Rakul Preet Singh
-
'దృశ్యం' పాప గ్లామర్.. రకుల్ ప్రీత్ వయ్యారాలు!
చీరలో ఓరకంట కల్యాణి ప్రియదర్శన్ వయ్యారాలుహనీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లిన నటుడు కాళిదాస్ఒకప్పటి హీరోయిన్ విమలా రామన్ చీరలో సోయగాలుఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ శుభశ్రీకేరళలోని రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న 'దృశ్యం' పాపమోడ్రన్ డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల విందుఆసనాలతో అదరహో అనిపిస్తున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeeprajfilms) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
మోస్ట్ ఫ్యాషనబుల్ సూపర్ కపుల్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్‌గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్‌ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. -
వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదు: రకుల్
వ్యాయామాలు చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హెవీ వర్కవుట్ చేసే క్రమంలో (80 కిలోల బరువు ఎత్తడం వల్లే) ఆమె వెన్నుముకకు గాయమైంది. దాదాపు రెండువారాలు బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా తన ఆరోగ్యపరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చింది. 80 కిలోల బరువు ఎత్తా..ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అసలేమైందంటే అక్టోబర్ 5న 80 కిలోల బరువు ఎత్తాను. అప్పుడు నా వెన్నెముకలో నొప్పి మొదలైంది. అయినా పట్టించుకోకుండా వర్కవుట్ చేశాను. అదే నా పాలిట శాపమైంది. వర్కవుట్ చేసి డైరెక్ట్‌గా షూటింగ్‌కు వెళ్లాను. సాయంత్రమయ్యేసరికి విపరీతమైన వెన్ను నొప్పి.. తట్టుకోలేకపోయాను. బర్త్‌డే పార్టీ రోజే..కొంచెం కూడా బెండ్ అవలేకపోయాను. అదే తగ్గిపోతుందిలే అని ఆ నొప్పి భరిస్తూనే ఐదు రోజులు గడిపాను. అక్టోబర్ 10న బర్త్‌డే పార్టీకి రెడీ అవుతున్న సమయంలో నా శరీరం కింది భాగం నా నుంచి వేరైపోయినట్లు అనిపించింది. నొప్పితో విలవిల్లాడిపోయాను. బీపీ పడిపోయింది. పదిరోజులు ఆస్పత్రిలోనే బెడ్‌పై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా కోలుకోలేదునా భర్త జాకీ భగ్నానీ... నా పుట్టినరోజును స్పెషల్‌గా ప్లాన్ చేశాడు. కానీ ఆ వేడుకలో పాల్గొనలేకపోయాను. ఆ సమయంలో నన్నెంతగానో అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ పని వెంట పడే నాకు అలా మంచానికి పరిమితమవడం బాధేసింది. ఇప్పటికీ 100 శాతం పూర్తిగా కోలుకోలేదు.తెలియకుండానే ఏడ్చా..ఈ గాయం తర్వాత తొలిసారి విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా ఎందుకో నాకు తెలియకుండానే ఏడ్చాను. అప్పుడు కూడా జాకీ ఏదో జోక్ వేసి నవ్వించాడు. ఇలాంటి గాయాలు అయినప్పుడు పూర్తిగా కోలుకునేందుకు ఎనిమిది వారాలదాకా పడుతుందట! అంటే మరో రెండు వారాల్లో నేను నార్మల్ అయిపోతాను అని చెప్పుకొచ్చింది.చదవండి: అప్పట్లో నేను చాక్లెట్ బాయ్.. నా భార్య భయపడిపోయేది.. హీరో -
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్.. రెడ్ డ్రెస్‌లో తాప్సీ !
రెడ్ డ్రెస్‌లో తాప్సీ పన్ను హోయలు..భూటాన్ పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్..మెహందీ లుక్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్..క మూవీ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. రకుల్ ప్రీత్ సింగ్‌తో మొదటి సినిమా!
ప్రముఖ బాలీవుడ్ నటుడు హిమాన్షు కోహ్లీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఓ ఆలయంలో ఆయన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హిమాన్ష్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే చిన్ననాటి స్నేహితురాలైన బంధువుల అమ్మాయినే పెళ్లాడినట్లు తెలుస్తోంది. కోహ్లి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ మీ అందరీ దీవెనలు పుష్కలంగా ఉన్నాయని రాసుకొచ్చాడు.అంతకుముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వేడుకల్లో హిమాన్ష్ కోహ్లీ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.కాగా.. హిమాన్ష్ కోహ్లీ మొదటి హమ్ సే లైఫ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌తో యారియాన్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాతోనే హిమాన్ష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించారు. హిమాన్ష్ ప్రస్తుతం జూలియా అండ్ కలియా చిత్రంలో కనిపించనున్నారునేహా కక్కర్తో డేటింగ్..కాగా.. హిమాన్ష్ గతంలో బాలీవుడ్ సింగర్ గాయని నేహా కక్కర్తో రిలేషన్షిప్లో ఉన్నారు. ఇండియన్ ఐడల్ 10 సందర్భంగా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు డిసెంబర్ 2018లో విడిపోయారు. ఆ తర్వాత నేహా.. రోహన్‌ప్రీత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. -
‘దో పట్టి’ మూవీ సక్సెస్ పార్టీలో తారల సందడి (ఫొటోలు)
-
నా భర్తతో తొలి దీపావళి.. చాలా ప్రత్యేకమన్న రకుల్ ప్రీత్ సింగ్
-
విచిత్రమైన హెయిర్ స్టైల్‌తో రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
నేనోపాఠం నేర్చుకున్నాను
వ్యాయామాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తనలానే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇంతకీ విషయం ఏంటంటే... వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ఇటీవల హెవీ వర్కౌట్ చేశారు. ఈ కారణంగా ఆమెకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి నేనొక అప్డేట్ ఇస్తున్నాను. నేనొక పిచ్చి పని చేశాను. నా శరీరం చెప్పే మాటను నేను పట్టించుకోలేదు. హెవీ వర్కౌట్ చేశాను. ఇందుకు ఫలితంగా నేను గాయపడ్డాను.ఆరు రోజులుగా నేను బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనిపిస్తోంది. నేను తొందరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. అలాగే నేనొకపాఠం కూడా నేర్చుకున్నాను. మీకు మీ శరీరం ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు పట్టించుకోండి. తేలికగా తీసుకుని బలవంతంగా వర్కౌట్స్ చేయకండి. నాకు తెలిసి నా శరీరం కన్నా నా బ్రెయిన్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను. కానీ అన్ని వేళలా ఇది వర్కౌట్ కాదు. ఇక నా మేలును ఆశించి నాకు సందేశాలు పంపుతున్న వారికి థ్యాంక్స్. నేను త్వరలోనే కోలుకుని, మరింత స్ట్రాంగ్‌గా వస్తాను’’ అని పేర్కొన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇదిలా ఉంటే.. 80 కేజీల బరువు ఎత్తడంవల్లే రకుల్‌కి గాయం అయిందని బాలీవుడ్ టాక్. -
వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి అక్టోబర్ 5న తీవ్రమైన వర్కవుట్ సెషన్లో వెన్నుకి గాయమయ్యింది. ఆమె జిమ్‌లో బ్యాక్బ్రేస్ని ధరించకుండా 80 కిలోల డెడ్లిఫ్ట్ని నిర్వహించి వెన్ను నొప్పి బారిన పడింది. అయినా లెక్క చేయక ఆ తర్వాత కూడా వర్కౌట్ సెషన్‌ని కొనసాగించింది. దీంతో ఆమె వెన్నుకి తీవ్ర గాయమయ్యింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజానికి ఈ డెడ్‌లిఫ్ట్ వర్కౌట్స్‌ని ఒత్తిడిని నివారించడానికి, వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇవి చేసేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ నిపుణుల ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలతో చేయాలి. ఇక్కడ రకుల్లా గాయాల బారిన పడకుండా వెనుక కండరాలను బలోపేతం చేసే కొన్ని ప్రభావవంతమైన వ్యాయామాలు ఏంటో సవివరంగా చూద్దామా..!వార్మ్-అప్వార్మప్తో వ్యాయామాన్ని ప్రారంభించడం చాలా అవసరం. 5 నుంచి 10 నిమిషాల మితమైన కార్డియోతో ప్రారంభించండి, ఆపై ఫోర్స్‌గా చేసే వ్యాయామాలకు సిద్ధమయ్యేలా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండిరెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్చాలా మంది వ్యక్తులు రెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్ వ్యాయామాలతో తమ బ్యాక్ వర్కౌట్‌ను ప్రారంభిస్తారు. ఈ వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. సుమారు 15 నుంచి 20 చొప్పున 1 లేదా 2 సెట్లను పూర్తి చేసేలా మంచి రిసిస్టెన్స్ బ్యాండ్‌ను ఎంచుకోవాలి. లాట్ పుల్డౌన్ఈ వ్యాయామాన్ని రెసిస్టెన్స్ బ్యాండ్‌తో లేదా జిమ్‌లో మెషీన్ సాయంతో పూర్తి చేయవచ్చు. ఈ వ్యాయామం వెనుక డెల్టాయిడ్లు, రోంబాయిడ్స్, కండరపుష్టి, ముంజేతులతో పాటు మధ్య, దిగువ వెనుక కండరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. బలమైన వెన్ను కండరాలు కావాలనుకునే వారికి ఇది ముఖ్యమైన వ్యాయామం.క్వాడ్రూప్డ్ సింగిల్ ఆర్మ్ డంబెల్ రోకదలిక ఎగువన ఓవర్-రోయింగ్ కదలిక దిగువన ఎక్కువగా సాగదీయడం వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఏదైనా ఇతర రోయింగ్ కదలికలను పూర్తి చేయడానికి ఈ వ్యాయామాన్ని సిఫార్సు చేస్తారు నిపుణులు.(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి) -
వారం రోజులుగా బెడ్‌పైనే.. కోలుకోలేకపోతున్నా: రకుల్
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ 'దేదే ప్యార్ దే 2' మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. కథానాయికగా అందాన్ని కాపాడుకునేందుకు డైట్, వర్కవుట్స్పైనా ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలో జిమ్‌లో బెల్ట్ కూడా వాడకుండా 80 కిలోల బరువు ఎత్తింది. ఈ సమయంలో ఆమెకు వెన్ను నొప్పి మొదలైంది. అయినా పట్టించుకోకుండా వర్కవుట్స్ చేసింది.ఓ పిచ్చిపని చేశా..వెన్నునొప్పి తీవ్రమవడంతో వైద్యులను సంప్రదించగా కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట! తాజాగా ఈ బ్యూటీ తన హెల్త్ అప్డేట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. 'హాయ్ అందరికీ.. నేను ఓ పిచ్చిపని చేశాను. నా శరీరాన్ని పట్టించుకోలేదు. వెన్నునొప్పి ఉన్నా లెక్కచేయలేదు. చివరకు అది ఎక్కువైంది. ఆరు రోజులుగా బెడ్‌పైనే ఉన్నాను. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనుకుంటాను.ఇదొక గుణపాఠంఇలా మంచానికే పరిమితం కావడం ఏమీ బాగోలేదు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. కానీ ఇదొక గుణపాఠంగా భావిస్తాను. మన బాడీ ఏదైనా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు దాని మాట పట్టించుకోకుండా ముందుకు వెళ్లకూడదని తెలుసుకున్నాను. నేను నా బాడీ కన్నా మైండ్ ఎక్కువ స్ట్రాంగ్ అని ఫీలయ్యాను. అన్నివేళలా అది నిజం కాదని తెలిసొచ్చింది. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని పేర్కొంది.చదవండి: ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ చూశారా? -
ప్రభాస్‌తో ఛాన్స్ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితం నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడి సంచలనం రేపారు. అయితే, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో వచ్చిన ఒక సినిమా ఛాన్స్ ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని రకుల్ పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకున్నారని తెలిపారు.రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే మొదట కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే ప్రభాస్ సరసన సినిమా ఛాన్స్ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో తను కొంత భాగం షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత తాను కాలేజీకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, రెండో షెడ్యూల్ పిలుపు కోసం ఎదురు చూసిన తనకు నిరాశే మిగిలిందన్నారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ నుంచి తనకు ఎలాంటి కబురు రాలేదని ఆమె అన్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని మరోకరి ద్వారా తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తనను తొలగించడంతో కాస్త బాధ అనిపించినట్లు తెలిపారు. వారిద్దరి కాంబినేషన్లో అప్పటికే వచ్చిన సినిమా హిట్ కావడంతో అదే జోడీని రిపీట్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లకు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. కాజల్ అగర్వాల్, ప్రభాస్ కాంబినేషన్లో రెండు సినిమాలు డార్లింగ్ (2010), Mr పర్ఫెక్ట్ (2011) వచ్చాయి. రకుల్ చెబుతున్న ప్రకారం 'Mr పర్ఫెక్ట్' చిత్రంలో తనకు వచ్చిన అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కోక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే, తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. నటి సమంత, నాగార్జున కుటుంబంతో పాటు రకుల్ పేరును కూడా కొండ సురేఖ తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. సాటి మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేయడం చాలా బాధాకరమని రకుల్ పేర్కొంది.'తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు ఉంది. ఎంతో అందమైన ఈ చిత్రపరిశ్రమలో నేను గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. సాటి సోదరిగా చూడాల్సిన వారే ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చెందడం బాధాకరం. ఇక్కడ మమ్మల్ని మరింత బాధపెట్టే విషయం ఏమిటంటే.. సమాజంలో ఎంతో బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. మా గౌరవం కోసం మేము మౌనంగా ఉండాలని కోరుకుంటాం. అది మా బలహీనత మాత్రమే, కానీ, దానిని తప్పుగా అనుకుంటే పొరపాటు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. నా పేరును తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. అలాంటి రీతిలో నా పేరు ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. మీరు పూర్తిగా రాజకీయ మైలేజీని పొందేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కళాకారులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచండి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ఇక నుంచి అయినా మానేయండి. అని రకుల్ పేర్కొన్నారు.తెలంగాణ మంత్రి కొండా సురేఖ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.Telugu Film Industry is known worldwide for its creativity and professionalism. I've had a great journey in this beautiful industry and still very much connected.It pains to hear such baseless and vicious rumours being spread about the women of this fraternity. What's more…— Rakul Singh (@Rakulpreet) October 3, 2024 -
కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె. తనపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్ విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. .. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మీద మాజీ మంత్రి హరీశ్‌రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. -
#RakulPreetSingh : అందాలతో మెరిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..(ఫొటోలు)
-
వారి వల్ల సినిమా అవకాశాలు కోల్పోయా
-
అందుకే అవకాశాలు కోల్పోయా!
‘‘చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. అలాగే కొన్ని సినిమా అవకాశాలు కోల్పోయాను’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. బంధుప్రీతి గురించి ఎదురైన ఓ ప్రశ్నకు రకుల్ సమాధానం ఇస్తూ– ‘‘సినిమా రంగంలో బంధుప్రీతి ఉన్న మాట నిజమే.ఈ నెపోటిజం కారణంగా కొన్ని సినిమా చాన్స్‌లు మిస్ అయ్యాను. నన్ను సంప్రదించి ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారు. అయితే అవి నాకు దక్కలేదని బాధ పడలేదు. అవకాశాలు కోల్పోవడం కూడా జీవితంలో ఓ భాగమే. వాటి గురించి ఆలోచించి టైమ్ వృథా చేసుకోను. ఏం చేస్తే నేను ఎదుగుతానో దానిపైనే శ్రద్ధ పెడతాను. ఒక స్టార్ కిడ్‌కు లభించినంత ఈజీగా మిగతా వారికి అవకాశాలు రావు’’ అన్నారు. -
ప్రభాస్‌తో తొలిసారి ఛాన్స్.. చెప్పకుండానే తొలగించారు: రకుల్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. టాలీవుడ్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్.. చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది. సినిమా ఛాన్స్‌ల గురించి ఇంతకీ రకుల్ ఏమన్నారో చూద్దాం.తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కానీ ఊహించని విధంగా తనకు చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ప్రభాస్‌తో మొదటిసారి నటించే అవకాశమొచ్చింది.. కానీ నాలుగు రోజుల పాటు షూటింగ్ అయ్యాక చెప్పకుండానే మరొకరితో రీప్లేస్ చేశారని రకుల్ వెల్లడించింది.నాకు సమాచారం ఇవ్వలేదునా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లానని.. ఆ తర్వాతే సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. ఈ విషయంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని రకుల్ పేర్కొంది. అంతేకాకుండా మరో తెలుగు ప్రాజెక్ట్‌లోనూ ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారని వెల్లడించింది. ఆ తర్వాతే నాకు ఇండస్ట్రీపై కాస్తా అవగాహన పెరిగిందని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నానని తెలిపింది.కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించింది. ఇటీవల ఇండియన్-2 చిత్రంలో మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం దే దే ప్యార్ దే -2 చిత్రంలో నటిస్తోంది. -
వారి వల్ల సినిమా అవకాశాలు కోల్పోయాను: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడారు. చిత్రపరిశ్రమ ఏదైనా సరే అక్కడ నెపోటిజం అనే పదం తప్పనిసరిగా వింటూనే ఉంటాం. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎలాంటి సినీనేపథ్యం లేకుండానే రకుల్ పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, నెపోటిజం వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.టాలీవుడ్లో మెప్పించి ఆపై బాలీవుడ్లో కూడా భారీ సినిమాల్లో రకూల్ నటించారు. టాప్ హీరోయిన్గా కొనసాగిన రకూల్ కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు ఇలా చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయాను. అరే, అవకాశాలు కోల్పోయానే అనే బాధ నాలో ఉండదు. అలా అని నేను కూర్చుని ఉండిపోయే వ్యక్తిని కాదు. బహుశా ఆ సినిమాలు నా కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను. ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్నా తండ్రి సైన్యంలో పనిచేయడంతో ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. దీంతో ఇలాంటి చిన్నవాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. అవకాశాలు కోల్పవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. అలాంటప్పుడు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్న సమయాన్ని వృథా చేసుకోను. ఒక స్టార్ కిడ్‌కు సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ రావు. ఆ క్రెడిట్ అంతా వారి తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. అని రకుల్ చెప్పుకొచ్చారు.రకుల్ తెలుగులో చివరి సినిమా కొండపొలం. 2021లో ఈ మూవీ విడుదలైంది. రీసెంట్గా భారతీయుడు2లో ఆమె కనిపించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తున్నారు. మేరీ పట్నీ కా రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు-3 ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు -
అందాల ఆషికా రంగనాథ్.. చీరలో దేవకన్యలా ప్రియాంక!
చీరలో కనికట్టు చేసేలా ప్రియాంక జవాల్కర్మత్తెక్కించే చూపులతో రెచ్చగొట్టేస్తున్న ఆషికా రంగనాథ్పొట్టి స్కర్ట్‌లో రీతూ చౌదరి.. చూస్తే అంతేవైట్ అండ్ వైట్ డ్రస్సులో రకుల్ ప్రీత్ హొయలుకొడుకు బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు షేర్ చేసిన నమ్రతజిమ్లో తెగ కష్టపడుతున్న క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీతెల్లని చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
రకుల్ ప్రీత్ ‘ఫెన్నెల్ టీ’ పోస్ట్ వైరల్, దీని లాభాలేంటో తెలుసా?
అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమంగా జిమ్ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ప్రీత్ తాజాగా ఒకటీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?ఫెన్నెల్ టీ అంటే సోంపు గింజలతో తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్, లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలిఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫెన్నెల్ టీ లాభాలుసోంపు గింజలలో ఉండే విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది.