Michael Vaughan
-
అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.తీరు మార్చుకోని సూర్యఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్ 360’.. మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్ బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తాజాగా రాజ్‌కోట్(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79), తిలక్ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్‌తో రాణించడంతో భారత్ గెలుపొందింది.అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్‌గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్ చాంపియన్స్ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్‌కోట్‌లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రాగానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్ వుడ్ బౌలింగ్‌లోనూ తన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. బట్లర్ బృందం 171 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు
ఇంగ్లండ్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కొడుకు ఆర్కీ వాన్ (Archie Vaughan) ఎంపికయ్యాడు. 19 ఏళ్ల ఆర్కీ వాన్ త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లండ్ యువ జట్టును సారధిగా వ్యవహరించనున్నాడు. ఆర్కీ వాన్ తన తండ్రి మైఖేల్ వాన్ బాటలోనే ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మైఖేల్ వాన్ హయాం ఇంగ్లండ్ జట్టుకు స్వర్ణ యుగం లాంటిది. మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2005 యాషెస్ సిరీస్ నెగ్గింది. 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌కు లభించిన తొలి యాషెస్ విజయం ఇది. మైఖేల్ వాన్ 51 టెస్ట్‌ల్లో, 60 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.మైఖేల్ వాన్ తనయుడు ఆర్కీ వాన్ తొలిసారి ఇంగ్లండ్ అంతర్జాతీయ జట్టుకు సారధిగా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటన జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. తొలి వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం జనవరి 27న స్టెల్లెన్బాష్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.ఆర్కీ వాన్ ఇటీవలే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. వాన్ సోమర్సెట్ తరఫున నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆర్కీ వాన్ తన స్వల్ప ఫస్ట్ క్లాస్ కెరీర్లో అదరగొట్టాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన వాన్ 236 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. సర్రేపై ఆర్కీ వాన్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఆర్కీ వాన్ ఇటీవలే లిస్ట్-ఏ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. మెట్రో బ్యాంక్ కప్ ఆర్కీ వాన్ తన తొలి 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు.ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో మాజీ ఆటగాడి తనయుడు ఆర్కీ వాన్. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ యువ జట్టులో రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కలేదు.సౌతాఫ్రికా పర్యటన కోసం ఇంగ్లండ్ అండర్-19 జట్టు: ఆర్కీ వాన్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, తజీమ్ అలీ, బెన్ డాకిన్స్, కేష్ ఫోన్సేకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, ఎడ్డీ జాక్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, హ్యారీ మూర్, జో మూర్స్, థామస్ రెవ్, ఆర్యన్ సావంత్, నావ్య శర్మ, అలెగ్జాండర్ వేడే. -
టీమిండియాను పాక్ కూడా ఈజీగా ఓడిస్తుంది: వసీం అక్రమ్ ఎగతాళి
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో భారత జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే స్పిన్‌కు బాగా ఆడుతారని పేరొందిన భారత బ్యాటర్లు.. ఇప్పడు అదే స్పిన్‌ను ఆడేందుకు భయపడుతున్నారు. ముంబై 147 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని కూడా భారత్ చేధించలేక చతికలపడింది. కివీస్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లు కివీ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. అయితే ఇదే అవకాశంగా తీసుకుని భారత జట్టును ఇంగ్లండ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎగతాళి చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్‌లు భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ కూడా ఓడిస్తుంది?మెల్బోర్న్ వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అక్రమ్,మైఖేల్ వాన్లు కామేంటర్లగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా వాన్ మాట్లాడుతూ.."పాకిస్తాన్-భారత్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలనుకుంటున్నాను' అని అన్నాడు. అందుకు బదులుగా అక్రమ్ "నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది. ఇది రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని పెంచుతుంది" అని సమాధానమిచ్చాడు. ఇక్కడవరకు అంతే బాగానే చివరిలో అక్రమ్, వాన్ తన వక్ర బుద్దిని చూపించుకున్నారు. "ఇప్పుడు స్పిన్పిచ్లపై టీమిండియాను పాక్ ఓడించగలదు" అని వాన్ వ్యాఖ్యనించాడు. అక్రమ్ కూడా అందుకు అంగీకరించాడు."భారత్ స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతంది. కాబట్టి టర్నింగ్ వికెట్లపై టీమిండియాను ఓడించే అవకాశముంది. న్యూజిలాండ్ భారత జట్టును వారి స్వదేశంలోనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది" అని అక్రమ్ రిప్లే ఇచ్చాడు. కాగా వీరిద్దరి కామెంట్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: టీమిండియా ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘ముందు మీ జట్టు సంగతి చూసుకో.. ఆ తర్వాత మా వాళ్ల గురించి మాట్లాడు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరోసారి భారత జట్టును తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.సొంతగడ్డపై అత్యల్ప స్కోరుకాగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా బెంగళూరు వేదికగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రోహిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది.పెద్ద గండం నుంచి బయటపడినిజానికి.. ఒకానొక దశలో 34 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. కథ తొందరగానే ముగుస్తుందేమోనని అభిమానులు భయపడ్డారు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం మరోసారి పునరావృతమవుతుందేమోనని బెంబేలెత్తిపోయారు. ఆయితే, రిషభ్ పంత్ (20)కారణంగా టీమిండియా పెద్ద గండం నుంచి బయటపడింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.టీమిండియా అభిమానుల ముఖాలు అంటూ టీజింగ్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై 2020-21 టెస్టు సిరీస్‌లో భారత జట్టు 36 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన స్కోరు.. తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్పం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఎక్స్ వేదికగా రోహిత్ సేన వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ.. టీమిండియా ఫ్యాన్స్‌ను టీజ్ చేశాడు. ‘కాస్తైనా సిగ్గుండాలి అంటూ కౌంటర్స్‘‘కనీసం మీ వాళ్లు 36 పరుగుల మార్కు దాటేశారు.. చూడండి.. టీమిండియా అభిమానుల ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయో!’’ అంటూ వాన్ హేళన చేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మమ్మల్ని కామెంట్ చేయడానికి కాస్తైనా సిగ్గుండాలి.2019 తర్వాత టీమిండియాపై ఇంగ్లండ్ సిరీస్ గెలవనే లేదు. టీమిండియా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఫైనల్ చేరబోతోంది. ఇంగ్లండ్‌కు ఆ అవకాశం లేనే లేదు. అయినా ఐర్లాండ్ చేతిలో మీ జట్టు 52 రన్స్‌కే ఆలౌట్ అయిన విషయం మర్చిపోయావా?’’ అంటూ భారత జట్టు ఫ్యాన్స్ వాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. కాగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయి.. భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్Look on the bright side Indian fans .. at least you have got past 36 .. 😜😜— Michael Vaughan (@MichaelVaughan) October 17, 2024 -
పాక్ క్రికెట్‌కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్‌పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ! -
ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కేవలం మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇంగ్లండ్ బ్రాండ్ క్రికెట్ 'బాజ్బాల్ను భారత్ కాపీ చేసిందని వాన్ ఆరోపించాడు.నిజంగా ఇదొక అద్భుతమైన టెస్టు మ్యాచ్. నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారత క్రికెటర్లు బాజ్బాలర్స్గా మారడం గొప్ప విషయం. కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ కొట్టారు' అని ఓ క్రికెట్ షోలో వాన్ పేర్కొన్నాడు. అయితే ఇదే షోకు కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ వాన్‌కు కౌంటిరిచ్చాడు."వాన్ నీవు బాగానే ఉన్నావా? భారత్ ఆడింది బజ్‌బాల్ కాదు.. గాంబాల్. వారి హెడ్‌కోచ్ గంభీర్ ఇప్పటికే గాంబాల్పై పేటెంట్ పొందాడు. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా జాగ్రత్తగా ఉండాలి" అని గిల్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇందుకు స్పందించిన వాన్.. భారత్ గాంబాల్ అచ్చెం బజ్‌బాల్ లానే ఉందంటూ చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టీ20లను తలపిస్తూ కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.చదవండి: IND-W vs SA_W: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. -
‘ధోని, రోహిత్‌లకే చోటు.. కోహ్లిని అమ్మేస్తాను’
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ టోర్నీ. ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్‌లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)ల సొంతం.ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే కానీ.. మరో స్టార్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తోనే ఉండగా.. కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో దక్కన్ చార్జర్స్‌కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లకు ఎదురైంది. ఇందుకు మైకేల్ వాన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్‌గా‘‘నేనైతే ఎంఎస్ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్. విరాట్‌కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రోహిత్ ఓవరాల్‌గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్‌ను అతడికి సబ్‌స్టిట్యూట్‌గా పెడతా. విరాట్‌కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్ View this post on Instagram A post shared by cricket.com (@cricket.com_official) -
కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు ఆరునెలల తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఇందుకోసం ఇప్పటికే చెన్నై వేదికగా టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ దిగ్గజ స్పిన్నర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.ఈ సందర్భంగా హోస్ట్ విమల్ కుమార్ అడిగిన ప్రశ్నలకు అశూ ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన దృష్టిలో.. బెస్ట్ కవర్ డ్రైవ్ షాట్ ఆడేది వీరేనంటూ ఇద్దరు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు అశూ. అదే విధంగా.. పుల్ షాట్ అత్యుత్తమంగా ఆడేది ఇతడేనంటూ ఆస్ట్రేలియా దిగ్గజం పేరును ప్రస్తావించాడు. ఇంతకీ వారెవరంటారా?కోహ్లి, రోహిత్ కాదు!కాగా ఆధునిక తరం క్రికెటర్లలో కవర్ డ్రైవ్ షాట్ ఆడటంలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ మేటి బ్యాటర్ బాబర్ ఆజం ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, మాజీ క్రికెటర్లలో డేవిడ్ గోవర్, మార్క్ వా, మైకేల్ వాన్, సౌరవ్ గంగూలీ, మార్కస్ ట్రెస్కోతిక్ కూడా షాట్‌తో ప్రసిద్ధి చెందినవారే. అయితే, అశ్విన్ వీరిలో కోహ్లిని కాదని మార్కస్ ట్రెస్కోతిక్, మైకేల్ వాన్లకు ఓటేశాడు.అతడి కవర్ డ్రైవ్‌లే ఇష్టం.. పుల్ షాట్లు ఆడటంలో అతడు బెస్ట్‘‘మార్కస్ ట్రెస్కోతిక్ అంటే ఇప్పటి యువతలో చాలా మందికి తెలియకపోవచ్చు. నాకైతే అందరికంటే అతడి కవర్ డ్రైవ్‌లే ఎక్కువగా నచ్చుతాయి. ఇక మైకేల్ వాన్ కూడా.. అద్భుతంగా ఈ షాట్లు ఆడగలడు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక పుల్ షాట్లు ఆడటంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌కు ఎవరూ సాటిరారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ షాట్లు సూపర్‌గా ఆడతాడన్న విషయం తెలిసిందే.ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పిల్లర్లుగాఇలా.. అభిమానులు ఊహించినట్లుగా కోహ్లి, రోహిత్ పేర్లు చెప్పకుండా అశూ.. విదేశీ బ్యాటర్ల పేర్లు చెప్పి ఒకరకంగా వారికి షాకిచ్చాడు. కాగా మార్కస్ ట్రెస్కోతిక్- మైకేల్ వాన్ తమ ఆట తీరుతో.. 2000 నాటి తొలినాళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగానికి రెండు పిల్లర్ల మాదిరి నిలబడ్డారు. ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ తరఫున 76 టెస్టులు ఆడి సగటు 43.79తో 5825 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు ఉన్నాయి. మరోవైపు.. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ 82 టెస్టుల్లో 5719 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 18 సెంచరీలు ఉన్నాయి.చివరగా ఇంగ్లండ్‌తో..టీమిండియా తరఫున అశ్విన్ చివరగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. స్వదేశంలో మార్చిలో ముగిసిన ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగానే అశూ.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో టెస్టుల్లో 516, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఈ స్పిన్ బౌలింగ్ ఐదు శతకాలు కూడా బాదడం విశేషం.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
రూట్.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడు..!
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ తాజాగా విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో (32) రూట్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి, ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11940) ఎగబాకాడు.టెస్ట్‌ల్లో 32 సెంచరీలు పూర్తి చేసిన అనంతరం రూట్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రూట్ అతి త్వరలో ఇంగ్లండ్ లీడింగ్ టెస్ట్ రన్ స్కోరర్‌గా అవతరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో రూట్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా సవరిస్తాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 ఏళ్లే అని.. మరో రెండు,మూడేళ్లలో సచిన్ రికార్డు బద్దలు కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.కాగా, రూట్ ప్రస్తుతం అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. కలిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), ద్రవిడ్ (36), యూనిస్ ఖాన్ (34), గవాస్కర్ (34), లారా (34), జయవర్దనే (34), కుక్ (33) రూట్ కంటే ముందున్నారు. రూట్ మరో సెంచరీ చేస్తే.. తన దేశ అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేస్తాడు.అలాగే రూట్ మరో 54 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారాను (11953) అధిగమించి ఏడో స్థానానికి ఎగబాకుతాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288), కుక్ (12472), సంగక్కర (12400), లారా మాత్రమే రూట్ కంటే ముందున్నారు. జులై 26 నుంచి విండీస్‌తో జరుగబోయే చివరి టెస్ట్‌లో రూట్ పై పేర్కొన్న వాటిలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. మైఖేల్ వాన్, ఫ్లింటాఫ్ కుమారుల అరంగేట్రం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కుటుంబాల్లో రెండో తరం వచ్చింది. వీరిద్దరి కుమారులు ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో వీరిద్దరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు.ఆర్కీ, రాకీతో పాటు ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యులు జో డెన్లీ, రెహాన్ అహ్మద్ సంబంధీకులు కూడా ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. జో డెన్లీ అల్లుడు జైడన్ డెన్లీ.. రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా శ్రీలంక సిరీస్‌లో ఆడనున్నారు.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ విషయానికొస్తే.. ఈ ఇద్దరు అప్‌కమింగ్ క్రికెటర్లు తమ తండ్రుల లాగే బ్యాటింగ్, బౌలింగ్ స్టయిల్లను ఎంచుకున్నారు. ఆర్కీ తన తండ్రి లాగే రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కాగా.. రాకీ ఫ్లింటాఫ్ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్లా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కీ, రాకీ ఒకేసారి తమ కెరీర్లు ప్రారంభించనుంటే.. మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కలిసి ఇంగ్లండ్ తరఫున 48 టెస్ట్‌లు (1999-2008) ఆడారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 8, 16 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఇంగ్లండ్ U19 స్క్వాడ్: హంజా షేక్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, చార్లీ బ్రాండ్, జాక్ కార్నీ, జైద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, కేశ్ ఫోన్సెకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఎడ్డీ జాక్, ఫ్రెడ్డీ మెక్కాన్, హ్యారీ మూర్, నోహ్ థైన్, ఆర్కీ వాన్. -
పాక్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్‌కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్‌తో జరిగే టీ20 సిరీస్‌లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు. మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్‌కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్‌లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.ప్రపంచకప్‌కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
టీమిండియాకు నో ఛాన్స్.. వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే: మైఖేల్ వాన్
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్‌కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్‌కప్‌పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈసారి సెమీఫైనల్స్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్ ఫోర్కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వాన్‌కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్‌కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్‌కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్‌కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్‌కప్ సెమీఫైనలిస్ట్‌లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్‌కప్‌లో టఫ్ ఫైట్ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు సెమీఫైనల్‌కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండ, వెస్టిండీస్, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాలు తమ వరల్డ్‌కప్ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025లో హిట్‌మ్యాన్ కచ్చితంగా జట్టు మారడతాడని అంచనా వేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడు ప్రయాణం మొదలుపెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడాలని ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే ‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లిపోతాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా? వచ్చే ఏడాది రోహిత్ జట్టుతో చేరేంత వరకు తాత్కాలిక సారథిగా ఉంటాడా? నేనైతే రోహిత్‌ను చెన్నై జట్టులో చూస్తాననే అనుకుంటున్నా’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌కు ఆడినా బాగానే ఉంటుంది అయితే, ఇందుకు హోస్ట్ బదులిస్తూ.. ‘‘రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయి కదా?’’ అని పేర్కొనగా.. అవునంటూ వాన్ సమాధానమిచ్చాడు. సీఎస్కేకు కాకపోతే రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా బాగానే ఉంటుందని.. గతంలో అతడు డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా మైకేల్ వాన్ గుర్తు చేశాడు. కాగా కెప్టెన్ మార్పు విషయాన్ని ముంబై ఇండియన్స్, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వెళ్లగక్కుతూ స్టేడియంలోనే అతడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024లో పాండ్యా సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలచింది. మరోవైపు రోహిత్ శర్మ ఇంత వరకు ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిఇపి 156 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఐదింట మూడు విజయాలతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. చదండి: IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హార్దిక్, రాహుల్, బుమ్రా కాదు.. భారత ఫ్యూచర్ కెప్టెన్ అతడే
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గుజరాత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం తన కెప్టెన్సీతో అందరని అకట్టుకున్నాడు. అతడు బౌలర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికి గిల్ మాత్రం కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. తొలుత బౌలింగ్‌లో తన కెప్టెన్సీ మార్క్‌తో లక్నోను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవకావడంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్‌మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత పరిణితి చెందుతున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని" గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు. హార్దిక్ పాండ్యా,రాహుల్, బుమ్రా వంటి వారు రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికి వాన్ మాత్రం గిల్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎంచుకోవడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'భారత్, పాక్, ఇంగ్లండ్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ విజేత ఆ జట్టే'
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. జాన్ 1 నుంచి ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన టీ20 వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్ జట్టును ఎంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్-2023ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియానే టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలుస్తుందని వాన్ జోస్యం చెప్పాడు. షఆసీస్ మరోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. నాకు వారిపై 100 శాతం నమ్మకం ఉంది. అదేవిధంగా ఇటీవలే వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కైవసం చేసుకున్నారు. అదే ఆత్మవిశ్వాసంతో ఈ టోర్నీలో కూడా బరిలోకి దిగుతారు. వారు బ్యాటింగ్ లైనప్ అద్బుతం. జట్టులో హెడ్, వార్నర్, మార్ష్, మాక్స్వెల్, ఇంగ్లిస్, డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా కూడా ఆసీస్ పటిష్టంగా ఉంది. పేస్, స్పిన్‌తో సమతూకంగా ఆస్ట్రేలియా కన్పిస్తోంది. అందుకే ఆసీస్‌ను ఫేవరేట్‌గా ఎంచుకున్నానని" వాన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాన్ తమ జట్టు ఇంగ్లండ్‌ను కానీ, టీమిండియాను ఎంచుకోపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. -
రోహిత్ బదులు కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది!
Ind vs Eng Test Series 2024: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ విమర్శించాడు. ఇంగ్లిష్ బ్యాటర్లపై తమ బౌలర్లను ప్రయోగించడంలో హిట్‌మ్యాన్ తెలివి ప్రదర్శించలేకపోయాడని పెదవి విరిచాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు బదులు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా అసలు ఓడిపోయేదే కాదని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యం కనబరిచిన టీమిండియా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(196) జోరుకు అడ్డుకట్ట వేయలేక ఓటమిని కొనితెచ్చుకుంది. తప్పని ఓటమి కేవలం నాలుగు పరుగుల దూరంలో పోప్ డబుల్‌సెంచరీ చేజార్చుకున్నా.. జట్టును మాత్రం గెలిపించగలిగాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. తద్వారా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీని టీమిండియా బాగా మిస్సవుతోంది. కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది ఒకవేళ హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లి కెప్టెన్‌గా ఉండి ఉంటే.. భారత జట్టు ఓడిపోయేదే కాదు! రోహిత్ శర్మ దిగ్గజ ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ.. ఆరోజు ఎందుకో పూర్తిగా తనకేమీ పట్టనట్టు.. ఒక్క వ్యూహం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయాడు’’ అని యూట్యూబ్ చానెల్‌తో పేర్కొన్నాడు. ఇక తన కాలమ్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రోహిత్ శర్మ కెప్టెన్సీ మరీ ఆవరేజ్‌గా ఉంది. మైదానంలో అతడు చురుగ్గా కదులుతూ బౌలింగ్‌లో మార్పులు చేస్తాడనుకున్నా. కానీ ఒలీ పోప్‌ను అవుట్ చేసేందుకు.. అతడి స్వీప్, రివర్స్ షాట్లను ఆపేందుకు రోహిత్ ఒక్కసారి కూడా సరైన వ్యూహం పన్నలేదనిపించింది’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తొలి టెస్టులో రోహిత్ శర్మ కేవలం 63 రన్స్ మాత్రమే చేశాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: Ind vs Eng: ఆ ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు?.. టీమిండియా కోచ్ స్పందన ఇదే -
టెస్టు క్రికెట్లో మేమే బెస్ట్.. ఆ మాటలకు నాకు నవ్వొచ్చింది! వాన్‌కు అశ్విన్ కౌంటర్
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారత జట్టుకు మరోసారి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులో తిరిగి పుంజుకుంది. కేప్‌టౌన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 సమం రోహిత్ సేన చేసింది. ఏదేమైనప్పటికీ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతడి వ్యాఖ్యలకు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటరిచ్చాడు. వాన్ కామెంట్స్ తనకు నవ్వు వచ్చేలా చేశాయి అంటూ అశ్విన్ అన్నాడు. "భారత జట్టు గత పదేళ్లలో ఏమి సాధించలేదని తొలి టెస్టు ఓటమి తర్వాత వాన్ కామెంట్స్ చేశాడు. అవును నిజంగానే మేము గత కొన్ని ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీలను గెలవలేకపోయాం. కానీ వరల్డ్‌క్రికెట్‌లో మా జట్టు బలమైన జట్టు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ జట్లలో మా టీమ్ ఒకటి. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్లో అద్బుతమైన విజయాలను సాధించాము. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది భారత క్రికెట్ నిపుణులు సైతం సొంత జట్టుపై ఈ తరహా విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే వారు కామెంట్స్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వారికి వారే ఆలోచించుకోవాలి. కేప్‌టౌన్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైంది. అదే తొలి టెస్టులో ఒక వేళ దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఉంటే 65 పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశం లేదా? టీమిండియా కూడా ఆరంభంలో ఇబ్బంది పడింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. విరాట్, శ్రేయస్ జట్టును అదుకున్నారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడు. చివరికి మేం 245 పరుగులు చేశాం. కాబట్టి టెస్ట్ క్రికెట్‌కు మిగితా ఫార్మాట్లకు చాలా తేడా ఉంది. మంచి, చెడూ రెండు వుంటాయి. భారత్ వంటి దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తారు. అందుకేనేమో మేం ఎక్కువగా విమర్శలకు గురవుతుంటామని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
మంచి జట్టే! కానీ టీమిండియా ఏదీ గెలవలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించిందని ప్రశ్నించాడు. పటిష్ట జట్టు అని చెప్పుకోవడమే తప్ప.. జట్టులోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దాఖలాలే లేవని విమర్శించాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓడినప్పటి నుంచి మైకేల్ వాన్.. రోహిత్ సేనపై కఠిన విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాడు. అంచనాలు అందుకోలేని ఓ అండర్అచీవ్ టీమ్ అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో మరోసారి తన వ్యాఖ్యలకు పదును పెట్టాడు వాన్. ఫాక్స్ స్పోర్ట్స్ షోలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వాతో కలిసి పాల్గొన్న మైకేల్ వాన్.. అతడిని ఉద్దేశించి.. ‘‘క్రికెట్ ప్రపంచంలో ఎంతో గొప్ప జట్టు అనుకునే టీమిండియా అండర్అచీవ్ టీమ్ అని భావిస్తున్నారా?’’ అని అడిగాడు. ఇందుకు స్పందించిన మార్క్ వా తిరిగి అదే ప్రశ్న వేయడంతో మైకేల్ వాన్ బదులిచ్చాడు. ఈ మేరకు.. ‘‘ఇటీవలి కాలంలో టీమిండియా చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించలేదు. వాళ్లపై అంచనాలు పెట్టుకున్న ప్రతిసారి వమ్ము చేస్తూనే ఉంటారు. వాళ్లు చివరిసారిగా అతి గొప్ప విజయం ఎప్పుడు సాధించారో గుర్తుందా? నిజానికి వాళ్ల దగ్గర ప్రతిభ, నైపుణ్యాలు గల ఆటగాళ్లకు కొదువలేదు. కానీ వారి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారా? అప్పుడెప్పుడో ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టులు గెలిచారు. కానీ వరల్డ్‌కప్ టోర్నీల సంగతేంటి? గత కొన్నేళ్లుగా వాళ్లు ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. నిజానికి ఇండియా మంచి టీమ్. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయినా ఏం లాభం? వాళ్లు ఇక ముందు కూడా గెలుస్తారనే నమ్మకం లేదు’’ అని మైకేల్ వాన్ టీమిండియా ఆట తీరును తక్కువ చేసే విధంగా మాట్లాడాడు. కాగా మహేంద్ర సింగ్ సారథ్యంలో 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. టీ20 వరల్డ్‌కప్-2021, టీ20 వరల్డ్‌కప్-2022లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన టీమిండియా.. ఇటీవల సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లోనూ విజయలాంఛనం పూర్తి చేయలేకపోయింది. ఫైనల్ వరకు చేరినా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండు పర్యాయాలు ఫైనల్లో అడుగుపెట్టినా ఆఖరి గండాన్ని దాటలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది. చదవండి: Ind vs SA: రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా పేసర్‌కు గాయం.. రెండో టెస్టుకు డౌటే! -
దిగ్గజాలు కలిసిన వేళ.. సచిన్, విరాట్లతో ముచ్చటించిన డేవిడ్ బెక్‌హమ్
భారత్, న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెక్‌హమ్ యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నాడు. షెడ్యూల్లో భాగంగా అతను వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బెక్‌హమ్.. క్రికెట్ గాడ్, యూనిసెఫ్ ప్రతినిథి అయిన సచిన్ టెండూల్కర్‌ను కలిసాడు. వీరిద్దరు చాలా సేపు ముచ్చటించారు. సచిన్ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది. సచిన్, బెక్హమ్లు క్రికెట్, ఫుట్‌బాల్‌కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సచిన్ బెక్‌హమ్‌ను ముంబై ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిప్పాడు. యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో బెక్‌హమ్‌కు ఐసీసీ గౌరవ వందనం తెలుపుతూ మ్యాచ్‌కు ముందు మైదానంలోకి ఆహ్వానించింది. Fantastic footage 👍 https://t.co/Uh8hM4GFsS — Michael Vaughan (@MichaelVaughan) November 15, 2023 అనంతరం టీమిండియా, కివీస్ క్రికెటర్లంతా బెక్‌హమ్‌ను పరిచయం చేసుకున్నారు. బెక్‌హమ్ కింగ్ విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, బెక్‌హమ్ ప్రస్తుతం ఇంటర్ మయామీ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
కోహ్లి నిన్ను బౌల్డ్ చేశాడు కదా: పాక్ మాజీ కెప్టెన్‌కు గట్టి కౌంటర్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విషయంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌కు ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. కోహ్లి బౌలింగ్‌లో హఫీజ్ అవుట్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో నాలుగు అర్ధ శతకాలు సహా రెండు సెంచరీలు సాధించి జోష్‌లో ఉన్నాడు. చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం ద్వారా వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న సెంచరీల రికార్డు(49)ను సమం చేసి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో రన్‌మెషీన్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తుండగా... పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘కోల్‌కతాలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నపుడు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడని నాకు అనిపించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికిది మూడోసారి. సింగిల్‌తో అతడు 49వ వన్డే శతకాన్ని అందుకున్న తీరు చూస్తే.. జట్టుకోసం కాకుండా కేవలం తన సెంచరీ కోసం మాత్రమే ఆడినట్లు అనిపించింది’’ అని హఫీజ్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులతో పాటు వెంకటేశ్ ప్రసాద్, మైకేల్ వాన్ వంటి మాజీ క్రికెటర్ల నుంచి హఫీజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మరోసారి పరోక్షంగా కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ప్రశంసించే క్రమంలో మరోసారి ‘సెల్ఫిష్’ కామెంట్స్ చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ప్రపంచకప్-2023లో నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో స్టోక్స్ సెంచరీని ప్రశంసిస్తూ.. ‘‘జట్టును గట్టెక్కించే రక్షకుడు. తీవ్ర ఒత్తిడిలోనూ దూకుడైన ఆట తీరుతో కావాల్సినన్ని పరుగులు రాబట్టి చివరికి జట్టును గెలిపించాడు. స్వార్థపూరిత, స్వార్థ రహిత ఇన్నింగ్స్‌కు తేడా ఇదే’’ అంటూ హఫీజ్.. మైకేల్ వాన్‌ను ట్యాగ్ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘స్టోక్సీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడనడంలో ఎలాంటి సందేహం లేదు హఫీజ్.. అయితే, కోల్‌కతా వంటి కఠినతర పిచ్‌పై విరాట్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేశాడు. విరాట్ కోహ్లి నిన్ను బౌల్డ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిసారి అతడి పేరును ఇలా ప్రస్తావిస్తున్నావేమో అనిపిస్తోంది’’ అని మైకేల్ వాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. కాగా 2012లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి(రైటార్మ్ పేసర్) హఫీజ్‌ను బౌల్డ్ చేశాడు. Seems to me @MHafeez22 you were bowled by @imVkohli !!! Is this the reason you constantly have a pop at him .. 😜😜 #CWC2023 #India #Pakistan pic.twitter.com/m3BOaCxOB7 — Michael Vaughan (@MichaelVaughan) November 8, 2023 Great innings from Stokesy @MHafeez22 .. As was Virats on a difficult pitch in Kolkata against a better attack .. 👍 https://t.co/KFpNIafgVK — Michael Vaughan (@MichaelVaughan) November 8, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
కళ్లు చెదిరే విన్యాసం.. సచిన్ టెండూల్కర్‌ను సైతం ముగ్ధుడిని చేసింది
బెల్గామ్‌లో (కర్ణాటక) జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో కిరణ్ తర్లేకర్ అనే స్థానిక క్రికెటర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి, సహచరుడు క్యాచ్ పట్టేందుకు తోడ్పడతాడు. వివరాల్లోకి వెళితే.. బెల్గామ్‌లో స్థానికంగా ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్యాటర్ భారీ షాట్ కోసం ప్రత్నించి క్యాచ్ ఔట్ అవుతాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకునే క్రమంలో తర్లేకర్ అనే ప్లేయర్ అద్భుతమైన విన్యాసాన్ని చేశాడు. This video of a cricket match in Belgaum is going viral. Watch Kiran Tarlekar's catch. Sachin Tendulkar said that the player who took this casual catch must know football for sure. Even former England captain, Michael Vaughan has retweeted this video and captioned it as… pic.twitter.com/tvtuZjGenb — Alok Jain ⚡ (@WeekendInvestng) October 30, 2023 సిక్సర్‌గా వెళ్లే బంతిని గాల్లోకి నెట్టి ఫుట్‌బాల్ తరహాలో షాట్ కొట్టి సహచరుడు క్యాచ్ పట్టుకునేలా చేశాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. తర్లేకర్ విన్యాసాన్ని చూసి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం ముగ్దుడయ్యాడు. ఈ క్యాచ్ పట్టిన ఆటగాడికి ఫుట్ బాల్ కచ్చితంగా తెలిసి ఉండాలని కామెంట్ చేశాడు. ఇదే వీడియోను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం రీట్వీట్ చేస్తూ.. గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. -
భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌కు మరో 9 రోజుల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించే జట్టుకు టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అందరూ ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేసారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే టీమిండియా సొంతం చేసుకుంది. ఇండోర్ వేదికగా కంగారులతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏకంగా 399 పరుగుల భారీ స్కోర్‌ను టీమిండియా సాధించింది. గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగగా.. సూర్య, రాహుల్ మెరుపులు మెరిపించాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ప్రదర్శనపై వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. "నాకు చాలా స్పష్టత వచ్చేసింది. ఏ జట్టు అయితే భారత్‌ను ఓడిస్తుందో వారే వరల్డ్‌కప్‌ను గెలుస్తారు. సొంత పిచ్‌లపై భారత బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. అదే విధంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా అత్యుత్తమంగా ఉంది. అంతేకాకుండా భారత్ దగ్గర చాలా బౌలింగ్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు" ఎక్స్(ట్విటర్)లో వాన్ రాసుకొచ్చాడు. మా జట్టుకు దిష్టిపెట్టకు .. ఇక వాన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఫన్నీగా స్పందించాడు. ‘మా జట్టుకు దిష్టిపెట్టకు’ అనే అర్థం వచ్చేలా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు It’s quite clear to me .. Whoever beats #India will win the WC .. 👍 #INDvAUS .. India’s batting line up on Indian pitches is ridiculous .. Plus they have all the bowling options covered .. it’s the only the pressure of the burden that could stop them .. 👍 — Michael Vaughan (@MichaelVaughan) September 24, 2023 #INDvAUS https://t.co/CWvpXS5vmH pic.twitter.com/vpZ4rgvI3M — Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2023 -
WC: ఎవరిపై వేటు? ప్రతిసారీ నేనే.. నేనే అంటే కుదరదు.. చెత్త సలహాలు వద్దు!
Ben Stokes' ODI Retirement Backflip For WC 2023: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అండగా నిలిచాడు. స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన ఆస్ట్రేలియా మాజీ సారథి టిమ్ పైన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. చెత్త సలహాలు మానుకోవాలంటూ హితవు పలికాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2019 హీరో స్టోక్స్ ఇటీవలే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హీరో వచ్చేస్తున్నాడు.. మెగా ఈవెంట్ నేపథ్యంలో అతడిని మళ్లీ వన్డేల్లో ఆడించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో స్టోక్స్ బరిలోకి దిగనుండటంతో హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్టోక్స్ యూటర్న్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ స్పందించిన తీరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. SEN టాస్మానియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో రిటైర్మెంట్పై బెన్ స్టోక్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తి కలిగించింది. మీరు బెంచ్‌పై కూర్చోండి! అంటే ప్రతిచోటా నేనే.. నేనే.. నేనే అన్నట్లుగా ఉంది కదా! నాకు ఇష్టం వచ్చినపుడు ఆడతా.. అది కూడా మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఆడతా అంటే.. ఏడాది పాటు కష్టపడ్డ ఆటగాళ్లు ఎక్కడికిపోవాలి? ఇప్పుడు నేను ఆడతాను.. మీరు బెంచ్‌కే పరిమితం కావాలి అని వాళ్లకు చెప్తాడా?’’ అంటూ స్టోక్స్ స్వార్థపరుడన్న ఉద్దేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ మాటలు నెట్టింట వైరల్ కాగా మైకేల్ వాన్ తనదైన శైలిలో స్పందించాడు. టిమ్‌కు కౌంటర్ ఇచ్చిన వాన్ ‘‘ఇంతవరకు బెన్ స్టోక్స్ లాంటి నిస్వార్థపరుడైన క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాడు. మిగతా ఏ క్రికెటర్‌తో పోల్చినా ఈ విషయంలో తనే ముందుంటాడు. టిమ్.. ఇలాంటి హాస్యాస్పద సలహాలు ఇవ్వడం మానుకో!’’ అంటూ దిమ్మతిరిగే ట్వీట్‌తో టిమ్ పైన్‌కు కౌంటర్ వేశాడు. కాగా 32 ఏళ్ల స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2924 పరుగులు చేశాడు. ఎవరిపై వేటు? ఇందులో మూడు సెంచరీలు, 21 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక ఈ ఫార్మాట్లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5- వికెట్ హాల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. స్టోక్స్ రీఎంట్రీతో ఎవరిపై వేటు పడనుందన్న అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయమైంది. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్‌లో మలింగ రీఎంట్రీ! అతడి స్థానంలో.. Ben stokes is the most selfless cricketer I have ever known .. He puts Team before himself more than any other player .. Ridiculous suggestion from Tim .. https://t.co/jUXwzl1z2e — Michael Vaughan (@MichaelVaughan) August 19, 2023 -
ఆసీస్ ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో చూడలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
The Ashes, 2023- England vs Australia, 5th Test: యాషెస్ సిరీస్-2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. కంగారూ జట్టు ఇంత బెరుగ్గా, భయం భయంగా బ్యాటింగ్ చేయడం ఎన్నడూ చూడలేదన్నాడు. ఓవల్ మైదానంలో ఆసీస్ ప్రదర్శన చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇప్పటికే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. స్వల్ప ఆధిక్యంలో ఇక బజ్‌బాల్ విధానం పేరిట దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ బృందం.. ఓవల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. హ్యారీ బ్రూక్(85) మెరుగైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో.. బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 295 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఇంత చెత్తగా ఆడటం ఎప్పుడూ చూడలేదు స్టీవ్ స్మిత్ అర్ధ శతకం(71) కారణంగా 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించగలిగింది. ఆచితూచి ఆడుతూ ఈ మేరకు స్కోరు సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ 82 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడంటే కంగారూల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఇంత డిఫెన్సివ్‌గా ఆడటం ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా వాళ్లు దూకుడుగా ఆడతారు. మ్యాచ్ చూసే వాళ్లకు మజా అందిస్తారు. కానీ ఈసారి.. బౌలర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయారు. నేనైతే ఆస్ట్రేలియా ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నిజం.. వాళ్లు గతంలో ఇలా అస్సలు ఆడలేదు’’ అని బీబీసీ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు...
దిగ్గజ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. యాషెస్ సిరీస్-2023లో ఇంగ్లండ్ నష్టపోవడానికి ఆండర్సన్ ప్రధాన కారణమని ఆరోపించాడు. లెజెండ్ బౌలర్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు ఇంగ్లండ్ టీమ్ తగిన మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆండర్సన్ ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఒక్కటంటే ఒక్క కీలక వికెట్ కూడా తీసి జట్టుకు ఉపయోగపడింది లేదని ఫైరయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను ఆండర్సన్‌ను తూర్పారబెట్టిన వాన్.. మరోవైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఆండర్సన్‌ను దిగ్గజ బౌలర్‌గా పరిగణించడాన్ని ఎవరూ కాదనలేరని, జట్టులో చోటుకు అతను వంద శాతం అర్హుడే అని అంటూనే ఆండర్సన్ సేవల వల్ల ఇంగ్లండ్‌కు ఒరిగిందేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బీబీసీ యాషెస్ డైలీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన 4 యాషెస్ టెస్ట్‌ల్లో 3 మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 114 ఓవర్లు వేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. వాన్ చెప్పినట్లు ఆండర్సన్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆండర్సన్ స్థానంలో మరే బౌలర్‌ను తీసుకున్నా ఫలితాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండేవి. నాలుగో టెస్ట్‌లో అయితే ఆండర్సన్ ప్రదర్శన అరంగేట్రం బౌలర్ కంటే దారుణంగా ఉండింది. నాలుగో రోజు ఆండర్సన్ ఏ మాత్రం ప్రభావం చూపించినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకునేది. మొత్తంగా చూస్తే కెరీర్లో సుమారు 1000 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ ప్రస్తుతం జట్టుకు భారంగా మారాడు. ఐదో టెస్ట్‌లో అయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మేల్కొనకపోతే ఇంతకుమించిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ బౌలర్, కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అని ములాజకు పోతే ఐదో టెస్ట్‌లో కూడా ఇంగ్లండ్‌కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఆండర్సన్‌ను పక్కకు పెట్టి ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరిని ఆడించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు యాషెస్‌ను ఈ దఫా కూడా తమ వద్దనే ఉంచుకోనుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్ గెలిచినా సిరీస్ 2-2తో డ్రా అవుతుందే తప్ప ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేదు. -
'ఈ సారి ఫైనల్‌కి రాకపోతే బజ్‌బాల్ దండగే.. కొంచెం తెలివిగా ఆడాలి'
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి చవి చూసిన విషయం విధితమే. టెస్టు క్రికెట్లో "బజ్‌బాల్" అంటూ దూకుడే మంత్రంగా పెట్టుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ గట్టి షాకిచ్చింది. అయితే ఇంగ్లండ్ ఆడుతున్న విధానాన్ని కొంతమంది సమర్థిస్తుంటుంటే మరి కొంత మంది విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌కు తాను ఒక అభిమానినని, కాని యాషెస్ సిరీస్‌లో మాత్రం కొంచెం తెలివిగా ఆడాలని ఇంగ్లండ్ జట్టుకు వాన్ సూచించాడు. కాగా బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లీష్ జట్టు టెస్టుల్లో గొత కొంతకాలంగా అద్బుతంగా రాణిస్తోంది. స్టోక్స్ నేతృత్వంలోని ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. ఇక జూన్ 28న లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "లార్డ్స్ టెస్టులో రెండు జట్లలో కొన్ని మార్పులు కన్పించవచ్చు. అయితే ఆసీస్ మాత్రం తొలి మ్యాచ్ విజయంతో మరింత జోష్‌లో బరిలోకి దిగుతారు. ఆసీస్ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాటర్లకు కాస్త జాగ్రత్తగా ఎదుర్కొవాలి. బజ్‌బాల్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అన్నివేళలా అది సరికాదు. ఆస్ట్రేలియా వంటి జట్టుతో మనం ఆడుతున్నప్పుడు కొంచెం తెలివిగా ఉండాలి. ఆస్ట్రేలియా వెనకడుగు వేసినప్పుడు, దాన్ని మరింత వెనక్కినెట్టే ఎత్తులు కావాలి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆపని చేయలేకపోయింది. రెండు సార్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడంలో ఇంగ్లండ్ విఫలమైంది. ఈ సారి కూడా రల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించకపోతే, బాజ్‌బాల్‌కు అర్దం ఉండదు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: అప్పుడు ధోని బాగా ఫీలయ్యాడు.. కానీ అక్కడ జడ్డూ ఉన్నాడు కదా: సీఎస్కే సీఈవో -
కే ఎల్ రాహుల్ అవుట్...ఎల్ఎస్ జీ లోకి కొత్త ప్లేయర్
-
కోచ్ లు డగౌట్ లో ఉండాలి.. గ్రౌండ్ లో ఏం పని
-
ఎక్కడివాళ్లు అక్కడ ఉండాలి.. మధ్యలో దూరడం ఎందుకు: గౌతీపై ఇంగ్లండ్ దిగ్గజం విమర్శలు
IPL 2023 LSG Vs RCB- #ViratGambhirFight: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదం గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ స్పందించాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమని.. ఇందులో కోచ్‌లు జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించాడు. ఎవరికి అప్పజెప్పిన బాధ్యతలు వాళ్లు సక్రమంగా నెరవేరిస్తే బాగుంటుందని పరోక్షంగా గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు. చర్యకు ప్రతిచర్య లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి- లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది. గత మ్యాచ్‌లో తమ అభిమానులను ఉద్దేశించి గంభీర్ చేసిన సైగలకు కౌంటర్‌గా కోహ్లి లక్నో గ్రౌండ్లో దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సద్దుమణగాల్సింది.. పెద్దదైంది ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్- నవీన్ ఉల్ హక్ మధ్య మొదలైన వివాదం కోహ్లి జోక్యంతో పెద్దదైంది. లక్నోపై విజయం తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లతో కరచాలనం చేస్తున్నపుడు నవీన్- కోహ్లి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో లక్నో ఓపెనర్ కెయిలీ మేయర్స్ కోహ్లితో మాట్లాడుతుండగా.. గంభీర్ ఆపే ప్రయత్నం చేసే క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. కోహ్లి- నవీన్ వార్ కాస్త కోహ్లి వర్సెస్ గంభీర్‌గా మారిపోయింది. దీంతో స్థాయికి తగ్గట్లు హుందాగా ప్రవర్తించకుండా ఇద్దరూ దిగజారిపోయారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొంతమంది కోహ్లికి, మరికొంత మంది గంభీర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్‌లు డగౌట్లో ఉండాలి ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ సైతం స్పందిస్తూ.. ఆటగాళ్ల మధ్య వివాదం తలెత్తితే కోచ్‌లు మధ్యలో దూరిపోవాల్సిన అవసరం లేదంటూ గంభీర్ తీరును విమర్శించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడుతూ.. ‘‘మైదానంలో ఆటగాళ్లు ఒక్కోసారి గొడవ పడటం సహజం. ఆటలో భావోద్వేగాలు కూడా మిళితమై ఉంటాయి. అలా అని ప్రతిరోజూ ఇలాంటి వివాదాలు జరగవు కదా! ఏదేమైనా ఇలాంటివి జరిగినపుడు కోచ్‌లు సంయమనం పాటించాలి. కోచ్‌లు లేదంటే ఇతర సహాయ సిబ్బంది ఆటలో ఎందుకు జోక్యం చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. మధ్యలో దూరి ఇలా మైదానంలో జరిగింది మైదానం వరకే పరిమితం చేయాలి. అంతేగానీ గొడవ పెద్దది చేయాలని చూడకూడదు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. వాళ్లే కాసేపటి తర్వాత సర్దుకుంటారు. అంతేగానీ డగౌట్లో కూర్చోవాల్సిన కోచ్‌లు వెళ్లి మధ్యలో దూరిపోకూడదు. డ్రెస్సింగ్ రూంలో నుంచి గమనిస్తూ పరిస్థితిని గమనించి అందుకు తగ్గట్లు గొడవ చల్లారేలా చేయాలి’’ అని మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు. చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్ నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. -
సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు!
IPL 2023 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అవుటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. మార్ష్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందని.. తొందరపడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెలరేగిన మార్ష్ ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ ఆల్‌రౌండర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ విధించినన 198 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే ఢిల్లీ తమ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయిన వేళ ఫిలిప్ సాల్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 6 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. ఓవైపు సాల్ట్(35 బంతుల్లో 59 పరుగులు).. మరోవైపు మార్ష్ జోరు చూస్తే ఢిల్లీ టార్గెట్‌ను సులువుగానే ఛేదించేట్లు కనబడింది. ఆట కట్టించిన అకీల్ అయితే, సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే సాల్ట్‌ను అద్భుత రీతిలో పెవిలియన్‌కు పంపగా.. కాసేపటికే అకీల్ హొసేన్ మార్ష్ ఆట కట్టించాడు. 14 ఓవర్ మొదటి బంతికి మార్ష్ సిక్సర్ బాదగా.. మరుసటి బంతికే హొసేన్ బదులు తీర్చుకున్నాడు. ఈ విండీస్ బౌలర్ తన స్పిన్ మాయాజాలంతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. హొసేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మార్ష్ బంతిని గాల్లోకి లేపగా.. రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ క్యాచ్ అందుకోవడంతో మార్ష్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. షాట్ ఎంపికలో కాస్త తెలివి ప్రదర్శించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కొంచెం కూడా తెలివి లేదు ‘‘మిచెల్ మార్ష్ మొదటి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి అద్భుతం చేశాడు. రెండో బంతికి కూడా అదే పునరావృతం చేద్దామని భావించాడు. టీ20 ఫార్మాట్లో దూకుడు అవసరమేనన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఇలాంటి షాట్ ఎంపిక చేసుకోవడం తెలివిగల బ్యాటర్ పనైతే కాదు. మిచెల్ ఇంకాస్త క్లెవర్‌గా ఆలోచించి ఉండాల్సింది. అప్పటికే బౌలర్ మీద ఒత్తిడి పెంచగలిగాడు. అలాంటి సమయంలో తదుపరి బంతిపై ఓ అంచనాకు రాగలడు కదా! బంతి కాస్త స్లోగా వచ్చినట్లు అనిపించింది.. కానీ మార్ష్ లెక్క తప్పింది. తొలి బంతిని సిక్సర్ బాదిన అతడు.. మరుసటి బంతికి బౌలర్ విసిరిన సవాలును స్వీకరించకుండా ఉండాల్సింది’’ అని మైకేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కాగా సాల్ట్, మార్ష్ అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ సాగినా 9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. జట్టు ఓడినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..! IPL 2023: పొట్టు పొట్టు కొట్టుకున్న ఢిల్లీ-సన్‌రైజర్స్ అభిమానులు Turning point of the match? Akeal Hosein gets Mitchell Marsh out for 63!#DC require 60 off the final five overs 👊🏻 Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/LCIOKm5O6p — IndianPremierLeague (@IPL) April 29, 2023 -
టీమిండియా ఓపెనర్‌గా గిల్ వద్దు.. అతడే సరైనోడు!
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్‌కు పయనం కానుంది. లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కంటే కేఎల్రాహుల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మైఖల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని ఆఖరి రెండు టెస్టులకు జట్టును తప్పించారు. ఈ క్రమంలో రాహుల్‌కు ఇక టెస్టు భవిష్యత్తు కష్టమనేని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ సెలక్టర్లు రాహుల్‌పై మరోసారి నమ్మకం ఉంచారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో రాహుల్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మైఖల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "శుబ్‌మన్ గిల్ అద్భుతమైన యంగ్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంగ్లండ్ వంటి పరిస్ధితుల్లో గిల్ కంటే రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో నేను కొన్ని లోపాలను గమనించాను. అందుకే గిల్ కంటే రాహుల్ బెటర్ అని భావిస్తున్నాను. కాగా ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే. కాబట్టి పాత చరిత్రను చూడకుండా రాహల్‌కు అవకాశం ఇవ్వండి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలంటే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడం ముఖ్యం. కావలంటే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో మార్పులు చేయవచ్చు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023 PBKS Vs LSG: హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్ -
ఈసారి గెలిచేది ఆ జట్టే! అంతలేదు కేకేఆర్ ఫ్యాన్‌గా చెప్తున్నా ట్రోఫీ సన్‌రైజర్స్‌దే!
IPL 2023 Winner Prediction: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో మార్చి 31న ఐపీఎల్- 2023 ఆరంభం కానుంది. టైటిల్ కోసం పది జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు వినోదం పంచనుంది. మొత్తంగా 74 మ్యాచ్‌లతో వేసవిలో మంచి ఎంటర్టైన్మెంట్ అందించనుంది. ఇక గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అరంగేట్ర జట్టు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మేటి జట్లకు షాకిస్తూ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది. ముంబై, చెన్నై దారుణంగా.. అయితే, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరీ ఘోరంగా పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలవగా.. నాలుగుసార్లు ట్రోఫీ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంతో ముగించింది. ఇక సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రెండోసారి ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి వైఫల్యాలు అధిగమించి మరోసారి సత్తా చాటాలని మాజీ చాంపియన్లు చెన్నై, ముంబై పట్టుదలగా ఉండగా.. మిగిలిన జట్లు సైతం టైటిల్ గెలిచే దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీ వాళ్లదే ఐపీఎల్-2023 విజేతను అంచనా వేస్తూ.. ‘‘ఐపీఎల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆతురతగా ఎదురుచూస్తున్నా... ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్‌దే.. ఈసారి వాళ్లే ట్రోఫీ గెలుస్తారు..’’ అని వాన్ ట్వీట్ చేశాడు. ఇందుకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేకేఆర్ ఫ్యాన్‌గా చెప్తున్నా గెలిచేది సన్‌రైజర్స్! ‘‘రాజస్తాన్ గెలిచే అవకాశం లేదు’’ అని ఓ యూజర్ పేర్కొనగా.. మరో నెటిజన్.. ‘‘నేను కేకేఆర్ అభిమానిని.. అయితే ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నా’’ అని కామెంట్ చేశారు. కాగా మే 28నాటి ఫైనల్‌తో ఐపీఎల్-2023 విజేత ఎవరో తేలనుంది. చదవండి: IPL 2023: వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వారికి మాత్రం కళ్లు చెదిరే మొత్తం.. కోట్లలో.. హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్, కోహ్లి ఫ్యాన్స్ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు? Can’t wait for the IPL to start .. Looking forward to being part of the @cricbuzz team .. I thinks it’s going to be @rajasthanroyals year .. they will be lifting the trophy in late May .. #OnOn #IPL2023 — Michael Vaughan (@MichaelVaughan) March 29, 2023 As a kkr fan I'm saying sunrisers for sure. — Riyaz (@Riyaz06844964) March 29, 2023 -
ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే కాగా మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్–ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే. అసలు ఈ మనిషి కనబడటం లేదే! 2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్ 0–3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్- మైకేల్ వాన్ మధ్య ఓ రేంజ్లో ట్విటర్ వార్ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు. వైరల్ ట్వీట్ ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్‌కు కౌంటర్ వేశాడు. ‘లాంగ్ టైమ్ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్ అంటూ వసీం జాఫర్‌ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక బంగ్లా- ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్ (36 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... నజ్ముల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? Hello @MichaelVaughan, long time no see 😏 #BANvENG pic.twitter.com/3nimzfuHOw — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2023 -
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్.. దిగ్గజాలను సైతం అబ్బురపరిచేలా
క్రికెట్లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకొని మళ్లీ బౌండరీ లోపలికి విసిరి అందుకోవడం చూస్తున్నాం. ఇలాంటి క్యాచ్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. జిల్లా క్రికెట్ క్లబ్లో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌలర్ ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని బ్యాటర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ ఇక్కడే ఒక ఊహించని అద్బుతం జరిగింది. ఆ ఏముందిలే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకొని ఉంటాడులే అనుకుంటే పొరబడ్డట్లే. బౌండరీ అవతలకి వెళ్లి బంతిని అందుకున్న ఫీల్డర్.. ఇక్కడే తన ఫుట్‌బాల్ విన్యాసం చూపించాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పట్టుతప్పి బౌండరీ లైన్ మీదకు జారిపడతానని భావించిన ఫీల్డర్.. బంతిని గాల్లోకి విసిరేసి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వ్యాలీ కిక్‌ను కొట్టాడు. అంతే బంతి మరో ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం.. అతను సేఫ్‌గా అందుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సదరు ఫీల్డర్ చేసిన విన్యాసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ''ఫుట్‌బాల్ తెలిసిన ఆటగాడిని క్రికెట్లోకి తీసుకొస్తే ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్.. ''నిజంగా ఇది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్'' అంటూ అభివర్ణించాడు. ఇక కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్.. ''నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్..'' అంటూ పొగడ్తలు కురిపించాడు. It doesn't matter what the rules say. You've got to give this out for the pure AUDACITY 🤯😂 Sent in by Kiran Tarlekar pic.twitter.com/pquwsLc5YC — Cricket District (@cricketdistrict) February 12, 2023 This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg — Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023 Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B — Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023 Absolutely outstanding 👌👌😂 https://t.co/Im77ogdGQB — Jimmy Neesham (@JimmyNeesh) February 12, 2023 చదవండి: Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్ ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని -
కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది?
Steve Smith- Sussex Deal: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ససెక్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లలో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ససెక్స్ క్రికెట్ హెడ్ పాల్ ఫాబ్రేస్తో మాట్లాడానని, కౌంటీల్లో ఆడనుండటం నిజమేనని ధ్రువీకరించాడు. అందుకే ఈ నిర్ణయం తనకు ఇదో సరికొత్త అనుభవమన్న స్మిత్.. యువ క్రికెటర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడం ద్వారా వాళ్లను మెంటార్ చేసే అవకాశం కూడా వస్తుందని, ఇది తనకు సంతృప్తినిస్తుందని స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు. మండిపడుతున్న అభిమానులు కాగా ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సన్నాహకాల్లో భాగంగా స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్మిత్ కౌంటీల్లో ఆడటంపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడికి ఈ అవకాశం ఇచ్చిన ససెక్స్ జట్టును ద్రోహులుగా అభివర్ణిస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడించడం ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. తప్పేముందన్న మాజీ సారథి అయితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ వాన్ భిన్నంగా స్పందించాడు. స్మిత్ కౌంటీల్లో ఆడటాన్ని అతడు స్వాగతించాడు. స్మిత్ వంటి మేటి టెస్టు క్రికెటర్లు ససెక్స్ డ్రెస్సింగ్‌రూంలో ఉండటం.. యువ ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతుందని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్.. మైకేల్ వ్యాఖ్యలతో ఏకీభవించినప్పటికీ.. యాషెస్ సిరీస్(డిసెంబరులో)కు ముందు ఇలాంటి నిర్ణయం సరికాదని పెదవి విరిచాడు. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Great signing for our game … Well done 👍👍 https://t.co/Qs2iqrBARy — Michael Vaughan (@MichaelVaughan) January 19, 2023 -
టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..!
ODI World Cup 2023: టీమిండియాపై తరుచూ అవాక్కులు చవాక్కులు పేలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022లో తన జట్టు విజేతగా నిలవడంతో కళ్లు నెత్తికి ఎక్కి, భారత జట్టుపై తన నోటి దూలను మరోసారి ప్రదర్శించాడు. సందర్భంతో పని లేకుండా తరుచూ టీమిండియాపై, జట్టులోకి ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో గెలుపు మదంతో కొట్టుకుంటూ టీమిండియాను అవమానకర రితీలో చులకన చేసి మాట్లాడాడు. భారత్ వేదికగా వచ్చే ఏడాది (2023) జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్టు ఏదనే అంశంపై ఇంగ్లీష్ దినపత్రిక టెలిగ్రాఫ్‌కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో టీమిండియాను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఫేవరెట్ జట్టు మాత్రం కాలేదని, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కే ఆ ట్యాగ్ తగిలించుకునే అర్హత ఉందని గొప్పలు పోయాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియాకు ఫేవరెట్ అనిపించుకునే అర్హత లేదని, ఇదంతా నాన్సెన్స్ అని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెట్ అంటే అస్సలు ఒప్పుకోనని, వరల్డ్‌కప్ ఎక్కడ జరిగినా ఫేవరెట్ జట్టుగా ఇంగ్లండే ఉంటుందని గర్వంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా లాంటి పేస్ అనుకూలమైన పిచ్‌లపైనే సత్తా చాటి వరల్డ్‌కప్ నెగ్గిన తమకు భారత పిచ్‌లపై రాణించి వరల్డ్‌కప్ గెలవడం పెద్ద విషయం కాదని అన్నాడు. స్వదేశంలో ఆడుతుంది కాబట్టి టీమిండియానే ఫేవరెట్ అని ఎవరైన అంటే, వారితో ఏకీభవించేది లేదని తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఏకైక ఫేవరెట్ అయిన ఇంగ్లండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకుని మెగా ఈవెంట్లలో జైత్రయాత్ర కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా బీసీసీఐపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నేనే ఇండియన్ క్రికెట్‌కు బాస్‌ను అయితే, అహంకారాన్ని తగ్గించుకుని ఇంగ్లండ్ విన్నింగ్ మోడల్‌ను స్పూర్తిగా తీసుకుని ఫాలో అవుతానని అన్నాడు. మేజర్ టోర్నీల్లో టీమిండియా గెలవాలంటే బీసీసీఐ.. ఇంగ్లండ్‌ను ఫాలో అవ్వాలని సూచించాడు. వాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలకు కౌంటర్లిస్తూ.. తగు రీతిలో స్పందిస్తున్నారు. వీడి నోటి దూలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది, వరల్డ్‌కప్ గెలుపుతో వీడి నోటికి తాళం వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి వెదవ చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చదవండి: 'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి' -
మైకెల్ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో గ్రూఫ్-1లో ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఇంగ్లండ్ కొంపముంచింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి చేయాల్సినదానికంటే ఐదు పరుగులు తక్కువగా ఉండడంతో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కోల్డ్‌వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫన్నీవేలో కామెంట్స్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ విజయం సాధించాకా.. జాఫర్ వాన్‌ను ఉద్దేశించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు ఐర్లాండ్.. ఇంకొకరు ఇంగ్లండ్. ఇంతలో వీరి మధ్యకు ట్రిమ్మర్ తీసుకొని ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు డక్‌వర్త్ లూయిస్(డీఎల్ఎస్). మ్యాచ్‌కు వర్షం ఎలా అయితే అంతరాయం కలిగించిందో.. అచ్చం అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా ఫైట్ చేసుకుంటున్న సందర్భంలో సదరు డీఎల్ ఇంగ్లండ్‌కు సపోర్ట్ చేద్దామనుకుంటున్నాడు. కానీ చివర్లో ఫలితం తారుమారు కావడంతో ఇంగ్లండ్ వ్యక్తికే జట్టు తీసేస్తాడు. ఇక చివర్లో మ్యాచ్ సమ్మరీ ఇదే అంటూ క్యాప్షన్ జత చేసి మైకెల్ వాన్ ట్యాగ్‌ను జత చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా' -
ODI Cricket: వన్డే క్రికెట్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు.. ఒకవేళ అదే జరిగితే..
Ravichandran Ashwin: వన్డే క్రికెట్ ఇటీవలి కాలంలో ఎలాంటి కొత్త తరహా మార్పులు చూపించకుండా టి20లకు కొనసాగింపుగానే కనిపిస్తోందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఒకవేళ ఇదే కొనసాగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించాడు. రెండు ఎండ్‌లనుంచి రెండు కొత్త బంతులను కాకుండా ఒకే బంతిని వాడితే రివర్స్ స్వింగ్ సాధ్యమవుతుందన్న అశ్విన్.. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపిస్తే వన్డేల్లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతూకం ఉండి ఆసక్తికరంగా మారతాయని సూచించాడు. ఇక టీ20 మ్యాచ్‌కు కొనసాగింపుగా అన్నట్లు వన్డే మ్యాచ్ సాగితే.. అందులో ఉన్న మజా పోతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో అశ్విన్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో జట్టు వెంటే ఉన్న అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా మెరుగైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఇక వన్డే ఫార్మాట్లో 151 వికెట్లు పడగొట్టిన అశూ.. టెస్టుల్లో 442 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
కోహ్లికి మూడు నెలల విశ్రాంతి అవసరం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్టులోనూ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ టెస్టుల్లో అతడు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో కోహ్లి ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కోహ్లి ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్ధితుల్లో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోహ్లిని మైఖేల్ వాన్ సూచించాడు. "ఐపీఎల్ తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అతడికి మరింత ఎక్కువ విశ్రాంతి అవసరం. అతడు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి, తన ఫ్యామిలీతో గడపాలని నేను భావిస్తున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి తన ఫామ్‌ను తిరిగి పొందగలడు" అని మైఖేల్ వాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs ENG 1stT20: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత్ గెలవడం కష్టమే..! -
Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం!
India Vs England 5th Test: ‘‘257 పరుగుల ఆధిక్యం అంటే కాస్త కష్టమే! లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ జట్టు చాలా కష్టపడాలి’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియా మరో 150 పరుగులు చేస్తే అప్పుడు కొండంత లక్ష్యం ఆతిథ్య జట్టు ముందు ఉంటుందని.. స్టోక్స్ బృందానికి తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా సేన 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్ స్టో(106 పరుగులు) మినహా ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. The glorious summer of Jonny Bairstow 😍 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/Ycl8Odq8ur — England Cricket (@englandcricket) July 3, 2022 పుజారా పట్టుదల! ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ గిల్ విఫలమైనా.. మరో ఓపెనర్ ఛతేశ్వర్ పుజారా అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత్. దీంతో పర్యాటక జట్టుకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ టీమిండియా నయా వాల్ పుజారా ఆడిన తీరు అమోఘమని ప్రశంసించిన వాన్.. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారని పెదవి విరిచాడు. An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 మైకేల్ వాన్(ఫైల్ ఫొటో) టీమిండియాదే విజయం! ‘‘ఇలాంటి పిచ్ వాతావరణ పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి 139 బంతులు ఎదుర్కొని 50 పరుగులు(నాటౌట్) చేయడం అంత సులభమేమీ కాదు. నిలకడగా రాణిస్తూ ముందుకు సాగిన విధానం అమోఘం. పుజారా, పంత్ వంటి ఆటగాళ్లు ఉంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. వాళ్లిద్దరూ ఒక్కసారి పైచేయి సాధించారంటే అంతే సంగతులు. ఇప్పుడు 257 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈజీగా మరో 150 పరుగులు చేస్తుంది. అప్పుడు టార్గెట్ ఇంచుమించు 400. మిగిలింది రెండ్రోజుల ఆట. ఇంగ్లండ్ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియానే విజయం వరిస్తుందని జోస్యం చెప్పాడు. చదవండి: Ind Vs Eng 5th Test: వాళ్లేమో అదరగొడుతున్నారు.. వీళ్లేమో ఇలా.. ఛాన్స్ ఇస్తే జట్టులో పాతుకుపోవాలి! కానీ.. IND VS Northamptonshire: హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం -
మళ్లీ మొదలైన రగడ.. వాన్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన వసీం జాఫర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ల మధ్య ట్విటర్ వార్ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్ చేసిన ఓ ట్వీట్‌కు వాన్ కౌంటర్ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్ కౌంటర్ ట్వీట్‌ను జాఫర్ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్ వార్ పతాక స్థాయికి చేరింది. జాఫర్-వాన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ క్రికెట్ ఫాలోవర్స్‌కు కావాల్సిన మజాను అందిస్తుంది. జాఫర్-వాన్ల మధ్య వార్ ఎక్కడ మొదలైందంటే.. జాఫర్ జూన్ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై వాన్ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్ వికెట్ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్ తనదైన స్టైల్లో వాన్‌పై కౌంటర్ అటాక్ చేశాడు. Sun is shining, the weather is sweet @HomeOfCricket 😊 pic.twitter.com/ImwcAS5YYh — Wasim Jaffer (@WasimJaffer14) June 20, 2022 2007 ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్ వాన్‌కు ఇచ్చిన ఈ స్ట్రోక్ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. Is it the 20th anniversary of my first Test wicket you are here for Wasim ? https://t.co/7Ul5Jw62ra — Michael Vaughan (@MichaelVaughan) June 20, 2022 Here for the 15th anniversary of this Michael 😄 #ENGvIND https://t.co/Qae4t8IRpf pic.twitter.com/gZC5ShGNwS — Wasim Jaffer (@WasimJaffer14) June 21, 2022 కాగా, ఇంగ్లండ్‌లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్ టెస్ట్‌లో మైఖేల్ వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ విజయం సాధిస్తుంది. చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్ -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
'అది ఒక విచిత్రమైన కెప్టెన్సీ'.. రిషభ్ పంత్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు
ఐపీఎల్-2022లో గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన కుల్ధీప్.. 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్ధీప్ను తన నాలుగు ఓవర్ల కోటాను పంత్ పూర్తి చేయించలేదు. కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు.అదే సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ గా ఉన్న లలిత్ యాదవ్ తో పంత్ మూడు ఓవర్లు వెయించాడు. మూడు ఓవర్లు వేసిన లలిత్ యాదవ్ 32 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పంత్ వ్యూహాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసంతృప్తి వక్య్తం చేశాడు. "ఇది ఒక విచిత్రమైన కెప్టెన్సీ. మూడు ఓవర్లలో కుల్ధీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అటువంటి బౌలర్‌తో పూర్తి కోటాను ఎందకు వేయంచలేదో నాకు అర్ధం కావడం లేదు" అని వాన్ ట్విటర్లో పేర్కొన్నాడు. మరో వైపు మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్ కుల్ధీప్తో నాలుగు ఓవర్లు పూర్తి చేయించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కుల్దీప్తో ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేయంచాలని అనుకున్నాను. అయితే అప్పటికే మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే పేసర్లు తీసుకువచ్చాను. అయినప్పటికీ భారీగా పరుగులు వచ్చాయి అని పంత్ పేర్కొన్నాడు.] చదవండి: Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా -
'అతడు ఎక్స్‌ప్రెస్ బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు'
ఐపీఎల్-2022లో సన్‌రైజెర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్లో ఉమ్రాన్ గంటకు 145 కి.మీ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మాలిక్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రశంసించాడు. ఈ ఎక్స్‌ప్రెస్ పేసర్ త్వరలో భారత్ జట్టు తరఫున ఆడతాడని వాన్ జోస్యం చెప్పాడు. " ఉమ్రాన్ మాలిక్ త్వరలో టీమిండియా తరపున ఆడడం ఖాయం. ఈ వేసవిలో అతడిని కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ పంపాలి. కౌంటీల్లో అతడు తన స్కిల్స్‌ను మరింత పెంపొందించుకునే అవకాశం ఉంది అని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఉమ్రాన్ కేవలం మూడు వికెట్లు పడగొట్టనప్పటికీ.. అతడు తన పేస్‌తో బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఏప్రిల్ 11న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న మాథ్యూ వేడ్ వికెట్‌ను మాలిక్ సాధించాడు. కాగా గతేడాది సీజన్లో నటరాజన్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ తన స్థానాన్నిసుస్థిరం చేసుకున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు మాలిక్‌ను రూ.4 కోట్లకు ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకుంది. చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ బౌలర్ -
మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు
Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్‌కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. England 120 all out! What happened @MichaelVaughan was this Extras guy unavailable due to IPL or what? 😜 #WIvENG #IPL2022 pic.twitter.com/lSetnPSif5— Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2022 ఈ ట్వీట్లో జాఫర్ ఇంగ్లండ్‌ను టార్గెట్ చేస్తూ వాన్‌కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్‌ట్రాలు 412) షేర్ చేస్తూ.. ఇంగ్లండ్ 120 ఆలౌట్! ఏమైంది వాన్..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్లో ట్వీట్ (పంచ్) చేశాడు. Wasim .. At the moment we are focusing on the Womens World Cup semis .. !!! 😜😜 https://t.co/ubwxORXKBU— Michael Vaughan (@MichaelVaughan) March 27, 2022 దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్ వెంటనే మరో కౌంటరిస్తూ.. With just 1 win in last 17 Tests, not surprised you have given up on the men's team Michael 😜 #WIvENG #IPL2022 https://t.co/xXNO71RmeR— Wasim Jaffer (@WasimJaffer14) March 28, 2022 రూట్ సేన గత 17 టెస్ట్‌ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను, 0-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
నువ్వొక చెత్త కెప్టెన్‌వి.. వేస్ట్.. ఇంకా ఎందుకు? దయచేసి దిగిపో!
West Indies Vs England Test Series- Fans Trolls Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాల్సిన సమయం వచ్చిందంటూ ఇంగ్లండ్ మాజీ సారథులు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇదేం కెప్టెన్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం(4-0), ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఓటమి నేపథ్యంలో రూట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులు డ్రా కాగా... నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మరోసారి ఇంగ్లండ్‌కు చేదు అనుభవం మిగిలింది. ఇక యాషెస్ సహా గత ఐదు సిరీస్‌లలో ఇంగ్లండ్‌కు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆడిన 17 మ్యాచ్‌లతో కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైఖేల్ వాన్ తదితరులు రూట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ జట్టు అభిమానులు సైతం రూట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వొక చెత్త కెప్టెన్‌వి. వేస్ట్.. చాలు ఇంక.. దయచేసి కెప్టెన్ పదవి నుంచి దిగిపో! మరీ ఇంత దారుణ ప్రదర్శనా!? అస్సలు ఊహించలేదు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్! మొదటి తప్పిదం కాబట్టి.. World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 -
ప్రియతమా.. నేనొచ్చేశా.. నువ్వు సూపర్ భయ్యా.. కౌంటర్ అదిరింది!
Ashes Series: England Lost Series To Australia 4-0: యాషెస్ సిరీస్ 2021-22లో ఘోర పరాభవం మూటగట్టుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక ట్రోఫీని 4-0 తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అద్భుత పోరాటంతో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా.. ఆఖరి టెస్టులో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక అప్రదిష్ట పాలైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ట్రోల్ చేశాడు. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటమి నేపథ్యంలో వాన్ స్పందించిన తీరుకు మరోసారి తాజాగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘హెలో మైకేల్... యాషెస్ ఏమైంది’’ అంటూ బాలీవుడ్ మూవీకి సంబంధించిన మీమ్ షేర్ చేశాడు. ‘‘నేనొచ్చేశాను ప్రియతమా’’ అన్న క్యాప్షన్‌తో సరదాగా ట్రోల్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన మైకేల్ వాన్... శుభ సాయంత్రం వసీం...!! నిజంగా ఇదొక సుదీర్ఘమైన రోజు’’ అని బదులిచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా అభిమానులు వసీం జాఫర్ ట్వీట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మంచి కౌంటర్ ఇచ్చావు భయ్యా.. నువ్వు సూపర్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత జట్టు పరాభవాన్ని ఉటంకిస్తూ.. వసీంను ట్యాగ్ చేస్తూ మైకేల్ వాన్ వ్యంగ్య రీతిలో ట్వీట్ చేశాడు. Evening Wasim .. !! It’s been a long day … https://t.co/PUYVdr4nKC — Michael Vaughan (@MichaelVaughan) January 16, 2022 A famous first-class debut and now celebrating a 4-0 #Ashes win - Cameron Green will have some fond memories of Bellerive Oval! @alintaenergy pic.twitter.com/L9X40oSU4p — cricket.com.au (@cricketcomau) January 17, 2022 -
Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి కూడా!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాన్ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్.. భారత కెప్టెన్ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది. నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
Ind Vs Sa: నువ్వు బాగానే ఉన్నావా... మీకంటే ముందే ఉన్నాం.. ఇచ్చిపడేశాడుగా!
సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు... మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ప్రొటిస్‌ను స్వదేశంలో ఓడించడం వీలుపడలేదు... ఒక్కటంటే ఒక్కటి .. ఈ ఒక్కటి గెలిస్తే చాలు ప్రపంచాన్నే గెలిచినట్లు అవుతుందనే కల కలగానే మిగిలిపోయింది. మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమితో కోహ్లి సేనకు చేదు అనుభవమే మిగిలింది. ముఖ్యంగా మనకు ప్రధాన బలంగా భావించే బ్యాటింగ్‌లో వైఫల్యం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది! అవకాశం దొరికితే చాలు... భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కడం అతడికి అలవాటే కదా! ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌లో ఓటమిపాలు కావడంతో మరోసారి టీజ్ చేశాడు మైకేల్ వాన్. అతడికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఉద్దేశించి తనదైన వ్యంగ్య రీతిలో ట్వీటాడు. ‘‘శుభ సాయంత్రం వసీం జాఫర్!! నువ్వు బాగానే ఉన్నావా’’ అంటూ టీజ్ చేశాడు. మరి... వసీం జాఫర్ ఊరుకుంటాడా.. ఎప్పటిలాగే మాంచిగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చిపడేశాడు. ‘‘అంతా బాగానే ఉంది మైకేల్... మర్చిపోకు... మేము మీకంటే ఇంకా 2-1 తేడాతో ముందే ఉన్నాము’’ అంటూ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. కాగా గతేడాది సెప్టెంబరులో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్ రెండింట నెగ్గి 2-1 తేడాతో ముందంజలో ఉంది. భారత శిబిరంలో కరోనా కలకలం కారణంగా ఆఖరి టెస్టు రద్దుకాగా... ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..! The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦 Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj — Cricket South Africa (@OfficialCSA) January 14, 2022 Haha all good Michael, don't forget we are still leading you 2-1 😆 https://t.co/vjPxot43mF — Wasim Jaffer (@WasimJaffer14) January 14, 2022 -
92 పరుగులకే ఆలౌట్ అవుతారా! 68కి కూడా మైఖేల్.. అదిరిపోయే కౌంటర్!
Wasim Jaffer Trolls Michael Vaughan: యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్.. ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ముఖ్యంగా మూడో టెస్టులో పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆసీస్ అరంగేట్ర బౌలర్ స్కాట్ బోలాండ్ ధాటికి నిలవలేక ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌట్ అయి అప్రదిష్టను మూటగట్టుకుంది ఇంగ్లండ్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ఏంటీ.. 100 లోపే జట్టు ఆలౌట్ అవుతుందా అంటూ గతంలో వాగన్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశాడు. కాగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ చేతిలో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరును విమర్శిస్తూ... ‘‘92కే ఇండియా ఆలౌట్... ఈరోజుల్లో కూడా ఏదేని జట్టు 100 లోపు పరుగులకే ఇలా చేతులెత్తేస్తుందంటే నమ్మకం కలగడం లేదు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పరాభవాన్ని గుర్తుచేస్తూ వసీం జాఫర్ ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అయింది మైఖేల్ వాన్ అంటూ ట్రోల్ చేశాడు. ఇందుకు స్పందించిన మైఖేల్.. ‘‘వెరీ గుడ్ వసీం’’ అంటూ ఫన్నీ ఎమోజీలను జతచేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్ ఏకపక్ష విజయాలు సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: Ind vs Sa ODI Series: టీమిండియాకు ఎదురుదెబ్బ... వాళ్లిద్దరూ డౌటే.. రుతు, అయ్యర్, షారుఖ్‌కు బంపరాఫర్! -
మైఖేల్ వాన్‌పై నిషేధం..!
Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్లో ప్రసారమయ్యే "ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాన్ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: యార్క్‌షైర్ కౌంటీపై వేటు -
భారత ఆటగాళ్లను ఫారిన్ లీగ్‌లలో ఆడనివ్వాలి.. అప్పుడే: మైకేల్ వాన్
Michael Vaughan Comments On Team India Players: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతున్నాయి. కోహ్లి సేన తమ స్థాయికి తగ్గట్లుగా ఆడినట్లు ఎక్కడా కనిపించలేదని, ఒత్తిడిలో పూర్తిగా చిత్తై పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్.. భారత జట్టును ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో దారుణంగా విఫలమవుతుందన్నాడు. వినడానికి కష్టంగా ఉన్నా.. ఇదే నిజమని చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్ వాన్ సూచించాడు. తద్వారా వివిధ పిచ్‌లపై సమర్థవంతంగా ఎలా ఆడాలన్న విషయంపై అవగాహన, అనుభవం వస్తుందని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం.. ‘ఒక్కసారి ఓడినందుకు ఇంతలా విమర్శించాల్సిన పనిలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గెలుపోటములు సహజం’’ అని మైకేల్‌కు బదులిస్తున్నారు. కాగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. చదవండి: Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్’ వైరల్ India should take a leaf out of all other countries … Allow their players to play in other leagues around the World to gain experience … #India #T20WorldCup — Michael Vaughan (@MichaelVaughan) October 31, 2021 -
T20 WC: ఇంగ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్.. మైకేల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్ ఏంది?!
Wasim Jaffer Trolls Michael Vaughan Tweet Goes Viral: టీమిండియాతో మ్యాచ్ అనగానే వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉంటాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ముఖ్యంగా ఈ ఏడాది ఇంగ్లండ్.. భారత్‌లో పర్యటించిన సమయంలో పిచ్‌ల గురించి సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలిచాడు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... మైకేల్‌కు ధీటుగా బదులివ్వడంలో ముందు వరుసలో ఉంటాడు. వీరిద్దరి మధ్య ట్విటర్ వార్ అంటే నెటిజన్లకు కూడా ఆసక్తి మరి!! తాజాగా వసీం జాఫర్.. మైకేల్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సోమవారం వార్మప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో.. కోహ్లి సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఒకటి, షమీకి మూడు, రాహుల్ చహర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(51), ఇషాన్ కిషన్(70) శుభారంభం అందించారు. ఇక ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.... కెప్టెన్ కోహ్లి 11, వికెట్ కీపర్ రిషభ్ పంత్ 29(నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(12 నాటౌట్)పరుగులు చేశారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ విజయంలో మూడు ముఖ్య విషయాలు. కేఎల్, ఇషాన్ బ్యాట్‌తో.. బూమ్(బుమ్రా), అశ్(అశ్విన్), షమీ బాల్‌తో ఆకట్టుకున్నారు. ఇక మూడోది.. మైకేల్ వాన్ ఆఫ్‌లైన్‌లో ఉండటం’’ అంటూ వసీం జాఫర్ ట్రోల్ చేశాడు. నెటిజన్ల నుంచి ఇందుకు భారీ స్పందన వస్తోంది. వందల సంఖ్యలో రీట్వీట్లు చేస్తూ వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ సాగిన విధానంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 3 things stood out in this win: 1: KL and Ishan with the bat. 2: Boom, Ash & Shami with the ball. 3: @MichaelVaughan staying offline😜#INDvENG #T20WorldCup — Wasim Jaffer (@WasimJaffer14) October 18, 2021 -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్‌లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్‌తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
Michael Vaughan: ఆర్సీబీ ఓడిపోవడమే మంచిదైంది.. అసలు..
Michael Vaughan Lashes Out At RCB Management: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు తీసుకున్న నిర్ణయాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి వారికి ఒక విధంగా మంచే చేసిందన్నాడు. ఇప్పటికైనా... లోపాలు సరిదిద్దుకోవాలని సూచించాడు. కాగా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ, ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టు సన్‌రైజర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విలియమ్సన్ సేన 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో... పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకుని పటిష్ట స్థితిలో ఉండాలనుకున్న కోహ్లి సేనకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ... ఆర్సీబీ తీరును తప్పుబట్టాడు. ముఖ్యంగా హిట్టర్ డివిల్లియర్స్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమేంటని విమర్శించాడు. ఈ మేరకు... ‘‘ఓడిపోవడం ఆర్సీబీకి మంచిదైంది. ఇప్పటికైనా వారి బ్యాటింగ్ ఆర్డర్ మరీ అంత గొప్పగా ఏమీ లేదని తెలిసి వచ్చింది. డాన్ క్రిస్టియన్(డానియల్ క్రిస్టియన్)ను మూడో స్థానంలో అస్సలు బ్యాటింగ్‌కు పంపకూడదు. 35 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అది అస్సలు సరికాదు. 60 బంతుల్లో సెంచరీ చేయగల సమర్థుడు తను. తనను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపితే.. మ్యాచ్‌ను గెలిపించేవాడు. గ్లెన్ మాక్స్వెల్ మూడో స్థానంలో, డివిల్లియర్స్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. స్కోర్లు: హైదరాబాద్: 141/7 (20) బెంగళూరు: 137/6 (20) చదవండి: Umran Malik: అతడు ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు... -
అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Michael Vaughan comments on Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా అసలు సిసలైన టీ20 ఆటగాడని అతడు కితాబు ఇచ్చాడు. "రవీంద్ర జడేజా అత్యుత్తమమైన ఆటగాడు. మూడు విభాగాల్లో రాణించే సత్తాఉంది.అతడు అద్భుతమైన ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌల్ చేయగలడు. ఎటువంటి పిచ్‌పై అయిన బాల్‌తో మ్యాచ్ తిప్పగలడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో జట్టు వికెట్లు కోల్పోయినట్లయితే అతడు కీలక పాత్రను పోషించగలడు. అందుకే అతడు టీ20 క్రికెటర్లలో అధ్బుతమైన ఆటగాడు. మీరు ఒక టీ 20 క్రికెటర్ని తయారు చేస్తే.. క్రిస్ గేల్‌ను, విరాట్ కోహ్లిలను ఆదర్శంగా చూపిస్తారు. కానీ ఇప్పటినుంచి రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకోవాలి" అని మైఖల్ వాన్ క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రవీంద్ర జడేజా అధ్బుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 లో జడేజా ఇప్పటి వరకు 212 పరుగులు,10 వికెట్లు సాధించాడు. జడేజా అనేక సందర్భాల్లో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా చెన్నైకు విజయాలను అందించాడు. టోర్నమెంట్ తొలి దశలో హర్షల్ పటేల్ ఓవర్లో జడేజా ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. సెకెండ్ఫేజ్లో కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేసి మ్యాచ్ ఫినిషర్‌గా నిలిచాడు. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే..
Dhoni As Team India Mentor Is Greatest Decision Says Vaughan: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని.. అపార క్రికెట్ పరిజ్ఞానం కలిగిన ఆటగాడని, ఆ చాణక్య బుర్ర అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ధోని లాంటి దిగ్గజం జట్టుతో కలిసి డ్రెసింగ్ రూమ్‌లో ఉండటం అదనపు బలమని పేర్కొన్నాడు. టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని, టీమిండియాకు ధోని చాణక్య బుర్ర తోడైతే టీ20 ప్రపంచకప్ తప్పక గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను అంచనా వేయడంలో ధోని మాస్టర్ అని, జట్టు మైదానంలో ఉన్న సమయంలో మహీ లాంటి వ్యూహకర్త డగౌట్లో ఉంటే అంతకు మించిన సౌలభ్యం మరొకటి ఉండదని అన్నాడు. ధోని వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అవుతాయని, త్వరలో జరుగబోయే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న భారత్‌కు ఇది తప్పక మేలు చేస్తుందని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ రెండో దశలో ధోని నేతృత్వంలో సీఎస్కే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజైత్రయాత్రలో జట్టు కెప్టెన్ ధోనిదే కీలకపాత్ర. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ధోనీ తన చాకచక్య నిర్ణయాలతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. అంతకుముందు ఆర్సీబీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో సైతం ధోని తన చాణక్య బుర్రను ఉపయోగించి జట్టును గెలిపించాడు. ఫలితంగా పాయింట్ల పట్టికలో సీఎస్కే(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: మోర్గాన్‌లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని.. -
మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా!
Michael Vaughan Comments On Natarajan Tests Covid Positive: ఐపీఎల్ 2021 ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలు ముందు హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ సహా మరో ఐదుగురు సహాయ సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఘాటు వాఖ్యలు చేశాడు. ‘చివరి టెస్ట్ రద్దు చేసుకున్నట్లు ఐపీఎల్‌ను కూడా రద్దు చేసుకుంటారా?... అలా చేయరని నేను హామీ ఇస్తా...’ అంటూ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా శిబిరంలో కరోనా కరోనా కేసులు నమోదు కావడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఐదో టెస్ట్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: IPL 2021 2nd Phase DC VS SRH: నటరాజన్‌కు కరోనా.. అయినా మ్యాచ్ యథాతథం -
టీమిండియాను ట్రోల్ చేసిన వాన్.. పీటర్సన్ కౌంటర్
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ మరోసారి టీమిండియాను ట్రోల్ చేశాడు. ఐదో టెస్టు రద్దు నేపథ్యంలో వాన్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో టీమిండియా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు నష్టం కలిగించింది. ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల ఈసీబీ భారీగా నష్టపోతుంది. సరిగ్గా గతేడాది దక్షిణాఫ్రికాతో ఇదే రీతిలో మేం సిరీస్‌ను రద్దు చేసుకున్నాం. మాకు శాపం తగిలినట్టుంది'' అంటూ గుర్తు చేశాడు. అయితే వాన్ వ్యాఖ్యలపై మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియాకు మద్దతిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ''ఇది ఊహించని పరిణామం. ఇందులో టీమిండియా తప్పు ఎక్కడుంది. గతంలో కరోనా కారణంగానే ఈసీబీ దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకుంది. మరి దక్షిణాఫ్రికా బోర్డు కూడా చాలా నష్టపోయింది. ప్రతీ విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ ఇక కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు అయిన సంగతి తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ India have let English Cricket down !!! But England did let South African Cricket down !!! — Michael Vaughan (@MichaelVaughan) September 10, 2021 England left the tour of SA for Covid scares & cost CSA plenty, so don’t go pointing fingers! 👀 — Kevin Pietersen🦏 (@KP24) September 10, 2021 -
హింట్ ఇచ్చావుగా కోహ్లి; ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట!
Michael Vaughan on Virat Kohli’s Trumpet celebration: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ఏకంగా 157 పరుగుల తేడాతో విజయం సాధించడం, అది కూడా 50 ఏళ్ల తర్వాత ఓవల్ గడ్డపై మ్యాచ్ గెలవడం ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది. అయితే, గతంలోనూ కోహ్లి ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఈసారి ఇంగ్లండ్ జట్టు ఫ్యాన్ బార్మీ ఆర్మీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫాక్స్ స్పోర్ట్స్ కోహ్లి సంబరాన్ని ‘క్లాస్లెస్’ అని అభివర్ణించడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది. అంతేకాదు.. క్రికెట్ రైటర్ లారెన్స్ బూత్, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ రిక్ కాంప్టన్ సైతం.. ‘‘అంత అవసరం లేదు. కోహ్లి స్థాయికి ఇది తగదు’’ అంటూ విమర్శించారు. అయితే, ఎల్లపుడూ టామ్ అండ్ జెర్రీలా ట్విటర్ వార్ సాగించే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ విషయంలో మాత్రం ఒకే తరహాలో స్పందించడం విశేషం. చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్ కోహ్లి సెలబ్రేషన్స్‌పై స్పందించిన వసీం జాఫర్..‘‘కెప్టెన్ ధైర్యవంతుడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌కు జీవం పోసి.. చారిత్రాత్మక విజయం సాధించిన విరాట్ కోహ్లి జట్టును ప్రపంచమంతా కొనియాడుతోంది. నీకైతే ఇది ఫిక్స్ అయిపోయింది’’ అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇక మైకేల్ వాన్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి గొప్ప నాయకుడు. ట్రంపెట్ వాయిస్తున్నట్లుగా సంజ్ఞలు చేయడం ద్వారా బార్మీ ఆర్మీని సరదాగా టీజ్ చేశాడంతే. నాకు తన ఆటిట్యూట్ చాలా నచ్చింది. ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు. మాస్టర్‌క్లాస్ టెక్నిక్, ప్రణాళికాబద్దమైన వ్యూహాలతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు’’ అని కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే.. బార్మీ ఆర్మీ సైతం కోహ్లి సెలబ్రేషన్‌పై తనదైన శైలిలో స్పందించింది. ‘‘నువ్వు కూడా మా ఆర్మీలో చేరాలని కోరుకుంటున్నావని మాకు అర్థమైంది విరాట్. మాకు హింట్ ఇచ్చావుగా..’’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. చదవండి: Shikhar Dhawan Divorce: విడాకులు తీసుకున్న టాప్-4 జంటలు -
టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ సారధి..
లండన్: టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి క్రికెట్ అభిమానులచే చివాట్లు తింటున్నా తీరు మార్చుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖత మైఖేల్ వాన్.. తాజాగా మరోసారి కోహ్లి సేనపై తన అక్కసును వెల్లగక్కాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్, ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్, షేన్ వార్న్, గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు కోహ్లి సేనను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు. In Test cricket .. not White ball cricket 👍 https://t.co/t5M3HQTB1c — Michael Vaughan (@MichaelVaughan) September 6, 2021 వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన అనంతరం టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించడంలో ఉందని, ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలని ట్వీటాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి తనకు మాత్రమే సొంతమైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. గంగూలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు. దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్.. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కోహ్లి సేన స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందంటూ ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. అయితే వాన్ ఇలాంటి కామెంట్లు చేసిన ప్రతిసారి టీమిండియా రెట్టింపు కసితో ఆడి విజయాలు సాధిస్తూ వస్తుంది. చదవండి: భూగ్రహం మొత్తంలో టీమిండియా కెప్టెన్‌కు మించినోడే లేడు: షేన్ వార్న్ -
పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్ పోయింది: వాన్
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ పుజారాపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. '' పుజారా తన ఆటతీరును పూర్తిగా మరిచిపోయాడు. సముద్రంలో మునిగిన నావలా అన్న చందంగా పుజారా పరిస్థితి తయారైంది. అతనికి మైండ్ పోవడంతో పాటు తన మార్క్ టెక్నిక్ షాట్లను మరిచిపోయాడు. ఆటలో స్కోరు నమోదు చేయడం కంటే మ్యాచ్‌లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ ఒత్తిడిలో కూరుకుపోయి అతను తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తున్నాడు.'' అంటూ కామెంట్స్ చేశాడు. 2020 నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా సగటు 25కు తక్కువగా ఉండడం గమనార్హం. ఇక 11 ఇన్నింగ్స్‌ల నుంచి పుజారా అర్థసెంచరీ నమోదు చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారా అర్థశతకం సాధించాడు. ఆ తర్వాత వరుసగా 15, 21, 7, 0, 17, 8,15,4,12 నాటౌట్, 9, 45 పరుగులు చేశాడు. ఇక అండర్సన్ టెస్టుల్లో పుజారాను ఔట్ చేయడం ఇది పదోసారి. అండర్సన్‌తో పాటు నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) కూడా పుజారాను 10 సార్లు ఔట్ చేశాడు. పాట్ కమిన్స్ ఏడుసార్లు, జోష్ హాజిల్‌వుడ్ 6 సార్లు, ట్రెంట్ బౌల్ట్ 5 సార్లు, జాక్ లీచ్ 4 సార్లు, బెన్ స్టోక్స్ 4 సార్లు, స్టువర్ట్ బ్రాడ్ 4 సార్లు పుజారాను ఔట్ చేశారు. ఇక మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్ స్కోరర్ కాగా, అండర్సన్ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), హమీద్ (60 బ్యాటింగ్; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: ENG Vs IND 3rd Test: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు -
ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..?
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ బుమ్రాను టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ పేసర్లు అతిగా(వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని) ప్రవర్తించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో క్రికెట్ విలువలకు తూట్లు పొడిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను ఆ జట్టు కోచ్ సిల్వర్ వుడ్ మందలించకపోవడంపై మండిపడ్డాడు. మైదానంలో కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుందని పేర్కొన్నాడు. డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సిందని తెలిపాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే, నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఇలాగే సందేశాలు పంపేవాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ఓటమికి కోచ్ సిల్వర్‌వుడ్ బాధ్యత లేమి మరో కారణమని ఆరోపించాడు. ఏదిఏమైనా బుమ్రాను టార్గెట్ చేసి మ్యాచ్‌ను గాలికొదిలేసిన రూట్ సేన తగిన మూల్యమే చెల్లించుకుందన్నాడు. ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసిన వాన్.. బుమ్రా విషయంలో ఇంగ్లండ్ అతి ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు 20 నిమిషాల ఆటనే(బుమ్రాను టార్గెట్ చేయడం) ఇంగ్లండ్ కొంపముంచిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్.. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నాడు. దీన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కోచ్ సహా ఇంగ్లండ్ బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడని ప్రశంశించిన వాన్.. భారత్ బృందాన్ని ఆకాశానికెత్తాడు. కాగా, లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఈనెల 25న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. చదవండి: మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి.. -
3-1 తేడాతో టీమిండియా గెలుస్తుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
లండన్: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినపుడు పిచ్‌లపై తన వైఖరి వెల్లడిస్తూ ట్రోలింగ్ బారిన పడ్డాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ముఖ్యంగా చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌ల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ టీమిండియా సామర్థ్యంపై సెటైర్లు వేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ప్రస్తుతం భారత్ టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మైకేల్ వాన్.. ఈసారి మాత్రం సిరీస్ టీమిండియాదే అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయం చెప్పడానికి తానుఇష్టపడనప్పటికీ... ప్రస్తుత బలబలాల ఆధారంగా భారత జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిప్రాయాలు, అంచనాలు కొన్నిసార్లు నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ ఓడిపోయింది. ప్రస్తుత సిరీస్‌లో ఈసారి టీమిండియాదే విజయం. వాళ్లకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రెండుసార్లు చేరువగా వచ్చినా ఓడిపోయారు. ఇప్పుడు స్టోక్స్ లాంటి కీలక ఆటగాడు లేకుండానే ఇంగ్లండ్ పోటీలోకి దిగనుంది. తను లేకుండా బాలెన్స్ చేయడం కష్టం. ఆల్రౌండర్లేని కారణంగా ఓ బ్యాటర్, బౌలర్‌ని మిస్ అవుతారు. కాబట్టి జో రూట్ సేనకు కష్టమే. ఆగష్టు, సెప్టెంబరులో స్పిన్ మాయాజాలమే పనిచేస్తుంది. కాబట్టి ఈ విషయం చెప్పడానికి నేను ద్వేషిస్తున్నా.. అయినా 3-1తేడాతో టీమిండియా తప్పక ఈ సిరీస్ గెలుస్తుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా తాను మానసిక ఆందోళనకు గురవుతున్న సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జాఫర్ బాయ్.. 'నీకు అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?'
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఫన్నీ ట్రోల్ చేశాడు. జాఫర్ గురువారం ఒడిశా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. 2021- 2023 మధ్య కాలంలో రెండేళ్లపాటు జాఫర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాన్ ట్విటర్ వేదికగా జాఫర్‌ను ట్రోల్ చేశాడు. '' జాఫర్ బాయ్‌కి అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?.. ఒకవేళ అసిస్టెంట్ అవసరం ఉంటే పిలువు.. నేను వెంటనే వచ్చేస్తా'' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వాన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు భారత్, ఇంగ్లండ్ సిరీస్ సమయంలో జాఫర్, వాన్ల మధ్య ట్విటర్లో చాలాసార్లే మాటలయుద్ధం జరిగింది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపింది. టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు యూకే డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పంత్‌తో పాటు జట్టు ట్రైనింగ్ అసిస్టెంట్/ నెట్ బౌలర్ అయిన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. గరానితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 10 రోజుల పాటు తమ హోటల్ గదుల్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. Does he need an assistant 😜😜 https://t.co/he2g0eKBFs — Michael Vaughan (@MichaelVaughan) July 15, 2021 -
అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే: మైకేల్ వాన్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. సన్నద్ధలేమికి తోడు రొటేషన్ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ ఇంగ్లండ్ జట్టుల శ్రీలంకను 2-0 తేడాతో ఓడించింది. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది.. గతేడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించింది. అదే విధంగా ఇండియాకు వెళ్లింది.. అద్భుతమైన ప్రతిభా పాటవాలతో తొలి టెస్టులో గెలుపొందింది. జో రూట్ డబుల్ సెంచరీ చేశాడు. కానీ మూడు రోజుల తర్వాత రొటేటింగ్ పద్ధతి కారణంగా పరిస్థితులు మారిపోయాయి. నిజంగా ఇది చాలా తప్పు. అదే విధంగా.. ఇంగ్లండ్ నలుగురు సీమర్లు, ఒకే ఒక స్పిన్నర్‌తో ఆడటం సరైన నిర్ణయం కాదు’’ అని గత సిరీస్‌లో ఇంగ్లండ్ ఆడిన తీరును విమర్శించాడు. ఇక ఇటీవల న్యూజిలాండ్‌కు సిరీస్ సమర్పించుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘లార్డ్స్‌లో తొలి టెస్టుకు వారం ముందు నుంచే డ్రైగా ఉంది. అయినా ఒక్క స్పిన్నర్ లేడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా అంతే. స్పిన్నర్ లేకుండానే మైదానంలో దిగారు. తప్పులు పునరావృతం చేశారు’’ అని వాన్ చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతం బట్లర్, స్టోక్స్, వోక్స్ ఫాంలోకి వచ్చారని, వాళ్ల రాకతో జట్టు బలం పెరుగుతుందన్న మైకేల్ వాన్.. బ్యాట్స్‌మెన్ గనుక విఫలమైతే భారత్‌ను ఓడించడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ -
వర్షం వల్ల టీమిండియా బతికిపోయింది; మీరైతే కళ్లప్పగించి చూడండి!
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి సెషన్ రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి టీమిండియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వాతావరణం కారణంగా భారత జట్టు బతికిపోయిందంటూ సెటైర్లు వేశాడు. ఇక ఇందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో మరోసారి వాన్‌కు చురకలు అంటించాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్న సమయంలో మిగతా జట్లు.. ఇదిగో ఇలా కళ్లప్పగించి చూస్తూ ఉంటాయి’’ అంటూ లగాన్ సినిమాలోకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో హీరో ఆమిర్ ఖాన్ తన బృందంతో పొదల మాటు నుంచి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ‘‘టీమిండియా- న్యూజిలాండ్ ఫైనల్ చేరితే.. నీ జట్టు ఇంగ్లండ్ మాత్రం కనీసం తుది వరకు పోరాడలేకపోయింది. ఇరు జట్లకు సిరీస్ సమర్పించుకుని వెనుకపడింది’’ అన్న ఉద్దేశంతో వసీం జాఫర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా వర్షం కారణంగా భారత్- కివీస్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఫైనల్ మ్యాచ్ ఆలస్యమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియాపై కామెంట్లు చేస్తూ మైకేల్ వాన్‌కు ఇటీవల పలుమార్లు ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌పై వాన్ తీవ్ర విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఈ నెలలో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత.. ‘‘హైక్లాస్ కివీస్ టీం.. వచ్చే వారంలో ఇండియాను ఓడిస్తుంది’’ అని జోస్యం చెప్పాడు. ఇందుకు వసీం జాఫర్ బదులిస్తూ.. ‘‘నీ పని అయిపోయింది. ఇక వెళ్లు’’అంటూ ఫన్నీ మీమ్‌తో కౌంటర్ ఇచ్చాడు. Meanwhile rest of the teams watching the #WTCFinals #iykyk 😜 https://t.co/MchOGlM2Ja pic.twitter.com/JBbMJcr1fU — Wasim Jaffer (@WasimJaffer14) June 18, 2021 -
WTC Final: ‘టీమిండియా ఓడిపోతుంది; నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’!
సౌతాంప్టన్: టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య ట్విటర్ వార్ భలే సరదాగా ఉంటుంది. వీరిద్దరు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై వివాదాస్సద వ్యాఖ్యలతో ముఖ్యంగా టీమిండియాను టార్గెట్ చేస్తూ.. వాన్ సోషల్ మీడియాను ఆకర్షిస్తే.. వాటికి దీటుగా తనదైన శైలిలో వ్యంగ్యాత్మక ధోరణిలో పంచ్‌లు వేస్తూ వసీం జాఫర్ ఫ్యాన్స్ మనసు చూరగొంటాడు. ఇక నాలుగు రోజుల్లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం కానున్న నేపథ్యంలో మరోసారి వీరి కౌంటర్ అటాక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో సిరీస్ నెగ్గి, 1999 తర్వాత మరోసారి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయంపై స్పందించిన మైఖేల్ వాన్.. ‘‘న్యూజిలాండ్ హైక్లాస్ టీం.. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని.. బ్యాట్‌తో.. బంతితో అదరగొడతారు... వాళ్లు కచ్చితంగా వచ్చే వారంలో టీమిండియాను ఓడిస్తారు’’అంటూ కివీస్‌ను ప్రశంసిస్తూనే భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. ఇక ఇందుకు స్పందించిన వసీం జాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్.. ‘‘నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’’ అంటూ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మీమ్ షేర్ చేసి కౌంటర్ వేశాడు. ఈ క్రమంలో..‘‘ఇంగ్లండ్ ఓటమిని కూడా వాన్ ఇలా కవర్ చేసేశాడు.. కానీ మీరు సూపర్ జాఫర్ భాయ్ అదరగొట్టేశారు.. వాన్‌కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారంటూ భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇరుజట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. #WTCFinals https://t.co/ixeBDMfAmV pic.twitter.com/Q0nZQU3WvU — Wasim Jaffer (@WasimJaffer14) June 13, 2021 చదవండి: WTC FInal: ‘కోహ్లి క్రేజ్ అలాంటిది మరి.. జాన్ సీన మద్దతు భారత్‌కే’! -
'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు'
ఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా కనిపిస్తాడు. తాజాగా తనకిష్టమైన గుర్రంతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నా 22 ఎకరాలు ఎంటర్టైనర్ ఇదే.. ఇది నా బెస్ట్ ఫ్రెండ్.. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. నా జీవితాంతం ఆ బంధం అలాగే కొనసాగుతుంది. అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే జడేజా పెట్టిన పోస్టుపై నెటిజన్లు బాగానే స్పందించగా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కూడా స్పందించడం విశేషం. జడేజా షేర్ చేసిన ఫోటోను లైక్ చేసి మూడు హార్ట్ ఎమోజీలను పెట్టాడు. అయితే వాన్ జడేజా పోస్టుపై స్పందించడానికి ఒక కారణం ఉందని అతను 22 అనే పదం ఇంకా మరిచిపోలేదని .. అందుకే జడేజా పోస్టెపై స్పందించాడంటూ కామోంట్లు చేశారు. కాగా మైకెల్ వాన్ ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఎదో ఒక దానిపై విమర్శలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి రెండు టెస్టులకు వాన్ చేసిన అతి ఎవరు మరిచిపోరు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టు డై నైట్ పద్దతిలో నిర్వహించగా.. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలుగో టెస్టుకు 22 గజాల పిచ్‌ను ఎలా రూపొందిస్తున్నారో చూడండి అంటూ రకరకాల పోస్టులతో రెచ్చిపోయాడు. ఒకసారి పొలం దున్నుతూ పిచ్‌ను తయారు చేస్తున్నట్లుగా.. మరొకసారి అదే పిచ్‌పై బ్యాటింగ్ ఎలా ఉండబోతుందో వివరించాడు. వాన్ చేసిన అతికి అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సిరీస్‌లో టీమిండియా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మినహా మిగిలిన వాటిని గెలిచి 3-1తేడాతో సిరీస్ గెలుచుకుంది. కాగా జడేజా ఆసీస్ పర్యటనలో గాయపడడంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ 14వ సీజన్లో ఆడిన జడేజా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి జడేజా ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. చదవండి: 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్' మొటేరా పిచ్ ఎలా తయారవుతుందో చూడండి! View this post on Instagram A post shared by Ravindra jadeja (@ravindra.jadeja) -
ఏనుగు బ్యాటింగ్‌కు ఫిదా.. వారికంటే బాగా ఆడుతుందే..!
లండన్: ఐపీఎల్లో ఆటగాళ్ల బ్యాటింగ్ చూడకపోతే ఏం..ఈ ఏనుగు బ్యాటింగ్ చూడండి అంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు జట్లలోని 9 మంది క్రికెట్లరకు కరోనా సోకడంతో ఐపీఎల్ రద్దు చేస్తూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఐపీఎల్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.ఈ క్రమంలో మైకేల్ వాన్ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రేమ్ అనే నెటిజన్ ఏనుగు బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీరెప్పుడైనా ఏనుగు క్రికెట్ ఆడడం చూశారా? చూడండి నేషనల్ ప్లేయర్స్ కంటే ఈ ఏనుగే బాగా ఆడుతుందని పోస్ట్ లో పేర్కొన్నాడు. అయితే ఆ పోస్ట్ ను ఇంగ్లండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ షేర్ చేస్తూ.. అవును నిజమే! నేషనల్ ప్లేయర్స్ కంటే ఇదే బాగా అడుతుంది. తప్పకుండా ఇంగ్లండ్ పాస్ పోర్ట్ ఇప్పిస్తాం అని రీట్వీట్ చేశారు. అయితే, ఆ వీడియోలో ఓ ఏనుగు బ్యాటింగ్ చేస్తుంటే, దాని యజమాని బౌలింగ్ చేస్తున్నాడు. యజమాని బాల్ ఎలా వేసినా ఏనుగు మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నెటిజన్లని కట్టిపడేస్తుంది. కాగా, వాఘన్ వీడియోలపై 'పిచ్ సరిగా లేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దానిపై ఆడలేరు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తుంటే.. ఏనుగు బ్యాటింగే దెబ్బకు ఐపీఎల్ పనికిరాదు క్రికెట్ బాగా ఆడుతుందంటూ మరో నెటిజన్ వేశాడు. Surely the Elephant has an English passport !! https://t.co/scXx7CIZPr — Michael Vaughan (@MichaelVaughan) May 8, 2021 చదవండి: IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! -
వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి
లండన్: ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోవచ్చుగానీ.. విదేశీ ఆటగాళ్లు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లలో ఆసీస్‌కే చెందినవారు ఎక్కువగా ఉన్నారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్, వోక్స్, జోస్ బట్లర్‌తో పాటు విండీస్ క్రికెటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్‌లోలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఆస్ట్రేలియా ఏప్రిల్ 15వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. యూకే కూడా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది. ఏప్రిల్ 22 నుంచి ఆ దేశం మీదుగా ఒక్క విమానం కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.' బీసీసీఐ తీసుకున్న ఐపీఎల్ రద్దు అనే నిర్ణయం ప్రస్తుతం సున్నిత అంశంగా కనిపిస్తుంది. బయోబబూల్‌లో ఉంటూ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తున్నా.. కరోనా మహమ్మారి ఐపీఎల్‌లోకి కూడా ఎంటరైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం సరైనదే. అయితే లీగ్ రద్దు వల్ల స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోయినా.. విదేశీ ఆటగాళ్లకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. భారత్ నుంచి విదేశాలకు విమానాల రాకపోకల నిషేధం కొనసాగుతుండడంతో ఏం చేయలేని పరిస్థితి. ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యమని.. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపే బాధ్యత మాది అని బీసీసీఐ చెబుతుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అని చెప్పుకొచ్చాడు. మరో మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ట్విటర్లో స్పందించాడు. '' బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. పటిష్టమైన బయోబబుల్‌లోకి కరోనా మహమ్మారి వచ్చేసింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది కూడా కరోనా బారీన పడ్డారు. లీగ్ ఇలాగే కొనసాగితే కేసులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని నియంత్రించేందుకే బీసీసీఐ ఐపీఎల్ రద్దు నిర్ణయం తీసుకుంది. కరోనా ఉదృతి తగ్గాకా మళ్లీ ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంటుందేమో' అని ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. చదవండి: 'ఐపీఎల్ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది' అయోమయంలో ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి..! Seems a very sensible decision to postpone the IPL .. Now cases have started to appear inside the bubble they had no other option .. Hope everyone stays safe in India and all the overseas players can find a way back to there families .. #IPL2021 — Michael Vaughan (@MichaelVaughan) May 4, 2021 In view of the COVID crisis in India and with players testing positive, the postponement of IPL with immediate effect is the correct course of action taken by @BCCI and the IPL governing council. Hope to see IPL back soon in better & safe environment.#IPL2021 #IndiaFightsCOVID19 — Mohammed Azharuddin (@azharflicks) May 4, 2021 -
అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్‌కు ఎలా వచ్చారు?
లండన్: ఒకవైపు కరోనా వైరస్ భయపెడుతున్నా ఐపీఎల్ విజయవంతంగా పూర్తి కావడానికి ఎటువంటి ఇబ్బందుల ఉండకపోవచ్చని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కొంతమంది విదేశీ క్రికెటర్లు ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నా ఐపీఎల్‌కు ఆటంకాలు ఉండకపోవచ్చన్నాడు. భారత్‌లో కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ద్వారా ప్రజలకు మంచి వినోదం లభిస్తుందన్నాడు. ఇది చాలా కష్టకాలమనే విషయం అందరికీ తెలిసినా ఐపీఎల్ బయోబబుల్ వాతావరణంలో సేఫ్‌గా జరుగుతూ అభిమానుల్లో మంచి జోష్‌ను నింపుతుందన్నాడు. ఇంకా దాదాపు ఏడువారాల పాటు ఇదే ఊపుతో ఐపీఎల్ సాగుతుందనే తాను ఆశిస్తున్నట్లు వాన్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోతున్న ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లపై వాన్ సెటైర్లు వేశాడు. గతంలో దక్షిణాఫ్రికాలో భయంకరమైన పరిస్థితులున్నాయని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి విముఖత చూపిన ఆసీస్, ఇంగ్లండ్ జట్ల క్రికెటర్లు.. భారత్‌లో ఐపీఎల్ ట్రేడింగ్‌కు ఎలా వచ్చారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఈ విషయంపై తాను ఎంతగా ఆలోచించినా అది కష్టంగానే ఉందన్నాడు. కాగా, ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్.. మే 30వ తేదీ వరకూ జరుగనుంది. ఇంకా సుమారు ఏడువారాలు పాటు ఐపీఎల్ సాగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ విజయాలు సాధించిన జట్ల పరంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ధోని అండ్ గ్యాంగ్.. నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఇక సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపు అందుకుని ఆఖరి స్థానంలో ఉంది. పేలవమైన ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇక్కడ చదవండి: భయపడొద్దు.. జాగ్రత్తగా పంపే బాధ్యత మాది: బీసీసీఐ మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి -
ధోని మూడేళ్లు ఉంటాడేమో.. తన వారసుడు అతడే!
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. కెప్టెన్‌గా ధోని వారసుడు జడ్డూనే అని, అతడిని కేంద్రంగా చేసుకుని చుట్టూ జట్టును నిర్మించాలని సీఎస్కే ఫ్రాంఛైజీకి సూచించాడు. ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా మైదానంలో మెరుపులాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న జడేజా, భారత్‌లో అత్యుత్తమ ఫీల్డర్ అంటూ వాన్ ఇటీవల కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాకుండాభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో రవీంద్ర జడేజాకు ‘ఎ+’ గ్రేడ్ ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుబడుతూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఇక, తాజాగా.. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించిన అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడిన వాన్.. జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మైండ్‌సెట్ సూపర్బ్ ‘‘నిజాయితీగా మాట్లాడుకుంటే, ధోని.. బహుశా.. మరో 2 నుంచి మూడేళ్లు ఆడతాడు అనుకోవచ్చు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నా అభిప్రాయం ప్రకారం జడేజా నేతృత్వంలో సీఎస్కే జట్టును తయారు చేసుకోవాలి. జడేజా మంచి క్రికెటర్. బంతితో రాణించగలడు. బ్యాట్‌తో మెప్పించగలడు. ఫీల్డింగ్పరంగా చూస్తే మైదానంలో చురుగ్గా కదలగలడు. తన మైండ్‌సెట్, మెంటాలిటీ సూపర్బ్. జడేజా ఎలాంటి ఆటగాడు అంటే.. ‘‘నాలుగు లేదా ఐదు, లేదంటే అంతకంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగినా, తనతోనే బౌలింగ్ ఓపెనింగ్ చేయించినా, ఫీల్డ్‌లో అతిముఖ్యమైన స్థానాల్లో సెట్ చేసినా.. అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. తను చాలా మంచి క్రికెటర్’’ అంటూ వాన్, జడ్డూను ఆకాశానికెత్తేశాడు. కాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, జడేజా రెండు కీలక వికెట్లు తీయడమే గాకుండా, 4 క్యాచ్‌లు పట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వైరల్: జడ్డూ.. నువ్వు వెరీ గుడ్డూ.. అంతేగా! అలా అయితే ధోని సేనదే టైటిల్: బ్రియన్ లారా -
‘రసెల్‌పై ఓ లుక్కేయండి.. ఇలా అయితే మీకే కష్టం’
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(31; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ జట్ట తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచినా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గతంలో రసెల్ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యంగా ఉండే కేకేఆర్.. ఇప్పుడు అతని ఆటపై పూర్తి నమ్మకం ఉంచలేకపోతోంది. నిన్నటి మ్యాచ్‌లో 19 ఓవర్లో కేవలం ఒక్క పరుగే తీశాడు అది కూడా చివరి బంతికి సింగిల్ తీసి అతనే స్టైకింగ్ ఉంచుకున్నాడు. డబుల్స్ తీసే అవకాశం ఉన్నా రసెల్ కనీసం ప్రయత్నించకపోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. ప్రస్తుతం రసెల్ శారీరక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నాడని, ఎంతో విలువైన ఆటగాడు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడకపోతే ఆ ప్రభావం చివర్లో కనిపిస్తుందని వాన్ చురకలంటించాడు. ‘ రసెల్ పూర్తి ఫిట్నెస్తో లేడని విషయం క్లియర్‌గా తెలుస్తుంది. అతని ఫిట్నెస్ లెవెల్స్ చాలా కిందిస్థాయిలో ఉన్నాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు వంగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. బాల్ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఫీట్‌ను ఉపయోగిస్తున్నాడు. అదే సమయంలో డబుల్స్ తీసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆండ్రీ రసెల్ వంటి సూపర్ స్టార్ ఇలా అన్‌ఫిట్‌గా ఉండటం ఆ జట్టుకు సరికొత్త తలనొప్పే. ఇలా అయితే కెప్టెన్ మోర్గాన్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌లకు జట్టును ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారడం ఖాయం’ అని వాన్ అభిప్రాయపడ్డాడు. ఆరంభంలో శిఖర్ ధవన్(92) మెరుపులకు, ఆఖర్లో స్టోయినిస్(13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్ తోడవ్వడంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు సునాయాస విజయాన్ని సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి 14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు! సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి -
‘జడేజాను మరచిపోయారా.. ఇది చాలా అవమానకరం’
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో రవీంద్ర జడేజాకు ‘ఎ+’ గ్రేడ్ ఇవ్వకపోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. రవీంద్ర జడేజా చాలాకాలంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడని, అటువంటి సందర్భంలో ‘ఎ+’ గ్రేడ్‌లో అతన్ని ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించాడు. జడేజాను ‘ఎ+’ గ్రేడ్‌లో తీసుకోవడానికి చర్చలు జరిపినా, చివరకు అతనికి దాన్ని కేటాయించకపోవడాన్ని వాన్ తప్పుబట్టాడు. ఒక కీలక ఆటగాడ్ని ఎందుకు ‘ఎ+’ కేటగిరీలో చేర్చలేదని ప్రశ్నించాడు. వార్షిక కాంట్రాక్ట్‌ల్లో జడేజాకు సరైన స్థానం ఇవ్వకపోవడం నిజంగానే అవమానకరమన్నాడు. భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లి తర్వాత అతనే ‘ఎ+’ కేటగిరీకి అన్ని విధాల అర్హుడని వాన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ‘ఎ+’ కేటగిరీలో కొనసాగుతున్నారు. అందులో కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. కాగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు గ్రేడ్ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్ లభించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్ ‘ఎ’ ప్లస్’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు. ఇక్కడ చదవండి: సాహోరే చహర్ బ్రదర్స్.. ఇద్దరూ సేమ్ టూ సేమ్ నువ్వు మంచి బౌలర్‌వి భాయ్, కానీ నెక్ట్స్ మ్యాచ్ ఆడకు’ -
నాకైతే ఫీల్డ్‌లో 11 మంది జడ్డూలు కావాలి: చహర్
ముంబై: ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తనూ ఒకడు. నా బౌలింగ్‌లో ఎన్నో క్యాచ్‌లు అందుకున్నాడు. నాకైతే మైదానంలో 11 మంది జడ్డూలు ఉంటే బాగుండు అనిపిస్తుంది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ సహచర ఆటగాడు రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ స్థానంలో గనుక జడ్డూ భాయ్ ఉంటే, తొలి ఓవర్లోనే గేల్ వికెట్ లభించేదని అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ తమ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చహర్ (4/13)కు ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డు లభించింది. అయితే, ఈ మ్యాచ్‌లో చహర్ వికెట్లతో రాణిస్తే రవీంద్ర జడేజా తన మెరుపులాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా మూడో ఓవర్లో కేఎల్ రాహుల్‌ను రనౌట్ చేసిన విధానం, ఆ తర్వాత చహర్ బౌలింగ్(ఐదో ఓవర్)లో క్రిస్ గేల్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించడం పట్ల ఫిదా అవుతున్నారు. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను అవుట్ చేయడంలో జడ్డూ ప్రధాన పాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చహర్ మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించాడు. కాగా తొలి ఓవర్లో చహర్ వేసిన బంతిని గేల్ షాట్ ఆడగా, గాల్లోకి లేచిన బంతిని రుతురాజ్ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం..‘‘ ఇండియాలోని అత్యుత్తమ ఫీల్డర్ తను. ఇదే నిజం’’ అంటూ రవీంద్ర జడేజాను ఆకాశానికెత్తాడు. India’s greatest ever fielder .. @imjadeja .. #Fact — Michael Vaughan (@MichaelVaughan) April 16, 2021 The name is Ravindra Jadeja ! 🔥❣️@imjadeja jaddu 💛#CSKvsPBKS pic.twitter.com/oFSqacnSId — vellamanasυ🎭 ˢʳᵉᵉʳᵃᵐ࿐ (@sreeramvellaman) April 16, 2021 చదవండి: సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ అదరగొట్టిన చహర్: 4–1–13–4 స్కోర్లు: పంజాబ్ కింగ్స్ 106/8 (20) చెన్నై సూపర్ కింగ్స్ 107/4 (15.4) -
బట్లర్‌తో ఎందుకు ఓపెనింగ్ చేయించలేదు.. ఏమనుకుంటున్నారు?
ముంబై: వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ సేవలను సరిగా వినియోగించుకోలేపోయారని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ రాజస్తాన్ రాయల్స్ తీరును విమర్శించాడు. అపార అనుభవం కలిగిన బట్లర్‌కు కీపింగ్ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించాడు. అదే విధంగా అతడిని మిడిల్ ఆర్డర్లో ఆడించడం పట్ల కూడా పెదవి విరిచాడు. కాగా ఐపీఎల్ -2021 సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. తద్వారా విజయంతో బోణీ కొట్టింది. ఇదిలా ఉండగా, అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ(119) చేసి విజయానికి చేరవవుతున్న సమయంలో అవుట్ కావడంతో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘జోస్ బట్లర్ వంటి అద్భుతమైన అనుభవం గల ఆటగాడు ఉండగా, అతడిని ఎందుకు కీపర్ స్థానంలో తీసుకోలేదు. అంతేకాదు అతడితో ఎందుకు ఓపెనింగ్ చేయించలేదు!!!! అసలు మీరేం ఆలోచిస్తున్నారు’’ అంటూ రాజస్తాన్ జట్టు తీరుపై విమర్శలు గుప్పించాడు. కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ సామ్సన్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగగా, బెన్‌స్టోక్స్, మనన్ వోహ్రా ఓపెనింగ్ చేశారు. స్టోక్స్ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరగగా, వోహ్రా కేవలం 12 పరుగులు చేశాడు. ఇక జోస్ బట్లర్ 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గత రెండు సీజన్లలో ఆర్ఆర్ తరఫున ఓపెనింగ్ చేసిన బట్లర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ తరఫున అతడు టీ20ల్లో ఓపెనింగ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. Having @josbuttler behind the stumps for his tactical experience is crucial ... Why isn’t he keeping @rajasthanroyals !???? #IPL2021 — Michael Vaughan (@MichaelVaughan) April 12, 2021 And now @josbuttler doesn’t Open !!!!!!!!!! What are you thinking @rajasthanroyals !!!!! #IPL — Michael Vaughan (@MichaelVaughan) April 12, 2021 చదవండి: ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం -
ముందు ఇంగ్లండ్‌కు అడ్మిషన్లు ఇవ్వు.. ఆ తర్వాత మాట్లాడు
పుణె: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు టీమిండియా ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అభిమానుల ఆగ్రహానికి గురికావడం ఇటీవల పరిపాటిగా మారింది. టెస్టు సిరీస్ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌పై వాన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, భారత జట్టు ఓడిన ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. రెండో వన్డేలో భారత్ ఓడిపోగానే, కోహ్లి కెప్టెన్సీని విమర్శించాడు. ఇక తాజాగా, ఆఖరి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడిచిన తీరుపై మరోసారి సెటైర్లు వేశాడు. ‘‘అమ్మో నాకు భయం వేస్తోంది. భారత జట్టు కోసం ఈవారంలో మళ్లీ నా ఫీల్డింగ్ అకాడమీ తెరవాలేమో’’ అని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించాడు. దీంతో, టీమిండియా అభిమానులు వాన్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘‘ముందు నీ జట్టును జాగ్రత్తగా ఇంటికి బయల్దేరమని చెప్పు. ఇంకో విషయం.. మా వాళ్ల గురించి నీకేం బెంగ అక్కర్లేదు. ముందుకు మీ ఇంగ్లండ్ క్రికెటర్లకు నీ అకాడమీలో అడ్మిషన్లు ఇవ్వు. ఎందుకంటే, పేరుకు ప్రపంచ చాంపియన్.. అయినా సిరీస్‌ను చేజార్చుకున్నారు. మూడు ఫార్మాట్లలో కనీసం ఒక్కటైనా గెలిచారు. పైగా మా జట్టు గురించి మాట్లాడుతున్నావా’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మూడో వన్డేలో గెలుపుపై కోహ్లి సేన ధీమాగా ఉన్న సమయంలో ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా, సామ్ కరన్ ఇచ్చిన క్యాచ్‌ను నటరాజన్ డ్రాప్ చేశారు. అయితే, అదే సమయంలో.. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపుతిప్పాయి. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్(పదకొండో ఓవర్లో), ఆదిల్ రషీద్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి ఒడిసిపట్టిన విధానం ముచ్చటగొలిపింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆటలో కొన్ని తప్పిదాలు సహజమని, వాటిని భూతద్దంలో చూడటమే తప్ప, అద్భుతంగా రాణించిన విధానాన్ని ప్రశంసించలేవా అంటూ అభిమానులు వాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. చదవండి: ఆ క్యాచ్ హైలెట్.. ఒకవేళ అవి జారవిడవకుండా ఉంటే..! ధోని లేకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాడు: వాన్ I am afraid my fielding academy is open again this week for all the Indian Team !!! 😜😜😜 #INDvENG — Michael Vaughan (@MichaelVaughan) March 28, 2021 -
ధోని లేకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాడు: వాన్
పుణే: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని జట్టులో లేకపోవడంతోనే కుల్దీప్ యాదవ్ విఫలమవుతున్నాడంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ''కుల్దీప్ రెండేళ్లుగా ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు ధోనీ వికెట్ల వెనుక నుంచి అతనికి సహకరిస్తున్నప్పుడు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసేవాడు. కానీ.. గత రెండేళ్ల నుంచి అతని బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అతను విసిరే స్లో గూగ్లీలు వర్క్‌వుట్ కావడం లేదు. అతని బౌలింగ్‌లో పస తగ్గిపోవడంతో ప్రత్యర్థి బ్యాట్స్మన్లు సులువుగా ఎదుర్కొంటున్నారు.ధోనీ లేకపోవడంతోనే కుల్దీప్ బౌలింగ్‌లో వైవిధ్యం దెబ్బతింది. దాంతో.. టచ్ కోల్పోయాడని'' మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కనిపించిన కుల్దీప్ యాదవ్.. ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ కనీసం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన కుల్దీప్ దారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏమాత్రం వేరియేషనల్ లేని అతని బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదేశాడు. రెండో వన్డేలో అతని కారణంగానే ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో.. మూడో వన్డేలో అతనిపై వేటు పడడంతో అతని స్థానంలో నటరాజన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. చదవండి: వైరల్: ఆ వేలు ఎవరికి చూపించావు..శార్దూల్ IPL 2021: ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసేనా -
కోహ్లి... పూర్ కెప్టెన్సీ; ఇలా అయితే వరల్డ్ కప్‌లో..
పుణె: ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్ట్రో, బెన్‌స్టోక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ టీమిండియాకు చేదు ఫలితాన్ని మిగిల్చింది. మంచి స్కోరు సాధించి పర్యాటక జట్టుకు భారీ లక్ష్యం విధించామన్న సంతోషం లేకుండా చేసింది. రెండో వన్డేలో 337 పరుగుల టార్గెట్ కాపాడుకోలేక కోహ్లి సేన ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. భువనేశ్వర్(1వికెట్ ), ప్రసీద్ కృష్ణ(2 వికెట్లు) మినహా ఇతర బౌలర్లు ఎవరూ రాణించకపోడంతో, కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ నెలకొల్పిన భాగస్వామ్యాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ చీల్చిచెండాడారు. కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి సగర్వంగా సిరీస్‌ను 1-1తో సమం చేసింది పర్యాటక జట్టు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి తనదైన శైలిలో టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘భారత జట్టుకు ఇదొక గుణపాఠం కావాలి.. 40 ఓవర్లపాటు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటే.. రానున్న రెండేళ్లలో స్వదేశంలో జరుగనున్న ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితే వస్తుందేమో... ఫ్లాట్ వికెట్లపై 375+ స్కోరు నమోదు చేయగల సత్తా వారికి ఉంది.. కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అదే సమయంలో ఇంగ్లండ్ ఈ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగింది’’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఇక టీమిండియా బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘అసలు ఆ బౌలింగ్ విధానాలేంటి అలా ఉన్నాయి!!! ఈసారి అత్యుత్తమ బౌలర్లను ప్రయోగించాలి!!!!! వెరీ పూర్ కెప్టెన్సీ’’ అంటూ కెప్టెన్ కోహ్లి తీరును విమర్శించాడు. Today should be a lesson to India ... Playing it safe for 40 overs with Bat might cost them in a World Cup at home in 2 yrs ... they have enough power & depth to get scores of 375 + on flat wickets ... England leading the way with this approach ... #INDvENG — Michael Vaughan (@MichaelVaughan) March 26, 2021 చదవండి: కోహ్లి ఏదో చెప్పబోయాడు.. అంపైర్ పట్టించుకుంటే కదా! రెండో వన్డేలో ఆరు వికెట్లతో ఇంగ్లండ్ ఘనవిజయం ఆ క్రెడిట్ ద్రవిడ్‌కే దక్కుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్