Vehicles
-
‘ఆటో’ టారిఫ్‌ల ప్రభావం అంతంతే..
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి వాహనాలు, ఆటో విడిభాగాలపై అమెరికా విధించబోయే 25 శాతం దిగుమతి సుంకాల ప్రభావం భారతీయ సంస్థలపై అంతంత మాత్రంగానే ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు దేశీ ఎగుమతిదారులకు దీనివల్ల వ్యాపార అవకాశాలు మరింతగా పెరగడానికి కూడా ఆస్కారం ఉందని పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో భారతీయ ఆటో, ఆటో విడిభాగాల ఎగుమతులను విశ్లేషించిన మీదట ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్ 3 నుంచి కంప్లీట్లీ బిల్ట్ వెహికల్స్ (సీబీయూలు), ఆటో విడిభాగాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో జీటీఆర్ఐ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 గణాంకాల ప్రకారం భారత్ సుమారు 8.9 మిలియన్ డాలర్ల విలువ చేసే వాహనాలను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది మొత్తం 6.98 బిలియన్ డాలర్ల వాహన ఎగుమతుల్లో 0.13 శాతమే. అలాగే, మొత్తం ట్రక్కుల ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా 0.89 శాతమే. ఇలా అమెరికాకు వాహనాల ఎగుమతులు నామమాత్రమే కాబట్టి, మనపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని శ్రీవాస్తవ వివరించారు.ఆటో షేర్లకు టారిఫ్ బ్రేక్స్ఆటో దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధింపుతో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమలో అనిశ్చితి తలెత్తింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల దిగ్గజం జేఎల్ఆర్ విలాసవంత మోడల్ కార్లు అమెరికా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారణంగా దేశీ మాతృ సంస్థ టాటా మోటార్స్‌కు సైతం సెగ తగులుతోంది. దీంతో టాటా మోటార్స్ షేరు తాజాగా 5.5 శాతం పతనమైంది. రూ. 669 వద్ద ముగిసింది. కార్లతో పోలిస్తే యూఎస్‌కు భారత్ నుంచి ఆటో విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో సోనా కామ్స్టార్ షేరు 6.2 శాతం క్షీణించి రూ. 466 వద్ద నిలవగా.. సంవర్ధన మదర్సన్ 2.6 శాతం నీరసించి రూ. 131 వద్ద, అశోక్ లేలాండ్ 2.7 శాతం నష్టంతో రూ. 209 వద్ద, భారత్ ఫోర్జ్ 2.3 శాతం క్షీణించి రూ. 1,155 వద్ద ముగిశాయి.ఆందోళనలో విడిభాగాల సంస్థలుటారిఫ్ల ప్రభావం వాహన తయారీ సంస్థల కన్నా విడిభాగాల తయారీ సంస్థలపైనే ఎక్కువగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా ఇంజిన్ విడిభాగాలు, పవర్ ట్రెయిన్లు మొదలైన వాటిని అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశానికి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మన దిగుమతులపై అమెరికాలో సుంకాలేమీ లేకపోయినప్పటికీ అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులపై భారత్‌లో 15 శాతం సుంకాలు అమలవుతున్నాయి. -
వామ్మో... రూ.25,000 జరిమానా.. జైలూ.. నిజమేనా?
రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. వీటిని ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తోంది. అయితే ఇప్పుడున్న జరిమానాలను కేంద్ర ప్రభుత్వం సవరించిందని, తీవ్రమైన ఉల్లంఘనలకు జరిమానాలను 10 రెట్లు పెంచిందని చాలా జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రహదారి భద్రతను పెంచడం, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త జరిమానాలకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందంటూ నివేదించాయి. ఆయా నివేదికల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెంచిన జరిమానాలను మార్చి 1 నుంచే ప్రభుత్వం అమలు చేస్తోంది. భారీ జరిమానాలతోపాటు తీవ్రమైన ఉల్లంఘనలకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. రహదారి భద్రతను పెంపొందించడం,డ్రైవర్లలో నిర్లక్ష్య ప్రవర్తనను తగ్గించడం ఈ చొరవ లక్ష్యం. కొత్త నిబంధనలలో భాగంగా భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించడంతో పాటు ఉల్లంఘనలకు పాల్పడినవారితో సమాజ సేవ చేయించే శిక్షలను సైతం అధికారులు విధించవచ్చు.పేర్కొన్న కొత్త నిబంధనలు, జరిమానాలు ఇవే..డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు చెల్లించి 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పదేపదే పాల్పడితే రూ.15,000 జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.హెల్మెట్ లేకపోతే: హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే విధించే జరిమానాను గతంలో రూ.100 ఉండగా ఇప్పుడు రూ.1,000లకు పెంచారు. దీంతో పాటు మూడు నెలల పాటు మీ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 జరిమానా విధిస్తారు.డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడకం: మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసేవారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.5000లకు పెరిగింది.డాక్యుమెంట్లు లేకపోతే: చెల్లుబాటు కాని లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వరుసగా రూ.5,000, రూ.2,000 జరిమానా విధిస్తారు. దీంతోపాటు మూడు నెలల జైలు శిక్ష, కమ్యూనిటీ సర్వీస్ కూడా శిక్షగా విధించవచ్చు. బీమా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 4,000 జరిమానా విధిస్తారు.పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే: రూ.10,000 లేదా ఆరు నెలల జైలు శిక్షతోపాటు కమ్యూనిటీ సర్వీస్ కూడా శిక్షగా విధించవచ్చు.ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్: బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1,000 జరిమానా, ప్రమాదకర డ్రైవింగ్ లేదా రేసింగ్ కు రూ.5,000 జరిమానా విధిస్తారు. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తారు.సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్: సిగ్నల్ జంపింగ్ చేస్తే 5,000 జరిమానా, ఓవర్‌లోడ్ వాహనాలకు 2,000 జరిమానా విధిస్తారు.పిల్లలకు వాహనమిస్తే: రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు, 25 ఏళ్ల వరకు లైసెన్స్‌పై నిషేధం విధిస్తారు.రోడ్డు ప్రమాదాలను నివారించి, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే పలు కఠిన నిబంధనలు, జరిమానాలు, శిక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జరిమానాలు, శిక్షలు భారీగా పెంచారని నివేదికలు రావడంతో వాహనదారులకు మరింత ఆందోళన మొదలైంది. అయితే దీనిపై కేంద్ర రవాణా శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
ఫొటోతో పాటు లొకేషన్ వాట్సాప్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాలు, కాలనీల్లోనూ అనేక ప్రాంతాల్లో గుర్తు తెలియని వాహనాలు (Abandoned Vehicles) కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెలలు, ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతాయి. వీటివల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు, క్యారేజ్ వేలు కుచించుకుపోవడం పరిపాటి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివే అసాంఘిక శక్తులకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ విభాగం సంయుక్త సీపీ డి.జోయల్ డెవిస్ నిర్ణయించారు.సాధారణంగా ఈ వాహనాల్లో అత్యధికం ఏదో ఒక ప్రాంతంలో చోరీ అయినవే అయి ఉంటాయి. జాయ్రైడర్స్గా పిలిచే చోరులు వాహనాలను చోరీ చేసి, వాటిలో ఇంధనం అయిపోయే వరకు తిరిగి వదిలేస్తుంటారు. వీళ్లు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం వంటివి చేయరు. కొందరు చోరులు కూడా మార్గమధ్యంలో చోరీ వాహనాలు ఆగిపోతే అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.ప్రాంతాల వారీగా రోడ్లపై కనిపించే వాహనాల సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం ఇప్పటి ఉన్న ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626తో పాటు ప్రత్యేకంగా 87126 60600ను కేటాయించారు. ఇలాంటి వాహనాలను చూసిన నగరవాసులు దాని ఫొటో లేదా వీడియోతో పాటు లొకేషన్ సైతం వాట్సాప్ (Whatsapp) ద్వారా షేర్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. #HYDTPinfoవదిలివేసిన వాహనం చూశారా? 🚗⚠️ ట్రాఫిక్ పోలీసులకు నివేదించండి మరియు రహదారులను సురక్షితంగా మరియు స్పష్టంగా ఉంచడానికి సహాయం చేయండి!#TrafficSafety #ReportAbandonedVehicles #RoadSafety #RoadRules pic.twitter.com/xi7CWkoour— Hyderabad Traffic Police (@HYDTP) March 12, 2025 హోలీ సందర్భంగా సిటీలో ఆంక్షలు హోలీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.చదవండి: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం -
ఎలాగైనా వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, లక్డీకాఫల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు. హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. -
ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలను సమకూర్చుతోంది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశా లతో ఈ వాహనాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా పలు వ్యాపారాలను ప్రారంభింపజేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేయి స్తున్నారు. ఒక్కో వాహనానికి రూ. 10 లక్షలు ప్రభుత్వం సమకూరుస్తోంది. జనవరి 3న వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించను న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో రూ. 4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని సైతం బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలుగా సెర్ప్ ఇప్పించనుంది. గచ్చిబౌలిలోని నిథమ్ ఇన్స్టిట్యూట్లో మహిళా సంఘాల సభ్యులకు సంచార చేపల విక్రయానికి సంబంధించిన శిక్షణను సెర్ప్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నారు. -
ఎస్డీఆర్ఎఫ్ వాహనాలను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ స్టాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ లోగోను సీఎం ఆవిష్కరించారు.రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాటుకగా, రాష్ట్ర సర్కార్.. ఎస్డీఆర్ఎఫ్కు రూ.35.03 కోట్లు మంజూరూ చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. -
ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం
ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్!మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్ పెట్రోలు లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఇంజిన్‌లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్ నెట్ వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్ (అక్కడికక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్‌ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పని కొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్‌లతో పాటు యూరోపియన్ యూని యన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్ యూని యన్ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బ్రిటన్ రాజు గారింట్లో దొంగలు పడ్డారు!
బ్రిటన్‌లో రాజు గారింట్లో దొంగలు పడ్డారు! రాజు చార్లెస్–3 దంపతులకు చెందిన విండ్సర్ రాజప్రాసాదంలో ఒక పికప్ ట్రక్కును, బైకును ఎత్తుకెళ్లారు. గత అక్టోబర్ 13న అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఉదంతాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ సన్ తాజాగా బయటపెట్టింది. ‘‘ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆరడుగుల ఫెన్స్‌ను దూకి మరీ ప్యాలెస్ లోనికి పవ్రేశించారు. దొంగిలించిన ట్రక్కుతోనే సెక్యూరిటీ గేట్‌ను బద్దలు కొట్టి మరీ దర్జాగా ఉడాయించారు’’ అని తెలిపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాసాదంలోకి దొంగలు సులువుగా ప్రవేశించడమే గాక సెక్యూరిటీ సిబ్బంది కన్నుగప్పి ఏకంగా వాహనాలనే ఎత్తుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాసాదం పరిధిలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయతి్నస్తే వెంటనే అలారం మోగుతుంది. చోరీ జరిగిన రోజు అలారం, ఇతర రక్షణ వ్యవస్థలన్నీ ఏమయ్యాయన్నది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌కు పాతిక మైళ్ల దూరంలో బెర్క్‌షైర్‌లో ఉండే విండ్సర్ క్యాజిల్‌లో రాజ దంపతులు వారానికి రెండు రోజులు బస చేస్తారు. యువరాజు విలియం, కేట్ దంపతులు కూడా తమ పిల్లలతో కలిసి దాని ఆవరణలోని అడెలైడ్ కాటేజీలోనే నివాసముంటారు. చోరీ జరిగినప్పుడు రాజ దంపతులు భవనంలో లేకున్నా విలియం దంపతులు తమ కాటేజీలోనే ఉన్నట్టు సమాచారం. దొంగలు బద్దలు కొట్టుకుని ఉడాయించిన గేటు గుండానే రాజ దంపతులు రాకపోకలు సాగుతాయని చెబుతున్నారు. ఈ ఉదంతంపై స్పందించేందుకు బకింగ్‌హాం ప్యాలెస్ నిరాకరించింది. బ్రిటన్ రాజ దంపతులతో పాటు రాజ కుటుంబీకులకు సొంత పోలీసు భద్రతా వ్యవస్థ ఉంటుంది. వారి భద్రతపై ఏటా కోట్లాది రూపాయలు వెచి్చస్తారు.గతంలో ఎలిజబెత్‌పై హత్యాయత్నం విండ్సర్ క్యాజిల్‌లో భద్రతా లోపాలు తలెత్తడం ఇది తొలిసారేమీ కాదు. 2021లో ఈ ప్రాసాదంలోనే రాణి ఎలిజబెత్–2పై హత్యా యత్నం జరిగింది. ఒక సాయుధుడు క్రిస్మస్ రోజు ఏకంగా ఫెన్సింగ్ దూకి లోనికి చొరబడ్డాడు. సునాయాసంగా రాణిని సమీపించాడు. అతన్ని చూసి భయంతో ఆమె చాలాసేపు కేకలు వేసినట్టు చెబుతారు. చివరికి భద్రతా సిబ్బంది దుండగున్ని బంధించడంతో ముప్పు తప్పింది. అప్పట్లో రాణి విండ్సర్లోనే నివాసముండేవారు. సాయుధుడు అంత సులువుగా రాణి సమీపం దాకా వెళ్లగలగడం, పైగా ఆ సమయంలో దగ్గర్లో భద్రతా సిబ్బంది లేకపోవడం అప్పట్లో చాలా అనుమానాలకు తావిచి్చంది. -
చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ.. రోడ్డు ప్రమాదాల్లో పదేళ్లలో 15 లక్షల మంది మృతి
మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.50 లక్షల మంది క్షతగాత్రులు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.రెండింతలైన వాహనాలుజనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.యాక్సిడెంట్ కేసులపై శీతకన్నుఅయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతిహత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు. -
‘ఈవీ’లు... టైంబాంబులు!
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.తొలుత వేడి... తర్వాత మంటలు! ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider) -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
జతకలిసిన జీఎం, హ్యుందాయ్.. కొత్త ప్లాన్ ఇదే..
జీఎం (జనరల్ మోటార్స్) & హ్యుందాయ్ మోటార్ రెండూ కలిసి కీలకమైన రంగాలలో భవిష్యత్ ప్రణాళికలను రచించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు బ్రాండ్స్ కలిసి కొత్త శ్రేణి వాహనాలను తీసుకురానున్నట్లు సమాచారం.ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలతో సహా ప్రయాణికులకు అవసరమయ్యే వాహనాలు, కమర్షియల్ వాహనాలను జీఎం.. హ్యుందాయ్ మోటార్స్ తయారు చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రానున్న రోజుల్లో రెండు బ్రాండ్స్ కలయికతో ఏర్పడ్డ కొత్త వెహికల్స్ రూపొందుతాయని తెలుస్తోంది.ఈ ఒప్పందంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుయిసన్ చుంగ్ & జనరల్ మోటార్ చైర్మన్ అండ్ సీఈఓ మేరీ బర్రా సంతకం చేశారు. రెండు కంపెనీల మధ్య ఏర్పడ్డ భాగస్వామ్యం వాహన అభివృద్ధిని మరింత సమర్థవంతంగా చేసేలా చేస్తుందని బర్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!భారత్‌లో జనరల్ మోటార్స్1996లో జనరల్ మోటార్స్ కంపెనీ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో కార్లను నిర్మించడం ప్రారంభించింది. కొన్ని రోజులు దేశంలో సజావుగా ముందుకు సాగిన తరువాత కాలంలో కంపెనీ తన కార్యకలాపాలను దేశంలో పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ భాగస్వామ్యంతో మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. -
వైఎస్ జగన్ ముందుచూపు.. చంద్రబాబుకు అదే దిక్కు
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు ఎండీయూ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. అందులోనే ఆహారం, మంచినీరును చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎండీయూ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చౌక డిపోల దగ్గర వేచిచూసే పని లేకుండా ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల దగ్గరకే వైఎస్ జగన్ రేషన్ పంపిణీ చేయించారు. సీఎం అయ్యాక ఆ వాహనాలను చంద్రబాబు పక్కన పెట్టించారు. ఇప్పుడు వరద బాధితుల కోసం కూటమి ప్రభుత్వానికి అవే వాహనాలు దిక్కు అయ్యాయి. ఇరుకు మార్గంలో కూడా వెళ్లి ఆహారం నీళ్లు అందించటానికి ఎండీయూ వాహనాలు ఉపయోగపడుతున్నాయి.అయితే, వాహనాల వాడకంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసింది. వాహనాలపై ఉన్న వైఎస్ జగన్ ఫోటోలు కనపడకుండా స్టిక్కర్లను అంటించిన అధికారులు.. జగన్ పేరు ఉన్న చోట ఏకంగా స్టిక్కర్లను చించివేశారు. నిన్నటి వరకు వాలంటీర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. నేడు వరద సహాయక చర్యల కోసం వాలంటీర్లను పిలుస్తున్నారు. ఆహారం సరఫరా కోసం ఎండీయూ వాహనాల వాడకం.. వైఎస్ జగన్ ముందు చూపు కార్యక్రమాలే చంద్రబాబుకు దిక్కయ్యాయని స్థానికులు అంటున్నారు. -
హరీష్‌రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్ల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్‌రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వరద బాధితులను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.. బడ్జెట్లో సున్నా, వరద సాయంలోనూ సున్నా’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు.అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే, ప్రధానిని నిలదీద్దామని హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర, కేంద్ర నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారు. సాగర్ కెనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన మండిపడ్డారు. -
నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు..వన్యప్రాణుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్–శ్రీశైలం రహదారి వెళుతోంది. దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగానే వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిషేధం ఉన్నా.. తగ్గని వేగం హైదరాబాద్–శ్రీశైలం హదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ. నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలు గంటకు కేవలం 30 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడవిలోని రహదారి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే అడవిలో గరిష్ట వేగం 30 కి.మీ. కాగా, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అడవిలో ఏదైనా వన్యప్రాణి అడ్డుగా వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడంతో వాహనాల కింద పడి అవి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో సుమారు 800కు పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి మరణించాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిపోర్టు కాని వన్యప్రాణుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. సూచిక బోర్డులకే పరిమితం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవురోజుల్లో వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. నల్లమలలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతో పాటు 35 చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా సూచిక బోర్డులు ఉన్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటం నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, మనుబోతులు, సరీసృపాలు తదితర అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వాహనదారులకు వి్రస్తృతంగా అవగాహన కలి్పంచడంతో పాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచుగా రహదారులు దాటే ప్రాంతాల్లో 35 చోట్ల సూచికబోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేశాం. వాహనాలు అటవీమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ -
Gujarat: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిరసనకారుల విధ్వంసం
గుజరాత్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్గావ్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ కరణ్‌రాజ్ వాఘేలా ఉమర్గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. -
సిటీ స్టీరింగ్ లాక్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం తారస్థాయికి చేరింది. రోడ్లపై అంగుళం కూడా ఖాళీలేనట్టుగా కార్లు, బైకులు, ఇతర వాహనాలు నిండిపోయి కనిపిస్తున్నాయి. నత్త నడకను తలపిస్తున్నట్టుగా ఒకదాని వెనుక ఒకటి మెల్లగా కదులుతున్నాయి. ఎప్పుడైనా కాసిన్ని చినుకులు పడితే అంతే.. గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. బండి తీసుకుని రోడ్డెక్కితే నరకమే. అలాగని బస్సు ఎక్కుదామనుకుంటే.. అదే ట్రాఫిక్ చిక్కు. అంతంత సేపు కిక్కిరిసిన జనంలో నిలబడి ప్రయాణించలేని పరిస్థితి. ఎంఎంటీఎస్ రైల్లోనో, మెట్రోలోనో వెళదామనుకుంటే.. ఇంటి నుంచి స్టేషన్లకు, స్టేషన్ల నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు సరిగా రవాణా సదుపాయాలు లేని దుస్థితి. మొత్తంగా హైదరాబాద్ నగరం వాహనాల రద్దీతో ‘గ్రిడ్ లాక్’స్థాయికి చేరుకుంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజారవాణాను మెరుగుపర్చడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమనే అభిప్రాయం వస్తోంది. రవాణా సౌకర్యాలు సరిగా లేక.. హైదరాబాద్ మహానగరం అన్నివైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగా రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. దీనితో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. నగరం పరిధిలోనే ఏటా 3.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతంఅన్ని రకాల వాహనాలు కలిపి 80 లక్షలు ఉంటే.. అందులో ద్విచక్ర వాహనాలు 60 లక్షలు, మరో 15 లక్షల వరకు కార్లు ఉండటం గమనార్హం. నగరంలోని రోడ్లపై రోజూ పీక్ అవర్స్‌లో ప్రతి కిలోమీటర్‌కు 30 వేల వరకు వాహనాలు ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇంత రద్దీతో నగరం దిగ్బంధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రజా రవాణాలో కీలకమైన సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బెంగళూరు, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో బస్సుల సంఖ్య ఆరేడు వేలకుపైనే ఉంది. మరిన్ని బస్సులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. దానికి విరుద్ధంగా హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య గత నాలుగైదేళ్లలో 3,885 నుంచి 2,550 కంటే తగ్గిపోవడం ఆందోళనకరం. ఔటర్ రింగ్‌రోడ్డును దాటి మరీ నగరం విస్తరిస్తూ ఉంటే.. ప్రజా రవాణా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. ‘బండి’తప్పనిసరి అయిపోయి.. నగరంలో ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నిత్యం రాకపోకలు సాగించేవారు సొంత వాహనాలపై ఆధారపడాల్సి న పరిస్థితి ఉంది. నగరంలోని చాలా ప్రాంతాలను ప్రధాన మార్గాలకు అనుసంధానించే ప్రజా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడమే దీనికి కారణం. అదే బస్సెక్కే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు కిక్కిరిసి, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఆ మేరకు బస్సుల సంఖ్య పెరగలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గణాంకాల ప్రకారం.. 7,228 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్న్ఏరియా (హెచ్ఎంఏ) పరిధిలో ప్రజా రవాణా సదుపాయం 31 శాతమే ఉంది. అక్కడ పెరిగాయి...ఇక్కడ తగ్గాయి..బెంగళూరులో ప్రస్తుతం 7,000 సిటీ బస్సులు ఉన్నాయి. వీటిని 13,000కు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఢిల్లీలోనూ బస్సుల సంఖ్యను 6,000 నుంచి 7,000కు పెంచారు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం బస్సుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. నాలుగేళ్ల కిందటి వరకు ఇక్కడ 3,885 బస్సులు నడవగా.. ఇప్పుడీ సంఖ్య 2,550కు తగ్గింది. సిటీ జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజారవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరం. హైదరాబాద్‌లో ప్రజారవాణా లెక్కలివీ..హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం:7,228 చదరపు కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్: 5,400 కిలోమీటర్లు జనాభా: కోటీ 8 లక్షలు రాష్ట్ర జనాభా శాతం: 29.6 శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: 31 శాతం కార్లు: 9 శాతం క్యాబ్‌లు, ట్యాక్సీలు: 18 శాతం బస్రూట్లు: 795 ప్రైవేట్ వాహనాలు: 51 శాతం ఏం చేస్తే.. సమస్యకు చెక్ పెట్టొచ్చు? మెట్రో మార్గాలు పెరిగితే ఎంతో ప్రయోజనం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రస్తుతం రోజుకు 1,030కుపైగా మెట్రోరైలు ట్రిప్పులు నడుస్తున్నాయి. 4.8 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూపోతోంది. రైళ్లు, మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బోగీల సంఖ్య పెంచాల్సి ఉందని గత ఏడాదే గుర్తించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. మూడు కోచ్‌ల మెట్రోలోనే కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీలోని మెట్రోరైళ్లలో 6 నుంచి 8 కోచ్‌లు ఉన్నాయి. బెంగళూర్‌లో కూడా 6 కోచ్‌లతో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం 2017 నుంచీ కూడా మూడు కోచ్‌లే ఉండటం గమనార్హం. అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేస్తే తప్ప రద్దీ నియంత్రణకు పరిష్కారం లభించదు. ఎంఎంటీఎస్‌ను విస్తరించాలి ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పూర్తయినా సర్వీసులు మాత్రం పెరగలేదు. పైగా గతంలో 121 ఎంఎంటీఎస్‌లు ఉంటే ఇప్పుడు 70కి తగ్గాయి. మరోవైపు లింగంపల్లి నుంచి పటాన్చెరు–తెల్లాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు, సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ అందుకు అనుగుణంగా సర్వీసులు పెరగలేదు. ప్రయాణికుల సంఖ్యను బట్టి చూస్తే.. వివిధ మార్గాల్లో కలిపి కనీసం 250 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాల్సి ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుతం అందులో మూడో వంతు కూడా లేవు. కొత్తగా ఎంఎంటీఎస్ విస్తరణతోపాటు సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం... మెట్రోరైల్ స్టేషన్ల నుంచి కాలనీలకు, శివారు ప్రాంతాలకు సమర్థవంతమైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల నగరవాసులు సొంత వాహనాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మెట్రో రైలు దిగిన ప్రయాణికుడు ఇంటికి చేరేందుకు మరో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే.. రోజూ వందలకు వందలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఆచరణ సాధ్యం కాదు. అదే లాస్ట్‌మైల్ కనెక్టివిటీని పెంచితే.. ప్రజా రవాణా వినియోగం పెరుగుతుంది. ప్రజారవాణా పెరగాలి వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గాలంటే ప్రజారవాణా సదుపాయాలు పెరగడం ఒక్కటే పరిష్కారం. గత పదేళ్లలో జనాభా పెరిగినట్టుగా రవాణా సదుపాయాలు పెరగలేదు. దీంతో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. – మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఉపరవాణా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కనెక్టివిటీయే అతిపెద్ద సవాల్ హైదరాబాద్ నగరానికి నలువైపులా కనెక్టివిటీ లేకపోవడం ఇక్కడి ప్రజారవాణాలో అతి పెద్ద సమస్య. దీనితో వాహనాల వినియోగం బాగా పెరిగింది. కాలుష్య కారకాలు కూడా ప్రమాదకర స్థాయికి చేరాయి. ప్రభుత్వం తక్షణమే ప్రజారవాణా సదుపాయాలపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణ నిపుణుడుగ్రేటర్లో వాహనాల విస్ఫోటనమిదీకేటగిరీ వాహనాల సంఖ్య ఆటోరిక్షాలు 1,07,862కాంట్రాక్ట్ క్యారేజీలు 6,835స్కూల్ బస్సులు 14,624ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు 41మ్యాక్సీక్యాబ్‌లు 15,754గూడ్స్ వాహనాలు 3,14,359క్యాబ్‌లు 79,609కార్లు 14,82,028ద్విచక్ర వాహనాలు 59,25,468ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 2,274 స్టేజీ క్యారేజీలు 8,569ట్రాక్టర్ ట్రాలర్లు 45,806ఇతర వాహనాలు 40,421 మొత్తం వాహనాలు 80,43,650 -
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్?
దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాహనాల వినియోగం గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంత తక్కువగా ఉందనే తెలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్న సమయంలో కొందరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 10 సంవత్సరాల్లో.. డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.మార్కెట్లో బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర వాహనాలు కూడా తప్పకుండా ఈవీల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ వాహనాల కోసం పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ కార్ల కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. గడ్కరీ హిమాచల్ ప్రదేశ్‌లోని బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెండానికి కేంద్రం ఇప్పటికే సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడ్డాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.కొత్త ఈవీ పాలసీలు ఆమోదం పొందిన తరువాత ఈవీల సేల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మాత్రమే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలు కూడా ఇదే విధాన్ని పాటించడానికి సుముఖత చూపుతున్నాయి.భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విరివిగా అందుబాటులో లేదు. ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారు ఛార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా లేదనే కారణంగానే.. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం చెప్పినట్లు 2034 నాటికి డీజిల్, పెట్రోల్ కార్లను తొలగించాలంటే.. కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
ఇసుక వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్ క్యూరీ నోర్మా అల్వరీస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు. -
టాప్‌గేర్‌లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్‌లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. తొలి స్థానంలో మారుతి.. దేశంలో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్‌కు నాలుగు సీఎన్జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్జీ మోడళ్లతో హ్యుండై మోటార్ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్జీని ఆఫర్ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగేళ్లలో సగానికిపైగా.. 2014–15లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్జీ ఆధారిత కార్లు, ఎస్‌యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. టాటా నుంచి పోటీ.. సీఎన్జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్ జీ వేరియంట్లను టాటా మోటార్స్ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్ అయిన కిట్‌తో సీఎన్ జీ వాహనాలు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్ సీఎన్జీ వేరియంట్ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్–జనవరిలో టాటా మోటార్స్ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది. పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో వెల్లడి దేశీయంగా ఆటోమొబైల్ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎగ్జిబిషన్లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్జీ, హైబ్రిడ్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోట ర్ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీఎక్స్, ఫ్లెక్స్–ఫ్యూయల్ వ్యాగన్ఆర్, హైబ్రీడ్ గ్రాండ్ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ–ఫ్లయింగ్ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఈవీఎక్స్ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్పో తెలియజేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఎక్స్పో విశేషాలు.. మెర్సిడెస్ బెంజ్ తమ ఆఫ్ రోడ్ జీ వాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ’కాన్సెప్ట్ ఈక్యూజీ’, జీఎల్ఏ, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ర్యాల్–ఈ, ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400, ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ మోటర్స్ .. ట్రావెలర్ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్ సీఎన్జీల వాహనాలను ప్రదర్శించింది. ప్రదర్శనలో టాటా మోటార్స్ 18 ‘ఫ్యూచర్ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్ కూపర్ ఎస్ఈలను ప్రదర్శనకు ఉంచింది. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్.. ఎన్ని వేల కోట్లంటే?
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్‌లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ ఆదాయం 22 శాతం జంప్‌చేసి 7.4 బిలియన్ పౌండ్లకు చేరింది. తగ్గిన రుణ భారం ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది. -
ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్‌గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్‌తో కూడిన సాఫ్ట్డోర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్‌లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. -
పాత వాహనాలను ఈ వీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు
-
సంతోషాల మకరందం.. పల్లెల్లో సంక్రాంతి శోభ
ఆనందాలు ముంగిళ్లలో రంగవల్లులై మెరిసినట్టు.. ఉత్సాహధ్వానాలు హరిదాసుల కీర్తనలై మార్మోగినట్టు.. సంక్షేమ సిరులు పాలపొంగళ్లై పొంగినట్టు.. ‘‘నవరత్నాలు’’ పొదిగిన నవ్వుల ఇంద్రధనస్సులు భోగిమంటల వెలుగులో దేదీప్యమానమై శోభిల్లినట్టు.. ధాన్యలక్ష్మి బసవన్నలతో కలిసి లయబద్ధంగా నర్తించినట్టు.. ప్రతిపతాక గగనాన పతంగులై సగర్వంగా రెపరెపలాడినట్టు.. ‘‘గడపగడపా’’ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతోంది. సంతోషాల ‘మకర’ందాలు గ్రోలుతోంది. పండగ కళతో ఉట్టిపడుతోంది. సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి కాంతులతో తళుకులీనుతున్నాయి. దూరప్రాంతాల నుంచి బంధుమిత్రుల మిత్రుల రాకతో జన తరంగమై పరవళ్లు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోడిపందేలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయి పంటల దిగుబడులు రావడంతో కర్షకుల ఇంట ఆనందం తొణికిసలాడుతోంది. పెద్ద పండగను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త దుస్తులు, కొత్తవస్తువుల కొనుగోళ్లకు తరలివెళ్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్తోపాటు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు సర్కారు ప్రకటించడంతో యువతరంలో కొత్త జోష్ కనిపిస్తోంది. సంక్షేమ ‘సిరి’నవ్వులు గడిచిన నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతినెలా ఏదో పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించారు. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. సేద్యలక్ష్మి కటాక్షం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతన్నలను కలవరపెట్టినప్పటికీ సాగైన విస్తీర్ణంలో మాత్రం రికార్డు స్థాయి దిగుబడులు రావడం రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వరి ఎకరాకు గతేడాది సగటున 30–35 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు సగటున 35–40 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నల గాదెలన్నీ ధాన్యపురాశులతో నిండిపోయాయి. వాహనాల అమ్మకాల జోరు మరొక వైపు కొత్త అల్లుళ్ల రాకతో రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న విక్రయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్ తర్వాత పది లక్షలకు పడిపోగా, గతేడాది 12 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి. కాగా ఈ ఏడాది కనీసం 15 లక్షలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కార్ల అమ్మకాలు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే, ఆ తర్వాత 3.5 లక్షలకు చేరినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 4లక్షలకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో 20 శాతం వృద్ధి సంక్రాతి అమ్మకాల్లో వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలదే అగ్రస్థానంగా ఉంది. వస్త్ర వ్యాపారం గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ళీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ సంక్రాంతికి రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర, బంగారం దుకాణాల ద్వారా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారం, కిరాణా దుకాణాల్లో మొత్తం రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని విక్రయదారుల అంచనా. వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతం వృద్ధిరేటు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులూ కిక్కిరిసిపోతున్నాయి. నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త అల్లుళ్లు, బంధువులతో కళకళ బంధువులు, కొత్త అల్లుళ్లతో పల్లెలు కళలాడుతున్నాయి. వారి కోసం సంప్రదాయ పిండివంటల తయారీ చేయడంతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొమ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
-
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
తుక్కు చేయడానికి ఎన్ని కేంద్రాలు అవసరమంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా 1,000 వాహన తుక్కు కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 స్క్రాపింగ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిన్చినట్లు ’డిజిఈఎల్వీ’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వివరించారు. జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీ అనేది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని, దక్షిణాసియాలో భారత్ స్క్రాపింగ్ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాహన స్క్రాపింగ్ కోసం వాహనదారుకు స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)లను ట్రేడింగ్ చేసుకునేందుకు డిజిఈఎల్వీ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. గత మూడు నెలలుగా బీటా ఫేజ్‌లో ఉన్న డిజిఈఎల్వీ దాదాపు 800 సర్టిఫికెట్ల ట్రేడింగ్‌కు తోడ్పడింది. పాతబడిన, ఫిట్నెస్ కోల్పోయిన, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తప్పించేందుకు 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాపింగ్ చేసిన వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్‌లో పాతిక శాతం వరకు రిబేటు పొందవచ్చు. ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. -
పలు పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
ఆ వాహనాలకు GPSలు
-
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
ఎక్కడికైనా వస్తుంది.. కల్తీని పట్టేస్తుంది
సాక్షి, అమరావతి: ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆహార కల్తీని సులభంగా గుర్తించేలా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరిట ల్యాబ్‌తో కూడిన మొబైల్ వాహనాలు త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిద్వారా ఆహార కల్తీని అప్పటికప్పుడే కనిపెట్టే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. రెండు దశల్లో 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలి దశలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రీజియన్లకు ఒక్కొక్కటి, స్టాండ్ బై కింద ఒక వాహనం చొప్పున మొత్తం నాలుగు కొనుగోలు చేస్తున్నారు. ఇక రెండో దశలో 10 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కేంద్రంలో ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.45 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. తొలి దశలో 4 వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్ఐడీసీ) టెండర్లు ఆహా్వనించింది. ప్రతి వాహనంలో 80 రకాల పరీక్షలు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనంలో 80 రకాల పరీక్షలు చేసే సౌకర్యం ఉంటుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, డిటర్జెంట్, ఇతర రసాయనాలను కలిపారా? లేదంటే పాలల్లో కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ (ఘన పదార్థాలు) స్థాయిలను తెలుసుకోవడానికి మిల్క్ అనలైజర్ అందుబాటులో ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారేమో తెలుసుకోవడానికి టీపీసీ, ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు పసిగట్టడానికి, ఉప్పులో అయోడిన్ వంటి పరీక్షలు చేయడానికి మ్యాజిక్ బాక్స్, టిష్యూపేపర్ టెస్ట్‌లు మొబైల్ ల్యాబ్‌లో నిర్వహించవచ్చు. డిజిటల్ మల్టీ పారామీటర్, హ్యాండ్ మిల్లీమీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్, డిజిటల్ బ్యాలెన్స్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్క్రీనింగ్ తదితర పరికరాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి ఘటనల్లో నీటిలో బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించడానికి శాంపిళ్లను నిర్ధేశిత టెంపరేచర్లో భద్రపరిచి సెంట్రల్ ల్యాబ్‌కు తరలించడానికి వీలుంటుంది. కల్తీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. కల్తీని తక్షణమే పసిగట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానంలో శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్‌కు పంపి పరీక్షించి ఫలితాలు రావడానికి సమయం పడుతోంది. ఈ కాలయాపనకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌తో చెక్ పడుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్, డయేరియా కేసులు నమోదైనప్పుడు సత్వరమే స్పందించడానికి మొబైల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. – జె.నివాస్, కమిషనర్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ -
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
ప్రపంచంలో లెక్కలేనన్ని వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం వైరల్ అవుతోంది. భవనంలోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం విస్మయం గొలుపుతోంది. ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్లో షేర్ చేశారు. కోట్లాది మంది యూజర్స్ ఈ వీడియో చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వాహనదారులు ఎలా వెళతారనే ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్కింగ్లో నిర్మితమయ్యింది. పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే ఉంది. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్‌కు చేరుకోగలుగుతారు. చైనావాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు? Refueling on the rooftop of a parking lot and subway passing through a residential building in the city of Chongqing, China. pic.twitter.com/gKZpbUA9wn — Tansu YEĞEN (@TansuYegen) September 2, 2023 -
రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లు, సీఎన్జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్‌ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు. మార్కెట్ వాటా మళ్లీ పెంచుకుంటాం.. చిన్న కార్లకు డిమాండ్ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. 2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్‌ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీము పొడిగింపు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది. దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు. -
దశాబ్దిలో రెండింతలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. గణనీయంగా పెరుగుతున్న ఈవీలు తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి. 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్‌లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు. -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకర్శించేస్తాయి. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లయితే ఒక భారీ 'హమ్మర్' (Hummer) రోడ్డుపై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి సాధారణ కారులా కాకుండా ఒక విమానం మాదిరిగా అనిపిస్తుంది. ఈ కొత్త మోడిఫైడ్ కారు దుబాయ్‌కి చెందిన 'షేక్ హమద్ బిన్ హమ్దాన్ నహ్వాన్'కి చెందినదిగా తెలుస్తోంది. ఇతన్ని అక్కడి ప్రజలు రెయిన్బో షేక్ అని కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! కార్ల మీద అమితమైన ఆసక్తి కలిగిన ఈయన దీనిని ప్రత్యేకంగా రూపోంచించినట్లు తెలుస్తోంది. ఇది సాధారణ హమ్మర్ కారుకంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. దీని పొడవు 184.5 ఇంచెస్, వెడల్పు 865 ఇంచెస్, ఎత్తు 77 ఇంచెస్ వరకు ఉంది. ఈ వీడియో ఎంతోమంది ఆటోమొబైల్ ప్రెమికులను కట్టిపడేస్తోంది. Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable [read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx — Massimo (@Rainmaker1973) July 27, 2023 -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్‌యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్‌ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!
Pakistan Popular Cars: మనం ఇప్పటి వరకు చాలా కథనాలతో భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు, సేఫ్టీ కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు, మంచి పాపులర్ కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎక్కువగా ఉపయోగించే పాపులర్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సుజుకి ఆల్టో పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో సుజుకి ఆల్టో ఒకటి. దీని ధర 22,51,000 పాకిస్థాన్ రూపాయలు (PKR). భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ. ఈ కారు ఇండియాలో అమ్ముడయ్యే కారు కంటే భిన్నంగా ఉంటుంది. 2023 మార్చిలో మొత్తం 2542 ఆల్టో యూనిట్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. సుజుకి స్విఫ్ట్ భారతీయ విఫణిలో మాత్రమే కాకుండా పాకిస్థాన్ ప్రజలను కూడా ఎక్కువ ఆకర్శించిన కారు సుజుకి స్విఫ్ట్. దీని ప్రారంభ ధర PKR 42,56,000. గత మార్చి నెలలో కంపెనీ ఆ దేశంలో 877 యూనిట్లను విక్రయించింది. ఇది కేవలం 1.2-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 89 bhp పవర్, 4200 rpm వద్ద 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి బోలన్ ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఓమ్ని మాదిరిగా అమ్ముడవుతున్న కారు పాకిస్థాన్‌లో బోలాన్ పేరుతో అమ్ముడవుతోంది. ఓమ్నికి.. బోలాన్ కారుకి డిజైన్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. 2023 మార్చిలో 782 యూనిట్లు అమ్ముడైన ఈ కారు ధర PKR 19,40,000. ఇది 3-సిలిండర్ OHC 6-వాల్వ్ ఇంజన్‌తో 5000 rpm వద్ద 37 bhp, 3000 rpm వద్ద 62 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్ పాకిస్థాన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతున్న కారు 'టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్'. దీని ప్రారంభ ధర PKR 61,69,000. 2023 మార్చిలో ఇది 778 యూనిట్ల అమ్మకాలను పొందింది. చూడటానికి హోండా సిటీ మాదిరిగా ఉండే ఈ కారు రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్.. థార్ 5 డోర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) హోండా సిటీ ఎక్కువ మంది భారతీయులను ఆకర్శించిన హోండా సిటీ, పాకిస్థాన్ వాహన ప్రియులను కూడా ఆకర్శించడంలో విజయం సాధించింది. 2023 మార్చిలో 611 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర PKR 47,79,000. ఎంచుకునే వేరియంట్‌ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు - ఇన్విక్టో నుంచి ఎక్స్టర్ వరకు..) నిజానికి పాక్ ఆర్థిక వ్యవస్థ భారత్‌లో కొంత భాగం మాత్రమే కావచ్చు, కానీ ఆటోమోటివ్ ఉత్పత్తిలో ప్రపంచంలో 35వ స్థానంలో ఉంది. అంతే కాకుండా జాతీయ ఖజానాకు ప్రతి సంవత్సరం దాదాపు $220 మిలియన్ డాలర్లకు దోహదం చేస్తోంది. అయితే గత కొంత కాలంలో అక్కడ ఏర్పడిన అంతర్గత సవాళ్లు, షట్డౌన్లు, రాజకీయ అస్థిర వాతావరణం కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమ కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో శుభవార్త!
ప్రమఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓలా వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల పాటు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు ఓలా ఈవీ బైక్‌ను కొనుగోలు చేయడం మరింత సులభతరం కానుంది. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ బైక్స్‌కు అందించే ఫేమ్-2 సబ్సిడీలో కోత పెట్టింది. దీంతో వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఈ తరుణంలో వాహనాల సేల్స్‌ను పెంచేలా ఓలా తన ప్రత్యర్ధి సంస్థ ఎథేర్ అందిస్తున్నట్లుగానే ఎస్10 రేంజ్ వాహనాల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! మార్కెట్లోని ఇతర సంస్థల కంటే తామే అతి తక్కువ వడ్డీతో డౌన్ పేమెంట్ చెల్లించే అవసరం లేకుండా 6.99 శాతంతో 60 నెలల పాటు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు. గతంలో, ఫైనాన్స్ కంపెనీలు ఈవీ వెహికల్స్‌పై 36 నెలలు మాత్రమే లోన్ సౌకర్యాన్ని అందించేవి. పండగలతో పాటు కొన్ని సందర్భాలలో 48 నెలలకు పొడిగించేవి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం దేశం మొత్తం 60 నెలల పాటు లోన్ సౌకర్యాన్ని అందిస్తుండడం విశేషం. చదవండి👉ట్రాన్సామెరికా డీల్ రద్దు.. టీసీఎస్‌కు 15 వేల కోట్ల నష్టం! -
ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
గుజరాత్:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం -
ఇక వాహనాల తుక్కు యూనిట్లు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది. అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్‌కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు. తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది. జిల్లాకు రెండు యూనిట్లు జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్నెస్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్‌ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. -
జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలు ప్రారంభం
-
మరుగున పడిన అద్భుతమైన మహీంద్రా వాహనాలు (ఫోటోలు)
-
అతనో సామాన్య రైతు. కుటుంబ అవసరాల కోసం ట్రాక్టరు, కారు, రెండు బైక్‌లు
గతంలో కారు, బైక్ లాంటి వాహనాలు స్టేటస్ సింబల్‌గా ఉండేవి. అబ్బో వాళ్లకు కారుంది... వీళ్లకు ద్విచక్ర వాహనం ఉందని గొప్పగా చెప్పుకునేవాళ్లు. అయితే ఇప్పుడు అవి కనీస అవసరాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బైక్ ఉండటమనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ముద్దారెడ్డి, రొళ్ల మండలం జీబీ హళ్లి. సామాన్య రైతు. కుటుంబ అవసరాల నిమిత్తం ట్రాక్టరు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు, కుటుంబ సభ్యులందరి కోసం ఓ కారు, ఎవరికి వారు వెళ్లేందుకు రెండు ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈయన పేరు పవన్‌కుమార్. అమరాపురం వాసి. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తుంటారు. ఫలితంగా రోజుకు సగటున పెట్రోల్‌కు రూ.600 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక్కో ఇంట్లో అవసరాల నిమిత్తం మూడు – నాలుగు వాహనాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేయక మానదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవి మాత్రమే. జిల్లాకు కర్ణాటక సరిహద్దు పక్కనే ఉండటంతో చాలా మంది పొరుగు రాష్ట్రంలోనే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అన్ని వాహనాలు లెక్క చేస్తే ఇంటికో ఓ వాహనం ఉన్నట్లు చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల వాహనాలు కలిపి మూడు లక్షలు దాటాయి. అవసరాల నిమిత్తం.. ఒకే కుటుంబంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం మూడు – నాలుగు రకాల వాహనాలు కొంటున్నారు. కుటుంబ సభ్యులందరి కోసం కారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు. జీవన పోషణ కోసం బాడుగ ఇచ్చేందుకు జీపు, సొంత పనులపై తిరిగేందుకు ద్విచక్ర వాహనం. మహిళల కోసం ఎలక్ట్రిక్ బైక్. బాలికల కోసం స్కూటీ. అబ్బాయిల కోసం యమహా లాంటి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి జిల్లాలో అధికారికంగా మూడు లక్షలు దాటాయి. అయితే కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన వాటితో మరో లక్ష పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇరుగు పొరుగు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు ఇంకో లక్ష వరకు ఉంటాయి. ద్విచక్ర వాహనాలే టాప్.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,235 వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా మోటారు బైక్‌లు 2,01,238 ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రం నుంచి వాహనాలు కొనుగోలు చేస్తుండటంతో ప్రతి ఇంట్లో ఒక ద్విచక్ర వాహనం చొప్పున ఉన్నట్లు చెప్పవచ్చు. ఆటో రిక్షాలు 15 వేలు, కార్లు 13 వేలు, గూడ్స్ వెహికల్స్ 11 వేలు, ట్రాక్టర్లు 11 వేలు, ట్రాలీలు, జీపులు, క్యాబ్‌లు, విద్యాసంస్థల వాహనాలు, డంపర్లు, అంబులెన్సులు, ఓమ్ని బస్సులు, చెట్ల కోత వాహనాలు కలిపి మొత్తం 2.77 లక్షల వరకు ఉన్నాయి. నెలకు వెయ్యిపైగా రిజిస్ట్రేషన్లు జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోజూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. అన్ని రకాల వాహనాలు కలిపి సగటున నెలకు వెయ్యి పైగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రోజుకు సరాసరి 37 వాహనాలు చొప్పున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనాలే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి -
2027 నాటికీ డీజిల్ వాహనాలు నిషేధం
-
4,293 వాహనాలకు ఒకే ట్రాఫిక్ పోలీస్.. బాగా వెనకబడిన తెలంగాణ?
రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగాలను మానవ వనరుల కొరత వేధిస్తోంది. చాలీచాలని సిబ్బందితో వాహనాల నియంత్రణకు అధికారులు తంటాలు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి పోలీసు పోస్టులకు బదులు హోంగార్డులను వినియోగించుకోవడం మొదలెట్టారు. కానీ వాటిలోనూ వందల సంఖ్యలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనకబడి ఉందన్న విమర్శలు ఉన్నాయి. 2022 నాటి ఆర్టీఏ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1,51,13,129 వాహనాలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) నివేదిక ప్రకారం అన్ని స్థాయిల్లోని ట్రాఫిక్ పోలీసుల సంఖ్య 3,520 మాత్రమే. అంటే రాష్ట్రంలో ప్రతి 4,293 వాహనాల నియంత్రణకు ఒకే ట్రాఫిక్ పోలీసు ఉన్నట్టు స్పష్టమవుతోంది. వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్నా.. రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2019లో వాహ నాల సంఖ్య 1,33,22,334 కాగా.. 2022 నాటికి 1,51,13,129కి చేరింది. ప్రజా రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, చిన్నకార్లు వంటివాటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇలా రోడ్లపై పెరిగిన వాహనాల నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. ♦ ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ట్రాఫిక్ సిబ్బంది సంఖ్య తక్కువ. ఉన్న సిబ్బందితోనే అధిక సమయం పని చేయిస్తున్న పరిస్థితి. షిఫ్ట్‌లు, వీక్లీ ఆఫ్‌లు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జంక్షన్లలో వేళాపాళా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వాయు, ధ్వని కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. ప్ర స్తుతం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న చాలా మందికి శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. ♦ఇతర పోలీసు విభాగాల మాదిరిగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వారికి డ్యూటీ సమయంలో కొంత విరామం కూడా లభించదు. డ్యూటీలోకి వచ్చింది మొదలు పూర్తయ్యే వరకు నిలబడి, అప్రమత్తంగా ఉండి పనిచేయాల్సిందే. రద్దీ వేళల్లో వారి ఇబ్బంది మరీ ఎక్కువ. ♦ ట్రాఫిక్ ఉన్నతాధికారులు గత ఐదారేళ్లలో వివిధ రకా లైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. స్పాట్ చలాన్లకు బదులు పూర్తిస్థాయిలో ఈ–చలాన్లను అమలు చేస్తూ.. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రా«దాన్యం ఇచ్చారు. హెచ్–ట్రిమ్స్ వంటి పథకాలతో సిగ్నల్స్ ఉన్న జంక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవన్నీ సిబ్బంది కొరతతో ఉన్న ట్రాఫిక్ విభాగానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. ♦ ప్రభుత్వం ఇటీవల వేల సంఖ్యలో పోలీసు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అందులో సింహభాగం హైదరాబాద్‌కు వస్తారని, అవసరమైన సంఖ్యలో ట్రాఫిక్ వింగ్‌కు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రోత్సాహకంతో పరిస్థితి మెరుగైంది గతంతో పోలిస్తే ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది పరిస్థితి చాలా మెరుగైంది. అప్పట్లో ఈ విభాగాన్ని అప్రాధాన్యమైనదిగా భావించే వారు. కానీ ట్రాఫిక్ వింగ్‌లో పనిచేస్తున్న వారికి 30 శాతం పొల్యూషన్ అలవెన్స్ మంజూరు చేయడంతో పరిస్థితి మారింది. పోస్టింగ్స్ కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ నుంచి ట్రాఫిక్ విభాగానికి గణనీయంగా సిబ్బందిని కేటాయిస్తే ఈ సమస్య తీరుతుంది. – ఆర్వీ నరహరి, ట్రాఫిక్ విభాగం మాజీ అధికారి -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు.. భారీగా పెరగనున్న కార్లు, బైక్‌ల ధరలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల ధరలు ప్రియం కానున్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్ స్టేజ్ - 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుండడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు వర్తించనున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. ఖరీదు రూ.30,000 వరకు.. ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేశాయి. దీంతో ప్యాసింజర్ కార్లు మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.10,000 మొదలుకుని రూ.30,000 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలు రూ.2,500 దాకా భారం కానున్నాయి. ఇప్పటికే ముడిసరుకు వ్యయాలకు అనుగుణంగా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహన విభాగాల్లోనూ తయారీ కంపెనీలు ధరలను సవరించాయి. వాహనాల్లో మార్పులు.. నూతన ఉద్గార ప్రమాణాల కింద వాహనాలకు ఆధునిక సాంకేతికత వినియోగించాల్సి వస్తోంది. ప్రోగ్రామ్‌తో కూడిన ఫ్యూయల్ ఇంజెక్టర్స్, సెల్ఫ్ డయాగ్నోస్టిక్ డివైసెస్ ఏర్పాటు తప్పనిసరి అయింది. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని తెలిపే పరికరం అమర్చాల్సి ఉంటుంది. యూరప్‌లో అమలులో ఉన్న యూరో- 6 ప్రమాణాలకు సమానంగా భారత్ స్టేజ్- 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలను తీర్చిదిద్దారు. దీంతో వాహనాల్లోని ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలో 7,00,000 ప్యాసింజర్ కార్లకు బుకింగ్స్ నమోదై ఉన్నాయి. ధర పెరగడం వల్ల డిమాండ్ తగ్గే అవకాశం లేదని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యయ భారంతో.. ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్లలో మార్పుల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. అధికంగా డిమాండ్ ఉన్న మోడళ్లను మాత్రమే కంపెనీలు అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. డిమాండ్ తక్కువ ఉన్న మోడళ్లకు స్వస్తి పలకడం తప్పడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ఇటువంటివి కనుమరుగు కానున్నాయి. వీటిలో మారుతీ సుజుకీ ఆల్టో 800, హోండా జాజ్, డబ్ల్యూఆర్–వి, అమేజ్ డీజిల్, సిటీ జనరేషన్-4, సిటీ జనరేషన్-5 డీజిల్, మహీంద్రా ఆల్టరస్ జీ4, కేయూవీ100, మరజ్జో, స్కోడా అక్టావియా, సూపర్బ్, హ్యుండై ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, టాటా ఆ్రల్టోజ్ డీజిల్, టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ మోడళ్లు ఉన్నాయి. -
పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..
ఇటీవల కాలంలో కొందరూ పనిలొంచి తీసేసిన లేక వారి తీరు నచ్చక పనిలో పెట్టుకోకపోయిన, లేదా వారి మంచి కోసమే చివాట్లు పెట్టినా పగలు పెంచేసుకుంటారు. ఆ తర్వాత ఆత క్షణికావేశంలో పిచ్చి పనులు చేసి కటకటాల పాలవ్వడమే గాక జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే నొయిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..నొయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని నిశ్చయించుకున్నారు. దీంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్ పోసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో కార్లన్ని ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి గల కారణమేమిటని..సమీపంలోని సీసీటీవీ ఫుట్జ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇదంత సదరు క్లీనర్ రామ్రాజ్ పని అని తెలిసి షాక్ గురువుతారు సోసైటీ వాసులు. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడిని రామ్రాజ్గా గుర్తించి సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్ చేసి అపార్టమెంట్ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా సదరు క్లీనర్‌పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఐతే విచారణలో క్లీనర్ తనకు ఎవరో యాసిడ్ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #बेरोजगार हो जाने के गुस्से की #आग ऐसी भड़की की 15 गाड़ियों के अंदर #तेजाब डाल दिया इस शख्स ने 😳 मामला #Noida के #Sector_75 की सोसायटी का है, जहां के कार सफाईकर्मी को नौकरी से निकाल दिया गया था. pic.twitter.com/sUhIvTyBPl — Ruby Arun रूबी अरुण روبی ارون 🇮🇳 (@arunruby08) March 17, 2023 (చదవండి: 216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు) -
వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!
భారతదేశంలో కొత్త వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో పాత వాహనాల వినియోగం తగ్గుతోంది, దీనివల్ల నిరుపయోగంగా ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. దేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కొంతకాలం క్రితమే స్క్రాప్ విధానాన్ని అమలులోకి వచ్చింది. వెహికల్ స్క్రాపేజ్ విధానంలో వాహనాలను స్క్రాప్ చేయడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్దేశించలేదని, 10 సంవత్సరాల వినియోగం తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లను విస్మరిస్తున్నట్లు వచ్చిన నివేదికలు నిరాధారమైనవని, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ వ్యవధి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మళ్ళీ ఒకేసారి ఐదేళ్లపాటు మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు ప్రస్తావించింది. పది సంవత్సరాల తరువాత వినియోగంలో ఉన్న ట్రాక్టర్లను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయడం గురించి ట్విటర్, వాట్సాప్‌తో సహా కొన్ని సోషల్ మీడియాలో వెల్లడవుతున్న వార్తలు నిజం కాదని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) కొన్ని ప్రభుత్వ వాహనాలకు కాకుండా ఇతర ఏ వాహనాలకు నిర్ణీత వయోపరిమితిని భారత ప్రభుత్వం నిర్ణయించలేదు, MoRTH వాలంటరీ వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించింది, దీని ప్రకారం రవాణాకు పనికి రాకుండా ఉండే వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పరీక్షించిన తర్వాత వాహనం ఫిట్‌గా ఉన్నంత వరకు రోడ్డుపై నడపవచ్చని నివేదికలు చెబుతున్నాయి. -
రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. హైదరాబాద్‌లోనే అధికం.. త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్లో ఆటోలు మినహా... సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్ గ్రాస్ వెహికల్ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్లు! ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం. ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట... త్రైమాసిక పన్ను పెండింగ్ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్లాంక్ డీడీలతో దళారుల వసూళ్లు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సీజ్ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. -
ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. వాహనాలపైకి దూసుకెళ్లి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సినిమాను మించిన లవ్‌స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి.. -
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
-
ట్రాఫిక్ దిగ్బంధంలో విరించి చౌరస్తా.. అదే సమస్యకు పరిష్కారం..
సాక్షి, బంజారాహిల్స్: అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించరు... పాదచారులు రోడ్డు దాటేందుకు వంతెనలు ఉండవు.. ఇష్టానుసారంగా కూడళ్లలో రాకపోకలు... ఫలితంగా వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. గంటల తరబడి కూడళ్లలో సిగ్నళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తాలో గడిచిన నాలుగు దశాబ్ధాలుగా ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి స్థానికులకు విముక్తి లభించడం లేదు. అదే రోడ్డు.. అదే చౌరస్తా... ఏ మాత్రం విస్తరణకు నోచుకోని ఈ కూడలిలో వాహనదారులే కాదు రోడ్డు దాటేందుకు పాదచారులు అవస్థలు పడుతున్నారు. మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తా దాటి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు, కేర్ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు అడుగడుగునా పాదచారులు రోడ్డుదాటుతుండటంతో వాహనాల రాకపోకలు ముందుకు సాగడం లేదు. కేర్ ఆస్పత్రి వైపు నుంచి మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12, రోడ్ నెం. 13 వైపు వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. వాహనాలు కేర్ ఆస్పత్రి నుంచి మొదలుకొని 1/12 చౌరస్తా వరకు స్తంభించిపోయి మాసబ్‌ట్యాంకు వైపు వెళ్ళడమే గగనంగా మారుతోంది. పరిష్కారమిదీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఈ చౌరస్తాలో తప్పనిసరిగా ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు పాదచారుల వంతెన కూడా అవసరం. పింఛన్ ఆఫీస్ వైపు నుంచి దారి మూసివేత... మాసబ్‌ట్యాంకు వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లే మలుపు వద్ద శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉండగా ఈ ఆలయం వెనుక నుంచి పింఛన్ ఆఫీస్ గేటు లోపల గతంలో ఓ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందనుకునేలోగా కొందరు అడ్డుపడటంతో ఈ దారిని బండరాళ్లు వేసి మూసివేశారు. గత పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే వారే లేరు. గుడి వెనుక దారి ఏర్పాటు చేస్తే మాసబ్ ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లేవారు తేలికగా ఫ్రీ లెఫ్ట్‌లో ముందుకు సాగుతారు. దీని వల్ల చాలా వరకు ఈ కూడలిపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ప్రణాళికలేవీ..? మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 చౌరస్తాల మీదుగా కేర్ ఆస్పత్రి దాకా ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుట్‌పాత్‌లు కూడా అందుబాటులో లేవు. గజిబిజి ట్రాఫిక్ మధ్య అక్రమ పార్కింగ్లు పెద్ద సమస్యగా మారాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. -
తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో వాహనాలు రెట్టింపును మించి పెరిగాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును దాటగా, ఇప్పుడది కోటిన్నరను దాటిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాహనాలు 71,54,667 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఏకంగా 81,50,483 పెరిగాయి. ప్రతి నెలా సగటున 80 వేల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో ఐదేళ్లలో రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోటాపోటీగా ద్విచక్రవాహనాలు, కార్లు గతంలో ఇంటింటికీ ఓ సైకిల్ ఉండగా, ఇప్పుడా స్థానాన్ని ద్విచక్రవాహనాలు ఆక్రమించాయి. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి. కార్ల కొనుగోళ్లు కూడా పోటీ పడుతున్నట్టుగా పెరుగుతున్నాయి. రా ష్ట్రంలో ప్రస్తుతం 84 లక్షల గృహాలుండగా, ఈ నెల 23 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల సంఖ్య 1,12,90,406కు చేరు కుంది. 2014 జూన్‌లో తెలంగాణలో 8,84,870 కార్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 19,84,059 కు చేరింది. కోవిడ్ సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు విపరీతంగా సాగగా, కొత్త వాహనాల అమ్మకాలు కాస్త తగ్గాయి. అయితే గతేడాది కొత్త వాహనాల విక్రయం బాగా పెరగటంతో వాహనాల సంఖ్యలో పెరుగుదల ఊ పందుకుంది. ఏడాదిలో 5.61 లక్షల ద్విచక్ర వా హనాలు, 1.52 లక్షల కార్లు కొత్తగా వచ్చి చేరాయి. క్యాబ్ సంస్కృతి పెరుగుదలతో.. రాష్ట్రంలో క్యాబ్‌ల వాడకం గణనీయంగా పెరిగింది. గతంలో ఆటోలు తప్ప క్యాబ్‌లు నామమాత్రంగానే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 49 వేలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 1.18 లక్షలకు చేరుకున్నాయి. ఆరుగురు కంటే ఎక్కువమంది ప్రయాణించే మ్యాక్సీ క్యాబ్‌లు అప్పట్లో 6,390 మాత్రమే ఉండగా, ఇప్పుడు 30,904కు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల జోరు చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వీటి కొనుగోళ్లు మరింత పెరిగే అవకా శం ఉందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలుండగా, ఎలక్ట్రిక్ కార్లు 4 వేలను దాటాయి. 2014లో వాటి సంఖ్య సున్నా. ఆర్టీసీ బస్సుల సంఖ్యే తగ్గింది.. అన్ని రకాల కేటగిరీ వాహనాలు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రెట్టింపు అవటమో, అంతకుమించి పెరగటమో జరగ్గా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో తెలంగాణ ఆర్టీసీ వద్ద 10,579 బస్సులు ఉండేవి. రవా ణాశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వాటి సంఖ్య 9,400 మాత్రమే. కొత్త బస్సుల కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండటం, నడిచే పరిస్థితి లేని బస్సులను తుక్కుగా మార్చాల్సి రావటంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగటానికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. -
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు. పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు. రేడియం టేప్ అతికించాలి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్’ పరిధిలోకి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రకటించింది. వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటుకు 2022 నవంబర్ 14 నాటికి 117 మంది ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. ఇందులో 36 దరఖాస్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఆంధప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, గోవా, ఉత్తరాఖండ్, చండీగఢ్ ఇందులో చేరాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల తుక్కు విధానం అమల్లోకి రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలను కూడా ఇందులో త్వరగా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 11 రాష్ట్రాల పరిధిలో 84 ఆటేమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను రాష్ట్రాల నియంత్రణలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు పేర్కొంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
2022లో.. 37.93 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు
ముంబై: దేశీయంగా 2022లో మొత్తం 37.93 లక్షల ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. 2021తో పోల్చితే 23% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఇండియా కార్లు రికార్డు సేల్స్ నమోదు చేసుకున్నాయి. కరోనా ప్రేరేపిత సవాళ్లు, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ముఖ్యంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు గిరాకీ పెరిగింది. -
పొగమంచు తెచ్చిన తంటా.. ఒకదాన్నొకటి ఢీకొన్న పది వాహనాలు
నాదెండ్ల: పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన సుదర్శనరావు గుంటూరు సమీపంలోని పొత్తూరు టుబాకో కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై డ్యూటీకి బయలుదేరాడు. జాతీయ రహదారిపై గణపవరం వద్ద ప్రసన్న వంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపానికి రాగానే పొగమంచు కారణంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం లారీ టైర్ల కింద నుజ్జునుజ్జవగా సుదర్శనరావు స్వల్ప గాయాల పాలయ్యాడు. వెనుక వస్తున్న వాహనాలు నెమ్మదించి రోడ్డుపై నిలిచాయి. పొగమంచు ఉండటంతో ముందు నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో వాహనం, అశోక్‌లేలాండ్ మినీ లారీలు, కారు, ట్యాంకర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనాలు గుమిగూడటంతో ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును కొద్దిదూరంలో నిలిపాడు. ఆ వెనుకే మరో ఆర్టీసీ బస్సు నిలిచింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న లోడ్ లారీ వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ముందు ఆర్టీసీ బస్సులోని ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. పది వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనటంతో రెండు గంటలపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంలో రాజమమస్త్రంద్రవరానికి చెందిన లారీ క్లీనర్ ప్రసాద్ గాయాలపాలయ్యాడు. క్షతగాత్రులను 108లో చిలకలూరిపేట వైద్య శాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. మొదట ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
వాహనాల అడ్వాన్స్ అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటుగా సీఐడీ విచారణ చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్షించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీ)గా పనిచేస్తున్న వారిలో ఏడాదికాలం సర్వీసును పూర్తి చేసిన వారిని సొంత శాఖలకు వెనక్కు పంపాలని మంత్రి ఆదేశించారు. -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
హిందుజా టెక్ చేతికి డ్రైవ్ సిస్టమ్
చెన్నై: ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ డ్రైవ్ సిస్టమ్ డిజైన్‌ను కొనుగోలు చేసినట్లు హిందుజా టెక్ తాజాగా పేర్కొంది. తద్వారా అభివృద్ధి నుంచి ఉత్పత్తివరకూ ఈమొబిలిటీ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం హిందుజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ డీల్ విలువను వెల్లడించలేదు. డ్రైవ్ సిస్టమ్ అంతర్జాతీయస్థాయిలో విశ్వాసపాత్ర ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నట్లు తెలియజేసింది. ఎలక్ట్రిఫైడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌కు కొత్తతరహా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. యూకే, యూఎస్, ఆసియాలలో ఆటోమోటివ్, వాణిజ్య వాహనాలు, ఆఫ్‌హైవే, వైమానిక పరిశ్రమలకు అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ సేవలందిస్తున్నట్లు పేర్కొంది. -
వాహనాల గ్రీన్‌ట్యాక్స్ భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాత వాహనాలపై కేంద్రం విధించిన హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను రాష్ట్రప్రభుత్వం భారీగా తగ్గించేసింది. వాహనాలు పాతబడేకొద్దీ వాటి నుంచి వెలువడే కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. దీంతో పాత వాహనాల వినియోగాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్సును విధించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాలు దాటిన భారీ వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంత్రులు భేటీఅయి, గ్రీన్ ట్యాక్సును ఎత్తేయాలన్న వారి డిమాండ్‌పై చర్చించారు. అత్యంత భారీగా ఉన్న గ్రీన్‌ట్యాక్స్‌ను నామమాత్రపు స్థాయికి తీసుకొస్తామన్నట్టుగా మంత్రులు ఆ భేటీలో హామీ ఇచ్చారు. ఈ మేరకు దాన్ని తగ్గిస్తూ రవాణాశాఖ కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. కొత్త ధరలు.. మార్పులు ఇలా.. గతంలో వాహనాల వయసు ఆధారంగా మూడు శ్లాబుల్లో పన్ను విధింపు ఉండేది. ఏడు నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నులో సగం మొత్తాన్ని గ్రీన్ టాక్స్‌గా విధించేవారు. 12–15 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నుతో సమంగా విధించేవారు. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు విధించేవారు. ఇప్పుడు ఆ మూడు శ్లాబులను రెండుగా మార్చారు. 7 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాహనాలకు రూ.1500, 15 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాహనాలకు రూ.3 వేలు పన్ను నిర్ధారించారు. రాష్ట్రంలో ఐదున్నర లక్షల వరకు వాణిజ్యపరమైన వాహనాలున్నాయి. వీటిల్లో 70 శాతం వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్యాక్సును భారీగా తగ్గించడం పట్ల వాటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల విషయంలో నిబంధనలను మరీ సరళతరం చేయటం సరికాదంటూ పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. -
వచ్చే ఏడాది జీప్ కొత్త మోడళ్లు
ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు. ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్‌లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఈ ఎస్యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి. -
పుంజుకుంటున్న రవాణా ఆదాయం
సాక్షి, అమరావతి: రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతోంది. గత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు రూ.1,531.29 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు (6 నెలలు) రూ.2,130.92 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఆదాయంలో 39.15 శాతం మేర వృద్ధి నమోదైంది. గత రెండేళ్లలో కోవిడ్–19 ప్రభావం రవాణా రంగం ఆదాయంపై తీవ్రంగా పడింది. 2019–20 రవాణా ఆదాయం గణనీయంగా పడిపోగా.. 2020–21లోనూ నేలచూపులు చూసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్పుడిప్పుడే ఆదాయం మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు మినహా అన్నిరకాల వాహనాల్లో ఈ ఏడాది తొలి 6 నెలల్లో వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు గత ఏడాది కంటే 6.52 శాతం తగ్గింది. అయితే, కార్ల అమ్మకాల్లో మాత్రం వృద్ది నమోదైంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో కార్లు కొనుగోళ్లలో 8.27 శాతం, గూడ్స్ వాహనాల కొనుగోళ్లలో 22.67 శాతం మేర వృద్ధి నమోదు కాగా.. పాసెంజర్ వాహనాల కొనుగోళ్లలో 85.02 శాతం, ఆటోల కొనుగోళ్లలో 83.94 శాతం వృద్ధి నమోదైంది. -
ఢిల్లీ సెకెండ్ హ్యాండ్ వాహనాలకు హైదరాబాద్‌లో ఫుల్ డిమాండ్.. ఎందుకంత మోజు?
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వెంకటేశ్ కొద్ది రోజుల క్రితం ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకెండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలుగా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయకుండా బండెక్కేశాడు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) నకిలీదని తేలింది. రూ.15 లక్షల వాహనం కేవలం రూ.10 లక్షలకే లభించిందని మొదట ఎగిరి గంతేశాడు. చదవండి: ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి.. కానీ ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. ...ఒక్క వెంకటేశ్ మాత్రమే కాదు. ఇటీవల కాలంలో తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో ఢిల్లీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసే నగరవాసులు సరైన ఆధారాలు లభించక నష్టపోతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నగరంలో లభించే సెకెండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీ నుంచి కొనుగోలు చేసే వాహనాలు కొంత మేరకు తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ సరైన డాక్యుమెంట్లు లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3000లకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలు..ప్రత్యేకించి కార్లు ఎక్కువగా ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి తదితర నగరాల నుంచి కూడా సెకెండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదవుతున్నాయి. కానీ 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఎక్కువగా ఉన్నట్లు అంచనా. నగరంలో 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కాలపరిమితిని ప్రతి సంవత్సరం పొడిగించుకొనే అవకాశం ఉంది. కానీ ఢిల్లీలో నమోదైన వాహనాలు కేవలం 10 ఏళ్ల కాలపరిమితికే పరిమితం. దీంతో ఢిల్లీ వాసులు తమ వాహనాల కాలపరిమితి ఆరేడుళ్లు దాటితే వాటిని సెకండ్ హ్యాండ్ వాహనాలుగా విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా విక్రయించే వాటి ధరలు కూడా కొంత మేరకు తక్కువగా ఉండడంతో నగరంలో డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాలపైన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వినియోగదారులకు కట్టబెడుతున్నారు. ‘వాహన్’లో నమోదు తప్పనిసరి... ‘సెకెండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపైన జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులకు చూపించే వాటికి, విక్రయించే వాటికి ఒక్కోసారి సంబంధం ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ‘వాహన్’లో నమోదైన వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.’ అని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ సూచించారు. కొన్ని ముఠాలు వాహనాలను అపహరించి విక్రయిస్తాయి. ఈ క్రమంలో నకిలీ ఆధారాలను సృష్టిస్తారు. ఈ నకిలీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ‘వాహన్’లో బండి వివరాలు పరిశీలించాలని ఆయన తెలిపారు. వాహనం ఆర్సీ (రిజి్రస్టేషన్), ఢిల్లీ రవాణా అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), బీమా పత్రాలు, తదితర డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాలపైన వాటి వయస్సు, కొనుగోలు చేసిన సమయంలో ఉన్న ధర ఆధారంగా నగరంలో నమోదుకు జీవితకాల పన్ను చెల్లించవలసి ఉంటుంది. -
ధంతేరస్: చీపురు సహా వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్) ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు. ♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు. ♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం. ♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. -
జూమ్‌కార్, ఐఐఏసీ విలీనం
కార్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌కార్ తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలీనం అనంతరం జూమ్‌కార్ హోల్డింగ్స్‌గా పేరు మారనుంది. ఈ లావాదేవీ ద్వారా జూమ్‌కార్ హోల్డింగ్స్ విలువ రూ.3,753 కోట్లుగా లెక్కించారు. విలీనం అనంతరం ఏర్పడిన కంపెనీని నాస్డాక్లో లిస్ట్ చేస్తారు. 2013లో ప్రారంభం అయిన జూమ్‌కార్ హోల్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 30 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. కార్ షేరింగ్ మార్కెట్‌ప్లేస్‌లో 25,000 కంటే ఎక్కువగా వాహనాలు నమోదయ్యాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఆఫ్రికాలోని దక్షిణ సహారా దేశాల్లో అపార అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు జూమ్‌కార్ కో–ఫౌండర్, సీఈవో గ్రెగ్ మోరన్ తెలిపారు. 2025 నాటికి రూ.7.4 లక్షల కోట్ల మార్కెట్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): అర్హత కలిగిన దివ్యాంగులు మూడు చక్రాల మోటారు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండి సదరం ధ్రువీకరణ పత్రంలో 70 శాతం అంతకంటే ఎక్కువ వికలాంగత్వంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. గతంలో సొంత వాహనం ఉండకూడదన్నారు. డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులు, 10వ తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధి పథకం, వేతనం పొందుతూ కనీసం సంవత్సరం అనుభవం కలిగి ఉండాలన్నారు. మహిళలకు 50 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం చొప్పున వాహనాలు మంజూరు చేస్తారన్నారు. అర్హతలు ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత పత్రాలతో దరఖాస్తును మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయంలో అందజేయాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం 08672–252637లో సంప్రదించాలని ఆయన కోరారు. -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
‘డీలర్ డీల్’ పై ఏపీ సర్కార్ సీరియస్..
సాక్షి, అమరావతి: ఎస్సీ యువత ఉపాధి నిమిత్తం వాహనాలు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని డీలర్లకు దారి మళ్లించిన బాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘‘షికారు వెనుక డీలర్ల డీల్–ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయి పాలు’’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీలర్ల డీల్ విషయమై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఏం జరిగాయి? డీలర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? తదితర కోణాల్లో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ చినరాముడు, జనరల్ మేనేజర్ సునీల్ రాజ్‌కుమార్‌ల నుంచి వాటికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఉన్నతస్థాయి అధికారులు గురువారం పరిశీలించారు. చదవండి: టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్! విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ యువత పేరుతో టీడీపీ నేతల బినామీలకు, వారు సిఫారసులు చేసిన వారికి కేటాయించి అసలు లక్ష్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకుని ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసిన డీలర్ల డీల్ వ్యవహారం తోడైంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం గత ప్రభుత్వం రూ.365.67 కోట్లను డీలర్లకు అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో వాహనాలు ఇవ్వకుండా సుమారు రూ.67.68 కోట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్వాన్స్‌ను చెల్లించని డీలర్లు ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత డీలర్లతో ఒకటి, రెండుసార్లు సమావేశం నిర్వహించి వాహనాలు ఇవ్వలేకపోతే, అడ్వాన్స్ డబ్బులైనా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇన్నోవాలు, ఇటియోస్లు ఇచ్చేందుకు అడ్వాన్సులు తీసుకున్న రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) కంపెనీ రూ.23.05 కోట్లకు పైగా, కినెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్(పూణే), ఈగల్ అగ్రీ ఎక్విప్మెంట్ (కావలి) పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రూ.41.67 కోట్లకు పైగా, ఎంట్రాన్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ (పశ్చిమ గోదావరి జిల్లా) పేరుతో గమ్మిడి మోహిని రూ.2.93 కోట్ల మొత్తాన్ని వసూలుచేసేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. వాహనాలు ఇవ్వకుండా ప్రజాధనం లూటీచేసిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని తదుపరి చర్యలకు సమాయత్తమైంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తోంది. -
వాహన అమ్మకాలు రయ్
ముంబై: దేశీయ ఆటో అమ్మకాలు ఆగస్టులో పెరిగాయి. పండగ సీజన్ సందర్భంగా వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో పాటు సెమీ కండక్టర్ల సరఫరా మెరుగవడం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా మోటార్స్ విక్రయాల్లో వృద్ధి కన్పించింది. హ్యుందాయ్, టయోటా, స్కోడా కంపెనీలూ చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే హోండా కార్స్, ఎంజీ మోటార్స్ వాహన సంస్థల విక్రయాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. ‘‘గడిచిన మూడు నెలల్లో మునుపెన్నడూ లేని విధంగా 9.92 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. బలమైన డిమాండ్‌కు తగ్గట్టు సప్లై మెరుగుపడటంతో ఇది సాధ్యమైంది. ఈ పండుగ సీజన్లో 3.77 లక్షల వాహనాలను ఆర్డర్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమైంది. పరిశ్రమ వ్యాప్తంగా పెండింగ్ ఆర్డర్లు 7–7.5 లక్షల వాహనాలు ఉండొచ్చు’’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు ఆగస్టులో 1,34,166కు చేరాయి. 30 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 59,068 నుంచి 5% వృద్ధితో 62,210 యూనిట్లకు చేరాయి. -
Number Plates: దొరికితే వదిలేదే లే!
సాక్షి, కర్నూలు: పోలీసులు తనిఖీ చేస్తున్నారట.. ఫొటో తీసి నంబర్ ప్లేట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేద్దాం.. ప్లేట్‌ను వంచేద్దాం లేదా చివర్లను విరగ్గొడదాం లేదా ప్లేటే తీసేద్దాం అప్పుడెలాంటి జరిమానాలు రావు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు చేస్తున్న ఆలోచన ఇదీ. ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాఅంతటా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం ద్విచక్ర వాహన చోదకులే ఉంటున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను విస్మరించిన వారికీ నష్టాలు తప్పవని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వాహనాలు చోరీకి గురైనప్పుడు గుర్తింపు అసాధ్యంగా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన చోదకుడు నష్టపోతే ఫిర్యాదు చేయడం కూడా ఇబ్బందికరమే. జిల్లాలో సుమారు 10 శాతం మేర వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసుల అంచనా. నంబర్ ప్లేట్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. విరిగిందన్న సాకుతో.. ప్రస్తుతం వాహనాలన్నింటికీ హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నంబర్ ప్లేట్లు విరిగిపోతున్నాయి. ఫలితంగా వాహన నంబర్లను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా ప్లేట్‌ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ ఉండి విరిగిపోయినా, దెబ్బతిన్నా వాటిస్థానంలో కొత్త ప్లేట్ బిగించుకోవాలని సూచిస్తున్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు లోబడి సిరీస్, అంకెలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి లేకుంటే జరిమానాలు విధిస్తున్నారు. చదవండి: (వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం) నంబర్ ప్లేట్‌తోనే వాహనం గుర్తింపు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏర్పాటు చేసుకునే నంబర్ ప్లేట్‌తోనే వాహనాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పలువురు వాహన చోదకులు ఉల్లంఘనుల జాబితాలో చేరుతున్నారు. కనీస నిబంధనలు పాటించక చిక్కుల్లోకి వెళ్తున్నారు. నంబర్ ప్లేట్ రహితంగా, ఇష్టారీతిన నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వందల సంఖ్యలో జనాలు ఈ జాబితాలో చేరుతుండటం గమనార్హం. వారం రోజుల వ్యవధిలో ఉల్లంఘనలకు పాల్పడిన 7,932 మందిపై ఈ–చలానాలు విధించి రూ.21.26 లక్షలు జరిమానా వసూలు చేశారు. వారంలో కనీసం వందకు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో సుమారు 75 ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడ్డాయి. అలాగే ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నవి 150 దాకా పట్టుకున్నారు. నిర్దేశిత వ్యవధి దాటినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు కూడా తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. కనిష్టంగా వెయ్యి జరిమానా.. నంబర్ ప్లేట్ లేకపోవడం, సరిగా అమర్చుకోకపోవడం, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అక్షరాలు, అంకెలు కనిపించకుండా మార్పులు చేయడం, వెనుకవైపు ప్లేట్‌ను తీసివేయడం, ప్లేట్‌ను వంపు చేయడం తదితర అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ఉల్లంçఘనలకు పాల్పడిన వారికి కనిష్టంగా వెయ్యి జరిమానా విధిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా, రాంగ్ రూట్లో ప్రయాణించినా సిగ్నల్ జంపింగ్ చేసినా, రికార్డులు అందుబాటులో లేకపోయినా, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రం లేకపోయినా రూ.1000, లైసెన్స్ లేకపోతే రూ.500, హెల్మెట్ లేకపోతే రూ.100, నోఎంట్రీకి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు. ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యం ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా పోలీసులు వాటిని జప్తు చేస్తారు. ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. – ఎస్పీ, సిద్ధార్థ్ కౌశల్ -
మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): వర్షాకాలంలో వాహనాల వినియోగంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బైకులు, కార్లు వినియోగించే వారు ఈ మాత్రం నిర్లక్ష్యం వహించినా బండి హఠాత్తుగా ఆగిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం.. చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి.. ద్విచక్ర వాహనాల రక్షణ ఇలా.. ♦ద్విచక్ర వాహనాల బ్యాటరీలు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు, పడిన తర్వాత వేగంగా వెళ్లడం ప్రమాదకరం. లైనర్స్, వీల్డ్రమ్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీల్డ్రమ్స్, బైక్ లైనర్స్లోకి నీరు వెళ్తే వెంటనే మెకానిక్ వద్దకు వెళ్లి శుభ్రం చేయించాలి. రోజుల తరబడి ఆలస్యం చేస్తే వాహనాలు పాడవుతాయి. ♦ద్విచక్ర వాహనాలు వర్షానికి తడిసినప్పుడు, నీళ్ల నుంచి వెళ్లినప్పుడు చైన్ గ్రీజ్ పోతుంది. అలాంటి సమయంలో చైన్ కవర్లను తీసి కిరోసిన్ గానీ, ఆయిల్‌గానీ వేయాలి. తర్వాత మెకానిక్కు చూపించి గ్రీజ్ పెట్టించాలి. నిర్లక్ష్యంగా ఉంటే చైన్ స్పాకెట్, వీల్ బేరింగ్ దెబ్బతింటాయి. ♦సైలెన్సర్లలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీటిలో పూర్తిగా మునిగిన వాహనాన్ని సర్వీసింగ్ చేయకుండా స్టార్ట్ చేయకూడదు. నీటి మడుగులోంచి వెళ్లాల్సివస్తే ఎక్స్‌లేటర్‌ను ఏమాత్రం తగ్గించినా వెంటనే స్పార్క్‌ప్లగ్, సైలెన్సర్లోకి నీరు చేరి బైక్ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సైలెన్సర్‌లోని నీరు బయటకు వచ్చేలా వాహనాన్ని వెనక్కి వంచాలి. స్పార్క్ప్లగ్ను శుభ్రం చేసి కిక్ కొట్టి మిగతా నీటిని బయటకు పంపాలి. అయినా స్టార్ట్ కాకపోతే మెకానిక్ వద్దకు వెళ్లాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంజన్ పాడయ్యే ప్రమాదముంది. ♦ప్రతి వాహనానికి తప్పనిసరిగా పెట్రోల్ ట్యాంక్ కవర్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే వర్షం కురిసిన సమయంలో నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ♦బైక్‌లో కార్బేటర్ది కీలకపాత్ర. దీంట్లోకి నీరు చేరితే వాహనం స్టార్ట్ కాదు. కిక్ కొట్టినా స్టార్ట్ కాకపోతే వెంటనే కార్బేటర్ను శుభ్రం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే కార్బేటర్లోకి తెల్లని ఫంగస్ చేరి వాహనం మైలేజ్ పడిపోతుంది. ♦వీలైనంత మేరకు వాహనాలు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. బయట ఉంటే కవర్లు కప్పాలి. లేదంటే షెడ్ల కింద పార్కింగ్ చేయాలి. వర్షాకాలంలో వ్యాక్స్ పాలిష్ చేయించుకోవాలి. కార్లు– జాగ్రత్తలు ♦వర్షాకాలంలో ఆథరైజ్డ్ క్యాంపుల్లో కార్లను తనిఖీ చేయించాలి. బండి బయటకు తీసే ముందే టైర్లను పరీక్షించాలి. దీనివల్ల దుర్ఘటనలను నివారించుకోవచ్చు. ఎగుడు దిగుడుగా అరిగి ఉండటం, అసలు గ్రిప్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. ♦‘యూజర్ మాన్యువల్‘లో సూచించిన విధంగా టైర్ ప్రెజర్ ఉండాలి. టైర్ల మన్నిక కూడా పెరుగుతుంది. ♦వర్షాలకు కారు లోపలికి నీరు వెళ్తుంటుంది. రబ్బర్ మ్యాట్స్‌కు బదులు ఫ్యాబ్రిక్స్ మ్యాట్స్ వినియోగించడం మంచిది. ♦ఏసీ దుర్వాసన వెదజల్లే కాలం కూడా ఇదే. అందుకే ఏసీని నిర్దేశిత సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలి. పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను కారులో పెట్టుకుంటే శుభ్రం చేసుకోవచ్చు. ♦వర్షాకాలంలో వైపర్స్ పక్కాగా పనిచేసేలా చూసుకోవాలి. సాధారణంగా విండ్ స్క్రీన్ వైపర్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలామంది కారు కొన్న దగ్గర నుంచి అవే వైపర్లను వాడుతుంటారు. సరైన సమయంలో వాటిని మార్చాలి. లేకపోతే విజిబిలిటీ స్పష్టంగా ఉండదు. -
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంటలే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం ఓ పెళ్లకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అయిపోతుండటంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసి మధ్యలో ఇరుక్కు పోయారు. జనం చోద్యం చూస్తూ ఉండిపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు. -
ఇక బీఎస్–6 ఆయిల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ స్టేజ్ –6 (బీఎస్–6) వాహనాలు విన్నాం.. ఇక నుంచి బీఎస్–6 ఆయిల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ.. వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్–6 ఆయిల్ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది. పర్యావరణహితంగా.. బీఎస్–6 వాహనాల తయారీ నేపథ్యంలో బీఎస్–6 ఆయిల్‌ను సరఫరా చేయనున్నారు. బీఎస్–4 వాహనాల కంటే బీఎస్–6 వాహనాలు తక్కువ సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్‌ను వెదజల్లుతాయి. బీఎస్–4 ఆయిల్‌ను వినియోగిస్తే వాతావరణంలోకి 50 పీపీఎం సల్ఫర్ విడుదలవుతుంది. అదే బీఎస్–6 ఆయిల్ ద్వారా అయితే ఇది కేవలం 10 పీపీఎం మాత్రమే. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ బీఎస్–4 ద్వారా 70 శాతం విడుదలయితే.. బీఎస్–6 ద్వారా కేవలం 25 శాతమే విడుదలవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా బీఎస్–6 ఆయిల్ పర్యావరణహితంగా ఉండటమే కాకుండా ఇంజన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. భారీ రియాక్టర్ల ఏర్పాటు.. హెచ్‌పీసీఎల్ విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారిగా భారీ రియాక్టర్లను రిఫైనరీ ఏర్పాటులో ఉపయోగిస్తున్నారు. ఈ యూనిట్ కోసం మూడు భారీ రియాక్టర్లు అవసరం కాగా.. ఇప్పటికే విశాఖలోని హెచ్‌పీసీఎల్ ప్లాంటుకు రెండు రియాక్టర్లు చేరుకున్నాయి. ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీ మ్యాక్స్) రియాక్టర్లుగా వీటిని పిలుస్తారు. ఒక్కో రియాక్టర్ 67.187 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో 2,105 టన్నుల బరువు ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నుంచి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బీఎస్–6 ఆయిల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ భారీ రియాక్టర్లను ఉపయోగించనున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ భారీ రియాక్టర్లను సరఫరా చేస్తోంది. హెచ్‌పీసీఎల్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయి పెట్టుబడితో రిఫైనరీని చేపట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఇదే ప్లాంటులో సొంత విద్యుత్ అవసరాల కోసం క్యాప్టివ్ పవర్ ప్లాంటును కూడా నెలకొల్పుతున్నారు. రోజుకు 3 లక్షల బ్యారల్స్.. వాస్తవానికి.. హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంఎంటీపీఏకు విస్తరించే పనులు ముందస్తు ఒప్పందం ప్రకారం 2020 మధ్యనాటికే పూర్తి చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో విస్తరణ, ఆధునికీకరణ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా 2023 మార్చి నాటికి పూర్తి చేయాలని తాజాగా గడువును నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న రిఫైనరీ 8.3 ఎంఎంటీపీఏ అంటే రోజుకు 1,66,000 బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఈ సామర్థ్యం (15 ఎంఎంటీపీఏ)తో రోజుకు 3 లక్షల బ్యారళ్లకు (సుమారు 4.77 కోట్ల లీటర్లు) పెరగనుంది. -
ఫోటో కొట్టండి రివార్డు పట్టండి.. రాంగ్ పార్కింగ్‌పై త్వరలో కొత్త చట్టం
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలో కేంద్రం చట్టం తేనున్నది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయన్నారు. రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి మొబైల్లో ఫొటో తీసి పంపితే.. సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తామన్నారు. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు. -
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్‌ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్‌ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్‌పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్‌తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్‌స్టాప్‌ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్‌స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్‌స్టాప్ ఉంది. అది వరంగల్ బస్‌స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్‌జాం సమస్య తలెత్తుతోంది. -
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఉదంతంలో పోలీసులు గుర్తించిన ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)పైనే తిరుగుతున్నట్లు నిర్ధారించారు. అదొక్కటే గ్రేటర్లో వేలకొద్దీ వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే తిరుగుతూ గందరగోళానికి కారణమవుతున్నాయి. సాధారణంగా బండి కొనుగోలు చేసిన 30 రోజుల లోపు వాహన యజమాని తన పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అపరాధ రుసుముతో 6 నెలల్లోపు కూడా శాశ్వతంగా నమోదు చేసుకొనేందుకు రవాణాశాఖ వెసులుబాటు కల్పించింది. కానీ.. కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంతో కాలయాపన చేయడం గమనార్హం. మరోవైపు మరికొందరు ద్విచక్ర వాహనదారులు సంవత్సరాలు గడిచినా శాశ్వత నమోదు చేసుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే రహదారులపై పరుగులు తీస్తున్నారు. దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో వాహనాల గుర్తింపులో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఇలా తాత్కాలిక నమోదుపై ఉన్న వాహనాల విషయంలో రవాణాశాఖ కేవలం అపరాధ రుసుముకే పరిమితం కావడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. నచ్చిన నంబర్ కోసం ఎదురు చూపులు.. ► అదృష్ట సంఖ్యలుగా భావించే ప్రత్యేక నంబర్ల కోసం ఎదురు చూస్తూ కొందరు వాహనదారులు తాత్కాలిక నమోదుపైనే బండ్లను నడుపుతున్నారు. మూడు నెలలకోసారి వచ్చే సిరీస్‌లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నచ్చిన నంబర్ లభించకపోతే మరో 3 నెలలు ఆగాల్సిందే. కొంతమంది తమకు నచ్చిన నంబర్ లభించే వరకు ఈ తరహా కాలయాపన చేస్తున్నారు. దీంతో వాహనాలపైన అతికించిన టీఆర్ నంబర్ స్టిక్కర్లు కూడా చిరిగిపోయి తాత్కాలిక గుర్తింపు కూడా కనిపించకుండా మాయమవుతోంది. గ్రేటర్లో ప్రతి రోజూ సుమారు 1650కిపైగా వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వీటిలో 500 వరకు కార్లు ఉంటే మరో 1100కుపైగా బైక్‌లు, ఇతర వాహనాలు ఉంటాయి. సాధారణంగా అన్ని రకాల రవాణా వాహనాలు కచ్చితంగా నిర్ణీత గడువు మేరకు శాశ్వత నమోదుపైనే తిరుగుతాయి. వ్యక్తిగత వాహనాల విషయంలోనే ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది. చిరునామా మార్పు అవసరమే.. ► కొందరు వాహనదారులు తాము ఇల్లు మారిన వెంటనే వాహనాలను కూడా కొత్త చిరునామాకు మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలా మార్చుకోకపోవడంతో ప్రమాదాల బారినపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాహనదారులను గుర్తించడం కష్టంగా మారుతోంది. వాహన యాజమాన్య బదిలీ, చిరునామా మార్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ హెచ్చరించారు. ‘మార్పు’ మరిచిపోతే కష్టమే.. ► మరోవైపు చాలా మంది తమ పాత బండ్లను అమ్ముకొని కొత్తవి కొనుగోలు చేస్తారు. అలా విక్రయించే సమయంలో బండి యాజమాన్య మార్పిడి కూడా తప్పనిసరి. కానీ ఇటు విక్రయించిన వారు, అటు కొనుగోలు చేసిన వారు సకాలంలో యాజమాన్య మార్పు చేసుకోవడం లేదు. బండి మాత్రం ఒకరి నుంచి మరొకరికి అనధికార యాజమాన్య మార్పిడికి గురవుతుంది. ఇలాంటి వాహనాలు తరచుగా ప్రమాదాలకు పాల్పడినప్పడు సదరు వాహనాలు ఎవరి పేరిట నమోదై ఉంటే వారే మూల్యం చెల్లించవలసి వస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపైనా భారీ ఎత్తున జరిమానాలు నమోదు కావడం గమనార్హం. ► అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు వినియోగించే వాహనాల్లోనూ వాటి అసలైన యజమానులే నష్టపోవాల్సివస్తుంది. బండిని విక్రయించినప్పుడే యాజమాన్యం కూడా బదిలీ చేసుకోకపోవడం వల్ల అప్పటి వరకు ఎవరి పేరిట నమోదై ఉంటే వారే ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. గతంలో నగరంలో కొన్ని చోట్ల చోటుచేసుకున్న హత్యలు, తదితర నేరాల్లో ఇలాంటి గుర్తుతెలియని వాహనాలతో వాటి మొదటి యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయి. చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా.. -
తెలంగాణలో ‘104’ మొబైల్ వైద్య వాహనాల వేలం
సాక్షి,హైదరాబాద్: ‘104’మొబైల్ వైద్య సేవలకు ఉపయోగిస్తున్న వాహనాలను వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. వాటిని వేలం ద్వారా అమ్మేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వాటికి వేలం వేసేందుకు చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా అదనపు కలెక్టర్, జిల్లా రవాణాధికారి, ఎస్పీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 198 వాహనాలు వేలం వేస్తారు. కాగా, వాటిల్లో అనేక వాహనాలను పాడైపోయాయని చెబుతున్నారు. కండీషన్లో ఉన్న వాటిని ఇతరత్రా వైద్య అవసరాలకు ఉపయోగించుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులకు మందుల సరఫరాకు బ్రేక్ గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వారి ఊళ్లలోనే నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా ఔషధాలను ఒకేసారి ఇచ్చే పథకమే..‘104’వాహన సేవలు. ప్రతి నెలా మొదటి తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్దేశించిన గ్రామాలకు ఈ వాహనాలు వెళ్లేవి. సంచార వైద్య వాహనంలో ఒక వైద్యుడు, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించడంతో ఆయా సేవలకు బ్రేక్ పడిపోనుంది. ఇందులో పనిచేస్తున్న సుమారు 1,250 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలోనే ఇతర పథకాల పరిధిలో వాడుకోవాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జీవనశైలి వ్యాధుల నివారణ పథకం అమల్లో ఉండగా... దీని ద్వారా ఇంటింటికి ఔషధాలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు త్వరలో పల్లె దవాఖానాలను ప్రారంభించనుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అమలాపురం ఘటన: పోలీస్ వాహనాలపై రాళ్లు.. 46 మందిపై కేసు..
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బస్సును దగ్ధం చేసిన కేసులో.. ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది
సాక్షి,హైదరాబాద్: వాహన విస్ఫోటనం గ్రేటర్ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్ కాలంలో స్తంభించిన ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ కంటే ముందు నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. ఇంటింటికీ సొంత బండి... సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో నగరానికి దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్ ఉన్నట్లే బైక్.. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఫోన్ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. ప్రజా రవాణా పెరగాలి వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. – పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు! -
వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే.. ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది. ► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం. ► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనాలే టాప్... ► గ్రేటర్లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) ► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!) -
కోటి వాహనాల ఐటీ సిటీ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం. ఫలితంగా రోడ్లు చాలక మొత్తం నగరవాసులు ఇబ్బందులను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.30 కోట్లుగా ఉంది. వాహనాల సంఖ్య కూడా సుమారు కోటికి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం బైకులు, కార్లు, బస్సులు, ఇతరత్రా రవాణా వాహనాల సంఖ్య 1,03,21,000గా ఉంది. కిక్కిరిసిన వాహనాల ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఎగబాకుతోంది. 68 లక్షల బైక్‌లు, 21 లక్షల కార్లు 2022, మే వరకు రాజధానిలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య చూస్తే 68,72,763 బైకులు, 21,74,830 కార్లు, 1,15,000 ట్రక్కులు, లారీలు, 3,50,000 ట్యాక్సీ, ఆటోలు, 8,08,990, ఇతర వాహనాలు ఇలా మొత్తంగా 1,03,21,583 వాహనాలు బెంగళూరు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత వాహన ఒత్తిడిని తట్టుకోలేని రోడ్లు తరచూ నాశనమవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ రద్దీ జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కిలోమీటరు దూరంలోని గమ్యం చేరడానికి పీక్ అవర్స్‌లో రెండు మూడు గంటలు పడుతోంది. చాలీచాలని రహదారులు బీబీఎంపీ పరిధిలో మొత్తం 1,1940 కిలోమీటర్ల పొడవునా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు 60 లక్షల వాహనాలను మాత్రం భరించగలవు. కానీ కోటికి పైగా వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతింటోంది. మరోవైపు నగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ను అమలు చేయాలని, పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లవారికే కారు కొనుగోలు నిబంధన ఉండాలని డిమాండ్లు ఉన్నాయి. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!
సాక్షి, హైదరాబాద్: వాహనాలపై విధించే హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను ప్రభుత్వం పెంచింది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను వినియోగించ కుండా నిషేధించే దిశలో కేంద్ర ప్రభుత్వం కట్టు దిట్టంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలకు కొంతకాలంగా స్పష్టమైన సూచ నలు జారీ చేస్తూ వస్తోంది. పాతబడ్డ వాహనా లను వినియోగించే విషయంలో వాహనదారులను నిరు త్సాహ పరిచేలా హరితపన్నును భారీగా పెంచాలని సూచించింది. ఈ క్రమంలోనే తెలం గాణ ప్రభు త్వం హరిత పన్నును పెంచుతూ నిర్ణ యం తీసు కుంది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహ నాలకు నామమాత్రంగా గ్రీన్‌ట్యాక్స్ ఉండేది. ఇప్పు డు దాన్ని శ్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్లు, 10 నుంచి 12 ఏళ్లు, 12 ఏళ్లు దాటినవి.. ఇలా 3 శ్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తోంది. ఈ విషయంలో రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచింది. శ్లాబు లవారీగా ఆ మొత్తం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు విధించినట్టు సమాచారం. ఇంతకాలం గ్రీన్ ట్యాక్స్ నామమాత్రంగా ఉండగా, ఇప్పుడది కూడా భారీగా పెరిగింది. కానీ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించకుండా రవాణాశాఖ గోప్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వును కూడా ఆన్లైన్లో పొందుపరచకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే జీవితకాల పన్ను పెంపు ఇటీవల వాహనాల జీవితకాలపు పన్నును పెంచిన ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్‌ను పెంచటం విశేషం. లైఫ్ ట్యాక్స్ పెంచటం ద్వారా ఏడాదిలో రూ.1,300 కోట్ల మేర అదనపు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పన్ను ద్వారా మొత్తం రూ.4,200 కోట్ల వార్షికాదాయం వస్తుందని భావిస్తున్నారు. లైఫ్ ట్యాక్స్‌కు సంబంధించి ఏడో తేదీనే ఉత్తర్వు విడుదల చేసి సోమవారం నుంచి అమలులోకి తెచ్చింది. అధికారికంగా ప్రకటించకుం డానే పన్ను పెంచటంపట్ల వాహనదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గ్రీన్ట్యాక్స్కు సంబంధించిన ఉత్తర్వు కూడా వెల్లడించకుండా గోప్యత పాటించటం విశేషం. 25 శాతం పెరిగిన త్రైమాసిక పన్ను.. పర్మిట్లతో నడిచే వాహనాల త్రైమాసిక పన్నును కూడా రవాణాశాఖ భారీగా పెంచింది. ఏకంగా 25% మేర పెంచింది. ఈ త్రైమాసికం నుంచే అది అమలులోకి వచ్చినట్టయింది. -
టోల్గేట్లకు త్వరలో టాటా
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్‌ఫీజు చెల్లింపునకు టోల్గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్‌ఫీజు వసూలు కోసం కొత్త విధానంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేస్తోంది. రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోలుఫీజు వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేసేందుకు ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (జీఎన్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. హేతుబద్ధంగాలేని ప్రస్తుత విధానం ప్రస్తుతం జాతీయ రహదారులపై రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. వాహనాలు టోల్‌గేటు వద్దకు చేరుకోగానే వాటిపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్‌చేసి సంబంధిత ఫీజు మొత్తం ఆ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆ రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని పూర్తిగా ప్రయాణిస్తే ఆ ఫీజు హేతుబద్ధమే. కానీ రెండు గేట్ల మధ్య పూర్తి దూరాన్ని ప్రయాణించకపోయినా ఈ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మీదుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనాలు గుంటూరు జిల్లాలో కాజ వద్ద టోల్ ఫీజు చెల్లించాలి. మళ్లీ ఆ రహదారిపై 66 కిలోమీటర్ల తరువాత కలపర్రు వద్ద టోల్గేట్ ఉంది. అంటే కాజ నుంచి కలపర్రు వరకు 66 కిలోమీటర్ల ప్రయాణానికి కాజ టోల్గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్నారు. కాజా నుంచి కలపర్రు వరకు ప్రయాణించే వాహనాలకు ఆ టోల్‌ఫీజు సహేతుకమే. కానీ వాహనాలు కాజ గేటు దాటిన తరువాత విజయవాడ వరకుగానీ, గన్నవరం వరకుగానీ ప్రయాణించినా సరే.. కలపర్రు వరకు అంటే 66 కిలోమీటర్ల దూరానికి టోల్‌ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్‌గేటు దాటి ఒక కిలోమీటరు ప్రయాణించినా సరే మొత్తం 66 కిలోమీటర్లకు టోలుఫీజు చెల్లించాల్సిందే. ఈ విధంగా దేశంలో ఉన్న వెయ్యికిపైగా టోల్గేట్లలో ప్రస్తుతం ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో 4.50 కోట్లకుపైగా ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు తాము ప్రయాణించే దూరానికి మించి టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు. నావిగేషన్ టోల్‌ఫీజు విధానం ఇలా.. టోల్‌ఫీజు విధానాన్ని మరింత హేతుబద్ధీకరించేందుకు జీఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తారు. అంటే వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్నప్పటి నుంచి ఆ దారిలో ప్రయాణించే దూరాన్ని జీఎన్ఎస్ఎస్ విధానంలో పరిశీలించి టోల్ వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై నుంచి పక్కకు జరగగానే ప్రయాణించిన దూరాన్ని ఆటోమేటిగ్గా లెక్కించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు తీసుకుంటారు. ఈ విధానంలో జాతీయ రహదారిపై ఎంతదూరం ప్రయాణిస్తే అందుకుతగ్గ టోల్ఫీజే వసూలు చేస్తారు. ఇక టోల్గేట్లు ఉండవు. కాబట్టి జాతీయ రహదారులపై టోల్‌ఫీజు చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి. ఐరోపా దేశాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్న ఈ జీఎన్ఎస్ఎస్ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ఈ విధానంపై ఎన్హెచ్ఏఐ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తోంది. దేశంలో 1.37 లక్షల వాహనాల నుంచి ప్రస్తుతం ఈ విధానంలో టోల్‌ఫీజు ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై రష్యా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు త్వరలో నివేదిక సమర్పించనున్నారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ విధానం అమలుపై ఎన్హెచ్ఏఐ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అందుకోసం అవసరమైతే జాతీయ రవాణా విధానంలో సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
ఈవీ.. బేఫికర్..
-
తల్లీబిడ్డకు శ్రీరామరక్ష
-
AP: ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’లు సిద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలు.. మొత్తం 500 వాహనాలను విజయవాడలోని సిద్ధార్థ్ధ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1న విజయవాడ బెంజి సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ వీటిని ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఈ వాహనాలను వరుస సంఖ్యలో ఉంచి, బెంజిసర్కిల్ మీదుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను అరబిందో ఫార్మా సంస్థ చూడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.24 కోట్లు చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి మూడు లక్షల దాకా ప్రసవాలు జరగనున్నాయి. ఈ వాహనాల ద్వారా గర్భిణులను ఉచితంగా ఆస్పత్రిలో చేర్చి.. ప్రసవం జరిగాక బాలింతలను తిరిగి ఉచితంగా ఇంటికి చేరుస్తారు. కాగా, డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్థానిక క్యాంప్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఐదు వాహనాలకు ఓ వీఆర్వో, ప్రతి జిల్లాకు సంబంధించిన వాహనాలను ఓ తహశీల్దార్ పర్యవేక్షించేలా ఉత్తర్వులివ్వాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. -
రోడ్లపై నిలిపివేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
-
Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..
సాక్షి, హైదరాబాద్: రోడ్లపై రోజుల తరబడి వాహనాలను వదిలేస్తున్నారా..? అయితే మీ వాహనం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కానుంది. రోడ్లపై వదిలేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారం వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా, నిర్లక్ష్యంగా ఉన్న వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆ వాహనాలకు సంబంధించి ఎవరూ క్లెయిమ్ చేయకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39బి కింద వేలం వేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, దొరికారో అంతే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
వాహనాల ధ్వని కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల కారణంగా నానాటికీ పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం తగ్గింపుపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. దీని నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ సభ్యులుగా ఉన్నారు. మార్గదర్శకాలు రూపొందించడంపై ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న, భయంకరమైన శబ్ధాలు చేసే సైలెన్సర్లు, హారన్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి విధానాల కోసం కసరత్తు చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ట్రాఫిక్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ విభాగాల అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాజధానిలో సంచరిస్తున్న వాహనాల హారన్లతో పాటు సైలెన్సర్ల మార్పు చేర్పుల ద్వారా తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. (క్లిక్: కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం) అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ వంటి వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థుల్ని తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాన్ని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మోడిఫైడ్ సైలెన్సర్ల కారణంగా, అనవసరంగానూ మోగిస్తున్న హారన్ల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం రంగనాథ్ నేతృత్వంలో రోడ్లపైకి వచ్చిన అధికారులు వివిధ వాహనాలతో పాటు ప్రధానంగా బస్సులపై దృష్టి పెట్టారు. సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో ఏఏ వాహనాలు, ఏ స్థాయిలో ధ్వనికి కారణమవుతున్నాయో గుర్తిస్తున్నారు. (క్లిక్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?) సమగ్ర నివేదికలు సమర్పిస్తాం: హాకింగ్ ఫ్రీ సిటీ అమలే మా లక్ష్యం. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వాహనాలకు కంపెనీలు అందిస్తున్న హారన్లు, సైలెన్సర్ల వద్ద వెలువడుతున్న శబ్ధంతో పాటు పాటు మార్పుచేర్పుల ద్వారా వస్తున్నదీ అధ్యయనం చేస్తున్నాం. కార్ డెకార్స్ సంస్థల యజమానులు, మార్పులు చేసే మెకానిక్స్, వివిధ కార్లు, బైకులు విక్రయించే డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో సోమవారం సమావేశమయ్యాం. జాతీయ రహదారులపై ఎయిర్ హారన్లు తప్పనిసరని కొందరు చెబుతున్నారు. వారు సిటీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి కమిటీకి సమర్పిస్తాం. దాని నిర్ణయం మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖరారు చేస్తాం. ప్రస్తుతం సిటీ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఐదు సౌండ్ లెవల్ మీటర్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఖరీదు చేయనున్నాం. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ చీఫ్ -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
నడి సంద్రం.. నౌకలో మంటలు.. వేలాది కార్లు బూడిద
Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!) -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
అస్సాం సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి కాన్వాయ్‌లో వాహనాల శ్రేణిని
దిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అస్సాంలో సీఎం, మంత్రులు ఆధ్వర్యంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. బిశ్వ శర్మ తన కాన్వాయ్ ఉండే వాహనాల శ్రేణిని ఆరుకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్‌లో 22 వాహనాలు ఉండేవి. రోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు, పలు అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో గౌహతిలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు శ్రేణిని ఆరుకి కుదిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఇతర ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎస్కార్ట్,పైలేట్ వాహనాల మినహ జిల్లాలలో 12 వాహనాలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది. అధికారిక సమావేశాలలో భాగంగా, ఇతర రాష్ట్రమంత్రులను సన్మానించడాన్ని కూడా నిషేధిస్తూ మంత్రి వర్గం నిర్ణయం వెలువరించింది. సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో 2 నిముషాలు ఆపవచ్చని తెలిపింది. అంబులెన్స్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. వీటితో పాటు పలు విధాన పర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ
న్యూఢిల్లీ: కారులో కనిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఎనిమిది మంది ప్రయాణించగలిగే కారులో తయారీదారులు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంచాలని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. 2019 జూలై 1 నుంచే డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశామని, ఇక 2022 జనవరి 1 నుంచే డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో ఉన్నవారికి ఎయిర్‌బ్యాగ్ ఉండాలన్న నిబంధన అమల్లో ఉందన్నారు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల దృష్ట్యా ఇప్పుడు అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేశామని గడ్కరీ తెలిపారు. చదవండి: Bipin Rawat Chopper Crash: ప్రతికూల వాతావరణమే కారణం -
6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్
-
ఎలక్ట్రిక్ కార్లపై సబ్సీడీ, ఒక్క నెలలోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కార్లు!
మారుతున్న కాలానికి అనుగుణంగా మన అభిరుచులు మారాలి. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి పోతాం. అందుకే వాహనదారులు ప్రస్తుతం వినియోగిస్తున్నఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు మొగ్గుచూపుతున్నారు.దీనికి తోడు ఆయా ప్రభుత్వాలు సబ్సీడీని అందిస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీస్థాయిలో జరుగుతున్నాయి. చైనా పాసింజర్ కార్ అసోషియేషన్ (సీపీసీఏ) ప్రకారం.. చైనాకు చెందిన ప్లగ్-ఇన్ కార్ల అమ్మకాలు ఈ ఏడాదిలో 5.5 మిలియన్లు దాటుతాయని సీపీసీఏ ప్రతినిధులు చెబుతున్నాయి. ఇదే సంస్థకు చెందిన కమర్షియల్ వెహికల్స్, బస్సుల అమ్ముకాలు ఇదే స్థాయిలో జరిగితే 6 మిలియన్లు దాటడం ఖాయమని అంటున్నారు. గతేడాది 11నెలల కాలంలో 14.3 శాతంతో ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ కార్లు 2.7 మిలియన్ల అమ్ముడవ్వగా.. ఒక్క డిసెంబర్ నెలలో 3 మిలియన్లకు పైగా అమ్ముడవ్వడం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదిలో ప్లగ్-ఇన్ కారు అమ్మకాలు 6 మిలియన్లు దాటుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం రాయితీలు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం..2021 నుంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు 30 శాతం రాయితీలు ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణే టెస్లా కార్లేనని రిపోర్ట్లు పేర్కొన్నాయి. నాటి మార్కెట్ ధరలకు అనుగుణంగా టెస్లా కారు ధర రూ.1,85,334.61 ఉండగా 30శాతం రాయితీతో రూ.1,29,464.71 కే అందించినట్లు రిపోర్ట్లు ప్రధానంగా హైలెట్ చేస్తున్నాయి.రాయితీలు ఇస్తున్న సమయంలో మార్కెట్ గణనీయంగా దాదాపు రెండింతలు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సబ్సిడీ 2023 వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత రాయితీల్ని తీసివేస్తారని చైనా కార్ల అసోసియేషన్ తెలిపింది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? -
వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!
ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనదారులకు భారీషాకిచ్చింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 43 లక్షల వాహనాలు మూలన పడనున్నాయి. అందులో 32 లక్షల బైక్స్, 11లక్షల కార్లు ఉన్నాయని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఒకవేళ 10ఏళ్లకు పైబడిన డీజీల్ వాహనాలు, లేదంటే 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల లైసెన్స్‌లు రద్దు చేసినా రోడ్ల మీద తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ వాహనాల్ని స్క్రాప్‌గా మార్చేస్తామని ఆర్టీఐ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ వాహనాల్ని ఏం చేయాలో అర్ధంగాక పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. 10ఏళ్లు పైబడిన డీజిల్ బండి ఉందా 10ఏళ్లు పైబడిన డీజిల్ వెహికల్ ఉంటే..ఆ వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చకుండా ఆదాయాన్ని గడించే మార్గాలు ఉన్నాయి. 10ఏళ్లు నిండిన డీజిల్ వాహనాల్ని ఎలక్ట్రిక్ కిట్ల సాయంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేసి, నో- అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఆ ఎన్ఓసీ సర్టిఫికెట్ సాయంతో వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవచ్చని ఢిల్లీ ఆర్టీఓ అధికారులు తెలిపారు. Delhi govt in a bid to provide relief to the Delhiites affected by the NGT order mandating de-registration of Petrol & Diesel Vehicles above 15 & 10 yrs resp., has allowed ✅Provision of NOC for registering in other states ✅Retrofitment to Electric & continue plying in Delhi pic.twitter.com/ZaqnoS0f0M — Transport for Delhi (@TransportDelhi) December 17, 2021 స్క్రాప్‌గా మార్చకుండా లైసెన్స్ రద్దు చేసిన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం గుర్తించిన ఆరు మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీల్లో మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని, ఆ వాహనాల్ని మళ్లీ వినియోగించుకోవచ్చని చెప్పింది. ఏజెన్సీలతో ప్రభుత్వం సంప్రదింపులు ఓల్డ్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చే ఏజెన్సీలతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అందులో ఆరు ఏజెన్సీలకు ఢిల్లీ ఆర్టీఓ విభాగం- ప్రముఖ టెస్టింగ్ సర్టిఫికేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటర్నేషన్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ(ఐసీఏటీ)లు ఆమోదం తెలిపాయి. వాటిలో ఎట్రియో ఆటోమొబైల్, 3ఈవీ ఇండస్ట్రీస్, బూమా ఇన్నోవేటివ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ రెన్యూవబుల్, జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, వీఈఎల్ఈవీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మీ పాత వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చుకొని వినియోగించుకోవచ్చు. లేదంటే అమ్ముకోవచ్చు. చదవండి: ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే -
దారి చూడు.. దుమ్ము చూడు
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు చల్లడం లేదు.. మండలంలోని చెరువుమాదారం క్రాస్‌రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
భద్రతకు డేంజర్ లోడ్ ఓవర్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దూలపల్లి నుంచి జీడిమెట్లకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇది. పారిశ్రామిక వ్యర్థాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. నిత్యం 5 వేలకుపైనే లారీలు, అంతకు పదింతలుపైనే ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డు చాలాచోట్ల గుంతల మయంగా మారింది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా.. కొత్తగా వేసిన మూడేళ్లలోనే ఈ స్థితికి చేరుకుందని స్థానికులు వాపోతున్నారు. నాసిరకం రోడ్లతో... ►సాధారణంగా సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్లు వేగాన్ని సరిగా అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పటిష్టమైన రోడ్లపైనే వాహనాలు అదుపుతప్పుతుంటే.. నాసిరకం రోడ్లపై మరింతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు వర్షాలకే పెచ్చులూడే రోడ్లపై అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ►రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతుల సమయంలో నాసిరకం సామగ్రిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా హడావుడిగా నిర్మాణంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో తారువేసే సమయంలో అది కనీసం 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల (లేయింగ్ టెంపరేచర్) సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కానీ దూరంలో ఎక్కడో తయారుచేసి, ఓపెన్ ట్రక్కుల్లో తరలిస్తున్న తారు 90డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటోందని.. దానిని అలాగే పరిచి, రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఇక తారు నాణ్యత (బిటుమినస్ తార్) 4.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని.. కానీ 3.5 శాతం నుంచి 4 శాతం వరకే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇలాంటి తారును రోడ్డు రోలర్లతో తొక్కించడం వల్ల మొదట్లో బాగానే కనిపించినా.. కొద్దిరోజులకే దెబ్బతింటోందని స్పష్టం చేస్తున్నారు. చిన్నవానలకే రోడ్లకు పగుళ్లురావడం, పైపొర కొట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయని.. అలాంటి రోడ్లపై ఓవర్‌లోడ్ వాహనాలు తిరుగుతుండటంతో మరింత నష్టం కలుగుతోందని వివరిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళితే.. ►రహదారులపై వాహనాల బరువుతో పడే ఒత్తిడిని కిలోన్యూటన్ల (కిలోన్యూటన్ అంటే సుమారు 101 కిలోల బరువు)లో కొలుస్తారు. ఆయా రోడ్ల నిర్మాణ తీరు (అక్కడి నేల తీరు, వాడిన కంకర పరిమాణం, రోలింగ్, తారు (బిటుమినస్ తార్) నాణ్యత తదితర అంశాల)ను బట్టి అవి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామాల మధ్య నిర్మించే సాధారణ రోడ్ల సామర్థ్యానికి, భారీ హైవేల సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. ►రోడ్లను నాసిరకంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించినా, తక్కువ కెపాసిటీ ఉన్నరోడ్లపై పరిమితికి మించి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లినా.. సదరు రోడ్లు దెబ్బతింటాయి. ►రాష్ట్రంలో 30 కిలోన్యూటన్ల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన రహదారులపై కూడా 60 కిలోన్యూటన్ల ఒత్తిడిపడే భారీ ఓవర్‌లోడ్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, ఇటీవల నిర్మించిన కొన్ని హైవేలు మినహా.. మిగతా రోడ్లన్నీ 40కిలోన్యూటన్లలోపు సామర్థ్యమున్న రోడ్లే కావడం గమనార్హం. ఇలాంటి ఈ రోడ్లపై ఇసుక, ఇటుక, కంకర, ఐరన్, గ్రానైట్స్, మార్బుల్స్ వంటి సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నారు. ►ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లపై ఒత్తిడి పెరగడం, ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తీవ్ర వైబ్రేషన్ (ప్రకంపనాల)తో రోడ్ల బేస్ దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆ పగుళ్లు, రంధ్రాల్లోకి వాన నీరు, గాలిచేరి రోడ్డు బలాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెప్తున్నారు. ఇలా కొద్దిగా దెబ్బతిన్న రోడ్లు వాహనాల రాకపోకలు జరిగిన కొద్దీ మరింతగా పాడైపోయి.. పెద్ద పెద్ద గుంతలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివారు రహదారులు, లోపలి రోడ్లు కూడా ఇలా ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. ఇది రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమేంటి? నాణ్యమైన రోడ్లు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయని, మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లపాటు వినియోగించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రెండు, మూడేళ్లకే మరమ్మతులు చేసినా దెబ్బతింటున్నాయి. ►ఓవర్‌లోడ్ కారణంగా డ్రైవర్లు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌లోడ్, రోడ్లపై గుంతలు కలిసి వాహనాల టైర్లు పేలిపోయి ఇతర వాహనాలను ఢీకొట్టడం, బోల్తాపడటానికి కారణమవుతున్నాయి. ►రోడ్లపై తారు కొట్టుకుపోవడం, కంకర తేలడం, గుంతలు పడటం కారణంగా సాధారణ వాహనాలు కూడా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. పగిడిపాల ఆంజనేయులు ఓవర్‌లోడ్ వాహనాలు రహదారి భద్రతకు పెనుముప్పుగా మారాయి. పరిమితికి మించిన బరువుతో పరుగులు తీస్తున్న సరుకు రవాణా లారీలు, ప్రైవేట్ బస్సుల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రధాన రహదారులపై పరిస్థితిని గమనించింది. నిత్యం వేలకొద్దీ లారీల్లో ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్, ఐరన్, మార్బుల్స్ తదితర సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నట్టు గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా తొర్రూరు, మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం ఆర్టీసీ బస్సులు, మైనింగ్ లారీలు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్లే మైనింగ్ లారీల కారణంగా రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది. దీనితో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ –చించొల్లి అంతరాష్ట్ర రహదారి దుస్థితి. ప్రస్తుతం రోడ్డు సామర్థ్యం 20 టన్నుల బరువులోపే. కానీ 30 టన్నులకుపైగా బరువుతో రోజూ వందలాది లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనికితోడు రోడ్డు నాణ్యతా లోపం కారణంగా.. అడుగుకో గుంత అన్నట్టుగా తయారైంది. రోడ్ల సామర్థ్యం కాస్త పెరిగినా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ జరిగింది. సామర్థ్యం ఎక్కువగా ఉండే నాలుగులైన్ల రహదారులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ఉన్న నిబంధనలను సవరించిన రవాణాశాఖ.. టైర్ల సంఖ్యకు అనుగుణంగా సుమారు 3 టన్నుల చొప్పున వాహనాల రవాణా బరువు పరిమితిని పెంచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓవర్‌లోడ్ రవాణాకు ఇది ఏమాత్రం దగ్గరగా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఇసుక, కంకర, ఐరన్, గ్రానైట్ వంటి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలు యథేచ్చగా లోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►ఒకవైపు రాజకీయ నాయకుల జోక్యం, మరోవైపు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిన్నర కాలంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలను నిలిపివేశారు. దీంతో బాహాటంగానే ఓవర్‌లోడ్ సరుకు రవాణా సాగుతోంది. ►ఓవర్‌లోడ్, రోడ్లు దెబ్బతినడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారి నుంచి స్పందన రాలేదు. నిబంధనలు ఏమిటి? ►రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల లారీల్లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే తీసుకెళ్లాలి. కానీ 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. ►12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు అనుమతి ఉంటుంది. అయినా 45 టన్నుల వరకు ఇసుక, ఐరన్, గ్రానైట్ వంటివి రవాణా చేస్తున్నారు. ►6 టైర్ల సాధారణ లారీల్లో 18 టన్నుల వరకు బరువును తీసుకెళ్లవచ్చు. కానీ వాటిలో 25 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులను రవాణా చేస్తున్నారు. ►హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, మియాపూర్, బొల్లారం, నాచారం, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వివిధ రకాల రవాణా వాహనాలు, వ్యర్ధాల తరలింపు లారీలు పరిమితికి మించిన లోడ్‌తో రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి. ►చాలా వాహనాల్లో పరిమితికి మించి 10 నుంచి 20 టన్నుల మేర ఎక్కువ బరువును రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిలో సుచిత్ర ప్రాంతం వద్ద రోడ్డు దుస్థితి ఇది. కనీసం 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు.. వేసిన రెండు, మూడేళ్లకే చాలా చోట్ల గుంతలు పడి, తారు కొట్టుకుపోయి దెబ్బతిన్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్లు ఇలా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతోనూ.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు ఇసుక పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. రోజూ కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. కేవలం 18 టన్నుల సామర్ధ్యం ఉండే ఆ లారీల్లో 25 టన్నులకుపైగా ఇసుకను నింపి రవాణా చేస్తున్నారు. రోజూ రాత్రిళ్లు వేలాది లారీలు వేగంగా రహదారులపై ప్రయాణిస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, తిరుమలగిరి, కర్మన్‌ఘాట్, చంపాపేట్, కూకట్పల్లి తదితర అడ్డాలకు.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇలా ఓవర్‌లోడ్ తరలింపును అరికట్టడంలో రవాణాశాఖ విఫలమవుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది లారీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులా?.. సరుకు రవాణా వాహనాలా..? ప్రైవేటు బస్సులు చాలా వరకు సరుకు రవాణా వాహనాలుగా కూడా మారిపోతున్నాయి. లగేజీ బాక్సులతోపాటు బస్సుల టాప్‌పై కూడా సరుకులను నింపి రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికులు, వారి లగేజీకి తోడు అదనంగా సరుకులతో బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, బెంగళూర్ తదితర ప్రాంతాలకు బట్టలు, ఐరన్, ద్విచక్ర వాహనాలు వంటివాటిని బస్సుల్లో తరలిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, బహదూర్‌పురా, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో.. బస్సుల్లో తరలిస్తున్న ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను గుర్తించడం గమనార్హం. ఇప్పటికీ కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల్లో క్వింటాళ్ల కొద్దీ సరుకు రవాణా జరుగుతూనే ఉంది. ఓవర్‌లోడ్‌తో రోడ్లకు పగుళ్లు ఇటీవల కాలంలో పలుచోట్ల రోడ్ల సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. లక్ష టన్నుల బరువు మోయాల్సినరోడ్డుపై ఏకంగా కోట్ల టన్నుల బరువు మోపితే ఎలా ఉంటుంది? ఓవర్‌లోడ్ కారణంగా రోడ్ల బేస్మెంట్ నుంచి పగుళ్లు వచ్చి దెబ్బతింటాయి. అంతిమంగా రహదారి భద్రతకు ఇది ముప్పు. – ప్రొఫెసర్ గోపాల్‌నాయక్, రోడ్డు నిర్మాణ నిపుణుడు వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలు ఓవర్‌లోడ్ వల్ల డ్రైవర్లు వాహనాలను నియంత్రించలేక పోతున్నారు. ప్రమాదాలను నివారించే అవకాశమున్న సందర్భాల్లో కూడా.. ఓవర్‌లోడ్ వల్ల వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు డివైడర్లను ఢీకొంటున్న సంఘటనల్లో చాలా వరకు ఓవర్‌లోడే ప్రధాన కారణం. – సి.రామచంద్రయ్య, రహదారి భద్రత నిపుణుడు -
విశాఖలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా వాహన తనిఖీలు
-
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా?
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా కొనసాగుతుంది. అయితే వాటిలో పలు రకాలైన ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వాటి టెక్నాలజీ సంగతేంటో తెలుసుకుందాం. పూర్తి ఎలక్ట్రిక్ వాహనం... బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ)గా దీన్ని పిలుస్తారు. లిథియం అయాన్ బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్... మోటార్‌ను (ఇంజిన్) రన్ చేయడం ద్వారా ఇవి నడుస్తాయి. ప్రస్తుతం అనేక ఈవీల రేంజ్ (ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది) 150–480 కిలోమీటర్ల వరకు ఉంది. బీఈవీలకు ప్రభుత్వ రాయితీలన్నీ లభిస్తాయి. ఇంట్లో లేదా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ప్లగ్–ఇన్ హైబ్రిడ్ వాహనం... ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం (పీహెచ్ఈవీ) లో పెట్రోలు/డీజిల్ ఇంకా ఎలక్ట్రిక్ ఇంజిన్ రెండూ ఉంటాయి. దీనిలోని లిథియం అయాన్ బ్యాటరీని రీచార్జ్ చేసుకోవచ్చు. చార్జింగ్ అయిపోతే, పెట్రోలు/డీజిల్ ఇంజిన్‌కు మారిపోవచ్చు. బ్రేకులు వేసేటప్పుడు విడుదలయ్యే శక్తితో కూడా బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. అయితే, దీని బ్యాటరీ రేంజ్ తక్కువగా ఉంటుంది. ఈవీలకు వర్తించే రాయితీలు అనేక దేశాల్లో పీహెచ్ఈవీలకు కూడా లభిస్తున్నాయి. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం... హైడ్రోజన్‌తో నడిచే వాటిని ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్‌సీఈవీ)గా పేర్కొంటారు. దీనిలో హైడ్రోజన్ ట్యాంక్, ఫ్యూయల్ సెల్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌తో హైడ్రోజన్ రియాక్షన్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్, ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందించి వాహనం నడిచేందుకు తోడ్పడుతుంది. పర్యావరణానికి హాని చేయని నీటి ఆవిరి, వేడి గాలి మాత్రమే వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అయితే, హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్దమొత్తంలో విద్యుత్, లేదా శిలాజ ఇంధనాలను ఉపయోగించాల్సి రావడం, ద్రవ హైడ్రోజన్‌ను తరలించడం, ప్రత్యేక బంకుల ఏర్పాటు, అధిక హైడ్రోజన్ రేటు వంటివి ప్రతికూలాంశాలు. కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది... ఈవీలో ఉపయోగించే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి చార్జింగ్ ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ టూవీలర్ల సగటు సామర్థ్యం 3 కిలోవాట్ అవర్స్ (కేడబ్ల్యూహెచ్) అదే కార్లలో 60 కేడబ్ల్యూహెచ్ వరకు, బస్సులు, ట్రక్కుల్లో 200–300 కేడబ్ల్యూహెచ్ వరకు ఉంది. ఉదాహరణకు ఒక ఫుల్ ఈవీ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 5 కేడబ్ల్యూహెచ్ అనుకుందాం. మన దేశంలో ఒక యూనిట్ విద్యుత్ అంటే 1 కేడబ్ల్యూహెచ్‌గా పరిగణిస్తారు. దీన్నిబట్టి 5 కేడబ్ల్యూహెచ్ ఈ–స్కూటర్ బ్యాటరీ ఫుల్‌చార్జ్ అయ్యేందుకు 5 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ విద్యుత్ వ్యయం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సగటున రూ.8 చొప్పున యూనిట్ ధర అయితే, ఫుల్ చార్జింగ్కు రూ.40 వ్యయం అవుతుంది. ఫుల్ చార్జింగ్‌తో సగటున 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని భావిస్తే ఖర్చు కిలోమీటరుకు 40 పైసలు మాత్రమే. అదే పెట్రోలు స్కూటర్ అయితే సగటున 40 కిలోమీటర్ల మైలేజీని లెక్కిస్తే కిలోమీటరుకు రూ.2.6 ఖర్చవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం పబ్లిక్ చార్జర్లను ఉపయోగిస్తే, యూనిట్ ధర కాస్త (సర్వీసు చార్జీలన్నీ కలిపి) పెరిగే అవకాశం ఉంటుంది. నార్వే.. టాప్‌గేర్ పర్యావరణం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్న దేశాల్లో నార్వేదే అగ్ర స్థానం. ఇప్పటికే తమ దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 100 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర, జల, పవన) ద్వారా పొందుతున్న నార్వే.. వాహన కాలుష్యాన్ని తగ్గించే విషయంలోనూ వడివడిగా అడుగులేస్తోంది. 2020లో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 75 శాతం ఈవీలే. అంతేకాదు నార్వే రోడ్లపై పెట్రోలు/డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లే అధికంగా ఉండటం విశేషం. చదవండి: మొండి ఘటం.. టెస్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? -
Hyderabad: నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: మిలాద్– ఉన్– నబీ సందర్భంగా మంగళవారం నగరంలో శాంతి ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం, పూర్తిగా ఆపేయడం చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే.. గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్ ఖాద్రీ చమాన్, ఇంజన్‌లి, షంషీర్గంజ్, లాల్ దర్వాజా మోడ్, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్ వద్ద ఉన్న నారాయణ స్కూల్, మక్కా మసీదు, చార్ కమాన్, గుల్జార్ హౌస్, మచిలీ కమాన్, ఎంఎం సెంటర్, పిస్తా హౌస్, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం, ఎస్జే రోటరీ, దారుల్షిఫా, పురానీ హవేలీ. నేడు సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు చారి్మనార్: మిలాద్–ఉన్–నబీ సందర్భంగా మంగళవారం నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని ఆయన కోరారు. చదవండి: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ -
కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన
వాహనాల హారన్ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ.. కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్ ఛేంజ్ హార్న్’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం.. ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన. అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినేవారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిపప్రాయపడ్డారు. వాహనాల రోదనల వల్ల జనాలు పడే ఇబ్బందులేంటో తనకూ అనుభవమని, అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఆ జోన్స్ లేకపోవడమే.. నో హాంకింగ్ జోన్స్.. అంటే ఆ జోన్ ఉన్న ప్రాంతంలో వెహికల్స్ హారన్ కొట్టడానికి వీల్లేదు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాలాదేశాల్లో ఇలాంటి జోన్లు ఉన్నాయి. కానీ, మన దేశంలో ఎక్కడా అలాంటివి కనిపించవు. కేవలం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో నో హాంకింగ్ జోన్స్‌కి బదులు.. హారన్ శబ్దాల్ని మార్చాలనే ఆలోచన చేయడం విశేషం. సడలింపు లేకుండా ఈ నిబంధనను అమలు చేస్తే.. హారన్ మార్పిడి కోసం వాహన తయారీదారీ కంపెనీలతో పాటు పాత వాహనదారులపైనా భారం పడనుంది. చదవండి: ప్రశాంతంగా యోగా కూడా చేసుకోనివ్వలేదు!: గడ్కరీ -
‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో!
-
ప్లీజ్ చేంజ్ హారన్: గడ్కరీ
Nitin Gadkari Horn Change Rules: నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నడుమ చెవులు చిల్లులు పడే రేంజ్ రణగోణధ్వనుల్ని భరిస్తూ.. వాహనదారులు ముందుకు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటన చేశారు. మరాఠీ న్యూస్ పేపర్ లోక్‌మట్ కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఓ భవనంలో పదకొండవ అంతస్తులో నివాసం ఉంటున్న గడ్కరీకి.. ప్రశాంతంగా గంటసేపు ప్రాణాయామం కూడా చేసుకోని పరిస్థితి ఎదురవుతోందట. వాహనాల రోదనల వల్ల అంత ఎత్తులో ఉన్న తన పరిస్థితే అలా ఉంటే.. సాధారణ పౌరులు ఆ గోలను ఎలా భరిస్తున్నారో తాను ఊహించుకోగలనని చెప్తున్నారాయన. అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇప్పుడున్న వెహికిల్ హారన్ల ప్లేస్‌లో తబలా, వయొలిన్, ఫ్లూట్.. ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. ఒకవేళ కేంద్రం గనుక కరాకండిగా ఈ రూల్స్ అమలు చేస్తే మాత్రం.. వాహన తయారీదారీ కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఆ టైంలోనే గట్టిగా.. హారన్ శబ్దాల వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మనుషుల్లో చెవుడుతో పాటు ఆందోళన, ఒత్తిళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అతి ధ్వనులను అవతి వాహనాలు(ఏవైనా సరే), వ్యక్తులు తప్పిపోయిన సమయాల్లో.. దూరం నుంచి వాహనాలు వస్తున్నాయనే అలర్ట్ ఇవ్వడానికి(ఎమెర్జెన్సీ సర్వీసుల విషయంలో) మాత్రమే ఉపయోగించాలని రూల్స్ చెప్తున్నాయి. కానీ, ఈ రూల్స్ అమలు కావడం లేదు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్ 130-150 డెసిబెల్స్ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్ కొట్టాలి. ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్ సౌండ్ హారన్ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం!. నో హాంకింగ్ జోన్స్ కొన్ని చోట్ల హారన్లు కొట్టడానికి వీల్లేదు. అలాంటి ప్రాంతాల్ని ‘నో హాంకింగ్ జోన్స్’ అంటారు. మన దేశంలో ఎక్కడా అలాంటి జోన్లను ఏర్పాటు చేయలేదు. కేవలం శబ్ద తీవ్రత పరిమితిని మించినప్పుడు.. అదీ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నో హాంకింగ్ జోన్స్ వ్యవస్థను అమలు చేస్తే.. గడ్కరీ చెప్తున్న హారన్ మార్పిడి ఆలోచన అవసరమే ఉండదనేది చాలామంది వెల్లడిస్తున్న అభిప్రాయం. చదవండి: లెదర్ పరిశ్రమకు మంచి రోజులు -
రాంగ్ రూట్.. ఇకపై ఫుల్ టైట్
నేరేడ్మెట్(హైదరాబాద్): పక్కనే రాంగ్ రూట్.. కాస్త దూరం వెళ్తే యూటర్న్.. కానీ కొంత మంది రాంగ్రూట్నే ఎంచుకుంటున్నారు. ఓవైపు వేగంగా వచ్చే వాహనాలు.. మరోవైపు రాంగ్రూట్లో వెళ్లే వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే రాంగ్రూట్లో వెళ్లే వారికి అనేక చలాన్లు సైతం వేశారు. ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో రయ్యిమంటూ వాహనాలకు ఎదురెళ్తున్నారు. అటునుంచి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడా ఉండే సీసీ కెమెరాల్లో కనిపించకుండా నంబర్ప్లేట్లను చెరిపేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి నంబర్ కనిపించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిసారి అవగాహన కల్పిస్తూ.. రెండోసారి వాహనదారులు చిక్కితే చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా.. నంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ► మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణా పరిధిలోని నేరేడ్మెట్లో రాంగ్ రూట్ డ్రైవింగ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ► ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే షార్ట్‌కట్‌లో గమ్యస్థానాలకు వెళ్లడానికి రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ► నేరేడ్మెట్–ఈసీఐఎల్ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ► ఈ మార్గంలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు, జేజేనగర్ చౌరస్తా, సైనిక్‌పురి చౌరస్తాల్లోనే యుటర్న్‌లు ఉన్నాయి. ► డిఫెన్స్ కాలనీ, వాయుపురి, సైనిక్పురితోపాటు పలు కాలనీలు ఉన్నాయి. ► ఆయా కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల మీదికి వచ్చే వాహనదారులు రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నారు. ► దాంతో ఎదురుగా వస్తున్న పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ► గడిచిన నెలలో 10 వరకు రాంగ్‌రూట్ ప్రయాణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. ► ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు రాంగ్‌రూట్ డ్రైవింగ్ నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
బీహెచ్ ట్యాగ్: ఇక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అక్కర్లేదు
వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ సిరీస్(బీహెచ్) కొత్త వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లినప్పుడు..రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు వాహనాలు తీసుకెళ్లినప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండేది. అయితే బీహెచ్ సిరీస్ ట్యాగ్ ఉన్న వాహనాలకు ఇకపై ఆ అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజా నొటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రక్షణ సిబ్బంది, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU), నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వచ్చందంగా వర్తించనుంది. ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాల తరలింపునకు బీహెచ్ ట్యాగ్ దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. పద్నాలుగేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రం.. క్రితం కంటే వసూలు చేసిన మోటర్ వెహికిల్ ట్యాక్స్‌లో సగం చొప్పున ప్రతీ ఏడాది వసూలు చేయనున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. చదవండి : మీరు పాత కారు కొనాలనుకుంటున్నారా ?! -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి...మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. .
Madras High Court: వాహనాలకు సంబంధించిన ఇన్సురెన్సులు చేసేప్పుడు ఇటు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరిగా చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటీ మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్ టు బంపర్ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్, డిజైన్లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు అభిప్రాయపడింది. తీర్పుకు కారణం ఇది తమిళనాడులోని హొగినేకల్‌లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం సడయప్పన్ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్ ఫార్టీ బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్ ఈరోడ్ ట్రైబ్యునల్ ఆదేశాలను రద్దు చేశారు. అంతేకాకుండా ప్రీమియం, కవరేజీలు తక్కువగా ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులను నిరసించారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు. చదవండి: ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్ -
కరీంనగర్లో దళిత బంధు తొలి విడత యూనిట్ల పంపిణీ
-
సిటీజన్ల కోసం స్వచ్ఛవాయువు..
ఊపిరి సలపని వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తాజాగా స్మాగ్ టవర్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ముక్కుపుటాలు, శ్వాసకోశాలను దెబ్బతీసే వాహన కాలుష్యం నుంచి తక్షణ విముక్తికి ఈ టవర్లు ఉపయోగపడతాయి. ముంబయి, ఢిల్లీ ఐఐటీ నిపుణుల సహకారంతో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తయారు చేసిన ఈ టవర్ 24 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇందులో 40 భారీ ఫ్యాన్లు, ఐదువేల ఫిల్టర్లు ఉంటాయి. ఇవి స్థానికంగా గాలిలో అధికంగా ఉండే కార్భన్‌మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ తదితర ఉద్ఘారాలను గ్రహించడంతో వాయు శుద్ధి జరుగుతుంది. కూడళ్లలో సిగ్నల్స్ వద్ద కొన్ని నిమిషాలపాటు ఆగే వాహనదారులకు కొద్దిసేపు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం దక్కుతుంది. ఢిల్లీ తరహాలో గ్రేటర్ పరిధిలోనూ వాయుకాలుష్యం బెడద తీవ్రంగా ఉంది. లక్షలాది వాహనాల రాకపోకలతో అత్యధిక వాయు కాలుష్యం వెలువడే పంజగుట్ట, ఆబిడ్స్, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్‌నగర్, పాశమైలారం, పటాన్చెరు, కూకట్పల్లి తదితర కూడళ్లలో స్మాగ్‌టవర్లను ఏర్పాటుచేసి సిటీజన్లకు స్వచ్ఛవాయువును సాకారం చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అవధులు దాటిన వాయుకాలుష్యం.. గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య సుమారు 60 లక్షలకు చేరువైంది. ఇందులో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షలకు పైగానే ఉన్నాయి. వీటి ద్వారా భయంకరమైన పొగ వెలువడుతుంది. ఈ ఉద్గారాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్ తదితర ఉద్ఘారాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాదు..సూక్ష్మ ధూళికణాల మోతాదు ప్రతి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు దాటరాదు. కానీ మహానగరం పరిధిలోని పలు పారిశ్రామిక వాడలు సహా, ప్రధాన రహదారులపైసుమారు 80 కూడళ్ల వద్ద నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకల కారణంగా తరచూ ధూళి కాలుష్యం 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోనూ స్మాగ్‌టవర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నది నిపుణుల మాట. స్వచ్ఛ వాయువును అందించాలి నగరవాసులకు స్వచ్ఛ ఊపిరిని సాకారం చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీఏ, పరిశ్రమలు, ట్రాఫిక్, పీసీబీ విభాగాల సమన్వయంతో టోక్యో తరహాలో క్లీన్ఎయిర్ అథారిటీని ఏర్పాటు చేయాలి. కాలం చెల్లని వాహనాలు రోడ్డెక్కకుండా చూడాలి. ఉద్ఘారాలను పరిమితికి మించి విడుదల చేస్తున్న పరిశ్రమలను కట్టడిచేయాలి. నగరంలో హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. అత్యధిక కాలుష్యం వెలువడే కూడళ్ల వద్ద స్మాగ్‌టవర్లు ఏర్పాటు చేయాలి. – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త -
ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి
న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు. తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు.. వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. చదవండి: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో -
ఏం తెలివి.. 'స్మార్ట్'గా దోచేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో ‘స్మార్ట్’ దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది. వాహనదారులకు స్మార్టు కార్డులను అందజేసేందుకు గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా పంపించవలసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ తదితర స్మార్ట్‌కార్డులను ఏజెంట్లకు కట్టబెడుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఇందుకోసం ఒకరిద్దరిని ప్రత్యేకంగా నియమించడం గమనార్హం. ఒక్కో కార్డుపైన రూ.100 నుంచి రూ.150 చొప్పున కొన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు వందకు పైగా స్మార్ట్ కార్డులను విక్రయిస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇలా చేతివాటాన్ని ప్రదర్శించడం ఆర్టీఏ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ఆన్లైన్ సేవలను విస్తృతం చేశారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రం వినియోగదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌కార్డులనే నేరుగా అందజేసేందుకు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. చిరునామా నిర్ధారణకే స్పీడ్ పోస్టు... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, తదితర డాక్యుమెంట్లను గతంలో వాహనదారులకే నేరుగా అందజేసే వారు. దీంతో చాలామంది నకిలీ అడ్రస్లపైన ఆర్టీఏ పౌరసేవలను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కీలకమైన డ్రైవింగ్ లైసెన్సు వంటి డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లవచ్చుననే ఆందోళన వివిధ స్థాయిల్లో వ్యక్తమైంది. పైగా ఒకే వ్యక్తి రకరకాల చిరునామాలపైన ఒక టి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొనేవా రు. వాహనాల అమ్మకాలు, యాజమాన్య బదిలీల్లో నూ అక్రమాలు జరిగాయి. దీంతో వాహనదారుల చిరునామా నిర్ధారణను తప్పనిసరి చేశారు. ఇందుకోసం డాక్యుమెంట్లను వాహనదారులకు నేరుగా ఇవ్వకుండా స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికే పంపించేందుకు చర్యలు చేపట్టారు. సర్వీసు చార్జీల్లో భాగంగా స్పీడ్ పోస్టు కోసం రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్‌పోస్టు చార్జీలు చెల్లించినప్పటికీ ఏజెంట్ల ద్వారా డాక్యుమెంట్లనే నేరుగా తీసుకొనేందుకు మరో రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. కొరవడిన నియంత్రణ.. గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి వివిధ రకాల పౌరసేవలపైన ప్రతి రోజు సుమారు 2500 నుంచి 3000 స్మార్ట్ కార్డులు పంపిణీ అవుతాయి. కొన్ని ఆఫీసుల్లో కచ్చితంగా పోస్టు ద్వారానే వినియోగదారులకు చేరవేస్తున్నప్పటికీ మరి కొన్ని ఆఫీసుల్లో మాత్రం 50 శాతం నుంచి 60 శాతం కార్డులను నేరుగా అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నూతన పాలసీ ఎఫెక్టు.. 40 లక్షల వాహనాలు తుక్కేనా?
బెంగళూరు: పాత వాహనాలను తుక్కు చేసేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంతో రాష్ట్రంలో లక్షలాది వాహనాలు గుజరీ దారి పట్టనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 2.46 కోట్ల వాహనాల్లో 40 లక్షలకు పైగా వాహనాలు ఈ జాబితాలోకి వస్తాయి. కొత్త స్క్రాప్ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద మారిస్తే కేంద్రం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. అలా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం చట్టం ఉద్దేశం. 9 లక్షల పెద్ద వాహనాలు 31 లక్షల బైక్‌లు 15 ఏళ్లకు పైబడిన మ్యాక్సిక్యాబ్‌లు, కారు, ఆటోరిక్షా, బస్సు, లారీలతో పాటు 9 లక్షలకు పైగా వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. 20 ఏళ్లు దాటిన 31 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. యజమానులు స్వయంప్రేరితంగా గుజరికి వేసేయవచ్చు. లేదా మూడు సార్లు ఫిట్నెస్ పరీక్ష విఫలమైతే రవాణా శాఖ వాటిని స్క్రాప్‌కి తరలిస్తుంది. ఒకవేళ ఎప్సీ పరీక్షలో పాసైనప్పటికీ గ్రీన్ ట్యాక్స్ చెల్లించడం యజమానికి ఆర్థిక భారమే. వ్యాపారులు, మెకానిక్‌లలో భయం ఈ చట్టంతో పాత కార్లు, లారీలు కలిగి ఉన్న వారిలో భయం నెలకొంది. పాత కార్ల వ్యాపారుల్లోనూ గుబులు ఏర్పడింది. లక్షలు పెట్టి కార్లు కొనలేనివారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారు తక్కువ ధరతో పాత కార్లను కొని మోజుతీర్చుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం పడిపోయే ప్రమాదం ఉందని ఓ పాత కార్ల వ్యాపారి మధు తెలిపారు. పాత వాహనాలను నమ్ముకుని గ్యారేజ్‌లు నిర్వహిస్తున్న మెకానిక్‌లు జీవనానికి కొత్త చట్టంతో ఇబ్బందులే అన్నారు. అన్ని పాత వాహనాల్నీ గుజరీకి తరలిస్తే రిపేరి పనులు తగ్గిపోతాయని మెకానిక్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చట్టం వల్ల తమ కుటుంబాలు వీధిపాలవుతాయని లారీ యజమానుల సంఘాల ఒక్కోట అధ్యక్షుడు బి.చెన్నారెడ్డి అన్నారు. 10–11 ఏళ్లు దాటిన పాత లారీలు స్థానికంగా తిరుగుతూ ఎంతోకొంత ఉపాధినిస్తుంటాయి. అలాంటి లారీల యజమానులకు ఏమీ పాలు పోవడం లేదని అన్నారు. -
వాహనాల తనిఖీ కోసం రీకాల్ చేస్తున్న మహీంద్రా
భారతీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మంగళవారం జనవరి 2020 - ఫిబ్రవరి 2021 మధ్య తయారు చేసిన కొన్ని పికప్ వాహనాల్లో ఫ్లూయిడ్ పైపును తనిఖీ చేయడానికి రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. "ఇది కేవలం 29878 వాహనాల బ్యాచ్ కు మాత్రమే పరిమితం చేసినట్లు" అని కంపెనీ తెలిపింది. "తనిఖీ చేసిన తర్వాత ఏవైనా లోపాలు ఉంటే రెక్టిఫికేషన్ అనేది కస్టమర్లందరికీ ఉచితంగా నిర్వహించనుంది" అని అధికారిక ప్రకటనలో తెలిపింది. గత నెలలో నాసిక్ ప్లాంటులో తయారు చేసిన 600 డీజిల్ ఇంజిన్ వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కలుషితమైన ఇంధనం కారణంగా ఇంజిన్ భాగాలు త్వరగా డ్యామేజ్ అవుతున్నట్లు గమనించిన తర్వాత వాహనాలను తనిఖీ చేసి వాటి భాగంలో కొత్తవి రీప్లేస్ చేస్తున్నట్లు పేర్కొంది. -
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి..
జైపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజస్థాన్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, కుండ పోత వర్షం కారణంగా.. సవాయిమాధోపూర్ జిల్లాలో రెండు వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ విషాదం సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సవాయి మాధోపూర్ జిల్లాకు చెందిన పప్పూలాల్ తన పిల్లలు, బంధువులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వర్షం ప్రారంభమైంది. దీంతో ఇంటికి తిరుగుప్రయాణమయ్యేటప్పుడు నీటి ప్రవాహం పెరిగింది. కారు అదుపుతప్పి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మాన్సింగ్ (13), రౌనక్ (9) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వారికోసం ఎంత వెతికిన లాభం లేకుండా పోయింది. అయితే, పప్పూలాల్, అతని బంధువులను విపత్తు నిర్వహణ అధికారులు రక్షించారు. ఆ తర్వాత వారు కొంత దూరంలో పొదల్లో మైనర్ బాలలు చిక్కుకుని విగత జీవులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా, మరోఘటనలో.. జైరా నుంచి టాంక్కు గీతాదేవి (42) అనే మహిళ మృత దేహన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో గీతాదేవి కొడుకు అంకిత్ (12), ఆమె భర్త రామ్జీలాల్ (45) ప్రయాణిస్తున్నారు. నీటి ఉధృతి కారణంగా అంబులెన్స్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిలో ఆమె కుమారుడు అంకిత్ మరణించగా, ఆమె భర్త గల్లంతయ్యారు. కాగా, అంబులెన్స్ డ్రైవర్, ఆమె బంధులువులు అద్దాలు పగులకొట్టి ప్రాణాలతో బయటపడ్డారని బరౌని పోలీస్ అధికారి దాతర్ సింగ్ పేర్కొన్నారు. -
పెరిగిన ఇంధన ధరలు, ప్రత్యామ్నాయంగా ప్రజల చూపు వాటి వైపు
సాక్షి, సిటీబ్యూరో: బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో నగరవాసులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. నెల రోజులుగా గ్రేటర్లో ఈ వాహనాల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు, 3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైతంఈ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఇంధన ధరల మోతతో... కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతుండడంతో జనం దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. గత నెల రోజులుగా సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్ వాహనషోరూమ్ నిర్వాహకులు ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది. స్పష్టత లేని 2 శాతం పన్ను... ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద కొన్ని వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. కానీ రవాణాశాఖ కొంతకాలంగా రెండో బండిపైన 2 శాతం అదనంగా పన్ను వసూలు చేస్తోంది. అంటే ఒకే వ్యక్తి తన పేరిట అప్పటికే ఒక వాహనం ఉండి మరో వాహనాన్ని కొత్తగా కొనుగోలు చేసినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపును ఇచ్చినప్పటికీ రెండో వాహనం నిబంధనపైన మాత్రం రవాణాశాఖ స్పష్టతను ఇవ్వలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద ఇప్పుడు మినహాయింపునిచ్చినా భవిష్యత్తులో అదనపు పన్నుల మోత తప్పకపోవచ్చేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. చార్జింగ్ కేంద్రాలు ఉంటే... ► ఒకసారి బైక్‌లు చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ► ప్రస్తుతం నగరంలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల వాహనదారులు ఇంటి వద్ద చార్జింగ్ చేసుకొని బయలుదేరుతున్నారు. కానీ నిర్ధేశిత దూరం కంటే ఎక్కువ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి మరోసారి చార్జింగ్ చేసుకోవలసి వస్తోంది. – చార్జింగ్ కేంద్రాల కొరత వల్లనే కార్లు, ఆటోలు, తదితర వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ► అన్ని ప్రధాన కూడళ్లు, బంకులు, సూపర్మార్కెట్లు, మాల్స్ తదితర కేంద్రాల్లో తప్పనిసరిగా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2018లోనే రవాణాశాఖ సూచించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, కొన్ని ఆర్టీసీ బస్‌డిపోలు, తదితర చోట్ల మినహా చార్జింగ్ కేంద్రాలు లేవు. పైగా ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రమే చార్జింగ్ సదుపాయం ఉంది. మిగతా చోట్ల సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ► ఈటో వంటి ఆటోరిక్షా సంస్థలు తమ వాహనాల అమ్మకాలు పెరిగితే విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను స్వయంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ప్రయాణించేలా టోల్ ప్లాజా దగ్గర రద్దీ సమయంలో కూడా వాహనదారులకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఇలా లైన్ పొడవు 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు అని కేంద్రం తెలిపింది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం తేవడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి రూల్స్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెంటనే వెళ్లిపోవచ్చు. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి. దీన్ని మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దేశంలో రాబోయే 10 సంవత్సరాలలో పెరగబోయే వాహనాల సంఖ్యకు అనుగుణంగా రాబోయే టోల్ ప్లాజాల డిజైన్ చేపట్టాలని కేంద్రం తెలిపింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
సాక్షి, అమరావతి/గరికపాడు(జగ్గయ్యపేట)/దాచేపల్లి(గురజాల): కోవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్ (అనుమతి) తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇకనుంచి తెలంగాణ ఈ పాస్‌లు ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెక్‌పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు సడలించినప్పటికీ ఆ సమయంలో వచ్చిన వాహనాలను ఎందుకు అనుమతించడంలేదంటూ పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో లాక్డౌన్ సడలింపు ఉందని పాస్‌లు లేకుండా భారీగా వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణాజిల్లా సరిహద్దు గరికపాడు వద్ద జాతీయరహదారిపై చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుంటూరు జిల్లాలో సరిహద్దు పొందుగల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. గంటల తరబడి ఎదురుచూసినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనదారులు వెనుదిరిగారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటినుంచి అంబులెన్సులను నిరంతరాయంగా తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే గూడ్స్ (సరుకుల) వాహనాలకు అనుమతి ఇచ్చారు. తర్వాత సరుకుల వాహనాలను కూడా నిలిపేశారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సరుకుల డెలివరీ సర్వీసుకు మాత్రం అనుమతి ఇచ్చారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటేశ్వరరావు, పొందుగల చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఐ బాలనాగిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. -
వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు
సాక్షి, గుంటూరు: రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. జిల్లాలో కొందరు ముఠాలుగా ఏర్పడి ఆపత్కాలంలో భరోసా ఇచ్చే వాహన బీమాల్లో నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం అనుమానం రాకుండా నకిలీ బీమా సర్టిఫికెట్ల వ్యవహారం సాగిపోతోంది. గత ఏడాది అక్టోబర్ రెండో తేదీ ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ వంతెనపై నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఢీ కొట్టారు. ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల బంధువులు బీమా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. కారంపూడికి చెందిన లారీ యజమాని వసంతవరపు శ్రీనివాసులు సమర్పించిన బీమా పత్రాల్లోని పాలసీ వివరాలను బీమా కంపెనీకి పంపగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో బీమా కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ బీమా సృష్టిలో ప్రకాశం జిల్లా కురిచేడుకు మండలానికి చెందిన అక్కలూరి గాందీ, గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వాహన కన్సల్టెన్సీ నిర్వాహకుడు షేక్ గౌస్‌బాషా, పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన వెంకటకృష్ణ, నరసరావుపేటకు చెందిన సయ్యద్ మస్తాన్‌షరీఫ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతోపాటు, ఈ ముఠా 200 వరకూ నకిలీ బీమా సరి్టఫికెట్లు సృష్టించారని విచారణలో వెల్లడైంది. చాపకింద నీరులా నకిలీ దందా జిల్లాలోని ప్రైవేట్ వాహన ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు, వాహన కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఆర్టీఏ ప్రైవేట్ ఏజెంట్లు కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ బీమా దందాను చాపకింద నీరులా సాగిస్తున్నారు. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఆ సంస్థల ప్రమేయం లేకుండా ఆయా సంస్థల పేరిట నకిలీ బీమా సర్టిఫికెట్లు తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియం కంటే తక్కువ ధరకే ఈ సరి్టఫికెట్లు ఇస్తూ నకిలీ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో వాహన, రవాణా కన్సల్టెన్సీ ఏజెన్సీలు 450 వరకూ ఉన్నాయి. నెలలో జిల్లా వ్యాప్తంగా సగటున వెయ్యి నుంచి 1500 వాహనాల విక్రయాలు జరుగుతాయి. ఇలా చేస్తారు.. నకిలీ బీమా పాలసీలు తయారు చేసేందుకు బీమా సంస్థలు జారీ చేసిన వాహన బీమా పాలసీలనే కాపీ చేస్తారు. అసలువాటితో ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ బీమా పాలసీ సర్టిఫికెట్లను తయారుచేస్తారు. ఇలా జారీ చేసిన నకిలీ పాలసీలే కస్టమర్లకు, ఆర్టీఓకు సమరి్పస్తారు. కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాలు, ఫోర్ వీలర్లకు మూడేళ్ల దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమాను ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏ) తప్పనిసరి చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారు అంతకన్నా తక్కువ సమయానికి పాలసీ తీసుకోవడానికి వీలు లేదు. ఇది వాహన యజమానులకు భారం కావడం నకిలీ బీమా చేయించే వారికి మంచి అవకాశంగా మారింది. తక్కువ ప్రీమియంతో నకిలీ పాలసీలను అంటగట్టి వాహన యజమానులను దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బీమా పాలసీలపై అవగాహన లేమిని నకిలీ బీమా ముఠాలు సొమ్ముచేసుకుంటున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ రెన్యూవల్ సమయంలో సమరి్పంచిన బీమా పాలసీ వివరాలు సరైనవా? కాదా? అని విచారించే వెసులుబాటును ఐఆర్డీఏ రవాణా శాఖకు ఇవ్వలేదు. దీంతో వాహనదారులు సమరి్పంచిన పత్రాల ఆధారంగా నమ్మకంపై రవాణా శాఖ అధికారులు రిజి్రస్టేషన్లు చేస్తున్నారు. అనుమానం వచ్చిన సందర్భంలో సదరు వాహన బీమా సంస్థలను సంప్రదించి ఆరా తీస్తున్నారు. చైతన్యంతోనే నకిలీలకు చెక్ ►పుట్టగొడుగుల్లా బీమా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ బీమా సంస్థలను మాత్రమే పాలసీల కోసం ఆశ్రయించాలి. బీమా సంస్థల నుంచి గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దే బీమా చేయించాలి. ►బీమా పాలసీ తీసుకున్నప్పుడే కస్టమర్లు సంబంధిత బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, ఈ–మెయిల్‌కు సందేశం పంపి తమ పాలసీ వివరాలను ధ్రువీకరించుకోవాలి. ►బీమా కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా ఈ వివరాలు ధ్రువీకరించుకోవచ్చు. ►చెల్లించిన ప్రీమియానికి సంబంధిత కంపెనీ లోగో ముద్రించి ఉన్న అసలు రసీదును తప్పక తీసుకోవాలి. ►బీమా పాలసీలు ఇప్పుడు క్యుఆర్ కోడ్‌తో వస్తున్నాయి. క్యూఆర్ కోడ్ ఆధారంగా పాలసీ స్వభావం, అసలో నకిలీనో తెలుసుకోవచ్చు. ►బీమా చేయించుకునే ముందే కొంత సమయాన్ని వెచ్చించి పాలసీ వివరాలన్నీ చదవాలి. ఆపాలసీ ఎంత కవరేజీ ఇస్తున్నదీ తెలుసుకోవాలి. ►బీమా కంపెనీకి ఆన్లైన్లో క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ఉపయోగించి నేరుగా ప్రీమియం చెల్లించాలి. మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు వాహనదారులు బీమా పాలసీలు చేయించుకునేందుకు కన్సల్టెన్సీ, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మొద్దు. మీ అవగాహన లేమి, అమాయకత్వాన్ని వాళ్లు సొమ్ము చేసుకుని నకిలీ పాలసీలు అంటగడతారు. బీమా పొందేముందు సంబంధిత సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి లేదా ఫోన్ ద్వారా సంప్రదించి పాలసీ వివరాలు తెలుసుకోవాలి. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు చదవండి: తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు -
ఈ నగరానికేమైంది.. జంక్షన్ జామాయే.. కోట్లేమాయే
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2011లో రూ.10 కోట్లు. ఏడాదికే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) పేరుతో మరో రూ.66.5 కోట్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి రూ.100 కోట్లకు పైగా కేటాయింపు...రాజధానిలో గడిచిన 11 ఏళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ఆ వ్యవస్థ ఆధునీకరణ కోసం వెచ్చించిన మొత్తాలివి. ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా నగర వాసికి ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. ‘ప్రాజెక్ట్ 100 డేస్’ కింద పదేళ్ల క్రితం రూ.10 కోట్లు కేటా యించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.100 కోట్లకు పైగా మంజూరు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. చాలాచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ఏర్పాటు చేసినవి ప్రారంభించకపోవడం, కీలక జంక్షన్లలో సైతం రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయకుండా పోవడం వంటి కారణాలతో నగరంలో వాహన ప్రయాణం నరకయాతనను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ‘వంద రోజులు’ ఓ ఫ్లాప్ ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉం డగా ‘ప్రాజెక్ట్ 100 డేస్’తో ఓ పథకం ప్రకటిం చారు. నగర రూపురేఖల్ని 100 రోజుల్లో మార్చాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ విభాగానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ వీటిని సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరించడానికి వెచ్చించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో నగర వ్యాప్తంగా ఉన్న 150 జంక్షన్లలోని సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.7.5 కోట్లు, 30 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి మరో రూ.2.5 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల్ని గరిష్టంగా మూడు నెలల్లోనే ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. హెచ్–ట్రిమ్స్తోనూ ఒరిగింది లేదు..తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) అందుబాటులోకి తీసుకురావాలని 2012లో నిర్ణయించారు. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. కాగా అప్పటికి సిటీలో ఉన్న 168 జంక్షన్లలోని సిగ్నల్స్ హైటెక్ హంగులు సంతరించుకోవడంతో పాటు 53 జంక్షన్లలో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.5 కోట్లను కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహకారం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (యాస్కీ) ప్రణాళికలతో అమలైన ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సాంకేతిక సహకారం అందించింది. సిగ్నల్స్ ఏర్పాటులో ప్రముఖ సంస్థగా పేరున్న బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. 2012 ఆగస్టు 18న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో బెల్ ఒప్పందం కుదుర్చుకుంది. గరిష్టంగా ఏడాది కాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అప్పట్లో గడువు నిర్దేశించారు. అప్పటి ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు బెల్ ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా... తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే ప్రాజెక్ట్ వ్యయంలో 3 శాతం అధికంగా చెల్లించేలా నిర్ణయించారు. అత్యాధునిక సౌకర్యాలు, నిఘా వ్యవస్థలతో కూడిన ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరంలో ప్రయాణ వేగంలో 50 శాతం పెరుగుదల , రోడ్ నెట్వర్క్ ఆలస్యంలో 35 శాతం, ఇంధన వినియోగంలో 22 శాతం తగ్గుదల వస్తుందని యాస్కీ అంచనా వేసింది. దాదాపు రెండేళ్లకు పైగా సాగిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా నగరానికి ఒరిగిందంటూ ఏమీ కనిపించక పోగా ట్రాఫిక్ కష్టాలు యధావిధిగానే కొనసాగడం గమనార్హం. ఐదేళ్లుగా ఐటీఎంఎస్ ట్రయల్ రన్! ‘ఉల్లంఘనుల్లో’ క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసేవారికి చెక్ చెప్పడం, వాహనచోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్లనేవి లేకుండా చేయడం... లక్ష్యాలుగా అత్యాధునిక ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం)కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో తొలి దశలో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో ఈ వ్యవస్థ అమలు చేయాలని భావించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ) నుంచే ఉంటుందని ప్రకటించారు. రాత్రి వేళల్లోనూ పనిచేసే, 16 మెగా పిక్సెల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐటీఎంఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. దాదాపు ఐదేళ్లుగా ట్రయల్ రన్లకు మాత్రమే ఇది పరిమితమైంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్), డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్మెంట్ (డీబీపీఏ), ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు (ఈసీబీ)... ఇలా ఉండాల్సిన హంగులు, ఆర్భాటాల్లో ఇప్పటివరకు కేవలం సగమే పని చేస్తుండటం శోచనీయం. తాజాగా మరో రూ.60 కోట్లు .. ఇప్పటివరకు రూ.170 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా రోడ్డు మధ్యలో నిల్చుని, అటూ ఇటూ తిరుగుతూ, నోటిలో ఉన్న ఈల ఊదుతూ, చేత్తోనో లేదా చేతిలో ఉన్న పనిచేయని కర్ర (ఎలక్ట్రానిక్) తోనో వాహనాలకు దారి చూపించాల్సిన పరిస్థితి ట్రాఫిక్ పోలీసులకు.. ఏ మాత్రం అదుపు తప్పినా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన దుస్థితి నగరవాసులకు తప్పట్లేదు. గతంలో ఈ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ‘బెల్’ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం, కొత్తగా టెండర్ దక్కించుకున్న ఐబీఐ సంస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తాజాగా సిగ్నల్స్ ఆధునీకరణ కోసం ఐబీఐ–ఉస్మానియూ యూనివర్శిటీ కలసి పని చేసేలా జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం ఈ ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడటం, సిగ్నల్స్ ఆధునీకరణ, సాఫీగా ప్రయాణం సాగేలా చేయడం వంటి పాత లక్ష్యాలతోనే కూడిన ఈ ప్రాజెక్టు అమలుకు ఓయూ ఈఈఈ విభాగం సహకరిస్తుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇక ఈ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. మా పరిస్థితి దారుణంగా ఉంటోంది ఇప్పటికే వేసవి తాపం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో ట్రాఫిక్ పోస్టులో కూర్చుని పని చేయడమే కష్టమే. అలాంటిది కొన్ని సిగ్నల్స్ పని చేయకపోవడంతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. రోడ్డుపై, రహదారికి మధ్యలో, సిగ్నల్స్ వద్ద నిల్చుని స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది. ఫలితంగా విధులు ముగిసే సమయానికి మా పరిస్థితి దారుణంగా తయారవుతోంది. – పశ్చిమ మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్ -
అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్‌లోనే!
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల జాబితా విడుదలైంది. దీనిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అత్యంత కలుషితమైనవిగా గుర్తించారు. దీనిలో 22 నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం. కాగా, స్విస్ అనే సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్ట్ - 2020ను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా చైనాలోని జిన్జియాంగ్ తొలి స్థానంలో నిలిచింది. కాగా, దీని తర్వాత మిగతా 9 నగరాలు మనదేశానికి చెందినవే. ఇక..రెండో స్థానంలో ఘజియాబాద్, మూడో స్థానంలో బులంద్‌షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కలుషిత రాజధాని నగరాలలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. వీటి తర్వాత బిస్రఖ్ జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా మరియు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్, రాజస్థాన్‌లోని భీవారీ, జింద్ , హిసార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్ మరియు ధారుహేరా, మరియు బీహార్‌లోని ముజఫర్‌పూర్ లు నిలిచాయి. అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 2019 నుంచి 2020ల మధ్య వాయునాణ్యత 15 శాతంమెరుగుపడింది. ఈ రిపోర్ట్ 106 దేశాల నుంచి వచ్చిన పీయమ్ 2.5 డేటా ఆధారంగా తీసుకున్నారు. వీటిని ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తాయి. భారత్‌లో ప్రధానంగా వంటచెరకు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చేపోగ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అయితే..దీనిపై గ్రీన్ ఇండియా క్యాంపెయినర్ అవినాష చంచల్ మాట్లాడుతూ..లాక్డౌన్ కాలంలో వాయునాణ్యత స్వల్పంగా పెరిగిందని అన్నారు. కాగా, ప్రభుత్వాలు ఎలక్టిక్ వాహనాలను , సైక్లింగ్, వాకింగ్, ప్రజారవాణాను ప్రొత్సహించాలని అన్నారు. అయితే, పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో, ఆరోగ్యసమస్యలు దూరమవుతాయని చంచల్ అన్నారు. ప్రజలు పర్యావరణాన్ని, కాపాడుకొంటు, కాలుష్యాన్ని తగ్గించుకొవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్సీఈవో ఫ్రాంక్ హమ్స్ తెలిపారు. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
ఎంతటి వాహనాన్నిఐనా రిపేర్ చేస్తున్న:ఆదిలక్ష్మి గ్యారేజ్
-
రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే బాదుడే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా అమల్లోకి రానుంది. వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఫాస్టాగ్ తప్పనిసరి వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ వినియోగంతో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర సమయం వృథా అయ్యే అవకాశం ఉండదు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫాస్టాగ్ రీఛార్జ్‌ను ఆన్లైన్ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు. -
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
టెక్సాస్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) చెందిన వాహనాలు 15 ఏళ్లు పైబడిన పక్షంలో వాటికి కూడా స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనికి ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు స్క్రాపేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా మోటార్ వాహనాల చట్టానికి సవరణలను 2019లో ప్రభుత్వం ప్రతిపాదించింది. -
ఇళ్ల ముందుకే చేపలు, రొయ్యలు
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల పల్లెవాసులకు సైతం ఏరోజుకారోజు తాజా చేపలు, రొయ్యలను సరసమైన ధరలకు అందుబాటులో తీసుకెళ్లాలని సంకల్పించింది. తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు ఇంటివద్దకు తీసుకెళ్తున్న తీరులో మొబైల్ వాహనాల్లో చేపలు, రొయ్యలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం దండిగా ఉండే మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడం ద్వారా ప్రజల్లో వ్యాధినిరోధకశక్తిని పెంపొందింప చేయాలని, మత్స్యకారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో తలసరి వినియోగం ఎనిమిది కిలోలే.. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి. తీరం వెంబడి 31,147 ఫిషింగ్ క్రాప్ట్స్ ద్వారా సముద్ర మత్స్యవేట సాగుతోంది. రాష్ట్రంలో 2,64,774 ఎకరాల్లో చేపలు, 2,25,406 ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు కలిపి ఏటా 31,50,486 మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తాయి. వీటిలో 24,02,610 టన్నులు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, 3,49,842 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన 3,98,034 టన్నులు (12.63 శాతం) మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల తలసరి వినియోగం అంతర్జాతీయంగా 20 నుంచి 30 కిలోలు, జాతీయంగా 7.5 నుంచి 10 కిలోలు ఉండగా మన రాష్ట్రంలో 8 కిలోలు మాత్రమే. మన రాష్ట్రంలో తలసరి వినియోగాన్ని 20 కిలోలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో 25 హబ్‌లు చేపలు, రొయ్యల స్థానిక వినియోగం పెంపునకు రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి హబ్ పరిధిలో రూ.20 లక్షల విలువైన ఐదు, రూ.10 లక్షల విలువైన 10, రూ.మూడులక్షల విలువైన 10 వంతున మొత్తం 25 స్పోక్స్ (కియోస్క్‌లు) ఏర్పాటు చేస్తారు. రూ.75 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో గ్రామ/వార్డు సచివాలయానికి ఒకటి వంతున ఆక్వా ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలు (మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తారు. తొలుత డిమాండ్ ఉన్న చోట వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి అక్కడి అమ్మకాలను బట్టి దశలవారీ విస్తరిస్తారు. హబ్‌లతో పాటు ఈ కేంద్రాలకు బ్రాండింగ్ చేయడంతో పాటు నాణ్యమైన తాజా చేపలు, రొయ్యలను ఒకేచోట నిర్దేశించిన ధరలకు విక్రయించేలా ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న జనతా బజార్ల ద్వారా మారుమూల పల్లె వాసులకు సైతం కోరుకున్న తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. ఒక్కో హబ్ పరిధిలో 200 మందికి ఉపాధి హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆక్వా రైతుల నుంచి సేకరించే మత్స్య ఉత్పత్తులను జిల్లాస్థాయిలో ఏర్పాటైన ఆక్వా ఫార్మర్స్ సొసైటీ ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఆక్వా హబ్‌లకు చేరవేస్తారు అక్కడినుంచి ప్రధాన నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసే స్పోక్స్‌కు, మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లకు తరలించి.. బతికిన, తాజా చేపలు, రొయ్యలు విక్రయిస్తారు. తద్వారా ప్రతి హబ్ పరిధిలో కనీసం 200 మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు బ్యాంకు లింకేజ్ మినీ ఫిష్ వెండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రూ.56,250 చొప్పున బ్యాంకు లింకేజ్ కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా.. నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,301 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,060 మంది చేయూత లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీరితోపాటు ఇతరులెవరైనా ఆసక్తి చూపితే బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణపరపతి కల్పిస్తారు. -
కదిలిన సంక్షేమ రథ చక్రాలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో : ప్రజా పంపిణీ వ్యవçస్థలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. పేదల గడప వద్దకే వెళ్లి సరుకులు చేరవేసేలా నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా వచ్చే నెల నుండి వారి ఇంటికే చేరనున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,503 వాహనాలకు సీఎం వైఎస్ జగన్ జెండా ఊపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 9,260 జగన్నాథ రథాల చక్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ముందుకు కదిలాయి. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు వీలుగా, తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాహనదారులందరికీ సీఎం నమస్కరిస్తూ.. విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన 2,503 వాహనదారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన వేదికపై ఉండి కుయ్.. కుయ్.. మంటూ హారన్ వినిపిస్తూ ముందుకెళ్లిన తొలి వాహనం నుండి చివరి వాహనం వరకు సీఎం నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. వాహనదారులు రెట్టింపు ఉత్సాహంతో ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ముందుకు కదలడం కన్పించింది. నాణ్యమైన బియ్యం పంపిణీతో ఏటా రూ.830 కోట్ల అదనపు భారం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.830 కోట్లు అదనపు భారం పడనుంది. అదేవిధంగా ఇంటింటా సరుకుల పంపిణీకి కొనుగోలు చేసిన 9,260 వాహనాలకు రూ.539 కోట్లు ఖర్చు చేసి పేద వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లైంది. ఈ వాహనాలను నిరుద్యోగులకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. వాహనదారులకు ప్రతి నెలా 18 రోజుల పని దినాలు కల్పిస్తూ ఆరేళ్ల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాహనాల కేటాయింపులో పారదర్శకత వాహనాల కేటాయింపులో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించింది. ఇందులో భాగంగా వర్గాల వారీగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ నుండి 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్వార్డ్) కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. యూనిట్ ధర రూ.5,81,000 కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందించింది. బ్యాంకు లింకేజి ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటాగా కేవలం రూ.58 వేలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నవ శకం జిల్లాల్లో వాహనాలు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సాక్షి నెట్వర్క్: ప్రజా పంపిణీ వ్యవçస్థలో నవ శకం దిశగా అడుగులు పడ్డాయి. పేదల గడప వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించే మినీ ట్రక్కులను గురువారం విజయవాడలో సీఎం వైఎస్ జగన్, వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వందలాది మినీ ట్రక్కులు ఆయా జిల్లా కేంద్రాల్లో ఒక్కసారిగా రోడ్లపై వరుసగా పరుగు పెట్టడం కనువిందు చేసింది. బారులు తీరిన వాహనాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ట్రక్కుల మంజూరు ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది. జగనన్నకు కోటి వందనాలు నాకు భర్త, ఇద్దరు పిల్లలు. అత్తమామలతో కలసి ఉంటున్నాము. నా భర్త ఆటో నడుపుతుంటాడు. నాకు కూడా ఆటో నడపడం నేర్పించాడు. ఆ తర్వాత నేను కారు నడపడం కూడా నేర్చుకున్నాను. నా భర్త పోడు వ్యవసాయానికి వెళ్లినప్పుడు నేను ఉదయమే ఇంటి పనులు ముగించుకుని ఆటో నడిపేందుకు వెళుతుంటాను. ఇప్పుడు నాకు ఉచిత రేషన్ సరుకుల వాహనం మంజూరైంది. శ్రీకాకుళంలో ఇవాళ ఈ వాహనాన్ని నడుపుకుంటూ వెళుతుండటం ఆనందంగా ఉంది. బతుకుపై మరింత భరోసా కలిగింది. ఇందుకు కారణమైన సీఎం జగనన్నకు కోటి వందనాలు. – సవర సుహాసిని, ఎస్.బాణాపురం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా రేషన్ పంపిణీ వాహనంలో తూకాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ రేషన్ çసరుకుల పంపిణీ వాహనాల తాళాన్ని డ్రైవర్లకు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు తదితరులు. -
రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
-
రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. -
‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిబద్దతతో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, అత్యంత సాంకేతికతతో కూడిన సామర్థ్యం ఎస్‌పీఎస్‌డీఆర్‌ఎఫ్ వాహనాల్లో ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పడవ, రోడ్డు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లు, భవనాలు కూలినప్పుడు రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ముంబాయి తర్వాత దేశంలో మన రాష్ట్రంలోనే ఈ వాహనాలు వచ్చాయని పేర్కొన్నారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) 2020లో కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత పరిచి 2021లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్రం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఇంటివద్దే వేడుకలు జరుపుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.(చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) -
అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. చదవండి : న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని అన్నారు. -
అక్కడ వాహనదారుల ఆటలు సాగవు!
సాక్షి, న్యూఢిల్లీ :రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి మనం వాహనాలను నడిపినా, పరిమితికి మించి వేగంగా తీసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసినా మన వాహనాల నెంబర్ ప్లేట్లను ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసులు మనకు జరిమానాలు విధించడం, వాటిని మనం ఆన్లైన్లో చూసుకొని బాధ పడడం, తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానాలు చెల్లించడం మనకు కొత్త కాదు. మన పోలీసులకు ఉన్నత స్థాయి హెచ్ డీ కెమేరాలు లేకపోవడం వల్ల రోడ్డు నిబంధనలను అతిక్రమించే వారు రాత్రిపూట ‘రాంగ్ సైడ్’లో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. (మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’) అలాంటి పరిస్థితి బ్రిటీష్ పోలీసులకు కూడా తరచూ ఎదురవుతుండడంతో వారు ‘ట్రూకామ్–2’ జనరేషన్ స్పీడ్ కెమేరాలను తెప్పించుకున్నారు. పగలే కాదు రాత్రి కూడా ఆటో ఫోకస్‌తో వాహనాల నెంబర్ ప్లేట్లను స్పష్టంగా ఫొటోతీసి పంపించే సామర్థ్యం ఈ కెమేరాలకు ఉంది. అంతేకాదు, నిమిషానికి 750 మీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా సునాయాసంగా పట్టుకోగల సామర్థ్యం కూడా వీటికి ఉంది. వీటి ధర కూడా అదిరిపోతుంది. ఒక్కో కెమేరాకు పదివేల పౌండ్లు (దాదాపు 9.80 లక్షల రూపాయలు). వీటిని ‘బ్లూ స్పీడ్ గన్స్’గా వ్యవహరిస్తున్నారు. అందుకని నార్త్‌అంబ్రియా, వార్విక్షైర్ ట్రాఫిక్ పోలీసులు వీటిని కొనగోలు చేశారు. వీటి వల్ల వేగంగా దూసుకెళుతున్న వాహనాలను వెంటపడి, వెంటపడి పట్టుకోవాల్సిన పనిలేకుండా పోతుందని పోలీసులు అంటున్నారు. ఫోటోగన్లా పనిచేసే ఈ కెమేరాల ద్వారా నిబంధనలకు నీళ్లొదులుతున్న వాహనాలను, వాటి ద్వారా వాటి యజమానులను సులభంగానే గుర్తించే అవకాశం దొరికిందని అక్కడి పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో మనలోని ‘రాంగ్ సైడర్స్’ భయపడాల్సిన అవసరం లేదు. కెమేరాల కోసం అంత డబ్బులు మన పోలీసులు పెట్టలేరేమో!(బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) -
దక్షిణ మధ్య రైల్వే: జహీరాబాద్ టు త్రిపుర!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే తొలిసారి 3,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రానికి వాణిజ్య రవాణా వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అంతదూరంలోని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా చేయలేదు. దేశవ్యాప్తంగా సరుకు రవాణాను మరింత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ప్రారంభించి కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి తాజాగా మినీ ట్రక్కులు, గూడ్స్ ఆటోలతో కూడిన లోడ్‌ను ఓ ఫ్రైట్ రేక్ ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురకు రవాణా చేసింది. రోడ్ ట్రాన్స్‌పోర్టుపై భారం తగ్గింపు దూర ప్రాంతాలకు ఇప్పటివరకు వాణిజ్యపరంగా సరుకు రవాణా రోడ్డు మార్గం ద్వారానే ఎక్కువగా సాగుతోంది. దీన్ని నియంత్రించటం ద్వారా రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించటంతో పాటు రైలు రవాణాకు లాభాలు పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రైల్వేకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల (బీడీయూ)ను ఏర్పాటు చేసుకుంది. ఆ యూనిట్లు పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ బిజినెస్ ఆర్డర్లు తెస్తున్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ యూనిట్లపై దృష్టి సారించాయి. ఇక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య వాహనాలు ఉత్పత్తవుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలుతున్నాయి. వాటిని దేశంలో ఏ ప్రాంతానికైనా తరలించేందుకు ప్రత్యేక రేక్స్ ఏర్పాటు చేస్తామన్న హామీతో ఆయా యూనిట్లు రైల్వేకు ఆర్డర్లు ఇస్తున్నాయి. వసతులు కల్పించడంతో.. జహీరాబాద్‌లోని గూడ్స్ స్టేషన్‌ను ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. ఇక్కడ సరైన వసతులు లేక గతేడాది అతికష్టం మీద ఒకే ఒక రేక్ (ఒక గూడ్స్ రైలు) మాత్రమే లోడైంది. ఇటీవల వసతులు కల్పించటంతో గత ఏప్రిల్ నుంచి ఏకంగా 9 రేక్స్‌ల ద్వారా జహీరాబాద్ నుంచి 2,500 కి.మీ. దూరంలో ఉన్న అస్సాంలోని ఛాంగ్సరీకి వాణిజ్య వాహనాలను తరలించింది. అయితే అంతకంటే 1,100 కి.మీ. దూరంలో ఉన్న త్రిపురలోని జిరానియాకు వాహనాలు తరలించాలని ఆ కంపెనీ కోరింది. అంతదూరం తరలించే అనుమతి లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా అనుమతి తీసుకుని తాజాగా ఓ రేక్ ద్వారా వాణిజ్య వాహనాలను తరలించటం విశేషం. ఇందులో త్రిపురలోని జిరానియా స్టేషన్‌కు 69 మినీ ట్రక్కులు, గూడ్సు ఆటోలతో కూడిన 15 వ్యాగన్లు, అస్సాంలోని ఛాంగ్సరీకి 42 వాహనాలతో కూడిన 10 వ్యాగన్లు కలిపి ఓ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే తరలించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారి 3,600 కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్‌కు వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్డర్లు అధికంగా పొందాలని సూచించారు. -
ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భారీ, చిన్నతరహా వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లు డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకపోతే వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. ఏపీ పరిధిలోని జాతీయ రహదారులపై 42 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 75 శాతం ఫాస్టాగ్ లైన్లు, 25 శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రహదారులపైనా 16 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ఖర్చును కేంద్రం 70 శాతం భరిస్తుందని గతంలోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర రహదారులపై ఈటీసీ మార్గాలను ఏర్పాటు చేయనుంది. -
అలర్ట్.. జనవరి నుంచి ఇది మస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్ పునరుద్దరించిన తర్వాతే ఫిట్మెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరైంది. -
6 నెలల్లో 43,958 కేసులు
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రాజీలేకుండా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 43,958 కేసులు నమోదు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు అత్యధికంగా విశాఖ జిల్లాలో 11,602, తరువాత శ్రీకాకుళం జిల్లాలో 6,772 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా 242 కేసులు విజయనగరం జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 11,686 కేసులను నమోదు చేసింది. రోజుకు 8 గంటలకుపైగా పనిచేసిన డ్రైవర్ల మీద కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ వాహనాలపైన కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గినట్లు అధికారవర్గాలు తెలిపాయి.