Gannavaram
-
వైఎస్ జగన్ విజువల్స్ @ గన్నవరం
-
వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
-
టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
విజయవాడ: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కుట్రను బట్టబయలు చేశాడు ముదునూరి సత్యవర్థన్. గన్నవరం టిడిపి ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని జడ్జి ముందు తేల్చిచెప్పాడు. కేసు విరమించుకుంటున్నట్లు జడ్జికి తెలిపాడు సత్యవర్థన్. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ముందు తనను పోలీసులు ఎలా ఒత్తిడి పెట్టారో స్పష్టం చేశాడు. తనకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకున్నాడు సత్యవర్థన్.కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, స్వయంగా అఫిడవిట్ సమర్పించాడు. తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని సత్యవర్థన్ తెలిపాడు. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన తనపై పోలీసులే ఒత్తిడి తెచ్చి కేసును నమోదు చేయించారన్నాడు. టీడీపీ నేతలు , పోలీసులు కుట్ర చేసి కేసు నమోదు చేశారన్నాడు,. ఆ రోజు తాను అక్కడేలేనని పేర్కొన్నాడు సత్యవర్థన్. సత్యవర్ధన్ స్టేట్మెంట్ను స్వయంగా రికార్డు చేశారు జడ్జి. సత్యవర్ధన్‌కు అతని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
గన్నవరం గగనతలంలో విమానాల చక్కర్లు!
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగా గన్నవరంలో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి విమానం యూటర్న్ తీసుకుని మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. మరికొన్ని విమానాలు అక్కడే గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.గన్నవరంలో విమానాశ్రయంలో వద్ద దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. దీని కారణంగా విమానాల ల్యాండింగ్ ప్రతికూలంగా మారింది. దీంతో, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం.. అలాగే, ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. సదరు విమాన సర్వీసులను దారి మళ్లీంచినట్టు తెలుస్తోంది. -
గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
గన్నవరంపై పొగమంచు ఎఫెక్ట్.. విమానం దారి మళ్లింపు
సాక్షి, కృష్ణా: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా గన్నవరం(Gannavaram) విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమాన ల్యాండింగ్‌కు అంతరాయం తగిలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రాజమండ్రికి తరలించారు.గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది. దీంతో, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్(Hyderabad), ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ వద్ద జాతీయ రహదారిని పొగ మంచు కమ్మేసింది. లైట్ల వెలుతురుతో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయం వద్ద కూడా దట్టంగా పొగమంచు అలుముకుంది. ప్రధాన ఆలయంతో పాటు ఘాట్‌రోడ్ ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. పొగ మంచులో ఆలయ పరిసరాలు మరింత శోభను సంతరించుకున్నాయి. -
ఎంపీపీ అనగాని రవి అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
-
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు కాలేజీ విద్యార్థుల ప్రాణం తీసింది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు వారంతం సెలవు కావడంతో స్నానం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులోకి దిగారు. అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఈత వచ్చినా.. నీటి ఉద్ధృతికి ఈదలేక కొట్టుకుపోయారు. అయినప్పటికీ ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ఇద్దరు విద్యార్థులు పాలడుగు దుర్గారావు , జె.వెంకటేష్‌లు ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారులు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టులో వంశీకి ఊరట
-
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం
-
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
విజయవాడ: గన్నవరం నుంచి దేశ వాణిజ్య రాజధానిగా చెప్పే ముంబైకి మరికొన్ని రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది.ప్రారంభ ఆఫర్గన్నవరం నుంచి ముంబైకి నడపనున్న డైరెక్ట్ విమాన సర్వీస్‌కి ప్రారంభ ఆఫర్‌గా టికెట్ ధరను రూ.5600గా ఎయిర్ఇండియా నిర్ణయించింది. తర్వాత డిమాండ్‌ను బట్టి ఈ ధర మారే అవకాశం ఉంది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబైకి చేరుతుంది. అంటే ప్రయాణ సమయం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే.ఇప్పటి వరకూ విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు లేదు. చాలా విమానాలు హైదరాబాదు మీదుగా కనెక్టింగ్ సర్వీసుగా వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు కావాలని నగరంలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా వెంటనే స్పందించింది. విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 తగ్గింపు ఇచ్చింది.గన్నవరం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వ్యాపారపరంగా కీలకమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో విజయవాడ-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. -
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
-
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్లో పెట్టింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు. -
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
-
యార్లగడ్డకు ఎదురుగాలి!
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన అంతరం ఇటీవల హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ సహకారం అంతంతమాత్రం నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు. పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వంశీ ప్రచార జోష్ ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది. నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
దుమ్ములేపుతున్న వల్లభనేని వంశీ ప్రచారం..
-
Memantha Siddham Photos: గన్నవరం.. అభిమాన సంద్రం (ఫోటోలు)
-
గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
సీఎం వైఎస్ జగన్ గన్నవరం బస్సు యాత్ర డ్రోన్ విజువల్స్
-
ప్రజల కోసం ఎందాకైనా.. గాయంతో సిద్ధం..!
-
సీఎం జగన్ బస్సు యాత్ర..ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం
-
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
గన్నవరం YSRCP అభ్యర్థి గా వంశీ..!
-
విమానంలో చంద్రబాబు భార్య.. గాల్లో 20 నిమిషాలు గందరగోళం
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏం జరిగింది.? హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు. భువనేశ్వరీ ప్రయాణం ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పి.గన్నవరం వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు
-
గన్నవరం ఏయిర్పోర్టు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం
-
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లాలోని గన్నవరంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కారులో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు వంద కిలోల గంజాయిని కేంద్ర ప్రత్యేక బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక సెయింట్‌జాన్స్ హైసూ్కల్ సమీపంలోని విద్యానగర్‌లో ఓ ఇంటిని ప్లాస్టిక్ వస్తువుల విక్రయ వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం మూడు నెలల క్రితం అద్దెకు తీసుకుంది. వీరి ఇంటికి గురువారం రాజస్థాన్‌కు చెందిన నలుగురు యువకులు కారులో వచ్చారు. ఆ కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం దాడి చేసింది. అయితే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నలుగురు యువకుల్లో.. అధికారుల రాకను గమనించి ఇద్దరు గోడ దూకి పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ ఇద్దరు యువకులను, గంజాయి ఉన్న కారును విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. ‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
గన్నవరంలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం
-
చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఆదివారం ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడంటూ దుయ్యబట్టారు. ‘‘గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. పేదలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వారిని విమర్శించడానికి సిగ్గుశరం ఉండాలి’’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్! -
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్‌లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్‌పాస్‌లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్‌లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్‌పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్‌లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్‌పాస్‌ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
‘ఈనాడు’ పైత్యం: అటకాయించడమే కాక.. ఎదురుదాడా!?
హనుమాన్ జంక్షన్ రూరల్: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉంది ఈనాడు పైత్యం చూస్తుంటే. చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు విధులు నిర్వర్తించినప్పటికీ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిపై ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పడక గదిలోకి చొరబడి దౌర్జన్యం’ అంటూ ఆ పత్రిక మంగళవారం సంచికలో అచ్చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి.. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణిని అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులపై నిందితురాలి కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఆమెను అరెస్టుచేసేందుకు వచ్చినట్లు ఎస్ఐ జి. రమేష్‌బాబు వారికి చెప్పారు. కానీ, ఈ సమయంలో సాయికల్యాణి కుటుంబ సభ్యులు ఎస్ఐతో పాటుగా వచ్చిన మహిళా కానిస్టేబుళ్లపై దురుసుగా వ్యవహారిస్తూ నానా దుర్భాషలాడారు. అరెస్టుకు సహాకరించాల్సిందిగా ఎస్ఐ రమేష్‌బాబు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులపై ఆమె కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సాయికల్యాణిని అరెస్ట్‌చేసి తీసుకువెళ్లేందుకు యత్నించిన పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు. ఇలా దాదాపు గంటసేపు అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులకు చుక్కలు చూపించారు. చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు అయినప్పటీ ఎంతో ఓర్పుతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహారించిన పోలీసులు ఆమె దుస్తులు మార్చుకుని, బ్రష్ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కానీ, ఈనాడు పత్రిక ఈ వివరాలేమీ ప్రస్తావించకుండా ఏకపక్షంగా పోలీసుల తీరును అభ్యంతరకర రీతిలో విమర్శించడం శోచనీయం. అయినా, తప్పు చేసిన వారి కోసం పోలీసులు ఎక్కడైనా వెతుకుతారు. ఇందులో తప్పేముంది?. -
టీడీపీకి బిగ్ షాక్.. మహిళా నేత కల్యాణి అరెస్ట్
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలో పట్టాభితో పాటు ఆమె కూడా అల్లర్లు సృష్టించి సీఐని గాయపరిచిన ఘటనలో కల్యాణిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ రాకపోవడంతో కల్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కల్యాణి హనుమాన్ జంక్షన్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కల్యాణి పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు. -
తొలిరోజే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన కువైట్ సమ్మర్ సర్వీస్
సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్ఇండియా సర్వీస్‌ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎయిర్ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్‌కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్‌కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదంటూ ఎయిండ్ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ..గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఈ కువైట్ సమ్మర్ సర్వీర్ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్‌ను ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్‌కు ఎయిర్ ఇండియాను నడపనున్నారు. (చదవండి: 162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ) -
రూ.46 కోట్లతో వైఎస్సార్ విత్తన పరిశోధన కేంద్రం
సాక్షి,గన్నవరం: రాష్ట్రంలో మొదటిసారిగా రూ.46 కోట్లు వ్యయంతో కృష్ణాజిల్లా గన్నవరంలోని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంస్థ ఆవరణలో నిర్మిస్తున్న వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సింహాద్రి రమేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ ఇప్పటివరకు విత్తన పరిశోధన కేంద్రం జాతీయస్థాయిలో వారణాసిలో మాత్రమే ఉందన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించడం రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని ఏడాదిలోపు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన, అన్ని వాతావరణాలను తట్టకుని మంచి దిగుబడులిచ్చే విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ జె.రాఘవరావు, ఏఎంసీ చైర్మన్ రామిశెట్టి అంజనీకుమారి, ఎంపీపీ అనగాని రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య: ఎమ్మెల్యే వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా. ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచాడు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించింది. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవు. సినిమాలో అన్నీ డూపులు అమర్చినట్లు వారి మాటలు కూడా డూపులే. సినిమాకి, రాజకీయానికి చాలా తేడా ఉంటుంది’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చదవండి: సీఎం జగన్ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు.. -
పట్టాభీ.. ఏంటిది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అన్నీ ఇలాగే చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా భ్రష్టుపట్టింది కాదని కూడా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అంతేనా! గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదలచేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాటవరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించకపోవడం పరిశీలనాంశం. గన్నవరం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని జిల్లా నాయకులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నాయకుల పనితీరునూ తూర్పారపట్టిన ఆయనకు ఆ తరువాత పలు విషయాల గురించి తెలియవచ్చింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు కొందరు కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న అంశాలను, అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణ పరిణామాలను ఏకరువు పెట్టడంతో పాటు సీనియర్లుగా తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు మీకిలాంటివి ఏమీ పట్టలేదని, అప్పుడే కొంతయినా సరిచేసి ఉంటే ఇంతలా పరిస్థితులు ఇప్పుడు తలెత్తేవి కావని అనడంతో చంద్రబాబు కూడా మౌనం వహించారని తెలిసింది. ముఖ్యమంత్రిని ఇతర నాయకులను ఇష్టానుసారం పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పడంతో తమ నాయకుడు మారుమాట్లాడలేదని సమాచారం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే.. బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా పార్టీ ఆదేశిస్తే తానే పోటీచేస్తానంటూ పట్టాభి ఇష్టానుసారం మాట్లాడటంతో నియోజకవర్గానికి చెందిన వారు కూడా అంటీముట్టనట్లు ఉన్నారని విశ్లేషించారు. తనంతట తాను గొప్ప నాయకునిగా పోల్చుకుంటూ రాష్ట్ర, జిల్లాలోని సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, కేశినేని నాని కార్యాలయంలో ఉంటూ పలు ఆరోపణలను ఎదుర్కోవడం, వివాదాలకు కారకుడనే గుర్తింపు తెచ్చుకోవడం తదితరాలతో పాటు పట్టాభి గతంలో అమెరికాకు వెళ్లి ఎన్ఆర్ఐల వద్ద పార్టీపేరు చెప్పి స్వీయ ప్రయోజనాలు పొందారని వివరించడంతో, అవునా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. ‘పట్టాభి గురించి తెలియాల్సిన అంశాలన్నీ మా సార్‌కు ఇప్పటికి తెలిసొచ్చాయి. అతను అంత యూజ్లెస్ నా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో ముందే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అతని మాటలవల్లే కదా మంగళగిరి, గన్నవరంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి’ అని ప్రస్తావనకు వచ్చిందని ఓ సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? మొత్తం డైవర్ట్ అయిపోయిందిగా. పార్టీ కూడా బాగా బదనాం అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టాభికి సంబంధించిన ఆ పాత ఫొటోలు ఎవరు పోస్ట్ చేశారో.. అన్నివిధాలా చాలా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యనాయకుల వద్ద బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పట్టాభి పేరు కూడా లేదాయె... ‘గన్నవరం విధ్వంసం– ప్రజలకు బహిరంగ లేఖ’ అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల ఆ లేఖలో పట్టాభి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా పేరు మాత్రం రెండు చోట్ల ప్రముఖంగా ఉంది. దీన్నిబట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టమైపోతోందని విజయవాడకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యవహార శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేషన్ కమిటీని అధిష్టానం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో తక్షణం నియమించినట్లు స్పష్టమవుతోంది. -
పట్టాభి ఎందుకు రెచ్చిపోయారు?.. టీడీపీలో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీలు అంటే వెన్నెముక. వెనుకబడిన వర్గాల వారు కాదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఆ వర్గాలను అదే స్థాయిలో చూస్తున్నారు. పదవుల అంశంలో అంతే ప్రాధాన్యమిస్తున్నారు. బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్ సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆదరణ లభిస్తోంది. ‘మరి మన పార్టీలో ఏం జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది. బీసీలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు. మాటలతో మనం ఇంకెంత కాలం మభ్యపెట్టగలం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఆ పార్టీకి చెందిన సీనియర్లు వాపోయారు. గన్నవరంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ వర్గాల ముఖ్యనేతల అంతర్గత చర్చల్లో వచ్చిన అంశాలు అధినేత చెవికి చేరాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తక్షణ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ‘గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తగుదునమ్మా అంటూ నేను వస్తున్నా. నేనే పోటీచేస్తా అంటూ పట్టాభిరాం అక్కడకు ఎలా వెళతారు. అర్జునుడు బీసీ వర్గానికి చెందినందునే అంత ధీమాగా, బహిరంగంగా ఆయన చాలెంజ్ చేయగలిగారు. అదే పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు అక్కడ ఇంచార్జిగా ఉన్నట్లయితే ఆ మాట అనగలిగే వారా? సామాజికవర్గం అండ చూసుకునే రెచ్చిపోయారు. మీ దన్ను అంతలా ఉండబట్టే పట్టాభి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది పార్టీలో మెజార్టీ అభిప్రాయం’ అని టీడీపీ సీనియర్లు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారనేది సమాచారం. ‘క్యాడర్, క్యారక్టర్ ఏవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడిన వారికి పదవులు ఇచ్చేస్తారనేది ముఖ్య శ్రేణులు భావిస్తున్నాయి. మంగళగిరి, గన్నవరం పార్టీ ఆఫీసులపై దాడులు ఎవరివల్ల జరిగాయి? ఎందువల్ల జరిగాయో మీరే విశ్లేషించుకోండి’ అని పార్టీ నాయకులు అనడంతో బాబు ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. అయినా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. గన్నవరంలో పార్టీకి ఏదైనా సమస్య ఉందని భావిస్తే అర్జునుడు తీవ్ర అస్వస్థతో ఉన్నందున కొనకళ్ల, కొల్లు, లేదా బచ్చుల కుమారుడు, మరెవరినైనా సీనియర్లను అక్కడకు పంపి ఉండవచ్చు. కానీ పట్టాభిని పంపి రెచ్చగొట్టించడాన్ని బట్టి బీసీలంటే మీకు చిన్నచూపు ఉందనే భావన ప్రజల్లోకి, పార్టీ క్యాడర్‌లోకి బాగా వెళ్లిపోయిందని వివరించడంతో బాబు కంగుతిన్నారని సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. బీసీల గురించి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఎంతమేరకు ఉందనేది బేరీజు వేసుకుంటున్నారని కూడా అన్నారనేది సమాచారం. మాటలు చెపితే సరిపోదు... ‘ఎమ్మెల్సీల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతపై మా వెనుకబడిన వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అంతకుముందు కూడా వివిధ పదవుల్లో దక్కిన ప్రాధాన్యతను ఇప్పటికే గుర్తించారు. ఇక నుంచి మీకు మేమంత చేశాం.. ఇంత చేసేశాం.. అని టీడీపీ చెపితే వినే దశలో బీసీ వర్గాలు లేవు. అన్నీ విశ్లేషించుకుంటున్నాయి. గణాంకాలతో సహా ముఖ్యులకే పాఠాలు అప్పజెపుతాయి’ అని విజయవాడకు చెందిన బీసీ ముఖ్య నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. గన్నవర్గానికి కో– ఆర్డినేటర్ కమిటీ చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కమిటీని నియమించారు. కమిటీ కో–ఆర్డినేటర్‌గా కొనకళ్ల నారాయణ, సభ్యులుగా బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురికి చోటు కల్పించారు. సీఐ కనకారావుపై చేసిన దాడిని పోలీసువర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయని. టీడీపీ అల్లరిమూకలు ఇంతలా బరితెగిస్తాయని అనుకోలేదని వారంటున్నారని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సంఘటన జరిగినప్పుడు గాయం తీవ్రత బాగా తెలిసిందని, ఏడు కుట్లు పడ్డాయని వివరించారు. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? -
అచ్చెన్నాయుడు చిట్టా విప్పుతా.. ఎమ్మెల్యే వంశీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ‘‘చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు బాధలో ఉన్నాయని.. అందుకే కావాలని గోబెల్ ప్రచారం చేస్తున్నాయి’’ అంటూ వంశీ దుయ్యబట్టారు. ‘‘చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు. పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు.. ఓ మహిళా ఆఫీసర్‌పై అసభ్యంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు నా గురించి మాట్లాడితే చిట్టా విప్పుతా.. చంద్రబాబు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం జగన్.. అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది? -
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకారావుపై రాళ్లతో దాడి చేసి గాయపరచడంతోపాటు హత్యాయత్నానికి అనుచరులను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధవారం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుపరచాలని జడ్జి శిరీష పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు. పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్ సర్టిఫికెట్‌పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే సబ్ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీరందరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్ యూనస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితోపాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. -
ఏపీ కొత్త గవర్నర్‌కు ఘనస్వాగతం పలికిన సీఎం జగన్
-
జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు, మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా, ఎస్పీ పి. జాషువా, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పట్టాభిని కొట్టారంటూ ఈనాడు తప్పుడు రాతలు
-
అడ్డంగా బుక్కైన ‘ఈనాడు’.. ఫేక్ వార్తల్లో పచ్చ మీడియా స్టైలే వేరు!
అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్ సర్కార్‌పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్ సర్కార్‌పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్లో.. రామోజీ యాక్షన్‌లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం. టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్ చేసి సీఎం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్‌గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది. -
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆత్మీయ వీడ్కోలు
-
గన్నవరం: సీఐపై దాడి కేసులో 10 మంది టీడీపీ నేతలకు రిమాండ్
గన్నవరం/నాగాయలంక (అవనిగడ్డ)/కోనేరుసెంటర్/పటమట/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లా గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పి.కనకారావును కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచిన కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి, పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. గన్నవరంలో సోమవారం టీడీపీ నేతలు సృష్టించిన ఘర్షణకు సంబంధించి పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. ఒకటి ఎమ్మెల్యే అనుచరులపై నమోదైంది. పట్టాభి తనను కులం పేరుతో దూషించడమేగాక ఆయనతోపాటు దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు మరో ఎనిమిదిమంది తనను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతోపాటు చంపేవిధంగా అనుచరులను ప్రేరేపించారని సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమను నెట్టేసినట్లు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కుండేటి రఘుబాబు, మేకల కోటేశ్వరరావు, కొలుసు వరప్రసాద్ తదితరులపై ఎస్ఐ రమేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదైంది. టీడీపీ నేతలు పట్టాభి, మూల్పూరి కళ్యాణి, కోనేరు సందీప్, గూడవల్లి నరసయ్య, జాస్తి వెంకటేశ్వరరావు తనను కులం పేరుతో దూషించినట్లు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు యతేంద్రరామకృష్ణ, మోహన్‌రంగా తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు టీడీపీ నేత దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై దాడికేసులో.. సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు పట్టాభి, చిన్నా, వీరంకి గురుమూర్తి, లావు వంశీకృష్ణ, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, చల్లగుళ్ల సందీప్, గురివిందగుంట దేవేందర్, ముప్పరాజు కార్తీక్, గుజ్జర్లపూడి బాబూరావు, కంచర్ల సూర్యప్రకాష్‌లను అరెస్ట్‌చేసి మంగళవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి తనను పోలీసులు కొట్టినట్లు ఆరోపించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి బి.శిరీష పోలీసులను ఆదేశించారు. మిగిలిన పదిమందికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మిగిలినవారిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. పోలీసులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం గన్నవరం ఘటనకు సంబంధించి మచిలీపట్నం, నాగాయలంకల్లో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గన్నవరం నుంచి తొమ్మిదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్నవరం టీడీపీకి చెందిన ఒక న్యాయవాది తొమ్మిదిమంది అనుచరులతో అక్కడికి వెళ్లి భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి పోలీసులు నిర్భంధించిన తొమ్మిదిమంది నాయకులు, కార్యకర్తలను కారుల్లో తప్పించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ జాషువ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జీపీఎస్ ద్వారా తప్పించుకున్న వారిని వెంబడించి నిమిషాల వ్యవధిలో న్యాయవాదితో సహా అందరినీ పట్టుకుని బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వాణి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను సోమవారం అర్ధరాత్రి నాగాయలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. బోడెని చూసేందుకు అనుమతించాలంటూ సీఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ మహిళా నేత తలశిల స్వర్ణలత, కొందరు తెలుగు తమ్ముళ్లు సచివాలయ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా మాట్లాడారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ స్టేషన్లో బోడెను పరామర్శించారు. బోడె ప్రసాద్‌ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసులతో పట్టాభి భార్య వాగ్వాదం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టాభి ఇంటివద్ద మంగళవారం ఆయన భార్య చందన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె నిరపరాధి అయిన తన భర్తను విడుదల చేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమె పోలీసులతో పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి పలువురు టీడీపీ నేతలు పట్టాభి ఇంటిపైకెక్కి ఆందోళన చేపట్టారు. పట్టాభి కుటుంబ సభ్యులను మంగళవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం టీడీపీ నాయకుడు పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని ఎస్పీ పి.జాషువ చెప్పారు. ఆయన దాడికి ప్రేరేపించడంతోనే సీఐ కనకారావు గాయపడ్డారని తెలిపారు. మచిలీపట్నంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై దాడికి సంబంధించి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. సుమోటోగా రైటింగ్, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వారి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును మంగళవారం పోలీసుల సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు జయపాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్తాన్‌ఖాన్ పరామర్శించారు. -
రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ
‘‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళతా!. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి తేలుస్తా. నియోజకవర్గంలోంచి బయటకు విసిరేస్తా’’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముందు రెచ్చగొట్టింది... టీడీపీ నాయకుడు పట్టాభి. ‘‘దొంతు చిన్నా ఇంటికి వచ్చి వంశీ మనుషులు బెదిరించారని మీరంతా కేసు పెట్టండి. నేనూ వస్తా. వంశీ సంగతి తేలుస్తా’’ అని గన్నవరం టీడీపీ నేతలతో చెప్పింది... పట్టాభి. అన్నట్టుగానే వెళ్లాడు. తనతో పాటు కొంతమందిని అక్కడికి తీసుకువెళ్లటంతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులను కూడా వెంటేసుకుని... దండయాత్రకు బయలుదేరాడు. అక్కడ అలజడి సృష్టించబోయాడు. వంశీ అనుచరులు, అభిమానులు దీన్ని అడ్డుకోబోయారు. అప్పుడే ఇరువర్గాలకూ ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేతలు ముందే ఘర్షణకు సిద్ధమై మారణాయుధాల్లాంటి పరికరాలు తీసుకెళ్లటం వల్లే... స్థానిక సీఐ కనకారావు నుదుటిపై తీవ్ర గాయమైందనేది ప్రత్యక్ష సాక్షుల మాట. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో తెలుసా? బాధితులను పరామర్శించటానికంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన అనుకూల మీడియా రభస మొదలెట్టింది. మొత్తానికి అందరూ కలిసి... అసలిక్కడ ప్రజాస్వామ్యమే లేదంటూ ఆక్రందనలు మొదలుపెట్టారు. అదీ కథ. (సాక్షి ప్రతినిధి, విజయవాడ): అసలిక్కడ బాధితులెవరు? చంద్రబాబు నాయుడు ఓదార్చాల్సింది ఎవరిని? ఓదార్చటం కన్నా ముందు తెలుగుదేశం నేతల్ని మందలించాలి కదా? ఇలాంటి సవాళ్లు, బెదిరింపులు రాజకీయాల్లో సరికాదని చెప్పాలి కదా? గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన బచ్చుల అర్జునుడు దురదృష్టవశాత్తూ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో చేరితే... ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత అత్యుత్సాహం తగదని పట్టాభికి చెప్పాలి కదా? అవేమీ లేకుండా పట్టాభికి తోడుగా మీరంతా ఎందుకు వెళ్లలేదని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడే క్లాసు తీసుకున్నారంటే ఆయన మానసిక స్థితిని ఎలా అంచనా వేసుకోవాలి? రాజకీయ పునర్వైభవం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనేగా అర్థం!!. పట్టాభి కూడా అంతే. అవును మరి! ఆవు చేలో మేసినపుడు దూడ గట్టున మేస్తుందా!!? విజయవాడే కాదు. కృష్ణా జిల్లాలో అందరికీ ఇటీవల సంకల్పసిద్ధి అనే ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసం గురించి తెలిసే ఉంటుంది. నిర్వాహకులను పట్టుకోవటంతో పాటు పోలీసులు కేసులూ పెట్టారు. అయితే దాన్ని అదునుగా తీసుకున్న తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా సంకల్పసిద్ధి నిర్వాహకులతో సంబంధం ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు ఆ సంస్థ వివరాలు గానీ, నిర్వాహకుల ఊరూపేరూ గానీ ఏమీ తెలియవని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయినా సరే తెలుగుదేశం నేతలు తమ విమర్శలు కొనసాగిస్తుండటంతో... దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు వల్లభనేని వంశీ. కాకపోతే దీన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎగతాళి చేశారు. అసలు వంశీకి పరువంటూ ఉంటే కదా... కేసులు వెయ్యాల్సింది? అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వంశీని విమర్శిస్తూ... ఆయన సంగతి తేలుస్తానని టీడీపీ నేత దొంతు చిన్నా ఆవేశంతో ఊగిపోయాడు. ఇదిగో... ఇదే కారణంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి ఆయన లేకపోవటంతో... ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, నోరు అదుపులో ఉంచుకోమని ఆయనకు చెప్పాలంటూ చిన్నా భార్యతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న పట్టాభి... దీన్నో అవకాశంగా మార్చుకుని అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారు. విజయవాడ నుంచి మనుషులను తీసుకుని వెళ్లి మరీ అక్కడ వారందరితో కలిసి ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే బాధితులు వెళితే సరిపోదా? ఇన్ని వందల మంది ర్యాలీగా వెళ్లాలా? అలా వెళ్లారంటే ఏమిటర్థం? వాళ్లు వెళ్లింది దండయాత్రకనేగా? క్లుప్తంగా గన్నవరంలో ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఇవే. సోమవారం టీడీపీ మూక పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా ఇరు వర్గాలూ ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చల్లబరిచారు. తరవాత టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ముందే పగలగొట్టిన నాపరాళ్లతో పాటు చేతికందిన కర్రలు, రాడ్లు సిద్ధం చేసుకున్నారు. అంతలో అటుగా వెళుతున్న వంశీ అనుచరులను చూసి రెచ్చగొట్టేలా అరవటంతో... అక్కడ ఇరువర్గాలూ ఘర్షణకు దిగాయి. వీరిని వారించబోయిన పోలీసులకూ టీడీపీ నేతల చేతిలో గాయాలయ్యాయి. ఎస్పీ జాషువా అప్రమత్తంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అదీ జరిగిన కథ. దూషణల్లో నెంబర్–1 చంద్రబాబే... వాస్తవానికి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరందరిలోనూ చంద్రబాబే ముందుంటూ... ఎక్కడకు వెళ్లినా, ఏ సభలోనైనా పదుల సార్లు ‘సైకో’ అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర దూషణకు దిగుతున్నారు. అదే కోవలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలకు, జీతగాళ్లకు కూడా చెబుతున్నారు. ఏ చిన్నఘటన జరిగినా వారిని ఉసిగొల్పుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయిస్తున్నారు. తనకు వంత పాడే మీడియా సహకారంతో అధికార పార్టీనే తిరిగి వేలెత్తి చూపిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పాలనలో వేలెత్తి చూపే అంశాల్లేక... ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లక ఇలాంటి రచ్చకు దిగుతున్నారనేది తెలియనిదేమీ కాదు. ఈ నెలలోనే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలో మూడు ఘటనలు జరిగాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. చిన్న విషయాలను పెద్దవి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. మచిలీపట్నం, గుడివాడలోనూ.. మచిలీపట్నంలో ఈ నెల 7న ఇదే విధంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. నిబంధనలు పాటించాలని కోరిన పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకొంటామంటూ రవీంద్ర కార్యకర్తలతో కలిసి వచ్చి అమలులో ఉన్న 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘించారు. పోలీసులు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతుందని, ధర్నాకు అనుమతి లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. దీంతో రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ, దుర్భాషలాడుతూ, నడి రోడ్డులో ఎస్సైపై చెయ్యి చేసుకున్నారు. ఆ మరునాడే గుడివాడలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మునిసిపల్ అధికారులకు వేలు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయారు. కోర్టు ఆదేశాలను అడ్డుకోవడం నేరమని చెప్పిన పోలీసులు, అధికారులపై జులుం ప్రదర్శించారు. -
గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్..
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన 10 మందిని రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులకు న్యాయమూర్తి సూచించారు. కాగా గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
బిగ్ క్వశ్చన్: గన్నవరంలో అసలు జరిగింది ఏంటి?
-
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
గన్నవరం రణరంగం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టాభి వీరంగం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఆ పార్టీ నియోజకవర్గ నేతలు పక్కా వ్యూహంతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వంశీ అభిమానులు, అనుచరులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో వారు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పట్టాభి పలు అసత్య ఆరోపణలు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా వేశారు. దీంతో మూడు రోజులుగా ఎమ్మెల్యేను టార్గెట్‌గా చేసుకుని పట్టాభితో పాటు స్థానిక టీడీపీ నేతలు మీడియా సమావేశాల్లో విమర్శలను, ఆరోపణలను తీవ్రతరం చేస్తూ రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం సోమవారం గన్నవరం వచ్చిన పట్టాభి.. మరోసారి ఎమ్మెల్యేను తిడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అప్పటికే ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశానికి, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ర్యాలీగా ఆ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. వీరిపై టీడీపీ నేతలు రాళ్లు విసురుతూ. జెండా కర్రలతో దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నేతలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టీడీపీ నేత విసిరిన రాయి తగలడంతో సీఐ పి.కనకారావు తలకు బలమైన గాయమైంది. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఏడు కుట్లు వేశారు. డీఎస్పీ కె.విజయపాల్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను ఆక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు పట్టాభి రెచ్చగొట్టడం వల్లే.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గన్నవరంలో ఓ గుంపును వెనకేసుకుని తిరుగుతూ వారిని రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఉద్దేశ పూర్వక దాడికి దిగడం ద్వారా వారిని నియంత్రించి, వంశీ వర్గీయులపై తీవ్ర దాడికి కుట్ర పన్నారని తెలిపారు. గన్నవరానికి చెందిన వారు కాకుండా, బయటి నుంచి ఇతరులను రప్పించి దాడికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. టీడీపీ కార్యాలయంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వంద మందితో గుంపుగా మోహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ఇందుకు నిదర్శనం. నా పని నేను చేసుకుంటున్నా.. గన్నవరం నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతూ నా పని నేను చేసుకుంటున్నా. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సంకల్పసిద్ది మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు సంబంధించి ఆధారాలు లేకుండా నాపై అత్యంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ నేను ఎంతో సంయమనంతో వ్యవహరించాను. ప్రత్యక్ష గొడవల జోలికి పోకుండా న్యాయం కోసం వారిపై కోర్టులో కేసు వేశాను. కొంత మంది కిరాయి జీతగాళ్లు వారి జీతం పెంచుకోవడం కోసం.. ఏరా.. ఒరేయ్.. బోస్డికే.. అంటూ ఇక్కడికొచ్చి నన్ను అతి దారుణంగా తిడుతుంటే నన్ను అభిమానించే వారికి బాధేసింది. అందుకు నిరసన తెలుపుదామని వెళ్లిన వారిపై దాడికి పాల్పడ్డారు. బయట నుంచి టీడీపీ నాయకులు వచ్చి గన్నవరం ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? ఇక్కడ టీడీపీ నాయకులు లేరా? – మీడియాతో వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే -
చంద్రబాబు చరిత్ర నాకు మొత్తం తెలుసు: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా: గన్నవరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాక్షిటీవీతో మాట్లాడారు. తరచూ తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. టీడీపీ వెబ్ సైట్, సోషల్ మీడియాలలోనే తన కుటుంబసభ్యులపై అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంశీ. చంద్రబాబు చరిత్ర నాకు, కొడాలి నానికి మొత్తం తెలుసు. అందుకే మాపై చంద్రబాబు పెంపుడు కుక్కలతో మొరిగిస్తున్నాడు. బుద్ధా వెంకన్నకు స్థాయి లేదు.. అలాంటివారిని పట్టించుకోను. గన్నవరంలో నన్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కేవలం మా అనుచరులే దాడికి పాల్పడినట్టు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. సంకల్పసిద్ధితో నాకు సంబంధం లేదని ఆకేసుపై విచారణ జరపాలని నేనే డీజీపీకి ఫిర్యాదు చేసాను అని వంశీ తెలిపారు. గన్నవరంలోకి బయటివాళ్లు వచ్చి గొడవ పెట్టారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎక్కడివారో వచ్చిన ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటని? నిలదీశారాయన. అక్కడ జరిగే ప్రతీ సంఘటనతో నాకు సంబంధం లేదని వంశీ చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. -
గన్నవరంలో టీడీపీ నాయకుల అత్యుత్సాహం.. వంశీపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు
-
గన్నవరంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
గన్నవరం(కృష్ణాజిల్లా): టీడీపీ కార్యకర్తలు మరోసారి ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో సీఐ కనకారావుకు గాయాలయ్యాయి. మరొకవైపు గన్నవరం రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. వాహనాలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వంశీని అసభ్య పదజాలంతో దూషిస్తూ టీడీపీ కార్యకర్తలు ఘర్షణ వాతావరణానికి ఆజ్యం పోశారు. గన్నవరం పీఎస్ వద్ద కూడా వంశీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేసి ఓవరాక్షన్ చేశారు. దాంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్‌కు వచ్చారు. అయితే టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. -
సంకల్ప సిద్ధి కేసులో టీడీపీ అసత్య ఆరోపణలు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: సంకల్ప సిద్ధి కేసుతో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ముడిపెట్టి టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి దోషులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డీజీపీకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సునీల్, పోలీస్ కమిషనర్ టీకే రాణా పేర్లను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. సీఐడీ విచారణను చెంచా విచారణ అని సంబోధించడం పట్టాభి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించినట్టు గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న పట్టాభికి లిఖిత పూర్వకంగా నోటీసులు ఇచ్చామన్నారు. పట్టాభిపై కేసు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. (చదవండి: ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు ) -
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఎమ్మెల్యే వంశీ ఆపన్నహస్తం
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. నాకు బతకాలని ఉంది.. నా ప్రాణాలు కాపాడండి..’ అంటూ ఓ మహిళ కన్నీటితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను వేడుకుంది. చలించిన ఆయన తాను న్నానంటూ ఆమె భరోసా ఇచ్చారు. అతిక్లిష్టమైన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయటంతో పాటు, అందుకు అయ్యే ఖర్చును భరించారు. బాపులపాడు మండలం హనుమాన్జంక్షన్కు చెందిన దుట్టా ఉదయ కిరణ్ రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పావని (22), ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతే డాది గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పావని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఎడమవైపు పుర్రె భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో పావనిని కుటుంబ సభ్యులు ఎనికేపాడులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి వైద్యులు రెండు సార్లు పావని బ్రెయిన్‌కు ఆపరేషన్లు చేశారు. తలలో దెబ్బతిన్న పుర్రె భాగాన్ని శస్త్రచికిత్స చేసేందుకు కొద్దిరోజులు భద్రపరిచినా, ఆ తర్వాత పూర్తిగా దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కృత్రిమ పుర్రె (ప్లాస్టిక్ సింకుల్) అమర్చాల్సి ఉందని, ఈ సర్జరీ తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు కావటంతో ఉదయకిరణ్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దకు వెళ్లి తన ప్రాణాలు కాపాడాలని పావని కన్నీటి పర్యంతమైంది. చిన్న వయస్సులో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే వంశీమోహన్ తనకు తెలిసిన కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాల్సిందిగా సూచించారు. పావని తలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వైద్యులు ఆమె తలలో కొప్పా త్రీడీ టెక్నాలజీతో కూడిన కృత్రిమ పుర్రె భాగాన్ని పెట్టి, దానిలో మెదడును అమర్చితే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు తెలిపారు. పుర్రె తయారీకి రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ తక్షణమే అందించి, ప్రత్యేకంగా పుర్రె భాగాన్ని సిద్ధం చేయించారు. త్వరలోనే పావని తలకు ఆపరేషన్ పూర్తి చేసి పుర్రె అమర్చనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. -
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో " స్ట్రెయిట్ టాక్ "
-
తిప్పనగుంటలో టీడీపీ నేతలకు చుక్కెదురు
-
‘ఇంటింటికీ’లో టీడీపీకి షాక్! బచ్చుల, చింతమనేని బృందానికి చేదు అనుభవం
హనుమాన్ జంక్షన్ రూరల్: ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నేతలపై మహిళలు మండిపడుతున్నారు.కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. బచ్చుల అర్జునుడుతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించటంపై గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటూ ఎమ్మెల్సీ అర్జునుడిని గ్రామానికి చెందిన కొలవెంటి లక్ష్మీతో పాటు పలువురు నిలదీశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామ అభివృద్ధితో పాటు తమకు ఏ ఇబ్బంది వచ్చినా వంశీనే ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బచ్చుల అర్జునుడు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆమెను వారించేందుకు ప్రయత్నించడంతో ‘మీరు ఏం చేశారు? వస్తున్నారు.. వెళ్తున్నారు.. ! మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు’ అని మహిళలు విరుచుకుపడటంతో టీడీపీ నేతలు నిష్క్రమించారు. -
కార్యకర్తతో బూట్లు తొడిగించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ
సాక్షి, విజయవాడ: బీసీలను ఉద్ధరిస్తామని, కార్యకర్తలే తమ బలమని ప్రగల్భాలు పలికే టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మాటల్లో మినహా.. చేతల్లో బీసీలన్నా, కార్యకర్తలన్నా వారికి చులకనే. ఇటీవల బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగిన ఓ ఘటన కార్యకర్తలను ఔరా! అనిపించింది. టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ‘ప్రతి ఇంటికి తెలుగుదేశం’ పేరుతో ఈ నెల 19న మల్లవల్లిలో పర్యటించారు. ఓ కార్యకర్తతో తన షూస్ తొడిగించుకున్న ఘటన అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ నాయకులు ఈ రకంగా వ్యవహరించటం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు చర్చించుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. చదవండి: (రాజకీయ జీవితంపై గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు) -
పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి..
గన్నవరం(కృష్ణా జిల్లా): వివాహితను వేధింపులకు గురిచేస్తున్న మాజీ ప్రేమికుడిపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని దావాజీగూడేనికి చెందిన యువతికి కళాశాలలో చదువుకునే రోజుల్లో కర్నూలుకు చెందిన సహ విద్యార్థి విక్రమ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే పెద్దలు కుదిర్చిన సంబంధం మేరకు ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమ్ గతంలో ఆమెతో దిగిన సెల్పీలు, ఫొటోలను ఆమె అత్తమామల సెల్‌ఫోన్‌కు పంపించి వేధిస్తున్నాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. చదవండి: ఏడేళ్లగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్‌కు ఫోన్ చేస్తే.. -
Self Defence: ఆగంతకుడు ఎదురుగా ఉంటే... వెనుక నుంచి వస్తే ఏం చేయాలి?
గాంధీజీ ఆకాంక్ష ఇది. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిరోడ్డు మీద ధైర్యంగా సంచరించగలిగిన రోజు మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు... అని ఆకాంక్షించాడు బాపూజీ. అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడానికి స్త్రీ ధైర్యం చేస్తోంది. కానీ సంస్కారం లోపిస్తున్నది మగవాళ్లలోనే. అయితే మహిళ ఒకప్పటిలాగా ఉండడం లేదు. ఆకతాయి మగవాళ్లు ఏడిపిస్తారని ముడుచుకు పోవడం లేదు. ఏడిపించిన వాళ్ల దేహశుద్ధి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇందుకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఉదంతమే. ఆమె డ్యూటీ ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తోంది. ఓ యువకుడు ఆమె బైక్‌ను ఆపాడు. అతడి దుర్మార్గపు ఆలోచనను కని పెట్టింది. అయితే ఆమె భయంతో బిగుసుకుపోలేదు, పారిపోయే ప్రయత్నమూ చేయలేదు. రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని ఆ యువకుడిని చితక్కొట్టింది. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాల’ని సమాజం నుంచి ప్రశంసలందుకుంటోంది. ‘ఆడపిల్ల ఒద్దికగా తల వంచుకుని వెళ్లాలి’ అనే కాలదోషం పట్టిన సూక్తిని తిరగరాసింది. ఈ ఆధునిక సమాజంలో మనగలగాలంటే ఆడపిల్ల ఎలా ఉండాలో... చెప్పడానికి తానే రోల్‌మోడల్‌గా నిలిచింది. మగవాడు సాహసం చేస్తే హీరో, మహిళ సాహసం చేస్తే షీరో. ‘‘ప్రతి ఒక్క బాలిక, మహిళ స్వీయ రక్షణ చిట్కాలను నేర్చుకుని తీరాలి. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌కి చాలా శక్తి కావాలని, ఆడపిల్లలు ఈ ప్రాక్టీస్ చేస్తుంటే లాలిత్యాన్ని కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా ఉండాల్సిన ఫిట్నెస్ చాలు. ఈ ప్రాక్టీస్‌తో దేహం శక్తిమంతం అవుతూ, ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది. నిజానికి ప్రమాదం ఎదురైనప్పుడు స్పందించాల్సింది మెదడు. ఈ ప్రాక్టీస్‌తో మెదడు చురుగ్గా ఉంటుంది. దాంతో తక్షణమే అప్రమత్తమై మెళకువలతో వేగంగా స్పందిస్తుంది. నైట్‌షిఫ్ట్‌లు, డ్యూటీలో భాగంగా బయట ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు తప్పనిసరిగా స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకుని తీరాలి. మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే... ఏదైనా సాధించగలమనే ధైర్యం కూడా వస్తుంది. ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ప్రాక్టీస్‌తో తమ మీద తమకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, అది ధైర్యానికి కారణమవుతుంది. ఆ ధైర్యం కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తుంది. గన్నవరం అమ్మాయిని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలి. ఆమె స్ఫూర్తితో మరికొంత మంది ప్రతికూల పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు’’ అన్నారు కరాటే చాంపియన్ సైదా ఫలక్. ఆమె తెలంగాణలో స్కూళ్లలో బాలికలకు స్వీయరక్షణ నేర్పిస్తున్నారు. పక్షులు, జంతువులు... స్త్రీపురుష భేదం లేకుండా వేటికవి తనను తాను రక్షించుకుంటాయి. మనిషికెందుకు ఈ తేడా? సమాజం విధించిన పరిధిలో కుంచించుకుపోవడం వల్లనే స్త్రీ బాధితురాలిగా మిగులుతోంది. అంతేతప్ప స్త్రీలో తనను తాను రక్షించుకోగలిగిన శక్తి లేక కాదు. దేహదారుఢ్యంలో పురుషుడికి సమానం కాకపోవచ్చు. కానీ తనను తాను పురుషుడికి దీటుగా తీర్చిదిద్దుకోవడంలో మాత్రం వెనుకబాటుతనం ఉండదు. సమాజం గీసిన అసమానత్వపు గిరిగీతను చెరిపేయడం మొదలుపెట్టింది మహిళ. ఇప్పటికే అనేక స్కూళ్ల నుంచి స్వీయరక్షణలో శిక్షణ పొందిన తరం బయటకు వచ్చింది. ఈ దారిలో మరికొంత మంది నడిచి తీరుతారు. గాంధీజీ కలలు కన్న సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మహిళలు నిశ్శబ్దంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఫలాలు సమీప భవిష్యత్తులోనే అందుతాయనడంలో సందేహం లేదు. ధైర్యం... ఆరోగ్యం! నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో తైక్వాండో క్లాసులు పెట్టారు. అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాలుగుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నాను. ప్రాక్టీస్‌కి ముందు తర్వాత తేడా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. మా నాన్న లేరు. అక్క, అమ్మ, నేను. బయట పనులు చక్కబెట్టుకుని రాగలిగిన ధైర్యం వచ్చింది. ‘ఆడపిల్ల కాబట్టి’ అని జాగ్రత్తలు నేర్పించే వయసులో మా అమ్మ నాకు తైక్వాండో నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే... ఈ ప్రాక్టీస్ వల్ల ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన కారణంగా ఎదురవుతున్న అనేక అనారోగ్యాల నుంచి కూడా దూరంగా ఉండగలుగుతాం. – కంభంపాటి లలితాకీర్తన, బీటెక్ స్టూడెంట్, కర్నూలు నన్ను నేను రక్షించుకోగలను! తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్, థర్డ్ డాన్ లెవెల్‌కు చేరాను. రాయలసీమలో ఈ స్థాయిని చేరుకున్న అమ్మాయిని నేను మాత్రమే. ఔరంగాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో మొదటి స్థానం నాది. దీనిని స్పోర్ట్‌గా చూడండి, మార్షల్ ఆర్ట్‌గా చూడండి. కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మరువద్దు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అమ్మాయిలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం సాధ్యం కాదు. అర్ధరాత్రి డ్యూటీ చేయలేమంటే కుదరదు. అంతేకాదు... విలువలు పతనమవుతున్నాయి కూడా. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ మెళకువలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే ఏ పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలననే ఆత్మవిశ్వాసం వస్తుంది. మహిళలు కూడా ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం అనుకోకూడదు. కనీసంగా కొన్ని టెక్నిక్లనైనా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ‘నన్ను నేను రక్షించుకోగలను’ అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. – జి. కెహితీ, కుకివోన్ తైక్వాండో నేషనల్ చాంపియన్, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ నేర్పిస్తూనే ఉన్నాను! తైక్వాండో నేర్పించడం నాకు వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతగా చేపట్టాను. ముప్పై ౖఏళ్లుగా ఐదువేల మందికి శిక్షణనిచ్చాను. ఈ యుద్ధవిద్యల్లో జపాన్ వాళ్లది కరాటే, చైనా వాళ్లది కుంగ్‌ఫూ, కొరియా వాళ్లది తైక్వాండో. మా అమ్మాయి పేరు కెహితి కూడా కొరియా పదమే. మా కొరియన్ మాస్టారి పట్ల గౌరవంతో ఆ పేరు పెట్టుకున్నాను. ఆడపిల్లల విషయానికి వస్తే ఈ మూడింటిలో తైక్వాండో అత్యుత్తమ స్వీయరక్షణ కళ. – జి. శోభన్‌బాబు, కుకివోన్ తైక్వాండో బ్లాక్‌బెల్ట్ సెవెన్త్ డాన్, వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆగంతకుడు ఎదురుగా ఉంటే... 1. హేమర్ స్ట్రైక్... చేతిలో ఉన్న వస్తువే ఆయుధం. బండి తాళం అయినా సరే. ఏమీ లేకపోతే చేతులే ఆయుధం. చేతిలో ఉన్న ఆయుధంతో సుత్తితో గోడకు మేకు కొట్టినట్లుగా ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. చేతిలో ఏమీ లేకపోతే పిడికిలి బిగించి దాడి చేయాలి. 2. గ్రోయిన్ కిక్... చేతులతో చేసిన దాడి సరిపోకపోతే కాళ్లకు పని చెప్పాలి. మోకాలి దెబ్బ ఆగంతకుడి కాళ్ల మధ్య తగలాలి. ఈ దాడితో చాలావరకు తాత్కాలికంగా దేహభాగం పక్షవాతం సోకినట్లు చచ్చుబడిపోతుంది. అతడు తేరుకునేలోపు పారిపోవచ్చు లేదా పోలీసులకు పట్టించవచ్చు. వెనుక నుంచి వస్తే... 1. ఆల్టర్నేటివ్ ఎల్బో స్ట్రైక్... ఇది ఆగంతకుడు వెనుక నుంచి దాడి చేసినప్పుడు ప్రయోగించాల్సిన టెక్నిక్. మోచేతిని భుజాల ఎత్తుకు లేపి దేహాన్ని తాడులా మెలితిప్పుతున్నట్లు తిరుగుతూ మోచేతితో ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. అతడు తేరుకునేలోపు వేగంగా మళ్లీ మళ్లీ దాడి చేయాలి. మోచేతితో దాడి చేస్తున్నప్పుడు పాదాన్ని దేహ కదలికకు అనుగుణంగా గాల్లోకి లేపి, దేహం బరువును మునివేళ్ల మీద మోపాలి. అప్పుడే మోచేతి అటాక్ సమర్థంగా ఉంటుంది. 2. ఎస్కేప్ ఫ్రమ్ ఎ ‘బేర్ హగ్ అటాక్’ ... ఆగంతకుడు వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నప్పుడు తప్పించుకునే మార్గం ఇది. రెండు మోచేతులను గాల్లోకి లేపి ఒకదాని తర్వాత మరో మోచేతితో ఆగంతకుడి ముఖం, దవడల మీద దాడి చేయాలి. అప్పుడు అతడి చేతులు వదులవుతాయి. అప్పుడు ఎదురుగా తిరిగి అరచేతిని చాకులాగ చేసి మెడ మీద కర్రతో కొట్టినట్లు దాడి చేయాలి. వెంటనే పిడికిలి బిగించి మెడ మీద గుద్దుతూ మరో చేతిని మెడ మీద వేసి అతడిని కిందపడేయాలి. దేహం మీద రకరకాలుగా దాడి చేసి శత్రువును నిర్వీర్యం చేయవచ్చు. నూటికి 81 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు యూఎస్‌లో ఓ సర్వేలో తెలిసింది. మహిళల రక్షణ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఓరేగాన్ సూచించిన కొన్ని స్వీయరక్షణ పద్ధతులివి. – వాకా మంజులారెడ్డి -
సీఎం జగన్ పాలనపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. అయన బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న పాలనకు అభినందనలు తెలిపారు. ఏపీ ఏం జరుగుతుందో తెలుసుకున్నానని, సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రిమార్కబుల్ అని తెలిపారు. డిజిటల్ లైబ్రరీ, రైతు భరోసా కేంద్రాలు, వికేంద్రీకరణ దేశంలో ఎక్కడా లేని వినూత్న ఆలోచనలని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చారని, కోవిడ్ వలన అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారని తెలిపారు. వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా సూచిస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాక ఏపీ కచ్చితంగా అగ్రస్థానాన్ని చేరుకుంటుందని తెలిపారు. అంతటి సామర్థ్యం ఏపీ రాష్ట్రానికి ఉందని, నీతి ఆయోగ్ నుంచి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 01: 30 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననున్నారు ఉదయం 11: 45 వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నీతి ఆయోగ్ బృందం విజయవాడకు బయల్దేరింది. ఉదయం 11: 30 వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్ ఉదయం 11: 00 ► వీరపనేని గూడెంలోని రైతు భరోసా కేంద్రాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. నీతి ఆయోగ్ బృందానికి వీరపనేని గూడెం గ్రామస్తులు వినూత్నంగా స్వాగతం పలికారు. సేంద్రీయపద్ధతిలో పండించిన కూరగాయలు, చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయంలో ప్రకృతి వ్యవసాయం పై మహిళా సంఘాలతో సమావేశం అయ్యింది. నీతి ఆయోగ్ బృందంతో పాటు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. చదవండి: మహాయజ్ఞంలా సాగుతోన్న పెన్షన్ల పంపిణీ ఉదయం 10: 00 ►నీతి ఆయోగ్ బృందం కృష్ణా జిల్లాలోని వీరపనేని గూడెంకు చేరుకుంది. వీరపనేని గూడెంలో బి.సతీష్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని పరిశీలించారు. రసాయనాలు వాడకుండా వరిసాగు చేసిన విధానాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9: 00 ► ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సభ్యుల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు రాగా.. వారందరికి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని నీతి ఆయోగ్ బృందం పరిశీలించనుంది. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నీతి ఆయోగ్ సభ్యుల బృందం మంగళవారం పర్యటించనుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించనుంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాజీవ్ కుమార్‌తో కూడిన నీతి ఆయోగ్ బృందం పరిశీలించనుంది. అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సీఎంతో పాటు వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో నీతి ఆయోగ్ బృందం భేటీ కానుంది. సాయంత్రం వివిధ పరిశ్రమల ప్రతినిధులు , పారిశ్రామిక సంఘాలు , వివిధ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు , విద్యా సంస్థల ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో నీతి ఆయోగ్ బృందం సమావేశం కానుంది. చదవండి: చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ జగన్ -
పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను: వల్లభనేని వంశీ
-
ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ‘‘పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వచ్చే ఎన్నిక వరకు ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేస్తా. తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు’’ అని వంశీ మండిపడ్డారు. చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ లోకేష్‌కు మీటర్, మోటార్, మేటర్ లేదు: వల్లభనేని వంశీ -
లోకేష్‌కు మీటర్, మోటార్, మేటర్ లేదు: వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: టీడీపీని చంద్రబాబు జంతు ప్రదర్శనశాలగా మర్చాడని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్‌కు మీటర్, మోటార్, మేటర్ ఏమీలేదని ఎద్దేవా చేశారు. ఓట్లుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు కరకట్టపై దాక్కున్నాడు. ఏముఖం పెట్టుకుని మోదీ, అమిత్‌షాను చంద్రబాబు కలుస్తాడు. అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయించిన ఘనుడు చంద్రబాబు. మోదీని టెర్రరిస్ట్ అని తిట్టిన వ్యక్తి చంద్రబాబు అని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. చదవండి: చంద్రబాబు అంటేనే కుట్రలు: కన్నబాబు -
మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్లో డ్రగ్స్ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్ లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఆగిపోయిన విమానం
-
కృష్ణా జిల్లా గన్నవరం లో భారీ అగ్ని ప్రమాదం
-
పాలిమర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
పాలిమర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో విజయ పాలిమర్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. పక్కన పలు ఫ్యాక్టరీలు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇవీ చదవండి: ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? ‘ఈస్ట్‌కోస్ట్’లో కోచ్‌ల ఆట -
పి.గన్నవరం చేరుకున్న సీఎం జగన్
-
గన్నవరంలో బొలెరో బీభత్సం..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. మృతుడు దావాజిగూడెంకు చెందిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. బోలెరో వాహనం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
ఏపీకి చేరుకున్న మరో 7.20 లక్షల కోవిడ్ టీకా డోసులు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో 7.20 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. కాగా కోవిషీల్డ్ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అక్కడి నుంచి టీకా డోసులను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. అనంతరం జాబితాల ప్రకారం టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు అధికారులు తరలిస్తారు. -
ఆరు లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక
విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ డోసుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఆరు లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ వ్యాక్సిన్ డోసులను 50 బాక్స్‌ల్లో స్పైస్‌జెట్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. చదవండి: కోవిడ్: రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ -
గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ లో పాప్ కార్న్ షాప్ యజమాని పై దాడి
-
గన్నవరం: నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
-
మానవత్వం చాటుకున్న గన్నవరం ఎస్ఐ పురుషోత్తం
-
ఆక్సిజన్ కొరతకు అధికారుల చెక్
గన్నవరం: కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చూపిన చొరవ సత్ఫలితాలనిచ్చింది. చెన్నై, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను గుర్తించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు 19 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. మొదట చెన్నై నుంచి తెలంగాణలోని ఖమ్మంకు వెళుతున్న క్యూమెన్ ఎయిర్ ప్రొడక్ట్ ఏజెన్సీకి చెందిన ట్యాంకర్ 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో గన్నవరం మండలం సూరంపల్లికి వచ్చింది. విజయవాడ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షి సదరు కంపెనీ యజమానితో చర్చలు జరపడంతో 13 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్‌ను కూడా అధికారులు ఆపారు. సదరు సంస్థ ప్రతినిధులతో మాట్లాడి 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచేందుకు ఒప్పించారు. సీఐ కోమాకుల శివాజీ, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్టుకు చేసురుకున్న కరోనా వాక్సిన్
-
ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు
గన్నవరం: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిమిత్తం బుధవారం మరో రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్స్‌లను ఉదయం విమానంలో ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు. గత 2 రోజుల్లో ఇక్కడికి మొత్తం 4 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్లలో 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు. -
‘చంద్రబాబు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడు’
సాక్షి, కృష్ణా : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గన్నవరం బాలుర హైస్కూల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో లోకేష్ గుది బండలాంటి వాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైనదని, చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్నారని వల్లభనేని వంశీ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాడని, కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నాడని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో10వేలు కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూశాడని, అదే 10 వేలు కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాని అన్నారు. తెలంగాణాలో ఓటుకు నోటు విచారణ వస్తుంది కాబట్టి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశాడని, ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్‌లో హక్కు ఉన్న పారిపోయి వచ్చాడని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి కావాలని చూసి రాష్టంలోనే చతికిల పడ్డాడని విమర్శించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గులేకుండా విలీనం చేసాడు. చదవండి: డబ్బు రాజకీయం సృష్టికర్త చంద్రబాబే: వల్లభనేని వంశీ -
గన్నవరం హై స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థుల మధ్య వివాదం
-
పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు
విజయవాడ: గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 67 మంది ప్రయాణికులతో స్పైస్ జెట్ SG3417 విమానం బెంగుళూరు నుంచి గన్నవరంకు వచ్చింది. అయితే ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయ్ర్ ఇండియా విమానం సైతం పొగమంచు కారణంగా ల్యాండింగ్ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ రెండు విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం గన్నవరం ఎయర్‌పోర్ట్‌లో రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు 4 రౌండ్లు అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. -
గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్–737 విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా శనివారం ఖతార్ రాజధాని దోహా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 64 మంది ప్రయాణికులతో విజయవాడ మీదుగా తిరుచిరాపల్లికి బయలుదేరింది. సాయంత్రం 4.49 గంటలకు విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత రన్‌వే నుంచి ఆప్రాన్లోని పార్కింగ్ బేలోకి వెళ్తున్న సమయంలో విమానం కుడి రెక్క హైమాస్ట్ లైట్ల విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ స్తంభం కుప్పకూలి విమానానికి కూతవేటు దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విమానం కుడివైపు రెక్కభాగం దెబ్బతింది. వెంటనే ఎయిర్పోర్ట్ అగ్నిమాపక, భద్రతా దళాలు విమానం దగ్గరకు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో విజయవాడ విమానాశ్రయంలో దిగే ప్రయాణికులు 19 మంది, తిరుచునాపల్లికి వెళ్లే ప్రయాణికులు 45 మంది ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. విమానాన్ని పరిశీలిస్తున్న ఎయిర్ పోర్టు సిబ్బంది మరో విమానంలో తరలింపు ప్రమాదానికి గురైన విమానంలోని ఏపీ ప్రయాణికులను ఇక్కడే దించేసి తిరుచిరాపల్లి వెళ్లాల్సిన వారిని మరో విమానంలో పంపే ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జి.మధుసూదనరావు చెప్పారు. పైలట్ తప్పిదమే కారణం! ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణం కావచ్చని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా విమానం ల్యాండ్ అయ్యే సమయానికి వాతావరణం మబ్బులతో కూడి ఉండటం వల్ల రన్‌వే, ఆప్రాన్‌లపై విజిబిలిటీ అస్పష్టంగా ఉందని పైలట్ చెప్పినట్టు సమాచారం. ఘటనపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. విజయవాడ విమానాశ్రయ చరిత్రలో ఇది రెండో ప్రమాదం. 1980 ఆగస్టు 28న హన్స్ ఎయిర్‌కు చెందిన విక్కర్స్ విస్కౌంట్ వీటీ–డీజేసీ విమానం ల్యాండ్ అవుతుండగా మూడుసార్లు రన్‌వేను గుద్దుకోవడంతో నోస్‌వీల్ దెబ్బతింది. అప్పట్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కుదుపులొచ్చాయ్ ఖతార్ నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇక్కడికి వచ్చాను. విమానం రన్‌వే పైకి దిగిన తర్వాత లోపల కుదుపులు వచ్చాయి. ఉన్నట్టుండి విమానం ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. – రేష్మ, ప్రయాణికురాలు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా చదవండి: అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్ ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు -
బాబు పసుపు కుంకుమ ఇస్తే ఉప్పు కారం పెట్టారు
సాక్షి, విజయవాడ: గతంలో జరిగిన కార్యక్రమాలకు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి చాలా వ్యత్యాసం ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన 31 లక్షల మందికి ఇళ్లిస్తున్నారని తెలిపారు. కోర్టు అనుమతి తరువాతే వీటికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ హయాంలో రెండు లక్షల ఇళ్ళకు చంద్రబాబు మంగమ్మ శపథాలు చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్ళి ఆపారని మండిపడ్డారు. (చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’) మంచి రోజున ఈ ఇళ్ళపట్టాల కార్యక్రమం చేయడం చాలామందికి కడుపునొప్పిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడిపీ ఇచ్చిన పట్టాల భూములకు రాయి కూడా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు పసుపు, కుంకుమ ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఉప్పు కారం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవినేని ఉమ ఇంటికి కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని, ఆయన తక్కువ ధరలకు భూములు చూపించగలడా? అని ప్రశ్నించారు. వ్యవసాయ భూమి పల్లం కాకపోతే ఇంకెలా ఉంటుంది, బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఉమ మీద మండిపడ్డారు. ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకునే నాయకులను ప్రజలే నిలదీయాలని వంశీ కోరారు. (చదవండి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్) -
బ్రేకింగ్: లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం
గన్నవరం: నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు కొద్దిసేపటికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో చోటుచేసుకుంది. ఆత్కూరు పోలీసుల వివరాల ప్రకారం.. బల్లిపర్రు నుంచి తెంపల్లికి ఓ మహిళ వెళ్తోంది. మార్గమధ్యలో బైక్‌పై ఇద్దరు వచ్చి లిఫ్ట్ ఇస్తామని ఆమెను ఎక్కించుకున్నారు. కొద్దిసేపటి అనంతరం ఆమెపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న అనంతరం బాధితురాలు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వంగవీటి రాధా వర్గీయుల దాడి
సాక్షి, గన్నవరం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హనుమాన్‌జంక్షన్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైవేపై అడ్డగోలుగా ఓవర్ టేక్ చేసినందుకు ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై రాధా అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చదవండి: (టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ రాజీనామా) ఒకే కారులో బయలుదేరి వెళుతున్న అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వివరాల్లోకి వెళితే.. వేర్వేరు వాహనాల్లో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విజయవాడ వైపు వెళుతున్నారు. హనుమాన్‌జంక్షన్ సెంటర్ దాటిన తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి చెందిన వాహనాలను వంగవీటి రాధా అనుచరులు ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వేలేరు క్రాస్‌రోడ్ వద్ద అడ్డగోలుగా కారు నడపటంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్, ఆయన అనుచరులపై వంగవీటి రాధా వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధాలకు సీఐ డి.వెంకటరమణ నచ్చజెప్పి అక్కడ నుంచి ఇద్దరిని ఒకేకారులో పంపించారు. ఇంతలోనే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ చల్లారి గోపీకృష్ణపై వంగవీటి రాధా వర్గీయులు దాడి చేయటంతో తలకు తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ గోపీకృష్ణ వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో వంగవీటి రాధా అనుచరులపై ఫిర్యాదు చేశారు. -
‘దుర్మార్గ ఆలోచనలకు చంద్రబాబు ఆద్యుడు’
సాక్షి, గన్నవరం: ప్రతిపక్షనేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చిన రోజే.. రాష్ట్ర ప్రజలకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 2631 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. (చదవండి: చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం) ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తే.. పునాదులు కదులుతాయని ప్రతిపక్షాలు కుట్రపన్నాయని దుయ్యబట్టారు. 25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడు. ఆయనకి కొన్ని డబ్బా చానల్స్ వత్తాసు పలుకుతూ హడావుడి చేస్తున్నాయని కొడాలి నాని ధ్వజమెత్తారు.(చదవండి: ‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’) అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి సీఎం జగన్: ఎంపీ బాలశౌరి చర్రితలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే, గుండె ధైర్యం, కృషి, పట్టుదల ఉండాలని,అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎంపీ బాలశౌరి అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండె చప్పుడు అయ్యారని, నేడు సీఎం వైఎస్ జగన్.. పేదల సొంతింటి కల నెరవేర్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమన్నారు. వైఎస్సార్ 1 రూపాయికే వైద్యం చేసి.. వృత్తికే వన్నె తీసుకువస్తే.. సీఎం జగన్ 1 రూపాయికే 30 లక్షల 70 వేలు టిడ్కో ఇళ్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వంశీ పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గొప్పలు కోసం లక్ష పట్టాలు అని డబ్బా కొట్టుకొని స్థలం చూపించలేకపోయారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందరికీ స్థలం,ఇల్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారే అసలైన నాయకుడన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరు చెప్పి ప్రజల దగ్గరకు వెళ్తే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చెప్పింది చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వల్లభనేని వంశీ అన్నారు. -
బస్సులో పొగలు, కిటికీలో నుంచి దూకేశారు..
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఎస్వీకేడీటీ (SVKDT ) ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి విజయవాడకు వస్తున్న బస్సు ప్రసాదంపాడులోని ఎస్వీఆర్ సెంటర్‌కు వచ్చేసరికి బస్సు టైర్ పగిలింది. టైర్ పగిలిన ధాటికి ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ఏమి జరిగిందో తెలియక అయోమయంలో బస్సు కిటికీ నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే బస్సు టైర్ పగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సిటీ బస్సును ఢీకొన్న మినీ వ్యాన్ మరోవైపు గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సిటీ బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
కారు ప్రమాదం, లోపల చూసి పోలీసులు షాక్
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది. జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని తప్పించబోయిన ఒక ఇన్నోవా కారు డివైడర్ వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పైకి ఎక్కింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని వెళ్ళడానికి వీలులేకపోవడంతో కారును అక్కడే వదిలి కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. డివైడర్ పై ఉన్న కారును పోలీసులు పరిశీలించగా కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. కారు ఏలూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. దీంతో పోలీసులు కారు మొత్తం పరిశీలించి కారులో ఎంత మంది ఉన్నారు, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారు అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్ -
ప్రధాని మోదీతో రేపు సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం చేరుకున్న సీఎం జగన్.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరారు. విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వెంకటరమణ, బాలశౌరి ఉన్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం రేపు (మంగళవారం) ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక.. ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. -
ఆ ఘనత వైఎస్సార్‌దే : వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే చేసి చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్నారని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పాలనలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబే అని మండిపడ్డారు. వైఎస్సార్ దారిలోనే నడుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని అభినందించారు. సీఎం జగన్ ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు చేపట్టారని, నగదు బదిలీ పథకం వల్ల రైతులకు భరోసా ఉంటుందన్నారు. (మహిళలకు మరో ‘రత్నం’) వైఎస్సార్ తొలి సంతకం.. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వల్లభనేని వంశీ మాట్లాడారు. ‘రానున్న 30 ఏళ్లకు రైతులకు భరోసాగా ఉండాలని వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. ఆనాడు మోటార్లకు ఉన్న మీటర్లు పీకిసి స్లాబ్ సిస్టం తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడారు. ఆనాడు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చి అధికారంలోకి రాగానే తొలి సంతకం చేసి అమలు చేశారు. రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతలో ఉచిత విద్యుత్‌కు గాను నగదు బదిలీ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. (అన్‌లాక్ 4.0: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ) చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..? గన్నవరం నియోజకవర్గంలో మెట్టప్రాంత మండలాల్లో పోలవరం కుడి కాలువ నుంచి రైతులు 600 మోటార్లు ద్వారా నీరు వినియోగిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ కనెక్షన్లు క్రమబద్దీకరణ చేయలేదు.ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డి విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 17 లక్షలు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, అదనంగా ఉన్న మరో లక్ష విద్యుత్ కనెక్షన్లు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పదివేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. చంద్రబాబు 42 ఏళ్ళ అనుభవం ఏమైంది..? చంద్రబాబు తన కొడుకు లోకేష్‌లా స్థాయి దిగి మాట్లాడుతున్నారు. రాజకీయ అనుభవం ఉండి చిల్లరగా మాట్లాడితే పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. ఉచిత విద్యుత్‌పై విమర్శలు సరికాదు. గన్నవరం నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను, వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు అందరూనాతోనే ఉన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న సీనియర్లు అందరిని తాను కలుపుకుని ముందుకు వెళ్తున్నాను. నూటికి 95 మందిని అందరిని కలుపుకుని గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తాను. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందుతున్నాయి. వలంటీర్లు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా పని చేస్తోంది. గతంలో ఫించన్, ఇళ్ల స్థలాలు రాలేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు 90 % క్షేత్రస్థాయిలో సమస్యలు తీరాయి.’ అని వ్యాఖ్యానించారు. -
పిల్లి కోసం కిందకు వంగడంతో..
సాక్షి, గన్నవరం: పాత సామాను కొంటానని నమ్మించిన ఓ దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. కేసరపల్లిలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో మూల్పూరు పద్మావతి అనే వివాహిత నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొనుగోలు చేస్తాను ఉన్నాయా అని అడిగాడు. అలాంటివేమీ లేవని పద్మావతి సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన అతను ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని కోరాడు. దీనికి అంగీకరించిన పద్మావతి పిల్లి పిల్లను యువకుడికి అందించేందుకు కిందకు వంగింది. అదే సమయంలో యువకుడు ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు గొలుసు లాక్కొని, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. రెప్పపాటులో మెడలో గొలుసు లాక్కొని దుండగుడు జారుకున్నాడని వాపోయింది. ఈమేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు. (చదవండి: కరోనా బాధితురాలిపై డ్రైవర్ లైంగిక దాడి) -
కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ పేలుడు
-
కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ పేలుడు
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం పేలుడు సంభవించింది. జయరాజ్ ఫ్లైవుడ్ ఎంటర్ ప్రైజర్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడకు చెందిన తండ్రి,కొడుకు స్క్రాబ్ కొనుగోలు చేసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రమాదంపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జయరాజ్ ఎంటర్ ప్రైజర్‌కు అనుమతులు లేవు గన్నవరం మండలం సూరంపల్లి మహిళా పారిశ్రమికవాడలో నిర్వహిస్తున్న జయరాజ్ ఎంటర్ ప్రైజర్‌కు ఎలాంటి అనుమతులు లేవని గన్నవరం తాహసిల్దార్ నరసింహారావు తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏడేళ్ల నుంచి కంపెనీ నిర్వహిస్తున్నారని, లాక్డౌన్ అనంతరం నాలుగు రోజుల క్రితమే కంపెనీ తెరిచారన్నారు. విజయవాడకు చెందిన తండ్రీకొడుకులు స్కాప్ కొనుగోలు చేసేందుకు వచ్చారని, దాన్ని ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలిపారు. ఆ పేలుడు ధాటికి తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు గన్నవరం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పేలుడు ధాటికి తండ్రీకొడుకులు ఇద్దరూ పైకి ఎగిరి పడ్డారన్నారు. క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరిస్తోందని, నివేదిక వచ్చాక పేలుడుకు గల కారణాలు తెలుస్తాయన్నారు. 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులు ఎవరైనా వారిపై కఠని చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. -
కేర్ అండ్ షేర్లో నిఖిల్..
-
కేర్ అండ్ షేర్లో నిఖిల్..
విజయవాడ : యంగ్ హీరో నిఖిల్ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. సోమవారం తన బర్త్ డే సందర్భంగా గన్నవరం మండలంలోని కేర్ అండ్ షేర్ అనాథ శరణాలయానికి వెళ్లిన నిఖిల్ అక్కడి పిల్లలతో సరదాగా గడిపారు. ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తన బర్త్‌డే పార్టీకి ఖర్చు చేసే మొత్తాని.. ఆ ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరోవైపు నిఖిల్ బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి : అది నువ్వేనా: హీరోయిన్ వీడియోకు నెటిజన్లు ఫిదా!) ‘నా పుట్టిన రోజున కొద్ది సమయం గన్నవరం కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్‌లో గడిపాను. ఈ ట్రస్ట్.. వదిలివేయబడిన మరియు అనాథ పిల్లలను సంరక్షిస్తుంది. సాధారణంగా నా బర్త్ డే పార్టీకి ఖర్చు చేసే మొత్తం డబ్బును.. ఈ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబోతున్నాను’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. కాగా, నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తన ప్రేయసి పల్లవి వర్మను పెద్దల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా తర్వాత నిఖిల్ జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో.. పల్లవి కూడా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే లవ్.. నువ్వు చాలా బలంగా ఉంటావు.. అయినప్పటికీ సున్నితమైన విషయాలపై చాలా సున్నితంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కలలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను’ అని పల్లవి పేర్కొన్నారు. -
గన్నవరం చేరిన కోవిడ్ 19 మెడికల్ కిట్లు
సాక్షి, విజయవాడ : ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ 19 మెడికల్ కిట్లు చేరుకున్నాయి. వీటిలో పీపీఈ కిట్లు, మాస్కులు, మెడిసిన్లు ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయం నుండి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్కు అధికారులు రవాణా చేయనున్నారు. వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను ఇప్పటికే దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఏపీకి తరలించిన విషయం తెలిసిందే. కొత్తగా మరిన్ని వైద్య పరికరాలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. -
గన్నవరం చేరిన కోవిడ్ 19 మెడికల్ కిట్లు
-
కుటుంబాలకు దూరంగా...
-
గన్నవరం వ్యవసాయ మార్కెట్లో మంటలు
-
కృష్ణా జిల్లాలో గంజాయి పట్టివేత
సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని శనివారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి తమిళనాడుకు కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందడంతో ఆత్కూరు జాతీయ రహదారి ఉన్న వంతెన వద్ద ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో గన్నవరం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది గంజాయిని తరలిస్తున్న కారుని అడ్డుకున్నారు. ఆదివారం విజయవాడ ఎక్సైజ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 450 కేజీలు గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నామని.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల వద్ద బలమైన ఇనుపరాడ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిందితులు పలు గంజాయి కేసుల్లో పాడేరు కోర్టుకు హాజరై వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటు పలు ఆధారాలు లభించాయని ఏసీపీ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదం: భార్య మృతి.. భర్తకు గాయాలు
సాక్షి, కృష్ణా: గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయ సమీపంలో గురువారం జరిగిన ఘటనలో ఓ మహిళా మృతిచెందింది. కాగా సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను వెనక నుంచి వస్తున్న ఐసన్ వ్యాన్ ఢికోట్టిడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. భార్యభర్తలు కేసరపల్లికి చెందిన వారని, మేధా టవర్స్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
64 బస్సులను సీజ్ చేసిన అధికారులు
-
పిల్లలకు విషమిచ్చి.. తల్లి..
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహతాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడలోని అస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శంకర్ అనే ఐదేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి అంకమ్మ, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణం, కుటుంబ కలహాలేనా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
ఆ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది!
సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా) : తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించిందని ఈస్ట్ జోన్ ఏసీపీ సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గన్నవరం పోలీసు స్టేషన్లో ఆదివారం సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం ఏర్పాటు చేసిన డయల్ 100ను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. డయల్ 100కి కాల్ చేస్తే 4 నిమిషాల్లో ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుంటారని, మొబైల్ ఫోన్లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే కమాండ్ కంట్రోల్ రూంకి సమాచారం వెళుతుందని, మొబైల్ కీపాడ్‌లో 5 లేక 9 నంబర్లను నొక్కి పట్టుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రమాద స్థలాన్ని పోలీసులు గుర్తిస్తారని తెలిపారు. బ్లూకోట్,రక్షక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని సురేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. స్త్రీలకు పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారని, మహిళలకు ప్రత్యేక రక్షణ కోసం సీపీ ద్వారకాతిరుమలరావు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. -
అదుపుతప్పిన ప్రైవేటు బస్సు
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఆరేంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మురళి ఆత్మహత్యతో సంబంధం లేదు:ఎస్ఐ
సాక్షి, గన్నవరం: ఆత్మహత్యకు పాల్పడ్డ డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ తెలిపారు. మురళి ఆత్మహత్యపై ఎస్ఐ వివరణ ఇచ్చారు. మురళి ఓవర్ స్పీడ్‌తో రాంగ్ రూట్లో బైక్ నడపడంతోనే స్టేషన్‌కు పిలిచి మాట్లాడనని, ఎస్ఐ అయితే నాకేంటి అంటూ దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. చదువుకుంటూ టీ దుకాణం నడిపే మురళి తమకు ముందు నుంచి పరిచయస్తుడేనని, స్టేషన్‌కు పిలిచాం కానీ, ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదని ఎస్ఐ నారాయణమ్మ స్పష్టం చేశారు. తన భర్త కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, బెదిరించడం కానీ చేయలేదని ఆమె తెలిపారు. కాగా ఎస్ఐ నారాయణమ్మ వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డిగ్రీ విద్యార్థి మురళి గన్నవరంలోని కోనాయిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి:నా చావుకు ఎస్ఐ వేధింపులే కారణం) -
చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉన్నారా
-
పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు సలహాలు ఇచ్చిన టీడీపీ నేతలకు పుష్పాంజలి అని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భాష, వేషం, మొరటుగా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు నా నియోజకవర్గ సమస్యలు మాత్రమే చెప్పా. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరాను. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తప్పేముందు. విద్యార్థి దశలో నాకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడ్డా. పేద ప్రజలకు ఇంగ్లీష్ నేర్పితే తప్పేంటి. అబద్ధాలు చెప్తూ నాపై బురద జల్లుతున్నారు. నేను ఏమైనా వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చానా. విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా. టీటీడీ ఛైర్మన్ పదవి అమ్ముకున్నానా. హైందవ ధర్మాన్ని అన్యాయం చేశానా. చంద్రబాబుకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టింది. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌లోనే చంద్రబాబు ఉన్నారా’అని ప్రశ్నల వర్షం కురిపించారు. లోకేశ్ కూడా పదవికి రాజీనామా చేయాలి ‘నేనేమైనా విశాఖపట్నం పీఠం ముందు సీసీ కెమెరాలు పెట్టి.. స్వామీజీని కలవడానికి ఎవరెవరు వస్తున్నారోనని చెక్ చేశానా. వయసురిత్యా చంద్రబాబు కాళ్లకు దండం పెడితే.. దానికి కాళ్లు పట్టుకున్నానంటారా. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ ఆరోపణలు గురువింద గింజప్పులా కనిపిస్తున్నాయి. మాపై దుష్ప్రచారం చేసే హక్కు మీకెరివచ్చారు. మేము జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చామా. పబ్లిక్‌లో అనుకున్నదే చెప్పాం. ప్రజల్లో గెలవలనివారు, పెయిడ్ ఆర్టిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాజేంద్రప్రసాద్ కూతురు పెళ్లికి రూ.25 లక్షలు ఇచ్చాను. మాల వేసుకున్నా. నన్ను ముందు దూషించింది రాజేంద్రప్రసాదే. నాకు పదవి ముఖ్యం కాదు. రాజీనామా చేస్తా. పార్టీ ఓడిపోయింది కాబట్టే లోకేశ్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. నీతులు మాకు చెప్పడమేనా.. మీకు వర్తించవా. నాపై చంద్రబాబులా ఓటుకు కోట్లు కేసు లేదు. నేను జగన్‌ను దొంగచాటుగా కలవలేదు. నా నియోజకవర్గ సమస్యలను చెప్పేందుకు కలిశా. నాకు చంద్రబాబులా తెలివితేటలు లేవు. అమ్మ చెబితే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని చంద్రబాబు అనలేదా. ముఖానికి రంగులు వేసుకునేవాళ్లు రాజకీయాలకు పనికిరారని బాబు అనలేదా’అని ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. -
420 పోస్టు మాస్టర్
సాక్షి, కృష్ణా : పోస్టాపీస్ ఖాతాదారులను మోసం చేసిన ఓ పోస్ట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు,అజంపూడి బ్రాంచ్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగేంద్ర 300 మంది ఖాతాదారులను మోసం చేసి 43 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. 2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని పాస్ బుక్ జమ చేయకుండా ఆ సొమ్మంత కాజేశాడు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. -
సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ
సాక్షి, గుంటూరు : కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే వంశీ టీడీపీ వీడతారనే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్ధరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎమ్మెల్యే వంశీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కూడా వంశీ కలిశారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు ఇక సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు, పార్టీ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీమంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీఎం జగన్‌తో వేదిక పంచుకోవడం అనందంగా ఉంది
-
టీడీపీ నేతలకు బిగుస్తున్న కేసుల ఉచ్చు
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుటిల యత్నాలు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో ఆయన అనుచరులు పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మోసగించిన వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీతో ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, తహసీల్దార్ స్థాయి అధికారి సంతకం, నకిలీ స్టాంపులు సృష్టించి దుర్వినియోగం చేయడంపై వివిధ సెక్షన్ల కింద హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. చీటింగ్, ఫోర్జరీ, ఎన్నికల నియమావళి ఉల్లంఘన అభియోగాలపై కేసు రిజిస్టర్ చేశారు. సాక్షి, గన్నవరం(విజయవాడ): కృష్ణా జిల్లా బాపులపాడు మండంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, పోరంబోకు స్థలాలు, చెరువు గట్లపై స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్న పేదలకు ఏప్రిల్ 7న అర్ధరాత్రి నకిలీ ఇళ్ల పట్టాలను తెలుగుదేశం నాయకులు పంపిణీచేయడం అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది. బాపులపాడుతో పాటు కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళలో ఇంటింటికీ వెళ్లి 3 వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లుగా పేదలకు చెబుతూ వాళ్లకు ఆ పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటు వేయాలని నకిలీ ఇళ్ల పట్టాలను పంచుతూ ఓటర్లను మభ్యపెట్టారు. ఇళ్ల పట్టాలపై మంజూరు చేసిన తేదీ, లబ్ధిదారుని ఫొటో, ఆర్సీ నంబరు, ఎల్డీ ఫైల్ నంబర్లు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులకు అనుమానాలు రేకెత్తడంతో అసలు విషయం బయటపడింది. గత ఏడాది ఆగస్ట్‌లో బదిలీ అయిన తహసీల్దార్ సంతకాన్ని రబ్బరు స్టాంపు చేయించి ఇళ్ల పట్టాలపై ముద్రించి ఉండటం వారి అనుమానాలను మరింత బలపరిచాయి. స్పందనలో ఫిర్యాదుతో కదలిక తాజాగా గన్నవరానికి చెందిన ముప్పలనేని రవికుమార్ అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, నియోజకవర్గ ఎన్నికల అధికారులను విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావును సుమారు 100 మందికిపైగా కలిసి నకిలీ ఇళ్ల పట్టాలపై ఫిర్యాదుచేశారు. టీడీపీ నేతలు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై ఉన్న తహసీల్దార్ పాస్ మెయిల్ సంతకం, కార్యాలయం స్టాంపు పూర్తిగా ఫోర్జరీ చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి, వీటిపై సమగ్రంగా విచారణ జరిపించాలని హనుమాన్‌జంక్షన్ పోలీ సులకు ఆయన ఫిర్యాదు చేశారు. పదిమంది టీడీపీ నేతలపై కేసు నమోదు బాపులపాడు మండలంలోని కొయ్యూరు, పెరికీడులో చేపట్టిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు హనుమాన్‌జంక్షన్ పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. గన్నవరం ఎమ్మె ల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహన రంగా, కాట్రు శేషు, జాస్తి ఫణి, టీడీపీ నాయకులు కొల్లి రంగారావు, వేగి రెడ్డి పాపారావు, కొత్తూరి ఆంజనేయులు, సింగవరపు దుర్గాప్రసాద్, లావేటి నారాయణ, బం డారు సత్యనారాయణలపై ఎస్ఐ కె.అశోక్‌కుమార్ శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ‘నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఫణిశేఖర్ పాత్ర ఉంది’ గన్నవరం : ఎన్నికల ముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ప్రజలను మోసగించిన వ్యవహారంలో ముమ్మాటికీ టీడీపీ నాయకుడు జాస్తి ఫణిశేఖర్ హస్తముందని మాజీ సైనిక ఉద్యోగి ముప్పనేని రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యే వంశీమోహన్ 20 వేలకుపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఫణిశేఖర్ స్వయంగా తనకు చెప్పారన్నారు. ఈ విషయమై తను ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాల తయారీలో ఫణిశేఖర్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ నకిలీ పట్టాలపై ఉన్న తహసీల్దారు సంతకంతో కూడిన స్టాంప్, కార్యాలయ స్టాంప్ కూడా నకిలీవిగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఫణిశేఖర్ ఆరోపిస్తున్నట్లుగా అతనికి, తనకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, పాత గన్నవరంలో నిర్మిస్తున్న భవనం కూడా తనకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. -
‘ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలి’
సాక్షి, గన్నవరం : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను రద్దుచేయాలని బాపులపాడు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దుట్టా శివనారాయణ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం పార్టీ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యురు గ్రామాల్లో మండల రెవిన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ప్రజలను మోసం చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం మండల కన్వినర్ తులిమిల్లి ఝాన్సీలక్ష్మీ మాట్లాడుతూ నకిలీ పట్టాల పంపిణీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా సహకరించ లేదని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, విచారించి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. వల్లభనేని వంశీ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైన విషయం తెలిసిందే. చదవండి: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు -
ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్..
సాక్షి, విజయవాడ: ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోసగాడిని సోమవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 లక్షల 46వేలు నగదుతో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో డీసీపీ హర్షవర్ధన్ రాజు, నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలకు పాల్పడుతున్న నిందితుణ్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతల సురేష్ బాబుగా గుర్తించామని తెలిపారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై..ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 16 నేరాలతో పాటు గన్నవరంలో ఆరు ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించామని అన్నారు. గన్నవరంలోనే ఏటీఎం సెంటర్లో మరో మోసానికి సురేష్ బాబు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం వివరాలు వెల్లడించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
ఎన్నికల్లో ఓడిపోయామన్న అక్కసుతోనే..
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సచివాలయంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటంపై గుర్తు తెలియని వ్యక్తులు బురదజల్లడం వివాదాస్పదంగా మారింది. గురువారం తెల్లవారు జామున ఈ దృశ్యాన్ని గుర్తించిన గ్రామ వైఎస్సార్సీపీ కార్యకర్తలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఎం జగన్ చిత్రపటంపై ఇలాంటి దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందామన్న అక్కసుతో, వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై గ్రామ సెక్రటరీతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆద్యంతం ఉత్కంఠభరితంగా..
సాక్షి, గన్నవరం: జాతీయస్థాయి ఎడ్లబండి లాగుడు, ఆవుల అందాల పోటీలను కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ పశువైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆళ్ల నాని, రంగనాథరాజు ప్రారంభించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వరంలో ఐదు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. తొలిరోజు పదిహేడు జతల ఒంగోలు జాతి బసవన్నలు కాలు దువ్వాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోటీల్లో తమ యజమానిని, ఊరిని ప్రథమస్థానంలో నిలిపేందుకు పోటీలు పడ్డాయి. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి 150 జతల ఎడ్లు తరలి రానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఎండ్లబండ లాగుడు పోటీలను తిలకించారు. ఈ పోటీలు 13 వ తేదీ వరుకు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల జతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. -
గుట్కా లారీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, విజయవాడ : నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణా చేస్తున్న లారీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం గన్నవరం వద్ద పట్టుకున్నారు. లారీలోని ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ. 18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉయ్యూరుకు చెందిన కాంతారావు, భూక్యా చంద్రశేఖర్, పూణేకు చెందిన హజీ అత్తర్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, వీటిని బరంపురం, ఇచ్చాపురం నుంచి విజయవాడకు తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. -
'ఇచ్చిన ప్రతీ హామీనీ జగన్ నెరవేరుస్తున్నారు'
సాక్షి, కృష్ణా : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నారన్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుళ్లిమిల్లి జాన్సీలక్ష్మి, మద్దినేని వెంకటేశ్వరరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, వింత శంకర్ రెడ్డి, దేవగిరి ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
సాక్షి, రామవరప్పాడు(కృష్ణా): భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పచ్చడి బండతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామానగర్‌లో ఘంటా శామ్యూల్, ఆశ్విని భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి తేజస్వి(8), రఘురామ్ (6) పిల్లలు ఉన్నారు. శామ్యూల్ లారీ డైవర్‌గా పని చేస్తున్నాడు. వీరు సంవత్సరం క్రితం పామర్రు నుంచి నిడమానూరు వచ్చి అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. లారీ డ్రైవర్ కావడంతో వారం, పది రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో గన్నవరానికి చెందిన ఓ యువకుడితో అశ్వినికి ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి అశ్వినితో భర్త పలుమార్లు గొడవ పడ్డాడు. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరగడంతో శామ్యూల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తరువాత రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న శామ్యూల్ తలుపు కొట్టడంతో అశ్విని తలుపు తీసింది. భార్యపై కోపంతో ఉన్న భర్త వచ్చి రావడంతోనే ఇంటి ఆవరణలో ఉన్న పచ్చడి బండతో అశ్విని తలపై గట్టిగా కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమయంలో వీరి పిల్లలు నిద్రపోతున్నారు. సమాచారం అందుకున్న పటమట సీఐ ఎంవీ దుర్గారావు, సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిను గుర్తించేందుకు మృతురాలి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన పచ్చడి బండను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశారు. అశ్విని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన శామ్యూల్ హత్య చేసిన అనంతరం నేరుగా పటమట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శామ్యూల్ లొంగిపోయాడు. అశ్విని వేరే వ్యక్తితో ఉన్న ఫొటోలను పోలీసులకు అందజేసినట్లు సమాచారం. అక్రమ సంబంధంపై పలుమార్లు హెచ్చరించిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో హత్య చేశానని పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. -
మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది!
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నడిరోడ్డు మీద పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 వాహనంలో పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనాలు.. ఆపదలో ఉన్న ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. అలాంటి 108 వాహనాలను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆపదలో ఉండి ఎవరైనా 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని, టైర్లలో గాలి లేదని సమాధానం వచ్చేది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం 108 వాహనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ప్రమాదంలో ఉన్నవారికి క్షణాల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ మహిళ నడిరోడ్డు మీద ప్రసవ వేదన పడటం చూసిన స్థానికులు 108కు కాల్ చేశారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది మహిళ పరిస్థితిని చూసి మానవత్వంతో తమ అంబులెన్స్ వాహనంలోనే పురుడుపోశారు. ఉంగుటూరు మండలం కొయ్యగూరప్పాడుకు చెందిన ఇట్ల సంధ్య నిండు గర్భిణి. పొలాల్లో కూలి పనులు చేసుకునే ఆమెకు సోమవారం రాత్రి భర్త ఇంట్లోలేని సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆటో ఎక్కి గన్నవరం సినిమా హాల్ సెంటర్లో దిగి ప్రభుత్వ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఇది గమనించి స్థానికులు 108కు కాల్ చేయగా.. 108 సిబ్బంది నాయుడు, సాయిబాబు సకాలంలో అక్కడకు చేరుకున్నారు. పురిటినొప్పులు ఎక్కువకావడంతో తమ అంబులెన్స్ వాహనంలోనే ఆమెకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 108 సిబ్బంది సకాలంలో వచ్చి తల్లీబిడ్డలను రక్షించడంతో 108 సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. -
ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
సాక్షి, గన్నవరంజ/కృష్ణా: ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో గన్నవరం శివారు మర్లపాలెంలోని చెరువులో శవమై తేలిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాలు.. స్థానిక రామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్న గోచిపాత పుష్పలత(30) ఆరేళ్ల కిందట ఏలూరులోని శనివారపుపేటకు చెందిన చోడగిరి అనిల్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉమామహేశ్వరి వద్ద మూడేళ్ల నుంచి పుష్పలత ఉంటోంది. తొలుత ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసిన పుష్పలత ఇటీవల కేసరపల్లిలోని ఐటీ పార్కులోని మేధా టవర్స్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. అయితే వివాహం అయినప్పటి నుంచి పుష్పలతకు ఆమె భర్త అనిల్‌కుమార్‌తో మనస్పర్థలున్నాయి. ఆరు నెలల కిందట అనిల్‌కుమార్ ఏలూరు వెళ్లిపోయి ఉంటున్నాడు. అప్పటి నుంచి పుష్పలతతో తరచూ భర్త ఫోన్‌చేసి గొడవ పడుతుండేవాడు. ఆమె భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్న పుష్పలత తీవ్ర మనస్తాపానికి గురై వారం రోజులుగా ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో హనుమాన్‌జంక్షన్‌లో ఉంటున్న స్నేహితురాలి ఇంటికి వెళ్లివస్తానని తల్లికి చెప్పి శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లింది. తిరిగి రాత్రి 8.15 గంటలకు తల్లికి ఫోన్ చేసి ఏలూరు వెళ్తునని పుష్పలత చెప్పింది. చెరువులో శవమై.. మర్లపాలెంలోని చెరువులో పుష్పలత శవమై తేలడాన్ని ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించారు. తొలుత చెరువు గట్టున హ్యాండ్ బ్యాగ్‌తో కూడిన వాహనం పార్కింగ్ చేసి ఉండి, కొద్ది దూరంలో వాచ్, కళ్లజోడు ఉండడం గమనించారు. చుట్టూ పరిశీలించగా మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక చెరువులో మృతదేహం తేలి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ వాసిరెడ్డి శ్రీనివాస్ హ్యాండ్ బ్యాగ్‌లోని బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా ఆమె పుష్పలతగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లి ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్ వేధింపులతో కుమార్తె మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుష్పలతది హత్య? ఆత్మహత్య అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
గన్నవరంలో రోడ్డు ప్రమాదం
సాక్షి, గన్నవరం : ఆగివున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. విజయవాడ నుండి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఆంధ్రా బ్యాంక్ సమీపంలో టైర్ పంచర్ పడింది. దీంతో బస్సును డ్రైవర్ ప్రక్కకు తీసి నిలిపి మరమ్మతులు చేస్తుండగా వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్సుధాకర్ అక్కడకక్కడే మృతి చెందాడు. అయితే బస్సులో వున్న 30 మంది ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విశాఖలో ఐ అండ్ సీ సెంటర్
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ సెంటర్) ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే ఐ అండ్ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే విభజన హామీ అయిన ఐ అండ్ సీ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునేందుకు గత ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబించింది. గన్నవరంలో ఏర్పాటు చేస్తున్నామని ఊదరగొట్టారే తప్ప సెంటు స్ధలం కేటాయించలేదు. ఐ అండ్ సీ ట్రాక్‌లపై రవాణా వాహనం వెళితే లోపాలన్నీ తెలుస్తాయి. ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్ విధానంలో రవాణా ఇన్స్పెక్టర్లు నిర్వహిస్తున్నారు. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటైతే ఫిట్నెస్ పరీక్షలు మొదలు అన్నీ ఆటోమేషన్ విధానంలోనే జరుగుతాయి. విశాఖ జిల్లాలో 14 ఎకరాల స్ధలం విశాఖ జిల్లా గంభీరం వద్ద రవాణా శాఖకు 14 ఎకరాల స్ధలం ఉండటంతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మళ్లీ తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఇక్కడే డ్రైవింగ్ ట్రాక్‌లు ఉండటంతో త్వరితగతిన ఐ అండ్ సీ సెంటరు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ కేంద్రాన్ని కోరింది. డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు రాజధానిలో స్ధల సమస్య ఉండటంతో ఇటీవలే అధికారులు సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. నాలుగేళ్ల క్రితం 9 జిల్లాల్లో ఆటోమేషన్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలకు డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు కేంద్రం రూ.9 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, ఏలూరు,విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఆటోమేషన్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ నిర్ణయించింది. -
చంపేసి..ఆపై కనిపించడం లేదంటూ!
సాక్షి, గన్నవరం: అనుమానంతో కట్టుకున్న భార్యనే హతమార్చాడు.. ఎవ్వరికీ కనపడకుండా ముళ్లకంచెల్లో పడేసి ఏమీ తెలియనట్లుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కళ్లు గప్పేందుకు రోజు స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆచూకీ గురించి వాకబు చేస్తూ కపట ప్రేమను కనబరిచాడు. చివరికి ఆ భర్తపైనే అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. వివరాలు.. కంకిపాడుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానుమోలు శివనాగరాజకు పదేళ్ల కిందట శిరీష(31)తో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. కొంత కాలం నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న శివనాగరాజు తరచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. గత నెల 25న శివనాగరాజు తల్లి ధనలక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రిలో చేర్చాడు. దీంతో అత్తకు సపర్యలు చేసేందుకు శిరీష కూడా ఆస్పత్రిలోనే వద్ద ఉంది. గత నెల 26వ తేదీ రాత్రి ఆస్పత్రికి వచ్చిన శివనాగరాజు ఇంటికి కారులో తీసుకెళ్లాడు. కేసరపల్లి ఏలూరు కాలువ పక్కన నిర్మానుషంగా ఉండే రోడ్డులో కారు ఆపి ఆమె తలపై రాడ్‌తో కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న ముళ్లకంచెల్లో పడేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. కనిపించడం లేదంటూ.. రెండు రోజుల అనంతరం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శివనాగరాజు పిన్నమనేని ఆస్పత్రికి వచ్చిన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీనితో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తూ ఆచూకీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నాడు. అయితే అతను తడబాటుకు గురవుతుండడం గ్రహించిన పోలీసులు గతంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో భార్యను హత్యచేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఏలూరు కాలువ పక్కనే ఉన్న రోడ్డులో ముళ్లకంచెల్లో పడివున్న పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
-
వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడను..
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఎమ్మెల్యే వంశీ తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యార్లగడ్డ వెంకట్రావు సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిస్కరించేందుకు రాజకీయాల్లోకి రావాలి. ప్రజలకు సమస్యలు సృష్టించేందుకు రాజకీయాల్లోకి రాకూడదు. క్రియశీలక రాజకీయాల్లోకి నేను కొత్తగా వచ్చానే గానీ, మా కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. ప్రాణహాని ఉందంటూ నేనేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విజయవాడ సీపీ కలవమంటేనే మా పార్టీ నేత దాసరి బాలవర్ధన్‌రావుతో వెళ్లి కలిశాను. చదవండి: (ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ వైరల్) వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడితే గన్నవరం వచ్చేవాడినే కాదు. వంశీ ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేను. నేను గన్నవరం నియోజకవర్గంలో ప్రతీ గడపకు వెళ్ళాను. ఎప్పుడూ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పడం కూడా నేను ఇష్టపడలేదు. అతని అరాచకాలు, దోపిడీల గురించి ప్రజలే చెప్పారు. ప్రజలు చెప్పిన దురాగతాలు గురించే నేను చెప్పాను. వంశీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎమ్మెల్యే వంశీ ఐదేళ్లు ప్రజలని భయబ్రాంతులకు గురిచేశారు. నేను అమెరికా నుంచి మంచి చేద్దాం అని రాజకీయాల్లోకి వచ్చాను కానీ దోచుకుందాం అని కాదు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఎమ్మార్వోలను మట్టి రెవెన్యూ అధికారులగా మార్చుకుని మట్టి తవ్వుకున్న వ్యక్తిని కాను. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడవద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతోనే వల్లభనేని వంశీ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు. వంశీ తన ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, పోలీస్ శాఖ వాళ్లే నాకు ఆ విషయం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. మా పార్టీ అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో వంశీ ఇలా వ్యవహరిస్తున్నాడు. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను మట్టి తవ్వలేదు. నియోజకవర్గంలో మొత్తం చెరువులు తవ్వి మట్టి దోచింది నేను కాదు అని చెప్పాను. వంశీ మీరు మీ భార్య 2014 ఎన్నికలకు ముందు బెంగుళూరుకు వెళ్లి జగన్ గారిని కలిసింది వాస్తవం కాదా. ఆంధ్రజ్యోతి పత్రికలో నా ఇల్లు అక్రమ కట్టడం అని రాశారు, నేను అన్ని అనుమతులు తీసుకునే కట్టాను. వంశీ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడం వంశీకి అలవాటు. వంశీ అరాచకాలు టీడీపీ నేతలే భరించలేక పోతున్నారు. నేను వంశీలా సంస్కార హీనుడిని కాదు. ఆయన తనకు అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాయించుకున్నారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర వంశీది. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. నీ ఇల్లు నువ్వు చక్కపెట్టుకోకుండా మా గురించి నీకు ఎందుకు. నన్ను, మా క్యాడర్ ని భయపెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తిని కాదు. బ్రహ్మలింగేశ్వర స్వామి అన్ని చూసుకుంటారు.’ అని అన్నారు. -
నాపై వంశీ తప్పుడు విమర్శలు చేస్తున్నారు
-
ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ వైరల్
సాక్షి, గన్నవరం : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా... కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇంకా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి ఇటీవల వల్లభనేని వంశీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వంశీ నుంచి తనకు ప్రాణహాని ఉందని యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ రాశారు. యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడాలనే తాను ఆయన ఇంటికి వెళ్లానంటూ వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
గన్నవరం చెరువులో పడి ఇద్దరి మృతి
-
గన్నవరంలో విషాదం..!
సాక్షి, కృష్ణా : గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఒకరు మృతి చెందగా.. అతడ్ని కాపాడే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. సింగరాయకొండకు చెందిన షేక్ మస్తాన్ భాషా(20), కావలికి చెందిన షేక్ కరీం భాషా(19)లు వేసవి సెలవులు కావడంతో గన్నవరంలోని బాబాయి ఇంటికి వచ్చారు. ప్రమాదవశాత్తు కరీం భాషా చెరువులో పడిపోగా.. అతన్ని కాపాడేందుకు మస్తాన్ భాషా ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం
-
పాకిస్తాన్లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలోనా..?
గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్‌బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు. వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు. -
‘రసాయన’ రోడ్డు ప్రయోగం విఫలం
గన్నవరం (కృష్ణా): అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గన్నవరంలో ప్రయోగత్మకంగా చేపట్టిన ‘కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్’ రోడ్డు నిర్మాణం విఫలమైంది. గ్రావెల్, మెటల్ అవసరం లేకుండానే.. టాప్ సీల్ కెమికల్‌ను వినియోగించి మట్టిని గట్టిపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో రహదారుల నిర్మాణం చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీకి ఇక్కడ మాత్రం ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పద్ధతిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.45 కోట్లు కేటాయించింది. అమెరికాకు చెందిన టాప్ సీల్ కెమికల్ తయారీ సంస్థ టెర్రా పేబ్తో కలిసి కడపకు చెందిన కృష్ణప్ప మినరల్ సంస్థ ఈ రోడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. పది రోజులకే తూట్లు తొలుత ప్రయోగాత్మకంగా గన్నవరంలోని జాతీయ రహదారి నుంచి మర్లపాలెం వరకు రెండు కిలోమీటర్ల పొడవున రూ.40 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట శంకుస్థాపన చేశారు. దీనికి అవసరమైన టాప్ సీల్ కెమికల్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. నెల రోజుల కిందట ప్రయోగాత్మకంగా 90 మీటర్ల పొడవున నిర్మాణం చేపట్టారు. రోడ్డును ఆరు అంగుళాల లోతున దున్ని దానిపై నీటిలో కలిపిన కెమికల్ చల్లుతూ గ్రావెల్‌తో చదును చేశారు. ఈ విధంగా నాలుగు, ఐదు రోజుల్లో మూడుసార్లు కెమికల్ స్ప్రే, రోలింగ్ చేయడం ద్వారా మట్టిని గట్టిపరిచారు. ఈ పనులను అమెరికాకు చెందిన టెర్రా పేబ్ కంపెనీ ప్రతినిధి గ్యారీ నిల్సన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు చార్లెస్, నిర్మాణ సంస్థకు చెందిన అంజప్ప పర్యవేక్షించారు. ఆశించిన ఫలితం రాక అయితే, కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం చివరకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 90 మీటర్ల పొడవున వేసిన రోడ్డు పైభాగంలో మట్టి గట్టి పడలేదు. ఫలితంగా రోడ్డు పైపొర (లేయర్) వాహనాల తాకిడికి క్రమంగా దెబ్బతింటోంది. రోడ్డు నిర్మాణం సంతృప్తికరంగా లేకపోవడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డు పదేళ్ల పాటు చెక్కుచెదరదని నిపుణులు చెప్పినప్పటికీ, పది రోజులకే దెబ్బతినడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి మట్టి స్వభావం కారణంగానే అనుకున్న రీతిలో నిర్మాణం జరగలేదని కాంట్రాక్ట్ సంస్థ చెబుతోంది. ఈ పద్ధతిలో ఇక్కడ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతికత, యంత్ర పరికరాలు లేకపోవడం, నేల స్వభావం వల్ల అనుకున్న మేర సక్సెస్ కాలేకపోయామని నిపుణులు పేర్కొంటున్నారు. లోపాలను సవరించి మరోసారి నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే, పనుల కొనసాగింపుపై పంచాయతీరాజ్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి నమ్మకం వ్యక్తం చేయడం లేదు. సంతృప్తికరంగా రాలేదు ప్రయోగత్మకంగా కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో నిర్మాణ సంస్థ తాత్కాలికంగా పనులను నిలిపివేసింది. పనుల కొనసాగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఎ.వెంకటేశ్వరరావు, డీఈ, పంచాయతీరాజ్ -
చక్కెర..ఓ చేదు నిజం
సాక్షి,గన్నవరం : జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్ ప్రకటించడం జంక్షన్ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్జంక్షన్కు ఓ తలమానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన షుగర్ ఫ్యాక్టరీ ప్రస్థానం.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం.. షుగర్స్ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్లో ప్రారంభమైన చెరకు క్రషింగ్ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్‌ను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? మూడేళ్లుగా డెల్టా షుగర్స్ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి. జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
నిన్న విజయవాడ... ఇప్పుడు గన్నవరమా?
సాక్షి, అమరావతి : జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించిన సీట్లలో పోటీ పెట్టారన్నారు. విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయమని చెప్పిన, జనసేన ఇప్పుడు గన్నవరం అసెంబ్లీ ఇస్తామని అంటోందని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరు చేసిన ఖండించాల్సిందేనని సురవరం పేర్కొన్నారు. కాగా తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చరిత్ర ఉన్న సీపీఐకి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా సీపీఐకి ఇచ్చిన బెజవాడ లోక్‌సభ సీటును జనసేన లాగేసుకోవడంతో కూటమి నుంచి బయటకు రావాలని సీపీఐ భావిస్తోంది. కాగా విజయవాడ లోక్‌సభ సీటుకు సోమవారం నామినేషన్ వేసేందుకు సీపీఐ అభ్యర్థి చలసాని అజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన తన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణబాబును నిన్నరాత్రి హడావుడిగా ప్రకటించింది. దీంతో కంగుతిన్న సీపీఐ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కూటమి నుంచి బయటకు రావడమా? కొనసాగడమా? అనే దానిపై చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ సమావేశం కొనసాగినా దానిపై స్పష్టత రాలేదు. దీంతో సీపీఎం రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన వామపక్ష పార్టీలకు చెరో 7 అసెంబ్లీ, రెండేసి పార్లమెంటు సీట్లు కేటాయించింది. ఇప్పటికే సీపీఐకి ఇచ్చిన అసెంబ్లీ సీట్లలో నూజివీడు సీటును జనసేన వెనక్కి తీసుకుని, దానికి ప్రత్యామ్నాయంగా విజయవాడ లోక్‌సభ సీటును కేటాయించింది. దీనికి అంగీకరించిన సీపీఐ తన అభ్యర్థిగా న్యాయవాది చలసాని అజయ్ కుమార్‌ను ప్రకటించింది. ఈ తరుణంలో జనసేన తన అభ్యర్థిని ప్రకటించడంపై అజయ్‌ను బలపరుస్తున్న పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన వైఖరిపై గుర్రుగా ఉన్న సీపీఐ... ఆ పార్టీతో తెగదెంపులు చేసుకునే యోచనలో ఉంది. -
నేడు అంబాజీపేటకు జగన్ రాక
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలోని అంబాజీపేటకు విచ్చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. గతంలో సుదీర్ఘంగా నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన ఆయన.. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో రోడ్‌షో నిర్వహించనున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నూతనోత్సాహంతో ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే వివిధ వర్గాల వారికి అమలు చేయబోయే పథకాలను ‘నవరత్నాలు’ పేరుతో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలు జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నేత జగన్‌ను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాకు సంబంధించి కోనసీమలో ప్రచారం ఆరంభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో అంబాజీపేటలో రోడ్ షో నిర్వహించడం ద్వారా ఈ సెంటిమెంట్ తప్పనిసరిగా నెరవేరుతుందని పలువురు నాయకులు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌తో పాటు పలువురు నాయకులు ఇప్పటికే రోడ్‌షో ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ టూర్ సాగనుందిలా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు భోగాపురం నుంచి బయలుదేరి 2.30 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం వస్తారు. అక్కడి నుంచి రోడ్‌షోగా అంబాజీపేట సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. విజయవంతం చేయాలి జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలశిల రఘురాం, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ వచ్చే రహదారిని, రోడ్‌షో నిర్వహించే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. జనసమీకరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, నాయకులు మంతెన రవిరాజు, పి.కె.రావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబులకు పలు సూచనలు చేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వాసంశెట్టి చినబాబు, నాగవరపు నాగరాజు, నాయకులు దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోట సత్తిబాబు, దొమ్మేటి సత్యమోహన్, మైపాల నానాజీ, మట్టపర్తి వెంకటేశ్వరరావు, దొమ్మేటి రాము తదితరులు వారి వెంట ఉన్నారు. హెలిప్యాడ్ పరిశీలన పి.గన్నవరం: జగన్ రాక సందర్భంగా పి.గన్నవరం శివారు పోతవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చింతా అనురాధ, కొండేటి చిట్టిబాబు, తలశిల రఘురామ్, పిల్లి సుభాష్‌చంద్రబో‹స్, మిండగుదిటి మోహనరావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు, రాజానగరం అబ్జర్వర్ కుడుపూడి బాబు, నక్కా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, జగన్ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారం చేపడతారని అన్నారు. హెలీప్యాడ్‌ను అమలాపురం డీఎస్పీ రమణ, రావులపాలెం, అమలాపురం సీఐలు బి.పెద్దిరాజు, జి.సురేష్ బాబు, ఎస్సైలు ఎస్.రాము, కేవీ నాగార్జున తదితరులు పరిశీలించారు. -
టీడీపీలో శ్రేణుల్లో అగ్గి రగిలింది
అధినేత చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేసిన తీరుపై జిల్లాలోని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. కొన్నిచోట్ల నిరసనలు తెలిపారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు చేశారు. మరికొన్నిచోట్ల సమావేశాలు ఏర్పాటు చేసుకుని, పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల్ని ఓడించి తీరుతామని టీడీపీ శ్రేణులు శపథం చేస్తున్నాయి. తాజా పరిమాణాల నేపథ్యంలో కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పేయాలని చూస్తుండగా, మరికొందరు పార్టీలో ఉంటూనే తమ సత్తా చూపించాలని భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామని అధిష్టానానికి సూటిగా హెచ్చరికలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి జిల్లాలోని 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీలో ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తి రేగింది. పెద్దాపురం టిక్కెట్టు ఆశిస్తున్న బొడ్డు భాస్కర రామారావుకు మొండిచేయి చూపడంతో ఆయనతో పాటు అనుచరవర్గం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ఆయన స్వగ్రామం పెద్దాడలో ఏకంగా చంద్రబాబు దిష్టిబొమ్మను బొడ్డు భాస్కర రామారావు అనుచరులు దహనం చేశారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని వారందరూ చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. పెద్దాపురం టిక్కెట్టు ఇచ్చిన నిమ్మకాయల చినరాజప్పకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు టిక్కెట్టు ఇవ్వవద్దని, ఇస్తే ఓడిస్తామని 17 మంది కార్పొరేటర్లు, మరికొంతమంది నేతలు ఇప్పటికే సమావేశమై అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొందరిని ప్రలోభాలతో దారికి తెచ్చుకునే యత్నం కూడా చేశారు. అసంతృప్తులు వెనక్కి తగ్గినట్టే తగ్గి అధిష్టానం పెద్దలకు తమ వ్యతిరేకతను తెలియజేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. వనమాడికే టిక్కెట్టు ఖరారు చేశారు. దీంతో అసమ్మతి నేతలంతా రగిలిపోతున్నారు. ఒకవైపు కొండబాబుకు బుద్ధి చెబుతామంటూనే మరోవైపు ఈ నెల 17వ తేదీన జిల్లాకొస్తున్న చంద్రబాబు వద్ద తేల్చుకోవాలని చూస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీలో రాజీనామాల పర్వం పెద్ద ఎత్తున మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కాదని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు టిక్కెట్టు ఖరారు చేశారు. దీంతో సుబ్బారావు వర్గం భగ్గుమంటోంది. ఇప్పటికే ఆయనతో పాటు అనేకమంది టీడీపీకి రాజీనామాలు చేశారు. మరికొంతమంది ఒక్కొక్కరుగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. వరుపుల రాజాను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాజోలు టిక్కెట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకే ఖరారు చేశారు. దీనిపై అక్కడి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. స్థానికేతరుడైన సూర్యారావుకే మళ్లీ టిక్కెట్టు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు స్థానికులు పల్లకీ మోయాలా అని విరుచుకుపడుతున్నారు. ఈ టిక్కెట్టు ఆశించిన బత్తుల రాము ఆధ్వర్యాన అసమ్మతి నేతలంతా శుక్రవారం ఉదయం మలికిపురంలో సమావేశమయ్యారు. ఈ నెల 17న జిల్లాకు వస్తున్న చంద్రబాబు వద్ద తేల్చుకుంటామని, స్పందించకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ సీనియర్ నేత, గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణకు అధిష్టానం మొండిచేయి చూపింది. దీంతో ఆయన వర్గం తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఎవరెవరికో టిక్కెట్టు ఇచ్చి, సీనియర్లను విస్మరించడం తగదని, ఆయన అనుచరులందరూ అమరావతి వెళ్లి నిరసన తెలుపుతున్నారు. సీఎం దగ్గరే తేల్చుకుంటామని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. జగ్గంపేట టిక్కెట్టును జ్యోతుల నెహ్రూకు ఖరారు చేయడాన్ని టీడీపీలో మొదటినుంచీ ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమను అణగదొక్కేందుకు వచ్చిన నేతకు మళ్లీ టిక్కెట్టు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తూ, ఏకంగా పార్టీని విడిచి వైఎస్సార్ సీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోయారు. మరికొందరు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌ను, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే, రోడ్డెక్కడం కన్నా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి కాకుండా, పార్టీ కోసం కష్టపడని నేలపూడి స్టాలిన్‌బాబుకు కేటాయించారు. దీనిపై ఎమ్మెల్యే వర్గమంతా మండిపడుతోంది. శుక్రవారం సాయంత్రం తన అనుచరులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని, కాళ్లరిగేలా తిప్పుకుని మోసగించారని, ఎమ్మెల్యేగా కనీసం గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులంతా స్టాలిన్‌బాబును ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఎల్లో మీడియావి తప్పుడు కథనాలు
సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. గన్నవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు స్టువర్టుపురం దొంగల్లా దోచుకుంటున్నరని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మైనార్టీలపై దాడులు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నేతలపై వందల్లో కేసులు నమోదు అయ్యాయని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ నాయకులు గుడిని, గుళ్లో లింగాన్ని మింగే విధంగా దోపిడీకి పాల్పడుతున్నారని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. -
అమ్మ కోసం ఒకరు.. స్నేహం కోసం మరొకరు..!
ప్రమాదవశాత్తూ మరణించిన అమ్మ కోసం బెంగపెట్టుకుని ఒక విద్యార్థిని, ప్రాణ స్నేహితురాలు లేకుండా ఉండలేనని మరో విద్యార్థిని.. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శీతల పానీయంలో పురుగు మందు కలిపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన మండలంలోని నాగుల్లంక గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించగా, మరో విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సాక్షి, పి.గన్నవరం: నాగుల్లంక శివారు రాయిలంకకు చెందిన మామిడిశెట్టి లక్ష్మీప్రసన్న (15), అయోధ్యలంక గ్రామం నుంచి వచ్చి నాగుల్లంకలో నివశిస్తున్న బొక్కా సూర్య భవాని (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులని స్థానికులు తెలిపారు. లక్ష్మీప్రసన్న తల్లి భవాని గత జనవరి 16న పంట బోదెలో బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించింది. దీంతో తల్లి కోసం కుమార్తె బెంగ పెట్టుకుంది. అమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె లేనిదే తనకు జీవితం లేదని, తాను కూడా చనిపోయి అమ్మ వద్దకు వెళ్తానని సుమారు సుమారు 10 లేఖలు రాసుకుని స్కూలు బ్యాగులో దాచుకుంది. మాతృమూర్తితో చంటి బిడ్డ ఉన్న చిత్రాలను పెన్నులతో గీసి తల్లిపై తనకున్న అభిమానాన్ని స్పష్టం చేసింది. అయితే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన వారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లలో గుళికల మందు కలిపి తాగి పాఠశాలకు వచ్చారు. సాయంత్రం సమయంలో లక్ష్మీ ప్రసన్న వాంతులు చేసుకోవడంతో పక్కనే ఉన్న పీహెచ్‌సీకి హెచ్ఎం హరినాథ్ తరలించారు. ఈలోగా ఆమె స్కూలు బ్యాగులోని టిఫిన్ బాక్సులో గుళికలు ఉండటాన్ని గమనించిన విద్యార్థులు హెచ్ఎంకు తెలిపారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈలోగా సూర్య భవాని కూడా వాంతులు చేసుకోవడంతో ఇద్దరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మరణించగా, ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్య భవానికి కిమ్స్‌లో వైద్యం చేస్తున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో ఒకరినొకరు వీడలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్బడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. నాగుల్లంక గ్రామంలో విషాదఛాయలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థినులలో లక్ష్మీ ప్రసన్న మరణించగా, సూర్య భవాని అపస్మారక స్థితికి చేరుకోవడంతో నాగుల్లంకలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మీ ప్రసన్న తల్లి భవాని ఇటీవల మరణించగా తండ్రి దుర్గారావు, చెల్లెలు లక్ష్మీదుర్గ ఉన్నారు. కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి దుర్గారావు బోరున విలపిస్తున్నాడు. సూర్యభవానికి తల్లి సుజాత, తండ్రి శ్రీనివాసరావు, తమ్ముడు గణేష్ ఉన్నారు. సూర్య భవాని అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. పి.గన్నవరం ఎస్సై ఎస్.రాము కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న సూర్య భవాని -
గన్నవరం తహశీల్దార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా : గన్నవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన గన్నవరం ఎయిర్ పోర్ట్ నిర్వాసితులకు తహశీల్దార్ నుంచి నిర్లక్ష్య సమాధానం ఎదురవ్వటంతో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రత్యామ్నాయం చూపటం లేదంటూ ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులు శనివారం వినతి పత్రం అందచేయటానికి తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇవ్వగా.. ‘ఎన్నికల డ్యూటీపై వచ్చా నాకు ఏం తెలియదు’ అంటూ తహశీల్దార్ మధుసూదనరావు నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. దీంతో తహశీల్దార్ తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు తమ నిరసన విరమించేది లేదంటూ కార్యాలయం లోపల వారు భైఠాయించారు. నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా సమావేశం ఉందంటూ తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోవటం గమనార్హం.