Shruthi Haasan
-
ఉమెన్స్ డే ఎందుకు.. శ్రృతీహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతీహాసన్(Shruti Haasan )..తనదైన నటనతో తక్కువ సమయంలోని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి సినిమాలు చేసింది. చివరిగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ శ్రుతీ హాసన్‌పై పెద్దగా పుకార్లేవి రాలేదు. ఏ విషయంలో అయినా ఆమె నిక్కచ్చిగా ఉండమే దానికి కారణం. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కూడా శ్రుతీ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..అసలు ఉమెన్స్ డేని జరుపుకోవడం దేనికని ప్రశ్నించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘మేల్ డే అనేది లేనప్పడు ప్రత్యేకంగా ‘ఉమెన్స్ డే’ ఎందుకు ? అంటే ఇంకా స్త్రీ వెనకబడి ఉందని చెప్పడానికే ఈ స్పెషల్ డేస్ జరుపుకుంటున్నారా? అలాగే ఉమెన్ ఓరియెంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియెంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజు ఉమెన్ ఎదిగినట్లు లెక్క’అని తనదైన శైలీలో చెప్పుకొచ్చింది. -
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
విజయ్ సేతుపతి ‘ట్రైన్’ కోసం.. ‘శ్రుతి’ గానం
తమిళ సినిమా: నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ట్రైన్ చిత్రం. నటి డింపుల్ హైయతీ నాయకిగా నటిస్తున్నారు. ఆర్.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్.రవికుమార్, వినయ్ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, అందులో ఓ పాటను దర్శకుడు మిష్కిన్ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కాగా డార్క్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ట్రైన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిసింది. కాగా దర్శకుడు మిష్కిన్ ఈ చిత్రానికి ముందు పిశాచి – 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఆ చిత్రాని కంటే ముందు ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. -
ఇడ్లీ, సాంబార్ అంటే ఊరుకునేది లేదు: శృతి హాసన్
ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా బతికేస్తుంటుంది హీరోయిన్ శృతిహాసన్. నటిగానే కాకుండా సింగర్‌గానూ తన సత్తా చూపింస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటుంది. అలా తాజాగా మరోసారి అభిమానులతో మాటామంతీ నిర్వహించింది. ఈ క్రమంలో తనకు ఎదురైన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసింది.ట్రై చేయొద్దుసౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడగ్గా.. అందుకు శృతి ఇలా రియాక్ట్ అయింది. ఓకే.. ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము. మీరు మమ్మల్ని అనుకరించలేరు.. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో రాసుకొచ్చింది.ఇడ్లీ..వడ..కాగా ఆ మధ్య జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో షారూఖ్ ఖాన్.. రామ్‌చరణ్‌ను అందరిముందు ఇడ్లీ వడ అని పిలిచాడు. అలా పిలవడాన్ని చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ తీవ్రంగా తప్పు పట్టింది. అంత పెద్ద హీరోను పట్టుకుని స్నాక్స్ పేరుతో పిలుస్తారా? అని మండిపడింది. శృతి హాసన్ విషయానికి వస్తే సలార్ సినిమాతో సందడి చేసిన ఆమె ప్రస్తుతం డకాయిట్ మూవీలో అడివిశేష్‌తో కలిసి నటిస్తోంది.చదవండి: హీరో వంటమనిషికి రూ.2 లక్షలా.. తన వంట చూస్తే..! -
దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్
కమల్ హాసన్ పేరు చెప్పగానే విలక్షణ నటుడు అనే పదం మాత్రమే గుర్తొస్తుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గీత రచయిత.. ఇలా కమల్‌కి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇతడి కూడా కూతురు శ్రుతి హాసన్ కూడా తక్కువేం కాదు. నటి, సంగీత దర్శకురాలు, గాయని, గీత రచయితగా గుర్తింపు సంపాదించింది. ఈమె ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం రాసిన ఇంగ్లీష్ పాటని తండ్రి కమలహాసన్ తమిళంలో అనువదించాడు. 'ఇనిమేల్' పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్)ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రుతిహాసన్.. రీసెంట్గా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. మీ తండ్రి కమలహాసన్ బయోపిక్‌ని మీరు తీస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. దానికి అవకాశమే లేదని బదిలిచ్చింది. తన తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొంది.ఇక్కడ ఎందరో మంచి దర్శకులు ఉన్నారని, తన తండ్రి కమలహాసన్ బయోపిక్ వాళ్లయితే అద్భుతంగా తీయగలరని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి సినిమాల విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'సలార్'లో నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?) -
Fathers Day: నాన్నే మొదటి హీరో.. స్పెషల్ ఫోటోలను పంచుకున్న స్టార్స్
నేడు(జూన్ 16) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు తమ నాన్నతో ఉన్న అనబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డకి నాన్నే మొదటి హీరో అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో సహా పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమ నాన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కేయండి. Father is the First Hero, to Every Child! Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge— Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q— Allu Arjun (@alluarjun) June 16, 2024Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH— shruti haasan (@shrutihaasan) June 16, 2024#ShrutiHaasan and #Ulaganayagan cute moments♥️♥️♥️♥️😍😍😍#Happyfathersday@ikamalhaasan@shrutihaasan#KamalHaasan#Indian2 pic.twitter.com/PyOfRsU6wF— Nammavar (@nammavar11) June 16, 2024 View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) https://www.instagram.com/p/C8RAhxbP7Ex/?img_index=1 View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
Shruti Haasan: ఫేవరెట్ కలర్ డ్రెస్‌లో పటాకాలా మెరుస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. -
హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్ సాంగ్ పాడిన శృతిహాసన్
‘నా డోర్స్ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్ శృతిహాసన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్ అరివు (సెవన్త్ సెన్స్) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తెలుగులో ఎక్కువ సక్సెస్అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్ అందుకోగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మింగిల్ అవ్వాలనుకోవడం లేదుఇకపోతే శృతిహాసన్‌కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్ ద డోర్. అండ్ ఐ ఈట్ ద కీ. ఐ వోంట్ బీ నీడింగ్ దట్ మీ ఎనీమోర్’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్ పాట రూపంలో పాడుతుందన్నమాట! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్ -
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి గుడ్ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే తాజాగా శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్ శృతి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.శృతి హాసన్ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్ స్పందించింది.కాగా.. శృతిహాసన్, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్ ప్రస్తుతం అడివి శేష్ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. -
షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం విశేషం. -
సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!
సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలతో పాటు ఆమెకున్న మయాసైటిస్ వ్యాధి గుర్తొస్తుంది. అప్పటివరకు వరసపెట్టి మూవీస్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. దీని వల్ల ఆమె.. 'చెన్నై స్టోరీ' అనే హాలీవుడ్ చిత్రం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!) సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత.. సదరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ కు వచ్చింది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ కథతో సాగే మూవీ. ఇందులో శ్రుతి.. అనూ అనే లేడీ డిటెక్టివ్‌గా నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్యే మొదలైన షూటింగ్‌లోనూ పాల్గొంది. ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు శ్రుతిహాసన్.. చైన్నె స్టోరి మూవీ నుంచి వైదొలగినట్లు టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందుకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో నటి సమంత, శృతిహాసన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో చూడాలి? (ఇదీ చదవండి: Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?) -
హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
రొమాన్స్‌తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్‌తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్‌లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
ఈ ఫోటోలోని వ్యక్తి స్టార్ హీరోయిన్ మదర్.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గతేడాది రిలీజైన సలార్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. అయితే గతంలో ఆమె సింగర్‌గా కూడా సుపరిచితమే. ప్రస్తుతం జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు పాట పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఫోటోలతో వీడియోను రూపొందించింది. నాకు అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం.. వారిద్దరు నా జీవితంలో అద్భుతమైన. ప్రత్యేక వ్యక్తులని తెలిపింది. వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టమని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మొదట వాణి గణపతిని పెళ్లాడిన కమల్ హాసన్.. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అక్షర హాసన్, శృతి హాసన్ జన్మించారు. కాని అనివార్య కారణాలతో 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
హీరోయిన్ శ్రుతిహాసన్.. మళ్లీ ఒకప్పటి ప్రొఫెషన్లోకి
శృతిహాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గతేడాది చిరు, బాలయ్యతో మొదలుపెట్టి.. చివర్లో ప్రభాస్ 'సలార్'తో హిట్ కొట్టి 2023ని ముగించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పక్కనబెట్టేసిన పాత ప్రొఫెషన్ని తిరిగి ఇప్పుడు మొదలుపెట్టేసింది. (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ చాలామందికి తెలుసు. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. హీరోయిన్ కాకముందు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసింది. తండ్రి కమల్ 'ఉన్నైపోల ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలు అయింది. ఆ తర్వాత నటిగా మారడంతో పాడటాన్ని పక్కనబెట్టేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తనలోని సింగర్‌ని శ్రుతిహాసన్ బయటకు తీయబోతుంది. జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇందులో 'కాదలిక్క నేరమిల్లై' అనే పాటని శ్రుతిహాసన్ పాడనుంది. అలా యాక్టింగ్ పరంగా ఛాన్సులు రాకపోతేనేం.. మళ్లీ సింగర్‌గా బిజీ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
స్టార్ డైరెక్టర్‌తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్‌తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హీరోయిన్ శ్రుతిహాసన్ డేరింగ్ స్టెప్.. ఫైనల్‌గా ఇన్నాళ్లకు?
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రుతిహాసన్.. కెరీర్ ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు ఫేస్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. చెప్పాలంటే గతేడాది తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో లక్కీ హీరోయిన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) గతేడాది తెలుగులో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్', 'హాయ్ నాన్న' (గెస్ట్ రోల్) సినిమాల్లో శ్రుతిహాసన్ నటించింది. ఇవన్నీ హిట్ అయ్యాయి. తాజాగా రవితేజ కొత్త మూవీలో నటించబోతుందని టాక్. హాలీవుడ్లో 'ది ఐ' అనే వెబ్ సీరీస్‌లోనూ శ్రుతి ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం ఈమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సొంత భాషలో దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రుతిహాసన్ నటించబోతుందట. శ్రుతిహాసన్ తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. విజయ్‌సేతుపతి 'లాభం' చిత్రంలో ఈ బ్యుటీ నటించింది. 2021లో ఇది రిలీజైంది. అప్పటినుంచి సొంత భాషలో చేయని శ్రుతిని ఇప్పుడు ఓ క్రేజూ సినిమాలో ఆఫర్ కొట్టేసిందట. వేలు నాచ్చియార్ అనే వీరవనిత పాత్రని శ్రుతిహాసన్ చేయబోతుందట. స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి వేలు నాచ్చియార్. రాజేష్ ఎం.సెల్వా ఈ ప్రాజెక్ట్ తీయబోతున్నారు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసే శ్రుతిహాసన్.. ఈ పాత్రలో చేస్తే సినిమా వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) -
శ్రుతిహాసన్ స్టన్నింగ్ లుక్.. నిధి అగర్వాల్‌ని ఇలా చూస్తే అంతే!
క్యూట్ ఫొటో షేర్ చేసిన ముద్దుగుమ్మ సమంత చీరలో మరింత అందంగా కనిపిస్తున్న మీనాక్షి చౌదరి కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న 'బలగం' బ్యూటీ లంగా ఓణీలో కేక పెట్టించేంత అందంగా బిగ్‌బాస్ శ్రీసత్య వింత ఔట్ఫిట్లో మత్తెక్కించే చూపులతో శ్రుతిహాసన్ 'నా సామి రంగ' షూటింగ్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన రుక్సార్ పట్టుచీరలో చిరునవ్వుతో టెంప్ట్ చేస్తున్న ఈషా చావ్లా పింక్ కలర్ డ్రస్‌లో అలా కనిపిస్తున్న యాంకర్ వర్షిణి View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by WARINA HUSSAIN (@warinahussain) View this post on Instagram A post shared by Nitya Naresh (@nityanaresh) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే
టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ శృతిహాసన్. అవును మీరు సరిగానే విన్నారు. 2023లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు. అయితే వీళ్ల సినిమాలన్నింటినిలోనూ శృతిహాసన్ ఉంది. అలా ప్రస్తుతం అదృష్ట కథానాయికగా మారిపోయింది. వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ వార్త ఎందుకొచ్చింది? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) గతంలో హీరో సిద్ధార్థ్‌తో శృతిహాసన్ రిలేషన్ లో ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరూ సెపరేట్ అయిపోయారు. కొన్నాళ్లకు ఓ ఫారినర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. పెద్ద టైమ్ తీసుకోకుండానే ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది. కొన్నాళ్ల నుంచి అసోంకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజరికాతో కలిసి ఉంటోంది. శృతి అయితే శంతను తన ఫ్రెండ్ అని చెబుతూ వస్తోంది. కానీ వీళ్లని చూస్తే మాత్రం అలా అనిపించదు. ఇకపోతే బాలీవుడ్లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు.. తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ శృతిహాసన్పై కామెంట్స్ చేశాడు. అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని, తనతో కూడా రూడ్‌గా ప్రవర్తించిందని ఒర్రీ చెప్పాడు. శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతిహాసన్.. 'నేను పెళ్లి చేసుకోలేదు. అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది' అని ఒర్రీ కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్) -
‘సలార్’ మూవీ రివ్యూ
టైటిల్: సలార్ పార్ట్ 1- సీజ్ఫైర్ నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీహాసన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు తదితరులు నిర్మాతలు: విజయ్ కె. దర్శకత్వం: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫీ: భువన గౌడ్ విడుదల తేది: డిసెంబర్ 22, 2023 ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు (రాధేశ్యామ్, ఆదిపురుష్) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(డిసెంబర్ 22)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడులైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా..యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. సలార్ కథేంటంటే.. ఆద్య(శృతిహాసన్) విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్(మైమ్ గోపీ) ద్వారా అస్సాంలో ఉన్న దేవా(ప్రభాస్) దగ్గరకు పంపిస్తాడు. దేవా బొగ్గు గనుల్లో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే.. ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్‌లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు? ఖాన్సార్ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్)ను చంపాలని కుట్ర చేసిందెవరు? ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్‌కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్ కోసం దేవా ఏం చేశాడు? ఆద్య ఎవరు? ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మేకింగ్ పరంగా ప్రశాంత్ నీల్‌కు ఓ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లో హీరోకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది. లెక్కలేనన్ని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్ సెంటిమెంట్ మస్ట్‌గా ఉంటుంది. సలార్‌లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీయఫ్‌లో మాదిరి ఇందులో కూడా ఖాన్సార్ అనే ఓ కల్పిత ప్రాంతాన్ని సృష్టించి, కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీయఫ్ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనీ సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు. కేజీయఫ్‌తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్ కాస్త తక్కువే అయినా.. అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి ఆ సీన్స్ అన్నీ థియేటర్లో ఈళలు వేయిస్తాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. ఈ విషయంలో ప్రశాంత్‌ని మెచ్చుకోవాల్సిందే. కథలో గందరగోళం.. కథనానికి నిలకడలేమి ఉన్నప్పటికీ.. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా తీర్చి దిద్దాడు. అయితే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచిపెడుతూ లైటర్ వేలో పార్ట్ 1ని కంప్లీట్ చేశాడు. దేవా, వరద రాజమన్నార్ల చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత భారీ ఎలివేషన్‌తో హీరో పాత్రని ఎంట్రీ చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాటకోసమే హీరో ఆగుతున్నాడు...ఒక్కసారి ఆమె వదిలేస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సెండాఫ్లో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే సీన్స్ గూస్బంప్స్ని తెప్పిస్తాయి. ఇలా రెండు పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్ సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. హీరో ఎలివేషన్స్.. యాక్షన్స్ సీన్స్‌తో ఫస్టాఫ్ అలరిస్తుంది. కానీ సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడేది చాలా తక్కువ సేపు. ఫస్టాఫ్‌లో అయితే రెండు, మూడు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ఎలివేషన్.. యాక్షనే. ఇక సెకండాఫ్‌లో కథంతా ఖన్సార్ ప్రాంతం చుట్టూ తిరిగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళానికి గురిచేస్తాయి. కుర్చి కోసం చేసే కుతంత్రలు కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే ఈ క్రమంలో వచ్చే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో సంహరించే సన్నివేశం గూస్బంప్స్ తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో ఇందులో కూడా తల నరికే సన్నివేశం ఉంటుంది. అది కూడా హైలెట్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే.. రాజమౌళి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చి దిద్దాడు. ఇక ఆ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయి నటించాడు. తల్లిమాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రబాస్ చేత కత్తిపట్టి విలన్లను నరుకుతుంటే.. ఫ్యాన్స్ ఆనందంతో ఈళలు వేయడం పక్కా. ఇక వరద రాజమన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించేది ఒకటిరెండు సన్నివేశాల్లోనే అయినా డిఫరెంట్ పాత్రలో కనిపించింది. మన్సార్ ప్రాంత కర్త(రాజు)గా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తిండిపోయే పాత్ర చేశాడు. శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఫస్టాఫ్‌లో ఆమే కీలకం. టినూ ఆనంద్, మైమ్ గోపీ, రామచంద్రరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. భువన గౌడ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి.. నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమా స్థాయిక తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
ప్రతి రోజు పబ్‌లో మద్యం తాగేదాన్ని: స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రవర్తన, పరివర్తనలకు శృతిహాసన్ కేరాఫ్‌గా మారారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సలార్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నటుడు కమలహాసన్ తనయగా.. తండ్రి కథానాయకుడిగా నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయౖమైన శృతిహాసన్, ఆ తరువాత హిందీలో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ) అయితే చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన నటి శృతిహాసన్. కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. ఈ ఏడాది తెలుగులో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విజయం సాధించటం విశేషం. అదే విధంగా నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హాయ్ నాన్న చిత్రంలో కూడా మోడల్‌గా కీలక పాత్రలో నటించారు. తాజాగా ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ భారీఅంచనాల మధ్య తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ సలార్ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిస అయ్యానని పేర్కొన్నారు. ప్రతి రోజు నా స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. అయితే తనకు ఎలాంటి డ్రగ్స్ సేవించే అలవాటు మాత్రం లేదని శృతిహాసన్ చెప్పారు. అయితే కొన్ని రోజుల తరువాత మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైందని తెలిపింది. ఎలాగైనా ఆ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికీ మద్యం మానేసి 8 ఏళ్లు పూర్తవుతోందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం తెలుగులో అడవి శేషు సరసన ఓ చిత్రం.. ఇంగ్లిష్‌లో ది ఐ అనే చిత్రంలోనూ శృతిహాసన్ కనిపించనుంది. (ఇది చదవండి: బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు) -
Shruti Haasan Photos: బ్లాక్ డ్రెస్‌లో మోస్ట్ బ్యూటిఫుల్‌గా శ్రుతి హాసన్ కుర్రకారుకు మత్తెక్కిస్తోందిగా!
-
సాలార్ ట్రైలర్ పై మిక్స్ రియాక్షన్ కి కారణం ఇదే..
-
శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు.. పూనమ్ బజ్వా హాట్ లుక్స్!
►గోల్డ్ డ్రెస్‌లో శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు ►బ్లూ కలర్ డ్రెస్సులో పూనమ్ బజ్వా హాట్ లుక్స్ ►ఎల్లో శారీలో ప్రియా భవానీశంకర్ హోయలు ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక స్మైలీ లుక్స్ ►ఫుల్‌గా చిల్ అవుతోన్న ఆదా శర్మ ►గ్లామర్‌తో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
రాజకీయాల్లోకి స్టార్ హీరో కూతురు.. క్లారిటీ ఇదే!
సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్. తరచుగా సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే శృతి.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్, మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ విషయమై శ్రుతిహాసన్ ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించగా... ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడంపైనే తనకు ఆసక్తి ఉందని చెప్పారు. కాగా.. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆల్బమ్‌ను కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రుతిహాసన్ చెప్పారు. (ఇది చదవండి: హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?) -
'సలార్' బ్యూటీ.. డిప్రెషన్ సమస్యకి చిట్కాలు చెప్పింది!
మానసిక ఒత్తిడి(డిప్రెషన్).. ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య ఇది. కారణాలు ఏంటనేది పక్కనబెడితే దీని బారిన పడి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు హీరోయిన్ శ్రుతిహాసన్ అద్భుతమైన చిట్కాలు చెప్పింది. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మానసిక ఒత్తిడి గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదు. నేను మాత్రం వీటి గురించి డైరీలో రాసుకుంటాను. రోజూ జిమ్ చేస్తారు. దీని వల్ల శరీరంలోని రసాయనాలు, హార్మోనులు సమతుల్యం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తుంది. రోజూ నచ్చిన వారితో మాట్లాడతాను. వారి మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడుకునే విషయాల్లో మంచి-చెడు గురించి ఆలోచిస్తానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్ 'సలార్'లో హీరోయిన్. అలానే హాలీవుడ్ మూవీ 'ది ఐ'లోనూ యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్) సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
యువరాణి గెటప్‌లో చిట్టి.. బ్యాక్ పోజులో అనసూయ!
సెల్ఫీ పోజులతో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి బ్లాక్ డ్రస్‌లో శ్రుతిహాసన్ బుసలకొట్టే స్టిల్స్ పింక్ చీరలో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింపుల్ ఔట్ఫిట్లో కాజల్ అగర్వాల్ అందాలు రాణి గెటప్‌లో రాజసం చూపిస్తున్న ఫరియా సన్నజాజి తీగలా శ్రియ అందాల విందు పై యాంగిల్ పోజుల్లో కృతిసనన్ చెల్లెలు రూట్ మార్చిన అనసూయ.. చీరలో సోయగాలు View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Jose Charles (@picstory_josecharles) -
'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్
హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పేరుకే హీరోయిన్ కానీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. నటిగా పేరు తెచ్చకున్నా, అంతకు ముందే సంగీతంపై ఆసక్తితో ఆ రంగంలో పలు ప్రైవేటు పాటల ఆల్బమ్స్ చేసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యింది. తండ్రి కమలహాసన్ హీరోగా నటించిన 'ఉన్నైప్పోల్ ఒరువన్' చిత్రానికి సంగీతమందించింది. అలానే లిరిక్ రైటర్, సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు 'సలార్' కోసం సాహసం చేసేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ!) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేస్తున్న శ్రుతి హాసన్.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. హిట్స్ అందుకుంది. ఈమె నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు ఈ మధ్యే శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఓవరాల్ గా ఐదు భాషల్లోనూ ఈమె సొంత గొంతే వినిపించనుంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పూర్తి చేసిన ఈమె.. మరో రెండింటివి కూడా కంప్లీట్ చేసే బిజీలో ఉంది. సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో చెప్పడానికే తంటాలు పడుతుంటారు. అలాంటిది శ్రుతి.. ఐదు భాషల్లో చెప్పడమంటే సాహసమే. ప్రస్తుతం తెలుగులో 'హాయ్ నాన్న', ఇంగ్లీష్‌లో 'ది ఐ' అనే సినిమాలో నటిస్తోంది. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) -
హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్. అలా పండగ విన్నర్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలో ప్రభాస్ 'సలార్'తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇది ఎవరికో కౌంటర్ వేసినట్లు ఉంది. దీంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. పోస్టులో ఏముంది? 'నేను కొందరినీ గమనిస్తుంటారు. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి సైలెంట్ గా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుంది' అని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) ఇబ్బంది పెట్టారా? అయితే ఈ పోస్ట్ చూస్తే శ్రుతిహాసన్.. ఎవరికో కౌంటర్ వేస్తున్నట్లు అనిపించింది. అలానే ఈ బ్యూటీ ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారా అనే సందేహం కూడా వస్తోంది. అయితే ఇలా సడన్ గా కర్మ సిద్ధాంతం టైపులో పోస్ట్ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది. బాయ్ ఫ్రెండ్‌తో గతంలో సిద్ధార్థ్, ఓ ఫారెన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిన శ్రుతిహాసన్ ప్రస్తుతం శంతను హజరికా అనే కుర్రాడితో రిలేషన్లో ఉంది. అయితే అతడిని ఫ్రెండ్ అని చెబుతుంది తప్పితే బాయ్ ఫ్రెండ్ అని ఎక్కడా అనట్లేదు. అయితే ప్రస్తుతం పెట్టిన కర్మ పోస్ట్ కూడా వీళ్ల రిలేషన్ గురించి ఏమైనా కామెంట్స్ చేసిన వాళ్లకా అనే సందేహం వస్తోంది. ఈ విషయాలపై స్వయంగా శ్రుతిహాసన్ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకు రాదు. (ఇదీ చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ) -
అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్‌లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ! ) అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్‌లు లేకపోతే వెంటనే ఫ్లాట్‌కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్‌ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది. ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్‌లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!) -
అప్పుడేమో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్! (ఫోటోలు)
-
ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో
మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది. అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే) -
వీకింగ్స్ సిరీస్ పాత్రల్లో సౌత్, బాలీవుడ్ నటులు.. ఏఐ మాయాజాలం! (ఫొటోలు)
-
షాపింగ్‌లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్‌తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్‌లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. అయితే తాజాగా ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండపడుతున్నారు. మరికొందరేమో దారుణమైన కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) శృతిహాసన్ తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ..' శాంతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు.' అంటూ శాంతనుకు ముద్దు పెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో రొమాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
మాస్ హీరోల దాడి.. అందాల భామలకు మళ్లీ కష్టాలే!
ఇటీవలకాలంలో హీరోయిన్స్ ...హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతే కాదు హీరోలతో పాటు సమానంగా స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ట్రెండ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో హీరో సెంట్రిక్ సినిమాల హవా మొదలయింది. మాస్ హీరోల సినిమాల దాటికి వుమెన్ సెంట్రిక్ సినిమాలకి అనుకున్న రేంజ్ లో హైప్ రావటం లేదు.. దీంతో స్టార్ హీరోయిన్స్ సైతం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. హీరోల ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ తో స్క్రీన్ నిండిపోవటంతో.. హీరోయిన్స్ పాటలకి..రెండు సీన్స్ కి పరిమితం అయిపోతున్నారు. గతంలో కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్మూలా ఉండేది..ఆరు పాటలు...ఆరు ఫైట్స్...మధ్య లో హీరోయిన్ తో రెండు మూడు సీన్స్ ... ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో...హీరోయిన్స్ స్క్రీన్ స్పెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సంక్రాంతి కి రిలీజైన కమర్షియల్ మూవీస్ చూస్తే...ఈ విషయం క్లారిటీగా అర్ధమైపోతుంది. వాల్తేరు వీరయ్య...వీర సింహారెడ్డి..వారసుడు సినిమాల్లో హీరోయిన్స్ నామా మాత్రంగానే కనిపించారు. వాళ్ల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసినా..పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కించుకోలేకపోయింది. ఇక వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ పాటలకే పరిమితం అని చెప్పాలి. వారసుడులో నటించిన రష్మిక మందన్న పరిస్థితి కూడా అలానే అయింది. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపిన సినిమాలు కెజిఎఫ్ చాపర్ట్ వన్..కెజిఎఫ్ ఛాప్టర్ 2.. ఈరెండు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కానీ స్క్రీన్ స్పెస్ తక్కువనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలతో బజ్ క్రియేట్ చేయలేకపోతున్న హీరోయిన్స్ కి... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలిసి రావటం లేదు. ఈ మధ్య యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత..అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సమంత పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించినా..ఆ తర్వాత ఎక్కడా సమంత పేరు వినబడలేదు. ఇక కమర్షియల్ సినిమాలనే నమ్ముకున్న కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే... లాంటి హీరోయిన్ల పేర్లు సినిమా ఎనౌన్స్మెంట్ ...మూవీ ఓపెనింగ్స్ లో తప్ప ఎక్కడ వినిపించటం లేదు. ఇక సినిమాలు సక్సెస్ అయితే హీరో దర్శకులు గురించి మాట్లాడుతున్నారు తప్ప... హీరోయిన్స్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. హీరో సెంట్రిక్ సినిమాలకు క్రేజ్ రావటంతో...ఈ అందాల భామలను ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. సో..మొత్తానికి కమర్షియల్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై నల్లపూసల్లా మారిపోయిన హీరోయిన్స్ క్రేజ్ తగ్గిందనే మాట ..ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. -
అఫీషియల్: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB — Netflix India South (@Netflix_INSouth) February 7, 2023 -
హీరోయిన్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్
వాల్తేరు వీరయ్య హీరోయిన్‌కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిరు విష్ చేశారు. ఈ మేరకు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే' పాటలోని ఫోటోను జత చేశారు. దీంతో మెగా అభిమానులు సైతం శృతిహాసన్‌కు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ ట్విటర్లోరాస్తూ..' ప్రియమైన శ్రుతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. వృత్తి పట్ల మీ అంకితభావం, మీకున్న బహుముఖ ప్రజ్ఞతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Happy Birthday Dear @shrutihaasan Have a Wonderful year ahead and May you scale greater heights with your passion & multi talents!!! 💐💐 pic.twitter.com/YV0sCb8Yzf — Chiranjeevi Konidela (@KChiruTweets) January 28, 2023 -
నీకన్నా బాగా చూసుకునే వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది తమిళ భామ. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. కాగా.. ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతి హాసన్, తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన ప్రేమను వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ..' ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు' అంటూ ఫన్నీ ఎమోజీలు జతచేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శృతి హాసన్ హాజరు కాకపోవడంతో ట్రోల్స్‌కు గురైంది. దీంతో తాను అనారోగ్య కారణాలతోనే హాజరు కాలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ఆమె ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగినట్లే విడుదలైన తొలిరోజు నుంచే మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. GOD OF MASSES has conquered the US Box Office 🔥🔥 VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses $ 1M+ and is continuing its glorious run 💥 Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/eL6vwuMVO7 — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 -
‘వాల్తేరు వీరయ్య’మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్‌ఫాదర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన చిత్రంకావడం.. అందులో రవితేజ కీలక పాత్ర పోషించడంతో ‘వాల్తేరు వీరయ్య’పై తొలి నుంచే హైప్ క్రియేట్ అయింది. ఇక పాటలు, టీజర్ కూడా అదిరిపోయాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగాస్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వాల్తేరు వీరయ్య ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు. 1st half k ramppp!! Racy & no dull moments. Intro, boss party song, comedy & interval bang rough aadinchaadu BOSS!! Thank you @dirbobby . 2nd half deenlo sagam unna enough. #WaltairVeerayya — Aditya (@Ad1tyaTwitz) January 13, 2023 2nd half is abv avg, Chiru & RT scenes super! Rest feels okayish. Songs, bgm, dance, entertainment & Boss’s best after re-entry!! Pakka commercial entertainer & will turn out to be a hit! #WaltairVeerayya — Aditya (@Ad1tyaTwitz) January 13, 2023 సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ర్యాంప్, ఇంట్రో, బాస్ పార్టీ సాంగ్, కామెడీ, ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ యావరేజ్ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Chiru in his element 😍😍😍 Boss mass entoo malli gurthu chese samayam ochesindhi. #WaltairVeerayya kummsss! pic.twitter.com/jFqNYd6sXd — Teja Sundar (@tejachoujarla) January 13, 2023 వాల్తేరు వీరయ్య యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాను చిరంజీవి తన భూజాన వేసుకొని నడిపించారని చెబుతున్నారు. రవితేజతో వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కామెడీ బాగుంది కానీ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదని కామెంట్ చేస్తున్నారు. #WaltairVeerayya Overall an Average Commercial Entertainer! Film is carried by Chiru along with a few good commercial sequences with RT and dance numbers. However, some of the comedy goes over the top and emotion does not work as expected. BGM is alright. Rating: 2.5-2.75/5 — Venky Reviews (@venkyreviews) January 12, 2023 Annayya Arachakam Aarambham 🔥😎#WaltairVeerayya IN CINEMAS NOW WORLDWIDE🔥 Book your tickets now! - https://t.co/qhW8HtSDfg MEGASTAR @KChiruTweets MASS MAHARAJA @RaviTeja_offl pic.twitter.com/3WU5ckIgWg — Pratheek Pr (@propratheereddy) January 13, 2023 @dirbobby great first half. Nice intro and great interval bang by @ThisIsDSP #WaltairVeerayya — Apen (@abk_inshort) January 13, 2023 Completed my show 1st half : enty is not up to Mark and forced scenes unwanted cringe scenes flat narrations.. 2nd half : nothing impressive Raviteja is good but chiru un nature acting made cringe and forceble.. Rating 1.5/5 strictly for none#WaltairVeerayya — viraj gowda (@thesnowdragonn) January 13, 2023 1st Half BlockBuster Dear Belli fans meru entha try chesina avvadhu paaripondi 🤣🤣🤣#WaltairVeerayya — ur's kishor (@Saikish89075170) January 13, 2023 #WaltairVeerayya Other than title card nothing seems to be interesting .. Lite #chiru, nee craze e movie hit avvadam valla emi peragadhu and flop avvadam valla thaggadu 👍. YouTube lo small channels ki interviews stop chesi range maintain cheye chaalu 🙏. — Kumar_Nfan (@Kumar_ind90) January 13, 2023 Excellent frist half 🔥 Boss vintage comedy💥 Inka second half #RaviTeja entry tarawatha peaks kii vellipodi 🔥 Sankranti winner manama🤙 Congrats annd @dirbobby @RaviTeja_offl @KChiruTweets @MythriOfficial #WaltairVeerayya https://t.co/RezdXhZSZf — Nandu😈 (@MASS_99_99) January 13, 2023 #WaltairVeerayya 1st Half Done✅ . Chiru Intro Raw and Massiest💥 . Comedy works😊 . Chiru Mannerisms 😍 . Finally "POONAKALU INTERVAL BANG"💥⚡💥⚡💥⚡💥⚡💥⚡ OVERALL A FIRST GOOD HALF✅⚡ — Cheemthil🗯️ (@Thulasinath1212) January 13, 2023 -
మా ఇల్లే పాన్ ఇండియా
శ్రుతీహాసన్ ఏదీ ప్లాన్ చేయరు. సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇన్నేళ్లు ఉండాలని ΄్లాన్ చేయలేదు. సినిమాకి దూరం కాకూడదనుకుంటారు. అంతే.. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’, గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో ఈ సంక్రాంతికి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారామె. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ 12న, 13న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా శ్రుతి చెప్పిన విశేషాలు.. రెండు చిత్రాలతో మీతో మీరే పోటీ పడటం ఎలా ఉంది? నిజానికి ఇది ఊహించలేదు. తొమ్మిదేళ్ల క్రితం నా రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. అయితే పండగప్పుడు కాదు. ఫెస్టివల్ టైమ్‌లో రెండు పెద్ద చిత్రా లతో.. ఇద్దరు లెజెండరీ (చిరంజీవి, బాలకృష్ణ) హీరోల సినిమాలతో రావడం ఆశీర్వాదం అనుకుంటున్నా. రెండు సినిమాలూ హిట్టవ్వాలనే ఓ టెన్షన్ ఉంటుంది కదా... టెన్షన్ అనేది సెట్లో పని చేస్తున్నప్పుడు మాత్రమే. ఎక్స్ప్రెషన్ సరిగ్గా వచ్చిందా? లేదా డైలాగ్ బాగా చెప్పానా? లేదా అనే టెన్షన్ ఉంటుంది. సెట్ నుంచి బయటికొచ్చేస్తే టెన్షన్ ఉండదు. ఎందుకంటే మిగతాదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ‘వాల్తేరు..’, ‘వీరసింహా...’లలో ఏ సినిమాలో మీ పాత్ర బాగుంటుందనే పోలిక రావడం సహజం.. నిజమే. అయితే రెండు సినిమాల కథలు, ΄ాత్రలు, ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటాయి. నా ΄ాత్రలు డిఫరెంట్‌గా, సవాల్‌గా ఉంటాయి. ‘వీరసింహా..’లో నా ΄ాత్ర కామెడీగా ఉంటుంది. కామెడీ చేయడం కష్టం. ‘వాల్తేరు...’లో నా ΄ాత్రని బాగా రాశారు. చిరంజీవి, బాలకృష్ణలతో డ్యాన్స్ చేయడం... నైస్ ఎక్స్పీరియన్స్. ‘వీరసింహారెడ్డి’లోని ‘సుగుణసుందరి...’ స్టెప్ బాగా రీచ్ అయ్యింది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లోని ‘శ్రీదేవి... చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది. ఒక పాట మంచి ఎండ (సుగుణ సుందరి)లో.. మరో పాట (నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరు) విపరీతమైన చలిలో చేసిన అనుభవం గురించి? ఇండియన్స్‌కి ఎండ సమస్య కాదు. కానీ చలి తట్టుకోవడం కష్టం. పైగా పల్చటి చీరలో మైనస్ 11 డిగ్రీల చలిలో చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో హీరోయి న్లకే సమస్య. హీరోలు ఫుల్‌గా కవర్ చేసుకునే వీలు ఉంటుంది... యూనిట్ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్ వేసుకుంటే మేం చలిలో డ్యాన్స్ చేశాం (నవ్వుతూ). సార్ (చిరంజీవి) కూడా పెద్దగా కవర్ చేసుకోలేదు. ఒక కోట్.. అంతే. ‘వీరసింహారెడ్డి’ వేడుకలో ΄పాల్గొన్న మీరు ‘వాల్తేరు వీర య్య’ వేడుకలో ΄పాల్గొనలేదు.. కారణం? ఆరోగ్యం బాగాలేదు. పూర్తిగా రికవర్ కాకపోవడంతో వేడుకకు వెళ్లలేకపోయా. ఐయామ్ సో సారీ. ఆ మధ్య మీకు తెలుగులో గ్యాప్ వచ్చింది... ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలతో, యంగ్ హీరో ప్రభాస్‌తో ‘సలార్’.. వరుసగా సినిమాలు చేయడం ఎలా ఉంది? మా ఇంట్లో మా అమ్మానాన్నని చూసి సినిమా అనేది ఫ్యామిలీ అనిపించింది. ఇక ఇండస్ట్రీ, ఆడియన్స్ పరంగా తెలుగు నాకు రియల్ ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే సౌత్‌లో నేను పరిచయం అయింది తెలుగు సినిమాల ద్వారానే. ఒక కొత్త ప్రాంతంలో నాకు మంచి ఆహ్వానం దక్కింది. ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. హిట్ ఇచ్చారు. ‘క్రాక్’ తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ? ‘సంక్రాంతి’ అనే పదం నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే నా లైఫ్‌లోకి వచ్చింది. మాకు తమిళ్లో ‘పొంగల్’ అంటాం. పండగ రోజు ΄పొంగలి వండుతాను. పూజ చేస్తాను. ఫ్యామిలీతో గడుపుతాను. గోపీచంద్ మలినేని మిమ్మల్ని లక్కీ హీరోయిన్ అంటారు. లక్‌ని మీరు నమ్ముతారా? లేదు.. హార్డ్ వర్క్‌ని, దేవుడిని నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా నన్ను లక్కీ అంటే వాళ్లకు థ్యాంక్స్ చెబుతాను. అయితే నేను లక్, అన్లక్ని నమ్మను. ఎందుకంటే ఒకప్పుడు నన్ను ‘అన్‌లక్కీ’ అన్నారు. ఆ తర్వాత ‘లక్కీ’ అన్నారు. వేరేవాళ్లు నన్ను అలా అనడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను. -
నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి ట్రైలర్ అవుట్
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ ఒంగోలులో జరగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. 'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఫైట్స్ అభిమానులను అలరించనున్నాయి. 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' అనే డైలాగ్ హైలెట్‌గా నిలవనుంది. ట్రైలర్ చూస్తే సీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. -
'భగ భగ భగ మండే.. మగాడు వీడే'.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా హైలెట్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్, 'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. ' అ’నే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. ఇప్పటికే రిలీజైన పాటలు సినిమాపై క్రేజ్ మరింత పెంచాయి. తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్‌తో సినిమాపై మరింత హైప్ పెరగనుంది. -
'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే..' వాల్తేరు వీరయ్య సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ పేరుతో తొలి సింగిల్ పాటను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. రాయే రాయే రాయే చేసేద్దాం రబ్బో' అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో కొద్ది రోజుల క్రితమే షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
వాల్తేరు వీరయ్య క్రేజీ అప్డేట్.. రేపే రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మాంచి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బాస్ పార్టీ' అంటూ వచ్చిన అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. తాజాగా మరో సింగిల్ పాటను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాటను సోమవారం సాయంత్రం 04.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా' అంటూ సాంగ్‌ను చిరు ఇప్పటికే తన ఇన్‌స్టాలో లీక్ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. #SrideviChiranjeevi will surely rule your playlists ❤️🔥 2nd single from #WaltairVeerayya out tomorrow at 4:05PM💥#WaltairVeerayyaOnJan13th Mega⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/2OAWF8k0kz — Mythri Movie Makers (@MythriOfficial) December 18, 2022 -
బాలయ్య 'వీరసింహారెడ్డి'.. ఆ సాంగ్ చూసేయండి..!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ వీడియో లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
ఎవ్వరికీ చెప్పొద్దు.. ఆ సాంగ్ లీక్ చేస్తున్నా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ ప్రత్యేక సాంగ్‌ను ఫ్రాన్స్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటను దట్టమైన మంచు పర్వతాల్లో శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవిపై చిత్రీకరించారు. తాజాగా మెగాస్టార్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈనెల 12న నేను శృతిహాసన్‌తో చేసిన ఓ సాంగ్ ఫినిష్ చేశాం. ఈ షూట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ లోకేషన్స్ కానీవ్వండి. సాంగ్ కానీవ్వండి. సో బ్యూటీఫుల్. ఈ లోకేషన్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది. ఆ పేరు లేజే లేజే. ఇది స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్లో ఉన్న మౌంటెన్స్‌లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ పాట కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడింది. దాదాపు -8 డిగ్రీల చలిలో ఈ పాటను షూట్ చేశాం. నిజంగా ఆ లోకేషన్ చాలా అందంగా ఉంటుంది. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు నేను ఆగలేకపోయాను. అయితే మీకోసం ఈ పాట నుంచి ఓ చిన్న బిట్‌ను లీక్ చేస్తున్నా. ఎవరికీ చెప్పకండి. త్వరలోనే మీ ముందుకు లిరికల్ సాంగ్ రానుంది.' అంటూ మెగాస్టార్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవిని.. రాయే రాయే రాయే' అంటూ సాగే సాంగ్ లిరిక్స్ లీక్ చేస్తున్నా అంటూ నవ్వుతూ చెప్పారు మెగాస్టార్. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
‘వాల్తేరు వీరయ్య’ తొలి పాట వచ్చేసింది.. ‘బాస్ పార్టీ’ అదిరిపోయింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలియజేసేలా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశాడు. నకాష్ అజీజ్, హరిప్రియ అద్భుతంగా ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. కలర్‌ఫుల్ చొక్కా, లుంగీ, చెవి పోగు, మెడలో గొలుసు, గడియారం, షూస్.. మాస్ అప్పీల్లో ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నారు చిరంజీవి. ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీకి తగ్గట్టుగా ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన ట్విటర్లో వెల్లడించింది. (చదవండి: మెగాస్టార్‌కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!) వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ సింగిల్ ఈనెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలోని ఓ ఐటం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించనుంది. Get ready for the biggest party of the year 🤩🤩#WaltairVeerayya first single #BossParty on November 23rd at 4.05 PM 💥💥 Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @UrvashiRautela @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/s725DcvosQ — Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2022 -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా : హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు. కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. 'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది. -
వైజాగ్ టు హైదరాబాద్
చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటీవల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ వైజాగ్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, రవితేజలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షెడ్యూల్లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రవితేజ తిరిగి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిరంజీవి. కాగా ‘వాల్తేరు వీరయ్య’ కొత్త షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం. -
నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్
Shruthi Haasan About Relationship With Shanthanu Says He Is Amazing: 'గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.' అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్‌లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం' అని పేర్కొంది. చదవండి: స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్'.. -
నీ ఆస్తి ఎంత? అన్న ప్రశ్నకు శ్రుతి హాసన్ ఆన్సరిదే!
శ్రుతి హాసన్.. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయిక. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే మాత్రం ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ. అయితే దొరికిందే సందనుకునే కొందరు నెటిజన్లు చిత్రవిచిత్ర ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ ఆమె ఆన్సర్ ఇవ్వలేదంటే గూగుల్ తల్లిని పదేపదే అడుగుతూ సమాధానాలు రాబడుతుంటారు. తాజా ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్.. తన గురించి గూగుల్‌లో ఎక్కువగా ఆరా తీసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అందులో భాగంగా ఆమె ఫోన్ నంబర్ అడగ్గా.. 100 అని ఇంతకుముందు కూడా చెప్పానుగా అని బదులిచ్చింది. రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. 'ఓహ్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసు.. శ్రుతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక ఎవరు? ఇదేగా.. ఎందుకంటే దీన్ని నేను గూగుల్ చేశాను. అక్కడ కనిపించిన మిగతా ప్రశ్నల పరంపరను చూసి తెగ నవ్వుకున్నాను. ఇంతకీ నా ఆన్సరేంటంటే, అవును, నేను డేటింగ్ చేస్తున్నాను' అని తెలిపింది శ్రుతి హాసన్. 'నీ ఆస్తి మొత్తం ఎంతుంటుంది?' అన్న ప్రశ్నకు 'శ్రుతి హాసన్ దాన్ని కనుగొనే పనిలోనే ఉంది, కానీ తను అదింకా పెరగాలనుకుంటోంది' అని చెప్పుకొచ్చింది. -
ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి? ధీటైన జవాబిచ్చిన హీరోయిన్
హీరోయిన్ శృతి హాసన్ 2021కి వీడ్కోలు చెప్పేముందు అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే సంధించమని సూచించింది. దీంతో ఫ్యాన్స్ దొరికిందే ఛాన్స్ అంటూ నానా ప్రశ్నలు అడిగి ఆమె సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'నీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి?' అని అడిగాడు. ఈ ప్రశ్నతో చిర్రెత్తిపోయిన శృతీ.. నీకెంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు? బహుశా ఎవరూ లేరేమో ఒకవేళ ఉన్నా హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ అయి ఉంటారులే అంటూ కౌంటరిచ్చింది. కాగా శృతీ హాసన్ ప్రస్తుతం సాంతను హజారికతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆమె చివరిసారిగా లాభం సినిమాలో కనిపించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. -
సమంత కన్నా ముందు.. చై ఆ హీరోయిన్‌తో డేటింగ్, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట..!
Report Says Before Samantha Naga Chaitanya Wanted to Marry Shruti Haasan: టాలీవుడ్ మోస్ట్ రోమాటింక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగ చైతన్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి అందరికి షాక్ ఇచ్చారు. విడాకులు ప్రకటన అనంతరం ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు. సమంత, చైతన్యలు విడిపోయినప్పటికి.. వీరద్దరికి సంబంధించి నిత్యం ఏదో వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత మీద సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ముఖ్యంగా చై పుట్టిన రోజు నాడు సమంత అతడికి శుభాకాంక్షలు చెప్పలేదు.. పైగా తన పెంపుడు కుక్కకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపడంతో నెటిజన్లు సామ్ మీద ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. (చదవండి: సమంతపై నెటిజన్ల ఫైర్) ఇదిలా ఉండగా.. తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. సమంత కన్నా ముందు చై.. ఓ స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరీ ఏం జరిగిందో తెలియదు కానీ వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదనేది వార్త సారంశం. మరి చై అంత గాఢంగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. విలక్షణ నటడు కమల్‌హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ అట. చై-శ్రుతి హాసన్‌ల రిలేషన్ గురించి KoiMoi.com ప్రచురించింది. ఈ వెబ్సైట్లో ఉన్నదాని ప్రకారం.. చై, శ్రుతి హాసన్‌లకు 2013లో పరిచయం ఏర్పడింది. ఇక సమంతను పెళ్లి చేసుకోకముందు అనగా.. 2017లో చై, శ్రుతి హాసన్‌తో డేటింగ్ చేశాడట. శ్రుతి, చైతన్యల మధ్య సిరీయస్ రిలేషన్ కొనసాగిందని.. ఒకానొక సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారట. ఏం జరిగిందో తెలియదరు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. వీరద్దరూ కలిసి 2018లో విడుదలైన ప్రేమమ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. (చదవండి: బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..) ఇక శ్రుతితో బ్రేకప్ తర్వాత అదే ఏడాది అనగా.. 2017లో చై-సామ్‌ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్లకు ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక గతంలో కూడా నాగచైతన్య.. మరో స్టార్ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడని.. ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని భావించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్ టైమ్ ఇది -
కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కమల్‌హాసన్
విలక్షణ నటుడు కమల్‌హాసన్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రయాణం ఆరంభిస్తున్నారు. యువతకు ఖాదీని దగ్గర చేయాలని, నేత కార్మికులకు చేయూత అందించాలని ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నారు. ‘‘మన దేశానికి ఖాదీ ఓ గర్వకారణం. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది నా ఆలోచన’’ అన్నారు కమల్‌హాసన్. కాగా వచ్చే నెల కమల్ అమెరికా వెళ్లాలనుకుంటున్నారట. అక్కడి చికాగో నగరంలో తన బ్రాండ్‌ని ఆవిష్కరించాలనుకుంటున్నారని సమాచారం. నవంబరు 7న కమల్ పుట్టినరోజు. ఆ రోజే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ ఉంటుందని టాక్. కమల్, ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అమృతా రామ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతోందని తెలిసింది. -
తన బాడీలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిప్లై ఇచ్చిన నటి
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చింది. ఎక్కువ ఆ పార్ట్‌కు ఖర్చు చేశాను.. సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్ తరువాత రీఎంట్రీలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఇది శ్రుతి హాసన్ వీటిని మార్చిందనే చెప్పాలి. తెలుగులో వకీల్‌సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ఈ రకంగా శ్రుతి స్పీడ్ చూస్తుంటే కాస్త విరామం వచ్చినప్పటికీ తిరిగి తన కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ముద్దు గుమ్మ ఓ అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో క్రాక్ నటి ఇచ్చిన రిప్లైకి షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. -
ఆవ్యక్తి గురించి కథ రాస్తున్నా, ఎగ్జయిటింగ్‌గా ఉంది: శ్రుతీహాసన్
శ్రుతీహాసన్ మంచి నటి. అది అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ మంచి గాయని. అది కూడా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు. మంచి రచయిత్రి కూడా. కవితలు రాస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకి కథ రాస్తున్నారు. ఒక తమిళ సినిమా కోసం కథ రాసే పనిలో ఉన్నారామె. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘చెన్నైకి సంబంధం లేని ఒక వ్యక్తి గురించి ఈ కథ రాస్తున్నాను. మా నాన్నగారు నన్ను రైటర్‌గా చూడాలనుకునేవారు. చిన్నప్పుడు నేను రాసినవి చూసి పెద్ద రచయిత్రిని అవుతానని అనుకునేవారు. నన్ను సినిమా రైటర్ని చేయాలనుకున్నారు. అందుకే వేసవి సెలవుల్లో రైటింగ్ కోర్సులు కూడా చేశాను. ఇప్పుడు రైటింగ్ మీద బాగా దృష్టి పెట్టాలనుకున్నాను. నా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం నాకు ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ -
బాయ్‌ఫ్రెండ్ కోసం వంట చేసిన హీరోయిన్ శ్రుతీహాసన్
-
నా క్యారెక్టర్‌కు ఆ సీన్స్ లేవు: సలార్ భామ
ఇప్పటివరకూ ప్రభాస్‌తో తప్ప తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించారు శ్రుతీహాసన్. ‘సలార్’ సినిమాతో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది భారీ యాక్షన్ డ్రామా మూవీ. హీరో మాత్రమే కాదు.. హీరోయిన్‌కి కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయనే టాక్ వినిపించింది. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘ఇది యాక్షన్ సినిమానే అయినా నా క్యారెక్టర్‌కు ఫైట్స్ లేవు. ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తి చేశాను. ప్రభాస్‌తో సినిమా చేయడం చాలా బాగుంది. తను నిజంగా చాలా మంచి వ్యక్తి. కొంతమంది తాము నిరాడంబరంగా ఉంటున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభాస్ సహజంగానే నిరాడంబరంగా ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్. లొకేషన్లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ఆయన సెట్లో ఉంటే షూటింగ్ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది’’ అన్నారు. బాయ్‌ఫ్రెండ్ కోసం... ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు శ్రుతీహాసన్. తమ మధ్య ఉన్న బంధం గురించి ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా, శ్రుతీహాసన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంతను కూడా చెన్నైలోనే ఉన్నారు. అతని కోసం చెఫ్‌గా మారారు శ్రుతి. ‘రామెన్’ తయారు చేశారు. రామెన్ అంటే జపనీస్ న్యూడుల్స్ సూప్. శ్రుతి తయారు చేస్తున్నప్పుడు వీడియో తీసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు శంతను. చదవండి: చెర్రీకి జోడి.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే! ‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..! -
క్రాక్ నుంచి ‘మాస్ బిర్యానీ’ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాను గత ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. తక్కువ సమయంలోనే కోటి వ్యూస్ అందుకుంది. క్రాక్ సినిమాతో రవితేజ కచ్చితంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం క్రాక్ సినిమాలో ‘మాస్ బిర్యానీ’ లిరికల్ పాటను విడుదల చేశారు. ‘ఓసి నా క్లాస్ కల్యాణి...పెట్టవే మాస్ బిర్యాని అంటూ’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ నంబియార్, సాహితి చాగంటి పాడారు. చదవండి: ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్లో ఉంటుంది ఈ పాట రవితేజ అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ బస్టర్ సినిమాతో మాస్ మహారాజ్ మళ్లీ రంగంలోకి వచ్చారని, ఇక థియేటర్లలో రచ్చ రచ్చేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా క్రాక్ రూపొందుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్’ సినిమాలోని పాటలు కూడా అంత హిట్ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉందని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ‘క్రాక్’ సినిమా నుంచి నేడు విడుదల అయిన ‘క్రాక్ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్లో వినిపిస్తుంటుందని పేర్కొన్నారు. చదవండి: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఇక రచ్చ రచ్చే -
డైరెక్టర్‌తో స్టెప్పులేయించిన శ్రుతీ హాసన్
నటి శ్రుతీ హాసన్... స్టార్ హీరో కూతురిగా కంటే సొంత టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా గాయనిగా, డ్యాన్సర్‌గా సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్న కోణాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తెలుగులో చివరగా పవన్ కల్యాణ్‌తో కలిసి కాటమ రాయుడు సినియాలో నటించిన శ్రుతి.. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: వకీల్ సాబ్ సెట్లో అడుగుపెట్టనున్న శృతి ఇక ఈ సినిమా షూటింగ్ కొంత వరకు మినహా మొత్తం పూర్తయ్యింది. మిగిలిన పాటల భాగాన్ని షూట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో తన క్రాక్ సినిమా డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి శ్రుతీ హాసన్ స్టెప్పులు వేశారు. మిర్రర్ ముందు మ్యూజిక్ పెట్టి సెల్ఫీ వీడియో తీస్తున్న శ్రుతి హాసన్ కాలు కదిపి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూసిన గోపిచంద్ ముందుగా డ్యాన్స్ చేసేందుకు బిడియంగా ఫీల్ అయ్యారు. అయినప్పటికీ మెల్లమెల్లగా డైరెక్టర్‌తో కూడా శ్రుతీ డ్యాన్స్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎప్పుడూ రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ బిజీగా ఉండే డైరెక్టర్ ఇలా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతీహాసన్ -
దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్ ఫుల్, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్ Happy Diwali to everyone !! May this Diwali guide us into the light from this rather strange year !! Wishing you and your family all the love and light - a lot of people won’t be able to celebrate in the same way due to financial or emotional reasons so keep them in your prayers — shruti haasan (@shrutihaasan) November 14, 2020 Wishing you all a very happy Diwali! While we spread the light of love, hope and joy, let's remember to keep ourselves and the environment safe from pollution. Shine bright, always ✨🙏 pic.twitter.com/n1u0738A3j — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2020 దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా May the light of the diyas illuminate your life with joy and prosperity.. Wish you all a very #HappyDiwali 🪔☺️ pic.twitter.com/wSgAgWy9N3 — Raashi (@RaashiKhanna) November 14, 2020 ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్ Make someone’s Diwali Happy, that’s the best way to wish Happy Diwali 🪔 — sonu sood (@SonuSood) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు Rejoice on this blessed occasion and spread sparkles of peace and goodwill. Let’s celebrate the festival in the true sense by spreading joy, being safe and by illuminating each others life with love and happiness! ✨💥😍#LakshmiManchu #LakshmiUnfiltered #HappyDiwali pic.twitter.com/aIsLVHsh7M — Lakshmi Manchu (@LakshmiManchu) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున Wishing you and your family a very #happyDiwali! May the light of this Diwali drive away the darkness in our lives and continue to do so!!🙏#BiggBossTelugu4 🥼 #sabyasachi #styledbysonybhupathiraju pic.twitter.com/KjOqofG6BR — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2020 దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన Happy Diwali / Deepavali you guys! ✨🤍 No crackers..🙅🏻♀️ have lots of sweets today..☺️🤤 stay with family.. 🤗 celebrate.. 🤗 enjoy!! 🪔✨ Stay safe. Stay happy. God bless us all with a safer and a better tomorrow.. ✨ — Rashmika Mandanna (@iamRashmika) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్ Extending my heartfelt greetings to you and your family! A very Happy Diwali to you and your loved ones.✨💥 Stay safe 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) November 14, 2020 వీరితోపాటు అనపమ పరమేశ్వరన్, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్, వరుణ్ తేజ్, విజయ్ సేతుపతి, రామ్ పోతినేని, రకుల్‌ప్రీత్ సింగ్, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali 🪔 pic.twitter.com/YbtZPt9GMW — Anupama Parameswaran (@anupamahere) November 14, 2020 Wishing everyone a safe and happy Diwali ! #LoveStory @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/8pyaArr4ME — chaitanya akkineni (@chay_akkineni) November 14, 2020 -
మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నా: శ్రుతిహాసన్
మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నట్టు నటి శ్రుతిహాసన్ పేర్కొన్నారు. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటి శ్రుతిహాసన్. నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ మధ్య నటనకు దూరంగా ఉన్నారు. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయకిగా బిజీగా ఉన్నారు. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. లాక్డౌన్ కాలంలో ఇటీవల ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతుందన్నారు. ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి అన్నారు. ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అందులో ఒకటి మానసిక సమస్యగా పేర్కొన్నారు. ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు అన్నారు. సాధారణంగా ప్రజలు హెచ్చరికగానే ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం బయటకు చెప్పటానికి సంతోషిస్తున్నారన్నారు. తాను కూడా మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అని తెలిపారు. తాను నిత్యం క్రమం తప్పకుడా వీటిని పాటిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా సంగీతాన్ని వినడం, పుస్తక పఠనం, రాయడం వంటివి చేసుకుంటానని తెలిపారు. చదవండి: ఆ కష్టం తెలుస్తోంది! -
హీరోయిన్ శ్రుతీహాసన్ ఫోటోలు
-
జోడీ కుదిరిందా?
‘గబ్బర్‌సింగ్’లో తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో మళ్లీ జంటగా నటించారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడానికి రెడీ అవుతున్నారట పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌ని మరోసారి డైరెక్ట్ చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతీహాసన్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రబృందం. -
వేడుక చేద్దాం.. లవ్ యూ పప్పా: శృతిహాసన్
చెన్నై : సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.. విలక్షణ నటుడు కమల్ హాసన్. విభిన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దశావతరంలో పది పాత్రలు పోషించి తను చేయలేని క్యారెక్టర్ లేదని నిరూపించుకున్నాడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి లెజెండ్ అనిపించుకున్నాడు. నవంబర్ 7(గురువారం) లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్ తన స్వగ్రామమైన ‘పరమక్కుడి’ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ ట్రిప్‌కి కుటుంబ సభ్యులతోపాటు తన టీం మొత్తం వెళ్లారు. ఈ క్రమంలో ఊరుకు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో కుటుంబంతో దిగిన ఫోటోలను అక్షర హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఇక శ్రుతి హాసన్ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్‌డే బాపూజీ. ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి వచ్చాం. అక్కడ వేడుక చేసుకున్నాం. అలాగే మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్ యూ లాట్స్ పప్పా’ అంటూ విషేస్ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌తో సహా అన్నయ చారు హాసన్ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ కమల్ తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్నిఆవిష్కరించనున్నారు. వృత్తి పరంగా శ్రీనివాసన్ న్యాయమూర్తి అలాగే స్వాతంత్య్ర సమర మోధుడు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడానికి లజెండ్ శివాజీ గణేశన్ కొడుకు నటుడు ప్రభు సైతం పరమక్కుడికి వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం కమల్ నవంబర్ 8న తిరిగి చెన్నైకి వచ్చి తన కార్యలయంలో సినీ గురువు, లెజెండరీ ఫిల్మ్‌మేకర్ కె.బాల చందర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక కమల్ హసన్ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళనటుడైనా తన విలక్షణ నటనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన(కలకత్తూర్ కన్నమ్మ) మొదటి చిత్రానికే కమల్ జాతీయ పురస్కరం అందుకున్నారు. అనంతరం మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నారు. నటుడిగానే కాకుండా నృత్యంలోనూ ముఖ్యంగా భారత నాట్యంలోనూ కమల్‌కి మంచి ప్రావీణ్యం ఉంది. 1960లోనే సినిమాల్లో ఆరంగేట్రం చేసిన కమల్ 1977లో తెలుగు చిత్రం(అంతులేని కథ)తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే వంటి హిట్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి(కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. ఈయన పద్మశ్రీ గ్రహీత. -
తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్
సినిమాల నుంచి కాస్తా విరామం తీసుకున్న శ్రుతిహాసన్ సంగీతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. గతేడాది స్వయంగా తన బృందంతో లండన్‌లో తాను కంపోజ్ చేసిన పాటలను ప్రదర్శించి అక్కడి అభిమానులను అలరించింది. అయితే మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిన శుత్రికి ఇటీవల వీరి బంధానికి బ్రేక్ పడటంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న‘లాభం’ సినిమాలో నటిస్తుండగా.. తెలుగులో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. జీవితానికి విశ్రాంతి, ప్రశాంతత ఎంతో అవసరమని.. సినిమాలను, మ్యూజిక్‌ను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ఆమె తల్లిదండ్రులు(కమల్‌హాసన్, సారికా) విడిపోవడం గురించి, అది ఆమెకు నేర్పిన విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఎంత మంచి కుటుంబం నుంచి వచ్చిన వారికైనా బాధలు, సమస్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు కలిసున్నప్పటికీ ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయని, అవి కూడా లైఫ్‌లో భాగమని పేర్కొన్నారు. ఇక తన తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు విడిపోతే అది తప్పకుండా బాధాకరమైన విషయమే కానీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోయి జీవించడమే మేలు. నేను చూసిన వారిలో చాలామంది భార్యభర్తలు విడిపోయారు. ఇది ఇతరులకు మాత్రమే విషయం.. ఆ కుటుంబానికి కాదు. వారు తీసుకున్న నిర్ణయంతో వారితో పాటు నేను కూడా సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే వారిద్ధరూ కూడా వారి వారి వ్యక్తిగత జీవితాలలో ఆనందంగానే ఉన్నారు. వారు నా తల్లిదండ్రులు కాకముందే ఇద్దరు వ్యక్తులు.. వాళ్లకూ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయమే నేను ఎప్పుడూ చెబుతుంటాను’ అని ఆమె తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చారు శృతిహాసన్. -
నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి
నాన్న ఆస్తిలో వాటా అడగలేదు అంటున్నారు సంచలన నటి శ్రుతీహాసన్. దక్షిణాది నటిగానే కాకుండా భారతీయ నటిగా పేరు తెచ్చుకున్న సంచలన నటి ఈ బ్యూటీ. కథానాయకిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ మధ్య లండన్‌కు చెందిన మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడి నటనను కాస్త అలక్ష్యం చేశారనే చెప్పాలి. అయితే అతనితో ప్రేమ బ్రేకప్ అవ్వడంతో తిరిగి నటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంతో పాటు ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, అలవాట్ల గురించి వెల్లడించారు. గతంలో తనకు ఎక్కువ ఖర్చు చేసే అలవాటు తనకుండేదని చెప్పారు. దీంతో అవసరాల కోసం పని చేశాననీ,అందులో సంతృప్తి లభించలేదనీ చెప్పారు. సంతోషంగా జీవించడానికి డబ్బు ఉంటే చాలదన్నది అర్ధం అయ్యిందన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న హీరోయిన్ల కంటే తన సంపాదన తక్కువేనని అన్నారు. ఇంకా చెప్పాలంటే తాను పెద్ద స్టార్‌ను కానని అంది. తన తండ్రి కమలహాసన్ సినిమాల్లో సంపాదించింది సినిమా రంగంలోనే పెట్టారని చెప్పారు. సాధారణంగా సంసాదించిన దానితో ఆస్తులు కూడబెట్టకుంటారనీ, అలాంటిది తన తండ్రి రాజ్‌కమల్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారని తెలిపారు. ఆయనకు సినిమానే శ్వాస అని పేర్కొన్నారు. మాకు ఏమైన మిగిల్చారా? ఆయన ఆస్తిలో మా వాటా ఎంత? అని తాను గానీ, తన చెల్లెలు గానీ అడిగిన సందర్భం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. నిజం చెప్పాలంటే తన బాల్య జీవితం చాలా సంతోషంగా సాగిందన్నారు. నాన్న మొదట చెన్నైలోని ఒక పాఠశాలలో చదివించారనీ, ఆ తరువాత అమెరికాలో మంచి కళాశాలలో చేర్పించారనీ చెప్పారు. మంచి ఆహారం, అంతకంటే మంచి దుస్తులు, ఖరీదైన కారు, అందమైన ఇల్లు అంటూ అన్నీ అందించారని చెప్పారు. తాను 21వ ఏట నుంచి కథానాయకిగా నటిస్తూ సంపాదించడం ప్రారంభించానన్నారు. ఆ తరువాత నాన్న నుంచి డబ్బు తీసుకోవడం మానేశానని చెప్పారు. అంతే ఇప్పటి వరకూ నాన్న ఆస్తిలో తన వాటా ఎంత? అని అడిగింది లేదని చెప్పారు. తనకు అవసరమైన డబ్బును తానే సంపాదించుకుంటున్నానని తెలిపారు. రేపు తన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తానని చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చేది ఇస్తారనీ, అయితే మన సంపాదన గురించి మనం ప్రయత్నించాలనీ నటి శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
శృతికి జాక్‌పాట్
నటి శృతీహాసన్ బ్రేక్‌ను బ్రేక్ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ వరుస పెట్టి చిత్రాలు చేసిన ఈ సంచలన హీరోయిన్ ఆ తరువాత సుమారు రెండేళ్లు తెరపై కనిపించలేదు. అంతే కాదు నటనకు బ్రేక్ ఇచ్చారు. తరచూ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారు. అయితే తాను సినిమాల్లో నటించకపోయినా ఖాళీగా లేనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తో కలిసి సంగీత ఆల్బమ్స్ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా మెరిశారు. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరిగా సింగం 3లో కనిపించారు. అదేవిధంగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటించారు. ఇక తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించిన శబాష్నాయుడులో నటించినా, ఆ చిత్రం మధ్యలోనూ ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిరాకరించారనే ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్ అయిన తరువాత ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు శృతి. కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ఒక చిత్రం, టాలీవుడ్లో రవితేజ్‌తో ఒక చిత్రం అంగీకరించారు. అవును ఈ అందాల భరిణి హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే జాక్‌పాట్‌ను కొట్టేసిందని తెలిసింది. ఒక హాలీవుడ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకె చెప్పారు శృతి. ప్రఖ్యాత లాసన్ బోర్మీ యూరనివర్స్ సంస్థ నిర్మించనున్న ట్రెడ్‌స్టోన్ సిరీస్‌లో శృతిహాసన్ నటించనున్నారు. ఈ సిరీస్‌లో ఢిల్లీలో ఒక హోటల్లో పని చేస్తూ ఇతర సమయాల్లో హత్యలు చేసే యువతిగా నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్ ప్రాంతంలో జరగనున్న ఈ సిరీస్ షూటింగ్లో త్వరలోనే శ్రుతిహాసన్ పాల్గొననున్నారు. మొత్తం మీద నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు ఆ బ్రేక్‌ను బ్రేక్ చేస్తున్నారన్న మాట. -
శృతి కలుస్తుందా!
ప్రస్తుతం డిస్కోరాజా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. గతంలో రవితేజ హీరోగా బలుపు లాంటి హిట్ సినిమాను అందించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శృతిహాసన్ సడన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో శృతి రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శృతి రవితేజ, గోపిచంద్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈసినిమా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
శృతీ హాసన్ బ్రేకప్ చెప్పేసింది!
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన శృతి హాసన్ తరువాత తనదైన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమా చేసి సత్తా చాటింది. కానీ కొంత కాలంగా ఈ భామ వెండితెరకు దూరమైంది. ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ కొర్సేల్తో విదేశాల్లో పర్యటిస్తున్న ఈ బ్యూటీ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే తాజాగా శృతి తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా రిలేషన్‌షిప్‌కు దూరమైన తరువాతే తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మైఖేల్ చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. గతంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలకు మై లవ్, డార్లింగ్ అంటూ కామెంట్ చేసిన మైఖేల్ ఈ సారి మాత్రం బెస్ట్ మేట్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో శృతి హాసన్, మైఖేల్ కొర్సేల్లు విడిపోయారంటూ కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై శృతి మాత్రం స్పందించలేదు. విజయ్ సేతుపతి సరసన శృతి హీరోయిన్గా నటిస్తున్న ‘లాభం’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
‘లాభం’ మొదలైంది..!
క్రేజీ జంట విజయ్‌సేతుపతి, శ్రుతీహాసన్లు లాభం అంటూ కలిశారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కథానాయకుడిగా విజయపథంలో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతి. ఈయన నిర్మాతగానూ విజయాలను అందుకుంటున్నారు. ఇక సంచలన నటిగా పేరు తెచ్చుకున్న శ్రుతీహాసన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. వీరిద్దరి రేర్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమే లాభం. ఇక ఆరంజ్ మిఠాయ్, జుంగా, మేర్కు తొడర్చి మలై వంటి చిత్రాలను నిర్మించారు విజయ్‌సేతుపతి. సొంత నిర్మాణ సంస్థ విజయ్‌సేతుపతి ప్రొడక్షన్ నాలు పోలీసుమ్ నల్లారుంద ఊరుమ్, ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న భారీ చిత్రం లాభం. ఇకపోతే ఇయర్కై, ఈ, పేరన్బు, పొరంబోక్కు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్పీ.జననాథన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం సోమవారం ఉదయం రాజపాళైయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అద్భుతమైన కథతో అదిరే యాక్షన్స్ సన్నివేశాలతో పూర్తి కమర్శియల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న లాభం చిత్రం విజయ్‌సేతుపతి, శ్రుతీ హాసన్‌ల కెరీర్లో గుర్తుండిపోయేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇతర నటీనటులను వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. చిత్రానికి రాంజీ ఛాయాగ్రహణను, డీ.ఇమాన్ సంగీ తాన్ని అందిస్తున్నారని తెలిపారు. పూర్తిగా పాజిటీవ్ దృక్పథంతో ప్రారంభించిన లాభం చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఇప్పటి నుంచే నెలకొంటున్నాయి. -
మెగాస్టార్ సినిమాలో శృతి
ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తరువాత చేయబోయే సినిమాను కూడా ఓకె చేశాడు. మరోసారి రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు చిరు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రకు మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతీ హాసన్‌ను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు జోడిగా నటించింది శృతి. అయితే మెగాస్టార్ సినిమాలో మాత్రం హీరోయిన్గా కాకుండా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. -
ఆ స్టార్ హీరోపై శ్రుతీ హాసన్ కామెంట్
తమిళసినిమా: సినీ హీరోయిన్లపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా హీరోయిన్లకూ సహ నటీనటులపై ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ అందరికీ అందరూ నచ్చాలని గానీ, నచ్చకూడదనీ రూలేం ఉండదు. ఇక సంచలన నటి శ్రుతిహాసన్ విషయానికి వస్తే తన మనసులో ఏం అనిపిస్తే అది నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈమె నటించింది తక్కువ చిత్రాలే అయినా, విజయాల శాతం ఎక్కువే. అభిమానులూ అధికమే. ఇటీవల నటనకు కాస్త దూరం అయినా అభిమానుల్లో మాత్రం శ్రుతిహాసన్‌కు క్రేజ్ చెక్కు చెరగలేదు. అదేవిధంగా తను తరచూ అభిమానులతో ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ముచ్చటిస్తూ ఉంటుంది. వారి ప్రశ్నలకు బదులిస్తుంది కూడా. ఇటీవల ఈ సంచలన తార వేలూర్‌లోని కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శ్రుతిహాసన్ చాలా సహనంగా బదులిచ్చింది. అందులో మీకు నచ్చిన చిత్రం ఏమిటన్న ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా మహానది అని బదులిచ్చింది. ఇది తన తండ్రి కమలహాసన్ నటించిన చిత్రం అన్నది గమనార్హం. ఉత్తమ నటుడు కమలహసన్ అని చెప్పింది. సినీరంగంలో మీరు కోరుకునేది? అన్న ప్రశ్నకు తాను నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలి పేరు తెచ్చుకున్నా, వీటన్నింటిలోనూ తాను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నేనని చెప్పింది. మీరు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. అందులో ఏ చిత్ర పరిశ్రమ ఉన్నతంగా అనిపించింది? అని ఓ విద్యార్థిఅడిగిన ప్రశ్నకు తాను ఏ భాషలో పని చేసినా నటననే ఇష్టపడి చేస్తానని చెప్పింది. నటుడు అజిత్ గురించి మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు తనకు బాగా ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరని చెప్పింది. తాను కలిసిన నటుల్లో సంప్రదాయమైన నటుడు అజిత్ అని శ్రుతిహాసన్ చెప్పింది. ఈ బ్యూటీ అజిత్‌తో వేదాళం చిత్రంలో నటించిందన్నది గమనార్హం. -
ఏంటి నిజమా?
కొత్త సినిమాలు సంతకం చేయడం లేదు. కేవలం టీవీ షో మాత్రమే చేస్తోంది. ఇది చాలదా గాసిప్‌రాయుళ్లకు శ్రుతీహాసన్ పెళ్లికి శుభముహూర్తం పెట్టడానికి. అదే చేసేశారు. శ్రుతీ 2019లో తన లండన్ బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సలేను పెళ్లి చేసుకోబోతోంది అని రాసుకొచ్చారు. ఈ వార్త శ్రుతీ చెవిలో కూడా పడింది. వెంటనే ‘ఏంటి నిజమా? ఇది నాకూ వార్తే’ అంటూ ట్వీట్ చేశారు. మైఖేల్, శ్రుతీ కొంత కాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఔత్సాహికులు రాసుకొచ్చినట్టు శ్రుతీహాసన్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా? ఆవిడ కొట్టిపారేసినట్టే ఈ ఏడాది ప్రేమలోనే మునిగి తేలుతూ జీవితాన్ని ఆస్వాదిస్తారా? వేచి చూద్దాం. -
గ్యాప్‌కు కారణం అదే..!
స్టార్‌వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నటి శృతీహాసన్ కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. కమలహాసన్, సారిక వంటి నట దిగ్గజాల వారసురాలైన ఈ సంచలన నటి బాలీవుడ్లో నటనకు శ్రీకారం చుట్టినా, తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో దక్షిణాదికి ఒక మంచి కమర్షియల్ కథానాయకి లభించిందని అందరూ భావించారు. ఇతర అగ్రనాయికలకు పోటీ అనే స్థాయికి చేరిన శ్రుతీహాసన్ సడన్‌గా సినిమాలకు దూరం అయ్యారు. ఇటీవల ఈ బ్రేక్‌కు కారణాలను వెల్లడించారు. నటన మాత్రమే తనకు ముఖ్యం కాదని, ఇతరత్రా చాలా ఉన్నాయని అప్పట్లో పేర్కొన్న శ్రుతీహాసన్ తాజాగా ఈ గ్యాప్ గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. లండన్‌కు చెందిన మైఖెల్ అనే వ్యక్తి ప్రేమలో పడ్డట్టు, ఆయనతో పెళ్లికి సిద్ధం కావడంతోనే నటనకు దూరం అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన గ్యాప్ గురించి చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్న విషయం తెలుసన్నారు. అలాంటి వారికి చెప్పేదేమిటంటే తన గురించి తాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం అయ్యిందన్నారు. తన బలం, బలహీనత తెలుసుకోవడానికే ఈ గ్యాప్ తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తానేమిటో క్లియర్‌గా అర్థం చేసుకున్నానని, ఇకపై తన నుంచి అభిమానులు అధిక చిత్రాలను ఆశించవచ్చని శ్రుతిహాసన్ అన్నారు. ఈ బ్యూటీ చిన్న గ్యాప్ తరువాత నటనకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ మొదలవుతుందని శ్రుతీహాసన్ తెలిపారు. -
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించాడు
ఉళగనాయగన్(లోకనాయకుడు) కమల్ హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం-2 చిత్ర విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈచిత్రం విడుదల కానున్నట్లు కమల్ ఈ ఉదయం తెలిపారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను నేటి సాయంత్రం ఆవిష్కరించున్నారు. తమిళ్, హిందీలో ఏకకాలంలో చిత్రం రూపొందించగా, తెలుగులో డబ్ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్, తమిళ ట్రైలర్‌ను కమల్ తనయ శృతిహాసన్, హిందీ ట్రైలర్‌ను అమీర్ ఖాన్ విడుదల చేస్తారు. వివాదాల నడుమే విడుదలైన మొదటి పార్ట్‌కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్ రాజకీయ ఆరంగ్రేటం నేపథ్యంలో విశ్వరూపం-2 చిత్రం విడుదల అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కమల్ హాసన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లు కాగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. Kamal Haasan announces the release date of #Vishwaroopam2: 10 Aug 2018... Trailer today [11 June 2018] at 5 pm... Directed Kamal Haasan, it has been shot in Tamil and Hindi and dubbed in Telugu... Poster announcing the release date: pic.twitter.com/30au9vtAx6 — taran adarsh (@taran_adarsh) 11 June 2018 -
రవితేజ సినిమాతో రీ ఎంట్రీ
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. ఫైనల్‌గా పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నారు శృతి. అయితే తరువాత కూడా శృతి హాసన్ కెరీర్ సాఫీగా సాగలేదు. నెమ్మదిగా కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో శృతి సినిమాలకు దూరమైయ్యారు. గత ఏడాది కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్.. లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాకు శృతి హాసన్ ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు శృతి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బలుపు సినిమాలో రవితేజకు జోడీగా నటించిన శృతి ఈ సినిమాలో మరోసారి మాస్ మహారాజ్‌తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. -
త్వరలో సెట్స్ మీదకు 300 కోట్ల చిత్రం
బాహుబలి రిలీజ్ తరువాత తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి అదే స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. జయం రవి, ఆర్యలు ప్రధాన పాత్రల్లో శృతిహాసన్ టైటిల్ రోల్లో సంఘమిత్ర సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాను లాంఛనంగా ప్రారంభించిన కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంది తప్పుకుంది. తరువాత మరో హీరోయిన్ను ప్రకటించకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపించింది. అయితే సుందర్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శృతిహాసన్ స్థానంలో బాలీవుడ్ నటి దిశాపటాని నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను షూటింగ్‌ను ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శ్రీ తేండాల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్కు సంబంధించి చిత్రయూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
సినిమా ఆగిపోలేదు.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది..!
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు తల పెట్టిన కోలీవుడ్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌కు ముందుగా శృతిహాసన్ ను తీసుకున్నారు. శృతి కూడా లండన్ వెళ్లి మరీ యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కానీ సినిమా అధికారికంగా ప్రారంభించిన తరువాత స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదన్న కారణంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.అయితే శృతిహాసన్ హ్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి సంఘమిత్ర ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు సుందర్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. 18 నెలలుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపిన డైరెక్టర్, కొంత గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయిన తరువాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. జయం రవి, ఆర్యలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో దిశాపటానిని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
ఆ వేదిక మనకు కలిసి రావటం లేదా..?
అక్కడి నుంచి మనోళ్లు తీసుకునే నిర్ణయాలు కలిసి రావడం లేదంటా. అక్కడి నుంచి ప్రకటించే ఏ విషయమైనా బెడిసికొడుతుందట. ఎక్కడ..? ఏంటి..? ఏం ప్రకటించారు? ఏం విషయాలు అని అనుకుంటున్నారా? కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదిక నుంచి మన సినిమా వాళ్లు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి జరగడం లేదు. బాలీవుడ్ దర్శక నిర్మాత మధు భండార్కర్ ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్లో ‘హీరోయిన్’ సినిమాను కేన్స్ వేదిక నుంచే ప్రకటించారు. కానీ ఆ సినిమా నుంచి ఐశ్వర్యరాయ్ తప్పుకుంది. తర్వాత కరీనా కపూర్ ‘హీరోయిన్’గా నటించింది. అదే వేదిక నుంచి తమిళ డైరెక్టర్ సి.సుందర్ కూడా శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలో ‘సంగమిత్ర’ సినిమాను ప్రకటించారు. కానీ తరువాత కొన్ని కారణాలు వల్ల శ్రుతి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. శ్రుతి తప్పు కున్న తరువాత ఆ స్థానంలో లోఫర్ బ్యూటీ దిశాపటాని వచ్చి చేరింది. సో...అదండీ మ్యాటర్..అక్కడి నుంచి మన దర్శకులు ఏ సినిమాలను ప్రకటించినా ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. -
శ్రుతీహాసన్ ప్లేస్‌లో..?
‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్ తప్పుకున్నాక ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేసే తార ఎవరు? అనే చర్చ జరుగుతోంది. కచ్చితంగా ఆ స్థాయి హీరోయిన్నే తీసుకుంటారని చాలామంది భావించారు. అందుకే, అప్ కమింగ్ హీరోయిన్ దిశా పాట్నీని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త విని, ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే దిశా బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. తెలుగులో ‘లోఫర్’, హిందీలో ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, చైనీస్ మూవీ ‘కుంగ్ ఫూ యోగా’ చేశారు దిశా. ప్రస్తుతం ‘భాగీ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 250 కోట్ల ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’లో అవకాశం దక్కితే దిశా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. సుందర్. సి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. -
ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత కోలీవుడ్ నుంచి అదే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర అనే భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి. దర్శకుడు అనుకున్న హీరోలు సినిమా చేసేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నాడు. ఇక టైటిల్ రోల్ కు ఫైనల్ చేసిన శృతి హాసన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వటంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రస్తుతం సంఘమిత్ర పాత్రకు నటి కోసం అన్వేషిస్తున్నారు. హన్సిక చేస్తుందన్న ప్రచారం జరిగినా.. ఆమె కూడా తాను ఈ ప్రాజెక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆలోచనలో పడ్డ దర్శకుడు సుందర్ సి, సంఘమిత్ర కన్నా ముందు మరో సినిమా చేసే ఆలోచన చేస్తున్నాడట. సంతానం లీడ్ రోల్ లో తానే తెరకెక్కించిన కలకళప్పు సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు సుందర్. సుందర్ ఈ సీక్వల్ ను గనుక ప్రారంభిస్తే సంఘమిత్ర మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. -
స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!
సౌత్ లో మంచి ఫాంలో ఉన్నా... బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది స్టార్ వారసురాలు శృతిహాసన్. కాటమరాయుడు సినిమాలో తన లుక్స్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ తరువాత సౌత్ సినిమాలేవి అంగీకరించలేదు. చేతిలో ఉన్న సంఘమిత్ర నుంచి కూడా తప్పుకొని పూర్తిగా బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బెహన్ హోగీ తేరి సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన శృతికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. శృతి హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'యారా' ఆగిపోయింది. విధ్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈసినిమా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్ర నిర్మాణం కొనసాగించలేమని భావించిన యూనిట్, నిర్మాణం ఆపేస్తున్నామని తెలిపారు. తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా తప్ప మరే సినిమా కూడా శృతి హాసన్ చేతిలో లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శృతి బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది. -
అక్క బాటలోనే చెల్లి అక్షర..
చెన్నై: నటుడు కమల్‌హాసన్ రెండో వారసురాలు అక్షరహాసన్ కూడా హీరోయిన్ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్‌లా వృత్తిపరంగా కోరుకున్నది ఒకటి, జరిగింది మరోకటి. అక్క సింగర్ కావలనుకొని హీరోయిన్ అయితే చెల్లి అక్షర డైరెక్టర్ కావలనుకొని హీరోయిన్ కాబోతుంది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కవతో సంగీత రంగంలో రాణించాలని ఆశ పడిందన్న విషయం తెలిసిందే. కేరీర్ తొలి రోజుల్లో పలు ప్రైవేట్ సంగీత ఆల్బమ్‌లు చేసింది ఈ అమ్మడు. ఇక తన తండ్రి కమలహాసన్ ఉన్నైపోల్ ఒరువన్ చిత్రంతో సంగీత దర్శకురాలిగాను సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే అనూహ్యంగా హిందీ లక్ చిత్రంతో హీరోయిన్గా అవాతారమెత్తింది ఈ చైన్నై భామ. తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్డంను కూడా సంపాదించుకుంది. ఇక అక్షరహాసన్ కెమెరా వెనుక కెప్టెన్ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పని చేశారు కూడా. అయితే యాదృశ్చికంగానే హిందీ చిత్రం షమితాబ్ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసింది ఈ పిల్లికల్ల సుందరీ. తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్ కథానాయకి కాదు. కాగా తాజాగా హీరోయిన్ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ వారసుడు విక్రమ్ చంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షరహాసన్ ఆయనకు జంటగా నటించనున్నారని సినీవర్గాల సమాచారం. -
హన్సిక ఖాతాలో భారీ ఆఫర్..?
బాహుబలి తరువాత అంతటి భారీ చిత్రంగా తెరకెక్కుతున్న సౌత్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందుగా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించిన చిత్రయూనిట్, అది కుదరకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నారు. టైటిల్లో రోల్లో శృతిహాసన్ నటిస్తుందంటూ ప్రకటించారు. శృతి కూడా సినిమా కోసం యుద్ధ విద్యలు నేర్చుకునే పని మొదలు పెట్టింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాను భారీగా లాంచ్ చేసిన తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు మరోసారి హీరోయిన్ కోసం వెతకటం ప్రారంభించారు. నయనతార, అనుష్కల పేర్లు ప్రముఖంగా వినిపించినా.. దర్శకుడు సుందర్.సి మాత్రం హన్సికకే ఓటు వేశాడట. ఇప్పటికే హన్సికతో చంద్రకళ, కళావతి సినిమాలు తెరకెక్కించిన సుందర్, మరోసారి ఆమెతోనే వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. త్వరలోనే సంఘమిత్ర హీరోయిన్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. -
పూజ జాతకం మారుతుందా..?
ముకుంద, ఒక లైలా కోసం, మొహెంజోదారో సినిమాలతో ఆకట్టుకున్న పూజ హెగ్డే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో నటించిన పూజ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. అందుకే ఒక్క కమర్షియల్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో పూజకు ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. గతంలో వరుస ఫ్లాప్‌లతో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న శృతిహాసన్‌ను గబ్బర్‌సింగ్ సినిమాకు హీరోయిన్గా తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాతో శృతి జాతకమే మారిపోయింది. గబ్బర్‌సింగ్ సక్సెస్‌తో అప్పటి వరకు ఐరన్ లెగ్ హీరోయిన్ అనిపించుకున్న శృతి హాసన్ ఒక్క సారిగా లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు పూజ హెగ్డే విషయంలోనూ అలాంటి మ్యాజిక్కే జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి శృతి తరహాలో పూజ కూడా దూసుకుపోతుందేమో చూడాలి. -
ఫైనల్‌గా అనుష్క చేతికే వెళ్లిందా..?
బాహుబలి తరువాత అదే స్థాయిలో సౌత్‌లో తెరకెక్కుతున్న సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలుత మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమా చేయాలని భావించినా.. వారు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలు హీరోలుగా సినిమా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక కీలకమైన సంఘమిత్ర పాత్రకు శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా సినిమాను లాంచ్ చేశారు. అయితే లాంచింగ్ తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్... సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్కనే సంప్రదిస్తున్నారట. ముందుగా తమన్నా, కాజల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేర్లు కూడా వినిపించినా.. ఫైనల్‌గా అనుష్క కే ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క సంఘమిత్రకు అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి. -
శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ
బాహుబలి రిలీజ్ తరువాత అంతకన్న భారీగా తెరకెక్కుతున్న సౌత్ సినిమాగా భారీ ప్రచారం పొందిన సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా లాంచ్ చేశారు. ప్రధాన పాత్రల్లో శృతిహాసన్, జయం రవి, ఆర్యలు నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. సంఘమిత్ర కోసం విదేశాల్లో కత్తి యుద్థాలు సైతం నేర్చుకున్న శృతిహాసన్ సడన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. నిర్మాతలు సరిగా కమ్యూనికేట్ చేయటం లేదన్న కారణంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది శృతి. అయితే దర్శకుడు సుందర్.సి వచ్చిన విభేదాల కారణంగానే శృతిహాసన్ సంఘమిత్ర నుంచి తప్పుకుందన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్ శృతి తప్పుకోవడానికి దర్శకుడు కారణం కాదంటూ క్లారిటీ ఇచ్చింది. -
కొత్త బాటలో క్రేజీ నటి !
నటి అనుష్క బాటలో శ్రుతీహాసన్ పయనిస్తున్నారా? ఆమె సినీ పయనం చూస్తుంటే అలా అనిపించక మానదు. అనుష్క ఆదిలో కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందాలారబోతలో దుమ్మురేపారు. సుందర్.సీ దర్శకత్వంలో అనుష్క నటించిన ఈత దుస్తుల దృశ్యాలు ఇప్పటికీ గూగుల్‌లో సందడి చేస్తూనే ఉంటాయి. అంతగా అందాల మోత మోగించిన అనుష్క ఆ తరువాత చారిత్రిక కథా చిత్రాల్లో నటిస్తూ వీరనారిగా రణభూమిలో కదం తొక్కారు. అందుకు కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి చాలా కసరత్తులు చేశారు. అదే విధంగా కథా పాత్ర డిమాండ్ మేరకు సుమారు 80 కిలోల వరకూ బరువు పెరిగి ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. ఇక బాహుబలి-2లో కత్తి చేత పట్టి సాహస విన్యాసాలు చేశారు. క్రేజీ నటి శ్రుతీహాసన్ కూడా తొలి చిత్రం లక్ (హింది)లోనే గ్లామర్ విషయంలో ఎల్లలు దాటారు. అలాంటి నటి ఇప్పుడు గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేయడానికి సిద్ధం అయ్యారనిపిస్తోంది. అనుష్కతో ఈత దుస్తులు ధరింపజేసిన అదే సుందర్.సీ ఇప్పుడు శ్రుతీహాసన్ చేత కత్తి పట్టిస్తున్నారు. ఆయన తాజాగా బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర పేరుతో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందులో శ్రుతీహాసన్ యువరాణిగా నటించనున్న విషయం తెలిసిందే. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం శ్రుతీహాసన్ లండన్‌లో కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు. అదే విధంగా తను నటిస్తున్న తాజా హిందీ చిత్రం బెహన్ హోగి తేరి కోసం నటి అనుష్క అంత కాకపోయినా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరిగి నటిస్తున్నారట. ఇందులో తీయని పదార్థం కంట పడితే చాలు లొట్టలేసుకుంటూ తినేసే యువతిగా నటిస్తున్నారట. సినిమా ఆధునిక పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇది చాలదు. అంతకు మించి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని సంతృప్తి పరచడానికి కథానాయకుడైనా, నాయకి అయినా కొత్తదనం కోసం తమ వంతుగా శ్రమించాల్సిందే. -
కాటమరాయుడు మూడో సాంగ్ రిలీజ్
-
కాటమరాయుడు సెకండ్ సాంగ్..
-
కాటమరాయుడు సెకండ్ సాంగ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా.. ఒక్కో పాటను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మూవీ టీం మాత్రం ఓ రొమాంటిక్ డ్యూయెట్ తో అభిమానులను అలరించింది. లాగే మనుసు లాగే నీ వైపే నను లాగే అంటూ సాగే ఈ పాటకు భాస్కరబట్ల సాహిత్యం అందించగా నకాష్ అజీజ్, ధనుంజయ్, నూతనలు ఆలపించారు. తొలి పాటతో మాస్ ఆడియన్స్ ను ఊర్రూతలూగించిన కాటమరాయుడు టీం రెండో పాటతో క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. మార్చి 18న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. -
కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు
-
కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే రికార్డ్ వ్యూస్ సాధించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. శనివారం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ వ్యూస్‌లో రికార్డ్‌లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్‌ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ కాయం అన్న నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకుడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎవడున్నాడన్నదే ముఖ్యం :కాటమరాయుడు
-
'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు
పవర్ స్టార్ అభిమానులు చాలా రోజులు ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయ్యింది. న్యూ ఇయర్ కి, సంక్రాంతికి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన చిత్రయూనిట్ ఫైనల్ పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పవన్ లుక్స్ క్యారెక్టరైజేషన్ తెలిసేలా రూపొందించిన టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నదే ముఖ్యం అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని కన్ఫామ్ చేసేస్తుంది. టీజర్ ఎక్కువగా భాగం పవన్ ను సీరియస్ గానే చూపించిన యూనిట్ ఒక్క షాట్ లో పవన్ డ్యాన్స్ మూమెంట్ ను చూపించారు. తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ లో ఎక్కడా ఆ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. -
కాటమరాయుడు ముందే వస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకుడు. గబ్బర్‌సింగ్ సినిమాతో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్, శృతి హాసన్‌లు ఈ సినిమాలో మరోసారి జోడి కడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చని ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు సినిమాను మరోవారం ముందుగా అంటే మార్చి 24నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మార్చి 15 వరకు చాలా మంది పిల్లలకు పరీక్షలు అయిపోతాయన్న ఆలోచనతో సినిమాను ప్రీపోన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. కాటమరాయుడు ముందే వస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
కాటమరాయుడు మొదలెట్టేశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా వీరం కు రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే బిజినెస్ మొదలెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ తరువాత పవన్ హీరోగా తెరకెక్కిన సినిమా అయినా కాటమరాయుడు బిజినెస్ పరంగా దూసుకుపోతోంది. సీడెడ్ బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్ అమ్ముడవ్వడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్
-
కాటమరాయుడు టీం న్యూ ఇయర్ విషెస్
పవర్ స్టార్ అభిమానుల కోసం కాటమరాయుడు యూనిట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసిన కాటమరాయుడు టీం తొలి మేకింగ్ వీడియోనే రిలీజ్ చేసింది. అంతేకాదు యూనిట్ సభ్యులంతా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని మేకింగ్ షాట్స్‌తో పాటు రిలీజ్ చేసిన ఈ వీడియో పవన్ విషెస్ చెప్పకపోవడం అభిమానులను నిరాశపరిచింది. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఇప్పటికే రెండు ప్రీ లుక్ పోస్టర్స్‌తో ఊరించిన పవన్, ఫైనల్‌గా ఫేస్ చూపించాడు. తమిళ సినిమా వీరంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌తో సినిమాలో పవన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించేశారు. ఈ రోజు(డిసెంబర్ 31) అర్ధరాత్రి ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
'కాటమరాయుడు' వచ్చేస్తున్నాడు
-
నేను నాన్నలా కాదు : శృతి హాసన్
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు ఎదురుచూసిన భామ శృతిహాసన్. కెరీర్ స్టార్టింగ్‌లో ఐరన్ లెగ్గా ముద్రపడ్డ శృతి, తరువాత గబ్బర్ సింగ్ సక్సెస్‌తో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్‌లతో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, కమల్ హాసన్ కూతురిగా కన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతోంది. కేవలం ఐడెంటీ విషయంలోనే కాదు చాలా విషయాల్లో నేను నాన్నలా కాదు అంటోంది. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కమల్, నాస్తికుడు. దేవుణ్ని నమ్మడు. కానీ శృతి అలా కాదట. తాను దేవుణ్ని నమ్ముతానని, తీరిక సమయాల్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేస్తానని చెపుతోంది. కానీ తన నమ్మకం మరీ మూర్ఖంగా మాత్రం ఉండదట. చిన్న చిన్న కోరికలు దేవుడికి చెప్పుకుంటానేగాని పూర్తిగా దేవుడే అన్ని చేస్తాడని ఆయన మీదే భారం వేయనంటోంది. -
పవన్ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్!
పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ విషయమై మరో కేజ్రీ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' ఫేం దర్శకుడు డాలీతో కలిసి జట్టు కట్టి పవన్ కొత్త సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సన్నిహితుడు శరత్ మరార్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాయికగా శృతిహాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయమై పలు కథనాలు వెబ్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు 'కడప కింగ్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సినిమాకు 'కాటమరాయుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఫేమస్ అయిన 'కాటమరాయుడు' పాటను పవన్ స్వయంగా పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు ఈ పేరును టైటిల్‌గా పెడితే ప్రజల్లోకి బాగా వెళుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నదని చెప్తున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట 'ఖుషీ' దర్శకుడు ఎస్జే సూర్యను తీసుకున్నారు. కానీ, అతడు బిజీ కావడంతో డాలీ ఈ ప్రాజెక్టును టేకాప్ చేశారు. -
శృతి పాట.. తమన్నా ఆట
మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ స్టార్ వారసురాలు శృతిహాసన్. హీరోయిన్ గానే కాక.. గాయనిగా కూడా ఆకట్టుకుంటున్న ఈ హాట్ బ్యూటి ఇప్పటికే చాలా సినిమాల్లో పాటలు పాడింది. అయితే ఎక్కువగా తను నటించిన సినిమాల్లో మాత్రమే పాటలు పాడే శృతి.. అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటి మరో హీరోయిన్ కోసం పాట పాడేందుకు రెడీ అవుతోంది. తమిళ్లో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న కత్తి సండెయ్ సినిమాలో తమన్నా కోసం శృతిహాసన్ ఓ పాట పాడనుంది. విశాల్‌తో పాటు తమన్నాతో కూడా శృతికి మంచి రిలేషన్ ఉండటంతో ఈ పాట పాడేందుకు అంగీకరించింది. తమిళ స్టార్ మ్యూజిషియన్ హిప్ హాప్ తమీజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కత్తి సండెయ్ తెలుగు ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
కమల్ సినిమాకు వరుస కష్టాలు
లోకనాయకుడు కమల్ హాసన్‌కు సినిమా కష్టాలు తప్పటం లేదు. గతంలో కమల్ సినిమా రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ ఇప్పుడు షూటింగ్ సమయంలోనే ఈ యూనివర్సల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో శభాష్ నాయుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు కమల్. బ్రహ్మానందం, శృతి హాసన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మళయాల స్టార్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా రాజీవ్ తప్పుకోవటంతో కమల్ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు. విజయవంతంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన కమల్, తన ఆఫీస్‌లో గాయపడటంతో సినిమా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ పడింది. కమల్ కొలుకుంటున్న సమయంలోనే ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్న జేమ్స్ జోసెఫ్ భార్య మరణించటంతో ఆయన కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. తాజాగా చిత్ర సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ దర్శకత్వ బాధత్యలు తీసుకున్న తరువాత కెమరామేన్ జయకృష్ణ పనితీరు నచ్చకపోవటంతో ఆయన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఇలా వరుస కష్టాలు కమల్ సినిమాను వేదిస్తున్నాయి. మరి వీటన్నింటినీ దాటి శభాష్ నాయుడు ఎప్పుడు థియేటర్లకు చేరతాడో చూడాలి. -
ఆగస్టు 6న సెట్స్ మీదకు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు డేట్ కుదిరింది. చాలా రోజులుగా ఈసినిమా విషయంలో వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆగస్టు తొలి వారంలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాను ఎస్ జె సూర్యను దర్శకుడిగా ఎంపిక చేసినా.. సూర్య నటుడిగా బిజీ అవ్వటంతో ఆ స్థానంలో డాలీని తీసుకున్నారు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. -
కమల్ హాసన్‌కు గాయాలు
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ జారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కమల్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సర్జరీ చేసిన వైద్యులు ప్రమాదం ఏమి లేదని , రేపు డిస్ చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. కమల్ ఇటీవలే శభాష్ నాయుడు షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. కమల్ తొలిసారిగా తన కూతురు శృతిహాసన్ తో కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రం ప్రస్తుతం సెట్స్ ఉంది. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది. -
కమల్ హాసన్‌కు గాయాలు
-
స్క్రీన్ పంచుకుంటున్న తండ్రీ కూతుళ్లు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, ఆయన వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఒకే సినిమాలో కలిసి నటించనున్నారు. చాలా రోజులుగా ఈ వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నా, ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఫైనల్‌గా ఈ నెల 29నుంచి కమల్, శ్రుతీలు కలిసి నటిస్తున్న సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రుతి హాసన్‌లు తండ్రీ కూతుళ్లుగానే నటించనున్నారు. టికె రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరగనున్న ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత తొలిసారిగా ఈ సినిమాతోనే తన తండ్రితో కలిసి నటించటం విశేషం. -
ఎండల్లో హాయ్ హాయ్...!
వాలు జడను ఒయ్యారంగా తిప్పుతూ... అంతే ఒయ్యారంగా నడిచే అమ్మాయిలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అఫ్కోర్స్ ఇప్పుడు వాలు జడ భామలు దాదాపు కనిపించట్లేదనుకోండి. ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రుతీహాసన్, సమంత కూడా ఆ పనే చేశారు. హీరోయిన్లు కాబట్టి, ట్రెండ్‌ను అనుసరించి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోక తప్పదు. సినిమాల్లో ఎలా కనిపించినా విడిగా మాత్రం దాదాపు జట్టును వదులుగా వదిలేస్తారు. సమ్మర్లో అలా వదిలేస్తే, చీకాకుగా ఉంటుంది. అందుకే, సమ్మర్ కోసం జుట్టును పొట్టిగా కత్తించుకున్నారు. ఇక, ఈ మండుతున్న ఎండల్లో హాయ్ హాయ్‌గా ఉంటామంటున్నారీ బ్యూటీలు. ‘సమ్మర్ లుక్ చూశారా’ అంటూ శ్రుతీహాసన్ తన కొత్త హెయిర్ స్టైల్‌ను చూపించారు. సమంత అయితే, ‘కురచ జుట్టుతో నేను కిడ్‌లా కనిపిస్తున్నా’ అంటూ తన లుక్ చూపించారు. ఏమైనా, అందగత్తెలు కురచ జుట్టులోనూ బాగానే ఉంటారు, వాలు జడలో కనిపించినా వారెవ్వా అనే విధం గానూ ఉంటారు కదూ! -
సౌత్ సినిమాలో జాన్ అబ్రహం
సాధారణంగా సౌత్ హీరోలు బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ధూమ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం. ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకునే సినిమాలు చేయలేకపోయినా బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో. ప్రస్తుతం తానే నిర్మాతగా మారి రాకీ హ్యాండ్సమ్ పేరుతో ఓ యాక్షన్ సినిమాను తెరకెక్కించాడు. మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకుడు. ఈ సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న జాన్, సౌత్‌లోనూ ఈ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే రీమేక్ చేయడం కన్నా డగ్ చేసి రిలీజ్ చేయటం బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై జాన్ అబ్రహం ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. -
'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర సౌత్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమమ్ తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అనుపమ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ కొన్ని ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలపై స్పందించిన అనుపమ ఆ ఫోటోలలో ఉన్నది తానే కానీ, అది మజ్ను సినిమా షూటింగ్లో కాదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంతవరకు మజ్ను షూటింగ్లో పాల్గొనలేదన్న అనుపమ, మార్చిలో తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. అనుపమతో పాటు శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
శ్రీమంతుడు @ 175
ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లలో యాబై రోజులు నడవటం లేదు. తొలి మూడు వారాల్లోనే ఎంత పెద్ద సినిమా అయినా ఢీలా పడిపోతుండటంతో 40, 50 రోజులకు మించి ఏ సినిమా థియేటర్లలో కనిపించే పరిస్థితి కనిపించటంలేదు. అలాంటిది శ్రీమంతుడు సినిమా మాత్రం ఏకంగా 175 రోజుల పాటు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది. మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బాహుబలి సినిమా తరువాత 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించిన శ్రీమంతుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ లోని లక్ష్మణ్ థియేటర్లో ఈ రోజుకూ నాలుగు ఆటలు ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఈ రోజు ( జనవరి 28)తో 175 రోజులు పూర్తి చేసుకుంటుండటంతో అభిమానులు పండగచేసుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, కొరటాల మార్క్ టేకింగ్, డైలాగ్స్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పటికే పలుమార్లు టీవీలో కూడా ప్రసారమయిన శ్రీమంతుడు, ఇప్పటికీ థియేటర్లో ప్రదర్శింపబడుతుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'హ్యాపీ బర్త్ డే టు మి'
స్టార్ వారసురాలిగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్ కోసం చాలాకాలమే ఎదురుచూసింది. 2009లో తెరకెక్కిన లక్ సినిమాతో వెండితెర మీద మెరిసిన ఈ భామ హిట్ కోసం 2012 వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్‌సింగ్ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న శృతి, ఆ తరువాత వరుస సక్సెస్‌లతో నెంబర్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తున్న శృతిహాసన్ గురువారం పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తనకు తానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్ డే టు మీ' అంటూ ట్వీట్ చేసింది. ఎలాంటి ఈగోలు లేకుండా తన తోటి హీరోయిన్స్‌తో ఎంతో స్నేహంగా ఉండే శృతిహాసన్‌కు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, త్రిష లాంటి హీరోయిన్స్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో విశాల్, దేవీ శ్రీ ప్రసాద్ లతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు శృతి హాసన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. Happy birthday to me ! I feel blessed loved happy and so fortunate thank you for the love and blessings always pic.twitter.com/DNXCKi1YYW — shruti haasan (@shrutihaasan) January 27, 2016 @khushsundar thank you so much Khushboo Mam!!!!! Im so so touched by your kind words — shruti haasan (@shrutihaasan) January 28, 2016 Happy birthday my dearest @shrutihaasan have a fabulous year ahead — Tamannaah Bhatia (@tamannaahspeaks) January 28, 2016 Wishing the most stunning n fun person @shrutihaasan a veryyyyyy happy bdayyyyy!! May U shine more n more in years to come. Lots of love! — Rakul Preet (@Rakulpreet) January 28, 2016 Happy bday dearest @shrutihaasan.hav a lovely year ahead and hats off to ya noble gesture to da kids today. God bless. Keep smilin always — Vishal (@VishalKOfficial) January 28, 2016 -
శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్
ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనం తిరిగి ఏదో ఒకటి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అంటూ.. సొంతూరి సెంటిమెంటుతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమా చూసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఫ్లాటైపోయారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన తన ఫీలింగులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టును ఫ్యామిలీ సెంటిమెంటుతో చాలా తెలివిగా కలిపారని, అదే ఈ సినిమా విజయ రహస్యమని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ చాలా బాగా చేసినందుకు అభినందనలు చెబుతూనే.. కలెక్షన్లు మాత్రం మహేశ్ బాబు వల్లే వస్తాయని స్పష్టం చేశారు. ఈ సినిమాలో మహేశ్ చాలా కూల్ గా కనపడుతూ, అంచనాలకు అందకుండా నటించి, ఏమాత్రం హడావుడి లేకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకుల హృదయాలను చేరుకున్నారన్నారు. యూనిట్ సమష్టి కృషి చాలా అత్యద్భుతంగా ఉందని రాజమౌళి మెచ్చుకున్నారు. ఇక శ్రుతిహాసన్ ని చూస్తే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామని, ఆమె తన నటనలో చాలా ఎత్తులు ఎదిగిందని ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడి విజన్ ను మాదీ ఫొటోగ్రఫీ మరింత పెంచిందని సాంకేతిక అంశాలనూ స్పృశించారు. తమ కుటుంబం మొత్తం ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామన్నారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలంటూ ముగించారు. The success of srimanthudu lies in the clever mixture of village adoption with family sentiment. Well done sivagaru. But The paisa vasool — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 are breath taking and she has improved by leaps and bounds on the acting front. And madhie’s photography enhanced the director’s vision. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Our whole family enjoyed the movie. Congratulations to everyone involved in srimanthudu for the blockbuster succcess.. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 -
విజయ్ చిత్రం నుంచి వైదొలగిన శ్రుతి
భారీ చిత్రం నుంచి వైదొలగినట్లు నటి శ్రుతిహాసన్ తెలిపారు. తమిళంలో విశాల్‌కు జంటగా పూజైరూ. చిత్రంలో నటిస్తున్నారు శ్రుతిహాసన్. దీంతోపాటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలావుండగా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ఒకదానికి దర్శకుడు శింబుదేవన్ డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో నటి శ్రుతిహాసన్ నటించేందుకు ఒప్పుకున్నారు. దీని గురించి గత వారం తన ఇంటర్నెట్ పేజీలో విజయ్, శింబుదేవన్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానురూ. అంటూ శ్రుతి తెలిపారు. శ్రుతిహాసన్ మళ్లీ తాను విడుదల చేసిన ప్రకటనలో కొన్ని మార్పులు జరిగాయని, భారీ చిత్రం ప్రస్తుతం లేదని అన్నారు. హిందీలో వెల్కం బ్యాక్రూ. చిత్రంలో జాన్ అబ్రహాం, అనిల్ కపూర్‌తోను, రమణ రీమేక్ అయిన కబార్రూ. చిత్రంలోను నటిస్తున్నారు శ్రుతి. ఈ రెండు చిత్రాలు 80 శాతం పూర్తయ్యాయి. ఇలావుండగా ఆమె వైదొలగినట్లు చెప్పిన భారీ చిత్రం, విజయ్ చిత్రమేనని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. -
మెగా ఫ్యామిలీ సెంటిమెంట్!
సినిమా రంగం సెంటిమెంట్లకు నిలయం. ఆ సెంటిమెంట్ ఒకటని చెప్పలేం. అనేక రకాల సెంటిమెంట్లు రాజ్యమేలుతున్నాయి. వారాలు - తేదీలు - నెలలు-పండుగలు-కాంబినేషన్లు.....ఇలా అనేక సెంటిమెంట్లు ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్లో హీరోలు ఎక్కవగా సెంటిమెంట్లను ఫాలో అవుతారని చెబుతుంటారు. అందరికీ ఉన్నట్లే మెగా ఫ్యామిలికి చెందిన హీరోలకు కూడా సెంటిమెంట్లపై నమ్మకం ఉందని అంటున్నారు. వారిలో ఎవరితోనైనా ఓ హీరోయిన్ జతగా నటించిన చిత్రం హిట్ కొడితే, మిగిలినవారి సినిమాలలో కూడా ఆ హీరోయిన్‌కు అవకాశం దక్కడం ఖాయం. నాజూకు భామ శృతి హాసన్ ఇటీవల అటువంటి అవకాశాలను కొట్టేసింది. వరుస పెట్టి ఆ స్టార్ హీరోల సరసన నటించింది. ఇంకా నటిస్తోంది. ఆ రకంగా శృతి మెగా హీరోలకి లక్కీ గర్ల్‌గా మారింది. ఈ బ్యూటీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజతో ఎవడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రేసు గుర్రం చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం మెగా అభిమానులు మరోసారి శృతి హాసన్‌తో మెగా హీరోలు రోమాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. దాంతో మెగా హీరోలు కూడా శృతితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్‌ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిని హీరోయిన్గా తీసుకోవలసిందిగా శ్రీను వైట్లని రామ్‌చరణ్ కోరినట్లు సమాచారం. అందుకు శ్రీను వైట్ల కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. - శిసూర్య -
వేశ్యగా నటించనున్న శ్రుతీ హాసన్
ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రల్లో రాణించారు. ఆ జాబితాలో శ్రుతీ హాసన్ కూడా ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె హిందీలో ‘డి-డే’ అనే సినిమాలో వేశ్యగా నటించారు. తెలుగులో ‘గెలుపు గుర్రం’గా అనువాదమైంది. సి.ఆర్. రాజన్ సమర్పణలో డర్ సినిమా మరియు సురేష్ సినిమా సంయుక్త నిర్మాణంలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకు వస్తున్నారు. మాఫియా నేపథ్యంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ రామ్‌పాల్, ఇర్ఫాన్‌ఖాన్, రిషికపూర్, అనిల్ కపూర్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి సురేష్ దూడల మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రుతీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఆమె నటించిన వేడి వేడి సన్నివేశాలు ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు. -
అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!
క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం. ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్‌కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.