Paddy procurement
-
ధాన్యం కొనుగోలులో దళారీలు వచ్చేసారు..
-
బాబు పాలనలో ధాన్యం సేకరణ, మద్దతు ధర రెండూ లేవు
-
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.ఇవిగో వాస్తవ గణాంకాలు...‘జగన్మోహన్రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.అదే 2019–23 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. -
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న
సాక్షి, అమరావతి: అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో.. అంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కంకులతోనే నిరసనలకు దిగారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయల ఎదుటే సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసిన వరా్షలకు తడిసి ముద్దయిన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ ధైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేయాలని, జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.గింజ ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర దక్కలేదురాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజా కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాధికారులు కూడా దళారుల అవతారమెత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. 25 శాతం తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపాటుతుపాను వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కళ్లాలపై ఉన్న పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తేమ శాతం పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా, రైతు సేవా కేంద్రంలోనే రూ.1,450కు మించి రాదని చెబుతున్నారని తెలిపారు. పైగా తరుగు రూపంలో 15 నుంచి 20 బస్తాలు తగ్గించి రశీదులిస్తున్నారని, ఎందుకిలా కోత విధిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేరని చెప్పారు. గతంలో రైతు భరోసా కేంద్ర (ఆర్బీకే) – మిల్లులకు మధ్య మ్యాపింగ్ ఉండేదని, ప్రస్తుతం పొరుగు జిల్లాలకు కూడా ఇష్టమొచ్చినట్టు తోలుతున్నారని ఆరోపించారు. రవాణా చార్జీల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉండగా, దానినీ రైతుల నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే సరఫరా చేసిన ఎంటీయూ 1262 రకం విత్తనాన్ని సాగు చేస్తే, ఆ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరూ కొనడంలేదని వాపోయారు. బీపీటీ, ముతకలు మాత్రమే కొనమని చెప్పారని, మధ్యస్తంగా ఉండే ఎంటీయూ 1262 కొనలేమని చెబుతున్నారని, దీంతో దళారులకు 75 కేజీల బస్తా రూ.1,250 నుంచి రూ.1,350కు అమ్ముకోవల్సి వస్తోందని వాపోయారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి ఆర్బీకే పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని, ఇక మీదట కొనేది లేదంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సగం కూడా కొనకుండానే లక్ష్యం పూర్తయిందని చెప్పడంలో అర్థం ఏమిటని మండిపడుతున్నారు.గింజ కొనే వారు లేరు..కృష్ణా జిల్లా మొవ్వ మండలం అవురుపూడికి చెందిన ఈ రైతు పేరు ఎం.హరిబాబు. 5.30 ఎకరాల్లో వరి సాగు చేసి గత నెల 24న కోసి 25న నూర్చారు. 29న రైతు సేవా కేంద్రానికి వెళితే 24 శాతం తేమ వచ్చింది. 30 కాటా వేశారు. తేమ 25 శాతం ఉన్నా మద్దతు ధరకు కొంటామని 4 రోజుల క్రితం మంత్రి మనోహర్ చెప్పారు. నిన్నటికి నిన్న తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే బస్తాకు 5 కిలోల తరుగుతో ధాన్యం తెనాలిలో చెప్పారు. ఆ లెక్కనైనా అదనంగా ఉన్న తేమ శాతానికి తరుగు మినహాయించుకొని మద్దతు ధర లెక్కగట్టి ఇవ్వాలని అడుగుతుంటే.. మిల్లర్లు రూ.1,450కు మించి ఇవ్వబోమంటున్నారని అధికారులు చెబుతున్నారని హరిబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంట కోసి ఆరబెట్టేందుకు కూలీలకు రూ.3 వేలు, టార్పాలిన్ల అద్దె రూ. 8 వేలు ఖర్చయిందని తెలిపారు. ధాన్యం తరలించకపోతే మొలకలొస్తాయని మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడంలేదని, తూర్పు గోదావరి నుంచి లారీలు వస్తే పంపిస్తామని అంటున్నారే తప్ప ఎంత రేటుకు కొంటారో చెప్పడం లేదని హరిబాబు వాపోతున్నారు.ఇదేనా 48 గంటల్లో డబ్బులేయడమంటే..ఈ రైతు పేరు వేమూరి నాగేశ్వరరావు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామం. ఒకటిన్నర ఎకరాల్లో వరి పంటను కోసి గతనెల 20న కాటా వేశారు. 40 కిలోల చొప్పున 96 బస్తాలు రైతుసేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు ఈ నెల 21వ తేదీన పంపారు. అదే రోజున ఎఫ్‌టీవో 906200015240005 జనరేట్ అయ్యింది. కానీ 81 బస్తాలకే రశీదు ఇచ్చారు. 24న రూ.74,520 రైతు ఖాతాలో జమైనట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంకులో చూసుకుంటే సొమ్ములు పడలేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ లింక్ అయి ఉండకపోవచ్చని చెప్పారు. రెండ్రోజులు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరిగి ఆధార్ లింక్ చేశారు. 26 నుంచి రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు రాలేదు. అడిగితే కంగారెందుకు.. నాలుగు రోజులాగండంటూ చిరాకు పడుతున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా 96 బస్తాలకుగాను 81 బస్తాలకే రశీదు ఇచ్చారని వాపోయారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. వాస్తవానికి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.రైతుకు అన్యాయం జరుగుతోంది..‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. ..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.మాఫియాకే ‘మద్దతు’!రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండిఇదిలా ఉంటే.. ఫెంగల్ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. ఇక్కడ యుద్ధప్రాతిపదికన పంటను తరలించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్‌లోడింగ్‌కు రోజులు తరబడి సమయంపడుతోంది. సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతున్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతున్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.గతంలో ఎంతో మేలు..గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.‘హాయ్’ అన్నా పలకని ప్రభుత్వం..పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలుఅత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టంఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. అంచనా వేసిన వ్యవసాయశాఖఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎకరాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.భయమేస్తోంది..నేను కౌలుకు సాగుచేస్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపానుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. – యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా కొనేవారు కరువయ్యారు.. ‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. – వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాఅన్ని విధాలా నష్టపోయాం.. పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా నష్టపోయాం. – నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాగతంలో ఇలా ఇబ్బంది పడలేదు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. – పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే: ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్ నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ : ధరావత్ రవి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్ -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్‌లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు
-
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారానికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టాల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తక్షణ స్పందన రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకొక ఐఏఎస్ అధికారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్ ఫండ్‌ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. మొలక 7–10 శాతం ఉన్నా సరే.. మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో (వాస్తవానికి పూర్తిగా ఆన్లైన్లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలానికో మినీ మొబైల్ మిల్లు నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్ అయినా íపిలిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నారు. రంగంలోకి మార్క్‌ఫెడ్ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా.. జిల్లా రైతుల సంఖ్య సేకరించిన ధాన్యం (టన్నుల్లో) పశ్చిమగోదావరి 28,650 2,62,711 ఏలూరు 11,423 1,34,543 తూర్పుగోదావరి 12,998 1,19,748 కోనసీమ 5,975 46,669 కాకినాడ 2,481 18,357 కృష్ణా 2,598 15,298 బాపట్ల 1968 12,014 నెల్లూరు 281 4257 ప్రకాశం 411 2577 ఎన్టీఆర్ 113 1456 ––––– వేగంగా స్పందించి కొన్నారు నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చారు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు. – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్‌తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్‌తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. – పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా ధాన్యం తరలింపు అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రబీ సీజన్లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా.. సంవత్సరం టన్నులు 2014–15 18,91,106 2015–16 20,70,540 2016–17 16,95,341 2017–18 18,12,994 2018–19 16,47,193 (మార్చి 31 వరకు) మొత్తం 91,17,174 –––– వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2018–19 11,05,578 (ఏప్రిల్ 1నుంచి) 2019–20 34,73,827 2020–21 37,23,522 2021–22 26,22,386 2022–23 6,17,761 (మే 6వ తేదీ వరకు) 1,15,43,074 ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారి అల్లూరి సీతారామరాజు ప్రవీణ్‌కుమార్, ఎండీ ఎపీఐఐసీ అనకాపల్లి జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ బాపట్ల కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ (ఇన్ఫ్రా) తూర్పు గోదావరి వివేక్‌యాదవ్, కమిషనర్ సీఆర్డీఎ ఏలూరు శశిభూషణ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖ గుంటూరు ఎండీ ఇంతియాజ్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, సెర్ప్ కాకినాడ పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్సీఎస్సీఎల్ కృష్ణా లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్‌హెచ్‌సీఎల్ ఎన్టీఆర్ గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఎస్పీఎస్ నెల్లూరు చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ పల్నాడు సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్ పార్వతీపురం మన్యం ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకాశం ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య పశ్చిమగోదావరి కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ అనంతపురం ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు. కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో కలెక్టర్ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది. -
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్‌కార్డులు అందజేశారు. -
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఉత్తరాంధ్రలో వారంలోగా.. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాప్.. నిజామాబాద్ ఆఖరున ఆదిలాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 63.20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ కారణంగా.. దాదాపు 65 లక్షల టన్నులకు మించి సేకరణ జరిగే అవకాశం కనిపించడం లేదు. ముప్పావువంతుకుపైగా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించగా, అతితక్కువ సేకరణలో ఆదిలాబాద్ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,015 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,100 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 20 వరకు కొంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. రెండు, మూడు స్థానాల్లో కామారెడ్డి, నల్లగొండ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.1,204.36 కోట్ల విలువైన 5,85,661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మూడేళ్లుగా పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్‌లోనే అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ తరువాత స్థానాల్లో 4,75,082 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రెండోస్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, 4,11,827 మెట్రిక్ టన్నులతో మూడోస్థానంలో నల్లగొండ జిల్లా ఉంది. 2,198 మెట్రిక్ టన్నులతో ఆఖరున ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో వరిసాగు అతితక్కువగా ఉండడమే అందుకు కారణం. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం రాష్ట్రంలో ధాన్యం సేకరణకు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానం చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట వంటి జిల్లాల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని మిల్లర్లు కల్లాల మీదే కొనుగోలు చేసి, బియ్యంగా మరపట్టించి విక్రయించారు. అగ్గువకో, సగ్గువకో తక్షణమే నగదు వస్తుండటంతో రైతులు కూడా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు భారీ ఎత్తున విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రావలసిన ధాన్యం తగ్గింది. 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారుల ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.12,430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్ ఆఖరు నాటికి 25.84 ఎల్ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్‌ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. నిజామాబాద్ టాప్ వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్ జిల్లాలో 5,38,354 మెట్రిక్ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 3,22,047 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సన్నాలకు డిమాండ్‌తో... జై శ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. -
ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణ కోసం ఈసారి 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ధాన్యం కోసం అవసరమైన 25 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. -
ఈసారి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట సాగైన నేపథ్యంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజను సేకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవసాయ, పోలీస్, మార్కెటింగ్, సహకార శాఖలకు చెందిన అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండించిన స్థితి నుంచి ఏకంగా కోటీ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ సారి 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు, తేమ కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 17 జిల్లాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం అక్రమ దిగుమతిని అడ్డుకొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు తెచ్చే ధాన్యాన్ని విజిలెన్స్‌తో పాటు పోలీస్ శాఖ అడ్డుకోవాలని ఆదేశించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ధాన్యం నిల్వకు ఏర్పాట్లు మిల్లర్ల వద్ద ఇప్పటికే దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యానికి తగిన నిల్వ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి గంగుల ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా సీఎంఆర్ కింద అప్పగించి, తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్‌కు ఎఫ్‌సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్‌సీఐ తీసుకున్న సీఎంఆర్‌కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్‌సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్‌లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
ధాన్యం సేకరణపై స్పందించకుంటే నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మోదీ కుట్రలను ఛేదించడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతుచూస్తామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత మరమ్మతులు చేసి పంపులను వినియోగంలోకి తెస్తుందని రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
కేంద్రం రైడింగ్‌ల పేరుతో వేధింపులు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులకు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయనివ్వకుండా మిల్లర్లపై కేంద్రప్రభుత్వం రైడింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేసే నాయకుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్కరేనని, అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ధాన్యాన్ని తెచ్చి తెలంగాణలో కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవం చేయిస్తే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేల పారితోషికం అందిస్తామని చెప్పారు. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరలోనే 1,300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. -
నిరంతరం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆటంకం లేకుండా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ న్నారు. మొన్నటి అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశా మని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినపక్షంలో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేస్తా మని రైతులకు భరోసా ఇచ్చి, ప్రతి ధాన్యం గింజను కొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ధాన్యం కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే రూ.3 వేల కోట్లకు పైగా భారాన్ని భరిస్తూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ చేయిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.5,888 వేల కోట్ల విలువైన 30.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 4.72 లక్షల మంది రైతుల నుండి సేకరించాం..’అని గంగుల వివరించారు. కేంద్రం సహకరించకున్నా.. ‘కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష తనిఖీల పేరుతో కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విష యాన్ని రైతులు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మే 2 వరకు ఒక్క గన్నీ బ్యాగును రాష్ట్రానికి అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదు. 6,544 కొనుగోలు కేంద్రాలకు గానూ 500 కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయింది. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నాం. 11.64 కోట్ల గన్నీ బ్యాగుల్ని సేకరించాం. వీటిలో 7.52 కోట్ల సంచులు వాడగా, ఇంకా 4.12 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఈ బ్యాగులు సరిపోతాయి. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తాం. ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలలో మరో వారం రోజుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకు పూర్తవుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ధరకు వడ్లు కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేవలం ఒక్కరిద్దరికే మద్దతు ధర ఇస్తున్నారని, మిగతా వారి నుంచి తక్కువ ధరకే వడ్లు కొంటూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. ‘రైతుల నుంచి వడ్లు కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరి వేసిన రైతులు అతలాకుతలమవుతున్నారు. రైతన్నలు పంట వేయకపోతే మనం అన్నం కాకుండా గడ్డి తినాలా’అని షర్మిల నిలదీశారు. మద్దతు ధర కూడా ఇవ్వని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రను సైతం పక్కన పెట్టానన్నారు. పంట బీమానే కాదు.. పంట నష్ట పరిహారం కూడా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. -
కేసీఆర్ చెప్తేనే అలా చేశాం.. మోసపోయాం.. పరిహారమిచ్చి ఆదుకోండి
ఉప్పల్వాయికి చెందిన తిరుమలయ్యకు పెద్ద చెరువు కింద ఏడు ఎకరాల భూమి ఉంది. చెరువులో నీరు ఉండటంతో వానాకాలంలో మొత్తం వరి సాగు చేశాడు. యాసంగిలో కూడా వరి వేద్దామనుకున్నాడు. కానీ ప్రభుత్వం ధాన్యం కొనం అనడంతో ఐదు ఎకరాలు బీడు ఉంచి రెండు ఎకరాల్లో వేశాడు. తీరా ప్రభుత్వం ఇప్పుడు పంట కొంటాం అనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మద్దికుంటకు చెందిన బండి నవీన్‌కు 3 ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది. రెండు బోర్లు మంచిగా పోస్తాయి. యాసంగిలో వడ్లు కొనం అని ప్రభుత్వం ప్రకటించడంతో తన భూమిలో ఇతర పంటలు పండవని బీడుగా వదిలేశాడు. తీరా ఇప్పుడు ధాన్యం కొంటుండంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సర్కార్ మాట విని మోసపోయానని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. రామారెడ్డి (నిజామాబాద్): సర్కార్ మాట విని యాసంగిలో వరి వేయకుండా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంట వర్షాలకు దెబ్బతిని నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వం మాట విని బీళ్లుగా ఉంచామని వాపోతున్నారు. యాసంగిలో వరి వేయద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక వేళ వరి సాగు చేసిన కొనుగోలు చేయమని ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు నీళ్లున్నా.. భూములను బీళ్లుగా ఉంచారు. చెరువుల కింద ఇతర పంటలు పండక పోవడంతో చాలావరకు బీడు పెట్టారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి వరి వేశారు. జిల్లాలో భూములు ఆరుతడి పంటలను అనుకులంగా లేకపోవడం, కోతుల బెడద, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పంటలు వేయలేదు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో వరి సాగు తగ్గింది. గతేడాది యాసంగిలో జిల్లాలో 2.47 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 1.5లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఉపాధి కరువు జిల్లాలో ఎక్కువగా బోరు బావులు, చెరువు నీళ్లు పారకంతో వ్యవసాయం చేస్తుంటారు. వడ్లు కొనమని చెప్పడంతో ఎకరం ఉన్న రైతులు బీడుగా వదిలేయగా, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 2 ఎకరాల వరకు వరి పంటను సాగు చేశారు. చాలా మంది యువ రైతులు, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఉపాధి కరువై వలస బాట పట్టారు. పనులు లేకపోవడంతో హైదరాబాద్, ముంబాయి నగరాలకు వెళ్లారు. తీరా ఇప్పుడు కొనుగోళ్లు ప్రా రంభించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చెప్పడంతోనే తాము వరి వేయలేదని.. కొనుగోలు చేస్తామని ముందే చెబితే తాము నష్టపోయేవారం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట విని పొలాలను బీళ్లుగా ఉంచిన వారికి పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కేసీఆర్ వద్దంటేనే వేయలేదు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ అనడంతోనే పంట వేయలేదు. ఇప్పుడు వడ్లు కొంటామని చెప్తున్నారు. నీళ్లు ఉన్నా వరి వేయని మా పరిస్థితి ఏమిటి? వరి వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి. – రాములు, రైతు, గిద్ద పరిహారం ఇవ్వాలి వరి సాగు చేయవద్దని వ్యవసాయాధికారులే చెప్పారు. ఇప్పుడు వడ్లు కొంటాం అంటున్నారు. వారి మాట విన్న మేము మోసపోయాం. ప్రభుత్వం పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. – రాజయ్య, రైతు, గిద్ద -
నూకల పరిహారం ఎంతిద్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్‌కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. -
ధాన్యం సేకరణకు బీజేపీ మోకాలడ్డుతోంది: పల్లా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణకు బీజేపీ నేతలు సహకరించకపోగా, అడుగడుగునా మోకాలడ్డుతున్నారని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడై తెలంగాణకు, రైతులకు శాపంగా మారారన్నారు. ఉప్పుడు బియ్యం సమస్య తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఉందని ఆ రాష్ట్రాల ఎంపీలు చెబుతుంటే రేవంత్ సిగ్గు లేకుండా తెలంగాణలోనే సమస్య ఎందుకుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైద్య సీట్ల భర్తీపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వైద్య విద్య ప్రవేశాల్లో అక్రమాలపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ..బీజేపీ లేకపోతే టీఆర్ఎస్కు పదవులు ఎక్కడివని బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 1997 నాటి కాకినాడ తీర్మానానికి అనుగుణంగా 2000 సంవత్సరంలోనే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవా అని ప్రశ్నించారు. -
వరి... ఉరి కాకుండా ఆపలేమా?
కొంతకాలంగా తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న వరి పండించే రైతన్నలకు ప్రత్యామ్నాయం చూపవలసి ఉంది. వరి పండించవద్దని చెప్పడం సరైంది కాదు. వరి కొనుగోలు సమస్య ముఖ్యంగా యాసంగి పంటకు వస్తుంది. కారణం – యాసంగిలో వడ్ల మిల్లింగ్‌లో ఎక్కువ నూకల శాతం ఉండడమే. నూక శాతాన్ని తగ్గించుకోవడానికి మిల్లర్లు బాయిల్డ్ రైస్ వైపు మొగ్గు చూపడం వలన కేంద్రం కొనుగోలుకు విముఖంగా ఉంది. రైస్‌కు ఉన్న డిమాండ్ బాయిల్డ్ రైస్‌కు లేకపోవడం, బాయిల్డ్ రైస్ వినియోగం దేశంలో తగ్గుతుండడం కేంద్ర ప్రభుత్వ నిరాసక్తతకు ఊతమిస్తున్నాయి. ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబబు కాదు. రైతుల క్షోభను అర్థం చేసుకుని ఇరు ప్రభుత్వాలూ సానుభూతితో పరిష్కారం కోసం కృషి చేస్తే రైతుల మన్ననలను పొందగలరు. సమస్యకు మూలకారణమైన నూకలు, బాయిల్డ్ రైస్ వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే, రైతులకు మంచి ధరను అందించవచ్చు. వీటిని వినియోగించి ‘ఇథనాల్’ తయారీకి మంచి అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఇంధనం కొరత, అధిక ఇంధన ధరలకు ఒక పరిష్కారం కూడా అవుతుంది. పెట్రోల్ కొరత, దాని ఇతర ఉత్పత్తుల ధరల పెరుగుదల వలన, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. బ్లెండెడ్ పెట్రోల్ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) అన్ బ్లెండెడ్ పెట్రోల్‌పై లీటరుకు రెండు రూపాయల అదనపు ఎక్సైజ్ సుంకం ఉండడం వలన, బ్లెండెడ్ పెట్రోల్ వినియోగించడానికి ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంది. ఇథనాల్ ఉపయోగిస్తే రైతులకు మేలుతో పాటు, దేశానికి పెట్రోలియం దిగుమతుల భారం తగ్గుతుంది. దేశంలో ‘ఇథనాల్’ కొరతను కూడా అధిగమించవచ్చు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా, వరి ఉత్పత్తులతో ఇథనాల్ తయారీకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశం మెండుగా ఉందనీ, తయారీకి ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామనీ చెప్పడం కూడా గమనార్హం. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) ఇథనాల్‌ను రైస్ తయారీలో కూడా మితంగా ఉపయోగిస్తారు. నూకలను, బాయిల్డ్ రైస్‌ను పిండిగా మార్చి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్, రైస్ బిస్కెట్లు, నిల్వ ఆహార పదార్థాల తయారీలో కూడా బియ్యపు పిండిని వాడుతారు. ఇవే కాకుండా ఇంకా మెరుగైన వినియోగానికి మార్గాలను పరిశోధనల ద్వారా అన్వేషించి ఉపయోగించడం ద్వారా వరి రైతులకు ఊరటనివ్వడమే కాకుండా పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థికం పరిపుష్టమౌతుంది. – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
బీజేపీ-టీఆర్ఎస్ కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయ్: మధు యాష్కీ
సాక్షి, ఖమ్మం: వరంగల్ పట్టణం మే 6నలో కిసాన్ సంఘర్షణ పోరాట సభ జరగనుందని ఆ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మంత్రి గుండాగా మారి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేధింపులు తట్టుకోలేక నగరంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిద్ర పోతున్నడా ? అని ప్రశ్నించారు. రౌడీ మంత్రిని తక్షణమే కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన తారక రామారావు అండ చూసుకుని స్థానిక మంత్రి అజయ్ కుమార్ రెచ్చి పోతున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ-మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త.. రాష్ట్రం వచ్చాక రాబందుల సమితిగా మారిందని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ-టీఎర్ఎస్ పార్టీలు కుమ్మకై రైతులను హింస పెడుతున్నాయని అన్నారు. ఢిల్లీ రాజధానిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ధర్నా కాదు.. డ్రామా అని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మనుషులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏసీలు, కూలర్లు పెట్టుకుని డ్రామా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యులను హింసకు గురి చేస్తున్నారని విమర్శించారు. -
రైతన్నా.. మీసం తిప్పెయ్..
ఖమ్మం మయూరి సెంటర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్) -
పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లై సన్నద్ధమైందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయిని తెలిపారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కొనుగోళ్లు మొదలవుతాయని చెప్పారు. మే చివరి నాటికి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైతు అని నిర్ధారించుకోవడానికే ఈ సిస్టం ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందుల కారణంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముతారనే సమాచారం ఉందని తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు ధాన్యం చేరిన తర్వాత ప్రభుత్వానికి మెసేజ్ రాగానే మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగిలో 36 లక్షల వరి సాగు అయ్యిందని తెలిపారు. -
Sakshi Cartoon: ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్!
ఇదే మాటను వాళ్లు ఢిల్లీలో అంటున్నార్సార్! -
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్సీ కవిత
-
మరోసారి రైతు ఉద్యమానికి సిద్ధం
బోనకల్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పాలకులు ప్రకటించాలని, లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో మరోసారి రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయడం చేతకాదని చేతులెత్తేసిన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇప్పుడు ధర్నాలు చేయడం గర్హనీయమని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు. కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షతతో జాతి సమైక్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలే కరువయ్యాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులను టీఆర్ఎస్ భయపెడుతోంది: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై రైతులను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మంళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ దీక్ష చేసినా రైతులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ లేఖ ఇచ్చారా? లేదా? చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదని తెలిపారు. బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందని గుర్తుచేశారు. ‘రా రైస్’ తీసుకోవడానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని సీఎం కేసీఆర్ లేఖ ఇచ్చారని అన్నారు. గత సీజన్ గురించి తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజవరకు కొంటామని తెలిపారు. గత సీజన్లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని అన్నారు. లేని వడ్ల సమస్యను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎవరూ ఉప్పుడు బియ్యం తినడం లేదని, ఉపయోగం తగ్గిందని తెలిపారు. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని అన్నారు. ఉచితంగా ఇచ్చినా తీసుకోవడం లేదని తెలిపారు. రైతులను టీఆర్ఎస్ భయపెడుతోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ధాన్యంపై కేంద్ర, రాష్ట్రాల డ్రామాలు
బోనకల్: యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్‌మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో భట్టి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు.. తమ బాధ్యతను విస్మరించి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ పక్క వరి కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని విచారం వ్యక్తంచేశారు. ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొన్నాక కేంద్రంతో యుద్ధం చేయాలని సూచించారు. ఏదిఏమైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీకి 24 గంటల డెడ్‌లైన్:కేసీఆర్
-
మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉంది: కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. టీఆర్ఎస్ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తమ రాష్ట్ర రైతులు పండించే ధాన్యం ప్రధాని కొంటే సరి. కొనకపోయినా ఫర్వాలేదని అన్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతునే ఉంటుందని తెలిపారు. తాము పేదవాళ్లమేమీ కాదని.. రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో తెలంగాణ మంత్రి మండలి, రైతులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. భారత ప్రధాని మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారని ధ్వజమెత్తారు. ధర్మబద్ధమైన డిమాండుతో తామొస్తే.. పీయూష్ గోయల్ అవమానించారని మండిపడ్డారు. ఆయన పీయూష్ గోయల్ కాదని.. పీయూష్ గోల్మాల్ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఈ దేశ రైతులు బిచ్చం అడగడం లేదని.. హక్కులు కోరుతున్నారని అన్నారు. కొత్త వ్యవసాయ విధానం రూపొందించాలని, దానికి తాము సహకరిస్తాని పేర్కొన్నారు. లేదంటే కేంద్ర పాలకుల్ని గద్దె దించి.. తామే కొత్త పాలసీ తయారు చేసుకుంటామని తెలిపారు. పంట మార్పిడి చేయమని కేంద్రం చెబితే, తాము గ్రామగ్రామానికి, ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పామని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేస్తాం టీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే, బీజేపీ హైదరాబాద్‌లో ధర్నా చేస్తోందని.. వాళ్లకు సిగ్గుందా? అని నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా? మనసు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తామంతా రాకేశ్ టికాయత్ పోరాటానికి మద్ధతిస్తున్నాని చెప్పారు. దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్ గోల్మాల్ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని మండిపడ్డారు. హిట్లర్, ముస్సోలినీ వంటి ఎందరో నేతలే మట్టికలిశారని.. మీరెంత? అని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈడీ, సీబీఐలు ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవని, తనను జైలుకు పంపుతామని అంటున్నారు. దమ్ముంటే రావాలని.. తనను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చోటామోటా కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేశామని, ఇప్పుడు దేశం కోసం చేస్తామని తెలిపారు. నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్‌కు రెండు చేతులూ జోడించి కోరుతున్నా.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ధాన్యం కొంటున్నారో తమ దగ్గర కూడా అలాగే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమ వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని మరింత ముందుకెళ్తామని అన్నారు. -
కేసీఆర్‌వి దొంగ ధర్నాలు: షర్మిల
రఘునాథపాలెం: వడ్ల కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో సంతకాలు చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు దొంగ ధర్నాలు చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయా త్ర శనివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పడమటి తండా వద్ద ప్రారంభమైంది. తర్వాత జాన్బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీల మీదుగా పాపటపల్లి చేరుకుంది. అక్కడ ఆమె రైతు దీక్ష చేపట్టారు. అనంతరం యాత్ర కామేపల్లి మండలానికి చేరుకుంది. యాత్ర 50వ రోజుకు చేరడంతో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. పాపటపల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై రైతులతో షర్మిల మాట్లాడారు. పరిపాలన చేయాలని కేసీఆర్‌కు ప్రజలు అధికారమిస్తే ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ సూచనతో రైతులు వరి వేయకపోవడంతో అటు రైతులు, ఇటు కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. సీఎం సంతకం పెట్టినందుకే కేంద్రం వడ్లు కొనేది లేదని చెబుతోందని, ఆ సంతకం ఎవరిని అడిగి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుతో మిల్లర్లు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 మేర ధర తగ్గించి రైతులను దోచుకునేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరతో ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. -
వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహాకుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే బ్రోకర్లకు అమ్ముకునే పరిస్థితులు సృష్టించి లబ్ధి పొందేలా సీఎం కేసీఆర్ పథకం రచించారన్నారు. దీని వెనుక రూ. వందల కోట్లు ప్రభు త్వ పెద్దలకు కమీషన్లుగా ముట్టబోతున్నాయని, వడ్ల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఇందులో భాగమేనని చెప్పారు. ఈ మేరకు శనివారం రైతులకు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘యాసంగి పం టను ఎట్లా అమ్ముకోవాలో తెలియక రైతులు బాధపడుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన సీఎం ఢిల్లీ వెళ్లి ధర్నాలు, ఆందోళనల పేరిట రాజకీయం చేసి సమస్యను జఠిలం చేయడం ఎంతవరకు కరెక్టు?’ అని ప్రశ్నించారు. సర్కారు పెద్దలకు క్వింటాలుకు 100 కమీషన్! ‘యాసంగి పంట ద్వారా కోటి మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి జరిగింది. కేంద్రం క్వింటాలు వడ్లకు మద్దతు ధర రూ.1,960గా నిర్ణయించింది. కొందరు మిల్లర్లు క్వింటాలు వడ్లను రూ.1,300 నుండి రూ.1,660 లోపే కొంటున్నారు. ఎమ్మెస్పీ దక్కక రైతులు నష్టపోతున్నారు’అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కామ్‌లో ప్రభుత్వ పెద్దలకు ప్రతి క్వింటాలుకు రూ. వంద చొప్పున రూ. వందల కోట్ల కమీషన్ ఇచ్చేలా కొందరు రైస్ మిల్లర్ల మాఫియా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది’ అని సంజయ్ ఆరోపించారు. -
కేంద్రమే కొనాలి..
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కష్టాలను చూపేందుకే: కేకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనేవరకు వదలం: నామా కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఢిల్లీలో లొల్లికి రెడీ! యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది. శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. -
మిల్లర్లతో సర్కారు కుమ్మక్కు
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం సేకరణలో రాష్ట్రం లోని మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జేబులను కొల్లగొడుతోందని, రూ. వేల కోట్లను దోచుకుంటోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం లో రైతుల నుంచి ఎంఎస్పీ కంటే సుమారు రూ.400 నుంచి రూ.600 తక్కువకే మిల్లర్లు ధాన్యం కొంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలపై విజిలెన్స్ దాడులు చేయించకపోవడం, క్రిమినల్ కేసులను పెట్టకపోవడాన్ని బట్టి మిల్లర్లతో సర్కారు కుమ్మక్కైనట్లు అర్థమవుతోందన్నారు. శనివారం తెలంగాణభవన్‌లో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న సీఎం.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రధాని మోదీ, మంత్రులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం సేకరించకపోతే తామే కొంటామని ఢిల్లీ ధర్నాలో కేసీఆర్ ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ధర్మపోరాటం పేరుతో ఢిల్లీలో దీక్ష చేస్తే ఏం జరిగిందో తెలుసుకుంటే మం చిదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. రైస్ మిల్లర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేలా పెద్ద కుంభకోణం జరుగుతోందని, రాష్ట్రంలో ధా న్యం సేకరణను ప్రారంభించకపోతే ఈ నెల 15 నుంచి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. -
టీఆర్ఎస్, బీజేపీని ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంతోపాటు ఏడేళ్లుగా టీఆర్ఎస్, బీజేపీలు ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ పార్టీల గుట్టువిప్పి ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ఆందోళనలు, విద్యుత్‌సౌధ ముట్టడిపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరున రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన ఉంటుందని, ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో మరింతగా ఉద్యమించాలని సూచించారు. అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ‘ధాన్యం కొనుగోలుకు ఈ నెల 11లోపు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా 12న అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలసి ధర్నాలు చేస్తాం. రైస్‌మిల్లర్లతో కుమ్మక్కయిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 15 తర్వాత బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల సమస్యలపై పోరాడుతాం’అని మధుయాష్కీ అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవితోపాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. మహిళల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీ భవన్లో శుక్రవారం జరిగిన ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నేతలతోపాటు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. భేటీ తర్వాత గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వచ్చిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిందపడిపోవడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇతర నేతలను అరెస్టు చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. -
ఓవర్ టు.. ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పక్షం రోజులుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘వరి పోరు’కు ఇక ఢిల్లీ వేదికకానుంది. గత నెల 21న సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొదలైన వరి పోరు కార్యాచరణ శుక్రవారం ఊరూరా నల్లజెండాల ఎగురవేతతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన తెలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడంతో..: ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర మంత్రుల బృందం కోరినా.. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ గత నెలలో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి. తిరిగి ఈ నెల 4 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వరకు.. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఊరూరా నల్లజెండాల ఎగురవేత, మోదీ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దేశ రాజధానిలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 3నే ఢిల్లీ వెళ్లారు. 12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యత పాటిస్తున్నాయి. మంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ దీక్షకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీక్షకు రావాల్సిందిగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 1,500 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీ దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. వీరంతా ఆదివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం 11వ తేదీ ఉదయం రాజధానికి వెళతారని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతల అనుచరులు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానాలు.. రైలు బోగీలు పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారి కోసం రెండు ప్రత్యేక విమానాలతో పాటు ప్రత్యేక రైలు బోగీలను బుక్ చేశారు. అయితే అధికారిక పనుల కారణంగా సుమారు అరడజను మంది మంత్రులు ఢిల్లీ దీక్షలో పాల్గొనబోవడం లేదని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే నేతల వివరాలు, వెంట వరి ధాన్యం తెస్తున్నారా.. తదితర వివరాలు సేకరిస్తోంది. -
ఒకే దేశంలో ద్వంద్వ ప్రమాణాలా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు అర్థమవు తాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు వ్యవసాయ కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే రైతులు అనేక వ్యయభారాలతో కుంగి పోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులను వడ్డించాలనడం విడ్డూరం. రైతులను క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే సేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్ని స్తోంది. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తును అందిస్తు న్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. కాగా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతున్నది. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నది. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొను గోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం... యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే, కేంద్రంపై ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం తప్పదు. తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న తీరును పలువురు జాతీయ విపక్ష నేతలు ప్రశంసిస్తున్నరు. ఇప్పుడు జరగాల్సింది ఇదేన ంటున్నరు. ఒకవైపు టీఆర్ఎస్ రైతుల బాగు కోసం పోరాడుతుంటే మన రాష్ట్ర విపక్ష నేతలు సహాయ నిరాకరణతో పీత రాజకీయాలు చేస్తున్నరు. దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే మోదీ సర్కార్ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్ శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతా రాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల ఇబ్బందులు, కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అంది వరి విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరీ పెడుతోంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి? పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న! దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమా ధానం చెప్పడం లేదు. పైగా అవమానిం చేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరి సాగును కొంత తగ్గించారు. అయినా ధాన్యం కొనుగోలు చేయలేమని సవా లక్ష కారణాలను కేంద్రం ఏకరువు పెడుతోంది. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహ రించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేవి. పంజాబ్ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండేవి. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించిన తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తు న్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యాన్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేంద్రమంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏంటో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే... రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నట్లుంది. తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా, నచ్చని చోట మరోలా చూస్తున్నది. ఇలా పక్షపాతంతో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్రం ఆలోచించాలి. -పువ్వాడ అజయ్ కుమార్ వ్యాసకర్త రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
హోరెత్తిన వరి పోరు!
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు మోకాళ్లపై కూర్చుని వడ్లు దోసిట్లో పట్టుకుని ఆందోళన చేశారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉందంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ‘ధర్నా’లో దున్నపోతుపై నీళ్లు చల్లుతూ నిరసన తెలిపారు. వరి పోరులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్ కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి, రెచ్చగొట్టి మరీ వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే.. తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చి మోసం. వారికి ఎంత బలుపు.. నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరిస్తం. కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ.. చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి.. రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్‌ర్యాలీలు నిర్వహించాలి. ఈనెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేటు దూరంలో ధర్నా చేస్తాం. – సిరిసిల్ల నిరసనల్లో మంత్రి కేటీఆర్ మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు: హరీశ్ నాడు రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం. నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కాం. లక్ష్యాన్ని సాధిస్తాం. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పనిచేస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్లరుణాలు మాఫీ చేశారు. రైతుల పంటను కొనాలంటే నష్టం వస్తుందంటున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కాదు.. ముందు తెలంగాణ రైతుల బాధలు వినాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు ఆయన అచ్చే దిన్ అని అధికారంలో వచ్చారు. కానీ ఇప్పుడు జనం సచ్చే దిన్ తీసుకొచ్చారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నట్టు తయారైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. – సిద్దిపేట దీక్షలో మంత్రి హరీశ్‌రావు మంత్రులు ఎవరేమన్నారంటే.. ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు. – మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వరి కంకులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య వనపర్తి: వరి కొనకుండా ఇబ్బందిపెడ్తున్న కేంద్రంపై రైతులు పెడుతున్న శాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి. – మంత్రి నిరంజన్‌రెడ్డి సంగారెడ్డి: పంజాబ్ మాదిరిగా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలు – మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వరంగల్: వడ్లు కొనకుండా రైతులను మోసం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ వైఖరిని తిప్పికొట్టాలి. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ములుగు, మహబూబాబాద్: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. – మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్: ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కరీంనగర్: వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతుపై వానపడినట్టే వ్యవహరిస్తోంది. – మంత్రి గంగుల కమలాకర్ వికారాబాద్: రాష్ట్రంలో ధాన్యం బాగా పండితే కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నారు. – మంత్రి సబితారెడ్డి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం. – మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజామాబాద్, కామారెడ్డి: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ మాట్లాడటం దారుణం. – మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష సాధిస్తోంది. ప్రతి గింజను కేంద్రం కొనేదాకా పోరాటం చేస్తాం. – మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్లగొండ: దేశంలో ఆహార పంటలపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచుతారు. – మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి -
యాసంగి ధాన్యం కొనాల్సిందే!
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. లేకుంటే కేంద్రానికి రాస్తా బంద్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ రహదారులపై రాస్తారోకోలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు వరి కంకులు, ప్లకార్డులు చేపట్టి, రోడ్లపై ధాన్యం కుప్పపోసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవే ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ‘‘రైతుల కోసం కేంద్రం ఏం చేసిం దో బీజేపీ నేతలు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. పండించిన పంటనే కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. అగ్రిమెంట్ రాసిచ్చారని ఒకరు.. కొంటమని మరొకరు.. కొనమని ఇంకొకరు.. నూకలు తినాలంటరు. నూకలు మేం తినం.. మీకు నూకలు చెల్లినయ్’’ అని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనేదాకా ఊరుకోబోమన్నారు. ఇక్కడ గంటకుపైగా ఆందోళన సాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అడుగడుగునా నిరసనలతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్‌ల ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండల కేంద్రం లో ఎమ్మెల్యే నోముల భగత్.. సూర్యాపేట సమీపంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో రాస్తారోకోలు జరిగాయి. ►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ►నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వైజంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ►ఆదిలాబాద్ జిల్లా చాందా(టి) గ్రామ సమీపంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ►సంగారెడ్డిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, దేవీప్రసాద్‌రావు, చింతా ప్రభాకర్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ►మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నేడు జిల్లా కేంద్రాల్లో దీక్షలు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, దీక్షలకు టీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ మండల కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు దీక్షలకు రావాలని సూచించారు. -
ఉప్పుడు బియ్యంపై అట్టుడికిన సభ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి టీఆర్ఎస్ కొనసాగిస్తున్న ఆందోళనతో మంగళవారం లోక్‌సభ అట్టుడికింది. ధాన్యం కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని కోరుతూ ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ అంశంపై త్వరితగతిన చర్చ చేపట్టి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనల నేపథ్యంలో సభ రెండుమార్లు వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనూ కేంద్రం తీరుకు నిరసనగా సభ్యులు వాకౌట్ చేశారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో డిప్యూటీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని విన్నవించారు. లోక్‌సభ రెండుమార్లు వాయిదా.. మంగళవారం సభ ఆరంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఎంపీలు నామా, బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డి, కవిత, పసునూరి దయాకర్, ఎంఎస్ఎన్ రెడ్డి, వెంకటేశ్ నేత, రాములు.. తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు సైతం ధరల పెరుగుదల అంశంపై చర్చ కోరుతూ వెల్‌లోకి వెళ్లారు. వీరితోపాటే వెల్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం సేకరణపై జాతీయ విధానం తేవాలి.. అన్నదాతలను శిక్షించొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటున్న సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పెట్టి నిరసన కొనసాగించారు. టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశా రు. సభ తిరిగి మొదలయ్యాక సైతం ఎంపీలు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలో వాకౌట్... రాజ్యసభ ఆరంభం అయిన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు.. సురేశ్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సురేశ్‌రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. ‘బాయిల్డ్ రైస్‌పై చర్చించాలని నోటీసులిచ్చాం. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు కేంద్రం తీరుతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య అయినందున చర్చ పెట్టండి’అని కోరారు. చైర్మన్ నిరాకరిం చడంతో సురేశ్‌రెడ్డి సహా ఇతర ఎంపీలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు తెలంగాణ భవన్లో ఎంపీలు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు. -
వానాకాలం బియ్యం యాడబొయ్యాలె?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం మధ్య మొదలైన ధాన్యం, బియ్యం రగడకు ఇప్పట్లో తెరపడేలా లేదు. వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధులంతా ధర్నాకు సిద్ధమయ్యారు. వచ్చే వారంలో యాసంగి కోతలు మొదలవనుండగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు గోదాముల్లోని బియ్యం మూవ్మెంట్ లేక మగ్గిపోతుండగా 2020–21 వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ని ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జూలైలోగా వానాకాలం ధాన్యానికి సంబంధించి 47 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (సీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 15.37 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యాన్ని తరలించేందుకు గోదాములు కూడా ఖాళీ లేవు. గడువు ముగిసిందనే నెపంతో 2020–21 యాసంగి సీఎంఆర్ 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెగేసి చెప్పింది. ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. తాజాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న కయ్యం నేపథ్యంలో మరోసారి వానాకాలం సీజన్ సీఎంఆర్‌పై వివాదం రేకెత్తే పరిస్థితి కనిపిస్తోంది. గోదాముల్లో జాగా లేదు... రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాములు, ప్రైవేటు గోదాములు 72 ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి సామర్థ్యం 20.05 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ గోదాములన్నీ ప్రస్తుతం 2020–21 యాసంగి, వానాకాలం బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు తరలించే బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అక్కడి అవసరాలకు అనుగుణంగా తీసుకెళ్తుండటం, రైల్వే రేక్‌లను సమయానుకూలంగా సమకూర్చకపోవడంతో గోదాముల్లోని బియ్యంలో లక్క పురుగులు, ఎలుకలు, పందికొక్కులు చేరి పొక్కిలి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లో... ధాన్యం నిల్వలన్నీ మిల్లుల్లో మగ్గే పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యాన్ని తరలించేందుకు గోదాములు ఖాళీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిన సొమ్ము రీయింబర్స్మెంట్ కింద తిరిగి రాక ఆందోళన చెందుతోంది. ఉత్పత్తి, నిల్వకు మధ్య భారీ తేడా... 2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 92.34 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 67 శాతం బియ్యాన్ని (62.53 లక్షల మెట్రిక్ టన్నులు) ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. కానీ మార్చి 31 నాటికి 53.38 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది. ఇంకా 9.15 ఎల్ఎంటీ బియ్యాన్ని ఇవ్వడానికి మే 31 వరకు రాష్ట్రం గడువు కోరినా కేంద్రం ససేమిరా అన్నది. ఇక వానాకాలం సీజన్ సీఎంఆర్ కింద 47 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 15.37 ఎల్ఎంటీ మాత్రమే ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడమొక్కటే పరిష్కారం. అయితే ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడాన్నిబట్టి కొత్తగా బియ్యం నిల్వలను నింపల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా ఎఫ్‌సీఐ గోదాములను సమకూర్చుకోకపోవడంతోపాటు గోడౌన్లలోని నిల్వలను ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడం సమస్యకు కారణంగా అధికారులు చెబుతున్నారు. గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడంతో మిల్లుల నుంచి కొత్తగా సీఎంఆర్ సరఫరా చేసే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ వాదిస్తోంది. అయితే గత యాసంగి తాలూకు బియ్యం 9.15 ఎల్‌ఎంటీని కేంద్రం తీసుకోకపోయినా మిల్లింగ్ చేసి రాష్ట్ర అవసరాలకు నిల్వ చేయాల్సిందే. అలాగే వానాకాలం సీజన్ బియ్యం 31.68 ఎల్ఎంటీ బియ్యం కలిపితే 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలకు అనుగుణంగా జూలై నాటికి గోదాములు సిద్ధంగా ఉంటాయా అనేది ప్రశ్న. 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించాం: ఎఫ్‌సీఐ డిసెంబర్ 2021 నుంచి ఈ మార్చి వరకు రాష్ట్రంలోని గోదాముల నుంచి 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించినట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. 2020–21 యాసంగి సీఎంఆర్ డెలివరీకి సెప్టెంబర్ 2021తో గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐదుసార్లు గడువు పొడిగించామని, వానాకాలం సీజన్ బియ్యం కోసం జూలై వరకు మాత్రమే గడువు ఉందని ఆయన తెలిపారు. -
కేంద్రం కాదంటే కొనుడే!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సమస్యపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని కేసీఆర్ సర్కార్ ఈనెల రెండోవారంలో అనూహ్య నిర్ణయం ప్రకటించి రైతుల మద్దతు పొందేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఆదివారం మొదలు 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ధాన్యం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి మహాధర్నా నిర్వహించిన అనంతరం.. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రైతాంగానికి అండగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని చాటి చెప్పనుంది. రైతులకు అండగా నిలవడం ద్వారా పడే దాదాపు రూ.2,000 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 11 తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారం భరించడం వైపే మొగ్గు.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానం మొదటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి ఉప్పుడు బియ్యంగా ఎఫ్‌సీఐకి పంపించడం. అయితే ఇందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ఉప్పుడు బియ్యం తీసుకునే ప్రసక్తి లేదని, ముడి బియ్యంగా ఇస్తే ఎంతైనా తీసుకుంటామని తేల్చి చెబుతోంది. నిర్ణయాన్ని రైతులకే వదిలేయాలనేది రెండో ప్రత్యామ్నాయం. యాసంగిలో వరి వేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని యాసంగి పంట వేసే సమయంలోనే ప్రభుత్వం చెప్పింది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం కొనదు కనుక.. రైతులు నేరుగా మిల్లర్లు, దళారులకు విక్రయిస్తే కనీస మద్దతు ధర ప్రసక్తే ఉండదు. క్వింటాలుకు రూ.500 వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. అందువల్ల ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని తెలిసింది. మద్దతు ధర రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం.. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ, ఈ ప్రత్యామ్నాయంపైనే కేసీఆర్ సర్కార్ దృష్టి సారించినట్లు తెలిసింది. ముడి బియ్యంతో నష్టమెంత? ఇప్పటివరకు సాగిన విధానంలో.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా రూపంలో (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగించి కేంద్రం నుంచి డబ్బులు వసూలు చేసుకునేది. ఈ విధానంలో 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిల్లింగ్‌లో నూకల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్నేళ్లుగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నారు. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటూ గత ఏడాది నుంచి ఈ విధానంపై పేచీ పెడుతోంది. కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామనిని చెబుతోంది. ఉప్పుడు కాకుండా ముడిబియ్యమే..! కేంద్రం చెప్పినట్లు ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చే ప్రతిపాదనపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా 100 కిలోల ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారిస్తే యాసంగిలో 68 కిలోల బియ్యం వస్తుంది. ఒకవేళ ముడిబియ్యంగా మారిస్తే 100 కిలోల ధాన్యాన్ని మర పట్టిస్తే నూకలు పోను 40 కిలోల నుంచి 50 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా నివేదికల్లో వివరించినట్లు తెలిసింది. నూకలను ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా ఎంతమేర నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే దానిపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. బియ్యం లోటు నష్టాన్ని మిల్లర్లకు చెల్లించేలా.. ముడిబియ్యంగా మార్చి ఇచ్చే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, ముడిబియ్యంగా మార్చే ప్రక్రియలో బియ్యం లోటు వల్ల ఏర్పడే నష్టాన్ని మిల్లర్లకే నేరుగా చెల్లించి ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 68 కిలోల బియ్యాన్ని తీసుకునేలా ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బద్నాం చేసి, తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా తానే ధాన్యం సేకరించాలనే వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అధికారులు, మిల్లర్లతో మంత్రి సమావేశం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్ర, శనివారాల్లో సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌తో పాటు మిల్లర్ల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై చర్చించారు. నష్టాన్ని భరిస్తే తాము ధాన్యం మిల్లింగ్‌కు తీసుకుని ముడి బియ్యం ఇచ్చేందుకు సిద్ధమేనని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తే వచ్చే నష్టాన్ని లెక్కలు వేశారు. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బియ్యం కొనకపోతే.. నూకలు చెల్లు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నూకలు చెల్లడం ఖాయమని టీఆర్ఎస్ హెచ్చరించింది. తెలంగాణపై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో పండే వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పాటు, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పచ్చబడుతున్న తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ధాన్యం కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతృత్వం వహించిన మంత్రులు మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, ఖిల్లాఘనపురం మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి పాల్గొనగా, హన్వాడలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. కరీంనగర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నిజామాబాద్ జిల్లా వేల్పూరులో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగిన నిరసనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షలో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అన్ని మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రణాళికబద్ధ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ వందేళ్ల అబద్ధాలను ఎనిమిదేళ్లలోనే ప్రజలకు చెప్పిందని విమర్శించారు. మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలందరూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలతో పాటు, వరి సాగు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దీక్షల్లో పాల్గొన్న వారికి వినిపించారు. చాలాచోట్ల ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు, యాసంగిలో వరి సాగు విషయంలో బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. దీక్షల అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. రేపు నాలుగు హైవేలపై రాస్తారోకో వరిపోరు కార్యాచరణలో భాగంగా మంగళవారం విరామం తర్వాత బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు లేనందున బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. -
వరంగల్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ
-
ధాన్యంపై నేటి నుంచి టీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ సోమవారం నుంచి నిరసన చేపట్టనుంది. పార్టీ పిలుపు మేరకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలో రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సన్నాహాలు పూర్తి చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత జిల్లా మంత్రులు ఆదివారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొనాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 6న జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేయడం, 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. -
బండి సంజయ్ ,కిషన్‌రెడ్డిల బండారం బయటపెట్టిన :కేటీఆర్
-
కేంద్రంపై ‘వరి’ యుద్ధం
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతులను అవమానించేలా మాట్లాడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీ ఉద్యమ కార్యాచరణను శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో మొదలయ్యే టీఆర్ఎస్ నిరసనలు 11న ఢిల్లీ వేదికగా జరిగే నిరసన దాకా కొనసాగుతాయని కేటీఆర్ వివరించారు. ఢిల్లీలో జరిగే నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. దౌర్భాగ్య నాయకులు రెచ్చగొట్టి వరి వేయించారు... ‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని మూర్ఖపు, పిచ్చి, రైతు వ్యతిరేక, మనసులేని ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, రాష్ట్రానిది దళారీ పాత్ర అంటూ రైతుల్ని రెచ్చగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ గతేడాది నవంబర్ 18న సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి నిరసన దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గినా 35–36 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన కేంద్ర మంత్రి వల్లే ఈ పరిస్థితి తలెత్తగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం తెలివితక్కువ వాళ్లు అంటూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఇప్పుడు రైతులు పండించే ధాన్యాన్ని బీరాలు పలికిన బీజేపీ దౌర్భాగ్యులు తీసుకుంటారా? ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టం.. అంతు చూస్తాం. ఇప్పటికే 12,769 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు తదితర సంస్థలన్నీ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించి ప్రధానికి పంపాయి. కేంద్రం స్పందించనందున గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలపాలని నిర్ణయించాం’అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గండ్ర వెంకట రమణారెడ్డి, గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, క్రాంతికిరణ్, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఉద్యమ కార్యాచరణ... ► ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఈ శిబిరంలో రైతులు కూడా పాల్గొనాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 5న విరామం ► 6న రాష్ట్రం మీదుగా వెళ్లే 4 జాతీయ రహదారులపై నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రాస్తారోకోలు చేపడతారు. ► 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి. ► 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, రైతులు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి కేంద్రం దమననీతి, భ్రష్టు రాజకీయాలపై నిరసన తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 9, 10 తేదీల్లో విరామం ► 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసనకు దిగనుంది. మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్ . -
తెలంగాణాలో వేడి వేడిగా వడ్ల రాజకీయం
-
వడ్లు కొనాలి లేదా సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు సెంటర్లను తెరిచి కొనుగోళ్లు ప్రారంభించాలని లేదంటే సీఎం కేసీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పండించిన ప్రతి గింజా కొంటామని సీఎం ప్రజలకు గతంలో పదే పదే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పెంచిన విద్యుత్, బస్ చార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నెపంమోపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ 17 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా పంటలు వేయకుండా రైతులను కన్నీళ్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించకుండా సీఎం, ఆరోగ్య శాఖమంత్రి తప్పులు చేస్తే శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? అని వరంగల్ ఘటనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈటల స్పందించారు. -
ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని, ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని పీయూష్ గోయల్ ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారని,పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.. మరి అటువంటి బియ్యాన్ని ఇవ్వాలని కోరామని అన్నారు పీయూష్ గోయల్. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణలో పండే రా రైస్ మొత్తం తీసుకుంటామన్నారు. -
కేంద్రంపై ‘వరి పోరు’కు కార్యాచరణ సిద్ధం చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూపిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్.. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఆ మేరకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలను రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టడం కూడా ఉద్యమ కార్యాచరణలో అంతర్భాగంగా ఉండనుందని పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారం రోజులుగా ఉద్యమ వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశంపై గత మూడు, నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు. పది రోజుల అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో కూడా సీఎం ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరి పోరుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను కేసీఆర్ ఈ నెల 3న మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించనున్నారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనలు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, ఏ ఒక్క వర్గానికి నష్టం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా నిరసన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. బంద్‌లు, రాస్తారోకోలు వంటివి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటం, విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమవుతుండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలని సీఎం భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సడక్ బంద్, వంటా వార్పు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లిన రీతిలోనే వరి పోరును కూడా శాంతియుత పద్ధతిలోనే చేపట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడితో పాటు ధాన్యం కొనుగోలుపై వైఖరి చెప్పాలంటూ అడుగడుగునా నిలదీసేలా నిరసన చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 14న గద్వాల నుంచి తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు. ఆ సమయానికే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకునేలా టీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వేదికగా సీఎం నేతృత్వంలో నిరసన రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిరసనకు దిగుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. రైతు సంఘాలు, భావ సారూప్య రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలు, పలువురు నేతలను కూడా ఈ దీక్షకు ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో అనేక వినూత్న నిరసన రూపాలను చూశాం. అలాగే ఉగాది తర్వాత మొదలయ్యే రైతు ఉద్యమంలోనూ సరికొత్త ఉద్యమ రూపాలను చూస్తారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తి చూపడంతో పాటు వరి కొనుగోలుకు కేంద్రం దిగివచ్చేలా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి..’అని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ధాన్యాన్ని కేంద్రమే కొనాలి: మంత్రి వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంజాబ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో రైతులు పెద్దఎత్తున వరి పండిస్తున్నారన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2014లో 4.29లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో 7.14లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరిత వైఖరి మానుకోవాలని హితవు పలికారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. యాసంగిలో తెలంగాణ రైతులు సాగు చేసిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతూ చైర్మన్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. గత కొన్ని నెలలుగా పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయనున్నారని తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి చేసే పోరాటంలో పాల్గొంటానని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న 40 లక్షల మందికి రూ.2 లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కింద రూ.6.34 కోట్ల చెక్కును రాహుల్ చేతుల మీదుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. కాగా 40 లక్షల సభ్యత్వ నమోదు చేసినందుకు రాష్ట్ర నేతలను రాహుల్ అభినందించారు. భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం 4.5 లక్షల సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్ 1 నుంచి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. రాహుల్‌తో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, అజారుద్దీన్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్వర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో 4న మరోసారి భేటీ బుధవారం నాటి భేటీలో రాష్ట్రంలో పార్టీ పటిష్టత, టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలతో చర్చించిన రాహుల్ గాంధీ.. ఇదే అంశంపై ఏప్రిల్ 4న వారితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో సుమారు 25 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం. కాగా రాష్ట్ర పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు, సీనియర్ల మధ్య విభేదాలతో పాటు రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలనే అంశంపై రాహుల్ చర్చిస్తారని తెలిసింది. -
చిత్తశుద్ధి ఉంటే ఆమరణ దీక్ష చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం కొనుగోలు చేసే వరకు ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ క్షేత్రంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు రాష్ట్ర రైతులను కేసీఆర్ పణంగా పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్ పార్టీ దిగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రూ.10 వేల కోట్లిస్తే 45 రోజుల్లో తెలంగాణలో యాసంగి ధాన్యం ఎలా సేకరిస్తామో చేసి చూపిస్తామన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొడుకు నుంచి తప్పించుకొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం... ‘ఏప్రిల్ మొదటివారం నుంచి వరి కొనుగోలు చేయకుండా నాటకాలు ఆడితే కేసీఆర్, కేటీఆర్‌ను నడి బజారులో ఉరివేసే బాధ్యత రైతుల పక్షాన కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రగతిభవన్‌లు, పోలీస్ పహారాలు మిమ్మల్ని కాపాడుతాయని అనుకుంటున్నారేమో, ఏవీ కాపాడవు. నిజాం కూడా ఇలాగే అనుకున్నడు. ఆయనను కోట గోడలు కాపాడలేదు.. రజాకార్ల సైన్యం కాపాడలేదు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ రైతులకు కేసీఆర్ మెడలు వంచడం తెలుసు. దీనికి ఎలా నాయకత్వం వహించాలో కాంగ్రెస్‌కు తెలుసు’అని రేవంత్ ధ్వజమెత్తారు. రైతులను దివాలా తీయించారు... ‘ఎఫ్సీఐకు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ గతేడాది సంతకం పెట్టి ప్రధానికి లొంగిపోయి ఇప్పుడు రాజకీయ లాభం కోసం డ్రామాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు మందుమీద మాత్రమే చూపు ఉంది.. ముందుచూపు లేదు. రాష్ట్రంలో పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను కావాలనే దూరం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల కుట్రలతో రైతులను దివాళా తీయించారు. రైతులను ఆదుకొనేందుకు కాంగ్రెస్ ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్రం కొంటలేదు కాబట్టి వరి వద్దంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఎందుకు దళారి పని చేయడానికా’అని రేవంత్ ప్రశ్నించారు. అందరిని వద్దని కేసీఆర్ మాత్రం తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్ ధాన్యం కొనేవాళ్లు.. పేదల వడ్లు కొనరా అని ఆయన ప్రశ్నించారు. శ్రీమంతులుగా ఎలా మారారో ప్రజలకు చెప్పాలి ‘దోపిడీదారుడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ కేసీఆర్‌కు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఆగర్భ శ్రీమంతులుగా మారింది. నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసుల వద్దే ఎక్కువ సంపద ఉంది. ఈ 8 ఏళ్లలో ఎలా శ్రీమంతులుగా మారారన్నది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్ర, తెలంగాణ ప్రజల గురించి కేటీఆర్‌కు అవగాహన లేదు’అని రేవంత్ ఆరోపించారు. -
వడ్ల గింజలపై ‘పిట్ట’ పోరు
ఉదయం 9:32 బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. – కాంగ్రెస్ నేత రాహుల్ ఉదయం 10:32 రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిరసన తెలపండి. ఒక దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉదయం 11:42 టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో పోరాటం చేయడం లేదు. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ 2021 ఆగస్టులో ఒప్పం దంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే. – టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్యాహ్నం 12:10 తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిచేయండి. ఒకే దేశం, ఒకే ధాన్యం సేకరణ విధానంలో మీ పార్టీ వైఖరి ఏంటో ముందు చెప్పండి. – మంత్రి హరీశ్‌రావు రాత్రి 10:40 రాహుల్ జీ.. మీ పార్టీకి ఈ దేశాన్ని 50ఏళ్లకు పైగా పాలించే అవకాశం లభించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 6 గంటలు కూడా కరెంటివ్వకుండా రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు కారణం అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలు ఉన్నాయి. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను రోజురోజుకూ వేడెక్కిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య వరిపై మాటల వార్ నడుస్తోంది. నేతల పదునైన వ్యాఖ్యలు, ఘాటైన విమర్శలతో కూడిన ఈ యుద్ధానికి మంగళవారం ట్విట్టర్ వేదికగా మారింది. తెలంగాణ రైతాంగానికి మద్దతుగా రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్‌తో మొదలైన వాగ్యుద్ధం.. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఆయా పార్టీల కేడర్ స్పందనలు, ప్రతి స్పందనలతో దాదాపు 7 గంటలకు పైగా కొనసాగింది. ఈ రెండు పార్టీల మాటల తూటాలను నెటిజన్లు కూడా ఆసక్తికరంగా ఫాలో అయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు టీఆర్ఎస్ను విమర్శిస్తూ, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే కాకుండా ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతలు సైతం రాహుల్ ట్వీట్‌ను ఫాలో అయ్యి కామెంట్లు చేయడం గమనార్హం. ట్విట్టర్ వార్ సాగిందిలా...! ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్, బీజేపీల వైఖరిని ఎండగడుతూ మంగళవారం ఉదయం 9:32 నిమిషాలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. రాహుల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 9:43 నిమిషాలకు ట్వీట్ చేశారు. అయితే రాహుల్ చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10:12 నిమిషాలకు స్పందించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. కవిత ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ రేవంత్ 11:42 నిమిషాలకు మరో ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 1:47 గంటల సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా కవితకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత 3:29 నిమిషాలకు కవిత, తర్వాత 4:49కు మాణిక్యం ఠాగూర్ మధ్య మరోమారు మాటల యుద్ధం సాగింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు 12:10 నిమిషా లకు రాహుల్ ట్వీట్నుద్దేశించి రీట్వీట్ చేయగా హరీశ్ రీట్వీట్‌కు రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:40 గంటలప్పుడు కౌంటర్ ఇచ్చారు. రాత్రి పొద్దుపో యాక రాహుల్ ట్వీట్‌కు ప్రతిగా మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఎవరెవరు ఏమన్నారంటే.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరును విమర్శించిన రాహుల్ గాంధీ.. ‘తెలంగాణలో రైతుల చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది..’అన్నారు. కాగా ‘తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు..’అని రేవంత్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో‘రాహుల్‌గాంధీజీ మీరు ఎంపీగా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేయండి..’అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. స్పందించిన రేవంత్.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఇక మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి.. ‘తెలంగాణ ప్రజల మేలు కోరేవాళ్లు అయితే పార్లమెంటులో మా ఎంపీలతో కలిసి మీరూ ఆందోళన చేయండి. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి.’అంటూ ధ్వజమెత్తారు. హరీశ్‌ను ఎద్దేవా చేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. ‘మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తుంటే జాలేస్తోంది. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి.. మా పార్టీ సెంట్రల్ హాల్లో ఫోటో షూట్ చేయదు. రైతుల కోసం ఫైట్ చేస్తుంది.’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల స్పందన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో స్పందించారు. ‘ఒక్కరోజైనా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వడ్ల సమస్యపై మాట్లాడలేదు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా మాట్లాడలేదు. రైతుల కోసం రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్, కవితలకు లేదు. కేంద్రంతో ములాఖత్ అయి ఎఫ్‌సీఐకి ధాన్యం ఇవ్వబోమని రాసిచ్చారు. ముందు రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొని ఆ తర్వాత కేంద్రంతో యుద్ధం చేయండి’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. -
రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది: రాహుల్‌గాంధీ
-
ధాన్యం కొనుగోళ్లపై రాహుల్‌గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
-
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకు పోరాడుతాం: రాహుల్‌గాంధీ
-
రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్.. కల్వకుంట్ల కవిత కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ఓ ట్వీట్ చేశారాయన. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు. మరోపక్క తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నిరసనలకు పిలుపు ఇచ్చింది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. — Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022 ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ట్వీట్ పట్ల టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. .@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022 -
ఏప్రిల్ నెలంతా కాంగ్రెస్ ఉద్యమాలు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని, ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గం నిర్ణయించింది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జూమ్ యాప్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. నల్లగొం డ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చై ర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహే శ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ చార్జీ ల పెంపు, ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వాల మోసాన్ని ఎండగట్టాలి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా పెంచారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, సీనియర్ నేతలంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిం చి ప్రజలు, రైతాంగానికి ఈ విషయాలను తెలియజెప్పాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ సిలెండర్లకు దండలు వేయడంతో పాటు డప్పులు కొట్టి నిరసనలు తెలపాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన సివిల్ సప్లయిస్ భవన్, విద్యుత్ సౌధల వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను పరిరక్షించే జీవో 111 విషయంలో సీఎం కేసీఆర్ అస్పష్ట ప్రకటన చేసిన నేపథ్యంలో. ఈ ప్రకటన ఫలితాలు, ఆయా గ్రామాల ప్రజలపై పడే ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు పర్యావరణ అంశాలపై అవగాహన ఉన్న మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రావణ్‌లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలావుండగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో మంచి కృషి చేసి 40 లక్షల పైచిలుకు డిజిటల్ సభ్యత్వాలను చేర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ఎన్‌రోలర్స్‌ను టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. -
ధాన్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. పెంచిన కరెంట్, ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై మోయం లేని భారం పడుతున్న అంశాన్ని దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. శనివారం రాత్రి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘వడ్లను కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నడు. ప్రజలు తరిమికొడతారనే భయంతో తన తప్పును కేంద్రంపై నెట్టి బీజేపీని బదనాం చేయాలని చూస్తున్నడు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి అన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నరు’అని బండి పేర్కొన్నారు. ‘కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని పంచాయతీలతో కలెక్టర్లు బలవంతంగా తీర్మానం చేయిస్తున్నారని అన్నారు. -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
Sakshi Cartoon: ధాన్యం సేకరణపై రోజుకో డ్రామా!
ధాన్యం సేకరణపై రోజుకో డ్రామా! -
మాయమాటలతో నిజాలను మరుగు పరచలేరు!
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరి ధాన్యం విషయంలో గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. తొలుత ‘వరి వేస్తే ఉరే గతి’ అన్నారు... ఆమధ్య యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నరు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని పేచీ పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి మర ఆడించి, బియ్యంగా మార్చి వాటిని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకూ జరిగిందదే. ఇందుకయ్యే ఖర్చు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోంది. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో కనీస మద్దతు ధరను కేంద్రమే చెల్లిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమిటి? కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ... కేసీఆర్ కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం అధీనంలో తగిన యంత్రాంగం లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్రాలకు అప్పగించింది. ఈ విషయం చెబితే పంజాబ్‌లో కొంటున్నప్పుడు ఇక్కడెందుకు కొనడం లేదని కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు. పంజాబ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ కమిటీలే స్వయంగా రైతుల నుండి వడ్లను కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసి వడ్లను కేంద్రానికి అప్పగిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ మార్కెట్ కమిటీలు తూతూ మంత్రంగా పనిచేస్తున్నయ్.. వాటికి ధాన్యం సేకరించే బాధ్యతను అప్పగిస్తే సేకరించే స్థాయి ఉందా? ఇక్కడ మరో విషయం చెప్పాలి... 2021–22 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఈ రెండింటికి నడుమ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. మరి ఒప్పందాన్ని తానే ఉల్లంఘంచి... ఆ ఒప్పందం నుండి తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని గత అక్టోబర్ 4న కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాసింది. మెడమీద కత్తి పెట్టిందనే అభియోగంతో ఇప్పుడు మాట తప్పుతున్నారు. గతంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాల ప్రజలు బాయిల్డ్ రైస్ తినేవారు. ఇప్పుడు దాన్ని తినడం తగ్గించేశారు. ఆయా రాష్ట్రాలే అక్కడి అవసరాల మేర ఆ రైస్‌ను తయారు చేసుకుంటున్నాయి. అందుకే కేంద్రం ఆ బియ్యం వద్దంటున్నది. మనకంటే ఎక్కువ వరి పండించే రాష్ట్రాలు ఉన్నా అక్కడ కొనుగోళ్ల సమస్య రావడంలేదు. మన పొరుగు రాష్ట్రం ఏపీ మనకంటే ఎక్కువ వరి పండిస్తోంది. అక్కడ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి నేరుగా కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటోంది. కొన్న ధాన్యంలో... రేషన్ సరఫరాకు అవసరమైన ధాన్యాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని కేంద్రానికి అమ్ముతోంది. కానీ కేసీఆర్ చేస్తోందేమిటి? వానా కాలం పంట వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు. అసలు తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం ఎంత? ఈ ప్రభుత్వం చూపుతోంది ఎంత? వాస్తవాలు తేల్చడానికి తక్షణమే కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించాలని మేం అడగబోతున్నం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ తరపున మేం చెబుతున్నం... కేసీఆర్‌కు ‘వరి అంటే ఉరి’.. కానీ మా దృష్టిలో ‘వరి అంటే సిరి’! మేం అధికారంలోకి వస్తే వానాకాలంతోపాటు యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొని చూపిస్తం. అవసరమైతే రైతు కోసం రాష్ట్రం తరఫున కొంత బోనస్ లేదా సబ్సిడీ కూడా ఇస్తాం. (క్లిక్: సంఘటితమైతేనే రాజ్యాధికారం) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. పోయిన యాసంగి, అంతకుముందు నిల్వ చేసిన బియ్యాన్ని కూడా మిల్లర్లు వానా కాలం పంటగా చూపుతూ ఎఫ్‌సీఐకి పెడుతున్నరు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో చౌకగా కొన్న ధాన్యాన్నీ ఇక్కడిదేనని లెక్కలు చెబుతున్నరు. కేంద్రానికి మిల్లర్ల వ్యవహారం అంతా అర్థమైంది. కొన్ని చోట్ల తనిఖీలు చేసి పట్టుకుంది. ఇదే విషయం చెబుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇకపై అట్లా జరగకుండా చూస్తామని బదులిచ్చి, ఇప్పుడు మళ్లీ కొత్త వాదనలకు తెర లేపారు. అందుకే కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో యాసిడ్ టెస్ట్‌కు సిద్ధమైంది. ఎఫ్‌సీఐ సేకరించే ధాన్యంపై యాసిడ్ టెస్ట్ చేస్తే ఏ సీజన్లో పండించారో తేలిపోతుంది. అంతేగాదు.. ఆ పంట తెలంగాణకు సంబంధించిందా? ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చారా అనేది కూడా తెలిసి పోతుంది. ఈ విషయాలు బయటపడతాయనే కేసీఆర్, మిల్లర్లు కుమ్మక్కై సమస్యను దారి మళ్లిస్తుండ్రు. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) యాసంగిలో పండించే ఏ వెరైటీ ధాన్యమైనా మిల్లింగ్ చేస్తే సగానికిపైగా నూక వస్తుందనే సీఎం మాటలు పచ్చి అబద్దం. యాసంగిలో సన్న వడ్లు మిల్లింగ్ చేస్తేనే నూక ఎక్కువొస్తది. సన్నవడ్లు పట్టిస్తే క్వింటాల్‌కు అదనంగా 10 కిలోల నూక వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. అయినా నష్టమేముంది? నూకతో రైస్‌బ్రాన్ ఆయిల్ తయారు చేస్తున్నరు. రాష్ట్రంలో రైస్‌బ్రాన్ ఆయిల్ సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రంతో చేసుకున్న ఒప్పందంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ సంస్థలను నెలకొల్పిన దాఖలాల్లేవు. నూక వల్ల యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు మించి భారం పడే అవకాశమే లేదు. రైతు బంధు ద్వారా రూ. 13 వేల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే సీఎం రైతు సంక్షేమం కోసం రూ. 1,000 కోట్లు భరించలేరా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. - బండి సంజయ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -
వారు రైతు వ్యతిరేకులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ధాన్యం సేకరణ విషయంలో తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. తెలంగాణలోని కొందరు నాయకులు తప్పుడు వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు పారదర్శకంగా ఉంటే, నిజంగా రైతులకు మేలు చేయాలని తలిస్తే తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని కోరారు. గురువారం తెలంగాణ మంత్రుల బృందంతో జరిగిన సమావేశం అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాణ్యత మేరకు అదనపు నిల్వల కొనుగోలు కేంద్రం చేయాల్సిన పనిని ఎలాంటి భేదభావాలు లేకుండా తప్పకుండా పూర్తి చేస్తుందని తెలంగాణ రైతులకు పీయూష్ భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్‌లో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పని చేయాలని సూచించారు. తెలంగాణ నుంచి నాణ్యతా ప్రమాణాల ప్రకారం అదనపు నిల్వలను కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పీయూష్ చెప్పారు. ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిన ఎమ్మెస్పీ చెల్లింపులు 2014–15లో తెలంగాణ రైతులకు వరికి రూ.3,391 కోట్లు కనీస మద్దతు ధరగా చెల్లించామని, ఇది ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిందని, 2020–21 ఖరీఫ్ పంట కాలంలో రూ.26,610 కోట్లు ఎమ్మెస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కాగా ‘తెలంగాణలో ఏవైనా అదనపు నిల్వలు ఉంటే, వాటి స్వంత వినియోగం తర్వాత, ముడి బియ్యం రూపంలో, కేంద్రంతో ఎంఓయూ ప్రకారం, ఎఫ్‌సీఐ పేర్కొన్న నాణ్యత ప్రకారం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కట్టుబడి ఉంది.. ’అని గోయల్ పేర్కొన్నారు. ముడిబియ్యం ఎంత ఇచ్చేదీ చెప్పలేదు తెలంగాణలో ధాన్యం సేకరణ విషయమై జరుగుతున్న ప్రచారం సత్యదూరమని, దేశంలో ఉన్న డిమాండ్ మేరకు కేంద్రానికి ముడి బియ్యం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బియ్యం సేకరణపై చర్చించేందుకు 2022 ఫిబ్రవరి 25న ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలను నిర్దిష్ట ఫార్మాట్‌ను ఇవ్వాలని కోరగా, తెలంగాణ ప్రభుత్వం ఫార్మాట్‌ను సమర్పించలేదని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ఇదేశాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలోనూ ముడిబియ్యం ఎంత ఇస్తామన్న విషయాన్ని తెలంగాణ చెప్పలేదన్నారు. మరోవైపు ప్రస్తుత రబీ పంటలో సెంట్రల్ పూల్‌కు తన వాటాగా అందించే ముడిబియ్యం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడిబియ్యం సేకరిస్తామన్నారు. -
అది ‘వ్యాపార’ కేంద్రం!
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. – వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం నిరంజన్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం’’అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్‌లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు. -
కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం: పీయూష్ గోయల్
-
‘కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం’
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారని, ధాన్యం కొనుగోలులో ఏ రాష్ట్రంపై వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరిస్తున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. పంజాబ్‌కు అనుసరిస్తున్న విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నామన్నారు. రా రైస్ ఎంత ఇస్తామనే విషయం ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, ఎన్నిసార్లు అడిగినా టీఎస్ సర్కారు స్పందించలేదన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఫిబ్రవరి 22, మార్చి 8వ తేదీల్లో సమావేశాలకు రావాలని ప్రభుత్వాన్ని కోరినా ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదని పీయూష్ గోయల్ తెలిపారు.కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. -
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు: గోయల్
-
ధాన్యం కొనకపోతే మద్దతు ధరకు అర్థమేముంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు రబీ (యాసంగి) సీజన్లో పండించి విక్రయించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించేలా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పంటను సేకరించకపోతే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అర్థమే లేదన్నారు. ఇది వ్యవసాయ రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రధానికి సీఎం లేఖ రాశారు. పంజాబ్, హరియాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం, గోధుమలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు విభిన్నమైన విధానాలు ఉండకూడదన్నారు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణకు ఒకే విధానం ఉండాలని.. నిపుణులు, సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలని ప్రధానికి సూచించారు. లేఖలో కేసీఆర్ ఏమేం ప్రస్తావించారంటే.. ఆహార భద్రత చట్టం లక్ష్యానికి విఘాతం రాష్ట్రాల ప్రజా పంపిణీ అవసరాలను తీర్చిన తర్వా త కేంద్రమే మొత్తం ధాన్యాన్ని సేకరించాలనేది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం. తెలంగాణలో ఏ ధాన్యం అందుబాటులో ఉందో దాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. గతంలో ఇదే ఆనవాయితీగా ఉన్నా ఆహార శాఖ రెండేళ్లుగా వరి ధాన్యాన్ని సేకరించేందుకు విముఖత చూపుతోంది. ఇది ఆహార భద్రత చట్టం లక్ష్యా న్ని ఉల్లంఘించడమే. ఈ చట్టం అమలు బాధ్యత మీదే. రాష్ట్ర ప్రభుత్వాలకు నిల్వ సామర్థ్యం, ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర తరలింపు అవకాశాల్లేవు. కాబట్టి ఆహార ధాన్యాలను సేకరించి సరఫరా చేసే బాధ్యతను ఈ చట్టం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణలో ప్రగతిశీల విధానాలు దేశంలో సగం జనాభా వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో వ్యవసాయ రంగంలో స్థిరమైన అధిక వృద్ధి రేటును సాధించడానికి మేం ప్రగతిశీల, రైతు అనుకూల విధానాలను అనుసరించాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయల కల్పన వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు గణనీయంగా తగ్గాయి. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాం పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఆయిల్ పామ్, ఎర్రపప్పు తదితర పంటల సాగును ప్రోత్సహించాం. తద్వారా వరి సాగు 52 లక్షల ఎకరాల నుంచి 36 లక్షల ఎకరాలకు తగ్గింది. ఈ నేపథ్యంలో రబీలో రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోగా మార్కెట్‌కు వచ్చే మిగులు వరి పంటను పూర్తి స్థాయిలో కేంద్రమే సేకరించాలి. దేశం రైతుల ఆగ్రహాన్ని చవిచూసింది కేంద్రం తీసుకున్న కొన్ని అస్థిరమైన, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశం మన రైతుల ఆగ్రహాన్ని చవి చూసింది. రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించడం వల్ల వారు నిస్సహాయ స్థితితో తీవ్రంగా బాధపడ్డారు. రైతు ఆందోళనకు తలవంచి చివరికి ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. -
సీఎంల సమావేశం పెట్టండి.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. ధాన్యం సేకరణపై జాతీయస్థాయిలో ఒకే విధానాన్ని రూపొందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయరంగ నిపుణులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ‘తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు పెట్టించాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. జాతీయస్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ లేదు. పంజాబ్, హర్యానాలో వంద శాతం ధాన్యం సేకరిస్తున్నారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయి. ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో ఒకే విధానాన్ని రూపొందించాలి. వ్యవసాయ రంగ నిపుణులు, సీఎంలతో సమావేశం నిర్వహించాలి’ అని సీఎం కేసీర్ లేఖలో పేర్కొన్నారు. -
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై స్పందించిన కేంద్రం
Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పందించింది. తెలంగాణలో ధాన్యం, బియ్యాన్ని మొత్తం కొనలేమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారాయన. అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు ఆయన. వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై రేపు(గురువారం) తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు ఎంపీలు పీయూష్‌ను కలవనున్నారు. వడ్ల సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. -
తెలంగాణ మంత్రుల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యం కొనుగో లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందే ప్రకటించినట్టుగా రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం రాజధానికి పయనమైవెళ్లారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో పాటు బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్, హరియాణా తరహాలో రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో మంత్రులు కేంద్ర మంత్రితో సమావేశం కావాలని భావిస్తున్నారు. కనీస మద్దతు ధరతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత కేంద్రం తన అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకున్నా తమకు అభ్యంతరం లేదనే వాదనను ఈసారి తెరపైకి తెచ్చారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు.. అంశాల పైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. బుధవారం గోయల్ ఇచ్చే అపాయింట్మెంట్ను బట్టి ఢిల్లీలో మంత్రులు, ఎంపీల కార్యాచరణ ఉండనుంది. ఇదే విషయాన్ని ఢిల్లీకి బయలుదేరుతూ మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు. గోధుమలు, పత్తి తరహాలోనే.. ‘దేశంలో పండిన గోధుమలు, పత్తిని కనీస మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేస్తోంది తప్ప గోధుమను పిండి చేసి, పత్తిని బేల్ చేసి కొనడం లేదు. మరి వరి ధాన్యం విషయంలో ఈ తేడా ఎందుకు? రైతు పండించిన ధాన్యాన్ని బియ్యంగా సేకరించే ఎఫ్‌సీఐ కేంద్రం చేతుల్లోనే ఉంది. బాయిల్డ్ రైస్‌ను పరిచయం చేసిందే ఈ ఎఫ్‌సీఐ. బాయిల్డ్ రైస్, రా రైస్ అనే దానితో మాకు సంబంధం లేదు. పంజాబ్ తరహాలో రైతులు ఏది పండిస్తే అది కొనాలి..’అని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రధానికి సమస్యను వివరిస్తాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే వస్తామని, సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోం దని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ గంగుల విమర్శించారు. కేంద్రం తీరుతో రైతాంగం అయోమయంలో ఉందన్నారు. ప్రధానిని కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. బియ్యం తీసుకోకుండా నిందలు.. ‘యాసంగి ధాన్యం కొనుగోలుపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నదే మా డిమాండ్. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్రం సేకరించేందుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పగిస్తాం. గత సీజన్లో వచ్చిన ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే ఎఫ్‌సీఐ తీసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చిస్తాం..’అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ‘వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏం సంబంధం?’అని ప్రశ్నించారు. -
ఢిల్లీలో 'వడ్ల దంచుడు'!
యాసంగి ధాన్యం కొనుగోలు అంశం దేశ రాజధాని హస్తినలో వేడిని పెంచుతోంది. మూడు పార్టీలకు చెందిన నేతల మోహరింపుతో రాష్ట్ర రాజకీయాలకు ప్రస్తుతం ఢిల్లీ వేదికగా మారింది. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత ఢిల్లీలో లడాయి షురూ అవుతుందని, ఈలోగా కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు కలుస్తారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలువురు రాష్ట్ర మంత్రులు మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాడోపేడో తేల్చుకునే తిరిగి వస్తామని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ధాన్యంపై రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు మీరడంతో మతి తప్పి మాట్లాడుతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం వేడిని మరింత పెంచింది. మరోవైపు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీలు ఒకే తానులో ముక్కలేనని, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయంటూ వ్యాఖ్యానించడంతో.. ‘ధాన్యం రాజకీయం’ రసకందాయంలో పడింది. -
ఆ రెండూ కలిసే వడ్ల నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్న మాదిరిగా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుబంధుతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదని, పంటలకు అందించే మద్దతు ధరకు అదనంగా అందించే బోనస్‌తోనే లబ్ధి జరు గుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. దొంగ సొమ్ము పంచుకోవడానికి ఇద్దరూ ఒక్కటే రాష్ట్రంలో దొంగ సొమ్ము పంచుకోవడానికి టీఆర్ ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడానికి.. వడ్ల కోసం కొట్లాడుతున్నానని ఒకరు చెబుతుంటే, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని మరొకరు అంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి సింగరేణి సంస్థకు నైని బొగ్గు గని కేటాయింపు విషయంలో జరుగుతున్న అవకతవకల విషయంలో ప్రధానికి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా, సింగరేణి సీఎండీ శ్రీధర్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకో వట్లేదని, ఆయనను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు కావడం వల్లే సింగరేణి కుంభకోణంపై విచారణ ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే: కోమటిరెడ్డి తాను పార్టీ మారుతున్నాననే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎన్నో గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాగే కాంగ్రెస్ పార్టీలో గొడవలు సహజమని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు. -
ముడి బియ్యం ఎంతైనా కొంటాం.. తెలంగాణ బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి గతంలో చెప్పిన మేరకు రా రైస్ (ముడి బియ్యం) ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పేర్కొన్నట్లు తెలిసింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే సంతకం చేసి కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత దేనిని ఆశించి రాజకీయం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంటులో గోయల్‌ను కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ‘అసలు రా రైస్ కొనబో మని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా బాధ్యత. అసలు గతంలో ఇస్తామన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభు త్వం ఇంతవరకు ఇవ్వలేదు. అయినా దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చా. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా డ్రామాలు ఎందుకు?’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశానంతరం సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పసుపు రైతులను ఆదుకోండి...: అరవింద్ అకాల వర్షాలతో గతేడాది పసుపు పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయం పై ఎంపీ అరవింద్ కేంద్రమంత్రి గోయల్‌తో చర్చించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పసుపు రైతులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని గోయల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
100% ధాన్యం కొనాల్సిందే.. పంజాబ్‌లో లాగా కేంద్రమే సేకరణ చేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలి. పంజాబ్, హరియాణాకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం రైతుల హక్కు. కేంద్రం పంజాబ్‌లో ధాన్యం వంద శాతం కొనుగోలు చేసినట్టే.. తెలంగాణలో కూడా కొనాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ఇస్తున్నది ధాన్యానికే తప్ప బియ్యానికి కాదని.. రైతుల నుంచి ధాన్యం కొన్నాక బాయిల్డ్ రైస్ చేసుకుంటరో.. బా గోతం ఆడుకుంటరో.. ఇంకేం చేసుకుంటరో కేం ద్రం ఇష్టమని వ్యాఖ్యానించారు. మొత్తం ధాన్యం మాత్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమ వారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుతం 30లక్షల ఎకరాల్లో వరి.. ‘‘రాష్ట్రంలో గత యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో వరి పండింది. ఈసారి 35 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంట్లో 3 లక్షల ఎకరాల్లో విత్తనాల కోసం, మరో రెండున్నర లక్షల ఎకరాల్లో స్వయం వినియోగానికి పంట వేశారు. మిగతా 30 లక్షల ఎకరాల్లో పండిన వరి కొనాల్సి ఉంటుంది. దీనికోసం రేపు (మంగళవారం) వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి కేంద్ర ఆహారమంత్రిని కలుస్తారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం. లేకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధం. తెలంగాణలోని అన్ని స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం. అప్పటికీ ధాన్యం కొనకుంటే తీవ్రంగా ఉద్యమిస్తాం. అవసరమైతే కేబినెట్ అంతా వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతాం. కిసాన్ నాయకులు కూడా మద్దతు తెలుపుతామన్నారు. రైతు ఉద్యమాలు నిర్మించాలని టికాయత్‌కు చెప్పాం. వడ్లు తీసుకెళ్లి ఇండియా గేట్ దగ్గర పోస్తాం. రైతులకు రాజ్యాంగ రక్షణ కావాలి దేశంలో రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరముంది. కనీస మద్ధతు ధర, ధాన్యం సేకరణతోపాటు ఇతర అంశాలపై జాతీయ స్థాయిలో రాజ్యాంగ రక్షణ అవసరం. ఈ మేరకు ప్రధాని, ఆహార మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తాం. రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతాం. ధాన్యం సేకరణకు జాతీయ విధానం ఉండాలని అడుగుతాం. దేశంలో కొందరు వ్యక్తులు బ్యాంకులను కొల్లగొట్టి రూ.11 లక్షల కోట్లు ముంచారు. కానీ రూ.15 వేలకోట్లు వెచ్చించి ధాన్యం సేకరించడం కేంద్రానికి కష్టమవుతోందా?’’అని సీఎం కేసీఆర్ నిలదీశారు. స్టేట్మెంట్లు కాదు.. యాక్షన్ రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆందోళనలు ఉధృతం చేస్తాం. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తాం. ఈ పోరాటం ఆషామాషీగా ఉండదు. మాటలు, పేపర్ స్టేట్మెంట్లుగా ఉండదు. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటది. ఈ పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. పంజాబ్, హరియాణాల తరహాలో వందశాతం ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చేవరకు పోరాటం చేస్తాం. వదిలే ప్రశ్నే లేదు. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం ఉద్యమ వీరులం. ఉద్యమం చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరే భంగపడతారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్‌కు అవలంబించిన విధానాన్నే మాకు అమలు చేయండి. మేం కోరేది గొంతెమ్మ కోర్కె కాదు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనండి, మీరే మిల్లింగ్ చేయించుకోండి. ఇందుకోసం పూర్తిస్థాయిలో సహకరిస్తాం. దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలి. దీని నుంచి తప్పించుకోవద్దు. -
వారంపాటు దేశానికీ అన్నంపెట్టె పరిస్థితి ఉందా:సీఎం కేసీఆర్
-
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 593 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా సేకరించినట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు 69.5 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిం దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు 69.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2 లక్షల టన్నుల వరకు సేకరించే అవకాశం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన పేచీలను అధిగమించి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపినట్లు తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇదే తొలిసారని వివరించారు. 12.72 లక్షల మంది నుంచి కొనుగోలు ‘గత సంవత్సరం వానాకాలంలో 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి అదనంగా మరో 22 ఎల్ఎంటీ ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సీజన్లో 6,878 కొనుగోలు కేంద్రాలను తెరవగా, దాదాపు 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరిగింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కొన్నిచోట్ల ఆలస్యంగా సాగు చేసిన కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరిగింది. 12.72 లక్షల మంది రైతుల నుంచి రూ.13,601 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశాం. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)లో నమోదైన 8.68 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. మరో రూ. 2,500 కోట్లు ఓపీఎంఎస్‌లోకి వివరాలు ఎక్కగానే రైతుల ఖాతాల్లోకి చేరతాయి. రైతులకు ధాన్యం సొమ్మును ఒక్కరోజు కూడా ఆపకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు అందుకు అనుగుణంగానే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడం హర్షణీయం..’ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. -
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్‌పై సమీక్షను మంగళవారం నిర్వహించారు. ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తికావచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 ఎల్ఎంటీ బియ్యానికి సమానమైన 68.65 ఎల్ఎంటీ ధాన్యం సేకరణలో 3వ తేదీ నాటికే 65.20 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించినట్లు తెలిపారు. కేంద్రం విధించిన నిబంధనలతో సంబంధం లేకుండా ఎంత ధాన్యం వచ్చినా సేకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తయిందని, వాటిని మూసివేసివేశామని తెలిపారు. ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ఈ వానకాలానికి సంబంధించి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దీన్, పౌరసరపరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఫ్రంట్‌లైన్ వారియర్లు కాదా
సాక్షి, హైదరాబాద్: వరి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ రైతు సంఘాల కూటమి (సిఫా) ఆరోపించింది. తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం... రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ను వరి వేయొద్దని చెప్పడంతో సమస్య మొదలైం దని స్పష్టం చేసింది. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరువు కాటకాలు ఉండగా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి వసతి ఏర్పడిందని వెల్లడించింది. దీంతో వరివైపు రైతులు మళ్లారని సిఫా వివరించింది. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంటూ వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులను గుర్తించారే కానీ రైతులను ఆ కేటగిరీలో చూపించలేదని విమర్శించింది. సిఫా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘అగ్రికల్చర్ యాజ్ ఫోకస్ ఏరియా ఆఫ్ రీజినల్ అప్రోచెస్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా’ అంశంపై జాతీయ వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు సిఫా ముఖ్య సలహాదారు పి.చెంగల్‌రెడ్డి, ప్రొఫెసర్ దేవీప్రసాద్ జువ్వాడి సంధానకర్తలుగా వ్యవహరించారు. సాగుకు మద్దతేదీ..? వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నా ధాన్యం సేకరణ, ఎగుమతులు కేంద్రం చేతిలో ఉన్నాయని చెంగల్‌రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్రం కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చిందే తప్ప వ్యవసాయానికి మద్దతివ్వలేదన్నారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలకు ఉన్న గౌరవం వ్యవసాయాధికారులకు లేదన్నారు. కేంద్రం వ్యవసాయ విధానాల్లో విఫలమైందన్నారు. తెలంగాణ రైతులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. రైతు సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వరిపై కేంద్రం వైఖరి సరికాదు: బి. వినోద్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఫోన్ ద్వారా తన సందేశం వినిపిస్తూ కేంద్రం వరి కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకులు ప్రైవేటీకరణ బాటపడితే రైతులకు రుణాలు కలగానే మిగులుతుందన్నారు. సంప్రదాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తేనే వ్యవసాయ రంగం బాగుంటుందన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్న తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేసినా ప్రభత్వం రుణాలు, వడ్డీ రాయితీ కల్పించకపోవడంతో సమస్యలు వస్తున్నాయని రైతు రఘురాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌లో వార్త ఎడిటర్ సాయిబాబా, ఆలిండియా అగ్రికల్చర్ స్టూడెంట్ అసోసియేషన్ నేత సాయికాంత్, సిఫా తెలంగాణ అధ్యక్షుడు సోమశేఖర్‌రావు ప్రసంగించారు. -
రైతుల చావు కేకలు వినిపించడం లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తామర పురుగుతో నష్టపోయి మిర్చి రైతులు, ధాన్యం కొనుగోళ్లు లేక వరి రైతుల చావు కేకలు వినిపించడం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి కేవలం ఐదు క్వింటాళ్లు రావడమే గగనంగా మారిందని, లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి మిర్చి పండించిన రైతులు దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక్కో మిర్చి రైతు నెత్తిన ఐదు నుంచి రూ.10 లక్షల అప్పు ఉందని, ఏ పత్రిక తిరగేసినా మిర్చి రైతుల ఆత్మహత్యలే దర్శనమిస్తున్నాయని వెల్లడించారు. పంట మార్పిడికి భరోసా ఏదీ? వరి వద్దు ...పంటల మార్పిడి చేయాలంటోన్న మీరు మిర్చి రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని రేవంత్ లేఖలో డిమాండ్ చేశారు. ఏడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మెజారిటీ రైతులకు పరిహారం కూడా అందలేదని, పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల్లో భరోసా నింపేలాచర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని, తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటుగా రూ.లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. లేదంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. -
తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ప్రశంస
సాక్షి, ఢిల్లీ: వరి ధాన్యం సేకరణలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. 2020-2021ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత ఏడాదితో పోల్చితే ధాన్యం సేకరణ 15 శాతం పెరిగింది. గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పంజాబ్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్లు ఉన్నాయి. 1.31కోట్ల మంది రైతులకు కనీస మద్ధతు ధర ద్వారా రూ.1,68,849కోట్ల మేర లబ్ది చేకూరింది. 2021-22లో దేశవ్యాప్తంగా బుధవారం వరకు 472.47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు కేంద్రం పేర్కొంది. -
ధాన్యంపై దండయాత్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని జిల్లాలను సస్యశ్యామలంగా మార్చింది. పాలమూరు, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని సాగునీటి పథకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 20 ఏళ్ల కిందట 2002–03లో వానాకాలం, యాసంగి కలిపి కేవలం 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించిన తెలంగాణ రైతులు.. మారిన పరిస్థితుల్లో వ్యవసాయాన్ని పండుగగా చేసుకొని అధిక దిగుబడి తెస్తున్నారు. గత యాసంగి (రబీ) సీజన్లోనే ఏకంగా 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు నడుస్తున్న వానకాలం (ఖరీఫ్) సీజన్లో ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించారు. మరో 20–30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ధాన్యం రగడ దేశంలో కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన కేంద్రం వరి విషయంలో కొత్త కొర్రీలు పెడుతోంది. కేంద్రం విధించిన ‘ఉప్పుడు బియ్యం’ ఆంక్షల చిచ్చు యాసంగి సీజన్లో వరిని రైతుకు దూరం చేస్తోంది. రైతు పండించిన ధాన్యం నుంచి సెంట్రల్ పూల్ కింద ఏయే రాష్ట్రాల నుంచి బియ్యాన్ని భారత ఆహార సమాఖ్య (ఎఫ్‌సీఐ) ఎంత సేకరించాలో ముందే నిర్ణయించి అంతకుమించి తీసుకోబోమని తెగేసి చెప్పింది. యాసంగిలో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి వెళ్లే బాయిల్డ్ రైస్‌ను ఇక ముందు కిలో కూడా సేకరించబోమని స్పష్టం చేసింది. దీంతో వరి సాగు విషయంలో కొత్త ఆంక్షలు ఎదుర్కొనే పరిస్థితి ఈ ఏడాది రైతాంగానికి ఎదురైంది. యాసంగి ఉప్పుడు బియ్యం లొల్లి తెలంగాణలో వేసవి కాలంలో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ మార్పుల కారణంగా యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగానే వస్తుంది. అదే సమయంలో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం గింజ విరుగుతుంది. నూకల శాతం 35–50 శాతం ఉంటుంది. దీంతో రైతుకు నష్టం ఎక్కువ ఉంటుండటంతో యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించడం కొన్నేళ్లుగా సాగుతోంది. అయితే కేంద్రం ఒక్కసారిగా ఉప్పుడు బియ్యం సేకరణకు నిరాకరించింది. అందులోభాగంగా 2021 యాసంగిలో వచ్చిన 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి కేవలం 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హతాశులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రంతో సంప్రదింపులు జరిపినా.. పరిస్థితి మారలేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి యాసంగిలో వచ్చే 65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 24.75 ఎల్ఎంటీ మాత్రమే తీసుకుంటే కష్టమని, మిగతా బియ్యం ఏం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం మరో 20 ఎల్ఎంటీ అదనంగా తీసుకొనేందుకు ఒప్పుకుంది. అయితే ఇంకెప్పుడూ ఉప్పుడు బియ్యం ఇవ్వకూడదనే షరుతు విధించింది. దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలనే ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరిసాగు ఇక రైతుల అభీష్టం మేరకేనని స్పష్టంచేసింది. యాసంగే కాదు.. వానకాలం పంటపైనా.. యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని చెప్పిన కేంద్రం వానాకాలం సీజన్లో పండించిన బియ్యంపైనా లక్ష్యాన్ని నిర్దేశించింది. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు మాత్రమే ఒప్పుకోవడంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. మంత్రుల బృందం వారంపాటు ఢిల్లీలో ఉండి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తామని కేంద్రం లేఖ రాసింది. పచ్చి బియ్యం ఎంతైనా కొంటామని చెప్పిన కేంద్రం తీరా ఇప్పుడు 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని చెప్పడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. -
కేంద్రం కబురు.. అదనంగా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో అదనపు బియ్యం సేకరణపై కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. కొన్ని నెలలుగా రాష్ట్ర సర్కారు తెచ్చిన ఒత్తిడితో ఈ సీజన్లో అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ జై ప్రకాశ్ సమాచారం పంపారు. ‘సెప్టెంబర్ 20న తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు అనుగుణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో నిర్ణీత లక్ష్యానికి అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకునేందుకు కేంద్రం అనుమతిస్తోంది. ఈ మేరకు తెలంగాణ నుంచి సెంట్రల్ పూల్ కింద తీసుకోవాల్సిన ముడి బియ్యం సవరించిన లక్ష్యం 46 లక్షల మెట్రిక్ టన్నులుగా పరిగణిస్తున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో వారం ఉండి.. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) తీసుకునేందుకే కేంద్రం ఇదివరకు అంగీకరించింది. అయితే లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ పూర్తవడం, అదనంగా మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించాల్సి ఉండటంతో దానికి అనుమతించాలని నెల రోజులుగా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు ఈ విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడంతో పాటు వారం పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అదనంగా వచ్చే ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అయితే అది ఎంత మేరో స్పష్టతనివ్వలేదు. లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప కేంద్రాన్ని నమ్మలేమని రాష్ట్ర నేతలు బలంగా చెప్పడంతో మంగళవారం కేంద్రం అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (సుమారు 9 లక్షల టన్నుల ధాన్యం) తీసుకునేందుకు సమ్మతిస్తూ లేఖ పంపింది. కాగా, ప్రస్తుత సీజన్లో ఈ నెల 27 నాటికి రాష్ట్రం నుంచి 52.88 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తంగా 7.84 లక్షల మంది రైతుల నుంచి రూ.10,364.88 కోట్ల విలువైన ధాన్యం కొన్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయినా మిగులుతాయ్ వానాకాలం సీజన్లో బియ్యం సేకరణపై టీఆర్ఎస్ సర్కారు చేసిన పోరుకు కేంద్రం నుంచి అంతంతే స్పందన వచ్చింది. అదనంగా ఇంకో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యమే.. అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. 100 కిలోల ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం వస్తుంటుంది. ఈ లెక్కన కేంద్రం వానాకాలంలో సేకరిస్తామన్న 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం 68.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. 61.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రం సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,668 కొనుగోలు కేంద్రాల్లో 3,767 కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయి మూతబడగా ఇంకో 2,901 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. రోజూ 75 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు సేకరిస్తున్నారు. ఈ లెక్కన సంక్రాంతికి మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి వస్తుందని అంచనా. దీన్ని బట్టి కేంద్రానికి ఇచ్చే ధాన్యం పోనూ మిగిలే 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నులను ఏం చేయాలో కేంద్రం నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమో లేక మిల్లర్‌లో విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. -
టీఆర్ఎస్, బీజేపీలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని కేంద్రానికి కప్పం కడుతున్నారని కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు వాళ్ల పోలాల్లో వరిధాన్యాన్ని పండిస్తూ.. రైతులను మాత్రం ఈ యాసంగిలో వరి వేయోద్దని బలవంతం చేస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని.. వరిధాన్యం కొనేవరకు పార్లమెంట్ లోపల, బయట టీఆర్ఎస్తో పోరాటం చేస్తుందన్నారు. నోట్ల రద్దు, కరోనాతో ఉద్యోగాలు లేక మధ్యతరగతి, బడుగు వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతాయని మధుయాష్కీ, టీఆర్ఎస్ను హెచ్చరించారు. చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి -
ఎంపీ అర్వింద్ అడ్డగింత
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి యత్నించాయి. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గన్నారం గ్రామంలో నిర్మించి న పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించడానికి ఆదివారం ఎంపీ వచ్చారు. ధాన్యం కొనుగోళ్లు, పసుపు బోర్డు విషయంలో జిల్లా రైతులను మోసం చేస్తున్నా రని ఆరోపిస్తూ... గ్రామ ముఖద్వారం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నా రు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపీ అర్వింద్ వాహనంతో పాటు బీజేపీ మండలాధ్యక్షుడి కారు స్వల్పం గా దెబ్బతిన్నాయి. పలువురు టీఆర్ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. హోం గార్డు రూపకళకు కాలు విరిగింది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకుని ఎంపీ వాహనాన్ని ముందుకు పంపించారు. పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని అన్నారు. పసుపు బోర్డుకు రూ.30 కోట్ల నిధులు కేటాయించడమే కాకుండా దిగుమతులు నిలిపి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. -
‘తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులు పంపుతున్నాం’
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకొస్తామని వెళ్లి ఉత్త చేతులతో వచ్చిన రాష్ట్ర మంత్రులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు బిళ్లలు పంపుతున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. శనివారం గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, రవళిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులను ఆడవారితో పోల్చడమంటే తమకే అవమానంగా ఉందన్నారు. అయినా పీసీసీ అధ్యక్షుడి ఆదేశాలతో వారికి చీరలు, గాజులు పంపుతున్నామని చెప్పారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని వెళ్లిన మంత్రులు వారం రోజులు అక్కడే ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశంపై సరిగ్గా పోరాడలేక టీఆర్ఎస్ చేతులెత్తేసిందన్నారు. కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా వారికి కష్టమయ్యాయని ఎద్దేవా చేశారు. చేతకాని రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసి, చీర, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలని సుజాత, రవళి రెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: Hyderabad: న్యూఇయర్ వేడుకలు.. లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ) -
కేంద్రానిది అసత్య ప్రచారం
ఖమ్మం మయూరిసెంటర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్న కూడా లేవనెత్తకపోవడం గమనిస్తే రైతులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతోందన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడతానని చెప్పడం గర్హనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకు సంజయ్ దీక్ష చేపడుతున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1.3 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి వెల్లడించారు. కాగా, బీజేపీ నాయకులు కలుషిత రాజకీయాలు చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల సంస్కారం బయటపడిందన్నారు. -
నిబంధనలు పెట్టకుండా కేంద్రం వడ్లు కొనాలి
సాక్షి, సిద్దిపేట: గత కేంద్ర ప్రభుత్వాల మాదిరే.. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా వడ్లను కొనుగోలు చేయాలని, నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్, 70 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్తే.. పని లేదా అంటూ హేళన చేయడం సరికాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా వ్యవసాయ మార్కెట్లో విత్తన ధ్రువీకరణ సంస్థ నూతన భవనం, గోదాములకు శంకుస్థాపన, దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని, సంవత్సర కాలం రైతుల పోరాటంతో వ్యవసాయంపై నల్ల చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. కాగా, విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలమని, రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సీడ్ కార్పొరేషన్‌కు కార్యా లయాలు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేటతో కలిపి ఆరుకు చేరాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కుంటుపడిన ఆస్పత్రులను ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వివరించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం ఉందని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి వస్తే కరోనా మూడో డోస్ టీకా వేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తెలంగాణలో మొదటిసారిగా సిద్ది పేట సమీకృత మార్కెట్‌కు తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
తెలంగాణను అవమానిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమానపరచడమే. రాష్ట్ర నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోంది. కేంద్రం వద్ద అడుక్కునేందుకు మేం బిచ్చగాళ్లం కాదు’అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తమ మంత్రులను అవమానించి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారు. రైతుల కోసం కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఆ పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారు. రైతుల సమస్యల కన్నా తమ పార్టీ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయి. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళ్తారు. మేం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తాం’అన్నారు. రైతుల కోసం ప్రతిపక్షాలు కలిసి రావట్లేదు ‘రాష్ట్ర మంత్రులు హైదరాబాద్ వచ్చినంత మాత్రాన వెనకడుగు వేసినట్లు కాదు. రైతుల కోసం అన్ని పార్టీలూ ఏకమైన సందర్భాలు అనేకం ఉన్నా రాష్ట్రంలో ప్రతిపక్షాలు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. యాసంగిలో వరి సాగుపై స్పష్టత ఇవ్వకుండా కేసీఆర్ మీద కోపం, అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పి న్యాయం చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై అసెంబ్లీ తీర్మానం చేసినా న్యాయం జరగట్లేదు. బీజేపీ కుట్రలను ఛేదించడంలో మాకు ప్రత్యేక వ్యూహం ఉంది’అని మంత్రి అన్నారు. మీడియాతో మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్, కౌశిక్‌రెడ్డి తదితరులు -
TS: హస్తినలో రిక్తహస్తమే!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల పంచాయితీకి తెరపడలేదు. వారం రోజులు ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేంద్రం నుంచి ఎలాంటి హామీ పొందకుండానే వెనుదిరిగారు. వడ్లపై ఎవరి వాదన వారిదిగానే సాగింది. రాష్ట్రంలో వానాకాలంలో ముడి బియ్యం ఎంత కొంటామనేది కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టతనివ్వలేదు. ప్రకటన వచ్చే వరకు ఢిల్లీ నుంచి కదిలేది లేదని మంత్రులు తేల్చి చెప్పారు. కానీ కేంద్రం స్పష్టతనిచ్చే పరిస్థితి లేకపోవడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం కక్ష సాధింపు ధోరణితో ఉందని, సీఎం కేసీఆర్‌తో చర్చించాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ‘సాక్షి’కి తెలిపారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లక్ష్యాన్ని చేరుకున్న కొనుగోళ్లు రాష్ట్రంలో వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని కేంద్రం గత జులైలోనే ప్రకటించింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం నాటికి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. కానీ అటు ఇటుగా 10 జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇంకా సాగుతోంది. ఈ లెక్కన సంక్రాంతి నాటికి మరో 20 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని వ్యవ సాయ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం విధించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తవగా అదనంగా వచ్చే ధాన్యం పరిస్థితి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. దీనిపైనే వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మంత్రులు మంత్రి గోయల్‌ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంత్రులతో సమావేశమైన సమయంలో ఎంత కొనుగోలు చేస్తామనే విషయంపై రెండ్రోజుల్లో స్పష్టతనిస్తామని ఆయన చెప్పినా తరువాత బదులివ్వలేదు. అదే సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ‘దేశంలో తెలంగాణకు మాత్రమే వానాకాలంలో ఎంత అదనపు ధాన్యం కొనుగోలు చేస్తారని ఎలా చెబుతారు?’అని ప్రశ్నించడం గమనార్హం. యాసంగి పంటలపై మూణ్నెళ్లుగా.. 2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి మూడు, నాలుగు నెలలుగా కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యాసంగిలో సెంట్రల్ పూల్ కింద 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యమే ఎఫ్‌సీఐ సేకరిస్తుందని గత జూలైలోనే కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ గత యాసంగిలో 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 64 ఎల్ఎంటీ కస్టం మిల్లింగ్ బియ్యం వస్తుందని, దానిలో నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని కేంద్రానికి పలు మార్లు లేఖలు రాసింది. అయితే కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో గత సెప్టెంబర్ ఆఖరులో సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవగా భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం పంపించబోమని హామీ ఇస్తేనే అదనంగా కొనుగోలుకు వెసులుబాటు ఇస్తామనడంతో సరేనన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి పంపబోమని లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. దీంతో 2020–21 యాసంగి ఉప్పుడు బియ్యం సేకరణ లక్ష్యాన్ని మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు (మొత్తంగా 44.75 ఎల్ఎంటీ) సేకరించనున్నట్లు కేంద్రం చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసినా కేంద్రం తన వాదనకే కట్టుబడి ససేమిరా అంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగిలో వరి సాగు చేయొద్దని సర్కారు చెప్పినా చాలా వరకు సాగవుతోంది. -
‘ఏమీ తేల్చకుండా ఢిల్లీ నుంచి వస్తే గాజులు, చీరలు పంపుతాం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వానాకాలం వడ్లు ఎంత కొంటుందో తేల్చడంతోపాటు యాసంగి ధాన్యాన్ని కూడా కొంటామని స్పష్టం చేసే వరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెనక్కు రావద్దని.. అక్కడే ఆమరణ దీక్ష చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రులు ఏమీ తేల్చకుండా ఢిల్లీ నుంచి వస్తే గాజులు, చీరలు పంపుతామన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివా సంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని విమర్శించారు. మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నా టీఆర్ఎస్ నేతలకు పట్టడంలేదని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలవకుండానే వచ్చారని, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి గోయల్ గడ్డి పెట్టి పంపించారని, వరంగల్ గోదాములోని 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్‌మాల్‌పై నిలదీస్తే దొంగల్లా పారిపోయి వచ్చా రని ఆరోపించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగి అక్కడ ఆందోళన చేసినట్టు ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు మంత్రులు ఢిల్లీ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. నిరసనల్లో కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదేం? బీజేపీపై మోగించిన చావు డప్పు నిరసనల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్ ఎందుకు పాల్గొనలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న మంత్రులు, ఎంపీల బృందంలో కేటీఆర్, సంతోశ్లు ఎందుకు లేరని, గత ఆరు రోజులుగా వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో ఇస్తామన్న పంటనే ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రం చెబుతోందని, రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోయిందో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత సరఫరా చేయగలరో చెప్పకుండా అదనంగా ఎంత కొంటారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాలన్నింటినీ వివరించేందుకు ఈ నెల 27న ఎర్రవెల్లిలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అక్కడకు రైతులంతా తరలిరావాలని రేవంత్ కోరారు. రైతుల సమక్షంలోనే టీఆర్ఎస్, బీజేపీల నాటకాలను వివరిస్తామని చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ తెలిపారు. -
ఇండియా గేట్ వద్ద బియ్యాన్ని పారబోస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం సేకరించిన మొత్తం బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సిందేనని మంత్రుల బృందం తేల్చిచెప్పింది. బియ్యం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగిస్తే మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం రైతులను తీవ్రంగా అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. ‘రాష్ట్రం సేకరించిన మొత్తం బియ్యాన్ని తీసుకో కుంటే, మిగిలిన బియ్యాన్ని ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద పారబోసి నిరసన తెలుపుతాం’అని ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం సేకరించామని చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఉన్నఫళంగా ధాన్యం సేకరణను ఆపేయలేమని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో సేకరించిన పూర్తి బియ్యాన్ని తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట ఇచ్చారు. దానికి సంబంధించిన లేఖ రాని పక్షంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన బియ్యాన్ని ఢిల్లీకి తెచ్చి పారబోస్తాం. ధాన్యం సేకరణ అంశం రాష్ట్ర రైతులకు సంబంధించినది.. అందువల్ల కేంద్రప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి’అని పేర్కొన్నారు. బియ్యం తీసుకెళ్లకుండా నిందలా: గంగుల 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన ధాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినందున వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. ‘కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో సిద్ధంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లాలని ఎఫ్‌సీఐకి గతేడాది నుంచి ఇప్పటివరకు 7 లేఖలు రాశాం. వారికి బియ్యం తీసుకెళ్లే ఉద్దేశం లేదు. అందుకే మాపై నిందలు వేస్తున్నారు’అని పేర్కొన్నారు. 3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్: నిరంజన్‌రెడ్డి ఏటా రూ.90 వేల కోట్లు వెచ్చించి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్రం.. దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపించకపోవడం దౌర్భాగ్యమని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే వచ్చే వానాకాలంలో రాష్ట్రంలో 3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతినిధులు వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. 2022 కల్లా దేశంలోని రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న ప్రధాని మోదీ, రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశంలో పీయూష్ గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించామన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయం కాదని.. రైతాంగ సమస్య అని వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం ఢిల్లీ వచ్చిన ఐదుగురు మంత్రులు, కేంద్రమంత్రి గోయల్ కార్యాలయం నుంచి లేఖ రాకపోవడంతో, తదుపరి కార్యాచరణ కోసం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు పయనమయ్యారు. -
కేంద్ర ప్రభుత్వమా? రాజకీయ పార్టీయా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని. కేంద్ర మంత్రులు రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై రెండురోజుల్లో చెబుతామని పీయూష్ గోయల్ అన్నందుకే గురువారం సాయంత్రం ప్రభుత్వ పనిగంటలు ముగిసేవరకు తాము ఎదురుచూశామని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చల మధ్యలో మాట్లాడడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేమడిగేది ఖరీఫ్ అదనపు కొనుగోళ్ల గురించే.. తెలంగాణ రైతుల కోసం గత 6 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే తాము ఢిల్లీకి ఏదో పనిలేక వచ్చినట్లు చులకనగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం వస్తే చులకనగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులను క్రమబద్ధీకరించాల్సిన కేంద్రం సరిగ్గా పని చేయని కారణంగానే తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ధాన్యం సేకరణ అంశంలో కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తాము అడుగుతున్నామని తెలిపారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వద్దని కేంద్రం చెప్పిన విషయాన్ని తాము రైతులకు చెప్పామన్నారు. ఇప్పుడు తాము అడిగేది ఖరీఫ్ దిగుబడి అదనపు కొనుగోళ్ల గురించేనని మంత్రి స్పష్టం చేశారు. పంట పండించడం అన్యాయమా? దేశంలోని సగం రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణలో సాగు జరుగుతుందని, యాసంగిలో ఎక్కువ వరి పండేది తెలంగాణలోనే అని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం చేసిన తప్పా..?, రైతులు పంట పండించడం అన్యాయమా? అని ప్రశ్నించారు. దేశంలోని రైతాంగాన్ని వ్యవసాయం చేయొద్దు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగ విషయంలో కేంద్రానికి ఒక విధానం లేని కారణంగానే సమస్య వచ్చిందన్నారు. ఏడేళ్లు గడిచినా మోదీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయలేదని, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. -
ఏ రాష్ట్రానికి ఇవ్వని లేఖ మీకెందుకివ్వాలి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అనేక చోట్ల బియ్యం దొంగదారి పడుతోందని, కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమలేదని, ధాన్యం సేకరణ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి ఇవ్వని లేఖను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వచ్చే ప్రతి గింజను కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొడవ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చిందన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇంకా ఏం పని ఉంది? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర మంత్రులకు ఢిల్లీలో ఇంకా ఏం పని ఉందని ప్రశ్నించారు. రాజకీయాన్ని రక్తి కట్టించే పని చేస్తున్నారా? లేక గల్లీలో పనిలేక ఢిల్లీకి వచ్చారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులకు రైతులపై కంటే రాజకీ యంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే పంచాయితీ: అరుణ టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలోని వరి రాజకీయాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు సేద తీరుతున్నారని, పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు చేసేందుకే వారిని కేసీఆర్ ఢిల్లీకి పంపారని విమర్శించారు. రైతుల విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అరుణ సూచించారు. -
అడుక్కొనడానికి కాదు.. అమ్ముకొనడానికి..
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు కోట్లకు పైగా తెలంగాణ ప్రజల్ని, లక్షలాది తెలంగాణా రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కించపరిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు భిక్షగాళ్లు కాదని, పంటలు అమ్ముకోవడమనే తమ హక్కును సాధించుకుని తీరతామని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజకీయ సమావేశం నిర్వహించిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి కేవలం బీజేపీ ప్రతినిధి కాదని, గోయల్ దేశంలోని ప్రజలందరికీ ప్రతినిధిలా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రులు, ఎంపీలు, అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం వస్తే వారికి పనిలేదా అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తున్న వారికి కిషన్‌రెడ్డి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాతపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే.. ధాన్యం సేకరణ విషయంలో లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సమానమైన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని కేంద్రం గతంలో లేఖ ఇవ్వడం అన్యాయమని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో మిగిలే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగతేంటని ప్రశ్నించారు. వర్షాకాలంలో వచ్చే ముడి బియ్యం ఎంతైనా కొంటామంటున్న కేంద్ర మంత్రులు, దాని ప్రకారం రాతపూర్వక హామీ ఇవ్వమని అడిగితే వారికి ఉన్న సమస్య ఏంటని నిలదీశారు. గత రబీకి సంబంధించి తీసుకొంటామని నోటిమాటగా చెప్పిన దానిలో ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం తీసుకోవట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై తమకు ఉన్న అనుమానాలతోనే లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తాము పట్టుబడుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 6,857 కేంద్రాలకు గానూ 2,760 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగతా వాటిలో సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని గంగుల తెలిపారు. కేంద్రానికి పట్టవు: జగదీశ్ రెడ్డి కేంద్రానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు అవసరం లేదని విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రైతుల మేలు కోసం ఎవరు పని చేస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. ధాన్యం సేకరణ అంశంలో బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమని, సీఎం కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం బీజేపీ నాయకులకు ఏమ్రాతం సాధ్యం కాదని అన్నారు. -
తేలేదాకా కదలం
ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరాం. బియ్యం తరలింపుపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్‌సీఐ పైనే ఉంటుంది. వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటి? సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం తరలింపు అంశాలపై తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉండాలని, దీనిపై స్పష్టత వచ్చాకే హస్తిన నుంచి కదలాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు మరో రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. మంగళవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అనంతరం తెలంగాణ భవన్లో సహచర మంత్రులు, ఎంపీలతో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరామని, ఒకట్రెండు రోజుల్లో చెబుతామని కేంద్రమంత్రి అన్నారని తెలిపారు. బియ్యం తరలింపుపై లోతైన అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారని ధ్వజమెత్తారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్‌సీఐ పైనే ఉంటుందని, వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన మంత్రిగా ధాన్యాన్ని కొనిపించే బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా? అని నిలదీశారు. రైతుల పక్షాన రాష్ట్రానికి సాయం చేయకుండా అనవసర నిందలు వేస్తున్నారని విమర్శించారు. -
పాలన చేతకాకపోతే తప్పుకోండి!
కొల్లాపూర్ రూరల్: ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే తప్పుకోవా లని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్ర భుత్వంపై సీఎం కేసీఆర్ అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు రూ.500 కోట్లు కూడా వెచ్చించలేరా? అని ప్రశ్నించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన పా ల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం విఫ లమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కాల్చడం, చావుడ ప్పులు కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరుపుతూనే తమ తప్పు లు కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం సిగ్గుచేట న్నారు. రైతులు ప్రగతిభవన్ ఎదుట కేసీఆర్ బొమ్మను తగులబెట్టి చావుడప్పు కొట్టాలన్నా రు. దళితులకు మూడెకరాల భూమి, సబ్సిడీ రుణాలు ఇవ్వనందుకు చావుడప్పు కొట్టాల న్నారు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచెలు వేసుకు న్నారని, మంత్రులకు అధికారాలు లేకుండా చేశారని ఈటల విమర్శించారు. సమావేశంలో బీజేపీ నేతలు బంగారు శృతి, సుధాకర్‌రావు, దిలీప్‌చారి తదితరులు పాల్గొన్నారు. -
పాలన చేతకాకే ధర్నాలు
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతగాకే ధర్నాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని, చావుడప్పు కొట్టాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వానికేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతుల చావులకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమ ని ఆరోపించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె సోమవారం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఇటీవల సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో వడ్ల కొ నుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. లింగంపేట మండలం ఐలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన బీరయ్య కుటుంబాన్ని, నాగిరెడ్డిపేట మండలం వదల్‌పర్తిలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నూరి యాదయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న సీఎం కేసీఆర్ రైతుల ఉసురు పోసుకున్నారని షర్మిల మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వానలో నానుతూ, చలిలో వణుకుతూ పలువురు రైతులు పడిగాపులుగాసి చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు పండించిన పంటలను కొనడం లేదు, పింఛన్ల కోసం ఏళ్ల తరబడిగా వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్లు కొనకుంటే ఆమరణ దీక్ష చేస్తా.. యాసంగిలో వడ్లను కొనకుంటే ఆమరణ దీక్షకు కూర్చుంటానని షర్మిల వెల్లడించారు. యాసంగి వడ్లు కొనబోమని కేసీఆర్ చెబుతున్నారని కొందరు రైతులు షర్మిల దృష్టికి తీసుకురాగా, మీరు వరి పండిస్తే కొనుగోలు కోసం తాను పోరాడుతానని, ఆమరణ దీక్ష చేపట్టయినా ధాన్యం కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో వైఎస్సార్టీపీ నాయకులు ఏపూరి సోమన్న, నీలం ర మేశ్, రాజగోపాల్, చంద్రహాస్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, చైతన్యరెడ్డి, రాంరెడ్డి, పొ ట్కూరి తిరుపతిరెడ్డి, గౌతం ప్రసాద్, సత్యవతి, తాహెర్, సుధాకర్ పాల్గొన్నారు. -
కేంద్రం.. ‘కొంటోంది’ రాష్ట్రం.. ‘చెప్పుకొంటోంది’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడున్నర సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన హడావుడి వల్ల ఈ సంగతి రైతాంగానికి తెలియడం శుభపరిణామమని ఆయన వాఖ్యానించారు. ఇన్నాళ్లుగా సీఎం కేసీఆర్ తానే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారని, తాజా పరిణామాలతో ధాన్యం కొనుగోలుపై రైతాంగానికి స్పష్టత వచ్చిందన్నారు. వానాకాలం దిగుబడులతో పాటు యాసంగి సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వానాకాలం దిగుబడుల కొనుగోలు గడువు డిసెంబర్ 31వరకు ఉంది. ఈ సీజన్‌కు సంబంధించి 44.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏజెన్సీలు కేవలం 30.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందించాయి. మరో 14.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించా ల్సి ఉంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకోకుంటే మరికొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇక జనవరి రెండో వారం తర్వాత రబీ దిగుబడుల కొనుగోలు మొదలై జూ లై 31వరకు కొనసాగుతుంది’అని తెలిపారు. రాష్ట్రం కూడా కొనవచ్చు.. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, అటు రైతాంగాన్ని మోసం చేస్తూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చారిత్రక తీర్పును అంత త్వరగా మర్చిపోరని, అందుకే ధాన్యం కొనుగోలు డ్రామాను తెరపైకి తెచ్చారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘నిజంగా రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదు’అని స్పష్టంచేశారు. కేసీఆర్ మాటలు సబబుకాదు.. ‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు తర్వాత మా పార్టీపై కేసీఆర్ మరింత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా సభ్యత లేకుండా మాట్లాడడం సమంజసం కాదు. సాధారణ పౌరుడు మొదలు ప్రధానమంత్రి మోదీ వరకు అందర్నీ అడ్డగోలుగా విమర్శించడం అలవాటుగా మారింది’అని కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
దూరమైనా వెళ్లాలి..అభివృద్ధిని దరిచేర్చాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకూ ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల్లో పాలన అందరికీ అందాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం గుర్తుచేశారు. కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల పునర్విభజన జరపాలని, నాలుగైదు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నూతన జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకే 95 శాతం ఉద్యోగ కల్పన లభించడంతోపాటు క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ పాలన అమల్లోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల విభజనతోపాటు ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రైతులకు అర్థమయ్యేలా వివరించండి... యాసంగి వరి ధాన్యం కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. బాధకరమే అయినా కేంద్రం మొండి వైఖరితో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యత కలెక్టర్లు, అధికారులకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థం చేయించాలన్నారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఎఫ్‌సీఐ నిర్లక్ష్యంతోనే గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని చెప్పారు. అయితే ఎన్ని కష్టాలొచ్చినా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా వీటిని అమలు చేయలేదన్నారు. సామాజిక పెట్టుబడిగా దళితబంధు.. తరతరాలుగా వివక్షకు గురైన దళితుల ఆర్థికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకం కేవలం వారినే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సైతం పటిష్టపరిచి సామాజిక పెట్టుబడిగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నాలుగు దిక్కుల్లోని నాలుగు మండలాల్లో సంతృప్తికర స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. హామీ మేరకు అన్ని నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు. దళితుల ఆర్థిక స్థితి మెరుగుదలకు ఉన్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అన్ని రకాల వ్యాపార, ఉపాధి మార్గాలను కలెక్టర్లు శోధించాలని సూచించారు. ఈ విషయంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు తీసుకోవాలన్నారు. ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ఆందోళన అక్కరలేదని, వైరస్ కట్టడికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒమిక్రాన్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ పురోగతిని కలెక్టర్లు, వైద్యారోగ్య అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలియజేశారు. వానాకాలానికి ప్రణాళికలు.. వచ్చే వానాకాలంలో ఏయే పంటలు వేయాలో ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలి. ప్రధానంగా పత్తి, కంది, వరి సాగుపై దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతాంగాన్ని సమాయత్తం చేయాలి. భార్యాభర్తలకు ఒకేచోట పని... భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారికి ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే వారు ప్రశాంతంగా పనిచేయగలరు. ఉత్పాదకత సైతం పెరుగుతుంది. స్థానిక యువత ఉద్యోగావకాశాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌజ్ కేసులను పరిష్కరించాలి. దళితులకు భరోసా కల్పించాలి.. గత పాలకుల దశాబ్దాల చేదు అనుభవాలతో ఎప్పుడూ మోసానికి గురవుతూ ఉంటామనే దుఃఖం దళితుల్లో ఉంది. వారి ఆర్తిని అర్థం చేసుకొని భరోసా కల్పించాలి. మీకు (కలెక్టర్లకు) ఆకాశమే హద్దు.ఇప్పటివరకు మీకు ఏ పనిలో లభించని తృప్తి దళితబంధులో దొరుకుతుంది. రైతాంగాన్ని కాపాడే బాధ్యత మీదే.. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యత కలెక్టర్లు, అధికారులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్నిరైతులకు అర్థమయ్యేలా వివరించాలి. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలి. యాసంగి కోసం రైతుబంధు సాయాన్ని ఈ నెల 28 నుంచి జమ చేస్తాం. వారం, పది రోజుల్లో వరుస క్రమంలో అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. -
23న వనపర్తికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలోసీఎం కేసీఆర్ ఈ నెల 20 నుంచి తలపెట్టిన జిల్లా పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 19 నుంచి ప్రారంభం కావాల్సిన సీఎం జిల్లాల పర్యటన, ఈ నెల 23 నుంచి మొదలవుతుంది. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. వనపర్తిలో కొత్త మార్కెట్ యార్డు, రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నూతన ఎమ్మెల్సీలకు అభినందన.. గవర్నర్ కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన అసెంబ్లీ మాజీ స్పీకర్ మదుసూధనాచారితో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీను సీఎం అభినందించారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, తాతా మధు, డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిశారు. బ్రీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గజ్జెల నగేశ్.. ముఖ్యమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయగా, కార్పొరేషన్లకు నామినేట్ అయిన ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు తదితరులను కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. -
డప్పు కొట్టి.. ఎండగట్టి
సాక్షి, హైదరాబాద్: ‘ధాన్యానికి మద్దతు ధర, కొనుగోలు వంటి అన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా వ్యతిరేక, మతతత్వ బీజేపీ వైఖరిని ఎండగట్టి, ఆ పార్టీని బొంద పెట్టకపోతే మనం బోనులో నిలబడాల్సి వస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై కోటి సంతకాలు సేకరించాలి’అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు హితబోధ చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సుమారు మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది. ‘వానాకాలం ధాన్యం కొనుగోలుకు కేంద్రం విధించిన లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నందున ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యానికి సంబంధించి కేంద్రం వైఖరి ఏంటో నిలదీయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎంపీల బృందం శనివారం ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రులను కలుస్తుంది. ఈ బృందంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్ సభ్యులుగా ఉంటారు’అని కేసీఆర్ ప్రకటించారు. మౌనంగా ఉంటే మీకే ‘నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించిన కోటిరెడ్డి పార్టీ నిర్ణయాన్ని గౌరవించడంతో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఏడేళ్ల క్రితం నేను గజ్వేల్ నుంచి పోటీ చేసే క్రమంలో పార్టీలో చేరి నా గెలుపు కోసం పనిచేసిన డాక్టర్ యాదవరెడ్డికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. అలా ఉంటే నష్టపోయేది మీరే అనే విషయం గుర్తుంచుకోండి. జిల్లాల్లో మంత్రులు తమ నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకుని వెళ్లాలి. పార్టీ నేతల నడుమ గ్యాప్ ఉండకూడదు. అందరూ నాకు సమానమే. ఎన్నికలు రెండేళ్లా మూడేళ్లా అనేది కాదు.. ఎంత యాక్టివ్‌గా పనిచేస్తున్నామన్నదే ముఖ్యం. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కమిటీలకు అధ్యక్షుడు లేదా కన్వీనర్‌ను నియమించాలా అనే అంశంపై వారం రోజుల్లో ప్రకటన చేస్తా. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల సేవలు వినియోగించుకోవాలి’. తమిళనాడులో బలంగా ప్రాంతీయ వాదం.. తమిళనాడులో డీఎంకే పార్టీ దశాబ్దాలుగా ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపిస్తూ ముందుకు సాగుతోంది. తరతరాలుగా అనేక కుటుంబాలు డీఎంకేతో రాజకీయ బంధాన్ని పెనవేసుకున్నాయి. మనం కూడా డీఎంకే తరహాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. ఇటీవల కాశీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తాము చేసిన అభివృద్ధి గురించి కాకుండా సంబంధం లేని విషయాలు మాట్లాడారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని సమావేశంలో తెలియజేశారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతుబంధు ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేసి రూ.50వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతుబంధు కొనసాగుతుంది. దళితబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి వేయి మంది చొప్పున ఎంపిక చేసి దళితబంధు అమలు చేసేందుకు బడ్జెట్లో రూ.20వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల మేర కేటాయిస్తాం. దళితబంధు లబ్దిదారుల ఎంపిక అధికారాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించే ఉత్తర్వులు త్వరలో వెలువడతాయి’అని కేసీఆర్ ప్రకటించారు. మీ గెలుపు బాధ్యత నాదే... పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు తప్పకుండా లభిస్తాయి. ఈ క్రమంలో నాయకులకు కొంత ఓపిక అవసరం.వివిధ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చురుగ్గా పనిచేస్తే మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత నాదే. -
ప్రజాక్షేత్రంలో యుద్ధం ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరువిప్పడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత రాకుండానే పార్లమెంటును బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారంటే.. టీఆర్ఎస్–బీజేపీల మధ్య తెరవెనుక ఒప్పందం జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్‌కు రప్పించాడో చెప్పాలని శుక్రవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 20 శాతం వరి కోతలు మిగిలి ఉన్నాయని, మరో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 1982 కొనుగోలు కేంద్రాలను మూసి వేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు -
బీజేపీతో చావో రేవో తేల్చుకుందాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర వైఖరిని నిలదీస్తూ బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోని తేల్చుకొని రావాలని పేర్కొన్నారు. తాను కూడా 19వ తేదిన పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజపీతో చావో రేవో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నేతలు జనంలో ఉండకుంటే ఎవరూ ఏం చేయాలని అన్నారు. నాయకులంతా చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. చదవండి: రైతు బంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని, ఈ విషయాన్ని రైతులకు వివరించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరికి బదులుగా ఇతర పంటలు వేసేలారైతులను ప్రోత్సాహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రిని కలవనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అలాగే త్వరలోనే టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడా.. లేదా కన్వీనర్‌ను నియమించాలా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
గతంతో పోలిస్తే 30% అధికం
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు 30 శాతం అధికంగా ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి రూ.8, 268 కోట్ల విలువైన 42.22 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని 1,280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తవడంతో మూసివేసినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ.5,447 కోట్లు మళ్లించినట్లు చెప్పారు. ధాన్యం రవాణా సమస్య, గన్నీ బ్యాగుల కొరత లేదని మంత్రి వెల్లడించారు. గోదాములు ఖాళీ చేయని ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాములన్నీ దాదాపుగా నిండిపోయాయని, సూర్యాపేట, సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్‌లోని గోదాముల్లో ఖాళీ లేదని గంగుల తెలిపారు. మిల్లింగ్ అయిన బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. గోదాముల్లోని బియ్యాన్ని తరలించేందుకు ఎఫ్‌సీఐ రైల్వే వ్యాగన్లను పంపించకపోవడంతో మిల్లుల్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో కదలిక లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి విన్నవించినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతులపై కేం«ద్రం అనుసరిస్తున్న వైఖరిమీద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాష్ట్ర ప్రభు త్వం వానాకాలం ధాన్యం సేకరణ వేగవంతంగా చేస్తోందని చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషన అనిల్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. -
పంటలు సేకరించడం కేంద్రం విధి
సాక్షి, హైదరాబాద్: మద్దతు ధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి అని, ఈ పద్ధతి దశాబ్దాలుగా సాగుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతాకుమార్ కమిటీ ధాన్యం ఎగుమతులు చేయాలని, పంటలన్నీ సేకరించాలని సూచించినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరు తదితర అంశాలపై నిరంజన్‌రెడ్డి రాష్ట్ర రైతులకు గురువారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలతో రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలబింస్తోందని లేఖలో మండిపడ్డారు. కేంద్రం రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా నష్టపోకుండా రైతులు వరికి బదులుగా ఇతర పంటలు పండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలమన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ప్రతి సీజన్‌కు ముందే ఏయే పంటలు వేయాలో సూచనలు చేస్తుందన్నారు. -
ఇక పోరు ఢిల్లీలో.. టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై పోరును తీవ్రం చేయాలని అధికార టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ విషయంలో లేఖలు, లెక్కల పేరిట గోల్మాల్ చేస్తున్న బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనుంది. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో పార్టీ ఎంపీలు, పలువురు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై తదుపరి పోరాటం, శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు పార్లమెంటు లోపల, బయట నిరసన చేపట్టిన పార్టీ ఎంపీలను కేసీఆర్ అభినందించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వడంతోపాటు ధాన్యం కొనుగోలులో వార్షిక లక్ష్యం నిర్ణయించడం, కనీస మద్దతు ధరల చట్టం కోసం డిమాండ్ చేయడంలో వెనక్కి తగ్గొద్దని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఇతర పార్టీలను కలుపుకొని సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు శాసనమండలి ఎన్నికలు ముగిశాక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడదామని కేసీఆర్ ప్రతిపాదించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలసి తాను కూడా ధర్నాలో పాల్గొంటానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన లెక్కలపై త్వరలో స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. -
ఇద్దరూ దోషులే
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణలో మొదటి దోషి టీఆర్ఎస్ కాగా, రెండో దోషి బీజేపీ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులు రెండు నెలలుగా ఖరీఫ్ పంట ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చా రు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోమటిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. పనికి రాని ప్రాజెక్టులను నిర్మించి కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆమోదం పొందిన రహదారి నిర్మా ణంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశానని పేర్కొన్నారు. రెండు నెలల్లో పను లు ప్రారంభమయ్యేలా అదేశాలిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. త్వరగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారన్నారు. -
బూతులు మాట్లాడనంటే చర్చకు వస్తా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ విలేకరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను చర్చకు సిద్ధమని, బూతులు మాట్లాడకుండా, నాగరిక భాష మాట్లాడతానంటేనే వస్తానని పేర్కొన్నారు. కేసీఆర్‌తో బూతుల్లో తాను పోటీపడలేనని, ఓటమిని ముందే అంగీకరిస్తున్నానని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఎప్పుడు హైదరాబాద్ రమ్మన్నా వస్తానని చెప్పారు. ఒక రైతుబిడ్డను అయిన తాను కేంద్రమంత్రి కావడం కేసీఆర్‌కు నచ్చలేదేమోనని అన్నారు. ‘నాపై కేసీఆర్ చేస్తున్న దూషణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేసీఆర్ అసభ్య పదజాలం ఉపయోగించవచ్చా.. విమర్శించడానికి మాటల్లేవా..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం వారిపై ఉందని గత కొన్ని రోజులుగా తాను చెప్తున్నానని, అభద్రతా భావం ఉన్నదునే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని, ఆ మాటలను చూస్తుంటే ఆయన అభద్రతాభావంలో ఉన్నట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తిట్లకు భయపడే వ్యక్తిని కాదని, తాను దేశం ముఖ్యమనుకుని పనిచేసే వ్యక్తినని పేర్కొన్నారు. రైతులకు ధైర్యమిస్తున్నాం... రైతులు అంగట్లో, రోడ్లపై ధాన్యం పోసి రెండు నెలల నుంచి ఎదురుచూస్తున్నారని, వారికి ధైర్యమిచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తామని చెప్పానని, తానేమీ కేసీఆర్‌ను తిట్టడం కోసం ప్రెస్‌మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. ‘ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని ఎక్కడైనా చెప్పిందా.. ఏదైనా ప్రకటన చేసిందా.. ఎందుకు రైతులను గోస పెడుతున్నారు..’ అంటూ కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయ రకాలైన విత్తనాలను ఉపయోగించి రబీలో కూడా వరిసాగు చేయవచ్చని, ఆంధ్రాలో సీడ్ మార్చుకుని, వేరే రకం సాగు చేస్తున్నారు. మిల్లర్లు టెక్నాలజీ మార్చుకునే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. వారికి అవసరమైన సాయం అందించాలి’ అని సూచించారు. -
యాసంగిలో 10 లక్షల ఎకరాల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగిలో వరి పది లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. విత్తనం, ఆహార అవసరాలు, మిల్లర్లతో ఇప్ప టికే ఉన్న ఒప్పందం నేపథ్యంలో ఈ మేరకు సాగు జరిగే అవకాశం ఉందని అంటున్నాయి. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చి చెప్పడం.. యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ వర్గాలు ఈ అంచనాకు వచ్చాయి. అవసరాల మేరకు మినహా ఇతరత్రా సాగు పెద్దగా జరగకపోవచ్చని భావిస్తున్నాయి. వరికి బదులు ప్రత్యామ్నాయ పం టల దిశగా రాష్ట్ర రైతులు ముందుకు వెళ్తున్నా రని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వరిసాగు విషయంలో తాజాగా మరోసారి స్పష్టత ఇవ్వడంతో.. మరోసారి వరి వేయొద్దంటూ రైతులకు చెప్పేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. గతేడాది ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో..: యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు. అయితే గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఈ వారంలో వరినాట్లు మొదలుకానున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు వరి తగ్గిస్తారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. కానీ వరి కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు రిస్క్ తీసుకోకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో సాగునీరు పూర్తిస్థాయి లో అందుబాటులో ఉండటం, ప్రతి పక్షాలు వరి కొనాల్సిందేనని సర్కారుపై ఒత్తిడి పెంచుతుండటంతో.. రైతులు ఏవిధంగా ముందుకు వెళతారన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రత్యామ్నాయ పంటల సాగు ఇప్పటికే పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భారీగా మినుము సాగు: యాసంగిలో మినుము ఎక్కువగా సాగవుతోంది. మినుము సాధారణ సాగు విస్తీర్ణం 24,018 ఎకరాలు కాగా, ఇప్పటికే 54,331 ఎకరాల్లో సాగవడం గమనార్హం. అంటే ఏకంగా 225 శాతం ఎక్కువగా ఈ పంట సాగైందన్నమాట. అది 70 వేల ఎకరాలకు చేరు కోవచ్చని అంటున్నారు. కేంద్రం కూడా మినుము సాగు పెం చాలని చెప్పడం, మద్దతుధర కంటే మార్కెట్లో ఉన్న ధర ఎక్కువుంటే అంతే ధర పెట్టి రైతుల వద్ద కొనా లని సూచించడంతో ఈ పంట వైపు వెళ్తున్నారని చెబుతున్నారు. మరోవైపు కుసుమ సాగు కూడా పెరిగింది. దీని సాధారణ సాగు విస్తీర్ణం 7,609 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8,459 (111%) ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇతర పంటల సాగు ఇలా.. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.47 లక్షల (87%) ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.80 లక్షల (93%) ఎకరాల్లో సాగయ్యింది. మొక్కజొన్న ఇప్పటివరకు 81,640 (19%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు), జొన్న 22,206 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 75,274 ఎకరాలు), పెసర 7,090 (33%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు) సాగయ్యింది. విత్తనాల కొరత కారణంగా పొద్దు తిరుగుడు విస్తీర్ణం పెరగకపోవచ్చని అంటున్నారు. ఈ పంట ఇప్పటివరకు 3,320 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు) సాగయ్యింది. -
ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రంలో ఒకమాట
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో రెండోరోజూ ఆందోళనను కొనసాగిం చారు. మంగళవారం సభ మొదలవగానే ధాన్యం సేకరణపై కేంద్రం విధానాన్ని తప్పుబడుతూ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, దయాకర్, నేతకాని వెంకటేశ్ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా కోరినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గం.కు ఆయన వాయిదా వేశారు. మరో రెండుసార్లు సభ వాయిదా తర్వాత మొదౖ లెనా ఎంపీల ఆందోళన చేయడంతో మాట్లాడేందుకు నామాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కొనుగోళ్లపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట చెబుతోంది. దీనిపై ప్రకటన చేయాలి’ అని కోరారు. కేంద్రం నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. తర్వాత ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. తెలంగాణభవన్‌లో ఎంపీలు మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల అంశం పై మాట్లాడేందుకు కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే తన చాంబర్లో నిర్వహించిన విపక్ష పార్టీ నేతల భేటీకి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ కూడా హాజరైంది. భేటీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పక్కనే కూర్చొని ఎంపీల సస్పెన్షన్‌పై తన అభిప్రాయం చెప్పారు. సస్పెన్షన్ ఎత్తేసేలా ఒత్తిడి చేయాలన్న కాంగ్రెస్ వినతికి మద్దతిచ్చారు. తర్వాత విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపగా కేకే హాజరయ్యారు. రాజ్యసభ మొదలయ్యాక విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని, కేంద్రంలోని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ తూర్పారపడుతున్న సమయంలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనడం ఢిల్లీలో చర్చనీయాంశమైంది. -
‘వరి’ కొనేలా ఆదేశించాలని హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన న్యాయవిద్యార్థి బొమ్మగాని శ్రీకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శ్రీకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. లక్షలాది టన్నుల వరిని రైతులు పండించినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, వరి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడి కొందరు రైతు లు చనిపోయారని తెలిపారు. వేలాది టన్నుల వరిని రోడ్లపై పోస్తున్నారని, అప్పులు భరించలేక మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరిని కొంటామని ముందు హామీ ఇచ్చినా రాజకీయ కారణాలతో ప్రభుత్వం తన హామీని వెనక్కు తీసుకుందని వివరించారు. ఎంఎస్పీ చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల విభాగం ముఖ్య కార్యదర్శులతోపాటు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
యార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మార్కెట్ యార్డులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి సూచించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం ధాన్యమే కొన్నారు. ఇంకా 60 శాతం కొనాల్సి ఉంది. గోనె సంచులు, రవాణాకోసం లారీలులేక రైతులు రోజుల తర బడి వరి కుప్పల మీదే నిద్రించాల్సి వస్తోంది. మీరు ఆకస్మిక తనిఖీలు చేసి నేరుగా రైతులతో మాట్లాడితే క్షేత్రస్థాయి సమస్యలేంటో తెలుస్తాయి. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తే మీకే మంచి పేరు వస్తుంది’అని అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన వారి ధాన్యాన్నే అధికారులు కొంటున్నారని, మిగిలిన రైతు లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. -
వడివడిగా వడ్ల కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కొనుగోళ్లు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. యాసంగిలో వరిసాగు వద్దంటున్న నేపథ్యంలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వానాకాలం ధాన్యాన్ని త్వరితగతిన సేకరించి, రైతుల్లో ఆందోళనను తొలగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల వారీగా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, సీఎస్వోలు వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు పంపించారు. వర్ష సూచనల నేపథ్యంలో సోమ, మంగళ వారాల్లో భారీగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కమిషనర్ ను ఆదేశించారు. 21.30 లక్షల మెట్రిక్ టన్నులు... హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఈ సీజన్లో 6,876 కొనుగోలు కేంద్రాలను తెరవాలని నిర్ణయించగా, 5,928 సెంటర్లు ప్రారంభమయ్యాయి. వీటి లో 4,446 కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 3.52 లక్షల మంది రైతులనుంచి రూ. 4,171 కోట్ల విలువైన 21.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ.1,546 కోట్లు జిల్లాలకు విడుదలయ్యాయి. సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు చాలా జిల్లాల్లో లారీల కాంట్రాక్టులు కొలిక్కి రాలేదు. దీంతో జిల్లా మేనేజర్లను టెండర్లను త్వరితగతిన పూర్తి చేయా లని పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. కొనుగోలు చేస్తాం వానాకాలంలో రైతులు పం డించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలు, వాతావరణంలో మంచు, తేమ పెరగడం వంటి కారణాల వల్ల కొనుగోళ్లలో జాప్యం జరిగిందే తప్ప ఇతర ఇబ్బందుల్లేవు. గత సంవత్సరం నవంబర్ 27 నాటికి 19.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈసారి 21.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. – మంత్రి గంగుల -
రైతులపై కక్షతోనే కేసీఆర్ ధాన్యం కొనడం లేదు
దురాజ్‌పల్లి (సూర్యాపేట)/చౌటుప్పల్, కోదాడ అర్బన్: ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయలేదని, మొత్తం కేంద్రమే చెల్లిస్తోందని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉప్పు డు బియ్యం కాకుండా రా రైస్ ఎంతైనా కొనుగోలు చేస్తామ ని చేసిన కేంద్ర ప్రభుత్వ సూచనకు అంగీకరించిన కేసీఆర్, ఇప్పుడు కేంద్రాన్ని బ దనాం చేసే కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్ అసహనానికి గురై, నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని, రైతులపై కక్షగట్టి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఈ ఏడాది రూ.56 వేల కోట్ల అప్పులు చెల్లించాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని విమ ర్శించారు. అంతకుముందు మహాత్మాజ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్రపటానికి ఈటల పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పదివేల కోట్లిస్తే ప్రతిగింజా కొంటాం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కల్లాలపైనే గుండెలు ఆగిపోయి రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బువ్వ ఎలా సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవ త్వం ఉందా అని నిలదీశారు. ధనిక రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద రెండు రోజుల ‘వరి దీక్ష’ప్రారంభమైంది. టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎస్. అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేతలతోపాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. అలాగే ప్రధాని, సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరి కొనకపోతే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ చౌరస్తాలో ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌నే కేసీఆర్ అడగలేదు... వరి కొనుగోలుపై ప్రధాని మోదీతో తాడోపేడో తేల్చుకొస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... ప్రధాని అపాయింట్మెంట్ కూడా అడగలేదని, ఎంపీ సురేశ్‌రెడ్డి ఇంట్లో విందు ఆరగించి వచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మంత్రులు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను కలిసినప్పుడు కూడా యాసంగి గురించి అడిగారే తప్ప వానాకాలం సీజన్లో వచ్చిన ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. వరి పంట గురించి తెలంగాణ బీజేపీ నేతలు ఇకపై మాట్లాడబోరని గోయల్ స్పష్టం చేయడం టీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగలనడానికి నిదర్శనమన్నారు. రైతుల మరణాలకు కేసీఆరే కారణం... కాంగ్రెస్ పార్టీ నేతలకు రూ. 10 వేల కోట్లు ఇస్తే వానాకాలంలో తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామని, విదేశాలకు ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు. క్వింటాల్‌కు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా రూ. 500 బోనస్ కూడా చెల్లిస్తామన్నారు. అలా చేయకపోతే తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని, ఈ సవాల్‌కు సీఎం కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 8 లక్షల టన్నుల ధాన్యమే కొన్నారని విమర్శించారు. రైతుల మరణాలకు కేసీఆర్ కారణమని, ధాన్యం కొనేలా ప్రభుత్వ మెడలు వంచే వరకు విశ్రమించబోమన్నారు. ప్రధాని ఆఫీసు ముందు ధర్నా చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొ న్నారు. తాము కేసీఆర్‌లాగా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోబోమని, పార్లమెంటులో గళం వినిపిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు... రైతులకు ఉచిత కరెంటు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఎద్దేవా చేస్తే వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టాక ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు గతి ఏమైందో అందరూ చూస్తున్నారని, రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులన్నారు. తెలంగాణ వరి రైతులను నట్టేట ముంచింది కేసీఆరేనని నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌లో వచ్చే 60 లక్షల టన్నుల్లో ఇప్పటివరకు రాష్ట్రం సేకరించింది 8 లక్షల టన్నులేనన్నారు. రాష్ట్రంలో 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమైతే 5 కోట్ల బ్యాగులే కొన్నారని విమర్శించారు. కోమటిరెడ్డి, రేవంత్ ముచ్చట్లు... వరి దీక్షా వేదికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఆయనతో కలిసి తొలిసారి వేదికను పంచుకున్న కోమటిరెడ్డికి వీహెచ్‌తోపాటు రైతు సంఘాల నేతలు స్వాగతం పలికారు. వేదికపైకి కోమటిరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన రేవంత్... ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత ఉత్తమ్, వీహెచ్ సహా ఇతర నేతలంతా సరదాగా మాట్లాడుకోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. కాగా, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వరి దీక్షావేదికపైనే శనివారం రాత్రి నిద్రించారు. వీరితోపాటు అన్వేశ్‌రెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, భువనగిరి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు. -
గుప్పెడైనా ‘ఉప్పుడు’ వద్దు.. యాసంగి వరి వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వచ్చే యాసంగి (రబీ) సీజన్లో వరిసాగు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకముందు బాయిల్డ్ రైస్ (ఉప్పు డు బియ్యం) ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే ప్రసక్తి లేదని మరోమారు తేల్చిచెప్పింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్రానికి సూచించింది. ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యాన్ని ప్రకటించాలని, ప్రస్తుత వానాకాలంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్లను పక్కనపెట్టింది. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ కమిటీని నియమిం చనున్నారని.. పంట కొనుగోళ్లు, మార్పిడి, కనీస మద్దతు ధరలపై ఆ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోటి టన్నులు సేకరించాలి.. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై నాలుగు రోజుల కింద మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఎలాంటి స్పష్టతరాకపోవడంతో.. వ్యవసాయ అధికారులతో చర్చించి 26వ తేదీన ధాన్యం కొనుగోళ్లపై తమ విధానాన్ని స్పష్టం చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు.. మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంట్ పక్షనేత నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు పీయూష్ గోయల్‌తో గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు, యాసంగిలో వరిసాగు పరిస్థితిని కేంద్రమంత్రికి నివేదించారు. తెలంగాణ నుంచి ఏటా 1.50 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. ప్రస్తుత (వానాకాలం) సీజన్లో కేంద్రం 60లక్షల టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) సేకరిస్తామని చెప్పిందని.. కనీసం కోటి టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. అంత స్థాయిలో ధాన్యం సేకరించలేమని తేల్చిచెప్పారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో 10 లక్షల టన్నుల వరకు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కానీ హామీ ఇవ్వలేదు. వరిసాగును పక్కనపెట్టండి యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునే పరిస్థితులు లేనందున వరిసాగును పూర్తిగా పక్కనబెట్టి.. పప్పుదినుసులు, నూనె గింజల సాగు, పంట మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ సూచించారు. ఇప్పటికిప్పుడు వరి నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడం సాధ్యం కాదని రాష్ట్ర మంత్రులు వాదించినా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఇక వార్షిక కొనుగోలు లక్ష్యాన్ని ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ స్పష్టం చేశారని పేర్కొన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పంటల పరిస్థితి ఆధారంగా కొనుగోళ్లపై నిర్ణయం ఉంటుందని.. వ్యవసాయశాఖ, ఆహారశాఖ సహా పలు శాఖలు కలిసి దీనిపై అంచనాలు రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పిన సమాధానాలపై మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినా.. అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది. యాసంగిలో వరి వద్దన్నారు.. కేంద్రమంత్రితో భేటీ అనంతరం రాష్ట్ర ప్రతినిధులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీరు పూర్తి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసం చర్చలకు వచ్చాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. వార్షిక ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ప్రకటించాలని కోరినా.. ముందుగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం పోటెత్తుతోంది. ఇప్పుడైనా ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని కోరాం. కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. గత ఏడాది మాదిరే సేకరిస్తామంటూ దాటవేశారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రితో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని, అందుకు అనుగుణంగా సీఎం రైతులకు దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వరి సాగు చేయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ రకంగా మాట్లాడొద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పామని, ఇక ముందు అలా ప్రకటనలు చేయబోరని కేంద్రమంత్రి వివరించారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. కేంద్రం తీరు బాధాకరం. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. కేంద్ర అధికారులు యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని అంటున్నారు కాబట్టి వరి వేయొద్దని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరినా స్పందించలేదు. – మంత్రి నిరంజన్‌రెడ్డి మేము నేరుగా వరి వద్దని చెప్పలేదు. యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం కొనలేని పరిస్థితుల్లో పంటల మార్పిడికి వెళ్లాలని సూచించాం. ప్రస్తుత వానాకాలంలో నిర్ణయించిన టార్గెట్‌ను పూర్తి చేయడంపై మొదట దృష్టి సారించాలని రాష్ట్ర ప్రతినిధులకు స్పష్టం చేశాము. – కేంద్ర ప్రభుత్వ వర్గాలు -
ధాన్యం తూకం వేయరా
చిగురుమామిడి: ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కొందరు రైతులు పురుగు మందు డబ్బాతో మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసనకు దిగారు. గురువారం ఉదయం కొనుగోలు కేంద్రంలో కాటాలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన మరికొందరు రైతులు సెంటర్లోనే ధర్నాకు దిగారు. ఓ వైపు ట్యాంకు ఎక్కిన రైతులు, మరోవైపు కింద రైతుల ధర్నాతో ఏం చేయాలో పాలుపోక కేంద్రం నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల రాక ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని, రైసు మిల్లు యజమానులు నూక పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. నూకలవుతున్నాయనే సాకుతో 43 నుంచి 44 కిలోలు తూకం వేస్తూ రైతులను ముంచుతున్నారని వాపోయారు. రైతు సంఘం మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బందెల శ్రీనివాస్, గట్టు జనార్దన్, మురళి, అందె రాయమల్లు, కుట్ల శ్రీనివాస్, గుమ్మడి బాలయ్య, మరో ఇద్దరు రైతులు ట్యాంకు పైనే ఉండగా.. అధికారులు స్పందించకుంటే పురు గు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పలుమార్లు హెచ్చరించారు. సమాచారం అందుకున్న చిగురుమామిడి తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, నయాబ్ తహసీల్దార్ చంద్రశేఖర్, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకు ఎక్కిన రైతులు కిందకు దిగారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అందె స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల జీవితాలతో ఆటలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల్లో పోసి ఎదురుచూస్తున్నా ఈ ప్రభుత్వం కొనడం లేదని విమర్శించారు. గురువారం ఆయన ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సేకరిస్తామని చెప్పిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీరు అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. కల్లాల్లో, రోడ్ల మీద ధాన్యం వానలకు తడిసి మొలకలు వస్తున్నా కొనకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రబీలో వరి నాట్లు వేయవద్దని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు ఏ పంటలు వేస్తారని ప్రశ్నించారు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, వానాకాలం పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి మాటతప్పిన ముఖ్యమంత్రి యాసంగి పంట గురించి ఢిల్లీ పర్యటనకు వెళ్లానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్, మోదీ కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాగా కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌కు రాసిన ఒక లేఖలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి క్రెడిట్ సదుపాయాన్ని కూడా తీసుకోలేదని అన్నారు. ఎం.కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరి ణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. -
ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు, నదీ జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగివెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక పరిమితిని ముందుగానే ప్రకటించే అంశంపై ప్రధానితో చర్చించాలని భావించినా ఆయన నిరీక్షణ ఫలించలేదు. ఉత్తరప్రదేశ్‌లో అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, వ్యవసాయ చట్టాల రద్దు అంశాలపై కేబినెట్ భేటీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధత నేపథ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నందున డిసెంబర్ రెండు లేక మూడో వారంలో ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వచ్చి మోదీని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక నదీ జలాల అంశం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నా, షెకావత్ రాజస్థాన్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సీఎం సమావేశమవుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. 26న వచ్చే స్పష్టతను బట్టి కార్యాచరణ ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు మాత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత వ్యక్తమయ్యింది. ఈ వానాకాల సీజన్‌కు సంబంధించి గతంలో నిర్ణయించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా కొంత అధికంగా సేకరించేందుకు ప్రయత్నిస్తామని గోయల్ చెప్పారు. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కొనే పంటలపై వ్యవసాయ శాఖతో చర్చించి 26 నాటికి స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో.. దానిని బట్టి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల మంత్రులతో గోయల్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి, వినియోగం, కేంద్రం కొనుగోలు, వన్‌నేషన్–వన్రేషన్ అంశాలపై చర్చించనున్నారు. -
కొనుగోళ్ల తంటా.. కల్లాల్లోనే పంట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల క్రితం కోసిన పంట కూడా ఇప్పటికీ తూకానికి రాని పరి స్థితి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నెలకొని ఉంది. కల్లాలు, రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం తడిచిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ట్రంలో ఆలస్యంగా కోతలు జరిగే మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా రైతులు ధాన్యం కుప్పలను రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు చాలా జిల్లాల్లో లారీల రవాణా కాంట్రాక్టు కొలిక్కి రాలేదు. హమాలీల సమస్య వెంటాడుతోంది. ధాన్యంలో తేమను లెక్కవేసే పరికరాలు, తూకం యంత్రాలు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వీటికి ఓటీపీ సమస్య కూడా తోడవడంతో ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం జరుగుతోంది. నెలరోజుల్లో కొన్నది 16.76 లక్షల టన్నులే ప్రస్తుత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 61.75 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీని ప్రకారం 1.35 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు , విత్తనాలకు పోగా 1.03 కోట్ల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 6,873 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 5,461 కేంద్రాలను తెరిచారు. కానీ 4,082 కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. గత నెల 25వ తేదీన అధికారికంగా కొనుగోళ్లను ప్రారంభించినప్పటికీ.. నెలరోజుల వ్యవధిలో కేవలం 16.76 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో కేవలం 15 శాతమే కావడం గమనార్హం. అకాల వర్షంతో ఆగమాగం ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు మందగించాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుండడంతో నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదు. దీంతో 4 వేల కేంద్రాల్లో రోజుకు కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సేకరణ జరగడం లేదు. మంగళవారం రాష్ట్రంలో కొనుగోళ్లు ప్రారంభించిన 26 జిల్లాల్లో 95 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత యాసంగి సీజన్ ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల్లో, గోదాముల్లో నిల్వ ఉండడంతో అవి ఖాళీ అయ్యే పరిస్థితి ఆధారంగా కొత్త స్టాక్‌ను మిల్లులకు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 16.76 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3,281.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా పౌరసరఫరాల సంస్థ ఆయా జిల్లాలకు రూ.912.62 కోట్లు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 12,425 మంది రైతుల నుంచి కేవలం 96,673 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కొనుగోలు లక్ష్యం 4.46 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించారు. కానీ ఇప్పటివరకు 54,015 టన్నులే కొనుగోలు చేశారు. పదిరోజులుగా పడిగాపులు నాకున్న నాలుగు ఎకరాల భూమిలో వరి సాగు చేశా. వరుస వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి 10 రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నాం. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం తరువాత చేసుకోండి. ముందు ధాన్యం కొనుగోళ్లపై దృష్టిపెట్టండి. – పడాల అజయ్ గౌడ్, గర్రెపల్లి, పెద్దపల్లి ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి వానాకాలం ధాన్యం తడవడం, రైతుల ఇబ్బందుల దష్ట్యా ప్రభుత్వం బోనస్ ప్రకటించి త్వరగా కొనుగోలు చేయాలి. తూకంలో కోత లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యం తరలించాలి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. – మల్లారెడ్డి, రైతు, హుజూరాబాద్ -
ధాన్యం కొనుగోళ్లపై తప్పించుకునేందుకే.. ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
మునుగోడు: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేయకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాము నెల రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే నేటికీ కొనుగోలు చేయలేదని, వర్షానికి తడిసి ధాన్యం మొలకెత్తిందని రైతులు కన్నీరు పెట్టారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాల్సిన సీఎం, యాసంగిలో వరిసాగు చేయాలా వద్దా అని అడిగేందుకు ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో ఆయనకు ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వ రని తెలిసి కూడా ప్రజలని మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. -
తేలని పంచాయితీ.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పండే వరి ధాన్యం కొను గోళ్లపై కేంద్రం ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న తెలంగాణ ప్రజా ప్రతినిధుల వినతిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిం చలేదు. ఏటా కనీసంగా 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం.. కేంద్ర ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌ను కోరింది. అయితే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించాక ఈ నెల 26న ఎంతమేర ధాన్యం సేకరణ చేస్తామన్న దానిపై స్పష్టత ఇస్తామని గోయల్ చెప్పారు. అంతవరకు వేచి ఉండాలని సూచించారు. రాష్ట్రం కోరినంతగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సేక రణ కుదరదని చెప్పకనే చెప్పిన కేంద్రమంత్రి, ప్రస్తుత వానాకాలా నికి సంబంధించి మాత్రం.. గతంలో ప్రకటించిన దానికన్నా కొంతమేర ఎక్కువ తీసుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర గంటలు ఆలస్యంగా భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు జరిపేం దుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన మంత్రులకు సోమ వారం రాత్రే అపాయింట్మెంట్ ఇస్తామని తొలుత చెప్పినా కుదరలేదు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తా మని సమాచారమిచ్చారు. దీంతో కేటీఆర్ నేతృ త్వంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలా కర్, రాజ్యసభ, లోక్‌సభా పక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కవిత, ఎంఎస్ఎన్ రెడ్డి, దయాకర్, రంజిత్‌రెడ్డితో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రామ కృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్‌లు మూడు గంటలకే కృషి భవన్‌కు చేరు కున్నారు. అయితే అమెరికా వర్తక సంఘం ప్రతి నిధులతో భేటీలో ఉన్న కారణంగా సుమారు మూడున్నర గంటల ఆలస్యంగా గోయల్ ఈ భేటీకి వచ్చారు. అప్పటివరకు కేంద్ర అధికారులతో చర్చి ంచిన మంత్రులు, కేంద్ర మంత్రి వచ్చాక ఆయనతో గంటా పది నిమిషాల పాటు చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి: రాష్ట్రంలో ప్రస్తుత పంటల సాగును మంత్రులు కేటీఆర్, నిరం జన్రెడ్డి, గంగుల కమలాకర్ ఆయ నకు వివరిం చారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి లభ్యత పెరగడం, రైతు బంధు, నిరంతర విద్యుత్తు కార ణంగా వరి ధాన్యం సాగు గణనీయంగా పెరిగిందని, వ్యవసాయ అధి కారులతో క్షేత్రస్థాయిలో పంటల సాగుపై చేపట్టిన అవగాహనా కార్యక్రమాలతో భారీగా ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరిం చారు. ఈ ఒక్క వానాకాలంలోనే 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి జరిగిందని వివరిం చారు. ఇం దులో స్థానిక, గృహ, విత్తనావసరాలు పోగా కోటి టన్నుల ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని వివరించారు. కేంద్రం కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) మాత్రమే కొంటామంటే కుదరదని, దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్ధిక భారం పడటంతో పాటు, కొనుగోళ్లకు అనేక ఇక్కట్లు ఎదురవుతా యని వివరించారు. దీంతో పాటే యాసంగిలోనూ భారీగా వరి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశా లుంటాయని, ఈ దృష్ట్యా ఏటా కనీసంగా 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం (సుమారు కోటి టన్నుల బియ్యం) కేంద్రం కొను గోలు చేయాలని కోరారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి అంత సాను కూలంగా స్పందించ లేదని తెలుస్తోంది. మరోవైపు కేంద్రం వద్ద నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) నిల్వలు న్నందున బాయిల్డ్ రైస్ అన్న అంశాన్నే మర్చిపో వాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ కొనే పరిస్థితి లేదని, దీన్ని అర్థం చేసుకొని రాష్ట్రం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ, ఇకపై బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ఒకేసారి పెంచలేమని, క్రమబద్ధంగా వరి సాగును తగ్గిస్తూ, ఇతర పంటల సాగును పెం చాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా కేంద్ర నిర్ణయాలు ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, కేంద్ర పరంగా కొనుగోలు చేసే బియ్యంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, అధికారులతో చర్చించాక 26న స్పష్టత ఇస్తామని తేల్చిచెప్పారు. 26న మరోసారి భేటీ ఈ వానాకాలంలో భారీ ధాన్యం దిగుబడుల దృష్ట్యా, 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొంత ఎక్కువ కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గోయల్ చెప్పినట్లు తెలిసింది. అనంతరం అదే బ్లాక్‌లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ను పీయూష్ సహా రాష్ట్ర మంత్రులు మర్యాద పూర్వ కంగా కలిశారు. కాగా 26న స్పష్టత ఇస్తా మన్న నేపథ్యంలో ఆరోజు కేంద్ర మంత్రులతో మరోసారి రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందుగానే ప్రకటన రాష్ట్రంలో 62 లక్షల 13 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీ కరించింది. కాగా వార్షిక ధాన్యం కొనుగోలు టార్గె ట్ను ముందస్తుగా ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పం దించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింప జేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభి ప్రాయపడింది. మంత్రివర్గ బృందంతో చర్చల సం దర్భంగా ఈ మేరకు సీఎం సూచనను కేంద్రం అభి నందించింది. ఇకపై వార్షిక వరిధాన్యం కొను గోలు వివరాలను ముందుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అసహనం.. గోయల్‌తో చర్చించిన అంశాలు, ఆయన స్పం దన తదితర అంశాలపై మంత్రులు, ఎంపీలు తుగ్లక్‌రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌కు వివరిం చారు. బాయిల్డ్ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేక రించేది లేదని చెప్పిన అంశాన్ని వివరిస్తూనే వార్షిక కొనుగోళ్ల అంశాన్ని ఎటూ తేల్చని విష యాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 26 వరకు వేచి చూద్దామని, అప్పుడు కేంద్రం ఇచ్చే స్పష్టత ఆధారంగా తదు పరి కార్యాచరణ ప్రకటిద్దామని ఆయన అన్నా రని సమాచారం. కేంద్రమంత్రితో భేటీపై టీఆర్ఎస్ నేతలెవరూ మీడియాతో మాట్లాడ లేదు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి ఇచ్చిన మధ్యాహ్న విందులో పాల్గొన్నారు. -
సీపీఐ ‘చలో రాజ్‌భవన్’ భగ్నం
హిమాయత్‌నగర్(హైదరాబాద్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్ చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇవ్వడానికే సమయాన్ని వృథా చేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం మీడియాలో కనిపిస్తూ మాట్లాడితే సరిపోతుందనే భావనతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో రాజ్‌భవన్’ ప్రదర్శన చేపట్టారు. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ఉన్న సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద సీపీఐ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపాయి. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో సీపీఐ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాటలు, పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ‘రండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు బద్దలు కొడదాం–రైతన్నకు అండగా నిలుద్దాం’. ‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ డౌన్.. డౌన్, రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలుసులు నిరసనకారులను అరెస్ట్ చేసి నారాయణగూడ, బేగంబజార్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బోస్, రాష్ట్ర సమితి సభ్యుడు శంకర్‌నాయక్, ఛాయాదేవి, రమావత్ అంజయ్యనాయక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ ప్రేమ్ పావని తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. -
వరికి ఎసరెందుకు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 25కుపైగా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వరే ప్రధాన పంట. వరి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నేరుగా కొనుగోలు చేయకుండా.. కస్టమ్ మిల్లింగ్ విధానంలో తీసుకుంటుంది. అంటే.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కొని రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయిస్తాయి. ఇందుకోసం మిల్లులకు డబ్బులు చెల్లిస్తాయి. మిల్లింగ్ ద్వారా ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపుతాయి. ఎఫ్‌సీఐ ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ‘డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ పూల్’ విధానం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రేషన్ డిపోలకు సరఫరా చేస్తుంది. ఎఫ్‌సీఐ ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యాన్ని సేకరిస్తుంది. ♦దేశవ్యాప్తంగా 2020–21లో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా.. ఎఫ్‌సీఐ 25 రాష్ట్రాల నుంచి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో ముందుజాగ్రత్త కోసం చేసే నిల్వ (బఫర్ స్టాక్) 1.35 కోట్ల టన్నులుపోగా.. మిగతా బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతుంది. క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం వస్తేనే.. ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు కనీసం 68 కిలోల బియ్యం రావాలి. కానీ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూకల శాతం పెరుగుతోంది. బియ్యం తగ్గుతున్నాయి. దీనికి ఎఫ్‌సీఐ అంగీకరించదు. అదే ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లుల్లో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మార్చితే ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు 68కిలోలకుపైగా వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాయిల్డ్ రైస్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఎఫ్‌సీఐ ఇకముందు బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడంతో సమస్య మొదలైంది. ♦ గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం.. రైతులకు రూ.17 వేల కోట్లకుపైగా చెల్లించింది. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుటివరకు లక్ష్యంలో 50 శాతమే ఎఫ్‌సీఐకి పంపారు. ఎఫ్‌సీఐ గోడౌన్లకు బియ్యం చేరితేనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి. వరిసాగు భారీగా పెరగడంతో.. తెలంగాణలో గతంలో కంటే వరిసాగు భారీగా పెరిగింది. గతంలో సాధారణంగా 26 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. కొన్నాళ్లుగా సాగునీటి సమస్య తీరడం, వాతావర ణం అనుకూలిస్తుండటం, విద్యుత్ సరఫరా బాగుండటం తో.. ప్రస్తుతం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. కొన్నేళ్లలో నే ఇంత భారీగా సాగు, ధాన్యం దిగుబడి పెరగడంతో.. దాని కి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం పెరిగింది. మరోవైపు.. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా సమస్యకు దారి తీసింది. ♦ తెలంగాణలో గత యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణంతో ఏకంగా 92.33 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది. కానీ కేంద్రం 24.60 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతా పచ్చి బియ్యంగా ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో రెండు సీజన్లలో పండిన పంటలో ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కలిపి 90 లక్షల టన్నులు సేకరించాలని కోరింది. దీనికి కూడా అంగీకరించని కేంద్రం.. వానకాలం పంటను పూర్తిగా తీసుకుని, యాసంగిలో 44.75 లక్షల టన్నులే సేకరించేందుకు ఒప్పుకొంది. 2021–22 వానాకాలం (ప్రస్తుత సీజన్) పంటలోనూ 40 లక్షల టన్నుల పచ్చి బియ్యం (రా రైస్) మాత్రమే సేకరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి కేరళ, తమిళనాడు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలకు సుమారు 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతాయని అంచనా. వరిలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే.. యాసంగిలో రాష్ట్ర రైతులు.. ధాన్యం దిగుబడి అధికంగా ఉండి, చీడపీడలు అంటని రకాలనే సాగుచేస్తారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న వాతావరణ పరిస్థితులు, సీడ్ కంపెనీల లాబీయింగ్ వంటికారణాలతో.. కొన్నేళ్లుగా ఒకే తరహా వంగడాలను సాగుచేస్తున్నారు. యాసంగి సమయంలోనూ మిల్లింగ్‌లో నూకలుగా మారని వంగడాలు ఉన్నా.. ఆ దిశగా రైతులు, సీడ్ కంపెనీలు ఆలోచించడం లేదని రైస్‌మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్‌రెడ్డి చెప్తున్నారు. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ వంటి వంగడాలు యాసంగిలో కూడా మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కన్నా వరిలోనే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలివే.. ♦ మొక్కజొన్న, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, శనగలు, పెసర్లు, ఉలువలు తదితరాలు ♦ వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, కుసుమలు, ఆముదం, ఇతర నూనె పంటలు ♦ ఇతర ఆహార పంటలు, పొగాకు సాగు వానాకాలం పంట కొనుగోళ్లూ తక్కువే.. రాష్ట్రంలో వానాకాలం పంటను చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో పంట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 2,34,517 మంది రైతుల నుంచి 14.84 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. రూ.2,415 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. రూ.489.6 కోట్లను మాత్రమే జిల్లాలకు విడుదల చేశారు. అయితే ఆలస్యమైనా వానకాలం కొనుగోళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి యాసంగిపైనే పడింది. ఇతర రాష్ట్రాల్లో ‘బాయిల్డ్’ గొడవెందుకు లేదు? దేశవ్యాప్తంగా చూస్తే.. కేరళలో మాత్రమే అత్యధికంగా 80 శాతం ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొంతమేర ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. కానీ మరీ తెలంగాణ స్థాయిలో ఉండదు. ఆ రాష్ట్రాలలో ఉన్న భూసార పరిస్థితులకు తోడు.. వాటికి ఆనుకొని ఉన్న సముద్రం కారణంగా ఎండాకాలంలోనూ గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో ధాన్యం ఎక్కువగా నూకలు అవదు. కొంతమేర ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అయినా అది ఆ రాష్ట్రాల అవసరాలకు సరిపోనుంది. దీనివల్లే కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు. కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూపులు! ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగిలో వరి వేయవద్దని హెచ్చరిస్తూనే, ఏ బియ్యం ఎంత మేర కొంటారో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సాగు విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. రెండు రోజులు అక్కడే ఉంటామని, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే రైతులు యాసంగిలో ఏ పంట వేయాలో సూచిస్తామని తెలిపారు. దీంతో రైతులు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. పచ్చిబియ్యంగా మార్చలేకనే.. వానలు సరిగాపడి, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు రైతులను పంటల కోసం ప్రోత్సాహించాల్సింది పోయి.. వరి పండించకూడదని కేం ద్రం చెప్పడం సరికాదు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని పచ్చిబియ్యంగా మారిస్తే.. నూకల శాతం పెరిగి ఎఫ్‌సీఐకి విక్రయించలేని పరిస్థితి. అందుకే కొన్నేళ్లుగా బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇస్తున్నాం. యాసంగిలో కూడా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనేందుకు ముందుకు రావాలి. అంతకు మించి ప్రత్నామ్నాయం లేదు. - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు, అఖిల భారత రైతు సంఘం చట్టం ప్రకారం కేంద్రం కొనాల్సిందే.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందే. ఆ చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం వరి తగ్గించాలనుకుంటే.. ఫలానా పంట వేస్తే మద్దతు ధరకు కొంటామని ముందే చెప్పాలి. ప్రతీ గింజ కొంటా మని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చెప్పింది? ఏ ఆధారం చేసుకొని కేసీఆర్ ఈ ప్రకటన చేశారు? పచ్చిబియ్యం విషయంలో నూకలు వస్తాయంటున్నారు. ఇది ప్రాసెసింగ్ సమస్య. సేకరణ సమస్య కాదు. ఈ విషయంపై మిల్లర్లతో కూర్చొని చర్చించుకోవాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రత్యామ్నాయ పంటలను మద్దతు ధరలకు కొనాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను మద్దతుధరకు కొనేలా హామీ ఇవ్వాలి. కేరళ తరహాలో బోనస్ ఇవ్వాలి. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని చెప్తోంది. ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేవు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈ యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుండే సరఫరా చేయాలి. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతుసంఘం -
Telangana: కొనేవరకు కొట్లాట..
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో అధికార టీఆర్ఎస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా చేపట్టిన మహాధర్నాలో వేలాది మంది రైతులతో కలిసి పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మం త్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ధర్నా వేదికలు గులాబీమయం అయ్యా యి. రాష్ట్ర అవతరణ తర్వాత అధికార పార్టీగా చేపట్టిన తొలి నిరసన కార్యక్రమం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యంత్రాంగం సవాలుగా తీసుకుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జరిగిన మహాధర్నాలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వైద్య, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మంత్రు లు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ, ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు తమ జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలి పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాదయాత్రగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు మంత్రి సత్యవతి రాథోడ్ ఎడ్లబండి మీద ర్యాలీగా వచ్చారు. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాకు సంఘీభావం తెలుపుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరి కంకులు, ధాన్యం సంచులను ధర్నా వేదిక వద్ద ప్రదర్శించారు. యాసంగి వడ్లు కొనేవరకు ఉద్యమ తరహాలో కేంద్రం పై కొట్లాడతామని ధర్నాల్లో పాల్గొన్న నేతలు చెప్పారు. ‘పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు శుక్రవారం జరిగిన మహాధర్నాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. ఉద్యమ కాలం నాటి జోష్ మళ్లీ టీఆర్ఎస్లో కనిపించింది..’అని సిరిసిల్లలో జరిగిన ధర్నాలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ధాన్యం కొల్లగొట్టేందుకు కుట్రలు పంటను కేంద్రం కొనకుండా, అంబానీ, అదానీలు వచ్చి తక్కువ ధరకే కొల్లగొట్టే కుట్రలకు బీజేపీ జాతీయ నేతలు తెరలేపారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. అవసరమైతే మోదీ, పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఊర్లోకి వచ్చే బీజేపీ నాయకుల్ని వేసంగి వడ్లు కొంటరా? లేదా? అని రైతులు నిలదీయాలి. – కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ అంబానీ, అదానీలపైనే ప్రేమ బీజేపీకి రైతులన్నా, వ్యవసాయమన్నా ప్రేమ లేదు. అదాని, అంబానీలపైనే ప్రేమ ఉంది. అందుకే ధాన్యం కొనకుండా కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. తొండి సంజయ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం. – ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ రైతులతో పెట్టుకుంటే నాశనమే యాసంగి వరి ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం విస్మరిస్తోంది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నాశనం అవుతుంది. డ్రామాలు ఆడుతున్న బీజేపీకి త్వరలో సినిమా చూపిస్తాం. – హైదరాబాద్‌లో మంత్రి తలసాని -
ధాన్యం మద్దతు ధర పొందాలంటే..
పంటను కంటికి రెప్పలా కాపాడుకుని వరి పండించడం ఒక ఎత్తు. దానికి మద్దతు ధర పొందటం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దాం. సాక్షి, శామీర్‌పేట్: రైతులు తాము పండించిన వరి గింజలపై తీసుకునే జాగ్రత్తల మేరకు మద్దతు ధర లభిస్తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణ ధాన్యం రకం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.1940, ఎ–గ్రేడ్ రకం రూ.1960 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ పంట తాలుకు వరి ధాన్యాన్ని దిగువ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వాటిని ఆచరిస్తే మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయ అధికారి సూచిస్తున్నారు. (చదవండి: ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం) నాణ్యతాప్రమాణాలు... ► మట్టి, రాళ్లు, ఇసుక వంటి వ్యర్థాలు ఉండకూడదు. ► గడ్డి, చెత్త, తప్ప, కలుపు, విత్తనాలు ఒక్క శాతం మించకూడదు. ► చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యపు గింజలు 5శాతం మించకూడదు. ► వరిపక్వం గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3శాతంలోపే ఉండాలి. ► తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఎ–గ్రేడ్ రకంలో 6శాతం మించకూడదు. ► తేమ లేక నిమ్ము 17 శాతం మించితే కొనుగోలు చేయరు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► ఒక రకం ధాన్యాన్ని మరోక రకం ధాన్యంతో కలపరాదు. ► పంట కోసిన తర్వాత ఆరబెట్టక పోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ► నూర్చేటప్పుడు ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి, వాటిపై నూర్పిడి చేయాలి. ► పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తాచెదారం పోయేటట్టు తూర్పారబట్టాలి. ► ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటు కట్టాలి. ► నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్ మాత్రలు, పురుగు నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్లు మలాథియాన్ మందును బస్తాలపై పిచికారి చేయాలి. ► రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకొచ్చి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహ పొందాలి. ► ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సరుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చుకోవాలి. ► మొదట తెచ్చిన ధాన్యం శాంపిల్ మాదిరిగానే మొత్తం సరుకు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► సదరు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఉచిత నాణ్యత, తేమ పరీక్ష కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది. ► రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కోనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి. ► దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకే ఈ నిబంధనలు పాటించాలి. ► రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ లేక ఏఈఓలను సంప్రదించాలి. దళారులను నమ్మొద్దు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించండి. అధికారుల సూచనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల ప్రమేయం నివారించేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి. – రమేష్, శామీర్‌పేట వ్యవసాయ అధికారి -
ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మాదిరే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ధాన్యం సేకరణకు 6,545 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ సోమవారం ఆరంభం కానుంది. ఇప్పటికే వరికోతలు ఆరంభమైన జిల్లాల నుంచి మొదటగా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించనుంది. ఈ సీజన్లో మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు అవసరమైన చర్యలను వెంటనే మొదలుపెట్టాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు... ఈ సీజన్లో మొత్తంగా 1.35 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో కనీసంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనుంది. దీనికిగాను 6,500లకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కోతలు ఆరంభమైన నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి మొదటగా ధాన్యం సేకరించే అవకాశాలున్నాయని పౌర సరఫరాల వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది వానాకాలం సీజన్లో 43 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించగా, ఈసారి దాదాపు రెట్టింపు సేకరించే అవకాశాలున్నాయి. వరి ఎ–గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ధాన్యం సేకరణ నిమిత్తం రూ.7 వేల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు అవసరమైతే, వాటిని రుణాల రూపేణా సమకూర్చుకోనుంది. ధాన్యం సేకరణపై కమిటీ ధాన్యం సేకరణ వ్యవహారాల పరిరక్షణకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కమిషనర్, పోలీస్ శా>ఖ అధికారులతో కలిపి ఆరుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ధాన్యం సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు ఎలాంటి అక్రమాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపడుతుంది. ఇక ధాన్యం అప్పగించిన రోజు నుంచి 15 రోజుల్లోగా మిల్లర్లు బియ్యాన్ని తిరిగి అప్పగించాలని పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌కు సంబంధించి బాయిల్డ్ రైస్(ఉప్పుడు బియ్యం)ను ఏమాత్రం తీసుకునేది లేదని తెలిపింది. మిల్లర్లు రారైస్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బాయిల్డ్ రైస్ తీసుకునే పరిస్థితులు లేకపోవడం, ఇప్పటికే బాయిల్డ్ నిల్వలు భారీగా పేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
కుప్పలు కుప్పలుగా వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం సేకరణ ఎంతకీ ముగియడం లేదు. అంచనాలకు మించి ఇప్పటికే 83.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినా.. మరో 4.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరగాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ లెక్కగడుతోంది. ఎంత ధాన్యం రావచ్చన్న దానిపై జిల్లాల అధికారులు ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగానికి సమాచారమిచ్చారు. ఇందులో వనపర్తి జిల్లా నుంచి 95 వేల టన్నులు, మెదక్ 84 వేలు, ఖమ్మం 73 వేలు, నారాయణపేట 56 వేలు, సిద్దిపేట 50 వేలు, నాగర్‌కర్నూలు 50 వేల మెట్రిక్ టన్నుల మేర వచ్చే అవకాశాలున్నాయని నివేదించారు. అంటే మొత్తంగా 87.95 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అదనంగా ప్రస్తుత సేకరణకు మరో రూ.2 వేల కోట్లు అవసరం ఉండటంతోపాటు మరో 2 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని లెక్కలేశారు. ఈ నిధుల సేకరణ, గన్నీ సంచుల సేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిధుల అంశమై మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించినట్లు సమాచారం. సేకరణను ఈ నెల 10లోగా ముగించాలని భావించినా, భారీగా ధాన్యం వస్తున్న జిల్లాల్లో ఈ నెల 20 వరకు సేకరణ జరపాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. లారీల కొరత, వానలు, మిల్లుల్లో ఖాళీ కాని ధాన్యం వంటి కారణాలతో సేకరణ కత్తిమీది సాములా మారుతోంది. కొన్నిచోట్ల నెలరోజులుగా పడిగాపులే.. రాష్ట్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో నెలరోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆవేదనతో అధికారుల కాళ్లావేళ్లాపడుతూ కొన్నిచోట్ల ధాన్యాన్ని అధికారుల ముందటే తగలబెడుతున్నారు. నిస్సహాయ స్థితిలో అన్నదాతలు మిగిలిపోతున్నారు. ఈ సమస్యను సరిగ్గా అంచనా వేయకపోవడం, సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. దీనికితోడు కొన్ని జిల్లాల్లో రైస్ మిల్లులు లేవు. ఆ జిల్లా ధాన్యాన్ని పొరుగున ఉన్న జిల్లాలకు కేటాయించారు. ఆ మిల్లర్లు సొంత జిల్లాల్లో సేకరణ పూర్తయితే తప్ప.. మరో జిల్లా నుంచి ధాన్యం తీసుకోవడంలేదని సమాచారం. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండటానికి కనీసం గన్నీ బ్యాగులనూ సమకూర్చడం లేదని అంటున్నారు. ఈక్రమంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంట కోసం తెచ్చిన అప్పులు చెల్లించలేక, కౌలు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు. అంచనాకు మించి సేకరణ జరిగిన జిల్లాలు: నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, నారాయణ పేట, భూపాలపల్లి, గద్వాల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల. -
మినీ రైస్ మిల్లు.. గట్టి మేలు!
మూడు అడుగుల ఎత్తు ఉండే చిన్న రైస్ మిల్లు గ్రామీణ యువతకు ఉపాధి మార్గంగా మార్గం చూపుతోంది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామంలోని తన సోదరికి ఈ మిల్లును కొని ఇచ్చారు. ఆమె ఈ మిల్లు ద్వారా ధాన్యాన్ని స్వయంగా మరపట్టి బియ్యం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన యువ రైతు కూడా దీని ద్వారా ఉపాధి పొందుతుండటం విశేషం. సన్న, చిన్న రైతులకు, దేశీ వంగడాలను సాగు చేసే రైతులకు, గ్రామీణ యువతకు ఈ చిట్టి రైస్ మిల్లు ఉపయోగకరమని చెబుతున్నారు. మినీ రైస్ మిల్లులో వడ్లను పోస్తున్న శ్రీధర్.. బియ్యం దేశీ వరి రైతులకూ ఉపయోగకరం నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీధర్ సోషల్ వర్క్‌లో ఎమ్మే చదివారు. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం కావడంతో తనకూ చిన్నప్పటి నుంచి సాగుపైనే ఆసక్తి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సాగుకు సంబంధించిన కొత్త విషయాల గురించి వెదుకుతూ ఉంటారు. రెండు నెలల క్రితం ఫేస్బుక్లో ఎక్కడికైనా తీసుకెళ్లదగిన అతి చిన్న రైస్ మిల్లుకు సంబంధించిన పోస్టు శ్రీధర్‌ను ఆకట్టుకుంది. ‘పల్లెసృజన’ సంస్థలో గతంలో వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల దీని ప్రత్యేకతను చప్పున గుర్తించారు. తమ వంటి సన్న, చిన్న రైతులకు ఈ మినీ రైస్‌మిల్లు చాలా ఉపయోగపడుతుందనిపించింది. ఆ పోస్టు పెట్టిన శ్రీకాకుళం జిల్లా వాసితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఛత్తిస్ఘడ్లోని రాయ్‌పూర్‌లో తయారైన ఈ మినీ రైస్ మిల్లును కొద్ది రోజుల్లోనే తానూ కొనుగోలు చేశారు శ్రీధర్. ఎత్తు మూడు అడుగులు. బరువు 65 కిలోలు. అడుగున నాలుగు వైపులా చక్రాలున్నాయి. ఎక్కడికంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లవచ్చు. దీన్ని ఇంటి దగ్గరే పెట్టుకొని గంటకు 100–150 కిలోల ధాన్యాన్ని మరపడుతూ ఉపాధి పొందుతున్నారు శ్రీధర్. 5 గంటల పాటు నిరంతరాయంగా మర ఆడించవచ్చు. వంద కిలోల ధాన్యానికి 55–60 కిలోల బియ్యం పొందుతున్నానని, వడ్ల నాణ్యతను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయన్నారు. ఇందులో ఒకేసారి ఎనిమిది కిలోల వడ్లను పోయొచ్చు. 3 హెచ్‌పీ మోటార్‌తో పనిచేస్తోంది. సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. విద్యుత్ ఖర్చు బాగా తక్కువేనన్నారు. కాబట్టి, మారుమూల గ్రామంలో కూడా దీనితో ధాన్యం మరపట్టుకోవచ్చని శ్రీధర్ చెబుతున్నారు. 3 రకాల జాలీలు ఉంటాయి. వడ్లు పొడవు, లావును బట్టి జాలీని మార్చి సెట్ చేసుకోవాలి. సాధారణ రకాలు సాగు చేసే రైతులతో పాటు.. రకరకాల సైజుల్లో ఉండే దేశీ వరి రకాలను చిన్న మడుల్లో సాగు చేసే తన వంటి రైతుల మిల్లింగ్ కష్టాలు తొలగిపోయినట్లేనని ఆయన సంతోషపడుతున్నారు. దీన్ని రూ. 39 వేలకు కొన్నానని, రూ. 3 వేలు రవాణా ఖర్చులు అయ్యాయని శ్రీధర్ తెలిపారు. ధాన్యం మరపట్టించుకున్న వారు తవుడు తనకే వదిలేస్తే ఉచితంగా మర పడుతున్నానని, లేదంటే కిలో వడ్లకు రూ.2 చొప్పున తీసుకుంటున్నానని తెలిపారు. అర కిలో ధాన్యం ఉన్నా దీనితో మర పట్టుకోవచ్చని, దీన్ని నిర్వహించడానికి నైపుణ్యం పెద్దగా అవసరం లేదని శ్రీధర్ (98480 88428) అంటున్నారు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ ఫొటో జర్నలిస్ట్ : బాతూరి కైలాష్ సోదరికి అన్నయ్య కానుక.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం వేములవాడకు చెందిన బొడ్డ గంగాధర్ సరిహద్దు భద్రతా దళంలో బంగ్లాదేశ్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్నారు. అమ్మమ్మ, తల్లితోపాటు వేములవాడలో ఉంటున్న ఆయన చెల్లెలు లావణ్య ఇంటర్ పూర్తి చేశారు. చెల్లెలికి ఏదైనా ఉపాధి మార్గం చూపదగిన యంత్ర పరికరాల కోసం ఇంటర్నెట్లో వెదుకుతున్న గంగాధర్‌కు ఓ మినీ రైస్ మిల్లు కనిపించింది. దీన్ని తయారు చేసిన చత్తిస్ఘఢ్లోని కంపెనీని సంప్రదించారు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న చిన్న మిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా చక్రాలు కూడా పెట్టించి ఏడాది క్రితం రూ. 40 వేలకు కొనుగోలు చేశారు. వేములవాడలోనే లావణ్య చిన్న రేకుల షెడ్డులో ఈ మినీ రైస్ మిల్లును, దానితోపాటు చిన్న పిండి మరను కూడా ఏర్పాటు చేసుకొని, తల్లి తోడ్పాటుతో తానే నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. 80 కిలోల సాంబ మసూరి ధాన్యం మరపడితే 51 కిలోల బియ్యం వస్తున్నాయని, 3 హెచ్‌పి మోటారు కావడంతో విద్యుత్తు ఖర్చు కూడా తక్కువగానే ఉందని లావణ్య తెలిపారు. తొలుత సింగిల్ ఫేజ్ విద్యుత్తుతో సమస్యలు రావటంతో టూ ఫేజ్ విద్యుత్ వాడుతున్నామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో మరపట్టించిన బియ్యాన్ని కిలో రూ. 40కి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నానని లావణ్య ‘సాక్షి’తో సంతోషంగా చెప్పారు. వేరే ఊళ్లో దూరాన ఉండే పెద్ద రైస్ మిల్లు దగ్గరకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సిన అవసరం ఇక లేదని, గ్రామంలోనే కొన్ని కిలోల ధాన్యాన్ని సైతం మరపట్టుకోవచ్చని ఈ మినీ మిల్లు చూశాక అర్థమైందన్నారు. చిన్న రైతులు, గ్రామాల్లో మహిళలు, యువతులు ఈ మిల్లు ద్వారా తన మాదిరిగా ఉపాధి పొందవచ్చని లావణ్య (70325 65474) సూచిస్తున్నారు. – లింగూడు వెంకట రమణ, సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
‘వరినాటు యంత్రాలకు ప్రాధాన్యత పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతున్న నేపథ్యంలో వరి నాటు యం త్రాలకు ప్రాధాన్యత పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రైతులను ఈ వరి యంత్రాల వాడకం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారం లో రాజేంద్రనగర్, పాలెం, వరంగల్, జగిత్యాల వరి పరిశోధన కేంద్రాల్లో రైతుల కోసం వరి నాటు యంత్రాల ప్రదర్శన, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి మండలానికి పది వరి నాటు యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు -
నేటినుంచి కొనుగోలు
ముంబై: రైతుల నుంచి ధాన్యం సేకరణపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర విదర్భలోని నాలుగు జిల్లాల్లో గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపివేయడంపై ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం అసెంబ్లీలో నిలదీశారు. దీనికి ఆహార, పౌరసరఫరాల మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... ‘నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలో ధాన్యం సేకరణను నిలిపివేశాం. ఈ విషయమై కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మే 27న లేఖ కూడా రాశాను. ధాన్యం కొనుగోలు విషయంలో చొరవ చూపాల్సిందిగా కోరాను. కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామ’న్నారు. విపక్షాల అభ్యంతరం దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కుశాల్ బోప్చే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా వెంటనే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. జూన్ 30 వరకు ధాన్యం సేకరణ కోసం కేంద్రం నుంచి అనుమతి ఉన్నందున వెంటనే సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణను నిలిపివేస్తే వ్యాపారులు మద్దతు ధరకంటే తక్కువ ధరకు కొనే ప్రమాదముందని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. రైతుకు మద్దతు ధర దక్కకపోతే హెక్టారుకు రూ. 20,000 నష్టం వస్తుందన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోండి: స్పీకర్ కేంద్రం నుంచి సమాధానం రాకపోతే రెండ్రోజుల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన.. స్పీకర్ ఆదేశాల తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నినాదాలు చేశారు. ఓ సమయంలో బీజేపీ నేత అతుల్ దేశ్కర్ స్పీకర్ మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ ఆయనను హెచ్చరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చవాన్ కలుగజేసుకుంటూ... ధాన్యం సేకరణను బుధవారం నుంచి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు.