Kamal Hassan
-
నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఔత్సాహికులను పర్యావరణ స్ప్రుహ వైపుకు అడుగులు వేసేలా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. ఆ వేదికపై టాప్ డిజైనర్ క్రియేషన్‌ని మొత్తం పర్యావరణహిత ఫ్యాషన్‌తోనే నింపేసింది. ఆ అద్భుతమైన ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రదర్శనల్లో కమలహాసన్ లేబుల్ హౌస్ ఆప్ ఖద్ధర్‌ను సుతారా కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఇక్కడ కోలీవుడ్ నటుడు కమలహాసన్ ఖాదర్ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇది వంద శాతం ఎకో బ్రాండ్. నేత కార్మికుడు నుంచి నేరుగా ఈ ఫాబ్రిక్ను తీసుకుని రూపొందిస్తారు. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం సేంద్రీయ రంగులతోనే తయారు చేయడం విశేషం. సుతారా కలెక్షన్స్ సినిమా, కళలను స్ఫూర్తిగా తీసుకుని స్థిరమైన ఫ్యాషన్ దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్‌తో ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే టొమాటో లెదర్, ఖద్దర్ డెనిమ్ పిక్ నిట్, మస్లిన్ ఖాదీ, వృత్తాకార మెష్ ఫ్యాబ్రిక్‌తో సహా పర్యావరణ అనుకూల పదార్థాలతో ఫ్యాషన్‌ని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇది హస్తకళాకారుల నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది. అదీగాక సెలబ్రిటీలు, ప్రముఖులు, డిజైనర్లు పర్యావరణ అనూకూల ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతరు సారా అలీఖాన్ 60ల నాటి రెట్రో చీరలతో రూపొందించిన లెహంగాతో మెరిసిన సంగతి తెలిసిందే. జీరో కార్బన్‌కి ప్రాధాన్యత ఇచ్చేలా పాత వస్త్రాలను రీసైక్లింగ్ చేసి పొదుపు షాపింగ్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అందులోనూ ప్రముఖ లగ్జరీ బ్రాండ్లే జీరోవేస్ట్ డిజైన్‌కి ప్రాముఖ్యత ఇచ్చి..సరికొత్త డిజైనర్‌వేర్‌లను క్రియేట్ చేస్తుండటం మరింత విశేషం. ఈ ఫ్యాషన్ ట్రెండ్‌కి అత్యంత విశేష ప్రజాదరణ లభించడమే గాక పర్యావరణ అనుకూల ఫ్యాషన్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని ప్రతిబింబిస్తోంది. (చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!) -
అబ్బ కమలహాసన్ !
-
ప్రభాస్ కల్కి ఖాతాలో కోట్లు జోష్ మాములుగా లేదుగా
-
నా దగ్గర ఇలాంటి తిరకాసు ప్రశ్నలు వద్దు: జయసుధ
అలనాడు హీరోయిన్గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. సుమారుగా 50 ఏళ్లుగా వెండితెరపై తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. జయసుధ అద్భుతంగా నటించగల గొప్ప స్టార్. అందుకే, ఆమె మాత్రమే 'సహజనటి' అవగలిగింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన జయసుధ హీరోయిన్ గా అన్ని విధాల పాత్రల్ని అవలీలగా చేసింది. నటన ఆమె ప్రధానమైన బలమైనప్పటికీ కమర్షియల్, గ్లామర్ రోల్స్ కి కూడా జయసుధ ఎన్నోసార్లు వన్నెతెచ్చింది. ఈ క్రమంలో ఆమె సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సొంతం చేసుకుంది. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్, తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు. కమల్‌తో జయసుధ పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ముందుగా ఆ ప్రశ్న ఎదురు అయిన వెంటనే ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. ప్రశ్న అడిగిన వ్యక్తితో చాలా ఎళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఏం అనలేక వదిలేస్తున్నాను అంటూనే ఎంతో హూందాగా సమాధానం చెప్పారు. 'ఇప్పుడు కమల్‌తో పెళ్లి విషయం అవసరమా? చాలామంది పాత సంగతులను ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి..? ఆ రోజుల్లో బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో కమల్‌తో పాటుగా నేను నటించాను. ఆ సినిమాలకి సంబంధించిన పలు పాటలను స్టేజ్ పై ఇద్దరమూ పాడే వారం. వాస్తవంగా కమల్ మంచి సింగర్. ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదానిని. ఆ సమయంలో మా పెయిర్ బాగుందని అందరూ అనేవారు. అందువలన మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఈ విషయంపై అప్పట్లో కొన్ని తమిళ పేపర్లు రాసి ఉండొచ్చు. పత్రికల వాళ్లు ఏదో ఒకటి రాయకపోతే ఎలా..? దీంతో అలాంటి తప్పుడు ప్రచారం జరిగి ఉంటుంది. వాస్తవంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను గొప్పనటిని అంటున్నందుకు సంతోషమే కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను.' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వీరాభిమాని వైరల్ వీడియో..లిప్ స్టిక్ పెదాలతో కమల్ హాసన్ ఫోటో
-
కమల్ హాసన్ పెద్ద నటుడు.. ఆయన అన్న మాటలకు నేను షాక్
-
ప్రభాస్ 'కల్కి' సీక్రెట్స్ బయటపెట్టిన కమల్ హాసన్
-
ప్రాజెక్ట్ K సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్... ఫస్ట్ పార్ట్ కథ ఇదే...
-
శంకర్ కి కమల్ హాసన్ స్పెషల్ గిఫ్ట్
-
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో విశ్వనటుడు కమల్ హాసన్
-
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
కమల్ మాస్టర్ ప్లాన్ శింబు కోసం దీసికకు 30 కోట్లు
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
కమలహాసన్ అంటే చాలా ఇష్టం
దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్ చాలాకాలంగా బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే సమీప కాలంలో ఆ ట్రెండ్ మారుతోంది. తమిళనాడుకు చెందిన అమ్మాయిలు కథానాయికగా నటించటానికి ముందుకు వస్తున్నారు. అలా తాజాగా సువితా రాజేంద్రన్ అనే తమిళ అమ్మాయి తామీ అనే చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అంటూ జాలీగా సాగే కథా చిత్రం ఇది. ప్రవీణ్ దశరథం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మరో కథానాయకి నటి చాందిని తమిళరసన్ నటించారు. కాగా తన సినీ రంగ ప్రవేశం గురించి నటి సువితా రాజేంద్రన్ తెలుపుతూ చిన్న తనం నుంచి నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలా నటనపై ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తానని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు సంకోచించడంతో పాటు భయపడ్డారన్నారు. కారణం తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమేనన్నారు. అయితే ఉద్యోగం పేరుతో చైన్నెకి వచ్చిన తాను ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానన్నారు. అదేవిధంగా ఒక కూత్తుపట్టరై కళాకారుడి వద్ద తాను నటనలో శిక్షణ పొందానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రంగంపై దృష్టి సాధించానన్నారు. అలా వచ్చిన అవకాశమే తామి చిత్రం అని చెప్పారు. ఇందులో దర్శకుడు సూచనల మేరకు బాగా నటించానని భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. ఇందులో తాను జర్నలిస్టు పాత్రను పోషించినట్లు చెప్పారు. -
ఇండియన్ 2కు కాజల్ మేకోవర్.. మేకప్‌కు మూడున్నర గంటలు!
మేకప్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్ చిత్రంలోని కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు. ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్‌తో మేకోవర్ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ –2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియాస్నీ శంకర్, నటుడు సిద్ధార్థ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్ అని సినీ వర్గాలు భావిస్తున్నారు. చదవండి: హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? -
రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్
తమిళ సినిమా: నటుడు విజయ్‌తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్‌తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్‌కు అజిత్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్‌కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. -
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ కొనసాగుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 96 విజయంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మంగాత్తా, ఎన్నై అరిందాల్ వంటి హిట్ చిత్రాల తరువాత అజిత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ఆ తర్వాత విక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్ వంటి సంచలన హిట్ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్‌కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్‌కు జంటగా మన్మదన్ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. -
చెన్నై: కమల్‌హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల
-
తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. డీఎంకేతో కమల్ దోస్తీ?
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమితో కలిసి ముందుకు సాగాలని మక్కల్ నీది మయ్యం వర్గాలు భావిస్తున్నాయి. అధికార డీఎంకేతో జత కట్టాలంటూ.. పార్టీ అధినేత కమల్‌కు వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు సూచించారు. వివరాలు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మక్కల్ నీది మయ్యం ఒంటరిగానే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. పార్టీ పరంగా ఉన్న 85 జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ ఉపాధ్యక్షులు మౌర్య, తంగవేలు, కార్యదర్శి సెంథిల్ అర్ముగం, శివ ఇలంగో, స్నేహన్, మూకాంబీకై, మురళీ అబ్బాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధినేత, నటుడు కమల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కూటమి కోసం పట్టు.. లోక్‌సభ ఎన్నికలను ఈ సారి బలమైన కూటమితో కలిసి ఎదుర్కొంద్దామని, గతంలో చేసిన తప్పులు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి నేతలు విజ్ఞప్తి చేశారు. డీఎంకేతో జత కట్టే విధంగా, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన వివరాలను కొందరు నేతలు అందజేసినట్లు సమాచారం. ఎక్కువమంది మంది డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొంద్దామని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ముందే తీసుకోవాలని కమల్‌ను కోరారు. చివర్లో కమల్ ప్రసంగిస్తూ, కూటమి గురించి పట్టించుకోవద్దని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఎవరితో కలిసి వెళ్లాలి..? అనే విషయాన్ని పక్కన పెట్టి, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే చెన్నైలో మక్కల్ నీది మయ్యం కోసం భారీ కల్యాణ వేదికను నిర్మించను న్నట్లు ఈసందర్భంగా కమల్ ప్రకటించారు. -
కుటుంబ సభ్యుల మధ్య కమల్ హాసన్ బర్త్‌డే వేడుక (వైరల్ ఫొటోలు)
-
35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్-మణిరత్నం
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన బర్త్ డే (నవంబరు 7) సందర్భంగా ఫ్యాన్స్‌కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు కమల్‌హాసన్. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. 1987లో వారిద్దరి కాంబోలో ‘నాయకన్’(తెలుగులో ‘నాయకుడు’) అనే హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు కమల్-మణిరత్నం. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ ఈ కొత్త సినిమా నిర్మించనున్నారు. కమల్ కెరీర్లో 234వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మణిరత్నంగారితో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ ఉత్సాహానికి ఏఆర్ రెహమాన్, ఉదయనిధి స్టాలిన్ తోడవ్వడం హ్యాపీ’’ అన్నారు కమల్‌హాసన్. ‘‘కమల్‌సర్‌తో మళ్లీ వర్క్ చేయడం సంతోషంగా, గర్వంగా, గౌరవంగా ఉంది’’అన్నారు మణిరత్నం. Here we go again! #KH234 பயணத்தின் அடுத்த கட்டம்! #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/ATAzzxAWCL — Kamal Haasan (@ikamalhaasan) November 6, 2022 -
‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’
ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్‌గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్‌లో ప్రేక్షకులను రోలెక్స్‌గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్‌లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm — Civic Ranter (@deerajpnrao) October 9, 2022 -
‘పొన్నియన్ సెల్వన్’ వివాదం, కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో పాన్ చిత్రం రూపొందిన ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే తమిళనాట తప్ప ఈ సినిమా మరే భాషల్లో పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో విడుదల అనంతరం ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్ సెల్వన్‌కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు. చదవండి: ‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా? దీంతో తమిళనాట దీనిపై పెద్ద వివాదమే రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ‘‘సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం ‘శంకరాభరణం’ ఆదరిస్తే వాళ్ళు మన ‘మరో చరిత్ర’ను ఆదరించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక తమిళ చారిత్రక కథ, దానిని ఇతర భాష వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి పోయి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే.. అనంతరం అసలు చోళరాజులు హిందువులు కాదంటూ కమల హాసన్ కామెంట్స్ చేశారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వమే లేదని, అప్పట్లో హిందూమతం లేదన్నారు. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్ పేర్కొన్నారు. ఇక కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా?
‘విక్రమ్’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. ఆ చిత్రం హిట్ కావడంతో మరింత ఉత్సాహంగా తర్వాతి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నారాయన. అందులో భాగంగానే శంకర్ దర్శకత్వంలో చేయనున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్‌హాసన్. మూడు వారాల పాటు యూఎస్‌లోనే ఉండి, ఈ సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారని టాక్. కమల్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ (1996)కి ‘ఇండియన్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోంది. 2020లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. అయితే కరోనా, సెట్స్‌లో నెలకొన్న ప్రమాదం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. కమల్‌హాసన్ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ‘ఇండియన్ 2’ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం కోసం రంగంలోకి కమల్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెలుగు, హిందీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇందులోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన పలు సన్నివేశాలను అక్కడక్కడా కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే తమిళంలో ఈ స్పెషల్ సీన్స్‌కు కమల్‌తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు మణిరత్నం. అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఆయా స్టార్‌ను ఎంచుకుని వాయిస్ ఓవర్ చెప్పించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కమల్ చెబితే బాగుటుందని మూవీ టీం భావిస్తోందట. -
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చదవండి: కానిస్టెబుల్‌గా విశాల్.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్ ఫాజిల్ సీన్‌తో మొదలైన ఈ మేకింగ్ వీడియోలో విజయ్ సేతుపతి, కమల్‌కు సంబంధిచిన పలు భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు మూవీలో హైలేట్‌గా నిలిచి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు. చదవండి: ‘ధాకడ్’ మూవీ ఫ్లాప్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను చూస్తుంటే ప్రతి సీన్లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్‌తో పాటు హీరో, విలన్ లుక్స్‌లోనూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ కోసం లోకేశ్.. కమల్ లుక్కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్ మేకింగ్, ప్రతి ఫ్రేమ్‌లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్ సక్సెస్’ అంటూ లోకేశ్ కనకరాజ్‌ను కొనియాడుతున్నారు. -
చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజు దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం(జూన్ 3న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో సైతం విక్రమ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న కమల్ ఈ మూవీ నటీనటులతో పాటు డైరెక్టర్, మూవీ బృందానికి బహుమతులు అందించాడు. చదవండి: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్ ట్వీట్ ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడిని సత్కరించాడు. విక్రమ్ మంచి విజయం అందుకున్న సందర్భంగా కమల్ హాసన్‌తో పాటు డైరెక్టర్ లోకేశ్ కనగరాజును చిరు ఇంటికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. అనంతరం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వచ్చి విక్రమ్ మూవీకి అభినందలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ విక్రమ్ టీంను సత్కరించిన ఫొటోలను షేర్ చేశాడు. ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్‌హాసన్‌తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. అభినందనలు మిత్రమా. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది’ అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా కమల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. తమిళ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించాడు. Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022 -
కమల్‌గారు గ్లోబల్ స్టార్: విక్టరీ వెంకటేశ్
‘‘దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్‌గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు’’ అని అన్నారు హీరో వెంకటేశ్. కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్: హిట్ లిస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘కమల్‌గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్»ౌల్డ్. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌కు జీపీఎస్. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ‘ఏక్ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్, నితిన్‌లకు కంగ్రాట్స్’’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. నా కెరీర్లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్డీ. నా స్టైల్, రజనీకాంత్ స్టైల్ ఆయన్నుంచే వచ్చాయి. వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వచి్చంది. ఇప్పుడు నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్’ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది మీ (ప్రేక్షకులు) సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కమల్‌గారి అద్భుతమైన యాక్షన్‌ను చూస్తారు’’ అన్నారు లోకేశ్ కనగరాజ్. ‘‘కమల్‌హాసన్‌గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ అన్నారు నితిన్. ‘‘తెలుగులో ‘విక్రమ్’ను రిలీజ్ చేసే చాన్స్ ఇచి్చన కమల్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్‌గా అనిపించింది. చదవండి: బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
కమల్‌ను పరామర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్
Kamal Haasan Health Condition: విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు. చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్ కమల్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమలహాసన్ ఆరోగ్యం బాగుందంటూ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు కూడా బులెటిన్ విడుదల చేశారు. కాగా పరిశ్రమలో కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కమల్‌కు కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్... ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. చదవండి: విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్ -
కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్
Kamal Haasan Tested Coronavirus Positive: విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..! ‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్ క్లాత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్‌హాసన్ అమెరికా వెళ్లారట. அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள். — Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021 -
లైంగిక వేధింపులు: బాలిక ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్
లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ స్పందించారు. మృతురాలు బాలిక ఆత్మహత్యకు కారకుడైన సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని కఠింగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే బాలిక మృతికి కారకుడైన టీజర్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావుతంగా కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కమల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సదరు పాఠశాల ఫిజిక్స్ టీజర్ మిథున్ చక్రవర్తిని ఆర్సీపురం పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్‌పై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. -
‘జై భీమ్’ మూవీ చూసి కమల్ హాసన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: జై భీమ్ చిత్రంలో సూర్య నటనకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించారు. పోలీసులు, రాజకీయ నాయకుల అరాచకాలకు గురవుతున్న కొండ జాతి ప్రజలకు అండగా నిలిచే న్యాయవాది పాత్రలో సూర్య నటించారు. ఈ చిత్రం మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం చూసిన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొండజాతి ప్రజల జీవన విధానాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారని కొనియాడారు. చదవండి: Jai Bhim Review: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? నిజాయితీపరులైన పోలీసులు, న్యాయవాదులు న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించగలరని జై భీమ్ చిత్రంలో చూపించారంటూ చిత్ర యూనిట్‌ను, ముఖ్యంగా నటుడు సూర్యను ప్రశంసించారు. అదే విధంగా నటుడు, మకల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ జై భీమ్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఈ సినిమా చూసి తన కళ్లు చమర్చాయని ట్విట్టర్లో పోస్టు చేశారు. పళంగుడి ప్రజల కష్టాలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడి తీరు ప్రశంసనీయం అన్నారు. సూర్య, జ్యోతికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్న కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’?
కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఇండియన్’. ఇదే తెలుగులో ‘భారతీయుడు’గా డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుండగా.. అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే చాలా భాగం షూటింగ్ పూర్తైన తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య వివాదం తలెత్తడంతో మూవీ ఆగిపోయింది. అయితే తాజాగా ఆ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు, డైరెక్టర్‌కి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తైన ఈ మూవీని మిగిలిన పార్ట్‌ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి విడుదల చేయాలని వారు భావిస్తున్నారంట. అయితే శంకర్ ఇప్పటికే రామ్‌చరణ్ హీరో ‘ఆర్సీ15’, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ హీరో ‘అపరిచితుడు’ రీమేక్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో వాటికంటే ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాడా.. లేదా? అనేది చూడాలి. చదవండి: సింహం ఎప్పుడు సింహమే.. -
‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!
Allu Arjun Pushpa Movie: పాత్రలతో ప్రయోగాలు చేసే నటులలో కమల్ హాసన్, విక్రమ్ చియాన్లు ముందుంటారు. వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు. అందుకే ఎప్పుడూ వారు వైవిధ్యమైన కథలతో డిఫరెంట్‌లుక్‌తో ఆశ్చర్యపరుస్తుంటారు. అంతగా సినీ పరిశ్రమలో కమల్, విక్రమ్‌లు విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్ర ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఇందులో స్టైలిష్ స్టార్ మునుపెన్నడు చూడని విధంగా మాస్ లుక్‌తో అలరించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. ఊరమాస్‌గా భయంకరమైన స్మగ్లర్ పుష్పరాజుగా నటించబోతున్నాడు. అయితే ఇందులో తన లుక్ కోసం బన్ని బాగానే కష్టపడుతున్నాడట. స్టైలిష్‌గా లవర్ బాయ్‌లా ఉండే బన్ని ఈ మూవీలో పుష్ప రాజులా కనిపించడానికి తనని తాను మేకోవర్ చేసుకుంటున్నాడు. రోజు సెట్లో మేకప్‌కు వేసుకోవడానికి, తీయడానికి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. రింగులజుట్టు, గడ్డంతో వీరమాస్ లుక్‌లో టాన్ టచ్ అప్లు చేయించుకుంటున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ మేకప్ వేయడానికి రెండు గంటలు, ఆ మేకప్‌ను తొలగించడానికి గంటకు పైనే సమయం పడుతుందా. ఆయన డెడికేషన్‌ను చూసి డైరెక్టర్‌తో పాటు సెట్లోని మిగతా బృందం ఫిదా అవుతున్నారట. అంతేగాక ప్రతిరోజు మేకప్ విషయంలో ఆయన ఓపిక చూసి వారంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. ఇది తెలిసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా ‘పుష్ప’ పార్ట్ వన్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ హాసన్ .. భారతీయుడు సినిమాలో సేనాపతి లుక్ కోసం 4 గంటలు మేకప్ వేసుకునే వాళ్లు. ఇక దశావతారం సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వరూపం వేషధారణకి సంబంధించిన మేకప్‌కు ఎక్కువ శ్రమించాడు. ఇక ఐ సినిమాలో విక్రమ్ తన లుక్కు బాగానే శ్రమించాడు. దీనికి ఆ సినిమాలో ఆయన లుక్‌యే ఉదాహరణ. చదవండి: చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది.. -
సింహం ఎప్పుడు సింహమే..
విలక్షణమైన నటనతో భాషా భేదం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు కమల్‌హాసన్. చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి గురువార నాటికి 62 ఏళ్లు. నాలుగేళ్ల వయసులో తమిళంలో చేసిన ‘కలత్తూర్ కన్నమ్మ’ చిత్రంతో కమల్ సినిమా కెరీర్ ఆరంభమైంది. 1960 ఆగస్టు 12న ఈ సినిమా విడుదలైంది. తొలి సినిమాతోనే రాష్ట్రపతి గోల్డ్ మెడల్ సాధించారు కమల్. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన కమల్ 1974లో ‘కన్యాకుమారి’ అనే మలయాళ చిత్రంతో హీరోగా మారారు. ఇప్పటివరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో 231 చిత్రాల్లో నటించారు. ఇక కమల్ పరిశ్రమకి వచ్చి 62 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’ సినిమా పోస్టర్‌ను ‘సింహం ఎప్పుడూ సింహమే’ అంటూ విడుదల చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 20న ఆరంభం కానుంది. -
దృశ్యం రీమేక్: కమల్ హాసన్ ‘పాపనాశం’ సీక్వెల్‌కు ప్లాన్!
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయి, మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ‘దృశ్యం’కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, వెంకటేశ్-మీనా జోడీగా నటించారు. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్-గౌతమి జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. కాగా ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 2’ రూపొందింది. మలయాళంలో ఇప్పటికే విడుదలైంది. తెలుగు ‘దృశ్యం 2’ రీమేక్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు జీతూ తమిళ రీమేక్‌ని ప్లాన్ చేస్తున్నారట. రెండో భాగంలోనూ కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించనున్నారట. అయితే మొదటి భాగంలో ఆయనకు భార్యగా నటించిన గౌతమి సీక్వెల్లో నటిస్తారా? అనే చర్చ ఆరంభమైంది. కమల్–గౌతమి తమ స్నేహానికి ఫుల్స్టాప్ పెట్టిన విషయం, కమల్ ఇంట్లోనే ఉంటూ వచ్చిన గౌతమి ఆ ఇంటి నుంచి బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమి నటిస్తారా? అసలు దర్శకుడికి ఆమెను తీసుకోవాలని ఉందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. చదవండి: కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్ అవగాహన -
మహేశ్-కమల్‌తో క్రియేటివ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్!
ఈ మధ్యకాలంలో పరిశ్రమతో సంబంధంగా లేకుండా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తుండగా, ఇక సెన్సెషనల్ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలక్షణ నటుడు కమల్ హాసన్‌లతో క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేశ్ ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్ గతంలో మహేశ్‌తో స్పైడర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్‌గా అంతగా సక్సెస్ అందుకోలేదు. -
ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు జీకే మూప్పనార్ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది. మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు. ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది. పంచముఖ పోటీ తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్ నీది మయ్యం (కమల్‌హాసన్), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్), నామ్ తమిళర్ కట్చి (సీమాన్) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్‌హాసన్, టీటీవీ దినకరన్‌లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 2016లో పార్టీ స్థాపించిన సీమాన్ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్‌కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
పోలింగ్ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసస్‌లు కూడా తండ్రి కమల్ హాసన్‌తో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కోమంబత్తూర్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒటు వేసిన అనంతరం కమల్ ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలీంగ్ బూతులోకి వెళ్లాడు. అయితే ఆయనతో పాటు శృతి హాసన్ కూడా లోపలికి వెళ్లింది. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన శృతి తీరుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శృతి హాసన్.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ అంతకన్న కాదు. మరెందుకు పోలీంగ్ బూతులోకి అనమతించారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులోకి ఆమెను ఎలా అనుమతించారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేగాక శృతి పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాకుండ.. ట్విట్టర్లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యంకు(ఎమ్ఎన్ఎమ్) ఓటు వేయమని చెప్పడం కూడా కమిషన్ నిబంధనలకు విరుద్దమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ స్పందించడం కానీ చేయలేదు. మరి ఎన్నికల కమిషన్ శృతిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
రామ్ చరణ్-శంకర్ సినిమాకు ‘లైకా’ బ్రేక్..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ ఓ భారీ ప్రాజెక్ట్ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో చెర్రీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడటం చకచకా అయిపోయాయి. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ ఇప్పట్లో సెట్స్‌పై వచ్చేల కనిపించడం లేదు. కాగా శంకర్ ఇప్పటికే కమల్ హాసన్‌తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 25 ఏళ్ల క్రితం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు సీక్వెల్‌గా శంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. ఆ షాక్‌లో ఉండిపోయిన డైరెక్టర్ మళ్లీ ఈ మూవీ రీ-షెడ్యూల్‌కు ప్లాన్ చేయడం లేదు. ఇందులో కథానాయికగా చేస్తున్న కాజల్ అగర్వాల్ సైతం ఈ మూవీ నుంచి తనకు ఎలాంటి అప్డేట్ రాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇక ‘ఇండియా 2’ షూటింగ్ కొనసాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ‘ఇండియా 2’ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్‌కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత శంకర్ ‘ఇండియా 2’ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడం, హీరో కమల్ హాసన్ ఏమో రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఇదంత చూస్తుంటే శంకర్ ఇబ్బందుల్లో పడేసేలా ఉంది. చదవండి: మహేశ్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్ శంకర్-రామ్ చరణ్ కాంబో; ఊహించని స్క్రిప్ట్ -
వైరల్: ఆగ్రహంతో ‘టార్చ్‌లైట్’ విసిరిన కమల్ హాసన్
చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న ‘టార్చ్‌లైట్’ను విసిరేశారు. కాన్వాయ్‌లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్‌లైట్ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్‌లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్ మైక్రోఫోన్ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. ‘ఏమైంది?’ అని.. ఎంతకీ మైక్రోఫోన్ సరిగా పని చేయకపోవడంతో కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కమల్ అంత కోపం వద్దు.. అంటూ హితవు పలుకుతున్నారు. -
అడ్డదారిలో సీఎం కాలేదు..
సాక్షి, చెన్నై: ప్రచారంలో ప్రధాన కూటముల సీఎం అభ్యర్థులు పళనిస్వామి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం సాగిన ప్రచారంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మూడో కూటమి సీఎం అభ్యర్థి కమల్ కాలి గాయం వేధిస్తున్నా ప్రచారబాటలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జనం ఇళ్ల వద్దకే పరిమితం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం హోరెత్తింది. తమ నేతృత్వంలో గతంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డీఎంకే, అన్నాఎంకే పార్టీలు రూపొందించి మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాల్లో పథకాలకు ప్రత్యేక ఆకర్షణ పేరిట ఒకే మహిళ ఫొటోను పొందు పరిచి ఉండడం అనేక చోట్ల గందరగోళం తప్పలేదు. అగ్రనేతలు ప్రచారంలో మాటల జోరు పెంచారు. అనేకచోట్ల అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా, మరికొన్ని చోట్ల పుష్పాలతో ఆహ్వానాలు పలికిన ఓటర్లూ ఉన్నారు. అనేక జిల్లాల్లో భానుడు భగభగ మని ప్రతాపం చూపించినా, ఉక్క పోత నడుమ ప్రచారంలో అభ్యర్థులకు ముచ్చెమటలు తప్పలేదు. ద్రోహం పెను విషం.. కాంచీపురం జిల్లా పరిధిలోని ఉత్తర మేరు పరిసరాల్లో స్టాలిన్ ప్రచారం సాగింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయాలు, కరోనా విపత్తుల సమయంలో కేటాయించాల్సిన నిధుల్ని సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి, ఎందుకు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్నారో అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన శశికళ గుండెల్లోనే తన్నిన వ్యక్తి పళని స్వామి అని పేర్కొన్నారు. పదే పదే తానేదో రైతు అని పళని జబ్బలు చరస్తున్నాడని, నిజంగా రైతే అయితే, ఎందుకు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చారో అని ప్రశ్నించారు. అడ్డదారిలో సీఎం కాలేదు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వందవాసిల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో-కన్వీనర్ పళనిస్వామి సుడిగాలి పర్యటనతో ఓటర్ల వద్దకు వెళ్లారు. ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను, కరుణానిధిని టార్గెట్ చేశారు. అన్నా మరణం తర్వాత నావలన్ నెడుం జెలియన్ సీఎం కావాల్సి ఉండగా, అడ్డదారిలో కరుణానిధి ఆ కుర్చీని కైవసం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆయనలా తానేమి అడ్డదారిలో సీఎం కాలేదని, అన్నాడీఎంకే శాసన సభా పక్షం మద్దతుగా ఆ పదవిలో కూర్చున్నట్టు పేర్కొన్నారు. తాను రైతునని, అందుకే రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నానని తెలిపారు. అయితే, తననే కాదు, రైతుల్ని కూడా కించ పరిచే విధంగా హేళన చేస్తూ స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చరిత్రను ఆయన చూసుకుంటే మంచిదని, లేని పక్షంలో గట్టిగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తే, ప్రతి దాడికి తానూ రెడీ అని సవాల్ చేశారు. అన్నాడీఎంకేకు ప్రజలే వారసులని, అవినీతి పుట్ట డీఎంకేకు ఈ ఎన్నికల్లో మళ్లీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలి నొప్పితోనూ.. మక్కల్ నీది మయ్యం నేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కమలహాసన్ గతంలో కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారినట్టుంది. కాలి గాయం బాధిస్తున్నట్టుంది. అయినా, లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం నియోజక వర్గం పరిధిలో ఉక్కడం పరిసరాల్లోని మైనారిటీలు అధికంగా ఉండే చోట్ల నడుచుకుంటూ కాసేపు, ఓపెన్ టాప్ వాహనంలో మరికాసేపు ప్రచారంలో ముందుకు సాగారు. డీఎంకేతో, బీజేపీతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఈ విమర్శలు చేస్తున్నారని మైనారిటీల దృష్టికి కమల్ తీసుకెళ్లారు. తనకు కాషాయం రంగు పూయవద్దు అని విజ్ఞప్తి చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! -
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
కమల్ మేనిఫెస్టో: నిరుద్యోగులు, గృహిణిలపై వరాల జల్లులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే, నీట్ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిల బస్తో సీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్ విలేజ్ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యం, ఎస్ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్ పోటీలో ఉన్నారు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్రాజ్లతో కలిసి మేనిఫెస్టోను కమల్ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కొన్ని.. ∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక ∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ ∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు ∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్ మెనేజ్మెంట్బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు ∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ ∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు ∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్‌కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిలబస్‌తో సిట్ పరీక్ష. అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు ∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్ విలేజ్ పథకం ∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. ∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) ∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా. ∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్ క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీపీఎం, టీఎంసీలు కూడా.. డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్ నేత టీకే రంగరాజన్ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత, -
సొంత డబ్బుతో తిరుగుతున్నా.. అనుమతి ఎందుకివ్వరు!
సాక్షి, చెన్నై: సొంత డబ్బు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవడం ఎమిటో అని అధికారుల తీరుపై విశ్వనటుడు కమలహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గురువారం ఎన్నికల ప్రచారం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కమల్‌కు ఏర్పడింది. మక్కల్ నీది మయ్యం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కమల్ ఉన్నారు. కోవై దక్షిణం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న దృష్ట్యా, అక్కడి నుంచే సమీప జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రైవేటు హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. బుధవారం కోవై నుంచి ఈరోడ్‌కు హెలికాప్టర్లో వచ్చి మళ్లీ ప్రచారం చేసి వెళ్లారు. గురువారం కోయంబత్తూరు నుంచి నీలగిరి జిల్లా ఊటి, కున్నురూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్ నిర్ణయించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి కున్నూరు లేదా, దిట్టకల్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగి, రోడ్డు మార్గంలో ప్రచారానికి నిర్ణయించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డ సొమ్ముతో.. ప్రచారం రద్దు కావడంతో కోయంత్తూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి తంగవేల్ నామినేషన్ దాఖలు కార్యాక్రమానికి కమల్ హాజరయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల్ని కలుసుకునేందుకు, సమయం వృథా కాకుండా వినియోగించు కునేందుకు హెలికాప్టర్ పర్యటనను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నానని కమల్ పేర్కొన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ ప్రజల్ని కలుస్తానని, లభిస్తున్న ఆదరణ చూసి అడ్డుకుంటున్నట్టుందని మండిపడ్డారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే! -
20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి. కమల్ వర్సెస్ గౌతమి! మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్, తమ పార్టీ 154 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ దూకుడు పెంచారు. కాగా కమల్ హాసన్- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్‌కు శరత్ కుమార్, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే 1. నరేంద్ర మోదీ 2. జేపీ నడ్డా 3. రాజ్‌నాథ్ సింగ్ 4. అమిత్ షా 5. నితిన్ గడ్కరీ 6.నిర్మలా సీతారామన్ 7. స్మృతి ఇరానీ 8. ఎస్ జైశంకర్ 9. కిషన్‌రెడ్డి 10. జనరల్ వీకే సింగ్(రిటైర్డు) 11. యోగి ఆదిత్యనాథ్ 12. శివరాజ్ సింగ్ చౌహాన్ 13. సీటీ రవి 14. పురందేశ్వరి 15. పి సుధాకర్ రెడ్డి 16. తేజస్వి సూర్య 17. ఎల్ గణేషన్ 18. వీపీ దురైస్వామి 19.కేటీ రాఘవన్ 20. శశికళ పుష్ప 21. గౌతమి తాడిమల్ల 22. రాధారవి 23. కేపీ రామలింగం 24. గాయత్రీ దేవి 25. రాజ్‌కుమార్ గణేషన్ 26. విజయశాంతి 27. సెంథిల్ 28. వెల్లూర్ ఇబ్రహీం 29. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్ 30. ప్రొఫెసర్ కనగ సబాపతి చదవండి: కమల్ సీఎం కావడం ఖాయం.. -
ద్రవిడ పార్టీల పెత్తనం చెల్లదంటున్న రాధిక శరత్ కుమార్
-
తమిళనాడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
-
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు..
-
పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
చెన్నె: సినిమాలతో అశేష జనాన్ని అలరించి లక్షలాది అభిమానం సొంతం చేసుకున్న తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన హాట్ టాపిక్ అయ్యారు. నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి. మొత్తం ఆస్తులు రూ.176.93 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో కమల్ ప్రకటించారు. వాటిలో స్థిరాస్తులు రూ.131.84 కోట్లుగా, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. దీంతోపాటు లండన్‌లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.49.5 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అయితే కమల్ మాత్రం పదో తరగతి కూడా చదవలేదు. తాను 8వ తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపారు. రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు (37.59 ఎకరాలు), చెన్నెలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నెలో ఉన్న రెండు నివాసాలు విలువ రూ.19.5 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌హాసన్ ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని దక్షిణ భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. చదవండి: ఎన్నికల వేళ బీజేపీ షాకిచ్చిన తమిళనాడు సీఎం -
శుభముహూర్తం కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై: శుభముహూర్తం కావడంతో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యరి్థతో పాటుగా మరొకరిని మాత్రమే రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లు స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో శనివారం నాటికి రూ. 100 కోట్ల నగదు, నగలు, వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. శని, ఆదివారాల్లోనూ పెద్దఎత్తున పట్టుబడిన నగదు, వస్తువుల వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. ఆదివారం ఆవడిలో పాత సామాన్ల వ్యాపారి శరవణన్ ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 లక్షలు పట్టుబడింది. అలాగే తిరుప్పూర్‌లో మంత్రి ఉడములై రాధాకృష్ణన్ ముఖ చిత్రంతో వాచీలు, చీరలు, దోవతీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కోవిల్ పట్టిలో తనిఖీని అడ్డుకున్న మంత్రి కడంబూరు రాజుపై కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరక్కాణం, చెంగల్పట్టు, వేలూరులో సాగిన సోదాల్లో రూ. 1.97 కోట్ల విలువ చేసే నగదు, నగలు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మన్నార్‌కుడిలో 64 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నుంచి పట్టుచీరలు కొనేందుకు వచ్చిన ఓ బృందం వద్ద రూ. 2.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్లో ఓ హెలికాఫ్టర్ దిగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందులో తనిఖీలు జరిపారు. అయితే ఆ హెలికాఫ్టర్‌లో కేరళకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కల్యాణ రామన్ తన కుటుంబంతో అంకాల పరమేశ్వరి ఆలయ దర్శనానికి వచ్చినట్టు విచారణలో తేలింది. చదవండి: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు! -
తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్‌హాసన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం. డీఎంకే సీట్ల పంపకాలు డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్‌కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు. -
రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్
సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్‌కు మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్ గార్డెన్లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్ పిలుపునివ్వడం గమనార్హం. చదవండి: అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక -
కమల్ కాలుకు సర్జరీ..
విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు మంగళవారం కమల్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కుడి కాలు ఎముకకు స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమల్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వివరించారు. దీంతో ఆయన కాలికి సర్జరీ చేశామన్నారు. ప్రస్తుతం కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. కమల్ కోలుకుంటున్నారని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కమలహాసన్ కొన్ని నెలలుగా ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కమల్ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. -
కమల్ వ్యాఖ్యలను ఖండించిన కంగనా
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైని పాక్ అక్రమిత కశ్మీర్‌గా పేర్కొనడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, కంగనాలు ఒకరిపై ఒకరు విరుచకుపడుతూ మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో కంగనా పలువురు ప్రముఖులపై అనుహ్య వ్యాఖ్యలు చేస్తూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆమె మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, హీరో కమల్ హాసన్‌పై విరుచుకుపడ్డారు. కాగా త్వరలో రాబోయే తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో కమల్ హాసన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి) Don’t put a price tag on sex we have with our love, don’t pay us for mothering our own, we don’t need salary for being the Queens of our own little kingdom our home,stop seeing everything as business. Surrender to your woman she needs all of you not just your love/respect/salary. https://t.co/57PE8UBALM — Kangana Ranaut (@KanganaTeam) January 5, 2021 దీంతో కంగనా, కమల్ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు. అయితే కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శిశీథరూర్ సమర్థించారు. ఆయన ఆలోచన తీరు ప్రశంసనీయమని థరూర్ ఆయనను కోనియాడారు. (చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!) -
రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!
సాక్షి, చెన్నై: రజనీకాంత్ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంచీపురం జిల్లాల్లో పర్యటించారు. పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు.రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం రూ.2,500 ఇస్తోందని.. తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు. చిన కాంచీపురంలోని చేనేత కార్మికులను కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. -
తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి
సాక్షి హైదరాబాద్ : తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్‌తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. బిహార్ అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మక్క ల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జట్టుగా, కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పో టీ చేయనున్నారని, ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ సోమవారం ప్రకటించారు. అయితేతా ము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్‌తో పొత్తు పెట్టుకోవాలని అసద్ నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ మజ్లిస్ పాగా వేసేనా? ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అసద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌కు చెంది న నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఒవైసీ ఫలవంతమైన చ ర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలు స్తోంది. ‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు’ అని మజ్లిస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!
చెన్నై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్‌తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం.(చదవండి: బెంగాల్లో ఎగరనున్న గాలిపటం!) కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహీద్ జమాత్ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ గత నెలలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్ సెక్రటరీ దురైమురుగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టుకట్టే అంశం గురించి ప్రస్తావించామని, అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఐడీఎంకే పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు బదులుగా బీజేపీకి మద్దతు పలికే పార్టీతో తాము కలిసి నడిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే కమల్‌హాసన్‌తో ఒవైసీ జట్టుకట్టనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం జనవరిలో రాజకీయ పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ శివాలెత్తిస్తారని చెప్పుకొచ్చారు. హౌస్‌లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. అభిజిత్ మాస్టర్ తాము చెప్పేది వినిపించుకోవడం లేదని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్‌లో దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి నిష్క్రమించడాన్ని తప్పు పట్టారు. ఎవరు వెలిగే దీపం, ఎవరు ఆరిపోయే దీపం? కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం అభిజిత్ మోనాల్ అమ్మ రాజశేఖర్ అరియానా అవినాష్ అభిజిత్ మోనాల్ అఖిల్ అరియానా సోహైల్ మెహబూబ్ అరియానా అవినాష్ అరియానా మోనాల్ హారిక లాస్య అవినాష్ లాస్య హారిక అరియానా మెహబూబ్ సోహైల్ అరియానా అమ్మ రాజశేఖర్ అరియానా అఖిల్ అఖిల్ మోనాల్ అమ్మ రాజశేఖర్ మోనాల్‌ను దగ్గరకు తీసుకున్న అఖిల్ మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్‌లో అతడు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్‌ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) తన ముఖంలో చిరునవ్వులు వెలిగించే దీపం అఖిల్.. అయితే అఖిల్‌ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్‌ను నామినేట్ చేసినందుకు అఖిల్‌ను ఆరిపోయే దీపమని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాదన్నాడు. (చదవండి: ఏయ్ హారిక, నోర్మూయ్: చెలరేగిన మాస్టర్) హారికను సేఫ్ చేసిన కమల్ హాసన్ నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్‌బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అనగా అది నాకు నచ్చని మాట అని కమల్ కౌంటరేశారు. అలా కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్‌బాస్‌కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు. తర్వాత నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్‌లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చదవండి: హిమాలయాలకు వీడ్కోలు) షో వదులుకున్నా, అప్పులున్నాయి, సపోర్ట్ చేయండి.. దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్ల దగ్గర బేరసారాలాడాడు. "నేను షోను వదులుకుని వచ్చాను. మళ్లీ తీసుకోమన్నారు. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు చేయలేనని లాస్య నిర్మొహమాటంగా చెప్పింది. మిగతావాళ్లు సపోర్ట్ చేయలేమని నేరుగా చెప్పకుండా చేతల్లో నిరూపించారు. మోనాల్‌కు సపోర్ట్ చేద్దామనుకున్న సోహైల్‌ను మెహబూబ్ వద్దని వారించాడంతో అవినాష్ కోసం తన వస్తువుల త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్యూనిటీ పొందిన అవినాష్ హారికకు మోనాల్‌కు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ అవినాష్ తనకే చేయాలని పట్టుపట్టాడు. కానీ అతడు పక్కు వెళ్లగానే మోనాల్ బుట్టలో తన వస్తువులను వేయడానికి సిద్ధపడగా అప్పటికే బజర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్కడే మోనాల్‌కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్‌కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్‌కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు. ఇక కెప్టెన్‌గా అందరి మీదా అజమాయిషీ చేస్తోన్న అమ్మ రాజశేఖర్ రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- కమల్ హాసన్
-
శంకర్ సినిమాలో పాయల్‌కు అవకాశం?
ఆర్ఎక్స్-100తో కుర్రకారు మనసు దోచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సాధించిన ఈ నటికి ఊహించిన విధంగా ఆఫర్లు రావడం లేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కెరీర్ పరంగా ఆమెకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. అయితే ఈ అమ్మడికి ఊహించని అవకాశం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాయల్‌కు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ కథానాయకుడిగా ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (చదువులో నేను టాపర్: సమంత) ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం పాయల్‌ను చిత్ర బృందం సంప్రదించిందని టాక్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్‌కు అవకాశం వస్తే పెద్ద బ్రేక్ దొరికినట్లేనని, శంకర్ సినిమాలో కనిపిస్తే అటు నార్త్ ఇటు సౌత్‌లో ఫుల్ క్రేజ్ పెరుగుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (తండ్రి అయిన దర్శకుడు) -
రెండు గంటల్లో పాట రాసిన కమల్
-
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
అలా కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది?
-
ఇండియన్-2 ప్రమాదం: హైకోర్టుకు కమల్
సాక్షి, చెన్నై : తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్-2 చిత్ర షూటింగ్ సందర్భంగా చెన్నైలో ఇటీవల ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ తీరుపై అభ్యంతకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. (దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలు) -
కమల్ హాసన్‌కు పోలీసు నోటీసులు
విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు చైన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్శకుడు శంకర్.. లైకా పోడక‌్షన్‌లో నిర్మిస్తున్న ‘ఇండియన్ -2’ సినిమా సెట్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28)తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ(34).. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్‌లపై కేసు నమోదు చేసి నోటిసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాదం నుంచి హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటీలో తప్పించుకోగా, డైరెక్టర్ శంకర్ కాలికి గాయమైంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్) కాగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల చోప్పు కమల్ హాసన్ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. అంతేగాక హస్పీటల్లో చికిత్స పొందుతున్న గాయపడ్డ 10 మందిని ఆయన పరామర్శించి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. లైకా పోడక్షన్ సంస్థ కూడా వారికి సాయం అందిస్తుంది. దర్శకుడు శంకర్ కూడా తోడుంటానని హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై చైన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, చిత్ర నిర్మాతలపై.. క్రేన్ యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ 287(యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), 377 పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెట్లో ప్రమాదం: అసలేం జరిగింది? -
కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్
సాక్షి, చెన్నై: భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు టెక్నీషియన్ల కుటుంబాలకు హీరో కమల్‌హాసన్ ఆపన్న హస్తం అందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్లో బుధవారం రాత్రి భారీ క్రేన్ పడిపోవడంతో సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని కమల్‌హాసన్ ట్విటర్లో పేర్కొన్నారు. గాయపడిన 9 మంది తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కాగా.. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున, గాయపడిన వారికి తలా 50 లక్షలు ఇవ్వనున్నట్టు లైకా నిర్మాణ సంస్థ తెలిపింది. (భారతీయుడు–2 ప్రమాదం: ఎలా జరిగింది?) మాటలు రావడం లేదు: కాజల్ గుండెను బరువెక్కించే ఈ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఊహించని దుర్ఘటనలో ముగ్గురు సహచరులను కోల్పోవడం పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. కృష్ణ, చంద్రన్, మధుల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ బాధను తట్టుకునే శక్తిని వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకున్నారు. సెట్లో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసిందని, కళ్లుమూసి తెరిచేలోగా అంతా జరిగిపోయిందన్నారు. ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన తాను, ఈ ఘటనతో సమయం, జీవితం విలువ గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
సెట్లో ప్రమాదం: అసలేం జరిగింది?
సాక్షి, చెన్నై : భారతీయుడు–2 సినిమా షూటింగ్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదం నుంచి హీరో కమల్‌హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని కాస్టూమ్ డిజైనర్ అమృతరామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఘోర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. 10 సెకన్ల తేడాతో క్రేన్ ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ ఆశీర్వాదాల కారణంగానే కమల్ సార్, కాజల్, నేను సురక్షితంగా ఉన్నాం. మేము బస చేసిన టెంట్పైనే భారీ క్రేన్ కూలిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాన’ని అమృత ట్వీట్ చేశారు. అసలేం జరిగింది? ఊహించని ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ‘ఇండియా టుడే’తో అమృత అన్నారు. ఫైటింగ్ సీన్ తీసేందుకు రెడీ అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అప్పటికే రెండు సీక్వెన్స్ పూర్తి చేసి మూడోది తీసేందుకు సమాయత్తమవుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదజరిగిన తర్వాత కొన్ని నిమిషాల పాటు తాను షాక్‌లో ఉండిపోయానని చెప్పారు. ‘దర్శకుడు శంకర్ సార్ నాలుగు రోజులుగా భారీ ఫైటింగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. గతరాత్రి మేము రెండు షాట్స్ పూర్తి చేశాం. మూడో షాట్‌కు రెడీ అవుతుండగా సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగిపోయింది. తర్వాతి షాట్‌కు జరుగుతున్న రిహార్సల్‌ను, లైటింగ్‌ను శంకర్, సినిమాటోగ్రాఫర్ లైటింగ్ పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి కొద్ది దూరంలోనే వారిద్దరూ ఉన్నారు. కమల్‌హాసన్ సార్, కాజల్ అగర్వాల్, నేను, మాతో పాటు ఉన్న హాలీవుడ్ మేకప్‌మేన్ మానిటర్ టెంట్లో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలోనే క్రేన్ అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో టెంట్ నుంచి బయటకు పరుగులు తీశాం. తర్వాత వచ్చి చూస్తే భారీ క్రేన్ కూలిపోయింది. అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. కొద్ది నిమిషాల పాటు నా మెదడు స్తంభించిపోయింది. కమల్, కాజల్ కూడా షాక్‌కు గురయ్యారు. గతంలో ఎన్నో ప్రమాదాలకు గురైన కమల్ సార్ వెంటనే తేరుకుని అందరినీ అప్రమత్తం చేశారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచివుండకుండా క్షతగాత్రులను మనమే ఆస్పత్రికి తీసుకెళదామని అన్నారు. తన సినిమా సెట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో శంకర్ సార్ చాలా ఆవేదనకు గురయ్యారు. శృతిహాసన్ ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాను. తన తండ్రికి ఏమీ కాలేదన్న విషయం తెలియడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. సెట్లోని మిగతా వారి గురించి కూడా శృతి ఆరా తీసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వణుకు పుడుతోంద’ని అమృత అన్నారు. ప్రాణాలు కోల్పోయింది వీరే.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మంచి సాంకేతిక నిపుణులను పోగొట్టుకున్నామని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిసెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరగడం తమను ఎంతోగానో బాధించిందని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారతీయుడు–2 షూటింగ్లో ఘోర ప్రమాదం -
భారతీయుడు 2 షూటింగ్లో ఘోర ప్రమాదం
-
దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై : కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు–2 సినిమా షూటింగ్లో బుధవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన చంద్రన్ ఉన్నట్లు తెలిసింది. చెన్నై శివారు పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో భారతీయుడు–2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ క్రేన్లతో ప్రత్యేక సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో 150 అడుగులున్న క్రేన్ హఠాత్తుగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సమీపంలోని ఓ టెంటులో దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్లతో కలిసి మానిటర్లో రషెస్ చూస్తుండగా.. ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ సమయంలో చిత్రహీరో కమల్‌హాసన్ సెట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. ప్రమాదం నా మనసును కలచివేసింది: కమల్‌హాసన్ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్ ట్విటర్లో స్పందించారు. ‘ సెట్స్‌లో జరిగిన ప్రమాదం మనసుని కలచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నోరెట్లు ఎక్కువ’ అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సాగుభూతిని తెలిపారు. -
పౌర ప్రకపంనలు : కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
-
కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
చెన్నై : బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు. 'ఈ బిల్లు దేశానికి సంబంధించినది. ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దానిని వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నియంతృత్వ పాలనవైపు అడుగులు వేయడం దురదృష్టకరం' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కమల్‌హాసన్ కూడా ఉన్నారు. (చదవండి : పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..) Kamal Haasan: I am not allowed to go inside. Till I die, I will call myself a student, I have come here in that capacity to be their defender. I will keep voicing whether or not I have started a party and now that I have started a party it becomes my duty to be here. https://t.co/pkdsv1MFxP pic.twitter.com/56Kpn9AFHu — ANI (@ANI) 18 December 2019 -
కమల్ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్ తమిళ తలైవా రజనీకాంత్‌కు వీరాభిమాని. చెన్నైలో జరిగిన దర్బార్ ఆడియో లాంచ్‌లో ఆయన చేసిన ప్రసంగం ఎన్నో చిక్కులను తెచ్చిపెట్టింది. చిన్నతనంలో కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరాను అని చెప్పడంతో కమల్ అభిమానులు రాఘవను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రాఘవ ఈ విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా ఆయన కమల్ హాసన్‌ను కలిసి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం వీరిద్దరూ ఆత్మీయంగా కలిసి దిగిన ఫొటోను రాఘవ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. నన్ను ట్రోల్ చేసేముందు పూర్తి వీడియో చూడాలని కోరారు. చిన్నతనంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఉన్న ప్రేమతో ఇతర నటుడైన కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరానన్నారు. కానీ పెద్దయ్యాక రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నడుస్తుంటే సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దయచేసి తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కమల్ హాసన్ అభిమానులను కోరాడు. ‘నేను నిజంగా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు కోరేవాన్ని. కానీ, నేనేం తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి. నాకు కమల్ సర్ అంటే ఎంతో గౌరవం. నాపై ప్రేమ చూపించిన కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు. కాగా రాఘవ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన హారర్ చిత్రం కాంచనను హిందీలో ‘లక్ష్మీబాంబ్ ’పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. (చదవండి: కమల్, రజనీ సెన్సేషనల్ న్యూస్) -
వారికి కూడా శివాజీ గణేశన్‌కు పట్టిన గతే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెర నటులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయ అజ్ఞానులని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదని ఎద్దేవా చేశారు. సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అనంతరం ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ఎడపాడి ప్రశ్నించారు. ‘కమల్ పెద్ద నాయకుడే కదా, గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకోవడంతో సినిమా అవకాశాలు రాక రాజకీయ ప్రవేశం చేశారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం స్థాపించాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు. అది తప్పుకాదు. అయితే ఇతరులను దూషించడం తప్పు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు. నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్లాను. ప్రజాభిమానంతో సీఎం దశకు చేరుకున్నాను. రజనీ, కమల్ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదు. ప్రజల సమస్యలపై అవగాహన లేదు. శివాజీగణేశన్ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ రజనీకాంత్, కమల్ హాసన్‌లపై విమర్శలు గుప్పించారు. కాళ్లపై పడి ఎవరైనా సీఎం అవుతారు.. శివాజీ గణేశన్ రాజకీయ జీవితంపై సీఎం పళనిసామి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతరులు కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి.. ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. పళనిసామికి అధికారం మాత్రమే ఉందని.. పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరని.. అదే శివాజీ గణేశన్ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంది. ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కమల్, రజనీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్‌లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్‌ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
వేడుక చేద్దాం.. లవ్ యూ పప్పా: శృతిహాసన్
చెన్నై : సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.. విలక్షణ నటుడు కమల్ హాసన్. విభిన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దశావతరంలో పది పాత్రలు పోషించి తను చేయలేని క్యారెక్టర్ లేదని నిరూపించుకున్నాడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి లెజెండ్ అనిపించుకున్నాడు. నవంబర్ 7(గురువారం) లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్ తన స్వగ్రామమైన ‘పరమక్కుడి’ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ ట్రిప్‌కి కుటుంబ సభ్యులతోపాటు తన టీం మొత్తం వెళ్లారు. ఈ క్రమంలో ఊరుకు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో కుటుంబంతో దిగిన ఫోటోలను అక్షర హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఇక శ్రుతి హాసన్ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్‌డే బాపూజీ. ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి వచ్చాం. అక్కడ వేడుక చేసుకున్నాం. అలాగే మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్ యూ లాట్స్ పప్పా’ అంటూ విషేస్ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌తో సహా అన్నయ చారు హాసన్ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ కమల్ తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్నిఆవిష్కరించనున్నారు. వృత్తి పరంగా శ్రీనివాసన్ న్యాయమూర్తి అలాగే స్వాతంత్య్ర సమర మోధుడు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడానికి లజెండ్ శివాజీ గణేశన్ కొడుకు నటుడు ప్రభు సైతం పరమక్కుడికి వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం కమల్ నవంబర్ 8న తిరిగి చెన్నైకి వచ్చి తన కార్యలయంలో సినీ గురువు, లెజెండరీ ఫిల్మ్‌మేకర్ కె.బాల చందర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక కమల్ హసన్ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళనటుడైనా తన విలక్షణ నటనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన(కలకత్తూర్ కన్నమ్మ) మొదటి చిత్రానికే కమల్ జాతీయ పురస్కరం అందుకున్నారు. అనంతరం మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నారు. నటుడిగానే కాకుండా నృత్యంలోనూ ముఖ్యంగా భారత నాట్యంలోనూ కమల్‌కి మంచి ప్రావీణ్యం ఉంది. 1960లోనే సినిమాల్లో ఆరంగేట్రం చేసిన కమల్ 1977లో తెలుగు చిత్రం(అంతులేని కథ)తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే వంటి హిట్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి(కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. ఈయన పద్మశ్రీ గ్రహీత. -
అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్
తమిళసినిమా: అది మాత్రం చెప్పను అంటోంది నటి కాజల్ అగర్వాల్. ఇంతకీ ఏమిటీ గొడవ అనేగా మీ ప్రశ్న. ఈ ముంబై బ్యూటీ గురించి ఇటీవల పలు రకాలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. నటిగా దశాబ్దంన్నరకు చేరుకోవడంతో పెళ్లి గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కాజల్‌కు పెళ్లి కళ వచ్చేసిందని, ఒక పారిశ్రామికవేత్తతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతోందని ఇలా వార్తలు దొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్–2 చిత్రంలో కాజల్‌అగర్వాల్ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా దర్శకుడు శంకర్ చిత్రాలకు సంబంధించిన వివరాలు అంతసులభంగా బయటకు రావు. అలాంటిది కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన విషయాలు బయటకు రావడానికి ఒక రకంగా తనే కారణం. కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇండియన్–2. ఈ చిత్రంలో నటించే విషయం గురించి నటి కాజల్ అగర్వాల్ ఎక్కువగా ప్రచారం చేసుకోవడంలో ఆమె పాత్ర గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ఇండియన్–2 చిత్రం కోసం ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఈ చిత్రంలో కమలహాసన్ ఇండియన్ పాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందనే ప్రచారం వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రచారంపై ఇటీవల స్పందించిన కాజల్ ఇండియన్–2 చిత్రంలో తన పాత్ర గురించి ప్రచారం జరుగుతోందంది. అందులోని పాత్ర కోసం ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటున్న విషయం నిజమేనని చెప్పింది. ఆ పాత్ర వయసు గురించి అడుగుతున్నారని, ఆయితే ఆ వివరాలను మాత్రం చెప్పనని పేర్కొంది. ఈ నెలలో తైవాన్‌లో జరగనున్న ఇండియన్ 2 చిత్ర షూటింగ్లో తాను పాల్గొనపోతున్నట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే సినిమాపై మక్కువ, వైవిధ్యభరిత కథలపై ఆసక్తితో నిర్మాతగా మారాలనుకున్నమాట నిజమేనని, అయితే తాను ఆశించిన కథలు అమరకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు చెప్పింది. అదేవిధంగా ప్రస్తుతం కథానాయకిగా విరామం లేకుండా నటిస్తున్నానని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతగా మరి ఇంకా ఒత్తిడికి గురికావడం ఇష్టంలేదని అంది. తాను నటించిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం బాగా వచ్చిందని, అయితే సెన్సార్ సమస్యలతో ఆటంకాలను ఎదుర్కొంటోందని చెప్పింది. అవన్నీ ఎదురొడ్డి త్వరలోనే చిత్రం తెరపైకి రావాలని కోరుకుంటున్నానని కాజల్ పేర్కొంది. -
‘ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలి’
చెన్నై : అధికార పార్టీకి చెందిన హోర్డింగ్ కారణంగా మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శుభశ్రీ ఉదంతం పట్ల నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ప్రచారానికి ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలని ప్రశ్నించారు. శుక్రవారం కమల్ మీడియాతో మాట్లాడుతూ...’అసలు ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ బ్యానర్లు పెట్టాలి. ఎక్కడ పెట్టాలో తెలియదా. కనీస ఇంగిత ఙ్ఞానం కూడా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే శుభశ్రీ, రఘు వంటి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ల తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వారి వేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ విషయాల గురించి వారిని ప్రశ్నించినా..నిజాలు మాట్లాడినా నాలుక కోస్తామని హెచ్చరిస్తారు. అటువంటి వాళ్లను అసలు పట్టించుకోవడమే మానేశాను. ప్రజా సమస్యల గురించి కచ్చితంగా ప్రశ్నించి తీరతా’ అని పేర్కొన్నారు.(చదవండి : నిషేధంతో బతుకు ప్రశ్నార్థకం) అదే విధంగా ప్రజలు కూడా ఇవన్నీ భరిస్తూ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ...‘ కలకాలం బానిసల్లా బతుకుదామని అనుకుంటే మీకంటే పిచ్చివాళ్లు ఎవరూ ఉండరు. పాలకులు మిమ్మల్ని బానిసల్లా చేసి ఆడుకుంటున్నారు. సాధారణ ప్రజల వల్ల ఏమతుందిలే అనే ధీమాతో ఉన్నారు. అయితే మీరంతా ఎంతో ధైర్యవంతులని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుని వారికి బుద్ధి చెప్పి.. సరికొత్త నాయకులను ఎన్నుకుంటారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోండి అని కమల్ పిలుపునిచ్చారు. కాగా వారం రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడం, వెనుక వచ్చిన లారీ మీదకి ఎక్కడంతో శుభశ్రీ అనే టెకీ మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు నమోదయ్యాయి. -
‘బిగ్ బాస్ షోలో ఆయన చేసింది బాగోలేదు!’
సాక్షి, చెన్నై : తమిళ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. పైగా ఆ వ్యాఖ్యలను కమల్ హాసన్ ప్రోత్సహించినట్లుగా ఉండటం మరింత అగ్గి రాజేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించింది. తాజాగా బీజేపీ ప్రతినిధి నారాయణ తిరుపతి కూడా కమల్ తీరుపై మండిపడ్డారు. ‘ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్ హాసన్.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పమని అడగాల్సింది పోగా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉందని’ అన్నారు. బిగ్ బాస్ షోలో ఆయన చేసింది అమోదయోగ్యంగా లేదని, శరవణన్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించడం సరికాదని ఆయన అన్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.. శనివారం నాటి బిగ్ బాస్ కార్యక్రమంలో కమల్ హాసన్.. సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో తాను కాలేజీకి వెళ్లే రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలను తాకుతూ ఆనందపడే వాడినని శరవణన్ తెలిపాడు. ఆ తర్వాత కమల్ దానిని ఒక సరదా సన్నివేశంగా మార్చి ఇప్పడు శరవణన్ అలాంటివాడు కాదు, పూర్తిగా మారిపోయి ఉంటాడంటూ ఆ సన్నివేశాన్ని దాటేశాడు. చదవండి: బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
‘ఇండియన్-2’ కోసం క్యాస్టింగ్ కాల్
భారతీయ దిగ్గజ దర్శకుల్లో శంకర్ ఒకరు. సామాజిక సందేశంతో నిండి.. అందరూ మెచ్చే చిత్రాన్ని తెరకెక్కించడం ఈయన ప్రత్యేకం. గతేడాది 2.ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకర్.. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. అయితే షూటింగ్ కూడా ప్రారంభించేసిన చిత్రయూనిట్.. కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కబోదని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను హీరోయిన్ ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు కావలెను అని ఓ ప్రకటనను విడుదల చేసింది చిత్రబృందం. ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యులు కావాలని అనుకునేవారు.. తమ ప్రొఫైల్‌ను ఈమెయిల్ (casting.indian2@gmail.com) చేయాలని తెలిపారు. ఈ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్
చెన్నై: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ వైఖరిని తాను ఖండిస్తున్నానని ప్రముఖ నటుడు,మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. నీట్ పరీక్షా విధానాన్ని విమర్శించిన సూర్యపై బీజేపీ సహా అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ ఆయనకు అండగా నిలిచారు. సూర్య కుటుంబం విద్యాభివృద్దికి ఎంతో కృషి చేసిందని.. వారికి విద్య గురించి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. కాగా చెన్నైలో తన ఫౌండేషన్ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ హిందీని మూడో భాషగా చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, ప్రవేశ పరీక్షలకు సమాయత్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.విద్యార్థులు హిందీ భాషను నేర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, నేను సైతం నా పిల్లలకు బోధించలేక పోతున్నానని వాపోయారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ విద్యను అందించాలని, అదీ సమతుల్యమైన విద్యగా ఉండాలనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకొస్తోందన్నారు. అయినా తమిళనాడులో ఆ విధానాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే విద్యా విధానం గురించి తెలియనివారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని సూర్యపై ధ్వజమెత్తారు. -
బిగ్‌బాస్ 3.. కంటెస్టెంట్స్ ఎవరంటే?
పెరంబూరు: బిగ్‌బాస్ రియలిటీ గేమ్ షో. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్న విషయం ఇది. కారణం ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాత కావడం ఒక అంశం. ఇందులో పాల్గొన్న పోటీదారులు విపరీతంగా పాపులారిటీని తెచ్చుకోవడం, తద్వారా చిత్ర పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకోవడం, అవకాశాలు వరించడం వంటివి ముఖ్య అంశాలు. బాలీవుడ్ నుంచి దక్షిణాదికి పాకిన ఈ రియాలిటీ గేమ్ షో తొలిసారిగా 2017లో ప్రారంభం అయ్యింది. విజయ్ టీవీలో ప్రసారం అయ్యే ఈ రియాలిటీ గేమ్ షోకు ప్రేక్షకుల ఆదరణతో విపరీతమైన రేటింగ్ వచ్చింది. ఈ గేమ్‌షోలో 15 మంది సభ్యులు పాల్గొంటారు. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఒకే చోట కలిసి మెలిసి ఉండాలి. ఎవరి పనులు వారే చేసుకుంటూ వంద రోజులు గడపాలి. అలా గడిపిన వారిలో వారి నడతను బట్టి విన్నర్ ఎంపిక ఉంటుంది. అలా గెలిచిన వారికి లక్షల్లో ప్రైజ్‌మనీ ఉంటుంది. అలా 2017, 2018ల్లో నిర్వహించిన ఈ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సూపర్‌హిట్ అవ్వడంతో తాజాగా మూడో సిరీస్‌కు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. బిగ్‌బాస్ 3కి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ఎందుకంటే ఇదే బిగ్‌బాస్ రియాలిటీ షోను తెలుగులోనూ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఒక్కో ఏడాదికి ఒక్కో నటుడు వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. కాగా తమిళంలో బిగ్‌బాస్–3 ప్రసారానికి సమయం దగ్గర పడింది. రేపే అంటే ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఇక అసలు విషయానికి వస్తే గత రెండు రియాలిటీ షోల కంటే ఈ సారి ప్రముఖ నటీనటులు ఈ గేమ్ షోలో పాల్గొననున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాల్లో అవకాశం లేని సీనియర్ నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొని మళ్లీ సినీ అవకాశాలను పొందాలనుకుంటున్నట్లు టాక్. అయితే ఈ షోలో పాల్గొంటున్న వారిని నిర్వాహకులు ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే ఆ వివరాలను రహస్యంగా ఉంచారు. అలాంటిది రియాలిటీ షోలో పాల్గొనేవారు వీరే అంటూ ఒక లిస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అ వివరాలు చూస్తే ఇటీవల తరచూ సినీ, రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న నటి కస్తూరి, ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సిద్ధహస్తుడైన సీనియర్ నటుడు రాధారవి, నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ, నటి విచిత్ర, పూనం బజ్వా, చాందిని, హాస్యనటి మధుమిత, నటుడు మోహన్ వైద్య, శక్తిచరణ్, సంతానబారతీ, శ్రీమాన్, రమేశ్తిలక్, టప్మాష్ మృణాలిని, మోడల్ శ్రీగోపిక, విజయ్ టీవీ రమ్య, గాయకుడు క్రిష్ మొదలగు వారు పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు నటి సాక్షీఅగర్వాల్ పేరు కూడా వినిపించింది. అయితే ఇది అధికారికపూర్వక జాబితా కాదు. అసలు పోటీదారులెవరన్నది రేపు తెలుస్తుంది. -
బిగ్‌బాస్ షోను సెన్సార్ చేయండి
పెరంబూరు: బిగ్‌బాస్‌కు షాకిచ్చారో న్యాయవాది. ఈ రియాలిటీ గేమ్ షోను సెన్సార్ చేయాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విజయ్ టీవీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సెన్సార్ బోర్డుకు రిట్ పిటిషన్ దాఖాలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే విజయ్ టీవీలో ప్రసారం అయిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1, 2 ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పలువురు నటీనటులు ప్రాచుర్యం పొందారు. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షోకు తాజాగా సీజన్–3 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదన్ అనే న్యాయవాది బిగ్‌బాస్–3 రియాలిటీ షోను నిషేధించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో.. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోను పిల్లల నుంచి పెద్దల వరకూ వీక్షిస్తున్నారన్నారు. ఈ రియాలిటీ షోలో నటీనటులు అశ్లీలకరంగా దుస్తులు ధరించడం, ద్వందర్థాల సంభాషణలను మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇవి ప్రేక్షకులను చెడు దారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. వారి మనోభావాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంటున్నాయన్నారు. కాబట్టి ఈ రియాలిటీ షోను సెన్సార్ చేయించి ప్రసారం చేయాలని కోరారు. అంతవరకూ రియాలిటీ షో ప్రసారంపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలను విన్న న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, సుబ్రమణియం ప్రసాద్‌లు ఈ పిటిషన్‌పై రిట్ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విజయ్ టీవీ.నిర్వాహక చైర్మన్‌కు, కేంద్ర సెన్సార్ బోర్డుకు 3 వారాల్లోగా నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదే«శించారు. -
రజనీ, కమల్‌పై విరుచుకుపడ్డ ‘కట్టప్ప’
సాక్షి, చెన్నై : తమిళ నాట రాజకీయ శూన్యత ఏమీ లేదంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌పై సత్యరాజ్ విరుచుకపడ్డారు. రాజకీయ శూన్యత ఏర్పడిందంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్హాసన్ల వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నట్లుగా చురకలంటించారు. -
ఆ సినిమా నుంచి కాజల్ తప్పుకుందా?
తమిళసినిమా: నటి కాజల్ అగర్వాల్‌కు ఇప్పుడు టైమ్ అస్సలు బాగోలేదని చెప్పవచ్చు. ఈ అమ్మడు మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. కోలీవుడ్‌లో అజిత్ సరసన నటించిన వివేకం చిత్రం తరువాత కాజల్‌కు విజయమే ముఖం చాటేసిందంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లోనూ నేనేరాజా నేనేమంత్రి తరువాత సక్సెస్‌లు లేవు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఎంఎల్ఏ, కవచం, సీత వంటి తెలుగు చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. తమిళంలో అంతకంటే నిరాశను కలిగించిన అవకాశం ఇండియన్–2. నిజానికి ఈ చిత్రంలో నటించే అవకాశం రావడంతో కాజల్‌అగర్వాల్ సంతోషంతో ఉబ్బితబ్బిబై పోయింది. కారణం కథానాయకుడు కమలహాసన్ కావడం, దర్శకుడు శంకర్ కావడం. ఇక ఇండియన్ (తెలుగులో భారతీయుడు) వంటి చిత్రానికి సీక్వెల్ కావడంతో ఇండియన్–2 తన సినీ కేరీర్లో మైలు రాయిగా నిలిచి పోతుందని భావించింది. ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్ ఫొటో సెషన్లో కూడా పాల్గొంది. చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే కమలహాసన్ రాజకీయ రూపంలో ఇండియన్–2 చిత్ర నిర్మాణానికి తొలి గండి పడింది. ఆయన లోక్‌సభ ఎన్నికల పనిలో బిజీ కావడంతో ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన వివరాలేవీ లేవు. లోక్‌సభ ఎన్నికల హడావుడి తగ్గిన తరువాత కమలహాసన్ బిగ్‌బాస్–3 పనిలో నిమగ్నమయ్యారు. ఈ రియాలిటీ షో త్వరలో ప్రసారం కానుంది. దీని కోసం కమలహాసన్ వారానికి రెండు రోజులు కేటాయించారు. అలా మరో మూడు నెలల వరకూ ఆయన ఇండియన్–2 చిత్రం గురించి ఆలోచించేలా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసిన కాజల్‌అగర్వాల్ వేసారిపోయిందట. ఇక సహనం నశించవడంతో ఇండియన్–2 చిత్రాన్ని వదులు కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. అలా ఒక క్రేజీ చిత్రాన్ని కాజల్ కోల్పోవాల్సిన పరిస్థితి రావడంతో చాలా నిరాశ, నిస్పృహలకు లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్న హింది చిత్రం క్వీన్‌కు రీమేక్ అయిన ప్యారీస్ ప్యారీస్ విడుదలలో జాప్యం కాజల్‌ను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం జయంరవితో రోమాన్స్ చేస్తున్న తమిళ చిత్రం కోమాలి పైనే ఈ బ్యూటీ ఆశలన్నీ. దీనితో పాటు తెలుగులో ఒక చిత్రం మాత్రమే కాజల్‌అగర్వాల్ చేతిలో ఉంది. కొత్తగా అవకాశాలేమీ లేవు. మరో పక్క ఈ ముద్దుగుమ్మకు ఇంటిలో పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
రాజకీయంగా కలుస్తారా?
తమిళసినిమా: రాజకీయంగా కమలహాసన్, రజనీకాంత్ కలుస్తారా? ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న వాడి వేడి చర్చల్లో ఇది ఒకటి. సినీరంగంలో కమలహాసన్, రజనీకాంత్ దిగ్గజాలు. అంతే కాదు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆరంభకాలంలో కమలహాసన్, రజనీకాంత్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. కాగా చాలా కాలం నుంచి రాజకీయాల్లోకి వస్తానంటూ చెబుతూ వస్తున్న రజనీకాంత్ ఇప్పటికీ మాట మార్చలేదు. రాజకీయాల్లోకి వస్తాననే చెబుతున్నారు. అయితే గత ఏడాది మాత్రం బహిరంగరంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అది జరిగి కూడా ఏడాది దాటిపోయింది. అయితే జూన్‌లో రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణన్ చెబుతున్నారు. ఇక కమలహాసన్ విషయానికి వస్తే అనూహ్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి, వెనువెంటనే ఆ దిశగా అడుగులు వేసి మక్కళ్ నీది మయ్యం పేరుతో పార్టీని ప్రారంభించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతే కాదు పార్టీ బలోపేతం కాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను పొందారు. కొన్నిస్థానాల్లో అయితే లక్షకు పైగా ఓట్లను రాబట్టగలిగారు. అదే ఉత్సాహంతో పార్టీని మరింత పటిష్టం చేసి రానున్న శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీని ప్రారంభించి శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో కమలహాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారా? అలా చేస్తే విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కూడా కమలహాసన్‌తో తనకున్న స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆ రకమైన ప్రసారాలకు నటుడు రజనీకాంత్ ఫుల్స్టాప్ పెట్టారు. అంతే కాదు లోక్‌సభ ఎన్నికల్లో మక్కళ్ నీది మయ్యం మంచి ఫలితాలను సాధించిందని కమలహాసన్‌ను అభినందిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో వీరి మైత్రి రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే రాజకీయంగా వీరిద్దరి దృక్పథాలు వేర్వేరన్నది గమనార్హం. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ తమ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు నటుడు రజనీకాంత్‌కు మధ్య మితృత్వం పటిష్టంగా ఉందన్నారు. అయితే కమలహాసన్, రజనీకాంత్‌ల మధ్య పొత్తు కాలమే నిర్ణయించాలన్నారు. అదేవిధంగా పొత్తు విషయంలో తమ పార్టీ ప్రత్యేకతకు భంగం కలగరాదన్న విషయంలో తాము దృఢంగా ఉన్నామన్నారు. కాబట్టి పొత్తుల విషయంలో తాము తొందర పడదలచుకోలేదన్నారు. జాతీయ పార్టీల విషయంలో తన అభిప్రాయం ఇదేనని మహేంద్రన్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. శాసనసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో! -
బిగ్‌బాస్–3లో శ్రీరెడ్డి?
సాక్షి, చెన్నై : బిగ్‌బాస్–3లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రముఖ నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే రెండు సీజన్లు జరిగిన షో కార్యక్రమం సీజన్–3 జూన్ రెండో వారంలో ప్రారభం కానుంది. ఇందుకు సంబంధించి కమలహాసన్ నటించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా నటి శ్రీరెడ్డి ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. శ్రీరెడ్డి గతంలో టాలీవుడ్లో తనతో లైంగిక చర్యలకు పాల్పడిన వారిలో కొందరి పేర్లు బయటపెట్టడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అర్ధనగ్నంగా నడిరోడ్డుపై దీక్ష చేపట్టింది. ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి కోలీవుడ్ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి వివాదాంశ నటిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో శ్రీరెడ్డి ఎంట్రీ ఇస్తే ఇక వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంటే. అయితే దీనిపై శ్రీరెడ్డి ఇంకా స్పందించలేదు. తాజాగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్–3లో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఒరుకల్ ఒరుకన్నాడీ చిత్రంలో నటుడు సంతానంకు జంటగా నటించిన జాంగిరీ మధుమితను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ ఒకటిలో నటి ఓవియ వివాదాస్పద చర్యలతో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆ షోలో విన్నర్‌గా మాత్రం ఆమె లవర్‌గా పాపులర్ అయిన నటుడు ఆరవ్ గెలుచుకున్నాడు. అలాగే సీజన్–2లో నటి ఐశ్వర్యదత్తు, యాషికలు పాపులర్ అయ్యారు. అయితే ఆ షోలో నటి రిత్విక విన్నర్‌గా నిలిచింది. -
నాలో మరో కోణం చూస్తారు..జాగ్రత్త!
సాక్షి, చెన్నై : తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదంటూ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన పార్టీ నిర్వాహకులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మక్కళ్ నీది మయ్యం పార్టీ విజం సాధించకపోయినా, కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మక్కళ్‌నీది మయ్యం పార్టీ 14,74,916 ఓట్లను దక్కించుకుంది. అదే విధంగా కోవై, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధురై స్థానాల్లో లక్షకు పైగా ఓట్లను రాబట్టుకుంది. కాగా 11 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓట్ల శాతం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులకు విందునిచ్చారు. ఈ విందులో సుమారు 400 మంది పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. విజయం సాధించామనే భావించాలి. పార్టీని ప్రారంభించిన 14 నెలల్లోనే ఎన్నికలకు వెళ్లిన తాము మంచి ఫలితాలనే పొందామని అన్నారు. అయితే డెల్టా జిల్లాలు, ఉత్తరాది జిల్లాల్లో తక్కువ ఓట్లనే రాబట్టగలిగామని, కాగా ఎన్నికలు ముగిశాయి కదా, తదుపరి ఎన్నికల సమయానికే ప్రజల వద్దకు వెళ్లవచ్చు అని ఎవరూ భావించరాదన్నారు. ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాల్లో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న శాసనసభ ఎన్నికల్లో అవకాశం ఉంటుందని చెప్పారు. కఠిన చర్యలుంటాయి ఈ ఎన్నికల్లో కఠినంగా శ్రమించింది ఎవరూ? విశ్రాంతి పొందింది ఎవరూ? సరిగా పని చేయనివారెవరూ? వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. అలాంటి వారు ఇకపై కూడా ఇలానే పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదని అన్నారు. ఆ కోణం తన, పర భేదాలను చూడదని అన్నారు. మనకిప్పుడు బాధ్యత పెరిగిందన్నారు. 14 నెలలోనే ప్రజలు మనకు ఇన్ని ఓట్లు వేసి ఆదరించారని, అందుకు తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలన్నారు. లేకుంటే పార్టీ నుంచి తొలగించడానికి కూడా వెనుకాడనని అన్నారు. అందరికీ ఉంటుంది విందు ప్రధాన నిర్వాహకులకే విందా? అని ఎవరూ భావించరాదని, తాను త్వరలోనే అన్ని జిల్లాలకు పర్యటించనున్నాని, అప్పుడు సమావేశాలతో పాటు విందు ఉంటుందని కమలహాసన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను వస్తానని కమల్ హాసన్ చెప్పారు. -
పోలీస్ అవుతానని కలలో కూడా అనుకోలే..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ రోడ్లపై టూ వీలర్ నడిపే వారిలో 90 శాతం మంది హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు జనం జంకుతున్నారు. చిన్న చిన్న సంఘటనలు మినహా మత పరమైన గొడవలు లేవు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వి.బి.కమలాసన్‌రెడ్డి రెండున్నరేళ్లలో సాధించిన ఘనత ఇది. మెదక్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి... అంచెలంచెలుగా ఎదిగి.. నిబద్ధతతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఐపీఎస్ అధికారి ఆయన. శాసనసభ, పంచాయతీ, పార్లమెంటు, ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ముగించిన కమలాసన్‌రెడ్డితో ఈ వారం ‘సాక్షి’ పర్సనల్ టైం... ఉమ్మడి కుటుంబంగానే ఇప్పటికీ... మాది మెదక్ జిల్లా శంకరంపేట మండలం దరిపల్లి గ్రామం. మా నాన్న గోవిందరెడ్డి రైతుగానే గాక పండితుడిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరున్న వ్యక్తి. మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు, ముహూర్తాల కోసం నాన్న దగ్గరికి వచ్చేవారు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయారు. మేం ఐదుగురం తోబుట్టువులం. పెద్దన్న పురుషోత్తంరెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్‌గా రిటైర్డ్ అయ్యారు. రెండో అన్న జగజ్జీవన్‌రెడ్డి వ్యవసాయం. చెల్లెళ్లు ఒకరు హైదరాబాద్‌లో, ఇంకొకరు యూఎస్‌లో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. జీవనం కోసం ఎవరు ఎక్కడున్నా... అందరం దరిపల్లిలో కలుస్తుంటాం. తండ్రి సంపాదించిన 25 ఎకరాల భూమి కూడా ఉమ్మడి ఆస్తిగానే ఉంది. కమలాసన్ అంటే కమలం పైన ఆసీనులైన బ్రహ్మ అని.. మానాన్న పండితుడు అని చెప్పాను కదా. సంస్కృతం మీద మంచి పట్టుంది. ఆయన తన ముగ్గురు కొడుకులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు వచ్చేలా నామకరణం చేశారు. పెద్దన్న పేరు పురుషోత్తంరెడ్డి . పురుషోత్తముడు అంటే విష్ణువు , రెండో అన్నయ్య జగజ్జీవన్‌రెడ్డి అంటే జగత్తును నడిపించే శివుడు. కమలాసన్ అంటే కమలంపైన ఆసీనుడయ్యే బ్రహ్మ. అలా నాకు కమలాసన్‌రెడ్డి అనే పేరు. సినీయాక్టర్ కమల్‌హాసన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు సినిమా నటుడిగా తెరపైకి వచ్చాడు. అయితే నేను చదువుకునేటప్పుడు గానీ, డీఎస్పీ ట్రైనింగ్‌లో గానీ నా స్నేహితులు సినిమా యాక్టర్ పేరేనని అనుమానపడేవారు. ఇది మా నాన్న పెట్టిన పేరు. చదవు దరిపల్లి నుంచి హైదరాబాద్ వయా మహబూబ్‌నగర్ నా చదువు ఐదో తరగతి వరకు దరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మేనమామ ఊరు ధర్మవరం అనే గ్రామంలో సాగింది. మహబూబ్‌నగర్‌లోని ఎంజీరోడ్డు హైస్కూల్లో పదో తరగతి 1978–79వ బ్యాచ్. తరువాత హైదరాబాద్‌లోని బడీచౌడీలోని చైతన్య కళాశాల(ఇప్పుడు లేదు)లో ఇంటర్. సికింద్రాబాద్ సర్ధార్ పటేల్ కళాశాలలో డిగ్రీ. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేశా. 1990లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివా. యూనివర్సిటీలో చదువు నా జీవిత గమనాన్ని మార్చింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడం, ఉద్యోగాల వేట యూనివర్సిటీ నుంచే మొదలైంది. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదివాను. తెలుగు అంటే చాలా ఇష్టం. పోలీస్ అవుతానని కలలో కూడా అనుకోలే..! ఉద్యోగ అన్వేషణలో 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్–2ఎ రాస్తే, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెవలప్మెంట్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యా. మళ్లీ గ్రూప్–2ఏతోపాటు గ్రూప్–1 రాశా. గ్రూప్–2ఏలో తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. జాయిన్ కాలేదు. 1993లో గ్రూప్–1లో సెలక్ట్ అయ్యా. ఆర్డీవోకు తొలి ప్రాధాన్యత ఇచ్చా. రెండో ఆప్షన్ డీఎస్పీ. నాకొచ్చిన మార్కుల ఆధారంగా డీఎస్పీగా సెలక్ట్ అయ్యా. అయితే నేను చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ పోలీస్ శాఖలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. గ్రూప్–1లో వచ్చిన మార్కులతోనే డీఎస్పీని అయ్యా. తరువాత 2004 బ్యాచ్ ఐపీఎస్‌గా వివిధ హోదాల్లో పనిచేస్తున్నా. పోలీసులకే కాదు.. ప్రతీ ఒక్కరికి ఫిట్నెస్ తప్పనిసరి పోలీసు ఉద్యోగంలో ఫిట్నెస్ తప్పనిసరి. ఇప్పటికీ నేను వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాను. మన ఆహార అలవాట్లు, శారీరక శ్రమనే ఫిట్‌నెస్‌కు ప్రధానం. లిమిటెడ్ ఫుడ్ తిని, ప్రతిరోజు 10వేల అడుగులు నడక సాగిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతా. నేను కమిషనర్‌గా వచ్చిన తరువాత స్టాఫ్‌కు ‘పునరాకృతి’ అనే కార్యక్రమం ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇప్పించాను. నాకు ఈత అంటే ఇష్టం. చిన్నప్పుడు చెరువులు, బావుల్లో ఈత కొట్టేవాళ్లం. హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈదేవాణ్ని. చిన్ననాటి ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నారు మా వూరిలో చదువుకున్నప్పటి ఫ్రెండ్స్‌తోపాటు ఎస్ఎస్సీ, డిగ్రీ, ఎల్ఎల్బీ నాటి స్నేహితులంతా ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడాన్ని ఇష్టపడతాను. రైతు కుటుంబం నుంచి రావడం వల్ల వ్యవసాయం అన్నా, రైతులు అన్నా నాకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో వ్యవసాయ పనులు చేసేవాడిని. అన్నయ్య ఇప్పటికీ రైతుగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారు. నర్సంపేట డీఎస్పీగా చాలెంజింగ్ జాబ్ నర్సంపేట డీఎస్పీగా పనిచేసిన 1997–2000 మధ్య కాలంలో నక్సలైట్ ప్రాబల్యం అధికంగా ఉండేది. పీపుల్స్‌వార్‌కు గట్టి పట్టున్న ప్రాంతం. కొత్తగూడ మండలం కోమట్లగూడ గ్రామంలో పోలీసులు అంటేనే జనం భయపడే పరిస్థితి. శత్రువులుగానే చూసేవారు. ఈ పరిస్థితుల్లో కోమట్లగూడలో భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించాను. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ గ్రామ ప్రజలతో మమేకమై పోలీసులు శ్రేయోభిలాషులు అనే అభిప్రాయాన్ని కలిగించాను. 1998లో నర్సంపేటలో మూడు రోజులపాటు డివిజన్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయించాను. కోకో, కబడ్డీ, వాలీబాల్ గేమ్స్‌ను పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం మరిచిపోని సంఘటన. 300 టీమ్స్ పాల్గొన్న ఈ స్పోర్ట్స్ మీట్‌ను చూసేందుకు 15వేల మంది తరలివచ్చారు. చివరి రోజు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయించాం. ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న దృక్పథం మారింది. యూత్‌ను దగ్గరికి తీశాం. శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతగా అంటే అప్పట్లో పేరున్న ముగ్గురు నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతే వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస రేగింది. నర్సంపేటలో చిన్న సంఘటన కూడా చోటుచేసుకోలేదు. అలాగే నర్సంపేట డివిజన్లో గంజాయి సాగును అరికట్టడం, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా కార్డన్ సెర్చ్‌కు అంకురార్పణ చేసి, ప్రజల్లో ధైర్యం కల్గించడం... కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా సంతృప్తి కరీంనగర్ ప్రజలు అత్యంత చైతన్యవంతులు. మంచి చెడులు వివరించి, ఏదైనా మార్పు తీసుకువస్తే తూచా తప్పకుండా పాటిస్తారు. కరీంనగర్లో టూ వీలర్ హెల్మెట్ డ్రైవింగ్ గురించి వివరిస్తే , 90 శాతానికి పైగా సక్సెస్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలావరకు తగ్గాయి. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు. నేను కరీంనగర్లో చేపట్టిన ప్రతీ చర్యకు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి పూర్తి మద్దతు లభించింది. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోం అనే సందేశాన్ని పంపించడంతో ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు. మత పరమైన గొడవలు, నేరాలు చాలా వరకు తగ్గాయి. చిన్న చిన్న సంఘటనలు జరిగినా, ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవడంతో అది సాధ్యమైంది. అడ్వకేట్‌గా, ఇంటి ఇల్లాలిగా మా రాధిక సక్సెస్ 1993లో డీఎస్పీగా ఉద్యోగంలో చేరిన తరువాత రాధికతో వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. వాళ్లది హైదరాబాద్ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేసి హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసేవారు. స్టాండింగ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. హైదరాబాద్ ఈపీఎఫ్ లీగల్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు రాజశేఖర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, చెన్నైలో జాబ్ చేస్తున్నారు. పాప దీపిక హైదరాబాద్ డెక్కన్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. రాధిక హైకోర్టు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దింది. నేను పోలీస్ ఆఫీసర్‌గా బిజీగా ఉన్నప్పటికీ, పిల్లలకు అన్నీ తానై చూసుకొంది. పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా హ్యాపీ. -
గాడ్సేకి అటూ ఇటూ
-
కమల్‌హసన్‌పై కేసు నమోదు చేసిన కరూర్ జిల్లా పోలీసులు
-
వృథా చర్చలేల?!
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేద’ని కూడా ఆయన సెలవిచ్చారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఏదో ప్రయోజనం, పర మార్థం లేకుండా ఏదీ మాట్లాడరు. కమల్ కాకలు తీరిన రాజకీయ నాయకుడు కాకపోవచ్చు. ఈమధ్యకాలంలోనే ఆయన పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తి ఉండొచ్చు. కానీ ఆయనకు రాజకీయాలు బాగానే ఒంటబట్టాయని ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అయితే వాటికి అవస రమైన లౌక్యం ఆయనకు ఇంకా పూర్తిగా పట్టుబడినట్టు లేదు. అందుకే ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి’ ఇలా అనడం లేదని తనకుతానే సంశయాన్ని రేకెత్తించారు. సహజంగానే కమల్‌హాసన్ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు వెలువడ్డాయి. బీజేపీ ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తే, ఢిల్లీ హైకోర్టులో ఆ పార్టీకి చెందిన నాయకుడొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వేరేచోట ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన చరిత్రలో ఒక్కసారైనా ఉందా?’ అని అడగటాన్ని దృష్టిలో పెట్టుకుని కమల్ ఈ మాట అన్నారు. మాకు ఏ మతమూ లేదని చెప్పుకునే వారి సంఖ్య ప్రపంచంలో అత్యల్పం గనుక పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మత విశ్వాసాన్ని అనుసరించే కుటుంబాల్లోనే జన్మిస్తారు. ఎదిగాక ఆ విశ్వాసా లను వారు అనుసరించవచ్చు. నిరాకరించవచ్చు. ఆ విశ్వాసాలను భక్తిశ్రద్ధలతో అనుసరిస్తున్నా మని అనుకుంటూ అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడేవారు గతంలోనూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. అయితే అలాంటివారిని వారు పుట్టిన మతంతో గుర్తించడం అసమంజసం. ఉగ్రవాదులు తమది ఫలానా మతం అని చెబుతుండవచ్చు. ఆ మతాన్ని ఉద్ధరించడానికే తాము ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నట్టు వారు అడపా దడపా ప్రకటనలు చేస్తుండవచ్చు. కానీ వారిని నెత్తిన పెట్టు కుని, సొంతం చేసుకోవాలని ఏ మతమూ తహతహలాడిన దాఖలా లేదు. పైగా వారి చర్యలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమని అనేక సందర్భాల్లో ఎందరో మతాచార్యులు చెప్పారు. కనుక ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన ఉందా’ అని మోదీ అడగడమైనా, అందుకు కమల్ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు’ అని చెప్పడమైనా అసమంజసం. ఎన్నికల్లో చర్చించడానికి బోలెడు అంశాలున్నాయి. అందరూ సమష్టిగా కృషి చేస్తే తప్ప పరిష్కారంకాని జటి లమైన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఒక అశాస్త్రీయ భావనను ఈడ్చుకొచ్చి దానిచుట్టూ చర్చ జరిగేలా చేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదు. మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సే గురించి, అతడు ఆ చర్యకు పాల్పడ్డం వెనకగల కారణాల గురించి ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ అనే గ్రంథంలో అతడి సోదరుడు గోపాల్ గాడ్సే రాశాడు. ఆ పుస్తకం చివర నాథూరాం వీలునామాను అనుబంధంగా ఇచ్చారు. దాని ప్రకారం గాంధీజీపై తనకెంతో గౌరవాభిమానాలున్నా ఆయన ముస్లిం అనుకూల వైఖరి తనకు ఆగ్రహం తెప్పించిందని నాథూరాం చెప్పడాన్ని చూడొచ్చు. దేశ విభజనకు కారణం కావడమేకాక, ఇలా ముస్లింలపట్ల సానుకూల దృక్పథం ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని కూడా అందులో చెప్పాడు. గాంధీజీపై ఇలాంటి అభిప్రాయాలు నాథూరాంలో ఏర్పడటానికి కారణం అతను పుట్టిన మతం కాదు. ఆ మత విశ్వాసాలు కాదు. ఆ పేరిట వెలసిన సంస్థల్లో అతను చురుగ్గా పనిచేశాడు. భిన్న అంశాలపై ఆ సంస్థల వైఖరులు, ఆచరణ అతన్ని రూపొందించాయి. ఆ ఘటన జరిగేనాటికి నాథూరాం చర్యను ఉగ్రవాదంగా పరిగణించాలన్న స్పృహ ఉండకపోవచ్చు. కానీ ఇప్పటి అర్ధంతో అది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అవుతుందనడంలో సందేహం లేదు. అతగాడు హిందువుల కోసం ఏదో చేస్తున్నానని అనుకునే ఆ పని చేసినా వారెవరూ అతన్ని సొంతం చేసుకోలేదు. నెత్తిన పెట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు జోరుగా చెలరేగడం మొదలుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. అంతకుముందు ఉగ్రవాద ఘటనలున్నా అవి చెదురుమదురుగా జరిగినవే. 2001లో అమెరికాలో అల్‌కాయిదా నేతృత్వంలో సాగిన మారణకాండ, పెను విధ్వంసం తర్వాత నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక పద్ధతి ప్రకారం ఉగ్రవాదులు పంజా విసురుతూనే ఉన్నారు. పలు ఇస్లామిక్ దేశాల్లో అమెరికా, దాని మిత్ర రాజ్యాలు రకరకాల పేర్లతో సాగించిన, ఇప్పటికీ సాగిస్తున్న దౌష్ట్యం అల్‌కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల పుట్టుకకు కారణం. ఆ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఆయా దేశాల్లో విధ్వంసానికి పాల్పడుతూ, అందుకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయి. కానీ ఇంతవరకూ ఉగ్రవాదికి, ఉగ్రవాదానికి నిర్దిష్టమైన, ప్రపంచంలో అందరికీ ఆమోదయోగ్య మైన నిర్వచనాలు లేవు. అలాగే మతానికీ, ఉగ్రవాదానికీ మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నదని తేల్చి చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. 1980–2003 మధ్య జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 315 ఘటనలు తీసుకుని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ పాపే ఈ దాడులకూ, ఇస్లామిక్ మతతత్వానికి మధ్య సంబంధం లేదని వివరించారు. అమెరికా రచయిత మైకేల్ షిహాన్ సైతం ఇలాగే చెప్పారు. ఉగ్రవాద బృందాలన్నీ తమ రాజకీయ లక్ష్యాలను కప్పెట్టి, ప్రజామోదం పొంద డం కోసం మతాన్ని, సంస్కృతిని అడ్డుపెట్టుకుంటాయన్నారు. ఉగ్రవాదులు ఏ పేరు చెప్పుకున్నా వారు మొత్తం మానవాళికే శత్రువులు. వారిని మతకోణంలో చూసి, దాని ఆధారంగా వారిపై అభి మానాన్ని లేదా శత్రుత్వాన్ని ఏర్పరచుకోవటం అసమంజసం. మన రాజకీయ నాయకులు ఈ సత్యాన్ని గ్రహించి వ్యర్థమైన చర్చలకు ఇకనైనా ముగింపు పలకాలి. -
ట్రెండింగ్‌లో రజనీ అభిమానుల వెబ్సైట్
తమిళసినిమా: రజనీకాంత్ ఏ విషయంలోనైనా ప్రత్యేకమే. ఈ విషయం తన అభిమానుల ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది. విషయం ఏమిటంటే రజనీకాంత్ నటుడుగా సూపర్‌స్టార్‌గా గత నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఇప్పుడు సౌత్ ఇండియన్‌గా సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. అలాంటి నటుడిని ఆయన అభిమానులు సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన అప్పటి నుంచి ఇదిగో, అదిగో అంటూ నాన్చుతూ వస్తున్నారేగానీ, రాజకీయాల్లోకి రావడం లేదు. దీంతో ఆయన అభిమానులు చాలా అసంతృప్తికి గురయ్యారు. అలాంటి సమయంలో గత ఏడాది రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నా, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దదాన్ని పూర్తి చేస్తాను. ఎంజీఆర్ పాలనను తీసుకొస్తాను అంటూ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతే ఆయన అభిమానుల్లో ఆనందానికి అదుల్లేకుండా పోయాయి. రజనీ కూడా తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. జిల్లాల వారీగా సంఘ నిర్వాహకులను నియమించారు. దీంతో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం తథ్యం అని ఆయన అభిమానులు సంబరపడ్డారు. రెట్టించిన ఉత్సాహంతో రజనీ ప్రజా సంఘం తరఫున సేవలకు ఉపక్రమించారు. పార్టీని ప్రారంభించి పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారని అందరూ భావించారు. అయితే వారు ఊహించినట్లు జరగలేదు. రజనీకాంత్ 2021లో శాసన సభ ఎన్నికల్లో చూసుకుందాం అని ప్రకటించి ఆయన కొత్త చిత్రాల్లో బిజీ అయిపోయారు. ఇది ఆయన అభిమానులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఇష్టమైన వారికి ఓటు వేశారు. కమల్‌కు ఓట్లు రజనీకాంత్ కంటే వెనుక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన సహనటుడు కమలహాసన్ వెనువెంటనే పార్టీని ప్రారంభించడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిపోయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కమలహాసన్, మరో నట, దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్‌లు అధిక ఓట్లను పొందగలిగారని, ఎక్కువ స్థానాలను దక్కించుకోబోతున్నారని సర్వేలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుండటంతో రజనీకాంత్ అభిమానుల కంటికి కునుకు పట్టనీయడం లేదు. హెస్టేక్ వెబ్సైట్ దీంతో రజనీకాంత్ అభిమానులు తదుపరి ఓటు రజనీకే అంటూ హెస్టేక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. గురువారం రాత్రి వరకూ ఈ హెస్టేక్ వెబ్సైట్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అందులో ఈ సారి ఓటు వేశాం. తదుపరి ఓటు కచ్చితంగా రజనీకాంత్‌కే అంటూ ఆయన అభిమానులు ఆ వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ అనూహ్యంగా ఇండియా స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం వారిని ఆనందంలో ముంచెత్తింది. -
రెండో దశ పోలింగ్‌లో ఓటు వేస్తున్న ప్రముఖులు
-
‘శ్రుతి’ పెంచిన ప్రచారం
పెరంబూరు: నటుడు కమల్‌హాసన్ మక్కళ్‌నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తన అభ్యర్థును గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. రాజకీయాల్లోకి తన వారసులెవరూ రారని ముందుగానే ప్రకటించారు. ఇటీవల తన తండ్రిని చూస్తుంటే తనకూ రాజకీయాలపై ఆసక్తి కలుగుతోందని ఆయన కూతురు, ప్రముఖ కథానాయకి శ్రుతిహాసన్ ఒక భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసిన శ్రుతి.. ఇప్పుడు తండ్రి రాజకీయ జీవితానికి ఏదో విధంగా తోడ్పడాలని భావించినట్లున్నారు. ట్విట్టర్ ద్వారా తన తండ్రికి మద్దతుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నటి శ్రుతిహాసన్ శుక్రవారం రాత్రి ట్విట్టర్లో పేర్కొంటూ నాన్నను చూసి గర్వపడుతున్నాను. భావితరాన్ని మెరుగుపరచడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ఉత్తమమైనవన్నారు. ఆయన చర్యల్లో అది స్పష్టంగా తెలుస్తోందన్నారు. నాన్న పార్టీ అభ్యర్థులందరూ టార్చలైట్ గుర్తు ద్వారా వెలుగులోకి వస్తున్నారన్నారు. వారందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారని శ్రుతి పేర్కొన్నారు. అదే విధంగా ఆమె అభిమానుల భావాలను శ్రుతి ట్విట్టర్లో పేర్కొంటూ తండ్రికి ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ సంచలన నటినీ రాజకీయనాయకురాలిగా చూడవచ్చునేమో! -
పొత్తుల కోసం కమల్ కసరత్తు..!
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సైతం కొత్త కూటమి కసరత్తుల మీద దృష్టి పెట్టారు. ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. కమల్‌హాసన్ తనది ఒంటరి పయనం అని ఇప్పటికే స్పష్టం చేశారు. 40 స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించవచ్చన్న చర్చ కూడా ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో కమల్ సైతం పొత్తు కసరత్తుల మీద దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తన నేతృత్వంలో కాకుండా, ఏకాభిప్రాయం, తమిళనాడు సంక్షేమం, అభివృద్ధి మీద చిత్తశుద్ధి, మార్పును ఆశించే వాళ్లు తనతో కలిసి వస్తే కూటమిగా ముందుకు సాగడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా కమల్ స్పందించడం గమనార్హం. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మూడో కూటమి కాదని, ఏకాభిప్రాయం కల్గిన వాళ్లు, తమిళనాడు సంక్షేమాన్ని ఆకాంక్షించే వాళ్లతో కలిసి పనిచేయడానికి రెడీగానే ఉన్నామన్నారు. ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు తమిళనాట ఉన్నాయని, వాళ్లతో చర్చకు సిద్ధమే అన్నట్టుగా çకమల్ స్పందించారు. ఈ వ్యాఖ్యలతో పచ్చముత్తు పారివేందర్ నేతృత్వంలోనే ఐజేకేతో పాటుగా మరికొన్ని పార్టీల నేతలు కమల్‌తో పొత్తు చర్చల్లో ఉన్నట్టు సమాచారం. కమల్‌తో ఓ ప్రైవేట్ హోటల్లో పచ్చముత్తు పారివేందర్ భేటీ అయినట్టుగా ప్రచారం ఊపందుకుంది. డీఎంకే, అన్నాడీఎంకేలు విస్మరించిన పార్టీలు కమల్‌హాసన్ పక్షాన చేరవచ్చన్న చర్చ జోరందుకుంది. ఇక, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్‌తో కలిసి పనిచేయడానికి ఎస్డీపీఐ సిద్ధం కావడం విశేషం. -
రజనీ మద్దతు ఉంటుందని నమ్ముతున్నా
పెరంబూరు: నటుడు రజనీకాంత్ మద్దతు తనకుంటుందని నమ్ముతున్నానని నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ అన్నారు. ఈయన తిరుచ్చి నుంచి శుక్రవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను సినిమా డైలాగులు చెబుతున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ విమర్శిస్తున్నారని అది ఆమె భావన అని అన్నారు. తమ పార్టీకి గ్లామర్ అవసరం లేదని, నిజాయితీ, భావోద్రేకాలే ముఖ్యం అని, ఆ దిశగానే తాము ముందుకు వెళుతున్నామని అన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు అందుకు తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. అలా లక్ష్యం అంటూ ఏదేదో చెప్పుకునేవారు ఇంకా వాటిని పాఠించడం లేదన్నారు. తాను చేయగలిగిందీ, చేయబోయేది మాత్రమే చెబుతానని అన్నారు. ఇతర పార్టీల వారు తమ బలాన్ని చెప్పుకోవడానికే కూటమిలను ఏర్పరచుకుంటున్నారన్నారు. తమకు ప్రజలే బలం ఉందన్నారు. ప్రజలతోనే తమ కూటమి అని ఆ ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. ఎవరితో కలిస్తే నోట్లు వస్తాయి, ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఓట్లు పడతాయన్న ఆలోచనతో కాకుండా ప్రజల మంచి కోసమే తమ పార్టీ అన్న విషయం వారికి అర్థం అవుతోందన్నారు. మూడో కూటమి ఏర్పాటు చేస్తానని అనలేదు తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు చేస్తామని తానెప్పుడూ అనలేదన్నారు. తాము ఒక కూటమి అనే చెబుతున్నానన్నారు. దాన్ని మీరు 3వ కూటమి అని అర్థం చేసుకున్నట్టున్నారని పేర్కొన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని నమ్ముతున్నామని, అందుకే ఇప్పటికీ ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని అన్నారు. అయితే తమతో నిజాయితీపరులు చేరవచ్చునని పిలుపునిచ్చారు. ఇందులో స్వలాభమో, యుక్తో లేదని అన్నారు. రజనీకాంత్, సీమాన్ వంటి వారి మద్దతు తమకు ఉంటుందని నమ్ముతున్నానని అన్నారు. తమ పార్టీకు చెందిన పోటీదారులకు దరఖాస్తులను శనివారం విడుదల చేయనున్నట్లు కమల్‌హాసన్ వెల్లడించారు. ప్రధాని రావాలి ప్రధాని రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తారా? అని అడుగుతున్నారని, నిజానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి రాకపోతే ప్రశ్నించాలి గాని, వస్తే వ్యతిరేకించడం ఎందుకన్నారు. ప్రధాని రాష్ట్రానికి రావాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఎందుకు రాలేదని అందరూ ప్రశ్నించాలని కమల్ అన్నారు. -
కశ్మీర్ సమస్యపై కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
‘భారతీయుడు-2’ షూటింగ్ వాయిదా!
‘2.ఓ’లాంటి గ్రాఫిక్స్ మాయాజాలం తరువాత శంకర్ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందోప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ను శంకర్ రూపొందిస్తున్నారు. పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ చిత్రయూనిట్.. అకస్మాత్తుగా షూటింగ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. అక్కడ వేసిన సెట్లు శంకర్‌కు సంతృప్తినివ్వలేదని, మళ్లీ సెట్‌ను రీక్రియేట్చేసేవరకు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును ఏ నాయకుడు బాగుచేయలేడని, తమిళనాట అత్యవసరంగా రాజకీయ ప్రక్షాళన జరగాలని అన్నారు. తమిళనాట గ్యోబాక్ నినాదాలు ఇవ్వడంపై ప్రధాని మోదీ సమీక్షించుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి... పార్టీ స్థాపించిన కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘కమలహాసన్ హిందువుల ద్రోహి’
పెరంబూరు: కమలహాసన్ స్థాపించిన మక్కళ్ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీ అని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఆరోపించారు. కేరళలోని శబరిమలలో అయ్యప్ప దేవాలయానికి వయసు బేధం చూడకుండా అందరు స్త్రీలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆ తీర్పును అమలు పరస్తూ మహిళలను అయ్యప్పస్వామి ఆలయ దర్శనానికి చర్యలు తీసుకుంటోంది. అయితే అక్కడి అయ్యప్ప భక్తుల సంఘాలతో పాటు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందుకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పట్టించుకోవడం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోది విమర్శలు చేశారు. ఇదే విధంగా తమిళనాడులోనూ బీజేపీ నాయకులు, ఇతర హిందు సంఘాలు శబరిమల వ్యవహారంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ స్పంధిస్తూ శబరిమల వ్యవహారంలో కేరళ ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని పేర్కొన్నారు. దీంతో కమలహాసన్ వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారం తన ట్విట్టర్లో పేర్కొంటూ శబరిమల వ్యవహారంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదట, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలనికమలహాసన్ అంటున్నారు. అలాగైతే 2017లో ప్రవం చర్చ్ వ్యవహారంలో న్యాయస్థానం తీర్పును పినరాయి విజయన్ ప్రభుత్వం ఎందుకు అమలు పరచలేదు. ఈ విషయం గురించి ప్రశ్నించే ధైర్యం కమలహాసన్‌కు ఉందా మొత్తం మీద మక్కళ్ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీ అని హెచ్.రాజా తీవ్రంగా విమర్శించారు. -
కొరియన్ భామతో కమల్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఇండియన్-2 చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘2.ఓ’ తరువాత శంకర్ రూపొందిస్తున్న మూవీ కావడం, గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడిగా అందాల చందమామ కాజల్ నటించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మరో భామ కూడా ఉండే అవకాశముందనీ, ఈ పాత్ర కోసం కొరియన్ స్టార్ బేయ్ సుజీని తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రతో చాలానే యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. -
పోటీకి సై అంటున్న లోకనాయకుడు
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని మక్కల్ నీధి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. రాజకీయ రంగులు మార్చే పార్టీలతో జట్టు కట్టమని, తమిళనాడు అభివృద్దే తమ లక్ష్యమని తెలిపారు. 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు నిర్ణయాలను పూర్తిగా కమల్‌కు ఇస్తూ మక్కల్ నీధి మయ్యం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నామని, తమతో కలిసి వచ్చే పక్షాలను స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా లోకనాయకుడిగా పేరొందిన కమల్ హాసన్ ఈఏడాది ఫిబ్రవరిలో సొంతపార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. -
కాజల్ ఫిక్స్.. న్యూ లుక్‌లోకి మారడమే తరువాయి
శంకర్ అద్భుత సృష్టిలో కాజల్ భాగం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ‘2.ఓ’ను రిలీజ్ చేసి రికార్డుల దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ఇప్పటికే శంకర్.. తన తదుపరి ప్రాజెక్ట్ ఇండియన్-2పైన దృష్టిపెట్టేశాడు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రషూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. అయితే ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కు జోడిగా కాజల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారనే వార్త చక్కర్లు కొట్టన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే వార్త నిజమని తెలుస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఇండియన్-2లో కాజల్హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ పాత్ర కోసం కొత్త లుక్‌ను ట్రై చేయనున్నట్లు, దీనికోసం అమెరికానుంచి ఓ బృందం రానున్నట్లు కాజల్ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. . @MsKajalAggarwal will play the main female lead in #Ulaganayagan @ikamalhaasan - Dir @shankarshanmugh 's upcoming Magnum Opus - #Indian2 pic.twitter.com/gUeHDHh0Mg — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 -
‘ఇండియన్-2’ మొదలైంది..!
ఇండియన్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కలిస్తే క్రియేట్ అయ్యే సెన్సేషన్‌కు తరుణం ఆసన్నమైంది. గతంలో ఇండియన్(భారతీయుడు)తో సంచలనం సృష్టించిన వీరి కాంబినేషన్.. మళ్లీ ఇన్నాళ్లకు సీక్వెల్ రూపంలో ప్రకంపనలు సృష్టించేందకు రెడీ అయింది. ఇప్పటికే శంకర్ ‘2.ఓ’కు సంబంధించిన పనులను పూర్తి చేశారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ‘ఇండియన్2’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ‘ఇండియన్2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. Set work for #Indian2 started.. pic.twitter.com/clKLenzzDb — Ramesh Bala (@rameshlaus) November 12, 2018 -
శబరిమల వ్యవహారంపై చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు, పెరంబూరు: శబరిమల ఆలయ ప్రవేశంపై నటుడు చారుహాసన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో రగులుతున్న అంశాల్లో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సమస్య ఒకటి. అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వివాదంగా మారింది. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మహిళలు పలువురు అయ్యప్ప సన్నిధికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. అయితే అక్కడి భక్తులు మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నటు డు కమలహాసన్ తానెప్పుడూ అయ్యప్ప ఆలయాన్ని దర్శించలేదని, కాబట్టి తెలియని విషయం గురించి ఎలా స్పందించనని తెలివిగా తప్పించుకున్నారు. అయితే ఆయన సోదరుడు చారుహాసన్ మాత్రం మహిళలకు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. మహిళలు అయ్యప్ప కొండకు వెళ్లడం అనేది పురుషుల మరుగుదొడ్డిని మహిళలు ఉపయోగించుకోవడం లాంటిదని చారుహాసన్ పేర్కొన్నారు. -
మీటూ ఉద్యమంపై కమల్ ఏమన్నారంటే..
చెన్నై : గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా, సినిమా ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు తమల్ని ఎలా లైంగికంగా వేధించారో చెబుతూ మహిళలు మందుకు వస్తున్నారు. దక్షిణాది సింగర్‌గా ఎక్కువగా ఫేమస్ అయినన చిన్మయి శ్రీపాద, ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనని హోటల్ గదికి వచ్చి కోపరేట్ చేయమన్నాడని, ఆయన తన స్నేహితురాలిని సైతం వేదించాడని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్మయి వెలుగులోకి తీసుకొచ్చిన వైరాముత్తు చీకటి కోణంపై చాలా మంది కోల్‌వుడ్ స్టార్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాజాగా మీడియా సమావేశంలో, కమల్ హాసన్ కూడా చిన్మయి-వైరాముత్తు వివాదం, మీటూ ఉద్యమంపై స్పందించారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిజాయితీగా, న్యాయంగా చెప్పాలని కమల్ అన్నారు. మహిళలు నిజాయితీగా జరిగిన ఇబ్బందులు చెబితే, అర్థవంతమైన న్యాయం దొరుకుతుందని చెప్పారు. మీటూపై దానికి సంబందించిన బాధితులు మాత్రమే అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉందని, ఇందులో సంబంధం లేని వ్యక్తులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేయటం వల్ల ఇది వివాదానికి దారి తీస్తుందని అన్నారు. మీటూ ఉద్యమాన్ని తాను స్వాగతిస్తున్నానని, దీనిని స్వాగతించే మార్పుగా చూస్తున్నానని పేర్కొన్నారు. కాగా, నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత మహిళా జర్నలిస్ట్‌లు పని ప్రదేశాల్లో, తమ ఉన్నతస్థాయి అధికారులతో ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలను ట్విటర్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. గాయని చిన్మయి సైతం తనపై వేధింపులకు పాల్పడ్డ వారి పేర్లను ట్విటర్ ద్వారా బహిర్గతం చేస్తూ బాంబు పేల్చారు. -
బిగ్‌బాస్: ప్రపోజ్ చేసిన కంటెస్టెంట్!
చెన్నై: తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ సామ్రాట్-తేజస్వీ, తనీష్-దీప్తి సునయనల బంధం స్నేహమా లేక అంతకు మించా అనే విషయం అర్థం కాలేదు. వాళ్లేమో స్నేహమే అంతకు మించి ఏమిలేదని చెబుతున్నారు. కానీ వారి ప్రవర్తన అలా అనిపించడం లేదు. ఇక తమిళ బిగ్‌బాస్‌లో యషికా-మెహతాల మధ్య బంధం మాత్రం ఈ రెండు జోడిలను మించింది. శుక్రవారం ఎపిసోడ్లో హౌస్‌కు అతిథులుగా వచ్చిన తొలి సీజన్ కంటెస్టెంట్స్ హరీష్ కల్యాణ్, రైజా విల్సన్‌లు వారి బంధంపై ఓ క్లారిటీ తీసుకొచ్చారు. వారి డెబ్యూ చిత్రం ‘ప్యార్ ప్రేమా కాదల్’ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌మేట్స్‌ను యషికా-మెహతాల బంధం స్నేహానికి మించి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా అని ప్రశ్నించారు. దీనికి కంటెస్టెంట్స్ అంతా అంగీకరించగా.. మెహతా మాత్రం తప్పుబట్టాడు. దీంతో ఒక్కసారిగా యషికా గుండె బద్దలైంది. ఆరోజంతా ఆమె ఏడుస్తూ బాధపడింది. ఇక ఈ వ్యవహారంపై హోస్ట్ కమల్ హాసన్ శనివారం ఆరాతీశాడు. తొలుత మెహతాను ప్రశ్నించగా.. తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని, తాను ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని తెలిపాడు. ఆమె బయట నాకోసం వేచిచూస్తోందని ఆమెను బాధపెట్టే పని తను చేయనని సమాధానమిచ్చాడు. ఇక 19 ఏళ్ల యషిక మాట్లాడుతూ.. 50 రోజులుగా కలిసి ఉండటంతో అతని ప్రేమలో పడిపోయానని, కానీ అతని పరిస్థితి అర్థం చేసుకున్నానని తెలిపింది. అతని పరిస్థితిని గౌరవిస్తానని, కానీ తన వైఖరిని మాత్రం మార్చుకోలేనని పేర్కొంది. ఆమె నిజాయితికి కమల్ మురిసిపోయి ప్రశంసించాడు. ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక గత సీజన్లో ఓవియా సైతం ఇలానే ప్రేమ వ్యవహారాలతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ కూటమిలోకి కమల్ పార్టీ?
సాక్షి, చెన్నై: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. సోమవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంకాగా, కమల్ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
బిగ్‌బాస్ : అమిత్‌కు బంపర్ ఆఫర్!
లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చేసరికి హౌజ్‌మేట్స్ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయింది. ఈ యూనివర్సల్ హీరో తమ ముందు దర్శనమిచ్చేసరికి ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్ హాసన్ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు. విశ్వరూపం2 ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానంటూ కమల్ హాసన్ హౌజ్‌మేట్స్‌కు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్లే చేయించారు. అనంతరం సినిమాకు పనిచేసిన మరికొంతమందిని కూడా హౌజ్‌లోకి విచ్చేశారు. హీరోయిన్ పూజా కూడా వచ్చారు. ఇంటి సభ్యులందరికి కమల్ హాసన్ విశ్వరూపం2 టీషర్ట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన టీమ్ సభ్యులైన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రఫర్ దత్, హీరోయిన్ పూజలను పరిచయం చేశారు. అమిత్ తనకిష్టమైన ట్యూన్‌ను కమల్‌కు వినిపించాడు. రోల్‌రైడా తన స్టైల్లో ర్యాప్ పాడి హోరెత్తించాడు. గీతా మాధురి కూడా కమల్ హిట్ సాంగ్‌ను పాడి వినిపించారు. కౌశల్ కోరిక మేరకు.. భారతీయుడు సినిమాలోని ‘అదిరేటి డ్రేస్సు’ సాంగ్‌ను ఇంటి సభ్యులు ఆలపిస్తుండగా.. తనదైన శైలీలో కమల్ హాసన్ నడుస్తూ ఇంటి సభ్యులను ఆనందపరిచారు. బిగ్‌బాస్ ప్రోగ్రామ్ గురించి కమల్ వ్యాఖ్యానిస్తూ.. కొంతమంది ఈ ప్రొగ్రామ్‌పై విమర్శలు చేస్తున్నారంటూ.. బయట జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుందని.. ఇందులో తప్పేం లేదంటూ.. మరికొన్ని విషయాలను ఇంటి సభ్యులతో పంచుకున్నారు. అమిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కమల్ బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్ అందరిలోంచి ఒక్కరికి మాత్రం.. ఓ రెండు వారాలు ఎలిమినేషన్ కాకుండా ఉంటే పవర్‌ను ఇస్తానని కమల్ హాసన్ చెప్పారు. బాగా ఫేమస్, కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్‌కు మాత్రం ఆ చాన్స్ ఇవ్వనని, ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వారికే ఇస్తానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం సరైనది కావచ్చు కాకపోవచ్చు అంటూ.. ఆ చాన్స్‌ను అమిత్‌కు ఇచ్చేశారు కమల్. దీంతో అమిత్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ చాన్స్‌తో అమిత్ ఓ రెండు వారాలు సేఫ్ అయ్యాడు. ఇలా శుక్రవారం కార్యక్రమం కమల్ హాసన్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌజ్ అంతా కోలాహలంగా మారింది. -
జూనియర్ హోస్ట్‌తో సీనియర్ హోస్ట్
సాక్షి, హైదరాబాద్ : న్యాచురల్ స్టార్, బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘ఓ అభిమాని తన అభిమాన హీరోను కలుసుకున్నాడు.. జూనియర్ హోస్ట్.. సీనియర్ హోస్ట్‌ను కలిసాడు. అవును ఇది జరిగింది’ అనే క్యాప్షన్‌తో కమల్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. విశ్వరూపం 2 ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఎన్నో ఇంటర్వ్యూల్లో తన అభిమాన హీరో అని చెప్పుకున్న నాని.. తను హోస్ట్ చేసే షోకు అతిథిగా రావడంతో పులికించిపోయాడు. నిజానికి నాని శని, ఆదివారాల్లోని కనిపిస్తాడు. కానీ లోకనాయకుడి కోసం నాని ప్రత్యేకంగా బిగ్‌బాస్ సెట్‌కు హాజరయినట్లు తెలుస్తోంది. ప్రోమోలో సైతం లోకనాయకుడు.. భారతీయుడు హౌస్‌లోకి వస్తున్నాడని ఇంటి సభ్యులకు తెలియజేశాడు. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Fan meets his Favourite actor . Junior Host meets senior Host . Yes ... This happened :)) pic.twitter.com/p5I6SF7tRf — Nani (@NameisNani) August 3, 2018 -
‘యూనివర్సల్ హీరో’పై రానా కామెంట్
లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం2’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. నేడు జరుగనున్న ఆడియో వేడుకలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేశారు. కమల్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న విశ్వరూపం2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు కమల్ హాసన్. దగ్గుబాటి రానా కమల్‌హాసన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఏడాదిలో నేర్చుకునేది ఒక్కగంటలోనే నేర్చుకున్నారంటే.. మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లేనంటూ.. కమల్నుద్దేశించి రానా ట్వీట్ చేశాడు. కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం2 ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిచారు. When you learnt in an hour more than what you’ve learnt in a year. That means you have met with Legend himself @ikamalhaasan pic.twitter.com/Ym65XsaZTH — Rana Daggubati (@RanaDaggubati) August 2, 2018 -
అమెరికాలో పంద్రాగస్టు వేడుకలకు కమల్
తమిళసినిమా: పంద్రాగస్ట్ వేడుక దగ్గర పడుతోంది. ఎందరో పోరాటయోధుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15న యావత్ భారతదేశంలో అశోక చక్రాన్ని ఇముడ్చుకున్న మువ్వన్నెల పతాకం రెపరెపలాడే తరుణం దగ్గరపడింది. ఈ వేడుకలు భారతదేశంలోనే కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూ డా జరగుతుంటాయి. వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొం టుంటారు. ఈ ఏడాది అమెరికాలోని న్యూ యార్క్‌లో జరగనున్న వేడుకల్లో విశ్వనటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్, ఆయన కూతరు శ్రుతీ హాసన్ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్‌హాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొంటున్నారు. మక్కళ్ నీ ది మయ్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నటి శ్రుతి హాసన్ చిన్న గ్యాప్ తరువాత హిందీ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. -
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్!
ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఆ కిక్కే వేరు. అది కూడా ఇండియా వైడ్‌గా పాపులారిటీ ఉన్న స్టార్స్ అయితే అది వైరల్ కావల్సిందే. ప్రస్తుతం ఇలాంటి ఓ పిక్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. బాలీవుడ్ కండలవీరుడు,సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ల పిక్స్ నెట్టింట్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోన్నాయి. కమల్ సినిమా విశ్వరూపం వివాదాల మధ్య విడుదలై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు విశ్వరూపం2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. హాలివుడ్ స్థాయిలో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను కమల్ ప్రారంభించాడు. బాలీవుడ్లో రియాల్టీ షోలు ఫేమస్. వాటికి హోస్ట్‌గా సల్మాన్ మరింత ఫేమస్. సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘దస్కాదమ్’ షోలో కమల్ ప్రత్యక్షమయ్యారు. ఈ మూవీ విశేషాలను కమల్ పంచుకున్నట్లు సమాచారం. ఈ షో జూలై 22న ప్రసారం కానుంది. -
ఆ అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడే..
తమిళసినిమా: నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను నటి గాయత్రీ రఘురాం తీవ్రంగా ఖండించింది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో వ్యవహారం రోజూ ఏదో ఒక గొడవకు తెరలేపుతోంది. బిగ్‌బాస్ గేమ్ షోకు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోని మహిళలకు క్లాస్ తీసుకున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై నటి గాయత్రీ రఘురాం కమల్‌ను విమర్శించింది. మహిళలు సిగరెట్లు కాల్చడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాల గురించి కమలహాసన్ స్పందిస్తూ, మగవాళ్లు చేసే పనులు మహిళలు చేయకూడదని, మనకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నటి గాయత్రీ రఘురాం తప్పు పట్టింది. దీని గురించి ఆమె బుధవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ మహిళలు సిగరెట్లు కాల్చడం వల్ల మగవారి కంటే గొప్పవారిగా వారు భావించడం లేదని, మగవారి లానే మహిళలు మానసిక ఒత్తిడి, మనోవేదన కారణంగానే సిగరెట్లు కాలుస్తున్నారని, అయితే ఈ అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడేనని పేర్కొంది. అయితే మగవారు గొప్పవారని, స్త్రీలు వారిని కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమలహాసన్ మాట్లాడడం సరికాదని ఘాటైన విమర్శలు చేసింది. గాయత్రీ గత ఏడాది బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్నదన్నది గమనార్హం. -
మహిళా కంటెస్టంట్లకు క్లాస్ పీకిన బిగ్‌బాస్
సాక్షి, చెన్నై: తమిళంలో గత ఏడాది ప్రారంభమైన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు సీజన్-2 నడుస్తోంది. మొదటి భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమలహాసన్‌నే ఈ సీజన్‌కు ఆ బాధ్యతను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్లో బిగ్‌బాస్ కుటుంబసభ్యులుగా పాల్గొన్న వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని కమలహాసన్ ఖండించారు. ఆదివారం ఎపిసోడ్లో పాల్గొన్న కమలహాసన్ బిగ్‌బాస్ సభ్యుల్లో నటుడు మహత్ రాత్రివేళ మహిళల గదిలో పడుకోవడం, అతను, నటి యాషికా సన్నిహితంగా ఉండడం వంటి సంఘటనపై సహ కుటుంబ సభ్యుడు పొన్నంబళంని తీవ్రంగా ఖండించారు. మహిత్, యాషికా, ఐశ్వర్యదత్ల అసభ్య ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. ఇక్కడ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అలా జరగకూడదని, ఈ షోను ఆబాలగోపాలం వీక్షిస్తున్నారని, మనకంటూ ఓ సంప్రదాయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు పొన్నంబళం వ్యాఖ్యల్ని కమలహాసన్ సమర్థించారు. పొన్నంబళం, వైద్యనాథన్ బిగ్‌బాస్ హౌస్‌పై మర్యాద కలిగిన వారని పేర్కొన్నారు. మగవారు చేసే తప్పులను మహిళలు చెయ్యకూడదని, పురుషులు కంటే కూడా మంచి కార్యాలను చేసి స్త్రీలు వారిని మార్చవచ్చునని వారికి క్లాస్ పీకారు. సద్వినియోగం చేసుకోండి: మీరు ఇంకా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేదని కమల్‌హాసన్ అన్నారు. దీన్ని మీరు హితబోధ అనో, హెచ్చరికగానో, టిప్స్ అనో ఏదైనా అనుకోండని అన్నారు. మీకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సినిమాలో తానూ అలానే మంచి పేరు సంపాదించానని చెప్పారు. ఆరంభంలో తననెవరూ పట్టించుకోలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు కే.బాలచందర్ దృష్టిలో పడేలా కొన్ని కార్యాలు చేసి పేరు తెచ్చుకున్నానని తెలిపారు. మీరు మీరుగా ఉంటూ ఇక్కడ తప్పులను సరిదిద్దుకోండని కమలహాసన్ హితవు పలికారు. -
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాకేష్ పాట
-
శృతి వీడియో.. ఇరకాటంలో కమల్ హాసన్
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు ట్విటర్లో చేదు అనుభవం ఎదురైంది. కుల వ్యవస్థ గురించి కమల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల అభిమానులతో ట్విటర్లో జరిగిన సంభాషణలో కుల వ్యవస్థపై మీ అభిప్రాయమేమిటని ఓ అభిమాని కమల్‌ను ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘నా ఇద్దరు కూతుళ్లను స్కూళ్లో చేర్పించే సమయంలో కులం, మతం వంటి కాలమ్స్ నింపమని అడిగినపుడు నేను వ్యతిరేకించాను. ఇటువంటి దృక్పథమే నా కుటుంబంలోని భవిష్యత్ తరాలకు అలవడుతుంది. ప్రతీ ఒక్కరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుల వ్యవస్థ అనేది క్రమంగా నశించిపోతుంది. కేరళ కూడా ఇలాంటి పద్ధతినే అవలంబిస్తోంది’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్... కమల్ పెద్ద కూతురు, ప్రముఖ హీరోయిన్ శృతీ హాసన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తాను ‘అయ్యంగార్’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా శృతి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో కమల్‌ను ట్రోల్ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘కేవలం స్కూలు అప్లికేషన్లో కులానికి సంబంధించిన కాలమ్ నింపకపోవడం వల్ల కుల వ్యవస్థ నశిస్తుందన్న మీ అభిప్రాయం తప్పు సార్. సమాజాన్ని సంస్కరించే కార్యక్రమం మీ ఇంటి నుంచే ప్రారంభించండి. పిల్లల ముందు కుల ప్రస్తావన తీయకుండా, వారు ఏ కులానికి చెందిన వారో తెలియకుండా పెంచితేనైనా మీరు కోరుకునే మార్పు వచ్చే అవకాశం ఉందంటూ’ ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించాడు. ‘మీరు కులానికి సంబంధించిన కాలమ్ నింపలేదేమో గానీ మీ సామాజిక గుర్తింపు ఏమిటో మీ కూతురి మాటల ద్వారా బహిరంగంగానే తెలియజేశారు కదా’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. I refused to fill in the caste&religion column in both my daughters’ school admission certificate.That’s the only way,it will pass on to the next generation.Every individual shld start contributing fr progress.Kerala started implementing the same.Those who do shld be celebrated https://t.co/DLdTubcfW1 — Kamal Haasan (@ikamalhaasan) June 30, 2018 -
యువతిని దత్తత తీసుకున్న కమల్
తిరువళ్లూరు: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. సినీనటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీనీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల్లో తిరుగుతూ సేవాకార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని అధిగత్తూరు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం తన టీమ్‌ను అధిగత్తూరులో పర్యటింప చేసి వాస్తవ పరిస్తితులను అడిగి తెలుసుకోవడంతో పాటు మే 1న గ్రామంలో పర్యటించి పలు హమీలు ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి కోసం ప్రత్యేక ప్రాజెక్టులు పక్కా గృహాలు ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. అయితే కమల్ పర్యటన ముగిసిన రెండు నెలల తరువాత సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. యువతిని దత్తత తీసుకున్న కమల్: తాజాగా కమల్ కార్యచరణలో వేగం పెంచారు. అధిగత్తూరు గ్రామానికి చెందిన దినసరి కూలీ ముత్తు. ఇతని భార్య లక్ష్మి. వీరికి సునీత అనే కుమార్తె వుంది. ముత్తు 2010లో మరణించాడు. లక్ష్మి కూలీ పనులను చేసుకుంటూ కుమార్తె సునీతను చదివిస్తోంది. పదో తరగతి పరీక్షల్లో 370 మార్కులు సాధించిన సునిత, ప్లస్‌టూలోనూ 652 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే పైచదువులు చదివించే స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పంచాయతీ మాజీ అధ్యక్షుడు చిదంబరనాథన్ కమల్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని చెన్నైకు పిలిపించుకున్న కమల్ వారి ఆర్థిక స్థితిగతులను ఆరా తీశారు. సునీత చెప్పిన మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన కమల్ యువతిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. మూడేళ్లు ఉచితంగా చదివిస్తానని ఆపై పోషణ బాధ్యత తీసుకుంటానని ప్రకటించి వెంటనే తిరునిండ్రవూర్‌లోని ప్రైవేటు కళాశాల్లో డిగ్రీలో చేర్పించారు. ఆదే విధంగా అధిగత్తూరు కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న మాలశ్రీ, డేవిడ్ ప్రియా తదితరులకు ఐదు లక్షల వ్యయంతో అరుదైన ఆపరేషన్ చేయించారు. మొత్తానికి కమల్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. గ్రామంలో 130 ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం సైతం సోమవారం ఉదయం ప్రారంభమైంది. -
స్క్రీన్ ప్లే 11th June 2018
-
విశ్వరూపం-2 ట్రైలర్ విడుదల
కమలహాసన్ ‘విశ్వరూపం’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపారు. ఈ యూనివర్సల్ హీరోకు విశ్వరూపం విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా విశ్వరూపం 2 సినిమాను తెరకెక్కిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ‘విశ్వరూపం 2’ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హిందీలో ఆమీర్ ఖాన్, తమిళ్లో శృతి హాసన్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు.. దేశ ద్రోహం మాత్రం తప్పు’ అంటూ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో చూపిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. జిబ్రాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉన్నాయి. ట్రైలర్ విజువల్ పరంగానూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. మరి ఈ సినిమాతో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి. కమల్ స్వీయ దర్శకత్వంలో ఆగస్టు 10న రాబోతున్న ఈ సినిమాలో ప్రియా, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
దేశద్రోహం మాత్రం తప్పు
-
ఎన్టీఆర్ చేతుల మీదుగా విశ్వరూపం2 ట్రైలర్
కమలహాసన్ విశ్వరూపం సినిమా ఎంతటి వివాదాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు సినిమా విడుదల విషయంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఎప్పుడో రావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వరూపం 2 సినిమా జూన్ 11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం 5 గంటలకు మూడు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. హిందీ వెర్షన్‌ను ఆమిర్ ఖాన్, తమిళ వెర్షన్‌ను శృతి హాసన్, తెలుగు వెర్షన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా, ఆండ్రియా కమలహాసన్‌కు జోడిగా నటించగా, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. The much-awaited #Vishwaroopam2Trailer will be out on June 11 at 5pm!l#Vishwaroopam2TrailerOnJune11 Telugu Trailer will be launched by @tarak9999 @ikamalhaasan @GhibranOfficial @PoojaKumarNY @andrea_jeremiah @shekharkapur @vairamuthu @Aascars pic.twitter.com/L39GgxS2ye — BARaju (@baraju_SuperHit) June 8, 2018 -
నేనూ సంఘ విద్రోహినే
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. సినీ దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసకందాయకంగా మారాయి. 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వచ్చిన రజనీ ఇనాళ్లకు రాజకీయ రంగస్థలంలోకి దూకడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన సమకాలీన నటుడు కమలహాసన్ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశంతో పాటు పార్టీ పేరు, జెండానూ కూడా ప్రకటించేసి జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు. కమల్,రజనీలిద్దరూ రాజకీయాల్లోనూ భిన్న రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నట ఘటికులిద్దరూ తమ అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి, అభిమానుల ద్వారా తమిళనాడులో అధికారాన్ని చేపట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న కమలహాసన్, రజనీకాంత్‌ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలంటూ, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా చదువుపై దృష్టి సారించాలి అని పేర్కొంటే.. కమల్ అందుకు భిన్నంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా పలు విషయాల్లో కమల్, రజనీ విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్టెరిలైట్ పోరాటంపైనా.. తమిళనాడును కుదిపేసిన తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం వ్యవహారంలో రజనీకాంత్, కమలహాసన్ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ పోరాటంలో సంఘవిద్రోహులు చొరబడి దాడికి పాల్పడడమే సమస్యకు కారణం అనీ, ఈ సంఘటనలో పోలీసులపై దాడి ఖండించదగ్గదని పేర్కొన్నారు. ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేనూ సంఘ విద్రోహినే తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ వ్యాఖ్యలను కమలహాసన్ ఖండించారు. ఆయనపై వ్యతిరేక గళం ఎత్తారు. పోరాటం చేసేవారు సంఘ విద్రోహులైతే తానూ సంఘ విద్రోహుడినేనని కమల్ పేర్కొన్నారు. పోరాటాలు ఆగకూడదని అన్న కమల్ తూత్తుకుడి పోరాటం మంచి మార్గం అని, తుపాకీలు గురిపెట్టినా వాటిని ఎదిరించే పరిపక్వతను చూశామని అన్నారు. పోరాటాలతో తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. తాను మహాత్మా గాంధీ శిష్యుడినని అన్నారు. కత్తులు, తుపాకులతో చేసేది పోరాటం కాదని, అహింసా విధానంలో పోరాటాలు చేయాలన్నారు. -
సీఎం కుమారస్వామితో కమల్ భేటీ
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం భేటీ అయ్యారు. కావేరీ నదీజలాల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు కమల్ హాసన్ తెలిపారు. కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ ‘కాలా’ సినిమాపై.. తాజాగా తూత్తుకుడిని సందర్శించిన రజనీకాంత్ కావేరీ నదీజలాలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారం రేపాయి. ఆయన కొత్త చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కొంతమంది నిరసనకారులు ప్రకటించారు. కాగా కాలా విడుదలపై ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చ జరగలేదని కమల్ హాసన్ తెలిపారు. -
రజనీ క్షమాపణ చెప్పినా విడుదలకానివ్వం..
సాక్షి, బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదలవకూడదని ఇప్పటికే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి చర్చించి సినిమా విడుదలవ్వాలా లేదా అనే విషయంపై తీర్మానిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఈ విషయంపై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి కూడా స్పందించారు. రజనీకాంత్ బహిరంగ క్షమాపణ చెప్పినా ‘కాలా’ చిత్రం కర్నాటకలో విడుదల కానివ్వమని అన్నారు. ఇకపై రజనీకాంత్, కమల్ హాసన్‌కు సంబంధించిన ఏ చిత్రాలు కర్నాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ శెట్టి పేర్కొన్నారు. కర్నాటక ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ మాట్లాడుతూ.. రజనీ కాంత్, కమల్ హాసన్ చిత్రాలు తప్ప మిగిలిన అన్ని తమిళ చిత్రాలు కర్నాటకలో విడుదలయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కావేరి జలాల విషయంలో తమిళులకు మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్‌లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
నేను కాదు వారు రావాలి
తమిళసినిమా: సినిమా చాలా పవర్ఫుల్ మాధ్యమం. ఇక్కడ నుంచే చాలా మంది రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఇంకా ఆ పయనం కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి సినీ ఉద్దండులు రాజకీయరంగంలో పునాదులు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. కాగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తున్న నటుల్లో విజయ్‌సేతుపతి ఒకరు. తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన సామాజిక అంశాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆయన తూత్తుక్కుడి స్టెర్లైట్ పోరాటంలో గానీ, అంతకు ముందు జల్లికట్టు పోరాటం లాంటి సంఘటనపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. దీంతో విజయ్‌సేతుపతికి రాజకీయ మోహం ఏర్పడుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదే విషయాన్ని ఇటీవల విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావిస్తూ మీకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా తాను రాజకీయాల్లోకి కచ్చితంగా రానని స్పష్టం చేశారు. కారణం తనకు ప్రజల మీద అక్కరే కానీ, రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఇంకా చెప్పాలంలే తనకు రాజకీయాలపై సరైన అవగాహన లేదని, రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఆ స్థానంలో కూర్చోకూడదన్నది తన అభిప్రాయం అన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న సరి అని కొందరూ, తప్పు అని మరి కొందరు అంటున్నారన్నారు. ఆ విధంగా సరైన నిర్ణయాన్ని మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొన్నారు. అయితే నేటి యువత అలా కాదని, వారు చాలా వివేకం కలిగి ఉన్నారని అన్నారు. రాజకీయ పరిపక్వతతోనూ ఉన్నారని, వారే రాజకీయాల్లోకి రావాలని నటుడు విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరికి చురకలో అన్నది చర్చకు దారి తీస్తోంది. విజయ్‌సేతుపతి నటించిన జుంగా చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రజినీకాంత్‌తో కలిసి కార్తీక్‌సుబ్బరాజ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. -
ఆ దిగ్గజాలతో అనిరుద్
తమిళసినిమా: యువ తరంగం అనిరుద్ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. తొలి చిత్రం 3తోనే వై దిస్ కొలైవెరి డీ.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యువ సంగీత దర్శకుడు ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చిత్రాలు చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకున్న అనిరుద్ వ్యక్తిగతంగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే అవేవి ఆయన వృత్తికి ఆటంకాలు కాలేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అంతే కాదు అగ్ర నటీనటుల చిత్రాలకు సంగీతబాణీలు కడుతున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలమావు కోకిల చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబ బంధువు అయిన ఈయనకిప్పుడు ఆయన చిత్రానికే సంగీతాన్ని అందించే అవకాశం వరించింది. ఎస్. రజనీకాంత్ తాజాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి అనిరుద్ సంగీతబాణీలను కడుతున్నారు. ఇది ఒక విశేషం అయితే తాజాగా విశ్వనటుడు కమలహాసన్ తాజా చిత్రానికి ఆ సంచలన సంగీతదర్శకుడికే సంగీతాన్ని అందించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. కమల్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తూనే మరో పక్క కమలహాసన్ ఇండియన్–2 చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి ఐ చిత్రం వరకూ ఏఆర్.రెహ్మాన్‌నే సంగీతాన్ని అందించారు. మధ్యలో అనియన్, నన్భన్ చిత్రాలకు మాత్రం హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఇండియన్ 2 చిత్రంతో కలిపి మూడో చిత్రానికి ఇతర సంగీత దర్శకుడు పనిచేస్తున్నారన్న మాట. ఇండియన్–2 చిత్రానికి కమిట్ అయిన అనిరుద్‌ను దర్శకుడు శంకర్ ఒకే ఒక్క విషయం చెప్పారట. కొలమావు కోకిల చిత్ర సంగీత చర్చనీయాంశంగా మారిన తరుణంలో తన చిత్రానికి సంగీతాన్ని అందించే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని సూచించారట. అంటే తన చిత్రానికి ఒరిజనల్ సంగీతం కావాలన్న భావాన్ని వ్యక్తం చేశారట. మరి ఈ రెండు దిగ్గజాల చిత్రాలతో అనిరుద్ తన సత్తాను ఎలా చాటుకుంటారో చూడాలి. ఏదేమైనా అనిరుద్ ఇప్పుడు స్టార్ సంగీతదర్శకుల పట్టికలో చేరిపోయారన్న మాట. -
స్టెరిలైట్ విస్తరణ పనులను నిలిపేయండి
-
కంటికి కనిపించిందే నిజం కాదు!
అవును. కంటికి కనిపించేవన్ని నిజాలు కాదు. లోతుగా పరిశీలించేస్తేనే నిజం తెలుస్తుందని అంటున్నారు లోక నాయకుడు కమల హాసన్. త్వరలో రాబోతున్న తమిళ బిగ్ బాస్ రెండో సీజన్‌కు కూడా ఈ యూనివర్సల్ హీరోనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 2 మోషన్ పిక్చర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ రియాల్టీ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోలో.. ఓ ఆకతాయిలా కనిపించే కుర్రాడు... అకస్మాత్తుగా ఓ అమ్మాయిని ఢీ కొట్టి పరిగెత్తుకుంటుపోతాడు... చుట్టుపక్కన ఉన్నవారంతా తిట్టబోతుంటే... కమల్‌హాసన్ ఓ చిటికేసి ఆ సీన్‌ను పాజ్ చేస్తారు . కంటికి కనిపించేది నిజం కాదంటూ... వెనకాల ఏదో ఉంటుందంటూ కమలహాసన్ చెబుతారు. తీరా స్క్రీన్ మొదలైన వెంటనే ఆ కుర్రాడు ఓ పాపను ప్రమాదం నుంచి కాపాడడానికే అలా వెళ్తాడు. కంటికి కనపడకుండా ఉండే విషయాన్ని తెలుసుకుంటేనే నిజమేంటో అర్థమవుతుందని ముగింపునిస్తారు కమల్. వినూత్నంగా ఉన్న ఈ ప్రోమో కు మంచి స్పందన వస్తోంది. మరి బిగ్‌బాస్ సీజన్ 2 ను కూడా ఈ హీరో రక్తికట్టించేలానే ఉన్నారు. -
కేరళ సీఎంతో కమల్ హాసన్ భేటీ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం భేటీ అయ్యారు. కొచ్చిలో సీఎంతో భేటీ అయిన కమల్ పలు అంశాలపై చర్చించారు. కోయంబత్తూర్‌లో జూన్ మొదటి వారంలో తాను నిర్వహిస్తున్న ర్యాలీకి రావాల్సిందిగా విజయన్ను కమల్ కోరారు. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులపై, కర్ణాటక రాజకీయ పరిణామాలపై విజయన్‌తో చర్చించారు. కర్ణాటకలో ఫాసిస్ట్ చేతుల నుంచి ప్రజాస్వామ్యం గెలిచిందని కమల్ వ్యాఖ్యానించారు. కేరళలో ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడు విద్యార్ధులను నీట్ పరీక్ష కోసం కేరళలో అనుమతించినందుకు విజయన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం కొచ్చిలోని బోల్గటి ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో వీరిరువురు పాల్గొన్నారు. -
నాతో వస్తే నేనూ రెడీ!
తమిళసినిమా: మీరు పాల్గొంటే నేనూ రెడీ అంటోంది నటి రాయ్‌లక్ష్మి. ఇంతకీ దేని గురించి ఈ అమ్మడు చెప్పేది అనేగా మీ ఆసక్తి. అవును నటి రాయ్‌లక్ష్మి గురించిన టాపిక్ అంటేనే ఆసక్తే. కోలీవుడ్‌లో పలు చిత్రాలు, టాలీవుడ్లో చాలా తక్కువ చిత్రాలు, హిందీలో ఒక చిత్రంలోనూ కథానాయకిగా నటించిన రాయ్‌లక్ష్మి ఈ మధ్య చిరంజీవితో ఐటమ్ సాంగ్‌లో నటించి అందాలారబోసింది. అంత కంటే మరింత సెక్సీగా హిందీ చిత్రం జూలీలో నటించింది. అయినా పెద్దగా మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. అయితే చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో యార్, నీయా–2 చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఈ అమ్మడి గురించి హల్చల్ చేస్తున్న పలు వదంతుల్లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనబోతోందన్నది ఒకటి. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ గేమ్ షో విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ సీజన్–2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్–2కు కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. జూన్ 17 నుంచి ఈ గేమ్‌షో మొదలవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. అంతే కాదు ఈ గేమ్ షోలో పాల్గొనే వారిలో కొందరు పేర్ల గురించి ప్రచారం జరుగుతోంది. అందులో నటి రాయ్‌లక్ష్మి పేరు చోటుచేసుకోవడం విశేషం. దీని గురించి స్పందించిన రాయ్‌లక్ష్మి ఎందుకు గేమ్ షో ప్రారంభం అవుతున్న ప్రతిసారి తను పేరును ప్రస్తవిస్తుంటారు అని కొంచెం సీరియస్‌గానే అంది. మీడియాలో కొందరికి తన గురించి వదంతులు ప్రచారం చేయడమే ఒకపనిగా మారిందని తన ట్విట్టర్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాయ్‌లక్ష్మి ట్వీట్‌కు స్పందించిన బాలీవుడ్ నటి బిపాసాబసు భర్త కరణ్ వి.కురువర్ తాము మిమ్మల్ని బిగ్‌బాస్–2లో చూడాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఆయనకు బదులిచ్చిన రాయ్‌లక్ష్మి మీరు నాతో కూడా వస్తే తాను బిగ్‌బాస్–2 గేమ్‌షోలో పాల్గొనడానికి రెడీ అని అంది. అదే విధంగా మరో అభిమాని తానూ మిమ్మల్ని ఆ గేమ్‌షోలో చూడాలనుకుంటున్నాను అని అనగా తాను బిగ్‌బాస్–2లో పాల్గొంటే నిప్పురాజుకుంటుందని రాయ్‌లక్ష్మి పేర్కొంది. -
బిగ్‌బాస్ సీజన్ 2 టీజర్ రెడీ
తమిళసినిమా : బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో గతేడాది ప్రసారమై విశేష ఆదరణ పొందింది. విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం పెద్ద ఎసెట్ అయ్యింది. అంతే కాదు నటి ఓవియ, జూలి, నటుడు ఆరవ్ బాగా ప్రాచుర్యం పొందారు. వారందరికీ ఇప్పుడు సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్– 2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షోకు నటుడు కమలహాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్లో ఆయన పాల్గొనగా ఈ నెల 3న స్థానిక ఏవీఎం స్టూడియోలో చిత్రీకరించారు. ఈ టీజర్‌ను శనివారం నుంచి విజయ్ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ గేమ్ షో కోసం భారీ సెట్ నిర్మాణం, ఇందులో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోందట. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 2 జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ విజయ్ టీవీలో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 కంటే సీజన్ 2 మరింత బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
కీర్తీకి కమల్ ప్రశంసలు
తమిళసినిమా : నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందించిన చిత్రం నడిగైయార్ తిలగం. దుల్కర్సల్మాన్, సమంత, అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్‌దేవరకొండ, శాలిని పాండే, నాగ్‌చైతన్య, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం శక్రవారం తెరపైకి వచ్చింది. సావిత్రి ప్రారంభ దశను మహానటిగా వెలిగిన దశను, వ్యక్తిగత అంశాలను సమతుల్యంగా ఏ ముఖ్య విషయాన్ని మిస్ కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా చిత్రాన్ని మలిచారు. చిత్ర షూటింగ్ దశలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్నా? అంటూ ఆక్షేపణ చేసిన వారు ఇప్పుడు ఆహా ఏం అభినయం అంటూ ప్రశంసిస్తున్నారు. విశ్వనటుడు కమలహాసన్ కూడా నటి కీర్తీసురేశ్‌ను శుక్రవారం ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నటి కీర్తీసురేశ్ తన ట్విట్టర్లో పేర్కొంటూ కమలహాసన్ ప్రశంసలు లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇలా కీర్తీసురేశ్‌ను అభినందించిన వారిలో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రముఖులెందరో ఉన్నారు. ఇంతకు ముందు కీర్తీపై వ్యంగాస్త్రాలు సంధించిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నటనను కీర్తిస్తుండడం విశేషం. చిత్రం నిర్మాణంలో ఉండగా సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ నటించడానికి సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్ నటి జమున వంటి వారి వ్యాఖ్యలకు కీర్తీసురేశ్ చిత్రం చూడకుండా విమర్శించడమా అంటూ గట్టిగానే బదులిచ్చారు. అప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అలా కీర్తీసురేశ్ గెలిచారు. మహానటి సావిత్రి మాదిరిగానే ఆమె జీవిత చరిత్ర వెండితెరపై చిరస్మరణీయమైంది. -
కమల్, రజనీలకు రాజకీయ కళ్లెం
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థులే లక్ష్యంగా నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ చేస్తున్న ప్రసంగాలకు రాజకీయకళ్లెం పడింది. కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించరాదంటూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగుచూశాయి. వెండితెరపై యువతను ఉర్రూతలూగించిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. నటులు రజనీకాంత్ ఇటీవల శ్రీరామచంద్ర వైద్యకళాశాలలో ఎంజీ రామచంద్రన్ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం బహిరంగసభావేదికపై ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. అలాగే ఇటీవల కాలంలో అనేక ప్రయివేటు, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలు తమ వార్షికోత్సవ వేడుకలకు నటీనటులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాయి. వారంతా సహజంగానే విద్యార్థులను ఉద్దేశించి రాజకీయ చైతన్య ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా కమల్‌హాసన్ ఇటీవలే తాను ప్రారంభించిన రాజకీయ పార్టీ, లక్ష్యాల గురించి ప్రసంగిస్తూ వస్తున్నారు. కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులకు స్పందించిన కాలేజీ విద్య సంచాలకులు మంజుల రాష్ట్రంలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు గత నెల 25న ఒక సర్క్యులర్ జారీచేశారు. కళాశాలల్లో జరిగే కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యే నేతలు రాజకీయాలను ప్రస్తావించరాదని, అలాంటి కార్యక్రమాలను అనుమతించరాదని పేర్కొంటూ ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కాలేజీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు తమ పార్టీ లక్ష్యాలను ప్రస్తావించడం, విద్యార్థుల్లో ప్రచారం చేయడం, అనేక రాజకీయ అంశాలపై చర్చలు జరపడం వంటివి తావివ్వరాదని స్పష్టం చేసింది. పాఠశాల విద్యార్థులపై ఆంక్షలు: ఇదిలా ఉండగా, ప్రభుత్వపాఠశాలల విద్యార్థులపై కొత్తగా 11 ఆంక్షలు విధిస్తూ విద్యాశాఖ సంచాలకులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి 1, 6, 9, ప్లస్ ఒన్ విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వేరుగా గుర్తించేలా నాలుగు ప్రత్యేకరంగులతో యూనిఫారాలను రూపొందించి సిద్ధం చేశారు. ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులు గోచరించాలని విద్యాశాఖ ఆశిస్తోంది. అయితే పాఠశాలల విద్యార్థులు కాలేజీ విద్యార్థులతో సమానంగా బుర్రమీసాలు, చెవులకు కమ్మలు, లోహిప్ ప్యాంట్, భిన్నమైన రీతిలో హెయిర్ కటింగ్లతో రావడాన్ని అధికారులు గుర్తించారు. అంతేగాక పాఠశాలల్లో యథేచ్ఛగా స్మార్ ఫోన్ల వినియోగం కూడా ఎక్కువైందని తెలుసుకున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు 11 ఆంక్షలను రూపొందించారు. ఉదయం 9.15 గంటల్లోగా పాఠశాలకు రావాలి. లోహిప్, టైట్ ప్యాంటులు వేసుకుని రాకూడదు. సా«ధారణ ప్యాంట్‌పై వదులుగా ఉంటే హాఫ్షర్ట్ మాత్రమే వేసుకోవాలి. టైట్ షర్ట్ వేసుకోరాదు. చేసుకున్న ఇన్‌షర్ట్ బైటకు రాకూడదు. నల్లని బకిల్ ఉన్న బెల్టును మాత్రమే వినియోగించాలి. చేతులు, కాళ్లకు పొడవుగా గోళ్లు పెంచుకోరాదు. పోలీస్ కటింగ్‌ను పోలినట్లుగా క్రాఫ్ ఉండాలి. పై పెదవికి సమానంగా మీసం ఉండాలి. బుర్రమీసాలు పెంచితే చర్య తప్పదు. చేతికి రబ్బర్‌బ్యాండ్, తాడు, చెయిన్, చెవులకు కమ్మలు ఉండకూడదు. తల్లిదండ్రుల సంతకంతో కూడిన ఉత్తరం ద్వారా మాత్రమే సెలవు తీసుకోవాలి. బైక్, సెల్‌ఫోన్, స్టార్ట్ఫోన్లకుఅనుమతిలేదు.ధిక్కరిస్తేవాటినిశాశ్వతంగాస్వాధీనంచేసుకుంటాం.జన్మదినంరోజుల్లోసైతంయూనిఫారంలలోనేస్కూలుకురావాలి. విద్యార్థులు ఈ ఆంక్షలను విధిగా ఆచరించాలని హెచ్చరించారు. అలాగే ఆంక్షలతో కూడిన ఫ్లెక్సీలను అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని, కరపత్రాల ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. రాజకీయపార్టీల గొంతునొక్కడమే: వైగో అయితే ఈ ఉత్తర్వులను ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది యువకులను చైతన్యవంతులను చేయకుండా రాజకీయ పార్టీల గొంతునొక్కడమేనని విమర్శించారు. పెరియార్, అన్నాదురై, కామరాజనాడార్, కరుణానిధి కాలేజీల్లో ప్రసంగాలు చేసి యువతలో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. కళాశాలల్లో రాజకీయాలు మాట్లాడరాదనే నిబంధనలు బ్రిటీష్ పాలనలో కూడా లేవని ఆయన ఎద్దేవా చేశారు. దుర్బుద్ధితో చేసిన ఉత్తర్వులను అన్నాడీఎంకే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇంటి పోరు
వెండితెర వేలుపులు రాజకీయ రంగంలో కాలు మోపడం తమిళనాడులో కొత్తేమీ కాదు. అనాటి అన్నాదురై మొదలుకుని రెండేళ్ల క్రితం కన్నుమూసిన జయలలిత వరకు అందరూ రాజకీయ రాజ్యమేలినవారే. సుదీర్ఘ విరామం తరువాత నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ ఒకేసారి రాజకీయాల్లోకి దిగారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీతో కమల్ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. రజనీకాంత్ ఇంకా పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వస్తారు లేక ఇద్దరికీ అవకాశం లేదా అని పెద్ద ఎత్తున ఊహాగానాలుసాగుతున్నాయి. ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన వ్యక్తే తమిళనాడుకు తరువాతి ముఖ్యమంత్రి అవుతారంటూ కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్ సోమవారం తనఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రజనీకాంత్‌ను దృష్టిలో ఉంచుకునేఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న నటుడు కమల్‌హాసన్ ఇంటిపోరును ఎదుర్కొంటున్నారా? ఆయన అన్న చారుహాసన్ వైఖరి చూస్తే అవుననే భావన కలుగుతోంది. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో సైతం కమల్, రజనీల మధ్య పోటీ అనివార్యమైంది. కమల్ నాస్తిక ధోరణితో, రజనీ ఆధ్యాత్మిక పంథాతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా ఇద్దరి లక్ష్యం అధికారంలోకి రావడమే. అయితే ఆశ్చర్యకరంగా కమల్ స్వయానా సోదరుడైన చారుహాసన్ రజనీకాంత్‌కే పూర్తి అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించి కలకలం రేపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తే తమిళనాడుకు తరువాతి ముఖ్యమంత్రి అవుతారంటూ సోమవారం తనఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రజనీకాంత్ పూర్వీకులది తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా. అయితే రజనీకాంత్ మాత్రం కర్ణాటకలోనే పుట్టి శివాజీరావు గైక్వాడ్ పేరుతో పెరిగారని ప్రచారం. కర్ణాటకలో బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగింది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ గతాన్ని దృష్టిలో ఉంచుకునే చారుహాసన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పైగా తన వాదనను సమర్థించుకుంటూ రెట్టింపు ధోరణితో మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘కర్ణాటకకు చెందిన వ్యక్తి సీఎం అవుతారనే నా వాదనతో ఏకీభవించని వారు నన్ను అజ్ఞాని అనుకుంటారు. ఈ ఏడాది మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను. వచ్చే ఏడాది నన్ను మీరు అర్థం చేసుకుంటారు’’ అని అందులో పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇద్దరు నటులు పెనుమార్పులు తీసుకువస్తారని ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చారుహాసన్ పేర్కొన్నారు. చారుహాసన్ వ్యాఖ్యలు సహజంగానే రజనీ శిబిరంలో ఆనందాన్ని నింపగా కమల్ అభిమానుల్లో కల్లోలం కలిగించింది. రజనీకి అనుకూలంగా చారుహాసన్ వ్యాఖ్యలు కాకతాళీయమా లేక మనస్పర్థలా అనే విషయంపై కమల్ నోరు మెదపాల్సి ఉంది. కమల్ పర్యటన అన్న చారుహాసన్ ధోరణి ఇలా ఉండగా కమల్ మాత్రం తాను స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఏడు జిల్లాల్లో ఆరు రోజులపాటు పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీని నెలకొల్పిన నాటి నుంచి ప్రజలను కలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్న కమల్ రామనాథపురం, మదురై జిల్లాల్లో తన తొలి, మలి విడత పర్యటనలను పూర్తిచేశారు. ఆ తరువాత ఈరోడ్ జిల్లాలో పర్యటనలో ప్రజలు పెద్ద ఎత్తున కమల్‌కు స్వాగతం పలికారు. దీంతో మరింత ఉత్సాహంతో అన్ని జిల్లాల్లో పర్యటించాలని కమల్ తీర్మానించుకున్నారు. మే, జూన్ మాసాల్లో ఏడు జిల్లాల్లో పర్యటనకు ఆయన సిద్ధం అయ్యారు. మే 16వ తేదీన కన్యాకుమారి జిల్లా, 17న తూత్తుకూడి, 18న తిరునెల్వేలి, విరుదునగర్‌లలో పర్యటిస్తున్నారు. జూన్ 8వ తేదీన తిరుప్పూరు జిల్లా, 9న నీలగిరి, 10న కోయంబత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన సమయంలో ముఖ్య కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏడు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిర్యాదులకు యాప్ ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు, సమాజంలో నెలకొన్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా విజిల్ అనే మొబైల్ యాప్‌ను కమల్ రూపొందించారు. ఈ యాప్‌కు ఫిర్యాదులు పంపేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఈ యాప్‌ను కమల్ ఆవిష్కరించారు. -
నెక్ట్స్ తమిళనాడు సీఎం రజనీనే!
సాక్షి, చెన్నై : తమిళనాట రాజకీయ పరిస్థితులపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాలను ఫేస్బుక్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. మొదటినుంచి రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి మద్దతుగా మాట్లాడుతున్న ఆయన.. భవిష్యత్తులో సూపర్‌స్టార్ రజనీ కాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. రజనీని కన్నడ వ్యక్తిగా వ్యతిరేకిస్తున్న వారందరికీ ఆయన తన విజయంతో సమధానం చెబుతాడని అన్నారు. రజినీతో పొల్చితే తన సోదరుడు కమల్‌కు సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు కమల్ని సినిమాలో ఆదరించినంతగా రాజకీయాల్లో ఆదరించకపోవచ్చని పేర్కొన్నారు. -
కమల్‌తో కటీఫ్
నటుడు కమల్‌హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీలో అప్పుడే లుకలుకలుప్రారంభమయ్యాయి. పార్టీలో సరైన గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు కమల్‌కు కటీఫ్ చెప్పేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ వెండితెర వేల్పులుగా ప్రజలు కొలుస్తున్న వారిలో ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్ అగ్రగణ్యులు. వీరిద్దరూ రాజకీయప్రవేశం కూడా చేశారు. అయితే శివాజీ అంతగా రాణించలేకపోయినా, ఎంజీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ కాలంలో మాస్ ఇమేజ్ ఎంజీఆర్‌కు సొంతమైతే, క్లాస్ ప్రేక్షకులు శివాజీ సినిమాలకు క్యూకట్టేవారు. అంతలా తమిళ ప్రేక్షకులను వారిద్దరూ పంచుకున్నారు. ఇక వారితరం అంతరించిపోగా, తరువాత తరంలో రజనీకాంత్, కమల్‌హాసన్ అదే తరహాలో దూసుకొచ్చారు. వారిలాగానే రజనీకాంత్ తెరపై కనపడితే మాస్ ప్రేక్షకులు ఊగిపోతారు. భిన్నమైన పాత్రలు, వేషధారణలతో హాలీవుడ్‌నే ఔరా అనిపించేలా నటించిన కమల్ అంటే క్లాస్ ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం. వెండితెరపై వెలుగులు చిమ్మిన వారు రాజకీయ తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం తమిళనాడులో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పటికే ఎందరో నటీనటులు రాజకీయ అరంగేట్రం చేసి అగ్రస్థానానికి చేరుకోగా తాజాగా రజనీ, కమల్ సైతం అదేబాట పట్టారు. ఒకేసారి వెండితెరను పంచుకున్న కమల్, రజనీ రాజకీయాల్లో సైతం అదే తరహాలో ముందుకు వచ్చారు. సిద్ధాంతాలు వేరైనా.. లక్ష్యం ఒకటే రజనీ, కమల్ పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అధికారంలోకి రావాలనే లక్ష్యం మాత్రం ఒకటే. పార్టీ స్థాపనలో రజనీకాంత్ మరికొంతకాలం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కమల్ మాత్రం మక్కల్ నీది మయ్యంను స్థాపించి ప్రజల్లోకివెళ్లడం ప్రారంభించేశారు. ఇదిలా ఉండగా, పార్టీ నిర్మాణంలో భాగంగా 14 ఉన్నతస్థాయి కమిటీలను కమల్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయవాది రాజశేఖర్ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో సీడి మెయ్యప్పన్ అనుచరుడిగా ఉండిన రాజశేఖర్ ఆ తరువాత టీటీవీ దినకరన్ పంచన చేరారు. కొంతకాలం దినకరన్ వెంట నడిచి కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంలో చేరారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏజీ మవురియా, స్టార్ జెరాక్స్ సౌరిరాజన్ తదితరులు రాజశేఖర్‌ను కమల్‌కు పరిచం చేయడంతో ఉన్నతస్థాయి కమిటీలో సభ్యత్వం లభించింది. అయితే, రాజశేఖర్ మూడురోజుల క్రితం కమల్‌హాసన్‌ను స్వయంగా కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయంపై రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ‘పార్టీ స్థాపన నుంచి కమల్ వెంటే ఉంటూ శ్రమించాను. ఉన్నతస్థాయి కమిటీలోని 14 మందిలో ఐదుగురు నావారే. ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిచడం ప్రారంభమైంది. పార్టీ పనుల కోసం సమయం కేటాయించడం వీలుకావడం లేదు. నా కక్షిదారులు కోపగించుకోవడం వల్ల న్యాయవాద వృత్తి దెబ్బతినింది. అందుకనే కమల్ పార్టీకి రాజీనామా చేశా’’ అని వివరించారు. రాజశేఖర్ రాజీనామా వల్ల మక్కల్ నీది మయ్యంలోని ఆయన అనుచరులు సైతం వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికానికి సై : కమల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తలపడేందుకు తమ పార్టీ సిద్ధమని కమల్ ప్రకటించారు. రెండు నెలల కిత్రం మదురైలో బహిరంగసభ తరువాత మంగళవారం చెన్నై మోడల్ గ్రామసభను నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండే భూమిని సిద్ధం చేస్తున్నానని చెప్పారు. గ్రామసభల ఆవశ్యకతను ఈ ప్రభుత్వానికి తెలియజెప్పడమే ఈనాటి కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. స్థానిక పరిపాలనే తమ బలమని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీచేసేందుకు మక్కల్ నీది మయ్యం సిద్ధంగా ఉందని చెప్పారు. అవినీతిని ఒక్కసారిగా రూపుమాపలేమని, తగ్గించుకుంటూ పోయి చివరకు పూర్తిగా లేకుండా చేయడమే తన పార్టీ ధ్యేయమని అన్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో నిందితులు ఎవరైనా న్యాయస్థానం ముందు శిక్షపడేలా చేయాలని ఆయన కోరారు. -
వారి కంటే శింబు బెటర్
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే యువ నటుడు శింబు సమయోచితంగా వ్యవహరిస్తున్నారని కన్నడ సీనియర్ నటుడు అనంతనాగ్ వ్యాఖ్యానించారు. కావేరి బోర్డు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తీరు, నటులు రజనీకాంత్, కమలహాసన్ వ్యాఖ్యలపై ఈయన స్పందించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత రజనీ, కమల్ల నుంచి తాను ఎంతో ఆశించానని అయితే వారు పాత విధానంలోనే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తమిళులకు వ్యతిరేకిని కానని, తమిళులు మంచి వారు, సహృదయులు అని అన్నారు. కన్నడిగులతో సన్నిహితంగా మెలుగుతారన్నారు. కర్ణాటకలో మరో నెలలో కొత్త ప్రభుత్వం రానుందని, ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయని అన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అయినా వారు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని ప్రశ్నించారు. నటుడు శింబు ఎలాంటి పోరాటం లేకుండా కావేరి వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీటిని ఇవ్వాలని కోరుతూ విజ్ఞతతో వ్యాఖ్యలు చేశారని, ఆయనలాంటి పరిణితి రజనీ, కమల్లో లేకపోవడం చూసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఆఫ్రికాలోని నైల్నది సమస్య కూడా పరిష్కరమైందని, అలాంటిది కావేరి సమస్యకు పరిష్కారం లభించాలని తమిళ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. కన్నడిగులు మంచి వారని, కావేరి వ్యవహారంలో తమిళ రాజకీయ నాయకుల చేతకాని తనంగా భావిస్తున్నారని, వారికి తాము తగిన రీతిలో బదులిస్తామని నటుడు అనంతనాగ్ పేర్కొన్నారు. -
కమల్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలి
యశవంతపుర: కావేరి జలా వివాదాలకు సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న తమిళ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘల నాయకులు తీర్మానించారు. బుధవారం కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు బెంగళూరులో ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను స్థాపించిన కమల్, రజనీలు తమిళనాడుకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారన్నారు. అయితే కన్నడిగుడైన రజనీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం మంచిదికాదన్నారు. ఆ ఇద్దరు నటులు నటించిన సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సారా గోవిందు పేర్కొన్నారు. ఇప్పుటికే కన్నడ చళవళి వాటాల్ నాగరాజు వీరిద్దరి సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేసిన్నట్లు గోవిందు గుర్తు చేశారు. -
మంత్రి వ్యాఖ్యలపై నటి శ్రీప్రియ సెటైర్లు
తమిళసినిమా: రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి కడంబూర్ రాజూ, కమలహాసన్ మక్కల్ నీది మయం పార్టీ కార్యకర్త, నటి శ్రీప్రియల మధ్య మాటల యుద్ధం సాగింది. మక్కల్ నీది మయం పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవల తిరుచ్చిలో బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సమావేశంపై స్పందించిన మంత్రి కడంబూర్ రాజు బర్రెల బండితో పోల్చి పరిహాసం చేశారు. ఆయన మాట్లాడుతూ వైగై నదిలో గెదెను కడిగినా జనం పోగవుతారని అన్నారు. అలా నటుడి సభకు జనం రావడం ఆశ్చర్యం ఏమీ లేదు అని పేర్కొన్నారు. దీనికి కమలహాసన్ పార్టీ ఉన్నత కమిటీ కార్యకర్త శ్రీప్రియ స్పందిస్తూ మంత్రి కడంబూర్ రాజూ ఆయన పార్టీ వారిని నీరులేని కావేరి నదిలో స్నానం చేయించమనండి. వారిని చూడటానికి జనం పోగవుతారు అని వ్యంగ్యాస్త్రాలతో ధీటుగా తన ట్విట్టర్లో బదులిచ్చారు. -
కమల్ హాసన్‌కు వ్యతిరేకిని కాను
చెన్నై: తాను సినీ నటుడు కమల్ హాసన్‌కు వ్యతిరేకిని కానని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..తక్షణమే కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీల నిర్వహణ మంచిది కాదని సూచించారు. ఒకవేళ ఐపీఎల్ పోటీలకు వెళితే తమదైన రీతిలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్‌ను కర్ణాటకకు చెందిన వ్యక్తిని, అన్నా యూనివర్సిటీ వీసీని నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు. -
ఆ ఇద్దరి చిత్రాల పరిస్థితేంటి!
సాక్షి,సినిమా: సూపర్‌స్టార్, కమలహాసన్ చిత్రాలు ఎన్నడూ లేనంతగా అయోమయం పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చిత్ర పరిశ్రమ సమ్మెకు ఇప్పట్లో పరిష్కారం లభించేటట్టులేదు. ఇటు నిర్మాతల మండలి, అటు థియేటర్ల సంఘం ఎవరికి వారు తమ పక్కనే న్యాయం ఉందంటూ పంతాలకు పోయి సమస్యను జఠిలంగా మారుస్తున్నారు. నిర్మాతల మండలి తమ డిమాండ్లు నెరవేరాల్సిందే నంటుంటే, వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని థియేటర్ల యాజమాన్యం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ సమ్మె ప్రకటనకు ముందే ప్రకటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాలా చిత్రం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్నా, ఎట్టకేలకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ /ఏ సర్టిఫికెట్‌ను అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రానికి కమల్ సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వరూపం–2 చిత్రాన్ని కమలహాసన్ ఇదే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మిగతా చిత్రాల విషయం ఎలా ఉన్నా, రజనీకాంత్, కమలహాసన్ చిత్రాల ప్రభావం చిత్ర పరిశ్రమపైనా, ప్రేక్షకులపైనా ఎక్కువగానే ఉంటుంది. అయితే చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండడంతో కాలా, విశ్వరూపం–2 చిత్రాల విడుదల అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె కారణంగా సినీ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా చూడాల్సిందిగా రజనీకాంత్ ఇటీవల తనను కలిసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు హితవు పలికారు. అదే విధంగా కమల్‌ను కలిసిన విశాల్ సమ్మెకు కారణాలను వివరించారు. దీంతో సమ్మెను రజనీకాంత్, కమలహాసన్ తప్పు పట్టకపోయినా ఈ పిరిస్థితులు వారి చిత్రాలకు ఇబ్బంది కలించేవిగా ఉన్నాయన్నది వాస్తవం. -
రజనీ, కమల్‌లకు తమిళ చరిత్ర తెలియదు
తమిళసినిమా: నటులు రజనీకాంత్, కమలహాసన్‌లకు తమిళనాడు చరిత్ర తెలియదని సీనియర్ దర్శకుడు భారతీరాజా వ్యాఖ్యానించారు. ఆయన «మధురైలో సోమవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై భారతీరాజా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ, నటులు రజనీకాంత్, కమలహాసన్‌లపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో, ఐసీయూలో ఉందన్నారు. రాష్ట్రంలో ఐక్యత కరువవ్వడంతో విభజన దారులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమిళులందరూ భేషజాలు విడిచి సంఘటితంగా నిలిస్తే తమిళనాడును ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న ఏడుగురిని విడుదల చేయాలని శాసనసభతో అప్పటి ముఖ్యమంత్రి తీర్మానం చేశారని, ఆమె బాటలో పయనిస్తున్నామని చెప్పుకుంటున్న ఈపీఎస్, ఓపీఎస్లు వారిని విడుదల చేస్తేనే తాను వారితో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్లు ఫ్యూజు లేని బల్పులని, వారు బీజీపీ బల్బు వెలుతురు కింద నిలబడటంతో వెలుగుతున్నట్లు కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. రజనీ, కమల్ తమిళనాట నేతలను బలపరచే విధంగా ఉండాలిగానీ, వారే అధినేతలు కావాలని ఆశ పడకూడదన్నారు. వారు తమిళులకు ఏం చేశారని నమ్మాలని ప్రశ్నించారు. వీరిద్దరికీ తమిళనాడు చరిత్ర తెలియదని విమర్శించారు. కటౌట్లకు పాలాభిషేకాలు చేసి చెడగొట్టిన రాష్ట్రాన్ని ఇకపై తమిళులందరం ఐక్యంగా కాపాడుకుందాం అని దర్శకుడు భారతీరాజా ప్రజలకు హితవు పలికారు. -
రజనీ, కమల్ ప్రకటించిన సాయం ఎక్కడ?
సాక్షి, చెన్నై : పాఠశాల విపత్తులో బలైన విద్యార్థులకు నటుడు రజనీకాంత్, కమలహాసన్ అందిస్తానన్న ఆర్థికసాయం ఏమైందనే ప్రశ్న తెలెత్తుతోంది.వివరాలు.. 2004, జూన్ 16న తంజావూరు జిల్లా, కుంభకోణంలోని ఒక ప్రైవేట్ పాఠశాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 94 మంది పిల్ల లు ఆహుతులయ్యారు. 18 మంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కరుణానిధి, జయలలిత ప్రమాద స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి, తగిన ఆర్థికసాయాన్ని అందించారు. రాష్ట్రప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు తలా రూ.లక్ష పరిహారంగా అందించింది. అదే విధంగా నటుడు రజనీకాంత్, కమలహాసన్ కూడా మరణించిన వారి కుటుంబాలకు సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. అయితే సంఘటన జరిగి 14 ఏళ్లు అయినా రజనీ, కమల్ ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కమల్, రజనీ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారని, ఇప్పుటికైనా వారు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలనే అభిప్రాయం బాధిత కుటుంబాల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంపై అగ్నిప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయిన మహేశ్ అనే వ్యక్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ నటుడు రజనీ, కమల్ తమ వాగ్దానాలను నెరవేర్చలేదు కదా, అప్పటి నడిగర్‌సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ బాధిత కుటుంబాలకు రూ.60 లక్షల విరాళాలను సేకరించినట్లు, ఆ మొత్తానికి మరో రూ.40 లక్షలు కలిపి కోటి రూపాయలను అందించనున్నట్లు చెప్పారని, ఆ మొత్తం కూడా బాధిత కుటుంబాలకు అందలేదని అన్నారు. అయితే ఆదే ప్రమాదంలో కొడుకును బిడ్డను కోల్పోయిన ఇన్బరాజ్ అనే వ్యక్తి ఇప్పుడు రజనీకాంత్ ఏర్పాటు చేయనున్న పార్టీలో నిర్వాహకుడిగా నియమితులయ్యాడు. ఆయన తెతుపుతూ రజనీకాంత్, కమలహాసన్ బాధిత కుటుంబాలకు అందిస్తానన్న సాయాన్ని అప్పుడే నడిగర్ సంఘంకు అందించారని వారు తెలిపారని, ఆ మొత్తాన్ని అప్పటి సంఘ నిర్వాహకులు ఏం చేశారో, అసలు ఏం జరిగిందో తెలియలేదని అన్నారు. -
‘రజనీ’కి రాంరాం..
జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని రజనీకాంత్, కమల్‌హాసన్ పూడ్చేందుకు పోటీపడుతున్నారు. ఒకేసారి రాజకీయరంగ ప్రవేశం చేశారు. కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించి రోడ్‌షోలు మొదలుపెట్టారు. రజనీకాంత్ ఇంకా పార్టీ ఏర్పాట్ల కసరత్తు చేస్తున్నారు. వెండితెర స్నేహితులైన కమల్, రజనీ రాజకీయాల్లో సైతం అదే తరహాను కొనసాగిస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది.ఈ తరుణంలో రజనీ తనది ఆధ్యాత్మిక పార్టీ అని స్పష్టం చేయగా తన పార్టీది లౌకిక సిద్ధాంతమని కమల్ పేర్కొని వేర్వేరు బాటలని తేల్చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకేసారి ఇద్దరం రాజకీయాల్లో రావడం వల్ల రజనీకాంత్ స్నేహానికి రాంరాం చెప్పక తప్పదని ‘మక్కల్ నీది మయ్యం’ అధినేత, నటుడు కమల్‌హాసన్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల కారణంగా రజనీతో స్నేహాన్ని తెంచుకోవడం బాధగా ఉందని అన్నారు. ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, రజనీతో తన స్నేహానికి కాజకీయాలు చెక్ పెట్టాయని తెలిపారు. రాజకీయ అడుగుల్లో తమ మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయని కమల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘రాజకీయాల్లో రజనీకాంత్ ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారో తెలియదు. రజనీకాంత్ రాజకీయాలతో తన రాజకీయ పయనాన్ని పోల్చిచూడవద్దు. ఇద్దరి రాజకీయాల్లో అనేక తేడాలున్నాయి. అయితే రజనీ రాజకీయ పరిస్థితి గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు. అయితే ఆయనలో నెలకొన్న పరిస్థితుల్లోకి నేను వెళ్లను. నాకు ఎలాంటి మతాలు లేవు అన్ని మతాలు సమ్మతమే. కాబట్టి రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. సినిమాల్లో ఆయన బాణిలో కాకుండా ప్రత్యేక తరహాలో నటునిగా నా ప్రయాణం సాగింది. సినిమాల్లో ఉండగా మా ఇద్దరి బాణీలు వేరైనా స్నేహం ఉండేవి. ఆయన అంగీకరించిన సినిమాల అవకాశాలను నేను తోసిపుచ్చాను. అలాగే నేను నటించిన పాత్రలను ఆయన నిరాకరించారు. రాజకీయాల్లో సైతం ఇద్దరికీ అలాంటి అభిప్రాయభేదాలే ఉన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ పొరపాటు నిర్ణయాలు తీసుకోను. అయితే ఒక్కటి మాత్రం నమ్మకంగా చెబుతా.. రాజకీయ విమర్శలు చేసే సమయాల్లో మా ఇద్దరి మధ్య ఏర్పడే ఇంకా బలమైన అభిప్రాయభేదాలను నివారించలేం. చీలికలకు కారణం కావచ్చు. అయితే ఎప్పుడు ఏర్పడుతుందో మాకే తెలియదు. సినిమాల సమయంలో కొనసాగిన స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేం. రాజకీయాల్లో మా ఇద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను తలచుకుంటే బాధగా ఉంది. అయితే ఒకరినొకరం విమర్శలు చేసుకోకుండా నాగరీకమైన రాజకీయాలు సాగించాలని ఇద్దరం కోరుకుంటున్నాం’’అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. కమల్ పరామర్శ తేనీ జిల్లా కురంగని కొండ అడవుల్లో ఈనెల 11వ తేదీన కార్చిచ్చుకు బలైన ఇద్దరు యువతుల కుటుంబాలను కమల్ శనివారం పరామర్శించారు. చెన్నైకి చెందిన అనువిద్య, నిషా ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చారు. హిమలయాలు టు అమెరికా హిమలయాల్లో ఆ«ధ్యాత్మిక పర్యటనలో ఉన్న రజనీకాంత్ అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళుతున్నారు. గత వారం హిమాలయాలకు చేరుకున్న రజనీ సుమారు 15 రోజులపాటు వివిధ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముగించుకుని చెన్నై చేరుకుంటారని అప్పట్లో సమాచారం. కానీ, సంపూర్ణ ఆరోగ్య వైద్య పరీక్షల కోసం హిమాలయాల నుంచే అమెరికా వెళ్లడానికి రజని నిశ్చయించుకున్నారు. రెండేళ్ల కిత్రం అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సింగపూరు వెళ్లి చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో అమెరికా నుంచి చెన్నై చేరుకుని పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు.