real estate
-
బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్‌కు బూస్ట్!
దేశంలో రియల్ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు."కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్‌కు తాజా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్‌లైన్‌లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్‌లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు(రీట్లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వేసినట్లు పేర్కొంది. -
సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్!
సాక్షి, హైదరాబాద్: సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25 వెల్లడించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల( Own Tax Revenue) ద్వారానే వస్తోందని.. అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి 88శాతంగా ఉందని తెలిపింది. కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.శుక్రవారం ప్రారంభమైన లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్‌గా మారిందని.. కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీగా ఇక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతోందని ఈ సర్వే తెలిపింది.రాష్ట్రంలో 100శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోందని, 86 శాతం సాగుయోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వే (2024–25)లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విశేషాలివీ.. ⇒ ఎగుమతుల పెంపు కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ–కామర్స్ మార్కెట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ–కామర్స్ వ్యా ప్తికి ఇతోధికంగా దోహదపడనుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో అమ్మకపు సంస్థల ప్రాతినిధ్యాన్ని పెంచేదిగా ఉంది. ⇒ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలోని 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17శాతం) మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 2024 నవంబర్ 26 నాటికి ఈ పథకం కింద మరో 12.06 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ప్రస్తుతం దేశంలోని 79.1 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం గ్రామీణ కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఒకటి. ⇒ ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, న్యాయ, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతోపాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తోన్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో భువన్ వేదిక ద్వారా వెబ్‌జీఐఎస్ పోర్టల్‌తో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే. మన దేశంలోని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 87 శాతం సిమెంట్ పరిశ్రమలున్నాయి. ⇒ రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సేవల రంగం గణనీయ పాత్ర పోషిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని సేవల రంగం వాటా దేశంలోని అన్ని రాష్ట్రాల వాటాలో 25 శాతాన్ని మించుతోంది. తెలంగాణలో స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతంగా నమోదైంది. దేశంలో ఈ రంగంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ⇒ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవల రంగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై నగరాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఆయా నగరాల్లో ఐటీ, ఫిన్‌టెక్ సేవల విస్తృతి కారణంగా ఆఫీసు, నివాస స్థలాల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ⇒ కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు సర్విసుల రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. పారిశ్రామిక అభివృద్ధిలో ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కేంద్రంగా ముందుకెళుతుండటమే ఇందుకు కారణం. ⇒ సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్ విద్య కొనసాగుతోంది. తద్వారా తక్కు వ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం, బో ధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్విసుల విస్తృతి గణనీయంగా ఉంది. వాణిజ్య సేవల రంగమైన ఐటీ రంగమే తెలంగాణ తలసరి ఆదాయ వాటాలోనూ సింహభాగం నమోదు చేస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్‌గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహదపడనుంది. దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది.2016–21 మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది. పంజాబ్ (98శాతం), హరియాణా (94), తెలంగాణ (86), ఉత్తరప్రదేశ్ (84శాతం)లలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది. -
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్‌లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్‌లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
ఇంటి కలకు భరోసా!
గత బడ్జెట్లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్ హౌసింగ్) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్లో చోటు కల్పించడం గమనార్హం. పరిశ్రమ వినతులు → మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది. → రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి. → గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ కార్పెట్ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి. → ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. → మరింత మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. → దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం అందించాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్
న్యూఢిల్లీ: సీమాంతర పెట్టుబడులకు సంబంధించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 10 కీలక మార్కెట్ల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికలో ముంబైకి అయిదో ర్యాంకు, న్యూఢిల్లీకి ఎనిమిదో ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ముంబై కన్నా ముందువరుసలో టోక్యో, సిడ్నీ, సింగపూర్, హోచిమిన్ సిటీ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది పైగా ఇన్వెస్టర్లు 2025లో మరింతగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.దేశీయంగా రియల్టీలో ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌తో పాటు పారిశ్రామిక.. డేటా సెంటర్లపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2024లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు 54 శాతం పెరిగి ఆల్‌టైం గరిష్టమైన 11.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు 2024లో రికార్డు స్థాయికి చేరాయి. ఇందులో దేశీ ఇన్వెస్టర్ల ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగడమనేది గ్లోబల్ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా భారత్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటానికి నిదర్శనంగా నిలుస్తుంది‘ అని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుత విభాగాలతో పాటు కొత్త విభాగాల్లోకి సైతం పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ–కామర్స్, వేగవంతమైన డెలివరీ సేవలకు డిమాండ్ నెలకొనడమనేది లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పరిశ్రమకు ఊతమివ్వగలదని అన్షుమన్ చెప్పారు. దీనితో ఇటు డెవలపర్లు, ఇన్వెస్టర్లకు కూడా ఆకర్షణీయమైన అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్ ట్రైనే ఎక్కుతాడు..
దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖలు తమ నిరాంబర శైలితో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిరంజన్ హీరానందని (Niranjan Hiranandani) ఒకరు. వేల కోట్ల సంపదకు అధిపతి అయినా లోకల్ ట్రైన్లోనే ప్రయాణిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 'ఇండస్ట్రీ గురు'గా పేరొందిన ఆయన హీరానందని గ్రూప్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కొత్త శిఖరాలకు నడిపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్ కొత్త యుగం వరకు విస్తరించిన హీరానందని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిరంజన్ హీరానందని నాయకత్వం వహిస్తున్నారు. తన పదునైన వ్యాపార చతురత, నైపుణ్యంతో హీరానందని గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందిన కంపెనీగా మార్చడంలో ప్రసిద్ది చెందారు. నిరంజన్ హిరానందని గురించి, ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..?నిరంజన్ హీరానందని నెట్వర్త్హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. భారతదేశంలోని 50 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనీ ఉన్నారు. నిరంజన్‌కు రూ. 12 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయి . విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. అయితే నిరంజన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.లోకల్ ట్రైన్లో ప్రయాణం ఇందుకే..ముంబై మహా నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంతటి ట్రాఫిక్‌లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో టైమ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నిరంజన్ హీరానందని ట్రాఫిక్‌లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై లోకల్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇలా రైలులో వెళ్తున్నప్పుడు సాధారణ వ్యక్తులతో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నది ఆయన భావన."ఆయన (నిరంజన్ హీరానందానీ) తెలివిగల పెట్టుబడి వ్యూహాలు, మార్గదర్శక పరిణామాలకు ప్రసిద్ధి చెందారు. అతని ఆర్థిక విజయం రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అంకితభావం కృషి ప్రత్యక్ష ఫలితం" అని నిరంజన్ హీరానందానీ అధికారిక వెబ్సైట్ తెలిపింది. "ఆయన ప్రయత్నాలు ముంబై స్కైలైన్‌ను మార్చడమే కాకుండా, పట్టణ జీవన ప్రమాణాలను కూడా మార్చేశాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, స్థిరమైన జీవనం ,విలాసవంతమైన జీవనశైలి అనేకమందికి అందుబాటులోకి తీసుకువచ్చాయి" వెబ్సైట్ పేర్కొంది.స్వీయ నిర్మిత బిలియనీర్నిరంజన్ హీరానందని సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన తర్వాత అకౌంటింగ్ టీచర్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తరువాత, హీరానందని తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూప్‌ను స్థాపించారు. తరువాత 1981లో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, హీరానందని తన దృష్టిని రియల్ ఎస్టేట్ పరిశ్రమపైకి మళ్లించి చివరికి ఆ రంగంలో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థాపించుకున్నారు. -
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి.. ఈటల స్ట్రాంగ్ రియాక్షన్
-
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై చేయి చేసుకున్న ఈటల రాజేందర్
-
హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.ప్రీమియం ప్రాపర్టీస్హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.జిల్లాల వారీగా..రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.ప్రాపర్టీ పరిమాణాల వారీగా..ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదనైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్‌కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. -
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్‌లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్‌లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్‌ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోతటాప్–10 డీల్స్ హవాతొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్‌హౌసింగ్ డీల్‌ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్‌స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. -
గోవాలో హై డిమాండ్ వేటికంటే..
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్ఎన్ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్‌ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.