Dale Steyn
-
డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్టెయిన్ ప్రకటించాడు. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ సిస్టర్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ కోచ్‌గా మాత్రం కొనసాగనున్నట్లు స్టెయిన్ తెలిపాడు.ఐపీఎల్లో రెండేళ్ల పాటు బౌలింగ్ కోచ్‌గా పనిచేసే అవకాశమిచ్చినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్తో నా ప్రయాణం ముగించాలని నిర్ణయించుకున్నాను. అయితే దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఎ20లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో కలిసి పని చేయనున్నాను ఎక్స్‌లో స్టెయిన్ గన్ రాసుకొచ్చాడు.బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్..కాగా డేల్ స్టెయిన్ ఐపీఎల్-2024 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా మాజీ న్యూజిలాండ్ ఆల్-రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను ఎస్ఆర్హెచ్ నియమించింది.ఫ్రాంక్లిన్ హెడ్‌కోచ్ డేనియల్ వెట్టోరితో కలిసి పని చేశాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్‌ను ఈ న్యూజిలాండ్ దిగ్గజాలు ఫైనల్‌కు చేర్చారు. అయితే ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా తన బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిను రెగ్యూలర్ బౌలింగ్ కోచ్‌గా ఎస్ఆర్హెచ్ నియమించే అవకాశముంది.చదవండి: LLC 2024: యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో) -
ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అతడే: కేఎల్ రాహుల్
శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన కేఎల్ రాహుల్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో వరుసగా 37, 57 పరుగులు చేశాడు. అయితే, కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా-‘ఎ’ జట్టుకు ఓటమి తప్పలేదు.తదుపరి టెస్టు సిరీస్‌తో బిజీబెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా-‘బి’ చేతిలో ఇండియా- ‘ఎ’ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. సొంతగడ్డ మీద సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న మ్యాచ్‌లో అతడు భాగం కానున్నాడు. తాజా ఫామ్ దృష్ట్యా తుదిజట్టులోనూ ఈ వికెట్ కీపర్‌కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నంబర్ వన్ అతడేఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా-‘ఎ’ జట్టును వీడిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లను ఎంచుకోమని యూట్యూబర్ కోరగా.. విరాట్ కోహ్లికి అగ్రస్థానమిచ్చిన రాహుల్.. ఆ తర్వాతి స్థానాలకు వరుసగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజం, ట్రవిస్ హెడ్‌ను ఎంపిక చేసుకున్నాడు.అత్యుత్తమ బౌలర్ ఎవరంటే?ఇక ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ ఎవరంటూ సదరు యూట్యూబర్ ఆప్షన్లు ఇవ్వగా రాహుల్.. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ పేరు చెప్పాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు రెండో ర్యాంకు ఇచ్చిన రాహుల్.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మూడు, అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు నాలుగు, పాకిస్తాన్ యువ పేసర్ నసీం షా కు ఐదో ర్యాంకు ఇచ్చాడు.కాగా ప్రపంచంలోని నవతరం ఫాస్ట్బౌలర్లలో ప్రత్యేకమైన శైలితో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను కాదని కేఎల్ రాహుల్ స్టెయిన్ పేరు చెప్పడం అతడి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సదరు యూట్యూబర్ తానే ఆప్షన్లు ఇచ్చి రాహుల్‌ను పేర్లు ఎంచుకోమని చెప్పాడు. కాబట్టి.. ‘‘అతడి లిస్టులో బుమ్రా పేరు ఉందో లేదో రాహుల్‌కు తెలియదు. అందుకే అతడు స్టెయిన్‌ను ఎంచుకుని ఉండవచ్చు’’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా క్లాసీ రాహుల్ ఎంతో క్లాస్‌గా సమాధానాలు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
'బుమ్రా, బ్రెట్‌లీ కాదు.. క్రికెట్ చరిత్రలో అతడిదే బెస్ట్ యార్కర్'
ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో యార్కర్ల కింగ్ ఎవరంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రానే. రెప్పపాటులో తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బుమ్రా స్పెషల్. చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఇప్పటివరకు బుమ్రాలా యార్కర్ల వేసే బౌలర్‌ను చూడలేదని కితాబు ఇచ్చారు. కానీ దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టేయిన్ దృష్టిలో బెస్ట్ యార్కర్ల వేసే బౌలర్ బుమ్రా కాదట. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ వేసిన బౌలర్ ఎవరు? అన్న ప్రశ్నను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందుకు బదులుగా డేల్ స్టేయిన్.. 1999 వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ వేసిన యార్కర్ తన బెస్ట్ అంటూ సమధానమిచ్చాడు. అయితే స్టేయిన్ బుమ్రాను గానీ, ఆసీస్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్‌లీని గానీ ఎంచుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక స్టెయిన్ విషయానికి వస్తే.. తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన ఈ సఫారీ పేస్‌గన్ మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది.అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. 2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు. -
కోహ్లి ఇక ఆడకపోవచ్చు: సౌతాఫ్రికా దిగ్గజం
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియామకం పట్ల సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్లు జాక్వెస్ కలిస్, డేల్ స్టెయిన్ హర్షం వ్యక్తం చేశారు. దూకుడైన ఆటకు మారుపేరైన గౌతీ శిక్షకుడిగా కూడా ఆకట్టుకోగలడని ధీమా వ్యక్తం చేశారు.కాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో అతడి స్థానాన్ని బీసీసీఐ గంభీర్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.శ్రీలంకతో జూలై 26 నుంచి మొదలుకానున్న ద్వైపాక్షిక సిరీస్ నుంచి ఈ మాజీ ఓపెనర్ కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. అయితే, గంభీర్ రాకతో సీనియర్ ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవని.. భావి జట్టును తీర్చిదిద్దే క్రమంలో అతడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా రవీంద్ర జడేజా వంటి సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటివారినైనా పక్కనపెట్టేందుకు గంభీర్ వెనుకాడడని పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్‌ను నేను వీరాభిమానిని. అతడి దూకుడైన స్వభావం నాకెంతో ఇష్టం.కోహ్లి ఇక ఆడకపోవచ్చునేను ఎదుర్కొన్న అత్యంత దూకుడైన భారత ఆటగాళ్లలో అతడూ ఒకడు. డెస్సింగ్ రూంలోనూ అలాంటి వాతావరణమే ఉండాలని కోరుకుంటాడు.నాకు తెలిసి విరాట్ కోహ్లి వంటి కొంత మంది సీనియర్లు ఇక ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతాడని చెప్పలేను కానీ.. కచ్చితంగా కఠినంగానే ఉంటాడనిపిస్తోంది’’ అని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.ఇక జాక్వెస్ కలిస్ స్పందిస్తూ.. ‘‘గంభీర్‌ది క్రికెటింగ్ బ్రెయిన్. సరికొత్త వ్యూహాలు రచించగలడు. జట్టులో జోష్ నింపుతాడు. దూకుడుగా ఆడటం తనకు ఇష్టం. జట్టును కూడా అలాగే తయారు చేస్తాడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
డేల్ స్టెయిన్‌కే బౌలింగ్ పాఠాలు నేర్పిన కుర్రాడు... వీడియో
తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదేనేమో... ద క్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ తెలుసుగా.... ప్రపంచ క్రికెట్లో తిరుగులేని బౌలర్లలో ఒకడు. వేసిన బంతి బుల్లెట్ లా దూసుకుపోవాల్సిందే..వికెట్ తీయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది స్టెయిన్ బౌలింగ్. ఈ ప్రతిభే అతడికి అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తెచ్చిపెట్టింది కూడా. మరి.. ఇలాంటి బౌలర్‌కు ఓ కుర్రాడు బౌలింగ్ పాఠాలు చెబితే ఎలా ఉంటుంది? కిందనున్న వీడియో చూస్తే తెలుస్తుంది. 2021 ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న స్టెయిన్ ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్లలోజరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2024లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల షాపింగ్ మాల్స్‌లలో ఏర్పాటు చేసే నెట్ క్రికెట్ స్టాల్ వద్దకు స్టెయిన్ చేరుకున్నాడు. అక్కడున్న కుర్రాడికేమో స్టెయిన్ ఎవరో తెలియదు. అతడి గొప్పతనమూ ఆ కుర్రాడికి తెలియలేదు. అందరు కస్టమర్ల మాదిరిగానే క్రికెట్ ఆడేందుకు వచ్చాడనుకున్నాడు. బంతి ఎలా పట్టుకోవాలన్న దగ్గరి నుంచి మోచేయి వంచకుండా బౌల్ ఎలా చేయాలన్న అంశం వరకూ చాలా ‘మెళకువ’లను నేర్పే ప్రయత్నం చేశాడు. స్టెయిన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఏమీ తెలియనట్లే అమాయకుడిలా.. ఆ కుర్రాడు చెప్పిన వాటికల్లా తలూపాడు.. బంతి విసిరే సమయంలో మోచేతిని వంచకూడదని, ఓసారి బౌన్స్ అయితే స్టంప్స్ వరకు వెళ్లాలని ఆ కుర్రాడు సూచించినా అలాగే సర్ అన్నంత పని చేసి బౌలింగ్ చేశాడు. తెగ కష్టపడతూ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్టెయిన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవతలి వ్యక్తికి తను ఎవరో చెప్పకుండా హుందాగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు.ఎన్నో ఘనతలు..2004లో ఇంగ్లండ్ పై టెస్ట్ మ్యాచ్‌తో డేల్ స్టెయిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన డేల్ స్టెయిన్.. మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు.దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది. అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. భారత్‌తో 2010లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు.చదవండి: T20 WC 2024: పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్?I haven’t laughed this hard in a long time. Imagine giving bowling tips to Dale Steyn 😂😂😂😂😂 pic.twitter.com/idqw2jvW5n— simmi (@simmiareff) June 6, 2024 -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం భయపెట్టిన ఘనత హిట్‌మ్యాన్‌ది. వన్డే క్రికెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక మొనగాడు రోహిత్ శర్మనే. అటువంటి రోహిత్ శర్మ తన కెరీర్లో ఒక బౌలర్‌కు భయపడ్డాడట. అతడే దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్. రోహిత్ శర్మ తాజాగా దుబాయ్ ఐ 103.8 అనే ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న హిట్‌మ్యాన్‌కు ఎదురైంది. అందుకు బదులుగా రోహిత్ శర్మ.. డేల్ స్టెయిన్ అంటూ బదులిచ్చాడు."నేను నా కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. స్టేయిన్ ప్రత్యర్ధి జట్టులో ఉంటే నేను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు అతడి బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడిని. స్టెయిన్ అద్భుతమైన బౌలర్. అతడొక లెజెండ్. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అతడి బౌలింగ్‌లో ఆడటాన్ని ఆస్వాదిస్తానని" రోహిత్ పేర్కొన్నాడు. -
మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫలమై ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటర్‌గా వైఫల్యం.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం.. ప్రత్యర్థి పరుగులు రాబడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నపుడైనా బుమ్రాను బరిలోకి దించకపోవడం వంటివి ఇందుకు కారణం. ఇదంతా ఒక ఎత్తైతే రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత విషయాన్ని తేలిక చేసేలా హార్దిక్ పాండ్యా నవ్వుతూ మాట్లాడటం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు కూడా చిరాకు తెప్పించింది. తమ జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్ అని.. వారికి తానేమీ కొత్త నేర్పించాల్సిన అవసరం లేదనడం.. ఆటగాళ్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొనడం.. తానేదో కెప్టెన్‌గా అంతా సరిగ్గానే చేశానన్నట్లుగా మాట్లాడటం ఒకింత ఆగ్రహం కూడా తెప్పించాయి. ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘తమ మనసులో ఏముందో దానిని మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా ఆటగాళ్లు బయటికి చెప్పే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నా. మౌనంగా ఉంటూ.. అంతా బాగానే ఉందనే భావన కల్పించేలా రక్షణాత్మక ధోరణి అవలంభించకుండా కుండబద్దలు కొట్టాలి. తదుపరి ఓటమి. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థంలేని వాగుడు’’ అంటూ డేల్ స్టెయిన్ ఘాటు విమర్శలు చేశాడు. తన పోస్ట్‌లో నేరుగా హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తావించకపోయినా ఈ సౌతాఫ్రికా స్టార్ అతడిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఓటమి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడిన తర్వాత డేల్ స్టెయిన్ ఈ మేరకు ట్వీట్ చేయడం ఇందుకు కారణం. I really look forward to the day players might say what’s honestly on their mind. Instead we some how dumbed ourselves and our minds into saying the usual safe thing, lose the next game, smile and then repeat that nonsense again. 🙄 PS. Qdk, I love you — Dale Steyn (@DaleSteyn62) April 22, 2024 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు: ►వేదిక: సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్ ►టాస్: ముంబై.. బ్యాటింగ్ ►ముంబై స్కోరు: 179/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 183/1 (18.4) ►ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ముంబైపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సందీప్ శర్మ(5/18)- రాజస్తాన్ ►టాప్ స్కోరర్: యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104 నాటౌట్)- రాజస్తాన్. THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
ధనాధన్ ధోని కథ వేరు.. అందుకే కాస్త ముందుగానే: డేల్ స్టెయిన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీసీ టైటిళ్ల(3) వీరుడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతూ అభిమానుల అలరిస్తున్న తలా.. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ ఐపీఎల్-2024లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు. నిజానికి ధోనిని చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తుండగా.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అందులో నేనూ ఒకడినే అంటున్నాడు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్. ‘‘ఐపీఎల్‌తో ఇక్కడ మాత్రమే కాదు.. సౌతాఫ్రికాలో నాలాంటి ఎంతో మందికి ఎనలేని సంతోషాన్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను టీవీ ఎక్కువగా చూడను. అయితే, ఐపీఎల్ సమయంలో మాత్రం సీటుకు అతుక్కుపోయి మరీ కళ్లప్పగించి చూస్తుంటా. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ టీవీ పగిలిపోతుందని అంటూ ఉంటుంది. ఎందుకంటూ ఎప్పుడూ అది.. ఐపీఎల్‌కు స్టక్ అయిపోయింది ఉంటుందిలెండి. ఎంఎస్ షాట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఓ అభిమానిగా ఆ కోణంలోనే ధోని ఆటను చూస్తున్నా. అతడు కొట్టే ప్రతీ షాట్‌ను ఆస్వాదిస్తున్నా. నిజం చెప్తున్నా తన ఇన్నింగ్స్ చూసినప్పుడల్లా నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. కాబట్టి ధోనిని మిడిలార్డర్లో తీసుకువస్తే ఇంకా బాగుంటుంది కదా’’ అని స్టెయిన్ గన్ డేల్ స్టెయిన్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై శుక్రవారం నాటి మ్యాచ్ నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టెయిన్ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న ధోని ఫ్యాన్స్.. ‘‘మా మనసులోని మాట నువ్వు చెప్పావు.. తలా ఫినిషర్‌గా కాకుండా మిడిలార్డర్లో వస్తే మరిన్ని మెరుపులు చూడవచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, అదే సమయంలో ధోని మోకాలి నొప్పిని గుర్తుచేసుకంటూ .. ‘‘తలా అలా క్రీజులోకి వచ్చి ఒక్క షాట్ ఆడినా సంతోషమే. తను బాగుండటమే ముఖ్యం’’ అని సర్దిచెప్పుకొంటున్నారు. #Dhoni can reach anything and everything. 🔥💪 pic.twitter.com/bAaxqdezgb — Satan (@Scentofawoman10) March 31, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చి 4 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్‌బౌలర్‌గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్‌లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్‌కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్‌ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్‌ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్‌పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’ -
IPL 2024: సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్‌గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
IPL 2024: సన్‌రైజర్స్ కొత్త బౌలింగ్ కోచ్ అతడే.. కోచింగ్ సిబ్బంది పూర్తి వివరాలు
రానున్న ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేల్ స్టెయిన్ వ్యక్తిగత కారణాల చేత 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనుండటంతో ఎన్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఫ్రాంక్లిన్‌ను ఎంపిక చేసింది. అయితే ఫ్రాంక్లిన్ ఈ విధుల్లో తాత్కాలికంగా మాత్రమే కొనసాగనున్నాడు. స్టెయిన్ తిరిగి రాగానే ఫ్రాంక్లిన్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. స్టెయిన్ 2022లో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. Dale Steyn will not be joining us this season due to personal reasons and James Franklin will be the Pace Bowling Coach for this season. Welcome on board, James! 🙌🧡#IPL2024 pic.twitter.com/CefHEbVSLy — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 ఫ్రాంక్లిన్ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. బౌలింగ్ కోచ్‌గా ఇవే అతనికి తొలి బాధ్యతలు. గతంలో అతను డర్హమ్ కౌంటీ జట్టుకు, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫ్రాంక్లిన్‌కు బౌలింగ్ కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అతను ఐపీఎల్‌కు సుపరిచితుడే. 2011, 2012 సీజన్లలో అతను ఆటగాడిగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫ్రాంక్లిన్.. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీకి రిపోర్ట్ చేయనున్నాడు. వెటోరీ కూడా న్యూజిలాండ్ దేశస్తుడే. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్‌గా వెటోరీకి కూడా ఇవే తొలి బాధ్యతలు. గత ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు. వెటోరీ, ఫ్రాంక్లిన్ గతంలో మిడిల్సెక్స్ కౌంటీకి, హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్కు కలిసి పని చేశారు. ఫ్రాంక్లిన్ కెరీర్ విషయానికొస్తే.. ఇతను 2001-2013 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 31 టెస్ట్‌లు, 110 వవ్డేలు, 38 టీ20లు ఆడి 183 వికెట్లు సాధించాడు. ఫ్రాంక్లిన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇవాళ ఉదయమే కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్ పేరును ప్రకటించింది. మార్క్రమ్ నుంచి కమిన్స్ బాధ్యతలు చేపడతాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు.. హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం) అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్ ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్ సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్!
IPL 2024- SRH: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా స్టన్‌గన్ డేల్ స్టెయిన్ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను కొంతకాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు స్టెయిన్ ఇప్పటికే ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. తాజా సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ సజావుగా సాగితే ‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్ సేవలను కోల్పోనుంది. 2024 సీజన్‌కు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది అతడు మళ్లీ ఎస్ఆర్హెచ్ కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా చేరతాడు’’ అని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. కాగా 40 ఏళ్ల డేల్ స్టెయిన్ సౌతాఫ్రికా స్టార్ పేసర్‌గా పేరొందాడు. ప్రొటిస్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 439, 196, 64 వికెట్లు తీశాడు. గతంలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు గతేడాది అదే జట్టుకు ఫాస్ట్‌బౌలింగ్ కోచ్‌గానూ సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో పదో స్థానం కోసం పోటీపడిన సన్‌రైజర్స్.. ఈసారి హెడ్‌కోచ్‌ను మార్చింది. బ్రియన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీని తీసుకువచ్చింది. అయితే, స్టెయిన్ విషయంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుందా.. లేదంటే అతడే బ్రేక్ తీసుకోవాలని భావించాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే! ఐపీఎల్-2024 ఎస్ఆర్హెచ్ జట్టు అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి.నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీశ్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే.. చాలా డేంజరస్: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్కు డేవిడ్ భాయ్ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌కు తన టెస్టు కెరీర్లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టేయిన్ పేరును చెప్పుకొచ్చాడు. 'నా టెస్టు కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్లో డేల్ స్టేయిన్ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్ మార్ష్‌ను భయపెట్టాడు. 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు. కనీసం పుల్ షాట్ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు బౌలింగ్ చేస్తే ప్రతీ బ్యాటర్‌కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్పీడ్‌గన్ స్టేయిన్ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్
Rohit Sharma- Dale Steyn: ‘‘నా కెరీర్లో నాకు సవాల్ విసిరిన బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే డేల్ స్టెయిన్ మాత్రమే. తన బౌలింగ్‌లో పరుగులు సాధించడం చాలెంజింగ్‌గా ఉంటుంది. అయినప్పటికీ తన ఆట తీరును నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. క్లాస్ ప్లేయర్ తను. అతడి నైపుణ్యాలు అమోఘం. బంతి స్వింగ్ చేయడంలో తనకు తానే సాటి. గంటకు 140+ కి.మీ. వేగంతో బంతిని స్వింగ్ చేయగలిగిన స్పీడ్స్టర్లు కొంతమందే ఉంటారు. అందులో స్టెయిన్ ముందు వరసలో ఉంటాడు’’.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. రోహిత్ ఇలా.. అతడేమో అలా అంతర్జాతీయ క్రికెట్లో ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఒకే ఒక్కసారి అవుటయ్యాడు. ఇక, మూడు ఫార్మాట్లలోనూ స్టెయిన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ సగటు 30 కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్టెయిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో.. అతడిని ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడిన విషయాన్ని రోహిత్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా రోహిత్‌ను ఉద్దేశించి డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. రోహిత్ శర్మ అతడికి బౌలింగ్ చేయడం కష్టం ‘అద్భుతమైన బ్యాటర్.. జట్టును ముందుండి నడిపించే నాయకుడు.. రోహిత్‌కు బౌలింగ్ చేయడం నాకెల్లప్పుడూ కష్టతరంగానే ఉండేది’’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకు సవాల్ విసిరిన మేటి బ్యాటర్‌గా రోహిత్ శర్మ పేరును చెప్పాడు స్టెయిన్. ఈ క్రమంలో ఇద్దరు దిగ్గజాలు.. పరస్పర గౌరవం అంటూ హిట్‌మ్యాన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన డేల్ స్టెయిన్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 439, 196, 64 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించే క్రమంలో 2019లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన స్టెయిన్ గన్.. 2021లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో సారథి రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో రోహిత్ నాలుగు అర్ధ శతకాలు చేశాడు. అందులో వరుసగా మూడు ఫిఫ్టీలు సాధించడం విశేషం. ఆసియా కప్-2023లో నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే ఫార్మాట్లో వరుసగా రెండోసారి టీమిండియా ఆసియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ క్రికెటర్ Rohit Sharma - Dale Steyn is the most challenging bowler I've faced. Dale Steyn - I've struggled bowling to Rohit Sharma, he's just amazing. - The mutual respect between two legends of the game! pic.twitter.com/D4tFlqAN6l — Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2023 -
IPL 2023: ఇలాంటి బంతిని ఎప్పుడూ చూడలేదే..!
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 2) జరిగిన ఉత్కంఠ సమరంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో గెలవదనుకున్న తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మపై దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 700 రోజుల తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏళ్ల ఇషాంత్ శర్మ, కుర్ర బౌలర్లా రెచ్చిపోతున్నాడని.. ఈ మ్యాచ్‌లో అతను విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి నకుల్ బంతిని (స్లో డెలివరి) తానెప్పుడూ చూడలేదని, క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే అత్యుత్తమ నకుల్ బంతి అయ్యుంటుందని కొనియాడాడు. భీకర ఫామ్‌లో ఉన్నటువంటి విజయ్ శంకర్‌ను ఇషాంత్ అద్భుతమైన బంతితో తెలివిగా బోల్తా కొట్టించాడని, ఊహించని రీతిలో బంతి వికెట్లను తాకడంతో విజయ్ శంకర్ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఆఖరి ఓవర్లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. Deception at its best! 👊🏻 What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase! Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X — IndianPremierLeague (@IPL) May 2, 2023 ఆఖరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ కేవలం 6 మాత్రమే ఇచ్చి గుజరాత్ నోటి దాకా వచ్చిన విజయాన్ని లాగేసుకున్నాడు. ప్రస్తుత సీజన్లో 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఇషాంత్.. ఢిల్లీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు (19 పరుగులిచ్చి) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, నిన్న ఢిల్లీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది. ఇషాంత్ శర్మ (2/23) ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..అమన్ హకీమ్ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిపాల్ పటేల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. గుజరాత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (4/11) అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ రాణించినపట్పికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. -
WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. తద్వారా నెట్ రన్‌రేటు భారీగా పెంచుకుని గ్రూప్-2లో గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా వర్షం కారణంగా హోబర్ట్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫలితం తేలకుండా పోవడంతో ప్రొటిస్‌కు ఒకే ఒక్క పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్‌లో వరుణుడి రూపంలో ఇలా దురదృష్టం వెక్కిరించడంతో ఉసూరుమంది. అయితే, ఆ బెంగ తీరేలా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలీ రోసో అద్భుత సెంచరీ(109)తో మెరవగా.. 205 పరుగుల భారీ స్కోరు చేసింది సౌతాఫ్రికా. అద్భుతం చేసిన బౌలర్లు ఇక బౌలర్లు కగిసో రబడ ఒకటి, కేశవ్ మహరాజ్ ఒకటి, తబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీశారు. ఇక అన్రిచ్ నోర్జే 3.3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారీ తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి మూడు పాయింట్లు, నెట్రన్ రేటు 5.200తో గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా తర్వాతి స్థానం(2)లో నిలిచింది. ఈసారి విజేతగా సౌతాఫ్రికా ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ పేసర్, కామెంటేటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై తమ బౌలర్లు అద్భుతం చేయగలరని.. ప్రొటిస్ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌తో స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌కు కగిసో రబడ నాయకుడు. అతడికి తోడుగా అన్రిచ్ నోర్జే కూడా ఉన్నాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ల జోడీ అద్భుతంగా రాణించగలదు. వీళ్లిద్దరూ కలిసి ఈసారి సౌతాఫ్రికాకు వరల్డ్‌కప్ అందించగలరని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. నా టాప్-5 బౌలర్లు వీరే ‘‘వాళ్ల పేస్‌లో వైవిధ్యం ఉంది. మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్న బౌలర్లు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రబడ రెచ్చిపోవడం ఖాయం. నోర్జే కూడా తక్కువేమీ కాదు’’ అంటూ ప్రొటిస్‌ను గెలిపించగల సత్తా వీరికి ఉందని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఇక గ్రూప్-1లోని ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ తన ఫేవరెట్ అన్న ఈ స్పీడ్‌స్టర్.. యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతడు దిట్ట అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఈ టోర్నీలో గనుక ముందుకు వెళ్తే అందులో మార్క్‌దే కీలక పాత్ర అని చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత వరల్డ్‌కప్ టోర్నీలో తన టాప్-5 బౌలర్ల పేర్లను స్టెయిన్ వెల్లడించాడు. కగిసో రబడ, అన్రిచ్ నోర్జే, మార్క్ వుడ్, మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిదిలకు ఈ లిస్టులో స్థానమిచ్చాడు. ఇక స్టెయిన్ ఈ జాబితాలో ఒక్క టీమిండియా పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవని జట్టుగా సౌతాఫ్రికాకు అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టెయిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘కనీసం ఈసారైనా టైటిల్ గెలిచి చోకర్స్ ట్యాగ్‌ను తొలగించుకోండి’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి'
మూడు ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో కార్తీక్ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా కార్తీక్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను కార్తీక్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కింది. అదే ఫామ్‌ను కార్తీక్ కొనసాగిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగునున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోవలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరాడు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి రిషబ్ పంత్ కంటే కార్తీక్కే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్‌కు ఇద్దరు వికెట్ కీపర్లను మాత్రమే బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరిలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా కిషన్ ఎంపిక కావచ్చు. ఇక ఫినిషర్ పాత్ర కోసం పంత్ లేదా కార్తీక్‌కు ఛాన్స్ దక్కనుంది. అయితే ప్రస్తుత సిరీస్‌లతో పంత్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. కాబట్టి కార్తీక్ నుంచి పంత్‌కు ముప్పు పొంచి ఉంది. "ప్రస్తుత సిరీస్‌లో పంత్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశాలు వచ్చాయి. అతడు అదే తప్పులు చేసి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లు తమ తప్పులను చక్కదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే కార్తీక్ మాత్రం తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. కార్తీక్ ఒక క్లాస్ ఆటగాడు. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే కార్తీక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు. చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు' -
టీమిండియాకు ఎంపికవుతానని ఆయన ముందే చెప్పారు!
India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ సంతోషం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న తన కల నెరవేరిందని, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్‌బౌలర్‌గా స్థానం సంపాదించిన ఉమ్రాన్ మాలిక్.. తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తన స్పీడ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ సన్‌రైజర్స్‌లో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. క్రీడా, రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనన్ను భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు సెషన్లో భాగంగా ఉమ్రాన్ మాలిక్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ‘‘నాకు 2022 పూర్తిస్థాయి ఐపీఎల్ సీజన్. 14 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాను. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాను. టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలన్న నా కల నెరవేరింది. మొదటి రోజు ట్రెయినింగ్ నుంచే నేను పూర్తి ఉత్సుకతో ఉన్నాను. బాగా బౌలింగ్ చేస్తాననే అనుకుంటున్నా. జట్టులో చేరే ముందే నేను ఎంతో మంది ప్రేమకు పాత్రుడినయ్యాను. ఇక్కడ ప్రతి ఒక్కరు నన్ను తమ సోదరుడిలా భావిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్‌తో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ‘‘జాతీయ జట్టు నుంచి నాకు పిలుపు వచ్చినపుడు ఎస్ఆర్హెచ్ టీమ్ బస్సులో డేల్ సర్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు నాకు శుభాకాంక్షలు చెబుతుంటే.. ఆయన మాత్రం.. ‘‘నువ్వు కచ్చితంగా టీమిండియాకు ఎంపికవుతావని ఐపీఎల్ ఆరంభానికి ముందే చెప్పాను కదా’’ అని సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఉమ్రాన్ మాలిక్ పేర్కొన్నాడు. చదవండి: Mithali Raj: రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్... భావోద్వేగ నోట్‌తో వీడ్కోలు Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! 💬 💬 "A dream come true moment to get India call up." Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl — BCCI (@BCCI) June 8, 2022 -
యార్కర్ దెబ్బకు శ్రేయాస్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్; రియాక్షన్ అదిరే
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్రాన్ మాలిక్ యార్కర్ దెబ్బకు అయ్యర్ ఔట్ కాగానే డగౌట్లో ఉన్న ప్రొటీస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇచ్చిన రియాక్షన్ అదిరింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తన జట్టును కాపాడుకునే ప్రయత్నంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. కేన్ విలియమ్సన్ 10వ ఓవర్ వేయమని బంతిని ఉమ్రాన్ మాలిక్‌కు ఇచ్చాడు. ఉమ్రాన్ ఆఖరి బంతిని యార్క్ర్ వేశాడు. ఉమ్రాన్ యార్కర్‌కు అయ్యర్ వద్ద సమాధానం లేకుండా పోయింది. బులెట్ వేగంతో వచ్చిన బంతి అయ్యర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. మీటర్ రీడింగ్‌లో ఉమ్రాన్ వేసిన బంతి గంటకు 148.8 కిమీ వేగంతో వచ్చింది. ఈ సమయంలో అందరు ఉమ్రాన్‌ను అభినందిస్తున్న వేళ స్టెయిన్ మాత్రం ఎగిరి గంతేశాడు. ఇది కదా కావాల్సింది అన్నట్లుగా నవ్వుతూ మురళీధరన్‌ను హత్తుకొని వచ్చాడు. స్టెయిన్ ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. ఈ సీజన్లో ఉమ్రాన్ మంచి వేగంతో బంతులు విసురుతున్నప్పటికి ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. దీంతో ఉమ్రాన్ బౌలింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికి స్టెయిన్ మాత్రం అతనిపై నమ్మకముంచాడు. ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే టీమిండియా జట్టులో చూస్తానని కూడా స్టెయిన్ ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. తన నమ్మకాన్ని నిలబెట్టాడు గనుకనే స్టెయిన్ నుంచి అంత రియాక్షన్ వచ్చింది. చదవండి: IPL 2022: అంపైర్ పొరపాటు ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది శ్రేయాస్ అయ్యర్ వికెట్ కోసం క్లిక్ చేయండి Dale Steyn's reaction ❤️❤️ pic.twitter.com/Rmesm6tG7f — Cricketupdates (@Cricupdates2022) April 15, 2022 -
మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8వ బౌలర్‌గా..!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆటలో లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వాను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం 86 టెస్ట్‌ల్లో 440 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్.. ఇదే సిరీస్‌లో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పేస్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431), శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు), భారత లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (131 టెస్ట్‌ల్లో 434 వికెట్లు)లను కూడా అధిగమించాడు. లంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ ఇప్పటివరకు 10 వికెట్లు (తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 4) పడగొట్టాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ గ్రేట్ స్పిన్నర్ దివంగత షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు), భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ (124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు), ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (152 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు), విండీస్ మాజీ పేసర్ వాల్ష్ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా రెండు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పింక్ బాల్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. సిరీస్‌లో వరుసగా రెండో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. 446 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కరుణరత్నే (89), చరిత్ అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధించాలంటే మరో 267 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: అశ్విన్ ఖాతాలో మరో మైలురాయి.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు -
IND vs SA: 'టీమిండియా అతడి సేవలను కోల్పోయింది.. అందుకే ఓడిపోయింది'
దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయి టీమిండియా ఘోర పరాభావం పొందిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. చివరి రెండు టెస్టుల్లో ఓటమి చెంది సిరీస్‌ను అతిథ్య జట్టుకు అప్పగించింది. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రోటిస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వెటరన్ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను టీమిండియా కోల్పోయిందని స్టెయిన్ పేర్కొన్నాడు. “భారత్ ఖచ్చితంగా సర్ రవీంద్ర జడేజా లాంటి వారి సేవలను కోల్పోయింది. అతను అద్భుతమైన క్రికెటర్. అతను తన స్పిన్ మయాజాలంతో ఆటను మలుపు తిప్పగలడు. అదే విధంగా జడ్డూ.. బ్యాట్‌తో కూడా రాణించగలడు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక భారత పేస్ బౌలింగ్ గురించి మాట్లాడూతూ.. ‘‘భారత్‌కు బౌలింగ్‌లో కొంత సమస్య ఉన్న మాట వాస్తవం. బుమ్రాకి బ్యాకప్‌గా ఒక మంచి బౌలర్ కావాలి. వారికి గంటకు 140-145 కిమీ స్పీడ్‌లో బౌలింగ్ చేయగల బౌలర్ అవసరం. ఇక టెస్టు సిరీస్‌లో షమీ కూడా అద్భుతంగా రాణించాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు. చదవండి: AUS vs SL: శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ! -
నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?
టెస్టుల్లో నో బాల్స్ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ నో బాల్స్ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలోనే రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్ టెస్టు వర్సెస్ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్ పొలాక్ 17 నోబాల్స్ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్ 1998 నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్ ఎలిజిబెత్ టెస్టు వర్సెస్ ఇంగ్లండ్‌తో డేల్ స్టెయిన్ 16 నోబాల్స్ వేయడం విశేషం. చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్ ట్రోల్ -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే
ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను ట్విటర్ వేదికగా వీడియో రూపంలో వెల్లడించింది. ఇక ఎస్ఆర్హెచ్కు తొలి టైటిల్ అందించిన హెడ్‌కోచ్ టామ్ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రొటిస్ లెజండ్ డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్ -2022: సన్‌రైజర్స్ సిబ్బంది హెడ్‌కోచ్- టామ్ మూడీ అసిస్టెంట్ కోచ్- సైమన్ కటిచ్ బ్యాటింగ్ కోచ్- బ్రియన్ లారా ఫాస్ట్ బౌలింగ్ కోచ్- డేల్ స్టెయిన్ స్పిన్ బౌలింగ్ కోచ్- ముత్తయ్య మురళీధరన్ ఫీల్డింగ్ కోచ్, స్కౌట్- హేమంగ్ బదాని Introducing the new management/support staff of SRH for #IPL2022! Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5 — SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021 -
స్టెయిన్ కొత్త అవతారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ఇకపై సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌గాను సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం... ఇప్పటికే స్టెయిన్‌తో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనున్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది. కాగా ఐపీఎల్లో 2013-2015 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున స్టెయిన్ ఆడాడు. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. 95 ఐపీఎల్ మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు. చదవండి: Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి! -
వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..!
Dale Steyn And Manjrekar Comments On Suresh Raina: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫామ్ లేమితో సతమతమవుతున్న స్టార్ ఆటగాళ్లను ఉద్దేశించి దిగ్గజ ఫాస్ట్ బౌలర్, సఫారీ మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ కోల్పోతే ఎంతటి స్టార్ ఆటగాళ్లపై అయినా సరే వేటు తప్పదని.. ఇది డేవిడ్ వార్నర్ విషయంలో నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మాజీలు ముఖ్యంగా సీఎస్కే మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనాను కార్నర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని అండ చూసుకుని రైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాడని, అతన్ని జట్టులో నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. "I want MS Dhoni to play couple of more years for CSK" - Suresh Raina #WhistlePodu 📸- BCCI pic.twitter.com/LRnC36QDlJ — Chennai Super Kings Fans (@CskIPLTeam) September 29, 2021 ఇటీవలి కాలంలో రైనా స్కూల్ పిల్లాడిలా ఆడుతున్నాడని, అతని ఫామ్ ఇలాగే కొనసాగితే బహుశా ఇదే ఆఖరి ఐపీఎల్ కావచ్చని అన్నారు. సన్‌రైజర్స్‌కు అపురూప విజయాలు అందించిన వార్నర్‌ను ఆ ఫ్రాంచైజీ ఎలా అమర్యాదగా పక్కకు పెట్టిందో.. రైనాకు కూడా అదే గతి పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ధోనిని సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగించాలని ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా.. ఈ సీజనే రైనాకు ఆఖరిది అవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రైనా 11 మ్యాచ్‌ల్లో కేవలం 157 పరుగులు మాత్రమే చేసి సీఎస్కే అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. అయితే ధోని నేతృత్వంలో సీఎస్కే జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ తొలి ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. చదవండి: ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..! -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ క్రమంలో తనకు సహకరించి తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. Announcement. pic.twitter.com/ZvOoeFkp8w — Dale Steyn (@DaleSteyn62) August 31, 2021 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, విదేశీ లీగ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు -
ఈ భూమ్మీద దాన్ని ‘వైడ్’ అంటారు కదా: హా.. ఇట్స్ షాకింగ్!
సెయింట్ జార్జెస్: వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా అంపైర్ వ్యవహరించిన తీరుపై ప్రొటీస్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విండీస్ బౌలర్ మెకాయ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా 2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జరిగిన చివరి టీ20లో గెలుపొంది 3–2తో పర్యాటక జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా... దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 19 ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్.. ముల్దర్‌కు షార్ట్ బాల్‌ను సంధించాడు. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. నిజానికి అది వైడ్‌బాల్. కానీ అంపైర్లు మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. డేల్ స్టెయిన్ ఈ అంశంపై ట్విటర్ వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కాడు. ‘‘ఈ భూమి మీద.. అది ఎలా వైడ్‌గా పరిగణించరో చెప్పగలరా’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు స్పందనగా... ‘‘షాకర్’’ అంటూ ఏబీ డివిలియర్స్ అతడిని సమర్థించాడు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ సైతం.. ‘‘ఇది నిజంగా చెత్త అంపైరింగ్’’ అని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మార్క్రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. Worst umpiring ever 🤣🤣🤣 pic.twitter.com/4fd9DwRy74 — ribas (@ribas30704098) July 4, 2021 -
కోహ్లిని ఔట్ చేయాలంటే ఇలా చేయాల్సిందే: స్టెయిన్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమైంది. అటు మాజీ ఆటగాళ్లు ఈ ప్రతిషష్టాత్మక పోరులో పాల్గొంటున్న ఇరు దేశాల బలా,బలహీనతలపై విశ్లేషిస్తూ వారి అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్టెయిన్ మాట్లాడుతూ.. కోహ్లిని ఔట్ చేయాలంటే అంత సులువు కాదని కచ్చితమైన ప్రణాళిక అవసరమని తెలిపాడు. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున కలిసి ఆడారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిలాంటి ఆటగాడిని త్వరగా ఔట్ చేయకపోతే మ్యాచ్ విజయంపై అవకాశాలు తగ్గుతాయని స్టెయిన్ సూచించారు. కాగా కోహ్లిని ఔట్ చేయాలంటే మైండ్‌గేమ్స్ తప్పవని తెలిపాడు. కచ్చితంగా మైండ్‌గేమ్స్ ఆడాల్సిందేనని పేర్కొంటూ.. నేను షార్ట్‌లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టేందుకు చూసే వాడిని, అలాగే బంతులను అతని శరీరానికి, ప్యాడ్లకు గురిపెట్టి వేసేవాడిని. అదే క్రమంలో బంతులు వేగంగా విసురుతానని అతడికి తెలిసేలా చేసేవాడిని. ఎందుకంటే ఏ బ్యాట్స్‌మెన్ అయినా తొలి 15 -20 బంతులును ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని కనుక ఆ సమయంలో వికెట్ కోసం ప్రయత్నించాలని అని స్టెయిన్ అన్నారు. చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు.. -
రెచ్చగొట్టి మరీ సిక్స్ కొట్టించాడు.. ఎప్పటికి మరిచిపోను
జోహన్నెస్‌బర్గ్: టీమిండియా సీనియర్ బౌలర్ శ్రీశాంత్ తన కెరీర్లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అయితే అతని బౌలింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బ్యాటింగ్ లెజెండ్స్ జాక్ కలిస్, బ్రియాన్ లారాలను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్‌లో తన పవరేంటో చూపెట్టిన శ్రీశాంత్ ఒక మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ చేసింది ఏడు పరుగులు.. కొట్టింది ఒకే ఒక్క సిక్స్. కానీ ఆ సిక్స్ ప్రత్యర్థి బౌలర్‌కు ఎప్పటికి గుర్తుండి పోయేలా చేశాడు. 2006లో టీమిండియా ఐదు వన్డేలు.. మూడు టెస్టులు, ఒక టీ20 ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్టు సిరీస్‌లో భాగంగా వాండరర్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ ఆండ్రూ నెల్ అప్పటికే మూడు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. క్రీజులో ఉన్న శ్రీశాంత్‌ను చూస్తూ ఏదో స్లెడ్జ్ చేశాడు. అసలే కోపానికి చిరునామాగా ఉండే శ్రీశాంత్‌కు అతని మాటలు మరింత కోపం తెప్పించాయి. ఆండ్రూ వేసిన బంతిని భారీ సిక్స్ బాదాడు. అంతే ఆండ్రూ ముఖంలో కోపం.. శ్రీశాంత్‌లో నవ్వు ఒకేసారి కనిపించాయి. ఇంతటితో ఆగకుండా శ్రీశాంతక్ష తన బ్యాట్‌ను అతనివైపు చూస్తూ.. పనిచేసుకో అన్నట్లుగా స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కాగా ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో 8 వికెట్లతో దుమ్మురేపి టీమిండియాకు 123 పరుగులతో భారీ విజయాన్నిఅందించాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను ఇంటర్వ్యూ చేసింది. మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్ అనిపించేలా.. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్ గురించి చెప్పండి అంటే అడిగాడు. దానికి శ్రీశాంత్ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసుకున్నాడు. ''ఆండ్రూ నెల్ బౌలింగ్‌లో శ్రీశాంత్ కొట్టిన సిక్స్ ఎప్పటికి మరిచిపోను. అతన్ని గెలికి మరీ సిక్స్ కొట్టించాడు. సిక్స్ కొట్టిన అనంతరం శ్రీశాంత్ తన బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా నన్ను చిల్ చేస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. Sreesanth and his slog off Andre Nel for 6 with the swinging bat celebration. Legendary — Dale Steyn (@DaleSteyn62) May 15, 2021 ఇక శ్రీశాంత్ ఆండ్రూ నెల్తో జరిగిన కాంట్రవర్సీ గురించి తర్వాత స్పందించాడు. ''ఆరోజు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి ఇండియన్స్‌కు పెద్ద మనసు ఉండదని.. మీతో పోలిస్తే మేము చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేశాడు. నాకు కోపం వచ్చింది.. అప్పటికే మా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటయ్యారు. ఆండ్రూకు మా స్కోర్‌బోర్డు చూపిస్తూ..' మేం ఆధిక్యంలో ఉన్నాం.. తర్వాత ఏ జరుగుతుందో నువ్వే చూడు' అని సైగ చేసి సిక్స్ బాదాను.. అంతే అతని కళ్లలో కోపం చూసి నేను సెలబ్రేట్ చేసుకున్నా'' అంటూ తెలిపాడు. ఇక శ్రీశాంత్ టీమిండియా తరపున 27 టెస్టుల్లో 87 వికెట్లు.. 53 వన్డేల్లో 75 వికెట్లు.. 10టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. చదవండి: 'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' -
కోవిడ్‌కు ఇష్టమైన వ్యక్తులు ఉండరు బాస్: స్టెయిన్
న్యూఢిల్లీ: ఐపీఎల్-14 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొందరు ఐపీఎల్ వాయిదాను సమర్థిస్తుంటే మరికొంతమంది మాత్రం మజాను మిస్సయ్యామని ఫీలవుతున్నారు. ఇలా మధ్యలో ఆగిపోవడంతో తమ జట్లు టైటిల్ గెలిచే చాన్స్‌ను మధ్యలోనే కోల్పోయామని మీమ్స్ ద్వారా ఊదరగొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచింది వారు పోస్టులు పెడుతూ ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టైయిన్ను ట్యాగ్ చేసి మరీ ప్రశ్నలు సంధించాడు. 2020 ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన స్టైయిన్.. ఈఏడాది మాత్రం దూరంగా ఉన్నాడు. కానీ 2021 సీజన్ పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో మాత్రం పాల్గొన్నాడు. కాగా, మార్చి నెలలో పీఎస్ఎల్ కరోనా కారణంగా ఆగిపోవడంతో గత ఐపీఎల్ సీజన్‌ను కోడ్ చేస్తూ ఒక అభిమాని ట్వీట్ చేశాడు. స్టెయిన్ ఇప్పుడు చెప్పు పీఎస్ఎల్-ఐపీఎల్లో ఏది ఉత్తమం. ఏ టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించారో వాస్తవం తెలుసుకో స్టెయిన్. అందుకు తగినంత సమయం కూడా ఉంది అని మార్చి 4వ తేదీన ట్వీట్ చేశాడు. అప్పుడు కేవలం నువ్వు చాలా సరదా మనిషివి అంటూ స్పందించిన స్టెయిన్.. తాజాగా ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మళ్లీ ట్వీట్ చేశాడు. కోవిడ్ లెక్కచేయదు.. దానికి ఎవరూ ఇష్టమైన వ్యక్తులు ఉండరు’ అని ట్వీట్ చేశాడు. సదరు అభిమానికి సమయం చూసుకుని మరీ రిప్లై ఇచ్చినట్లు స్టెయిన్‌కు మరొకసారి ట్రోలింగ్ బారిన పడే అవకాశం లేకపోలేదు. More time at hand for @DaleSteyn62 to figure out which of PSL or IPL is better. Perhaps also accounting for the fact that once started, the IPL managed to finish! https://t.co/pTKKfAX3W9 — Aashish Chandorkar (@c_aashish) March 4, 2021 More time at hand for @DaleSteyn62 to figure out which of PSL or IPL is better. Perhaps also accounting for the fact that once started, the IPL managed to finish! https://t.co/pTKKfAX3W9 — Aashish Chandorkar (@c_aashish) March 4, 2021 Covid don’t care. It has no favorites. Get well to those sick and hopefully everyone else will get home safe and in good health. — Dale Steyn (@DaleSteyn62) May 4, 2021 -
‘వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడటం ఇదే ఆఖరు’
న్యూఢిల్లీ: ‘‘యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే, మనీష్ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్మెంట్కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు. ఒక కెప్టెన్‌గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుదిజట్టులో ఉంటారు, ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోంది’’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ డెయిల్ స్టెయిన్ సందేహం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే డేవిడ్ వార్నర్ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో మంచి రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్‌ను తొలుత కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్, ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దీంతో, వార్నర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జట్టుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌ను ఇంతలా అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. క్రీడా వర్గాల్లోనూ ఈ విషయంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డెయిల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 2013-15 సీజన్లలో హైదారాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ‘‘నాకు తెలిసి డేవిడ్ వార్నర్‌ను ఇకపై సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేమేమో’’ అని పేర్కొన్నాడు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 55 పరుగుల తేడాతో ఓటమి చెంది ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ను కాదని నబీని జట్టులోకి తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ మరోసారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చదవండి: వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా -
శివం మావి వ్యాఖ్యలు: కంటతడి పెట్టిన డేల్ స్టెయిన్!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బౌలర్లలో తానే ఆదర్శం అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ శివం మావి చెప్పిన మాటలు విని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా, శివం మావి మాట్లాడుతూ.. ‘‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్ స్టెయిన్ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా. బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్ స్టెయిన్ లాగే అవుట్ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. అతడితో పాటు బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. అయితే, నా రోల్‌మోడల్ మాత్రం డేల్ స్టెయిన్’’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన డేల్ స్టెయిన్.. శివం మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ‘‘నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2021లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: KKR vs PBKS: నైట్‌రైడర్స్ ఎట్టకేలకు.. -
'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి'
కరాచీ: ఐపీఎల్లో ఆట కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టెయిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్టెయిన్ బుధవారం తనపై వస్తున్న విమర్శలపై మరోసారి స్పందించాడు. ''ఐపీఎల్‌తోనే నా కెరీర్ అద్భుతంగా సాగిందని నేను ఎప్పుడు అనను. కానీ ఐపీఎల్‌ను చులకన చేసి మాట్లాడి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను సోషల్ మీడియా తప్పుగా రాసుకొచ్చింది. ఒకవేళ నా వాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి. పీఎస్ఎల్.. ఎల్పీఎల్ లాంటి లీగ్‌లతో ఐపీఎల్‌ను నేనెప్పుడు పోల్చలేదు. ఆటలో దేని ప్రాధాన్యం దానికే ఉంటుంది. అని'' రాసుకొచ్చాడు. దీంతో పాటు వేలానికి ముందు జనవరిలో చేసిన ఒక ట్వీట్‌ను మరోసారి రీట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో..''ఈసారి ఐపీఎల్ల్కు నేను అందుబాటులో ఉండడం లేదు. గతేడాది ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీకి కూడా ఈ విషయం ఇప్పటికే తెలిపా. అంతేగాక ఈసారి వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా.. దీంతో పాటు ఐపీఎల్లో ఏ టీమ్‌కు ఆడకూడదని భావించా.. కేవలం ఐపీఎల్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలనేది దీని ఉద్దేశం. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ టూ ఆర్సీబీ. చివరగా ఒక్క మాట.. నేను ఇంకా ఆటకు గుడ్‌బై చెప్పలేదు'' అంటూ ముగించాడు. కాగా స్టెయిన్ ప్రస్తుతం పీఎస్ఎల్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా తరపున 93 టెస్టుల్లో 439 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు సాధించాడు. చదవండి: 'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా' 'రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉంటుందంటావు!' IPL has been nothing short of amazing in my career, as well as other players too. My words were never intended to be degrading, insulting, or comparing of any leagues. Social media and words out of context can often do that. My apologies if this has upset anyone. Much love — Dale Steyn (@DaleSteyn62) March 3, 2021 -
ఐపీఎల్ అంతా డబ్బే.. ఆట లేదంటున్న స్టార్ పేసర్
కరాచీ: ఐపీఎల్ ఆరంభమైన నాటినుంచి గత సీజన్ వరకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ లీగ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అక్కడ అసలు ఆట తెర వెనక్కి వెళ్లిపోతుందని అతను అన్నాడు. ఈ లీగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ జట్ల తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు తీశాడు. కనీసం 50కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతి తక్కువ ఎకానమీ (6.91) ఉన్న పేసర్ కూడా ఇతనే. గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన స్టెయిన్ ఈసారి ముందే తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోలుస్తూ స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్లో ఎప్పుడు చూసినా భారీ జట్లు, పెద్ద ఆటగాళ్లు, ఎవరికెంత ఇస్తున్నారు అనే దానిపైనే చర్చ సాగుతుంది. అలాంటి స్థితిలో క్రికెట్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందుకే ఒక ఆటగాడిగా ఐపీఎల్‌తో పోలిస్తే నాకు పీఎస్ఎల్, లంక లీగ్‌లలో ఆడటం ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఈ లీగ్‌లలో ఆటపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన రెండు రోజుల్లో నన్ను కలిసిన వారంతా క్రికెట్ గురించే చర్చించారు. అదే ఐపీఎల్లో నీకు ఎంత మొత్తం వస్తోంది అనేది మాట్లాడతారు. అందుకే ఈసారి ఐపీఎల్‌ను కాదని నాకు నచ్చిన చోట ఆడాలని నిర్ణయించుకున్నా. పైగా ఐపీఎల్ చాలా ఎక్కువ రోజులు సాగుతుంది. నాకంటూ కొంత సమయం కూడా కావాలి’ అని స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా'
కరాచీ: దక్షిణాఫ్రికా సీనియర్ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆటగాళ్లు కేవలం డబ్బులు కోసం మాత్రమే ఆడుతారని.. కానీ పీఎస్ఎల్, మిగతా లీగ్స్ ద్వారా ఆటగాళ్లు మంచి హోదా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. తాజాగా స్టెయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో స్టెయిన్ వివరించాడు. ''ఐపీఎల్లో పాల్గొనేవి అన్ని పెద్ద జట్లే. ఆటగాళ్ల కోసం కోట్లు గుమ్మరిస్తుంటాయి. అయితే ఐపీఎల్లో ఆట కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అదే పీఎస్ఎల్, లంక ప్రీమియర్ లీగ్‌లో చూసుకుంటే అక్కడ డబ్బుల కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పీఎస్ఎల్లో ఆడిన కొన్ని రోజుల్లోనే నాకు ఈ విషయం అర్థమయింది. నేను ఆడుతున్న జట్టులోనే నా సహచర ఆటగాళ్లు నా దగ్గరనుంచి ఆటకు సంబంధించిన మెళుకువలు అడిగారే తప్ప ఎంత డబ్బు పొందుతున్నావు అని అడగలేదు. కానీ అదే ఐపీఎల్లో మాత్రం ఇద్దరి మధ్య చర్చ ఉందంటే.. నువ్వు ఎంతకు అమ్ముడపోయావనే మాట మొదటగా వినిపిస్తుంది. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకున్నా'' అంటూ వివరించాడు. కాగా డేల్ స్టెయిన్ గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 13వ సీజన్లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టెయిన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత స్టెయిన్‌ను ఆర్సీబీ రిలీజ్ చేయగా.. అతను వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని దూరంగా ఉన్నాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు -
సచిన్‌పై డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు
జోహన్నెస్‌బర్గ్ : భారత దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులు లేవు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సచిన్ వన్డేల్లోనూ తొలి డబుల్ సెంచరీ సాధించిన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2010లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ ఈ ఫీట్‌ను అందుకొని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచాడు. అయితే ఈ డబుల్ సెంచరీపై సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ అయిన స్టెయిన్ అంపైర్ భయపడటం వల్లనే సచిన్ డబుల్ సెంచరీ సాధించాడని ఆరోపించాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిపిన చిట్ చాట్‌లో స్టెయిన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.(యువీ ఛాలెంజ్‌కు ‘మాస్టర్’ స్ట్రోక్..) 'గ్వాలియర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడ్డాడు. దాంతో సచిన్ 190 ప్లస్ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీడబ్ల్యూ చేశానని, కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. నాకు ఏమీ అర్థం కాక గౌల్డ్ వైపు చూశానని, అతని ముఖంలో ఏదో భయం కనపడింది. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అంపైర్ వైపు చూశా. అంపైరేమో చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే నన్ను ఇక్కడినుంచి బయటకు కూడా వెళ్లనివ్వరనే ఉద్దేశంలో' పేర్కొన్నాడని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. ('ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా') ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 401 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. తరువాత ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయవద్దని, ముఖ్యంగా బౌలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ' ఒక్క చెత్త బంతిని కూడా సచిన్‌కు వేయకూడదు. ముఖ్యంగా భారత్‌లో అలాంటి తప్పిదం చేయవద్దు. ఆ ఒక్క బంతిని బౌండరీ తరలించే తన ఆటను మొదలు పెడతాడు. దాన్ని అలానే కొనసాగిస్తూ 500 పరుగులైనా చేస్తాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ముగిసిపోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. మనం అతన్ని ఔట్ చేయగలమనే ధీమాతోనే బంతులను సంధించాలంటూ ' అండర్సన్ పేర్కొన్నాడు. -
రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది వీరే..
ముంబై: భారత క్రికెట్ జట్టులో ఓపెనర్‌గా చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో అత్యంత ఇబ్బంది పడ్డ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. గతంలో పేస్ బౌలింగ్ ఆడటంలో కొద్దిపాటి ఇబ్బందులకు గురైన రోహిత్ శర్మ.. ఆ విభాగంలో ఇద్దరు బౌలర్లు మాత్రం తనకు అత్యంత పరీక్షగా నిలిచారన్నాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో చాట్ చేసిన చేసిన రోహిత్.. ఫేవరెట్ బౌలర్లు ఎవరనే దానికి సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఉన్న బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా, ఆస్ట్రేలియా పేసర్ హజిల్వుడ్లే తన ఫేవరెట్ బౌలర్లన్నాడు. అదే సమయంలో తనను ఎక్కువ ఇబ్బందికి గురి చేసిన బౌలర్లలో డేల్ స్టెయిన్, బ్రెట్ లీలు ముందు వరుసలో ఉన్నారన్నాడు. ఈ ఇద్దరి బౌలింగ్‌లోనే తాను అత్యంత ఇబ్బంది పడినట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. (‘కుంబ్లే కోసం నా జీవితాన్ని ఇస్తా’) ‘నా వన్డే సిరీస్ అరంగేట్రంలో భాగంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లాను. అక్కడ స్టెయిన్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత బ్రెట్ లీ బౌలింగ్ కష్టంగా అనిపించేది’ అని రోహిత్ తెలిపాడు. 2007లో ఐర్లాండ్‌లో జరిగిన ట్రై సిరీస్ ద్వారా రోహిత్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్ ఆరంభంలో జట్టులో చోటు కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రోహిత్.. ఆపై రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్‌గా రోహిత్ బ్యాట్ పట్టుకున్న దగ్గర్నుంచీ అతని కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయింది. వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌కు ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264గా ఉంది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ 81.00 సగటుతో 648 పరుగులు సాధించి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 224 వన్డేలు, 108 వన్డేలు, 32 టెస్టులు ఆడిన రోహిత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు సాధించాడు. ('రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం') -
ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ 11మంది ఆటగాళ్లలో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా ప్రొటీస్ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్, శ్రీలంక మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కరలు ఓపెనర్లుగా, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో, వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న క్వింటన్ డికాక్‌ను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ చోటు సంపాధించగా మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ కూడా ఉన్నాడు. స్టెయిన్ అత్యుత్తమ జట్టు : గ్రేమి స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్ -
‘అతని బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం’
కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొల్లాక్ పేర్కొన్నాడు. 1990-2000ల మధ్యలో భారత్‌కు శ్రీనాథ్ ప్రధాన బౌలింగ్ ఆయుధని పొల్లాక్ తెలిపాడు. కానీ అతని ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని పొల్లాక్ అన్నాడు. 1991 నుంచి 2003 వరకూ భారత జట్టు తరఫున శ్రీనాథ్ 67 టెస్టులు, 229 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 236, వన్డేల్లో 315 వికెట్లు తీశారు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే') వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌరల్ మైఖేల్ హోల్డింగ్, ఇంగ్లండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఓ చర్చలో పాల్గొన్న పొల్లాక్ .. ‘శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదు. మా కాలంలో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్.. వెస్టిండీస్‌లో కల్ట్రీ ఆంబ్రోస్, వాల్ష్, ఆస్ట్రేలియాలో గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది గొప్ప బౌలర్లు ఉన్నారు’’ అని అన్నారు.తన రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లలో డెయిల్ స్టెయిన్ బౌలింగ్ తనకు ఎంతో నచ్చిందని పొల్లాక్ పేర్కొన్నారు. ఎటువంటి వికెట్‌పై అయినా స్టెయిన్కి బౌలింగ్ చేసే సత్తా ఉందని చెప్పిన పొల్లాక్.. అతను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతని రికార్డులే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. (ఐపీఎల్ జరిగేలా లేదు ) -
ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్ కష్టం
హైదరాబాద్: బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్లు తన అభిమాన నటీమణులని టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. సహచర క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్న ధావన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన కెరీర్లో దక్షిణాఫ్రికా స్పీడస్టర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలిపాడు. అతను అత్యుత్తమ బౌలర్ అని పేర్కొన్న ధావన్ ప్రపంచకప్-2019లో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించాడు. చేతి గాయం బాధించినా జట్టు కోసం పోరాడి ఆడానని, సెంచరీ సాధించానని అందుకే తన కెరీర్లో ప్రత్యేకమైన శతకంగా అది నిలుస్తుందన్నాడు. ఇక సంగీతమంటే ఎంతో ఇష్టమని చెప్పడంతో అయ్యర్ కోరిక మేరకు లైవ్‌లో ఫ్లూట్(పిల్లన గ్రోవి) వాయించాడు. సంగీతమంటే ఇష్టమున్నవాళ్లు, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి ఈ లాక్డౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫ్లూట్ నేర్చుకుంటున్నానని తెలిపాడు. ఇక లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్న ధావన్.. తన పాటలు, డ్యాన్స్‌లు, పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు. చదవండి: నాడు రియల్.. నేడు వైరల్ ‘లూడో కలిపింది అందరినీ’ -
‘నేను పిచ్చి పనిచేస్తే మళ్లీ క్రికెట్ ఆడలేను’
కరాచీ: కరోనా వైరస్ ప్రభావంతో దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ కొన్ని గంటల పాటు పాకిస్తాన్‌లోని ఓ హోటల్ నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆడేందుకు అక్కడికి వెళ్లిన స్టెయిన్.. ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, ఇస్లామాబాద్ యునైటెడ్ నాకౌట్‌కు చేరలేదు. దాంతో స్టెయిన్ స్వదేశానికి పయనం కావాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా టోర్నీలో ప్లే ఆఫ్ చేరిన టీమ్స్‌లోని ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించింది. విదేశీ ఆటగాళ్లకు నెగటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతిచ్చింది. పరీక్షలకు పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ క్రికెటర్లని హోటల్ గదులకే పరిమితం చేసింది.(కరోనా విజృంభణ: ఇటలీ వీధులు వెలవెల) ‘ఆటగాళ్లందరం హోటల్ నిర్భంధంలో ఉండిపోయాం. హోటల్ దాటి వీధుల్లోకి రాకూడదని మాకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా ఈ నిబంధనల్ని అతిక్రమించాలనిపించలేదు. ఒకవేళ నేను ఏదైనా పిచ్చి పని చేసినా.. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్లో క్రికెట్ ఆడలేను. నేను అందరికీ ఒకటే చెబుతున్నా ఎవరు కూడా వీధుల్లో తిరగకండి.. మీరు తిరగాలనుకునే వీధులు బాగున్నా సరే బయటకి వెళ్లవద్దు’ అని ఈసీపీన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన స్టెయిన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ లీగ్ దశలో మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న పీఎస్ఎల్ తాజా సీజన్లో ఇంకా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. (భారత్‌లో 209కి చేరిన కరోనా కేసులు ) -
పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్ రికార్డు
ఈస్ట్ లండన్(దక్షిణాఫ్రికా): దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా సఫారీలు పరుగు తేడాతో గెలుపొందారు. దక్షిణాఫ్రికా విజయంలో లుంగీ ఎన్గిడి కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు సాధించి సఫారీలకు విజయాన్ని అందించాడు. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్టెయిన్ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ రికార్డును స్టెయిన్ బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పుటివరకూ తాహీర్ 61 టీ20 వికెట్లు సాధించగా, స్టెయిన్ దాన్ని బద్ధలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20ల్లో జోస్ బట్లర్ వికెట్‌ను తీయడం ద్వారా తాహీర్ రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉంది. మలింగా ఇప్పటివరకూ 106 అంతర్జాతీయ టీ20 వికెట్లు సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో షాహిద్ ఆఫ్రిది(96), షకిబుల్ హసన్(92)లు ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు రికార్డు కూడా స్టెయిన్ పేరిటే ఉన్న సంగతి తెలిసిందే. 439 టెస్టు వికెట్లు సాధించి సఫారీ జట్టు తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఇడియట్.. దేవుడికి సంబంధమేంటి?
దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్‌కు ఓ నెటిజన్ కోపం తెప్పించాడు. దీంతో ఆ నెటిజన్ను స్టెయిన్ కడిగిపారేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములు, వివాదాలతో సతమవుతున్న ప్రొటీస్ జట్టుకు ఈ విజయం ఎంతో ఊరట కలిగించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో, జట్టులో కొన్ని సంస్కరణల అనంతరం స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో విజయం సాధించడం పట్ల ఆదేశ తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డుప్లెసిస్ సేనపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ స్టెయిన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్టెయిన్ ఆగ్రహానికి గురయ్యాడు. గెలిచింది స్వదేశంలో కదా లెక్కలోకి రాదు అంటూనే దేవుడి దయతో మ్యాచ్ గెలిచారనే అనే అర్థంలో రీట్వీట్ చేశాడు. దీంతో స్టెయిన్‌కు చిర్కెత్తుకొచ్చింది. ఆ నెటిజన్ భారత్‌కు చెందిన వాడని గుర్తించిన ఈ ప్రొటీస్ బౌలర్ అతడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘అయితే టీమిండియా కూడా భారత్‌లో గెలిచినవి లెక్కలోకి రావా? అయినా మా గెలుపుకు దేవుడితో సంబంధం ఏంటి? ఇడియట్’అంటూ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు స్టెయిన్‌కు అండగా నిలుస్తుండగా.. మరికొందరు ఇడియట్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. -
అక్కడ ఉంది నేను.. గెలవడం పక్కా!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13కు సంబంధించి జరిగిన ఆటగాళ్ల వేళంలో దక్షిణాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2కోట్లకు స్టెయిన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరడంపై స్టెయిన్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్టెయిన్ తన దైన స్టైల్లో సమాధానాలిచ్చాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..‘తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను’అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ‘ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి’అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ‘ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది’అంటూ ఫ్యాన్స్ అడిగిన దానికి బదులిచ్చాడు ఈ స్పీడ్‌గన్. ఇక స్టెయిన్ ఐపీఎల్ అరంగేట్రం చేసింది ఆర్సీబీ జట్టులో అయినప్పటికీ.. ఆ జట్టుకు తొమ్మిదేళ్ల దూరంగా ఉన్నాడు. తిరిగి ఐపీఎల్-2019లో బెంగళూరు జట్టులో చేరినప్పటికీ రెండు మ్యాచ్‌ల అనంతరం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అయితే తాజా వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. కానీ వేలంలో అనూహ్యంగా తిరిగి చేజిక్కించుకుంది. స్టెయిన్‌తో పాటు రిచర్డ్సన్, మోరిస్, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది. ఇప్పటికే బ్యాటింగ్‌లో దుమ్ములేపే కోహ్లి జట్టు బౌలింగ్ బలం పెరగడంతో వచ్చే సీజన్లో హాజ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. కోహ్లితో చర్చించే తీసుకున్నాం: మైక్ హెసన్ ‘వేలం ప్రారంభానికి ముందే అనుకున్నాం స్టెయిన్ అవసరం ఆర్సీబీకి ఉందని, అయితే అతడు కనీసం రూ. 3నుంచి 4 కోట్లు పలుకుతాడని భావించాం. కానీ మేము ఊహించింది జరగలేదు. లక్కీగా స్టెయిన్‌ను వేలంలో చేజిక్కించుకున్నాం. బౌలర్ల ఎంపిక విషయంలో సారథి కోహ్లితో పదేపదే చర్చించాం. మిడిల్ ఓవర్లలో మంచి బౌలర్ కావాలని అతడు కోరాడు. అందుకోసం ఉదాన సరైన వ్యక్తిగా భావించాం. దీంతో స్టెయిన్, ఉదానలను ఎంపిక చేశాం’అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ పేర్కొన్నాడు. -
‘ఆర్చర్.. డేల్ స్టెయిన్‌ను తలపిస్తున్నావ్!’
హెడింగ్లీ: ఇంగ్లండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్ తరుపున అరంగేట్రం చేసిన ఈ బౌలర్ తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెన్నుల్లో వణుకుపుట్టించాడు. తాజాగా మూడో టెస్టులో కంగారు బ్యాట్స్‌మెన్‌ను ఠారెత్తించాడు. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆర్చర్‌ను ఆకాశానికి ఎత్తాడు. ‘కొత్త బంతితో ఆర్చర్ బౌలింగ్ విధానం చూస్తుంటే నాకు డేల్ స్టెయిన్ గుర్తుకువస్తున్నాడు. వేగంతో పాటు పేస్‌లో వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్చర్ ఇప్పుడే ప్రపంచ శ్రేణి బౌలర్‌ను తలపిస్తున్నాడు’అంటూ వార్నర్ పేర్కొన్నాడు. అరంగేట్రపు టెస్టులోనే ఐదు వికెట్లన సాధించిన ఆర్చర్ అందరి మన్ననలను పొందాడు. లార్డ్స్ టెస్టులోనే ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెడకు తగిలి గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగానే మూడో టెస్టుకు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. చదవండి: అచ్చం స్మిత్‌లానే..! ఆర్చర్‌పై ఆసీస్ మాజీ బౌలర్ ప్రశంసలు -
స్టెయిన్ అసహనం.. కోహ్లికి క్షమాపణలు
కేప్‌టౌన్: భారత పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడం పట్ల దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ అసహనం వ్యక్తం చేశాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టెయిన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతున్నాడు. అయితే టీమిండియాతో జరగబోయే మూడు టీ20, మూడు టెస్టుల కోసం దక్షిణాఫ్రికా జట్టును సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. అయితే టీ20 జట్టులో స్టెయిన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాయం కారణంగా ప్రపంచకప్ ఆరంభంలోనే నిష్క్రమించిన స్టెయిన్.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అయితే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నా తనను పక్కకు పెట్టారని స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా జట్టును సెలక్టర్లు ప్రకటించిన వెంటనే స్టెయిన్ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను సెలక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహపరిచిందని స్టెయిన్ పేర్కొన్నాడు. ఇక టీ20 జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో టీమిండియా సారథి విరాట్ కోహ్లి, కోట్లాది అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. టెస్టు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ తప్పక ఆడతానని స్టెయిన్ ప్రకటించిన విషయం విదితమే. స్టెయిన్ ఇప్పటివరకు 44 టీ20 మ్యాచ్‌ల్లో 6.79 ఎకానమీతో 61 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌ను పక్కకు పెట్టి డికాక్‌ను దక్షిణాఫ్రికా సారథిగా ఎంపిక చేశారు. -
సంధి దశలో సఫారీలు
ఒక్కొక్కరుగా దిగ్గజాల రిటైర్మెంట్, ఫిట్నెస్ సమస్యలు, బోర్డు పాలన వైఫల్యాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు ఫర్వాలేదనిపించిన ఆ జట్టు అనంతరం డీలా పడిపోయింది. ఆఖరికి శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో వారి వైఫల్యం దీనికి పరాకాష్ట. ప్రతిభావంతులను గౌరవించకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం... ఇలా అనేక తప్పిదాలతో ప్రొటీస్ పరిస్థితి దిగజారింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు లేకుంటే మరింతగా పతనమయ్యే ప్రమాదమూ ఉంది. సాక్షి క్రీడా విభాగం పేరుకు 12 జట్లున్నా... ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న దేశాల్లో బలమైనవని చెప్పుకోదగ్గవి ఆరే! అవి... భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. వీటిలోనూ విండీస్ ఆట మూడు దశాబ్దాలుగా అనిశ్చితం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో మరో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. మేటి అనదగ్గ ఆటగాళ్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండటంతో సఫారీలు నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మిగిలారు. విధ్వంసక ఏబీ డివిలియర్స్‌తో మొదలైన రిటైర్మెంట్ల పరంపర... నిలకడకు మారుపేరైన హషీమ్ ఆమ్లా వరకు వచ్చింది. వీరిద్దరి మధ్యలో ప్రధాన పేసర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వీడ్కోలు పలకడం ప్రొటీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడా జట్టులో మిగిలిన నాణ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మాత్రమే. మిగతా వారిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్లో తమ ముద్ర వేసే దిశలో ఉండగా... ఇంకొందరు ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సంధి కాలం అనదగ్గ ఇలాంటి దశను అధిగమించేందుకు దక్షిణాఫ్రికా బోర్డు గట్టి చర్యలు చేపట్టకుంటే... ఆ జట్టు ఓ సాధారణమైనదిగా మిగిలిపోవడం ఖాయం. రెండు, మూడేళ్లయినా ఆడగలిగినవారే! తమ దిగ్గజ ఆటగాళ్లు అర్ధంతర రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ దేశ క్రికెట్ బోర్డయినా ఏం చేస్తుంది? తక్షణమే సంప్రదింపులు జరిపి, వారి సేవలు ఎంత కీలకమో వివరించి నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకునేలా చేయడమో, మూడు ఫార్మాట్లలో వారి సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ తగిన విధంగా వాడుకునేలా చేయడమో చేస్తుంది. కానీ, దక్షిణాఫ్రికా బోర్డు ఇలాంటి చొరవేదీ చూపుతున్నట్లు లేదు. డివిలియర్స్ ఉదంతమే దీనికి పక్కా నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే అతడు గతేడాది ఏప్రిల్‌లో అనూహ్యంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అప్పటికి ఏబీ వయసు 34 ఏళ్లే. తన ఫామ్‌ను అంతకుమించిన ఫిట్నెస్ను చూస్తే కనీసం రెండేళ్లయినా మైదానంలో మెరుపులు మెరిపించగల స్థితిలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో 2018 మార్చి 30న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన టెస్టు తర్వాత ఇక ఆడనంటూ తప్పుకొన్నాడు. ఇదే టెస్టుతో, అంతకుమందే ప్రకటించిన మేరకు పేసర్ మోర్నీ మోర్కెల్ బై బై చెప్పాడు. ఆ సమయంలో అతడికి 33 ఏళ్లే. గాయాలు వేధిస్తున్నాయని అనుకున్నా... మోర్కెల్ మరీ ఫామ్ కోల్పోయి ఏమీ లేడు. పెద్ద జట్లతో సిరీస్‌లైనా ఆడేలా అతడిని ఒప్పించలేకపోయారు. మోర్కెల్ లేని లోటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తెలిసొచ్చింది. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా... లంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక 36 ఏళ్ల స్టెయిన్‌ది మరో కథ. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన అతడు వరుసగా గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో టెస్టులకు రాం రాం చెప్పాడు. దీంతో ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్ల సేవలను కోల్పోయినట్లైంది. మరో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అద్భుత బౌలరే. అయితే, 34 ఏళ్లు దాటిన అతడు గాయాలతో కొంతకాలంగా ప్రధాన స్రవంతి క్రికెట్లో లేడు. తాజాగా హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్తో దక్షిణాఫ్రికా మరో స్టార్ ఆటగాడిని కోల్పోయినట్లైంది. వాస్తవానికి 36 ఏళ్ల ఆమ్లా విరమణపై ఊహాగానాలు ఉన్నా... కనీసం ఇంకో ఏడాదైనా టెస్టుల వరకు ఆడతాడని భావించారు. అతడు మాత్రం మూడు ఫార్మాట్లకు అస్త్రసన్యాసం చేశాడు. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎలాగో... బ్యాటింగ్, బౌలింగ్‌లో మూలస్తంభాలైన నలుగురి రిటైర్మెంట్తో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎదుర్కోనున్న అసలు సవాలు టెస్టు చాంపియన్‌షిప్. ఆ జట్టు చాంపియన్‌షిప్‌లో 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వచ్చే జనవరి లోపు భారత్ (3), ఇంగ్లండ్ (4 సొంతగడ్డపై)లతోనే ఏడు టెస్టులున్నాయి. విండీస్, పాక్, లంకలతోనూ రెండేసి ఆడాల్సి ఉంది. చివరగా ఆస్ట్రేలియాతో 3 టెస్టుల్లో తలపడుతుంది. బౌలింగ్‌లో రబడ మినహా ఇంకెవరిపైనా ఆశలు లేని నేపథ్యంలో డు ప్లెసిస్, డికాక్‌లకు తోడు ఓపెనర్ మార్క్రమ్, ఎల్గర్ సత్తా చాటితేనే సఫారీలు కనీసం పోటీ ఇవ్వగలరు. పెద్దరికం లేని బోర్డు... దూరదృష్టి లేని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తీరే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆటగాళ్లు, బోర్డు అధికారుల మధ్య సత్సంబంధాలు లేవు. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందుండగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు నచ్చజెప్పి ఆపే పెద్దరికం, కప్‌నకు తుది జట్టును ప్రకటించే సమయంలో తిరిగొస్తానన్న అతడిని తీసుకునే విశేష చొరవ ఎవరికీ లేకపోయింది. గాయాలతో ఉన్న స్టెయిన్‌ను జాగ్రత్తగా కాపాడుకునే వ్యూహం, ఆమ్లాను కొన్నాళ్లు ఆగేలా చేసే ప్రయత్నమూ వారిలో కొరవడింది. వన్డేలు, టి20ల కంటే స్టెయిన్ టెస్టుల్లోనే దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవసరం. కానీ, అతడు టెస్టులకే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడా బోర్డు నిష్క్రియాపరత్వం కనిపిస్తోంది. ఇప్పుడు సీఎస్ఏ... ఫుట్‌బాల్ తరహాలో జట్టుకు మేనేజర్‌ను నియమించి అతడే కోచింగ్ సిబ్బందిని, కెప్టెన్‌ను ఎంపిక చేసేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్, సహాయ సిబ్బంది కాంట్రాక్టు కూడా ముగియనుంది. వచ్చేవారైనా దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలిసితీసి బాధ్యతలను సమర్థంగా నెరవేరిస్తేనే ప్రొటీస్ జట్టు పటిష్టంగా ఉంటుంది. -
క్రికెట్లో నువ్వు నిజమైన చాంపియన్: కోహ్లి
గయానా: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. పేస్ మెషీన్‌గా గుర్తింపు పొందిన స్టెయిన్ టెస్టు రిటైర్మింట్ సంతోషమయం కావాలని ఆకాంక్షించాడు. ‘ క్రికెట్ ఆటలో నువ్వు నిజమైన చాంపియన్. నీ టెస్టు రిటైర్మెంట్ మరింత ఆనందమయం కావాలి పేస్ మెషీన్’ అని కోహ్లి తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2008 నుంచి 2010 వరకూ ఆర్సీబీ తరఫున ఆడిన స్టెయిన్.. 2019 సీజన్లో కూడా అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్సీబీ కెప్టెన్ అయిన కోహ్లితో కలిసి ఆడిన అనుభవం స్టెయిన్‌ది. దాంతో సహచర ఆటగాడికి కోహ్లి అభినందులు తెలియజేశాడు. (ఇక్కడ చదవండి: స్టెయిన్ ‘టెస్టు’ ముగిసింది!) ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. గత కొంతకాలంగా తరచూ గాయాలబారిన పడిన 36 ఏళ్ల స్టెయిన్ ఇకపై వన్డేలు, టి20లకు పరిమితం అవుతానని చెప్పాడు. 93 టెస్టుల్లో స్టెయిన్ 439 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టెయిన్... ఓవరాల్‌గా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంతో తన కెరీర్ ముగించాడు. -
స్టెయిన్ ‘టెస్టు’ ముగిసింది!
జొహన్నెస్‌బర్గ్: ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన ఈతరం దిగ్గజం టెస్టు క్రికెట్లో తన ఆటను ముగించాడు. ఎర్ర బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన సఫారీ టెర్రర్ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. గత కొంతకాలంగా తరచూ గాయాలబారిన పడిన 36 ఏళ్ల స్టెయిన్ ఇకపై వన్డేలు, టి20లకు పరిమితం అవుతానని చెప్పాడు. ‘నేను ఎంతగానో ప్రేమించిన ఫార్మాట్‌నుంచి ఇక తప్పుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాలపరంగా కూడా ఆటగాడిగా ఎంతో పరీక్ష పెట్టే టెస్టు క్రికెట్టే నా దృష్టిలో అత్యుత్తమం. మళ్లీ టెస్టులు ఆడననే విషయం నన్ను నిజంగా చాలా బాధ పెడుతోంది. ఇకపై వన్డేలు, టి20లు మాత్రమే ఆడి నా కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించుకోవాలని భావిస్తున్నాను’ అని స్టెయిన్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. 93 టెస్టుల్లో స్టెయిన్ 439 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టెయిన్... ఓవరాల్‌గా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంతో తన కెరీర్ ముగించాడు. ఎదురులేని స్టెన్ గన్! అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం, 2008...అత్యద్భుత పేస్ బౌలింగ్ ప్రదర్శనతో స్టెయిన్‌కు 5 వికెట్లు...భారత్ 76 ఆలౌట్! మరో రెండేళ్ల తర్వాత నాగపూర్ వేదిక... స్టెయిన్‌కు 7 వికెట్లు... కుప్పకూలిన టీమిండియా, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయం... భారత గడ్డపై టెస్టుల్లో ఒక విదేశీ బౌలర్ చెలరేగిపోవడమే అరుదు. అదీ ఒక ఫాస్ట్ బౌలర్ మన బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడం అసాధారణం... కానీ స్టెయిన్‌కు పిచ్ స్వభావంతో పని లేదు. తన పదునైన బౌలింగ్‌పై నమ్మకమే తప్ప సొంత మైదానమా లేక ప్రత్యర్థి వేదికనా అనేది అనవసరం... అందుకే అతను ఈతరం ఫాస్ట్ బౌలర్లలో అందరికంటే అగ్రభాగాన నిలిచాడు. జొహన్నెస్బర్గ్తో మొదలు పెడితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్, హరారే, గాలే, కరాచీ, ఓవల్, మెల్బోర్న్... అన్ని మూలలా అతను ప్రత్యర్థి బ్యాట్‌మెన్‌ను గడగడా వణికించాడు. పచ్చిక మైదానాల నుంచి దుమ్ము రేగే పిచ్‌ల వరకు ఒకదానితో మరోదానికి పోలికే లేని వేదికలపై అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఉపఖండంలో ఆడిన 22 టెస్టుల్లో కేవలం 24.11 సగటుతో 92 వికెట్లు తీయడం అతడిని తన తరంలోని మెక్‌గ్రాత్, అండర్సన్లకంటే పైన నిలబెడుతుంది. ‘నేను అమిత వేగంతో బౌలింగ్ చేసినప్పుడు బ్యాట్స్‌మెన్ చెవి పక్కనుంచి జూమ్మంటూ బంతి దూసుకుపోతుంటే ఆ శబ్దం చాలా వినపొంపుగా అనిపిస్తుంది’... ఇలా తన పేస్ గురించి స్వయంగా ఎన్నో సార్లు గొప్పగా చెప్పుకున్న స్టెయిన్ స్పీడ్‌నే శ్వాసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కాకుండా చివరి వరకు కూడా కనీసం 140 కిలోమీటర్లకు తగ్గని ఒకే తరహా వేగాన్ని కొనసాగించగలగడం అతనికే సాధ్యమైంది. ఆకట్టుకునే యాక్షన్, 19 మీటర్ల రనప్, అదరగొట్టే అవుట్ స్వింగర్లు స్టెయిన్ చిరునామాగా మారాయి. ఒకటా, రెండా స్టెయిన్ బౌలింగ్ దక్షిణాఫ్రికాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్లలో టెస్టు సిరీస్ విజయాలు, భారత గడ్డపై రెండు సిరీస్‌లు ‘డ్రా’ కావడంలో స్టెయిన్ కీలక పాత్ర పోషించాడు. ప్రతీ దేశంలో అతను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. స్టెయిన్ తమతో ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్‌లలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోకపోవడం అతని విలువను చూపిస్తోంది. సొంతగడ్డపై గొప్పగా రాణించిన బౌలర్లు కూడా విదేశాల్లో పేలవ ప్రదర్శన కనబర్చారు. కానీ స్టెయిన్‌కు మాత్రమే ప్రతీ చోటా ఘనమైన రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాలో 21.62 సగటుతో 261 వికెట్లు తీస్తే, విదేశాల్లో 24.23 సగటుతో 164 వికెట్లు తీయడం అతని ఘనతకు నిదర్శనం. 2010 నుంచి 2015 వరకు నిర్విరామంగా స్టెయిన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగాడు. కనీసం 300 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అందరికంటే అత్యుత్తమ స్ట్రయిక్ రేట్ (42.30) స్టెయిన్దే. ఇటీవల తిరగబెట్టిన భుజం గాయం స్టెయిన్ టెస్టు కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించిందని చెప్పవచ్చు. మేలిరకం అసలు సిసలు ఫాస్ట్ బౌలర్‌గా అతను టెస్టు క్రికెట్‌పై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ ఎవరూ మరచిపోలేనిది. టెస్టు కెరీర్ ఆడిన మ్యాచ్‌లు-93 తీసిన వికెట్లు- 439 సగటు-22.95 అత్యుత్తమ బౌలింగ్:7/51 (ఇన్నింగ్స్) 11/60 (మ్యాచ్) ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు:26 సార్లు మ్యాచ్‌లో 10 వికెట్లు:5 సార్లు –సాక్షి క్రీడావిభాగం -
ఐపీఎల్ అతడి కొంపముంచింది: డుప్లెసిస్
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఏది కలసిరావడంలేదు. ఆతిథ్య ఇంగ్లండ్, పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పరాజయాలతోనే సతమతమవతున్న సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరో తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎన్గిడి గాయపడ్డాడు. దీంతో అతడికి పదిరోజుల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ డెల్ స్టెయిన్‌కు పాత గాయం తిరగబెట్టడంతో ఏకంగా టోర్నీకే దూరమయ్యాడు. దీంతో స్టెయిన్ ప్రపంచకప్‌కు దూరం కావడానికి ఐపీఎల్ కారణమంటూ సఫారీ జట్టు సారథి డుప్లెసిస్ నిందిస్తున్నాడు. ‘ఐపీఎల్లో స్టెయిన్ ఆడకుంటే ప్రస్తుతం ప్రపంచకప్‌లో అతడి సేవలను దక్షిణాఫ్రికా వినియోగించుకునేది. ఐపీఎల్‌కు ముందు అతడు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్లో ఆడాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మళ్లీ గాయపడటంతో టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో ఆడకుండా విశ్రాంతి తీసుకోకపోవడమే స్టెయిన్ చేసిన పొరపాటు’అంటూ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినిథ్యం వహించిన స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. -
సఫారీలకు మరో ఎదురుదెబ్బ
సౌతాంప్టాన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌కు వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టినప్పటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లతో సహా ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టెయిన్ తన భుజానికి అయిన గాయం నుంచి ఎంతకీ కోలుకోపోవడంతో అతను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో హెండ్రిక్స్‌ను జట్టులో తీసుకున్నారు. ఈ మేరకు హెండ్రిక్స్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి పిలుపు అందింది. ఈ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. తొలుత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవి చూసిన సఫారీలు.. ఆపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి పరాజయం చెందారు. దాంతో బుధవారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్ దక్షిణాఫ్రికాకు కీలకంగా మారింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టెయిన్ ఆడితే తమ బౌలింగ్ విభాగం బలంగా ఉండేదని మ్యాచ్ తర్వాత కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో మ్యాచ్ నాటికి స్టెయిన్ కోలుకుంటాడని దక్షిణాఫ్రికా యాజమాన్యం భావించినప్పటికీ అతను అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలగడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. ఇప్పటికే భారత్‌తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడి గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. -
ఆర్సీబీకి ఎదురుదెబ్బ
బెంగళూరు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ డేల్ స్టెయిన్ భుజం గాయం కారణంగా మిగతా లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు సాధించిన స్టెయిన్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఐపీఎల్ ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ దశలో ప్రధాన పేసర్ స్టెయిన్ దూరం కావడంతో ఆర్సీబీకి ప్రధాన లోటుగానే చెప్పొచ్చు. నాథన్ కౌల్టర్ నైల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన స్టెయిన్ కూడా అదే దారిలో పయనించడం ఆర్సీబీని ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు సైతం స్టెయిన్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
బుమ్రా బౌల్డ్ చేస్తాడు.. మరి అశ్వినేమో..
హైదరాబాద్: కింగ్స్ పంజాబ్ సారథి రవించంద్రన్ అశ్విన్‌కు ‘మన్కడింగ్’ మచ్చ ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. వీలుచిక్కినప్పుడల్లా నెటిజన్లు, క్రికెటర్లు అశ్విన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు మైదానంలోనే అశ్విన్‌కు ‘మన్కడింగ్’ను గుర్తు చేస్తూ ఆటపట్టించారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌గన్ డెల్ స్టెయిన్ అశ్విన్‌ను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు. ‘బ్యాట్స్‌మెన్ ఎక్కువగా బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్, రబడ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్, తాహీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుతారు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో మన్కడింగ్‌తో అవుటవుతారు’అంటూ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం స్టెయిన్‌కు సంబంధించిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. స్టెయిన్ కరెక్ట్‌గా చెప్పారంటూ నెటిజన్లు రీట్వీట్ చేస్తూన్నారు. ఇక ఆలస్యంగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌గన్.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. స్టెయిన్ రాకతో బలహీనంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి బలం చేకూరింది. అసలేం జరిగిందంటే..? ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంతో ఔట్ చేయడంతో అశ్విన్ వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. అశ్విన్ తీరుపై నెటిజన్లు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోశారు. -
వరల్డ్‌కప్.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే
కేప్‌టౌన్: వచ్చే నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగబోయే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా, తాజాగా దక్షిణాఫ్రికా సైతం జట్టును వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే సఫారీ జట్టుకు డుప్లెసిస్‌నే కెప్టెన్‌గా నియమించింది. మరో సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లాకు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించిన హెన్‌డ్రిక్స్‌కు మాత్రం మొండి చేయి చూపించారు. వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో డుప్లెసిస్, మార్క్రరమ్, క్వింటన్ డీకాక్, హషీమ్ ఆమ్లా, జేపీ డుమినిలకు చోటు కల్పించారు. బౌలింగ్ విషయానికొస్తే డేల్ స్టెయిన్, కగిసో రబాడ, ఆండిల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, తబ్రాజ్ షంసీలకు చోటు దక్కింది. మరోవైపు సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా జట్టు.. డుప్లెసిస్(కెప్టెన్), మార్కరమ్, క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ పెహ్లుక్వాయో, జేపీ డుమిని, డేవాయిన్ ప్రోటోరియస్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జే, ఇమ్రాన్ తాహిర్, తబ్రాజ్ షంసీ -
బెంగళూరు జట్టులో స్టెయిన్
దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ ఐపీఎల్లో అడుగు పెడుతున్నాడు. గాయపడిన కూల్టర్ నీల్ స్థానంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు స్టెయిన్‌ను తీసుకుంది. 2016లో ఆఖరి సారిగా అతను లీగ్‌లో ఆడగా తర్వాతి ఏడాది గాయంతో దూరమయ్యాడు. 2018, 2019 వేలంలలో స్టెయిన్‌ను ఎవరూ తీసుకోలేదు. ఐపీఎల్ తొలి మూడేళ్లలో బెంగళూరుకే ఆడిన స్టెయిన్ ఆ తర్వాత రెండు హైదరాబాద్ జట్లు డీసీ, సన్‌రైజర్స్, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 90 ఐపీఎల్ మ్యాచ్‌లలో అతను 6.72 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు. -
ఆర్సీబీ జట్టులోకి డేల్ స్టెయిన్!
హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. స్టెయిన్ ఐపీఎల్ 2019 సీజన్లో ఆడటానికే భారత్‌కు వస్తున్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇండియా వీసాకు సంబంధించిన ఫొటోను స్టెయిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అహ్హా.. ఏంటీ ఈ సర్ప్రైజ్’ అనే క్యాఫ్షన్‌తో షేర్ చేయడంతో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులకు తీరని మనోవ్యథను మిగిల్చింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సీబీకి కలుసోస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాథన్కౌల్టర్ నీల్ స్థానంలో స్టెయిన్ తుదిజట్టులోకి వస్తునట్లు ప్రచారం చేస్తున్నారు. తమకు మంచిరోజులు రాబోతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టెయిన్ ఆర్సీబీ జట్టులో చేరితే ఆ జట్టుకు కలిసొచ్చే అంశమే. గత ఆరు మ్యాచ్‌ల్లో వారి బౌలింగ్ విభాగం తేలిపోయింది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేక పరాజయాలను చవిచూసింది. ఒకవేళ స్టెయిన్ జట్టులో చేరితే మాత్రం ఆ లోటు తీరనుంది. ఇక 2008 సీజన్ నుంచి 2010 వరకు స్టెయిన్ ఆర్సీబీ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. 2011లో డెక్కన్ చార్జెర్స్ తరపున ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున కూడా బరిలోకి దిగాడు. ఇక ఈ విషయంపై ఆర్సీబీ జట్టు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. స్టెయిన్ జట్టులో చేరే అవకాశం లేదని మాత్రం చెప్పలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలయర్స్ జట్టులో ఉండటంతో స్టెయిన్ రాకను కొట్టిపారేయలేమంటున్నారు. Dale Steyn to join RCB tomorrow — Merin Kumar ™ (@merin_kumar) April 11, 2019 -
కపిల్ దేవ్‌ను దాటేశాడు..!
డర్బన్: దక్షిణాఫ్రికా క్రికెట్ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో స్టెయిన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నాలుగు ప్రధాన వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్లో 437వ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. అయితే భారత దిగ్గజ బౌలర్ కపిల్‌దేవ్(434 వికెట్లు)ను స్టెయిన్ దాటేశాడు. తన కెరీర్లో 92వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న స్టెయిన్.. 26సార్లు ఐదు వికెట్లను సాధించాడు. కాగా, టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ముత్తయ్య మురళీ ధరన్(800వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, షేన్ వార్న్(708) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అనిల్ కుంబ్లే(619), జేమ్స్ అండర్సన్(575), మెక్‌గ్రాత్(563), కర్ట్నీ వాల్ష్(516)లు ఆ తర్వాత వరుస స్థానాల్లో ఉన్నారు. -
పాక్ అభిమానికి దిమ్మతిరిగే సమాధానం!
పెర్త్ : దక్షిణాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలో సైతం పదునైన బౌన్సర్లు సంధిస్తున్నాడు. ఎటకారం ఎక్కువై స్టెయిన్‌ను కామెంట్ చేసిన ఓ పాకిస్తాన్ అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్టెయిన్ ‘ఇప్పటివరకూ జరిగింది చాలు. ఈ టెస్ట్‌ని హాయిగా నా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా. నేనిప్పుడు కుర్చి విమర్శకుడిని అయ్యాను’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఓ పాక్ అభిమాని అత్యుత్సాహంతో ‘‘అవును, ఈ టెస్ట్ సిరీస్‌లో బాబార్ అజమ్ నీ బౌలింగ్‌లో చితక్కొట్టినప్పుడు.. నీకు కచ్చితంగా విరామం కావాల్సిందిలే’’ అంటూ ఎటకారంతో రిప్లే ఇచ్చాడు. దీనికి స్టెయిన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ‘‘అవును టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో గెలవడమే నిజంగా చితక్కొట్టించుకోవడమే’’ అంటూ చురకలంటించాడు. ఈ సమాధానంతో సదరు అభిమాని ‘‘నేను నా దేశం పరువు తీసినందుకు క్షమించండి. కానీ నాకు ఆ దిగ్గజం నుంచి రిప్లే కోసం అలా ట్వీట్ చేసాను’’ అని పేర్కొన్నాడు. కాగా స్టెయిన్ రిప్లే నెటిజన్లను ఆకట్టుకుంది. మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టే స్టెయిన్.. సోషల్‌మీడియా తన ట్వీట్లతో అదరగొట్టాడు అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. బాబర్ ఆజమ్ క్రికెట్లోకి వచ్చిన బచ్చాగాడని, స్టెయిన్ దిగ్గజ బౌలరని సదరు అభిమానికి హితవు పలుకుతున్నారు. కామెంట్ చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని చేయాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. You sure need some comfort after that spanking by Babar Azam in the Test series. — BernaLeo (@MQunClub91011) January 31, 2019 Yes, 3-0 in the test series is a proper spanking. #burn — Dale Steyn (@DaleSteyn62) January 31, 2019 Sorry Pakistan for getting our country embarrassed but I really wanted a reply from him #Legend🔥🔥😂🤣 https://t.co/rOVM2YeOQj — BernaLeo (@MQunClub91011) January 31, 2019 -
దక్షిణాఫ్రికా శుభారంభం
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో డేల్ స్టెయిన్ (2/18) నిప్పులు చెరగడంతో దక్షిణాప్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టెయిన్‌తో పాటు ఫెలుక్వాయో (3/33), ఇన్‌గిడి (2/26), ఇమ్రాన్ తాహిర్ (2/39) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 38.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. కూల్ట ర్నీల్ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్), అలెక్స్ కారీ (33; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం సునాయాస లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు డికాక్ (40 బంతుల్లో 47; 7 ఫోర్లు), హెన్డ్రిక్స్ (44; 4 ఫోర్లు) రాణించడంతో 29.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుకిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. 1996లో సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 3 మధ్యకాలంలో ఆస్ట్రేలియా వరుసగా ఆరు వన్డేల్లో ఓడింది. ఆ తర్వాత ఆ జట్టుకు అత్యధిక వరుస ఓటములు ఎదురుకావడం ఇదే తొలిసారి. రెండో వన్డే శుక్రవారం అడిలైడ్‌లో జరుగనుంది. -
పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చోటుచేసుకున్న ఈ అద్భుత ఫీట్‌కు మైదానంలోని ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆటగాళ్లైతే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. (చదవండి: అయ్యో తాహీర్.. ఎంత పనాయే!) ఇక ఈ మ్యాచ్‌తో పేసర్ డేల్ స్టేయిన్ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అతనేసిన రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తొలుత ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన స్టేయిన్ అనంతరం క్రీజులోకి వచ్చిన డీఆర్సీ షార్ట్‌ను డుప్లెసిస్ అద్భుత ఫీల్డింగ్‌తో డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. స్టెయిన్ వేసిన ఫుల్ లెంగ్త్‌ను డీఆర్సీ షాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ అంతే వేగంతో సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు పెహ్లుక్వాయో మూడు, ఎంగిడి, స్టెయిన్, తాహిర్‌లు రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 152 పరుగులకే కుప్పకూలింది. (చదవండి: వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ!) Wake up for this 💯💙.!! #AUSvsSA #dalesteyn #fab @DaleSteyn62 @OfficialCSA @CAComms @ICC pic.twitter.com/2i9J9wSI82 — Ragul fraNk (@Ragulfrank) November 4, 2018 Good catch, Faf. #AUSvSA pic.twitter.com/fiMPs6lgUD — Googly (@googlyAU) November 4, 2018 -
రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ నెల 30 నుంచి జింబాబ్వేతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో స్టెయిన్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. గత కొద్ది నెలలుగా గాయాలతో సతమతమవుతున్న ఈ స్సీడ్ గన్ శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అయితే 2019 ప్రపంచకప్ దృష్ట్యా జింబాబ్వే సిరీస్‌కు 35 ఏళ్ల స్టెయిన్‌ను పరీక్షించడానికి సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. స్టెయిన్ ఫిట్నెస్, ప్రపంచకప్ వరకు ఆడగలడా వంటివి పరీక్షించే అవకాశం వుంది. ‘జింబాబ్వే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకతో కీలక సిరీస్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లతో ప్రపంచకప్ కోసం బలమైన జట్టును తయారు చేసుకోవచ్చు. అన్ని రకాలు ప్రయోగాలు చేసాం. ఎవర ప్రపంచకప్ వరకు ఆడే సత్తా ఉందో ఈ సిరీస్‌లతో తేలిపోతుంది. కెప్టెన్ డుప్లెసిస్‌కు శ్రీలంకతో సిరీస్ సందర్భంగా భుజానికి గాయమైంది. జింబాబ్వే సిరీస్ ప్రారంభం వరకు కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఒక వేళ కోలుకోకుంటే ఆ సిరీస్‌కు నాయకత్వం వహించేది ఎవరనేది త్వరలో చెపుతాం’ అంటూ దక్షిణాఫ్రికా సెలక్షన్ కన్వీనర్ లిండా జోండి తెలిపారు. -
2019 వరల్డ్ కప్ తర్వాతే రిటైర్మెంట్
కేప్‌టౌన్ : 2019 వరల్డ్ కప్ తర్వాతే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు. తన అనుభవాన్ని, ప్రదర్శనను దృష్టిలో పెట్టుకోనైనా సరే రానున్న వరల్డ్ కప్‌కు ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ..‘మా(దక్షిణాఫ్రికా) బ్యాటింగ్ లైనప్ చూడండి. టాప్‌లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లు కలిపి 1000 మ్యాచ్‌లు ఆడారు. కానీ లోయర్ ఆర్డర్‌కి వచ్చే సరికి అంతా కలిపి 150 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ప్రతీసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా 2019 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో నేనుంటాను. మరో వరల్డ్ కప్ వచ్చే సరికి నాకు 40 ఏళ్లు నిండుతాయి. అప్పుడు ఎలాగో తప్పుకోవాల్సిందే. అయితే టెస్టు క్రికెట్ మాత్రం కొనసాగిస్తానని’ ఈ ప్రొటీస్ బౌలర్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ గురించి ప్రస్తావిస్తూ... ‘ ప్రస్తుతం నేను గాయాల బారి నుంచి కోలుకున్నాను. పూర్తి ఫిట్నెస్ సాధించాను. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడాను. నా వరకు మంచి ప్రదర్శనే ఇచ్చానని అనుకుంటున్నాను. కానీ శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాను. అయినా గాయాల నుంచి కోలుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదని’ స్టెయిన్ పేర్కొన్నాడు. కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. గాలేలో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌గన్.. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. -
సరికొత్త రికార్డుకు వికెట్ దూరంలో..
గాలె: దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ సరికొత్త రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లను సాధించేందుకు స్టెయిన్‌కు వికెట్ మాత్రమే అవసరం. ప్రస్తుతం 421 టెస్టు వికెట్లతో ఉన్న స్టెయిన్.. సఫారీ దిగ్గజ పేసర్ షాన్ పొలాక్ సరసన సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్లు సాధించిన స్టెయిన్ పొలాక్ సరసన నిలిచాడు. అయితే పొలాక్ కంటే 21 టెస్టులు ముందుగానే స్టెయిన్ ఈ ఫీట్‌ను సాధించడం ఇక్కడ మరో విశేషం. శుక్రవారం నుంచి కొలంబోలో జరుగనున్న రెండో టెస్టులో స్టెయిన్ తమ దేశం తరపున అత్యధిక టెస్టు వికెట్లను సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కే అవకాశం ఉంది. భుజం గాయంతో దాదాపు 13 నెలలు పాటు క్రికెట్‌కు దూరమైన స్టెయిన్.. తన చివరి టెస్టును గతేడాది జనవరిలో భారత్‌పై ఆడాడు. -
‘అతడు ఎప్పటికీ ప్రమాదకర బౌలరే’
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. తన దైన శైలిలో భిన్నంగా స్పందిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేసే ఈ డాషింగ్ ఓపెనర్.. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకోంటుంది. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్ డేల్ స్టెయిన్, అతడు బౌలింగ్ చేస్తుంటే మైదానంలో పచ్చిక కూడా పచ్చగా వెలిగిపోద్ది. జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్’ అంటూ ట్వీట్ చేశారు. సెహ్వాగ్ లాంటి భీకర బ్యాట్స్‌మన్ స్టెయిన్‌ను అంతలా పొగడ్తలతో ముంచెత్తడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్టెయిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్, నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. స్టెయిన్ కూడా ఈ క్రికెటర్ల ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. ‘నాకు మీ నుంచి విషస్ రావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ స్టెయిన్ బదులిచ్చారు. స్టెయిన్‌కు సహచర క్రికెటర్లతో పాటు ఐసీసీ కూడా బర్త్ డే విషస్ చెప్పింది. Whenever you think of the most dangerous bowlers in the world @DaleSteyn62 ka sthan sada rahega. Whenever Steyn bowled, the grass always seemed greener than what it was. Happy Birthday Steyn Gun ! pic.twitter.com/twZeuoFNBq — Virender Sehwag (@virendersehwag) June 27, 2018 A very happy birthday to you @DaleSteyn62. Wish you good health and happiness. pic.twitter.com/DOE2v3ZGiw — Sachin Tendulkar (@sachin_rt) June 27, 2018 -
మూడు వికెట్ల దూరంలో..
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో వసీం ఆక్రమ్ తర్వాతి స్థానం ఎవరంటే దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ అని క్రికెట్ పండితులు పేర్కొంటారు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలిత్తించిన స్టెయిన్ నేడు(జూన్ 27న) 35వ ఏట అడుగుపెడుతున్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన స్టెయిన్ అనతికాలంలోనే జట్టులో, క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. స్టెయిన్ 14 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు సాధించాడు. ఈ మధ్య కాలంలో వరుస గాయాలతో జట్టుకు దూరమవుతూ ఇబ్బందులు పడుతున్నా.. తన బౌలింగ్ వేగం ఎక్కడా తగ్గటం లేదు. కుర్రాళ్లు ఎంతమంది జట్టులోకి వచ్చి అదరగొట్టినా, స్టెయిన్ ప్రత్యేకతే వేరు. క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఈ స్పీడ్‌గన్ మరో మూడు టెస్టు వికెట్లు సాధిస్తే దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకోల్పనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు ప్రొటీస్ దిగ్గజం షాన్ పొలాక్ పేరిట ఉంది. ఈ రికార్డును శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో స్టెయిన్ తిరగరాస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. ‘నా టార్గెట్ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్’ అంటూ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అనంతరం డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యం పూర్తి చేసేవరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాను సాధించాల్సిన లక్ష్యాలకు గాయాలు అడ్డంకి కాదని, గాయంతో జట్టుకు దూరమైనప్పుడు మరింత ఉత్తేజంతో తిరిగి జట్టులోకి వస్తానని ఈ ప్రొటీస్ బౌలర్ తెలిపాడు. -
‘నా టార్గెట్ 100 టెస్ట్‌లు 500 వికెట్లు’
కేప్‌టౌన్ : వరుస గాయాలతో సతమతమవుతూ, కెరీర్ చరమాంకంలో ఉందనుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తిరిగి జట్టులో స్థానం సాధించాడు. శ్రీలంకతో జులైలో జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్ఏ) స్టెయిన్ గన్ను ఎంపిక చేసింది. న్యూలాండ్స్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ స్పీడ్‌స్టర్ గాయపడటంతో మిగిలిన టెస్ట్‌లకు, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో ఆ గాయం నుంచి కోలుకుని, కఠోర శ్రమతో ఫిట్నెస్ సాధించి సీఎస్ఏ దృష్టిలో పడ్డాడు. మోర్నీ మోర్కెల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బౌలింగ్‌లో అనుభవలేమి సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో సీఎస్ఏ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టెయిన్‌కు స్థానం కల్పించారు. దీంతో పాటు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన కగిసో రబడా కోలుకోవడంతో జట్టులో స్థానం కల్పించారు. స్టెయిన్ ఆనందం శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయడం పట్ల స్టెయిన్ అనందం వ్యక్తం చేశారు. జట్టులో స్థానం లభించిన తర్వాత స్టెయిన్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ క్రికెట్లో అత్యున్నతమైన ఆట ఆడటానికి వయసు అడ్డంకి కాదని, పూర్తి ఫిట్నెస్ ఉన్నంతకాలం ఆడతానని ఈ ప్రొటీస్ బౌలర్ పునరుద్ఘాటించారు. దక్షిణాఫ్రికా తరుఫున అత్యధిక టెస్ట్ వికెట్లు(86 టెస్టుల్లో 422 వికెట్లు) సాధించిన స్పీడ్‌గన్ తాను ఇంకా సాధించాల్సిన లక్ష్యాన్ని తెలిపారు. ‘నా వయసు 35 సంవత్సరాలు, నేను కెరీర్లో సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నా టార్గెట్ 100 టెస్టులు ఆడాలి, 500 టెస్టు వికెట్లు సాధించాలి. అలాగే 2019 ప్రపంచకప్‌లో ఆడాలి. అవి సాధించడానికి వయసుతో సంబంధం లేకుండా కష్టపడతాను’అంటూ స్టెయిన్ తెలిపారు. -
కౌంటీలతో స్టెయిన్ పునరాగమనం
గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతోన్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనానికి ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా మడమ గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న 34 ఏళ్ల స్టెయిన్ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించాడు. ‘ఇప్పుడు 12 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్నా. కానీ టెస్టు మ్యాచ్‌కు ఇది సరిపోదు. అందుకే ఐపీఎల్లో పాల్గొనకుండా కౌంటీల్లో హాంప్‌షైర్ తరఫున బరిలో దిగాలనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్తా’ అని స్టెయిన్ అన్నాడు. -
స్టెయిన్ ‘గన్ డౌన్’
భారత్‌తో జరుగుతున్న కేప్‌టౌన్ టెస్టులో 17.3 ఓవర్లు వేసిన తర్వాత... ఈ మ్యాచ్‌కు ముందు తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై పెర్త్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్ల తర్వాత... అంతకు కొన్నాళ్ల క్రితం డర్బన్‌లో ఇంగ్లండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 3.5 ఓవర్ల తర్వాత... దానికంటే ముందు మొహాలీలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లకే! దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడం ఇది కొత్త కాదు. తాను బరిలోకి దిగిన గత ఆరు టెస్టుల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆట మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు కూడా అతను తొలి టెస్టుతో పాటు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతను మళ్లీ కోలుకొని జట్టులోకి రావడం, గత స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం కావచ్చు. పదమూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసి ఎందరో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన స్టెయిన్ కెరీర్ ప్రమాదంలో పడింది. తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ మీడియాతో మాట్లాడుతూ స్టెయిన్‌కు తుది జట్టులో దాదాపుగా అవకాశం లేదని తేల్చేశాడు. జట్టు కూర్పు ఒక సమస్య కాగా, గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను, ఏదైనా జరిగి మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే సమస్యగా మారుతుందని స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఆయన భయపడినట్లే జరిగింది. న్యూలాండ్స్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని సఫారీ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతో స్టెయిన్‌కు చాన్స్ లభించినా... అతను మళ్లీ గాయంతో వెనుదిరగడం ఆ టీమ్‌ను ముగ్గురు పేసర్లకే పరిమితం చేసింది. ఇది చివరకు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు కూడా. భుజం గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేశాక ఇప్పుడు మరో కొత్త తరహా గాయం (మడమ)తో అతను మధ్యలోనే వెళ్లిపోవడం ఏమాత్రం మేలు చేసేది కాదు. భారత్‌తో సిరీస్ తర్వాత మార్చిలో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఉంది. అతను అప్పటిలోగా కోలుకోగలడా? ప్రదర్శన బాగున్నా... భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత స్టెయిన్ ముందుగా దేశవాళీ టి20ల్లో ఐదు మ్యాచ్‌లు ఆడి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా 12 ఓవర్లు వేశాడు. అయితే అనారోగ్యంతో జింబాబ్వేతో టెస్టు ఆడలేకపోయాడు. భారత్‌తో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో ఎప్పటిలాగే పదును కనిపించడం విశేషం. షార్ట్ బంతులు, అవుట్ స్వింగర్లు వేయడంలో ఎక్కడా తీవ్రత తగ్గకపోగా, బౌలింగ్ రనప్, యాక్షన్‌లో ఎక్కడా పాత గాయం సమస్య కనిపించలేదు. ధావన్‌ను వెనక్కి పంపిన బంతిగానీ, ఆ వెంటనే కోహ్లిని దాదాపుగా అవుట్ చేసినట్లుగా అనిపించిన బంతిగానీ పాత స్టెయిన్‌ను చూపించాయి. చాలా సార్లు స్టెయిన్ బంతులు గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా దాటాయి. ఆ తర్వాత సాహా వికెట్, పాండ్యా క్యాచ్ డ్రాప్ అయిన బంతి కూడా అతని గొప్పతనాన్ని చాటాయి. అయితే దురదృష్టవశాత్తూ గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం పేస్‌కు బాగా అనుకూలించే తర్వాతి రెండు టెస్టుల వేదికలు సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లలో అతను తప్పనిసరిగా జట్టులో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడంలేదు. గత రెండేళ్ల కాలంలో అతను తుంటి, రెండు సార్లు భుజం, మడమ గాయాలకు గురయ్యాడు. భుజానికి సర్జరీ కూడా జరగడంతో అతను ఏడాది పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అద్భుతమైన రికార్డు... సమకాలీన క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడు అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్ళలో జీవం లేని పిచ్‌లు, చిన్న మైదానాలు, పెద్ద బ్యాట్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అతను తన ముద్ర చూపించాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా అతని బౌలింగ్ ఇంకా భీకరమే. గాయంతో పెర్త్ టెస్టు నుంచి తప్పుకోవడానికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో అతని అద్భుత బౌలింగ్ పునాదితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలవగలిగింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టెయిన్ టాప్–10లో ఉన్నాడు. వారిలో కేవలం ఇద్దరు పేసర్లకు (మెక్‌గ్రాత్, హ్యాడ్లీ)లకు మాత్రమే స్టెయిన్ (22.32) కంటే మెరుగైన సగటు ఉంది. ఎంతో మంది పేసర్లు తమ సొంతగడ్డపై, అనుకూల పిచ్‌లపై చెలరేగినా... ఉపఖండానికి వచ్చేసరికి మాత్రం తేలిపోయారు. అయితే ఈతరంలో తనతో పోటీ పడిన బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, అండర్సన్, బ్రాడ్ తదితరులతో పోలిస్తే భారత్‌లాంటి చోట అతని ప్రదర్శన స్టెయిన్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. భారత గడ్డపై 6 టెస్టుల్లో కేవలం 21.38 సగటుతో 26 వికెట్లు పడగొట్టడం, పాకిస్తాన్లో 24.66, శ్రీలంకలో 24.71 సగటు అతనేమిటో చెబుతాయి. దక్షిణాఫ్రికా తరఫున 44 టెస్టు విజయాల్లో భాగమైన స్టెయిన్... వాటిలో నమ్మశక్యం కాని రీతిలో 16.03 సగటుతో 291 వికెట్లు పడగొట్టడం అతని విలువేమిటో చూపిస్తోంది. ఇలాంటి గొప్ప ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగియా లని ఏ జట్టూ కోరుకోదు. డాక్టర్ల సహకారంతో వీలైనంత త్వరగా అతను కోలుకునేలా ప్రయత్నిస్తామని జట్టు మేనేజర్ మూసాజీ చెప్పడం తమ స్టార్ ఆటగాడిపై వారికి ఉన్న నమ్మకమే కారణం. వారు ఆశించినట్లుగా స్టెయిన్ మళ్లీ తిరిగొచ్చి తన సత్తా చూపించాలని క్రికెట్ ప్రపంచం కూడా కోరుకుంటోంది. 419: 86 టెస్టుల్లో స్టెయిన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా పదో స్థానంలో ఉన్న అతను... మరో మూడు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా షాన్ పొలాక్ (421)ను అధిగమిస్తాడు. 60 ఏళ్ల వయసులో కూడా 90 కిలోమీటర్ల మారథాన్ పరుగెత్తే కొందరు మిత్రులే నాకు ఆదర్శం. ఫిట్నెస్ గురించి నాకు బెంగ లేదు. ప్రస్తుతం మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకంటే నా ఫిట్నెస్ చాలా బాగుంది. కనీసం ఈ ఏడాది మొత్తం ఆడిన తర్వాతే కెరీర్‌పై పునరాలోచిస్తా. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో నాకు క్రికెట్ గురించే తప్ప రిటైర్మెంట్, ఇతర వ్యాపకాల గురించి ఆలోచన లేదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్న నాకు వయసు సమస్యే కాదు. –కేప్‌టౌన్ టెస్టుకు ముందు స్టెయిన్ వ్యాఖ్య కేప్‌టౌన్‌కు వానొచ్చింది ► మూడో రోజు ఆట పూర్తిగా రద్దు ► భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు కేప్‌టౌన్: అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌కు ఆకస్మిక విరామం... రెండు రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టెస్టుకు మూడో రోజు వాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రోజంతా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. శనివారం రాత్రి నుంచే నగరంలో కురుస్తున్న వర్షం ఆదివారం ఉదయం జోరందుకుంది. మధ్యలో కొన్ని సార్లు తెరిపినిచ్చినా, గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు అది సరిపోలేదు. అంపైర్లు కనీసం న్యూలాండ్స్ మైదానాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేకుండా ఆటను రద్దు చేశారు. మ్యాచ్ నిర్దేశిత ఆరంభ సమయంనుంచి సరిగ్గా ఐదు గంటల తర్వాత అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్‌గా 142 పరుగులు ముందంజలో ఉంది. మిగిలిన రెండు రోజుల ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఎలాంటి తుది ఫలితం వస్తుందో చూడాలి. సోమ, మంగళవారాల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆట సాగనుంది. మరోవైపు ఈ భారీ వర్షం స్థానికంగా క్రికెట్ వీరాభిమానులను కూడా ఏమాత్రం నిరాశపర్చలేదు. ఈ వాన వారిలో అమితానందాన్ని నింపింది. వర్షాలే లేకపోవడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న కేప్‌టౌన్‌కు ఇదో వరంగా వారు భావిస్తున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం సోమవారం మాత్రం వర్షసూచన లేదు. –సాక్షి క్రీడా విభాగం -
'అతనికే కాదు.. ఎవ్వరికీ భయపడం'
న్యూఢిల్లీ:తన పదునైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేస్తానన్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ వ్యాఖ్యలకు మొహ్మద్ షమీ దీటైన జవాబిచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో స్టెయిన్‌కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి భయపడబోమంటూ టీమిండియా ప్రధాన పేసర్ షమీ స్పష్టం చేశాడు. 'ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. మమ్మల్ని భయపెడతామని ఎవరైనా చెప్పొచ్చు. దక్షిణాఫ్రికా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నాం. అక్కడ స్టెయిన్ పేస్కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి టీమిండియా భయపడదు. మా జట్టు 100 శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారించింది. దక్షిణాఫ్రికా పేస్‌కు దీటుగా బదులిచ్చేందుకు మా జట్టు సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లనుంచి మేము ఏ జట్టుకు భయపడటం లేదనేది గుర్తుంచుకోవాలి. త్వరలో దక్షిణాఫ్రికా దైపాక్షిక సిరీస్‌లో కూడా అదే రిపీట్ చేస్తాం. కాకపోతే మా ప్రణాళికలు ఏమిటో మీడియా ముందు చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఒక్క విషయం చెబుతున్నా. దక్షిణాఫ్రికా పిచ్‌లపై షార్ట్ బంతుల్ని సంధించడానికి దూరంగా ఉంటాం. దక్షిణాఫ్రికా జట్టులో స్వ్కేర్ కట్, పుల్ షార్ట్, హుక్ షాట్లను అవలీలగా ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి విభిన్నమైన ప్రణాళికలతో సఫారీ పర్యటన ఉండబోతుంది' అని షమీ పేర్కొన్నాడు. అంతకుముందు స్టెయిన్ మాట్లాడుతూ.. మా పిచ్‌లపై 150 కి.మీ వేగంతో బంతులు సంధించి టీమిండియాను భయపెడతాం. కచ్చితమైన లెంగ్త్‌తో పాటు బౌన్సర్లతో విరాట్ సేనను హడలెత్తిస్తాం' అని స్టెయిన్ ముందుగా మాటల యుద్ధానికి తెరలేపాడు. -
భారత్‌తో అంత ఈజీ కాదు!
న్యూఢిల్లీ : దాదాపు ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్‌కు భారత్‌పై రాణించడం అంత సులువైన విషయం కాదని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టెయిన్ భుజానికి గాయమైంది. దీంతో ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ‘పదేళ్లు తన బౌలింగ్‌తో అద్బుతంగా రాణించిన స్టెయిన్‌కు పునరాగమనం అంత ఈజీ కాదు. జింబాంబ్వేతో జరుగుతున్న నాలుగురోజుల ప్రయోగాత్మక టెస్టు.. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ప్రతిబింబించలేదు.’ అని బజ్జీ దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనపై తన అభిప్రాయం తెలిపాడు. ‘భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. చాలా నాణ్యమైన బ్యాట్స్‌మెన్ భారత జట్టులో ఉన్నారు. మురళి విజయ్, చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రోహిత్ శర్మలతో కూడిన పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవడం స్టెయిన్, మోర్కెల్లకు పెద్ద సవాలే.’ అని హర్బజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆరో స్థానంలో ఆడుతున్న పాండ్యాకు బదులు రోహిత్‌ను చూడాలనుందన్న బజ్జీ .. పాండ్యా బెస్ట్ ఆల్‌రౌండరే కానీ రోహిత్ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చని, భారత్ ముగ్గురు పేసర్లను బరిలోకి దించే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నాడు. -
స్టెయిన్ కు తప్పని నిరీక్షణ
కేప్‌టౌన్: దాదాపు ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ పునరాగమనం కోసం నిరీక్షణ తప్పడం లేదు. వచ్చే వారం దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాలని భావించిన స్టెయిన్ మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ మేరకు తాను ఇంకా టెస్టు క్రికెట్ ఆడటానికి సిద్ధం కాలేదని విషయాన్ని స్టెయిన్ స్వయంగా వెల్లడించాడు. 'నేను క్రికెట్ ఆడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను బౌలింగ్ బాగానే వేస్తున్నా. కాకపోతే ఎక్కువ పని భారాన్ని భుజాన వేసుకునేంతగా ఫిట్ కాలేదు. అప్పుడే టెస్టు క్రికెట్ ఆడటం అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. అది నాలుగు రోజుల దేశవాళీ మ్యాచ్ కావొచ్చు.. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ కావొచ్చు. ఫిట్ గా ఉన్నానని భావించిన తరువాత మాత్రమే టెస్టు క్రికెట్ ఆడతా'అని స్టెయిన్ తెలిపాడు. దాంతో త్వరలో బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ లో స్టెయిన్ పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి. గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారి కనిపించి స్టెయిన్.. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని భుజానికి శస్త్ర చికిత్స అనంతరం సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకున్న స్టెయిన్ తిరిగి బరిలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. -
ఇక నిరీక్షణ ముగిసింది!
కేప్‌టౌన్: దాదాపు ఏడాది కాలంగా క్రికెట్ కు దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టెయిన్.. గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారి కనిపించాడు. అతని భుజానికి శస్త్ర చికిత్స అనంతరం సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకున్న స్టెయిన్ తిరిగి బరిలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పునరాగమనానికి సంబంధించి 'ఇక నిరీక్షణ ముగిసింది' అని పోస్ట్ చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-1 తో దక్షిణాఫ్రికా కోల్పోయింది. ప్రధానంగా స్టెయిన్ దూరం కావడంతో పాటు, మరో ఇద్దరు పేసర్లు ఫిలిండర్, క్రిస్ మోరిస్ లను గాయాలు వేధించడంతో ఇంగ్లండ్ చేతిలో సఫారీలకు ఘోర పరాభవం ఎదురైంది. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు స్టెయిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఇంగ్లండ్ పర్యటనకు స్టెయిన్ దూరం
కేప్‌టౌన్: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టు నుంచి ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ వైదొలిగాడు. ఇంకా భుజం గాయం నుంచి కోలుకోలేకపోవడంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు స్టెయిన్ పేర్కొన్నాడు. అయితే వచ్చే నెల్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే విషయంలో మాత్రం స్టెయిన్ ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయం కారణంగా దూరమైన స్టెయిన్ అప్పట్నుంచి క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు. అతని గాయం పదే పదే ఇబ్బంది పెడుతుండటంతో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ సర్జరీ నుంచి కోలుకునే ప్రయత్నంలో స్టెయిన్ మరికొన్ని రోజులు పాటు సఫారీ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. 'నేను గాయం నుంచి కోలుకుంటున్నా. తిరిగి క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెట్టడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనే అనుకుంటున్నా. ప్రస్తుతం నేను చాలా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. రన్నింగ్, జిమ్ వర్క్‌లు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ కు ఇంకా రెఢీ కాలేదు'అని స్టెయిన్ పేర్కొన్నాడు. -
డివిలియర్స్, మోర్కెల్లకు ఉద్వాసన
జోహన్నెస్ బర్గ్: న్యూజీలాండ్ తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ దూరం కానున్నాడు. దీంతో కెప్టెన్సీ పగ్గాలను టీ20 కెప్టెన్ డుప్లెసిస్ కు అప్పగించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. కివీస్ తో టెస్టు సిరీస్ నుంచి డివిలియర్స్, ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ లకు సఫారీ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్, వెర్నర్ ఫిలాండర్, ఆల్ రౌండర్ వేన్ పార్నెల్ 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 19న డర్బన్ లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో గాయపడ్డ డివిలియర్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని అందుకే కివీస్ టూర్ కు ఎంపిక చేయలేదు. మరోవైపు మోర్నీ మోర్కెల్ వెన్నునొప్పితో సతమతమవుతున్నాడని, అతడికి 4 నుంచి 6 వారాలపాటు విశ్రాంతి కావాలని బోర్డు తెలిపింది. 2004లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచీ గాయాల కారణంగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్సవ్వని డివిలియర్స్ ప్రస్తుత సిరీస్ కు దూరం కానున్నాడు. గత ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే హషీం ఆమ్లా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో డివిలియర్స్ ను టెస్టు కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. -
నా టార్గెట్ వాళ్లే: నెం1 బౌలర్
లండన్: తాను టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించినప్పటికీ దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్ డెల్ స్టెయిన్ తన జనరేషన్ బౌలరని ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ వికెట్లు తీయడమే తన టార్గెట్ అని, దాంతో జట్టుకు విజయాన్ని అందించడం సులువవుతుందని చెప్పాడు. 91 టెస్టుల్లో 28.66 సగటుతో 333 వికెట్లు తీయగా... సఫారీ స్పీడ్ స్టార్ స్టెయిన్ 82 టెస్టుల్లో 22.53 సగటుతో 406 వికెట్లు పడగొట్టాడు. అందుకే గ్రేట్ ఫాస్ట్ బౌలర్లు వెస్టిండీస్ కు చెందిన మాల్కమ్ మార్షల్, ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ, ఇంగ్లండ్ కు చెందిన ఫ్రెడ్ ట్రూమన్ సగటు మాత్రమే 20 కంటే తక్కువగా ఉందన్నాడు. ఇప్పటికీ అదేమాట చెబుతున్నాను.. డెల్ స్టెయిన్ కంటే తానే అత్యుత్తమ బౌలర్ నని చెప్పాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న స్టూవర్ట్ బ్రాడ్ గతంలో తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చుకున్నాడు. స్టెయిన్ ను ఈ జనరేషన్ బౌలర్ అని మాత్రమే చెప్పాను, బెస్ట్ బౌలర్ అని చెప్పలేదని వివరించాడు. బెస్ట్ ర్యాంకు కోసం తాను చాలా శ్రమపడ్డాననీ, అందుకే టాప్ ర్యాంకు తన సొంతమైందన్నాడు. బెస్ట్ బౌలింగ్ వనరులున్న సహచరులతో పోటీ పడి వికెట్లు తీయడం చాలా కష్టమంటున్నాడు -
మలింగా అవుట్: స్టెయిన్ ఇన్
బ్రిడ్జిటౌన్(బార్బోడాస్): త్వరలో ఆరంభం కానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నుంచి శ్రీలంక పేస్ బౌలర్ లషిత్ మలింగా తప్పుకున్నాడు. సీపీఎల్ లో భాగంగా జమైకా తల్లావాస్ జట్టుకు మలింగా ఆడాల్సిఉంది. ఇటీవల కాలంలో తరచు గాయాల బారిన పడుతున్న మలింగా టోర్నీ నుంచి ముందుగానే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ కు అవకాశం కల్పించారు. సీపీఎల్‌లో తొలిసారి పాల్గొంటున్న స్టెయిన్ కు ఇది ఆరో టీ 20 ప్రాంఛైజీ కావడం విశేషం. జూన్ 30 నుంచి ఆగస్టు 7వరకూ జరిగే సీపీఎల్‌లో పలువురు సఫారీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వీరిలో హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్,డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్‌లు ఉన్నారు. ఇదిలా ఉండగా గత నవంబర్ నుంచి గాయాలతో సతమతమవుతున్న మలింగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)9 సీజన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మలింగా ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో చేరినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన మలింగా.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనలేదు. -
స్టెయిన్ స్థానంలో రబడా
డర్బన్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో నాలుగు కీలక వికెట్లు తీసి గాడిలో పడ్డట్లు కనిపించిన దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ డేల్ స్టెయిన్ కు భుజం గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో శనివారం నుంచి కేప్ టౌన్ లో ఆరంభం కానున్న రెండో టెస్టుకు స్టెయిన్ దూరం కానున్నాడు.. ఈ మేరకు కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఓ ప్రకటనలో స్టెయిన్ కు విశ్రాంతినిస్తున్నట్లు తెలిపాడు. అతని స్థానంలో రబడాను తుది జట్టులో తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గత ఐదు టెస్టుల నుంచి జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ డీ కాక్ రేపటి టెస్టులో ఆడనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో సఫారీలు 241 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టులో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. -
నాలుగో టెస్టుకు స్టెయిన్ దూరం
న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లలో భారత్‌తో గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టులో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా ఆడటం లేదు. ప్రస్తుతం డేల్ స్టెయిన్ ఫిట్‌గా లేకపోవడంతో నాలుగో టెస్ట్‌లో ఆడటం లేదని హషిం ఆమ్లా బుధవారం తెలిపారు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న డేల్ స్టెయిన్ మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చి నెట్ సెషన్లో పాల్గొనలేదు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు. -
రెండో టెస్టుకు స్టెయిన్ దూరం
బెంగళూరు: టీమిండియాతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టుకు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. మొహాలీ టెస్టులో గాయపడిన స్టెయిన్ శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్ లో విఫలం చెందడంతో అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ సెలెక్షర్లు ప్రకటించారు. తొలి టెస్టుకు ముందే మోర్కెల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు, గురువారం ఫుట్ బాల్ ఆడుతూ వెర్నాన్ ఫిలాండర్ గాయపడటంతో అతను కూడా జట్టుకు దూరమయ్యాడు. దీంతో ముగ్గురు ప్రధాన పేసర్లు లేకుండా దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతుండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.