Brendon McCullum
-
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్‌లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్‌కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్ -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు..ఈ ఘెర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే పుణే టెస్టులో రోహిత్ సేన పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. లక్ష్య చేధనలో యశస్వీ దూకుడుగా ఆడి అభిమానుల్లో గెలుపుపై ఆశలను పెంచాడు. కానీ మిగితా బ్యాటర్లు చేతులేత్తేయడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. జైశ్వాల్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యశస్వీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.జైశ్వాల్ అరుదైన ఘనత.. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 30 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి భారత ప్లేయర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. 2024 ఏడాదిలో జైశ్వాల్ ఇప్పటివరకు 32 సిక్స్‌లు కొట్టాడు.ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ (33 సిక్స్‌లు) పేరిట ఉంది. ఈ కివీ దిగ్గజం 2014లో 33 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు యశస్వీ మరో రెండు సిక్స్‌లు బాదితే మెక్కల్లమ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. కివీస్‌తో జరిగే మూడో టెస్టులో ఈ రికార్డు బద్దులు అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: ‘కివీ’ చేతుల్లో ఖేల్ ఖతం! -
పాక్ గడ్డపై ఇంగ్లండ్ వీరుల విధ్వంసం(ఫోటోలు)
-
కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్
ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సోమవారం(ఆక్టోబర్ 7) ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. కాగా ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. ఇంకా జట్టుతో చేరలేదు.ఈ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో సైతం జిమ్మీ భాగం కాలేదు. అండర్సన్ ప్రస్తుతం స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న గోల్ప్ టోర్నీ ఆల్ఫ్రెడ్ డన్హిల్ లింక్స్ ఛాంపియన్‌షిప్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు జట్టుతో కలిసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు అతడి తీరును తప్పుబడుతున్నారు. కీలకమైన సిరీస్‌ను పక్కన పెట్టి గోల్ప్ టోర్నీలో పాల్గోనడమెంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్సన్‌కు ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. జిమ్మీ ఇంకా జట్టుతో చేరనప్పటకి వర్చవుల్గా తన సూచనలు అందిస్తున్నాడని మెకల్లమ్ తెలిపాడు."రెండు నెలల క్రితం ఆండర్సన్ కోచ్‌గా పనికిరాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో అతడు ఇంకా జట్టుతో చేరలేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మేము కూడా అతడిని మిస్ అవుతున్నాము. ఒక ఆటగాడి నుండి కోచ్‌గా మారిన తక్కువ సమయంలో జిమ్మీ ఎంత ప్రభావం చూపించాడో మాకు ఇప్పుడు ఆర్ధమవుతోంది.ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. అతడు తన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జట్టుతో పాటే ఉండాల్సిన అవసరం లేదు. వర్చువల్‌గా అతడు మా బౌలర్లకు సలహాలు, చిట్కాలు అందిస్తున్నాడు. అతడు స్కాట్లాండ్లో జరుగుతున్న గోల్ఫ్ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ విషయం మాకు ముందే చెప్పాడు. మేము అందరి కలిసి తీసుకున్న నిర్ణయమిది. జిమ్మీ త్వరలోనే జట్టుతో చేరుతాడు. అతడు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తన న్యూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కాబట్టి అతడికి తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఇవ్వాలి కాదా. జిమ్మీ మా జట్టు పార్ట్‌టైమ్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే. పూర్తి స్ధాయిలో అతడు తన సేవలను అందించడు" అంటూ ఓ ఇంటర్వ్యూలో మెకల్లమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో) -
మరోసారి 'యూ టర్న్' తీసుకోనున్న బెన్ స్టోక్స్..!
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సారధి బెన్ స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బరిలోకి దిగాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘోర పరాభవం నేపథ్యంలో స్టోక్స్ అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా స్టోక్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లోని మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని క్లూ ఇచ్చాడు. ఈ విషయమై జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తనను సంప్రదిస్తే తాను రెడీ అంటూ సంకేతాలు పంపాడు.రిటైర్మెంట్ విషయమై ఆటగాళ్లు మనసు మార్చుకోవడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. చాలా మంది క్రికెటర్లు స్టోక్స్ లాగే తొలుత రిటైర్మెంట్ ప్రకటిస్తారు.. ఆతర్వాత ఆ కారణం.. ఈ కారణం చెప్పి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తావించాడు. రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకోవడం ఆటగాళ్లకు ఫ్యాషన్‌గా మారిపోయిందని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.స్టోక్స్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ టెస్ట్ సారధి వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ మెగా టోర్నీ కావడంతో స్టోక్స్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తుండవచ్చు. మళ్లీ ఈ టోర్నీ అయిపోయిన వెంటనే స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్యర్యపోనక్కర్లేదు. 33 ఏళ్ల స్టోక్స్ ఫిట్నెస్ పరంగానూ పెద్దగా పర్ఫెక్ట్గా లేడు. టెస్ట్‌ల్లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. బౌలింగ్ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్ట్‌ల్లో మాత్రం అతన్ని మ్యాచ్ విన్నర్‌గా తీసిపారేయడానికి వీళ్లేదు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం అతనికి ఇంకా ఉంది.స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 105 టెస్ట్‌లు, 114, 43 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను గత కొంతకాలం యాక్టివ్‌గా లేడు. మెక్కల్లమ్ ఇంగ్లండ్ ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత స్టోక్స్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. చదవండి: మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్ -
ఇదొక అద్భుత నిర్ణయం.. నిజంగా నమ్మలేకపోతున్నాను: బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ పురుషుల జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా ఉన్న మెకల్లమ్‌కు ఆదేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై మూడు ఫార్మాట్లలో ఇంగ్లీష్ జట్టు హెడ్‌కోచ్‌గా మెకల్లమ్ వ్యవహరించనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌తో వైట్‌బాల్ కోచ్‌గా మెకల్లమ్ తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు.టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఇంగ్లండ్ హెడ్‌కోచ్ పదవి నుంచి మాథ్యూ మోట్ తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. ఇక వైట్‌బాల్ కోచ్ మెకల్లమ్ ఎంపికపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా స్పందించాడు. ఇదొక సంచలన నిర్ణయమని స్టోక్స్ అన్నాడు."మెకల్లమ్ మా జట్టు వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. తొలుత ఈ వార్త విని చాలా ఆశ్చర్యపోయాను. అన్ని ఫార్మాట్లలో మెకల్లమ్ కోచ్‌గా ఎంపిక అవ్వడం ఇంగ్లండ్ క్రికెట్ ప్రపంచంలో తిరిగిలేని శక్తిగా అవతరిస్తుంది.ఇదొక అద్భుతమైన నిర్ణయం. అతడు ఇప్పటికే కోచ్‌గా టెస్టుల్లో ఏమి సాధించాడో మనం చూశాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా బాజ్(మెకల్లమ్)తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతడికి వైట్‌బాల్ క్రికెట్లో చాలా అనుభవం ఉంది.అదే విధంగా బట్లర్ కూడా మెకల్లమ్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నడాని నేను భావిస్తున్నాను. చాలా మంది కొత్త ఆటగాళ్లు కూడా మెకల్లమ్ గైడన్స్‌లో ఆడేందుకు సముఖత చూపుతారు. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్సీ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్ల హెడ్ కోచ్‌గా మెక్కల్లమ్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్ల హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 3) అధికారికంగా ప్రకటించింది. మెక్కల్లమ్ 2022 నుంచి ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అతని కాంట్రాక్ట్‌ను ఈసీబీ 2027 వరకు పొడిగించింది. మెక్కల్లమ్ పూర్తి స్థాయి ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా వచ్చే ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపడతాడు. భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి మెక్కల్లమ్ ప్రస్తానం మొదలుకానుంది. అనంతరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెక్కల్లమ్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోథిక్ వ్యవహరిస్తాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు, ఆతర్వాత విండీస్ పర్యటనకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పని చేస్తాడు. కాగా, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా ఉన్న మాథ్యూ మాట్స్ ఇటీవలే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మాట్స్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022లో ఛార్జ్ తీసుకున్నాడు. అయితే అతను అనివార్య కారణాల వల్ల తన నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగాడు. మాట్స్ వైదొలిగిన నెల వ్యవధిలోనే ఈసీబీ మెక్‌కల్లమ్‌ను వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా నియమించింది. మాట్స్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
అండర్సన్ సంచలన నిర్ణయం.. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న ఆండర్సన్.. ఈ వేసవి సీజన్‌తో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా 41 ఏళ్ల ఆండర్సన్ వెల్లడించాడు."ఈ వేసవిలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు మ్యాచ్. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్‌కు ,అభిమానులకు ధన్యవాదాలంటూ" ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్ రాసుకొచ్చాడు. ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) -
విరాట్ గొప్ప బ్యాటర్.. ఎంట్రీ ఇస్తే ఏం చేయాలో తెలుసు!
'Respect His Prowess & Competitiveness': టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆటంటే తనకెంతో గౌరవమని.. అతడు భాగంగా ఉన్న జట్టుతో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడినని గుర్తు చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కోహ్లి సొంతమన్న మెకల్లమ్.. ప్రత్యర్థి జట్టుతో అతడు పోటీపడే తీరు మజా అందిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మూడో టెస్టుతో కోహ్లి రీ ఎంట్రీ ఇస్తే అతడిని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి.. ‘బజ్‌బాల్’ పేరిట సంప్రదాయ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ విజయవంతంగా ముందుకు సాగుతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్ వేదికగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ రెండు టెస్టులకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరమయ్యాడు. అందుకే కోహ్లి దూరం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మ కోసం అతడు సమయం కేటాయించాడని కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లి పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం ఈ నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడి ఆట, పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం. తనతో మ్యాచ్‌లు ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని. విజయవంతమైన ఆటగాడితో పోటీ పడటం అంటే.. మనం కూడా ఎంతో కొంత నేర్చుకునే వీలు ఉంటుంది కదా!’’ అంటూ కోహ్లిని కొనియాడాడు. మూడో టెస్టు నేపథ్యంలో కోహ్లి తిరిగి వస్తే.. అతడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారించామని మెకల్లమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా కోహ్లి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం గురించి రాహుల్ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురుకాగా.. సెలక్టర్లకే కోహ్లి అందుబాటులో ఉండే విషయం గురించి అవగాహన ఉంటుందని తెలిపాడు. అతడితో వాళ్లు టచ్‌లో ఉన్నారని.. జట్టు ప్రకటన నాటికి క్లారిటీ వస్తుందంటూ మాట దాటేశాడు. చదవండి: శివం దూబేకు విశ్రాంతి.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ! -
మళ్లీ స్పిన్ పిచ్‌కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్‌పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్‌లోని పిచ్ కూడా స్పిన్‌కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్‌లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్‌కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్‌గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా ఫుల్‌టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్‌గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్‌బాల్ క్రికెట్‌ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్‌కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ ‘22బెట్ ఇండియా’కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్‌లో రిజిస్టర్ అయిన బెట్22తో గత నవంబర్‌లో మెకల్లమ్ ఒప్పందం కుదర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్‌లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్ హెడ్ కోచ్‌గా మెకల్లమ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్’ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్‌గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టులు గెలిచింది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా స్టోక్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ తన మొదటి సిక్స్‌తో ఈ రికార్డును తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ పేరిట ఉండేది. తన కెరీర్లో 101 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్107 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో మెకల్లమ్ రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. కాగా స్టోక్స్ ఇప్పటివరకు 90 మ్యాచుల్లో 108 సిక్స్‌లు కొట్టాడు. ఇక తర్వాత స్థానాల్లో ఆడమ్ గిల్ క్రిస్ట్ (100), క్రిస్ గేల్(98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ 384 పరుగుల ముందంజలో ఉంది. కాగా టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ వన్డే తరహాలో ఆడుతోంది. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Most Test Sixes: 109 BEN STOKES 🏴 (164 innings) 107 Brendon McCullum 🇳🇿 (176) 100 Adam Gilchrist 🇦🇺 (137) 98 Chris Gayle 🏝️ (182) 97 Jacques Kallis 🇿🇦 (280) 91 Virender Sehwag 🇮🇳 (180) 88 Brian Lara 🏝️ (232) 87 Chris Cairns 🇳🇿 (104)#NZvENG #NZvsENG — Fox Sports Lab (@FoxSportsLab) February 18, 2023 -
T20 WC: టీ20 వరల్డ్‌కప్-2022.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు అరుదైన రికార్డులు
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 1.కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించే అవకాశం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 2010 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. 2. నాలుగో స్థానం నుంచి.. టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. విండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్‌లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 3. ఈ రికార్డు లాంఛనమే! హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే! ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు ►తిలకరత్నె దిల్షాన్-35 ►డ్వేన్ బ్రావో- 34 ►షోయబ్ మాలిక్- 34 ►ఎంఎస్ ధోని- 33 ►క్రిస్ గేల్-33 ►ముష్ఫికర్ రహీం- 33 ►రోహిత్ శర్మ- 33 4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్‌ను అధిగమించే అవకాశం ఉంది. 5. ఇంకో మూడు సిక్స్‌లు కొడితే టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. మరో మూడు సిక్స్‌లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్‌లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్‌మ్యాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. నేనిది కోరుకోలేదు: ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్
England vs South Africa, 3rd Test: బ్రెండన్ మెకల్లమ్.. ఈ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ జట్టు ఇంతవరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. కొత్త కెప్టెన్ బెన్‌స్టోక్స్ సారథ్యంలో మే నుంచి వరుస విజయాలు సాధిస్తోంది. బజ్‌బాల్ విధానంతో దూకుడైన ఆట కనబరుస్తూ స్వదేశంలో సంచలనాలు నమోదు చేసింది. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. లండన్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు! ఈ మేరకు స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెండన్ మెకల్లమ్.. ‘‘నిజానికి నాకసలు ఇంగ్లండ్ కోచ్‌గా జాబ్ అవసరమే లేదు! అయితే.. ఆ పదవి నన్ను వరించింది. నాకిది నచ్చింది. ఇప్పుడు నా పనిని ప్రేమిస్తున్నాను. ఇంతకు ముందెన్నడూ నాకు ఇలాంటి అనుభవం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడ ప్రతిభకు కొదువ లేదు. ఆట పట్ల వారి అంకితభావాన్ని దగ్గరగా గమనిస్తున్నా. ముఖ్యంగా స్టోక్స్‌తో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. తనొక అద్భుతమైన మనిషి. తనకెవ్వరూ సాటిరారు. తను గొప్ప నాయకుడు. కెప్టెన్‌గా సరైన వ్యక్తి’’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌ను వీడి.. ఇంగ్లండ్ కోచ్‌గా.. తాము ఇలాగే వరుస సిరీస్‌లు గెలుస్తూ అభిమానులకు ఆనందం పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తామని తెలిపాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌కు మార్గదర్శనం చేసే క్రమంలో అతడు కేకేఆర్‌కు దూరం కాగా.. 2023 సీజన్‌కు గానూ చంద్రకాంత్ పండిట్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకుంది కోల్‌కతా ఫ్రాంఛైజీ. చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం? క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ -
బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర
Bazball: బజ్‌బాల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్‌బాల్..? క్రికెట్‌కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పదం బజ్‌బాల్. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్‌బాల్ అని అంటారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ నిర్ధేశించిన భారీ టర్గెట్లను ( 277, 299, 296) బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లోనూ ఇంగ్లండ్ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రూట్, బెయిర్‌స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్‌ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్ మోడ్‌లో సాగే టెస్ట్ క్రికెట్లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేసే ఈ అటాకింగ్ స్టయిల్‌నే బజ్‌బాల్ అంటారు. మెక్కల్లమ్, స్టోక్స్‌లు ఇంగ్లండ్ కోచింగ్, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్‌కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్‌బాల్ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్‌కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్‌బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్‌ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్ శర్మ -
టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 100 సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. లీడ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును 151 టెస్టు ఇన్నింగ్స్‌లలో స్టోక్స్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో 107 సిక్స్‌లతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఉండగా, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అరుదైన ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడు స్టోక్స్ కావడం విశేషం. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్లు బ్రెండన్ మెకల్లమ్- 107(176 ఇన్నింగ్స్‌లు) ఆడమ్ గిల్‌క్రిస్ట్-100( 137 ఇన్నింగ్స్‌లు) బెన్ స్టోక్స్-100 (151 ఇన్నింగ్స్‌లు) క్రిస్ గేల్-98 (182 ఇన్నింగ్స్‌లు) జాక్వెస్ కల్లిస్- 97(280 ఇన్నింగ్స్‌లు) వీరేంద్ర సెహ్వాగ్-91(104 ఇన్నింగ్స్‌లు) బ్రియాన్ లారా-88(232 ఇన్నింగ్స్‌లు) క్రిస్ క్రేయన్స్-87(104 ఇన్నింగ్స్‌లు) వివ్ రిచర్డ్స్-84(182 ఇన్నింగ్స్‌లు) ఆండ్రూ ఫ్లింటాఫ్-82(130 ఇన్నింగ్స్‌లు) చదవండి:T20 WC 2022: 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం' -
'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్, కోచ్ అడుగుపెట్టిన వేళ
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్‌గా వెలిగిన జో రూట్.. గతేడాది మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో వంక పెట్టలేకున్నా.. కెప్టెన్సీలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. రూట్ కెప్టెన్సీలో గత 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. అది కూడా గతేడాది భారత్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్. ఆ తర్వాత జరిగిన 12 టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయిన ఇంగ్లండ్ మరో ఆరింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ వరుసగా ఓడిన టెస్టు సిరీస్‌ల్లో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌తో పాటు వెస్టిండీస్ సిరీస్‌లు ఉన్నాయి. దీంతో జట్టును మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అభిమానులు విమర్శలు కురిపించారు. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ రూట్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త కెప్టెన్‌గా రావడం.. కొత్త కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ దశ పూర్తిగా మారిపోయింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ వచ్చాకా ఇంగ్లండ్ టెస్టుల్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అది ఏకపక్ష విజయాలు కావడం విశేషం. ఆరు నెలల క్రితం వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టు తాజాగా మాత్రం బలంగా తయారైంది. దానికి కొత్త కోచ్, కొత్త కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే అని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటతీరుపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్‌ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలోనే మైండ్‌సెట్ ఎంతలా మారింది.. కొత్త కోచ్, కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే’ అంటూ తెలిపాడు. ఇక నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్లో ఇంగ్లండ్ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు), స్టోక్స్ (75 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయతీరాలకు చేరింది. June 2021: NZ set Eng 273 in 75 overs. Eng bat out a draw scoring 170/3 (70). June 2022: NZ set Eng 299 in 72 overs. Eng chase it down in 50 overs! What changed? Mindset. #ENGvNZ pic.twitter.com/zOMbJMB51I — Wasim Jaffer (@WasimJaffer14) June 14, 2022 We’ve just chased 299 in 50 overs in a Test match on day five 🤯 Scorecard & Videos: https://t.co/ffFnHnaIPX 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/EPG1oNUWuD — England Cricket (@englandcricket) June 14, 2022 చదవండి: 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్లో నయా రికార్డు 'సంజూ శాంసన్‌లో అదే పెద్ద మైనస్.. అందుకే'.. క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు -
సెంచరీతో చెలరేగిన జో రూట్.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. రూట్ 170 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. విజయానికి 61పరుగులు కావాల్సిన నేపథ్యంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. రూట్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ 54, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 32 పరుగులతో రాణించారు. రూట్, ఫోక్స్ కలిసి 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 132 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ సైతం 141పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న న్యూజిలాండ్ 285పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డార్లీ మిచెల్ 108,టామ్ బ్లండెల్ 96 పరుగులతో రాణించారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ పేసర్ కైలీ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటర్లకు చక్కులు చూపించాడు. ఈ దశలో రూట్, స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక స్టోక్స్ ఔటయ్యక రూట్..ఫోక్స్‌తో కలిసి ఇంగ్లండ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..! -
IPL 2022: చాలా కాలం బెంచ్‌కే పరిమితం.. కానీ ఇప్పుడు సూపర్: మెకల్లమ్
IPL 2022 KKR Vs LSG- Rinku Singh: కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ ఆటగాడు రింకూ సింగ్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైన సమయంలో తానున్నానంటూ భరోసానిచ్చే గొప్ప ఆట తీరు అతడి సొంతమని కొనియాడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనను తాను నిరూపించుకున్నాడని రింకూను.. మెకల్లమ్ ప్రశంసించాడు. కాగా ఐదేళ్లుగా కేకేఆర్‌తో ఉన్న రింకూ ఐపీఎల్-2022లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 174 పరుగులు సాధించాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో విజయతీరాలకు చేర్చి సత్తా చాటాడు. ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ రింకూ ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం. బుధవారం(మే 18) నాటి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. కానీ రెండు పరుగుల తేడాతో ఓడి కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతడి వీరోచిత పోరాటం వృథాగా పోయింది. అయితే, మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడంటూ రింకూపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ హెడ్‌కోచ్ మెకల్లమ్ మాట్లాడుతూ.. ‘‘రింకూ సింగ్‌పై కేకేఆర్ ఫ్రాంఛైజీ నమ్మకం ఉంచింది. రానున్న కాలంలో అతడు కీలక సభ్యుడిగా ఎదిగే అవకాశం ఉంది. మిడిలార్డర్లో రాణిస్తూనే ఒంటిచేత్తో జట్టును గెలిపించగల కొంతమంది ఆటగాళ్లలో రింకూ ఒకడు. తన ఆట తీరు అద్బుతం. ఐదేళ్లుగా ఐపీఎల్లో భాగమయ్యాడు. చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ అవకాశం వచ్చినపుడు విజృంభించాడు. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొట్టాడు. సరైన సమయంలో తానేంటో నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణిస్తాడు’’ అని రింకూను కొనియాడాడు. ఐపీఎల్ మ్యాచ్ 66: లక్నో వర్సెస్ కేకేఆర్ స్కోర్లు లక్నో- 210/0 (20) కేకేఆర్- 208/8 (20) చదవండి👉🏾Shreyas Iyer: ఐపీఎల్-2022.. కేకేఆర్ అవుట్.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); WHAT. A. GAME !!@LucknowIPL clinch a thriller by 2 runs. Scorecard - https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL pic.twitter.com/7AkXzwfeYk — IndianPremierLeague (@IPL) May 18, 2022 View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా మాథ్యూ మాట్..
ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్ ఎంపికయ్యాడు. మాట్ నాలుగేళ్లు ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే మాట్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా మాట్ గత ఏడేళ్లుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మాట్ కోచ్‌గా ఉన్న కాలంలోనే ఆస్టేలియా జట్టు వన్డే ప్రపంచకప్, రెండు టీ20 ప్రపంచకప్‌లు కైవసం చేసుకుంది. "ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాథ్యూ మాట్ను నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం" అని ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్.. -
Eng Vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. వాళ్లిద్దరికీ చోటు!
England Vs New Zealand Test Series 2022: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్‌తో తలపడబోయే జట్టులో 13 మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇక టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. అదే విధంగా కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్‌కు కూడా ఇదే తొలి సిరీస్.. అది కూడా సొంతజట్టుపై కావడం మరో విశేషం. ఇక ఈ సిరీస్‌తో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇక దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న హారీ బ్రూక్, మాథ్యూ పాట్స్ అరంగేట్రం చేయనున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జో రూట్, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: జూన్ 02- 06 తొలి టెస్టు: లార్డ్స్ మైదానం జూన్ 10-14 రెండో టెస్టు: ట్రెంట్ బ్రిడ్జ్ జూన్ 23- 27 మూడో టెస్టు: హెడ్డింగ్లీ, లీడ్స్ చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ చదవండి👉🏾Zubayr Hamza: సౌతాఫ్రికా బ్యాటర్‌పై ఐసీసీ నిషేధం -
'ఇక ఇంగ్లండ్ జట్టు టీ20లా టెస్టు క్రికెట్ ఆడనుంది'
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా మెకల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. కాగా ఇంగ్లండ్ కోచ్‌గా ఎంపికైన మెకల్లమ్‌పై కేకేఆర్ ఆస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మెకల్లమ్‌కు రెడ్-బాల్ కోచ్‌గా అనుభవం లేదని, రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ టెస్ట్ ఫార్మాట్లో టీ20లా దూకుడుగా ఆడుతుందని నాయర్ అభిప్రాయపడ్డాడు. "బెన్ స్టోక్స్, బ్రెండన్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతుందని నేను భావిస్తున్నాను. వీరిద్దరి కలియికలో ఇంగ్లండ్ జట్టు వైట్‌బాల్ ఫార్మాట్‌లా ఆడుతుంది. టెస్టుల్లో బ్యాటర్లు భారీ షాట్లు, రిస్క్ తీసుకుని ఆడటం చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌ను అత్యుత్తమ జట్టుగా తీర్చుదిద్దుతాడన్న నమ్మకం నాకు ఉంది. అతడు ముందుగా ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ఆపై తన సలహాలు ఇస్తాడు" అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..! -
మెక్కల్లమ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇంగ్లండ్ నూతన టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్ సిల్వర్‌వుడ్ స్థానంలో కొత్త కోచ్‌గా వచ్చిన మెక్కల్లమ్ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మెక్కల్లమ్ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్‌కల్లమ్‌కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్‌కోచ్‌కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన మెక్కల్లమ్ స్పందించాడు. ''ఇంగ్లండ్ క్రికెట్‌కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టును గాడిలోపెట్టడానికి ప్రయత్నిసా. బెన్ స్టోక్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి: IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు RCB Play-Off Chances: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్..
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం వెల్లడించింది. ఇక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ కూడా తప్పుకున్నాడు. అతడి స్థానంలో బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికయ్యాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే మెక్ కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక మెక్ కల్లమ్ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్ని నియమించడం మాకు ఆనందంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం. మెక్ కల్లమ్ రాకతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి' -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్..!
లండన్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్‌ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్‌ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్ రాజీనామా చేశాక బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు).. టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ మాజీ సారధి, కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా, జూన్‌లో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్‌కల్లమ్‌కు డీల్ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది' -
ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడినప్పటి నుంచి అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరనే దానిపై ఈసీబీలో పెద్ద చర్చ నడిచింది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) టెస్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక టెస్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. 2011లో వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో కిర్‌స్టన్ పాత్ర మరువలేనిది. ఇక టెస్టు కోచ్‌తో పాటు.. వైట్‌బాల్ క్రికెట్ కోచ్‌ను ఈసీబీ ఎంపికచేయనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌కు ఆడిన సమయంలో బెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మెక్కల్లమ్.. మంచి వ్యూహాలు పన్నగల కెప్టెన్‌గా రాణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మెక్కల్లమ్ ఇంగ్లండ్‌ను గాడిలో పెడతాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు మెక్కల్లమ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఇక కిర్‌స్టన్ లాగే మెక్కల్లమ్ కూడా సక్సెస్ఫుల్ కోచ్. ప్రస్తుతం ఐపీఎల్లో మెక్కల్లమ్ రెండుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2012లో న్యూజిలాండ్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో కివీస్ 2015 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడి రన్నరప్‌గా నిలిచింది. చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ? Ajaz Patel: భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి.. -
ఆరోజు అలా.. ఇప్పుడిలా.. పాపం మెకల్లమ్.. పర్లేదు.. తలెత్తుకోండి!
IPL 2022 RR Vs KKR: పదిహేనేళ్ల క్రితం... ఏప్రిల్ 18న... కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తెరలేచింది. ఇక క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్(ఏప్రిల్)లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేరు. వైభవోపేతంగా ఆరంభమైన మొదటి సీజన్ తొలి మ్యాచ్‌లో కేకేఆర్,ఆర్బీబీ పోటీపడ్డాయి. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఒక్కసారిగా విజృంభించాడు.. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాత విజృంభించాడు. నాలుగు బంతుల్లో 18 పరుగులు సాధించి తన ఖాతా తెరిచాడు. ఇక అంతే.. ఆ తర్వాత మెల్లకమ్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేయడం ఏ బౌలర్‌కూ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులతో మెకల్లమ్ అజేయంగా నిలిచాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ మూలంగా ఆర్సీబీ ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందించిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 15.1 ఓవర్లలోనే 82 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 140 పరగుల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఇక కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. యాజమాన్యానికి ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అయితే, విశేషం ఏమిటంటే.. నాడు కేకేఆర్ బ్యాటర్‌గా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మెకల్లమ్.. ఐపీఎల్-2022లో హెడ్‌కోచ్‌గా తమ జట్టును మాత్రం ఈ ప్రత్యేకమైన రోజున(ఏప్రిల్ 18)న విజేతగా చూడలేకపోయాడు. ఐపీఎల్-2022లో భాగంగా.. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించినా.. 17వ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చహల్ తన అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్ పతనానికి బాటలు వేశాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్‌నే విజయం వరించింది. ఏడు పరుగుల తేడాతో సంజూ శాంసన్ సేన గెలుపొందింది. తలెత్తుకోండి! ఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తమ జట్టును ఉద్దేశించి భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ‘‘చాలా బాగా ఆడారు. శ్రేయస్ అయ్యర్, ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 150వ మ్యాచ్ ఆడిన సునిల్ నరైన్‌కు అభినందనలు. 15 ఏళ్ల క్రితం బ్రెండన్ మెకల్లమ్ ఇదే రోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. మనం ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. కిందపడినపుడే మరింత పట్టుదలగా ముందుకు వెళ్లగలం. తలెత్తుకుని ఉండాలి మీరు’’ అని షారుఖ్ మంగళవారం ట్వీట్ చేశాడు. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ స్కోర్లు: రాజస్తాన్- 217/5 (20) కోల్‌కతా- 210 (19.4) చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 Well played boys. Stupendous effort by @ShreyasIyer15 @AaronFinch5 @y_umesh congrats to #SunilNarine for the 150th match & @Bazmccullum for that innings 15 yrs ago. I know we lost but if we have to go down this is the only way to do it! Keep ur chins up…. — Shah Rukh Khan (@iamsrk) April 18, 2022 -
IPL 2022: అహ్మదాబాద్ 8 కోట్లు పెట్టింది.. వదిలేసినందుకు చాలా బాధగా ఉంది: హెడ్‌కోచ్
శుభ్‌మన్ గిల్... ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్లో 17 ఇన్నింగ్స్‌లో 478 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కానీ... ఐపీఎల్ మెగా వేలం-2022కు రిటెన్షన్ సమయంలో కేకేఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కెప్టెన్ కాగలడని భావించిన శుభ్‌మన్ గిల్‌ను వదిలేసుకుంది. ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు) , వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ గిల్‌ను సొంతం చేసుకుంది. వేలానికి ముందు ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేసుకునే క్రమంలో రూ. 8 కోట్లు వెచ్చించి ఈ టీమిండియా ఓపెనర్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రిటెన్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభ గల యువ ఓపెనర్ గిల్‌ను దూరం చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ‘‘సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ దశాద్దకాలంగా సేవలు అందిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి సామర్థ్యమేమిటో గత రెండు సీజన్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి వీరే సాటి. తనదైన రోజున ఆండ్రీ రసెల్ ఎలాంటి అద్భుతాలు చేయగలడో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను వదిలేయాల్సి వచ్చింది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్‌ను కోల్పోవడం నిరాశ కలిగించింది. కొన్నిసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఏదేమైనా మెగా వేలానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ "I'd love to hear some suggestions from the fans: Which players do they think we should target and also, why?" - @Bazmccullum Register for #KKRMockAuction here 👉 https://t.co/vsfROhjYuZ if you haven't already!#GalaxyOfKnights #KKR #IPL pic.twitter.com/k8MOOZ1ddQ — KolkataKnightRiders (@KKRiders) January 29, 2022 -
IPL 2021 Final: అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం!
Brendon McCullum Comments: ‘‘ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండే విజయాలు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం అదే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్మెంట్కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం’’- కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్... జట్టును ఉద్దేశించి ఈ మేరకు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలను నిజం చేస్తూ... కేకేఆర్ ఆటగాళ్లు రెండో అంచెలో అద్భుత ప్రదర్శనను కనబరిచి... వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువచ్చారు. ఇక అక్టోబరు 15న చెన్నై సూపర్‌కింగ్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఫ్రాంఛైజీ మెకల్లమ్ స్పీచ్ వీడియోను షేర్ చేసింది. అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా కోవిడ్ కారణంగా ఐపీఎల్-2021 సీజన్ వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే గెలుపొందిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... కోల్‌కతా రాత మారింది. ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు ఖాయమా? Tonight's our 𝙩𝙧𝙮𝙨𝙩 𝙬𝙞𝙩𝙝 𝙙𝙚𝙨𝙩𝙞𝙣𝙮! 💜#KKR #CSKvKKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/X0u50MHBR0 — KolkataKnightRiders (@KKRiders) October 15, 2021 -
కేకేఆర్.. 13 ఏళ్లు అయిపోయింది..ఈసారైనా?
కేకేఆర్.. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిల్స్ సాధించి మూడోసారి రేసులో నిలిచింది ఈ జట్టు. తాజా ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ అనూహ్యంగా ఫైనల్‌కు చేరింది. అసలు ప్లే ఆఫ్‌కు వస్తుందా అనే దశ నుంచి ఏకంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన కేకేఆర్.. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. దాంతో చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఫలితంగా 2012, 2014 సీజన్లో చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ఇప్పుడు మరొ టైటిల్‌పై కన్నేసింది. ప్రస్తుత ఐపీఎల్ ఒక్క మ్యాచ్‌తో ముగియనున్న నేపథ్యంలో కేకేఆర్ టైటిల్‌తో పాటు మరో రికార్డును బ్రేక్ చేయాలనే భావనలో ఉంది. 13 ఏళ్లుగా నో ‘సెంచరీ’ ఐపీఎల్ ఆరంభపు సీజన్లో భాగంగా ఆటగాళ్ల వ్యక్తిగత విభాగంలో తొలి సెంచరీ సాధించిన జట్గుగా రికార్డు నమోదు చేసిన కేకేఆర్.. ఆపై ఇప్పటివరకూ మరో సెంచరీ సాధించిన చరిత్ర లేదు. మెకల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులు సాధించిన తర్వాత ఆ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు దినేశ్ కార్తీక్. 2019లో రాజస్థాన్ రాయల్స్ దినేశ్ కార్తీక్ అజేయంగా 97 పరుగులు సాధించినప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. దాంతో మరో సెంచరీ సాధించే రికార్డు రెండేళ్ల కిందటే చేజారిపోయింది. మరి ఈ సీజన్లో కేకేఆర్ జట్టు నుంచి మరొక ప్లేయర్ శతకం సాధిస్తాడని భావించినా ఇప్పటివరకూ అది జరగలేదు. చదవండి: IPL Final CSK Vs KKR: ఎవరిదో ‘విజయ’ దశమి..? కేకేఆర్ టీమ్(ఫైల్‌ఫోటో) ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు నుంచి ఎవరైనా శతకం నమోదు చేసి 13 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. కేకేఆర్ జట్టు నుంచి అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వారిలో మెకల్లమ్, దినేశ్ కార్తీక్‌ల తర్వాత స్థానంలో మనీష్ పాండే(94-2014లో పంజాబ్ కింగ్స్‌పై),క్రిస్ లిన్(93 నాటౌట్-2017లో గుజరాత్ లయన్స్‌పై), గౌతం గంభీర్(93- 2012లొ ఆర్సీబీపై)లు వరుసగా ఉన్నారు. మెకల్లమ్ సుడిగాలి ఇన్నింగ్స్ మెకల్లమ్(ఫైల్‌ఫోటో) కోల్‌కతా నైట్‌రైడర్స్-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మొదటి సీజన్(2008) తొలి మ్యాచ్‌లో ఒక జట్టు అంచనాలు మించి ఆడితే మరొక జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇందులో అంచనాలు మించి ఆడిన జట్టు కేకేఆర్ కాగా, ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను సౌరభ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్‌లు ధాటిగా ప్రారంభించారు. ప్రధానంగా మెకల్లమ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు ఆదిలోనే చుక్కలు కనబడ్డాయి. 5.2 ఓవర్లలో కేకేఆర్ 61 పరుగులు చేసిన తర్వాత గంగూలీ(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కానీ మెకల్లమ్ బ్యాటింగ్ మోత మాత్రం తగ్గలేదు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో పరుగుల రుచి ఎలా ఉంటుందో మెకల్లమ్ చూపించడాంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు కేకేఆర్ స్టార్ ఆటగాళ్లు రికీ పాంటింగ్(20), డేవిడ్ హస్సీ(12)లు విఫలమైనా మెకల్లమ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీ నమోదు చేశాడు. 73 బంతుల్లో 13 సిక్స్‌లు, 10 ఫోర్లతో అజేయంగా 158 పరుగులు చేసి కేకేఆర్ 222 భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో సెంచరీ కావడమే కాకుండా ఈ రికార్డు ఐదేళ్లు పాటు పదిలంగా ఉండటం విశేషం. ఆటగాళ్ల అత్యధిక పరుగుల రికార్డులో మెకల్లమ్ నమోదు చేసిన 158 పరుగులు ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. చదవండి: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
ఫస్ట్ మ్యాచ్‌లోనే మోత.. ఆ రికార్డు ఐదేళ్లు పదిలంగా!
క్యాష్ రిచ్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌కు కాపీగా ఎన్నో క్రికెట్ లీగ్‌లు వచ్చినా దీని స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉంది. 2007, సెప్టెంబర్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఐపీఎల్‌కు ముహూర్తం ఖరారు చేయగా, అది 2008లో ఆరంభమైంది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఈ లీగ్ వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితే రాలేదు. స్టార్ క్రికెటర్ల సైతం పోటీ పడి మరీ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఈ లీగ్ ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఈ లీగ్ 2008 ఏప్రిల్ 18వ తేదీన ఆరంభం కాగా, ఈ లీగ్ ప్రస్థానం ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే అందుకు సంచలన ప్రదర్శనలే కారణం. క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను తీసుకొచ్చిన ఐపీఎల్ తొలి సీజన్ మొదటి మ్యాచ్‌పై ఒకసారి లుక్కేద్దాం. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఒక జట్టు అంచనాలు మించి ఆడితే మరొక జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇందులో అంచనాలు మించి ఆడిన జట్టు కేకేఆర్ కాగా, ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను సౌరభ్ గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్‌లు ధాటిగా ప్రారంభించారు. ప్రధానంగా మెకల్లమ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు ఆదిలోనే చుక్కలు కనబడ్డాయి. 5.2 ఓవర్లలో కేకేఆర్ 61 పరుగులు చేసిన తర్వాత గంగూలీ(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కానీ మెకల్లమ్ బ్యాటింగ్ మోత మాత్రం తగ్గలేదు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో పరుగుల రుచి ఎలా ఉంటుందో మెకల్లమ్ చూపించడాంటే అతిశయోక్తి కాదేమో. మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా! ఒకవైపు కేకేఆర్ స్టార్ ఆటగాళ్లు రికీ పాంటింగ్(20), డేవిడ్ హస్సీ(12)లు విఫలమైనా మెకల్లమ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీ నమోదు చేశాడు. 73 బంతుల్లో 13 సిక్స్‌లు, 10 ఫోర్లతో అజేయంగా 158 పరుగులు చేసి కేకేఆర్ 222 భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో సెంచరీ కావడమే కాకుండా ఈ రికార్డు ఐదేళ్లు పాటు పదిలంగా ఉండటం విశేషం. ఆటగాళ్ల అత్యధిక పరుగుల రికార్డులో మెకల్లమ్ నమోదు చేసిన 158 పరుగులు ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. 2013లో క్రిస్ గేల్(ఆర్సీబీ) అజేయంగా 175 పరుగులు చేసే వరకూ మెకల్లమ్ రికార్డ్‌దే తొలి స్థానం. 82 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ కేకేఆర్ నిర్దేశించిన 223 పరుగుల టార్గెట్‌లో ఆర్సీబీ చతికిలబడింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోనే బెంగళూరు 15.1 ఓవర్లలో 82 పరుగులకే చాపచుట్టేసింది. ద్రవిడ్(2), వసీం జాఫర్(6), విరాట్ కోహ్లి(1), జాక్వెస్ కల్లిస్(8), కామెరూన్ వైట్(6), మార్క్ బౌచర్(7) ఇలా విఫలం కావడంతో ఆర్సీబీ 140 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ ఆటగాళ్లలో ప్రవీణ్ కుమార్(18)దే డబుల్ డిజిట్ కావడం గమనార్హం. కేకేఆర్ బౌలర్లలో అజిత్ ఆగార్కర్ మూడు వికెట్లు సాధించగా, అశోక్ దిండా, గంగూలీ తలో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మ, లక్ష్మీ శుక్లాలకు చెరో వికెట్ దక్కింది. దిండా మూడు ఓవర్లు వేసి 9 పరుగులు ఇవ్వగా, ఇషాంత్ మూడు ఓవర్లకు 7 పరుగులే ఇచ్చాడు. చదవండి: IPL 2021 2nd Phase PBKS Vs RR: పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం -
మీరు మారండి.. లేకపోతే మిమ్మల్నే మారుస్తాం: మెకల్లమ్
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ దారుణమైన ఓటమి చవిచూడటంపై ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కేకేఆర్ జట్టు సమిష్టగా విఫలం అవుతూ వరుస ఓటములు ఎదురవుతున్న తరుణంలో జట్టును పూర్తి ప్రక్షాళన చేయాల్సి వస్తుందనే సంకేతాలిచ్చాడు. టాపార్డర్ ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చవిచూసి భారీ స్కోర్లను ప్రత్యర్థి జట్ల ముందు ఉంచలేకపోతున్న సమయంలో ప్రత్యామ్నాయాలను చూద్దామా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఒక్క క్రికెటర్ గురించి ప్రస్తావన తీసుకురాకుండానే చురకలంటించాడు మెకల్లమ్. దూకుడుగా ఆడటంలో విఫలం అవుతున్న నితీష్ రానా, శుబ్‌మన్ గిల్, త్రిపాఠిలనే టార్గెట్ చేసినట్లు మెకల్లమ్ మాటల ద్వారా అర్థం అవుతోంది. ప్రధానంగా టాప్-3 ఆటగాళ్లైన వీరి స్టైక్‌రేట్ చాలాపేలవంగా ఉండటమే మెకల్లమ్ అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ‘ మీరు మారండి.. లేకపోతే మిమ్మల్నే మారుస్తాం’ అంటూ హెచ్చరించాడు. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మెకల్లమ్.. ‘ ఇది చాలా చాలా నిరూత్సాహపరిచింది. ఒక ప్లేయర్‌గా ఆలోచిస్తే నువ్వు సెలక్షన్‌కు వచ్చిన ప్రతీసారి మాపై నమ్మకం, ఫ్రీడమ్ గురించి మాట్లాడతావ్. అటువంటప్పుడు గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. మ్యాచ్‌కు సిద్ధమైతే దూకుడు ఉండాలి. నీ జట్టు కోసం శ్రమించాలి. నేను, మా జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌లు కావాల్సినంత స్వేచ్చ ఇస్తున్నాం. ఢిల్లీ జట్టులో పృథ్వీ షాను చూడండి. మాతో మ్యాచ్‌లో ఫెర్ఫెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ జట్టు అతని నుంచి ఏమి ఆశించిందో అదే చేశాడు. ప్రతీ బాల్ సిక్స్, ఫోర్ కొట్టాలంటే కుదరదు. కానీ ముందు మీలో బంతిపై దూకుడే లేదు. మీకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఇలాగేనా ఆడేది. మనం షాట్లు కొట్టకపోతే స్కోరు ఎలా వస్తుంది. నా కెరీర్ కొనసాగించినంత కాలం నేను ఎక్కువగా ఫాలో అయ్యే ఒకే ఒక్క సామెత. మీరు మారకపోతే(పరిస్థితిని బట్టి అడ్జస్ట్ కాకపోతే).. ఆ మనిషినే మార్చడం’ అంటూ మార్పులు తప్పవనే సంకేతాలిచ్చాడు మెకల్లమ్. ఇక్కడ చదవండి: పెద్ద మనసు చాటుకున్న ఉనాద్కత్ స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ -
'ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్‌గా ఉండాలి'
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్ నాలుగు పరాజయాల తర్వాత సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 16.4 ఓవర్లలోనే చేధించింది. మోర్గాన్ 47 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇచ్చిన స్పీచ్ వైరల్‌గా మారింది. '' ఈరోజు మ్యాచ్‌లో మీరు చూపిన ఆట అద్భుతం. మొదట బౌలింగ్ టీంను అభినందించాలి. ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా మెరవడం మనకు కలిసొచ్చింది. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందనుకున్నా.. కానీ మోర్గాన్, రాహుల్ త్రిపాఠిల కౌంటర అటాక్ సూపర్.. దీనిని రానున్న మ్యాచ్‌ల్లో కొనసాగించాలి. గేమ్ ఆడితే ఫోకస్ చాలా కీలకం. అది మనకు ఎవరు చెప్పరు.. ఆట ఆడేటప్పుడు మనకు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకొని నిలబడి ఆడాలి. మోర్గాన్, త్రిపాఠిలు అదే చేసి చూపించారు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విక్టరీ సాధించాం. దీనికి ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఈ విజయంతో మీకు కాన్ఫిడెంట్ పెరిగిందని అనుకుంటున్నా. ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్‌గా ఉండాలనేది నా నిర్ణయం అంటూ'' చెప్పుకొచ్చాడు. మెక్కల్లమ్ స్పీచ్‌ను కేకేఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా పంజాబ్ కింగ్స్‌పై విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. చదవండి: అదృష్టం బాగుండి ఆ బ్యాట్ ఎవరిపై పడలేదు బయట భయంకర పరిస్థితులే ఉన్నాయి: మోర్గాన్ View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’
అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎదురైన ఘోర పరాభవంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు. కనీస స్థాయిలో కూడా తాము బ్యాటింగ్ చేయలేకపోయామని, ఈ విషయంలో పిచ్‌లో సమస్యేమీ లేదని అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన మెకల్లమ్ ‘ నిజాయితీగా చెప్పాలంటే మేము పూర్తిగా విఫలమయ్యాం. ఈ వికెట్‌పై ఆడటం మరీ అంత కష్టమేం కాదు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి మోరిస్ కూడా తోడవ్వడంతో... మా బ్యాట్స్‌మెన్ ధైర్యంగా బంతులను ఎదుర్కొనలేక పోయారు. దూకుడుగా ఆడాలనే ప్రణాళికతో మేము మ్యాచ్‌ను ఆరంభించాం. కానీ అలా జరగలేదు. మా టాప్ ఆర్డర్ మరింతగా ఆడాల్సి ఉంది. ఇదొక పాఠంగా భావించి... మా తదుపరి మ్యాచ్ నుంచి మళ్లీ విజయాల బాట పడతాం. ఇప్పటికీ లీగ్‌లో మాకు మంచి అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి మాట వినలేదు... వికెట్ తీశాడు! ఒకే ఒక్క మ్యాచ్‌తో ‘జీరో’ నుంచి ‘ హీరో’గా తనను తాను సిరాజ్ ప్రమోట్ చేసుకున్నాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం దక్కడంతో... చెలరేగిన సిరాజ్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘డ్రీమ్ స్పెల్ (4–2–8–3)’తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. తీసిన మూడు వికెట్లలో నితీశ్ రాణా వికెట్ కోసం వేసిన ఇన్‌స్వింగ్ బంతి అయితే సూపర్ అనే చెప్పాలి. అయితే ఈ బంతి వేసే ముందు తాను కోహ్లి మాటను పెడ చెవిన పెట్టానని సిరాజ్ పేర్కొనడం విశేషం. రాణా బ్యాటింగ్‌కు రాగానే... బౌన్సర్ వేయమంటూ కోహ్లి తనకు సూచించాడని... అయితే రన్నప్ మొదలు పెట్టేముందు బౌన్సర్ వద్దు... ఫుల్ బాల్ వేయాలని నిర్ణయించుకొని బంతిని వేశానని సిరాజ్ తెలిపాడు. దాంతో ఆ బంతి లోపలికి వెళ్తూ వికెట్లను గిరాటు వేయడంతో... రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. -
ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీ వద్దు.. ప్లీజ్
మెల్బోర్న్: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తేనే మంచిదని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ నివారణ అనేది ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేకపోవడంతో ప్రధాన క్రీడా ఈవెంట్లను వచ్చే ఏడాదికి జరిపితేనే మంచిదన్నాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌కప్‌ను తదుపరి ఏడాదికి వాయిదా వేస్తూ ముందుగానే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసిన తరుణంలో మెకల్లమ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. (‘ధోనికి చాన్స్ ఇవ్వడం బాధించింది’) ఐపీఎల్-13వ సీజన్‌ను అక్టోబర్ విండోలో జరిపే యోచనలో ఉన్న క్రమంలో వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిస్తే బాగుంటుందన్నాడు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను నిర్వహించే సమయంలోనే పురుషుల మెగా టోర్నీకి కూడా నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రేక్షకులు లేకుండా అక్టోబర్‌లో నిర్వహించాలనే చూస్తే వరల్డ్‌కప్ కళ తప్పుతుందన్నాడు. స్టేడియాలను మూసివేసి క్రికెట్ మ్యాచ్‌లను ఆటగాళ్లతోనే నిర్వహిస్తే అసలు మజానే ఉండదన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో 16 జాతీయ జట్లు ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంటుందని, ఈ క్రమంలోనే 20 లక్షలకు పైగా ప్రభావితులు అయ్యే అవకాశం ఉండటంతో అక్టోబర్‌లో వరల్డ్‌కప్ మాటను వదులుకోవాలన్నాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!) -
కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్
కోల్‌కతా: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఇప్పుడు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ సీజన్ అనంతరం చీఫ్‌కోచ్ జాక్వస్ కలిస్ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో మెకల్లమ్‌కు కోచింగ్ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కూడా మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. లీగ్‌లో మెకల్లమ్.. 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్ నుంచి 2018 వరకు కేకేఆర్‌తో పాటు, కొచ్చి టస్కర్ కేరళ, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు. -
మెకల్లమ్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న విధ్వంసక ఆటగాడు, న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెకల్లమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అసిస్టెంట్ కోచ్‌గా రానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. గతంలో కేకేఆర్‌కు ఆడిన ఆనుభవం ఉపయోగపడుతుందని ఆ జట్టు యాజమాన్యం విశ్వసిస్తోంది. ఐపీఎల్‌తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు హెడ్ కోచ్‌గా కూడా మెకల్లమ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్ అనంతరం కేకేఆర్ హెడ్ కోచ్‌గా పనిచేసిన దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు జాక్వస్ కలిస్‌ను, అతని డిప్యూటీ అయిన సైమన్ కటిచ్‌ను యాజమాన్యం తప్పించింది. ఐపీఎల్ తొలి సీజన్లో మెక్‌కలమ్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 158 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఐదు సీజన్లలో కేకేఆర్ తరఫున ఆడిన అతడు 2009లో నాయకుడిగా జట్టును నడిపించాడు. ఇప్పుడు తిరిగి అదే జట్టుకు అస్టిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. -
క్రికెట్‌కు మెకల్లమ్ వీడ్కోలు
20 ఏళ్ల కెరీర్ పట్ల గర్వం, సంతృప్తితో ఈ రోజు నేను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఎన్నో త్యాగాలు, ఎంతో నిబద్ధత అవసరమైన ప్రొఫెషనల్ క్రికెట్లో ఇకపై కొనసాగలేనని కొన్ని నెలలుగా నాకు అనిపిస్తోంది. ఆటలో ప్రవేశించినప్పుడు ఈ స్థాయి ప్రయాణాన్ని ఊహించలేదు. త్వరలో జరిగే యూరో టి20 స్లామ్లో పాల్గొనను. ఆ టోర్నీ నిర్వాహకులకు ధన్యవాదాలు. విధ్వంసకరంగా ఆడటం నాకిష్టం. డ్యునెడిన్‌లోని కల్లింగ్ పార్క్ నుంచి ప్రఖ్యాత లార్డ్స్ వరకు ఎన్నో మధురానుభూతులున్నాయి. నా సహచరులందరికీ రుణపడి ఉంటాను. –ట్విట్టర్లో మెకల్లమ్ రిటైర్మెంట్ ప్రకటన ఆక్లాండ్: విధ్వంసక బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్... క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ పోటీ క్రికెట్ నుంచి 2016లోనే తప్పుకొన్న అతడు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ప్రసుత్తం కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీనే తనకు ఆఖరిదని స్పష్టం చేశాడు. 37 ఏళ్ల మెకల్లమ్... దిగ్గజ మార్టిన్ క్రో తర్వాత న్యూజిలాండ్ అందించిన మరో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. కెరీర్ తొలినాళ్లలో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చినా, అనంతరం స్పెష లిస్ట్ బ్యాట్స్‌మన్‌గా పాతుకుపోయాడు. 2002లో వన్డే (సిడ్నీలో ఆస్ట్రేలియాపై), 2004లో టెస్టు (హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాపై), 2005లో టి20 (ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియాపై) అరంగేట్రం చేశాడు. కివీస్‌ను నిలిపి... ఐపీఎల్‌కు ఊపు తెచ్చి... మెకల్లమ్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది 2008 ఐపీఎల్ ప్రారంభ మ్యాచే. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై అతడు ఆడిన 73 బంతుల్లో 158 పరుగుల ఇన్నింగ్సే. అప్పటివరకు లీగ్ పట్ల ఓ మాదిరిగా ఉన్న అంచనాలను మెకల్లమ్ కళ్లుచెదిరే ఆటతో ఎక్కడికో తీసుకెళ్లాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ ఐపీఎల్ స్థాయిని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. బంతిని బలంగా బాదే మెకల్లమ్‌కు... తన కెరీర్‌కు సమాంతరంగా ప్రారంభమైన టి20లు మరింత మేలు చేశాయి. అతడెంత ప్రమాదకర బ్యాట్స్‌మనో ప్రపంచానికి చాటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని టి20 లీగ్‌లలో కలిపి 370 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 9,922 పరుగులు చేయడమే దీనికి నిదర్శనం. ♦ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) రికార్డు మెకల్లమ్ పేరిటే ఉంది. 2016లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్టులో అతడీ రికార్డు నెలకొల్పాడు. ♦ టెస్టుల్లో మెకల్లమ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (302)ను భారత్‌పైనే చేశాడు. 2014లో వెల్లింగ్టన్లో జరిగిన ఈ టెస్టులో అతడు అసాధారణ రీతిలో 775 నిమిషాలు క్రీజులో నిలిచి భారత్‌కు విజయాన్ని దూరం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా మెకల్లమ్ గుర్తింపు పొందాడు. ♦ అరంగేట్రం నుంచి ఏకధాటిగా 100 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ మెకల్లమ్. క్రిస్ గేల్ తర్వాత టి20 ఫార్మాట్లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఈ కివీస్ క్రికెటర్ నిలిచాడు. ♦ 2015లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టుకు మెకల్లమే కెప్టెన్. ఆ టోర్నీలో విధ్వంసకరంగా ఆడిన అతడు జట్టును తుది సమరానికి చేర్చాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్‌కు మెకల్లమ్ మంచి స్నేహితుడు. జట్టును నడిపించడంలో మెకల్లమ్ తనకు ఎంతో ప్రేరణగా నిలిచాడని మోర్గాన్ ప్రస్తుతించాడు. -
‘ నా క్రికెట్ కెరీర్‌ను సంతృప్తిగా ముగిస్తున్నా’
వెల్లింగ్టన్: సుమారు మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్.. తాజాగా కాంపిటేటివ్ క్రికెట్ కూడా గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన మెకల్లమ్.. విదేశీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న మెకల్లమ్.. ఈ లీగ్ తర్వాత మొత్తం క్రికెట్‌కు దూరం కానున్నట్లు వెల్లడించాడు. ‘ నా క్రికెట్ జీవితాన్ని సంతృప్తిగా ముగిస్తున్నా. గ్లోబల్ టీ20 కెనడా తర్వాత ఇక క్రికెట్ మ్యాచ్‌లు ఆడను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మెకల్లమ్ పేర్కొన్నాడు.తన టెస్టు కెరీర్లో 101 టెస్టులు ఆడిన 37 ఏళ్ల మెకల్లమ్ 12 సెంచరీలతో 6,453 పరుగులు చేశాడు. అందులో 302 అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక 260 వన్డేల్లో 6,083 పరుగులు చేయగా, ఐదు సెంచరీలున్నాయి. 71 అంతర్జాతీయ టీ20ల్లో 2,140 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20(అన్ని లీగ్‌లతో కలిపి) కెరీర్లో 370 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్ 9,922 పరుగులు చేశాడు. -
250 టార్గెట్ భారత్‌కు కష్టమే!
మాంచెస్టర్ : భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో భారత్‌కు 250 పరుగుల లక్ష్యం సవాల్‌తోకూడుకున్నేదనని ట్వీట్ చేశాడు. ‘ఇరు జట్ల మధ్య జరిగే ధ్వైపాక్షిక సిరీస్ 250 పరుగుల లక్ష్యం సర్వసాధారణమే. కానీ విశ్వవేదికపై జరిగే సెమీస్ మ్యాచ్‌లో మాత్రం కష్టమైనదే.’ అని పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులే చేసింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ నిలదీశాడు. ‘ఇంకా 250 చేయలేదు కదా’ అని కామెంట్ చేశాడు. దీనికి మెక్కల్లమ్ స్పందించాడు. ‘ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లు (భారత్, బంగ్లాదేశ్) మాత్రమే 250, అంతకన్నా ఎక్కువ పరుగుల లక్ష్యాలను చేధించి విజయాలు సాధించాయి. ఆ రెండు జట్లపై అప్పుడు ఎలాంటి సెమీఫైనల్ ఒత్తిడి లేదు. చీర్స్ కేపీ, రేపు(బుధవారం) మా వాళ్లు ఇరగదీస్తారు’ అని బదులిచ్చాడు. Around 250 would never be enough in a bilateral series between these two teams on this surface but in a World Cup semi final....it may just be! 🧐 — Brendon McCullum (@Bazmccullum) July 9, 2019 But when they do...only 2 teams have successfully chased 250 or greater in this World Cup so far. And none of them in the pressure cooker of Semi finals! Cheers KP! Well batted the other day too 🤷♂️ 😂😂😂😂@piersmorgan https://t.co/6KoXsr4Zp3 — Brendon McCullum (@Bazmccullum) July 9, 2019 లీగ్ దశలో భారత్, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే చేజింగ్‌లో విజయాలు సాధించాయి. వెస్టిండీస్‌పై 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాదేశ్7 వికెట్లతో గెలవగా.. శ్రీలంకపై భారత్ 265 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. మెక్కల్లమ్ అన్నట్లు 240 పరుగుల టార్గెట్‌ను చేధించడం భారత్‌కు కష్టమైన పనేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగుతారని పేర్కొంటున్నారు. -
‘టీమిండియా ఓడిపోయేది ఆ జట్టు పైనే’
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 ప్రారంభానికి ముందే పలువురు మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్టును ప్రకటించారు. అంతేకాకుండా తమ ఫేవరేట్ జట్టే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అయితే అందరికంటే వినూత్నంగా ప్రయత్నించాడు న్యూజిలాండ్ మాజీ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్. ప్రపంచకప్‌లో సుదీర్ఘ లీగ్ మ్యాచ్‌ల్లో ఎవరు ఎన్ని గెలుస్తారో అంచనా వేస్తూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే తన అంచనాల ప్రకారమే తొలి రెండు రోజుల ఫలితాలు రావడంతో అందరి దృష్టి మెకల్లమ్ అంచనాలపై పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు ఇంగ్లండ్, టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు వెళ్తాయని ధీమా వ్యక్తం చేయగా.. మరో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు. లీగ్‌లో ఇంగ్లండ్, టీమిండియా జట్లు ఒక్కో ఓటమి చవిచూస్తాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో కోహ్లి సేనకు పరాభావం తప్పదన్నాడు. ఇక ఇంగ్లీష్ జట్టును ఆసీస్ జట్టు ఓడించి తీరుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే మెకల్లమ్ అంచనాలను ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్ వా తప్పుపట్టాడు. మెకల్లమ్ చెప్పిన దానికంటే ఆసీస్ ఎక్కువ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. View this post on Instagram World Cup game by game predictions. 4 teams will fight out the 4th qualifying spot and net run rate will decide who progresses. Rain and luck will likely play a part as well. I hope Nz gets that little bit of luck and can qualify. Enjoy the 6 week celebration of the best players on the planet. 🤙🏼 #CWC2019 A post shared by Brendon McCullum (@bazmccullum42) on May 31, 2019 at 12:13am PDT -
ఐపీఎల్ వచ్చేసింది
వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ స్టంప్స్‌ను గాల్లో గిరాటేస్తే గానీ తాను వరల్డ్ బెస్ట్ బౌలర్‌ను కాలేనంటున్నాడు బుమ్రా... కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా, ఎలాగైతేనేం అదీ నేర్చుకున్నావు అంటూ కోహ్లి జవాబు... మీ జట్టుపైనే విరుచుకు పడతానంటూ గురువుకే సవాల్విసురుతున్న పంత్... అప్పట్లో నేనూ నీలాగే ఉండేవాడిని, చూసుకుందాం రమ్మంటూ ధోని పిలుపు... ప్రకటనలు, థీమ్ సాంగ్‌లు, ప్రమోషన్లు... ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నడుస్తుండగానే మరో వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. రేపు ఆఖరి మ్యాచ్ ముగిస్తే చాలు... టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోతారు. జయహో అంటూ భారత్ విశ్వ సమరానికి వెళ్లే ముందే ఈనెల 23 నుంచి వేసవి వినోదం అందించేందుకు మరోసారి క్రికెట్ అభిమానుల పండగ ఐపీఎల్ వచ్చేసింది. అన్ని జట్లు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగిస్తుండగా, స్టార్ ఆటగాళ్లు కూడా వారితో చేరితే అందరి కళ్లూ లీగ్ వైపే నిలుస్తాయి. మరో 11 రోజుల్లో ‘ఆట తప్ప మాటలొద్దు’ అంటూ లీగ్ సంబరాలు షురూ కానున్న నేపథ్యంలో గత 11 ఐపీఎల్ టోర్నీల ఫలితాల విశేషాలు.... బిగ్ బ్యాంగ్... ఏప్రిల్ 18, 2008... ఐపీఎల్ చరిత్రలో మరచిపోలేని తేదీ. ఒక కొత్త టోర్నీకి ఎలాంటి ఆరంభం లభిస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతుందో ఆ రోజు అలాంటి మ్యాచ్‌తోనే లీగ్ మొదలైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు చేసి ప్రేక్షకులకు మజా అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టి20 రుచిమరిగిన అభిమానులను ఇప్పటికీ ఐపీఎల్ మత్తులోనే ముంచెత్తుతోంది. మరచిపోలేని చెంపదెబ్బ! తొలి ఐపీఎల్లో ఆటతో పాటు అత్యంత వివాదంగా నిలిచిన అంశం శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం... అతను చిన్న పిల్లాడిలా భోరున ఏడ్వడం! లీగ్‌లో పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో శ్రీశాంత్ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండా భజ్జీ కొట్టాడని విచారణలో రిఫరీ నిర్ధారించారు. దాంతో మిగిలిన 11 లీగ్ మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు. ఘట న జరిగిన మ్యాచ్ ఫీజు లో కూడా 100 శాతం కోత విధించారు. కేవలం తొలి రెండు మ్యాచ్‌లకే ఫీజు అందుకున్న భజ్జీఈ ఘటనతో భారీగా నష్టపోయాడు కూడా. ఫైనల్ ఫలితం... సెమీస్‌లో పంజాబ్‌ను ఓడించి చెన్నై, ఢిల్లీని ఓడించి రాజస్తాన్ ఫైనల్ చేరాయి. ముందుగా చెన్నై 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, రాజస్తా న్ 7 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి బంతికి రాయల్స్‌కు గెలుపు దక్కింది. బ్యాటింగ్‌లో 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన యూసుఫ్ పఠాన్ ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’గా నిలిచాడు. చార్జర్స్ అట్టడుగున... టోర్నీలో హైదరాబాద్ జట్టు దక్కన్ చార్జర్స్ ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచింది. జట్టు తరఫున గిల్‌క్రిస్ట్ (436), రోహిత్ శర్మ (404) పరుగుల పరంగా టాపర్లుగా నిలవగా... ఆర్పీ సింగ్ 15, ప్రజ్ఞాన్ ఓజా 11 వికెట్లు తీశారు. రాజస్తాన్ రాయల్స్ రాజసం 2008 నుంచి 2018 వరకు 11 ఐపీఎల్ టోర్నీలు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో 3 సార్లు టైటిల్ సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలవగా... రెండు వేర్వేరు పేర్లతో హైదరాబాద్ జట్లు దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ జట్లు ఒక్కోసారి టోర్నీని గెలుచుకున్నాయి. అయితే అనూహ్యంగా, అంచనాలు లేకుండా, స్టార్ ఆటగాళ్ల బలగం లేకుండా రాజస్తాన్ 2008 టైటిల్ సాధించడం విశేషం. పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చిన టోర్నమెంట్ తొలి టైటిల్‌ని సొంతం చేసుకున్న టీమ్‌గా షేన్ వార్న్ నాయకత్వంలోని రాయల్స్ ఘనత వహించింది. ఈ టోర్నీ విశేషాలను గుర్తు చేసుకుంటే... టీమ్ గుర్తుందా! రాజస్తాన్ టైటిల్ గెలిచిన జట్టు సభ్యులలో 19 మంది లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లు షేన్ వార్న్, గ్రేమ్ స్మిత్, షేన్ వాట్సన్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, డారెన్ లీమన్, మస్కరెన్హాస్, యూనిస్ ఖాన్‌లను వదిలిస్తే... యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ భారత్ తరఫున తమ ముద్ర చూపించిన ఆటగాళ్లు. పంకజ్ సింగ్ 2 టెస్టులు, 1 వన్డే ఆడగా... నీరజ్ పటేల్, స్వప్నిల్ అస్నోడ్కర్, దినేశ్ సాలుంఖే, మహేశ్ రావత్, తరువర్ కోహ్లి, సిద్ధార్థ్ త్రివేది ఎప్పుడూ జాతీయ జట్టులోకి ఎంపిక కాలేకపోయారు. శతకవీరులు లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే నాలుగు ఆస్ట్రేలియన్లే చేశారు. మెకల్లమ్, సైమండ్స్, హస్సీ, షాన్ మార్‡్ష, గిల్‌క్రిస్ట్‌లతో పాటు సనత్ జయసూర్య సెంచరీ సాధించాడు. టోర్నీలో జయసూర్య మొత్తం 31 సిక్సర్లతో టాపర్‌గా నిలవడం విశేషం. పాకిస్తాన్ ఒకే ఒక్కసారి... తొలి ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే అదే ఏడాది 9/11 ముంబై దాడి తర్వాత వారు లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దాంతో 2008లో ఆడిన షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. -
వైరల్ : క్యాచ్ పట్టలే కానీ.!
సిడ్నీ : లాంగాన్‌లో బ్యాట్స్‌మన్ ఆడిన భారీ షాట్‌ను ఫీల్డర్ అందుకోలేకపోయాడు.. కానీ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకోని ఔరా అనిపించాడు. భారీ షాట్ ఆడిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ కాగా.. మైమరిపించే ఫీల్డింగ్‌తో అదరగొట్టింది న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్. అభిమానులు కనువిందు చేసిన ఈ దృశ్యం బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్-సిడ్నీ సిక్సర్స్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జేమ్స్ విన్స్ లాంగాన్‌లో ఆడిన భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ రెప్పపాటులో అదే దిశలో బౌండరీ లైన్ వద్ద నిల్చున్న బ్రెండర్ మెకల్లమ్ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావించిన మెకల్లమ్ బంతిని గాల్లోకి విసిరేసి మరోసారి క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సారి కూడా బౌండరీ రోప్‌పై పడుతానని భావించి బంతిని మైదానంలోకి నెట్టేశాడు. క్షణిక కాలంలో ఈ కివీస్ ప్లేయర్ చేసిన ఫీట్‌ను చూసి మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు. బౌండరీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా మెకల్లమ్‌కు ఫేవర్‌గా వచ్చింది. ఇప్పటికే బ్యాట్‌తో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన మెకల్లమ్.. 37 ఏళ్ల వయసులో కూడా అద్భుత ఫీల్డింగ్‌తో అదరగొట్టడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్లో ‘క్యాచ్ పట్టలే కానీ.. మెకల్లమ్ ఎలా బౌండరీ ఆపాడో చూడండి!’ అని షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బ్రిస్బెన్ హీట్ 98 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
వైరల్ : క్యాచ్ పట్టలే కానీ.!
-
వాడ్ని పట్టుకుంటా: మెకల్లమ్
వెల్లింగ్టన్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువయ్యాయి. పుకార్ల విషయంలో అయితే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ మెకల్లమ్‌ను సోషల్ మీడియా వేదికగా చంపేశారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్వీటర్లో సందేశాలను పోస్టు చేశారు. అయితే, తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నాథన్ మెకల్లమ్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీంతో స్వయంగా అతడే ట్విటర్ వేదికగా తాను బతికే ఉన్నానంటూ అభిమానులకు తెలియజేశాడు. "నేను చావలేదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను" అని ఓ ట్వీట్ చేశాడు. అయితే అతని సోదరుడు, మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం ఈ పుకార్లపై చాలా సీరియస్ అయ్యాడు. ‘మా సోదరుడు చనిపోయాడంటారా.. ఈ వార్త వ్యాప్తి చేసిన వాడిని పట్టుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలిసినప్పుడు తాను విమానంలో ఉన్నా. ఇలాంటి చెత్త వార్తలను సృష్టించిన వారెవరైనా, ఎక్కడున్నా, ఎలాగైనా పట్టుకుంటా’ అని మెకల్లమ్ ట్వీట్ చేశాడు. Tonight someone decided, via social media to release that my brother passed away! Im on a flight back to NZ and my heart broke! None of it is true! Whoever put this out there, I’ll find you! Somewhere, somehow. — Brendon McCullum (@Bazmccullum) 1 December 2018 నేను బతికే ఉన్నాను: మెకల్లమ్ -
నేను బతికే ఉన్నాను: మెకల్లమ్
వెల్లింగ్టన్ : ఈ మధ్య సోషల్ మీడియాలో అసత్య వార్తలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఉన్నవి.. లేనివి కల్పిస్తూ.. ఫేక్ న్యూస్‌తో అందరిని తప్పుదారి పట్టిస్తున్నారు. బతికున్నవాళ్లను చంపేస్తూ.. వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇలానే న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ మెకల్లమ్‌ను సోషల్‌మీడియా వేదికగా చంపేశారు. దీంతో కంగారుపడిన ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు పంపించారు. ఈ తరహా ఫోన్ కాల్స్.. మెస్సేజ్‌లతో ఖంగుతిన్న నాథన్ మెక్కల్లమ్.. ‘నేను చావలేదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు. ఈ తరహా అసత్య వార్తలను నమ్మెద్దని, ఈ ఫేక్ వార్తకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్ తరపున 84 వన్డేలు.. 63 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన నాథన్ మెకల్లమ్.. బ్రెండన్ మెకల్లమ్‌కు స్వయాన సోదరుడు. నాథన్ భారత్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో కూడా ఆడాడు. 2011లో పుణే వారియర్స్ తరుపున బరిలోకి దిగిన నాథన్.. 2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించినా.. ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. I am alive and kicking more than ever before. Not sure where this news has come from but this is fake. Love you all. pic.twitter.com/WZ1nuX4LUo — Nathan McCullum (@MccullumNathan) 1 December 2018 -
డోపీగా తేలడంపై పెదవి విప్పిన మెకల్లమ్..
వెల్లింగ్టన్: 2016 ఐపీఎల్ సందర్భంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెకల్లమ్ స్వయంగా వెల్లడించాడు. అయితే అతను తాను వాడిన ఉత్ప్రేరకం విషయంలో మినహాయింపు ఉన్నట్లుగా ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం తప్పించుకున్నట్లు స్పష్టం చేశాడు. 2016లో భారత్‌లో ఒక ప్రముఖ ఆటగాడు డోప్ పరీక్షలో విఫలమైనట్లుగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పేర్కొంది. అయితే అతను ఎవరన్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్పట్లో దాచి పెట్టింది. దీనిపై ఇప్పుడు మెక్కలమే స్వయంగా తాను డోపీగా దొరికిన విషయాన్ని పేర్కొన్నాడు. ‘ఆ సమయంలో ఇన్హేలర్ అతిగా వాడాను. బీసీసీఐ నాకు సహకరించింది’ అని మెక్‌కలమ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం గుజరాత్ లయన్స్ తరపున ఆడినప్పుడు ఆస్తమా బాధితుడైన మెకల్లమ్ ఢిల్లీలో కాలుష్యం వల్ల బాగా ఇబ్బంది పడటంతో ఎప్పుడూ వాడే ఇన్హేలర్ మందు ఎక్కువ స్థాయిలో తీసుకున్నాడట. దీని ఫలితంగా డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడట. దీనిపై బీసీసీఐ అతడిని వివరణ కోరగా.. స్వీడన్‌కు చెందిన వైద్య నిపుణుల నుంచి ధ్రువపత్రం సమర్పించడం ద్వారా నిషేధం నుంచి బయటపడినట్లు వెల్లడైంది. -
ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు పదేళ్లు..
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరుగుల ప్రవాహం సాగిందిలా.. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి ఖాతా తెరిచాడు. అంతే ఇక ఏ బౌలర్ కూడా మెల్లకమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మెకల్లమ్ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 222 పరుగుల ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని మిగిల్చిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ చతికిల పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 82 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన మెకల్లమ్ 2801 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ 11లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మెకల్లమ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు తన మార్క్ ప్రదర్శనను కనబరచకపోవటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. -
టీ 20 చరిత్రలో రెండో క్రికెటర్‌గా..
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. టీ 20 చరిత్రలో తొమ్మిదివేల పరుగుల మార్కును చేరిన రెండో క్రికెటర్‌గా మెకల్లమ్ గుర్తింపు సాధించాడు. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో మెకల్లమ్ 27 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఫలితంగా 9,035 టీ 20 పరుగుల్ని సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్(11,068) తొలి స్థానంలో ఉన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు 8,992 పరుగులతో ఉన్న మెకల్లమ్ తన సహజసిద్ధమైన ఆటతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ డీకాక్(4) విఫలమైనప్పటికీ మెకల్లమ్ మాత్రం విజృంభించి ఆడాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వీడ్కోలు చెప్పి చాలా కాలమే అయినప్పటికీ తనలో సత్తా తగ్గలేదని తాజా ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు మెకల్లమ్. -
చిందేసిన కోహ్లి, చాహల్
సాక్షి, బెంగళూరు : క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-11వ సీజన్ మరో మూడో రోజుల్లో మొదలు కానుంది. అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ) బెంగుళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, బ్రెండన్ మెకల్లమ్ చిందులేశారు. ‘ఐపీఎల్ కోసం లెజెండ్స్‌తో వార్మప్ మొదలెట్టేశా’ అంటూ కోహ్లి, మెక్‌కల్లమ్‌ను ట్యాగ్ చేస్తూ 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియోను చాహల్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కోహ్లి తనదైన శైలిలో రెచ్చిపోగా మెక్కల్లమ్, చాహల్‌లు అతన్ని అనుకరించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 8న ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)తో తలపడనుంది. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ వంటి స్టార్లతో పాటు యువ ఆటగాళ్లతో ఎంతో పటిష్టమైన జట్టుగా పేరున్నప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్‌కు చేరిన ప్రతిసారీ అభిమానులను నిరాశపర్చింది. క్రిస్‌గేల్‌ను వదులుకున్న ఆర్సీబీ ఈసారి బ్రెండన్ మెకల్లమ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డీకాక్‌లను జట్టులోకి తీసుకోవడం ద్వారా బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపరచుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్, ఎమ్ అశ్విన్, పవన్ నేగీలు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేసేందుకు తమ బౌలింగ్‌కు పదునుపెడుతున్నారు. -
రెండు రికార్డులు బ్రేక్ చేశాడు..!
ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సరికొత్త టీ 20 రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తన దేశానికి చెందిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డును గప్టిల్ బద్ధలు కొట్టాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ ఈ మార్కును చేరాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు సాధించడంతో టీ 20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గప్టిల్ గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గప్టిల్ 2,188 పరుగులతో ముందంజంలో ఉండగా, మెకల్లమ్ 2,140 రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లి(1,956) మూడో స్థానంలో నిలిచాడు. కాగా, మెకల్లమ్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా గప్టిల్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తరపున వేగవంతంగా టీ 20 సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 49 బంతుల్లో శతకం సాధించడం ద్వారా మెకల్లమ్ రికార్డును గప్టిల్ సవరించాడు. అంతకుముందు న్యూజిలాండ్ తరపున వేగవంతమైన ట్వంటీ 20 సెంచరీని మెకల్లమ్(50 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ గప్టిల్ కు తోడు మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది. గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. -
'వారితో ఆడాలనేది నా డ్రీమ్'
ఆక్లాండ్: గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిథ్య వహించిన న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్.. ఈసారి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తరపున బరిలోకి దిగనున్నాడు. శని, ఆదివారాల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో మెకల్లమ్‌కు రూ. 3.60 కోట్లు వెచ్చించి ఆర్సీబీ దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న క్రిస్ గేల్‌ను పక్కకు పెట్టిన ఆర్సీబీ యాజమాన్యం.. మెకల్లమ్‌పై ఎక్కువ ఆసక్తి చూపింది. తనను ఆర్సీబీ కొనుగోలు చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మెకల్లమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ జట్టులో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. దీనిలో భాగంగా విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి ఆడాలనే తన డ్రీమ్ అని మెకల్లమ్ తెలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్‌ను సాధించడంలో విఫలమైన ఆర్సీబీ.. మెకల్లమ్ రాకతో తన తలరాతను మార్చుకుంటుందేమో చూడాలి. -
మొత్తం డబ్బులు ఇవ్వలేదు: మెకల్లమ్
కాన్పూర్: తనకు రావాల్సిన మొత్తం సొమ్మును గుజరాత్ లయన్స్ ఇవ్వలేదని అంటున్నాడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రెండన్ మెకల్లమ్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడేటప్పుడు తనకు రూ. 7.5 కోట్లు వచ్చేదని, ఆ మొత్తాన్ని తాజా ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ నుంచి పొందలేదన్నాడు. తనను అదే మొత్తానికి గుజరాత్ లయన్స్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మెకల్లమ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లకు ధనాన్ని చెల్లించే వ్యవహారంలో శాలరీ క్యాప్ పేరు చెప్పి తగ్గించి ఇచ్చారని మెకల్లమ్ స్పష్టం చేశాడు. 2016లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు ఐపీఎల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లుపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వాటిపై రెండేళ్లు నిషేధం పడింది. దాంతో ఆ జట్ల స్థానంలో గుజరాత్, పుణెలు వచ్చి చేరాయి. అదే క్రమంలో చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్లను గుజరాత్, పుణెలు వేలంలో కొనుగోలు చేశాయి. అందులో మెకల్లమ్ ను గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. -
ఐపీఎల్ కు మెకల్లమ్ దూరం
హైదరాబాద్: గుజరాత్ లయన్స్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్, పేసర్ నాధూ సింగ్ లు గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఢిల్లీతో జరిగన గత మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో మెకల్లమ్ టోర్ని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గాయం తీవ్రం కాకుండా మూడు, నాలుగు వారాలు విశ్రాంతి తీసుకురావల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ వెల్లడించాడు. మెకల్లమ్ ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో 319 పరుగులు చేశాడు. ఇక నాధూ సింగ్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. గత గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూండగా మెకల్లమ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. ఇక రాజ్ కోట్ లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో నడుము నొప్పితో బాధపడ్డ నాధూ సింగ్ తర్వతా ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడలేదు. -
ఐపీఎల్ నుంచి మరో క్రికెటర్ అవుట్
న్యూఢిల్లీ: ఐపీఎల్-2017 సీజన్ నుంచి గాయం కారణంగా మరో స్టార్ క్రికెటర్ దూరమయ్యాడు. ఎడమ కాలి తొడనరం నొప్పితో బాధపడుతున్న గుజరాత్ లయన్స్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఈ ఈవెంట్ నుంచి వైదొలిగాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ సందర్భంగా బ్రెండన్ గాయపడ్డాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. కాగా వరుస వైఫల్యాలతో గుజరాత్ ప్లే ఆఫ్ అవకాశాల్ని పోగొట్టుకుంది. గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడగా కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. మెకల్లమ్ మొత్తం 319 పరుగులు చేశాడు. ఇంతకుముందు గాయాల కారణంగా ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావో, ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ఐపీఎల్‌కు దూరమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు జేసన్ రే ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. -
సెంచరీ వీరుడికి వీరతాళ్లు!
ఐపీఎల్ పదో సీజన్లో తొలి సెంచరీతో వీరవిహారం చేసిన యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూను సీనియర్ క్రికెటర్లు ఘనంగా కొనియాడారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన బ్రాండన్ మెక్కల్లమ్ సంజూను ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. ’సంజూ క్రికెట్ ఆడుతుంటే చూడటం నాకు ఇష్టం. అతనిది అద్భుతమైన ప్రతిభ’ అని మెక్కల్లమ్ ట్వీట్ చేశాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన మెక్కల్లమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగి.. 73 బంతుల్లో 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీగా ఈ తుఫాన్ ఇన్నింగ్స్ మిగిలిపోయింది. ఇక తాజా పుణె మ్యాచ్‌లో 62 బంతుల్లో శతకం (102) కొట్టిన 22 ఏళ్ల సంజూ ఐపీఎల్లో అతి పిన్నవయస్సులో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2009లో మనీష్ పాండే 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వీరోచితమైన ఆటతీరు ప్రదర్శించిన సంజూపై బ్రాండన్ మెక్కల్లమ్తోపాటు టాప్ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్, కామెంటేటర్ హర్షభోగ్లే తదితరులు ప్రశంసలతో ముంతెత్తారు. సంజూ గొప్పగా ఆడాడని, అతని ఆడుతుండటం చూసి చాలా ఆనందం కలిగిందని కొనియాడారు. I love watching Sanju Samson play cricket! Hes some talent! — Brendon McCullum (@Bazmccullum) 11 April 2017 Sanju's indifferent year just took a big UU turn. Special Innings. #IPL2017 #RPSvDD — Ashwin Ravichandran (@ashwinravi99) 11 April 2017 -
అది క్రికెట్ అదృష్టం: మెకల్లమ్
వెల్లింగ్టన్:టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి లాంటి ఆటగాడు క్రికెట్లో ఉండటం గేమ్ చేసుకున్న అదృష్టమంటూ ఆకాశానికెత్తేశాడు. గత కొంతకాలం నుంచి ఏ ఫార్మాట్లో చూసినా విరాట్ హవానే నడుస్తుందని కొనియాడాడు. క్రికెట్ క్రీడకు విరాట్ ఒక సూపర్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఫీల్డ్‌లో విధ్వంసకర ఆటతీరుతో చెలరేగే కోహ్లి.. తన కెరీర్లో ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించేలేదన్నాడు. ఫీల్డ్‌లో దూకుడును చూపట్టే కోహ్లి.. మైదానం బయటం ఎంతో హుందాగా ఉంటాడని పేర్కొన్నాడు. ఇలా ఉండటం కచ్చితంగా ఎవరికైనా సవాల్ వంటిదని మెకల్లమ్ పేర్కొన్నాడు. ఈ తరహా లక్షణాలున్న విరాట్.. క్రికెట్లో ఉండటం ఆ గేమ్ చేసుకున్న అదృష్టమన్నాడు. చాలాకాలం నుంచి విరాట్ అత్యంత నిలకడగా ఆటను కొనసాగించడమే అతని పట్టుదలకు నిదర్శమన్నాడు. ఒకవైపు ఫిట్నెస్ను కాపాడుకుంటూ, మరొకవైపు అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేస్తున్న కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడన్నాడు. -
'భారత క్రికెట్లో అతను చాలా ప్రమాదకరం'
రాంచీ:న్యూజిలాండ్‌తో జరిగిన రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో భారత్ క్రికెట్ జట్టు లక్ష్య ఛేదనలో వెనుబడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో పాటు పలువురు టాపార్డర్ ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో భారత జట్టు పరాజయం చవి చూసింది. అయితే భారత క్రికెట్ జట్టులో ధోని చాలా ప్రమాదకరమైన ఆటగాడు అని అంటున్నాడు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రభావం చూపిన ధోని అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా అభివర్ణించాడు. 'ధోని గొప్ప నాయకుడు. అంతకంటే ప్రమాదకరమైన ఆటగాడు కూడా. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని, పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఆ క్రమంలోనే అతని బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చాలా ముందుకొచ్చాడు. అతని ఆర్డర్లో ముందుకు రావడం మ్యాచ్‌లపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అతను అలా నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడం నన్ను ఆశ్చర్యపరచలేదు. ధోని ఒక అద్భుతమైన క్రికెటర్. ప్రస్తుతం భారత క్రికెట్లో ఇద్దరు క్రికెటర్లకు చాలా అనుభవం ఉంది. అందులో ఒకరు ధోని అయితే, మరొకరు కోహ్లి. ఒత్తిడిలో కూడా మ్యాచ్‌లను తమవైపుకు తిప్పుకునే సామర్థ్యం వారి సొంతం. చాలా ప్రశాంతంగా వారి పని ముగిస్తారు. ఇలా లక్ష్య ఛేదనలో ఒకర్నినొకరు అర్ధం చేసుకుని విజయాల్ని సాధించడం అంత తేలిక కాదు. ఆ ఇద్దరి క్రికెటర్లు ఒకేసారి క్రీజ్‌లో ఉంటే అభిమానులకు తగినంత వినోదాన్నిఅందిస్తారు' అని మెకల్లమ్ అన్నాడు. -
అతను ఎప్పుడూ మౌనముద్రలోనే..: మెకల్లమ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గతంలో న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలు మోసిన టేలర్ ఎప్పుడూ పెదవి విప్పేవాడే కాదంటూ మెకల్లమ్ రాసిన 'డిక్లేర్' అనే బుక్‌లో ప్రస్తావించాడు. కనీసం జట్టు సమావేశాల్లో కూడా రాస్ టేలర్ మౌన ముద్రలోనే ఉండేవాడంటూ ఆ పుస్తకంలో ప్రస్తావించాడు. ' మా ప్రధాన కోచ్ మైక్ హెస్సెన్ ఎప్పుడూ ఆటగాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకునేవాడు. అయితే ఇందుకు కారణంగా కెప్టెన్ గా రాస్ టేలర్ ఎప్పుడూ జట్టు ప్రణాళికలు చెప్పకపోవడమే. భవిష్యత్తు ప్రణాళికలేమిటో మేమే చెప్పేవాళ్లం. రాస్ ను ఎప్పుడు అడిగినా ఏమీ లేదు అనేవాడు. ఒక్క పదం కూడా మాట్లాడేవాడు కాదు. దాంతో మా కోచ్ అయోమయంలో పడేవాడు. ఇలా రాస్ ఎందుకు చేసేవాడు నాకైతే తెలీదు. జట్టును ఎప్పుడూ సరైన రీతిలో పెట్టలేకపోయేవాడు. అతని ఆలోచల్ని కూడా జట్టు సభ్యులతో పంచుకునేవాడు కాదు' అని మెకల్లమ్ తాజా పుస్తకంలో వెల్లడించాడు. అయితే రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని తెలిపాడు. రాస్ టేలర్ తరువాత డేనియల్ వెటోరికీ న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పడాన్ని మాత్రం మెకల్లమ్ పరోక్షంగా విమర్శించాడు. -
సచిన్ ఒక్కడే..
లండన్:న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తన ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించాడు. తాజాగా మెకల్లమ్ విడుదల చేసిన క్రికెట్ ఎలివన్లో భారత్ నుంచి సచిన్‌కు ఒక్కడికే స్థానం దక్కింది. అయితే నలుగురు ఆస్టేలియా ఆటగాళ్లకు మెకల్లమ్ ఆల్ టైమ్ ఎలివన్లో చోటు దక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, మిచెల్ జాన్సన్‌లు ఉన్నారు. మరోవైపు వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ కు వెస్టిండీస్ నుంచి స్థానం కల్పించగా, న్యూజిలాండ్ నుంచి టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లను మాత్రమే మెకల్లమ్ ఎన్నుకున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్కు ఒక్కడికి తన జట్టులో స్థానం కల్పించాడు. అయితే క్రిస్ గేల్, సచిన్‌లను ఓపెనర్లుగా ఎంచుకోగా, రికీ పాంటింగ్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు.. ఆ తరువాత స్థానల్లో లారా, రిచర్డ్స్లుండగా, ఏడో స్థానాన్ని ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఇచ్చాడు. ఆరో స్థానాన్ని తనకే కేటాయించుకున్నాడు మెకల్లమ్. -
ఐసీసీపై మెకల్లమ్ ధ్వజం!
లార్డ్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవినీతి నిరోధక శాఖపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ మండిపడ్డాడు. క్రికెట్లో అవినీతికి పాల్పడిన కొంతమంది ఆటగాళ్లకు వరల్డ్ క్రికెట్ గవర్నింగ్ బాడీ జీవిత కాలం నిషేధం విధిస్తున్నా, మరికొంతమందిని ప్రత్యేకం ఫిక్సింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శించాడు. సోమవారం ఎంసీసీ నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కార్యక్రమానికి హాజరైన మెకల్లమ్.. తాను గతంలో సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్పై చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న ఐసీసీ అవినీతి నిరోధక శాఖలో లోపాల కారణంగానే కొంతమంది ఫిక్సింగ్ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాడు. తన తోటి ఆటగాడైన లూ విన్సెంట్‌కు జీవిత కాలం నిషేధం విధించిన సంగతిని ఈ సందర్భంగా మెకల్లమ్ ప్రశ్నించాడు. విన్సెంట్ లాంటి వారిపై నిషేధం విధించి, కొంతమందిని కాపాడటమా అవినీతి నిరోధక శాఖ విధి అని నిలదీశాడు. ఇక భవిష్యత్తులో్నైనా అవినీతి నిరోధక శాఖ పారదర్శకంగా ఉండాలని మెకల్లమ్ సూచించాడు. అప్పుడే క్రికెట్ లో పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టే అవకాశం ఉందని మెకల్లమ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌కు గతేడాది ఊరట లభించిన సంగతి తెలిసిందే. అతణ్ని నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. -
‘కోట్లా’టలో నెగ్గేదెవరు?
టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడు ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ అమీతుమీ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం ఒకవైపు వరుస విజయాలతో అజేయంగా నిలిచిన జట్టు... మరోవైపు తడబడుతూనే అయినా అంచనాలను దాటి సెమీస్ చేరిన జట్టు... ఒకరేమో మాజీ చాంపియన్... మరొకరేమో తొలిసారి ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో ఉన్న బృందం... ఇరు జట్లలోనూ ఆల్‌రౌండ్ నైపుణ్యం... పిచ్ చూస్తేనేమో అనిశ్చితికి మారుపేరు... ఏ రోజు ఏ మ్యాచ్‌కు ఎలా ప్రవర్తిస్తుందో తెలియని ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై... న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరి ఈ సమఉజ్జీల ‘కోట్లా’టలో నెగ్గేదెవరో..! న్యూఢిల్లీ: గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో న్యూజిలాండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు కూడా అదే తరహా టీమ్ స్పిరిట్ కనబరుస్తున్న ఆ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ తుది పోరుకు అర్హత సాధించాలని భావిస్తోంది. అయితే ఆ జట్టుకు ఇంగ్లండ్ రూపంలో సమఉజ్జీ ఎదురుగా నిలిచింది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కివీస్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉండగా, తొలి మ్యాచ్ తర్వాత కోలుకున్న ఇంగ్లండ్ సవాల్ విసురుతోంది. ఇంగ్లండ్ 2010లో టైటిల్ గెలుచుకోగా, న్యూజిలాండ్ ఒక్కసారీ ఫైనల్‌కు చేరలేదు. ఓటమి లేకుండా... ప్రపంచకప్‌కు ముందు బ్రెండన్ మెకల్లమ్ దూరం కావడం, చెప్పుకోదగ్గ స్టార్లు లేకపోవడంతో భారత్‌లో జరిగే టోర్నీలో న్యూజిలాండ్ జట్టుపై ఎవరికీ అంచనాల్లేవు. కానీ లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా ఇప్పుడు కివీస్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. 162 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జట్టు తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు... రాస్ టేలర్, రోంచీ, విలియమ్సన్ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకకుండా జట్టును నడిపిస్తుండగా... రోంచీ, ఇలియట్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు. అండర్సన్ రూపంలో కీలక ఆల్‌రౌండర్ ఆ జట్టుకు ఉన్నాడు. అన్నింటికి మించి ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం బాగా పని చేసింది. నాథన్ మెకల్లమ్ ఆఫ్ స్పిన్, సోధి లెగ్‌స్పిన్‌కు తోడు వెటోరికి డూప్లికేట్‌గా కనిపిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ శాంట్నర్ కివీస్‌కు బలంగా మారారు. ముగ్గురు కలిసి టోర్నీలో ఇప్పటికి 20 వికెట్లు పడగొట్టారు. మరోసారి కివీస్ తమ స్పిన్‌ను బలంగా నమ్ముతోంది. దూకుడైన ఆటకు మారుపేరుగా మారిన ఈ జట్టును ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు సులువు కాదు. ఇంగ్లండ్ మారిపోయింది తొలి మ్యాచ్‌లో క్రిస్ గేల్ చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత ఇంగ్లండ్ కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికాతో 230 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించడం అనూహ్యం. అఫ్ఘానిస్తాన్‌తో తడబడినా, శ్రీలంకపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ మళ్లీ మెరిశారు. టి20 స్పెషలిస్ట్‌లతో టోర్నీకి వచ్చిన ఆ జట్టు మంచి ఫలితాలే సాధిం చింది. ముఖ్యంగా బట్లర్ మరోసారి తన దూకుడైన ఆటతో చెలరేగిపోతుండగా... జేసన్ రాయ్ మంచి ఆరంభం ఇస్తున్నాడు. టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు ఉన్న జో రూట్ కూడా 150 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం ఇంగ్లండ్ ఆటతీరు మారిందనడానికి నిదర్శనం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల రూట్‌తో పాటు కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ కూడా ఆ జట్టు బలం. ఇంగ్లండ్ బౌలింగ్ మాత్రం అంత గొప్పగా లేదు. జట్లు (అంచనా): న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, అండర్సన్, రాస్ టేలర్, రోంచీ, గ్రాంట్ ఇలియట్, శాంట్నర్, సోధి, మిల్నే, మెకల్లమ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, హేల్స్, రూట్, బట్లర్, మోర్గాన్, స్టోక్స్, అలీ, జోర్డాన్, విల్లీ, ప్లంకెట్/టోప్లీ. పిచ్, వాతావరణం టోర్నీలో చాలా వేదికల్లాగే ఫిరోజ్ షా కోట్లాలో నెమ్మదైన పిచ్ ఉంది. ఇంగ్లండ్ ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడింది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షం పడే అవకాశం లేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య ఇప్పటివరకూ 13 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 8 గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లలో మాత్రం నాలుగు మ్యాచ్‌లు జరిగితే చెరో రెండు గెలిచాయి. -
నా నిర్ణయం సరైనదే:మెకల్లమ్
క్రిస్ట్‌చర్చ్: తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని న్యూజిలాండ్ డాషింగ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ స్పష్టం చేశాడు. సరైన సమయంలోనే క్రికెట్ నుంచి బయటకొచ్చినట్లు రెండో టెస్టులో కివీస్ ఓటమి అనంతరం మెకల్లమ్ పేర్కొన్నాడు. తన చివరి ప్రదర్శన సంతృప్తి నిచ్చినా ఓటమి మాత్రం బాధించిందన్నాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డును తిరగరాసిన సంగతి తెలిసిందే. వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో; ఇంగ్లండ్‌పై 1986లో), మిస్బా వుల్ హక్ (56 బంతుల్లో; ఆస్ట్రేలియాపై 2014లో) పేరిట ఉన్న రికార్డును మెకల్లమ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్ గా ఈ ఇన్నింగ్స్ లో మెకల్లమ్ (145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ నమోదు చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ( 27 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు బుధవారం ఆఖరి రోజు ఆటలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కివీస్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని స్మిత్ సేన 54 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో పాటు టెస్టుల్లో ఆసీస్ నంబర్‌వన్ గా అవతరించింది. -
మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్టేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ పరాజయం దాదాపుగా ఖాయమైంది. 121/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివీస్ 335 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విలియమ్సన్(97) తృటిలో సెంచరీ కోల్పోయాడు. హెన్రీ(66) అర్ధ సెంచరీ సాధించాడు. ఆండర్సన్ 40, వాట్లింగ్ 46 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బర్డ్ 5, పాటిస్సన్ 4 వికెట్లు పడగొట్టారు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు. టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. వార్నర్(22) అవుటయ్యాడు. బర్న్స్(27), ఖాజా(19) క్రీజ్ లో ఉన్నారు. -
మెకల్లోలం లేదు!
క్రైస్ట్‌చర్చ్: మొదటి ఇన్నింగ్స్ లో 'శత'కొట్టుడుతో రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రెండో ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బాదుతానని ప్రకటించిన కివీస్ కెప్టెన్ కు ఆస్ట్రేలియా బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ విధ్వంసకర ఆటగాడిని తక్కువ స్కోరుకే పెవిలియన్ కు పంపి ఊపిరి పీల్చుకున్నారు. మెక్ కల్లమ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 25 పరుగులు చేసి అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. లాంథమ్(39), గప్టిల్(0), నికోల్స్(2) అవుటయ్యారు. విలియమ్సన్(45), ఆండర్సన్(9) క్రీజ్ లో ఉన్నారు. పాటిన్సన్ 3 వికెట్లు తీశాడు. హాజిల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది. ఆసీస్ కంటే కివీస్ 14 పరుగులు వెనుకబడివుంది. 363/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులకు ఆలౌటైంది. వోజెస్(60) అర్ధ సెంచరీ సాధించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ 6 వికెట్లు పడగొట్టాడు. బౌల్డ్ 2 వికెట్లు తీశాడు. ఆండర్సన్, విలియమ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మెక్ కల్లమ్ బౌలింగ్ అంతర్జాతీయ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ కాసేపు బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో రెండు మేడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
'రికార్డు గురించి తెలియదు'
క్రిస్ట్‌చర్చ్: తాను టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసిన విషయం క్రీజ్‌లో ఉన్నప్పుడు తెలియదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ స్సష్టం చేశాడు. తాను క్రీజ్‌లోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం మాత్రమే చేశానన్నాడు. అది ఇలా రికార్డుగా నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదని మెకల్లమ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఆరంభమైన రెండో టెస్టులో మెకల్లమ్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తద్వారా 1986లో ఇంగ్లాండ్ పై విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 56 బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డుతో పాటు ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియాపై పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బావుల్ హక్ 56 పరుగుల్లోనే 100 పరుగులు చేసిన రికార్డులను మెకల్లమ్ చెరిపేశాడు. దీనిపై ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన మెకల్లమ్.. తాను బ్యాట్ తో పరుగులు వర్షం కురిపించాలని మాత్రమే ప్రయత్నించానన్నాడు. ఆ క్రమంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం చేశానన్నాడు. తన ఆదర్శ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ రికార్డును అధిగమించడం చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ రికార్డు కంటే మ్యాచ్ లో గెలుపే ముఖ్యమని మెకల్లమ్ తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ లో మెకల్లమ్(145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో కూడా మెకల్లమ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వన్డే మ్యాచ్ లో 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెకల్లమ్ 47 పరుగులు చేశాడు. మరోవైపు కివీస్ తరపున టెస్టుల్లో ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత మెకల్లమ్ పేరిటే ఉండటం విశేషం. -
ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బద్దలు
క్రైస్ట్ చర్చ్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. తన చిట్టచివరి టెస్ట్ మ్చాచ్ ఆడుతోన్న కివీస్ విధ్వంసకారుడు మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డులను తిరగరాశాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో బ్రెండన్ ఈ ఘనత సాధించాడు. మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లంచ్ విరామంకంటే ముందే న్యూజిలాండ్ స్కోరు 32/3. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన మెకల్లమ్.. కంగారూలపై వీరప్రతాపం చూపాడు. ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే 21 పరుగులు పిండుకుని షాన్ మార్ష్ కు చుక్కలుచూపాడు. మెకల్లం 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అంపైర్ లంచ్ విరామం ప్రకటించాడు. ఆట మళ్లీ మొదలయిన తర్వాత చూడాలీ.. బ్రెండన్ బాదుడే బాదుడు! సరిగ్గా 54 పరుగుల వద్ద 100 పరుగులు పూర్తిచేసుకున్న మెకల్లం.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ధీరుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇద్దరిపేరిట ఉండేది. 1986లో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్.. ఇంగ్లాండ్ పై వివ్.. 56 బంతుల్లో సెంచరీ కొట్టారు. ఆ తర్వాత 2014లో పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బాఉల్ హక్.. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మెకల్లమ్ ఆ రికార్డులను తిరగరాశాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండరీ బాదిమరీ రికార్డు సెంచరీ చేసిన మెకల్లమ్ ఈ మ్చాచ్ లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీకాగా, బ్యాటింగ్ లో అత్యధిక సిక్సులు(100) కొట్టిన వికెట్ కీపర్ గా మెకల్లమ్.. ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 145 పరుగులు చేసిన మెకల్లమ్ ఆరోవికెట్ గా వెనుదిరిగాడు. జేమ్స్ అండర్సన్ 66 బంతుల్లో 72 పరుగులు) మెకల్లమ్ కు చక్కటి సహకారం అందించాడు. చివర్లో వాట్లింగ్(57 బంతుల్లో 58 పరుగులు) ధాటిగా ఆడటంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 370 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ 3, హాజిల్ వుడ్, పాటిన్సన్, బర్డ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ మార్ష్ కు ఒక వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. -
చివరి వన్డేలోనూ దుమ్మురేపాడు
హామిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తన చివరి వన్డేలోనూ దుమ్మురేపాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో మెకల్లమ్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ మార్ష్ మూడు, హజ్లెవుడ్, హేస్టింగ్స్, బొలాండ్ తలా రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ జట్టులో గుప్టిల్ (59), ఎలియట్ (50), మెకల్లమ్ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. దూకుడు మీదున్న మెకల్లమ్ హాఫ్ సెంచరీకి చేరువలో మార్ష్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బ్రెండన్ మెకల్లమ్.. పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పులకించిపోతారు. గత దశాబ్ధకాలంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో తనదైన ముద్ర వేసిన కివీస్ క్రికెటర్ మెకల్లమే. భారీషాట్లకు, విధ్వసంక ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా ఉన్న మెకల్లమ్.. న్యూజిలాండ్ జట్టు తరఫున అనేక వ్యక్తిగత రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్‌కు అద్భుత ఆరంభం ఇచ్చిన వీరుడు.. కివీస్ తరఫున టెస్టుట్లో ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ధీరుడు.. న్యూజిలాండ్ జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన యోధుడు. ప్రస్తుత తరంలో ఏ న్యూజిలాండ్ ఆటగాడికి సాధ్యంకానీ రీతిలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన బ్రెండన్ మెకల్లమ్ ఔటయిన తర్వాత ఆసిస్ ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపారు. కీపర్‌గా జట్టులోకి అరంగేట్రం చేసి అప్పటి స్టార్ల నీడలో కొద్దికొద్దిగా ఎదిగిన మెకల్లమ్.. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత జూనియర్లకు మార్గదర్శిగా నిలిచాడు. మెరుపు వేగంతో పరుగులు చేసి ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్‌లను తేలిగ్గా లాగేయడంలో తనదైన శైలిని ఏర్పర్చుకున్న మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవడం అభిమానులకు లోటే అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్.. 2002లోనే కీపర్ అరంగేట్రం చేశాడు మెకల్లమ్. అయితే మెక్‌మిలన్, నాథన్ అస్టల్, స్టీఫెన్ ఫ్లెమింగ్, క్రిస్ కెయిన్స్ వంటి స్టార్లు ఉండడంతో అతని ప్రతిభ బయట పడలేదు. ఓపెనింగ్‌లో వచ్చినా పెద్దగా రాణించకపోవడంతో అతణ్ని మిడిలార్డర్‌కు మార్చేశారు. అయినా మెకల్లమ్ మెరవలేదు. మరో కీపర్ లేకపోవడం.. మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టులో కొనసాగాడు. అసలు వన్డేల్లో తొలిసారి అర్ధసెంచరీ చేయడానికే ఏకంగా 29 ఇన్నింగ్స్‌లు పట్టింది. 2005లో ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఆ మ్యాచ్‌లో 331 పరుగులను ఛేదించే క్రమంలో కివీస్ 258 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రెండన్.. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. పదోవికెట్కు వెటోరీతో కలసి 74 పరుగులు జోడించి ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. సెంచరీలతో కొలవలేం.. మెకల్లమ్ కెరీర్‌ను అతడు చేసిన పరుగులు.. బాదిన శతకాలతో వర్ణించలేం. భారీగా పరుగులు చేయకపోయినా.. సగటు ఎక్కువగా లేకపోయినా.. ఒక్కో మ్యాచ్‌లో అతడు మెరుపు వేగంతో చేసిన పరుగులే మ్యాచ్‌లో తన జట్టు గెలిచేందుకు పునాదులు వేశాయి. నిజానికి మెకల్లమ్ తన 144వ ఇన్నింగ్స్‌లో తొలిసెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 166 పరుగులు సాధించాడు. సీనియర్లు రిటైరయ్యాక ఓపెనింగ్‌కు మారిన మెక్.. పవర్‌ప్లే ఎలా ఆడాలో చూపించాడు. ఈ 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుండి నడిపించాడు. గత కొంతకాలంగా కీపింగ్‌కు దూరంగా ఉంటున్న మెకల్లమ్ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు. టీ20ల రాకతో మరోస్థాయికి.. వన్డే, టెస్టుల్లో మెకల్లమ్ ఆట ఒక ఎత్తు.. టీ20ల్లో మరోఎత్తు. టీ20ల రాకతో మెకల్లమ్ ఒక్కసారిగా సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. ఓపెనింగ్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. ముఖ్యంగా ఐపీఎల్ తొలిమ్యాచ్‌లో మెకల్లమ్ విధ్వంసం మర్చిపోలేం. కోల్‌కతా తరఫున బెంగళూరుపై 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపాడు. టీ20ల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బ్రెండనే. ఈ ఫార్మాట్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా అతడే. ముందుండి నడిపించాడు.. 2009లో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మెక్.. నాయకుడిగా ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నిలకడైన ఆటతో మార్గనిర్ధేశం చేశాడు. ఇక 2015 ప్రపంచకప్ సందర్భంగా జట్టును తొలిసారిగా ఫైనల్‌కు చేర్చాడు. దాంతో ఆ దేశంలో క్రికెట్‌కు మరోసారి క్రేజ్‌ను తెచ్చాడు. టోర్నీలో ప్రతిమ్యాచ్‌లో మెరుపు ఆరంభాలిచ్చి జట్టును చివరిమెట్టుకు చేర్చాడు. బాదడానికే ఆడినట్లు.. మెకల్లమ్ ఆడే శైలే విభిన్నంగా ఉంటుంది. క్రీజ్‌లో చురుగ్గా కదలడం అతని ఆటలో ప్రత్యేకం. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్‌లో నుంచి ముందుకి వచ్చి ఫీల్డర్ల తలపై నుంచి బౌండరీలు బాదడంలో దిట్ట. ఇక పేసర్ల బౌలింగ్‌లో పుల్‌షాట్లు, స్ట్రైట్షాట్లు ఆడడం చూసి తీరాల్సిందే. వికెట్లకు అడ్డంగా వచ్చి ఫైన్‌లెగ్‌వైపు సిక్స్‌లు కొట్టడంలో ఆరితేరాడు. ఫీల్డింగ్‌లో మెరుపు విన్యాసాలు ప్రదర్శిస్తుంటాడు. డైవ్ దూకడంలోనూ.. క్లిష్టమైన క్యాచ్‌లు పట్టడంలోనూ వీరుడే. * క్రికెట్‌కు బ్రెండన్ చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో ఆ దేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారం 'ఆఫీసర్ ఆఫ్ ద న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' అందుకున్నాడు. * అయితే 34 ఏళ్ల మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన లీగ్‌ల రూపంలో తన విన్యాసాలు కొనసాగించడం అభిమానులకు ఊరటే. * ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్.. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నాడు. టెస్టుల్లో 100 సిక్స్‌లు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఈ స్టార్.. అరంగేట్రం నుంచి వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతానని మంగళవారం ప్రకటించాడు. ఫిబ్రవరి 20న హేగ్లే ఓవల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ అతడికి 101వది. రెండేళ్లుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న 34 ఏళ్ల మెక్ కల్లమ్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. 'ఆటగాడిగా, కెప్టెన్ నాకు ఇచ్చిన అవకాశాలను ఎంతో ప్రేమించా. ఆటకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సొంత దేశం తరపు ఆడడం మర్చిపోలేని అనుభవం' అని మెక్ కల్లమ్ అన్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్ కల్లమ్ 38.48 సగటుతో 6,273 పరుగులు సాధించాడు. 2013లో మూడు ఫార్మాట్లకు న్యూజిలాండ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. మార్చి, ఏప్రిల్ లో జరగనున్న టి20 వరల్డ్ కప్, ఆగస్టులో సౌతాఫ్రికా, జింబాబ్వే టూర్లకు కెప్టెన్ వ్యవహరిస్తాడని భావించారు. అయితే టి20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించేవరకు ఆగకూడదన్న ఉద్దేశంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెక్ కల్లమ్ వారసుడిగా 25 ఏళ్ల కానే విలియమ్సన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించనున్నారు. -
మెకల్లమ్ 'సిక్సర్ల' ఘనత
దునేదిన్:న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ మెకల్లమ్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ఒక ఓవర్ లో రెండు సిక్సర్లు బాది వంద సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ఓవర్ ను ఎదుర్కొన్న మెకల్లమ్(17 నాటౌట్; ఆరు బంతుల్లో 2 సిక్సర్లు) హిట్టింగ్ చేసి ఆ ఘనతను అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా లెజెండ్ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన మెకల్లమ్ నిలిచాడు. కాగా గిల్ క్రిస్ట్ 96 మ్యాచ్ ల్లో 100 సిక్సర్లను పూర్తి చేసుకుంటే, మెకల్లమ్ 98 మ్యాచ్ ల్లో ఆ ఘనతను సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో క్రిస్ గేల్(98), కల్లిస్(97), వీరేంద్ర సెహ్వాగ్(91 సిక్సర్లు) లు ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్) విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. -
బాంబు పేల్చిన మెక్ కల్లమ్
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బాంబు పేల్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ లోకి లాగేందుకు ప్రయత్నం జరిగిందని కోర్టుకు వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్ప్ తనను అడిగాడని తెలిపాడు. 2008, ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా లోని ఓ హోటల్ లో కలిసినప్పుడు తనను ఫిక్సింగ్ లోకి లాగేందుకు కెయిన్స్ ప్రయత్నించాడని, అయితే అతడి ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని లండన్ కోర్టులో వెల్లడించాడు. కెయిన్స్ ప్రతిపాదనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఫిక్సింగ్ చేయాలని అదే ఏడాది రెండుసార్లు తనను కెయిన్స్ కోరాడని తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ గురించి పేపర్ పై రాసి మరీ వివరించాడన్నాడు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్ కు 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశ పెట్టాడని వెల్లడించాడు. ఫిక్సింగ్ సొమ్ముతో కెయిన్స్ న్యూజిలాండ్ లో ఆస్తులు కూడబెట్టాడని తెలిపాడు. కెయిన్స్ వ్యవహారం గురించి 2011లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మెక్ కల్లమ్ చెప్పాడు. -
మెకల్లోలమ్
64 బంతుల్లో 158 పరుగులు ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీ లండన్: తొలి ఐపీఎల్లో కివీస్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 73 బంతుల్లో 158 పరుగులతో ఔరా అనిపించి లీగ్‌కు కూడా ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చాడు. ఇప్పుడు కౌంటీల్లో కూడా అదే రకం ఆటతీరుతో విరుచుకుపడి రికార్డు సృష్టించాడు. ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా శుక్రవారం డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ తరఫున ఆడిన మెకల్లమ్... 64 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులు చేశాడు. ఇది ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండగా 42 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో వార్విక్షైర్ గెలిచింది. ఇంతకుముందు 2014లో ససెక్స్ ఆటగాడు ల్యూక్ రైట్ 153 పరుగులు సాధించాడు. అలాగే ఓవరాల్‌గా టి20 ఫార్మాట్లో తన పేరిటే ఉన్న రెండో అత్యధిక స్కోరును మెకల్లమ్ సమం చేసుకున్నాడు. తొలిస్థానంలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (175) ఉన్నాడు. -
మె ’కల్లోలమ్
56 బంతుల్లో అజేయంగా 100 9 సిక్సర్లతో చెలరేగిన చెన్నై ఓపెనర్ ధోని మెరుపు ఇన్నింగ్స్ సన్‌రైజర్స్‌పై సూపర్‌కింగ్స్ విజయం ఐపీఎల్ అంటేనే విభిన్న షాట్లతో కనువిందు చేసే టోర్నీ. ఇక మెకల్లమ్ లాంటి విధ్వంసకర ఆటగాడు అలాంటి షాట్లనే తన ఆయుధంగా చేసుకుంటే... పరుగుల సునామీయే. సంప్రదాయ డ్రైవ్‌లు, కట్లతో పాటు స్కూప్ షాట్లతో మెకల్లమ్ పరుగుల మోత మోగించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సెంచరీల బోణీ చేసిన మెకల్లమ్ జోరుకు... ధోని మెరుపులు తోడవడంతో... చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం నమోదు చేసింది. సీజన్‌లోని తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 45 పరుగులతో ఓడిపోయింది. చెన్నై: స్టెయిన్‌లాంటి ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ అందుబాటులో ఉన్నా తుది జట్టులోకి తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పు చేసినందుకు సన్‌రైజర్స్ భారీ మూల్యమే చెల్లించుకుంది. బౌలింగే తమ బలమనుకున్న హైదరాబాద్ ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టిన మెకల్లమ్ (56 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు; 9 సిక్సర్లు), ధోని (29 బంతుల్లో 53; 4 ఫోర్లు; 4 సిక్సర్లు) చెన్నై ఖాతాలో రెండో విజయాన్ని చేర్చారు. చెపాక్ స్టేడియంలో శనివారం జరిగిన ఐపీఎల్-8 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగులతో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసి ఓడింది. వార్నర్ (42 బంతుల్లో 53; 1 ఫోర్; 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. మోహిత్ శర్మ, బ్రావోలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం మెకల్లమ్కి దక్కింది. మెకల్లమ్, ధోని దూకుడు ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ బాదిన ఓపెనర్ మెకల్లమ్ తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. అందరి బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ స్మిత్ (26 బంతుల్లో 27; 4 ఫోర్లు; 1 సిక్స్), రైనా (12 బంతుల్లో 14; 1 ఫోర్) తక్కువ స్కోర్లకే రనౌట్ అయ్యారు. ఇషాంత్ శర్మ వేసిన 7వ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్స్‌లు ఓ ఫోర్‌తో మొత్తం 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ధోని రాకతో మ్యాచ్ టాప్ గేర్‌లో వెళ్లింది. కరుణ్ శర్మ వేసిన 18వ ఓవర్లో తను మూడు సిక్స్‌లు బాదాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి మరుసటి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మెకల్లమ్, ధోని మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. మెకల్లమ్ 89 పరుగుల మీద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ చివరి మూడు బంతులు ఆడే అవకాశం వచ్చింది. వరుసగా రెండు స్కూప్ షాట్లతో సిక్సర్, ఫోర్ కొట్టిన మెకల్లమ్... ఆఖరి బంతికి సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ ఒక్కడే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ చెన్నై బౌలర్ల ముందు తేలిపోయారు. క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ (18 బంతుల్లో 26; 5 ఫోర్లు) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత వార్నర్‌కు సహకారం ఇచ్చే వారు కరువయ్యారు. ఓజా (11 బంతుల్లో 15; 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన తను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 15వ ఓవర్లో పాండే బౌలింగ్‌లో వార్నర్ అవుటయ్యాడు. చివర్లో బొపారా (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (రనౌట్) 27; మెకల్లమ్ నాటౌట్ 100; రైనా (రనౌట్) 14; ధోని (సి) వార్నర్ (బి) బౌల్ట్ 53; జడేజా (రనౌట్) 0; బ్రేవో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1-75, 2- 135, 3-198, 4-198. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-31-0; బౌల్ట్ 4-0-34-1; ఇషాంత్ 3-0-46-0 కరుణ్ 4-0-51-0; బొపారా 4-0-29-0; రసూల్ 1-0-11-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్మిత్ (బి) పాండే 53; ధావన్ (సి) జడేజా (బి) మోహిత్ 26; రాహుల్ (బి) మోహిత్ 5; ఓజా (సి) మోహిత్ (బి) అశ్విన్ 15; బొపారా (బి) బ్రేవో 22; విలియమ్సన్ నాటౌట్ 26; కరుణ్ (సి) రైనా (బి) బ్రేవో 4; రసూల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-30, 2-46, 3-91, 4-114, 5-136, 6-150. బౌలింగ్: నెహ్రా 4-0-31-0; మోహిత్ 4-0-36-2; పాండే 3-0-26-1; అశ్విన్ 4-0-22-1; బ్రేవో 4-0-25-2; జడేజా 1-0-17-0. 32 ఐపీఎల్లో ఇప్పటిదాకా నమోదైన సెంచరీలు. మెకల్లమ్‌కు ఇది రెండోది. -
మెకల్లమ్‌కు మరో గౌరవం
కివీస్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక ఆక్లాండ్: ప్రపంచకప్‌లో తొలిసారి తమ జట్టును ఫైనల్‌కు చేర్చిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌కు తమ దేశంనుంచి మరో గౌరవం దక్కింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ సమర్థంగా రాణించిన మెకల్లమ్ కివీస్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ రిచర్డ్ హ్యడ్లీ మెడల్)కు ఎంపికయ్యాడు. బుధవారం ఇక్కడ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మెకల్లమ్ అవార్డు అందుకున్నాడు. ఏడాది కాలంగా బ్యాట్స్‌మన్‌గా కూడా అద్భుతంగా రాణించిన మెకల్లమ్ నేతృత్వంలో కివీస్ ఒకే ఏడాది ఐదు టెస్టు విజయాలు సాధించడం విశేషం. ఈ అవార్డు కోసం మెకల్లమ్‌తో పోటీ పడిన కేన్ విలియమ్సన్ మూడు అవార్డులు గెలుచుకున్నాడు. టెస్టు, వన్డే, టి20లు మూడింటిలోనూ అతను ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్‌కు ఉత్తమ బౌలర్ అవార్డు దక్కింది. -
ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్
దుబాయ్: ఐసీసీ ప్రపంచకప్ ఎలెవన్ జట్టులో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ సారథి క్లార్క్ కాకుండా న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ‘దూకుడైన ఆటతీరే కాకుండా వినూత్న, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఈ మెగా టోర్నీలో మెకల్లమ్ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ జట్టుకు అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశాం’ అని ఐసీసీ తెలిపింది. టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లను పలువురు క్రీడా నిపుణులు కలిసి ఓ జట్టుగా ఎంపిక చేశారు. ప్రపంచకప్ ఎలెవన్ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, స్మిత్, అండర్సన్, వెటోరి, బౌల్ట్, సంగక్కర (వికెట్ కీపర్), డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, స్టార్క్, మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు). -
22 బంతుల్లో మెక్ కల్లమ్ అర్ధసెంచరీ
ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ విజృంభించాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికి 31 హాఫ్ సెంచరీ కాగా, ఈ టోర్నమెంట్లో నాల్గోది. కివీస్ 8 ఓవర్లలో 77/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ కల్లమ్ అవుటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో స్టెయిన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ జోరు తగ్గింది. గప్టిల్(6), విలియమ్సన్(2) క్రీజ్ లో ఉన్నారు. -
మీ ఉద్యోగులకు సెలవు ఇవ్వండి!
కార్యాలయాలకు మెకల్లమ్ బహిరంగ లేఖ ఆక్లాండ్: దక్షిణాఫ్రికాతో సెమీస్ సందర్భంగా మైదానానికి వచ్చి తమ జట్టుకు మద్దతు పలకాలని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తమ అభిమానులను కోరాడు. ఇందు కోసం అతను అనూహ్య రీతిలో కొత్త పద్ధతిని అనుసరించాడు. మంగళవారం ఉద్యోగులకు సెలవు ఇవ్వాలంటూ కార్యాలయాలకు బహిరంగ లేఖ రాశాడు. .....అనే వ్యక్తికి విధులనుంచి సంబంధిత అధికారులు మినహాయింపు ఇవ్వమని, వారు ఆఫీసులో లేకపోయినా ఈడెన్ పార్క్‌లో ఉండేలా చూడమంటూ మెకల్లమ్ సంతకంతో కూడిన లేఖ న్యూజిలాండ్‌లో సర్క్యులేట్ అయింది. ‘మైదానానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మీ కోసం సీటును సిద్ధంగా ఉంచాం. అక్కడే ఉన్న జాతీయ జెండా తనంతట తానుగా ఎగరలేదని గుర్తుంచుకోండి’ అంటూ మెకల్లమ్ ఈ లేఖలో కోరాడు. -
మెక్ 'కల్లోలం' ఆపకుంటే...?
వెల్లింగ్టన్: మెక్ 'కల్లోలం'కు అడ్డుకట్ట పడడంతో ఇంగ్లీషు బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. తమపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన బ్రెండన్ మెక్ కల్లమ్ పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఓటమి కాస్త ఆలస్యమైంది. అతడు కాసేపు క్రీజ్ లో ఉండివుంటే మ్యాచ్ 10 ఓవర్లలోపు ముగిసేదన్నది ఆట చూస్తున్నవారందరి భావన. 124 స్వల్ప స్కోరు ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ కెప్టెన్ రావడం రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లీషు బౌలింగ్ ను ఊచకోత కోశాడు. బౌలర్ బంతిని వదలడం పాపం.. వెంటనే దాన్ని బౌండరీకి బాదాడడం. దీంతో బంతి వేయాలంటనే బౌలర్లు జంకారు. మెక్ కల్లమ్ దూకుడుకు బౌలర్లు బెంబేలెత్తారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన ఈ విధ్వంసకర బ్యాట్స్ మన్ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు వోక్స్ బౌలింగ్ లో మెక్ కల్లమ్(77) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 9 ఒవర్లలో 112/1గా ఉంది. -
18 బంతుల్లోనే అర్థ సెంచరీ
వెల్లింగ్టన్: ఇంగ్లండ్ తమ ముందు ఉంచిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ రెచ్చిపోయారు. ఇంగ్లీషు బౌలర్లను ఉతికిపాడేశాడు. గుప్తిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మెక్ కల్లమ్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెక్ కల్లమ్ విజృంభణతో 3.4 ఓవర్ లోనే స్కోరు 50 పరుగులు దాటింది. మొదటి వికెట్ కు 22 బంతులోనే 50 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలో 67/0 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కివీస్ దూకుడు చూస్తుంటే 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసేలా ఉంది. -
మెక్ కల్లమ్ విధ్వంసం: కివీస్ ఘనవిజయం
క్రిస్ట్ చర్చ్: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రాండెన్ మెక్ కల్లమ్ తన బ్యాట్ తో మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతులను ఎదుర్కొన్న మెక్ కలమ్ మూడు సిక్స్ లు, ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి కివీస్ కు సునాయాస విజయం అందించాడు. శ్రీలంక విసిరిన 219 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. మెక్ కల్లమ్ దూకుడుగా ఆడి రన్ రేట్ ను ముందుకు తీసుకెళితే.. కోరె అండర్సన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో 43 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న కివీస్ మూడు వికెట్ల తేడాతో లంకేయులపై జయభేరీ మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 218 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే(104) పరుగులు చేసి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలుపంచుకున్నాడు. -
మెకల్లమ్ మెరుపులు
134 బంతుల్లో 195 పరుగులు శ్రీలంకతో తొలి టెస్టు క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రకంపనలు సృష్టించాడు. శుక్రవారం స్థానిక హాగ్లే ఓవల్ మైదానంలో తను లంక బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 134 బంతుల్లోనే 195 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇందులో 18 ఫోర్లతో పాటు 11 సిక్స్‌లు ఉండడం విశేషం. అయితే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ సాధించిన రికార్డును తృటిలో కోల్పోయాడు. తన దేశానికే చెందిన నాథన్ ఆస్టల్ (153 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది. మరోవైపు మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా ఏడు వికెట్లకు 80.3 ఓవర్లలో 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రారంభంలో బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై కెప్టెన్ మెకల్లమ్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించాడు. 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన తను... కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 54; 7 ఫోర్లు), జిమ్మీ నీషమ్ (80 బంతుల్లో 85; 10 ఫోర్లు; 3 సిక్సర్లు)తో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇందులో నీషమ్‌తో కలిసి 23.8 ఓవర్లలో 7.84 రన్‌రేట్‌తో 153 పరుగులు రాబట్టాడు. ఇది టెస్టుల్లో వేగవంతమైన మూడో 150+ భాగస్వామ్యం. లక్మల్ వేసిన ఇన్నింగ్స్ 55వ ఓవర్లో చెలరేగిన మెకల్లమ్ 4,6,6,4,6తో 26 పరుగులు పిండుకున్నాడు. 74 బంతుల్లోనే 11వ సెంచరీ చేసిన తను గత నెలలో పాక్‌తో జరిగిన షార్జా టెస్టులో 78 బంతుల్లో సెంచరీ రికార్డును (కివీస్ తరఫున) అధిగమించాడు. 103 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. అయితే 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాంగ్ ఆన్‌లో మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను సంగక్కర వదిలేశాడు. 65.5 ఓవర్ల దగ్గర ఈ సునామీ ఇన్నింగ్స్ ముగిసింది. చివరి ఓవర్‌కు కొత్త బంతిని తీసుకున్న లంక అదే ఓవర్లో వికెట్ తీసి తొలి రోజును ముగించింది. ఆట నిలిచే సమయానికి మార్క్క్రెయిగ్ (19 బంతుల్లో 5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మాథ్యూస్‌కు రెండు వికెట్లు దక్కాయి. రికార్డులు ఒక రోజులో 429 పరుగులు చేయడం కివీస్‌కిదే తొలిసారి. ఓ క్యాలెండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ (9 మ్యాచ్‌ల్లో 33)లు కొట్టిన బ్యాట్స్‌మన్ మెకల్లమ్. టెస్టుల్లో అత్యంత వేగంగా (74 బంతుల్లో) సెంచరీ చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్. ఓ ఏడాదిలో 1000కి పైగా పరుగులు చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు. కివీస్ తరఫున ఒక ఓవర్లో అత్యధిక పరుగుల (26) రికార్డు సమం. ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్ (11)లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్. వసీం అక్రమ్ (12) ముందున్నాడు. ఈ ఏడాది మెకల్లమ్ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. బాక్సింగ్ డే టెస్టుకి న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. క్రైస్ట్‌చర్చ్‌లో ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న తొలి టెస్టు ఇది. -
మెక్కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 429 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ విజృభించి ఆడాడు. 5 పరుగులతో తేడాతో అతడు డబుల్ సెంచరీ కోల్పోయాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కేవాడు. విలియమ్సన్(54), నీషమ్(85) అర్థ సెంచరీలు చేశారు. లాథమ్ 27, రూథర్‌ఫోర్డ్ 18, వాల్టింగ్ 26 పరుగులు చేశారు. రాస్ టేలర్(7) రనౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. లక్మాల్, ఎరంగ, ప్రసాద్, కౌషాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మెకల్లమ్ మెరుపులు
షార్జా: కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మెరుపు సెంచరీ (145 బంతుల్లో 153 బ్యాటింగ్; 17 ఫోర్లు, 8 సిక్స్‌లు) సాధించడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 45 ఓవర్లలో వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. లాథమ్ (13) అవుటయ్యాడు. మెకల్లమ్‌తో పాటు కేన్ విలియమ్సన్ (76 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. 78 బంతుల్లోనే సెంచరీ చేసిన మెకల్లమ్ న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో వేగంగా శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 281/3తో తొలి ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన పాక్ 351 పరుగులకే ఆలౌటైంది. హఫీజ్ (197) తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. కివీస్ యువ స్పిన్నర్ మార్క్ క్రెయిగ్ 7 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు వెనుకబడి ఉంది. -
ఫిక్సింగ్పై విచారణ తుది దశలో ఉంది: ఐసీసీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లపై కొనసాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ పూర్తి కావచ్చిందని ఐసీసీ తెలిపింది. దీంట్లో భాగంగా ఏసీఎస్‌యూ ముందు కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను ఇప్పటికే అంగీకరించాడు. ‘విచారణ చివరి దశలో ఉన్నాం. క్రిస్ కెయిన్స్ కూడా త్వరలోనే తన వాదనను వినిపిస్తాడని అనుకుంటున్నాను’ అని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. మరోవైపు కెయిన్స్... ఐసీసీ ఎసీఎస్‌యూ అధికారులను, మెట్రోపాలిటన్ పోలీసులను కలిసేందుకు వెళ్లినట్టు సమాచారం. -
బయటకు రావడం షాక్: మెకల్లమ్
క్రైస్ట్‌చర్చ్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఐసీసీ ఏసీఎస్యూకి తానిచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తన భార్య మూడో సంతానానికి జన్మనివ్వనున్న కారణంగా మెకల్లమ్ ఐపీఎల్ నుంచి స్వదేశానికి వచ్చాడు. ‘ముందుగా నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పటిదాకా ఏ క్రికెట్ మ్యాచ్‌నూ నేను ఫిక్స్ చేయలేదు. ఈ ఆటలో నెలకొన్న అవినీతిపై పోరాడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాను. నమ్మకంతోనే ఐసీసీకి నేను వాంగ్మూలం ఇచ్చాను. అయితే మీడియాలో ఇదంతా రావడం షాక్‌కు గురిచేసింది. అయితే మున్ముందు కూడా ఐసీసీకి ఈ విషయంలో సహకారం అందిస్తాను’ అని మెకల్లమ్ వివరించాడు. లూ విన్సెంట్‌పై ఈసీబీ అభియోగాలు లండన్: మూడేళ్ల క్రితం కౌంటీ మ్యాచ్‌ను ఫిక్స్ చేసినందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్, అతడి ససెక్స్ సహచరుడు ఆరిఫ్‌లపై ఇంగ్లండ్ బోర్డు చర్యలకు సిద్ధమవుతోంది. 15కు పైగా కౌంటీ మ్యాచ్‌లను వీరిద్దరు ఫిక్స్ చేశారని అభియోగాలు ఉన్నాయి. -
మెకల్లమ్ వాంగ్మూలం ఎలా లీకైంది?
విచారణ చేపట్టిన ఐసీసీ దుబాయ్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీఎస్‌యూ) ముందు ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై ఐసీసీ విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంలో మెకల్లమ్‌పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కివీస్ బ్యాట్స్‌మన్ ఈ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ‘వాంగ్మూలం అంశం చాలా సీరియస్ విషయం. తక్షణ విచారణ జరిపేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటాం. ఇంత రహస్య అంశం మీడియాకు ఎలా చేరిందో కనిపెడతాం. ఏదేమైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో భరోసా నింపాల్సిన అవసరం ఉంది. ఏసీఎస్యూపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఆట సమగ్రతను కాపాడతాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. వాంగ్మూలం లీక్ విషయంలో మెకల్లమ్‌పై ఎలాంటి విచారణ జరపబోమని చెప్పిన ఆయన మరో క్రికెటర్ లూ విన్సెంట్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. క్రికెట్‌ను క్లీన్‌గా ఉంచేందుకు ఏసీఎస్‌యూ అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఐసీసీకి చెందిన ప్రాంతాల్లో స్థానిక చట్టాలు, దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయడానికి అవసరమైన లింక్‌లను ఏసీఎస్‌యూ అభివృద్ధి చేసుకుందని వెల్లడించారు. అవసరమైనప్పుడు ప్రభుత్వేతర సంస్థలు, న్యాయస్థానాలను కూడా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఏదేమైనా అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని సీఈఓ స్పష్టం చేశారు. -
ఆ ఆటగాడిని నేను కాదు
క్రిస్ కెయిన్స్ వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌ను మ్యాచ్ ఫిక్స్ చేయాల్సిందిగా కోరిన మాజీ క్రికెటర్ ‘మిస్టర్ ఎక్స్’ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఫిక్సింగ్ చేసినట్టుగా అంగీకరించిన కివీస్ మాజీ బ్యాట్స్‌మన్ లూ విన్సెంట్ కూడా ఆ ఆటగాడే తనను కూడా కలిశాడని చెప్పాడు. అయితే అతడి పేరు ఇప్పటిదాకా బహిరంగంగా వెల్లడి కాలేదు.మరోవైపు ఆ మిస్టర్ ఎక్స్ ఆటగాడిని తాను కాదని కివీస్ దిగ్గజం క్రిస్ కెయిన్స్ స్పష్టం చేశాడు. ‘క్రికెట్లో అవినీతిపై ఐసీసీ ఏసీఎస్‌యూ విచారణ సాగిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో ఇతరుల చేత నా పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆ ఎక్స్ ప్లేయర్ నేనేనా అని అడుగుతున్నారు. పరిమిత సమాచారం ఆధారంగా నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను మ్యాచ్ ఫిక్సర్‌ను కాదని ఇప్పటికే కోర్టులో నిరూపించుకున్నాను’ అని కెయిన్స్ తేల్చి చెప్పాడు. -
మెక్ కల్లమ్ 100 శాతం సచ్చీలుడు:కివీస్
వెల్లింగ్టన్: గతంలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు వెనుకేసుకొచ్చింది. అతను ఎటువంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదని బోర్డు తాజాగా స్పష్టం చేసింది. 2008 లో జరిగిన ఐపీఎల్, ఇంగ్లండ్ టూర్లలో మెక్ కల్లమ్ ఫిక్సింగ్ చేశాడని బ్రిటీష్ పత్రికల్లో వచ్చిన కథనం పెద్ద దుమారాన్నే రేపింది. కాగా, అతను ఆ టూర్లలో ఎటువంటి ఫిక్సింగ్ చేయలేదని కివీస్ తెలిపింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. 'మాకు మెక్ కల్లమ్ పైపూర్తి నమ్మకం ఉంది. అతడు 100 శాతం సచ్చీలుడు. దీనిపై ఎటువంటి ఐసీసీ విచారణ అవసరం లేదు' అని కివీస్ తెలిపింది. అప్పట్లో ఒక మాజీ క్రికెటర్ ను మెక్ కల్లమ్ కలిసి.. ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దానికి గాను మెక్ కల్లమ్ కు భారీ పారితోషకం కూడా అందినట్లు కూడా ఊహాగానాలు చెలరేగాయి. అనంతరం 2012లో జట్టు పగ్గాలను మెక్ కల్లమ్ అప్పజెప్పిన కివీస్ అతనిపై నమ్మకాన్ని చాటుకుంది. తరువాత మెక్ కల్లమ్ కివీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. -
చెన్నై చమక్
7 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు రాణించిన మోహిత్ శర్మ, మెకల్లమ్ రోహిత్ సేనకు మూడో ఓటమి దుబాయ్: మోహిత్ శర్మ (4/14) సంచలన బౌలింగ్... బ్రెండన్ మెకల్లమ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)మెరుపు ఇన్నింగ్స్‌తో... ఐపీఎల్-7లో చెన్నై ఖాతాలో మరో విజయం చేరింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనిసేన 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. అండర్సన్ (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), తారే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు) రాణించారు. అండర్సన్, రోహిత్ శర్మ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 84 పరుగులు జోడించారు. ఓ దశలో 108/2తో పటిష్ట స్థితిలో ఉన్న ముంబై... మోహిత్ శర్మ ఒకే ఓవర్లో మూడు వికెట్లు (రాయుడు, పొలార్డ్, హర్భజన్) తీయడంతో 19 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. మోహిత్ శర్మ 4, హిల్ఫెన్హాస్ 2 వికెట్లు తీశారు. తర్వాత చెన్నై 19 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. స్మిత్ (22 బంతుల్లో 29; 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (25 బంతుల్లో 20), ధోని (11 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమయోచితంగా ఆడారు. స్మిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన మెకల్లమ్... డు ప్లెసిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హర్భజన్ 2, ఓజా ఒక్క వికెట్ పడగొట్టారు. మోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ధోని, రోహిత్‌లకు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (బి) హిల్ఫెన్హాస్ 1; తారే (సి) రైనా (బి) మోహిత్ 23; అండర్సన్ రనౌట్ 39; రోహిత్ (సి) స్మిత్ (బి) హిల్ఫెన్హాస్ 50; పొలార్డ్ (బి) మోహిత్ 12; రాయుడు (సి) రైనా (బి) మోహిత్ 1; గౌతమ్ నాటౌట్ 7; హర్భజన్ (సి) బి. మెకల్లమ్ (బి) మోహిత్ 0; జహీర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-11; 2-25; 3-109; 4-123; 5-125; 6-127; 7-127 బౌలింగ్: ఈశ్వర్ పాండే 4-0-21-0; హిల్ఫెన్హాస్ 4-0-39-2; అశ్విన్ 4-0-20-0; మోహిత్ శర్మ 4-0-14-4; రైనా 3-0-32-0; జడేజా 1-0-14-0 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) అండర్సన్ (బి) ఓజా 29; బి. మెకల్లమ్ నాటౌట్ 71; రైనా (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 1; డు ప్లెసిస్ (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 20; ధోని నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-57; 2-61; 3-114 బౌలింగ్: ఓజా 4-1-25-1; జహీర్ 4-0-31-0; మలింగ 4-0-22-0; అండర్సన్ 2-0-23-0; హర్భజన్ 4-0-27-2; పొలార్డ్ 1-0-10-0. -
కివీస్ స్థంభించింది
మెకల్లమ్ ఇన్నింగ్స్‌పై కోచ్ వ్యాఖ్య వెల్లింగ్టన్: భారత్‌తో రెండో టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ తన బ్యాటింగ్‌తో జాతి యావత్తునూ ఒక్క క్షణం స్థంభింపజేశాడని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఓటమి బాటలో పయనించిన కివీస్... ఆపై రెండో ఇన్నింగ్స్‌లో మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ కారణంగా పట్టు సాధించడం, చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెస్సన్ మాట్లాడుతూ... మెకల్లమ్ పోరాడిన తీరు దేశ ప్రజలందరినీ సంతోషంలో ముంచెత్తిందని, తాను కోచ్‌గానే కాకుండా న్యూజిలాండ్ జాతీయుడిగా గర్విస్తున్నానని అన్నాడు. ‘మెకల్లమ్ అద్భుత ఆటతీరుకు దేశమంతా గర్విస్తోంది. అతడు పోరాడిన తీరు మేం క్రికెట్ ఎలా ఆడతామో చాటిచెప్పింది. అభిమానుల నుంచి కూడా చక్కటి మద్దతు లభించింద’ని హెస్సన్ అన్నాడు. 2015 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియాతో కలిసి ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వన్డే, టెస్టు సిరీస్‌లలో తాజా విజయాలు తమకు శుభసూచకాలని తెలిపాడు. ఇక న్యూజిలాండ్ మీడియా... మెకల్లమ్‌కు దిగ్గజాల సరసన చోటు కల్పించింది. రిచర్డ్ హ్యాడ్లీ 1986లో 300వ టెస్టు వికెట్ సాధించిన క్షణాన్ని మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ గుర్తుకు తెచ్చిందని ‘డొమినియన్ పోస్ట్’ పేర్కొంది. కాగా, న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక తమ మొదటి పేజీలో మెకల్లమ్ రెండు చేతులతో ఆకాశాన్నందుకున్నట్లుగా ఫొటోను ప్రచురించింది. -
రికార్డుల కల్లోలం
అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన బ్రెండన్ మెకల్లమ్ వాట్లింగ్ శతకం ఆరో వికెట్‌కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం ఆసక్తికరంగా భారత్‌తో రెండో టెస్టు ప్రస్తుతం 325 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్ పట్టిన పట్టు విడుచుటకంటే పడి చచ్చుట మేలు...న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌కు ఇది బాగా వంటబట్టినట్లుంది. అంతే మూడో రోజు ఆటతో జట్టును రక్షించిన అతను నాలుగో రోజు మరింత చెలరేగి ముందంజలో నిలిపాడు. పట్టిన పట్టు వదలటంలో భారత బౌలర్లను మించినవారెవరు...గతంలో ఎన్నో సార్లు వెంటాడిన ఈ బలహీనత వెల్లింగ్టన్లో మళ్లీ బయట పడింది. ఫలితంగా రోజంతా శ్రమించినా ఒక వికెట్ మాత్రమే తీసి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతిలో పెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్, అంతకు మించిన బ్యాటింగ్‌తో చాన్నాళ్ల తర్వాత విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయానికి చేరువైన భారత్... అనూహ్యంగా ఇప్పుడు మ్యాచ్‌ను కోల్పోయే స్థితికి దిగజారింది. కివీస్ రికార్డుల హోరులో భారత్ ప్రదర్శన ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది. కివీస్ తరఫున ఇది (281) రెండో అత్యధిక స్కోరు. మార్టిన్ క్రో (299) తొలి స్థానంలో ఉన్నాడు. మరో 19 పరుగులు చేస్తే మెకల్లమ్ ఆ జట్టు తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఈ ఇన్నింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఒక్క హనీఫ్ మొహమ్మద్ (337) మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ కెరీర్లో మూడో సారి 200కు పైగా స్కోరు నమోదు చేశాడు. కివీస్ తరఫున ఫ్లెమింగ్ (3)తో సమంగా నిలిచాడు. ఈ మూడు డబుల్స్ భారత్‌పైనే కావడం విశేషం. కివీస్ గడ్డపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్ (525). కివీస్ తరఫున ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన రికార్డు (దాదాపు 727 నిమిషాలు). వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్. వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలనుకున్న భారత జట్టు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (525 బంతుల్లో 281 బ్యాటింగ్; 28 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ఆటతో డబుల్ సెంచరీ సాధించడంతో మ్యాచ్‌పై కివీస్ పట్టు బిగిసింది. మెకల్లమ్‌కు తోడు వాట్లింగ్ (367 బంతుల్లో 124; 13 ఫోర్లు) కూడా సెంచరీ సాధించడంతో కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది. మెకల్లమ్‌తో పాటు నీషామ్ (96 బంతుల్లో 67 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్‌కు 352 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం నాలుగో రోజు ఆటలో విశేషం. ప్రస్తుతం ఆ జట్టు 325 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒక దశలో రెండో ఇన్నింగ్స్‌లో 94/5తో ఉన్న కివీస్ మరో వికెట్ మాత్రమే కోల్పోయి 477 పరుగులు జోడించింది. ఆగని జోరు... మూడో రోజు ఆటలో జట్టును కాపాడే మొదటి అంకాన్ని పూర్తి చేసిన మెకల్లమ్, సోమవారం భారీ స్కోరు అందించడంపై దృష్టి పెట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మినహాయిస్తే ఓ రకంగా 5 వికెట్లకు 6 పరుగుల స్కోరు మాత్రమే ఉన్న స్థితి! ఈ దశలో వాట్లింగ్ అండతో మెకల్లమ్ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చాడు. ఒక్క తప్పుడు షాట్ భారత్‌కు మ్యాచ్ అందించే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా ఆడాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. జహీర్, షమీ, ఇషాంత్ ఎండ్లు మార్చినా, రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసినా ఫలితం దక్కలేదు. జహీర్ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో బ్రెండన్ క్యాచ్‌కు ఒకే ఒక సారి అవకాశం వచ్చినా బంతి ధావన్నుంచి చాలా దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ డబుల్... ఇదే క్రమంలో మెకల్లమ్ 150 పరుగుల మార్క్‌ను దాటగా...వాట్లింగ్ 297 బంతుల్లో కెరీర్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికి జహీర్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా ఫ్లిక్ చేసి మెకల్లమ్ వరుసగా రెండో టెస్టులోనూ డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో అనేక పాత రికార్డులు గల్లంతయ్యాయి. ఎట్టకేలకు మూడో కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే షమీ ఈ మారథాన్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వాట్లింగ్ ఎల్బీగా వెనుదిరగడంతో ఏకంగా 123 ఓవర్ల తర్వాత భారత్‌కు వికెట్ దక్కింది. కథ మారలేదు... అయితే వికెట్ తీసినా భారత్ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న నీషామ్, కెప్టెన్‌కు అండగా నిలిచాడు. దాంతో మరో కీలక భాగస్వామ్యం నెలకొంది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయిన మెకల్లమ్ షమీ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి 250 పరుగులు దాటాడు. ఏడో వికెట్‌కు ఇప్పటికే మెకల్లమ్, నీషామ్ అభేద్యంగా 125 పరుగుల జత చేయడం విశేషం. నేడు ఏం జరగవచ్చు! ‘ఓడిపోయే దశనుంచి శాసించే స్థితికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. దీనిని వృథా చేయదల్చుకోలేదు. కాబట్టి చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా’ అని మెకల్లమ్ ఆట అనంతరం వ్యాఖ్యానించాడు. కివీస్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం ఇప్పుడు అతని ముంగిట ఉంది. 19 పరుగులే కాబట్టి వేగంగా సాధించి ఆ వెంటనే డిక్లేర్ చేయవచ్చు. ఇప్పటికే 325 పరుగుల ఆధిక్యంలో ఉన్న కివీస్ కనీసం 80 ఓవర్లలో దాదాపు 350 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంచవచ్చు. గత రికార్డులు, చివరి రోజు పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఛేదించడం అంత సులువు కాదు కాబట్టి భారత్ గెలిచే అవకాశాలు తక్కువే! అయితే ఎలాగూ తొలి టెస్టు నెగ్గారు కాబట్టి డ్రా అయినా చాలనుకుంటే ఆలౌట్ అయ్యే వరకు కివీస్ ఆడుతుంది. పైగా తొలి టెస్టులో లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ చాలా దూకుడుగా ఆడింది కాబట్టి మళ్లీ అలాంటి రిస్క్ కివీస్ తీసుకోకపోవచ్చు. ఒత్తిడిలో కుప్పకూలి భారత్ ఓడే ప్రమాదమూ ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితి ప్రకారం భారత్ గెలుపుకంటే ఓటమి లేదా డ్రాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. 281 గుర్తుందా... దాదాపు 12 ఏళ్ల క్రితం కోల్‌కతాలో ఆసీస్‌పై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ గుర్తుందా...సరిగ్గా అలాగే కాకపోయినా ఇప్పుడు మెకల్లమ్ ఇన్నింగ్స్ కూడా దాదాపు అదే తరహాలో సాగింది. ముందుగా ఆధిక్యాన్ని తొలగించి జట్టును రక్షించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత భారీ స్కోరుతో విజయానికి బాటలు వేయడం... అప్పుడు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటై 274 పరుగులు వెనుకబడింది. నాలుగో రోజు ముగిసే సరికి లక్ష్మణ్ 275 స్కోరుతో భారత్ 589/4 పరుగులు చేసింది. ఇప్పుడు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులే చేసి 246 పరుగులు వెనుకబడింది. నాలుగో రోజు ఇప్పుడు మెకల్లమ్ 281 స్కోరుతో నిలవగా, జట్టు స్కోరు 571/6. అప్పుడు చివరి రోజు ఆసీస్ 212 పరుగులకే కుప్పకూలడంతో ఆతిథ్య జట్టు మ్యాచ్ గెలుచుకుంది. మరి ఈ సారి ఆఖరి రోజు ఫలితం ఎలా ఉండబోతోందో! స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192 భారత్ తొలి ఇన్నింగ్స్: 438 న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (ఎల్బీ) (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ (సి) ధోని (బి) జహీర్ 35; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 7; లాథమ్ (సి) ధోని (బి) షమీ 29; మెకల్లమ్ (బ్యాటింగ్) 281; అండర్సన్ (సి) అండ్ (బి) జడేజా 2; వాట్లింగ్ (ఎల్బీ) (బి) షమీ 124; నీషామ్ (బ్యాటింగ్) 67; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (189 ఓవర్లలో 6 వికెట్లకు) 571. వికెట్ల పతనం: 1-1; 2-27; 3-52; 4-87; 5-94; 6-446. బౌలింగ్: ఇషాంత్ 39-4-124-0; జహీర్ 43-12-129-3; షమీ 40-5-136-2; జడేజా 49-10-108-1; రోహిత్ శర్మ 11-0-40-0; కోహ్లి 6-1-13-0; ధోని 1-0-5-0. -
ఇంకా ఉంది!
టాప్ ఆర్డర్ విఫలమైనా... మెకల్లమ్, వాట్లింగ్లు సమయోచితంగా ఆడటంతో రెండో టెస్టులో న్యూజిలాండ్ నిలబడింది. వీరిద్దరు కీలక సమయంలో మెరుగైన భాగస్వామ్యాన్ని జోడించారు. జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. మరోవైపు ఉదయం సెషన్లో ఆకట్టుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత నిరాశపర్చారు. ఫలితంగా మూడో రోజే గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌ను నాలుగో రోజుకు తీసుకెళ్లారు. వెల్లింగ్టన్: రెండు కీలక క్యాచ్‌లు జారవిడవడంతో పాటు చివరి రెండు సెషన్లలో భారత బౌలర్ల నిరాశజనక ప్రదర్శనతో మూడో రోజే ముగుస్తుందనుకున్న రెండో టెస్టు నాలుగో రోజుకు వెళ్లింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (237 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్సర్), వాట్లింగ్ (208 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) వీరోచిత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యాన్ని (6 పరుగులు) అందించారు. దీంతో బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... ఆదివారం మూడో రోజు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో 5 వికెట్లకు 252 పరుగులు చేసింది. తొలి సెషన్లో జహీర్ చకచకా రెండు వికెట్లు తీశాడు. అయితే రెండు, మూడో సెషన్లో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో రోజంతా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు 4 వికెట్లతో సరిపెట్టుకున్నారు. జహీర్ చకచకా... ఓవర్‌నైట్ స్కోరు 24/1తో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ (22 బంతుల్లో 7), రూథర్‌ఫోర్డ్ (55 బంతుల్లో 35; 6 ఫోర్లు) డిఫెన్స్‌కు మొగ్గు చూపారు. మ్యాచ్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించారు. అయితే వీళ్ల ఆశలపై జహీర్ నీళ్లు చల్లాడు. ఆట రెండో ఓవర్లోనే ఓ అద్భుతమైన బంతికి విలియమ్సన్‌ను అవుట్ చేశాడు. తర్వాత లాథమ్ (64 బంతుల్లో 29; 3 ఫోర్లు), రూథర్‌ఫోర్డ్ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఫలితంగా 16వ ఓవర్లో కివీస్ జట్టు 50 పరుగులకు చేరుకుంది. కానీ తర్వాతి ఓవర్లోనే జహీర్ బంతిని ఆడబోయి రూథర్‌ఫోర్డ్... ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన మెకల్లమ్ ఆచితూచి ఆడాడు. అయితే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అడపాదడపా బౌండరీలు కొడుతూ లాథమ్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంచ్‌కు ఒక్క నిమిషం ముందు షమీ బౌలింగ్‌లో బంతిని పుష్ చేయబోయి కీపర్ చేతికి చిక్కాడు. ఫలితంగా కివీస్ 87/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. మెకల్లమ్ హవా తొలి సెషన్లో ఆకట్టుకున్న భారత బౌలర్లు లంచ్ తర్వాత కూడా అదే ఊపును ప్రదర్శించారు. సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తూ అండర్సన్ (2)ను పూర్తిగా కట్టడి చేశారు. ఓ మూడు ఓవర్ల తర్వాత ఒత్తిడిని జయించలేని అండర్సన్ చివరకు జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 94 పరుగులకు 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. తర్వాత వాట్లింగ్‌తో కలిసి మెకల్లమ్ ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. స్కోరును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అదే సమయంలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 55వ ఓవర్లో 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెకల్లమ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఇషాంత్ వదిలేయడం జట్టును ఘోరంగా దెబ్బతీసింది. తర్వాత ఈ జోడి ఒకటి, రెండు పరుగులతో సరిపెట్టుకోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. భారత బౌలర్లు విఫలం టీ తర్వాత భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో జడేజా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన మెకల్లమ్ 146 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఈ జోడి మరింత అప్రమత్తంగా ఆడింది. జడేజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి మెకల్లమ్ దూకుడును చూపెట్టాడు. ఈ భాగస్వామ్యాన్ని తొందరగా విడదీయాలనే ఉద్దేశంతో ధోని 80వ ఓవర్ కాగానే కొత్త బంతిని తీసుకున్నాడు. కానీ మెకల్లమ్, వాట్లింగ్ ఓపికగా ఆడుతూ 254 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. చివరకు 94 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టి మెకల్లమ్ కెరీర్లో 9వ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో వాట్లింగ్ కూడా నిలకడగా ఆడుతూ 190 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఇద్దరి మధ్య 158 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇషాంత్ బౌలింగ్‌లో మరో ఫోర్ కొట్టిన మెకల్లమ్ తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు. సెషన్-1 ఓవర్లు: 25.1; పరుగులు: 63; వికెట్లు: 3 సెషన్-2 ఓవర్లు: 29.5; పరుగులు: 59; వికెట్లు: 1 సెషన్-3 ఓవర్లు: 35; పరుగులు: 106; వికెట్లు: 0 స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ (సి) ధోని (బి) జహీర్ 35; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 7; లాథమ్ (సి) ధోని (బి) షమీ 29; బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ 114; అండర్సన్ (సి అండ్ బి) జడేజా 2; వాట్లింగ్ బ్యాటింగ్ 52; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (99 ఓవర్లలో 5 వికెట్లకు) 252 వికెట్ల పతనం: 1-1; 2-27; 3-52; 4-87; 5-94 బౌలింగ్: ఇషాంత్ 23-3-63-0; జహీర్ 25-8-60-3; షమీ 25-4-72-1; జడేజా 26-6-49- 1. గెలిచి తీరుతాం ‘మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయినా మేం ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాం. ఈరోజు (ఆదివారం) కొన్ని క్యాచ్‌లు చేజారాయి. కానీ, ఆటలో ఇవి సాధారణమే. సిరీస్‌లో అద్భుతమైన క్యాచ్లెన్నో అందుకున్నాం. మెకల్లమ్, వాట్లింగ్లు అద్భుతంగా ఆడారు. అయితే పిచ్ రోజురోజుకూ బౌలర్లకు అనుకూలంగా మారుతోంది. మావాళ్లు సరైన ప్రదేశంలో బంతులు విసరడం ద్వారా పరుగుల్ని నిరోధిస్తున్నారు. ఇక సోమవారం ఉదయం తొందరగా ఒకటి, రెండు వికెట్లు తీయగలిగితే టెయిలెండర్లను ఔట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసముంది.’ -పుజారా, భారత బ్యాట్స్‌మన్ 1 భారత్‌పై వేయి పరుగులు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్ మెకల్లమ్ (10 టెస్టుల్లో 1036 పరుగులు). గతంలో గ్రాహం డౌలింగ్ 11 టెస్టుల్లో 964 పరుగులు సాధించాడు. 4 టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో కివీస్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్. -
కివీస్ ఎదురుదాడి
-
భారత్‌తో వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన
నేపియర్: భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్ 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను డ్రా చేసుకున్న జట్టుపై సెలక్టర్లు నమ్మకాన్ని ఉంచారు. ఈ నెల 19న నేపియర్‌లో తొలి వన్డే జరుగుతుంది. న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెకల్లమ్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, జెస్సీ రైడర్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, లూక్ రోంచీ, జిమ్మీ నీషామ్, నాథన్ మెకల్లమ్, టిమ్ సౌతీ, కైల్ మిల్స్, మిషెల్ మెక్లీంగన్, ఆడమ్ మిల్నే. -
దుమ్మురేపిన టేలర్, మెకల్లమ్
డునెడిన్: వెస్టిండీస్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (122 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), టేలర్ (157 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 367 పరుగులు చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 182 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఫుల్టన్ (61), రూథర్‌ఫోర్డ్ (62) అర్ధసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే వరుస విరామాల్లో రూథర్‌ఫోర్డ్, రెడ్మండ్ (20) అవుట్ కావడంతో కివీస్ 117 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫుల్టన్‌కు జత కలిసిన టేలర్ నెమ్మదిగా ఆడాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న ఫుల్టన్‌ను... స్యామీ పెవిలియన్‌కు పంపించాడు. టేలర్ నిలకడకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత వచ్చిన మెకల్లమ్ మాత్రం వేగంగా ఆడాడు. గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోరును 300 దాటించిన మెకల్లమ్ ఆ తర్వాతా దూకుడును కొనసాగించి కెరీర్లో ఏడో టెస్టు సెంచరీని నమోదు చేశాడు.