Telugu Tech News
-
'తెలుగు టెక్ ట్యూట్స్' సయ్యద్ హఫీజ్ నెల సంపాదన ఎంతో తెలుసా!
ప్రముఖ తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్ 'తెలుగు టెక్‌ట్యూట్స్' పేరుతో వీడియో కంటెంట్‌ను అందిస్తున్నాడు. ముఖ్యంగా అటు సోషల్ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ రివ్వ్యూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్ స్కోర్‌తో టాప్ 100 డిజిటల్ స్టార్ట్స్‌లో చోటు కల్పిచ్చింది. సయ్యద్ హఫీజ్ ఆదాయం ఎంతంటే టెక్ కంటెంట్‌తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్ హఫీజ్ యూట్యూబ్ ఛానల్‌కు ప్రస్తుతం 16లక్షల మంది సబ్ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ర్యాంకులు ఎలా ఇచ్చింది ఫోర్బ్స్ ఇండియా, ఐఎన్సీఏ, గ్రూప్ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్ స్టార్ట్స్ ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్, ఫిట్నెస్, ఫుడ్,టెక్, ట్రావెల్, సోషల్ వర్క్ ఇలా తొమ్మిది రకాల కంటెంట్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది. ఆ 100మందిని ఎలా సెలక్ట్ చేసిందంటే టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో స్థానం సంపాదించిన కంటెంంట్ క్రియేటర్లు నెటిజన్లు ఆకట్టుకోవడంతో పాటు క్రియేట్ చేసే కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్‌తో ఎంగేజ్ అవుతున్నారు. ఆ కంటెంట్ జెన్యూన్‌గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్‌లో సయ్యద్ హఫీజ్ 32వ స్థానం దక్కడం గమనార్హం. చదవండి: ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు! -
యాపిల్ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్-11 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఐఫోన్-11, ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఐఫోన్-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే... -
సూపర్ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్‌లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్‌లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్‌ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్‌ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్‌డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్..! -
వాట్సాప్ సంచలన నిర్ణయం..!
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్‌ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్‌పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్‌కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తెస్తోన్న ఫీచర్‌తో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్‌లకు చెక్ పెట్టనుంది. ఈ ఫీచర్‌తో ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేయకుండా చేస్తోంది. దీంతో స్పామ్ మెసేజ్‌లకు వాట్సాప్ అడ్డుకట్ట వేయనున్నది. ఒకవేళ సదరు మెసేజ్‌ను ఒకరికంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయా మెసేజ్‌ను కాపీ చేసి రెసిపెంట్ కాంటాక్ట్ చాట్‌కు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన వాట్సాప్‌ల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ విజయవంతమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ట్రాకర్ బెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..! -
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..! ఈ ఎమోజీ పంపితే 20 లక్షల జరిమానా..!
Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది. ఒక వేళ రెడ్ హార్ట్ ఏమోజీలను పంపితే రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. . వేధింపులతో సమానంగా... గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం వేధింపుల నేరమవుతుందని ఆయన పేర్కొన్నారు. యూజర్లు ఇతరులకు రెడ్ హార్ట్ ఎమోజి మెసేజ్‌లను పంపితే వారు తీవ్రంగా భావిస్తే కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. -
6జీబీ ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్..!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో మొబైల్స్ భారత్‌లో మరింత విస్తరించేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్ చేయనుంది. టెక్నో స్పార్క్ సిరీస్‌లో భాగంగా త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్‌తో అతి తక్కువ ధరలో..! టెక్నో మొబైల్స్ అతి తక్కువ ధరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. టెక్నో స్పార్క్ సిరీస్‌లో భాగంగా లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ రూ. 8000 కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాదిలో టెక్నో మొబైల్స్ భారత్‌లో పదుల సంఖ్యలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Tecno Pova 5G ఫిబ్రవరి 8న లాంచ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్ 8GB RAMతో జత చేయబడింది. Tecno Pova 5G 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం! -
ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్! ఒకేసారి 5 వేల ఫోన్స్ ఇట్టే ఛార్జ్..!
మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్ ఒక భాగమైపోయాయి. స్మార్ట్‌ఫోన్స్ లేనిదే రోజు గడువదనే ఛంధంగా తయారైంది పరిస్థితి..! ఇక ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారు పవర్ బ్యాంకును కూడా తమతో క్యారీ చేస్తుంటారు. పవర్బ్యాంకులకు కూడా భారీ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్ గెంగ్ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంకును కనిపెట్టి అందరితో ఔరా..అనిపిస్తున్నాడు. ఒకే సారి 5 వేల ఫోన్లకు..! హ్యాండ్ గెంగ్ తయారుచేసిన పవర్‌బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చునని ఈ యూట్యూబర్ తెలిపాడు. ఈ పవర్‌బ్యాంక్‌ను గెంగ్కున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ పవర్‌బ్యాంకు తరహలో అతి పెద్ద పవర్‌బ్యాంకును తయారు చేశాడు. దీని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా 60 పవర్ సాకెట్లను అమర్చారు. స్మార్ట్‌ఫోన్స్ ఛార్జింగ్ ఒక్కటే కాదు..! గెంగ్ తయారుచేసిన పవర్బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్‌ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్. చదవండి: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..! -
ఈ కంప్యూటర్ ధర కేవలం రూ. 1000 మాత్రమే..!
సాధారణంగా ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కాన్ఫీగరేషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్ బెంచాఫ్ అనే ఒక డెవలపర్ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..! స్మార్ట్‌ఫోన్ సైజులో..! బ్రియాన్ తయారుచేసిన మినీ పాకెట్ సైజ్ కంప్యూటర్ ఇంచుమించు స్మార్ట్‌ఫోన్ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్‌తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్ కంట్రోల్ బోర్డ్‌ను (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది స్క్రిప్ట్‌లను, పింగ్ రిమోట్ సర్వర్లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్ చేయవచ్చును. ఫీచర్స్‌లో కంప్యూటర్స్‌తో సమానంగా..! బ్రియాన్ తయారుచేసిన ఈ లైనక్స్ కంప్యూటర్లో సాధారణ కంప్యూటర్లో ఉండే ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్‌ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్‌ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది. Wi-Fi అడాప్టర్, కీబోర్డ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్‌ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్ను తయారుచేయడానికి బ్రియాన్ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. I designed the 'minimum viable computer', a full Linux computer that fits in your pocket. It costs $15.https://t.co/P7F3Re1mGw If you'd like to see more of this, please like, retweet, and share the above link in whatever forum or aggregator you frequent. pic.twitter.com/XzBSULz3El — VT-69 (@ViolenceWorks) January 26, 2022 చదవండి: మాస్కున్న ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..! -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్‌లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అన్‌లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్‌లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్‌లాక్ ఫీచర్‌తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ ఇదేనేమో..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్‌ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ఫుల్ ర్యామ్..ఏకంగా 22జీబీ..! లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీతో లెనోవో లీజియన్ Y90 రానుంది. Lenovo Legion Y90 స్పెసిఫికేషన్(అంచనా) 6.92-అంగుళాల E4 శాంసంగ్ AMOLED డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ 22 జీబీ ర్యామ్+ 640 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64ఎంపీ+16ఎంపీ రియర్ కెమెరా 44-ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్ ఫ్యాన్స్ ఫర్ కూలింగ్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ 5,600mAh బ్యాటరీ చదవండి: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్‌ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్‌లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 9ఏ, రెడ్మీ నోట్ 10ఎస్, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5G, శాంసంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్మీ నార్జో 50ఏ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ వంటి స్మార్ట్ఫోన్స్తో పాటుగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్స్‌కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..! ► వన్‌ప్లస్ నార్డ్ 2 5G 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా బోనస్‌గా రూ. 16,950 వరకు అమెజాన్ అందిస్తోంది. ► వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అమెజాన్ అందిస్తోంది. ► రెడ్మీ నోట్ 10ఎస్ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. ► షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చును. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 19,950 కూడా రానుంది. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
వన్‌ప్లస్ 9 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ త్వరలో 9 సిరీస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రిలీజ్చేయనుంది. వన్‌ప్లస్ 9ఆర్కు అప్‌గ్రేడ్‌గా వన్‌ప్లస్ 9ఆర్టీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 13 న చైనాలో లాంచ్ చేయనుంది. అదే రోజున భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 23 వేల నుంచి 34 వేల మధ్యలో ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? వన్‌ప్లస్ 9ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ 50+16+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 బ్యాటరీ 4500ఎమ్ఏహెచ్ ఫ్లాష్ చార్జ్ చదవండి: స్పేస్ఎక్స్ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..! -
యూజర్ల కోసం రూ. 95 వేల కోట్లను ఖర్చు చేసిన ఫేస్బుక్...!
ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజుల క్రితం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. ప్రతి యూజర్‌ను తమ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్బుక్ పేర్కొంది. చదవండి: అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట! యూజర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 95, 830 కోట్లు) ఖర్చు చేసిందని ఫేస్బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి..40 వేల వరకు పెరిగిందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తీసేసినట్లు తెలిపింది. కోవిడ్-19 సమయంలో ఫేక్ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్ అవ్వకుండా చూశామని ఫేస్బుక్ వెల్లడించింది. సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను అరికట్టామని ఫేస్బుక్ తెలిపింది. ఇమేజ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొంది. చదవండి: New York Times Report: వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో అప్డేట్ను తీసుకురానుంది. లాస్ట్‌సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్ కాంటాక్టులకు తెలియజేస్తుంది. చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ లాస్ట్‌సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్‌లో ‘నోబడీ’, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్‌సీన్‌ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్‌లకు యూజర్ లాస్ట్‌సీన్ కన్పించదు. ప్రస్తుతం ఈ సెట్టింగ్‌ను వాట్సాప్ కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్‌తో కొంతమంది లాస్ట్‌సీన్ ఆప్షన్‌ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. చదవండి: Microprocessor Chips: సొంత చిప్ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్ వరకే? -
మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం ఫోటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ చాట్‌లో మీరు అనుకుంటే మెసేజ్‌లు కన్పించకుండా చేయవచ్చును. ఔను మీరు విన్నది నిజమే..! వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లను నిర్ధిష్ట చాట్‌లో కన్పించకుండా ఆయా సందేశాల కాలాన్ని మీరు నిర్ణయించవచ్చును. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) వాట్సాప్ తన డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ కోసం కొత్త ఆప్షన్ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లో భాగంగా 90 రోజుల తర్వాత ఒక నిర్దిష్ట చాట్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. అంతేకాకుండా 24 గంటల్లో మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా కనుమరుగయ్యే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టగా ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు పంపిన మెసేజ్‌లు ఏడు రోజుల వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మెసేజ్‌లను అదృశ్యమయ్యేలా చేయడానికి వాట్సాప్ యాప్ వీలు కల్సిస్తుంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం బీటా వెర్షన్ 2.21.17.16 ద్వారా 90 రోజుల తర్వాత చాట్‌లో మెసేజ్‌లు కన్పించకుండా ఉండే ఫీచర్‌ను WABetaInfo స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. 90 డేస్‌తో పాటు 24గంటల్లో వాట్సాప్‌లో మెసేజ్‌లు కన్పించకుండా చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను గత కొన్ని నెలలుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్లో ఒక చిన్న మెలిక ఉంది. వాట్సాప్ యూజర్ ఇతర రెసిపెంట్లకు పంపిన మెసేజ్‌లకు డిస్ఆప్పియర్ ఫీచర్‌తో మెసేజ్‌లు పంపినా...,రెసిపెంట్ ఆయా మెసేజ్‌ను వేరే ఇతర వాట్సాప్ యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే మాత్రం యూజర్ పంపిన మెసేజ్ ఎప్పటికి రెసిపెంట్తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్తగా వ్యూ వన్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్‌లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్‌ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్‌ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్‌లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్‌ఫోన్‌ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్‌బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
Samsung: ఈ స్మార్ట్‌ఫోన్ ప్రి-బుక్ చేస్తే స్మార్ట్‌ట్యాగ్ ఉచితం...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్ భారత మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్‌ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం కానుంది. ఫ్రీ బుకింగ్ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్ షాప్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్ ఉచితంగా శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ను అందించనుంది. మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్‌ట్యాగ్ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో ప్రీ బుక్ చేసుకున్న అమౌంట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. -
యూట్యూబ్ బంపర్ ఆఫర్..! వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు..!
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ డబ్బులను అందజేస్తుంది. తాజాగా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు మరో బంపర్ ఆఫర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియోలను తీసే వారికి కొత్తగా ప్రోత్సాహకాలను యూట్యూబ్ తన యూజర్లకు అందించనుంది. ప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌ను భారత్‌తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ పొందాలంటే అర్హతలు..! యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్లోడ్ చేసి ఉండాలి. షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్లోడ్ చేసేవారు అర్హులు కాదు. ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్‌కు అర్హత సాధించవు. యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి. -
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..!
జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్‌కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్‌ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్ అనే యాప్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు జియోఫైబర్‌వాయిస్‌తో వీడియోకాలింగ్ ఆప్షన్‌ను ఎనెబుల్ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్లోని జియోజాయిన్ యాప్ ద్వారా ల్యాండ్‌లైన్ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్ చేసుకోవచ్చును. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో నమోదు చేయాలి. జియోఫైబర్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్ యాప్ సెట్టింగ్‌లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌తో వీడియోకాల్స్ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్‌ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చును. -
వాట్సాప్ గ్రూప్స్‌తో విసుగుచెందారా..! అయితే ఇది మీ కోసమే..!
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ యాప్‌లో మనందరికీ గ్రూప్‌లు ఉండే ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ ఫ్రేండ్స్ గ్రూప్స్, ఆఫీస్ కోలిగ్స్ గ్రూప్ ఇలా..ఎన్నో..మనకు తెలిసిన వాళ్లతో గ్రూప్‌ను క్రియేట్ చేసి మన అభిప్రాయాలను ఆయా సభ్యులతో పంచుకుంటాం. వాట్సాప్ గ్రూప్‌లో మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ...మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తే కాస్త ఇబ్బంది కల్గుతుంది. మనలో కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..! కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్‌లోని ఒక చిన్న ట్రిక్‌తో తెలియని వాట్సాప్ గ్రూప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్ గ్రూప్‌ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండటం కోసం ఇలా చేయండి..! మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. తరువాత ‘సెట్టింగ్’ పై క్లిక్ చేయండి. తరువాత ‘అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అకౌంట్‌పై క్లిక్ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్‌పై క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేసి ‘గ్రూప్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. 1. ఎవ్రీవన్, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఎప్పుడు డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును. ఎవ్రీవన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మిమ్మల్ని ఆయా వాట్సాప్ గ్రూప్‌లో ఏవరైనా యాడ్ చేయవచ్చును మై కాంటాక్ట్స్ ఆప్షన్‌తో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో మీరు సేవ్ చేసిన నంబర్లకు మాత్రమే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్‌ల్లో యాడ్ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్‌లను ఎంచుకోని సేవ్ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేయలేరు. -
వన్‌ప్లస్ నార్డ్ 2కు పోటీగా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్‌ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ధర భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది. ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్: 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1) మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్) 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ) 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 2
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్: 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్) 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్) 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 189 గ్రాముల బరువు -
క్లబ్‌హౌజ్‌లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్‌హౌజ్ యాప్‌ను మార్చి 2020లో విడుదల చేశారు. క్లబ్‌హౌజ్‌కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌజ్‌లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం కొత్త యూజర్లకు క్లబ్‌హౌజ్ అందుబాటులో వస్తోంది. తాజాగా క్లబ్‌హౌజ్ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్ కోడ్ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్‌హౌజ్‌లో జాయిన్ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్ లీస్ట్ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్‌హౌజ్ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్‌హౌజ్ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్‌హౌజ్‌లో డేలీ రూమ్స్ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్ హౌజ్ టెడ్ టాక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్తగా షాపింగ్..ముందుగానే ఇంట్లో చూడొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించనుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్లిప్‌కార్ట్‌లోని ఆయా వస్తువులను కస్టమర్లు ముందుగానే తమ ఇంట్లో చూసుకునే సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ టెక్నాలజీతో కొనుగోలుదారులకు ఆయా వస్తువులపై మరింత అనుభూతిని పొందవచ్చునని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కెమెరా సహాయంతో ఆయా వస్తువుల 3డీ ఇమెజ్‌లను ఇంట్లో చూడొచ్చును. ఈ ఫీచర్‌తో ఫర్నిచర్, లగేజ్, పెద్ద ఉపకరణాల కొనుగోలు విషయంలో ఉపయోగకరంగా ఉండనుంది. వస్తువులను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ కెమెరా సహయంతో వస్తువుల పరిమాణం నిర్ధిష్ట స్థలంలో సరిపోతుందా లేదా అనే విషయాన్నికొనుగోలుదారులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు పడనుంది. ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు మరింత షాపింగ్ అనుభూతిని కల్పించడానికి కంపెనీ పలు చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్ల తమ ఇంట్లో ఆయా వస్తువులను ఏఆర్ టెక్నాలజీ సాయంతో ముందుగానే చూసే సౌకర్యం కల్గుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత సులువుకానుంది. ఫ్లిప్‌కార్ట్ కెమెరాను ఎలా వాడాలంటే..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేయండి. మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్ చేయండి. ఆ వస్తువుపై క్లిక్ చేయండి. ఆయా వస్తువుకు ‘వ్యూ ఇన్ యూవర్ రూమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కొన్ని క్షణాల తరువాత వచ్చే ఏఆర్ కెమెరాను అలో చేయండి. తరువాత మీరు ఆ వస్తువును ఉంచదల్చుకున్న ప్రాంతంలో మీకు ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కన్పిస్తోంది. -
5జీ కోసం జతకట్టిన ఎయిర్టెల్, ఇంటెల్
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ అభివృద్ధి కోసం ఇంటెల్ తో ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశంలో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. 5జీ నెట్వర్క్ వల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, క్లౌడ్ గేమింగ్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి వాటిలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. భారతదేశంలో మొదటి టెలికామ్ ఆపరేటర్ ఎయిర్టెల్ ప్రధాన నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోందని ఐఏఎన్ఎస్ నివేదిక తెలిపింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడానికి ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెల్ తాజా మూడవ తరం జియోన్ స్కేలబుల్ ప్రాసెసర్లు, ఎఫ్ పీజిఏ, ఈఏఎస్ఐసీలు, ఈథర్నెట్ 800 సిరీస్ వాడనుంది. ఓ-ఆర్ఎఎన్ నెట్వర్క్ లో భాగస్వాములైన ఎయిర్టెల్, ఇంటెల్ మేక్ ఇన్ ఇండియా 5జీ అభివృద్ధి కోసం స్థానిక భాగస్వాముల ద్వారా భారతదేశంలో ప్రపంచ స్థాయి టెలికామ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి పనిచేస్తున్నాయి. -
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్!
కొద్దిరోజుల క్రితం కొత్తగా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్ కాల్ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సాధారణంగా మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మనం ఇతర పని చేస్తున్నపుడు వాట్సాప్ గ్రూప్ కాల్ కట్ చేస్తాం. అయితే, అలాంటి సంధర్భంలో వారు ఇంకా మాట్లాడుతుంటే మధ్యలో గ్రూప్ కాల్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. అందుకే, వాట్సాప్ కొత్తగా జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొనివచ్చింది. మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు గ్రూప్ కాల్ చేసిన సందర్భంలో మన పాల్గొనకుండా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు. మీరు జాయిన్ కావాలంటే గ్రూప్ కాల్ మీద టాప్ చేస్తే మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు బటన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కనుక మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మధ్యలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దశల వారీగా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. -
విడుదలకు ముందే లీకైన గెలాక్సీ ఏ 22 5జీ ధర, ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శామ్సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కానీ, విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ ఫోన్ ధర లీక్ అయింది. ఈ ఫోన్ ను రెండు ర్యామ్ వేరియెంట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిని జూన్ లో యూరోపియన్ మార్కెట్లో రూ.20,000 ధర ట్యాగ్ తో ప్రారంభించారు. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ జూన్ లోనే లాంఛ్ చేశారు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, గెలాక్సీ ఏ22 5జీ ఆగస్టులో రావచ్చు అని సమాచారం. దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. వీటి ధర 10 నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటుంది. శామ్సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది. దీని 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్ 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్‌వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
ఈ ఇయర్ ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్‌హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900. భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్, హెచ్డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది. -
పోకో ఎఫ్ 3 జీటీ జూలై 23న లాంఛ్
పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు ధృవీకరించింది. చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ చేసిన మొబైల్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోకో బ్రాండ్ కింద 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ లో "స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్ ఉందని కంపెనీ పేర్కొంది. ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ నుంచి తయారు చేశారు. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో ఆటపట్టించారు. 2021 క్యూ3లో తీసుకొస్తారని అప్పుడు పేర్కొన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు, హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లేను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సీఎన్ వై 1,999 (సుమారు రూ. 23,000) లాంచ్ చేశారు. -
అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్టాప్స్..!
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్ కొత్తగా క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ మోడళ్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 ల్యాప్‌టాప్ మోడళ్లను ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ఆసుస్ కంపెనీ ప్రారంభించింది. ఈ ల్యాప్‌టాప్ మోడళ్లు గూగుల్‌కు చెందిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్(Chrome OS)తో పనిచేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఆసుస్ కొత్తగా క్రోమ్‌బుక్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. యుఎస్, ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా భారత మార్కెట్లోకి ఆసుస్ రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523 టచ్, నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్ క్రోమ్ బుక్ మోడళ్లు జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ఫీచర్లు 11.6 అంగుళాల ఆంటీగ్లేర్ టచ్ డిస్ప్లే డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 600 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ423 ఫీచర్లు 14 అంగుళాల టచ్ డిస్ప్లే(ఆప్షనల్) ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 500 ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ523 ఫీచర్లు 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 ఫీచర్లు 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెట్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ -
మార్కెట్లోకి నయా ఆడి ఎలక్ట్రిక్ కారు వేరియంట్లు..! ధర ఎంతంటే
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు ఆడి భారత విపణిలోకి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లు ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు రకాల బాడీ స్టైల్స్‌తో ఆడి కస్టమర్లకు అందించనుంది. తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మల్టీపుల్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన లగ్జరీ కార్ల సంస్థగా ఆడి నిలిచింది. ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ-ట్రోన్50, ఈ-ట్రోన్55, ఈ-ట్రోన్55 స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఆడి ఈ-ట్రోన్50 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99 లక్షలు, ఈ-ట్రోన్55 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.1కోట్లు, ఈ-ట్రోన్55 స్పోర్ట్‌బ్యాక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ కార్లు 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. -
విద్యార్థులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన అమెజాన్..!
కరోనా రాకతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. టీచర్లు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. కాగా నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్‌ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్‌పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్‌పై విద్యార్థులకు ఎడ్టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును. ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్యా వంటి ఎడ్యుకేషన్ యాప్‌లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తోంది. హెచ్‌పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్‌టాప్‌పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై అడిషనల్ కూపన్లను అందించనుంది. -
మీ ఫోన్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..లేకపోతే..!
స్మార్ట్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. పెరుగుతున్న సాంకేతికతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. రకరకాల యాప్‌లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం తక్కువైంది. కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను వాడుతున్నాం. మనలో చాలా మంది ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోండి ! ఒక వేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలు కొట్టేసినా అప్పుడు ఎలా...! సింపుల్‌గా మరో కొత్త ఫోన్ తీసుకుంటామని అనుకుంటున్నారా..! అయితే మీ బ్యాంకు ఖాతాలోని నగదును మర్చిపోవడం మంచింది. ఔను మీరు చూసింది నిజమే.. తాజాగా స్మార్ట్ఫోన్లను కొట్టేసిన దొంగలు సాంకేతికతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మీ ఫోన్‌ను బ్లాక్ మార్కెట్ విక్రయించడంతో పాటు, మీ ఫోన్లో ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్‌లనుంచి నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీ ఫోన్ పోతే వెంటనే ఇలా చేయండి. మొబైల్ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా బ్లాక్ చేయండి. మీ సిమ్ కార్డుతో రిజిస్టర్ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి. మీ నంబర్‌పై రిజిస్టర్ ఐనా అన్ని మొబైల్ వ్యాలెట్లను బ్లాక్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. -
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్‌కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు మెసెజ్ రూపంలో వస్తుంది. మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును. अब घर बैठे ही अपना #ईपीएफ बैलेंस चेक करें। इन आसान स्टेप्स का पालन करें और परेशानी मुक्त सेवा का आनंद लें।#EPFO #PF #पीएफ #ईपीएफओ #Employees #Services@PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @DDNewslive @airnewsalerts @mygovindia @_DigitalIndia @PTI_News pic.twitter.com/WU8L2Z2Sxl — EPFO (@socialepfo) July 8, 2021 -
సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్‌తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. బొలెరో నియో సబ్‌కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్4, ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది. బొలెరో నియో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది. సరికొత్త బొలెరో నియో రివైజ్డ్ డీఆర్ఎల్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్‌తో రానుంది. కారు ఇంటీరియల్స్ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇనోఫో సిస్టమ్ విత్ బ్లూటూత్‌ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, బ్లూ సెన్స్యాప్తో బొలెరో నియో రానుంది. బొలెరో నియో ఇంజన్ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో, గరిష్టంగా 100పీఎస్ పవర్, 260ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్ఎమ్ టార్క్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్, రాకీ బీజ్ ఆరు రకాల కలర్ వేరియంట్లతో రానుంది. -
జులై 22న వచ్చేస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే!
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా): 6.43 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 12 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా -
రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్
ప్రముఖ చైనా తయారీ దిగ్గజం రియల్ మీ డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేరుతో రెండు ఫీచర్ ఫోన్లను భారతదేశంలో లాంఛ్ చేసింది. ఈ రెండు మోడల్స్ మూడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో కాన్ఫిగరేషన్ లో లభిస్తున్నాయి. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 ఫీచర్ ఫోన్లు కీప్యాడ్, చిన్న డిస్ ప్లేలతో వస్తున్నాయి. డిజో అనేది రియల్ మీ సబ్ బ్రాండ్. ఇది మొదట టీడబ్ల్యూఎస్ వైర్ లెస్, నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. డిజో స్టార్ 300 ధర రూ.1,299, డిజో స్టార్ 500 ధర రూ.1,799కు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. డిజో స్టార్ 300 ఫీచర్స్: 1.77 అంగుళాల క్యూవిజీఏ(160ఎక్స్120 పిక్సెల్స్) డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.08 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 2,550 ఎమ్ఎహెచ్ బ్యాటరీ డిజో స్టార్ 500 ఫీచర్స్ 2.8 అంగుళాల క్యూవిజీఏ(320ఎక్స్240 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.3 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 1,900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
అమెజాన్ మెగా హోమ్ మాన్సూన్ సేల్: 70 శాతం వరకు తగ్గింపు!
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్సూన్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్ శాంసంగ్, ఎల్జీ, వర్ల్‌పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. ఎల్జీ, శామ్సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది. -
ఈ మాస్క్ కరోనా వైరస్‌ను ఇట్టే పసిగడుతుంది..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని కోవిడ్-19 పూర్తిగా అతాలకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కాగా పలుదేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లు మొదలైయ్యాయి. భారత్‌తో సహా కొన్ని దేశాలలో మూడో వేవ్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్‌ను గుర్తించడానికి మార్కెట్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మాస్క్‌తో వైరస్ గుర్తింపు...! కరోనా వైరస్‌ను గుర్తించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) , హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని వైస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తయారుచేశారు. ఈ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్‌ను కేవలం 90 నిమిషాల్లో పసిగట్టవచ్చునని పరిశోధన బృందం పేర్కొంది. ఈ మాస్క్‌ను బయోసెన్సర్ టెక్నాలజీనుపయోగించి అభివృద్ధి చేశారు. ఈ బృందం ప్రామాణిక కెఎన్95 మాస్క్‌కు బయోసెన్సర్లను ఏర్పాటుచేశారు. ఒక వ్యక్తి శ్వాసలో వైరస్ ఉందో లేదో అనే విషయాన్ని ఈ మాస్క్ గుర్తించనుంది. కరోనా వైరస్‌ను ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల మాదిరిగానే కచ్చితమైన రిజల్స్ట్ వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనా శాస్త్రవేత్త పీటర్ న్గుయెన్ మాట్లాడుతూ..ఈ మాస్క్‌తో కరోనా వైరస్ పరీక్షల వేగవంతమౌతుందని పేర్కొన్నారు. అంతేకాకుంగా కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. -
ఫేస్బుక్లో మరొ కొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ భవిష్యత్తులో మరో కొత్త ఫీచరును నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ట్విటర్లో ఉండే ‘థ్రెడ్’ ఫీచరును ఫేస్బుక్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ట్విటర్లో యూజర్ పోస్ట్ చేయాలనుకున్న సందేశాన్ని కేవలం 280 క్యారక్టర్లను మాత్రమే పోస్ట్ చేయవచ్చును. మిగతా సమాచారాన్ని ముందుపెట్టిన ట్విట్‌కు థ్రెడ్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఫీచరును ఫేసుబుక్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావలని చూస్తోంది. థ్రెడ్ ఫీచరును ఫేస్బుక్ టెస్టింగ్ చేస్తోంది. కొంతమంది ఫేస్బుక్ పబ్లిక్ ఫిగర్లకు అందుబాటులో ఉంచింది. దీంతో ఫలానా సమాచారానికి సంబంధించిన విషయాలను సులువుగా థ్రెడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌పై ఫేస్బుక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా థ్రెడ్ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా ఫేస్బుక్ తన యూజర్లకు క్లబ్హౌజ్లాంటి సర్వీస్‌ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తోంది. ఈ థ్రెడింగ్ ఫీచర్ భవిష్యత్తులో యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. NEW! Facebook is testing a ‘Threads’ feature h/t @valionk pic.twitter.com/yqv8PIoTcf — Matt Navarra (@MattNavarra) July 1, 2021 -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో గింబల్‌ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్‌డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్‌కు తేలికపాటి డ్రోన్‌ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు పేటెంట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌ను కలిగి ఉంది . ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ .49,990. -
ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి
గత కొన్ని ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి మొదలు పెడితే హై-రిజల్యూషన్ డిస్ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పటికి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే పెద్దగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం బ్యాటరీ చార్జ్ అయ్యే వేగం, సామర్థ్యంలో మాత్రమే మార్పులు వచ్చాయి. అనేక ఏళ్లుగా ఇప్పటికి స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేదిస్తున్న సమస్య బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. శామ్ సంగ్ వంటి సామర్థ్యం పరంగా పెద్ద పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చిన వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. అయితే, ఈ 5 చిట్కాలతో మన స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునే వీలుంది. 1. పవర్ సేవింగ్ మోడ్ మీకు అత్యవసర సమయాల్లో మీ ఫోన్ బ్యాటరీ తొందరగా ఖాళీ కాకుండా ఉండాలంటే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఫోన్ లో అనవసరంగా రన్ అయ్యే యాప్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో తొలగిస్తుంది. దీంతో మీ బ్యాటరీ తొందరగా ఖాళీ కాదు. అలాగే, ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతున్న ఫోన్లలో ఉండే అడాప్టివ్ పవర్ సేవింగ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు ఫోన్ లో చాలా తక్కువగా వాడే యాప్స్ కు బ్యాటరీ అవసరం మేరకు మాత్రమే సరఫరా చేయబడుతుంది. 2. నెట్ వర్క్ డేటా మీ ఇంట్లో వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంటే వై-ఫై ఉపయోగించడం చాలా మంచిది. బయటకి వెళ్లిన సందర్భంలో మాత్రమే మీ మొబైల్ డేటాను ఆన్ చేసుకోవాలి. వై-ఫైతో పోలిస్తే మీ మొబైల్ డేటా ఆన్ చేసిన సమయంలోనే ఎక్కువ బ్యాటరీ డ్రెయిన్ అవుతుంది. రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే, లొకేషన్ సేవలు అవసరం లేని సమయంలో ఆఫ్ చేసుకుంటే. ముఖ్యంగా మీరు ఇంట్లో, ఆఫీస్ లో ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం. 3. డార్క్ మోడ్ మీరు ఉపయోగించే ఫోన్లో గాని, యాప్స్ లో డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటే అది ఆన్ చేసుకుంటే మంచిది. ఐఫిక్స్ ప్రకారం, డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మీరు ఒక గంట బ్యాటరీ జీవితకాలాన్ని ఆదా చేయవచ్చు. అలాగే, అడాప్టివ్ బ్రైట్ నెస్ ఫీచర్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు వెళ్లే ప్రదేశాన్ని బట్టి బ్యాటరీ ఆటోమెటిక్ గా నియంత్రించబడుతుంది. 4. స్క్రీన్ టైమ్ ఔట్ చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయ్యేలా టైమ్ సెట్ చేస్తారు. దీనివల్ల కూడా బ్యాటరీ కాలం త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్ ఔట్‌ను 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. 5.వాల్ పేపర్, విడ్జెట్ చాలా మంది ఎక్కువగా స్క్రీన్ మీద లైవ్ వాల్ పేపర్ పెడుతుంటారు. మీ డిస్ ప్లే వాటిని యానిమేట్ చేయడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి బ్యాటరీ ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భాలలో సాదారణ వాల్ పేపర్ పెట్టుకోవడం మంచిది, అలాగే విడ్జెట్ లు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్.. ఈ యాప్స్ తో జర జాగ్రత్త! -
ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్
ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్‌టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్‌టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్‌టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్‌టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్‌టీఈ ఒకటి. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల -
Redmi 10 Series: రెడ్ మీ 10 సీరీస్ వచ్చేస్తుంది!
రెడ్ మీ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. రెడ్ మీ 10 సీరీస్ త్వరలో మనదేశం లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. షియోమీ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఎ, రెడ్ మీ 9ఐ లకు వారసుడిగా రెడ్ మీ 10 సీరీస్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చైనా కంపెనీ నేరుగా రెడ్ మీ 10 సీరీస్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పనప్పటికి వచ్చే నెల ప్రారంభంలో సిరీస్ ను ఆవిష్కరించవచ్చని ట్వీట్ లో సూచించింది. రెడ్ మీ ఇండియా ట్విట్టర్ లో "రెడ్ మీ రివల్యూషన్" అనే చిన్న క్లిప్ ను "#10on10" అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది. రెడ్ మీ 10 సీరీస్ ను జూలై ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు అని ఇది సూచిస్తుంది. ఈ సిరీస్ పై ఈ ట్వీట్ తప్ప ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రెడ్ మీ 9 సీరీస్ లో రెడ్ మీ 9 ప్రైమ్ మొబైల్ ను గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో భారతదేశంలో తొలిసారిగా లాంఛ్ చేసింది. ఇలా వరుసగా ఒక్కో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Brace yourselves for the #RedmiRevolution! 💫 Hitting your screens soon! ☄️ Watch this space for more #10on10 action. 🎥 pic.twitter.com/uFY6ri5SU2 — Redmi India - #RedmiNote10 Series (@RedmiIndia) June 28, 2021 చదవండి: లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు -
బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ నార్జో 30 స్మార్ట్ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ బడ్స్ క్యూ2, రియల్ మీ ఫుల్-హెచ్ డి స్మార్ట్ టీవీతో పాటు వర్చువల్ ఈవెంట్ లో రియల్ మీ ఈ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్ మీ నార్జో 30 5జీ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తే, రియల్ మీ నార్జో 30 మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ పనిచేస్తుంది. రెండు ఫోన్ లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రియల్ మీ నార్జో 30 5జీ 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ ధర రూ.15,999. మరోవైపు రియల్ మీ నార్జో 30 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.12,499, 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ రెండు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ రంగులలో లభిస్తాయి. నార్జో 30 5జీ మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. అదే రోజున కొన్నవారికి రూ.500 డిస్కౌంట్(రూ.15,499) లభిస్తుంది. అలాగే, రియల్ మీ నార్జో 30 జూన్ 29న అమ్మకానికి రానుంది. మొదటి రోజు కొంటే 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ పై కూడా రూ.500 తగ్గింపు(రూ. 11,999 సమర్థవంతమైన ధర) లభిస్తుంది. రెండు ఫోన్ లు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం అవుతాయి. రియల్ మీ నార్జో 30 5జీ ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ (ఎఫ్/2.4 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపెర్చర్) 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (ఎఫ్/2.1 అపెర్చర్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 18 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ రియల్ మీ నార్జో 30 ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 30 డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్ ఫోన్ -
బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్
ఈ రోజుల్లో మనకు రూ.1కే ఏమి వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం రూ.1కే టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తీసుకొని రాకపోవడంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే అనేక పరిశోదనల అనంతరం ప్రోబడ్స్ను రూపొందించినట్లు లావా పేర్కొంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అనేక ట్రయల్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. నిజంగానే కేవలం రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ ‘ఆఫర్’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే రేపు(జూన్ 24వ తేదీ) మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. లావా ఈ-స్టోర్ కానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం 12 గంటల నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్న వరకే రూపాయికి ఆఫర్ వర్తిస్తుందని లావా కంపెనీ పేర్కొంది. తర్వాత కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్డ్ డ్రైవర్స్, మీడియా టెక్ ఏయిరో చిప్సెట్ ఉన్నాయి. ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ప్రోబడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు 77 గ్రాముల బరువు ఉన్నాయి. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్‌ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్ సొంతం. ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫైండ్ మై డివైజ్’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది. ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరిట ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకురానుంది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’తో మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయవచ్చును. ఫైండ్ మై డివైజ్‌లో మెయిల్ ఐడీ, పాస్వర్ఢ్తో లాగిన్ అయితే మొబైల్ ఉన్న లోకేషన్ చూపిస్తోంది. ఇది కేవలం పోయిన మొబైల్‌కు నెట్వర్క్ కనెక్టివీటీ, ఇంటర్నెట్ ఆన్ , జీపీఎస్ కనెక్షన్ ఆన్‌లో ఉంటేనే మొబైల్‌ను ట్రాక్ చేయగలము. కాగా ఆపిల్ తన ఐవోస్ 13లో భాగంగా ఫైండ్ మై డివైజ్‌కు అదనపు ఫీచర్లను జోడించి ఆపిల్ కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐపాడ్, ఆపిల్ తెచ్చిన ఎయిర్టాగ్స్తో గుర్తించవచ్చును. కాగా ప్రస్తుతం గూగుల్ ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఏవిధంగా పనిచేస్తోందని గూగూల్ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఈ ఫీచర్‌తో సుమారు 3 బిలియన్ల ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆపిల్‌లో ఫైండ్ మై డివైజ్ ఎలా పనిచేస్తుంది..? సాధారణంగా ఆపిల్ ఐఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఉన్న ఫీచర్లో ముందుగానే లాస్ట్ మై డివైజ్ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. లాస్ట్ మై డివైజ్‌లో స్నేహితుల, లేదా ఇతర ఫోన్ నంబర్‌ను కచ్చితంగా ఎంటర్ చేయాలి. లాస్ట్ డివైజ్ సహకారంతో పోయినా మొబైల్ వేరేవారికి దొరికినా, లేదా దొంగిలించినా ఆ మొబైల్ స్విచ్చ్ ఆన్ చేయగానే మొబైల్ ఫోన్ లోకేషన్, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఫోన్ లోకేషన్ వస్తోంది. అంతేకాకుండా ఈ ఆప్షన్‌తో మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే మన ఫోన్ నంబర్ కనిపించేలా ఓ మెసేజ్‌ను చూపిస్తోంది. దీన్ని ముందుగానే లాస్ట్ మై డివైజ్‌లో ఎంటర్ చేస్తేనే కనిపిస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్ఫోన్తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్కు తదనంతర వాచ్‌గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై సుమారు రూ.2,000 వరకు స్మార్‌వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్‌ను షావోమి వెబ్సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది. చదవండి: షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి -
బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్సాంగ్
ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ సంస్థ శామ్సాంగ్ మార్కెట్లోకి బడ్జెట్ లో మరో కిల్లర్ మొబైల్ తీసుకొనివచ్చింది. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎమ్31 కొనసాగింపుగా ఈ ఏడాది గెలాక్సీ ఎమ్32ను నేడు(జూన్ 21) లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్సాంగ్ ఫోన్ 90హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32లో మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ వోసి ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది. మూవీలు, గేమ్స్, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్32 రెడ్ మి నోట్ 10ఎస్, పోకో ఎం3 ప్రో, రియల్ మీ 8 5జీ వంటి వాటితో పోటీపడనుంది. భారతదేశంలో శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంటే, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,999గా ఉంది. ఇది బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అమెజాన్, శామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, కీలక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు రానుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం జూన్ 28 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా గెలాక్సీ ఎమ్32 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ ఎమ్32 స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(వన్ యుఐ 3.1) 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ బ్రైట్ నెస్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 25డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (బాక్స్‌లో 15డబ్ల్యు ఛార్జర్ వస్తుంది) 4జీ ఎల్ టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సీ, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ 196 గ్రాముల బరువు చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి? -
పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్మీ తన జీటీ 5జీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్మీ బుక్ ల్యాప్‌టాప్, రియల్మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో రియల్మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను చైనా సీఎన్‌వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,299 (రూ. 37,800). రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు: 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్) 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: పబ్జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్‌యులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు. As part of my research on predatory practise of Chinese companies in India and it's impact on National Security, had filed an RTI about the relaunch of PUBG Mobile in India by Krafton (in which the Chinese behemoth has the second largest stake). pic.twitter.com/WL5rkThdOb — Dr Gaurav Tyagi (@drtyagigaurav) June 13, 2021 చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్ -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్
వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్‌ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్ సీఈ 5జీ' స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్‌ప్లస్ ఎదురు చూశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999 చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌లో బయటపడ్డ లోపం!
సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు భద్రత విషయంలో విషయంలో కొన్ని చిక్కులు ఎదురైన వాటిని వెంటనే గుర్తించి పరిష్కరిస్తుంది. కాగా ప్రస్తుతం ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్‌కు సంబంధించి ఒక లోపం బయటపడింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్ తన ఐఫోన్ 12 మినీ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్‌లో కనుగొన్న ప్రధాన లోపాన్నిగుర్తించి వీడియోను పోస్ట్ చేశాడు. వినమ్రే సూద్ అనే నెటిజన్ తన సోదరుడితో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ఐఫోన్‌ను సూద్ తన ఫేస్ ఐడిని ఉపయోగించి అన్‌లాక్ చేసి తన సోదరుడు ఉపన్షుకు ఇచ్చాడు. ఉపన్షు ఫేస్ ఐడితో వినమ్రే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగాడు. ఇరువురు సోదరులు కవలలు కాకపోయినప్పటికీ ఐఫోన్ వీరి ఇరువురి ఫేస్ ఐడీలను ఒకే విధంగా గుర్తించి మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసింది. కాగా ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ వారి విషయంలో పూర్తిగా విఫలమైంది. విన్రమే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ఆపిల్ ఫేస్ఐడి గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. మొబైల్ పరిశ్రమలో పేరున్న ఒక సంస్థ తమ మార్కెటింగ్ ప్రచారంలో వినియోగదారుల భద్రతకు రాజీ లేకుండా ఉంటుందని చెప్పకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చే భద్రతను కూడా ఆపిల్ ఐఫోన్ ఇవ్వలేకపోతుందని తెలిపాడు. కాగా 2017లో సీఎన్ఎన్ చేసిన ఒక పరీక్షలో ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. వాస్తవానికి ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఇతర స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ కంటే చాలా మెరగైంది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో పదిలక్షల మందిలో ఒకరిని గుర్తించే సంభావ్యతను కలిగి ఉంటుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్ కంపెనీకి కోట్ల జరిమానా -
ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర
దేశీయ మొబైల్ మార్కెట్ లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి మొబైల్స్ తీసుకొచ్చిన వన్‌ప్లస్, హత్య కొద్దీ రోజుల హై ఎండ్ మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో మిడ్ రేంజ్ అభిమానులు అందరూ వన్‌ప్లస్ నుంచి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంస్థ తిరిగి మిడ్ రేంజ్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10న విడుదల చేయబోతున్నది. లాంచ్ చేయడానికి కొద్దీ రోజుల ముందు ఇండియాలో ఈ కంపెనీ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్‌ప్లస్ టీవీ యు 1 ఎస్ ధరలను ట్విటర్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండనున్నట్లు తెలుస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు అదనంగా రూ.1,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చే ఉంది. ఈ ఆఫర్ కూడా జూన్ మే 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది. లీక్‌ల ప్రకారం రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. అలాగే ఇది 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్‌ప్లస్ కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు. చదవండి: జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్ -
రూ. 25 వేలకే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్‌బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్‌వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్ట్రా షిప్మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990. చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద -
లీకైన రియల్ మీ 4కే స్మార్ట్ టీవీ ధరలు
రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ధర మే 31 విడుదలకు ముందే లీక్ అయ్యాయి. కంపెనీ మే 31న రెండు మోడళ్లను 43-అంగుళాల, 50-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్నట్లు కొద్దీ రోజుల క్రితం ప్రకటించింది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్స్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ 10 సహాయంతో పనిచేయనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫైలను కలిగి ఉంటాయి. రెండు మోడళ్లు 178-డిగ్రీల కోణాల్లో 4కే రిజల్యూషన్‌ను చూడవచ్చు అని సమాచారం. టిప్‌స్టర్ డెబాయన్ రాయ్ పంచుకున్న వివరాల ప్రకారం.. 43 అంగుళాల మోడల్ ధర రూ.28,000 - 30,000 ఉంటే, 50 అంగుళాల మోడల్ ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ టీవీ 10 సహాయంతో నడవనుంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్ తో 24వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ద్వారా ఆడియోను వినవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్బి పోర్ట్‌లు, ఎవి అవుట్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ట్యూనర్ పోర్ట్‌తో రావచ్చు. ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5 కూడా ఉంటాయి. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తీసుకొని రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ జూన్ 10న తన సమ్మర్ లాంచ్ ఈవెంట్లో కొత్త వన్‌ప్లస్ టీవీ యు-సిరీస్ మోడళ్ తో పాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గతంలో యూరప్, ఉత్తర అమెరికాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీని పోలి ఉంటుందని తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ ఫోన్ గురించి మరికొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు ఆండ్రాయిడ్ సెంట్రల్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ పేరులో సీఈ అంటే కోర్ ఎడిషన్ అని అర్ధం. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ టీవీ యు సిరీస్‌తో పాటు లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 16 నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఓపెన్ సేల్ కి వస్తుంది. చదవండి: పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్ -
ఈ సైట్లు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఇట్టే చెప్తాయి...!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కేంద్రం కూడా భావించగా, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరచగా, ఏప్రిల్ 28 నుంచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కేంద్రం ప్రకటించడంతో ఆ రోజు ఒక్కసారిగా చాలా మంది సైటుపై పడడంతో కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ సైట్ క్రాష్ అవ్వగా, ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది ఎగబడుతున్నారు. సైట్ ఓపెన్ చేసిన వెంటనే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీ లేదు అనే సందేశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు కొంతమంది టెక్నికల్ నిపుణులు పరిష్కారాన్ని చూపారు. వీరు చూపిన పరిష్కారంతో సులువుగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందుకుగాను కోవిన్ యాప్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఎక్కడ, ఎప్పుడు ఖాళీగా ఉందో చెప్పేలా వైబ్సైట్లను రూపొందించారు. అంతేకాకుండా ఈ సైట్లలో రిజిస్టర్ అయిన వారికి నోటిఫికేషన్ అలర్ట్‌లను పంపుతాయి. అందు కోసం ఈ సైట్లలో ముందుగా రిజిస్టర్ కావాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తిరిగి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ప్రజలు చాలా సమయం పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికి ఈ సైట్లలో రిజిస్టరవ్వండి: 1. కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రాకర్ ఫర్ ఇండియా: దీనిని ఇండియాకు చెందిన అమిత్ అగర్వాల్ రూపొందించారు. ఈ వైబ్సైట్లో రిజిస్టర్ కాగానే, వ్యాక్సిన్ లభ్యత ఎక్కడ ఉందనే విషయం ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. Get email alerts when #COVID19Vaccine becomes available in a vaccination center near you. (Built with Google Sheets) 👉🏻 https://t.co/Gt5D18thvr https://t.co/EWHDC1FEQ5 pic.twitter.com/7BJbCQROgw — Amit Agarwal (@labnol) May 1, 2021 2.అండర్45.ఇన్(Under45.in): 18-44 సంవత్సరాల వయసు వారికి సమీపంలో ఉన్న టీకాల స్లాట్ల కోసం శోధించడానికి అండర్ 45.in అనే వెబ్‌సైట్‌తో ప్రోగ్రామర్ బెర్టీ థామస్ ముందుకు వచ్చారు. Alerts of vaccination slots (18-45 group) for South East Delhi (Delhi)https://t.co/LSucUAl4sS For any district, continue to use: https://t.co/VXNLXkLu8C#CovidIndia #CovidVaccineIndia #Under45 6/n — Berty Thomas (@BertyThomas) May 1, 2021 3. గెట్జ్యాబ్.ఇన్(Getjab.in): ఐఎస్బీ పూర్వ విద్యార్థులు శ్యామ్ సుందర్, అతని స్నేహితులు getjab.in అనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. ప్రజలకు సమీపంలోని టీకా స్లాట్ల ఖాళీలను ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది 4. ఫైండ్ స్లాట్.ఇన్(FindSlot.in): కోవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కోసం సహాయపడే మరొక సైట్, ఫైండ్స్లాట్.ఇన్ , ఈ సైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రజలు తమ నగరం ద్వారా లేదా వారి పిన్ కోడ్ ద్వారా శోధించవచ్చును. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వాట్సాప్ లో కొత్త ఫీచర్...వాయిస్ మెసేజ్‌లను...
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ ద్వారా సందేశాలను ఇతరులకు పంపుతాము. అప్పుడప్పుడు మనం పంపే మెసేజ్‌ల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో..చూసి మెసేజ్‌లను పంపుతాం. ఈ సౌలభ్యం కేవలం వాట్సాప్‌లో మెసేజ్‌లకు మాత్రమే ఉంది. వాయిస్ మెసేజ్‌లకు లేదు. వాయిస్ మెసేజ్‌లను ఎలాంటి పునః పరిశీలన చేయకుండానే పంపుతుంటాం. మనలో కొంత మంది అరేరే..! తప్పుగా వాయిస్ మెసేజ్ సెండ్ చేశానే..!అని నాలుక కర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనలో కొందరు వాటివల్ల అనేక పర్యవసానాలను కూడా ఎదుర్కొని ఉంటారు. ఈ సమస్యకు వాట్సాప్ త్వరలోనే చెక్ పెట్టనుంది. అవును మీరు విన్నది నిజమే... రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను తిరిగి ఒకసారి వినే వీలు కల్గుతుంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల్లో మెసేజ్‌లను వినవచ్చును. ఈ ఫీచర్‌తో యూజర్లు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చును. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్‌లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది. చదవండి: కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది! -
ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్‌లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
గేమింగ్ ప్రియుల కోసం రెడ్మీ సూపర్ ఫోన్!
చైనా: గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్‌లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియో సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 30వ తేదీన చైనాలో జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయం తెలియదు. రెడ్మీ కే40 గేమింగ్ ఎడిషన్ ఫీచర్స్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెట్ రేట్ హెచ్డీఆర్10+ సపోర్ట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా 5065 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600) 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500) 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,699 యువాన్లు (సుమారు రూ.31,100) చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
జోరుమీదున్న స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్‌తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను నడిపించాయి. స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో.. మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 207 శాతం, వన్‌ప్లస్ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్‌ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్ స్కీమ్స్‌పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్ వేవ్‌తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ చెబుతోంది. కోవిడ్-19, లాక్డౌన్స్ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్-సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. చదవండి: గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా? -
గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా?
మనం ఇంటర్నెట్లో అనేక రకాలైన ఫోటోలను చూస్తుంటాం. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్ సాయంతో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలిబ్రిటీల విషయంలో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనది కదా అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ఇమేజెస్ ఆన్ లైన్ లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్. గూగుల్ లో మనకు కనిపించే ఫోటోలు నిజమా? కదా అనేది గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే? గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫొటో యూఆర్ఎల్ లేదా ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు చెప్పేస్తుంది. గూగుల్ సెర్చ్ మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి మీరు రివర్స్ సెర్చ్ చేయాలనుకుంటున్న ఆసక్తికరమైన ఫోటోను ఎంపిక చేసి దానిమీద రైట్ క్లిక్ ఇవ్వండి అప్పుడు మీకు సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది. చదవండి: మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా? -
బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ ఫోన్ అదరహో...!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్‌లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్‌ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్‌ను ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్ఐ 11 ఎక్స్‌తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్ఐ 11 ఎక్స్ ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లో లభిస్తుంది. ఐక్యూ 7 ధరలు: (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990 (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990 ఐక్యూ 7 ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఐక్యూ 7 లెజెండ్ ధరలు (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990 ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చదవండి: రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ : సరసమైన ధరలో -
వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడానికి వాట్సాప్ స్టేటస్ లో వీడియోనో, ఫొటోనో పెడుతుంటారు. కొందరు తమకు నచ్చిన వీడియో లేదా ఫోటోలను వాట్సాప్ స్టేటస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా అత్యంత తేలిగ్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం క్రింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు వాట్సాప్ తెరచి, స్టేటస్‌లోకి వెళ్లండి. మీరు ఏం డౌన్లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఓసారి పూర్తిగా చూడండి. ఇప్పుడు మీ మొబైల్లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show Hidden Files ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్‌లోకి వెళ్లి వాట్సాప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఫోల్డర్ కనిపించే మీడియా ఆప్షన్లో స్టేటస్(statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో వాట్సాప్ స్టేటస్‌లో చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. వాటిని కాపీ చేసి... వేరే ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ మేనేజర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీకు నచ్చిన వాటిని పొందవచ్చు. -
వాట్సాప్‌లో కొత్త సమస్య..! పరిష్కరించండి ఇలా...
వాట్సాప్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనలో చాలా మంది తెల్లవారగానే ముందుగా డేటా ఆన్ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయే లేదో చూసుకుంటాం. నేటి టెక్నాలజీ యుగంలో అప్పుడప్పుడు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవుతూంటాయి. దీనితో కాస్త ఇబ్బందికి గురవుతుంటాం. ప్రస్తుతం వాట్సాప్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాట్సాప్ కొత్త వినియోగాదారులకు మిస్సింగ్ మీడియా ప్రాబ్లమ్ వస్తోంది. వినియోగదారులు వారి వాట్సాప్ యాప్‌లో మీడియాను చూసుకోలేక పోతున్నారు. ఈ సమస్య కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ఆప్డేట్ చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వాట్సాప్ వర్షన్ 2.21.9.3 వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేసింది. తాజా వెర్షన్‌లోని కొంతమంది వినియోగదారులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఈ సమస్యను గుర్తించినప్పటీకి, సమస్యకు ఇంకా పరిష్కారం చూపలేదు. మీ మీడియా కంటెంట్‌ను తిరిగి తీసుకురావడానికి సరళమైన ప్రత్యామ్నాయం ఉంది. కొంత మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సమస్యకు గురయ్యారని వాట్సాప్ బేటా ట్రాకర్ డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది. ఈ మీడియాను మొబైల్ ఫోన్లో పొందినప్పటికి కింద సూచించిన విధంగా చేస్తే ఏకంగా మీడియాను మీ వాట్సాప్ యాప్‌లో చూసుకోవచ్చును. వాట్సాప్ యాప్‌లో మీడియా కనిపించాలంటే... ►ముందుగా మీ ఫోన్లో వాట్సాప్‌ను క్లోజ్ చేసి క్యాచీ డేటాను క్లియర్ చేయాలి ఇక్కడ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడవకుండా చూసుకోవాలి. ►తరువాత మీ ఫోన్లో ఫైల్ మెనేజర్లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్ఢర్ను సెలక్ట్ చేసుకోవాలి. ►ఇప్పుడు మీడియా ఫోల్డర్‌లోని కంటెంట్‌ను ఆండ్రాయిడ్ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్లో కామ్.వాట్సాప్‌లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాట్సాప్ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్ మాత్రమే మూవ్ చేయాలి. ►మీడియా కంటెంట్ పూర్తిగా మూవ్ అయ్యే వరకు నిరిక్షించాలి. ఈ స్టెప్స్ పూర్తి చేశాక మీడియా మిస్సింగ్ అనే బాధ ఉండదు. మీ వాట్సాప్ యాప్‌లో మీడియాను మీ కళ్లముందు ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య ఉన్నవారు పై స్టెప్స్నుపయోగించి మాన్యువల్ గా చేయాలని ఉద్ధేశ్యం లేకపోతే వాట్సాప్ యాప్‌ను ఆప్డేట్ చేసేదాక వేచి ఉండండి. -
10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్
ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన కో-ఫౌండర్ & సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్ల ప్రకారం.. ఈ డేటా సామర్ధ్యం 13 టెరాబైట్లు(టీబీ). డేటాలో 10 లక్షల యూజర్ల క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్ వివరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపాడు. జూమినెంట్ ఫుడ్‌వర్క్స్ డొమినోస్ ఇండియా మాతృ సంస్థ. అలాగే, 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 550,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే. Threat actor claiming to have hacked Domino's India (@dominos) and stealing 13TB worth of data. Information includes 180,000,000 order details containing names, phone numbers, emails, addresses, payment details, and a whopping 1,000,000 credit cards. pic.twitter.com/1yefKim24A — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) April 18, 2021 మా నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేము ఎప్పుడు స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18 కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో చాలా కంపెనీల డేటా లీక్ అవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. చదవండి: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి! -
వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి!
వాట్సాప్ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉందంటే మనం అంత ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా విస్తరించింది వాట్సాప్. దీని వినియోగం రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈ యాప్ వాడే చాలా మంది తమకు నచ్చని వారిని బ్లాక్ చేస్తారు. అయితే ఇలా ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి ఈ క్రింద ఇస్తున్న ట్రిక్స్ ఫాలో అవ్వండి. ట్రిక్ 1: సాదారణంగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మీకు వారి స్టేటస్ కనిపించదు. ట్రిక్ 2: అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొపైల్ మీకు కనిపించదు. ఒకవేళ కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకులో కనిపిస్తుంది. ట్రిక్ 3: మిమ్మల్ని బ్లాక్ చేశారని తెలియక మీరు అతనికి మెసేజ్ పంపితే కేవలం సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కాని అలాగే డబుల్ ట్రిక్ కాని కనిపించదు. ట్రిక్ 4: బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని, వాయిస్ మెసేజ్ కాని పంపలేరు. ట్రిక్ 5: మీరు ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు మీకు You are not authorized to add this contact అనే మెసేజ్ కనిపిస్తుంది. చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా? -
మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్సైట్(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు. చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ -
సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్
ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న నెక్స్‌జూ మొబిలిటీ రోడ్‌లార్క్ పేరుతో సూపర్ లాంగ్ రేంజ్ ఈ-సైకిల్‌ను తయారు చేసింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్థాయిలో నడిచే ఈ-సైకిల్ భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ధర రూ.42,000. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. ఆరు రకాల రైడింగ్ మోడ్స్, డ్యూయల్ డిస్క్ ఎలక్ట్రిక్ బ్రేక్స్, డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్, 26 అంగుళాల కాటన్ ట్యూబ్ టైర్స్ ఏర్పాటు ఉంది. కోల్డ్ రోల్డ్ స్టీల్‌తో తయారైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. నెక్స్‌జూ పోర్టల్ ద్వారాగాన్నీ దేశవ్యాప్తంగా ఉన్న 90 టచ్ పాయింట్లలో రోడ్‌లార్క్‌ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: టెకీలకు గుడ్ న్యూస్.. భారీగా నియామకాలు! -
గేమింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ కార్నివాల్లో అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 6.59 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.55,999గా ఉండగా ఈ సేల్‌లో రూ.41,999కే విక్రయిస్తున్నారు. అలాగే, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999 నుంచి రూ.12,000 తగ్గింపుతో రూ.45,999కు అందిస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 3 ఫీచర్లు: 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ హెచ్డీఆర్ డిస్ ప్లే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ మెయిన్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ చదవండి: బజాజ్ చేతక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్! -
వాట్సాప్ వినియోగదారులకి సీఈఆర్టీ హెచ్చరిక
వాట్సాప్ వినియోగదారులకు భారత సైబర్ సెక్యూరిటీ సీఈఆర్టీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32 వెర్షన్లో లోపం గుర్తించినట్లు తెలిపింది. పైవెర్షన్లు ఆన్ ఇంస్టాల్ చేసి అప్డేటెడ్ వెర్షన్లు డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సీఈఆర్టీ సూచించింది. అలాగే, వాట్సాప్ కొత్త గోప్యతా విధానం అధిక డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొంది. -
లాంచ్ కు సిద్ధంగా 75 అంగుళాల షియోమీ స్మార్ట్ టీవీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ. ఇప్పుడు స్మార్ట్‌టీవీ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తుంది. క్రమ క్రమంగా భారత టెలివిజన్ మార్కెట్‌ను కూడా సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. షియోమీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్ టీవీల్లో కెల్లా ఇదే అతిపెద్ద స్మార్ట్ టీవీ కావడం విశేషం. అంతేకాక, షియోమీకి చెందిన అత్యంత ఖరీదైన టెలివిజన్ కూడా ఇదేనని తెలిపింది. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్లు 2020 డిసెంబర్లో ఇదే సిరీస్‌లో విడుదలైన 55 అంగుళాల వేరియంట్‌తో సమానంగా ఉంటాయని పేర్కొంది. కాగా, ఈ కొత్త స్మార్ట్‌టీవీ ఏప్రిల్ 23న జరిగే ఆన్లైన్ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే కార్యక్రమంలో ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కూడా లాంఛ్ చేయనుంది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 అంగుళాల అతి పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీవీలో సినిమా చూసేటప్పుడు థియేటర్లో చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ టీవీ ధరను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇదే ఫీచర్లతో ఇతర కంపెనీల నుంచి విడుదలైన 75 అంగుళాల టీవీలు రూ.1,50,000 ధరల శ్రేణిలో లభిస్తుండగా.. దీని ధర లక్ష రూపాయలలోపే ఉండే అవకాశం ఉంది. చదవండి: ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.2,499కే పోకో ఎక్స్3 ప్రో
పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. పోకో ఎక్స్3 ప్రో తదుపరి సేల్ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.16,500 విలువచేయాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఒకవేళ పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను డైరెక్ట్‌గా సేల్ లో కొనాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు!
మీ ఫోన్ నంబర్ సహాయంతో రిమోట్‌గా మీ ఖాతాను హ్యకర్లు సస్పెండ్ చేయడానికి అనుమతించే ఒక భద్రత లోపాన్ని ఇటీవల కనుగొన్నట్లు భద్రతా పరిశోధకులు తెలిపారు. రిమోట్ అటాకర్ మీ ఫోన్లో వాట్సాప్‌ను క్రియారహితం చేసి, దాన్ని తిరిగి యాక్టివేట్ చేయకుండా కొద్దిగంటలసేపు చేయగలరు. ఇలా చేస్తే పెద్ద సంఖ్యలో వాట్సాప్ యూజర్లు భారీ ప్రమాదంలో పడనున్నారు. మీరు మీ వాట్సాప్ ఖాతా కోసం టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. భద్రతా పరిశోధకులు లూయిస్ మార్క్వెజ్ కార్పింటెరో, ఎర్నెస్టో కెనాల్స్ పెరెనా మొదటిసారిగా వాట్సాప్ ఖాతాను రిమోట్‌గా బ్లాక్ చేసే లోపాన్ని కనుగొన్నారు. భద్రతా పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడిన వాట్సాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయడానికి అనుమతిస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్లో లభించే ఆరు అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ను పొందకపోతే వారు మీ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం ఉండదు. కానీ, వారికి కూడా కావాల్సింది కూడా అదే. మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించి తర్వాత వారి ఫోన్లో 12 గంటలు పాటు వాట్సాప్‌లోని కోడ్ ఎంట్రీలను కూడా బ్లాక్ చేస్తుంది. దీని తర్వాత వారు మీ ఫోన్ నంబర్‌ను యాప్ నుంచి బ్లాక్ చేయడానికి వాట్సాప్ సపోర్ట్ తీసుకొంటారు. వారికి కావలసింది క్రొత్త ఇమెయిల్ చిరునామా, ఫోన్ దొంగిలించబడిందని లేదా పోయిందని పేర్కొన్న సాధారణ ఇమెయిల్. ఆ ఇమెయిల్‌కు ప్రతిస్పందనగా, దాడి చేసేవారు వారి చివర నుంచి త్వరగా అందిస్తారని ధృవీకరించడానికి వాట్సాప్ అడుగుతుంది. ఇలా మీ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేస్తారు. అంటే మీరు ఇకపై మీ ఫోన్లో వాట్సాప్ యాప్ యాక్సెస్ చేయలేరు. హ్యాకర్ పంపిన ఈ-మెయిల్ ద్వారా మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది. మీ వాట్సాప్ ఖాతాలో టూ-స్టెప్-వెరిఫికేషన్ ఏమి చేయలేరు. సాధారణ సందర్భంలో మీరు మీ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడం ద్వారా మీ వాట్సాప్ ఖాతాను తిరిగి ఆన్ లాక్ చేయవచ్చు. కానీ, మీ వాట్సాప్ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి అనేక విఫల ప్రయత్నాలు చేయడం వల్ల దాడి చేసిన వ్యక్తి ఇప్పటికే 12 గంటలు ఖాతాను లాక్ చేసి ఉంటే ఇది సాధ్యం కాదు. మీ ఫోన్ నంబర్లో కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌ను 12 గంటలు వరకు పొందకుండా పరిమితం చేయబడతారని అర్థం. ఇలా మళ్లీ 12 గంటల తర్వాత హ్యాకర్లు చేస్తే చాలా ప్రమాదం. వారు ఇలా చేయకుండా ఉండటానికి డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. అయితే, మీరు సమస్యను తప్పించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసే సమయంలో ఇచ్చిన మెయిల్ ద్వారా తిరిగి మీ ఖాతాను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ లోపాన్ని సరిదిద్దడానికి చేస్తుందా? లేదా అనే దానిపై వాట్సాప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఎవరైనా ఈ లోపాన్ని ఉపయోగించారా? లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. చదవండి: 10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు -
చరిత్రలో మనకంటూ ఒక స్పేస్
సాక్షి, సెంట్రల్ డెస్క్: భూమికి అవతల ఏముంది.. ఇతర గ్రహాల్లో, ఇంకెక్కడైనా జీవం ఉందా.. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోక చుక్కలు.. ఇలా అంతరిక్షంపై ఎప్పటినుంచో మనిషికి ఆసక్తి ఉంది. ఆ దిశగానే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టారు. మనుషులు స్పేస్‌లోకి అడుగు పెట్టారు కూడా. 1961 ఏప్రిల్ 12న రష్యా కాస్మోనాట్ యూరీ గగారిన్ తొలిసారిగా స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఏటా ఏప్రిల్ 12న ‘ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డే’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది చేపట్టిన పలు కీలక అంతరిక్ష ప్రయోగాలేంటో తెలుసుకుందామా? అమెరికా.. ఆర్టెమిస్-1 చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది తొలి ప్రయోగం జరుగనుంది. నవంబర్‌లో ‘ఆర్టెమిస్-1’ను లాంచ్ చేసేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సుదూర అంతరిక్షంలో రహస్యాలను ఛేదించేందుకు, భూమిలాంటి గ్రహాలను గుర్తించేందుకు నాసా చేపట్టిన ‘ది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది. మార్స్‌పైకి.. మూడు దేశాలు ఒకప్పుడు జీవం ఉండి ఉంటుందని భావిస్తున్న అంగారక గ్రహంపై ఈ ఏడాది మూడు దేశాలు పరిశోధనలు చేపట్టాయి. అమెరికా పంపిన పర్సవెరన్స్ రోవర్ మార్స్‌పై ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేల, రసాయనాలు, జీవం ఉనికిని వెతుకుతోంది. ఈ రోవర్ వెంట వెళ్లిన ‘ఇన్‌జెన్యుటీ’.. భూమి అవతల మరోగ్రహంపై గాల్లోకి ఎగిరే తొలి హెలికాప్టర్ కానుంది. ఇక మార్స్‌పైకి చైనా, యూఏఈ దేశాలు తొలిసారి ప్రయోగాలు చేపట్టాయి. చైనాకు చెందిన టియాన్వెన్-1, యూఏఈకి చెందిన ది హోప్ ఆర్బిటర్ రెండూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం ఒక్క రోజు తేడాలో అంగారకుడిని చేరి పరిశోధనలు మొదలుపెట్టాయి. స్పేస్‌లో చెత్తను క్లీన్ చేసేందుకు.. సుమారు 50 ఏళ్లుగా వివిధ దేశాలు పంపిన శాటిలైట్లలో గడువు ముగిసిపోయినవి, చెడిపోయినవి, ప్రయోగాలకు వాడిన రాకెట్లు, వాటి విడిభాగాలు లక్షల సంఖ్యలో భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వాటినే ‘స్పేస్ జంక్’ అంటారు. ఇవి భవిష్యత్తు శాటిలైట్ ప్రయోగాలకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ఆ చెత్తను క్లీన్ చేసేందుకు జపాన్‌కు చెందిన ఆస్ట్రోస్కేల్ కంపెనీ ఈ ఏడాది మార్చి 22న ‘స్పేస్ జంక్ క్లీనప్’ మిషన్‌ను ప్రయోగించింది. చంద్రయాన్-3 చంద్రుడిపైకి రోవర్‌ను పంపేందుకు మన ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టింది. దానిని ఈ ఏడాది చివర్లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రయోగం వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో చేపట్టాలని భావిస్తోంది. ఆస్టరాయిడ్ల గుట్టు తేల్చే.. ల్యూసీ మిషన్ అంగారక గ్రహం అవతలి ఒక ఆస్టరాయిడ్, గురుగ్రహం కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఏడు ‘ట్రోజాన్ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసం నాసా చేపట్టిన ప్రయోగం ‘ల్యూసీ’ మిషన్. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో పరిస్థితులు, భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను ఈ ప్రయోగంతో గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 12 ఏళ్లపాటు సాగు ఈ సుదీర్ఘ మిషన్ ఈ ఏడాది అక్టోబర్‌లో నింగికి ఎగరనుంది. చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
బీఎస్ఎన్ఎల్ ప్రియులకు గుడ్ న్యూస్!
బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. అన్ని రకాల ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ల తీసుకునే ఇన్స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేయాలని భారత ప్రభుత్వ టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. టెలికాం పీఎస్‌యు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, ల్యాండ్‌లైన్ సేవలు వంటి అనేక టెలికాం సేవలను అందిస్తుంది. ఈ సేవలకు సంబంధించి ఏప్రిల్ 30, 2021 వరకు ఏదైనా కొత్త కనెక్షన్ కోసం తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలు మాఫీ కానునున్నట్లు టెలికామ్‌టాక్ నివేదించింది. బీఎస్ఎన్ఎల్ 2021 ఏప్రిల్ 8న దీనికి సంబంధించి సమాచారాన్ని ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్ పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటుంది. అంటే ఇది ఏ ప్రత్యేక సర్కిల్‌కు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ప్రతి ఇతర రాష్ట్రలోని, సర్కిల్లలోని వెబ్సైట్లో సమాచారాన్ని నవీకరించాలని పేర్కొంది. అంతేకాకుండా, నిబంధనలు వెంటనే అమలు చేయాలనీ సూచించింది. అంటే ఈ అఫర్ 2021 ఏప్రిల్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కొత్త బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను పొందాలనుకునే ఏ యూజర్ అయినా ఇన్స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి ఇన్స్టాలేషన్ ఛార్జీగా రూ.250 వసూలు చేస్తుంది. చదవండి: 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ! -
వాట్సాప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయా?
మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? వాట్సాప్ అందించే ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే, మీకు వాట్సాప్‌లో ఉన్న ట్రిక్స్ గురుంచి మీకు తెలుసా?. తెలియకపోతే ఏమి పర్వాలేదు, వాట్సాప్ ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ ట్రిక్స్‌ని రిలీజ్ చేసింది. అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కొన్ని వాట్సప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది. విండోస్ డెస్క్‌టాప్ యాప్, విండోస్ బ్రౌజర్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్, మ్యాక్ బ్రౌజర్లో ఈ ట్రిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు వాట్సప్‌లో రెగ్యులర్‌గా ఉపయోగించే కమాండ్స్‌కి సంబంధించిన షార్ట్‌కట్స్‌ని రిలీజ్ చేసింది వాట్సాప్. మరి ఆ షార్ట్‌కట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. Final boss mode: UNLOCKED! pic.twitter.com/ykDVmwyL7V — WhatsApp (@WhatsApp) April 7, 2021 విండోస్ డెస్క్‌టాప్ యాప్ వాట్సాప్ ట్రిక్స్: Mark as unread- Ctrl + Shift + U Archive Chat- Ctrl + E Pin / Unpin- Ctrl + Shift + P Search in chat- Ctrl + Shift + F New Group- Ctrl + Shift + N Settings- Ctrl + , Mute chat- Ctrl + Shift + M Delete chat- Ctrl + Shift + D Search in Chat list- Ctrl + F New Chat- Ctrl + N Open Profile- Ctrl + P Return Space- Shift + Enter విండోస్ బ్రౌజర్ వాట్సాప్ ట్రిక్స్: Mark as unread- Ctrl + Alt + Shift + U Archive Chat- Ctrl + Alt + E Pin / Unpin- Ctrl + Alt + Shift + P Search in Chat- Ctrl + Alt + Shift + F New Chat- Ctrl + Alt + N Settings- Ctrl + Alt + , Mute chat- Ctrl + Alt + Shift + M Delete chat- Ctrl + Alt + Shift + Backspace Search in chat list- Ctrl + Alt + / New Group- Ctrl + Alt + Shift + N Open Profile- Ctrl + Alt + P Return Space- Shift + Enter చదవండి: 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ -
6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రముఖ ఎల్జీ కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. ఈ మూడు సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి పరిశోధనపై దృష్టి పెట్టాయి. ఒప్పందం ప్రకారం.. 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి. 2024 నాటికి 6జీ పరిశోధనలను పూర్తి చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. 6జీ నెట్వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి. 6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎల్జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. కీసైట్ టెక్నాలజీస్ 6జీ టెరాహెర్ట్జ్ పరీక్ష పరికరాలకు ప్రధాన సరఫరాదారుడు. ఇది ఎల్జీ, కైస్ట్ యొక్క 6జీ పరిశోధన కేంద్రానికి పరికరాలను అందిస్తోంది. ఈ కొత్త తరువాతి తరం 6జీ టెక్నాలజీ వల్ల డిజిటల్ హెల్త్‌కేర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీలు, పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. -
మూడు బడ్జెట్ మొబైల్స్ లాంచ్ చేసిన రియల్మీ
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఒకే రోజు మూడు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. రియల్మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్ గా సీ సిరీస్‌లోనే రియల్మీ సీ20, రియల్మీ సీ21, రియల్మీ సీ25 పేరిట మరో మూడు కొత్త మోడల్స్‌ని తీసుకొచ్చింది. మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్ విభిన్నంగా ఉన్నాయి. రియల్మీ సీ20, సీ21 మోడల్స్‌లో స్పెసిఫికేషన్స్, డిజైన్ కాస్త దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999. రియల్మీ సీ సిరీస్ మొబైల్స్ ను రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రియల్మీ సీ25 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ డెప్త్ సెన్సార్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్ 4జీబీ+64జీబీ ధర రూ.9,999 4జీబీ+128జీబీ ధర రూ.10,999 రియల్మీ సీ21 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ బ్లాక్ అండ్ వైట్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్స్ 3జీబీ + 32జీబీ ధర రూ.7,999 4జీబీ + 64జీబీ ధర రూ.8,999 రియల్మీ సీ20 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్స్ 2జీబీ + 32జీబీ ధర రూ.6,999 చదవండి: జియో ఫైబర్ బంపర్ ఆఫర్! -
జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్!
రిలయన్స్ జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. జియోఫైబర్ యూజర్లు నెల నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు పేర్కొంది. జియోఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజులు అదనంగా అందిస్తోంది. జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788(నెలకు రూ.399 రూపాయల బేస్ ప్లాన్ కోసం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనుంది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనుంది. ఈ ఆఫర్ జియోఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999, రూ.8,4999 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ గల వినియోగదారులు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల అదనపు డేటాను పొందవచ్చు. అదేవిధంగా, వినియోగదారులు జియోఫైబర్ సెమీ-వార్షిక ప్యాక్‌లను కొనుగోలు చేస్తే ఆరు నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజులు అదనంగా డేటా ఇవ్వబడుతుంది.-ప్రస్తుతానికి, త్రైమాసిక లేదా నెలవారీ జియోఫైబర్ ప్లాన్లపై ఎటువంటి ఆఫర్లు లేవు. చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు -
రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. రియల్మీ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్ మీ8, 8 ప్రోలను గత నెలలో చైనాలో లాంఛ్ చేసింది. అతి త్వరలోనే వీటిలో 5జీ కనెక్టివిటీ అందించి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే, ఈ రెండు ఫోన్లు ఎఫ్‌సిసి, బిఐఎస్ సర్టిఫికేషన్‌ను సాధించడంతో అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో అందిస్తున్న స్పెసిఫికేషన్లు వివరాలను పరిశీలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. రియల్ మీ 8 స్పెసిఫికేషన్లు(అంచనా): 6.4-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 4 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.14,999 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.15,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.16,999 రియల్మీ 8ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా) 6.4 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 108 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.17,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.19,999 చదవండి: ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ -
మీ డేటా ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోండిలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేసుబుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా బయటికి విడుదల అయింది. ఇలా మన డేటా ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా మన డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. మీ డేటా లీక్ అయ్యిందా లేదా అని తెలుసు కోవడానికి ప్రముఖ వెబ్సైట్ (https://haveibeenpwned.com/) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్బుక్ లాగిన్ ఇచ్చిన లేదా మీ ఈమెయిల్ చిరునామాను టైప్ చేయండి. ఈ వెబ్సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనేది సూచిస్తుంది. ప్రస్తుతానికి, మీరు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి మాత్రమే సెర్చ్ చేయగలరు. చదవండి: డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోండిలా!
స్మార్ట్‌ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయింది. రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. అయితే, ఒకప్పటి స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ సమస్యలు అధికంగా కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని కంపెనీలు పెద్ద పెద్ద బ్యాటరీలతో కూడిన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ అనేది చాలా ముఖ్యమైనది. ఫోన్ మిగిలిన ఫీచర్స్ ఎలాగున్నా బ్యాటరీ పరిమాణాన్ని బట్టి మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటికి ఉన్నారు. అలాంటి బ్యాటరీ లైఫ్ మొదట బాగున్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్రమంగా క్షీణిస్తూనే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు మీరు గమనిస్తే మీ ఫోన్‌ను వెంటనే ఛార్జ్ చేయడం మంచిది. అలాగే, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 90 శాతం చేరుకోగానే ఛార్జింగ్‌ను ఆపడం చాలా మంచిది. ఎక్కువ శాతం మంది రాత్రంతా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ వేగంగా క్షీణిస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, గేమ్స్ ఆడనప్పుడు లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించడం మంచిది. వై-ఫై, బ్లూటూత్ అనేది మీ బ్యాటరీని త్వరగా హరిస్తుంది. ఈ రెండింటినీ అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం మంచిది. వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో గల మరొక సౌలభ్యం. అయితే దీనిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి యాదృచ్ఛిక ఛార్జింగ్ ఎడాప్టర్లు మరియు కేబుల్లను ఉపయోగించడం మానుకోండి. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంకులను ఉపయోగించడం మానుకోండి. బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవడానికి ఫోన్ లో అవసరం లేని యాప్ లను తొలగించండి. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త లోగోను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ లోగో తయారీ కోసం 3 లక్షల డాలర్లు(సుమారు రూ.2.2 కోట్లు) ఖర్చు, నాలుగు సంవత్సరాల కాలం పట్టినట్లు షియోమీ పేర్కొంది. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, అసలు లోగోకు కొత్త లోగోకు మధ్య తేడా ఏమి లేదు అనే కదా. షియోమీ దీనిని 'అలైవ్' డిజైన్ కాన్సెప్ట్‌తో ప్రపంచ ప్రముఖ డిజైనర్, జపాన్‌లోని ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్యా హరా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న ఆరెంజ్ రంగు షియోమీ యూత్‌ఫుల్‌నెస్‌కు ప్రతీక అని కంపెనీ తెలిపింది. ఇందులో ఉన్న వైట్ రంగు విలువైన హైఎండ్ ఉత్పత్తులను అందిస్తూనే ఉంటామనే సందేశాన్ని తెలుపుతున్నట్లు షియోమీ ప్రకటనలో పేర్కొంది. లోగోను చతురస్రాకారం నుంచి వృత్త చతురస్రాకారంలోకి మార్చడంతో పాటు తమ కంపెనీ అంతర్గత స్పిరిట్‌ను, బ్రాండ్ స్వభావాన్ని కూడా మార్చామని తెలిపారు. దీంతోపాటు కొన్ని గణిత శాస్త్రానికి సంబందించిన సిద్ధాంతాల ఆధారంగా ఈ కొత్త లోగోను తయారు చేయడానికి ఇంత సమయం పట్టిందని కంపెనీ సీఈవో పేర్కొన్నారు. అయితే, షియోమీ కొత్త లోగోపై ఆన్ లైన్లో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఇందులో కొత్తదనం ఏముంది అని, దానికింత ఖర్చయిందని ట్రోల్ చేస్తున్నారు. రూ.10 ఖర్చుపెడితే 10 నిమిషాల్లోనే మార్చవచ్చని దీనికి 2.2 కోట్లు అవసరమా? అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
టిక్‌టాక్‌లా మారుతోన్న ఇన్స్టాగ్రామ్
ప్రపంచంలో షార్ట్ వీడియో పరంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రెజ్ వేరొక యాప్ కు లేదని చెప్పుకోవాలి. కరోనా సమయంలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టిక్‌టాక్ వల్ల సామాన్యులు కూడా సెలబ్రిటీ లాగా మారిపోయారు. భారత్ లో టిక్‌టాక్‌పై నిషేధం విదించాక ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చాలా కంపనీలు ప్రయత్నించాయి. ఇన్స్టాగ్రామ్ కూడా అందులో ఒకటి, అందుకే టిక్‌టాక్ రీతిలో కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇన్స్టాగ్రామ్ రీమిక్స్ అనే క్రొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ రీమిక్స్ ఫీచర్ టిక్‌టాక్‌లో ఉన్న ‘డ్యూయట్’ ఆప్షన్ మాదిరిగానే ఉండటం విశేషం. రీమిక్స్ సహాయంతో టిక్‌టాక్‌ను పోలినట్లే డ్యూయట్ వీడియోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పబ్లిక్ టెస్టింగ్‌లో ఉంది, కాబట్టి కొంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్ ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రెడ్మీ రికార్డు సృష్టించింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ మొదటి రెండు వారాల్లోనే భారతదేశంలో రూ.500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు షియోమీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ మూడు ఫోన్లు తీసుకొచ్చింది. షియోమీ ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. ప్రతి ఫోన్ వరుసగా మార్చి 16, మార్చి 17, మార్చి 18న ఫస్ట్ సేల్ కు వెళ్లాయి. షియోమీ ఒక ప్రెస్‌నోట్ ద్వారా ఈ ఫోన్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను షియోమీ ప్రకటిచింది. మార్చి 16 ఫస్ట్ సేల్ నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.500 కోట్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 10 మాత్రమే మార్చి 16వ తేదీన అమ్మకానికి వచ్చింది. రెడ్మి నోట్ 10 ప్రో మార్చి 17న, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ మార్చి 18న అమ్మకాలు జరిగాయి. షియోమీ మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందో తెలపలేదు. కాబట్టి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడు ఫోన్లలో ఏది అనేది అస్పష్టంగా ఉంది. అంచనా ప్రకారం, షియోమీ రెండు వారాల్లో 2,27,000 నుంచి 4,16,000 యూనిట్ల రెడ్మి నోట్ 10 సిరీస్ ఫోన్ల విక్రయించవచ్చు. చదవండి: రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్! -
స్పేస్ఎక్స్ కు ఇండియాలో ఎదురుదెబ్బ
స్టార్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించటానికి ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ చేసున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లకు స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల బీటా వెర్షన్‌ను ముందే అమ్మకుండా నిరోధించాలని లేఖ రాసింది. భారతదేశంలో ఇటువంటి సేవలను అందించడానికి స్పేస్ఎక్స్కు అనుమతులు లేవని ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. స్పేస్ఎక్స్ భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ బీటా సేవల ప్రీ-ఆర్డర్ల కోసం 99 డాలర్లు( సుమారు రూ.7,000) చెల్లించాలని గతంలో ఆఫర్ చేసింది. ఇదే తరహా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతి గ్రూప్(ఎయిర్ టెల్), యుకే ప్రభుత్వ కలిసి వన్‌వెబ్ ప్రాజెక్ట్ కింద 2022 వరకు అందించాలని చూస్తున్నాయి. అలాగే అమెజాన్ ప్రాజెక్ట్ కైపెర్ ఇతర ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం ఇతర సంస్థలతో పోటీపడుతుంది. ఇండియాలో స్టార్‌లింక్‌కు సొంత గ్రౌండ్ లేదా ఎర్త్ స్టేషన్లు లేకపోవడంతో పాటు ఇస్రో & టెలికమ్యూనికేషన్ విభాగం(డిఓటి) నుంచి శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఆథరైజేషన్ లేదని ఫోరం తెలిపింది. యుఎస్, కెనడా, యుకే దేశాలలో ఇప్పటికే ఇటువంటి సేవలను అందిస్తున్న స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ 2022 వరకు ఉపగ్రహాల ద్వారా భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని చూస్తుంది. వివిధ దేశాలలో విజయవంతంగా బీటా పరీక్షలు జరగడంతో ఇండియాలో కూడా బీటా సేవల కోసం బుక్ ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సేవలు అందించనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. చదవండి: -
యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా?
మన నిత్యజీవితంలో యూట్యూబ్ ఒక భాగమైంది. తీరికగా యూట్యూబ్‌లో వీడియోలను చూస్తు కాలక్షేపం చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోలను లైక్ కొడతాం. వీడియో నచ్చక పోతే సింపుల్ డిస్లైక్ కొడతాం. యూట్యూబ్‌లో అత్యధికంగా డిస్‌లైక్‌లు కొట్టిన వీడియో ఏది అంటే...? ఠక్కున బాలీవుడ్‌కు చెందిన సడక్-2 ట్రైలర్ అని చెప్తాము. యూజర్లు ఈ విధంగా చేయడంతో ఒకింతా చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీసింది. సడఖ్-2 చిత్రం తరువాత వరుణ్ ధవన్ హీరోగా నటించిన కూలీ చిత్ర బృందం లైక్, డిస్లైక్ బటన్ లేకుండా చేసింది. ఒక వీడియోపై మన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యూట్యూబ్ డిస్లైక్ చేయడం ప్రజాస్వామ్య మార్గాలలో ఒకటిగా చెప్పుకొవచ్చు. కానీ కొంతమంది యూజర్లు వీడియోలకు దురుద్ధేశంతో డిస్‌లైక్‌లను కొట్టడం ఒక వ్యసనంగా మారింది. ఈ సమస్యలన్నింటికీ భవిష్యత్తులో యూట్యూబ్ చెక్ పెట్టనుంది. అందుకుగాను యూట్యూబ్ వివిధ మార్గాలను పరీక్షిస్తోంది. భవిష్యత్తులో యూట్యూబ్‌లో కనిపించే వీడియోలకు డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా, అసలు డిస్లైక్ బటన్ లేకుండా చేయబోతుంది. ప్రస్తుతం ఈ టెస్టును యూట్యూబ్ పరీక్షిస్తోందని ట్విటర్లో తెలిపింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ సిస్టమ్‌లలో పరీక్షించనుంది. యూజర్ల నుంచి తగు సూచనలు తీసుకున్న తరవాత ఈ ఫీచర్‌ను అమలు చేయనున్నారు. యూట్యూబ్ ఒకటే ఇలాంటి ఫీచర్‌ను తీసుకొని వస్తూదంటే మీరు పొరపడినట్లే. గతంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు నిజమైన యూజర్లను గుర్తించడానికి ఈ ఫీచర్‌ను పరీక్షించాయి. 👍👎 In response to creator feedback around well-being and targeted dislike campaigns, we're testing a few new designs that don't show the public dislike count. If you're part of this small experiment, you might spot one of these designs in the coming weeks (example below!). pic.twitter.com/aemrIcnrbx — YouTube (@YouTube) March 30, 2021 చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు -
భారీ ర్యామ్‌తో విడుదలైన ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్ లో ఎంఐ మిక్స్ పేరుతో విడుదల చేసింది. ఇది టాప్-ఆఫ్-లైన్ స్పెసిఫికేషన్లతో నో-బెజెల్ స్మార్ట్‌ఫోన్. ఫోల్డబుల్ డిస్ ప్లే మాత్రమే కాకుండా షియోమీ ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, హువావే మేట్ ఎక్స్ 2లతో పోటీ పడనుంది. దీనిని మన దేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్‌తో 840 x 2,520 పీఎక్స్ రిజల్యూషన్‌తో బయట వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తెరిచినప్పుడు పెద్ద స్క్రీన్ 4: 3 నిష్పత్తిలో 1440పీ రిజల్యూషన్‌తో 8.01-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్ప్లే అని కంపెనీ పేర్కొంది. ఓఎల్ఈడి ప్యానెల్ హెచ్‌డిఆర్10 ప్లస్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ చేస్తే 6.5-అంగుళాల డిస్ప్లే 27: 9 నిష్పత్తితో, 90హెర్ట్జ్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. ఇది 12జీబీ, 16జీబీ ర్యామ్ ఎంపికలతో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా (శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్), లిక్విడ్ లెన్స్ టెక్నాలజీతో 8 ఎంపీ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డ్యూయల్ సెల్ 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. 37 నిమిషాల్లో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్‌లో క్వాడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి హర్మాన్ కార్డాన్ చేత ట్యూన్ చేయబడతాయి.ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12తో నడుస్తుంది. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఎంఐ మిక్స్ ఫోల్డ్ ఫీచర్స్: 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా(శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్) 08 ఎంపీ సెకండరీ కెమెరా 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,12,100 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,23,300 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,45,700 చదవండి: ఈ-వాహన రంగంలో షియోమీ భారీ పెట్టుబడులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! -
మోస్ట్ పవర్ఫుల్ ఫోన్...ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో మరొక మొబైల్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో పోకో ఎక్స్ 3 ప్రోను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన పోకో ఎక్స్3 కి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌ను అమర్చారు. పోకో ఎక్స్ 3 ప్రో క్వాడ్ రియర్ కెమెరాతో పాటు 120 హెర్ట్జ్ డిస్ప్లేను కలిగి ఉంది. పోకో ఫోన్ 25 జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62, రియల్ మీ ఎక్స్ 7, వివో వి 20 మొబైల్ ఫోన్లతో పోటీపడనుంది. కాగా, పోకో ఎక్స్ 3 ప్రో( 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) వేరియంట్‌కు రూ. 18,999 కాగా, (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) మోడల్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్ లో రానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1000 వరకు 10శాతం డిస్కౌంట్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్ 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48+8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5160ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.18,999 చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..! -
షావోమి నుంచి మరో సంచలనం...!
బీజింగ్: ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటి, చైనీస్ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల దిగ్గజం షావోమి మరో సంచలన నిర్ణయం దిశగా కదులుతోంది. ప్రస్తుతం కంపెనీ ఆటోమోబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. అందులోనూ భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు పుంజుకుంటున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. తాజా నివేదికల ప్రకారం షావోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గ్రేట్ వాల్ మోటర్స్ డీల్ చేసుకోనుంది. ఈ భాగస్వామ్యంతో, సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. వీరు ఇరువురి మధ్య చర్చలు జరిగాయనే ఊహగానాలు రావడంతో షాంగై , హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెటులో గ్రేట్‌వాల్ కంపెనీ షేర్లు రాకెట్లా పైకి ఏగిశాయి. కాగా, గ్రేట్ వాల్ కంపెనీ ఇంతవరకు వేరే కంపెనీలకు మ్యానుఫాక్చరింగ్‌ను అందించలేదు. ఇరు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భాగస్వాములు అయ్యే విషయాన్ని వచ్చే వారం అధికారికంగా తెలుపనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు కంపెనీలు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. చైనా అతిపెద్ద ట్రక్ తయారీ సంస్థ గ్రేట్ వాల్ ఈ సంవత్సరం ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాల కోసం తన సొంత బ్రాండ్‌ను విడుదల చేసింది. గ్రేట్ వాల్ కంపెనీ జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూతో కలిసి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీని నిర్మిస్తోంది.గత ఏడాది 1.11 మిలియన్ పి-సిరీస్ ట్రక్స్, ఓరా ఈవీ వాహనాలను గ్రేట్‌వాల్ విక్రయించింది. ప్రస్తుతం థాయిలాండ్‌లో తన మొదటి కర్మాగారాన్ని నిర్మిస్తోంది. చదవండి: రికార్డు స్మార్ట్ఫోన్లు విక్రయం : టాప్‌లో షావోమి -
వన్‌ప్లస్‌కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వన్‌ప్లస్‌కు పోటీగా ఎక్స్60 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో వన్‌ప్లస్‌కు దీటుగా మంచి ఫీచర్లను అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేలు ఇందులో ఉన్నాయి. వివో ఎక్స్60లో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్, ఎంఐ 10 సిరీస్ ఫోన్లతో వివో ఎక్స్60 సిరీస్ పోటీ పడనుంది. వివో ఎక్స్60 స్పెసిఫికేషన్లు: 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,990 వివో ఎక్స్60 ప్రో స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990 వివో ఎక్స్60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా (జీఎన్1 సెన్సార్) 48 ఎంపీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 32 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 55 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990 చదవండి: జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ -
వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!
ఫ్లాగ్షిప్ స్మార్ట్పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో మార్చి 23న లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో హాసెల్‌బ్లాడ్ తో కలిసి వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. వన్‌ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకంగా ఒక క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో అడిగిన 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి ఏప్రిల్ 16వ తేదీన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంది. ఈ క్విజ్ నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. వన్‌ప్లస్ 9 సిరీస్ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు, సమాధానాలు: ప్రశ్న 1: OnePlus 9 Pro comes with ___ W Wireless Charging జవాబు: (C) 50 W ప్రశ్న 2: OnePlus 9 Series gets a day’s power in ___ mins with Warp Charge 65T? జవాబు: (A) 15 Mins ప్రశ్న 3: The OnePlus 9 and OnePlus 9 Pro 5G come with _____? జవాబు: (C) Hasselblad Camera for Mobile ప్రశ్న 4: The OnePlus 9 Pro’s Fluid Display 2.0 comes with _____ and _____? జవాబు: (A) LTPO technology and Smart 120 Hz ప్రశ్న 5: OnePlus 9 and 9 Pro come with _____ MP Ultra-Wide Angle Lens జవాబు: (D) 50MP ప్రశ్న 6: OnePlus 9R 5G is powered by Qualcomm Snapdragon ____ జవాబు: (C) 870 చదవండి: వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు : అద్భుత ఫీచర్లు -
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3
పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది. పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డాట్ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) పోకో ఎఫ్3 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల -
లాంచ్ కు ముందే లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను రేపు (మార్చి 23) విడుదల చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభించటానికి కొద్దీ గంటల ముందు కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్‌కు చెందిన ధరలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వీటిలో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఉన్నాయి. కొన్ని లక్షణాలు అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ, ధర వివరాలు మాత్రం బయటకి విడుదల కాలేదు. ఇప్పుడు ఒక టిప్ స్టార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వన్‌ప్లస్ 9 సిరీస్ ఇండియాకు చెందిన ధర వివరాలను బయటకి లీక్ చేసాడు. లీకైన వివరాల ప్రకారం కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు (అంచనా): వన్‌ప్లస్ 9 ఆర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 వన్‌ప్లస్ 9 ఆర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 వనిల్లా వన్‌ప్లస్ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 వనిల్లా వన్‌ప్లస్ 9 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 వన్‌ప్లస్ 9 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999 వన్‌ప్లస్ 9 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999 చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి తీపికబురు లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర -
కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త!
కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త అందించింది. మొబైల్ ప్రియుల కోసం అమెజాన్ "ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. రెడ్మీ 9ఎ, రెడ్మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం21తో పాటు మరిన్ని స్మార్ట్ఫోన్లపై ఆకర్షిణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. త్వరలో మార్కెట్లోకి విడుదలకాబోతున్న వన్‌ప్లస్ 9 సిరీస్, వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలపై 40శాతం వరకు తగ్గింపు లభించనుంది. శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్ తదితర బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు ప్రకటించింది. చదవండి: అమెజాన్ క్విజ్: రూ.10వేలు గెలుచుకోండి! -
పవర్ బ్యాంక్ కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
ఈ రోజు చాలా వరకు స్మార్ట్ఫోన్లు పెద్ద బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మన బ్యాటరీ తొందరగా ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా వేదించే సమస్య బ్యాటరీ. అందుకే వారు తమ వేంట తప్పనిసరిగా పవర్ బ్యాంక్ తీసుకెళ్తుంటారు. మనం పవర్ బ్యాంక్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. చాలా వరకు పవర్ బ్యాంక్ కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనుగోలు చేయమని సలహాలు ఇస్తుంటాయి. అయితే, మనం వారి మార్కెట్ బుట్టలో పడవద్దు. మన వాడే మొబైలును బట్టి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలి. ఉదా: ఫోన్ యొక్క బ్యాటరీ సామర్ధ్యం అనేది 4000 ఎంఏహెచ్ అనుకుంటే 10,000 ఎంఏహెచ్ సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు ఔట్పుట్ వచ్చేది సుమారు 8,000 ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకుల తీసుకునేటప్పుడు కొలతలు, బరువు, ఆకారం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి. పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది. ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే. మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, ఛార్జింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది. ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల జీవితం ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే. చదవండి: ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది -
ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది
న్యూఢిల్లీ: మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1(ఫస్ట్ ఇంప్రెషన్స్) మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు రానుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లు 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డుతో 256జీబీ వరకు పెంచుకునే అవకాశం 48 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ.9,999 6జీబీ + 128జీబీ వేరియంట్‌కు రూ.11,499 చదవండి: జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు -
శామ్సంగ్ నుంచి సరికొత్త మొబైల్స్ విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ తన గెలాక్సీ ‘ఏ’ సిరీస్ నుంచి గెలాక్సీ ఏ52, ఏ52 5జీ, ఏ72 అనే మూడు మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసింది. మార్చి 17న జరిగిన ‘గెలాక్సీ ఆసమ్ అన్ప్యాక్డ్’ ఆన్లైన్ కార్యక్రమంలో ఈ మూడు మోడళ్లను విడుదల చేసింది. మూడు ఫోన్లు ఐపీ67 సర్టిఫైడ్ డస్ట్ - వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ ఎ 52 మోడల్స్, గెలాక్సీ ఎ72లో క్వాడ్ రియర్ కెమెరాలతో పాటు హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ కూడా ఉన్నాయి. శామ్సంగ్ తన కొత్త గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్లు ఒకే ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయని పేర్కొంది. గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లు అద్భుతమైన డిస్ప్లే, ప్రో-గ్రేడ్ కెమెరా, దీర్ఘకాలిక మన్నిక ఇచ్చే బ్యాటరీకి గుర్తింపు పొందాయి. ఇప్పటికే గెలాక్సీ నుంచి వచ్చిన ఏ సిరీస్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించాయి. వీటి ధర, భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. గెలాక్సీ ఎ52 ఫీచర్లు: 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 గెలాక్సీ ఎ52 5జీ ఫీచర్లు: 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 గెలాక్సీ ఎ72 ఫీచర్లు: 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో షూటర్ + 8 ఎంపీ టెలిఫోటో షూటర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6 జీబీ ర్యామ్ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! -
విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం
వాషింగ్టన్: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోన్న ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్‌తో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాల కొత్త బ్యాచ్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ఆదివారం ప్రవేశపెట్టింది. స్పేస్ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 14న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ కాంప్లెక్స్ 39ఎ(ఎల్సి-39ఎ) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. 2019 మే 24న స్పేస్ఎక్స్ 'స్టార్‌లింక్ మిషన్'కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. ప్రస్తుతం మరో 60 శాటిలైట్లను పంపింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. (చదవండి: ఒక్క రోజులోనే మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుసా?) Targeting Sunday, March 14 at 6:01 a.m. EDT for Falcon 9's next launch of 60 Starlink satellites. The first stage booster supporting this mission has completed eight flights to date https://t.co/bJFjLCzWdK pic.twitter.com/aTNacxYAiE — SpaceX (@SpaceX) March 13, 2021 Deployment of 60 Starlink satellites confirmed pic.twitter.com/AMLK4R9dMn — SpaceX (@SpaceX) March 14, 2021 -
ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్..!
న్యూఢిల్లీ: గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బి మోడళ్లను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా ఇన్ సీరిస్ నుంచి మూడో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ ఫోన్‌ను వర్చువల్‌గా కంపెనీ వెబ్సైట్ మైక్రోమాక్స్ఇన్ఫో.కామ్‌లో మార్చ్ 19 న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్చేయబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘తయార్ హోజావో.. ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ ,ఇన్1 కమింగ్ సూన్!, మేడ్ ఇన్ ఇండియా, ఇండియన్ డైరక్ట్ చేసిన, సూపర్‌స్టార్ వచ్చే శుక్రవారం మార్చి 19న జరగబోయే మ్యాట్ని షోకు అందరూ ఆహ్వానితులే ’ అంటూ మైక్రోమాక్స్ సోషల్ మీడియాలో షేర్చేసింది. ప్రస్తుతం మైక్రోమాక్స్ ఇన్ 1 ఫీచర్స్ పై ఎలాంటి సమాచారం లేదు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం మైక్రోమాక్స్ ఇన్ 1 , 6.67-అంగుళాల ఏఫ్హెచ్డీ + హోల్-పంచ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్టర్నల్ స్టోరేజ్‌తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 18వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్‌తో , బ్యాటరీ 5,000 ఎమ్ఏహెచ్ కెపాసిటితో రానుంది. అంతేకాకుండా త్రిపుల్ రియర్ 48 ఎమ్‌పి ప్రైమరీ కెమరా, 2 ఎమ్‌పి సెకండరీ కెమరా , 2 ఎమ్‌పి షూటర్కెమరా 8ఎమ్‌పి ఫ్రంట్కెమరాతో రాబోతుంది. (చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!) Taiyyar ho jao, India Ka Naya Blockbuster, #IN1 is coming soon! Made in India, directed by Indians, starring the Indian Superstar! Releasing next Friday, 19th March, matinee show! 🎬🍿#INMobiles #INdiaKeLiye pic.twitter.com/6en3nfCiJG — IN by Micromax (@Micromax__India) March 13, 2021 -
గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్డేట్ ..!
మీకు గుర్తుందా..! బహుశా మీరందరూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసే ఉంటారు.. సినిమాలో సుబ్బు (నాని) దూద్‌కాశికి వెళ్లడానికి నాకు ట్రావెల్ గైడ్ ఏం అవసరం లేదు అని చెప్పి , నాకు గూగుల్ మ్యాప్స్ ఉంది అది చూస్తూ నేను దూద్‌కాశికి వెళ్లిపోతానని అంటాడు చివరికి గూగుల్ మ్యాప్స్ సుబ్బును ఎక్కడికో లోయలోకి తీసుకుపోతుంది.. ఈ సన్నివేశం చూసి మనం కడుపుబ్భా నవ్వుకున్నాం.. ఎందుకంటే మనలో కూడా చాలామందికి గూగుల్ మ్యాప్స్ నుంచి అలాంటి పరిస్థితి ఏర్పడింది. మనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తుంది. అంతేకాకుండా సీదా వెళ్లాల్సిన మార్గాలను వదిలేసి మనల్ని గూగుల్ మ్యాప్స్ తిప్పుకుంటూ తీసుకెళ్తుంది. దీంతో మన సమయం , అటు పెట్రోల్ వృథా అవుతోంది. అసలే దేశంలో ముడిచమురు ధరలు కొండేకుతున్నాయి. కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్‌ను అసలు నమ్మకూడదని నిర్ణయించుకుంటాం. తప్పుగా చూపించిన మార్గాలను రిపోర్ట్ చేసిన అంతగా ఫలితం ఉండదు. కానీ భవిష్యత్తులో గూగుల్ మ్యాప్స్నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురుకావు. ఎందుకంటే తప్పుగా ఉన్న మార్గాలను గూగుల్ మ్యాప్స్‌లో మనమే ఎడిట్ చేయవచ్చును. అంతేకాకుండా మిస్సయిన రోడ్లను కూడా యాడ్ చేయొచ్చు. కేవలం ఏడు రోజుల్లో యూజర్లు తెలిపిన విషయాన్ని పరిశీలించి ఆ మార్గాలను ఆప్డేట్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ టూల్‌ను గూగుల్టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త ఆప్డేట్ రానున్న రోజుల్లో సుమారు 80 దేశాల్లో తీసుకురాబోతున్నారు. (చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!) -
ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా, పదే పదే ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా. అయితే, మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోండి. కొన్ని యాప్స్ మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, ఆధార్, పాన్ నెంబర్స్ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును ఖాళీ చేసే అవకాశం ఉన్నట్లు బీజీఆర్ తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఆ నివేదికలో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలు బహిర్గతం చేసింది. వీటి వల్ల సైబర్ క్రైమ్‌లు జరిగే ఆస్కారం ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. మీ ఫోన్లో కనుక ఈ కింద తెలిపిన యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేక్ వీపీఎన్ (Cake VPN) పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN) ఈవీపీఎన్ (eVPN) బీట్‌ప్లేయర్ (BeatPlayer) క్యూర్/బార్కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX) మ్యూజిక్ ప్లేయర్ (Music Player) టూల్‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary) క్యూరికార్డర్ (QRecorder) -
ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. సిమ్ లేకుండా ఒక సారి ఫోన్ వాడటం గురుంచి ఆలోచించండి. అసలు అది సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఎయిర్టెల్ దాన్ని సుసాధ్యం చేస్తుంది. ఇప్పుడు సిమ్ లేకుండానే కాల్స్, సందేశాలు, మొబైల్ డేటాను వాడే టెక్నాలజీని తీసుకొచ్చింది. మీరు కనుక ఎయిర్టెల్ యూజర్ అయితే మీరు ఈ-సిమ్‌ను దగ్గరలోని ఎయిర్టెల్ స్టోర్ నుండి పొందవచ్చు. అలాగే, మీరు మీ ఫోన్లో ఎయిర్టెల్ ఈ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎయిర్టెల్ ఈ-సిమ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, మీ సిమ్‌ను ఈ-సిమ్ గా మార్చడానికి సందేశం పంపాల్సి ఉంటుంది. మీరు మొబైల్ నుంచి eSIMregistered email id అని టైపు చేసి 121కు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి సరైనది అయితే మీకు 121 నుంచి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఇచ్చిన ఈ మెయిల్ ఐడి సరైనది కాకపోతే మళ్లీ తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. మీరు 121 నుంచి వచ్చిన మెసేజ్ కు 60 సెకన్లలోపు '1' అని టైప్ చేసి ప్రత్యుత్తరం ఇవ్వాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు QR కోడ్ గురించి ఎయిర్టెల్ ఆఫీసర్ మిమ్మల్ని సంప్రదిస్తారు. అన్ని వివరాలు సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్ లో అధికారిక QR కోడ్ వస్తుంది. మీరు QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత ఈ-సిమ్ M 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది. చదవండి: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్! నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు! -
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్!
వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్ లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను మరిచిపోయేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తుంది. తాజాగా వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొనిరాబోతుంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్‌లోని మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్లీ చాట్స్ ని రీస్టోర్ చేసే సమయంలో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నట్లు 'వాబీటా ఇన్ఫో' సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని ట్విటర్ లో షేర్ చేసింది. ఈ ఫీచర్ వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. ఇప్పటికే వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే, డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని కూడా మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు ఉన్న టైమ్ 24 గంటలకు తీసుకొనిరానుంది. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు. As previously announced, @WhatsApp is working on cloud backups encryption. The chat database and media will be safe from unauthorized access when using a password. The password is private and it's not sent to WhatsApp. It will be available in a future build for iOS and Android. pic.twitter.com/Lp06PaECBX — WABetaInfo (@WABetaInfo) March 8, 2021 చదవండి: నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు! 'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు -
'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు
‘చరిత్రలో ఈరోజు ఏం జరిగెను?’ అనే కొచ్చెన్కు వినిపించే జవాబులలో బెర్నర్స్-లీ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇన్వెంటర్‌గా సుపరిచితుడైన లీ 12 మార్చి, 1989లో తొలి సారిగా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం గురించి ప్రతిపాదించాడు. అది ఇంతై.. ఇం తింతై...వెబ్డింతై ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసింది. ‘ప్రపంచం ఒక పెద్ద గ్రామం అయిపోయింది. దేశాలన్నీ గల్లీలైపోయా యి. ఆ గల్లీలో జరిగే విషయాలు ఈ గల్లీకి వాళ్లకు తెలియడం ఎంతసేపని...’ అని మనం సంబరాల్లో మునిగిపోతుంటాం. ఈలోపే ‘చాల్లేండి సంబడం’ అని ఆకాశవాణి ఉరుముతుంది. ఏమైంది? రాబోయే కాలంలో ఇంటర్నెట్ కంటే ‘స్ప్లింటర్ నెట్’ పేరు మాత్రమే ఎక్కువగా వినబడుతుంది. ‘వరల్డ్ వైడ్ వెబ్’ అనే కోటకు బీటలు పడతాయి. ఈ రోజుల్లో సమాచారాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. అందుకే దేశాలు సమాచారభద్రత విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమ సమాచారం బయటికి పోకుండా, బయటి సమాచారం లోనికి రాకుండా గోడలు కడుతున్నాయి. అదే స్ప్లింటర్ నెట్. స్ప్లింట్(ముక్కలు చేయడం), ఇంటర్నెట్లను కలిపితే ‘స్ప్లింటర్ నెట్’ అయిందన్నమాట. ప్రపంచంలోని కొన్ని దేశాలు సొంత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉదా: ఇరాన్-హలాల్ ఇంటర్నెట్. ఈ గోడల వికేంద్రీకరణ దేశాలు దాటి రాష్ట్రాల వరకు రావచ్చు. జిల్లాల వరకూ కూడా రావచ్చు!. చదవండి: ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం -
4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!
ప్రపంచం దృష్టి రాబోయే 5జీ మీద ఉంటె మనదేశంలో మాత్రం చాలా ప్రాంతాలలో సరిగ్గా 4జీ స్పీడ్ రాక భాదపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. మన మొబైల్ స్పీడ్ అనేది మీరు మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్ టవర్ ను ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీరు మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా అనే దానిపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా రావడం గమనించవచ్చు. అయితే, కొన్ని పరిస్థితులలో మన మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ కారణంగా కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4జీ వోఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి పెరగడం ఒక కారణం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్ లో 4జీ వేగాన్ని మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లి మొబైల్ నెట్వర్కుల ద్వారా "4జీ"ను ఎనేబుల్ చేయండి. మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగుకు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయండి కొన్ని అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి వాటిని ఆన్ ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపి వేయడం ఉత్తమం 4జీ ఇంటర్నెట్ సరిగ్గా రాణి సందర్భంలో ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది కొన్ని ప్రత్యేక సందర్భాలలో మీ నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం మంచిది చదవండి: 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ భారత్‌లో మూడు నెలల్లో 5జీ సిద్ధం -
10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్
సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్లో ఉండే బ్యాటరీ కెపాసిటీని బట్టి 1 నుంచి 2 గంటలు సమయం పడుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జర్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఛార్జింగ్ సమయం ఒక గంట లేదా అంతకన్నా తక్కువకు తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. అంతే కాకుండా, 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కానీ, చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీపై దృష్ట్టి సారించినట్లు సమాచారం. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్డ్, వైర్లెస్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో షియోమీ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే షియోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలో రాబోయే షియోమీ ఎంఐ 11 అల్ట్రాలో ఈ టెక్నాలజీ తీసుకోని రావచ్చు. -
భారత్‌లో మూడు నెలల్లో 5జీ సిద్ధం
న్యూఢిల్లీ: 5జీ నెట్‌వర్క్‌ను మూడు నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలపరమైన సమస్యలు.. అడ్డంకులుగా ఉంటున్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఇన్ఫ్రా ఇంకా సిద్ధంగా లేనందున.. కొన్ని ప్రాంతాలకు మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ను పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ సత్వరం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్ (మార్కెటింగ్) అమిత్ మార్వా తెలిపారు. ‘5జీ అనేది ఆపరేటర్లు సొమ్ము చేసుకునేందుకు మరో మార్గంగా భావించరాదు. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. భారత్‌లో 5జీ తయారు చేస్తున్నాం. హార్డ్‌వేర్ సిద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లను వినియోగంలోకి తేవడం మొదలుపెట్టొచ్చు‘ అని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలకు భారీ వ్యయాలు.. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాలంటే భారత్‌లో చాలా వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని టెలికం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సందీప్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడ రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అటు చైనాలో చూస్తే కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు స్థానిక కంపెనీలకు దాదాపు 200 బిలియన్ డాలర్ల దాకా ప్రభుత్వమే సమకూరుస్తోందని ఆయన వివరించారు. మరోవైపు, భారత్ టెక్నాలజీలను పూర్తి స్థాయిలో రూపొందించే పరిస్థితి లేదని, మిగతా వారి నుంచి కూడా మద్దతు తీసుకోవాల్సిన ఉంటోందని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో అరవింద్ బాలి తెలిపారు. -
శాంసంగ్ నుంచి మరో మాన్స్టర్ మొబైల్!
శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ, లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీతో నడిచే మొబైల్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎమ్12ను కంపెనీ ఈ రోజు భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా లాంచ్ చేశారు . ప్రారంభంలో గెలాక్సీ ఎమ్ సిరీస్ మొబైల్‌ను వియత్నాంలో లాంచ్ చేయగా, ఈ మొబైల్ గెలాక్సీ ఎమ్ 11 తదనంతర మొబైల్గా నిలుస్తోంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం12 6జీబీ+128జీబీ ధర 13,499, 4 జీబీ+64 జీబీ ధర 10,999 గా నిర్ణయించారు.ఈ మొబైల్‌ను గత నెలలో వియత్నాంలో బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో రిలీజ్ చేశారు. గెలాక్సీ ఎమ్12ను అమెజాన్ సేల్ చేయనుంది. గెలాక్సీ ఎమ్12 ఫీచర్స్.. గెలాక్సీ ఎమ్12 నాలుగు రియర్ కెమెరాలు, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 6.5-అంగుళాల హెచ్డి + (720x1,600 పిక్సెల్స్) టిఎఫ్టి వాటర్ డ్రాప్-స్టైల్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే నాచ్‌తో రానుంది. ఎమ్12 లో 6,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు.3జీబీ, 4 జీబీ ,6 జీబీ ర్యామ్ ను కలిగి ఉండగా, 32జీబీ, 64జీబీ, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో) శామ్సంగ్ గెలాక్సీ ఎమ్12 ఆండ్రాయిడ్ వన్ యుఐ కోర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ 8 ఎంఎం ఎక్సినోస్ ప్రాసెసర్‌ను అమర్చారు. బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో లభిస్తాయి. -
ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్ ఫోన్ విడుదల
ఆసుస్ రోగ్ ఫోన్ 5 మొబైల్ ను మనదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త గేమింగ్ ఫోన్ మూడు విభిన్న మోడళ్లలో తీసుకొచ్చారు. అసుస్ రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్ ఎడిషన్). ఈ మూడు మోడళ్లు 144 హెర్ట్జ్ శామ్సంగ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తాయి. ఇవి రోగ్ ఫోన్ 3 కంటే 23 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. రోగ్ ఫోన్ 5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో గేమ్ కూల్ 5 అనే ఫీచర్ ఉండనుంది. రోగ్ ఫోన్ 5లో ఎయిర్ ట్రిగ్గర్ 5 అనే కొత్త ఫీచర్‌ను అందించారు. భారత దేశంలో 18జీబీ ర్యామ్ తో వచ్చిన తోలి మొబైల్ అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్. అసుస్ రోగ్ ఫోన్ 5 ఫీచర్లు: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ రిఫ్రెష్ రేట్: 144 హెర్ట్జ్ ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్: 18 జీబీ స్టోరేజ్: 512 జీబీ ఫ్రంట్ కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ సెల్పీ కెమెరా: 24 ఎంపీ బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్: 65 వాట్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 అసుస్ రోగ్ ఫోన్ 5 ధర: 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.49,999 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.57,999 అసుస్ రోగ్ ఫోన్ 5 ప్రో ధర: 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.69,999 అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర: 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.79,999 చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా? -
లీకైన పోకో ఎక్స్3 ప్రో ధర, ఫీచర్లు
చైనా మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో రాబోతున్న పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. పోకో ఎక్స్3 ప్రో ధర, స్టోరేజ్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5200ఎంఏహెచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టిప్ స్టర్ సుధాంశు అంభోర్ ట్వీటర్ ద్వారా లీక్ చేశారు. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 250 యూరోలుగానూ(సుమారు రూ.21,600), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 300 యూరోలుగానూ(సుమారు రూ.26,000) ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను తీసుకోని రానున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ ఫీచర్లు ఉండనున్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో ఈ ఫోన్ రానుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ఈ ఫోన్ త్వరలో రానుంది. చదవండి: ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా!
ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్ మొదటి రోజున(ఏప్రిల్ 9) చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి)తో తలపడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం అయితే లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచే ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఐపిఎల్ 2021ను వీక్షించాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే చూడటానికి అవకాశం ఉంది. మీరు కనుక ఎయిర్టెల్, జియో కస్టమర్ అయితే ఐపీఎల్‌ను ఆన్లైన్లో ఉచితంగా చూడవచ్చు. సాధారణంగా ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా రూ.399 చెల్లించాల్సిందే. అయితే ఎయిర్టెల్, జియో కంపెనీలు తమ వినియోగదారుల కోసం డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో కూడిన ప్రత్యేక రీఛార్జిలను అందిస్తున్నాయి. దీనివల్ల మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అలాగే మీరు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరి ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.. జియో ప్లాన్స్: రూ.401 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ కింద 28 రోజులకు 90జీబీ డేటాను పొందుతారు. దీనిలో రోజుకు 3జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. ఇవే కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు. రూ.499 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ కింద మీరు రోజుకు 1.5జీబీ డేటాను పొందుతారు. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు ఎలాంటి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం లభించదు. రూ.598 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. రూ.777 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ కింద రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. మీరు 84 రోజుల పాటు మొత్తం 131జీబీ డేటాను పొందుతారు. ఇవే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. రూ.2,599 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ కింద ఏడాది పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు 10జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. జియోతో పాటు ఎయిర్టెల్ వినియోగదారులు కూడా రూ.401, రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో మాదిరిగానే ఎయిర్టెల్ కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపీ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అలాగే ఉచిత వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి. చదవండి: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ -
మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9 సిరీస్ విడుదల తేది బయటకి వచ్చింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ 9ఈ, వన్ ప్లస్ 9 లైట్, వన్ ప్లస్ 9ప్రో తీసుకొనిరావచ్చు. మార్చి 23న ఈ మొబైల్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల ప్రారంభ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్, జెడ్ ఇయర్‌బడ్స్ రెండు వెర్షన్లలో ఒకదాన్ని పొందవచ్చు అని సమాచారం. వన్ ప్లస్ 9ప్రో ఫీచర్స్(అంచనా): 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 48 ఎంపీ + 50 ఎంపీ + 8 ఎంపీ చదవండి: వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ ఇక వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి -
ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!
సాధారణంగా హై ఎండ్ మొబైల్స్ లో అత్యధికంగా 8జీబీ ర్యామ్ లేదా ఇంకొంచం ఎక్కువ అయితే 12జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ, న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18 జీబీ ర్యామ్ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో తీసుకోని వచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 6 ప్రో 18జీబీ ర్యామ్ గల మొబైల్ లో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొనివచ్చారు. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. రెడ్‌మ్యాజిక్ 6 & రెడ్‌మ్యాజిక్ 6 ప్రో ఫీచర్స్: వీటిలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్ ఉన్నాయి. 165 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్న ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మల్టీ టచ్‌లో 360 హెర్జ్ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, 3.1 యూఎఫ్ఎస్ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్లో బ్యాటరీ కూలింగ్ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్ 6లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్లోకి ఈ మొబైల్స్ విక్రయానికి రానున్నాయి. రెడ్‌మ్యాజిక్ 6 ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 3,799 (సుమారు రూ.42,700) 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,099 (సుమారు రూ.46,000) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,500) రెడ్ మ్యాజిక్ 6 ప్రో ధర: 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,550) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,799 (సుమారు రూ.54,000) 16జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 5,299 (సుమారు రూ.59,600) 18జీబీ + 512జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 6,599 (సుమారు రూ.74,200) చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యాన్ని డెస్క్ టాప్ యాప్‌నకూ కలిపించినట్టు వాట్సాప్ గురువారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్/ల్యాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. డెస్క్ టాప్ యాప్‌నకూ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్ కాల్స్ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ నమోదయ్యాయని వెల్లడించింది. చదవండి: భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్ ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ -
టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. టిక్‌టాక్‌కు పోటీగా "ఫాస్ట్ లాఫ్స్" యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ లో మొబైల్ యూజర్లకు కామెడీ కేటలాగ్ నుంచి ఫన్నీ క్లిప్‌లను అందిస్తుంది. అయితే ఈ ఫాస్ట్ లాఫ్స్ యాప్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది కూడా చూడటానికి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీనిలో ఆసక్తి పెంచే, హాస్య సంబంధిత చిన్న వీడియోలు ఉన్నాయి. ఈ యాప్ లో కెవిన్ హార్ట్ & అలీ వంటి స్టాండ్-అప్ కమెడియన్ల స్నిప్పెట్లు ఉన్నాయి. ఈ కామెడీ యాక్టర్స్ వీడియో క్లిప్స్ నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా అనుసంధానమై నేరుగా ప్లే అవుతాయి. అంతేకాదు వినియోగదారులు కూడా తమకు నచ్చిన ఆసక్తి కనబరిచే వీడియోలను పోస్ట్ చేయవచ్చు అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. గత ఏడాది నుంచి దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. చదవండి: విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ? 2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే.. -
వాట్సాప్‌లో ఫొటోలూ మాయం కానున్నాయి!
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలలో వాట్సాప్‌పై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్ తన యూజర్లను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితమే స్టేటస్ మ్యూట్ వీడియో ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. వాట్సాప్‌లో ఇప్పటికే డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఉంది. అయితే, ఈ ఫీచర్ యాక్టివ్ చేసుకుంటే వారం తర్వాత మెసేజ్‌లు ఆటో మెటిక్ గా డిలీట్ అవుతాయి. అదేవిదంగా ఇప్పుడు మీడియా డిస్అపియరింగ్ అనే ఫీచర్ తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌తో ఫొటోలు/వీడియోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోతాయి. దీని కోసం ఫొటో/వీడియోను షేర్ చేసే ముందు, యాడ్ కాప్షన్ అనే బాక్స్ పక్కన ఉండే గడియారం సింబల్‌ను టచ్ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో/వీడియోను అవతలి వ్యక్తి చూశాక డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటీకే స్వయంగా స్టిక్కర్ మేకర్ యాప్ ని కూడా ప్లే స్టోర్, యాప్ స్టోర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. WhatsApp is working on self-destructing photos in a future update for iOS and Android. • Self-destructing photos cannot be exported from WhatsApp. • WhatsApp didn't implement a screenshot detection for self-destructing photos yet. Same concept from Instagram Direct. ⏱ pic.twitter.com/LLsezVL2Hj — WABetaInfo (@WABetaInfo) March 3, 2021 చదవండి: గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ
ఎల్జీ మనదేశంలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించారు. గేమింగ్ కోసం ఆటో లో-లాటెన్సీ మోడ్‌తో తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడీ 48సీఎక్స్ టీవీ ధర రూ.1,99,990గా ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీలో వేగవంతమైన గేమ్ ప్లేతో పాటు అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలో ఏఎమ్ డీ ఫ్రీసింక్, ఎన్విడియా జి-సింక్ సపోర్ట్ ఉంది. ఈ 48 అంగుళాల టీవీ ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆడియో కోసం ఎఐ ఎకౌస్టిక్ ట్యూనింగ్‌తో పాటు 'హెచ్‌డిఆర్ 10 ప్రో' సపోర్ట్‌ను అందిస్తుంది. ఎల్జీ పేర్కొన్నట్లు 4కే రిజల్యూషన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇందులో 48 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో ఎక్కువ ఫ్రేం రేట్, వీఆర్ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ఈఆర్క్, హెచ్డీఎంఐ 2.1 స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీఆర్ఆర్ ఫీచర్ ద్వారా మీరు కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్కు తగినట్లు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఇందులో సెల్ప్ లిట్ పిక్సెల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మంచి కలర్‌ను టీవీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఎల్జీ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లి తమ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ -
లీకైన రెడ్మీ నోట్ 10 సిరీస్ ధర, చిత్రాలు
రెడ్మీ నోట్ 10 సిరీస్ మొబైల్ రేపు (మార్చి 4) మనదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో మూడు ఫోన్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రీమియం రేంజిలో రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, మిడ్-రేంజ్ లో రెడ్మీ నోట్ 10 ప్రో, బడ్జెట్ రేంజిలో వనిల్లా రెడ్మీ నోట్ 10 తీసుకోని రావొచ్చు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెడ్మీ నోట్ 10 సిరీస్ లాంచ్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో ధర లీకైంది. రెడ్మీ నోట్ 10 భారతదేశం ధర ఆన్లైన్లో లీక్ కాగా, రెడ్మీ నోట్ 10 ప్రో గ్లోబల్ లాంచ్ ధర కూడా బయటకు వచ్చేసింది. యూట్యూబర్ సిస్టెక్ బన్నా ఒక వీడియోలో రెడ్మీ నోట్ 10 ధరతో పాటు రిటైల్ బాక్స్ చిత్రాన్ని లీక్ చేశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.15,999గా ఉంది. అయితే, సాధారణంగా రిటైల్ బాక్స్ ధర కంటే ఫోన్ సేల్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా తక్కువ ధర కలిగిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గ్లోబల్ రెడ్మీ లాంచ్ ధర 279 యూరోలుగా(సుమారు రూ.20,400) ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు తీసుకోని రానున్నారు. వీటి ధర లీక్ చేయలేదు. రెడ్మి నోట్ 10 ప్రో మొబైల్ డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, గ్రాడియంట్ బ్రాంజ్, వింటేజ్ బ్రాంజ్, ఓనిక్స్ గ్రే రంగుల్లో తీసుకోని రావచ్చు. అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉన్న ఫోన్ రెడ్ మీ ఈ ధరలోనే అందిస్తూ ఉండటం విశేషం. ఇందులో 120 హెర్ట్జ్ ఐపీఎస్ డిస్ ప్లే, బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్ ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. చదవండి: గ్రాహంబెల్ జయంతి: టెలిఫోన్లలో ఎన్ని రకాలొచ్చాయి? భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ సంస్థకు అనుబంధ సంస్థ స్టార్ లింక్... శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను మన దేశంలో అందించేందుకు ప్రీబుకింగ్ ప్రారంభించింది. హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఇంటర్నెట్ ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ (డేటా తన గమ్యస్థానాన్ని చేరుకునే వ్యవధి) కనెక్టివిటీ అందించాలన్న లక్ష్యంతో స్టార్‌లింక్.. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. మన ఇంట్లో డీటీహెచ్ యాంటెన్నా కంటే చిన్న సైజులో ఉండే యాంటెన్నా ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. 2015లోనే ఎలన్ మస్క్ దీనిపై సూత్రప్రాయ ప్రకటన చేశారు. స్పేస్ఎక్స్ కమ్యునికేషన్ శాటిలైట్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు శాటిలైట్ నెట్వర్క్ ద్వారా అందించనున్నట్టు ప్రకటించారు. దీనిని అభివృద్ధి పరిచేందుకు వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇంటర్నెట్ సేవలు ఇలా.. భూమి నుంచి పంపే ఇంటర్నెట్ సిగ్నల్‌ను స్టార్‌లింక్ శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ శాటిలైట్ తన నెట్‌వర్క్‌లోని ఇతర శాటిలైట్లతో లేజర్ లైట్ సాయంతో కమ్యునికేట్ చేస్తుంది. లక్షిత శాటిలైట్ డేటా రిసీవ్ చేసుకోగానే.. కింద భూమిపై ఉన్న వినియోగదారుడి రిసీవర్‌కు రిలే చేస్తుంది. ఒక్కో శాటిలైట్ మొత్తం శాటిలైట్ల కూటమిలోని ఏవైనా నాలుగు శాటిలైట్లకు ఎల్లవేళలా అనుసంధానమై ఉంటుంది. యారే యాంటెన్నాలు శాటిలైట్లు డేటా బదిలీ చేసేందుకు సహకరిస్తాయి. వాటి నుంచి వినియోగదారులకు చిన్నసైజు డిష్ యాంటెన్నా ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికా తదితర ప్రాంతాల్లో బీటా(టెస్టింగ్) సేవలు అందిస్తోంది. ఎక్విప్మెంట్ కిట్ కోసం 499 డాలర్లు వసూలు చేస్తోంది. ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుతుందని సంస్థ చెబుతోంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ ప్రీబుకింగ్ ప్రారంభించింది. స్టార్‌లింక్ వెబ్సైట్లోకి వెళ్లి వినియోగదారులు తమ ప్రాంతంలో ఆ సేవల లభ్యతను తెలుసుకోవచ్చు. సేవల లభ్యత ఉంటే 99 డాలర్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్ చేసుకున్న వారందరికీ సేవలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవలు అన్న ప్రాతిపదికన అందించనుంది. అలాగే ఈ సేవలకు మన దేశ అధీకృత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సాగితే 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అంతరిక్షంలోకి 12 వేల శాటిలైట్లు 2019 మే 24న స్పేస్ఎక్స్.. స్టార్‌లింక్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. భూమిపై 550 కి.మీ. ఎత్తులోలో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్లను స్టార్‌లింక్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఎత్తులో ఈ శాటిలైట్ ఉండడంతో లోలేటెన్సీ రేటు ఉంటుంది. ఒక్కో శాటిలైట్ 260 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉండేలా చాలా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఈ శాటిలైట్‌కు నాలుగు యారే యాంటెన్నాలు ఉంటాయి. ఒక సింగిల్ సోలార్ యారే, అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ సెన్సార్లు, డెబ్రిస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి. -
వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్లో మ్యూట్ వీడియో సౌకర్యాన్ని వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ను చాలా సులువుగా ఉపయోగించవచ్చు. మీరు స్టేటస్ లో షేర్ చేయాలనీ అనుకున్న వీడియోను ఎంచుకొన్నపుడు దానికింద సౌండ్ సింబల్ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా మ్యూట్ చేసేస్తే రిసీవ్ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో వెళ్లిపోతుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు అప్డేషన్ కూడా వచ్చేసింది. మీకు కనుక ఈ ఫీచర్ రాకపోతే ఒకసారి మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. అలాగే కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వన్‌ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్! -
వన్‌ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్
వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్డేట్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ గత ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10తో విడుదల చేశారు. మార్చి 1నుంచి వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ దశల వారీగా రావడం ప్రారంభమైంది. ఈ అప్డేట్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. యాంబియంట్ డిస్ప్లే ట్వీక్స్, మెరుగైన డార్క్ మోడ్, షెల్ఫ్ ఈ అప్డేట్ లో అందించారు. -
ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్
ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా గురుంచి తెలియని వారు అతితక్కువలో ఉంటారని చెప్పుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియాకు బానిస అయిన వారే. అయితే, ఈ సోషల్ మీడియా ద్వారా కొందరు తమ సమయాన్ని వృథా చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా, ట్విటర్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోని వస్తుంది. ఈ ‘సూపర్ ఫాలో’ ఫీచర్ ద్వారా యూజర్లు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో ట్విటర్ యూజర్లు సరికొత్త వీడియోలు, ప్రత్యేకమైన కంటెంట్, తాజా సమాచారం, ప్రత్యేక ఫోటోలు, ఇతర ఆసక్తికర విషయాలను షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ట్విటర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేసే ప్రత్యేకమైన ఈ సమాచారం.. అతని అభిమానులు చూడాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వారు చెల్లించే ఫీజు ద్వారా ట్విట్టర్ యూజర్లు మనీ సంపాదించవచ్చు. ఇక సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారు ఈ కంటెంట్‌ను చూడలేరు. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ 'జాయిన్' అనే పేరుతో ఉంది. చదవండి: ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్ వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్ఓ -
రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. బిఎస్ఎన్ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399 ప్లాన్లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు బీమా పాలసీదారులకు శుభవార్త! -
గూగుల్ మెసేజిస్ లో అదిరిపోయే ఫీచర్
మీ మిత్రుడు, బంధువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మర్చిపోయారా? అర్ధరాత్రి వారిని లేపకుండానే వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా. అయితే, మీకు ఒక శుభవార్త. గూగుల్ తన మెసేజిస్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చిన గూగుల్. తాజాగా, షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ తీసుకొనివస్తుంది. దీని ద్వారా మీరు మీ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. మీరు మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ ఫోన్లో గూగుల్ మెసేజ్ తాజా వెర్షన్(7.4.050 )ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ కేవలం గూగుల్ మెసేజ్ యాప్ లో మాత్రమే వర్తిస్తుంది. మీ ఫోన్ లో వచ్చిన మెసేజ్ యాప్ లో ఈ ఫీచర్ వర్తించదు. మీరు మెసేజ్ లను షెడ్యూల్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ అనుసరించండి. మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ సందేశాన్ని టైప్ చేయండి తర్వాత సేండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్(ఎక్కువ సేపు) చేయండి. ఇప్పుడు మీకు తేదీలు, సమయం చూపించే ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. దానిలో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా మీ ఫొటోలు, వీడియోలు కూడా షెడ్యూల్ చేయవచ్చు. చదవండి: ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్ పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ -
2020లో తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
2020 నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 5.4% తగ్గాయని గార్ట్నర్ కొత్త నివేదిక తెలిపింది. 2020 ఏడాది మొత్తంలో అమ్మకాలు కరోనా కారణంగా 12.5శాతం తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విషయంలో 20.8 శాతం వాటాతో ఆపిల్ అగ్ర స్థానంలో ఉంది. గార్ట్నర్ ప్రకారం.. మన దేశంలో అక్టోబర్ 23న విడుదలైన ఆపిల్ 12 సిరీస్ 5జీ ఐఫోన్ లు నాల్గవ త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ 16.2 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన షియోమీ, ఒప్పో, హువావే వరుసగా మూడవ, నాల్గవ మరియు ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి. "2020 నాలుగో త్రైమాసికంలో 5జి స్మార్ట్ఫోన్లు, లోయర్-టు-మిడ్-టైర్ స్మార్ట్ఫోన్ల రాకతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల క్షీణత కొంతమేర తగ్గింది" అని గార్ట్నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా అన్నారు. కరోనా కారణంగా వినియోగదారులు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. మార్కెట్లోకి కొత్తగా విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్లు, ప్రో-కెమెరా ఫీచర్లు కొంతమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఆపిల్ నాల్గవ త్రైమాసికంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 2020 ఏడాది మొత్తం అమ్మకాలలో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది పోలిస్తే 2020లో శామ్సంగ్ 14.6శాతం క్షీణతను నమోదు చేసింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో క్షీణత భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) ప్రకారం.. 2020లో కరోనా కారణంగా భారత్‌లో మొబైల్ ఎగుమతులు 2శాతం మేర తగ్గాయని తెలిపింది. 2009 తరువాత భారత్‌లో మొబైల్ అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి. చదవండి: ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! -
ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
మొబైల్ ప్రియుల కోసం మొబైల్స్ బొనాంజా సేల్ ను ఫ్లిప్‌కార్ట్ తీసుకోని వచ్చింది. ఈ మొబైల్ బొనాంజా సేల్ నేటి(ఫిబ్రవరి 24) నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఆపిల్, మోటరోలా, పోకో, రియల్మీ, శామ్సంగ్, వివో, షియోమీతో పాటు ఇతర బ్రాండ్ల మీద ఆఫర్లు ఉన్నాయి. రియల్మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999కాగా ఆఫర్ కింద ధర రూ.8,499కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499కాగా ఆఫర్ కింద ధర రూ.6,999కు లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999 కాగా ఆఫర్ కింద రూ.16,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.54,900కాగా ఆఫర్ కింద రూ.49,999కు లభిస్తుంది. ఇలా మొత్తం 25 స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో భారీ డిస్కౌంట్ అందిస్తుంది. చదవండి: ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ -
ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా!
బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌పాన్ స్కేప్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్‌టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్లపై పనిచేసే డాటా సైంటిస్ట్‌లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్ స్క్రీన్లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్డీ స్క్రీన్లు కలిగి ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు. 64 జీబీ ర్యామ్, 2టీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. చూసేందుకు బాక్స్ తరహాలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్‌ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంది. దీని సహాయంతో అవసరమైన స్క్రీన్లను మాత్రమే తెరిచి పనిచేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్లలో పనిచేయాలనుకునేవారు ఈ ల్యాప్‌టాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే పలువురు ఈ ల్యాప్‌టాప్ కోసం ముందస్తు ఆర్డర్ చేశారట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారట. చదవండి: క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్
ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేనిది ప్రతి ఒక్కరికి పూటైనా గడవదు. మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకి 3 నుంచి 5 గంటలు మొబైల్ మీద గడుపుతున్నారు. ఇన్ని గంటలు ఫోన్ చూడటం కొన్ని మానసిక సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే చాలా యాప్ కంపెనీలు యూజర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నాయి. దీని వల్ల కళ్లకు కాస్త శ్రమ తగ్గుతుంది. అలాగే ఎక్కువ సేపు వాడే మొబైల్లో బ్యాటరీ కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ డార్క్ మోడ్ ఫీచర్ వల్ల ఎంతో కొంత ఆదా కానుంది. తాజాగా గూగుల్ కూడా తన మ్యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇది దశల వారీగా అందరికి అందుబాటులో రానుంది. గూగుల్ మ్యాప్ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ఆల్వేస్ ఇన్ డార్క్ థీమ్ సెలక్ట్ చేసుకుంటే మ్యాప్స్‌ను డార్క్ మోడ్‌లో చూడొచ్చు. ఈ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఇది ఇష్టం లేనివాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణ థీమ్‌లోకి మార్చుకోవచ్చు. అయితే డార్క్ మోడ్ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. గతంలో చీకటి పడుతుంటే నావేగేటింగ్ డార్క్ మోడ్‌లోకి, ఉదయం పూట మళ్లీ లైట్ మోడ్‌లోకి స్వయం చాలకంగా వచ్చేది. చదవండి: క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్ -
క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌తో చేతులు కలిపింది. క్వాల్కామ్కి చెందిన ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఓ-రాన్) ప్లాట్‌ఫామ్ తోడ్పాటుతో శ్జీ5 నెట్‌వర్క్‌ను తీరిదిద్దుకోనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. అలాగే ఇళ్లు, వ్యాపార సంస్థలకు బ్రాడ్యూండ్ సర్వీసులను మరింత చౌకగా, వేగ వంతంగా అందించేందుకు కూడా ఈ భాగస్వామ్య ఒప్పందం ఉపయోగపడగలదని వివరించింది. 5జీ సాంకేతికతతో గిగాబిట్ పరిమాణమున్న భారీ ఫైళ్లను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చని, 4కే వీడియోలను స్మార్ట్ఫోన్లు... కంప్యూటింగ్ సాధనాల్లో నిరాటంకంగా వీక్షించవచ్చని భారతి ఎయిర్టెల్ సీటీవో రణ్‌దీప్ సెఖాన్ తెలిపారు. దేశ సామాజిక-ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి 5జీ సేవలు ఎంతగానో తోడ్పడగలవని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజేన్ వగాడియా చెప్పారు. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్ కుదిరింది -
'5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట
న్యూఢిల్లీ: టెలీ కమ్యూనికేషన్ రంగం భవిష్యత్ లో భారత ఐటీ దిగ్గజాలకు కాసుల పంట పండించనున్నది. కరోనా మహమ్మారి పుణ్యమా? అని 5జీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఒకవేల కనుక ప్రపంచంలోని దేశాలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత కంపెనీలకు పెద్ద పెద్ద అవకాశాలు రానున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల మన దేశంలోని ఐటీ దిగ్గజాలకు 30 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు లభిస్తాయని అంచనా. భారతదేశంలో 5జీ రంగంలో పని చేస్తున్న టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలకు భారీగా లబ్ధి పొందనున్నాయి. తొలిదశలో టెలికాం ప్రొవైడర్ల నెట్వర్క్ ఆధునీకరణ, ఎక్విప్మెంట్ రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాలి. టెక్నాలజీలో ఎటువంటి మార్పులు సంభవించిన పరికరాల తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు లభిస్తాయి. 5జీ టెక్నాలజీ వల్ల కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, నూతన సేవలు అందుబాటులోకి తేవడానికి భారీగా వాల్యూక్రియేషన్ అవకాశాలు ఐటీ దిగ్గజాలకు లభిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండస్ట్రీ గ్రూప్ అధ్యక్షుడు కమల్ భాడాడా వ్యాఖ్యానించారు. హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ సాఫ్ట్వేర్ కోసం టీసీఎస్ కసరత్తు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్
వాట్సాప్ ఏ ముహూర్తాన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చారో అప్పటి నుంచి దరిద్రం అదృష్ట్టం పట్టినట్లు పట్టింది. ఒకవైపు తన ప్రత్యర్థి యాప్స్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్ లో దూసుకుపోతుంటే వాట్సాప్ మాత్రం చతికిలబడింది. ఇప్పుడు వాట్సాప్‌కు దీటుగా మళ్లీ ఒక యాప్ మార్కెట్ లోకి రాబోతుంది. రాబోయే యాప్ విదేశానికి చెందినది కాదు మన దేశానికి చెందిన కేంద్ర ప్రభుత్వం చేత తయారు చేయబడిన సందేశ్ యాప్. వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సందేశ్ యాప్ నుంచి డేటాను చోరీ చేసే అవకాశాలు, గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ సందేశ్ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్, జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు మీరు వాట్సాప్‌లో పొందలేరు. మీరు దీనిలో లాగిన్ అవ్వడానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత మెయిల్ ద్వారా లాగిన కావొచ్చు. మీ బంధువులు, మిత్రులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇందులో వాట్సాప్‌లో లేని చాట్‌బాట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే Help అని టైప్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. వాట్సాప్‌లో త్వరలో తీసుకురాబోయే లాగౌట్ ఫీచర్ ప్రస్తుతం సందేశ్ యాప్‌లో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవచ్చు. మీరు సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్ -
ఆండ్రాయిడ్ 12లో టాప్-5 ఫీచర్స్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన టెక్నాలజీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధానమైనది. ప్రతి ఏడాది వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ వస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోని వచ్చింది. దీనిలో ప్రధానంగా ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్‌ని ఆండ్రాయిడ్ యూజర్స్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఓఎస్ ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆండ్రాయిడ్ 12కి సంబందించిన కొన్ని ఫీచర్స్ బయటకి వచ్చాయి. వాటిలో ప్రధానమైన 5 ఫీచర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. సరికొత్త థీమ్స్: గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా రాబోయే ఆండ్రాయిడ్ 12లో సరికొత్త పరిచయం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘థీమింగ్ సిస్టం’ ఫీచర్‌ను కొత్త వెర్షన్లో తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనితో యూజర్ తనకు నచ్చినట్టు ఓఎస్ థీమ్ రంగుని మార్చుకొనే అవకాశం ఉంది. కొత్త యూఐతో నోటిఫికేషన్స్: ఆండ్రాయిడ్ 12లోని నోటిఫికేషన్ సెంటర్లో కూడా మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్’ డిజైన్ ఆకృతితో నోటిఫికేషన్ సెంటర్‌ను తీసుకోని రానున్నారు. ఇందులో యాప్ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ యాప్స్ అప్డేట్లు సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)తో కనిపిస్తాయి. నోటిఫికేషన్ కోసం ఎక్కువ స్థలం కాకుండా తక్కువ స్థలం తీసుకొనేలా రూపొందించారు.మెసేజింగ్ యాప్‌ల కోసం ప్రత్యేకంగా ‘కన్వర్సేషన్స్’ పేరుతో విడ్జెట్స్ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్ ద్వారా చివరిగా ఎవరితో సంభాషించామనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్‌కి ప్రత్యేక విడ్జెట్ ఉంటుందని సమాచారం. సింగల్ హ్యాండ్ మోడ్: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు స్క్రీన్ పెద్దదిగా వస్తున్నాయి. దీంతో కొన్ని సార్లు ఫోన్ వాడటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ 12లో ‘వన్ హ్యాండ్ మోడ్’ ఫీచర్ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్‌ను తగ్గిస్తుంది. దీని సాయంతో యూజర్ ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం: యాపిల్ ఐఓఎస్ తరహాలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్‌కి తెలిసేలా ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్ రంగులో మైక్ సింబల్, గ్రీన్ రంగులో కెమెరా సింబల్ కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది. అలాగే వైఫ్ షేర్ చేసుకోవడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ తీసుకోని వచ్చింది. దీనితో ఎదుటి వ్యక్తికి పాస్ వర్డ్ షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ స్క్రీన్‌షాట్: 2019లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్ 10, 11 వెర్షన్లో ఈ ఫీచర్‌ను తీసుకురాలేదు. తాజాగా స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ని ఆండ్రాయిడ్ 12లో పరిచయం చేయనున్నారట. దీని సాయంతో యూజర్ స్క్రీన్‌షాట్ తీసిన వెంటనే దానంతటదే ఫోన్ స్క్రీన్ కిందకు జరిగి మరో స్క్రీన్‌షాట్ తీసుకుని రెండింటిని కలిపి చూపిస్తుంది. చదవండి: 16వేలకే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
16వేలకే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62
ముంబయి: మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ సంస్థ గెలాక్సీ సిరీస్ లో ఎఫ్62 మొబైల్ ను గత కొద్దీ రోజుల క్రితం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో తీసుకొచ్చిన ఎఫ్-సిరీస్ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ 62 మోడల్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆఫ్ లైన్ భాగస్వాములైన రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ వెళ్లి శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62ను కొనుగోలు చేస్తే మీకు రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మీకు మొదట రూ.3వేలు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ లభించగా మొబైల్ కొన్న తర్వాత శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ లో జియో సిమ్ వేసుకొని రూ.349పైన ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు రూ.7వేలు రూపాయలు వోచర్ రూపంలో లభిస్తాయి. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ తో రిలయన్స్ డిజిటల్ లో కొంటే రూ.5వేలు తగ్గే అవకాశం ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 7,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ ర్యామ్: 6జీబీ, 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: ఎక్సినోస్ 9825 బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్ ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999 8జీబీ+128జీబీ - రూ.25,999 చదవండి: జీఎస్టీపై కేంద్రం కీలక నిర్ణయం? బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
ఫిబ్రవరి 24న రియల్మీ నార్జో 30 ప్రో 5జీ లాంచ్
రియల్మీ ప్రియులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా రియల్మీ నార్జో 30 ప్రో 5జీ విడుదల తేదీలను సంస్థ ప్రకటించింది. దీనితో పాటు రియల్మీ నార్జో 30ఎ, రియల్మీ బడ్స్ ఎయిర్ 2లను కూడా ఫిబ్రవరి 24న సంస్థ భారతదేశంలో విడుదల చేయనుంది. రియల్మీ గతేడాది రియల్మీ నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు వాటికీ కొనసాగింపుగా రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ ఫోన్లను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంది. రియల్మీ బడ్స్ ఎయిర్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ వీటి కోసం ఒక ప్రత్యేక పేజీని కూడా సృష్టించింది. రాబోయే రెండు ఫోన్ల డిజైన్ వివరాలతో పాటు రియల్మీ నార్జో 30ప్రో 5జీ ప్రాసెసర్ సమాచారం కూడా వెల్లడించింది. రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 6.5 అంగుళాల డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొనిరావచ్చు అని సమాచారం. ఇక రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలియాలంటే ఫిబ్రవరి 24న రిలీజ్ వరకు ఆగాల్సిందే. -
రూ.13వేలకే రియల్మీ ఎక్స్7 ప్రో
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ ఇటీవలే ప్రీమియం రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. రియల్మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. కొద్దీ రోజుల క్రితం ఫస్ట్ సేల్ కి వచ్చిన అవుట్ అఫ్ స్టాక్ వెళ్లింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్ఛేంజ్ కింద రూ.30వేలు విలువైన రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.16,500 తగ్గిస్తే మీరు చెల్లించాల్సింది రూ.13,499 మాత్రమే. మీ దగ్గర యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 7 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.13,499 ధరపై 5 శాతం అంటే రూ.674 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ లెక్కన మీకు రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,000 లోపే కొనవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బట్టి ఎక్స్ఛేంజ్ రేటు మారే అవకాశం ఉంది. అందుకే కొనే ముందు ఒకసారి మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ ఎంత వస్తుందో ఓసారి చెక్ చేసుకోండి. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
ఇండియన్ ట్విటర్ నుంచి చైనా ఔట్
న్యూఢిల్లీ: దేశీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ’కూ’ యాప్ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై తన వాటాలను విక్రయించి వైదొలిగే పనిలో ఉంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి పోటీగా తెరపైకి వచ్చిన ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ఈ విషయం తెలిపారు. కూ యాప్ మాతృసంస్థ బాంబినేట్ గతంలో తయారు చేసిన వోకల్ యాప్ కోసం షున్‌వై క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత బాంబినేట్ సంస్థ ప్రధానంగా ఇండియన్ ట్విటర్ "కూ" యాప్ పై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో షున్‌వై తప్పుకుంటోంది. ఆ సంస్థకున్న 9 శాతం వాటాలను దేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ‘2018లో ప్రశ్నోత్తరాల యాప్ వోకల్‌ను మేం ప్రారంభించినప్పడు.. కంటెంట్ రంగంలో ప్రముఖ ఇన్వెస్టరయిన చైన సంస్థ షున్‌వై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పలు కంపెనీల్లో షున్‌వై ఇన్వెస్ట్ చేసిందని, బాంబినేట్ కూడా అందులో ఒకటని వివరించారు. అప్పట్లో ‘కూ’ ని రూపొందించలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కూ ప్రారంభించామని, పూర్తి దేశీ యాప్‌గా జాతీయ స్థాయిలో దీనికి ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదని రాధాకృష్ణ చెప్పారు. 3వన్4 క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బాంబినేట్ ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించింది. పూర్తి స్వదేశీ యాప్‌గా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కొత్తగా మరే చైనా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం లేదని రాధాకృష్ణ వివరించారు. తెలుగు, హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంటోంది. ఇటీవలే 30 లక్షల డౌన్లోడ్లు దాటగా, పది లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. చదవండి: ‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! -
మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
న్యూఢిల్లీ: వచ్చే రోజుల్లో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ధరలు భారీగా పెరగనున్నాయా అంటే? అవుననే సమాధానం టెలికామ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది. జియో రాకతో టెలికామ్ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో కంపెనీలు డేటా ధరలతో పాటు ఫోన్ కాల్స్ ధరలను కూడా బాగా తగ్గేంచేశాయి. అయితే వచ్చే ఏప్రిల్ 1 నుంచి టెలికాం కంపెనీలు రేట్లు పెంచడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసిఆర్ఎ) నివేదిక ప్రకారం.. రాబోయే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సుంకాలను మరోసారి పెంచవచ్చు అని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు ఎంత పెరుగుతాయనే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న 2జీ వినియోగదారులను 4జీకి మార్చడంతో పాటు ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ధరలు పెంచడం ద్వారా సగటు వినియోగదారుడు వెచ్చించే ఆదాయాన్ని(ఎఆర్‌పియు) మెరుగుపర్చుకోవాలని కంపెనీలు చూస్తున్నట్లు ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. దీనివల్ల టెలికామ్ కంపెనీల ఆదాయం రాబోయే 2 సంవత్సరాల్లో 11శాతం నుంచి 13శాతంకు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి టెలికాం పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, విద్యార్థుల ఆన్లైన్ తరగతుల కారణంగా ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ వినియోగం పెరిగింది. చివరగా టెలికాం కంపెనీలు 2019 డిసెంబర్లో టారిఫ్ రేట్లను పెంచాయి. టెలికాం కంపెనీల టారిఫ్ ధరలు పెరగనున్నాయనే వస్తున్నా వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్ అమ్మకాల సెగ : 52 వేల దిగువకు సెన్సెక్స్ -
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్!
అలకచెందిన వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ల గురించి ఆలోచిస్తుంది. వాట్సాప్ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ ను ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకి బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఓఎస్ యూజర్స్‌కి కూడా బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ ఖాతా ఉపయోగిస్తున్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్లో వాట్సాప్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్ చెయ్యొచ్చు. దీనితో పాటు వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ అనే ఫీచర్ తీసుకొనివస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు వేరే పరికరాలలో వాట్సాప్ లాగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్ తో ఎక్కడి నుంచైనా లాగౌట్ చేయవచ్చు. దీనికి సంబందించిన ఒక వీడియోను వాట్సాప్ తన బ్లాగ్ లో షేర్ చేసింది. అలాగే మ్యూట్ ఫీచర్ ను తీసుకోని వస్తుంది. వేరే యూజర్లకు వీడియో, క్లిప్‌ను పంపించడానికి ముందు మ్యూట్ చేసి పంపవచ్చు. ప్రస్తుతం పరీక్షదశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిట్, ఇమోజీ...మొదలైనవి చేయవచ్చు. ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ పేరిట సరికొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన సంగతి మనకు తెలిసిందే. చదవండి: స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి ఫేస్బుక్ -
మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
మోటో ఈ7 పవర్ ను ఫిబ్రవరి 19న ఇండియాలో తీసుకొనిరానున్నట్లు మోటోరోలా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హెలియో పీ22 ప్రాసెసర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ7 పవర్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. మోటో ఈ-సిరీస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన మోటో ఈ7 ప్లస్‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. లెనోవా యాజమాన్యంలోని సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మోటో ఈ7 పవర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.5 హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ ర్యామ్: 4జీబీ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ22 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
టిక్‌టాక్ తో ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు
గత ఏడాది జూన్ 29న పొరుగు దేశం చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్ ను దేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ కు ప్రత్యామ్నాయంగా చాలా యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, తక్కువ సంఖ్యలో మాత్రమే యాప్ లు ప్రజాధారణ పొందాయి. వాటిలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన "రీల్స్" చాలా ఫేమస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌కు ఒక టిక్‌టాక్ తో పెద్ద తలనొప్పి ఎదురైంది. గతంలో టిక్‌టాక్ యూజర్లు రూపొందించిన వీడియోలు ప్రస్తుతం రీల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దీనితో చాలా మంది టిక్‌టాక్ వినియోగదారులు తమ పాత వీడియోలను తిరిగి రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలపై టిక్‌టాక్ వాటర్ మార్క్ ఉండటంతో ఎక్కువ కంటెంట్ కాపీ పేస్ట్ అవుతుందని ఇన్స్టాగ్రామ్ ఆలోచిస్తుంది. ఇకపై టిక్‌టాక్ యాప్‌లో రూపొందించిన వీడియోలను ‘రీల్స్‘లో అప్లోడ్ చేయకుండా ఉండటానికి కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ సాంకేతిక సహాయంతో కాపీ కంటెంట్ ను పోస్టు చేయలేరని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62 ‘ఆపిల్ డే సేల్’లో ఐఫోన్లపై భారీ తగ్గింపు -
‘ఆపిల్ డే సేల్’లో ఐఫోన్లపై భారీ తగ్గింపు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా "ఆపిల్ డే సేల్"లో భాగంగా సరికొత్త ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ప్రో సిరీస్, ఐఫోన్ 7లపై భారీ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ "ఆపిల్ డే సేల్" ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలిపింది. 5,410 రూపాయల తగ్గింపుతో వినియోగదారులు ఐఫోన్ 12 మినీని రూ.64,490 ధరతో పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. ఐఫోన్ 11 ప్రో రూ.82,900 ధరకే లభిస్తుంది. ఛార్జింగ్ కేసు ఉన్న ఎయిర్పాడ్లు రూ.2,000 తగ్గింపుతో రూ.12,490కు లభిస్తాయి. ఇతర ఆఫర్లలో సుమారు 6,000 రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 7(32 జీబీ) ధర రూ.23,990కు లభిస్తుంది. కొనుగోలు సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ .3,000 అదనపు తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62)