ICC Champions Trophy 2025
-
ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్ అయ్యర్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ టీమిండియా సొంతం కావడంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఐదు మ్యాచ్‌లలోనూ అద్భుత ఆట తీరుతో రాణించి.. జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.తుదిజట్టులో చోటు కరువు?అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ముందు శ్రేయస్ అయ్యర్‌కు తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ (Ind vs Eng ODIs)తో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు ఆడగా.. తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లి గాయం వల్ల దూరమయ్యాడు. ఫలితంగా శ్రేయస్ అతడి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.ఇక అప్పటి నుంచి అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస మ్యాచ్‌లలో బ్యాట్ ఝులిపించి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. భారత జట్టు మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ (Dubai)లో ఆడిన విషయం తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ బాగా ఏడ్చాడట. ఇందుకు గల కారణాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చానుక్యాండిడ్ విత్ కింగ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చివరగా ఏడ్చిన సందర్భం అంటే.. చాంపియన్స్ ట్రోఫీ అప్పుడే. మొదటి ప్రాక్టీస్ సెషన్లో నేను సరిగ్గా ఆడలేకపోయాను. దాంతో ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను.అంతేకాదు.. నా మీద నాకు అంతులేని కోపం వచ్చింది. నిజానికి సాధరణంగా నేను అస్సలు ఏడ్వను. కానీ అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డానో నాకే తెలియదు. ఒక్కోసారి నాకు ఇది షాకింగ్‌గా అనిపిస్తుంది.అంతకు ముందు ఇంగ్లండ్ సిరీస్‌లో నేను బాగానే ఆడాను. అదే జోరును చాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని ఫిక్సయ్యాను. అయితే, అలా తొలి సెషన్లోనే చేదు అనుభవం ఎదురుకావడం వల్ల నిరాశకు గురయ్యాను. తర్వాత అక్కడి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని నాదైన శైలిలో ఆడాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.కనక వర్షంకాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను ఆ జట్టు వదులుకుంది. ఈ క్రమంలో మెగా వేలంలోకి వచ్చిన ఈ ముంబైకర్పై కాసుల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంజాబ్ సారథిగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అయ్యర్.. రెండింట గెలిచాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్Sarpanch Saab's passion for the game... 🥹🤌🏻Watch the full heartfelt conversation between Shreyas Iyer and Sahiba Bali on our YT channel and Punjab Kings App. 📹 pic.twitter.com/t1PBDtCY6M— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2025 -
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.ఆర్సీబీ వదిలేసిందిఅయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.టైటాన్స్ అక్కున చేర్చుకుందిఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు సిరాజ్. నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించిందిఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్‌ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయంచదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు! -
అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్‌గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మేము సెమీస్‌లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్‌బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదు: టీమిండియా దిగ్గజం
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్ సేన.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డుగ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్ పోరులో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరగా.. భారత్‌కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.గంభీర్‌కు రూ. 3 కోట్లుఈ మొత్తంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్‌కోచ్ గంభీర్‌కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్‌లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సునిల్ గావస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్‌తో గంభీర్‌ను పోలుస్తూ స్పోర్ట్స్‌స్టార్‌కు రాసిన కాలమ్‌లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్‌మనీ ప్రకటించింది. అప్పటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదుకానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్‌లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్‌లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్‌కోచ్ నుంచి ప్రైజ్‌మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.అతడు ద్రవిడ్ మాదిరి కోచ్లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా?!’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శుభపరిణామంఅదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే!
దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి అంగీకరించాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను అక్కడకు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) వెనక్కి తగ్గింది.ఈ నేపథ్యంలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. గ్రూప్ దశలో మూడు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను అక్కడే పూర్తి చేసుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ పది మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంకాగా.. వర్షం వల్ల కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే సజావుగా సాగాయి.రూ. 739 కోట్ల మేర నష్టం?ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ నేపథ్యంలో పీసీబీకి రూ. 739 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే వార్తలు వచ్చాయి. అయితే, పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఈ వదంతులను ఖండించారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తమకు ఎలాంటి నష్టం రాలేదని.. పైగా రూ. 100 కోట్ల మేర ఆదాయం చేకూరిందని చెప్పడం గమనార్హం.‘‘టోర్నమెంట్‌కు సంబంధించి అయిన ఖర్చు మొత్తాన్ని ఐసీసీ సమకూర్చింది. టికెట్ల అమ్మకం, ఇతర మార్గాల ద్వారా పీసీబీకి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది’’ అని ఆమిర్ మిర్ స్పష్టం చేశాడు. తమ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని.. ఆడిట్ తర్వాత ఈ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తమకు రూ. 300 కోట్ల మేర ఆదాయం చేకూరిందని పీసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆదాయంలో ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదైందని.. ప్రపంచంలో తాము ఇప్పుడు టాప్-3 సంపన్న బోర్డుల జాబితాలో చేరామని పేర్కొన్నాయి.అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకాగా దాదాపు 19 వేల కోట్లకు పైగా రూపాయలతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 689 కోట్లు, ఇంగ్లండ్ &వేల్స్ బోర్డు రూ. 513 కోట్ల మేర సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా.. రూ. 300 కోట్ల సంపద కలిగి ఉన్నామన్న చెపుతున్న పీసీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. తాము టాప్-3లో ఉన్నామంటూ బోర్డు వర్గాలు వెల్లడించడం గమనార్హం.చాంపియన్‌గా టీమిండియాఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. తొలి సెమీస్‌లో భారత్.. ఆసీస్‌ను.. రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ ప్రొటిస్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దుబాయ్‌లో మార్చి 9న జరిగిన ఫైనల్లో టీమిండియా కివీస్ జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో రావల్పిండి, కరాచీ, లాహోర్ మైదానాలు చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగా వన్డే ఈవెంట్ కోసం ఈ మూడు స్టేడియాలలో భారీ ఖర్చుతో పీసీబీ మరమతులు చేపట్టింది. అయితే, వర్షం కారణంగా రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్‌లు రద్దు కావడం.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దుస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేనపుడు ఇలాంటి మెగా టోర్నీలను నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదంటూ పీసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ధనశ్రీకి చహల్ కౌంటర్?'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు. నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.మధ్యలో ఆమె!అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి. ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్‌కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్‌లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌కు టి. దిలీప్‌నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్‌గా నిలిచింది.దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
Pak vs Ban: పాకిస్తాన్ పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడకు వెళ్లింది. తొలి రెండు టీ20లలో ఓటమి పాలైన సల్మాన్ ఆఘా బృందం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు.. ఈ టూర్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీ కానున్నారు.అనంతరం.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ టూర్ (Bangladesh Tour Of Pakistan) లో భాగంగా పాక్- బంగ్లా జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 10వ సీజన్ జరగనుండగా... ఇది ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. లాహోర్ (Lahore), ముల్తాన్ (Multan), ఫైసలాబాద్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ పాకిస్తాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడితో చర్చించిన.. అనంతరం ఇరు దేశాల బోర్డులు ఈ సిరీస్‌లకు పచ్చజెండా ఊపాయి. ద్వైపాక్షిక సిరీస్ కోసం చివరిసారిగా గతేడాది పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది.ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. బంగ్లాదేశ్ కూడా ఘోర ఓటములు చవిచూసింది. గ్రూప్-ఎలో టీమిండియా, న్యూజిలాండ్‌తో కలిసి ఉన్న ఈ ఆసియా జట్లు.. ఈ రెండు టీమ్‌ల చేతిలో చిత్తుగా ఓడాయి. అనంతరం పాక్- బంగ్లా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డుపడటంతో టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చెరో పాయింట్‌తో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.ఇక గ్రూప్-బి నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ఇందులో సౌతాఫ్రికా సెమీస్ చేరి.. అక్కడ కివీస్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో రోహిత్ సేన జయకేతనం ఎగురువేసింది. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా అవతరించింది. చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్ -
IPL: వారెవ్వా..! అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకప్పుడు బాల్ బాయ్‌గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).సారథిగా సూపర్ హిట్ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఈ ముంబైకర్.. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. గౌతం గంభీర్ తర్వాత కోల్‌కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది. పంజాబ్ టైటిల్ కలను తీర్చాలని గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్ టైటిల్ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్‌స్టార్‌తో ముచ్చటించిన ఈ కెప్టెన్ సాబ్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.అప్పుడు బాల్ బాయ్‌ని‘‘మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్లో బాల్ బాయ్స్‌గా తీసుకువెళ్లారు.నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్ క్రికెటర్ రాస్ టేలర్‌ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.సర్.. నేను మీకు వీరాభిమానినిఅనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు. అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్ లేదంటే బ్యాట్ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పాను. అప్పట్లో ఇర్ఫాన్ భాయ్ క్రేజ్ తారస్థాయిలో ఉండేది. పంజాబ్ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్ అయ్యర్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.2015లో ఎంట్రీకాగా ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తాను రాస్ టేలర్ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్ వెల్లడించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 115 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్‌గా టైటిల్ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో తాజా సీజన్‌ను మొదలుపెట్టనున్నాడు.చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్‌కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు. -
టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి
టెస్టు ఫార్మాట్ తనకు సరిపడదని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అన్నాడు. టీ20, వన్డేల్లో కొనసాగితే చాలని.. అందులోనే తనకు సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. కాగా 2021లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ కర్ణాటక బౌలర్ చాలాకాలం పాటు జట్టుకు దూరంగానే ఉన్నాడు.రీ ఎంట్రీలో అదుర్స్అయితే, ఐపీఎల్లో సత్తా చాటుతున్న వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి ప్రధాన కారణం హెడ్‌కోచ్ గౌతం గంభీర్. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా పనిచేసిన గౌతీ.. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ నైపుణ్యాలను దగ్గరగా గమనించాడు. ఈ క్రమంలో వరుణ్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అదరగొట్టిన వరుణ్.. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటాడు. అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటిఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన వరుణ్.. అనూహ్య రీతిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపికయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లలో తుదిజట్టులో స్థానం దక్కనప్పటికీ.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన 33 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ తన వంతు సాయం చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే తొమ్మిది వికెట్లు తీసి చాంపియన్స్ ట్రోఫీ-2025 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే.. కానీఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లోనూ అతడిని ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్ స్వయంగా తనకు టెస్టు ఫార్మాట్ సరిపడదని చెప్పడం విశేషం. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే. కానీ నా బౌలింగ్ శైలి అందుకు సరిపడదు.నా బౌలింగ్ స్టైల్ ఇంచుమించు మీడియం పేస్లాగే ఉంటుంది. ఇక టెస్టు క్రికెట్లో వరుస విరామాల్లో 20- 30 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నాకు అది సాధ్యం కాదు. నేను కాస్త ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను కాబట్టి.. 10- 15 ఓవర్ల వరకే నాకు సౌకర్యంగా ఉంటుంది. అదేమో రెడ్ బాల్ క్రికెట్‌కు సరిపడదు.అందుకే నేను ప్రస్తుతం 20, 50 ఓవర్ల క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితం కావాలని భావిస్తున్నాను’’ అని వరుణ్ చక్రవర్తి తన మనసులోని మాటను వెల్లడించాడు.అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లుఇక ఆరంభంలో పేసర్‌గా ఉన్న తమిళనాడు బౌలర్ వరుణ్.. తర్వాత స్పిన్నర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పశ్చాత్తాపం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నిజమే.. తొలిరోజుల్లో నేను మీడియం పేస్‌తో బౌలింగ్ చేశా. అక్కడ చాలా మంది పేసర్లు ఉండేవారు.అయితే, తమిళనాడు వికెట్లపై బంతి స్వింగ్ కాదు. అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లు. అందుకే మీరు తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను చూడలేరు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో జూన్‌లో మొదలయ్యే టెస్టు సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అతడు తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ (Sanjana Ganesan) వివాహ వార్షికోత్సవం నేడు (మార్చి 15). ఈ సందర్భంగా సంజనా భర్తపై ప్రేమను కురిపిస్తూ ఉద్వేగ పూరిత నోట్ షేర్ చేసింది. ‘‘నువ్వుంటేనే నా గుండె కొట్టుకుంటుంది.. నువ్వు నాతో ఉంటేనే నాకు శ్వాస ఆడుతుంది.. నువ్వు లేని ఇల్లు ఇల్లులా కనిపించదు.. నువ్వే నా ధైర్యం.. నువ్వుంటే నేను నిశ్చితంగా ఉంటాను.. హ్యాపీ 4 లవ్’’ అంటూ సంజనా కవితాత్మక పంక్తులతో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ సినిమా పాటలోని లిరిక్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది.హ్యాపీ యానివర్సరీఇందుకు బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను సంజనా జతచేసింది. ఈ క్రమంలో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాధారణ కుటుంబంలో జన్మించిన బుమ్రా.. తన అంకిత భావం, కఠిన శ్రమతో వరల్డ్‌క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతడే ముందున్నాడు.అంతేకాదు.. టీమిండియా పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. వైస్ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించిన ఆమె.. తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రజెంటర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో బుమ్రా- సంజనా మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వీరు 2021, మార్చి 15న సిక్కు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా.. అతడికి అంగద్‌గా నామకరణం చేశారు. కోలుకుంటున్న బుమ్రాకాగా బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమైన అతడు... కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి ముంబైతో ప్రయాణిస్తున్న బుమ్రాను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ తమ మొదటి ప్రాధాన్య ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. అతడి కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 45 టెస్టులు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున 89 వికెట్లు తీసిన బుమ్రా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోసారి సూపర్ ‘హిట్’కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్‌గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ సాధించాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.అత్యంత ఘోర ఓటమి కారణంగాముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్.. 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.ఇక ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. సీన్ రివర్స్ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.రోహిత్ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్ ఆఖర్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‘‘రోహిత్ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. అటు రోహిత్ కూడా రెడ్ బాల్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్‌కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..? -
బుమ్రా ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలి: ఆసీస్ దిగ్గజం వార్నింగ్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. గాయాలతో సావాసం చేస్తున్న ఈ రైటార్మ్ బౌలర్.. కెరీర్ పొడిగించుకోవాలంటే జిమ్‌లో మరింతగా కష్టపడాలన్నాడు. రోజురోజుకు వయసు పెరుగుతున్న కారణంగా మునుపటిలా త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువ.. కాబట్టి గాయాల బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా పేస్ దళ భారం మొత్తాన్ని బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఐదు టెస్టులకు గానూ.. రెండింటిలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా అదనపు భారం వల్ల బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఫలితంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొత్తానికి బుమ్రా దూరమయ్యాడు. అయితే, ప్రధాన బౌలర్ లేకపోయిన్పటికీ.. ఈ వన్డే టోర్నీలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన కారణంగా స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయవంతమైంది. ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోనేట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. స్పష్టంగా ఏ రోజు నుంచి, ఏ మ్యాచ్‌కు అతడు ఆడేది చెప్పనప్పటికీ.. ఏప్రిల్ రెండో వారంలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారం, వచ్చే నెల మొదటి వారం రోజుల్లో జరిగే ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా గైర్హాజరు కానున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్న పేసర్ వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రా తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతాడు. శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు. అయితే, దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలిగతంలో చాలాసార్లు గాయాల నుంచి అతడు బయటపడి.. సరికొత్త ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. జిమ్‌లో ఎంతగా కష్టపడాలి అనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది. కానీ రోజురోజుకూ వయసు పెరుగుతున్న కారణంగా.. ఫిట్నెస్ కాపాడుకునేందుకు అతడు ఇంకాస్త కఠినంగా శ్రమించాలి.మైదానం వెలుపలా కష్టపడాలి. మరింత స్మార్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ బౌలర్ నడిచే కార్ లాంటివాడైతే.. అందులో ఇంధనం ఉన్నంత వరకే ముందుకు వెళ్తుంది. నిజానికి బుమ్రాతో పోలిస్తే నా ఫ్యూయల్ ట్యాంకు పెద్దది. ఎందుకంటే.. అతడిలా నేను అతి వేగంతో బౌలింగ్ చేయను.ముందుగా చెప్పినట్లు.. బుమ్రా తన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు కాబట్టే.. పనిభారాన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అతడు లేకుంటే టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేదు. కాబట్టి బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కూడా ఉంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాంగ్ కూడా బుమ్రా గురించి ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంపై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బాబర్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా అజ్మల్ ఈ సందర్భంగా మండిపడ్డాడు.అంతటి సచిన్‌కే తప్పలేదుఅంతటి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం సాధ్యం కాదని.. అలాంటపుడు బాబర్‌ను పదే పదే ఎందుకు విమిర్శిస్తారని అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాబర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించడం మానుకోవాలని అజ్మల్ హితవు పలికాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అంతేకాదు చరిత్రలో లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ చేతిలో వన్డే పరాజయం చవిచూసింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు పీసీబీ మరోసారి అతడికి పగ్గాలు అప్పగించింది.ఇక ఈ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. పసికూన అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌పై వేటు వేసిన పీసీబీ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో వన్డేల్లో పాక్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.ఆ ఇద్దరిపై వేటుఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, అంతకంటే ముందు సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌లతో త్రైపాక్షక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఐసీసీ టోర్నీలోనూ చేదు అనుభవం చవిచూసింది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ఒక్క విజయం లేకుండానే ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో.. అనంతరం టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది. ఇక ఈ టోర్నీలో బాబర్‌తో పాటు.. రిజ్వాన్ కూడా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పీసీబీ ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేదు. కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించడంతో పాటు బాబర్‌పై కూడా వేటు వేసింది. ఈ విషయంపై సయీద్ అజ్మల్ స్పందిస్తూ పీసీబీ తీరును ఎండగట్టాడు. విరాట్ లాంటి దిగ్గజాలు కూడా అంతే‘‘బాబర్, రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు. అయితే, మిగతా వాళ్లలా వాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయలేరు. అయినా సరే జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా రాణిస్తారు. కానీ మా వాళ్ల(మాజీ క్రికెటర్లను ఉద్దేశించి) ఆలోచనా విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.అంతర్జాతీయ క్రికెట్ అంటే దూకుడుగా ఆడాలనే ఫిక్సైపోయినట్టున్నారు. మ్యాచ్ విన్నర్లకు దూకుడుతో పని ఏముంది? అటాకింగ్ చేసే కంటే ముందు విరాట్ లాంటి దిగ్గజాలు కూడా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభిస్తారు. అది వాళ్ల శైలి. కానీ బాబర్- రిజ్వాన్‌లను మీరెందుకు తప్పుబడుతున్నారు?వాళ్లను టీ20 జట్టు నుంచి తొలగించడం ముమ్మాటికీ తప్పే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. బాబర్‌పై వేటు వేయకుండా.. అతడితో చర్చించి ఆటను మార్చుకునే విధంగా.. తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపి ఉండాల్సింది.మీరు కాస్త నోళ్లు మూయండిప్రతి ఒక్క క్రికెటర్ జీవితంలో ఒకానొక సమయంలో గడ్డు దశ ఎదుర్కోక తప్పదు. కెరీర్ మొత్తం ఏ ఆటగాడూ అద్భుతంగా ఆడలేడు. అంతెందుకు.. సచిన్ టెండుల్కర్ కూడా ప్రతి మ్యాచ్‌లో శతకం బాదలేడు కదా!పాకిస్తాన్ క్రికెట్‌కు ఉన్న ఏకైక స్టార్ బాబర్. మీరు గనుక అతడిని కూడా డీగ్రేడ్ చేస్తే.. ఎవరి పేరు మీద పాక్ క్రికెట్‌ను నడుపుతారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మన మాజీ క్రికెటర్లు కాస్త నోళ్లు మూసుకుని ఉంటే బాగుంటుంది’’ అని సయీద్ అజ్మల్ ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: ఎవరూ ఊహించని నిర్ణయం.. అతడి రాకతో కివీస్ కుదేలు: పాక్ దిగ్గజం -
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హిట్‌మ్యాన్ అనుసరించిన వ్యూహాలు అమోఘమని కొనియాడాడు. కీలక మ్యాచ్‌లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జట్టును విజేతగా నిలిపాడని ప్రశంసించాడు. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే టోర్నమెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. అజేయ చాంపియన్గాగ్రూప్ దశలో మూడింటికి మూడు (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్) గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఫైనల్లో కివీస్ (India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను ముందుగా బౌలింగ్‌కు పంపడమే మ్యాచ్‌కు టర్నింగ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పక అభినందించాలన్నాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘కుల్దీప్ను ముందుగా పంపడమే ఈ మ్యాచ్‌లో కీలకంగా మారింది.ఎవరూ ఊహించని నిర్ణయంరోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రత్యర్థి జట్టు అస్సలు ఊహించి ఉండదు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ 20- 25 ఓవర్ల తర్వాతే బౌలింగ్‌కి వస్తాడు. కాబట్టి న్యూజిలాండ్‌కు ఇది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.కుల్దీప్ ఇంత ముందుగా వస్తాడని కివీస్ ఓపెనర్లు అస్సలు ఊహించి ఉండరు. అక్షర్ లేదా జడేజా వస్తారని వాళ్లు అనుకుని ఉంటారు. అయితే, ఇక్కడే రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. అద్భుతమైన వ్యూహంతో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు’’ అని వకార్ యూనిస్ కొనియాడాడు.అతడి రాకతో కివీస్ కుదేలుకాగా కివీస్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పదకొండో ఓవర్లోనే బరిలోకి దించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. పదమూడో ఓవర్లో కేన్ విలియమ్సన్(11) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్‌కు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమంగా (10-0-40-2) రాణించిన కుల్దీప్ యాదవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో టాస్ ఓడిన ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైఖేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాల కారణంగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(76) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్ -
అతడిని కెప్టెన్ చేస్తారా?.. అదే జరిగితే..: స్టువర్ట్ బ్రాడ్ వార్నింగ్
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఘోర పరాభవాలు చవిచూసింది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 (ICC ODI World Cup)లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బట్లర్ బృందం... కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ జట్టు చేతిలోనూ ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గ్రూప్-బి మ్యాచ్‌లలో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సౌతాఫ్రికా చేతిల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.అంతకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోస్ బట్లర్ (Jos Buttler) ఇంగ్లండ్ టీ20, వన్డే జట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.బట్లర్ వారసుడిగా స్టోక్స్? ఈ నేపథ్యంలో బట్లర్ స్థానంలో యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నియామకం దాదాపు ఖరారైందనే వార్తలు రాగా.. ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ మాత్రం భిన్నంగా స్పందించాడు. బట్లర్ వారసుడిగా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా స్పందించాడు.బెన్ స్టోక్స్‌ను గనుక వన్డే జట్టు కెప్టెన్‌ను చేస్తే అంతకంటే అనాలోచిత నిర్ణయం మరొకటి ఉండదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి మాట్లాడటం కూడా వృథా ప్రయాసేనని పేర్కొన్నాడు. ఇప్పటికే స్టోక్స్‌పై పనిభారం ఎక్కువై.. గాయాల బారిన పడుతున్నాడని.. అలాంటిది అదనపు బాధ్యతలు అప్పగిస్తే అతడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండదుఈ మేరకు... ‘‘స్టోక్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తే అంతకంటే నిరాశ కలిగించే విషయం మరొకటి ఉండదు. ఇంగ్లండ్ బోర్డు గనుక ఈ పని చేస్తే.. అప్పుడు స్పందించడానికి నా దగ్గర మాటలు ఉండవు. ముందుగా షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అతడు ఐపీఎల్‌ను వదిలేశాడు. కీలక సిరీస్‌లలో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఫిట్‌గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గడిచిన మూడేళ్లలో స్టోక్స్ ఎన్ని ఓవర్లు బౌల్ చేశాడో గుర్తుందా?మోకాలి గాయం వల్ల అతడు సతమతమైపోతున్నాడు. ఇలాంటి సమయంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఓవర్ల వేయాలంటూ అతడిపై అదనపు భారం మోపడం ఏమాత్రం సరికాదు. గణాంకాలతో పనిలేదు.121 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన క్రికెటర్‌గా చెబుతున్నా.. టెస్టు మ్యాచ్ ఆడటం కంటే యాభై ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్ ఆడటం వల్లే ఆటగాళ్లు ఎక్కువగా అలసిపోతారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. స్టోక్స్‌పై అదనపు భారం మోపితే.. పరిస్థితులు మరింత దిగజారిపోతాయంటూ ఇంగ్లండ్ బోర్డును ఈ సందర్భంగా హెచ్చరించాడు.గాయాలతో సావాసంకాగా 33 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక జూలై 2022లో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత మళ్లీ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున వైట్‌బాల్ క్రికెట్ ఆడనేలేదు. గత రెండేళ్లుగా అతడు మోకాలి నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. 2024 ది హండ్రెడ్ లీగ్ సమయంలో మరోసారి గాయపడ్డ స్టోక్స్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్‌తో సిరీస్‌కూ గైర్హాజరైన స్టోక్స్.. సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తీసుకువస్తే అతడి కెరీర్‌కే ప్రమాదమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు! -
టీమిండియాకు అదనపు ప్రయోజనం.. ఆ విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు. ‘హోం అడ్వాంటేజ్’మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్‌కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు. మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. న్యాయంగానే గెలిచారుఅదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం. ‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్‌లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్‌కు వెళ్లింది.ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్‌కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్‌కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.ఆ విమర్శలతో ఏకీభవిస్తాఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోనే రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసింది.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం విశేషం.ఆ సత్తా భారత్‌కు మాత్రమే ఉందిఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు. ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌లను ఆడే సత్తా భారత్‌కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.ఆసీస్‌తో టెస్టు, ఇంగ్లండ్‌తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ప్రపంచ లీగ్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.కేవలం ఐపీఎల్ వల్ల కాదు..ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు. మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్‌లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్‌కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ తన.. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురికి మాత్రమే స్థానమిచ్చిన అతడు.. కేఎల్ రాహుల్‌ను విస్మరించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్‌ను కూడా పక్కనపెట్టాడు.ఇక ఓపెనింగ్ జోడీగా అఫ్గనిస్తాన్ యువ స్టార్ ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran), న్యూజిలాండ్ యంగ్‌స్టర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)లను మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసుకున్న ఈ మాజీ సారథి.. కెప్టెన్‌గా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్‌కు స్థానమిచ్చాడు.అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదేఇక గ్రూప్ దశలోనే తమ జట్టు నిష్క్రమించినప్పటికీ జో రూట్‌కు ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆథర్టన్ చోటు కట్టబెట్టాడు. ఇంగ్లండ్ నుంచి ఒకే ఒక్క ఆటగాడిగా రూట్‌కు ఈ మాజీ బ్యాటర్ స్థానం ఇచ్చాడు. తన జట్టు ఎంపిక గురించి మైఖేల్ ఆథర్టన్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ జద్రాన్ బ్యాటింగ్ నుంచి వచ్చింది.అందుకే రచిన్ రవీంద్రతో పాటు ఓపెనింగ్ జోడీగా జద్రాన్‌ను ఎంచుకున్నా. ఇక వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, రూట్ నాలుగో స్థానంలో ఉండాలి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా నా ఓటు జోష్ ఇంగ్లిస్కే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు అద్భుత నైపుణ్యాలు కనబరిచాడు.సారథి అతడేఇక ఆరోస్థానంలో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు నేను స్థానం ఇస్తాను. అతడు బ్యాట్‌తో బాల్‌తో రాణించగలడు. అతడు జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుంది. ఇక నా ఏడో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. మిచెల్ సాంట్నర్‌ను నా జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకుంటాను. ఇద్దరు సీమర్లు మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలకు చోటిస్తా. సాంట్నర్‌తో పాటు మరో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంటా’’ అని మైఖేల్ ఆథర్టన్ వెల్లడించాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఆడగా.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఆడాయి.రాహుల్,శ్రేయస్ అదరగొట్టారుఇక ఈ మెగా టోర్నీలో అఫ్గన్ ఓపెనర్ జద్రాన్ ఇంగ్లండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 117 పరుగులు సాధించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. మరోవైపు.. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కోహ్లి పాకిస్తాన్‌పై అజేయ శతకం చేయగా.. షమీ బంగ్లాదేశ్‌పై, వరుణ్ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. అయితే, టీమిండియా మిడిలార్డర్లో దిగి కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(243 రన్స్), కేఎల్ రాహుల్(140 రన్స్)లకు మాత్రం ఆథర్టన్ చోటివ్వకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లండ్ తరఫున ఆథర్టన్ 115 టెస్టులు, 54 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.మైఖేల్ ఆథర్టన్ ఎంచుకున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లి, జో రూట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
హార్దిక్ పాండ్యా(Hardhik Pandya).. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో టీమిండియాకు అద్బుతమైన విజయాలను అందిస్తున్నాడు. బంతితో మ్యాజిక్, బ్యాట్‌తో విధ్వంసం చేయగల సత్తా అతడిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ హార్ధిక్‌ది కీలక పాత్ర.బౌలింగ్, బ్యాటింగ్‌లో పాండ్యా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ ఈ బరోడా ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో పాండ్యాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్ ప్రశంసించారు. పాండ్యా తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్బుతాలు చేస్తున్నాడని వారిద్దరూ కొనియాడారు."హార్దిక్ పాండ్యా ఏమి.. మాల్కం మార్షల్, వాకార్ యూనిస్, జవగల్ శ్రీనాథ్, బ్రెట్ లీ కాదు. ఈ లెజెండ్స్ లాంటి స్కిల్స్ పాండ్యాకు లేవు. కానీ బంతితో మాత్రం అద్బుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త బంతితో చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన సత్తాచూపిస్తున్నాడు. హార్దిక్ అంత పెద్ద హిట్టర్ కూడా కాదు. కానీ తన టెక్నిక్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. నిజంగా అతడిని మెచ్చుకోవాల్సిందే. 2000లో పాకిస్తాన్ జట్టులో హార్దిక్ లాంటి ఆటగాళ్లు చాలా మంది ఉండేవారు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా అక్తర్ చేసిన వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఏకీభవించాడు."అక్తర్ భాయ్ చెప్పింది అక్షరాల నిజం. అబ్దుల్ రజాక్ వంటి ఆల్‌రౌండర్ ప్రదర్శనలను చూస్తే మనకు ఆర్దమవుతోంది. అతడు హార్దిక్ పాండ్యా కంటే చాలా బెటర్. అతడొక మ్యాచ్ విన్నర్. కానీ పాకిస్తాన్ క్రికెట్లో అతడికి సరైన గౌరవం దక్కలేదు. రజాక్లో కూడా స్కిల్స్ తక్కువగా ఉన్నప్పటికి.. అద్బుతమైన ప్రదర్శన చేసే వాడని" హాఫీజ్ చెప్పుకొచ్చాడు.కాగా రజాక్.. తన కెరీర్లో పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లో వరుసగా 1946, 5080, 393 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి పేరిట 269 వికెట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవగా.. పాకిస్తాన్ మాత్రం దారుణ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.చదవండి: WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం! -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది. హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
‘‘ఇంకో విషయం చెప్పాలి.. ఈ ఫార్మాట్ నుంచి నేను రిటైర్ కావడం లేదు. ఇకపై వదంతులు ప్రచారం చేయకుండా ఉండాలనే ఈ మాట చెబుతున్నా’’... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు ఇవి. తాను భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని.. జీవిత ప్రయాణంలో ఎదురైన వాటినే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశాడు.ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆట మీదే ఉందని.. 2027 వన్డే వరల్డ్‌కప్ నాటికి కొనసాగుతానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేనని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు తాను ఎలాంటి కామెంట్లూ చేయలేనని పేర్కొన్నాడు.ఊహాగానాలు ఆగటం లేదుక్రికెట్ ఆడటాన్ని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. జట్టుతో సమయం గడపడం తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని.. సహచర ఆటగాళ్లు కూడా తనతో ఉండేందుకు ఇష్టపడుతున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఇంత చెప్పినప్పటికీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఆగటం లేదు. అతడి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.వన్డేల్లో కొనసాగినా.. టెస్టులకు మాత్రం రోహిత్ దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాభై ఓవర్ల ఫార్మాట్లో మరో రెండేళ్లకు అంటే.. 2027 తర్వాత రోహిత్ పక్కకు తప్పుకోవడం లాంఛనమేననే వార్తలు వస్తున్నాయి. కాగా రోహిత్ వచ్చే నెలలో 38వ వసంతంలో అడుగుపెడతాడు.నలభై ఏళ్ల వయసులో ఎలా?వన్డే వరల్డ్‌కప్-2027(ICC ODI World Cup 2027) నాటికి అతడికి నలభై ఏళ్లు వస్తాయి. ఇక సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కంటే ముందు టీమిండియా దాదాపు 27 వన్డేలు ఆడనుంది. సమయాన్ని బట్టి ఇందుకు అదనంగా మరికొన్ని మ్యాచ్‌లు కూడా షెడ్యూల్ కావచ్చు. అయితే, వరల్డ్‌కప్ నాటికి రోహిత్ ఫిట్‌గా ఉండేందుకు ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలుపెట్టాడని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ మార్గదర్శనంలో రోహిత్ తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించుకున్నట్లు సమాచారం. కాగా ఇంటెలిజింట్, వినూత్న టెక్నిక్‌లకు నాయర్ పెట్టింది పేరు. దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్ తదితర స్టార్ ప్లేయర్లు నాయర్ విధానాలు పాటించి కష్టకాలం నుంచి బయటపడ్డారు.ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్‌మ్యాన్ ప్రస్తుతం ఐపీఎల్-2025కి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో అతడు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. కాగా ముంబైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ తన పేరిట చెక్కుచెదరని రికార్డును లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలుఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు.. ఈసారి మాత్రంముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.ఈ మెగా ఈవెంట్‌ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.ఆసీస్ వర్సెస్ ప్రొటిస్ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.సుమారు రూ.45 కోట్లు నష్టంఅయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్‌లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.చదవండి: కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మనే..! -
రూ. లక్ష నుంచి పది వేలకు.. ఆటగాళ్లకు షాకిచ్చిన పాక్ బోర్డు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెటర్లకు ఊహించని షాకిచ్చింది. దేశీ మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస పరాజయాలతో పాక్ సీనియర్ జట్టు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయిన రిజ్వాన్ బృందం.. వర్షం వల్ల బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవడం వల్ల నిరాశగా వెనుదిరిగింది.ఈ నేపథ్యంలో రిజ్వాన్ బృందంపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాంపియన్స్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పీసీబీ.. స్టేడియాల మరమత్తుల కోసం భారీగానే ఖర్చు చేసింది. అయితే, ఆతిథ్య జట్టుగా దిగి దారుణంగా విఫలం కావడంతో సెలక్షన్ కమిటీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మొహమ్మద్ యూసుఫ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం గమనార్హం. తదుపరి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కివీస్‌తో జరిగే 5 టి20లు, 3 వన్డేల సిరీస్ కోసమే అతడిని పీసీబీ ఎంపిక చేయగా... అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే తన కూతురు అనారోగ్యం కారణంగా టూర్‌నుంచి అతను తప్పుకొన్నట్లు యూసుఫ్ వెల్లడించగా.. అతడి స్థానంలో పీసీబీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ వైఫల్యం తర్వాత కివీస్‌తో ఎంపిక చేసిన టీ20 జట్టులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంకు పీసీబీ చోటివ్వలేదు. లక్ష నుంచి పది వేలకు.. తాజాగా.. దేశవాళీ క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ.. ఆటగాళ్లపై దెబ్బ వేసింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పాక్ దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. ఆ బోర్డు ఆర్థిక స్థితికి ఇది నిదర్శనం!కాగా జాతీయ టీ20 చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 31 వేలు) ఫీజుగా ఇస్తుండగా.. ఇప్పుడు దానిని ఏకంగా 10 వేల రూపాయలకు (రూ.3,100) తగ్గించారు. ఈ 90 శాతం కోతతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన హోటల్స్‌లో వసతి, తక్కువ సార్లు మాత్రమే విమానాల్లో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. పాక్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ సారథిగా బ్రేస్‌వెల్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా నియమించారు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనే కివీస్ జట్టును మంగళవారం ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భుజం గాయానికి గురైన హెన్రీకి మొదటి 3 మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చి ఆఖరి 4, 5వ మ్యాచ్‌లకు ఎంపిక చేయగా, జేమీసన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు.దుబాయ్‌లో ఆదివారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో తలపడిన ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్, పీఎస్ఎల్ (పాక్) కాంట్రాక్టుల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్ సహా కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, ఫెర్గూసన్ ఐపీఎల్ ఆడనుండగా, కేన్ విలియమ్సన్ పాక్ సూపర్ లీగ్ ఆడేందుకు వెళ్లనున్నాడు.కివీస్ జట్టు మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో పాక్‌తో ఐదు టీ20లు ఆడుతుంది. అనంతరం ఇరుజట్ల మధ్య మార్చి 29, ఏప్రిల్ 2, 5వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ కూడా జరుగనుంది. ఈ జట్టును తర్వాత ఎంపిక చేస్తారు. న్యూజిలాండ్ టీ20 జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్), అలెన్, చాప్మన్, ఫౌల్కెస్, మిచెల్ హే, హెన్రీ, జేమీసన్, మిచెల్, నీషమ్, రూర్కే, రాబిన్సన్, బెన్ సీర్స్, సీఫెర్ట్, జేకబ్ డఫీ, ఇష్ సోధి. తస్కీన్ ఒక్కడికే బంగ్లా ‘ఎ’ప్లస్ కాంట్రాక్టు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ తస్కీన్ అహ్మద్ ఒక్కడికే బోర్డు కాంట్రాక్టుల్లో అగ్ర తాంబూలం దక్కింది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించింది. కొన్నేళ్లుగా బీసీబీ ఫార్మాట్ల ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇస్తూ వచ్చింది. అయితే దీనికి మంగళం పాడిన బోర్డు మళ్లీ పాత పద్ధతిలోనే గ్రేడ్లవారీగా కాంట్రాక్టులు ఇచ్చింది. ఇందులో భాగంగా ‘ఎ’ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఒకే ఒక్కడు తస్కీన్‌కు నెలకు బంగ్లా కరెన్సీలో ఒక మిలియన్ టాకాలు (రూ.7.15 లక్షలు) చెల్లిస్తారు.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ సహా మెహదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌లకు ‘ఎ’గ్రేడ్ కాంట్రాక్టు దక్కింది. ఇందులో భాగంగా వీరికి నెలకు 8 లక్షల టాకాలు (రూ.5.75 లక్షలు) లభిస్తాయి. చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాని ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బీసీబీ కాంట్రాక్టు లభించలేదు. 2022 తర్వాత సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్‌లకు సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరికి నెలకు 4 లక్షల టాకాలు (రూ.2.87 లక్షలు) జీతంగా చెల్లిస్తారు. ‘బి’ గ్రేడ్ ప్లేయర్లకు 6 లక్షల టాకాలు (రూ.4.27 లక్షలు) చెల్లిస్తారు. -
అతడు అద్భుతం.. కానీ ఆ విషయంలో అసంతృప్తి: భారత మాజీ బ్యాటర్
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడిఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్‌పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్‌ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్‌తో సెమీస్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.అయ్యర్ అద్భుతంఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్‌ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు.సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలిఅదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా షాట్‌కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ లాంటి జట్లను చూసి రిజ్వాన్ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయం లేకుండానేఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాంఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.పాక్ క్రికెట్ ‘ఐసీయూ’లో ఉందిఇదిలా ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్ ఖాన్ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్ క్రికెట్ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు. చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ వార్నింగ్
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్( Shane Bond) భారత క్రికెట్ జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై పనిభారం తగ్గించాలని సూచించాడు. లేదంటే ప్రపంచకప్ నాటికి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా క్రికెటర్లలో గాయాల బెడద ఎక్కువగా ఉండేది ఫాస్ట్‌బౌలర్లకే.బుమ్రా కూడా ఇందుకు అతీతం కాదు. గతంలో చాలాసార్లు అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఏడాది పాటు జట్టు అతడి సేవలను కోల్పోయింది. అనంతరం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికి తిరిగి జట్టుతో చేరిన బుమ్రా.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తాత్కాలిక కెప్టెన్‌గా ఆ తర్వాత కూడా జట్టుతో కొనసాగిన ఈ రైటార్మ్ పేసర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. కంగారూ దేశ టూర్లో భాగంగా తొలి టెస్టుకు, ఆఖరి టెస్టుకు బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో చివరిదైన ఐదో టెస్టులో భాగంగా వెన్నునొప్పితో విలవిల్లాడిన బుమ్రా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నాడు.ఇక ఈ టూర్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా బుమ్రా కోలుకోలేదు. ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ మాట్లాడుతూ... ‘‘అతడొక విలువైన బౌలర్. వచ్చే వరల్డ్‌కప్‌లో అతడి పాత్ర కీలకం.అయితే, త్వరలోనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడబోతోంది. నేను గనుక టీమిండియా మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే.. అతడిని వరుసగా రెండు టెస్టుల్లో ఆడించను. ఐపీఎల్ తర్వాత వెనువెంటనే వరుస టెస్టులు ఆడించడం పెద్ద రిస్క్.అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లేఅలా కాకుండా మధ్యలో కాస్త విశ్రాంతినిస్తే అతడు ఫిట్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా ఫార్మాట్లలోనూ ఆడగలుగుతాడు. జట్టులోని ప్రధాన, అత్యుత్తమ బౌలర్ ప్రతిసారి గాయం వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లకు దూరం కావడం మంచిదికాదు.ఒకవేళ అతడు మరోసారి ఇదే తరహాలో గాయపడితే మాత్రం.. కెరీర్‌కే ఎండ్‌కార్డ్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేచోట పదే పదే గాయమైతే సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు’’ అని టీమిండియా యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో షేన్ బాండ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా చివరగా ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన బుమ్రా.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 32 వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్‌లో భారత్ 3-1తో కంగారూల చేతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగి విజేతగా అవతరించింది. ఇక బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
శుబ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్‌లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్‌మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్‌లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
ఆర్సీబీని అవహేళన చేసిన రాయుడు.. మాజీ కోచ్ స్పందన ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుRCB) మాజీ కోచ్ సంజయ్ బంగర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని.. తాను ఇలాంటివి సహించలేనని పేర్కొన్నాడు. కాగా అంబటి రాయుడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టైటిళ్లు గెలిచిన సందర్భాల్లో అతడు జట్టులో ఉన్నాడు. రికార్డుల రారాజు ఉన్న జట్టుఇక ఐపీఎల్లో ఏకంగా ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ రెండు జట్లకు ఉన్నంత స్థాయిలో ఆర్సీబీకి కూడా క్రేజ్ ఉంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బెంగళూరు ఫ్యాన్‌బేస్ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనడంలో సందేహం లేదు.ఇందుకు ప్రధాన కారణం రికార్డుల రారాజు, టీమిండియా ముఖచిత్రం విరాట్ కోహ్లి మొదటి నుంచి ఆ జట్టులో భాగం కావడమే! అయితే, రాయుడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆర్సీబీని కించపరిచే విధంగా మాట్లాడతాడనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆర్సీబీ ఏదో ఒకరోజు ట్రోఫీ గెలుస్తుందని.. అయితే, ఆ సమయం ఎప్పుడూ రాకూడదని తాను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని వ్యాఖ్యానించాడు.అన్ని జట్లకూ సాధ్యం కాదుఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేళ కామెంట్రీ చేస్తున్న సమయంలోనూ అంబటి రాయుడు మరోసారి ఆర్సీబీని అవహేళన చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గురించి మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘గత నాలుగైదేళ్లుగా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగు సందర్భాల్లో ప్లే ఆఫ్స్ చేరింది.గతేడాది వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిన తర్వాత కూడా టాప్-4లో అడుగుపెట్టగలిగింది. వరుస పరాజయాల తర్వాత ఇలా తిరిగి పుంజుకోవడం అన్ని జట్లకూ సాధ్యం కాదు. కాబట్టి త్వరలోనే వాళ్లు ప్రతి అవాంతరాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇది తప్పుఇందుకు అంబటి రాయుడు బదులిస్తూ.. ‘‘నిజమే.. సంజయ్ భాయ్.. వచ్చేసారి ఆర్సీబీ అవాంతరాలు దాటుతుంది. క్వాలిఫయర్ 2 వరకైనా వెళ్తుంది’’ అని నవ్వాడు. ఇందుకు స్పందనగా.. ‘‘ఇది చాలా తప్పు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను ఇలాంటివి సహించలేను. ఆర్సీబీ అభిమానులు మిమ్మల్ని చూస్తున్నారు’’ అంటూ నవ్వుతూనే రాయుడు వ్యాఖ్యల్ని బంగర్ తప్పుబట్టాడు.ఇందుకు రాయుడు.. ‘‘చూస్తే చూడనివ్వండి’’ అంటూ మరోసారి ఆర్సీబీని అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూర్ఖత్వంతను హైలైట్ అయ్యేందుకు ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి చూపుతున్నాడని.. ఆ జట్టుకు ఉన్న క్రేజ్‌లో వీసమైంత గుర్తింపు అయిన దక్కించుకోవాలని భలే ఆరాటపడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.ఒక జట్టును పదే పదే కించపరచడం ద్వారా తన స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాడని.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదంటూ రాయుడుకు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల పట్ల రాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. నీదే పబ్లిసిటీ స్టంట్కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు చిరంజీవి, సుకుమార్ తదితరులు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఉద్దేశించి.. టీవీల్లో కనిపించాలని ఇలాంటి వారు ఇక్కడికి వస్తారంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పేర్కొన్నాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడదే మాటను రాయుడు ఆపాదించడం గమనార్హం.చదవండి: 'ప్రపంచ క్రికెట్‌ని భారత్ శాసిస్తుంది’ -
పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. అన్నీ మారుతాయి: అఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 18 నెలలగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్... ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ అదే తీరును కనబరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. గ్రూపు స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలో టీ20 జట్టు నుంచి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదిలను పీసీబీ సెలక్షన్ కమిటీ తప్పించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏడాదిగా జట్టుగా దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను తీసుకొచ్చి ఏకంగా వైస్ కెప్టెన్సీ సెలక్టర్లు కట్టబెట్టారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు."పాక్ జట్టులోకి ఎప్పుడు ఎవరు తిరిగి వస్తారో తెలియదు. దేశవాళీ క్రికెట్లో షాదాబ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడిని తీసుకొచ్చి వైస్ కెప్టెన్‌గా చేశారు. మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోనప్పుడు జట్టు పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రస్తుతం టీ20 సెటాప్‌లో లేని వారిని కూడా తిరిగి ఎంపిక చేస్తున్నారు.పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈవెంట్‌కు పీసీబీ ప్రతినిధిని ఎందుకు ఆహ్వానించలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. మేము బాగుచేయడానికి ముందుకు వస్తాము. కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే, ప్రతిదీ మారుతుంది.ప్రస్తుత క్రికెట్ బోర్డు ప్యానల్ మంచి జట్టును తయారు చేయడానికి సమయం కేటాయించడం లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడంలో బీజీగా ఉంది. ప్రతీఒక్కరికి కొంతసమయమివ్వాలి. కోచ్‌లు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆటగాళ్లపై నిందిస్తారు. కాబట్టి అన్ని ఆలోచించాక ఏ నిర్ణయమైనా తీసుకోవాలని" అఫ్రిది పేర్కొన్నాడు.చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్ -
ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ సొంతమైంది.ఈ క్రమంలో టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించాడు. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం అశ్విన్ తన ఎంచుకున్న టీమ్‌లో చోటు ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఫైనల్లో 74 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ పరంగా రోహిత్ అదరగొట్టాడు. టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిపాడు. ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీమ్‌లో కూడా రోహిత్‌కు చోటు దక్కలేదు.కాగా అశ్విన్ తన ఎంపిక చేసిన జట్టులో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్లకు ఓపెనర్లగా అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిష్‌ను అశూ ఎంచుకున్నాడు.ఫినిషర్‌గా డేవిడ్ మిల్లర్‌కు ఛాన్స్ లభించింది. ఆల్‌రౌండర్ల కోటాలో అజ్మతుల్లా ఓమర్జాయ్, మైఖల్ బ్రేస్‌వెల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా కివీస్ స్పీడ్ స్టార్ మాట్ హెన్రీని అశ్విన్ ఎంపిక చేశాడు. అశ్విన్ తన జట్టులో 12వ ప్లేయర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను ఎంచుకున్నాడు. అయితే ఐసీసీ మాత్రం తన ప్రకటించిన టీమ్‌కు శాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం.ఆర్ అశ్విన్ ఎంపిక చేసిన బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు: రచిన్ రవీంద్ర, బెన్ డకెట్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మైఖేల్ బ్రేస్‌వెల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మాట్ హెన్రీ. 12వ ఆటగాడు: మిచెల్ సాంట్నర్చదవండి: రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్‌గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
'ప్రపంచ క్రికెట్‌ని భారత్ శాసిస్తుంది’
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.బౌలింగ్ వల్లేటీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.రచిన్ కాదు వరుణ్ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. "ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .ఆతిధ్య పాకిస్తాన్‌కి తలవంపులు ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది. భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్‌లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. -
మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తాఅందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్ లతీఫ్ ‘ది కరెంట్ పీకే’కు వెల్లడించాడు.అంతకు ముందు జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్‌కప్ గెలవడం ఆలస్యమైంది.దయచేసి వీరందిని పాక్ క్రికెట్‌కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్ క్రికెట్‌కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్ లతీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.చాలా వరకు స్క్రిప్టెడ్ఇక క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్‌లోనూ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్ మ్యాచ్‌లలో చాలా వరకు స్క్రిప్టెడ్. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్ కూడా!.. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్ ప్లేయర్ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్ లతీఫ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్ క్రికెట్‌ను ఫిక్సింగ్ ఉదంతం కుదిపేసింది. జస్టిస్ మాలిక్ మొహమద్ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్ సలీం మాలిక్, పేసర్ అటా ఉర్ రెహ్మాన్‌లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది. ఘోర అవమానం ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకిదిగిన మెన్ ఇన్ గ్రీన్.. కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడిన టీమిండియా చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్‌కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్‌గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వెన్నముకగా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై కూడా సంచలన స్పెల్‌ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్‌లో అందరం కలిసిమెలిసి ఉంటాము. నా పదేళ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్‌ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), మహేంద్ర సింగ్(MS Dhoni) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు దక్కగా.. అతడి తర్వాత ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా ఈ ఫీట్ నమోదు చేశాడు.విన్నింగ్ కెప్టెన్ల జాబితాలోఇక గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్‌కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది.లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్‌రైజర్స్‌తో తలపడి పైచేయి సాధించి.. విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్‌గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో విన్నర్‌గా నిలిచింది.అయితే, ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో టైటిల్ సాధించినా తను కోరుకున్నట్లుగా ఏదీ జరుగలేదని పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్‌తో పోటీపడి అయ్యర్‌ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025లో తమ కెప్టెన్‌గా నియమించింది.కోరుకున్న గుర్తింపు దక్కలేదుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత.. నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.ఎవరూ లేనపుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీదా అసహనం, అసంతృప్తి లేదు. ఐపీఎల్ ఆడినందు వల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తూ టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే కాగా ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న గంభీర్ గతేడాది కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించాడు. కోల్‌కతా టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే. ఈ విజయం తర్వాతే అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కోచ్‌గా నియమించింది. ఒక్కసారి కూడా కోచ్‌గా పని చేసిన అనుభవం లేకపోయినా గంభీర్‌పై నమ్మకం ఉంచింది. అయితే, టెస్టుల్లో అతడి మార్గదర్శనంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఓడిన భారత్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
రచిన్ రవీంద్ర కాదు.. అతడే ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఫైనల్లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ సేన సోమవారం సొంతగడ్డపై అడుగుపెట్టింది.అయితే ఐపీఎల్-2025 సీజన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఈసారి ఎటువంటి విక్టరీ పరేడ్లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. స్వదేశానికి చేరిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా తమ ఐపీఎల్ జట్లతో కలుస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయడం పట్ల భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకునేందుకు భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆర్హడుని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ రచిన్ రవీంద్రను ఎంపిక చేసుండొచ్చు. కానీ దృష్టిలో మాత్రం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణ్ చక్రవర్తినే. అతడు టోర్నీ మొత్తం ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అతడు భారత్‌కు ఎక్స్ఫ్యాక్టర్గా మారాడు. వరుణ్ లేకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఈ టోర్నీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నేను జడ్జిని అయివుంటే ఆ అవార్డు వరుణ్‌కి ఇచ్చేవాడిని. ఫైనల్ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ను చక్కవర్తి ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. గూగ్లీతో ఫిలిప్స్‌ను వరుణ్ బోల్తా కొట్టించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ తరహా ప్రదర్శన చేశాడు. అతడు ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుని ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయాల్సింది. ఈ అవార్డుకు వరుణ్ కచ్చితంగా ఆర్హుడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా వరుణ్ ఈ టోర్నీలో తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన చక్రవర్తి.. కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వరుణ్ ఇంపాక్ట్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి కివీస్ పతానాన్ని శాసించాడు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్లో రెండేసి వికెట్లు పడగొట్టి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు రచిన్ రవీంద్ర.. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 263 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్‌ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలుచాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్‌దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్‌కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్‌బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్‌కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్‌గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్ పిచ్‌పై ఆల్‌రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూపర్ ఫామ్‌తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్‌గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్‌లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్‌లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్‌కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్‌లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్‌లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్‌లో పదింటికి పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
నోరు అదుపులో పెట్టుకోండి గవాస్కర్ సాబ్: ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌పై ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టును లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు. "పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు.ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్-బి టీమ్‌పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" అని గవాస్కర్ పేర్కొన్నాడు.ఇంజమామ్ ఫైర్.. తాజాగా గవాస్కర్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఘూటుగా స్పందించాడు. ఇతర జట్ల గురుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంజమామ్ హెచ్చరించాడు. "గవాస్కర్ సాబ్.. మీ జట్టు బాగా ఆడి గెలిచింది. అది నేను కూడా అంగీకరిస్తాను. కానీ మా జట్టు గురించి ఏది పడితే అది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. మా జట్టు గణాంకాలు చూసి మాట్లాడండి. షార్జా వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు భయపడి మీరు పారిపోలేదా? మీరు మా కంటే పెద్దవారు.మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాము. కానీ మీరు ఇతర దేశం కోసం అలా తక్కువ చేసి మాట్లాడం సరికాదు. మీ జట్టును ఎంత కావాలంటే అంతగా ప్రశంసించే హక్కు మీకు ఉంది. కానీ ఇతర జట్లను చులకన చేసే మాట్లాడే హక్కు మీకు లేదు. ముందు మా పాకిస్తాన్ గణాంకాలను చెక్ చేసుకోండి.మీ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. మీరు గొప్ప క్రికెటర్, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మీ గౌరవాన్ని పోగట్టుకుంటున్నారు. ఇటువంటి కామెంట్స్ చేసేముందు అతడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలి" అని 24 న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మండిపడ్డాడు.పాక్‌దే పై చేయి..కాగా వన్డే క్రికెట్లో భారత్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు వన్డేల్లో ముఖా ముఖి 136 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు టోర్నీల్లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టికర్పించింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.సహచర కామెంటేటర్లు వారి సెల్ఫోన్లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.కాగా భారత్‌కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Sunil Gavaskar after India won champions trophy 😂😂😂I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025 -
అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు!
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది.న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్‌కు మూడు టైటిల్స్‌ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్‌ను సాధించాడు.👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్‌బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరంటే? కొంతమంది ఫైనల్లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరు చెబుతుంటే.. మరి కొంతమంది పాక్‌పై సెంచరీ, సెమీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. వీరిద్దరూ కాకపోతే కేవలం మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్ల వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అందరికంటే అద్బుతంగా ఆడాడని ప్రశించాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని హిట్‌మ్యాన్ కొనియాడాడు.సూపర్ శ్రేయస్..అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి అతడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మిడిలార్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ ఈ భాగస్వామ్యం రాకపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవరాల్‌గా శ్రేయస్ 5 మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు."శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో. అతడు మిడిలార్డర్లో చాలా కీలకమైన ఆటగాడు. ఈ మ్యాచ్‌లో నేను ఔటయ్యాక అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్‌తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు.అప్పుడు వేటు.. ఇప్పుడు ప్రమోషన్కాగా గతేడాది అయ్యర్ తన కెరీర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా అతడు జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి పని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్యర్ మాత్రం పడిలేచిన కేరటంలా తిరిగొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడిని సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. తన రీ ఎంట్రీలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్‌కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్‌ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్‌రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్ -
HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్‌పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025 -
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్మెన్ క్రికెట్లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు (white jackets) ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు. 1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్‌తో తయారైంది. వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.చదవండి: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
వారెవ్వా కుల్దీప్.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న ఫైనల్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కుల్దీప్ బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చిన తొలి బంతికే భారత్‌కు వికెట్ అందించాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్రను కుల్దీప్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి రచిన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్‌ఫుట్‌పై నుంచి ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్‌తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరవాతి ఓవర్లో కేన్ విలియమ్సన్‌ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్.. కుల్దీప్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్.. 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy Final: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనేDC Blood Kuldeep Yadav got 2 wickets.KL Rahul and Kuldeep Yadav duo will gonna cook all thye ipl teams pic.twitter.com/EzuPwtBuVN— KL'sGIRL (@Silverglohss_1) March 9, 2025 -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.ఆజేయంగా భారత్..ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్‌కు చేరింది. లీగ్ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్‌ను ఓడించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్‌పై భారత్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లుఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. -
కప్ కొట్టేది ఎవరు ?.. సర్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు ?
-
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం2025 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్.. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్203 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్183 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో రచిన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్, అక్షర్252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్, విరాట్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (47), అక్షర్ పటేల్ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్.. 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ (76) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్ బంతి కనెక్ట్ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్.. కోహ్లిని బ్రేస్‌వెల్ ఔట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్ వికెట్ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్ 252.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ 252ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్ టార్గెట్‌ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్ కోహ్లి సూపర్ త్రో.. సాంట్నర్ రనౌట్విరాట్ కోహ్లి సూపర్ త్రోతో మిచెల్ సాంట్నర్‌ను (8) రనౌట్ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్45.4వ ఓవర్: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ (63) ఔటయ్యాడు. ఔట్ కాకముందు మిచెల్ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్37.5వ ఓవర్: డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 165/5గా ఉంది. డారిల్ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్, ఫిలిప్స్లాథమ్ వికెట్ పడ్డ తర్వాత న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 156/4గా ఉంది. కివీస్ నాలుగో వికెట్ డౌన్..టామ్ లాథమ్ రూపంలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్, లాథమ్..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్(18), టామ్ లాథమ్(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్ ఔట్..కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 82-3కివీస్ స్పిన్ మ్యాజిక్.. రవీంద్ర క్లీన్ బౌల్డ్రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీంద్ర.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్ స్కోర్: 73/3వరుణ్ మ్యాజిక్.. కివీస్ తొలి వికెట్ డౌన్న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(16), విల్ యంగ్(8) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్ పడనుంది. ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ టు హెడ్ రికార్డ్..ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి 119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయింది. -
ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమైంది. ఈ ఫైనల్ పోరుకు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.హెన్రీ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డ ఈ కివీ స్పీడ్ స్టార్ ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు భుజం నొప్పి కారణంగా అతడు ఎక్కువగా ప్రాక్టీస్‌లో కూడా పాల్గోకపోయినట్లు సమాచారం.నెట్ ప్రాక్టీస్‌లో హెన్రీ కేవలం ఏడు బంతులు మాత్రమే సంధించినట్లు రేవ్‌స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. హెన్రీ అందుబాటుపై ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడు మ్యాచ్‌లో ఆడే సూచనలు కన్పించడం లేదు.ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్ధానంలో జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా -
న్యూజిలాండ్‌తో ఫైనల్.. రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్‌ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.టీ20 వరల్డ్‌కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్‌మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హిట్‌మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్‌లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్
-
కౌన్ బనేగా ఛాంపియన్?
-
'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది.ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్‌కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ దిట్ట. గత మూడు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్లగా వారిద్దరూ నిలుస్తారు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. పవర్‌ప్లేలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువ సేపు అతడు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవర్లు ఆడితే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ అని"చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లగా రోహిత్ మలచలేకపోతున్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్‌లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్‌బౌలర్‌గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్‌లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్‌ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్‌లో స్పిన్‌ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్‌కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా -
'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్‌కు టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్‌లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్‌లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్‌ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
రోహిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా, కోచ్‌గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్‌గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్‌మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్‌లోభారత్ ఇప్పటికే కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది. గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.రోహిత్ కి కలిసిరాని టాస్భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.వరుణ్ చక్రవర్తి కీలకం"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్‌ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది మరియు టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి -
రేపు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
-
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడగా.. కివీస్‌కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే భారత్- కివీస్ ఫైనల్‌కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్‌మెన్‌కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్‌రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్‌తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND vs NZ: ‘అండర్డాగ్స్ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్(India vs New Zealand)దే పైచేయి అయినా.. దుబాయ్‌లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్‌ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్ జట్టు గుర్తించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అంటున్నాడు.అండర్డాగ్స్ అని మర్చిపోండిభారత్- న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్‌కు అక్తర్ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్‌డాగ్స్‌గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.సాంట్నర్‌కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్‌గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్‌తో మ్యాచ్ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్ శర్మ.అతడి దూకుడుకు కళ్లెం వేస్తేపవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్‌ను అటాక్ చేస్తాడు. కెప్టెన్‌గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్‌గానూ రాణించాలని అతడికి తెలుసు.70 శాతం టీమిండియాకే అవకాశంఓపెనర్గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటిల్ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గేమ్ ఆన్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోండిఇదే షోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.ఇక సెమీస్‌లో స్మిత్ భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడిన విధానం కివీస్ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్‌లో షాట్లు బాదుతూ హాఫ్ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్ మాలిక్ సూచనలు చేశాడు. కాగా 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలుపొంది టైటిల్ గెలిచిన న్యూజిలాండ్... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్‌కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్‌కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్‌కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్‌తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్‌ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
నాణ్యమైన క్రికెటర్.. ఏ స్థానంలోనైనా అతడు ఆడతాడు: టీమిండియా కోచ్
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్‌లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్‌ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడుపరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. కివీస్‌తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ ఏర్పాటు పూర్తి అయింది. గ్రూపు స్టేజిలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్‌నే తుది పోరుకు కూడా క్యూరేటర్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన తమ నాలుగు మ్యాచ్‌లు వేర్వేరు పిచ్‌లపైనే ఆడింది. ఎందుకంటే ఒక్కసారి ఉపయోగించిన పిచ్‌ను మళ్లీ ఉపయోగించాలంటే కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్లాన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్ ఆడి రెండు వారాలు పూర్తి కావడంతో ఆ పిచ్‌పై మళ్లీ ఆడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 244 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.కివీస్‌కు మరోసారి..కాగా ఈ వికెట్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మణికట్టు స్పిన్నర్లు బంతితో మ్యాజిక్ చేశారు. ఆ మ్యాచ్‌లో ఇంకా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేడు. అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాక భారత స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడి స్పిన్ దాటికి కివీలు విల్లవిల్లాడారు. ఈ క్రమంలో మరోసారి న్యూజిలాండ్‌కు వరుణ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ప్రత్యర్ధి జట్టులో కూడా మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రెస్‌వెల్ వంటివారు బంతితో అద్భుతాలు చేయగలరు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లకు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తాఉంది. దీంతో మరోసారి బ్యాటర్లకు స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.కివీస్‌దే పైచేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్-భారత జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా కివీసే విజయం సాధించింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను బ్లాక్ క్యాప్స్ చిత్తు చేసింది.చదవండి: రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే... -
Ind vs NZ: ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు! కానీ ‘టై’ అయితే.. విజేతగా ఎవరు?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.పాతికేళ్ల క్రితం అలా2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది. గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి టాపర్‌గా నిలిచింది.అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్ విన్నర్‌ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో వివాదంనాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.ఇక దుబాయ్‌లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్‌పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో ఆటంటే శ్రేయస్‌కు మజాకాగా న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్‌పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్‌పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్‌పై గిల్‌కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్‌పై పదకొండు ఇన్నింగ్స్‌లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్‌లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్‌పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై?.. బీసీసీఐ నిర్ణయం ఏమిటి?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు. అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్‌కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్‌కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.కోహ్లి గురించి కూడా చర్చ.. కానీఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరొందాడు.ఏకైక సారథిగా అరుదైన ఘనతగతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చారు. అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇటీవల ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో విజయానంతరం గంభీర్‌కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్‌పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్‌గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్‌లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్‌కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్‌కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్‌కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్‌లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
Axar Patel: ‘అక్షరా’లా అమూల్యం.. భారత జట్టులో స్థానం సుస్థిరం
అక్షర్ పటేల్ భారత జట్టు తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే పదేళ్ల కాలంలో కేవలం 14 టెస్టులు, 57 వన్డేలు, 60 టి20లు మాత్రమే ఆడగలిగాడు. తనలాంటి లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కలగలిసిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా నీడలోనే అతను ఎక్కువ కాలం ఉండిపోవడమే అందుకు కారణం. జడేజా ఏదో కారణంతో జట్టుకు దూరమైతే తప్ప అక్షర్‌కు అవకాశం దక్కకపోయేది. కానీ గత ఏడాది కాలంలో పరిస్థితి మారింది. వన్డేలు, టి20ల్లో చక్కటి ప్రదర్శనలతో అతను జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. జడేజాతో పోలికలు వచ్చినా సరే... తనదైన శైలిలో రెండు విభాగాల్లోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు... 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్‌లో కోహ్లిలాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజాలాంటి ఆల్రౌండర్లను కాదని అక్షర్‌పై నమ్మకంతో కోచ్ ద్రవిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లితో కలిసి అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లి 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే... అక్షర్ ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది. 2021లో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్‌గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, టి20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు. అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, టి20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్‌కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీని వల్ల కొన్నిసార్లు బ్యాటర్‌కు భారీ షాట్ ఆడే అవకాశం వచ్చినా... అదే ఉచ్చులో ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్‌కు అవకాశం ఉంటుంది. ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్‌వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్‌లో మరింత సాధన చేశాడు. పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నింటికి మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్‌లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, టి20ల్లో మరిన్ని అవకాశాలు కల్పించింది. టి20 వరల్డ్ కప్‌లో అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్‌తో మ్యాచ్‌లో మార్ష్ క్యాచ్‌ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్తో టి20ల్లో అతని స్థానం సుస్థిరమైంది. బ్యాటర్‌గానే తన కెరీర్ మొదలు పెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్‌ను గత కొంత కాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతని దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతనికి అలాంటి అవకాశం ఇచ్చింది. వాటిని చాలా వరకు అక్షర్ సమర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు అవసరాలరీత్యా అతనికి ఐదో స్థానంలో ఆడే అవకాశం దక్కుతోంది. వన్డేల్లో రాహుల్‌కే కీపర్‌గా తొలి ప్రాధాన్యత లభిస్తుండటంతో పంత్‌కు చోటు ఉండటం లేదు. దాంతో టాప్–6లో అంతా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్షర్‌ను మేనేజ్మెంట్ ఐదో స్థానంలో పంపిస్తోంది. అది చక్కటి ఫలితాలను కూడా అందించింది. అక్షర్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే తీరు. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌తో అతను పెద్ద సంఖ్యలో పరుగులు రాబడుతున్నారు. అలవోకగా సిక్స్‌లు కొడుతున్న అతని నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతను తొలిసారి ఐదో స్థానంలో ఆడాడు. అక్షర్ వరుసగా 44, 52, 41 నాటౌట్, 8, 42, 27 పరుగులు సాధించాడు. ఒక బ్యాటర్‌గా చూస్తే ఇవన్నీ అద్భుత గణాంకాలు కాకపోయినా... ఆల్‌రౌండర్ కోణంలో, పైగా తక్కువ స్కోర్ల మ్యాచ్‌లలో ఈ స్కోర్లన్నీ అమూల్యమైనవే. ఇప్పుడు టీమిండియాలో అన్ని విధాలా ఆధారపడదగ్గ ప్లేయర్‌గా మారిన అక్షర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు. -
CT 2025 Final IND vs NZ: విజేతను తేల్చేది ఆ ఇద్దరే!
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియాను ఢీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్ధంగా ఉంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టులోని భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీలు సాధించారు.రికార్డ్-బ్రేకర్ల మధ్య ఉత్కంఠమైన పోటీఇక టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర పోటీ చూడబోతున్నాం. ఫ్యాబ్ ఫోర్లో భాగమైన కేన్ విలియమ్సన్ , విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అనేక రికార్డులు బద్దలు కొడుతున్నారు. మార్చి 9 ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్ల మధ్య జరిగే పోటీని ప్రధాన పోరుగా అభివర్ణించవచ్చు.ఎందుకంటే జట్టులో వీరిద్దరిదీ బాధ్యత ఒక్కటే. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వైపు దృఢంగా నిలబడడం లేదా కాపు కాయడం. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం. దీని ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు బ్యాటర్‌పై పట్టు సాధించుకుండా నిరోధించడం. ఇందుకోసం వీరిద్దరూ ఆఖరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేయాలని చూస్తారు. విజేతను తేల్చేది ఆ ఇద్దరే!ఈ ప్రయత్నం లో వీరిద్దరూ సఫలమైతే వారి జట్టుకి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ వారి జట్లలో ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమైపోతుంది.ఇక మంగళవారం దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. కోహ్లీ ఎంతో నింపాదిగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముక గా నిలిచాడు. కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.కివీస్ విజయంలో కేన్ పాత్రదక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా కేన్ అదే రీతిలో ఆడాడు. విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు సాధించి తమ జట్టు 362/6 పరుగుల భారీ స్కోరును చేరుకోవడానికి సహాయపడ్డారు. రవీంద్ర 108 పరుగులు చేయగా, విలియమ్సన్ తన 102 పరుగులు సాధించాడు. ఈ జంట రెండవ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ 19000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డును సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా ఖ్యాతి వహించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (432 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (433 ఇన్నింగ్స్) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డ్ ని వేగవంతంగా సాధించిన వారిలో విలియమ్సన్ నాలుగో వాడు. ఈ ఘనతను నమోదు చేయడానికి న్యూజిలాండ్ దిగ్గజం 440 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతను వన్డే ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల ల లో 16వ స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీభారత్ ‘రన్ మెషిన్’గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 301 వన్డే మ్యాచ్‌ల్లో సగటు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు, ఇందులో 51 సెంచరీలు మరియు 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 93.35.వన్డేల్లో కేన్ విలియమ్సన్ఎప్పడూ ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేసే విలియమ్సన్ 172 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 49.47 సగటు తో 81.72 స్ట్రైక్ రేట్‌తో 7,224 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు మరియు 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఫైనల్లో పైచేయి సాధిస్తారన్న దాని పైనే టైటిల్ విజేత నిర్ణయించబడుతుందనడం లో సందేహం లేదు. గణాంకాల ఆధారంగా చుస్తే విరాట్ కోహ్లీ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ మ్యాచ్ ఫైనల్ మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగడం ఖాయం. మరి ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి లో ఎవరు మెరుస్తారో మ్యాచ్ రోజున స్పష్టంగా తెలుస్తుంది.చదవండి: అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్‌గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం: సాంట్నర్ వార్నింగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనను సౌతాఫ్రికా(New Zealand vs South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువచ్చింది. తొలుత భారీ స్కోరు చేయడంతో పాటు దానిని కాపాడుకోవడంలోనూ సఫలమై అత్యద్భుత విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra- 101 బంతుల్లో 108)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) శతకాలతో చెలరేగగా.. డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ ఏకంగా 362 పరుగులు సాధించింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్(17) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా అర్ద శతకం(71 బంతుల్లో 56) చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్ కూడా హాఫ్ సెంచరీ(66 బంతుల్లో 69) రాణించాడు.మిల్లర్ విధ్వంసంవీరంతా స్లో ఇన్నింగ్స్ ఆడగా డేవిడ్ మిల్లర్ మాత్రం ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. యాభై పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమిపాలైన ప్రొటిస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. న్యూజిలాండ్- టీమిండియాతో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయానంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టును ప్రశంసిస్తూనే భారత్‌తో మ్యాచ్‌కు తాము సంసిద్ధంగానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చాడు. ‘‘పటిష్ట జట్టుతో పోటీపడి గెలవడం సంతోషంగా ఉంది. తదుపరి టీమిండియాతో ఆడబోతున్నాం.రచిన్ , విలియమ్సన్ అద్భుతంగ్రూప్ దశలోనూ రోహిత్ సేనను మీ ఢీకొట్టాం. అయితే, ఈసారి ఫైనల్ వేరుగా ఉంటుంది. మాకైతే కాస్త విరామం దొరికింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతాం. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఆడిన తీరు అద్భుతం.అయితే, ఇక్కడ 320 పరుగుల స్కోరు సరిపోదని మేము భావించాం. కనీసం 350 రన్స్ దాటితేనే మ్యాచ్ మా చేతుల్లో ఉంటుందని భావించాం. రచిన్- విలియమ్సన్ భారీ భాగస్వామ్యం ఇందుకు బాటలు వేసింది.అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడం కలిసివచ్చింది. అయినా సరే సౌతాఫ్రికా మాకు సవాలు విసిరింది. ఎట్టకేలకు విజయం మాత్రం మమ్మల్నే వరించింది’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఒత్తిడిలోకి నెట్టగలిగాముఇక టీమిండియా చేతిలో గత మ్యాచ్‌లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘దుబాయ్‌లో మేము ఓడిపోయాం. అయితే, అక్కడే మ్యాచ్‌లు ఆడుతున్న వారిని మేము ఒత్తిడిలోకి నెట్టగలిగాము. టాపార్డర్‌ను మా వాళ్లు పడగొట్టారు’’ అంటూ తాము తక్కువేమీ కాదన్నట్లుగా రోహిత్ సేనకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది. చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనంSouth Africa's last man standing! 👊David Miller is keeping the fight on from one end ⚔#ChampionsTrophyOnJioStar 👉 #SAvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start watching FREE on JioHotstar pic.twitter.com/EkhEIpvEI0— Star Sports (@StarSportsIndia) March 5, 2025 -
25-30 పరుగులు చేస్తే చాలా?: గంభీర్‌కు టీమిండియా దిగ్గజం కౌంటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు. అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్‌కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోన్న విషయం తెలిసిందే.ఒక్క ఫిఫ్టీ కూడా లేదుగ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్‌పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్‌మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్‌గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్‌గా అదొక లోటే.జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్‌గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీదూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా రోహిత్‌కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్‌లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
పాపం సౌతాఫ్రికా.. మరోసారి హార్ట్ బ్రేకింగ్! ప్రపంచంలోనే తొలి జట్టుగా
మళ్లీ అదే కథ.. అదే వ్యథ. ఐసీసీ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా తలరాత ఏ మాత్రం మారలేదు. 'చోకర్స్ అనే పేరును సఫారీలు మరోసారి సార్థకత చేసుకున్నారు. సెమీస్ గండాన్ని మరోసారి సౌతాఫ్రికా గట్టెక్కలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.363 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో బవుమా సేన విఫలమైంది. దీంతో బరువెక్కిన హృదయాలతో సఫారీలు ఇంటిముఖం పట్టారు. సెమీస్‌లో ఓడిపోవడం దక్షిణాఫ్రికాకు ఇదేమి తొలిసారి కాదు.పాపం ప్రోటీస్..ఇప్పటివరకు ఓవరాల్‌గా ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు పదిసార్లు సెమీఫైనల్స్ ఆడిన ప్రోటీస్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు పరాజయం పాలైంది. దీంతో ఐసీసీ వన్డే టోర్నీ సెమీస్‌లో అత్యధిక సార్లు ఓటమిపాలైన జట్టుగా సౌతాఫ్రికా చెత్తరికార్డు నెలకొల్పింది. కాగా ప్రతీ ఐసీసీ ఈవెంట్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగే దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అయ్యి ఇంటిదారి పడుతుంటుంది.ఐసీసీ ఛాంపియన్స్ తొట్టతొలి ఎడిషన్(1998) విజేతగా నిలిచిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత ఈ మెగా టోర్నీలో కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరినప్పటికి.. రెండు సార్లు కూడా భారత్ చేతిలోనే ఓటమి పాలైంది. ఆ తర్వాత 2006, 2013 సీజన్లలో సెమీస్‌లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా.. అక్కడ కూడా అదే తీరును కనబరిచింది. మళ్లీ ఇప్పుడు తాజా ఎడిషన్‌లో కూడా సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది.వన్డే వరల్డ్‌కప్‌లో కూడా..కాగా వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాది ఇదే తీరు. అయితే ఈ ప్రపంచకప్‌లో సఫారీలను ఒత్తడితో పాటు దురదృష్టం కూడా వెంటాడింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యమిచ్చాయి. సౌతాఫ్రికాకు ఇదే తొలి వన్డే ప్రపంచకప్. దక్షిణాఫ్రికా తమ తొలి వరల్డ్‌కప్‌లోనే సెమీస్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈమ్యాచ్‌లో ప్రోటీస్ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. వర్షం కారణంగా ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా అనుహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా.. ఆఖరికి టైగా ముగించింది.రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దీంతో ప్రోటీస్ ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత 2007లో ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను సౌతాఫ్రికా తమ సొంత తప్పిదాల్ల వల్ల చేజార్చుకుంది.ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. న్యూజిలాండ్ ఆరంభంలో అద్బుతంగా ఆడినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.అయితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. దీంతో ఇలియట్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను సఫారీల నుంచి లాగేసుకున్నాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కల్ వంటి దిగ్గజ క్రికెటర్లు కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో కూడా సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది.చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్‌పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొంతకాలంగా భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
టీమిండియా విజయాలను తక్కువ చేసే విధంగా మాట్లాడేవారికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయానుసారమే భారత్ దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోందన్నారు. గెలుపు కోసం పిచ్‌లపై ఆధారపడే దుస్థితిలో టీమిండియా లేదని.. వేదిక ఒకటే అయినా వేర్వేరు పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని శుక్లా పేర్కొన్నారు.అజేయంగా ఫైనల్కుఅదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ లాహోర్‌లో జరిగితే బాగుండేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు రాజీవ్ శుక్లా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేలా రోహిత్ సేనకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ నుంచి పోటీపడిన టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కానీ, ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా గళం వినిపించారు.ఐసీసీ నిబంధన ప్రకారమేఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన రాజీవ్ శుక్లా పైవిధంగా స్పందించారు. అదే విధంగా.. భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పాక్ క్రికెట్ బోర్డు కూడా వారి ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుంది.ఇరుజట్లు.. ఒకరి దేశంలో మరొకరు ఆడితే చూడాలని భారత్- పాక్ అభిమానులు కోరుకుంటున్నారని మాకు తెలుసు. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఐసీసీలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వాల సమ్మతితోనే బోర్డులు ముందుకు వెళ్లాలి. బీసీసీఐ, పీసీబీ ఆ నిబంధనను పాటిస్తున్నాయి.అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రతీ దేశం దాయాదుల పోరుకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదొక శుభపరిణామం. టోర్నీ సజావుగా సాగేలా చేశారు’’ అని రాజీవ్ శుక్లా పీసీబీని ప్రశంసించారు.ఆసీస్ ఓడిపోయింది కదా!ఇక లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగితే బాగుండేది కదా అని ఓ పాకిస్తాన్ జర్నలిస్తు రాజీవ్ శుక్లాను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరన్నట్లు జరగాలంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండాల్సింది. కానీ వాళ్లు ఓడిపోయారు కద! అందుకే ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగబోతోంది’’ అని రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు.ఇక ఆసియా కప్ షెడ్యూలింగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. ఆసియా కప్ గురించి చర్చించేందుకు కూడా నేను ఇక్కడకు వచ్చాను. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడగా.. భారత్- న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా సెమీస్ చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
టీమిండియాతో ఫైనల్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్(IND vs NZ) అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది కివీస్.అయితే ఈ తుదిపోరుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ(Matt Henry) గాయం బారిన పడ్డాడు. లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో హెన్రిస్ క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో వచ్చినప్పటికి తన సెకెండ్ స్పెల్‌లో కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ మాత్రమే వేశాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన హెన్రీ.. 43 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం హెన్రీ గాయంపై కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సైతం కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. "హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, అతడి గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి అన్నట్లు శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి.అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. తన అకస్మాత్ నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆసీస్ పరాజయం అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకొన్నా... టెస్టులు, టీ20ల్లో కొనసాగాలనుకుంటున్నట్లు 35 ఏళ్ల స్మిత్ వెల్లడించాడు.అయితే, స్మిత్ తన రిటైర్మెంట్(ODI Retirement) నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే కంటే ముందే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఈ విషయం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్లో ఆసీస్‌పై భారత్ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న వేళ స్మిత- కోహ్లి ముఖాలు దిగాలుగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదే చివరి మ్యాచా?ఈ క్రమంలో.. ‘‘ఇదే చివరి మ్యాచా?’’ అని కోహ్లి అడుగగా.. ‘అవును’ అంటూ స్మిత్ సమాధానమిచ్చాడని.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులే అయినా కోహ్లి- స్మిత్ మధ్య వ్యక్తిగతంగా ఉన్న స్నేహబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు చిలిపిగా వ్యవహరించినా క్రీడా స్ఫూర్తిని చాటడంలో.. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వడంలో కింగ్‌కు మరెవరూ సాటిరారని కోహ్లిని కొనియాడుతున్నారు.నాడు స్మిత్‌కు కోహ్లి మద్దతుకాగా నవతరం ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, విలియమ్సన్, స్మిత్, రూట్)లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా తలపడే ఈ ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంలోనూ ముందే ఉంటారు. కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని తాను చూడలేదని.. అతడంటే తనకు ఎంతో గౌరవమని స్మిత్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.ఇక వరల్డ్ కప్-2019లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సమయంలో స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేయగా.. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించాడు. అంతేకాదు.. స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. దీంతో ప్రేక్షకులు కూడా సంయమనం పాటించారు.5,800 పరుగులుఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... చాంపియన్స్ ట్రోఫీలో అతడి స్థానంలో స్మిత్ కంగారూ జట్టుకు సారథ్యం వహించాడు. 2010లో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్మిత్... కెరీర్లో ఇప్పటి వరకు 170 మ్యాచ్‌లాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. గొప్ప ప్రయాణంఇక 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన స్మిత్... బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్... ఆ తర్వాత నెమ్మదిగా ఆల్‌రౌండర్‌గా... ఆపై టాపార్డర్ బ్యాటర్‌గా... అటు నుంచి స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. ‘ఇది చాలా గొప్ప ప్రయాణం. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. ఈ ఫార్మాట్లో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలవడం ఎప్పటికీ మరవలేను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా’ అని స్మిత్ పేర్కొన్నాడు.అందుకే రిటైర్ అయ్యానుకాగా 2027 వన్డే ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘ఇంకా నాలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అయితే మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టును సిద్ధం చేసుకునేందుకు మేనేజ్మెంట్కు సమయం దక్కుతుంది. టెస్టులు, టీ20ల్లో అవకాశం కల్పిస్తే తప్పక జట్టు విజయాల కోసం కృషి చేస్తా’ అని స్మిత్ అన్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్YOU MISS, I HIT! 🎯Shami strikes big, sending the dangerous Steve Smith back to the pavilion with a stunning delivery! 🤯#ChampionsTrophyOnJioStar 👉 #INDvAUS | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/cw9RB77Ech— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. సెహ్వాగ్ వరల్డ్ రికార్డు బద్దలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా లహోర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మాత్రం తన విరోచిత పోరాటంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మిల్లర్ క్రీజులోకి వచ్చినప్పటికి ప్రోటీస్ స్కోర్ 167/4 గా ఉంది. అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడానికి దక్షిణాఫ్రికా 128 బంతుల్లో 196 పరుగులు చేయాల్సి ఉండేది.ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. అప్పటివరకు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్న కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్ కోల్పోతున్నప్పటికి మిల్లర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ ఆఖరి బంతికి తన 6వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సౌతాఫ్రికా భారీ ఓటమి నుంచి తప్పించుకుంది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మిల్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సెహ్వాగ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా మిల్లర్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 67 బంతుల్లోనే శతక్కొట్టిన మిల్లర్..సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.👉అదేవిధంగా ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాపై మిల్లర్ మూడు అంకెల స్కోర్‌ను సాధించాడు.👉ఐసీసీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా మిల్లర్ నిలిచాడు. మిల్లర్ 35 ఏళ్ల 268 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(36 సంవత్సరాల 95 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: Temba Bavuma: ఆ నలుగురు వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం -
ఆ నలుగురి వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం: బవుమా
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరోసారి సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో లహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. డేవిడ్ మిల్లర్ 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ విరోచిత సెంచరీతో పోరాడినా విజయం మాత్రం ప్రోటీస్‌కు దక్కలేదు. లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ టెంబా బవుమా (56), వాన్ డర్ డుసెన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. అతడితో పాటు ఫిలిప్స్, హెన్రీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, బ్రెస్‌వెల్ ఓ వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(102) సెంచరీలతో మెరిశారు.ఇక సెమీస్‌లో ఓటమిపై మ్యాచ్ అనంతరం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. భాగస్వామ్యాలు రాకపోవడంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైమని బావుమా తెలిపాడు."న్యూజిలాండ్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయసంగా 350 పైగా పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ మేము అలా చేయలేకపోయాము. ముఖ్యంగా భాగస్వామ్యాలను సాధించలేకపోయాము.కేవలం రెండు భాగస్వామ్యాలు మాత్రమే వచ్చాయి. మిడిల్ ఓవర్లలో రాస్సీ లేదా నేను ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే 360 పరుగుల లక్ష్యం చేధన అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలోనే నా వికెట్ కోల్పోవల్సి వచ్చింది. ఆ తర్వాత రాస్సీ కూడా దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.అయితే మేము ఔటయ్యాక ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరున్నాము. మేము అనుకున్నట్లు డేవిడ్ మిల్లర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మిల్లర్ గత కొన్నేళ్లగా మా జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు. ఈ రోజు కూడా అతడిపై ఆశలు పెట్టకున్నాము. కానీ అతడికి సహకరించే వారు లేకపోవడంతో ఓటమి పాలైము. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. గ్యాప్స్ రాబట్టి వారు బౌండరీల సాధించిన తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. మిడిల్ ఓవర్లలో మేము వికెట్లు తీయలేకపోయాము. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ రోజు వారిద్దరూ చాలా బాగా ఆడారు. ఆఖరిలో ఫిలిప్స్, మిచెల్ కూడా దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. ఏదేమైనప్పటికి వారు మా కంటే మెరుగైన క్రికెట్ ఆడారు" అని బవుమా పేర్కొన్నాడు.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ -
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల రహీమ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టీ20లకు వీడ్కోలు పలికిన రహీమ్.. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముష్పికర్ వెల్లడించాడు.అన్నివిధాలగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రహీమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రహీమ్ వన్డేలకు విడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది."నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాను. నా కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతీ విజయం వెనక ఆ దేవుడు ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో మేము సాధించిన పరిమితం అయినప్పటికీ.. నేను మాత్రం నా దేశం కోసం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశాను. గత కొన్ని వారాలగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇక టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టిసారిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన బంగ్లా క్రికెట్‌కు, అభిమానులకు, సహచరులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను" అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు.2006లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రహీమ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్లో బంగ్లా తరపున 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్.. 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు రహీమ్ పేరిటే ఉంది. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కూడా ముష్ఫికర్ 243 క్యాచ్‌లు అందుకున్నాడు.చదవండి: సచిన్ హాఫ్ సెంచరీ వృథా.. భారత్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
-
ఒకడే ఒక్కడు మొనగాడు
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్‌పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్‌మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్‌లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు. ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.చదవండి: కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ ర్యాంకు -
SA vs NZ: రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర.. కివీస్ తొలి ప్లేయర్‌గా రికార్డు
ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) జోరు కొనసాగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సెమీ ఫైనల్లో భాగంగా సౌతాఫ్రికా(New Zealand vs South Africa)తో మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మళ్లీ శతక్కొట్టాడు. తద్వారా కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే అధిక సెంచరీలు కొట్టిన కివీస్ బ్యాటర్‌గానూ రచిన్ రవీంద్ర చరిత్రకెక్కాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు లాహోర్ వేదిక.గడాఫీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ విల్ యంగ్(23 బంతుల్లో 21) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రం అదరగొట్టాడు. 93 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రచిన్.. కేన్ విలియమ్సన్తో కలిసి రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.ఇదిలా ఉంటే.. రచిన్ రవీంద్రకు వన్డేల్లో ఇది ఐదో శతకం కావడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో సాధించిన ఈ ఐదు సెంచరీలు ఐసీసీ టోర్నమెంట్లలోనే సాధించడం విశేషం. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో రచిన్ రవీంద్ర ఏకంగా మూడు శతకాలు బాదాడు.తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఈవెంట్లో గాయం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆ తర్వాత బంగ్లాదేశ్(112)తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి శతక్కొట్టాడు. తద్వారా ఐసీసీ వన్డే టోర్నీల్లో నాలుగో శతకం అందుకున్న 25 ఏళ్ల రచిన్.. తాజాగా పటిష్ట సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టి ఈ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు. తద్వారా రచిన్ రవీంద్ర పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో కివీస్ తరఫున వన్డేల్లో అధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానం దక్కించుకోవడంతో పాటు.. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా నిలిచాడు.ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్(101 బంతుల్లో 108, 13 ఫోర్లు, ఒక సిక్సర్)తో పాటు కేన్ విలియమ్సన్ కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరికి తోడు డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్.. రికార్డు స్థాయిలో 362 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉డెవాన్ కాన్వే- 22 ఇన్నింగ్స్లోరచిన్ రవీంద్ర- 28 ఇన్నింగ్స్లోడారిల్ మిచెల్- 30 ఇన్నింగ్స్లోకేన్ విలియమ్సన్- 56 ఇన్నింగ్స్లోనాథన్ ఆస్ట్లే- 64 ఇన్నింగ్స్లోపిన్న వయసులో వన్డేల్లో ఐదు శతకాలు బాదిన ఆటగాళ్లు24 ఏళ్ల 165 రోజుల వయసులో కేన్ విలియమ్సన్25 ఏళ్ల 107 రోజుల వయసులో రచిన్ రవీంద్ర.చదవండి: కోహ్లి పైపైకి.. -
కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి గ్రూప్-‘ఎ’ టాపర్‌గా సెమీ ఫైనల్‌కు చేరింది భారత్. దుబాయ్‌లో మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.నిరాశపరిచిన రోహిత్ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నాలుగో స్థానానికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ అక్షర్ పటేల్ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 791 రేటింగ్ పాయింట్లు2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 770 రేటింగ్ పాయింట్లు3. హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా)- 760 రేటింగ్ పాయింట్లు4. విరాట్ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్ పాయింట్లు5. రోహిత్ శర్మ(ఇండియా)- 745 రేటింగ్ పాయింట్లు.చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
సూపర్ ఫామ్‌లో టీమిండియా స్టార్.. ‘ఐటం సాంగ్’తో సోదరి బాలీవుడ్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఈ వన్డే టోర్నమెంట్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కాస్త నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, సెమీస్ చేరాలంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. 67 బంతుల్లో 56 పరుగులు చేసి విరాట్ కోహ్లి(100 నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో భాగమయ్యాడు.ఆకాశమే హద్దుగాఆ తర్వాత గ్రూప్ దశలో ఆఖరుగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. జట్టు విజయానికి పునాది వేసే క్రమంలో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించిన టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ చూసేందుకు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్(Shresta Iyer) కూడా దుబాయ్ స్టేడియానికి వచ్చింది. తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్‌గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్’’ అంటూ అక్కాతమ్ముళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ఆసీస్‌పై భారత్ విజయానంతరం శ్రేష్ట మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలతో పాటు.. సెలబ్రిటీలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు.. శ్రేయస్ అక్క శ్రేష్ట అయ్యర్ 1990లో జన్మించింది. వీరి తండ్రి సంతోష్ అయ్యర్- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్ స్వస్థలం మంగళూరు. వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్‌లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు. చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. View this post on Instagram A post shared by Panorama Music (@panoramamusic) -
CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తుఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (100 నాటౌట్) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్ మిల్లర్ (25), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. సాంట్నర్ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ ఔట్189 పరుగుల వద్ద (32.6వ ఓవర్) సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (31) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్ ఔట్167 పరుగుల వద్ద (28.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (3) ఔటయ్యాడు. మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. డసెన్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో డసెన్ (69) క్లీన్ బౌల్డయ్యాడు. మార్క్రమ్ (16), క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 202 పరుగులు చేయాలి.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా125 పరుగుల వద్ద (22.2వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (56) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సాంట్నర్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్‌కు (50) జతగా మార్క్రమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆచితూచి ఆడుతున్న డసెన్, బవుమా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 94/1గా ఉంది. రికెల్టన్ 17 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:టెంబా బవుమా 25, డసెన్ 14 పరుగులతో ఉన్నారు. 56-1తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా4.5: మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ర్యాన్ రెకెల్టన్ బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. రచిన్, విలియమ్సన్ శతకాలు.. న్యూజిలాండ్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 300 దాటిన న్యూజిలాండ్ స్కోర్45.3వ ఓవర్: మార్కో జన్సెన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 317/5గా ఉంది. ఫిలిప్స్‌తో పాటు బ్రేస్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్41.1 ఓవర్: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డారిల్ మిచెల్‌కు (19) జతగా గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్39.5వ ఓవర్: సెంచరీ పూర్తి చేసిన ఓవర్లోనే విలియమ్సన్ (102) ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్‌లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి కేన్ మామ పెవిలియన్ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 252/3గా ఉంది. టామ్ లాథమ్ (1), డారిల్ మిచెల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్39.1 ఓవర్: ముల్దర్ బౌలింగ్‌లో బౌండరీ బాది కేన్ విలియమ్సన్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్‌కు ఇది 15వ సెంచరీ. కేన్ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. రచిన్ అవుట్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో రచిన్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్ 80 పరుగులతో ఉండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) శతక్కొట్టిన రచిన్.. విలియమ్సన్ ఫిఫ్టీసౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్ 74 బంతుల్లో 72 రన్స్ సాధించాడు. దీంతో న్యూజిలండ్ స్కోరు 201కి చేరింది.నిలకడగా ఆడుతున్న రచిన్, విలియమ్సన్అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్ 67, విలియమ్సన్ 31 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 67-1విలియమ్సన్ 11, రచిన్ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.7.5: తొలి వికెట్ కోల్పోయిన కివీస్విల్ యంగ్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి యంగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)టాస్ గెలిచిన కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్(South Africa Vs New Zealand) మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్‌కు నగారా మోగింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.పిచ్ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్‌లో మేము దుబాయ్‌లో పిచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.నా ఆరోగ్యం బాగానే ఉందిమా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్‌లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్‌లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ల ఫలితం.. భారత్ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.ట్రై సిరీస్‌లో కివీస్‌దే విజయంఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. ఆసీస్‌ను టీమిండియా నాకౌట్ చేసింది. ఇక గ్రూప్-‘బి’ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా కివీస్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడగా.. కివీస్ పాక్, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌లో ట్రోఫీ లీగ్ దశ చివరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించగా.. న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుసౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.న్యూజిలాండ్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.చదవండి: రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు... -
SA Vs NZ: న్యూజిలాండ్‌తో సెమీస్.. సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రెండో సెమీఫైనల్‌కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీఫైనల్లో లహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు అదిరిపోయే వార్త అందింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ప్రోటీస్ స్టార్ ఐడైన్ మార్క్రమ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు.మంగళవారం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో అతడు పాసైనట్లు క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్టాండిండ్ కెప్టెన్‌గా ఉన్న మార్క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదాన్ని వీడాడు. ఈ క్రమంలో ప్రోటీస్ పగ్గాలు హెన్రిచ్ క్లాసెన్ చేపట్టాడు. అయితే సెమీఫైనల్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. అతడికి బ్యాకప్‌గా జార్జ్ లిండేను సైతం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు రప్పించింది. కానీ ఐడైన్ ఇప్పుడు ఫిట్నెస్ సాధించడంతో సౌతాఫ్రికా టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు జ్వరం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, ఓపెనర్ డీజోర్జీ కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్లో టీమిండియాతో తాడోపేడో తెల్చుకోనుంది.సౌతాఫ్రికా తుది జట్టు(అంచనా): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడీన్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విల్ ఓ'రూర్క్చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలనే!!...ఎందుకంటే.. రోహిత్ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్‌పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్ మంజ్రేకర్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్‌ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించింది.టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. ‘అతి’ ఆనందంఅయితే, హెడ్ ఇచ్చిన క్యాచ్ పట్టిన తర్వాత గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్ బంతిని గాల్లోకి విసిరేశాడు.నిజానికి క్యాచ్ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్‌ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.క్లీన్’గా ఉన్నా.. వార్నింగ్ ఎందుకు?ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్‌వర్త్ గనుక గిల్ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్‌గా తీసుకుని నాటౌట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్ లభిస్తే హెడ్‌ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్ చర్య విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే.. ఓపెనర్ హెడ్ అవుటైన తర్వాత కెప్టెన్ , వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్ లబుషేన్(29) మరో ఎండ్ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.నిజానికి అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. ఏదేమైనా స్మిత్ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. అలెక్స్ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్ 264 పరుగులు చేయగలిగింది.వరల్డ్ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిఅయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన సిక్సర్‌తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్ సేన ఫైనల్‌కూ దూసుకెళ్లింది.చదవండి: #Steve Smith: భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం -
రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు...
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రోహిత్ సేన.. సెమీస్‌లోనూ అదరగొట్టింది. దుబాయ్‌లో ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ నేపథ్యంలో.. ఓవైపు భారత జట్టుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్, భవిష్యత్తు గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో టెస్టులు, వన్డేల్లో ఫామ్‌లేమితో సతమతమైన హిట్‌మ్యాన్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇంకెంతకాలం ఆడతాడు?ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా విజయానంతరం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడగా.. ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ‘‘రోహిత్ ఫామ్ సంగతేంటి? అతడు ఇంకెంతకాలం ఆడతాడని మీరనుకుంటున్నారు’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.ఇందుకు గంభీర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్నాం. ఇలాంటి సమయంలో మీ ప్రశ్నకు నేనెలా బదులివ్వగలను. మా కెప్టెన్ వేరే లెవల్ టెంపోతో బ్యాటింగ్ చేస్తూ సహచర ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. భయం లేకుండా, దూకుడుగా ఆడాలని చెబుతూ ఉంటే నేను ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వగలను?ఇచ్చి పడేసిన గంభీర్!మీరంతా పరుగులు, సగటు గురించే మాట్లాడతారు. అయితే, కోచ్‌గా నేను కెప్టెన్ ప్రభావం జట్టుపై ఎలా ఉందనేది చూస్తాను. జర్నలిస్టులు, నిపుణులకు గణాంకాలు మాత్రమే కావాలి. కానీ మా కెప్టెన్ జట్టుకు ఆదర్శంగా ఉంటూ.. డ్రెస్సింగ్‌రూమ్‌లో సానుకూల వాతావరణం నింపుతుంటే మాకు ఇంకేం కావాలి’’ అని గంభీర్ సదరు విలేకరి ప్రశ్నపై ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోహిత్ శర్మ అభిమానులు గౌతం గంభీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన కోచ్ ఇలాగే ఉంటాడని.. 37 ఏళ్ల రోహిత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.264 పరుగులు చేసి ఆలౌట్ఇక సెమీస్ మ్యాచ్ విషయానికొస్తే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్(39) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(73), అలెక్స్ క్యారీ(61) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ(3/48), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కోహ్లి, అయ్యర్, రాహుల్ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే టీమిండియా పూర్తి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(28) దూకుడుగా ఆడగా.. విరాట్ కోహ్లి అద్భుత అర్ధ శతకం సాధించాడు. శ్రేయస్ అయ్యర్(45)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది 84 పరుగులు సాధించాడు. ఇక కేఎల్ రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) ధనాధన్ దంచికొట్టాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు -
భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మిత్ తెలిపాడు."వన్డేల్లో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో భాగంగా ఉండడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఎంతోమంది సహచరలతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను. 2027 వన్డే ప్రపంచకప్‌కు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.అందుకే వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాను. ముఖ్యంగా అత్యున్నతస్ధాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు గర్వకారణమే. ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఆనుభూతిని వర్ణించలేం. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు.ఇకపై టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు. -
నేను ఎంతగానో చెప్పాను.. అయినా నా మాట కోహ్లి వినలేదు: రాహుల్
భారత క్రికెట్ జట్టు రెండో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. కాగా భారత్ విజయంలో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. తృటిలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.అప్పటివరకు ఆచితూచి ఆడుతున్న కోహ్లి అనూహ్యంగా ఔట్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం నిరాశచెందాడు. నేను కొడుతున్నా కదా భయ్యా అన్నట్లు రాహుల్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు."నేను క్రీజులోకి వచ్చాక పది పన్నేండు బంతులు ఆడాక కోహ్లి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని తనకు చెప్పాను. నేను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతాను, ఏదో ఒక ఓవర్‌ను టార్గెట్ చేస్తాను అని చెప్పా. ఎందుకుంటే ఆ సమయంలో మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ వికెట్‌పై ఓవర్‌కు ఎనిమిది పరుగులు సులువగా సాధించవచ్చు అన్పించింది. ఓవర్‌కు ఒక్క బౌండరీ వచ్చినా చాలు. కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకుంటూ, నీవు కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తే చాలు అని చెప్పాను. కానీ కోహ్లి నా మాట వినలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బహుశా బంతి స్లాట్‌లో ఉందని భావించి ఆ షాట్ ఆడిండవచ్చు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది" అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్ -
అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.భారత బౌలర్లలో హ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. దీంతో ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటికి తమ బౌలర్లు అద్భుతంగా పోరాడరని స్మిత్ కొనియాడాడు."ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. విజయం కోసం చివరివరకు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకొచ్చారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంతసులువు కాదు. ఆరంభంలో పరుగులు సాధించడం, స్టైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది.మా జట్టులోని ప్రతీ ఒక్కరూ విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డారు. పిచ్ మేము ఊహించినదాని కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వికెట్‌కు కొంతవరకు స్పిన్నర్లకు బాగానే అనుకూలించింది. స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయ్యింది. పేసర్లకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. దుబాయ్ వికెట్ కొంచెం గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోర్లు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేము కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మాక్స్వెల్ కూడా తన వికెట్‌ను కోల్పోయాడు. అక్కడే మేము రిథమ్‌ను కోల్పోయాము. మేం 280 పైగా రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఉండింటే మేము అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అప్పుడు ప్రత్యర్ధిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణించారు. ముఖ్యంగా మా బౌలింగ్ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికి టోర్నీ ఆసాంతం వారు అద్బుతంగా రాణించారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కూడా చేధించాము. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్లు భవిష్యత్తులో కచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లగా ఎదుగుతారు" అని స్మిత్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
గెలిపించినందుకు థాంక్యూ భయ్యా.. రాహుల్‌ను హగ్ చేసుకున్న ఫ్యాన్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. భారత విజయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కీలక పాత్రపోషించాడు.లక్ష్య చేధనలో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) సత్తాచాటారు.ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. భారత బౌలర్లలలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీమిండియా ప్రపంచ రికార్డు..ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.గతంలో ఆస్ట్రేలియా 2006 2009లో బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడింది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. భారత్ ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ రికార్డు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా(13) పేరిట ఉండేది. తాజా విజయంతో ఆసీస్ ఆల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
రికార్డుల కంటే జట్టు గెలవడమే నాకు ముఖ్యం: విరాట్ కోహ్లి
ప్రపంచ క్రికెట్లో అతడొక రారాజు. తన ముందు ఉన్న ఎంతటి లక్ష్యమున్న వెనకడుగేయని ధీరుడు. కొండంత లక్ష్యాన్ని అలోవకగా కరిగించే ఛేజ్ మాస్టర్. ఐసీసీ టోర్నమెంట్లు అంటే పరుగులు వరద పారించే రన్ మిషన్ అతడు. అతడే టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లి. ఐసీసీ ఈవెంట్లలో తనకు ఎవరూ సాటి రారాని కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 264 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కింగ్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడ్పించాడు.అయితే భారత్ విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడి అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో భారత్ ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.జస్ట్ సెంచరీ మిస్..కాగా కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. అయితే కోహ్లి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోవడంతో తన సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశచెందారు.ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని కోహ్లి చెప్పుకొచ్చాడు. "పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే.ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్ధులకు అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను" అని ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా
-
ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మట్టికర్పించిన టీమిండియా.. ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలర్లు సత్తాచాటగా.. అనంతరం బ్యాటర్లు సమిష్టగా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్ మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్(45) ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. ఆఖరిలో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు."ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెటర్‌గా ఉంది.ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవర్ వరకు గేమ్‌ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్‌లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్‌ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జట్టు కూర్పు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగస్వామ్యం అందించారు. కేఎల్(రాహుల్), హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు! -
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్ మ్యాచ్.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. అందుకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్ యాదవ్‌పై ‘విరాహిత్’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ మీదుగా బంతిని బాది.. అలెక్స్ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్ కోసం వెళ్లాడు.ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్ చేసుకుని నాన్- స్ట్రైకర్ ఎండ్ దగ్గర ఉన్న కుల్దీప్ వైపు వేశాడు. అయితే, కుల్దీప్ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్‌కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా దుబాయ్ వేదికగా ఈ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/48), వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.సెమీస్‌లో ఈ నాలుగుఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను నాకౌట్ చేసి గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టాయి. భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా.. ఆసీస్‌ను నాలుగు వికె ట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించారు. సౌతాఫ్రికా- న్యూజిలాండ్ లాహోర్‌లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025😂😂😂 https://t.co/r5K5MJW6XX pic.twitter.com/iVansWOhAv— Ayush. (@Ayush_vk18) March 4, 2025 -
IND vs AUS: ఛేదించేశారు..
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. కంగారూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. 49.3 ఓవర్లలోనే స్మిత్ బృందాన్ని ఆలౌట్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తొలి సెమీ ఫైనల్లో గ్రూప్-‘ఎ’ టాపర్ భారత్- గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కన్నోలి(0) వికెట్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కదిద్దారు. హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేయగా.. వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో అతడిని పెవిలియన్‌కు పంపాడు.స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలుఇక అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకారిగా మారిన స్మిత్ ఆటను మహ్మద్ షమీ కట్టించాడు. 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో స్మిత్‌ను అతడు బౌల్డ్ చేశాడు. మిగతా వాళ్లలో మార్నస్ లబుషేన్ ఫర్వాలేదనిపించగా.. అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే, మైదానంలో పాదరసంలా కదిలిన శ్రేయస్ అయ్యర్ అతడిని రనౌట్ చేశాడు.షమీకి మూడు వికెట్లుఇదిలా ఉంటే.. గ్లెన్ మాక్స్వెల్(7)నున అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. బెన్ డ్వార్షుయిస్(19), ఆడం జంపా(7), నాథన్ ఎల్లిస్(10), తన్వీర్ సంఘా(1 నాటౌట్) కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.ఛేదిస్తే చరిత్రే..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో 2011 తర్వాత టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా విధించిన అత్యధిక లక్ష్య ఛేదనను పూర్తి చేసిన ఏకైక జట్టు టీమిండియానే.వన్డే ప్రపంచకప్-2011 టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ఇచ్చిన 261 పరుగుల టార్గెట్‌ను నాడు ధోని సేన పూర్తి చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీనిని ఛేదిస్తే ఆస్ట్రేలియాపై తమకున్న రికార్డును తామే బద్దలుకొట్టినట్లవుతుంది. అప్డేట్: విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించడంతో భారత్ ఆసీస్ ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి నాలుగు వికె ట్ల తేడాతో గెలుపొందింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీస్- తుదిజట్లు ఇవేటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు! -
రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన సారథుల జాబితాలోకి హిట్‌మ్యాన్ చేరాడు. నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ పీటర్ బారెన్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మ్యాచ్సందర్భంగా రోహిత్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది.టాపర్‌గా నిలిచిన టీమిండియాకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలైన ఈ వన్డే టోర్నీలో టీమిండియా మాత్రం దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరిన రోహిత్ సేన.. గ్రూప్ దశలో ఆఖరిదైన న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం గమనార్హం.తాజాగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్‌లోనూ రోహిత్‌ను మరోసారి దురదృష్టం పలకరించింది. టాస్ గెలిస్తే తమకు నచ్చిన విధంగా మ్యాచ్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, గత పదకొండు సందర్భాల్లోనూ రోహిత్ టాస్ ఓడి ప్రత్యర్థి జట్టుకే మొదటి ఛాయిస్ ఇచ్చేశాడు. వరుసగా పదకొండుసార్లు టాస్ ఓడిపోయాడు.ఇక వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా బ్రియన్ లారా ముందున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పీటర్ బారెన్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు టాస్ ఓడిపోయాడు.👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*గ్రూప్ దశలోనే ఆ జట్ల ఇంటిబాటకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం ఎనిమిది జట్లు భాగమయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా పాకిస్తాన్ అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఇంగ్లండ్ టోర్నీలో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో వీటిని రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. పాక్, బంగ్లాదేశ్‌లతో పాటు.. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. దుబాయ్‌లో మార్చి 4న తొలి సెమీస్‌లో భారత్- ఆసీస్.. లాహోర్ మార్చి 5న రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. మేము గెలవాలంటే: స్మిత్ -
IND vs AUS: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే: సురేశ్ రైనా
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడేఅదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్‌ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.అయితే, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్‌లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్‌లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్‌తో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది.సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
Champions Trophy 2025: ఆసీస్‌పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా
ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final: 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్48.1వ ఓవర్: మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేయగా.. భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అంతుకుముందు స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.84 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్42.4 ఓవర్: 225 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో డ్వార్షుయిస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (84) ఔటయ్యాడు.కేఎల్ రాహుల్‌కు (31) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా34.5వ ఓవర్: నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 178/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 87 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విరాట్‌కు (68) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్26.2వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్‌కు (51) జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 134/3గా ఉంది.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్24.5వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్‌లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలు సాధించాడు. విరాట్‌కు జతగా మరో ఎండ్‌లో శ్రేయస్ (43) ఉన్నాడు. 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 131/2గా ఉంది.రోహిత్ శర్మ అవుట్7.5: రోహిత్ శర్మ(29 బంతుల్లో 28) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి బౌలింగ్‌లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి ఐదు పరుగులతో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 43-2(8)గిల్ అవుట్4.6: శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కోహ్లి క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 21 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 30-1 ఆసీస్ ఆలౌట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆడం జంపా బౌల్డ్అయ్యాడు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టీమిండియాకు 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు , హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్నాథన్ ఇల్లిస్(10) రూపంలో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. ఆసీస్ స్కోరు: 262-9(49). తన్వీర్సంఘా క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. క్యారీ ఔట్47.1వ ఓవర్: 249 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (61) స్ట్రయిక్ తన వద్దే ఉంచుకునేందుకు లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో క్యారీని రనౌట్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్45.1 ఓవర్: 239 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో బెన్ డ్వార్షుయిస్ (19) పెవిలియన్‌కు చేరాడు. అలెక్సీ క్యారీకి (54) జతగా ఆడమ్ జంపా క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యారీ42.2 ఓవర్: కీలకమైన తరుణంలో అలెక్స్ క్యారీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. క్యారీ 48 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 240/6గా ఉంది. క్యారీ 54, బెన్ డ్వార్షుయిష్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌కు బిగ్ షాక్37.3:ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు. క్యారీ 39 పరుగులతో ఉండగా.. డ్వార్షుయిస్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 205/6 (37.3)ఎట్టకేలకు స్మిత్ అవుట్36.4: భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 198/5 (36.5). మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.6: రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 144-4మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 111/3 (22.4)వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 105/2స్మిత్ 36, లబుషేన్ 24 రన్స్‌తో ఉన్నారు.పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 72/2లబుషేన్ 4, స్మిత్ 23 పరుగులతో ఉన్నారు.8.2: ట్రవిస్ హెడ్ అవుట్ఆసీస్కు భారీ షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 54/2 (8.2) కన్నోలీ డకౌట్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన కూపర్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్, స్మీత్ కొనసాగుతున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు నగారా మోగింది. దుబాయ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం. బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.బంతి స్పిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్‌స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్‌లలో మేము రాణించాం. కివీస్‌తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్‌లో పేసర్ హర్షిత్ రాణాపై వేటు వేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్‌లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్‌తో పాటు ఆసీస్ కూడా వారివైపే మొగ్గు చూపింది.తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా. -
కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెకెండ్ సెమీఫైనల్లో బుధవారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లహోర్ వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్ దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికా తమ గ్రూపు స్టేజిని ఆజేయంగా ముగించగా.. కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది.కాగా సెమీస్ పోరుకు ముందు సౌతాఫ్రికాను ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్య వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఐడైన్ మార్క్రమ్ సైతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫీల్డింగ్ మధ్యలోనే ఐడైన్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే మార్క్రమ్కు మార్చి 4న ప్రోటీస్ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఒకవేళ ఈ ఫిట్నెస్ పరీక్షలో మార్క్రమ్ ఫెయిల్ అయితే కివీస్‌తో సెమీస్‌కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ జార్జ్ లిండేను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా లిండేకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా అతడు అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
IND vs AUS: అతడిలో ప్రత్యేక ప్రతిభ ఉంది: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. నలుగురు స్పిన్నర్లతో ఆడాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నామన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటామని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తొలి సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.దుబాయ్ వేదికగా మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొన్నేళ్లుగా కంగారూల చేతిలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలకు ఈ మ్యాచ్‌తో సమాధానం చెప్పాలని భారత్ ఎదురుచూస్తోంది.ఇక ఈ వన్డే టోర్నీ లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా.. ఇంగ్లండ్, ఆసీస్ మాజీ క్రికెటర్లు మాత్రం ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.విమర్శకులకు రోహిత్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ‘‘ఒకే నగరంలో ఉంటూ ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం పట్ల మాపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదేమీ మాకు అదనపు ప్రయోజనం కలిగించడం లేదు.ప్రతీసారి పిచ్ కొత్త సవాళ్లు విసురుతోంది. మూడు మ్యాచ్లలోను పిచ్ భిన్నంగా స్పందించింది. ఇది మా సొంత మైదానం కాదు. దుబాయ్‌లో మేం తరచుగా మ్యాచ్‌లు ఆడం. మాకు కూడా ఇది కొత్తగానే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అతడిలో ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థే. మైదానంలో సహజంగానే కొంత ఉత్కంఠ ఖాయం. అయితే గెలవాలనే ఒత్తిడి మాపైనే కాదు వారిపైనా ఉంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆ జట్టులో పోరాటపటిమకు లోటు ఉండదు.కాబట్టి మా వ్యూహాలు, ప్రణాళికలకు అనుగుణంగా మేం బాగా ఆడటం ముఖ్యం. వరుణ్ చక్రవర్తిలో ప్రత్యేక ప్రతిభ ఉంది. అతడి ఎంపికపై కొన్ని విమర్శలు వచ్చినా సరే, జట్టు ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆటగాడిగా చూస్తూ అతడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ నలుగురు స్పిన్నర్లను ఆడించాలనేలా పిచ్ ఊరిస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు’’ అని రోహిత్ శర్మ తమ తుదిజట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే అంశం గురించి ప్రస్తావించాడు.కాగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఒకే జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం అదనపు స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపింది. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్‌తో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు భారత్‌కు తలనొప్పిగా మారింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.న్యూజిలాండ్‌తో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం -
మాపై ఒత్తిడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్ములేపుతున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాను ఈసారి ఎలాగైనా ఓడించి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఫైనల్‌తో పాటు అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్‌ను ఆసీస్ ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత ప్రదర్శనతో విజయ భేరి మోగించింది.అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అదేవిధంగా గతేడాదిగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురుంచి కూడా అయ్యర్ మా"కష్టం కాలం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నాలాంటి వాడికి ఇటువంటి కఠిన దశలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరు. అటువంటి సమయాల్లో మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో గతేడాది కాలం నాకు నేర్పించింది. ఇక సెమీస్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మాపై ఎటువంటి ఒత్తడి లేదు. ఇది ఒక సాధరణ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో గెలవాలనే కోరిక మరింత రెట్టింపు అయింది" అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.అయితే ఆ తర్వాత తన మనసు మార్చకుని రంజీల్లో ఆడడంతో అయ్యర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తన పునరాగమనంలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు శ్రేయస్ సాధించాడు.చదవండి: అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్ -
అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ పోరులో హెడ్ నుంచి భారత్‌కు భారీ ముప్పు పొంచి ఉందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రత్యర్ధి భారత్ అంటేనే చాలు ట్రావెస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2023 నుంచి హెడ్ ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు కొరకరాని కోయ్యగా మారాడు.ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతడిని వీలైనంత త్వరగా ఔట్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి పంపించాలి. అప్పుడే నాతో పాటు భారత అభిమానులంతా ఊపిరిపీల్చుకుంటారు. అతడు ఎక్కువ సమయం క్రీజులో ఉంటే ఏమి చేయగలడో మనందరికి తెలుసు అని ESPNCricinfoకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో భారత్‌పై హెడ్(137 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం(76 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు.టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.చదవండి: Champions Trophy: సెమీస్‌లో విజయం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!? -
సెమీస్‌లో విజయం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. లీగ్ దశలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును సెమీస్ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫిషయల్స్ జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ సెమీస్ పోరుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైకేల్ గాఫ్ .. నాలుగో అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ఎంపికయ్యాడు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు? కాగా ఈ మ్యాచ్ అఫిషయల్స్ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతకుముందు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్, 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ ఓటమి చవిచూసింది. మరోవైపు న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు.ఆసీస్‌దే పైచేయి..వన్డే క్రికెట్లో భారత్‌పై ఆస్ట్రేలియా పూర్తి అధిపత్యం చెలాయించింది. ఇప్పటివరకు ఇరు జట్లు 151 వన్డేల్లో తలపడ్డాయి. 57 మ్యాచ్‌ల్లో భారత్... 84 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్, ఆ్రస్టేలియా ముఖాముఖిగా నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు భారత్ (1998లో ఢాకాలో 44 పరుగుల తేడాతో; 2000లో నైరోబిలో 20 పరుగుల తేడాతో) నెగ్గింది. ఒకసారి ఆ్రస్టేలియా గెలిచింది (2006లో మొహాలిలో 6 వికెట్ల తేడాతో). 2009లో దక్షిణాఫ్రికాలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే టోర్నమెంట్లలో (వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరుసార్లు నాకౌట్ దశ మ్యాచ్‌లు జరిగాయి. మూడుసార్లు భారత్ (1998, 2000 చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో; 2011 వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో)... మూడుసార్లు ఆ్రస్టేలియా (2003 వరల్డ్‌కప్ ఫైనల్, 2015 వరల్డ్‌కప్ సెమీఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్) గెలిచి 3–3తో సమంగా ఉన్నాయి.చదవండి: WPL 2025: మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్ -
IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. గెలవాలంటే: స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) టీమిండియా స్పిన్ దళంపై ప్రశంసలు కురిపించాడు. సెమీ ఫైనల్లో తమకు భారత స్పిన్నర్లతోనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) దూరం కాగా.. స్మిత్ తాత్కాలిక సారథిగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు భాగం కాగా.. గ్రూప్-‘ఎ’లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఎలిమినేట్ చేసిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను నాకౌట్ చేసి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి.వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఇక దుబాయ్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ మాకు ప్రమాదం పొంచి ఉంది.ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే ఈ మ్యాచ్‌లో మా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైనది. అదే మాకు అతిపెద్ద సవాలు కాబోతోంది. అయితే, మేము వారిపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం’’ అని స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కాస్త సమయం చిక్కిందిఇక టీమిండియాతో మ్యాచ్ సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. ‘‘రెండు రోజుల ముందుగానే దుబాయ్‌కు చేరుకోవడం మాకు సానుకూలాంశం. ప్రాక్టీస్‌కు కావాల్సినంత సమయం దొరికింది. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చేంత వరకు మేము ఏ వేదిక మీద ఆడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.అయితే, అదృష్టవశాత్తూ మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే.. న్యూజిలాండ్ స్థానంలో మేము పాకిస్తాన్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఏదేమైనా దుబాయ్ పిచ్‌ను అర్థం చేసుకునేందుకు మాకు కాస్త సమయం చిక్కింది’’ అని 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇక రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ బుధవారం తలపడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఇందుకు వేదిక.వరుణ్ మాయాజాలంచాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బట్లర్ బృందాన్ని 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు ఎంపికైన వరుణ్.. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, న్యూజిలాండ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఈ మిస్టరీ స్పిన్నర్ దుమ్ములేపాడు. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆ అపవాదు చెరిపేసుకున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసిన వరుణ్ 42 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. విల్ యంగ్(22), గ్లెన్ ఫిలిప్స్(12), మైఖేల్ బ్రాస్‌వెల్(2), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(28), మ్యాట్ హెన్రీ(2) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి ఆసీస్‌తో వరుణ్ చక్రవర్తి ఆడటం దాదాపు ఖాయం కాగా.. స్మిత్ పైవిధంగా స్పందించాడు. కాగా వరుణ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ జట్టులో ఉన్నారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్‌ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది.ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్ మ్యాచ్‌లలో ఆసీస్‌దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్ హెడ్ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..‘‘ముందుగా ట్రవిస్ హెడ్ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్ చేయడం మంచిది. షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్‌కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ వంటి హార్డ్ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్ పేస్‌లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్ మ్యాచ్ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడుకాగా ట్రవిస్ హెడ్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో మ్యాచ్ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్ మ్యాచ్‌లో భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌ను చితక్కొట్టాడు. కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్‌ను టార్గెట్ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.టీమిండియాదే గెలుపుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోహిత్ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్ ఆసీస్‌ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్ -
కొత్త తలనొప్పి.. వరుణ్ చక్రవర్తిని సెమీ ఫైనల్లో ఆడిస్తారా?
న్యూజిలాండ్(India vs New Zealand) తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(_ICC Champions Trophy)లోని ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్‌కి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రూపం లో సెలక్షన్ బెడద. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆడిన తీరుపై అభినందించక తప్పదు. బ్యాటింగ్‌లో ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా తర్వాత శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), అక్షయ్ పటేల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆదుకోవడంతో భారత్ భారీ స్కోర్ కాకపోయినా (249/9) కొద్దిగా మెరుగైన స్కోర్ చేసింది.తర్వాత న్యూజిలాండ్ వంతు వచ్చింది. సీనియర్ బ్యాటర్ కేన్ విల్లియమ్స్ నిలకడగా పడుతుండటం తో ఒక దశలో మెరుగ్గానే కనిపించింది. ఈ తరుణంలోనే వరుణ్ చక్రవర్తి వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు.చక్రం తిప్పిన వరుణ్నిజానికి దుబాయ్ వేదిక పై వరుణ్ కి గతంలో ఎన్నడూ అదృష్టం కలిసి రాలేదు. గతం లో 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వరుణ్ ఇదే వేదిక పై మూడు మ్యాచ్ లలో ఆడాడు. ఈ మూడు మ్యాచ్ ల లో వరుణ్ గణాంకాలు 11-0-71-0 . ఈ గణాంకాలు బట్టి చూస్తే వరుణ్ ఈ వేదిక పై ఆడటం కష్టమే అనిపిస్తుంది. పాకిస్తాన్‌తో వరుణ్ ఈ వేదికపై వరుణ్ ఆడిన మ్యాచ్ పెద్ద పీడకల లాగా నిలిచిపోతుంది.పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్ లో వరుణ్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. గత రికార్డులను చూస్తే వరుణ్ ని దుబాయ్ వేదికపై ఆడించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను అభినిందించక తప్పదు.ఆ రోజుల్లో వరుణ్ చక్రవర్తి అసలు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడా లేదా అని వాదించిన వారూ ఉన్నారు. ఈ నేపధ్యం లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఖచ్చితత్వంతో వైవిధ్యాలను చూపించిన వరుణ్ చివరికి 10-0-42-5 గణాంకాల తో తన ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలో అద్భుతంగా రాణించిన బౌలర్లలో ఒకడిగా రికార్డ్ నెలకొల్పాడు. “మాకు 2021 ఐసీసీ టి20 ప్రపంచ కప్ పెద్దగా కలిసి రాలేదు (భారత్ గ్రూప్ దశల్లోనే ఓడిపోయింది). వ్యక్తిగతంగా కూడా నేను ఆ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేక పోయాను. కానీ నేను అప్పుడు నిబద్దతతోనే బౌలింగ్ చేశానని భావిస్తున్నాను. కానీ ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా అంతా బాగానే కనిపిస్తోంది. టీమ్ ఇండియా కూడా బాగా రాణిస్తోంది. మా కాంబినేషన్లు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసి వస్తోంది’’ అని వరుణ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత చెప్పాడు.కంగారు పడ్డ వరుణ్2021ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వికెట్ పడగొట్టడంలో విఫలమైన వరుణ్ ఆ తర్వాత 2024 అక్టోబర్ వరకు భారత జట్టులో కనిపించకుండా పోయాడు. అందుకే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, వరుణ్ తొలుత కంగారు పడ్డాడు. అతను బౌలింగ్ చేసిన మొదటి బంతిలోనే బౌండరీ ఇచ్చాడు.“నా మొదటి స్పెల్‌లో, నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే గత విషయాలు, భావోద్వేగాలు, ఈ మైదానంలో గత మూడు సంవత్సరాలలో జరిగిన ప్రతిదీ నా మనస్సులో కదిలాడాయి. నేను దానిని అదుపులో ఉంచడానికి, నియంత్రించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. విరాట్ (కోహ్లీ) భాయ్, రోహిత్ మరియు హార్దిక్ (పాండ్యా) నాకు ప్రశాంతంగా ఉండు' అని చెప్పారు. అది నిజంగా ఏంతో సహాయపడింది" అని వరుణ్ అన్నాడు.వరుణ్ అసాధారణ బౌలింగ్ మంగళవారం జరిగే సెమీ-ఫైనల్‌కు ముందు కెప్టేన్ రోహిత్ తన సీమర్ల పనిభారాన్ని తగ్గించడానికి బాగా సహాయపడింది. అంతే కాకుండా చివరికి ఆస్ట్రేలియాతో జరిగే పోరులో భారత్‌కు వరుణ్ రూపం లో కొత్తరకమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. నలుగురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ముగ్గురు-ఇద్దరు కాంబోలోకి తిరిగి వెళ్లాలా? అలా అయితే, ఎవరిని వదిలివేయాలి? వరుణ్‌ను తొలగించడం మాత్రం ఇప్పుడు సాధ్యపడదు!చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
Ind vs Aus: ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్ మ్యాచ్‌లలో..అయితే, సెమీస్‌లో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ కమిన్స్ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్‌లో ఆసీస్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్‌తో మ్యాచ్‌లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్‌ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్ -
ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వ్యవహరించిన తీరును కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. వికెట్ కోసం అప్పీలు చేసే క్రమంలో జడ్డూ ప్రవర్తించిన విధానం సరికాదని.. అంపైర్ అతడికి హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి మ్యాచ్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్‌తో తలపడిన విషయం తెలిసిందే.శ్రేయస్ అద్భుత అర్ధ శతకందుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(India vs New Zealand) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుబ్‌మన్ గిల్(2), విరాట్ కోహ్లి(11) విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించింది.నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధ శతకం(98 బంతుల్లో 79) సాధించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) రాణించారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిగతా వారిలో కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు.విలియమ్సన్ హాఫ్ సెంచరీఇక 250 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి కివీస్ జట్టు ఆలౌట్ అయింది. రచిన్ విఫలం(6) కాగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ(81) చేయగా.. ఓపెనర్ విల్ యంగ్(22), మిచెల్ సాంట్నర్(28) మాత్రమే ఇరవై పరుగుల మార్కు అందుకోగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. పేసర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్‌ను అవుట్ చేసే క్రమంలో జడేజా వ్యవహరించిన తీరును కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు.కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన జడ్డూ రెండో బంతిని అద్భుతంగా సంధించాడు. అతడి స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న లాథమ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. బంతి అతడి తొడకు తాకింది. లేదంటే బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టేదే. ఈ నేపథ్యంలో అంపైర్ లాథమ్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా ప్రకటించగా అతడు పెవిలియన్ చేరాడు.ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?అయితే, లాథమ్ విషయంలో జడేజా పిచ్ మధ్య వరకు వచ్చి అప్పీలు చేయడం సరికాదంటూ సైమన్ డౌల్ కామెంట్రీలో పేర్కొన్నాడు. ‘‘అతడు ఏం చేశాడో చూడండి. ఆటగాళ్లు ఇలా చేయవచ్చా? అతడిని అంపైర్ హెచ్చరించి ఉండాల్సింది’’ అని డౌల్ అభిప్రాయపడ్డాడు. అసలు ఆటగాడు పిచ్ మధ్యలోకి రావడం ఏమిటంటూ అసహనం వెళ్లగక్కాడు. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇక అంతకుముందు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో... దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లాలని పట్టుదలగా ఉంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025 -
'బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లి జీరో': పాక్ మాజీ క్రికెటర్
ఛాంపియన్స్ ట్రోఫీ-20525లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆ దేశ మాజీ క్రికెటర్ల బుద్ది మాత్రం మారలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం భారత్‌పై విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కించపరిచి మాట్లాడాడు. విరాట్ కోహ్లి కంటే పాక్ ఆటగాడు బాబర్ ఆజం ఎంతో బెటర్ అని అతడు విమర్శించాడు.మీకు ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. బాబర్ ఆజంతో విరాట్ కోహ్లిని దయచేసి పోల్చవద్దు. బాబర్ ముంగిట విరాట్ కోహ్లి జీరో. మనం ఇక్కడ ఎవరు మంచి ఆటగాడు అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం. పాకిస్తాన్ క్రికెట్ పతనం గురించి మాట్లాడుతున్నాము. ప్రణాళిక లేదు, వ్యూహాలు లేవు, జవాబుదారీతనం లేదు. పాక్ క్రికెట్ నాశనం అవుతోంది అని మొహ్సిన్ ఖాన్ ARY న్యూస్‌తో పేర్కొన్నారు.కాగా ఈ మెగా టోర్నీలో బాబర్ ఆజం విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లి మాత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చెలరేగాడు. దీంతో తమ జట్టుపై విరాట్ సెంచరీ చేయడాన్ని పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లిపై తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. అయితే మొహ్సిన్ ఖాన్‌కు భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. విరాట్ కోహ్లికి బాబర్‌కు పోలికా, కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా మెగా టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో గ్రూపు స్టేజిని టీమిండియా ఆజేయంగా ముగించింది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: 'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు -
'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు
ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ జట్టుకు పాల్గొనే అర్హత లేకపోవడం బాధ, ఒకింత చిరాకు పరుస్తోందని కరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ చెప్పారు. తాజా మెగా టోర్నీలో వన్డే ప్రపంచకప్ మాజీ చాంపియన్లు విండీస్, శ్రీలంక జట్లు అర్హత సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ... క్రికెట్లో రోజురోజుకు పరిణతి సాధిస్తూ... ప్రదర్శన మెరుగుపర్చుకుంటున్న అఫ్గానిస్తాన్ జట్టును చూసి తమ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని హితవు పలికారు. ‘మైదానంలో దిగినపుడు అఫ్గాన్ ఆటగాళ్లలో కసి కనిపిస్తుంది. వారి పోరాటం ముచ్చటేస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి ఏన్నో ఏళ్ళు కాలేదు. అయినాసరే... దశాబ్దాలుగా ఆడుతున్న మిగతా జట్ల కంటే ఎంతో మెరుగ్గా అఫ్గాన్ ఆడుతోంది. ఏటికేడు ప్రగతి సాధిస్తున్న వారి ఆటతీరు అద్భుతం. ఈ చాంపియన్స్ ట్రోఫీనే చూసుకుంటే మా వెస్టిండీస్ జట్టు టాప్–8లో లేక టోరీ్నకి దూరమైంది. మరోవైపు నిలకడగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ మేటి జట్లతో తలపడుతోంది’ అని అన్నారు. ఇలాంటి జట్టును, ప్రతిభను చూసి వెస్టిండీస్ మారాలన్నారు. క్రికెటర్లు మాత్రమే కాదు... బోర్డు, దేశవాళీ పరిస్థితులు అన్నింటా మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడంపై రిచర్డ్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంగ్లండ్ మాజీలు నాసిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ ఒక్క దుబాయ్ వేదికపై భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడటం, వచ్చే అనుకూలతలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
ఆసీస్‌తో సెమీఫైనల్.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూపు స్టేజిలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వన్డే ప్రపంచకప్-2023 ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన కసితో ఉంది. అందుకు తగ్గట్టు తమ ఆస్తశాస్త్రాలను భారత జట్టు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీమిండియాను మరోసారి మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు దూరమైనప్పటికి స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు అదరగొడుతోంది. దీంతో మరోసారి ఆసీస్-భారత్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్పిస్తోంది.మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?అయితే తొలి సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పైనే ఉన్నాయి. ప్రత్యర్ధి భారత్ అయితే చెలరేగిపోయే హెడ్.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్లో అతడి చేసిన విధ్వంసం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోరు.ఈ డేంజరస్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హెడ్ మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 76 పరుగులు చేసి తన జట్టును గెలిపించే అంత పనిచేశాడు. అంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్‌పై సెంచరీతో మెరిశాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ పరుగుల వరద పారించాడు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భారత అభిమానులు భయపడుతున్నారు. మరి హెడ్‌ను అడ్డుకునేందుకు భారత్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో మరో 24 గంటలు వేచి చూడాలి.భారత్‌పై హెడ్ రికార్డు..టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.భారత్‌దే పైచేయి..కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. భారత్ రెండింట, ఆసీస్ కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. చదవండి: Champions Trophy: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్ -
అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. లీగ్ స్టేజిని ఆజేయంగా ముగించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో విజయోత్సహంతో సెమీస్‌కు భారత్ సన్నద్దమైంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కాళ్లును మొక్కబోయాడు. అవును మీరు విన్నది నిజమే. కోహ్లి ఎందుకు అలా చేశాడో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) , హార్దిక్ పాండ్యా(45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. టీమిండియా స్పిన్నర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. అయితే న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి కేన్ విలియమ్సన్ మాత్రం భారత్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. మిగితా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడితే కేన్ మాత్రం సమర్ధవంతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అక్షర్ పటేల్.. విలియమ్సన్ వికెట్‌ను భారత్‌కు అందించాడు. కివీస్ ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. అద్బుతమైన బంతితో కేన్‌ను బోల్తా కొట్టించాడు. అక్షర్ సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగ్గాఇ అంచనా వేయలేకపోయిన విలియమ్సన్ స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అక్షర్ తన 10 ఓవర్ల స్పెల్ చివరి బంతికి వికెట్ తీయడం గమనార్హం. దీంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి వేగంగా అక్షర్ వద్దకు వెళ్లి అతడు కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్షర్ వెంటనే కిందకూర్చుని నవ్వుతూ కోహ్లిని ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15— voodoo mama juju (@ayotarun) March 2, 2025 -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ స్టేజిని భారత్ విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ విజయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) స్పిన్ మాయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.అతడిని ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చక్రవర్తి ఓవరాల్‌గా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన వరుణ్..అంతర్జాతీయ వన్డేల్లో మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్న భారత బౌలర్‌గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన మూడో వన్డేలో కేవలం 4 పరుగులిచ్చి 6 వికెట్లతో చెలరేగాడు.తాజా మ్యాచ్‌తో బిన్నీ అల్‌టైమ్ రికార్డును చక్రవర్తి అధిగమించాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్‌గా ఈ తమిళనాడు స్పిన్నర్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఈ ఫీట్‌ను అందుకున్నారు.సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ..ఇక మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2023 వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి బదలు తీర్చుకోవాలని కసితో రోహిత్ సేన ఉంది. ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అయితే సెమీస్‌లో కూడా నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందా లేదా హర్షిత్ రాణాను మళ్లీ తుది జట్టులోకి తీసుకువస్తుందో వేచి చూడాలి.కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రాణాకు విశ్రాంతి ఇచ్చిన టీమ్ మెనెజ్‌మెంట్.. వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చింది. అయితే జట్టులోకి వచ్చిన వరుణ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నలుగురు స్పిన్నర్లతో భారత్ ఆడింది. మొత్తం నలుగురు స్పిన్నర్లు కూడా తమ మార్క్‌ను చూపించారు. దీంతో తుది జట్టు కూర్పు భారత్‌కు సవాలుగా మారింది. అంతకు తోడు మహ్మద్ షమీ కూడా అంత రిథమ్‌లో కన్పించడం లేదు. మరి భారత జట్టు మెనెజ్‌మెంట్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో మరో 24 గంటలకు వేచి చూడక తప్పదు.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజిని భారత్ ఆజేయంగా ముగించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును అయ్యర్, అక్షర్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 98 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.అతడితో పాటు కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్, జడేజా, అక్షర్ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(81) టాప్ స్కోరర్ నిలిచాడు. కాగా భారత్ తమ తొలి సెమీఫైనల్లో మంగళవారం(మార్చి 4) ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సెమీస్‌కు ముందు ఇటువంటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ తెలిపాడు."ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని భావించాము. మేము అనుకున్నది జరిగినందుకు చాలా అనందంగా ఉంది. న్యూజిలాండ్ జట్టు ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటువంటి జట్టును ఓడించాలంటే మన ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలి. పవర్ ప్లేలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము.ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మా దగ్గర క్వాలిటీ బౌలర్లు ఉండడంతో డిఫెండ్ చేసుకునే టోటల్ లభించందని భావించాము. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. నిజంగా వరుణ్ చక్రవర్తి ఒక మిస్టరీ స్పిన్నరే.అతడిని ఎవరితోనూ పోల్చలేం. తొలి రెండు మ్యాచ్‌లకే బెంచ్‌కే పరిమితమైన అతడికి ఓ ఛాన్స్ ఇద్దామని ఈ మ్యాచ్‌లో ఆడించాము. అతడు బంతితో అద్భుతం చేశాడు. తదుపరి మ్యాచ్ కోసం మేము ప్రస్తుతం ఆలోచించడం లేదు. కానీ అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ కొంచెం తలనొప్పిగా మారింది. ఈ టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి మెగా ఈవెంట్లలో తప్పులు జరగడం సహజం.కానీ తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆసీస్‌తో సెమీస్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం నేను అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Champions Trophy: భారత్‌తో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు -
టీమిండియాతో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా సెమీఫైనల్-1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాలు పట్టేశాయి.దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్లో కూపర్ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్ అప్షన్ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.సెమీస్‌కు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంగాచదవండి: Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ -
కుప్పకూలిన న్యూజిలాండ్..44 పరుగులతో టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే
Updates:పీకల్లోతు కష్టాల్లో టీమిండియాటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్మూడో వికెట్‌గా వెనుదిరిగిన విరాట్‌కోహ్లి(11) ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోర్ 44-3తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్‌టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(2) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.యువ పేసర్ హర్షిత్ రాణాకు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ కూడా ఓ మార్పుతో ఆడుతోంది. డెవాన్ కాన్వే స్ధానంలో డార్లీ మిచెల్ జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే కావడం విశేషం.తుది జట్లుభారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కేచదవండి: 'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్ -
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 29 ఏళ్ల తర్వాత తమ దేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.దీంతో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో తమ సెమీస్ బెర్త్‌ను బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడుతోంది.భద్రత కారణాల రీత్యా తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పక్కన పెట్టండి. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ ఐపీఎల్లో పాల్గోంటారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గోనరు. అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు. కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు ఎన్వోసీ జారీ చేయకూడదు. ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపై రావాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ పేర్కొన్నాడు.అయితే ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్(2008) లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడారు.అయితే ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిషేధించారు. కాగా బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందకు అనుమతించదు. ఒక ఇండియన్ క్రికెటర్ ఓవర్సీస్ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాలంటే ఐపీఎల్‌తో సహా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి.చదవండి: CT 2025 IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ? -
IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది.ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు."కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ తమ తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు ఆడే అవకాశం ఇవ్వండి. మొదటి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నించిండి. గెలిస్తే ఆస్ట్రేలియాతో ఆడుతారు. లేదంటే దక్షిణాఫ్రికాతో తలపడతారు. అంతేతప్ప ఓడినంతమాత్రాన భారత జట్టుకు పెద్దగా నష్టం లేదు. కాబట్టి నావరకు అయితే తుది జట్టులో మార్పులు చేస్తే బెటర్" అని మంజ్రేకర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులో వచ్చే అవకాశముంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ స్ధానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నట్లు సమచారం.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
మళ్ళీ కోహ్లి హవా ... ఒక్క మ్యాచ్ తో మారిన తీరు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.రికార్డుల వేటలో కోహ్లి..కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు "ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.న్యూజిలాండ్ రికార్డ్ ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరి లీగ్ మ్యాచ్ సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఇరు జట్లు లీగ్ స్టేజిని విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. కాగా ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులను లిఖించుకున్నాడు.ఇప్పటివరకు భారత జట్టు తరపున 299 వన్డేలు ఆడిన కోహ్లి.. 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.300 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్లుఎంఎస్ ధోని – 350 మ్యాచ్లురాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్లుమహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్లుసౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్లుయువరాజ్ సింగ్ – 304 మ్యాచ్లువరల్డ్ రికార్డుపై కన్ను..అదేవిధంగా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100 టెస్టులు, 100 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ ఇప్పటివరకు 299 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20లు ఆడాడు. సంగర్కరకు చేరువలో కోహ్లి..కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కింగ్ కోహ్లి మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి మరో 149 పరుగులు చేస్తే శ్రీలంక కుమార్ సంగక్కర(14234)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 18426 పరుగులు చేశాడు. సచిన్ కంటే కోహ్లి ఇంకా 4,341 పరుగులు వెనకబడి ఉన్నాడు. చదవండి: Champions Trophy: టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే? -
టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరినప్పటికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.ఆదివారం న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ తర్వాతే సెమీస్‌లో ఎవరి ప్రత్యర్ధి ఎవరన్నది తేలనుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్నది నేడు ఖారారు కానుంది. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది. కివీస్‌తో చివరి పోరులో భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్ సేన మంగళవారం తొలి సెమీఫైనల్ ఆడుతుంది.ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్ మైదానంలో ప్రాక్టీస్ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.ఇక కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఓమార్పుతో బరిలోకి దిగింది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై