drone attack
-
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తత
-
ఉక్రెయిన్ భీకర దాడులు.. రష్యాలో విమానాల నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి. అస్ట్రాఖాన్ రీజియన్‌లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్‌లోని గ్లాస్ ప్లాంట్‌పైనా, మరో ఎనర్జీ సెంటర్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.ఇదీ చదవండి: స్కూల్‌పై క్షిపణి దాడి.. పుతిన్‌దే బాధ్యత! -
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి
ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైంది. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. 2023 ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో వేల సంఖ్యలో మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నాలు ఫలించడం లేదు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోషకాహార లోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదలకాగా, పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా గత ఏడాది (2024) నిలిచింది. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ పేర్కొంది. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్‌తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. -
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం
టెల్అవీవ్:తమ దేశంపై 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడుల వెనుక కీలకంగా వ్యవహరించిన హమాస్ కమాండర్ అల్హదీసబాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో శరణార్థులు సహాయం పొందుతున్న ప్రాంతంలో సబాను గుర్తించామని,డ్రోన్ దాడితో అతడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్‌లో హమాస్ జరిపిన దాడిలో అబ్ద్ అల్ హదీ సబా కీలక సూత్రధారని తెలిపింది. యూదులు టార్గెట్‌గా అల్హదీసబా దాడులు చేశాడని పేర్కొంది. సబా నేతృత్వంలో డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్య చేశారని ఆరోపించింది. ఇప్పటికే హమాస్ అగ్ర నేతలు పలువురిని ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే.కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వందల కొద్ది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలువురిని హమాస్ తన వెంట బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:జిన్‌పింగ్ హెచ్చరిక -
రష్యాలో 9/11 తరహా దాడి!
కజాన్: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ జంట ఆకాశహర్మ్యాలను విమానాలు ఢీకొట్టిన దాడి ఘటన వీడియో విశ్వవ్యాప్తంగా నాడు వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి దాడి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తమ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రతికార దాడులతో ప్రతిఘటిస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగా శనివారం రష్యాలోని టటారస్థాన్ పరిధిలోని కజాన్ నగరంలో జనావాస ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది.అందులో చూడ్డానికి అచ్చం చిన్నపాటి విమానంలా ఉన్న ఒక డ్రోన్ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో చివరి అంతస్తును ఢీకొనడం ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ వీడియోలోఉంది. ఆరు డ్రోన్లు జనావాసాలపై, రెండు పారిశ్రామికవాడలపై పడ్డాయని టటారస్తాన్ గవర్నర్ రుస్తమ్ మిన్నీకన్నోవ్ ప్రకటించారు. అయితే ఈ దాడిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని రష్యా చెబుతోంది. అయితే దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కజాన్ విమానాశ్రయాన్ని మూసేశారు.ఈ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం సైతం కజాన్ నగర ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండొద్దని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లొద్దని గవర్నర్ రుస్తమ్ జాగ్రత్తలు చెప్పారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పైకి రష్యా 113 డ్రోన్ల దాడులు చేసింది. అయితే వీటిల్లో 57 డ్రోన్లను నేలమట్టంచేశామని ఉక్రెయిన్ తెలిపింది. 56 డ్రోన్లను నిరీ్వర్యం చేశామని తెలిపింది. -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి..విమానాశ్రయం మూసివేత
కీవ్ : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 8 డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. శనివారం కజాన్ నగరంలో హైరైజ్ బిల్డింగ్స్‌పై డ్రోన్ దాడులు జరిపింది. మూడు అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లను డ్రోన్లు ఢీకొట్టాయి. డ్రోన్ల దాడితో కజాన్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. కజాన్‌కు ఈశాన్య నగరం ఇజెవ్‌స్క్‌లో, కజాన్‌కు దక్షిణంగా ఉన్న సరాటోవ్లో మరో రెండు విమానాశ్రయాలలో తాత్కాలిక ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించింది. రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న కజాన్‌లోని నివాస సముదాయాలపై డ్రోన్ దాడి జరిగినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన వాటిలో పలు డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. నివాస సముదాయాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. కజాన్ మేయర్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ నగరంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు,ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.Russia witness 9/11 style attack!Drones/UAV's attack high-rise buildings in Kazan, residents evacuated, Alert Sounded pic.twitter.com/PMHthxQBxh— Megh Updates 🚨™ (@MeghUpdates) December 21, 2024 -
రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న ఉక్రెయిన్ దళాలు!
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా పోరులో అమెరికా.. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్‌పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. 🇷🇺🇺🇦The deputy head of Russia's Security Council, Dmitry Medvedev, has commented on discussions by US politicians and journalists about the transfer of nuclear weapons to Kiev:The very threat of transferring nuclear weapons to the Kiev regime can be seen as a preparation for a… pic.twitter.com/m92Vg3HeGK— dana (@dana916) November 26, 2024 -
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి
-
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. -
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్‌ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
తుల్తులీ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.మూడో తేదీనే చేరుకున్న బలగాలు మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్‌కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.పట్టు సాధించిన బలగాలుబస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్‌ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్మడ్ ప్రాంతం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం 31 కాదు 35 మంది మృతి..తుల్తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడి.. నలుగురి సైనికులు మృతి
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైఫాకు దక్షిణంగా ఉన్న బిన్యామినా పట్టణానికి సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. లెబనీస్ హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని డ్రోన్లతో టార్గెట్ చేసినట్ల తెలిపింది.అయితే ఈ దాడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్లు వినిపించకపోవటం గమనార్హం.Hezbollah UAV strike on Israeli army base kills 4 IDF soldiersRead @ANI Story | https://t.co/k9xhKHZCmS#Israel #UAVstrike #Hezbollah #IDF pic.twitter.com/witCwWBOTD— ANI Digital (@ani_digital) October 13, 2024 నిన్న(ఆదివారం) హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన యూఏఈ ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడిన వ్యక్తుల పేర్లను వ్యాప్తి చేయటం. పుకార్లు సృష్టించటం మానుకొని సైనికులు కుటుంబాలను గౌరవించాలని కోరుతున్నాం’అని ఇజ్రాయెల్ ఆర్మీ ‘ఎక్స్’లో పేర్కొంది.హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ త్స్నోబార్ లాజిస్టిక్స్ స్థావరాన్ని కూడా క్షిపణలుతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక.. హెజ్బొల్లా డ్రోన్ దాడుల నుంచి రక్షణను బలోపేతం చేయటంలో సహాయపడటానికి ఇజ్రాయెల్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు అమెరికా ప్రకటించిన ఈ డ్రోన్ దాడులు జరగటం గమనార్హం.చదవండి: ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్ -
ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి
ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు గత హెజ్బొల్లా గ్రూప్ వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది.#Hezbollah says it launched a drone attack on a military base in north Israel’s Haifa, hours after claiming an attack on another base south of the city.https://t.co/i0Ibz2rdFV— Al Arabiya English (@AlArabiya_Eng) October 12, 2024క్రెడిట్స్: Al Arabiya English‘‘శనివారం ఉదయం 8 గంటల సమయంలో హైఫాలోని ఎయిర్ డిఫెన్స్ బేస్‌పై పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లతో వైమానిక దాడి చేశాం’’ అని హెజ్బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు జరిపాం: హౌతీ రెబల్స్
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024 క్రెడిట్స్: GAROWE ONLINEయెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్‌పై మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ ముప్పేట దాడి
కీవ్: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్లలో పెద్దసంఖ్యలో ఉక్రె యిన్ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్ రీజియన్‌లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్య వస్థ కూల్చేసిన ఘటనలు నమోద య్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది. -
రష్యా ఆయుధాగారాలపై ఉక్రెయిన్ భీకర దాడి
కీవ్: రష్యాకు చెందిన కీలక ఆయుధాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మిసై్పళ్లు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేసింది. సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆయుధ గిడ్డంగులపై ఉక్రెయిన్ మంగళవారం రాత్రి వందకు పైగా డ్రోన్లను ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టోరోపెట్స్‌లో ఉన్న రష్యా ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కోకు 380 కిలోమీటర్ల దూరంలో టోరోపెట్స్ ఉంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సరీ్వసెస్, ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిపి సంయుక్తంగా ఈ భీకర దాడిని చేపట్టాయి. స్వదేశీ తయారీ కొమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ఈ దాడికి వాడింది. ఇస్కాండర్, టోచ్కా–యు మిసై్పళ్లు, గ్లైడ్ బాంబులు, ఇతర మందుగుండు సామాగ్రి ఈ గిడ్డంగుల్లో ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉత్తరకొరియా సరఫరా చేసిన కేఎన్–23 స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసై్పళ్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. భూకంపం వచి్చనంతటి తీవ్రతతో పేలుళ్లు జరిగాయని, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. టోరోపెట్స్‌లో 11 వేల జనాభా ఉంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో మిసై్పళ్లు పేలిపోయి 6 కిలోమీటర్ల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. -
రష్యాపై 140 డ్రోన్లతో ఉక్రెయిన్ భారీ దాడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కోనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంపై భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్.. తమ భూభాగంలో ఏకంగా 140కి పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా రక్షణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే.. తమ భూభాగంలోకి ప్రవేశించిన 144 డ్రోన్లను రాత్రికి రాత్రే కూల్చివేశామని తెలిపారు.బ్రయాన్స్క్ ప్రాంతంపై 72, మాస్కో ప్రాంతంపై 20, కుర్స్క్ ప్రాంతంపై 14, తులా ప్రాంతంపై 13, దేశంలోని మరో ఐదు ప్రాంతాలపై 25 ప్రయోగించిన డ్రోన్ల కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ చేసిన భారీ వైమానిక దాడుల్లో మాస్కోలో ఒక మహళ మృతి చెందినట్లు మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ వెల్లడించారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.మరోవైపు.. ఈ దాడుల కారణంగా నాలుగు విమానాశ్రయాల్లో కొన్ని విమానాలను రద్దు చేసి, మరికొన్నింటిని వాయిదా వేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఇటీవల ఇరుదేశాల మధ్య దాడుల తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా రాత్రి సమయంలో భీకరంగా వైమానిక దాడులకు ఇరు దేశాలు తెగబడటం గమనార్హం.ఇది చదవండి: గాజాపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ -
ఉక్రెయిన్ ప్రతీకారం.. రష్యా ఆక్రమిత ప్రాంతాలపై బాంబుల దాడి
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం మాస్కో దళాలు క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యాలను ధీటుగా ఎదుర్కొంటూనే సమయం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి దేశంపై బాంబుల దాడికి దిగుతోంది ఉక్రెయిన్.. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాలపై ఉక్రెయిన్ తన ప్రతాపం చూపించింది.రష్యా ఆధీనంలో ఉన్న ఖర్కీవ్ ప్రాంతంలో డ్రాగన్ డ్రోన్లతో థర్మైట్ బాంబులను ఉక్రెయిన్ జారవిడిచింది. కొన్ని రష్యన్ సైనిక స్థావారాలను లక్ష్యంగా చేసుకొని నిప్పుల వర్షం కురిపించింది. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. . రష్యా మిలటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ఖోర్న్ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఈవీడియోలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ద్వారా చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్ డ్రోన్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.The Ukrainian military began using the Dragon drone, which burns the area underneath with thermite 🥰🥰🥰 Thermite is a mixture of burning granules of iron oxide and aluminum. About 500 grams of thermite mixture can be placed under a standard FPV drone. The chemical reaction is… pic.twitter.com/3XIzc3LLHN— Anastasia (@Nastushichek) September 5, 2024అత్యంత ప్రమాదకరమైన థర్మైట్ బాంబులు..థర్మైట్ బాంబులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా పరిగణిస్తారు. అల్యూమినియం పొడి, ఐరన్ ఆక్సైడ్ కలిసిన ఈ థర్మైట్ బాంబులు అత్యధికంగా 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇవి చెట్లు, కోటలే కాకుండా ఇనుప లోహాలను, సైతం ఇవి క్షణాల్లో కరిగించగలవు. 2023లో రష్యా కూడా ఉక్రెయిన్ పట్టణం వుహ్లెదర్పై ఈ థర్మైట్ బాంబులను ఉపయోగించింది. అయితే వీటిని జనాలు, సైన్యం నివసించే ప్రాంతాల్లో వీటిని జారవిడిస్తే పెనువిపత్తు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
Russia-Ukraine war: 150పైగా డ్రోన్లు కూల్చేశాం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్ తమపైకి భారీ సంఖ్యలో డ్రోన్ల దాడికి పాల్పడిందని రష్యా పేర్కొంది. శనివారం రాత్రి మొత్తం 158 డ్రోన్లను కూల్చేశామని రష్యా ఆర్మీ తెలిపింది. ఇందులో రాజధాని మాస్కోపైకి రెండు, పరిసరప్రాంతాలపైకి మరో దూసుకువచ్చిన తొమ్మిది డ్రోన్లు కూడా ఉన్నాయంది. సరిహద్దులకు సమీపంలోని ఉక్రెయిన్ బలగాలు ప్రస్తుతం తిష్ట వేసిన కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్లు, బ్రియాన్‌స్‌్కలో 34, వొరెనెజ్‌లో 28 డ్రోన్లతోపాటు, బెల్గొరోడ్పైకి వచి్చన మరో 14 డ్రోన్లను కూలి్చనట్లు వివరించింది. సుదూర ట్వెర్, ఇరనొవో సహా మొత్తం 15 రీజియన్లపైకి ఇవి దూసుకొచ్చాయని తెలిపింది. మాస్కో గగనతలంలో ధ్వంసం చేసిన డ్రోన్ శకలాలు పడి ఆయిల్ డిపోలో మంటలు రేగాయని మేయర్ చెప్పారు. బెల్గొరోడ్ రాజధాని ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణితో 9 మందికి గాయాలయ్యాయి. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ రిజియన్‌లోని పివ్నిచ్నె, వ్యింకా పట్టణాలు తమ వశమయ్యాయని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. కురకోవ్ నగరంపై రష్యా క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా మరో 9 మంది క్షతగాత్రులయ్యారు. శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన 11 క్షిపణుల్లో ఎనిమిదింటిని కూలి్చవేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఖరీ్కవ్పై రష్యా ఆర్మీ ఆదివారం చేపట్టిన దాడుల్లో 41మంది గాయపడ్డారు. -
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సేనలు రష్యాపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా బాంబు, డ్రోన్ దాడులు చేస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి రష్యా రాజధాని మాస్కో, ఇతర ప్రాంతాలే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. మాస్కో వైపు దూసుకువచ్చిన డ్రోన్‌ను రష్యా ధ్వంసం చేసిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.🚨BREAKING/ALERT: Ukraine has launched a massive drone attack on Russia. Over 100+ drones are airborne & flights are being prevented from landing due to the attack. pic.twitter.com/OqWRnH6uh4— The Enforcer (@ItsTheEnforcer) August 31, 2024అదేవిధంగా రష్యా నైరుతి ప్రాంతంలోని బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన కనీసం 12 డ్రోన్లు కూడా ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ పేర్కొన్నారు. మానవరహిత దాడిలో కుర్స్క్ ప్రాంతంపై రెండు వాహనాలను కూడా కూల్చివేశామని తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం పాక్షికంగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ దాడుల వల్ల ఎలాంటి గాయాలు, నష్టం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు. అదేవిధంగా.. గత కొన్ని రోజులుగా దాడుల్లో వేగం పెంచిన ఉక్రెయన్ రష్యా భూభాగాలను స్వాధీనం చేసుకోవటమే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే: జెలెన్స్కీ
కీవ్: తమ దేశంలోని జపోర్జియా అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన జపోర్జియా న్యూక్లియర్ పవర్‌ప్లాంటులో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు.కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్కేంద్రం కూలింగ్టవర్లపై డ్రోన్ దాడి జరిగింది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ల దాడి
జెరూసలెం: ఇజ్రాయెల్‌పై తాజాగా పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. మౌంట్ హెర్మాన్పై ఉన్న ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బేస్‌పై పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడి చేసినట్లు తెలిపింది. ఈ డ్రోన్లన్నీ పేలుడు పదార్థాలతో నిండి ఉన్నట్లు వెల్లడించింది. అయితే డ్రోన్లు మౌంట్ హెర్మాన్ మీద ఉన్నఖాళీ ప్రదేశంలో పేలిపోయాయని, ఈపేలుడులో ఎవరికీ గాయాలవలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసిన తర్వాత హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఇప్పటికీ దాడులు చేస్తోంది. ఈ పోరులో హమాస్‌కు మద్దతుగా లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. కొన్ని వారాలుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేసింది. -
రష్యా ఆయిల్ టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. మరోసారి ఉక్రెయిన్ రష్యా ఆయిల్ టెర్మినల్‌పై డ్రోన్ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంక్లే లక్ష్యంగా రష్యాలోని దక్షిణ పోర్టు అజోవ్లో ఉన్న ఆయిల్ టెర్మినల్‌పై దాడి చేయటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. Russia's remaining air defense units are either busy being destroyed in Ukraine or guarding Putin's palaces, leaving airfields, military bases and oil infrastructure easy targets for hungrry Ukrainian drones.Rostov pic.twitter.com/XiHWfAW4MK— Jay in Kyiv (@JayinKyiv) June 18, 2024భారీగా చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు రష్యా మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ తెలిపింది. మంగళవారం జరిగిన ఆయిల్ రిఫైనరీ దాడిలో.. పలు ట్యాంకుల్లో మెథనాల్ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారలు తెలిపారు. ఇక.. తామె ఈ డ్రోన్ దాడులు చేసినట్లు సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ పేర్కొంది. అజోవ్ పోర్టు సమీపంలో రెండు ఆయిల్ టెర్మినల్స్ ఉన్నాయి. ఈ రెండు ఆయిల్ టెర్మినల్స్ సుమారు 220,000 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేసి 2024 జనవరి నుంచి మే వరకు ఎగుమతి చేసింది.మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర పర్యటనలో సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటం గమనార్హం. -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
Israel-Iran tensions: ఇజ్రాయెల్ ప్రతీకార దాడి
దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడి పని ఇజ్రాయెల్దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్ పనేనన్న అమెరికా!
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయని అమెరికా పేర్కొంది. ఇరాన్‌పై మిసైల్ ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అమెరికా అధికాలు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమ భూభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి మిసైల్ దాడి జరగలేదని తెలిపింది. అదే సమయంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు ఇరాన్ న్యూక్లీయర్ సైట్లు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడి జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఈ దాడులను ఇరాన్ కొట్టేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్లో పలు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇరాన్ రక్షణ వ్యవస్థ పలు డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి క్షిపణీ దాడి జరిగినట్లు నివేదికలు లేవు’ అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇస్ఫాహాన్ సమీపంలోని ప్రధాన వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు మరికొందరు తెలిపారు. అయితే కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కొన్ని డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్‌పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. తాజా దాడులతో పశ్చిమాసియా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒక వేళ యుద్ధం అంటూ ప్రారంభమయితే అది ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆగదని.. ఇతర దేశాలకూ వ్యాపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్‌లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్‌లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రష్యా 32 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్ ఫీల్డ్‌లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్‌స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1– లాంగ్రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్–క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల ‘హష్ద్–అల్– షబి’, కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. -
మావోల సరికొత్త ఎత్తుగడ
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో బంకర్ వెలుగుచూసిన నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నట్టు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా బస్తర్ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనతన సర్కార్‌ను నిర్వీర్యం చేసేందుకు భద్రతాదళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి. దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఈ మేరకు 80 పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్‌ను గోండు భాషలో తయారు చేశారు. ఇందులో ఉన్న రణతంత్ర వివరాలపై గతంలోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిని ఆతర్వాత కొందరు హిందీలోకి అనువదించినట్టు తెలిసింది. ఆకాశదాడులు తిప్పికొట్టేలా.. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తుండగా, మావోయిస్టుల ఏరివేతకు వాయు దాడులు చేయడం లేదని భద్రతాదళాలు చెబుతున్నాయి. డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు. ఇలా భిన్నవాదనలు ఉన్నా, ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు. ఈమేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్లో చర్చించారు. తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు. డ్రోన్లు, హెలికాప్టర్ దాడులను తిప్పికొట్టేలా ‘చెట్లపై నుంచి రాకెట్ లాంచర్లు పేల్చడం’పై కేడర్‌కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తయిన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే లాంగ్ పైప్ బాంబులను ప్రయోగించే దానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడడుగుల బంకర్లు డ్రోన్లు, హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డాక్యుమెంట్లో చర్చించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అడవిలో ఆరుబయట ప్రాంతంలో కాకుండా పైనుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే...కనీసం మూడు అడుగుల లోతుతో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కొత్తగా మావోయిస్టు స్నైపర్ టీమ్‌లు మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు, ప్లాటూన్లు, లోకల్ గెరిల్లా స్క్వాడ్, యాక్షన్స్ టీమ్‌లు ఉన్నాయి. అయితే అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ క్యాంపులు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలుదిశలా కూంబింగ్ చేస్తున్నాయి. దీంతో భద్రతాదళాలపై అందుబాటులో ఉన్న కేడర్‌తో అంబూష్ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. కనీసం కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్నైపర్ టీమ్‌లు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అడవుల్లోకి వచ్చే భద్రతాదళాలపై స్నైపర్ టీమ్ దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగినా భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా కూంబింగ్ స్పీడ్‌కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతల సమావేశం? దంతెవాడ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో వెలుగుచూసిన బంకర్లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావును మావోయిస్టు పార్టీ నియమించింది. అంతకుముందు ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన నాయకులు తాజాగా వెలుగు చూసిన బంకర్లోనే సమావేశమైనట్టు తెలుస్తోంది. :::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు
అమెరికా, భారత్ మధ్య ‘ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల’పై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల(రూ.33 వేలకోట్లు) విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్ అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే.. సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లు, భూసరిహద్దు పరిరక్షణ నిఘా కోసం స్కై గార్డియన్ డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించుకోవచ్చు. ఈ సాయుధ డ్రోన్లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్జెట్లు చేయగలిగే పనులు సైతం ఇవి చేస్తాయి. వీటికి హెల్ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి. శత్రువులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, మందుగుండు సామగ్రితో విధ్యంసం సృష్టిస్తాయి. ఈ డ్రోన్లను నిఘా సామర్థ్యం ఉంటుంది. మానవతా సహాయం, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, గాలింపు చర్యలు, గాలో ముందస్తు హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ వార్‌పేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ల్లో ఈ డ్రోన్లను ఉపయోగించవచ్చు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ డ్రోన్లను మోహరించవచ్చు. ఇదీ చదవండి: జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 30 నుంచి 40 గంటలపాటు ఈ డ్రోన్లు గాల్లో ఎగరగలవు. 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం వీటికి ఉంటుంది. -
Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది!
జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్ 22పై మిలిటెంట్ గ్రూప్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. మిలిటెంట్ దళాలు డ్రోన్ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అప్పటికే షెడ్యూల్ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లనే మిలిటెంట్ల డ్రోన్ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన డ్రోన్ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్ దాడి మధ్యప్రాచ్యలో అమెరికా స్థావరం జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇరాన్ దేశానికి చెందిన ఇస్లామిక్ రెసిస్టాన్స్ మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడికి పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ‘జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ ఇరాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ పని. సమయం వచ్చిప్పుడు తాము అంతే స్థాయిలో స్పందిస్తాం’ అని అన్నారు. అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిటెంట్‌కు గ్రూప్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఎవరికీ డ్రోన్ దాడులకు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని ఇరాన్ పేర్కొంది. -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
జెరూసలేం: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగిన పశి్చమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇన్నాళ్లూ దౌత్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్న పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా వైరం ప్రజ్వరిల్లింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్రీన్ మౌంటేన్ పర్వతప్రాంతంలోని జైష్ అల్ అదిల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్) సంస్థకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ రాయబారిపై వేటు జైష్ అనేది 2012లో పాక్‌లో నెలకొలి్పన సున్నీ ఉగ్రసంస్థ. ఇరాన్లో జైష్ తరచూ ఇరాన్ భద్రతాబలగాలపై దాడులకు దిగుతోంది. సైనికులను అపహరిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా తయారైంది. పాక్ సరిహద్దు పట్టణం పంజ్‌ఘర్ కేంద్రంగా పనిచేస్తూ జైష్ దాడులకు దిగుతోందని ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఆరోపించింది. ఈనెలలో సున్నీ ఉగ్రసంస్థ ఒకటి సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి వంద మందిని బలితీసుకున్న విషయం తెల్సిందే. దీంతో సున్నీ ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఇరాన్ నిశ్చయించుకుంది. అందులోభాగంగానే పాక్‌లోని జైష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తమ భూభాగంపై విదేశీ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఆక్షేపించింది. పాక్‌లోని ఇరాన్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారిని పిలిపించుకుని తన నిరసన వ్యక్తంచేసింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. ‘పాక్ గగనతలాన్ని అనుమతిలేకుండా వినియోగించడం, దురి్వనియోగం చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ఇది పాక్ సార్వ¿ౌమత్వాన్ని అవమానించడమే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను అపహాస్యం చేస్తూ ఇలా దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ ఆర్మీ అధికారి కాల్చివేత జైష్ ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన మరుసటి రోజే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిని ఉగ్రవాదులు కాలి్చచంపారు. పాక్, అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దు పంచుకుంటున్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రదాడి ఘటన జరిగిందని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ బుధవారం తెలిపింది. -
అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు
న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు. తాజాగా అమెరికా నావికాదళం, వాణిజ్య నౌకలకు సమీప దూరంలో డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. హౌతీలు సాయుధ మానవ రహిత ఉపరితల నౌక(USV)ను ప్రయోగించారని అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవరహిత ఉపరితల నౌకను ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా నేవీ ఆపరేషన్స్ హెడ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. యూఎస్‌వీలు హౌతీల సముద్ర యుద్ధాల్లో కీలకమైన భాగమని క్షిపణి నిపుణుడు ఫాబియన్ హింజ్ తెలిపారు. సౌదీ సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన యుద్ధాల్లో వాటిని ఉపయోగించారని చెప్పారు. తరచుగా సూసైడ్ డ్రోన్ పడవలను ఎక్కువగా ఉపయోగింస్తారని వెల్లడించారు. ఇరాన్లో తయారైన కంప్యూటరైజ్డ్ గైడెన్స్ సిస్టమ్స్‌లతో అమర్చబడి ఉంటాయని తెలిపారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల వెనక ఇరాన్ ఉందని యుఎస్ డిప్యూటీ రాయబారి క్రిస్టోఫర్ లూ అన్నారు. హౌతీలకు బాలిస్టిక్ క్షిపణులతో సహా అధునాతన ఆయుధ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌తో అమెరికా ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హౌతీల దాడులు నిలిపివేయకపోతే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా మిత్ర దేశాలు గురువారం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాతే హౌతీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
#Russia: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు (ఫొటోలు)
-
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపంది. Shahed drone attack on Odessa has been underway in New Year's Eve for more than two hours. Debris of kamikaze drones caused several fires in residential buildings so far. At least one person was killed. pic.twitter.com/kX1lxLijvj — Olga Klymenko (@OlgaK2013) January 1, 2024 ఈ డ్రోన్ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన సైన్యం పేర్కొంది. డ్రోన్ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్ దాడులతో ఒడెస్సాలోని పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది. చదవండి: జపాన్‌లో సునామీ హెచ్చరికలు -
Drone Attack: నౌకపై దాడి అక్కడి నుంచే !
పుణె : ఇటీవల గుజరాత్‌లోని పోర్బందర్ తీరానికి సమీపంలో క్రూడాయిల్ నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఇరాన్ నుంచే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. డ్రోన్‌లో నుంచి వచ్చిన పేలుడు పదార్థం ఇరానియన్ 136 లాయిటరింగ్ అమ్యూనిషన్ అని పుణెలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు సమాచారం. రష్యన్ జిరాన్ -2 ఎక్స్‌ప్యాండబుల్ రకానికి చెందిన ఈ డ్రోన్ 2500 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణించగలదు. దీనిలో 50 కిలోల వార్‌హెడ్ ఉంది. వార్‌హెడ్‌లో షాహెద్ 136 అనే పేలుడు పదార్థం వాడారని తెలుస్తోంది. అయితే పుణె ల్యాబ్ పూర్తిస్థాయి నివేదిక రావడానికి వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సమీపంలోని రెండు ఇరానియన్ షిప్పుల నుంచే క్రూడాయిల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిందని తొలుత భావించారు. అయితే ఆ రెండు నౌకలను తనిఖీ చేసిన తర్వాత వాటికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని నేవీ అధికారులు తేల్చారు. ఇదీచదవండి..హౌతీ రెబెల్స్‌పై అమెరికా కీలక ప్రకటన -
Pentagon: హౌతీ రెబెల్స్‌పై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్ : ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజాగా హౌతీ మిలిటెంట్లు వాణిజ్య నౌకలపై ప్రయోగించిన డజన్ల కొద్ది డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. హౌతీలు ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్ల వల్ల నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నౌకల్లోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారని పెంటగాన్ తెలిపింది. మొత్తం 12 డ్రోన్లు, 3 యాంటీ షిప్ మిసైళ్లు, రెండు లాండ్ ఎటాక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక వాణిజ్య నౌక లక్ష్యంగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపినట్లు హౌతీ రెబెల్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని మిలిటరీ స్థావరాలపైనా డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడులు మొదలు పెట్టారు. ఇదీచదవండి..పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ -
Drone Attacks: భారత నేవీ కీలక నిర్ణయం
ముంబై: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడులు జరుగుతుండడంతో ఇండియన్ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్ఎస్ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది. ‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్‌షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్‌గార్డ్‌లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్ కమాండ్ అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో ఇటీవలే డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ ప్రటించడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్ నౌకపైనా డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు దాడి తర్వాత ముంబై డాక్‌యార్డుకు చేరుకున్న కెమ్ ఫ్లూటోను ఫోరెన్సిక్ అధికారులు తనిఖీ చేశారు. ఇదీచదవండి..ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’ -
14 మంది ఇజ్రాయెల్ జవాన్లు మృతి
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం, శనివారం హమాస్ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు బలైన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 153కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఒకేసారి 14 మంది జవాన్లను కోల్పోవడం ఇజ్రాయెల్ జీరి్ణంచుకోలేకపోతోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 166 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ చెరలోని బందీలను విడిపించాలంటే యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ అంటోంది. హమాస్‌పై పోరాటం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని, అయినప్పటికీ ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో జనం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెతన్యాహు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎర్రసముద్రంలో అలజడి.. మరో రెండు నౌకలపై డ్రోన్ దాడి
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్‌దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ లబూన్ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్‌ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్కామ్ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది. ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇదీ చదవండి: డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. -
Drone Attack: అమెరికా సంచలన ప్రకటన
వాషింగ్టన్: గుజరాత్‌లోని పోర్బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ నౌక కెమ్ ప్లూటో మంగళూరు వెళుతోంది. ఈ నౌకపై భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్‌ను ఇరాన్ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం 2021 నుంచి ఇది ఏడోసారి’అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్ ఇంత వరకు స్పందించలేదు. ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హతీ రెబెల్స్ దాడి చేస్తుండగా భారత సమీపంలో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్ దాడి తామే చేశామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడికి గురైన కెమ్ప్లూటోకు భారత కోస్ట్‌గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోంది. ఇదీచదవండి..హిందూ ఆలయంపై విద్వేష రాతలు -
గాజాలో భయం భయం
ఖాన్ యూనిస్: గాజా్రస్టిప్‌లో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైనికులు ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి. ఈ మూడు నగరాల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు చిక్కుకుపోయారు. దక్షిణ గాజాలో 6 లక్షల మందికి పైగా ఉన్నారని, వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలోని శరణార్థి శిబిరాలన్నీ ఇప్పటికే బాధితులతో నిండిపోయాయని, ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరికీ దిక్కుతోచడం లేదని పేర్కొంది. ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఖాన్ యూనిస్ సిటీపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ముఖ్యనేతలంతా ఖాన్ యూనిస్‌లో మాటు వేశారని, వారిని బంధించక తప్పదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీ సహా పలు వాణిజ్య నౌకలపై ఆదివారం దాడులు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దాడికి కారణమెవరనే విషయం పెంటగాన్ తెలపలేదు. ఉదయం 10 గంటల సమయంలో యెమెన్ రాజధాని సనాలో మొదలైన ఈ దాడులు సుమారు 5 గంటలపాటు కొనసాగినట్లు ఓ అధికారి చెప్పారు. ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు బ్రిటిష్ మిలటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనలపై హౌతీలు స్పందించలేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం వేళ మధ్యప్రాచ్యంలో ఈ దాడులు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. -
Russia-Ukraine War: మాస్కోపై డ్రోన్ల దాడి
మాస్కో: మాస్కో లక్ష్యంగా డజన్ల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ ఆదివారం దాడికి యత్నించినట్లు రష్యా ఆరోపించింది. శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా 60కి పైగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆదివారం మాస్కో పరిసర ప్రాంతాలపైకి దూసుకొచి్చన 24 వరకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. మాస్కోలోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన డ్రోన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని గవర్నర్ ఆండ్రీ ఒవొబియెవ్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న తుల నగరంలోని 12 అంతస్తుల అపార్టుమెంట్‌ను ఒక డ్రోన్ ఢీకొట్టగా ఒకరు గాయపడినట్లు సమాచారం. -
కీవ్‌పై భారీగా డ్రోన్ల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడింది. 2022లో తమపై దురాక్రమణ మొదలయ్యాక రష్యా పాల్పడిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది. శనివారం ఉదయం రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన 75 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లలో 66 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వేకువజామున 4 గంటలకు మొదలై దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 11 ఏళ్ల బాలుడు సహా అయిదుగురు పౌరులు గాయపడ్డారు. -
ఉక్రెయిన్‌పై రష్యా అతి పెద్ద డ్రోన్ ఎటాక్, ఏకంగా 75 డ్రోన్లతో
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమారు 75 ఇరానియన్ షాహెద్ డ్రోన్లతో అతిపెద్ద దాడికి దిగింది. ఉక్రెయిన్ రాజధానిని లక్ష్యంగా 2022లో రష్యా దాడి తరువాత శనివారం ఉదయం ఉక్రెయిన్‌పై అత్యంత తీవ్రమైన డ్రోన్ దాడికి దిగిందని సైనిక అధికారులు తెలిపారు. 71 డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ అడ్డగించిందని, వాటిని ధ్వంసచేశాయని ఉక్రెయిన్ సాయుధ దళాలు వెల్లడించాయి. కైవ్‌పై డ్రోన్ల ద్వారా జరిగిన అత్యంత భారీ వైమానిక దాడి అని కైవ్ నగర పరిపాలన అధిపతి సెర్హి పాప్కో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైఆరు గంటలకు పైగా కొనసాగింది. 77 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకుత తీవ్ర అంతారాయం ఏర్పడింది. కనీసం ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ నవంబర్ 11న రెండు నెలల్లో మొదటిసారిగా క్షిపణి దాడులను ఎదుర్కొంది. కీవ్ ఆ రాత్రి ప్రాణ నష్టం నుండి తప్పించుకున్నప్పటికీ వారాంతంలో డ్రోన్ దాడులతో సహా కీవ్, దాని పరిసరాలపై దాడులు కొనసాగుతున్నాయి. రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 560 మంది చిన్నారులు, 10వేల మంది పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో తాజా దాడి మరింత ఆందోళన రేకత్తిస్తోంది. -
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు. దాడుల ఫొటోల విడుదల గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్ విస్తృత భూగర్భ నెట్వర్క్ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...! ఆస్పత్రే హమాస్ కేంద్రం! గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి. ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్వర్క్ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. గాజాకు స్టార్‌లింక్ కనెక్టివిటీ గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్వర్క్ వ్యవస్థ. 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. సర్వం స్తంభించింది... ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్ఖిద్రా తెలిపారు. ► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. ► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది. ► ఇజ్రాయెల్ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి. ► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది. ► తాము కేవలం హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బందీల బంధువుల నిరసన అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్ అవీవ్ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు. ► హమాస్ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ► ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే. -
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోని రఫాలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. అడపాదడపా రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. గాజాలో వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గాజా దిగ్బంధానికి ఆదేశాలు గాజాలో హమాస్ ముష్కరులను, వారి ప్రభుత్వాన్ని తుదముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. హమాస్‌ను ఇప్పటికే చాలావరకు బలహీనపర్చామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ తమ సైన్యాన్ని ఆదేశించారు. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధనం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో 24 కాలనీలు ఉండగా, 15 కాలనీలను ఖాళీ చేయించారు. మిగిలినవాటిని 24 గంటల్లోగా ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాపై ఇప్పటిదాకా వైమానిక దాడులకే పరిమితం అయిన ఇజ్రాయెల్ ఇక భూ యుద్ధంపై దృష్టి పెట్టింది. నేరుగా భూమిపైనుంచే క్షిపణులు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధం వల్ల గాజాలో 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని, ఇళ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గాజా బయట తమ పోరాటం కొనసాగుతోందని, సోమవారం ఉదయం మరికొంతమంది ఇజ్రాయెల్ పౌరులను బంధించామని హమాస్ ప్రతినిధి అబ్దెల్–లతీఫ్ అల్–ఖనౌవా చెప్పారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిపించి, స్వేచ్ఛ ప్రసాదించడమే తక్ష లక్ష్యమని ఉద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి సహకరించాలంటూ ఇజ్రాయెల్ కోరిందని ఈజిప్టు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం మిత్రదేశం ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక సాయం అందిస్తోంది. తూర్పు మధ్యదరా సముద్రానికి యుద్ధ నౌకలను పంపించింది. ఇంకా అదనపు సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 260 మృతదేహాలు లభ్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో శనివారం సూపర్నోవా ఫెస్టివల్లో ఆనందంగా గడుపుతున్న జనంపై హమాస్ ముష్కరులు హఠాత్తుగా దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 260కిపైగా మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం గాజాకు సమీపంలోనే ఉంది. నా భార్యాబిడ్డలను అపహరించారు యువకుడు యెనీ అషెర్ గాజా సరిహద్దుకు సమీపంలో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అతడి భార్య డోరన్, కుమార్తెలు రజ్(5), అవివ్(3)ను శనివారం అపహరించారు. ఎక్కడ దాచారో తెలియడం లేదు. వారి కోసం అషెర్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. వారిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకంటున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండగానే చంపేశారు ఇలాన్ ట్రోయెన్ అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె డెబోరా మతియాస్, అల్లుడు స్కోమ్లీ మతియాస్, మనవడు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. శనివారం ఆమె అమెరికాలో ఉన్న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండగా హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డెబోరా, స్కోమ్లీ దంపతులు బలయ్యారు. వారి 16 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు ఇజ్రాయెల్ ఆయాగా పనిచేస్తున్న కేరళ మహిళ షీజా ఆనంద్ హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడ్డారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పయ్యావూర్కు చెందిన షీజా ఆనంద్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని సముద్ర తీర నగరం అషె్కలాన్లో ఆయాలో పని చేస్తున్నారు. శనివారం హమాస్ మిలిటెంట్ల అషె్కలాన్పై రాకెట్లు ప్రయోగించంతో ఆమె గాయాలపాలయ్యారు. భారత్‌లో ఉన్న భర్త ఆనంద్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు షీజా ఆనంద్‌ను ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆదివారం మధ్యాహ్నం షీజా భారత్‌లోని తన తల్లితో మాట్లాడారు. ‘అమ్మా.. ఐయామ్ ఓకే’ అని చెప్పారు. -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో సోమవారం రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్ మిస్సైళ్లలో పదకొండింటిని, రెండు పీ–800 ఓనిక్స్ క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల ద్వారా తరలించే ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. అప్పటి నుంచి ఒడెసా ఓడరేవు లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతోంది. ఫలితంగా ధాన్యం గోదాములు, ఆయిల్ డిపోలు, షిప్పింగ్, నిల్వ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
సూడాన్‌లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఓ మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
రష్యా డ్రోన్లను కూల్చేసిన ఉక్రెయిన్
క్యివ్: దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా శనివారం మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చేసినట్లు తెలిపింది ఉక్రేయి రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఒడెస్సాలో దానుబే నది వద్దనున్న రెనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. యుద్ధ ప్రారంభ రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగానే తిప్పి కొడుతోంది. ఒక పక్క రష్యా దాడులను అడ్డుకుంటూనే మరోపక్క వారిపై ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాహెద్ డ్రోన్లను చిత్తు చేసింది. మొత్తం 25 డ్రోన్లలో 22 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా అక్కడక్కడా ఇఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తిన్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైన్యం. పోర్టు ప్రాంతమైన ఒడెస్సా పోర్టు నుంచి ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి చేసేది. నౌకాశ్రయంలో జరిగిన నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమంది సైన్యం. ఈ పోర్టు ధ్వంసం చేసి ధాన్యం రవాణాను దెబ్బతీయాలన్నది రష్యా ఉద్దేశ్యమై ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత
మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ -
క్రిమియాలో 20 డ్రోన్లు కూల్చివేశాం: రష్యా
కీవ్: ఆక్రమిత క్రిమియాపై డ్రోన్ల దాడిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 20 డ్రోన్లను కూల్చివేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో 14 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా మరో ఆరింటిని జామర్లు నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. వరుసగా మూడు రోజులుగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా అప్రమత్తమైంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతానికి చెందిన ఉరోజ్హయిన్ అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం ప్రకటించుకుంది. ఖర్కీవ్, జపొరిజియా ప్రాంతాలతోపాటు, అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణం క్రివ్విరిహ్ల్లో జరిగిన రష్యా బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోగా మరో 16 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది. -
రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..
మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి. దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. POV: you ram into a Russian landing warship as a little simple drone pic.twitter.com/u79u5A4Shb — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) August 4, 2023 ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా? -
మాస్కోపై మళ్లీ ఉక్రెయిన్ డ్రోన్‌దాడి
-
వెస్ట్‌బ్యాంక్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్‌బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్‌లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
మాస్కోపై డ్రోన్ల దాడి యత్నం భగ్నం.. ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించిందా? నిజమేనని చెబుతోంది రష్యా వైమానిక దళం. ఉక్రెయిన్ ప్రయత్నాన్ని భగ్నం చేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం మంగళవారం ఐదు డ్రోన్లు ప్రయోగించిందని, వెంటనే ఈ విషయం గుర్తించి మాస్కోలో ఒక విమానాశ్రయాన్ని మూసివేశామని రష్యా ఆర్మీ తెలియజేసింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించామని పేర్కొంది. మాస్కోలో గతంలోనూ పలుమార్లు డ్రోన్ దాడులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు యత్నం విఫలమైన తర్వాత డ్రోన్‌తో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయతి్నంచడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ సైన్యం ఐదు డ్రోన్లను ప్రయోగించగా, వాటిలో నాలుగింటిని కూల్చివేశామని, మరో డ్రోన్‌ను సురక్షితంగా కిందికి దింపామని రష్యా రక్షణ శాఖ తెలియజేసింది. ఈ దాడులతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. -
మాస్కోపై డ్రోన్ దాడులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం ఉదయం డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణహాని జరగలేదని, భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మాస్కోపైకి దూసుకొచ్చిన ఎనిమిది డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు. డ్రోన్ల దాడిపై అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వం చేసిన ఉగ్రవాద దాడి అంటూ ఆరోపించారు. మాస్కోలో డ్రోన్లను కూల్చి వేసిన ప్రాంతంలో కొన్ని భవనాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని నగర మేయర్ సెర్గీ సొబియానిన్ చెప్పారు. ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి, దెబ్బతిన్న రెండు బహుళ అంతస్తుల భవనాల్లోని వారిని ఖాళీ చేయించామని తెలిపారు. అయిదు డ్రోన్లను మాస్కోలో కూల్చివేయగా, మూడింటిని జామ్ చేసి దారి మళ్లించి పేల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం మొదలైన దాదాపు ఏడాదిన్నర కాలంలో డ్రోన్లతో ఏకంగా సుదూర ప్రాంతంలోని రష్యా రాజధానిపై డ్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. ఈ నెలారంభంలో అధ్యక్షుడు పుతిన్ లక్ష్యంగా రెండు డ్రోన్లు క్రెమ్లిన్‌పైకి వచ్చాయని రష్యా ఆరోపించింది. రష్యా గత 24 గంటల్లో మూడో విడత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై వేకువజామున బాంబులతో విరుచుకుపడింది. కీవ్ వాసులు భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడులతో ఒకరు చనిపోయారు. పేలుడు పదార్థాలతో వచి్చన 20 షహీద్ డ్రోన్లను కూల్చి వేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. మొత్తమ్మీద 24 గంటల్లో 31 వరకు డ్రోన్లను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. -
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్లో దాక్కున్న స్థానికులు -
మరో ఆప్షన్ లేదు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను డ్రోన్లతో హత్య చేయడానికి ఉక్రెయిన్ పన్నిన కుట్రను.. భద్రతా సిబ్బంది భగ్నం చేశాయి. అధ్యక్ష నివాసంలో పుతిన్ ఉంటున్న ఫ్లోర్‌కు అతి సమీపంగా రెండు డ్రోన్లు వెళ్లాయని, వాటిని నేల కూల్చినట్లు బుధవారం క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో వర్గాలు.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని ఉక్రెయిన్ అంటోంది. మరోవైపు పుతిన్‌పై హత్యాయత్నానికి రష్యా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, పుతిన్‌కు ఆప్తుడు దిమిత్రి మెద్వెదేవ్. ఉక్రెయిన్ ఉగ్రదాడికి కౌంటర్‌గా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందేనని రష్యా బలగాలకు సూచిస్తున్నాడు ఆయన. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వెదేవ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ద్వారా ఉక్రెయిన్ ఉగ్రచర్యలకు దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ముందు ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అది జెలెన్స్కీని మట్టుబెట్టడమే. ఇక ఆ హిట్లర్(జెలెన్స్కీని ఉద్దేశించి..) లొంగిపోవాల్సి అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోతానని వచ్చినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాస్కో ముందు మరో ప్రత్యామ్నాయమూ అక్కర్లేదు. అతన్ని భౌతికంగా లేకుండా చేయడమే ఇప్పుడు రష్యా బలగాలు చేయాల్సిన పని అని మెద్వెదేవ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం అర్ధరాత్రి పుతిన్ అధ్యక్ష అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ UAV(మానవ రహిత) దాడులకు తెగబడిందని, వాటిని చాకచక్యంగా నేలకూల్చామని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని మాస్కో వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో పుతిన్ ఇంట్లో లేడని వెల్లడించిన ఆయన సిబ్బంది.. మాస్కోలోని తన నివాసం నుంచే ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారని తెలిపింది. అంతేకాదు మే 9వ తేదీన రెడ్ స్క్వేర్ వద్ద జరిగే విక్టరీ డే పరేడ్‌పై ఈ డ్రోన్ ఎటాక్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జెలెన్స్కీ ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. రష్యా ఆరోపణలను ఖండించారు. పుతిన్‌పై గానీ, మాస్కోపైగానీ ఉక్రెయిన్ దళాలు ఎలాంటి దాడులకు యత్నించలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి దాడులకు సరిపడే ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ వద్ద లేదని చెబుతున్నారాయన. మేం మా దేశ సరిహద్దులోనే పోరాడుతున్నాం. మా గ్రామాలను, నగరాలను రక్షించుకుంటున్నాం. మా వద్ద అలాంటి దాడులు చేయాలన్నా.. అందుకు తగ్గ ఆయుధాలు లేవు. అంతేసి ఖర్చు చేసే పరిస్థితుల్లోనూ లేం అని చెబుతున్నారు. ఇదీ చదవండి: మొసలి కడుపులోకి ఎలాగ వెళ్లాడంటే.. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెను సంచలనం.. పుతిన్‌పై హత్యాయత్నం..!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను హత్య చేసేందుకు జెలెన్స్కీ కుట్ర చేశారని తెలిపింది. మాస్కోలోని పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించింది. దీన్ని ఉగ్ర చర్యగా అభివర్ణించింది. 'రెండు మానవ రహిత డ్రోన్లు పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించాయి. రాడార్ వ్యవస్థను ఉపయోగించి రష్యా సైన్యం వాటిని కూల్చివేసింది. దీన్ని ఉగ్ర కుట్రగా మేం భావిస్తున్నాం. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న మేము నిర్వహించే పరేడ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసింది. రష్యా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. శత్రువులు ఏ రూపంలో వచ్చినా దీటుగా బదులిస్తాయి.' అని రష్యా ప్రకటనలో తెలిపింది. #BREAKING Footage of Ukrainian drone attack on Russia’s Kremlin overnight. pic.twitter.com/8S5MGQWdbK — Clash Report (@clashreport) May 3, 2023 ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని, భవనాలు కూడా దెబ్బతినలేదని రష్యా తెలిపింది. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మాస్కోలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం.. -
క్రిమియా చమురు నిల్వకేంద్రంపై దాడులు
కీవ్: తొమ్మిదేళ్ల క్రితం రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ద్వీపకల్ప ప్రాంతం క్రిమియాపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో క్రిమియాలోని తీరప్రాంత నగరం సెవస్తపోల్‌లోని చమురు నిల్వ కేంద్రానికి నిప్పు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ‘ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ల పనే. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి ఒక్కచోట మాత్రమే మంటలు ఆర్పగలిగాం’ అని నగర గవర్నర్ మిఖాయిల్ రజవోజయేవ్ చెప్పారు. మరణాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రతిదాడి చేసి క్రిమియాను మళ్లీ ప్రధాన భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం, శుక్రవారమే 20 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి రష్యా 23 మంది పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయిల్ డిపోలో 10 ట్యాంకుల్లో అగ్గిరాజుకోవడం దేవుడు వేసిన శిక్ష అంటూ ఉక్రెయిన్ సైనిక నిఘా అధికార ప్రతినిధి ఆండ్రీ యుసోవ్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అక్రమంగా విలీనం చేసుకున్న ఖేర్సన్ ప్రావిన్స్‌లోని నోవా కఖోవ్కా సిటీపైకి ఉక్రెయిన్ సేనలు భారీ స్థాయిలో కాల్పుల మోత మోగించాయి. -
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్ నుంచి జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజధాని కీవ్ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్ ప్రధాని కిషిదా ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు చేరుకున్నారు. -
అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్ విషెస్
కీవ్: కొత్త ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తంగా మారింది. రష్యా బలగాల విజృంభణ.. ప్రతిగా ఉక్రెయిన్ బలగాల కౌంటర్‌తో సరిహద్దు రక్తసిక్తం అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రష్యా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసింది రష్యా. అయితే ఆ పరిణామం ఉక్రెయిన్ భగ్గుమంటోంది. కారణం.. డ్రోన్ దాడులతో ఆ శుభాకాంక్షలు తెలియజేయడమే!. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి తన ఫేస్బుక్లో పంచుకున్నారు. హ్యాపీ న్యూఇయర్, బూమ్ అంటూ అక్షరాలు రాసి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే మైదానంలో పడింది ఆ డ్రోన్. అదొక చీప్, టేస్ట్‌లెస్ మెసేజ్. ఇరాన్ ఆధారిత డ్రోన్‌పై రాసి ఉంది. ఉగ్రవాద దేశం, దాని సైన్యం తీరు గురించి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. మరోవైపు అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఇదొక అతి చేష్టగా అభివర్ణించారు. ఉక్రెయిన్ బలగాలు రష్యా బలగాలకు ధీటుగా సమాధానం ఇస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 40కి పైగా డ్రోన్లతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై మొదటిరోజే దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
పెరిగిన పాక్ డ్రోన్ల ముప్పు
చండీగఢ్: పాకిస్తాన్ నుంచి డ్రోన్లు సరిహద్దును దాటి భారత్‌లోని పంజాబ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇలా వచ్చిన డ్రోన్ల సంఖ్య కేవలం ఏడాదిలోనే నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. 2021లో 67 డ్రోన్లు, 2022లో 254 డ్రోన్లు పాక్ భూభాగం నుంచి పంజాబ్‌లోకి వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో 254 డ్రోన్లు రాగా, వీటిలో 9 డ్రోన్లను బీఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. 13 డ్రోన్లు వివిధ కారణాలతో నేలకూలాయి. పాక్ ముష్కరులు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన డ్రోన్లను భారత్‌లోకి చేరవేస్తున్నట్లు సైనికాధికారులు చెబుతున్నారు. 2022లో గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో ఉన్న తూర్పు సరిహద్దులో 311 డ్రోన్లను గుర్తించారు. 2020లో 77, 2021లో 104 డ్రోన్లు పట్టుబడ్డాయి. సరిహద్దుల్లో జామింగ్ టెక్నాలజీ లేదా రైఫిల్ ఫైరింగ్ ద్వారా డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కూల్చివేతలో పాల్గొన్న బృందానికి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తున్నామని తెలిపారు. -
శత్రు డ్రోన్లను చీల్చి చెండాడే ‘గద్దలు’.. ఆర్మీ నయా అస్త్రం
న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది. ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది. Here comes India's first anti #drone Kite (a bird) which can destroy a quadcopter in air. #IndianArmy #YUDHABHYAS22 pic.twitter.com/OByAwWuJop — Haresh 🇮🇳 (@HARESHRJADAV3) November 29, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
ఇరాన్ ‘డ్రోన్’లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. రష్యా కొత్త పంథా!
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్‌పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్‌లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. డ్రోన్ల దాడిలో కీవ్‌లో ఓ గర్భిణి, ఆమె భర్త సహా మొత్తం నలుగురు, సుమీ ప్రాంతంలో మరో నలుగురు కలిపి మొత్తం 8 మంది మరణించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానం కూలిపోయి నలుగురు మృతి చెందిన క్రమంలో ఈ దాడులు చేసినట్లు సమాచారం. డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఖండించారు. రష్యాకు డ్రోన్లు అందిస్తున్న ఇరాన్‌పై ఆంక్షలు విధించాలను యూరోపియిన్ యూనియన్ను కోరారు. ఇదీ చదవండి: పుతిన్ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు -
Al Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతంపై బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. More than 20 years after 9/11, one of the masterminds of that terrorist attack and Osama bin Laden’s successor as the leader of al-Qaeda – Ayman al-Zawahiri – has finally been brought to justice. — Barack Obama (@BarackObama) August 2, 2022 కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు. 9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?