Kumaraswamy
-
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్
-
Vizag Steel Plant: మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు.
-
మనిషిగా నిఖిల్ ఓడిపోలేదు
బనశంకరి: నా కుమారుడు ఎన్నికల్లో మూడోసారి ఓడిపోయాడు. అతను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, మానవత్వం, సహృదయమున్న మనిషిగా ఓడిపోలేదని నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్ పరాజయం తరువాత ఆమె ఎక్స్‌లో సోమవారం పోస్ట్ చేశారు. నా కొడుకు ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి, కానీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో నా భర్త, మామగార్లకు ఇటువంటివి కొత్త కాదు. ఓటమితో కుంగిపోలేదు. నా కుమారునికీ ఇదే వర్తిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. నిఖిల్ మనిషిగా ఓటమి చెందలేదన్నారు. చెన్నపట్టణ ప్రజల, ప్రేమ, విశ్వాసం నిఖిల్ వెంటే ఉన్నాయని, ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. -
కుమారస్వామిపై కేసు
బెంగళూరు: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటకలో కేసు నమోదైంది. 2006–08 కాలంలో కర్ణాటక సీఎంగా ఉన్న కాలంలో కుమారస్వామి ఒక గనుల తవ్వకం సంస్థకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని గతంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న ఇన్స్పెక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్ తాజాగా ఫిర్యాదుచేయడంతో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కుమారస్వామిపై కేసు నమోదైంది.కుమారస్వామి ప్రభుత్వ అధికారిగా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని, తనను బెదిరించారని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించి నాడు బళ్లారి జిల్లాలో శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ సంస్థకు 550 ఎకరాల్లో గనుల తవ్వకం అనుమతులు ఇచ్చారని కుమారస్వామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కుట్రపూరిత కేసు: కుమారస్వామితాజా కేసుపై కుమారస్వామి స్పందించారు. ‘‘ ఇది పూర్తిగా కుట్రపూరితంగా నమోదుచేసిన కేసు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఐజీపై నేను పత్రికాసమావేశంలో ఆరోపణలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నిజమని నిరూపించగలరా? కావాలంటే ప్రెస్‌మీట్ వీడియోను మరోసారి చూడండి. ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొంటా’’ అని మంత్రి అన్నారు. -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్.. CMD మైండ్ గేమ్..
-
స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం
ఉక్కునగరం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర భారీ, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసశర్మ తదితరులతో కలిసి గురువారం ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాలను సందర్శించారు. మొదట ఈడీ(బిలి్డంగ్)లోని మోడల్ రూమ్‌ను సందర్శించారు. అక్కడ సీఎండీ అతుల్ భట్ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియ, ముడి పదార్థాల సరఫరా, ఉత్పత్తుల రవాణా తదితర అంశాలను వివరించారు. అక్కడే ఉన్న అవార్డు గ్యాలరీకి వెళ్లి స్టీల్‌ప్లాంట్ సాధించిన అవార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కోక్ ఓవెన్స్, బ్లాస్ట్‌ఫర్నేస్–3, ఎస్ఎంఎస్–2, వైర్ రాడ్ మిల్–2 విభాగాలను సందర్శించారు. అనంతరం ఉక్కు పరిపాలన భవనంలో సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్ అధికారులతో స్టీల్‌ప్లాంట్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్‌కు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి సంజయ్ రాయ్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. ఆందోళన వద్దుఆయన సందర్శన పుసక్తంలో ఇలా రాశారు ‘ఈ స్టీల్‌ప్లాంట్ సందర్శించాక దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్లాంట్ సహాయపడుతుందని నాకు అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్‌పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్‌ను రక్షించడం నా బాధ్యత. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రధాని ఆశీస్సులు, సాయంతో ప్లాంట్ నూరు శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది’ అని రాశారు. ప్రధానితో చర్చించాకే నిర్ణయం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పా రు. ఇందుకు తమకు రెండు నెలలు వ్యవధి అవసరమన్నారు. అయితే ప్రైవేటీకరణ రద్దుపై కుమారస్వామి పూర్తి భరోసా ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సినిమాలకు గుడ్‌బై : నిఖిల్
యశవంతపుర: రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా సినిమా రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి తెలిపారు. మండ్యలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... సినిమాలకు గుడ్‌బై చెప్పాను. 2019లో మండ్యలో తనను ఓడించారు. అనేక తప్పులు వల్ల వెనకడుగు వేశా. ఇప్పుడు మండ్య ప్రజలు స్థానం ఇచ్చినట్లు చెప్పారు. తన తండ్రి కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో మండ్యలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. త్వరలో చెన్నపట్టణలో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
ఈసారి నాన్న.. సత్తా చాటేనా?
రాష్ట్రంలో హై ఓల్టేజ్ ఎంపీ సీట్లలో ఒకటిగా మండ్య ఎప్పుడూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇక్కడ పోటీ రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. సాదా సీదా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ జరిగే ఎన్నికలు.. రాజకీయాలను వేడెక్కిస్తాయన్నది నిజం. పోటీదారులు, కులం, పార్టీ తదితర అంశాలు ఎన్నికలను కుతూహలంగా మారుస్తాయి. ఈసారి జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి పెద్దగా రాజకీయ చరిత్ర లేని స్టార్ చంద్రు తలపడుతున్నారు. కర్ణాటక: మండ్య ఎంపీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి వెంకట రమణ గౌడ అలియాస్ స్టార్ చంద్రు నామినేషన్లు ముగించి ప్రచారంలో ముందున్నారు. ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చేతిలో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి దారుణంగా ఓడిపోయారు. దీంతో కొడుకు స్థానంలో తండ్రి రంగం మీదకు వచ్చారు. ఈసారి బీజేపీ బలం ఉండడంతో కుమారస్వామి ఉత్సాహంగా ఉన్నారు. మండ్యలో గెలిచి జేడీఎస్ జెండాను ఎగరేయాలి అన్నది ఏకై క అజెండాగా పెట్టుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్. చెలువరాయస్వామి, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇద్దరూ స్థానికేతరులే కుమారస్వామి, స్టార్ చంద్రు ఇద్దరూ మండ్యలో స్థానికులు కాదు, బెంగళురు నగరానికి చెందిన వారు కావడం విశేషం. స్టార్ చంద్రు బెంగళూరులో వ్యాపారవేత్త. కాంగ్రెస్ నాయకులు ఆయనను ఏరికోరి దళపతి కుటుంబానికి వ్యతిరేకంగా నిలబెట్టారు. స్టార్ చంద్రు గెలుపుని మంత్రి చెలువరాయస్వామి భుజాలకెత్తుకున్నారు. జేడీఎస్‌లో అసమ్మతితో ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా.. ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్ ఇటీవలే బీజేపీలో చేరి కుమారకు మద్దతు పలికారు. కానీ అధికార కాంగ్రెస్ అంత తేలికగా తీసుకోవడం లేదు. ఈ నెల 17న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో మండ్యలో ప్రచార సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు, తాను గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు వస్తాయని ప్రజలకు చెబుతున్నారు. కుమారస్వామి నరేంద్రమోదీ పథకాలు, జిల్లా అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. జిల్లాలో మైనారిటీలు, దళితులు, కురుబ, ఒక్కళిగ సముదాయం ఓటర్లు అధికం. కాంగ్రెస్ మూడు వర్గాలను నమ్ముకుంటే, జేడీఎస్ ఒక వర్గాన్ని నమ్ముకుంది. కుమారకు పాత బలం గతంలో మండ్య జిల్లాలో ఎక్కువగా జేడీఎస్ ఎమ్మెల్యేలే ఉండేవారు. ఆ నాయకులు కుమారస్వామి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర సీనియర్లు చంద్రుకు మద్దతుగా ఉన్నారు. పోలింగ్‌కు ఇంకో 9 రోజులు ఉంది. జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తేలాల్సి ఉంది. -
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
చేతబడి నెపంతో తల్లీకొడుకుల హత్య
గూడూరు: మంత్రాలతో చేతబడులు చేస్తున్నారనే నెపంతో పట్టపగలే తల్లీకొడుకులను స్వయానా వారి బంధువే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ టన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా.. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (55), కొమురయ్య దంపతులకు కుమారుడు సమ్మయ్య (32) ఉన్నాడు. సమ్మయ్య దివ్యాంగుడు. వరంగల్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన వారికి బంధువైన శివరాత్రి కుమారస్వామి తన కుటుంబానికి హాని కలిగించేలా సమ్మయ్య, సమ్మక్క మంత్రాలు, పూజలు చేస్తున్నారని, వారి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ ఇరువురినీ పిలి పించి మాట్లాడారు. మంగళవారం పెద్దల సమక్షంలో మరోసారి మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారు. అనుకున్న ప్రకారం.. మంగళవారం సమ్మక్క కు టుంబసభ్యులు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదుదా రుడు కుమారస్వామి రాకపోవడంతో పోలీసులు అతనికి ఫోన్ చేయగా తనకు వేరే పని ఉందని, మ రోరోజు మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో పోలీసులు సమ్మక్క కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పారు. పోలీసులు పిలిచినా రాకుండా.. మాటు వేసి పోలీస్‌స్టేషన్ నుంచి సమ్మక్క కుటుంబసభ్యులు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కాపుకాసిన కుమారస్వామి మరోవైపు నుంచి ఆటోలో వచ్చి అ డ్డుగా పెట్టాడు. తన ఆటోలోని ఇనుపరాడ్డును తీ సుకొని అందరూ చూస్తుండగానే ముందుగా సమ్మ క్క తలపై బలంగా కొట్టాడు. ఆమె తల పగిలి కిందపడగా, భర్త కొమురయ్య ఆడ్డుకోబోగా అతన్ని కూడా రాడ్‌తో కొట్టడంతో అతని చేయి విరిగి పడి పోయాడు. వికలాంగుడైన సమ్మయ్య ఆడ్డురాగా అతని తలపై రాడ్‌తో బాదాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే తల్లీకొడుకులు రక్తపు మడుగు లో చనిపోయారు. స్థానికులు, సమీప వ్యాపారస్తు లు ఘటనాస్థలంలోనే కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యు లు, బంధువులు అడ్డుకున్నారు. హత్యలకు కార ణం పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆందోళనకారులు శాంతించారు. మృతుడు సమ్మయ్య భార్య రజిత ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడి భార్యకు అరోగ్యం బాగాలేకపోవడానికి సమ్మక్క కుటుంబం చేస్తున్న పూజలే కారణమని కొంతకాలంగా ఆ కుటుంబంపై వైరం పెంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
కాంగ్రెస్‌కు అస్త్రంగా.. కుమారస్వామి విద్యుత్ చౌర్యం కేసు
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై బెంగళూరులో విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పవర్ సప్లై కంపెనీ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్కయింది. భారత విద్యుత్ చట్టం(ఐఈఏ) సెక్షన్ 135 కింద కుమారస్వామిపై కేసు పెట్టారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల దాకా శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. దీపావళి సందర్భంగా బెంగళూరులో జేపీ నగర్‌లోని తన ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకునేందుకు కుమారస్వామి విద్యుత్ చోరీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి అది తన తప్పు కాదని చెప్పారు. ఒక ప్రైవేట్ డెకరేటర్ అవగాహన లేక తన ఇంటి బయట ఉన్న పోల్ నుంచి డెకరేషన్ కోసం ప్రత్యేక కనెక్షన్ తీసుకున్నాడని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆ కనెక్షన్‌ను తొలగించానని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన కాంగ్రెస్‌కు మంచి అవకాశంగా దొరికింది. ఇటీవలే కుమారస్వామి ఒక పప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కరెంటే ఉండడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీలేవీ అమలు కావని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని ప్రజలు, రైతులను కోరారు. కుమారస్వామి చెప్పినట్లు కర్ణాటకలో కరెంటే లేకపోతే ఎలా దొంగిలిస్తారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి...సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది? -
సిద్ధాంతాలు గాలికొదిలేసి పొత్తులా?
కర్ణాటక: సిద్ధాంతాలను గాలికొదిలేసి రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే వారిని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల గతేమిటని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ పరోక్షంగా జేడీఎస్ నేత కుమారస్వామిపై ధ్వజమెత్తారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నపట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సీ.అశ్వత్థతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమస్యను పరిష్కరించకపోతే పార్టీని విసర్జించి రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదే పదే చెబుతున్నారని, అధినాయకులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తే పార్టీ నమ్ముకొన్న నాయకులు, కార్యకర్తల గతేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధానపరిషత్ సభ్యుడైన సీ.ఎం.ఇబ్రహీం రాజీనామా చేసి జేడీఎస్‌లో చేరిన సమయంలో ఆయనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. జేడీఎస్, బీజేపీ పొత్తు విషయం ఇబ్రహీంకు సమాచారం లేదని దుయ్యబట్టారు. జేడీఎస్‌లో ఉన్నవారు వరుసగా కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తాము ఎవరినీ పిలువాల్సిన అవసరం లేదన్నారు. బీదర్ నుంచి చామరానగర వరకు అన్ని జిల్లాల్లో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలపై నిలిచిందేగాని వ్యక్తిపై కాదన్నారు. తాను లేకపోయినా పార్టీ మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు. -
పెన్‌డ్రైవ్ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి
మైసూరు: రాష్ట్రంలో అధికారుల బదిలీల దందా మొత్తం ముఖ్యమంత్రి సిద్దరామయ్య కనుసన్నల్లో జరుగుతోందని, తన పెన్ డ్రైవ్‌లో ఉన్న రహస్యం బయటకు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. గురువారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో బదిలీలు తప్పనిసరి, కానీ ఏ కొలమానం ప్రకారం బదిలీలు చేయాలో ఆ ప్రకారంగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు డబ్బుల కోసం బదిలీలు చేస్తున్నారు, ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాలతో నడుస్తోందని దుయ్యబట్టారు. కుమారపై సీఎం భగ్గు శివాజీనగర: జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి నిరాశతో తమ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తరువాత మీడియాతో మాట్లాడారు. బదిలీల దందా సాగుతోందని ఆరోపించడం సబబు కాదన్నారు. వారి కాలంలోను బదిలీలు జరిగాయి. ఆయన లంచం పుచ్చుకొన్నాడా? అని ప్రశ్నించారు. సాధారణ బదిలీలు జరుగుతున్నాయన్నారు. హిట్ అండ్ రన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బదిలీలకు– తన కుమారుడు యతీంద్ర పేరును అంటగట్టడం తగదన్నారు. -
పెన్‌డ్రైవ్‌లో బదిలీల దందా: కుమార
కర్ణాటక: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బదిలీ దందాలపై తన వద్ద సాక్ష్యం ఉందని జేడీఎస్ మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఒక పెన్ డ్రైవ్‌ను చూపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బదిలీ దందాకు ఆధారాలు విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో పెన్ డ్రైవ్‌ను చూపినట్లు చెప్పారు. బదిలీల దందాకు సంబంధించిన ఆడియో ఉందని, ప్రధాన సాక్ష్యమని చెప్పారు. సమయం చూసి ఈ పెన్ డ్రైవ్‌ను విడుదల చేస్తానన్నారు. తన ఆరోపణలకు ఎమ్మెల్యే దినేశ్ గుండురావు కంగారు పడాల్సిన పని లేదన్నారు. నా ఆస్తుల గురించి కూడా ప్రభుత్వం విచారణ చేయించవచ్చు, రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక నా సంపద ఎంత అనేది తనిఖీ చేయండి అని సవాల్ చేశారు. నగరాభివృద్ధి అనేది జరగడం లేదన్నారు. తన గురించి బీజేపీ నేత యడియూరప్ప మంచిగానే మాట్లాడారన్నారు. -
అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్! -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం
పరకాల: ఓ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు. కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. -
నిఖిల్.. ఓటు అడగవద్దు
కర్ణాటక: దయచేసి మా ఏరియాకు వచ్చి ఓట్లు అడక్కండి. మీ నాన్నను, మీ అమ్మను ఎమ్మెల్యేలుగా గెలిపించాం.ఇప్పటికీ మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. మీకు ఓట్లు వెయ్యం, మీకే కాదు ఎవ్వరికీ వెయ్యం అంటూ ఓ మహిళ నిఖిల్ కుమారస్వామికి ఘాటుగా చెప్పింది. రామనగర జేడీఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిఖిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనగరలోని ఒక మురికివాడకు వెళ్లగా అక్కడి మహిళలు నిఖిల్‌ను నిలదీశారు. గతంలో కుమారస్వామి, అనితలను రామనగర ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. వారు పలుసార్లు వచ్చి అభివృద్ధి పనులకు భూమిపూజలు చేసివెళ్లారు కానీ పనులు మాత్రం జరగలేదు. ఆ కోపంతో నిఖిల్‌పై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న నిఖిల్ చివరికి వారికి నచ్చచెప్పి ఓటేయాలని అడిగారు. -
కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చినట్టు చెప్పుకొచ్చారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అన్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్. -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
కుమారస్వామి తనయుడికి జేడీయూ అసెంబ్లీ టికెట్
రామనగర: కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు, జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్‌ను దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రామనగర స్థానం నుంచి నిలబెట్టనున్నట్లు జేడీయూ అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అభ్యరి్థని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీయూ నిలిచింది. కుమారస్వామి భార్య అనిత ప్రస్తుతం రామనగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ చదవండి: మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ -
అట్టహాసంగా ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకు స్థాపన కార్యక్రమంలో, తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఉన్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎంకు స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత త్రైలోక్య మోహన గౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎంను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముహ్తూర సమయంలో బీఆర్ఎస్ ఏర్పాటు అధికారిక పత్రాలపై పార్టీ అధినేతగా కేసీఆర్ సంతకాలు చేశారు. నిర్ణయించిన ముహూ ర్తం మేరకు 1.25 గంటలకు భారతదేశ చిత్రపటంతో కూడిన గులాబీ జెండాను హర్షధ్వానాల మధ్య ఆహ్వానితులతో కలిసి ఆవిష్కరించారు. తరలివచ్చిన ప్రముఖులు, నేతలు: కుమారస్వామి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతుసంఘాల నేతలు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్నామ్ సింగ్ (హరియాణా), అక్షయ్ కుమార్ (ఒడిశా), హిమాంశు తదితరులు హాజరయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ల్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ ర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాల్లో కార్యకర్తలు బాణసంచా పేలుళ్లు, డీజే, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. గుణాత్మక మార్పు వస్తుందనే విశ్వాసం ఉంది: కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహ్వానితులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో ప్రారంభించగా, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుదుటన తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. కేసీఆర్ సోదరీమణులతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. ‘తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ బీఆర్ఎస్ వృక్షం శాఖోపశాఖలుగా నేడు భారతాన విస్తరిస్తుంది. భారతదేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే చల్లని నీడను పంచనుంది మన భారత్ రాష్ట్ర సమితి’ – హరీశ్‌రావు, ఆర్థిక శాఖమంత్రి ‘బీఆర్ఎస్ ఆవిర్భావం మహోజ్వల ఘట్టం. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో నవశకం ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి’ – నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత ‘భారత రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. టీఆర్ఎస్తో సంఘటిత, సమైక్య, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చారు. భారతీయుల కలలు నిజం చేసేందుకు సీఎం కట్టుబడి ఉన్నారు. తెలంగాణ భూమికగా భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ ప్రస్థానం బీఆర్ఎస్’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు ఫలించాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు గెలవాలి. ఆ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. – ముఖ్యమంత్రి కేసీఆర్