BCCI
-
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
ఇట్స్ బేబీ బాయ్: సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్(ఫొటోలు)
-
Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ
ఒమన్ వేదికగా జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం అభిషేక్ శర్మ, స్పిన్నర్ రాహుల్ చాహర్ భాగమయ్యారు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ)లకు చోటు దక్కింది. అండర్-19 వరల్డ్‌కప్-2022లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం లభించింది. ఇక ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది.కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.ఎమర్జింగ్ ఆసియా కప్‌నకు భారత్-ఏ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్. -
‘రంజీ’ సమరానికి వేళాయె!
న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి వేళైంది. నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో 32 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. టెస్టు సీజన్ కారణంగా భారత జట్టు ప్రధాన ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి అందుబాటులో లేకపోగా... వర్ధమాన ఆటగాళ్లు కూడా వివిధ సిరీస్‌ల వల్ల సీజన్లో అన్నీ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు కొత్తవాళ్లకు ఇదే సరైన అవకాశం. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... స్టార్ ప్లేయర్లు తప్ప మిగిలిన వాళ్లంతా వీలున్న సమయంలో ఈ టోర్నీలో పాల్గొననున్నారు. దేశవాళీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌పై బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో... యువ ఆటగాళ్లు అందరూ రంజీ ట్రోఫీ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తే చాలు జాతీయ జట్టుకు ఎంపికవొచ్చు అనే ఆలోచన ఆటగాళ్లకు రాకుండా... దేశవాళీల్లో రాణిస్తేనే టీమిండియా తలుపులు తెరుచుకుంటాయి అని బోర్డు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్లేయర్లు తమ శక్తియుక్తులను వాడేందుకు సిద్ధమయ్యారు. రంజీ సీజన్లోనే భారత జట్టు న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా గడప తొక్కొచ్చు అనే ఆలోచన కూడా ప్లేయర్ల మదిలో ఉంది. హైదరాబాద్ ఆకట్టుకునేనా? గత ఏడాది బలహీన జట్లున్న ప్లేట్ గ్రూప్‌లో అదరగొట్టి ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధించిన హైదరాబాద్ జట్టు పటిష్ట జట్లతో పోటీపడనుంది. టీమిండియా ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో నేడు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు నాగ్‌పూర్ వేదికగా విదర్భతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లోని ఎనిమిది జట్లు... తక్కిన జట్లతో ఆడనున్నాయి. లీగ్ దశ ముగిశాక నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఎనిమిది జట్లు నాకౌట్ దశ (క్వార్టర్ ఫైనల్స్)కు అర్హత పొందుతాయి. నేడు ప్రారంభం కానున్న లీగ్దశలో తొలి ఐదు లీగ్ మ్యాచ్‌లు నవంబర్ 16తో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు నెలల విరామం తర్వాత చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌ను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరిగే ఫైనల్‌తో రంజీ ట్రోఫీ సీజన్‌కు తెర పడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు మరోసారి భారీ బలగంతో బరిలోకి దిగుతోంది. దేశవాళీ దిగ్గజంగా గుర్తింపు సాధించిన ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా కీలకం కానున్నారు. ఖాన్ బ్రదర్స్‌లో... ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా... సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టుకు ఎంపివడం ఖాయమే. ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత ‘ఎ’ జట్టు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు కూడా పలు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో నయా హీరోలు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు దూరమైన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాతో పాటు... అడపా దడపా జట్టులోకి వచ్చి పోతున్న శ్రేయస్ అయ్యర్, గతంలో మెరుగైన ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయిన ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ వంటి వాళ్లు తిరిగి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక యశ్ ధుల్, సారాంశ్ జైన్, విద్వత్ కావేరప్ప, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి వాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు సమాయత్తమయ్యారు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ముంబై, బరోడా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్, సర్వీసెస్, మేఘాలయ, త్రిపుర. గ్రూప్ ‘బి’: ఆంధ్ర, హైదరాబాద్, గుజరాత్, విదర్భ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి. గ్రూప్ ‘సి’: బెంగాల్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్. గ్రూప్ ‘డి’: తమిళనాడు, ఢిల్లీ, సౌరాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, రైల్వేస్, అస్సాం. ప్రైజ్‌మనీ ఎంతంటే... విజేత: రూ. 5 కోట్లు రన్నరప్: రూ. 3 కోట్లు సెమీఫైనల్లో ఓడిన జట్లకు: రూ. 1 కోటి చొప్పునమ్యాచ్ ఫీజు ఎంతంటే (తుది జట్టులో ఉన్న వారికి) 40 లేదా అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 60 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 30 వేలు చొప్పున) 21 నుంచి 40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 50 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 25 వేలు చొప్పున) 1 నుంచి 20 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రూ. 40 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 20 వేలు చొప్పున). -
టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.వేదిక మార్చబోమన్న ఐసీసీ ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రం అనుమతినిస్తేనేఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్‌కైనా వెళ్లుందని.. పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.ఇస్లామాబాద్‌లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్‌ను కలిసి.. టీమిండియా పాక్ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందేఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్, భద్రతా అంశాల గురించి మొహ్సిన్ నక్వీ.. జైశంకర్‌కు వివరించనున్నట్లు క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా 2008 ఆసియా కప్ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు. ఎవరి మాట నెగ్గుతుందో?దీంతో రోహిత్ సేన ఆడిన మ్యాచ్‌లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం. కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ -
BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా NIA మాజీ హెడ్
BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.ఎన్ఐఏ హెడ్‌గా పనిచేసిన అనుభవంఉత్తరప్రదేశ్కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్‌కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్ఐఏ హెడ్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.కేకే మిశ్రా ఏడాది పాటేఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్‌ను ఏసీయూ చీఫ్‌ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్‌గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్‌కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది?
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించే తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశాడు. కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు.పాల్గొనే జట్లు ఇవేఈ ఐసీసీ టోర్నీకి వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, ఆతిథ్య పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో ఈ ఈవెంట్ జరుగనుండటంతో రోహిత్ సేన అక్కడికి వెళ్లకుండా.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోందని.. టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించినట్లు తెలిసింది.భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతేఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ వేదికను పాకిస్తాన్ నుంచి తరలించే యోచన లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ పేర్కొనడం ఇందుకు బలాన్నిచ్చింది. అయితే, బీసీసీఐ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం గురించి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం మేము వివిధ దేశాలకు ప్రయాణిస్తాం. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది. మా జట్టు ఒక దేశానికి వెళ్లాలా లేదా అనేది భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా ముంబై దాడుల తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఇంతవరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో ముఖాముఖి తలపడలేదు. చివరగా 2008లో భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే, గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇక్కడకు వచ్చింది.చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆరుగురిని రిటైన్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ఖారారు అయ్యాయి. 28(శనివారం) బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. ఆర్టీఎం కార్డును ఈ సీజన్‌తో తిరిగి తెవాలని నిర్ణయించుకున్నారు. కాగా కొత్త రూల్స్ ప్రకారం.. అంటిపెట్టుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఇద్దరైనా పర్వాలేదు.రిటెన్షన్ ఆటగాళ్లకు ఎంతంటే?అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి.అదేవిధంగా నాలుగు, ఐదో ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవడానికి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లపై 75 కోట్లు వెచ్చించినట్లు అవుతోంది. అంటే ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉంటాయి. ఆ మొత్తాన్ని మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవచ్చు. ఆటగాళ్లపై కాసుల వర్షంఇకపై ఐపీఎల్లో ఆడే క్రికెటర్లపై కాసుల వర్షం కురవనుంది. ఐపీఎల్-2025 నుంచి క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును రూ.7.50 లక్షలు అందజేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ. 3 నుంచి కోట్లు 4 కోట్లు ఉండేది. అదేవిధంగా గతేడాది తీసుకువచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కూడా 2027 సీజన్ వరకు కొనసాగనుంది. -
IND Vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్.. మూడేళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
బంగ్లాదేశ్‌తో టీ20తో సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్ధానం లభించగా.. స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్‌కు తొలి సారి జాతీయ జట్టులో చోటు దక్కింది. బంగ్లాతో టీ20 సిరీస్‌కు స్టార్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్‌లు దూరమయ్యారు. వర్క్ లోడ్ కారణంగా వీరిముగ్గురికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఛాన్స్ కొట్టేశాడు.మిస్టరీ స్పిన్నర్ రీఎంట్రీఇక ఈ సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు పిలుపు నిచ్చారు. అతడికి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటుదక్కింది. చక్రవర్తి చివరగా టీమిండియా తరపున 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్లు అతడికి మళ్లీ పిలునివ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే అతడి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేయడంలో హెడ్‌కోచ్ గంభీర్‌ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గంభీర్‌ను.. చక్రవర్తి తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లకు గౌతీ అతడిని ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చక్రవర్తి టీమిండియా తరపున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటకి.. దేశీవాళీ క్రికెట్లో మాత్రం వరుణ్‌కు మంచి రికార్డు ఉంది. 87 టీ20లు ఆడి 98 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.బంగ్లాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్ -
IPL: క్రికెటర్లకు బీసీసీఐ బంపరాఫర్.. ఏకంగా రూ.7.50 లక్షలు?
ఐపీఎల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్-2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు."ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించున్నాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఓ క్రికెటర్ సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. ప్రతీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్‌కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని ఎక్స్‌లో జైషా రాసుకొచ్చారు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది. In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…— Jay Shah (@JayShah) September 28, 2024 -
ఐపీఎల్-2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని బీసీసీఐ దాదాపుగా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలకు ఓ గుడ్‌న్యూస్ చెప్పే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ మాత్రమే ఐపీఎల్ జట్లకు ఉంటుంది. ఎప్పటి నుంచో రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచమని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ ఏడాది జూలై 31న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ మరోసారి ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి.అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్‌కు భారత క్రికెట్ బోర్డు ఒకే చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య ఐదు పెంచితే ఆయా ఫ్రాంచైజీలకు ప్రయోజనం చేకూరనుంది. ఐపీఎల్-2025 రిటెన్షన్ రూల్స్‌ను గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా గురువారం(సెప్టెంబర్ 26) ప్రకటించే అవకాశం ఉంది.చదవండి: BAN vs IND: టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్ న్యూస్ -
బంగ్లా రెండో టెస్ట్ లో మార్పు ఆ స్టార్ ప్లేయర్ ని తీసుకుంటున్న రోహిత్
-
బంగ్లాతో రెండో టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో బంగ్లాను భారత జట్టు చిత్తు చేసింది. పాక్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లా టైగర్స్‌కు రోహిత్ సేన చుక్కలు చూపించింది. 515 పరుగుల భారీ లక్ష్య చేధనలో బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని 234 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. అశ్విన్ 6 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. .జడేజా 3 వికెట్లతో అదరగొట్టాడు. ఆటు బ్యాటింగ్‌లోనూ అశూ సెంచరీతో మెరిశాడు. అశ్విన్‌తో పాటు గిల్, జడేజా, పంత్, జైశ్వాల్ బ్యాటింగ్‌లో సత్తాచాటారు.బీసీసీఐ కీలక ప్రకటనఇక తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాతో రెండో టెస్టుపై కన్నేసింది. బంగ్లాను మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు జరగనుంది.ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. బంగ్లాతో రెండో టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టునే రెండో టెస్టుకు కొనసాగించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా తొలుత కేవలం మొదటి టెస్టుకే జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దీంతో రెండు టెస్టుకు భారత జట్టులో మార్పులు ఉండవచ్చు అని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి మార్పులకు మొగ్గు చూపలేదు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
‘మసాలా’ వార్తలకు ముగింపునిస్తున్నాం: కోహ్లి, గంభీర్
చెన్నై: మైదానంలో దూకుడైన స్వభావానికి వారిద్దరు చిరునామా... ఆటతోనే కాకుండా ప్రత్యర్థులపై మాటలతో దూసుకుపోయేందుకు ఎవరూ వెనుకాడరు... భారత ఆటగాళ్లుగా ఇతర జట్లతో తలపడిన సందర్భాలే కాదు... ఒకరికొకరు కూడా ఆవేశంతో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో అలాంటివి అభిమానులు చూశారు.అలాంటివారు ఒకరు ప్లేయర్‌గా, మరొకరు అదే జట్టుకు కోచ్‌గా కలిసి భారత జట్టును నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ‘ఢిల్లీ బాయ్స్’ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ల మధ్య ఆసక్తకర సంభాషణ జరిగింది. తామిద్దరి మధ్య ఏదో వైరం ఉందంటూ మసాలా వార్తలు రాసుకునే వారికి ఈ సంభాషణ తర్వాత అలాంటి అవకాశం ఉండదని వారు ఈ ‘బీసీసీఐ’ వెబ్సైట్ రూపొందించిన వీడియోలో చెప్పేశారు. » మైదానంలో బ్యాటింగ్ సమయంలో దూషణలకు దిగితే అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపి అవుటవుతారా లేక మరింత దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించవచ్చా అని గంభీర్‌ను కోహ్లి అడిగాడు. దీనిపై గంభీర్ ‘ఇలాంటి తరహా అనుభవాలు నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వే బాగా చెప్పగలవు’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ‘ఇది తప్పు కాదు. ఇలా చేయవచ్చు అని నాకు మద్దతిస్తావని ఆశించా’ అంటూ కోహ్లి బదులిచ్చాడు. తన విషయంలో ఆ తరహా దూకుడు బాగా పని చేసిందని గంభీర్ అన్నాడు. » మెదానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాల్లో దైవభక్తి బాగా పని చేసిందని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. తాను న్యూజిలాండ్‌పై నేపియర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సమయంలో ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేసినట్లు గంభీర్ చెప్పగా... అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పుడు ‘ఓం నమఃశివాయ’ అంటూ వచ్చానని కోహ్లి వెల్లడించాడు. » 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన క్షణాల వీడియో చూస్తుండటంతో వీరి సంభాషణ మొదలైంది. ఢిల్లీ గ్రౌండ్లో గంభీర్‌ను చూసి తాను ఎలా కెరీర్లో ఎదగాలో స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కోహ్లి చెప్పగా... కెరీర్ ఆరంభంలో కోహ్లి ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఈ చర్చ భారత టెస్టు క్రికెట్ వైపు మళ్లింది. ఒక ఆటగాడి గొప్పతనాన్ని గుర్చించేందుకు టెస్టు క్రికెట్ మాత్రమే అసలైన వేదిక అని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌లో చాలా కాలంగా బలంగా ఉందని... అయితే బౌలింగ్‌ను శక్తివంతంగా మార్చి బౌలర్ల ద్వారా మ్యాచ్‌లను గెలిపించిన ఘనత కెపె్టన్‌గా కోహ్లిదేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరంలో టెస్టులను ఇష్టపడేలా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని వీరిద్దరు అభిప్రాయపడ్డారు. » లక్ష్య ఛేదన అంటేనే తనకు ఇష్టమని, తాను చేయాల్సిన పనిపై స్పష్టత ఉంటుందని కోహ్లి అన్నాడు. ఒక ఆటగాడు సొంత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా టీమ్ కోసం ఏం కావాలో ఆలోచిస్తేనే ఛేదన సులువై జట్టుకు విజయాలు లభిస్తాయని గంభీర్ విశ్లేషించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ గురించి ఆలోచించనే లేదని, అవుటైనప్పుడు కూడా ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వడం పట్ల బాధపడ్డానని గంభీర్ వివరించాడు. » తర్వాతి అతిథి రోహిత్ శర్మ అయితే ఏం ప్రశ్న వేయాలని గంభీర్ అడగ్గా... ఉదయమే నానబెట్టిన బాదం పలుకులు తిన్నావా లేదా అని అడగాలని (అతని మతిమరపును గుర్తు చేస్తూ)... ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు రమ్మంటే రాత్రి 11 గంటలకు వస్తాడని కోహ్లి చెప్పడంతో నవ్వులతో సంభాషణ ముగిసింది. -
నాకంటే నీకే బాగా తెలుసు: కోహ్లికి షాకిచ్చిన గంభీర్!
‘‘గౌతం గంభీర్‌కు.. విరాట్ కోహ్లికి అస్సలు పడదు. ఇక ముందు ముందు ఎలాంటి గొడవలు చూడాల్సి వస్తుందో!?.. కోహ్లికి చెక్ పెట్టేందుకు గౌతీ కచ్చితంగా ప్రయత్నాలు చేస్తాడు. కోహ్లి కూడా అందుకు గట్టిగానే బదులిస్తాడు’’... మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రకటించగానే ఇలాంటి వదంతులు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో గౌతీ- కోహ్లి గొడవపడ్డ ఘటనలు ఇందుకు కారణం. ఆటలో ఇవన్నీ సహజమని.. తాము వాటి గురించి ఎప్పుడో మర్చిపోయామని చెప్పినా రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే, ఇలాంటి ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో గంభీర్- కోహ్లి తమ అనుబంధాన్ని చాటేలా ఎన్నో సరదా విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి టీమిండియాకు ఆడిన జ్ఞాపకాలతో పాటు మైదానంలో గొడవపడ్డ సందర్భాలనూ గుర్తు చేసుకున్నారు. వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్లు కలిసి బ్యాటింగ్ దృశ్యాలతో మొదలైన వీడియో.. వారి మధ్య సంభాషణతో ముగిసింది.గౌతం గంభీర్: ఆస్ట్రేలియాలో నాటి సిరీస్(2014-15)లో నువ్వు పరుగులు రాబడుతూనే ఉన్నావు. అంతేకాదు.. ప్రతి డెలివరీకి ముందు ఓం నమఃశివాయ అని స్మరించుకుంటున్నావని నాతో చెప్పావు. ఆరోజు నువ్వలా బ్యాట్‌తో చెలరేగడానికి కారణం అదేనేమో!నాకు కూడా నేపియర్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నేను రెండున్నర రోజుల పాటు బ్యాటింగ్ చేశాను. అప్పుడంతా హనుమాన్ చాలిసా వింటూనే ఉన్నా..విరాట్ కోహ్లి: మీరు చెప్పండి.. బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లతో అప్పుడప్పుడూ మాట్లాడేవారు. దాని వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినేదా? మీరు అవుటయ్యే వారా? లేదంటే.. ఎదుటి వారి కవ్వింపు చర్యల వల్ల మీరు మరింత స్ఫూర్తి పొందేవారా?గౌతం గంభీర్: నాకంటే నువ్వే ఎక్కువసార్లు గొడవలు పెట్టుకున్నావు కదా!.. ఈ ప్రశ్నకు నా కంటే నువ్వే సరైన సమాధానం చెప్పగలవు.విరాట్ కోహ్లి(నవ్వుతూ): నేను చెప్పే విషయాలతో ఏకీభవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా. అలా చేయడం(ప్రత్యర్థి రెచ్చగొడితే స్పందించడం) తప్పేమీ కాదు. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే అని చెప్పేవారు కనీసం ఒక్కరైనా ఉండాలి(గంభీర్‌ను ఉద్దేశించి).స్లెడ్జింగ్ కారణంగా లాభమే చేకూరిందికొన్నిసార్లు నేనైతే కావాలనే గొడవలకు దిగేవాడిని. ఆటను రసవత్తరంగా మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి. అయితే, నన్ను మార్చే అవకాశం ఎవరికీ ఇవ్వను. నిజానికి స్లెడ్జింగ్ కారణంగా నాకు నష్టం కంటే లాభమే ఎక్కువ వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు స్కోరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.మసాలాకు చెక్ ఇక ఆఖర్లో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. మేము చాలా దూరమే వచ్చాము. మసాలాకు చెక్ పెట్టామనే అనుకుంటున్నాము’’ అని పేర్కొనడం విశేషం. కాగా శ్రీలంకలో వన్డే సిరీస్ సందర్భంగా గంభీర్ మార్గదర్శనంలో తొలిసారి బరిలో దిగిన కోహ్లి.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో పాల్గొనున్నాడు. గంభీర్‌కు హెడ్‌కోచ్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం విశేషం.చదవండి: పాక్‌లో ఐసీసీ బృందం పర్యటన.. టీమిండియా మ్యాచ్‌లు అక్కడేనా?A Very Special Interview 🙌Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat. You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy— BCCI (@BCCI) September 18, 2024 -
‘ఐదు రోజులకు తీసుకెళ్లాలి’
చెన్నై: భారత్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై ఆదివారం అడుగు పెట్టింది. ఢాకా నుంచి ఆటగాళ్ల బృందం తొలి టెస్టు వేదిక అయిన చెన్నైకి నేరుగా చేరుకుంది. తమ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. టీమ్ బస చేస్తున్న హోటల్లో బోర్డు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి బంగ్లాదేశ్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. 19 నుంచి ఇరు జట్ల మధ్య ఎంఎ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మినహా బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా వచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న షకీబ్ టెస్టు సమయానికి నేరుగా చెన్నైకి చేరుకుంటాడు. భారత్‌కు బయల్దేరడానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్నజు్మల్ హసన్ షంటో మీడియాతో మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలం. టెస్టు మ్యాచ్‌లలో కుప్పకూలిపోకుండా ఆటను ఐదు రోజుల వరకు తీసుకెళ్లడం మా తొలి లక్ష్యం. భారత్‌తో సిరీస్ మాకు సవాల్. అందరిలాగే మేమూ అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కోరుకుంటాం. మా బలానికి తగినట్లుగా ఆడటం ముఖ్యం. మా అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వాలి’ అని నజ్ముల్ చెప్పాడు. -
అంతా అనుకున్నట్టే.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు. ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. చివరికి టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు నిరాశే ఎదురైంది.చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే? -
పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గురించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ మెగా ఈవెంట్ వేదికను మార్చే ఆలోచన తమకు లేదన్న అతడు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తుందని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న విషయం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.ఆతిథ్య హక్కులు పాకిస్తాన్వేకాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆసియా వన్డే కప్-2023లో భారత జట్టు మ్యాచ్‌లను పాక్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించినట్లు.. ఈసారి కూడా హైబ్రిడ్ విధానంలో టోర్నీని నిర్వహిస్తారని వార్తలు వచ్చాయ.టీమిండియా అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు!అయితే, పీసీబీ వర్గాలు మాత్రం తమ దేశం నుంచి ఐసీసీ వేదికను తరలించబోదని.. టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించాలనే నిశ్చయానికి వచ్చినట్లు తెలిపాయి. ఇందుకు స్పందనగా.. బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాత్రం టీమిండియా పాక్‌కు వెళ్లబోదనే సంకేతాలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ కొత్త చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా నియమితుడు కావడంతో.. పీసీబీకి వ్యతిరేక పవనాలు వీస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి.వేదికను మార్చే ఆలోచన లేదుకానీ.. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన అలార్డిస్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశాం. ఇప్పటివరకైతే వేదికను మార్చే అంశం మా ప్రణాళికల్లో లేదు. ఈ క్రమంలో ఎదురుకాబోయే కొన్ని సవాళ్లకు సరైన పరిష్కారాలు కనుగొనాలనే యోచనలో ఉన్నాం.అయితే, ముందుగా అనుకున్నట్లుగానే పాక్‌లో ఈ టోర్నీ నిర్వహించాలన్న అంశానికి కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లు పాక్‌లో సిరీస్ ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.కాదంటే వాళ్లకే నష్టంఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఐసీసీ గనుక ఈ నిర్ణయం మార్చుకోకపోతే.. టీమిండియా పాక్‌కు వెళ్లాలి లేదంటే టోర్నీ నుంచి వైదొలగడం తప్ప వేరే ఆప్షన్లు లేవంటున్నారు విశ్లేషకులు.ఒకవేళ రోహిత్ సేన ఈ ఈవెంట్ ఆడకపోతే ఐసీసీతో పాటు పీసీబీ ఆర్థికంగా భారీగానే నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ మరి!! అయితే, భారత ప్రభుత్వ నిర్ణయం ఆధారంగానే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్నది తేలుతుంది.చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే! -
వదలని వరుణుడు.. కివీస్-అఫ్గాన్ నాలుగో రోజు ఆట రద్దు
గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు అయ్యే దిశగా సాగుతోంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట సైతం రద్దు అయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షాహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అంతేకాకుండా ప్రస్తుతం నోయిడాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పిఉంచారు. ఈ క్రమంలోనే గురువారం జరగాల్సిన నాలుగో రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. అయితే ఆఖరి రోజైన శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో టెస్టు మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకు పోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రముఖ ప్రెజెంటర్ ఆండ్రూ లియోనార్డ్ మాట్లాడుతూ.. రేపు కూడా వాతావారణం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా రెండు జట్లకు నిరాశ కలిగించే వార్త.న్యూజిలాండ్ తమ ఆసియా పర్యటనను ప్రారంభించేందుకు భారత్‌కు వచ్చింది. ఈ టూర్లో అఫ్గాన్‌తో పాటు భారత్,శ్రీలంకతో టెస్టు సిరీస్‌లు కివీస్ ఆడనుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ టెస్టు క్రికెట్ చాలా అరుదుగా ఆడుతుంది. కివీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ప్రకృతి మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది. మళ్లీ రేపు కలుద్దాం అని పేర్కొన్నారు.నిరాశలో అఫ్గాన్-కివీ ఫ్యాన్స్.. కాగా వాస్తవానికి ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ సోమవారం(సెప్టెంబర్ 9) ప్రారంభం అవ్వాలి. కానీ మ్యాచ్ కంటే ముందు కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు.దీంతో మైదానం రెడీ చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించారు. అయితే సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది కష్టపడ్డారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు.కానీ ఔట్ ఫీల్డ్ మాత్రం చిత్తడి ఉండటంతో ఆటగాళ్లు భద్రత దృష్ట్యా అంపైర్లు రెండు రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కూడా మైదానం కూడా సిద్దం కాలేదు. దీంతో మూడో రోజు కూడా టాస్ పడకుండానే రద్దు అయింది. అయితే ఎలాగైనా మైదాన్ని సిద్ద నాలుగు రోజు(గురువారం) 98 ఓవర్లు పాటు ఆటను నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ మళ్లీ నోయిడాలో వర్షం రావడం, మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో నాలుగో రోజు ఆటను కూడా రద్దు చేశారు. అయితే నోయిడా స్టేడియం పరిస్థితులపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆంసతృప్తి వ్యక్తం చేశారు. తాము ఇంకెప్పుడూ నోయిడాకు రామంటూ అఫ్గాన్ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు.చదవండి: ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు -
వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు రూ.11, 637 కోట్ల ఆదాయం..
దుబాయ్: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్‌లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్‌కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్ 1.39 బిలియన్ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.ఈ వరల్డ్‌కప్‌ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్‌కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది. టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
అయ్యో పాపం!.. అఫ్గనిస్తాన్ జట్టుకు ఏమిటీ ‘పరీక్ష’?
న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.కారణం ఇదేకాగా స్వదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్‌తో టెస్టు ఆడేందుకు భారత్‌లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్‌మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది. రెండో రోజు కూడా టాస్ పడకుండానేఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కివీస్‌కు నష్టమేమీ లేదు.. కానీనోయిడా స్టేడియం మేనేజ్మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్‌కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్‌కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్‌తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకుని పలు మ్యాచ్‌లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్‌కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్‌పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్‌కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్‌గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌గా ఎంపికయ్యాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్‌బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్‌గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్‌లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్‌మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.