Rana Daggubati
-
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్‌కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
ఇండియన్ స్క్రీన్స్‌కి ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’
‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. కనికా కస్రుతి, దివ్య ప్రభ లీడ్ రోల్స్‌లో, ఛాయా కందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాల నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై, గ్రాండ్ ప్రీ అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ ఈ చిత్రానికి చోటు దక్కింది. తాజాగా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. నవంబరు 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రానా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నదే ఈ చిత్రకథ. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్‌లుక్
‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు."ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
రానా.. నన్ను చూపుతో భయపెట్టాడు: రజనీకాంత్
రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'బాహుబలి'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్)'రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పట్లోనే షూటింగ్‌కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు. అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని' అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సూపర్‌స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్.. ఇలా భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అక్టోబరు 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా)Imagine the level of Achievement when SUPER STAR himself talks something like this!🤯🤯🔥🔥🔥#RanaDaggubati #Vettaiyan #Rajinikanth pic.twitter.com/KMMKTrWa2s— Filmy Bowl (@FilmyBowl) October 8, 2024 -
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్‌మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024 -
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
కేన్స్ అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్‌కి రెడీ
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తీసిన సినిమా 'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్'. కని కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మేలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందనతో పాటు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా మన దగ్గర థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్' సినిమాని అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21న కేరళలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. భారత దేశవ్యాప్తంగా తెలుగు హీరో రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణ సంస్ఛ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.మలయాళ వెర్షన్ సినిమా 'ప్రభయయ్ నీనచతళం' పేరుతో రిలీజ్ కానుంది. కథ విషయానికొస్తే ముంబైలో పనిచేస్తున్న కేరళ నర్సులు ప్రభ, అను జీవితాల్లో జరిగిన సంఘటనల ఏంటి? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇకపోతే వచ్చే ఏడాది ఆస్కార్ బరిలోనూ ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ దేశం ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
స్టార్ హీరో కాళ్లకు మొక్కిన రానా.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో రానా ఇటీవలే కొత్త మూవీని ప్రకటించారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి రానా కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2024 ప్రెస్ మీట్లో రానా పాల్గొన్నారు. ముంబయిలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న రానా వేదికపై సందడి చేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ పాదాలకు నమస్కరించారు. నేను పూర్తిగా సౌత్ ఇండియన్.. అందుకే ఇలా అంటూ రానా మాట్లాడారు. దీంతో కరణ్, షారూఖ్ ఖాన్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ కార్యక్రమంలో సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.(ఇది చదవండి: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!)దుబాయ్‌లోని షారూఖ్ ఇంటికి వెళ్లనప్పుడు తమను అప్యాయంగా చూసుకున్నారని ఈ సందర్భంగా రానా గుర్తు చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు సౌత్‌కు చెందిన సెలబ్రీటీలంతా వచ్చాం.. ఆ సమయంలో షారూఖ్ ఇంటికి వెళ్లగా.. అందరినీ బాగా చూసుకున్నారని తెలిపారు. షారూఖ్ కేవలం నటుడు మాత్రమే.. మానవతావాది కూడా అని రానా కొనియాడారు. కాగా.. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ 27,28, 29 తేదీల్లో అబుదాబిలోని ఓ ఐలాండ్‌లో జరుగనుంది. ఇందులో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి స్టార్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని షారూక్ వెల్లడించారు. We're fully South Indian so.. this is how we do.. 🥺🥹 Rana pic.twitter.com/NumYzPpCEc— . (@charanvicky_) September 11, 2024 -
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్‌తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్‌లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥Starring @dulQuer #BhagyashriBorse Directed by #SelvamaniSelvaraj Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024 -
ఒక సినిమాకు ఇన్ని స్టార్స్ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా
ఒక మంచి సినిమా వస్తే..దాన్ని మీడియా ఎంత బాగా ప్రమోట్ చేస్తుందో ‘35-చిన్న కథ కాదు’చిత్రం ద్వారా తెలిసింది. ఈ సినిమాకి మీరు(మీడియా) ఇచ్చినన్ని స్టార్స్ నేను ఎప్పుడూ చూడలేదు .చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రానా. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. (చదవండి: 35: చిన్న కథ కాదు మూవీ రివ్యూ)ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్లో రానా మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం' అన్నారునివేదా థామస్ మాట్లాడుతూ.. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ' అన్నారు‘ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి '35-చిన్న కథ కాదు' తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా ఉంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విశ్వదేవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి ,సృజన్ యరబోలు పాల్గొన్నారు. -
రూ.కోటి సాయం ప్రకటించిన వెంకటేశ్, రానా
భారీగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎంతోమంది అమాయక జనాలు నిరాశ్రయులయ్యారు. నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి సినీతారలు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగార్జున, అలీ, సాయిధరమ్‌తేజ్.. ఇలా ఎంతోమంది విరాళాలు ప్రకటించారు.కోటి రూపాయ విరాళం తాజాగా దగ్గుబాటి వెంకటేశ్, రానా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దగ్గుబాటి హీరోలను అభిమానులు మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు. Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger. pic.twitter.com/Hz73oFNkYf— Venkatesh Daggubati (@VenkyMama) September 6, 2024 చదవండి: అదొక పెద్ద స్కామ్.. అయినా అదే కోరుకుంటున్నా: జోష్ నటి -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జీరోను దాటి గెలిచి తీరాలి.. ఆసక్తిగా '35–చిన్న కథ కాదు' ట్రైలర్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఉంది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆపై ఆలోచింపచేస్తుంది. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్... ఇలాంటి బంధాల గురించి అందంగా ఈ సినిమాలో చెప్పారు. -
ఐఫా అవార్డ్స్-2024 షెడ్యూల్ ప్రకటన.. రానా, తేజను తప్పించారా..?
ఈ ఏడాదిలో జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 24వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో సెప్టెంబర్ 27-29 వరకు జరగనున్నట్టు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది.ఐఫా అవార్డ్స్ వేడుకలో షాహిద్ కపూర్‌తో సహా బాలీవుడ్ ప్రముఖులు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27న ఐఫా ఉత్సవం పేరుతో అద్భుతమైన ఈవెంట్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 28న అవార్డ్స్, 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.రేసులో ఈ సినిమాలే టాప్ఈ సంవత్సరం నామినేషన్లు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. రణబీర్ కపూర్ 'యానిమల్' అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ 10 నామినేషన్లను పొందింది. 2023 ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌తో పాటు జవాన్ రెండూ పాపులర్ కేటగిరీలో ఏడు నామినేషన్లను పొందగా, విక్రాంత్ మాస్సే చిత్రం 12th ఫెయిల్ ఐదు నామినేషన్లను సాధించింది. ఈసారి ఐఫా అవార్డ్స్ కోసం గట్టిపోటీ ఎదురుకానుంది.రానాను తప్పించారా..?ఐఫా అవార్డ్స్2024'కి హోస్ట్‌గా రానాతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ వ్యవహరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరబాద్‌లో ముందస్తు వేడుక(కర్టెన్ రైజర్ ఈవెంట్)లో కూడా వారు సందడి చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్లు తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలను ఈసారి నిర్వాహుకులు తప్పించారా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, గతంలో కరణ్ ఐఫా హోస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. -
రానా గొప్ప మనసు.. అభిమాని కోసం ఏకంగా!
టాలీవుడ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకుల స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్-2లోనూ కనిపించనున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు.ప్రస్తుతం రానా అమెరికాలోని చికాగోలో పర్యటిస్తున్నారు. అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rana Daggubati ❤️ Diehard Fans (@ranadaggubatif) -
భారత బాక్సింగ్ చరిత్రలో ఇదొక మైలు రాయి: రానా
భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచే దిశగా బాక్సింగ్‌బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బాక్సింగ్ ఈవెంట్లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్‌లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వర్సెస్ 5గా జరగనున్నాయి. ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్‌లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌ను 1963లో స్ధాపించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్‌లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మన బాక్సర్లకు అంతర్జాతీయ స్ధాయిలో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్లబ్‌తో భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భారత్, యూఎస్ బాక్సర్లకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్న నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే క్లబ్ అన్ని విధాల కృషి చేస్తుంది.భారత బాక్సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్‌లో జరిగే ఈవెంట్లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్.