Sub Inspector of Police (SI)
-
మహిళా ఎస్ఐ జుట్టు పట్టుకుని జులుం..
తప్పతాగండి.. ఇష్టానుసారం వ్యవహరించండంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా, వీధి వీధిన మద్యం వరద పారిస్తోంది. 24/7 మద్యం లభిస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఎదుట ఉన్న వారు ఎవరన్న కనీస విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతుండటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లో తప్పతాగిన యువకులు కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ దేవి ఇలా చేయడం తగదంటూ వారిని వారించారు.దీంతో మాకే అడ్డుచెబుతావా.. అంటూ ఆ యువకులు ఆమె జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. ఫోన్ లాక్కుని.. ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అప్పటికీ శాంతించని ఆ యువకులు గేట్లు లాగుతూ, పూల కుండీలు విసిరేసి బీభత్సం సృష్టించారు. ఆమె ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో అదనంగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మాయదారి మద్యం వల్లే ఇలా జరిగిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్ -
AP: జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. జుట్టు పట్టుకుని తిట్టుకుంటూ..
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. విజయనగరంలో జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతరలో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. దీంతో, సదరు ఎస్ఐ.. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. గుడివాడ మోహన్ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన యువకులు.. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఆమె ప్రాణభయంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వెంటాడి అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై అప్పలనాయుడు, ఎల్ కోట, కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవీకి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఇక, ఈ ఘటనపై ఎస్ఐ దేవీ.. సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న గుడివాడ మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎస్సైకి గ్రూప్–1 ఉద్యోగం
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్ 505 మార్కులు సాధించారు. మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్గడ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు.గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానంశాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌ృ1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌ృ1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. -
‘మీ ఊరికి ఓ ఎస్ఐను తెచ్చుకోండి’..ఊరికే నా వద్దకు వస్తారు..
చిత్తూరు అర్బన్: సుమారు 40 వేల మందికి పైగా జనాభా. 24 పంచాయతీలు. ప్రముఖ పుణ్యక్షేత్రం పులిగుండు ఉన్న ఊరు. అదే పెనుమూరు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాత్రం కనిపించడంలేదు. ఎనిమిది నెలలుగా ఈ స్టేషన్లో ఎస్ఐ పోస్టు భర్తీకి నోచుకోలేదు. మండలంలోని ఏ గ్రామంలో చిన్న సమస్య వచ్చినా ప్రజలు పెనుమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. ‘ఇక్కడ ఎస్ఐ లేరు, మీరు చిత్తూరు టౌన్‌లోని తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. అక్కడ సీఐ సార్ ఉంటారు. ఆయన మీ సమస్య చూస్తారు’ అంటూ సిబ్బంది పంపివేయడం. నెలలు తరబడిగా ఇదే సమాధానం వినివిని మండలంలోని ప్రజలు విసుగెత్తిపోతున్నారు. పెనుమూరు మండల కేంద్రం నుంచి చిత్తూరుకు 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచైతే 30 కిలోమీటర్ల పైనే దూరం. మనిషి కనిపించికపోయినా, ఇంట్లో చోరీ జరిగినా, చిన్నపాటి గొడవలు జరిగినా, ఆఖరుకు చింతచెట్లు కొట్టేసినా సరే.. పెనుమూరు ప్రజలు చిత్తూరుకు రావాల్సిందే. స్టేషన్లో ఇద్దరు ఏఎస్ఐలుంటే ఒకరు వారెంట్ డ్యూటీ, మరొకరు స్టేషన్ పర్యవేక్షణ బాధ్యత. ఉన్న పది మందిలో ఎవరికి వాళ్లే బాసు. ఒకరి మాట, ఒకరు వినే పరిస్థితి లేదు. అలాంటిది ప్రజల సమస్య ఏం వింటారనే విమర్శలున్నాయి. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధి చెప్పిన వ్యక్తికి ఇక్కడ ఎస్ఐ పోస్టింగ్ దక్కడం లేదో..? పోలీసు బాసు ఎవరినైనా నియమిస్తే ఆయన్ని ఇక్కడ చేర్చుకోవడంలేదో..? తెలియడం లేదుగానీ.. ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. ఒక్కొక్కసారి తాలూక స్టేషన్‌లోని పోలీసు సారుకూ చిర్రెత్తుకొస్తుంది. జనం ముందే ‘మీ ఊరికి ఓ ఎస్ఐను వేసుకోవడానికి వగలేదు. ఊరికే నా వద్దకు వస్తారు. మీ వల్లైతే ఎస్ఐను వేసుకోండి. నాకు ఇదొక్కటే స్టేషన్ కాదు కాదా..?’ అంటూ చిర్రుబుర్రులాడుతున్నారని ప్రజలు నిట్టూరుస్తున్నారు. మరి పోలీసు ‘బాసు’ ఇప్పటికైనా పెనుమూరు స్టేషన్‌కు ఎస్ఐని నియమిస్తే ప్రజలకు మేలు చేసినట్లవుతుంది. -
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం రికార్డ్స్ బ్యూరో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ.. ఘటనా స్థలంలోనే మృతిచెందారు.కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. -
నా జీవితాన్ని సర్వనాశనం చేసింది వాళ్లే
సాక్షి, భీమవరం/తణుకు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు, పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయం, తన భార్య, పిల్లలు ఏమైపోతారోనని ఆయన పడిన ఆవేదన అందరిని కలచివేస్తోంది. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణల్లో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశువును చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్సై మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది. పై అధికారులు తనను ఏ విధంగా బలిపశువును చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో కొంత భాగం..ఎస్సై: ఇంట్రెస్ట్ లేదురా.. ఫ్రెండ్: ఏంటి జాబా?ఎస్సై: లేదురా లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా. నన్ను మోసం చేసిన వాళ్లు హ్యాపీగా ఉన్నారు.ఎస్సై: ఆ కృష్ణకుమార్, ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఏదో అలా గెంటుతున్నాను. సరే వీఆర్ భీమవరం కదా చూద్దాం చూద్దాం అని.. చెప్పాను ఆ కృష్ణకుమార్‌కు నన్ను ఇబ్బంది పెట్టకండి సార్! అని. లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అదీ ఇదీ అని పెంట చేశాడు నా జీవితాన్ని. సీఐ నాగేశ్వరరావుకు చెప్తే ఇలా పెంట చేశాడు. ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు నా జీవితాన్ని.. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటూ ఫ్యామిలీతో ఉండొచ్చు కదా అనుకున్నాను.ఫ్రెండ్: పోన్లే ఇప్పటి దాకా ఉన్నావ్.. నాకు లూప్ కావాలి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోతానని అడుగు ఒకసారిఎస్సై: అంతా ఊహించిందే జరుగుతుంది.ఎస్సై: పిల్లలు, విజ్జిని చూస్తుంటే బాధేస్తుంది రా..ఫ్రెండ్: ఏం మాట్లాడుతున్నావ్ రా ఊరుకో..ఎస్సై: లేదురా పిల్లలు, విజ్జి గురించి ఆలోచిస్తుంటే చాలా చాలా బాధేస్తుంది రా.ఫ్రెండ్: అసలేమైనా బుర్రా ఉందా! నీకుఎస్సై: మనం చాలా హ్యాపీగా ఉంటామనకున్నాం.ఫ్రెండ్: రేయ్ ఏమైంది రా! ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని తెలుసుకోకుండా.. పాజిటివ్ నెగిటివో తెలుసుకోకుండా.ఎస్సై: అక్కడికి వెళ్తే కృష్ణా జిల్లా ఎలాట్మెంట్ అనేది తెలుసు నాకు. నేను అస్సలు ఉండలేను. ఒక్కరోజు కూడా నేను అక్కడ ఉండలేను. అక్కడ వాతావరణం అది నా వల్ల అయితే కాదు.ఫ్రెండ్: రేయ్ బాబు నువ్ కంగారు పడకు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు! -
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
AP: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఎస్ఐను ఏజీఎస్ మూర్తిగా గుర్తించారు. కాగా, ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్తహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.శ్రుతి, నిఖిల్ వాట్సాప్(Whatsapp) మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
కానిస్టేబుల్ తో ఎస్సై వివాహేతర సంబంధం.. న్యాయం కావాలంటూ భార్య ఆందోళన
-
'నూతన' వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్ఐ గోపాల్
సాక్షి, నిడమనూరు (నల్గొండ జిల్లా): ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి బండి నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో డీజేలు, సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాప్‌లకు రాత్రి 12.00 గంటల వరకు.. బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1.00 గంట వరకు మాత్రమే ప్రభుత్వo అనుమతించింది. సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామన్నారు. -
కామారెడ్డి పోలీసుల కేసులో విచారణ వేగవంతం
-
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్‌లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్‌గా మారింది. -
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్
ములుగు: ఎస్సై హరీశ్, ఆ యువతి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఓ రిసార్టులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హరీశ్ ఆత్మహత్యకు సూర్యాపేట జిల్లాలోని దుగ్యాతండాకు చెందిన ఓ యువతిపై పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా..అబద్ధమా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ ఆడియోలో ఏంముందంటే...: ‘మనం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేయాలి. పలువురిని ఆకర్షించేలా చేస్తేనే మన ప్రేమ విషయం బయటకు వస్తుంది.. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. విషయం బయట కు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకోని పక్షంలో నా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుందాం.’ – ఎస్సై హరీశ్‘నేను కాళ్లు పట్టుకుంటాను కానీ.. మా అమ్మా నాన్న పట్టుకోరు.. నేను కొందరిపై కేసులు పెట్టినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన ఇద్దరిపై కేసులు పెట్టాను. ఈ విషయం హరీశ్‌కు ముందుగానే తెలిపాను. ఆయన మంచి మనసుతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి డబ్బు చర్చలు రాలేదు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా బ్యాంకు ఖాతాలను చూస్తే ఆ విష యం తెలుస్తుంది. నాపై కావాలనే చిలుకూరులోని కొందరు కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలు వచ్చేలా చేశారు’. – సదరు యువతిఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?
ములుగు : వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను పోలీసులు ఇప్పటి వరకూ వెల్లడించలేకపోతున్నారు. ఎస్సై ఆత్మహత్య రోజు ఏమి జరిగిందనే అంశం మిస్టరీగా మారుతోంది. నల్లగొండ జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండాకు చెందిన యువతి బ్లాక్ మెయిలింగ్ కారణంగానే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతోపాటు మరేమైన బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు యంత్రాంగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సదరు యువతి ఈ నెల 1వ తేదీన ఎస్సై హరీశ్ కోసం వచ్చినట్లు ఆధారాలతో పూర్తి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఫెరిడోస్ రిసార్ట్‌లోని ఓ గదిలో ఎస్సై ఆత్మహత్య అనంతరం సదరు యువతిని పోలీస్ శాఖతో పాటు ఇతరులు గమనించారు. దీంతో ఎస్సై హరీశ్ ఆత్మహత్య ఘటనలో ఆమె ప్రధాన కారణమా లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హరీశ్ చనిపోక ముందు రోజు యువతితో మాట్లాడే క్రమంలో ఒత్తిడికి లోనై స్నేహితులకు ఫోన్ చేశారు. దీంతో ఓ స్నేహితుడు రిసార్ట్‌కు చేరుకుని యువతితో మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. సమస్య సద్దుమనిగినట్లు భావించిన ఎస్సై హరీశ్ స్నేహితుడిని వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అతను అక్కడి నుంచి బయలుదేరి ములుగు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన సదరు యువతి.. ఎస్సైతో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన హరీశ్ ఫోన్ ద్వారా స్నేహితుడిని సంప్రదించాడు. అప్రమత్తమైన స్నేహితుడు ములుగు నుంచి బయలుదేరి వాజేడుకు చేరుకోకముందే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న సదరు యువతి ఈనెల 1వ తేదీ వాజేడు స్టేషన్ ముందు నుంచి ఎస్సై హరీశ్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వెహికిల్ ద్వారా ఆమెను రిసార్ట్‌కు పంపించారు. అయితే ఈ వాహనాన్ని నడిపిన వాజేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎవరు అనే అంశం ఇప్పటికీ తెలియడం లేదు. చివరికి ఆ యువతిని రిసార్ట్‌లో డ్రాప్ చేసిన అనంతరం రెండు, మూడు సార్లు సదరు వ్యక్తి ప్రైవేట్ వాహనంలో కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ఎస్సై హరీశ్ విషయంలో కీలక ఆధారాలు అతని వద్దే? -
కీలక ఆధారాలు అతని వద్దే?
ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ అనుమానాస్పద ఆత్మహత్యపై పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న గన్‌మన్ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కేసును ఛేదించేందుకు వెంకటాపురం(కె) సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాజేడు కేంద్రంగా పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆత్మహత్య అనంతరం సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ సభ్యులు ఎస్సై హరీశ్‌కు సంబంధించిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన సూర్యాపేట జిల్లా పరిధి చిలుకూరు మండలానికి చెందిన యువతి ఫోన్‌కాల్ లిస్టుపైన మదింపు జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇదంతా పోలీసు శాఖ పరిధిలో సాఫీగానే జరుగుతున్నా.. వాజేడు ఎస్సైగా హరీశ్ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అతను ఆత్మహత్య చేసుకునే వరకు ఎస్ఐతో ఉన్న గన్‌మన్ మరుసటి రోజు నుంచి అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.సంచలనంగా మారిన ఈ కీలక కేసులో గన్‌మన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. వివాదాస్పద కేసు వివరాలను బయట పెడతాడని అధికారులు అతడిని సెలవుపై పంపించారా? లేక అతడిని కూడా విచారిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ తరఫున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం గమనార్హం.రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య -
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
-
వట్‌పల్లికి ఎస్ఐ కావలెను
వట్పల్లి(అందోల్): వట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ పోస్టు నెల రోజులుగా ఖాళీగా ఉంటోంది. గతనెల 8వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ లక్ష్మణ్‌తో పాటు సిబ్బంది ఓ పార్టీ నాయకుడి బర్త్‌డే వేడుకలు నిర్వహించడంతో ఎస్ఐపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆ తర్వాత అతని స్థానంలో మరో ఎస్ఐని నియమించకుండా ఏఎస్ఐ విఠల్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జోగిపేట సర్కిల్లో వట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువ. ఈ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి తోడు వట్పల్లి మీదుగా కర్నాటక, మహారాష్ట్ర, బీదర్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గుట్కా, తంబాకు వంటివి అక్రమంగా రవాణా అవుతుంటాయి. వరంగల్, బీదర్, కర్నాటక ప్రాంతాల నుంచి గుట్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నెలలో ఒకటి రెండు కేసులు నమోదు కావడం పరిపాటి. మండలంలో పేకాట పెద్ద ఎత్తున సాగుతోంది. పూర్తిస్థాయి ఎస్ఐ లేకపోవడంతో కొందరూ సిబ్బంది సైతం విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. త్వరితగతిన ఎస్ఐని నియమించి శాంతి భద్రతలకు కృషి చేయాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
ఎస్సై శ్వేత సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం -
వెంబడిస్తున్న టీఎస్ఐని కారుతో ఢీకొట్టి..
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్‌ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
బదిలీ, ఘన వీడ్కోలు.. అంతలోనే కన్నుమూత
రాయచూరు రూరల్: యాదగిరి నగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం (29) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేశారు. వివరాలు... యాదగిరి ఎస్ఐగా పనిచేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాత్రి ఆయనకు అందరూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లి నిద్రించిన ఆయన నిద్రలోనే చనిపోయారు. మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ సంగీత ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.ఎమ్మెల్యేకు రూ. 30 లక్షలు ఇచ్చాం: భార్యపరశురాం భార్య శ్వేత మీడియాతో మాట్లాడారు. తన భర్త పరశురాం బదిలీ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల క్రితం రూ. 30 లక్షలు ఇస్తే యాదగిరి పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు ముగిశాక తిరిగి యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నట్లు శ్వేత చెప్పారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఇదిలా ఉంటే ఎస్ఐ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.మరణంపై విచారణ: హోంమంత్రిశివాజీనగర: యాదగిరి ఎస్ఐ పరశురాం మరణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనిఖీ చేపట్టాలని సూచించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎస్ఐ సతీమణి శ్వేతా ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఐ బదిలీ గురించి స్థానిక ఎమ్మెల్యే ఒకరిపై ఆమె ఆరోపించారు. పరశురాం మరణం సహజమైనది. ఆత్మహత్య కాదు. ఎలాంటి డెత్ నోట్లు లభించలేదని అన్నారు. బదిలీ కావడంతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని తోసిపుచ్చబోమన్నారు. కాగా, బీజేపీ– జేడీఎస్ పాదయాత్రకు షరతులను విధించడమైనది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగరాదు. ప్రజలకు ఇబ్బంది కారాదని హోంమంత్రి తెలిపారు. వారు కోర్టుకు వెళ్లేలోపు తామే పాదయాత్రకు అనుమతి ఇచ్చామని తెలిపారు. -
భట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు
భట్టిప్రోలు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. మరోవైపు తమ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపైనా దౌర్జన్యానికి దిగుతున్నారు. పోలీసు అధికారులపై సైతం దౌర్జన్యం చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే మీ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం, దుర్భాషలాడటం ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యకర్త ఏకంగా ఎస్ఐ చొక్కాపట్టుకుని నెట్టివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విన్నవించినా వినకుండా ఎస్ఐపై దౌర్జన్యంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాలు నియోజకవర్గంలో పేకాట, కోడిపందాల నిర్వహణపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై శనివారం బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు భట్టిప్రోలులో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను వారించి తమకు సహకరించాలని కోరారు. అయినా సాయిబాబా పట్టించుకోకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డకున్నారు. దీంతో సాయిబాబా అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సాయిబాబా అనుచరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టారు. అధికార పార్టీ కార్యకర్త కావడంతో ఎస్ఐ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే బయటకు రావడం... అది చూసిన పలువురు రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండాపోయిందని, సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన వ్యక్తంచేశారు. -
గుండెపోటుతో అయోధ్య ఎస్ఐ కన్నుమూత
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు. సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది(59) పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద కొందరితో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యారు.వెంటనే అతనిని శ్రీరామ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేంద్ర నాథ్ త్రివేది హర్దోయ్ జిల్లా నివాసి. సురేంద్ర నాథ్ 2023, డిసెంబరు 16న అయోధ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1983లో పోలీసు శాఖలో చేరారు. -
మహిళపై కన్ను.. వీఆర్‌కు శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్
సాక్షి, నల్గొండ జిల్లా: శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ మహిళ మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేధింపుల ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే నీతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడు’’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
నారక్కపేటలో విషాదం
నల్లబెల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(31) కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. అశ్వరావుపే ట ఎస్సై శ్రీనుపై కొంతకాలంగా సీఐ జితేందర్ రెడ్డితో పాటు సిబ్బంది మానసిక వేధింపులకు పాల్ప డుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పైగా సీఐ జితేందర్ రెడ్డితో పాటు సిబ్బంది వేధింపులు మరింత పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను గత నెల 30న మహబుబాబాద్ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సికింద్రా బాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు.. శ్రీను మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా తమ స్వగ్రామం నారక్కపేటకు తరలించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని పోలీసు అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఐదు నెలల క్రితం అశ్వరావుపేటకు బదిలీ ..2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై శ్రీను.. భద్రాది కొత్తగూడెంలో జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం త్రీ టౌన్, బోడు, చుంచుపల్లి, డీసీఆర్బీ భద్రాది కొత్తగూడెం, మణుగూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఐదు నెలల క్రితం అశ్వరావుపేట కు బదిలీ అయ్యాడు. అయితే ఇక్కడి పోలీసుస్టేషన్లో అధికారుల వేధింపులకు బలయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. కాగా, శ్రీను మృతి వార్త వినగానే అతడి మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది.పలువురి సంతాపంశ్రీను మృతి పట్ల భద్రాది కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు, డీసీపీ రవీందర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, భద్రాది కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్‌తో పాటు ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు బానోత్ సారంగపాణి, చిట్యాల తిరుపతి రెడ్డి పరామర్శించారు.భారీగా మోహరించిన పోలీసులు..ఎస్సై శ్రీను ఆత్మహత్య బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు నారక్కపేటలో ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రాజగోపాల్ పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది భారీగా చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే బందోబస్తులో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అశ్వారావుపేట ఎస్సె శ్రీరాముల శ్రీనివాస్ మృతి
-
ఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి వెనుక కారణాలు ఏంటి?
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వివాదానికి కేంద్రబిందువైంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11.30 గంటల వరకు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థాయిలో ఏం జరిగింది? అసలు దీనికి కారణాలు ఏమిటి? ఉన్నతాధికారుల మౌనం దేనికనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.వేధింపులు, ఫిర్యాదులే కారణమా?పార్లమెంట్ ఎన్నికల బదిలీల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేటకు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఎస్ఐ అదృశ్యం, ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బంది వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులే కారణమని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ.. తన సన్నిహితులతో వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కొద్దిరోజులుగా పోలీస్‌స్టేషన్‌లో పని చేసే నలుగురు సిబ్బందికి ఎస్ఐకి మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్ఐపై అవినీతి ఆరోపణలు రాగా, ఇదే అదునుగా సదరు సిబ్బంది కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ఏఎస్ఐ తనను తీవ్రంగా దూషించాడని ఎస్పీకి నేరుగా చెప్పడంతో.. ఉన్నతాధికారులు ఎస్ఐని సున్నితంగా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు సిబ్బంది కలిసి ఒక వర్గంగా మారి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని పాల్వంచ డీఎస్పీకి చెప్పగా.. ఆయన ఎస్ఐపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఒక వర్గంగా మారి ఎస్ఐకి సహకరించడం లేదని, ఏదైనా ఆదేశాలిచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని, స్థానిక సీఐ ఐదు నెలల వ్యవధిలో నాలుగు మెమోలు ఇచ్చారనే ప్రచారం కుడా సాగుతోంది. దీంతోనే ఎస్ఐ శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురై, పురుగులమందు తాగాడని మరో వర్గం సిబ్బంది చెబుతున్నారు.పరిస్థితి విషమంగానే..పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాస్‌ను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం అపస్మారకస్థితి నుంచి బయటకు రాగా, కొద్దిసేపు కుటుంబీకులు, బంధువులతో మాట్లాడినట్లు తెలిసింది. కాగా, ప్రమాదకరమైన గడ్డి మందు కావడంతో మందు ప్రభావం లివర్, కిడ్నీలపై పడిందని, కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ అందిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే కానీ భరోసా చెప్పలేమని వైద్యులు అంటున్నట్లు తెలిసింది. కాగా, ఎస్ఐ శ్రీనివాస్‌ను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బంధువులు, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం
-
అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేటరూరల్/మహబూబాబాద్‌రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమయాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.పురుగుల మందు తాగి.. 108కు ఫోన్అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై.. స్వయంగా 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావుతోపాటు 108 సిబ్బంది చేరుకుని ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్సై పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటలకు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా...’అని ఎస్సై అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ మహిళ ఎస్సై నల్లగొండ సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసింది. ‘నా భర్త విషయంలో నేను ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. మళ్లీ ఫిర్యాదు చేయాలని ఏప్రిల్ 16న స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై క్యాబిన్లో నన్ను రెండు గంటలపాటు ఉంచి అసభ్యకరంగా వ్యవహరించారు. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు.. భర్తకు దూ రంగా ఉంటున్నావు కదా. నీకు పిల్లలు ఎప్పుడు, ఎలా పుట్టారు.. నీకు ఇప్పుడు భర్తతో ఉండాలనే కోరిక కలగడం లేదా? నాతో మంచిగా ఉండు. నీ ఫోన్‌నంబరు నాకు ఇవ్వు. నా పర్సనల్ నంబరు నువ్వు తీసుకో. నేను నీకు అన్నివిధాలా సహకరిస్తాను. నీ ప్రతి అక్కర తీరుస్తాను.. నీకు వంట వచ్చా.. వస్తే నాకు చేపలు వండుకు రా.. మరొక రోజు మేక మాంసం వండుకురా అని వేధించడమే కాకుండా నాతో బలవంతంగా గ్రీన్ టీ పెట్టించుకొని తాగారు. స్టేషన్‌కు ఇలా అప్పుడప్పుడు వచ్చి నేను నడుచుకొమ్మన్నట్లు నడుచుకో. నీకు అన్నివిధాలా మంచిది. ఈ సంభాషణ మన మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పవద్దు.ఒకవేళ చెబితే మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి అక్రమ కేసులు బనాయిస్తా. అంటూనే నీకంటే మీ అమ్మ ఇంకా బాగుంది అని అన్నాడు. నేను భయపడి ఈ విషయాలు రెండు వారాల పాటు ఎవరితో పంచుకోలేదు. మీరే తగిన చర్యలు చేపట్టండి..’. అని ఎస్పీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్కారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. -
మహిళా కానిస్టేబుల్స్ పై SI లైంగిక వేధింపులు..
-
పోలీస్ ఇన్స్పెక్టర్ రాసలీలలు?
హసన్‌పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు. యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్ఐబీ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయితే, మంగళవారం సదరు ఇన్స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
మాదాపూర్ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్ఐ
హైదరాబాద్: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్గుల్కు చెందిన షేక్ నజీముద్దీన్ గత డిసెంబరులో సర్వే నంబర్ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్ ఈ నెల 23న మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్‌కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్ ప్లాట్ కాగితాలు నజీముద్దీన్కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి ఎస్ఐ సుభాష్‌కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్ఫోన్లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్‌కు వచ్చిన సుభాష్ నుంచి ఎస్ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐ సైదులును మేజి్రస్టేట్ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్ఐ సైదులు సస్పెండ్ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
నకిలీ సబ్ఇన్స్పెక్టర్ మాళవికను పోలీసులు అరెస్ట్ చేశారు
-
విశాఖలో నకిలీ ఎస్ఐల ఘరానా మోసం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ (47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్‌్కఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ. 17 కోట్ల సాయం కోసం ఎదురుచూపు!
రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. హృదయాంశ్‌కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు. తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు. -
జూనియర్ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్‌గా పని చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్ పీఎస్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్ఐ అరుణ్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్‌కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్ ఫోన్లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్ చేశాడు. అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్‌కు ఫోన్ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ..
-
మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ
సాక్షి, యాదాద్రి భువనగిరి: వలిగొండలో గుండెపోటుకు గురై ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అక్కడే వాహన తనిఖీలు చేస్తున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ భువనగిరి మండలం మన్నెవారిపంపునకు చెందిన బోయిన వెంకటమ్మ గుర్తించారు. పలువురు ఎస్ఐని అభినందించారు. -
ఎందరు ఏమన్నా.. ఎస్ఐ కాబోతున్న భాను!
కరుడు కట్టిన ‘ఖాకీవనం’లోకి అడుగుపెట్టడానికి చాలా మంది యువకులు వెనకడుగు వేస్తారు. కేసులు, కోర్టులు, నేరస్తులతో బెంబేలెత్తిపోతారు. అయితే, ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా, అకుంఠిత దీక్షతో భానుప్రసన్న ధైర్యంగా అడుగుపెడుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకు సాధించి పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. మార్టూరు: ‘ఆడపిల్లవు నీవు ఎస్ఐ అవుతావా ? ఎందుకమ్మా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోక ! ’ అంటూ అయిన వారి హేళన మాటల్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుంది. అనుకున్నది సాధించింది. విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవని నిరూపించింది. అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి భాను ప్రసన్న. స్థానిక బీసీ కాలనీకి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతులు తమకున్న ఒకటిన్నర ఎకరా వ్యవసాయ భూమి సాగు చేసుకుంటూ చిన్నపాటి బడ్డీ కొట్టును నడుపుకుంటున్నారు. ఇద్దరు కుమార్తెలను చదివించుకున్నారు. పెద్ద కుమార్తె భాను ప్రసన్న జొన్నతాళి గ్రామంలోని ప్రభుత్వ యూపీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, మార్టూరు కాకతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత నర్సరావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నిమిత్తం చేరింది. పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింత విస్తృత పరచుకుంది. ఎస్ఐ కావాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. పెళ్లి తన కెరీర్‌కు అడ్డంకిగా మారకూడదని భావించి తల్లిదండ్రులను ఒప్పించింది. చెల్లెలు కోమలికి ముందుగా వివాహం జరిపించింది భాను ప్రసన్న. మగరాయుడులా ప్యాంటు, టీషర్టు వేసుకుని పోలీసు అవుతుందంటా అనే ఇరుగు పొరుగు వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కూతురుకు బాసటగా శ్రీనివాసరావు నిలిచాడు. ఆయన నమ్మకం, పట్టుదలను సాకారం చేస్తూ భానుప్రసన్న మొక్కవోని దీక్షతో ఎస్ఐ పోటీ పరీక్షలో విజయం సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి తానేమిటో నిరూపించుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ యువతి ఎస్ఐగా ఎంపిక కావడంపై గ్రామస్తులంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుడడం విశేషం. ఎస్ఐతో సరిపెట్టుకోను ఓ పల్లెటూరుకు చెందిన నేను ఎస్ఐగా ఎంపికయ్యే దాకా జరిగిన ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఈ తరం ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండబోదని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా. నిజాయతీ కలిగిన పోలీసు అధికారిగా పని చేస్తూ మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి వారికి అండగా ఉంటా. వృత్తిపరంగా మరింతగా ఎదగడం కోసం ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నా వెనుక సూటిపోటి మాటలు అన్నవారే నేడు అభినందిస్తుంటే ప్రస్తుతం నాకు ఎంతో అనందంగా ఉంది. నా గ్రామానికీ, నా కుటుంబానికీ మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా. – భాను ప్రసన్న -
కష్టపడి చదివి.. ఎస్సై పోస్టుకు ఎంపికై ..
కందుకూరు రూరల్: ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు. వివరాలిలా ఉన్నాయి. వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8 నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్‌సీఏలో పూర్తి చేశాడు. ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్‌కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. చదువే ఆయుధం కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఆయుధం. – నేలకూరి ఏడుకొండలు -
ఎస్ఐగా ఎంపికై న పేదింటి బిడ్డ
అన్నమయ్య : చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు... అమ్మమ్మ దగ్గర పెరిగి అనంతరం హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు.. డ్రైవర్‌గా పని చేసుకుంటూ తాను కలలు గన్న పోలీస్ ఉద్యోగాన్ని సాధించాడు పేదింటి బిడ్డ మురళీనాయక్. వివరాల్లోకి వెళితే.. కేవీపల్లె మండలం దిగువగళ్ల తాండాకు చెందిన బుక్కే మురళీనాయక్ జన్మించిన నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనంతరం అమ్మమ్మ శ్యామలమ్మ కూలి పనులు చేసుకుంటూ మురళీనాయక్‌ను పోషించింది. కేవీపల్లె హాస్టల్లో ఉంటూ 8వ తరగతి వరకు కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం పీలేరులో హాస్టల్లో ఉంటూ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివాడు. అనంతరం తనను తాను పోషించుకోవడానికి డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాడు. మరోవైపు ఎప్పటికై నా పోలీస్ కావాలనే తపనతో ఎస్ఐ రాతపరీక్షకు సిద్ధమయ్యాడు. 167.5 మార్కులు సాధించి ఎస్ఐగా ఎంపికయ్యాడు. చదువుకు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మురళీనాయక్ మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా ఒక్కో మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. -
AP: ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన పేదింటి కుసుమాలు
అనంతపురం: ‘ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చితీరుతుంది. గట్టిగా అనుకుంటే... లోలోపల ఆశయం రగులుకుంటే... వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వవిజేత కావొచ్చు. పెద్దోళ్లకే అందలం అనే మాట వెనుకటిది. బీదాబిక్కీ సైతం ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న కాలమిది. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం చేసిన ఉద్బోధతో ప్రభావితమైన ఉమ్మడి జిల్లాకు చెందిన యువత.. తమ సత్తా ఏమిటో చాటింది. ఇటీవల ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఊహించని విధంగా ర్యాంక్‌లు దక్కించుకున్న పలువురు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. లైబ్రరీలో చదివి... కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీనగర్‌కు చెందిన కవిత, దేవదాసు దంపతుల రెండో కుమారుడు గౌతమ్‌సాయి అనంతపురంలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్‌పై మక్కువతో యూపీఎస్సీ పరీక్ష రాశారు. అనంతరం గ్రూప్ 1 పరీక్షల్లో మెయిన్స్ వరకూ వెళ్లారు. అక్కడితో నిరుత్సాహపడకుండా అనంతపురంలోని పోలీస్ లైబ్రరీకెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఎస్ఐ పోస్టును దక్కించుకున్నారు. విషయం తెలియగానే ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తన వద్ద పీఏగా పనిచేస్తున్న దేవదాసు కుమారుడు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారన్న విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీచరణ్ ప్రత్యేకంగా గౌతమ్‌సాయికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పేదింట ఆనందాల హరివిల్లు కంబదూరు: మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న ఎరికుల దురగప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు అరుణాచలం... ఆర్డీటీ సహకారంతో బీటెక్ పూర్తి చేశాడు. ఆపన్నులకు అండగా నిలవాలని భావించిన అరుణాచలం ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలని పరితపించాడు. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాశాడు. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. 222 మార్కులతో సివిల్ ఎస్ఐగా తాను కలలు కన్న ఉద్యోగానికి అర్హత సాధించాడు. పట్టుదలే తమ కుమారుడిని ఉన్నత స్థానానికి చేర్చిందంటూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యమే నడిపించింది బ్రహ్మసముద్రం : చదువులే జీవిత గమనాన్ని మారుస్తాయన్న తల్లిదండ్రులు మాటలు స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఆమెను ఎస్ఐగా అర్హత సాధించేలా చేసింది. బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లికి చెందిన కురుబ భూలక్ష్మి, వన్నారెడ్డి దంపతులు చదువుసంధ్యలకు నోచుకోలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరే పని తెలియదు. తమ కష్టం తమ కుమార్తె జ్యోతి పడకూడదని భావించిన వారు ఆమెను చదువుల వైపు దృష్టి సారించేలా చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం చిన్నాన్న మల్లేష్ చొరవతో పోటీ పరీక్షలకు హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే తండ్రి వన్నారెడ్డి అనారోగ్యం బారినపడ్డాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు చేసుకుంది. ‘కష్టాలు ఎన్ని ఉన్నా... లక్ష్యం వైపే గురి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అన్న ఆ మాటలే ఆమెను ఎస్ఐ పోటీ పరీక్షల్లో తలపడేలా చేసింది. ఎస్ఐ ఉద్యోగానికి జ్యోతి అర్హత సాధించడంతో నిరుపేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అనుకున్నదే సాధించి బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంటకు చెందిన దబ్బర వెంకటేశులు, కొండమ్మ దంపతుల కుమారుడు దబ్బర అనికుమార్ తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయదుర్గం ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్నారు. అయితే ఎస్ఐగా కావాలనే తపన ఆయనను స్థిరంగా ఉండనివ్వలేదు. దీంతో పోటీ పరీక్షలు రాసి తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు. గిరిజన ఆణిముత్యం బెళుగుప్ప: మండలంలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన వడిత్యా గోపాల్‌నాయక్, గీతాబాయి దంపతుల కుమారుడు వడిత్యా అశోక్‌కుమార్‌నాయక్ పోలీసు బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. కళ్యాణదుర్గంలోనే డిగ్రీ వరకూ చదువుకున్న ఆయన ఎస్ఐ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఇద్దరే తాడిపత్రి: ప్రస్తుతం తిరుపతిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, సావిత్రమ్మ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన నరే‹Ùయాదవ్ 2020లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈ ఏడాది తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 5వ ర్యాంక్ సాధించి ఎస్ఐగా శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు లక్ష్మీనారాయణమ్మ, శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నార్పల మండలం నాయనపల్లికి చెందిన లావణ్య, నార్పలకు చెందిన జగదీశ్వరరెడ్డి కూడా ఎస్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి గుత్తి: ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే కసి ఆమెలో పట్టుదలను పెంచింది. అదే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరువ చేసింది. గుత్తి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రావణిరెడ్డి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. పెద్ద పప్పూరు మండలం పెద్ద యక్కలూరు గ్రామానికి చెందిన శ్రావణిరెడ్డి... 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గుత్తిలో పోస్టింగ్ పొందారు. ఎస్ఐ కావాలనే బలమైన ఆశయం ఆమెను పోటీ పరీక్షలకు సిద్ధపడేలా చేసింది. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసిన ఆమె గురువారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గుత్తి పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది. సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్ఐ నబీరసూల్, ఏఎస్ఐ నాగమాణిక్యం, తదితరులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఆరంభమే... రాప్తాడు: వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన బాలగొండ చిన్న బాబయ్య, శివమ్మ దంపతులు తమ కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలనూ సమానంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. రెండో కుమార్తె హరిత అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. 8 నుంచి ఇంటర్ వరకు ధర్మవరం పంగల్ రోడ్డు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో, ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఐఎఫ్ఎస్ సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటుండగా ఆమెకు తెలియకుండా ఎస్ఐ పోటీ పరీక్షలకు నాన్న బాబయ్య దరఖాస్తు చేశాడు. ఈ విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్న ఆమె ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎలాగైనా ఐఎఫ్ఎస్ సాధించి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓపెన్ కేటగిరిలో మూడో స్థానం ముదిగుబ్బ: మండల కేంద్రానికి చెందిన చిగిచెర్ల గురుప్రసాద్, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె చిగిచెర్ల లహరి... ఎస్ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 225 మార్కులతో ఓపెన్ కేటగిరి మహిళల విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆమెను గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అభినందించారు. సీమ జోన్లో 7వ ర్యాంక్ బత్తలపల్లి: మండలంలోని మాల్యవంతం పంచాయతీ ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట అఖిల్‌కుమార్ వివిధ ఉద్యోగాల్లో మౌనంగానే ఎదుగుతూ వచ్చారు. లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడైన అఖిల్‌కుమార్... టెక్ మహేంద్రలో సాప్‌్టవేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం అగళి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండడంతో డిప్యూటేషన్‌పై పుట్టపర్తిలోని సైబర్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఐ పోటీ పరీక్షల్లో రాయలసీమ జోన్ పరిధిలో ఏడో ర్యాంక్‌ను దక్కించుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రైతు ఇంట ఆనందం బెళుగుప్ప: మండలంలోని రామినేపల్లికి చెందిన ఆంజనేయులు, సాలమ్మ దంపతుల కుమారుడు మంజునాథ్ చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ వచ్చేవాడు. ఈ క్రమంలో అగ్రీ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.అయితే తన చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే తపన అతన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. అనుకున్నట్లుగానే లక్ష్యాన్ని చేరకోవడంతో నిరుపేద రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రమే‹Ù.. మంజునాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒకే ఊళ్లో ఇద్దరు కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన గజేంద్ర, కురబ శ్రీవాణి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. గ్రామానికి చెందిన మాలమ్మ, గంజన్నకు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చివరి వాడు గజేంద్ర. కూలి పనులతో జీవనం సాగిస్తునే ఎస్ఐ రాత పరీక్షల్లో సత్తా చాటారు. అలాగే శ్రీవాణి తల్లిదండ్రులు నాగలక్షి్మ, బాలాజీ... వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరూ ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మిత్రుల సహకారంతో... బెళుగుప్ప: మండలంలోని కాలువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు, భాగ్యమ్మ దంపతుల కుమారుడు అశోక్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అనంతరం ఇంజనీరింగ్ పూర్తి చేసి తన పెద్దనాన్న, మాజీ సర్పంచ్ తిమ్మన్న సూచన మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మిత్రులు వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, సిద్దేశ్వర్, లలిత్, మంథేష్ అన్నింటా సహకరిస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా పోలీస్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షల్లో విజయం సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్ఐ (పురుషులు, మహిళలు), 96 ఏపీఎస్పీ ఎస్ఐ (పురుషులు) పోస్టులకు రాత పరీక్షల ఫలితాల అనంతరం నాలుగు జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం. మొత్తం సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్లో 50, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మందిని ఎంపిక చేశారు. టాపర్లు వీరే.. సివిల్ ఎస్ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కరరావు (రి.నం. 5033539) 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. ఈయన ఏలూరు జోన్‌కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిసా కృష్ణవేణి (రి.నం.5052468) 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీఎస్పీ విభాగంలో రానెల్లి కోటారావు (రి.నం.5036787) 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండొచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రతిభ, రోస్టర్ ప్రకారం.. రాష్ట్రంలో 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా 1,73,047 దరఖాస్తులు వచ్చాయి. 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1,51,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది (38.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 31,193 మంది తుది రాత (మెయిన్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్ష జరగ్గా ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో ప్రతిభావంతుల జాబితాను రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్లో నిలిచిన 411 మంది అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎస్ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ప్రత్యేక కోటా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల తుది ఎంపికలు చేపట్టింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ (పీఈ)కు 2 శాతం, ఎన్సీసీకి 3 శాతం, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎంఎస్పీ)కు 2 శాతం, పోలీసు సిబ్బంది పిల్లలు (సీపీపీ)కు 2 శాతం, సీడీఐకి 2 శాతం, పోలీసు మినిస్టీరియల్ (పీఎం)కు 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. -
ఎస్సైగా ఎంపికై న వలంటీర్‌కు సన్మానం
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించిన వలంటీరు జి.యోగీశ్వరిని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా సుమతి..
అన్నమయ్య: కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలందుకుంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి(డబ్ల్యూపీసీ1651) మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియెట్ విశ్వసాధన కా లేజ్‌లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017 లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో విడుదలైన పోలీస్కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేశారు. 2022 డిసెంబర్లో విడుదలైన ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్‌కమల్, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎస్సై పోస్టుల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఎస్సై పోస్టులకు మొత్తం 315 మంది ఎంపికయ్యారు. వీరిలో 102 మంది మహిళలు ఉన్నారు. సివిల్, ఎపీఎస్పీ విభాగాల్లో ఎస్సైల ఎంపిక జరిగింది. విశాఖ జోన్లో 50, ఏలూరు జోన్లో 105, గుంటూరు జోన్లో 55, కర్నూలు జోన్లో 105 మంది ఎంపియ్యారు. ఎస్సై పరీక్షల్లో గోనబోయిన విజయ భాస్కరరావు, మహిళల్లో లోగిస కృష్ణవేణి టాపర్‌గా నిలిచారు. త్వరలో ఎంపికైన వారికి సర్టిఫికెట్లు పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ పేర్కొంది. -
ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్లు వేయాలన్న తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో కేసు పూర్వాపరాలను ప్రస్తావించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దిగొచ్చిన ఎస్ఐ అభ్యర్థుల తరఫు న్యాయవాది ప్రస్తుత అఫిడవిట్లను ఉపసంహరించుకుని, తిరిగి అఫిడవిట్లు దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి ఎస్ఐ నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది తాము పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు స్వయంగా ఎత్తు పరీక్ష నిర్వహించింది. పోలీసుల కొలతలతో తాజా కొలతలు సరిపోవడంపై ఆ 19 మంది అభ్యర్థులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాల్సిందేనంది. అంత స్థోమత తమకు లేదని, తాము పేదలే కాక నిరుద్యోగులం కూడానని వారు తెలిపారు. దీంతో ధర్మాసనం జరిమానా స్థానంలో సామాజిక సేవ శిక్ష విధిస్తామని తెలిపింది. చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అíఫిడవిట్లు వేయాలని వారిని ఆదేశించింది. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు రాగా, అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ధర్మాసనం వాటిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. -
వ్యతిరేకంగా పిటిషన్ వేసిన ఎస్సె అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం
-
ఏడేళ్లకే పోలీసయ్యాడు!
బంజారాహిల్స్: ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు కేన్సర్ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది. కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్ యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు. -
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్లో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 411 ఉద్యోగాల గానూ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 31,193 తుది పరీక్షరాశారు. అక్టోబరు 14, 15 తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించారు. బుధవారం ఏపీ ఎస్ఎల్పీర్బీ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఎస్సై రాత పరీక్ష ఫలితాలపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ఎస్సై అభ్యర్థుల ‘ఎత్తు’ వివాదం కీలక మలుపు తిరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవలేదంటూ పలువురు అభ్యర్థులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎస్సై రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. మంగళవారం కోర్టు హాలులో నిర్వహించిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితాలతో సరిపోలడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది. ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యులను విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తు, ఛాతీ కొలతలపై వివాదం ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతీ చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో అర్హులుగా ప్రకటించిన తమను తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. రూ.లక్ష చొప్పున కట్టాల్సిందే కాగా.. న్యాయస్థానంలో కొలతలకు హాజరైన అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే రూ.లక్ష జరిమానా చెల్లిస్తామని రాసిచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో.. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. రూ.లక్ష చొప్పున చెల్లించాల్సిందేనని.. లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌పై ఆగ్రహం మంగళవారం న్యాయస్థానంలోనే అభ్యర్థుల ఎత్తును ధర్మాసనం కొలిపించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు సరిగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అభ్యర్థుల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు ఉన్నారని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నవ్వుతూ కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టునే శంకిస్తారా? అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు అంటే నవ్వులాటగా ఉందా అంటూ శ్రవణ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తేలిగ్గా తీసుకుంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంది. -
ఎస్సై నియామకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాలకు సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్‌కు మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు. కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలను అడ్డుకున్న స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు విచారణ చేపట్టింది. ఆపై న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించింది. అయితే.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ►నెలన్నర కింద న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్ ►ఇప్పటికే పలు మార్లు పిటిషన్లు వేసిన అభ్యర్థులు ►అభ్యర్థుల తరపున జడ శ్రవణ్ పిటిషన్ ►ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో కేసులు ►తొలుత ఫలితాలు విడుదల చేయకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ►ఎస్సై రిక్రూట్మెంట్లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు ►ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►రెండో సారి కొలిచిన తర్వాత మళ్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు పిటిషన్ ►రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు ►రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు ►అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన జడ శ్రవణ్ ►అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారని ఆరోపణలు ►రిక్రూట్మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు ►అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం ►హైకోర్టు సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలుస్తామన్న జడ్జిలు ►ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు ►అభ్యర్థులు వెనక్కి తగ్గడంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చన్న హైకోర్టు ఇదీ చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్లో ‘ఎత్తు’ విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజా నోటిఫికేషన్ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ‘ఎత్తు’ పరీక్ష నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించిన కొలతలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తాము ప్రతిపాదించిన విధంగా ఎత్తు కొలిచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు.. ఎస్సై నియామక ప్రక్రియలో భాగమైన దేహదారు ఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలి చిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై శుక్రవారం జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఎత్తు కొలిచామని ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్ కిషోర్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఈ పరీక్షలో పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు. అయితే, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. 2018లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాజా నోటిఫికేషన్లో ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ పర్యవేక్షణలో హైకోర్టు ప్రాంగణంలోనే మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. -
ఏసీబీ వలలో చింతలమానేపల్లి ఎస్సై వెంకటేష్..
చింతలమానెపల్లి(సిర్పూర్): లంచం కోసం యువకుడిని వేధించిన చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి పట్టుబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండల ఎస్సై ఎన్.వెంకటేశ్, హోంగార్డ్ జనార్దన్ శుక్రవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో గత నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. మహారాష్ట్రలోని అహేరి పట్టణానికి అమె వెళ్లేందుకు దిందా గ్రామానికి చెందిన యువకుడు డోకె ప్రశాంత్ సహకరించాడు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. కొద్దిరోజుల అనంతరం సదరు వివాహిత ఇంటికి తిరిగి వచ్చింది. ఈ ఘటనలో రూ.70వేల లంచం ఇవ్వాలని ప్రశాంత్‌ను ఎస్సై వెంకటేశ్ వేధించాడు. అడిగినంత ఇవ్వకుంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బేరసారాల మధ్య ప్రశాంత్ రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రశాంత్ గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల వేసి ఎస్సైని పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఎస్సై డిమాండ్ చేసిన నగదును మధ్యవర్తి డోకె శ్రీనివాస్ చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద హోంగార్డు జనార్దన్‌కు ఇస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి ఎస్సై వెంకటేశ్, హోంగార్డు జనార్దన్‌ను శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. లంచం కోసం ఎవరైనా వేధిస్తే ఏసీబీని 9154388963 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ దాడిలో ఎస్సైలు రాము, జాన్సన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజస్తాన్‌లో అమానుషం
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్పై జనం దాడి చేసి, కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్‌పై బీజేపీ దుమ్మెత్తి పోసింది. లాల్సోత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెకర్ భూపేంద్ర సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకువచ్చి, దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్‌ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు, కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఇది కూడా కాంగ్రెస్ గ్యారంటీయే: బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాలికలను కాపాడాలి (బేటీ బచావో) అని నినదిస్తుండగా రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ సర్కారు మాత్రం రేపిస్టులను కాపాడాలి(రేపిస్టు బచావో) అని అంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఘటన రాజస్తాన్‌కు మాత్రమే కాదు, మొత్తం దేశానికే అవమానకరమని విమర్శించారు. పోలీసులు, ఇతర అధికారులు మహిళలు, బాలికలపై పాల్పడిన అఘాయిత్యాలకు సంబంధించిన అనేక ఘటనలను పూనావాలా ఉదహరించారు. ఎన్నికల వేళ కూడా రేపిస్టులు ఎంతో ధీమాతో ఉన్నట్లు దీనితో అర్థమవుతోందని ఆరోపించారు. తాజా ఘటన కూడా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీయేనని వ్యాఖ్యానించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. దారుణాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఉమేశ్ మిశ్రాను ఆయన ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం చేతకానితనంతో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పోలీస్ నీచ బుద్ధి.. నాలుగేళ్ల చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి..
జైపూర్: రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వ్యక్తే వక్ర బుద్ధి చూపించారు. నాలుగేళ్ల బాలికపై ఓ పోలీస్ అఘాయిత్యానికి పాల్పడిన అమానుషం శుక్రవారం వెలుగుచూసింది. దౌసా జిల్లాలోని లాల్సోట్ మండలం రాహువస్ పోలీస్ స్టేషన్లో భూపేంద్ర సింగ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన ఇంటి సమీపంలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడపై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. ఆమెను నిలదీయగా జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులంతా రాహువస్ పోలీస్ స్టేసన్ ఎదుట పెద్దఎత్తున గుమిగూడి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ వద్దే చితకబాదారు. ఈ ఘటనపై ఏఎస్పీ రామచంద్ర సింగ్ నేత్ర మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి న్యాయ చేయాలని డిమాండ్ చేశారు. లాల్సోట్ బాలికపై పోలీసు అత్యాచారం ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలీసులు నిరంకుశంగా మారుతున్నారని విమర్శించారు. నిందితుడు, ఏఎస్సై భూపేంద్ర సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, వారికి సాయం అందిస్తామని చెప్పారు. చదవండి: ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా.. -
ఎస్ఐ నాగరాజు హల్చల్
వెల్దుర్తి(కృష్ణగిరి): నంద్యాల జిల్లాకు చెందిన ఎస్ఐ బోడెల్ల నాగరాజు మద్యం మత్తులో స్వగ్రామంలో వీరంగం సృష్టించాడు. ఘర్షణ రేపి, వైరి వర్గంపై దాడులు చేశాడు. చివరకు ఆపేందుకు వచ్చిన పోలీసులపై సైతం దూషణలకు దిగడంతో సదరు ఎస్ఐతో పాటు మరో 13మందిపై కేసు నమోదైంది. వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండల పరిధిలోని సూదేపల్లె గ్రామానికి చెందిన బోడెల్ల నాగరాజు ఇటీవల ప్యాపిలి ఏఎస్ఐగా ఉండి పదోన్నతిపై నంద్యాల జిల్లాకు ఎస్ఐగా నియమితుడయ్యాడు. అక్కడి ఎస్పీ అటాచ్డ్గా విధి నిర్వహణలో ఉన్నాడు. స్వగ్రామమైన సూదేపల్లెకు వచ్చిన ఆయన సోమవారం రాత్రి మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. రస్తా పంచాయితీ, దాయాదుల మధ్య మనస్పర్థలను, పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వైరి వర్గం వారిపై దూషణలకు దిగుతూ తిరిగాడు. ఈ క్రమంలో తన వర్గానికి చెందిన మరో 13 మందిని కలుపుకుని గుంపుగా ప్రత్యర్థి వర్గంలోని వైకుంఠం అచ్చయ్య ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపడ్చాడు. ఇదంతా గ్రామస్తులు కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించి వెల్దురి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకోగా ఎస్ఐ నాగరాజు బూతు పురాణం అందుకున్నాడు. అతని వర్గానికి చెందిన కొందరు పోలీసులపై దూషణలకు దిగి దాడికి ప్రయత్నించారు. కాగా గాయపడిన అచ్చయ్య కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం వెల్దురి పోలీస్‌స్టేషన్‌లో నంద్యాల జిల్లా ఎస్ఐ నాగరాజు, మరో 13 మందిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వెల్దుర్తి సీఐ సురేశ్‌కుమార్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి విచారణ జరిపి బోడెల్ల నాగరాజు, రాముడు,శివరాముడు, నాగేంద్ర, తిమ్మరాజు, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య, కోటేశ్వరులు, ప్రసాద్, సుబ్బయ్య, శివుడు, మద్దిలేటి, సంతోష్, పెద్ద తిమ్మన్న మరి కొందరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
నేడు, రేపు ఎస్ఐ పోస్టులకు మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీకోసం మెయిన్ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపదని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్సైట్లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది. రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్ చేయవచ్చని, ఈమెయిల్: mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది. ఈ పరీక్షల వివరాలు.. అక్టోబరు 14: పేపర్–1 (డిస్క్రిప్టివ్ ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–2 (డిస్క్రిప్టివ్ ) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్టోబరు 15: పేపర్–3 (ఆబ్జెక్టివ్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–4 (ఆబ్జెక్టివ్) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు -
నిమజ్జనంలో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం
జగ్గయ్యపేట: వినాయక నిమజ్జనంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించటంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 15వ వార్డు పరిధిలోని చెరువు బజారులో టీడీపీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిమజ్జన నిర్వహించడంతో విగ్రహాన్ని ఊరేగించేందుకు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు. శాంతి భద్రతలు పర్యవేక్షణకు ఎస్ఐ రామారావు సిబ్బందితో అక్కడకు వచ్చారు. విగ్రహం ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరటంతో ఎస్ఐ తలకు తీవ్రంగా గాయమైంది. ఎస్ఐను సిబ్బంది స్థానికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని శాంతి భద్రతలు పర్యవేక్షించారు. నందిగామ ఏసీపీ జనార్దన్ నాయుడు అక్కడకు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఘటనపై కేసు నమో దు చేస్తామని ఏసీపీ తెలిపారు. ప్రథమ చికిత్స చేయించుకుని ఎస్ఐ అక్కడకు రావటంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు యత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
14, 15 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌కు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు. మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–1(డిస్క్రిప్టివ్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పేపర్–2(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–3(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–4(ఆబ్జెక్టివ్) నిర్వహించనున్నారు. slprb. ap. gov. in వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను లేదంటే ఈమెయిల్ mail& slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు. -
మఠంపల్లి ఎస్ఐకి రూ.5వేలు జరిమానా
నల్గొండ: కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మఠంపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్ఐ బాలకృష్ణకు రూ.5వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్ఐ సోమవారం రాష్ట్ర న్యాయ సేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించి రశీదు పొందారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లపుదాసు కలమ్మకు భూమిని ఆమె ఆడపడుచు యరగాని విజయలక్ష్మి, ఆమె భర్త గురువయ్య ఫోర్జరీ సంతకాలతో మ్యూటేషన్ చేయించుకుని పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఈ విషయం తెలుసుకున్న కళమ్మ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సూర్యాపేట ఎస్పీ, కోదాడ డీఎస్పీ, హుజూర్నగర్ సీఐకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హుజూర్నగర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ద్వారా కళమ్మ ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా న్యాయమూర్తి ఆ కంప్లైంట్‌ను మఠంపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎస్ఐ కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి మఠంపల్లి ఎస్ఐ బాలకృష్ణను రాష్ట్ర న్యాయసేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పేరుతో ఎస్ఐ బాలకృష్ణ జరిమానా రూ.5వేలు చెల్లించి రశీదు పొందారు. కాగా గత నెలలోనే ఇక్కడ పనిచేసిన మరో ఎస్ఐకి హైకోర్టు రూ.2వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
మహబూబాబాద్‌లో విషాదం: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు కాగా శోభన్‌బాబు సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు -
నందివాడ ఎస్ఐ భర్త ఆత్మహత్య
గుడివాడ టౌన్(నందివాడ): నందివాడ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష భర్త బోగాది అశోక్(30) ఆదివారం నందివాడ లోని ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అశోక్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని నందివాడ పోలీసులు అంటున్నారు. ఈ దంపతులకు ఏడాది కుమార్తె ఉంది. శిరీష ఏడాది క్రితం నందివాడ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డ్రగ్స్ కేసులో ఎస్సె రాజేందర్ కి పోలీస్ కస్టడీ
-
AP: ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, ఏపీలో సివిల్, ఏపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఏడుగంటల సమయం -
ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం
ఘంటసాల(అవనిగడ్డ): ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని చెప్పిన ఘంటసాల ఎస్ఐ శ్రీనివాస్‌పై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఊగిపోయారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆయనకు వంతపాడారు. దీంతో టీడీపీ నేతలు ఎస్ఐపై రెచ్చిపోయారు. వారి తీరుతో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో చేపట్టిన టీడీపీ ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపిన వివరాలు..చంద్రబాబు పిలుపు మేరకు సోమవారం బుద్ధప్రసాద్ నేతృత్వంలో మాజీ ఎంపీ కొనకళ్లతో మరికొంతమంది టీడీపీ నేతలు శ్రీకాకుళం నుంచి ర్యాలీగా ఇసుక క్వారీ వరకు వెళ్లారు. అక్కడ టీడీపీ జెండాలు ఉంచి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక గంట మాత్రమే అనుమతిచ్చారు. పామర్రు టీడీపీ ఇన్చార్జి వర్ల కుమారరాజా రావడం ఆలస్యం కావడంతో ఇచ్చిన సమయం దాటిపోయింది. అయినప్పటికీ కొంతమంది నేతలు మాట్లాడుతుండటంతో మీకిచ్చిన సమయం అయిపోయింది, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని ఎస్ఐ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన బుద్ధప్రసాద్.. ‘ఇసుక దోపిడీకి అనుమతిస్తావా, మేము మాట్లాడుతుంటే ఆడ్డుపడతావా’ అంటూ ఎస్ఐపై విరుచుకుపడ్డారు. ఇసుక దోపీడిని అరికట్టకుండా మమ్మల్నే అడ్డుకుంటావా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కొనకళ్ల కలి్పంచుకుని ఇసుక దోపిడీ గురించి మాట్లాడుతుంటే అడ్డుకుంటానికి మీరెవరు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటరీ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ ఎస్ఐకి వేలు చూపిస్తూ.. నువ్వు దొంగవి అంటూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జేపీ సిబ్బందిని తీసుకొచ్చిన ఎస్ఐ శ్రీనివాస్.. ఇసుక ధరలు, క్వారీ అనుమతుల గురించి బుద్ధప్రసాద్‌తో మాట్లాడించారు. ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలకు సంబంధించిన స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయడం వల్ల వాటికి రేటు వేయరని చెప్పారు. మైనింగ్ అనుమతి గురించి ప్రశ్నించగా.. మా ఉన్నతాధికారుల వద్ద వివరాలున్నాయని సిబ్బంది చెప్పారు. ఇసుక క్వారీకి సంబంధించి అనుమతులు చూపించాలని లేదంటే రేపు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామంటూ ఎస్ఐని బుద్ధప్రసాద్ హెచ్చరించారు. -
SI Results Released: పోలీసు ఎస్ఐ ఫలితాలు విడుదల..
హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐ, ఏఎస్ఐ ఫలితాలు విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 పురుష అభ్యర్థులు, 153 మంది మహిళ అభ్యర్థులను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కులు రేపు ఉదయం సంబంధిత వెబ్సైట్లో ఉంచుతామని బోర్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్సైట్లో పూర్తించాల్సి ఉంటుంది. ఇందుకు ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు గడువును ఇచ్చారు. 2022 ఏడాది విడుదల చేసిన 587 ఎస్ఐ పోస్టుల రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్, దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇదీ చదవండి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. -
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది. 2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్లో విచారించారు. ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్ అయ్యారు. చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు. అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు. అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. -
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ!
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ! -
ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు
దుండిగల్: చనిపోయి 35 రోజులైన ఓ ఎస్సైని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉంది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రభాకర్‌రెడ్డి జూన్ 8న గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయి నెల రోజులు దాటింది. కాగా.. సైబరాబాద్ పరిధిలో 83 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీరియల్ నంబరు 26లో ప్రభాకర్‌రెడ్డిని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం గమనార్హం. సైబరాబాద్ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి.. ప్రభాకర్‌రెడ్డి పేరును జాబితాలోంచి తొలగించి మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి!
కుమురంభీం జిల్లా: ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చే పోలీసు సిబ్బందికి భోజనాలు ఏర్పాటు పేరిట వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జూన్ 27న ‘భోజన ఖర్చులివ్వండి!’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై రాష్ట్ర పోలీసు బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జోనల్‌స్థాయి అధికారిని విచారణకు ఆదేశించారు. స్థానిక నిఘా విభాగం అధికారుల ప్రాథమిక విచారణలో ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం బయటపడడంతో తొలుత ఎస్సైను వీఆర్‌కు అటాచ్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ సురేశ్‌కుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీ సురేశ్‌కుమార్ ఎస్సై గంగన్నను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే గంగన్న వ్యవహారంపై పో లీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటి కీ.. పర్యటన ముగిసిన రెండోరోజు ఎస్సైపై వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టడం గమనార్హం. వసూళ్ల వెనుక అదృశ్య శక్తులెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అదునుగా తీసుకుని స్థానిక వర్తక సంఘాల నుంచి డబ్బులు వసూళ్లు చేయాలనే ఆలోచన ఎస్సై గంగన్నదేనా? లేక దీని వెనుక ఎవరైనా అదృశ్య శక్తులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు విచారణలో ప్రధానంగా తేలాల్సిన విషయం. ఎందుకంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఇసుమంతైనా లేకుండా ఎస్సై గంగన్న అంతటి సాహసానికి పాల్పడడనే వాదనలు పోలీసు శాఖలోనే గుప్పుమంటున్నాయి. పైగా ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చినా వసూళ్లు ఆగకపోవడం ఎస్సై గంగన్న వెనుక ఎవరో ఉన్నారనే వాదనలకు బలం చేకూరింది. పోలీసుల ప్రాథమిక విచారణలో రూ.5 లక్షలకుపైగా వసూళ్లు చేశారని తేలినట్లు సమాచారం. పోలీసులు సమగ్రంగా విచారణ చేపడితే ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వాంకిడిలో దొంగనోట్ల కేసు విషయంలోనూ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో రూ.30 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఇక్కడా ఆ అదృశ్య శక్తులకే భారీగా వాటాలు ముట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సై గంగన్న వసూళ్ల పర్వం వెనుకా కచ్చితంగా అదృశ్య శక్తుల హస్తం ఉన్నట్లు పోలీసుశాఖలో ప్రచారం ఊపందుకుంది. పైగా వసూళ్ల విషయంలో ఎస్సైను మాత్రమే బలిపశువును చేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది. ఆది నుంచి ఆరోపణలే..! ఎస్సై గంగన్నపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలోనూ దురుసుగా ప్రవర్తిస్తారని సమాచారం. చిటికీమాటికి వాహనాలను ఆపడం.. వాహనదారులతో గొడవకు దిగుతున్నారనే విషయం స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధికి తెలిసి ఎస్సైను పిలిచి ‘ఇక్కడ పనిచేయాలనుకుంటున్నావా? లేదా?’ అని గట్టిగా మందలించాకే కొంత తగ్గినట్టు తెలిసింది. అలాగే ఏదైన కేసు విషయంలో పోలీసుస్టేషన్ మెట్లెక్కితే ఇక అంతే! స్టేషన్ ఉన్నతాధికారి పేరు చెప్పి ఇరువర్గాల నుంచి అందినకాడికి దండుకుంటారని సమాచారం. ఆదాయానికి మించి ఆర్జించారనే వాదనలు ఆ శాఖవర్గాల్లోనే గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి బినామీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వ్యాపారి చేసే రియల్ దందాలో ఇతనికి వాటాలున్నాయని సమాచారం. ఇటీవల ఫోర్‌లేన్ రహదారికి ఆనుకుని ఉన్న ఓ రెండెకరాల భూమిని కబ్జా చేసి.. స్థల యజమానులను బెదిరించినా కబ్జాదారులపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా.. ఎస్సై గంగన్న స్థల యజమానులపై కేసు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు వాపోతున్నారు. ఈ కబ్జా కథ వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతోనే ఎస్సై గంగన్న రంగంలోకి దిగి మమ్మల్ని బెదిరించారని బాధితురాలు, స్థల యజమా ని తారాబాయి ఆరోపిస్తోంది. -
మహిళను వేధిస్తున్న.. ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్ల...
తమిళనాడు: తిరుచ్చి సమయపురంలో హాస్టల్లో ఉంటున్న మహిళను వేధించిన ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లను అధికారులు బదిలీ చేశారు. వివరాలు.. తిరుచ్చి మారియమ్మన్ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. యాత్రికుల వసతి కోసం ఉచిత మండపాలు, వసతి గృహాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం సమయపురం ఆలయానికి ఓ జంట ఇక్కడి హాస్టల్లో ఉంటోంది. హాస్టల్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ ఎస్ఐ, ముగ్గురు పోలీసులు మహిళతో దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారని.. ప్రశ్నించిన భర్తపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు రహస్య విచారణ చేశారు. మహిళకు వేధింపులు ఇచ్చిన సంగతి నిజమేనని తేలింది. దీంతో సమయపురం పోలీసుస్టేషన్లో పని చేస్తున్న ఎస్ఐ ప్రకాష్, కుమారేశన్లను పుదుకోటై జిల్లాకు, తిరుమేనిని పెరంబలూరు జిల్లాకు, సెయ్యరాసును అరియలూరు జిల్లాకు బదిలీ చేస్తూ డీఐజీ శరవణ సుందర్ ఆదేశించారు. ఈ చర్య పోలీసు శాఖలో కలకలం రేపింది. -
తండ్రి బదిలీ.. కూతురు బీవీ వర్షకి బాధ్యతలు
కర్ణాటక: ఒక ఎస్ఐ బదిలీ అవుతూ బాధ్యతలను తన కూతురికి అప్పగించారు. ఆమె కూడా ఎస్ఐగా పనిచేస్తుండడం విశేషం. ఈ వినూత్న సంఘటన మండ్యలో జరిగింది. మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ బీఎస్ వెంకటేశ్ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి కొత్త ఎస్ఐగా బీవీ వర్ష నియమితులయ్యారు. ఆమె ఎవరో కాదు.. వెంకటేశ్ కూతురే. తొలి పోస్టింగ్ ఇక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదివిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకుని ట్రైనీ ఎస్ఐగా ఇదే పీఎస్‌లో పనిచేశారు. తొలి పోస్టింగ్ కూడా మండ్యలోనే జరగడం గమనార్హం. అది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్‌కే. బుధవారం తన తండ్రి వెంకటేశ్ నుంచే వర్ష చార్జ్ తీసుకుని పూర్తిస్థాయి ఎస్ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ పోలీసు అధికారి ప్రాణాలను బలి తీసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఎస్ఐ సోమకుమారస్వామి(56) మృతిచెందారు. దీంతో, ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర ఎస్ఐ కుమారస్వామి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి తీవ్రంగా గాయపడటంతో ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందతూ మృతిచెందారు. అయితే, ఎస్ఐ సోమకుమార్ ఆదివారం వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమకుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం -
దుండిగల్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి హఠాన్మరణం
హైదరాబాద్: దుండిగల్ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి (36) గుండెపోటుతో మృతి చెందారు. 2016 బ్యాచ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి నెల రోజుల క్రితం నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనాన్ని ఆపే క్రమంలో కింద పడ్డాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పూర్తిగా కోలుకున్న అతను మరో రెండ్రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తన సహోద్యోగులకు సమాచారం అందించాడు. గురువారం రాత్రి అతను గుండె నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
ఎస్ఐ భార్య అనుమానాస్పద మృతి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని
కర్ణాటక: సబ్ ఇన్స్పెక్టర్ భార్య అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని శవమైన సంఘటన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బేగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పటేల్ లేఔట్లో జరిగింది. మృతురాలు ఎస్ఐ రమేష్ భార్య శిల్ప (33). వివరాలు.. కాలేజీలో చదివే రోజుల్లో రమేష్, శిల్పా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. తరువాత రమేష్‌కు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే కాపురంలో కలతలు వచ్చాయి. శిల్పను కులం పేరుతో వేధించినట్లు, రోజూ గొడవపడేవారని ఆరోపణలు వచ్చాయి. దాంతో శిల్ప భర్త రమేష్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడంతో పోలీసులు పెద్దల సమక్షంలో ఇద్దరికీ రాజీ పంచాయతీ చేసి పంపించారు. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో శిల్ప ఉరికి వేలాడింది. శిల్పను ఎలాగైనా వదిలించుకోవాలని హత్య చేసి ఇది ఆత్మహత్యగా చెబుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ ప్రేమించుకుని సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోమంటే రమేష్ ఒప్పుకోలేదని తెలిపారు. కానీ ఆమె ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయంతో రిజిస్టర్ పెళ్లి చేసుకుని, వేధింపులకు దిగాడని చెప్పారు. ఆమెకు ఖర్చులకు, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదని, తామే పుట్టింటి నుంచి పంపేవారమని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రమేష్ ఆస్తి కోసం అక్క కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని, అందుకే శిల్పను అంతమొందించాడని విలపించారు. బేగూరు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టగా రమేష్ పరారీలో ఉన్నాడు. -
TS: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్ ఎస్సై పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని పేర్కొంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు. చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు. నిందితుడి లోంగుబాటు ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్పందించిన సీఎం జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేతో వివాదం గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు. -
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
జీవితంపై విరక్తి చెంది ఎస్ఐ ఆత్మహత్య
తిరువళ్లూరు: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఓ ఎస్ఐ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన తనిగవేలు(49). తిరువళ్లూరు పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం యథావిధిగా విధులకు హాజరై శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. భోజనం తరువాత తన గదిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య గీత తలుపు తెరిచి చూడగా ఉరి వేసుకుని శవంగా కనిపించాడు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళతో ఎస్ఐ అసభ్య ప్రవర్తన.. ఇంటికి వెళ్లాక ఫోటోలు పంపాలని..
బెంగళూరు: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించారు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళను వేధించినంట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. వరకట్నం విషయంపై సాక్షిగా సుద్ధగుంటపాళ్య పోలీసు స్టేషన్‌కు పిలుపించుకున్న ఎస్ఐ మంజునాథ్‌స్వామి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళలు ట్విట్టర్లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. స్నేహితురాలి విడాకుల కేసులో సాక్షిగా వివరాలను ఇవ్వటానికి స్టేషన్‌కు వెళ్లాను. ఎస్ఐ మంజునాథస్వామి మొదట చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం అతడి నిజస్వరూపం బయట పడింది. విచారణ సమయంలో తన చేతులు పట్టుకుని ముద్దు పెట్టడానికి యత్నించాడు’. అని బాధితురాలు ఆరోపించారు. స్టేషన్లో కుర్చోన్న తన నడుం గిల్లి, క్యాబిన్ పక్కన ఉన్న రూంకు రావాలని పిలిచాడని, అదే సమయంలో మా అమ్మ ఫోన్ చేయటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లటంతో అతడి నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. స్టేషన్లోనే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఎస్ఐపై ఆరోపణలు చేశారు. ఇంటికి వెళ్లాక వాట్సాప్‌లో తన ఫోటోలు పంపాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు సాక్షులను తీసుకోవటం సరి అయితే తన ఫోటోలను పంపాలని సూచించటం ఎంత వరకు న్యాయమని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తను స్టేషన్లో ఉన్నంత వరకు ఏమి మాట్లాడలేక భయంతో ఉన్నట్లు వివరించారు. ఎస్ఐ ఘటనకు సంబంధించి బాధితురాలు ఫఙర్యాదు చేసిందని డీసీపీ సీకే బాబా తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
జనగామ ఎస్సై దంపతుల మృతి.. ఆత్మహత్యకు ముందు జరిగిందిదే!
సాక్షి, ఉమ్మడి వరంగల్: జనగామలో ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్ కూడా తన సర్వీస్ రివాల్వర్‌లో కాల్చుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి దూరమవ్వడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల మరణంపై కొడుకు రవితేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి, పోస్టుమార్టం అనంతరం అమ్మనాన్నల మృతదేహాలను అప్పగించాలని కోరారు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. జనగామ ఎస్ఐ దంపతుల ఆత్మహత్యపై కొడుకు ఫిర్యాదు కాపీ అసలేం జరిగిందంటే ఎస్సై కాసర్ల శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా జనగామ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రవితేజకు ఇటీవలె వివాహమవ్వగా భార్యతో కలిసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బేగంపేట్‌లో ఉంటున్నారు. ఎస్సై దంపతులిద్దరే జనగామలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి శ్రీనివాస్, స్వరూప మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున పాలు పోసే వ్యక్తి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇంటి పక్కన నివాసముండే వ్యక్తిని పిలిచి ఇద్దరు కలిసి ఇంటి వెనకున్న డోర్ దగ్గరకు వెళ్లగా బయట ఉన్న బాత్రూమ్లో వెంటిలేటర్ ఇనుపరాడ్‌కు స్వరూప తన చీరతో ఉరివేసుకొని ఉండటం చూశారు. వెంటనే వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్‌ను నిద్రలేపారు.. ఎస్సై బాత్రూమ్కి వెళ్లి చూసేసరికి భార్య విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఎస్సై నివాసానికి ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్ఛార్జ్ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు.భార్య మృతికి గల కారణాలను ఎస్సై శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన శ్రీనివాస్.. ఉదయం 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్రూమ్కి వెళ్లి చూడగా.. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని రక్తపు మడుగులో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో ఎస్సై దంపతులు మృతిచెందడంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య , భార్య శవాన్ని చూస్తూ ఏడుస్తూ కాసేపటికే..
-
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య
సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్ భార్య స్వరూప(45) ఈ ఉదయం ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే.. భార్య చనిపోయిందన్న మనస్థాపంతో కాసేపటికే శ్రీనివాస్ సైతం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ మీటింగ్‌లో అన్నం గిన్నె మోసిన ఎస్సై
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై వెంకటరెడ్డి అన్నం గిన్నె మోస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవు తోంది. హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకటరెడ్డి బందోబస్తు కోసం వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి అన్నం గిన్నెను మోయడం చర్చనీయాంశమైంది. ‘అక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నా కూడా ఓ ఎస్సై ఇలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేసిందని, హుజూర్‌నగర్‌లో పోలీసులు చివరికి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లలో అన్నం గిన్నెలు మోసే స్థితికి దిగజారారు, ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా’అంటూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సామాజిక మాధ్యమాలలో కామెంట్ పోస్టు చేశారు. ఈ విషయమై సదరు ఎస్సై వివరణ ఇస్తూ..భోజనం కోసం కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుండగా వారిని అదుపు చేయడం కోసమే అన్నం గిన్నెను పక్కకు జరిపామని చెప్పారు. -
HYD: ఎస్సై సార్ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడాడు
సాక్షి, హైదరాబాద్: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అనిపించుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కు ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్ సాయి కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్‌ను, రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. -
ఎస్ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్ కలకలం..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో సెల్ఫీ సూసైడ్ యత్నం ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నానంటూ క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. రూ.7 లక్షల రూపాయల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ యత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. భార్యా భర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలకు తనను దూరం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు క్రాంతి. న్యాల్ కల్ రోడ్ఖులో ఓ పోలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ముందు.. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ బాబూరావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో ఎస్ఐ బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరింది. బాన్సువాడకు చెందిన క్రాంతి నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో ఉంటున్నాడు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి.. -
AP: ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఉదయం ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను వెల్లడించింది. కాగా, గత నెల 19న ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షలు జరుగుగా 1,51,288 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అర్హత సాధించారు. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాల కోసం https://slprb.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోగలరు. -
పదోన్నతుల్లో న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కల్పనలో తమకు న్యాయం చేయాలని 2009 బ్యాచ్ ఎస్సైలు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు సోమవారం 2009 బ్యాచ్‌కు చెందిన దాదాపు 85 మంది వరకు సబ్ ఇన్స్పెక్టర్లు బీఆర్కేఆర్ భవన్ వద్ద మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 175 పోస్టులు ఖాళీగా ఉన్నా సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు దక్కకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు రూల్స్‌లో స్పష్టత లేని కారణంగా తమకు పదోన్నతులు రావడం లేదని వివరించారు. 2009 బ్యాచ్‌లో మొత్తం 435 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో ఇప్పటికే 220 మంది సీఐలుగా ప్రమోషన్లు పొందారని, మరో 215 మందికి పదోన్నతులు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన తమ బ్యాచ్మేట్లు సీఐలుగా పనిచేస్తున్న చోటే తాము ఎస్సైలుగా పనిచేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాతజోన్ల విధానంలో లేదంటే నూతన మల్టీ జోన్ విధానంలో అయినా సరే తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ఎస్సైలు తెలిపారు. -
కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..!
తిరుపతి రూరల్: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్ఐ ఏ స్టేషన్లో పనిచేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు. ట్రాన్స్ఫర్ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్ పరిధిలోని లింగేశ్వరనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్లో దాడులుచేశారు. మహిళా ఎస్ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్ఐ మెడికల్ లీవ్‌లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్‌లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాసేపట్లో ఏపీలో ఎస్సై ప్రిలిమ్స్ రాతపరీక్ష
-
ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి
సాక్షి, కర్ణాటక: తనపై ఎస్ఐ లైంగిక దాడి చేసినట్లు కాలేజీ విద్యార్థిని బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో వైర్లెస్ విభాగంలో ఎస్ఐగా పని చేస్తున్న లాల్సాబ్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టి దైహికంగా వాడుకొని మోసం చేశాడని విద్యార్థిని ఫిర్యాదు చేయగా లాల్సాబ్పై కేసు నమోదు చేశారు. ఈ నెల 10న మరో యువతిని అతడు పెళ్లాడినట్లు బాధితురాలు తెలిపింది. ఫేస్బుక్ ద్వారా 2020 జూన్‌లో పరిచయం అయిన లాల్సాబ్ ప్రేమ పేరుతో వంచించాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. చదవండి: రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో ఇష్టం లేక.. ప్రియుడిని మర్చిపోలేక.. -
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్ఐ భార్య, కూతురు మృతి
సాక్షి, బాపట్ల జిల్లా: మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమంధర్ వలి భార్య కూతురు కూడా ఉన్నారు. చిన్నగంజాం లో తిరుణాలకు డ్యూటీకి వెళ్లిన ఎస్సై సమందర్ వలి, తన భార్య కూతురుతో పాటు, పక్కింటి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్ని ఇచ్చి కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు. అయితే తిరుగు ప్రయాణంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వహీదా(39) ఆయేషా(9) గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి.. తన భార్యతో పాటు తన 9 ఏళ్ల కూతురు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి బోరున వినిపిస్తున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు. -
23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ఎస్సై
సాక్షి, చెన్నై: చిరు ఉద్యోగులే బైక్‌లు, కార్లు వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ అధికారిణి గత 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు హాజరవుతుండడం కచ్చితంగా విశేషమే. వివరాలు.. చెన్నై షావుకారుపేటలోని ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల జి.పుష్పరాణి రోజూ సైకిల్ పైనే డ్యూటీకి వెళ్తారు. అలాగేే తన ఇంటి పనులకు సైతం దాన్నే వాడుతారు. 1997లో ఈమె తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగంలో గ్రేడ్– 1 కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పదోన్నతి ద్వారా పుదుపేట ఆర్మ్డ్ రిజర్వుకు బదిలీ అయ్యారు. విశ్రాంత ఎస్ఐ అయిన తన తండ్రి గోవింద స్వామి సైకిల్ పైనే విధులకు వేళ్లేవారని ఆమె పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏడో సైకిల్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. ఎవరినీ సైకిల్ తొక్కమని బలవంతం చేయనని, అలాగే తనను సైకిల్ నుంచి ఎవరూ దూరం చేయలేరని పుష్పరాణి స్పష్టం చేశారు. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఆరోగ్య సంరక్షణ కోసం సైకిల్ పైనే పాఠశాలకు వేళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. ధనవంతులకు సైకిల్ వ్యాయామం అయితే.. పేదలకు అది జీవనాధారం అని ఆమె తెలిపారు. ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి. ఇంద్ర మాట్లాడుతూ సబ్ ఇన్స్పెక్టర్ పుష్పారాణి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని కొనియాడారు. -
శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో మరో విషాదం నెలకొంది. సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి షార్కు వచ్చారు. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కాగా, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటలో వ్యవధిలోనే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం కలిగించింది. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఐ కాల్చుకోవడాన్ని చూసిన సిబ్బంది శ్రీహరికోట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చింతామణి ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ చిన్నకన్నన్ శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు) -
జనవరి 31న రిటైర్మెంట్.. కారు ఢీకొని డ్యూటీలోని ఎస్సై మృతి!
న్యూఢిల్లీ: కారు ఢీకొట్టిన ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి మృత్యువాతపడ్డారు. పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నిపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. 59 ఏళ్ల లతూర్ సింగ్ సెంట్రల్ జిల్లాలోని చందిని మహాల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రింగ్ రోడ్డులో రాజ్‌ఘాట్,శాంతివన్ సిగ్నల్స్ వద్ద వేగంగా వచ్చిన కారు లతూర్ సింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో సింగ్ డ్యూటీలో ఉన్నట్లు సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహన్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాగంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన హ్యుందాయ్ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుడ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. నిందితుడిని శోకేంద్ర(34)గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన ఇతడు అసఫ్ అలీ రోడ్డులోని బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడు లతూర్ సింగ్ జనవరి 31న రిటైర్మెంట్ తీసుకోనున్నారని శ్వేతా చౌహన్ తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు. సింగ్ కుటుంబం దయాల్పూర్లో నివసిస్తుందని, వారికి ప్రమాదంపై సమాచారం ఇచ్చిన్నట్లు చెప్పారు. చదవండి: నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు -
అవ్వకు ఇల్లు కట్టించిన ఎస్ఐ.. మానవత్వంలో ‘రాజా’రాం
వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన మేడిపల్లి సమ్మవ్వ(సమ్మక్క) కుమారుడు సంపయ్య ఇరవై ఏళ్లక్రితం చనిపోగా, భర్త అయి లయ్య ఏడాది క్రితం అనారో గ్యంతో కాలం చేశాడు. దీంతో ఎవరూ లేని ఆమె గ్రామంలో భిక్షాటన చేస్తూ బతుకుతోందని స్థానికులు ఎస్సై నార్లాపురం రాజారాం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ‘ఆమె అనాథ కాదు.. బాగోగులు నేను చూసుకుంటా.. ఉండేందుకు ఇల్లు కటించే బాధ్యత నాదే’’ నని చెప్పి... అన్నట్టుగానే సొంత డబ్బులతో ఇల్లు కట్టించి సోమవారం గృహప్రవేశం చేయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఏసీపీ సంపత్‌రావు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం సమ్మవ్వకు ఏసీపీ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు అందించారు. అనాథ అవ్వను దత్తత తీసుకున్న రాజారాంను అందరూ అభినందించారు. – నల్లబెల్లి -
అర్ధరాత్రి మాటువేసి.. మహిళా ఎస్ఐని టార్గెట్ చేసి..
భువనేశ్వర్: మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో వెంబడించారు. విధులు నిర్వహించుకుని పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇలా జరిగింది. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ఈ మేరకు భువనేశ్వర్‌లోని సహీద్నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా నగరంలోని రిజర్వ్ బ్యాంక్ సమీపంలో కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. చేతిలో కత్తులు, తల్వార్లతో ఆమెను వారు ఫాలో చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో వారిబారి నుంచి ఎస్ఐ శుభశ్రీ నాయక్ తప్పించుకున్నారు. అనంతరం, ఈ ఘటనపై భువనేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు.. ఎస్ఐ శుభశ్రీ నాయక్‌కి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఎస్ఐ శుభశ్రీ పలువురికి సాయం అందించారు. లాక్డౌన్ సమయంలో అవసరం ఉన్నవారిని భోజనం అందించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన హీరోలు కూడా ఆమెను అభినందించారు. Stringent action should be taken against the culprits @odisha_police NB : During COVID lockdown MegaStar @KChiruTweets appreciate SI Subhashree Nayak for her commendable social work #Odisha https://t.co/HX9G0FUa2i — BIKASH KUMAR ROUTRAY (@Bikash_Media) January 4, 2023 So delighted to chat with #Shubhasri ji ,the Odisha Cop who cares for citizens like her own.Salute her compassion. @CMO_Odisha @Naveen_Odisha @DGPOdisha pic.twitter.com/15ZURVUITc — Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020 -
సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం
వరంగల్ క్రైం: మహిళా ఎస్ఐ పెళ్లయి నెలరోజులైంది. కానీ, అంతకుముందు ఉన్న పరిచయం కారణంగా ఓ ఇన్స్పెక్టర్తో కలిసి ‘హద్దులు’వీురింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో బట్టబయలైంది. అదేవిధంగా లైంగిక వేధింపులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని మరో ఎస్ఐ.. పట్టించుకోకుండా రాజీపడాలి్సందిగా ఉచిత సలహా ఇచ్చా డు. వీరి చర్యలను సహించని సీపీ రంగనాథ్ మంగళవారం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనరేట్ పరిధిలో ఇక ఏమి జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతం ఇచ్చారు. వచ్చిన నెలరోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ. కానీ కొంతమంది అధికారులు హద్దు మీరి ప్రవర్తించడం ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దు మీరి ప్రవర్తించడంతో ఇరువురిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్ పరిధిలో సంచలనం కలిగించింది. ఎస్ఐ హరిప్రియకు ఇటీవల పెళ్లయ్యింది. కానీ.. ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఫోన్లో వాట్సాప్ చాటింగ్ గమనించాడు. దీని ఆధారంగా సీపీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన సీపీ.. వాస్తవమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. రాజీ కుదుర్చుకోండని ఉచిత సలహా.. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పి.పున్నంచందర్ ఓ యువతి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది. స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించాలి్సన ఎస్సై పున్నంచందర్ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోపాటు రాజీ పడాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు సీపీకి నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లో ఐదుగురిపై వేటు.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించిన సీపీ రంగనాథ్.. నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై వేటు వేయడం కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ దొంగతనం విషయంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా దొంగ పరారయ్యాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ మోహన్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడగా, అడ్మిన్ ఎస్సై సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. తాజాగా ముగ్గురిని సస్పెండ్ చేశారు. గతంలోనూ ప్రేమాయణాలు.. కమిషనరేట్‌లోని పోలీస్ అధికారుల ప్రేమాయణాలు కొత్తేమి కాదు. మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు సీబీసీఐడీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీసులు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. సీబీ సీఐడీ ఇన్స్పెక్టర్, రవి, తన మహిళా సహోద్యోగి అయిన ఇన్స్పెక్టర్తో కలిసి హనుమకొండలోని రాంనగర్‌లోని ఆమె ఇంట్లో ఉండగా భర్త అయిన మహబూబాబాద్ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీసీఐడీ ఇన్స్పెక్టర్, మహిళా ఇన్స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. గీసుకొండ మండలంలో సంబరాలు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడిందన్న సమాచారంతో గీసుకొండ మండలం మణుగొండ, కొమ్మాలగ్రామాల్లో యువకులు బాణసంచా కాల్చి సీపీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
Hyderabad: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్‌చౌక్ ఎస్సై వెంటనే స్పందించి తన పౌచ్‌లో ఉన్న గన్ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్‌తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్ చూపించి సినిమా ఫక్కీలో హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్‌చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు. How can SI take out his service revolver gun to stop vehicle during cheking in mirchowk old city ? @CPHydCity @DCPSZHyd sir kindly take action on this... On small small issues a police officer can't take out his firearm @TelanganaDGP pic.twitter.com/SPWBZKphTk — Mohammed Inayath ulla sharief (@InayathShafi) December 27, 2022 చేతిలో వెపన్ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్‌ఫ్లాప్) -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్ఐ
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను కిరాయి గూండాలతో హత్య చేయించిన అతని భార్య (ఎస్ఐ) చిత్ర, కిరాయి రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమారు (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర (44) సింగారపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సెపె్టంబర్ 16వ తేదీ సెంథిల్ కుమార్ అదృష్టమయ్యాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా సెంథిల్ కుమార్‌ను వివాహత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతని భార్య చిత్రా కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఎస్ఐ చిత్ర, ఆమెకు సహరించిన మహిళా మంత్రగత్తే సరోజ (32), రౌడీలు విజయ్ కుమార్ (21), రాజ పాండ్యన్ (21)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: (Anusha: ఇప్పటికే మూడు సర్జరీలు.. బాధను తట్టుకోలేక..) -
Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): మద్యం మత్తులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు డ్యూటీలో ఉన్న ఎస్ఐని ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..శుక్రవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హిమాయత్‌నగర్ మెక్‌డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వన ఇద్దరు యువకులను ఆపేందుకు నరేష్ ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. వారిని ఆపేందుకు అడ్డుగా వెళ్లిన నరేష్‌ను ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐని హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు. నిందితుల అరెస్ట్ ఎస్ఐని ఢీకొట్టి బైక్‌పై పరారైన యువకులను పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్థారణ అయ్యింది. నిందితులు రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
పరుగులోనే ఆగిన ప్రాణం
సూర్యాపేట: ఎస్ఐ కొలువుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడి కల నెరవేరకుండానే ఊపిరి ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (24) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి నిర్వహించే శారీరక, దేహ దారుఢ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం పరుగు సాధన చేస్తున్నాడు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం పరుగు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్కం దాబా హోటల్లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
డీజీపీ ఆఫీస్ ఎదుట ఎస్సై ,కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా
-
బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వడ్డెపు రమణ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం ఉన్నట్టు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు గురువారం ఉదయం 7.55 గంటలకు సమాచారం అందింది. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలోని సీ క్యాబిన్ వద్ద రెండు ముక్కలైన యువకుడి మృతదేహం ఉన్నట్టు రైల్వే ‘కీ’ మెన్ వెంకటేశ్వర్రావు ద్వారా సమాచారం అందింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన వడ్డెపు అప్పల స్వామి రెండోకుమారుడు రమణ 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ముగ్గురు మిత్రులతో కలిసి ఉంటూ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల తరువాత బయటకు వెళ్లి వస్తానని రూమ్‌మేట్స్‌కు చెప్పి వెళ్లాడు. అదే రోజు అర్థరాత్రి దాటిన తరువాత మౌలాలి ప్రాంతానికి చేరుకుని రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా రమణ మానసిక ఆందోళనలకు గురవుతున్నట్టు, ఇందుకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. నగరంలోనే నివాసం ఉంటున్న అక్క,బావతోపాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు సికింద్రాబాద్ చేరుకుని రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్క,బావతోపాటు పలువురు రమణ బ్యాచ్ ఎస్ఐలు గాంధీ ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్ఐ తల్లితండ్రులు శుక్రవారం ఉదయానికి నగరానికి చేరుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి పోలీసులపై దాడి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాలక్రైం: ఓ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలు విస్మరించి మద్యంమత్తులో వీరంగం సృష్టించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండలం వేంపల్లికి చెందిన ఆవుల తిరుపతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి మంచిర్యాలలో రోడ్డుపై కారు ఆపి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ హల్చల్ చేశారు. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన తిరుపతి మరింత రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ‘‘నేను బెజ్జంకి ఎస్ఐని. మీరు ఆఫ్ట్రాల్ కానిస్టేబుళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’అని బెదిరించారు. కానిస్టేబుళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారివద్ద ఉన్న ట్యాబ్‌ను, సెల్‌ఫోన్ ఎస్ఐ లాక్కుని నేలకేసి కొట్టారు. ఉస్మాన్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హోంగార్డును కొట్టారు. దీంతో మరింత మంది పోలీసులు రావడంతో తిరుపతి పారి పోయారు. బుధవారం తిరుపతితోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్, మెయిన్స్‌కు ఉచిత కోచింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్స్‌లో కోచింగ్ తీసుకున్న 1237 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్ తెలిపారు. వారికి ఫిజికల్, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చే నెల 2 నుంచి ఉచిత కోచింగ్ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 స్టడీ సర్కిళ్లుండగా.. హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 250 మందికి, మిగతా సర్కిళ్లల్లో 100 మందికి 90 రోజులపాటు కోచింగ్ ఇవ్వనున్నా రు. ప్రిలిమ్స్‌కు అర్హత సాధించి, స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోని అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. -
Telangana: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 554 ఎస్ఐ పోస్టుల భర్తీకి ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. -
Telangana Govt: ‘పోలీస్’ కటాఫ్ మార్క్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించనున్న పోలీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్క్‌గా 40 మార్కులను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 200 మార్కులకు బీసీలకు 50, ఓసీలకు 60 కటాఫ్ మార్కులుగా పేర్కొంటూ తాజాగా జీవో విడుదల చేసింది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80 (40%), బీసీలకు 70(35%), ఎస్సీ, ఎస్టీలకు 60 (30%)గా ఉండేది. అయితే ఎస్సై, కాని స్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి కటాఫ్ మార్కులు తగ్గిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30% మార్కులు సాధిస్తే వారు అర్హత సాధిస్తారని ప్రకటించింది. దీంతో జనరల్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు సైతం 30% మార్కులను కటాఫ్‌గా పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని హైకోర్టులో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం కొత్త కటాఫ్ మార్కులను ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిల్ల రమేశ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పిటిషనర్లకు ఆమోదయోగ్యంగా ఉండటంతో ధర్మాసనం వాదనలు ముగించింది. -
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కేసు నుంచి తప్పిస్తా.. కానీ ఖర్చవుతుంది: ఎస్ఐ మరో అవతారం!
యశవంతపుర(బెంగళూరు): కేసు నుంచి తప్పిస్తామంటూ భారీ మొత్తాల్లో లంచం తీసుకుంటూ బెంగళూరు ఉత్తర తాలూకాలోని చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్‌తో పాటు కానిస్టేబుల్ రవిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. రవిని లోకాయుక్త అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ తప్పించుకున్నారు. వివరాలు... ప్రకాశ్ అనే ఒక కాంట్రాక్టర్‌పై చిక్కజాల పోలీసుస్టేషన్లో కేసు ఉంది. కేసుపై కోర్టులో చార్జిషీట్ వేయడంపై మాట్లాడడానికి ప్రకాశ్ మామ దేవరాజును కానిస్టేబుల్ రవి కలిశాడు. ప్రకాశ్‌ను కేసు నుంచి తప్పించాలంటే రూ. 3.70 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎస్ఐ ప్రవీణ్‌కు 3.50 లక్షలు, ఇద్దరు స్టేషన్ రైటర్లకు తలా రూ. 10 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉందన్నాడు. సరేనని దేవరాజు సదరు మొత్తాన్ని రవికి ఇచ్చాడు. కానీ కేసులో ఎలాంటి పురోగతి కనపడలేదు. దేవరాజు వెళ్లి రవిని కలిసి ఇదే అడిగాడు. మరో రూ. 5 లక్షలకు డిమాండ్ ఇది చాలా పెద్ద కేసు, మరో రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. డబ్బులు ఇవ్వని కారణంగా ఎస్ఐ ప్రవీణ్ కాంట్రాక్టరు కుటుంబానికి తక్షణం విచారణకు రావాలని నోటీసులు పంపాడు. తీవ్ర ఆక్రోశానికి గురైన దేవరాజు లోకాయుక్తను ఆశ్రయించాడు. రవి, ప్రవీణ్‌లు కలిసి దేవరాజును లంచం డబ్బుతో చిక్కజాల పోలీసుస్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు తక్షణం రవిని అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ పరారయ్యాడు. ఫోన్లో ఏసీబీ అని వినబడడంతో రవి తప్పించుకోగలిగాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని.. -
కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్ మహబూబ్ సుభాని పని చేస్తున్నారు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదనపుకట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. గతనెల 9వ తేదీన ఆమెపై భర్త, అత్త దాడి చేశారు. ఈక్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. బాధితురాలు ఆ నెల 28న దిశా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబసభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్ ఎస్సై కె.లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..) -
సిరిసిల్ల టౌన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి మృతి
సాక్షి, సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని ఒబులాపూర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి 28 ఆగస్టు 1990న కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులతో ఎస్సై స్థాయికి ఎదిగారు. వేములవాడ ఆర్అండ్ఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో భార్య విజయతో ఉంటున్నారు. ఆయన రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పని చేశారు. 2019లో ఎస్సైగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. 8 నెలల క్రితం బదిలీపై డీపీవో కార్యాలయానికి వచ్చారు. ఉపేందర్‌రెడ్డి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల అవి ఎక్కువవడంతో పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు జరిపించారు. ఎస్సై మృతికి ఎస్పీ రాహుల్‌హెగ్డే సంతాపం ప్రకటించారు. -
ఎస్ఐ, ఏఎస్ఐలను లాకప్‌లో బంధించిన ఎస్పీ.. వీడియో వైరల్
పాట్నా: సబ్ ఆర్డినేట్ల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు చిర్రెత్తిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. बिहार पुलिस का हाल नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb — UnSeen India (@USIndia_) September 10, 2022 అయితే ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై శనివారం న్యాయ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ! -
ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..
సాక్షి, చెన్నై: చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై సబ్ ఇన్స్పెక్టర్ కన్నుపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలి ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. సుమారు ఏడేళ్లుగా బాలికకు ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు అయింది. ఆమెకు మరొకరితో వివాహమైంది. కానీ తన తల్లి ఇంటికి వస్తున్న సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. అతని వేధింపులను సహించలేక ప్రియురాలు, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికను 13 ఏళ్ల నుంచి బెదిరింపులు లైంగికంగా వేధించినట్లు, ప్రస్తుతం వేరొకరితో వివాహం అయినప్పటికీ లైంగిక వేధింపులకు పాల్పతుండడంతో సబ్ ఇన్స్పెక్టర్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్‌లోడ్ చేస్తూ.. -
ఎస్ఐ పాడుబుద్ధి.. మహిళా హోంగార్డుతో పరిచయం పెంచుకుని..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) ఎస్ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి సెబ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కొమ్మా కిరణ్‌కుమార్.. బందరు సబ్‌జైలులో పని చేస్తున్న మహిళ హోంగార్డుతో పరిచయం పెంచుకున్నాడు. నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ ఆమె వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇటీవల ఇంటి అవసరాల నిమిత్తం కిరణ్‌ను ఆమె డబ్బులడిగింది. ‘డబ్బులివ్వను.. ఏమి చేసుకుంటావో చేసుకో’ అంటూ అతను బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు సోమవారం ‘స్పందన’లో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ఎస్ఐ కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ‘దిశ’ పోలీసులను ఆదేశించారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ కేసు నమోదు చేసి 24 గంటల్లో కిరణ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రాజీవ్ చెప్పారు. -
డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో.. సబ్ ఇన్స్పెక్టర్ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్–కేంద్ర సాయుధ పోలీస్ దళాలు) లో.. సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ తాజా నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్ఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్లో మొత్తం 4,300 ఎస్ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ►విద్యార్హత: ఆగస్ట్ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ►వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400 శారీరక ప్రమాణాలు ►ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ సబ్–ఇన్స్పెక్టర్ పోస్ట్‌ల భర్తీకి ఎస్ఎస్సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. పేపర్–1 ఇలా తొలి దశగా నిర్వహించే పేపర్–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రెండో దశ ఫిజికల్ ఎండ్యూరెన్స్ పేపర్–1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారితో మెరిట్ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్ జంప్, హై జంప్; షాట్‌పుట్. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్ జంప్ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్ చేయాలి. 16 ఎల్బీస్ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్ జంప్, 0.9 మీటర్ల హై జంప్ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్ పుట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 200 మార్కులకు పేపర్–2 ►ఫిజికల్ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్–2 ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ►పేపర్–1, పేపర్–2 రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ నిబంధన విధించారు. ►ఆన్లైన్ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. పరీక్షలో విజయానికి పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేపర్–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్–స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేరుతో నిర్వహించే పేపర్–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రెసిస్ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి. కమాండెంట్ స్థాయికి సబ్–ఇన్స్పెక్టర్గా కొలువు దీరిన వారు సర్వీస్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 30,2022 ►ఆన్లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్ 1 ►ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్‌లో ►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in -
ఎస్ఐ పరీక్షకు 91.32% హాజరు
సాక్షి, హైదరాబాద్/కోదాడ అర్బన్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్), ఇతర విభాగాల్లోని ఎస్ఐ సమాన పోస్టుల ప్రాథమిక రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన 503 పరీక్ష కేంద్రాల్లో 91.32% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది హాజరైనట్లు స్పష్టం చేశారు. ప్రతీ అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ విధానంలో వేలిము ద్రలతో పాటు డిజిటల్ ఫొటో ద్వారా రికార్డు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతా మని వెల్లడించారు. కాగా, సంగారెడ్డితో పాటు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. గూగుల్ తప్పుగా చూపించింది.. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యానని, అందులో కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాల కొమరబండ వద్ద చూపించిందని పాలకవీడు మండలం కోమటికుంటకు చెందిన కృష్ణ జయదేవ్ చెప్పాడు. అక్కడికి వెళ్లి మళ్లీ పట్టణంలోకి వచ్చే సరికి 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందన్నాడు. గూగుల్‌లో పాఠశాల అడ్రస్‌ను అప్డేట్ చేయకపోవడంతో ఇలా జరిగిందన్నాడు. -
ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
-
‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచి్చనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలో 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా హాజరవుతుండగా..వీరిలో దాదాపు 50 వేల మంది నగరంలోనే రాయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను జేఎనీ్టయూలోని స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించడం..వంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్ ఎం.రమేష్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ చేస్తున్న కీలక సూచనలివి.. ►ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ►ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ►సెల్ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్ ధరించాలి. ►అభ్యర్థులు తమ వెంట హాల్‌టిక్కెట్, పెన్ మాత్రమే తెచ్చుకోవాలి. ►అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్ చాట్లు వెలుగులోకి -
‘ఊపిరి’ పోసిన ఎస్ఐ
గుడిహత్నూర్ (బోథ్): రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి నోటిద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలందుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫారూఖ్ బుధవారం ఆదిలాబాద్ నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాడు. తోషం గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఫారూఖ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్న ఎస్ఐ సునీల్ గమనించి తన వాహనాన్ని ఆపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఫారూఖ్‌కు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనంతరం క్షతగాత్రుడిని తన వాహనంలో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఫారూఖ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఎస్ఐ సునీల్ చేసిన ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు ప్రశంసించారు. -
మనసున్న పోలీసు.. సెలవుల్లో టీచర్.. పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు
లక్నో: పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు డ్యూటీ. క్షణం తీరిక లేని పని. ఎప్పుడైనా సెలవు దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ, ఓ పోలీసు అధికారి తన బాధ్యతలను నిర్వరిస్తూనే.. సెలవు రోజుల్లో టీచర్ అవతారమెత్తి పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ తానే అందిస్తున్నారు. ఆయనే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఎస్సై రంజిత్ యాదవ్. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు ఎస్సై రంజిత్ యాదవ్. ఉన్నత చదువులు చదవుకోవాలనే కోరికను వారిలో కలిగిస్తున్నారు. ఆయన చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు.. తదుపరి తరగతులకు వెళ్తామని చెబుతున్నారు.' మేము ఇంకా చదువుకోవాలి. స్కూల్‌కు వెళ్లాలి. ఇక్కడ చదువుకోవడం వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక్కడికి రోజూ వస్తాము.' అని ఓ చిన్నారి పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో, ఓ చెట్టు నీడలో తరగతులు నిర్వహిస్తున్నారు. తాను నివాసముండే ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు చెంది వారు, పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపించగా వారికి చదువు చెప్పించి మార్పు తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు రంజిత్ యాదవ్ తెలిపారు. కొద్ది నెలల క్రితమే తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ‘నా సొంత పాఠశాలను ప్రారంభించాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఈ పిల్లలకు పాఠాలు బోధిస్తాను. వారి తల్లిదండ్రులు బిచ్చమెత్తుకుంటూ కనిపించటాన్ని చూసిన తర్వాత వారితో మాట్లాడాను. వారు పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు.’ అని తెలిపారు. ఆ పాఠశాలకు 50 మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వారికి అవసరమైన సామగ్రి, పుస్తకాలను పోలీసు అధికారే ఉచితంగా అందిస్తున్నారు. #Heartily #thanks 🙏✍️🙏@ANINewsUP @ayodhya_police @UpPolicemitra @igrangeayodhya @dubey_ips @navsekera @renukamishra67 @adgzonelucknow @dgpup @Uppolice शिक्षा है अनमोल रतन! https://t.co/lUphOUAjZn — Ranjeet Yadav 🇮🇳 (@RSupercop) July 21, 2022 ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
స్మగ్లింగ్ మాఫియా దారుణం.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించి హత్య
రాంచీ: హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. ‘పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశాం. ’అని సీనియర్ ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
అంబర్‌పేట ఎస్సైకి ‘మహానంది’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సాహితీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అంబర్‌పేట క్రైం విభాగం సబ్ ఇన్స్పెక్టర్ టి. రామచందర్ రాజుకు ‘మహానంది’ పురస్కారం వరించింది. ఇటీవల జాతీయ విశ్వకర్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ‘తెలుగు వెలుగు’ మహానంది జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో రామచందర్ రాజు పురస్కారం స్వీకరించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అవార్డును ప్రదానం చేశారు. తన విధి నిర్వహణతో ఎస్సై రాజు ‘తెలంగాణ సాహితీ రత్న’ వంటి బిరుదుతో పాటు ఇప్పటివరకు 200కు పైగా అవార్డులు అందుకున్నారు. -
ఎస్ఐ వేధింపులు.. కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లైవ్‌లో..
సాక్షి బెంగళూరు: ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లైవ్‌లో తెలిపిన విజయపుర వాసి సోమనాథ్ నాగమోతి(25) కోల్హార వద్ద కృష్ణా నదిలో శవమై తేలాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఏపీఎంసీ పోలీసు స్టేషన్ ఎస్ఐ సోమేశ్ గెజ్జి సోదరుడు సచిన్ గెజ్జి కారులో రూ. లక్ష నగదు గల్లంతైంది. ఆ నగదును సోమనాథ దొంగతనం చేశాడనే అనుమానంతో ఎస్ఐ అతన్ని పోలీసు స్టేషన్‌కు పిలిపించాడు. డబ్బు తిరిగి వాపస్ ఇవ్వాలని హింసించాడు. ఆవేదనకు గురైన సోమనాథ్ నాగమోతి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్బుక్ లైవ్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ స్పందిస్తూ పోలీసు శాఖ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని తెలిపారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు తెలుస్తాయన్నారు. చదవండి: గుజరాత్లో 'ఆట' రష్యా నుంచి డబ్బుల 'మూట'.. బయటపడ్డ ఫేక్ ఐపీఎల్ బండారం -
హీటెక్కిన ఎస్ఐ కొలువుల స్కాం.. సీఐడీ అదుపులో హోంమంత్రి పీఎస్
బనశంకరి(బెంగళూరు): సంచలనాత్మక ఎస్ఐ ఉద్యోగాల కుంభకోణం మరింత వేడెక్కింది. మొన్న అదనపు డీజీపీ అమృత్‌పాల్ అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా హోంమంత్రి పీఎస్ సీఐడీకి చిక్కాడు. ఈ స్కాంకు సంబంధించి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యక్తిగత కార్యదర్శి గణపతి భట్‌ను మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులతో అతడు కుమ్మక్కయ్యాడని ఆరోపణలు ఉండగా, సీఐడీ రంగంలోకి దిగింది. ఆరోపణలకు పలు సాక్ష్యాధారాలు లభించడంతో గణపతిభట్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు, బొమ్మై సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసి ప్రాంతానికి చెందిన గణపతిభట్ ఆర్ఎస్ఎస్లో గుర్తింపు పొందాడు. చదవండి: పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు -
యువతిపై లైంగిక వేధింపులు రెబ్బెన ఎస్సైపై వేటు
ఆసిఫాబాద్/రెబ్బెన: యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సీఐ, మరో ఎస్సై మహిళలపై లైంగికదాడుల ఘటనలు మరువక ముందే కుమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సైపైనా ఆరోపణలొచ్చాయి. బాధితురాలి కథనం ప్రకారం రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. పరీక్షకు సిద్ధమవుతోంది. స్టడీ మెటీరియల్ ఇప్పిస్తానని, పరీక్ష లేకుండానే పాస్ చేయిస్తానని రెబ్బెన ఎస్సై భవానీసేన్ నెల క్రితం యువతికి ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. ఎత్తు కొలుస్తానంటూ స్టేషన్లోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. పలుమార్లు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం సోమవారం బయటకు పొక్కింది. యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సైపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఆపై ఎస్సైని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. కాగా, యువతి డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... స్టేషన్ల చుట్టూ తిరగడం ఇబ్బందవుతుందని ఇంట్లోవారు చెప్పడంతో కేసు విత్‌డ్రా చేసుకుంటున్నానని తెలిపింది. మరోవైపు ఎస్సై వ్యవహారం టీవీ చానళ్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవడంతో అవమానంగా భావించిన ఎస్సై భార్య మంగళవారం రెబ్బెనలోని ఎస్సై క్వార్టర్లో శానిటైజర్ తాగి, ఆత్మహత్యకు యత్నించింది. ఇరుగుపొరుగు వారు ఆమెను రెబ్బెన పీహెచ్‌సీకి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. -
ఎస్సై నిర్వాకం.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం.. మరొక మహిళతో
మిర్యాలగూడ అర్బన్: కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండాకు చెందిన ధీరావత్ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. తన దూరపు బంధువైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్ విజయ్‌తో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. విజయ్ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఆమెతో సహజీవనం చేశారు. మేనమామ కూతురుతో వివాహం ఝాన్సీతో సహజీవనం చేస్తూనే ఆరేళ్ల క్రితం విజయ్ తన మేనమామ కూతురును వివాహం చేసుకోగా..వీరికి సంతానం కూడా కలిగింది. ఈ విషయం ఝాన్సీకి తెలిసి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు వెతుకుతుండగా.. మరో వివాహం చేసుకోవద్దని విజయ్ బెదిరిస్తూ ఉండేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సదరు మహిళ ఎల్బీనగర్ నుంచి వచ్చి చైతన్యనగర్‌లో నివాసం ఉంటోంది. అయినా విజయ్ బెదిరిస్తుండటంతో తనను మోసగించడమే కాకుండా వివాహం చేసుకోవద్దని, పెళ్లి సంబంధాలు చెడగొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈనెల 8వ తేదీ రాత్రి మిర్యాలగూడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయ్‌పై అత్యాచారం, చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ను సస్పెండ్ చేయడంతో పాటు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సదరు ఎస్ఐని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. -
ఆయనకు ఆ స్కాంలో రూ.కోట్ల వాటా!
శివాజీనగర: పోలీస్ నియామక విభాగపు చీఫ్‌గా ఏడీజీపీ అమృత్ పాల్ నియమితులయ్యాక ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలని ఆయన కుట్ర పన్నారని సీఐడీ విచారణలో తేలింది. ఈ స్కాంలో అమృత్‌పాల్‌ను మూడురోజుల కిందట అరెస్టు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు, అభ్యర్థుల నుంచి వసూలు చేసిన సొమ్ములో అమృత్ పాల్‌కు కోట్లాది రూపాయల వాటా అందినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీఎంకు సిద్దు సవాల్ కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాల అక్రమాలను విడుదల చేస్తానని సీఎం బసవరాజ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పందిస్తూ ఆధారాలుంటే విచారణ జరపాలని సవాల్ చేశారు. బుధవారం బెంగళూరులో మాట్లాడుతూ సీఎం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సమయంలో బొమ్మై ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అక్రమాలు జరిగాయని తెలిసినపుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. -
ఎస్ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7న
సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ విభాగం తదితర సమానహోదా పోస్టులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్ సివిల్, తదితర సమాన పోస్టులు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 554 సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులతోపాటు 15,644 సివిల్ తదితర సమాన కానిస్టేబుల్ పోస్టులు, 63 ట్రాన్స్‌పోర్టు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మొదటిదశలో భాగంగా రాతపరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 20 పట్టణాల్లో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 21న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ, 6.5 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవుతారని శ్రీనివాసరావు వెల్లడించారు. సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
రక్షకుడే భక్షకుడై దారుణకాండ
బనశంకరి: నగరంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ టీఆర్ శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు ఆరోపణలతో నమోదైన కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆ ఎస్ఐ భార్య ముబషిరా హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ఏకసభ్యపీఠం ప్రతివాదులైన డీజీపీ, నగర పోలీస్‌కమిషనర్, సీబీఐ, జేసీ నగర పోలీస్‌స్టేషన్ సీఐకి, అలాగే ఎస్ఐ టీఆర్ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేసింది. రాజీకి రావాలని బెదిరించారు జూన్ 1వ తేదీనే తన భర్త దాష్టీకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ జేసీ నగర సీఐ దర్యాప్తు చేపట్టలేదని, పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారని, అప్పటికీ లొంగలేదని డబ్బు ఆశచూపించి రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమైంది. 5వ తేదీన డీసీపీ జోక్యం చేసుకోవడంతో శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదేరోజు జేసీ నగర సీఐ, ఎస్ఐ శ్రీనివాస్ కలిపి ఫిర్యాదుదారులపై బ్లాక్మెయిల్ అని ఎదురు కేసు పెట్టారు. ఏమిటీ కేసంటే.. కేసు ఏమిటంటే... టీఆర్ శ్రీనివాస్ వసంతనగర పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. 2005లో అల్లాబకాష్ అనే వ్యక్తితో ముబ షిరాకు పెళ్లయింది. భర్త వేధిస్తున్నాడని శివాజీనగర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. తరువాత ఇద్దరూ విడిపోగా, ముబషిరాకు ఎస్ఐ శ్రీనివాస్‌తో స్నేహం ఏర్పడింది. మంచి జీవితం కల్పిస్తానని ఆశ చూపి 2013లో తనను పెళ్లి చేసుకున్నాడని ముబషిరా పేర్కొంది. 2014 నుంచి 2022 వరకు టీఆర్ శ్రీనివాస్ తనపై పాల్పడిన దౌర్జన్యాలను ఫిర్యాదులో వివరించింది. మొదటి భర్త ద్వారా కలిగిన తన ఇద్దరు కుమార్తెలపై శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడేవాడని ఆరోపించింది. అంతేగాక తన సహోదరిపై కూడా లైంగికదాడికి ఒడిగట్టాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందని తెలిపింది. తాను గర్భవతిగా ఉండగా తీవ్రంగా కొట్టాడని, దీంతో గర్భస్రామైందని తెలిపింది. ఈ అరాచకాలపై ప్రశ్నించానని దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అమానుషంగా ప్రవర్తించేవాడని, నీలిచిత్రాలు చూడాలని ఒత్తిడి చేసేవాడన్నారు. అలాంటివి చూడొద్దని చెప్పగా, చేతులు కట్టేసి కొట్టాడని వాపోయింది. (చదవండి: మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య) -
100 మంది పోలీసులు.. రెండు గంటలు.. కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నామంటే..??
-
ఎస్ఐ వివాహేతర సంబంధం.. గుట్టురట్టు చేసిన భార్య
బెంగళూరు: ప్రజలకు న్యాయం చేయాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ ఆయన. కానీ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతుండడంతో భార్యకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలూకాలోని సూలిబెలె పీఎస్‌లో జరిగింది. ఎస్ఐ రమేష్ గుగ్రి ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మరో మహిళతో కూడా కలిసి జీవిస్తున్నట్లు భార్యకు ఇటీవల తెలిసింది. దీంతో భార్య న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి, ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..) -
కాబోయే భర్తనే అరెస్టు చేసిన లేడీ సింగంపై అవినీతి మరక
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో సబ్-ఇన్స్పెక్టర్ రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ పిర్యాదు చేశారని పోలీసుల తెలిపారు. ఆమె కాబోయే భర్త పోగాగ్ రభా తరుపున డబ్బులు వసూలు చేసేరనే ఆరోపణలు కూడా రావడంతో ఆమెను విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది జనవరిలో బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన ఆ ఆడియో టేప్ తీవ్ర దుమారానికి తెరలేపింది. పైగా ఆయన తన నియోజక వర్గ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రభా పై ఆరోపణలు గుప్పించారు. (చదవండి: చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..) -
ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు
బనశంకరి(బెంగళురు): రెండు నెలలుగా పరారీలో ఉన్న ఎస్ఐ కుంభకోణం నిందితులు శాంతి బాయి, బసయ్యనాయక్ దంపతులను సోమవారం సీఐడీ అధికారులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అరెస్ట్‌చేశారు. శాంతిబాయి ఎస్ఐ పరీక్ష రాసి ఎంపికైంది. ఆమె, భర్త మరో ప్రధాన నిందితుడు మంజునాథ మేళకుందికి డబ్బులు ఇచ్చి అక్రమాలకు పాల్పడడంతో సులభంగా ఉత్తీర్ణురాలైందని సమాచారం. కేసు వెలుగులోకి రాగానే శాంతిబాయి దంపతులు హైదరాబాద్ కు వెళ్లి తలదాచుకున్నారు. వీరి కోసం రెండునెలల నుంచి సీఐడీ పోలీసులు గాలింపు చేపట్టారు. మరో ఘటనలో.. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: విలాసవంతమైన జీవనం కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ సాదిక్ పట్టుబడిన దొంగ. మంగళూరుకు చెందిన నిందితుడు బెంగళూరు సిటీమార్కెట్‌లో ఉన్న ఒక హోటల్లో క్లీనింగ్ పనిచేసేవాడు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడు దొంగతనాల కేసుల్లో జైలు పాలై, విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడడం గమనార్హం. చదవండి: Crime: కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి... -
ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే!
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్/పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. దాన్ని ప్రభుత్వానికి లింక్ పెడుతూ టీడీపీ చేస్తున్న ‘పచ్చ’ రాజకీయం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ.. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చేస్తున్న కుయుక్తులు ప్రజలందరికీ వెగటు పుట్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ ముత్తవరపు గోపాలకృష్ణ మరణంపైన ఆ పార్టీ చేస్తున్న రాజకీయంపై ప్రజలు విస్తుపోతున్నారు. వాస్తవాలను మరుగున పరిచి.. కులం కార్డు తగిలించి రెచ్చగొట్టే చర్యలకు దిగడంపై పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. బాబు జమానాలో పోలీసులకు పదోన్నతులు, పోస్టింగ్‌ల్లో కులం కార్డు చూశారనే తీవ్ర విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో అనేక మంది పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ మరణాలపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎటువంటి రాజకీయ విమర్శలను చేయలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి 2019 వరకు (టీడీపీ ప్రభుత్వ హయాంలో) మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన డొంకరాయిలో గోపాలకృష్ణ విధులు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఆయనకు రాజోలు, కాకినాడ టౌన్, కాకినాడ ట్రాఫిక్, సర్పవరం ఎస్ఐగా ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇవేమీ గుర్తించకుండా టీడీపీ నేతలు అవాస్తవాలను వండివార్చడంపై పోలీసులు మండిపడుతున్నారు. చంద్రబాబు జమానాలో పోలీసుల అనుమానాస్పద మరణాలు.. ♦చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో 2017 సెప్టెంబర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. రివాల్వర్ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్ అయినట్టు అప్పట్లో ప్రకటించారు. ♦2017 సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబు రివాల్వర్ కాల్పులతో మరణించారు. ♦2017 జనవరి 2న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే47 గన్ మిస్‌ఫైర్ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నకు అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. ♦2016 జూన్ 16న పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి మరణించారని తొలుత భావించినప్పటికీ.. ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని ఉన్నతాధికారులు భావించారు. ♦విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అప్పట్లో అనుమానాలకు తావిచ్చింది. ♦ఢిల్లీలోని ఏపీ భవన్లో 2015 అక్టోబర్‌లో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు. పోలీస్ లాంఛనాలతో ఎస్ఐ గోపాలకృష్ణకు అంత్యక్రియలు ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహానికి శనివారం ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో పోలీస్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను నివాళులర్పించారు. పలువురు పోలీసులు గౌరవ వందనం చేశారు. శ్మశానవాటికలో పోలీస్ సిబ్బంది మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తి చేయించారు. తప్పుడు కథనాలపై చర్యలు తప్పవు గోపాలకృష్ణ మృతిపై కొన్ని టీవీ చానళ్లలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై చర్యలు తప్పవు. పోస్టింగ్‌ల విషయంలో గోపాలకృష్ణకు ఎటువంటి అన్యాయం జరగలేదు. ఆయన మృతికి ఉన్నతాధికారుల వేధింపులు, పోస్టింగ్ కారణం కాదు. సున్నిత మనస్తత్వం కారణంగా పోలీస్ శాఖలో ఇమడలేకపోవడం, తన చదువుకు తగ్గ వృత్తిలోకి వెళ్లలేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనైనట్టు సూసైడ్ నోట్లో గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు సైతం వెల్లడించారు. – పాలరాజు, డీఐజీ, ఏలూరు రేంజ్ ఎస్ఐ మృతిపై రాజకీయం ఆపండి ఎస్ఐ గోపాలకృష్ణ మృతిని రాజకీయం చేయడం ఆపాలి. కొందరి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. – జనకుల శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ పోలీసు అధికారుల సంఘం రివాల్వర్ మిస్‌ఫైర్ వల్లే జరిగిందనుకుంటున్నాం.. రివాల్వర్ మిస్‌ఫైర్ కావడం వల్లే మా సోదరుడు గోపాలకృష్ణ మరణించి ఉండొచ్చు. ఆయనకు ఎటువంటి ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు లేవు. కొన్ని టీవీ చానల్స్‌లో వస్తున్న వార్తలు నిజం కాదు. పోలీసుల దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకముంది. – సైదులు, మృతుడు ఎస్ఐ గోపాలకృష్ణ సోదరుడు -
సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?
కాకినాడ సిటీ/నవాబుపేట (పెనుగంచిప్రోలు): సర్పవరం ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటన జిల్లాలో శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. మృదుస్వభావిగా పోలీసు శాఖలో ముద్ర వేసుకున్న ఆయన తన సర్వీసు పిస్టల్‌తో కాల్చుకుని విషాదకర రీతిలో జీవితానికి ముగింపు పలకడం దారుణమని సహచర ఉద్యోగులు దిగ్భ్రమ చెందారు. గోపాలకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. ఎంసీఏ చదివి, కొన్నాళ్లు వీఆర్వోగా పని చేసి, తరువాత ఎస్సైగా ఎంపికైన ఈయన సున్నిత మనస్కుడని అన్నారు. తన స్వభావానికి పోలీస్ ఉద్యోగం సరికాదని, ఇది మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉండేవారని తెలిపారు. ఆ డిప్రెషన్లోనే ఉన్న ఎస్సైకి కొందరు అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేదంటూ ముభావంగానే ఉండేవారని భార్య కూడా చెప్పారని ఎస్పీ వివరించారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలపించిన బంధువులు ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భారతమ్మతో పాటు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలివచ్చారు. మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. గోపాలకృష్ణ 36 ఏళ్లకే తనువు చాలించడం దారుణమంటూ రోదించారు. ఆసుపత్రి వద్ద గోపాలకృష్ణ మృతదేహాన్ని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ వి.భీమారావు తదితరులు పరిశీలించి, దగ్గరుండి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. చదవండి: పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం కుమారుడి మృతితో రోదిస్తున్న తండ్రి శ్రీనివాసరావు నవాబుపేటలో విషాదం గోపాలకృష్ణ స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు, సరోజని దంపతుల రెండో కుమారుడు గోపాలకృష్ణ, మొదటి కుమారుడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణకు భార్య పావని, నాలుగేళ్ల కుమార్తె భవిష్య, రెండేళ్ల కుమారుడు శర్వాన్ ఉన్నారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ మొదటి నుంచీ చదువులో ముందుండేవారు. అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పారు. ఎస్సైగా ఉంటూనే ఉన్నత పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ అంత్యక్రియలు శనివారం చేయనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.