New Year Events
-
2025లో ఐపీవోల వెల్లువ
ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం టాప్ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ పేర్కొంది.హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్ టెక్ కంపెనీలు ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ఫ్రై తదితరాలు 5 బిలియన్ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది. ఇష్యూ పరిమాణం అప్ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.గతేడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్‌సీలు సైతం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది. -
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
కొత్త సంవత్సరం...హుసేన్ సాగర్ వద్ద సందడే సందడి (ఫొటోలు)
-
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా పిలువనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు. బీటా జనరేషన్(Beta Generation) సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం ఉంటుందని అంచనా. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం, 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారంటున్నారు. సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ (2010-2024 మధ్య పుట్టినవారు)ను అనుసరిస్తుంది. దీనికి ముందు జెనరేషన్ జెడ్ (1996–2010), మిలీనియల్స్ (1981–1996) జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్(Beta Babies) అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్‌క్రిండిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’
నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలిచింది. దీంతో వారు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈఈ మెయిన్ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలుఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.యూజీసీ నెట్ పరీక్షనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలుయూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2 పరీక్షస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.యూకేసీఎస్‌సీ ఎస్ఐ పరీక్షఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్ఐ) పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.జేఈఈ మెయిన్స్ పరీక్షఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
చూస్తుండగానే 2024 వెళ్లిపోయింది. 2025లోకి మనం ప్రవేశించాం. జనవరి ఒకటి సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటోంది. ఇదేవిధంగా నాటి 1978 నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచమంతా ఉత్సవవాతావరణంలో మునిగి తేలులోంది. ఇంతలో పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైకి మూడు కిలోమీటర్ల దూరంలో1978, జనవరి ఒకటిన ముంబైకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటుచేసుకుంది. దుబాయ్‌కి బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నిప్పులను ఎగజిమ్మింది. విమానంలోని పరికరాలు లోపభూయిష్టంగా ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విమాన ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు మృతిచెందారు.అంతా అనుభవజ్ఞులే..1978, జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855(Air India Flight 855) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అప్పట్లో ఈ విమానాశ్రయాన్ని శాంటా క్రజ్ విమానాశ్రయంగా పిలిచేవారు. తరువాత దాని పేరు సహర్ విమానాశ్రయంగా మార్చారు. ఈ విమానాన్ని 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కుకర్ నడిపారు. ఆయన 1956లో ఎయిర్ ఇండియాలో చేరారు. పైగా అతనికి 18,000 గంటల విమానయాన అనుభవం ఉంది. ఫ్లైట్ ఇంజనీర్ అల్ఫ్రెడో ఫారియా(53) 955లో ఎయిర్ ఇండియాలో చేరారు. అతనికి 11,000 గంటల అనుభవం ఉంది. అలాగే వింగ్ కమాండర్ ఇందు వీరమణి(42) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుండి పదవీ విరమణ పొందారు. అతనికి 11,000 గంటల విమానయాన అనుభవం ఉంది. అనుభవజ్ఞులైన వీరంతా అదే విమానంలో ఉన్నారు.ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేక..ఈ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత విమానం ఉండాల్సినంత ఎత్తును చేరుకోలేకపోయింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుండి అందిన డేటా ప్రకారం చూసుకుంటే విమానం ఎత్తును తెలిపే సూచిక పాడైపోయింది. దీంతో కెప్టెన్ ఎత్తును అంచనా వేయలేకపోయారు. చీకటిగా ఉండటానికి తోడు, కింద అరేబియా సముద్రం ఉండడంతో విమనం నడుపుతున్న సిబ్బందికి విమానం ఎత్తు, స్థానం గురించి సమాచారం లభించలేదు.ఇన్పుట్లు సక్రమంగా లేకపోవడంతో..విమానాన్ని రోలింగ్ చేసి నిఠారుగా చేసేందుకు కెప్టెన్ ప్రయత్నించగా, ఇంతలోనే అది సముద్రంలో కూలిపోయింది. విమానం 35 డిగ్రీల కోణంలో అరేబియా సముద్రాన్ని తాకింది. విమానంలోని 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. విమాన శిథిలాలను పరిశీలించగా అధికారులకు అక్కడ ఎలాంటి పేలుడు లేదా అగ్ని ప్రమాదం లేదా ఎలక్ట్రానిక్ వైఫల్యం(Electronic failure) గురించిన సమచారం లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన దరిమిలా.. పైలట్‌కు అందిన ఇన్పుట్లు సక్రమంగా లేవు. ఫలితంగా అతను విమానం ఎత్తును గుర్తించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరిగిందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు -
New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్‌మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్‌లు మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో.. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..శ్రీలీల,దక్ష నాగర్కర్ డ్యాన్స్ అదుర్స్ (ఫోటోలు)
-
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
-
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాసుల మోతలతో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, విజయవాడ, విశాఖపట్నంలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. యువత రోడ్ల మీదకు వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికారు. #WATCH | Vijayawada, Andhra Pradesh | People celebrate and welcome the New Year 2025. pic.twitter.com/BLOuKmIBM6— ANI (@ANI) December 31, 2024 #WATCH | Hyderabad | People celebrate as they welcome the New Year 2025. (Visuals from Tank Band, Hussain Sagar) pic.twitter.com/k7DSh0rWYh— ANI (@ANI) December 31, 2024#WATCH |Andhra Pradesh | People celebrate as they welcome the New Year 2025 in Vijayawada. pic.twitter.com/1z9q7kCIMF— ANI (@ANI) December 31, 2024అలాగే, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, తమిళనాడ, కేరళలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి.#WATCH | Maharashtra | People celebrate as they welcome the New Year 2025 in Mumbai. (Visuals from Bandra) pic.twitter.com/3Qsd5bEAY5— ANI (@ANI) January 1, 2025 #WATCH | Goa | People celebrate and witness fireworks as they welcome the New Year 2025.(Visuals from Baga Beach) pic.twitter.com/oI2nIv51wX— ANI (@ANI) December 31, 2024 #WATCH | Virudhunagar, Tamil Nadu | People gather to celebrate and witness the fireworks as they welcome the New Year 2025. pic.twitter.com/hi3LReXf19— ANI (@ANI) December 31, 2024న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్‌లోని నాగసాకిలో ప్రపంచంలోనే అతి పెద్ద బాణాసంచాలను కాల్చారు. డ్రోన్ల సాయంతో వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇక, దుబాయ్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి.New Year, Dubai pic.twitter.com/TUEiIbxQny— Figen (@TheFigen_) December 31, 2024 When drones and fireworks meetpic.twitter.com/dZpnPCn1A3— Massimo (@Rainmaker1973) December 31, 2024 The world's largest firework launched over Nagasaki, Japan. pic.twitter.com/V7mP14aSYx— Pookie (@PookiesParadise) December 31, 2024అమెరికాలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. Welcome 2025! pic.twitter.com/EkFw5O2PsS— Times Square (@TimesSquareNYC) January 1, 2025 -
జూబ్లీహిల్స్ క్లబ్లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆలయాల్లో నూతన సంవత్సర సందడి
ప్రపంచ వ్యాప్తంగా 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనమంతా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉన్నప్పటికీ జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్ జోష్‌లో మునిగిపోయారు.నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు చూపగానే జనమంతా పెద్ద ఎత్తున హ్యాపీ న్యూ ఇయర్(Happy New Year) అంటూ ఒకరికొకరు విష్ చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అటు జమ్ముకశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు జనమంతా నూతన సంవత్సర వేడుకల్లో తేలియాడుతున్నారు. ఇదే సమయంలో చాలామంది నూతనసంవత్సరం వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. #WATCH | Maharashtra | People gather to witness the fireworks and celebrate as they welcome the New Year 2025.(Visuals from Marine Drive) pic.twitter.com/7tJizmhp8D— ANI (@ANI) December 31, 2024మహారాష్ట్రలోనూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముంబయిలోని మెరైన్‌డ్రైవ్(Marine Drive)లో బాణాసంచా కాల్చేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు పర్యాటకలు ఎంజాయ్ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. ఒకరినొకరు విష్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.#WATCH | Himachal Pradesh | People gather to celebrate as they welcome the New Year 2025 in Shimla. pic.twitter.com/YXUhDGx8hI— ANI (@ANI) December 31, 2024కేరళలోని తిరువనంతపురంలో ప్రజలు బాణసంచా వెలిగించి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.గోవాలోని పనాజీలో జనం కేక్‌లు కట్ చేస్తూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలామంది ఉత్సాహంగా నృత్యం చేశారు.#WATCH | Fireworks in Kerala's Thiruvananthapuram as people celebrate to welcome the New Year 2025. pic.twitter.com/18ZAbzCGh4— ANI (@ANI) December 31, 2024కొత్త సంవత్సరం సందర్భంగా అమృత్సర్(Amritsar)లోని స్వర్ణ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు.షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాబా దర్శనం కోసం బారులు తీరారు.ఇది కూడా చదవండి: New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం#WATCH | Goa | People dance and cut cake as they celebrate and welcome the New Year 2025 in Panaji. pic.twitter.com/BRd67rFqSP— ANI (@ANI) December 31, 2024 #WATCH | Punjab | People visit the Golden Temple in Amritsar to celebrate as they welcome the New Year 2025. pic.twitter.com/yxmHzFzeC6— ANI (@ANI) December 31, 2024#WATCH | Maharashtra | Devotees visit Shirdi Temple as they welcome the New Year 2025. pic.twitter.com/MvWXZXz6rb— ANI (@ANI) December 31, 2024 -
‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం
మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే... ఇక కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త టోర్నీలు, సరికొత్త తరహా ఆటతో అత్యుత్తమ ప్రదర్శనకు ‘సై’ అనడమే... ముగిసిన సంవత్సరంలో త్రుటిలో విజయాలు చేజార్చుకున్న క్షణాలు, అనూహ్యంగా ఎదురైన అపజయాలను మరచిపోయేలా అక్కడే, అదే వేదికపై తప్పులు దిద్దుకొని సత్తా చాటేందుకు కొత్త ఏడాది ఇస్తున్న మరో చాన్స్ అనుకొని చెలరేగిపోవడమే... మరోవైపు అభిమానులకు ఏడాదంతా ఆటలతో పండగనే... క్రీడాంశం ఏదైనా, టోర్నీ పేరు ఏదైనా మైదానంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడి నుంచైనా తాము ఆశించిన వినోదం కోసం వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పోటీలైనా... ప్రతీ ఏటా పలకరించే వార్షిక టోర్నీలైనా... ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ‘జై’ కొట్టేందుకు సిద్ధమైపోతారు... అందుకే క్యాలెండర్లో సంవత్సరం మారగానే కొత్త ఏడాదిలో వచ్చే ఈవెంట్లపై అందరికీ ఎప్పటిలాగే ఆసక్తి ఉంటుంది.2025 అలాంటి కొన్ని ఉత్సాహవంతమైన క్రీడా పోటీలతో సిద్ధమైంది. క్రికెట్ అభిమానుల కోసం వన్డే వరల్డ్‌కప్‌కు సమఉజ్జీలాంటి చాంపియన్స్ ట్రోఫీ ఏడాది ఆరంభంలోనే కనువిందు చేయనుంది. ఈ టోర్నీకి ముందు మలేసియా వేదికగా అండర్–19 మహిళల వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. ఆ తర్వాత మహిళల క్రికెట్లో వన్డే వరల్డ్‌కప్‌నకు మన దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఆటగాళ్లు అటు ఇటు మారడం మినహా ఎప్పటిలాగే ఐపీఎల్ వేసవిలో అలరించనుంది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్‌లో బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలు ఏడాదంతా కొత్త చాంపియన్ల కోసం తివాచీ పరచడం ఖాయం కాగా... భారత్ వేదికగానే జూనియర్ హాకీ వరల్డ్ కప్ యువ ఆటగాళ్లను పరిచయం చేయనుంది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్వంటి క్రీడాంశాల్లో విశ్వ వేదికలపై మన ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాదిలో అసాధారణ ప్రదర్శనలతో అలరించిన మన చదరంగం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఎత్తులు పై ఎత్తులతో కొత్త ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన ఈవెంట్లతో కూడిన క్రీడా క్యాలెండర్ మీ కోసం... –సాక్షి క్రీడా విభాగంక్రికెట్ జనవరి 3–7: ఆ్రస్టేలియాతో ఐదో టెస్టు (సిడ్నీ) భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన జనవరి 22: తొలి టి20 (చెన్నై) జనవరి 25: రెండో టి20 (కోల్‌కతా) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్) జనవరి 31: నాలుగో టి20 (పుణే) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబై) ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్) చాంపియన్స్ ట్రోఫీ (దుబాయ్) ఫిబ్రవరి 20: భారత్ X బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ Xపాకిస్తాన్ మార్చి 2: భారత్ X న్యూజిలాండ్ మార్చి 4: సెమీఫైనల్ (అర్హత సాధిస్తే) మార్చి 9: ఫైనల్ (అర్హత సాధిస్తే) ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూన్ 20–24: తొలి టెస్టు (హెడింగ్లే) జూలై 2–6: రెండో టెస్టు (ఎడ్జ్‌బాస్టన్) జూలై 10–14: మూడో టెస్టు (లార్డ్స్) జూలై 23–27: నాలుగో టెస్టు (మాంచెస్టర్) జూలై 31–ఆగస్టు 4: (ఓవల్) బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన ఆగస్టు: 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో వెస్టిండీస్ పర్యటన అక్టోబర్: 2 టెస్టులు ఆ్రస్టేలియాలో భారత్ పర్యటన నవంబర్: 3 వన్డేలు, 5 టి20లు భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నవంబర్–డిసెంబర్: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఇంగ్లండ్‌లో భారత మహిళల జట్టు పర్యటన జూన్–జూలైలో ఐదు టి20లు, మూడు వన్డేలుమహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు వేదిక: మలేసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వేదిక: పాకిస్తాన్, దుబాయ్ ఐపీఎల్ టోర్నీ మార్చి 14 నుంచి మే 25 వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ ఆగస్టు–సెప్టెంబర్ వేదిక: భారత్ బ్యాడ్మింటన్ జనవరి 7–12: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 14–19: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) ఫిబ్రవరి 11–16: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (కింగ్డావో, చైనా) మార్చి 11–16: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్ (బరి్మంగ్‌హమ్) ఏప్రిల్ 8–13: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (నింగ్బో, చైనా) ఏప్రిల్ 27–మే 4: సుదిర్మన్ కప్ (జియామెన్, చైనా) మే 27–జూన్ 1: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ (సింగపూర్ సిటీ) జూన్ 3–8: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) జూలై 15–20: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) జూలై 22–27: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) ఆగస్టు 25–31: ప్రపంచ చాంపియన్‌షిప్ (పారిస్) సెప్టెంబర్ 16–21: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) అక్టోబర్ 6–19: ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్ (గువాహటి, భారత్) అక్టోబర్ 14–19: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) అక్టోబర్ 21–26: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) డిసెంబర్ 10–14: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా)ఫార్ములావన్మార్చి 16: ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) మార్చి 23: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 6: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) ఏప్రిల్ 13: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 20: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి (జిద్దా) మే 4: అమెరికా గ్రాండ్‌ప్రి (మయామి) మే 18: ఇటలీ గ్రాండ్‌ప్రి (ఇమోలా) మే 25: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 1: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) జూన్ 15: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 29: ఆ్రస్టియా గ్రాండ్‌ప్రి (స్పీల్బర్గ్) జూలై 6: బ్రిటన్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జూలై 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ఆగస్టు 3: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 31: డచ్ గ్రాండ్‌ప్రి (జాండ్‌వూర్ట్) సెప్టెంబర్ 7: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబర్ 21: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) అక్టోబర్ 5: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబర్ 19: యూఎస్ఏ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 26: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 9: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబర్ 22: లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి (అమెరికా) నవంబర్ 30: ఖతర్ గ్రాండ్‌ప్రి (దోహా) డిసెంబర్ 7: అబుదాబి గ్రాండ్‌ప్రి (యూఏఈ)టెన్నిస్ జనవరి 12–26: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 25–జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూన్ 30–జూలై 13: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 25–సెప్టెంబర్ 7: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్). మార్చి 5–16: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కాలిఫోర్నియా) మార్చి 19–30: మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్లోరిడా) ఏప్రిల్ 5–13: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (మొనాకో) ఏప్రిల్ 22–మే 4: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (స్పెయిన్) మే 6–18: రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఇటలీ) జూలై: టొరంటో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కెనడా) ఆగస్టు: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఒహాయో) అక్టోబర్ 1–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (చైనా) అక్టోబర్ 25–నవంబర్ 2: పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 9–16: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) నవంబర్ 18–23: డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) ఆర్చరీఫిబ్రవరి 16–23: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ (బ్యాంకాక్) ఏప్రిల్ 8–13: వరల్డ్ కప్ స్టేజ్–1 టోర్నీ (ఫ్లోరిడా, అమెరికా) మే 6–11: వరల్డ్ కప్ స్టేజ్–2 టోర్నీ (షాంఘై, చైనా) జూన్ 3–8: వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, టర్కీ) జూలై 8–13: వరల్డ్ కప్ స్టేజ్–4 టోర్నీ (మాడ్రిడ్, స్పెయిన్) ఆగస్టు 17–24: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (విన్నీపెగ్, కెనడా) సెప్టెంబర్ 5–12: వరల్డ్ చాంపియన్‌షిప్ (గ్వాంగ్జు, దక్షిణ కొరియా)రెజ్లింగ్ మార్చి 25–30: ఆసియా చాంపియన్‌షిప్ (అమ్మాన్, జోర్డాన్) జూన్ 14–23: ఆసియా అండర్–17, అండర్–23 చాంపియన్‌షిప్ (వియత్నాం) జూలై 5–13: ఆసియా అండర్–15, అండర్–20 చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్) జూలై 28–ఆగస్టు 3: వరల్డ్ అండర్–17 చాంపియన్‌షిప్ (ఏథెన్స్, గ్రీస్) ఆగస్టు 18–24: వరల్డ్ అండర్–20 చాంపియన్‌షిప్ (సోఫియా, బల్గేరియా) సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జాగ్రెబ్, క్రొయేషియా) అక్టోబర్ 20–26: ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్ (నోవిసాద్, సెర్బియా)టేబుల్ టెన్నిస్జనవరి 30–ఫిబ్రవరి 9: సింగపూర్ స్మాష్ టోర్నీ మార్చి 11–16: చాంపియన్స్ టోర్నీ (చైనా) ఏప్రిల్ 1–6: చాంపియన్స్ టోర్నీ (కొరియా) ఏప్రిల్ 14–20: పురుషుల, మహిళల వరల్డ్ కప్ (మకావు) జూన్ 26–జూలై 2: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (తాషె్కంట్) జూలై 3–13: యూఎస్ఏ స్మాష్ టోర్నీ ఆగస్టు 7–11: చాంపియన్స్ టోర్నీ (జపాన్) ఆగస్టు 14–24: గ్రాండ్స్మాష్ టోర్నీ సెప్టెంబర్ 9–14: చాంపియన్స్ టోర్నీ (మకావు) సెప్టెంబర్ 25–అక్టోబర్ 5: చైనా స్మాష్ టోర్నీ అక్టోబర్ 11–15: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (భారత్) అక్టోబర్ 28–నవంబర్ 2: చాంపియన్స్ టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 23–30: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (రొమేనియా) షూటింగ్ఫిబ్రవరి 9–22: ఆసియా రైఫిల్, పిస్టల్ కప్ (బ్యాంకాక్) ఏప్రిల్ 1–11: వరల్డ్ కప్–1 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బ్యూనస్ ఎయిర్స్) ఏప్రిల్ 13–22: వరల్డ్ కప్–2 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (లిమా) మే 3–12: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (సైప్రస్) జూన్ 1–12: ఆసియాకప్ షాట్‌గన్ టోర్నీ (చైనా) జూన్ 8–15: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జర్మనీ) జూలై 4–14: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (ఇటలీ) ఆగస్టు 16–30: ఆసియా చాంపియన్‌షిప్ (కజకిస్తాన్) సెప్టెంబర్ 13–21: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (చైనా) అక్టోబర్ 8–19: ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌గన్ టోర్నీ (గ్రీస్) నవంబర్ 6–16: వరల్డ్ చాంపియన్‌షిప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (ఈజిప్‌్ట) హాకీ డిసెంబర్ 28–ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా లీగ్ (భారత్) జనవరి 12–26: మహిళల హాకీ ఇండియా లీగ్ (భారత్) ఫిబ్రవరి 15–జూన్ 29: ప్రొ హాకీ లీగ్ (మహిళలు) ఫిబ్రవరి 15–జూన్ 22: ప్రొ హాకీ లీగ్ (పురుషులు) డిసెంబర్: జూనియర్ పురుషుల వరల్డ్‌కప్ (భారత్)చెస్ ఫిబ్రవరి 17–28: మహిళల గ్రాండ్‌ప్రి మూడో సిరీస్ (మొనాకో) ఫిబ్రవరి 23–మార్చి 8: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (మోంటెనిగ్రో) మార్చి 14–25: మహిళల గ్రాండ్‌ప్రి నాలుగో సిరీస్ (సైప్రస్) ఏప్రిల్ 13–24: మహిళల గ్రాండ్‌ప్రి ఐదో సిరీస్ (భారత్) మే 6–17: మహిళల గ్రాండ్‌ప్రి ఆరో సిరీస్ (ఆ్రస్టియా) జూలై 5–29: మహిళల వరల్డ్‌కప్ టోర్నీ (జార్జియా) అథ్లెటిక్స్ సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జపాన్)బాక్సింగ్ మార్చి 6–18: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ (బెల్గ్రేడ్) మే–జూన్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ -
న్యూ ఇయర్ ట్రెండ్..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!
ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో. ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది. 12 పండ్లే ఎందుకంటే..ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం. (చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!) -
New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం
2024కి వీడ్కోలు పలుకుతూ, 2025కి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరాన మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన బాబాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే షిర్డీ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 31న రాత్రంతా బాబా ఆలయాన్ని తెరిచివుంచనున్నామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ తెలిపారు.షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుతం నాలుగు రోజులపాటు షిర్డీ మహోత్సవ్(Shirdi Mahotsav)ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పండపాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు దేశం నలుమూలల నుండి సుమారు 90 పల్లకీలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నాయి.2025, నూతన సంవత్సరం వేళ భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 120 క్వింటాళ్ల బూందీ ప్రసాదం ప్యాకెట్లు, సుమారు 400 క్వింటాళ్ల మోతీచూర్ లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఆలయ సముదాయం, దర్శనం క్యూ, సాయి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మరోవైపు పోలీసు ఇన్స్పెక్టర్లు, క్విక్ యాక్షన్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)లు షిర్డీలో అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆలయ ప్రాంగణం, సాయి ఆశ్రమం, ప్రసాదాలయం తదితర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.డిసెంబరు 31న భక్తులకు రాత్రంతా దర్శనాలు కల్పించనున్నందున 31న రాత్రి 10 గంటలకు జరిగే హారతి జనవరి 1న ఉదయం 5.15 గంటలకు జరిగే హారతి కార్యక్రమాలను రద్దుచేశారు. కాగా ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు షిర్టీకి చేరుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు బాబా దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.ఇది కూడా చదవండి: New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్ -
#NewYear2025 : న్యూ ఇయర్ సందడి మొదలు... (ఫొటోలు)
-
New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచే రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు. న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు వేడుకలు సవ్యంగా సాగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8 గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఏఐ ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు వీటిని వినియోగించనున్నారు.ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యోధా వాహనాల్లో కమాండోలను మోహరించనున్నారు. వీరు రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడేవారి ఆటకట్టించనున్నారు. దీనికి తోడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. కన్నాట్ ప్లేస్‌లో 50కి పైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు మోటార్ సైకిళ్లపై నిరంతరం గస్తీ తిరగనున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జనం మధ్యలో తిరుగుతూ, ప్రజలకు రక్షణ అందించనున్నారు.నూతన సంవత్సర వేడుకల్లో రాజకీయ పార్టీలు, సంస్థలు అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. ఇండియా గేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టనున్నారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉన్నందున సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినా, అతివేగంగా వాహనం నడిపినా, జిగ్-జాగ్ తరహాలో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా వారిపై వివిధ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు -
2025లో లాంగ్ వీకెండ్లు.. ఎంజాయ్ చేద్దామిక..
ఇక కొద్దిగంటల్లో న్యూ ఇయర్ చిందులు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలి? అని పలువురు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇందుకు తగిన విధంగా సెలవులు కూడా అవసరమవుతుంటాయి. అందుకే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయా? లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిందా? అని క్యాలెండర్లో చూస్తుంటారు.హోలీకి లాంగ్ వీకెండ్2025లో మొదటి లాంగ్ వీకెండ్(Long weekend) హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ ఒక రోజు ముందు అంటే మార్చి 13న (గురువారం) జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ మరుసటి రోజు అంటే మార్చి 15న (శనివారం) ఆఫీసు నుండి సెలవు తీసుకోగలిగితే.. మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల సుదీర్ఘ వీకెండ్ వస్తుంది. అంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా తిరిగే అవకాశం లభిస్తుంది.స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగాఆగస్ట్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా కూడా లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆగస్టు 15 శుక్రవారం నాడు వచ్చింది. ఈ నేపధ్యంలో శనివారం ఆగస్టు 16న సెలవు తీసుకోగలిగే మూడు రోజుల పాటు వీకెండ్ వస్తుంది. మరోవైపు జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఒకవేళ ఆరోజున సెలవు ఉంటే ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం రాదు. ఈ మూడు రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రదేశానికి రోడ్ ట్రిప్‌కు వెళ్లవచ్చు. లేదా రిసార్ట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.దసరా హాలిడేస్2025 దసరా సెలవులకు గాంధీ జయంతి మరో సెలవుగా జతచేరింది. సాధారణంగా దుర్గాష్టమి నుండి విజయదశమి వరకూ ఆఫీసులో సెలవులు ఉంటాయి. 2025లో దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ ఒకటి (బుధవారం), గాంధీ జయంతి(Gandhi Jayanti), విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.బక్రీద్‌కు..2025 జూన్ 7న (శనివారం) బక్రీద్ జరుపుకోనున్నారు. ఆ మర్నాడు ఆదివారం. దీంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది.రక్షాబంధన్ సందర్భంగాఆగస్టు 9న (శనివారం) రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ మర్నాడు ఆదివారం. ఈవిధంగా రక్షాబంధన సందర్బంగా వచ్చే రెండు రోజుల సెలవుల్లో కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే..
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్, యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి నగర పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. బౌన్సర్లు, నిర్వాహకులు సహా ఎవరు హద్దు మీరినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయం తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు.డిసెంబర్ 31 రాత్రి పార్టీలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధతీవ్రతనూ కొలుస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పైన ఇతర కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్Œ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్లు మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి మూసి ఉంచుతారు.వెస్ట్‌జోన్‌లో స్పెషల్ యాక్షన్స్... నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి రానివ్వరు. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక షీ–టీమ్స్ బృందాలు మోహరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ‘డ్రింక్సే’ కాదు డ్రగ్సూ పట్టేస్తారు... కేవలం డ్రంక్ డ్రైవింగే కాకుండా ‘డ్రగ్ డ్రైవింగ్’కు చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపే వారితో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర అనుమానితులకు గుర్తించడానికి డ్రగ్ డిటెక్టర్స్ సమీకరించుకున్నారు. జర్మనీ నుంచి ఖరీదు చేసిన ఈ అత్యా«ధునిక పరికరాల్లో 75 పరికరాలను తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు. స్నిఫర్ డాగ్స్తోనూ తనిఖీలు చేపడతారు.అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపున్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ సేవలు పొడిగించారు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్‌కు చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నగరంలో రాత్రి 11 నుంచి రేపు(మంగళవారం) ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్ మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. -
బ్యాంకులకు వరుస సెలవులు
కొత్త ఏడాది (New Year 2025) మొదలవుతోంది. తొలి నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు (Bank holidays) ఉన్నాయి. వివిధ పండుగలు, విశేషమైన సందర్భాల కారణంగా జనవరిలో (January) చాలా రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో ముందుగా తెలుసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సెలవులు, అలాగే రాష్ట్రాలవారీగా మారే కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో కూడా బ్యాంకులను మూసివేస్తారు. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.జనవరిలో సెలవులు ఇవే..జనవరి 1: బుధవారం- నూతన సంవత్సరాదిజనవరి 2: నూతన సంవత్సరం, మన్నం జయంతిజనవరి 5: ఆదివారం జనవరి 6: సోమవారం- గురుగోవింద్ సింగ్ జయంతి జనవరి 11: శనివారం- మిషనరీ డే, రెండవ శనివారం జనవరి 12: ఆదివారం- స్వామి వివేకానంద జయంతి జనవరి 13: సోమవారం- లోహ్రి జనవరి 14: మంగళవారం- మకర సంక్రాంతి, మాఘ బిహు, పొంగల్జనవరి 15: బుధవారం- తిరువళ్లువర్ దినోత్సవం (తమిళనాడు), తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం) జనవరి 16: ఉజ్జవర్ తిరునాల్ జనవరి 19: ఆదివారం జనవరి 22: ఇమోయిన్ జనవరి 23: గురువారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 25: శనివారం- నాల్గవ శనివారం జనవరి 26: ఆదివారం- గణతంత్ర దినోత్సవం జనవరి 30: సోనమ్ లోసర్దేశంలో రాష్ట్రాలవారీగా మారే జాతీయ సెలవులు, ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో పాటు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులను మూసివేస్తారు. బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లు డిజిటల్‌గా వివిధ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు బ్యాంకు సెలవుల సమయంలో అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు తమ పనిని ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. -
వెరైటీ డ్రెస్సింగ్‌తో సిద్ధమవుతున్న సిటీ యూత్
ప్రస్తుతం నగరంలో పార్టీ టైమ్ నడుస్తోంది. ప్రీ న్యూఇయర్ బాష్ నుంచి ఆఫ్టర్ నైట్స్ దాకా కొత్త సంవత్సరం వేడుకలు చలిగాలులు కమ్మిన నగరాన్ని సైతం హీటెక్కిస్తోంది. పారీ్టస్కి అటెండ్ అవడం ఒకెత్తయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం మరొకెత్తు. ఈ నేపథ్యంలో పలువురు డిజైనర్ల నుంచి సేకరించిన సూచనల సమాహారం ఇది.. పార్టీని బట్టి డ్రెస్సింగ్ ఎంచుకోవడం ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ట్రెండ్. అయితే ఇది కేవలం ఫ్యామిలీ గెట్ టు గెదర్ లాంటిదైతే.. ఒక రకంగా, ఉర్రూతలూగించే సందడితో ఉంటే.. మరో రకంగా ఆహార్యాన్ని తీర్చిదిద్దుకోండి అంటూ సూచిస్తున్నారు నగరంలోని ప్రముఖ డిజైనర్లు. వీరు అందిస్తున్న మరికొన్ని సూచనలు... ⇒ డ్రెస్సింగ్‌లో స్టైల్స్ ఎలా ఉన్నా విభిన్న రకాల యాక్సెసరీస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. చంకీ బెల్ట్సŠ, ఫంకీ గాగుల్స్.. ఇలా నైట్ పారీ్టకి మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ పార్టీకి నప్పేలా ఏదైనా ట్రై చేయవచ్చు. ⇒ మహిళలు ఈవెనింగ్ గౌన్స్ను ట్రై చేయవచ్చు. విభిన్న రకాల ఫ్యాన్సీ జ్యువెలరీకి చోటు ఇస్తే బాగుంటుంది. ⇒రకరకాల హెయిర్‌స్టైల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా డ్రెస్సింగ్ సింపుల్‌గా సరిపెడితే.. ఇది మరింత అవసరం. అమ్మాయిలకు.. షార్ట్ స్కర్ట్స్, షార్ట్స్, వన్ పీస్ డ్రెస్‌లు బాగా పోష్ లుక్ ఇస్తాయి. టీనేజర్లకు వన్‌పీస్ డ్రెస్ బాగుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లో వన్‌పీస్ డ్రెస్‌లు పర్ఫెక్ట్ పార్టీ కాస్ట్యూమ్‌గా పేర్కొనవచ్చు. ట్యాంక్ టాప్స్, ట్యూబ్ టాప్స్ మంచి లుక్కునిస్తాయి. పొరపాటున కేప్రీస్ వేసుకుంటే ఓల్డ్‌ఫ్యాషన్ అయిపోతుంది జాగ్రత్త. వన్ పీస్ విత్ ట్యూబ్ టాప్ సరికొత్తగా న్యూ లుక్‌తో బాగుంటుంది. చలిగాలికి రక్షణగా ఉలెన్ స్కార్ఫ్స్ బెటర్. లైట్ కలర్ టీ షర్ట్‌కు డార్క్ కలర్ టీ షర్ట్‌కు లైట్కలర్ స్కార్ఫ్ ఎంచుకోవాలి.యువకులకు.. షార్ట్స్ వేసుకోవచ్చు. లుంగీ స్టైల్లో వేసుకునే డ్రెస్ కూడా ఫంకీగా ఉండి బావుంటుంది. బ్లాక్, బ్రౌన్ టీషర్ట్‌తో క్యాజువల్ బ్లేజర్. రెడ్, పింక్ కలర్స్ ప్రస్తుతం లేటెస్ట్ ఫ్యాషన్. యువకులు ఇప్పుడు డ్రెస్సింగ్‌లో షేడ్స్ ఎంచుకునేటప్పుడు గోల్డ్ కలర్ కూడా బాగా వినియోగిస్తున్నారు. వైట్ కలర్ టీషర్ట్, రెడ్‌కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ క్యాజువల్ బ్లేజర్/ఎల్లో కలర్ బ్లేజర్ కాంబినేషన్‌తో వావ్ అనిపిస్తారు. జాగ్రత్తలు మరవొద్దు.. ⇒ తప్పనిసరై దూరంగా ఉన్న వేడుకకు వెళ్లవలసి వస్తే.. కుటుంబ సమేతంగా, వీలైతే మరికొన్ని ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్లడం మంచిది. ⇒పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒కొన్ని ఈవెంట్స్ నిర్వాహకులు రాత్రి పూట బస మరుసటి రోజు బ్రంచ్ కూడా కలిపి ప్యాకేజీలు అందిస్తున్నారు. వీలైతే అటువంటిది ఎంచుకోవడం మంచిది. ⇒కొందరు పికప్‌తో పాటు తిరిగి వెళ్లేటప్పుడు డ్రాప్ చేసేందుకు కూడా వాహన సౌకర్యం కూడా అందిస్తున్నారు. గమనించండి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికం.. ఓ వైపు సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక పోకడల్ని మేళివింపుతో పారీ్టలకు హాజరవుతూనే హుందగా కనిపించాలని ఆశించే నగర మహిళలూ ఎక్కువే. పార్టీ సీజన్ పురస్కరించుకుని హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివే.. ⇒కలంకారీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకోవచ్చు. పొడవాటి గౌన్‌కి సిల్క్ దుపట్టా జత చేయడం వల్ల లగ్జరీ లుక్ వస్తుంది. మోడ్రన్, క్లాసిక్ లుక్‌ని మేళవించిన ఈ అవుట్ ఫిట్ నప్పుతుంది. ⇒ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆర్ట్. సరైన పద్ధతిలో రూపొందిన ఎంబ్రాయిడరీ నెట్ లెహెంగా.. ఆకర్షణీయంగా ఒదిగిపోతుంది. ⇒హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ప్రత్యేకంగా రూపొందిన చీర భారతీయ వస్త్ర విశిష్టతకు అద్దం పడుతుంది. ⇒ఫార్మల్ కుర్తా సెట్స్, పార్టీ ఎతి్నక్ వేర్ కలిసిన కో–ఆర్డ్ సెట్స్ ధరించిన వారి ఫ్యాషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తాయి. ఇవి సాయంత్రపు సందడికి, రోజువారీ యాక్టివిటీస్‌కీ అతికినట్టు సరిపోతాయి. ⇒ సంప్రదాయ బెనారస్ చీరల నుంచి మారి స్టైలిష్ రఫెల్ శారీస్‌ను ఎతి్నక్ వేర్‌కు జత చేయవచ్చు. వీటి ఎతి్నక్ శైలి, ఫ్రిల్డ్ బోర్డర్స్.. ప్రతి మహిళనీ అందంగా స్టైలిష్ గా చూపించగలవు.ట్రెండీ వేర్.. టేక్ కేర్.. ⇒ న్యూ ఇయర్ వేదికలకు వెళ్లేటప్పుడు.. ధరించిన దుస్తులను ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌గా ఉంటూనే.. సౌకర్యంగానూ ఉండేలా జాగ్రత్తపడాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు ⇒షిఫాన్, సిల్క్, సీత్రూ తరహాలో గ్లామరస్ వస్త్రధారణకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు.. వీలున్నంత వరకూ సమూహాలతోనే పార్టీలకు హాజరవడం బెటర్. అలాంటి సందర్భాల్లో ఊరికి దూరంగా ఉన్న రిసార్ట్స్, క్లబ్స్‌ను కాకుండా కాస్త దగ్గరగా ఉన్నవే ఎంచుకోండి. ⇒అవుట్ డోర్ ఈవెంట్లకు హాజరయే సందర్భంగా రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి.. అందుకు తగ్గట్టుగా డ్రెస్ ఎంచుకోవాలి. ⇒ డ్రెస్సింగ్ ఎంపికలో చలి వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పారీ్టలో పాల్గొని నృత్యాలు చేయడం, డ్రింక్స్ తీసుకోవడం జరిగితే అవే దుస్తులు అసౌకర్యంగా అనిపించవచ్చు కాబట్టి లేయర్స్‌గా దుస్తుల్ని ధరిస్తే మరింత మంచిది. వెరైటీ డ్రెస్సింగ్‌తో సిద్ధమవుతున్న సిటీ యూత్ ⇒కొత్త సందడి వేళ కొత్తగా కనిపించేందుకు ఆసక్తి ⇒జోష్ ఫుల్ ఈవెంట్స్‌లో యాక్సెసరీస్దే హవా ⇒చలిలో హీటెక్కిస్తున్న న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ ⇒ స్టైలిష్ లుక్‌కి అ‘డ్రెస్’గా నిలిచేందుకు డిజైనర్ టిప్స్ -
జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఎన్ని ప్రయోజనాలో..
కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్‌తో రూ. 2025 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.రూ.2025 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2025 ప్లాన్‌తో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.రూ.2150 విలువైన కూపన్లుజియో భాగస్వామి బ్రాండ్ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్‌మైట్రిప్‌లో (EaseMyTrip) విమాన బుకింగ్‌లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్‌తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
ఆ దేశాల్లో న్యూ ఈయర్కి ఎలా స్వాగతం పలుకుతారో తెలుసా..!
కొత్త సంవత్సరం వేడుకలను కోలాహలంగా జరుపుకోవడం చాలాకాలంగా కొనసాగుతోంది. సంవత్సర ఆరంభ దినాన పాత అలవాట్లను వదిలేస్తామని కొత్తగా తీర్మానాలు చేసుకోవడం, కొత్త డైరీలను ప్రారంభించడం, కొత్త సంవత్సరం సందర్భంగా కేకు కోసి, బంధుమిత్రులతో పంచుకోవడం, ఆత్మీయులతో కలసి విందు వినోదాలు జరుపుకోవడం, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతులే! కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పాటించే ప్రత్యేక ఆచారాలు, పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి కొంత వింతగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారాల గురించి, కొత్త సంవత్సరం ముచ్చట్లు గురించి తెలుసుకుందాం.టమాలీల కానుకఆత్మీయులకు ఇంట్లో వండిన టమాలీలను కానుకగా ఇవ్వడం మెక్సికన్ల ఆచారం. టమాలీ స్పానిష్ సంప్రదాయ వంటకం. టమాలీల తయారీలో మొక్కజొన్న పిండితో పాటు కూరగాయల ముక్కలు, మాంసం, సుగంధద్రవ్యాలు ఉపయోగిస్తారు. కొత్త సంవత్సరం జరుపుకొనే విందు కార్యక్రమాల్లో ఈ టమాలీలను స్థానికంగా ‘మెనుడో’ అని పిలుచుకునే సూప్‌తో కలిపి వడ్డిస్తారు. మెక్సికన్లు టమాలీలను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. పన్నెండు ద్రాక్షలుడిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతుండగా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ఒక్కొక్కరు పన్నెండు ద్రాక్షలను ఆరగించడం స్పానిష్ ఆచారం. స్పెయిన్‌లో మాత్రమే కాదు, స్పానిష్ ప్రజలు ఎక్కువగా నివసించే లాటిన్ అమెరికా దేశాల్లోను, కరీబియన్ దీవుల్లోను ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. పన్నెండు ద్రాక్షలను కొత్త సంవత్సరంలోని పన్నెండు నెలలకు సంకేతంగా భావిస్తారు. స్పెయిన్‌లోని అలకాంటీ ప్రాంతానికి చెందిన ద్రాక్షతోటల యజమానులు 1895లో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఈ ఆచారం స్పానిష్ ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి గడియారం పన్నెండు గంటలు కొడుతుండగా, ఒక్కో గంటకు ఒక్కో ద్రాక్ష చొప్పున పన్నెండు ద్రాక్షలు తినే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. స్పానిష్ ప్రజలు ఈ తంతు తర్వాతనే కేకు కోయడం, బాణసంచా కాల్చడం వంటి సంబరాలు జరుపుకుంటారు.ద్వారానికి ఉల్లిపాయలుకొత్త సంవత్సరం సందర్భంగా గ్రీకు ప్రజలు చర్చిలలో ప్రార్థనలు జరిపి, ఇళ్లకు చేరుకున్న తర్వాత, ఇళ్ల ప్రవేశ ద్వారాలకు, గుమ్మాలకు ఉల్లిపాయలను వేలాడదీస్తారు. ఉల్లిపాయలను ఇలా వేలాడదీయడం వల్ల ఇంట్లోని వారికి ఆయురారోగ్య వృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇలా వేలాడదీసిన ఉల్లి΄పాయలను మరునాడు వేకువ జామునే తొలగిస్తారు. ద్వారాల నుంచి తొలగించిన ఉల్లిపాయలతో ఇంట్లో నిద్రిస్తున్న పిల్లల నుదుటికి తట్టి, వారిని నిద్రలేపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టిదోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.సోబా నూడుల్స్‌తో ప్రారంభంకొత్త సంవత్సరం రోజున జపాన్‌లో వేడి వేడి సోబా నూడుల్స్ తింటారు. ఈ ఆచారాన్ని జపానీస్ ప్రజలు పన్నెండో శతాబ్ది నుంచి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పొడవాటి ఈ నూడుల్స్‌ను కొరికి తినడం వల్ల పాత ఏడాదిలోని చెడును కొరికి పారేసినట్లేనని జపానీస్ ప్రజలు భావిస్తారు. వేడి వేడి సూప్‌లో ఉడికించిన సోబా నూడుల్స్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, శీతకాలంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని పురాతన జపానీస్ పాకశాస్త్ర గ్రంథాలు చెబుతుండటం విశేషం.అన్నీ గుండ్రమైనవేకొత్త సంవత్సరం సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రజలు గుండ్రని వస్తువులను సేకరించడాన్ని, గుండ్రని డిజైన్లు ఉన్న దుస్తులు ధరించడాన్ని, గుండ్రని పండ్లు, ఆహార పదార్థాలు తినడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా గుండ్రంగా ఉండే పుచ్చకాయలు, యాపిల్, ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను, గుండ్రంగా ఉండే డోనట్స్, కుకీస్, గుడ్లు తింటారు. అలాగే, గుండ్రంగా ఉండే నాణేలను సేకరించి దాచుకుంటారు. గుండ్రంగా ఉండే లాకెట్లను ధరిస్తారు. గుండ్రమైన వస్తువులను పరిపూర్ణమైన జీవితానికి సంకేతంగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున అన్నీ గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటే జీవితంలో పరిపూర్ణత సాధించగలుగుతామని వీరి విశ్వాసం.కొత్త సంవత్సరం కానుకలుకొత్త సంవత్సరం సందర్భంగా ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం చాలా చోట్ల ఉన్న పద్ధతే అయినా, జర్మనీలో మాత్రం దీనిని తప్పనిసరి ఆచారంగా పాటిస్తారు. జర్మన్లు కొత్త సంవత్సర వేడుకలకు హాజరైన తమ ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కానుకల్లో పుస్తకాలు, పెన్నులు వంటి సర్వసాధారణమైన వస్తువుల నుంచి ఖరీదైన వజ్రాభరణాల వంటివి కూడా ఉంటాయి. జర్మన్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే, షాంపేన్ లేదా స్పార్మింగ్ వైన్‌ను రుచి చూస్తారు. దీనివల్ల సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని వారి నమ్మకం. జర్మన్లకు మరో వింత ఆచారం కూడా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న చిన్న సీసపు విగ్రహాలను కరిగించి, కరిగిన సీసాన్ని నీట్లోకి పోస్తారు. నీటిలో ఆ సీసం సంతరించుకునే ఆకారాన్ని బట్టి, కొత్త సంవత్సరంలో జీవితం ఎలా ఉండబోతుందో జోస్యం చెబుతారు. ధవళవస్త్ర ధారణకొత్త సంవత్సరం వేడుకల్లో బ్రెజిల్ ప్రజలు ధవళవస్త్రాలను ధరిస్తారు. బ్రెజిల్లో జరిగే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడ చూసినా, తెలుపు దుస్తులు ధరించిన జనాలే కనిపిస్తారు. సంవత్సర ప్రారంభ దినాన తెలుపు దుస్తులను ధరించడం వల్ల సంతవ్సరమంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడుస్తుందని బ్రెజిలియన్ల నమ్మకం. తెలుపు దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ్ర΄ార్థనలు జరుపుతారు. అనంతరం కొత్త సంవత్సరం వేడుకలను విందు వినోదాలతో ఆర్భాటంగా జరుపుకుంటారు.దిష్టిబొమ్మల దహనంఆఫ్రికన్ దేశమైన ఈక్వడార్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఇళ్ల ముందు వీథుల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పాత కాగితాలు, కట్టెల పొట్టు, చిరిగిన దుస్తులు నింపి, మానవాకారాల్లో దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ దిష్టిబొమ్మలను గడచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలకు, నష్టాలకు, దురదృష్టాలకు సంకేతంగా భావిస్తారు. వీటిని తగులబెట్టడం ద్వారా కొత్త సంవత్సరంలో అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. ఇంకొన్ని వింత ఆచారాలుకొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఐర్లండ్‌లో ప్రజలు బ్రెడ్ స్లైస్‌తో ఇంటి తలుపులను, కిటికీలను, గోడలను కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని నమ్ముతారు. ఆచార సంప్రదాయాలు ఎలా ఉన్నా, కొత్త సంవత్సరం అంటేనే ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త సంరంభం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ హ్యాపీస్ 2025పాత్రల మోతతో స్వాగతంకొత్త సంవత్సరానికి ఇంగ్లండ్, ఐర్లండ్లలోని కొన్ని ప్రాంతాల ప్రజలు విచిత్రంగా స్వాగతం పలుకుతారు. ఇంట్లోని గిన్నెలు, మూకుళ్లు, తపేలాలు వంటి వంటపాత్రలపై గరిటెలతో మోత మోగిస్తూ చేసే చప్పుళ్లతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. వంట΄ాత్రలను మోగిస్తూ రణగొణ ధ్వనులను చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని వారి నమ్మకం. తొలుత ఈ ఆచారం ఐర్లండ్‌లో ప్రారంభమైందని చెబుతారు. తర్వాతి కాలంలో ఐర్లండ్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు కూడా ఈ ఆచారం వ్యాపించింది.గుమ్మడి సూప్ స్వేచ్ఛా చిహ్నంహైతీలో కొత్త సంవత్సరాన్ని గుమ్మడి సూప్ సేవించడంతో రంభిస్తారు. వీరికి జనవరి1 స్వాతంత్య్ర దినోత్సవం కూడా! గుమ్మడి సూప్‌ను హైతీయన్లు ‘సూప్ జోమో’ అంటారు. స్వాతంత్య్రానికి ముందు హైతీని పాలించిన స్పానిష్, ఫ్రెంచ్ వలస పాలకుల హయాంలో గుమ్మడి సూప్‌ను రుచి చూడటానికి స్థానిక నల్లజాతి ప్రజలకు అనుమతి లేదు. అందుకే స్వాతంత్య్రం పొందిన తర్వాత హైతీయన్లు స్వేచ్ఛా చిహ్నంగా గుమ్మడి సూప్ సేవనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఆచారంగా మార్చుకున్నారు. -
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిఈపీఎఫ్వో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుఈపీఎఫ్వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
New Year 2025 : ఒక్కో హోటల్ ఒక్కో తీరు..ఆహా.. ఏమి రుచి!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేది ఏడాది ముగింపు సెలబ్రేషన్స్.. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి పండగ.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. సాధారణ రెసిపీలకు భిన్నంగా సంప్రదాయ, గ్రామీణ, స్థానిక, అంతర్జాతీయ వంటకాలను మరోమారు పరిచయం చేస్తున్నాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆహారం వేగంగా తినడం, పానీయాలు త్వరగా తాగడం, ఇతర వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఒక్కో హోటల్లో ఒక్కో రకం.. మినీ భారత దేశంగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1.5 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లు వారి సొంతం. ఒక్కో ప్రాంతంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి అనుగుణంగానే నగరంలోని పలు హోటల్స్ సైతం ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేకించి చెఫ్‌లను తెప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో హోటల్లో ఒక్కో రకమైన మెనూ ప్రత్యక్షం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకించి బర్గర్ ఈటింగ్, పానీపూరీ, జూస్ స్పీడ్ డ్రింకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య
సుజు: నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచి్చన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోందని, అయినాసరే సహాయక చర్యల్ని ముమ్మురం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. -
2024 New Year Celebrations Pics: ప్రజలు తమ ప్రత్యేక పద్ధతిలో 2024 నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు
-
సెలబ్రిటీస్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫోటోలు
-
న్యూఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు
-
బంజారాహిల్స్ : ర్యాక్ క్యాజిల్‌లో నూతన సంవత్సర వేడుకల్లో యువత ఉత్సాహం (ఫొటోలు)
-
శ్రీరాముని దర్శనం కోసం భక్తులు బారులు
నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, యాగ్యాచార్యులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. -
న్యూ ఇయర్ రోజున ఇవి తింటే..అదృష్టానికి, డబ్బుకి ఢోకా ఉండదట!
కొత్త ఏడాది 2024 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఈ న్యూ ఇయర్‌ని తమదైన పద్ధతిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సంతోషకరంగా సాగిపోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే మంచిగా ప్లాన్ చేసుకుంటారు కూడా. అయితే కొత్త ఏడాది రోజున ఇవి తింటే ఏడాదంతా అదృష్టం కలిసొచ్చి సంతోషకరంగా సాగుతుందని కొన్ని దేశాల ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందామా! ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అంతా కలిసి సెలబ్రెట్ చేసుకునేది మాత్రం న్యూ ఇయర్ నాడే. ఈ రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ న్యూ ఇయర్‌ని ప్రారంభిస్తే ఆ ఏడాదంతా బావుండటమే కాకుండా అదృష్టం వస్తుందని కొందరి ప్రగాఢి నమ్మకం. ఇంతకీ మరీ ఈ రోజు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలంటే.. ద్రాక్ష ప్రేమను: స్పెయిన్, లాటిన్ అమెరిక దేశాలలో న్యూఇయర్ రోజున వీటిని తినడం అక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా న్యూ ఇయర్ రోజు ద్రాక్ష తింటే ప్రతి నెలా అదృష్ట కలిసొస్తుందని ఒక నమ్మకం కూడా. అంతేగాదు సోషల్ మీడియాలో దాదాపు 12 ద్రాక్ష పండ్లను తింటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలుస్తారనే ట్రెండ్ తెగ నడుస్తోంది కూడా. కాయధాన్యాలు దీర్ఘాయుష్షును: ఈ రోజున పప్పుతో చేసిన రెసిపీలు లేదా సూప్ తినడం మంచిదట. ముఖ్యంగా ఇలా తింటే ఆర్థిక సమృద్ధి పుష్కలంగా ఉంటుందని భావిస్తారు. ఇటలీలో ఎక్కువగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దానిమ్మ పండు సంతానం: గ్రీకు సంప్రదాయంలో దానిమ్మని సంతానోత్పత్తి, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ రోజున ఇవి తింటే సంతానం, సంపద, అదృష్టం వస్తాయని ఎక్కువమంది నమ్ముతారు. చేపలు తింటే లక్కు: వివిధ సంస్కృతుల్లో చేపలను అదృష్టవంతమైన వాటిగా పరిగణిస్తారు. అవి పురోగతి, సమృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారట. అందుకే కొన్ని ప్రదేశాల్లో నూతన సంవత్సరం రోజున చేపలు తినడంతో ప్రారంభిస్తారట కూడా. ఆకుకూరలు సంపదలు ఇస్తాయి: యూఎస్ఏలోని అనేక కుటుంబాలు కొల్లార్డ్ గ్రీన్స్ లేదా క్యాబేజీ వంటి ఆకుకూరలను తినడంతో న్యూ ఇయర్ రోజుని ప్రారంభిస్తారు. అలా చేస్తే సంపదలు పెరుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ఆకుపచ్చ రంగును సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆరోజు ఆకుకూరలు తింటే ఆర్థిక సమస్యలనేవే ఉండవనేది వారి విశ్వాసం. నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి: చైనాలో పొడవైన నూడుల్స్ దీర్ఘాయువును సూచిస్తాయి. అందువల్ల న్యూ ఇయర్ రోజున న్యూడిల్స్ తింటే దీర్ఘాఆయుష్షు ఉంటుందనేది వారి నమ్మకం. చైనా సంస్కృతి ప్రకారం ఆ రోజు ఇవి తింటే అదృష్టం వస్తుందని చెబుతారు. కేక్ లేదా డోనట్స్: గుండ్రని ఆకారంలో మధ్యలో చిల్లు ఉండే ఇవి తింటే సంవత్సరాంతం బాగుటుందని, లక్ కలిసోస్తుందని కొందరూ భావిస్తారు. (చదవండి: 'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్! వీడియో వైరల్) -
కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!
జార్ఖండ్‌లో నూతన సంవత్సరం 2024 తొలిరోజునే విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపుతప్పిన ఒక కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. #WATCH जमशेदपुर, झारखंड: प्रभारी पदाधिकारी, जमशेदपुर अंजनी तिवारी ने बताया, "प्रात: 5:15 पर ये दुर्घटना हुई... गाड़ी में 8 लोग सवार थे। 5 की मौके पर ही मृत्यु हो गई। पुलिस द्वारा 3 घायलों को अस्पताल में भर्ती करवाया गया। जानकारी के अनुसार सभी लोग आदित्यपुर के रहने वाले हैं..." https://t.co/EhcyZIZD0V pic.twitter.com/EZWs1i7z8G — ANI_HindiNews (@AHindinews) January 1, 2024 ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆయా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
#Welcome2024 : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
#NewYear2024 : తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు (ఫొటోలు)
-
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్‌బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్‌లో ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు
దేశవ్యాప్తంగా ప్రజలంతా 2024 నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12 గంటలకు ప్రజలంతా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమదైన రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | Karnataka: People celebrate the New Year at Bengaluru's MG Road pic.twitter.com/dQTJoQkl0o — ANI (@ANI) December 31, 2023 పలువురు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పర్యాటక ప్రదేశాలకు వెళ్లగా, మరికొందరు తమ నగరంలోనే ఉంటూ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. పలుచోట్ల నూతన సంవత్సరాన్ని బాణసంచా వెలుగులలో జరుపుకోవడం కనిపించింది. పలు ప్రాంతాల్లోని ప్రజలు కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. #WATCH | Fireworks in Odisha's Bhubaneswar to welcome the New Year 2024 pic.twitter.com/GkbPfHLtr3 — ANI (@ANI) December 31, 2023 కర్ణాటకలోని బెంగళూరులో జనం వీధుల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడి ఎంజీ రోడ్డులో జనం ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at Lucknow's Hazratganj to welcome the New Year 2024 pic.twitter.com/ptHN0Tm2gE — ANI (@ANI) December 31, 2023 ఒడిశాలోని భువనేశ్వర్‌లో బాణాసంచా వెలిగించి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ బాణాసంచా వెలుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ నగరాల్లోని వివిధ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. నోయిడాలో కూడా ప్రజలు తమదైన శైలిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. #WATCH | People celebrate the beginning of the New Year in Uttar Pradesh's Noida pic.twitter.com/f0BUmiOrpJ — ANI (@ANI) December 31, 2023 కొందరు సంగీత, నృత్యాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా, మరికొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఝండేవాలన్ ఆలయంలో నూతన సంవత్సర హారతిలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. #WATCH | Delhi: Hundreds of devotees welcome the new year by participating in the New Year's aarti at Jhandewalan Devi Temple https://t.co/iPbigtn2Lw pic.twitter.com/AyHhkoE7gb — ANI (@ANI) December 31, 2023 న్యూ ఇయర్ సందర్బంగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తూ కనిపించారు. ఢిల్లీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Delhi: Security heightened in the National Capital as people celebrate the beginning of the New Year. (Visuals from Hauz Khas village) pic.twitter.com/6NvnRUqrOe — ANI (@ANI) December 31, 2023 -
Mann ki Baat: ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి.. 2024లోనూ కొనసాగాలి
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సృజనాత్మకతను పంచుకోండి ‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు. అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్భజన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా. ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’ ఎన్నెన్నో ఘనతలు ‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’. ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్ సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్‌నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. -
జూబ్లీహిల్స్ క్లబ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సిడ్నీలో ఘనంగా 2024 న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)
-
డిఫరెంట్ స్టైల్లో కొత్త ఏడాది 2024కి స్వాగతం (ఫొటోలు)
-
జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా ఎందుకు పరిగణించారు?
ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా ప్రారంభమవుతుంది. కానీ తెలుగు ప్రజలు మాత్రం మార్చి/ఏప్రిల్‌లోనే జరుపుకుంటారు. అలాగే చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటాయి. ఇలా చాలా దేశాలు వారి సంప్రదాయం ప్రకారం ఇతర నెలల్లోని తేదీల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాయి. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌గా పరిగణిస్తున్నాయి ఎందుకు? ఆ రోజే వేడుకలు నిర్వహించడానికి కారణం?. రోమన్లు చంద్రుని గమనంతో రూపొందించిన క్యాలెండర్‌ని అనుసరించేవారు. ఆ క్యాలెండర్లో కొత్త ఏడాది మార్చిలో ప్రారంభమయ్యింది. కానీ అధికారుల పదవీ కాలాన్ని మాత్రం జనవరి 1 నుంచి లెక్కించేవారు. అయితే క్రీస్తూ పూర్వం 153లో కొన్ని నెలలు జోడించి 12 నెలలు ఉన్న క్యాలెండర్‌ని రూపొందించారు. దీంతో నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలనే ప్రశ్న మొదలైంది. ఇక్కడ సూర్య చంద్ర గమనంతో అప్పటి క్యాలెండర్ల తేదీలు సరితూగపోవడంతో జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్త అలెగ్జాండ్రియన్తో వాటి లెక్కలు సరిచేసి జూలియన్ క్యాలెండర్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్ అనే రోమ్ దేవుడు పేరు మీదగా వచ్చింది. దీంతో జనవరి 1వ తేదిని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్ చాలా పొడవుగా ఉన్నప్పటికీ, దానిని పోప్ గ్రెగొరీ XII సంస్కరించి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు.ఈ క్యాలెండర్లో కూడా జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం అధికారికంగా ప్రకటించింది. ఆయన రూపొందించిన క్యాలెండర్ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటుపడి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. అయితే బ్రిటన్ గ్రెగొరియన్ క్యాలెండర్‌ను అనుసరించడానికి ఇష్టపడలేదు. అందుకే జనవరి 1 కాకుండా.. మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంది. కాలక్రమంలో ప్రపంచ దేశాలు, బ్రిటన్ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా సమస్యలు మొదలవ్వడంతో 1752లో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగొరియన్ క్యాలెండర్‌ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంది. చరిత్రకారుల ప్రకారం.. చరిత్రకారుడు గ్రీకు తత్వవేతత ఫ్లూటార్చ్ రోమ్ ఈ తేదీ గురించి మరొక వివరణ ఇచ్చారు. రోమ్ మొదటి రాజు రోములస్ని అంగారకుడి పుత్రుడిగా విశ్వసిస్తామని, ఆయన యోధుడు, యుద్ధ ప్రేమికుడు అని చెప్పుకొచ్చారు. అయితే రోమలస్ మార్చికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే శాంతి ప్రేమికుడైన మరొక రోమ్ రాజు నుమా నగరాన్ని యుద్ధం నుంచి మళ్లించి పశుపోషణ వైపు మళ్లించాలనే ఆశయంతో జనవరికి ప్రాధాన్యం ఇచ్చాడు. అందువల్లే జనవరి 1వ తేదీనే ప్రపంచ దేశాలు న్యూ ఇయర్‌ని జరుపుకుంటున్నాయి. ఆ రోజునే అట్టహాసంగా వేడుకలు చేసుకుంటున్నారు. (చదవండి: జస్ట్ కొన్ని గంటల తేడాతో.. న్యూ ఇయర్ వేడుకలు ముందుగా జరిగే దేశాలు ఇవే!) -
న్యూ ఇయర్ వేడుకలు మొదటగా ప్రారంభమయ్యే దేశం ఇదే..!
2023కి ఈ రోజుతో వీడ్కోలు చెప్పేసి కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఎలా సెలబ్రెట్ చేసుకోవాలి, ఈ ఏడాది అంతా మంచే జరిగేలా ఏం చేయాలి అనే ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు కూడా. ఎలాంటి చేదు అనుభవాలు, బాధలు, కన్నీళ్లు చవిచూసినా ఈ ఏడాది అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ఆశావాహ దృక్పథంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. ఈ సందర్భంగా ఏయే దేశాలు న్యూ ఇయర్‌కి ముందుగా స్వాగతం పలుకుతాయి. టైమింగ్స్ ప్రకారం ఏయే దేశాల్లో ముందుగా వేడుకలు జరిపోతాయి తదితరాలు గురించి తెలుసుకుందామా!. అందరికి న్యూ ఇయర్ ఒకే రోజు మొదలైనప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం జస్ట్ కొన్ని గంటల తేడాతో ముందుగా జరిగిపోతాయి. ప్రపంచదేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటుగా ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాంటి దేశాలు ఏవంటే.. ముందుగా సెలబ్రేట్ చేసుకునే దేశాలు.. ఫసిపిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలుకే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక న్యూజిలాండ్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైపోతాయి. ఇదే సమయాలనికి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. ఇక భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల మనకంటే 30 నిమిషాల ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. చివరిగా జరుపుకునే దేశాలు.. జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవులలో అయితే భారత కాలమానం ప్రకారం జనవరి 1, సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అంతేగాదు భారత్‌లో జరిగిన తర్వాత నాలుగున్నర గంటలకు సుమారు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2024కి స్వాగతం చెబుతాయి. వాటిలో నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా దేశాల తోపాటు కాంగో అంగోలా, కామెరూన్ వంటి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. భారత్ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్ మొదలవుతుంది. అలాగే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి1 ఉదయం స్వాగతం పలుకుతుంది. కాగా, భారతదేశంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సమయానికే శ్రీలంక వాసులు కూడా వేడుకలు జరుకోవడం విశేషం. (చదవండి: వీధి కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న నెటిజన్లు! ఎందుకో తెలుసా?) -
భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు.. ఏడాది పొడవునా సంబరాలే!
సర్వమత సమానత్వ భావన భారతదేశంలో మినహా మరెక్కడా కనిపించదు. ఈ లక్షణమే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి భారత్‌ను వేరు చేసి, ప్రత్యేకతను అందిస్తుంది. ఇక్కడ అన్ని మతాల ప్రజలు సమైక్యంగా నివసిస్తున్నారు. దీంతో అన్ని మతాలవారి పండుగలు మన దేశంలో వైభవంగా జరగుతుంటాయి. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జనవరి ఒకటిన నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజన ప్రజలంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కానుకలు, స్వీట్లు మొదలైనవి పంచుకుంటారు. అయితే మన దేశంలో జనవరి ఒకటి అసలైన కొత్త సంవత్సరం కాదనే వాదన వినిపిస్తుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మే మన దేశంలోని ప్రజలు ఏడాదికి ఐదుసార్లు కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరాలను వివిధ మత విశ్వాసాల ప్రకారం చేసుకుంటారు. హిందువులు హిందువుల నూతన సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నిర్ణీత తేదీన వస్తుంది. బ్రహ్మ దేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజున నూతన సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రైస్తవులు రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా ప్రకటించిన మొదటి వ్యక్తి అని చెబుతారు. అయితే ఆ తరువాత పోప్ గ్రెగొరీ ఇందులో కొన్ని సవరణలు చేసి, తన మత గురువును సంప్రదించి, లీప్ ఇయర్‌ని దానికి జోడించి, కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. దీని ప్రకారం కూడా జనవరి ఒకటినే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నాటి నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. పార్సీయులు పార్సీయులు ఆగస్టు 19న నూతన సంవత్సరాన్ని నవరోజ్ పేరుతో జరుపుకుంటారు. మూడు వేల సంవత్సరాల క్రితం షా జంషెడ్జీ దీనిని మొదటిసారిగా జరుపుకున్నారని పార్సీయులు నమ్ముతారు. పంజాబీయులు సిక్కు నానాక్షహి క్యాలెండర్ ప్రకారం సిక్కు మతానికి చెందినవారు వైశాఖ మాసం తొలి రోజున తమ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. జైనమతస్తులు జైన సమాజానికి చెందినవారు దీపావళి మరుసటి రోజును నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. దీనిని వీర్ నిర్వాణ సంవత్ అని అంటారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి -
Hyderabad: నేడు అర్ధరాత్రి వరకు మెట్రో
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వివిధ కారిడార్లలో ఆఖరి సర్విసు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున ఒంటిగంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే నగరవాసులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మద్యం సేవించి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులతో పాటు,మెట్రో సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు. మెట్రో రైళ్ల నిర్వహణకు ప్రయాణికులు సహకరించాలని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి కోరారు. -
వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్‌లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్‌లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు. జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్‌లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా. మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్‌కు చేరుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -
సీఎం ఆగ్రహం.. బుక్ మై షో నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్!
సన్ బర్న్ షోకు సంబంధించి ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్ బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో సన్ బర్న్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ మహంతి వెల్లడించారు. అనుమతి కోసం కూడా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సీపీ తెలిపారు. అనుమతుల్లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సంఘటనపై బుక్ మై షోతో పాటు సన్ బర్న్ షో నిర్వాహకులపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు సన్ బర్న్ షోకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్ఫ్రైజ్ గిప్్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్‌లను, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దని తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి లింక్‌లలో సైబర్ నేరగాళ్లు ఫోన్, ల్యాప్లాప్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా కూపన్లు, గిఫ్ట్‌లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లు, ఎస్సెమ్మెస్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
న్యూఇయర్ వేడుకలపై పోలీసు నిఘా
హైదరాబాద్: న్యూ ఇయర్ రోజు మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 12.30 నుండే కస్టమర్లను పబ్‌ల నుంచి బయటికి పంపాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించిన, సప్లై చేసిన కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నీపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
కొత్త ఏడాది యువతరం ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ పాట పాడగానే సరిపోతుందా? ‘పాటతోపాటు ప్రణాళిక కూడా ఉంది’ అంటుంది మన జెన్ జెడ్. కొత్త సంవత్సరంలో జెన్ జెడ్ లక్ష్యాలు, ప్రణాళికలు, అభిరుచులకు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్–2024’ అద్దం పడుతోంది. ఇండియా, యూఎస్, యూకే, బ్రెజిల్, సౌత్ కొరియా దేశాలలోని జెన్ జెడ్ ట్రెండ్స్‌కు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్’ను విడుదల చేసింది ఇన్స్టాగ్రామ్. వర్త్ గ్లోబల్ స్టైల్ నెట్వర్క్ (డబ్ల్యూజీఎస్ఎన్)తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్కు సంబంధించిన ప్రశ్నలు జెన్ జెడ్‌ను అడిగారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఫ్యాషన్ ట్రెండ్స్, బ్యూటీ అండ్ ఫుడ్ విభాగాలలో మన దేశం ట్రెండ్ సెట్టర్‌గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా కనిపించే వస్త్రధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త హెయిర్‌స్టైల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. 2024కు సంబంధించి ‘జెన్ జెడ్’ ప్రాధాన్యతలలో హెల్త్, ట్రావెల్, కెరీర్లు మొదటి స్థానంలో ఉన్నాయి. తమ కెరీర్‌పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు 43 శాతం మంది తెలియజేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన ‘జెన్ జెడ్’ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సంపద సృష్టికి వ్యాపారమే మార్గం అని చెబుతోంది. మన దేశంలో ‘జెన్ జెడ్’లో ఎక్కుమంది స్పోర్ట్స్‌కు సంబంధించి సూపర్‌ఫ్యాన్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజ్, తమ ప్రొఫెషన్‌కు సంబంధించి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జీఆర్డబ్ల్యూఎం(గెట్ రెడీ విత్ మీ)లాంటి క్రియేటివిటీతో కూడిన ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో జెన్ జెడ్‌లో 44 శాతం మంది సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే డీఐవై(డూ–ఇట్–యువర్సెల్ఫ్) విధానాన్ని ఇష్టపడుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, అనిరుథ్ నుంచి సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్ ఆర్మీ’ వరకు ఇష్టపడుతున్నారు. వారికి నచ్చిన వీడియో గేమ్స్‌లో ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, రాబ్లక్స్... మొదలైనవి ఉన్నాయి. జెన్ జెడ్‌లోని పదిమందిలో తొమ్మిదిమంది వారు ఇష్టపడే రంగాలకు సంబంధించి సెలబ్రిటీల అభిమానగణంలో ఉన్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు, అథ్లెట్లు, క్రియేటర్ నుంచి జెన్ జెడ్ రాబోయే కాలంలో ఆశిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నకు వినిపించే జవాబు... లైఫ్ అడ్వైజెస్, వారి ప్రొఫెషన్‌కు సంబంధించిన కంటెంట్... ఇక మీమ్స్ విషయానికి వస్తే మూడింట ఒక వంతుమంది ‘బ్యాడ్ టేస్ట్ మీమ్స్’ను తమ ‘టాప్ టర్న్ ఆఫ్’గా ఎంచుకున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో యువతరం ముందు ఉంటుంది. అభిరుచుల నుంచి కెరీర్ ఆప్షన్స్ వరకు కొత్తగా ఆలోచిస్తోంది. ‘కాలేజీ చదువు పూర్తయిన తరువాత వైట్–కాలర్ జాబ్ తెచ్చుకోవాలి’ అనేది సంప్రదాయ ఆలోచన. అయితే యువతరంలో అందరూ ఇలాగే ఆలోచించడం లేదు.‘కంఫర్టబుల్ లైఫ్‌స్టైల్’కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కారణం జెనరేటివ్ ఏఐ. జెనరేటివ్ ఏఐ ప్రభావంతో వైట్–కాలర్ జాబ్స్‌కు ఉద్యోగభద్రత తక్కువ అనే అభిప్రాయం ఉంది. పియర్సన్ రిపోర్ట్ ప్రకారం జెనరేటివ్ ఏఐ వల్ల వైట్–కాలర్ ఉద్యోగాలలో 30 శాతం రిప్లేస్మెంట్ జరుగుతుంది. వైట్–కాలర్ జాబ్‌లతో పోల్చితే బ్లూ–కాలర్ జాబ్లకు అధిక ఉద్యోగ భద్రత ఉంది. రోబోట్స్ చేయలేని పనులు వీటిలో ఉండడమే కారణం. ఈ పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరం. అయితే జెన్ జెడ్‌లో ఎక్కువమంది ఈ హై–డిమాండ్ ఫీల్డ్‌పై ఆసక్తి ప్రదర్శించడం లేదు. వైట్–కాలర్ జాబ్, బ్లూ–కాలర్ జాబ్ అనేదానితో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఆలోచన విధానం, సమస్య పరిష్కార నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్ట్రెస్ మెనేజ్మెంట్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. వీటిపై జెన్ జెడ్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ‘లైఫ్‌స్టైల్’ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు నుంచి ఫ్రీ టైమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వరకు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది జెన్ జెడ్. గుడ్ ప్లానింగ్ 2024లో యువతరం ఆసక్తి చూపుతున్న రంగాలలో ట్రావెల్ ఒకటి. ట్రావెల్ ప్రేమికులకు టాన్యాలాంటి ట్రావెల్ వ్లోగర్ల సలహాలు ఉపయోగపడుతున్నాయి. అడ్వర్టైజింగ్ రంగంలో ఉద్యోగం చేసిన టాన్యా సోలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టి తాను వెళ్లిన ప్రదేశాలకు సంబంధించి వ్లోగింగ్ మొదలు పెట్టింది. యూట్యూబ్, ఎయిర్‌టెల్‌లాంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసింది. ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి గుడ్ ప్లానింగ్ అనేది ముఖ్యం అంటుంది టాన్యా. ‘గుడ్ ప్లానింగ్’కు సంబంధించి టిప్స్ చెబుతుంటుంది. ప్రణాళిక ఉండాలి దిల్లీకి చెందిన మౌనికా మాలిక్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి కంటెంట్ క్రియేటర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది. పర్సనల్ ఫైనాన్స్ నుంచి స్టాక్‌మార్కెట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతోంది. ‘ఒక రంగంపై ఇష్టం ఉన్నంత మాత్రాన విజయం చేరువ కాదు. భవిష్యత్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమకైనా, వ్యక్తికైనా ఇది ముఖ్యం’ అంటుంది మాలిక్. (చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్‌లెస్ మోడల్‌గా సత్తా చాటింది) -
కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏడు ప్యాకేజీలుగా నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. నాలుగు, ఐదు ప్యాకేజీల డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. ఇది కూడా చదవండి: ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన! -
రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం
రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపిక అయిన అర్చక అభ్యర్థులు బుధవారం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరికీ నేటి నుంచి అంటే గురువారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈ ఆరు నెలల శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులకు శ్రీరామ జన్మభూమి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలలో అర్చకులుగా నియమించనున్నారు. మరోవైపు శిక్షణ కార్యక్రమాలకు వచ్చిన అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రతి అర్చక అభ్యర్థికి నెలకు రూ. 2,000 ఇవ్వనున్నారు. అర్చక శిక్షణకు వచ్చిన అభిషేక్ పాండే మాట్లాడుతూ శ్రీరాముని ఆరాధనా విధానం, పూజలు మొదలైన వాటిపై తమకు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగా అర్చక అభ్యర్థులకు శిక్షణ సమయంలో అర్హత కలిగిన ఆచార్యుల దగ్గర సమస్త ఆచార వ్యవహారాలు నేర్పించనున్నారు. అయోధ్యలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్‌లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్‌లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్‌పూర్‌లోని హోటల్ లీలా ప్యాలెస్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్‌కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్‌లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్‌సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్‌పూర్‌లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్‌లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
అదే దారుణం: బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. డెలివరీ ఏజెంట్ మృతి
లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్‌ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న కౌషల్‌గా గుర్తించారు. నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్. నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్ సోదరుడు అమిత్ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌ను సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. -
అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్ విషెస్
కీవ్: కొత్త ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తంగా మారింది. రష్యా బలగాల విజృంభణ.. ప్రతిగా ఉక్రెయిన్ బలగాల కౌంటర్‌తో సరిహద్దు రక్తసిక్తం అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రష్యా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసింది రష్యా. అయితే ఆ పరిణామం ఉక్రెయిన్ భగ్గుమంటోంది. కారణం.. డ్రోన్ దాడులతో ఆ శుభాకాంక్షలు తెలియజేయడమే!. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి తన ఫేస్బుక్లో పంచుకున్నారు. హ్యాపీ న్యూఇయర్, బూమ్ అంటూ అక్షరాలు రాసి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే మైదానంలో పడింది ఆ డ్రోన్. అదొక చీప్, టేస్ట్‌లెస్ మెసేజ్. ఇరాన్ ఆధారిత డ్రోన్‌పై రాసి ఉంది. ఉగ్రవాద దేశం, దాని సైన్యం తీరు గురించి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. మరోవైపు అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఇదొక అతి చేష్టగా అభివర్ణించారు. ఉక్రెయిన్ బలగాలు రష్యా బలగాలకు ధీటుగా సమాధానం ఇస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 40కి పైగా డ్రోన్లతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై మొదటిరోజే దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు
సాక్షి, శివాజీనగర: ఐటీ సిటీలో కొత్త సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారింది. కొత్త వేడుకల సమయంలో గత రెండేళ్లుగా కరోనా వల్ల మద్యం వ్యాపారం పూర్తిగా తగ్గుముఖమైంది. ఈసారి కోవిడ్ బెడద అంతగా లేకపోవడంతో మద్యం షాపులు కళకళలాడాయి. క్రిస్మస్ నుంచి నెలాఖరు వరకు వ్యాపారం ఊపందుకుంది. 20 లక్షల లీటర్ల మద్యం తాగేశారు డిసెంబర్ 31న సుమారు మూడు లక్షల లీటర్ల మద్యం, 2.41 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనిద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకూ లెక్కిస్తే 20.66 లక్షల లీటర్ల మద్యం, 15.04 లీటర్ల బీర్లను తాగారు. తద్వారా రూ.1,262 కోట్ల వ్యాపారం జరిగితే, పన్ను రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.651 కోట్లు ఆర్జించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే రికార్డు ఆదాయమని ఎక్సైజ్‌వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్‌కు చర్చి స్ట్రీట్‌లో పబ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో మామూలు కంటే 50 శాతం ధరను పెంచారు. అయినా కూడా యువతీ యువకులతో పబ్‌లు కిటకిటలాడాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: మెగా ఫ్యామిలీ ఇలా.. మహేశ్ ఫ్యామిలీ అలా..
న్యూ ఇయర్ వేడుకలను సినీ తారలు ఎంతో సరదాగా జరుపుకున్నారు. కొంతమంది తమకిష్టమైన ప్రాంతానికి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొంతమంది ఇంట్లోనే స్నేహితులు, బంధువుల సమక్షంతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీకి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) . @AlluArjun AT GOA 💥😎✨ pic.twitter.com/zSsv1t5Orp — Allu Arjun Folks ™ 🪓 (@AlluArjunFolks) December 31, 2022 View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
న్యూఇయర్ గ్రీటింగ్స్.. బెస్ట్ వాట్సాప్ స్టేటస్లు కావాలా?
కొత్త సంవత్సరం రాబోతోందంటే.. మనలో ఏదో నూతనోత్సాహం. ఏదో తెలియని అనుభూతి. గడిచిపోయిన ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త ఏడాది సరికొత్తగా ప్రారంభించాలనే తపన. ఉప్పొంగే ఉత్సాహం.. అలుపెరగని ఉల్లాసం.. పాత ఒక రోత.. కొత్త ఓ వింత అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. చేసుకుంటేనే కొత్త ఏడాది రాదు.. చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ఏడాది అనేది కామన్. స్థానిక సంప్రదాయాల ప్రకారం వేరే సంవత్సరాదులను కలిగి ఉన్నా.. ఆంగ్ల సంవత్సరాది సంబరాల్లో భారతీయులు ఉత్సాహంగా జత కలుస్తారు. పాత సంవత్సరానికి ముగింపు పలికే సందర్భం వచ్చేసింది కాబట్టి కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని రావాలని, నయా జోష్‌తో నిండిపోవాలని కోరుకుందాం. మనం ఫ్రెండ్స్ అయినందుకు చాలా సంతోషిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2023 2022కి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఆశలు, కలలు, ఆశయంతో ముందుకు సాగాలని వెల్ కమ్ 2023.. హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.. హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తూ బై బై 2022 వెల్ కమ్ 2023 మీరు ఏడాది పొడవునా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఆనందం, విజయం, శ్రేయస్సు అందించాలని కోరుకుంటూ.. వెల్ కమ్ 2023 గత బాధలను మరచి ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. వెల్ కమ్ 2023 దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి రోజు ఉత్తమమైన రోజు కావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 మీ అందమైన కుటుంబానికీ వెల్కమ్ 2023... ఆనందాలు, సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. పాత సంవత్సరానికి బై చెపుతూ మీకు, మీ కుటుంబానికీ.. హ్యాపీ న్యూఇయర్ 2023 ఈ సంవత్సరం అందర్నీ ప్రేమతో ఏకం చెయ్యాలి. అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలి.. హ్యాపీ న్యూఇయర్ 2023 సకల సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను దేవుడు మీ ఇంట ఆహ్వానించాలని కోరుకుంటూ వెల్కమ్ 2023 2022కి బై బై వేడుకల్లో అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ వెల్కమ్ 2023 2022 అనే గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. వెల్ కమ్ 2023 అని చెప్పాల్సిన టైం వచ్చింది.. హ్యాపీ న్యూ ఇయర్ 2023 నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది! కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!! కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023 క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఈ న్యూ ఇయర్ విషెస్, మెసేజెస్, కోట్స్‌ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు షేర్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, మెసేజ్ రూపంలో పంపుకోండి. మీ ఆనందాన్ని వారితో పంచుకోండి. -
31st నైట్.. మందుబాబులూ జాగ్రత్త..!
-
న్యూ ఇయర్ విషెస్ ఇలా తెలియజేయండి మీ సన్నిహితులకు
Happy New Year 2023: మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం 2023లో మనం అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచం మొత్తం జరుపుకునే సెలబ్రేట్ చేసుకునే వేడుకల్లో ఆంగ్ల సంవత్సరాది ఒకటి. ఏంటీ అప్పుడే 2022 గడిచిపోయిందా? అనే సందేహం వస్తోందా! అంతే కదండీ.. కాలం.. పల్లె ఆర్డినరీ బస్లా కాకుండా జెట్ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లినట్లుగా గడిచిపోతోందంతే! ఈ వేడుక మన ఆలోచనలు, భావజాలానికి కూడా కొత్తదనాన్ని తెస్తుంది. జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఈ న్యూ ఇయర్ ప్రారంభంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీకు, మీ కుటుంబ సబ్యులకు ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు ఈ నూతన సంవత్సరంలో కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. క్రింద ఇవ్వబడిన విషెష్ తో మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి.. మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2023 ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు 2023 అద్భుతమైన మరియు సంతోషకరమైన సంవత్సరం కావలని ప్రార్థిస్తున్నాను! మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 కోట్స్: నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!! ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడవకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోషమయం హ్యాపీ న్యూ ఇయర్ 2023. హ్యాపీ న్యూ ఇయర్ 2023 విషెస్ నువ్వు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. ఈ ఏడాది మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రకరకాలుగా విషెష్ చెబుతుంటారు. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూమీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 !! ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2023!! హ్యాపీ న్యూ ఇయర్ 2023 మెసేజ్ లు ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!! కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023 క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ 2023 గ్రీటింగ్స్ గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ స్టేటస్ మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది! కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ డీపీ నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్.. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలు కుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎంట్రీ.. నగరవాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకూ న్యూ ఇయర్ ఈవెంట్లకు ధరలను కొంతవరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్ సోనిక్ టేకోవర్ పేరుతో నోవోటెల్ నిర్వహిస్తున్న ఈవెంట్‌కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా... తాజ్ డెక్కన్ ఎ నైట్ ఇన్ ప్యారిస్.. థీమ్ ఈవెంట్ కు బుకింగ్ ధర రూ. 1200తో ప్రారంభించింది. పార్క్ హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పారీ్టకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీ యానిమల్స్‌కు కేరాఫ్ లాంటి ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్‌లో ది ప్రిజ్మ్ సర్కస్ ఈవెంట్‌కు రూ.4వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్ ఆడిటోరియంలలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కు సమీపంలోనే ధరలు ఉన్నాయి. తరలివస్తున్న సంగీతం... నోవోటెల్లో ఆర్టిస్ట్ ఎమ్కెషిÙఫ్ట్... (ఎమ్కెఎస్హెచ్ఎఫ్టీ) పేరొందిన లైవ్బ్యాండ్తో కలిసి నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నో పాజ్ పారీట్ల డిజెషాన్, ఆర్యన్ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెన్షన్ దర్శన్ రావల్‌తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్/సినీ గాయకుడు రామ్ మిరియాల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో థండర్ స్టైక్ పార్క్ పాటలతో అలరించనున్నారు. కంట్రీక్లబ్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్లో డిజె ఆసిఫ్ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్ ఫీస్టా థీమ్ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్లు అతిథులను ఉత్సాహపరచనున్నారు. వండర్లాలో.. సన్‌బర్న్.. కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్‌గా పేరొందిన సన్‌బర్న్ తిరిగొచ్చింది. సన్‌బర్న్ రీలోడ్ ఈవెంట్ నగరశివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్ సెన్సేషన్ జియాన్ నోబిలీ, డైనమిక్ డీజె ఈడీఎం సంగీతానికి పేరొందిన జెఫిర్టోన్ – టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు అతిధుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు. మందుబాబులూ.. పారాహుషార్ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే వేళ.. డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. బార్లు, పబ్‌లు, వినోద కేంద్రాలు ఉండే వాణిజ్య ప్రాంతాల్లోని మార్గాలలో ట్రై కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు 31న రోజంతా విధులు నిర్వర్తిస్తారు. బ్రీత్ అనలైజర్లు, బారికేడ్లు ఇతరత్రా ఉపకరణాలను సిద్ధం చేశారు. మహిళా డ్రైవర్లు, మద్యం తాగిన మహిళలను తనిఖీలు చేస్తున్న సమయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డీడీ చెకింగ్ కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు విధులు కేటాయించామని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్.. ► 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. ► మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్‌లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...
ఆశ అనేది మనిషి శ్వాస ఆసక్తి అనేది నిత్యనూతన శక్తి. ఆశ, ఆసక్తులతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది యువతరం. ‘భవిష్యత్ మీదే ఎప్పుడూ నా నిఘా ఉంటుంది ఇవాళ కంటే రేపే ఎంతో బాగుంటుందంటాను నేను’ అనే శ్రీశ్రీ మాట రేపటి వైపు చూసినప్పుడల్లా వినిపిస్తూ ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది. ఇంకో మూడు రోజుల తరువాత మనల్ని పలకరించనున్న 2023 గురించి యూత్ ఏం ఆలోచిస్తుంది? కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చేయాలనుకుంటుంది? రకరకాల ట్రెండ్ రిపోర్ట్‌ల సారాంశం ప్రకారం యాక్టివిజం, ఫ్యాషన్ సస్టెయినబిలిటీ, క్లైమెట్, ఫైనాన్స్, కల్చర్, మ్యూజిక్... మొదలైన అంశాలపై ఆసక్తి కనబరుస్తుంది యువతరం. యాక్టివిజానికి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్ సోషల్ మీడియాలో యువతరం చురుకైన పాత్ర పోషిస్తోంది. రాజకీయరంగంలోకి తమ వయసు వాళ్లు రావాలని కోరుకుంటోంది. అయితే ఇదేమీ అసాధ్యమైన కోరిక కాదని కొందరు యువ రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు. ఉదా: యూఎస్ కాంగ్రెస్–2022కు ఎంపికైన జెన్–జెడ్ లీడర్ మాక్స్వెల్ ఫ్రాస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల హవా గురించి మనకు తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇన్ఫ్లూయెన్సర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? అనే విషయానికి వస్తే‘దివ్యాంగులైన ఇన్ఫ్లూయెన్సర్లు’ అనే సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణం సానుభూతి అనడం కంటే వారి శక్తిసామర్థ్యాలకు ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం అనుకోవచ్చు. ‘పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు–వాటి పర్యవసానాలు’ ఇప్పుడు యూత్‌కు పట్టని విషయం కాదు. తమ షాపింగ్ వ్యవహారాలపై పర్యావరణ స్పృహ గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో పర్యావరణానికి హాని కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. క్లైమెట్–ప్రూఫ్ ప్రాడక్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ‘మనం దృష్టి పెట్టాలేగానీ మార్కెట్లో ఎన్నో ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. కాఫీ కప్పు, ల్యాంప్ షేడ్, యోగా మ్యాట్, ఫ్లవర్ పాట్ స్టాండ్...ఇలా ఎన్నో పర్యావరణ హిత వస్తువులు కనిపిస్తాయి. వీటిని కొనడం ద్వారా ఎకో–ఫ్రెండ్లీ కల్చర్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చు’ అంటుంది జైపుర్(రాజస్థాన్)కు చెందిన వైష్ణవి. ఆర్థిక విషయాలకు వస్తే ‘2023లో సోషల్ మీడియా వేదికగా డబ్బులు ఎలా సంపాదించాలి?’ అనేదాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు తమ ఆనందం కోసం చేసిన కంటెంట్ క్రియేషన్‌ని ఇకముందు కరెన్సీలోకి మార్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు. యూత్‌లో ఎక్కువ మంది వేరే ప్రాంతాలకు చెందిన రుచికరమైన ఆహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అది ఆసక్తికి మాత్రమే పరిమితం కాబోవడం లేదు. ‘వైరల్ ఫుడ్ కంటెంట్’ను అనుసరిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారపదార్థలను రుచి చూడాలనుకుంటున్నారు. ఇది ఒకరకంగా ‘ఫుడ్ ట్రావెల్’ అని చెప్పుకోవచ్చు. ఇన్–పర్సన్ ఇంటరాక్షన్‌కు ప్రాధాన్యత పెరగబోతుంది. తమ ఫేవరెట్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అభిమానించే యువతరం ఇక ముందు వారిని ప్రత్యక్షంగా కలుసుకొని చాలాసేపు మాట్లాడాలనుకుంటోంది. ఇన్–పర్సన్ వెంచర్స్‌కు ప్రాధాన్యత పెరగబోతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే గ్లోబల్ మ్యూజిక్ తమకు ఇష్టమైన అభిరుచిగా మారనుంది. ముఖ్యంగా నాన్–ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్టిస్ట్‌ల సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. ఇక సాంకేతిక ప్రపంచం వైపు తొంగిచూస్తే... ‘న్యూ జెనరేషన్ ఆఫ్ ది ఇంటర్నెట్’గా చెప్పుకునే ‘వెబ్3’ గురించి, వాటి ట్రెండ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ–కృత్రిమ మేధస్సు) అనేది ‘2023’ హెడ్‌లైనింగ్ ట్రెండ్‌గా మారనుంది. కొత్త సంవత్సరంలో ఎన్నో ఏఐ టూల్స్ మార్కెట్లోకి రానున్నాయి. భాషకు సంబంధించి ‘యంత్ర’ వాసన పోగొట్టి సహజత్వాన్ని తీసుకువచ్చే ఏఐ టూల్స్ రాబోతున్నాయి. స్క్రిప్ట్‌లు, వ్యాసాలు రాయనున్నాయి... ఇలాంటి వాటిపై యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. 2023ను ‘ఫోల్డబుల్ ఫోన్ల సంవత్సరం’ అంటున్నారు. సామ్సంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు ఎన్నో కంపెనీల నుంచి స్టైలిష్ ఫోల్డబుల్ ఫోన్స్ వస్తున్నాయి. సహజంగానే యూత్ వీటిపై ఆసక్తి కనబరుస్తుంది. -
ఇటు ఈవెంట్లు.. అటు వేరియంట్లు.. హైదరాబాద్‌లో డేంజర్ సిగ్నల్స్
సాక్షి, హైదరాబాద్: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభించిందని, ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడిపోతున్నాయని తెలియడంతో నగరంలో అలజడి మొదలైంది. ప్రస్తుత కేంద్రం హెచ్చరికలు, గతానుభవాల నేపథ్యంలో నగరవాసులు దీని గురించి చర్చించడం కనిపించింది. మరికొందరు ముందు జాగ్రత్తగా మాస్కులను ధరించడం కూడా మొదలుపెట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల క్రితం వరకూ కేవలం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, నగరంలో వాటి సంఖ్య మూడుకు పరిమితమైంది. అలాగే ప్రస్తుతం కోవిడ్‌కు చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 34 మాత్రమే.. వేడుకలు, ప్రదర్శనల హోరు... గత కొన్ని నెలలుగా అన్ని రంగాలూ దాదాపుగా కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడంతో పారీ్టలు, ఈ వేడుకల ఈవెంట్ల సీజన్‌ను ఉత్సాహంగా జరుపుకోవడానికి నగరవాసులు సిద్ధమయ్యారు. సిటీలో క్రిస్మస్ సందర్భంగా పారీ్టలు వేడుకలు, సన్‌బర్న్ వంటి బిగ్ ఈవెంట్స్ జరుగనున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్జాతీయ స్థాయి సంగీత నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ ఈవెంట్లకు నగరం, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో సందర్శకులు హాజరయే అవకాశం ఉంది. అదే విధంగా జనవరి ప్రారంభంలోనే నుమాయిష్, ఆ తర్వాత మళ్లీ పండుగలు... ఇలా ఎటు చూసినా సందడి వాతావరణం, సమూహాల కోలాహలం కనపడనుంది. వీటిన్నంటి దృష్ట్యా కోవిడ్ భయాల నేపథ్యంలో అధికార యంత్రాంగంలోనూ అలజడి మొదలైంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం... కోవిడ్ కేసులు క్షీణించడం, నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన నేపధ్యంలో నగరం నుంచి విదేశాలకు రాకపోకలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈవెంట్స్ హోరు... ఈ పరిస్థితుల్లో మరోసారి కోవిడ్ కోరలు చాస్తుందేమోనని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎఫ్7 వల్లే దారుణమైన పరిస్థితి ఏర్పడగా, ఈ వేరియంట్‌ను ఇప్పటికే మన దేశంలో గుజరాత్లో 2, ఒడిశాలో 1 కేసును గుర్తించినట్టు వెల్లడైంది. దీంతో సిటీ ఎయిర్‌పోర్ట్‌లో సైతం అత్యవసర చర్యలు చేపట్టనున్నారు. నత్తనడకన వ్యాక్సినేషన్... నగరంలో ఇటీవల నత్తనడకన కూడా నడవని∙వ్యాక్సినేషన్‌పై మళ్లీ దృష్టి పెట్టనుంది. నగరంలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇంకా లక్ష్యానికి చాలా దూరంగానే ఉంది. దీనితో పాటు బూస్టర్ డోస్ విషయంలో కూడా నగరం ఇంకా లక్ష్యానికి చేరుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో నిరీ్ణత వ్యవధుల వారీగా నగర వాసులకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్‌తో పాటు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన ఇతర ముందస్తు జాగ్రత్తలపై కూడా వైద్యాధికారులు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళన వద్దు...అప్రమత్తత మరవద్దు... చైనాలో మరోసారి మొదలైన కోవిడ్ విజృంభణ అక్కడే ఆగిపోతుందని అననుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదని నగరానికి చెందిన అపోలో ఆసుపత్రి జాయింట్ ఎండి సంగీతారెడ్డి హెచ్చరించారు. మూడేళ్ల క్రితం వ్యూహాన్లో ఊపిరిపోసుకున్న ఉత్పాతాన్ని ఒక పాఠంగా తీసుకోవాలన్నారు. అయితే చైనాలో పరిస్థితులపై ఇప్పటికిప్పుడు తీవ్రమైన ఆందోళన అవసరం లేదని, అంతమాత్రాన స్థబ్ధతకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. చైనా నుంచి జరిగే రాకపోకలపై తగిన విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ట్వీట్ చేశారు. -
న్యూ ఇయర్ ఈవెంట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఈ నెల 21 (బుధవారం) లోపు దరఖాస్తు చేసుకుని పొందాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచి్చతమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్దం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. అసభ్య వస్త్రధారణ, అభ్యంతరకరమైన నృత్యాలకు తావుండకూడదు. మాదకద్రవ్యాల వినియోగానికి నిర్వాహకులూ బాధ్యులవుతారని ఆనంద్ స్పష్టం చేశారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కలి్పంచాలి. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే లా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. కార్యక్రమం జరిగే చోటకు ఎలాంటి ఆయుధాలు అనుమతించ వద్దని ఆనంద్ పేర్కొన్నారు. -
షిర్డీ ఆలయానికి భారీ విరాళాలు.. రూ.6.68 కోట్ల ఆదాయం
సాక్షి, ముంబై: వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌తో భారీగా పడిపోయిన ఆదాయం.. క్రిస్మస్‌తోపాటు థర్టీఫస్ట్ డిసెంబర్, నూతన సంవత్సరం ఇలా వరుసగా వచ్చిన సెలవుల కారణంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు. చదవండి: Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా దీంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. కానీ కోవిడ్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా వచ్చిన సెలవుల వల్ల నవంబర్ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు భక్తులు బాబాకు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఇలా పది రోజుల్లో మొత్తం రూ.6.68 కోట్ల మేర విరాళాలు సమకూరాయని ఆలయ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు. -
ఆంక్షలు లేని నిషా.. పాత రికార్డు బద్దలు
సాక్షి, బెంగళూరు: కోవిడ్ భయాలు, రాత్రి కర్ఫ్యూ ఏవీ మందుబాబులను అడ్డుకోలేకపోయాయి. రాష్ట్రంలో కొత్త ఏడాదికి మద్యం విక్రయాల్లో గత ఏడాది రికార్డు బద్ధలైంది. డిసెంబర్ 31న మొత్తం 2.39 లక్షల పెట్టెల మద్యం అమ్ముడైంది. 2020 డిసెంబర్ 31న ఇది 2.25 లక్షల బాక్సులుగా ఉండింది. పగలే రికార్డు కొనుగోళ్లు కరోనా అంటే తెలియని 2019 డిసెంబర్ 31న 3.62 లక్షల బాక్సుల మద్యాన్ని స్వాహా చేశారు. 2020లో కొంచెం తగ్గి, 2021లో మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా నైట్ కర్ఫ్యూ జారీ చేసినప్పటికీ కొనుగోళ్లు తగ్గలేదు. పగటి పూట వైన్‌షాపులకు పోటెత్తారు. పబ్‌లు, బార్లు రాత్రి మూతపడడం వల్ల పగలే కొని పెట్టుకున్నారు. నెలలో రూ.977 కోట్ల రాబడి 2021, డిసెంబర్ మాసంలో మొత్తం 17.18 లక్షల పెట్టెల మద్యం, సుమారు 10.13 లక్షల పెట్టెల బీర్లు ఖాళీ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. 977 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా (13 శాతం) ఆదాయం వచ్చింది. -
భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !
లండన్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్ అమృత్‌పాల్ సింగ్ మాన్‌కి యూకే నూతన సంవత్సర గౌరవాల జాబితాలో చోటు దక్కింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2 లక్షల మందికి పైగా నిరుపేదలకుకి భోజనాన్ని అందించిన గొప్ప మహోన్నత పరోపకారి అమృతపాల్ సింగ్ మాన్. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఓబీఈ అవార్డును పొందారు. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) అంతేకాదు న్యూ ఇయర్ గౌరవ జాబితా 2022లో క్వీన్ సత్కరించబడిన వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఆయన్ను చాలా మందికి అమృత్ మాన్ అని పిలుస్తారు. ఆయన చాలా సంవత్సరాలుగా నిరాశ్రయులు, సాయుధ దళాలు, వారసత్వం కళలతో కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు తనవంతు మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఆయన యూకే తొలి పంజాబీ రెస్టారెంట్‌గా అతని ముత్తాత 1946లో స్థాపించిన కోవెంట్ గార్డెన్‌లోని పంజాబ్ రెస్టారెంట్ ఎండీగానే యూకేలో ఎక్కువమందికి తెలుసు. ఈ మేరకు యూకే లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ ఉటింగ్ మాట్లాడుతూ...."సిక్కు సమాజంలో గుర్తింపు పొందిన నాయకుడిగా, అమృత్ మాన్ చాలా మంది సిక్కులు నివసించే విభిన్న దేశంలో వారి గుర్తింపు ఏమిటో, వారి సంస్కృతిని ఎలా కొనసాగించాలో నిర్వచించడంలో సహాయపడటానికి చాలా కష్టపడ్డారు. ఇందులో భాగంగా సాయుధ బలగాలకు అతని మద్దతు అద్భుతంగా ఉంది. అతని సహాయం లేకుండా సిక్కు సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రగతిని సాధించగలమా! అనే సందేహం కలుగుతుంది. ఆయనతో కలిసి అనేక సందర్భాల్లో పనిచేసినందున, ఈ గౌరవానికి ఆయన అర్హులు" అని అన్నారు. ఈ క్రమంలో అమృత్ మాన్ మాట్లాడుతూ..." నేను గౌరవానికి సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్‌ను స్వీకరించినప్పుడు నమ్మలేకపోయాను. ఈ గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గుర్తింపు దాతృత్వ పనిని మరింతంగా కొనసాగించాలనే తన సంకల్పాన్ని బలపరుస్తుంది అని" అమృత్ మాన్ అన్నారు. (చదవండి: చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!) -
తెగ తాగి.. అడ్డంగా దొరికేశారు.. 4,448 మంది బుక్కయ్యారు
సాక్షి, హైదరాబాద్: అసలే ఇయర్ ఎండ్.. కొత్త ఏడాది ఆరంభ ఘడియ.. జనాల్లో అంతులేని జోష్.. పట్టరాని సంతోషం.. ఇంకేముంది కొందరు తెగ తాగారు. కిక్కు ఎక్కిన తర్వాత కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ రోడ్డెక్కారు.. పోలీసులు ఎదురుపడే సరికి వారికి చుక్కలు కనిపించాయి. అంతే, దెబ్బకు మత్తు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ నిర్వహించిన ప్రత్యేక డ్రంకన్ డ్రైవుల్లో 4,448 మంది పోలీసులకు చిక్కారు. వారంతా రేపో మాపో కోర్టు మెట్లక్కనున్నారు. నిత్యం జరిపే డ్రంకన్ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కూడా దాటని కేసుల సంఖ్య డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా 4 వేలు దాటడం గమనార్హం. పోలీస్ శాఖ హెచ్చరికలను సైతం ధిక్కరించి మందుబాబులు రోడ్డెక్కడంతో హైదరాబాద్‌లో ఒక్కరోజే 1,200 మంది పట్టుబడి టాప్‌లో నిలవగా, ములుగు పట్టణం ఒక్క కేసు కూడా లేకుండా చివరన నిలిచింది. కమిషనరేట్ల వారీగా... సైబరాబాద్ 870, రాచకొండ 360, వరంగల్ 274, రామగుండంలో 253 చొప్పున, సూర్యాపేట జిల్లాలో 176 చొప్పున కేసులు నమోదయ్యాయి. చదవండి: బంజారాహిల్స్: తూలుతూ.. తేలుతూ.. యువతి రచ్చ.. -
స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే
To Hurt A Woman Is To Insult God": Pope Francis In New Year's Speech: పోప్ ఫ్రాన్సిస్ నూతన సంవత్సర ప్రసంగంలో మహిళలపై హింసను అరికట్టాలని పిలుపునిచ్చారు. స్త్రీని అవమానించడం అంటే దేవుడిని అవమానించడమేనని అన్నారు. అంతేకాదు సెయింట్ పీటర్స్ బసిలికాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో పవిత్ర మేరీ మాత సమక్షంలో నూతన సంవత్సర వేడుకల తోపాటు ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు (చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష) పైగా ఫ్రాన్సిస్ నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు మనకు జీవితాన్ని ప్రసాదించడమే కాక ప్రపంచాన్ని ఐక్యమత్యంగా ఉంచుతారు కాబట్టి మనమందరం మహిళలను రక్షించడానికే ఎక్కువ ప్రయత్నాలు చేద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు మానవత్వానిక ప్రతీక అయిన స్త్రీని అవమానించటం అంటే దేవుడిని అవమానించడమే అని స్పష్టం చేశారు. పైగా కోవిడ్ లాక్డౌన్ సమయాల్లో గృహహింస గురించి ఫ్రాన్సిస్ చాలాసార్లు మాట్లాడారు. అంతేకాక రాబోయే సంవత్సరంలో వాటికన్లో తనను అధికారికంగా సందర్శించే నాయకులకు పోప్ సంతకం చేసిన కాపీని అందజేస్తారు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..
నూతన సంవత్సరం సందర్భంగా చాలమంది పలురకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది ప్రజల హితం కోరి విన్నూతన పద్ధతుల్లో వేడకను జరుపుకుంటున్నారు. అచ్చం అలానే పుణేకి చెందిన వ్యక్తి కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విచిత్ర వేషధారణలో మద్యం మానేయండి అంటూ విన్నూతనంగా ప్రచారం చేశాడు. (చదవండి: డబ్బులు కోసం ఏకంగా 14 సార్లు కరోనా వ్యాక్సిన్‌లా?) అసలు విషయంలోకెళ్లితే...పుణెకు చెందిన ఓ వ్యక్తి రావణుడి వేషధారణలో కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాల ప్యాకెట్లు పంచి పెడుతూ మద్యానికి స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారని అందుకే మీలోని రావడుడిని విడిచిపెట్టి మద్యానికి స్వస్తి పలకేందుకే తాను రావణుడి వేషం వేసుకున్నాని అరుణ్ ఓహర్ అన్నారు. ఈ మేరకు అక్కడ స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ.." సమాజంలో మద్యపాన వ్యసనం పెరుగుతోంది. దీని ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మద్యపానాన్ని వదిలివేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు. పైగా ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలామంది తాగి నానా రచ్చ చేస్తుంటారని కూడా చెప్పారు. ఈ వేడకను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలనే చెప్పేందుకు తాను ఈ విధంగా రావణుడి వేషం ధరించి పాల ప్యాకెట్లు పంచిపెడుతున్నాను అని రావణ వేషధారి అరుణ్ ఓహర్ అన్నారు. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) -
కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం
జమ్మూకశ్మీర్: నూతన ఏడాదివేళ జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, కొత్త సంవత్సరం కావడంతో భక్తులు ఆలయంలో పూజలకు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీ సంతాపం వైష్ణోదేవి ఆలయ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిహారం ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూకశ్మీర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. -
న్యూ ఇయర్ ఉత్సాహంపై ఒమిక్రాన్ నీడ
వెల్లింగ్టన్: నూతన సంవత్సరం అన్నీ శుభాలు తెస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకోవడం పరిపాటి. కానీ ఈ దఫా న్యూ ఇయర్ వేడుకలపై ఒమిక్రాన్ భయాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే వరుసగా రెండో ఏడాది కొత్త సంవత్సర వేడుకలు పలు ప్రాంతాల్లో భారీగా జరగడం లేదు. అయితే నూతన ఏడాది కరోనాకు ఫుల్స్టాప్ పడుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఒమిక్రాన్ చెలరేగుతుండడంతో ముందు జాగ్రత్తగా అనేక దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంతంతమాత్రంగా జరిగాయి. జపాన్‌లో వేడుకలకు బదులు కుటుంబాలతో గడపాలని నిర్ణయించుకున్నారు. మాస్కులు ధరించి ఆలయాలను దర్శించారు. దక్షిణ కొరియాలో బెల్ రింగింగ్ పండుగను వరుసగా రెండో సంవత్సరం రద్దు చేశారు. అనేక బీచ్‌లు, టూరిజం ప్రాంతాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు స్తబ్దుగా సాగాయి. దేశంలో ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి జరగలేదు. కానీ ముందు జాగ్రత్తగా ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతున్నా కొన్ని ప్రాంతాల్లో వేడుకలు భారీగా జరిగాయి. కానీ అధిక శాతం ప్రదేశాల్లో జనం తక్కువ సంఖ్యలో కనిపించారు. కరోనాకు ముందు వేడుకలకు సిడ్నీలో సుమారు పదిలక్షల మంది చేరేవారు. ఇప్పుడు కొద్ది మందే వచ్చారు. ఇండోనేసియాలో ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. చాలా చోట్ల నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. వేడుకలపై వియత్నాం నిషేధం విధించింది. హాంకాంగ్‌లో నిర్వహించే సంగీత విభావరిలో కేవలం 3,000 మందే పాల్గొనే వీలుంది. చైనాలో పలు ప్రాంతాల్లో వేడుకలను నిషేధిం చారు. దేవాలయాల్లో నూతన సంవత్సరాది వేడుకలను నిలిపివేశారు. థాయ్‌లాండ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్క డ వేడుకలపై ఎలాంటి నిషేధం లేదు. అయితే కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో సంవత్సరాది ఉత్సాహంపై ఇటీవలి తుపాను నీళ్లు జల్లింది. దీంతో చాలామంది వేడుకలకు దూరంగా ఉన్నారు. యూరప్, యూఎస్‌ల్లో కేసులు పెరుగుతున్న వేళ పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. -
కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ !
-
కొత్త సంవత్సరంలో... జీఎస్టీ మోత
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు... చేనేత, జౌళి, పాదరక్షల రంగాలపై కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పన్నులు వేయలేదు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. కంచి, బెనారస్, బెంగాల్, పోచంపల్లి, గద్వాల్, నారా యణపేట, వెంకటగిరి, ధర్మవరం లాంటి పట్టు, కాటన్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇకపై ఆన్లైన్, ఈ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా; ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే. జీఎస్టీ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... పన్నుల పెంపు, హేతుబద్ధత, వ్యత్యాసాల తొలగింపు నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకనుంచీ పన్నుల రీఫండ్ మార్పుల కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వరసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే.. మూడో నెల బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతారు. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ దాఖలు చేయకపోతే జనవరిలో బ్లాక్‌లిస్ట్‌లోకి వెళతారు. ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా స్థిర, చర ఆస్తులు జప్తు చేసే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు దఖలు పరిచారు. తనకు కావాల్సిన సమాచారం ఏ వ్యక్తి, సంస్థ నుంచైనా రాబట్టే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు ఉంటుంది. ఈ జప్తుకు సంబంధించిన కారణాలు, పెనాల్టీలు ఏడు రోజుల్లో తెలియజేస్తారు. ఇకపై పెనాల్టీలు, ఇతర అభ్యంత రాలు కోర్టులు, ట్రిబ్యునల్‌లలో దావా దాఖలుకు 25 శాతం పెనాల్టీ పన్ను లేదా క్లయిం విలువను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తుది సప్లయ ర్కు జీఎస్టీ ఇన్వాయిస్ను, డెబిట్ నోటు విధిగా మొదటి సరఫరా దారు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, వ్యాపార సంస్థలను జీఎస్టీ 12 శాతం శ్లాబులోకి; కేంద్ర పరోక్ష పన్నుల, సుంకాల పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం కేంద్ర ఉద్దేశం. పొనకా జనార్దన్‌రెడ్డి వ్యాసకర్త ఏపీ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి మొబైల్: 83094 09689 -
మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్ 31 అంటేనే యువతలో తెలియని జోష్ ఉంటుంది. మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బయటకొస్తే తాట తీస్తారు.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు డిసెంబర్ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు. – ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్ చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
Telangana: ట్రాఫిక్ ఆంక్షలు: అలా చేస్తే 10వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్‌బిహేవ్ చేయవద్దని అన్నారు. పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. -
న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్.. అరకొరే...అయినా హుషారే...
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు అడ్డంకి తొలగిపోయింది. పార్టీ ప్రియత్వం ఉప్పొంగిపోతోంది. అయితే షరతులు వర్తిస్తాయి అంటున్న ప్రభుత్వం... హద్దులు దాటితే కేసుల పద్దులు తప్పవంటోంది. మరోవైపు కరోనా పరిస్థితుల్లో కళావిహీనమైన ఈవెంట్ పరిశ్రమకు న్యూ ఇయర్ వేడుకలతో పునరుత్తేజం తప్పక తిరిగొస్తుందని ఈవెంట్ మేనేజర్లు ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ప్రకటించిన పరిస్థితుల్లో తెలంగాణలో ఈ ఏడాది వేడుకలు జరుగుతాయా లేదా అనే సందిగ్థం ఏర్పడింది. మన దగ్గరా లాక్డౌన్ పెడతారంటూ పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే వీటన్నింటికీ తెర దించుతూ నయాసాల్ జోష్‌కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పటిదాకా మీమాంసలో ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్లు హడావిడిగా ఏర్పాట్లు ప్రారంభించారు. చదవండి: హైదరాబాద్ కొత్త సంవత్సర వేడుకలు.. కండిషన్స్ అప్లై అరకొరే...అయినా హుషారే... నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రధాన వేదికలుగా మారే పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్‌లలో కొన్ని ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండగా, మరికొన్ని ఆదరా బాదరా సిద్ధమవుతున్నాయి. తమ అతిధులకు, సభ్యులకు పూర్తిగా కాకున్నా ఎంతో కొంత సంబరాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న డిజెలతో, రాక్ బ్యాండ్స్‌తో రాక్ స్పీడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సిటీలో ఈవెంట్స్ జరిగే పరిస్థితి లేదనే ఆలోచనతో గోవా తదితర ప్రాంతాలకు తరలిపోయిన వీజేలు, డిజెలను కూడా వెనక్కు రప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి సిటీకి సెలబ్రిటీల రాక దాదాపుగా లేనట్టే. లైవ్ మ్యూజిక్, ఫుడ్, ఇండోర్ గేమ్స్, యాంకర్, ఫైర్ వర్క్స్ వంటి సాదా సీదా సరదాలతోనే సందడి పూర్తి చేయనున్నారు. పోలీసుల సూచనల మేరకు వీరు ప్రకటిస్తున్న నిబంధనల జాబితా కార్యక్రమాల జాబితాకు రెట్టింపు ఉంది. దిగొచ్చిన ఎంట్రీ ధర... సిటీలో అన్ని పేరొందిన పబ్స్, క్లబ్స్ న్యూ ఇయర్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. అయితే చరిత్రలోనే ఎన్నడూ లేనంత తక్కువ ధరలకే ఈ సారి ఎంట్రీ పాస్‌లు అందుబాటులోకి రావడం విశేషం. ప్రత్యేక మెనూ, సంగీతం...తదితర చిన్న చిన్న ఆకర్షణలు తప్ప మరేమీ లేకపోవడంతో కనీస ధర రూ.1000 ఆపైనకు తగ్గిపోయింది. కోవిడ్ నిబంధనల అమలు కఠినంగా ఉండబోతున్న నేపధ్యంలో పార్టీలకు వెళ్లాలనుకున్న సిటిజనులు జాగ్రత్తలు తీసుకోవాలి. -
Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీటిలో పాల్గొనే వారికి కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన డిజిటల్ లేదా నేరుగా తెచ్చిన సర్టిఫికెట్‌ను చూసిన తర్వాతే లోపలకు అనుమతించాలంటూ కొత్వాల్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను ఆయన వెల్లడించారు. ►థర్మల్/ఐఆర్ స్క్రీనింగ్ తర్వాత, కచ్చితంగా మాస్కు ధరించిన వారినే లోపలకు అనుమతించాలి. కార్యక్రమం జరిగే చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ►కార్యక్రమం నిర్వహణకు 48 గంటల ముందే నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించాలి. ►బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్ధం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. ►ఈవెంట్లతో జరిగే ప్రతి చర్యకు, కష్టనష్టాలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి. ►ఎక్సైజ్ విభాగం నిర్దేశించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. కపుల్స్ కోసం నిర్దేశించిన పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు. బార్ అండ్ రెస్టారెంట్స్‌లో లైవ్ బ్యాండ్స్ నిర్వహించకూడదు. ►మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై ప్రచారం చేయాలి. ►నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. రహదారులపై వాహనాలు ఆపేలా చేయకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్లు వేర్వేరుగా అవసరమైన స్థాయిలో ఉండాలి. జరిమానా.. జైలు మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. ఈ విషయాలపై ప్రచారం చేపట్టారు. -
రైతు విజయం.. కరోనా కల్లోలం!
కాల గతిలో మరో ఏడాది గడిచిపోతోంది. మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం కాలుమోపుతోంది. గతేడాది ఆరంభమైన కరోనా సంక్షోభం ఇంకా మానవాళిని వీడలేదు. ఈ ఏడాది చివరకు కొత్త వేరియంట్ కలకలం ఆరంభమైంది. 2021లో దేశీయ యవనికపై పలు ఘటనలు జరిగాయి. స్థూలంగా చెప్పుకుంటే 2021 రైతు ఆందోళనతో మొదలై సాగు చట్టాల ఉపసంహరణతో ముగిసిందనుకోవచ్చు. కరోనా, రైతు సంఘటనలతో పాటు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, పెగసస్ కలవరం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో కదలికలు, సీడీఎస్ మృతి వంటి పలు ఇతర ఘటనలు దేశంలో సంచలనానికి కారణమయ్యాయి. కోవిడ్ విధ్వంసం జనవరిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. అదేనెల దేశీయంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆరంభమైంది. ఏప్రిల్‌లో దేశీయంగా కరోనా మరణాలు 2లక్షలు దాటాయి. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈనెల్లో సుమారు 69 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మేలో సెకండ్ వేవ్ తారస్థాయికి చేరింది. కొత్త కేసులు 90 లక్షలు దాటగా, 1.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. కోర్టులు కల్పించుకొనే స్థాయికి ఆక్సిజన్ కొరత చేరింది. అక్టోబర్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల రికార్డును భారత్ సాధించింది. డిసెంబర్ 29నాటికి దేశీయంగా 143.75 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందించారు. డిసెంబర్లో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆరంభమైంది. మమత హ్యాట్రిక్ మే నెల్లో దేశంలో ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77 సీట్లు దక్కగా వామపక్షాలు, కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. టీఎంసీ అధినేత మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం ఆమె భవానీ పూర్ నుంచి పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొందారు. అస్సాంలో రెండోమారు ఎన్డీఏ కూటమి 75 సీట్లతో అధికారంలోకి రాగా, బీజేపీకి చెందిన హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కేరళలో పాలకపక్షం వరుసగా రెండోమారు విజయం సాధించదన్న ఆనవాయితీని లెఫ్ట్ కూటమి తిరగరాసింది. 99 సీట్లతో లెఫ్ట్ కూటమి వరుసగా రెండోమారు విజయం సాధించగా, సీపీఎంకు చెందిన పినరయ్ విజయన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకేను 159 సీట్లతో విజయం వైపు నడిపిన సారధి స్టాలిన్, 68 సంవత్సరాల వయసులో తొలిసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 19 సీట్లను గెలిచి రంగస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రుల మార్పులు జూలైలో ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. కర్ణాటకలో బీజేపీ యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మైని సీఎం చేసింది. సెప్టెంబర్‌లో గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ, పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్‌సింగ్ వైదొలిగారు. పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. మిస్ యూనివర్స్ డిసెంబర్లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది. 1994(సుస్మితా సేన్), 2000(లారా దత్తా) తర్వాత విశ్వ సుందరిగా ఎంపికైన మూడో భారతీయ యువతి సంధు. వ్యవసాయదారుల విజయం గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ దినోత్సవాన రైతుల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముట్టడించారు. జనవరి 12న రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీటిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. నవంబర్ 19న రైతు చట్టాలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించారు. అదే నెల 29న సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఉపసంహరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. దీంతో ఏడాదికి పైగా సాగిన ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేసి స్వస్థలాలకు వెళ్తున్నామని రైతులు ప్రకటించారు. లఖింపూర్ ఖేరీ ప్రకంపనలు అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడపడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్యన్ అరెస్టు అక్టోబర్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా 8 మందిని నార్కొటిక్స్ బ్యూరో డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. 22 రోజుల కస్టడీ అనంతరం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. బిపిన్ మృతి డిసెంబర్లో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్‌రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో బతికి బయటపడ్డ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. -
బార్లకేమో బంపర్ ఆఫర్.. దీక్షపై ఆంక్షలా?: బండి సంజయ్
సాక్షి,కాగజ్‌నగర్: ప్రజలు తాగి ఊగాలని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకూ వైన్స్‌లు, బార్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘మేం నిరుద్యోగదీక్ష చేపడతామంటే ఒమిక్రాన్ పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకూ జనం తాగి ఊగితే వైరస్ వ్యాప్తిచెందదా?’అని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల మీద వచ్చే పైసల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చిబియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ‘బాయిల్డ్ రైస్ నువ్వు తినవు, కానీ పక్క రాష్ట్రంలో తినాలా’ అని సీఎంను నిలదీశారు. ‘మీ ఫాంహౌస్‌లో మీరు చేస్తున్నదమేమిటీ.. అక్కడ వరి పండిస్తూ, రైతులు పండిస్తే మాత్రం ఉరి అంటారా’అని మండిపడ్డారు. -
2022 ప్రారంభ వేడుక... ఇంట్లోనే న్యూ ఇయర్ ఇలా..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి. ఎలా చేస్తే బాగుంటుంది? మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా. సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్‌లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం. ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్‌లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి. లైట్లు వెలిగించండి లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్‌కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్‌కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్‌గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది. షామియానా వేయండి షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి. ఫొటో కార్నర్ ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్‌ఫోన్‌నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి. ఫోన్లు చేయండి పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి. ప్రార్థన చేయండి కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్‌లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు. -
పోలీస్ వర్సెస్ పార్టీస్: న్యూఇయర్ వేడుకలపై ఉత్కంఠ
జూబ్లీహిల్స్‌లోని వైట్ రాబిట్ పబ్‌పై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. సిటీలోనే బిగ్గెస్ట్ పార్టీ సెంటర్‌గా పేరున్న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్పైనా దాడి చేశారు. అలాగే నివాసాల మధ్య న్యూసెన్స్ పేరిటా పలు పబ్స్‌పై రైడ్స్ జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల్ని అదుపు చేయడానికే ఈ రైడ్స్ అనేది తెలుస్తోంది. అయితే వీటిని పట్టించుకోకుండా కొన్ని పబ్స్ పార్టీస్‌కి సై అంటుంటే మరికొన్ని సైలెన్స్‌ని ఆశ్రయించాయి. హోటల్స్, రిసార్ట్స్‌లు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నా పబ్స్ మాత్రం నిబంధనలకు లోబడి నిర్వహిస్తామంటూన్నాయి. ఏతావాతా న్యూ ఇయర్ వేడుకలు పోలీస్ వర్సెస్ పార్టీస్‌గా మారిన పరిస్థితుల్లో పార్టీ ప్రియులూ...పారా హుషార్. –సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ప్రతి న్యూ ఇయర్ ఈవెంట్‌కి ఓ వారం ముందుగానే వేడుకలు మొదలవుతాయి. అయితే కరోనా వల్ల గత ఏడాది సందడి కనుమరుగైంది. ఈ ఏడాది కరోనా లేదనుకుంటూ..ఫుల్ జోష్‌కు రెడీ అయిన సిటీ పార్టీపై ఒమిక్రాన్ అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో కొన్ని పార్టీ ప్లేస్లేమో సైలెంట్ అయిపోగా మరికొన్ని మాత్రం మాదే ఈవెంట్ అంటున్నాయి. వెల్కమ్...పార్టీస్.. ఎక్స్ప్లోజన్, అబ్రకదబ్ర, ఐయామ్ స్పుత్నిక్ ఎట్ బఫెలో వైల్డ్ వింగ్స్...తదితర ఆసక్తికరమైన పేర్లతో సిటీలో ఉన్న కొన్ని పాపులర్ పబ్స్ అన్నీ ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్స్‌ని ప్రకటించేశాయి. కొన్ని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించేశాయి. బయటి నగరాల నుంచే కాక విదేశీ డీజేలను కూడా రప్పిస్తున్నాయి. చదవండి: (గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!) కార్పొరేట్...హార్ట్ బీట్... అత్యధిక సంఖ్యలో పబ్స్ అది కూడా యువతను ఆకట్టుకునేవి ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలు ముందు వరుసలో ఉంటాయి. ఎప్పుడూ కిక్కిరిసిన పార్టీ యానిమల్స్‌తో కళకళలాడే ఈ పబ్స్‌కి కార్పొరేట్ ఉద్యోగులే ప్రధాన పోషకులు. వీరికి పబ్బింగ్ అనేది దినచర్యలో ఒక భాగం కాగా న్యూ ఇయర్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. విభిన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, కుటుంబాలకు దూరంగా గడిపే వారు సహజంగానే న్యూ ఇయర్ పార్టీస్ కోసం పబ్స్‌ను ఆశ్రయిస్తారు. వీరిని నిరాశపరచకుండా కొత్త సంవత్సరారంభానికి వారం ముందే పబ్స్ పార్టీల పరంపర కొనసాగిస్తుంటాయి. ముందస్తు ఏర్పాట్లే...వెనుకడుగుకు పోట్లు న్యూ ఇయర్ పార్టీస్ కోసం అంతర్జాతీయ స్థాయి డిజెలను సెలబ్రిటీలను నగరంలోని పబ్స్ ముందస్తు అడ్వాన్స్‌లు ఇచ్చి పోటా పోటీగా బుక్ చేసుకుంటాయి. కనీసం నెల, నెలన్నర ముందుగానే ఈ కాంట్రాక్ట్‌లు ఫిక్స్ అయిపోతాయి. ఈవెంట్స్ క్యాన్సిల్ అయితే పెద్ద మొత్తాలనే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకని వీలున్నంత వరకూ పార్టీల్ని నిర్వహించడానికే సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస ప్రీ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ప్రిజమ్ పబ్.. ఓ వైపు పోలీసు రైడ్స్ జరిగినా పట్టించుకోకుండా షెడ్యూల్ ప్రకారం తదుపరి ఈవెంట్స్‌కి రెడీ అయిపోతోందని తెలుస్తోంది. ఏదేమైనా.. న్యూ ఇయర్ పార్టీలపై పోలీస్ దాడులు, నిబంధనలను పబ్బుల బేఖాతరు కొనసాగే పరిస్థితులున్నాయి. కాబట్టి... గత ఏడాదిలా సన్నిహితులతో ఇంట్లోనే వేడుకలు జరుపుకోవడం సిటిజనులకు అన్ని రకాలుగా శ్రేయోదాయకం అని చెప్పక తప్పదు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) డౌట్ ఫుల్...కోవిడ్ ప్రొటోకాల్... నగరంలో ఉన్న మోస్తరు పబ్‌లో సగటున 300 నుంచి 500 మంది వరకూ ఆతిథ్యం ఇవ్వొచ్చు. ఇక ప్రిజమ్, బ్లాక్ 22 వంటి పెద్ద పబ్స్ అయితే 2 వేల మంది వరకూ హాజరు కావచ్చు. ఈ పబ్స్‌లో ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది అసాధ్యమే. కాబట్టే పోలీసులు ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్స్‌పై డేగ కన్నేస్తున్నారు. తాము కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నామని, 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రం అనుమతిస్తున్నామని చెబుతున్నా అది జరిగే పనికాదని ఓ ప్రముఖ డి.జె ‘సాక్షి’తో స్పష్టం చేశారు. -
న్యూ ఇయర్ జోష్ కు సిద్ధమవుతున్న యూత్
-
న్యూయర్ వేడుకలపై ఆంక్షలు.. అద్దెకు న్యూ ఇయర్ అడ్డాలు!
సాక్షి,హైదరాబాద్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించడంతో కొత్త సంవత్సర వేడుకలకు నగరవాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదారుగురు స్నేహితులు బృందంగా ఏర్పడి ఫామ్ హౌస్‌లో పార్టీలకు ప్లాన్స్ చేస్తుంటే.. మరికొందరేమో గోవాలో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పార్టీలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, వ్యక్తిగత గృహాలను యజమానుల నుంచి అద్దెకు తీసుకొని వ్యక్తిగత ఏర్పాట్లతో న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నారు. ప్రతి ఏడాది హోటళ్లు, పబ్, క్లబ్‌లే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు న్యూ ఇయర్ పార్టీలను నిర్వహిస్తుంటాయి. 2–3 నెలల ముందు నుంచే ప్రణాళికలు వేసుకునేవారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలబ్రిటీలతో ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. కరోనా కంటే ముందు కొత్త సంవత్సరం వేడుకలు నగరంలో 250కు పైగా జరిగేవి. ఈవెంట్ కోసం ప్రాంగణం దొరకడమే కష్టంగా ఉండేది. కానీ, గత రెండేళ్లుగా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆయా ఈవెంట్లు పెద్దగా జరగడం లేదు. ఈసారి ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మరోసారి నిరుత్సాహామే ఎదురైందని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు తెలిపారు. సెలబ్రిటీలతో పెద్ద షోలు చేయాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేయాలి. సెలబ్రిటీల డేట్స్, విమాన టికెట్ల బుకింగ్స్, పబ్లిసిటీ, స్పాన్సర్షిప్ వంటి చాలా తతంగమే ఉంటుంది. అలాంటి వారం రోజుల వ్యవధిలో భారీ స్థాయిలో పెట్టుబడి ఆదాయం రాబట్టడం కుదిరేపని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఈవెంట్ సైట్లలో ఒకట్రెండు ఈవెంట్లు కనిపిస్తున్నా.. పార్టీ ప్రియులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు హోటళ్లు రూమ్స్‌కు ఎక్కువ చార్జీ వసూలు చేసి, గదికే ఫుడ్, వైన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇక రేవ్ పార్టీలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం అందిన నేపథ్యంలో గట్టి నిఘా పెట్టామని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫామ్ హౌస్ ఫర్ రెంట్ పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో పార్టీ ప్రియులు వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐదారు మంది స్నేహితులు బృందంగా ఏర్పడి. గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, ఘట్కేసర్, కీసర, భువనగిరి, కొల్లూరు, గండిపేట, షాద్‌నగర్, హయత్‌నగర్ వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ తెలిపారు. రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. -
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
-
క్రిస్మస్, కొత్త ఏడాదిపై ఆంక్షలు?
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కరోనా మూడో దశ, రూపాంతర ఒమిక్రాన్ భయాలు క్రిస్మస్, నూతన ఏడాది సందడిని తగ్గించేలా ఉన్నాయి. మూడో దశను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాలను కట్టడి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సర్కారుకు గురువారం కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు జన సందడిని నియంత్రించాలని కోరింది. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
కొత్త ఏడాది, కొత్త పోస్టర్స్
కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్‌తో, కొత్త పోస్టర్స్‌తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు.. ఆ వివరాలేంటో చూసేద్దాం. ♦ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం ♦ ‘ఎఫ్ 2’తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్‌తో ‘ఎఫ్ 3’తో తిరిగొస్తున్నారు ♦ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో పవన్, శృతీ హాసన్ బైక్‌పై వెళుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తారు ♦ రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు ♦ ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఫుల్ జోష్‌తో సీటీ కొడుతున్న స్టిల్ రిలీజ్ చేశారు ♦ శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఇందులో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ♦ సంక్రాంతికి సందడి చేయడానికి ‘అల్లుడు అదుర్స్’తో వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు ♦ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘లక్ష్య’ లో అథ్లెట్‌లా రఫ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య ♦ సుమంత్ ‘కపటధారి, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’, అలీ, నరేష్ ముఖ్య పాత్రల్లో చేస్తున్న ‘అందరూ బావుండాలి అందులో మనముండాలి’, వశిష్ట సింహ, హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, సప్తగిరి హీరోగా చేస్తున్న ‘ఎయిట్’, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’, ‘ఆకాశవాణి’, ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్’ చిత్రాలు న్యూ ఇయర్‌కి న్యూ లుక్స్‌తో Ðð ల్కమ్ అన్నాయి. -
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు
-
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్‌రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్‌రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్‌లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పైనే.. శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్‌షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్‌లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్‌రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో ప్రజా జీవనానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలలో మార్పులకు తెరలేవనుంది. వీటిలో ప్రధానంగా చెక్కుల జారీ ద్వారా జరిగే చెల్లింపుల నిబంధనలు మారనున్నాయి. ఇదేవిధంగా యూపీఐ చెల్లింపులలో అదనపు చార్జీలతోపాటు.. కార్లు, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే వీలుంది. ఇక పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు చెల్లింపుల పరిమితి రూ. 5,000కు పెరగనుంది. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొన్ని అంశాలను చూద్దాం.. 1. చెక్ చెల్లింపులు సానుకూల చెల్లింపుల వ్యవస్థలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని సవరణలు చేపట్టింది. దీంతో రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల్లో కస్టమర్ల వివరాలను బ్యాంకులు తిరిగి ధృవ పరుచుకోవలసి ఉంటుంది. రూ. 5 లక్షలకు మించిన చెక్కుల చెల్లింపులకు ఇవి తప్పనిసరికాగా.. కొన్ని విషయాలలో కస్టమర్ల ఆసక్తిమేరకు బ్యాంకులు ఈ నిబంధనను అమలు చేసే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) 2. పిన్‌తో పనిలేదు బ్యాంకులు జారీ చేసిన కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు రూ. 5,000వరకూ పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి రూ. 2,000గా అమలవుతోంది. రక్షణాత్మక విధానంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కోవిడ్-19 నేపథ్యంలో కస్టమర్ల భద్రతరీత్యా కూడా డిజిటల్ చెల్లింపుల పరిమితిని పెంచినట్లు తెలియజేశాయి. (పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్) 3. యూపీఐ చెల్లింపులు అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే తదితర యాప్‌ల ద్వారా వినియోగదారులు చేపట్టే చెల్లింపులపై అదనపు చార్జీల భారం పడనుంది. థర్డ్‌పార్టీ నిర్వహించే యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలను విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. జనవరి 1నుంచి థర్డ్‌పార్టీ యాప్స్‌పై 30 శాతం పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. 4. ఫాస్టాగ్ తప్పనిసరి జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీల్ వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరికానుంది. ఇందుకు కేంద్ర రోడ్ రవాణా శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989కు సవరణలు చేపట్టింది. ఈ అంశంపై నవంబర్ 6నే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 5. నో.. వాట్పాప్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో ఇకపై వాట్సాప్‌కు వీలుండదు. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 వెర్షన్‌తో నడిచే స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇదేవిధంగా ఐవోఎస్9 వెర్షన్ ఐఫోన్లలోనూ వాట్సాప్ నిలిచిపోనుంది. ఈ జాబితాలో కేఏఐవోఎస్ 2.5.1 వెర్షన్‌తో నడిచే కొన్ని ఎంపిక చేసిన జియో ఫోన్లు సైతం ఉన్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. 6. ఎల్పీజీ, కార్ల ధరలు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతీ నెలా మొదటి రోజున అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సగటు ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. ఇటీవల విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌తోపాటు, ఎల్పీజీ ధరలను సైతం పెంచిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఆటో రంగ దిగ్గజాలు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితరాలు జనవరి నుంచి వాహనాల ధరలను పెంచేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 7. 0తో మొదలు ల్యాండ్ లైన్ నుంచి దేశీయంగా మొబైల్‌కు కాల్ చేయాలంటే నంబర్‌కు ముందు 0ను జత చేయవలసి రావచ్చని టెలికం వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశాయి. తద్వారా మొబైల్ టెలికంలు తగిన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. -
శృతి కొత్త సంవత్సర తీర్మానం
దైవదూతలు స్నేహితుల రూపంలో వస్తారని శృతీహాసన్ బలంగా నమ్ముతున్నారు. ఎప్పట్నుంచి నమ్ముతున్నారు! ఎప్పట్నుంచో కాదు. గత ఏడాదిలో ఓ రోజు నుంచీ! ‘ఓ రోజు’ అంటున్నారు తప్పితే ఏ రోజో కచ్చితంగా చెప్పడం లేదు శృతి. ‘‘2019 లో నేనొకటి తెలుసుకున్నాను. మనం చిక్కుల్లో పడబోతున్నప్పుడు దైవదూతలు గమనించి, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా శృతి చెప్పారు. ఓ ప్రశ్న అంటే.. ఏ ప్రశ్న? ‘‘గత ఏడాది మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్న. ‘‘మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందీ అంటే అది.. మనల్ని మనం ప్రేమించుకోవడమే’’ అని ఆమె సమాధానం. ఆ సమాధానం తర్వాతే దైవదూతలు, స్నేహితులు అంటూ మాట్లాడారు శృతి. ఆమె ప్రేమ విఫలమైంది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం కావచ్చు.. ఆమెలోని ఈ తాత్వికత. ‘రేసుగుర్రం’ సినిమాలోని తన క్యారెక్టర్లా కూల్‌గా ఉంటూ కూల్‌గా మాట్లాడుతున్నారు శృతీహాసన్ గత రెండు రోజులుగా. ‘కూల్’ అనేది ఆమె చేసుకున్న కొత్త సంవత్సర తీర్మానంలా కనిపిస్తోంది. -
న్యూఇయర్‌కు వినూత్న స్వాగతం
పశ్చిమగోదావరి ,నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామస్తులు ఏటా నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా నిర్వ స్తున్నారు. స్థానిక ఓల్డ్ క్రిస్టియన్ పేటకు చెందిన వైఎంసీఏ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 81 ఏళ్లుగా జనవరి 1న నిడదవోలు–భీమవరం ప్యాసింజర్ రైలుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం శెట్టిపేట రైల్వే గేటు వద్ద కొద్దిసేపు రైలును నిలుపుదల చేసి దాని ఇంజిన్‌కు అరటి బొంతలు, రంగుల జెండాలు కట్టి అలంకరించారు. రైలు డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామ పెద్దల నుంచి ఏటా రైలులో న్యూఇయర్ వేడుకలు నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది. దీంతో యూత్ సభ్యులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
అత్తింట్లో అల్లుడు అనుమానాస్పద మృతి
ఉప్పల్: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్, ఎన్‌ఆర్‌నగర్‌కు చెందిన కిన్నెరస్వామి (35) డ్రైవర్‌గా పని చేసేవాడు. పదేళ్ల క్రితం అతడికి రామంతాపూర్ కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. డిసెంబర్ 31న కిన్నెర స్వామి భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లివచ్చిన కొద్ది సేపటికే అతను ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా స్వామి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు శ్రీనివాస్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంబరంలో విషాదం..
వాకాడు: నూతన సంవత్సర వేడుకలను సరదాగా బీచ్‌లో జరుపుకోవాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వచ్చిన మిత్రబృందంలో ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా తిరుపతి లీలామహల్ సెంటర్‌కు చెందిన బత్తల సోనియా (20) (బీటెక్ 3వ సంవత్సరం) అదే ప్రాంతానికి చెందిన దేరంగుల సోను (19) (డిగ్రీ సెకెండ్ ఇయిర్), తిరుపతిలోని జీవకోన ప్రాంతానికి చెందిన రాహుల్ ద్రావిడ్ అలియాస్ మధు (20) (ఆటో డ్రైవర్), దుగ్గిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (ప్రైవేట్ వాహన డ్రైవర్), ఎస్కే బావాజీ (ట్రావెల్స్ డ్రైవర్) కలిసి ఓ స్నేహితుడికి చెందిన కారులో మంగళవారం రాత్రి తూపిలిపాళెం బీచ్‌కు వచ్చారు. అక్కడ నిఘా ఉంచిన వాకాడు, మెరైన్ పోలీసులు వీరిని బీచ్ వద్దకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో వీరు పోలీసులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వెనుదిరిగి వెళ్లిపోయిన వీరు రాత్రంతా గ్రామంలోని ఓ పాఠశాలలో ఉండి అక్కడే కేక్ కట్ చేశారు. బుధవారం ఉదయాన్నే తిరిగి బీచ్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌గా వచ్చిన బావాజీ ఒడ్డున ఉండిపోగా, మిగిలిన నలుగురూ సముద్రంలో స్నానానికి దిగారు. ఉధృతంగా ఎగసిపడుతున్న అలల ధాటికి నలుగురూ గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న బావాజీ కేకలు పెట్టడంతో స్థానిక మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే సురక్షితంగా బయటికి తేగలిగారు. సోనియా, సోను, రాహుల్ ద్రావిడ్‌లను తీరానికి తీసుకువచ్చినప్పటికీ అప్పటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వీరిని నాయుడుపేట ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘ఖాకీ’ మార్కు ప్రతాపం!
సిరిసిల్లటౌన్/సిరిసిల్ల క్రైం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముగ్గురు విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. పోలీసుల దాష్టీకానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం అర్ధరాత్రి సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాహుల్, బన్నీ, శ్యాం బైక్‌పై వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు.. వీరిని బ్రీతింగ్ అనలైజర్‌తో చెక్ చేశారు. అనంతరం ఎస్సై వద్దకు తీసుకెళ్లారు. ఆపై ఎస్సైతోపాటు పలువురు కానిస్టేబుళ్లు వారిని విచక్షణా రహితంగా కొట్టారు. అయితే అదే స్థలంలో అంతకుముందు ఇరువర్గాల యువకులు ఘర్షణ పడగా పోలీసులు చెదరగొట్టారు. కాసేపటికే రాహుల్, బన్నీ, శ్యాం త్రిబుల్‌రైడింగ్‌లో వచ్చి పోలీసులకు చిక్కారు. అయితే.. పోలీసుల వాదన మరోలా ఉంది. రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, సతీశ్, శ్రీనివాస్, ప్రణయ్ బీరు బాటిళ్లతో రోడ్డుపై న్యూసెన్స్ చేశారని, వారిని వారిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ.. విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెబుతున్నారు. -
ప్రేమ ముద్దు
అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారని వారి సాన్నిహిత్యం చూస్తే అర్థం అవుతుంది. కానీ, ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు ఈ ఇద్దరూ. ప్రతి సందర్భంలో ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ముద్దుగా తీసుకున్న పై ఫొటోను షేర్ చేశారు మలైకా అరోరా. ఈ ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. -
ఆశల జనవరి
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకు నిలువెత్తు నిదర్శనంగానిలిచిన 2019 ద్వితీయార్థంలో సంక్షేమ సిరులు కురిపించి కాలగమనంలో కలిసిపోయింది. కొంగొత్త ఆశలతోమరో కొత్త వత్సరం జనజీవితాల్లోకి అరుదెంచింది. ఆనంద సంబరాలతో నవశకానికి నాంది పలికింది. సాక్షిప్రతినిధి, ఏలూరు: కొత్త సంవత్సరం 2020లో జిల్లా ప్రగతి వైపు అడుగులు వేయనుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ సంతకంతో జిల్లాపై తనదైన ముద్ర వేసింది. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల సవారీ చేస్తూ ముందుకు సాగుతోంది. జనవరి నుంచి సంక్షేమ ఝరి పరవళ్లు తొక్కనుంది. ఆనందాలు నింపనుంది.అందరికీ ఇళ్లు లక్ష్యంగా.. మరో రెండురోజుల్లో జిల్లా కేంద్రం ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఆయన ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. ఉగాది నాటికి జిల్లాలో ఇళ్లు, ఇళ్ల స్థలం లేని వారు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే పాలనను తీసుకువచ్చింది. మంచికే విజయం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అనే నానుడిని గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీకి ఘన విజయం అందించారు. జిల్లాలోనూ ఆ పార్టీ 13 స్థానాల్లో జయ కేతనం ఎగురవేసింది. ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు పెద్ద పీట వేశారు. జిల్లాకు చెందిన నేతలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో రెండు మంత్రి పదవులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కమిటీ అధ్యక్ష బాధ్యతలు కూడా జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణకు అప్పగించారు. సంక్షేమ పథకాల అమలులో ముందంజ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏలూరు నుంచే వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 13 వేల మందికిపైగా లబ్ధి చేకూరింది. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా రికార్డు స్థాయిలో అమలు చేసి సీఎం జేజేలు అందుకున్నారు. జిల్లాలో 3,09,057 మంది రైతులకు రూ.2,43,20,39,500 చెల్లించారు. కౌలు రైతులకు దేశంలోనే తొలిసారిగా అండగా నిలిచిన ప్రభుత్వాధినేతగా సీఎం జగన్ కీర్తిపుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. జిల్లాలో 899 మంది చేనేతలకు రూ.24వేల వంతున చేయూత అందించారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం అమలు కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పు తీసుకు వచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,058 పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 16,552 మంది వలంటీర్లను నియమించారు. 938 సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏడు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన పోస్టులనూ త్వరలో భర్తీ చేయనున్నారు. ఉగాది నాటికి 2.60 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలోనే స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరోగ్యశ్రీ పథకం పైలెట్ ప్రాజెక్టు అమలుకు పశ్చిమగోదావరి జిల్లా వేదిక కానుంది. ప్ర‘జల సమస్య’ను గుర్తించి సీఎం జగన్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు గుర్తించిన తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారంలోకి రాగానే పరిష్కార మార్గం చూపారు. రూ.4వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో వైఎస్సార్ సీపీలో నవోత్సాహం తొణికిసలాడుతోంది. నైరాశ్యంలో టీడీపీ, ప్రతిపక్షాలు మరోవైపు ఘోరమైన ఓటమి చవిచూసిన తెలుగుదేశం నానాటికీ నైరాశ్యంలో మునిగిపోతోంది. అమరావతి రాజధాని పేరుతో రాజకీయం చేసేందుకు చూస్తున్నా ప్రజల నుంచి మద్దతు రావడం లేదు. ఏలూరు మాజీ శాసనసభ్యుడు బడేటి బుజ్జి ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటుగా మారింది.అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను వేధించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెండునెలలు వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపి వచ్చారు. చంద్రబాబునాయుడు రెండురోజుల పాటు జిల్లాలో మకాం వేసి దిశానిర్దేశం చేసినా పార్టీలో ఇంకా స్తబ్దత కొనసాగుతోంది. ఇక జనసేన అ«ధ్యక్షుడే భీమవరం నుంచి పోటీ చేసినా ప్రజలు ఘోర పరాజయాన్ని అందించడంతో జనసేన నైరాశ్యంలో మునిగిపోయింది. గత ఎన్నికల్లో పొ త్తుల్లో భాగంగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ ఎక్కడా డిపాజిట్లు కూడా పొందలేని స్థితి నెలకొంది. వామపక్షాలు తమ ఉనికి కోసం పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాయి. -
టీ20.. కిర్రాక్ పార్టీ
టిక్ టిక్ టిక్.. మంగళవారం అర్ధరాత్రి చిన్న ముల్లు, పెద్ద ముల్లు ఒక్క చోటకు చేరిందో లేదో ఊరూవాడా ఉర్రూతలూగింది. ఆశల పల్లకీలో ఆకాంక్షల గుబాళింపులను వెంటేసుకొచ్చిన కొత్త అతిథికి స్వాగతం చెప్పే సమయాన ప్రతి గుండె వేయి గొంతుకలై హ్యాపీ న్యూయర్ అంటూ కేక పుట్టించింది. ముగ్గుల చీరచుట్టి... రంగురంగుల విద్యుత్ తోరణాలు కట్టిన ప్రతి వీదీ ఇంద్రధనుస్సులా దివ్య కాంతులు విరజిమ్మింది. వీడలేక వీడిపోతున్న ఆప్తుడికి వీడ్కోలు చెబుతూనే.. ఉరిమే ఉత్సాహంతో దూసుకొచ్చిన హితుడికి ఆత్మీయ స్వాగతం పలికింది. జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్‌లు, కిర్రాక్ పార్టీలతో యువత కేరింతలు కొడుతూ.. కొంగొత్త ఆలోచనల రెక్కలు కట్టుకుని సంబరాల ఆకాశపు అంచులను తాకింది. సాక్షి, అమరావతిబ్యూరో: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2019 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2020కి స్వాగతం పలుకుతూ యువతీయువకులు సందడి చేశారు. ముఖ్యంగా రాజధాని నగరం విజయవాడ పలువురు సినీ, టీవీ తారలు, గాయకుల సందడితో హోరెత్తింది. యువత విజయవాడ రోడ్లపైకి వచ్చి ఒకొరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ వేడుకలు ఫుల్ జోష్‌గా సాగాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్‌లతో యువత ఉత్సాహంగా గడిపింది. స్టార్ హోటళ్లలో సందడే సందడి.. నగరంలోని నోవాటెల్, గేట్‌వే, మురళీఫారŠూచ్యన్, డీవీ మానర్ వంటి స్టార్ హోటళ్లతోపాటు కొన్ని ఫంక్షన్ హాళ్లలో నూతన ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి ఆరంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సంగీత కార్యక్రమాలతోపాటు గ్రాండ్ కార్నీవాల్, విందులు ఏర్పాటు చేశారు. శేషసాయి ఫంక్షన్ హాలులో ‘గ్లో ఇన్ ద డార్క్’ పేరుతో వేడుకలు నిర్వహించారు. స్టాండ్ ఆఫ్ కామెడీతోపాటు.. మ్యూజిక్ బ్యాండ్, డీజే, ఫుడ్ తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే విజయవాడ ట్రెండ్‌సెట్ మాల్లోని ఐదో అంతస్తులో ‘క్యూబా లిబ్రే న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించారు. నిడమానూరులోని బ్లూబజ్లో ‘కూల్ డేజ్ 2020 న్యూ ఇయర్ ఈవ్’ పేరుతో వేడుకలు జరిగాయి. పీవీపీ మాల్ నాలుగో అంతస్తులో డీజే ఉత్సవ్ 2020 పేరుతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వీఏసీ క్యాంపింగ్ గ్రౌండ్స్ వద్ద ‘నైట్ అండర్ ద స్టార్స్’ పేరుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు నైట్ ట్రెక్కింగ్, ఫారెస్ట్ వాకింగ్, చేపలు పట్టడం, క్యాంప్ ఫైర్ లాంటివి చేసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆటపాటలతో సందడి చేసిన యువత.. నూతన సంవత్సర వేడుకల్లో యువత సందడి చేసింది. నగరంలో ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి దాటగానే వేడుకలు జరుపుకుంది. బెంజిసర్కిల్, బందర్‌రోడ్డు, ఏలూరు రోడ్డు, భవానీ ద్వీపం తదితర ప్రాంతాల వద్ద యువత బైక్‌లపై, కార్లలో నగరమంతా తిరుగుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేసింది. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో విజయవాడ హోరెత్తిపోయింది. ఇక శివారు ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలల్లోనూ నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. -
సిడ్నీలో గ్రాండ్ గా న్యూఇయర్ వేడుకలు
-
నయాసాల్ జోష్
సాక్షి, సిటీబ్యూరో/నెట్వర్క్: న్యూ ఇయర్ జోష్‌తో సిటీ హోరెత్తింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నగరమంతటా కొత్త సంవత్సరం సందడి కన్పించింది. యువతీ యువకులు ట్యాంకుబండ్, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు. సరిగ్గా సమయం అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరంలో అనేక చోట్ల మ్యూజికల్ నైట్స్ నిర్వహించారు. డ్యాన్స్‌లు, డీజేలతో సిటీ హోరెత్తింది. జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సంగీతదర్శకుడు తమన్ తన సంగీతంతో కొత్త సంవత్సర వేడుకలకు జోష్‌నిచ్చాడు. బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా, రోడ్‌నెంబర్ 14లోని రివోట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని 800 పబ్‌లతో పాటు అన్ని స్టార్‌హోటళ్లలోనూ కొత్త సంవత్సర వేడుకల సందడి నెలకొంది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీలలో సంబరాలు అంబరాన్నంటాయి. ఐటీ కారిడార్లలో న్యూఇయర్ జోష్ యూత్‌ను ఓలలాడించింది. కొన్నిచోట్ల సినీతారలు కూడా వేడుకల్లో పాలుపంచుకుని అభిమానులను అలరించారు. మరోవైపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని ప్రధానఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వీట్‌షాపులు, బేకరీలు కొనుగోళ్లతో కళకళలాడాయి. బిర్యానీ, మద్యం అమ్మకాలు సైతం భారీగా జరిగాయి. ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు... నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భక్తులు సందర్శించుకొనేందుకు అనుగుణంగా పలు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిర్లా టెంపుల్, దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం, సికింద్రాబాద్ మహాంకాళి ఆలయం, గణేష్ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, పద్మారావునగర్ స్కందగిరి టెంపుల్, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, తదితర ఆలయాలను అందంగా అలంకరించారు. కాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెరిచివుంటుందని ఆలయవర్గాలు తెలిపాయి. దిల్సుఖ్నగర్ శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీతాఫల్మండి నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్నస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ నోముల ప్రకాశరావు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేయనున్నారు. 6గంటల నుంచి 6.30గంటలకు విశేష అలంకారం ఉంటుంది. 6.30 గంటలకు సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిఇస్తారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం 5.30 గంటలకు స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నారు. అనంతరం అర్చనలు, 8.30 గంటలకు గణపతి హోమం నిర్వహిస్తారు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
-
2020 అద్భుతమైన ఏడాదిగా ఉండాలి
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం 2020లో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన తన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను. రాష్ట్రానికి, ప్రజలకూ ఈ సంవత్సరం అద్భుతమైన ఏడాదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ ద స్టేట్ అండ్ విష్ ద పీపుల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. -
పార్టీ మూడ్
న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి తారలందరూ తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లేందుకు అంతా సెట్ చేసుకున్నారు. ఫుల్ జోష్‌తో దిల్ ఖుష్ అయ్యేలా రెగ్యులర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్లో ఎక్కువమంది తారలు గోవా తీరంలో సేద తీరడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. స్టార్ హీరో మహేశ్‌బాబు కుటుంబ సమేతంగా ముంబైలో ఉన్నారు. రామ్‌చరణ్ గోవాలో ల్యాండ్ అయ్యారు. అల్లు అర్జున్ బ్యాంకాంక్‌లో వాలిపోయారు. తన శ్రీమతి సమంతతో కలిసి రెండు రోజులు ముందుగానే గోవా వెళ్లారు నాగచైతన్య. ఇంకా సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీమంచు కూడా 2020 సెలబ్రేషన్స్‌కు గోవానే ఎంచుకున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఆ్రస్టియాలో అడుగుపెట్టారు. తన బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ వాణీకపూర్‌తో కలిసి లండన్‌లో మస్తీ చేస్తున్నారు రాశీఖన్నా. ఆకాంక్షాసింగ్ న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్నారు. మేఘా ఆకాష్ స్పెయిన్ తీరంలోని చల్లగాలులను ఆస్వాదిస్తున్నారు. బ్యాగ్ సర్దుకుని శ్రీలంకకు వెళ్లారు ఐశ్వర్యారాజేష్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు పాయల్ రాజ్‌పుత్. ఇక ఏడాదిలో తొలిరోజును షూటింగ్ లొకేషన్లో గడపనున్నారు నిధీ అగర్వాల్. అంతేకాదు.. ఈ ఏడాది రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు తన వంతు సాయం అందించాలనుకుంటున్నారు నిధి. ఆ్రస్టియాలో పరిణీతిచోప్రా, స్విట్జర్లాండ్‌లో అనుష్కాశర్మలతో పాటు మరికొందరు తమ తమ ఫేవరెట్ లొకేషన్స్‌కు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనున్నారు. -
మందు తాగి పట్టు బడితే అంతే..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 1 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. మందు బాబుల ఆటకట్టించేందుకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసెస్‌లను ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్‌లో ఎక్కువగా ఈవెంట్స్, పబ్‌లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఏడాది ప్రతి ఈవెంట్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలు.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. - ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికిల్స్‌ను అనుమతించరు - పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనా వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ - కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపైకి అనుమతిస్తారు - లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు యథాతథం - గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ల మూసివేత - కామినేని, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, చింతల్ కుంట అండర్ పాస్‌ల మూసివేత - తెలుగుతల్లి ఫ్లైఓవర్, నల్గొండ చౌరస్తా పైవంతెన, పంజాగుట్ట ప్లైఓవర్ మూసివేత - వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలు చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు - మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు - రాత్రి 10 నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిలిపివేత - ఆ దారుల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులు -
31రాత్రి 11 తర్వాత ఓఆర్ఆర్, ఫ్లైఓవర్ల మూసివేత
సాక్షి,సిటీబ్యూరో: కొత్త సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న రాత్రినిర్వహించే వేడుకలపై గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఆ రోజు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో పూటుగా మద్యం తాగి వాహనంపై దూసుకెళదామనుకునేవారికి ముందుగానే బ్రేకులు వేయనున్నారు. గతేడాది అమలు చేసినట్టుగానే ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అయితే, ఈసారి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే మాత్రం రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ చేయనున్నట్టు సైబరాబాద్, రాచకొండ పోలీసుకమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ హెచ్చరించారు. అందరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీసులు చేపట్టే ఈ తనిఖీలకు నగరవాసులు సహకరించాలని వారు కోరారు. వేడుకల నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు హోటల్స్, ఈవెంట్ నిర్వాహకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మార్గదర్శకాలు పాటించాల్సిందే.. న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31న రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే అనుమతి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ సమయం మించి ఈవెంట్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ‘ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదు. సౌండ్ సిస్టంల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, డ్రగ్స్, హుక్కా వంటివి పూర్తిగా నిషిద్ధం. వీటిపై గట్టి పోలీస్ నిఘా ఉంటుంది. రేవ్ పార్టీలకు కూడా అనుమతి లేదు. ఈవెంట్లలో భద్రతను నిర్వాహకులే చూసుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాల(ఫైర్ ఎక్స్టింగుషర్లు)ను సిద్ధంగా ఉంచుకోవాలి. పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నిర్వాహకులదే. అవసరం మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించుకోవాలి. సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలి. వేడుకల్లో ఆయుధాలకు అనుమతి లేదు. వేడుకలకు అనుమతి తీసుకున్న వారు కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేసి పోలీసులకు రెండు రోజుల్లో సమర్పించాలి. ఈవెంట్లో ఏమైనా గొడవ జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే నిర్వాహకుడినే విచారిస్తా’మని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం అమ్మకాల రికార్డు! డిసెంబర్ 31 సంబరాల కోసం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. 2018 డిసెంబర్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు సాగడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే, ఇటీవలే మద్యం ధరలను పెంచడంతో ఈసారి ‘డబుల్’ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతోంది. కగా, గడిచిన ఏడాది డిసెంబర్ 31 ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.133 కోట్ల లిక్కర్ అమ్ముడుపోయింది. హైదరాబాద్ జిల్లాలో రూ.19.5 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.15.30 కోట్లు, మేడ్చల్‌లో రూ.11.90 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈసారి కూడా గ్రేటర్లో పెద్ద సంఖ్యలో ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేయడం, రాత్రి ఒంటి గంట వరకు బార్లకు అనుమతివ్వడంతో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అయితే, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు టికెట్ చూపిస్తే మినహాయింపు ఉంటుంది. అలాగే, బేగంపేట ఫ్లైఓవర్ మినహాయించి మిగతా ఫ్లై ఓవర్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.’’ ‘జోష్’ అనుమతి లెక్క ఇదీ.. నయాసాల్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 124 ఈవెంట్లకు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 75 ఈవెంట్లకు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 33 ఈవెంట్లకు అనుమతిచ్చారు. అయితే, హైదరాబాద్ కమిషనరేట్ విషయానికొస్తే అత్యధికంగా వెస్ట్‌జోన్‌లో 68 ఈవెంట్లు ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్లోనే 63 ఈవెంట్లకు అనుమతించారు. ఈవెంట్లకు వచ్చేవారి భద్రత బాధ్యత నిర్వాహకులదేనని, రాత్రి ఒంటి గంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు ఆదేశించారు. డిజిగ్నేటెడ్ డ్రైవర్లను వాడుకోండి డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేయనున్నట్టు నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడపకపోవడమే మంచిది. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తాం. పార్టీల నిర్వాహకులు క్యాబ్‌లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలి. ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్’ సేవలను వినియోగించుకుంటే ప్రమాదాలకు అవకాశం ఉండదు. – మహేష్ భగవత్, రాచకొండ సీపీ ఈవెంట్ల వద్ద డిస్ప్లే తప్పనిసరి డ్రంకన్ డ్రైవ్ తీవ్రమైన నేరం. 100 మి.లీ రక్తంలో ఆల్కహల్ పరిమితి 30 మైక్రోగ్రాములు మించొద్దు. ఈ అంశాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్క్రీన్‌పై ప్రదర్శించాలి. దీనివల్ల వేడుకల్లో పాల్గొనేవారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ -
న్యూ ఇయర్ ‘షాక్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈవెంట్ల నిర్వహణ కోసం ఎక్సైజ్ ఫీజు భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈవెంట్లను నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోన్న తరుణంలో గతంలో ఉన్న ఈవెంట్ల ఫీజును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఉన్న ఫీజును రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెంచిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్త ర్వులు వచ్చేంతవరకు ఇవి అమల్లో ఉంటా యని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. గతంలో రూ.9 వేలే... వాస్తవానికి గతంలో ఈవెంట్ల నిర్వహణకు చాలా తక్కువగా ఎక్సైజ్ ఫీజు వసూలు చేసేవారు. ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య, ఇతర అంశాలతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే రూ.9 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.4,500 ఎక్సైజ్ ఫీజు కింద వసూలు చేసేవారు. అంటే ఈవెంట్లలో మద్యం సరఫరా అనుమతికి గాను ఈ ఫీజు తీసుకునేవారు. కానీ, చాలాకాలంగా ఈ ఫీజును సవరించకపోవడం, ఈవెంట్ల నిర్వహణ ఖరీదు కావడంతో ఫీజును పెంచాలని రెండు నెలల క్రితం ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు సాధారణ ఈవెంట్ల నిర్వహణకు గాను జీహెచ్ఎంసీ పరిధిలో.. రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. అదే స్టార్ హోటళ్లలో ఈవెంట్లను నిర్వహిస్తే దాన్ని రూ.9 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. ఇక జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో.. సాధారణ ఈవెంట్లకు రూ.4,500 నుంచి రూ.9 వేలకు, స్టార్‌హోటళ్లలో అయితే రూ.4,500 నుంచి రూ.12వేలకు ఎక్సైజ్ ఫీజు పెంచారు. వాణిజ్య, క్రీడా ఈవెంట్లకు భారీ వడ్డన... హైదరాబాద్ పరిధిలో న్యూఇయర్‌తో పాటు పలు సందర్భాలను పురస్కరించుకుని నిర్వహించే ఈవెంట్లలో మందు సరఫరా అనుమతికి గాను కట్టాల్సిన ఫీజు కూడా గతంలో రూ.9 వేలే ఉండేది. ఇప్పుడు ఆ ఫీజును ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య ఆధారంగా ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కనీసం 1000 మంది హాజరయ్యే ఈవెంట్లలో మందు సరఫరా కోసం రూ.50 వేలు, 5 వేల మందిలోపు హాజరయ్యే ఈవెంట్లకు రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ మంది హాజరయితే రూ.2.5 లక్షలు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక నుంచి హైదరాబాద్‌లో జరిగే వాణిజ్య ఈవెంట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే అక్కడ లిక్కర్ సరఫరాకు గాను గతంలో రూ.9 వేలు చెల్లించేవారు. కానీ మారిన నిబంధనల ఇప్పుడు రూ.2.5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
న్యూ ఇయర్ వేడుకలు; షెడ్యూల్ వివరాలు
నూతన సంవత్సరం అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనికోసం యువత వినూత్న రీతిలో వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతుంటారు. ముఖ్యంగా నగర యువతీ యువకులు న్యూ ఇయర్ వేడుకలను హోటల్స్, రిసార్ట్స్, పబ్స్ అంటూ రకారకాలుగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే రానున్న డిసెంబర్ 31ని నగర యువత వినూత్నంగా జరుపుకునేందుకు.. వేడుకలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఉంచాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వేడుకలను నిర్వహించే వారిని సంప్రదించి ఈసారి మీ న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. న్యూ ఇయర్ ఈవెంట్స్ షెడ్యూల్, పూర్తి వివరాలు.. న్యూఇయర్ లైవ్ విత్ రాహుల్ సిప్లిగంజ్ తేది : 31 డిసెంబర్ 2019 సమయం : రాత్రి 7గంటల నుంచి స్థలం : సమ్మర్గ్రీన్ రిసార్ట్స్, తూంకుంట, శామీర్‌పేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు : కపుల్ : రూ.999/-, సిల్వర్ టేబుల్: రూ. 20వేలు, గోల్డ్ టేబుల్ : రూ. 40వేలు న్యూ ఇయర్ ఈవ్ : కంట్రీక్లబ్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:30 నుంచి స్థలం: కంట్రీక్లబ్, బేగంపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ.799 నుంచి మొదలు ప్రత్యేకతలు: బాలీవుడ్ డీజే నైట్, ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్ న్యూ ఇయర్ ఫ్యామిలీ ఫన్ ఈవెంట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 7:00 నుంచి స్థలం: శంకర్ పల్లి– హైదరాబాద్ రోడ్, కోకాపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1000 నుంచి ప్రత్యేకతలు: గ్లో జంప్, న్యూ ఇయర్ కౌంట్‌డౌన్, కేక్ కట్టింగ్ పబ్–జీ 2కె19 తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు స్థలం: డీ లేక్ వ్యూ రిసార్ట్, అజీజ్‌నగర్, మొయినాబాద్, రంగారెడ్డి ఎంట్రీ ఫీజు: రూ.699 నుంచి ప్రత్యేకతలు: లైవ్ డీజే ఫో, మ్యూజిక్ నైట్, ఫైర్ వర్క్స్ బూమ్రాంగ్ న్యూ ఇయర్ ఈవ్ 2019 తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు స్థలం: వసంత సిటీ, హపీజ్‌పేట్, హైటెక్ సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ.899 ప‹స్ట్ కమ్, రూ. 1299 నుంచి ప్రత్యేకతలు: డ్యాన్స్ షో, గార్లిండ్ స్టేజ్, ఫుడ్, లిక్కర్, మ్యూజిక్ నైట్ నైయ్ 2019ః ప్లే బాయ్ బీర్ గార్డెన్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు స్థలం: ప్లే బాయ్ బీర్ గార్డెన్,జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 1999 ప్రత్యేకతలు: డీజే నైట్, లైవ్ మ్యూజిక్, ఫైర్ ప్లే న్యూఇయర్ 2019 ఇన్ లియోనియో తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు స్థలం: లియోనియో రిసార్ట్స్, శామీర్‌పేట, రంగారెడ్డి ఎంట్రీ ఫీజు: రూ. 1999, రూ. 2999 ప్రత్యేకతలు: లైవ్ షో విత్ ఎల్వీ రేవంత్, మాలవిక సుందర్, అనురాగ్ కులకర్ణి, లిప్సిక బాష్యమ్, సిమ్రన్ చౌదరి టీవోటీ న్యూయర్ ఈవ్ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: టీవోటీ, రోడ్ నెంబర్ 10, ఇక్రిశాట్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 2000 ఇద్దరికి ప్రత్యేకతలు: డీజే నైట్ విత్ జస్టిన్ మైలో, శివ్, మైరిస్ న్యూ ఇయర్ ఈవ్ః ప్రిసమ్ క్లబ్ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: ప్రిసమ్ క్లబ్,ఓల్డ్ ముంబయి హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1200 ఇద్దరికి ప్రత్యేకతలు: పాపులర్ డీజే షో, ఫుడ్ అండ్ డ్రింక్స్ స్పాయిల్ న్యూ ఇయర్ బాష్ 2020 తేది: 25 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: డిసెంబర్ 25, రాత్రి 8:00 నుంచి స్థలం: స్పాయిల్, రోడ్ నెంబర్ 1, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1100 ఇద్దరికి ప్రత్యేకతలు: ఇంటర్నేషనల్ డీజే, స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఫన్ ఎక్స్టెండెడ్ 2019ః ట్రైడెంట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12.30 వరకు స్థలం: హోటల్ ట్రైడెంట్, మాదాపూర్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 4499, రూ. 7999 ప్రత్యేకతలు: అన్లిమిటెడ్ ఫుడ్, లక్కీడ్రా ఫర్ ట్రిప్ టూ బాలీ, ప్రీమియమ్ బేవరేజెస్ న్యూ ఇయర్ ఈవ్ @ రామోజీ ఫిల్మ్ సిటీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 1 గంట వరకు స్థలం: రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 4999, రూ. 2999 ప్రత్యేకతలు: స్పెషల్ ఫర్పార్మెన్స్ విత్ సింగర్ ఉషా ఉతుప్, డీజే నైట్ విత్ శివప్రసాద్ న్యూ ఇయర్ ఈవ్ః తాజ్ డెక్కన్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు స్థలం: తాజ్ డెక్కన్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 2999, రూ.4999 ప్రత్యేకతలు: ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్, సెల్ఫీ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఈవ్ @ ఫ్యూజన్ 9 తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం:మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9:00 వర కు స్థలం: ఫ్యూజన్ 9, ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 3399 ప్రత్యేకతలు: డీజై లైవ్ షో, రాక్ బాండ్ మ్యూజిక్ మ్యాడ్ ఆన్ 2కె20ః బీస్పోర్టీ తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: సాయంత్రం 6:00 నుంచి 12.30 గంటల వరకు స్థలం: స్పోర్ట్ కాంప్లెక్స్,మెరిడియన్ స్కూల్ రోడ్, మాదాపూర్, హైటెక్‌సిటీ, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 1500 ఒక్కరికి, రూ. 2500 ఫర్ కపుల్స్ ప్రత్యేకతలు: 3డీ లేసర్ షో, లైవ్ డ్యాన్స్ షో, డీజే నైట్, రాక్ బాండ్ మ్యాజిక్ న్యూయర్ ఇన్ డెక్కన్ ట్రయల్స్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంత్రం 6:00 నుంచి స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్ ఎంట్రీ ఫీజు: రూ. 500 నుంచి ప్రత్యేకతలు: మ్యూజిక్, ఫుడ్ పెస్టివల్ అనంతగిరి హిల్స్ న్యూ ఇయర్ ప్రీ పార్టీ తేది: 28 డిసెంబర్ నుంచి సమయం: మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభం స్థలం: వికారాబాద్, రంగారెడ్డి, తెలంగాణ ప్రత్యేకతలు: క్యాంపింగ్, ట్రెక్కింగ్, మ్యూజికల్ నైట్ గేటెబ్ కమ్యూనిటీ న్యూఇయర్ పార్టీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: సాయంత్రం 6:00 నుంచి స్థలం: దివ్యశ్రీ శక్తి, మయూరి నగర్, మియాపూర్, హైదరాబాద్ ప్రత్యేకతలు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విత్ గ్రూఫ్ ఆఫ్ పీపుల్ జోష్ 2020 న్యూయర్ పార్టీ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: శ్రీ కన్వెన్షన్, దూలపల్లి రోడ్, కొంపల్లి , హైదరాబాద్ ప్రత్యేకతలు: లైవ్ షో విత్ డీజే షరోన్ సహస్ర న్యూ ఇయర్ గాథరింగ్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: హైదరాబాద్ ప్రత్యేకతలు: డీజే నైట్, ఫైర్ వర్క్, లైవ్ స్ట్రీమింగ్, లిమిటెడ్ డ్రింకింగ్, ఫుడ్ పెస్టివల్ మైస్టీ 5 నై బ్లాస్ట్ తేది: 31 డిసెంబర్ 2019 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్ ప్రత్యేకతలు: మ్యూజిక్ విత్ డీజే ఆంద్రా, డీజే సోనాలి కత్యాల్ న్యూ ఇయర్ ఈవ్ ఎట్ తాజ్ బంజార తేది: 31 డిసెంబర్ 2019– 1 జనవరి 2020 సమయం: రాత్రి 8:00 నుంచి స్థలం: తాజ్ బంజార, రోడ్ నెంబర్ 1,బంజారా హిల్స్, హైదరాబాద్ ప్రత్యేకతలు: డీజే ఫ్లెక్స్, లైవ్ గ్రూఫ్ డ్యాన్స్ షో - ఎస్.వరుణ్ (వెబ్‌డెస్క్) -
సిటీ థ్రిల్స్.. పార్టీ స్టైల్స్..
ఇది వింటర్ సీజన్. వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీలోని పార్టీ లవర్స్‌కి బాగా ఇష్టం. దీనికి తోడు క్రిస్మస్ మొదలుకుని సంక్రాంతి దాకా వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పార్టీల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో సిటీలో క్రేజీగా మారిన కొన్ని పార్టీల విశేషాలు... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పార్టీలకు థీమ్‌ని జత చేయడం అనేది ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. నలుగురం కలిశామా తిన్నామా తాగామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని మోడ్రన్ సిటీ ఆశిస్తోంది. అందుకని వెరైటీ స్టైల్స్ కోసం అన్వేషిస్తోంది. సిటీలో ఇప్పుడు బాగా క్రేజీగా మారిన పార్టీ స్టైల్స్‌లో... కూల్... పూల్.. సిటీలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న స్టార్ హోటల్స్ ఉన్నాయి. అలాగే సొంత భవనాలూ కొందరికి ఉన్నాయి. దీంతో పూల్ పార్టీ కూడా క్రేజీగా మారింది. ఈ వేడుక మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. దీనిలో భాగంగా వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ వంటివి ఉంటాయి. పూల్ పార్టీలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల థగథగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి డెస్టినేషన్.. పేషన్ ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా... ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమేటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పార్టీలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే . ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ చెప్పారు. పాట్ లాక్... ఫుడ్ క్లిక్... చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచ్చిన, వచ్చిన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్ధాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ట్రెడిషనల్... ట్రెండీగా... సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పార్టీస్ ఎక్కువగా జరుగుతుంటాయి.వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకుని రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడతాయనే ఆలోచన దీనికి కారణమన్నారు. ఆరోగ్యకరం... ఆర్గానిక్ ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పార్టీస్‌కి కూడా వచ్చేసింది. ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. సిటీలో చాలా మందికి పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలు, నృత్యాలు వచ్చీరాని సేద్యం కూడా చేసేసి, సహజమైన పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తన్నారు. -
సిటీ థ్రిల్స్.. పార్టీ స్టైల్స్..
సాక్షి, సిటీబ్యూరో(రంగారెడ్డి): ఇది వింటర్ సీజన్. వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీలోని పార్టీ లవర్స్‌కి బాగా ఇష్టం. దీనికి తోడు క్రిస్మస్ మొదలుకుని సంక్రాంతి దాకా వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పార్టీల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో సిటీలో క్రేజీగా మారిన కొన్ని పార్టీల విశేషాలు... నగరంలో పార్టీలకు థీమ్‌ని జత చేయడం అనేది ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. నలుగురం కలిశామా తిన్నామా తాగామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని మోడ్రన్ సిటీ ఆశిస్తోంది. అందుకని వెరైటీ స్టైల్స్ కోసం అన్వేషిస్తోంది. సిటీలో ఇప్పుడు బాగా క్రేజీగా మారిన పార్టీ స్టైల్స్‌లో... కూల్.. పూల్.. సిటీలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న స్టార్ హోటల్స్ ఉన్నాయి. అలాగే సొంత భవనాలూ కొందరికి ఉన్నాయి. దీంతో పూల్ పార్టీ కూడా క్రేజీగా మారింది. ఈ వేడుక మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. దీనిలో భాగంగా వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ వంటివి ఉంటాయి. పూల్ పార్టీలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల థగథగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి డెస్టినేషన్.. పేషన్ ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా... ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమేటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పార్టీలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే . ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ చెప్పారు. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచ్చిన, వచ్చిన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ట్రెడిషనల్.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పార్టీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకుని రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడతాయనే ఆలోచన దీనికి కారణమన్నారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్ ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పార్టీస్‌కి కూడా వచ్చేసింది. ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. సిటీలో చాలా మందికి పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలు, నృత్యాలు వచ్చీరాని సేద్యం కూడా చేసేసి, సహజమైన పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తన్నారు. -
‘జోష్’లో సభ్యత.. జాగ్రత్త!
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరువొద్దని నిర్వాహకులకు నగర పోలీసులు స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడానికి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం హోటళ్లు, పబ్స్, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణకు నిర్ణీత సమయం ముందు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఈ పార్టీల నేపథ్యంలో కచ్చితంగా పాటించాల్సిన అంశాలను పోలీసు కమిషనర్ వారికి స్పష్టం చేశారు. ⇒ ఈ కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. ⇒ వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. ⇒ అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించరాదు. ⇒ న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. ⇒ వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించొద్దు ⇒ యువతకు సంబంధించి ఎలాంటి విశృంకలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. ⇒ బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ⇒ ఎక్సైజ్ అధికారులు అనుమతించిన సమయాన్ని మించి మద్యం సరఫరా చేయకూడదు. ⇒ జనసమర్థ, బహిరంగ ప్రాంతాల్లో టపాకులు పేల్చకూడదు. నిర్ణీత ప్రదేశాల్లో అవసరమైన సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ⇒ మద్యం తాగి వాహనాలు నడిపేతే కలిగే దుష్ప్రరిణామాలు, చట్ట ప్రకారం వారిపై తీసుకునే చర్యల్ని వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. ⇒ మద్యం తాగిన వారు వాహనాలు నడపకుండా ఉండేలా ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఫర్ ది డే’ అంశాన్ని వారికి వివరించాలి. ‘‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై స్టార్ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాళ్లు తదితరాల యజమానులతో సమావేశం నిర్వహించాం. ఈ ఏడాదీ రాత్రి ఒంటి గంట వరకే అనుమతి. ఆ తర్వాత నిర్వహించకూడదు. నిర్ణీత సంఖ్యకు మించి ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాలకు కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. పార్కింగ్ ప్లేసులు ప్రొవైడ్ చెయ్యడంతో పాటు అక్కడా వీటిని ఏర్పాటు చేయాలి. వలంటీర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, ట్రాఫిక్ నిర్వహణ చేసే వారు కచ్చితంగా ఉండాల్సిందే. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫైర్ సేఫ్టీకి సంబం«ధించిన చర్యలు తీసుకోవాల్సిందే. చిన్నారులు, మైనర్లు ఈ పార్టీలకే అంశంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు. డ్రగ్స్ వినియోగంపై కన్నేసి ఉంచాలి. ఈ చర్యలు కచ్చితంగా తీసుకుంటామని ఆయా యాజమాన్యాలు హామీ ఇచ్చాయి’’ – నగర పోలీసు ఉన్నతాధికారి -
చాక్లెట్ బ్యూటీ
-
జనవరిలో కొలువుల జోరు..
ముంబై: నూతన సంవత్సరం తొలి నెలలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోల్చి చూస్తే 2019 జనవరిలో ఉద్యోగ నియామకాలు 15% పెరిగాయి. ప్రధానంగా ఐటీ పరిశ్రమ ఇందుకు దోహదం చేసింది. ఈ ఒక్క రంగంలోనే నియామకాలు జనవరిలో 36 శాతం పెరిగాయి. ఈ మేరకు జనవరి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గణాంకాలు విడుదలయ్యాయి. జనవరిలో ఈ ఇండెక్స్ 2,251గా నమోదైంది. 2018 జనవరిలో ఇది 1,951గా ఉండటం గమనార్హం. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రతినెలా నౌకరీ డాట్ కామ్ సైట్లో ఉద్యోగ వివరాల నమోదు ఆధారంగా విడుదలయ్యే గణాంకాలు. బెంగళూరు నగరం 27 శాతం నియామకాల వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. ముంబైలో 10 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 8 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. మొత్తం మీద ప్రారంభ స్థాయి (0–3 ఏళ్ల అనుభవం కలిగిన వారు)లో నియామకాలు 16 శాతం పెరగ్గా, 4–7 ఏళ్ల అనుభం కలిగిన వారి నియామకాలు 18 శాతం పుంజుకున్నాయి. -
మళ్లీ పనిలో పడ్డా
న్యూ ఇయర్ బ్రేక్‌ను పూర్తి చేసి మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయారు పూజా హెగ్డే. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం ఈ బ్యూటీ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు పనికి ఫుల్స్టాప్ పెట్టి హాలిడేస్‌ను ఎంజాయ్ చేశారు. హాలీవుడ్, హ్యారీపోటర్ షూటింగ్ చేసిన ప్రదేశాలన్నీ చుట్టేశారు. రీసెంట్గా హాలిడేస్‌ను పూర్తి చేసిన పూజ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్‌తో చేస్తోన్న లవ్‌స్టోరీ సెట్లో జాయిన్ అయ్యారామె. ‘‘లాంగ్ హాలిడే తర్వాత ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. హాలిడే మూడ్ వదిలేసి మళ్లీ పనిలో పడ్డా’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1920ల కాలంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరుపుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
ఆ రాత్రి 20,000 ప్లేట్ల బిర్యానీ లాగించారు..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నూతన సంవత్సర వేడుకలంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. 2018కి వీడ్కోలు పలుకుతూ 2019కు స్వాగతం చెబుతూ డిసెంబర్ 31 రాత్రి భారత్‌లో వేడుకలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలు 20,000కు పైగా ప్లేట్ల బిర్యానీని లాగించేశారని వెల్లడైంది. డిసెంబర్ 31 రాత్రి దేశమంతటా వేలాది బిర్యానీ ప్లేట్లు సరఫరా చేశారని, కొత్త ఏడాదికి అరగంట చేరువలోనే వందలాది ఆర్డర్లను అందచేశారని ఆహార ఆర్డర్, సరఫరా సంస్థ ఫుడ్‌పండా పేర్కొంది. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ జనం బిర్యానీతో పాటు బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్, చికెన్ రోల్స్, బర్గర్లు, ఫ్రైడ్ రైస్‌ను ఆస్వాదించారని తెలిపింది. 2018 చివరి రోజున హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూర్, ముంబై, వైజాగ్ల్లో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. హైదరాబాదీలు ఎక్కువగా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయగా, ముంబై వాసులు మిల్క్‌షేక్‌లు, బర్గర్ల వైపు మొగ్గుచూపారని,ఇక దేశ రాజధాని ఢిల్లీ పౌరులు టిక్కా, బటర్ చికెన్లను ఇష్టంగా తిన్నారని తేలింది. ఇక ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎక్కువగా చక్కెర లేని జ్యూస్‌లు, సలాడ్లను ఆర్డర్ చేశారని ఫుడ్‌పండా పేర్కొంది. -
హాలిడే ఇంకా అవ్వలేదు
టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంతల న్యూ ఇయర్ హాలిడే ఇంకా ముగిసినట్టుగా లేదు. ఆమ్స్టర్డమ్ అందాలను ఇంకా చూస్తూ గడిపేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నాగచైతన్య, మరికొంత మంది స్నేహితులతో కలసి హాలిడేకి వెళ్లారు సమంత. అక్కడ తాము చేస్తున్న అల్లరంతా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారామె. తాజాగా ఈ ట్రిప్‌లో పలు ఫొటోలను పంచుకున్నారు. సినిమాల విషయానికి వస్తే సమంత, నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. -
నా పిల్లల్లో ఒకరు టెన్త్ చదువుతున్నారు..
సినిమా: నటి హన్సిక నూతన సంవత్సరంలో ఒక శపథం చేసింది. ఈమెలో అందమే కాదు దాని వెనుక అంతకన్నా అందమైన మనసూ, మంచి ఆశయమూ ఉంది. నటిగా పుష్కరాన్ని టచ్ చేసినా క్రేజీ కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న నటి హన్సిక. ఈ ముద్దుగుమ్మ సిగ్ధమనోహరం యువత గుండెల్లో తీయని గునపాలను గుచ్చుతుంది. ఇప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల్లో అందాలను ఆరబోయడానికే ఎక్కువగా ప్రయత్నించిన ఈ బ్యూటీ తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. అలాంటి చిత్రమే ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న మహా. ఇది హన్సికకు అర్ధ సెంచరీ చిత్రం కావడం విశేషం. అయితే ఈ చిత్రంతో మొదటి నుంచే హన్సిక వివాదాలకు కారణంగా మారుతోంది. మహా చిత్ర తొలి రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్ల విడుదల సమయంలోనూ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. అదీ చర్చనీయాంశంగా మారింది. అందరూ టబ్‌లో నీళ్లతో స్నానం చేస్తారు. మహా చిత్రంలో నటి హన్సిక మాత్రం రక్తంతో స్నానం చేసింది. అవును చేతిలో గన్ పట్టుకుని రక్తం నిండిన టబ్‌లో స్నానం చేస్తున్నట్లున్న హన్సిక ఫొటోతో కూడిన మహా చిత్ర మూడో పోస్టర్‌ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నూతన సంవత్సరంలో నటి హన్సిక చేసిన శపథం విషయానికి వస్తే ఈ బ్యూటీ ఇంత చిన్న వయసులోనే 34 మందికి తల్లి అయ్యింది. అవును 34 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. వారిని హన్సిక తన పిల్లలనే చెబుతుంది. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కట్టించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా హన్సిక తన ట్విట్టర్లో పేర్కొంటూ నా పిల్లల్లో ఒకరు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను రాయనున్నారని చెప్పింది. అతన్ని మంచి మార్కులు సాధించేలా చేసి రాష్ట్రంలోనే ప్రథమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని నూతన సంవత్సరంలో శపథం చేశానని తెలిపింది. ఇకపోతే తాను ప్రస్తుతం నటిస్తున్న మహా చిత్రం విభిన్నమైన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్రం గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంది. ఇప్పుడు మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించానని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని హన్సిక పేర్కొంది. అదేవిధంగా ఇకపై తాను నటించే చిత్రాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. -
సీన్ రివర్స్!
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకల సహా ఇతర సందర్భాల్లో ఉత్తరాది నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు నగరానికి దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ డిసెంబర్ 31ని టార్గెట్‌గా చేసుకుని గోవా నుంచి కొకైన్‌ను తీసుకువచ్చిన గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే చింతల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులామ్ హుస్సేన్ మాత్రం ఈ సీన్‌ను రివర్స్ చేశాడు. నగర శివార్లలోని పారిశ్రామిక వాడలో తయారైన ఎఫిడ్రిన్ డ్రగ్‌ను మరో వ్యక్తితో కలిసి ముంబైకి అక్రమంగా చేరవేశాడు. సోమవారం తెల్లవారుజామున వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి అంబోలీ పోలీసులు రూ.3.4 కోట్ల విలువైన 20 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విశేషం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. చింతల్‌లోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులాం హుస్సేన్ కొన్నేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన దయానంద్ మాణిక్ ముద్దన్నార్ అతడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వీరు దేశవాళీ డ్రగ్‌గా పిలిచే ఎఫిడ్రిన్‌ను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్ యూనిట్ అధికారులు 2013లో వీరిని పట్టుకుని 200 కేజీల ముడి ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి వ్యవహారాలపై కన్నేసి ఉంచేందుకుగాను హిస్టరీ షీట్లు కూడా తెరిచారు. ఈ కేసులో బెయిల్ పొందిన వీరు 2015లో బయటికి వచ్చారు. ఈ ద్వయం అప్పటి నుంచి తమ దందాను హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చింది. అక్కడి కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తో (విక్రయదారులు) సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారు కొరినప్పుడల్లా సిటీ నుంచి రోడ్డు మార్గంలో ఎఫిడ్రిన్ తీసుకువెళ్లి అప్పగించి వస్తున్నారు. డిసెంబర్ 31 పార్టీలను టార్గెట్‌గా చేసుకున్న ముంబైలోని డ్రగ్ పెడ్లర్లు ఇస్మాయిల్ ద్వయానికి భారీ ఆర్డర్ ఇచ్చారు. దీంతో హై క్వాలిటీ ఎఫిడ్రిన్ తీసుకున్న వీరు ఆదివారం ఉదయం సిటీ నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఎఫిడ్రిన్తో ఉన్న బ్యాగ్‌ను డెలివరీ చేయడానికి వెళుతుండగా అంబోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగేశ్వరి వెస్ట్‌లో ఉన్న అగర్వాల్ ఎస్టేట్స్ వద్ద సంచరిస్తున్న వీరి వ్యవహారంపై అక్కడి పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున 2.40 గంటలకు రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ దయా నాయక్ నేతృత్వంలోని బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా... అందులో మూడు ప్యాక్స్‌లో పార్శిల్ చేసి ఉన్న 20 కేజీల 348 గ్రాముల ఎఫిడ్రిన్ లభించింది. దీనిని స్వాధీనం చేసుకున్న అంబోలీ పోలీసులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మాదకద్రవ్యం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అరెస్టుపై సమాచారం అందుకున్న ఇక్కడి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 2013లో, తాజాగా వీరి వద్ద లభించిన ఎఫిడ్రిన్ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నగర శివార్లలో దీనిని తయారు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించిన మూలాలను కనిపెట్టడానికి ఎన్సీబీ సైతం రంగంలోకి దిగింది. ఇస్మాయిల్‌తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసిన ముంబైలోని అంబోలీ ఠాణా ఇన్స్పెక్టర్ దయా నాయక్‌కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుంది. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌ల్లో ఈయన ఒకరు. 1995లో ముంబై పోలీసు విభాగంలో చేరిన దయా పేరు 2000 ప్రాంతంలో మారుమోగింది. డిటెక్షన్ యూనిట్లో పని చేస్తూ దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈయన అంబోలీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. -
వలసదారులపై బాష్పవాయువు
టిజుయానా: మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న వలసదారులను యూఎస్ సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. వీరిలో 25 మందిని అరెస్టు చేశాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దాదాపు 100 మంది వలసదారులు అమెరికాలోకి చొరబడేందుకు యత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 45 మంది వలసదారులను అడ్డుకున్నామని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మంగళవారం వెల్లడించింది. కొద్దిసేపటి తర్వాత వీరంతా సీబీపీ అధికారులపై రాళ్ల వర్షం కురిపించారని తెలిపింది. వలసదారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రేను వాడామని వివరించింది. -
హల్వా కావాలా బాబూ!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఎక్కవమంది బాలీవుడ్ స్టార్స్ విదేశాలకు వెళ్లి మస్త్ మజా చేస్తే కంగనా రనౌత్ మాత్రం సొంతింట్లోనే వేడుక చేసుకున్నారు. గతేడాది కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. న్యూ ఇయర్‌కు ముందు రోజు కిచెన్‌లోకి వెళ్లి ఆమె గరిటె తిప్పి హల్వా ప్రిపేర్ చేశారు. కంగనా వంట చేస్తున్న ఫొటోను ఆమె సోదరి రంగోలి షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. హల్వా కావాలా బాబు? అని అడిగేలా ఉంది కదా కంగనా స్మైల్. మరి.. టేస్ట్ ఎలా ఉందనే విషయం మైకుల ముందుకు వచ్చినప్పుడు కంగనానే అడిగి తెలుసుకుందాం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని కంగనా అనుకుంటున్నారట. -
కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం
జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంవత్సరంలో మొదటిరోజు ఎంచుకున్నారు అమీ జాక్సన్. తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పణాయిట్టోతో జనవరి ఫస్ట్ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారీ బ్రిటీష్ బ్యూటీ. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జార్జ్, అమీ 2015 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ... అలాంటిదేం లేదని చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అమీ జాక్సన్. గతేడాది వేలంటేన్స్ డే రోజు జార్జ్‌ను ప్రేమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్స్‌లోనూ, పార్టీల్లోనూ తరచుగా కలుస్తూ, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ క్రిస్మస్ పార్టీని కూడా అరేంజ్ చేశారు. న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా జాంబియా వెళ్లింది ఈ జంట. అక్కడే ఈ ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ‘‘మా జీవితాల్లో సరికొత్త సాహస యాత్రను మొదలుపెట్టాం. ఐ లవ్ యూ జార్జ్. నన్నీ ప్రపంచంలోనే ఆనందమైన అమ్మాయిని చేసినందుకు థ్యాంక్స్’’ అని ఈ ఫొటోను పోస్ట్ చేశారు. త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారట అమీ, జార్జ్. -
నల్గొండలో ఒక్కరోజే రూ.3 కోట్లు తాగేశారు
నల్లగొండ క్రైం : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగింది. మందు ప్రియుల జేబుకు చిల్లు పడగా.. ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు జరిగిన కార్యక్రమాలతో ఒక్క రోజులోనే (డిసెంబరు 31వ ) రూ.3 కోట్ల మద్యం సేల్ అయ్యింది.ఇక, డిసెంబరు నెల విషయానికి వస్తే.. 2017 డిసెంబర్ ఒక్క నెలలో రూ.83 కోట్ల 2లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, 2018 డిసెంబర్లో రూ.95 కోట్ల 28 లక్షల విలువ గల మద్యం అమ్మకాలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018 డిసెంబర్లో రూ.12.26 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి కేవలం డిసెంబర్ 31 నాడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల 15 లక్షల విలువైన మద్యం వైన్‌షాపులకు చేరగా... అందులో రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 138 వైన్‌షాపులు, 18 బార్లు, నాగార్జునసాగర్, నల్లగొండల్లో క్లబ్బులు ఉన్నాయి. డిసెంబర్ 31న మద్యం డిపో నుంచి వైన్‌షాపులకు 8,185 లిక్కర్ పెట్టెలు, 10,298 బీర్ పెట్టెలు తరలాయి. మొత్తం రూ. 5,15 లక్షల విలువైన మద్యం వైన్‌షాపులకు చేరగా రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున రూ.2 కోట్ల 50 లక్షల మద్యం అమ్మకం ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి శంకరయ్య తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత బీర్లను పొంగించారని మద్యం అమ్మకాలు రుజువు చేస్తున్నాయి. -
డ్రంక్ అండ్ డ్రైవ్: తాగకున్నా.. తాగినట్టు..!!
సాక్షి, కంటోన్మెంట్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రమాదాల నివరణకు సోమవారం అర్ధరాత్రి నగరవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకెటన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ జహిరూల్లా ఖాద్రి అనే యువకుడు మద్యం తాగకున్న తాగినట్టు బ్రీత్ అనలైజర్‌లో రీడిండ్ రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి కూడా అలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. ఉప్పల్‌కు చెందిన నాగభూషణ్‌రెడ్డి (32) తాడ్బండ్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలాఖరు కావడంతో ఆరోజు ఆఫీసులో ఆలస్యమైంది. అర్ధరాత్రి 12గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. (డ్రంక్ అండ్ డ్రైవ్.. తాగకున్న తాగినట్టు!) తాడ్‌బండ్ చౌరస్తా సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగభూషణ్‌రెడ్డిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా భారీగా మద్యం తాగినట్టు రీడింగ్ వచ్చింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఖంగుతిన్న నాగభూషణ్‌రెడ్డి తాను ఎలాంటి మద్యం సేవించలేదని ట్రాఫిక్ సిబ్బందికి చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాధితుడు అప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు బాదితుడికి ‘క్లీన్ చిట్’ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదిక ఇచ్చారు. వైద్యులు ఇచ్చిన నివేదిక తీసుకుని నాగభూషణ్‌రెడ్డి మంగళవారం స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు అతని వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయమై తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవిని వివరణ కోరగా.. బ్రీత్ అనలైజర్ పరీక్షలో నాగభూషణ్‌రెడ్డి మద్యం సేవించినట్లు నిర్దారణ అయిందనీ ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. -
కొత్త వత్సరానికి ఘన స్వాగతం
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2018కు బైబై చెప్పి.. 2019కు స్వాగతం చెబుతూ.. సోమవారం అర్ధరాత్రి వరకు డ్యాన్సులు, పాటలతో సరదాగా గడిపారు. నగరంలోని పలు హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని, వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాగరతీరంలో యువత సందడి చేశారు. బీచ్‌రోడ్డు మొత్తం జాతరను తలపించింది. అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరాన్ని ప్రశాంతంగా ఉంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా విశాఖను సేఫ్ జోన్‌గా మార్చాలని అధికారులు, సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం సూర్యాభాగ్ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూపొందించిన హేండ్‌బుక్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర శాంతిభద్రతలు కాపాడటంలో సిబ్బంది ముఖ్యపాత్ర వహించాలన్నారు. 2019లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. పాపాహోంలో..: పోలీస్ కమిషనరేట్‌లోని పాపాహోం, సీతమ్మధారలోని బాలికల పాపాహోంలో జరిగిన వేడుకల్లో సీపీ పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు కేక్ తినిపించేందుకు పోటీ పడ్డారు. నగర డీసీపీ–1 రవీంద్రనాథ్‌బాబు, డీసీపీ–2 అద్మన్ నయీమ్ అశ్మీ, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం అన్ని శాఖల ఉన్నాతాధికారులు కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. జాయింట్ కలెక్టర్ సృజన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉప రవాణాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో తేజ్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
లాఠీలు ఝుళిపించిన పోలీసులు
ఏలూరు /కాళ్ల: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహంతో కేరింతలు కొడుతున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పలువురు గాయపడిన సంఘటన మండలంలోని సీసలిలో జరిగింది. సోమవారం రాత్రి మైక్‌లో పాటలు పెట్టుకుని ఆనందంతో గడుపుతున్న వారి వద్దకు కాళ్ల ఎస్సై రాజ్‌కుమార్ సిబ్బందితో వచ్చి మైక్ నిలుపుదల చేసి వెంటనే వెళ్లిపోవాలని కోరారు. ఈ సందర్భంగా వాగ్వివాదం జరగడంతో పో లీసులు లాఠీలకు పని చెప్పారు. డీజే సౌండ్ సిస్టం యజమాని మత్తి శాంతారావు, భూపతి ఆదాం, నర్శింహులు, జె.శ్యామ్యూల్, గంటా లాజర్ తదితరులు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన శాంతారావు, ఆదాంలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయిస్తున్నారు. రాజీకోసం పోలీసుల యత్నాలు తాము రికార్డింగ్ డాన్సులు, అసభ్యకర నృత్యాలు వంటివి ఏవీ చేయలేదని, దైవ ప్రార్థనలు చేసి భక్తి గీతాలాపన చేసుకుంటున్నామని, సమయం అయిపోయింది వెళ్లిపోండని చెబుతూనే ఎస్సై రాజ్‌కుమార్, పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితులు శాంతారావు, ఆదాం తదితరులు వాపోయారు. దళితులపై జరిగిన దాడికి సంబంధించి భీమవరం రూరల్ సీఐ సునిల్‌కుమార్ రాజీ కుదుర్చుతున్నారని బాధితులు తెలి పారు. తన చేతి ఎముక విరిగిపోవడంతో స్టీల్ రా డ్డు వేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అయితే షుగర్ 360 ఉన్నందున ఆపరేషన్ కష్టమని, సిమెంట్ పోత పోశారని బాధితుడు శాంతారావు చెప్పారు. ఆదాంకు మోకాలుపై కట్టుకట్టారు. ఎక్స్‌రే తీసి ఎముకకు దెబ్బతగిలిందేమోనని పరీ క్షించారని చెప్పారు. బాధితుల్ని దళిత పేటకు చెందిన పలువురు పరామర్శించారు. ఎమ్మెల్యే వీవీ శివరామరాజు చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. -
ప్రాణం తీసిన నిషా?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి తీసుకుని ఇంట్లో వారిపై దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఇటీవల వనపర్తి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినట్లు సమాచారం. అయినా కన్నప్రేమ విషయం బయటకు పొక్కనివ్వవటం లేదు. ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి యువకులు చేసుకున్న సంబరాల్లో ఓ యువకుడు మృతి చెందడానికి గంజాయి మత్తే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మత్తులో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వనపర్తి సీఐ సూర్యానాయక్, ఎస్ఐ జములప్ప, రమణ తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వ్యాపారం కోసం కొన్నేళ్ల క్రితం వనపర్తికి వచ్చిన దేవేందర్ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనతో పాటు తమ్ముడు పుష్పెందర్ (28) వనపర్తిలోనే నివాసం ఉండేవాడు. పుష్పెందర్‌కు గత ఏడేళ్ల క్రితం సుజాత అలియాస్ రాఖితో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వారు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని మళ్లీ నలభై రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి వనపర్తికి వచ్చాడు. తన అన్నవెంట పనిచేసే యోగేష్‌తో కలిసి సోమవారం ఇంట్లోనే మద్యం సేవించిన పుష్పేందర్.. మిత్రుడు భానుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సంతబజార్‌లో ఎస్పీ కార్యాలయం పక్కన తెలిసిన వ్యక్తులు సాయి, చరణ్ మరికొందరు కనిపిస్తే శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఇరువర్గాల మధ్య మునుపటి విషయాలపై ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పుష్పేందర్‌పై సాయి, చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేయగా యోగేష్ అడ్డుకునేందుకు యత్నించినా వారు వినకపోవడంతో పారిపోయాడు. ఆ వెంటనే విషయాన్ని పుష్పేందర్ అన్న దేవేందర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న దేవేందర్ ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డుపై పడి ఉన్న పుష్పేందర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిందని ఎస్ఐ జములప్ప తెలిపారు. కాగా, ఈ విషయమై సీఐ సూర్యానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. -
ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలి
సాక్షి, హైదరాబాద్: ఇది మన రాష్ట్రమని తెలుగు వారంద రూ ఒక్కటేనని, ప్రతీ పౌరు డు బాధ్యతతో వ్యవహరిం చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దర్బార్ హాల్లో గవర్నర్ దంపతులను సామాన్యులు, ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘హైకోర్టు విభజన జరిగింది. ఉద్యోగుల విభజనపై గతంలో లాగా చొరవ తీసుకొని మళ్లీ మీటింగ్ పెడతారా’అని పలువురు గవర్నర్‌ను ప్రశ్నించగా.. త్వరలో ఆ సమస్యపై కూడా పని చేస్తానని సమాధానమిచ్చారు. తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షిం చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. -
సీసాలో ఆవిరి
విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్‌ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేశారు. గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘‘ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని రవిబాబు తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నారు. -
కాలానికి ధన్యవాదాలు
న్యూ ఇయర్ వచ్చేసింది. గడచిన సంవత్సరం ఎలా గడిచింది? అని విశ్లేషించుకుంటూ ఈ ఏడాది ఎలా ఉండాలో కోరుకుంటూ బిజీగా ఉన్నారు చాలామంది. శ్రుతీహాసన్ ఏమంటున్నారంటే.. ‘‘ఎలా జీవించాలో నాకు నేర్పుతున్న ప్రతి ఏడాదికి థ్యాంక్స్. కాలం నాలో తెచ్చిన మార్పులకు థ్యాంక్స్. నాలో నన్ను వెతుక్కునే అవకాశం కల్పించి, నన్ను నేను ప్రేమించుకునేలా చేసిన టైమ్‌కి థ్యాంక్స్. అలాగే 2019 కూడా నన్ను ఎగై్జట్ చేసే ఎన్నో అంశాలను నా ముందుకు తీసుకురావాలి. నాకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకునే అవకాశాలను ఇవ్వాలి. నా సంతోషంలో గతేడాది భాగమైన నా బంధుమిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఆమె తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి లండన్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక శుత్రి సినిమాల విషయానికి వస్తే.. హిందీలో విద్యుత్ జమాల్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
-
వేడుకల్లో విషాదం : ఇద్దరు బాలురపై కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్రమంలో ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలురిపై కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది సంవత్సరాల బాలుడు బుల్లెట్ గాయాలతో మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో తమ ఇంటి టెర్రేస్‌పై నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఎనిమిదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాణాసంచా పేలుళ్లు తమకు వినిపించాయని, అనంతరం బాలుడు స్పృహ కోల్పోయి పడిఉండటాన్ని గమనించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్ధానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని ప్రశ్నించామని విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక ఈశాన్య ఢిల్లీలోని వెల్కం ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో 12 ఏళ్ల బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
నవ వత్సరం.. సాదర స్వాగతం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నవ వత్సరానికి జిల్లా వాసులు సాదర స్వాగతం.. 2019 ఎన్నికల ఏడాది అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. బాణ సంచా పేల్చారు. కేక్‌లు కట్ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఆబాలగోపాలం నూతన సంవత్సర వేడుకల్లో పాలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఏడాది అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ నేతలను కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ప్లెక్సీల పండుగ జోరుగా సాగింది. మొత్తంగా న్యూఇయర్ స్వాగత సంబరాలు వాడవాడలా మిన్నంటాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. వరుణుడు కరుణించాలి. వరుస కరువులు తీరేలా వానలు హోరెత్తాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగాలి. ఒంగోలు గిత్తలు రంకేయాలి. జిల్లా పచ్చని పంటలతో కళకళలాడాలి. గిట్టుబాటు ధరలు రావాలి.. అన్నదాతలతో పాటు అందరి కష్టాలు తీరాలి.. పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరగాలి. అర్హులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, పక్కా గృహాలు అందాలి. అన్నదాతలకు పెట్టుబడి నిధి రావాలి. గిట్టుబాటు ధర కావాలి. ప్రకృతి విపత్తుల పరిహారం అందాలి. పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు విద్య అందాలి. మహిళల అభివృద్ధికి అన్ని విధాలా సహకార మందాలి. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు దక్కాలి. సంక్షేమం, అభివృద్ధి జరగాలి. వెలిగొండను అధికారపార్టీ పెద్దలకు నిధులు తెచ్చిపెట్టే ధనాగారంగా కాక జిల్లా వాసులకు సాగు–తాగునీరిచ్చే ప్రాణదాతగా చూడాలి. కొత్త ఏడాదిలో నిదులిచ్చి.. నీల్లిచ్చేలా ప్రభుత్వం ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర రావాలి. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పబడాలి. జిల్లాలోని అన్ని సమస్యల పరిష్కారానికి కొత్త ఏడాదిలో ముందడుగు పడాలి. ప్రకాశంలో వెలుగులు ప్రకాశించేలా కొత్త ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇదే అందరి ఆశ, ఆకాంక్ష ఆ ఆశతోనే కొత్త ఏడాదిలోకి ముందడుగు వేద్దాం...! వైఎస్సార్ సీపీలో కొత్త ఏడాది జోష్ ఎన్నికల ఏడాది ప్రారంభం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో నేతలు, క్యాడర్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ప్రత్యేకించి జిల్లాలో ఆ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పార్టీ శ్రేణుల్లో భరోసా నింపింది. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలు క్షేత్ర స్థా«యికి వెళ్లాయి. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి నవరత్నాల పథకాల ద్వారా సాకారమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు ఆపార్టీపై ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఇది వైఎస్సార్ సీపీకి మరింతగా కలిసి వచ్చే అంశం. ఈ ఉత్సాహానికి కొత్త ఏడాది తోడైంది. ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగనుండడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. దీంతో నూతన సంవత్సర వేడుకలను కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి చో ఫ్లెక్సీల పండుగ జోరుగా సాగింది. మరోవైపు అధికార టీడీపీతో పాటు మిగిలిన పార్టీల్లో ఉత్సాహం కొరవడింది. ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా బయట పడుతుండడంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం నీరు కారిపోయింది. వారు డీలా పడ్డారు. ఓటమి భయం వారిని వెంటాడుతోంది. దీంతో నూతన సంవత్సర వేడుకల్లో వారి జోష్ తగ్గింది. -
దారుణం : పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు
బ్యాంకాక్ : నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అత్తింటివారు చేసుకుంటున్న పార్టీకి తనని సరిగా ఆహ్వానించలేదని ఓ థాయ్ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు మర్యాదలు చేయలేదని భావించి అత్తింటి వారిని, భార్యాపిల్లల్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... థాయ్‌ల్యాండ్‌కు చెందిన సుచీప్ సార్న్‌సంగ్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారింటికి వెళ్లాడు. అయితే తనకు ఆహ్వానం పలికేందుకు ఎవరూ రాకపోవడాన్ని అతడు అవమానంగా భావించాడు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఫుల్లుగా మద్యం సేవించిన సుచీప్... అత్తామామలు, తన భార్యాపిల్లల(తొమ్మిదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు)ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
కొత్తేడాది నాడు మానవత్వం చాటుకున్న యువకులు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సరం పలువురు యువకులు మావనత్వం చాటుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఖర్చు చేసే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించారు. స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఒక బృందంగా తయారయ్యారు. వారంతా కలిసి దుప్పట్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల వరకు పాతబస్తీలోని మంగళ్‌హట్, రహీంపుర, ఉస్మానియా ఆస్పత్రి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాపు 40 నుంచి 50 దుప్పట్లు చలికి వణుకుతున్న పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, ఆకాశ్, విష్ణు, పవన్ సింగ్, మహేశ్ రతన్, అజయ్, మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. పేదలకు కొంత సేవా చేయాలనే భావనతో కొత్త సంవత్సరం రోజు ఈ కార్యక్రమం చేసినట్లు సాయినాథ్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. -
హ్యాపీ న్యూ ఇయర్..!
కడప కల్చరల్ : యమా స్పీడుగా ద్విచక్ర వాహనాలు...వాటిపై యువకుల సర్కస్ విన్యాసాలు, కేకలు, కేరింతలు, వచ్చేపోయే వారిని ఆపి మరీ శుభాకాంక్షలు తెలిపిన యువత...జిల్లాలో అర్ధరాత్రి అంతటా సంబరాలు నెలకొన్నాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ మేల్కొన్నాయి. అన్ని వర్గాల ప్రజల్లోనూ కట్టలు తెగిన ఉత్సాహం, ఉద్వేగం, ఉల్లాసం....ఇవీ జిల్లాలో సోమవారం అర్దరాత్రి విశేషాలు. నూతన సంవత్సరాన్ని మరుపురాని విధంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవాలని ప్రజలు రాత్రి 11 గంటల నుంచి ఉత్కంఠ భరితంగా ఎదురుచూశారు. అర్ధరాత్రి దగ్గర పడేకొద్దీ ప్రతిక్షణం వాచీలు, సెల్ఫోన్లలో సమయం చూసుకుంటూ గడిపారు. సరిగ్గా 12 గంటలకు దిక్కులు పిక్కటిట్టేల్లా అరుపులు, కేరింతలు...ఒకరినొకరు పట్టుకుని ఊపేసుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకున్నారు. రోడ్ల కూడళ్లలో యువకుల బృందాలు భారీ కేకులు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు.. కేరింతలతో బైకులపై విన్యాసాలు చేస్తూ వీధుల్లో కలియతిరిగారు. ఈ సందర్బంగా పలు క్రైస్తవ ప్రార్థన మందిరాలు, చర్చిలలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. విశ్వాసులు మారు మనసుపొంది కొత్త జీవితాన్ని ఆహ్వానించాలని క్రైస్తవ గురువులు సందేశమిచ్చారు. -
న్యూఇయర్ సందర్బంగా కిటకిటలాడుతున్న దేవాలయాలు
-
ప్రపంచమంతా సందడిగా న్యూఇయర్ సెలబ్రేషన్స్