meet
-
వైఎస్ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. -
మహిళలు అలాంటి డైట్‌ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్‌గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్‌గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్‌గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్‌ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్‌ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్‌ను గట్‌లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
టాలీవుడ్ అందాల తారలు.. తళుక్కున మెరిశారు!
సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు. ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, నటుడు భరత్ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్ గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.మరిన్ని NRIవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు
-
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు రావాలని ఖర్గేను ఆహ్వానించారు.కాగా, నిన్న (గురువారం) హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం. -
సీఈఓ నీలం సాహ్నిని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా?
సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో తెలుగు పరిశ్రమలో అలజడి మొదలైంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధులు పదునైన కామెంట్లు చేస్తున్నా సరే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. భవిష్యత్‌లో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన అందరిలోనూ మొదలైంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రానున్నాయి. ఇందులో మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం కూడా ఉంది. ఈ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పవచ్చు.కొద్దిరోజుల క్రితం ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్‌రాజు నియామకం అయ్యాక పుష్ప చేసిన డ్యామేజీకి ‘గేమ్ ఛేంజర్’ అవుతారని అందరూ భావించారు. దానిని నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు తాను మధ్యవర్తిగా ఉంటానని ఆయన అన్నారు. అందులో భాగంగానే అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌తో ఆయన సమావేశం అయ్యారు. చిత్రసీమ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సమయంలో దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకొచ్చిన తర్వాత దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ కావడంతో గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.తాజాగా ఇండస్ట్రీ సమస్యల పేరుతో సీఎం రేవంత్‌తో సినీ పెద్దల మీటింగ్‌ను దిల్‌రాజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని సీఎం ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ మొదట గేమ్ ఛేంజర్ మీద పడుతుందని దిల్ రాజు భావించారు. ఈ భేటీతో గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులు పొందవచ్చని ఆయన అడుగులు వేసినట్టు కనబడింది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు దిల్ రాజు బడ్జెట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల ధరలు పెంపు లేకుంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది.తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్‌షోల గురించి కూడా చర్చ వచ్చిందట. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటున్నానని.. అందులో తగ్గేదే లేదని ఆయన అన్నారట. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండదని రేవంత్ క్లియర్‌గా చెప్పేశారట. అంతే కాదు ప్రీరిలీజ్‌లు, సినిమా ఫంక్షన్లు, అభిమానుల గేదరింగులకు అనుమతులు ఉండాలంటే పక్కాగా నిబంధనలు పాటించాలని చెప్పారట. సినిమా పెద్దలు ఎంత ప్రయత్నించినా సీఎం రేవంత్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నారని సమాచారం. మొత్తానికి సీఎం రేవంత్ పైచేయి సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం: దిల్ రాజు
-
3 నెలల వయసులో కిడ్నాపై... 26 సంవత్సరాలకు తల్లిదండ్రులను చేరి..
బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు. తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు
-
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్‌రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం.. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు తదితర అంశాలపై కేందమంత్రితో సీఎం చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కాగా, ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశముంది. కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావహలు చక్కర్లు కొడుతున్నారు.రంగారెడ్డి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవకాశం కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ అడుగుతుండగా, మరో వైపు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘వెల్కమ్ బ్యాక్ ట్రంప్’.. బైడెన్‌తో భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బుధవారం తొలిసారి వాషింగ్టన్లో అడుగు పెట్టారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఓవర్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు వారి నడుమ చర్చకు వచ్చినట్టు సమాచారం. తన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి ‘వెల్కం బ్యాక్’ అంటూ ట్రంప్‌ను బైడెన్ స్వాగతించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అనంతరం నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ‘‘రాజకీయా లు కఠినమైన వ్యవహారం. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.మెలానియా డుమ్మాబైడెన్తో ట్రంప్ భేటీకి ఆయన భార్య మెలానియా డుమ్మా కొట్టారు. ట్రంప్‌పై నమోదైన రహస్య పత్రాల కేసులో బైడెన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతోనే ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్లోరిడా నివాసంలో సోదాల సందర్భంగా మెలానియా వార్డ్ రోబ్‌ను అధికారులు అణువణువూ శోధించారు. ఆ క్రమంలో ఆమె లో దుస్తులున్న షెల్ఫ్‌ను కూడా వదిలి పెట్టలేదు. మెలానియా భేటీకి రాకున్నా ఆమెకు జిల్ అభినందన లేఖ రాశారు. దాన్ని ట్రంప్‌కు స్వయంగా అందజేశారు. -
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘‘బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలు.. తేడాను గమనిస్తున్నారు.. ‘‘గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు.చంద్రబాబు అబద్ధాలు.. మోసాలుగా మారుతున్నాయి‘‘చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదుకదా.. ఉన్న పలావు పోయింది. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందిచంద్రబాబు సర్కార్‌లో ప్రతీదీ స్కామే....ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి. డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్. నాయుకుల దగ్గరకు వెళ్తే కాని పెన్షన్ రాని పరిస్థితి. పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. కాని వైఎస్సార్సీపీ హయాంలో కన్నా, ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉంది. మన హయాంలో ఇసుక సరసమైన ధరకే దొరికేది, ప్రభుత్వానికీ ఆదాయం కూడా వచ్చేది. వైఎస్సార్సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు, రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణకు పెద్ద పీట వేశాం. అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. ఇలా ప్రతీదీ స్కామే.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!కేసులకు భయపడొద్దు....రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్అన్యాయమైన పరిపాలన సాగుతోంది..‘‘నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీకూడా చేసి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్‌బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
పలు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగనమోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అవంతి శ్రీనివాస్, కేకే రాజు పాల్గొన్నారు. కాగా, నిన్న(బుధవారం) ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.కాగా, వైఎస్ జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీ (శనివారం) ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న (శనివారం) ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!! -
కేసీఆర్ ను కలిసిన కవిత.. కాళ్లకు నమస్కరించి భావోద్వేగం
-
165 రోజుల తర్వాత కేసీఆర్ తో కవిత భేటీ
-
అచ్యుతాపురం ఘటన బాధితుల కన్నీళ్లు.. చలించిపోయిన బొత్స
-
ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన YSRCP నేతలు
-
చంద్రబాబులో అలాంటి విలువలు లేవు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే దాని అర్థం ఏంటి?.. కొనుగోలుచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడన్నదానిపై సమాజం చూస్తుంది. కాని చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు, కాని మోసం చేస్తున్నాడు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకు ఏం సంతృప్తి వస్తుంది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల వరకూ తిరిగి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా?. జగన్ మాట చెప్పాడు, కాని అమలు చేయలేదనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు కూడా ఇలాంటి హామీలు ఇచ్చి, మాట తప్పాడు. ఇది ప్రజలకు అర్థమైంది, అందుకే 2019లో ఆయన డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019లో మనం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతిమాటనూ నిలబెట్టాం. ఇవ్వాల్టికీ ప్రజల దగ్గరకు వెళ్లి మనం ఇది చేశామని చెప్పుకోగలిగాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారు. ప్రజలకు మనకు శ్రీరామ రక్షగా ఉంటారు. విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజలనుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. విలువలు, విశ్వసనీయతగా మనం అడుగులేశాం. కష్టాలు లేకుండా ఏదీ ఉండదు. చీకటి తర్వాత వెలుగు రాక మానదు. పలానా వాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. గడపవద్దకే మనం సేవలు అందిస్తే ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పాలన దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. వ్యవసాయం దెబ్బతింది. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేది. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే.. కాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి. తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మనం దగ్గరంగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకూ నేను భరోసా ఇస్తున్నాను. వీటిని ఎదుర్కొని ఉన్నప్పుడు ప్రజలు మనల్ని కచ్చితంగా ఆదరిస్తారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నన్ను 16 నెలలు జైలుకు పంపారు. కాని ప్రజలకోసం మనం చేసిన పోరాటాలతో మళ్లీ మంచి స్థానంలో పెట్టారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ధనబలం, అధికార బలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధర్మం, అన్యాయం సాగదన్న సందేశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ కొనలేరనే మెసేజ్ పంపాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీకి చుక్కెదురు అంటూ ఈనాడు పత్రిక ఏదో ఘనకార్యం జరిగినట్టుగా రాసింది. మెజార్టీలేని చోట ప్రలోభాలు పెట్టి, పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఘనకార్యమా?. దొంగతనం, హత్యలు చేస్తే దాన్ని కూడా ఘనకార్యంగా రాసే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఘన కార్యాలుగా రాస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు చాలా కీలకం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మొదటి సమావేశం.. రేపటి నుంచే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 వరకు జరగనుంది. బడ్జెట్ తర్వాత మొదటి సమావేశం కావడం, మరోవైపు సెప్టెంబరులో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలను సూచిస్తుండటంతో కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఆర్బీఐ ఎంపీసీ గత సమావేశం జూన్‌లో జరిగింది. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలను చూసింది. అయితే ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలందరూ రేపటి ఆర్బీఐ ఎంపీసీ ఎనిమిదవ వరుస సమావేశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా రెపో రేటును 6.5% వద్దే ఉంచుతారని అంచనా వేస్తున్నారు. ప్రధాన ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఒత్తిడి నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ జాగ్రత్తగా ఉండవచ్చని బార్క్లేస్లో ప్రాంతీయ ఆర్థికవేత్త శ్రేయా సోధాని ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. "4-2 మెజారిటీతో ద్రవ్య విధాన కమిటీ విధాన సెట్టింగ్‌లను మార్చకుండా ఉంచుఉంచుతుందని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు. స్థిరమైన వృద్ధి ఉండటం, ప్రస్తుతానికి రేట్లు తగ్గించడానికి అత్యవసరం లేకపోవడం వలన మొదటి రేటు తగ్గింపు డిసెంబర్ తర్వాతే ఉంటుందని పేర్కొన్నారు. -
జగన్ ను కలిసేందుకు పోటెత్తిన అభిమానులు
-
సీఎం రేవంత్ ఇంటికి ఎమ్మెల్యే బండ్ల...
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీ అరాచకాలు.. గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
-
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
-
పులివెందులలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రేపు ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజా భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు.మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. -
గవర్నర్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్‌కు గుంటూరు ఆర్డీవో శ్రీకర్, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం నివాసానికి బయలుదేరి వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్.. చంద్రబాబును కలిశారు. -
నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే
సాక్షి, ఢిల్లీ: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని తెలిపారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రహదారి పనులు చేపట్టాలి..హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు వరుసలుగా విస్తరించాలి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో రోజుకు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వరుసల పనులు చేపట్టడం లేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు వరుసలుగా రహదారి విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్-సోమశిల-కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ వాసులకు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.కల్వకుర్తి-నంద్యాల రహదారి (ఎన్‌హెచ్-167కే) హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి-కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు హైదరాబాద్-కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు.హైదరాబాద్-శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహన రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంథనికి జాతీయ రహదారి ప్రకటించండి..మంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదని, జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్-565, ఎన్‌హెచ్-353సీ అనుసంధానమవుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు..తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్-మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్-163) ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం పూర్తయిన ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదు. ఆ మార్గంలో ఉన్న మర్రి చెట్లను కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌లోకేషన్ చేసేందుకు ఎన్‌హెచ్ ఏఐ అంగీకరించింది. ఈ దశలో ఎలైన్మెంట్ మార్చడం సాధ్యం కాదు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి. సేతు బంధన్ స్కీం కింద 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి. గిత్యాల-కాటారం (130 కి.మీ.), దిండి-నల్గొండ (100 కి.మీ.), భువనగిరి-చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్-సంగారెడ్డి (182 కి.మీ), మరికల్-రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి-మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ-బీదర్ (134 కి.మీ.), కరీంనగర్-పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్-రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి-దుద్దెడ (75 కి.మీ.), సారపాక-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ-రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట-కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల-కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్-సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్-రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ.జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలి. -
టాలీవుడ్ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ (ఫోటోలు)
-
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలిసిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు.రేపు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జూన్ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
-
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
సచిన్ టెండూల్కర్‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్ (ఫొటోలు)
-
రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే?
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్‌ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు. కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. A high level delegation of the Ministry Of Culture - Moscow has met #Chiranjeevi garu at his residence today Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/NPLmjrUo1q — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
సీఎం జగన్ ను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
-
IPL 2024 SRH Vs MI: ఆరెంజ్ఆర్మీతో సన్‌రైజర్స్.. బెస్ట్ ఫొటోలు
-
కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్ -
Hanu Man: అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్ (ఫోటోలు)
-
మోదీతో దీదీ భేటీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు అనంతరం మీడియాకు చెప్పారు. రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాలంటూ మమత రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం, అంతేగాక జాతీయ ఉపాధి హామీ కూలీలకు మమత సర్కారే చెల్లింపులు చేయడం తెలిసిందే. -
Manmadhudu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మన్మథుడు జంట ఫోటోలు వైరల్
-
బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!
ఓ యువకుడు ఉన్నత చదువలు చదవకపోయినా కోట్లు సంపాదించి ఆశ్చర్యపరుస్తున్నాడు. డబ్బు సంపాదించగల సత్తువ ఉంటే అకడమిక్ చదువులతో పనిలేదని ఈ వ్యక్తి ప్రూవ్ చేసి చూపించాడు. మన వద్ద మంచి టాలెంట్ ఉంటే దానికే పదును పెడితే కోట్టు వచ్చి పడతాయని చెప్పకనే చెప్పాడు ఈ కుర్రాడు. ఎలా అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడంటే.. ఫరిదాబాద్కి చెందిన అజయ్ నగార్ Aka (ఆల్సో నోన్ యాజ్ ) కైరీమినాటీ.. తన పీర్స్‌లో bae (బిఫోర్ ఎనివన్ ఎల్స్) కెరీర్ స్టార్ట్ చేశాడు. కేవలం పదేళ్ల వయసులోనే! STeaLThFeArzZ అనే యూట్యూబ్ అకౌంట్లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన మెయిన్ యూట్యూబ్ చానెల్ అడిక్టిడ్ ఏ1కి మాత్రం 2014లో లాగిన్ అయ్యాడు. అలా వీడియో గేమ్ క్లిప్స్.. రియాక్షన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ! గతేడాది ఆగస్ట్ కల్లా 40 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. తన అన్న యశ్ నగార్‌తో కలసి మ్యూజిక్ ఆల్బమ్స్కీ పనిచేస్తున్నాడు. అజయ్ నగార్ నెలకు 25 లక్షలు సంపాదిస్తున్నాడని, నెట్ వర్త్ దాదాపు 41కోట్లు ఉండొచ్చని పాపులర్ న్యూస్ సైట్ల అంచనా. హరియాణాలోని ఫరిదాబాద్కి చెందిన ఈ అబ్బాయి ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ట్వల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదట. కానీ లైఫ్‌లో మాత్రం పాస్ అయ్యాడు కదా అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఆ ఫాలోయింగే అజయ్‌ని 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా లిస్ట్‌లోకి చేర్చింది. అపార్ట్ ఫ్రమ్ అకడమిక్స్ సమ్ అదర్ టాలెంట్ ఆల్సో ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు కదా అజయ్ నగార్! (చదవండి: ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?) -
ఎన్ఐసీ చేతికి ధరణి?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, నవీన్‌మిత్తల్, మధుసూదన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే 22 అంశాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచి్చనట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. చేవ్రాలే... ప్రాతిపదిక ఈ సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.46లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి? భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బిలో చేర్చిన 13.5లక్షల ఎకరాల కు సంబంధించిన భూముల సమస్యలను ఎలా నివృత్తి చేయాలి? అన్న దానిపై నిర్ణయాలు తీసుకో నున్నారు. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ఆన్లైన్లో ఉన్న అస్తవ్యస్త రికార్డులను కాకుండా మాన్యువల్ పహాణీలను ప్రాతిపదికగా తీసుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. రెవెన్యూ–అటవీ, రెవెన్యూ–దేవాదాయ, రెవెన్యూ–వక్ఫ్ శాఖల మధ్య అంతరాలు ఉన్న భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. వీటితో పాటు ధరణి దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా అధికార వికేంద్రీకరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్వోఆర్ చట్టంలో ఎలాగూ ఈ అధికారాలు కలెక్టర్లకు బదలాయించకపోవడంతో చట్ట సవరణ కూడా అవసరం లేదని, అధికారిక ఉత్తర్వులతో ఈ వికేంద్రీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా నేడు జరగనున్న కీలక సమీక్షలో ధరణి పోర్టల్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించిన అంశాలివే
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ►పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని కోరిన ముఖ్యమంత్రి. ►అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరిన ముఖ్యమంత్రి. ►2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరిన సీఎం. ►రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడతాయన్న సీఎం. ►రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలన్న సీఎం. ►విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం. ►విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరిన సీఎం. ►కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్న సీఎం. ►విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే.. -
ఆర్థిక వనరులు పెంచుకోవడం ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధుల సమీకరణ, అలాగే ప్రజలపై భారం పడకుండా ఏవిధంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న అంశంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని, అందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని, మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిందని అహ్లూవాలియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాలు, సూచనలు కావాలని కోరా రు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా.. పన్నుల వసూళ్ల గురించి అహ్లూవాలియా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం విక్రమార్కకు వివరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. -
15 రోడ్లు అప్‌గ్రేడ్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమరి్పంచారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) ► చౌటుప్పల్–(ఎన్‌హెచ్65)–ఆమనగల్లు–షాద్‌నగర్ –సంగారెడ్డి (ఎన్‌హెచ్65) 182 కి.మీ ► మరికల్ (ఎన్‌హెచ్167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్150) 63 కి.మీ ► పెద్దపల్లి (ఎస్‌హెచ్1)– కాటారం (ఎన్‌హెచ్353సి) 66 కి.మీ ►పుల్లూరు (ఎన్‌హెచ్44)–అలంపూర్–జెట్‌ప్రోల్–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్765)–దేవరకొండ(ఎన్‌హెచ్176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్167)– నల్లగొండ (ఎన్‌హెచ్–565) 225 కి.మీ ► వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్167) 110 కి.మీ ► మన్నెగూడ (ఎన్‌హెచ్163)–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్ (ఎన్‌హెచ్–50) 134 కి.మీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి భారతమాల పథకం ఫేజ్–1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–చౌటుప్పల్‘) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
-
సీఎంతో వంశీచంద్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన వంశీ.. చాలా సేపు ఆయనతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహా రాలపై చర్చ జరిగిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. గత 22 రోజుల ప్రభుత్వ పాల న తీరు, అధికారుల నియామకంలో పారదర్శ కత, ప్రజాపాలన నిర్వహణపై సీఎంకు వంశీ అభినందనలు తెలిపారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు.. నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సభకు హాజరై వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న రేవంత్.. సీఎంవో అధికా రులతో భేటీ అయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమ య్యారు. అయితే, ఏఐసీసీ పక్షాన వంశీచంద్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడం, అది కూడా చాలా సేపు ఈ భేటీ జరగడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి విక్రమార్కలు పీసీసీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ పెద్దలతో చర్చించారన్న వార్తల నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి తాజాగా రేవంత్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చి ఉంటుందని, ఏఐసీసీ పక్షాన ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తీసుకుని వంశీ, రేవంత్‌ను కలసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్య క్షుడి ఎంపికపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
AP: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు. చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. -
ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి చేశారు. గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్ తెలిపారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా? -
సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్ -
లోకేష్-అమిత్‌షా భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్మెంట్ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్‌షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్‌ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. -
నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. Today, I met the Hon’ble Finance Minister Madam Nirmala Sitaraman Ji in New Delhi and discussed issues pertaining to the state of Andhra Pradesh. pic.twitter.com/0Lg4EZbAUh — Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023 -
సీఎం జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందని పేర్కొన్నారు. శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేని చోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని సీఎం వివరించారు. చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ -
సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ సీపీ గుర్నాని
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్ర సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్ర విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు. చదవండి: సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్ -
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
ఏపీ నిధులు.. బకాయిలు, పోలవరంపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. అలాగే కృష్ణా జలాల అంశంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.. కృష్ణాజలాల అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ( KWDT-II) నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్ఎల్పీలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు 2021 ఆగస్టు 17న, 2022 జూన్ 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు. KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైనా సీఎం జగన్ కేంద్ర హోంమంత్రితో చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు. లైడార్ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సదస్సులో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చదవండి: ఏషియన్ గేమ్స్‌లో పతక విజేతలకు సీఎం జగన్ అభినందన -
ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు. ‘‘విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించాం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ పథకానికి ఏపీ అర్హత పొందింది. నిధులు అందిస్తాం’’ అని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ -
సునీతారెడ్డికే టికెట్..
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది. మీ స్థాయికి తగిన పదవి వస్తుంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. -
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
యూపీ సీఎంపై మహంత్ తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులతో వాగ్వాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి(మహంత్) యతి నరసింహానంద్ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్‌ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్ గత 27న మీరఠ్‌లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్‌కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ములాయం, మాయావతి, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్ ఆరోపించారు. కొద్దిసేపు యతి నరసింహానంద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్‌ను అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ -
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే..
ఢిల్లీ: నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే.. ప్రధానమంత్రి అభ్యర్థి.. కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు 28 పార్టీలు కూటమిలో ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి తరపున ఒక ప్రధాన అభ్యర్థిని ప్రధాని మోదీకి అభిముఖంగా నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా, అన్ని పార్టీల అంగీకరంతో ఓ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే కూటమి ముందు ఉన్న ప్రధాన సవాళుగా పేర్కొనవచ్చు. టికెట్ల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అనేక చిన్ని పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు పోటీ చేయకుండా ఆయా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంలో కూటమి పెద్దలు ఇప్పటికే తలమునకలయి ఉన్నాయి. ఈ అంశంలో సమన్వయ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. దీనిపై నేడు భేటీలో చర్చించనున్నారు. #WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Today we will go to the meeting... The agenda decided in the Mumbai meeting will be discussed. Everybody is going to attend the meeting except TMC. TMC leader Abhishek Banerjee is a member of this committee,… pic.twitter.com/FglophdMXr — ANI (@ANI) September 13, 2023 టీఎంసీ Vs కాంగ్రెస్, లెఫ్ట్: అటు.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ , కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అధికారంలో ఉన్న టీఎంసీ బెంగాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగే సత్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌లకు సీట్లను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగల విశ్వాసంతో ఉంది. లెఫ్ట్ Vs కాంగ్రెస్: కేరళలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పీనరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీ నేతలు.. తాము సొంతంగా మెజారిటీ సీట్లను సాధించగలమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సీట్ల పంపిణీపై నిరాసక్తతతో ఉన్నారు. ఆప్ Vs కాంగ్రెస్: ఢిల్లీ, పంజాబ్ , హర్యానాలో టిక్కెట్ల పంపిణీ పై ఆప్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ కూటమి ముందు ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..? -
చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు
-
జైల్లో చంద్రబాబును కలవనున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి..!
-
పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ
సాక్షి, విజయవాడ: విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలు సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదని.. కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. భువనేశ్వరి, లోకేశ్‌లకు అనుమతిస్తామని తెలిపారు. ఉద్రిక్తతలు కోసం పవన్ వస్తున్నారంటూ తమకు సమాచారం ఉందన్న పోలీసులు.. ఆ మేరకు పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్‌పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం పంపించారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి.. -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్‌తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్‌తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వెళ్లి పుతిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్‌లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌లోకి తుమ్మల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. చదవండి: ‘జమిలి’తో మరింత జోష్! -
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Updates.. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్ పవార్, స్టాలిన్ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని, త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్‌లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih — ANI (@ANI) September 1, 2023 ► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Congress MP Rahul Gandhi at INDIA alliance meet in Mumbai "Today, two very big steps were taken. If parties on this stage unite, it is impossible for BJP to win elections. The task in front of us is to come together in the most efficient way. Forming a coordination… pic.twitter.com/SyDw8Tzmhk — ANI (@ANI) September 1, 2023 ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు. #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8 — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx — ANI (@ANI) September 1, 2023 ► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.' అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8 — ANI (@ANI) September 1, 2023 మూడు తీర్మాణాలు.. ► మూడు తీర్మాణాలు 1) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం 2) ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 3) జుడేగా భారత్-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు #WATCH | Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Today, INDIA parties passed three resolutions. One, we the INDIA parties hereby resolve to contest the forthcoming Lok Sabha elections together as far as possible. Seat-sharing arrangements in different states will be… pic.twitter.com/VAEXozqV9S — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut announces names of the 14-member coordination committee -- KC Venugopal (INC), Sharad Pawar (NCP), TR Baalu (DMK), Hemant Soren (JMM), Sanjay Raut (SS-UBT), Tejashwi Yadav (RJD), Abhishek Banerjee (TMC), Raghav Chadha (AAP), Javed Ali Khan… https://t.co/JrhGDqO74I pic.twitter.com/zPyGtxpdND — ANI (@ANI) September 1, 2023 ► సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party president Mallikarjun Kharge and MP Rahul Gandhi arrive at the venue of the meeting of INDIA alliance in Mumbai. pic.twitter.com/xOCth1XXm9 — ANI (@ANI) September 1, 2023 ► భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్‌కు చేరుకున్నారు. #WATCH | Tamil Nadu CM and DMK leader MK Stalin arrives at the venue of the meeting of the INDIA alliance in Mumbai. pic.twitter.com/UNVMmvUGme — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. Live: INDIA alliance meet Day 2 in Mumbai Live: Opposition bloc to unveil logo Read @ANI | https://t.co/OCbMsEp4Fp#INDIAAlliance #INDIA #OppositionMeeting pic.twitter.com/Tqotpp95UK — ANI Digital (@ani_digital) September 1, 2023 ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు. ► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. ► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. ► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. ► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
హైకోర్టు సీజేను కలిసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలను సీజే జస్టిస్ ఠాకూర్ దంపతులు పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీజేకు సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఇటీవల సీజేగా జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు -
తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై.. పాలేరు బీఅర్ఎస్లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం. కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్‌బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
సీఎం జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. -
భారీ స్కామ్.. ‘బ్రో’.. ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డితో ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బ్రో మూవీ లావాదేవీలపై ఆయన చర్చించారు. ఇతర ఎంపీలను కూడా మంత్రి కలవనున్నారు. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా, బ్రో సినిమా వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అదో కుంభకోణమని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే సినిమా నిర్మాతగానీ పవన్ కళ్యాణ్‌గానీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు వెల్లడించేందుకు భయపడుతున్నారా? దాస్తున్నారా? అని నిలదీశారు. దాస్తున్నారంటే అందులో స్కామ్ దాగి ఉందనే అర్థమని స్పష్టం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అమెరికాలో తన ముఠా ద్వారా వసూలు చేసిన డబ్బును నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీగా ఇప్పించారన్నారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ బ్రో సినిమాకు విదేశీ పెట్టుబడులు అక్రమంగా వచ్చాయని, ఇది మనీలాండరింగ్ కాదా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? కలెక్షన్లు ఎంత? పవన్ పారితోషికం ఎంత? ఆదాయ పన్నుగా కట్టింది ఎంత? అని ప్రశ్నించారు. అత్యంత నిజాయితీపరుడినని, అపర దాన కర్ణుడినని, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తినంటూ డైలాగ్‌లు కొట్టే పవన్ వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. సినిమాను సినిమాలాగే చూడాలన్న సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందిస్తూ అలాంటప్పుడు సినిమాలను సినిమాలుగానే తీయండి.. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు? అని చురకలంటించారు. తనపై పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసినా అభ్యంతరం లేదన్నారు. బ్రో సినిమా వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘నేను ఇవాళ రాత్రి చాలా ముఖ్యమైన అంశంపై ఢిల్లీ వెళ్తున్నా. మా పార్టీ ఎంపీలను కలుస్తా. ఢిల్లీ నుంచి వచ్చాక అన్ని వివరాలు చెబుతా’ అని అంబటి చెప్పారు. -
సాయంతో మనసు గెలిచే యత్నం!
జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరొకటి. శ్రీలంక ప్రస్తుత సంక్షోభం, ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో రూపొందించిన ‘సాగర్’, ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. ఇది పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా, వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇటీవలే భారత్‌కు వచ్చిపోయారు. బోలెడన్ని ఒప్పందాలు కుదిరాయి. చాలావరకూ ఆర్థిక వ్యవహారాలే. రణిల్ మనకు మిత్రుడే అన్నది చాలాకాలంగా ఉన్న గట్టి అభిప్రాయం. గత ఏడాది జూలైలో అధ్య క్షుడు గొటబయ రాజకపక్స దేశం నుంచి పారిపోవడం, ప్రజాగ్రహం నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి రావడం మనకు తెలిసిన విషయమే. అలాంటి అనూహ్యమైన, మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో రణిల్ గద్దెనెక్కారు. దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టు మిట్టాడుతోంది ఆ దేశం అప్పుడు. సాధారణంగా పదవి చేపట్టిన కొద్ది కాలానికి శ్రీలంక నేతలు భారత్ పర్యటనకు రావడం కద్దు. కానీ ఈసారి రణిల్ ముందు దేశంలో పరిస్థితులు కొంతైనా చక్కబెట్టుకున్న తరువాతే, విదేశీ పర్యటనల గురించి ఆలోచించాల్సిన వచ్చింది. అటు ఆర్థిక, ఇటు రాజకీయాలూ సర్దుకున్న తరువాత ఆహ్వానం పంపు దామని భారత్ కూడా వేచి చూసింది. 75 ఏళ్ల దౌత్య బంధం జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరో విషయం. దేశవాళీ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన సాయం అందిస్తున్నందుకూ విక్రమసింఘే కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటారు. ఈ సాయం భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు భారత్‌తో సమావేశాలు ఉపయో గపడి ఉంటాయి. ఎందుకంటే భారత్‌తో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల సాయంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో కొంత స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. సబ్సిడీల తగ్గింపు, పన్నుల పెంపు వంటి సంస్కరణలకు ఐఎంఎఫ్ షరతులు విధించిన విషయమూ చెప్పుకోవాలిక్కడ. ఈ సంస్కరణల భారం మోయడం సామాన్యుడికి కష్టమైతే, ఆ అసంతృప్తిని వాడుకుని తిరగబడేందుకు శ్రీలంకలోని కొన్ని నియోజకవర్గ నేతలు కాచుకుకూర్చున్నారు. శ్రీలంకకే చెందిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సీపీ చంద్రశేఖర్, అహిల్ కదిర్గమర్ వంటి వారు ఐఎంఎఫ్ పథకం సమస్య పరిష్కా రానికి అస్సలు ఉపయోగపడదనీ, పరిస్థితిని మరింత దిగజారుస్తుందనీ అభిప్రాయపడుతున్నారు. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం శ్రీలంక 2031 వరకూ సంస్కరణలు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ఇంకో ఎనిమిదేళ్లు. చాలా సమయం. విక్రమసింఘేకు ఈ విషయమే కాకుండా, భవిష్యత్తులో ఎదురుకాగల సవాళ్ల గురించి కూడా తెలుసు. విదేశీ అప్పులు ప్రస్తుతం 40 బిలియ¯Œ డాలర్ల వరకూ ఉంటే, అందులో 30 శాతం అయినా తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాగే తొమ్మిదేళ్లపాటు రుణాల చెల్లింపులను నిలిపివేయడం అప్పులిచ్చే వారి ఆగ్రహానికి కారణమవుతోంది. పొరుగుకు ప్రాధాన్యత శ్రీలంక ప్రస్తుత సంక్షోభం ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవహా రాల్లో భారత్ జోక్యం పెరగాలని లంక ఆశిస్తోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో భారత్ రూపొందించిన ‘సాగర్’(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్), ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. వీటి ప్రకారం, పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా... వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు, ఆర్థిక సమృద్ధికి ఉపయోగపడే కొన్ని చర్యలకు ప్రధాని మోదీ, విక్రమసింఘే తమ దార్శనిక పత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ఇరుదేశాల మధ్య అటు సముద్ర మార్గం ఇటు విమాన, భూతల మార్గాల ద్వారా కూడా కనెక్టివిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే తెగల పోరు నేపథ్యంలో 1980లో నిలిపివేసిన పడవల సేవలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ ద్వారా శ్రీలంకలో రూపాయి ద్వారా చెల్లింపులు జరపాలన్నది వీటిల్లో ఒకటి. ఇంధన రంగంతోపాటు ట్రింకోమలై ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అదాని వంటి భారతీయ వ్యాపారవేత్తలకు సరికొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత పర్యటనలో విక్రమసింఘేను గౌతమ్ అదాని కూడా కలిసిన విషయం గమనార్హం. శ్రీలంక తమిళుల సమస్య సున్నితత్వాన్ని గుర్తించిన విక్రమసింఘే ఆ విషయంలో తాను తీసుకోబోయే చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. 13వ రాజ్యాంగ సవరణ ప్రకారం, దక్షిణాఫ్రికా తరహాలో తమిళుల కోసం ఓ నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇందులో ఉంది. ప్రాంతాల వారీగా అధికార పంపిణీ జరగాలని 13వ సవరణ చెబుతోంది. అయితే దీని అమల్లో ఉన్న సాధకబాధకాల గురించి కూడా శ్రీలంక అధ్యక్షుడు భారత ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు అనుమతి లేకుండా పోలీసు తదితర సున్నితమైన వ్యవస్థల అధికారాలను పంపిణీ చేయడం కష్టమని వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ విక్రమసింఘే వర్గానికి ప్రతినిధి ఈయనొక్కరే. పార్లమెంటులో మద్దతు లభిస్తున్నది కూడా రాజపక్సే పార్టీ నుంచి మాత్రమే. రాజపక్సే పార్టీకి అధికార పంపిణీ సుతరామూ ఇష్టం లేకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకునే ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ అమలును మరోసారి గుర్తు చేశారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కౌన్సిల్ ఎన్నికలు తొందరగా జరిపించడం గురించి ప్రస్తావించారు. తమ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదనీ, విక్రమసింఘే అధికార పంపిణీ ప్రణాళిక తమకు సమ్మతం కాదనీ తమిళ వర్గాలు ఇప్పటికే మోదీకి వేరుగా లేఖలు రాశాయి. తమిళ సామాజిక వర్గపు ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేలా లంకను ఒప్పించాలని వీరు కోరుతున్నారు. కలిసి పనిచేయాలి విక్రమసింఘే పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై చర్చలు జరక్కపోయినా, చైనా అంశం కచ్చితంగా ఇద్దరు నేతల మనసుల్లో ఉండి ఉంటుంది. విక్రమసింఘే కొన్ని రోజుల క్రితమే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా శ్రీలంకలో చైనా భద్రతా వ్యవహారాలు లేవని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా, భారత్‌కు ముప్పు కాగలఎలాంటి విషయానికైనా శ్రీలంక వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. ఇది చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఫలితం లభించినట్లే భావించాలి. భారత ప్రధాని మాట్లా డుతూ, ‘భారత్ భద్రత, శ్రీలంక అభివృద్ధి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇరు దేశాలు భద్రత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని కలిసి పని చేయాలి’ అన్నారు. అభివృద్ధి పనులతో భద్రతను పొందాలనుకోవడం భారత్ ఎంత సమర్థంగా, సకాలంలో తన ఆర్థిక హామీలు నెరవేర్చగలదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఎస్.డి.ముని, వ్యాసకర్త మాజీ దౌత్యవేత్త, శ్రీలంక రత్న అవార్డు గ్రహీత- (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కిమ్‌తో రష్యా మంత్రి భేటీ
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఉ. కొరియా అధికారిక మీడియా తర్వాత వెల్లడించింది. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్‌తో రష్యా రక్షణ మంత్రి సమావేశంకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్యాంగ్లో సమావేశమైన సెర్గీ, కిమ్‌లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్ ఆయుధాల ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు. -
తెలుగు అమ్మాయిలకు.. ఇదేనా రిక్వెస్ట్..!
-
స్టేజ్ పై పుష్ప 2 డైలాగ్‌తో దుమ్ము దులిపిన బన్నీ..
-
'ఆ పార్టీలు రిజిష్టర్ అయినవేనా..?' విపక్షాల భేటీ అనంతరం ఖర్గే కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: ప్రతిపక్ష పార్టీలంటే ప్రధాని మోదీకి భయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారు.. కానీ అవి రిజష్టర్ అయినవేనా? అని బీజేపీని ఎద్దేవా చేశారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన ఖర్గే.. మాహాకూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరు సూచించామని తెలిపారు. #WATCH | Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: Congress President Mallikarjun Kharge in Bengaluru pic.twitter.com/pI66UoaOCc — ANI (@ANI) July 18, 2023 ప్రతిపక్ష పార్టీల కూటమిని సమన్వయ పరచడానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖర్గే వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ముంబైలో తదుపరి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. పాట్నాలో జరిగిన సమావేశానికి 16 పార్టీలు వస్తే నేడు బెంగళూరు భేటీకి 26 వచ్చాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలున్నా వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
బిగ్ ట్విస్ట్.. మరోసారి శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్..
ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో అజిత్ పవార్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ వరుసగా రెండోరోజు శరద్ పవార్‌తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్‌ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు. #WATCH | NCP president Sharad Pawar arrives at Mumbai's YB Chavan Centre where Maharashtra Deputy CM Ajit Pawar and NCP MLAs of his faction are present to meet him. pic.twitter.com/hrx8S2mVTR — ANI (@ANI) July 17, 2023 ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్ పవార్‌ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు. నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్‌కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్ పవార్‌ను కలిశారు. అయితే, శరద్ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పవార్ రియాక్షన్? -
'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు. 'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు! -
‘ఏపీ అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరోజు ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాలు, పెండింగ్ బకాయిలతో పాటు న్యాయంగా దక్కాల్సిన సాయం గురించి ఆయన వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు సీఎం జగన్ భేటీ కొనసాగింది. అంతకు ముందు దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చివరగా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారాయన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో కూడా ఉంది. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్లు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని, ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు సీఎం జగన్. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సొంత నిధుల ఖర్చు రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తిచేసిన సీఎం. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయి. ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. ఏపీ జెన్కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టండి. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అధిక శాతం కవరేజీ ఉంది. కానీ, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదు. నీతిఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించింది. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కకుండా పోతోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోంది. అందుకే సత్వరమే జోక్యం చేసుకోండి. ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయి. ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టండి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుంది. రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉంది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయండి. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చింది. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరం. స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వండి. ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయండి. 2012-13 నుంచి రూ. 2017-18 వరకూ ఇవి పెండిగులో ఉన్నాయి అని ప్రధాని మోదీకి ఏపీకి సంబంధించిన పలు అంశాలను వివరించారు సీఎం జగన్. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు -
విపక్షాల భేటీ.. 17, 18 తేదీల్లో...?
న్యూఢిల్లీ: దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు జూన్ 23న బిహార్ రాజధాని పాటా్నలో సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి భేటీ ఈ నెల 17, 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం ట్వీట్ చేశారు. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే ధ్యేయమని, అందుకోసమే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే విపక్ష కూటమి సంకల్పమని వివరించారు. వాస్తవానికి విపక్షాల సమావేశాన్ని ఈ నెల 13, 14న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తమ భేటీని 17, 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. -
‘ఈటల, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు.. ఫొటోలు బయటపెట్టాలా?’
హైదరాబాద్: ఖమ్మంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటే అని చెప్పే క్రమంలో బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్‌ని చాలా మంది పప్పు అని పిలుస్తుంటారు.. కానీ అందుకు తగిన వ్యక్తేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలే ఏ టీం, బీ టీం అంటూ వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు జరిపిన మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూపించాలా? అని అన్నారు. భేటీ జరిగిందా? టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే.. సాధారణంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ముందు నుంచి ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రధాన బాధ్యతలను అప్పగిస్తారు. పార్టీలో తనకు సరైన ప్రధాన్యత లభించట్లేదని ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఈటల ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. నిజానికి ఈటల, రేవంత్ రెడ్డి టచ్‌లోనే ఉన్నారనే రాజకీయ వర్గాల్లో వినికిడి ఉన్న నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ.. ఓ రిమోట్ గాంధీ.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఏంటో గుర్తెరిగి మాట్లాడాలని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిని స్ర్కప్టిను చదివి వెళ్లాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ రిమోట్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏంటో తెలియదని అన్నారు. గతంలో తెలంగాణ కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది.. మరి అప్పుడు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్’ మంత్రి ప్రశాంత్‌రెడ్డి -
Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ (ఫొటోలు)
-
ఢిల్లీలో కేటీఆర్.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్ కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
ఏపీలో అన్ని వర్గాల సమానాభివృద్ధి
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, సామాజిక, ఆరి్థక పరంగా మార్పులు కనిపిస్తున్నాయని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలుచేయాల్సిన అవసరముందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. సీఎం సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళా సాధికారికతకు వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, వరుసగా నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం అందించడమే కాక వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నారని సమీర్ కొచ్చర్ వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2005లో ఆంధ్రప్రదేశ్ వచ్చానని, అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో సామాజికంగా, ఆరి్థకంగా మార్పులను ఎలా తీసుకొచ్చారో అధ్యయనం చేసి డాక్యుమెంట్ రూపొందించానన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. మహిళా సాధికారికతలో భాగంగా మహిళల జీవనోపాధి మెరుగుపరచడమే కాక.. వారి ఆరోగ్యానికి భరోసా కల్పించారని చెప్పారు. విద్యా రంగంపై పెద్దఎత్తున వ్యయం చేస్తున్నారని, తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారని, మూడో తరగతి నుంచే ప్రపంచస్థాయి సిలబస్‌తో టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారని సమీర్ తెలిపారు. అలాగే, వైద్య రంగంలోనూ చాలా మార్పులు తీసుకొచ్చారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి పెద్దఎత్తున వ్యయంచేస్తున్నారని, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక.. వ్యవసాయ రంగంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను అందిస్తున్నారని, దేశంలో తొలిసారిగా ఏపీలోనే ఇలాంటి కేంద్రాలున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించాల్సిన అవసరముందని ఆయన కొనియాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని, సంపద అందరికీ సమానంగా అందితేనే సామాజికంగా ఆర్థికంగా మార్పులు వస్తాయని సమీర్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎంతో జరిగిన భేటీలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తన‘ఇండియా 2047 హై ఇన్కమ్ విత్ ఈక్విటీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. సమీర్ కొచ్చర్‌ను సీఎం జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో స్కోచ్ గ్రూప్ వైస్ చైర్మన్ డాక్టర్ గురుశరణ్ ధంజల్, డైరెక్టర్ రోహణ్ కొచ్చర్ పాల్గొన్నారు. చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం -
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలో రేపు సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గౌరవార్థం ప్రభుత్వం తరపున సత్కారం, విందు కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసి ఇటీవలే సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పదోన్నతి పొందారు. -
కాంగ్రెస్‌లో జోష్.. పొంగులేటి ఇంటికి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక లాంఛనప్రాయం నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్న లీడర్ లేని లోటు ఉన్న నేపథ్యంలో పొంగులేటి చేరికతో జిల్లాలో బలం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం.. హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. ‘‘అత్యంత అవినీతి పరుడైన కేసీఆర్‌ను గద్దె దించాలి. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను మాతో కలిసి రావాలని ఆహ్వానించాం. ఖమ్మం నేతలంతా పొంగులేటి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు అందించడమే మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులే ముఖ్యం: కోమటిరెడ్డి అప్పులు తీసుకొచ్చి రోడ్లు కూడా వేయలేదని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ధరణి పేరుతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు అధికారం కాదు.. ప్రజల బాగోగులే ముఖ్యం అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు ‘‘12వ పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం. చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. 16 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించినందుకు ధన్యవాదాలు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నా’’ అని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం: శివారెడ్డి ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, పీఆర్సీ కమిషన్ వేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి’’ అని శివారెడ్డి అన్నారు. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
పరస్పర సహకారానికి సిద్ధం: జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్‌లో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువవారం జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ కుచ్లర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు ఎంవోయూలు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. భారతీయులు, ముఖ్యమంగా తెలుగువారి మేధాశక్తిపై తమకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను తమతో చర్చిస్తే.. ఆ మేరకు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కోవిడ్ సమయంలో భారతదేశం అందించిన తోడ్పాటుకు జర్మనీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. యాంటీబయాటిక్, సర్జికల్ వస్తువులను ఆ సమయంలో భారతదేశం నుంచి తొలిసారి దిగుమతి చేసుకున్నామని, ఇప్పటికీ ఈ దిగుమతులు కొనసాగుతున్నాయని వివరించారు. యోగా, ఆయుర్వేదం లాంటి సాంస్కృతిక వైద్య విధానాలను తమ దేశంలోనూ అమలు జరిపేలా, మా వైద్య విధానాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలా అవగాహన ఒప్పందం కుదర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. పెట్టుబడులు పెట్టండి తమ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అద్భుతమైన వనరులతో మెడ్‌టెక్ జోన్ ఉందని, జర్మన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇరుదేశాలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ ముదువరుసలో ఉందని తెలిపారు. తమ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణ కోసం జర్మనీ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ మేరకు వారికి కళాశాలల్లో జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో జర్మనీ దేశ సహకారం కావాలని కోరారు. నర్సింగ్ విద్యార్థులు జర్మనీ వెళ్లాలంటే రెండేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను మాత్రమే జారీ చేస్తున్నారని, ఇది చాలా తక్కువ సమయం అని చెప్పారు. కనీసం నాలుగేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను జారీ చేస్తే తమ విద్యార్థులకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. తమ విద్యార్థులు ఏజెన్సీల ఆధారంగా జర్మనీ వస్తున్నారని, అలాంటి ఏజెన్సీలకు జర్మనీ దేశం నుంచి అధికారిక గుర్తింపు ఉండేలా చూస్తే.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కోరారు. వైద్య పరిశోధనపై దృష్టి తమ రాష్ట్రంలో వైద్య పరిశోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య పరిశోధనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. జర్మనీ దేశ సాంకేతిక సహకారం కూడా తోడైతే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జర్మనీలో వైద్య రంగంలో మానవ వనరుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు భారత్ సహకారం తీసుకుంటామని జర్మన్ కాన్సుల్ జనరల్ కుచ్లర్ మంత్రి విడదల రజినితో అన్నారు. సంస్కరణలతో అద్భుత ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా అక్షరాస్యత పెరిగినట్లుగా తాము గుర్తించామని, ఇదెలా సాధ్యమైందని మంత్రిని కాన్సుల్ జనరల్ కుచ్లర్ అడిగారు. మంత్రి మాట్లాడుతూ విద్యా రంగంలో తమ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ ఫలితంగానే అక్షరాస్యత అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు. నాడు- నేడు కింద పాఠశాలల్లో వసతులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడం, అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన... లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా చదువును పేదలకు తమ ప్రభుత్వం అత్యంత చేరువ చేసిందని, బడికి పంపే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొప్ప గొప్ప సంస్కరణలను జగనన్న తీసుకొచ్చారని మంత్రి వివరించారు. ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య వసతులు అమాంతలం పెంచుతున్నామన్నారు. చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగనన్న అని వివరించారు. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ ప్రోగ్రాం తమ రాష్ట్రంలో అమలవుతున్నదని చెప్పారు. జర్మనీలో వైద్య సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో పదివేల మంది నర్సులను జర్మనీకి సేవలు అందించేందుకు పంపాలన్నా తమ వద్ద సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అవసరమైన సహకారం అందిస్తే చాలని వెల్లడించారు. భేటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎంఈ డాక్టర్ నర్సింహం, జర్మన్ రాయబార కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం....
-
రాహుల్ గాంధీని కలవనున్న డీకే. శివకుమార్, సిద్ధరామయ్య
-
సీఎం జగన్‌ను కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలు ఉద్యోగ సంఘాల నేతలు గురువారం కలిశారు. టీడీపీ హయాంలో తొలగించిన 500 మంది మండల సమన్వయకర్తలకు స్వచ్చాంధ్ర కార్పొరేషన్లో అవకాశం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున సుమారు 11 వేల మంది గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఏపీ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్.. కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్, సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. చిరంజీవిరావు వారి వెంట ఉన్నారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
ట్రిపుల్ ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ
-
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో 2,640 బీసీ కులాలున్నాయి. కుల, చేతి, సేవా వృత్తులు పోయాయి. యంత్రాలు, పరిశ్రమలు, గ్లోబలైజేషన్, ఇండస్ట్రీయలైజేషన్‌తో పెనుమార్పులు సంభవించాయన్నారు. చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
సోమవారం చెన్నైలో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం అమలు తీరుతెన్నులపై చర్చించడానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో భేటీ కానున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెరెక్ ఓ బ్రియన్ తదితరులు పాల్గొంటారు. మరికొన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ సమావేశం కాదని, సామాజిక అంశంపై చర్చించడానికి జరుగుతున్న భేటీ అని విపక్ష నేతలు వెల్లడించారు. -
సీఎం వైఎస్ జగన్ కు కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో
-
ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి.. కారణం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ, నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్ పొడిగించాలని కోరానన్నారు. ‘‘కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయి. అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు నెలలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారు. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరాను’’ అని కోమటిరెడ్డి అన్నారు. చదవండి: నడుచుకుంటూ సిట్ ఆఫీస్‌కు రేవంత్.. తీవ్ర ఉద్రిక్తత -
ప్రధాని మోదీతో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే..
3:30PM ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించారు. 3:00PM కేంద్ర మంత్రి అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం(శుక్రవారం) అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రధానితో సీఎం జగన్ భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు: ♦రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను. ♦గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ♦2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ♦గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు. ♦తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను. ♦తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ♦జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ♦రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ♦వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. -
ఈడీ విచారణ వివరాలను కేసీఆర్ తో చర్చించే అవకాశం
-
న్యూజెర్సీలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్ అండ్ గ్రీట్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వంశీ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కమ్యూనిటీ సర్వీసెస్, భవిష్యత్ లక్ష్యాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీటీఏ కన్వెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు వంశీరెడ్డి తెలిపారు. ఇక న్యూయార్క్ చాప్టర్ సభ్యులను ఆయన అభినందించారు. తమకు అండగా ఉంటూ సహాయసహాయకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇక టీటీఏ కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు న్యూయార్క్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. -
విజయవాడ: రాజ్‌భవన్‌కు సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రేపు(శుక్రవారం) ఏపీ గవర్నర్‌గా అబ్ధుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది? -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్
-
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు. చదవండి: జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర -
సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని నిక్ వుజిసిక్ అన్నారు. ఈ సందర్భంగా నిక్ ఏమన్నారంటే...: ‘‘దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అభివృద్ధి చేశారు. అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఇది అందరికీ తెలియాల్సి ఉంది’’ అని నిక్ అన్నారు. ‘‘ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’’ అని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. చదవండి: రైతు భరోసాపై మడతలు కాదు.. చంద్రబాబుకు రామోజీ చిడతలు!! -
సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీలలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్ శాస్త్రిలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను కలిసి సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్‌తో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని సీఎంతో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ మరోమారు భరోసానిచ్చారు. చదవండి: తెలుగు నేలపై విరిసిన పద్మాలు -
సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. అసోసియేషన్ల క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియతో మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ‘‘రెండు డీఏలు కూడా ఇవ్వాలని కోరాం. సంక్రాంతికి ఒక డీఏ, ఏప్రిల్ నుంచి ఎరియర్స్ ఇస్తామన్నారు. సీఎంకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞలు తెలుపుతున్నాం’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
ఖమ్మం నేతలతో భేటీ.. ‘పొంగులేటి’ వ్యవహారంపై కేసీఆర్ ఏమన్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సమావేశం సాగింది. ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. పొంగులేటి పార్టీ వీడినా నియోజకవర్గంలో క్యాడర్ చేజారకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న సీఎం కేసీఆర్ నగరంలో నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ హీట్ -
ఈనెల 18న అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ
-
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టాడు: మంత్రి కొట్టు సత్యనారాయణ
-
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ
-
అమిత్ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు హార్దిక్ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్, క్రునాల్ పాండ్యాలు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో రోహీత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k — hardik pandya (@hardikpandya7) December 31, 2022 ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
అమిత్ షాతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు విన్నవించిన అంశాల సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాకు సీఎం విన్నవించారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యు) ఏర్పాటు చేయాల్సిందిగా అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ: "ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించింది. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ... కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది." ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్ రంగంలో సేవలందించే అటువంటి సంస్థ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూ, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాకు విన్నవించిన సీఎం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపారు. ♦ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని హోం మంత్రికి వివరించారు. ♦రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘ కాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి సీఎం వివరించారు. ♦2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. 2014-15కు సంబంధించిన రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని సీఎం కోరారు. ♦పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం. ♦తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరిన సీఎం. ♦జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్న విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ♦రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన సీఎం. ♦రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం పునరుద్ఘాటించారు. ♦రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని హోం మంత్రిని కోరారు. ♦కడపలో నిర్మించనన్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరిన సీఎం ♦విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు ♦రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం ♦రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను వివరించిన సీఎం ♦కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్న సీఎం. ♦తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని తెలిపిన సీఎం. ♦‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ది చేస్తున్నాం. రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి, 2024 నాటికి పోర్ట్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి. మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరుతున్నాం.’’ అని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ♦పంప్డ్ స్టోరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం పాలసీని కూడా రూపొందించిందని, ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. చదవండి: కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే -
అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ‘‘ప్రతి పథకం ప్రజలకు అందుతుందా లేదా అన్నది పరిశీలించాలి. మైలవరంలో 89 శాతం ఇళ్లకు సంక్షేమం అందించాం. ఈ సారి మన టార్గెట్ 175 నియోజకవర్గాలు ఈ మూడున్నరేళ్లలో మైలవరంలో రూ.900 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం. ఇంత మేలు చేయగలిగాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని అడుగ గలుగుతున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘ఇతర కారణాలతో సంక్షేమం అందని వారికి కూడా గడప గడప ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం. జనవరి నుంచి బూత్ కమిటీలను నియమించనున్నాం. బూత్ కమిటిలో ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం. ముగ్గురు సభ్యుల్లో కచ్చితంగా ఒక మహిళ కూడా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, ఒక తమ్ముడు గృహ సారధులను నియమిస్తున్నాం. గృహ సారధులు, సచివాలయ కమిటి కన్వీనర్లు రానున్న 16 నెలలు ఇంటింటికి వెళ్లాలి’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: నోరు జారి నిజాలు ఒప్పుకున్నారా? -
కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం
-
Writers Meet 2022: కొత్త రచయితల గట్టి వాగ్దానం
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి. ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది. స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి. ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది. కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - సి.ఎస్. రాంబాబు ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత -
ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిసాను : కోదండరాం
-
CrossBorderTrade: డాలర్‌తో పనిలేకుండా రూపాయితో!
న్యూఢిల్లీ: సీమాంతర వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు రూపాయి మారకంలో నిర్వహించే మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యూఎస్ డాలర్‌కు బదులుగా రూపాయిలో సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించేందుకు డిసెంబరు నెల 5న బ్యాంకుల చీఫ్‌లతో చర్చించనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్) ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆరు అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల సీఈవోలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర భాగస్వాములు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. (ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని) కంపెనీల కొనుగోళ్ల నిబంధనల సమీక్ష సెబీ అత్యున్నత స్థాయి కమిటీ కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయడానికి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా సెబీ ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. న్యాయస్థానాల గత తీర్పుల కోణంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించనున్నారు. 20 మంది సభ్యుల కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ షివాక్స్ జల్ వాజిఫ్‌దార్ నేతృత్వం వహించనున్నారు. సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, న్యాయ సేవల సంస్థల సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. గణనీయ మొత్తంలో షేర్ల కొనుగోలు లేదా కంపెనీల కొనుగోలు విషయంలో నిబంధనలపై తమ సూచనలు అందించనున్నారు. చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! -
ప్రధానితో పవన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
సీఎం జగన్‌ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు గురువారం కలిశారు. ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసిన కురువ సంఘాల ప్రతినిధులు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించారు. తమ కులస్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో సీఎం సానుకూలంగా స్పందించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని -
ఈకో ఫినిక్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వ్యాపార మెళకువలు
తిరుపతి: ఈకో ఫినిక్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కేఫ్ స్టోరీస్‌లో సస్టైనబులిటీ, వేస్ట్మేనేజ్మెంట్పై శనివారం మీటప్ జరిగింది. ఈ మీటప్ సందర్భంగా ఈకో ఫినిక్స్ సీఈవో చందన్ కగ్గనపల్లి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియను మనమే నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. అలాగే రుసా సంస్థ యువ వ్యాపార వేత్తలకు వంశీ రాయల స్టాటర్జిక్ అప్లై గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వివిధ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రతినిధులు, ప్రణవి, కనిష్క శ్రేష్ట, మఫీద్, అభిలాష్, నేత్ర తదితరులు పాల్గొన్నారు. -
మంచి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని కలవడం ఒక కారణం అయితే, ఇక రెండోది మరో పద్దెనిమిది నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 18 నెలలంటే చాలా కాలం ఉందికా? ఇవ్వాళ్టి నుంచే ఆలోచన చేయాలా? అనుకోవచ్చు. ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్ చేయగలుగుతాం. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా టెక్కలికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. మీరు అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన ఉంది. ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. అర్హత ఉన్నవారికి మిస్ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేం?: తప్పకుండా గెలవగలుగుతాం.. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశాం. మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం. మన గ్రామంలో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలవుతోంది. యాభై ఇళ్లకు వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఇలా గ్రామ రూపురేఖలన్నీ మార్చాం. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తా, నాయకుడూ కూడా 175 కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం! జగన్ చేసే పని జగన్ చేయాలి. అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి. ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కేవలం ఏ ఒక్కరి వల్లనే ఇది జరగదు. నేను చేయాల్సింది నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది. టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జడ్పీటీసీలు 4కు 4 గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాగా మంచి విజయాలు నమోదు చేశాం. మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 175కి 175 ఎందుకు మనం తెచ్చుకోలేమన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.. పక్కనపెడదాం. బిగ్గర్ పిక్చర్ గుర్తుకు తెచ్చుకుందాం. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే ౩౦ ఏళ్లూ మనం ఉంటాం: ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీకూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అని కార్యకర్తలు, కీలక నేతలను ఉద్దేశించి సీఎం జగన్ ఉద్భోధించారు. పార్టీ పటిష్టతలను కొనసాగించే క్రమంలో.. నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ఆయన వరుసగా భేటీలు జరుపుతున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్ తో మంత్రి ధర్మాన భేటీ
-
దుబాయ్‌లో పద్మశాలీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం
దుబాయ్: యునైటెడ్ అరబ్‌ఎమిరేట్స్‌లో నివసిస్తున్న పద్మశాలీ కుటుంబ సభ్యులు ఆత్మీయ కుటుంబ సమ్మేళనాన్ని ఘనం నిర్వహించుకున్నారు. దుబాయ్‌లోని షెరటాన్ హోటల్లో అక్టోబర్ 16న జరిగిన ఈ వేడుకలో వందకు పైగా కుటుంబాలు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొంన్నాయి. కార్యక్రమానికి యూఏఈలోని ప్రమోద్ పిల్లమర్రి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా, మహిళా విభాగం మామ్ అండ్ మీ పేరుతో నిర్వహించిన వాక్ ఆకర్షణగా నిలిచింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన బాలలకు బహుమతులు అందించారు. నేత ఈవెంట్స్ అండ్ నార్త్ అమెరికాన్ పద్మశాలీ అసోసియేషన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. యూఏఈ అండ్ నార్త్ అమెరికాన్ పద్మశాలీ అసోసియేషన్ చాప్టర్ నూతన డైరెక్టర్‌గా రవిచంద్ర గుత్తికొండ ఎంపికయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఈ తొలి సమ్మేళనానికి లక్ష్మీనారాయణ, మార్కండేయ్ కోడి, నరహరి గంగుల, డా. నారాయణ దేవనపల్లి, ప్రజ్వల్ బంగారి, శ్రీకాంత్ జక్క, శ్రీనివాస్ అడ్డగట్ట, శ్రీనివాస్ కొండా, సుధీర్ తుమ్మా, శ్రీ విజయ్ కుమార్ తదితర అసోసియేషన్ సభ్యులు ఈ ఈ వెంట్లో భాగస్వాములయ్యారు. -
సీఎం జగన్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్
-
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఇతర సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. వారితో వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాల గురించి ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. యూకే – భారత్ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై విన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాల్లో కలిసి పని చేస్తాం ఐటీ, పరిశోధన రంగాలపై బ్రిటిష్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకు హామీ ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటిష్ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతి గురించి కూడా వారితో చర్చించారు. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్న విన్ ఓవెన్.. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా చర్చించారు. విద్యా రంగానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రిటీష్ కమిషన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రకటన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రణాళికపై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు కురిపించారు. ఈ కాన్సెప్ట్‌కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ బృందానికి సీఎం వివరించారు. ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై చర్చించారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. -
కర్నూల్ జిల్లా ఆలూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ
-
ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?: సీఎం జగన్ ‘‘గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని’’ సీఎం అన్నారు. ‘‘మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనులకోసం కేటాయిస్తున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారు. రోజూ 6 గంటలపాటు సమయం గడుపుతున్నారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు. సాధ్యం కాదుకూడా. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు మాత్రం ప్రతి గ్రామంలో తిరగాలి.. రెండురోజులపాటు తిరగాలి. రోజుకు 6 గంటలు గడపాలి. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయవల్ల గడపగడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వీలైనప్పుడు నేను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నాను. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగింది’’ అని సీఎం జగన్ అన్నారు. -
కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
ఆరేళ్ళ తర్వాత సోనియాతో భేటీ కాబోతున్న నితీష్
-
సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా కార్తీక్ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ తెలిపారు. తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. -
పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ
పాట్నా: బీహార్ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా పీకే.. నితీశ్ ప్రభుత్వాన్ని, పాలనను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లద్దరు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’ భేటీ అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వీళ్లు మళ్లీ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. అయితే భేటీ సాధారణమైందేనని, ఎలాంటి రాజకీయాల ప్రస్తావన లేదని బయటకు వచ్చాక నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అందుకే కలుసుకున్నాము. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం సాధారణ విషయాలు.. మనం ఇది చేయాలి, అలా చేయాలి అని చర్చించాం. అయినా మేం కలవడం వల్ల నష్టం ఏమిటి?.. ఇంకేమైనా ఉంటే ఆయన్నే అడగండి అంటూ మీడియాకు వివరణ ఇచ్చారు నితీశ్. పనిలో పనిగా ఓ ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు అని సమాధానం ఇచ్చారు. జేడీయూ మాజీ నేత పవన్ వర్మ నితీశ్-పీకే భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. బుధవారం సాయంత్ర పాట్నాలో దాదాపు 45 నిమిషాలపాటు వీళ్లిద్దరి భేటీ జరిగింది. పవన్ వర్మ రెండేళ్ల కిందట జేడీయూకు గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామంతో ఆయన మళ్లీ చేరతారా? లేదంటే పీకే వెంట ఉంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక పీకేతోనూ రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు నితీశ్. ఈ క్రమంలో జన్ సురాజ్ పేరిట ఓ విభాగం ప్రారంభించిన పీకే.. బీహార్‌లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు కూడా. ఇదీ చదవండి: పళనిస్వామికి బిగ్ షాక్ -
సీఎం జగన్ కలిసిన మున్నూరు కాపు సంఘం నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు సోమవారం కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను నేతలు కలిశారు. చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్ అనంతరం.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ, విలీనం తర్వాత ఎన్ని సార్లు చంద్రబాబుకి చెప్పుకున్నా ఫలితం లేదన్నారు. వరద పర్యటన సమయంలో సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపులు.. బీసీ-డీ కింద చేర్చాలని, తెలంగాణలో ఉన్న పరిస్థితిని విన్నవించారన్నారు. విలీన మండలాల్లో ఉన్న మున్నూరు కాపులను బీసీ-డీ కిందకు తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. కాపు నేస్తం రూపకర్త సీఎం వైఎస్ జగన్.. ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం ఇలా అన్ని సమస్యలు తీరుస్తుంటే ప్రతిపక్షాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. జనసేన పార్టీ నాయకుడు ఎక్కడా కాపుల కోసం పోరాడింది లేదని.. చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని రోడ్డుకు ఈడ్చాడని ఆయన దుయ్యబట్టారు. బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే.. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే నడుస్తామన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆశలు చిగురించాయి.. మున్నూరు కాపు నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మాలో ఆశలు చిగురించాయన్నారు. తమకు మున్నూరు కాపు సర్టిఫికేట్ బీసీ-డీ కింద వచ్చిందన్నారు. -
రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ
న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్బీఐ, బ్యాంకింగ్ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి. ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్ అవుతోంది. -
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరణ! రాష్ట్రపతిని కలిసేందుకు ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు రోజంతా అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యాయి. ప్రతిపక్ష శాసన సభ్యులైన బీజీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆప్ పార్టీపై వచ్చిన ఆరోపణలపై చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. వారంతా తరగతి గదుల నిర్మాణం, ఎక్సైజ్ పాలసీ 2021-22 అవకతవకలు జరిగిన ఆరోపణలపై చర్చ జరగాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో బీజీపీ ఎమ్మెల్యేలను బహిష్కరణకు గురై ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి మాట్లాడుతూ...బీజేపీ ఎమ్మెల్యేలను రాజ్యంగ విరుద్ధంగా అసెంబ్లీ నుంచి రోజంతా బహాష్కరించారంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అందువల్లే ఈ అంశాలపై చర్చించేందుకు భయపడుతోందని దుయ్యబట్టారు. ఆప్ పార్టీ నియంతృత్వంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎప్పటికప్పుడూ విపక్షాలను సభ నుచి తరిమికొడుతుందని ఎద్దేవ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఈ విషయమై రాష్ట్రపతిని సంప్రదిస్తామని తేల్చి చెప్పారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌తో కూడా సభను నిరంతరాయంగా వాయిదా వేస్తున్న ఆంశాన్ని కూడా లేవనెత్తుతామని బిధూరి అన్నారు. ఢిల్లీలో ఏడాది పొడవునా కనీసం మూడు శాసనసభ సమావేశాలు జరగాలని వాటి వ్యవధి పది రోజుల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన పెట్టాలని అభ్యర్థిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేవలం ఒక్క రోజు సుదీర్ఘ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని అందులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఢిల్లీ ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదని బిధూరి ఆరోపించారు. -
బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ నోవాటెల్‌లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్‌షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? -
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో ఉన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆమె కేంద్రమంత్రిని కలిశారు. చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ తర్వాత కేంద్రంలో కదలిక ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు విషయాలను చర్చించారు. పలు అంశాలపై వినతి పత్రాలు అందించారు. ఆమె మాట్లాడుతూ పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, ఇప్పుడు ఈ మూడు చోట్ల కళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గతంలో ఏపీలో 13 జిల్లాలు ఉండేవని, జనాభా అత్యధికంగా పెరిగిపోయిన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికే అన్ని చోట్లా మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. తగిన ఆర్థిక సాయం అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీలో కీలకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వ చేయూత కూడా తోడైతే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని త్వరలో రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని చెప్పారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల గురించి కేంద్రమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సహకారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వినతికి స్పందించిన కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ ఏపీలో చేపట్టిన నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి అన్ని విధాలా సాయం చేస్తామని చెప్పారు. 10 లక్షలు జనాభా దాటిన ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తుండటం అభినందనీయమని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలో.. అవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ ప్రభుత్వ కళాశాలలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. మన దేశంలోని విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీలో తాను స్వయంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించానని, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శి ఉండటం చాలా గొప్ప విషయమని తెలిపారు. వైద్య ఆరోగ్యరంగానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ మేరకు అన్ని విషయాల్లో కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీలో ఆరోగ్యశ్రీ చాలా బాగా అమలవుతోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ఈ దేశ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందేలా చేయగలిగిందని చెప్పారు. ఏపీలో రైల్వే, ఈఎస్ఐ ఆస్పత్రుల పరిధిలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు? -
యూనికార్న్‌ల కీలక భేటీ
న్యూఢిల్లీ: ఐపీవోకు రావాలనుకుంటున్న 10 యూనికార్న్‌లతో జేపీ మోర్గాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించాయి. బెంగళూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో ఇది జరిగింది. వచ్చే మూడేళ్లలో ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్న స్విగ్గీ, అన్అకాడమీ తదితర యూనికార్న్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం ఇందులో పాల్గొన్నాయి. మామాఎర్త్, లెన్స్‌కార్ట్, అకో, మీషో, ఎలాస్టిక్‌రన్, ఇన్‌మొబి సైతం ఇందులో పాల్గొన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ తదితర 14 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం పాలు పంచుకున్నాయి. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను యూనికార్న్‌లు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, యూనికార్న్‌ల మధ్య మెరుగైన సమాచార సంప్రదింపులకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది వచ్చిన పేటీఎం, జొమాటో సెకండరీ మార్కెట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది.