంతో జలాశయంపై ఉండనున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మా వాళ్లను క్షేమంగా అప్పగించండిజార్ఖండ్ కార్మికుల కుటుంబ సభ్యుల ఆవేదనఅచ్చంపేట: బతుకుదెరువు కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చారు.. వారు క్షేమంగా బయటికి తిరిగి వస్తారు కదా.. అంటూ దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమా దంలో చిక్కుకున్న కార్మికుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొరంగంలో వాళ్లు ఎలా ఉన్నారో తలుచుకుంటేనే భయమేస్తోంది. మా పిల్లలను మాకు క్షేమంగా అప్పగిస్తే చాలు..’ అని వేడుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నలుగురు కార్మికుల కుటుంబ సభ్యులు మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చారు. స్థానిక అధికారులు వారితో మాట్లాడి భరోసా కల్పించారు. తమవారు క్షేమంగా బయటికి రావాలని సొరంగంలో చిక్కుకున్న జగ్దాక్షేస్ అన్న జల్లామ్‌క్షేస్ చెప్పాడు. ‘నా పెద్ద కొడుకైన సందీప్ సాహు ఆరేళ్ల క్రితం కంపెనీలో పనిచేసేందుకు వచ్చి ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. నా కొడుకు క్షేమంగా వస్తే మా ఊరికి తీసుకెళ్లిపోతా..’ అని సందీప్ తండ్రి జీత్‌రామ్ సాహు అన్నాడు. -
72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
-
SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్
-
హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రమాదం
-
ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై దృష్టి తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. -
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
మేఘాలయలో ఆకస్మిక వరదలు..10 మంది మృతి
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత -
అడిగింది రూ.10,320 కోట్లు.. ఇచ్చింది 416 కోట్లే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్‌కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
TG: అమిత్‌షా ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, పట్టణంలోని ఇతర భవనాలపై 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు. దీంతో తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ను అమిత్‌షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపుతున్నట్లు అమిత్‌షా తెలిపారు. షా ఆదేశాల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సూచించారు. కేంద్ర ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. -
బాపట్లలో అత్యధికంగా వర్షపాతం నమోదు
-
వాళ్లు సొరంగాన్ని జయించారు!.. ఎప్పుడేం జరిగింది?
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్నిరోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతమయ్యేది కాదని పుష్కర్‌సింగ్ ధామీ అన్నారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం సొరంగం ముఖద్వారం వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కార్మికులకు కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం నెలకొంది. హర హర మహాదేవ, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి. సొరంగం బయట ఉన్నవారంతా పరస్పరం ఆలింగనాలతో ఆనందం పంచుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం అభినందనలు తెలుపుకున్నారు. సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు తమ మొర ఆలకించాడని చెమర్చే కళ్లతో వారు చెప్పారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో కార్మికుల కోసం ఇంతకుముందే 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీన కార్మికులు సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చదవండి: ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే.. ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. బొగ్గు గనుల్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తయిన సొరంగాలను అడ్డంగా తవ్వడానికి ర్యాట్–హోల్ మైనింగ్ టెక్నాలజీ వాడుతుంటారు. కేవలం ఒక్క మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగాలు ఉంటాయి. మేఘాలయ బొగ్గు గనుల్లో ఈ సాంకేతికతను వాడడాన్ని 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ర్యాట్–హోల్ మైనింగ్‌పై నిషేధం అమలవుతోంది. కానీ, ఇతర నిర్మాణ పనుల్లో అనధికారికంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. సిల్క్యారా సొరంగంలో మట్టి శిథిలాలను తవ్వడానికి 12 మంది ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. -
సిక్కిం వరదలు.. 26కు చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు. బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు. -
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్‌పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్‌పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్‌పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్‌పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్‌యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్‌పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్‌కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
వరద బీభత్సం: ములుగు జిల్లాలో 8 మంది మృతి
సాక్షి, ములుగు జిల్లా: వరదలతో ములుగు జిల్లాలో 8 మంది మృతి చెందగా, మరో 8 మంది గల్లంతయ్యారు. జంపన్న వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గ్రామంలోని 150 మందికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మెడిసిన్ సరఫరా చేశారు. వరద ఉధృతితో కొండాయి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై బిడ్జ్రి కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వెంకటాపూర్ మండలంలో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు దాటే క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడారు. వర్షం, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అపారనష్టం మిగిల్చింది. 14 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 40 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ లో పలు కాలనీలు నీటమునగడానికి కబ్జాలు అక్రమ నిర్మాణాలే కారణమని మంత్రి అన్నారు. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉధృతంగా నీరు రావడంతో ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయొద్దని, అత్యవసరమైతే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని, జలాశయాల వద్దకు ప్రజలు రావద్దని సూచించారు. వరద నిలిచిన రహదారుల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లను అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక. -
10,696 మంది తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముంపునకు గురైన 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి 600 మందిని, మంథనిలోని గోపాల్పూర్ ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సుర క్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఆర్మీ హెలికాప్టర్‌ను మోరంచపల్లికి పంపించి అక్కడ చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. మరో 4 హెలికాప్టర్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని అన్ని పీహెచ్ సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుప త్రులను 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూరు గుంపాడుకు హెలికాప్టర్‌ను వెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ప్రయా ణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లు... వరద ప్రభావిత జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వ ం నియమించింది. ములుగుకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్‌కు ముషా రఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫా బాద్‌కు హన్మంతరావును కేటాయించింది. వరద చూసేందుకు వెళ్లి చిక్కుకుంటున్నారు వర్షాల నేపథ్యంలో ప్రజలు నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలపై ప్రయాణించ వద్దని సీఎస్ సూచించారు. చాలాచోట్ల వరద పరిస్థితులను చూసేందుకు వెళ్లినవారు అనూ హ్యంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్.. సహాయ, పునరావాస కార్యక్రమాల పర్య వేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులతో సచివాలయంలో 7997950008, 7997 959782, 040 – 23450779 అనే ఫోన్ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపో యిన 80 మంది పర్యాటకులను బుధవా రం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సురక్షి తంగా బయటకు తెచ్చామని తెలిపారు. -
ములుగు NDRF రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. భద్రా చలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎస్, డీజీపీ సమీక్ష సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో కలసి గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సరిపడా మందులు, విద్యుత్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఏవిధమైన సహాయ, సహకారాలైనా రాజధాని నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించామని.. సహాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించామని వెల్లడించారు. ‘అవసరమైతే హెలికాప్టర్ సేవలు’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి ఉగ్రరూపం దాల్చడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. ‘వారం రోజులు నిరసనలు వాయిదా’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసనలను వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను భారీ వర్షాల నేపథ్యంలో వారంపాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. -
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
ఒడిశా దుర్ఘటన.. శవాలా గుట్టలు చూశాక ఆకలేస్తుందా?
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు. విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి? -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
Turkey–Syria Earthquake: శిథిలాల కింద బాధితుల వేదన
ఆంటాక్యా/జందారిస్: ఆశలు అడుగంటుతున్నాయి. శిథిలాల కింద సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని కాపాడగలమన్న నమ్మకం తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో 19 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాల కింద లక్షలాది మంది ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సహాయ చర్యల్లో లోపాలున్నాయని తుర్కియే అధ్యక్షుడు తయిపీ ఎర్డోగన్ స్వయంగా అంగీకరించారు. ఈ స్థాయిలో ప్రళయం సంభవిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. భూకంపం వచ్చిన ప్రాంతం దేశంలో ఒక మారుమూల ఉండడంతో సహాయ బృందాలను పంపించడంలో ఆలస్యమైందని అన్నారు. మరోవైపు భూకంపానికి ఇళ్లు కోల్పోయిన వారు వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. చలి తట్టుకోలేక వారంతా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రాత్రి వేళల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లలో ఉంటున్నారు. ఆ 72 గంటలు ముగిశాయ్..! భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి మూడు రోజులే అత్యంత కీలకం. ఈ 72 గంటల్లో ఎంతమందిని కాపాడారన్నదే ముఖ్యం. ఆ తర్వాత శిథిలాలు తొలగించినా ప్రాణాలతో బయటపడేవారి సంఖ్య చాలా తక్కువ. గురువారం ఉదయానికి 72 గంటలు గడిచిపోవడంతో ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. భూకంపాల సమయంలో మొదటి మూడు రోజుల్లో సర్వ సాధారణంగా 90శాతం మందిని బాధితుల్ని రక్షిస్తారు. మూడు రోజులు దాటితే శిథిలాల కింద ఉన్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించాలి. అవి అందక మిగిలిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారుతుంది. ఆరేళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశం నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్‌కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు. హైపోథెర్మియా ముప్పు తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్‌లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు. దేశమే జరిగింది...! తుర్కియే (టర్కీ)లో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే తుర్కియేలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. కాపాడడమూ కష్టమే..! భూకంపం శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి వారిని కాపాడడం అంత తేలిౖMðన విషయం కాదు. సహాయ సిబ్బందితో పాటు బాధితులు కూడా సహకరించాలి. అందుకు ఈ ఫొటో నిదర్శనం. తుర్కియేలోని తీవ్ర విధ్వంసం జరిగిన హతేలో ఇంటి పైకప్పు మొత్తం మీద పడిపోవడంతో కాళ్లు కదల్చలేని స్థితిలో అబ్దుల్అలీమ్ అనే వ్యక్తి ఉన్నాడు. అంత పెద్ద శ్లాబుని తొలగించి అతనిని బయటకు తీసుకురావడం సహాయ సిబ్బందికి కష్టమైంది. అబ్దుల్‌ను కాపాడినా అతని భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదం. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని తుర్కియే ప్రభుత్వం అంచనా వేస్తోంది. సిరియాలో సహాయానికి అంతర్యుద్ధమే అడ్డు భూకంపం సంభవించిన ప్రాంతాలు ఎవరి అధీనంలో? అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో సంభవించిన భూకంపంలో సహాయ కార్యక్రమాలు సరిగా కనిపించడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. -
Joshimath: కుంగుతున్నా వదలట్లేదు
డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు. -
ఉదారంగా సాయం అందించండి.. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారుల వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్‌తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రభుత్వ స్పందన భేష్ రవినేష్‌కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు. కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ నయిమ్ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది. పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం. కేంద్ర బృందంలో రవినేష్ కుమార్‌తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు. -
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
'ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం'
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణకు చేయాల్సిన వరద సాయంపై కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తే.. రాష్ట్రానికి రాజ్యాంగ హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ లెక్కలు చెప్తూ కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నిధులు రాజ్యాంగ హక్కు తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఒకటని, ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. లోక్‌సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఒకసారి చదువుకోవాలన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిత్యానంద్రాయ్ ప్రకటించిన మాట అబద్ధమా? కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వరదలప్పుడు ఒక్క పైసా ఇవ్వలే.. గతంలో భారీ వర్షాలతో హైదరాబాద్ మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కోరితే.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలతో ప్రాథమికంగా రూ.1,400 కోట్ల నష్టం వచ్చిందని, తెలంగాణకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే.. కేవలం పరిశీలన బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2021లో బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు తౌక్టే తుఫాన్ వల్ల గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు.. ప్రధాని ఆగమేఘాల మీద సర్వే జరిపించి రూ.1,000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధికార బృందాలను పంపడం.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు మూటలు పంపడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని, లేకుంటే నయా పైసా సాయం తీసుకురాలేని చేతకాని మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
Amarnath Floods: ఆకస్మిక వరదలు.. అమర్నాథ్లో అసలేం జరుగుతోంది?
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఇప్పటిదాకా కనీసం 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. చదవండి👉🏻గుజరాత్లో వరుణ విలయం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరదల వల్ల ఆహార కేంద్రాలు, టెంట్లు దెబ్బతిన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమర్నాథ్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ప్రకటించారు. పదో బ్యాచ్ కింద శుక్రవారం ఉదయం 6,100 మందికి పైగా యాత్రికులు రెండు బేస్ క్యాంపుల నుంచి ఆమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. చదవండి👉🏻Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ -
ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... జలదిగ్బంధంలో నగరం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు. మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది. ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. #WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE — ANI (@ANI) July 5, 2022 (చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్) -
భూకంప బాధితుల రక్షణకు రెస్క్యూ ఆపరేషన్
గన్నవరం రూరల్/సాక్షి, అమరావతి: ‘అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. భూకంపంతో భవనం కుప్పకూలింది.. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్)కు సమాచారం అందించడంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది’.. ఏంటి ఇదంతా వాస్తవం అనుకుంటున్నారా? కాదు.. కేవలం మాక్ డ్రిల్ మాత్రమే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్‌ను మంగళవారం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ సందర్శించారు. అనంతరం భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్పందించే విధానం, హైరిస్క్ భవనాల్లో చిక్కుకున్న బాధితులను రెస్క్యూ రోప్ టీమ్ రక్షించే విధానాలపై ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన వీక్షించారు. మాక్ డ్రిల్ ఇలా: మాక్ డ్రిల్‌లో భాగంగా.. భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన రెస్క్యూ టీమ్ భవనం స్ట్రక్చరల్ ఇంజనీర్ సాయంతో గ్యాస్, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం డాగ్ స్క్వాడ్ శిథిలాల కింద ఉన్న బాధితులను గుర్తించగా యంత్రాలతో గోడలు బద్దలుకొట్టి వారిని రక్షించింది. అనంతరం బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రోప్ టీమ్ రంగంలోకి దిగింది. పై అంతస్తుల్లో ఉన్నవారి నడుముకు బెల్టులు అమర్చి రోప్ సహాయంతో వారిని సురక్షితంగా కిందకు చేర్చింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, డిప్యూటీ కమాండెంట్లు జఫరిల్ ఇస్లాం, దిల్భాగ్ సింగ్, సుఖేందు దత్త, అఖిలేష్ చౌబే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరం సహాయ చర్యలు చేపట్టేందుకు దేశంలో 26 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు 12 ఉండగా వాటిని 16కు పెంచాం. విపత్తుల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను బెటాలియన్లలో అందిస్తున్నాం. భవిష్యత్ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం. – అతుల్ కర్వాల్, డీజీ, ఎన్డీఆర్ఎఫ్ -
ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ఖాతా హ్యాక్..!
న్యూఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన ట్విట్టర్ ఖాతా శనివారం(జనవరి 22) రోజున కొద్దిసేపు హ్యాక్ అయినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. "ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ హ్యాండిల్ జనవరి 22న హ్యాకర్స్ హ్యాక్ చేశారు. సాంకేతిక నిపుణులు ఈ సమస్యను పరిశీలిస్తున్నారని" అని డిజీ కర్వాల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. '@NDRFHQ ట్విటర్ హ్యాండిల్ ద్వారా హ్యాకర్స్ కొన్ని యాదృచ్ఛిక సందేశాలను పోస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను కొద్ది సేపు హ్యాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్లో బిట్కాయిన్లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు. (చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!) -
ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి
Rayala Cheruvu Present Situation: నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కట్ట పటిష్టతకు కృషి చేస్తోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు చెరువును ఆదివారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాయలచెరువులో 0.9 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు హెలికాప్టర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. చదవండి: (తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం) చెరువులో పరిస్థితిని గమనిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అలాగే రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొండలు, గుట్టల్లో తలదాచుకుని ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలచెరువు వద్దకు చేరుకున్న ఆయన కట్టను పటిష్టం చేసే చర్యలను పర్యవేక్షించారు. అధి కారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రంతా చెరువు వద్దనే గడిపారు. -
వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది
సాక్షి,రేగిడి(శ్రీకాకుళం): ఆశల దీపం ఆరిపోయింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కుమారుడి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి కందిశ గ్రామానికి చెందిన కెల్ల శ్రీనివాసరావు (30) విజయనగరం ఐదో బెటాలియన్‌లో ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఏడేళ్లుగా పని చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదల్లో పలువురు చిక్కుకున్నారు. దీంతో విధి నిర్వహణ కోసం అక్కడకు వెళ్లిన శ్రీనివాసరావు బాధితులను కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం తెలియడంతో కందిశ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుండెలవిసేలా.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు వరహాలనాయుడు, గౌరీశ్వరిలు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరికి కుమారుడు శ్రీనివాసరావుతోపాటు కుమార్తె ధనలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావుకు వివాహమై ఏడాదిన్నర కుమారుడు మోక్షజ్ఞంనాయుడు ఉన్నాడు. భర్త మృతి విషయం తెలుసుకొని భార్య సునీతతోపాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మృతదేహం కోసం గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నారు. పలువురు సంతాపం శ్రీనివాసరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, రేగడి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ వంజరాపు భారతీ అశోక్‌కుమార్, సర్పంచ్ కెల్ల పద్మావతి, ఎంపీటీసీ సభ్యురాలు కెల్ల చిన్నమ్మడు, కెల్ల మన్మథరావు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. -
భారీ వరద.. ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గల్లంతు..
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా దామర మడుగు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యాడు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్లాడు. నీటి ఉధృతికి కానిస్టేబుల్ వేసుకున్న లైఫ్‌జాకెట్ ప్రవాహంలో ఊడిపోయింది. దీంతో కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. దీంతో సహచరుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. -
నదీ స్నానాలకు వెళ్లి నలుగురి గల్లంతు
తోట్లవల్లూరు/పద్మనాభం: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, విశాఖ జిల్లా పాండ్రంగిలో కార్తీక సోమవారం సందర్భంగా నదీస్నానం ఆచరిస్తూ ఓ బాలుడు, ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీయగా.. బాలుడు, మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో స్థానిక కృష్ణా నది పాయలో స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. వారిలో ఐటీఐ చదువుతున్న గొరిపర్తి నరేంద్ర (18), గొరిపర్తి పవన్ (18) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గొరిపర్తి శివనాగరాజు (20) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గ్రామస్తులు, మత్స్యకారులు నదీపాయలో గాలించగా.. శివనాగరాజు, పవన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. నరేంద్ర ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కనుగొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ జె.నివాస్‌తో ఫోన్లో చర్చించి తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆశల దీపం గల్లంతు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో చోటుచేసుకున్న మరో ఘటనలో రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్‌కుమార్‌రెడ్డి (9) అనే బాలుడు గోస్తనీ నది వద్ద కాజ్వే గట్టున స్నానం చేస్తూ నదిలో కొట్టుకుపోయాడు. యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లి వెంకటలక్ష్మితో కలిసి సోమవారం ఉదయం 5.15 గంటల సమయంలో నదీ స్నానానికి వెళ్లాడు. తల్లి వెంకటలక్ష్మి తోటి మహిళలతో కలిసి నదిలో కాజ్‌వేపై స్నానం చేస్తుండగా.. యశ్వంత్ మరో బాలుడితో కలిసి కాజ్వే ఒడ్డున స్నానానికి ఉపక్రమించాడు. అక్కడ నాచు పట్టి ఉండటంతో యశ్వంత్ కాలు జారి నదిలో పడిపోయాడు. జాలర్లు, గజ ఈతగాళ్లు నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు 18 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. సాయంత్రం 5.30 గంటల వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసి మళ్లీ మంగళవారం కొనసాగించనున్నారు. బాలుడు కృష్ణాపురంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. తండ్రి గౌరిరెడ్డి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 34 మంది మృత్యువాత
ఉత్తరాఖండ్ వర్షాలు అప్డేట్స్: ► రాష్ట్రంలోని భారీ వర్షాలతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరింది. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ► వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ధామి ఏరియల్ సర్వే చేపట్టారు. ► వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ 15 బృందాలను నియమించింది. ►వరద ప్రభావిత ఉత్తరాఖండ్‌లో భారత వైమానిక దళం రెస్క్యూ మిషన్‌ను నిర్వహిస్తోంది. ►నైనిటాల్ సరస్సు పొంగిపొర్లుతుంది. ఇప్పటి వరకు కనీసం 24 మంది చనిపోయారు., రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి #HADROps#Uttarakhandfloods #IAF has inducted 3 x Dhruv helicopters at Pantnagar for #floodrelief efforts. 25 people marooned at 3 locations near #Sunderkhal village were airlifted to safer areas by these helicopters.#HarKaamDeshKeNaam pic.twitter.com/i2aEm5LPqO — Indian Air Force (@IAF_MCC) October 19, 2021 డెహ్రాడూన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండగా, పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడగా…వరద ఉద్ధృతికి ఇళ్లు, బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. కాగా గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరాఖండ్ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్ Uttarakhand CM Pushkar Singh Dhami undertook an aerial survey of flood-affected areas of Ramnagar, Bazpur, Kiccha, Sitarganj, this evening; Uttarakhand DGP Ashok Kumar also present. pic.twitter.com/TaOI4A9Xhj — ANI (@ANI) October 19, 2021 అయితే ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో 34 మంది మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. మృతుల్లో నేపాల్‌కు చెందిన కూలీలు కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇక చంపావత్‌లో ఓ ఇళ్లు కూలడం వల్ల మరో ఇద్దరు మృతిచెందారు. మూడు ఆర్మీ హెలీక్యాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. So far 34 deaths, 5 missing in #uttarakhandrains. Rs 4 lakh compensation to the families of the deceased, those who lost their houses will be given Rs 1.9 lakhs. Possible help to be extended to those who lost their livestock: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/J8RhIeC3Jx — ANI (@ANI) October 19, 2021 కాగా నైనిటాల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నైనిటాల్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధిక నీటి ప్రవాహంతో చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అదే విధంగా హల్ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వంతెన మీదకు రావడాన్ని గమనించిన స్థానికులు, అధికారులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో ప్రమాదం తప్పింది. Scary situation .May God protect them #Uttarakhand #UttarakhandRain #Uttarakhandfloods pic.twitter.com/LVFzqciGh6 — Pamela Bhattacharya (@PamelaBhattac10) October 19, 2021 మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన సుష్మ, ఆమె స్నేహితులు వరదల్లో చిక్కుకుపోగా.. తమ పరిస్థితి గురించి తెలంగాణ సీఎంవో, కేంద్ర మంత్రులకు ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన మంత్రి సహాయక చర్యలకు ఆదేశించారు. దీంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అనంతరం వీరు తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. Rail Tracks washed away in #Kathgodam due to Extremely Heavy Rainfall 🌧️🌧️🌧️🌧️#Haldwani #Nainital #Uttarakhand #uttarakhandrains #UttarakhandRain pic.twitter.com/3afy635ANt — Weatherman Shubham (@shubhamtorres09) October 19, 2021 కాగా, ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. -
పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడా పంట నష్టం జరగలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. విపత్తులతో పంటలు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పింది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. నష్టాన్ని నివారించామనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నెల రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కౌలు రైతులతో పాటు నష్టపోయిన రైతుందరికీ ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం అందించాలని ఆదేశించింది. పంట బీమా లేక తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేసింది. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, ఆశాలతలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. నష్టం లేకుండా చేయడం అసాధ్యం ‘భారీ వర్షాలు పడ్డాయని, పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. అయితే వెంటనే చేపట్టిన నష్టనివారణ చర్యలతో పంటలు నష్టపోలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చేమో. అంతేగానీ అసలు నష్టమే జరగకుండా చేయడం అన్నది అసాధ్యం. వాస్తవానికి భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం, సీఎస్ వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర ప్రతినిధి బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేసింది. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వాదనలు చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్న వాదన కూడా సరికాదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రానికి కేటాయించింది. రైతు బంధు భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు సాయం అందడం లేదు. విపత్తులు సంభవించినప్పుడు సన్న, చిన్నకారు, కౌలు రైతులే తీవ్రంగా నష్టపోతారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత..’అని ధర్మాసనం పేర్కొంది. పిల్ అన్నింటికీ మాత్ర కాదు ‘ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. గత ఏడాది.. ముందు నష్టం జరిగిందని భావించి సీఎం, సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. తర్వాత పరిశీలించగా ఎక్కడా నష్టం జరగలేదని తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం అందలేదు..’అని అంతకుముందు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఉంది ఏజీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పిల్‌ను విచారణకు స్వీకరించిన దాదాపు 10 నెలల తర్వాత విచారణార్హం కాదనడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజన ఉందని తేల్చిచెప్పింది. ఎలాంటి సాయం అందించలేదు ‘5.97 లక్షల ఎకరాల్లో దాదాపు 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం, సీఎస్ కోరారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయినా రైతులకు ఎటువంటి సాయం అందించలేదు..’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. నష్టం జరిగిందని లేఖ రాశారు గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని సీఎం కేసీఆర్, సీఎస్‌లు కేంద్రానికి గత ఏడాది అక్టోబర్ 16న లేఖలు రాసినట్లు కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం ఇచ్చేందుకు రూ.7,219.5 కోట్లు అవసరమని కోరిందని తెలిపారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం ‘హైకోర్టు చారిత్రక తీర్పుతో లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలి. అలాగే ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది యాసంగికి పంటల బీమాను నోటిఫై చేయాలి..’అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
కాళ్లకు బురద అంటిందని క్వారీ గుంతలోకి.. నలుగురు గల్లంతు
-
కాళ్లకు బురద అంటిందని క్వారీ గుంతలోకి.. నలుగురు గల్లంతు
సాక్షి,ప్రత్తిపాడు: అప్పటివరకూ అంతా కలిసి తిరిగారు.. ఒకే బండిపై చక్కర్లు కొట్టారు. కలిసి తాగారు. కలిసి తిన్నారు. సరదాగా గడిపారు. చివరికి క్వారీ గుంతలో గల్లంతయ్యారు. ఆ క్షణంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించారు. ఆఖరి గడియల్లోనూ స్నేహబంధాన్ని వీడలేదు. కాళ్లకు బురదైందని.. ప్రత్తిపాడుకు చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్ (21), బిళ్లా సాయి ప్రకాష్ (23), ఇగుటూరి వీరశంకర్ రెడ్డి (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్ స్నేహితులు. ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం డైట్ కళాశాల సమీపంలోని కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయ్యింది. దీంతో కాళ్లను కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన (సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు) క్వారీ గుంతలోకి ముందుగా శంకర్ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తరువాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వంశీ, వెంకటేష్ దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితోపాటు వీరూ మునిగిపోయారు. బంధువుల ఆర్తనాదాలు నలుగురు యువకులు నీటి క్వారీ గుంతలో పడి గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది. విషయం దావానంలా వ్యాపించడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కలవారు ఘటనా స్థలానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. ఓ బిడ్డా.. నన్ను వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ గల్లంతైన వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అర్ధరాత్రీ కొనసాగిన గాలింపు చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ క్వారీలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్ఐ అశోక్, తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావుతో పాటు అధికారయంత్రాంగమంతా అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈత రాకున్నా.. నేనున్నా నేస్తం అంటూ. ఓ దశలో సాయిప్రకాష్ చేతులు పైకిలేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుడిని కాపాడేందుకు నీళ్లలోకి దిగి సాయికి చేయి అందించాడు. అతడిని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు. చివరికి ఫలితం లేకపోవడంతో సాయి చేయిని విడవక తప్పలేదని యశ్వంత్ కన్నీరుమున్నీరయ్యాడు. -
ఓ వైపు తుపాను.. మరోవైపు పురిటి నొప్పులు
బాలాసోర్ (ఒడిషా): ఆకాశానికి చిల్లులు పడేట్టుగా కురుస్తున్న వర్షం... ఊరు మొత్తాన్ని చుట్టేసిన వరద నీరు... అప్పుడే మొదలైన పురిటి నొప్పులు.. అర్థరాత్రి.. చిమ్మచీకటి.. చెట్లు కూలిపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇక తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని అంతా భయపడుతున్న తరుణంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ష్ ఫోర్స్ రంగంలోకి దిగింది. తక్షణ స్పందన ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహదలాపూర్ గ్రామంలో రాజా, సుకాంతి దంపతులు నివిస్తున్నారు. అయితే యాస్ తుపాను ఒడిషాలో తీరం దాటిన రోజు రాత్రే సుకాంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. చెట్లూ కూలిపోవడంతో కరెంటు తెగిపోయి గ్రామంలో చీకట్లు కమ్మకున్నాయి. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్లతో రాకపోకలు ఆగిపోయాయి. ఆ విపత్కర పరిస్థితుల్లోనే సుకాంతి ప్రసవించినా.. తల్లిబిడ్డలకు వైద్య సాయం అత్యవసరమైంది. మరోవైపు వరద నీరు ఇంటిని చుట్టేస్తోంది. ఈ తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాజా ఫోన్ చేశాడు. తల్లిబిడ్డ క్షేమం వాహనాలు పోయే దారి లేకపోవడంతో కాలినడకనే ఎన్డీఆర్ఎప్ బృందం బహదలాపూర్ గ్రామానికి అర్థరాత్రి 2 గంటలకు చేరుకుంది. స్ట్రెచర్ మీదనే సుకాంతిని, నవజాత శిశువుని తీసుకుని కాలినడకన దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన వివరాలను ఎన్డీఆర్ఎఫ డీసీ సత్య నారాయన్ ప్రధాన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. చదవండి: అలజడిలో జననం #CycloneYaasUPDATE 27/5/21@NDRFHQ 𝐑𝐄𝐒𝐂𝐔𝐄 𝐎𝐅 𝐌𝐎𝐓𝐇𝐄𝐑 & 𝐍𝐄𝐖𝐁𝐎𝐑𝐍 🔸Sukanti w/o Raja Jena 🔸& her newborn baby 🔸Bahabalapur,Balasore 🔸Rescued frm flooded village 🔸2 am night 🔸On foot w/stretcher 🔸Safe to hospital@PIBHomeAffairs @ANI @PIBBhubaneswar pic.twitter.com/FEbTUdjG8c — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) May 27, 2021 -
Cyclone Yass: ‘యాస్’ విధ్వంసం
బాలాసోర్/కోల్‌కతా: అత్యంత తీవ్ర తుపాను ‘యాస్’ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పళ్ల తోటలు, పంటపొలాలు నాశనమయ్యాయి. దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా ఒడిశాలో నలుగురు, బెంగాల్లో ఒకరు చనిపోయారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్ జిల్లాల్లో పలు తీర ప్రాంత గ్రామాల్లోకి సముద్ర నీరు చొచ్చుకువచ్చింది. ఆయా ప్రాంతాల్లో స్థానికుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టామని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో చెట్లు కూలి ఇద్దరు, ఇల్లు కూలి ఒక వృద్ధురాలు చనిపోయారు. తీరప్రాంతాల నుంచి 5.8 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. పశ్చిమబెంగాల్లో.. తమ రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామన్నారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సముద్ర తీరాల్లో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. కొన్నిచోట్ల కొబ్బరి చెట్ల ఎత్తులో కెరటాలు విరుచుకుపడ్డాయి. శంకరపుర్లోని తీర ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల అలల ధాటికి కొట్టుకుపోయింది. పౌర్ణమి కావడంతో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. హూగ్లీ నది పోటెత్తడంతో కోల్‌కతా పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రానున్న 24 గంటల పాటు తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం, దక్షిణ 24 పరగణ, బంకుర, ఝార్గం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. ఒడిశాలో.. యాస్ ప్రభావంతో ఒడిశాలో, ముఖ్యంగా భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. -
Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్
భువనేశ్వర్: భారత వాతావరణ విభాగం జారీ చేస్తున్న సమాచారం మేరకు యాస్ తుపానుతో బాలాసోర్ జిల్లా ప్రధానంగా ప్రభావితమవుతుంది. పొరుగు జిల్లా భద్రక్‌పై కూడా తుపాను ప్రభావం పడవచ్చు. తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తుపానుకు ముందు, తర్వాత కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) యశ్వంత్ జెఠ్వా ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన బాలాసోర్ జిల్లాను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. బాలాసోర్ జిల్లాలో 40 లోతట్టు గ్రామాల్ని గుర్తించి కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించేందుకు 1,200 శాశ్వత, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం బాలాసోర్ జిల్లాకు అత్యధికంగా 12 యూనిట్ల ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్) జవాన్లను పంపారు. వారితో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్ని మాపక దళం జవాన్లు కూడా చేరుకుంటారు. కోవిడ్-19 నిబంధనలతో వారంతా తుపాను అనంతర పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లపై బాలాసోర్ జిల్లా ఐజీ, ఎస్పీ ఇతర సీనియర్ అధికారులతో శాంతిభద్రతల అదనపు డీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో పునరుద్ధరణ తుపాను తదనంతర పునరుద్ధరణ కార్యకలాపాలు చేపట్టేందుకు రోడ్లు–భవనాల శాఖ 165, గ్రామీణ అభివృద్ధి విభాగం 313 ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాల్ని రంగంలోకి దింపాయి. వారంతా అత్యాధునిక సహాయక, పునరుద్ధరణ యంత్ర పరికరాలతో సహాయక, పునరుద్ధరణ పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 కోట్లు విలువ చేసిన యంత్రపరికరాల్ని కొనుగోలు చేసింది. వాటిలో టవ ర్ లైట్లు, సెర్చ్ లైట్లు, జనరేటర్లు, జేసీబీలు, హైడ్రా క్రేనులు, ఇన్ఫ్లేటబుల్ పడవలు, హై హ్యాండ్ హైడ్రాలిక్ చెట్టు కోత యంత్రాలు, గ్యాసు కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, సాట్ ఫోన్లు, వాకీటాకీలు ఉన్నాయి. ఈ ఆధునిక సామగ్రితో యాస్ తుపాను కార్యకలాపాలు చేపడతారని శాంతిభద్రతల అదనపు డైరెక్టరు జనరల్ యశ్వంత్ జెఠ్వా మీడియాకు తెలిపారు. -
Borewell: 16 గంటల ఆపరేషన్, బాలుడు సేఫ్
జైపూర్: దేశంలో పలు చోట్ల బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయా ఘటనల్లో కొందరు పిల్లలు ప్రాణాలు విడువగా.. మరికొందరు బతికి బయటపడ్డారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. బోరు బావుల యజమానులు కొందరు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. పిల్లాడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యమే బాలుడిని ప్రమాదంలో పడేసింది వివరాల్లోకి వెళితే.. జాలోర్ జిల్లాలోని లచ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగరమ్ దేవసీ తన వ్యవసాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ ప్రమాదవశాత్తు ఆ బావిలో జారి పడిపోయాడు. ఆ బావి సుమారు 95 అడుగులు లోతు ఉంది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ టీంకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 16 గంటల తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆక్సిజన్‌తో నిలిచిన ప్రాణం.. స్థానిక ఎస్‌హెచ్‌వో ఆచార్య మాట్లాడుతూ.. ‘బాలుడు బోరు బావిలో పడిపోయాడని సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. పిల్లాడి వద్దకు కెమెరా పంపించి అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాం. పిల్లాడికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను, ఆహార పదార్థాలు కూడా బావిలోకి పంపించాము. అలాగే బాలుడు నిద్రపోకుండా ఉండటానికి మా జట్టు సభ్యులు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. సహాయక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీయగలిగాం’అని చెప్పారు. ( చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు ) #UPDATE | Rajasthan: The four-year-old boy who fell into a nearly 95-feet-deep open borewell in a village in Jalore has been rescued. pic.twitter.com/UEak9keBEN — ANI (@ANI) May 7, 2021 -
ఉత్తరాఖండ్ విలయం: 136 మంది మరణించినట్టే..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 7వ తేదీన సంభవించిన ఘోర విపత్తులో అదృశ్యమైన 136 మంది ఆచూకీ కనుగొనడానికి కష్టసాధ్యమైంది. వారి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో.. ఘటన జరిగి రెండు వారాలు దాటడంతో ఇక అదృశ్యమైన వారంతా మృతి చెందినట్టేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు విన్నవించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వారి మరణ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేస్తోంది. నందాదేవి పర్వత శ్రేణుల్లో కొండచరియలు విరిగిపడడంతో చమోలీ ప్రాంతంలో ఒక్కసారిగా దౌలీగంగా నది ప్రవాహం పెరిగింది. సునామీ మాదిరి నది ప్రవాహం దూసుకురావడంతో అక్కడి స్థానికులతో పాటు పర్యాటకులు కొట్టుకుపోయారు. ఆ నది ప్రవాహం కొండకోనలు దాటుకుంటూ వెళ్లడంతో ఆ ప్రవాహంలో వెళ్లిన వారంతా చెల్లాచెదురయ్యారు. అలా వెళ్లిన వారిని గుర్తించేందుకు భద్రత బలగాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించగా తక్కువ సంఖ్యలో బాధితులను కనుగొన్నారు. మొత్తం 204 మంది అదృశ్యమవగా వారిలో 69మంది మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మిగతా 136 మంది ఆచూకీ లభించలేదు. తీవ్రంగా శ్రమించినా వారి ఆచూకీ లభించకపోవడం..ఘటన జరిగి రెండు వారాలు దాటడంతో ఇక వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో అదృశ్యమైన వారిని మూడు కేటగిరిలుగా ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ విభజిస్తోంది. స్థానికం, రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అదృశ్యమైనవారంతా మృతిచెందినట్టు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఒ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీటీవీతో చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్డీఓ, ఎన్డీఆర్ఎఫ్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్ చెప్పారు. ఫుట్‌బాల్ స్టేడియం కంటే మూడింతలు పెద్దది డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ గ్రౌండ్ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు. ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు. 38కి చేరుకున్న మృతుల సంఖ్య ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. -
విలయం మిగిల్చిన విషాదం
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది) ముమ్మరంగా సహాయ చర్యలు వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం) తపోవన్– విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల సూపర్వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు. మరో చిన్న సొరంగంలో.. తపోవన్– విష్ణుగఢ్ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి. కచ్చితమైన కారణమేంటి? ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్డీవోలోని ‘ద స్నో అండ్ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. -
ఉత్తరాఖండ్‌లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
ఇండియాలో తొలిసారి కాపాడే మహిళా దళాలు
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం. ∙∙ తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్. -
వాగులో చిక్కుకున్న 11 మంది సురక్షితం..
సాక్షి, ఏర్పేడు(చిత్తూరు): సదాశివపురం కోన వాగు ప్రవాహంలో చిక్కుకున్న 11మంది గిరిజనులను రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరికి రక్షించడానికి శుక్రవారం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు. చదవండి: (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) -
పీలేరులో ఎన్డీఆర్ఫ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
-
గల్లంతైన రైతు ప్రసాద్ మృతదేహం లభ్యం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మల్లెమడుగు వరద ఉధృతిలో నిన్న గల్లంతు అయిన రైతు ప్రసాద్ మృతి చెందాడు. ప్రసాద్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం శుక్రవారం వెలికి తీసింది. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా రేణిగుంట సమీపంలోని రాళ్లవాగులో నిన్న ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. వాగులో ఉన్న విద్యుల్ మోటార్లను తీసుకొచ్చేందుకు ఉదయం వాగులో దిగారు. మల్లిమడుగు నుంచి వరదనీరు రావడంతో వాగులోనే చిక్కుకుపోవడంతో ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వాగులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో ప్రసాద్ అనే రైతు గల్లంతయ్యారు. గల్లంతు అయిన ప్రసాద్ కోసం నిన్నటి నుంచి గాలించగా ఇవాళ మృతదేహం లభించింది. చదవండి: (రాగుళ్లవాగులో కొట్టుకుపోయిన ముగ్గురు రైతులు) -
‘నివర్’ బీభత్సం
సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ సాక్షి నెట్వర్క్ : నివర్ తుపాను అతి తీవ్రంగా ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటిన తుపాన్ ► బుధవారం అర్థరాత్రి 11.30 గంటలకు సముద్రంలో కల్లోలం సృష్టిస్తూ.. ‘నివర్’ తుపాన్ తీరం వైపు కదిలింది. రాత్రి 2.30 గంటల సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులతో భూమిని తాకి.. వాయవ్య దిశగా పయనమైంది. ► అయినా సముద్రంలో కల్లోలం కొనసాగుతుండటంతో ఆశ్చర్యపోయిన వాతావరణ కేంద్రం అధికారులు.. ఇంకా నివర్లోని కొంత భాగం అక్కడ ఉందని గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకు మిగిలిన భాగం కూడా తీరం వైపు కదిలి, ముందు భాగంలో విలీనమై అతి తీవ్ర తుపాన్‌గా తీరం దాటింది. ► తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, వాడరేవు పోర్టుల్లో లోకల్ సిగ్నల్ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక సూచీని ఎగరేశారు. ► శుక్రవారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా అతలాకుతలం ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. కోట మండలంలో ఒక్క రాత్రికే 25 సెం.మీ.వర్షం కురిసింది. 30 మండలాల్లో 10 సెం.మీ. నుంచి 24 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ► లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. గూడూరు వద్ద ఏషియన్ హైవే పైకి వరద నీరు రావడంతో రెండు మార్గాల్లో పూర్తి స్థాయిలో వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ► నాయుడుపేట–తిరుపతి మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వెంకటగిరి–రాపూరు మార్గంలోని నేషనల్ హైవేలో లింగసముద్రం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఆత్మకూరు–సోమశిల ప్రధాన రహదారిపై దేపూరు వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ► జిల్లాలోని పెన్నానదితో పాటు కాళంగి, స్వర్ణముఖి, ఉపనదులైన బొగ్గేరు, కేతామన్నేరు, పంబలేరు, చిప్పలేరు, కైవల్యా, గొడ్డేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని చెరువులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. లింగాలపాడు చెరువుకు గండిపడడంతో నీరంతా గ్రామాన్ని చుట్టుముట్టింది. బొప్పాయి, మిరప, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ► ఈదురు గాలులకు 89 పెద్ద చెట్లు, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 3,365 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. ► వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. దీంతో సోమశిల అన్ని గేట్లు ఎత్తేసి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నానది ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో పెన్నా పరీవాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. కలెక్టర్ చక్రధర్‌బాబు, జేసీలు ప్రభాకర్‌రెడ్డి, హరేందర ప్రసాద్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గూడూరు నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు తిప్పవరప్పాడు వద్ద కాజ్‌వేను దాటుకుని సైదాపురం కైవల్యా బ్రిడ్జి సమీపానికి వెళ్లే సరికి అక్కడ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆగిపోయింది. వెనక్కు మళ్లించే సరికి కాజేవేపై ఐదు అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో బస్సు సహా, ఇతర వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ చొచ్చుకు వచ్చిన సాగరతీరం ► కృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు మీటర్లు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ మేర నీరు ముందుకు చొచ్చుకువచ్చింది. మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి. ► కృష్ణా జిల్లాలో 27,769 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. గన్నవరం విమానాశ్రయంలో 10 సర్వీసులకు గాను మూడు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 7 సర్వీసులు విజిబిలిటీ లేక రద్దయ్యాయి. చిత్తూరు జిల్లా గజగజ ► చిత్తూరు జిల్లాను నివర్ తుపాను చిగురుటాకులా వణికించింది. ► సదు మండలం జాండ్రపేట పొట్టెంవారిపల్లెకు వెళ్లే రహదారి పక్కనున్న చెరువులో గుర్తుతెలియని మహిళ గల్లంతయ్యారు. సోమల మండలం సీతమ్మ చెరువు పొంగి ప్రవహించడంతో అటుగా వాహనంలో వెళ్తున్న నలుగురు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. ► పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద పాపిరెడ్డి చెరువు మొరవ ఉధృతంగా పోతోంది. దాన్ని దాటే క్రమంలో పాల వ్యాన్ కొట్టుకుపోగా అందులో ఉన్న ఇద్దరు దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ► కాణిపాకం సమీపంలోని పుణ్యసముద్రం వద్ద ఒకరు వరదలో చిక్కుకోగా అతన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తిరుమల ఘాట్ రోడ్లలో బండరాళ్లు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. మాడ వీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. పాపవినాశనం, గోగర్భం గేట్లను ఎత్తిని నీటి విడుదల చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కడపలో భయపెడుతున్న బుగ్గవంక ► కడప నగరంలో 19,000 క్యూసెక్కులతో బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగరాజుపేట, రవీంద్రనగర్, ద్వారకానగర్, బాలాజీనగర్, మోచంపేట, పాతబస్టాండ్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ హరికిరణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ► కడప–తిరుపతి రహదారిలోని ఊటుకూరు, బాలుపల్లెల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో రాయచోటి వైపు ›ట్రాఫిక్ మళ్లించారు. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. ► గుంటూరు జిల్లాలోని పశ్చిమ డెల్టా, పల్నాడు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల వాలింది. పత్తి, మిరప పంటలపై తుపాన్ ప్రభావం చూపింది. ► ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో నీరు చేరింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 131 పునరావాస కేంద్రాలు, 93 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. ఇదీ వర్షపాతం.. రైల్వేకోడూరులో 25 సెం.మీ, వెంకటగిరిలో 24 సెం.మీ, గూడూరులో 19, రాపూరులో 16, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో 15, నెల్లూరు, కావలి, సత్యవేడు, సంబెపల్లెలో 14, రాజంపేట, తిరుపతిలో 13, తొట్టెంబేడు, పుత్తూరులో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనాల కాలం.. హిమాలయాల్లో ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో కొనసాగిన ఇంట్రా ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే ప్రాంతం) ప్రస్తుతం అరేబియా, బంగాళాఖాతాల్లో కొనసాగుతోంది. దీని వల్ల ఈ రెండు సముద్రాల్లో అల్పపీడనాలు వరుసగా ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ నిపుణుడు, ఏయూ వాతావరణ విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ భాను కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 29న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించారు. డిసెంబర్ నెలలోనూ వరుసగా తమిళనాడు సమీప సముద్ర తీరాల్లో అల్పపీడనాలు ఏర్పడతాయని చెప్పారు. తమిళనాడుకు తప్పిన భారీ ముప్పు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీయకుండా తమిళనాడులో నివర్ తుపాన్ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. కేవలం రెండు జిల్లాలపై మాత్రమే ప్రభావం చూపడంతో భారీ నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు భయానక పరిస్థితులు కొనసాగాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, వేలూరు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తుపాన్ తీరందాటిన ప్రభావం కొనసాగింది. పుదుచ్చేరి–మరక్కానం మధ్య విల్లుపురం జిల్లా అళగన్కుప్పం ప్రాంతాన్ని ఎన్నడూ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు కుదిపేశాయి. దీంతో వేలాది వృక్షాలు కూలిపోయాయి. ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపి వేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోలేదు. కడలూరు, విల్లుపురం జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం సంభవించింది. ► 2015 డిసెంబర్ స్థాయిలో కాకున్నా నివర్ తుపాన్ ధాటికి చెన్నై మరోసారి నీట మునిగింది. మొత్తం 5 లక్షల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించగా ప్రజలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయారు. ► చెన్నై శివార్లలోని తాంబరం–ముడిచ్చూరులలో గత 24 గంటల్లో 31.4 సెంటీమీటర్ల వర్షం పడడంతో 10 వేలకు పైగా ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి. ► ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను రబ్బర్ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో 267 వృక్షాలు కూలిపోయాయి. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక చర్యల కోసం కడపలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద పడవను సిద్ధం చేసిన యంత్రాంగం నెల్లూరు జిల్లా లింగ సముద్రం వద్ద వరద ఉధృతికి కూలిన బ్రిడ్జి చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తున్న సహాయక సిబ్బంది నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నీట మునిగిన సవారి గుంట ప్రాంతం తిరుమలలోని ప్రధాన ఆలయం వద్ద వరద నీరు భారీ వర్షాలకు కొండపై నుంచి పడుతున్న నీటితో నిండుగా కపిలతీర్థం తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న పోలీసులు ఈదురు గాలుల ధాటికి పుదుచ్చేరిలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు నివర్ తుపాన్‌కు జలమయమైన చెన్నైలోని ముడిచ్చూరు ప్రాంతం -
కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు
న్యూ ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు అదనపు విపత్తు సహాయం కింద రూ.4381.88 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఉంపున్ తుఫాన్ సహాయం కింద అత్యధికంగా బెంగాల్ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్లను అందజేయనుంది. అస్పాం రాష్ట్రానికి 128.23 కోట్లు, జూన్‌లో నిసర్గ తుఫాన్‌కి నష్టపోయిన మహరాష్ట్రకు రూ.268.59 కోట్లు, వరదలతో దెబ్బతిన్న కర్ణాటక రాష్ట్రానికి రూ.577.84 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.611.61 కోట్లు, సిక్కింకు రూ.87.84 కోట్లుగా ప్రకటించింది. ఈ నిధులన్ని జాతీయ విపత్తు సహాయనిధి ద్వారా ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉంపున్, నిసర్గ తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడ్డ విపత్తులతో పలు రాష్ట్రాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వీటిలో మే నెలలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో వచ్చిన ఉంఫున్ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మే 20న తూర్పు తీర ప్రాంతంలోని సుందర్బన్ అడవుల్లో 20 కిలోమీటర్ల మేర భూమి కుంగిపోయింది. 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురవగా, మరి కొన్ని చోట్ల పాడయ్యాయి. తుఫాన్ వచ్చిన మరుసటి రోజు ప్రధానమంత్రి ఆ రాష్ట్రాలకు పర్యవేక్షణకు వెళ్లి, తక్షణ సహాయంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు తక్షణ సహాయంగా అందజేశారు. తుఫాన్ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50000 ఎక్స్‌గ్రేషియాను అందజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సహాయం కన్నా ఎక్కువ. -
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. రెండు రోజులుగా అలుపెరుగని సేవలు అందిస్తోన్నాయి. వరదలో నుంచి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. నగరంలో ఎనమిది చోట్ల ఏకకాలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఫలక్ నామా, బాలాపూర్, మీర్ పేట, టోలి చౌకి, సలీం కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీ, రామాంతాపూర్, కృష్ణా నగర్, చాంద్రాయణ గుట్ట, బగల్ గూడలలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు వరుణుడు సహకరించి, నేడు వర్షం కురవకపోతేనే చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాలనుండి వరద కొనసాగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. చదవండి: మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం -
మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్వవేక్షించాలని సూచించారు. ఈరోజు కురిసిన వర్షానికి ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేందరాలకు తరలించడంలో పోలీసు శాఖ చోరవ ప్రశంసనీయం అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో పోలీసులు పని చేయాడం అభినందనీయమని డీజీపీ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా 100/112కు డయల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువు తలపించిన వెలగపూడి హైకోర్టు ప్రాంగణం: ఒక్కరోజు కురిసిన వర్షానికి వెలగపూడి తాత్కాలిక హైకోర్టు ప్రాంగణం చెరువును తలపిస్తోంది. హైకోర్టుకి వెళ్లే మార్గంలో వెలగపూడి వద్ద రోడ్డుపై దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో హైకోర్టుకి వచ్చే ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు చెరువుగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ నానా ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. -
భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్నాకా పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు. బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. -
‘పీఎం కేర్స్ ఫండ్‌ను ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేయలేం’
సాక్షి. న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్ ఫండ్'కు వచ్చిన కోవిడ్-19 విరాళాలను ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి (ఎన్డీఆర్ఎఫ్)కి బదిలీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పీఎం కేర్స్‌కు నిధులు విరాళాల రూపంలో వచ్చాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్డీఆర్ఎఫ్) లేదా స్టేట్ ఫండ్ లకు బదిలీ చేయాలని కోరుతూ ఓ స్వఛ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది దుశ్యంత్ దేవ్ వాదనలు వినిపిస్తూ.. కొత్త ఫండ్‌ను క్రియేట్ చేయడం వల్ల అది ఎన్డీఆర్ఎఫ్కు అవరోధంగా మారినట్లు తెలిపారు. పీఎం కేర్స్ అనేది పబ్లిక్ చారిటీ ట్రస్ట్ లాంటిదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇది కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి స్వఛ్చందంగా అందే విరాళాల సేకరణ కోసం ఉద్దేశించినదని తెలిపింది. అంతే తప్ప.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లకు కేటాయించిన నిధులకు, దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. (చదవండి : జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!) ఇక పిటిషనర్ తరపున దుశ్యంత్ దేవ్ వాదిస్తూ.. ఎన్డీఆర్ఎఫ్ను కాగ్ ఆడిట్ చేయగా పీఎం కేర్స్‌ను ఓ ప్రైవేటు సంస్థ ఆడిట్ చేస్తున్నట్లు ధర్మాసనానికి వివరించారు. పీఎం కేర్స్‌ను కూడా కాగ్ ఆడిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. కోవిడ్ -19 ను పరిష్కరించడానికి 2019 నవంబర్‌లో రూపొందించిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక సరిపోతుందని, కొత్త డిజాస్టర్ రిలీఫ్ ప్లాన్ అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉండగా రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. -
‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’
బెంగళూరు: దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ సత్య ప్రధాన్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల మధ్య ఓ గొర్రెల కాపరి, అతడి పెంపుడు కుక్క కూర్చొని ఉన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని వీరంతా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. ‘భారీ వరదలతో కృష్ణానది పొంగిపొర్లుతోంది. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు ఈ గొర్రెల కాపారిని కాపాడారు. వరదల కారణంగా ఈ కుర్రాడు తన గొర్రెలను వదిలేసి వచ్చాడు. కానీ పెంపుడు కుక్కను మాత్రం తనతో పాటు తీసుకొచ్చాడు’ అంటూ సత్య ప్రధాన్ ట్వీట్ చేశారు. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...) ✅This image will stay etched in my memories ✅This shepherd boy was rescued by @NDRFHQ from raging waters of Krishna ✅He was sad to leave many sheep behind ✅But had presence of mind to bring the dog so sheep graze freely & dog is fed by him ✅Happy to have helped the boy🙏🏻 pic.twitter.com/VLgvMZdjKv — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) August 9, 2020 అంతేకాక ‘ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే.. ‘గొర్రెలు ఎక్కడైనా స్వేచ్ఛగా మేస్తాయి. కానీ కుక్క అలా కాదు. దానికి నేనే భోజనం పెట్టాలి. అందుకే దాన్ని నా వెంట తీసుకొచ్చాను. గొర్రెలను వదిలేసినందుకు బాధగా ఉంది. కానీ అవి ఎలాగైనా బతుకుతాయనే నమ్మకంతోనే కుక్కను తీసుకొచ్చాను’ అన్నాడు. క్లిష్ట సమయంలో ఈ గొర్రెల కాపరి అద్భుతమైన సమయస్ఫూర్తి చూపాడు. ఈ సంఘటన, ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి’ అంటూ సత్య ప్రధాన్ ఈ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అంతేకాక ‘కష్టాలు వచ్చినప్పుడు మనిషిలోని పోరాట పటిమ, కరుణ వెల్లడవుతాయి. మనిషి నమ్మకానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిస్తుంది’ అన్నారు సత్య ప్రధాన్. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాల వల్ల తీరప్రాంత జిల్లాలు, కొన్ని ఉత్తర జిల్లాలు, కొడగు జిల్లా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. (ముంబైని ముంచెత్తిన వర్షాలు) వర్షం పరిమాణం కొంత వరకు తగ్గింది.. కాని పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కొడగు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. -
26కి చేరిన మృతుల సంఖ్య
ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు కార్మికుల ఇళ్ళపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్ఎఫ్కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలిస్తున్నారు. రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకంగా మారాయి. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 46 మంది కనిపించకుండా పోయారు. ఇన్ని అవాంతరాల మధ్య అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని ఇడుక్కి జిల్లా కలెక్టర్ హెచ్.దినేషన్ తెలిపారు. ఇప్పటికే 12 మందిని రక్షించినట్లు చెప్పారు. 55 మంది సిబ్బందితో రక్షణ, పునరావాస కార్యకలాపాలను చేపట్టినట్టు ఎన్డీఆర్ఎఫ్ దక్షిణాది చీఫ్ రేఖా నంబియార్ చెప్పారు. గత 24 గంటల్లో సగటున 9.5 సెంటిమీటర్ల వర్షపాతం, అత్యధికంగా కోళీకోడ్‌లోని వడకరలో 32.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళూరు ఎయిర్‌పోర్టు మూత శివాజీనగర: కుంభవృష్టి నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు తెరవబోమని అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు సాంకేతిక కారణాలు తోడవటంతో కోళీకోడ్ విమానాశ్రయంలో దుర్ఘటన సంభవించటం తెలిసిందే. ఇది టేబుల్ టాప్ విమానాశ్రయం కావటంతో వర్షాల సమయంలో ల్యాండింగ్ సమస్యాత్మకమే. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
భారీ వర్షాలకు భవనం కూలి ముగ్గురు మృతి
డెహ్రాడూన్: భారీ వర్షాలకు ఓ భవనం కూలి ముగ్గురు మృతచెందిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చుక్కువాలా ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 37 ఏళ్ల గర్భిణీ మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటన స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. #UPDATE NDRF team rushed to building collapse site at Chhukhuwala, Dehradun & did search & rescue operation with local SDRF. 3 rescued alive and 3 dead bodies retrieved. Operation on: Satya Pradhan, Director General of NDRF (National Disaster Response Force). #Uttarakhand https://t.co/cM8AqvVYYX pic.twitter.com/u4VAMsRPnj — ANI (@ANI) July 15, 2020 -
49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా
భువనేశ్వర్ : ఒడిశాలో ఉంపన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొన్న 49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్లో తుఫాను సృష్టించిన బీభత్సం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రెస్యూ ఆపరేషన్ అనంతరం ఒడిశా తిరిగివచ్చారు. వీరిలో జూన్ 3న ఒకరికి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు బృందంలోని మిగతా 173 మందికి పరీక్షలు జరపగా 49 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరంతా కటక్‌లోని ముండలి ప్రాంతానికి చెందిన 3వ బెటాలియన్‌కు చెందినవారని అధికారులు పేర్కొన్నారు. కరోనా వచ్చిన వారిని ఎన్డీఆర్ఎఫ్ శిబిరంలోని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. అయితే పశ్చిమబెంగాల్లో సహాయక చర్యల్లో భాగంగా ఒడిశా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన 376 మంది, ఒడిశా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 271 మంది కూడా పాల్గొన్నట్లు వివరించారు. వీరందరి నమూనాలు ల్యాబ్‌కు పంపించామని ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) మరోవైపు డీఆర్డీవో యూనిట్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. బాలాసోర్ జిల్లాలోని ఈ సంస్థలో మిలిటరీ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లకు కోవిడ్ ఉన్నట్లు తేలింది. వీరు ఇటీవల రెస్యూ ఆపరేషన్‌లో భాగంగా కోల్‌కతా వెళ్లారు. పిఎక్స్ఇ సైనిక శిబిరానికి వెళ్ళిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) బృందంలోని ఎనిమిది మంది జవాన్లు కోవిడ్ బారిన పడటంతో వారిని క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం ఐటీఆర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఉంపన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కేంద్రం 19 ప్రత్యేక బృందాలను పశ్చిమ బెంగాల్‌కు పంపించింది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి తిరిగి వచ్చిన బృందాల్లో కరోనా కేసులు బయటపడటంతో ఆందోళన మొదలైంది. (కరోనాపై తప్పుడు వార్తలకు ట్విటర్ చెక్ ) -
భయానక వీడియోలు.. ‘నిసర్గ’ విలయం
ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబైని నిసర్గ తుపాను మరింత భయపెట్టింది. ఆలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా రాయ్‌గడ్ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఓ చోట గాలుల తాకిడికి ఇంటి పై కప్పు ఎగిరి.. మరో ఇంటి మీద పడింది. చెట్లు విరిగి కార్ల మీద పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్య నారాయణ్ ప్రధాన్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. #CycloneNisarga makes landfall, visuals from Raigad District of Maharashtra (Video courtesy: Satya Pradhan(@satyaprad1), NDRF DG/Twitter) For more, follow: https://t.co/rmvEa6PjeJ#CycloneNisarga #CycloneNisargaUpdate pic.twitter.com/vYd6W6EwDm — Jagran English (@JagranEnglish) June 3, 2020 ప్రధాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ ప్రాంతానికి చెందినవారు. మరో వీడియో మంగోన్లోని ధాన్యం గోడౌన్ వద్ద జరిగిన నష్టాన్ని చూపిస్తుంది. హింసాత్మక గాలులు ఈ ప్రాంతాన్ని తాకడంతో ధాన్యం గోడౌన్ పైకప్పు పూర్తిగా ఎగిరి కిందపడింది. #CycloneNisargaUpdate DAY 0-3rd June 2020,1500 hrs#CycloneNisarga landed Visuals few minutes ago from Grain Godown,Mangaon,Raigad Video13@NDRFHQ @ndmaindia @PMOIndia @HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @ANI @PTI_News @DDNewslive @DDNewsHindi @DisasterState pic.twitter.com/8WH1fBKfBP — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) June 3, 2020 పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను నాశనం చేసిన నింపన్ తుపానుతో పోల్చుకుంటే నిసర్గ తుపాను వల్ల జరిగిన నష్టం తక్కువనే అంటున్నారు అధికారులు. -
భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!
న్యూఢిల్లీ: ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్ మత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఇది ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘అంఫన్’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని మత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాం కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ అన్నారు. అంఫన్ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో తమ బృందాలను బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 19, ఒడిశాలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించినట్టు వెల్లడించారు. అదనంగా మరో 6 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి బెటాలియన్‌లో నాలుగు బృందాలు ఉంటాయని చెప్పారు. (అంఫన్ బీభత్సం మామూలుగా ఉండదు!) జనరేటర్లు సిద్ధం చేసుకోండి అంఫన్ తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని టెలికం సర్వీసు ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ సూచించారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున తగినంత సంఖ్యలో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేసుకుని, సరిపడా డీజిల్‌తో సన్నద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ జనరేటర్ల సహాయంతో టెలికం టవర్లను పనిచేయించవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంఎంఎస్‌ల ద్వారా సమాచారం చేరవేయనున్నట్టు తెలిపారు. స్థానిక భాషల్లో, ఉచితంగా ఈ సేవలు అందిస్తామన్నారు. తుపాను తీరం దాటేవరకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. (అంఫన్‌తో జాగ్రత్త) -
సత్యం దిబ్బరొట్టె సూపర్
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో మారుతి క్యాంటీన్లో దిబ్బరొట్టె స్పెషల్ అందరికీ తెలిసిందే. 40 ఏళ్లుగా క్యాంటీన్లో రొట్టెలను వేస్తున్న వేగిరాతి సత్యం సేవలను యూట్యూబ్‌లో చూసిన ఢిల్లీ నేషనల్ డిజాస్టర్ రిసోర్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డీజీపీ సత్యనారాయణ ప్రధాన్ స్పందించారు. 86 ఏళ్ల వయస్సులో కూడా సత్యం పనిచేయ డం అభినందనీయమని అతనికి ఏదైనా సహాయం చేయాలని గుంటూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ జాహిద్ఖాన్కు సందేశం పంపారని ఏఎస్సై బి.భూలోకం తెలిపారు. గుంటూరునుంచి వచ్చిన అధికారులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సత్యంకు క్వింటాలు సోనా రైస్, 50 కేజీల మినపగుళ్లు అందజేశారు. వీటిని అందుకున్న సత్యం మాట్లాడుతూ ఆ అధికారులు తన సేవలకు స్పందించి ఇచ్చిన ఈ కానుకలు తన ఒక్కడికే కాదని హోటల్లో పనిచేస్తున్న అందరికీ పంచుతానని ఆనందంతో చెప్పారు. హోటల్ యజమాని మట్టా భాస్కర్‌తోపాటు పలువురు సత్యంను అభినందించారు. -
వైజాగ్ ఘటన: ఆ ప్రచారం నమ్మొద్దు
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రెండోసారి విషవాయువు లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రెండోసారి గ్యాస్ లీక్ కాలేదని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ స్పష్టం చేశారు. రసాయన వాయువును తసట్థం(న్యూట్రలైజ్) చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొద్దిగా పొగ వస్తుందని, దీన్ని గ్యాస్‌గా పొరబడటం సరికాదని వివరించారు. రెండోసారి గ్యాస్ లీకైనట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అనవసర ప్రచారంతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయొద్దని మీడియాను కోరారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తమతో మాట్లాడారని ప్రధాన్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను పూర్తిస్థాయిలో వైజాగ్‌లో మొహరించామని, అన్నిరకాలుగా సహాయం అందిస్తామని ఆయన హామీయిచ్చారు. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) కాగా, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికలవలవన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. గ్యాస్ లీకేజీ ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వం హైకమిటీని ఏర్పాటు చేసింది. విశాఖ దుర్ఘటనపై స్పందించిన దక్షిణ కొరియా -
విశాఖ దుర్ఘటన: ఒక్క ఫోన్ కాల్ కాపాడింది
విశాఖ సిటీ, బీచ్ రోడ్డు, సాక్షి, అమరావతి: విశాఖలో విష వాయువు లీకేజీ ఘటనపై పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి విశేష సేవలందించాయి. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకోవడం, ఉన్నతాధికారులు సైతం వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులను చురుగ్గా నిర్వహిం చారు. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లారు. నీటిట్యాంకర్లతో గ్రామాల్లో నీటిని స్ప్రే చేయించారు. (విషవాయువు పీల్చి 10 మంది మృతి) ఒక్క ఫోన్ కాల్ కాపాడింది ► విషవాయువు వ్యాప్తి చెందిన సమయంలో స్థానికుడు ఒకరు సత్వరం స్పందించి డయల్ 100కు చేసిన ఒక్క ఫోన్ పెను ముప్పు నుంచి ప్రజలను కాపాడింది. తెల్లవారు జామున 3.25కి గ్యాస్ లీకైనట్టు స్థానికుడు అరుణ్‌కుమార్ డయల్ 100కి సమాచారమందించారు. పోలీసులు అదే వేగంతో స్పందించారు. ► 3.26కి ఎస్ఐ సత్యనారాయణతోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఆర్ఆర్ వెంకటాపురానికి రక్షక్ వాహనంలో బయలుదేరి 3.40కల్లా చేరుకున్నారు. వెంటనే మర్రిపాలెం పోలీస్‌స్టేషన్‌కు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ► 3.40కి కంచరపాలెం సీఐ, ఆర్ఐ భగవాన్, గాజువాక ఎస్సై గణేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఇళ్లలో నిద్రిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. సమీప ప్రాంతాల్లోని 4,500 కుటుంబాలను ఖాళీ చేయించారు. ► 3.45కి అగ్నిమాపక విభాగం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ► 3.45 – 4 గంటల మధ్య 12 రక్షక్ వాహనాలు, 108 వాహనాలు 15, అంబులెన్సులు 12, నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు çఘటన స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన తరలించాయి. మినీ బస్సులను సైతం ఏర్పాటు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► 4.30 గంటలకు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ జోన్–2 ఉదయ్‌భాస్కర్‌లు అక్కడకు చేరుకుని తరలింపు ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు. ► 7 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు çఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉదయం 8కి లీకేజీని అదుపులోకి తెచ్చారు. ► ప్రజలను కాపాడే క్రమంలో విశాఖ డీసీపీ–2 ఉదయ్భాస్కర్తోపాటు మరో 20 మంది పోలీస్ సిబ్బంది విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. ► వందలమందిని రక్షించిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురైన ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరావు బాధితులు ఏమన్నారంటే.. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం తెల్లవారుజామున విష రసాయనం వెలువడటంతో ప్రజలు భీతిల్లిపోయారు. ఒళ్లంతా మంటలు.. దద్దుర్లు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నఫళంగా బయటకు పరుగెత్తారు. వాహనాలు ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ నుంచి దూరంగా తమ బంధువులు, తెలిసినవారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ బాధితులు ఏం చెబుతున్నారంటే.. స్పృహ కోల్పోయిన ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం నేను.. ముగ్గురు పిల్లలు, నా చెల్లెలు జయలక్ష్మితో కలిసి బీసీ కాలనీలో నివసిస్తున్నాను. విష వాయువు నుంచి తప్పించుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఊరు విడిచి చీమాలపల్లి వైపు ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం. నా చెల్లెలు మాత్రం వాం తులు, వికారంతో స్పృహ తప్పిపోయింది. దీంతో అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలిం చాం. ప్రస్తుతం స్పృహలోకి వచ్చింది. ప్రా ణాలతో బయటపడతామని అనుకోలేదు. – బిల్ల సూర్య దేముడు, బీసీ కాలనీ, విశాఖపట్నం నా కూతుళ్లు నిద్ర లేపారు మేము పాలిమర్స్ కంపె నీకి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఉదయం నాలుగు గంటల సమయంలో నా కూతుళ్లు నిద్ర లేపారు. కంపెనీలో ఏదో ప్రమాదం జరిగిందని, అందరినీ వెళ్లిపోమంటున్నారని చెప్పారు. అప్పటికే తీవ్రమైన, భరించలేని వాసన వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తొలుత చీమలాపల్లి వైపు పరు గులు తీశాం. ఆ తర్వాత మమ్మల్ని సింహాచలం వైపు వెళ్లమనడంతో అటు వెళ్లాం. – నీలాపు తాతారావు, వెంకటాపురం అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు ఊపిరి తీసుకోలేకపోయా పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిందని నన్ను చుట్టుపక్కల వాళ్లు నిద్రలేపారు. అప్పటికే తీవ్రమైన వాసన వస్తోంది. ఊపిరి తీసుకోలేకపోయా. మా ఆయనకు ఆస్తమా ఉండటంతో ఏమవుతుందోనని భయపడ్డా. కొంచెం ఆలస్యమైతే మా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించేది. ఇంటి నుంచి ఆగమేఘాలపై సింహాచలం వైపు పరుగులు తీశాం. – గుడివాడ కృష్ణవేణి, వెంకటాపురం ఉన్నఫళంగా వచ్చేశాం పాలిమర్స్ కంపెనీ పక్కనే ఉంటున్నాం. వేకువజామున కేకలు వినిపించడంతో నిద్రలేశాం. గ్యాస్‌లీక్ అయిందని అందరూ పరు గులు పెడుతున్నారు. మా ప్రాణాలు కాపా డుకోవడానికి ఉన్నఫళంగా పిల్లలను తీసుకుని.. ముడసర్లోవ పార్కుకు వచ్చేశాం. –ఎస్.కనక, వెంకటాపురం పోలీసులు వచ్చి తలుపుకొట్టారు వేకువజామున 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. మేము నిద్రలేచి బయటకు వచ్చాం. విషయం చెప్పి బయటకు వెళ్లిపోమన్నారు. వెంటనే ఆటోలో ముడసర్లోవకు వచ్చేశాం. – ఎ.పరదేశమ్మ, వెంకటాపురం ప్రాణభయంతో బయటకు వచ్చేశాం నాకు ఈ మధ్యే ఆపరేషన్ జరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. గ్యాస్ లీక్ సంఘటన తెలియగానే ప్రాణ భయంతో అందరం ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వీల్‌చైర్‌లో ఉన్న నన్ను మా కుటుంబ సభ్యులు ఆటో ఎక్కించి ముడసర్లోవకు తీసుకొచ్చారు. – ముఖేష్, వెంకటాపురం -
కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్
సాక్షి, విజయవాడ : ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరోవైపు సమన్వయంతో కరోనా కట్టడికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొండికేసిన కరోనా పెషేంట్‌ను ఎలా తీసుకురావాలి, డిసిన్ఫెక్షన్ ఎలా చేయాలి అన్న విషయాలపై మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాల డెమో నిర్వహించి అవగాహన కల్పించాయి. ఈ మాక్ డ్రిల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీవీరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. కరోనాపై అవగాహన పెంచేందుకే ఐదు శాఖల సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చివారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రెస్క్యూ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీవీ రావు మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజలు ఇంటిపట్టునే ఉంటే కరోనా కట్టడి సులభతరమౌతుందన్నారు. -
తీరం దాటిన బుల్బుల్ తుపాను
-
ఇంకా వణికిస్తున్న బుల్బుల్
సాక్షి, న్యూఢిల్లీ: బుల్బుల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్బుల్... పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను వణికిస్తోంది హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుల్బుల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. శనివారం రాత్రి తీరం దాటిన సమయం నుంచి ఆదివారం ఉదయం వరకూ తీవ్రగాలులు, వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి 24 పరగణాస్, తూర్పు మిద్నాపూర్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇక ఉత్తర 24 పరగణాలు జిల్లా కకావికలమైంది. కోల్‌కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోని దిగి సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు తీర ప్రాంతాల నుంచి దాదాపు లక్షా 20వేలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలోని కంట్రోల్ రూమ్ నుంచి బుల్బుల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తుపానుపై సీఎం మమతా బెనర్జీతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాను పరిస్థితిని సమీక్షించానని మోదీ ట్వీట్ చేశారు. సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
పట్నా : బిహార్‌ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. రాజధాని పట్నాలో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ చెరవులను తలపిస్తున్నాయి. అయితే ఈ వరదల్లో సామాన్య ప్రజలే కాదు... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా చిక్కుకున్నారు. పట్నాలోని ఆయన నివాసం ఉన్న రాజేంద్ర నగర్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులు అక్కడే ఉండిపోయారు. దీంతో సోమవారం రోజున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అయితే మోదీ మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. మరోవైపు పట్నాలో జనజీవనం స్తంభించింది. బిహార్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను బిహార్‌కు పంపించింది. బిహార్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 1 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. -
పుణేలో కుంభవృష్టి
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న 16 వేల మందిని అధికారులు రక్షించారు. ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై ఖేద్–శివపూర్ గ్రామంలోని ఓ దర్గాలో నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయారు. అలాగే, అరణ్యేశ్వర్ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మిగతా ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు చనిపోయారు. పుణేతోపాటు బారామణి తహ్‌శీల్‌లో ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను పంపించారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. -
ఎన్డీఆర్ఎఫ్ బోటుకు తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. గత రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లుగా వాతావారణ శాఖ హెచ్చరించింది. బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బోటు మునిగిపోయింది. కాగా అందులో ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్ ధరించడంతో వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సెప్టెంబర్ 15వ తేదీన 71 మంది ప్రయాణికులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన విషయం విదితమే. లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెలికితీయడానికి 10 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
లాంచీలోనే చిక్కుకుపోయారా?
సాక్షి, దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బోటు (లాంచీ) 315 అడుగుల లోతులో మునిగిపోయినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో లాంచీని వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్ఎఫ్ భావిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో ఓఎన్జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు. నల్గొండ యువ ఇంజినీర్లు గల్లంతు లాంచీ ప్రమాదంలో నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతయ్యారు. అనుముల మండలం హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్, రామడుగు గ్రామానికి చెందిన పాశం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు స్నేహితులు కలిసి విహారాయాత్రకు వెళ్లారు. వీరిలో నలుగురు బయటపడ్డారు. ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురిలో హేమంత్ అనే యువకుడిది వరంగల్ జిల్లా. విహారాయాత్రకు వెళ్లిన ఈ ఏడుగురు ఇంజినీర్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. తమ పిల్లలు బోట్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త తెలియగానే హాలియా, రామడుగులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని తల్లులు తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు రాజమండ్రి బయలుదేరారు. సంబంధిత కథనాలు.. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం మేమైతే బతికాం గానీ.. తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి.. నిండు గోదారిలో మృత్యు ఘోష అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే -
భవనం కుప్పకూలి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ దారుణం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భివాండి ప్రాంతంలో నిర్మించిన ఈ అక్రమ కట్టడానికి పగుళ్లు రావడం గమనించిన మున్సిపల్ అధికారులు అందులో నివసిస్తున్న ప్రజలని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. దాదాపు 22 కుటుంబాలను బిల్డింగ్ నుంచి తరలించారు. అయితే కొందరు తమ వస్తువులను తీసుకెళ్లడం కోసం తిరిగి బిల్డింగ్‌లో ప్రవేశించారు. ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన హిమాచల్‌ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
సాక్షి, అమరావతి : ఎగువ నుంచి కృష్ణా నదికి వస్తున్న వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ముప్పు నివారణ కోసం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రెండు జిల్లాల్లో విధులు నిర్వహించడానికి 140 మంది పైర్ సిబ్బంది, 180 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలను నియమించినట్లు స్పష్టం చేశారు. నీట మునిగిన 10 మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు 10 మంది చొప్పున విడిపోయి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికర్ల, కొల్లిపర, కొల్లూరు, గుంటూరు జిల్లా తుల్లూరు, సీతానగరం మండలాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెండు జిల్లాలు కలిపి మొత్తం 56 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 14,413 ఆహార పొట్లాలు, 42వేల మంచినీటి ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే రోగాల బారిన పడకుండా తగిన వైద్యం అందించడానికి రెండు జిల్లాల్లో 54 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు జిల్లాలు కలిపి 32 మండలాలకుగాను 87 గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఉదయం 9గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.21 లక్షల క్యూసెక్కుల అవుట్‌ప్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆగని వరదలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది. మరోవైపు సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలతో పాటు వాయుసేనను(ఐఏఎఫ్) హెలికాప్టర్లను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్డుమార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు అందజేస్తున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన హంపీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమిత్ షా ఏరియల్ సర్వే.. కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగాఆదివారం నాటికి కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప, ఇతర ముఖ్యనేతలతో కలిసి బెళగావి, బాగల్‌కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం షా స్పందిస్తూ..‘ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. వర్షాలు కొంచెం తెరిపినిచ్చినప్పటికీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు. తన నియోజకవర్గమైన వయనాడ్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ ఓ పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ ప్రతినిధి జైవీర్ షేర్గిల్ మాట్లాడుతూ..‘వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్‌కు రూ.200 కోట్లు కేటాయించి, వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో కేరళకు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే రూ.3 వేల కోట్లు్లమాత్రమే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. సూపర్ పోలీస్.. సాక్షి, అమరావతి : గుజరాత్లో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు ఓ పోలీస్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మోర్బీ జిల్లా కల్యాణ్ పూర్ గ్రామంలోని పాఠశాలలో 43 మంది చిన్నారులు చదువుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉపాధ్యాయులు, పిల్లలు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ వరద ఉధృతికి బోట్లు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ పృథ్వీరాజ్ జడేజా ఇద్దరు బాలికల్ని భూజాలపై కూర్చోబెట్టుకుని నడుములోతులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
ముంబై అతలాకుతలం
సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్‌లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్పోర్ట్ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్ రైలు సేవలు చర్చిగేట్, విరార్‌ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. పుణేలోనూ ఆరుగురు.. ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్‌లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్ కూడా నీట మునిగిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. అదే స్ఫూర్తి.. భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్ రోడ్ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్ పంపండి’ అని బిభాష్ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్ సూపర్ హీరోలు అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం ధాటికి రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన విమానం ఘట్కోపర్లో వరదతో నిండిన రోడ్డు ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు -
బోరుబావిలోని బాలుడు మృతి.. 110 గంటల శ్రమ వృథా
చండీఘడ్ : గత ఐదురోజులోగా అధికారుల చేసిన ప్రయత్నం.. బూడిదలో పోసిన పన్నీరు అయింది. వారి 110 గంటల శ్రమ వృథా అయింది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 6(గురువారం)న సాయంత్రం గ్రామంలో ఆడుకుంటున్న ఫతేవీర్(3) ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్), పోలీసులు, స్థానిక వాలంటరీల సహాయంతో సుమారు 110 గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ బోర్వెల్ బట్టతో కప్పిఉండగా.. గమనించని బాలుడు అందులో పడిపోయాడు. 9 ఇంచ్లే ఉన్న ఆ బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయి కదల్లేకుండా నరకయాతన అనుభవించాడు. 150 అడుగుల లోతులో ఫతేవీర్ చిక్కుకున్నట్టు కెమెరాల ద్వారా గుర్తించిన సహాయక బృందం... బోరుబావికి సమాంతరంగా బావిని తవ్వారు. పైప్‌లతో ఆక్సిజన్ అందించి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఐదు రోజులుగా నిరంతరం శ్రమించి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాము చేసిన పూజలు, హోమాలు ఫలించాయని సంబరపడిన ఆ తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆనందం కొద్దిక్షణాల్లోనే ఆవిరైంది. బాలుడి మృతితో ఆ ఊరిలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తెరిచి ఉన్న బోరుబావిలను మూసేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. బాలుడి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో ఈ తరహా ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న బోరుబావిలను పూడ్చకుండా అలానే వదిలేస్తున్నారు. అధికారులు, బోరుబావి యజమానుల నిర్లక్ష్యంతో అమాయక చిన్నారులు బలవుతున్నారు. బోరుబావి ప్రమాదాలపై ‘కర్తవ్యం’ వంటి సినిమాలు, ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చినా జనాలు బోరుబావిల పట్ల అదే నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, has passed away. https://t.co/wMn4IAhJJe — ANI (@ANI) June 11, 2019 #WATCH Punjab: Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, rescued after almost 109-hour long rescue operation. He has been taken to a hospital. pic.twitter.com/VH6xSZ4rPV — ANI (@ANI) June 11, 2019 -
16 గంటలు మృత్యువుతో పోరాటం
పుణే : బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని మహారాష్ట్ర పోలీసులు చాకచక్యంగా రక్షించారు. బుధవారం ప్రమాదవశాత్తూ 200అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని దాదాపు 16గంటల కఠోర శ్రమ అనంతరం గురువారం ఉదయం సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనంధానికి అవధుల్లేవు. అటు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పుణే 70కి.మీ దూరంలో ఉన్న థ్రాడేండేల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి ఫాంథిల్ భిల్ అనే బాలుడు ఆడుకుంటూ సమీపంలోని పొలంలోతవ్విన బోరుబావిలో నిన్న సాయంత్రం 4.30 గంటలకు పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాలుని తల్లిదండ్రులు, ఇతర స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో కలిసి బాలుడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరికి 16గంటల అనంతరం విజయం సాధించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడనీ, వైద్యులతో పరీక్షలు కూడా నిర్వహించామనీ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని తెలిపారు. కాగా బాలుడి తండ్రి పండిట్ భిల్ రహదారి నిర్మాణ కార్మికుడు. -
‘ఏదైనా అద్భుతం జరగొచ్చు.. ప్రయత్నం మానకండి’
న్యూఢిల్లీ : మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లా బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 15 మంది కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘మీ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉండండి. ఏదైనా అద్భుతం జరిగి అందరూ లేదా వాళ్లలో కనీసం కొందరైనా బతికి ఉండొచ్చేమో’? అని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకోసం అవసరమైన నిపుణుల సహాయం కూడా తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ సందర్భంగా అక్రమంగా గనుల తవ్వకాలు చేపడుతున్న వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అసలు అక్రమంగా గనులు తవ్వేందుకు ఎవరు అనుమతులు ఇస్తున్నారని న్యాయస్థానం మేఘాలయ అధికారులను ప్రశ్నించింది. అధిక శక్తి గల పంపుల ద్వారా గనిలో నుంచి ఇప్పటి వరకు 28 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడినట్లు మేఘాలయ అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే.. దగ్గర్లో ఉన్న నది కారణంగా నీటి స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదని సహాయక చర్యలకు ఇది తీవ్ర ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం నేవీ సిబ్బంది రిమోర్ట్‌లతో పని చేసే ఐదు వాహనాలతో రంగంలోకి దిగి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అక్రమంగా గని తవ్వకం చేపట్టిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా అగ్నిమాపక దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, రాష్ట్ర అగ్నిమాపక దళంతో పాటు ఇతర కంపెనీలకు చెందిన సిబ్బంది కూడా నిరంతరం గని దగ్గర సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డిసెంబరు 13న ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో పలువురు కూలీలు అక్రమంగా బొగ్గు గని తవ్వేందుకు వెళ్లగా.. అదే సమయంలో వరదలు సంభవించి గనిలోకి నీరు చేరింది. అదృష్టవశాత్తూ ఐదుగురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 15 మంది అందులో చిక్కుకుపోయారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. కూలీల జాడ తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. -
గనిలోకి గజ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖలోని నేవీ బేస్ నుంచి బయలుదేరిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం పశ్చిమ జైంతియా జిల్లా లుంథారి గ్రామ సమీపంలోని గని వద్దకు చేరుకుంది. వీరి వద్ద నీటి అడుగున శోధించే రిమోట్ వాహనాలు తదితర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ బృందానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) అధికారులు పరిస్థితి వివరించారు. అలాగే, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన ఈతగాళ్ల బృందంతోపాటు 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు కూడా గని వద్దకు చేరుకున్నాయని జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్టింగర్ తెలిపారు. వీరంతా కలిసి 370 అడుగుల లోతున్న గనిలో గల్లంతైన కార్మికుల జాడ కనుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. లిటీన్ నది మధ్యలో ఉన్న చిన్న గుట్టపై ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా బొగ్గు గని నడుపుతోంది. ఈ నెల 13వ తేదీన నది వరద అకస్మాత్తుగా గనిలోకి ప్రవేశించడంతో బొగ్గు తవ్వుతున్న కార్మికులు 15 మంది అందులో చిక్కుకుపోయారు. గనిలోతు 370 అడుగుల లోతు ఉండగా నీరు 170 అడుగుల వరకు ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూమికి 200 నుంచి 500 అడుగుల లోతులో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. బతికి ఉండేందుకు అవకాశమే లేదు గనిలోని కార్మికులు తప్పించుకుని వచ్చేందుకు మార్గం లేదని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సాహిబ్ అలీ అనే కార్మికుడు తెలిపాడు. ఇతనిది అస్సాంలోని చిరంగ్ జిల్లా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న మిగతా నలుగురూ పశ్చిమ గారో జిల్లాలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని అలీ తెలిపాడు. ‘ప్రమాదం జరిగిన రోజు 22 మంది వరకు పనిలో ఉన్నాం. కేవలం ఒకే మనిషి కూర్చునేందుకు వీలుండే లోతైన గుంతల్లో చాలామంది బొగ్గు తవ్వుతున్నారు. ఉదయం 5 గంటలకే పని మొదలుపెట్టాం అయితే, 7 గంటల సమయంలో ఎన్నడూ లేనిది గనిలోకి కొత్త రకమైన గాలి వీచింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దం చేస్తూ వరద నీరు గనిలోకి వెల్లువలా వచ్చింది. అతికష్టంమీద బయటకు రాగలిగా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న నలుగురూ ఇనుప పెట్టెల్లో బొగ్గును నింపేవారే. గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడేందుకు దారి లేదు. నీటి అడుగున శ్వాస పీల్చకుండా ఎవరైనా ఎంతకాలం ఉండగలరు?. నాకు తెలిసినంత వరకు గనిలో 17 మంది వరకు చిక్కుకున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు జరిపేందుకు వారి మృతదేహాలైనా దొరుకుతాయని నా ఆశ’ అని అలీ అన్నాడు. ర్యాట్‌హోల్‌లో రెక్కీ నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్నకు చెందిన గజ ఈతగాళ్లు ప్రమాదం జరిగిన ర్యాట్ హోల్గా పిలిచే ఆ ఇరుకైన గని లోపలికి దిగి, నీటి మట్టం, కార్మికుల ఆచూకీ ఎలా కనుగొనాలనే విషయమై ఒక అంచనాకు వచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరితోపాటు పంజాబ్‌కు చెందిన గని ప్రమాదాల నిపుణుడు జస్వంత్ సింగ్ గిల్ కూడా సాయంగా అక్కడికి వచ్చారు. శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లతో నీటిని తోడే ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుందని అధికారులు అంటున్నారు. కూలీల బతుకులు కూల్చింది సాహిబ్ అలీతోపాటు గని తవ్వకాల్లో పాల్గొంటున్న వారంతా నిరుపేదలు.. రిక్షా తొక్కుతూ, బరువులు మోస్తూ జీవనం సాగించేవారు. ఈ పనుల్లో సంపాదన కుటుంబపోషణకు సరిపోక కూలీ ఆశతో ప్రమాదకరమైన గని పనిలో చేరారు. అత్యంత ఇరుకైన, లోతైన గనిలో రోజంతా పనిచేస్తే రూ.2వేల వరకు చేతికందుతాయి. వేరే ప్రాంతాలకు చెందిన కార్మికులు రెండు మూడు వారాలపాటు ఈ పనిని కొనసాగించి, తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతారు. గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల 13వ తేదీన ప్రమాదం జరగ్గా గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 22వ తేదీన రూ.లక్ష చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించింది. -
కిర్లోస్కర్ స్వచ్ఛంద సాయం
షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో రెండు వారాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించేందుకు కిర్లోస్కర్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆ గనిలోని నీటిని తోడేందుకు అవసరమైన 100 హెచ్‌పీ మోటార్లను తాము సమకూరుస్తామని తెలిపింది. గని వద్ద పరిస్థితులను అంచనా వేసి, వారిని కాపాడేందుకు కిర్లోస్కర్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, గని నుంచి నీటిని ఎంత తోడినా నీటి మట్టాలు తగ్గకపోవడంతో ఆ ప్రక్రియను అధికారులు శనివారం నిలిపేసిన విషయం తెలిసిందే. గనిలోని నీటిని తోడేందుకు రెండు 25 హెచ్‌పీ పంపులు సరిపోవట్లేదని, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పంపులు కావాల్సిందిగా మేఘాలయ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్కే సింగ్ తెలిపారు. గని నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో గనిలో చిక్కుకున్న వారు చనిపోయి ఉండొచ్చన్న మీడియా కథనాలను ఎన్డీఆర్ఎఫ్ ఖండించింది. వారిని రక్షించే చర్యలు చేపడుతున్న గువాహటిలోని ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మైనర్లు చనిపోయి ఉంటారని, వారి దేహాలు కుళ్లిపోవడం ప్రారంభమైందని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ఎస్కే సింగ్ తప్పుపట్టారు. 48 గంటలుగా నీటిని తోడే ప్రక్రియ నిలిచిపోవడంతో గనిలో నిలిచిపోయిన నీటి వల్ల ఆ దుర్గంధం వస్తుందని స్పష్టం చేశారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషిచేస్తున్నాయన్నారు. -
14 రోజులుగా బొగ్గు గనిలోనే 15 మంది..
న్యూఢిల్లీ: మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో గత 14 రోజులుగా చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియరావడం లేదు. గనిలో నీటి ఉధృతి కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు బొగ్గుగనిలోని నీటిని తోడేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గనిలోని నీటిని బయటకు పంప్ చేయడానికి హైపవర్ సబ్ మెర్సిబుల్ పంపులు కావాలని అధికారులు కోరినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ ఓ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గనిలోని కార్మికుల ప్రాణాలపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. పంపులపై బదులేది? సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండెంట్ ఎస్కే శాస్త్రి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..‘గనిలోని నీటిని తోడేసేందుకు కనీసం వంద హార్స్పవర్ ఉన్న 10 మోటార్ పంపులు కావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మేం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ జవాబు రాలేదు. మా దగ్గర ప్రస్తుతం 25 హార్స్పవర్ సామర్థ్యం ఉన్న రెండు పంపులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 370 అడుగులు ఉన్న ఈ గని మధ్యలో 70 అడుగుల మేర నీరు చేరుకుంది. ఈ నీటిని తొలగిస్తేనే జాతీయ విపత్తు సహాయక బృందం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది లోపలకు పోగలరు. మేం గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి కారణంగా కుదరలేదు’ అని తెలిపారు. గని కార్మికుడొకరు బొగ్గును వెలికితీసే క్రమంలో గోడపై బలంగా కొట్టడంతో గనిలోకి లైటైన్ నది నీరు పోటెత్తి ఉంటుందని శాస్త్రి చెప్పారు. ‘ర్యాట్ హోల్’ తవ్వకం తాజాగా కార్మికులు చిక్కుకున్న బొగ్గు గనిని ర్యాట్ హోల్ పద్ధతిలో తవ్వారు. ఈ విధానంలో తొలుత చిన్న పరిమాణంలో గుంతలను నిట్టనిలువుగా బొగ్గు కనిపించేవరకూ తవ్వుతారు. అనంతరం సన్నటి దారుల ద్వారా బొగ్గును పైకి తీసుకొస్తారు. అయితే ఈ విధానంలో పర్యావరణానికి నష్టం జరుగుతుండటం, కార్మికుల ప్రాణానికి ముప్పు ఉండటంతో మేఘాలయలో 2014లో ఈ ర్యాట్ హోల్ పద్ధతిని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ జైంతా హిల్స్‌లో గని ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్.కె.సంగ్మా స్పందిస్తూ..‘కాలం వేగంగా కరిగిపోతోంది. పదిహేను మంది కార్మికులను రక్షించడానికి హైపవర్ సబ్మెర్సిబుల్ పంపులను ఇవ్వాలని కోల్ ఇండియాను కోరాం. వాళ్లు వీలైనంత త్వరగా సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఈ గనిలోకి కార్మికులను పనికి దింపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు జరుపుతున్నారు. ఫొటోలకు పోజులా? గని కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 15 మంది కార్మికులు బొగ్గుగనిలో చిక్కుకుంటే ప్రధాని మోదీ మాత్రం అస్సాంలోని బోగీబీల్ వంతెనపై ఫొటోలకు పోజులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓవైపు మేఘాలయలో 15 మంది కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకుని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రధాని మాత్రం బోగీబీల్ వంతెనపై కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం హై ప్రెజరైజ్డ్ మోటార్ పంపులను అందించేం దుకు నిరాకరిస్తోంది. మోదీజీ.. దయచేసి ఈ కార్మికులను కాపాడండి’ అని ట్వీట్ చేశారు. -
గుహ కూలి 12 మంది దుర్మరణం!
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాల నుంచి తప్పించుకునేందుకు బరఘరా గ్రామానికి చెందిన కొందరు ఓ గుహలోకి వెళ్లగా, ఒక్కసారిగా అది కుంగిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నలిగిపోయి 12 మంది చనిపోయినట్లు భావిస్తున్నామని సహాయక చర్యల ప్రత్యేక కమిషనర్ బీసీ సేథి తెలిపారు. మరో నలుగురి జాడ తెలియడంలేదు. సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రతిస్పందన బృందాన్ని(ఎన్డీఆర్ఎఫ్) పంపామన్నారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మార్గమంతా చెట్లు కూలిపోయాయి. మరోవైపు తిత్లీ విధ్వంసంపై సమీక్ష నిర్వహించిన ఒడిశా సీఎం పట్నాయక్.. గంజాం, గజపతి, రాయగఢ్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పునరావాస శిబిరాల్లో 1.27 లక్షల మంది తలదాచుకుంటున్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తిత్లీ తుపాను పేరును కొందరు తమ పిల్లలకు పెట్టారు. తుపాను తీరం దాటేముందు, దాటిన తర్వాత పుట్టిన పిల్లలకు తిత్లీ (హిందీలో సీతాకోకచిలుక అని అర్థం) అని పేరు పెట్టారు. -
పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఉపశమనం
-
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 30 మంది
గ్రేటర్ నోయిడా : నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోమారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని సాహ్ బెరి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనంపై పడింది. దీంతో నాలుగంతస్తుల భవనం కూడా కుప్పకూలి అందులో నివాసముంటున్న18 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. -
రెండు రోజులైనా లభ్యం కాని విద్యార్థినుల ఆచూకీ
-
ఉత్తరాదిపై ఉరిమిన తుపాను
పట్నా/లక్నో: ఉత్తరాది రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలు, పిడుగుపాట్లు, పెనుగాలులు బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో బీభత్సం సృష్టించాయి. ఈ 4 రాష్ట్రాలో 54 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో చెట్లు కూలకూలాయి. ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తుపాను తీవ్రరూపం దాల్చింది. బిహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 17 మంది, జార్ఖండ్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమ బెంగాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. ఈ నెలలో అకాల వర్షాలకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 290కి చేరింది. బిహార్‌లో బెంబేలెత్తించిన పిడుగులు.. తుపాను ప్రభావం అధికంగా ఉన్న బిహార్‌లో గంటకు 70 కి.మీ.కు పైగా వేగంతో పెనుగాలులు వీచాయి. గయ, ఔరంగాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఐదుగురు చొప్పున మృతిచెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇంకా ముంగర్, కతియార్, నవాడా జిల్లాల్లోనూ ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌లో పిడుగుపాటుకు మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలున్నారు. గయలో ఇంటి పైకప్పులు, చెట్లు కూలిపోవడంతో మరణించినవారిలో ఇద్దరు మహిళలు, బాలుడు, బాలిక ఉన్నారు. ఇదే జిల్లాలో ఇద్దరు బాలికలు, బాలుడు గాయపడ్డారు. ముంగర్‌లో పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయారు. నవాడా జిల్లాలో పిడుగుపాటు 16 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల వ్యక్తిని బలితీసుకుంది. కతియార్‌లో విరిగిపడిన చెట్టు కింద నలిగి 70 ఏళ్ల వృద్ధుడు, 11 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల మహిళ మరణించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. యూపీలో 17 మంది మృత్యువాత.. యూపీలో 17 మంది మృతిచెందగా, మరో 10 మంది గాయపడినట్లు సీనియర్ అధికారి చెప్పారు. అందులో ఉన్నావ్‌లో ఆరుగురు పిడుగుపాటు, వర్షానికి బలికాగా, రాయ్‌బరేలీలో ముగ్గురు, కాన్పూర్, పిలిబిత్, గోండా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించినట్లు తెలిపారు. తుపాను ధాటికి రాయ్‌బరేలీ, ఉన్నావ్ జిల్లాల్లో పలు గుడిసెలు నేలకూలినట్లు చెప్పారు. హర్దోయ్–ఉన్నావ్ రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపశమనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి(సమాచార శాఖ) అవినాశ్ అవస్తి తెలిపారు. మరోవైపు, పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లాలోనూ భీకర గాలులకు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. కర్ణాటకలో బీభత్సం మంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాలను మంగళవారం వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వరుసగా మూడోరోజూ భారీ వర్షాలు కురవడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. మంగళూరులో పరిస్థితిని సమీక్షించామనీ, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అదనపు బృందాలను అక్కడకు పంపుతున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మంగళూరు నగరంలో వర్షం కురిసిందనీ, అనేక ప్రాంతాల్లో భవనాలు సగం వరకు మునిగాయని అధికారులు చెప్పారు. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. పాఠశాలలో చిక్కుకున్న పిల్లలను పడవల సాయంతో సిబ్బంది కాపాడారు. వందకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. మంగళూరులో వరద ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలిస్తున్న సిబ్బంది -
లాంచీ దుర్ఘటనలో 19మంది మృతి: కలెక్టర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపాన గోదావరిలో లాంచీ దుర్ఘటనలో 19మంది మృతి చెందినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఒక్కరు గల్లంతుకాగా అతని కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 17మంది ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. జియో సంస్ధతో ఒప్పందం చేసుకుని ఏజెన్సీలో నలభై ఏడుచోట్ల టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంటూరు నుండి కొండమొదలు వరకు బండి బాట నిర్మించేందుకు సిఎం ఆదేశాల మేరకు ప్రయత్నాలు ప్రారభిస్తామని, గోదావరిలో ప్రయాణికుల తరలింపుకు... సామాగ్రి తరలింపుకు వేరు వేరు సర్వీసు లాంచీలు నడుస్తాయన్నారు. ప్రస్తుతం పోలవరం ఎగువకు వెళ్ళే అన్ని రకాల సర్వీసు లాంచీలను నిలివేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా గురువారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, నౌకా సిబ్బంది, స్థానికుల సహకారంతో వాడపల్లి, మంటూరు పరిసర ప్రాంతాల్లో బోట్ల సాయంతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, నావీ సిబ్బంది ఇరవై గంటల అనంతరం నదిలో మునిగిన లాంచీని భారీ క్రేన్ల సాయంతో వెలికితీసిన విషయం విదితమే. లాంచీ పూర్తిగా నేలపైకి రావడానికి వీలుకాక పోవడంతో నేవీ సిబ్బంది లాంచీ భాగాలను కత్తిరించి మృతదేహాలను బయటికి తీశారు. . -
బోటు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. కొనసాగుతున్న రెస్క్యూ!
సాక్షి, విజయవాడ/న్యూఢిల్లీ : కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందని, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. కొనసాగుతున్న సహాయక చర్యలు కృష్ణా నదిలోని పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తాపడిన ఘటనలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 'ఆదివారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు నదిలో గల్లంతైన వారి జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు' అని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. వీరి కోసం ప్రస్తుతం నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే సీనియర్ మంత్రుల కమిటీ ఏర్పాటైందని, ఈ ఘటనలో నలుగురు-ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదుచేశామంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు -
తిరుమలలో ‘డ్రోన్’ కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శేషాచలంతోపాటు తిరుమలకొండ మీద ఉద్యాన వనాల అభివృద్ధి కోసం నెల రోజులుగా డ్రోన్ కెమెరాతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నాలుగు మాడ వీధులు, సమీప ప్రాంతాలు మినహా మిగిలిన అటవీ, కాటేజీ ప్రాంతాల్లో ఈ సర్వే చేసుకునేందుకు టీటీడీ అనుమతినిచ్చింది. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ ఎఫ్) నిపుణుల బృందం ఈ సర్వే నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాను పక్షి ఢీకొనడంతో సిగ్నల్స్ తెగిపోయి డ్రోన్ కెమెరా స్థానిక శేషాద్రినగర్‌లోని ఓ చెట్టుపై ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
ప్రకృతి విపత్తు.. ప్రళయ సహాయం
♦ వరద సహాయక చర్యలపై అవగాహన కల్పించనున్న ఆర్మీ ♦ ‘ప్రళయ సహాయం’ పేరుతో కార్యక్రమం ♦ సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ ♦ పాల్గొంటున్న 500 మంది సైనికులు ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితేంటి? వరద ఉప్పొంగితే, నగరం జలమయమైతే ఏం చేయాలి? బాధితులను ఎలా రక్షించాలి? నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 500 మంది సైనికులు పాల్గొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సహకారం అందిస్తోంది. ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరద బాధితులను ఎలా రక్షించాలనే అంశంపై ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే సైనికులు సాగర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సాగర్ చుట్టూ సైనికులు పహారా కాస్తున్నారు. సాగర్‌లో మూడు విభాగాలుగా గృహసముదాయాలు ఏర్పాటు చేశారు. నీటిలో ప్రమాద శాతం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఒకటో సముదాయంగా ఒడ్డుకు కొద్ది దూరంలో నిర్మించారు. ప్రమాదం మధ్యస్తంగా రెండో విభాగాన్ని ఒడ్డుకు ఇంకొద్ది దూరంలో నిర్మించారు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువున్న ప్రాంతంగా మూడో విభాగాన్ని సాగర్ మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. నిఘా నీడలో.. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందుకు అత్యాధునికి కెమెరాలు వినియోగిస్తున్నారు. విద్యుత్ సహాయంతో ఎడారి ప్రాంతాల్లో, మంచుకొండల్లో సైన్యం వినియోగించే ప్రత్యేక వైర్లెస్ పరికరాలను కెమెరా రికార్డింగ్‌ల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ట్యాంక్‌బండ్ చుట్టూ దాదాపు 12 ప్రత్యేక కెమెరాలతో ఈ మాక్‌డ్రిల్‌ను డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రవేశం ఉచితం.. ఈ ప్రదర్శనను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఈనెల 22, 23 తేదీల్లో సంజీవయ్య పార్క్, హుస్సేన్‌సాగర్ వేదికగా సైనికుల విన్యాస ప్రదర్శనలు ఉంటాయి. అవగాహన వేదిక.. ప్రకృతి విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఆర్మీ ప్రతి ఏటా ఏదో ఒక మహానగరంలో మాక్‌డ్రిల్ చేపడుతుంది. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. సిటీ జలమయమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరద బాధితులను ఎలా రక్షించాలి? ఏ శాఖ ఏ పని చేయాలి? తదితర విషయాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ఆర్మీ ఆఫీసర్లు, అంతర్జాతీయ వక్తలు ఇందులో పాల్గొంటారు.– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
ఉత్తరాదిన వరద విలయం
► బిహార్, యూపీ, ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 473 మంది మృతి ► సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లక్నో: దేశ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వరదలకు 473 మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. మరోవైపు ఆదివా రం కూడా ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు ఉత్తర ప్రదేశ్‌లో వరద పరిస్థితి ఆదివారం నాటికి మరింత విషమించింది. మృతుల సంఖ్య 69కి చేరగా.. రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో 20 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. 2,523 గ్రామాలు నీట మునిగాయని పునరావాస శాఖ వెల్లడించింది. పశ్చిమ యూపీ జిల్లాల్లో మొత్తం 39,783 మందిని సహాయక శిబిరాలకు తరలించామని, నేపాల్ వైపు నుంచి వరద ప్రవాహం తగ్గకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ఆ శాఖ పేర్కొంది. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పీఏసీ(యూపీ ఆర్మ్డ్ కానిస్టేబుల్స్) సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. 20 కంపెనీల ఎన్డీఆర్ఎఫ్, 29 కంపెనీల పీఏసీ సిబ్బందితో పాటు ఆర్మీ కూడా సాయమందిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముంపు ప్రాంతాలకు ఆహారం, నీరు చేరవేస్తున్నారు. యూపీలో శారద, ఘాఘ్రా, రాప్తీ, బుధి రాప్తీ, రోహిణ్ నదులు ఇంకా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. బిహార్‌లో 253 మంది మృతి బిహార్‌లో వరద మృతుల సంఖ్య 253కి చేరింది. అరారియా జిల్లాలో అత్యధికంగా 57 మంది మరణించారు. 18 జిల్లాలో 1.21 కోట్ల మంది వరదల్లో చిక్కుకున్నారు. 1,336 కేంద్రాలు ఏర్పాటు చేసి 4.22 లక్షల మందికి పునరావాసం కల్పిస్తున్నారు. 28 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 16 రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.అస్సాంలో మూడుసార్లు సంభవించిన వరదలకు ఇంతవరకూ 151 మంది మరణించారు. తాజాగా దుబ్రి, మోరిగావ్, గోలాఘాట్ జిల్లాలో మూడు మరణాలు సంభవించాయి. 16 జిల్లాల్లో 22 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మొత్తం 328 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. కాగా వరుసగా రెండో రోజు ఆదివారం కూడా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. పల్లపు ప్రాంతాలు నీటమునగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. కజిరంగ పార్కులో 346 జంతువులు మృతి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగ జాతీయ పార్కులో వరద ధాటికి 346 జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండటంతో ఈ పార్కుకు వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది. గతనెల నుంచి ఇప్పటికి మూడు సార్లు పార్కుకు వరద రాగా మూడోసారి 239 జంతువులు చనిపోయాయి. వాటిలో 200కు పైగా జింకలే ఉండటం బాధాకరం. 15 ఖడ్గ మృగాలు, ఒక బెంగాల్ పులి, నాలుగు ఏనుగులు, నాలుగు అడవి పందులు, రెండు అడవి దున్నలు కూడా వరదల్లో చిక్కుకుని మరణించాయి. 430 చ.కి.మీ ఉన్న కజిరంగా పార్కులో వరదఉధృతంగా ఉన్నప్పుడు 87 శాతం భూభాగం నీట మునిగింది. ఇప్పటికీ 22 శాతం భూభాగం నీటిలోనే ఉంది. 1988లో వరదలు వచ్చినప్పుడు ఈ పార్కులో అత్యధికంగా 1,203 జంతువులు చనిపోయాయి. 25 శాతం భూభాగంలో లోటు వర్షపాతం న్యూఢిల్లీ: ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు దేశంలోని నాలు గింట ఒక వంతు (25%) భూ భాగంలో లోటు వర్షపాతం నమోదైంది. అయితే రుతుపవన కాలం ముగిసే సెప్టెంబర్ లోపు ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభా గం (ఐఎండీ) ఆశాభావం వ్యక్తం చేస్తోం ది. ఈ వర్షా కాలంలో ఇప్పటికి దేశవ్యా ప్తంగా సగటున 5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాలుగింట ఒక వంతు భూ భాగంలో మాత్రం లోటు మరింత ఎక్కువగా ఉందని ఐఎండీ వెల్లడించింది. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడ ప్రాం తాల్లో 32%, కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ భాగాల్లో 20 నుంచి 25% వరకు లోటు వర్షపాతం నమోదైందనీ, కేరళ, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతా ల్లోనూ వర్షాలు సరిగా కురవలేదని ఐఎం డీ పేర్కొంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యా యనీ, సెప్టెంబర్ ఆఖరు కల్లా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
సారీ.. చిన్నారి
శనివారం అర్ధరాత్రి వరకూ దొరకని పాప జాడ - చిన్నారి మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ! - 40 అడుగుల వద్దే ఉండి ఉంటుందని భావిస్తున్న యంత్రాంగం - బోరులోని మోటారు తీయడంతో పక్కన మట్టిలో కూరుకుపోయిందా? -180 అడుగుల్లో నీటిలో పడిపోయి ఉంటుందా? - అత్యాధునిక కెమెరాలతో పరిశీలించినా లభించని ఆచూకీ - మొత్తం బోరుబావిని పెకలించాలని నిర్ణయం - 40 అడుగుల వరకు చుట్టూ తవ్వేస్తున్న సహాయక సిబ్బంది - అయినా ఆచూకీ లభించకపోతే ఫ్లషింగ్ చేయాలని యోచన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, చేవెళ్ల/ మొయినాబాద్/ షాబాద్: క్షణక్షణం ఉత్కంఠ.. చిన్నారి జాడ కనిపించకపోతుందా.. ఆఖరి చూపైనా దక్కకపోతుందా అన్న ఆవేదన.. బోరుబావిలో పడి 50 గంటలు దాటిపోవడం, ఆమె ఆచూకీ కూడా లేకపోవడంతో చిన్నారి మృతి చెంది ఉంటుందని శనివారం రాత్రి అధికార యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కనీసం ఆమె దేహాన్నైనా వెలికితీసి తల్లిదండ్రులకు అప్పగించాలన్న ఆలోచనతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించగల ప్రత్యేక కెమెరాలను తెప్పించి పరిశీలించినా.. శనివారం అర్ధరాత్రి వరకూ పాప జాడ తెలియరాలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారును పైకి తీసినప్పుడు చిన్నారి బోరు పక్కభాగంలో మట్టిలో కూరుకుపోయి ఉంటుందని.. 40 అడుగుల లోతు లోపలే ఉండి ఉంటుందన్న అంచనాకు వచ్చారు. బోరుబావిలో 40 అడుగుల కిందకు ఏదీ పడిపోకుండా అడ్డు ఏర్పాటు చేసి.. మొత్తంగా బోరుబావిని పెకలిస్తున్నారు. ఒకవేళ 40 అడుగుల వరకు తవ్వాక చిన్నారి ఆచూకీ లభించకపోతే.. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. దీనికోసం కేఎల్ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. దొరకని జాడ గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో చిన్నారి అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. దీంతో శనివారం ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా పాప ఆనవాళ్లు కనబడలేదు. దాంతో అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించారు. అయినా పాప ఎక్కడ చిక్కుకుపోయిందనేది తేలకపోవడంతో సహాయక చర్యలపై తర్జనభర్జన జరిగింది. పాప బోరుబావి పక్క భాగంలో భూమిలో అతుక్కుపోయిందా? లేక కిందకు జారిన పాపపై మట్టి పెళ్లలు పడడంతో కెమెరాలకు కనిపించడం లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. దీంతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, అధికారులు చర్చించి.. బోరుబావి పెకలించాలని నిర్ణయించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. పాపను బయటికి తీసేందుకు సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుండడంతో.. తమకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీస్తామని చెప్పిన వారందరికీ అవకాశం కల్పించారు. బోరుబావిలోకి కొక్కెం వేసి, అది పాప దుస్తులకు చిక్కుకుంటే బయటికి లాగాలని ప్రయత్నించారు. అది ఫలించలేదు. అలాగే బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లను లాగేందుకు ఉపయోగించే పంజరం లాంటి యంత్రాన్ని సైతం వినియోగించారు. తర్వాత బోరుబావి అడుగున నీళ్లు, బురద ఉండటంతో సీసీ కెమెరాలకు పాప కనిపించటం లేదని.. అందులో ఉన్న నీటిని మోటారు సహాయంతో తోడేశారు. అయినా చిన్నారి కనిపించలేదు. చివరికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అధునాతన సైడ్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారు. పాప బోరు మధ్యలో ఎక్కడైనా కూరుకుపోయిందా అనేది వాటితో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. చేతులెత్తేసిన ఓఎన్జీసీ బృందం మూడు రోజులుగా సేవలందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తోడుగా ముగ్గురు సభ్యుల ఓఎన్జీసీ బృందం శనివారం వేకువజామున ఘటనాస్థలికి చేరుకుంది. ఓఎన్జీసీ డీజీఎం శ్రీహరి, ఎస్ఈ కేవీసీఎస్ రావు, ఈఈ మహేశ్‌కుమార్‌లు బోరుబావిని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఇక్కడి పరిస్థితులు అనుకూలించవని వారు స్పష్టం చేశారు. బారుబావి యాజమానిపై కేసు నమోదు ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు. బోరుబావిని పెకిలిస్తున్న యంత్రాంగం బోరుబావిలో పడిన చిన్నారి 40 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉంటుందని సహాయక యంత్రాంగం భావిస్తోంది. బోరుబావి 40 అడుగుల లోతు వరకు 9 అంగుళాల వెడల్పు ఉంటుంది. 40 అడుగుల కింది నుంచి 6 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. పాప శరీరం 8 అంగుళాల వెడల్పు ఉన్నందున 40 అడుగుల కన్నా కిందికి పాప పడిపోకపోవచ్చని భావిస్తున్నారు. 40 అడుగుల లోతు నుంచి కిందకు ఏమి పడిపోకుండా 40 అడుగుల లోతులో బోరుబావిని బ్లాక్ చేశారు. 40 అడుగులపైన ఉన్న బోరుబావిని మొత్తం ఇటాచీలతో పెకలిస్తున్నారు. అలాగైనా చిన్నారి జాడ బయటపడని పక్షంలో 40 అడుగుల నుంచి చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ చేసి పాపను బయటకు తీస్తామని అధికార యంత్రంగం, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి న్నారిని వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తదితరులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పరిశీలించారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు లేని బోరుబావులు ఎక్కడైనా ఉంటే వెంటనే మూసివేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సూచించారు. అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాపను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మృత్యుంజయురాలు ఈ అంజలి - రెండేళ్ల క్రితం బోరుబావిలోపడి క్షేమంగా బయటికి... - ‘చిన్నారి’కూడా బతకాలని ఆకాంక్షించిన అంజలి చిన్నతనంలోనే తరుముకుంటూ వచ్చిన మృత్యువును ఎదిరించింది ఈ చిన్నారి. 2015లో బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం తోటి విద్యార్థులతో బడిలో ఆడుతూపాడుతూ చదువుకుంటోంది. రెండు రోజులక్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బోరుబావిలో చిన్నారి పడిపోయిన విషయం విదితమే. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలో జరిగిన బోరుబావి ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామమైన గోవింద్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ కూతురు కొర్ర అంజలి 2015, జనవరి 14న తల్లిదండ్రుల వెంట పొలానికి వెళ్లింది. ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు.. సుమారు 20 ఫీట్ల లోతులో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అంజలి సల్కర్‌పేట్ మినీ గురుకుల పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. నన్ను బోరు అంజలి అంటారు నేను చిన్నగున్నపుడు బోరులో పడి బతికినందుకు నన్ను బోరు అంజలి అని పిలుస్తారు. మా అమ్మానాన్నలు కూడా నా దగ్గర లేనందుకు నన్ను అందరూ ఆప్యాయంగా చూసుకుంటారు. రెండ్రోజుల క్రితం నాలాగే బోరుబావిలో పడిన చిన్నారి కూడా బతికితే బాగుండు. -
ఏపీకి 584 కోట్లు, తెలంగాణకు 314 కోట్లు
ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాలకు జాతీయ విపత్తు సహాయక నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి నిధుల మంజూరుకు ఆ మోదం తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో కరువు, ప్రకృతి విపత్తులపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికల మేరకు మొత్తంగా రూ.5,020.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 4,979 కోట్ల మేర ఎన్డీఆర్ఎఫ్ నిధులతోపాటు జాతీయ గ్రామీణ తాగునీటి పథకంకు సంబంధించి రూ.40.67 కోట్లు ఉన్నాయి. ఏపీకి రూ.584.21కోట్లు,తెలంగాణకు రూ.314.22 కోట్లు ఈ కమిటీ మంజూరుచేసింది. -
పాలేరు వాగులో చిక్కుకున్న రైతులు సేఫ్
-
30 గంటలు వరద నీటిలోనే..!
-
30 గంటలు వరద నీటిలోనే..!
వరదలో 30 గంటలు చేపల వేటకు వెళ్లి ఎల్లంపల్లి నీటిలో చిక్కుకున్న ఇద్దరు జాలర్లు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన బృందం రామగుండం : చేపలవేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరదనీటిలో చిక్కుకున్నారు. సుమారు 30గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలంగడిపారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గంగపుత్రులు కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్ ఆదివారం ఉదయం చేపల వేట కోసం ప్రాజెక్టు దిగువన గోదావరి నదిలోకి వెళ్లారు. ఎగువన వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు సుమారు 5.25లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయిన జాలర్లు.. ముళ్లచెట్లకు చిక్కుకున్నారు. ఇదేవిషయాన్ని తమ వద్ద ఉన్న మెుబైల్‌ఫోన్ ద్వారా రాజేశ్ అన్న ధర్మాజీ శ్రీనివాస్‌కు సమాచారం చేరవేశాడు. అతడు సాయంత్రం వేళ అధికారులకు అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, జాతీయ విపత్తు సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) తదితర శాఖలు అప్రమత్తమయ్యాయి. గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, సీఐ వాసుదేవరావు, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎల్లంపల్లి సర్పంచ్ సంకటి సుధాకర్, వైస్ ఎంపీపీ కొదురుపాక పవన్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఇన్చార్జి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ ప్రవీణ్, తహసీల్దార్ దండు మధుసూదన్, ఆర్డీవో అయేషామస్రత్ఖాన్, ఆర్ఐ గడియారం శ్రీహరి, ముల్కల్ల సర్పంచ్ నైతిని శంకరమ్మ, ఆదిలాబాద్ జేసీ సుందర్‌అబ్నార్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ కనకేశ్, ఎస్ఈ విజయభాస్కర్ తదితరులు పర్యవేక్షించారు. ఏఎస్సీ విష్ణు ఎస్.వారియర్ స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్, ధర్మాజీ శ్రీనివాస్ కలిసి చేపల వేటకు ప్రాజెక్టు దిగువలోని గోదావరి నదిలో దిగారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో ధర్మాజీ శ్రీనివాస్ సాయంత్రం ఒడ్డుకు చేరి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటలు గడుస్తునా తనతోపాటు నదిలో దిగిన ఇద్దరు ఇంటికి చేరలేదు. దీంతో శ్రీనివాస్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు, బట్టలు అక్కడే ఉండడంతో వరదలోనే చిక్కుకున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. అటునుంచి కేకలతో సమాధానం వచ్చింది. సాయంత్రం 6.30 గంటలకు తన తమ్ముడితోపాటు స్నేహితుడు సంతోష్ వరద నీటిలో చిక్కుకున్నాడని సర్పంచ్ సంకటి సుధాకర్‌కు శ్రీనివాస్ తెలియజేశాడు. సర్పంచ్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 8గంటలకు ప్రాజెక్టు వద్దకు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, గ్రామ పోలీసు అధికారి బాయి శ్రీనివాస్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి టార్చిలైట్ల సాయంతో మరోసారి జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి సమాంతరంగా బురద, ముళ్లపొదలు దాటుకుంటూ కొద్దిదూరం వెళ్లారు. తర్వాత కేకలు వేయడంతో.. వరదనీటిలోనే ఉన్నామని నీటిలో చిక్కుకున్న వారి నుంచి సమాధానం వచ్చింది. ‘మీకేం భయంలేదు.. జాగ్రత్తగా ఉండండి.. ఏం వరద రాదని’ వారికి ఎస్సై తదితరులు ధైర్యం చెప్పారు. అదే రాత్రి గుడిపేట వైపు జాలర్లను పిలిపించి వారు చిక్కుకున్న ప్రదేశాన్ని చూపించి ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చారు. చివరగా అర్ధరాత్రి గం.2.30 (సోమవారం వేకువజాము) హైదరాబాద్‌లోని 10వ బెటాలియంకు చెందిన జాతీయ విపత్తుల స్పందన సంస్థ (ఎన్డీఆర్ఎఫ్)కు ఇక్కడి ఘటనను వివరించారు. అధునాతన వస్తుసామగ్రితో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక బస్సులో బయలు దేరి సోమవారం ఉదయం 6 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరారు. ప్రాజెక్టులో వరద పరిస్థితిని గోదావరిఖని ఏఎస్పీతో సమీక్షించారు. గేట్ల వద్ద వరద ఉధృతితోపాటు ఎయిర్‌బోట్స్ దిగేందుకు ప్లాట్‌ఫామ్స్ లేకపోవడం, ఇరువైపులా భారీగా ముళ్లపొదలు ఉండడంతో ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్ వద్ద నుంచి ఆపరేషన్ కుదురుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం స్పష్టం చేసింది. దీంతో ఉదయం 8.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్‌కు 22 మందితో కూడిన బృందం చేరుకుంది. వారితో రబ్బర్బోట్, లైట్‌బాయ్, డాట్బ్రాహెల్మోటార్స్, లైట్ జాకెట్స్, లైఫ్లైన్రోప్స్తో ఎన్డీఆర్ఎఫ్ ఎస్సైలు ఘన్పాల్సింగ్, తృశాల్సింగ్తోపాటు 22 మంది బృందం వరద నీటిలో దిగేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు రబ్బర్ బోట్స్‌తో మరిన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని మూడు బృందాలుగా విడిపోయి ఉదయం 11.30గటలకు ప్రాజెక్టు వరద నీటిలోకి మొదటి బోటులో ఐదుగురు బృందంతో దిగారు. దాని తర్వాత పది నిమిషాల వ్యవధిలోనే రెండో బోటు దిగి వెళ్తుున్న క్రమంలో వరద ఉధృతితో వెనుకకు కొట్టుకు వచ్చింది. దీంతో మొదటి బోటుతోనే ఆపరేషన్ చేపట్టారు. వరద ఉధృతికి బోటు పది మీటర్లు ముందుకు వెళ్తే.. ఇరవై మీటర్లు వెనక్కి వచ్చింది. అయినా వెనక్కి తగ్గని బృందం.. జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి వంద మీటర్ల దూరానికి చేరింది. బోటును చూస్తుండగా అందరి ముఖాల్లో సంతోషం.. క్రమంగా ఉత్కంఠకు తెరతీసింది. పెరుగుతున్న వరద ఉధృతితో సుమారు ఐదు వందల మీటర్ల దూరానికి బోటు పక్కకు కొట్టుకుపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై కొట్టుకుపోతున్న బోటుకు ఎదురుగా ఉన్న రెండు గేట్లను మూసివేశారు. దీంతో బోటు ముందుకు సాగిపోయింది. ప్రయాణం సాఫీగా సాగి నీటిలో చిక్కుకున్న జాలర్ల వద్దకు చేరుకున్న సహాయ బృందం.. ఇద్దరు జాలర్లను బోటులోకి ఎక్కించుకొని మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుగు ప్రయాణమైంది. ఇరవై నిమిషాల్లో ముల్కల్ల ఘాట్‌కు సురక్షితంగా చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది.. జాలర్లకు అత్యవసర వైద్య సేవలు అందించారు. బీపీ, ఇతరత్రా పరీక్షలు జరిపారు. తక్షణమే అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆదిలాబాద్ జేసీ సుందర్ అబ్నార్ ముల్కల్ల ఘాట్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. గోదావరిఖని ఏఎస్పీ, బెల్లంపల్లి డీఎస్పీ, మంచిర్యాల ఆర్డీవో తదితరులు ఎన్డీఆర్ఎఫ్ సేవలను ప్రశంసించారు. బెటాలియన్ ఎస్సైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం వరద నీటిలో గాలిస్తున్నంత సేపు ముల్కల్ల ఘాట్‌తోపాటు ఎల్లంపల్లి బ్యారేజీపై ఉన్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు బోట్లో ఉన్న వారితో ఎప్పటికప్పుడు వాకీటాకీలతో పరిస్థితిని తెలుసుకుంటూ ముందుకు సాగడం అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది. -
వరద సహాయకచర్యల్లో ఎన్డీఆర్ఎఫ్
-
వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేయడంతో.. నాలుగు ఆర్మీ బృందాలు బేగంపేట్, నిజాంపేట, హకింపేట, అల్వాల్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆర్మీ సహాయకచర్యలు చేపడుతోంది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్మీ సిబ్బంది ఇప్పటికే ఆల్వాల్‌లో పర్యటించి అక్కడి వరద ప్రభావిత ప్రాంతంలో అందించడానికి మెడికల్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రాష్ట్రంలో సహాయకార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని.. మరో రెండు బృందాలు పుణె నుంచి వస్తున్నాయని ఉన్నతాధికారులు మధుసూధన్‌రెడ్డి, సెల్వం వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో రెవెన్యూ శాఖ కార్యదర్శి కె. ప్రదీప్ చంద్రను వారు కలిశారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మధుసూదన్‌రెడ్డి, సెల్వం మాట్లాడుతూ... ఓ బృందాన్ని మెదక్ జిల్లాకు, మరో బృందాన్ని నిజామాబాద్ పంపిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు బృందాలు హైదరాబాద్‌లో పని చేస్తాయని వారు చెప్పారు. -
వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్
-
ఎన్డీఆర్ఎఫ్ విన్యాసాలు
-
చెన్నై చూపు...ఆకాశం వైపు
- హెలికాప్టర్ కనిపిస్తే చాలు.. ఆహారం కోసం బాధితుల హాహాకారాలు - శాంతించిన అడయార్, కూవం నదులు - ఇంకా భారీ ముంపులోనే లోతట్టు ప్రాంతాలు - పొంచి ఉన్న అంటువ్యాధుల ముప్పు - ఇళ్లలోనే బందీలైన ప్రజలు.. పాలు, తాగునీరు లేక అవస్థలు - ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు - వాటర్ క్యాన్ రూ.200, పాలు లీటర్ రూ.100 - సహాయక చర్యలు కొనసాగిస్తున్న సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ - మళ్లీ భారీ వర్షం.. బిక్కుబిక్కుమంటున్న జనం ‘నా పేరు ప్రసన్న వెంకటరామ్. ఒక అమెరికన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ చెన్నై బ్రాంచిలో సిస్టమ్ ఎనలిస్టుగా పనిచేస్తున్నా. ప్రస్తుతం నేను 18 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతున్నా. చెన్నై నగరంలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ నాకుందని చెప్పుకోవడానికి గర్విస్తాను. ఆర్థికంగా నా శక్తి సామర్థ్యాల గురించి ఇంకా చెప్పాలంటే... ఈ క్షణంలో లక్ష రూపాయల పరిమితితో రెండు క్రెడిట్ కార్డ్స్, రూ.65 వేల బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరుంది... ఇదే క్షణంలో నేను మా ఇంటి టై పై నిలబడి ఏదైనా అన్నం పాకెట్ వచ్చిపడుతుందా అని ఆర్తిగా ఎదురుచూస్తున్నా! ఆర్థికంగా స్థితిమంతుడైన నేను ఇప్పుడు బతకాలంటే కావాల్సింది తినడానికి ఇంత ఆహారం, తాగడానికి కాసిన్ని నీళ్లు. మా ఇంటిని వరదనీరు చుట్టుముట్టింది. బయటకు అడుగుపెట్టే పరిస్థితే లేదు. దీంతో ఒక యాచకుడిలా మారింది నా స్థితి. నిన్నటి వరకూ నా ఆలోచనలు, ప్రాధాన్యతలు వేరు. నా అప్రైజల్ గురించి, ఈ ఏడాదికి నేను కోరుకుంటున్న 15 శాతం హైక్ దొరుకుతుందా లేదా.. అని మధనపడేవాడిని. అయితే ఊహించనే లేని రీతిలో ఈ రోజు.. మా ఇంటి టై మీదకు ఎక్కి హెలికాప్టర్ల నుంచి ఏమైనా అన్నం పాకెట్లు పడతాయా.. అని ఎదురుచూస్తున్నా... ప్రకృతి మనిషి ప్రాధాన్యతలను, స్థితిని మార్చేయగలదనే పాఠం ఇప్పుడు బోధపడుతోంది.’ - చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాట్సాప్‌లో షేర్ చేసిన మెసేజ్ ఇది. రాజు-పేద తేడా లేకుండా చెన్నై వాసులను కబళించిన వరద తీవ్రతకు నిదర్శనమీ మెసేజ్. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైతో వరుణుడు చెలగాటమాడుతున్నాడు. అక్కడక్కడా అడపాదడపా చిరుజల్లులు మినహాయించి దాదాపుగా రోజంతా వర్షపు జాడ లేకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ శుక్రవారం మధ్యాహ్నానికి వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. కారు మబ్బులు మళ్లీ ముంచుకొచ్చాయి. మైలాపూర్, కొట్టూర్పురం, కోడంబాక్కం, టీ నగర్, అడయార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అడయార్ నది పక్కన ఉన్న కొట్టూర్పురంలో ఇప్పటికీ రెండో అంతస్తు వరకు నీళ్లున్నాయి. వేలచెరి తదితర ప్రాంతాలు కూడా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. మధ్యమధ్యలో కురుస్తున్న వర్షాలు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయితే రాత్రికి భారీ వర్షం తిరిగి ప్రారంభమయ్యింది. తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో.. మళ్లీ భీకర ముంపును తలుచుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు వరద కొంత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇళ్ల మిద్దెలపై, బహుళ అంతస్తుల భవనాలపై చిక్కుకుపోయినవారు ఆహారం కోసం అలమటిస్తున్నారు. హెలికాప్టర్ ఏదైనా కనబడితే చాలు ఆహార పొట్లాల కోసం తలలు పెకైత్తి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపూ ఆకాశం వైపే. శాంతించు వాన దేవుడా అంటూ కొందరు.. హెలికాఫ్టర్లు జారవిడిచే ఆహారం కోసం ఇంకొందరు. కాగా సుమారు 12 లక్షల ఇళ్లు ముంపునకు గురయ్యాయని, 50 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ప్రాథమిక అంచనా. 1.27 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. చేతిలోనూ, ఏటీఎంలలోనూ డబ్బుల్లేవు.. చెన్నైవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరికి డబ్బుల్లేవు. బ్యాంకులో డబ్బున్నా తీసుకుందామంటే ఏటీఎంలు పనిచేయడం లేదు. చేతిలో డబ్బులున్నవారికి కొనేందుకు నిత్యావసరాలు అందుబాటులో లేవు. నగరంతో పాటు శివార్లలో లక్షలాదిమందిని పాలు, నీళ్లు, ఆహార వస్తువుల వంటి నిత్యావసరాల కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నా రేట్లు చుక్కలనంటుతున్నాయి. లీటర్ ఆవిన్ పాల ప్యాకెట్ రూ.100 వరకు ధర పలికింది. కొన్నిచోట్ల అరలీటర్ ప్యాకెట్టుకు కూడా వంద వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నై నగరానికి రోజుకు 11.5లక్షల లీటర్ల ఆవిన్ పాలు, ప్రైవేటు సంస్థల నుండి మరో 25 లక్షల లీటర్ల పాలు సరఫరా కావాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా పాలసేకరణ దెబ్బతినడంతో రోజుకు 7 లక్షల లీటర్ల పాలే సరఫరా జరుగుతోంది. దీంతో ప్రైవేటు పాల వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. కోయంబేడు మార్కెట్‌కు తాజాగా కూరగాయలు రాకపోవడంతో కిలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. ఇక వాటర్ క్యాన్ ధరైతే దాదాపుగా డబుల్ సెంచరీకి (రూ.200) చేరువైంది. కొన్నిచోట్ల అది కూడా అందుబాటులో లేదు. కొందరు అరటిపండ్లతో ఆకలి తీర్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఒక్కో అరటిపండును రూ.20 చొప్పున కూడా వ్యాపారులు విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్.కె.నగర్‌ను సందర్శించిన సీనియర్ మంత్రులు నాథం విశ్వనాథన్, సెల్లూర్ రాజు, గోకుల్ ఇందిరలను స్థానికులు ఘెరావ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకెలాంటి సహాయం అందకపోవడంపై అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. హోటళ్లు మూతపడటం నగరవాసుల కష్టాలను రెట్టింపు చేసింది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిరాశ్రయులైన వేలాది మంది స్వస్థలాలకు చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా విద్యాసంస్థలను సైతం వరద ముంచెత్తడంతో సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులకు తమ ఇళ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లే దు. రైళ్లు లేవు. అరకొరగా అందుబాటులో ఉన్న బస్సుల్లో వెళ్లేందుకు ఒక్కొక్కరూ రూ.1000 నుంచి రూ.2,000 వెచ్చించాల్సి వచ్చింది. కొందరికి ఆ అవకాశం కూడా చిక్కకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. సేవల పాక్షిక పునరుద్ధరణ విమాన, రైళ్ల సర్వీసులు శుక్రవారం పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మొబైల్ ఫోన్ సర్వీసులను కూడా పాక్షికంగా పునరుద్ధరించారు. 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. మౌంట్ రోడ్‌తో పాటు మరికొన్ని కీలక రోడ్లలో శుక్రవారం అధికారులు మూడురోజుల తర్వాత ట్రాఫిక్‌ను అనుమతించారు. పెట్రోలు బంకుల్లోకి నీరు చేరిపోవడం వల్ల డీజిల్, పెట్రోలు లభించడం లేదు. డీజిల్ దొరక్కపోవడంతో జనరేటర్లు మూగబోయాయి. ట్యాంకర్ల డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో డీజిల్, పెట్రోల్ తరలింపు సమస్యాత్మకంగా మారింది. 10 వేలమందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తీవ్ర ముంపు ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్డీఆర్ఎఫ్ శుక్రవారం సహాయక కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసింది. ఇంతవరకు 10 వేలకు పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సంస్థ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. మనాలి, కొట్టూర్పురం, గ్లోబల్ హెల్త్ సిటీ ప్రాంతాల్లో బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు. ఐటీపీఎల్ కాలనీలో ముగ్గురి మృతి నందంబాక్కంలోకి చెంబరబాక్కం చెరువు నీరు భారీఎత్తున చేరిపోవడంతో ఐటీపీఎల్ కాలనీ మునిగిపోయింది. కాలనీలోని ఓ కుటుంబ యజమాని కృష్ణన్ ఎప్పుడో మరణించాడు. ఆయన భార్య సుశీల (62), నడవలేని వికలాంగురాలైన కుమార్తె విజయ (36), కుమారుడు వెంకటేశన్ (32)లను వరదనీరు నిలువునా ముంచేయడంతో బైటకురాలేని స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రీతి.. ఇప్పుడు భీతి వాన.. ఒకప్పుడు ఈ పదమంటే తమిళనాడు ప్రజలకు ఎంతో ప్రీతి. నేడు అదే రెండు అక్షరాల పదం తమిళనాడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల ప్రజలు వానపేరు చెబితేనే వణికి పోతున్నారు. సహజంగా తమిళనాడులో ఎప్పుడూ లోటు వర్షపాతమే. చెన్నై నగరంతోపాటూ అనేక ప్రధాన నగరాలు తాగునీటి కోసం తపిస్తుంటాయి. చెన్నై వాసులైతే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే కృష్ణ నీటికోసం ఏటా ఎదురుచూస్తుంటారు. చెన్నై నగరంలో తాగునీటి కటకటను తట్టుకోలేక కృష్ణా జలాల కోసం ఏపీ ప్రభుత్వంపై కేసు దాఖలు చేసేందుకు సైతం ఇటీవల సిద్ధమైంది. నైరుతి రుతుపవనాలు తమిళనాడుపై ముఖం చాటేసినా అక్టోబరు 28వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. చిరుజల్లులతో ప్రారంభమై అడపాదడపా వర్షాలతో పులకరింపజేశాయి. అయితే గతనెల మొదటి వారంలో రుతుపవనాల ప్రభావం తీవ్రమై తుఫాను రూపంలో కడలూరు జిల్లాను కుదిపేశాయి. ఆ తరువాత మందగించిన వర్షాలు క్రమేణా విశ్వరూపం దాల్చాయి. ప్రకృతి చేసిన విలయతాండవం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం...ఈ మూడు జిల్లాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. చెరువులు, ఊర్లు ఏకమైనాయి. దీంతో జనం తంజావూరులో వరుణదేవుని ఆలయంలో ఇక వర్షాలు వద్దు అంటూ శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భారీవర్ష సూచన అల్పపీడనం కొనసాగుతుండటంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ ఎస్.ఆర్.రమణన్ చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది. దక్షిణ కోస్తా తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం అతి భారీ వర్షాలకు కూడా కురిసే సూచనలున్నాయని పుణెలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. చెన్నైలో అడపాదడపా వర్షం కొనసాగుతుండగా పుదుచ్చేరి, కడలూరు, కారైక్కాల్, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. -
'చెన్నైలో వరద తగ్గుతోంది'
చెన్నై: భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు. -
అడిగింది 5వేల కోట్లు.. ఇచ్చింది వెయ్యి కోట్లు
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 5 వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. భారీవర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మోదీని జయలలిత కలిశారు. భారీవర్షాలతో తమ రాష్ట్రానికి జరిగిన నష్ట్రాన్ని వివరించారు. జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్డీఆర్ ఎఫ్) కింద రూ. 5 వేల కోట్లు సహాయం చేయాలని ఆర్థించారు. జయ విన్నపానికి స్పందించిన మోదీ రూ.1000 కోట్లు ఎన్డీఆర్ ఎఫ్ కింద తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సహాయక కార్యక్రమాలకు అదనంగా 10 ఆర్మీ బలగాలు, 20 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని జయలలిత కోరగా ప్రధాని అంగీకరించారు. -
ఏపీకి ఎన్ఐడీఎం హుళక్కే!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి ష్టాత్మక ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం... విపత్తుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు రూపొందించే, ప్రాంతీయ కేంద్రాలను పర్యవేక్షించే కీలకమైన ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉన్నా దానికి అవసరమైన హంగులేమీ లేవు. చిన్న కార్యాలయంలోనే ఇది నడుస్తోంది. సువిశాల తీరప్రాంతమున్న ఏపీలో పూర్తిస్థాయి ఎన్ఐడీఎం కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి ఢిల్లీలోని ప్రస్తుత కార్యాలయాన్ని ప్రాంతీయ కేంద్రంగా మార్చాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు స్థలం కేటాయించాలనీ రాష్ట్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో జాతీయ విపత్తు సహాయదళం(ఎన్డీఆర్ఎఫ్) కోసం గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుని జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిర్మాణ పనులు ఆరంభించినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకోవడంపై సంబంధిత అధికారులు కినుక వహించారు. ‘ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమిని నిర్మాణ పనులు ఆరంభించిన తర్వాత వెనక్కు తీసుకోవడం ఏమిటి? మరెక్కడా రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి లేదా?’ అని కేంద్ర హోంశాఖ అధికారులు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఐడీఎంకు స్థలం కేటాయింపులోనూ జాప్యం చేయడంతో ఏపీలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న ఢిల్లీలోనే కొంతకాలం కొనసాగించి తర్వాత అవసరమైతే వేరే రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం. రాష్ట్రానికి వచ్చిన సంస్థను పోగొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును అధికారులు తప్పుబడుతున్నారు. గన్నవరం మండలంలో... గన్నవరం మండలంలో వంద ఎకరాల్లో ఎన్ఐడీఎం, 50 ఎకరాల్లో ఎన్డీఆర్ఎఫ్, 50 ఎకరాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ కోరింది. తదుపరి కేంద్రం ఎన్ఐడీఎం విషయంలో నిర్ణయం మార్చుకున్నందున దీనికి పది ఎకరాలే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. -
ఢిల్లీలో అణుధార్మికత లీకేజీ కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అణుధార్మిక పదార్థం లీకేజీ కలకలం రేపింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అణుధార్మిక పదార్థాలు లీకవడంతో ఆందోళన రేగింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే కనుగొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానంలో ఇది వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోర్టిస్ ఆస్పత్రి కోసం ఇస్తాంబుల్ నుంచి దీన్ని తెప్పించారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. ఫోర్టిస్ ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నట్టు చెప్పారు. పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామని చెప్పారు. ఎయిర్ పోర్టులోని కార్గో కాంపెక్స్ నుంచి అణుధార్మికత లీకయినట్టు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అణుశక్తి విభాగం బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుందన్నారు. అణుధార్మికత లీకేజీని నియంత్రించారని తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అణుధార్మికత లీకైందన్న కోణంలో సీఐఎస్ఎఫ్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తక్షణం ఆదుకోండి: మోదీ ఆదేశం
నేపాల్ సహా భారత్ లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాల్సిందిగా జాతీయ విపత్తు నివారణ బృందాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. నేపాల్ కేంద్రంగా శనివారం ఉదయం సంభవించిన భూకంపం అనంతర పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించిన ఆయన సహాక చర్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు వైద్య సదుపాయాలు అందించాలని, నేపాల్ లో చిక్కుకుపోయిన భారత యాత్రికులను వెంటనే స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నించాలని సూచించారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కోయిరాలాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇటు భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి కల్లా జాతీయ విపత్తు నివారణ బృందం నేపాల్‌కు చేరుకోనుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రధానితో సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
నలియా వద్ద తీరం దాటనున్న నీలోఫర్ తుపాన్
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నిలోఫర్ తుపానుగా మారి నవంబర్ 1న తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గుజరాత్‌లోని నలియా వద్ద తీరం దాటనున్నట్లు వారు తెలిపారు. గుజరాత్ సహా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితులలో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బలగాలను తరలించారు. ** -
గజగజ
ఏలూరు:తీరం వైపు మహోగ్రంగా దూసుకొస్తున్న హుదూద్ పెను తుపాను జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఏ క్షణాన ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రజలను, అధికారులను కలవరపెడుతోంది. జిల్లా యంత్రాం గం నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమైంది. విశాఖ పట్నం నుంచి 36 మంది సభ్యులు గల కోస్టుగార్డు బృందం, గుంటూరు నుంచి 40 మంది సభ్యులు గల జాతీయ విపత్తుల నివారణ (ఎన్డీఆర్ఎఫ్) బృందం జిల్లాకు చేరుకున్నారుు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలపై యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రెండు మండలాల్లో 14 పునరావాస కేంద్రాలను, కాళ్ల, భీమవరం, యల మంచిలి మండలాల్లో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 5,045 మందికి పునరావాసం కల్పించారు. సీఎం ఆరా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కలెక్టర్ కె.భాస్కర్‌తో మాట్లాడిన ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఇదిలావుండగా, అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు తీర గ్రామాల్లోనే మకాం వేశారు. నరసాపురం మండలంలో సముద్ర తీర గ్రామాలైన వేములదీవి తూర్పు, పడమర, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, బియ్యపుతిప్ప గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామాల్లో ఏర్పాట్లను జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డీవో పుష్పమణి, డీహెఎంహెచ్వో శంకరరావు పర్యవేక్షిస్తున్నారు. కేపీ హైస్కూల్, పేరుపాలెం హైస్కూల్లో శనివారం రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆ గ్రామాలను సందర్శించారు. ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. తీర గ్రామాల్లో మంత్రి సుజాత,కలెక్టర్ పర్యటన నరసాపురం మండలంలోని తీర గ్రామా ల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ శని వారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటుతుందని, ఆ సమయంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా గుడిసెలు, పాకల్లో నివాసం ఉంటున్న వారిని బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పెదమైనవాని లంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి పీతల సుజాత పరిశీ లించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలకు లోనుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్లు, బస్సులు రద్దు హుదూద్ తుపాను తీవ్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖ వైపు వెళ్లే, అటు నుంచి వచే అన్ని రైళ్లను శనివారం అర్ధరాత్రి నుంచి రద్దు చేశారు. చెన్నై, హౌరా ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లిం చారు. జిల్లా మీదుగా వెళ్లే 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నుంచి నిలిపివేశారు. గోదావరి, రత్నాచల్, లింక్, బొకారో, తిరుమల తదితర రైళ్లు రద్దయ్యూరుు. విజయవాడ-రాయగడ, రాయగడ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేశారు. హౌరా వైపు వెళ్లే ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించారు. ఉదయం 8.25 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విశాఖపట్నం రైలును రాజ మండ్రి వరకే నడపాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోల నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులను శనివారం రద్దు చేశారు. ఆదివారం బస్సులను నడిపేది లేనిది అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రీజినల్ మేనేజర్ ఆర్.రామారావు తెలిపారు. రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాట్లు రైళ్ల రాకపోకలు, రద్దు తదితర వివరాలను తెలుసుకునేందుకు ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన 08812-232267కు ఫోన్ చేయూలని స్టేషన్ మేనేజర్ ఐ.ప్రభాకరరావు సూచించారు. రద్దయిన రైళ్లలో టికెట్లు తీసుకున్న ప్రయూణికులకు సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏవైనా రైళ్లు ఏలూరు సమీపంలోకి వచ్చాక రద్దు చేయూల్సి వస్తే వాటిలోని ప్రయూణికులకు భోజనం, పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జాగ్రత్త సుమా! తుపాను వల్ల తీర గ్రామాల్లో ఏ ఒక్కరికీ ప్రాణహాని లేకుండా చూడాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం రాత్రి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఎవరికైనా ప్రాణహాని జరిగితే అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారం తీసుకుని బలవంతంగానైనా తరలించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ అధికారులెవరూ తమ కార్యస్థానాలను విడిచి వెళ్లొద్దన్నారు. జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. వీలైనంత వరకూ పురుషులు, మహిళలకు వేర్వేరుగా వసతి కల్పించేలా చూడాలన్నారు. గోదావరి, ఎర్రకాలువ, తమ్మిలేరు పరీవాహక ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శెట్టిపేట సమీపంలోని గ్రామాలు, భీమవరంలో యనమదుర్రు డ్రెరుున్ పక్కన మురికివాడలు, మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, మోళ్లపర్రు, నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, సీపీవో సత్యనారాయణ, గృహనిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు, సెట్వెల్ సీఈవో సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల పాల్గొన్నారు. -
'హుదూద్ ను ఎదుర్కొనేందుకు 15 బృందాలు'
కాకినాడ: హుదూద్ తుఫాన్ ఎదుర్కొనేందుకు 15 బృందాలను సిద్ధం చేశామని ఎన్ డీఆర్ఎఫ్ కమాండర్ ప్రశాంత్ దార్ వెల్లడించారు. శ్రీకాకుళంలో 2 బృందాలు, విజయనగరంలో 1, విశాఖ 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, మంగళగిరి 4 బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ డీఆర్ఎఫ్ బృందాలకు శాటిలైట్ ఫోన్లను అందించామన్నారు. -
'శిథిలాల తొలగింపుకు మరో రెండురోజులు'
-
మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 18 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. నదిలో మునిగిపోయిన విద్యార్ధుల ఆచూకీని తెలుసుకునేందుకు ఉపరితలం నుంచి మానవ రహిత విమానం ద్వారా ఫోటోలు తీయడానికి వినియోగించనున్నారు. విద్యార్ధుల మృతదేహాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ ద్వారా విమానం ఫోటోలు తీయడానికి, నీటి అడుగు భాగంలో పనిచేసే కెమెరాల వినియోగం, ప్రమాద ఘటనా స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు జాతీయ విపత్తు సంస్థ నిర్ణయం తీసుకుంది. -
'నదిలో గల్లంతైన విద్యార్ధులు బతికిలేనట్టే'
మండి( హిమాచల్ ప్రదేశ్): బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధులు ఇక బతికి లేనట్టేనని జాతీయ విపత్తు సంస్థ అధికారి జైదీప్ సింగ్ అన్నారు. 18 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని జైదీప్ సింగ్ తెలిపారు. గాలింపు చర్యల్లో రేపు కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశముందని ఆయన తెలిపారు. బియాస్ నదిలో ఉదయం పూట నదిలో నీళ్లు తక్కువగా ఉంటున్నాయని, అదే సమయంలో గాలింపునకు ఆస్కారం ఉంటోందని జైదీప్ సింగ్ అన్నారు. విద్యార్ధుల గాలింపు చర్యలపై అధికారులతో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మరోసారి సమీక్ష జరిపారు. రిజర్వాయర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో సైరన్ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం వీరభద్ర సింగ్ ఆదేశించారు. తీరం వెంబడి హెచ్చరిక బోర్డులు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. కనీసం 500 మంది జవాన్లను గాలింపు కోసం వినియోగించాలని హోంశాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు. -
రాష్ట్రానికీ ఓ ‘డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’
డీజీపీ ప్రసాదరావు వెల్లడి 250 మందితో ఏపీఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు బోగీ దగ్ధం కేసులో విద్రోహ చర్యల కోణంలోనూ దర్యాప్తు పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు తగ్గిన నక్సలైట్ల కార్యకలాపాలు, హత్య కేసులు సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్రం అధీనంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) ఉన్నట్లే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటైంది. ప్రాథమికంగా 250 మందితో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ మరో ఆరు నెలల్లో పని చేయడం ప్రారంభిస్తుందని డీజీపీ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు నిర్మాణాలు కూలిన సందర్భంలోనూ ఈ దళం సేవలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మంగళగిరిలోని ఎన్డీఆర్ఎఫ్ లేదా హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా) అధీనం లో ఉండే కోలాప్డ్స్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) బృం దాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కోసారి ప్రాణనష్టం పెరుగుతోంది. ఈ ఏడాది వరుసగా వచ్చిన పైలీన్, హెలెన్, లెహర్ తుఫాన్ల సందర్భంలో రెవెన్యూ యంత్రాంగానికి పోలీసులు గణనీయ సేవలందించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని సహాయ శిబిరాలకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ అనుభవంతో పోలీసు విభాగంలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచించిన డీజీపీ, ఏపీఎస్డీఆర్ఎఫ్కు అంకురార్పణ చేశారు. డీజీపీ చెప్పిన మరికొన్ని అంశాలివీ బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వెనుక విద్రోహ చర్యేలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది శేషాచలం అడవుల్లోని ఏడు రీజియన్లలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు అటవీశాఖ అధికారులకు సాయంగా రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ), ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్) బలగాలను పంపిస్తాం. విభజన అనంతరం గ్రేహౌండ్స్ కేంద్ర అధీనంలోకి వెళ్తే ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధం కేసునకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. బస్సు అసలైన యజమానిగా జేసీ ప్రభాకరరెడ్డి సతీమణి ఉమాప్రభాకరరెడ్డి ఉన్నారు. విచారణ అనంతరం నిందితుల్ని అరెస్టు చేస్తాం. రోడ్డు ప్రమాదాల సంఖ్య గతేడాదితో పోలిస్తే 6.45 శాతం పెరిగాయి. పోలీసు శాఖలో 9,815 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 90 పోలీస్స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్ల కింద పునర్ వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో నక్స ల్స్ కార్యకలాపాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. ఈ ఏడాది 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేయుగా, 76 మంది లొంగిపోయారు. మొత్తం కేసులు 12.94 శాతం పెరగ్గా, హత్య కేసులు 10 శాతం తగ్గాయి. సైబర్, ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక నేరాల ద్వారా రూ.1,627 కోట్లు, ఆస్తి సంబంధిత నేరాలలో రూ.216 కోట్లు స్వాహా జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాదిలో 608 కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం, వేధింపుల కేసులు 16.36 శాతం, కిడ్నాప్ కేసులు 17.94 శాతం పెరిగాయి. -
ముందుజాగ్రత్తలతో తప్పిన పెనుముప్పు
పై-లీన్ తుఫాను తీరం దాటినప్పుడు గాలి వేగం దాదాపు గంటకు 220-240 కిలోమీటర్లు ఉంది. తుఫాను కూడా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. ఇంత తీవ్రత ఉన్న తుఫాను సంభవిస్తే జనం అల్లాడిపోవాలి. నిజానికి 1999లో కూడా ఇంతే తీవ్రతతో తుఫాను సంభవించి ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది అప్పటి విలయానికి దాదాపు 12 వేల మంది మరణించారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే.. ఈసారి కూడా అంతే తీవ్రతతో తుఫాను తీరాన్ని దాటినా, ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం, దానికితోడు రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు.. ఇలా అందరూ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం ఎక్కువ సంభవించకుండా అరికట్టగలిగారు. తుఫాను ప్రభావంతో కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే జాగ్రత్త వహించి ఒడిశా నుంచి దాదాపు 8 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ ప్రాణనష్టం సంభవించకుండా నివారించగలిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ కృష్ణచౌదరి తెలిపారు.