Sharwanand
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
త్వరలో సెట్స్‌లోకి...
కొత్త సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో 1960 కాలమానంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, అప్పటి సంస్కృతిని ప్రతిబింబించేలా హైదరాబాద్‌కు సమీపంలో 15 ఏకరాల విస్తీర్ణంలో భారీ బడ్జెట్‌తో కళా దర్శకుడు కిరణ్ కుమార్ మన్నె ఓ పెద్ద సెట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శర్వానంద్ మేకోవర్ అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్. -
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అరవయ్యేళ్లు వెనక్కి...
పల్లెకు పోదాం అంటున్నారు హీరో శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల నేపథ్యంలో 1960 కాలంలో జరిగే గ్రామీణ చిత్రం ఇది.ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ మూవీ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు సంపత్ నంది. మునుపెన్నడూ చూడని ఓ కొత్త పాత్రలో శర్వానంద్ కనిపిస్తారు. 1960 నాటి క్యారెక్టర్లో కనిపించేందుకు శర్వానంద్ మేకోవర్ అయ్యారు.యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎస్. సౌందర్ రాజన్. -
జాను సీక్వెల్ కు సమంత ఓకేనా !
-
శర్వానంద్ 'మనమే' సినిమా విషయంలో మోసపోయాం: నిర్మాత
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టిందని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోయామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. కొందరు చేసిన మోసంతో ఇప్పటికీ ఓటీటీలో కూడా సినిమాను విడుదల చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని శర్వానంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల అయ్యి మూడు నెలలు అవుతున్నా ఓటీటీలోకి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. అందుకు కారణాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఇలా తెలిపారు. మనమే సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయానని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక సంస్థకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను అప్పగిస్తే.. ఆ సంస్థ మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పలు కారణాలు చెబుతూ మనమే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమ్మలేదని ఆయన అన్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని విశ్వప్రసాద్ తెలిపారు.మనమే సినిమాకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసిన వారు తమకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో సుమారు 70 శాతం వరకు నష్టం వచ్చినట్లు ప్రకటించారు. వారు చేసిన మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. మనమే సినిమాను మాత్రమే ఆపేసి ఇతర సినిమాలను మాత్రం వారు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే మనమే సినిమా ఓటీటీ విడుదల విషయంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది. -
ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా?: మండిపడ్డ శర్వానంద్
టాలీవుడ్ రెబల్ స్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడిపై మన హీరోలంతా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు లేఖ రాశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా చేరిపోయారు. ఒక నటుడు మరో నటుడిని విమర్శించడని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రాథమిక విలువల్లో ఒకటని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ప్రభాస్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. An actor should never criticize another actor. It’s a basic ethic.— Sharwanand (@ImSharwanand) August 23, 2024 -
ఓటీటీ బాటలో శర్వానంద్ 'మనమే'
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే, ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలపుతున్నాయి. కానీ, అధికారికంగా సమాచారం వెలువడలేదు.శర్వానంద్ ఇప్పుడో మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు రానున్నాయి. -
ఆర్కిటెక్ట్ నిత్య ఆన్ సెట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్‌కి జోడీగా నటిస్తున్నారామె. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
హీరో శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. (ఫొటోలు)
-
ఆమె కోసమే కాఫీ: శర్వా
బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. 2008 సమయంలో తన కాఫీ షాప్‌లో అప్పట్లో హీరోలు రామ్‌చరణ్, అఖిల్‌తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
శర్వానంద్, కృతిశెట్టి ‘మనమే’ మూవీ స్టిల్స్
-
'మనమే' సినిమా రివ్యూ
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చాలామందికి ఇష్టమైనవి ఫీల్ గుడ్ మూవీసే. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తుంటాయి. అలాంటి ఓ సినిమా 'మనమే'. శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో? టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విక్రమ్(శర్వానంద్) లండన్‌లో ఉంటాడు. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఇతడికి అనురాగ్ (అదిత్) అనే ఓ ఫ్రెండ్. ఇండియా వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరగడంతో అనురాగ్, అతడి భార్య చనిపోతారు. వీళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని కొన్ని నెలల పాటు చూసుకోవాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)పై పడుతుంది. లండన్‌లో అనురాగ్ ఇంట్లోనే ఉంటూ పిల్లాడిని చూసుకుంటారు. మరి ఖుషిని చూసుకునే క్రమంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ సుభద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి ప్రేమ-బాండింగ్ ఉండాలి? అనేదే 'మనమే' కాన్సెప్ట్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ స్టోరీ అని చెప్పుకొచ్చారు కానీ సినిమాలో ఎమోషన్ అక్కడక్కడే వర్కౌట్ అయింది. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ జాలీగా ఉండే హీరో.. ఫ్రెండ్ చనిపోవడంతో అతడి కొడుకు బాధ్యత చూసుకోవాల్సి రావడం, ఇతడు ఒక్కడే కాకుండా అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన ఓ అమ్మాయి కూడా పిల్లాడ్ని చూసుకోవాల్సి రావడం.. ఇలా సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి వాటితో ఫస్టాప్ ఓ మాదిరిగా ఉంటుంది.సెకండాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎటేటో పోయింది. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏం జరుగుతుందిరా అని చూస్తున్న ప్రేక్షకుడు కాస్త కన్ఫూజ్ అవుతాడు. కానీ చివరకొచ్చేసరికి హీరో-అతడి తల్లిదండ్రుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్, పెద్దగా ట్విస్టులేం లేకుండా క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఏం జరుగుతుందో మనం ఊహించేయొచ్చు. సినిమాలో ఖుషి అనే పిల్లాడిది కీలక పాత్ర. కానీ అతడి క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి తప్పితే చాలావరకు మనం పూర్తిగా ఆ పిల్లాడికి కనెక్ట్ కాలేకపోతాం. సినిమా అంతా రిచ్‌గా చూడటానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషన్ కాస్త మిస్ అయింది. నిడివి రెండున్నర గంటలు.. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ ట్రిమ్ చేసినా పర్లేదు! ఇదే స్టోరీని లండన్‌లో కాకుండా ఇండియాలో ఉన్నట్లు రాసుకున్నా సరే పెద్దగా మార్పులుండవేమో? విలన్ ట్రాక్ అయితే అసలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వదిలేశారో అర్థం కాదు.ఎవరెలా చేశారు?విక్రమ్‌గా చేసిన శర్వానంద్.. తన పాత్రకు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్‌గా కనిపించాడు. సుభద్రగా చేసిన కృతిశెట్టికి ఫెర్ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే.. ఇందులో ఖుషి అనే పిల్లాడిగా చేశాడు. డైలాగ్స్ లాంటివి లేకుండా హావభావాలతోనే దాదాపు సీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లాడితో ఇంకాస్త ప్రాక్టీస్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల మేనేజ్ చేసినట్లు తెలిసిపోతుంది. మిగిలిన యాక్టర్స్ తమకు ఇచ్చిన పనికి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సినిమాని చాలా సాగదీశాడు.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్
‘‘ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇరవయ్యేళ్లు ... ముప్పైఐదు సినిమాలు ఎలా అయ్యాయో తెలియదు. స్టార్ స్టేటస్ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాకు ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చినందుకు విశ్వగారికి థ్యాంక్స్. నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ప్రోడక్షన్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మనమే’.ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మనమే’ ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘మనమే’ సినిమాలో నేను కొత్తగా కనిపించినా, కొత్తగా పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ శ్రీరామ్‌కే వెళ్తుంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి గొడవలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి. ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమతి టైమ్. ఈ పాయింట్‌నే శ్రీరామ్ ఈ సినిమాలో చెప్పారు’’ అని అన్నారు.‘‘శర్వానంద్ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది. తన చార్మింగ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ చూసి తనకి ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఇంకా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి కూడా మాట్లాడారు. -
Manamey : శర్వానంద్ ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మనీ కాదు...మానసిక తృప్తి ముఖ్యం: హేషమ్ అబ్దుల్ వహాబ్
‘ఖుషి, హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లోని బీట్స్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ని టచ్ చేశాయి. అందుకే జస్ట్ రెండు మూడు చిత్రాలతో సంగీతదర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు ‘మనమే’కి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హేషమ్. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మనమే’ గురించి, ఇతర విశేషాలను సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విధంగా పంచుకున్నారు. ⇒ సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం ఏ సంగీతదర్శకుడికైనా ఆనందంగా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి. నా గత చిత్రాలకన్నా ఈ చిత్రానికి ఎక్కువ హార్డ్‌వర్క్ చేశాను. ముందు 16 పాటలు ఉంటాయని ఊహించలేదు. కానీ శ్రీరామ్ ఆదిత్య కథని మలిచిన తీరు ఎక్కువ పాటలకు స్కోప్ ఇచ్చింది. ఫస్టాఫ్‌లో పది, సెకండాఫ్‌లో ఆరు పాటలు అవసరం అవుతాయని కంపోజ్ చేసేటప్పుడు అర్థం అయింది. పదకొండు ఫుల్ సాంగ్స్, మిగతావి బిట్ సాంగ్స్‌లా వస్తాయి ∙నా గత చిత్రం ‘హాయ్ నాన్న’లో తండ్రీ కూతురు ఎమోషన్ ఉంటుంది. ‘మనమే’లో కూడా పేరెంటింగ్ ప్రాధాన్యమైన అంశం. అయితే రెండు కథలు పూర్తిగా వేరు. ‘మనమే’లో పేరెంటింగ్ అనే ఎమోషన్‌తో పాటు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి ⇒ ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి కాబట్టి మిగతా సినిమాలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే... ఓ క్రియేటర్‌గా మనీ గురించి కాకుండా మానసిక తృప్తి ముఖ్యం అనుకుంటాను. ఆ విధంగా చూస్తే ‘మనమే’ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. సంగీతం పట్ల నాకు ఉన్న అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే నా పనికి తగ్గ పారితోషికం కూడా దక్కింది (నవ్వుతూ). నా గత చిత్రాలు, ఇప్పుడు ‘మనమే’ వంటి మంచి ప్రాజెక్ట్‌కి చాన్స్ దక్కడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను ⇒ ఫలానా సినిమాలో ఉన్న అలాంటి బీట్ ఇవ్వండి అంటూ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ అడగకపోవడం నా లక్. మంచి ట్యూన్‌ని ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు. కానీ నా వరకూ ఒరిజినల్ ట్యూన్ ఇవ్వాలనుకుంటాను. ఒకవేళ డైరెక్టర్ అడిగితే... ఆయన చెప్పిన ట్యూన్ కథలోని సందర్భానికి తగ్గట్టుగా ఉందనిపిస్తే అప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను ∙ప్రస్తుతం రష్మికా మందన్నా నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’కి వర్క్ చేస్తున్నాను. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో సాగే సినిమా చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. ఇదో కొత్త అనుభవం. ఇక తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఎంతమంది వచ్చినా ఇక్కడ అవకాశం ఉంటుంది... ్రపోత్సాహం ఉంటుంది. అందుకే కేరళ నా ఫస్ట్ హోమ్ అయితే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అంటాను. -
మనమే నా గ్రాఫ్ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య
‘‘ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మన కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. నా గత చిత్రం ‘హీరో’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కొంత కరోనా ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు ‘మనమే’ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాను. నా కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘‘పేరెంటింగ్ ఎమోషన్స్ గురించి కొంచెం వినూత్నంగా చెప్పాలన్న ఉద్దేశం నాకు ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఈ ఎమోషన్స్‌కు ఫన్ జోడించి, ఫుల్ ఎనర్జీతో చెప్పాలనుకున్నాను. అదే ‘మనమే’ కథ. ఈ సినిమాలో శర్వానంద్–కృతీ శెట్టిల క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీలా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మనమే’ నా ఫేవరెట్.ఈ సినిమాలో నా కొడుకు చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడని నేను ఇలా చెప్పడం లేదు. అందమైన భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా ఇది. ఈ సినిమాలో శివ కందుకూరి పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటల వరకూ ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోకు ప్లస్గానే ఉంటాయి కానీ అడ్డుగా అనిపించవు. హేషమ్ మంచి సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు. -
మనమే తో బ్లాక్ బస్టర్.. ప్రామిస్ చేస్తున్న శర్వానంద్
-
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్‌చరణ్ లాంచ్ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఈ సినిమా ఓ మ్యాజిక్.. ఆ మ్యాజిక్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ కృతీ ప్రసాద్, అసోసియేట్ప్రోడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడారు. -
ఎమోషనల్‌గా శర్వానంద్ 'మనమే' ట్రైలర్
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ జానర్లో వస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించి. ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు. -
సుభద్రలా ఉండలేను!: కృతీ శెట్టి
‘‘మనమే’ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశంలో వినోదం ఉంటుంది. అలాగే వండర్ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. అది గ్లోబల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మా ముగ్గురి పాత్రల (శర్వా, కృతి, విక్రమాదిత్య) చుట్టూ తిరుగుతుంది.. అందుకే ‘మనమే’ అనే టైటిల్ పెట్టాం’’ అని హీరోయిన్ కృతీ శెట్టి అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు... ∙‘మనమే’లో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి ఇది వైవిధ్యంగా ఉంటుంది. నేను క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, తొలిసారి ‘మనమే’లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర చేశాను. నిజ జీవితంలో నాకు పెద్దగా కోపం రాదు.. గట్టిగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. చెప్పాలంటే సుభ్రద్రలా స్ట్రిక్ట్‌గా ఉండలేను. అందుకే ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీరామ్‌గారి విజన్‌ని ఫాలో అయ్యాను. నా తొలి మూవీ ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘ఉప్పెన’ రస్టిక్ లవ్ స్టోరీ. ‘మనమే’ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలున్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. నా వరకూ పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ కమిట్మెంట్స్ వల్లే తెలుగులో గ్యాప్ వస్తోంది. పైగా రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కగారిలా నాకు మహారాణి పాత్ర చేయడం ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నాకు వీలు కుదిరినప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాను. -
టప్పా టప్పా.. పెళ్లి పాటప్పా
టప్పా టప్పా.. అంటూ పాట అందుకున్నారు శర్వానంద్, కృతీ శెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మనమే’ చిత్రంలో పెళ్లి సమయంలో వచ్చే ‘టప్పా టప్పా..’ అంటూ సాగే పాట విడుదల అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. కాగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన యూనిట్ గురువారం ‘టప్పా టప్పా..’ అంటూ సాగే మూడవ పాటని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘‘అందరూ ఎంజాయ్ చేసే వెడ్డింగ్ సాంగ్‌ని అందించారు హేషమ్. ఈ పాటలో శర్వానంద్, కృతీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
'భజే వాయు వేగం' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
జూన్‌లో మనమే
జూన్‌లో థియేటర్స్‌కు వస్తోంది ‘మనమే’ అని శర్వానంద్ అంటున్నారు. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించి, శర్వానంద్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. -
పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
శర్వానంద్, కృతీ శెట్టి కొత్త సినిమా టీజర్ విడుదల
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా విడుదలకు సిద్దంగా ఉంది. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శర్వానంద్, కృతీ శెట్టి ఈ చత్రంలో భార్యాభర్తలుగా నటించినట్లు తెలుస్తోంది. వారిద్దరి కుమారుడిగా విక్రమ్ ఆదిత్య ఉన్నాడు. టీజీర్లో చాలా ముద్దుగా కనిపిస్తున్న ఆ బాబుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. శమంతకమణి, దేవదాస్,భలే మంచి రోజు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య 'మనమే' చిత్రంతో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనమే చిత్రం తర్వాత శర్వానంద్ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో మాళవికా నాయర్ హీరోయిన్గా తన 36వ సినిమాగా రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నుంచి 37వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో శర్వా బిజీగా ఉన్నారు. -
కుమార్తెను పరిచయం చేసిన శర్వానంద్ (ఫొటోలు)
-
శర్వానంద్ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్స్
హీరో శర్వానంద్ బర్త్ డే (మార్చి 6) సందర్భంగా మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్ ఖరారు చేయగా, 36వ సినిమా బుధవారం ప్రారంభమైంది. అలాగే శర్వా నటించనున్న 37వ సినిమా ప్రకటన కూడా వెల్లడైంది. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’ టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే శర్వానంద్ 36వ సినిమా ఆరంభమైంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. శర్వా 37వ సినిమాని రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గత ఏడాది రక్షితను వివాహం చేసుకున్నారు. ఇటీవల పాపకు జన్మనిచ్చారు రక్షిత. పాపకు లీలాదేవి అని నామకరణం చేసినట్లు బుధవారం వెల్లడించారు. -
తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో.. అప్పుడే పేరు కూడా!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 3న రక్షితారెడ్డిని పెళ్లాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తాజాగా ఇవాళ శర్వానంద్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. శర్వానంద్- రక్షితా రెడ్డి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాదు తమ ముద్దుల పాపకు లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. కాగా.. గతేడాది నవంబర్‌లో రక్షితారెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా శర్వానంద్ జాగ్రత్తపడ్డారు. తాజాగా శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఏకంగా బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేశాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించనుంది. దీంతో పాటు 36వ సినిమాకు సంబంధించిన తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళవిన నాయర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఈ బ్యానర్‌పై రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్రాజా , మహానుభావుడు వంటి హిట్ సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
రీ రిలీజ్ తో ఆకట్టుకుంటున్న స్టార్లు ఎవరు ?
-
2025 పొంగల్ వార్ ఫిక్స్ .. చిరుతో శర్వానంద్ ఢీ
-
సంక్రాంతి వేళ.. సినిమా పోస్టర్ల కళకళ!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడే వేరు. కొత్త ఏడాదిలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండగ ఇదొక్కటే. అంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఫెస్టివల్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లకు సంక్రాంతి పండుగ ఓవరం లాంటిదనే చెప్పాలి. అగ్ర హీరోలంతా ఈ పండుగకు సినిమాలు రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటి మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే మరికొందరు హీరోలు ఈ ఫెస్టివల్‌కే అప్డేట్స్ సిద్ధమయ్యారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా క్రేజీ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మెగాస్టార్, ప్రభాస్, సూర్య, విజయ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు తమ మూవీ పోస్టర్స్‌తో అలరించారు. అంతే కాకుండా అలా ఈ ఏడాది పొంగల్‌కు మన ముందుకు వచ్చిన కొత్త సినిమాల పోస్టర్స్‌పై ఓ లుక్కేద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం టైటిల్‌ను సంక్రాంతి రోజే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్- మారుతి డైరెక్షన్లో మూవీ టైటిల్‌ను వెల్లడించారు మేకర్స్. ది రాజాసాబ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ వచ్చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ వీడియోను విడుదల చేశారు. వీటితో పాటు శర్వానంద.. శతమానంభవతి పార్ట్-2 రానుందని పోస్టర్ విడుదలైంది. మరోవైపు కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య సినిమాలకు సంబంధింటిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా మీ అభిమాను హీరోల చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ చూసేయండి. அனைவருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துகள் 😇☀️🌾#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4 @ritika_offl @officialdushara @srkathiir @philoedit @KKadhirr_artdir… pic.twitter.com/bbuCtkAgLG — Lyca Productions (@LycaProductions) January 15, 2024 The Art behind the aesthetic! 🎨✨ Delve into the making of the vibrant & colourful VETTAIYAN 🕶️ poster! ✨ Art by 🖌️ @sthabathy Designed by 🖼️ @gopiprasannaa Photographed by 📸 @anand16na#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions… pic.twitter.com/wQiW2hiaZ1 — Lyca Productions (@LycaProductions) January 15, 2024 pic.twitter.com/Tl8mrlT8fT — Vijay (@actorvijay) January 15, 2024 Echoes of freedom in every note. 🇮🇳 #OperationValentine All set to launch our first song at the iconic Wagah border, Amritsar 💥#VandeMataram song launch on Jan 17th 🎶#HappySankranti ✨ pic.twitter.com/5CkfhnZykN — Varun Tej Konidela (@IAmVarunTej) January 15, 2024 For he was touched by fire, chosen as a beacon of hope🔥 Unveiling the #Kanguva2ndLook tomorrow at 11 AM⚔️#Kanguva🦅⚔️ #HappyPongal🌾 #HappyMakarSankranti🌞@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions #Vamsi… pic.twitter.com/pzW6yWR5pw — UV Creations (@UV_Creations) January 15, 2024 7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️ Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍 More Details loading soon 😉 వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q — Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024 Igniting the MASS MODE 🥁🕺 Presenting the delightful #TheRajaSaab Title Announcement 🤩 - https://t.co/IhcaisVZsy 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by… — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 The celestial bodies are making way for the MEGA MASS BEYOND UNIVERSE 🔥 #Mega156 title today at 5 PM 💫🌠 MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @AforAnilkumar @UV_Creations pic.twitter.com/bsyqxtE6Hk — UV Creations (@UV_Creations) January 15, 2024 -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
త్వరలో తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు నడిచాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం విచ్చేసి సందడి చేశారు. కాగా జనవరిలో నిశ్చితార్థం జరగ్గా.. ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకుందీ జంట. తాజాగా ఈ దంపతులకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తల్లిదండ్రులుగా ప్రమోషన్? త్వరలోనే శర్వానంద్- రక్షిత దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రక్షిత గర్భిణీ అని, మెడికల్ చెకప్స్‌తో పాటు డెలివరీ కూడా అక్కడే జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు శర్వానంద్ కూడా అమెరికా వెళ్లిపోయాడని, కొంతకాలం పాటు అక్కడే ఉండబోతున్నాడని చెప్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. శర్వానంద్ స్పందిస్తేనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. సినిమాల సంగతేంటి? ఇదిలా ఉంటే శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించాడు. గతేడాది రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం అతడు తన 35వ సినిమా చేస్తున్నాడు. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ఆ ఇద్దరి కాళ్లకు నమస్కరించిన లావణ్య త్రిపాఠి -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
ఈ సినిమా చేయడానికి చాలా ధైర్యం ఉండాలి: శర్వానంద్
-
ఎన్ని సినిమాలు తీసిన..తెలుగు వారి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను
-
శర్వానంద్‌కు జోడీగా కృతీ శెట్టి.. స్పెషల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం ఉప్పెన తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. చదవండి: అట్లీ తీరుపై కోపంగా నయన్.. ఆమెనే హైలెట్ కావడంపై చర్చ! -
యంగ్ హీరో శర్వానంద్‌కి సర్జరీ!?
యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సర్జరీ చేసుకోనున్నాడట. ఈ విషయమై అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అభిమానులు కంగారు పడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అసలేం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? డిఫరెంట్ మూవీస్‌తో ఎంటర్టైన్ చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. 'రన్ రాజా రన్' నుంచి రూట్ మార్చి.. ఫన్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'బేబీ ఆన్ బోర్డ్' మూవీతో బిజీగా ఉన్న ఇతడు.. సర్జరీ కోసం అమెరికా వెళ్లాడనే విషయం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) గతంలో 'జాను' షూటింగ్ సందర్భంగా చాలా ఎత్తు నుంచి శర్వా పడిపోయాడని, చాలా గాయాలు అయ్యాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే గాయాలు మానిపోయినప్పటికీ.. నొప్పి మాత్రం అలానే ఉండిపోయిందట. ఇప్పుడు దాన్ని సర్జరీతో క్లియర్ చేసుకునేందుకే యూఎస్ వెళ్లాడని అంటున్నారు. ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీసే సినిమాలో నటిస్తాడు. అలానే చిరంజీవి కొత్త సినిమాలోనూ శర్వా.. కీలకపాత్ర చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మధ్యే రక్షితా అనే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
చిరంజీవికి కుమారుడిగా 'రామ్ చరణ్' క్లోజ్ ఫ్రెండ్
టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలకు కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుసుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోష్‌లో ప్రస్తుతం ఆయన నటించిన 'భోళాశంకర్' విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే చిరంజీవి మరో సినిమాను లైన్లో పెట్టారు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి చిత్రాలను రూపొందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి ఆయన కమిట్ అయ్యారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'ని రీమేక్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ఈ సినిమాలో ఎవర్గ్రీన్ బ్యూటీ త్రిష ఆయనకు జోడీగా కనిపించనుంది. వారిద్దరికి గోల్డెన్ ఛాన్స్ ఈ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ ఏర్పాటు చేసే పనిలో దర్శకుడు కాల్యాణ్ కృష్ణ ఉన్నారు. సుమారు 23 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష మళ్లీ జత కట్టనుంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మరోవైపు చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్ధు జొన్నలగడ్డ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) ఈ నేపథ్యంలోనే కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ చివరకు రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్‌ను చిరంజీవి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. శర్వాకు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఫిక్స్ చేశారని టాక్. అలా వారిద్దరూ చిరుతో నటించేందుకు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. అలా చిరంజీవి-త్రిషలకు కొడుకుగా శర్వానంద్ నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చిరు బర్త్‌డే రోజు (ఆగష్టు 22)న ప్రకటించనున్నారు. బ్రో డాడీ రీమేక్ ఇక బ్రో డాడీ సినిమా విషయానికొస్తే కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. కల్యాణి ప్రియదర్శి, మీనా, మోహన్ లాల్ తదితరులు నటించారు. ఈ మూవీ స్టోరీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పైగా చిరంజీవి కూడా కొత్త కథలతో ప్రయోగాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చేసిన ఆయన.. ప్రస్తుతం విడుదల కానున్న భోళా శంకర్ కూడా 'వేదాళం' సినిమాకు రీమేక్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) -
DJ టిల్లు రిజెక్ట్ చేసిన పాత్రకి కమిట్ అయిన యంగ్ హీరో
-
సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను షేర్ చేసిన శర్వానంద్ (ఫొటోలు)
-
హీరో శర్వానంద్ రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..(ఫొటోలు)
-
Sharwanand Reception: ఘనంగా శర్వానంద్- రక్షితా రెడ్డి రిసెప్షన్ వేడుక (ఫొటోలు)
-
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శర్వానంద్ ఆహ్వానం (ఫొటోలు)
-
జైపూర్‌లో అదితిరావు, సిద్ధార్థ్ సందడి..
-
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్‌తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్‌లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్‌లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
అంగరంగ వైభవంగా సినీనటుడు శర్వానంద్ వివాహ వేడుక (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 11 గంటలకు రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శర్వా పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక కోసం లీలా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒక రోజు ముందే ప్యాలెస్‌కు వెళ్లారు. శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకకు రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు. ఇక శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాస్త్రోక్తంగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేశాడు శర్వా. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకుంది ఈ జంట. -
జైపూర్ ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి సందడి (ఫొటోలు)
-
వైరల్ అవుతున్న శర్వా మ్యారేజ్ వీడియోలు..!
-
Sharwanand: శర్వానంద్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..సంగీత్‌లో సందడి చేసిన రామ్ చరణ్ (ఫొటోలు)
-
శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్‌లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుకలకు లీలా ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అంతకుముందే కాబోయే వధూవరులిద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు. (ఇది చదవండి: ‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్ మచ్చ) శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో పలువురు తారలు కూడా పాల్గొన్నారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా సంగీత్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా.. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్) #RamCharan at his best friend #sharwanand wedding 🤩🤩 @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8 — Telugu Box office (@TCinemaFun) June 2, 2023 Ram Charan at #Sharwanand and Rakshita 's Sangeet function 😍❤️#SharwaRakshitaWedding @ImSharwanand pic.twitter.com/37pcknNccz — ❤️ (@RakeShPrabhas20) June 2, 2023 Man Of The Masses @AlwaysRamCharan 🦁 Joined his Best Buddy @ImSharwanand's Wedding at JAIPUR ❤️✨🤩#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) June 2, 2023 #Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan 🦁🔥 pic.twitter.com/IM7vaIsGD0 — Raees (@RaeesHere_) June 2, 2023 -
Sharwanand: హీరో శర్వానంద్ హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
జైపూర్ ప్యాలెస్‌లో మొదలైన శర్వానంద్ పెళ్లి సందడి
-
శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇందుకోసం రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ, వారి కుటుంబాలు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మొదట హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైట్ డ్రెస్‌లో ఉన్న కొత్త పెళ్లి కొడుకు శర్వా ముఖమంతా పసుపుమయంగా మారింది. అతడు ప్రతీకారంగా అక్కడున్నవాళ్ల ముఖానికి సరదాగా పసుపు రుద్దుతూ కనిపించాడు. దీంతో వాళ్లందరూ మూకుమ్ముడిగా పసుపు చేతపట్టుకుని శర్వా వైపు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరికాసేపట్లో మెహందీ, సంగీత్ ఫంక్షన్ జరగనున్నాయి. రేపు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) శర్వా పెళ్లి సందడి ❤️ Lovely & candid visuals from Hero @ImSharwanand 's Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyise — SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023 -
చిన్న ప్రమాదమే, క్షేమంగానే ఉన్నాను: శర్వానంద్
‘నా కారు చిన్న ప్రమాదానికి గురైంది. కానీ, నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ హీరో శర్వానంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ జంక్షన్ లో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా శర్వానంద్ స్పందిస్తూ – ‘‘ఈ రోజు (ఆదివారం) ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడొద్దు’’ అన్నారు. కాగా జూన్ 3న రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం రక్షితతో జరగనున్న విషయం తెలిసిందే. There has been news that my car met with an accident this morning. It was a very minor incident.I am absolutely safe and sound at Home with all your love and blessings. There is nothing to worry about. Thank you all for your concern.Have a great Sunday everyone.— Sharwanand (@ImSharwanand) May 28, 2023 -
ఫిలింనగర్ జంక్షన్ లో బోల్తా పడిన శర్వానంద్ కారు
-
Sharwanand Car Accident: శర్వానంద్ క్షేమంగా ఉన్నారు..ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
శర్వానంద్ రోడ్డు ప్రమాదంపై ఆయన టీమ్ స్పందించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ‘శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’ అంటూ శర్వానంద్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. రాంగ్ రూట్లో వస్తున్న బైక్‌ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్పల్ప గాయాలు అయినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆయనను ఆస్పతికి తరలించినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ అది అవాస్తవం అని, శర్వానంద్ క్షేమంగా ఉన్నారని ఆయన టీమ్ వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
హీరో శర్వానంద్‌కు ప్రమాదం..
-
Sharwanand Car Accident: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిన్తున్న రేంజ్ రోవర్ కారు.. ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి.. బోల్తా పడింది. రాంగ్ రూట్లో వస్తున్న బైక్‌ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం పై శర్వానంద్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇటీవల తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం రాజస్తాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. -
లీలా ప్యాలెస్.. శర్వానంద్ పెళ్లి జరిగేది ఇక్కడే (ఫోటోలు)
-
ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో తన జీవితాన్ని పంచుకోనున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిపోగా జూన్ 2,3 తేదీల్లో పెళ్లి జరగనుంది. రెండో తారీఖున మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహించనుండగా మూడో తారీఖున రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా మారనున్న సంగతి తెలిసిందే! అయితే లీలా ప్యాలెస్‌లో పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న విషయమని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం లీలా ప్యాలెస్‌లో ఒక్క రోజుకే రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ విషయం తెలిసిన శర్వా ఫ్యాన్స్ జీవితంలో ఒక్కసారే వచ్చే పెళ్లికి ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా అని అంటున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి సినీప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మలయాళ కంపోజర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: చిత్రపరిశ్రమలో విషాదం.. యాక్సిడెంట్లో బుల్లితెర నటి మృతి కన్నీళ్లు పెట్టిస్తున్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు వీడియో -
శర్వానంద్‌పై ఆశలు పెట్టుకున్న కృతి శెట్టి
-
శర్వానంద్ రాయల్ వెడ్డింగ్...తేదీ ఎప్పుడూ? గెస్ట్‌లు ఎవరంటే
-
శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..
యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో శర్వా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకి రామ్ చరణ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. నిశ్చితార్థం జరిగిన ఐదు నెలల తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ జంట. వచ్చే నెలలో వీరి వివాహం జరగనుంది. జూన్ 2,3 తేదిలలో శర్వా- రక్షితల వివాహం గ్రాండ్‌గా చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి వివాహ వేడుకకి రాజస్తాన్‌లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్‌తో పాటు సాయంత్రం సంగీత్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారట. టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో! -
శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా?
-
నిశ్చితార్థం రద్దు చేసుకున్న శర్వానంద్? ఇదిగో క్లారిటీ!
యంగ్ హీరో శర్వానంద్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే! అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో శర్వానంద్‌కు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు రామ్‌చరణ్, ఉపాసన, సిద్దార్థ్, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వీరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తోంది. ఇంతవరకు వీరు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 'శర్వానంద్- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తాడు. ఇప్పుడతడు సిటీలోనే ఉన్నాడు కాబట్టి ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం' అని హీరో టీమ్ స్పష్టతనిచ్చింది. కాగా శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనుమరాలని తెలుస్తోంది. చదవండి: ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. నయన్‌కు విఘ్నేశ్ విషెస్ -
మరో ఊర మాస్ కాంబినేషన్ స్టోరీ కూడా లీక్?
-
కొత్త సినిమా కోసం కంప్లీట్ లుక్ మార్చేసిన శర్వానంద్
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించిన శర్వానంద్ తాజాగా తన 35వ సినిమాను అనౌన్స్ చేశాడు.టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్న శర్వానంద్ ఇందులో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. Thank you all for the birthday wishes ❤️ Will keep trying my best to entertain you all with quality films 🤗 #Sharwa35 pic.twitter.com/NVGlpc5PVU — Sharwanand (@ImSharwanand) March 6, 2023 -
ఈ ప్రయాణంలో కష్టాలు, ఎత్తులు, లోతులు.. ఎన్నో మరెన్నో!: శర్వానంద్
'అయిదో తారీఖు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో శర్వానంద్. ఈ సినిమా ఎలా వచ్చిందో అలానే పోయింది. కానీ తర్వాత నటించిన యువసేనతో మంచి పేరొచ్చింది. సంక్రాంతి, లక్ష్మి సినిమాల్లో వెంకటేశ్ తమ్ముడిగా చేసి మరింత మందికి దగ్గరయ్యాడు. అమ్మ చెప్పిందిలో నటనతో అదరగొట్టేశాడు. గమ్యంతో నటజీవితమే మారిపోయింది. రన్ రాజా రన్‌తో స్టార్ ఎదిగాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతితో మంచి మార్కులు కొట్టేశాడు. శర్వానంద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడీ హీరో. '20 ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందరినీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మరెన్నో.. అచంచలమైన ప్రేమ, మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి' అని రాసుకొచ్చాడు. నా ఈ ఒకే ఒక జీవితం సినిమాకు అంకితం. 20 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టిన ఈ సినీ ప్రస్థానం మరుపురానిది, మరువలేనిది. ఈ సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం రన్ రాజా రన్‌లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరు నాకిచ్చే ఆశీస్సులతో సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. మీ శర్వానంద్..' అని రాసుకొచ్చాడు. 20 years of a wonderful journey in a wonderful world called Cinema. Cherishing every moment and blessing, which came along the way. Thank you. pic.twitter.com/4ejEemqEOI — Sharwanand (@ImSharwanand) March 6, 2023 -
తొలిసారి జతకట్టబోతున్న శర్వానంద్, కృతిశెట్టి!
హీరో శర్వానంద్‌కి జోడీగా హీరోయిన్ కృతీశెట్టి నటిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గత సెప్టెంబరులో విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు కృష్ణచైతన్యతో మూవీ చేయనున్నట్లు ప్రకటించారు శర్వానంద్. అయితే ఆ చిత్రాన్ని ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచారట శర్వానంద్. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమాను స్టార్ట్ చేశారట. ఇందులో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారని, ఆల్రెడీ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతోందని టాక్. శర్వా-కృతి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం కాశ్మీర్‌లోని లింగేశ్వర ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు -
అగ్రహీరోల బాటలో శర్వానంద్.. అందుకేనా ఇలా..!
ఒక దర్శకుడితో సినిమా ఎనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయడం లేదంటారు. ఇదీ ఇప్పటి హీరోల ట్రెండ్. స్టోరీ విషయంలో కాంప్రమైజ్ కాలేక, మొహమాటాలకు పోకుండా, సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ఘనంగా ప్రారంభించిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ నిలిపేస్తున్నారు హీరోలు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చేరిపోయాడు. ఒకే ఒక జీవితంతో మళ్లీ సక్సెస్ జీవితాన్ని ప్రారంభించాడు శర్వానంద్. ఈ దశలో హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం మంచి కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాడు. అందుకే కృష్ణ చైతన్య అనే దర్శకుడితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఘనంగా మూవీని కూడా ప్రారంభించాడు. శ్రీరామ్ ఆదిత్యకు గ్రీన్ సిగ్నల్ అయితే ఎంతో ఘనంగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు శర్వానంద్ మనసు మారింది. కృష్ణ చైతన్య స్టోరీ విషయంలో కాన్పిడెంట్‌గా లేడు. అందుకే ప్రాజెక్ట్ ఆపేసాడని సమాచారం. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య రాసుకొచ్చిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీరామ్ అంటే భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిత్రాలు తెరకెక్కించాడు. సౌత్‌లో కొనసాగుతున్న ట్రెండ్ అయితే శర్వానంద్ ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి తోటీ నటీనటులు, సీనియర్ స్టార్స్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. బుచ్చిబాబుతో తారక్, గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్, సినిమాలు ఎనౌన్స్ చేసి వెనక్కి తగ్గారు. వెంకీ కుడుములతో చిరు సినిమా చేయాల్సి ఉండగా రద్దయింది. ప్రస్తుతం కోలీవుడ్‌కు కూడా ఇదే ట్రెండ్ విస్తరించింది. డాన్ దర్శకుడు సీబీతో సినిమా చేయాలనుకున్నాడు రజనీకాంత్. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు గానీ డాన్ డైరెక్టర్‌ను కాదని జై భీమ్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సౌత్ మొత్తం ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అందుకేనేమో తానెందుకు రిస్క్ తీసుకోవాలి అనుకున్నాడేమో శర్వానంద్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. -
కష్టపడితే ఆదరణ లభిస్తుంది – శర్వానంద్
‘‘మేము (నటీనటులు) ఫ్యా షన్తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. కష్టపడి మంచి సినిమా చేస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందని నేను నమ్ముతా. మంచి కథతో రూపొందిన ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మజీ , హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంకా శర్మ ప్రధాన పా త్రల్లో నటించిన చిత్రం ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను శర్వానంద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను, మౌర్య ‘రణరంగం’ సినిమాలో నటించాం. ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ కథ నచ్చి, నిర్మించానని మౌర్య చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘‘నన్ను, కథని నమ్మి ఈ సినిమా నిర్మించిన మౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్ జి. రెడ్డి. ‘‘పురుషుల బాధలను చూపించే చిత్రమిది. మహిళలకూ నచ్చు తుంది’’ అన్నారు బ్రహ్మజీ . ‘‘యంగ్ టీమ్‌తో మంచి సినిమా చేశాను’’ అన్నారు మౌర్య సిద్ధవరం. -
డేటింగ్ రూమర్స్.. శర్వానంద్ ఎంగేజ్మెంట్లో జంటగా సిద్ధార్థ్, అదితి!
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడి, సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇంత వరకు డేటింగ్ రూమర్స్‌పై ఈజంట క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు జంటగా ఓ యంగ్ హీరో నిశ్చితార్థం వేడుక సందడి చేశారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నేడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. చదవండి: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన ఈ వేడుకలో రామ్ చరణ్, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు సతీసమేతంగా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే హీరో సిద్ధార్థ్ కూడా తన రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ అదితి రావ్ హైదరితో కలిసి హజరయ్యాడు. ఈ కొత్త జంటతో వీరిద్దరు తీసుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా ఇండస్ట్రీలో సిద్ధార్థ్, శర్వానంద్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. శర్వా, సిద్ధార్థ్‌ల కాంబినేషన్లో సముంద్రం అనే మూవీ రాగా అందులో అదితి హీరోయిన్గా నటించింది. చదవండి: ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు -
కాబోయే భార్యతో ఫస్ట్ పోస్ట్ చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
Sharwanand: ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం (ఫొటోలు)