revenue
-
APలో పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
-
IPL 2025: జియోహాట్‌స్టార్‌కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్‌స్టార్ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకుస్పాన్సర్లుజియోహాట్స్టార్ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్‌పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్స్ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్‌స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్స్క్రైబర్ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‌కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది. -
బాబు విజనరీ.. ఆదాయం ఆవిరి!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది.సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు... గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్‌బుక్ పాలనపైనే దృష్టి సారించి, సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టం అవుతోంది. భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ⇒ ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు ⇒ 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. ⇒ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. జగన్ పాలనలో కన్నా రూ.10వేల కోట్లు తక్కువగా మూలధన వ్యయం ⇒ అప్పు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. ⇒ జగన్ సీఎంగా ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద రూ.23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం రూ.13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా.. అది ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.76,292 కోట్లకు చేరింది. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ.90,047 కోట్లకు చేరింది. ⇒ రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందంటూ సీఎం చెప్పడం.. కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
పన్ను పోటు!
సాక్షి, అమరావతి: భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు. పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్లో ఆ ఊసే లేకుండా చేశారు.ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు. -
మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం
ఎనర్జీ సొల్యూషన్స్ బిజినెస్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించాలని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ ఆశిస్తోంది. ఇందుకు డేటా సెంటర్ల వృద్ధి, తదితర అంశాలు దోహదపడతాయని భావిస్తోంది. కంపెనీ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్డర్ బుక్ విలువ రూ.2,400 కోట్లకు చేరింది. ప్రధానంగా 400కేవీ, 765 కేవీ విభాగాలలో శుద్ధ ఇంధన విద్యుత్ ప్రసారంలో కంపెనీ నాయకత్వ స్థాయిని ఇది వెల్లడిస్తున్నట్లు గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలలో భారత్ వేగవంత మార్పులకు లోనవుతున్నట్లు తెలియజేసింది. ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం వార్షికంగా 30 శాతం చొప్పున వృద్ధి చెందనున్నట్లు అంచనా వేసింది. సస్టెయినబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై జాతీయస్థాయిలో దృష్టి పెట్టినట్లు పేర్కొంది. యాక్సిస్ ఫైనాన్స్‌లో వాటాల విక్రయంపై యాక్సిస్ కసరత్తుబిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌పై దృష్టిన్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే యాక్సిస్ ఫైనాన్స్‌లో మెజారిటీ వాటాలను విక్రయించాలని యాక్సిస్ బ్యాంక్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అడ్వైజరుతో కూడా బ్యాంకు కలిసి పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, వాటాల విక్రయంపై నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొన్నాయి. ఒకవేళ ముందుకెళ్లే పక్షంలో, యాక్సిస్ ఫైనాన్స్‌కి యాక్సిస్ బ్యాంక్ 900 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకు వేల్యుయేషన్ అడిగే అవకాశం ఉందని వివరించాయి. యాక్సిస్ ఫైనాన్స్ వృద్ధికి బ్యాంకు గణనీయంగా నిధులు సమకూర్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ జనవరిలో ఒక నివేదికలో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్స్‌కి రూ.300 కోట్లు అందించినట్లు వివరించింది. యాక్సిస్ ఫైనాన్స్ ప్రధానంగా కార్పొరేట్, రియల్ ఎస్టేట్ రంగాలకు రుణాల సర్వీసులు అందిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిధుల సమీకరణన్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్–కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లకు 5 శాతం కూపన్ రేటుతో 36 నెలల కాలపరిమితి ఉంటుంది. -
గరిష్టానికి ఆర్థిక లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం వెలవెలబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు ఏకంగా 8,758 శాతానికి చేరింది. అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయానికి, ఖజానా నుంచి పెడుతున్న రెవెన్యూ ఖర్చుకు మధ్య ఆ మేరకు తేడా ఉందన్నమాట.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ విషయం వెల్లడించింది. 2025 జనవరి మాసాంతానికి గాను వార్షిక బడ్జెట్ స్థితిగతులపై కాగ్ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో నికర ఆర్థిక లోటు రూ.26,050 కోట్లకు చేరింది.జనవరి నెలాఖరుకు రెవెన్యూ ఆదాయం రూ.1,23,815.60 కోట్లు ఉండగా, రెవెన్యూ ఖర్చు రూ.1,49,866.10 కోట్లుగా నమోదయింది. ఆదాయం కంటే ఖర్చు రూ.26 వేల కోట్లకు పైగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2024–25 వార్షిక బడ్జెట్లో రూ.297.42 కోట్ల మేర నికర ఆర్థిక మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 8,758 శాతం మేరకు నికర లోటు చేరుకోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ మేరకు నికర ఆర్థిక లోటు ఎప్పుడూ లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.అంచనాల్లో ఇప్పటివరకు 56% ఆదాయమే..! ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కటకట అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. ప్రభుత్వ అంచనాలకు, రాబడులకు పొంతన లేకుండా పోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, జనవరి మాసాంతానికి కేవలం రూ.1.23 లక్షల కోట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా.. అంచనాల్లో 56 శాతమే ఆదాయం రావడం, ఇంకా రూ.లక్ష కోట్ల వరకు రావాల్సి ఉండడం గమనార్హం. జీఎస్టీ ఓకే.. రిజిస్ట్రేషన్లు డౌన్ ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడులు రూ.1.64 లక్షల కోట్లు వస్తాయని 2024–25 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించగా.. జనవరి మాసాంతానికి రూ.1,12,772 కోట్లు మాత్రమే (68 శాతమే) సమకూరాయి. ఆదాయార్జన శాఖల వారీగా చూస్తే ఎంతో కొంత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.58,594 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, అందులో 73 శాతం అంటే రూ.42,658 కోట్ల మేర సమకూరింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం రూ.5,821 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా లాంటివి కూడా ఓ మోస్తరుగా వచ్చినా, ఎక్సైజ్, పన్నేతర రాబడులు తగ్గిపోయాయి. ఇక కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా బడ్జెట్ అంచనాలతో పోల్చుకుంటే కేవలం 24 శాతమే రావడం గమనార్హం. భారీగా పెరిగిన అప్పులు ఆదాయం భారీగా తగ్గగా, మరోవైపు అప్పుల పద్దు భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ మార్కెట్లో రూ.49,225 కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, జనవరి నెలాఖరుకే అప్పులు రూ.58 వేల కోట్లకు చేరాయి. మరో రెండు నెలల్లో ఇంకో రూ.20 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్బీఐ దగ్గర షెడ్యూల్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అప్పుల చిట్టా రూ.80 వేల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రూ.22 వేల కోట్ల కు పైగా గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీల కిందే చెల్లించాల్సి రావడం గమనార్హం. -
ఏపీ జీఎస్టీ ఆదాయం నేల చూపులే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను కూడా నాశనం చేస్తోంది కూటమి సర్కారు. బీహార్ వంటి రాష్ట్రాలు కూడా సంపద సృష్టించడంలో దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో నమోదవుతున్న క్షీణతలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉండగా, ఇదే సమయంలో దేశ జీడీపీ ఆదాయం 10 శాతం పెరిగితే.. బీహార్ మనకంటే అధికంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 జనవరిలో రూ.3,587 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది జనవరిలో రూ.3,604 కోట్లకు చేరింది.జనవరి నెల రాష్ట్ర ప్రజలకు అత్యంత ఇష్టమైన నెల. ఈ నెలలో సంక్రాంతి పండుగను పేదలు, ధనికులు.. ఎవరి స్తోమత మేరకు వారు ఘనంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికందడంతో రైతులు ఏదో ఒక కొత్త వస్తువును కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏటా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో భారీ వృద్ధి రేటు ఉంటుంది.కానీ ఈసారి దీనికి భిన్నంగా జీఎస్టీలో ఎక్కడా సంక్రాంతి వెలుగులు కనిపించ లేదు. ఇదే సమయంలో బీహార్ జీఎస్టీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,565 కోట్ల నుంచి రూ.1,684 కోట్లకు చేరింది. అదే మన పొరుగు రాష్ట్రం తమిళనాడు అయితే ఏకంగా 20 శాతం వృద్ధితో జీఎస్టీ ఆదాయం రూ.9,606 కోట్ల నుంచి రూ.11,496 కోట్లకు చేరింది. తెలంగాణ 10 శాతం, కర్ణాటక 8 శాతం, కేరళ 8 శాతం, ఓడిషా 7 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రమే స్థిరంగా ఉంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 10.04 శాతం పెరిగింది.జనవరిలో ముఖ్య రాష్ట్రాల జీఎస్టీ పెరుగుదలఏప్రిల్–జనవరి అదే తీరుఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు పది నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేల చూపులు చూస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయంలో వృద్ధి రేటును నమోదు చేస్తుంటే ఒక్క ఏపీలో మాత్రమే వృద్ధి నమోదు అంతంత మాత్రంగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.36,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో వెనుకబడిన బీహార్ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 9.9 శాతం పెరిగి రూ.15,965 కోట్లకు చేరింది.దే సమయంలో కర్ణాటక 10.5 శాతం, తమిళనాడు 8, తెలంగాణ 6 శాతం వృద్ధితో దేశ వ్యాప్తంగా 10.1 శాతం వృద్ధి నమోదయ్యింది. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి దేశ సగటు వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు అధికంగా ఉంటూ వచ్చేదని, కానీ తొలిసారిగా ఈ ఏడాది దానికి భిన్నంగా తిరోగమన దిశలో పయనిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఐదేళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించడం, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించక పోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది.అందువల్లే పండుగల నెలలైనప్పటికీ నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో జీఎస్టీ ఆదాయం క్షీణించిందని అధికారులు పేర్కొంటున్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని, అందరినీ లక్షాధికారులను చేస్తానని ఎన్నికల ముందుచెప్పిన సీఎం చంద్రబాబుకు వాస్తవం బోధ పడుతున్నట్లు తెలుస్తోంది.అందువల్లే ‘సంపద సృష్టించే సలహా ఉంటే నా చెవిలో చెప్పు తమ్ముడూ’ అనే పరిస్థితికి దిగజారిపోయాడని, సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ కొత్త రాగం తీస్తున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయని, చివరికి ఉద్యోగుల జీతాల కోసం మంగళవారం రిజర్వ్ బ్యాంకు అప్పు కోసం ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారంటూ విమర్శిస్తున్నారు. -
ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే బాబు ఆదాయం పెరుగుతోంది : వైఎస్ జగన్
-
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు
-
40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశంలో 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళాకు సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.12 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు.जहां संस्कृतियों का संगम भी है, श्रद्धा और समरसता का समागम भी है।'अनेकता में एकता' का संदेश देता महाकुम्भ-2025, प्रयागराज मानवता के कल्याण के साथ ही सनातन से साक्षात्कार करा रहा है।#एकता_का_महाकुम्भ pic.twitter.com/kZt5xtBItW— Yogi Adityanath (@myogiadityanath) January 13, 2025 -
రెవెన్యూను సరిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘ఆసామి సరిగా లేకపోతే ఏం జరుగుతుందో గత ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. దొరికినోడికి దొరికినంత తరహాలో ఆగమాగం చేశారు. ఈ పరిస్థితిని మార్చకపోతే ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమైపోతాయి. అలాకాకుండా వాటిని కాపాడడం మా బాధ్యత. నేను మంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తా. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా..’అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పారదర్శకత కోసమే ప్రక్షాళన: ‘కర్ణాటకలో పారదర్శక రిజిస్ట్రేషన్ల ప్రయత్నం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతోంది. అక్కడ ఇప్పటికీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తెలంగాణలోనూ దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ వ్యవస్థను అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 1.2 శాతం పెరిగినా మా అంచనాలకు తగినట్టు మాత్రం రాలేదు. ఈ మూడు నెలలు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మొత్తం 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జాగ్రత్తగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది.జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి) దరఖాస్తుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. భూముల విలువల సవరణ ప్రక్రియ అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియ త్వరలో చేపడతాం. వీఆర్వో, వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 1,365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతాం. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలిపోతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్ల నియామక ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 81 లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయింది..’అని పొంగులేటి తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలుండవు ‘కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయనడం సరికాదు. కొత్తగా అవసరమైన వారికి మాత్రమే కొత్త పుస్తకాలు వస్తాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని నేను కూడా ఊహించలేదు. ధరణి పోర్టల్ నిర్వహణను ఈనెల ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఐసీ చూస్తోంది..’అని మంత్రి వెల్లడించారు. సియోల్ బాంబులు స్టార్టయ్యాయి: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో తాను చెప్పిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు పేలడం మొదలయ్యాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, అయితే తప్పొప్పులు తేల్చేది కోర్టులని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో తప్పు చేయకుంటే కేటీఆర్‌కు భయమెందుకని, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్కో ఇచ్చిన ఎన్నికల బాండ్లు మాత్రమే కాదని, ఈ కేసులో బయటపడాల్సినవి చాలానే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకి వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఎలా అయిందని, జాతీయ పార్టీలకు కూడా లేని నిధులు ఆ పార్టీకి ఎక్కడివని ప్రశ్నించారు. -
మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత భారీగా ఆదాయం
టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.గతేడాది జూలైలో ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది. కంపెనీల వారీగా ఏజీఆర్ భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది. -
రాష్ట్ర వాణిజ్యం.. తిరోగమనం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు తిరోగమన దిశలో సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడంతో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయి. గడచిన మూడు నెలల్లో నాలుగు, ఏడు శాతం చొప్పన జీఎస్టీ వసూళ్లు తగ్గగా, నవంబర్‌లో ఏకంగా 10 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 10 శాతం క్షీణించి రూ.4,093 కోట్ల నుంచి రూ.3,699 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడు 8 శాతం, కర్ణాటక 15 శాతం, కేరళ 10 శాతం, తెలంగాణ 3 శాతం వృద్ధి నమోదు చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే క్షీణతను నమోదు చేసింది. నవంబర్‌లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9.38 శాతం వృద్ధితో రూ.139,678 కోట్లుగా నమోదైంది.దేశ సగటు కంటే వెనుకబాటు వైఎస్సార్సీపీ హయాంలో దేశ సగటు కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మాత్రం వెనుకబడ్డాయి. ఈ ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధితో రూ.11,04,817 కోట్లు వసూళ్లు అయితే ఏపీలో కేవలం 2.2శాతం వృద్ధితో రూ.30,056 కోట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు అటకెక్కడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతోపాటు అధికారం చేపట్టి 5 నెలలు గడచినా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం జీఎస్టీ వసూళ్లు తగ్గిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. -
పతంజలి ఆయుర్వేద్ ఆదాయం అదుర్స్!
న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2023–24) రూ.9,335 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది. లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్‌లో కొంత వాటాలు విక్రయించడం ఆదాయం పెరిగేందుకు సాయపడింది.అలాగే, గ్రూప్‌లోని ఇతర కంపెనీల రూపంలో మెరుగైన ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీ సమర్పించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర ఆదాయం రూ.2,875 కోట్లు 2023–24లో వచ్చినట్టు వెల్లడించింది. నికర ఆదాయాన్ని గమనిస్తే.. (కేవలం అమ్మకాల ద్వారా వచ్చిన) అంతక్రితం ఆర్థిక సంవ్సరం కంటే 14 శాతం తక్కువగా రూ.6,460 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.2,901 కోట్లుగా నమోదైంది. 2022–23 సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద్ రూ.7,534 కోట్ల ఆదాయంపై రూ.578 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.ఆదాయం తగ్గినప్పటికీ, నికర లాభం ఐదు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పతంజలి ఫుడ్స్‌లో వాటాల విక్రయం, ఇతర ఆదాయం ఇందుకు దోహదపడింది. ప్రకటనలు, ప్రచారం కోసం 9 శాతం అధికంగా రూ.422 కోట్లు వ్యయం చేసింది. పతంజలి ఆయర్వేద్ తన నిర్వహణలోని హోమ్, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని రూ.1,100 కోట్లకు పతంజలి ఫుడ్స్‌కు విక్రయించేందుకు ఈ ఏడాది జూలైలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పతంజలి ఆయుర్వేద్ ఫలితాల్లో కనిపించనుంది. దివాలా పరిష్కార చట్టం కింద రుచి సోయా సంస్థను పతంజలి గ్రూప్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చడం గమనార్హం. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
జొమాటో లాభం అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ.176 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ.36 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,848 కోట్ల నుంచి రూ. 4,799 కోట్లకు జంప్‌చేసింది.అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్) ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు జొమాటో తెలిపింది. కాగా, 4 వారాల్లో డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ ద్వారా డైనింగ్, మూవీస్, స్పోర్ట్స్ టికెటింగ్, షాపింగ్ తదితర గోయింగ్ అవుట్ సర్వీసులను కన్సాలిడేట్ చేయనున్నట్లు వివరించారు.ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం నష్టంతో రూ. 257 వద్ద ముగిసింది. -
ఆదాయం పెరిగింది.. నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ భారత్‌పే గ్రూప్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు 50 శాతం తగ్గి రూ. 474 కోట్లకు పరిమితమయ్యాయి.అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 941 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 1,426 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 1,029 కోట్ల టర్నోవర్ మాత్రమే అందుకుంది. కంపెనీ 2024 అక్టోబర్‌లో పాజిటివ్ ఇబిటా సాధించినట్లు భారత్‌పే సీఈవో నళిన్ నేగి వెల్లడించారు. -
ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లోని అన్ని మాడ్యూళ్లను రద్దు చేసి ఒకటే మాడ్యూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని రెవెన్యూ చట్టాల స్థానంలో ఒకటే చట్టాన్ని (రెవెన్యూ కోడ్) అమల్లోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్ పునరి్మర్మాణ కమిటీతోపాటు గతంలో నల్సార్ విశ్వవిద్యాలయం చేసిన సిఫార్సు మేరకు రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈ కోడ్ ముసాయిదా తయారీలో నిమగ్నమైన రెవెన్యూ వర్గాలు త్వరలోనే ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో 124 రెవెన్యూ చట్టాలు, నియమాలు అమల్లో ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)తోపాటు సర్వే, భూ రికార్డుల నిర్వహణ, సీలింగ్, కౌలు, రెవెన్యూ రికవరీ, భూ ఆక్రమణ నిరోధం, రెవెన్యూ పరిపాలన, భూదాన్, ఇనాం, వదిలివేయబడిన భూములు, భూవివాదాల పరిష్కారం... ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ప్రస్తుతం కూడా అమల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ తెలంగాణకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని.. వాటిలో 20కిపైగా కాలంచెల్లిన చట్టాలున్నా యని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భూచట్టాల నిపుణులు పేర్కొన్నారు.కానీ ప్రభు త్వం దీన్ని పెడచెవిన పెట్టింది. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటయ్యాక రెవెన్యూ వ్యవస్థ అమల్లో గందరగోళాన్ని నివారించేందుకు ఒకటే రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలంచెల్లిన ఆ చట్టాలను రద్దు చేయడంతోపాటు అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 5 వేల భూ చట్టాలను అధ్యయనం చేసి అందులో అవసరమైన చట్టాలను తెలంగాణకు వర్తింపజేస్తూ రెవెన్యూ కోడ్‌లో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులకూ సులభతరం... నిజాం హయాంలో తెలంగాణ ప్రాంత భూపరిపాలన, రెవెన్యూ వ్యవస్థ అమలు కోసం భూమి రెవెన్యూ చట్టం–1907 పేరుతో సమగ్ర చట్టం అమల్లో ఉండేది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఈ చట్టం స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ 124 చట్టాలుగా మార్చారని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యల పరిష్కారం సంబంధిత అధికారులకు సులభతరం కావడంతోపాటు భూమి హక్కులను కాపాడుకునే విషయంలో రైతులకు కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.ఏ చట్టం ద్వారా ఏ సమస్య పరిష్కారమవుతుంది, ఏ అధికారి వద్దకు వెళ్లాలనే విషయంలో కూడా అన్నదాతలకు గందరగోళం పోతుందని చెబుతున్నారు. యూపీలో 2016లోనే ఈ కోడ్ అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం ఒడిశాలోనూ కోడ్ అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యలు, రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. సౌకర్యవంతంగా ఉంటుంది దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా భూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన చట్టాలను అమలు చేసుకుంటున్నాయి. యూపీలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వచ్చాక అక్కడ మారిన పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూచట్టాల్లో ఉన్న గందరగోళం పోతుంది. – ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు -
అతీగతీలేని ‘వినతి’
సాక్షి, అమరావతి :ప్రజల నుంచి భారీఎత్తున విజ్ఞాపనలు తీసుకుంటున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు జనం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజూ కొందరు మంత్రులు కూడా అక్కడ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను చూసి జనసేన, బీజేపీ ఆఫీసుల్లోనూ ఈ తంతు సాగిస్తున్నారు. అలాగే, ప్రతి సోమవారం ఎప్పటిమాదిరిగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టీడీపీ ప్రభుత్వం మార్చింది. జనం గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ పెద్దఎత్తున తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సైతం ఎటువంటి ఊరట లభించడంలేదు. ఉదా.. నెలరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నబీల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి టీడీపీ ఆఫీసులో తన సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చాడు.కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి పురోగతిలేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటిపై ఏంచేయాలో తెలీడంలేదని అధికారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల గురించే ఎక్కువ మంది ఫిర్యాదుల చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా అవి ఎప్పుడూ రొటీన్‌గా వచ్చే రెవెన్యూ సమస్యలేనని అధికారులు చెబుతున్నారు. వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. దీంతో చేసేదిలేక 60 రోజుల్లో వినతిని పరిష్కరించాలి కాబట్టి ఈలోపే ఏదో ఒక కారణంతో దాన్ని మూసేసి అది పరిష్కారమైపోయినట్లు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. అసలేమీ జరగకుండానే వినతిపత్రం ఇచ్చిన వారికి అది క్లియర్ అయిపోయినట్లు ఎస్ఎంఎస్లు వస్తుండడంతో వారు బిత్తరపోతున్నారు.కోర్టు కేసు లేకుండా ఉన్నట్లు చెప్పి మూసేశారు..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అల్లవరం గ్రామానికి చెందిన భీమవరపు కటుమస్వామి జులై 15న ఆర్డీఓ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్ఎంసీ) లేకుండానే తమ కుటుంబానికి చెందిన భూమిని మ్యుటేషన్ చేశారని విజ్ఞాపన ఇచ్చాడు. తన అమ్మమ్మ నూకాలమ్మ 2016లో చనిపోయిందని, ఆమెకు వారసత్వంగా ఉన్న భూమిని ఆమె చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా రెవెన్యూ అధికారులు వేరే కొందరికి మ్యుటేషన్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. అడుగుతుంటే పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.ఆర్డీఓ ఈ వినతిని తీసుకుని ఎఫ్ఎంసీ లేకుండా మ్యుటేషన్ ఎలా చేస్తారని ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వీఆర్ఓ విచారణకు వెళ్లాడు. కానీ, కొద్దిరోజులకు మీ సమస్య పరిష్కారమైందంటూ కటుమస్వామికి ఎస్ఎంఎస్ రావడంతో అతను విస్తుపోయాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే కోర్టులో కేసు ఉందని తహశీల్దార్ రిపోర్టు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని ఫిర్యాదును మూసివేసినట్లు చెప్పారు. అతను ఈ కేసు కోర్టు పరిధిలో లేదని అన్ని ఆధారాలు చూపడంతో నిజమేనని ఒప్పుకున్నా తాము చేసేదేంలేదని ఆర్డీఓ చేతులెత్తేశారు. 60 రోజుల్లోపు వినతిని పరిష్కరించాల్సి వుండడంతో కోర్టు వంకతో వినతిని తహశీల్దార్ క్లియర్ చేసినట్లు తేలింది.65 వేల సమస్యలు పరిష్కారమయ్యాయటఇలా ఇప్పటివరకు 65,211 సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) వెబ్సైట్లో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 88,761 విజ్ఞాపనలు అందగా, 65,211 విజ్ఞాపనలను పరిష్కరించినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే, ఇవన్నీ గోకవరం కేసు మాదిరిగానే ఏమీ అవకుండానే కాగితాల్లోనే పరిష్కారమైనట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు. -
ఐటీలో వృద్ధి 6 శాతంలోపే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 4 నుంచి 6 % మద్య ఆదాయంలో వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో యూఎస్, యూరప్ లోని క్లయింట్లు టెక్నాలజీలపై వ్యయా లు తగ్గించుకోవడాన్ని కారణంగా పేర్కొంది. ఆదా యం పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ మార్జిన్లు మెరుగ్గా 22% మేర ఉంటాయని తెలి పింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) గణనీయంగా తగ్గి, సమీప కాలంలో స్థిరపడొ చ్చని అంచనా వేసింది. మెరుగైన నగదు ప్రవాహాలు, బలమైన బ్యాలన్స్ షీట్లను పరిగణనలోకి తీసుకుని ఐటీ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ ఇచి్చంది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ వ్య యాలు కీలక రంగాల్లోని క్లయింట్లపై ఒత్తిళ్లకు దారితీశాయని, ఫలితంగా వ్యయాలని యంత్రణ, విచక్షణారహిత వ్యయాలను క్లయింట్లు వాయిదా వేసుకోవడాన్ని ప్రస్తావించింది. ఆర్డ ర్లు రాక తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఐటీ కంపెనీలకు ఆర్డర్, డీల్స్ పైపులైన్ బలంగానే ఉ న్నట్టు ఇక్రా తెలిపింది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే మధ్యకాలానికి ఐటీ కంపెనీల్లో వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ హెడ్ దీపక్ జోత్వాని పేర్కొన్నారు. కీలక మార్కెట్లో రికవరీ కీలకం.. దేశ ఐటీ కంపెనీల ఆదాయం గడిచిన ఐదారు త్రైమాసికాలుగా పెద్ద వృద్ధిని చూడకపోవడం గమనార్హం. ఇక్రా ఎంపిక చేసిన 15 పెద్ద, మధ్యస్థాయి లిస్టెడ్ ఐటీ కంపెనీలు 2023–24లో డాలర్ పరంగా కేవలం 5.5 శాతం వృద్ధినే నమోదు చేశాయి. 2022–23లో ఇది 9.2 శాతంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 22 శాతంగా ఉంటాయని ఇక్రా అంచనా వేస్తోంది. దేశ ఐటీ కంపెనీలకు సింహభాగం ఆదాయం యూఎస్ నుంచి వస్తుంటే, ఆ తర్వాత యూరప్, మిగిలిన ప్రపంచ మార్కెట్ల (ఆర్వోడబ్ల్యూ) నుంచి వస్తోంది. ఇక్రా ఎంపిక చేసిన ఐటీ కంపెనీల ఆదాయంలో 55–60 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలోయూఎస్ నుంచే వచ్చింది. యూరప్ నుంచి 22–25 శాతం సమకూరింది. స్థూల ఆర్థిక అనిశి్చతుల ప్రభావం పరిశ్రమపై ఇక మీదట ఉండొచ్చని, కీలక మార్కెట్లలో నియంత్రణపరమైన తీవ్ర మార్పులు చోటు చేసుకుంటే అది ప్రతికూల ప్రభావం కొనసాగేలా చేయొచ్చని పేర్కొంది. జెనరేషన్ ఏఐ మధ్య కాలంలో ఐటీ పరిశ్రమ వృద్ధికి కీలకమని.. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇందులో శిక్షణ ఇప్పించి, సేవల పరంగా తమ సామర్థ్యాలను పెంచుకున్నట్టు ఇక్రా తన నివేదికలో వివరించింది. జెనరేషన్ ఏఐ పరంగా ఆర్డర్‌బుక్ లేదా ఆదాయం ఇప్పటి వరకు పరిమితంగా ఉండగా, మధ్య కాలానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. డిమాండ్ మోస్తరుగా ఉండడం, 2022–23లో అధికంగా చేరిన సిబ్బందితో ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల నియామకాలపై ప్రభావం పడినట్టు తెలిపింది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నికర సిబ్బంది తగ్గుదల చోటుచేసుకున్నట్టు పేర్కొంది. -
తగ్గుతున్న ఆటో డీలర్ల ఆదాయం!.. రిపోర్ట్
ఆటోమొబైల్ రంగంలో దేశం దూసుకెళ్తోంది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో డీలర్ల ఆదాయ వృద్ధి గణనీయంగా తగ్గుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ నివేదికలు చెబుతున్నాయి.గత ఏడాది 14 శాతంగా ఉన్న ఆదాయ వృద్ధి.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా. దీనికి కారణం ధరల పెరుగుదల అని తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గడం వల్ల డీలర్లు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ప్రకటించారు. దీంతో ఆదాయం కొంత తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావంలో ఎక్కువ భాగం తయారీదారులచే భరించబడినప్పటికీ, ఆటో డీలర్ల లాభదాయకతను కూడా 3 శాతానికి తగ్గిస్తుందని నివేదికలో వెల్లడైంది.పండుగల సీజన్లో అధిక తగ్గింపుల మధ్య విక్రయాలు పుంజుకోవడంతో ద్వితీయార్ధంలో కూడా ఇన్వెంటరీ కాస్త తగ్గుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. క్రిసిల్ రేటింగ్స్.. 110 మంది ఆటో డీలర్ల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను వెల్లడించింది.నిజానికి భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. -
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
-
రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు. -
15 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, అమరావతి: భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. 15న అన్ని జిల్లాలో ప్రారంభించి 16–30 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం మెమో ఇచ్చారు. గ్రామ స్థాయిలో భూముల సమస్యలు పరిష్కారానికి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని అందులో అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూకబ్జాలు, 22ఏ జాబితా దురి్వనియోగంతో పాటు అన్ని భూ సంబంధిత విషయాలపై అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా సదస్సుల షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినతులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని, వచి్చన అన్ని పిటిషన్లను.. వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.జేసీలు సదస్సులకు కో–ఆర్డినేటర్లుగా ఉంటారని, సబ్ కలెక్టర్లు/ఆర్డీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలోని ప్రతి గ్రామంలో సదస్సు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలన్నారు. ప్రతి సదస్సుకి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, మండల సర్వేయర్ ఇతర అన్ని శాఖలకు చెందిన వారు వెళ్లాలని, జిల్లా కలెక్టర్ జిల్లా నుంచి మండల నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. సెపె్టంబర్ నెలాఖరుకి సదస్సులన్నీ పూర్తి కావాలని, ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాల ఆదేశాలను 45 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. -
‘పన్ను’లపైనే గంపెడాశలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల ఆదాయంపైనే గంపెడాశలు పెట్టుకుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారా ఆదాయం రాబట్టుకోవడంపై కాంగ్రెస్ సర్కారు దృష్టిపెట్టినట్టు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రూ.2.91లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం.. అందులో ఏకంగా రూ.1.64 లక్షల కోట్లను (50 శాతానికిపైగా) పన్నుల రూపంలోనే సమీకరించుకుంటామని పేర్కొంది. ఇది గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే.. రూ.29 వేల కోట్లు (20 శాతం) అదనం కావడం గమనార్హం. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా కింద వచ్చే రూ.26,216 కోట్లు పోను మిగతా రూ.1.38 లక్షల కోట్లను అమ్మకపు పన్ను, ఎక్సైజ్, ఇతర పన్నుల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది రూ.14,295.56 కోట్లురాగా.. ఈసారి రూ.18,228.82 కోట్లు వస్తాయని అంచనా వేశారు. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనే భూముల విలువల సవరణ చేసే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్ ఆదాయాన్ని గత ఏడాది సవరించిన అంచనాల్లో రూ.20.298 కోట్లుగా చూపగా.. ఈసారి రూ.5వేల కోట్లు అదనంగా రూ.25,617 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. ఎక్సైజ్ ఆదాయ లక్ష్యం పెంపు నేపథ్యంలో.. ఈసారి మద్యం ధరలు పెరగొచ్చన్న చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద అమ్మకపు పన్ను ద్వారా గత ఏడాది రూ.57,394.46 కోట్లురాగా, ఈసారి 18శాతం అదనంగా రూ.68,273.73 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించారు. జీఎస్టీ, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, వాహనాలు, సరుకులు, ప్రయాణికుల రవాణా, ఇతర పన్నుల రూపంలో ఈ మొత్తం సమకూరనుంది.భూముల అమ్మకంపై చర్చ!ఈసారి పన్నేతర ఆదాయం ఏకంగా రూ.35,208.44 కోట్ల మేర వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. గత ఏడాది ఇది రూ.23,819.50 కోట్లుకాగా.. ఈసారి 50శాతం అదనంగా ప్రతిపాదించారు. అంతకుముందు 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.8,857.42 కోట్లు మాత్రమే. అప్పుడు పన్నేతర ఆదాయం పెంచిన తరహాలోనే ఇప్పుడూ పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టిని ప్రశ్నించగా.. భూములు అమ్ముతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆదాయం పెంపు కోసం తమకు అనేక మార్గాలున్నాయని, అవన్నీ ఇప్పుడు వెల్లడించలేమని పేర్కొన్నారు.ఆశల పల్లకి దిగని ‘గ్రాంట్లు’కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాంట్ల కింద ఈసారి రూ.21,636 కోట్లు వస్తాయని చూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏడెనిమిదేళ్లుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఆశించడం, కేంద్రం మొండిచేయి చూపడం రివాజుగా మారింది. గత ఏడాది కేంద్రం రూ.13,179.21 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు ఏడాది రూ,.8,619.26 కోట్లు మాత్రమే అందాయి. అయినా ఈసారి భారీగా అంచనా వేయడం గమనార్హం. (నోట్: పన్నుల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లను కలిపి మొత్తం రాబడుల కింద పరిగణిస్తారు. తాజా బడ్జెట్లో రూ.2,21,242.23 కోట్లు రాబడులు వస్తాయని ప్రతిపాదించారు. ఇది 2023–24లో రూ.1,69,089.59 కోట్లు, 2022–23లో రూ.1,27,468.63 కోట్లు మాత్రమే) -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై చెంప చెళ్లుమనిపించిన రైతు..
-
టోలు ఒలుస్తున్నారు!
సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. 8 కోట్లకుపైగా ఫాస్టాగ్‌లు వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది. -
ఆదాయం పెంచే మార్గాలను చూడండి
సాక్షి, హైదరాబాద్: గనుల తవ్వకాలతో పాటు ఇసుకకు సంబంధించిన వార్షిక కేలండర్ రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో ఆదాయాల తీరును ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. గనుల శాఖ ద్వారా గణనీయంగా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తరలించాల్సిన అవసరం ఉందని సాగునీటి అధికారులు కోరినట్టుగా తనకు సమాచారం ఉందని చెప్పారు.ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, ఈ అంశంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు అపరాధ రుసుము విధించి వేసి మూసివేశారని, వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. పట్టా భూముల పేరిట గోదావరి నదీ తీరం వెంట ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క అధికారులను కోరారు.ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం.. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా కార్యకలాపాలుగానీ, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పని గానీ జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలిసాక్షి, హైదరాబాద్: నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితబోధ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టిని కలిశారు. ఐఏఎస్ అధికారి శశాంక్ గోయెల్ ట్రైనీ ఐఏఎస్ లను భట్టికి పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న అధికారులకు కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో వారు నిర్వహించిన విధుల గురించి వివరించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...ప్రజలకు చేసేందుకు ఇచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ ప్రజల హృదయా ల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలన్నారు. శిక్షణ సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ప్రజాసమస్యల్ని పరిష్కరించడంలో అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్ పెద్ద బోయిన ఉన్నారు. -
మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
-
అంతా ఐఫోన్ల చలవే! టిమ్‌కుక్ ఫుల్ హ్యాపీ
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్.. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్లు భారీగా అమ్ముడుపోవడంతో అత్యధిక లాభాలు వచ్చాయి. యాపిల్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 119.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 2 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఫోన్లు 6 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయంలో ఐఫోన్ల ద్వారా వచ్చిన ఆదాయం 69.7 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.7 లక్షల కోట్లు). యాపిల్ యాక్టివ్ డివైజ్ బేస్ ఆల్‌టైమ్ హైని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను వాడుతున్నవారి సంఖ్య 220 కోట్లను దాటింది. భారత్‌లో ఆదాయ పరంగా వృద్ధిని సాధించామని, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన రెండంకెల వృద్ధిని, ఆదాయ రికార్డును తాకినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారత్‌తో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. 2023లో ఆదాయ పరంగా యాపిల్ భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉందని, ఎగుమతులలో కోటి యూనిట్లను అధిగమించిందని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది. -
టెంపుల్, ఎకో టూరిజాలతో సర్క్యూట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో ఎకో టూరిజాన్ని కలిపి టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరిగింది. గిరిజనుల లబ్ధికి ఔషధ మొక్కల తోటల పెంపకం చేపట్టండి.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్నో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థికపరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత ఔషధ మొక్కల తోటలను పెంచాలన్నారు. ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ ప్లాంటేషన్లకు సంబంధించి మార్కెటింగ్‌ను అనుసంధానించాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజానికి హైదరాబాద్వాసుల్లో ఆదరణ ఉందని, ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిత బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, దేవాదాయ కమిషనర్ అనీల్ కుమార్, పీసీసీఎఫ్ డోబ్రియల్ పాల్గొన్నారు. -
17, 18 తేదీల్లో ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి వస్తుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపో తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. బుధ,గురువారాల్లో రికార్డు స్థాయిలో 101 శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఈ రెండు రోజుల్లో టీఎస్ఆర్టీసీకి రూ.45.1 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 33.93 లక్షల కి.మీ.మేర తిరిగి 48.94 లక్షలమంది ప్రయాణికులను గమ్యం చేర్చాయి. ఆ రోజు 101.62 శాతం ఓఆర్‌తో రూ.22.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 18వ తేదీన 34.18 లక్షల కి.మీ.మేర బస్సులు తిరిగ్గా 50.60 లక్షలమంది ప్రయాణికులు గమ్యం చేరారు. 101.92 శాతం ఓఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ట శాతం కావటం విశేషం. ఆ రోజు రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక రోజులో ఇంత ఆదాయం నమోదు కావటం కూడా ఇదే తొలిసారి కాగా, గతేడాది జనవరి నెలలో 17వ తేదీనాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి రూ.92 కోట్లు ఎక్కువ నమోదు కావటం విశేషం. -
రూ. 50,000 కోట్ల వ్యాపారం.. అంతా రాముని దయ!
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట జనవరి 22న జరగబోతోంది. ఈ పుణ్య తరుణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే భక్తి, ఆధ్యాత్మికతతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు, చిరు వర్తకులు రాముని దయతో నాలుగు డబ్బులు సంపాదించుకోబోతున్నారు. రూ. 50,000 కోట్ల వ్యాపారం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగే ప్రస్తుత జనవరి నెలలో భారతదేశం అంతటా రూ. 50,000 కోట్ల వ్యాపారం జరిగేలా దేశానికి సహాయపడుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. ‘జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా, ఆతృతగా చూస్తున్నారు. ఇది రాముడు, రామ మందిరానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా దోహదపడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని సభ్య వ్యాపారులు విస్తృతమైన సన్నాహాలు చేశారు’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నట్లుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులు ఇవే.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం.. ప్రత్యేకమైన కండువాలు, లాకెట్లు, కీ చైన్లు, రామ మందిర నమూనాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు మొదలైన వాటికి దేశమంతటా ప్రస్తుతం గణనీయమైన డిమాండ్ ఉంది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా గాజులు, పెండెంట్లు వంటి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు రామమందిర చిత్రాలను కలిగిన కుర్తాలు, టీ షర్టులు, ఇతర దుస్తులకు బలమైన మార్కెట్ డిమాండ్ ఉన్నట్లు సీఏఐటీ చెబుతోంది. -
సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంప్రదాయ వైఖరికి భిన్నంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో సినిమా చూడాలంటే క్యూలైన్లో టికెట్ల కోసం పోరాటం చేసే పరిస్థితులుండేవి. ప్రస్తుతం ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకుని అరచేతిలో సినిమా చూస్తున్నారు. ఆ సౌకర్యాలు అందించే కంపెనీలు కూడా అధికమవుతున్నాయి. అయితే అవి అందించే ఫీచర్లకు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ సంస్థలు కోట్లు సంపాదిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్పీ 2023లో 24 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ)కు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలియజేసింది. సంస్థ వార్షిక ఆదాయంలో సంవత్సరానికి 24 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ విలువ రూ.2,214 కోట్లకు చేరుకుంది. దీంతోపాటు నికరలాభం గణనీయంగా పెరిగింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 75 శాతం పెరిగినట్లు సంస్థ తెలిపింది. డిసెంబర్ 2021లో తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరను తగ్గించాలనే నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. దాంతో ఎక్కువ మంది తమ ప్లాన్లను తీసుకోవడంతో నికర లాభం పెరిగినట్లు సంస్థ అంచనా వేసింది. తర్వాత క్రమంగా 2022లో సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. 2023లో భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. చందాదారుల సంఖ్యను పెంచడానికి భారత్‌లో కంపెనీ రూ.149 ధర కలిగిన మొబైల్ ప్లాన్‌ను ప్రచారం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..! 2023 వార్షిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 2022 కంటే 16 శాతాన్ని అధిగమించినప్పటికీ, ఇది కరోనా తర్వాత 2021తో పోలిస్తే 66 శాతం తగ్గింది. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీస్‌ల కోసం రూ.125 కోట్లు ఖర్చు చేసింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 30 శాతం పెరిగింది. -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్‌వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్‌లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
2 బిలియన్ డాలర్లపై బ్లాక్ బాక్స్ గురి
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నెట్వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్‌లోనే ఉంటుందని వర్మ వివరించారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్‌లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్‌లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్‌లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్‌లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్‌ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా?
ఎలాన్‌మస్క్‌కు చెందిన సోషల్‌మీడియా దిగ్గజ కంపెనీ ‘ఎక్స్’ త్వరలో ఈ ఏడాది చివరినాటికి భారీగా నష్టపోనుందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ ద్వారా చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రచారం చేస్తాయి. అయితే అందులో ప్రధాన బ్రాండ్ కంపెనీలు వాటి ప్రచారాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేయనున్నట్లు తెలిసింది. దాంతో ఆ కంపెనీల ద్వారా ఎక్స్‌కు వచ్చే ఆదాయం రూ.625 కోట్లు తగ్గనుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత వారం ఎలాన్‌మస్క్ ఎక్స్ వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఒక పోస్ట్‌ను సమర్థించాడు. దాంతో వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా కొన్ని కంపెనీలు ఎక్స్‌లో తమ ప్రకటనలు కొంతకాలం నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన కంపెనీలకు చెందిన ప్రకటనలు అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీని ప్రచారం చేసే కొన్ని పోస్ట్‌ల పక్కన కనిపించాయి. దాంతో ఆ కంపెనీలు ఎక్స్ మీడియా, వాచ్డాగ్ గ్రూప్ మీడియాపై దావా వేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈవారం ఎయిర్ బీఎన్బీ, అమెజాన్, కోకకోలా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 200 యాడ్ సంస్థలు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రకటనలు లిస్ట్ చేశాయి. కానీ వాటిలో కొన్నింటిని త్వరలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అక్టోబర్ 2022లో మస్క్ ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా కంపెనీలకు చెందిన ప్రకటనదారులు యాడ్లను తగ్గించినట్లు సమాచారం. సైట్లో ద్వేషపూరిత ప్రసంగాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. మస్క్ ఎక్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి యూఎస్ ప్రకటనల ఆదాయం ప్రతి నెలా దాదాపు 55 శాతం తగ్గుతుందని రాయిటర్స్ గతంలో తెలిపింది. -
ఆ ఆదాయం మొత్తం ఇచ్చేస్తా: ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్-హమాస్ వార్ నేపథ్యంలో టెస్లా అధినేత ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. X Corp will be donating all revenue from advertising & subscriptions associated with the war in Gaza to hospitals in Israel and the Red Cross/Crescent in Gaza — Elon Musk (@elonmusk) November 21, 2023 ఈ మేరకు మస్క్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గాజాను పాలించే హమాస్ మధ్య భీకర పోరుకు నాలుగు రోజుల తాత్కాలిక విరామం ప్రకటన తరువాత మస్క్ సాయం ప్రకటన వచ్చింది. గత నెలలో, ఎలాన్ మస్క్ గాజాలోని గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు కనెక్టివిటీని అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్దానికి నిన్నటికి(నవంబరు 21) 46 రోజులు గడిచింది. ఈ దాడుల్లో 13వేలమందికి పైగా మరణించారు. OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation. The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG — Israel Defense Forces (@IDF) November 19, 2023 చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం ఆపండి..లేదంటే: పతంజలికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక -
వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?
కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దాదాపు యథాస్థితికి రావడంతో టెక్ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇక వర్క్ ఫ్రం హోం పద్ధతికి గుడ్ బై చెపుతూ ఆఫీసులకు రావాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానం, కంపెనీల ఆదాయంపై ఒక సర్వే సంచలనంగా మారింది.. ఆ వివరాలు. ఎలా ఉన్నాయంటే.. WFH ద్వారా పలు కంపెనీలు వేగవంతమైన ఆదాయ వృద్దిని నమోదు చేశాయని తాజా సర్వేలో తేలింది. దీంతో పని ప్రదేశాలలో ఉత్పాదకత ,పనితీరుపై చర్చకు ఈ సర్వే మరోసారి తెరలేపింది. రిమోట్ పనిని అనుమతించే కంపెనీలు ఆఫీసు హాజరు విషయంలో మరింత కఠినంగా వ్యవరిస్తున్న కంపెనీలతో పోలిస్తే నాలుగు రెట్లు వేగంగా ఆదాయ వృద్ధిని సాధించాయని ఫ్లెక్స్-వర్క్ అడ్వైజర్ స్కూప్ టెక్నాలజీస్ సంస్థ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. టెక్నాలజీ నుండి బీమా వరకు 20 రంగాల కంపెనీలో ఈ సర్వే జరిగింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) 554 పబ్లిక్ కంపెనీల్లో 26.7 మిలియన్ల మంది ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించారు. పూర్తిగా రిమోట్ లేదా ఉద్యోగులు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపికకు అనుమతిచ్చిన కంపెనీల్లో 2020 2022 మధ్య అమ్మకాలు 21శాతం అమ్మకాలు పెరిగాయి. కనీస ఆఫీస్ అటెండెన్స్ అవసరమయ్యే కంపెనీల వృద్ధి , వారంలో కొన్ని రోజుల్లో వచ్చినవి ఆఫీస్ ఫుల్ టైమ్‌లో ఉన్నవాటి కంటే రెండింతలు పెరిగిందని సర్వే తెలిపింది. రిమోట్ ఫ్రెండ్లీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు తగ్గడంతోపాటు, గ్లోబల్‌గా నియామక అవకాశాలు పెరిగి, గ్రోత్ రేటు వేగం పెరుగుతుందని, స్కూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబ్ సాడో తెలిపారు. (రిషీ సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం) స్కూప్ డేటాబేస్‌లోని 5,565 కంపెనీలలో, పూర్తి-సమయం కార్యాలయంలో పని అవసరమయ్యే షేర్ ఈ ఏడాది ఆరంభంలో 49 శాతంగా ఉండగా, ఇది అక్టోబర్ నాటికి 38 శాతానికి దిగి వచ్చింది.నిర్దిష్ట సంఖ్యలో పని రోజులు అవసరమయ్యే కంపెనీలలో, కేవలం 6 శాతం మందికి నాలుగు రోజులు , చాలా వరకు రెండు లేదా మూడు రోజులు చాలని Scoop-BCG సర్వే కనుగొంది. మెర్సర్ సీనియర్ ప్రిన్సిపాల్ లారెన్ మాసన్ పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల్లో ఫ్లెక్సీ వర్క్ పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి చేసిన మునుపటి పరిశోధనలో హైబ్రిడ్ పని కోసం కేవలం ఒకటి లేదా రెండు రోజులు ఆఫీసుకు వస్తే చాలని తేలింది. వర్క్‌ప్లేస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం,వ్యక్తిగత బృందాలకు వారు ఎప్పుడు, ఎక్కడ పని చేస్తారనే దానిపై కొంత స్వయం ప్రతిపత్తిని అందించడం మంచి పద్ధతి. ఇందులో ఆ కంపెనీ సీఈవో సూచించే తప్పనిసరి విధానం కంటే, హైబ్రిడ్ పాలసీని సెట్ చేసే టీమ్స్ నిర్ణయమే ఉత్తమని నిపుణుల వాదన. -
ఇంధన దిగ్గజం కోల్ ఇండియాకు లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్ఎస్ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం లక్ష్యం రూ.1,000 కోట్లు
అల్లిపురం (విశాఖ దక్షిణ): బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం ప్రస్తుతం రూ.700 కోట్లు ఉందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10% అధికమని ఏపీ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఎం.శేషాచలం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. డాబాగార్డెన్స్‌లో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మనిర్బర్ భారత్ కింద స్వదేశీ 4జీ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ను ఆదేశించిందని, ఇప్పటికే పాన్ ఇండియాలో టీసీఎస్, ఐటీఐ కంపెనీలకు లక్ష సైట్లు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఏడాదిలో ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జూలైలో పంజాబ్‌లో బీటా లాంచ్ పూర్తయిందని, దీని ద్వారా 4జీ పరికరాలు 5జీకి అప్‌గ్రేడ్ అయినట్టు తెలిపారు. ఏపీ సర్కిల్లో 4300 సైట్లలో 4జీ పరికరాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విశాఖ సర్కిల్లో 463 సైట్లు 4జీగా ఇప్పటికే సేవలందిస్తున్నాయన్నారు. అంత్యోదయ మిషన్ కింద మారుమూల గ్రామాలకూ కనెక్టివిటీ అందిస్తున్నామని, డిసెంబర్ నాటికి ఆ పనులు పూర్తవుతాయని, వాటికి సోలార్ పవర్‌తో కనెక్షన్ ఇస్తామన్నారు. ఏపీలో 4జీ సేవలు 3800 గ్రామాల్లో అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. 2026 నాటికి సంస్థ లాభాల బాటలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రభుత్వ శాఖలన్నీ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు వాడేలా మార్కెటింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తామని శేషాచలం వివరించారు. సమావేశంలో విశాఖ జిల్లా జనరల్ మేనేజర్ పి.పాల్ విలియమ్స్, జి.ఆడం, మొబైల్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్‌లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్‌కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్‌కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్‌లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్‌పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్‌లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్‌ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్‌ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
టెలికం ఆదాయం అంతంతే.. 5జీ వచ్చినా లాభం లేదు!
న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 5జీ ఆదాయ వనరుగా మారలేదు.. మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు. -
నాన్ టాక్స్ రెవెన్యూపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు
Twitter Ad-Revenue Sharing భారతీయ కంటెంట్ క్రియేటర్లు కూడా ఎక్స్(ట్విటర్) ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ట్విటర్ బాస్ ఎలాన్ మాస్క్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. యాడ్-రెవన్యూ షేర్ ఫీచర్‌పై ట్వీపుల్ ప్రశంసలు కురిపిస్తున్నారు. (మోటో జీ14: ఫీచర్లు అదుర్స్! ధర తెలిస్తే వదిలిపెట్టరు!) ఇంప్రెషన్ల వల్ల సుమారు 2.1 లక్షలు సంపాదించానంటూ @గబ్బర్‌సింగ్ హ్యాండిల్ యూజర్ అభిషేక్ అస్థానా, స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు. ''బ్లూ టిక్ కే పైసే వసూల్'' అంటూ కమెంట్ చేశారు. ట్విటర్ స్ట్రాటజీ చాలా సింపుల్. ఈ వ్యూహంతో భారీగా సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్లే బ్లూ టిక్ సేల్స్‌మెన్‌గా మారతారు.. ఇదే నిజమైన ఆదాయ వనరు అని పేర్కొన్నారు. 'మైథున్' అనే వినియోగదారు తన బ్యాంక్ ఖాతాలో రూ. 3,51,000 జమ అయ్యాయంటూ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. 455.75 డాలర్లు వచ్చాయి. గత 3 నెలల్లో దాదాపు 17మిలియన్ల ఇంప్రెషన్లు, 25కే ఫాలోవర్లు ఉన్నారంటూ మరొక యూజర్ తెలిపారు. బెంచ్‌మార్క్ సాధించాలంటే ఏం కావాలో తెలిపారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) కాగా ఎంపిక చేసిన కంటెంట్ సృష్టికర్తలు వారి ప్రత్యుత్తరాలలో వచ్చేప్రకటనల నుండి వచ్చే ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఎక్స్ ప్రకటనల రాబడి భాగస్వామ్యానికి అర్హత పొందాలంటే, వెరిఫైడ్ క్రియేటర్లు గత 3 నెలల్లో వారి పోస్ట్‌లపై కనీసం 5 మిలియన్ ఇంప్రెషన్లు కలిగి ఉండాలి. వెరిఫైడ్ క్రియేటర్లకు వారి కంటెంట్ రిప్లై సెక్షన్లో యాడ్స్ వస్తాయని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి పేమెంట్ల కోసం 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41.2 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. (ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: మహీంద్ర థార్‌పై బంపర్ ఆఫర్) Blue tick ke paise vasool pic.twitter.com/pVrX5hTYWo — Gabbar (@GabbbarSingh) August 8, 2023 $455.75 is pretty good. If you want to benchmark, I have roughly ~17M impressions in last 3 months and ~25k followers. pic.twitter.com/3eknXeIEhP — Ravi Handa (@ravihanda) August 8, 2023 Twitter 𝕏 Ad Revenue sharing eligibility criteria. Requirements - 15 Million+ Tweet impressions for the last 3 months, earlier 5 Million+ impressions for the last 3 months. - Twitter Blue subscription or Verified Organisations subscription. - Minimum 500 followers. - Minimum… pic.twitter.com/2Wb2ntoQa3 — Abhishek Yadav (@yabhishekhd) August 8, 2023 -
ఫార్మా ఆదాయాల్లో 7–9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఫార్మా కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ మార్కెట్ 8–10 శాతం మేర, అమెరికా మార్కెట్ 6–8 శాతం మేర విస్తరించడం ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. ఇక ఐరోపా మార్కెట్ల నుంచి ఆదాయం 3–5 శాతం వరకు, వర్ధమాన మార్కెట్ల నుంచి 8–10 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. 25 దేశీ ఔషధ కంపెనీల గణాంకాలను ఇక్రా విశ్లేషించింది. దేశ ఫార్మా మార్కెట్లో ఈ కంపెనీల వాటా 60 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దేశీ ఫార్మా కంపెనీల ఆదాయాలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. కాంప్లెక్స్ జనరిక్స్, స్పెషాలిటీ ఫార్ములేషన్లను యూఎస్ మార్కెట్లలో విడుదల చేయడంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించడం పరిశ్రమ మార్జిన్లకు అనుకూలిస్తుందని వివరించింది. దేశ ఫార్మా కంపెనీల పరపతి ప్రొఫైల్ (రుణ స్థితిగతులు) ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘జాతీయ ముఖ్య ఔషధాల జాబితాలోని వాటి ధరలను టోకు ద్రవ్యోల్బణం ఆధారితంగా 12.1 శాతం పెంచడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ముఖ్య ఔషధ జాబితాలో లేని వాటి ధరలను వార్షికంగా కంపెనీలు పెంచడం అనేవి దేశీ మార్కెట్లో 8–10 శాతం ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి’’అని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మైత్రి మాచర్ల తెలిపారు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీల రిస్క్. యూఎస్ మార్కెట్లో వృద్ధి అనేది ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 6–8 శాతం మధ్య ఉంటుందని ఇక్రా తెలిపింది. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు ఇటీవల మళ్లీ పెరిగాయని, కనుక నియంత్రఫరమైన రిస్క్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలపై సైబర్ దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కార్యకలాపాలకు తాత్కాలిక అవరోధం కలిగించొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల మూలధన వ్యయాలు రూ.20,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. -
నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!
దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్‌ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. జూన్ నెలలో గ్రాస్ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. 👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth 👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception 👉… pic.twitter.com/Q17qM9mTEX — Ministry of Finance (@FinMinIndia) July 1, 2023 -
‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్!
తాజ్‌మహల్ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేవారి నుంచి ప్రభుత్వానికి ప్రతీయేటా ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విదేశీయులు ఎవరైనా భారతదేశానికి వస్తే ముందుగా వారు చూడాలనుకునేది తాజ్‌మహల్. ఇక మనదేశంలోని ప్రతీఒక్కరూ తాజ్‌మహల్ చూడాలని తప్పనిసరిగా అనుకుంటారు. తాజ్‌మహల్‌కు ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణం దాని నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజ్‌మహల్ అనునిత్యం పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. మరి అటువంటప్పుడు తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది. అలాగే ప్రతీయేటా తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడవుతాయనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందువరుసలో... దేశంలోని అత్యంత పురాతన అందమైన కట్టడాలలో తాజ్‌మహల్ ముందువరుసలో ఉంటుంది. తాజ్‌మహల్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదంటే.. కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినప్పుడు కూడా.. ఆ రెండు సంవత్సరాల్లో తాజ్‌మహల్ సందర్శించేందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టిక్కెట్లు విక్రయమయ్యాయి. ఇది కూడా చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు సందర్శకుల సంఖ్య ఎంతంటే.. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తాజ్‌మహల్ సందర్శనకు ప్రతీయేటా సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేలమంది విదేశీయులు ఉంటారు. తాజ్‌మహల్ సందర్శనకు సంబంధించి స్థానికులకు (భారత్) రూ. 50, విదేశీయులకు రూ.1100 టిక్కెట్ రూపంలో వసూలు చేస్తారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో రూ.152 కోట్ల ఆదాయం తాజ్‌మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీయేటా రూ. 40 కోట్లు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా రూ.110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తరువాతి స్థానంలో ఆగ్రాకోట పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ల విక్రయాల కారణంగా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతీయేటా వచ్చే ఆదాయంలో.. తాజ్‌మహల్, ఆగ్రాకోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53 శాతం మేరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా.. -
బాష్‌కు రూ.399 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఆటో, గృహోపకరణాల సంస్థ బాష్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లాభాల్లో 14 శాతం వృద్ధిని చూపించింది. రూ.399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.350 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.4,063 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1,424 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని బాష్ ప్రకటించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,217 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.11,781 కోట్ల నుంచి రూ.14,929 కోట్లకు పెరిగింది. ‘‘2022 సంవత్సరాన్ని భారత్‌లో శతాబ్ది సంవత్సరంగా జరుపుకున్నాం. అదే ఏడాది మార్కెట్లో ఎన్నో సవాళ్లను చవిచూశాం. ఎన్నో అవరోధాలు ఉన్నా బలమైన వృద్ధితో సానుకూలంగా ముగించాం’’ అని బాష్ లిమిటెడ్ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు. (చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమోటివ్ మార్కెట్ పట్ల ఆశావహ అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.280 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఒక్కో షేరుకు రూ.480 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది. ఇదీ చదవండి: సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే -
లాభాల్లో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా - ఆదాయం అక్షరాలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 376 కోట్ల ఆదాయం (కన్సాలిడేటెడ్)పై రూ. 27 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 271 కోట్లుగా, లాభం రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 84 శాతం ఎగిసి రూ. 594 కోట్ల నుంచి రూ. 1,091 కోట్లకు చేరింది. నికర లాభం 86 శాతం వృద్ధితో రూ. 35 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగింది. 2021–22లో 259 ఎలక్ట్రిక్ బస్సులు డెలివరీ చేయగా, 2022–23లో 117 శాతం అధికంగా 563 ఈ–బస్సులను అందించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 3,394 బస్సుల కోసం ఆర్డర్లు ఉన్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా విక్రయించడం ప్రారంభించామని, క్యూ4లో 17 వాహనాలను డెలివరీ చేశామని పేర్కొంది. సరఫరా వ్యవస్థ, స్థూల పరిస్థితులపరమైన రిస్కులు నెలకొన్నప్పటికీ తాము తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి. ప్రదీప్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో అగ్రగామిగా కొనసాగేందుకు ఇది తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. -
ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ట్విటర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగిస్తూ వారిని ఆందోళనలోకి నెట్టి వేస్తున్నాయి. ఎపుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ తరుణంలో ఒక టెక్ కంపెనీ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వార్తల్లో నిలిచింది. ఏకంగా సంస్థలో పని చేస్తున్న 21 వేల మందికిభారీ బహుమతిని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ కోఫోర్జ్ దాని Q4 ఆదాయాలలో కీలక మైలురాయిని అధిగమించింది. ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిన శుభ సమయంలో సంస్థలోని మొత్తం 21వేల మందిలో ప్రతి ఒక్కరికి యాపిల్ ఐపాడ్‌ను బహుమతిగా ఇస్తుంది. ఇందుకోసం రూ. 80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది తదిరులను మినహాయించి మొత్తం కంపెనీలో 21,815 మంది ఉద్యోగులున్నారు. త్రైమాసికంలో తమ పనితీరు రెండు కీలక విజయాలు సాధించామని, మొదటిది త్రైమాసిక క్రమానుగత 5 శాతం వృద్ధి. రెండోది బిలియన్ డాలర్ల మార్క్ ఆదాయాన్ని అధిగమించడమని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ వెల్లడించారు. 2024లో కూడా ఇదే వృద్ధిని కొనసాగించనున్నామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోఫోర్జ్ కంపెనీ ఫలితాలు, డివిడెండ్ గత ఏడాది రూ.1,742 కోట్లుగాగా ఉన్న కోఫోర్జ్ కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్ పై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం, గ్లోబల్ బ్యాంకింక్ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని సంస్థ పేర్కొంది. రానున్న కాలంలో 13 శాతం నుండి 16 శాతానికి వార్షిక ఆదాయ మార్గదర్శకత్వం ఇచ్చింది. అలాగే దాదాపు 50 బేసిస్ పాయింట్ల (bps) స్థూల మార్జిన్ పెరుగుదలను కూడా అంచనా వేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 19 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ మే 9గా సంస్థ ప్రకటించింది. 25 డెలివరీ కేంద్రాలతో 21 దేశాల్లో సేవల్ని అందిస్తోంది. -
అమరావతి జేఏసీవై ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘాల ఫైర్
-
వక్క సాగు.. లాభాలు బాగు
సాక్షి, పుట్టపర్తి: వక్క.. శ్రీసత్యసాయి జిల్లా రైతుల కష్టానికి ప్రతిఫలం ఇస్తోంది. ఒకసారి పంటవేస్తే దీర్ఘకాలం దిగుబడి వస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో అధిక దిగుబడులు సాధించవచ్చు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వక్కసాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో అమరాపురం, గుడిబండ, అగళి, రొళ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల రైతులు దశాబ్దాలుగా వక్క తోటలు సాగుచేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత దిగుబడి ఎకరాలో 450 నుంచి 500 వక్క మొక్కలు నాటుతున్నారు. ఐదేళ్ల వరకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఐదేళ్ల తర్వాత ఏటా దిగుబడి వస్తుంది. ధరలు బాగుంటే ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకు వస్తాయి. ఒకసారి పంట వేస్తే 45 ఏళ్ల వరకు అదాయం వస్తూనే ఉంటుంది. హిందూ సంప్రదాయంలో వక్క లేదా పోక చెక్కకు అధిక ప్రాధాన్యం ఉంది. వీటిని శుభకార్యాల్లో విరివిగా వినియోగిస్తారు. పెరుగుతున్న ఆదరణ వక్క చెట్టు నుంచి గరిష్టంగా క్వింటాలు చొప్పున పచ్చి వక్కకాయలు వస్తాయి. వాటి నుంచి 30 శాతం వక్క వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే వక్క మొక్కలకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం ఉండదు. వక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒకసారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. పెట్టుబడి తక్కువగా ఉండడంతోపాటు అధిక లాభాలు ఉన్నందున వక్క తోటల సాగుకు ఆదరణ లభిస్తోంది. స్థానికంగానే నర్సరీలు కొందరు రైతులు వక్క తోటల నర్సరీలు పెంచుతున్నారు. తొలుత రైతులు ఎండబెట్టి వలిచిన వక్కను తీసుకొచ్చి పాలిథీన్ కవర్లో విత్తనం వేసి నీరు పోస్తారు. పదిరోజుల తర్వాత విత్తనం నుంచి మొక్క వస్తుంది. రెండేళ్ల పాటు నీరు, ఎరువు అందిస్తారు. తర్వాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు దూరంలో మొక్కలు నాటుతారు. మరికొందరు తాము పండించిన వక్క కాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పచ్చికాయల నుంచి పీచు వేరుచేసిన అనంతరం వేడినీటిలో గంటన్నర పాటు కాయల నుంచి వేరుచేసిన వక్కను ఉడికిస్తారు. తర్వాత పదిరోజులు ఆరబెడితే వక్కగా మారుతుంది. కర్ణాటక మార్కెట్‌కు.. రైతులు వక్కను పండిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్క రాష్ట్రం కర్ణాటకకు తరలిస్తున్నారు. కర్ణాటకలోని శిర, హిరియూర్, చిత్రదుర్గంలోని మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముతున్నారు. పలువురు వ్యాపారులు ఇక్కడ తోటల వద్దకే వచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు వక్క ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒకసారి పంట కోత ఉంటుంది. కొందరు చెట్లపైనే పచ్చి వక్కలను వ్యాపారులకు అమ్మేస్తారు. రాష్ట్రంలోనే అమరాపురం టాప్ శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా 5,171.3 ఎకరాల్లో వక్క పంట సాగులో ఉంది. అమరాపురం మండలంలో 1,829 ఎకరాల్లో, రొళ్లలో 1,128, గుడిబండలో 970, అగళిలో 811, మడకశిరలో 190, హిందూపురంలో 97, లేపాక్షిలో 41, చిలమత్తూరులో 29, రొద్దంలో 27, పరిగిలో 25, పెనుకొండలో 13, సోమందేపల్లిలో 8, కొత్తచెరువు మండలంలో రెండెకరాల్లో వక్క సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలోనే వక్కసాగు అత్యధికంగా అమరాపురం మండలంలోనే చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోను వక్క కొంతమేర సాగులోకి వచ్చింది. ఏటా రూ.5 లక్షల ఆదాయం నేను 20 ఏళ్లుగా మూడెకరాల్లో వక్క సాగుచేస్తున్నా. ఏటా ఖర్చులు పోను రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దిగుబడిని పొరుగు రాష్ట్రం కర్ణాటక మార్కెట్‌కు తరలిస్తుంటాం. సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో రవాణా ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. – నారాయణప్ప, టీడీపల్లి, రొళ్ల మండలం మార్కెటింగ్ సమస్య ఉంది ఇరవై ఏళ్లుగా రెండున్నర ఎకరాల్లో వక్క సాగుచేస్తున్నాం. ఏటా రూ.4 లక్షల ఆదాయం వస్తోంది. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకకు తరలిస్తున్నాం. డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉంటాయి. – రవికుమార్, బీసీహళ్లి, రొళ్ల మండలం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఉండటంతో చాలామంది రైతులు వక్కసాగుకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అమరాపురం, గుడిబండ, రొళ్ల ప్రాంతాల్లో వక్క పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లో కూడా సాగుచేస్తున్నారు. వక్క పంటకు పక్క రాష్ట్రం కర్ణాటకలో మంచి గిరాకీ ఉంది. వక్క నార్కోటిక్స్ విభాగంలోకి వస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. రాయితీలు వర్తించవు. – చంద్రశేఖర్, శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖాధికారి -
కరోనా తరువాత లాభాల్లోకి విమానాశ్రయాలు
-
విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది. (ఈ–కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దేశీయంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్ సంతూర్ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. 2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్ అగ్రవాల్ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్‌కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది. -
టికెట్ల ఆదాయం రూ. 5 వేల కోట్లపైనే
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్ రైళ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని నమోదు చేసింది. టికెట్ల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజులు మిగిలి ఉండగానే రూ.5 వేల కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే అతి పెద్ద ఆదాయంగా రికార్డుకెక్కింది. గురువారం నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,000.81 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఆదాయం గరిష్ట మొత్తంగా రూ.2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,119.44 కోట్లు. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేస్తూ తొలిసారి రూ.5 వేల కోట్లను దాటింది. మార్చి చివరి నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా చాలా జోన్లు టికెట్ల రూపంలో మంచి ఆదాయాలను సొంతం చేసుకున్నాయి. 18 జోన్లకు గానూ దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత ఇటీవలే పూర్తిస్థాయిలో.. కోవిడ్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు చాలా రైళ్లు పార్కింగ్ యార్డులకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పూర్తిస్థాయి రైళ్లను నడుపుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి 100 శాతం రైళ్లను నడిపిన తొలి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేనే నిలిచింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు రైళ్లు, ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బిజీగా ఉంటోంది. ఇటీవల పలు రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన వాటిల్లో 200 కోచ్‌లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నారు. ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలకు సంబంధించి రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్‌లను తాత్కాలికంగా నిర్వహించారు. వీటి రూపంలో 9,83,559 మంది అదనంగా బెర్తులు పొందగలిగినట్టు అ«ధికారులు తెలిపారు. ఈ అదనపు ప్రయాణికుల ద్వారానే రూ. 81 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో 3,543 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ద్వారా 30.42 లక్షల మంది అదనంగా ప్రయాణించారు. వీరి ద్వారా రూ.219 కోట్లు అదనంగా సమకూరాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతం ఈ సంవత్సరం సికింద్రాబాద్–విశాఖ మధ్య దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలును, కాచిగూడ–మెదక్, అకోలా–అకోట్, బీదర్–కలబురగి మధ్య కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం 8 జతల రైళ్లకు కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రారంభించారు. వీటిల్లో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల కూడా వారి సంఖ్య పెరిగింది. వెరసి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతానికి చేరుకోవటం విశేషం. చమురు ధరలు విపరీతంగా పెరగటంతో సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ అన్ని కారణాలతో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైందని తెలుస్తోంది. -
రుణ భారం, ఆదాయం రెండూ అప్
ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది. 18 సంస్థలపై.. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది. హెచ్ఏఎంలో.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్హెచ్ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్‌చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
TSRTC: టార్గెట్ రూ.4,953 కోట్లు.. వచ్చింది రూ.6,055 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 17వ తేదీ నాటికి రూ.6,055 కోట్ల రెవెన్యూతో కొత్త రికార్డు సృష్టించింది. మార్చి నెలాఖరుకు ఈ మొత్తం రూ.6,285 కోట్లకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,953 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, దానికి మించి రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. గతేడాది ఈ మొత్తం రూ.3,971 మాత్రమే కావటం గమనార్హం. ఖజానాను నింపే శాఖలపై ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం, మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి వరుస సమీక్షలతో అధికారులను పరుగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, రవాణా శాఖ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ సహా కొన్ని ట్యాక్స్‌లను పెంచి మరీ ప్రభుత్వ ఖజానాకు మెరుగైన మొత్తాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు పన్నులు సరిగా కట్టడం లేదు. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించి బకాయి పడ్డ పన్నులు సహా పెనాల్టీలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.54.21 కోట్ల పన్ను బకాయిలు, రూ.9.37 కోట్ల పెనాలీ్టలు వసూలు చేశారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.53 కోట్లకు చేరుకుంది. విలాసవంతమైన వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగింది. వాహనాల లైఫ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం భారీగా పెరిగింది. ఇక ఫ్యాన్సీ నంబర్ల వేలాన్ని కూడా రవాణాశాఖ పోత్సహిస్తోంది. లైఫ్ ట్యాక్స్ రూపంలో రూ.4,401.75 కోట్లు, త్రైమాసిక పన్ను రూపంలో రూ.825.28 కోట్లు, ఫీజుల రూపంలో రూ.527.78 కోట్లు, యూజర్ చార్జీల రూపంలో రూ.129.10 కోట్లు, డిటెక్షన్ పద్దు ద్వారా 171.09 కోట్లు సమకూరింది. శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, జేటీసీలతో ఆదాయంపై సమీక్షించారు. లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధించిపెట్టినందుకు అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర -
7 బిలియన్ డాలర్లకు ఆదాయం
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు. లాభం డౌన్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్డ్ వైర్లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కొత్త పన్ను విధానం.. ఎవరికి?
ఏటా బడ్జెట్లో భాగంగా ప్రకటించే ఆదాయపన్ను శ్లాబు రేట్లు, మినహాయింపుల్లో మార్పుల గురించి తెలుసుకోవాలని వేతన జీవులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఆదాయపన్ను చట్టంలోని 1961 కింద ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న పన్ను మినహాయింపులు, తగ్గింపుల ఆధారంగానే వేతన జీవుల పన్ను ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. 2023–24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ సంవత్సరం 2024–25) నుంచి నూతన పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనుక పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. పన్నుల్లో మార్పులు నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. అలాగే, వార్షిక పన్ను ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ కల్పించారు. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని నూతన పన్ను విధానానికి కూడా విస్తరించారు. అంటే రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే, 37 శాతంగా ఉన్న గరిష్ట సర్‌చార్జీని 25 శాతానికి తగ్గించారు. రూ.5 కోట్లకు పైగా పన్ను ఆదాయం ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి దిగొచ్చింది. మినహాయింపులు/తగ్గింపులు పాత పన్ను విధానంలో కొన్ని సాధనాలను వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో లేవు. సెక్షన్ 80టీటీఏ/80టీటీబీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, సెక్షన్ 10 (14) కింద ప్రత్యేక అలవెన్స్‌లు, అలాగే సెక్షన్ 80సీ, 80డీ, 80ఈలు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సొంతంగా నివసిస్తున్న ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులపైనా (సెక్షన్ 24) మినహాయింపు ప్రయోజనం ఉంది. అదనపు ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. ఇవి పాత పన్ను విధానంలో లేవు. ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన (వైకల్య బాధితులు) వారికి ఇచ్చే రవాణా అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, బదిలీ సమయంలో అయ్యే వ్యయాలు, ఎన్పీఎస్కు సంస్థలు చేసే జమలు (సెక్షన్ 80సీసీడీ(2)), రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ (సెక్షన్ 80జేజేఏ) ప్రయోజనాలు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. కుటుంబ పెన్షన్ ఆదాయం కోసం చేసే వ్యయాలకు సెక్షన్ 57 (ఐఐఏ) కింద బడ్జెట్లో పన్ను ప్రయోజనం కల్పించారు. అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సెక్షన్ 80సీసీహెచ్ (2) కింద ఇచ్చే విరాళాలకూ పన్ను మినహాయింపు ప్రకటించారు. మదింపు తర్వాతే.. పన్ను చెల్లింపుదారు తప్పకుండా తమకు వచ్చే ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం, పన్ను తగ్గింపుల గురించి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అంచనా వేయాలి. ఈ మదింపు ఆధారంగా అనుకూలమైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఇచ్చే జీవిత బీమా పథకాలు, పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంటుంది. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి సాధనాల ద్వారా మెరుగ్గా నిర్వహించుకునే వారికి కూడా నూతన విధానమే ప్రయోజనం. సెక్షన్ 80సీ, 80డీ, హెచ్ఆర్ఏ లేదా గృహ రుణం కింద ప్రయోజనాలు కోరుకునే వారు పాత విధానంలోనే కొనసాగొచ్చు. ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా, పన్ను భారం తగ్గాలని కోరుకునే వారికి నూతన పన్ను విధానం అనుకూలం. - అమర్ దియో సింగ్ అడ్వైజరీ హెడ్ ఏంజెల్ వన్ -
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. విభాగాలవారీగా.. క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్ఎంసీజీ విభాగం టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ టర్నోవర్ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
ఊహించని ఫలితాలు.. దుమ్మురేపిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్– డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్ క్యూ3లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్‌నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 3.2 శాతం జంప్‌చేసి రూ. 544 వద్ద ముగిసింది. చదవండి: కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు -
టీవీ టుడే: ఫలితాలు నిరుత్సాహం.. ఒక్కో షేరుకు రూ.67 బంపర్ డివిడెండ్!
న్యూఢిల్లీ: టీవీ టుడే నెట్వర్క్ లిమిటెడ్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 55 శాతం తగ్గి రూ.28 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 10 శాతం తగ్గి రూ.231 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.61 కోట్లు, ఆదాయం రూ.258 కోట్ల చొప్పున ఉన్నాయి. టెలివిజన్, ఇతర మీడియా కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.229 కోట్లుగా ఉంది. రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సేవల నుంచి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యయాలు 12 శాతం పెరిగి రూ.206 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.67 ప్రత్యేక డివిడెండ్ కింద ఇవ్వాలని కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. ఇందుకు ఫిబ్రవరి 13 రికార్డ్ తేదీగా ప్రకటించింది. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
ఇది ఊహించలేదు.. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లాభం 452శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికరలాభం అంత క్రితంతో పోలిస్తే 452.5% ఎగసి రూ.9.2 కోట్లు సాధించింది. ఎబిటా 300 శాతం పెరిగి రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్ 71% అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు 3డీ, 2డీ, రోబోటిక్స్ సేవలను అందిస్తున్నామని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. ‘ఇటువంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్ ఒకటి. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వృద్ధి కొనసాగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
ఎన్టీపీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్ఎఫ్) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది. చదవండి: ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ -
పతంజలి ఫుడ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్‌చేసింది. చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్! -
వేదాంత లాభం క్షీణత
న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 2,464 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,164 కోట్లు ఆర్జించింది. పెరిగిన ముడివ్యయాలు, విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 12.5 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం, కాపర్, ఆయిల్‌గ్యాస్ కార్యకాలాపాల కోసం 91 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్, 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను పొందేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో వేదాంతా మొత్తం ఆదాయం రూ. 34,674 కోట్ల నుంచి రూ. 34,818 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 26,777 కోట్ల నుంచి 31,327 కోట్లకు భారీగా ఎగశాయి. 2022 జూలెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కారణంగా రూ. 333 కోట్ల ప్రభావం పడినట్లు కంపెనీ వెల్లడించింది. జింక్ ఇంటర్నేషనల్ ఆస్తులను రూ. 2,981 కోట్ల విలువలో హిందుస్తాన్ జింక్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. క్యూ3లో తరుగుదల, అమార్టైజేషన్ పద్దు 4 శాతం పెరిగి రూ. 2,720 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్ 31కల్లా స్థూల రుణభారం రూ. 61,550 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
జ్యోతి ల్యాబ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతీ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 77% పైగా జంప్‌చేసి రూ. 674 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 380 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,390 కోట్ల నుంచి రూ. 6,127 కోట్లకు ఎగసింది. అధిక కమోడిటీ ధరలు వినియోగాన్ని దెబ్బతీసినప్పటికీ పటిష్ట బిజినెస్‌ను సాధించగలిగినట్లు కంపెనీ పేర్కొంది. నూతన ప్రొడక్టులు, మెరుగైన పంపిణీ, కొత్త ప్రాంతాలకు విస్తరించడం వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎంఆర్ జ్యోతి పేర్కొన్నారు. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
ఇండియన్ బ్యాంక్ లాభం డబుల్
కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది. -
అరవింద్ లాభం డౌన్!
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది. చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం -
యుకో బ్యాంక్ డబుల్ ధమాకా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 653 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో సాధించిన రూ. 310 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 5.63 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీల కంటే రికవరీలు పెరగడంతో మొండి రుణాలకు కేటాయింపులు రూ. 565 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 3,919 కోట్ల నుంచి రూ. 4,627 కోట్లకు బలపడింది. కనీస మూలధన నిష్పత్తి 14.32 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ఆర్బీఐ రూ. 88 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యుకో బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 29.50 వద్ద ముగిసింది. చదవండి: మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్ -
భళా.. అదరగొట్టిన యాక్సిస్ బ్యాంక్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56% ఎగసి రూ. 6,187 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 62% జంప్‌చేసి రూ. 5,853 కోట్లను తాకింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,614 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 32 శాతం వృద్ధితో రూ. 11,459 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.73% బలపడి 4.26 శాతానికి చేరాయి. ఆదాయం రూ. 21,101 కోట్ల నుంచి రూ. 26,892 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) వార్షిక ప్రాతిపదికన 3.17% నుంచి 2.38%కి, నికర ఎన్పీఏలు 0.91% నుంచి 0.47%కి దిగివచ్చాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 930 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
విప్రో లాభం రూ. 3,053 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. డీల్స్ రికార్డ్.. ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్ సర్వీసులు, ఇంజనీరింగ్ సర్వీసులు ఆర్డర్బుక్కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ►క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది. ► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి. ► ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది. ► ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం -
అంచనాలు మించిన ఇన్ఫోసిస్: లాభాలు, ఆదాయం జంప్
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలను సాధించింది. ఈ క్వార్టర్లో ఏకీకృత నికర లాభం 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది.గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.లాభం గత త్రైమాసికంలో రూ. 6,021 కోట్లతో పోలిస్తే 9 శాతం పెరిగింది అలాగే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.31,867 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లగా నమోదైంది. ఇన్ఫోసిస్ తన 2023 ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాన్ని(రెవెన్యూ గైడెన్స్) 16.0-16.5 శాతానికి పెంచింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22శాతంగా ఆదాయ ఫలితాల సందర్భంగా ఇన్పీ గురువారం ప్రకటించింది. -
దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ల రాబడి స్వల్పమే
సాక్షి, అమరావతి : దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మినహా మిగతా రాష్ట్రాల్లోని కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి చాలా తక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కూడా మిగతా రాష్ట్రాల కార్పొరేషన్ల రెవెన్యూ రాబడిలేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.75 శాతం ఉండగా మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.12 శాతం ఉందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, అందులో కార్పొరేషన్ల సొంత రాబడులు, వ్యయాలకు సంబంధించి ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ముఖ్యాంశాలు ఏమిటంటే.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి కార్పొరేషన్లు సొంత రాబడులను పెంచుకోవడంతో పాటు వివిధ మార్గాల్లో నిధులను సమీకరించుకోవాలి. దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సగటు ఆదాయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ రాబడి ఉంది. దేశ జీడీపీలో కార్పొరేషన్ల సగటు రాబడి 0.72 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.38 శాతమే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యధికంగా ఉండగా మిగతా రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2018–19 ఆర్థిక ఏడాదిలో మున్సిపల్‌కార్పొరేషన్ల రెవెన్యూ రాబడులు ఎంత ఉన్నాయో 2019–20 ఆర్దిక ఏడాదిలో కూడా అంతే ఉన్నాయి. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు 2018–19 ఆర్థిక ఏడాదిలో రూ.2,906.83 కోట్లు ఉండగా.. రెవెన్యూ వ్యయం రూ.2,692.52 కోట్లు ఉంది. అదే 2019–20లో ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు రూ.2,906.83 కోట్లు ఉండగా రెవెన్యూ వ్యయం రూ.2,954.08 కోట్లు ఉంది. అలాగే, ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్ల వ్యయం 2018–19లో రూ.822.49 కోట్లు కాగా.. 2019–20లో రూ.878.83 కోట్లకు పెరిగింది. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఆపరేషన్, నిర్వహణ వ్యయం 2018–19లో రూ.1,143.86 కోట్లు వ్యయం కాగా.. 2019–20లో రూ.1,254.16 కోట్లు. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో అడ్మినిస్ట్రేటివ్ వ్యయం 2018–19లో రూ.238.59 కోట్లు కాగా.. 2019–20లో రూ.247.75 కోట్లకు పెరిగింది. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో మూలధన వ్యయం 2018–19లో రూ.4,419.12 కోట్లు ఉండగా ఇది జీఎస్డీపీలో 0.51 శాతంగా ఉంది. 2019–20లో మూలధన వ్యయం రూ.5,788.75 కోట్లు ఉండగా ఇది జీఎస్డీపీలో 0.60 శాతంగా ఉంది. -
మీడియా@65 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద (ఎంఅండ్‌ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్‌ఈ రంగం 2022లో 27–29 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 65–70 బిలియన్ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‘కు డిజిటల్ వీడియో, గేమింగ్ సెగ్మెంట్లు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది. డిజిటల్.. డిజిటల్.. మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్‌ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్‌దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్‌వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు. ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది. 2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్‌వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
బయోకాన్ లాభం డౌన్
న్యూఢిల్లీ:హెల్త్‌కేర్ రంగ దిగ్గజం బయోకాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది. బయోసిమిలర్స్, రీసెర్చ్ సర్వీసులు, జనరిక్స్ బిజినెస్ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్ పేపర్(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
ఎన్ఎండీసీ లాభం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది. చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ! -
భారత్ ఫోర్జ్ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో 48 శాతం క్షీణించి రూ.141 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,386 కోట్ల నుంచి రూ. 3,076 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 1.50 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ విక్రయాలు మందగించడంతో యూరోపియన్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తిని దశలవారీగా హెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం నిర్వహణా లాభస్థాయికి దిగువనే వినియోగమున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ టర్న్అరౌండ్ సాధించే వీలున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 853 వద్ద ముగిసింది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఆదాయం పుంజుకున్నా.. స్పైస్‌జెట్ నష్టాలు పెరిగాయ్!
న్యూఢిల్లీ:ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 838 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఫారెక్స్ నష్టాలను మినహాయిస్తే రూ. 578 కోట్ల నష్టం నమోదైంది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రభావం చూపాయి. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 562 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,539 కోట్ల నుంచి 2,105 కోట్లకు పుంజుకుంది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,100 కోట్ల నుంచి రూ. 2,943 కోట్లకు ఎగశాయి. ఇదే కాలంలో కార్గో అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 206 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 39 వద్ద ముగిసింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
దివీస్ ల్యాబొరేటరీస్‌కు షాక్.. ఈ సారి తగ్గింది!
ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’ అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ♦ మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా ఉంది. ♦ ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ♦ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్టా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ♦ కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
షాక్ ఇచ్చిన వోల్టాస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆతిథ్య రంగ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 41.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 60 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 546 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 515 కోట్ల నుంచి రూ. 575 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన కొత్తగా 4,397 మంది సభ్యులను జత చేసుకుంది. సభ్యత్వ అమ్మకాల విలువ 93 శాతం వృద్ధితో రూ. 194 కోట్లను తాకింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఎన్పీఏల భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్టాండలోన్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో 63% తగ్గిరూ.411 కోట్లకు చేరింది. ఆదాయం రూ.23,001 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,105 కోట్లు, ఆదాయం రూ.21,262 కోట్ల చొప్పున ఉన్నాయి. మొండి బకాయిల భారం కొంత తగ్గినప్పటికీ.. వీటి కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలను ప్రభావితం చేసింది. వడ్డీ ఆదాయం రూ.17,980 కోట్ల నుంచి రూ.20,154 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.8,271 కోట్లుగా ఉంది. రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 13.36 శాతం నుంచి 10.48 శాతానికి (రూ.87,034 కోట్లు) తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.49 శాతం నుంచి 3.80 శాతానికి పరిమితమయ్యాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
కారణం తెలియదు, ఫర్వాలేదనిపించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్!
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి ఫలితాల పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.305 కోట్లుగా నమోదైంది. కానీ, కీలకమైన వడ్డీ ఆదా యం స్వల్పంగా తగ్గి (0.80 శాతం) రూ.1,163 కోట్లకు పరిమితమైంది. ఇందుకు కారణం ఏంటన్నది సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత విభాగంలో రుణాల మంజూరు స్వల్పంగా తగ్గి రూ.14,300 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల వితరణ 4 శాతం పెరిగి రూ.16,110 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని మొత్తం రుణాల్లో వ్యక్తులకు ఇచ్చినవి రూ.2,16,771 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 2 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. కేటాయింపులు రూ.6,552 కోట్లకు పెరిగాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 శాతం ఎగసి రూ. 2,262 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,047 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,626 కోట్ల నుంచి రూ. 10,952 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,562 కోట్ల నుంచి రూ. 8,625 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీ ఫార్ములేషన్ల అమ్మకాలు 8 శాతంపైగా పుంజుకుని రూ. 3,460 కోట్లను తాకాయి. యూఎస్ విక్రయాలు 14 శాతం ఎగసి 41.2 కోట్ల డాలర్ల(రూ. 3,400 కోట్లు)కు చేరాయి. గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు మరింత అధికంగా 27 శాతం జంప్‌చేసి 20 కోట్ల డాలర్లను అందుకున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి ఫార్ములేషన్ల విక్రయాలు 7 శాతం బలపడి 25.9 కోట్ల డాలర్లను(రూ. 2,140 కోట్లు) తాకాయి. అయితే ఇతర దేశాల నుంచి ఆదాయం 4 శాతం క్షీణించి 18.1 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం లాభంతో రూ. 1,033 వద్ద ముగిసింది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్!
న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వ్యయాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ షాకిచ్చాయి. ఈ సారి నికర లాభం (కన్సాలిడేటెడ్) ఏకంగా 90 శాతం క్షీణించి, రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 12,548 కోట్లు. తాజాగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 60,658 కోట్ల నుంచి రూ. 60,207 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 47,240 కోట్ల నుంచి రూ. 57,684 కోట్లకు పెరిగాయి. కీలక ఎకానమీల్లో మందగమన భయాలు, సీజనల్ అంశాలతో పాటు భౌగోళికరాజకీయ అనిశ్చితి తదితర అంశాలు వ్యాపార నిర్వహణలో ఒడిదుడుకులకు కారణమయ్యా యని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ దేశీ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి సరుకుల నిల్వలను ఉపయోగించుకోవాల్సి రావడం వల్ల మార్జిన్లు తగ్గాయని టాటా స్టీల్ ఈడీ కౌశిక్ ఛటర్జీ చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్ కోలుకుంటూ ఉండటం, ముడి సరుకుల రేట్లు సానుకూలంగా మారుతుండటం వంటి అంశాలతో మార్జిన్లు మళ్లీ మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు -
ప్చ్.. వాల్‌మార్ట్ ఇండియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ. 299 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2020-21)లో రూ. 201 కోట్ల నష్టం ప్రకటించింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 6 శాతంపైగా పుంజుకుని రూ. 5,362 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 8 శాతం పెరిగి రూ. 5,660 కోట్లను తాకాయి. వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2020 జులైలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 29 బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ స్టోర్లు, 2 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌ను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 2018 మే నెలలో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. -
బ్లూ స్టీల్ తయారీపై దృష్టి
చెన్నై: బ్లూ స్టీల్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు నగరానికి చెందిన సుమంగళ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ రాజేంద్రన్ సబానాయగం తెలిపారు. శనివారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ఉక్కు తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నామని అన్నారు. పుదుచ్చేరిలోని తమ ప్లాంట్‌లో బ్లూ స్టీల్‌ను తయారు చేయడానికి ఆధునిక స్క్రాప్ ష్రెడర్, థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ ఫినిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.679 కోట్లు టర్నోవర్ నమోదు చేశామని.. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరనున్నట్లు వివరించారు. సంస్థ ప్రెసిడెంట్ అశ్విన్ పాల్గొన్నారు. చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఈ బెల్టు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం! -
అయ్యో!.. ఐకియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
ఎస్బీఐ కార్డ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్బీఐ కార్డ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 526 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 345 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 3,453 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 2,695 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రమోట్ చేసిన క్రెడిట్ కార్డుల కంపెనీ వడ్డీ ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,484 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.36 శాతం నుంచి 2.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.91 శాతం నుంచి 0.78 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 23.2 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 812 వద్ద ముగిసింది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
గ్లాండ్ ఫార్మా లాభం 20% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ గ్లాండ్ ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.241 కోట్లు నమోదు చేసింది. వ్యయాలు రూ.731 కోట్ల నుంచి రూ.786 కోట్లకు ఎగశాయి. టర్నోవర్ రూ.1,080 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్ల నుంచి టర్నోవర్ 3 శాతం పెరిగి రూ.747 కోట్లుగా ఉంది. ఆదాయం భారత విపణి నుంచి 42 శాతం తగ్గి రూ.73 కోట్లకు, ఇతర మార్కెట్ల నుంచి 3 శాతం క్షీణించి రూ.224 కోట్లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే గ్లాండ్ ఫార్మా షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.57 శాతం పెరిగి రూ.2,224.20 వద్ద స్థిరపడింది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
సీడీఎస్ఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిపాజిటరీ సేవల దిగ్గజం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 80 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 86 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పుంజుకుని రూ.170 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 165 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు కొత్తగా 48 లక్షల డీమ్యాట్ ఖాతాలను తెరచినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా డిజిటల్ ఎకోసిస్టమ్‌పై వెచ్చిస్తున్న పెట్టుబడులు ఫలితాలనిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో నేహల్ వోరా పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సీడీఎస్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్రంగా లాభపడి రూ. 1,228 వద్ద ముగిసింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఐడీబీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 567 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,130 కోట్ల నుంచి రూ. 6,066 కోట్లకు ఎగసింది. ఎల్ఐసీ నియంత్రణలోని బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 21.85 శాతం నుంచి 16.51 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు 1.71 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ. 571 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 771 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 1.4 శాతం నీరసించి రూ. 44 వద్ద ముగిసింది. చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! -
మెప్పించిన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (టీసీపీఎల్) సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా మెప్పించింది. నికర లాభం 36 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం ఎగసి రూ.3,363 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభం రూ.286 కోట్లు, ఆదాయం రూ.3,033 కోట్ల చొప్పున ఉన్నాయి. వ్యయాలు 12 శాతం వరకు పెరిగి రూ.3,022 కోట్లకు చేరాయి. భారత్‌లో వ్యాపారం బలమైన పనితీరు చూపించినట్టు టీసీపీఎల్ గ్రూపు సీఎఫ్‌వో ఎల్ కృష్ణకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆహారోత్పత్తుల వ్యాపారం గొప్ప పనితీరు చూపించిందన్నారు. భారత మార్కెట్ నుంచి ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా ఉంది. ఫుడ్స్ బిజినెస్ ఆదాయం 29 శాతం వృద్ధిని చూసింది. టాటా సంపన్న్, నీటి వ్యాపారం ఆదాయం డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగింది. ప్యాకేజ్డ్ పానీయాల వ్యాపారం 7 శాతం క్షీణించింది. టాటా స్టార్ బక్స్ ఆదాయం 57 శాతం పెరిగింది. ఉప్పు వ్యాపారంలో మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
ఐనాక్స్ లీజర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మల్టీప్లెక్స్ చైన్ నిర్వాహక కంపెనీ ఐనాక్స్ లీజర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం సగానికిపైగా తగ్గి రూ. 40.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 88 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 47.44 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు దూసుకెళ్లింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గత క్యూ2లో స్వల్ప టర్నోవర్ నమోదైంది. అయితే ప్రస్తుత క్యూ2లో మొత్తం వ్యయాలు సైతం రెండు రెట్లు ఎగసి రూ. 434 కోట్లను దాటాయి. ఈ కాలంలో 11.6 మిలియన్లమంది సినిమాలను వీక్షించగా.. సగటు టికెట్ ధర రూ. 215కు చేరింది. ఒక్కో వ్యక్తి సగటు వ్యయం రికార్డు నెలకొల్పుతూ రూ. 102ను తాకింది. కొత్తగా 13 తెరలను ఏర్పాటు చేసింది. దీంతో కంపెనీ 165 మల్టీప్లెక్స్‌ల ద్వారా 74 పట్టణాలలో 705 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐనాక్స్ లీజర్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 514 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం రూ.364 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించే హెచ్డీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.364 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.344 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.649 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.608 కోట్లుగా ఉంది. ఈ సంస్థ నిర్వహణలోని సగటు ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిర్వహణ ఆస్తులు రూ.4.38 లక్షల కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా తగ్గాయి. మార్కెట్ వాటా 11 శాతం కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,960 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హావెల్స్ ఇండియా లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 302 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం వృద్ధితో రూ. 3,679 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 3,238 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం ఎగసి రూ. 3,274 కోట్లకు చేరాయి. కమోడిటీ ధరల కారణంగా వ్యయాలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ రాయ్ గుప్తా పేర్కొన్నారు. కేబుళ్ల విభాగం అమ్మకాలు రూ. 1,359 కోట్లను దాటగా.. స్విచ్ గేర్ల నుంచి రూ. 488 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. ఇక మొత్తం ఆదాయంలో ఎలక్ట్రికల్ కన్జూమర్ గూడ్స్ నుంచి రూ. 773.5 కోట్లు, లైటింగ్ తదితరాల నుంచి రూ. 402 కోట్లు చొప్పున లభించినట్లు వెల్లడించారు. లాయిడ్ కన్జూమర్ అమ్మకాలు రూ. 420 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 1,248 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
నష్టాల్లోకి నెట్వర్క్18 మీడియా
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో ఎంటర్టైన్మెంట్ రంగ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 29 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 199 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం బలపడి రూ. 1,549 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,387 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 34 శాతం ఎగసి రూ. 1,592 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ముగిసింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
పీవీఆర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 23 శాతం బలపడి రూ. 680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 28 శాతంపైగా ఎగసి రూ. 4,837 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. క్లౌడ్, అనలిటిక్స్ విభాగంలో పటిష్ట వృద్ధి బాటన సాగుతున్నట్లు కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ సుధీర్ చతుర్వేది పేర్కొన్నారు. గ్రూప్‌లోని సాఫ్ట్వేర్ సేవల మరో కంపెనీ మైండ్‌ట్రీని విలీనం చేసుకునే ప్రాసెస్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు గత నెల 10న వాటాదారులు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించినట్లు ప్రస్తావించారు. పూర్తి షేర్ల జారీ ద్వారా ఈ లావాదేవీ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లస్థానే 73 ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లు జారీ కానున్నాయి. విలీన సంస్థ ఆదాయం 3.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్! -
డీమార్ట్ నికర లాభం హైజంప్
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతంపైగా జంప్‌చేసి రూ. 686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 418 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 37 శాతం ఎగసి రూ. 10,638 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 7,789 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 9,926 కోట్లను తాకాయి. స్టోర్ల సందర్శకుల సంఖ్య తగ్గినప్పటికీ సరుకు కొనుగోళ్ల(బాస్కెట్) విలువ పుంజుకున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హా పేర్కొన్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
నాటుసారాపై ఉక్కుపాదం...
-
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నామని చెప్పారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని పేర్కొన్నారు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచామన్నారు. హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. చదవండి: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ► పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలి. ►పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు ►గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలి. ► బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. ► ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. ► నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలి. ► దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలి. ► అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. ► రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ► ఈ కమిటీలో ఐఏఎస్అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి ► రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలి. ► అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ► నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి ► ఇందులో ప్రొఫెసనల్ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలి. ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. ► రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలి. ► భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోదగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ► సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్న సీఎం. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లో ఉంచాలి. ► గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం. ► మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా అధికారులు తెలిపారు. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందినవారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ► ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► ఇతర రాష్ట్రాలతో పోల్చితే సానుకూల పరిస్థితులను సృష్టించుకోవడం ద్వారా... రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలి. ► పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలి. ► ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. ► దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు -
సరికొత్త రికార్డు.. కంపెనీ ప్రారంభమయ్యాక ఇదే ఫస్ట్‌టైం!
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ మెటల్ కంపెనీ నేషనల్ అల్యూమినియం(నాల్కో) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రికార్డ్ లాభాలు ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,952 కోట్ల లాభం ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం అమ్మకాలు సైతం కొత్త గరిష్టాన్ని సాధిస్తూ రూ. 14,181 కోట్లకు చేరాయి. ఈ బాటలో కంపెనీ అల్యూమినియం క్యాస్ట్ మెటల్ ఉత్పత్తి 4,60,000 టన్నులను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. కంపెనీ ప్రారంభమయ్యాక తొలిసారి 100 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది. నాల్కో ప్రస్థానంలో గతేడాది చరిత్రాత్మకమని వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు కంపెనీ పటిష్ట పనితీరుకు దృష్టాంతమని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సవాళ్లలోనూ ఉద్యోగులంతా కీలకపాత్ర పోషించినట్లు ప్రశంసించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడివ్యయాలు, బొగ్గు సంక్షోభం, ఎల్ఎంఈ ధరల్లో అనిశ్చితి తదితరాల మధ్య కూడా ప్రపంచంలోనే బాక్సైట్, అల్యూమినా చౌక తయారీదారుగా కంపెనీ నిలిచినట్లు ప్రస్తావించారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఓయోకు నిర్వహణ లాభాలు
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
సమస్యలు ఉన్నా.. తగ్గేదేలే మన టార్గెట్ 1,000కోట్లు!
కోల్‌కతా: ఇమేజింగ్ ఉత్పత్తుల కంపెనీ నికాన్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల టర్నోవర్ సాధిస్తానన్న అంచనాతో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ వివరాలను నికాన్ ఇండియా ఎండీ సజ్జన్ కుమార్ వెల్లడించారు. సరఫరా పరంగా సమస్యలు ఉన్నా, తయారీ వ్యయాలు పెరిగి మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. పండుగల విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ధరలను పెంచలేదని చెప్పారు. వార్షిక అమ్మకాల్లో 30–35 శాతం మేర ఓనమ్ నుంచి దీపావళి మధ్య నమోదవుతాయన్నారు. కరోనా ముందస్తు అమ్మకాలను ఈ ఏడాది అధిగమిస్తామని చెప్పారు. కెమెరా మార్కెట్ వార్షిక పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, నిపుణులే తమ ఉత్పత్తుల విక్రయాలకు మద్దతుదారులుగా చెప్పారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఉపయోగించే ఆరంభ స్థాయి నుంచి మధ్య స్థాయి కెమెరాల విక్రయాల్లో 45 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపారు. విలువ పరంగా చూస్తే ఈ విభాగం వాటా ఇమేజింగ్ మార్కెట్లో 25 శాతం ఉంటుందన్నారు. ఈ విభాగంలో తమకు మార్కెట్‌ను శాసించే ‘నికాన్ జెడ్ 30’ కెమెరా ఉన్నట్టు ప్రకటించారు. నిపుణులు వినియోగించే కెమెరాల విక్రయాల్లోనూ 20 శాతం వృద్ధి ఉందని సజ్జన్ కుమార్ తెలిపారు. చదవండి: ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్ -
‘నాటు’ ఊబి దాటించాలి
సాక్షి, అమరావతి: నాటుసారా తయారీలో కూరుకుపోయిన కుటుంబాలను దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆయా కుటుంబాలు స్వయం ఉపాధితో గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంతో పాటు జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు. ఇతర వ్యవసాయ పంటలను సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, సహాయ సహకారాలు అందించాలని నిర్దేశించారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. గంజాయి సాగును విడనాడి ఇతర వ్యవసాయ పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చి వారికి రైతు భరోసా కూడా వర్తింప చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో షాక్ కొట్టేలా రేట్లు పెంచడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. బెల్టు షాపులను ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడం ద్వారా మద్యం వినియోగాన్ని బాగా నియంత్రించామని తెలిపారు. ఎక్సైజ్, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ, పర్యావరణ శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లీకేజీలు లేకుండా పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కాలేజీలు, వర్సిటీల ఎదుట ఎస్ఈబీ నంబర్ డిస్ప్లే మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ఎదుట ఎస్ఈబీ నంబర్‌ను ప్రదర్శించాలి. ఎస్ఈబీ నంబర్‌తో డిస్ప్లే బోర్డులు పెట్టాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడా ఉండకూడదు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలి. గంజాయి సాగుపై దాడులు గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలి. ఆహార ధాన్యాలు, ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, సహకారాన్ని అందించాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలి. గనుల నిర్వహణపై పరిశీలన మైనింగ్‌కు సంబంధించి అన్ని రకాల అనుమతులు పొంది లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలి. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి పరిశీలించాలి. లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్‌లో ఉండేలా చూడాలి. ఒకవేళ ఆపరేషన్‌లో లేకపోతే కారణాలను అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా సమస్యలుంటే సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి. అన్ని అనుమతులూ పొంది నిర్వహణలో లేకపోతే ఆదాయాలు రావు. ఎర్రచందనం విక్రయంలో పారదర్శకత ఎర్రచందనం విక్రయానికి అన్ని రకాల అనుమతులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అక్టోబరు – మార్చి మధ్య 2,640 మెట్రిక్ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో థర్డ్ పార్టీతో కూడా పరిశీలన చేయించాలని సీఎం జగన్ సూచించారు. గంజాయి సాగును గుర్తించిన చోట్ల ఇతర పంటల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం తరపున ఇప్పటికే విత్తనాలు అందించామని అధికారులు వివరించారు. 2,500 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. 1,600 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగిలిన చోట్ల ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అడిషనల్ డీజీ ఎ.రవిశంకర్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఎౖMð్సజ్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గణనీయంగా తగ్గిన మద్యం వినియోగం ► రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు తెలిపారు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గినట్లు పేర్కొన్నారు. ► 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా 2021–22లో గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. ► 2018 – 19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021 – 22లో ఆదాయం రూ.25,023 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ► గత ఆర్నెల్లలో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తం 20,127 కేసులు నమోదయ్యాయి. 16,027 మందిని అరెస్టు చేసి 1,407 వాహనాలు సీజ్ చేశారు. నాటుసారా తయారీనే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏసీబీ నంబర్ 14400తో బోర్డులు అవినీతి కార్యకలాపాల నిర్మూలనకు ఏసీబీ నంబర్ 14400 అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనిపించాలి. దీనికోసం కచ్చితంగా బోర్డులు అమర్చాలి. గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ, పీడీఎస్ షాపుల వద్ద కూడా ఈ నంబర్‌తో బోర్డులు కనిపించాలి. అన్ని ప్రభుత్వ విభాగాధిపతులతో మాట్లాడి దీన్ని అమలు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్తరూపు ఇవ్వాలి. పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలి. -
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్‌లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్‌కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్‌ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి గి‘రాఖీ’.. భారీగా ఆదాయం.. ఏకంగా..!
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రోజువారీ టికెట్ ఆదాయం రూ.20 కోట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ అనుకున్నది సాధించింది. ఆగస్టు చాలెంజ్ పేరుతో తనకు తాను సవాలు విసురుకుని దాన్ని అధిగమించి చూపింది. రాఖీ పౌర్ణమి రోజు టికెట్ రూపంలో ఏకంగా రూ.20.10 కోట్ల ఆదాయాన్ని పొంది ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఆర్టీసీలో ఓరోజు టికెట్ ఆదాయం రూ.21 కోట్ల రికార్డు కాగా, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ టీఎస్ఆర్టీసీ ఒక్కటే దానికి అతి చేరువగా వచ్చి సత్తా చాటింది. ఇదే రోజు అటు ఏపీఎస్ఆర్టీసీ రూ.19.79 కోట్ల ఆదాయాన్ని పొందింది. విస్తృత పరిధి ఉన్న ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ ఆదాయాన్ని పొంది టీఎస్ఆర్టీసీ కొత్త మైలురాయిని దాటింది. ఈ నెల 12న 38,76,824 మంది ప్రయాణికులను బస్సులు గమ్యస్థానాలకు చేర్చాయి. ఏకంగా 35.54 లక్షల కి.మీ. మేర బస్సులు తిరిగాయి. ఎన్నడూలేనట్టు కి.మీ.కి రూ.56.56 చొప్పున ఆదాయాన్ని సంస్థ నమోదు చేసుకుంది. వెరసి 86.84 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.8.79 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.84 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల ఆదాయం సమ ూరింది. రాఖీ పౌర్ణమితో పాటు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బస్సులు కిటకిటలాడాయి. ముందుగానే ఈ రద్దీని ఊహించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉద్యోగులకు ఆగస్టు ఛాలెంజ్ పేరుతో లక్ష్యాన్ని నిర్ధారించారు. -
ఏబీ క్యాపిటల్ రికార్డు లాభం.. కంపెనీ చరిత్రలోనే అత్యధికం
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 429 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 302 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 5,859 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 4,632 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్‌కల్లా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్, గృహ రుణాల బుక్ 22 శాతం బలపడి రూ. 69,887 కోట్లకు చేరింది. జీవిత, ఆరోగ్య బీమా విభాగం స్థూల ప్రీమియం 53 శాతం జంప్‌చేసి రూ. 3,250 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 106 వద్ద ముగిసింది. -
వోల్టాస్.. తగ్గింది!
న్యూఢిల్లీ: ఏసీలు, ఇంజినీరింగ్ సర్వీసుల దిగ్గజం వోల్టాస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతంపైగా నీరసించి రూ. 110 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 122 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 55 శాతం జంప్‌చేసి రూ. 2,768 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 57 శాతం పెరిగి రూ. 2,603 కోట్లను దాటాయి. యూనిటరీ కూలింగ్ ప్రొడక్టుల నుంచి ఆదాయంలో రూ. 2,162 కోట్లు సమకూరింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి 34 శాతం తక్కువగా రూ. 455 కోట్లు లభించింది. ఇక ఇంజినీరింగ్ సరీ్వసుల నుంచి 8 శాతం అధికంగా రూ. 124 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,000 వద్ద ముగిసింది. చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా! -
అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం తగ్గి రూ. 214 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 219 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,079 కోట్ల నుంచి రూ. 1,701 కోట్లకు జంప్‌చేసింది. అయితే గత రెండు సంవత్సరాలుగా అదానీ వ్యాపారాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ఈక్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ తొలి త్రైమాసిక ఫలితాలలో నికర లాభం స్వల్పంగా తగ్గడం గమనార్హం. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 898 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీయంగా తొలి 390 మెగావాట్ల సౌర, పవన హైబ్రిడ్ యూనిట్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో వినీత్ ఎస్.జైన్ పేర్కొన్నారు. ఈ బాటలో సౌర విద్యుత్ సామర్థ్యం 58 శాతం జంప్‌చేసి 4,763 మె.వా.కు చేరగా.. పవన విద్యుత్ సామర్థ్యం 30 శాతం ఎగసి 647 మె.వా.కు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం పుంజుకున రూ. 2,285 వద్ద ముగిసింది. చదవండి: Banks Privatisation: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేంద్రం క్లారిటీ -
హమ్మయ్యా.. జొమాటో నష్టాలు తగ్గాయి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గి రూ. 186 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 361 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 917 కోట్ల నుంచి రూ. 1,582 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,260 కోట్ల నుంచి రూ. 1,768 కోట్లకు పెరిగాయి. బ్లింకిట్ కొనుగోలు ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 97 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో దీపీందర్ గోయల్ వెల్లడించారు. స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతి రావలసి ఉన్నదని సీఎఫ్‌వో అక్షంత్ గోయల్ పేర్కొన్నారు. బ్లింకిట్ కొనుగోలుకి సాధ్యాసాధ్యాల పరిశీలన చేపట్టడంతోపాటు విలువ విషయంలో తీవ్రస్థాయిలో చర్చలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 46.50 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌కు ఉబర్ గుడ్‌బై, స్పందించిన ఈవోసీ -
అయ్యో! ఆదాయం పెరిగినా.. నెస్లే ఇండియా నేల చూపులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 515 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 539 కోట్లు ఆర్జించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 4,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 3,462 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం పెరిగి రూ. 3,356 కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 2,776 కోట్లుగా నమోదయ్యాయి. పెట్ బిజినెస్ అమ్మకాల్లో వృద్ధి కొనసాగడంతో క్యూ2లో తొలిసారి రూ. 4,000 కోట్ల మార్క్‌ను దాటినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దేశీ అమ్మకాలు 16 శాతం బలపడి రూ. 3,848 కోట్లకు చేరగా.. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో రూ. 158 కోట్లుగా నమోదయ్యాయి. స్విస్ మాతృ సంస్థ నుంచి పురీనా పెట్‌కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా పెట్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకు రూ. 123 కోట్లకుపైగా వెచ్చించింది. చదవండి: సంచలనం : ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. ధర ఎంతంటే! -
దూసుకుపోయిన బజాజ్ ఫైనాన్స్.. డబుల్ జోరు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,596 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,002 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం వృద్ధితో రూ. 9,283 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 6,743 కోట్ల ఆదాయం సాధించింది. నికర వడ్డీ ఆదాయం 33 శాతం పుంజుకుని రూ. 7,920 కోట్లుకాగా.. కొత్త రుణాల సంఖ్య 60 శాతం ఎగసి 74.2 లక్షలకు చేరింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 30 శాతం మెరుగై రూ. 2,04,018 కోట్లను తాకాయి. రుణ నష్టాలు, కేటాయింపులు సగానికిపైగా తగ్గి రూ. 755 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ1లో ఇవి రూ. 1,750 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.96 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.46 శాతం నుంచి 0.51 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 26.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 6,408 వద్ద ముగిసింది. -
చిప్ కొరత.. బజాజ్ ఆటో లాభం డౌన్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. రూ. 1,163 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,170 కోట్లు ఆర్జించింది. చిప్ కొరత అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 7,386 కోట్ల నుంచి రూ. 8,005 కోట్లకు ఎగసింది. ఇందుకు ధరల పెంపు, డాలర్ బలపడటం సహకరించింది. అమ్మకాల పరిమాణం మాత్రం 7 శాతం నీరసించి 9,33,646 యూనిట్లకు చేరింది. గతేడాది క్యూ1లో 10.06 లక్షలకుపైగా వాహనాలు విక్రయించింది. తొలుత సెమీకండక్టర్ల కొరత సమస్యలు సృష్టించినప్పటికీ తదుపరి ఇతర మార్గాలలో సరఫరాలు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 1,061 కోట్ల నుంచి రూ. 1,173 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీ అమ్మకాలు 1 శాతం తగ్గి 3,52,836 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మరింత అధికంగా 10 శాతం క్షీణించి 5,80,810 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో 2.25 శాతం బలహీనపడి రూ. 3,932 వద్ద ముగిసింది. -
ఎస్ఐబీకి ఫలితాలు.. గతేడాదితో పోలిస్తే పదింతల లాభాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్(ఎస్ఐబీ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 115 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 10 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4లో నమోదైన రూ. 272 కోట్లతో పోలిస్తే లాభం 57 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2,084 కోట్ల నుంచి రూ. 1,868 కోట్లకు వెనకడుగు వేసింది. ఇందుకు వడ్డీ, ఇతర ఆదాయాలు తగ్గడం కారణమైంది. వడ్డీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 1,622 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 45 శాతం పడిపోయి రూ. 246 కోట్లకు చేరింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.02 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.05 శాతం నుంచి 2.87 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు సైతం రూ. 496 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.25 శాతం బలపడి రూ. 7.87 వద్ద ముగిసింది. చదవండి: Stock Market: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు! -
ఎల్అండ్టీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 1,702 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,174 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 29,335 కోట్ల నుంచి రూ. 35,853 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 57 శాతం అధికంగా రూ. 41,805 కోట్ల విలువైన గ్రూప్ స్థాయి ఆర్డర్లను సాధించింది. వీటిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి 66 శాతం వృద్ధితో రూ. 18,343 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయి. ఇంధన ప్రాజెక్టుల విభాగం నుంచి రూ. 4,366 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. వెరసి జూన్ చివరికల్లా మొత్తం(కన్సాలిడేటెడ్) ఆర్డర్ బుక్ విలువ రూ. 3,63,448 కోట్లకు చేరింది. వీక్ క్వార్టర్లోనూ నిజానికి ఈపీసీ కంపెనీలకు ప్రధానంగా ఎల్అండ్టీకి తొలి త్రైమాసికం బలహీనంగా ఉంటుందని, అయినప్పటికీ పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ పేర్కొన్నారు. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా తొమ్మిది విభాగాలను ఏడుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రోడ్ కన్సెషన్ ప్రాజెక్టుల నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఐదేళ్ల లక్ష్యం 2026 ప్రణాళికలో భాగంగా కొత్త విభాగాలలోకి డైవర్సిఫై అవుతున్నట్లు వెల్లడించారు. వీటిలో గ్రీన్ ఎనర్జీ, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ బిజినెస్‌లున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు 2% క్షీణించి రూ. 1,751 వద్ద ముగిసింది. చదవండి: RBI Unclaimed Deposits: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం!
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం (ఈవీ) వృద్ధి చెందుతుండడంతో.. ఆటో విడిభాగాల కంపెనీలకు 2027 నాటికి 9–11 శాతం మేర ఆదాయం ఈవీల నుంచి రావచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే కాలంలో సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాల నుంచి కూడా విడిభాగాల కంపెనీలకు వ్యాపారం వృద్ధి చెందుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో ఈవీ విడిభాగాల వాటా ఒక శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈవీలకు సంబంధించి ఆటో విడిభాగాల మార్కెట్ ఏటా 76 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందుతూ 2026–27 నాటికి రూ.72,500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇందులో 60 శాతం బ్యాటరీల నుంచే ఉంటుందని పేర్కొంది. 15 శాతం మేర డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఉంటుందని తెలిపింది. 220 తయారీ సంస్థల నుంచి వివరాలు తీసుకుని విశ్లేషించగా.. ఈవీలకు మళ్లడం అనేది అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తీసుకొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. వ్యాపారంలో వైవిధ్యం.. ‘‘బ్యాటరీలు, డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర విడిభాగాలు ఆటో కాంపోనెంట్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌కు వెలుపల విస్తరించుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీపై కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో ఐసీఈ విడిభాగాల కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటవున్న ఈవీ విడిభాగాల కంపెనీలు కూడా ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు ఈవీ వైపు వ్యాపార అవకాశాల విస్తరణకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈవీ విభాగంలో టూవీలర్ల వాటా ప్రస్తుతమున్న 2.5 శాతం నుంచి 19 శాతానికి, ప్యాసింజర్ కార్ల వాటా 1 శాతం నుంచి 7 శాతానికి చేరుతుందని పేర్కొంది. -
దశాబ్ద కాలంలో ఇదే రికార్డ్.. ఆ వజ్రాలకు భారీ డిమాండ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వజ్రాల పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం తగ్గుతుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘డిమాండ్ పడిపోవడం, ముడి వజ్రాల ధర అంతర్జాతీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2022–23లో పరిశ్రమ ఆదాయం రూ.1,52,000–1,60,000 కోట్లు నమోదు కావొచ్చు. సహజ వజ్రాలకు కొరత, అంతకంతకూ ఇవి ప్రియం కావడంతో వినియోగదార్లు 50–60 శాతం తక్కువ ధర కలిగిన కృత్రిమ వజ్రాల వైపు మళ్లుతున్నారు. మొత్తం పరిశ్రమలో కృత్రిమ వజ్రాల వాటా రెండేళ్ల క్రితం 3 శాతం నమోదైంది. ప్రస్తుతం ఇది ఏకంగా 8 శాతానికి చేరింది. 2021–22లో పరిశ్రమ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే భారీ రికార్డ్. ఇక పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 48 శాతం, ముడి వజ్రాల దిగుమతులు 74 శాతం దూసుకెళ్లాయి. ముడి వజ్రాలకు అనుగుణంగా పాలిష్ చేసిన వజ్రాల ధరలు నిర్ణయిస్తారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలను పరిశ్రమ పెంచలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ముడి వజ్రాల ధర దాదాపు 30 శాతం అధికమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వజ్రాల పాలిషింగ్ కంపెనీల నిర్వహణ లాభదాయకత 75–100 బేసిస్ పాయింట్లు తగ్గి 4–4.25 శాతానికి చేరవచ్చు. ద్రవ్యోల్బణం, మరోవైపు యాత్రలు, ఆతిథ్యంలో కస్టమర్లు ఖర్చు చేస్తుండడంతో యూఎస్, యూరప్‌లో సమీప కాలంలో డిమాండ్ తగ్గుతుంది’ అని క్రిసిల్ వివరించింది. చదవండి: ఉక్రెయిన్ వార్.. భారత్‌కు అలా కలిసోచ్చిందా! -
అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 229 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) క్యూ1లో కేవలం రూ. 109 కోట్లు ఆర్జించింది. వడ్డీ మార్జిన్లు బలపడటం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.55 శాతం నుంచి 3.82 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.97 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.69 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చాయి. ఈ బాటలో ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 247 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు వెనకడుగు వేశాయి. క్యూ1లో ఆభరణ రుణ పోర్ట్‌ఫోలియో 13 శాతం పుంజుకుని రూ. 14,873 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం లాభపడి రూ. 55.35 వద్ద ముగిసింది. చదవండి: Canara Bank: వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్! -
వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా!
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 7,714 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 9,768 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. వ్యయాలు పెరగడమే క్యూ1లో లాభాలు తగ్గడానికి కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ. 53,628 కోట్లకు పెరిగింది. ముడి వస్తువుల ఖర్చులతో పాటు వడ్డీలు తదితర వ్యయాలు కూడా కలిపి రూ. 41,491 కోట్ల నుంచి రూ. 51,912 కోట్లకు పెరిగాయి. దేశీయంగా టాప్ 4 ఉక్కు సంస్థల్లో టాటా స్టీల్ కూడా ఒకటి. మొత్తం ఉక్కు ఉత్పత్తిలో కంపెనీ వాటా దాదాపు 18 శాతంగా ఉంటుంది. -
టెక్ మహీంద్రా.. మార్జిన్లు తగ్గాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 16.4 శాతం క్షీణించి రూ. 1,132 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,353 కోట్లు. పలు అంశాల మూలంగా మార్జిన్లు తగ్గిపోవడమే తాజాగా లాభాల క్షీణతకు కారణం. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 24.6 శాతం వృద్ధి చెంది రూ. 10,198 కోట్ల నుంచి రూ. 12,708 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.2 శాతం నుంచి 11 శాతానికి తగ్గగా, నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరింది. లాభదాయకతను పెంచుకునేందుకు అన్ని అవకాశాలూ వినియోగించుకుంటామని, రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో నమోదు చేయగలమని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ కోణంలో కొన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు సరఫరా తరఫు సమస్యలు (అధిక వేతనాలతో ఉద్యోగులను తీసుకోవడం లేదా సబ్–కాంట్రాక్టుకు ఇవ్వడం వంటివి) కూడా మార్జిన్ల తగ్గుదలకు కారణమని తెలిపారు. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ► క్యూ1లో 6,862 మంది ఉద్యోగుల నియామకాలతో సిబ్బంది సంఖ్య 1.58 లక్షలకు పెరిగింది. ► అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) మార్చి త్రైమాసికంలో 24 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 22 శాతానికి తగ్గింది. అయితే, గతేడాది క్యూ1లో నమోదైన 17 శాతంతో పోలిస్తే ఇంకా అధికంగానే ఉంది. ► బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు 1.15 శాతం క్షీణించి రూ. 1,016.55 వద్ద క్లోజయ్యింది. చదవండి: 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు -
వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్!
ముంబై: మెరుగైన రుణ వృద్ధి, వడ్డీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం 72 శాతం ఎగిసి రూ. 2,022 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,177 కోట్లు. ‘నికర వడ్డీ ఆదాయంతో (ఎన్ఐఐ) పాటు వడ్డీయేతర ఆదాయం కూడా 25 శాతం పెరిగింది. కేటాయింపులు అదుపులోనే ఉన్నాయి. రుణ వృద్ధి కూడా సానుకూలంగా నమోదైంది‘ అని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో ఎన్ఐఐ 10.15 శాతం పెరిగి రూ. 6,160 కోట్ల నుంచి రూ. 6,785 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 24.55 శాతం వృద్ధితో రూ. 4,155 కోట్ల నుంచి రూ. 5,175 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.71 శాతం నుంచి 2.78 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.90 శాతం స్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో స్థూల రుణాల వృద్ధి 13.14 శాతంగాను, డిపాజిట్ల వృద్ధి 8.49 శాతంగాను నమోదైంది. తగ్గిన మొండిబాకీలు మరోవైపు, స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 8.50 శాతం నుంచి 6.98 శాతానికి దిగి రాగా, నికర ఎన్పీఏల నిష్పత్తి కూడా 3.46 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ. 1,886 కోట్ల మొత్తం రికవర్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల రికవరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభాకర్ చెప్పారు. అలాగే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేసేందుకు రూ. 2,300 కోట్ల విలువ చేసే మొండి పద్దులను గుర్తించినట్లు వివరించారు. చదవండి: Huawei: భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం -
అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర: సీఎం జగన్
-
మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సీఎంకు అధికారులు వివరాలు అందించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్షించారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. చదవండి: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ♦మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్న సీఎం ♦ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న సీఎం ఎక్సైజ్ శాఖపైనా సీఎం సమీక్ష. ♦అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్న సీఎం ♦బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర ♦దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్ఓపీ రూపొందించాలి ♦అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్న సీఎం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైనా సమీక్ష ♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న అధికారులు ♦సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలన్న సీఎం ♦14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం ♦ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరుపోస్టర్‌ను డిస్ప్లే చేయాలని ఆదేశం ♦ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్ప్లే చేయాలి ♦పటిష్టమైన చర్యలు ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్న సీఎం ♦14400 ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలన్న సీఎం ♦గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్ప్లే చేయాలన్న సీఎం ♦రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్న సీఎం ♦అప్పుడే ప్రజలు ముందుకు వస్తారన్న సీఎం ♦51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయన్న అధికారులు ♦మరో 650 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు ♦వీటికి అదనంగా 2వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం అక్టోబరు2, 2022 నాటికి సిద్ధం చేస్తామన్న అధికారులు ♦రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం అటవీ పర్యావరణ శాఖపైనా సీఎం సమీక్ష ♦త్వరలోనే రెడ్ శాండిల్ ఆక్షన్– గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయన్న అధికారులు. ♦ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న సీఎం ♦ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేసుకుంటూ... వివరాలు నమోదు చేయాలన్న సీఎం ♦పక్కాగా స్టాక్ వెరిఫికేషన్ చేయాలన్న సీఎం అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపైనా సమీక్ష ♦గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందన్న సీఎం ♦అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలన్న ముఖ్యమంత్రి ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(ఎక్సైజ్ శాఖ) కె నారాయణస్వామి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి సాయి ప్రసాదరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఏపీ జెన్కో ఎండీ బి శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యస్ బ్యాంక్ జూమ్.. లాభం వచ్చింది కానీ, అవి తగ్గాయి!
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 314 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 207 కోట్ల నుంచి రూ. 311 కోట్లకు ఎగసింది. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 32 శాతం పుంజుకుని రూ. 1,850 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.47 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం మాత్రం 10 శాతం నీరసించి రూ. 781 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు రూ. 2,233 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రొవిజన్లు 62 శాతం దిగివచ్చి రూ. 175 కోట్లకు పరిమితమయ్యాయి. పునర్వ్యవస్థీకృత రుణాలు రూ. 6,450 కోట్లుకాగా.. 30 రోజులుగా చెల్లించని(ఎన్పీఏలుకాని) రుణాల విలువ రూ. 1,700 కోట్లుగా నమోదయ్యాయి. ఇందుకు భారీ ఇన్ఫ్రా ఖాతా కారణమైనట్లు బ్యాంక్ పేర్కొంది. రికవరీలు, అప్‌గ్రేడ్స్ ద్వారా రూ. 1,532 కోట్లు జమయ్యాయి. ఈ ఖాతా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కనీస మూలధన నిష్పత్తి 17.7 శాతానికి చేరింది. -
ఇన్ఫోసిస్ ఓకే.. 21,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3.2 శాతం పుంజుకుని రూ. 5,360 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,195 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 24 శాతం ఎగసి రూ. 34,470 కోట్లకు చేరింది. కీలక మార్కెట్లలో ప్రధానమైన యూఎస్‌సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినప్పటికీ ఈ ఏడాది ఆదాయంలో 14–16 శాతం వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా(గైడెన్స్) వేయడం గమనార్హం. గతంలో 13–15 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ1లో పటిష్ట ఫలితాలు, డిమాండ్ ఔట్లుక్ నేపథ్యంలో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. త్రైమాసికవారీగా చూస్తే క్యూ1లో నికర లాభం 5.7 శాతం క్షీణించింది. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. నిర్వహణా మార్జిన్లు వీక్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ నిర్వహణా మార్జిన్లు 23.7 శాతం నుంచి 20.1 శాతానికి డీలాపడ్డాయి. గతేడాది క్యూ4లోనూ ఇవి 21.5 శాతంగా నమోదయ్యాయి. విక్రయాలు, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో నిర్వహణా వ్యయాలు 14.4 శాతం హెచ్చాయి. క్యూ1లో రూ. 6,914 కోట్ల నిర్వహణా లాభం ఆర్జించింది. ఈ కాలంలో 21,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించింది. కంపెనీ ఆదాయంలో యూఎస్ నుంచి 17.8 శాతం, యూరప్ నుంచి 21.9 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధించింది. భారీ డీల్స్తోకూడిన కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.7 బిలియన్ డాలర్లు(రూ. 13,600 కోట్లు)గా నమోదైంది. వేతన పెంపు, ఉద్యోగ నియామకాల ద్వారా నిపుణుల నియామకాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► జూన్ చివరికల్లా ఇన్ఫోసిస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,35,186కు చేరింది. 2022 మార్చికల్లా ఈ 3,14,015 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ► గత 12 నెలల సగటు ప్రకారం ఉద్యోగ వలస 28.4 శాతానికి ఎగసింది. గతేడాది క్యూ4లో ఇది 27.7 శాతంకాగా.. గత క్యూ1లో 13.9 శాతమే. ► 106 క్లయింట్లను కొత్తగా జమ చేసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,778ను తాకింది. ► 10 కోట్ల డాలర్ల క్లయింట్లు 38కాగా, 5 కోట్ల డాలర్ల క్లయింట్లు 69కు చేరారు. కోటి డాలర్ల క్లయింట్ల సంఖ్య 278కు చేరింది. చదవండి: Cryonics: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా? -
రూ.10 వేల కోట్ల ఆదాయంపై కన్నేసిన బ్లూస్టార్
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనింగ్, వాణిజ్యపర రిఫ్రిజిరేటర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్.. మధ్య కాలంలో తన ఆదాయాన్ని రూ.10,000 కోట్లకు పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ‘తదుపరి దశ వృద్ధిలో భాగంగా అంతర్జాతీయంగా ప్రధాన కంపెనీగా బ్లూస్టార్ మారుతుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో మరింత విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాల పరిచయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని బ్లూస్టార్ వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాం. వ్యయ నియంత్రణ చేపడతాం. భారతదేశం మాతృ కేంద్రంగా కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో బ్లూ స్టార్ ప్రధాన బ్రాండ్‌గా ఉండడానికి కృషి చేస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల తయారీలో ముఖ్య కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ వీర్ ఎస్ అద్వానీ తెలిపారు. కాగా 2021-22లో బ్లూ స్టార్ రూ.6,081 కోట్ల టర్నోవర్ సాధించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 20 ఎకరాల్లో రూమ్ ఏసీల తయారీ కేంద్రం స్థాపిస్తోంది. ఈ కేంద్రం కోసం బ్లూ స్టార్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. పూర్తి వార్షిక తయారీ సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉండనుంది. -
జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్, వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్ ఆస్ట్రోటాక్ స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. 10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా కార్యకలాపాలను, ప్రస్తుత బృందాన్ని పెంచాలని చూస్తున్నాము. మా వద్ద ఉన్న జ్యోతిష్యుల సంఖ్యతో పోలిస్తే వినియోగదరులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించడానికి మా మార్కెటింగ్ చాలా మెరుగ్గా ఉంది. మా వెబ్సైట్లో మేము పొందుతున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే మా టెక్నాలజీ టీమ్‌లో వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించాము మేము 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము’’ అన్నారు. 3 కోట్ల మంది కస్టమర్లు నమోదు... సొంత వనరులతో అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన తన స్టార్టప్ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్ సందర్శనలను నమోదు చేసిందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని వెల్లడించారు. అయితే 3,500 కంటే ఎక్కువ జ్యోతిష్యుల సేవలను వినియోగించుకోలేకపోయినట్లు తెలిపిన ఆయన, ఇప్పుడు వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నాన్-జ్యోతిష్యుల సంఖ్య దాదాపు 125గా ఉందని పేర్కొంటూ, మరింత మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. కంపెనీ నాన్-జ్యోతిష్యుల్లో రిక్రూటర్లు, జ్యోతిష్కుల శిక్షకులు, జ్యోతిష్య భాగస్వాములు, కస్టమర్ల కోసం రిలేషన్షిప్ మేనేజర్లు ఉన్నట్లు వెల్లడించారు. -
వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి రెండు నెలల్లో రూ. 500 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల(రూ. 7,800 కోట్లు) ఆదాయం అందుకోగల మని కంపెనీ భావి స్తోంది. అయితే తొలి రెండు నెలల్లో ఎన్ని వాహనా లు విక్రయించిందీ వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కస్టమర్ల విశ్వాసం పెరుగుతున్నదని, దీంతో భవిష్యత్‌లో మరింత పురోభివృద్ధిని సాధించగలదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజుకి 1,000 వాహనాలను తయారుచేయగల కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే భారీ ఆర్డర్లను పొందిందని, ఇకపై మరింత వేగాన్ని చూపే వీలున్నదని తెలియజేసింది. కాగా వాహన రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఓలా ఎస్1 ప్రో రిజిస్ట్రేషన్ 12,683 యూనిట్ల నుంచి 9,196 యూనిట్లకు క్షీణించాయి. ఇప్పటివరకూ కంపెనీ 50,000 స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఆగస్ట్‌లో కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్కి ఇంతటి సత్తా ఉందా?
రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించబోతుందంటూ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్ విభాగం 8.8 శాతం సమ్మిళిత అభివృద్ధి (సీఏజీఆర్) సాధిస్తుందని అంచనా వేసింది. దీంతో మీడియా, ఎంటర్టైన్ పరిశ్రమర విలువ ఏకంగా రూ. 4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. పీడబ్ల్యూసీ నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. - దేశీయంగా టీవీ, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో రెవెన్యూ ప్రస్తుత విలువ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. - 2026 నాటికి టీవీ అడ్వెర్టైజింగ్ విభాగం విలువ రూ.43,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో టీవీ అడ్వెర్టైజ్మెంట్లో ప్రపంచంలో ఐదో స్థానానికి ఇండియా చేరుకుంటుంది. ఇండియా కంటే ముందు వరుసలో అమెరికా, జపాన్, చైనా, యూకేలు ఉండనున్నాయి. - రాబోయే నాలుగేళ్లలో ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.21,031 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో చందాల ద్వారా రూ.19,973 కోట్ల రెవెన్యూ రానుండగా వీడియో ఆన్ డిమాండ్ ద్వారా రూ.1058 కోట్లు రానుంది. - రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలకు ప్రధాన ఆదాయం చందాల ద్వారానే తప్పితే వీడియో ఆన్ డిమాండ్ ద్వారా అంతగా పెరగకపోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓటీటీ సేవలు మరింత వేగంగా విస్తరించవచ్చు. - ప్రస్తుతం రూ.35,270 కోట్లు ఉన్న టీవీ అడ్వెర్‌టైజ్ విభాగం మార్కెట్ విలువ 2026 నాటికి రూ.43,568 కోట్లు కానుంది. - ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ 12 శాతం వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకునే అవకాశం. ఇంటర్నెట్ అడ్వెర్టైజింగ్ మార్కెట్లో 69 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాటా 60 శాతంగా ఉంది. - మ్యూజిక్, రేడియో, పోడ్కాస్ట్ విభాగం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.7,216 కోట్లు ఉండగా నాలుగేళ్ల తర్వాత ఇది రూ.11,356 కోట్లకు చేరుకోవచ్చు. - వీడియో గేమ్ మార్కెట్ త్వరలో పైకి దూసుకుపోనుందని సీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఈ విభాగంలో రూ. 37,535 కోట్లుగా ఉండవచ్చని అంచనా. టర్కీ, పాకిస్తాన్ తర్వాత వీడియోగేమ్ మార్కెట్ ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. - ఇక ఇండియన్ సినిమా మార్కెట్ ప్రస్తుత రెవెన్యూ 2026 నాటికి రూ. 16,198 కోట్లు కానుంది. ఇందులో బాక్సాఫీసు ద్వారా రూ. 15,849 కోట్ల రాబడి ఉండగా మిగిలిన రూ.349 కోట్లు యాడ్స్ ద్వారా రానుంది. - న్యూస్‌పేపర్ రెవెన్యూ రాబోయే నాలుగేళ్లలో 2.7 శాతం వృద్ధితో రూ.26,278 కోట్ల నుంచి రూ.29,945 కోట్లను టచ్ చేయనుంది. న్యూస్‌పేపర్ రెవెన్యూలో ఇండియా వరల్డ్‌లో ఐదో ర్యాంకులో ఉంది. చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది -
CM Jagan: ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి.. పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై రివ్యూ మీటింగ్‌లో.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. అదే సమయంలో ఆదేశాలు, కీలక సూచనలతో పాటు ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారాయన. ►ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ► టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక.. సిబ్బందికి, ఆపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ఎలాంటి సేవలు పొందవచ్చు అనే దానిపైనా అవగాహన కల్పించాలి. ► కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా.. రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలి. ► రిజిస్ట్రేషన్ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న విషయాలను తెలియజేయాలి. ► అక్టోబరు 2న తొలివిడతగా.. గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలి అని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు.. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. అంతేకాదు.. 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. రిజిస్ట్రేషన్ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం జగన్, అధికారులకు సూచించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సీఎం జగన్ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. మైనర్ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని, తద్వారానే ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ చెప్పారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. జెన్కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని, దీనివల్ల జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్న సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా.. ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలన్న సీఎం జగన్, తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వాణిజ్య పన్నుల శాఖ పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టతతో పాటు డాటా అనలిటిక్స్ విభాగం, లీగల్‌సెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే.. బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం కల్పించనున్నారు. జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు జరగనుంది. వీటితో పాటు అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఎన్ ప్రతీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఆర్టీసీకి ‘మండే’.. ఆదాయం మెండే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి సోమవారం అంటే పండుగే. అది ఎప్పుడూ కలిసొచ్చే రోజే. ఆరోజు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆదాయం భారీగా ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ మండేగా ఆర్టీసీ అధికారులు చెప్పుకుంటారు. సోమవారాల్లోనూ గత సోమవారం వేరు. ఆరో తేదీన(సోమవారం) ఆర్టీసీ ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఆరోజు ఏకంగా టికెట్ ద్వారా రూ.15.58 కోట్లు ఆర్జించింది. దసరా, సంక్రాంతి లాంటి పండగరోజులు కాకుండా ఓ సింగిల్ డే ఇంత ఆదాయం రావటం రికార్డే. గత ఏప్రిల్ 18న సమకూరిన రూ.15.01 కోట్లు ఇప్పటివరకు గరిష్ట ఆదాయం. దాన్ని గత సోమవారం అధిగ మించింది. 2019 డిసెంబర్లో ఆర్టీసీ చార్జీలు పెరిగిన వెంటనే, కోవిడ్ రావటంతో పూర్తిస్థాయిలో బస్సులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. గత ఆరు నెలల నుంచే బస్సుల ఆపరేషన్లు ఊపందుకున్నాయి. ఈ ఆరు నెలల్లో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి. సోమవారం రూ.13.64 కోట్లు టార్గెట్ పెట్టుకోగా దాన్ని మించి (114 శాతం) ఆదాయం రావటం విశేషం. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.6.19 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో 4.42 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక కిలోమీటరు ఆదాయం(ఈపీకే) రూ.44.93గా, ఆక్యుపెన్సీ రేషియో 85.10 శాతంగా నమోదయ్యాయి. 34.25 లక్షల కి.మీ. తిరగాలని లక్ష్యం పెట్టుకోగా ఆరోజు ఆర్టీసీ బస్సులు 34.69 లక్షల కి.మీ. మేర తిరిగాయి. -
అడ్డాకులకు అదిరే ధర
సాక్షి,పాడేరు : ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఉన్న అడ్డాకుల సేకరణతో గిరిజన రైతులు పూర్వం నుంచి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి అడ్డాకులకు డిమాండ్ నెలకొనడంతో వ్యాపారులు గిరిజనుల నుంచి పోటీపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో వారపు సంతలో కనీసం రూ.3 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. రెండు దిండ్లు అడ్డాకులు రూ.1800 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుంకరమెట్ట, అరకు, కించుమండ, హుకుంపేట, జి.మాడుగుల, వంట్లమామిడి, మద్దిగరువు, తాజంగి, అన్నవరం, చింతపల్లి, లోతుగెడ్డ వారపుసంతల్లో రెండు వారాల నుంచి అడ్డాకుల వ్యాపారం భారీగా జరుగుతోంది. మైదాన ప్రాంత వ్యాపారులు.. ఏజెన్సీలో వారపు సంతల్లో నర్సీపట్నం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, ఎస్.కోట, విజయనగరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులంతా పోటా పోటీగానే అడ్డాకులను కొనుగోలు చేస్తుండటంతో గిరిజనులకు మంచి ధర లభిస్తోంది. ఈ ఆదివారం పాడేరు మండలం వంట్లమామిడి, అరకులోయ మండలం సుంకరమెట్ట వారపుసంతల్లో అడ్డాకుల వ్యాపారం భారీగానే జరిగింది. ఈ రెండు సంతల్లోను కనీసం రూ.8లక్షల మేర విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వందలాది కుటుంబాలకు ఉపాధి ఏజెన్సీలోని గిరిజన రైతుల వద్ద సీజన్లో రూ.20 నుంచి రూ.30 వేలకు పైగా ఆదాయం సీజన్ ముగిసే లోపు ఒక్కో కుటుంబం కనీసం రూ.20వేల నుంచి 30వేల వరకు అడ్డాకుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. గతంలో గిరిజన సహకార సంస్థ అడ్డాకులను కిలోల రూపంలో కొనుగోలు చేసేది. అడ్డాకుల వినియోగం అప్పట్లో తగ్గడం, ప్రైవేటు వ్యాపారుల నుంచి ఆదరణ కరువవడంతో పదేళ్ల నుంచి అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడంతో అడ్డాకులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. గిరి రైతులకు అడ్డాకులు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెటఖ పరిస్థితులు కలిసి రావ డంతో రెండేళ్ల నుంచి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో గిరిజనులకు ఊహించని ధర లభించింది. దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుండటంతో ఆదాయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. -
Sakshi Cartoon: గణనీయంగా తగ్గిన కాంగ్రెస్ ఆదాయం
గణనీయంగా తగ్గిన కాంగ్రెస్ ఆదాయం -
కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. -
పసిడి పరుగులు, బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం పైపైకి!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) 12–15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. ఇందుకు స్థిరమైన గిరాకీ, పసిడి అధిక ధర ఇందుకు కారణమవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 20–22 శాతం ఆదాయ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. వార్షికంగా ఆదాయాలు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2021–22లో భారీ ఆదాయాల నమోదుకు మహమ్మారి ప్రారంభ దశ (2020–21) లో బేస్ ఎఫెక్ట్ కారణమని తెలిపింది. క్రిసిల్ రేటింగ్స్ ఇస్తున్న 82 సంస్థల పనితీరు ఆధారంగా నివేదిక రూపొందింది. ఈ రంగ మొత్తం ఆదాయంలో వీటి వాటా 40 శాతం. క్రిసిల్ నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే... ►ఆపరేటింగ్ మార్జిన్లు 2022–2023 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 50–70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శౠం) 7.3–7.5 శాతం శ్రేణిలో మెరుగుపడతాయి. పెరిగిన బంగారం ధరలు, మెరుగైన నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 12–15 శాతం పెరుగుతాయి. ఫలితంగా పరిశ్రమపై రుణ భారాలు తగ్గే వీలుంది. ►అధిక మూలధన వ్యయం, ఇన్వెంటరీలు ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల క్రెడిట్ ఔట్‌లుక్‌ను ‘స్థిరంగా’ ఉంటుంది. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల డిమాండ్ స్థిరంగా ఉంటుంది. డిమాండ్ పరిమాణం 8–10 శాతం వృద్ధి చెంది 600–650 టన్నుల మహమ్మారి ముందస్తు స్థాయిలకు చేరుకుంటుంది. కోవిడ్–19 అనంతరం వ్యాపార కార్యకలాపాలను మామూలు స్థితికి చేరుకుంటుండడం దీనికి ప్రధాన కారణం. ► డిమాండ్ స్థిరీకరణతో, వ్యాపార విస్తరణ విలువ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 200–250 కోట్లు ఉంటుంది. తద్వారా ఈ పరిమాణం మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. ► భారత్‌పై నాల్గవ వేవ్ సవాళ్లు తలెత్తడం, అలాగే సుంకాల పెంపు వంటి చర్యలు ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు ఆలోచనలో మార్పు తీసుకువస్తాయి. ► బంగారం అధిక దిగుమతులు భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) పెరగడానికి దారితీసే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
AP Forest Department: ఆదాయం అదరహో!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. రెండేళ్లుగా రూ.15–20 కోట్ల మధ్య ఉన్న ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.193.31 కోట్లుగా నమోదైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి అటవీ శాఖ ఆదాయం రూ.200 కోట్లుగా నమోదవుతుందని సామాజిక ఆర్థిక సర్వే 2020–21 అంచనా వేసింది. అంతర్జాతీయ వేలం విధానంలో ఎర్ర చందనం అమ్మకం ద్వారా రూ.175 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చి చేరింది. చదవండి: Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’ ఇదే సమయంలో ఫర్నిచర్ తయారీలో అత్యధిక డిమాండ్ ఉండే టేకు కలప విక్రయం ద్వారా రూ.10.98 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద రూ.6.83 కోట్ల విలువైన టేకు కలపను విక్రయించారు. ఈ రెండింటి తర్వాత వెదురు అమ్మకం ద్వారా డిసెంబర్ నాటికి అటవీ శాఖకు రూ.6.53 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద వెదురు అమ్మకం ద్వారా రూ.850 కోట్లు ఆర్జించింది. ఇవికాకుండా ఇతర కలప, బీడీ ఆకులు, జీడి మామిడి విక్రయాల ద్వారా అటవీ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,603.39 చదరపు కిలోమీటర్లలో అడవి విస్తరించి ఉండగా, ఇందులో 1,994.28 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అటవీ ప్రాంతం, 13,861.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాధారణ అడవులు ఉన్నాయి. -
రోజుకు రూ. 30 కోట్ల పైమాటే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల శాఖ కాసుల వర్షం కురిపిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వలు పెరిగిన తర్వాత 15 రోజుల్లోనే ఆ శాఖ ఆదాయం అమాంతంగా పెరిగింది. ఈనెల ఒకటో తేదీ నుంచి తాజాగా గురువారంరాత్రి వరకు 61 వేలకుపైగా లావాదేవీలు జరగగా, రూ.502. 87 కోట్ల ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రోజుకు రూ.30 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోందన్న మాట. కేవలం వ్యవ సాయేతర భూములు, ఆస్తుల రిజి స్ట్రేషన్లకే ఈ ఆదాయం రాగా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు మరో రూ.100 కోట్లు వస్తాయని రెవెన్యూవర్గాలు భావి స్తున్నాయి. ఈ నెలలో మిగిలిన 15 రోజు లకు మరో రూ.500 కోట్లు వస్తాయని, మొత్తం కలిపి ఈ నెలలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది రూ.10 వేల కోట్లు 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12 వేల కోట్ల ఆదాయం రాబట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి 15 నాటికే రూ.10 వేల కోట్లు వచ్చాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్టాంపుల విక్రయంతో వచ్చిన ఆదాయం కలుపుకుంటే అది రూ.12 వేల కోట్లకు చేరిందని సమాచారం. గతేడాది జూలైలో ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి నప్పటి నుంచే రిజిస్ట్రేషన్ల ఆదాయం పరుగులు పెడుతోంది. తాజాగా ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వ విలువలను మరోసారి సవరించిన నేపథ్యంలో ఈ ఆదాయం మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలకడగా కొన సాగుతుండటం, క్రయవిక్రయ లావా దేవీలు నానాటికీ పెరుగుతుండ టమే ఇందుకు కారణమని, వచ్చే ఆర్థిక సంవ త్సరంలో ఒక్క రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.38 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2022 జనవరిలో రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 జనవరితో పోల్చితే ఈ విలువ 15 శాతం అధికం. ఎకానమీ రికవరీ, పన్ను ఎగవేతల నిరోధం వంటి అంశాలు దీనికి కారణం. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకటన ప్రకారం 36 లక్షల త్రైమాసిక రిటర్నులు సహా 2022 జనవరి 30 వరకూ దాఖలైన జీఎస్టీఆర్–3బీ రిటర్నుల సంఖ్య 1.05 కోట్లు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లు పైన నమోదుకావడం (ఏప్రిల్, అక్టోబర్,నవంబర్, జనవరి) ఆర్థిక సంవత్సరంలో ఇది నాల్గవనెల. ఇక లక్ష కోట్లు పైబడ్డడం వరుసగా ఏడవనెల. అత్యధికంగా నమోదయిన వసూళ్లు 2021 ఏప్రిల్‌లో కాగా, అటుపై రెండు నెలల్లో సెకండ్‌వేవ్ ఎఫెక్ట్ పడింది. - జనవరి 31వ తేదీ 3 గంటల వరకూ వసూళ్లను పరిశీలిస్తే, మొత్తం జీఎస్టీ రూ.1,38,394 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.24,674 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.32,016 కోట్లు, ఐజీఎస్టీ రూ.72,030 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.35,181 కోట్లుసహా), సెస్ రూ.9,674 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.517 కోట్లుసహా). చదవండి: Income Tax Return: రిటర్నులకు ఫినిషింగ్ టచ్! -
బకాయిలు చెల్లించకుంటే లీజులు రద్దు
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం ఆదాయన్ని పెంచే లక్ష్యంతో అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతోందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.200 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రూ.31.08 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో లీజు అద్దెను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రూ.35 కోట్లతో 18 చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లను ఆధునికీకరించనున్నట్టు వివరించారు. ఉగాది నాటికి పర్యాటక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 13 రకాల క్రీడలతో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో టోర్నీ పూర్తవగా వచ్చే వారంలో మిగిలిన జిల్లాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 1,497 మంది క్రీడాకారులకు దాదాపు రూ.8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతిపాదనల మేరకు రూ.7.50 కోట్లతో విశాఖపట్నం కొమ్మాదిలో ఈతకొలను, రూ.5.50 కోట్లతో కర్నూలు డీఏస్‌ఏ స్టేడియంలో సింథటిక్ టర్ఫ్ ఫుట్‌బాల్ మైదానం, రూ.7.50 కోట్లతో కడపలో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ (8 లేన్లు), రూ.7.50 కోట్లతో నెల్లూరు జిల్లా స్పోర్ట్సు విలేజ్ మొగలాయిపాలెంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ (8 లేన్లు) ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభా వంతుల కోసం ఆయా సంక్షేమ శాఖల సమన్వయంతో 8 క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. కొత్త జిల్లాలపై చంద్రబాబు వైఖరేంటి? అభివృద్ధి వికేంద్రీకరణ, సత్వర సేవలే లక్ష్యంగా జిల్లాల విభజన చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. అనవసర విమర్శలు కాకుండా జిల్లాల విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాలను విభజించినప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి సాంస్కృతిక శాఖలో కొత్తగా నియమితులైన వివిధ అకాడమీ చైర్మన్లతో తొలిసారిగా సమావేశమయ్యారు. రాఘు హరిత (నాటక అకాడమీ), సత్యశైలజ (దృశ్య కళల), నాగభూషణం (ఫోక్–క్రియేటివిటి), ప్రభావతి (సైన్స్ అండ్ టెక్నాలజీ), నాగమల్లేశ్వరి (హిస్టరీ), శిరీషా యాదవ్ (సంగీత, నృత్య), లక్ష్మి (సాహిత్యం)లను మంత్రి సన్మానించారు. -
టైర్ రీట్రెడింగా.. ఆర్టీసీ వర్క్‌షాపు ఉందిగా
టైర్ రీట్రెడింగ్.. టైర్ల జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. కొత్త టైరును కొనేబదులు మరికొంతకాలం పాతదాన్నే వినియోగించేలా దాని జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. భారీ వాహనాలున్న వారికి ఇది సుపరిచితమే. ఇప్పుడు ఆర్టీసీ వర్క్‌షాపులో ప్రైవేటు వాహనాల టైర్లనూ రీట్రెడింగ్ చేసేలా కసరత్తు జరుగుతోంది. తార్నాకలో 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రి.. నిత్యం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలపై ఇక్కడికి వస్తుంటారు. ఇన్‌పేషెంట్‌గా కొందరు, ఔట్ పేషెంట్‌గా మరికొందరు వైద్యం పొందుతుంటారు. పెద్ద ల్యాబ్, 24 గంటలూ సేవలందించే ఫార్మసీ ఇక్కడ ఉన్నాయి. త్వరలో సాధారణ వ్యక్తులూ ఇక్కడ వైద్య సేవలు, పరీక్షలు పొందే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబి నుంచి గట్టేందుకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ఆర్టీసీ కొత్త దారులు వెదుకుతోంది. తనకున్న వనరులనే పెట్టుబడిగా పెట్టి ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా ఉప్పల్‌లో ఉన్న వర్క్‌షాపు, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై మరింత కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే పలుమార్లు తార్నాక ఆసుపత్రిని సందర్శించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. దాని స్థాయిని పెంచి సాధారణ వ్యక్తులకూ వైద్యాన్ని అందించడం ద్వారా ఫీజుల రూపంలో ఆదాయాన్ని పొందాలని నిర్ణయించారు. వీలైతే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 200 పడకలను 300కు పెంచాలనీ యోచిస్తున్నారు. ముందుగా ల్యాబ్‌లో పరీక్షలతో శ్ర్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ల్యాబ్‌ను కొంత విస్తరించారు. అలాగే ఫార్మసీలో కూడా బయటి వ్యక్తులకు 24 గంటలూ మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా వైద్యాన్ని కూడా అందిస్తారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూర్చుకుంటారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నారు. వర్క్‌షాప్.. బస్‌బాడీ యూనిట్ ఆర్టీసీకి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ వర్క్‌షాప్ ఉంది. ఇక్కడ బస్సులకు రంగులు వేయటం, ప్యాచ్ వర్క్‌తోపాటు కీలకమైన టైర్ రీట్రెడింగ్ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌లో బస్బాడీలను రూపొందించే వర్క్‌షాప్ ఉంది. అక్కడి భూములకు మంచి డిమాండ్ ఉన్నందున దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలనే యోచన ఉంది. దీంతో భారీ వాహనాలకు సంబంధించిన సమస్త సర్వీసులు ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకుని దీన్ని పటిష్టపరిచి ప్రైవేటు వాహనాలకు సేవలు అందించడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇటీవలే ఆ వర్క్‌షాపును పరిశీలించిన సజ్జనార్ .. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతోంది. మూడు నాలుగు నెలలుగా టికెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయినా సంస్థ ఖర్చులను మించిన ఆదాయం పెద్దగా ఉండటం లేదు. దీనికితోడు కరోనా ఉధృతి వల్ల 20 రోజులుగా టికెట్ ఆదాయం బాగా తగ్గుముఖం పట్టింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం సమకూర్చుకోవడం అనివార్యమైంది. -
భారీగా పెరిగిన టోల్ వసూళ్లు.. రోజుకు రూ. 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తప్పనిసరి కావడం, ఇంటి దొంగల ఆట కట్టు కావటంతో జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. ఇంతకాలం జవాబుదారీ విధానం లేకపోవటంతో ఎన్ని వాహనాలు టోల్‌ప్లాజాలను దాటుతున్నాయి, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తోంది.. సరైన లెక్కాపత్రం లేకుండా పోయింది. సిబ్బంది హస్తలాఘవం బాగా ఉండటంతో దాదాపు సగానికి సగం మొత్తం గాయబ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్‌గా వసూలవుతుండటంతో భారీ మొత్తం జమవుతోంది. ఇంతకాలం ఫాస్టాగ్ లేని వాహనాల సంఖ్య కూడా గణనీయంగా కనిపిస్తూండేది. కానీ గత రెండు మూడు నెలల్లో ఫాస్టాగ్ పొందిన వాహనాల సంఖ్య గరిష్టస్థాయికి చేరింది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద పరుగుపెడుతున్న వాహనాల్లో 98 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. దీంతో నిత్యం రాష్ట్రంలోని 27 టోల్ కేంద్రాల ద్వారా రూ.మూడున్నర కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు ఆదాయం నమోదవుతుండటం విశేషం. ఫాస్టాగ్ తప్పనిసరితో.. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ గతేడాది ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం వస్తే అప్పటికప్పుడు ట్యాగ్ కొని అతికించుకోవటమో, లేదా రెట్టింపు రుసుమును పెనాల్టీగా చెల్లించి ముందుకు వెళ్లటమో, లేదా వెనుదిరిగి వెళ్లిపోవటమో చేయాల్సిన పరిస్థితిని గత ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులందరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయటం ప్రారంభించారు. తాజాగా.. సంక్రాంతి ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొనేశారు. ప్రస్తుతం 98 శాతం వాహనాలకు ట్యాగ్ కనిపిస్తోంది.