Virat Kohli
-
‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’
‘టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్‌ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.క్రికెట్ కింగ్‌గా పేరొందిన విరాట్ కోహ్లి.. 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.అప్పటి నుంచి ఎక్కువగా లండన్లోనేఇక వామిక భారత్‌లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్‌తో కలిసి అనుష్క లండన్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. విరాట్ కూడా సొంతగడ్డపై మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్‌లు ఉన్న సమయంలో లండన్ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.లండన్‌లో స్థిర నివాసంఅదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.‘‘అవును.. విరాట్ కోహ్లి లండన్‌కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.కారణం ఇదేకాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్‌లో కోహ్లి భారత పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత శాశ్వతంగా లండన్లోఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్‌కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.చదవండి: సంజూ శాంసన్‌కు షాక్ -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
డిసెంబర్ 19.. భారత క్రికెట్లో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?
డిసెంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. టెస్ట్ క్రికెట్లో ఇవాల్టి దినాన టీమిండియా రెండు భిన్నమైన రికార్డులు నమోదు చేసింది. 2016లో ఈ రోజున భారత్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత (2020లో) మళ్లీ ఇదే రోజున భారత్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.2016, డిసెంబర్ 19న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌పై 7 వికెట్ల నష్టానికి 759 పరుగులు స్కోర్ చేసింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటికీ ఇదే అత్యధిక స్కోర్. చెన్నై వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అజేయమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. నాటి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2020, డిసెంబర్ 19న భారత్ టెస్ట్‌ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్‌గా ఉంది. టెస్ట్‌ల్లో భారత అత్యధిక స్కోర్, అత్యల్ప స్కోర్ విరాట్ కోహ్లి నేతృత్వంలో వచ్చినవే కావడం విశేషం. -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు) -
Kohli- Gambhir: మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ సైతం..
గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్ నైట్ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్‌ను ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) విఫలమైనా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్.. విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.రాహుల్, జడేజా విలువైన అర్ధ శతకాలుఇక కేఎల్ రాహుల్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగే సమయానికి భారత్ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఆకాశ్ దీప్ బ్యాట్‌తో అదరగొట్టాడు.గట్టెక్కించిన పేసర్లుమరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.మ్యాచ్ గెలిచినంత సంబరంహెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్‌ను చీర్ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్‌కు సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్), ఆకాశ్ దీప్27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడం ఆఖర్లో హైలైట్‌గా నిలిచింది.గబ్బాలో కనీసం డ్రా కోసంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.ఈ క్రమంలో బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బౌలింగ్ చేయగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం Moment hai bhai, moment hai ft. #ViratKohli! 😂#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/3s0EOlDacC— Star Sports (@StarSportsIndia) December 17, 2024Read the lips of Gambhir and Kohli, follow-on bach gaya bc 😂 pic.twitter.com/ibIRSQTwEK— Prayag (@theprayagtiwari) December 17, 2024THE MOMENT AKASH DEEP & BUMRAH SAVED FOLLOW ON..!!!! 🇮🇳- The celebrations and Happiness of Virat Kohli, Rohit Sharma & Gautam Gambhir was priceless. ❤️ pic.twitter.com/i0w0zRyNPa— Tanuj Singh (@ImTanujSingh) December 17, 2024 -
'సచిన్ కూడా అప్పట్లో నీలాగే అవుటయ్యాడు.. కానీ’
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన కోహ్లి.. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న కోహ్లి ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఫాస్ట్ బౌలర్లు కోహ్లిని ఈజీగా ట్రాప్ చేసి పెవిలియన్‌కు పంపుతున్నారు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్లే బంతిని వెంటాడే క్రమంలో విరాట్ తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. మొత్తం అన్ని సార్లు వికెట్ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతికే చిక్కాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి భారతక్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. 2004 ఆసీస్ పర్యటనలో మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ ఏమి చేశాడో, ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా అలానే చేయాలని గవాస్కర్ సలహా ఇచ్చాడు."సచిన్ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లి ఉదాహరణగా తీసుకోవాలి. 2004 ఆసీస్ పర్యటనలో సచిన్ కూడా ఇదే సమస్యలను ఎదుర్కొన్నాడు. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అతడు ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్లే బంతులను ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలోనూ స్లిప్స్ లేదా షార్ట్ గల్లీ వద్ద ఫీల్డర్లకు చిక్కాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం సచిన్ ఆ తప్పు చేయలేదు. కవర్స్ దిశగా ఎటువంటి షాట్లు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. స్ట్రైట్ డ్రైవ్స్, మిడ్ ఆఫ్ దిశగానే షాట్లు ఆడాడు. అతడు తనకు ఇష్టమైన కవర్ డ్రైవ్ షాట్ కూడా ఆడలేదు. ఆఫ్-స్టంప్ వెలుపల బంతులను టచ్ చేయకూడదని సంకల్పంగా పెట్టుకున్నాడు. తన స్కోర్ 200 పరుగులు దాటాక సచిన్ కవర్స్ వైపు షాట్ ఆడాడు. ఇప్పుడు కోహ్లి కూడా సచిన్‌నే ఫాలో అవ్వాలి. ఆఫ్-స్టంప్ వెలుపుల బంతులను ఆడే సమంయలో మన మనస్సు నియంత్రణలో" ఉంచుకోవాలి అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND Vs AUS 3rd Test: తీరు మార్చుకోని విరాట్ కోహ్లి..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తమ ఇన్నింగ్స్ ప్రారంభించి పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండానే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాది జోష్ మీద కనిపించిన యశస్వి జైస్వాల్ రెండో బంతికే స్టార్క్ పన్నిన పన్నాగానికి బలయ్యాడు. స్టార్క్ సంధించిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన యశస్వి షార్ట్ మిడ్వికెట్లో కాపు కాసిన మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఈ బంతిని ఆడాల్సి అవసరం లేదు. వదిలేస్తే సరిపోయేది. కానీ గిల్ వెంటాడి మరీ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ గల్లీలో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ ఒక్క పరుగు వద్దే ముగిసింది. భారత్ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చేసిన తప్పునే మరోసారి చేశాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఇలాంటి బంతులను ఎదుర్కోవడంలో విరాట్ తరుచూ విఫలమవుతున్నాడు. Virat Kohli and the delivery outside off stump 🥲Same story!pic.twitter.com/kuHQXBPLjY— CricTracker (@Cricketracker) December 16, 2024విరాట్ ప్రతిసారి ఒకే తరహాలో ఔట్ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. చేసిన తప్పునే ఎన్ని సార్లు చేస్తావు. నేర్చుకోవా అంటూ చురకలంటిస్తున్నారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతులను డ్రైవ్ చేయాల్సిన అవసరమేముందంటూ తలంటుతున్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి విరాట్ పెవిలియన్ బాటపట్టాడు.మొత్తానికి మూడో రోజు తొలి సెషన్లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. కేఎల్ రాహుల్‌కు (13) జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. విరాట్ ఔట్ కాగానే వర్షం మొదలైంది. అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 3rd Test: అలెన్ బోర్డర్ రికార్డును సమం చేసిన విరాట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ అలెన్ బోర్డర్ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్కీపర్ల జాబితాలో బోర్డర్, విరాట్ సమానంగా నిలిచారు. అలెన్ బోర్డర్ తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై 71 క్యాచ్‌లు పట్టగా.. విరాట్, ఆసీస్‌పై అన్నే క్యాచ్‌లు పట్టాడు. ఈ విభాగంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉన్నాడు. స్మిత్.. ఇంగ్లండ్‌పై 76 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్ధనే ఉన్నాడు. జయవర్ధనే ఇంగ్లండ్‌పై 72 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్, జయవర్ధనే తర్వాతి స్థానాల్లో అలెన్ బోర్డర్, విరాట్ కోహ్లి ఉన్నారు. ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టడంతో విరాట్.. బోర్డర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌కు ఇది మూడో క్యాచ్. మార్ష్ క్యాచ్‌కు ముందు విరాట్ మెక్‌స్వీని, లబూషేన్ క్యాచ్‌లు పట్టాడు. ఈ రెంటిలో లబూషేన్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు..స్టీవ్ స్మిత్-76 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)మహేళ జయవర్ధనే-72 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)విరాట్ కోహ్లి-71 క్యాచ్‌లు (ఆస్ట్రేలియాపై)అలెన్ బోర్డర్-71 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)ఇదిలా ఉంటే, భారత్‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలతో కదంతొక్కారు. అలెక్స్ క్యారీ (45), మిచెల్ స్టార్క్ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్లను ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ భారత ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అద్భుతమైన బంతితో లబుషేన్ బోల్తా కొట్టించాడు.విరాట్ సూపర్ క్యాచ్..ఆసీస్ ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నితీశ్ రెడ్డి రెండో బంతిని ఔట్‌సైడ్ స్టంప్ లైన్ వద్ద ఫుల్ డెలివరీగా సంధిచాడు. ఆ డెలివరీని లబుషేన్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఎటువంటి తప్పిదం చేయకుండా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ పట్టిన వెంటనే విరాట్ కోహ్లి తన దైన స్టైల్లో కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. గబ్బా మైదానంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఆసీస్ అభిమానుల వైపు చూస్తూ మౌనంగా ఉండమని కోహ్లి సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను ఆసీస్ ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే బూయింగ్(బిగ్గరగా అరవడం) చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్ ఫ్యాన్స్‌కు కోహ్లి తన సెలబ్రేషన్స్‌తో కౌంటరిచ్చాడు.చదవండి: తెలుగు టైటాన్స్ గెలుపు pic.twitter.com/9kOwCXHb1p— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు మెక్‌స్వీనీ(4 నాటౌట్), ఉస్మాన్ ఖావాజా(19 నాటౌట్) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్‌లు(అన్ని ఫార్మాట్లు) ఆడిన రెండో ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్టులో కోహ్లి మైదానంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు.ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో కోహ్లి కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో కంగారులపై 39 టెస్టులు, 71 వన్డేలతో కలిపి 110 మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ మరో 11 మ్యాచ్‌లో ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.ఆసీస్‌పై అదుర్స్.. కాగా ఆల్ఫార్మాట్లలో ఆసీస్‌పై కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ 100 మ్యాచ్‌ల్లో కోహ్లి 50.24 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 23 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు.ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ (భారత్)-110 మ్యాచ్లువిరాట్ కోహ్లి(భారత్)-100 మ్యాచ్లుడెస్మండ్ లియో హేన్స్ (వెస్టిండీస్)- 97 మ్యాచ్లుమహేంద్ర సింగ్ ధోని( భారత్)- 91 మ్యాచ్లువివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)-88 మ్యాచ్లుజాక్వెస్ కల్లిస్(దక్షిణాఫ్రికా)-82 మ్యాచ్లుచదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
IND Vs AUS: హైలైట్‌గా కోహ్లి.. వెనుక నిలబడ్డ రోహిత్! గంభీర్ సైతం..
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిష్టాత్మక గాబా మైదానంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు.. తమ నైపుణ్యాలకు పదునుపెడుతూ పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు హైలైట్‌గా నిలిచింది.తన ఫుట్‌వర్క్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన కోహ్లి.. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతుల్ని ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డాడు. అయితే, తన అనుభవాన్ని ఉపయోగించి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా.. కోహ్లి యువ ఆటగాళ్లను ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో స్ఫూర్తిని రగిల్చాడు.ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించిన కోహ్లిముఖ్యంగా ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డితో చాలా సేపు ముచ్చటించిన కోహ్లి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో కలిస చేతులు కట్టుకుని వెనుక నిలబడటం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు.. ఆసీస్ గడ్డపై అనుభవం ఉన్న కోహ్లిని కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.గంభీర్ సైతంఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లను ఉద్దేశించి కాసేపు ప్రసంగించాడు. అడిలైడ్ ఓటమి నుంచి త్వరగా కోలుకుని.. బ్రిస్బేన్ టెస్టుపై దృష్టి పెట్టేలా గౌతీ ఆటగాళ్లను సన్నద్ధం చేశాడు. ఇక రోహిత్ శర్మ సైతం నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటూ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు.కాగా ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.రెండో టెస్టులో రోహిత్ విఫలంఇక రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే, మిడిలార్డర్లో బరిలో దిగిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తొమ్మిది పరుగులే చేశాడు. ఇక అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు!It is time to look ahead. Preparations for the Brisbane Test starts right here in Adelaide.#TeamIndia #AUSvIND pic.twitter.com/VfWphBK6pe— BCCI (@BCCI) December 10, 2024 -
ఒకే ఒక సెంచరీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే బ్రిస్బేన్‌కు చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి..అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో టెస్టులో కోహ్లి సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు ప్రధాన స్టేడియాల్లో టెస్టు సెంచరీ సాధించిన మూడో పర్యాటక బ్యాటర్‌గా నిలుస్తాడు.కోహ్లి ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సాధించాడు. అడిలైడ్‌లో మూడు సెంచరీలు (2012, 2014, 2014), పెర్త్‌లో రెండు (2018, 2024), మెల్బోర్న్ (2014), సిడ్నీ (2015)లో ఒక్కో సెంచరీ సాధించాడు. కానీ గబ్బాలో మాత్రం కోహ్లి ఇప్పటివరకు ఒక్క సెంచరీ నమోదు చేయలేకపోయాడు. కాగా ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ దిగ్గజం అలైస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో ఐదు వేర్వేరు స్టేడియాల్లో సెంచరీలు చేశారు. ఇప్పుడు మరోసారి కోహ్లికి గబ్బాలో సెంచరీ చేసే అవకాశం లభించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే కింగ్ కోహ్లి.. గవాస్కర్, కుక్ సరసన చేరుతాడు.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
'హెడ్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.. ఆ ఒక్కటి చేస్తే చాలు'
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ డే/నైట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.రోహిత్ సేన మాత్రం మూడు విభాగాల్లో విఫలమైన ఆసీస్ ముందు మోకరల్లింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.దీంతో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలా భారత పేసర్లందుకు తెలివిగా ఆలోచించడం లేదని కైఫ్ ప్రశ్నించాడు."స్కాట్ బోలాండ్ ఆసీస్ జట్టులో రెగ్యూలర్‌గా ఉండడు. కానీ అతడికి విరాట్ కోహ్లిని ఎలా ఔట్ చేయాలో తెలుసు. జట్టులో స్ధిరంగా ఉండని బౌలరే కోహ్లిని ట్రాప్ చేసినప్పుడు, మీరెందుకు ట్రావిస్ హెడ్‌ని అడ్డుకోలేకపోయారు. ప్రతీ బ్యాటర్‌కు ఓ వీక్నెస్ ఉంటుంది.హెడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే హెడ్ ఔటయ్యే అవకాశముంటుంది. అటువంటిప్పుడు మీరు ఎందుకు అదే లైన్లో నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం మనం ఆసీస్ బౌలర్లను చూసి నేర్చుకోవాలి.విరాట్ కోహ్లి బలహీనత అందరికీ తెలుసు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే విరాట్ ఔటయ్యే అవకాశముంది. అందుకే ఆసీస్ బౌలర్లు అదే లైన్లో అతడికి బౌలింగ్ చేస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్, రెండో ఇన్నింగ్స్‌లో బోలాండే అదే పనిచేశారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా ట్రావిస్ హెడ్‌కి వ్యతిరేకంగా భారత బౌలర్లు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి బంతి నుంచే అతడిని ఎటాక్ చేయాలి. హెడ్‌కు ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. పక్కా ప్రణాళికతో అతడిని ఔట్ చేయాలని" ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: భారత్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే: పాక్ మాజీ క్రికెటర్ -
చెత్త రికార్డు సమం చేసిన రోహిత్.. ధోని, విరాట్‌తో పాటు..!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది.చెత్త రికార్డు సమం చేసిన రోహిత్తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు (4) చవిచూసిన మూడో భారత సారథిగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన నిలిచాడు. రోహిత్ సారథ్యంలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ధోని, విరాట్ నేతృత్వాల్లో కూడా భారత్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు, 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు, 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ధోని (4 ఓటములు, 2011, 2014), విరాట్ (4 ఓటములు, 2020-21), రోహిత్ (4 ఓటములు, 2024) ఉన్నారు. కాగా, ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్వదేశంలో రోహిత్ నేతృత్వంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా! అద్భుతం జరిగితేనే..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీ కొట్టి మురిపించిన ఈ రన్‌మెషీన్.. అడిలైడ్‌లో మాత్రం తేలిపోయాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు.అజేయ శతకంతో అలరించిఈ నేపథ్యంలో కోహ్లి నిలకడలేమి ఫామ్‌పై మరోసారి విమర్శలు వస్తున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు.. పెర్త్ టెస్టులో గెలిచి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదాడు కోహ్లి.యువ ఆటగాళ్ల కంటే కూడా దారుణంగాటెస్టుల్లో ముప్పైవ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం అడిలైడ్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లి ఘోరంగా వైఫల్యం చెందాడు. ఈ క్రమంలో 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది.కనీసం ఇప్పుడైనా కోహ్లి ఆదుకుంటాడేమోనని భావిస్తే ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. నిజానికి అడిలైడ్‌లో ఆరంభం నుంచి కోహ్లి కాస్త జాగ్రత్తగానే ఆడాడు. చీకట్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో.. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతులను కోహ్లి వదిలేశాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని బౌండరీకి తరలించి.. టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు.కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన కోహ్లిఅయితే, బోలాండ్ చేతికే కోహ్లి చిక్కడం గమనార్హం. పదిహేనవ ఓవర్ మూడో బంతి ఆఫ్ స్టంప్ దిశగా రాగా.. షాట్ ఆడేందుకు ప్రయత్నించి కోహ్లి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడటంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్ చేరాడు.కష్టాల్లో టీమిండియాఇక శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(24) ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్(7) విఫలమయ్యాడు. శుబ్‌మన్ గిల్(28) రాణించగా.. కోహ్లి(11), రోహిత్ శర్మ(6) నిరాశపరిచారు. ఆట ముగిసే సరికి రిషభ్ పంత్ 28, నితీశ్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కంటే(తొలి ఇన్నింగ్స్) టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. లేదంటే.. ఘోర పరాభవం తప్పదు. ఇక రెండో రోజు ఆటలో ఆసీస్ పేసర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టువేదిక: అడిలైడ్ ఓవల్ మైదానం, అడిలైడ్- పింక్ బాల్ టెస్టు- డే అండ్ నైట్ మ్యాచ్టాస్: టీమిండియా.. బ్యాటింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 180ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 337రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 128/5 (24).చదవండి: అద్భుత యార్కర్‌తో సెంచరీ వీరుడికి చెక్!.. సిరాజ్ ఉగ్రరూపం చూశారా? -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. అద్బుతమైన క్యాచ్‌తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను యశస్వి పెవిలియన్‌కు పంపాడు.గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న లబుషేన్ ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. మరో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు నితీశ్ రెడ్డిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అయితే రోహిత్ ప్లాన్ సఫలమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతిని షార్ట్ అండ్ వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జైశ్వాల్ అద్బుతం చేశాడు. తన పొజిషన్‌కు కుడివైపునకు కదులుతూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్(64) బిత్తరపోయాడు.కోహ్లి రియాక్షన్ వైరల్..ఇక జైశ్వాల్ క్యాచ్ అందుకోగానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసీస్ ప్రేక్షకుల వైపు చూస్తూ సైలెంట్‌గా ఉండమని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో pic.twitter.com/e9HmixGbG2— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024 -
బన్నీ అంటే కోహ్లి లాంటోడు
-
IND Vs AUS: స్టార్క్ మ్యాజిక్ బాల్.. విరాట్ కోహ్లి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తనకు ఇష్టమైన వేదికలో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో విరాట్‌ను బోల్తా కొట్టించాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే సూపర్ కవర్ డ్రైవ్ షాట్ ఆడి మంచి టచ్‌లో కన్పించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 21వ ఓవర్లో తొలి బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.అయితే తొలుత ఆ డెలివరీని ఢిపెన్స్ ఆడాలని భావించిన కోహ్లి.. ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుని బంతిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోహ్లి తన బ్యాట్‌ను వెనక్కి తీయడంలో కాస్త ఆలస్యమైంది.దీంతో బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి వెళ్లింది. క్యాచ్ అందుకోవడంలో స్మిత్ ఎటువంటి పొరపాటు చేయలేదు. దీంతో కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.@Ro45Kuljot_ pic.twitter.com/Qt3QfgL2hI— " (@Beast__010) December 6, 2024 -
ఒకే ఒక సెంచరీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అద్బుతమైన విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు కంగారులతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్(పింక్‌బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్తశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ ఆడిలైడ్ టెస్టుకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.కోహ్లి కన్నేసిన రికార్డులు ఇవే..👉ఆసీస్‌తో రెండో టెస్టులో కోహ్లి మరో సెంచరీ సాధిస్తే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(10) చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను అధిగిమిస్తాడు. ప్రస్తుతం ఈ ఐకానిక్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(9)తో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా అడిలైడ్ ఓవల్‌లో విరాట్ కోహ్లి ఇప్పటివరకు మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రెండో టెస్టులో కోహ్లి మరో శతకం నమోదు చేస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ జాక్ హాబ్స్ పేరిట ఉంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్
‘పింక్ బాల్’తో మ్యాచ్ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్‌తో ఆడారు.ఇక కేఎల్ రాహుల్‌కు ఇదే తొలి ‘పింక్ బాల్ టెస్టు’ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్ నైట్ టెస్టులో ‘పింక్ బాల్’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్ వ్యాఖ్యానించాడు. నాకు ఇది కొత్త అనుభవం‘బౌలర్ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్‌లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ చెప్పాడు.అయితే ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్ రాహుల్ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు. అప్పుడే సరైన షాట్ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పింక్ బాల్ టెస్టుకు వేదికైన అడిలైడ్ చేరుకున్న టీమ్ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది.ఓపెనర్‌గా ఆడిస్తారా?ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్‌గా కొనసాగాలా లేక మిడిలార్డర్లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్ స్పందించాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్ టెస్టులో నా బ్యాటింగ్ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను.ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్ ఆడాలా లేక అటాక్ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్‌ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్ అయినా మిడిలార్డర్ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్ వెల్లడించాడు. ముందే చెప్పారుఇక టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్ ఇదే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ పదేళ్ల కెరీర్లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్‌ను ఆస్వాదించాననేది వాస్తవం. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నాచిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ వివరించాడు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
టీమిండియాకు చేదు అనుభవం.. ఇకపై వారికి అనుమతి లేదు!
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా తొలి టెస్టు గెలిచి టీమిండియా జోరు మీదుండగా... ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ‘పింక్ బాల్’ టెస్టు ప్రారంభం కానుంది. ఇకపై వారికి అనుమతి లేదుఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు గులాబీ బంతితో ముమ్మర సాధన చేస్తుండగా... ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరైన కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లను ఎగతాళి చేశారు.ఈ నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో ఇకపై భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించబోవడం లేదు. కాగా మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా... వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. పరుష పదజాలంతో దూషణలుఅడిలైడ్ మైదానంలో నెట్స్‌కు చాలా సమీపం వరకు అభిమానులు వచ్చే వీలుండటంతో... అక్కడికి చేరుకున్న పలువురు పరుష పదజాలంతో భారత ఆటగాళ్లను తూలనాడారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఫిర్యాదు చేసింది. ఇకపై టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌కు అభిమానులను అనుమతించబోమని తేల్చి చెప్పింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే.. ఏ జట్టుపై అయినా విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. బ్రాడ్‌మన్ 1930-1948 మధ్యలో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు చేయగా.. విరాట్ 2011-2024 మధ్యలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. అడిలైడ్ టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డు బద్దలవుతుంది.బ్రాడ్‌మన్- ఇంగ్లండ్‌పై 11 సెంచరీలువిరాట్ కోహ్లి- ఆస్ట్రేలియాపై 10 సెంచరీలుజాక్ హాబ్స్- ఆస్ట్రేలియాపై 9 సెంచరీలుసచిన్ టెండూల్కర్- శ్రీలంకపై 9 సెంచరీలువివియన్ రిచర్డ్స్- ఇంగ్లండ్‌పై 8 సెంచరీలుసునీల్ గవాస్కర్- ఇంగ్లండ్‌పై 7 సెంచరీలుకాగా, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి టెస్ట్‌ల్లో 30వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 81వ సెంచరీ.ఇదిలా ఉంటే, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడగా.. బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు. -
కోహ్లి వర్సెస్ బుమ్రా..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు కఠోరంగా శ్రమించారు. నెట్స్‌లో గంటల కొద్ది చెమటోడ్చారు. జట్టులో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండే ఆస్కారం ఉన్న వారు మరింత ఎక్కువగా కష్టపడ్డారు. మ్యాచ్ ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం సాగింది.ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు ఆసక్తి రేకెత్తించింది. విరాట్, బుమ్రా నెట్స్‌లో ఒకరి ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. బుమ్రా రెగ్యులర్ మ్యాచ్ తరహాలో నిప్పులు చెరుగుతూ బౌలింగ్ చేయగా.. విరాట్ కూడా అంతే సీరియస్‌గా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా, కోహ్లి మధ్య జరిగిన పోటీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ తరంలో ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIRAT KOHLI vs JASPRIT BUMRAH WITH PINK BALL...!!!!- The Battle between the Greatest of this Generation. 🐐 pic.twitter.com/xsUkB6rQfV— Johns. (@CricCrazyJohns) December 4, 2024మరోవైపు కోహ్లి, బుమ్రాతో పాటు రోహిత్ శర్మ కూడా చాలా సేపు నెట్స్‌లో గడిపాడు. నెట్స్‌లో రోహిత్ డిఫెన్స్‌పై ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ప్రాక్టీస్ కూడా జోరుగా సాగింది. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్ కూడా ప్రాక్టీస్‌లో మునిగి తేలారు. రెండో టెస్ట్ తుది జట్టులో ఎవరుంటారో తెలియదు కాని, జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. గత పర్యటనలో భారత్ పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పింక్ బాల్ టెస్ట్‌లో ఆసీస్‌కు ఓటమి రుచి చూపించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. తొలి టెస్ట్ ఫామ్‌ను టీమిండియా ఆటగాళ్లు కొనసాగిస్తే ఆసీస్‌కు చుక్కెదురవడం ఖాయం.కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు నుంచి బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు. సిరాజ్ 5, హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆసీస్‌పై ముప్పేట దాడి చేశారు.