Bigg Boss 3 Telugu
-
'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి
యాంకర్ శిల్పా చక్రవర్తి.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు గానీ 2000 ప్రారంభంలో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఒకానొక టైంలో సుమకు పోటీ అన్నట్లు నిలిచింది. మధ్యలో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా కొన్నాళ్లు స్క్రీన్ కి దూరమైంది. రీఎంట్రీలో బిగ్ బాస్ షోలో పాల్గొంది. పలు షోలు కూడా చేసింది. (ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే శిల్పా చక్రవర్తి ప్రస్తుతం ఏం చేస్తుంది? ఎక్కడుంది? లాంటి విషయాల్ని తనే స్వయంగా బయటపెట్టింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది..'పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీతో ఉందామని సీరియల్స్, యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాను. రీఎంట్రీ అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షోలో పాల్గొన్నాను. తర్వాత లైఫ్ మారింది. కానీ షోకి వెళ్లొచ్చిన తర్వాత నన్ను చాలా ట్రోల్ చేశారు. నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. కౌంటర్స్ ఇస్తే బూతులు తిట్టేవాళ్లు. ఇవన్నీ మా ఆయకు చెబితే ఆ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని అన్నారు'(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)'మరీ దారుణంగా ట్రోల్ చేయడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాదాపు నాలుగు నెలల పట్టింది ఆ బాధ నుంచి బయటకు రావడానికి. సరిగ్గా అదే టైంకి కరోనా వచ్చింది. మా ఆయన బిజినెస్ ఆగిపోయింది. డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది. కరోనా టైంలో సరైన చికిత్స అందక కోమాలోకి వెళ్లిన నాన్న చనిపోయారు. కరోనా తర్వాత ఆఫర్స్ వచ్చినా ఆసక్తి రాలేదు. సరే చేద్దాం అనుకునేలోపు అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు' అని శిల్పా చక్రవర్తి చెప్పుకొచ్చింది.ఇలా రకరకాల కారణాలతో ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు షోలు, సీరియల్స్ చేస్తున్నానని శిల్ప చెప్పింది. బిగ్ బాస్ 3వ సీజన్ లో ఈమె పాల్గొంది కానీ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపుగా ఏడేళ్లుగా ఏదో ఒకలా బాధపడుతున్నానని ఇప్పుడు వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!) -
'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్లు పూర్తి చేసుకోగా, చాలామంది నటీనటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా మూడో సీజన్లో పెద్దగా అంచనాల్లేకుండా పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన పునర్నవి.. ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: 'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్)హైదరాబాద్‌కి చెందిన పునర్నవి.. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అలా బిగ్‌బాస్ 3వ సీజన్లో ఏకంగా 11 వారాల పాటు ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె నడిపిన ప్రేమ కహానీ గురించి చాలామందికి తెలుసు. అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలామంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి.. ఆ తర్వాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. యూకేలో ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడితో ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇతడు బాయ్ ఫ్రెండ్ లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!) -
బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోతో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లో సెటిలైపోయిన వాళ్లు ఉన్నారు. అయితే మూడో సీజన్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచిన అలీ రెజా కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. గతంలో బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చిన తర్వాత ఓ ఛానెల్ తనపై నిషేధం విధించిందని చెబుతూ అప్పుడు జరిగిన వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?) 'బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్ చేస్తుండేవాడిని. షోకి వెళ్లొచ్చిన తర్వాత తిరిగి మళ్లీ సీరియల్లో చేరాలని అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ స్టేజీపై ఉన్నప్పుడే 'వైల్డ్ డాగ్' మూవీలో రోల్ గురించి నాగార్జున సర్ చెప్పారు. దర్శకుడిని కలవడంతో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ కోసం రోజూ పొద్దునే ప్రాక్టీస్ ఉండేది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ముందు చెప్పారు. సరిగ్గా అదే టైంలో సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అన్నారు. అప్పటికీ నేను వస్తానని, కాకపోతే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను' 'నేను వచ్చే విషయమై డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత ఓ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగ్లో ఉన్నాను. అప్పుడు.. కౌన్సిల్లో మీటింగ్ ఉంది రావాలని ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇప్పుడు రాలేను, సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాను. ఇది జరిగిన రెండు రోజులకు నాకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను బ్యాన్ చేసినట్లు, రెండేళ్లు ఎవరూ షూటింగ్స్, షోలకు పిలవొద్దు అని అందులో ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారనిపించింది' అని అలీ రెజా చెప్పుకొచ్చాడు. అలీ రెజాతో పాటు నటి పల్లవి గౌడని కూడా సదరు ఛానెల్ వాళ్లు పలు కారణాలతో నిషేధించారు. కానీ అలీ రెజా సినిమా నటుడిగా సెటిలైపోయాడు. పల్లవి గౌడ మాత్రం ప్రస్తుతం అదే ఛానెల్లో రీఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేసుకుంటోంది. (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ) -
'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్
'బిగ్‌బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్‌బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు? ఏం జరిగింది? తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వరుణ్ ఏం చెప్పాడు? 'బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది. 'బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది' అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది. దీంతో మళ్లీ స్క్రీన్‌పై కనిపేందకు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) తాజాగ రోహిణి ఓ షోలో మొట్టమొదటిసారి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం చాలామందికి తెలియదు.ఇదే విషయంపై ఆమె రివీల్ చేసింది. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతనితో వచ్చిన కొన్ని విబేదాల వల్ల బ్రేకప్ అయ్యానని, దాంతో చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. అప్పుడు తానెంతో డిప్రెషన్లోకి వెళ్లానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారని చెప్పింది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అన్న మాటలను మరోసారి గుర్తుచేసుకుంది. 'నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అప్పుడు, వీడు ఒక ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా.. అలా వారి సపోర్ట్‌తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను.' అని రోహిణి తెలిపింది. దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింట తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. -
పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు?
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్ క్రష్‌గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవితో రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని సీరియస్‌గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అషూ రెడ్డితో రాహుల్ ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్ తర్వాత ఎన్నో హిట్ పాటలు పాడా. బిజినెస్ మొదలుపెట్టా. తన కెరీర్లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు. -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోర్టును బిగ్‌బాస్ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగు యువశక్తి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బిగ్‌బాస్-3 జరుగుతున్న సందర్భంగా 2019లో మొదట తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటీగేషన్ దాఖలు చేశామన్నారు. అందులో ‘‘బిగ్‌బాస్ సెలక్షన్స్ పేరుతో అమ్మాయిలను మోసగిస్తున్నారని, ఈ షో వలన సమాజానికి ఎంతో హానికరమని, ముఖ్యంగా యువత పెడమార్గంలో నడవడానికి ఈ షో కారణం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ షోని రద్దు చేయాలని, 24 గంటల షూట్ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం, ఓటింగ్ పేరుతో జరుగుతున్న అవకతవకలు, గేమ్ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు అభ్యంతరకరమని పేర్కొన్నట్లు కేతిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ షోలు టెలికాస్ట్ కాకుండా ఆపేసే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత తీసుకోవాలని పేర్కొంది. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా వేసిన కేసు వెనక్కి తీసుకోలేదని, దీనిపై పోరాటం కొనసాగిస్తామని కేతిరెడ్డి తెలిపారు. -
ఎమోషనల్‌గా ఎంత బాధ పెడుతుందో మీకు చెప్పలేను: శివజ్యోతి
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో శివజ్యోతి స్పందించింది. ఈ సందర్బంగా ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్‌న్యూస్ సృష్టిస్తున్నారు. వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ వేస్తున్నారు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్.. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్ ఉంటే నేనే మీ అందరితో షేర్ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది. -
కొత్త కారు కొన్న వితికా, ఫస్ట్ కారు కంటే పది రెట్లు ఎక్కువ ఖరీదు!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ వితికా శెరు ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. కారు కొన్న విషయాన్ని తన యూట్యూబ్ చానల్ ద్వారా వెల్లడించింది. 'నా జీవితంలో కారు కొంటానని ఊహించలేదు. కానీ ఆ తర్వాత మనకూ ఓ కారుంటే బాగుంటుంది కదా, ఇంత పెద్ద కారులో తిరిగితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాను, చివరికి ఆ కల సాకారమైంది' అని చెప్తూ ఉబ్బితబ్బిబ్బయింది. ఆ తర్వాత షోరూమ్‌కు వెళ్లి భారత్ హ్యుందాయ్ అల్కాజార్ కారును సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆ కారును చూసి ఆమె కుటుంబ సభ్యులు సర్ప్రైజ్ అయ్యారు. వితికా కొన్న కారు అదిరిందని మెచ్చుకున్నాడు ఆమె భర్త, నటుడు వరుణ్ సందేశ్. ఇక ఈ కారు ధర దాదాపు రూ.20 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వితికా మాట్లాడుతూ.. 'మాది మధ్యతరగతి కుటుంబం. భీమవరంలో పుట్టి హైదరాబాద్‌కు వచ్చి ఈ స్టేజీవరకు వచ్చానంటే కారణం నా కష్టంతో పాటు ప్రజల ఆశీర్వాదాలే! నేను మొదట్లో రెండున్నర లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. ఈ రోజు దానికి పది రెట్లు ఎక్కువ పెట్టి కారు కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా చెల్లి పెళ్లి జరిగాక ఓసారి నా అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడీరోజు ఇక్కడిదాకా వచ్చానంటే అదంతా అభిమానుల వల్లే' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
నాన్న కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నా: యాంకర్ లాస్య
యాంకర్ లాస్య.. హోస్టింగ్‌తోనే కాదు, చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ ఆమె. యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. గతంలో కొన్నాళ్లపాటు బుల్లితెరకు దూరమైన లాస్య ఈమధ్య టీవీ షోలతో బిజీబిజీగా మారింది. అలాగే వీలున్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. తాజాగా ఆమె తన తండ్రికి ఇల్లు కట్టిస్తోంది. ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించిన లాస్య ఈమేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. 'నేను చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఆ మధ్య కూలగొట్టాం కదా, దాని స్థానంలో కొత్తింటిని కట్టిస్తున్నాము. ఇప్పటికే అది చాలావరకు పూర్తయింది' అంటూ ఆ ఇల్లును చూపించింది. నాన్న కళ్లలో ఆనందం చూడటానికి నేనేదైనా చేస్తాను. ఆయన సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నానంటూ గదులన్నింటినీ చూపించింది. గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా పూర్తిగా చూపిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే తండ్రికి గిఫ్టిచ్చిన ట్రాక్టర్‌ను చూపించడమే కాకుండా అందులో ఎక్కి తిరిగింది. -
సంక్రాంతికి తల్లికి ఖరీదైన గిఫ్టిచ్చిన అషూ రెడ్డి
పండగ వచ్చిందంటే చాలు.. చాలామంది బంగారం కొంటుంటారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా బంగారం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోనుఆమె తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. బంగారు నగలను అలంకరించుకుంటూ తెగ మురిసిపోయిందామె. అయితే అవన్నీ తనకు కాదని తన తల్లి కోసం కొన్నానని చెప్పుకొచ్చింది. ఆ నగలను ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లిన అషూ తల్లికి గిఫ్టిచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది. తనకోసం బంగారు నగలు కొనుక్కురావడంతో ఆమె చాలా ఎగ్జయిట్ అయింది. అంతకు ముందు కొన్న బంగారు గాజులకు ఇవి చాలా బాగా సెట్టవుతాయని సంతోషపడింది. అషూకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందంటూ ఆశ్చర్యపోయింది. కాగా అషూ రెడ్డి ప్రస్తుతం 'సర్కస్ కార్ 2' చిత్రంలో నటిస్తోంది. ఇది నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తుండగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె నిర్మిస్తున్నారు. -
ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లు కొనుగోలు చేసిన హిమజ
బిగ్‌బాస్ తర్వాత క్రేజ్ రెట్టింపైనవారిలో హిమజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న ఆమె షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం షాప్ లాంఛింగ్లకు, ఈవెంట్లకు వెళ్తూ బాగానే సంపాదించింది. సినిమాలు, షోలు, ఫొటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా తన తల్లికి ఖరీదైన బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో మొదటిసారి అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నానంటూ తెగ ఎగ్జయిట్ అయింది హిమజ. అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తనను కూడా షాప్‌కు తీసుకొచ్చానని తెలిపింది. తల్లికి డైమండ్ నెక్లెస్ కొన్న ఈ నటి తన కోసం కూడా నగలు కొనుక్కుంది. వజ్రాల ఆభరణంతో పాటు రెండు బంగారు నెక్లెస్‌ల సెట్‌ను, ఒక బంగారు వడ్డాణాన్ని సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
ముంబై వీధుల్లో ఆటో నడిపిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ ముంబై వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
సన్నీకి శివజ్యోతి చురకలు, నువ్వు నీతులు చెప్పకంటున్న నెటిజన్లు
Bigg Boss 5 Telugu, Trolling On Shiva Jyothi: కెప్టెన్సీ టాస్క్‌లో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే! సిరి, షణ్ను- సన్నీ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అన్న సన్నీ వ్యాఖ్యలను షణ్ను ప్రేయసి దీప్తి సునయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే! సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడినట్లా? అని మండిపడింది. మరి నీకు కాజల్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది? అని ప్రశ్నించింది. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకో? అని సన్నీ హెచ్చరించడాన్ని సైతం తప్పుపట్టింది. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాడని సంతోషించకుండా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పని హితవు పలికింది. తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి కూడా షణ్నూకు మద్దతుగా నిలబడింది. దీప్తి సునయన ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ.. 'ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే? ఒకసారి మీరు కెప్టెన్ అవడానికి యానీ మాస్టర్ సపోర్ట్ చేశారు. ఇది లేడీ కార్డ్ వాడటం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్ బయట కాదు, హౌస్ లోపల హెల్తీ గేమ్ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయకపోతే అలగొచ్చు, ఏంటో మరి..' అని సన్నీకి చురకలు అంటించింది. అయితే సన్నీ ఫ్యాన్స్ శివజ్యోతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'షణ్ను సిరి క్యారెక్టర్ గురించి మాట్లాడటంలో తప్పు లేదు, సిరి సన్నీ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడంలో తప్పు లేదు, దీనికి షణ్ను సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పు లేదు కదూ. మీరు కేవలం కొన్ని పాయింట్లే పట్టుకుని వేలాడకండి, అన్నింటి గురించి మాట్లాడండి. ఇలా పక్షపాతం చూపిస్తారనుకోలేదు, ఏంటో మరి' అని సెటైర్లు వేస్తున్నారు. షోని షోలాగే చూడండి, క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అని నీతులు చెప్తూ వీడియోలు పెట్టారు, మరిప్పుడు మీరు చేస్తుందేంటి? అని నిలదీస్తున్నారు. 'నువ్వు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నప్పుడు గేమే ఆడలేదు, ఊరికే ఏడ్వడం తప్ప! అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడుతున్నారు' అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఇంకోసారి సన్నీని ఏమైనా అంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు డైమండ్ రింగ్ గిఫ్ట్! ఎవరిచ్చారంటే?
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రౌడీ రోహిణి గత నెలలో 28వ బర్త్‌డే జరుపుకుంది. తాజాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోను యూట్యూబ్‌లోని తన ఛానల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిణి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఫాంహౌస్‌లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు శివజ్యోతి, లాస్య కూడా హాజరయ్యారు. ఇక రోహిణి పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్నో బహుమతులు పట్టుకొచ్చారు ఆమె సన్నిహితులు. అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒకతైతే ఆమె ఫ్యామిలీ ఇచ్చిన బహుమతి మరో ఎత్తు. రోహిణి తల్లి కూతురి కోసం డైమండ్ రింగ్‌ను బహుమానంగా ఇచ్చింది. అది చూసి రోహిణి ఎంతగానో మురిసిపోయింది. వెంటనే దాన్ని తన సోదరితో వేలికి తొడిగించుకుంది. తనకు వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చిన తల్లిని, సోదర్ని కౌగిలించుకుని వారిపై ప్రేమను కురిపించింది. ఇక ఈ సెలబ్రేషన్స్‌కు హాజరైన ఇమ్మాన్యుయేల్కూడా ఖరీదైన ఉంగరాన్ని గిఫ్టిచ్చినట్లు తెలుస్తోంది. రోహిణికి చెవిరింగులు, ఆభరణాలు, చీర వంటి మరెన్నో బహుమతులు సైతం కానుకగా అందాయి. గిఫ్టులంటే ఇష్టం అని చెప్పే రోహిణికి వీటన్నింటినీ చూసి తెగ మురిసిపోయింది. -
తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో మూవీలో చేస్తున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) -
కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ 2 విన్నర్ ఫొటోలు
-
కలల ఇంట్లోకి వెళ్లిన బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా షోలోనే కాదు, షో ముగిశాక కూడా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకున్న సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించాడు. కాదు, కాదు, కౌశల్ ఆర్మీనే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది. కౌశల్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆయన అభిమానులు సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇక బిగ్‌బాస్ అయ్యాక అతడికి బోలెడు సినిమా ఛాన్సులు వచ్చాయంటూ వార్తలు సైతం గుప్పుమన్నాయి కానీ చివరాఖరకు అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే అప్పుడప్పుడూ టీవీ షోలలో మాత్రం తళుక్కున మెరుస్తుంటాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి) తాజాగా కౌశల్ తను కలలు గన్న కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ఇంటిని మించిన మంచిప్రదేశం మరేదీ ఉండదు" అంటూ సతీమణి నీలిమ, పిల్లలు నికుంజ్, లల్లితో కలిసి గృహ ప్రవేశం చేస్తున్న ఫొటోలను సైతం షేర్ చేశాడు. కొత్త ఏడాది కొత్తింట్లోకి వెళ్లిన కౌశల్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
శివజ్యోతి కొత్త కారు: ఇది ఆరంభం మాత్రమే
తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే శివజ్యోతి కొత్త కారు కొన్నది. గతేడాది కొత్తిల్లు కొని గృహప్రవేశం చేసిన ఆమె ఈసారి కారు కొనుగోలు చేసింది. మరి కారు కొన్నాక ఫొటోలు దిగకపోతే ఎలా? అందుకే భర్త గంగూలీతో కలిసి కారు ముందు ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. దీంతో "ఇది ఆరంభం మాత్రమే", "సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది" అంటూ ఈ ఫొటోలను బిగ్‌బాస్ ఫేం రవికృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా శివజ్యోతి కారు కొన్నందుకు కంగ్రాట్స్ చెప్పింది. అటు అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి: ‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది..) కాగా తీన్మార్ వార్తలతో సావిత్రక్కగా ఫేమస్ అయిన శివజ్యోతి బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె బంధాలకు ప్రాధానమ్యిస్తూనే తన ఆట తను ఆడి అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో ప్రతిదానికి ఏడుస్తూ పాతాళగంగలా పేరు తెచ్చుకుంది. కంటెస్టెంట్లు అలీ రెజా, రవి కృష్ణలను సొంత తమ్ముళ్లలా భావిస్తూ రాఖీలు కూడా కట్టింది. బిగ్‌బాస్‌లో తనకు మంచి స్నేహితులుగా ఉన్న హిమజ, రోహిణిలను తరచూ కలుస్తూ ఎప్పుడూ పార్టీలు చేసుకుంటోంది. ఈ మధ్యే తన గ్యాంగ్‌తో సహా వితికా షెరు చెల్లి పెళ్లికి హాజరై అక్కడ సందడి చేసింది. (చదవండి: నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
నటనంటే నాకెంతో మజా: హిమజ
కళల కాణాచి నుంచి కెమెరా ముందు తలుక్కున మెరిసింది. నటనానుభవం లేకపోయినా.. మోడలింగ్‌లో రాణిస్తూ బుల్లితెరపై ప్రత్యక్షమైంది. ఆకట్టుకునే అందం.. అభినయంతో ఉత్తమ నటి అయ్యింది. అందివచ్చిన అవకాశాలతో వెండితెరకు పరిచయమై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ తానేంటో నిరూపిస్తోంది. నటన అంటే తనకు ఎంతో ‘మజ’ అంటోంది యువ నటి హిమజ. – తెనాలి తెనాలి సమీపంలోని వీర్లపాలెం హిమజ స్వస్థలం. తండ్రి మలిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, తల్లి రాజ్యలక్ష్మి. ఊరిలోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారు. నూతక్కిలో స్కూలు విద్య, తెనాలి కాలేజీ నుంచి దూరవిద్యలో బీఏ చేశారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ సోషల్ టీచరుగా పిల్లలకు పాఠాలు చెబుతూనే మోడలింగ్ కెరీర్ వైపు అడుగులు వేశారు. ఫ్యాషన్, బ్యూటీ ఈవెంట్స్‌లో పాల్గొంటూ మోడల్‌గా, టీవీ యాంకర్‌గా కొత్త జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో బుల్లితెర ఆహ్వానం ఆమె జీవితాన్నే మార్చేసింది. తొలి సీరియల్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘స్వయం వరం’ సీరియల్స్‌లో బాగా పాపులరయ్యారు. రెండేళ్లు వరుసగా ఉత్తమ సీరియల్ హీరోయిన్గా అవార్డులు దక్కించుకున్నారు. వరసు ఆఫర్లు.. టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలతో బిజీగా ఉంటూనే వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలి సినిమా శివం. హీరోయిన్ రాశిఖన్నా స్నేహితురాలిగా మంచి క్యారక్టర్ దక్కించుకున్నారు. అదే ఏడాది నేను శైలజ, చుట్టాలబ్బాయ్ సినిమాల్లోనూ చేశారు. జనతా గ్యారేజ్‌తో అవకాశాలు వరుసకట్టాయి. ధృవ నుంచి చిత్రలహరి వరకు దాదాపు 15కుపైగా సినిమాల్లో నటించారు. లాక్డౌన్ తర్వాత తాజాగా ఎఫ్–3, వరుడు కావలెను సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యలోనే బిగ్‌బాస్–3లో కంటెస్టెంట్‌గా చేశారు. సెలవుల్లో సొంతూరుకు.. సొంతూరంటే ఎంతో ఆపేక్ష కలిగిన హిమజ ఏమాత్రం ఆటవిడుపు దొరికినా ‘చలో వీర్లపాలెం’ అనేస్తారు. చిన్న భద్రాచలంగా పిలుచుకునే వీర్లపాలెంలోని ప్రసిద్ధ రామాలయాన్ని తప్పక దర్శించుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ‘ఇట్స్ హిమజ’ అనే సొంత చానల్లోనూ ఆలోచనాత్మక వీడియోలతో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ‘‘పాత్ర ఏదైనా.. క్యారెక్టర్‌ను అంతిమంగా గెలిపించడమే తన బాధ్యతని హిమజ ‘సాక్షి’కి చెప్పారు. తొలినాళ్లలో ‘నీకు మేకప్ అంటదు...ఎన్ని చెప్పినా ఇంతే...నటన మెరుగపడదు’ అని ముఖం మీదే అన్నవారే.. ఇప్పుడు ‘ఏ క్యారక్టర్‌లోనైనా అతికినట్టు సరిపోతుంది’ అంటూ ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నారు’’. -
బిగ్ బాస్: సెలబ్రెటీలకు ఒరిగిందేంటి?
వెబ్ ప్రత్యేకం : బిగ్ బాస్.. పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన ఈ బిగ్ బాస్ షో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్ చూపిస్తోంది. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. నాలుగో సీజన్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ రియాల్టీ షో.. విన్నర్స్ నుంచి కంటెస్టెంట్స్ వరకు ఎంతమందికి, ఎంతవరకు యూజ్ అయింది? వారి కెరీర్‌కి ఎంత హెల్ప్ అయింది ? ఈ షోలో పాలుపంచుకొన్న సెలబ్రెటీలకు ఒరిగిందేంటి? వాళ్ల ఇమేజ్‌లు ఏమైనా మారాయా? కొత్తగా అవకాశాలు వస్తున్నాయా?లాంటి విషయాల్లోకి వెళ్తే.. ‘బిగ్‌బాస్’ ని కెరీర్ గ్రోత్‌కి యూజ్ చేసుకోవాలి. సహజంగా కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే. కంటెస్టెంట్స్ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్‌తో షోని సక్సెస్ చేసుకోవాలి. బిగ్‌బాస్ స్ట్రాటజీ ఇదే. ఇందులో ఇప్పటి దాకా బిగ్‌బాస్ యూనిట్ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే మూడు సీజన్స్‌లో విన్నర్స్ కానీ, కంటెస్టెంట్స్ కానీ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్‌కి షో ప్లస్ అయిందీ లేదు. ఫస్ట్ విజేతకే కలిసి రాలేదు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1లో కత్తి మహేష్, హరితేజ, శివ బాలాజీ, అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, కత్తి కార్తీక, ఆదర్శ్, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. 70 రోజుల పాటు కొనసాగిన ఈ రియాల్టీ షోలో శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్‌లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. బిగ్ బాస్‌తో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్ ఏమీ మలుపు తిరిగిపోలేదని ఫిలింనగర్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్ద పెద్ద అవకాశాలతో ఆయనేం బిజీ అయ్యిందీ లేదు. ఇక ముమైత్ ఖాన్, ప్రిన్స్, నవదీప్,సంపూర్ణేష్ బాబు, కత్తి మహేష్ లాంటి వాళ్లకు బిగ్ బాస్ కలిసి రాలేదనే చెప్పాలి. కత్తి మహేష్.. బిగ్ బాస్ షో కంటే పవన్‌పై విమర్శల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఇక ఈ సీజన్లో కాస్తో కూస్తో లాభ పడింది ఎవరైనా ఉన్నారు అంటే అది హరితేజ అనే చెప్పాలి. మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే హరితేజ తరచూ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ ఆమెకు కీలక పాత్ర దక్కింది. అలాగే వివిధ సినీ ఫంక్షన్లలోనూ యాంకరింగ్‌తో మెప్పిస్తుంది. తేజస్వీ ఇమేజ్ డ్యామేజ్ బిగ్‌బాస్ సీజన్2లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ‘బిగ్ బాస్’ యూజ్ కాలేదు. పైగా ఈ షో వల్ల వారికున్న కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ముఖ్యంగా తేజస్వికి అయితే బిగ్ బాస్ షో కలిసే రాలేదు. ఈ రియాల్టీ షోలో పాల్గొనేకంటే ముందే చిన్నా చితకా సినిమాల్లో నటించిన ఆమెకి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఎంట్రీ తరువాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. కోలుకోలేని డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత ఏ ఒక్క చాన్స్ రాలేదు. యాంకర్‌గా అవతారమెత్తినా సక్సెస్ కాలేకపోయింది. కౌశల్కీ కలిసి రాలేదు ఇక బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్ పేరు మారుమోగింది. కౌశల్ ఆర్మీ పేరుతో యువత హల్చల్ చేశారు. బిగ్‌బాస్ షోలో ఏ కంటెస్టెంట్‌కు రాన్నంత ఇమేజ్ కౌశల్‌కు వచ్చింది. బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో ముఖ్యపాత్రలో కౌశల్ నటించే ఛాన్స్ కొట్టేసాడాని చెప్పుకున్నారు. అంతేకాదు బోయపాటి శ్రీను,బాలయ్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు కౌశల్‌ను తీసుకున్నారంటూ రకరకాలు వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు. బిగ్ బాస్ ఇమేజ్ కొన్నాళ్ల వరకే ఉంది. ఆ తర్వాత కౌశల్ కనుమరుగైపోయాడు. ఇటు బ్రేక్ వచ్చేసింది అని చెప్పుకునే స్థాయిలో సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఇక మరో కంటెస్టెంట్ దీప్తి సునైనాకు బిగ్ బాస్ హౌస్‌కి రాకముందు యూట్యూబ్ సంచలనంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కాని హౌస్‌కి వచ్చిన తరువాత ఆమె తనీష్‌తో ప్రేమ వ్యవహారం, అతడితో రొమాన్స్ కారణంగా ఆమెకు ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. మరో కంటెస్టెంట్ బాబు గోగినేని పరిస్థితి కూడా అంతే. హౌస్‌లోకి రాకముందు ప్రముఖ హేతువాదిగా టీవీ కార్యక్రమాల్లో ప్రచారం పొందిన ఆయనకు బిగ్ బాస్ చేదు అనుభవాన్నే మిగిల్చాడు. సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆయన మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కనిపించడం అరుదైపోయింది. తనీష్, సామ్రాట్, నందినిలకు కూడా పెద్ద బ్రేక్ వచ్చిందేమి లేదు. బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, గణేష్ లాంటి వాళ్లను బిగ్ బాస్ తరువాత జనం గుర్తించడమే మానేశారు. ఇటీవల నూతన్ నాయుడు ఓ వివాదం వల్ల కాస్త వార్తల్లో నిలిచాడు. రాహుల్‌కు బెంజ్ కొన్నాడు కానీ... కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శివజ్యోతి, టీవీ నటుడు రవికృష్ణ, అశురెడ్డి, జర్నలిస్ట్ జాఫర్,నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, నటి హేమ, అలీ రజా, మహేశ్ విట్టా, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, వితికా షెరు, యాంకర్ శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. వీరిలో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ని రాహుల్ సిప్లిగంజ్ గెల్చుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ బ్రేక్ వచ్చే స్థాయిలో కెరీర్ పరంగా అద్భుతాలు ఏం జరగలేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బిగ్ బాస్ 3 రన్నరప్ శ్రీముఖికి కూడా పెద్ద బ్రేక్ వచ్చిందేమి లేదు. షోలో పాల్గొనడానికి ముందే ఆమె స్టార్ యాంకర్. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువే డబ్బులు తీసుకెళ్లింది కానీ, కెరియర్ పరంగా ఆమెకు బిగ్ బాస్ ఏరకంగా ఉపయోగపడలేదు. ఇక శివ జ్యోతి అయితే సొంతింటి కలను నిజం చేసుకుంది కానీ కెరియర్ పరంగా మాత్రం అలాగే కొనసాగుతోంది. సొంతంగా యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకొని తనకొచ్చిన ఇమేజ్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్‌లో కూడా ఏ ఒక్కరికి బిగ్‌బాస్ వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి. ఈ సారైనా కలిసొచ్చేనా బిగ్ బాస్ షో లో పాల్గొనడం వల్ల అవకాశాలు వచ్చిన వాళ్లు ఉన్నారు. ఇమేజ్‌ని పెంచుకున్న వాళ్లు ఉన్నారు. కానీ కెరీర్‌ని మలుపు తిప్పే స్థాయిలో ఎవరికీ బ్రేక్ రాలేదన్నది సినీ పరిశ్రమ వర్గాల మాట. ఓవరాల్‌గా బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్‌కి ఒరిగింది ఏదైనా ఉందా అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్, వ్యక్తిగత దూషణలు తప్ప కెరియర్ పరంగా బిగ్ బాస్ హెల్ప్ కావడం లేదనే చెప్పాలి. మరి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సీన్ మారుతుందా? లేదా గత సీజన్ల మాదిరే కంటెస్టెంట్ల కెరియర్ గ్రోత్‌కు ఉపయోగపడకుండా పోతుందా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
‘రాహుల్ లిప్‌లాక్ సీన్ వైరల్..’
రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా పరిచం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అటు సింగర్‌గా, నటుడిగా, ప్రయివేట్ ఆల్బమ్స్‌తో చాలా బిజీ అయిపోయాడు. అంతేకాకుండా తరుచూ వార్తల్లో నిలిచే రాహుల్ తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ పాత వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రాహుల్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆరేళ్ల కిందట బిగ్‌బాస్-2 భామ నందినీ రాయ్‌తో కలిసి రాహుల్ ఓ ప్రయివేట్ ఆల్బమ్ చేశాడు. ఈ పాటలో నందినీతో రోమాన్స్ చేయడంతో పాటు లిప్ లాక్ సీన్ చేశాడు. అయితే అప్పుడెప్పుడో నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాలో తాజాగా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మరో బిగ్‌బాస్ భాం అషూ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'వావ్ ఇది నేను చూడలే' అని కామెంట్ చేయగా.. దీనికి రాహుల్.. 'అబ్బో ఇక నేను చచ్చిపోతా' అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనికి మళ్లీ స్పందించిన అషూ.. 'మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో' అంటూ స్మైలీ ఎమోజీ జత చేసింది. ఇక మరికొంత మంది నెటిజన్లు పున్ను(పునర్నవి భూపాలం) ఈ వీడియో చూస్తే రాహుల్ పరిస్థితేంటో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram With this pretty lady @nandini.rai #throwbackmemories😍 #enduke #musicvideo #myfavorite A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Apr 14, 2020 at 5:32am PDT చదవండి: ‘వి’ డైరెక్టర్‌తో చైతూ చిత్రం? ‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’ -
మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్
కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్ చానల్లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ‘స్టార్ మా’ కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది. సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ఒక ప్రకటన చేసింది. ‘21 రోజుల లాక్డౌన్ సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే మరోసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ని చూసేద్దాం’ అని పేర్కొంది. కాగా, నాగార్జున హౌస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మూడు నెలలకు పైగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలువగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తనపై పబ్‌లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని పేర్కొన్నారు. తను టీఆర్ఎస్ పార్టీ కోసమే నిలిచానని, టీఆర్ఎస్కి ఓటు వేశానని అన్నారు. కేటీఆర్‌పై ఎంతో నమ్మకం ఉందని.. ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకు నిష్పాక్షిక న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘నాపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు చూడండి. ఆ గ్యాంగ్ నన్ను ఏవిధంగా రెచ్చగొట్టిందో, దాడి చేసిందో తెలుస్తోంది. ఈ వీడియో చూసి నిజం వైపు నిలబడండి. కేటీఆర్ సార్, నేను ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేశాను. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను. నేను బతికి ఉన్నంతకాలం తెలంగాణకు సేవ చేస్తాను. సార్ మేము నమ్మి నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్‌లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను. వాళ్ల సోదరుడికి అధికారం ఉందని దాడికి పాల్పడ్డారు. (చదవండి : ‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?) సారు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలి. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ఈ కేసును పరిశీలించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ నేను( లేదా కామన్ మ్యాన్) ఒకవేళ ఆ తప్పు చేసి ఉండకపోతే అలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాలి?. మీరు నాకు, మాకందరికీ నాయకుడు. నేను నిష్పాక్షిక న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాను. ఎంతో నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాల్సిన సమయం వచ్చింది. మీరు కచ్చితంగా సరైన పనే చేస్తారని నేను నమ్ముతున్నాను. థాంక్యూ సార్’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. కాగా, గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో బుధవారం రాత్రి రితేష్‌రెడ్డితోపాటు మరికొందరు రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 324, 34 రెడ్‌విత్, 354 సెక్షన్ల కింద రితేష్‌రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. (చదవండి : రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి) -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
-
‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
-
‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: పబ్‌లో జరిగిన గొడవపై బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువు రితేశ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని వెల్లడించారు. అసలేం జరిగింది? రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లాడు. రాహుల్ ఇద్దరు స్నేహితురాళ్ల పట్ల రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. అభ్యంతరం తెలిపిన రాహుల్‌ను పక్కకు తోసేశారు. ఎందుకు కామెంట్ చేశారని ప్రశ్నించిన రాహుల్‌పై రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారని సిప్లిగంజ్ చెబుతున్నారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్ ముఖానికి గాయమైంది. (రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి) కాంప్రమైజ్ కాను: రాహుల్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. రితేశ్‌రెడ్డి గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, పబ్‌లోని వీడియో ఫుటేజీని సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి
-
రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: గాయకుడు, బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువులతో రాహుల్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారు రాహుల్‌పై దాడి చేసినట్లు సమాచారం.. గచ్చి బౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం రాహుల్ డిశ్చార్జ్ అయ్యారు. తనకు ఏమీ కాలేదని.. చిన్న గాయమే అయిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రాహుల్ వెళ్లిపోయారు. పబ్‌లో గొడవపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
బిగ్‌బాస్: రాహుల్ కల నెరవేరింది!
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినవాళ్లకు ఉన్న కాస్త గుర్తింపు కూడా పోతుందనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదన. కానీ బిగ్‌బాస్ 3 తెలుగులో మాత్రం ఇది రుజువు కాలేదు. దీనికి భిన్నంగా బిగ్‌బాస్ 3 చాలామందికి కలిసొచ్చింది. ఈ షోతో పలువురు పార్టిసిపెంట్లు సెలబ్రిటీలుగా మారిపోయారు. అందులో మొదటి వ్యక్తి విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అతని గురించి చెప్పాలంటే బిగ్‌బాస్ ముందు, బిగ్‌బాస్ తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో. అంతలా అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్‌తో గుర్తింపుకు ఆరాటపడ్డ రాహుల్ బిగ్‌బాస్ అందించిన స్టార్డమ్తో సింగర్‌గానూ నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పటికే రాహుల్ ఆలపించిన పలు సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఏదైతేనేం 2019 రాహుల్‌కు బాగానే కలిసొచ్చింది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి బద్ధ శత్రువుల్లా అస్తమానం గొడవపడుతుండేవారు. కానీ రాహుల్ విజయాన్ని అందుకోడానికి ఇది కూడా ఒకింత ప్లస్ అయిందనేవారు లేకపోలేరు. అయితే బిగ్‌బాస్ ముగిసిన తర్వాత తాను కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తలేదని వాపోయిన రాహుల్ తర్వాతి కాలంలో శ్రీముఖితో బాగానే కలిసిపోయాడు. ఇక నుంచి కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందంటూ వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను పంచుకోగా అప్పట్లో ఇది వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. స్నేహం కన్నా ఎక్కువ అని చెప్పుకున్న పునర్నవిని బిగ్‌బాస్ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. తనను గెలిపించిన అభిమానుల కోసం ఫ్రీ లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేయగా అందులో పునర్నవి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో కానీ, పలు ఇంటర్వ్యూల్లో కానీ రాహుల్ ఎప్పుడూ ఓకే ఒక కోరికను చెప్తుండేవాడు. తన కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని ఎప్పటికైనా ఓ కొత్తిల్లు కొనుక్కోవాలన్నదే తన డ్రీమ్‌గా చెప్పుకొచ్చేవాడు. దానితోపాటు అధునాతన బార్బర్ షాప్ పెట్టుకోవాలన్నది కూడా తన కలగా పేర్కొన్నాడు. అయితే రాహుల్ ఈ మధ్య బెంజికారు కొన్నాడు. సెలబ్రిటీ హోదా రాగానే కలలు మారిపోయినట్టున్నాయని కొందరు అతన్ని విమర్శించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కారు కన్నా ముందే ఫ్లాట్ కొనేశానని వెల్లడించాడు. అది పూర్తిగా సిద్ధమవడానికి ఇంకో ఏడు నెలలు పడుతుందని సమాధానమిచ్చాడు. దీంతో చిచ్చా(రాహుల్) సొంతింటి కల నెరవేరనుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సవారికి సిద్ధం పునర్నవితో కలిసి రాహుల్ డ్యాన్స్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ కోరిక నెరవేర్చిన నాగార్జున
వెండితెర, బుల్లితెర రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేస్తూ రెండుచోట్ల ప్రేక్షకాదరణను రెట్టింపు చేసుకున్న హీరో కింగ్ నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ 3 రియాలిటీ షో ఈమధ్యే ఘనంగా ముగిసింది. ఇందులో నాగ్ పార్టిసిపెంట్లతో ఓవైపు ప్రేమగా మాట్లాడుతూనే అవసరమైనపుడు మందలించేవాడు కూడా. ఇక బిగ్‌బాస్‌తో క్రేజ్ రెట్టింపైన వ్యక్తుల్లో అలీరెజా ఒకరు. అతను బుల్లితెర అర్జున్‌రెడ్డి అన్న పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇక అలీ ఎలిమినేట్ అయినపుడు పార్టిసిపెంట్లతోపాటు ఆయన అభిమానులు కూడా కంటతడి పెట్టారు. దీంతో బిగ్‌బాస్ యాజమాన్యం అతడిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తిరిగి ఇంట్లోకి పంపించింది. అలీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు స్టైలిష్‌గానే ఉండటానికే ప్రయత్నించాడు. నాగ్ కూడా చాలాసార్లు నీ స్టైల్ నచ్చుతుంది అంటూ పొగిడేవాడు. అయితే వీకెండ్లో ఓసారి నాగ్ ధరించిన బ్రాండెడ్ షూ కావాలని అలీ కోరాడు. దానికి నాగ్ ఓకే చెప్పాడు. ఆ తర్వాత షో ముగిసింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో నాగ్.. అలీరెజాకు బ్రాండెడ్ షూను గిఫ్ట్ ఇచ్చాడు. షో పూర్తయి నెల రోజులు దాటిపోయినా గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ రెజా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. నాగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్లు మరోసారి ఒకేవేదికపై కనిపించనున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం అంతా ఒక చోటికి చేరి నానాహంగామా చేయనున్నారు. -
రెట్టింపైన క్రేజ్; రాహుల్‌కు అవార్డు
తెలంగాణ యాసతో పక్కింటి కుర్రాడిలా అనిపించే రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది. పలు రంగాల్లో విశేష సేవలందించే వ్యక్తులకు సాత్విక్ ఫైర్ సర్వీసెస్ పురస్కారాలను అందిస్తుంటుంది. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సంగీత రంగంలో రాహుల్‌కు ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డు’ను అందించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ తన పాటలతో అక్కడికి విచ్చేసిన జనాలను ఉర్రూతలూగించారు. కాగా బిగ్‌బాస్ తర్వాత రాహుల్ క్రేజ్ రెట్టింపైంది. చేతినిండా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇక షోలో బద్ధ శత్రువుల్లా ఉన్న రాహుల్, శ్రీముఖి వారి గొడవలన్నీ షోలోనే వదిలేస్తాం అని చెప్పినప్పటికీ దాన్ని నిజం చేసిన దాఖలాలు లేవు. ఇక బిగ్‌బాస్ రీయూనియన్ పార్టీకి పీవీవీఆర్(పునర్నవి,వితిక, వరుణ్, రాహుల్) బ్యాచ్‌లో రాహుల్ మిస్సవగా అటు శ్రీముఖి కూడా రాలేదు. ఆ తర్వాత రాహుల్.. తన చిచ్చాస్ (అభిమానుల) కోసం హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. దీనికి శ్రీముఖిని పిలుద్దామని కాల్ చేస్తే కనీస స్పందన కరువైంది. ఇక వీళ్లు కలవడం కష్టమేమో అన్న సమయంలో అందరికీ షాక్‌నిస్తూ రాహుల్, శ్రీముఖిలు కలిసిపోయారు. అసలైన రిలేషన్షిప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటూ కలిసి ఫొటోలకు ఫోజులిస్తూ డ్యాన్స్‌లు చేశారు. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోయారోచ్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖి మాట మర్చిపోయిందా.. బిగ్‌బాస్ 3 తెలుగు షో కొతమందికే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో బాగా పాపులర్ కంటెస్టెంట్ శ్రీముఖి. కానీ ఈ భామ బిగ్‌బాస్ పాపులారిటీని షో తర్వాత సరిగా ఉపయోగించుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ పూర్తవగానే శ్రీముఖి ఎవరికీ చిక్కకుండా మాల్దీవులు వెళ్లిపోయి రిలాక్స్ అయింది. అక్కడ నుంచి రాగానే అభిమానులను కలుస్తానంటూ మాట కూడా ఇచ్చింది. తిరిగొచ్చి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై పెదవి విప్పట్లేదు. దీంతో శ్రీముఖిపై ఆమె అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రాహుల్ అభిమానుల కోసం లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తే కనీసం శ్రీముఖి అభిమానులను కలవడానికి ఇంకా ఏదీ ప్లాన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ కోసం పటాస్‌ను వదిలేసిన శ్రీముఖి ఆ తర్వాత కూడా అటువైపు అడుగులు వేయదల్చుకోలేదు. అయితే ఈ మధ్యే ప్రారంభమైన ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. View this post on Instagram What an honour to receive “Rashtriya Gourav Award” in association with Department of Language and culture of Telangana for my contributions to music and arts. Thanks to all the Chichaas❤️ who supported me in this journey.. Everything I am, is because of you..!! A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Dec 7, 2019 at 8:42am PST -
అసలు రిలేషన్షిప్ మొదలైంది: శ్రీముఖి
రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 రన్నరప్ శ్రీముఖి తన అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. బిగ్‌బాస్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దానికి... ‘గతం గతః.. అసలు రిలేషన్షిప్ ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్‌తో పాటుగా హార్ట్ సింబల్‌ను జత చేశారు. అంతేకాదు రాహుల్ సైతం శ్రీముఖి షేర్ చేసిన ఫొటోను రీపోస్ట్ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి- రాహుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మీరిద్దరు ఇలా కలిసిపోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా... మరి పున్ను సంగతి ఏంటి రాహుల్ అంటూ మరికొందరు తమదైన శైలిలో రాహుల్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫేక్ ఎలిమినేషన్‌కు గురై... చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను దక్కించుకుని సత్తా చాటాడు. రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమితమవడాన్ని ఆమెతో సహా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ షో ముగింపు సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. హోస్ట్ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. షో అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి టూర్ వెళ్లిన శ్రీముఖి.. తన దృష్టిలో బాబా భాస్కరే నిజమైన విజేత అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు. View this post on Instagram #Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️ A post shared by Sreemukhi (@sreemukhi) on Dec 6, 2019 at 2:55pm PST -
రాహుల్‌కు సినిమా చాన్స్
బంజారాహిల్స్: నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్‌కి బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్ సింగర్‌గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్‌బాస్ తెలుగు సీజన్–3 విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్ స్టార్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ రాహుల్‌ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్ బాయ్‌గా అభిమానులకు దగ్గరైన రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన రాహుల్ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్లోనూ ఇటు ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆయన అభిమానులు ఈ ఆరందార్రి పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్ సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్ పేర్కొన్నాడు. View this post on Instagram I feel very honoured to be a part of this amazing movie with impeccable cast,A big thanks to @krishnavamsiofficial Garu I feel very lucky and super excited for the shoot. My debut as an actor,I need all your blessings chichas! 🙏🏻 #rangamarthanda A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Nov 30, 2019 at 9:36am PST సంతోషంగా ఉంది కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్‌స్ట్రాగామ్ వేదికగా రాహుల్ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ పేర్కొన్నాడు. ఒక్కసారిగా స్టార్డమ్.. బిగ్‌బాస్–3 విజేతగా నిలిచిన రాహుల్ రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంతమంది అభిమానులను కలిగివున్న ఇతడు బిగ్‌బాస్ తర్వాత లక్షలాదిగా వ్యూవర్స్ సొంతమయ్యారు. యూట్యూబ్‌లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న వారిలో రాహుల్ ఇప్పటికే అందరికంటే ముందున్నాడు. నిన్నామెన్నటిదాకా ఓ సాధారణ గల్లీబాయ్‌గా తిరిగిన రాహుల్ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందాడు. గత నెల 29న పీపుల్స్‌ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టగా ఆ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో రాహుల్ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రాహుల్ నటుడిగా తననుతాను చూపించుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అంటున్నారు. ఇప్పటివరకు వెండితెరపై వెలిగిపోయే ఛాన్సు పక్కా హైదరాబాదీకి దక్కడం చాలా అరుదుగా లభించింది. ‘ఒక్క ఛాన్స్’ అంటూ అవకాశాల కోసం ఫిలింనగర్లో చెప్పులరిగేలా ఎంతోమంది తిరుగుతున్నారు. అలాంటిది రాహుల్‌కు మాత్రం ఈ అవకాశం వెతుక్కుంటూ రావడం గమనార్హం. -
మిస్ యూ రాహుల్ : పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు 3.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాట మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్.. ఆర్ఎక్స్100 ఫేమ్ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్ఎల్ చిత్రంలో ‘సింగిల్ సింగిల్’ పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది. అలా బిగ్‌బాస్ విజేత రాహుల్ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయిపోయాడు. కాగా మరోవైపు బిగ్‌బాస్ పార్టిసిపెంట్లు రీయూనియన్ పేరిట గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కలర్‌ఫుల్ డ్రెస్సులతో మాంచి కిక్ ఇచ్చే పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో హిమజ, మహేశ్, పునర్నవి, వరుణ్, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. కేక్ కటింగ్‌లు, డ్యాన్సులు, ఫొటోలకు ఫోజులు.. అబ్బో చాలానే ఎంజాయ్ చేశారు. వరుస ఫొటోషూట్లు చేస్తున్న బిగ్‌బాస్ జంట బిగ్‌బాస్ పూర్తయ్యాక వరుణ్, వితికలు వరుస ఫొటో షూట్లతో అభిమానులను ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్‌తో బాగా ఫేమస్ అయిన పునర్నవి తన తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేయనున్నాడు. ఈ నలుగురి గ్రూప్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రీ యూనియన్ పార్టీలో ఒకరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీ ఎంజాయ్ చేసినప్పటికీ మనసులో ఉన్న వెలితిని పునర్నవి సోషల్ మీడియాలో బయటపెట్టింది. మిస్ యూ రాహుల్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పార్టీకి చాలామందే డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బిగ్‌బాస్ గ్యాంగ్ మాత్రం రచ్చరచ్చ చేసింది. రాహుల్, పునర్నవి మధ్య ఏముంది? రాహుల్, పునర్నవిలను ఎన్నో వెబ్సైట్లు, టీవీ చానళ్లు మొదటగా అడిగే ప్రశ్న.. మీ మధ్య ఏముంది అని? దీనికి పునర్నవి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వారిపై వచ్చే రూమర్స్‌ను కొట్టిపారేసేది. రాహుల్ మాత్రం పునర్నవి తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పేవాడు. పైగా అప్పట్లో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ బయటకు వచ్చిన వార్తలు సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకు వీరిద్దరూ కలిసే వెళ్లారంటే బయట వీళ్లకున్న క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది. ఇక బిగ్‌బాస్ పూర్తయ్యాక పీవీవీఆర్ బ్యాచ్ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. -
టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్ : నాగార్జున-చిరంజీవి కాంబినేషన్లో అట్టహాసంగా జరిగిన బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నానిలు ప్రెజెంట్ చేసిన తొలి రెండు సీజన్ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. బిగ్‌బాస్ తెలుగు 3 గ్రాండ్‌ఫినాలేను నవంబర్ 3న స్టార్ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని రాహుల్ సిప్లీగంజ్ బిగ్‌బాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ఫినాలే టీఆర్పీలు వెల్లడై ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో వీక్షకులను ఆకట్టుకుందో తేటతెల్లం చేశాయి. నాలుగున్నర గంటల పాటు సాగిన ఫైనల్ ఎపిసోడ్ 18.29 టీఆర్పీ రాబట్టిందని ఈ షో నిర్మాతలైన ఎండెమోల్ షైన్ ఇండియా ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్ షో ఇదేనని ట్వీట్ పేర్కొంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 గ్రాండ్ ఫినాలేకు 14.13 టీఆర్పీ, నాని ప్రెజెంట్ చేసిన సీజన్ 2 ఫినాలే 15.05 టీఆర్పీ రాబట్టాయి. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్ఫినాలేలో విజేత రాహుల్‌కు చిరంజీవి టైటిల్‌ను ప్రదానం చేసే ఎపిసోడ్ చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్ మా నెట్వర్క్ ఉద్యోగి రాజీవ్ ఆలూరి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, హీరోయిన్ క్యాథరిన్ త్రెసా సహా పలువురు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో తళుక్కున మెరవడం ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో భారీ రేటింగ్‌లు దక్కాయి. -
రాహుల్ చేజారిన రాములో రాములా సాంగ్..
హైదరాబాద్ : అల వైకుంఠపురములో మూవీ నుంచి విడుదలైన రెండో సాంగ్ రాములో రాములా..విశేషంగా అలరిస్తూ మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అనురాగ్ కులకర్ణితో ఈ పాట పాడించే ముందు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. రాహుల్‌తో ఈ పాట పాడించాలని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ప్రయత్నించారు. ఈ పాట రఫ్ ట్రాక్‌ను తాను పాడానని రాహుల్ సైతం చెప్పుకొచ్చారు. అంతలోనే రాహుల్ బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ కోసం హౌస్‌లో ఎంటరవడం మూడు నెలలకు పైగా అక్కడే గడపడంతో అన్ని రోజులు వేచిచూడటం సాధ్యం కాక అనురాగ్ కులకర్ణితో రాములో రాములాను పాడించేశారు. ఈ పాట యూట్యూబ్‌లో యువతను ఓ రేంజ్లో ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోను వీక్షించిన కొందరు సంగీత ప్రియులు ఈ సౌండ్‌ట్రాక్‌కు రాహుల్ పరిపూర్ణంగా న్యాయం చేసేవారని బదులిచ్చారు. ఈ పాటకు రాహుల్ గొంతు చక్కగా సరిపోయేదని కామెంట్స్ చేశారు. రాహుల్‌తో ఈ పాటను తిరిగి పాడించాలని, అప్పుడు మరింత పెద్ద హిట్ అవుతుందని తమన్‌కు వారు సలహా కూడా ఇచ్చేశారు. -
బిగ్‌బాస్ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి
బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మేనంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక బిగ్‌బాస్ పూర్తవగానే శ్రీముఖి మీడియాకు చిక్కకుండా విహారయాత్రకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. ముందుగా తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్, ఆటో రాంప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ కాదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పింది. గర్వపడే షోలు చేస్తా.. ‘నామినేషన్లోకి వచ్చినప్పుడు భయపడలేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్‌గా, మోడ్రన్‌గా, మేకప్‌తో, మేకప్ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్ విన్నర్ అని చాలా విషెస్ వచ్చాయి. బిగ్‌బాస్ ట్రోఫీ, మనీ ఏవీ నాకు వద్దు.. మీ ప్రేమ నాకు చాలు. బిగ్‌బాస్ షో తర్వాత ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పటాస్‌కు వస్తానో లేదో ఓ వారం తర్వాత చెప్తాను. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా. వారంలోనే షూటింగ్‌కు వచ్చేస్తా. ఇకనుంచి మీరు గర్వపడే షోలు చేస్తా’నని శ్రీముఖి మాటిచ్చింది. అంత త్వరగా గెలిస్తే కిక్ ఉండదు ‘బిగ్‌బాస్‌లో మరిచిపోలేనిది మా అమ్మ, తమ్ముడు వచ్చిన సందర్భం. ఇంకా బాబాతో నా పరిచయం. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. బిగ్‌బాస్‌లో ఇటుకల టాస్క్ బాగా ఎంజాయ్ చేశాను. ఈ టాస్క్‌తో కెప్టెన్ కూడా అయ్యాను. కోడలిగా చేయడం బాగా నచ్చింది. చూడటానికి నచ్చిన టాస్క్.. తికమకపురం (గ్లాస్ పగలగొట్టింది). గెలిస్తే.. అక్కడితో ఆగిపోతాం. కానీ ఓడిపోతే.. ఇంకా ఏదో చేయాలి, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది. జీవితంలో సక్సెస్ అంత త్వరగా చూసేస్తే కిక్ ఉండదు’. నావరకూ ఆయనే అసలైన విజేత ‘బాబా భాస్కర్ అసలైన విన్నర్. టాస్క్‌ల్లోనూ, వండి పెట్టడంలోనూ, అతని ప్రవర్తన, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి అతనే విజేత. బాబా తర్వాత తమన్నా సింహాద్రి ఇష్టం. రాహుల్ నా ఫ్రెండ్. పరిస్థితుల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. బిగ్‌బాస్‌లో జరిగినవి అక్కడే వదిలేశా. బిగ్‌బాస్ హౌస్‌లో కనుబొమ్మలు తీసుకుంటున్నట్టు నటించి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని బిగ్‌బాస్ గుర్తించలేదు. తర్వాత ఇది మగవాళ్లు కూడా చేశారు. టాటూ నిజమే.. నమ్మకపోతే తమ్ముడిని రుద్దమని చెప్పగా అది పోకపోవడంతో ఒరిజినల్’ అని శ్రీముఖి నిరూపించింది. అవేమీ పట్టించుకోకండి హిమజ, హేమ తన గురించి నెగెటివ్‌గా మాట్లాడిన కామెంట్లపై స్పందిస్తూ వాటికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది. ‘వాళ్లిద్దరూ షోలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. స్టేజీపై కూడా నాకోసం బాగానే మాట్లాడారు. కానీ తర్వాత ఎందుకు అలా నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్లకే వదిలేస్తా. వాళ్లు వేసిన నిందలను పట్టించుకోకండ’ని తేలికగా తీసిపారేసింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసినవారికి గుడ్‌లక్ చెప్పింది. త్వరలో ఫ్యాన్స్మీట్ ఏర్పాటు చేస్తున్నానని, వీలైనంత ఎక్కువమంది అభిమానులను కలుస్తానని శ్రీముఖి పేర్కొంది. -
బిగ్‌బాస్: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ముగిసి వారం గడిచింది. కంటెస్టెంట్ల పార్టీలు, ఇంటర్వ్యూలు రోజుకొకచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే, రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బిగ్‌బాస్ పూర్తికాగానే ఆమె ఎంచక్కా మాల్దీవుల టూర్‌కు వెళ్లిపోయింది. సముద్ర తీరంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్‌లో ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియ కూడా ఉన్నారు. ఇక బిగ్‌బాస్ షో జరుగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున ఓ సందర్భంలో శ్రీముఖిని.. ‘మీరు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి రూ.50 లక్షలు మీ సొంతమైతే.. ఏం చేస్తారు’ అని ప్రశ్నించగా.. అన్నీ పేరెంట్స్‌కు ఇస్తానని సమాధానమిచ్చింది. అంతేగాక తనకెంతో ఇష్టమైన మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. కానీ, ఆమె రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. మాల్దీవులకు వెళ్లి తన కోరిక నెరవేర్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఆమె చేస్తున్న సందడిని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను పలకరిస్తోంది. ఏదేమైనా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న 105 రోజులు శ్రీముఖి చలాకీగా, దూకుడుగా ఉంటూ అందరినీ ఆకర్షించింది. టాస్క్‌ల్లోనూ విజృంభించి మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టిపోటీనిచ్చింది. కానీ, షో చివరి రోజుల్లో రాహుల్ అనూహ్యంగా పుంజుకోవటంతో ఆమె రెండోస్థానంలో నిలిచింది. ఇక, విన్నర్‌గా నిలవలేకపోయినందుకు శ్రీముఖి బాధపడినా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవడం కాస్త ఊరటనిచ్చింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) on Nov 8, 2019 at 5:22am PST -
మంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్
సాక్షి, సిటీబ్యూరో : అశేష ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్‌గా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం మసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి తలసానితో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనూహ్యరీతిలో రాహుల్ బిగ్ బాస్ టైటిల్‌కు సొంతం చేసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాతబస్తీ యాస, బాషతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషంగా ఆకట్టుకున్న సిప్లిగంజ్‌కు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున పూర్తి సహయ సహకారాలు ఉంటాయని రాహుల్‌కి హామీ ఇచ్చారు. ఇక వంద రోజులకు పైగా ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నర్‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రాహుల్ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. -
ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్ షోకు వచ్చా: జాఫర్
జాఫర్ బాబు.. బిగ్‌బాస్ షోలో ఉన్నది రెండువారాలైనా తనలోని మరో యాంగిల్‌ను చూపించాడు. బాబా భాస్కర్‌తో కలిసి ఆయన చేసే కామెడీకి అందరూ తెగ నవ్వుకునేవారు. షో నుంచి ఎలిమినేట్ అయ్యాక కూడా తన మిత్రుడు బాబాకు జాఫర్ మద్దతుగా నిలిచాడు. ఇదిలాఉండగా.. తాజాగా బిగ్‌బాస్ షోపై జాఫర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాఫర్ ఓ ఇంటర్య్యూలో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షో ఎలా జరిగిందనే ప్రశ్నకు... ‘కంటెస్టెంట్లు ఎలా ఆడారు..? బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల అనుభవాలేమిటీ..? ఇలా వీటిపై ఇంతగా చర్చ జరగాల్సిన అవసరం ఉందా? అని ఎదరు ప్రశ్నించారు. దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అని వ్యాఖ్యానించారు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడమే మనిషి వీక్నెస్ అని.. ఆ బలహీనతే ఇలాంటి షోలు హిట్ అవడానికి కారణం అవుతాయని జాఫర్ అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్ ప్రసారం అవుతున్న ఏడు రాష్ట్రాలతో పోలిస్తే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3కి విపరీతమైన రేటింగ్స్ వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారని ఆయన గుర్తు చేశాడు. అయితే, ఇదేమీ గొప్ప షో కాదని, కేవలం బిజినెస్ గేమ్ అని తేలిగ్గా కొట్టిపారేశాడు. ‘బిగ్‌బాస్ షోకు ఆర్మీలు ఎందుకు’ అని జాఫర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇంటిసభ్యులు ఆడే ఆట కన్నా.. కంటెస్టెంట్లకు మద్దతుగా చేసే ఆడేఆటలు ప్రమాదకరంగా పరిణమించాయని చెప్పుకొచ్చాడు. ‘ఇలాంటి టీఆర్పీ రేటింగ్ గేమ్ షోల వల్ల అటు నిర్వాహకులకు లాభం.. అందులో పాల్గొన్న నాలాంటి కంటెస్టెంట్లకు లాభం. ఎందుకంటే వారం వారం పారితోషికం ఇస్తారు. దానికి తోడు పాపులారిటీ కూడా పెరుగుతుంది. ఎంతబాగా పాపులర్ అయితే అంతగా తాను చేసే డిబేట్స్ ఎక్కువమందికి రీచ్ అవుతాయనే స్వార్థంతోనే బిగ్‌బాస్ షోకు వచ్చాను’అని జాఫర్ తెలిపాడు. బిగ్‌బాస్ షో కోసం చర్చలు అనవసరమని భావించాను కాబట్టే తాను ఏ డిబేట్లోనూ పాల్గొనలేదని చెప్పుకొచ్చాడు. అయితే, జాఫర్ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జాఫర్ ప్రవర్తిస్తున్నాడని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘బిగ్‌బాస్‌పై చర్చలు అనవసరమని చెప్పిన జాఫర్ బాబు.. షో ముగిసిన అనంతరం బాబా భాస్కర్‌ను ఇంటర్వ్యూ చేయడం ఎందుకని ట్రోల్ చేస్తున్నారు. ‘అతను చేస్తే ఒప్పు.. మిగతావాళ్లు చేస్తే తప్పా’ అంటూ మండిపడుతున్నారు. బిగ్‌బాస్ ప్రసారం అయినన్నాళ్లూ సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో షో వేస్ట్ అంటూ మాట్లాడటం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు. షో పూర్తయ్యేదాకా నోరు మెదపని జాఫర్ ఇప్పుడేమో అది కేవలం బిజినెస్ గేమ్ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్
రాహుల్ సిప్లిగంజ్.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్‌బాస్–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టినఈ కుర్రాడు.. ప్రారంభంలో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చినా.. రోజులు గడుస్తున్న కొద్దీ చక్కటి ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో అంతిమ లక్ష్యాన్నిచేరుకున్నాడు. అంతేనా.. లక్షల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీని అందుకుని రూ.50 లక్షల విజేతగా నిలిచాడు. పాతబస్తీ గల్లీల్లో చక్కర్లు కొట్టే ఈ కుర్రాడు ఇప్పుడు స్టారైపోయాడు. దాదాపు 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఇతడిపై బోలెడు ‘ప్రేమ కథలు’ పుట్టుకొచ్చినా అవన్నీ ‘ట్రాష్’ అంటూ కొట్టిపారేశాడు. రాహుల్ ‘సాక్షి’తో పంచుకున్న మరిన్ని ముచ్చట్లు బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్–3 విజేతగా నిలిచి తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంచలనం సృష్టించారు. 105 రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోతో ప్రేక్షకుల మనసు దోచారు ఆయన. పక్కా లోకల్ బాయ్ విజయంతో నగర యువత ఉత్సాహానికి హద్దులే లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రూ.50 లక్షలనగదుతో పాటు ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని.. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్మెంట్ అని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. గత జూలై 21న ప్రారంభమైన సీజన్– 3 చివరిదాకా ఎంతో ఉత్కంఠగా సాగింది. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాహుల్ ప్రారంభంలో అంతంతమాత్రంగానే ప్రదర్శన ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కో వారం గడిచేకొద్దీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అభిమానులను పెద్ద సంఖ్యలో పెంచుకుంటూ తన సన్నిహితురాలు పునర్నవితో స్నేహాన్నీ కొనసాగించారు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నో రూమర్లూ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారని కూడా అంతా భావించారు. ఇది ఒకరకంగా రాహుల్‌కు కూడా పబ్లిసిటీ పరంగా కలిసొచ్చింది. 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి చివరకువిజేతగా నిలిచిన పాతబస్తీ కుర్రోడు రాహుల్ బుధవారం ‘సాక్షి’తోముచ్చటించారు. తన అనుభవాలు, అనుభూతులు, పునర్నవితో స్నేహం, భవిష్యత్ ప్రణాళికలపై ఇలా మనసు విప్పి మాట్లాడారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి ఆ రోజు ఏడ్చేశా.. ‘‘పునర్నవి నాకు వెరీ స్పెషల్. మా ఇద్దరిదీ జాన్ జిగిరీ దోస్తాన్. మాటల ద్వారా ఇష్టాల ద్వారా మేమిద్దరంబాగా దగ్గరయ్యాం. మా ఇద్దరి అభిప్రాయాలు బాగాకలిశాయి. ఇద్దరం ముఖం మీదనే మాట్లాడుతూ ముక్కుసూటిగా చెబుతుండేవాళ్లం. మనలాగే ఆలోచించే వ్యక్తి మన స్నేహితులైతే ఎంత బాగుంటుందో అలాగే మేమిద్దరం ఉన్నాం. ఆమెతో ప్రేమలో ఉన్నానని వచ్చిన రూమర్లు సరైనవి కావు. మా ఇద్దరిదీ స్నేహం మాత్రమే. మా పరిచయం హౌస్‌లో ఉన్నప్పుడే జరిగింది. బయటికొచ్చాక కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాం. మాది విడదీయలేని బంధం. హౌస్‌లో ఆమెను అందరూ పున్ను అని పిలిచేవారు. నేను ‘నవీ’ అని ప్రేమగా పిలిచేవాణ్ని. ఆమె ఎలిమినేట్ అయిన రోజున బాగా ఏడ్చాను. రెండు మూడ్రోజుల తర్వాత ఒంటరి వాణ్నయ్యానని ఫీలింగ్ వచ్చింది.టాస్క్‌లతో, స్నేహితుల ముచ్చట్లతో మామూలు మనిషినయ్యా.’’ మలైపాయ.. ఇరానీ చాయ్ ఇష్టం.. పాతబస్తీలోని బిస్మిల్లా హోటల్లో మలైపాయ తినడం అంటే బాగా ఇష్టం. వారంలో నాలుగైదుసార్లు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి నా స్నేహితులు భాస్కర్, చందు, సొహైల్, నోయల్, జోయల్‌తో కలిసి మలైపాయ తింటాను. అది తింటుంటే ఆహా.. ఏమిరుచి.. అన్న ఫీల్ కలుగుతుంది. ఇక మల్లేపల్లి డైమండ్ హోటల్లో ఇరానీ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టడం బాగా ఇష్టం. నేను ఎక్కువగా ఇరానీ హోటల్లోనే ఫ్రెండ్స్‌తో కలిసి చాయ్ తాగుతాను. నా కెరీర్ ఇలాప్రారంభమైంది.. యూట్యూబ్ ద్వారా గాయకుడిగా కెరీర్ ప్రారంభించాను. సంగీతం కంపోజ్ చేస్తూనే పాటలు పాడేవాడిని. 2009లో వచ్చిన జోష్ సినిమాతో గాయకుడిగా మారాను. అదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించాను. అనంతరం దమ్ము, ఈగ, లై, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో పాటలు పాడాను. నాకంటూ ఓ గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ హౌస్‌కు ఎంపికయ్యా. పాతబస్తీలో పుట్టి పెరిగా.. నేను పుట్టి పెరిగింది పాతబస్తీలో. పదో తరగతి వరకు లయోలా స్కూల్లో, ఇంటర్ నారాయణ కాలేజీలో చదివా. దూర విద్యద్వారా డిగ్రీ పూర్తి చేశాను. నాన్న రాజ్‌కుమార్ హెయిర్ స్టైలిస్ట్. అబిడ్స్‌లోని ఓ హోటల్లో షాపు ఉంది. హలో బ్రదర్ సినిమా ఈ హోటల్లోనే ఓ సీన్ జరిగిన విషయాన్ని హౌస్‌లో ఉండగా నాగార్జునతో చెప్పాను. అమ్మ సుధారాణి గృహిణి. చెల్లెలికి వివాహమైంది. ముంబైలో ఉంటోంది. తమ్ముడు నిఖిల్ అమెరికాలో చదువుకుంటున్నాడు. మెగాస్టార్ ప్రశంసించారు.. బిగ్‌బాస్–3 విన్నర్‌గా చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాను. ఆయన బర్త్‌డే ఆగస్టు 22. నా బర్త్‌డే కూడా ఆగస్టు 22. ఇదే విషయాన్ని చిరంజీవితో చెప్పాను. ఆయన వెరీగుడ్ అంటూ ప్రశంసించారు. రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావని వ్యాఖ్యాత నాగార్జున ప్రశ్నించినప్పుడు నా కులవృత్తి సెలూన్ పెట్టుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత సెలూన్ పెట్టుకుంటాను. తప్పనిసరిగా సెలూన్ పెట్టుకోవాలనేది నా లక్ష్యం. టెన్షన్‌కు గురయ్యాను.. బిగ్‌బాస్– 3 హౌస్‌లోకి వెళ్లినప్పుడు నేను సాధారణ కంటెస్టెంట్‌ని. బయట ఏం జరుగుతోందో తెలియదు. 105 రోజుల ప్రయాణం తర్వాత వచ్చిన ఓటింగ్ శాతం చూస్తే నాకు ఇంతమంది అభిమానులున్నారా? అని ఆశ్చర్యపోయాను. నా ప్రదర్శన ఇంతమందికి నచ్చుతుందన్న విషయం లోపలున్న నాకసలే తెలియదు. విన్నర్ అని ప్రకటించేవరకూ టెన్షన్‌కు గురయ్యాను. హౌస్‌లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టడంతో మనుషుల్లోని రియాల్టీ బయటపడుతుంది. ఎమోషన్స్ అన్నీ వెలికివస్తాయి. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి.. యూత్ చేసే పనిలో జెన్యూనిటీ ఉంటే తప్పనిసరిగా విజయం వరిస్తుంది. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుగానే సంసిద్ధులు కావాలి. ఏమాత్రం వెనకడుగు వేయొద్దు. ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే విజయాలు వరిస్తాయని బిగ్‌బాస్– 3 విజేతగా రుజువు చేశా. పాతబస్తీ అందాలు మస్త్.. మీకో విషయం చెప్పాలి. హైదరాబాద్‌లాంటి సిటీ దేశంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా పాతబస్తీ అందాలు అన్నీ ఇన్నీ కావు. నాకు హైదరాబాద్‌తో అనుబంధం ఎక్కువ. మిగతా ఏ నగరానికి వెళ్లినా ఈ అనుభూతులు, ఆనందాలు ఉండవు. నేను ఫ్రెండ్స్‌తో రాత్రిపూట ఎక్కువగా పాతబస్తీలోనే చక్కర్లుకొడుతుంటా. గోడ దూకి బయటపడ్డా.. బిగ్ బాస్– 3 విజయంతో నాకు దిమాక్ ఉందని మా ఇంట్లో వాళ్లకు అర్థమైపోయింది. ఈ విషయంలో రవి కూడా అన్నాడు.. నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యానని. ఇందుకు తమన్నా సింహాద్రి ఇష్యూనే పేర్కొనవచ్చు. దాంతో పాటు హేమా ఇష్యూ సైతం అందరికీ తెలిసిందే. చెప్పాలంటే మా అయ్యకే భయపడం.. బయట వాళ్లకి ఏం భయపడతాం. పాతబస్తీ పోరగాడుగా రియాల్టీ షో విన్నర్ కావడంతో మా ఇంట్లో వాళ్లు చాలా ఆనందపడుతున్నారు. మా ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఒక దశలో గోడ దూకి బయటపడాల్సి వచ్చింది. తెలుగులో పాప్ ఆర్టిస్ట్‌గా ఎదగాలని ఉంది. పునర్నవి విషయానికి వస్తే ఆమెదీ నాదీ మంచి క్యూట్ థింక్స్. ఆమెతో నేను ప్రేమలో ఉంటే చెప్పేంత «ధైర్యం ఉంది. శ్రీముఖి కంగ్రాట్స్చెప్పిందో లేదో గమనించలేదు.. నేను విన్నర్నయ్యాయని తెలియగానే శ్రీముఖి నన్ను అభినందించలేదనే విషయం మీరడిగేదాకా నాకు తెలియదు. గెలిచిన ఆనందంలో నా మైండ్ బ్లాంక్ అయింది. ఏం జరుగుతోందో అర్ధగంటదాకా తేరుకోలేకపోయాను. అందుకే శ్రీముఖి నన్ను కంగ్రాట్స్ చేసిందా.. లేదా? గమనించలేదు. నేనా.. హీరోగానా..? నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం. తమిళంలో రజనీకాంత్, సూర్యను బాగా ఇష్టపడతా. అయితే.. నన్ను ప్రేక్షకులు హీరోగా చూస్తారని అనుకోవడం లేదు. ఇప్పటికైతే పాటలు పాడుతుంటా. ఒకవేళ హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ వస్తే మాత్రం చేస్తా. ప్రేమలో పడ్డాను..పేరు చెప్పలేను.. ప్రేమలో పడ్డమాట వాస్తవమే. ఎవరన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. -
త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్
రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్‌బాస్ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. రాహుల్, పునర్నవిల గురించి మరో అభిమాని ప్రస్తావించగా పున్నుతో కలిసి త్వరలోనే లైవ్‌లోకి వస్తానని చెప్పాడు. తాను గెలుస్తానని ఊహించలేదని, ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులు తోపులని రాహుల్ అభివర్ణించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వరుణ్ గురించి చెప్తూ అతను చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులందరికీ టాస్క్‌ల్లో బేధాభిప్రాయాలు వచ్చాయే తప్ప అందరూ మంచివాళ్లేనని పేర్కొన్నాడు. ‘నోయెల్ అన్న నీ పక్కన ఉన్నంతవరకు నిన్నెవరూ ఏం చేయలేర’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రాహుల్ స్పందిస్తూ.. తనకు ఎంతో మద్దతునిచ్చిన నోయెల్, ఫలక్‌నుమాదాస్ హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పున్ను తనను ఘోరంగా సపోర్ట్ చేసిందని, వినకపోతే తిట్టి మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నాడు. పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) లేకపోయుంటే నేనింత కష్టపడకపోయేవాడినని, నా గెలుపుకు వాళ్లు కూడా ఓ కారణమని పేర్కొన్నాడు. -
అది టెలికాస్ట్ చేయలేదు: బాబా భాస్కర్
బాబా భాస్కర్.. తెలిసిన కొద్దిమందికీ కోపిష్టి కొరియోగ్రాఫర్‌గా పరిచయం. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఆయన ఎంటర్టైన్మెంట్ కా కింగ్. ఆయన మాటలకు నవ్వుకోని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బాబా.. ఏకంగా బిగ్‌బాస్ మనసునే గెలుచుకున్న వ్యక్తి. ఎలాంటి ఆర్మీలు, సోషల్ మీడియా అకౌంట్లు లేకపోయినా వేల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. రెండు వారాలు ఉండటానికి వచ్చాను అంటూనే టాప్ 3లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఓటమి చెందినందుకు తానేమీ బాధపడట్లేదు అంటున్నాడు. బిగ్‌బాస్ షో తన లైఫ్‌లో పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. బిగ్‌బాస్ గురించి బాబా భాస్కర్ మాట్లాడుతూ.. రెండు వారాలే ఉంటాననుకున్నాను.. కానీ అందరూ నన్ను ఫినాలే వరకు తీసుకొచ్చారు. అందుకు ప్రేక్షకులు ప్రతీసారి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. సీన్ రివర్స్ అయింది.. బిగ్‌బాస్ షో కోసం 300 మంది పనిచేశారు. నాకు మొదటి వారంలో అందరూ దగ్గరయ్యారు.. నాలుగోవారం తర్వాత అందరూ దూరమయ్యారు. అయితే నన్ను కొట్టినా పర్లేదు కానీ నా వెనక మాట్లాడటం నచ్చదు.. అది తట్టుకోలేను. ఇక నాగార్జున నవ్వుతూనే అన్ని చెప్పేవారు. గొడవలైనా కూడా అందరినీ కలిపేవారు. శనివారం వచ్చిందంటే ఏమంటారోనని భయపడుతూ ఉండేవాళ్లం. మెడాలియన్ టాస్క్‌లో వితిక తెలివిగా ఆడింది.. కానీ నమ్మకద్రోహం చేసిందనిపించింది. నేను మెడాలియన్ కోసం బాగా ప్రయత్నించాను కానీ అది దొరకలేదు. కొరియోగ్రఫీ చేయమని అడిగారు రాహుల్, శ్రీముఖి, వరుణ్ ఈ ముగ్గురిలో ఒకరు గెలుస్తారనుకున్నాను. మరీ ముఖ్యంగా శ్రీముఖి గెలుస్తుందనుకున్నా. అయితే రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించారంటే అతనికి వచ్చిన ఓట్లే కారణం. నా గురించి మెగాస్టార్ స్టేజీమీద మాట్లాడారు. నేను ఆయనకు ఫ్యాన్ అని చెప్తే ఆయనే తిరిగి నాకు ఫ్యాన్ అనడం చాలా సంతోషంగా అనిపించింది. షోలో మరొకటి కూడా చెప్పారు. కానీ అది టెలికాస్ట్ చేయలేదు. మెగాస్టార్ ఏమన్నారంటే.. ‘మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఖైదీ 150 కూడా చేశాను. నాకు కొరియోగ్రఫీ చేస్తావా’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని బాబా భాస్కర్ బదులిచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌తో క్లోజ్‌గా ఉన్నాడని ఫ్యామిలీలో గొడవలు వచ్చాయంటూ వచ్చిన పుకార్లను బాబా కొట్టిపారేశాడు. ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. -
టైటిల్ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్..
హైదరాబాద్ : బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ కంటే అధికంగా రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి రెమ్యూనరేషన్ రూపంలో ఎక్కువ మొత్తం ఇంటికి తీసుకువెళ్లిందని సమాచారం. బిగ్‌బాస్ విజేతతో పోలిస్తే హౌస్‌లో ఉన్నన్ని రోజులు శ్రీముఖికి పారితోషికంగా భారీ మొత్తమే నిర్వాహకులు ముట్టజెప్పారని భావిస్తున్నారు. టీవీ యాంకర్‌గా రెండు తెలుగురాష్ట్రాల్లో పేరున్న శ్రీముఖి బుల్లితెరపై హయ్యస్ట్ పెయిడ్ నటిగా గుర్తింపు పొందడంతో బిగ్‌బాస్ షోలోనూ భారీగా రాబట్టారు. 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్‌బాస్ తెలుగు 3 హౌస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగడంతో పాటు టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో టైటిల్‌ను రాహుల్ సిప్లీగంజ్ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్‌గా మిగిలారు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా రాహుల్‌కు రూ 50 లక్షలు దక్కగా శ్రీముఖి అంతకుమించే ఈ షోలో ఆర్జించారని వినికిడి. భారీ పే చెక్‌తో శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారని సమాచారం. చదవండి: త్వరలోనే పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్ రోజుకు రూ లక్ష.. బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటిన శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ లక్ష డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. 105 రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల చెక్ ఆమెకు దక్కింది. టైటిల్ విజేత రాహుల్ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్ చాలా అధికం కావడం గమనార్హం. -
బిగ్‌బాస్ ఫలితంపై యాంకర్ ఝాన్సీ అసహనం
తెలుగువారిని ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ 3 ముగిసినప్పటికీ దానిచుట్టూ వివాదాలు మాత్రం వదలడంలేదు. ప్రేక్షకులు కురిపించిన ఓట్ల వర్షంతో అంచనాలు తలకిందులు చేస్తూ రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ‘గత రెండు సీజన్లలో పురుష కంటెస్టెంట్లకే టైటిల్ దక్కింది.. ఈసారి మహిళకు అవకాశమిద్దాం’ అని శ్రీముఖి అభిమానులు చేసిన ప్రచారాన్ని ఎవరూ లెక్కచేయలేదు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో శ్రీముఖి ఓ సందర్భంలో.. ‘నేను జెండర్‌ను వాడను’ అని చెప్పింది. అయితే అందుకు భిన్నంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం శ్రీముఖి కుటుంబ సభ్యులు #THISTIMEWOMAN అంటూ ప్రచారం నిర్వహించడం గమనార్హం. మూడో‘సారీ’ ఇక తెలుగులో బిగ్‌బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకోగా ఒక్కసారి కూడా మహిళలు విన్నర్‌గా నిలవలేకపోయారు. టాప్ 5లో చోటు దక్కించుకుని ఫినాలేలో అడుగుపెట్టినా.. వట్టిచేతులతోనే వెనుదిరిగారు. ముచ్చటగా మూడోసారి.. కూడా మేల్ కంటెస్టెంట్ విన్నర్‌గా అవతరించాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్న శ్రీముఖి క్రేజ్ రాహుల్ నిజాయితీ ముందు తక్కువే అయింది. దీంతో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ ఫలితంతో శ్రీముఖి అభిమానులు నిరాశలో మునిగిపోగా.. పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు అందుకు సిద్ధంగా లేరు ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ వీక్షకులు మహిళను గెలిపించడానికి సిద్ధంగా లేరని అభిప్రాయపడింది. ‘అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ విన్నర్‌గా మహిళను ఎందుకు గెలిపిస్తారు?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. లింగభేదం ఇంకా ఉనికిలోనే ఉందంటూ కామెంట్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి తన బెస్ట్ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. -
వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్ పేరెంట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్-పునర్నవిల రిలేషన్షిప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసిన రాహుల్.. డేటింగ్‌కు వస్తావా అని పునర్నవిని సరదాగా అడగడం అప్పట్లో హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టాస్క్‌లు ఆడటం చేతకాదని పేరు తెచ్చుకున్న రాహుల్.. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్‌ను గటగటా తాగి ఆమెను నామినేషన్ నుంచి తప్పించాడు. దీంతో ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దులు కూడా ఇచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్ అయినపుడు రాహుల్ వెక్కివెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. పదకొండోవారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి.. రాహుల్‌తో కలిసి ఫేస్బుక్ లైవ్ చేస్తానని అభిమానులకు మాటిచ్చింది. అటు గ్రాండ్ ఫినాలే స్టేజిపై రాహుల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత పునర్నవి తనను ఎంకరేజ్ చేసిందని ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు. అటు రాహుల్, ఇటు పునర్నవి.. మేం ఇద్దరం ప్రాణస్నేహితులమంటూ ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్ తల్లిదండ్రుల మాటలు ప్రేక్షకులను చిక్కుల్లో పడేశాయి. వారిది స్నేహమా? ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో మరోసారి తలెత్తుతోంది. అటు రాహుల్ తల్లిదండ్రులు అతనికి లైఫ్ సెట్ చేసే పనిలో పడ్డారు. పనిలో పనిగా పెళ్లి విషయం గురించి కూడా మాట్లాడారు. అయితే బిగ్‌బాస్ వాళ్లు రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందన్న భావన కలిగించారని చెప్పుకొచ్చారు. కానీ అది బిగ్‌బాస్ హౌస్ వరకే ఉంటుందనుకుంటున్నామని తెలిపారు. రాహుల్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలన్నారు. వారికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని ప్రకటించారు. ‘వాళ్లు నిజంగా లవ్ చేసుకుంటే వాళ్ల ఇష్టమే మా ఇష్టం.. వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం.. పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని వెల్లడించారు. ఇక బిగ్‌బాస్ ముగిసిందో లేదో అప్పుడే పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) కలిసి పార్టీ చేసుకున్నారు. -
బిగ్‌బాస్ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్
అతిరథ మహారథుల సమక్షంలో బిగ్‌బాస్ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ టైటిల్ సాధించాడు. ‘ఈసారి మహిళను గెలిపిద్దాం’ అంటూ ప్రచారం చేసిన శ్రీముఖి మాటలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ కప్పు కొట్టకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసిన బాబా భాస్కర్ మూడో స్థానంలో నిలిచాడు. షో మొదటి నుంచి టైటిల్ గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనుకున్న వరుణ్ సందేశ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. టాస్క్‌ల్లో విజృంభించే అలీ రెజా అయిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ ఫెయిల్ అయింది.. ఇక షో ముగిసినప్పటికీ రాహుల్‌ను విజేతగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాహుల్ గెలుపుతో చిచ్చా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతుంటే శ్రీముఖి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒక బద్ధకస్తుడిని గెలిపించి బిగ్‌బాస్ 3 ఫెయిల్ అయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాహుల్ గెలుపు ఏకపక్షమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిగ్‌బాస్ 2,3 ఫలితాలు బిగ్‌బాస్ షో ప్రతిష్టను దిగజార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహుశా ఆ ఫలితాలు జనాల అభిప్రాయం కావచ్చని అసహనం వ్యక్తం చేశాడు. రాహుల్ గెలిచాడు.. కానీ బిగ్‌బాస్ ఓడిపోయిందని పేర్కొన్నాడు. రాహుల్ గెలవడం స్త్రీ జాతికే అవమానం.. మహేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖిని రన్నరప్‌గా ప్రకటించడంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక సోమరిపోతు, అహంకారిని బిగ్‌బాస్ విన్నర్‌గా చూడగలగడం.. ఆడపడుచుని అహంకారంగా అవమానపరిచిన వాడిని ఆమె ముందే విన్నర్ అనడం స్త్రీ జాతికే అవమానం’ అంటూ దుయ్యబడుతున్నారు. బిగ్‌బాస్ షోపై నమ్మకం పోయందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇకమీదట వచ్చే బిగ్‌బాస్ 4 చూడమంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. బిగ్‌బాస్ 1లో పాల్గొన్న కత్తిమహేశ్ గతంలోనూ బిగ్‌బాస్ రియాలిటీ షోపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’
బిగ్‌బాస్ తెలుగు 3 విజేతగా పాతబస్తీ పోరడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి చివరి నిమిషంలో తడబడి రెండో స్థానానికి పరిమితమైంది. రాహుల్ నిజాయితీ, ముక్కుసూటితనం, నిరాడంబరత అన్నీ ప్రేక్షకులు జై కొట్టేలా చేశాయి. ఇక మొదటి నుంచి టాస్క్‌ల్లో, ఎంటర్టైన్మెంట్లో శ్రీముఖి దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆమె ఓటమిని ముందే పసిగట్టామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పచ్చబొట్టు సెంటిమెంట్ కథేంటి? బిగ్‌బాస్ రెండో సీజన్లో కంటెస్టెంట్ గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకుంది. చిచ్చుబుడ్డిలా ఇంట్లో సందడి చేసే గీతామాధురే టైటిల్ విజేతగా నిలుస్తుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. విజయపుటంచులదాకా వచ్చిన గీత.. కౌశల్ ఆర్మీ దెబ్బతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక హౌస్‌లోని కంటెస్టెంట్ బాబు గోగినేనిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి గీతామాధురి టాటూ వేసుకోవాల్సి వచ్చింది. అతన్ని కేవలం ఒక్కవారం ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి మాత్రమే ఆ పచ్చబొట్టు ఉపయోగపడుతుంది. దీనికోసం శరీరంపై జీవితాంతం గుర్తుండిపోయేలా టాటూ వేసుకోడానికి గీత సిద్ధపడుతుందా? అని అందరూ అనుమానపడ్డారు. కానీ గీతామాధురి వెంటనే ఒప్పేసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సీజన్లో శ్రీముఖికి కూడా బిగ్‌బాస్ అలాంటి టాస్కే ఇచ్చాడు. సేమ్ టు సేమ్.. వరుణ్‌ను నామినేషన్ నుంచి ఒకవారంపాటు సేవ్ చేయడానికి టాటూ వేసుకుంటావో, లేదో నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ శ్రీముఖిని ఆదేశించాడు. అయితే శ్రీముఖి.. తనకు కాబోయే భర్త పేరు మాత్రమే టాటూ వేయించుకోవాలనుకున్నాను అని చెబుతూనే.. ఇష్టం లేకపోయినా వరుణ్ కోసం పచ్చబొట్టు వేయించుకుంది. అయితే గత సీజన్లో గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకోవడం.. రన్నరప్‌గా నిలివటాన్ని ప్రస్తుత సీజన్‌తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. సేమ్ టు సేమ్.. ఈ సీజన్లోనూ శ్రీముఖి పచ్చబొట్టు వేయించుకుందని.. అందువల్లే ఆమె ఓటమిపాలైందని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శ్రీముఖి టైటిల్ పోరులో వెనకబడటానికి పచ్చబొట్టే కారణమని చెప్తున్నారు. పచ్చబొట్టు శ్రీముఖి కొంపముంచిందంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. -
రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో అట్టహాసంగా ముగిసింది. అనూహ్యంగా చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను దక్కించుకోగా శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమితమవడం జీర్ణించుకోలేకపోతోంది. ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టింది. హోస్ట్ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వెల్లగక్కింది. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్య అతిథి చిరంజీవి కూడా శ్రీముఖిని అనుసరిస్తూ.. ‘రాహుల్ చెక్ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నావు’ అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల తీర్పును శ్రీముఖి గౌరవించినట్టులేదు. ‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్‌బాస్ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం అదృష్టం వల్లే గెలిచాడు అన్నట్టుగా ఆమె మాటలు ధ్వనించాయి. మొదటి నుంచి టైటిల్ తనదే అని ఫిక్స్ అయిన శ్రీముఖికి రాహుల్ విజయం గట్టి షాక్‌నిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా విజేతగా నిలిచిన రాహుల్‌కు కనీసం అభినందనలు చెప్పకపోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. ఆచితూచి మాట్లాడే శ్రీముఖి అంతపెద్ద స్టేజిపై సరిగా ప్రవర్తించలేదని అంటున్నారు. ఓటమిని అంగీకరించాలి తప్పితే గెలుపును తప్పుబట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె తీరును విమర్శిస్తున్నారు. -
బిగ్‌బాస్: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది
డబ్బు, ఐశ్వర్యం, అవకాశాలు కల్పించగల కుటుంబ నేపథ్యం... ఇవి ఉన్నవారు విజేతలు కావడంలో పెద్ద విశేషం లేదు. కాని ఒక పక్కింటి కుర్రాడు, మన గల్లీ కుర్రాడు విజేత కావడం చాలా పెద్ద విశేషం. బిగ్‌బాస్-3 రియాలిటీ షోలో చాలా గట్టి కంటెస్టెంట్లను దాటి గెలిచిన రాహుల్ ఇటీవలి యువతకు ఇన్స్పిరేషన్గా నిలవవచ్చు. బిగ్‌బాస్ హౌస్‌లో సినిమా హీరో వరుణ్ ఉన్నాడు. సిక్స్‌ప్యాక్ అందగాడు అలీ రజా ఉన్నాడు. తన యాసతో ఆకట్టుకునే మహేష్ విట్టా ఉన్నాడు. ఇంకా అమ్మాయిలలో అయితే సావిత్రక్కగా ఫేమస్ అయి తెలంగాణ బిడ్డగా అభిమానం పొందిన శివజ్యోతి ఉంది. హుషారు శ్రీముఖి ఉంది. తన మంచితనంతో ఆకట్టుకున్న బాబా భాస్కర్ ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరూ గట్టి పోటీదారులే. అయినప్పటికీ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. తను తనలాగే ఉండటం, తన ప్రవర్తనతోనే ఆకట్టుకోవడం, పాటగాడిగా తన ప్రతిభ, పెద్దగా మతలబులు చేయకపోవడం ఇవన్నీ అతనికి లాభించాయని చెప్పవచ్చు. విజయనగర్ కాలనీలో రాహుల్ ఇల్లు వృత్తిరీత్యా బార్బర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ప్రాథమికమైన రెండు కోరికలతో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఒకటి: మంచి సొంత సెలూన్ తెరవడం. రెండు: ఒక సొంత ఇల్లు సంపాదించుకోవడం. బిగ్‌బాస్ విజేతగా ఈ రెండు కోరికలు తీర్చుకోవడం అతనికి ఇక కష్టం కాకపోవచ్చు. రాహుల్‌ది హైదరాబాద్ ధూల్‌పేటలోని మంగళ్‌హాట్. అతని కుటుంబం ప్రస్తుతం విజయ నగర్ కాలనీలోని ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. రాహుల్ ఫోక్ సింగర్‌గా, సినిమా గాయకునిగా మారకముందు తండ్రితో కలిసి నాంపల్లిలోని శ్రీ సాయి కిరణ్ సెలూన్లో పని చేసేవాడు. వచ్చిన కస్టమర్లను తన మాటలతో పాటలతో అలరించేవాడు. విజయనగర్ కాలనీలో కూడా చుట్టుపక్కల వారికి అతడు ఆత్మీయుడు. ‘రాహుల్ మమ్మల్ని చాలా ప్రేమగా పలకరిస్తాడు’ అని అనిల్ సింగ్ అనే అతని స్నేహితుడు తెలిపాడు. ‘దీపావళి వస్తే చాలా సందడి చేస్తాడు. నాంపల్లిలో రాహుల్ పని చేసిన సెలూన్ ఇదే! ఈసారి పండగ సమయానికి అతడు హౌస్‌లో ఉండటంతో మేమంతా కొంచెం నిరాశ పడ్డాం’ అని మరో స్నేహితుడు శ్రీవత్స చెప్పాడు. హౌస్‌లో ఉన్న రోజుల్లో తోటి కంటెస్టెంట్ శ్రీముఖితో తనకి సఖ్యత కుదరలేదు. అదే శ్రీముఖిని రాహుల్ ఫైనల్స్‌లో ఓడించడం అభిమానులకే కాదు, ఎక్కువమందికి నచ్చినట్టు కనపడుతోంది. రాహుల్ తన నేపథ్యాన్ని, వృత్తిని దాచకుండా గౌరవంతో సొంతం చేసుకోవడం చాలా మందికి నచ్చి ఉండవచ్చు. నాంపల్లిలోని సాయికిరణ్ హెయిర్ సెలూన్లో తండ్రి రాజ్‌కుమార్‌తో బార్బర్‌గా పని చేసిన రాహుల్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, దర్శకుడు రాజమౌళి వంటి వారికి హెయిర్ కట్ చేసేవాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు తమ స్నేహితుడే సెలబ్రిటీగా మారడంతో ఇంటి దగ్గర కోలాహాలం ఏర్పడింది. షో ముగిశాక నిబంధనల ప్రకారం ఇంకా జనంలోకి రాని రాహుల్ త్వరలో ఇల్లు చేరి తమతో దావత్ చేసుకుంటాడని మిత్రులు ఎదురు చూస్తున్నారు. – జెమిలిప్యాట వేణుగోపాల్, సాక్షి, హైదరాబాద్ -
బిగ్‌బాస్: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..
ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్‌బాస్ సీజన్ 3కి నిన్నటి (ఆదివారం)తో శుభంకార్డు పడింది. 105 రోజుల ప్రయాణానికి తెరదించుతూ రాహుల్ విన్నర్ అయ్యాడు. ఇద్దరు టాలీవుడ్ సూపర్స్టార్లు చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా 50 లక్షల ప్రైజ్‌మనీ, ట్రోఫీ అందుకున్నాడు. బుల్లితెర యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ విజేతగా రాహుల్ అన్న విషయం ఒక్కరోజు ముందుగానే లీక్ అయినప్పటికీ ఎక్కడో ఒక్క చోట శ్రీముఖి గెలుస్తుందేమో అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకునికి ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అయితే కొన్ని గంటల ముందే విన్నర్ రాహుల్ అని తేలడంతో ధూల్‌పేటలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అభిమానుల నిరాశ శ్రీముఖి పక్కాగా గెలుస్తుందనుకున్న ఆమె అభిమానులు మాత్రం రాహుల్ విన్నర్ అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. చివరి క్షణాల వరకు శ్రీముఖి అభిమానులు బుల్లితెర రాములమ్మ గెలుస్తుందనే గంపెడు ఆశతో ఉన్నారు. అనూహ్యంగా రాహుల్ గెలిచాడని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాస్కులన్నింటిలోనూ బద్దకస్తుడిగా పేరుతెచ్చుకున్న రాహుల్ గెలువడమేమిటన్న విస్మయం వారిలో వ్యక్తమవుతోంది. నిజానికి బిగ్‌బాస్ - 3 విన్నర్ శ్రీముఖేనని, అనూహ్యంగా రాహుల్ గెలవడంలో ఏదో గూడుపుఠాణీ ఉందని ఆమె అభిమానులు కొందరు విపరీత ఆరోపణలు కూడా చేస్తున్నారు. రాహుల్ అభిమానులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ముక్కుసూటితనంతో ఒరిజనల్‌గా ఉండటం వల్లే రాహుల్ విన్నర్ అయ్యాడని స్పష్టం చేస్తున్నారు. శ్రీముఖిని కూల్ చేసిన మెగాస్టార్ బిగ్‌బాస్ విన్నర్‌గా రాహుల్‌ను ప్రకటించడంతో శ్రీముఖి అంచనాలను తలకిందులైనట్టు కనిపించింది. పరాజయం ఇష్టపడని శ్రీముఖి చివరికి లూజర్‌గా మిగిలిపోవడంతో డీలాపడిపోయింది. ఆమె మొహం కూడా వాడిపోయింది. ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి శ్రీముఖిని.. లక్షలమంది మనసులను గెలుచుకున్నావంటూ కాస్తా కూల్ చేశాడు. మళ్లీ మామూలు స్థితికి వచ్చిన శ్రీముఖి అభిమానుల నిర్ణయాన్ని అంగీకరిస్తానని, ఇప్పుడు చిరంజీవితో ఏ స్టెప్పు వేయడానికైనా రెడీ అంటూ హుషారైంది. ఎవరి బలం ఎంత ఏ విషయంలో చూసినా శ్రీముఖి రాహుల్‌కంటే ముందుంటుందని పేరు తెచ్చుకుంది. టాస్క్‌ల పరంగా, ఫ్యాన్ ఫాలోవర్స్ పరంగా చూస్తే రాహుల్ కంటే శ్రీముఖి ఓ అడుగుముందే ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీముఖికి కొన్ని విషయాలు మైనస్‌గా మారినట్టు కనిపిస్తున్నాయి. ఓట్లపరంగా చూసుకుంటే శ్రీముఖి, రాహుల్‌కు సమానస్థాయిలోనే ఓట్లు పడి ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా తన స్వరంతో పాటలు పాడి రాహుల్ అభిమానులను హృదయాలను కొల్లగొట్టాడు. హౌజ్‌లోనూ అతను చాలావరకు ఒరిజినల్‌గా నిజాయితీగా ఉండటంతోపాటు పునర్నవితో చక్కని అనుబంధాన్ని కొనసాగించడం కూడా రాహుల్‌కు కలిసివచ్చింది. పునర్నవి ఎలిమినేట్ అయిన సందర్భంలో రాహుల్ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి ఉంటుంది. ఫైనల్ సమీపిస్తున్న వేళ రాహుల్ మరింత సటిల్డ్‌గా ఉండటమే కాకుండా.. తన హైదరాబాదీ యాస, జానపద పాటలతో క్రేజ్ పెంచుకున్నాడు. ఫైనల్ దశలో ఇది కొంతమేరకు శ్రీముఖి క్రేజ్‌కు బ్రేక్ వేసింది. ఓటమికి కొన్ని కారణాలు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హేమ, హిమజా శ్రీముఖికి వ్యతిరేకంగా గళమెత్తడం.. ఆమె పట్ల కొంత నెగిటివిటీకి కారణమైంది. బిగ్‌బాస్ హౌజ్ డైరెక్టర్లలో కొందరు శ్రీముకికి స్నేహితులంటూ హిమజ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ఈ మాటల ప్రభావం కొంతలేకపోయిందని బిగ్‌బాస్‌ను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు బిగ్‌బాస్ టీంకు కూడా చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే బిగ్‌బాస్ టీం శ్రీముఖికి ఫేవర్‌గా ఉందని వదంతులు వచ్చాయి. దీంతో శ్రీముఖిని విన్నర్‌గా ప్రకటిస్తే ఈ ప్రక్రియ అంతా ఫుల్ ప్లాన్డ్గా చేశారనే ఆరోపణలు వస్తాయని భావించి బిగ్‌బాస్ టీం.. ఆమెతోపాటు సమానంగా ఉన్న రాహుల్‌ను విజేతగా ప్రకటించిందని శ్రీముఖి ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇక రాహుల్‌తో శ్రీముఖి గొడవపడటం కూడా మైనస్‌గా మారి.. రాహుల్‌పై సానుభూతి పెరగడానికి కారణమైంది. మొదటినుంచి రాహుల్‌పై విముఖత చూపిస్తున్న శ్రీముఖి.. రాహుల్‌ను అనేకసార్లు నామినేషన్లోకి నెట్టింది. శ్రీముఖి అనవసరంగా రాహుల్‌తో గొడవ పడిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇంట్లో కొందరి విషయాలు శ్రీముఖి అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెపుతుందని ప్రచారం కూడా ఆమెకు ట్రోఫీని దూరం చేసిన వాటిలో ఒక కారణమని చెప్పేవాళ్లు లేకపోలేదు. -
అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్ హిట్ అయ్యేదే..!
ప్రేక్షకులను వంద రోజులకు పైగా అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 నిన్న(ఆదివారం) ఘనంగా ముగిసింది. అయితే, కంటెస్టెంట్లకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన బిగ్‌బాస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లను బీట్ చేస్తుందనుకున్న బిగ్‌బాస్ సీజన్ 3 ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకుంది. విన్నర్ ఎంపికలో ఈసారి బిగ్‌బాస్ న్యాయం చేయలేకపోయాడని కొందరు వాదిస్తున్నారు. ఏ ప్రాతిపదికన రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కూడా కెప్టెన్‌గా ఎంపికవ్వని రాహుల్‌కి టైటిల్ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్న కొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఈక్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 హైలైట్స్ ఓసారి పరిశీలిస్తే.. బిగ్‌బాస్ 3 కొనసాగిందిలా.. 1. హోస్ట్‌గా కింగ్ నాగార్జున 2. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 3. దంపతుల జంట వరుణ్, వితికలు రావడం 4. ఆరోవారంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించడం స్పెషల్ అట్రాక్షన్ 5. ఆరోవారం నో ఎలిమినేషన్ 6. ఎనిమిదో వారంలో స్పెషల్ గెస్ట్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ రావడం 7. తొమ్మిదో వారం రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అండ్ రీఎంట్రీ 8. పన్నెండోవారం హౌస్‌లో బిగ్‌బాస్ బర్త్‌డే వేడుకలు 9. బిగ్‌బాస్ హౌస్‌లో పలువురు సెలబ్రిటీల సందడి ‘గ్యాంగ్ లీడర్’ తారాగణం నాని, వెన్నెల కిశోర్ ‘గద్దలకొండ గణేష్’ చిత్ర యూనిట్, వరుణ్ తేజ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర యూనిట్ రామ్, నిధి అగర్వాల్ ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ దీపావళికి యాంకర్ సుమ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి 10. పదమూడోవారం కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించడం 11. బిగ్‌బాస్ 105 రోజుల పాటు కొనసాగింది.(జూలై 21న ప్రారంభమై నవంబర్ 3న ముగిసింది) 11. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం 12. టైటిల్ విజేతగా రాహుల్, రన్నరప్‌గా శ్రీముఖి నిలవటడం మైనస్‌గా మారినవి.. 1. మెప్పించని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2. టాస్క్‌లు పదేపదే రద్దు చేయడం 3. ఎమోషన్స్‌ను ఎలివేట్ చేస్తూ సాగదీయడం 4. గత సీజన్ల టాస్క్‌లు కాపీ కొట్టడం 5. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం 6. లీకులు అరికట్టలేకపోవడం 7. చుట్టుముట్టిన వివాదాలు -
బిగ్‌బాస్: రాహుల్ గెలుపునకు కారణాలివే..
జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. రాహుల్ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే... శ్రీముఖితో వైరం రాహుల్‌కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్షిప్ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రాహుల్ చివరాఖరికి ఇంటి సభ్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. పాటల మాంత్రికుడు.. బద్ధకస్తుడు అన్న పేరును తెచ్చుకున్న రాహుల్ మొట్టమొదటగా ‘టికెట్ టు ఫినాలే’ సాధించి తనేంటో రుజువు చేసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పడం.. ఎలాంటి భేషజాలానికి పోకుండా తప్పు చేస్తే సారీ చెప్పడం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రాహుల్ హైదరాబాదీ యాసతో ఇంటి సభ్యులు కొన్నిసార్లు నొచ్చుకున్నారు. రాహుల్ తమను తిడుతున్నాడని హోస్ట్ నాగార్జునకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగ్ సైతం రాహుల్‌ను జాగ్రత్తగా మాట్లాడాలని సూచించాడు. అయితే, ప్రేక్షకులు మాత్రం రాహుల్ బోల్డ్ రియాక్షన్స్‌కి ఫిదా అయ్యారు. వీటన్నిటికీ తోడు రాహుల్ కొత్తకొత్త బాణీలతో, తన గాత్రంతో అటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను అలరించాడు. ఫేక్ ఎలిమినేషన్, రీఎంట్రీ రాహుల్ క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ సమయంలో పునర్నవీ, పున్నూ ఎలిమినేషన్ సమయంలో రాహుల్ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు. సింగర్, నటుడు నోయెల్.. రాహుల్‌కు అండగా నిలవటం అతనికి మరింత ప్లస్ అయ్యింది. మిడిల్ క్లాస్+వృత్తికి గౌరవం మరీ ముఖ్యంగా రాహుల్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, అతను లైఫ్‌లో ఇంకా సెటిల్ అవాల్సి ఉందని కూడా జనాలు గెలిపించేందుకు ఓ కారణమైంది. తన బార్బర్ వృత్తికి గౌరవం ఇవ్వడం కూడా అతని విలువను రెట్టింపు చేసింది. గల్లీ సింగర్ నుంచి ఎదిగిన తీరును దగ్గరుండి చూసిన జనం అతనికి జై కొట్టారు. వీటన్నింటి వల్ల రాహుల్‌కు గెలుపు ఖాయమైంది. ఒక్కసారి కూడా కెప్టెన్ అవని రాహుల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అయితే అతని గెలుపును శ్రీముఖి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బద్ధకస్తుడిని గెలిపించి బిగ్‌బాస్ 3 ఫెయిల్ అయిందని తిట్టిపోస్తున్నారు. రాహుల్ గెలుపు.. శ్రీముఖి వేసిన భిక్షగా అభివర్ణిస్తున్నారు. -
బిగ్‌బాస్ 3 విన్నర్
-
బిగ్‌బాస్ : ‘మిడిల్ క్లాస్ వ్యక్తిని గెలిపించారు’
తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ సీజన్ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన రాహుల్, రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్ గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్ డాన్సులు వేశారు. షో నుంచి బయటకు వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు లెజెండ్స్ చేతులమీదుగా టైటిల్ తీసుకోవడం అదృష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్ చేంజ్ అవుతది అనిపిస్తుంది. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించినందుకు నా సంతోషానికి హద్దులు లేవు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్‌ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా సక్సెస్‌కు కారణమయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అభిమానులు రాహుల్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాహుల్ వారితో కాసేపు ముచ్చటించాడు. ఇక శ్రీముఖి టైటిల్ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక అభిమానులు తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
బిగ్‌బాస్ విజేతగా రాహుల్
-
బిగ్‌బాస్–3 విజేత రాహుల్
సాక్షి, హైదరాబాద్ : 3 నెలల క్రితం ప్రారంభమై వివాదాలు, సంవాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్–3 షో విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్ అయిన రాక్‌స్టార్ రాహుల్ .. విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్, వితికల కష్టం కూడా ఉందన్నారు. (చదవండి : బిగ్‌బాస్ తర్వాత కనిపించకుండా పోయారు) ఇక పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’ అని చెప్పాడు. టాస్క్‌ల వల్లే శ్రీముఖికి, తనకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదన్నారు. ఇక నుంచి తన లైఫ్ కొత్తగా మారుతుందని చెప్పారు. ‘ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. కాగా, బిగ్‌బాస్ సీజన్ త్రీకి గ్రాండ్‌గా ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ పోటీని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బుల్లితెర ప్రేక్షకులు సుమారు మూడు గంటల పాటు ఇంట్లో టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. సీరియల్ యాక్టర్స్, పలువరు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటిస్టెంట్లు ధూమ్‌ధామ్‌గా సందడి చేశారు. ప్రతిరోజు పండగే టీమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి హంగామా చేసింది. హీరోయిన్స్ అంజలి, కేథరిన్, నిషా అగర్వాల్ ఫర్మామెన్స్లతో గ్రాండ్ ఫినాలే స్టేజీ దద్దరిల్లింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాప్5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో మొదటగా అలీ రెజా, తర్వాత వరుణ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో ఎమిలినేషన్గా బాబా భాస్కర్ బయటకు వచ్చారు. చివరకి హౌజ్‌లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ దగ్గరకి స్వయంగా హోస్ట్ నాగార్జునే వెళ్లాడు. వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. వారి జర్నీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. వంద రోజులకు పైగా కష్టపడి టాప్2లోకి వచ్చిన రాహుల్, శ్రీముఖిలకు చివరగా నాగ్ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు. ప్రైజ్ మనీ యాభై లక్షలని, ఇద్దరికీ చేరో రూ.25లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడాడు. కానీ దాన్ని వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వారిద్దరిని నాగ్ స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. చిరు కోసం పాట పాడమని నాగ్ రాహుల్‌ను కోరగా.. అబీఅబీ అనే పాటతో రాహుల్ స్టేజిని ఉర్రుతలూగించాడు. ఇక రాహుల్, శ్రీముఖి ఇద్దరిలో రాహుల్‌ను విన్నర్‌గా నాగ్ ప్రకటించేశాడు. అనంతరం చిరంజీవి ట్రోఫీని అందజేశాడు. శ్రీముఖి డల్ అయిపోవడంతో చిరంజీవి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అలా ఉంటే తాను చూడలేనని సరదాగా అన్నారు. ఆ తరవాత తనతో చిరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలో చిరు బుగ్గపై శ్రీ ముద్దపెట్టింది. దీంతో చిరంజీవి షాకయ్యాడు. మొత్తంగా 8కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో బిగ్‌బాస్ 3కి ఎండ్‌కార్డు పడింది. -
బిగ్‌బాస్‌లోకి మెగాస్టార్.. హీటెక్కిన షో!
బిగ్‌బాస్ సీజన్ టూ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్‌గ్రౌండ్ పాటతో అదరిపోయేలా గ్రాండ్ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాబా భాస్కర్ ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య తుదిపోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నరో మరికాసేపట్లో తెలిపోనుంది. హోస్ట్ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్‌బాస్ గేమ్ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్‌లోంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాటవేశారు. నాగార్జున హౌజ్‌లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్ భామ నిధి అగ్వరాల్ తన దుమ్మురేపే డ్యాన్సులతో గ్రాండ్ ఫినాలెకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. -
బిగ్‌బాస్: బాబా ఔట్.. విజేత ఎవరంటే!
బాస్‌బాస్ సీజన్ 3 తుదిపోరు రసవత్తరంగా మారింది. టాప్-5లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా, వరుణ్ సందేశ్ ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా ఊహించినట్టే బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తుది అంకానికి చేరుకున్న ఫైనల్ పోరులో టాప్-2 కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మిగిలారు. టాప్-2లో ఈ ఇద్దరే ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీముఖి, రాహుల్‌లలో విజేత కానుండగా.. మరొకరు రన్నరప్ కానున్నారు. బిగ్‌బాస్-3 గ్రాండ్ ఫినాలెలో మూడో కంటెస్టెంట్ ఎలిమినేషన్ కూడా నాటకీయంగా సాగింది. ఈ ఎలిమినేషన్ కోసం అంజలి హౌజ్‌లోకి వెళ్లారు. ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి.. తన వద్దకు తీసుకువచ్చే బాధ్యతను నాగార్జున ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి కూడా రూ. 25 లక్షల ఆఫర్‌ను నాగార్జున ఇచ్చారు. నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని రావొచ్చునంటూ ఊరించారు. అయినా ఎవ్వరూ ఆఫర్‌ను స్వీకరించలేదు. దీంతో బాబా భాస్కర్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్టు అంజలి ప్రకటించి.. నాగార్జున వద్దకు తీసుకొచ్చారు. ఇక, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ అవుతారని బాబా భాస్కర్‌ను అడుగగా.. శ్రీముఖి విజేతగా నిలుస్తారని, రాహుల్ రన్నరప్ అవుతారని బాబా తన అభిప్రాయం చెప్పారు. ఇక, గ్రాండ్ ఫినాలె షోలో భాగంగా వితిక, పునర్నవి, రవికృష్ణ, శిల్పా చక్రవర్తి తమ డ్యాన్సులతో అదరగొట్టారు. -
20 లక్షల ఆఫర్.. హౌజ్‌లో టెన్షన్ రేపిన శ్రీకాంత్
బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలె ఆసక్తికరంగా సాగుతోంది. హీరోయిన్ల ఆటపాటలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రస్తుతం ఫినాలె ఎపిసోడ్ సాగుతోంది. ప్రముఖ హీరోయిన్లు క్యాథరిన్, అంజలి తన నృత్యాలతో బిగ్ బాస్ స్టేజ్‌ను వేడెక్కించారు. అనంతరం గెస్ట్‌గా దర్శనమిచ్చిన హీరో శ్రీకాంత్.. హౌజ్‌లోకి వస్తూనే టెన్షన్ రేపారు. హౌజ్‌లోని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ. 10 లక్షల సూట్‌కేస్ తీసుకొని.. ఒక కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌కు కంటెస్టెంట్లు ఎవరూ ముందుకురాలేదు. కంటెస్టంట్ల కుటుంబసభ్యులను ఈ ఆఫర్ గురించి నాగార్జున అడుగగా.. వాళ్లు కూడా ఈ ఆఫర్‌కు ఒప్పుకోవద్దంటూ కంటెస్టెంట్లకు సూచించారు. దీంతో శ్రీకాంత్ ప్లాన్-బీ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మరో పది లక్షల సూట్‌కేసును హౌజ్‌లోకి తీసుకొచ్చారు. మొత్తం రూ. 20లక్షలున్న రెండు సూట్‌కేసులు తీసుకొని.. హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని శ్రీకాంత్ కంటెస్టెంట్లకు సూచించారు. నలుగురు అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారని, మిగతా ముగ్గురు ఓడిపోవాల్సిందేనని చెప్పిచూశారు. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నవాళ్లు, విజేత కాలేనేమోనని భావించే ఎవరైనా ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టాలని, రూ. 20 లక్షలంటే మామూలు విషయం కాదని, అదృష్టం కలిసివస్తే కాలదన్న కూడదని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ హితబోధ చేసినా.. ఎవ్వరూ కూడా ఈ ఆఫర్‌ను ఒప్పుకోలేదు. దీంతో ప్లాన్ సీ రూపంలో క్యాథరిన్ థెరిస్సా హౌజ్‌లోకి ఎంటరై.. ఎవరూ ఎలిమినేట్ అవుతున్నారో తెలిపే సీల్డ్ కవర్‌ను తీసుకొచ్చింది. చివరినిమిషంలోనూ సీల్డ్ కవర్లో తెరిచేటప్పుడు కూడా నాగార్జున్ సూట్‌కేసులను తీసుకొని వెళ్లిపోవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. బాబా భాస్కర్ కొంచెం తక్కువ కాన్ఫిడెన్స్‌తో కనిపించినా ఈ ఆఫర్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎవరూ అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ సీల్డ్ కవర్‌ను తెరిచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరును ప్రకటించాడు. వరుణ్‌ను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతన్ని తీసుకొని.. శ్రీకాంత్, క్యాథరిన్ తీసుకొని నాగార్జున వద్దకు వచ్చారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలె: ఫస్ట్ ఎలిమినేషన్ అతడే!
బిగ్‌బాస్ సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. మూడో సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలనుంది. మా టీవీలో ప్రస్తుతం బిగ్‌బాస్ -3 గేమ్ షో గ్రాండ్ ఫినాలె ప్రసారం అవుతోంది. ఈ షోలో భాగంగా గ్రాండ్ ఫినాలె నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటుడు అలీ రెజా నిలిచారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్ చేశారు. టాప్-5లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా అలీ రెజా పేరును వారు వెల్లడించారు. దీంతో అలీ రెజా హౌజ్ నుంచి బయటకు వచ్చి హోస్ట్ నాగార్జునతో ముచ్చటిస్తూ.. తన అనుభవాలు పంచుకున్నారు. టాప్-5లో ఐదుగురు కంటెస్టెంట్లలో నేడు ముగ్గురు ఎమిలినేట్ అవనుండగా.. ఒకరు విజేతగా, మరొకరు రన్నరప్‌గా నిలువనున్నారు. 17 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన రియాటీ షో ఈసారి ప్రేక్షకులను గణనీయంగా అలరించిన సంగతి తెలిసిందే. జులై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ త్రీ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు శ్రీముఖి, రాహుల్ సిప్లింగజ్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. పేరు ఘనం ఫలితం శూన్యం అన్న చందంగా తయారైంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్‌బాస్ యాజమాన్యం తీవ్ర కసరత్తులే చేస్తుంది. జనాల్లో కొద్దో గొప్పో పేరు సంపాదించుకున్న వారినే షోకు ఎంపిక చేసుకుంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో నియమనిబంధనలను అతిక్రమించకుండా, వందరోజులు హౌస్‌లోనే ఉండేలా బాండ్ రాయించుకుంటుంది. అయితే.. షో తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయని భావించిన కంటెస్టెంట్ల గంపెడాశలపై బిగ్‌బాస్ నీళ్లు చల్లుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. షో నిర్వహించే వారికి మంచి టీఆర్పీ రేటింగ్‌తో భారీగానే గిట్టుబాటు అవుతుంది.. కానీ అందులో పాల్గొన్నవారికి మాత్రం అంతకుమునుపు ఉన్న పేరు కూడా ఊడిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆ హడావుడి ఏమైంది? అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తారలు.. బిగ్‌బాస్ షో తర్వాత చేతిలో ఏ ప్రాజెక్టు లేక ఈగలు తోలుకుంటున్నారు. జనాలు వారి పేర్లను కూడా మర్చిపోతున్నారంటే వారి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ 1 విజేతగా నిలిచిన శివబాలాజీ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ కిరీటం గెలిచాడన్న మాటే గానీ అది అతని జీవితానికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. అంతకుముందు చకచకా సినిమాలు చేసుకుంటూ పోయిన శివబాలాజీ బిగ్‌బాస్ తర్వాత అడపాదడపా సినిమాల్లో మాత్రమే కనిపించాడు. అంతదాకా ఎందుకు? అందులో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు పత్తాలేకుండా పోయారు. ఏ ఒకరిద్దరికో తప్పితే ఎవరికీ పాపులారిటీ రాలేదు. ఇక రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించాలంటూ ఆర్మీల పేరిట ర్యాలీలు చేస్తూ నానాహడావుడి చేశారు. కప్పు కొట్టాక భవిష్యత్తు ఏంటి? బిగ్‌బాస్ షో తర్వాత కౌశల్ సినిమాల్లోకి రానున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ పరిస్థితి తలకిందులైంది. కేవలం టీవీ ఇంటర్వ్యూలకు, షాప్ ఓపెనింగ్లకు మాత్రమే అతను పరిమితమైపోయాడు. మెల్లిమెల్లిగా మీడియా కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. మొత్తానికి గత రెండు సీజన్ల విజేతలకు ప్రైజ్‌మనీ తప్పితే అంతకుమించి ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్ షో తర్వాత వాళ్లిప్పుడు కనిపించకుండా పోయారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు టైటిల్ కోసం నువ్వా నేనా అని పోరాడుతున్న శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలిచినా.. తర్వాత వారి పరిస్థితి కూడా ఇంతేనా అని ప్రేక్షకులు పరిపరివిధాలా ఆలోచిస్తున్నారు. -
గ్రాండ్ ఫినాలే: ఎలిమినేట్ అయింది ఎవరు?
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు కదిలి వచ్చారు. వారి అందచందాలు, ఆటపాటలతో స్టేజ్‌ను ఊపేయనున్నారు. సినీ తారలు అంజలి, క్యాథరిన్, రాశి ఖన్నా గ్రాండ్ ఫినాలేకు విచ్చేసి సందడి చేశారు. రాశిఖన్నా ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్ కులకర్ణి పాడిన ‘రాములో రాములా..’ పాటతో స్టేజీ హోరెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో నేటి ఎపిసోడ్ టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనకు పునర్నవి ఇష్టమైన కంటెస్టెంట్ అని చెప్పడంతో ఆమె సిగ్గులు ఒలకబోసింది. ఇక బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు తారలతోపాటు ఇంటి సభ్యుల కుటుంబాలు కూడా విచ్చేశాయి. ఇక బిగ్‌బాస్‌ను ఇంటికి రమ్మన్న క్రేజీ బామ్మ హైలెట్‌గా నిలుస్తోంది. ఆమె మాటలకు ముగ్ధుడైపోయిన నాగార్జున బామ్మకు లవ్యూ చెప్పాడు. వచ్చిన సెలబ్రిటీలు టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయనున్నారు. చివరగా మిగిలే ఇద్దరిలో విజేత ఎవరనేది ప్రత్యేక అతిథి ప్రకటిస్తాడు. ఆ స్పెషల్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని టాక్. ఇక ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్.. అంజలి, రాశి ఖన్నాకు అప్పగించాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఎవర్ని ఎలిమినేట్ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొదటగా ఇంటి నుంచి అలీ ఎలిమినేట్ అయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. Are you ready to watch the GRAND FINALE of #BiggBossTelugu3?? .. Sunday evening is going to be too much fun with many more surprises!!! #BB3TeluguFinale Starts today at 6 PM on Star Maa pic.twitter.com/5BLKsfg3CS — STAR MAA (@StarMaa) November 3, 2019 -
‘షూటింగ్ అయినా మానేస్తా.. బిగ్‌బాస్ కాదు’
17 మంది కంటెస్టెంట్లు... మిగిలింది అయిదుగురు ఇంటి సభ్యులు. జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్ 3 తెలుగు నేడు అంతే ఘనంగా ముగియనుంది. నేటి గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటు గ్రాండ్ ఫినాలేను దుమ్ములేపడానికి బిగ్‌బాస్ యాజమాన్యం రంగస్థల నటులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్లయితే బుల్లితెర యాంకర్లు, పలువురు సెలబ్రిటీలు కూడా ఫినాలేకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ‘షూటింగ్ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్ మాత్రం మానను’ అని చెప్పుకొచ్చాడు. ఇక సెలబ్రిటీల హంగామాతో స్టేజీ దద్దరిల్లేట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లీకుల ప్రవాహం కొనసాగుతోంది. రాహుల్, వరుణ్‌లు బయటికి వచ్చేసి డాన్సులు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి ఎంతమాత్రం నిజం కాదని కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. గతంలో శ్రీముఖి విన్నర్ అంటూ ఓ ఫొటో వైరల్ కాగా ప్రస్తుతం రాహుల్ విజేతగా నిలిచాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీటన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ నాగార్జున గ్రాండ్ ఫినాలే నేడు లైవ్ జరగబోతుందని బాంబ్ పేల్చాడు. ఇక నేటి గ్రాండ్ ఫినాలే సాయంత్రం 6 గంటకు ప్రసారం కానుంది. The Final Day and the stage is set for #BiggBossTelugu3 Grand Finale!!! #BB3TeluguFinale Today at 6 PM on @StarMaa pic.twitter.com/DshbdzMNnc — STAR MAA (@StarMaa) November 3, 2019 -
బిగ్‌బాస్ చివరి రోజు: మహేశ్ హర్ట్ అయ్యాడు
నిన్నటి ఎపిసోడ్ చూసినవారికి బిగ్‌బాస్ షో మళ్లీ మొదలైందా అన్న భావన కలిగించేలా ఉంది. అందరూ ఒకే చోటికి చేరి రచ్చరచ్చ చేశారు. పొట్టి డ్రెస్సులతో అదరగొట్టారు. ఎలిమినేట్ అయిన 17 మంది కంటెస్టెంట్లు ఆటపాటలతో బిగ్‌బాస్ హౌస్‌ను హోరెత్తించారు. ఇక మొదట్లో శత్రువులుగా మారిన రాహుల్, శ్రీముఖి అన్నీ పక్కనపెట్టేసి మళ్లీ పాత మిత్రువులుగా మారిపోయినట్టు కనిపించింది. నిన్నటి పార్టీలో రాహుల్ శ్రీముఖిని ఎత్తుకుని తిప్పాడు. ఇక వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన జాఫర్, బాబా కామెడీతో, పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. వీరి సమక్షంలో అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎవరు ఏ అవార్డు అందుకున్నారంటే.. వరుస సంఖ్య అవార్డు అందుకున్న వ్యక్తి అందజేసిన వ్యక్తి 1 పక్కా మాస్ హేమ రాహుల్ సిప్లిగంజ్ 2 అగ్నిగోళం పునర్నవి వితికా షెరు 3 సర్వజ్ఞాని జాఫర్ బాబు హేమ 4 మెరుపుతీగ శిల్పా చక్రవర్తి శ్రీముఖి 5 మిస్టర్ రోమియో అలీ రెజా రవికృష్ణ 6 బెస్ట్ కామెడీ చానల్ రోహిణి బాబా భాస్కర్ 7 సైలెంట్ కిల్లర్ అషూ రెడ్డి శివజ్యోతి 8 బెస్ట్ ఫుటేజ్ క్వీన్ హిమజ రోహిణి 9 మిస్టర్ నారద మహేశ్ విట్టా(తిరస్కరించాడు) - 10 సూపర్ స్టార్ బాబా భాస్కర్ తమన్నా 11 దివా వితికా షెరు వరుణ్ సందేశ్ 12 పటాకా ఆఫ్ హౌస్ శ్రీముఖి రాహుల్ 13 మాయలోడు రవికృష్ణ శివజ్యోతి 14 జలపాతం శివజ్యోతి రోహిణి, అషూ, రవి, అలీ, హిమజ 15 రాక్ స్టార్ రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి, వరుణ్, వితికా 16 గ్యాంగ్ లీడర్ వరుణ్ సందేశ్ మహేశ్ విట్టా అవార్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శిల్ప, మహేశ్ మెరుపుతీగ అవార్డును అందుకోడానికి మొదట శిల్పా చక్రవర్తి నిరాకరించింది. అయితే అందరూ నచ్చచెప్పడంతో ముభావంగానే అవార్డును స్వీకరించింది. ‘అసలు నాకు ఈ అవార్డు అవసరమా’ అంటూ నిరుత్సాహాన్ని వెళ్లగక్కింది. మహేశ్ కూడా నారద అవార్డు అందుకోడానికి ససేమీరా అన్నాడు. ‘ టాస్క్ కోసం వాళ్లిస్తారు. కానీ తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం’ అంటూ అవార్డును తిరస్కరించాడు. హిమజ ఓ సక్కనోడా.. పాట అందుకోగా వరుణ్ హ్యాపీడేస్ సాంగ్‌తో అందరినీ అలరించాడు. రాహుల్ పాటల హోరు అదనపు ఆకర్షణగా నిలిచింది. అందరూ మాంచి కిక్కిచ్చే పార్టీ చేసుకున్నాక ఇంటికి వీడ్కోలు పలికారు. అనంతరం బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శ్రీముఖి, వరుణ్ తిరిగి కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇక గ్రాండ్ ఫినాలే కోసం ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు వీరలెవల్లో కష్టపడుతున్నారు. డాన్స్ వచ్చినవాళ్లు, వచ్చీరాకుండా మేనేజ్ చేసేవాళ్లు, అసలు ఇప్పటివరకు డాన్స్ చేయనివాళ్లు కూడా నేటి ఎపిసోడ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరు అనేదానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి కొద్ది గంటల్లో వాటికి తెరదించుతూ ఫైనల్ విజేత ఎవరు అనేది తేలనుంది. -
ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. బిగ్‌బాస్‌లో ఫైనల్లో ఐదుగురు సభ్యులు నిలువగా.. వారిలో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ రాహుల్ సొంతం చేసుకుంటాడని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిగ్‌బాస్ విజేతగా శ్రీముఖి నిలుస్తోందని ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కాగా, ఈ సారి రాహుల్ టైటిల్ సొంతం చేసుకుంటాడని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లీక్‌లు నెటిజన్ల వాదనకు బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి. శ్రీముఖి మీద కొద్దిపాటి ఓట్ల మెజారిటీతో రాహుల్ మొదటి స్థానంలో నిలిచాడనే ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బిగ్‌బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున స్పందించారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పారు. బిగ్‌బాస్ విన్నర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరారు. విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. It’s here!! The final day of of shoot for the #BiggBossTelugu3 and it’s been an incredible journey!! It's going to be LIVE!! do not believe any scrolls, winner updates out there in the social media. Catch the Winner this evening LIVE on @StarMaa — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 3, 2019 -
పున్నమి వెన్నెల పునర్నవి
ఉయ్యాల జంపాల చిత్రంలో సునీత పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్ ప్రేక్షక, చిత్రలోకాన్ని తనవైపునకు తిప్పుకొంది. సినిమా విజయం తర్వాత చేసింది కొద్ది సినిమాలే అయినా వాసి కన్నా రాశి గొప్పది అన్నట్లుగా ఆయా సినిమాల్లో తనదైన ముద్రవేసి ముందుకు సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్–3 కంటెస్టెంట్‌గా బుల్లితెరపై తన పాపులారిటీ ఏంటో తెలియజెప్పింది. ఆమే పునర్నవి భూపాలం. కళల కాణాచి తెనాలికి చెందిన ఈ ముద్దుగుమ్మ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. సాక్షి, తెనాలి: రంగస్థలం, వెండితెరపై మెరుస్తున్న నయాతార పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. తాజాగా బిగ్ బాస్–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది. హీరోయిన్గా మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పునర్నవి జన్మస్థలం కళల తెనాలి అని చాలామందికి తెలీదు. కళల కాణాచే జన్మస్థలం.. పునర్నవి భూపాలం తలిదండ్రులు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తల్లి భాగ్యలక్ష్మిది తెనాలి. తండ్రి నగేష్‌కుమార్ విజయవాడకు చెందినవారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెల్లో రెండో అమ్మాయి పునర్నవి. తెనాలిలో జన్మించిన పునర్నవి, ఆమె అక్క, తమ్ముడిని కొన్నేళ్లపాటు ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంచారు. మాంటిస్సోరి స్కూలులో రెండేళ్లు చదివాక, విజయవాడ వెళ్లారు. అక్కడ కెనడీ ఇంటర్నేషనల్ స్కూలులో పదోతరగతి వరకు చదివింది. హైదరాబాద్‌లోని ఎల్లామే కాలేజీలో ఇంటర్, బీఏ (సైకాలజీ/ జర్నలిజం) పూర్తిచేసింది. పాఠశాల స్థాయినుంచే నటనపై ఆసక్తి విజయవాడలో హైస్కూలు చదువులో ఉండగా సమాన అనే మహిళ, స్కూలు వార్షి కోత్సవ ఈవెంట్లను నిర్వహించేవారు. అందులో పునర్నవి తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసేది. చురుకుదనం, బెరుకు లేకపోవటం, చెప్పింది చెప్పినట్టుగా చేయగల నేర్పు కలిగిన తనను, సమాన బయట ఈవెంట్లకు తీసుకెళ్లటం ఆరంభించారు. ఆ క్రమంలో ఓ జ్యూయలరీ యాడ్‌లో నగలన్నింటికీ ధరింపజేసి, పునర్నవినే మోడల్‌గా నటింపజేశారు. తొలి సినిమానే సూపర్ హిట్ టెన్త్ పరీక్షల తర్వాత కుటుంబం హైదరాబాద్‌కు మారింది. అక్కడ వేసవి సెలవుల్లో ఉండగానే సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నగేష్కుమార్తో గల స్నేహంతో ఆయన ఇంట్లోనే సినీరచయిత గుత్తి మధుసూదనరెడ్డి, దర్శకుడు విరించి వర్మలు ‘ఉయ్యాల జంపాల’ సినిమా కథాచర్చలు జరిపారు. అ సినిమాలోనే ‘హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఉంది. పునర్నవితో చేయిద్దాం’ అనగానే, సెలవులే కదా...అని సరేనన్నారు. రాజ్‌తరుణ్, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ సినిమా సూపర్‌హిట్టయింది. తర్వాత శర్వానంద్, నిత్యమీనన్‌ల ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో శర్వానంద్ కుమార్తెగా నటించిన పునర్నవికి నటిగా మంచి మార్కులే పడ్డాయి. కథానాయికగా సైతం.. చదువు కొనసాగిస్తూనే చేసిన ఈ సినిమాలతో హీరోయిన్గా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘ఉయ్యాల జంపాల’ నటనతో సురేష్ ప్రొడక్షన్స్ తీసిన ‘పిట్టగోడ’ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఆ సినిమా తర్వాత మహేశ్వరి క్రియేషన్స్ ‘ఎందుకో ఏమో’లోనూ నాయికగా నటించారు. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తీసిన ‘సైకిల్’ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. బిగ్ బాస్–2లో కంటెస్టెంట్‌గా అహ్వానం వచ్చినా, అప్పట్లో అమెరికాలోని తన సోదరి దగ్గర ఉండటంతో వీలుపడలేదు. ఈ సీజనులో బిగ్ బాస్–3లో పాల్గొన్న పునర్నవికి మంచి గుర్తింపు లభించింది. రంగస్థలంపైనా ముద్ర రంగస్థలంపైనా గల ఆసక్తితో అప్పుడప్పుడూ నటనకు ప్రాధాన్యత కలిగిన నాటకాల్లో నటిస్తూ, అక్కడా పేరుతెచ్చుకోవటం మరో విశేషం. ప్రఖ్యాత నటుడు గిరీష్కర్నాడ్ రచించిన ‘నాగమండల’ హిందీ నాటకంలో లీడ్ క్యారెక్టర్ రాణి పాత్రలో పునర్నవి నటనకు రవీంద్రభారతిలో ప్రశంసలు లభించాయి. ‘నా బంగారుతల్లి’ సినిమాతో అవార్డు గెలుచుకున్న నటుడు, దర్శకుడు రత్నశేఖరరెడ్డి దగ్గర రంగస్థల నటనలో మెలకువలు తెలుసుకున్నారు. రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన మరో నాటికలోనూ నటించారు. -
బిగ్‌బాస్ : 50 లక్షలు ఎవరివి?
తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఐదేళ్ల క్రితమే ‘ప్రత్యేక తెలంగాణ’ పేరుతో విడిపోయారుగా.. ఇప్పుడేమిటి మళ్లీ విడిపోవడం? అప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. ఇప్పుడు విడిపోయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులు. వీళ్లను విడదీసింది నాయకులు కాదు.‘బిగ్‌బాస్–3’ టీవీ షోలోని నటీనటులు. నటీనటులు కూడా కాదు. కంటెస్టెంట్లు. ఈ వంద రోజులూ ఒకరితో ఒకరు ఆడి, పాడి, పోట్లాడి.. పోటీలో చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురిలో ప్రధానంగా ఇద్దరిపైనే అందరి చూపు ఉంది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. వీళ్లిద్దరిలో ఎవరు విజేత అవుతారన్నదానిపైనా తెలుగు టీవీ వీక్షకులు రెండుగా విడిపోయారు! బిగ్‌బాస్ 3 షోలో యాభై లక్షల ప్రైజ్‌మనీని శ్రీముఖి కొట్టేస్తుందని సగం మంది. కాదు కాదు.. ఆ యాభై లక్షలు రాహుల్‌నే వరిస్తాయని మిగతా సగం మంది! మరి మిగిలిన ముగ్గురిలో అలీకి ఏం తక్కువైంది? బాబా భాస్కర్‌కి ఏం ఎక్కువైంది? వరణ్ సందేశ్‌కి ఎక్కువ తక్కువలు ఏం ఉన్నాయి? వాళ్లెందుకు మొదటి ఇద్దరిలో స్థానం సంపాదించుకోలేక పోయారు? సంపాదించుకోలేదని ఎవరన్నారు? ఈ ఐదుగురి స్థానం గత కొన్ని రోజులుగా వెనుకా ముందు, ముందూవెనుక అవుతూ.. ప్రయారిటీ లిస్ట్‌లోకి ప్రధాన పోటీదారులుగా శ్రీముఖి, రాహుల్ వచ్చేశారు. పందేలు ప్రధానంగా వీళ్లిద్దరి మధ్యే నడుస్తున్నాయి. చెప్పలేం. ఈ సాయంత్రం లోపు రాతలు తారుమారవచ్చు. వీక్షక ఓటర్లు పైకొకటి చెప్పి, లోపల ఇంకొరికి ఓటేస్తూ తమ సెల్‌ఫోన్ బటన్ నొక్కొచ్చు. అప్పుడు శ్రీముఖీ, రాహుల్ కాకుండా వేరెవరైనా విజేతలవచ్చు. వీళ్లయిదుగురి స్పెషాలిటీ ఏంటి? వీళ్లలో మళ్లీ ఆ ఇద్దరి ప్రత్యేకతలేంటి? చూసే ఉంటారుగా. రాహుల్ సిప్లిగంజ్ గాయకుడు. శ్రీముఖి యాంకర్. వరుణ్ సందేశ్ నటుడు. బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్. అలీ (అలీ రెజా).. ఇతనూ యాక్టరే. ఇతడి తొలి సినిమా ‘గాయకుడు’. రాబోయే సినిమా ‘సినీ మహల్’. వీళ్ల గురించి ఇంతవరకు చాలు. మిగతా 12 మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒకసారి ఏకబిగిన చెప్పేసుకుందాం. పాపం ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేశారు కదా. బిగ్‌బాస్ హౌస్‌లో ఆటాడింది మొత్తం 17 మంది. అంతమంది ఉన్నారా! ఉన్నారు. మీరు చూశారు. ఈ పదిహేడు మందిలో పదిహేను మంది ఒరిజినల్ కంటెస్టెంట్లు. రాహుల్, శ్రీముఖి. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి, వితిక, మహేశ్, పునర్నవి, రవికృష్ణ, హిమజ, అశురెడ్డి, రోహిణీరెడ్డి, జాఫర్ బాబు, హేమ.. వీళ్లు ఒరిజినల్. మిగిలిన ఇద్దరు.. శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయినవాళ్లు. ప్రస్తుతం మిగిలిన ఐదుగురు తప్ప అంతా ఎలిమినేట్ అయ్యారు. రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు కానీ.. అది ఫేక్ ఎలిమినే షన్. అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఇదంతా ఆటలో భాగం. బిగ్‌బాస్ మొదటి సీజన్లో విజేత శివబాలాజి. రెండో సీజన్లో విజేత కౌశల్. మొదటి రెండు సీజన్లలోనూ మగవాళ్లకే ప్రైజ్ మనీ రావడంతో ఈసారి కచ్చితంగా శ్రీముఖే గెలుస్తారని ఒక అంచనా. మొన్నటి వరకు ఆమెకు పోటీగా శివజ్యోతి ఉంటుందని భావించారు కానీ, శివజ్యోతి కూడా ఎలిమినేట్ అయిపోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనలిస్ట్‌లలో ఏకైక మహిళ అయిన శ్రీముఖికే ఎక్కువ చాన్స్ ఉందని వీక్షకులు ఊహిస్తున్నారు.అయితే శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న వీక్షకుల ఓటింగ్ అంచనాల ప్రకారం విజేతగా రాహుల్ మొదటి స్థానంలో ఉండగా, వరుణ్ సందేశ్, శ్రీముఖి.. రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. ‘యాభై లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ చెప్పిన సమాధానం కూడా వీక్షకుల గుండెల్లో హత్తుకుపోయింది. ‘ఆ డబ్బుతో బార్బర్ షాపు’ పెడతాను అని రాహుల్ అన్నాడు. కులవృత్తి మీద అతడికున్న గౌరవానికి ఆ క్షణమే బిగ్‌బాస్ వీక్షకులు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. దాంతో అతడి గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అతడికి ప్రధాన పోటీదారు అనుకుంటున్న శ్రీముఖి తరఫున పెద్ద సైన్యమే బయటి నుంచి పని చేస్తోంది. టాప్ యాంకర్‌గా ఆమెకున్న ఫాలోయింగే ఆమెను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీముఖికి ‘బుల్లితెర రాములమ్మ’ అని పేరు. సెలబ్రిటీలు సైతం ఆమెను గెలిపించమని ప్రతి వేదికపై పోస్టింగ్‌లు పెడుతున్నారు. చూద్దాం ఏమౌతుందో. విజేతలు ఎవరైనా.. స్టార్ మా చానెల్లో ఈ సాయంత్రం జరిగే ‘లైవ్’ ముగింపు కార్యక్రమం మాత్రం మూడు గంటలపాటు ఓ మహోత్సవంగా జరగబోతోంది. మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లూ మళ్లీ ప్రత్యక్షం అవుతారు. ‘షో’ హోస్ట్‌లు నాగార్జున, రమ్యకృష్ణ ఎలాగూ ఉంటారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా స్టార్ హీరో చిరంజీవి కనిపించినా ఆశ్చర్యం లేదు. ‘షో’ని హిట్ చేసిందెవరు? సందేహమే లేదు.. కంటెస్టెంట్లే! ప్రతి కంటెస్టెంటూ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అల్లరితో, కన్నీళ్లతో, ఇతరత్రా ఎమోషన్లతో అత్యంత సహజంగా బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లన్నీ పూర్తి చేశారు. ఒకరిద్దరు ఓవర్ రియాక్ట్ అయ్యారు. వాళ్లను నాగార్జున మందలించారు. సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. కొందరిని అభినందించారు. ‘షో’ బిగి తగ్గకుండా నడుపుతూ హోస్ట్ చేసిన నాగార్జున కూడా హిట్‌కు ప్రధాన కారకులే. రమ్యకృష్ణ కూడా హోస్ట్‌గా ఉన్న కొద్ది రోజులూ డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌ను చక్కబెట్టారు. -
బిగ్‌బాస్: లెక్క తేలింది. రాహుల్ గెలిచాడు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ వందరోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులను తిరగరాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించలేకపోయింది. అయితే బిగ్‌బాస్ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు.. రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ షోను గట్టెక్కించాయి. ఇన్నినాళ్ల బిగ్‌బాస్ జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురానుభూతులను మిగుల్చుకున్నారు. కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. అంతకుమించి వ్యక్తిగతంగా వారి బలాబలాలేంటో వారే క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఇక బిగ్‌బాస్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అందరినీ దాటుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు ఇంటి సభ్యులు టాప్ 5లోకి అడుగుపెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్‌లైన్ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్‌లో దుమ్ము లేపిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్‌కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడని దండోరా వేస్తున్నారు. కౌశల్, రాహుల్.. సేమ్ టు సేమ్ రాహుల్ గెలిచాడన్న విషయం తెలుసుకున్న చిచ్చా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాహుల్ షో మొదటి నుంచి బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాస్క్‌లు సరిగా ఆడడని, ప్రతీదానికి గీవప్ అంటాడంటూ ఇంటి సభ్యులు 11సార్లు నామినేట్ చేశారు. విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్‌దే పైచేయి అవుతూ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులకు రాహుల్‌కు ఉన్న ఫాలోయింగ్ అర్థమైంది. పునర్నవితో పులిహోర కలుపుతున్నాడు అన్నవాళ్లే పున్ను ఎలిమినేట్ అయ్యాక రాహుల్ పూర్తిగా ఆటపైనే దృష్టిపెట్టి ఆడిన తీరు చూసి అతనికి ఓట్లు గుద్దేశారు. కాగా గత సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్ కూడా 11 సార్లు నామినేట్ అవడం విశేషం. రన్నర్‌గా శ్రీముఖి..? మొన్నటివరకు టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి.. రాహుల్‌కు వచ్చిన ఓట్ల సునామీలో కొట్టుకుపోయిందని లీకువీరులు జోస్యం చెప్తున్నారు. అయితే షో ప్రారంభం నుంచి వాళ్లు చెప్పేవి దాదాపుగా నిజమవుతూ వచ్చినప్పటికీ కొన్నిసార్లు బొక్కబోర్లా పడ్డ సందర్భాలూ లేకపోలేదు. పైగా బిగ్‌బాస్ టీంలో శ్రీముఖిని సపోర్ట్ చేసేవారు ఉన్నారని, కనుక ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి బిగ్‌బాస్ 3 విజేత ఎవరో అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూద్దాం. (చదవండి: బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పిన కంటెస్టెంట్లు) -
బిగ్‌బాస్ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!
ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన బిగ్‌బాస్ షోకు రేపు శుభం కార్డు పడనుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు వారి జీవితానికి సరిపడా అనుభూతులను మిగిల్చుకున్నారు, జీవితంలో అవసరమయ్యే మెళకువలను నేర్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సర్ప్రైజ్లు, ట్విస్ట్‌లు, షాక్‌లు ఇచ్చిన బిగ్‌బాస్ చివరగా అవార్డులను అందజేసి వాళ్లను సంతోషపెట్టనున్నాడు. అగ్ని గోళం, ఫుటేజ్ కింగ్, పక్కా మాస్.. ఇలాంటి ఎన్నో అవార్డులను నేడు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు అందజేయనున్నాడు. దీనికోసం ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో పార్టీ మొదలుపెట్టేశారు. ఈ పార్టీలో జరిగే అవార్డుల కార్యక్రమానికి జాఫర్, బాబా భాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా వారి కామెడీతో పార్టీ అదిరిపోయేట్టు కనిపిస్తోంది. ఈ పార్టీలో బిగ్‌బాస్ హౌస్ టాప్ లేచిపోయేలా ఇంటి సభ్యులు రచ్చ చేస్తున్నారు. గతంలో తన పాటతో మిగతా ఇంటి సభ్యులను గడగడలాడించిన హిమజ పార్టీలో మరోసారి గళాన్ని వినిపించనున్నట్లు కనిపిస్తోంది. దీంతో ‘మళ్లీనా’ అంటూ పునర్నవి పంచ్ వేసింది. ఇక ఆటపాటలు, సెటైర్లు, ఎంటర్టైన్మెంట్ వెరసి ఇంటి సభ్యుల జోష్ పీక్స్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో గడిపేందుకు ఇంటి సభ్యులకు నేడే ఆఖరి రోజు. దీంతో హౌస్మేట్స్ భావోద్వేగంతో బిగ్‌బాస్ బైబై చెప్తున్నారు. రేపటితో షో ముగుస్తుండటంతో బిగ్‌బాస్‌ను ఆరాధించే అభిమానులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. Last day at #BiggBossTelugu3 house...Time to celebrate!!! Today at 9 PM on @StarMaa pic.twitter.com/jsglNYVwFZ — STAR MAA (@StarMaa) November 2, 2019 So many memories, so many emotions. All coming to an end. Last day in #BiggBossTelugu3 house Today at 9 PM on @StarMaa pic.twitter.com/0Faz0MPMEk — STAR MAA (@StarMaa) November 2, 2019 -
శ్రీముఖి విన్నర్ కాదంటున్న ఆమె తమ్ముడు
బిగ్‌బాస్ షో ఆఖరి అంకానికి చేరుకోవడంతో ఎవరు విజేతగా నిలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరు అన్న అంశంపై జనాలు బుర్ర బద్ధలు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. వందరోజుల పోరాటానికి సెలవు పెట్టి కంటెస్టెంట్లు హాయిగా ఉండగా వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. కొంతమందైతే ఓ అడుగు ముందుకేసి అభిమానుల కోసం పాటలు, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టారు. కొత్త తరహా ప్రచారాలు కూడా ఈ సీజన్లో తెరపైకి వచ్చాయి. బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దండంటూ గళం వినిపించారు. శుక్రవారంతో ఓటింగ్ ముగియడంతో ప్రచారాలకు ముగింపు పలికిన ఫ్యాన్స్ గెలిచిన కంటెస్టెంట్ వీరే.. అంటూ మళ్లీ వార్ మొదలుపెట్టారు. కాగా ఈపాటికే విన్నర్ ఎవరో డిసైడ్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి బిగ్‌బాస్ టైటిల్‌తో కనిపిస్తుంది. స్టేజీపై ఉన్న నాగార్జున టైటిల్ గెలుచుకున్న శ్రీముఖిని అభినందించడం ఫొటోలో చూడవచ్చు. బిగ్‌బాస్ షోను ఆదరించే అభిమానులు ఈ ఫొటో చూసి గందరగోళంలో పడ్డారు. ఇది నిజమేనా అంటూ తలలు పట్టుకున్నారు. దీంతో ఈ వైరల్ ఫొటోపై శ్రీముఖి సోదరుడు శుశ్రుత్ నోరు విప్పాడు. ‘అది ఫేక్ ఫొటో, ఇంకా ఫినాలే పూర్తవలేదు, ఎవరూ దాన్ని నమ్మకండి’ అంటూ జనాలకు క్లారిటీ ఇచ్చాడు. దీంతో మిగతా కంటెస్టెంట్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
పున్నును ఎత్తుకున్న రాహుల్, మొదలుపెట్టారుగా
రేపటితో బిగ్‌బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. హలో యాప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులను బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను కలుసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే వారు ఆకస్మాత్తుగా ఇంట్లోకి రావటంతో ఇంటి సభ్యులు మొదట షాకింగ్‌కు గురయ్యారు. అనంతరం తేరుకున్న హౌస్మేట్స్ వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారు వెళ్లిపోయిన తర్వాత బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రత్యేక అతిథులను పంపించారు. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. మొదటగా రవి హౌస్‌లో అడుగుపెట్టగా అలీ వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఇంటి సభ్యులందరూ రవికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశిండంతో ఇల్లు కళకళలాడింది. వారి అల్లరితో మళ్లీ పాత రోజులు గుర్తుకు చేశారు. ఇక పునర్నవి ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్రీముఖి చంటిపిల్లలా ఎత్తుకుని ‘కరెక్ట్ ప్లేస్‌లో దింపుతా’నంటూ రాహుల్ దగ్గర వదిలిపెట్టింది. దీంతో రాహుల్ పునర్నవిని ఎత్తుకుని స్వాగతం పలికాడు. అనంతరం రాహుల్.. ‘బయట ఎలా ఉంద’ని ఆరా తీశాడు. ‘రెండువారాల్లో కొత్త బెస్ట్‌ఫ్రెండ్స్ అయ్యారు కదా.. నేనేం చెప్పినా ఫేక్ అనిపిస్తది, ఎందుకంటే నేను ట్రూ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా’ అని పునర్నవి వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ‘ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్..’ అని పునర్నవి అనగా ‘నీతో తిరిగి తిరిగి వచ్చింది’ అని రాహుల్ పంచ్ వేశాడు. ‘సెన్స్ కూడా నాలా వస్తే బాగుండేది’ అని పున్ను రివర్స్ కౌంటర్ వేసింది. ఇక పొట్టి డ్రెస్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నాను ‘రంభలా రెడీ అయి వచ్చిందే’ అంటూ బాబా కామెంట్ చేశాడు. తన స్నేహితుడైన జాఫర్పైనా బాబా పంచ్‌లు విసిరాడు. అందరూ ఒకేచోటికి చేరడంతో బిగ్‌బాస్ ఇల్లు.. ఆనందాల హరివిల్లుగా మారింది. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ వీడియోను ప్లే చేశాడు. వారి ఆటపాటలు, అల్లరి జ్ఞాపకాల మేళవింపుతో చేసిన వీడియో చూశాక తమన్నా కాస్త ఎమోషనల్ అయింది. బాధపెట్టినందుకు క్షమించమంటూ రవి చేయి పట్టుకుని కన్నీళ్లతో అర్థించింది. పర్వాలేదు అంటూ రవి ఆమెను ఊరడించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో పార్టీ జరుగుతోంది. దీనికోసం ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. ఈ పార్టీలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అవార్డుల ఎంపికకోసం ఇంటి సభ్యుల సమాధానాలను బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు. మరి ఈ పార్టీలో రచ్చ ఏరేంజ్‌లో ఉండబోతుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ టైటిల్ తన్నుకుపోయే ఆ ఒక్కరు?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్3 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తెలుగునాట అందరూ బిగ్‌బాస్ జపం చేస్తున్నారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు పక్కవాళ్ల ఫోన్లు లాక్కుని మరీ ఓట్లు గుద్దుతున్నారు. అంతేనా, ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్ సమరంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్‌లో సమాధానం దొరకనుండగా.. ఇప్పటినుంచే జనాలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్‌కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్‌లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్లరేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్ ప్రస్తుతం శ్రీముఖిని అధిగమించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్‌ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది. -
శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..
బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతీ ఇంటి సభ్యుడికి ఒక్కో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో లౌడ్ స్పీకర్ అన్న క్యాప్షన్‌ను శ్రీముఖికి ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్ టాప్ లేచిపోయేలా అరుస్తుంది. అయితే ఈ అల్లరి అరుపులతో శ్రీముఖికి అభిమానులు సొంతమయినట్టే ఇదేం గోల అని ముఖం తిప్పుకునేవారూ లేకపోలేరు. ఇప్పటిదాకా టైటిల్ కోసం ఇంటి సభ్యులు ఎన్నో ఫీట్లు చేశారు. ఇప్పుడు వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా హోరాహోరీ ప్రచారాలతో ఓట్ల యుద్ధానికి దిగారు. ఫలితం నిర్ణయించడానికి నేడే ఆఖరి రోజు కానుండటంతో ప్రచారాన్ని మరింత ఉదృతం చేశారు. ఇప్పటికే శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో వినూత్న ప్రచారానికి దిగింది. వరుణ్ కోసం అభిమానులు ఓ పాటతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇదే ఫార్ములాను శ్రీముఖి అభిమానులు ఫాలో అయ్యారు. ఇందుకోసం లేటెస్ట్ మూవీ ‘సైరా’ను వాడుకున్నారు. సైరా టైటిల్ సాంగ్‌ను శ్రీముఖి కోసం పేరడీ చేశారు. బిగ్‌బాస్ 3 టైటిల్ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్ఫుల్ లైన్లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. బిగ్‌బాస్ హౌస్‌లో సాగిన జర్నీని ప్రతిబింబించేలా వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు నూతనోత్సాహంతో ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా గెలుపు ఒక్కరిదే. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ ఓటింగ్‌లో దూసుకుపోతుండగా వీరిమధ్యే ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరు టైటిల్‌ను ఎగరేసుకుపోతారనేది సస్పెన్స్‌గా మారింది. View this post on Instagram Another super-duper gift from fans, with #syera remix song 😍😍😍 Amazing lyrics👌🏼Thanks to each and everyone for all ur support till now and few hrs left to close the voting lines. Please keep voting and we all together make #Ramulamma WINNER. To Vote through Calls,📱Give a (50) Missed Calls to 8466996713 & Login to #Hotstar app and cast your (10) votes to #Sreemukhi. #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI #SreemukhiMania #TeamSreemukhi #biggbosstelugu3 #StarMaa #AllRounder #energetic A post shared by Sreemukhi (@sreemukhi) on Nov 1, 2019 at 1:41am PDT -
బిగ్‌బాస్: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారబోతోంది. ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా? అని అనుకోకండి. గతంలో ఎలిమినేట్ అయినవారినే తిరిగి హౌస్‌లోకి రప్పించనున్నారు. బిగ్‌బాస్ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. వీరు చేసే అల్లరితో నేటి ఎపిసోడ్ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హేమ జాఫర్, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టారో మళ్లీ అంతా అక్కడికే చేరినట్టు తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టింది. It's time for a grand reunion of #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/OnXlfhsXwm — STAR MAA (@StarMaa) November 1, 2019 -
శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..
బిగ్‌బాస్ షో తుది ఘట్టానికి చేరుకుంది. 15 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో మరో రెండు వైల్డ్ కార్డులు వచ్చి చేరగా ప్రస్తుతం ఇంట్లో అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్‌బాస్ వందరోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆటుపోట్లు, ఆటపాటలు, గొడవలు, గిల్లికజ్జాలు అన్నింటితో మిళితమైన జర్నీ వీడియోలు చూశాక ఇంటి సభ్యులు తెలీని ఫీలింగ్‌లో ఉండిపోయారు. ఇప్పటికే రాహుల్, వరుణ్, బాబా తమ జర్నీ చూసి ఎమోషనల్ అయ్యారు. తాజా ఎపిసోడ్లో శ్రీముఖి, అలీకి బిగ్‌బాస్ జర్నీ వీడియోను చూపించాడు. దానికన్నా ముందు వారి ఆటతీరును, సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ప్రస్తావించాడు. శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు ‘బిగ్‌బాస్’ ‘శ్రీముఖి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టకముందు తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారు. కానీ ఈ ప్రయాణం శ్రీముఖిని ప్రతీ ఒక్కరి ఇంట్లో అమ్మాయిగా మార్చింద’ని బిగ్‌బాస్ తెలిపాడు. ‘ఎప్పుడూ అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉండే శ్రీముఖిని ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించార’ని బిగ్‌బాస్ ప్రశంసించాడు. దీంతో శ్రీముఖి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. జీవితానికి ఇది చాలు అని సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో కొంత సాధించానన్న ఫీలింగ్ కలిగిందని ఆనందంతో తేలియాడింది. తన జీవితంలోనే ఇవి మధుర క్షణాలు అని పేర్కొంది. అనంతరం అలీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లాడు. ఆటలో దూకుడు, ప్రతీ టాస్క్‌లో చూపించిన శ్రద్ధే అలీని ఇక్కడివరకు తీసుకువచ్చాయని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. యంగ్‌స్టార్ బిరుదు దక్కించుకున్న అలీ రెజా ‘టాస్క్‌ల్లో ఉత్సాహం వల్ల కొన్నిసార్లు శిక్ష అనుభవించారు. కానీ ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూ వచ్చారు. మీరు రెండోసారి ఇంట్లోకి వచ్చినపుడు పరిస్థితులు, మనుషులు అన్నీ మారిపోయాయి’ అని చెప్తూ అలీకి జర్నీ వీడియోను చూపించాడు. అతనికి ‘యంగ్ స్టార్’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశాడు. ఎమోషనల్ అయిన అలీ.. రీఎంట్రీ అవకాశాన్నిచ్చిన బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితాంతం బిగ్‌బాస్ జర్నీ గుర్తుండిపోతుందన్నాడు. అనంతరం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ సీజన్‌తోపాటు ఇంటి గురించి సైతం యాడ్స్ చేయమని ఆదేశించాడు. ఈ టాస్క్‌లో హౌస్మేట్స్ రెచ్చిపోతూ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. -
నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి
తెలంగాణ భాష, యాసను వినిపించి బిగ్‌బాస్ సీజన్– 3 హౌజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి శివజ్యోతి టాప్– 5లో ఉంటానని ఆశించారు. ఓట్ల శాతం తగ్గడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఆదివారం హౌజ్ నుంచి బయటకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఆమె తెలంగాణ యాసను నమ్ముకొని అక్కడి నుంచి ప్రయాణమై జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టారు. అక్కడ మహామహులను ఢీకొట్టి 14 వారాలపాటు తెలంగాణ భాషతో అందరినీ ఆకట్టుకున్నారు. ఏకంగా బిగ్‌బాస్‌తోనే తెలంగాణ భాషను పలికించారు. బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో తెలంగాణ యాసలోనే మాట్లాడించిన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేనిదని ఆమె వెల్లడించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఆమె ప్రయాణం.. ఎలిమినేషన్ దాకా దారి తీసిన పరిస్థితులు భవిష్యత్ వ్యూహాలపై తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. – బంజారాహిల్స్ మావారే స్ఫూర్తి.. మాది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఇంటర్ వరకు చదివాను. నాన్న రాజమల్లేష్ ఆర్ఎంపీ. అమ్మ లావణ్య ఇప్పటికీ బీడీలు చుడుతుంది. నాకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. నా భర్త గంగూలీది కూడా మా ఊరే. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భర్తే నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం. ఎంతో గర్వంగా ఫీలయ్యేదాన్ని.. నేను ఆరేళ్ల క్రితం తార్నాకలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి గమనించారు. నీ భాష, యాస బాగున్నాయమ్మా ఫలానా చానెల్లో ఇలాంటి గొంతు కోసం చూస్తున్నారని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఓ చానెల్లో చక్కని అవకాశం, గుర్తింపు వచ్చింది. నా భాషనే నన్ను అందలం ఎక్కించింది. ఆ యాసనే నన్ను బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చింది. నాకు ఇంతకంటే ఏం కావాలి. పొల్లుపోకుండా ప్రతి మాటను నా భాషలో మాట్లాడుతుంటే అందరూ ఎంతో ఆసక్తితో వినేవారు. ఇది నాకు చాలా గర్వంగా ఉండేది. కేసీఆర్ మాట్లాడుతుంటే కూడా ఇలాగే వినాలనిపిస్తుందని ఓ కంటెస్టెంట్ చెప్పిన మాటలు నాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. ఆ ఆనందం వర్ణనాతీతం నేను బిగ్‌బాస్ హౌజ్‌లోకి జూలై 21న అడుగు పెట్టాను. అక్టోబర్ 26న హౌజ్ నుంచి బయటకు వచ్చాను. 98 రోజుల పాటు నా ఆనందం వర్ణనాతీతం. హౌజ్‌లో ఎవరితోనూ గొడవలు లేవు. కాకపోతే అలీ, రవికృష్ణ, హిమజ, రోహిణి, అశురెడ్డి తదితరులు నా బెస్ట్ ఫ్రెండ్స్. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా మేము మా స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మిగతావారితో కూడా క్లోజ్‌గానే ఉండేదాన్ని. క్వాలిటీస్ స్ట్రాంగయ్యాయి ఈ 98 రోజుల జర్నీలో నా క్వాలిటీస్ మరింత స్ట్రాంగయ్యాయి. నేను చాలా మొండిదాన్ని. ఓపిక కూడా చాలా తక్కువ. ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకున్నాను. నేను సోది చెప్పకుండా మొహం మీదే మాట్లాడేస్తాను. బయట కూడా నేను ఇలాగే ఉంటాను. బిగ్‌బాస్ హౌజ్‌లో నుంచి గత ఆదివారమే బయటికి వచ్చాను. మూడు రోజలు పాటు నా బంధుమిత్రులతో కలుస్తున్నాను. మరో మూడు రోజుల్లో ఫైనల్ పోటీలున్నాయి. నేను కూడా హాజరు కావాల్సి ఉంది. ఫైనల్ తర్వాత నా భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. రెండు టీవీ చానెళ్లు నన్ను ఆహ్వానిస్తున్నాయి. ఎందులోకి వెళ్తానో వారం రోజుల్లో తెలిసిపోతుంది. కలలో కూడా అనుకోలేదు.. భారీ అంచనాలతో నేను హౌజ్‌లోకి అడుగు పెట్టలేదు. నాతో పోటీ పడుతున్న వాళ్లను చూస్తే మొదట్లోనే చివరిదాకా ఉంటానా అని అనిపించింది. కానీ 14 వారాల జర్నీ నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక్కడిదాకా వస్తానని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే టాప్– 5లో ఉండి ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నా. ఇక చాలు.. చాలా మంది వచ్చే సీజన్లో అవకాశం ఇస్తే వెళ్తారా అని నన్ను అడుగుతున్నారు. మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను. ఎందుకంటే బిగ్‌బాస్ హౌజ్‌లో నేను ప్రతి స్కిట్లోనూ, టాస్క్‌లోనూ పాల్గొన్నాను. ఆడాను.. పాడాను.. అందరితో ఆనందాన్ని, బాధను పంచుకున్నాను. పచ్చిపులుసు.. అదుర్స్ నేను తెలంగాణ సంప్రదాయ వంటకం పచ్చిపులుసుతో అందరినీ ఆకట్టుకున్నాను. టమాటా రసం, సాంబారు చేసినా కంటెస్టెంట్లు మాత్రం ఎక్కువగా పచ్చి పులుసునే తినేవారు. నేను హౌజ్ నుంచి బయటికి వచ్చే రోజు కూడా పచ్చిపులుసుతోనే అందరికి వంటలు వండిపెట్టాను. నాకు కాకరకాయ కూర అంటే కూడా బాగా ఇష్టం. నేను వండిన ప్రతీ వంటకం అందరికీ నచ్చేది. -
‘రాహుల్‌ను గెలిపించండి’
-
బిగ్‌బాస్: ‘రాహుల్‌ను గెలిపించండి’
బిగ్‌బాస్ 3 టైటిల్ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్ మాత్రం రాహుల్, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్ ఫినాలేనాడు తేలనుంది. మరోపైపు రాహుల్ సిప్లిగంజ్ కోసం ప్రముఖ సింగర్ నోయెల్ గట్టి ప్రచారమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇంకాస్త డోస్ పెంచుతూ రాహుల్ తల్లి రంగంలోకి దిగింది. ఇంతకు మునుపు బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన రాహుల్ తల్లి ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచుకుంది. హౌస్‌ను వీడి వెళ్లేముందు రాహుల్‌కు టాస్క్‌లు బాగా ఆడమని సూచించింది. అమ్మ మాట రాహుల్‌కు టాబ్లెట్లా పనిచేసిందేమో! తర్వాతి టాస్క్‌ల్లో తానేంటో నిరూపించుకుని టికెట్ టు ఫినాలే అందుకున్న ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి రాహుల్.. అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ టైటిల్ కావాలని ఆమె రాహుల్ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ మంచితనం, నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించమని కోరింది. మరి చిచ్చా(రాహుల్) ఫ్యాన్స్ అమ్మ మాట నెరవేరుస్తారో లేదో చూడాలి! -
ఆ ఇద్దరికే సపోర్ట్ చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
టైటిల్ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హౌస్‌మేట్స్‌తో పాటు ఆయా ఇంటి సభ్యుల అభిమానులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్ రష్మీ మద్దతు తెలుపగా.. రాహుల్‌కు పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్ పంచ్‌ల యాంకర్ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో సింగర్ గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్ 3పై స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్ ద బెస్ట్ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్ గెలిచినా ఓకే అని స్పష్టమవుతోంది. View this post on Instagram All the best to my friends @sreemukhi @sipligunjrahul @itsvarunsandesh @baba_bhasker @i.ali.reza Show choosi meeku nachina vaallaki vote cheyandi A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on Oct 27, 2019 at 12:17pm PDT అయితే.. ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనేదానిపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్ రెండు టీంలుగా విడిపోయి రాహుల్, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు. ఇక వాళ్లిద్దరిలోనే ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నప్పుడు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం ఎందుకని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురి బిగ్‌బాస్ ఐ లోగోను పచ్చబొట్టు వేయించుకుంది. ఈ సీజన్లో శ్రీముఖి ‘బిగ్‌బాస్ కన్ను’ను పచ్చబొట్టు వేయించుకోవటంతో ఆమె కూడా రన్నరప్‌గా నిలుస్తుందని కొంతమంది నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి శ్రీముఖి టైటిల్ సాధిస్తుందా? తడబడుతుందా అనేది చూడాలి. మరోవైపు మొదటి సీజన్లో టాప్ 3లో చోటు దక్కించుకున్న హరితేజ.. తన ఫేవరెట్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రాహుల్ అని చెప్తూ.. ఆ ఇద్దరికీ టైటిల్ గెలిచేందుకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది. View this post on Instagram Two very close friends of mine are in finals And it’s time for us to show them our love. Do vote for the person you love. #biggboss3 @sipligunjrahul @sreemukhi All the best to u guys ❤️❤️ Much love❤️ A post shared by hariteja (@actress_hariteja) on Oct 30, 2019 at 10:36am PDT -
బిగ్‌బాస్ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా
బిగ్‌బాస్ తెలుగు 3 రియాలిటీ షో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్నిరోజులుగా కలిసి ఉన్న ఇంటి సభ్యులు మరో రెండు మూడు రోజుల్లో విడిపోనున్నారు. బిగ్‌బాస్ షో అనేది వారి జీవితంలో మధురానుభూతుల పేజీగా మిగిలిపోనుంది. అయితే ఇన్ని రోజులు హౌస్‌లో ఎలా ఉన్నారో, వారేంటో వాళ్లకే చూపించడానికి బిగ్‌బాస్ రెడీ అయిపోయాడు. ఈ మేరకు ఇప్పటికే వరుణ్, రాహుల్, బాబా భాస్కర్లను ఒక్కొక్కరిగా పిలిచి బిగ్‌బాస్ ఇంట్లో కొనసాగిన జర్నీ వీడియోను చూపించాడు. అది చూస్తూ హౌస్మేట్స్ ఎమోషనల్ అవడంతోపాటు ఇంతమంచి చాన్స్ ఇచ్చిన బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన ఇంటి సభ్యులైన శ్రీముఖి, అలీ రెజాకు నేటి ఎపిసోడ్లో వారి బ్యూటిఫుల్ జర్నీని చూపించనున్నాడు. తాజా ప్రోమోను చూసినట్టయితే జర్నీ వీడియోను చూస్తున్న అలీ, శ్రీముఖిలు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో హౌస్‌లోని జ్ఞాపకాలను చూసి సంతోషంతో మురిసిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్‌బాస్ ఇంట్లో ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ ఏడిపించేస్తున్నాడు. నేడు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషన్ బాగానే పండనుందని స్పష్టమవుతోంది. మరి మిగతా హౌస్మేట్స్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! Beautiful journey of #Sreemukhi & #AliReza Tonight!!!#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/AlupHOMdqM — STAR MAA (@StarMaa) October 31, 2019 -
బిగ్‌బాస్: వాళ్లకు సోషల్ మీడియా అంటే ఏంటో తెలీదు!
బాబా భాస్కర్.. ‘ఎంటర్టైన్మెంట్ కా బాప్, టాస్క్‌లో తోపు, వర్క్‌లో తోపు, డాన్స్ కా కింగ్, నో బ్యాక్ బిచ్చింగ్, లవ్స్ ఎవ్రీ వన్’ ఇది ఓ అభిమాని చెప్పిన మాట. అయితే ప్రేక్షకులు కూడా దీన్ని ఎంతో కొంత ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. గుండెలో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తాడని స్వయంగా బిగ్‌బాసే పేర్కొన్నాడు. ఇక వచ్చీరాని తెలుగుతో ఆయన ఆపసోపాలు పడ్డా.. అవి కూడా నవ్వు తెప్పించేవి. బాబా భాస్కర్ అంటే ఇంటి సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. కానీ, అదే సమయంలో బాబా ‘మాస్కర్’ అన్న పేరును సంపాదించుకున్నాడు. బాబా ఒంటరి పోరాటం సోషల్ మీడియాలో.. బాబా భాస్కర్ ‘ఎంటర్టైన్మెంట్ కింగ్’ అని ఆయన అభిమానులు చెప్పుకొస్తుంటే, బాబా ‘మాస్కర్’ అంటూ ఆయనంటే గిట్టనివాళ్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై బాబా స్నేహితుడు, రెండోవారంలోనే ఇంటి బాట పట్టిన హౌస్‌మేట్ జాఫర్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా బాబాపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్న ప్రతీ ఒక్కరికీ బయట ఎవరో ఒకరి సపోర్ట్ ఉందని, కొంతమందికైతే ఏకంగా సోషల్ మీడియా మేనేజర్స్ మద్దతు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది అని పేర్కొన్నాడు. కానీ ఎలాంటి అండదండలు లేని ఏకైక వ్యక్తి బాబా భాస్కర్ మాత్రమేనన్నాడు. బాబాను ‘మాస్కర్’ కాదు: పైర్ బాబా భాస్కర్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా అంటేనే తెలియదని, దానిపై కనీస అవగాహన కూడా లేదని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆట కోసమో, టైటిల్ కోసమో మాస్కులు వేసుకునే తత్వం బాబాది కాదని ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో టాప్-5కు చేరుకున్న ఇంటి సభ్యుల కోసం బయట గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కానీ బాబాకు మాత్రం ప్రచారం చేసే ఆర్మీలు కానీ మద్దతుగా నిలిచే సెలబ్రిటీలు గానీ లేరు. అయితే.. ఓట్ల కోసం ఎలాంటి జిమ్మిక్కులు చేయకపోయినా బాబా గెలుపు కోసం చాలామందే పోరాడుతుండటం విశేషం. -
బిగ్‌బాస్ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి
మూడు రోజుల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్ అతని గ్రాఫ్‌ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్‌బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్‌ను ‘మిస్టర్ కూల్, ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ పర్ఫెక్ట్’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్‌బాస్ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్‌లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాహుల్‌ను చూసి గర్వించిన బిగ్‌బాస్.. అనంతరం రాహుల్ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్‌ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్ అయిన రాహుల్ వెంటనే తేరుకుని బిగ్‌బాస్‌కు కృజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్.. ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్.. ఈ పేరు వింటే డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్‌బాస్‌ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్‌బాస్ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్.. బాబాకు ‘సూపర్‌స్టార్ ఆఫ్ ద హౌస్’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్మేట్స్ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి! -
ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్’ కనిపించదు..
‘బిగ్ బ్రదర్’.. విదేశాల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న రియాలిటీ షో. ఎంపికచేసిన కొంతమంది సెలబ్రిటీలను 100 రోజులపాటు ఒక ఇంట్లోకి పంపించి, వారి మధ్య పోటీలు పెడుతూ, ఎవరేంటో చూపించడమే బిగ్ బ్రదర్ థీమ్. ఇక ఈ రియాలిటీ షోను మనదేశంలోకి బిగ్‌బాస్ పేరుతో దిగుమతి చేసుకున్నారు. అయితేనేం.. ఎక్కడా పరాయివాళ్లది అన్న భావన కలగకుండా.. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఇక్కడ ప్రయోగించారు. తొలుత హిందీలో బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలుపెట్టగా అది మంచి హిట్టయ్యింది. దీంతో అక్కడ వెంటవెంటనే ఈ షోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పదమూడో సీజన్ నడుస్తోంది. హిందీలో మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లో కూడా బిగ్‌బాస్ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీని బట్టి విజేతలకు అందించే ప్రైజ్‌మనీ కూడా మారుతూ వస్తోంది. తెలుగులో మాత్రం బిగ్‌బాస్ టైటిల్ గెలిచినవారికి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను గత 15 వారాలుగా అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 వచ్చే నెల (నవంబర్) 3న ముగియనున్నట్లు షో నిర్వాహకులు ప్రకటించారు. కాగా కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్- 3 జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్ల టీఆర్పీ రేటింగ్లను కొల్లగొడుతూ 17.9 టీఆర్పీతో సంచలనం నమోదు చేసింది. అయితే దీన్ని చివరి వరకూ కొనసాగించడంలో బిగ్‌బాస్ టీం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. యావత్తు తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఈ రియాలిటీ షోను గ్రాండ్‌గా ముగించడానికి బిగ్‌బాస్ యాజమాన్యం వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం హేమాహేమీలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని గ్రాండ్ ఫినాలేకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. దీనికి ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. టాప్ హీరోలతోపాటు హీరోయిన్లను కూడా రంగంలోకి దించనున్నారు. ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటూ టాలీవుడ్లో మెరిసిపోతున్న హీరోయిన్లను బిగ్‌బాస్ షోకు రప్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. బిగ్‌బాస్ 3ని ఎంత గ్రాండ్‌గా మొదలుపెట్టామో అంతే గ్రాండ్‌గా ముగించాలన్నది నిర్వాహకుల ఆలోచన. బిగ్‌బాస్‌లో లిఖించుకున్న రేటింగ్ రికార్డులను గ్రాండ్ ఫినాలేతో తిరగరాయాలని ప్రణాళికలు వేస్తున్నారు. (చదవండి: గ్రాండ్ ఫినాలేకు బిగ్‌బాస్ ముస్తాబు..) -
బిగ్‌బాస్: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్..
బిగ్‌బాస్ 3 తెలుగు ఎన్నో పోట్లాటలు, ప్రేమలు, అపనిందలు, ఆప్యాయతలు, గొడవలు, గారాలతో అల్లుకుపోయింది. అప్పుడే గొడవపడతారు.. మళ్లీ అంతలోనే ఒక్కటైపోతారు. ఏ ఎమోషన్ అయినా అన్నీ ఇంట్లోవాళ్ల ముందే చూపిస్తారు. ఎవరినైనా నామినేట్ చేయడానికి సాకులు వెతుక్కునేది వాళ్లే.. ఎలిమినేట్ అవుతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఆ మధ్య బిగ్‌బాస్.. 50 రోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు ఓ వీడియో ద్వారా చూపించాడు. దాన్ని చూసిన హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. మరి ఇప్పుడు బిగ్‌బాస్ షోకు వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి కొత్తగా ఇంటి సభ్యులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది. ఆ గదిలోకి ఒక్కో హౌస్‌మేట్‌ను పిలిచి బిగ్‌బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నాడు. కాగా ఇల్లువాకిలి అన్నీ వదిలి వచ్చి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన ఇంటి సభ్యులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా మిగలనున్నట్లు స్పష్టమవుతుంది. కుటుంబంలాగా కలిసిపోయిన ఇంటి సభ్యులు మరి కొద్ది రోజుల్లో ఎవరిదారిన వాళ్లు వెళ్లనున్నారు. ఎన్నో ఎమోషన్స్, మరెన్నో జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకుని భారంగా బయటికి వెళ్లిపోనున్నారు. దీంతో నేటి ఎపిసోడ్ ఇంటి సభ్యుల భారమైన మనసుతో, బాధాతప్త హృదయాలతో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. మరి వారి జర్నీలను మనమూ చూడాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! Time to cherish the beautiful memories of #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa #FinaleWeek pic.twitter.com/mBBBAZTfNh — STAR MAA (@StarMaa) October 30, 2019 -
బిగ్‌బాస్: శ్రీముఖి కల నెరవేరబోతుంది
బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ వంద రోజులు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో అడుగుపెట్టిన సుమ పంచ్‌లు పేల్చుతూ నానా హడావుడి చేసింది. బిగ్‌బాస్.. గత ఎపిసోడ్లో మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచిన వరుణ్‌కు ఒక అభిమానితో కాల్ మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజామబాద్ నుంచి ఫోన్ చేసిన రవి.. ‘వితిక వెళ్లిన తర్వాత డల్ అయినట్టు అనిపిస్తుంది’ వరుణ్‌తో పేర్కొన్నాడు. దీనికి వరుణ్ సమాధానమిస్తూ ‘పెళ్లైన అయిదేళ్లలో ఇంత దగ్గరగా ఉన్నది లేదు. అందుకే కాస్త డల్ అయినా కావచ్చు’ అని తెలిపాడు. అనంతరం మిగతా ఇంటి సభ్యులకు కూడా వాళ్ల ఫ్యాన్స్ పంపిన మెసేజెస్ చదివి వినిపించారు. వీటిలో ముఖ్యంగా ఒకవైపు కంటెస్టెంట్లను పొగుడుతూనే మరోవైపు వారు చేసిన తప్పిదాలను వేలెత్తి చూపించారు. ‘టాస్క్‌ల్లో అలీ బెస్ట్ కంటెస్టెంట్, వెల్కమ్ టు ద ఫ్రూట్ క్లబ్’ అంటూ వచ్చిన మెసేజ్‌లను అలీ చదివి వినిపించాడు. శ్రీముఖికి వచ్చిన ట్వీట్స్‌లో ఆమె ‘కన్నింగ్ అని, టాస్క్‌ల్లో జెండర్ కార్డు వాడుతుంద’ని విమర్శించారు. మరొక నెటిజన్ మాత్రం ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని రాసి పంపించడంతో శ్రీముఖి సంతోషంగా ఫీల్ అయింది. తిట్టినా థ్యాంక్స్ చెప్పిన వరుణ్... బాబాకు రెండు రకాల ట్వీట్లు వచ్చి పడ్డాయి. ‘బిగ్‌బాస్ షోలో బాబా.. బెస్ట్ కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ కా బాప్’ అంటూ పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. అదేవిధంగా ‘ఊసరవెల్లి, బాబా మాస్కర్’ అంటూ వచ్చిన నెగెటివ్ ట్వీట్లను బాబా చదివి వినిపించాడు. ఇక ‘ఈ సీజన్లోనే వరస్ట్ కంటెస్టెంట్.. హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’ అని వచ్చిన మెసేజ్ చదివిన వరుణ్ ఆ ట్వీట్ చేసినవారికి చిరునవ్వుతోనే కృతజ్ఞతలు తెలిపాడు. ‘రాహుల్ చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడని, వరుణ్‌తో టాస్క్ ఆడిన విధానం బాగుంది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రాహుల్ చదివి వినిపించాడు. రాహుల్‌ను నక్కతో పోల్చుతూ అగ్రెసివ్ అని తిట్టిపోసిన కామెంట్‌ను కూడా చదివాడు. అయితే ఏదైనా సరే పాజిటివ్‌గానే తీసుకుంటానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు ప్రేక్షకుల ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చిన సుమతో కలిసి దీపావళి పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇంటి సభ్యులందరూ స్టెప్పులేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాహుల్, శ్రీముఖి కలిసి డాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచింది. అనంతరం సుమ బిగ్‌బాస్ హౌస్ నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇంటి సభ్యుల జాతకాలు... ఇంటి సభ్యుల సందేహాలు తీర్చడానికి బిగ్‌బాస్ ఇంట్లోకి ఓ జ్యోతిష్యురాలిని పంపించారు. ఆమె హౌస్‌మేట్స్‌కు సందేహాల నివృత్తితోపాటు పలు సూచనలు చేసింది. ‘ఏదైనా మన మంచికే అనుకుంటూ చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి’ అని బాబా భాస్కర్‌కు సూచించింది. ‘మీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. త్వరలో మీ కల నెరవోరుబోతుంది’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అంటే, అది బిగ్‌బాస్ టైటిల్ అయుండొచ్చు అని రాములమ్మ అభిమానులు గంతులేస్తున్నారు. ఇక ‘మీకు ఉన్న సమస్య ముగియబోతుంది’ అని రాహుల్‌కు తెలిపింది. ‘ఆలోచనా పరిధి మార్చుకో’మని అలీ రెజాకు సలహా ఇచ్చింది. వరుణ్‌ను ‘ఇగోకు వెళ్లొద్దు’ అని సూచించింది. కాగా టాబ్లెట్ ఇవ్వమని రాహుల్ బిగ్‌బాస్‌ను అడిగాడు. అయితే వెరైటీగా ఫన్నీ లిరిక్స్‌తో పాట రూపంలో కోరడంతో అందరి మొహంలో నవ్వులు విరిశాయి. -
అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్.. రచ్చ రచ్చ!
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. 100 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్‌బాస్ షో సెంచరీ కొట్టింది. బిగ్‌బాస్ ఇంట్లోకి ఒక ప్రేక్షకురాలిగా వస్తున్నానంటూ అడుగుపెట్టిన సుమ ఇంటి విషయాలను రాబట్టడానికి ప్రయత్నించింది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి రాగానే ఇంటి సభ్యులతో బోలెడు కబుర్లను పంచుకుంది. బిగ్‌బాస్‌కే పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేసింది. పనిలోపనిగా ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్ ఆడించింది. ఆ గేమ్‌లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన వరుణ్‌ను విజేతగా ప్రకటించింది. అయితే.. సుమ ఇంట్లోకి రాగానే మొదటగా.. టపాకాయలు తెచ్చావా అని హౌస్మేట్స్ ప్రశ్నించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ తనవెంట ఏమీ తీసుకురాలేదని సుమ చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న బిగ్‌బాస్ దీపావళి పండగను జరుపుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకోసం వారికి టపాకాయలు అందించినట్టు కనిపిస్తోంది. దీంతో దొరికిందే చాన్స్ అన్నట్టుగా ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. వీరి అల్లరికి సుమ తోడవగా.. దీపావళి వేడుకలతో హౌస్ వెలుగులీనేలా ఉంది. ఇంటి సభ్యులు కాకర పువ్వొత్తులను చేతపట్టుకుని ఆనందంతో డాన్స్‌లు చేస్తున్నారు. ఇక ఈ సంబరాలను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! . #Diwali celebration continues with @ItsSumaKanakala #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/0MuAV2HQ7D — STAR MAA (@StarMaa) October 29, 2019 -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్..!?
బిగ్‌బాస్ తుది సమరానికి సిద్ధమవుతోంది. ఆఖరి పోరులో ఎవరు నిలుస్తారు.. ఎవరు వెనుదిరుగుతారనేది ఆసక్తికరంగా మారింది. టాప్ 5 లోకి అడుగుపెట్టిన శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజాలలో ఎవరు టైటిల్ తన్నుకుపోతారో చూడాలి. కాగా గ్రాండ్ ఫినాలే పోరుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దుమ్ము లేపేందుకు స్టార్ మా యాజమాన్యం పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బిగ్‌బాస్ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఫైనల్ వార్‌ను మరింత రక్తి కట్టించడానికి చిరంజీవిని వేదిక మీదకు రప్పించాలన్నది వారి ఆలోచన. ఆయన చేతుల మీదుగా బిగ్‌బాస్ విజేతకు టైటిల్ అందజేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరుతో పాటు పలువురు హీరోయిన్లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హీరోయిన్లు నిధి అగర్వాల్, అంజలి ప్రత్యేక ఆకర్షణగా మెరిసిపోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిధి అగర్వాల్.. రామ్‌తో కలిసి బిగ్‌బాస్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవి బిగ్‌బాస్ నిర్వాహకుల ఆహ్వానానికి అంగీకారం తెలిపాడా? గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీతో అదరగొట్టనున్నాడా అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది. అప్పటివరకు మెగాఫ్యాన్స్కు నిరీక్షణ తప్పదు. ఇక బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న అయిదుగురు కంటెస్టెంట్లకు ప్రతీరోజు.. ప్రతీక్షణం విలువైనదే.. వారి ప్రతీ కదలిక విజయానికి సోపానాలే. ఇప్పటికే ఓటింగ్‌లో అలీ రెజా, బాబా భాస్కర్ వెనుకబడిపోయారని తెలుస్తోంది. వరుణ్‌కు కూడా ఓ మోస్తరుగానే ఓట్లు పడుతున్నాయి. ఓటింగ్‌లో దూసుకుపోతున్న శ్రీముఖి, రాహుల్ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు కనిపిస్తోంది. అయితే వీకెండ్‌లోపు ఈ లెక్కలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బిగ్‌బాస్ టైటిల్‌తోపాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకునేది ఎవరో వేచి చూడాల్సిందే! -
‘మా ఆయనే బిగ్‌బాస్ విజేత’
బిగ్‌బాస్ సీజన్– 3 విజేతగా తన భర్త వరుణ్ సందేశ్ నిలుస్తారని, తనకు ఆ నమ్మకం బాగా ఉందని ఆయన భార్య, గత వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన వితికా శేరు అన్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు ఓపిక బాగా అబ్బిందని కుదురుగా ఉండటం నేర్చుకున్నానని చెప్పారు.టాస్క్‌లలో నాకంటే వరుణ్ బాగా ఆడేవారు. అయితే వరుణ్ సోలోగా ఆడడానికే ఇష్టపడుతున్నట్లుగా ప్రేక్షకులు చెప్పారు. అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను. ఏదైనా చేయగలననే పట్టుదల కూడా వచ్చిందన్నారు. లగ్జరీ లేకుండా ఒకరి సహాయం తీసుకోకుండా గూగుల్‌తో సంబంధం లేకుండా బతకవచ్చు అనే నమ్మకం ఈ 90 రోజుల బిగ్‌బాస్ హౌజ్‌లో నాతో పాటు వరుణ్ కూడా తెలుసుకున్నారన్నారు. ఇందులో మైండ్‌తో ఆడేదే ఎక్కువగా ఉంటుందని, అందుకే తన విజ్ఞానం కూడా బాగా పెరిగిందన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యులందరూ తనకు ఇష్టమైనవారేనని.. నచ్చని విషయమంటూ ఉందంటే అది రాళ్లు, రత్నాలు టాస్క్‌లో జరిగిన ఘటనేనని ఆమె తెలిపారు. వంటలు బాగా చేస్తా... బిగ్‌బాస్ హౌస్‌లో బాగా వంటలు చేయడంలో నాకు నేనే సాటిగా నిరూపించుకున్నాను. ఆరు వారాల పాటు కిచెన్ కెప్టెన్‌గా కొనసాగాను. నా వంటలను ఇతర సభ్యులతోపాటు వరుణ్ కూడా బాగా మెచ్చుకునేవారు. రూ.50 లక్షలు వస్తే... ఫైనల్లో వరుణ్ విజేతగా నిలిచి రూ.50 లక్షలు బహుమతిగా తీసుకొని వస్తే వాటిని భద్రంగా దాచుకుంటాను. మేం పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. డబ్బులు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో చవిచూశాం. అలాంటి పరిస్థితి రాకుండా.. ఈ వచ్చిన డబ్బును ఫిక్స్డ్ చేసుకుందామనుకుంటున్నాం. ఫైనల్లో ఆ ముగ్గురు ఉండొచ్చు.. వచ్చే నెల 3న జరగనున్న బిగ్‌బాస్–3 ఫైనల్ టాప్–3లో మా వారు వరుణ్ సందేశ్‌తో పాటు శ్రీముఖి, రాహుల్ ఉంటారేమో. తెలుగింటి ఆడపడుచుగా, ఒక భార్యగా మావారు వరుణ్‌సందేశ్ విజేతగా తిరిగి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. 13 వారాల పాటు భార్యాభర్తలిద్దరం బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగడానికి ప్రేక్షకులతో పాటు సహచర సభ్యులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. మంచి మిత్రులం.. బిగ్‌బాస్ హౌస్లోవరుణ్తో పాటు నేను, పునర్నవి, రాహుల్ మంచి స్నేహితులం. కష్టాల్లో, ఇష్టాల్లో నలుగురం పాలుపంచుకున్నాం. వరుణ్ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఎంతగానో ప్రేమించేవారు. ఎక్కువగా ఇంటి గురించే.. మేమిద్దరం ఒంటరిగా హౌస్‌లో కూర్చున్నప్పుడు ఇంటి గురించే ఆలోచించుకునేవాళ్లం. మా ఇంట్లో అమ్మకు, వరుణ్ ఇంట్లో బామ్మ, తాతయ్యకు ఆర్థిక అవసరాలు తీర్చేది మేమిద్దరమే. ఆర్థిక పరిస్థితులను చూసుకునే ఇద్దరం హౌస్‌లోనే ఉండటం వల్ల అక్కడ వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని తల్లడిల్లిపోయేవాళ్లం. ఇద్దరికి టెన్షన్‌గానే ఉండేది. మాది ప్రేమ వివాహం.. నేను మొదటి సినిమా కన్నడలో చేశా. 17 ఏళ్ల వయసులోప్రేమ–ఇష్క్–కాదల్ సినిమాలో హీరోయిన్గా నటించాను. 2014లో వరుణ్ హీరోగా వచ్చిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో హీరోయిన్గా నటించి ఆయనతో ప్రేమలో పడ్డాను. 2016 ఆగస్టు 19న మా ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. 250 డ్రెస్‌లు మార్చా.. బిగ్‌బాస్– 3లో నన్ను అందంగా చూపించడానికి, టాస్క్‌లలో నా ఆటకు తగిన డ్రెస్‌లు రూపకల్పన చేయడానికి ముగ్గురు డిజైనర్లు పని చేశారు. రోజుకు మూడు డ్రెస్‌లు మార్చేదాన్ని. మొత్తం 250 డ్రెస్‌లు మార్చాను. ముఖ్యంగా నాకు చీరలంటే బాగా ఇష్టం. మా బంధం.. దృఢమైంది హౌస్‌లో వరుణ్‌కు నాకు మధ్యన భార్యాభర్తల అనుబంధం మరింతగా పెరిగింది. ఆయన ఓపెన్ మైండెడ్‌గా ఉండేవారు. నిజాయతీ కనిపించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని దాటగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇద్దరం బాగా అర్థం చేసుకున్నాం. -
బిగ్‌బాస్: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ సుమ అనుకున్నంత సందడీ చేశారు. బాగ్‌బాస్-3 లో గెస్ట్( ఆడియన్)గా ఎంటరైన సుమ నవ్వుల పువ్వుల దీపావళి తీసుకొచ్చారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు. బిగ్‌బాస్ సీజన్లోనే ఇంత బాగా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్-3 సీజన్‌ను క్లుప్తంగా రివ్యూ చేసిన బిగ్‌బాస్ ఆ తరువాత హౌస్‌లోకి సుమను ప్రవేశపెట్టాడు. ఇహ అక్కడినుంచి మొదలైంది రచ్చ..రచ్చ రంబోలా.. రంగ్‌దే.. రంగ్‌దే...పాటతో ముసుగు వేసుకుని డాన్స్‌తో సుమ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే..కంటెస్టెంట్స్ అందరూ తమన్నా..తమన్నా అంటూ హల్ చల్ చేశారు. చివరికి ముసుగుతీసి తనెవరో రివీల్ చేశారు. ఆరంభం నుంచే సుమ తనదైన పవర్ పంచ్‌లతో మొదలెట్టేశారు. రాగానే మంచి నీళ్లు తాగుతారా అని అడిగిన శ్రీముఖితో.. వచ్చినవాళ్లందరి చేత నీళ్లు తాగించేస్తున్నావుగా అంటూ పంచ్ వేశారు. ఆ తరువాత ఇల్లంతా కలియతిరిగి... ఒక్కొక్కరి బెడ్‌ను, మేకప్ సామాన్లు పరిశీలించారు. ముఖ్యంగా రాహుల్ బెడ్ పక్కన ఏముందంటూ అల్లరి చేశారు. ఆ తరువాత లివింగ్ రూం, వంటగది, వాష్‌రూంలను పరిశీలించారు. బిగ్‌బాస్ -3 హౌస్‌లో ఏమేమి మిస్ అవుతున్నదీ అందరూ షేర్ చేసుకున్నారు. తరువాత హౌజ్‌లోకి వచ్చిన సుమ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసిపెట్టి, ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరిన బిగ్‌బాస్.. దానికి సంబంధించిన సరుకు సరంజామా పంపించారు. మధ్నాహ్నం 2 గంటలకు శ్రీముఖి, బాబా భాస్కర్ కుకింగ్ పనిలో వుండగా.. రాహుల్‌తో సరదాగా పాట పాడించారు సుమ. ‘అదరా...నా గుండెలదరా..బొమ్మోలె ఉందిరా పోరీ..పాట పాడారు. అలాగే ‘ఏమైనదీ..ఏమో నాలో..కొత్తగా ఉంది నాలో’ అంటూ వరుణ్ కూడా చాలా హృద్యంగా.. ఫీల్‌తో ఆలపించాడు. తర్వాత సుమ తన సహజమైన గేమింగ్ షోను స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ప్రకారం పార్టిసిపెంట్స్ అందరూ హెడ్‌ఫోన్స్ పెట్టుకొంటారు. వాళ్ల చెవిలో.. బిగ్‌బాస్ మ్యూజిక్ ప్లే చేస్తుండగానే.. సుమ చెప్పే వాక్యాన్ని, సామెతను.. డైలాగ్‌ను లిప్ మూమెంట్ ద్వారా గుర్తించి.. ఆమె చెప్పిందో ఏంటో చెప్పాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం శ్రీముఖికే దక్కింది. మొత్తం మూడు ప్రశ్నల్ని శ్రీముఖి అలవోకగా సమాధానం చెప్పేసింది. తనదైన శైలిలో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పడంతో.. చెవుల్లోం,చి రక్తాలు కారుతున్నాయంటూ సుమ జోక్ చేశారు. 1. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి.. సింహాల మీద కాదు.. 2 చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు 3. బిగ్ బాస్గారూ మీ ఒకసారి మా యింటికి రావాలి.. ఈ డైలాగులను శ్రీముఖి అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. ఇక, మీ ఆవిడంటే మీకు చాలా భయమా. ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడో తెలుసా.. ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా..డైలాగులు సుమ చెప్పగా.. వీటిని చెప్పడానికి బాబా పడినపాట్లు మామూలువి కావు. తరువాత వంతు వరుణ్‌ది. బుజ్జిగాడు.. బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు.. అన్న డైలాగుకు.. పుచ్చకాయ..పచ్చగా అంటూ వరుణ్ నానా తిప్పలు పడి..ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. రెండుసార్లు ఇదే డైలాగును చెప్పగా.. చచ్చీ చెడి సాధించాడు. చివరికి జీవితంమంటే పోరాటం.. పోరాటంలోనే ఉంది జయం... డైలాగును కరెక్ట్‌గా చెప్పి సక్సెస్ అయ్యాడు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా.. గుర్తు పెట్టుకో..నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ..నీకు బీపీ వస్తే..నీ పీఏ వణుకుతాడు..వంటి డైలాగులు అలీ రెజాకు ఇవ్వగా.. వాటిని చెప్పడం అలా కి సాధ్యంకాలేదు. ఈ సందర్భంగా కూడా నవ్వుల మతాబులు విరజిమ్మాయి. ‘పునర్నవి వెళ్లిపోయిన తరవాత బాధగా వుందా’ ఈ డైలాగును రాహుల్ అలవోకగానే చెప్పాడు. విష్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబొట్లు చెప్పడానికి మాత్రం కష్టపడ్డాడు. నా చావు నే చస్తా.. నీకెందుకు అన్న డైలాగును చెప్పలేక తికమక పడ్డాడు. అయితే నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా డైలాగును సరిగ్గా చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విచిత్రం ఏమంటే.. ఈ గేమ్‌లో బాగా, తొందరగా ఆన్సర్ చేసిన వారికి కాకుండా.. ప్రేక్షకులను ఎక్కువ ఎంటర్టైన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది వరుణ్. ఈ గేమ్‌షోలో సుమ హావభావాలు, పంచ్‌లతో బాగా ఆకట్టుకున్నారు. భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించారు. కానీ అంతలోనే బిగ్‌బాస్ కుక్కలు మొరిగిన వార్నింగ్ రావడంతో అది కుదరలేదు. మొత్తంమీద అందరూ ఊహించినట్టుగానే...ఎదురు చూసినట్టుగానే.. సుమ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నారు. -
బిగ్‌బాస్: శ్రీముఖి కోసం డ్యాన్స్ పోటీలు!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 14వ వారంలో శివజ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌజ్‌లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, అలీ రెజా ఫైనల్ రేసులో తలపడతారు. బిగ్‌బాస్ టైటిల్ సాధించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇటు అభిమానులు కూడా కంటెస్టెంట్ల పేరుతో ఆర్మీలు పెట్టి దుమ్ము లేపుతున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓట్లు వేయండని ప్రచారాన్ని ఉదృతం చేశారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోట్లాటలు కూడా ఎక్కువవయ్యాయి. ఏం చేసినా ఒక్కవారమే అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న శ్రీముఖి అభిమానులు విభిన్న ప్రచారంతో ముందుకొచ్చారు. రాములమ్మ (శ్రీముఖి)ను గెలిపించడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందుకోసం ‘రాములమ్మ కాంటెస్ట్’ నిర్వహిస్తున్నారు. దీంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ప్రచారం చేయొచ్చు అని చెప్తున్నారు. ‘రాములమ్మ కాంటెస్ట్’ పాల్గొనడం కష్టతరమైనదేమీ కాదు. ఒసేయ్ రాములమ్మ పాటకు శ్రీముఖి చేసే సిగ్నేచర్ స్టెప్పును వేస్తూ వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ వీడియోను #THISTIMEWOMAN, #VOTEFORSREEMUKHI హ్యాష్‌ట్యాగ్‌లను జోడించి ఇన్స్టాగ్రామ్ షేర్ చేయాల్సి ఉంటుంది. పోటీ నిర్వాహకులు వాటిలో అత్యుత్తమ డాన్స్ వీడియోను ఎంపిక చేసి, వారికి శ్రీముఖితో కలిసి డాన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ పోటీ మరింత సులువుగా అర్థమవటం కోసం శ్రీముఖి.. పిల్లలతో కలిసి చేసిన డాన్స్ వీడియోను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త ట్రిక్ ఏమేరకు పనిచూస్తుందో చూడాలి! View this post on Instagram For all the #Ramulamma fans out there!! A Surprise contest 🤩 landed on to prove your love and talent. With this celebration of lights...bring up your confidence. 💃 "CALLING ALL BOYS AND GIRLS. DO THIS SIGNATURE STEP OF OUR RAMULAMMA AND USE THE BELOW HASHTAGS. THE BEST VIDEOS WILL BE SHARED AND WILL GET A CHANCE TO DANCE WITH SREEMUKHI." #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI #TeamSreemukhi #Sreemukhi #Ramulamma #biggbosstelugu3 #StarMaa #AllRounder #Energetic A post shared by Sreemukhi (@sreemukhi) on Oct 27, 2019 at 5:06am PDT -
బిగ్‌బాస్ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి లవ్ ట్రాక్ గురించి తెలియని వారుండరు. టాస్క్‌లు ఆడటం చేతకాదు అని పేరు తెచ్చుకున్న రాహుల్.. పునర్నవిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగి తనపై ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు. ఇక పదకొండో వారం.. పునర్నవి ఎలిమినేట్ అయినపుడు రాహుల్ వెక్కివెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి మధ్య ప్రేమరాగాల్ని గుర్తు చేయడానికి ఓ కారణముంది. నిన్నటి (ఆదివారం)ఎపిసోడ్లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ దేవరకొండ బిగ్‌బాస్ షోలో సందడి చేశాడు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న విజయ్ దగ్గరకు ఒక్కో ఇంటి సభ్యుడు వచ్చి ‘రహస్య భేటీ’లో పాల్గొన్నారు. ఈ టాస్క్ ఉద్దేశం.. బిగ్‌బాస్ హౌజ్‌లో ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోని ఒక రహస్యాన్ని కంటెస్టెంట్లు విజయ్‌తో పంచుకోవాలి. దాదాపు ఇంటి సభ్యులంతా సీక్రెట్స్ చెప్పలేక దాటవేసే సమాధానాలే ఇచ్చారు. కానీ, రాహుల్ మాత్రం నిర్మొహమాటంగా ఓ సీక్రెట్‌ను బయట పెట్టాడు. కెమెరాలకు కూడా చిక్కని రహస్యాన్ని నిన్నటి ఎపిసోడ్లో విజయ్‌తో చెప్పాడు. రాహుల్ మాట్లాడుతూ.. ‘తనకోసం కాకరకాయ జ్యూస్‌లు తాగినపుడు పునర్నవి నన్ను ముద్దుపెట్టుకోవడమే అందరికీ తెలుసు. మీకు తెలియని విషయమేంటంటే ఒకసారి కోపంలో ఆమె నా చేయి కొరికి, పారిపోయింది’ అని ఆ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దీనికి నాగార్జున కౌంటర్ వేశాడు. ‘వితిక.. కితకితలు పెడితే గిల్లిందని రాద్ధాంతం చేశావు. కానీ, పునర్నవి చేయి కొరికినా కూడా ఏమీ అనలేదు’ అని రాహుల్‌ను ఆటపట్టించాడు. ఇక రాహుల్, పున్నూ మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..
తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. పిల్లోడి నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి సినీ పరిశ్రమ దాకా అందరికీ ఆమె సుపరిచితురాలే. క్యాలెండర్లు మారుతున్నా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగా కొనసాగుతోంది. బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆమెదే పైచేయి. తను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తిరుగే ఉండదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. ఆవిడే ప్రముఖ యాంకర్.. సుమ కనకాల. వారం రోజుల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్ప్రైజ్ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! Special guest #Suma in the house#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/O84sZSmf04 — STAR MAA (@StarMaa) October 28, 2019 -
బిగ్‌బాస్: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!
బిగ్‌బాస్ సీజన్ 3లో చివరగా ఎలిమినేట్ అయిన వ్యక్తి శివజ్యోతి. హౌస్‌ను వీడేముందు శివజ్యోతి ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. అలీని పక్కన పెట్టేసి శ్రీముఖి బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపింది. అటు అలీ కూడా శివజ్యోతిని కాదని రాహుల్ టైటిల్ సాధించాలని కోరుకున్నాడు. ఇక ట్రంకుపెట్టెతో బయటకు వచ్చేసిన శివజ్యోతి కన్నీళ్లతోనే బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకుంది. మొదటి నుంచి ఇంటి సభ్యులందరికీ టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చిన శివజ్యోతి చివరివరకు టైటిల్ కోసం పోరాడింది. కాగా పద్నాలుగోవారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన శివజ్యోతి తన స్నేహితులను కలుసుకుంది. తన కన్నా ముందే ఎలిమినేట్ అయిన రవికృష్ణ, అషూ రెడ్డి, రోహిణి, హిమజలను శివజ్యోతి కలుసుకుంది. వారితో కలిసి సరదాగా దీపావళి వేడుకలను జరుపుకుంది. ఈ మేరకు వాళ్లంతా కలిసి టపాకాయలు పేల్చుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో శివజ్యోతి.. స్నేహితులతో కలిసి పీకల్లోతు సంబరాల్లో మునిగిపోయింది. కాగా తనకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. View this post on Instagram Meeku & Mee Kutumbha Sabhyulaku Andharki Diwali Subhakanshalu ..🙏🏻🙏🏻 Thq For Urs Lovely Support Each and Everyone 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 @starmaa @itshimaja @actressrohininoni @ashu_uuu @iam.savithri A post shared by Shiva Jyothi - Savithri (@iam.savithri) on Oct 27, 2019 at 9:53am PDT -
బిగ్‌బాస్ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్
దీపావళీ సందర్భంగా కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హీరో విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా కన్ఫెషన్ రూమ్‌లో పెట్టి వారితో ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.. బిగ్‌బాస్ ప్రయాణంలో ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని రహస్యాన్ని తనతో షేర్ చేసుకోవాలని చెప్పాడు. తొలుత శ్రీముఖి, తర్వాత బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, చివరగా వరుణ్ ఒక్కొక్కరూ విజయ్ దేవరకొండను కలుసుకున్నారు. తనతో షేర్ చేసుకున్న సీక్రెట్స్ ఎవరితో చెప్పనని విజయ్ వారికి మాటిచ్చాడు. అయితే, ఎవరూ చెప్పుకోదగ్గ రహస్యాలు పంచుకోలేదు. రాహుల్ మాత్రం పునర్నవి తన చేయి కొరికిన సందర్భాన్ని గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా.. కన్ఫెషన్ రూమ్‌లోకొచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు విజయ్ తలా ఒక బెలూన్ ఇచ్చాడు. వాటిల్లో ఒక రహస్యం ఉందని చెప్పాడు. హోస్ట్ నాగార్జున అందులోని సీక్రెట్ బయటపెడ్తారని హౌజ్‌లోకి పంపించాడు. అందరితో ‘రహస్య భేటీ’ పూర్తయిన తర్వాత విజయ్ బిగ్‌బాస్ వేదికపైకొచ్చి హోస్ట్ నాగార్జునను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ టీం సభ్యులు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను పలుకరించారు. దాంతోపాటు ఈ సినిమా ట్రైలర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో మరోసారి ప్రదర్శించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న విడుదలవుతుందని విజయ్ చెప్పాడు. సినిమాను ఆదరించండని బిగ్‌బాస్ వేదికగా ప్రేక్షకులను కోరాడు. ఇక చివరగా ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లో విజయ్ ఇచ్చిన బెలూన్లను పగులగొట్టాలని హోస్ట్ నాగార్జున సూచించాడు. అందరి బెలూన్లలో ఎలాంటి విశేషం కనబడలేదు. అయితే, విజయ్ తనకిచ్చిన బెలూన్ ఎక్కడో మిస్ అయిందని వరుణ్ తెలపడంతో.. నాగ్ ఆ బెలూన్ను వెతికి తెప్పించి విజయ్‌ని పగులగొట్టమన్నాడు. బెలూన్ నుంచి ఒక స్లిప్ బయటపడింది. ఆ స్లిప్‌ను నాగ్ ఓపెన్‌చేసి.. విజయ్ చేతికివ్వగా.. వరుణ్ సేవ్ అయినట్టు అతను ప్రకటించాడు. ఇక ఎపిసోడ్ చివరలో.. అసలైన ట్విస్ట్ మొదలైంది. అలీ రెజా, శివజ్యోతి ఇద్దరిలో ఎవరు సేవ్ అయ్యారో.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్పేందుకు నాగ్ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. బోర్డుపై BIG BOSS అని ఉన్న అక్షరాలను తెరచి చూపిస్తూ.. అక్షరాల వెనక ఎవరి ఫొటో ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. అనంతరం ఒక్కొక్క అక్షరాన్ని తిప్పి చూశాడు. అయితే, అక్షరాలు అయిపోవస్తున్నా..ఎవరి ఫొటో రాలేదు. ఇక చివరగా.. రెండక్షరాలు మాత్రమే మిగిలాయి. వాటిలోని మొదటి అక్షరం వెనక శివజ్యోతి ఫొటో బయటపడింది. దాంతో హౌజ్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. అలీరెజా సేవ్ అయ్యాడని అందరూ అనుకుంటుండగా నాగ్ బాంబు పేల్చాడు. టాప్ 5 కాకుండా.. టాప్ 4 కూడా ఉండే అవకాశం ఉందని, ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయినా కావొచ్చునని అన్నాడు. దీంతో టెన్షన్ మరింత రెట్టింపైంది. ఇక చివరి అక్షరం తెరచి చూడగా.. దానిపై అలీ ఫొటో లేదు. దీంతో అతను టాప్ 5లో చోటు దక్కించుకున్నట్టు నాగార్జున ప్రకటించాడు. -
బిగ్‌బాస్: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ నేటితో పద్నాలుగు వారాలు పూర్తి చేసుకోనుంది. పదిహేను మందితో ప్రారంభమైన ఈ బిగ్‌బాస్ సీజన్లో రెండు వెల్డ్‌కార్డ్ ఎంట్రీలు కూడా ఉండటంతో ఇంటి సభ్యుల సంఖ్య పదిహేడుకు చేరింది. ఇప్పటివరకు 11 మంది హౌస్‌ను వీడగా ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖిలు టికెట్ టు ఫినాలే దక్కించుకుని టాప్ 5లోకి అడుగు పెట్టారు. వరుణ్, అలీ రెజా, శివజ్యోతి నామినేషన్లో కొనసాగుతున్నారు. అయితే, వరుణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉండటంతో అతను సేఫ్ జోన్లోనే ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఇక అక్కాతమ్ముళ్లు శివజ్యోతి, అలీరెజా మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్టుతో రీఎంట్రీకి అలీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కానీ, అదిప్పుడు పూర్తిగా పడిపోయింది. రీ ఎంట్రీ అనేది అలీకి పెద్ద మైనస్‌గా మారింది. బయట పరిస్థితులు, బిగ్‌బాస్‌కు సంబంధించి గేమ్ ప్లాన్లు తెలుసుకుని వచ్చాడని అందరూ అలీనీ పక్కన పెట్టేశారు. దీంతో ఎలిమినేషన్ తప్పించుకోవడానికి అలీకి ఈ సారి తక్కువ ఓట్లే పడ్డాయి. కానీ అతని కన్నా తక్కువ ఓట్లతో శివజ్యోతి చిట్ట చివరి స్థానంలో ఉంది. గత కొన్ని వారాలుగా శివజ్యోతి ప్రవర్తన నచ్చట్లేదంటూ నెటిజన్లు ఆమెను పంపిచడానికి సిద్ధమైపోయారు. ఏడుపు అనేది ఒక ఎమోషన్ అని చెప్పిన శివజ్యోతి మాటలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. తన సాగదీత సమాధానాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుణ్, వితికలతో గొడవ కూడా ఓట్లకు గండి కొట్టింది. టాస్క్‌లు బాగానే ఆడినప్పటికీ అదొక్కటే టైటిల్ అందుకోడానికి సరిపోదనేది ఈమె విషయంలో అర్థమవుతోంది. దీంతో నేడు శివజ్యోతి ఎలిమినేట్ కానున్నట్టు సమాచారం. ఈ సీజన్లో ఇదే చివరి ఎలిమినేషన్ కాగా రేపటి నుంచి అయిదుగురు హౌస్మేట్స్ మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
బిగ్‌బాస్: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన సీనియర్ నటి హేమ వారం తిరక్కుండానే బయటికి వచ్చేశారు. అయితే, బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోమారు బిగ్‌బాస్ నిర్వాహకులపై విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మట్లాడుతూ.. అటు బిగ్‌బాస్ గురించి, ఇటు శ్రీముఖి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ సమయంలో తన గురించి పూర్తి ఏవీ (ఆడియో విజువల్) వేయలేదని, తన ఎంట్రీని దరిద్రంగా మార్చిన డైరెక్టర్‌కు గట్టిగానే ఇచ్చానని తెలిపారు.. బిగ్‌బాస్ నిర్వాహకులు చెడు మాత్రమే చూపిస్తారని విమర్శించారు. షో ఎడిటరే అక్కడ బిగ్‌బాస్ అని వ్యాఖ్యానించారు. తనకు ఫైనల్‌కు రావాలని పిలుపు వచ్చినప్పటికీ మళ్లీ అవమానపడటం తన వల్ల కాదని తిరస్కరించినట్టుగా పేర్కొన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ శ్రీముఖిపై సంచలన ఆరోపణలు చేశారు. శ్రీముఖి బయట ఒకలా, లోపల మరొకలా మాట్లాడుతుందని హేమ విమర్శించారు. హిమజ వచ్చేశాక బిగ్‌బాస్ చూడటమే మానేశానని అన్నారు.. ఎందుకంటే అందులో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని చెప్పుకొచ్చారు. శ్రీముఖి బర్త్‌డే నాడు అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని.. అప్పుడే తనను బయటకు పంపించేయాలని డిసైడ్ అయ్యారని హేమ ఆరోపించారు. ‘ఇంటి సభ్యులందరూ నన్ను పంపించేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. లేకపోతే తాను స్ట్రాంగ్‌గా మారుతానని వారు భావించారు. అందుకోసమే నాతో కావాలని గొడవ పెట్టుకునేవారు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది’అని హేమ చెప్పుకొచ్చారు. రాహుల్‌తో సహా అందరూ శ్రీముఖి బర్త్‌డేకు వెళ్లారని.. ఎవరు ఏ వారంలో ఎలిమినేట్ కావాలనే విషయాన్ని అప్పుడే ప్లాన్ చేసుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖి గేమ్‌లో అందరూ బలవుతున్నారని హేమ అభిప్రాయపడ్డారు. ఇక మరోవారంలో బిగ్‌బాస్ షోకు ఎండ్‌కార్డ్ పడనుందనగా ఈ వ్యాఖ్యలు ప్రేక్షుకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. -
బిగ్‌బాస్ ఇంట్లో రౌడీ హడావుడి..
-
నాగ్‌కు విజయ్ దేవరకొండ ఫన్నీ కౌంటర్..
-
బిగ్‌బాస్: పెళ్లిపై స్పందించిన విజయ్ దేవరకొండ
బిగ్‌బాస్ హౌస్‌లో మిగిలిన ఆరుగురిలోంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖిలు టికెట్ టు ఫినాలే దక్కించుకుని టాప్ 5లో నిలిచారు. మిగతా ముగ్గురిలో ఫైనల్‌కు చేరే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇక వీకెండ్లో దీపావళి రావటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ అతిథిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ హౌస్‌లోని కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూంలోకి పంపించగా రౌడీ స్టార్‌ను చూసి సర్ప్రైజ్ అయ్యారు. జ్యోతక్క ఓ అడుగు ముందుకేసి లడ్డుగైనవ్.. అంటూ అతన్ని ఆటపట్టించింది. వైఫ్ లేకుండా ఎలా ఉంటున్నావ్ అని విజయ్.. వరుణ్‌ను ఆటపట్టించాడు. అంతేకాకుండా అతడి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఈ టాలీవుడ్ రౌడీ. ఈ సమయంలో నాగ్.. విజయ్ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని అడిగాడు. దీనికి రౌడీ స్పందిస్తూ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. దీనికి నాగ్ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్ సరదాగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. రౌడీ సందడిని చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! -
షాకింగ్, రాహుల్ బండబూతుల వీడియో
రాహుల్ సిప్లిగంజ్.. నోటి దురుసుతో ఫేమస్ అయిన వ్యక్తి. అతని నోటికి అడ్డూఅదుపు ఉండదు. ఇంట్లో రాహుల్‌తో గొడవపడని వ్యక్తి లేడంటే అర్థం చేసుకోవచ్చు. అతని కోపం వల్ల స్నేహితులతోనే వైరాలు ఏర్పడ్డ సంఘటనలు కోకొల్లలు. ఇక హౌస్‌లో ముందు నుంచీ టాస్క్‌ల్లో పెద్దగా కష్టపడకపోయినా. ఫైనల్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆటలో తానేంటో నిరూపించుకుంటున్నాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా తన పేరును లిఖించుకున్నాడు. బయట సింగర్‌గా ఉన్న పేరు కన్నా.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ రాహుల్‌ను కార్నర్ చేయడంతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్‌బాస్ చివరి వారంలో ప్రేక్షకులు వేసే ప్రతీ ఓటు వారి గెలుపుకు దారులు నిర్మిస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ ఇమేజ్ను దెబ్బతీసే షాకింగ్ వీడియో బయటకొచ్చింది. ఇందులో రాహుల్.. బిగ్‌బాస్ 1 సీజన్‌ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ పాడిన మంగమ్మ పాటను బిగ్‌బాస్ హౌస్‌లో నిర్వాహకులు ప్లే చేశారు. అయితే, ఇదేం పాట అంటూ కొంతమంది ఇంటి సభ్యులు చులకనగా మాట్లాడారు. దీనిపై రాహుల్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. హౌస్‌మేట్స్‌ను బండబూతులు తిట్టాడు. తన పాటను కించపరిచిన వాళ్లను ఉద్దేశిస్తూ.. ఒకసారి వెళ్లి అద్దంలో మొహం చూసుకోండి అని వ్యంగ్యంగా విమర్శించాడు. ‘నా సాంగ్‌ను చిల్లర పాట అంటున్నారు.. వారి జీవితంలో అలాంటి అచీవ్మెంట్ ఉందా’ అని వెటకారంగా మాట్లాడాడు. ప్రతీ వాక్యంలో బూతులను జోడిస్తూ అసభ్యంగా మాట్లాడాడు. బండబూతులతో నిండిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటువంటి వ్యక్తికి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హతా ఉందా అంటూ నెటిజన్లు రాహుల్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఫైనల్‌కు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ వీడియో రాహుల్ ఓట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. మరి దీన్ని రాహుల్ అభిమానులు ఏ విధంగా ఖండిస్తారో చూడాలి! Ilanti vaadu Bigg boss winner aithey votes vesey vaallanu emanalo. Idhi kooda edho okati cheppi cover cheskuntara ? 😠😠🤔 Please retweet to share about this sadistic guy. #BiggBoss3Telugu #biggbosstelugu3 #RahulSipligunj #BabaBhaskar #VarunSandesh#srimukhi #BiggBossTelugu pic.twitter.com/Ny4b1lzI2j — Manoj Kumar (@ManojKu49243561) October 26, 2019 -
బిగ్‌బాస్ : మరొకరికి టికెట్ టు ఫినాలే
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. గత పద్నాలుగు వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘బిగ్‌బాస్’ మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్,శ్రీముఖి నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్లో ఒకరు లేదా ఇద్దరు సేవ్ అయ్యే అవకాశముందని హోస్ట్ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్ గన్ తలా ఒకటి ఇచ్చి పేల్చమన్నాడు. ఎవరి గన్ నుంచి రంగురంగుల కాగితాలు బయటికొస్తాయో.. వారు సేవ్ అవుతారని తెలిపాడు. మిగిలినవారు నామినేషన్లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్, తర్వాత అలీ గన్ పేల్చగా.. వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దాంతో వారిద్దరూ సేవ్ కాలేదని నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్లను పేల్చలేకపోయారు. రెండో ప్రయత్నంలో శ్రీముఖి గన్ పేల్చగా.. దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. దాంతో శ్రీముఖి సేవ్ అయి టికెట్ టు ఫినాలేకు చేరుకున్నట్టు నాగ్ ప్రకటించాడు. ఇక శివజ్యోతి గన్‌లో నుంచి ఎలాంటి రంగుల కాగితాలు రాకపోవంతో ఆమె కూడా సేవ్ కాలేదని నాగ్ వెల్లడించాడు. వరుణ్, శివజ్యోతి, అలీరెజా ముగ్గురూ నామినేషన్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్ టికెట్ టు ఫినాలె గెలుచుకుని టాప్ 5కి చేరారు. మిగిలిన ముగ్గురిలో ఫైనల్లో పోటీ పడే ఆ ఇద్దరు ఎవరు..? ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. అయితే, ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉన్న శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ 3 తెలుగు రియాలిటీ షోకు దీపావళీ (అక్టోబర్ 27) రోజున శుభం కార్డు పడనుందనే వార్తల్లో నిజం లేదని తెలిసింది. అక్టోబర్ 28 నుంచి స్టార్ మా ఛానల్లో కొత్త సీరియల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారమే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫినాలే జరగనుందని సోషల్ మీడియాలో తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, శనివారం ఎపిసోడ్ అలాంటి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది. మరో వారంపాటు బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. -
‘అందుకే శ్రీముఖికి సపోర్ట్ చేయడం లేదు’
బుల్లితెరపై సందడి చేస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 3కి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్ యాంకర్ రష్మీ, రాంప్రసాద్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ రవి కూడా తన బెస్ట్ప్రెండ్ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్బుక్ లైవ్ నిర్వంచారు. అయితే ఫేస్బుక్ లైవ్‌లో రవి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీరెజాకే ఇస్తానని చెప్పాడు. శ్రీముఖినీ కాదని అలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా వివరించారు. ‘అలీ రేజా నా కుటుంబ సభ్యుడులాంటి వాడు. ఇండస్ట్రీలో నా బెస్ట్ప్రెండ్ అతనే. మా ఇంట్లో పండుగైతే వాళ్లు వస్తారు.. వారింట్లో పండగైతే మేము వెళ్తాం. రంజాన్ పండగ రోజు బిర్యానీ పంపిస్తాడు. నాతో కలిసి దీపావళి పండుగ జరుకుంటాడు. మా మధ్య అంతమంచి బాండ్ ఉంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో అందరూ నాకు నచ్చివాళ్లే. కానీ అలీ నాకు సొంత అన్నలాంటివాడు. అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా. గేమ్ బాగా ఆడుతున్నాడు. అలీ మొదటి నుంచి 49 వరకు ఏంటో మీకు తెలుసు. ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు అందరు బాధపడ్డారు. అతను చాలా మంచోడు..గేమ్ బాగా ఆడుతుంటే ఎందుకు ఎలిమినేట్ చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చాక కూడా అలీని కలిశా. పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత బిగ్‌బాస్ టీం వచ్చి రీఎంట్రీకి అడిగినప్పుడు ఆలోచించాడు. అతనేం సొంతంగా వెళ్లలేదు. అతను ఉంటే బాగుంటుందని భావించే బిగ్‌బాస్ మేనేజ్మెంటే మళ్లీ ఆహ్వానించింది. అయితే రీఎంట్రీ తర్వాత అలీ అలాగే ఉన్నాడు. కానీ చూపించే విధానం మారింది. అది ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. వారికి నచ్చింది వారు చూపిస్తారు. దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. 24 గంటల్లో కేవలం ఒక గంట మాత్రమే వారిని చూపిస్తారు. ఇండస్ట్రీ వాళ్లం కాబట్టి మాకు అంతా తెలుసు. షూటింగ్, రేటింగ్, ఔట్ పుట్, మనీ ఇవన్నీ మాకు తెలుసు. మీరు చూసేవాళ్లు మాత్రమే. మేం ఏది చూపిస్తే అది చూస్తారు. మిమ్మల్ని నమ్మేలా చేసేది మేం. ఇది బిజినెస్. ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అని ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్.. అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి. అలీ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. తెలుగు నేర్చుకున్నాడు. యాక్టింగ్ నేర్చుకున్నాడు. కష్టపడి సీరియల్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చి కూడా జన్యూన్‌గా ఆడుతున్నాడు. గేమ్‌లోకి వేళ్లేముందు అలీకి ససోర్ట్ చేస్తానని మాట ఇచ్చా. అందకే సపోర్ట్ చేస్తున్నాను. శ్రీముఖికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అందరూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి నా కోయాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. తను కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్ చేస్తున్నా. మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి కానీ ట్రోలింగ్ చేయకండి ప్లీజ్. హౌజ్ నుంచి బయటకు వచ్చాక అందరూ కలిసి ఉంటారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారని నెటిజన్ అడగ్గా.. రాహుల్, అలీలు టాప్ వన్, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్ 3 విన్నర్ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు. -
బిగ్‌బాస్: రేపే గ్రాండ్ ఫినాలే!
-
బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే!?
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్3 తుది అంకానికి చేరింది. గత 14 వారాలుగా బుల్లితెరపై సందడి చేస్తూ వచ్చిన ‘బిగ్‌బాస్’కి కొద్దిరోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. 15 మంది కంటెస్టన్స్తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది నలుగురు. వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి మిగిలిన ముగ్గురు, ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లిన రాహుల్, బాబా భాస్కర్‌తో కలిసి ఫైనల్లో పోటీ పడతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈ రోజు లేదా రేపటి ఎపిసోడ్లో తేలనుంది. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్3 షోకి రేపే ముంగింపు ఉండబోతుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్టార్ మా యాజమాన్యం ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ..సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చ మొదలైంది. అక్టోబర్ 28 నుంచి స్టార్ మా ఛానల్లో కొత్త సీరియల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్ షోను రేపటితో ముగిస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ ఆదివారమే బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే ఉంటుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వారం హౌజ్‌మేట్స్‌కి లగ్జరీ బడ్జెంట్ ఇవ్వలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీపావళి సందర్భంగా సీజన్ 3కి ఎండ్ కార్డ్ పడిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, లాజికల్‌గా చూస్తే అది సాధ్యకాదని మరి కొంత మంది భావిస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా ఒక్కరు ఎలిమినేట్ అవుతారని, మిగిలిన ఐదుగురిని మరోక వారం ఇంట్లో ఉంచి..ఆ తర్వాత విన్నర్‌ను ప్రకటిస్తారని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే వారం మాత్రం షో ప్రసార సమయంలో మార్పులు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్‌బాస్ ప్రసారం కానున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో మాత్రం యథాతథంగా 9 గంటలకే ప్రసారమవతుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వచ్చే వారం కూడా బిగ్‌బాస్ షో కొనసాగితే.. మూడో సీజన్ 105 రోజులు జరినట్లు చరిత్రలో నిలిచిపోతుంది. కాగా, జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తొలి సీజన్ 70 రోజులు మాత్రమే కొనసాగింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ 112 రోజులుపాటు కొనసాగి అత్యధిక రోజలు పాటు ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్‌గా రికార్డు సృష్టించింది. కాగా నిన్నటి 97వ ఎపిసోడ్లో బిగ్‌బాస్ పెద్ద షాకిచ్చాడు. అనూహ్యంగా బాబా భాస్కర్‌ను ఫైనల్స్‌కు పంపిచాడు. దీంతో శ్రీముఖి, అలీ రేజా, వరుణ్, శివజ్యోతి మాత్రమే నామినేషన్లో ఉన్నారు. వీరిలోనుంచి ఒకరు ఈ రోజు లేదా రేపు ఎలిమినేట్ అవుతారు. అయితే ఎలిమినేట్ ఎవరనే ఉత్కంఠకు లీకులు వీరులు తెరదించారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది శివజ్యోతి అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఎప్పటి మాదిరిగానే లీకుల వీరులు చెప్పినట్లు శివజ్యోతి ఎలిమినేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మరొకొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్: అర్థరాత్రి ‘బిగ్’ షాక్
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్3 షో ముగింపు దశకు వచ్చింది. ఫైనల్‌కి వెళ్లే టాప్ 5 ప్లేస్‌ల కోసం హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనల్ పోరులో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బాబా మాస్టర్ జాక్‌పాట్ కొట్టాడు. అనూహ్యంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలోని మంచి జోష్ ఉన్న సాంగ్‌తో నిన్నటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ పాటకు శ్రీముఖి, బాబా భాస్కర్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. వీరికి శివజ్యోతి కూడా జతకలవడంతో డాన్స్‌లతో హౌస్‌ను షేక్ చేశారు. అనంతరం టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కి కేఎల్ఎం ఫ్యాషన్స్ వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి, మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ హౌస్‌గా నిలిచిన వాళ్లకు వారికి 10వేల గిఫ్ట్ ఓచర్ ప్రకటించారు బిగ్ బాస్. ఈ గిఫ్ట్ ఓచర్‌ను బాబా భాస్కర్, శివజ్యోతి దక్కించుకున్నారు.] (చదవండి: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!) అనంతరం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ చుక్కలు చూపించాడు. అర్థరాత్రి వేళ సైరన్ మోగించి.. నామినేషన్లో ఉన్నవారిని బ్యాగులు సర్ధుకొని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో షాకైన ఇంటిసభ్యులు.. నిద్రమత్తులోనుంచి తేరుకొని బ్యాగులు సర్ధుకున్నారు. శని, ఆదివారాల్లో నామినేషన్ ఉంటే ఇప్పుడు బ్యాగులు సర్ధుకోవాడం ఏంటని అనుకుంటూ.. భారంగా బ్యాగ్‌లు తీసుకొని గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై బాబా మాస్టర్ తనదైన స్టేల్లో జోకులు పేల్చాడు.ఎందుకు ఇప్పుడు బ్యాగ్‌లు సర్ధమంటున్నారని వరుణ్ అడిగితే బయటకు పిలిచి ఆటోకి డబ్బులు ఇస్తారంట అన్నాడు. మరి మీకేం కావాలి అని వరుణ్ అడగ్గా.. ఫ్లైట్ టికెట్‌తో పాటు ఓ పది లక్షలు ఇస్తే హ్యాపీగా బయటకు వెళిపోతా అన్నాడు. మరి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ వద్దా అని వరుణ్ పంచ్ వేస్తే..పొద్దునే వద్దులే అంటూ జోక్‌లు పేల్చారు. అనంతరం తలుపు తెరవడంతో గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులు వాళ్ల జర్ని గురించి చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించగా..ఒక్కొక్కరు తమ జర్నీని ఎమోషనల్‌గా షేర్ చేసుకున్నారు. అనంతరం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని చెబుతూ.. బాబాను టాప్5 కంటెస్టెంట్‌గా ప్రకటించారు. అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్ టు ఫినాలేను అందించాడు. దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. టికెట్ టు ఫినాలేను ఆడియన్స్‌ని డెడికేట్ చేశారు బాబా భాస్కర్.దీంతో ఏపిసోడ్ ముగిసింది.కాగా, మిగతా నలుగురిలో ఎవరు ఎలిమేషన్ అవుతారనేది నేటి ఎపిసోడ్ లేదా రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్‌బాస్: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!
పద్నాలుగో వారం పూర్తయితే బిగ్‌బాస్ ఫైనల్‌కు వచ్చేసినట్లే.. అయితే దీనికన్నా ముందుగా ఎలిమినేషన్ ఉంది. ఈసారి రాహుల్ మినహాయిస్తే ఇంటి సభ్యులంతా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులతో కొన్ని స్టంట్లు చేయిస్తూ.. వారిని సేఫ్ చేసుకోడానికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం కల్పించాడు. చివరి ఎలిమినేషన్ కావడంతో హౌస్మేట్స్ గుండెల్లో గుబులు మొదలైంది. ఇక తాజా ప్రోమోను చూసినట్టయితే బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. అందరూ పడుకున్న సమయంలో సైరన్ మోగించి వారిని నిద్రకు భంగం కలిగించాడు. ఉన్నపళంగా వారిని బ్యాగులు సర్దుకొని గార్డెన్ ఏరియాకు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. అయితే ఇంత సడన్‌గా బ్యాగులను ఎందుకు సర్దుకోమన్నాడు. ఈ సారి భిన్నంగా రెండు రోజుల ముందే, నాగార్జున లేకుండానే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈసారి ఎలిమినేషన్ పూర్తయితే బిగ్‌బాస్ ఫైనల్ లెవల్‌కు వెళ్లనుంది. అయితే ఫైనల్‌కు వెళ్లేదెవరు అనేదానిపై ప్రేక్షకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అందరినీ దాటేసి రాహుల్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోగా శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజా రేసులో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. పాతాళ గంగ శివజ్యోతికి ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి లీకువీరుల కన్నా ముందుగా ప్రేక్షకులే శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. All housemates Pack your bags!!!#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/MphP1KDfm9 — STAR MAA (@StarMaa) October 25, 2019 -
జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..
టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా వారికి హౌ క్లీన్ యువర్ జర్నీ అనే టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు రాసున్న రంగు బౌల్స్‌ను ఇచ్చారు. ఆ పేర్లు ఉన్న వ్యక్తులు టాప్ 5కు ఎందుకు అనర్హులు కాదో చెప్పి రంగు పోయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా బాబా భాస్కర్.. అలీ తన గురించి మాట్లాడిన విషయాలు బాధపెట్టాయంటూ అలీపై రంగు పోశాడు. తర్వాత శ్రీముఖి.. శివజ్యోతి ఎమోషనల్ వ్యక్తి.. కాబట్టి తను ఫైనలిస్టుకు అర్హురాలు కాదంటూ ఆమెపై రంగు గుమ్మరించింది. ఇక శివజ్యోతి... కోపంలో వరుణ్ మాట్లాడిన విధానం నచ్చలేదంటూ అతడిని అనర్హుడిగా తేల్చింది. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడంటూ వరుణ్‌పై రంగు చల్లింది. టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి.. అయితే బాబా టాప్ 5లో ఉండేందుకు బాబా అర్హుడంటూ వరుణ్ రంగు పోయడానికి నిరాకరించాడు. అటు బాబా కూడా శ్రీముఖి ఫైనల్‌కు వెళ్లేందుకు తగిన వ్యక్తి అని రంగు చల్లడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు తటాపటాయించిన అనంతరం వరుణ్ రంగు చల్లడానికి సిద్ధపడ్డాడు. వితిక వెళ్లిపోయినప్పటి నుంచి తనను ప్రేమగా చూసుకున్నావంటూ పాజిటివ్ దృక్పథంలో బాబాపై రంగు గుమ్మరించాడు. ఇక బాబా.. తనపై రంగు పడకుండా గెంతులు వేశాడు. కాగా రంగు పడకుండా క్లీన్‌గా నిలిచిన శ్రీముఖి విన్నర్‌గా నిలవగా.. తనకోసం ప్రచారం చేసుకునే అవకాశాన్ని గెలుచుకుంది. ఓట్లు వేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, తనను గెలిపించమని శ్రీముఖి ప్రేక్షకులను కోరింది. జీవితంలో చీకటి రోజులు.. అనంతరం బిగ్‌బాస్ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో జరిగిన చేదు ఘటనను చెప్తూ మళ్లీ పాతాళ గంగలా మారింది. నాన్న చనిపోయినా కూడా రెండు రోజుల వరకూ ఆ విషయాన్ని దాచారని.. తండ్రి కోసం తెచ్చిన ఆహారాన్ని అన్నయ్య తినేసి నాన్నే తిన్నాడని చెప్పి నమ్మించేవాళ్లని ఎమోషనల్ అయింది. మానసికంగా నన్ను సిద్ధంగా ఉంచటం కోసం వాళ్లు అవన్నీ చేశారు. అయితే తండ్రికి చికిత్స అందించడానికి ఆలస్యం చేసామని శివజ్యోతి కుమిలిపోయింది. ‘నాన్న ట్రీట్మెంట్కు నేను, మా ఆయన రెండు రోజులు ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లుంటే బతికేవాడేమో’ అని చెప్తూ కన్నీటి పర్యంతం అయింది. ఇది తన జీవితంలోనే చేసిన పెద్ద తప్పు అంటూ శివజ్యోతి బాధపడింది. బ్రేకప్... చచ్చిపోదామనుకున్నా: శ్రీముఖి అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ‘అందరు అమ్మాయిల లాగే నా జీవితంలోనూ రిలేషన్షిప్స్ ఉండేవి. అతనితో అంతా బాగుంది అనుకున్న సమయంలో డిస్టబెన్స్ ఎదురయ్యాయి. ఓ రోజు ఆకస్మాత్తుగా స్టేజీపై యాంకరింగ్ చేస్తున్నపుడు నాకు బ్రేకప్ అయిపోయిందన్న వార్త వచ్చింది. నేను పక్కకు వెళ్లి ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అవన్నీ పక్కనపెట్టి.. అప్పుడు నేను చేస్తున్న కామెడీ షోను నవ్వుతూనే పూర్తి చేశాను. బ్రేకప్ తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఆ విషయం కోసం అంత ఫూలిష్‌గా ప్రవర్తించాను అనిపిస్తుంది. సో.. ఒక అమ్మాయి ఆర్థికంగా ఎదిగిన తర్వాతే లవ్వు, గివ్వు వంటివాటి కోసం ఆలోచించండి. ఫ్యామిలీ తర్వాతే మిగతా వాటిని పట్టించుకోండి’ అని సలహా ఇచ్చింది. అయితే ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరును మాత్రం చెప్పుకోడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి తనకు తెలుసంటూ అలీ హింట్ ఇవ్వగా శ్రీముఖి కాదని చెప్పింది. -
శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్
బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్‌లు ఇస్తూ నవ్విస్తాడు.. అంతలోనే మరో టాస్క్ ఇచ్చి గొడవలు పెడతాడు. మళ్లీ అప్పుడే వాళ్లతో ఆటలు ఆడిస్తాడు. ఈ క్రమంలో నేడు బిగ్‌బాస్ ఇవ్వనున్న టాస్క్ వీటన్నింటికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యుల జీవితాలను కుదిపేసిన ఘటనలను వారితోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి చిరునవ్వు వెనక తీరని విషాదం ఉందని అర్థమవుతోంది. అయితే యాంకర్ శ్రీముఖి ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదు. (చదవండి: శ్రీముఖికి నేనున్నానంటూ అభయమిస్తున్న రష్మీ) కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యుల సమక్షంలో తన జీవితంలో జరిగిన చేదు ఘటనను వెల్లడించినట్లు తాజా ప్రోమోలో తెలుస్తోంది. శ్రీముఖి కూడా ప్రేమలో పడిందని.. కానీ అది ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం బ్రేకప్ అయిందని స్పష్టమవుతోంది. అది కూడా ఘోరంగా బ్రేకప్ జరిగిందని, ఆ సమయంలో చచ్చిపోవాలనిపించిందని తను పడిన బాధను చెప్పుకొచ్చింది. తన రిలేషన్షిప్ వల్ల ఎంత వేదనను అనుభవించిందో ఇంటి సభ్యులతో పంచుకుని మనసు తేలిక పరుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి పేరు వెల్లడించిందా? గోప్యంగా ఉంచిందా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. #Sreemukhi opens up on her relationship #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3j4wK2Klel — STAR MAA (@StarMaa) October 24, 2019 -
బిగ్‌బాస్ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు త్వరలో శుభం కార్డు పడనుంది. అత్యధిక టీఆర్పీలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయింది. వైల్డ్‌కార్డులు, రీ ఎంట్రీలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది. పాత సీజన్లతో పోలుస్తూ బిగ్‌బాస్ తెలుగు 3 అట్టర్ ఫ్లాఫ్ అని ప్రేక్షకులు తేల్చి చెప్తున్నారు. బిగ్‌బాస్ మొదటి నుంచి ఇస్తూ వచ్చిన టాస్క్‌లు.. అష్టా చెమ్మా ఆటల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. అయితే బిగ్‌బాస్ షో క్లైమాక్స్ చేరుకోవడంతో, ఇప్పటికైనా ఆసక్తికర టాస్క్‌లు ఇస్తారేమోనని ఎదురు చూశారు. కానీ అదీ నెరవేరలేదు. షో మొత్తంలో మరీ అంత గొప్పగా చెప్పుకోదగ్గ టాస్క్‌లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రోమో చూస్తే భయానకంగా, ఒళ్లు గగుర్పొడిచేదిలా ఉంటుందని, తీరా ఎపిసోడ్ చూస్తే ఉసూరుమనిపిస్తుందని ప్రోమో లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్ మాత్రమే, నో ఎంటర్టైన్మెంట్! అంతదాకా ఎందుకు..? నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. సర్కస్ ఫీట్లకు ఏమాత్రం తీసిపోదు. పైగా ఇందులోనూ కొంతమందికి కాస్త కఠినంగా మరికొంతమందికి సులువైన టాస్క్‌లు ఇచ్చారని నెటిజన్లు బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ పూర్తిగా పక్కన పడేసి, కేవలం ప్రమోషన్స్‌కు మాత్రం బిగ్‌బాస్‌ను భీభత్సంగా వాడుకున్నారన్న వాదన లేకపోలేదు. మొదటి నుంచి ఈ కార్యక్రమంపై వెల్లువెత్తిన ఆరోపణలకు లెక్కేలేదు. ఈ సీజన్లో హౌస్మేట్స్ గొడవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్పో రాహుల్.. పునర్నవిల లవ్‌ట్రాక్ కాస్త పర్వాలేదనిపించింది. మన్మథుడి హోస్టింగ్‌తో నెట్టుకొద్దామని చూసినప్పటికీ, బిగ్‌బాస్ షోలో అసలైన మజా లోపించి టీవీల దగ్గర చతికిలపడిపోయింది. సోషల్ మీడియాలోనూ బిగ్‌బాస్‌పై చర్చ అంతంతమాత్రంగానే జరిగింది. ఇక ఎక్కువగా టాస్క్‌లు రద్దు చేసిన ఘనత కూడా ఈ సీజన్‌కే సొంతం. (చదవండి: జీరో నుంచి హీరోగా మారిన రాహుల్) ఆరోజే ముగింపు.. జూ. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ 70 రోజులు మాత్రమే కొనసాగింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ 112 రోజులుపాటు కొనసాగి అత్యధిక రోజలు పాటు ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మూడో సీజన్ 105 రోజుల పాటు జరగనుంది. దీపావళి తర్వాత నుంచి షో ప్రసార సమయంలో మార్పులు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. స్టార్ మా ఛానల్లో కొత్త సీరియల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్ షోను మరింత లేట్‌గా ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. దివాళీ తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్‌బాస్ ప్రసారం కానున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో మాత్రం యథాతథంగా 9 గంటలకే ప్రసారమవనుంది. ఏదేమైనా క్లైమాక్స్‌లోనైనా బిగ్‌బాస్ షోను రక్తికట్టిస్తారో లేదో చూడాలి! -
వరుణ్, శివజ్యోతిల ఫైట్ మళ్లీ మొదలైంది..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 లో నామినేషన్లోకి వచ్చిన ఇంటిసభ్యులతో బిగ్‌బాస్ ఫీట్లు చేయిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో వారితో సర్కస్ ఫీట్లు చేయించగా.. నేడు హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టనున్నాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగేట్టు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు.. నచ్చని హౌస్మేట్పై రంగు పోసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ టాస్క్‌తో ఇంట్లో పాత గొడవలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. వారం ప్రారంభంలో జరిగిన నామినేషన్ టాస్క్‌లోని జరిగిన లొల్లిని శివజ్యోతి ప్రస్తావించడంతో వరుణ్ ఒంటికాలిపై లేచాడు. తన సహనాన్ని కోల్పోయి శివజ్యోతిపై విరుచుకుపడ్డాడు. ‘మానిప్యులేటివ్‌గా మాట్లాడకు..’ అంటూ శివజ్యోతిపై మండిపడ్డాడు. గొడవను సర్ది చెప్పాలని చూసిన రాహుల్‌పైనా తిరుగుదాడి చేశాడు. దీంతో వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. కాగా వరుణ్.. బాబాపై, శివజ్యోతి.. వరుణ్‌పై, బాబా.. అలీపై, శ్రీముఖి.. శివజ్యోతిపై రంగు పోసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమో ఆసక్తి రేకెత్తించినప్పటికీ ఎపిసోడ్ మాత్రం సాదాసీదాగానే ఉంటుందని ప్రోమో లవర్స్ విమర్శిస్తున్నారు. Color esko leda Cover chesko!!! #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4EC1CfrIAj — STAR MAA (@StarMaa) October 24, 2019 Who do you think is the clean person in the house??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/rDG0QsRNDS — STAR MAA (@StarMaa) October 24, 2019 -
శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్ యాంకర్
బయట టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక.. బిగ్‌బాస్ ఇంట్లోనూ టాప్ కంటెస్టెంట్‌గా పేరుగాంచిన ఏకైక వ్యక్తి శ్రీముఖి. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా వెనుకడుగు వేయకుండా పోరాడుతుంది. ఇక ఈ వారం రాహుల్ తప్ప శ్రీముఖితో సహా ఇంటి సభ్యులందరూ నామినేషన్లో ఉన్నారు. దీంతో వారిని ఎలిమినేషన్ నుంచి తప్పించడమే కాక టైటిల్‌ను సాధించడానికి గెలుపు బాటలు వేయడానికి అభిమానులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి నచ్చిన కంటెస్టెంట్ కోసం ప్రచారాన్ని ఊపందించారు. ఈ తరుణంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ గొంతు వినిపిస్తున్నారు. తమకి నచ్చిన వ్యక్తులకు ఓట్లు వేయండంటూ ప్రచారానికి దిగారు. ఈ నేపథ్యంలో శ్రీముఖిని గెలిపించాలంటూ జబర్దస్త్ టీం రంగంలోకి దిగింది. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా శ్రీముఖికి తన మద్దతు తెలిపింది. తను నాకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పుకొచ్చింది. గేమ్ అద్భుతంగా ఆడుతోందని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ టైటిల్ కొట్టాలని కోరింది. నా ఫుల్ సపోర్ట్ శ్రీముఖికే అంటూ ప్రచారంలోకి దిగింది. ఇక జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా శ్రీముఖికి అండగా నిలిచాడు. బిగ్‌బాస్ షోను ఫాలో అవుతున్నానని.. అందులో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ శ్రీముఖి అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్స్‌కు వచ్చిన ఆమె ఫైనల్‌కు తప్పకుండా వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీముఖిని బిగ్‌బాస్ విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని, ఆమెకు ఓట్లు వేయండని వేడుకున్నాడు. దీంతో రాములమ్మ అభిమానులు.. ‘విన్నర్ శ్రీముఖి’ అంటూ మరింత దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారం ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తుందా, లేదా అనేది తెలియాలి. -
చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్
బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియలో ‘టికెట్ టు ఫినాలే’ ట్విస్టులతో కొనసాగింది. ఇక ఇంటి సభ్యులు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డప్పటికీ గెలుపు రాహుల్ సొంతం అయింది. ఇది మిగతా ఇంటి సభ్యులకు మింగుడు పడటంలేదు. టాస్క్‌లు ఆడడు.. అన్న అపనింద తెచ్చుకున్న రాహుల్ ఈ దెబ్బతో తనేంటో నిరూపించుకున్నాడా! , అసలు ‘టికెట్ టు ఫినాలే’ రాహుల్‌కు పొరపాటున వచ్చిందా? ఈ గెలుపు కొద్దిపాటిదేనా, లేక అదే ఊపుతో టైటిల్ కొట్టేయడానికి పావులు కదుపుతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. గేమ్‌లో అప్పటివరకూ ఆధిక్యతను కనబర్చిన అలీని.. టాప్ 5 అంటూ ఆటపట్టించిన ఇంటి సభ్యులకు రాహుల్ విజయంతో నోటమాట రాలేదు. ఈ గేమ్‌లో రాహుల్ ప్రదర్శన చూసినట్టయితే.. టాస్క్ ప్రారంభంలోనే అదృష్టం అతనికి కలిసొచ్చింది. అతను ఎంచుకున్న కార్డులో 50 శాతం అని రాసి ఉండగా దానితోనే ఆటను మొదలుపెట్టాడు. మొదటగా.. వరుణ్, రాహుల్ టాస్క్ ఆడాల్సి రాగా వాళ్లు కొట్టుకుంటున్నారేమో అన్నట్టుగా వీరోచితంగా పోరాడారు. కానీ విజయం రాహుల్‌నే వరించింది. ఈ టాస్క్‌లో తన బ్యాగు కూడా రాహుల్‌కే ఇస్తూ వరుణ్ మరోసారి ఫ్రూట్ అని నాగార్జున చెప్పిన మాటలను నిజం చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అలీ, బాబా ఆడిన పూల టాస్క్ ఎంత హింసాత్మకంగా మారుతుందో బిగ్‌బాస్ హెచ్చరిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ అలీ బాబాపై అదును చూసి దాడి చేయడం, తోయడం వంటి హింసకు పాల్పడటంతో అతన్ని రేస్ నుంచి తప్పిస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో అలీ విజయానికి అడుగుదూరంలో ఆగిపోయాడు. అలీ అనర్హుడిగా తేలడంతో రాహుల్‌కు టికెట్ గెలుచుకునే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దీంతో రాహుల్ మరీంతగా శ్రమించాడు. మరో టాస్క్‌లో బద్ధ శత్రువైన శ్రీముఖితో రాహుల్ తలపడ్డారు. దీంతో శ్రీముఖి పెట్టిన కార్డ్‌లు గాలికి కూలిపోగా రాహుల్ పెట్టిన కార్డ్‌లు నిటారుగా ఉండటంతో అతను విజేతగా నిలిచాడు. ఒకవేళ అలీ పూల టాస్క్‌లో గెలుచుంటే రాహుల్ ఫినాలే టికెట్ దక్కించుకోవటం కష్టతరమయ్యేది. ఎలాగైతేనేం.. రాహుల్ గెలుపును ముద్దాడాడు. ఈ సీజన్లో ఫైనల్‌కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా తన పేరును లిఖించుకున్నాడు. దీంతో చిచ్చా(రాహుల్) ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అమ్మ మాట నిలబెట్టాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ టైమ్ స్టార్టయింది అంటూ పంచ్ డైలాగ్‌లు విసురుతున్నారు. టాస్క్‌లు ఆడడు.. లేజీ అంటూ మూకుమ్మడిగా దాడి చేసిన వారికి మీమ్స్‌తో తగిన సమాధానమిస్తున్నారు. కింద ఇచ్చిన కొన్ని మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. -
బిగ్‌బాస్ ఇంట్లో సర్కస్, నేడే చూడండి!
బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్‌బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్.. ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్‌లో మరో ఆసక్తికర టాస్క్ ఇవ్వడానికి బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. అందులో భాగంగా నామినేట్ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్‌లు ఇస్తూ వారి బలాబలాలను బేరీజు వేయనున్నాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి ఇది సువర్ణావకాశం అంటూ.. నామినేషన్లో ఉన్న బాబా భాస్కర్, వరుణ్, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు భిన్న టాస్క్‌లను ఇచ్చాడు. అభిమానులను అలరించడానికి సర్కస్ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్మేట్స్. తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్ బాబా.. పంచ్‌లు విసురుతూ ఇంట్లో నవ్వులు పూయిస్తున్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి! అయితే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గత వారం స్వల్ప ఓటింగ్ తేడాతో గట్టెక్కిన శివజ్యోతి ఈసారి తప్పించుకోలేదని, బిగ్‌బాస్ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Which nominated contestant will prove his best to get viewers appreciation ??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/vxEXxf0cMr — STAR MAA (@StarMaa) October 23, 2019 -
బిగ్‌బాస్: ఫైనల్‌కు రాహుల్, అలీకి బిగ్ షాక్
బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠకరంగా సాగింది. టికెట్ టు ఫినాలే రేసులో గెలుపు కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. ఇక పూల టాస్క్‌లో అలీ రెజా, బాబా భాస్కర్ల ఫైట్ సినిమాల్లోని పోరాట ఘట్టాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. టాస్క్‌లో భాగంగా.. అలీ బాబాను తోసెస్తూ మట్టి పాత్ర దరిదాపుల్లోకి కూడా రానీకుండా విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బల ప్రదర్శన చూపించారు. దీంతో బిగ్‌బాస్ హింసకు తావలేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ వినిపించుకోని అలీ.. బాబాను తలతో గుద్దుతూ కిందపడేశాడు. దీంతో బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను రద్దు చూస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హింసకు పాల్పడ్డ అలీని టికెట్ టు ఫినాలే రేసుకు అనర్హుడిగా ప్రకటించాడు. దీంతో వీరోచితంగా పోరాడిన అలీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అప్పటివరకూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అలీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. చిచా గెలుపు... అనంతరం బెల్ మోగించిన రాహుల్, శ్రీముఖి తలపడ్డారు. వారికిచ్చిన డామినోస్ (కార్డ్స్)లను వరుస క్రమంలో నిలబెట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ టాస్క్‌లో రాహుల్‌కు అలీ సహాయం చేయగా శ్రీముఖి ఒంటరి పోరాటం చేసింది. కానీ వీరి ఆటకు గాలి ఆటంకం కలిగించడంతో శ్రీముఖి పెట్టిన కార్డ్స్ అన్నీ పడిపోగా రాహుల్‌వి మాత్రం నిటారుగా ఉండటంతో అతను గెలిచాడు. ఓటమితో శ్రీముఖి తీవ్ర నిరాశ చెందినట్టు కనిపించింది. అనంతరం బజర్ మోగినపుడు గంట కొట్టిన శ్రీముఖి, శివజ్యోతిలకు క్యూబ్స్‌తో పిరమిడ్లు నిర్మించాల్సిన టాస్క్ ఇవ్వగా ఇందులో రాములమ్మ విజయం సాధించింది. కాగా అప్పటికే ఆధిక్యంలో ఉన్న రాహుల్‌ను ఇంటి సభ్యులెవరూ అందుకోలేకపోయారు. నామినేషన్ టాస్క్‌లో అలీ, వరుణ్ 0, శివజ్యోతి, శ్రీముఖి.. 10, బాబా భాస్కర్.. 20, రాహుల్.. 40 శాతం బ్యాటరీని సాధించారు. అధిక బ్యాటరీతో ముందంజలో ఉన్న రాహుల్ నామినేషన్ నుంచి సేఫ్ అవడంతోపాటు ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నాడు. మిగిలిన అయిదుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. కాగా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టు అయిన రాహల్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు పంపించి పండగ చేసుకోమన్నాడు. -
బిగ్‌బాస్: అలీని చూసి వణికిపోతున్న హౌస్మేట్స్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ పద్నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ ఓ సువర్ణావకాశాన్ని ఇస్తూనే అందులో ఓ మెలిక పెట్టాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ‘టికెట్ టు ఫినాలే’ అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉండగా ఓడిపోయిన మిగతా అయిదుగురు సభ్యులు నామినేషన్లో ఉంటారని ప్రకటించాడు. గెలిచిన ఒక్కరికి టికెట్ టు ఫినాలే దక్కుతుందని తెలిపాడు. దీనికోసం పగలూ రాత్రీ తేడా లేకుండా ఇంటి సభ్యులంతా టాస్క్‌లపైనే దృష్టి సారించారు. ఇప్పటికే అధిక శాతం బ్యాటరీతో అలీ రెజా మొదటి స్థానంలో ఉండగా.. తక్కువ బ్యాటరీతో వరుణ్ చివరి స్థానంలో ఉన్నాడు. ఇక అర్ధరాత్రి సమయంలో బజర్ మోగించినపుడు అలీ, బాబాలు గంట మోగించడంతో వారిద్దరికీ బిగ్‌బాస్ రసవత్తరమైన టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా మట్టి పాత్రలో బాబా ఎరుపు రంగు పూలు.. అలీ ఊదా రంగు పూలు పెట్టాల్సి ఉంటుంది. ఒకరి పూలను మరొకరు పీకే ప్రయత్నం చేయవచ్చని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో అలీ.. బాబా పూలను పెకిలిస్తూ.. దూరంగా విసిరేశాడు. ఆగ్రహించిన బాబా.. అలీ పూలను కూడా మట్టిలో నుంచి తీసేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుస్తీలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దొర్లుతూ గెలుపు కోసం భీకరంగా పోరాడుతున్నారు. తాజా ప్రోమో ప్రకారం.. అలీ బాబాను ఎత్తిపడేస్తున్నట్టు కనిపిస్తోంది. వీరి పోరాట పటిమను చూస్తుంటే ఇంటి సభ్యులకు సైతం ఒళ్లు గగుర్పొడొస్తోంది. టాస్క్ హింసాత్మకంగా మారడంతో ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. ఓ పక్క శ్రీముఖి వారిస్తోన్నప్పటికీ అలీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాబాపై విరుచుకుపడ్డాడు. రసవత్తరంగా మారిన ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. #Ali ki #BabaBhaskar ki madhyalo jarigina fight lo evaru gelicharu?#BiggBossTelugu3 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zWDLv9aZCD — STAR MAA (@StarMaa) October 22, 2019 -
బిగ్‌బాస్: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..
బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాల్లో బందీ అయిన వరుణ్ తనను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వరుణ్‌ను.. రాహుల్, అలీ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇక బిగ్‌బాస్ పద్నాలుగోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా ఇచ్చాడు. ఇందులో గెలిచే ఒక్కరే ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారని, మిగతా అయిదుగురు నామినేట్ అవుతారని ప్రకటించాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ‘బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండగ’ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరూ వివిధ కలర్ బ్లాక్స్‌ను ఎంచుకున్నారు. అందులో ఉన్న నెంబర్ శాతం ప్రకారం.. బాబా భాస్కర్.. 40 %, రాహుల్, శ్రీముఖిలు.. 50 %, శివజ్యోతి 60 %, అలీ.. 70% ల బ్యాటరీ పర్సెంటేజ్‌తో ఆట స్టార్ట్ చేశారు. సైరన్ మోగిన ప్రతీసారి ఇంటి సభ్యుల బ్యాటరీ లెవల్స్ తగ్గుతూ వస్తాయి. అయితే బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు గంటలను ఎవరు ముందుగా మోగిస్తారో వారు బ్యాటరీ రీఫిల్ చేసుకోడానికి టాస్క్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి బ్యాటరీలను చూపించే పట్టికను బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ఒకేసారి గంట కొట్టిన అలీ-శివజ్యోతి.. రాహుల్-వరుణ్.. బాబా భాస్కర్-శ్రీముఖి టాస్క్‌ల్లో తలపడ్డారు. అరటిపండ్ల టాస్క్‌లో శివజ్యోతి 15 మాత్రమే తినగా, అలీ 21 తిని రీఫిల్ చేసుకునే అవకాశాన్ని పొందాడు. రాహుల్, వరుణ్‌లకు థర్మాకోల్ నింపిన సంచులను ఇచ్చి ఒకరి సంచిని మరొకరు ఖాళీ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ పేర్కొన్నాడు. ఇందులో వరుణ్, రాహుల్ భీకర పోరాటం చేయగా చివరగా రాహుల్‌దే పైచేయి అయింది. బాబా, శ్రీముఖిలు.. ఆల్ఫాబెట్ కాయిన్స్‌ను పిండి, ఈకలు ఉన్న డబ్బాలో నుంచి కేవలం నోటి సహాయంతో తీయాల్సి ఉండగా ఇద్దరూ సమానంగా తీయగా టై అయింది. దీంతో టాస్క్‌ను ముందుగా పూర్తి చేసిన బాబా భాస్కర్ విజయం సాధించాడని బిగ్‌బాస్ ప్రకటించాడు. కాగా వారికిచ్చిన టాస్క్‌ల్లో గెలిచిన అలీ, రాహుల్, బాబా 10 శాతం బ్యాటరీలను పెంచుకున్నారు. ఇక అర్ధరాత్రి బజర్ మోగినప్పుడు బెల్ కొట్టిన బాబా, అలీ ఇద్దరూ చివరగా తలపడ్డారు. మట్టి నింపిన డబ్బాలో తలా ఒక రంగును పూలను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పూలను పీకే ప్రయత్నం కూడా చేయవచ్చని బిగ్‌బాస్ సూచించాడు. ఈ క్రమంలో అలీ, బాబాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా రోజులకు ఫిజికల్ టాస్క్ రావటంతో అలీ తన శక్తినంతా కూడబెట్టుకుని బాబాపై విరుచుకుపడుతున్నాడు. బాబా పెట్టిన పూలను దూరంగా విసిరి పారేస్తున్నాడు. బాబా తన పూలను కాపాడుకోడానికి ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఈ భీకర పోరులో విజయం ఎవరిని వరించనుంది అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు..
తెలుగు రాష్ట్రాల్లో టీవీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షోల్లోఒకటి ‘బిగ్‌బాస్’. ఇందులో పాల్గొనే అవకాశం ఎన్నో వడపోతల తర్వాత వస్తుంది. అలాంటిది ‘ఫన్‌బకెట్’ కామెడీ స్కిట్లతో సోషల్ మీడియా ద్వారా యూత్‌కు చేరువైన మహేష్ విట్టా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బిగ్‌బాస్–3 హౌస్‌లో ఏకంగా 84 రోజులు ఉన్నాడు. గతవారం ఎలిమినేట్ అయ్యాక ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. లోపల జరిగేవన్నీ నిజం కాదని, నాగార్జున ఓన్లీ స్క్రిప్ట్‌ని మాత్రమే ఫాలో అవుతారని..ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.ఆవి మహేష్ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: వాస్తవానికి నేను ‘బిగ్‌బాస్–2’కి వెళ్లాల్సిన వాడిని. అప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ చివర్లో ఉన్నాను. అదే సమయంలో ‘బిగ్‌బాస్’లోకి మహేష్ విట్టా వస్తే బాగుంటుందని ‘స్టార్ మా’కి నాని అన్న చెప్పారు. అప్పుడు ‘మా’ యాజమాన్యం నన్ను సంప్రదించింది. షూటింగ్స్‌లో బిజీ ఉండి రాలేనని.. వచ్చే ఏడాది వస్తాననడంతో సీజన్–3కి రావాలని పిలిచారు. తెలిసిన డైరెక్టర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని అంతా ఓకే అనుకున్నాక ఓకే చెప్పా. అలా నాని మాట సాయం వల్ల వెళ్లానే తప్ప విజేత అవ్వాలని మాత్రం కాదు. నన్ను నేను టీవీలో చూసుకోవడానికి, ప్రేక్షకులకు ‘వాట్ ఈజ్ మహేష్ విట్టా’ అని చెప్పడం కోసం వెళ్లా. తల్లి రమణమ్మతో మహేష్ విట్టా నెగిటివ్ చెప్పడం చాలా కష్టం హౌస్‌లోకి అడుగుపెట్టాక చాలా సంతోషమనిపించింది. అందరం కొత్త ముఖాలే అయినా కలిసిపోయాం. కబుర్లు చెప్పుకుంటూ బాగానే ఉంటున్న సమయంలో టాస్క్‌లు ఇస్తారు. ఏవో చిన్న చిన్న గొడవలు. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారు. ఓ వ్యక్తి గురించి నెగిటివ్‌గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? అంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడని చెప్పాలి? సరే.. బిగ్‌బాస్ చెప్పాడు కదా అని చెప్తాం.. మళ్లీ పొద్దున లేచాక ఆ మనిషి ముఖం చూడాల్సిందేగా? ఇన్ని సమస్యలు ఉండబట్టే లోపల ప్రతి ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. బయటకు చెప్పుకోలేం. మీరు చూస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డా.. హౌస్‌లో ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడాలి. ఒక మనిషిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్లకు నచ్చిన కూరగాయాల్ని పంపుతారు. ఆ కూరగాయలు కూడా ఫ్రెష్ ఉండవు. వారానికి సరిపడా పంపే రేషన్‌లో కొన్ని ముఖ్యమైన నిత్యావసర సరుకులు ఉండవు. ఒకసారి కూరలో వేసుకునే కారం పంపలేదు. దాంతో మాదగ్గరున్న ఎండు మిర్చిని దంచి కారంలా చేసి కూరల్లో వాడుకున్నాం. లోపల పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. లైట్స్ ఆపితేనే పడుకోవాలి లోపల ఉన్న మాకు రాత్రి– పగలు ఎప్పుడో తెలియదు. బిగ్‌బాస్ లైట్లు ఆపి పడుకోండి అంటే పడుకోవాలి, లైట్లు ఆన్‌చేసి లేవమంటే లేవాల్సిందే. నైట్ టైం పోలీసుల పెట్రోలింగ్ వాహనాల సైరన్ విని రాత్రి అయ్యిందేమో అనుకునేవాళ్లం. ఇంటి నుంచి లెటర్స్ వస్తే వారు చదివి, బయట విషయాలు లేవంటేనే మాకు సమచారం ఇస్తారు. నాగార్జునకు కూడా తెలియదు వాస్తవానికి హౌస్‌లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదు, ఇబ్బంది పెట్టేవారు అసలే కాదు. అసలు నేను ఎందుకు పనికిరానని అందరూ అనుకున్న సమయంలో నాగ్ సార్ ‘మహేష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్, నీ స్టైల్లో నువ్వు ఆడు’ అంటూ సపోర్ట్ చేశారు. దసరా రోజు హౌస్‌లోకి వచ్చినప్పుడు నాతో సరదాగా ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్ స్వీట్ మెమరీ. నాకు బాగా నచ్చిన వ్యక్తి బాబా మాస్టర్. ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు. ఆ రాజకీయాలు ఏంటనేవి నేను చెప్పను. హౌస్ నుంచి రాగానే అమ్మని కలిశాను. కొన్నిరోజులు కేరళ వెళతా. టీఆర్పీ రేటింగ్స్ కోసం గత వారంలో అయిన గొడవను టీవీలో ఫ్రెష్‌గా చూపిస్తారు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్ ఫ్రెండ్స్. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. వీటిని ఎడిటింగ్ చేసి పునర్నవి, రాహుల్ మధ్య ఏదో ఉందన్నట్టు టెలికాస్ట్ చేశారు. అక్కడ అదేం లేదు. -
రాహుల్‌ది ఫేక్ రిలేషన్షిప్ : వితికా
పదమూడో వారానికిగానూ వితికా ఎలిమినేట్ అవడంతో వరుణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక్కడో చిన్న ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వితికా హౌస్‌ను వీడేముందు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ శ్రీముఖి ఆమె చెవిలో గుసగుసలాడింది. అనంతరం బయటకు వచ్చిన వితికాతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్మేట్స్ ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టి వారికి చెప్పాలనుకునేటివి ఏమైనా ఉంటే చెప్పాలన్నాడు. ఈ సమయంలో వితికా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ నిర్మొహమాటంగా వెల్లడించింది. తను బయటకు రావడానికి కారణం శివజ్యోతి అని బల్లగుద్ది చెప్పింది. లేకపోతే షో చివరిదాకా ఉండేదాన్నేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. శివజ్యోతి తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వితికా అంగీకరించింది. ‘నాకన్నా ఒక స్టెప్పు ఎక్కువే నువ్వు. అది నేను ఒప్పుకుంటున్నా’నంటూ శివజ్యోతికి తెలిపింది. కాగా వరుణ్.. శివజ్యోతి కన్నా వితికా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నామినేషన్లో తన స్థానాన్ని భార్యకు ఇచ్చేసిన విషయం తెలిసిందే! అయితే ఇప్పుడు వితికా.. శివజ్యోతే తనకన్నా స్ట్రాంగ్ అని ఒప్పుకోవటం గమనార్హం. ఇక ఎవరి గురించి చెడుగా చెప్పాలనుకోడవం లేదంటూనే రాహుల్‌కు చురకలంటించింది. ‘నామినేషన్ తర్వాత నుంచి మాతో దూరంగా ఉంటున్నావు. మాతో నువ్వు ఫేక్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నావేమో’ అని అనుమానంగా ఉందని చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నంతమాత్రాన ఫేక్ రిలేషన్ కాదని రాహుల్ తిరుగు సమాధానమిచ్చాడు. అనంతరం ‘అలీ ఉండాలి, నేను వెళ్లిపోవాలనుకున్నాను’ అన్న విషయాన్ని వితికా వెల్లడించింది. ‘ఎలిమినేట్ అయి వెళ్లిపోవటం, తిరిగి రావటం నీ తప్పు కాదు’ అంటూ అలీకి ధైర్యం నూరిపోసింది. బాబా భాస్కర్‌తో.. మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి, తనకు ఒక దోసె కూడా ఎక్కువగా ఇవ్వండి అని ఆర్డర్ వేసింది. చివరగా వరుణ్, శ్రీముఖిల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టడానికి చాలాసేపు తటాపటాయించింది. వరుణ్ ఏడ్చినందుకుగానూ అతని బెలూన్ను పగలగొట్టింది. శ్రీముఖిని కరెంట్‌తో పోల్చుతూ ఆమె అసలు అలసిపోదని ఎప్పటికీ ఎనర్జెటిక్‌గా ఉంటుందని వితికా ప్రశంసించింది. -
బిగ్‌బాస్: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?
భీమవరం అమ్మాయి వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షో ఫైనల్‌కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు. దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఫైనల్ బెర్తు కోసం వరుణ్, రాహుల్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వరుణ్.. రాహుల్‌తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్‌గా టికెట్ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? టాస్క్ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే! "Ticket To Finale" evaru geluchukuntaru??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/srVrxbrxGn — STAR MAA (@StarMaa) October 21, 2019 -
బిగ్‌బాస్: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్
బిగ్‌బాస్ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్‌బాస్ విడగొట్టాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్‌కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్‌లు ఆడించాడు. మీకు సూటబుల్ అనిపించే పాటలను డెడికేట్ చేసుకోమని నాగ్ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్ సాంగ్‌తో, శ్రీముఖి.. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్.. జులాయి టైటిల్ సాంగ్, వరుణ్.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్‌గా శివజ్యోతి డాన్స్ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్, అలీ రెజాలకు బాక్సింగ్ గ్లౌజ్‌లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్ చేస్తుండగా మిగతా హౌస్మేట్స్ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్ ఆసక్తికర టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్‌బాస్ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను రాహుల్‌పై వేసింది. -
బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్టైన్మెంట్ తగ్గిందని బిగ్‌బాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్ చాలా వీక్‌గా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బంధాలు, ఎమోషన్స్, ప్రేమవ్యవహారాలతో ఈ సారి షోలో వినోదం తక్కువైందని వాపోతున్నారు. అదేవిధంగా బిగ్‌బాట్ టాస్కుల్లో కొత్తదనం లోపించిందని విమర్శిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్ని బిగ్‌బాస్ షోలు చూసి రావడంతో ఫిజికల్, సీక్రెట్ టాస్క్‌లను ముందే అంచనా వేస్తున్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఈ సీజన్‌ను చాలా బోరింగ్‌గా ఫీలవుతున్నామని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఈ వాదనకు మరింత బలం చేకూరేలా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా సీజన్‌ను చూడటం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దానికి గల కారణాలను కూడా వివరించాడు. తనకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టమని, అయితే అది ఈ సీజన్లో లోపించిందన్నాడు. అందుకే ఈ సీజన్ తనకు కనెక్ట్ కాలేదన్నాడు. ఆరంభంలో కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడే ఈ విషయం పక్కాగా అర్థమైందన్నాడు. ప్రస్తుతం షూటింగ్, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్ షోను మొత్తానికే చూడటం మానేశానని పేర్కొన్నాడు. తొలి సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం ఆ సీజన్‌కు హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు శివబాలాజీ, ఆదర్శ్, అర్చన, నవదీప్, ప్రిన్స్ వంటి కంటెస్టెంట్లు చాలా బలంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంటిసభ్యులు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని డబుల్ పంచారు. దీంతో ఆ సీజన్ విజయం సాధించింది. అనంతరం రెండో సీజన్‌కు హోస్ట్ మారినా.. ఎంటర్టైన్మెంట్ కాస్తా కూడా తగ్గలేదు. గీతామాధురి పాటలు.. దీప్తి మాటల ప్రవాహం.. తనీశ్, సామ్రాట్ల బ్రొమాన్స్.. కౌశల్ తన యాటిట్యూడ్‌తో పాటు గొడవలతో రెండో సీజన్‌ను హీటెక్కించాడు. ఇక మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో వినోదం మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని భావించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు షోలో చేసే ప్రదర్శన కంటే ముందుగా చేసుకున్న సోషల్ మీడియా క్యాంపైన్ మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అందుకే బిగ్‌బాస్‌లో ఆడినా ఆడకున్నా బయట తమకున్న ఫాలోయింగ్‌తో ఓట్లు రాబట్టి విజేతగా నిలవాలని అనుకుంటున్నారు. అయితే ఇంత ముందు చూపు ఉన్న కంటెస్టెంట్లు కాస్త టాస్క్‌లపై దృష్టి పెట్టాలని బిగ్‌బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చదవండి: బిగ్‌బాస్: వితికా ఎలిమినేట్.. ఇది ఫిక్స్! బిగ్‌బాస్: ఆ ముగ్గురు సేఫ్..! -
బిగ్‌బాస్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!
బిగ్‌బాస్ ఇంట్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వరుణ్, వితిక, శివజ్యోతిల గొడవ దెబ్బతో అందరూ నామినేషన్లోకి వచ్చారు. దీంతో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది తేలనుంది. ఇక ఇంటి సభ్యుల కష్టానికి ఏమాత్రం తీసిపోకుండా వారి అభిమానులు కూడా తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ ఈ వారం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. మొదట నామినేషన్ ప్రక్రియతో అందరినీ డేంజర్ జోన్లోకి పంపించి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించి ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో అదిరిపోయే ట్విస్టు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇప్పటికే వైల్డ్‌కార్డ్ కార్డ్ ఎంట్రీలు అయిపోయాయి. మిగిలిందల్లా డబుల్ ఎలిమినేషన్! తాజా ప్రోమో ప్రకారం నాగ్ చెప్పినట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా..! ఉంటే కనక హౌస్ నుంచి వితికతో పాటు శివజ్యోతి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపేమో.. ఎలిమినేట్ అయింది వితిక మాత్రమే అంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మరి ఈ వారం వితిక వెళ్లిపోతే వరుణ్ ఏమవుతాడో చూడాలి! భార్యను వెయ్యి ఏనుగుల బలంగా భావించే వరుణ్ తను వెళ్లిపోతే కుప్పకూలిపోతాడా.. రెట్టింపు కష్టపడుతూ టైటిల్ దక్కించుకోడానికి ప్రయత్నిస్తాడా అనేది చూడాలి! Sunday ochesindi so its Funday time!!! kani last lo twist emana untunda ??#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/JYLUSDDvFJ — STAR MAA (@StarMaa) October 20, 2019 -
బిగ్‌బాస్: ఆ ముగ్గురు సేఫ్..!
బిగ్‌బాస్ ఇంట్లో చూస్తుండగానే తొంభై రోజులు గడిచిపోయాయి. ఇక వీకెండ్లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. చిచ్చు రేపిన నామినేషన్ టాస్క్‌నే మళ్లీ ఆడించడం ఆసక్తి రేపింది. ఇంట్లో తమ స్థానాలను తెలిపే నెంబర్స్‌ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2, బాబా భాస్కర్, వితిక..3, రాహుల్..4, వరుణ్ 7 స్థానాలను ఇచ్చుకున్నారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ల లొల్లి మళ్లీ మొదలైంది. బిగ్‌బాస్ షోకు తనను శ్రీముఖే రికమెండ్ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్ నాగార్జున దగ్గర వాపోయాడు. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘రికమెండ్ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు’ అని శ్రీముఖి కరాఖండిగా చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంపై రాహుల్ ఎంతకూ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే తక్షణమే షో నుంచి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. మీ మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగింది అంటూ నాగ్ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. వచ్చిన బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్‌లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ రాములమ్మను బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్ గిఫ్ట్‌ను రాహుల్ ఓపెన్ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్ అయింది. శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్ప్రైజ్ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్‌కు ఓటు వేసింది. వితికను చూడగానే ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్‌బాస్ అయిపోయాక ఇంటికి వస్తే అందరికీ భీమవరం వంట చేసిపెడతానని ఆఫర్ ఇచ్చింది. అనంతరం అలీ స్నేహితుడు యాంకర్ రవి షోలో పంచ్‌లు పేల్చుతూ ఎంటర్టైన్ చేశాడు. శ్రీముఖిని బాగా మిస్ అవుతున్నానని రవి చెప్పుకొచ్చాడు. రాహుల్ మిత్రుడు.. సింగర్ నోయెల్ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక నుంచి రాహుల్ 2.0 చూడాలని కోరాడు. బిగ్‌బాస్ టైటిల్ కొట్టాలంటూ రాహుల్ కోసం ఉరకలెత్తించే పాట పాడాడు. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ అక్క శోభన కాస్త ఎమోషనల్ అవుతూనే, బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం అలీ చేతుల మీదుగా బాబా సేవ్ అయ్యారు. షోకు వచ్చిన గెస్ట్‌లు ఎక్కువమంది అలీ, వితికలు టాప్ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. శ్రీముఖి, రాహుల్ ,బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. మరి మిగిలిన నలుగురిలో బయటకు వెళ్లేది వితికేనా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బిగ్‌బాస్: వితికా ఎలిమినేట్.. ఇది ఫిక్స్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ -3 తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్ పోరు వైపు దుసుకెళ్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియకు భిన్నంగా ఈ వారం జరిగింది. పదమూడో వారానికి గాను జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. హౌస్‌లో ఉన్న ఏడుగురు నామినేట్ అవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరగబోతోందో ముందే చెబుతున్న లీకువీరులు తాజాగా ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతున్నారో ముందే చేప్పేశారు. పదమూడో వారానికి గాను వితికా షేరు ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వితికా బిగ్‌బాస్ హౌస్‌ను వీడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భార్యభర్తలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన వితికా-వరుణ్‌లు విడిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా లేని వరుణ్ గేమ్ ఇంకా బాగా ఆడతాడా లేక చతికిలపడతడా అనేదానిపై తెగ చర్చ జరుగుతోంది. ఆమె ఎలిమినేట్ కావడానికి గల అనేక కారణాలను కూడా నెటిజన్లు పేర్కొంటున్నారు. మెడాలియన్ టాస్క్ గెలవడానికి బాబా భాస్కర్‌తో ప్రవర్తించిన తీరు.. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శివజ్యోతితో వరుణ్-వితికల వాగ్వాదం ఆమె ఎలిమినేషన్‌కు కారణాలుగా పేర్కొంటున్నారు. పునర్నవి భూపాలం ఎలిమినేషన్ తర్వాత రాహుల్ కూడా వరుణ్-వితికాలతో అంత సఖ్యంగా ఉండటం లేదు. దీంతో వితికాకు ఓటింగ్ శాతం తగ్గింది. అంతేకాకుండా ఉన్న ఏడుగురు ఇంటిసభ్యుల్లో వీక్ కంటెస్టెంట్ వితికా కావడంతోనే ఆమెకు ఓట్లు తక్కువ వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుణ్, రాహుల్, పునర్నవిల సహాయంతోనే ఇన్ని రోజులు నామినేషన్ కాకుండా సేఫ్ అయిందని లేకుంటే వితికా ఎప్పుడో హౌస్‌ను వీడేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక వితికా ఎలిమినేషన్ విషయం అధికారికంగా తెలియాలంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ వరుకు వేచిచూడాల్సిందే. -
బిగ్‌బాస్: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్ అవుతుందా?
తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. పదమూడో వారానికి గానూ ఏడుగురు నామినేట్ అవగా ఎవరో ఒకరు లగేజీ సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక పొరపాటున కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్లు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నమోదైన పోల్స్ ప్రకారం వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే నేటితో ఓట్లు వేయడానికి ఆఖరి రోజు కావటంతో లెక్కలు మారే అవకాశం ఉంది. లీకువీరుల అంచనా ప్రకారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది వితికేనంటూ పేర్కొంటున్నారు. తను టాస్క్‌లు బాగా ఆడినప్పటికీ అతి తెలివి, స్వార్థబుద్ధితో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అని అభిప్రాయపడుతున్నారు. పైగా తను ఇంట్లో ఉండటం వల్ల వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. వితిక ఒక అవకాశవాది అని వెనకాల గోతులు తీయడంలో దిట్ట అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మెడాలియన్ టాస్క్‌లో బాబాకు వెన్నుపోటు పొడవటం కూడా ఆమెకు నెగిటివిటీగా మారింది. బిగ్‌బాస్ షో ప్రారంభంలో తప్పితే ఆ తర్వాత నామినేషన్ దరిదాపుల్లోకి రాకుండా వితిక, శివజ్యోతి తప్పించుకు తిరిగారని.. ఈ సారి వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ప్రేక్షకులు. పైగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరినీ పంపించేస్తామని పేర్కొంటున్నారు. శివజ్యోతి కన్నింగ్ బిహేవియర్ అని, ఆమె ఏడుపు మొఖాన్ని చూడలేకున్నామని ఆమెను పంపించేయాలని మరికొంతమంది కోరుతున్నారు. ఎటొచ్చీ ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే వితిక బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు తొంభై రోజులుగా కలిసి ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి బిగ్‌బాస్ రెడీ అయిపోయాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కానీ ఒక్కరోజులో ఈ అంచనా తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి బిగ్‌బాస్ ఏమైనా ట్విస్టులు ఇస్తాడా? డబుల్ ఎలిమినేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారా అన్నది వీకెండ్ ఎపిసోడ్లో చూడాలి. -
బాబా భాస్కర్ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్
బిగ్‌బాస్ ఇంట్లోకి ఏడుగురు అతిథులు వచ్చారు. ఇంటి సభ్యులు వారికి సకల మర్యాదలు చేసి ఏడు స్టార్లను సంపాదించుకున్నారు. అయితే వచ్చిన అతిథుల్లో మెజారిటీ జనాలు వరుణ్ బామ్మ అదుర్స్ అంటున్నారు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో హుషారెత్తించింది అంటూ బామ్మకు జై కొడుతున్నారు. ఇక రాహుల్ తల్లి సుధారాణి.. తన కొడుకుకు, శ్రీముఖికి మధ్య ఉన్న గొడవలను ఏమాత్రం పట్టించుకోకుండా రాములమ్మ అల్లరి ఎంతో ఇష్టమని పాజిటివ్‌గా మాట్లాడింది. ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లిని కలుసుకోడానికి ఆమెను బిగ్‌బాస్ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా శ్రీముఖి గుండె పగిలేలా రోదించింది. ఇన్ని ట్విస్టుల మధ్య మళ్లీ ఆమె ఇంట్లోకి ప్రవేశించగా రాహుల్‌ను కాస్త సున్నితంగానే హెచ్చరించింది. మరోవైపు శ్రీముఖి లేనిదే బిగ్‌బాస్ హౌస్ లేదంటూ ఆమెను ఆకాశానికి ఎత్తింది. రాహుల్ తల్లి అంత పాజిటివ్‌గా మాట్లాడితే శ్రీముఖి తల్లి మాత్రం అలా రాహుల్‌ను వేలెత్తి చూపడం ఏం బాగోలేదంటూ కొంతమంది ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్ ప్రవర్తించిన విధానం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతని తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆమెను హగ్ చేసుకోడానికి అన్నట్టుగా బాబా భాస్కర్ దగ్గరికెళితే శివజ్యోతి ఆయనను పక్కకు లాక్కెళ్లింది. సిగ్గులేదా అంటూ బాబాను శివజ్యోతి తిట్టిపోసింది. పైగా బాబా శ్రీముఖి తల్లిని ఉద్దేశించి.. సేమ్ జిరాక్స్.. జై రామకృష్ణ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆమె కోసం వస్తా నీ వెనక.. అని పాటలు పాడటం వెగటు పుట్టించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెకు మోకాళ్లపై కూర్చుని టీ ఇస్తూ అతిగా ప్రవర్తించడం చిరాకు పుట్టించదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఆమె తల్లిని ఎత్తుకున్న సమయంలోనూ ‘ఏమైనా హెల్ప్ చేయాలా..’ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆయన దిగజారిన కామెడీకి అద్దం పట్టాయని విమర్శిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో బాబా ప్రవర్తనను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అలాగే బాబా ప్రవర్తనకు ఇంటి సభ్యులు సైతం షాకైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాబా అభిమానులు మాత్రం ఇదంతా కేవలం కామెడీయే అని వెనకేసుకొస్తున్నారు. -
బిగ్‌బాస్: వితిక దెబ్బకు వరుణ్ అబ్బా!
బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్ ఇంట్లో టైటిల్ వేటకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపించి బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఎనభై ఏడు రోజులపాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఇంటి సభ్యులు వారిని చూడగానే ఎమోషనల్ అయ్యారు. వచ్చిన అతిథులు సైతం ఎవరి తరహాలో వారు టైటిల్ పోరుకు హౌజ్‌మేట్స్‌ను సన్నద్ధం చేసి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హౌజ్‌మేట్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కో గెటప్‌లో దర్శనమిస్తున్నారు. శ్రీముఖి ధరించిన గెటప్ తనకు పర్ఫెక్ట్గా సూట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా తన హావభావాలు చూస్తుంటే ఇది మహానటి సావిత్రి పాత్ర అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక శివజ్యోతి చంద్రముఖి క్యారెక్టర్లో విరుచుకుపడి నటించినట్లు తెలుస్తోంది. వరుణ్, వితికలు బాహుబలి చిత్రంలోని ప్రభాస్, అనుష్క గెటప్ వేశారు. కత్తి తిప్పుతూ రాణిలా హావభావాలు పలికిస్తోంది వితిక. బాహుబలి ఫేమస్ సీన్ ఒకటి కాపీ చేయాలని చూడగా బొక్కబోర్లా పడ్డారు. వరుణ్ వీపు మీద నుంచి వితిక నడుచుకుంటూ వెళ్లాలని చూసింది. కానీ వరుణ్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో అందరూ పడీపడీ నవ్వారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. వరుణ్.. మళ్లీ ఫ్రూట్ అయ్యాడంటున్నారు. మీరు కూడా కింది మీమ్స్ చూసి సరదాగా నవ్వుకోండి. Cinemallo manaki nachina characters lo housemates 🎞️📽️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4ZUWgF9BYv — STAR MAA (@StarMaa) October 18, 2019 -
శ్రీముఖిని ఓ రేంజ్లో ఆడుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన అతిథులతో హౌస్ సందడిగా మారింది. గత ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ నానమ్మ రాజ్యలక్ష్మి గలగలా మాట్లాడుతూ, పంచ్‌లు విసురుతూ అందరినీ నవ్వించింది. కుదిరితే తర్వాతి సీజన్‌కు తాను కూడా వస్తానని ఉత్సాహం ప్రదర్శించింది. టాస్క్‌లు బాగా ఇస్తున్నాడని బిగ్‌బాస్‌ను మెచ్చుకోవడంతో పాటు ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేసింది. తర్వాత కన్ఫెషన్ రూంలో నుంచి రాహుల్ తల్లి సుధారాణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే ఏడుపును తమాయించుకున్న రాహుల్ వెళ్లి ఆమె ఒడిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. రాహుల్‌ను అక్కున చేర్చుకుని సుధారాణి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. బిగ్‌బాస్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. టాస్క్‌లు సరిగా ఆడమని సూచించింది. ‘రాహుల్.. మనసులో ఏం ఉంటుందో.. అది మొహం మీదే అనేస్తాడు. కానీ వాడి మనసు చాలా మంచిది, ఎవరూ వాడిని తప్పుగా అనుకోకండి’ అని ఇంటి సభ్యులను కోరింది. శ్రీముఖి గెలిచేసింది శ్రీముఖి అల్లరంటే చాలా ఇష్టమని రాహుల్ తల్లి తెలిపింది. రాహుల్.. పెదవే పలికిన మాటల్లోన పాట పాడి తల్లిపై ప్రేమ కురిపించాడు. అనంతరం తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. చివరి అతిథిగా శ్రీముఖి తల్లి లత లోనికి వస్తుండగా ఆమెను చూడగానే శ్రీముఖి కన్నీటి పర్యంతమయింది. అయితే బిగ్‌బాస్ కాస్త నాటకీయతను జోడించి శ్రీముఖి ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు. కనీసం కళ్లారా చూడకముందే లతను బయటికి పంపించేయడంతో శ్రీముఖి వెక్కివెక్కి ఏడ్చింది. కన్నీళ్లు ధారలు కడుతుండగా మళ్లీ ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే లేడిపిల్లలా చెంగుచెంగున పరుగెత్తుకు వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడుపు లంకించుకుంది. శ్రీముఖి తల్లి ఆమెను ఓదారుస్తూ.. ‘డాన్సు ఇరగదీస్తున్నావ్.. ఎవరు ఏమన్నా నువ్వు పడుతున్నావ్ తప్ప తిరిగి మాటలు అనట్లేదు.. అక్కడే నువ్వు గెలిచావ్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని సంతోషించింది. ‘బయట చిన్నపిల్లోడి నుంచి ముసలోడి వరకు అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వు లేనిది బిగ్‌బాస్ హౌసే లేదు’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. నిజామాబాద్ అమ్మాయిలు దుమ్ము లేపుతున్నారు అంటూ శ్రీముఖి, శివజ్యోతిలను పొగడ్తలతో ముంచెత్తింది. రాహుల్‌తో మాట్లాడుతూ.. మాట్లాడుకోండి, పోట్లాడకండి అని చురకలు అంటించింది. ఇక బాబా భాస్కర్ కామెడీ వెగటు పుట్టించింది. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ‘రామకృష్ణ సేమ్ పీస్ పట్టారు’ అని సెటైర్ వేశాడు. కిచెన్‌లో ఆమె కోసం పాట పాడారు. ఇక ఆయన కుళ్లు కామెడీ భరించలేక వితిక, శివజ్యోతిలు ఆపండి మాస్టర్ అంటూ హెచ్చరించారు. వచ్చిన ప్రతీ అతిథి ఒక్కో స్టార్‌ను ఇవ్వడంతో బిగ్‌బాస్ హోటల్ సెవన్ స్టార్ హోటల్‌గా మారింది. దీంతో నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
‘బిగ్‌బాస్ గారు.. మా ఇంటికి రండి’
బిగ్‌బాస్ పదమూడోవారం ఎమోషనల్ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్మేట్స్ మిగిలారు. వీరు టీవీ, ఫోన్లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85 రోజులు కావస్తోంది. ఉన్నదల్లా హౌస్‌లో ఉన్నవారితోనే ఆటలు, పాటలు, అల్లరి పనులు, గొడవలు, వగైరా! ఏ ఎమోషన్ అయినా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారితోనే పంచుకోవాలి, వారితోనే తెంచుకోవాలి. ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ స్వాంతన కలిగించారు. వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. దీంతో కొద్ది నిమిషాలైనా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్‌మేట్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇప్పటికే వితిక, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చి పలకరించి వెళ్లిపోయారు. మా వాళ్లెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న రాహుల్, శ్రీముఖి, వరుణ్‌ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. తాజా ప్రోమో ప్రకారం కన్ఫెషన్ రూమ్‌లో నుంచి రాహుల్ తల్లి అతన్ని పిలుస్తోంది. గతంలో అమ్మ గుర్తుకు వచ్చిందని ఏడ్చిన రాహుల్.. ఇప్పుడు అమ్మ కళ్లెదుటే ఉండటంతో సంతోషిస్తాడో, కన్నీటిపర్యంతం అవుతాడో చూడాలి. అలాగే వరుణ్ బామ్మ కూడా ఇంట్లోకి అడుగుపెట్టి సందడి చేసినట్టు కనిపిస్తోంది. అందరూ బామ్మ చుట్టూ చేరగా.. ఆమె బోలెడు కబుర్లను ఇంటి సభ్యులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్‌బాస్.. మా ఇంటికి రావాలి’ అని ఇన్వైట్ చేయడంతో ఇంటి సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఈ సరదా కబుర్లు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! #Rahul & #Varun family visit to #BiggBossHotel#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/YwIButaZCU — STAR MAA (@StarMaa) October 17, 2019 -
బిగ్‌బాస్: ‘పాత అలీ కావాలి!’
బిగ్‌బాస్ ఇంట్లో గ్రూప్‌లు మారిపోయినట్టు కొట్టొచినట్టు కనిపిస్తోంది. రాహుల్.. శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్... శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక మరో గ్రూప్‌గా మారిపోయారు. అయితే ఇదంతా నామినేషన్ ఎఫెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ ఇంట్లోకి హౌస్మేట్స్ కుటుంబీకులను పంపిస్తూ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈపాటికే వితిక చెల్లెలు రితిక అందరినీ పలకరించి వెళ్లింది. తాజా ఎపిసోడ్లో అందరూ స్లీప్ మోడ్‌లో ఉన్న సమయంలో అలీ భార్య మసుమా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది మసుమా అని శివజ్యోతి గుర్తుపట్టింది. స్లీప్ మోడ్ రివీల్ చేసిన తర్వాత అలీతో బయట జరుగుతున్న వాటికోసం కబుర్లు చెప్పింది. ‘వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ముందున్న అలీ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. నాకు అదే కావాలని కోరింది. బంధాల్లో ఇరుక్కుపోకుండా నీ గేమ్ నువ్వు ఆడు..’ అని అలీకి చురకలు అంటించింది. తర్వాత వచ్చిన మరో అతిథి గంగూలీని చూడగానే శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. శివజ్యోతిని దగ్గరికి తీసుకుని బాగా ఆడుతున్నావ్ అంటూ గంగూలీ ధైర్యం చెప్పాడు. కాసేపు రాహుల్, అలీ శివజ్యోతిని ఆటపట్టించగా.. ఏయ్, మా ఆయన ఉన్నాడు అంటూ రెచ్చిపోయింది. అయితే తను లేనందుకు గంగూలీ కొంచెం కూడా బాధపడట్లేదని శివజ్యోతి ఫీల్ అయింది. ఏడుస్తూనే భర్తను సాగనంపింది. తర్వాత బాబా భాస్కర్ వంతు వచ్చింది. ముందుగా వారి పిల్లలను, తర్వాత భార్య రేవతిని ఇంట్లోకి పంపించారు. ఏంటి.. ఇంత మేకప్ వేసుకున్నారు అంటూ బాబా వాళ్లని ఆటపట్టించాడు. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ సైతాన్ అని శ్రీముఖిని చూపించాడు. అనంతరం కుటుంబం అంతా కలిసి కాసేపు హాయిగా ముచ్చటించారు. ఎందుకు అన్నిసార్లు ఏడ్చారు అని రేవతి.. బాబాను ప్రశ్నించింది. ‘బిగ్‌బాస్ షో ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చాను.. కానీ ఇక్కడ అందరూ నేను గేమ్ ఆడుతున్నానని అనేసరికి కష్టం అనిపించి ఏడ్చాన’ని చెప్పాడు. వెళ్లిపోయే ముందు రేవతి మాట్లాడుతూ ఎప్పుడూ బాబానే మూడుపూటలా వంట చేస్తాడు.. అసలు మీరెవరూ చేయరా అని నిలదీసింది. అసలు వితిక, శివజ్యోతిలను వంట వచ్చా? కిచెన్‌లో శ్రీముఖి కేవలం గరిటె ఊపుతుంది.. అని కామెంట్ చేసింది. అయితే బాబా మమ్మల్ని ఎవరినీ వంట చేయనివ్వడని ఇంటి సభ్యులు సమాధానమిచ్చారు. కాగా ముచ్చటగా మరో ముగ్గురి ఇంటి సభ్యుల బంధువులు ఇంకా రావాల్సి ఉంది. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు తమాయించుకుంటారో, ఏడ్చేస్తారో లేదో చూడాలి! -
థియేటర్లలో శ్రీముఖి యాడ్స్.. నెట్టింట్లో రచ్చ
బిగ్‌బాస్ షోలో అందంతో అదరగొడుతూ.. అల్లరితో అలరిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీముఖి. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి టాప్ 3లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈవారం నామినేషన్లో ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. దీంతో ఎవరి అభిమానులు వారికి గట్టిగానే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. బిగ్‌బాస్ టైటిల్ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం కల్పించడానికి కొంతమందిని నియమించుకుందని అంటున్నారు. ఆ పెయిడ్ బ్యాచ్.. రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్టర్లు, యాడ్స్ అంటూ ఏ ఒక్కటినీ వదలకుండా ఆమెను సేవ్ చేయండంటూ దరువు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. పెయిడ్ బ్యాచ్ సహాయంతో నకిలీ ఓట్లు సంపాదించి టైటిల్ విన్నర్‌గా నిలవాలని చూస్తోందని ఆరోపించారు. ఆమెకోసం ఎంత ఖర్చు పెట్టినా వృథాయే అని ప్రచారాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు కొంతమంది యాంటీఫ్యాన్స్. ఇలాంటి యాడ్స్ వల్ల ఉన్న ఓట్లు కూడా పోతాయని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఎవరేం చేసినా టైటిల్ సాధించే అర్హత ఒక్క శ్రీముఖికే ఉందంటూ ఆమె అభిమానులు వెనకేసుకొస్తున్నారు. ఒకరి ప్రచారశైలిని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదంటూ శ్రీముఖి అభిమానులు వాటికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తతంగం అంతా చూస్తుంటే బిగ్‌బాస్ సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ చేసిన హంగామా గుర్తుకు వస్తోంది. అతను కూడా పెయిడ్ ఆర్టిస్టులతో ఓట్లు సంపాదించి టైటిల్ గెలిచాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసందే! అయితే అదే ఫార్ములా ఇక్కడ గుడ్డిగా ఫాలో అవుతే మొదటికే మోసం వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.ఏదేమైనా అటు ప్రచారంతో ఇటు ట్రోలింగ్‌తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది రాములమ్మ. sreemukhi theater ads trolls chusthuna it is not wrong they have money they are doing it.. but ala cheyadam valla valake bokka edo forcefull ga vepisthunatu untadi adi chusi kondaru veyaru kuda. votes will come in genuine way no matter how much promotion u do #BiggBossTelugu3 — DineshChakre (@chakre_dinesh) October 15, 2019 Promotions/Campaigns/Marketing in all best ways possible with good reach ki Mafia ki difference telidhu anukunta. In this game format every HM has their own campaign. "Paid Mafia" aithe public display undadhu.#biggbosstelugu3 — Annie Juvvanapudi (@anniejuvvan) October 15, 2019 -
బిగ్‌బాస్: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’
బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్ ఎమోషనల్‌గా మారుతోంది. బిగ్‌బాస్ హోటల్ నిర్వహణ ఆధారంగానే ఇంట్లోకి అతిథులను పంపిస్తానని బిగ్‌బాస్ తేల్చి చెప్పాడు. అయితే ఆ అతిథులు హౌస్మేట్స్ కుటుంబ సభ్యులే కావటం విశేషం. ఇప్పటికే వితిక చెల్లెలు రితికా ఇంట్లోకి వచ్చి సందడి చేసి వెళ్లిన విషయం తెలిసిందే! వెళ్లిపోతూ వారిద్దరికీ తగు సూచనలు ఇచ్చి వీడ్కోలు పలికింది. బిగ్‌బాస్ ఇంటి సభ్యులను స్లీప్ మోడ్‌లో ఉండమని ఆదేశించిన సమయంలో అలీ భార్య మసుమా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరాగానే అలీని తన ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు కార్చింది. ఇక నేటి ఎపిసోడ్లో మరింత మంది అతిథులు రానున్నారు. శివజ్యోతి భర్త గంగూలీని చూడగానే శివజ్యోతికి ప్రాణం లేచి వచ్చినట్టయింది...ఆనందంతో ఆమె కళ్ల వెంబడి కన్నీళ్లు ధారలు కట్టాయి. ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా..’ అంటూ గంగూలీ.. శివజ్యోతిని ఏడవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించాడు. ఇన్ని వారాల ఎడబాటును భరించలేకున్నానంటూ ఆమె ఒక్కసారిగా అతని కౌగిలిలో బందీ అయిపోయింది. ఇక మళ్లీ ఈ అవకాశం రాదని గ్రహించిన శివజ్యోతి మనసారా అతనితో ముచ్చట్లాడింది. అన్ని రకాల బాధలను వదిలేసి మనసును తేలిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. మిగిలిన ఇంటి సభ్యులు.. తమవాళ్లు ఎవరెవరు వస్తారోనని ఎదురు చూస్తున్నారు. #BiggBossHotel next guest ga #ShivaJyothi family#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/1sQ1GS4tKW — STAR MAA (@StarMaa) October 16, 2019 -
బిగ్‌బాస్: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!
బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి అని నోరు పారేసుకున్నాడు. టివిలొ మా ఆయన చూస్తే ఫీల్ కాడా? తనకొక్కడికే పెళ్లాం ఉందా?’ అంటూ శివజ్యోతి ఏడ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ వరుణ్, రాహుల్ స్నేహానికి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. పునర్నవి వెళ్లినప్పటి నుంచి రాహుల్ కాస్త దూరంగా ఉంటున్నాడని, తనలో మార్పు గమనిస్తున్నానని వరుణ్ అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారి పనితనంతో హోటల్‌కు సెవన్ స్టార్ సంపాదించి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హోటల్ మేనేజర్ వరుణ్.. వంట మాస్టర్లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక, హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా అలీ, శివజ్యోతి, రాహుల్ పనిచేశారు. వీరందిరి చేత బిగ్‌బాస్ కొన్ని డ్రిల్స్ చేయించాడు. మార్చ్.. ఆగకుండా శుభ్రం చేయడం.. ఫ్రీజ్ అవటం.. ఉన్నచోటే నిద్రపోవడం.. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్‌బాస్.. తర్వాత ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ముందుగా వితిక చెల్లెలిని ఇంట్లోకి పంపించగా.. ఆమె బావగారూ అంటూ పరుగెత్తుకెళ్లి వరుణ్‌ను హత్తుకుంది. చెల్లెలు రితికను చూడగానే వితిక బోరున ఏడ్చింది. వితికను ఊరడిస్తూ.. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోసింది. టాస్క్‌లో మరింత పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అంటూ వరుణ్‌కు సలహా ఇచ్చింది. చివరగా వెళ్లిపోతూ హోటల్‌కు ఒక స్టార్‌ను ఇచ్చింది. తర్వాత అలీ రెజా భార్య మాసుమా ఇంట్లోకి అడుగు పెట్టింది. వచ్చీరాగానే అలీని హత్తుకుని విలపించింది. ఇక మావాళ్లు ఎప్పుడొస్తారో అంటూ మిగతా హౌస్మేట్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్‌బాస్ : శివజ్యోతి ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!
బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ చివరి అంకానికి చేరింది. సీజన్ ముగింపునకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ బిగ్‌బాస్ గేమ్ కఠినతరం చేసేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఇంటి సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే గేమ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ ట్రాక్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్ పదమూడో వారం నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో కుంపటి పెట్టాడు. ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ టాస్క్‌పెట్టి.. మీలో మీరే ఎవరు తోపు అనేది తేల్చుకోండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు సేవ్ అవుతారని, మిగతా నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్లు నామినేషన్‌కు వెళ్తారని చెప్పారు. ఇక ఈ టాస్క్‌లో రాహుల్, శ్రీముఖి ఒకరి మీద ఒకరు వీర లెవల్లో వాదులాటకు దిగారు. కానీ చివరికి బాబా తన మొదటి స్థానాన్ని శ్రీముఖికి ఇవ్వడంతో ఈ గొడవ సమసిపోయింది. ఇక శివజ్యోతి.. తన లక్కీ నంబర్ మూడంటూ ఆ స్థానం తనకు కావాల్సిందేనని పట్టుబట్టింది. వరుణ్.. తన మూడో స్థానాన్ని శివజ్యోతికి ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. అయితే వితిక వచ్చి అడగ్గానే తను పక్కకు తప్పుకుని మూడో స్థానాన్ని ఆమెకు అప్పగించాడు. ఇది మింగుడుపడని శివజ్యోతి వారిద్దరితో వాదనకు దిగింది. కంటెస్టెంట్లుగా ఎవరికి వారు సొంతంగా గేమ్ ఆడండి అని శివజ్యోతి.. వరుణ్, వితికలకు చురకలు అంటించింది. మూడో స్థానం నుంచి కదిలేది లేదని వితిక పక్కనే నుంచుని పేచీకి దిగింది. సహనం కోల్పోయిన వరుణ్.. శివజ్యోతిపై ఫైర్ అయ్యాడు. కంత్రి ఆటలు ఆడకు అంటూ ఆమెను వెక్కిరించాడు. దీంతో వెటకారాలు, వెక్కిరింతలు చేయొద్దని శివజ్యోతి వరుణ్‌కు స్పష్టం చేసింది. చాలా సేపటివరకు ఇదే గొడవ కొనసాగింది. చివరకు బజర్ మోగడంతో టాస్క్ సమయం అయిపోయింది. ఎవరెవరూ ఏయే.. స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకోడంలో గందరగోళం, సందిగ్దత ఏర్పడినందున.. ఈ వారం అందరూ నామినేషన్‌కు వెళ్తున్నారని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇక వరుణ్, వితిక, శివజ్యోతి మాటల యుద్ధంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వితికను నామినేట్ చేయడానికే శివజ్యోతి ఈ కుట్ర పన్నిందని నెటిజన్లు అంటున్నారు. వరుణ్ ప్రవర్తనను కూడా ఓ వర్గం ఎండగడుతోంది. మొత్తంమీద ఈ ముగ్గురూ చేసిన తప్పుకు ఇంటి సభ్యులంతా నామినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ గొడవ వల్ల నష్టపోయేది మాత్రం వితికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ను వీడేది వితికే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతవరకు నామినేషన్లోకి ఎక్కువగా రాని వితిక, శివజ్యోతిలను ఈసారి ఇంటికి పంపిస్తామనే ఆలోచనలో జనం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో చూడాలి..! -
ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్!
బిగ్‌బాస్ ఇంట్లో మహేశ్‌కు, శ్రీముఖికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికీ తెలిసిందే! పన్నెండో వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ‘హంట్ అండ్ హిట్’ టాస్క్‌తో ఇది మరింత తేటతెల్లం అయింది. శ్రీముఖిని పంపించాలని చూసినప్పటికీ చివరికి మహేశ్ బిగ్‌బాస్ హౌజ్‌ను వీడక తప్పలేదు. ఇక మహేశ్.. తననే టార్గెట్ చేశాడని గ్రహించిన శ్రీముఖి కూడా అతని మాటలకు గట్టి కౌంటర్లే ఇస్తూ వచ్చింది. మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించినప్పుడు బాబా తప్ప ఇంటిసభ్యులెవరూ పెద్దగా బాధపడినట్లు కనిపించలేదు. తన గురువు అంటూ బాబా భాస్కర్‌కు పాద నమస్కారం చేసి అతనిపై భక్తి, ప్రేమలను చాటుకున్నాడు. ఎలిమినేషన్ రోజు కూడా మహేశ్, శ్రీముఖి నాగ్ ముందే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇక మహేశ్ వెళ్లిపోయే ముందు శ్రీముఖితో పనుందంటూనే ఏమీ చెప్పకుండానే సెలవు తీసుకున్నాడు. కానీ స్టేజిపైకి వచ్చిన తర్వాత మనసులో ఉన్నదంతా కక్కేశాడు. ఇంట్లో నెంబర్ 1 కంటెస్టెంట్ బాబా తప్ప ఎవరూ లేరటూ ఘంటాపథంగా చెప్పాడు. ఇక కిచెన్‌లో అన్ని గిన్నెలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను శ్రీముఖిపై వేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తాను గురువుగా గౌరవించే బాబాకు ఆర్డర్లు వేస్తుందని, అది తనకు ఇసుమంతైనా నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఎన్ని గిన్నెలైనా వేసేయండి అంటూ బాబాకు ఉచిత సలహా ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్‌బాస్: ఇంటి సభ్యులకు బిగ్ సర్ప్రైజ్!
హౌస్‌లో గొడవలు రాజుకున్నాయనుకునేలోపే ఏదైనా ఫన్నీ టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను కూల్ చేస్తాడు బిగ్‌బాస్. అందరూ కుటుంబంలాగా కలిసిపోయారనుకునేలోపే మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేస్తాడు. ఇవాళ కూడా ఇదే ఫార్ములా వాడనున్నాడు. నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌజ్ హీటెక్కగా ఫన్నీ టాస్క్‌తో నవ్వులు పూయించనున్నాడు. తాజా ప్రోమోలో ఇంటి సభ్యులందరూ ఒకే రకమైన వస్త్రాలను ధరించి, వారి చేష్టలతో నవ్వు తెప్పిస్తున్నారు. కాగా బిగ్‌బాస్ ఇంట్లో ఎనభై అయిదు రోజులు పూర్తయ్యాయి. షో ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటివరకు ఇంటి సభ్యులు బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వారిని బంధువులతో ఫోన్లో మాట్లాడించడం కానీ, కలవనీయడం కానీ జరగలేదు. గతంలో అరవై రోజుల పండగలో వితిక, రవి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని తనివితీరా కబుర్లు చెప్పుకున్నప్పటికీ మిగతావారికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఒక్కసారి కలుసుకునే చాన్స్ ఇవ్వండని కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ అందుకు బిగ్‌బాస్ ససేమీరా ఒప్పుకోలేదు. కాగా నేటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. షో ముగింపుకు వస్తున్నందున ఇంటి సభ్యులకు బూస్ట్ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపిచనున్నట్టు తెలుస్తోంది. అలీ భార్య మసూమా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఎమోషనల్‌గా మారింది. మరి ఇంటి సభ్యులందరి ఫ్యామిలీస్‌ను కూడా బిగ్‌బాస్ పంపిస్తున్నాడా లేదా అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. అటు కామెడీ, ఇటు ఎమోషన్స్‌తో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారనుంది. Entertaining task lo Families entry!!! ❤️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/PsstJF7ZUs — STAR MAA (@StarMaa) October 15, 2019 -
ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్ విట్టా ఎలిమినేట్ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ ఇంట్లో బీభత్సాన్ని సృష్టించింది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు.. వారు తీసుకున్న చిట్టీలో ఉన్న నెంబర్ల స్థానంలో నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అయితే వారు చర్చలు జరుపుకుని తమతమ స్థానాలను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బజర్ మోగిన తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. మొదటగా.. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, శ్రీముఖిలు వరుసగా 1 నుంచి ఏడు స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం ఎందుకు టాప్ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో చెపుతూ ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మొదట శ్రీముఖి.. రాహుల్‌పై ఫైర్ అయింది. ‘నువ్వు బాగా ఆడిన టాస్క్ ఒక్కటి చెప్పు’ అంటూ రాహుల్‌ను ప్రశ్నించింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్ ఆడినవ్’ అంటూ రాహుల్.. శ్రీముఖికి ఎదురు తిరిగాడు. దీంతో చర్చ కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీముఖి.. రాహుల్‌తో పెట్టుకుంటే అయ్యే పని కాదని వదిలేసి బాబాను కాకాపట్టడానికి వెళ్లింది. అయితే అప్పటికే శ్రీముఖికి తన స్థానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్న బాబా తన మొదటి స్థానాన్ని ఆమెకు కట్టబెట్టి వెళ్లి ఆఖరి స్థానంలో నిలుచున్నాడు. రాహుల్.. తనకన్నా అలీ బెస్ట్‌గా పర్ఫార్మ్ చేస్తాడని ఒప్పుకుంటూ అతనికి రెండో స్థానాన్ని ధారధత్తం చేశాడు. ఇక వరుణ్.. అతని మూడో స్థానాన్ని వితికకు ఇవ్వడంపై శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేసింది. కంటెస్టెంట్లుగా గేమ్ ఆడండి.. భార్యాభర్తలుగా కాదంటూ.. శివజ్యోతి ఆవేశంతో విరుచుకుపడింది. ఏదైతే అది అవుతుందంటూ వితిక సాధించుకున్న 3వ స్థానంలోకి వెళ్లి నిలబడింది. ఇక వరుణ్ కూడా కంట్రోల్ తప్పి శివజ్యోతిపై మాటల దాడి చేశాడు. ‘కంత్రీ ఆటలు ఆడకు.. నువ్వు కూడా నీ భర్త గంగూలీని తెచ్చుకోవాల్సింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇంటి సభ్యుల చర్చ ఎంతకూ తెగేలా లేదని భావించిన బిగ్‌బాస్ అందరినీ నామినేట్ చేశారు. కాగా ఈ సీజన్లో ఇంటి సభ్యులు అందరూ నామినేషన్లో ఉండటం ఇదే మొదటిసారి. మరి నామినేషన్ హీట్ ఇంట్లో అలాగే కొనసాగుతుందా.. నేటి ఎపిసోడ్లో చల్లారిపోతుందా అనేది చూడాలి! -
బిగ్ బాస్ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో బిగ్‌బాస్ విజేత ఎవరనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ చర్చే 84వ ఎపిసోడ్‌గా మారింది. శనివారం స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చి ఎపిసోడ్‌ను అత్యంత వినోదకంగా మార్చారు. మొదట శుక్రవారం ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్ను చూపించారు. ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్కర్, అలీ, వరుణ్‌లు పాల్గొనగా ఎండ్ బజర్ మోగే సరికి ముగ్గురు 12 బాటిల్స్ ఫిజ్ తాగారు. దీంతో గేమ్ టైగా ముగిసింది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫిజ్ బాటిల్స్ తీసుకొచ్చి తాగాలి అని చెప్పగా, అలీ రెజా ఒకటి తాగేసి రెండోది తాగుతున్న సమయంలో ఎండ్ బజర్ మోగింది. దీంతో టాస్క్ విజేతగా అలీ నిలిచారు. ఆ సమయంలో బాబా, వరుణ్, అలీ పడిన ఇబ్బందులు ఫన్నీగా అనిపించాయి. (చదవండి : బిగ్‌బాస్ : ‘అతడు’ ఎలిమినేటెడ్!) అనంతరం వితికా, వరుణ్‌లు స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు రోమాంటిక్‌గా చర్చ జరిపారు. వరుణ్‌ను ఎత్తుకొని పూల్‌లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులకు ట్రెజర్ హంట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో దాచిన 8 వస్తువులను 8 మంది పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వస్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారిలో అలీరెజానే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. 8 వస్తువులలో 7 వస్తువులను ఇంటి సభ్యులు కనుక్కోని, ఒక వస్తువును మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో చేసేది ఏమిలేక ఆ వస్తువు ఎక్కడ ఉందో నాగార్జునే చెప్పాడు. ఆ వస్తువును బాబా భాస్కర్ తీసుకున్నాడు. 8 వస్తువులో ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున. ఇందులో ఇతరులపై ఆధారపడేవాళ్లు, మోస్ట్ డేంజర్, భజన చేసే వాళ్లు, జోకర్, ఆట ఆడించేవారు, సుత్తి వేసేవాళ్లు, బలహీనమైన వాళ్లు అనే బిరుదు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరి సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడే వాళ్లు, బలహీనమైన వాళ్లుగా మహేష్‌ను ఎంచుకోగా, సుత్తి ఎక్కువగా మాట్లాడేది శివజ్యోతిగా ఎంచుకున్నారు. మోస్ట్ డేంజర్‌గా వితికాను బాబా భాస్కర్ ఎంచుకున్నాడు. ఫన్నీగా సాగిన ఈ ప్రక్రియలో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు రావడం గమనార్హం. అనంతరం మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. బిగ్‌బాస్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నాడు. శ్రీముఖి ఆ సొమ్మును అమ్మనాన్నలకు ఇస్తానని చెప్పగా, వరుణ్ వితిక ఇస్తానని, రాహుల్ ఇల్లు కొంటానని, అలీ వాళ్ల నాన్నకు వ్యాపారం పెట్టించి, హోటల్‌ను తెరిపిస్తానని, మహేష్ హైదరాబాద్‌లో ఓ ఇళ్లు కట్టి దానికి వాళ్ల నాన్న పేరు పెడుతానని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ ప్రైజ్ మనీతో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. అనంతరం ఇంటి సభ్యుల్లో ఎవరికి రూ.50 లక్షలు తీసుకునే అర్హత లేదో చెప్పాలని కింగ్ నాగార్జున అడగ్గా.. వితిక, వరుణ్‌లు బాబా భాస్కర్ పేరును, రాహుల్ వరణ్ పేరు, అలీ, జ్యోతి, శ్రీముఖి మహేష్ పేరును సూచించారు. మహేష్ విట్టా.. శ్రీముఖకి పేరును చెప్పి ఎందుకు అర్హత లేదో కూడా వివరించారు. ఆమె ప్రతిదీ గేమ్‌లాగే ఆడుతుందని, ఆమె ప్రవర్తను తనకు నచ్చడం లేదన్నాడు. రూ. 50 లక్షలు తీసుకునే అర్హత శ్రీముఖికి లేదన్నాడు. మహేష్ కామెంట్స్‌పై శ్రీముఖి మండిపడింది. అతను ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తున్నాడని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడని విమర్శించింది. ప్రతి స్టోరీని తనకు అనుకూలంగా, చాలా అందంగా నరేట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే వీరి మధ్య నాగార్జున కలుగజేసుకొని ఆ వార్కి అక్కడే పుల్‌స్టాప్ పెట్టాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ కొంచెం కామెడీగా, కొంచె హాట్‌గా సాగింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో నేడు తెలియనుంది. -
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి
‘రాహుల్ సిప్లిగంజ్ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింద’ని చెప్పింది బిగ్‌బాస్–3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్ అయ్యానని తెలిపింది. వైల్డ్‌కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని పేర్కొంది. ఒకవేళ హౌస్‌లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్ అయ్యేదాన్నని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంది. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు.. పదకొండు వారాలు.. పరిచయం లేని ముఖాల మధ్య ఉండటం.. ఫోన్ లేదు.. పుస్తకాల్లేవ్.. టీవీ లేదు.. కుటుంబ సభ్యులను కలవడానికి వీల్లేదు.. బిగ్‌బాస్–3 హౌస్‌లో ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వమున్న ఆమె రెండున్నర నెలల పాటు తన హావభావాలు, అందచందాలు, మాటతీరు, ఆటపాటలతో వీక్షకులను కట్టిపడేసింది. బిగ్‌బాస్ టాప్–5లో నిలుస్తానని భావించింది. ఓట్లు రాకపోవడమో, మాటతీరో, ముక్కుసూటితనమో తెలియదు గానీ మూడు వారాల ముందే ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం మళ్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది బిగ్‌బాస్– 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. ఆమె ఇటీవల హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలు.. తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్‌తో స్నేహం తదితర అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే.. - పురుమాండ్ల నరసింహారెడ్డి కుటుంబాన్ని మిస్సయ్యా.. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్వని అన్నారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తాను. మూడు వారాల్లో ముగిసే సమయంలో ఎంట్రీ వస్తే నేను వెళితే మిత్రులు హ్యాపీగా ఫీలవుతారు. టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో.. అలాగే ఉండి ఉంటే టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో. టాప్– 5లో మాత్రం ఉండేదాన్నని అనుకుంటున్నా. ఇదొక జీవితానుభవం. 11 వారాలు 23 ఏళ్ల వయసులో అంతమంది మైండ్‌సెట్‌తో కలిసి ఉండటం గొప్ప విషయమే. వరుణ్, వితిక నామినేట్ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాను. నామినేట్ చేసినా సరే నాకు కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్ త్యాగం చేయడం బాధ కలిగించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. రెండున్నర నెలల బిగ్‌బాస్ షోలో ఉండటం ఓ చాలెంజ్. బయటికి రాగానే ముందుగా డేట్.. ఆ రోజు ఏమిటని అడిగా. ఫోన్ చూడగానే పాస్వర్డ్ మరిచిపోయా. ఆ తర్వాత మెసేజ్‌లు చూశా. చాలా మెసేజ్‌లు వచ్చాయి. బయటికి రాగానే ముందుగా డేట్ అండ్ టైమ్ అడిగాను. నా బాడీ, మైండ్ చెక్ చేసుకున్నా. ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా సపోర్ట్ వచ్చింది. వరుణ్, వితిక, రాహుల్, నేను మంచి స్నేహితులం. బిగ్బాగ్ హౌస్‌లోకి వెళ్లాక మూడు వారాలు చాలా ఇబ్బందిపడ్డాను. రిజర్వ్‌గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మైండ్‌సెట్‌కు తగినట్లుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అందరితో సన్నిహితంగా మెలిగాను. ఒక కుటుంబంగా భావించి అందరితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకున్నాను. అందులో ఈ ముగ్గురితో బాగా అనుబంధం ఏర్పడింది. అందులో పుస్తకాలు ఉండవు. ఫోన్లు ఉండవు. టీవీ ఉండదు. పత్రికలు ఉండవు. ఉండేదల్లా కథలు చెప్పుకోవడం, టాస్క్‌ల గురించి ఆలోచించడం. తప్పితే ఇంకో వ్యాపకం ఉండేది కాదు. చాలా ఎడిట్ చేసి గంట మాత్రమే ప్రసారం చేస్తారు. ఆ ముగ్గురు టాప్– 5లో ఉంటారు.. బిగ్‌బాస్– 3 టాప్– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను. ప్రస్తుతం చదువు, సినిమాలే.. నేను తెనాలిలో పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశాను. విల్లామేరీ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం చేశా. చదువులో ఉండగానే ‘ఉయ్యాల..జంపాల’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ మొదలైంది. అమెరికాలో మా అక్క వద్ద ఉన్నప్పుడే బిగ్‌బాస్ సీజన్– 2లో అవకాశం వచ్చినా కుదరలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్– 3లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా చదువు, సినిమాలపైనే. పెళ్లి ఆలోచన లేదు. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి చేసుకుంటా. వారు వద్దంటే ఊరుకుంటా. వారు చూసిన సంబంధం కూడా ఇష్టమే. అయితే పెళ్లికి మరో ఐదారేళ్ల సమయముంది. అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం సినిమాల్లో నటిస్తున్నాను. అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌తో ఓ సినిమా అవకాశం వచ్చింది. కథలు వింటున్నాను. ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి కేంద్రీకరించా. -
రాహుల్‌తో రిలేషన్షిప్.. పునర్నవి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ హౌజ్‌లో సింగర్ రాహుల్‌తో తనకు ఉన్న అనుబంధంపై నటి పునర్నవి భూపాలం మరోసారి స్పందించారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘ బిగ్‌బాస్ హౌజ్‌లో రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను అతనితో ఎక్కువగా గొడవపడి ఉండాల్సింది కాదు. అందుకు బాధపడుతున్నా’ అని తెలిపారు. ‘మాది ప్యూర్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. కానీ, మొదట్లో కొన్ని వారాలు నేను రాహుల్‌తో అంత కంఫర్ట్‌బుల్‌గా లేను. అందుకే అతన్ని తిట్టేదానిని. నాకు దూరంగా ఉండమని చెప్పేదాన్ని. బయట ప్రపంచం మా ఫ్రెండ్షిప్ను ఎలా చూస్తుందోనని వర్రీ అయ్యేదానిని. కానీ, దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదని తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత మేం మరింత క్లోజ్ అయ్యాం’ అని పునర్నవి పేర్కొన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె బయటకు రాగానే తన టీమ్ పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) ఫ్యాన్స్ అందరూ వరుణ్, రాహుల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టారు. రాహుల్, తాను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా తాము మంచి మిత్రులని చెప్పారు. రాహుల్ టాప్ 5లో ఉండాలని తన కోరికను బయటపెట్టారు. ఇక, పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్ కావడంతో ఎగిరిగంతేశారు. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించగానే హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. -
బిగ్‌బాస్ : ‘అతడు’ ఎలిమినేటెడ్!
బిగ్‌బాస్ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. షో చూస్తే నిద్ర వస్తుందే తప్ప ఇంట్రస్ట్ అన్న మాట మచ్చుకైనా కనిపించటం లేదని ప్రేక్షకుల వాదన. ఇప్పటివరకు తొమ్మిది మంది ఇంటిని వీడగా మరొకరు తట్టాబుట్టా సర్దుకోనున్నారు. అయితే ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్లో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్తూ పూటకో ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. దీంతో అతని నిజ స్వరూపం ఇంటి సభ్యులందరికీ అర్థమయి కాస్త దూరం పెట్టారు. దీంతో అందరితో కలిసిపోయానంటున్న మహేశ్ ఇంట్లో చివరికి ఏకాకిగా మారిపోయాడు. అయినప్పటికీ నారద వేషాలు మానుకోలేదు. ఇక నామినేషన్ రౌండ్లో వరుణ్, రాహుల్ ఉన్నందున బాబా భాస్కర్, శ్రీముఖి ఫ్యాన్స్ ఓట్లు మహేశ్‌కు పడే అవకాశాలు ఎక్కువ. కానీ మహేశ్.. శ్రీముఖిని టార్గెట్ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ అతనికి ఓట్లు వేయాలా వద్ద అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అటు బాబాతోనూ సఖ్యతగా ఉండకపోవటం వల్ల అతని అభిమానులు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ఈ ఊగిసలాటలోనే వారం అంతా గడిచిపోయింది. మరి ఈ లెక్కన చూస్తే మహేశ్‌కు ఓట్లు తగ్గినట్టేగా! గతంలోనూ నాగ్ ఒకసారి మహేశ్‌ను ఎలిమినేట్ చేశాడు. కానీ అది టాస్క్‌లో భాగంగా! ఈ సారి మాత్రం ఊరికే కాకుండా నిజంగానే గుడ్‌బై చెప్తారని టాక్.. సో ఈ విషయం మహేశ్‌కు కూడా ఈపాటికే అర్థమై ఉంటుంది. అందుకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని లెక్కలు వేసుకున్నాడు. ఒకవేళ వెళ్లిపోయినా నాతోపాటు ఇంకొకరు రావాల్సిందేనని మంకు మీద ఉన్నాడు. మరి మహేశ్ చెప్పినట్టు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేక మహేశ్ బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం దగ్గరపడిందా! అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్‌బాస్: ‘బాబా సైకో.. రాహుల్ వేస్ట్’
బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్‌బాస్ బర్త్‌డే సందర్భంగా.. బిగ్‌బాస్ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. పైగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కొన్ని టాస్కులను ఇస్తూ అవి కూడా సైలెంట్‌గా కానిచ్చేయాలని పేర్కొన్నాడు. అందులో భాగంగా అలీ, శ్రీముఖిని వీపుపై ఎత్తుకుని గార్డెన్ ఏరియాలో 20 రౌండ్లు తిరగాలి. వితిక, రాహుల్‌లు బెలూన్లకు షేవింగ్ ఫోమ్ రాసి క్లీన్‌గా షేవ్ చేయాలి. వరుణ్, శివజ్యోతిలకు ఇంటి సభ్యులు కితకితలు పెట్టాలి. మహేశ్ తలపై ప్లేట్ పెట్టుకుని గోడ కుర్చీ వేయాలి. బాబా భాస్కర్.. చేతులకు, కాళ్లకు వాక్స్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక వీటన్నింటిని చేసే సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించినా కొందరు సఫలీకృతం కాలేకపోయారు. వితిక, మహేశ్, శ్రీముఖి, శివజ్యోతిలు బిగ్‌బాస్ నిద్రకు భంగం కలిగించినందున టాస్క్‌లో ఫెయిల్ అయినట్టుగా ప్రకటించాడు. అనంతరం ఇంటి సభ్యులకు మరో పరీక్ష పెట్టాడు. బిగ్‌బాస్ ఊహాచిత్రాన్ని గీయమని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు వారి ఆలోచనలకు పదును పెడుతూ ఎవరికి తోచినట్టుగా వాళ్లు బిగ్‌బాస్ చిత్రాన్ని గీశారు. అన్ని చిత్రాల్లో కల్లా మహేశ్ గీసిన బిగ్‌బాస్ ఊహాచిత్రం హైలెట్‌గా నిలిచింది. దొరికిందే చాన్స్ అన్నట్టుగా మహేశ్.. బిగ్‌బాస్‌ను దేవుడు, అంతరాత్మ అంటూ పెద్ద పెద్ద పదాలను వాడుతూ కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు కనిపించింది. బిగ్‌బాస్ ఇంట్లో కేకుల గోల ఇంకా తగ్గలేదు. ఇప్పటికే నాలుగు కేకులు తిని పొట్ట పగలిపోయేలా ఉందన్న ఇంటి సభ్యుల మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా మళ్లీ 2 కేకులు పంపించాడు. ఈ దెబ్బతో ఇంటి సభ్యులకు కేకులంటేనే వెగటు పుట్టింది. బిగ్‌బాస్ నిద్రకు భంగం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు. రకరకాల శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యుల నిద్ర చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అలీ విలన్లా, మాస్టర్ సైకోలాగా, రాహుల్ వేస్ట్ సాలే, చిచోరలా కనిపిస్తాడని శ్రీముఖి కామెంట్ చేసింది. తనకైతే రాహుల్ బఫూన్‌లాగా కనిపిస్తాడంటూ వితిక సెటైర్ వేసింది. అయితే ఈ విషయాన్ని రాహుల్ లైట్ తీస్కున్నాడు. కాగా రాహుల్ రాసి, పాడిన పాటకు బాబా డైరెక్షన్లో తీసిన ఇంటి సభ్యుల వీడియో అదిరిపోయింది. టీవీలో వారి వీడియో చూసుకుని మురిసిపోయారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ బర్త్‌డే ముగియడంతో కేకుల గోల తప్పిందని ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్‌బాస్ ఇంట్లో మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 కథ కంచికి చేరుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో 80 రోజులు పూర్తయ్యాయి. ఫైనల్ ట్రోఫీ అందుకోడానికి మరో 20 రోజులు మాత్రమే ఉంది. రోజులు దగ్గరవుతున్న కొద్దీ బిగ్‌బాస్ టాస్క్‌లకు పదును పెట్టడం మానీ ఇప్పటికీ ఫన్నీ టాస్క్‌లతోనే ఎపిసోడ్లను నెట్టుకొస్తున్నాడు. అటు ఇంటి సభ్యులు కూడా సీరియస్‌గా కష్టపడుతున్న దాఖలాలు లేవు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన హిట్ అండ్ హంట్ టాస్క్‌లో వారి మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు. కానీ ఇంటి సభ్యులు ఇదంతా తెలిసిందే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. దీంతో బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్ అయింది. సీరియస్ టాస్క్ మానుకుని మళ్లీ సరదా టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. బర్త్‌డే సందర్భంగా ఇంటిసభ్యులతో డాన్స్‌లు చేయించాడు, కేక్‌లు పంపించాడు. దీంతో వావ్ అంటూ ఆదుర్దాగా తిన్నవాళ్లతోనే నాలుగు కేక్‌లు వరుసపెట్టి పంపించి వామ్మో, మాకొద్దు బాబోయ్ అనేలా చేశాడు. దీంతో బిగ్‌బాస్ పుట్టినరోజు వీరి చావుకొచ్చినట్టయింది. బిగ్‌బాస్ బర్త్‌డే వేడుకలు నేటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి. బిగ్‌బాస్ నిద్రకు ఇంటి సభ్యులు ఎవరూ ఆటంకం కలిగించకూడదని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఇంటిసభ్యులు మౌనవ్రతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సైలెంట్‌గా చిలిపి పనులు చేస్తూ, ఒకరినొకరు ఆటపట్టిస్తూ గడుపుతున్నారు. ఇక వీరు అల్లరి మాని నిశ్శబ్దంగా ఉంటారా అన్నది సందేహమే! మరి వీరి పనుల వల్ల బిగ్‌బాస్ నిద్రకు భంగం కలిగిందా, లేదా అనేది నేటి ఎపిసోడ్లో చూడాలి! Ssshhh!!! 🤫 #BiggBoss is sleeping 😀😀#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Q9biBF9fuY — STAR MAA (@StarMaa) October 11, 2019 -
‘మొగుడే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు’
బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు హంట్ అండ్ హిట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్‌కు అలీ రెజా, రాహుల్ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్‌తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్‌బాస్ గేమ్ వదలదు అంటూ మాట్లాడిన అలీ, డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటే శ్రీముఖిని లగేజ్ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది. రాహుల్‌కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్‌బాస్ రాహుల్‌కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్‌తో వాగ్వాదానికి దిగిన రాహుల్. మహేశ్ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది. ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడంటూ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్‌కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్‌కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు. ఇక స్టార్ ఆఫ్ దహౌస్గా నిలిచిన వరుణ్, శివజ్యోతికి స్పెషల్ డిన్నర్ రావటంతో ఇంటిసభ్యులు గుటకలు వేసినా ఏం లాభం లేదని తెలుసుకుని మిన్నకుండిపోయారు. ఇక మహేశ్ వీడియో చూసిన తర్వాత బాగా హర్ట్ అయినట్టు కనిపించాడు. ఇక నుంచి తాను ఎవరితో మాట్లాడను అంటూ శ్రీముఖి, మాస్టర్‌పై అలిగాడు. నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అయినా నాపై జోకులు వేస్తున్నారు. శ్రీముఖి అవసరం కొద్దీ మెదులుతుంది. నామినేషన్‌కు వెళ్లకుండా ఉండటానికి అందరితో క్లోజ్‌గా ఉంటుంది అని అతని అభిప్రాయాన్ని శివజ్యోతితో పంచుకున్నాడు. అలీరెజా గుట్టు బయటపడిందని, మహేశ్ చిత్రగుప్తులవాడు అని వరుణ్, వితిక అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిసభ్యులు రచ్చరచ్చ చేశారు. వింత వింత వేషధారణలతో డాన్స్ చేశారు. బిగ్‌బాస్ బర్త్‌డే ఇంటిసభ్యుల చావుకొచ్చింది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బర్త్‌డే సందర్భంగా బిగ్‌బాస్ కేకుల మీద కేకులు పంపించాడు. మొదటి కేక్‌ను ఆవురావురుమంటూ తిన్నారు కానీ నాలుగో కేక్‌కు వచ్చేసరికి అపసోపాలు పడుకుంటూ తినేశారు. ఇక బిగ్‌బాస్ ఇంట్లో 80 రోజులు గడిచిపోయాయి. రానురాను టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కడదాకా పోరాడుతారో చూడాలి! -
బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..
బంజారాహిల్స్: బిగ్‌బాస్– 3లో టీవీ యాంకర్ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి. రోజుకో అరుదైన డిజైన్‌తో అదరగొడుతోంది. నగర యువతులు ఆమె వస్త్రధారణనే అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పటి సినీనటి వాణిశ్రీ కట్టిందంటే అవి మార్కెట్లో ఆవిడ పేరుతోనే పిలుచుకునే వారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో శ్రీముఖి డ్రెస్‌లు అదే స్థాయిలో హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇంతకూ శ్రీముఖికి డ్రెస్‌లు, జ్యువెలరీ డిజైన్ చేస్తున్నది ఎవరో తెలుసా?. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10 నివసిస్తూ.. ‘రేఖాస్’ బొటిక్ పేరుతో డిజైనర్ షోరూమ్‌ను నడిపిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ కీర్తన సునీల్. శ్రీముఖికి దుస్తులను సరికొత్త తీరులో, కలర్‌ఫుల్ కాంబినేషన్లో ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెరపై ఆమెకు కొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. పదకొండు వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న శ్రీముఖికి ఇప్పటి వరకు రోజుకొకటి చొప్పున 76 డ్రెస్‌లను ధరించింది. ఈ 76 డ్రెస్‌లను డిజైన్ చేసింది కీర్తన కావడం విశేషం. తెలుగుదనం ఉట్టిపడేలా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా తన డ్రెస్ ఉండాలని శ్రీముఖి కోరుకుంటుందని, ఒకవేళ ఆధునికంగా కనిపించాలనుకుంటే కాలేజీ విద్యార్థినిని దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌లు తయారు చేయాల్సిందిగా సూచిస్తుంటారని కీర్తన తెలిపారు. బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా డిజైనర్ ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా శ్రీముఖికే దక్కుతుంది. స్లీవ్‌లెస్, నెక్లైన్ డీప్‌గా ఉండే డ్రెస్సులను శ్రీముఖి ఎంతమాత్రం ఇష్టపడదని, భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ఉండాలని కోరుకుంటుందని ఆమె తెలిపారు. ఒక్కో డ్రెస్ డిజైన్చేయడానికి వారం పడుతుందని వెల్లడించారు. 15 ఏళ్ల నుంచి.. ప్రస్తుతం శ్రీముఖి వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్‌లన్నీ తాను డిజైన్ చేసినవేనని కీర్తన వెల్లడించారు. హ్యామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కీర్తన.. 15 ఏళ్ల నుంచి డిజైనర్‌గా, నాలుగేళ్లుగా సెలబ్రిటీలకు డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. పటాస్‌తో పాటు భలే చాన్సులే.. జూలకటక, సరిగమపా, సరిగమప లిటిల్ చాంప్స్, డ్రామా జూనియర్స్, గోల్డ్‌రష్, కామెడీ నైట్స్, సూపర్ సీరియల్ చాంపియన్‌షిప్‌లకు సైతం దుస్తులు డిజైన్ చేస్తుంటానని కీర్తన తెలిపారు. -
పాపం వాడు మళ్లీ నామినేషన్లో ఉన్నాడు
-
హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి
బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే! అయితే బయటకు వచ్చీరాగానే తన టీమ్ పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) ఫ్యాన్స్ అందరూ వరుణ్, రాహుల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టింది. రాహుల్‌తో తనకున్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ తాము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ నొక్కి చెప్పింది. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మేం మంచి మిత్రులమే అని స్పష్టం చేసింది. రాహుల్ టాప్ 5లో ఉండాలి అని తన కోరికను బయటపెట్టింది. అందరూ అనుకుంటున్నట్టుగా బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ కాదని వెల్లడించింది. ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్తూ.. మనుషులు ఇలా కూడా ఉంటారా? అనేలా ప్రవర్తిస్తున్నాడంటూ పరోక్షంగా మహేశ్‌కు పంచ్ విసిరింది. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు మానసికంగా ధృడంగా ఉండి వంద రోజులు నెట్టుకొస్తారో వారే విజేత అని ప్రకటించింది. పీవీవీఆర్ బ్యాచ్ గురించి పునర్నవి మాట్లాడుతూ ‘రాహుల్ వాళ్ల మమ్మీపై బెంగ పెట్టుకున్నాడు. రాహుల్‌ను రియల్ గేమర్ అని బాగా ఆటపట్టించేదాన్ని. ఓవర్ థింక్ చేస్తాడు.. పాపం వాడు మళ్లీ నామినేషన్లో ఉన్నాడు. వితిక.. బంగారం, చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. కానీ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీనిస్తుంది. వరుణ్ నాకు మరో బ్రదర్. వాళ్లందరినీ చాలా మిస్ అవుతున్నా’ అని తెగ బాధపడిపోయింది. ఇక బిగ్‌బాస్‌ను వీడి నాలుగు రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎవరో తనను గమనిస్తున్నారన్న ఆలోచన ఇంకా పోవట్లేదంది. ఎలిమినేట్ అయిన సభ్యులను తప్పకుండా కలుస్తానంది. పునర్నవి ఎలిమినేట్ అయినపుడు హిమజ టీవీ ముందు డాన్స్ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘అది ఊహించిన విషయమే’ అని కొట్టిపారేసింది. హిమజ ఎందుకు అలా చేసిందో తననే అడుగుతానంది. దానితో వాదనలో ఎవరూ గెలవలేరని చెప్పుకొచ్చింది. ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. ‘అలీ రెజా.. స్వీట్ పర్సన్ & స్ట్రాంగ్ కంటెస్టెంట్. రవి.. ఊరికే ఇన్ఫ్లూయెన్స్ అయిపోతాడు. అతన్ని నేనెప్పుడూ చెడ్డగా అనుకోలేదు. పర్సనల్‌గా అతనికి నాకు ఎలాంటి గొడవ లేద’ని స్పష్టం చేసింది. ఇక శ్రీముఖి ఎనర్జిటిక్.. తమన్నా సింహాద్రి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని తెలిపింది. ప్రొఫైల్ పిక్చర్ మార్చమన్న ఓ నెటిజన్ అభ్యర్థనకు పున్ను సున్నితంగా నో చెప్పింది. ఇక ఈ వారం నాకిష్టమైన రెండు కోతులు నామినేషన్లో ఉన్నాయంది. రాహుల్, వరుణ్‌లు ఇద్దరికీ ఓట్లు వేస్తూ సేవ్ చేయండంటూ ప్రేక్షకులను వేడుకుంది.