public
-
కంచ గచ్చిబౌలిలో నిషేధాజ్ఞలు
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/రాయదుర్గం: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. సుప్రీంకోర్టు, కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల మేరకు ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశానికి అనుమతులు లేవని తెలిపారు.నిషేధాజ్ఞలు శుక్రవారం నుంచి ఈనెల 16 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెంట్రల్ వర్సిటీతో పాటు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గురువారం నాటి సుప్రీంకోర్టు స్టేతో ధర్నాలు, ఆందోళనలు ఆగిపోయాయి.సదరు 400 ఎకరాల్లో పనులను నిలిపివేశారు. క్యాంపస్‌తో పాటు వివాదాస్పద భూముల్లో పోలీసు లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను తనిఖీలు చేసి, ఐడీ కార్డులున్న సిబ్బంది, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థుల భారీ ర్యాలీ శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హెచ్‌సీయూలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ‘ప్రతిఘటన, విజయోత్సవ ర్యాలీ’పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీచర్స్ అసోసియేసన్, వర్కర్స్ అసోసియేషన్ సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఫ్యాకలీ్ట, నాన్‌టీచింగ్, వర్కర్స్ ఐక్యత వర్ధిల్లాలి, హెచ్‌సీయూ భూములను కాపాడుతాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టయిన, కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, సివిల్ సొసైటీ గ్రూప్‌లు, ఇతరులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, క్యాంపస్ నుంచి పోలీస్ క్యాంప్‌లను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కుక్కల దాడిలో గాయపడి.. దుప్పి మృతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి (మచ్చల జింక).. మృగవనికి తరలిస్తుండగా మృతిచెందింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హెచ్‌సీయూ క్యాంపస్‌లో చెట్లు, పొదలను తొలగించడంతో స్థావరాలను కోల్పోయిన వన్యప్రాణులు క్యాంపస్‌లోని హాస్టళ్ల వైపు వస్తున్నాయి.శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక దుప్పి రాగా కుక్కలు వెంటపడి గాయపరిచాయి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది కుక్కలను తరిమివేసి గాయపడిన దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని మృగవనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో మృగవనిలో పోస్టుమార్టమ్ నిర్వహించి అక్కడే ఖననం చేశారు. గోపన్‌పల్లిలో ఇళ్ల మధ్య జింక పరుగులు.. శుక్రవారం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం సమీపంలోని గోప న్‌పల్లి ఎన్టీఆర్నగర్లో ఓ జింక రోడ్లపై పరుగులు తీసింది. అటూఇటూ తిరుగుతూ ఓ ఇంట్లోకి వెళ్లగా, స్థానికులు గమ నించి తలుపులు మూసివేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి జింకను పట్టుకుని జూపార్కుకు తరలించారు.అవన్నీ ఏఐ చిత్రాలే సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పరిధిలో చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న రీతిలో.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమంతా కల్పితమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని జేసీబీలతో చెట్లను నరికివేయడం వల్ల అక్కడున్న నెమళ్లు, జింకలు పరుగెత్తుకుంటూ పారిపోతున్న రీతిలో రూపొందించిన చిత్రం పూర్తిగా ఏఐ(ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారితమని తేల్చిచెప్పింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో క్రిషాంక్ ఎక్స్ ఖాతాలో జింక కాళ్లు కట్టేసి చంపినట్లు చూపిన చిత్రం కూడా తప్పుడు చిత్రమని తేల్చింది. ఈ చిత్రం ఓ సోషల్ మీడియా జర్నలిస్టు పొరపాటున పోస్టు చేశారని, ఆ తర్వాత సదరు రిపోర్టర్ తన తప్పిదాన్ని ఒప్పుకుని తొలగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారని వివరించింది. -
బడ్జెట్ పై ఏపీ ప్రజల రియాక్షన్.. సూపర్ మోసం
-
జనంలో రూ.2000 నోట్లు.. ఇంకా అన్ని ఉన్నాయా?
ముంబై: ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 98.18 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయి. ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం తెలిపింది.2023 మే 19న ఆర్బీఐ రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆనాడు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. 2025 ఫిబ్రవరి 28 నాటికి ఈ విలువ రూ.6,471 కోట్లకు వచ్చి చేరిందని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ లేదా మార్చుకునే సదుపాయం ఉంది. మొత్తం మీద దేశంలో ఇప్పటికీ కొందమంది దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇవన్నీ పూర్తిగా ఆర్బీఐకు ఎప్పుడు చేరుతాయనేది తెలియాల్సిన విషయం. -
Sakshi Poll: కేంద్ర బడ్జెట్‌పై జనం ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యం అంటూ ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.కేంద్రం చెప్పినట్లు ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతికి లాభం చేకూర్చేదేనా? అంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సాక్షి పోల్ క్వశ్చన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. అవును, కాదు, ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే ప్రశ్నలకు అధిక శాతం మంది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ శాతం మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన శాతం ఫిప్టీ.. ఫిప్టీ అని తెలిపారు. -
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు ఫైర్
-
అందుబాటులోకి టిన్టిన్, పొపాయ్
పిల్లలు మొదలు పెద్దలదాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించే దిగ్గజ ‘టామ్ అండ్ జెర్రీ’ కార్టూన్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనువిందుచేయడం తెల్సిందే. దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ వీడియోలపై ఇప్పుడు ఎలాంటి కాపీరైట్ వంటి మేథోహక్కులు ఎవరికీ లేవు. ఇప్పుడు వీటిని అందరూ ఉపయోగించుకోవచ్చు. రచయితకు ఎలాంటి రాయితీ చెల్లించకుండానే వాడుకోవచ్చు. అచ్చం ఇలాగే అమెరికాలో జనవరి ఒకటో తేదీ నుంచి ఇంకొన్ని కార్టూన్ పాత్రలు, అలనాటి అపురూప రచనలకు కాపీరైట్ గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ప్రజలంతా వాటిని తమకు నచ్చినట్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఒకప్పటి క్లాసిక్స్ అయిన టిన్టిన్, పొపాయ్ కార్టూన్ పాత్రలతోపాటు మరికొన్ని ప్రసిద్ధ రచనలపై కాపీరైట్ గడువు జనవరి ఒకటో తేదీతో ముగిసింది. వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, మార్క్స్ బ్రదర్స్ మొదటి చలన చిత్రం ‘ది కోకోనట్స్’ వంటి క్లాసిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. 1924లోని సౌండ్ ట్రాక్స్ కూడా కాపీరైట్ రహితం అయ్యాయి.జాబితాలో ఏమేమున్నాయి? కొత్త సంవత్సరంలో కాపీరైట్ కోల్పోనున్న సాంస్కృతిక రచనల జాబితాను ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది పబ్లిక్ డొమైన్’ ప్రతి డిసెంబర్లో ప్రచురిస్తుంది. ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో భాగమైన ఈ కేంద్రం ఈ జాబితాను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జనవరి ఒకటో తేదీ నుంచి అమెరికా పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన సాహిత్యంలో వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, విలియం ఫాల్కనర్ రాసిన ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’, జర్మన్ రచయిత ఎరిక్ మారియా రెమార్క్ రాసిన ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ ఆంగ్ల అనువాదం ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ‘బ్లాక్ మెయిల్’, ఆస్కార్ అవార్డు గ్రహీత జాన్ ఫోర్డ్ రూపొందించిన మొదటి సౌండ్ ఫిల్మ్ ‘ది బ్లాక్ వాచ్’ కూడా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాయి. ఫ్రెంచ్ స్వరకర్త మారిస్ రావెల్ ‘బొలెరో’, జార్జ్ గెర్‡్షవిన్ ‘యాన్ అమెరికన్ ఇన్ పారిస్’ వంటి ట్రాక్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం కాపీ రైట్ రహితమైన కార్టూన్ పాత్రల్లో టిన్టిన్, పొపాయ్ ది సెయిలర్ ఉన్నాయి. కామిక్ పాత్ర టిన్టిన్.. 1929లో బెల్జియం వార్తాపత్రికలో అరంగేట్రం చేసింది. కార్టూనిస్ట్ ఎల్జీ క్రిస్లర్ సెగర్ సృష్టించిన పొపాయ్ ది సెయిలర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. 95 ఏళ్ల తరువాత... అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం పుస్తకాలు, చలనచిత్రాలు, ఇతర కళాకృతులకు 95 సంవత్సరాల తర్వాతే కాపీరైట్స్ ముగుస్తాయి. అలా 1929కి చెందిన వేలాది రచనలు, 1924లో రికార్డ్ అయిన అనేక సౌండ్స్ అమెరికాలో ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వేలాది సినిమాలు, పాటలు, పుస్తకాలు జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 కాపీరైట్స్ పూర్తయిన మిక్కీమౌస్, 2023లో పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన విన్నీ ది పూహ్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు
మాటలే మంటలు రేపుతాయి.. చెలరేగిన మంటలను నోటి మాటలే చల్లార్చుతాయి. నోట్ల కట్టల కంటే నోటి మాటకే పదునెక్కువ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటీ తీసిపడేయలేని నిత్యసత్యాలే. మనం మాట్లాడే మాటకున్న విలువను తెలియజేసే సామెతలు. మనిషికి ఉన్న 64 కళల్లో వాక్చాతుర్యం ఒకటి. మాటలే కదా ఎన్నయినా మాట్లాడతాం అనుకుంటే పొరపడినట్లే.. మైక్ పట్టుకుని నలుగురిలో అనర్గళంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో 514 రకాల భయాలు ఉండగా.. అందులో ప్రథమ స్థానంలో పబ్లిక్ స్పీచ్ నిలిచింది. రెండో స్థానంలో మరణం ఉందని అమెరికాకు చెందిన పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. నలుగురిలో ప్రసంగించాలంటే.. మనసులో ఏదో తెలియని భయం. మైక్ పట్టుకున్న చేతికి వణుకు మొదలవుతుంది. వీటిని అధిగమించిన వారికే ఏ రంగంలోనైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మనలో చాలా మందికి ఎన్నో చెప్పాలని మనసులో ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాటలు రావడంలేదు అంటారు. అధికారం కోసం రాజకీయ నాయకులు, ఉద్యోగం, పదోన్నతి కోసం ఇంటర్వ్యూను ఎదుర్కొనాల్సిన అభ్యర్థులు, విద్యార్థులు, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో వ్యాపార సంస్థలు, తాను తీసుకున్న కేసును గెలిపించడం కోసం న్యాయవాది తదితర రంగాల్లోని వ్యక్తులకు వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇటువంటి వారిలో అవసరమైన వారికి మాటలు నేరి్పంచడానికి నగరంలో పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ రంగంలోని వారికైనా సమయం, సందర్భానుసారం మాట్లాడే మెళకువలు నేర్పిస్తామంటున్నారు. ఆ భయం ఎందుకు? వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడాలంటే భయంతో కాళ్లు చేతులు ఎందుకు వణుకుతున్నాయి. నలుగురిలో మాట్లాడాలంటే మాట ఎందుకు తడబడుతోంది. మనసులోని భావాన్ని చెప్పడంలో వెనుకాడటానికి కారణం.. ఇలా ఎన్నో ప్రశ్నలకు అనుభవం లేకపోవడం, సిగ్గు, బిడియం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే మాటల తడబాటుకు కారణాలట. ఒక్కోసారి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి ఒక అంశంపై చర్చలు పెడుతున్నారు. మైక్ పట్టుకుని తనకు నచి్చన అంశంపై ధారాళంగా మాట్లాడాలని ఆహా్వనిస్తున్నారు. మనసులో మాటను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవసరమైన టిప్స్ ఇస్తున్నారు. నాలుగు రోజుల నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు.ఆకట్టుకున్నవారికే అందలం..మాట్లాడే సబ్జెక్ట్‌పై పట్టుండాలి. చెప్పే మాటల్లో కొత్తదనం కనిపించాలి. మాట్లాడే సమయంలో హావభావాలు, శారీరక కదలికలు ఇతరులను ఆకర్షించాలి. మన మాటలకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ పసిగట్టాలి. సందర్భానుసారం అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయతి్నంచాలి. ఈ అంశాల్లో పట్టున్న వారిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నాయకుడనే కిరీటం అందిస్తారు. అధికారం కట్టబెడతారు.మాటలతోనే గుర్తింపు.. తొలినాళ్లలో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు శిక్షణ తీసుకున్నాను. ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు వేలాది మంది ఉన్న సభల్లో డయాస్‌పై అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. టీవీ షోల్లో పాల్గొంటున్నా. ఎదుటి వ్యక్తి ఎలా చెబితే వింటాడో మనం గుర్తించగలగాలి. మన ఆలోచనలను వరుసక్రమంలో పెట్టుకోవాలి. సందర్భానుసారం ఆకట్టుకునే విధంగా మాట్లాడితే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. – పల్లవి, సైకాలజిస్టు, హైదరాబాద్సెల్ఫ్ కాని్ఫడెన్స్ పెరిగింది.. పబ్లిక్ స్పీచ్ అందరికీ అవసరమే. ఉద్యోగంలో భాగంగా కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలో అనుకున్నంత గొప్పగా మాట్లాడలేకపోయాననే ఆలోచన ఉండేది. శిక్షణ తీసుకున్నప్పుడు చాల విషయాలు నేరి్పంచారు. సెల్ఫ్ కాని్ఫడెన్స్ మన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పీచ్‌కి సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో.. ఆరంభం, ముగింపు రెండూ అంతే ముఖ్యం. – కిరణ్‌రెడ్డి, పోలీసు పీఆర్ఓ, సైబరాబాద్మాటలు వెనక్కి వచ్చేవి.. నాకు కమ్యూనికేషన్ ఫీల్డ్ అంటే ఇష్టం. పది మందిలో మాట్లాడాలంటే నా మనసులో మాటలు వెనక్కి వచ్చేవి. ట్రైనింగ్‌లో చేరినప్పుడు ఎలా ఉంటుందోనని భయపడ్డాను. లెక్చర్ ఇస్తారని ఊహించుకున్నాను. ఇక్కడ ప్రాక్టికల్‌గా నేరి్పస్తున్నారు. మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడితే బోలెడు తప్పులుండేవి. వాటిని సరిదిద్దుకుంటున్నా. పది నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. – సింధుశ్రీ, విద్యారి్థనిఅవకాశాలు కోల్పోతున్నారు.. ఆకట్టుకునే విధంగా మాట్లాడటం తెలియక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. 15 ఏళ్ల విద్యార్థి నుంచి 70 ఏళ్ల వయసు వారికీ వాక్చాతుర్యం అవసరం. స్కిల్ అనేది జీవితాంతం ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నారు. సుమారు 800 బ్యాచ్‌లలో ఐదువేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. శిక్షణ అనంతరం తమలో మార్పు కనిపించింది అంటున్నారు.– దన్నారపు కల్పన, మీడియా జంక్షన్ డైరెక్టర్ -
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
పాల వ్యాన్ వద్ద ఎగబడుతున్న జనం
-
Pakistan: పాక్ సైనికులపై నిరసనకారుల దాడి.. ఒక జవాను మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆ దేశ సైన్యంపై నిరసనకారులు తిరగబడ్డారు. పాక్ సైన్యం కొనసాగిస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్‌లోని ఆందోళనకారులు దాడులకు దిగారు. ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో జాతీయవాద బలూచ్ ఉద్యమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.బలూచ్ యక్జేతి సమితికి చెందిన నిరసనకారులు ర్యాలీలో పాక్ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పాక్ ఆర్మీ జవాన్ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ నాయకుడు మెహ్రంగ్ బలోచ్ తెలిపారు.నిరసనకారుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మెహ్రాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ‘ఈ రోజు మీరంతా పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ సందేశం ఇచ్చారు. మీ ఆందోళనల ముందు తుపాకులు, అధికారం విలువలేనివని అన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం ముందు నిరసనకారులపై దాడి చేసి, 12 మంది మహిళలు, 50 మందికి పైగా పురుషులను తమతో పాటు తీసుకుపోయి నిర్బంధించాయి. -
రషీద్ ఘటనపై వినుకొండ ప్రజలు ఫైర్
-
కూటమి పేరుతో మోసం.. చంద్రబాబుకు మాస్ వార్నింగ్
-
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
తల్లడిల్లిన జన హృదయాలు
సాక్షి, అమరావతి/గన్నవరం: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిసి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల హృదయం తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా సమాదరించే వందలాది మంది ఒకసారి తమ నేతను చూడాలని తాపత్రయపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడలోని సింగ్‌నగర్ వద్ద హత్యాయత్నం జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. అయినా ఇంటికి వెళ్లిపోకుండా కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద రాత్రి బస చేసిన ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను చూడాలని, పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచీ వస్తున్న జన ప్రవాహాన్ని పోలీసులు నిలువరించారు. గాయం తీవ్రత కారణంగా జగన్ ఎవరినీ కలిసే పరిస్థితుల్లో లేరని, ఈ ఒక్కరోజు ఆగితే బస్సుయాత్రలో మరలా ఆయన మీ ముందుకు వస్తారని నచ్చజెప్పి అందరినీ వెనక్కు పంపించారు. ‘జగనన్నా. నీకేం కాదన్నా. మేమంతా నీవెంటే ఉంటామన్నా. మీరు క్షేమంగా మా మధ్యకు రావాలన్నా. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నా’ అని నినాదాలు చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తూ వారంతా అక్కడి నుంచి తరలివెళ్లారు. బస ప్రాంతానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బస చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, విడదల రజని, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
చంద్రబాబు, లోకేష్ పై ఫైర్
-
విశేషాల సమాహారం.. రాష్ట్రపతి నిలయం
రసూల్‌పురా: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలు విశేషాలున్నాయి. చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతలూ ఉన్నాయి. ఇవన్నీ సందర్శకులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ కరపత్రాన్ని రూపొందించారు. మంగళవారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనాధికారిణి రజని ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 97 ఎకరాల్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం 20 రకాల ప్రత్యేక విశేషాలను తీర్చిదిద్దామని, ఇవి ఆద్యంతం సందర్శకులను ఆకట్టుకుంటాయని రజని పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరచి ఉంటుందని, విద్యార్థులకు ఉచిత ప్రవేశమని, 20 మంది గైడ్స్ అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో అడ్మిన్ అధికారి దులార్ మింగ్, అసిస్టెంట్ అడ్మిన్ అ«ధికారి రాజేష్ యాదవ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
-
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. "ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు. ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. -
కాంగ్రెస్ వారంటీ ముగిసిన పార్టీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోందని, అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీ స్కీంలంటూ మాయమాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలకు మూడు గ్యారంటీలు మాత్రం పక్కాగా ఉంటాయన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పోవుడు, మూడు గంటల కరెంట్ వాపస్ వచ్చుడు గ్యారంటీగా జరుగుతుందన్నారు. ఇక సంవత్సరానికి ఒక సీఎం చొప్పున ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు మారతారని పేర్కొన్నారు. సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు దిగుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆకాశం నుంచి పాతాళం దాకా ఏ టూ జెడ్ కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని అన్నారు. ‘ఓటుకు కోట్టు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇచ్చే హామీలకు గ్యారంటీ ఉందా?’అని ప్రశ్నించారు. అది వారంటీ అయిపోయిన పార్టీ అని, అలాంటి పార్టీ ఇచ్చే హామీకి విలువ ఉంటుందా? ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. తొలుత ఆయన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలోనూ పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అందరికీ అండగా ఉన్న మాది కుటుంబపాలనే.. ‘ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలనగా విమర్శిస్తున్నారు. బరాబర్ మాది కుటుంబ పాలనే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబ పెద్ద కేసీఆర్. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న సోదరుడు కేసీఆర్. 5 లక్షల మంది దళిత సోదరులకు దళితబంధు ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరే. ఇన్ని రకాలుగా అందరికీ అండగా నిలబడ్డ కేసీఆర్‌ది తప్పకుండా కుటుంబ పాలనే..’అని కేటీఆర్ అన్నారు. మోదీది గాడ్సే వారసత్వం ‘బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమని మరొకడు అంటున్నడు. మాది పక్కా వారసత్వ రాజకీయమే. రాణి రుద్రమదేవి రాజసత్వంలో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాది పక్కా కొమరంభీం, సర్వాయి పాపన్న, దళితజాతి వైతాళికుడు భాగ్యారెడ్డి వారసత్వం. బడుగు వర్గాలకు చేయూతనిచ్చేలా కులవృత్తులు, చేతి వృత్తులకు కొత్త ఊపిరినిచి్చన వారసత్వ ప్రభుత్వం మాది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీ సాంస్కృతిక వారసత్వం మాది. మాది గాంధీ వారసత్వం అయితే.. మాపై మాట్లాడుతున్న మోదీ గారిది గాం«దీని చంపిన గాడ్సే వారసత్వం..’అని మంత్రి ధ్వజమెత్తారు. ఈ ప్రధాని తొమ్మిదేళ్లలో చేసిందేముంది? ‘రాష్ట్రానికి వచి్చన ప్రధాని మోదీ చెప్పే అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. కేసీఆర్ రైతురుణ మాఫీ చేయలేదని, అందుకే రైతులు చనిపోయారంటూ ఒక ప్రధానిగా ఉండి అబద్ధాలు చెప్పొచ్చా? రెండుసార్లు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరే. తొమ్మిదేళ్లలో ఈ ప్రధాని దేశానికి చేసిందేముంది. ఆయన ప్రధాని అయినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను తిట్టారు. ఈరోజు సిలిండర్ ధర రూ.1,200కు చేరుకుంది. మోదీ పాలనలోనే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మోదీని చేతగానోడు అనాలా? సన్నాసి అనాలా? దద్దమ్మ అనాలా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ తీగలు పట్టుకుని చెక్ చేసుకోండి ‘రాష్ట్రంలో 24 గంటల కరెంటు చూపిస్తే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అనుమానం ఉంటే మేమే బస్సు పెడతాం. చెక్ చేసుకునేందుకు రావాలి. వెంకట్‌రెడ్డి, రేవంత్, కాంగ్రెస్ నేతలందరూ రావాలి. ఏ సమయంలో, ఏ ఊరికి వెళతారో వెళ్లి అందరూ కరెంటు తీగలు పట్టుకొని నిలబడితే తెలుస్తుంది. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే ఉందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని తెస్తే.. కేటీఆర్ ప్రపంచానికి తెలంగాణ అంటే ఏమిటో తెలియజేశారన్నారు. ఒక్క చెయ్యోడని అవమానించారు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు నన్ను అవమానించారు. ఒక్క చెయ్యోడు ఏం చేస్తాడని అన్నారు. నాకు ఒక్క చెయ్యి మాత్రమే ఉన్నా.. మీ చేతులు నాకు తోడయ్యాయి.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకుడిని చిత్తుగా ఓడించారు..’అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆయన్ను ఓదార్చారు. -
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
ఇకనుండి తిరుపతి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు
-
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
-
రేపు ప్రారంభంకానున్న శ్రీ టెక్‌టెక్స్ ఐపీవో - ధరల శ్రేణి ఇలా..
న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్‌టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్‌కానున్నాయి. ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్ఒవెన్ ఫ్యాబ్రిక్‌ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది. -
జగనన్న సురక్ష: గంటల వ్యవధిలోనే మోక్షం.. 11రకాల సేవలు ఉచితం
-
తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరగాల్సిన సభను రద్దు చేశారు. ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
రైలులో ప్రయాణిస్తున్నారా? దయచేసి ఇలా చేయకండి!
-
ఇంటి తలుపు కొట్టి మరీ మా సమస్యలు తీరుస్తున్నారు
-
పబ్లిక్ కి లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ పంచిన పోలీసులు
-
అర్జంట్‌గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్‌రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్‌మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్‌షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్‌లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
పులివెందులలో భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
-
మల్లరెడ్డి డైలాగ్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
-
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే మా భవిష్యత్తు అంటున్నారు జనాలు.. పేద ప్రజల బతుకులకు ఒక భరోసా ఇచ్చి.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేపి మరి పింఛను ఇస్తున్నారు. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. మా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ వృద్ధులు దీవిస్తున్నారు. చదవండి: జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..? -
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
-
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్‌గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్‌లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్) -
ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో ముగిసిన సీఎం భేటీ
-
అభివృద్ధి పథంలో ఏపీ..
-
కందుకూరు ఘటనపై స్థానికుల ఆగ్రహం
-
మాకొద్దీ అమరరాజా.. వ్యతిరేకంగా నిరసనలు
-
రాష్ట్ర నలుమూలల నుంచి మహాసభకు హాజరవుతున్న బీసీలు
-
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
సముద్రఖని ఇన్ పబ్లిక్ ఫస్ట్ లుక్ చూశారా?
దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సముద్రఖనియిన్ పబ్లిక్'. నటుడు కాళి వెంకట్, నటి రిత్విక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్.పరమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేకేఆర్ సినిమాస్ పతాకంపై కేకే రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాజేష్ యాదవ్, వెట్రిల ద్వయం ఛాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విజయ్‌సేతుపతి, దర్శకుడు వెంకట్ ప్రభు ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. కానీ తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ పార్టీల కార్యకర్తల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. -
హైటెన్షన్ పోల్ ఎక్కిన స్థానికులు..
-
తిరుమలగిరిలో హైటెన్షన్... కరెంటు స్తంభం ఎక్కిన స్థానికులు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారని స్థానికులు ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. వీరిలో లక్ష్మణ్, రాములమ్మ, రాజు, మహేష్, శంకరమ్మ స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమకు కేటాయించిన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు హమీ ఇవ్వడంతో స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
మహిళ కళ్లల్లో కారం చల్లి..
-
జనానికి వాక్సిన్ అంటే భయం ఎందుకు ??
-
ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..
ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విజయవాడలోని పటమట రైతుబజార్ కిటకిటలాడుతోంది. 20 దుకాణాలను పరిశీలించగా కేవలం 5 దుకాణాల యజమానులు మాత్రమే మాస్క్ ధరించారు. అలాగే.. ఓ దుకాణానికి 10 మంది వినియోగదారులు వచ్చారు. వీరిలో నలుగురు మాస్క్ ధరించలేదు. ఇద్దరు మాస్క్‌ను గడ్డం కిందకు పెట్టుకున్నారు. కేవలం నలుగురే ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకున్నారు. ఇక ఈ పది మందిలో ఒక్కరే చేతులు శానిటైజ్ చేసుకున్నారు. సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపట్ల రాష్ట్రంలో ప్రజలు ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు? నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు? అని ‘సాక్షి’ వివిధ ప్రాంతాల్లో ఆదివారం పరిశీలిస్తే అక్కడ పరిస్థితులు ఇలా కనిపించాయి.. ►విజయవాడలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో గంట వ్యవధిలో 67 మంది ప్రవేశించారు. వీరిలో 15 మంది ప్రవేశద్వారం దగ్గరకు రాక ముందు నుంచి మాస్క్‌తో ఉన్నారు. 31 మంది అక్కడకు వచ్చాక జేబులోని మాస్క్ తీసి ధరించారు. లోపలికి వెళ్లాక వీరు మాస్క్‌ను తిరిగి జేబుల్లో పెట్టుకోగా, మరికొందరు గడ్డం కిందకు లాగేసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా లోనికి ప్రవేశించడానికి వీల్లేదని 21మందిని సెక్యూరిటీ సిబ్బంది వారించారు. దీంతో ఐదుగురు అమ్మాయిలు చున్నీని, 11 మంది అబ్బాయిలు రుమాలును ముఖానికి కట్టుకుని లోపలికి వెళ్లారు. ఐదుగురు అప్పటికప్పుడు మాస్క్‌లు కొని వెళ్లారు. ►విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, విజయవాడ సహా పలు నగరాల్లో విద్యావంతులు మాస్క్ లేనిదే బయటికి రావడంలేదు. ►పోలీసుల తనిఖీల్లో మాస్క్‌లు ధరించకుంటే రుసుములు విధిస్తున్నారని.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతించరనే కారణంతో కొందరు ఆ కాసేపటికి మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు. ►పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాస్క్ వాడకాన్ని మెజారిటీ శాతం తగ్గించేశారు. చాలామంది ఆటోల్లో, ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించడమే మానేశారు. ►గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట, తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, అమలాపురం, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైనప్పటికీ ఇప్పుడు అక్కడి ప్రజలు సైతం కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారు ఇలా అంటున్నారు.. ►రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు చాలావరకు తగ్గింది. దీంతో వైరస్ ప్రభావం పెద్దగాలేదు కదా.. ►రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాంగా.. ►మాస్క్‌తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సమూహానికి దూరంగా ఉన్నప్పుడు మాస్క్ ఎందుకింక.. మాస్క్‌ల వాడకం 80–90 శాతం తగ్గింది లాక్డౌన్ రోజులతో పోలిస్తే విద్యా, వ్యాపార, వాణిజ్య ఇతర కార్యకలాపాలు బాగా పెరిగాయి. ప్రజల దృష్టి కరోనా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం బాగా తగ్గించారు. నగరాల్లో ప్రతి 10 మందిలో 5–6 మంది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2–3 మంది మాత్రమే మాస్క్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన జూలై నెలతో పోలిస్తే మాస్కుల వినియోగం 80–90 శాతం తగ్గిందని అంచనా. మాస్క్ ధరించే విధానం చాలా ముఖ్యం వైరస్ వ్యాప్తిని మాస్క్ ద్వారా అడ్డుకోవచ్చు. మాస్క్ పెట్టుకున్న వ్యక్తుల్లోకి వైరస్ ప్రవేశించినా తక్కువ లోడ్ మాత్రమే వెళ్తుŠంది. చాలామంది మొక్కుబడిగా పెట్టుకుంటున్నారు. నోరు, ముక్కు రెండూ పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తేనే రక్షణగా ఉంటుంది. టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావంలేదని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి.. వారూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. – డాక్టర్ హైమావతి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు తప్పనిసరి అయితేనే గర్భిణులు బయటకు వెళ్లాలి గర్భిణులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెండో దశలో వైరస్ బారినపడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ వ్యక్తుల్లా గర్భిణుల ఊపిరితిత్తుల పనితీరు ఉండదు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభావతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ -
చనిపోయిన ప్రియుడికి కోపం తెప్పించిన ప్రియురాలు.. దెయ్యమై..
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్ఫర్డ్ షైర్‌కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు. ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్‌లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్ను వాలెంటైన్స్గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది. తన ప్రియుడికి కెండిల్స్ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
మీ ప్రతాపం ప్రజల మీద చూపిస్తారా?
-
CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు
ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’ (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్ గ్రేట్’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సాక్షి, చెన్నై(తమిళనాడు): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు. ‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. చదవండి: ‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’ M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE — J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021 -
కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులా..?
సాక్షి, చెన్నై: కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులు జరపడం భావ్యం కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూత్తుకుడిలో స్టెరిలైట్‌పరిశ్రమకు వ్యతిరేకంగా 2018లో జరిగిన ఉద్యమ ర్యాలీ తుపాకీ కాల్పులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ వ్యవహారం సీబీఐ విచారణలో ఉంది. మానవ హక్కుల కమిషన్‌తో పాటుగా గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిషన్ సైతం ఈ ఘటనపై దర్యాప్తు చేశాయి. అదే సమయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, మానవ హక్కుల సంఘాల విచారణకు అడ్డంకులు, నివేదికలు తదితర వ్యవహారాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. సోమవారం ఇవి విచారణకు రాగా, ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్రంగానే స్పందించింది. కార్పొరేట్ సంస్థల కోసం ప్రజల మీద కాల్పులా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భావ్యం కాదు అని, ప్రభుత్వాలపై కార్పొరేట్ సంస్థలు ఆధిక్యాన్ని ప్రదర్శించ కూడదని పేర్కొంటూ, ఈ కాల్పుల్ని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి నష్ట పరిహారం పెంపు మీద దృష్టి పెట్టాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. దివ్యాంగుల కోసం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కలి్పంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజే సంజీబ్ బెనర్జీ బెంచ్ విచారించింది. వాదనల అనంతరం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు తప్పనిసరి అని ప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే 54శాతం మేరకు ఏర్పాట్లు జరిగాయని, ఏడాదిలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. లుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గుంతలు: ప్రాణాలు పోతేనే.. పట్టించుకుంటారా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్ల వెంట భారీగా గుంతలు తవ్వుతున్నారు. పైపులైన్లు వేయడంలో ఆలస్యం కావడం.. గుంతల వద్ద కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం వరంగల్ హెడ్ ఫోస్టాఫీస్ సమీపంలోని ఓ వృద్ధుడు అదుపు తప్పి డ్రెయినేజీలో పడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకన్న, షబ్బీర్‌లు వెంటనే స్థానికుల సహకారంతో బయటకు తీశారు. ఇలా వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి చౌరస్తా వరకు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా.. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒక బస్సు..రెండింతలజనం, కొండగట్టును మరిచారా?
సాక్షి, హైదరాబాద్: సోమవారం.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. మంగళవారం 68 శాతంగా రికార్డయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత బస్సులు మళ్లీ కళకళలాడుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో జనం ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. బస్టాండ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం, సాయం త్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటు లో ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెచ్చినా చాలటం లేదు. గత్యంతరం లేక డిపోల్లో మూలకు చేరిన డొక్కు బస్సులను అప్పటికప్పుడు మరమ్మతులు చేయించి వాడుకోవాల్సి వస్తోంది. వీటిల్లో కొన్ని మధ్యలోనే మొరాయిస్తుండటంతో సిబ్బంది, ప్రయాణికులు నెట్టాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అవి కూడా సరిపోక, ఒక్కో బస్సులో రెండు బస్సులకు సరిపడా ప్రయాణికులను కుక్కి పంపుతున్నారు. అధికారులు డిపోల్లో నిలబడి మరీ బస్సుల్లోకి జనాన్ని ఎక్కిస్తున్నారు. ఎందుకీ పరిస్థితి....? ఆర్టీసీకి సొంతంగా 6,370 బస్సులున్నాయి. నిధులు లేక చాలాకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. ఏటా 400 బస్సులు తుక్కుగా మారుతుంటాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. కానీ కొన్నేళ్లుగా కొత్త బస్సుల్లేక ఆర్టీసీ సొంత బస్సులు తగ్గిపోయాయి. దీంతో నిబంధనలను సడలించి మరీ అద్దె బస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 3,170 బస్సులు అద్దె ప్రాతిపదికనే నడుస్తున్నాయి. అయితే అసలే నష్టాలు, ఆపై కోవిడ్ కష్టాలతో అద్దె బస్సు నిర్వాహకులకు రూ.100 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. లాక్డౌన్ తర్వాత అద్దె బస్సుల వాడకాన్ని ఆర్టీసీ నిలిపేయడంతో.. 3,170 బస్సులు అందుబాటులో లేక ఇప్పుడీ కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో సొంత నిధులు లేకపోవటం, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా బ్యాంకు రుణాలు చేతికందకపోవటం, ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీతాలకే వాడేస్తుండటం వల్ల అద్దె బస్సుల వినియోగానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. కొండగట్టును మరిచారా? 2018లో 102 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టు వద్ద బ్రేకులు ఫెయిలై దొర్లిపడిపోయి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. అది ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపటంతో.. ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. ఇప్పుడు స్వయంగా ఆర్టీసీ అధికారులే దాన్ని ఉల్లంఘించి దగ్గరుండి మరీ ఎక్కువ మందిని బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. ‘ప్రస్తుతం మాకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. అద్దె యజమానులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని వీలైనంత త్వరగా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
Telangana: రద్దీ ఎప్పటిలాగే..
సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. వ్యాపారులకు ఊరట లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. భౌతికదూరం మరిచారు ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
కరీంనగర్లో నైట్ కర్ఫ్యూ.. సహకరిస్తున్న ప్రజలు
-
అభివృద్ధిలో ప్రజా కోణం ఏది?
దేశానికి, ఆయా రాష్ట్రాలకు ఏ మోడల్ అవసరం అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అభివృద్ధి అంటే ఏమిటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి అవుతుందా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగితే అభివృద్ధి అవుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందని సంతోషపడ్డారు. బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల విలువ బాగా పెరిగిన మాట నిజం. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాంతాలలో గజం లక్ష నుంచి రెండు లక్షల వరకు ధర పలుకుతుంది. అదే సమయంలో లక్షలాది మంది ఇళ్లు లేక, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కాని స్థలాభావం కారణంగా ఆశించిన రీతిలో వాటిని ప్రభుత్వం నిర్మించలేక పోతోంది. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఆ ప్రభావం కూడా పడి టీఆర్ఎస్కు నష్టం జరిగింది. తాజాగా కేసీఆర్ తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చని చెబుతున్నారు. గతంలో ఇది రివర్స్‌లో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నడూ కేసీఆర్‌ను కానీ, టీఆర్ఎస్ నేతలను కానీ విమర్శించలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నేతల స్వరంలో ఎందుకు మార్పు వచ్చిం దన్నది ఆసక్తికర అంశమే అవుతుంది. అభివృద్ధిలో మార్గాలు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం నవరత్నాల హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. పలువురు రెండు రాష్ట్రాల మధ్య పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అది కేసీఆర్‌కు కాస్త చికాకుగా ఉంటోంది. ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ఇక్కడ కార్మికులు కోరారు. కేసీఆర్ ఒప్పుకోలేదు. కాని ఏపీలో మాత్రం జగన్ చేసి చూపించారు. కేసీఆర్ కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు వంటి ప«థకం గత ఎన్నికలలో బాగా ఉపయోగపడింది. అలాగే జగన్ కూడా రైతు భరోసాతో పాటు అమ్మ ఒడి, చేయూత, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు ఇంటివద్దకు తీసుకు వెళ్లి ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో అమరావతిలోనే మొత్తం డబ్బు అంతా ఖర్చు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి రాజకీయంగా దెబ్బతిన్నారు. అయితే అమరావతి ముప్పై గ్రామాల పరిధిలో రాజధాని గ్రామాలలో అక్కడ అభివృద్ధి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఆ 30 గ్రామాలు దాటి విజయవాడ వైపుకాని, గుంటూరు వైపు కాని భూముల ధరలు ఆ రోజుల్లోనే తగ్గిపోయాయి. దానికి తోడు రాజధాని గ్రామాలలో మినహా గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పొలాలను, స్థలాలను గ్రీన్ జోన్ కింద ప్రకటించడంతో అసలు కొనేవాడు లేకపోయాడు. అప్పటి నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందన్నది వాస్తవం. కాని కేసీఆర్ ప్రకటన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎంతో సంతోషం కలిగించింది. జగన్‌ను విమర్శించడానికి ఆయన ఈ పాయింట్ వాడుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి మూడు రాజధానుల విధానం ప్రతిపాదించారు. దాంతో అమరావతి ప్రాంతంలో రేట్లు కొంతమేర తగ్గాయి. కాని అదే సమయంలో విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాలలో భూముల రేట్లు బాగా పెరిగాయి. విశాఖపట్నంలో అయితే ఎకరా భూమి వెల 107 కోట్ల రూపాయల వరకు ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా భూముల ధరలు పెరిగాయి. పేదలకు వసతుల కల్పనే అసలు అభివృద్ధి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేసీఆర్ పనిగట్టుకుని ఏపీని తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న నేపథ్యం ఏమైనా ఈ వ్యాఖ్యల వెనుక ఉందా? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం వస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. భవిష్యత్తులో ఆమె ప్రకటించే విధానాలు, ఆమె యాత్రలలో వచ్చే స్పందనను బట్టి రాజ కీయం సాగుతుంది. ఆమె కూడా రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కూడా వైఎస్ అభిమానులు గణనీయంగానే ఉన్నారు. ఒకవేళ షర్మిల పార్టీ వారిని ఆకర్షించితే టీఆర్ఎస్కు కూడా కొంత నష్టం జరగవచ్చు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రమేయం లేకపోయినా, టీఆర్ఎస్కు ఈ పరిణామం నచ్చలేదేమోననిపిస్తుంది. షర్మిలతో టీఆర్ఎస్ నేతలే పార్టీ పెట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తుంటే, బీజేపీ చొరవతోనే ఆమె పార్టీ విషయంలో ముందుకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో మూడేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలలో వైఎస్ ప్రభావం తగ్గించడానికిగాను కేసీఆర్ రియల్ ఎస్టేట్ కామెంట్లు చేశారా అన్న అనుమానం వస్తోంది. అలాగే కేటీఆర్ ఆశ్చర్యకరంగా చంద్రబాబును పొగుడుతూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. దళితులకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఎంతమేర నెరవేర్చారో టీఆర్ఎస్ నేతలు చెప్పవలసి ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ముప్పై లక్షల మందికి సెంటు నుంచి సెంటున్నర వరకు పేదలకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఆ పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధిగా పరిగణించరా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల భావనకు తొలుత ప్రాముఖ్యత వచ్చినా, ఆశించిన రీతిలో వాటి నిర్మాణం జరగలేదు. అది కొంత ఆయనకు మైనస్ అయింది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేసీఆర్ తెలివిగా రియల్ ఎస్టేట్ పెరిగిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ముఖ్యం రియల్ ఎస్టేట్ అన్నది ఆయా పరిస్థితులను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. హైదరాబాద్ పలుమార్లు ఆటుపోట్లు ఎదుర్కొంది. హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలకు ఏపీలో మాదిరి ఇక్కడ ప్రభుత్వం స్థలాలు ఇవ్వగలదా? అన్నదానికి సమాధానం దొరకదు. ఏపీలో గతంలో మాదిరి స్పెక్యులేషన్ ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలంగాణలో కన్నా ఏపీలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. కేసీఆర్ మాటలు మోతుబరులకు అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంటే, ఏపీలో మాత్రం పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల మంది పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధి కాదా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మాస్క్‌పై ఏపీ పోలీసు స్పెషల్ డ్రైవ్
-
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
‘మందు’ బంద్‌కు వేళాయె!
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో ఉన్న వైన్స్‌షాపుల ఎదుట బుధవారం వినియోగదారులు మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల నింబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో రెండు రోజులు వైన్స్‌లో మద్యం విక్రయాలు బంద్ కావటంతో వినియోగదారులు మద్యం కోనుగోలుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. -
ఓల్లు నారాజ్ కావొద్దని..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఏంరా... రాజు ఎటు పోతున్నవ్ అసలే కనిపిత్తలేవ్... ఏంలేదు నర్సన్న రోజు ఎలచ్చన్ల పెచారంకు బోతున్న గందుకే నీకు కనిపిత్తలేను... గట్లనా మరి గదే రోజు పొద్దుగాల్ల కసీర్కాడ ఉన్న హోటల్‌కు అచ్చి చాయి తాగుతుంటివి.. మూడు నాలుగు రోజుల నుంచి సూత్తున్న కనిపిత్తలేవని అడుగుతున్న. అవు నర్సన్న మస్కట్ బోయేటందుకు విజాకు అప్లికేషన్ పెట్టిన గని ఇంకా మస్తు టైం ఉంది. గందుకే ఉట్టిగా ఇంటికాడ ఉంటే యాష్ట అత్తది. పెచారంకు బోతే పైసలత్తున్నయి. ఇంత బిర్యాని బువ్వ బెడుతుండ్రు... గందుకే పెచారంకు బోతున్న. అగో రోజు మస్తు మజా సేత్తున్నవ్ అన్నట్లు గదరా రాజు.. అవు నర్సన్న మరేంజేస్తం... ఎలచ్చన్లు అయిపోయేదాంకా పెచారంల తిరుగుతున్న.. అవు మల్ల మరి ఏ పార్టీల్లోకు పెచారంకు బోతున్నవ్ రాజు. ఏం లేదు నర్సన్న ఓల్లు ఒక రోజు ముందు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్న. అగో గట్ల గిదేం తరీకర బై రాజు.. ఇగో నర్సన్న ఓల్లయిన గంతే పైసలిత్తుండ్రు. అందరి లెక్కనే బిర్యాని బువ్వ బెడుతుండ్రు. గందుకే ముందు ఓల్లు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్నం. గట్ల గాదురా రాజు. ఏదన్న ఒక పార్టీకే పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏమన్నా మంచిదావురా. ఇగో నర్సన్న.. గిప్పుడు గిట్లనే సెయ్యాలే.. ఏంటికంటే.. ఓల్లయిన ఉట్టిగనే తోల్కపోతలే. అందరు పైసలు, బిర్యాని బువ్వ పెట్టుడు కామన్ జేసిండ్రు. గందుకే ఒక రోజు ముందు సెప్పినోల్లకు పెచారంకు బోతున్నం. మల్ల పొద్దుమీక్కి మా ఇంటికచ్చి పెచారంకు రమ్మని సెప్పినోల్లకు తెల్లారి ఆల్లకు బోతున్నం. ఇగో రాజు నేను అన్నది నీకర్థం గాలే.. నేను సెప్పిదే ఏంటిదంటే ఏదన్న ఒక పార్టీకి పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏం మంచిగలేదు. ఏదన్న ఒక పార్టీతోనే ఉండాలే అని సెప్పుతున్న. గది కరెక్టె గని నర్సన్న. మనకు ఎప్పుడు ఓల్లతోని పని బడ్తదో తెల్వదాయే. గందుకే ఏ పార్టీవోల్లు సెప్పినా పెచారంకు బోయి అత్తున్న. అంటే ఒక పాల్టీలనే తిరగవ్ అన్నట్లు గదరా రాజు. అవ్మల్ల. నర్సన్న ఒక పార్టీలనే దిరిగితే మిగిలిన పార్టీలోల్లతోని లొల్లి. గందుకే ఓల్లను కూడా నారాజ్ సేయకుండా అన్ని పార్టీవోల్లకు బోయి పెచారం సేసి అత్తున్నం. గట్లనే ఏ పార్టీవోల్లతోని బోతే ఆల్ల కండువ గప్పుకుంటున్నం నర్సన్న. అవ్రా రాజు నువ్వు సెప్పింది మస్తుగున్నది. నీ లెక్కనే రాజకీయం చెయ్యాల. మంచి పిలాన్ సేసినవ్. ఓల్లు కూడా నారాజ్ కాకుండా అందరి తాన్కి బోతున్నవ్. ఓల్లు పైసలిత్తే ఆల్లయి తీసుకుంటున్నవ్. మంచి పని జేసినవ్. పోతరా మస్తు లేట్ అయ్యింది పని బాగుంది అని ఆడికెల్లి ఇద్దరు ఎల్లిపోయిండ్రు.. -
‘పల్లె వెలుగులు’ ఏవీ?
సాక్షి, అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు పల్లెలకు కాకుండా పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లె ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు మండలం నుంచి ప్రజలు, విద్యార్థులు మోత్కూర్, నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్, తిరుమలగిరి, సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వరంగల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సరియైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల కోసం పడిగాపులు కాస్తుంటారు. లేదంటే కాలినడకనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలంలో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. గ్రామాల స్టేజీల నుంచి గ్రామంలోకి వర్షంలోనే నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. ఆటోలే శరణ్యం.. గ్రామాలు బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు, రవాణా సౌకర్యం ఉండాలి. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రవాణా వ్యవస్థనే. కానీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం వల్ల మండలంలోని చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను నమ్ముకుని ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం నాలుగు గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. చౌళ్లరామారం, అడ్డగూడూరు, ధర్మారం, చిర్రగూడూర్, కంచనపల్లి, బొడ్డుగూడెం, కోటమర్తి, డి.రేపాక మంగమ్మగూడెం, గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామాల స్టేజీలవద్ద గ్రామం పేరు తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీవారు స్పందించి గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలి. – తుప్పతి మధు, అడ్డగూడూరు -
ప్రజల కోసమే పోలీసులు
భీమారం : పోలీసులు పనిచేసేది ప్రజల కోసమేనని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బోయగూడెంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో స్థానిక కుటుంబాలతో బుధవారం ఆయన మాట్లాడారు. 411 సర్వే నెంబర్లో 19 గుంటల భూమిని ప్రభుత్వం పీఎస్‌కు కేటాయించిందన్నారు. దీనిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సుపారిపాలన కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన భీమారాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటేనే ఆ కార్యాలయాలకు కళ వస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జంబి పూజలు, మరోవైపు బతుకమ్మ ఆడుకుంటారని, ఇందుకోసమే అడ్డుకుంటున్నామని స్థానికులు తెలిపారు. వాటి కోసం మరోచోట స్థలం చూపించి ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బతుకమ్మ, జంబి చెట్టు కు కేటాయిస్తామని ఏసీపీ హామీఇచ్చారు. చెన్నూరు సీఐ కిశోర్, ఎస్సై మంగీలాల్ æరాజ్‌కుమార్‌నాయక్, ఎంపీపీ మెండె హేమలత, సర్పంచ్ ఎల్కటూరి శంకరమ్మ తదితరులు ఉన్నారు. ఆరెపల్లిలో కార్డెన్‌సెర్చ్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జైపూర్ ఏసీపీ సీతారాములు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వాహనపత్రాలు లేని 10 ద్విక్ర వాహనాలతోపాటు టాటా ఏసీ, 9 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీ చేశారు. చెన్నూరు సీఐ కిశోర్, భీమారం ఎస్సై మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్సై రవిప్రసాద్, ఏఎస్సైలు గంగన్న, నజీర్ ఉన్నారు. -
‘నివేదన’కు స్పందించండి
గద్వాల అర్బన్ : గ్రామీణులు దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రాయాలకోర్చి ‘ప్రజావాణి’కి రావద్దనే ఉద్దేశంతోనే నివేదన యాప్ రూపొందిం చా మని జాయింట్ కలెక్టర్ సంగీత తెలి పారు. వీలైనంత వరకు దీని ద్వారా నే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి 52 ఫిర్యాదులు అందా యి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. నివేదన యాప్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు 13 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 అర్జీలు అందాయి. గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరు, వడ్డేపల్లి, ఇటిక్యాల, అయిజ మండలాల ప్రజలు ఎస్పీ విజయ్‌కుమార్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదు కట్టెల మిషన్‌లో పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చేతివేళ్ల సరిగా పని చేయడం లేదు. దీంతో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వడం లేదు. ఎలాగైనా అందేలా చూడాలి. – పద్మ, వెంకటస్వామి దంపతులు, వడ్డెవీధి, గద్వాల ‘కల్యాణలక్ష్మి’ వర్తింపజేయాలి నా కూతురు కళావతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వివిధ కారణాలతో మండల అధికారులు ఇంతవరకు ఆమోదించడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం డబ్బులు వచ్చేలా చూడాలి. – మునెమ్మ, చెనుగోనిపల్లి, గద్వాల మండలం -
‘ఛీఛీ’ రోడ్లు..!
పెంట్లవెల్లి : మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ గ్రామాల్లో సీసీరోడ్లు మాత్రం ఇప్పటికీ వేయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికాలనీలో సీసీరోడ్లు వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వేయలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడిప్పుడంటూ కాలయాపన సీసీరోడ్లు నిర్మిస్తే ప్రయాణికులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తొలగుతాయని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరితే మంజూరవుతాయి.. అప్పుడిప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో ఎన్నో హామీలిస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా చోట్ల న్యాయం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీసీరోడ్లు నిర్మించండి మాధవస్వామినగర్‌లో సీసీరోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రివేళ మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్, అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మించేలా చూడాలి. – రాజేందర్, మాధవస్వామినగర్ ఏళ్లు గడుస్తున్నా.. మల్లేశ్వరం గ్రామంలో ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన నాయకులు ప్రస్తుతం అడిగితే మాట మారుస్తున్నారు. ఇప్పటికైనా మా కాలనీల్లో సీసీ రోడ్ల కల నెరవేర్చాలి. – కుర్మయ్య, మల్లేశ్వరం -
నిఘా నేత్రం.. కట్టుదిట్టం
అలంపూర్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే అలంపూర్ స్టేషన్ పరిధిలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో వారు సీసీల కెమరాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని ప్రజలనుంచి ప్రశంసలు వస్తున్నాయని, శాంతి భద్రతల విషయంలో అందరికీ ఒకేగాడిన పెడుతున్నామన్నారు. ఇకపై నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. నివేదన యాప్ జిల్లా ప్రజల కోసమే తీసుకొచ్చామని, ఏ సమస్య అయినా క్లిప్పింగ్‌లు, ఫొటోలు పంపిస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవాసమితి కార్యదర్శి వెంకట్రామయ్య శెట్టి ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్, ఎస్పీలను మెమోంటోలతో గౌరవించారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, డీఆర్వో వేణుగోపాల్‌రావు, సీఐ రజిత, ఎస్ఐ వాసా ప్రవీన్‌కుమార్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికా బద్ధ్దంగా చదివితేనే ఉత్తమ గ్రేడ్ గద్వాల అర్బన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర, ఆనంద నిలయంలో కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు, తివాచీలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే ఆందోళనకు గురికావద్దని, ఏకాగ్రతతో చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టని, తల్లిదండ్రుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు. వార్డెన్లు కూడా టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం నాణ్యతతో భోజనం పెట్టించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల అధికారి రాములు పాల్గొన్నారు. సమగ్ర నివేదిక తయారుచేయాలి : జోషి సాక్షి, గద్వాల: సమగ్ర భూ సర్వే అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున జిల్లాలో ఖాతానెంబర్లు, ఫొటోలు, ఆధార్‌కార్డు నెంబర్లు అన్నీ సరిపోయేటట్లు సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. మార్చిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసేవరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు కంప్యూటరీకరించి పంపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రత్యేక కలెక్టర్ కరుణ, సంయుక్త కలెక్టర్ సంగీత పాల్గొన్నారు. దళారుల ఆటలు కట్టించండి : పార్థసారధి గద్వాల అర్బన్: కంది పంట రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎఫ్‌సీఐ, హాకా సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంటే దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీఏడీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం కందులకు రూ.5,450 మద్దతు ధర కల్పిస్తోందని, దళారులు గోదాముల్లో నిల్వ ఉంచిన కందులు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలతో అమ్ముతున్నట్లు తెలిసిందని, తక్షణమే దాడులు నిర్వహించి వారి ఆట కట్టించాలని ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌సైని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.5లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి కాగా దాదాపు 50శాతం కందులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వీసీలో జిల్లా సంయుక్త కలెక్టర్ సంగీత, మార్కెట్ శాఖ అధికారిణి పుష్పలత, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్ పాల్గొన్నారు. -
ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు : మంత్రి
సాక్షి, నల్గొండ: సుపరిపాలన ప్రజల చెంతకు చేరాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా ఘట్టుప్పల్‌లో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘట్టుప్పల్‌ను కొత్త మండలం చేయాలనే డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, అలాగే గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఘట్టుప్పల్ మండల సాధన కోసం ఆత్మహత్యయత్నం చేసి తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఘట్టుప్పల్ మండల సాధనలో భాగంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు -
జనం మెచ్చేలా పనిచేస్తాం: డీజీపీ
సాక్షి, మహబూబాబాద్ : ప్రజలు మెచ్చుకునేలా తెలంగాణ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ గురువారం మహబూబాబాద్, వరంగల్ అర్భన్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. పోలీసుల పనితీరుతో రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పౌరులకు ఒకే విధానం పాటిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పనితీరు బాగుందని ప్రశంసించారు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన డీజీపీ హన్మకొండ మోడల్ పోలీస్ స్టేషన్‌ను, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం నీట్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. -
మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ ఫలితాలు మోదీ నాయకత్వంలో పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గుజరాత్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు. గుజరాత్లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి జిమ్మిక్కులు పనిచేయలేదని లక్ష్మణ్ అన్నారు. గుజరాత్లో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, గుజరాత్ తరహా పాలన దేశమంతటా వ్యాపిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్దనోట్లపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
మావోలతో జతకడితే ఖబర్దార్
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టులు, అనుబంధ సంఘలతో సంబంధాలు నేరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రాంత ప్రజలను డీజీపీ హెచ్చరించారు. ఆదివాసీలు-లంబాడాల గొడవల నేపధ్యంలో మావోలు అదనుగా తీసుకునే అవకాశం ఉందని ఆయన పోలీసులను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఉట్నూరులో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, లంబాడీ - ఆదివాసీల వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీఐజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జనజీవనం, విద్యార్థుల చదువుకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు మహేందర్‌రెడ్డి సూచించారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తెలుత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా అక్కడి పరిస్థితి ఉంది. కాగా... ఘర్షణలను ముందే పసిగట్టలేకపోవడం, వాటిని అదుపు చేయలేకపోయారన్న కారణంతో మూడు జిల్లాల కలెక్టర్లు, ఓ డీఐజీని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఘర్షణలను అరికట్టలేకపోయారన్న అపవాదును పోలీస్ శాఖ మూటకట్టుకున్న నేపధ్యంలో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ఏం చేశావని ఓటేయాలి బాబూ?
సోషల్ మీడియా వేదికగా అధికార పక్షాన్ని నిలదీస్తున్న నెటిజన్లు - విచ్చలవిడి హామీలే తప్ప అమలు ఏది? - ఇప్పుడు మళ్లీ నంద్యాల ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంపై మండిపాటు - ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటివరకు ఒక్క హామీ అమలు చేయకపోగా.. ఇప్పుడు నంద్యాలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ అధికారపార్టీ చేస్తున్న వాగ్ధానాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటు వేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ వైఫల్యాలు, హామీల మోసాలు, మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న పోస్టులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు, పుష్కరాలు, పట్టిసీమ పేరుతో విచ్చలవిడి దోపిడీ, సదావర్తి భూముల వ్యవహారం, మహిళలపై దాడులు, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న తీరు, కాల్‌మనీ కేసులు, ఇసుక మాఫియాను దగ్గరుండి ప్రోత్సహిస్తుండడం దగ్గరనుంచి... అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఉదంతం, ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాల్సిందేనంటూ ఎన్నికల్లో చెప్పి.. ప్యాకేజీకి అమ్ముడుపోయిన తీరుపై అనేక ఆలోచింపజేసే పోస్టులు పెడుతూ ఎందుకు టీడీపీకి ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చిన క్రమం.. భూమా నాగిరెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులు, నంద్యాల్లో రోడ్ల వెడల్పుకు నిధులు కావాలంటూ రెండేళ్ల కిందట శిల్పా మోహన్‌రెడ్డి అభ్యర్థిస్తే.. ఎక్కడున్నాయి నిధులు, నువ్వు ఇస్తావా అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడిన ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో హడావుడిగా ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లను కూలదోయడం.. నామమాత్రపు నష్టపరిహారాన్ని ఇస్తామంటూ మభ్యపెట్టడంపై మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు కొన్ని.. ► ఓట్లు వేయలేదని మూడేళ్ల పాటు రాయలసీమకు కనీసం ఎంగిలి చేతులు కూడా విదిల్చకపోగా.. ఓటేస్తేనే మీకేదైనా చేస్తాను. నాకు ఓట్లేయకుంటే రోడ్లమీద తిరగొద్దు.. పింఛన్లు, రేషన్ తీసుకోవద్దు అని బెదిరిస్తున్న వారిని నమ్ముదామా?.. నాయకత్వం కంటే ప్రజలే ముఖ్యం అని నినదించే వాడి పక్షాన నిలబడదామా..? ► విపక్షం గెలిచినా నా ప్రమేయం లేకుండా అభివృద్ధి జరగనివ్వను అనే వాళ్లను విశ్వసిద్ధామా?.. అధికారం ఉన్నా లేకపోయినా శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తామనే వాళ్లకు ఓటేద్దామా? ► కోట్లు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కనీసం రాజీనామా చేయమనే ధైర్యం లేని వాళ్లకు ఓటేద్దామా?.. విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ ఒక పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీలో చేర్చుకున్న వ్యక్తికి ఓటేద్దామా? ► ‘‘టీడీపీకి ఎందుకు ఓటేయ్యాలి?.. ఒక మంత్రి పదవి కూడా ఇవ్వనందుకు ముస్లిమ్స్ టీడీపీ కి ఓటు వేయాలా? ► బ్రాహ్మణులకు ఒక మంత్రి పదవీ ఇవ్వకుండా పైగా నిజాయితీపరుడైన మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అవమానించినందుకు ఓటు వేయాలా? ► దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఎస్టీలకు తెలివి ఉండదు.. అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే దళితులను అవమానిస్తే.. దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటూ ఓ మంత్రి దారుణంగా మాట్లాడినందుకు టీడీపీ కి ఓటు వేయాలా? ► అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తాను, ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి.. హామీలు నెరవేర్చమని ముద్రగడ ఉద్యమిస్తే దారుణంగా అవమానించినందుకు ఓటెయ్యాలా? ► కోడలు మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది అని మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు ఓటు వేయాలా? రాయలసీమ రౌడీలు అని పదే పదే ఒక ప్రాంతాన్ని అవమానిస్తున్నందుకు సీమ ప్రజలు ఓటు వేయాలా? ► సీమకు నీళ్లివ్వకుండా ఎండబెడుతున్నందుకు ఓటు వేయాలా? సీమలో హైకోర్ట్ పెట్టనందుకు ఓటు వేయాలా? ► నిరుద్యోగులకు రుణమాఫీ చేయనందుకు ఓటు వేయాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకా? నిరుద్యోగులకు నెలకు 2 వేలు చొప్పున 38 నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి 76 వేలు ఇవ్వనందుకు ఓటు వేయాలా?’’ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. -
టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం త్వరలో కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేసేందుకు జిల్లాలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా వైఎస్సార్సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానుందన ప్రజలు కసితో రలిగిపోతున్నారని, ఎన్నికలెప్పుడొస్తాయా? ఎప్పుడు ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీకి ప్రజల్లో గుర్తింపు లేదని, తీవ్ర వ్యతిరేకత మధ్య అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అభ్యర్థులు దొరకకే మిత్రపక్షమైన బీజేపీకి అధిక సంఖ్యలో డివిజన్లు కేటాయిస్తుందని, ఆ పార్టీ బలహీనతకు ఇదే నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు. -
జయరామయ్యా.. అభివృద్ధి ఏదయ్యా?
► పార్టీ ఫిరాయింపు సమయంలో ప్రజలకు భారీగా హామీలు ► తర్వాత అటకెక్కించిన ఎమ్మెల్యే ► ఏడాదిన్నరలో మరింత పెరిగిన జనం సమస్యలు ► తన అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించారని మండిపడుతున్న జనం పార్టీ ఫిరాయించిన రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఇప్పుడు తన హామీల ఒట్టు తీసి గట్టున పెట్టారు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత తాను జనానికి ఇచ్చిన హామీల సంగతేమిటని మంత్రులను, సీఎంను గట్టిగా నిలదీసి నిధులు సాధించుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి మీద ధ్యాసతోనే పార్టీ ఫిరాయించి అధికార పార్టీ ఎమ్మెల్యే అవతారం ఎత్తి ఉంటే ఇప్పటి వరకూ హామీలను ఎందుకు నెరవేర్చలేక పోతున్నారని ప్రజలు రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నాననీ, అధికార పార్టీలో చేరుతున్నందువల్ల నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఇట్టే పరిష్కరిస్తానని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు గట్టిగా చెప్పారు. హామీలు దంచేసి ఏడాదిన్నర కావస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో జనం నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్లే దిక్కు. జయరాములు నివాసం ఉంటున్న పోరుమామిళ్ల జనం దప్పిక తీర్చడానికి రూ.90 లక్షలతో సగిలేరు నుంచి పోరుమామిళ్ల వరకు నిర్మించిన తాగునీటి పథకం పనులు నాసిరకంగా జరిగినా కాంట్రాక్టర్లు, అధికారులను ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. పోరుమామిళ్లవాసుల గొంతులు తడపడానికి రోజుకు రూ.50 వేలు ఖర్చుచేసి 115 ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నా నీటి కటకట తీరడం లేదు. పోరుమామిళ్ల జనం నీళ్లో జయరామయ్యా అని గొంతు చించుకుంటున్నా ఎమ్మెల్యే వారి ఇబ్బందుల గురించి గొంతు విప్పే పరిస్థితిలో లేరు. సొంత అభివృద్ధి కోసమే..: ఎమ్మెల్యే జయరామయ్య గారు సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నోరు విప్పడం లేదంటే గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన జయరాములు ఎందుకోసం టీడీపీ కండువా కప్పుకున్నారనే విషయం వేరేగా చెప్పక్కర్లేదు. తాను ఇచ్చిన హామీలకు ఏడాదిన్నర నిండబోతున్న నేపథ్యంలోనైనా జయరాములు తన హామీల గురించి ఆలోచించాలని జనం కోరుతున్నారు. ఈ పనైనా చేయండి బద్వేలు మండలం అప్పరాజుపేట నుంచి అట్లూరు మండలంలోని చివరి ఆయకట్టు వరకు బ్రహ్మసాగర్ కుడికాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్సార్ సీఎంగా ఉండగా ఈ పనులు వేగంగా జరిగాయి. ఆయన మరణం తర్వాత నిధులు లేక నీరసించాయి. ఎమ్మెల్యే జయరాములు మూడు, నాలుగు కోట్ల నిధులు సాధించి ఈ పనైనా పూర్తి చేయిస్తే సుమారు 15వేల ఎకరాల భూములకు సాగునీరందించవచ్చు. ఇదీ హామీల గతి హామీ: బద్వేలు అభివృద్ధి కోసం రూ.100కోట్ల నిధులు తెస్తా. అమలు : ఇంతవరకూ ప్రత్యేకంగా రూపాయి కూడా తేలేదు. హామీ : గోపవరం, బద్వేలు మండలాల తాగునీటి ఎద్దడి నివారణకు సోమశిల బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా ఒక టీఎంసీ నీరు సరఫరా చేయిస్తా. అమలు : ఇంతవరకూ అతీగతి లేదు. హామీ : కాశినాయన మండలానికి తెలుగుగంగ ఎడమ కాలవ నుంచి సావిశెట్టిపల్లి, ఆకులనారాయణపల్లి, వరికుంట్ల, భాలాయపల్లి, గొటువారిపల్లి, గంగనపల్లి పంచాయతీలలోని గ్రామాలకు సాగునీరు అందిస్తా. అమలు : ఇంతవరకూ దాని ఊసేలేదు. హామీ : కలసపాడు మండలానికి స్పెషల్ కోటా కింద వెయ్యి పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : అన్ని మండలాలకు కేటాయించిన విధంగా 130 ఇళ్లే మంజూరయ్యాయి. స్పెషల్ కోటా ప్రస్తావనే లేదు. హామీ : బి.కోడూరుకు 200 వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా. అమలు : 80 పింఛన్లు మాత్రమే మంజూరు చేయించారు. హామీ : బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లి ఎస్సీకాలనీపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ లైను మార్పిస్తా అమలు : ఇంతవరకూ విద్యుత్ లైన్ మార్చలేదు. హామీ : అట్లూరు మండలంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం సిద్దవటం సమీపంలో నుంచి పెన్నా నీరు ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా చేయిస్తా అమలు : ఆ పనులు ప్రతిపాదనల దశకు కూడా చేరలేదు. హామీ : బద్వేలు నుంచి పోరుమామిళ్ల వరకూ ఉన్న సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్పిస్తా. అమలు : ఆ ఊసే లేదు హామీ : పోరుమామిళ్ల చెరువుకు బ్రహ్మసాగర్ నీరు తెస్తా. అమలు : ఆ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హామీ : ప్రతి జర్నలిస్టుకు ఇంటిస్థలంతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : ఈ హామీకి అతీగతీ లేదు. -
బదిలీల్లో గందరగోళం
వెబ్ కౌన్సిల్ అంటూ ప్రభుత్వం జీవో జారీ దరఖాస్తు చేసుకున్న ప్రజారోగ్యశాఖ లాంగ్ స్టాండర్డ్ ఉద్యోగులు తర్వాత సాధారణ కౌన్సెలింగ్ అంటూ మరో జీవో సర్వీసు ఆధారంగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ తెల్లవార్లు జరుగుతున్న ప్రక్రియ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకున్న గందరగోళ నిర్ణయాలు ఉద్యోగులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముందు వెబ్ కౌన్సెలింగ్ అన్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సాధారణ కౌన్సెలింగ్ అంటూ, అదీ కూడా వారం రోజుల్లో ముగించాలంది. కౌన్సెలింగ్‌కు సరైన ప్రణాళిక, కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పటు చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 64 జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రజారోగ్య, వైద్య విభాగంలో బదిలీలు చేపట్టేందుకు ఆ శాఖ మే 6న జీవో నంబర్ 318 జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రులలో అదే ప్రాంతంలో ఎక్కువ కాలం (లాంగ్ స్టాడింగ్) పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియను మే 24కి పూర్తి చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రణాళికా లోపం, సౌకర్యాలు లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. 24 అర్ధరాత్రికి ఆయా విభాగాలలో బదిలీల కోసం జీవో నంబర్ 64 ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమయం ముగిసింది. సాధారణ కౌన్సెలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేయకుండానే ప్రజారోగ్య,వైద్య విభాగం మే 27న జీవో నంబర్ 343 జారీ చేసింది. జూన్ 5 నాటికి బదిలీలు పూర్తి చేసేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం జోన్ స్థాయిలో ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లు, ఒక రీజనల్ డైరెక్టర్‌తో త్రిసభ్య కమిటీ వేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఎంఅండ్ హెచ్‌వో, డీసీహెచ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలకు నామం... రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లలో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. జోన్–2 పరిధిలోని కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులకు రాజమహేంద్రవరంలోని రీజనల్ డైరెక్టరేట్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం స్టాఫ్ నర్సులు, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్(ఎఫ్)ల కౌన్సెలింగ్ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వి«ధంగా అభ్యర్థుల జాబితాను కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంతంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి తిరిగి అదే ప్రాంతంలో పని చేస్తామని తమ ఆసక్తిని కనబరుస్తూ మూడు ఆప్షన్లు పెట్టారు. ఇలా 153 మంది స్టాఫ్ నర్సులలో దాదాపు 40 మంది ఇలానే ఆప్షన్లు ఇచ్చారు. మిగతా వారు మూడు ప్రాంతాలను వేర్వేరుగా ఆప్షన్లుగా పెట్టుకున్నారు. కౌన్సెలింగ్ పిలుస్తున్న కమిటీ, అభ్యర్ధి అక్కడే పని చేస్తామని మూడు ఆప్షన్లు పెట్టుకుంటే తిరస్కరిస్తూ మరో చోట తీసుకోవాలని ఖాళీల జాబితా చూపిస్తోంది. ఈ విధానాన్ని ఇతర ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బదిలీ అంటేనే ఉన్న ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లడమని, కానీ వారు అదే ప్రాంతంలో పని చేస్తామని ఇచ్చిన మూడు ఆప్షన్లను పెడితే వారికి అప్పటికప్పుడు ఎంచుకోండంటూ లిస్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆప్షన్లు పెట్టుకున్న ఉద్యోగులకు మూడింటిల్లో ఒక్కటి కూడా రాలేదని వాపోతున్నారు. మూడు ఆప్షన్లు పని చేస్తున్నచోటే పెట్టుకున్న వారికి అక్కడికక్కడే నచ్చిన ప్రాంతం ఎంచుకోవాలని కమిటీ సభ్యులు జాబితా ఎలా ఇస్తారని స్టాఫ్ నర్సులు ప్రశ్నిస్తున్నారు. ప్రణాళిక లోపం శనివారం మూడు విభాగాలకు సంబంధించి 232 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు స్టాఫ్ నర్సులు, పీహెచ్ఎన్ విభాగానికి సంబంధించి 178 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ నిర్వహణలో ప్రణాళిక లోపం వల్ల ఒక్కొక్క అభ్యర్థికి 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం పడుతోంది. ఉద్యోగులు ముందుగా ఎంచుకున్న మూడు ఆప్షన్లు కాకుండా అప్పటికప్పుడు అక్కడే నచ్చిన చోటను ఎంపిక చే సుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, కూర్చునేందుకు అవసరమైన మేరకు కుర్చీలు లేక ఎక్కడికక్కడ చతికిలపడ్డారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతం. ఆదివారం సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, ఏఎస్వో, టీఎస్వో, ఏపీఎంవో, డీపీఎంవో, ఎంపీహెచ్ఎస్(ఎం) తదితర విభాగాల ఉద్యోగులకు కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇష్టానుసారం చేస్తున్నారు... ప్రభుత్వం జీవో జారీ చేయకుండానే విభాగం జీవో 343 ద్వారా కౌన్సెలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం. వెబ్‌కౌన్సెలింగ్ అన్నారు. తర్వాత సాధారణమన్నారు. ఉద్యోగులకు కనీసం అవగాహణ కల్పించలేదు. మార్గదర్శకాలు పాటించకుండా కమిటీ సభ్యుల ఇష్టానుసారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. – జి.ఆస్కారరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం. వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్లను పరిగణలోకి తీసుకోం వెబ్ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగులు దరఖాస్తులు, అందులో పేర్కొన్న మూడు ఆప్షన్లను సాధారణ కౌన్సెలింగ్‌లో పరిగణలోకి తీసుకోవడంలేదు. సర్వీసు ఆధారంగా వరుసగా ఉద్యోగులను పిలుస్తున్నాం. వారికి నచ్చిన చోటను ఎంపిక చేసుకోమంటున్నాం. నిబంధనల ప్రకారమే అంతా చేస్తున్నాం. కేంద్రం వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – షాలినీదేవి, రీజనల్ డైరెక్టర్, జోన్–2 -
‘ప్రజా తీర్పును స్వీకరిస్తా’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాలు, ఒత్తిళ్లను అధిగమించి తనకు ఓటు వేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. -
ప్రజాసమస్యలపై పోరుబాట
- 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ముట్టడి - పార్టీ కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టినట్లు పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తెలిపారు. ఇందులో భాగంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న దోమల సమస్య నివారణ డిమాండ్‌తో ఈ నెల 25న నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హఫీజ్‌ఖాన్ నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగంగా హఫీజ్‌ఖాన్ తన పర్యటనలో అనేక సమస్యలను గుర్తించారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా దోమల సమస్య అధికంగా ఉన్నట్లు ప్రజలు చెబుతుండడంతో ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25వతేదీన నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హఫీజ్‌ఖాన్ వెల్లడించారు. స్థానిక రాయల్ ఫంక్షన్‌హాలు పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక కుళాయిలకు నీరు సరఫరా చేస్తుండడంతో ప్రజలు జాగరణ చేయాల్సిన పరిస్తితి నెలకొందన్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలన్నారు. కొన్ని వీధుల్లో విద్యుత తీగలు కిందుగా వేలాడు ప్రమాద హేతువులుగా ఉన్నాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవలని కోరారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభించే నగరపాలక సంస్థ ముట్టడిలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, నాయకులు పేలాల రాఘవేంద్ర, గణపచెన్నప్ప, జాన్, నవీద్, హరికృష్ణ, షోయాబుద్దీన్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. -
ఆయనలదే పెత్తనం
భార్యల మౌనం భర్తలదే రాజ్యం అధికారికమైనా అంతావారే ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల దగ్గరా అదేసూత్రం పెచ్చుమీరిపోతున్న ‘పచ్చ’పాతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతల పెత్తనం పెచ్చుమీరిపోతోంది. ఆ పార్టీ నేతలు జిల్లాలో రా జ్యాంగేతర శక్తులుగా తయారయ్యా రు. ఇందుగలడందు లేడనే సామెత ను తలపించే రీతిలో ఆ పార్టీ నేతలు అన్నింటా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతలే తమకు ముఖ్యమని, వారు చెప్పిన పనులు చేయాల్సిందేనని హుకుం జారీచేశారు. సీఎం స్థాయి నుంచే అటువంటి ఆదేశాలు రాడంతో కలెక్టర్లే చేసేదేమీ లేక వారు చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల సిఫార్సులకు అగ్రతాంబూలం వేయాల్సిన అనివార్య పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, గృహనిర్మాణాలు, బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరవ్వాలన్నా పార్టీ నేతల సిఫార్సులు తప్పడం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన అర్హత పార్టీ నేతల ఆమోదముద్రే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ వరకు అడుగడుగునా జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ప్రతి చోటా వారి పెత్తనమే కనిపించడంతో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదురైంది. ప్రజాగ్రహంతో తమకు పని లేదన్నట్టుగానే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదిగో తాజా ఘటన... తాజాగా రెండు రోజుల కిందట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశం తీరు ఆ పార్టీ నేతల వ్యవహారశైలికి అద్దంపడుతోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాపు, బీసీ రుణాలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. కానీ మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో విశ్వనాథరెడ్డి వేదికపై ఉన్నా ఎప్పటి మాదిరిగానే పెత్తనమంతా ఎమ్మెల్యే భర్త, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబుదే. సత్తిబాబుతోపాటు ఆ మండల ఎంపీపీ, జడ్పీటీసీలు పుల్లా సుధ, కాకరపల్లి సత్యవతి భర్తలు చందు, చలపతిరావులు పెత్తనం చెలాయించడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోను దాదాపు ఇదే ఒరవడిని పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలైనా, పనుల కాంట్రాక్ట్లైనా, అధికారులు బదిలీలైనా పెత్తనమంతా వారిదే. చివరకు శిలాఫలకాలపై వారి పేర్లు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే ధైర్యం అక్కడి అధికారులకు లేనేలేదు. ఈæ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా నామ్కేవాస్తే అన్నట్టుగా మార్చేశారని నియోజకవర్గ ప్రజలు ఆక్షేపిస్తున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోయే అధికార పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేతోపాటు మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోటా అంతే... జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న కొత్తపేట, తుని, రంపచోడవరం నియోజకవర్గాల్లో వారిని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. కొత్తపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కాదని పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSఛార్జి బండారు సత్యానందరావుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు మైక్‌ను లాగేసుకుని దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాదని పార్టీ నేతలే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అక్కడ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెత్తనమంతా తమ్ముళ్లదే. మిగిలిన నియోజకవర్గాల్లోను దాదాపు ఇదేరకంగా పార్టీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. -
ఇక మీదట ఆ తప్పు చేశారో అంతే...
-
ప్రజలకు మొండిచేయి చూపుతున్న టీడీపీ
గొరిగపూడి(భట్టిప్రోలు): ఎన్నికలకు ముందు టీడీపీ రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. భట్టిప్రోలు మండలం గొరిగపూడిలో ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటేశ్వరరావు ఇంట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీలు ఇచ్చి జనాలను మోసం చేశారన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి ఫించన్లు అందకుండా చేస్తున్నారని, జన్మభూమి కమిటీ సభ్యులు అనుకూలమైన వారికే పథకాలు వర్తింప చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలు అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వారు మాఫియాలకు పాల్పడుతున్నారన్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికి హోదా విషయంలో కప్పదాట్లు వేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. భారత దేశంలో ఆర్థిక మాంద్యం రాబోతుందని నోట్ల రద్దు విషయం ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుండేదని తెలిపారు. ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని తెలిపారు. -
బ్యాంకుల ముందు గొడవలు,తోపులాట
-
స్వగ్రామంలో ఎమ్మెల్యే తోటకు చుక్కెదురు
జనావాసాల మధ్య సబ్‌స్టేçÙ¯ŒSను వ్యతిరేకిస్తూ 20 రోజులుగా రిలే దీక్షలు శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసుల హుకుం వేరే ప్రాంతంలో దీక్ష కొనసాగింపు వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్): స్వగ్రామం వెంకటాయపాలెంలో జనావాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేç షన్ నిర్మించాలనే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు యత్నానికి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20 రోజులుగా గ్రామస్తులు రిలే దీక్షలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ద్రాక్షారామ ఎస్సై ఫజులు రహ్మాన్, పోలీసులతో వచ్చి మార్గానికి ఇబ్బందిగా ఉందని, దీక్షా శిబిరాన్ని మార్చాలని ఆందోళనకారులను కోరారు. దాంతో దీక్షలో ఉన్న మహిళలు 20 ఇరవై రోజులుగా అడ్డుగా లేనిది ఇప్పుడు అడ్డు వచ్చిందా అంటూ దీక్షలో ఉన్న మహిళలు నిలదీయడంతో వారు వెళ్లిపోయారు. కొంత సేపటికి తిరిగి వచ్చిన పోలీసులు శిబిరాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో గ్రామస్తులు టెంట్‌ను ఖాళీచేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో దీక్షలు కొనసాగించారు. స్వగ్రామంలో సమస్యలు వదిలి జనచైతన్య యాత్రలా? ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెంలో రెండు నిరాహార దీక్షా శిబిరాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి జనావాసాల మధ్య విద్యుత్ సబ్‌స్టేçÙన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నది. మరొకటి వెంకటాయపాలెం దళితులు శిరోముండనం కేసులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తున్నది. వీటిని పట్టించుకోకుండా జన చైతన్య యాత్రలంటూ నియోజకవర్గంలో తిరగడానికి సిగ్గు లేదా అని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్) దుయ్యబట్టారు. బుధవారం నాటి దీక్షల్లో వాసంశెట్టి శ్రీనివాసకుమార్ (శ్యామ్), పిల్లి శ్రీనివాస రామారావు, అనుసూరి వెంకటరమణ, వాసంశెట్టి సత్యనారాయణ, దార్ల పాపారావు, పిల్లి రాంబాబు, దార్ల సత్యనారాయణ, వాసంశెట్టి ఏడుకొండలు, విత్తనాల కాంతమ్మ, ఈతకోట భవాని, కడలి లక్ష్మిసుకన్య, వాసంశెట్టి సత్తెమ్మ, మందపల్లి జ్యోతి, మందపల్లి రాణి, కుడుపూడి హైమావతి, పిల్లి చంద్రరావు కూర్చున్నారు. -
కరెన్సీ కష్టాలు
-
కోలాహలం..సూర్యలంక తీరం
బాపట్లటౌన్: సూర్యలంక సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. కార్తీకమాసంలో సముద్రస్నానం చేసి, తీరం వెంబడి ఉన్న జీడిమామిడి తోటల్లో వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సెలవుదినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజామునే తీరానికి చేరుకొని సూర్యనమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలను ఆచరించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు శనివారం రాత్రే బయల్దేరి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకే తీరానికి చేరుకున్నారు. మహిళలు తీరం వెంబడి గౌరిదేవి పూజలు నిర్వహించి ఇసుకతో తయారుచేసిన అమ్మవారి ప్రతిమలను సూర్యలంక తీరంలో కలిపి పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానాలనంతరం ఇక్కవ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. ప్రత్యేక బందోబస్తు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యలంక రోడ్డు జనసందోహంగా మారింది. పర్యాటకులు అధికసంఖ్యలో రావడంతో తీరంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బాపట్ల తాలుకా ఎస్ఐ సీహెచ్. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేశారు. కార్తీకమాసం ముగిసేంత వరకు తీరంలో రెండు టీమ్లచే పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. -
ప్రజావిశ్వాసంతోనే ల్యాండ్ పూలింగ్ సాధ్యం
సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు తుళ్లూరు : ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం వల్లే ఎంతో కష్టతరమని భావించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను సుసాధ్యం చేయగలిగినట్టు తుళ్లూరు సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు చెప్పారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం స్థానిక కార్యాలయానికి వచ్చింది. చెన్నకేశవులు వారితో మాట్లాడుతూ.. రాజధాని 29 గ్రామాల్లో ప్రతిచోట ఓ కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు 150 మంది సర్వే బృందాలను 13 జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చామని తెలిపారు. మూడు నెలల కాలంలో సుమారుగా 34 వేల ఎకరాల భూమిని, 160 సర్వే నంబర్లలో 22,197 మంది భూ యజమానులను గుర్తించామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన ల్యాండ్ పూలింగ్ విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ టీం లీడర్ జయశ్రీ కత్తెర నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్లు అశోక్ చౌదరి, రమాకాంత్ ఆస్మర్, సంజయ్ అశ్వల్, ఉత్తమ్ పటేల్, దత్తాత్రేయ కవితక్ రాజధాని ప్రాంతంలోని పలు ప్రదేశాలను సందర్శించి సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించినట్లు వివరించారు. -
పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలి
కాకినాడ కల్చరల్: అ ణగారిన వర్గాల ప్రజ లు ప్రజా పోరాటాల తోనే హక్కులు సా ధించుకోవాలని అణగారిన కులాల సమా ఖ్య (డీసీఎఫ్) రాష్ట్ర అ ధ్యక్షుడు దోనం నీలకంఠం అన్నారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్లో బొజ్జా తారకం ప్రాంగణంలో డీసీఎఫ్ ఆధ్వర్యంలో అణగారిన ప్రజాపోరు సభ సోమవారం జరిగింది. ముందుగా అంబేడ్కర్, పూలే, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు డీసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డోకుబుర్ర భద్రం (మాస్టార్) అధ్యక్షత వహించారు. అంబేడ్కర్ లండన్ గ్రంథాలయంలో చదివి సముపార్జించిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో దళితుల సంక్షేమానికి వినియోగించారని మరో అతి థిగా విచ్చేసిన రాషీ్ట్రయ దళిత సేవ జాతీయ నాయకులు జేబీ రాజు అన్నారు. దళితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని దళిత బహుజన నేత నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. ఐక్యతతో ప్రజా పోరాటం చేస్తేనే అణగారిన వర్గాలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ అన్నారు. పలువురు ప్రముఖులకు సన్మానాలు చేశారు. ముందు భానుగుడి సెంటర్ నుంచి ఆనందభారతి వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా గాయకులు జయరాజ్, బహుజన కళామండలి సభ్యుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. గుడాల కృష్ణ, కొత్తపల్లి కిషోర్‌కుమార్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నం
తెనాలి : జనతా రాజ్యమే ఏకైక విముక్తి మార్గమని విశ్వసించిన రాడికల్ యువజన సంఘం (ఆర్‌వైఎల్) రాష్ట్ర తొలి అధ్యక్షుడు, విరసం సభ్యుడు పీజే వర్ధనరావు, తన ఆశయం దిశగా నిబద్ధతతో వ్యవహరించారని పలువురు విప్లవాభిమానులు, సాహితీమిత్రులు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆకస్మికంగా కన్నుమూసిన వర్ధనరావు అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అయితానగర్‌లోని స్వగహం వద్ద నిర్వహించిన సంతాపసభకు వర్ధనరావు సన్నిహితుడు ప్రదీప్ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నమని కొనియాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాజకీయ మార్గం ఏదైనా వర్ధనరావు మనిషిగా ఉన్నతుడని చెప్పారు. విరసం జిల్లా అధ్యక్షుడు సీఎస్సార్ ప్రసాద్ మాట్లాడుతూ విప్లవ భావజాలానికి కట్టుబడినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో భౌతికంగా దూరంగా ఉండిపోయినా, మద్దతును కొనసాగించారని చెప్పారు. సివిల్ లిబర్జీస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ రాజ్యహింసను అనుభవించి కూడా వర్ధనరావు విప్లవోద్యమానికి అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఆర్‌వైఎల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ వర్ధనరావు ఆర్‌వైఎల్ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, విప్లవోద్యమం జీవించే ఉందనీ, ముందుకు తీసుకెళతామని ప్రతిజ్ఞచేసినవారిలో ఒకరని గుర్తుచేసుకొన్నారు. జనసాహితి నాయకుడు దివికుమార్ మాట్లాడుతూ వర్ధనరావు వంటి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి వతి సమాజానికి తీరని నష్టమన్నారు. కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.కష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న కులోన్మాదాన్ని కట్టడి చేయాల్సిన చారిత్రక బాధ్యత ఉందని నమ్మిన వర్ధనరావు తుదివర కు కట్టుబడ్డారని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డాక్టర్ జి.కపాచారి, జేఎస్ఆర్ కష్ణయ్య, ఉన్నం లక్ష్మయ్య, తురుమెళ్ల శ్యాంషా, ఎంజే విద్యాసాగర్, కనపర్తి బెన్హర్ మాట్లాడారు. జీఎస్ నాగేశ్వరరావు, ఉమారాజశేఖర్, రాఘవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
బాబు పాలనలో సొంతగూడు కరువు
గడపగడపకూ వైఎస్సార్‌లో పేదల గగ్గోలు కార్యక్రమానికి అనూహ్య స్పందన కాకినాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇదిగో ఇళ్లు, అదిగో రుణం అంటూ రెండేళ్లు గడిపేశారు. కాని పేదలకు ఒక్క పూరిగుడిసైనా కట్టివ్వలేదు. పేద లు సొంద గూడులేక ఇబ్బంది పడుతున్నారు. వారికి పూర్తిగా అన్యాయం జరుగుతోందంటూ కాకినాడ రూరల్ 49వ డివిజన్లో జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ఓనుం ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల ఆగడాలు పెచ్చురిల్లాయి. అర్హులందరి పింఛన్లను తొలగిస్తున్నారు. అధికారులే ఏమీ చేయలేకపోతున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పే కాలం దగ్గరపడుతుందని అదే ప్రాంతానికి చెందిన పి.రమణ ఆవేదన వెళ్లబుచ్చాడు. ఇళ్లు ఎప్పుడొస్తాయో... టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం మండలం ఇటికాయలపల్లిలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని తలారి సంధ్య తెలిపారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పంచాయతీ పరిధిలో ఇళ్లు మంజూరు చేయలేదంటూ బొర్రా నాగరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. మురికి కూపంలో మగ్గుతున్నాం రౌతులపూడి మండలంలోని పారుపాక ఎస్సీపేటలో డ్రెయినేజీ సదుపాయాలు లేక మురికికూపంలో మగ్గుతున్నామని పాలెడ్డి నాగమణి పర్వత వద్ద వాపోయింది. కాకినాడ జగన్నాథపురం మెయిన్‌రోడ్డు, విష్ణాలయం వీధులలో ఆశీల పేరుతో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారంటూ నాయకుల వద్ద రవి అనే చిరువ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్ల సదుపాయం లేక.. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు మిలటరీ కాలనీలో రోడ్లు గోతులమయంగా మారినా పట్టిం చుకోవడంలేదని ఆప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు తెలిపారు. ఆలమూరు మండలంలోని మూలస్థాన అగ్రహారంలో స్థానిక సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. అమలాపురం రూరల్ మండలం సాకుర్రు ప్రాంతంలో పొలమూరుబాలకృష్ణనగర్, కాపులపాలెం, క్రాపవీధి తదితర ప్రాంతాల్లో పంటపొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గుత్తుల జనార్దనరావు ఆవేదన వ్యక్తం చేశాడు. మంచినీటి సమస్యతో సతమతమవుతున్నామని కాపులపాలెంనకు చెందిన బాలకృష్ణ తెలిపాడు. -
‘టీడీపీ’ వైఫల్యాలపై గడపగడపలో ప్రచారం
కాకినాడ : తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపలో విస్తృత ప్రచారం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను కూడా కల్పించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షుడు కన్నబాబు నివాసంలో జరిగింది. సమావేశంలో తొలుత ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల అనంతరం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో సైతం మాట తప్పి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు పంపిణీ చేసి వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు వివరించారు. ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా వంచించారో తెలియజెప్పాలని కన్నబాబు కోరారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. తెలుగుదేశం చేసిన అబద్దపు ప్రచారాలు నమ్మి గెలిపించినప్పటికీ ఇప్పుడు ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థంచేసుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. కులమతాలకు అతీతంగా పార్టీ పట్లనిబద్ధత, అంకిత భావం కలిగిన వారికి అవకాశం కల్పించి పదవుల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఏడిద చక్రం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, కాట్రేనికోన ఎంపీపీ ఆకాశం సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి రేవు మల్లేశ్వరి, తాళ్ళరేవు, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం కన్వీనర్లు, సీనియర్ నాయకులు, సుమారు 300 మంది ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆయిల్ ఇండియా పనులకు ఆటంకం
డిమాండ్లు పరిష్కరించాలన్న కర్రివాని చెరువు గ్రామస్తులు డ్రిల్లింగ్ సైట్ వద్ద పిల్లాపాపలతో వంటా వార్పు అధికారుల హామీతో సమసిన ఆందోళన ముమ్మిడివరం : మండలంలోని గాడిలంక ఆయిల్ ఇండియా సంస్థ చేపట్టిన డ్రిల్లింగ్ పనులను మంగళవారం కర్రివాని రేవు గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డ్రిల్లింగ్ సైట్ మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసి రిలే దీక్షలు చేపట్టారు. పిల్లా పాపలతో మహిళలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. సైట్ సమీప గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కాలుష్య నియంత్రణ చర్యలు గాని, అనుమతులు గాని లేకుండా డ్రిల్లింగ్ చేస్తున్నారన్నారు. డ్రిల్లింగ్ పాయింట్‌కు కేవలం 300 మీటర్ల సమీపంలో కర్రివానిరేవు గ్రామంలో 1997లో నిరుపేదలకు ఏఎంజీ సంస్థ నిర్మించిన గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి సామర్థ్యాన్ని ఇంజనీర్ల చేత నిర్ధారించాలని లేకపోతే డ్రిల్లింగ్ పనుల వల్ల ఆవి కూలిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 9నెలల క్రితం ఆయిల్ ఇండియా ప్రతినిధులు సైట్ నుంచి పెన్నాడ పాలెం వరకు 1350 మీటర్ల కెనాల్ రోడ్డును బీటీ రోడ్డుగా ఆధునికీకరిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. డ్రిల్లింగ్ వల్ల నష్టపోతున్న గాడిలంక, కర్రివాని రేవు గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని, ప్రధాన పంట కాలువ వెంబడి రక్షణ గోడ నిర్మించాలని, ఆయా గ్రామాల పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, నెలనెలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్ల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.వీర్రాజు, ముమ్మిడివరం, కాట్రేనికోన ఎస్సైలు ఎం.అప్పలనాయుడు, షేక్‌జాన్‌బాషా ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించినా ఆందోళనకారులు ససేమిరా అంటూ ఆర్డీఓ వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఆందోళనకారులతో సైట్ ఇంజనీర్ శ్యామలరావు, సీఐ కేటీవీవీ రమణారావు, ఎస్సై అప్పలనాయుడు రెండు నెలల్లో రహదారి ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని, మిగిలిన పనులు రిగ్ పనులు మొదలయ్యాకా దశలవారీగా పూర్తిచేసేందుకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. చర్చల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి పాల్గొన్నారు.అంతకు ముందు ఆందోళనలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, నాయకులు చింతా వెంకటరమణ,కాశి రామకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల డిమండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని పితాని కర్రివాని రేవు సర్పంచ్ చింతా వెంకటరమణ, గాడిలంక సర్పంచ్ దానం వేణుగోపాలస్వామి, ఎంపీటీసీ ఓలేటి సత్యవతి, మాజీ సర్పంచ్‌లు మోర్త వీరశూర్జ్యం తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమ కంటే ప్రజలే ముఖ్యం
వారి కోసం పోరాటాలకు సిద్ధం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : తొండంగి మండలం సముద్ర తీర ప్రాంతంలో విషపదార్థాలను వెదజల్లే దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం, పరిశ్రమ కన్నా ప్రజలే ముఖ్యమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తొండగి మండలం తీరప్రాంతానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, మేరుగు హరి, మెసా సత్తిబాబు తుని పార్టీ కార్యాలయంలో రాజాను కలిశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో లక్ష మంది మత్స్యకారులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారని నాయకులు లె లిపారు. దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మత్స్య సంపద అంతరించి, మత్స్యకారులు ఉపాధి కోల్పోయి, వలసపోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేయాలే తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని, 30 ఏళ్ల నుంచి టీడీపీకి కంటికి రెప్పలా ఉన్న మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలను యనమల రామకృష్ణుడు నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం సొమ్ముల కోసం సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేయడం తగదన్నారు. కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, తొండంగి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ మాజీ జెడ్పీటీసీ కాశీ స్థానిక శాంతినగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాజా సమక్షంలో టీడీపీకి చెందిన కాశీ విశ్వేశ్వరరావు పార్టీ చేరారు. ఆయనకు ఎమ్మెల్యే రాజా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చొక్కా కాశీ విశ్వేరరావు మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన తీర ప్రాంత ప్రజలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తొండంగి మండలంలో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసి సభలు జరగకుండా చేసిందని, త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరతారన్నారు. దానవాయిపేట పంచాయతీ మాజీ సర్పంచ్ మేరుగు హరిబాబు, కోస్తా జాతీయ మత్స్యకార పరిరక్షణ కాలుష్య నివారణ సంఘం చైర్మన్ మెసా సత్తిబాబు, ఎ.ప్రకాశరావు, కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, మోతుకూరి వెంకటేష్ పాల్గొన్నారు. -
కరెంటు బిల్లుల మోత మోగుతోంది
కడప అగ్రికల్చర్: ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లుల మోత మోగుతోందని నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు నిర్వహించారు. మైదుకూరు మండలం అన్నలూరులో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రజలను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు మాట్లాడుతూ ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలమైన తమకు కరెంటు బిల్లుల భారం ఉండేదికాదని అన్నారు. ఈ మాయదారి ప్రభుత్వం వచ్చాక బిల్లులు వేలల్లో వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు హామీలను భారీగా ఇచ్చినా ఇంతవరకు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నందలూరు మండలం రాచపల్లె, ఇసుకపల్లెల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రజలు మాట్లాడుతూ 108, 104 వాహనాలు అందుబాటులో ఉండటం లేదని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, వాటిని అందుబాటు ఉండేలా చూడాలని కోరారు. -
వీడని భయం
అన్నవరం గ్రామంలో తగ్గని కాళ్లవాపు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో భయాందోళనలు గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం ముందెన్నడూ లేనివిధంగా కాళ్ల వాపు వ్యాధి ప్రాణాంతకంగా మారడంతో గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారిపై వైద్యాధికారుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో.. దీనిపై వారికే పూర్తి అవగాహన లేనట్టు తేటతెల్లమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బాధితులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి, వైద్యులు చేతులు దులుపుకొంటున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. – అన్నవరం (వీఆర్ పురం) రేఖపల్లి పంచాయతీలోని అన్నవరం గ్రామంలో కాళ్ల వాపు వ్యాధితో ముగ్గురు మరణించడం, అవే లక్షణాలతో బాధపడుతున్న మరికొందరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించిన నేపథ్యంలో గ్రామస్తులు భయకంపితులవుతున్నారు. శుక్రవారం ప్రత్యేక వైద్య బృందం గ్రామంలో పర్యటించింది. గ్రామస్తులు తినే ఆహారంతో పాటు వారి వద్ద నుంచి రక్తనమూనాలను అనేక ఇళ్లలో సేకరించి, కాకినాడకు తీసుకువెళ్లారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, కారణం ఏమిటనే దానిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు. రేఖపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరం శనివారం కూడా కొనసాగింది. బంధువుల ఆందోళన అన్నవరం గ్రామానికి చెందిన 19 మందితో పాటు పెదమట్టపల్లికి చెందిన ఇద్దరు, లక్ష్మీనగరానికి చెందిన మరో ఇద్దరు మొత్తం 23 మంది కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారిని మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ, వారి ఆరోగ్యం మెరుగు పడకపోగా, అందులో కొందరికి ముఖంలో కూడా వాపు లక్షణాలు బయటపడ్డాయని తెలియడంతో.. గ్రామంలోని వారి బంధువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం గ్రామానికి చెందిన సోడె గోపాలకృష్ణకు ముందు కాళ్లు వాపునకు గురయ్యాయి. ఇతడిని గురువారం అంబులెన్స్‌లో కాకినాడకు తరలించారు. ఇప్పుడు అతడి ముఖ భాగం కూడా వాపుతో ఉన్నట్టు ఫోన్ ద్వారా సమాచారం తెలియడంతో అతడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరినీ కాపాడాలి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించిన కాళ్లవాపు బాధితులను కాపాడాలి. ప్రభుత్వం వారందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కాళ్లవాపుతో పాటు ముఖం వాపుతో బాధపడుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం స్పందించి బాధితుల ప్రాణాలను కాపాడాలి. – మడకం జోగమ్మ, రేఖపల్లి సర్పంచ్ -
ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం
∙ఎమ్మెల్యే అరూరి రమేష్ వర్ధన్నపేట : ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం తీసుకురావడానికి మన ఊరు– మనబడి కార్యక్రమంతో ఉద్యమంగా పని చేస్తున్నామని స్థాని క ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మండలంలోని ల్యాబర్తిలో జరిగిన గురుపూజోత్సవం కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘బడి మనదే..బాధ్యత మనదే’ కార్యక్రమంతో నియోజవకర్గంలోని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశామని తెలిపారు. దా తల సహకారంతో నిధులు సమకూర్చి అభివృద్ధి కా ర్యక్రమాలు చేశామని వెల్లడించారు. మన గురువులను మనం గౌరవించుకోవాలని విద్యార్థుల్లో స్ఫూర్తినికల్పించడానికి గురువులకు ఆత్మీయ సన్మానం చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లోని 1550 ఉపాధ్యాయుల కు, విద్యావలంటీర్లకు ఒకే రోజున సన్మాన కార్యక్రమం చేసినట్లు వెల్లడించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నా యకులను భాగస్వామ్యం చేశామన్నారు. ఎంపీ పీ మార్నెని రవీం దర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, తహసీల్ధార్ కనకయ్య, ఎంపీడీఓ ఎం. శ్రీనివాసరావు, సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్, సర్పంచ్ తక్కళ్లపెల్లి విజయ, ఎంపీటీసీ సభ్యుడు భూక్య శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మ న్, విద్యాభివృద్ధి కమటీ సభ్యులు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో హాజరైన ఎమ్మెల్యే... గురువుల ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి నియోజకవర్గంలోని మడికొండ, కొండపర్తి, ల్యాబర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. -
ప్రత్యేక ప్యాకేజీలపై ‘ఫైర్’
-
దగాపై కదనభేరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర పురోగతికి వరం లాంటి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో ప్రజలు మరోసారి దగా పడ్డారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాల కపట నాటకానికి తెరపడి, జైట్లీ ప్రకటన తో అసలు రంగు బయటపడడంతో జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెండున్నరేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నట్టు మభ్యపెట్టిన చంద్రబాబు తీరుపై కన్నెర్రజేస్తున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం గుప్పెట్లో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు ఇక ప్రత్యేక హోదా తేలేరన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సమైక్యాంధ్ర ఉద్యమ స్థాయిలో మరో పోరుకు సమాయత్తమవుతున్నారు. ఒకప్పుడు సొంతమామను వెన్నుపోటుపొడిచిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను కూడా అదే తరహాలో వంచించారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధిపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు సహా అన్ని వర్గాలూ చంద్రబాబు తీరును జీర్ణించుకోలేకపోతున్నాయి. పోరుబాటలో జగన్ ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచీ పోరాడుతూనే ఉన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ రెండేళ్లుగా ఢిల్లీలో, రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. జనం ఆకాంక్షల మేరకు మరో ఉద్యమానికి సన్నద్ధమౌతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న రాష్ట్రవ్యాప్త బంద్‌కు జగన్ పిలుపునిచ్చారు. కలిసి వచ్చే అన్నివర్గాలనూ సమన్వయం చేసుకుంటూ బంద్‌ను విజయవంతం చేయడంతోపాటు తదుపరి కార్యాచరణకు కూడా పార్టీ కసరత్తు చేస్తోంది. హోదా లేకుంటే జిల్లాకు అపారనష్టం ప్రత్యేక హోదా లేకుంటే అపార సహజవనరులు కలిగి, రేవు కార్యకలాపాలు, రైల్వే రవాణా, అనేక పరిశ్రమల ద్వారా ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధిస్తున్న జిల్లాకు తీవ్రనష్టమే. ఇప్పటికే ప్రభుత్వపరమైన ప్రోత్సాహం, రాయితీలు లేకపోవడంతో నత్తనడకన జరుగుతున్న అభివృద్ధి ప్రస్తుత పరిస్థితుల వల్ల మరింత కుంటుపడే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఎస్ఈజడ్ ద్వారా ఎన్నో పరిశ్రమలు వస్తాయన్న ఆశ కూడా అడుగంటిపోయే పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్న ఆశకూడా అడియాసే అన్న భావన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. కేజీ బేసిన్లో అపార చమురు నిక్షేపాలున్నందున ఇక్కడ పెట్రోలియం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ఇప్పుడు అవి కూడా రాని పరిస్థితి ఉందంటున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే రాయితీలు అవసరం. హోదాతోనే ఇవి సాధ్యమవుతాయి. ప్రత్యేక హోదాతో రాయితీలతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వచ్చి తామూ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కుతాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు. -
ఎగసిన ఉద్యమం
-
జీజీఎస్ వద్ద కొనసాగుతున్న ఆందోళన
గొల్లపాలెం (మలికిపురం) : గ్రామాభివృద్ధి విషయంలో ఓఎన్జీసీ వైఖరికి నిరసనగా మలికిపురం మండలం గొల్లపాలెంలో గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. జీజీఎస్ ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 25 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా వందలాది మంది మహిళలు, గ్రామస్తులు శిబిరం కూర్చొన్నారు. కాకినాడ డీఎస్పీ వి.విజయరావు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జీజీఎస్‌లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఓఎన్జీసీ అధికారుల తరపున గ్రామస్తులతో చర్చించారు. ఆయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల బావులు దెబ్బతినే అవకాశం ఉందని, బావులు మూసుకుపోతే ఒక్కొక్క బావిని మరలా తెరిచేందుకు రూ.కోటికి పైగా ఖర్చవుతుందని ఓఎన్జీసీ అధికారులు ఆందోళన చెందుతున్నట్టు వివరించారు. కొన్ని ట్యాంకులు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చి, స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు భీష్మించారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు సెప్టెంబర్ ఒకటో తేదీన వస్తారంటున్నారని చెప్పారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామం నుంచి కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తరలించుకు పోతున్న ఓఎన్జీసీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు ఈ ఆందోళన చేపట్టారు. డీఎస్పీ వైఖరితో ఉద్రిక్తత : ఎమ్మెల్యే ఆగ్రహం మలికిపురం : గొల్లపాలెం ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీజీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులను బలవంతంగా తొలగించేందుకు కాకినాడ డీఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పోలీసులు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఫోన్లో తెలిపారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమ్మెల్యే సూర్యారావు డీఎస్పీతో పాటు ఓఎన్జీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తుల పోరాటం చేస్తుంటే, వారి ఆవేదన వినేందుకు ఒక్క ఓఎన్జీసీ అధికారి కూడా రాకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. లాఠీ చార్జీ చేస్తే.. ముందు తనపై చేయాలని చెప్పారు. ఓ కేంద్ర మంత్రి హస్తం? గొల్లపాలెంలో ఉద్రిక్తతకు ఓ కేంద్ర మంత్రి వైఖరి కారణమని తెలుస్తోంది. గొల్లపాలెం జీజీఎస్‌లో ఆయనకు కాంట్రాక్టు ఉందని, ఈ ఆందోళనల వల్ల ఆయన పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఆ మంత్రి.. కలెక్టర్, ఎస్పీలకు ఫో¯Œæలో హుకుం జారీచేశారని, దీంతో పోలీసులు, స్థానిక ఓఎన్జీసీ అధికారుల చర్యల వల్ల ఉద్రిక్తత ఏర్పడినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. -
చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
ఆందోళన బాటపట్టిన చెన్నూర్ ప్రజానీకం మంచిర్యాల సిటీ : కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని చెన్నూర్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయం ఇన్చార్జి రాజేశ్వర్‌రావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ చెన్నూర్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే వేమనపల్లి, కోటపల్లి, జైపూర్ మండలాలతోపాటు చెన్నూర్ మండలవాసులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మండల వ్యవస్థ రాకముందు చెన్నూర్ తహసీల్ కేంద్రంగా ప్రజలకు సేవలందించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, అందుగుల శ్రీనివాస్ ఉన్నారు. -
జిల్లాల ఏర్పాటులో పారదర్శకత పాటించాలి
మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశ్ ఆసిఫాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పారదర్శకత, విధివిధానాలు పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశ్ అన్నారు. సోమవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాలను స్వాగతిస్తున్నామని, జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాల ఏర్పాటులో స్పష్టత లేదని, ప్రజలు కోరుకునే జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. రెడ్లు, వెలమల స్వార్థం కోసం మంచిర్యాల, నిర్మల్ జిల్లాలుగా ప్రకటించారని విమర్శించారు. నిర్మల్‌జిల్లా కావాలని జిల్లా ప్రజలు కోరడం లేదని, వద్దని ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. నైజాం కాలంలో జిల్లా కేంద్రంగా కొనసాగిన ఆసిఫాబాద్‌ను, బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసినా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఆసిఫాబాద్‌లో ఐటీడీఏ పీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు పిడుగు శంకర్, జాడి గణేశ్, ఏఐవైఎఫ్ జిల్లా అద్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు. -
ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి..
నగరంలో బెంబేలెత్తిస్తున్న వానర సైన్యం ఆందోళనలో మహా నగర వాసులు గ్రేటర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయ లోపం కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల బిల్లుల చెల్లింపులో జాప్యం వరంగల్ అర్బన్ : అడవుల శాతం తగ్గిపోవడంతో ఊర్లలోకి కోతులు వచ్చేశాయి.. అయితే, వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా? నగరంలోని పలు ఇళ్లను పీకి పందిరేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు పట్టే పని అప్పగించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో చేతులెత్తేశాడు. ఫలితంగా నెల రోజుల నుంచి కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహా నగర పాలక సంస్థ పరిధిలో ఒక కోతిని పట్టుకున్నందుకు గాను రూ. 450 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. పొరుగు రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కోతులు, కుక్కలను పట్టే కాంట్రాక్టు తీసుకున్నారు. దీనికోసం సదరు కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వారు బాగా సమస్య ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేసి అందులో అరటి పండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇలా పట్టుకున్న కోతులను వారానికికోసారి నగరానికి దూరంగా భూపాలపల్లి, కాళేశ్వరం, ఏటూరునాగారం, పాఖాల కొత్తగూడెం అడవుల్లోకి తరలిస్తారు. అందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్టర్ కోతికి రూ.450 చొప్పున బల్దియా నుంచి బిల్లులు చెల్లించాలి. కానీ కొన్నిరోజులుగా బిల్లులు చెల్లించని కారణంగా సమస్య మళ్లీ మెుదటికొచ్చింది.] నాలుగు నెలలు.. 900 కోతులు గత నాలుగు నెలల కాలంలో పదమూడు వందల కోతులు పట్టుకున్నట్లు బల్దియా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంగా 900 పైగా కోతులు పట్టుకున్నట్లు వివరాలు ఉన్నాయి. ఒక కోతిని పట్టుకుని బల్దియా వాహనంలో ఏటూరునాగారం అడవుల్లో వదిలేసినందుకు కాంట్రాక్టర్‌కు రూ.450 చొప్పన చెల్లిస్తున్నారు. గత రెండు నెలలుగా 900 కోతులకు సంబంధించిన రూ.4.05లక్షల సొమ్మును సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. దీంతో నెల రోజులుగా ఆ కాంట్రాక్టర్ కోతులు పట్టుకోవడం మానేశారు. దీంతో నగరంలో కోతుల సమస్య జఠిలంగా తయారైంది. ఇది పక్కన పెడితే కోతులను ఎప్పటికప్పుడు అడవుల్లో వదిలేస్తుండగా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అయినా, మళ్లీ కోతులు పెద్దసంఖ్యలో ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు సమస్యల మూలాలపై దృష్టి సారించడంతో పాటు కాంట్రాక్టర్‌కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని నగర వాసులు కోరుతున్నారు. ఏ కాలనీలో చూసినా కోతుల గుంపులే... వానర సేనలు గుంపులు గుంపులుగా నగరంలో సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. బజారుకు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో మీద పడి చేతుల్లో ఉన్న కవర్లు, సంచులను లాక్కుంటున్నాయని నగర వాసులు వాపోతున్నారు. ఒకటో, రెండో కాకుండా పదుల సంఖ్యలో వానరాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి ఇంటిలో ఉన్న పండ్లు, కూరగాయల తదితర సామాగ్రిలు ఎత్తుకుపోతున్నాయని చెబుతున్నారు. ఎక్కడెక్కడ అంటే.. ట్రైసిటీ పరిధిలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. వరంగల్‌లోని గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట, చౌర్బౌళి, పిన్నవారి వీధి, రామన్నపేట, పాపయ్యపేట చమన్, పోచమ్మమైదాన్, ఎల్బీ నగర్, కాశిబుగ్గ, క్రిస్టియన్ కాలనీ, గాంధీనగర్, అబ్బనికుంట, చింతల్, ఏ.సీ.రెడ్డి నగర్, శివనగర్, పెరకవాడ, ఖిలా వరంగల్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్.తోట, ఉర్సు, రంగశాయిపేట, వరంగల్ రైల్వేస్టేçÙన్, ఎల్లంబజార్, ప్రాంతాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇంకా హన్మకొండలోని కాకాజీ కాలనీ, పింజర్ల వీధి, శ్రీనివాస కాలనీ, లక్ష్మీపురం, బ్రాహ్మణవాడ, పద్మాక్ష్మి కాలనీ, న్యూశాయంపేట, దీన్‌దయాళ్ నగర్, నాగేంద్ర నగర్, రాయపురతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్, విష్ణుపురి, సిద్ధార్థనగర్ తదితర ప్రాంతాల్లో కోతులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజులుగా పట్టుకోవడం లేదు.. కాంట్రాక్టర్‌కు బిల్లుచెల్లింపులో జాప్యమైన విషయం వాస్తవమే. దీంతో సదరు కాంట్రాక్టరు గత పక్షం రోజులుగా కోతులను పట్టుకోవడం లేదు. దీంతో ఫిర్యాదులు పెరిగాయి. నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల చెక్కు ఇప్పిస్తాం. ఆ వెంటనే కోతులు పట్టుకునేలా చర్యలు వేగవంతం చేస్తాం. – బాలముని, బల్దియా ఈఈ -
ప్రజాగోడు పట్టని ప్రభుత్వం ఇది
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రైతు గర్జన పోస్టర్ల విడుదల నిర్మల్అర్బన్ : ప్రజల గోడును పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఆయన నివాసంలో భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలను అవలబిస్తోందని ఆరోపించారు. రైతు గర్జన పోస్టర్ విడుదల.. ఈ నెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన పోస్టర్లను శనివారం డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు చేపడుతున్న రైతు గర్జన ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాద సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ హరినాయక్, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కల రమణారెడ్డి, నాయకులు జమాల్, అజార్, ముత్యంరెడ్డి, దినేష్, సంతోష్ తదితరులున్నారు. -
మిషన్ కాకతీయ అతిపెద్ద కుంభకోణం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపణ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన చేయాలని డిమాండ్ వినాయక్‌నగర్ : ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లాల పునర్విభజన జరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అతి పెద్ద కుంభకోణమని, ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాజీ ఎంపీ మధుయాష్కికి తగదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలకు దగ్గరవ్వాలనుకోవడం అవివేకానికి నిదర్శనమన్నారు. నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలని, లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జిల్లాలో డయేరియా, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే పల్లెలు, తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గతంలో డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించిన రోజే అమరుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. బీజేపీ నేతలు గంగోని గంగాధర్, సుధాకర్, నాగరాజు, కిషన్, రాజు, నరేశ్, విజయ్ కృష్ణ, రోషన్‌లాల్ బోరా, మనోజ్ పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.18 వేలకు పెంచా«లి
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, కనీసవేతనాల షెడ్యూల్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లుగా కార్మికుల కనీస వేతన చట్టాన్ని సవరించని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, పి.కిషోర్, చింతకాయల బాబూరావు, ఆర్.లింగరాజు పాల్గొన్నారు. -
కొండ చుట్టూ వాక్ పాత్
-
విద్యుత్ కోసం రాస్తారోకో
దహెగాం: చిన్నపాటి వర్షం వచ్చినా,గాలి వీచిన విద్యుత్ సరఫరా‡ నిలిపి వేస్తున్నారని రాత్రంతా అంధకారంలో మగ్గామని బీబ్రా గ్రామస్తులు మంగళవారం కాగజ్‌నగర్–దహెగాం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని రోజులు విద్యుత్ సరఫరా బీబ్రా గ్రామానికి సక్రమంగా చేయడం లేదన్నారు.సోమవారం రాత్రంతా చీకట్లోనే ఉన్నామని దోమల బాధ తీవ్రంగా ఉందన్నారు. అసలే వర్షాకాలం కావడంతో రాత్రి వేళల్లో బయటకి వెళ్లలేక పోతున్నామన్నారు. విషపురుగుల భయం అధికంగా ఉంటుందన్నారు. పలుమార్లు సమస్యను విద్యుత్ అధికారుల దష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌తో గ్రామస్తులు ఫోన్లో మాట్లాడగా బీబ్రా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను రెండు రోజుల్లో తీరుస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు ఏర్పాటు చేయాలి
దీక్షలను సందర్శించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ జనగామ : శాస్త్రీయంగా నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం మేరకే నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ సూచించారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను సోమవారం పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణతో కలిసి యాష్కీ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ జిల్లాల చిచ్చు తెరపైకి తీసుకువచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్నాడని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో ప్రాణాలు అర్పించిన అమరులు, ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు తీరిక లేదనే సీఎం, హరితహారంతో పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. ధనార్జనే ధ్యేయంగా టీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దీక్షలో ధర్మపురి శ్రీనివాస్, బ్రాహ్మణపల్లి రమేష్, ఉల్లెంగుల అబ్బసాయిలు, పట్టూరి శ్రీనివాస్, నరేందర్, శ్రవణ్‌కుమార్ కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల ద శమంతరెడ్డి, మంగళ్లపల్లి రాజు, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమా ర్, ఎండి అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, దూడల సిద్దయ్య, జక్కుల వేణుమాధవ్, వెన్నెం సత్యనిర ంజన్‌రెడ్డి, రంగు రవి, మాజీద్ ఉన్నారు. -
మురికి కూపాల్లో జనావాసాలు
ఇండ్ల మధ్యలో నిలుస్తున్న మురుగునీరు చిత్తడవుతున్న అంతర్గత రోడ్లు ప్రబలుతున్న వ్యాధులు పట్టించుకోని అధికారులు దిలావర్పూర్ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. 70శాతానికి పైగా ప్రజలు పల్లెలోనే జీవనం సాగిస్తున్నారు. అందుకే గాంధీజీ పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నాడు. కానీ ప్రస్తుతం పల్లెలను పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు. కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధే ధ్యేయం అంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారులు పల్లె ముఖం చూడడం లేదు. ఇందుకు తార్కాణమే మండల కేంద్రమైన దిలావర్పూర్ గ్రామం. దిలావర్పూర్ గ్రామంలో ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వ్యాధులు ప్రబలుతాయి అని జిల్లా అధికారులు తరచూ పేర్కొనే మాటలివి. వాస్తవానికి గ్రామంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రై నేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు ఇండ్ల మధ్యలో ప్రవహించి అంతర్గత రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన స్థానిక పంచాయతీ పాలకవర్గం, అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. సాక్షాత్తు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోని ఇండ్ల మధ్య మురుగునీరు ప్రవహించి ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో తీవ్ర దుర్గందంతో పాటు దోమల వ్యాప్తి అధికంగా ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే పలు వార్డుల్లో సైతం అంతర్గత రోడ్లు డ్రై నేజీలు లేని కారణంగా కురుస్తున్న వర్షాలకు జనావాసాలన్నీ కంపుకొడున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత వర్షా కాలంలో తాము ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నాం గామ్ గంగారాం, దిలావర్పూర్ తమ కాలనీలో అనేక రోజులుగా తీవ్ర సమస్యలు పడుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. మా ఇండ్ల మధ్య మురుగునీరంతా ఒకచోటికి చేరి తీవ్ర దుర్గందం వ్యాపిస్తోంది. దోమలు, ఈగల బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతూ జ్వరాల బారిన పడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి. రోడ్లు బురదగా మారుతున్నాయి – ఖలీం, దిలావర్పూర్ గ్రామంలో డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహించి రోడ్లన్నీ బురదగా మారుతున్నాయి. నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు అధికమయ్యాయి. దీంతో ఇండ్లలో నివసించాలంటేనే ఇబ్బందిగా ఉంది. పలుమార్లు పంచాయతీ వారికి తమగోడును విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దోమలతో వేగలేకపోతున్నం – చాతిరి లక్ష్మి, దిలావర్పూర్ రోడ్లు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండడంతో రోజూ ఇబ్బందుల పాలవుతున్నం. నాలుగు రోజులగా వర్షం పడుతోంది. దీంతో నీరు అంతా రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. సర్కారోళ్లు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుని రోగాల బారిన పడకుండా చూడాలి. చర్యలు చేపడతాం.... – సరస్వతి, కార్యనిర్వహణాధికారిణి, దిలావర్పూర్ గ్రామ శివారు కాలనీలతో పాటు గ్రామంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు బురదమయంగా ఉన్న మాట వాస్తవం. పరిస్థితి జఠిలంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి మురుగునీరు నిలువ ఉండకుండా చేసి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అలాగే ఇండ్ల మధ్యలో ఉన్న గుంతలను పూడ్చి నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపడతాం. నూతనంగా రోడ్లనిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణాన్ని సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం. -
ప్రజా భాగస్వామ్యంతోనే గ్రీనరీ
సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో రామ్ మోహన్‌రావు గుంటూరు వెస్ట్ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం ద్వారానే గ్రీనరీ సాధ్యమని సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో పి.రామ్ మోహన్‌రావు తెలిపారు. 2016లో అటవీశాఖ జిల్లాలో కోటీ 7 లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమ వివరాలను ఆయన వివరించారు. జిల్లాలో విస్తీర్ణంలో 14.58 శాతం అడవులు ఉన్నట్లు తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన జిల్లావ్యాప్తంగా 11 లక్షల 31 వేలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని నగరవనంలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. మొక్కలను పెంచాలని ఆసక్తి కలిగినవారు 1800 425 3252 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని, అవసరమైన మొక్కలను తీసుకుని వెళ్లవచ్చని ఆయన సూచించారు. -
అడ్డంగా బుక్కైన హర్యానా అధికారులు..!
గుర్గావ్ః విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగలాలు చిక్కాయి. ఓ కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లులను చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు లంచావతారాలు అధికారుల దాడుల్లో అడ్డంగా బుక్కయ్యారు. కాంట్రాక్టర్ వద్దనుంచీ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానాలోని రివారీలో విజిలెన్స్ బ్యూరో అధికారులకు అవినీతి చేపలు చిక్కాయి. ప్రజారోగ్య శాఖకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. కోస్లీలోని పబ్లిక్ హెల్గ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్డీవో రాజ్ కుమార్, జూనియర్ ఇంజనీర్ దల్బీర్ సింగ్ బురా, సీనియర్ గుమాస్తా గుల్షన్ కుమార్ లు, స్థానిక కాంట్రాక్టర్ ఆనంద్ ప్రకాశ్ వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.. లంచావతారాలను అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకున్న డబ్బు ఎస్డీవో నుంచి 9000, ఇంజనీర్ నుంచి 6000, క్లర్క్ నుంచి 2500 లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అకౌంటెంట్ అనిల్ కుమార్ సహా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటిండెంట్ ఇంజనీర్లకు సైతం ఒక్కోరికీ 9 వేలు చొప్పున లంచం చెల్లించేందుకు బురా సిద్ధంగా ఉండగా.. అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ డీఎప్పీ నరేష్ కుమార్ తెలిపారు. కాంట్రాక్టర్ ఆనంద్.. తనకు రావాల్సిన 6 లక్షల రూపాయల బిల్లును క్లియర్ చేసేందుకు సదరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళిక ప్రకారం దాడిచేసి లంచగొండి అధికారులను అరెస్ట్ చేశారు. -
పరిశ్రమల స్థాపనకు ప్రజాపోరాటాలు
రాజంపేటః వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాపోరాటలే శరణ్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి అన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలంటూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీడీపీ పాలన రెండేళ్లలో జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జిల్లాకు ఏమైనా చేయాలంటే అది ఒక్క వైఎస్సార్సీపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాతే సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం తనయుడు లోకోష్ డైరక్షన్లో కార్పొరేట్ పాలిట్రిక్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధి లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందన్నారు. 2007లో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో బ్రహ్మిణి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరగడంతో సీమవాసుల ఆశలు చిగురించాయని, ఆ ఆశలు నేడు నీరుగారాయని పేర్కొన్నారు. పంచాయతీ, మండలపరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లాలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి శంకుస్థాపన చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సహాయకార్యదర్శి టీ.రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మా వెతలు పట్టవా!
తాగునీరులేక ఇబ్బందులు పడుతున్నాం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వర్షం పడితే నడవలేని పరిస్థితి ప్రభుత్వ తీరుపై ప్రజల మండిపాటు ‘గడప గడపకూ వైఎస్సార్’లో వైఎస్సార్ సీపీ నేతలకు గోడు టీడీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మంగళవారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. ‘సమస్యలు పరిష్కరించాలని స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్తే.. నిధులు రావడంలేదు. మమ్మల్నేం చేయమంటారు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని వాపోయారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిలో పార్టీ నియోజకవర్గ అదనపు కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, చీకట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాగునీరు అందించాలని యామన మాణిక్యం అనే మహిళ కోరింది. అలాగే తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు పింఛను రాలేదని, ఉపాధి పనుల కూలీ రూ.10 వేల వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ వీధిలో రోడ్డు నిర్మించాలని గుడాల లక్ష్మి కోరింది. మండపేటలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని 15వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, గృహ నిర్మాణ రుణాలు, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం తదితర సమస్యలను స్థానికులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు వేగుళ్ల వెంట ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని 14, 15 వార్డుల్లో కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, దందాలు, దోపిడీని ప్రజలకు వివరించారు. గొల్లప్రోలు, పిఠాపురం పట్టణ కన్వీన ర్లు పర్ల రాజా, బొజ్జా రామయ్య, పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌సెక్రటరీ , ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం సీతారామపురం గ్రామంలో పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం సరిగా లేదని, విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం గ్రామంలో రెండో రోజు ఈ కార్యక్రమం నియోజవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా బ్యాలెట్ పత్రాలను అందజేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, నియోజవర్గ కార్యనిర్వహక కార్యదర్శి మోకా రాఘవులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, కార్యవర్గ సభ్యులు మొండి రమేష్‌బాబు, గెడ్డం జీవన్‌కుమార్, జున్నూరి బాబి పాల్గొన్నారు. రాజానగరం మండలం సీతారామపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నిర్వíß ంచారు. గతంలో వస్తున్న పింఛన్లు తీసేశారని, వికలాంగులు, వృద్ధులు వాపోయారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. మండల కన్వీనర్ బంగారపు వీర్రాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు అడబాల చినబాబు, మండల రైతు విభాగం కన్వీనర్ పిక్కిరెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట మున్సిపాలిటీలోని 15వ వార్డులో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు మంజూరు కాకపోవడంతో మూడేళ్లుగా పునాదులతో ఉన్నాయని, వార్డులో అనేక మందికి వికలాంగ, వితంతువులకు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీరాఘవరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బంగారు కృష్ణ, బొబ్బరాడ సత్తిబాబు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. తట్ట మట్టి కూడా ఇవ్వలేదు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కలవచర్లలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెంకుటిల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నా ఇంటి రుణం మాత్రం మంజూరు చేయడం లేదని చండ్రమళ్ల నాగమణి ఆరోపించింది. తమ పూరింటిని మెరక చేసుకుందామంటే నీరు–చెట్టు పథకం కింద ఒక తట్ట మట్టి కూడా సరఫరా చేయలేదని బుంగ రాజు దంపతులు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అక్కరకు రావడం లేదంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. -
బాధ్యత... భరోసా
సామాజిక సేవలో పోలీసులు జనమైత్రి ద్వారా జనంతో మమేకం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చెన్నూర్ : ఖాకీ చొక్కా తొడిగి ధర్మాన్ని కాపాడుతారు. లాఠీ పట్టి నేరస్తుల బెండు తీస్తారు. తలపై ధరించిన టోపీలోని సింహాల్లా సమాజంలోని మానవ మృగాల బారి నుంచి సామాన్యులను రక్షిస్తారు. 24 గంటలు 7 రోజులు 365 రోజులు శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమవుతారు. సమాజాన్ని డేగ కన్నులతో పహారా కాస్తారు. పీ ఫర్ పోలీస్... పోలీస్ ఫర్ పబ్లిక్.. జనంతో మమేకమవుతున్న పోలీసులపై ఈ కథనం. ప్రజల సేవలో మేము సైతం అంటూ ‘జనమైత్రి’ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు మీలో ఒకరేననే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక సేవకులని చాటి చెప్పేందుకు నేడు జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికో జనమైత్రి పోలీసు అధికారిని నియమించారు. ఆయా గ్రామాల్లో జనమైత్రి గ్రామసభలు నిర్వహించి ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం సత్వరమే గ్రామాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు జనమైత్రి పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గ్రామ అభివద్ధికి ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నప్పటికీ ఇతర అభివృద్ధి పనుల్లో జనమైత్రి పోలీసు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. యువతకు ప్రోత్సాహం గ్రామాలలోని నిరుద్యోగ యువతపై జనమైత్రి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అన్ని ఉండి అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువతను ప్రోత్సహిస్తున్నారు. వారి లోని ప్రతిభను వెలికితీసేందుకు పలు పోటీలను నిర్వహిస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామస్తులను కోరుతున్నారు. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు. -
గుజరాత్లో అమానుషం
-
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
'ఇలాంటి రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన స్నాతకపూర్వ(బీఏ)విద్యతోపాటు, స్నాతకోత్తర విద్య(పీజీ)ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హత గురించి అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని వెల్లడించారు. 'ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి' అని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో మోదీ బీఏ పూర్తి చేశారన్నది అవాస్తవం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ జియో 4G సేవలు ప్రారంభం...కానీ..
దేశంలో సెల్ వినియోగంలో విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎట్ట కేలకు తన జీయో సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించింది. సాధారణ ప్రజలకు 4జీ సేవలను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడో మెలిక ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఆహ్వానం ఉంటేనే జియో సిమ్ కొనుక్కోవడానికి వీలవుతుంది. లేదంటే రిలయన్స్ డిజిటల్లో లైఫ్ మొబైళ్లను కొనుగోలు చేసినా, ఈ జియో 4జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే ఈ మొబైల్స్ మొబైళ్లు రూ.5,599- 19,499 ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్యపరమైన ప్రారంభానికి దగ్గరపడుతున్న నేపథ్యంలో..మా నెట్‌వర్క్‌ను పరీక్షించేందుకు వీలుగా ఆప్తులకు, సన్నిహితులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నామని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా రిలయన్స్ జియో 4జీ సిమ్ లేదా లైఫ్ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థ ఉద్యోగి గరిష్ఠంగా 10 మందిని ఆహ్వానించవచ్చు. కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు 90 రోజుల పాటు అపరిమిత 4జీ మొబైల్ ఇంటర్నెట్, ఫోన్ కాల్స్‌ను కంపెనీ అందిస్తుంది. అన్నట్టు ఈ సేవలను యాక్టివేట్ చేసుకునేందుకు ఆహ్వానం పొందిన వ్యక్తి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు జియోకు చెందిన 4జీ యాప్‌లు జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియోమ్యాగ్, జియో బీట్స్, జియో డ్రైవ్ వంటి వాటిని 90 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అటు ప్రయోగాత్మక దశ(ట్రయల్ ఫేజ్) లో తమ నెట్‌వర్క్‌ను 5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నారని ఆర్ ఐఎల్ ఇటీవల ప్రకటించింది. మొదటి నెలలో 18జీబీకిపైన, అలాగే 250 నిమిషాలకు పైగా వాయిస్ సర్వీసులను వాడుకుంటున్నట్టు తెలిపింది. ఇకో ఫ్రెండ్లీ దిశగా తమ ప్రయోగాలు సాగుతున్నాయని పేర్కొంది. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ.200లు ఖరీదు చేసే సిమ్ ద్వారా 75జీబీ 4జీ డేటాతో పాటుగా 4500 నిముషాల ఫ్రీ కాల్స్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
దండ... దండనం!
ట్రాఫిక్-టాపిక్ మూత్రాతురాణాం న భయం న లజ్జ.ఇలా అయితే ఎలా అన్నది సమాజం వర్రీ. ఎక్కడ పడితే అక్కడా...? ఇదీ పోలీసుల క్వెర్రీ. ఒక దశకు వచ్చాక క్లాస్‌లో చిటికనవేలు చూపించడానికే బిడియపడతామే! మనమే పబ్లిక్‌లో ఇలా చేస్తే ఎలా? అందుకోసమే పోలీసులు వెరైటీగా దండతో దండిస్తున్నారు. కుక్కలు కూడా ఈమధ్య స్తంభాలపైకి కాలెత్తడం లేదు. అలాంటిది మనుషులమైన మనం దిక్కులు చూడకుండా ఇలా చేయడం సబబు కాదేమో ఆలోచించమంటున్నారు మన సికింద్రాబాద్ పోలీసులు. అంతేకాదు... తమదైన శైలిలో ఖాకీగిరీ చేయకుండా గాంధీగిరీ చేసి మరీ యోచించమంటున్నారు. ఈ ఖాకీగిరీ ఏమిటా అనే సందేహం మిమ్మల్ని పట్టి పీడించి, ఝాడించి, వేధిస్తుంటే ఈ నాలుగు ముక్కలూ చదవాల్సిందే. ముంబైకి బిజినెస్‌మ్యాన్ రూపంలో ప్రిన్స్ మహేశ్‌బాబు వెళ్లినట్లుగా మన రాష్ట్రాలకు ఎవరూ రాలేదు. అయినా కొంతమంది మూత్రాతురులు గోడల్ని అదేపనిగా తడిపేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ వెళ్లండి... ఆరోగ్యానికి అదే లాభదాయకం అన్నా వినడం లేదు. పక్కలకైనా చూడకుండా, మహిళలు ఎవరైనా వస్తున్నారా అనే ధ్యాస కూడా లేకుండా గోడవారగా నిలబడి మూత్రవిసర్జనం గావిస్తున్నారు కొందరు ఆత్రపరులు. అవేమైనా అప్పుడే కొత్తగా కట్టిన సిమెంట్ గోడలా క్యూరింగ్ చేయడానికి? ఈ జబ్బును క్యూర్ చేయడం ఎలా అని ఆలోచించారు మహంకాళి పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి. అంతే... ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమల్లోకి వచ్చాక ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాల్సిందే. అదే సమయంలో అల్పబుద్ధుల తాలూకు అల్పాచమనం అరికట్టాల్సిందే. అందుకు ఇన్స్పెక్టర్ రామస్వామికి ఒక ఉపాయం తట్టింది. దానికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. పరిసరాలెరగకుండా ప్రకృతి పిలుపునకు పరవశించిపోయేవారి పని పట్టాలనుకున్నారు. ప్రకృతిలోనే బహిరంగ విసర్జనకు పాల్పడుతుండేవారిని గుర్తించేందుకు కొందరు సిబ్బందిని నియమించారు. వారు సికింద్రాబాద్ బస్‌స్టాప్‌లోనూ, ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ సిగ్గుపడకుండా చిటికెనవేలి పనిని కానిస్తున్న వారిని చూశారు. కొట్టలేదూ... తిట్టలేదు. దండ వేసి, దండం పెట్టారంతే. పాటలూ అవీ ఏవీ పాడకుండానే ‘మా మూత్రవీరులకూ మంచిపూదండా’ అంటూ సెలైంట్ సందేశం ఒకటి పంపించారు. అంతే... జనాలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లను మడుగులా మార్చడానికి మాది గుండా, చెరువా అని సిగ్గుపడేలా చేశారు ఆ ఇన్స్పెక్టర్. దండ దండనానికి దడిసిపోయిన మూత్రాసురులు నలుగురూ తిరిగే రోడ్డును మరెప్పుడూ మురికిచేయబోమంటూ సిగ్గులమొలకలైపోతూ చెబుతున్నారు. ఇలా రోజూ సన్మానం చేయించుకునేవారి సంఖ్య కనీసం పదిహేను మందివరకూ ఉంటుందంటున్నారు ఇన్స్పెక్టర్ రామస్వామి. ‘‘ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ పీక్ అవర్స్. ఆ సమయంలో మేం ట్రాఫిక్‌కు అవరోధం కల్పించము. ఆ తర్వాతే రోడ్డు మీద ఈ రకమైన చిటికెనవేలి ఘనాఘన విసర్జనపరులను సత్కరిస్తున్నాం. ఇలా చిటికెలో ముగించవచ్చులే అనుకునే చిటికెనవేలి వీరులను సన్మానించడం వల్ల రోడ్డు మీద ఈ వ్యవహారం క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు కూడా సికింద్రాబద్‌లోని ప్యాట్నీ సెంటర్లో ఈ సత్కార సత్కార్యాన్ని చేశాం. ఇలా ఈ శుక్రవారం వరకు కొనసాగిస్తాం’’ అన్నారు ఇన్స్పెక్టర్ రామస్వామి. అంతేకాదు... ఆయన వినూత్న కార్యకలాపాల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచేలా ఇంకొన్ని విధులూ ఉన్నాయి. ‘‘ట్రాఫిక్‌లో ద్విచక్రవాహనాలపై హెల్మెట్ లేనివాళ్లను ఆపుతున్నాం. అయితే వాళ్లకు మేం జరిమానాలు వేయడం వంటివి చేయడం లేదు. సుప్రీం కోర్టు పేర్కొన్న హెల్మెట్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాదు... ఇదే సమయంలో హెల్మెట్ పెట్టుకొని ఉన్న వారిని అభినందిస్తూ, వాళ్లకు ‘చాక్లెట్’లను బహూకరిస్తున్నాం’’ అని అన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి. -
వెధవపని చేస్తే.. కొత్త సత్కారం!
ప్రకృతి పిలుస్తోందని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి ఓ హెచ్చరిక. ప్రభుత్వం ఫుట్‌పాత్‌లపై బయో టాయిలెట్లను వినియోగించుకోకుండా రోడ్డు పక్కన పని కానిచ్చేరు ఓ మారు వెనక్కు తిరిగి చూసుకోండి. ఎందుకంటే మీ పని కానిచ్చే లోపు మీకు సత్కారం చేయడానికి ఒక దండ పట్టుకుని సిద్ధంగా ఉంటారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే వారిలో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ ‘సత్కారం’ చేస్తున్నారు. స్టేషన్ చుట్టు పక్కల బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరో సారి ఇలాంటిది చేయవద్దని హితబోధ చేస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరం కోసం కృషి చేస్తుంటే.. ఇలా రోడ్లను అపరిశుభ్రం చేయడం మంచిది కాదని చెబుతున్నారు. - రాంగోపాల్‌పేట్ -
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...
ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే' పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది. హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్ వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి. -
నేడు కాకినాడలో వైఎస్ఆర్సీపీ 'యువభేరీ'..
-
భర్తను వీర ఉతుకుడు ఉతికింది...
మరో మహిళతో జల్సా చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వీర ఉతుకుడు ఉతికింది పెరూవియన్ మహిళ. ఓ బార్లో ప్రియురాలి చేతిలో చేతులు వేసి ఊసులాడుతున్న భర్తను అందరూ చూస్తుండగానే చితక్కొట్టింది. ఇంట్లో స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పి...బయట మరొకామెతో రొమాన్స్ చేయటాన్ని తట్టుకోలేని భార్య శివమెత్తిపోయింది. తనకు, తన పిల్లలకు అన్యాయం చేస్తున్న భర్తను జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొరడాతో చితకబాదింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. సుజానా వాస్క్వెజ్ అనే మహిళ... భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెట్టింది. ఇందుకోసం ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకుంది. స్నేహితులతో కలిసేందుకు వెళుతున్నానని భార్యకు మాయమాటలు చెప్పిన అతగాడు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి స్థానికంగా ఉన్న బార్లో విందులో మునిగి తేలుతున్నాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటంతో అతడిని సుజానా ఫాలో అయింది. భర్త... ప్రియురాలితో కలిసి ఉన్న దృశ్యం కంటబడింది. అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొంతమంది స్థానికుల సహాయంతో మొగుడిని బయటకు లాక్కొచ్చింది. కొరడా తీసుకుని రఫ్పాడించింది. ఈ మొత్తం దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. 'నీ పిల్లలకు తినడానికి తిండి లేదు.. ఇక్కడ నీవు జల్సాలు చేస్తున్నావా.. నీ తల్లిని మోసం చేశావు.. నాకు, నా పిల్లలకు ద్రోహం చేశావు.. నీ అంతు చూస్తానంటూ' సుజానా ఆగ్రహంతో, నిస్పహాయంగా రోదిస్తున్న తీరు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయాలో లేదో తెలియక పోలీసులు అయోమయంలో పడిపోయారట. -
హోదాను చట్టంలో చేర్చని కాంగ్రెస్
-
రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్
గొలుసు దొంగల బీభత్సం - రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్ - బాధితుల్లో మాజీ మంత్రి అత్తయ్య సాక్షి, హైదరాబాద్: రాజధానిలో చైన్ స్నాచర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 11 ప్రాంతాల్లో 40.5 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు అత్తయ్య సత్యవతి (76) కూడా ఉన్నారు. ఫిలింనగర్‌లోని ఓ గుడిలో దైవ దర్శనం చేసుకుని కారు కోసం వేచి చూస్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చి ఆమె మెడలోని 4 తులాల గొలుసు లాక్కెళ్లారు. ఇది గమనించిన కారు డ్రైవర్ వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దారిలో ముందుకు వెళ్లిన దుండగులు.. ఫిలింనగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి (30) రోడ్డు దాటుతుండగా ఆమె మెడలోని రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు. వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా.. దోమలగూడ హౌసింగ్ బోర్డు నివాసి రమాదేవి (65) ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు.. ఆమె మెడలోని 5 తులాల గొలుసు అపహరించారు. చిక్కడపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో నివసించే సునీత.. అశోక్‌నగర్‌లోని ఓ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెళ్లి వస్తుండగా ఇద్దరు దుండగులు 9 తులాల మంగళసూత్రం లాక్కెళ్లారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన స్వప్న (36) తన కుమారుడిని స్కూల్‌కు పంపించి వస్తుండగా ఆమె మెడలోని మూడు తులాల గొలుసును దుండగులు తీసుకెళ్లారు. కేపీహెచ్‌బీ నివాసి మల్లేశ్వరి (55) తన మనవడిని స్కూల్లో దించి వస్తుండగా రెండు తులాల చైన్ లాక్కెళ్లారు. అదే ప్రాంతానికి చెందిన జలజ (50) కూరగాయలు కొనుక్కుని వస్తుండగా ఆమె మెడలోని నల్లపూసల హారాన్ని దుండగులు తీసుకెళ్లాలని ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఒక తులం మాత్రమే వారు తీసుకెళ్లారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. బల్కంపేట డివిజన్‌కు చెందిన అంబిక నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు అగంతకులు.. 4 తులాల గొలుసు తెంచుకెళ్లారు. దారుస్సలాం సేవక్‌నగర్ నివాసి స్వరూపమ్మ ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్తుండగా ఓ దుండగుడు మూడున్నర తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. సనత్నగరర్లోని జెక్‌కాలనీకి చెందిన సువర్చల (52) ఉదయం మెడికల్ షాప్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 7 తులాల గొలుసులు ఎత్తుకెళ్లారు. సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా చైన్‌స్నాచర్ల ఫొటోలను విడుదల చేశారు. కాగా, ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురంలో మంగళవారం రాత్రి దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. అయితే అది రోల్డ్ గోల్డ్‌గా తేలింది. -
రహ‘దారి’ కష్టాలు
- రోడ్లు తెగినా పట్టించుకోని అధికారులు - 20 గ్రామాల వాసులకు ఇబ్బందిగా ప్రయాణం - ఆందోళనలో పల్లె జనం కెరమెరి : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పరంధోళి గ్రామపంచాయతీ ప్రజలను రహదారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాలి బాటే వారికి శరణ్యమైంది. సరిహద్దులోని తెలంగాణలోని పంచాయతీకి చెందిన ఆరు గ్రామాలతోపా టు మహారాష్ట్రకు చెందిన మరో 14 గ్రామాల ప్రజ లు ఇదే మార్గంలో మీదుగా ఆదిలాబాద్ వెళ్తారు. ఎక్కడిక్కడ రోడ్లు తెగిపోవడంతో వారి రాకపోకలు నిలిచి పోయాయి. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నార్నూర్, పరంధోళి మీదుగా జివితి, చంద్రాపూర్‌కు వెళ్లేది. రోడ్లు తెగిపోవడంతో 20 రోజులుగా బస్సు నిలిచిపోయింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పాలనలో ఉన్న పరంధోళి రోడ్డుకు మరమ్మతులు కరువయ్యాయి. పనులకు ఆటంకం ప్రతీ పనికి కెరమెరి, ఆదిలాబాద్ వంటి కేంద్రాల కు వెళ్లాల్సిన వారు వరద తెచ్చిన కష్టంతో ఇబ్బంది పడుతున్నారు. ఇరవై రోజులుగా రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. రోడ్ బౌండరీ అధికారుల దృష్టికి పలుమార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లినా.. చేస్తాం, చేస్తాం అనే సమాధానాలతో సరిపెడుతున్నారని పరంధోళి సర్పంచ్ వామన్ తెలిపారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారికి రావాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవా ల్సి వస్తోందని పేర్కొన్నారు. అరకొరగా ఉన్న రోడ్డుపై వాహనాలు నడిచి కాలం వెళ్లదీస్తుంటే భారీ వరదల వల్ల రవాణా సౌకర్యానికి అనేక ఇబ్బంది పడుతున్నామని సరిహద్దు వాసులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి.. తాము పడుతు న్న ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. -
మాట వినకుంటే..
- ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ మోసగాడి హెచ్చరికలు - తెలంగాణ, ఏపీలోనూ బెదిరింపు కాల్స్ - ఐఆర్ఎస్నంటూ టెండర్లు పొందిన వైనం - కైకలూరులో పోలీసులకు చిక్కిన కేటుగాడు కైకలూరు: ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్, ఐఆర్ఎస్ అంటూ ప్రజలను భయపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులకు గురువారం చిక్కాడు. తెలంగాణ, ఏపీలో ఇతగాడి మాయమాట లకు పలు శాఖలు ప్రొటోకాల్ సైతం కల్పించాయి. కైకలూరు మండలం ఆలపాడులో ఓ చేపల చెరువు వివాదంలో దంపతులను బెదిరించిన ఘటనలో పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కైకలూరులో సీఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో నిందుతుడి వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన పిడకల సురేష్ కుమార్ ఎంబీఏ చదివి 2008 వరకు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తర్వాత కేలాబ్ అనే పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను సరఫరా చేసే సంస్థను నెలకొల్పాడు. హైదరాబాదులోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్సు మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు తాను ఐఆర్ఎస్, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునంటూ టెండర్లు దక్కించుకున్నాడు. నకిలీ ఐడెంటిటీ కార్డుపై ఆఫీస్ అడ్రస్ రేస్‌కోర్టు రోడ్డు, కొయంబత్తూరు అని... ఇంటి అడ్రస్ ఎలిగేషన్ రోడ్డు, భరత్‌నగర్ కాలనీ, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద, కొయంబత్తూరు అంటూ ముద్రిం చుకున్నాడు. మధ్య మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్‌కంట్యాక్స్ కార్యాలయానికి వచ్చి... తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌నంటూ హుందాగా మాట్లాడడంతో అతను వచ్చినప్పుడల్లా పోలీసులు, రె వెన్యూ అధికారులు ప్రొటోకాల్ పాటించారు. తెలంగాణలో ఎక్కువగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా చిక్కాడు... కైకలూరు మండలం ఆలపాడు వద్ద నంగెడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి 2 ఎకరాల 70 సెంట్లను ఇదే గ్రామానికి చెందిన పెనుమూడి నాగ వెంకట లక్ష్మీనారాయణ దంపతులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో చేపల చె రువు ఉంది. శ్రీకాంత్ తిరిగి తన భూమి తనకు అమ్మాలని కోరుతున్నాడు. దీనికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. చివరకు శ్రీకాంత్ ఘరానా మోసగాడు సురేష్‌కుమార్‌ను ఆశ్రయించాడు. ఇతను లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తాను ఇన్‌కంట్యాక్స్ ఆఫీసరునని, మీ ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించాడు. ఈ విషయాన్ని దం పతులు గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్‌కు తెలుపగా ఆయన ఆదేశాలతో రూరల్ ఎస్సై రంజిత్‌కుమార్ వలపన్ని నకిలీ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 420, 170 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
పీఏసీఎల్‌పై సెబీ కొరడా
రూ.7,270 కోట్ల జరిమానా ముంబై: అక్రమంగా, మోసపూరితంగా ప్రజల నుంచి నిధులను సమీకరించినందుకు గాను పీఏసీఎల్, దాని నలుగురు డెరైక్టర్లపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 7,269.5 కోట్ల భారీ జరిమానా విధించింది. సామాన్యులను భారీగా మోసం చేసినందుకు కంపెనీపై సాధ్యమైనంత ఎక్కువ జరిమానా విధించడం అన్ని విధాలా సమంజసమేనని సెబీ వ్యాఖ్యానించింది. పదిహేనేళ్ల వ్యవధిలో ప్రజల నుంచి అక్రమంగా సమీకరించిన రూ. 49,100 కోట్లను వాపసు చేయాలంటూ గతేడాదే సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో పీఏసీఎల్ సవాల్ చేసినప్పటికీ.. దానికి చుక్కెదురైంది. ఇక, తాజా ఆదేశాల విషయానికొస్తే.. పీఏసీఎల్, దాని నలుగురు డెరైక్టర్లు.. తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రత భట్టాచార్య కలసి.. వ్యవసాయ భూముల కొనుగోళ్లు, అభివృద్ధి పేరిట సమష్టి పెట్టుబడి పథకాల కింద ప్రజల నుంచి అక్రమంగా నిధులు సమీకరించినట్లు తేలిందని సెబీ పేర్కొంది. తద్వారా.. ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే కంపెనీ రూ.2,423 కోట్ల మేర లాభపడిందని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలను మళ్లీ జరగకుండా కఠిన శిక్షలు, పెనాల్టీలు విధించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సెబీ ఇం త భారీ ఎత్తున పెనాల్టీ విధించడం ఇదే ప్రథమం. నిర్దేశిత మొత్తాన్ని 45 రోజుల్లోగా కట్టాలంటూ పీఏసీఎల్, డెరైక్టర్లను సెబీ ఆదేశించింది. -
ఇంటింటికీ ఇంటర్నెట్
- అంతా ఆన్‌లైన్‌మయం - ‘ఈ’ ద్వారా 300 సేవలు - ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు - అసెంబ్లీలో సీఎం జయలలిత వెల్లడి - ప్రతి పక్షాలకు ప్రసంగాల్లేవు - స్పీకర్ తీరుపై నిరసన - డీఎంకే, పీఎంకే, వామపక్షాల వాకౌట్ సాక్షి, చెన్నై: ప్రజలకు అన్ని రకాల సేవలు ఆన్లైన్ ద్వారానే అందించేందుకు సీఎం జె.జయలలిత నిర్ణయించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా మూడు వందల రకాల సేవల్ని అందించనున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవల్ని, ఆన్లైన్ టీవీ ప్రసారాలు కల్పించబోతున్నారు. చెన్నైలో ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ధనపాల్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి పక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తొమ్మిది రోజుల విరామంతో సోమవారం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ లేచి పెట్టుబడుల మహానాడు అని పెదవి విప్పగానే, స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని మాట్లాడే అవకాశం తర్వాత ఇస్తానంటూ నచ్చజెప్పారు. అలాగే పీఎంకే, సీపీఎం, సీపీఐ, పుదియ తమిళగం, కాంగ్రెస్ సభ్యులు తమకూ అవకాశం అంటూ పెదవి విప్పే యత్నం చేయగా, స్పీకర్ అడ్డుకున్నారు. ముందు సీఎం జయలలిత 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటన చేయబోతున్నారంటూ ప్రతి పక్షాల గళాన్ని నొక్కే యత్నం చేశారు. ఇంతలో సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన పాఠాన్ని అందుకున్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలసి భారత్ నెట్ పథకం ద్వారా గ్రామాల్ని అనుసంధానించేందుకు నిర్ణయించి ఉన్నదని వివరించారు. ఆ దిశగా రాష్ట్రంలో 12,524 గ్రామ పంచాయతీలను అనుసంధానించబోతున్నామని, ఇందు కోసం తమిళనాడు ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇందుకు గాను రూ.మూడు వేల కోట్లను ఖర్చు పెట్టనున్నామన్నారు. అలాగే, సమాచార వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని వివరిస్తూ, ఇంటర్నెట్ ఆవశ్యకత పెరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంటింటికీ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవల్ని అందించబోతున్నామని ప్రకటించారు. తద్వారా కేబుల్ కార్పొరేషన్ నేతృత్వంలో ఆన్లైన్ టీవీ ప్రసారాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించామని వివరించారు. ప్రస్తుతం ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు 36 రకాల సేవల్ని మాత్రమే అందిస్తున్నామని, ఇక మూడు వందల రకాల సేవల్ని అందించబోతున్నామని ప్రకటించారు. ప్రసంగాల్లేవు: సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన పాఠం ముగియగానే, మళ్లీ డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రసంగించేందుకు లేచారు. మళ్లీ స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని, సీఎం ప్రకటనపై కృతజ్ఞతల తదుపరి అవకాశం ఇస్తామంటూ బుజ్జగించే యత్నం చేశారు. దీంతో అన్నాడీఎంకే మిత్ర పక్షం కుడియరసు కట్చి ఎమ్మెల్యే సేకు తమిళరసన్, కొంగు ఇలైంజర్ కట్చి సభ్యుడు తనియరసు, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు కదిరవన్, మంత్రులు వలర్మతి, ముక్కూరు సుబ్రమణ్యం, స్పీకర్ ధనపాల్ కృతజ్ఞతలు తెలుపుతూ, తమ అమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ తంతు ముగియగానే మళ్లీ స్టాలిన్ పైకి లేచి మాట్లాడే యత్నం చేయగా, ఉదయాన్నే తమరు తన దృష్టికి పెట్టుబడుల వ్యవహారం గురించి తీసుకొచ్చారని, ఇది పరిశీలనలో ఉందని, ప్రభుత్వంతో చర్చించి మాట్లాడే అవకాశం ఇస్తాన ని పేర్కొనడంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టముట్టారు. అదే సమయంలో సభ నుంచి సీఎం జయలలిత బయటకు వెళ్లి పోయారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డీఎంకే సభ్యులు నినదించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పీఎంకే, పుదియ తమిళగం సభ్యులు సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినదించడంతో సభలో అరుపులు కేకలు దద్దరిల్లాయి. ప్రతిపక్షాల వాకౌట్ : అవకాశం ఇస్తాం..అవకాశం ఇస్తాం...అంటూ నచ్చచెప్పి, చివరకు పరిశీలనలో ఉందంటూ స్పీకర్ పేర్కొనడాన్ని స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. కాసేపు స్పీకర్‌తో వాగ్యుద్దానికి దిగారు. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. స్పీకర్ తీరుపై తీవ ఆగ్రహాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు. తదుపరి వాకౌట్ల పర్వం ఊపందుకుంది. కాంగ్రెస్ సభ్యుడు ప్రిన్స్, పీఎంకే సభ్యుడు గణేష్ కుమార్ సహాయం విచారణ గురించి ప్రస్తావించారో లేదో, అందుకు సమయం లేదంటూ స్పీకర్ కరాఖండీగా తేల్చారు. దీంతో ఆ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. తాము ఇచ్చిన సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని సీపీఎం శాసన సభా పక్ష నేత సౌందరరాజన్, సీపీఐ శాసన సభా పక్షనేత ఆర్ముగం స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఇవి కూడా పరిశీలనలోనే ఉన్నాయని స్పీకర్ చెప్పడంతో ఆ పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం పుదియ తమిళగం సభ్యుడు కృష్ణస్వామి కూడా వాకౌట్ చేయడంతో అధికార పక్షం సభ్యులు సభలో మిగిలారు. -
చవితి పాయసం చేదు!
రేషన్ దుకాణాలకు చేరని చక్కెర - పాయసానికి తీపి కరువు - పట్టించుకోని యంత్రాంగం ఘట్కేసర్ టౌన్ /వికారాబాద్ రూరల్: చవితి పండుగకు పేదోడికి పాయసం చేదెక్కినట్టే అనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న చక్కెర నేటికి రేషన్ దుకాణాలకు చేరుకోలేదు. దీంతో జనాలకు తిప్పలు తప్పేట్టు లేదు. గత నెలలో జరిగిన రంజాన్ పండుగకు నెలకు ఇచ్చే చక్కెరతో పాటు అదనంగా అరకిలో చక్కెరను అందజేసిన సర్కార్ చవితి పండుగకు మాత్రం మొండిచేయి చూపింది. ఎప్పటిలాగే నెలవారీగా ఇచ్చే చక్కెర కూడా గత నెలలో సగానికి పైగా అందలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పౌర సరఫరా శాఖ గోదాముల్లో నిల్వలు లేకపోవడంతో రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని తెలుస్తోంది. మూడు రోజుల్లో చవితి పండుగ ఉండగా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం. ఘట్కేసర్ మండలంలో 32,000 వేలు, జిల్లా మొత్తం 11.6 లక్షల ఆహార భధ్రత కార్డులున్నాయి. పేదోడిపై భారం... చవితి పండుగ పాయసం తయారీకి చిన్న కుటుంబానికి అయినా కిలో చక్కెర తప్పనిసరి. సివిల్ సప్లై ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆహార భద్రత కార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి అరకిలో చక్కెరను సర్కారు అందజేస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ. 30లు ఉండగా రేషన్‌షాపుల ద్వారా అరకిలో చక్కెరను రూ. 6.75లకు అందజేస్తోంది. ప్రతినెల 25 నుంచి డీలర్ల నుంచి డీడీలు స్వీకరించి ఒకటో తేదీ నాటికే రేషన్ దుకాణాలకు సరుకులు అందేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ముందు చూపు లేని ప్రభుత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడు.. గోదాములు నిండుకోవడంతో రేషన్ దుకాణాలకు చక్కెర నేటికి చేరుకోలేదు. దీంతో ప్రజలపై భారం తప్పేలా లేదు. జిల్లా ప్రజలకు చవితి పండుగకు సుమారు రూ. 35 లక్షలకు పైగా భారం పడనుంది. కాగా, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని పండుగల విషయమై అత్యుత్సాహం చూపిస్తున్న సర్కార్ చవితి పండుగను పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు అందజేస్తాం... చక్కెర నిల్వలు లేని కారణంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేకపోయాం. చవితిని దృష్టిలో ఉంచుకొని టెండర్ల ప్రక్రియను తొందరగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆదేశానుసారం చవితి పండుగకుఅరకిలో చక్కెరను అందజేస్తాం. అదనంగా ఇవ్వాలని ఆదేశాలు రాలేదు. ప్యాకింగ్ చేసే సమయం లేనందున డీలర్లకు నేరుగా సంచుల్లోనే పంపిస్తాం. - సత్యం, జిల్లా సివిల్ సప్లయి అధికారి -
‘ప్రత్యేక హోదా’ పై ప్రజలను చైతన్యం చేయండి
-
‘ప్రత్యేక హోదా’ పై ప్రజలను చైతన్యం చేయండి
- వైఎస్సార్సీపీ జిల్లా నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘ప్రత్యేక హోదా అంశాన్ని సీరియస్‌గా తీసుకోండి. హోదాపై వైఎస్సార్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలను చైతన్యం చేసేలా, హోదా దక్కకపోతే వారికి జరగబోయే నష్టం వారు తెలుసుకునేలా ఉండాలని’ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు గురువారం హైదరాబాదులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఈ నెల 26 నుంచి గుంటూరులో ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెడుతున్న నిరాహార దీక్షకు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి పౌరుడు తనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించేలా చేయాలని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పండి
- ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వస్తారు - బీజేపీకి ఓటుతోనే 12వ వార్డు అభివృద్ధి సాధ్యం - బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సాక్షి, బళ్లారి : బళ్లారి మహానగర పాలికెలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అలాంటి పార్టీకి ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జే.శాంత, బీజేపీ అభ్యర్థి శశికళతోపాటు వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నగరంలో 12వ వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. వార్డు పరిధిలోని కొలిమిచౌక్, రెడ్డికాలనీ, ఖాజాసాబ్ వీధి, అగసర వీధి తదితర కాలనీల్లో ఇంటింటా బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆయా కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా ప్రచారం చేయడంతో బీజేపీ నాయకులకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ... బళ్లారి నగరంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం జరగడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని గుర్తు చేశారు. ఎన్నికలు ముగిసినా తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వైపు కన్నెత్తి చూడరన్నారు. ఇలాంటి నేతలను నమ్మి ఓటు వేయవద్దని ఓటర్లు సూచించారు. బళ్లారి నగరాన్ని తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శశికళను గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు. బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జే.శాంత మాట్లాడుతూ... బళ్లారి నగరాన్ని గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు కార్పొరేటర్లు కూడా నగరాభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో నగరంలో అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా మారిపోయాయన్నారు. నగరాభివృద్ధి జరగాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యం అని పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీన జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శశికళను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థి శశికళ మాట్లాడుతూ... తనకు 12వ వార్డు ఓటర్లు, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి తదితర బీజేపీ నేతల ఆశీస్సులతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందని, వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రతి ఒక్కరు తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో శశికళ వృద్ధులకు పాదాభివందనం చేస్తూ ప్రచారం చేయడంతో అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్, జిల్లా బీజేపీ నాయకులు రామలింగప్ప, జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సుమారెడ్డి, మాజీ జెడ్పీ ఉపాధ్యక్షురాలు మంజమ్మ, బీజేపీ నాయకులు గురులింగనగౌడ, గాదిలింగనగౌడ, హనుమంతప్ప, మాజీ మేయర్ ఇబ్రహీంబాబు, వీరశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో.. నీటి ముప్పు!
సంగారెడ్డి పట్టణానికి నీటి ముప్పు పొంచి ఉంది.. మంజీర బ్యారేజ్‌లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు.. మరో మూడు రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సైతం మంజీరలో నీరు లేకపోవడంతో కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. - మంజీర బ్యారేజీలో అడుగంటిన నీరు - మూడు రోజులకు మాత్రమే సరిపడే దుస్థితి - సంగారెడ్డి పట్టణ ప్రజలకు తప్పని నీటి కష్టాలు - ప్రత్యామ్నాయం వైపు అధికారుల చూపు సంగారెడ్డి మున్సిపాలిటీ: మంజీర బ్యారేజీ (కల్పాగూర్ డ్యాం)లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. బ్యారేజ్ నుంచి సంగారెడ్డి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తదితర కాలనీలకు తాగు నీరు సరఫరా అవుతోంది. నీటి నిల్వలు తగ్గిపోడంతో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. మరో రెండు, మూడు రోజులకు మాత్రమే నీళ్లు సరిపోనుండటంతో.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పట్టణంలో ఉన్న చేతిపంపుల మరమ్మతులు, కొత్త బోర్ల తవ్వకాలు, సింగల్ఫేస్ బోరు మోటార్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణానికి మంజీరా నీటి సరఫరా పథకం మినహా మరోమార్గం లేకపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనుకున్నా మంజీరాలో నీరు లేకపోవడంతో అది సాధ్యం కాకపోవచ్చు. పట్టణంలోని వివిధ కాలనీలలో కొత్తగా బోర్లు వేస్తేనే నీటి సమస్యను కొంతమేర తీర్చవచ్చన్న ఉద్దేశంతో అధికారులున్నారు. అందుకు అనుగుణంగానే వార్డుల వారీగా అవసరమైన బోర్లకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోవడంతో మంజీరకు నీరు వదిలేపరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా పట్టణ వాసులకు నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఎలాగైనా సింగూరు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మంజీర బ్యారేజీలో కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా కేవలం అర టీఎంసీకి తక్కువే ఉంది. హైదరాబాద్ నగరానికి సైతం ఇక్కడి నుంచే నీరు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు సరఫరా అయ్యేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు డ్యాం మధ్యలో ఉన్నందున.. నీరు ఉన్నంత వరకూ సరఫరా చేసే అవకాశం ఉంది. కాని సంగారెడ్డికి సరఫరా చేసే పంపింగ్‌కు డ్యాం చివరి భాగాన మోటార్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గాగానే పట్టణానికి నీరు సరఫరా చేసే అవకాశం లేకుండా పోతోంది. రోజూ 22.22 లక్షల గ్యాలన్ల నీరు అవసరం పట్టణంలోని 31 వార్డులకు రోజూ 22.22 లక్షల గ్యాలన్ల(మిలియన్ క్యూబిక్ మీటర్) నీరు సరఫరా చేయాల్సి ఉంది. అందులో మంజీర ద్వారా 16.30 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు 25 చేతిపంపులు, రెండు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని అన్ని వార్డులతో పాటు కొత్తగా విస్తరించిన కాలనీలకుసైతం మంజీర పైపులైన్లు వేశారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే 25 శాతం అదనంగా అవసరం ఉంటుంది. దీనికి తోడు మంజీర బ్యారేజీలో 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 0.36 మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇది సంగారెడ్డి పట్టణానికి కేవలం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా సరఫరా అయ్యో అవకాశం లేదు. ప్రభుత్వానికి లేఖ రాస్తాం: పట్టణానికి నీటి సమస్య తలెత్తనున్నందున ముందస్తుగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ తెలిపారు. మంజీరలో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్ల ద్వారా నీరు రావడం లేదని అందుకు సింగూరు నుంచి నీటిని విడుదల చేయించాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు. -
హామీలను అమలు చేయూలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి ఎర్రుపాలెం : ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయూలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పగటిపూట తొమ్మిది గంటలు కరెంటు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆరు గంటలలోపే ఇస్తున్నారన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే నేటికి ప్రభావ మండలాలను ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఈనెల 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను కార్యకర్తలు జయప్రదం చేయూలన్నారు. మండలంలోని పెగళ్లపాడు ఆర్ఓబీ పనులు ఇప్పటికే ఆలస్యమయ్యూయని త్వరితగతిన పూర్తి చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీటీసీ, పార్టీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లక్కిరెడ్డి న ర్సిరెడ్డి, మండల మహిళా కన్వీనర్ వేమిరెడ్డి త్రివేణి, ఎంపీటీసీలు శీలం అక్కమ్మ, సామనూరి కృష్ణార్జునరాజు, గుర్రాల పుల్లారెడ్డి, షేక్ హుస్సేన్, గూడూరు నర్సింహారెడ్డి, దేవరకొండ రవి, యన్నం కోటిరెడ్డి, దేవరకొండ భూషణం, శీలం వెంకటేశ్వరరెడ్డి, శీలం కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
‘సీమ’ సమగ్రాభివృద్ధికి పోరాటమే మార్గం
ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ ఈశ్వరయ్య కడప అగ్రికల్చర్ : రాయలసీమలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా రాయలసీమ ప్రజానీకం ఉద్యమానికి సన్నద్ధం కావాలని వైఎస్ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో కడపలో రాయలసీమ అభివృద్ధి మహాసభలను నిర్వహించామన్నారు. ఈ సభల్లో రాయలసీమ వెనుకబాటు తనం, అందుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై మేధావులు విపులంగా చర్చించారన్నారు. ఇప్పటికే నష్టపోయిన రాయలసీమ ఇకపై కూడా నష్టపోకుండా ప్రజానీకాన్ని వెన్నుతట్టి ఉద్యమానికి సమాయత్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తి, కృష్ణా నీటిలో నికర జలాల కేటాయింపు, కడపలో ఉక్కు పరిశ్రమ, విద్యా సంస్థల ఏర్పాటు, హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించాలన్నారు. హైదరాబాద్ తరహాలో లక్షల కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడం తగదన్నారు. అంతకు ముందు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్‌గా వైఎస్ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి జి ఈశ్వరయ్యను ఎంపిక చేశారు. చిత్తూరు నుంచి జల్లి విశ్వనాథ్, అనంతపురం నుంచి జాన్సన్, కర్నూలు నుంచి లెనిన్‌బాబు, వైఎస్ఆర్ జిల్లా నుంచి కె సురేష్‌బాబు, ఎల్ నాగసుబ్బారెడ్డిలు సభ్యులుగా ఎంపికయ్యారు. ‘సీమ’ అభివృద్ధి మహాసభ తీర్మానాలు.. - రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ‘కృష్ణా’లో నికర జలాలు కేటాయించాలి. - రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల మినహాయింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. - ‘సీమ’ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. - విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి. - సెయిల్ ఆధ్వర్యంలో కడపలోనే భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. - విద్య, వైద్య సంస్థలు, హైకోర్టు బెంచ్‌ను ‘సీమ’లో ఏర్పాటు చేయాలి. - వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. - రాష్ట్ర రాజధానికి అనుసంధానిస్తూ రోడ్లు, రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలి. - బెరైటీస్, డోలమైట్, చైనా క్లేవ్ ఐరన్‌ఓర్, లైమ్‌స్టోన్, మాంగనీసు, ఇసుక ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. -
కరువును ఎదుర్కొందాం
- ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించండి - జెడ్పీ సమావేశంలో అధికారులకు చైర్మన్ చమన్ హితబోధ అనంతపురం సెంట్రల్ : గతంలో ఎన్నో కరువులను చూశాం.. ఈసారి అంతకన్నా భయంకరమైన కరువు వచ్చింది.. కరువు బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలి... అందరం కలిసి కరువును ఎదుర్కొందాం.. అని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల సంక్షేమమే పరమావధిగా చర్చ జరిగేలా సహకరించాలని కోరారు. గురువారం జెడ్పీ మీటింగ్‌హాలులో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామీణ నీటిసరఫరా, జిల్లా నీటియాజమాన్యసంస్థ, జిల్లా విద్యాశాఖ, హెచ్చెల్సీ, చిన్ననీటిపారుదల శాఖలపై చర్చించారు. ఈ సందర్బంగా చైర్మన్ చమన్ మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆయా శాఖలకు నేరుగా నిధులు మంజూరవుతున్నాయని, అవి సక్రమంగా ప్రజలకు అందేలా ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సభ్యులు ఒకే అంశంపై గంటల తరబడి మాట్లాడడం సబబు కాదని అన్నారు. కేవలం జెడ్పీ సమావేశాల్లో కాకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీని వలన జెడ్పీ సమావేశాల్లో అన్ని శాఖలపై చర్చించేందుకు అవకాశం వస్తుందన్నారు. జిల్లాలో దాదాపు 40 శాఖలున ్నప్పటికీ ఎప్పుడూ ఐదారు శాఖలతో ముగించాల్సి వస్తోందని సభ్యులకు సూచించారు. అనంతరం సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు ఏకరవు పెట్టారు. బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ రామలింగారెడ్డి మాట్లాడుతూ... అనంత కార్పొరేషన్‌నుంచి వచ్చే మురుగునీటిని మొత్తం మండల పరిధిలో ఉన్న కాలనీల్లోకి, ఈ సమస్యను పలుమార్లు తమ దృష్టికి తెచ్చినా ఫలితంలేదని అన్నారు. భాగ్యనగర్ స్కూల్లోకి మురుగునీరు వచ్చి చేరుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాటు నాలుగైదు కాలనీ ప్రజలు మురుగునీటితో అవస్థలు పడుతున్నారని, మురుగుకాలవను మరికొంత దూరం పొడిగించాలని కోరారు.. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... లక్ష ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా తాము చిన్న చిన్న అభివృద్ది పనులు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీకి వస్తున్న అరకొర నిధులు పంచాయతీలకు, తాగునీటి పథకాలకే సరిపోతున్నాయని అన్నారు. మడకశిర జె డ్పీటీసీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ... ఈ సమస్యను 63 మంది జెడ్పీటీసీలు ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నామని అన్నారు. పెనుకొండ జెడ్పీటీసీ నారాయణస్వామి మాట్లాడుతూ... ఏరోజైతే జెడ్పీటీసీ గెలిచామో అదే రోజే పదవీవిరమణ చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీకి ఏమాత్రం గౌరవం లేకుండా చేస్తున్నారని అన్నారు. మూడెంచల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరి మాట్లాడుతూ... రూ. 700 కోట్లతో నిర్మించిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం మొత్తం లోపభూయిష్టంగా నిర్మించారన్నారు. 3,4 రోజుల కొకసారి కూడా నీరివ్వకపోతే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. నీరివ్వలేదని ప్రజలు జెడ్పీటీసీలను నిలదీస్తున్నారని, ట్యాంకుల సరఫరా రేట్లు పెంచి నీటిని సరఫరా చేయాలని కోరారు. -
మెరుగైన సేవలందించాలి
- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి - ఫారెస్ట్ అధికారులకు నూతన వాహనాల అందజేత - రైతులతో ఉదాసీనంగా వ్యవహరించాలి - రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్ రూరల్: ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం పోలీస్, ఫారెస్ట్ శాఖలకు అత్యాధునిక వాహనాలను అందజేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని బ్లాక్‌గ్రౌండ్‌లో ఫారెస్ట్ అధికారులకు కొత్త వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 40 ద్విచక్ర వాహనాలు, ఐదు జీపులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారని, రైతులతో కఠినంగా ఉండవద్దని అన్నారు. కర్ణాటక, రంగారెడ్డి జిల్లా సరిహద్దులో అనేక ఇబ్బందులు ఉన్నాయని, అధికారులు సరిహద్దుల్లో సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ చేపట్టిందన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రతిశాఖను ఆధునికీకరించడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఫారెస్ట్ కంన్జర్వేటీవ్ అధికారి నాగభూషణం, అదనపు ఫారెస్టు కంన్జర్వేటీవ్ అధికారి శోభ, డీఎఫ్ఓ శ్రీనివాసు, హరీశ్వర్, అధికారులు నర్సింగ్‌రావు, విష్ణువర్ధన్, విజయనంద్, కవిత, వెంకట్రామ్ పాల్గొన్నారు. -
‘ఆశ’.. నిరాశ!
- పొట్టనింపని పారితోషికం - అర్ధాకలితో అలమటిస్తున్న ఆశ వర్కర్లు అల్లాదుర్గం రూరల్: ప్రజలకు వైద్యసేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆశ వర్కర్లను నియమించింది. పల్లెల్లో వైద్య సేవలపై అవగాహన కల్పించడంతోపాటు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల టార్గెట్లు పూర్తిచేయడం, గర్భిణులను అసుపత్రులలో డెలివరీ చేయించడం, చిన్న పిల్లలకు ఇంజక్షన్లు చేయించడం వంటి పనులు ఆశ వర్కర్లతో ప్రభుత్వం చేయిస్తోంది. బాధ్యతలు ఫుల్‌గా ఆప్పగించిన ప్రభుత్వం వారికిచ్చే పారితోషికం మాత్రం అరకొరే. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, అందోల్ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వందకు పైగానే ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. విధులను సక్రమంగా నిర్వహిస్తున్నా ప్రభుత్వం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ వర్కర్ల విధులకు, ఇచ్చే పారితోషికానికి పొంతన లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడటం వీరి ముఖ్య విధి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం ఆయ్యో వరకు అశ వర్కర్లే చూసుకోవాల్సి ఉంటుంది. గర్భిణుల వివరాలు అందించినప్పుడు రూ.60, గర్భిణులను ఏడు నెలల వరకు అసుపత్రికి తరలించడం.. వైద్య పరీక్షలు చేయించడం.. టీటీ ఇంజక్షన్ ఇప్పిస్తే రూ.250, ప్రభుత్వ అసుపత్రిలో వెంట ఉండి ప్రసవం చేయిస్తే రూ.300 ఇస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తే ఒక్కరికి రూ.150 చొప్పున చెల్లిస్తారు. ఏడాదికి రెండు సార్లు నిర్వహించే పల్స్‌పోలియో కార్యాక్రమానికి మూడు రోజులు పని చేయించుకుని రూ.225 మాత్రమే చెల్లిస్తారు. గ్రామాలలో జనన, మరణ వివరాలు, క్షయా వ్యాధి నిర్ధారణ, ఇమ్యునైజేషన్, వ్యాధులు, పారి శుద్ధ్యంపై అవగాహన, కుటుంబ సర్వే, కీషోర బాలికల సర్వే, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇన్ని సేవలను చేయించుకుంటూ జీతాలు మాత్రం ఇవ్వడం లేదని ఆశవర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. కనీస వేతనం చెల్లించాలి ఆశ వర్కర్లకు పారితోషికం కాకుండా కనీస వేతనం నెలకు రూ.15 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఎన్ఎంలకు ఇచ్చే సదుపాయాలు కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. - రేణుకా ఆశ కార్యకర్త, అల్లాదుర్గం ఏఎన్ఎంలుగా నియమించాలి అర్హులైన ఆశ కార్యకర్తలను ఏఎన్ఎంలుగా నియమించాలి. ఏఎన్ఎంల విధులను తామే నిర్వహిస్తున్నాం. 6 నెలలు శిక్షణ ఇచ్చి గ్రామాలలో ఏఎన్ఎంలుగా నియమించాలి. - సత్యమ్మ, ఆశ కార్యకర్త, రేగోడ్ -
‘పట్టిసీమ’ పూర్తికాకున్నా సీఎం పర్యటన ఖరారు
-
అయిననూ.. వచ్చి పోవలె!
- ‘పట్టిసీమ’ పూర్తికాకున్నా సీఎం పర్యటన ఖరారు - పంద్రాగస్టు నాడు నీళ్లివ్వకుండానే ప్రజలకు అంకితం - ఏలూరులో జెండా పండగకు అంతరాయం! సాక్షి ప్రతినిధి, ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంద్రాగస్టు నాడే వినియోగంలోకి తీసుకురావాలని మొండిపట్టుపట్టిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. పనులు కొలిక్కిరాని నేపథ్యంలో ఆ రోజున నీటిని విడుదల చేయడం కాకుండా.. కనీసం ఆ పథకాన్ని ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పట్టిసీమ రానున్నారు. శనివారం విశాఖపట్నంలో స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు పట్టిసీమ చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు పట్టిసీమ నుంచే హెలికాప్టర్లో తిరిగి వెళతారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా, పట్టిసీమ వద్ద పంపులు బిగించే పనులు పూర్తి కాకున్నా.. తాడిపూడి కాలువను అనుసంధానం చేసే పనులు కొలిక్కి రాకున్నా.. పోలవరం కుడి కాలువ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిజాతికి అంకితం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటనే చర్చ అధికారవర్గాల్లోనూ మొదలైంది. కాంక్రీటు పనులే కొలిక్కి రాలేదు వాస్తవానికి ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పథకం వద్ద కాంక్రీటు పనులు కూడా పూర్తయ్యే పరిస్థితులు లేవు. రూ.1,300 కోట్ల వ్యయంతో ఎత్తిపోతలను నిర్మించి 24 పంపులు, 24 మోటార్లతో 12 పైపులైన్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా, పంద్రాగస్టు నాటికి కనీసం 8 పంపులతోనైనా నీటిని తరలిస్తామని సీఎం రెండు నెలల కిందట ప్రకటించారు. పనులు జరగకపోవడంతో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా నీరు పంపాలని ఇటీవల నిర్ణయించారు. ఆ తరువాత 2 పంపులు.. చివరకు ఒక పంపుతోనైనా నీరు తరలించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఒక మోటారు, ఒక పంపు ఏర్పాటుకు సంబంధించి కాంక్రీటు పనులు కూడా కాలేదు. వీటిని పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. దీనికితోడు ఇప్పటివరకు మోటార్లు, పంపులు కూడా రాలేదు. అలాగే విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి తాత్కాలిక పనులూ కొలిక్కి రాలేదు. ఆ పనులు పెండింగ్‌లోనే.. పోలవరం కుడికాలువ నిర్మాణానికి సంబంధించి ఆరు ప్యాకేజీల్లో 39.22 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.91 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. ఇంకా 17.31 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రోజుకు సగటున 2.50 నుండి 3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన కాలువ తవ్వకం పనులు పూర్తయ్యేందుకు ఇంకా వారం రోజులు పడుతుంది. దీనికి తోడు కాలువల లైనింగ్ పనులు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. పోనీ తాత్కాలికంగా పట్టిసీమను పక్కనపెట్టి తాడిపూడి కాలువ ద్వారా పోలవరం కుడి కాలువకు నీళ్లు మళ్లించాలని భావించినా అది కూడా సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముందునుంచి ఆగస్టు 15 నాటికి పథకం ప్రారంభిస్తామని విపరీతమైన ప్రచారం చేసిన నేపథ్యంలో చివరకు సీఎం వచ్చి జాతికి అంకితం చేసే కార్యక్రమాన్నైనా చేపట్టాలని నిర్ణయించారు. పంద్రాగస్టు వేడుకలకు అంతరాయం! సీఎం చంద్రబాబు రాకతో జిల్లా కేంద్రం ఏలూరులో శనివారం పంద్రాగస్టు వేడుకలు హడావుడిగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనే వేడుకలు ఉదయం 9గంటలకు మొదలుపెట్టినా మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగుతాయి. శకటాల ప్రదర్శన, అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ జరగాలి. కానీ.. మధ్యాహ్నం 2.30 గంట లకు సీఎం పట్టిసీమ రానున్న నేపథ్యంలో కలెక్టర్ కె. భాస్కర్, డీఐజీ హరికుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ సహా అధికారులంతా హడావుడిగా పట్టిసీమ చేరుకోవాల్సి ఉంటుంది. పోనీ.. ఏలూరులో వేడుకలను కుదించినా.. ఉన్నతాధికారులు ఎంతవేగంగా అక్కడికి చేరుకున్నా మిగిలిన ఉద్యోగులు జెండా పండగ పూర్తి చేసుకుని అక్కడకు రావడం ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఇక పోలీసుశాఖాపరంగా కూడా ఆ రోజు సీఎం పర్యటనకు బందోబస్తు ఏర్పాటుచేయడం తలకు మించిన భారంగా మారనుంది.