Manchu lakshmi
-
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్‌లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్‌లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ దివి..కోట్ డ్రెస్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ మూవీ స్టిల్స్
-
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ వచ్చేస్తోంది
మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రలు పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. -
ముంబయిలో మంచు లక్ష్మి బర్త్ డే బాష్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్‌పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్‌బాబు), మోహన్‌లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పిక్స్ షేర్ చేసిన మంచులక్ష్మి (ఫోటోలు)
-
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
నువ్వు చేస్తే సంసారం.. నేను చేస్తే.. అనే వాళ్ళు నాకు...
-
లైవ్ లో మంచు లక్ష్మి వాళ్ళ అత్త కి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
-
నాకు ప్రాబ్లెమ్ వస్తే ఫస్ట్ రానా కి ఫోన్ చేస్తా
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి
‘‘ఆదిపర్వం’ వంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తివంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాశ్, సుహాసిని ఇతర పాత్రల్లో నటించారు.రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఇటీవల ‘యక్షిణి’ వెబ్ సిరీస్ చేశాను... చాలా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ‘ఆదిపర్వం’ చేశాను. దేవత అయినా దెయ్యం పాత్ర అయినా నన్నే సంప్రదిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆదిపర్వం’లో నాగులాపురం నాగమ్మ పాత్ర చేశారు లక్ష్మి. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘‘ఈ చిత్రంలో నేను క్షేత్రపాలకుడి పాత్ర చేశాను’’ అన్నారు శివ కంఠంనేని. -
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది. (చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్‌పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్‌కి కూడా డూప్‌ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. (చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్‌ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్‌ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. -
ప్లీజ్..ఎవరైనా సాయం చేయండి..!
-
ప్లీజ్.. ఎవరైనా సాయం చేయండి.. మంచు లక్ష్మి విజ్ఞప్తి!
టాలీవుడ్ నటి,నిర్మాత మంచులక్ష్మి తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. నా యూఎస్ వీసా జారీ అయి నెల రోజులకు పైగానే అయిందని వివరించింది. ఎంబసీ కార్యాలయం సైట్ సాంకేతిక లోపం రావడంతో.. వీసా తనకు చేరడంలో ఆలస్యమైందని పేర్కొంది. దీనికి ఎవరైనా సాయం చేయగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. ఇన్‌స్టాలో మంచులక్ష్మి రాస్తూ..'నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి. నేను ఎక్కాల్సిన విమానం విమానం జూలై 12న ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా?' అంటూ పోస్ట్ చేసింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటలతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లతో ఈమెకు చాలామంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషయాన్నే మంచు లక్ష్మీ బయటపెట్టింది. ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది. అలానే తమ సీక్రెట్ వాట్సాప్ గురించి కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొత్తం బయటపెట్టేసింది.తనని ముంబై రమ్మని.. రానా, రకుల్ ప్రీత్ చాలా సార్లు చెప్పారని అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే అపార్ట్మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్ల పాటు చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని మంచు లక్ష్మీ చెప్పింది. ఇంకా ఏమేం చెప్పిందంటే...?(ఇదీ చదవండి: వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ)'ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్ప లేదు. దీంతో వెళ్లిపోతానని చెప్పా. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు' అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.అలా ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని మంచు లక్ష్మి చెప్పింది. ఇందులో చరణ్, రానాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని తమ తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఈ గ్రూప్‌లో షేర్ చేస్తుంటారని.. అలా తామందరం తమ పర్సనల్ అకౌంట్స్‌లో షేర్ చేసి ప్రమోట్ చేస్తుంటామని ఈమె చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్) View this post on Instagram A post shared by Thug Trollers (@thug_trollers) -
నా కెరీర్‌కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్‌కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే! మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్‌లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్‌బాబు)కు కూడా నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్‌లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్‌స్టార్‌లో విడుదలైంది.చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?