Somesh Kumar
-
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
జీఎస్టీ స్కాంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీఎస్టీ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆమె ఆరా తీశారు. కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై టీకే శ్రీదేవి నివేదిక ఇచ్చారు. ఇక, సీఎస్ శాంతకుమారికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్‌తో పాటుగా పలువురు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.ఇక, ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్‌ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్‌ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్‌బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో పాటు ఐజీఎస్టీ, సెస్‌లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్‌కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో భారీ కుంభకోణం
-
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కేసు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. కమర్షియల్ ట్యాక్స్‌లో కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఇక, ఈ స్కాంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో వెలుగు వచ్చింది.ఇక, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, స్కామ్‌కు పాల్పడిన నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
వెయ్యి కోట్ల స్కామ్
-
రూ.1,000 కోట్ల ట్యాక్స్ స్కాం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. సోమేశ్ మౌఖిక ఆదేశాలతో.. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్‌లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు స్రూటినీ మాడ్యూల్లో మార్పుచేర్పులు చేశారు.ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్‌లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్‌లలో ఐజీఎస్టీ, సెస్‌లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్లో మార్పులు చేసిన శోభన్‌బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్‌లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్‌కు పాల్పడ్డా బయటపెట్టలేదు. ఎట్టకేలకు బట్టబయలు.. ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్మాల్ను గుర్తించింది.దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది. బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్‌లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్‌లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్‌వర్డ్‌గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్‌లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు. -
రీజనల్ రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు( ఆర్ఆర్ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగురోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. రూ. 300 కోట్ల డ్యూటీ ఛార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయని తెలిపారు. అవినీతిపరుడైన సోమేష్ కుమార్ వల్లే ఇలా జరిగిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. మూసీనదీ ప్రక్షాళన చేస్తాం. సిగ్గులేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు. ... కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. అది అప్పుడే బీటలు వారింది. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో నిర్మాణం చేస్తాం. కాంగ్రేస్ పార్టీ చాలా రోజులుండదని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలలు కంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ. 100 తెచ్చుకోలేని చేతగానివాడు కిషన్‌రెడ్డి’ అని వెంకటరెడ్డి అన్నారు. -
సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్ ప్లానేంటి?
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భూ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది?. ఫార్మా సిటీ వస్తుందని తెలిసి ముందుగానే భూములు కొనుగోలు చేశారా?. ఆయనతో పాటు భూములు కొనుగోలు చేసిన ఇతర అధికారుల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోందా? అక్కడ భూములు అమ్ముకున్న రైతులు ఏమనుకుంటున్నారు? ఫార్మా సిటీ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందా?. రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా సిటీపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు.. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టారు. యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమనగల్లు మండలాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12వేల ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తి చేశారు. దాదాపుగా 500కు పైగా విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్రొడక్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. అయితే, దీనికి దగ్గరలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 25ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25ఎకరాల 19గుంటల భూమి తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు మూడు కోట్లకు పైగానే ఉంది. ధరణి పోర్టల్‌లో ఖాతా నెంబర్ 5237 ద్వారా సర్వే నెంబర్ 249/అ1లో 8 ఎకరాల భూమి, 249/ఆ2లో 10 ఎకరాల భూమి, 260/అ/1/1లో 7.19 ఎకరాల భూమి మొత్తం 25ఎకరాల 19 గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి నుంచి సెల్ డీడ్ ద్వారా భూమిని జ్ఞానముద్ర కొన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2018లో తన సతీమణి జ్ఞానముద్ర పేరుతో నిబంధనల మేరకే కొనుగోలు చేసినట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి టీవీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్లో కేటాయించిన నివాసస్థలంలోని ఇంటిని విక్రయించి.. కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భూమి కొనుగోలుపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఫార్మా సిటీ సమాచారం ముందుగానే తెలుసుకుని ఈ భూములు తక్కువ ధరకే కొనుగోలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాగుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలకు పైగా సోమేశ్ కుమార్ లబ్ధిపొందారు. ఈ భూమి కొనుగోలు చేసిన విధానంపై ఈడీ, విజిలెన్స్ విభాగాలకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అక్రమాస్తులు కూడకట్టుకున్నారని, ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సోమేశ్ కుమార్‌పై వస్తున్న భూ ఆరోపణలు.. ఎటువైపు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ భూములు కొన్న అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ చుట్టూ భూ కొనుగోళ్లపై విచారణ చేయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఐపీఎస్ అధికారి ఫార్మా సిటీ దగ్గర్లో మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి, నక్కర్తిమేడిపల్లి గ్రామాల రైతులను భయాందోళనకు గురి చేశారట. అడ్డగోలు ధరకే రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. ►సదరు ఐపీఎస్ అధికారి తమపై అక్రమంగా కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కంటతడి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ►ఫార్మా సిటీ భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు తాడిపర్తి గ్రామస్తులు, భూదాన్ ట్రస్టులో ఉన్న భూమిని కొందరు రియాల్టర్లు ఫార్మా సిటీకి అమ్ముకుని వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే భూమి కోసం చాలా ఏళ్లుగా ఆ ఊరి ప్రజలంతా న్యాయపోరాటం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ►ఫార్మాసిటీలో భూ సేకరణ వ్యవహారంలో ఓ వైపు గందరగోళం నెలకొనగా.. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులు ముందుగానే సమాచారం తెలుసుకుని రైతుల నుంచి అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారు. మొత్తంగా ఫార్మాసిటీ చుట్టూ భూములు కొన్నవాళ్ల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై భూ వివాదం ఆరోపణలు
-
సోమేష్ కుమార్ నియామకంపై భట్టి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ తన ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ నియామకంపై తెలంగాణ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రిటైర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాజాగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలి. కానీ, సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమికమయ్యారు. రైటర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారు. వీళ్లపై చాలా అపోహలు ఉన్నాయి. భూ భకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్ సహాయపడ్డారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి భూములను ధరణి పేరుతో లాక్కున్నారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారు. ఓఆర్ఆర్ లీజ్ వెనుక సోమేష్ కుమార్, అరవింద్ ఉన్నారు. 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటి?. ఇంత మంది సలహాదారులు ఎందుకు?. రిటైర్డ్ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా?. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖకు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు. సోమేష్ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టే. వెంటనే సోమేష్ సలహాదారు పదవిని రద్దు చేయాలి. ఆయనపై ఎంక్వరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తాం. సోమేస్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి వెల్లి వచ్చే దమ్ము కేటీఆర్‌కు తలసానికి ఉందా?. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు?. గజ్వేల్, సిరిసిల్లలో భూములు లేవా?. ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు! -
కేసీఆర్ కీలక నిర్ణయం.. సీఎం సలహాదారుగా సోమేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సోమేష్ కుమార్ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్‌ను కేంద్రం రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇక, ఇటీవలే సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో, సీఎం కేసీఆర్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’.. అనేక రాజకీయ విమర్శలను ఎదుర్కొని -
ప్రజల పక్షాన గళమెత్తిన ‘సాక్షి’: సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో గతంలో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు స్పందిస్తూ అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రజలందరికీ తేలిగ్గా గుర్తుండిపోయేలా 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అలా అందుబాటులోకి వచ్చిందే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21 11 11 11. అంతేకాదు.. ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులతో పాటు కొన్ని సూచనలూ ఉన్నాయి. అలా అందిన సూచనల్లోంచి అమలు చేస్తున్నవే తడి–పొడి చెత్త వేరు చేయడం, కొన్ని మొక్కలైనా పెంచాలని ఇంటి నిర్మాణ అనుమతుల నిబంధనల్లో పొందుపరచడం తదితరమైనవి. ఏయే ప్రాంతంలో పారిశుద్ధ్య బాధ్యతలెవరివో ప్రజలందరికీ తెలిసేలా స్థానికంగా బోర్డులు ఏర్పాటు చేస్తామనీ అప్పుడే ప్రకటించారు. నగరంలోని శ్మశాన వాటికల్లో దశలవారీగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలా ఏర్పాటైందే నగరంలోని మొదటి ‘మహాప్రస్థానం’. ఇప్పుడు అన్ని జోన్లలోనూ మహా ప్రస్థానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ తరుణంలో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారికి ఇళ్లవద్దకే అన్నపూర్ణ భోజనాలు పంపిణీ చేశారు. అలా ఆపత్కాలంలో లక్షల మందికి ఆకలి బాధ తీరింది. నిర్మొహమాటంగా.. పారిశుద్ధ్యం తదితర అంశాల్లో అధికారుల పనితీరు బాగాలేదని సైతం ఆనాటి కార్యక్రమంలో ప్రజలు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. ఆయా సమస్యలపై గళమెత్తారు. అన్నింటినీ సావధానంగా విన్న అప్పటి కమిషనర్ ‘నేను సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నాను’ అంటూ ప్రజలతో కలిసిపోయారు. ఇలాంటి వేదికల ద్వారానే ప్రజాభిప్రాయం తెలుస్తుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులతో పాటు సూచనలు కూడా రావడం ముదావహమన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా తగిన చర్యలు చేపట్టారు. ఆనాడే వినియోగంలోకి.. ప్రస్తుతం గ్రేటర్ నగరంలో ఏ సమస్యకైనా, ఫిర్యాదుకైనా ప్రజలు ఫోన్ చేస్తున్న నెంబర్ ఆనాడు వినియోగంలోకి తెచ్చిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లపై చెత్త నుంచి వెలగని వీధి దీపాలు, ఆహార కల్తీ, రోడ్లపై గుంతలు, దోమలు, వరద ముంపులు.. ఇలా సమస్య ఏదైనా కార్యాలయాల దాకా వెళ్లకుండా ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు అందుబాటులో ఉన్న నెంబర్. ఫిర్యాదును స్వీకరించే సిబ్బంది సంబంధిత అధికారులకు సమస్య చేరవేస్తారు. వివరాలన్నీ ఆన్లైన్లో నమోదవుతాయి. ప్రజలు తమ గోడు తెలిపేందుకు ఒక మార్గం లభించింది. అనంతరం మొబైల్ యాప్ వంటివి సైతం తీసుకొచ్చారు. -
‘రెరా’ చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్ కూడా రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, టౌన్‌ప్లానింగ్‌లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
మాజీ సీఎస్ సోమేశ్కు బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా.. రాకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో కోర్టు తీర్పు అమలు చేయనందుకు సోమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన జయరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మాజీ సీఎస్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
సీఎంను కలిసిన సోమేశ్‌కుమార్
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/గన్నవరం: హైకోర్టు తీర్పుతోపాటు డీఓపీటీ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ కేడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్ తెలంగాణలో పనిచేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో డీఓపీటీ కూడా సోమేశ్‌కుమార్ వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డిని విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. అనంతరం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. ఏ బాధ్యతలిచ్చినా ఓకే.. ఇక ఏపీ ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను..
-
ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే: సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేష్ కుమార్.. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. విజయవాడలో సోమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వీఆర్ఎస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు సోమేష్ కుమార్. -
Somesh Kumar: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్‌కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. మూడేళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషి నుంచి ప్రభుత్వ శాఖల పాలన పగ్గాలు తీసుకున్న ఆయన.. అనేక రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు. ఎక్సైజ్, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడింతలు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రించేలా మార్పులు తెచ్చారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ విధానాన్ని తెచ్చి కల్తీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నియంత్రించడంతోపాటు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు తెచ్చారు. వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆదాయ శాఖలన్నింటిలో తనదైన ముద్ర వేసిన సోమేశ్.. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను తెచ్చారు. అయితే, ఈ పోర్టల్ అమల్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ రూపకల్పన నిరర్ధక ఆస్తులు, భూములను అమ్మి ప్రభుత్వ ఖజానా నింపడం, టీఎస్ఐఐసీ లాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా భూములను విక్రయించే పద్ధతిని సోమేశ్‌కుమార్ తీసుకొచ్చారు. లెక్కాపత్రం లేని ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను రూపొందించడం లాంటి పనులు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన పైరవీలకు సోమేశ్ చెక్ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏటా అన్ని శాఖల్లో ఆడిటింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా జవాబుదారీతనం పెంపు కోసం యత్నించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో డోర్ టు డోర్ సర్వే, రూ.ఐదుకే భోజనం, ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలు సులవుగా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది కూడా ఈయన హయాంలోనే. ఈ కాల్‌సెంటర్ కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడిందనే పేరుంది. -
Telangana: సీఎం కేసీఆర్‌తో శాంతికుమారి భేటీ
సాక్షి, హైదరాబాద్: సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆసక్తికరంగా.. సీనియర్ అధికారిణి శాంతికుమారి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సీఎస్ రేసులో ఈమె పేరు కూడా ప్రముఖంగా వినిపించడం విశేషం. దీంతో సీఎస్‌గా శాంతకుమారి పేరును ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి పేరు.. సీఎస్ రేసు లిస్ట్‌లో ప్రముఖంగా ఉంది. ఇదిలా ఉంటే.. విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. దీంతో ఆయన గురువారం ఏపీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. రాజీనామా చేస్తారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వెంటనే ఆయన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎస్ రేసులో.. ఆ ముగ్గురు! -
తెలంగాణ కొత్త సిఎస్ ఎవరు ?
-
తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీతో సంబంధం లేకుండా.. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి సీఎస్ నియామకం? పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. -
సోమేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించాలి: బండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్‌ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయా లని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చనందున ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని సూచించారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం సీఎం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించిన అధికారులను అక్కడకు, తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వ రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటున్నారని, 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు. -
ఏపీకి వెళ్లాల్సిందే.. సోమేశ్ కుమార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని తేలి్చచెప్పింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ పరిధి క్యాట్‌కు లేదని స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన కేటాయింపులను సమర్థించింది. అఖిల భారత సరీ్వసు అధికారుల కేటాయింపులు, కేడర్ నియంత్రణ, నిర్ణయాధికారం కేంద్రానిదేనన్న వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన వాటితో పాటు ఇతర అన్ని అంశాలను క్యాట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందాతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది. కాగా అప్పీల్ కోసం తీర్పు అమలును మూడు వారాలు నిలిపేయాలన్న సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీకి సంబంధించిన వివాదాలపై గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ హైకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ కాలం ఇరుపక్షాల వాదనలు విని, గత జూలైలో తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. మాకెలాంటి పక్షపాతం కనిపించడం లేదు.. ‘కేంద్రానికి క్యాట్ అప్పిలేట్ అధికారిగా వ్యవహరించలేదు. అది చట్టప్రకారం సమర్ధనీయం కాదు. ఆలిండియా కేడర్ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫలానా రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పడం సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. సోమేశ్‌ను ఏపీకి కేటాయించడంలో మాకు ఎలాంటి పక్షపాతం కనిపించడం లేదు. సీరియారిటీ, కేడర్ దెబ్బతింటుందన్న వాదనలో వాస్తవం లేదు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం కేడర్ విభజన చేసింది. పరస్పర బదిలీకి సంబంధించి సోమేశ్ చేసిన అభ్యర్థనను మార్గదర్శకాల మేరకు కేంద్రం తిరస్కరించింది. 1989 బ్యాచ్ అధికారి సోమేశ్కు, 1990 బ్యాచ్ అధికారి రజత్భార్గవ్తో పరస్పర బదిలీ సాధ్యం కాదంది. విభజన సమయంలో సీఎస్‌గా ఉన్న మొహంతి.. ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటం సరికాదని, కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలుగుతున్నందున కమిటీలో ఆయన ఉండొద్దన్న క్యాట్ నిర్ణయం సమర్ధనీయం కాదు. కేంద్రాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారో ఎవరూ చెప్పలేదు. 60 ఏళ్లు నిండటంతో 2014 ఫిబ్రవరిలో మొహంతి పదవీకాలం ముగిసింది. అయినా విభజన దృష్ట్యా 4 నెలలు పదవీ కాలాన్ని పొడిగించారు. జూన్ 1న పదవీ విరమణకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను నాటి సర్కార్ అంగీకరించింది. విరమణ రోజును పని దినంగా పేర్కొనరాదని నిబంధనలున్నా.. క్యాట్ ఆ రోజును కూడా పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాల్సిందే. ఈ కేసులో సోమేశ్ తరఫున నాటి జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ కౌంటర్ దాఖలు చేశారు. సోమేశ్ అఫిడవిట్ ఎందుకు వేయలేదన్నది సందిగ్ధం..’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. క్యాట్‌లో ఒకలా..హైకోర్టులో మరోలా.. సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే కేడర్ కంట్రోలింగ్ అథారిటీ. ఇష్టం వచి్చన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. తెలంగాణలో సోమేశ్ కొనసాగింపు చట్ట వ్యతిరేకం. ఆయన కంటే సమర్థులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి డెప్యుటేషన్ మీద మళ్లీ రప్పించుకోవచ్చు. ఈ కేసుపై క్యాట్‌లో విచారణ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఎదుట మాత్రం వైఖరిని మార్చుకుంది. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014కు ఒకరోజు ముందు పీకే మొహంతి రిటైరయ్యారు. అందుకే ఆయనను ఇరు రాష్ట్రాల మధ్య విభజన అధికారుల జాబితాలో చేర్చలేదు. అలా చేర్చి ఉంటే తనకు తెలంగాణ వచ్చేదన్న సోమేశ్‌కుమార్ వాదన సరికాదు. అధికారుల విభజనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీలో పీకే మొహంతి ఎక్స్‌అఫీíÙయో మెంబర్ మాత్రమే. మిగతా సభ్యులు ఉండగా ఆయన వివక్ష చూపడానికి అవకాశం లేదు. క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలి. సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే. – ఏఎస్జే టి.సూర్యకరణ్‌రెడ్డి సోమేశ్ అవకాశాలను మొహంతి దెబ్బతీశారు రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సమైక్యాంధ్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించలేదు. ఆయన తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు ఒక్కరోజు ముందు పదవీ విరమణ చేసిన మొహంతి పేరిట 2014, జూన్ 1న కూడా ప్రభుత్వ జీవోలు జారీ అయ్యాయి. దీని ప్రకారం అప్పటివరకు సరీ్వస్‌లో ఉన్న మొహంతిని ఏపీ లేదా తెలంగాణకు కేటాయించక పోవడం చట్ట వ్యతిరేకం. చివరిరోజు వరకు విధుల్లో ఉండి ఆపై రాజీనామా చేయడం ద్వారా కావాలని సోమేశ్‌కుమార్ అవకాశాలను దెబ్బతీశారు. లబి్ధదారుడైన మొహంతి కమిటీలో సభ్యుడిగా ఉండటం చెల్లదు. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి. – సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాదులు రాష్ట్ర ఏర్పాటు నుంచే వివాదం.. రాష్ట్ర విభజన (2014) నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సరీ్వస్ ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్‌ను ఏపీకి కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా, తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. సోమేశ్కు సంబంధించి క్యాట్ ఇచి్చన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జే) టి.సూర్యకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారాంమూర్తి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, ఏపీ తరఫున పి.గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా సోమేశ్‌కుమార్‌తో పాటు మరో 14 మంది ఆలిండియా కేడర్ సరీ్వస్ అధికారులు కాŠయ్‌ట్ ద్వారా అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తుండటం గమనార్హం. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.